hyper aadi
-
మెహబూబ్ అవుట్.. నొప్పి భరించలేక అవినాష్ సెల్ఫ్ ఎలిమినేట్
పండగ సెలబ్రేషన్స్‌లో బిగ్‌బాస్ ఎప్పుడూ ముందుంటుంది. ఇటీవలే హౌస్‌లో బతుకమ్మ, దసరా వేడుకలు జరిగాయి. ఇప్పుడు దీపావళి సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ వేడుకలల్లో సినీ తారలు భాగమయ్యారు. మరి హౌస్‌లో జరిగిన రచ్చ, హంగామా ఏ రేంజ్లో ఉందో లైవ్ అప్డేట్స్లో చూసేయండి..పండగ సర్ప్రైజ్నాగార్జున దీపావళి పాటకు స్టెప్పులేస్తూ పండగ కళను తీసుకొచ్చాడు. తర్వాత హౌస్‌మేట్స్‌ను జంటలుగా విడగొట్టిస్టెప్పులు మీవి- మార్కులు మావి అనే గేమ్ ఆడించాడు. ప్రతి రౌండ్లో గెలిచిన టీమ్‌కు ఒక సర్ప్రైజ్ ఉంటుందన్నాడు. అలా మొదటి రౌండ్లో గంగవ్వ-తేజ గెలిచారు. ఈ జంటలో ఒకరికే ఇంటిసభ్యుల నుంచి మెసేజ్ వస్తుందన్నాడు. అలా తేజ త్యాగంతో గంగవ్వకు తన కూతురి వీడియో మెసేజ్ ప్లే చేశారు. అది చూసిన అవ్వ సంతోషంతో కన్నీళ్లుపెట్టుకుంది. తర్వాత విష్ణుప్రియను సేవ్ చేశారు.ప్రైజ్‌మనీలో మరో రూ.1లక్షఅనసూయ డ్యాన్స్‌తో జోష్ నింపింది. ప్రైజ్‌మనీ కవర్స్ కనుక్కోవాలన్న రెండో గేమ్‌లో నిఖిల్, యష్మీ గెలిచారు. వీరు కనిపెట్టిన కవర్లలోని రూ.1 లక్ష ప్రైజ్‌మనీలో యాడ్ చేశారు. తర్వాత ఈ జంటకు సంబంధించిన ఇంటిసభ్యుల ఫోటో చూపించారు. యష్మి త్యాగం చేయడంతో నిఖిల్ పేరెంట్స్ వీడియో ప్లే చేశారు. అలాగే నాగ్ నిఖిల్‌ను సేవ్ చేశాడు.ప్రేరణకు సర్ప్రైజ్తర్వాత 'క' మూవీ టీమ్ స్టేజీపైకి వచ్చింది. వీరు హౌస్మేట్స్ కళ్లకు గంతలు కట్టి గేమ్ ఆడించారు. ఇందులో ప్రేరణ-మెహబూబ్ గెలిచారు. మెహబూబ్ త్యాగంతో ప్రేరణకు వీడియో ప్లే చేశారు. ఆమె తన పేరెంట్స్ మాటలు విని మురిసిపోయింది. తర్వాత మెహరీన్ డ్యాన్స్‌తో ఆకట్టుకుంది. సింగర్ సమీరా భరద్వాజ్.. హౌస్మేట్స్ అందరిపైనా అలవోకగా పాటలు పడేసి అబ్బురపరిచింది. ప్రతి ఒక్కరిపైనా అద్భుతంగా పాట పాడి అదరొట్టేసింది. స్టేజీపై దుల్కర్ సల్మాన్లక్కీ భాస్కర్ మూవీ హీరో దుల్కర్ సల్మాన్, హీరోయిన్ మీనాక్షి చౌదరి, డైరెక్టర్ వెంకీ స్టేజీపైకి వచ్చారు. డైరెక్టర్స్ త్రివిక్రమ్, వెంకీలలో ఎవరిని సెలక్ట్ చేస్తావన్న ప్రశ్నకు మీనాక్షి.. వెంకీ అని బదులిచ్చింది. లక్కీ భాస్కర్ టీమ్ ఆడించిన గేమ్‌లో గౌతమ్-నయని పావని జంట గెలిచింది. వీరిలో నయని పావని తన తల్లి మెసేజ్‌ను త్యాగం చేయడంతో గౌతమ్.. అతడి తండ్రి వీడియో సందేశాన్ని వినగలిగాడు. ఇంట్లో గొడవపడి వచ్చిన గౌతమ్.. తండ్రికి సాష్టాంగ నమస్కారం చేసి మరీ సారీ చెప్పాడు.హరితేజ ఎమోషనల్హీరోయిన్ శాన్వీ స్పెషల్ డ్యాన్స్ పర్ఫామెన్స్తో మైమరపించింది. తర్వాత ప్రేరణ, పృథ్వీని సేవ్ చేశారు. అనంతరం అమరన్ హీరో శివకార్తికేయన్, హీరోయిన్ సాయిపల్లవి స్టేజీపైకి వచ్చారు. వీరు ఆడించిన గేమ్‌లో రోహిణి, అవినాష్ గెలిచారు. వీళ్లిద్దరూ తమకు బదులుగా హరితేజకు తన కూతురి వీడియో చూపించమన్నాడు. హాయ్ అమ్మ, హ్యాపీ దివాళి అంటూ కూతురు మాట్లాడిన ముద్దుముద్దు మాటలు విని హరితేజ ఏడ్చేసింది. తర్వాత హైపర్ ఆది హౌస్‌లోకి వచ్చి తన పంచ్ కామెడీతో నవ్వించాడు.ఏడ్చిన యష్మిఈ ఎపిసోడ్ కంటే ముందు ఏం జరిగిందన్నది చూపించారు. ఎవరినో ఉడికించడానికి యష్మి తనను వాడుకోవడం నచ్చలేదన్నాడు గౌతమ్. ఆ మాటలు విన్న యష్మి.. తన ఉద్దేశం అది కాదంటూ ఏడ్చేసింది. నిఖిల్, నేను ఫ్రెండ్స్‌లా టీజ్ చేసుకున్నాం తప్ప నువ్వంటే నాకు బాగా ఇష్టం అని ఎక్కడా ఒకరికొకరం ఎక్స్‌ప్రెస్ చేసుకోలేదు. నా వల్ల తప్పు జరిగుంటే సారీ అని చెప్పింది. దీంతో గౌతమ్.. ఇకపై నువ్వు నాకు కంటెస్టెంటు మాత్రమే.. నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది అని క్లారిటీ ఇచ్చేశాడు. నాగ్ నయనిని సేవ్ చేసి మెహబూబ్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు.అప్పుడలా ఇప్పుడిలా..వెళ్లిపోయేముందు మెహబూబ్ హౌస్‌మేట్స్‌ను పటాకాలతో పోల్చాడు. అవినాష్ ధౌజండ్‌వాలా, గంగవ్వ లక్ష్మీబాంబ్, నబీల్ రాకెట్, రోహిణి కాకరబత్తి, గౌతమ్ మ్యాచ్ స్టిక్ అన్నాడు. గతంలోనూ దీపావళికి నేను ఎలిమినేట్ అయ్యా.. ఈసారి కూడా దీపావళికే బయటకు వచ్చేశాను. ఎందుకో అర్థం కావట్లేదంటూ ఎమోషనల్ అయ్యాడు. అవినాష్ ఎలిమినేట్ఇక రేపటి ప్రోమోలో అవినాష్ అనారోగ్యంతో సెల్ఫ్ ఎలిమినేట్ అయినట్లు చూపించారు. కడుపు నొప్పి తట్టుకోలేకపోతున్నాను. మెడికల్ రూమ్‌కు వెళ్తే బయటకు వచ్చేయమన్నారు. వెళ్లిపోతున్నాను అంటూ వీడ్కోలు తీసుకున్నాడు. హాస్పిటల్‌కు వెళ్లి మళ్లీ హౌస్‌లో అడుగుపెడతాడా? లేదా నిజంగానే వెళ్లిపోతాడా? అన్నది రేపు తేలనుంది. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
అల్లు అర్జున్‌ని ట్రోల్ చేయొద్దు: కమెడియన్ ఆది
మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ అనేది గత కొన్నాళ్లుగా ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట. లోపల వాళ్ల మధ్య రిలేషన్ ఎలా ఉందనేది తెలియదు గానీ ఎవరికీ వాళ్లు ఏదేదో అనేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఈ విషయంలో అల్లు అర్జున్‌ని మెగా ఫ్యాన్స్ బాగా ట్రోల్ చేస్తున్నారు. ఏపీ ఎన్నికల టైంలో ఇది మరింత ఎక్కువైంది. తాజాగా ఈ విషయమై ప్రముఖ కమెడియన్ హైపర్ ఆది స్పందించాడు. 'శివం భజే' మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.(ఇదీ చదవండి: రెమ్యునరేషన్ తగ్గించుకున్న ప్రభాస్.. నిజమేనా?)'అల్లు అర్జున్.. నేషనల్ అవార్డ్ విన్నర్. ఆయన్ని అందరూ గౌరవించాలి. మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటే. కొందరు అల్లు అర్జున్‌ని ఉద్దేశపూర్వకరంగానే ట్రోల్ చేస్తున్నారు. థంబ్ నెయిల్స్ పెడుతున్నారు. దయచేసి అలా చేయొద్దు. ఇకనుంచైనా ఇలాంటివి ఆపేయాలని మనస్పూర్తిగా కోరుతున్నాను' అని ఆది చెప్పాడు. (ఇదీ చదవండి: 'ఆర్ఆర్ఆర్' రికార్డ్ కూడా బ్రేక్ చేసిన 'కల్కి') -
నరేశ్ పెళ్లిళ్లపై హైపర్ ఆది కౌంటర్!
కొన్నాళ్ల ముందు ఇండస్ట్రీలో ఓ జంట గురించి తెగ మాట్లాడుకున్నారు. విచిత్రం ఏంటంటే వాళ్ల లైఫ్ ని సినిమాగా తీసి మరీ థియేటర్లలో రిలీజ్ చేశారు. అవును మీరు ఊహించింది కరెక్టే. వాళ్లే నరేశ్-పవిత్రా లోకేశ్. 'మళ్లీ పెళ్లి' అని సినిమా వీళ్లు చేయడం మాటేమో గానీ కొన్నాళ్లపాటు తెగ ట్రెండ్ అయ్యారు. సరేలే వీళ్ల గురించి అందరూ మర్చిపోయారు అనుకునే టైంలో మరోసారి చర్చనీయాంశమయ్యారు. నరేశ్ పెళ్లిళ్లపై హైపర్ ఆది కామెంట్స్ దీనికి కారణం? విజయనిర్మల వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నరేశ్.. తొలుత హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. నటుడిగా ఇతడిని వంకపెట్టడానికి లేదు. కానీ వ్యక్తిగతంగా మాత్రం ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఇప్పటికే పలు పెళ్లిళ్లు చేసుకున్న నరేశ్.. మాజీ భార్య రమ్య రఘుపతితో దూరంగా ఉంటున్నాడు. అదే టైంలో నటి పవిత్రా లోకేశ్‌తో రిలేషన్లో ఉన్నాడు. (ఇదీ చదవండి: విజయ్ సేతుపతికి ఇంత పెద్ద కూతురు ఉందా?) నరేశ్-పవిత్రా లోకేశ్ కలిసి తమ బంధంపై 'మళ్లీ పెళ్లి' అనే మూవీ తీయడం.. దానిపై రమ్య రఘుపతి కోర్టుకెళ్లడం లాంటి విషయాలు అప్పట్లో హాట్ టాపిక్ అయ్యాయి. సరే దాని గురించి వదిలేస్తే.. వీళ్లిద్దరూ జంటగా ఓ తెలుగు ఛానెల్లో ప్రసారం కాబోతున్న వినాయక చవితి ఈవెంట్లో పాల్గొన్నారు. దీని ప్రోమో తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో భాగంగానే హైపర్ ఆది.. నరేశ్‌పై ఫన్నీగా కౌంటర్ వేశాడు. 'నాకు ఒక పెళ్లే అవ్వట్లేదు. పెళ్లి, మళ్లీపెళ్లి ఎలా సార్?' అని హైపర్ ఆది.. స్టేజీపై అందరూ చూస్తుండగానే నరేశ్‌ని అడిగేశాడు. పక్కనే పవిత్రా లోకేశ్ ఉంది. ఈ క్రమంలోనే ఈ క్వశ్చన్‌కి నరేశ్ నవ్వి ఊరుకున్నాడు. ప్రోమో కాబట్టి పెద్దగా రివీల్ చేయలేదు. బహుశా ఫుల్ ఈవెంట్లో నరేశ్ చెప్పిన ఆన్సర్ చూపిస్తారేమో? ఏదేమైనా అలా పెళ్లిళ్ల గురించి డైరెక్ట్‌గా అడిగేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. (ఇదీ చదవండి: 'ఫ్యామిలీ మ్యాన్' చిరంజీవి చేయాల్సింది.. కానీ!) -
ప్రియురాలిని పరిచయం చేసిన హైపర్ ఆది.. పేరు విహారిక!
తనదైన పంచ్ డైలాగులతో ట్రెండింగ్ కమెడియన్‌గా మారాడు హైపర్ ఆది. జబర్ధస్త్ కామెడీతో షో అతని జీవితాన్ని మార్చేసింది. ఆ షోలో మొదటగా కంటెస్టెంట్‌గా వచ్చి, తర్వాత టీమ్ లీడర్ అయ్యాడు. ప్రస్తుతం మల్లెమాల ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న పలు టీవీ షోలలో ఆది పాల్గొంటూ తనదైన కామెడీతో నవ్వులు పూయిస్తున్నాడు. పలు షోలలో తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నాడు. (చదవండి: హైపర్ ఆదితో పెళ్లి? క్లారిటీ ఇచ్చేసిన వర్షిణి!) తాజాగా ఓ టీవీ షోలో తన ప్రియురాలిని పరిచయం చేశాడు. తాను గత కొంత కాలంగా ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నానని, ఆమెను పరిచయం చేస్తానంటూ స్టేజ్‌పైకి పిలిచాడు. ‘ఇప్పటివరకు కంటెంట్ కోసం చాలా మందికి లైన్ వేసినట్లు చెప్పాను. కానీ నేను నిజంగా ప్రేమించింది ఒక అమ్మాయిని మాత్రమే. ఆమె ఇక్కడే ఉందంటూ ‘బేబీ ఒక్కసారి స్టేజ్‌పైకి రా’అని ఆది పిలవగా.. ఒక అమ్మాయితో నవ్వులు చిందిస్తూ స్టేజ్ మీదకు వచ్చింది. ఆ తర్వాత ఆది తనకు ‘ఐ లవ్ యూ విహారిక’ అంటూ ప్రపోజ్ చేశాడు. విహారిక కూడా ‘లవ్ యూ టూ ఆది’ అని చెప్పింది. అంతేకాదు ఇద్దరూ ఒకరి బుగ్గలను ఒకరు ముద్దాడారు. దీంతో షోలో ఉన్నవారంతా చప్పట్లు కొడుతూ ఆ జంటను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుంది. విహారికతో ప్రేమాయణం నిజమేనా? హైపర్ ఆది పెళ్లిపై గతంలో చాలా సార్లు పలు రూమర్స్ వినిపించాయి. ఓ యాంకర్‌తో ఆది లవ్‌లో ఉన్నాడని త్వరలోనే పెళ్లి చేసుకుంటారనే వార్త ఆ మధ్య నెట్టింట చక్కర్లు కొట్టింది. తాజాగా ఆ యాంకర్ వర్షిణితో పెళ్లి అనే పుకార్లు వినిపించగా.. ఆమె కొట్టిపారేసింది. అయితే ఆది మాత్రం ఈ రూమర్స్‌పై ఎప్పుడూ స్పందించలేదు. పైగా తన పెళ్లిపై తానే పంచ్‌లు వేసుకుంటాడు. గతంలో కూడా తాను పెళ్లి చేసుకునేది ఈ అమ్మాయినే అంటూ పలు షోలలో కొంతమందిని పరిచయం చేశాడు. కాకపోతే అది స్కిట్లో భాగమే. కేవలం హైప్ కోసం ఆది అలా చెప్పేవాడు. ఇక తాజాగా ఆది పరిచయం చేసిన అమ్మాయి కూడా షోలో భాగమే అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మరికొంతమంది అయితే ఆ అమ్మాయిని ఏ టీవీ షోలోనూ చూడలేదు. నిజంగానే ఆమె ఆది ప్రియురాలే కావొచ్చునని అంటున్నారు. మరి ఇందులో ఏది నిజమేది అనేది ఆ షో ఫుల్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యాక తెలుస్తుంది. -
హైపర్ ఆదితో పెళ్లి? క్లారిటీ ఇచ్చేసిన వర్షిణి!
నటి, యాంకర్ వర్షిణి గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే సినిమాల్లో చిన్న చితకా పాత్రలు చేస్తున్న రానీ గుర్తింపు టీవీ షోలతో సంపాదించింది. ఢీ డ్యాన్స్ షోతో పాటు పలు కామెడీ ప్రోగ్రామ్స్‌కి యాంకరింగ్ చేస్తూ పేరు తెచ్చుకుంది. అయితే ఈమె ప్రేమ గురించి ఎప్పటికప్పుడు ఏదో ఓ న్యూస్ వస్తూనే ఉంది. ఇప్పుడు అలానే ప్రశ్న ఎదురవగా దానిపై క్లారిటీ ఇచ్చేసింది. హైపర్ ఆదితో పెళ్లి? గతంలో కమెడియన్ హైపర్ ఆదితో కలిసి వర్షిణి.. డ్యాన్స్ షోలో యాంకరింగ్ చేసింది. అలా వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ కావడంతో నిజంగానే రిలేషన్లో ఉన్నారని అంతా అనుకున్నారు. కానీ గతంలో ఓ ఇంటర్వ్యూలో వర్షిణి మాట్లాడుతూ అలాంటిదేం లేదని క్లారిటీ ఇచ్చింది. కానీ మొన్నీ మధ్య మరోసారి వర్షిణిని హైపర్ ఆది పెళ్లి చేసుకోబోతున్నాడనే టాక్ వచ్చింది. దీనిపై తాజాగా ఇన్‌స్టా వేదికగా స్పందించిన వర్షిణి.. ఎమోజీలు పోస్ట్ చేసి అలాంటిదేం లేదని చెప్పకనే చెప్పేసింది. (ఇదీ చదవండి: అమలా పాల్ ఒక చెత్త హీరోయిన్: యంగ్ హీరో) అమ్మతో మాట్లాడు..! ఇకపోతే ఇదే చాట్ డిస్కషన్లో భాగంగా ఓ నెటిజన్.. పెళ్లి చేసుకుందామని వర్షిణితో అన్నాడు. దీనిపై ఫన్నీగా స్పందించిన ఈభామ.. తన అమ్మతో మాట్లాడమని చెప్పింది. ఇదంతా పక్కనబెడితే గతంలో ఎన్నడూ లేనంతగా ఈ మధ్య వర్షిణి పెళ్లి ఎక్కువగా డిస్కషన్‌లోకి వస్తుంది. ఎందుకంటే ఐపీఎల్ టైంలో హైదరాబాద్ జట్టుకు ఆడుతున్న వాషింగ్టన్ సుందర్‌తో షికార్లు చేసిందని మాట్లాడుకున్నారు. ఇక ఇప్పుడేమో పలు ఎంటర్ టైన్మెంట్ షోలు చేసే డైరెక్టర్‌తో యాంకర్ వర్షిణి ప్రేమలో ఉందని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. త్వరలో వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని అందుకే ఈ మధ్య కాలంలో వర్షిణి పెళ్లి గురించి తెగ రూమర్స్ వస్తున్నాయని అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై క్లారిటీ రావాలంటే కొన్నాళ్లు ఆగితే గానీ అసలు విషయం ఏంటో తెలీదు. (ఇదీ చదవండి: మెగాస్టార్‌కు సర్జరీ.. సినిమాలకు బ్రేక్?!) -
హైపర్ ఆది ఓవరాక్షన్.. చిరంజీవిని జీరోగా.. మెగా ఫ్యాన్స్ ఆగ్రహం
భోళా మేనియా మొదలవడానికి ఇంకా రెండు రోజులే ఉంది. ఇప్పటికే కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. ఒక పక్క చిరంజీవి కూడా గతంలో ఎప్పుడూ లేనంతగా కామన్ ఇంటర్వూలలో కామెడీ టన్నుల్లో పంచుతున్నాడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఫుల్ ఫన్నీ మోడ్‌లో సాగింది. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో హైపర్ ఆది స్పీచ్ ఇప్పుడు భోళా శంకర్‌కు చాలా మైనస్‌గా మారింది. మెగా ఫ్యామిలీకి వీరభక్తుడిని అని చాటుకోవడానికి ఒక రేంజ్లో రెచ్చిపోయాడు. కానీ అత్యుత్సాహంతో చాలా తప్పులు చేశాడు. సినిమా వేదికపై రాజకీయాలు.. ఆది తన స్పీచ్‌తో తమ్ముడిని హీరో చేసే ప్రయత్నంలో భాగంగా అన్నయ్యని జీరో అని డైరెక్ట్‌గానే చెప్పాడు. చిరంజీవి రాజకీయాల్లో జీరో అని ఆయన ఎప్పుడో వదిలేసిన వాటిని మళ్ళీ గుర్తు చేశాడు. దీంతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ హ్యాపీ అయినా మెగా అభిమానులు మాత్రం గుర్రుగా ఉన్నారు. హైపర్ ఆది వేసిన మరో రాంగ్ స్టెప్.. సినిమా వేదికపై నుంచి ఏదో కౌంటర్ వేస్తున్నా అనే భ్రమలో రాజకీయాలు మాట్లాడడం! చిరంజీవి రాజకీయాలు వదిలేసి చాలాకాలమైంది. అంతే కాదు, రాజకీయాలకు అతీతంగా చాలా మంది చిరంజీవిని అభిమానిస్తారు, రిలీజ్ రోజే ఆయన సినిమా చూస్తారు. చిరు కూడా ఎప్పుడూ సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అంటారు. ఆది వ్యాఖ్యలపై సెటైర్స్ పడాల్సిందే! కానీ ఇప్పుడు హైపర్ ఆది సినిమా ఫంక్షన్ లో రాజకీయాల గురించి మాట్లాడాడు. ఇక ఇప్పుడు రాజకీయనాయకులు తమ ప్రెస్ మీట్స్‌లో సినిమాల గురించి మాట్లాడకుండా ఎందుకు ఉంటారు? ఆది సెటైర్స్‌ను మించిన సెటైర్స్ పడకుండా ఎందుకు ఉంటాయి? ఆది కామెంట్స్ చిరంజీవి ఫ్యాన్స్‌ను బాధపెట్టాయి. అలాగే సాధారణ ప్రేక్షకులకు సైతం చాలా ఓవర్ అనే భావనను కలిగించాయి. ఓవరాల్‌గా ఇవన్నీ కలిసి భోళా శంకర్ కలెక్షన్స్‌పై ప్రభావం చూపించే ఆస్కారం ఉంది. ఇకనైనా చిరంజీవి తన సినిమా ఫంక్షన్స్‌లో ఇలాంటి వాళ్ళకి ముందే కొన్ని కండిషన్స్ పెడితే బావుంటుంది. ఇదే కంటిన్యూ అయితే ఇన్నాళ్లు అందరివాడిగా ఉన్న చిరంజీవి కొందరివాడిగా మారడానికి ఎంతో సమయం పట్టదు! చదవండి: 'భోళా శంకర్'కి అడ్డంకులు.. రిలీజ్ వాయిదా? రెండు సినిమాలకే క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్.. అప్పుడే పెళ్లంటూ ఒత్తిడి తెస్తున్న శంకర్ -
ప్రముఖ యాంకర్‌తో హైపర్ ఆది పెళ్లి ఫిక్స్!
బుల్లితెరలో ప్రసారం అవుతున్న కామెడీ షోలకు స్క్రిప్ట్ రైటర్‌గా పని చేసిన హైపర్ ఆది రానురానూ అదే షోలో టీమ్‌కు లీడర్ అయ్యే స్థాయికి ఎదిగాడు. ఆపై తిరుగులేని పంచులతో మంచి కమెడియన్‌గా పేరు తెచ్చుకున్నాడు. తద్వారా వచ్చిన పాపులారిటీతో పలు షోలు చేస్తూ బిజీబిజీగా మారాడు. దీంతో తన కామెడీ టైమింగ్ పంచ్‌లతో సపరేట్ ఫ్యాన్ బేస్‌ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. అలా బుల్లితెరపైనే కాకుండా బిగ్ స్క్రీన్‌పైనా కూడా పలు సినిమాల్లో కమెడియన్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఈ మధ్యే విడుదలైన ధనుష్ 'సార్' సినిమాలో కూడా ఆది మెప్పించాడు. (ఇదీ చదవండి: TFCC Election Live Update: టాలీవుడ్ లో ఉత్కంఠ.. గెలుపెవరిది?) తాజాగా అతడు పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడు అవ్వాలని భావిస్తున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం ఊపందుకుంది. దీంతో అతడికి కాబోయే భార్య ఎవరా? అని అభిమానులు కూడా తెగ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రముఖ యూట్యూబ్ యాంకర్‌తో ఆది ప్రేమలో ఉన్నారట. ఆమెతో ఆదికి చాలా కాలం నుంచే పరిచయం ఉందట. ఒక రకంగా ఆది ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సమయంలో అతనికి ఆమె ఎంతో సాయంగా నిలిచిందట. అలా స్నేహంగా మొదలైన వారి బంధం ప్రేమ వరకు వచ్చిందట. (ఇదీ చదవండి: TFCC Election: సంతోషపడాలో, సిగ్గు పడాలో తెలియట్లేదు..తమ్మారెడ్డి) తాజాగా వీరి ప్రేమ గురించి ఇంట్లో తెలిపితే ఇద్దరి పెద్దలు కూడా అంగీకరించారట. ఇంకేముంది త్వరలోనే ఒక మంచి ముహూర్తం ఏర్పాటు చేసి ఆ అమ్మాయితో నిశ్చితార్థం జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. త్వరలో ఆ ఆమ్మాయి పేరుతో పాటు.. పెళ్లి విషయాన్ని అధికారికంగా ఆదినే వెల్లడించాలనే ప్లాన్‌లో ఉన్నారట. -
దివాళీ స్పెషల్: స్టేజీపై కార్తీ, అంజలి.. పంచులతో నవ్వించిన ఆది!
బిగ్‌బాస్ షోలో ఉన్న కంటెస్టెంట్లకు దీపావళి ఒకరోజు ముందే వచ్చింది. సెలబ్రిటీల రాకతో నేటి ఎపిసోడ్ చిచ్చుబుడ్డిలా పేలనున్నట్లు కనిపిస్తోంది. కార్తీ, అంజలి స్టేజీపైకి వచ్చి హౌస్‌మేట్స్‌తో ముచ్చటించగా హైపర్ ఆది తన పంచులతో కంటెస్టెంట్లను ఓ ఆటాడుకున్నాడు. శ్రీరామచంద్ర పాటలతో ఆకట్టుకోగా రష్మీ, అవికాగోర్ డ్యాన్స్ చింపేశారు. అంజలి కోసం అద్భుతమైన పాట పాడాడు రేవంత్. హీరో కార్తీ దీపావళి సందర్భంగా అందరికీ స్వీట్స్ తీసుకొచ్చానన్నాడు. కానీ అది వారు పొందేందుకు గేమ్ ఆడించాడు. అలాగే ఇంట్లో ఉన్న అబ్బాయిలు అమ్మాయిల గెటప్‌లు వేసుకుని డ్యాన్స్ చేశారు. ఓవైపు ముఖాన గడ్డం పెట్టుకుని చీర కట్టుతో కనిపించిన వాళ్లను చూసి నాగార్జున ఈ ఘోరం నేను చూడలేను బాబోయ్ అంటూ కళ్లు మూసుకున్నాడు. మరి ఈ పటాకా ఎపిసోడ్ చూడాలంటే నేడు సాయంత్రం ఆరు గంటల వరకు వేచి చూడాల్సిందే! చదవండి: తమ్మీ, నీకు అడుక్కు తిందామన్నా దిక్కుండదు: ఆరోహి బిగ్‌బాస్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఎవరికుందో చెప్పిన హౌస్మేట్స్! -
'హైపర్ ఆదిపై దాడి' వార్తలపై క్లారిటీ ఇచ్చిన కమెడియన్
Hyper Aadi Release Video: హైపర్ ఆది... బుల్లితెర ప్రేక్షకులకు బాగా సుపరిచితమీ పేరు. పంచులతో, తనదైన కామెడీ టైమింగ్‌తో జోక్స్ పేల్చుతూ ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్విస్తాడీ కమెడియన్. అయితే తరచూ వివాదాల్లో ఉండే హైపర్ ఆదిపై గత రెండు మూడు రోజులుగా కొన్ని వార్తలు విపరీతంగా ప్రచారమవుతున్నాయి. ఆదిపై దాడి జరిగిందని కొందరు.. లేదు, దాడి చేయడానికి ఓ హీరో అభిమానులు ఎదురు చూస్తున్నారని మరికొందరు రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. అయితే ఇవన్నీ వుట్టి పుకార్లేనని కొట్టిపారేశాడు హైపర్ ఆది. ఈ మేరకు వీడియో రిలీజ్ చేసి క్లారిటీ ఇచ్చాడు. 'నాపై దాడి చేయడం కోసం ఎవరో వెతుకుతున్నారంటూ ఏవేవో ఫేక్ న్యూస్‌లు వస్తున్నాయి. మీ ఫేక్ న్యూస్‌లు రాసేవారికి ఒకటే చెప్తున్నా.. మీ దగ్గర డబ్బుల్లేవంటే చెప్పండి, నేను సంపాదించేదాంట్లో కొంత తీసి మీకిస్తాను. మేమందం హ్యాపీగా షూటింగులు చేసుకుంటున్నాం. అందరూ హ్యాపీగా ఉండండి, మేమూ హ్యాపీగా ఉన్నాం' అని చెప్పుకొచ్చాడు హైపర్ ఆది. View this post on Instagram A post shared by Jabardasth Hyper Aadi (@hyper.aadi) -
హైపర్ ఆది ఆస్తుల విలువెంతో తెలుసా?
Hyper Aadi: కమెడియన్ హైపర్ ఆదికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతలా తన కామెడీ, టైమింగ్ పంచులతో తెగ నవ్విస్తుంటాడు. ఆయన చేసే కామెడీ స్కిట్లు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలుస్తాయి. తనదైన కామెడీ టైమింగుతో అలరించే హైపర్ ఆదికి బుల్లితెరపై మాంచి ఫాలోయింగ్ ఉంది. దీంతో ఆయన రెమ్యునరేషన్ కూడా భారీగానే ఉంటుందని టాక్. ఈవెంట్‌ను బట్టి హైపర్ ఆది పారితోషికం డిమాండ్ చేస్తాడని తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన ఒక్క స్కిట్‌కి గానూ లక్షల్లో అందుకుంటాడని, దీన్ని బట్టి ఏడాదికి కోటి రూపాయలకు పైగానే సంపాదిస్తాడని వార్తలు వస్తున్నాయి. అటు బుల్లితెరతో పాటు అప్పుడప్పుడూ సినిమాల్లోనూ నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్న ఆది కామెడీ షోలతో బాగానే వెనకేసుకున్నట్లు తెలుస్తుంది. సొంత ఊర్లో ఇప్పటికే సుమారు 16ఎకరాలు కొన్న ఆది తాజాగా హైదరాబాద్‌లో ఓ ఖరీదైన ఇంటిని కూడా కొనుగోలు చేసినట్లు సమాచారం. చదవండి: ‘వరుడు కావలెను' ముందు నాగచైతన్యకు చెప్పా: డైరెక్టర్ ఆర్ఆర్ఆర్ మూవీ రన్‌టైం ఎంతో తెలుసా? -
బిగ్‌బాస్ 5: స్పెషల్ ఎపిసోడ్లో ఆది, 25 నిమిషాలకే షాకింగ్ రెమ్యునరేషన్!
ప్రముఖ బుల్లితెర కమెడియన్ హైబర్ ఆది క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతలా తన కామెడీ, టైమింగ్ పంచులతో ఆది బుల్లితెరపై నవ్విస్తుంటాడు. బయట జరిగిన కొన్ని సంఘటనలను, కాన్టెంపరరీ ఇష్యూస్ తీసుకుని అదిరిపోయే కామెడీ చేయడంలో హైపర్ ఆది సిద్ధహస్తుడు. అలా అతడు స్టేజ్‌పై ఉన్నంత సేపు ప్రేక్షకులను నవ్విస్తూనే ఉంటాడు. ఇదిలా ఉంటే ఇటీవల ఆది ప్రముఖ రీయాలిటీ షో తెలుగు బిగ్‌బాస్ 5కి అతిథిగా వచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: బిగ్‌బాస్ పత్తేపారం.. రవి, లోబో, శ్వేతలకు జాక్‌పాట్ నవరాత్రి ఉత్సవాలు పేరుతో ఆదివారం బిగ్‌బాస్ స్పెషల్ ఎపిసోడ్‌ను నిర్వహించారు. ప్రేక్షకులకు రెట్టింపు వినోదం అందించేందుకు ఈషోకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోహీరోయిన్ అఖిల్, పూజ హెగ్డేతో పాటు నటి మీనాక్షి, హెబ్బా పటెల్, నాట్యం నటి వచ్చి తమ డ్యాన్స్ పర్ఫామెన్స్తో అలరించారు. దీనితో పాటు కాస్తా కామెడీ టచ్ ఇచ్చేందుకు బిగ్‌బాస్ నిర్వహకులు ఆదిని తీసుకువచ్చారు. పోలీసు ఆఫీసర్‌గా బిగ్‌బాస్ స్టేజ్‌పైకి వచ్చిన ఆది అందరిని ఓ రెంజ్లో నవ్వించాడు. ఈ షోలో 25 నిమిషాల పాటు కనిపించిన ఆది పోలీసు ఆఫీసర్‌గా వచ్చి బిగ్‌బాస్ హౌజ్‌మెట్స్‌పై ఇన్వెస్టిగేషన్ చేశాను అంటూ వారి చరిత్ర అంతా విప్పాడు. చదవండి: బన్నీవాసుపై ఎస్పీకి ఫిర్యాదు చేసిన సునీత బోయ హౌజ్‌లో ఎవరెవరు ఏం చేశారు, ఎలా ఆడుతున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారో అన్ని బయటపెడుతూనే తనదైన శైలిలో హౌజ్‌మేట్స్‌పై పంచ్‌లు, సటైర్లు వేశాడు. అలా ఈ షోలో గెస్ట్‌గా తన పాత్రకు వందశాతం న్యాయం చేశాడు. చెప్పాలంటే ఆది ఉన్నంత సేపు బిగ్‌బాస్ ప్రేక్షకులంతా కూడా ఫుల్‌గా నవ్వేసుకున్నారు. అంతలా వినోదం పంచిన ఆది భారీగానే రెమ్యునరేషన్ అందుకున్నాడట. కేవలం 25 నిమిషాలు కనిపించినందుకే దాదాపు 2 లక్షల నుంచి 2.5 లక్షల రూపాయల వరకు పారితోషికం తీసుకున్నాడని సమాచారం. కాగా గతేడాది కూడా దసరా సందర్భంగా బిగ్‌బాస్ 4 సీజన్‌కు సమంత హోస్ట్‌గా రాగా అదే ఎపిసోడ్‌కు ఆది గెస్ట్‌గా వచ్చి అలరించిన సంగతి తెలిసిందే. -
‘క్షమాపణ చెప్పినా హైపర్ ఆదిని వదలం.. బుద్ధి చెప్తాం’
సాక్షి, హైదరాబాద్: ఓ టీవీలో ప్రసారమైన షోలో జబర్దస్త్ నటుడు హైపర్ ఆది తెలంగాణ సంస్కృతిపై చేసిన అనుచిత వ్యాఖ్యల వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. తాజాగా హైపర్ ఆది ఆ వ్యాఖ్యలకు క్షమాపణ తెలిపారు. అయితే ఆయన క్షమాపణలు చెప్పినా కూడా తాము వదిలేది లేదని తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ స్పష్టం చేసింది. ఆది క్షమాపణలు చెప్పిన అనంతరం ఆ సంస్థ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నవీన్ గౌడ్ స్పందించారు. హైపర్ ఆదిని బాధపెట్టడం.. క్షమాపణ చెప్పడం సరైన విధానం కాదు అని తెలిపారు. సంస్కృతిని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ తాము ఆరోపణలు చేస్తున్నట్లు హైపర్ ఆది అనడం సిగ్గుచేటు అని నవీన్ గౌడ్ తెలిపారు. ఇప్పటికీ కూడా పశ్చాత్తాప పడకుండా కేవలం తప్పించుకునే ధోరణిలో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం ఈ వ్యాఖ్యలను గమనిస్తున్నారని చెప్పారు. సరైన సమయంలో సరైన రీతిలో బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఎక్కడ కూడా మేము తగ్గేది లేదని.. కచ్చితంగా బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందేనని స్పష్టం చేశారు. యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందుకు వచ్చి క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. ఏదో అతని పర్సనల్ పేజీలో వీడియో పెట్టుకొని చేతులు దులుపుకునే ధోరణి సహించేది లేదు అని పేర్కొన్నారు. చదవండి: తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన హైపర్ ఆది చదవండి: నేను తెలంగాణ సంస్కృతిని కించపరచలేదు: హైపర్ ఆది -
తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన హైపర్ ఆది
సాక్షి, హైదరాబాద్: బతుకమ్మ, గౌరమ్మపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు జబర్దస్త్ నటుడు హైపర్ ఆది క్షమాపణలు చెప్పాడు. ఆంధ్ర, తెలంగాణ అనే భేదాభిప్రాయాలు తమ షోలో ఎప్పుడు ఉండవు... అందరం కలిసికట్టుగా పని చేసుకుంటూ ఉంటామని వివరణ ఇచ్చారు. ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షోలో చేసిన స్కిట్‌పై తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఎల్బీనగర్లో కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం దీనిపై ఫోన్‌కాల్‌లో ఆ ప్రతినిధులకు వివరణ ఇచ్చారు. అయితే బేషరతుగా క్షమాపణలు చెప్పేదాక తాము వదిలిపెట్టమని.. కావాల్సి వస్తే న్యాయపరంగా వెళ్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే హైపర్ ఆది క్షమాపణలు చెబుతూ రాత్రి వీడియో విడుదల చేశారు. ఆ షోలో చేసిన స్కిట్‌పై కొన్ని ఆరోపణలు వచ్చాయి.. అవి తాము కావాలని చేసినవి కావు అని హైపర్ ఆది తెలిపారు. అన్ని ప్రాంతాల వారి ప్రేమ, అభిమానంతోనే తాము వారికి వినోదం పంచుతున్నట్లు చెప్పారు. ఇటీవల షోలో జరిగిన దానికి అందరి తరఫున క్షమాపణ కోరుతున్నట్లు ప్రకటించాడు. చదవండి: హైపర్ ఆదిపై పోలీసులకు ఫిర్యాదు చదవండి: నేను తెలంగాణ సంస్కృతిని కించపరచలేదు: హైపర్ ఆది -
నేను ఎక్కడా తెలంగాణ సంస్కృతిని కించపరచలేదు: హైపర్ ఆది
-
నేను తెలంగాణ సంస్కృతిని కించపరచలేదు: హైపర్ ఆది
సాక్షి, హైదరాబాద్: జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదిపై తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు సోమవారం నాడు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. హైపర్ ఆది తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిచాడు.. క్షమాపణ చెప్పాల్సిందే అంటూ తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో హైపర్ ఆది దీనిపై స్పందిస్తూ.. నేను ఎక్కడా తెలంగాణ సంస్కృతిని కించపరచలేదు. స్క్రిప్ట్ నేను రాయలేదు.. నేను కేవలం ఆర్టిస్ట్‌ను మాత్రమే అని తెలిపారు. టీవీలో ప్రసారమైన ఓ కార్యక్రమంలో ఆది.. తెలంగాణ పండుగ బతుకమ్మ, దేవతగా పూజించే గౌరమ్మతో పాటు తెలంగాణ యాస, భాషలను కించపరిచే విధంగా మాట్లాడారని తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ ఆరోపించింది. ఈ మేరకు ఆది, స్క్రిప్ట్ రైటర్‌తో పాటు మల్లెమాల ప్రొడక్షన్‌పై చర్యలు తీసుకోవాలని ఎల్బీ నగర్ ఏసీపీ శ్రీధర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. చదవండి: మరోసారి రెచ్చిపోయిన హైపర్ ఆది.. వ్యాఖ్యలు దుమారం -
హైపర్ ఆదిపై పోలీసులకు ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదిపై తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు సోమవారం నాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీవీలో ప్రసారమైన ఓ కార్యక్రమంలో ఆది.. తెలంగాణ పండుగ బతుకమ్మ, దేవతగా పూజించే గౌరమ్మతో పాటు తెలంగాణ యాస, భాషలను కించపరిచే విధంగా మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ఆది, స్క్రిప్ట్ రైటర్‌తో పాటు మల్లెమాల ప్రొడక్షన్‌పై చర్యలు తీసుకోవాలని ఎల్బీ నగర్ ఏసీపీ శ్రీధర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. గతంలోనూ హైపర్ ఆది డబుల్ మీనింగ్ డైలాగులు, హద్దుమీరిన కామెడీపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదులు అందిన విషయం విదితమే. చదవండి: కమల్ చిత్రంపై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు -
హైపర్ ఆదిపై దొరబాబు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!
హైపర్ ఆది.. కామెడీ, డబుల్ మీనింగ్ డైలాగ్స్, టైమింగ్ పంచ్‌లకు కేరాఫ్ అడ్రస్. ఓ కామెడీ షో ద్వారా బుల్లితెరకు పరిచయమైన ఆది తనదైన శైలిలో కామెడీ పండిస్తూ హైపర్ ఆదిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎదుటి వారిపై పంచులు వేస్తూ బుల్లితెర ప్రేక్షకులకు ఎనలేని కామెడీని అందిస్తుంటాడు. ఇక ఏ షో చేసిన అందులో ఆడవాళ్లు, మహిళ యాంకర్స్‌పై అతడు వేసే డబల్ మీనింగ్ పంచ్‌లు మాములుగా ఉండవు. ఎంతటి వారినైనా అవి ఆకట్టుకుంటాయి. ఈ క్రమంలో కొన్నిసార్లు అవి శృతి మించి విమర్శలు కూడా ఎదుర్కొంటుంటాడు. అయితే హైపర్ ఆది టీంలో పనిచేసే దొరబాబు, పరదేశి గతంలో వ్యభిచారం కేసులో పట్టుబడిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ విషయం సంచలనంగా మారింది. ఆ ఘటన జరిగి సంవత్సరం పూర్తయినా ఇప్పటికీ షోలో వారిని ఉద్దేశిస్తూ ఆది వేసే పంచ్ డైలాగ్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికీ వారిని టార్గెట్ చేస్తునే ఉంటాడు. ఇక ఇటీవల ఓ షోలో పాల్గొన్న దొరబాబు భార్య ఆమూల్య ఆది గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరించిన సుడిగాలి సుధీర్ దొరబాబుని ఎందుకు పెళ్లి చేసుకున్నావ్ అని అడగ్గా.. తన ఇంట్లో వాళ్ళు దొరలాంటివాడిని పెళ్లి చేసుకోమని చెబితే దొరలాంటివాడు ఎందుకని దొరబాబునే చేసుకున్నఅంటూ పంచ్ వేసింది. ఇక వెంటనే ఆది ‘నీకు ఫాలోయింగ్ ఆ రేంజ్ లో ఎందుకు వచ్చిందో ఇప్పుడు అర్థం అయింది’ అంటూ ఆమెపై కౌంటర్ వేశాడు. ఇక ఆ తర్వాత ఆమూల్య మాట్లాడుతూ.. ‘మేము కష్టాల్లో ఉన్న సమయంలో ఎవరూ మాకు తోడుగా లేరు. ఇక మాకు ఎవరు లేరని అనుకున్న సమయంలో హైపర్ ఆది ముందుకు వచ్చాడు. క్లిష్ట పరిస్థితుల్లో మాకు సాయం చేసి ఆదుకున్నాడు. అందుకే ఆది నెంబర్‌ను మా ఫోన్లో గాడ్ అని సేవ్ చేసుకున్నాం’అంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. ఈ ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఎప్పుడు ఎదుటి వారిపై పంచ్ డైలాగ్‌లు వేస్తూ ఆటపట్టించే ఆది ఈ కోణం కూడా ఉందా అంటూ నెటిజన్లను కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: వర్షపై బాడీషేమింగ్ చేసిన హైపర్ ఆది గుడ్‌న్యూస్ చెప్పిన వర్ష, ఆ వెంటనే గిఫ్ట్‌తో పార్టీకి! -
హైపర్ ఆది పెళ్లి ఆరోజే.. ఆమెనే పెళ్లాడతాడట!
కామెడీ టీమ్‌కు స్క్రిప్ట్ రైటర్‌గా పని చేసిన హైపర్ ఆది రానురానూ అదే టీమ్‌కు లీడర్ అయ్యే స్థాయికి ఎదిగాడు. తిరుగులేని పంచులతో మంచి కమెడియన్‌గా పేరు తెచ్చుకున్నాడు. తద్వారా వచ్చిన పాపులారిటీతో పలు షోలు చేస్తూ బిజీబిజీగా మారాడు. తాజాగా అతడు పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని భావిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. అతడికి కాబోయే భార్య ఎవరా? అని అభిమానులు కూడా తెగ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. నిజానికి హైపర్ ఆది.. ముందు సుధీర్, రష్మిల పెళ్లి అయిన తర్వాతే తాను పెళ్లిపీటలెక్కుతానని గతంలో పలుమార్లు మీడియాతో చెప్పాడు. కానీ వాళ్లు పెళ్లి ఊసే ఎత్తకపోవడంతో తనే ముందు వివాహానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఆది కోసం పెళ్లికూతురును వెతికే పనిలో పడ్డారట అతడి ఇంటి సభ్యులు. అతను కూడా తల్లిదండ్రులు తీసుకొచ్చే అమ్మాయినే అర్ధాంగిగా చేసుకుంటానని చెప్తున్నట్లు తెలుస్తోంది. పనిలో పనిగా పెళ్లి డేట్ కూడా ప్రకటించేశాడట హైపర్ ఆది. వచ్చే ఏడాది తన జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభిస్తానని అంటున్నాడట. అది కూడా తన సొంత జిల్లా ప్రకాశానికి చెందిన అమ్మాయితోనే ఏడడుగులు నడుస్తానని తేల్చి చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ పెళ్లి వార్తలు ఎంతవరకు నిజమో త్వరలోనే తెలియనుంది. చదవండి: స్టార్ హీరో సినిమా: థియేటర్లో, ఓటీటీలో ఒకేసారి! నటుడి కొడుకు కోసం చిరంజీవి ఖరీదైన గోల్డ్ చైన్! -
మరోసారి రెచ్చిపోయిన హైపర్ ఆది.. వ్యాఖ్యలు దుమారం
హైపర్ ఆది..ఈ పేరు తెలియని బుల్లితెర ప్రేక్షకులు ఉండరనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. తనదైన కామెడీ టైమింగ్, పంచు డైలాగులతో షోని రక్తి కట్టిస్తాడు. అయితే ఒక్కోసారి శృతి మించే పంచ్‌లు నవ్వు తెప్పించకపోగా ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తాయి. తాజాగా హైపర్ ఆది మరోసారి తన డబుల్ మీనింగ్ డైలాగులతో యాంకర్‌పై రెచ్చిపోయాడు. ఓ షోలో పాల్గొన్న హైపర్ ఆది..యాంకర్ వర్షపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో హల్చల్ అవుతున్నాయి. హైపర్ ఆది-వర్షకు మధ్య జరిగిన ఓ డిస్కషన్లో ఎలా ఉన్నావు అని ఆది అడగ్గా...బావున్నానండీ. ఎందుకంటే నా పని నేను చూసుకుంటాను కాబట్టి అని వర్ష చెప్పింది. దీనికి కౌంటర్‌గా... 'అదే పనిగా నీకు వచ్చే కామెంట్లు చూసుకుపోయావా..షోలో కొత్తగా వచ్చిన లేడీ గెటప్ ఎవరు అని చాలామంది అడుగుతున్నారు' అంటూ వర్షపై బాడీషేమింగ్ వ్యాఖ్యలు చేశాడు. ఆమె జెండర్‌పై ఆది చేసిన ఈ వల్గర్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. లేడీ యాంకర్ల పరువు తీసేలా ఆది బిహేవ్ చేస్తున్నాడంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. చదవండి : ప్రేమలో ఉన్నా.. సురేఖ వాణి షాకింగ్ పోస్ట్ జాతిరత్నాలు డైరెక్టర్‌కు కాస్ట్లీ లంబోర్గిని కారు! -
‘ఆటగదరా శివ’ మూవీ రివ్యూ
టైటిల్ : ఆటగదరా శివ జానర్ : ఎమోషనల్ డ్రామా తారాగణం : దొడ్డన్న, ఉదయ్ శంకర్, హైపర్ ఆది సంగీతం : వాసుకి వైభవ్ దర్శకత్వం : చంద్ర సిద్ధార్థ నిర్మాత : రాక్‌లైన్ వెంకటేష్ ఆ నలుగురు, అందరి బంధువయా లాంటి హార్ట్ టచింగ్ సినిమాలను తెరకెక్కించిన చంద్ర సిద్ధార్థ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ఆటగదరా శివ. కన్నడలో ఘనవిజయం సాదించిన రామ రామరే సినిమాకు రీమేక్ తెరకెక్కిన ఈ సినిమాలో కన్నడ నటుడు దొడ్డన్న, ఉదయ్ శంకర్, జబర్దస్త్ ఫేం హైపర్ ఆదిలు కీలక పాత్రల్లో నటించారు. దాదాపు మూడేళ్ల విరామం తరువాత చంద్ర సిద్ధార్థ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కావటంతో ఆటగదరా శివపై ఆసక్తి నెలకొంది. మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుందా..? కథ; జంగయ్య (దొడ్డన్న) తలారీ. ఊళ్లో పశువులకు వైద్యం చేస్తూ ఉండే జంగయ్య, ప్రభుత్వం నుంచి పిలుపు వచ్చినప్పుడు వెళ్లి తలారీ బాధ్యతలు నిర్వహిస్తుంటాడు. అలా ఉరిశిక్ష పడ్డ ఖైదీ గాజులమర్రి బాబ్జీ(ఉదయ్ శంకర్)ని ఉరితీసేందుకు రావాల్సిందిగా జంగయ్యకు కబురందుతుంది. జంగయ్య బయలుదేరే సమయానికి బాబ్జీ.. జైల్లో సెంట్రీని గాయపరిచి పారిపోతాడు. బయటకు వచ్చి బాబ్జీ చాలా దూరం పరిగెత్తి పరిగెత్తి చివరకు జీపులో వెళ్తున్న జంగయ్యనే లిఫ్ట్ అడుగుతాడు. కొద్ది దూరం ప్రయాణం తరువాత పేపర్లో ఉరిశిక్ష పడ్డ ఖైదీ పరార్ అంటూ వచ్చిన ప్రకటన చూసిన జంగయ్య బాబ్జీని గుర్తుపడతాడు. అయినా ఏం తెలియనట్టే ప్రయాణం కొనసాగిస్తారు. వారి ప్రయాణం చివరకు ఎలా ముగిసింది..? ఈ ప్రయాణంలో వాళ్లకు ఎదురైన అనుభవాలేంటి..? కలిసిన వ్యక్తులు ఎవరు..? అన్నదే మిగతా కథ. విశ్లేషణ ; కన్నడలో ఘనవిజయం సాధించిన రామ రామరే సినిమాను దాదాపు అదే ఫీల్‌ను క్యారీ చేస్తూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కించారు చంద్రసిద్ధర్థ. కథగా చిన్నపాయింటే అయినా.. కథనంతో ప్రేక్షకులను మెప్పించారు. సినిమాకు కీలకమైన జంగయ్య పాత్రను మలిచిన తీరు చాలా బాగుంది. ఆ పాత్రకు కన్నడ నటుడు దొడ్డన్న ప్రాణం పోశారు. లుక్స్ పరంగానే కాదు నటనతోనూ మెప్పించారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో దొడ్డన్న నటన సూపర్బ్. బాబ్జీ పాత్రలో కనిపించిన ఉదయ్ శంకర్ ఆకట్టుకున్నాడు. పెద్దగా వేరియేషన్స్ చూపించే అవకాశం దక్కకపోయినా.. సెటిల్డ్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. జబర్దస్త్ ఫేం హైపర్ ఆదికి లెంగ్తీ రోల్ దక్కింది. తన మార్క్ పంచ్ డైలాగ్స్‌తో కామెడీ పండించే ప్రయత్నం చేశాడు ఆది.ఇతర పాత్రలకు పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోవటంతో పాటు ఆపాత్రలో పరిచయం ఉన్న నటులెవరూ కనిపించలేదు. దర్శకుడు చంద్ర సిద్దార్థ తన గత చిత్రాల మాదిరిగానే మరోసారి మనసుకు హత్తుకునే ఎమోషనల్ సీన్స్‌తో సినిమాను రూపొందించారు. ముఖ్యంగా ఆటగదరా శివ సినిమాకు ప్రధాన బలం మాటలు. ‘ముందు క్షమాపణ అడిగిన వాడే ధైర్యవంతుడు.. క్షమించిన వాడే బలవంతుడు’, ‘మనం ఉన్నప్పుడు లేనోళ్లు, పోయాక ఉంటే ఎంత పోతే ఎంత’, ‘చావు విముక్తి, బతుకు తృప్తి’ లాంటి డైలాగ్స్ ఆలోచింప చేస్తాయి. అయితే కమర్షియల్ సినిమాలు ఇష్టపడే వారని ఈ సినిమా మెప్పించటం కాస్త కష్టమే. సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్ లవిత్ సినిమాటోగ్రఫి. నిర్జన ప్రదేశంలో పెద్దగా సెట్ ప్రాపర్టీస్‌ను వాడకుండా ఆసక్తికర విజువల్స్‌ను క్యాప్చర్ చేశారు. కన్నడ వర్షన్‌కు సంగీతమందించిన వాసుకీ వైభవ్ తెలుగు వర్షన్ కు కూడా మంచి సంగీతాన్నందించారు. ముఖ్యంగా టైటిల్ సాంగ్‌తో పాటు, ఎట్టాగయ్య శివ పాటలకు మంచి రెస్సాన్స్ వస్తోంది. చాలా కాలం తరువాత తెలుగు సినిమాను నిర్మించిన రాక్‌లైన్ లైన్ వెంకటేష్ తమ బ్యానర్ స్థాయికి తగ్గ సినిమాతో ఆకట్టుకున్నారు. ప్లస్ పాయింట్స్ ; కథా కథనం ప్రధాన పాత్రధారుల నటన ఎమోషనల్ సీన్స్ మైనస్ పాయింట్స్ ; రొటీన్ కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవటం సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
అప్పుడు సినిమాలు చేయకూడదనుకున్నా
‘‘చాలా గ్యాప్ తర్వాత మీ ముందుకొస్తున్నా. సరైన కథ తోచక నిరాసక్తతలో ఉండి ఇక సినిమాలు చేయకపోవడమే బెటర్ అనుకుంటున్న టైమ్‌లో తనికెళ్ల భరణిగారు రాసిన ‘ఆటగదరా శివ’ పాట విన్నా. అది టైటిల్‌గా బావుంటుందనిపించింది. ఆ మరుసటిరోజే రాక్‌లైన్ వెంకటేశ్‌గారు ‘ఆటగదరా శివ’ సినిమా గురించి చెప్పారు. నాకూ రోడ్ ఫిల్మ్ చేయాలని కోరిక ఉండటంతో ఒప్పుకున్నా’’ అని దర్శకుడు చంద్రసిద్ధార్థ్ అన్నారు. ఉదయ్ శంకర్ కథానాయకుడిగా దొడ్డన్న, ‘హైపర్’ ఆది, దీప్తి, ‘చలాకీ’ చంటి, ‘చమ్మక్’ చంద్ర, భద్రం నటించిన చిత్రం ‘ఆటగదరా శివ’. ‘ఆ నలుగురు’ ఫేమ్ చంద్రసిద్ధార్థ్ దర్శకత్వంలో రాక్‌లైన్ వెంకటేశ్ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా చంద్రసిద్ధార్థ్ మాట్లాడుతూ– ‘‘కన్నడలో హిట్ అయిన ‘రామ రామ రే’ చిత్రానికి స్పిరిచ్యువల్ యాంగిల్‌ని, ఇంకో లేయర్‌ని కలగలిపి ‘ఆటగదరా శివ’ కథ సిద్ధం చేశా. పెద్ద పెద్ద సినిమాలు చేసే వెంకటేశ్‌గారు ఈ సినిమా తీయడం ధైర్యం చేయడమే. ఇది రాగిముద్దలాంటి సినిమా. అయినా మా నటీనటులు దాన్ని తినిపించేలా కష్టపడ్డారు’’ అన్నారు. ‘‘ఆటగదరా శివ’ నిర్మాతగా సంతృప్తినిచ్చింది. నటీనటులు, టెక్నీషియన్స్ ఛాలెంజింగ్‌గా తీసుకుని ఈ సినిమా కోసం కష్టపడ్డారు. వాసుకి సంగీతం బాగుంది. పులగం చిన్నారాయణ, చైతన్యప్రసాద్ రాసిన పాటలు బాగున్నాయి’’ అని రాక్‌లైన్ వెంకటేశ్ అన్నారు. ‘‘వెంకటేశ్‌గారి బ్యానర్లో హీరోగా పరిచయం కావడం నా అదృష్టం. చంద్రసిద్ధార్థ్గారి డైరక్షన్లో చేయడం హ్యాపీ’’ అన్నారు ఉదయ్ శంకర్. ‘‘ఈ సినిమా కోసం ఆర్నెల్లు గడ్డం పెంచా’’ అన్నారు కన్నడ నటుడు దొడ్డన్న. -
కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలపై హైపర్ ఆది ఫైర్
-
కత్తి మహేష్‌పై హైపర్ ఆది ఫైర్
కత్తి మహేష్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది ఫైర్ అయ్యారు. ఓ వీడియోను కూడా పోస్ట్ చేశారు. ఆ వీడియో సారాంశం.. ‘హాయ్ అండి నేను హైపర్ ఆదిని మాట్లాడుతున్నాను. కొన్నికోట్ల మంది దేవుడిగా కొలిచే రాముడ్ని కూడా తీసుకొచ్చి న్యూస్ ఛానెళ్లో కూర్చోబెట్టేశారండి. ఒకడేమో రాముడు దేవుడు కాదంటాడు. ఇంకొకడేమో సీతను రావణాసురుడి దగ్గర ఉంచితే మంచిది అంటాడు. ఇంకొకడైతే రాముడు దశరథుడికి పుట్టలేదంటాడు. ఇంకొకడైతే రాముడ్ని డైరెక్ట్‌గా దగుల్బాజీ అంటాడు. ఛీ ఛీ చీ.. ఏరా శ్రీరామనవమికి పెట్టే పానకం, వడపప్పు తిని ఒళ్లు పెంచినట్టున్నావ్. ఎలా వచ్చాయ్‌రా నీకా మాటలు. నాకు క్రిష్టియన్స్, ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు. క్రిస్మస్, రంజాన్ వస్తే నేను వాళ్లింటికి వెళ్లి భోజనం చేస్తాను. సంక్రాంతి వస్తే వాళ్లు మా ఇంటికి వచ్చి భోజనం చేస్తారు. నేను ఎక్కడికైనా వెళ్తుంటే దారిలో చర్చి, మసీదు, గుడి కనిపించినా దండం పెట్టుకుంటాను. ఇలా ఐకమత్యంగా ఉండే మనదేశంలో మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అరే.. మీ పబ్లిసిటీ కోసం మనుషుల మధ్యే కాకుండా దేవుడి మీదే రివ్యూలు రాసి.. మా హీరో మా హీరో అని కొట్టుకునే స్థాయి నుంచి మా దేవుడు మా దేవుడు అని కొట్టుకునే స్థాయికి తీసుకొచ్చారు. సూపర్. సార్.. మీ అందరికి.. హిందు మతాన్ని కించపరుస్తుంటే.. ఇది తప్పు అని చెప్పలేనంత బిజీగా ఉన్నారని నేననుకోవడం లేదు. కాబట్టి మీరు ఎవ్వరూ ఏ ప్రొఫెషన్లో ఉన్నా.. మీకిది తప్పు అని అనిపిస్తే ఖండించండి సార్. అలాగే రేపు బొడుప్పల్ నుంచి యాదగిరి గుట్ట వరకు హిందూ ధర్మాగ్రహ యాత్రలో అందరూ పాల్గొనండి. ఇది తప్పు అనిపించిన ఎవరైనా మతబేధం లేకుండా అందరూ ఖండించండి. కానీ దేవుడ్ని తిట్టిన విషయంలో కూడా సపోర్ట్ చేయటం కరెక్ట్ కాదు సర్. కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. ఒకసారి ఆలోచించండి. అందరు దేవుళ్లు ఒకటే. థ్యాంక్యూ’ అంటూ ముగించారు. ఇక ఇదే విషయంపై మెగా బ్రదర్ నాగబాబు కూడా ఫైర్ అయిన సంగతి తెలిసిందే. -
చచ్చేవాడు.. చంపేవాడు కలిసే తిరుగుతున్నారు
‘ఆ నలుగురు’ లాంటి మంచి సందేశాత్మక చిత్రాన్ని తెరకెక్కించారు చంద్రసిద్దార్థ. ఏమో గుర్రం ఎగరావచ్చు సినిమా ఆశించినంత విజయం సాధించకపోయినా.. మళ్లీ ఒక విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం చంద్రసిద్దార్థ ‘ఆటగదరా శివ’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. టైటిల్, టీజర్‌తో సినిమా కొత్తగా ఉండబోతోందని ముందే తెలియజేసేశారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. పదునైన మాటలు, జబర్దస్ టీం హైపర్ ఆది, చమ్మక్ చంద్ర పంచ్ డైలాగ్‌లు ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా ఉండబోతోన్నాయి. ఉరి తీయడానికి రమ్మని పిలిచి ప్రభుత్వం ఓ వ్యక్తికి లేఖ రాయగా, అదే టైంలో ఉరి శిక్ష పడ్డ ఓ ఖైదీ జైలు నుంచి పారిపోతాడు. ఈ ఇద్దరు కలిసి చేసే ప్రయాణామే ఈ సినిమా కథ. ‘హ్యాంగ్ మ్యాన్’ నేపథ్యంలో జరిగే ఈ కథలో ‘సమయానికి వచ్చే వాడు దేవుడు కాదు.. యముడు, చచ్చేవాడు... చంపేవాడు కలిసే తిరుగుతున్నారు’ లాంటి డైలాగ్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాను రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్నారు. -
‘ఆటగదరా శివ’
-
విడుదలకు సిద్ధమైన ‘ఆటగదరా శివ’
ఆ నలుగు, మధుమాసం, అందరి బంధువయా లాంటి క్లాస్ చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న చంద్రసిద్ధార్థ ఏమో గుర్రం ఎగరావచ్చు ఫ్లాప్ అవ్వడంటో గ్యాప్ తీసుకున్నారు. 2014 నుంచి దర్శకత్వానికి దూరంగా ఉన్న ఆయన త్వరలో మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. తన మార్క్ కనిపించేలా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ఆటగదరా శివ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో జబర్ధస్త్ ఫేం హైపర్ ఆది కీకల పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సినిమాను కన్నడ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూన్ నెలాఖరున సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
హైపర్ ఆది.. తాట తీస్తా
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ కమెడియన్ హైపర్ ఆదిపై నటి శ్రీరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ ప్రముఖ కామెడీ షో స్కిట్లో ఆది వేసిన సెటైర్లపై ఫేస్బుక్ లైవ్‌లో ఆమె స్పందించారు. ముందుగా ఆదిపై ప్రశంసలు గుప్పించినట్లే గుప్పించిన ఆమె.. తర్వాత తీవ్ర వ్యాఖ్యలకు దిగారు. తరిమి తరిమి కొడతానంటూ, తాట తీస్తానంటూ హెచ్చరించారు. సహించబోను... ‘ఆది గారూ.. మీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. మీరు మంచి రచయిత. మీ పొట్టకూటిని చూసుకుంటూనే మరికొందరికి లైఫ్ కూడా ఇస్తున్నారు. ఆ విషయంలో నేను అభినందిస్తున్నా. కానీ, మీ పద్ధతి బాగోలేదు. గతంలో మీరు చేస్తున్న అదే షోలో కొన్ని కులాల గురించి, కొందరి గురించి కించపరిచేలా మాట్లాడారంటూ కొందరిని వెంటపడి మరీ కొట్టిన ఘటనలు మీకు గుర్తుండే ఉంటాయనుకుంటా. అలాగని ఎవరో వచ్చే దాకా ఎదురు చూసే రకాన్ని నేను కాదు. వెంటపడి తరిమి తరిమి కొడతా. హైపర్ ఆది నీ తాట తీస్తా. మహిళలపై సమాజంలో ఇప్పుడిప్పుడే కాస్త గౌరవం పెరుగుతోంది. ఇలాంటి సమయంలో నువ్వు కించపరిచే కామెంట్లు చేస్తే ఊరుకోను’ అని ఆమె హెచ్చరించారు. ఘాటు వ్యాఖ్యలు... తాను చేసిన నిరసన దీక్షను ఆది తక్కువ చేసి మాట్లాడాడని, ‘షర్ట్ విప్పరా.. ఇంటర్నేషనల్ మీడియా కవర్ చేస్తుంది’ ఓ డైలాగ్ చెప్పాడని ఆమె తెలిపారు . ‘నేను తెలిపింది నిరసన.. అది సెక్సీ నెస్ కాదు. ఆది.. నీ పుట్టుకకు అవమానం తీసుకురాకు... అంటూ ఘాటు పదజాలమే వాడారామే. తల్లిగా, చెల్లిగా, భార్యగా మగాడి జీవితంలో పాత్రలు పోషించే మహిళలపై టీవీషో అడ్డుపెట్టుకుని జోకులేయొద్దని, అలా కాదు అని ఇదే కొనసాగితే వంద చెప్పులు నీ మీద వచ్చి పడతాయి’ అని ఆదిని ఉద్దేశించి ఆమె వ్యాఖ్యానించారు. గతంలో ఓ ప్రముఖ హీరో గురించి మాట్లాడిన కత్తి మహేష్ పైకూడా ఆది ఇదే షోలో సెటైర్లు వేసిన విషయాన్ని ఆమె ప్రస్తావనకు తీసుకొచ్చారు. ఇక ఆది పేల్చే పిచ్చి జోకుల వెనుక ఆ షో న్యాయనిర్ణేత నాగబాబు ప్రమేయం గనుక ఉంటే మాత్రం.. రాజకీయంగా ప్రభావం చూపుతుందని ఆమె హెచ్చరించారు. మహిళలను కించపరిచే డైలాగులపై ఎందుకు ఉపేక్షిస్తున్నారంటూ షో నిర్వాహకులను కూడా ఆమె నిలదీశారు. -
హైపర్ ఆది లవ్ ప్రపోజల్..?
సాక్షి, సినిమా : హైపర్ ఆది, బుల్లితెరపై తనదైన శైలిలో సంచులకొద్ది పంచులతో కమెడియన్‌గా రాణిస్తున్న నటుడు. కామెడీ షోలతో పాటు, పలు టీవీ కార్యక్రమాలతో బుల్లితెర అభిమానులను అలరిస్తాడు. ఇప్పుడిప్పుడే సినిమాల్లో కూడా అవకాశాలు అందుకుంటున్నాడు. సినిమాల్లోను తనదైన మార్క్ పంచులను ఏమాత్రం తగ్గించట్లేదు. తాజగా వరుణ్ తేజ్, రాశీఖన్నా నటించిన తొలిప్రేమ సినిమాలోను అలరించాడు. పంచ్‌లతో కామెడీ చేశాడు. రీసెంట్గా ఆది ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఓ అమ్మాయికి తన ప్రేమను తెలుపుతున్నట్లుగా చేయి పట్టుకొని ఉన్నాడు. ప్రేమికుల రోజు సందర్భంగా ఆఫోటో పెడుతూ అందరికీ వాలంటైన్స్ డే.. స్ప్రెడ్ లవ్ అంటూ పోస్టు చేశాడు. అయితే అది నిజంగా జరిగింది కాదు. తొలిప్రేమ షూటింగ్లో ఉన్నప్పుడు అక్కడ ఓ అమ్మాయిని కలిసి లవర్ బాయ్‌లా స్టిల్ ఇచ్చాడు. ఇప్పుడు అది కాస్తా సోషల్ మీడియా వైరల్ అయింది. దీంతో ఫాలోవర్స్ అందరూ ఆదికి పంచ్‌లతో పాటు ప్రేమించడం, ప్రపోజ్ చేయడం కూడా వచ్చే అంటూ కామెంట్ చేస్తున్నారు. -
ఆ హక్కును కాపాడుకోవడానికే నా పోరాటం: కత్తి
సాక్షి, హైదరాబాద్ : తన పోరాటమంతా నిర్భయంగా మన అభిప్రాయాన్ని చెప్పే హక్కుని పరిరక్షించుకోవడానికేనని సినీ విమర్శకుడు కత్తి మహేశ్ అన్నారు. తనపై కోడిగుడ్లతో దాడి చేసిన వారిపై సినీ విమర్శకుడు మహేశ్ కత్తిపోలీసులకు చేసిన ఫిర్యాదును కొద్ది గంటల్లోనే ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘పోరాటం అంతా నిర్భయంగా మన అభిప్రాయాన్ని చెప్పే హక్కుని పరిరక్షించుకోవడానికి. అది ఎక్కడా నేను సరెండర్ చెయ్యను. నోరు మూసుకునే అవసరం లేదు. వ్యక్తుల్ని టార్గెట్ చెయ్యడం కాకుండా విధానాలు, సమస్యలు, ఆలోచనల గురించి నా అభిప్రాయాల్ని ఎప్పటిలాగే నిష్కర్షగా చెబుతూనే ఉంటాను’అని కత్తి ట్వీట్ చేశారు. పోరాటం అంతా నిర్భయంగా మన అభిప్రాయాన్ని చెప్పే హక్కుని పరిరక్షించుకోవడానికి. అది ఎక్కడా నేను సరెండర్ చెయ్యను. నోరు మూసుకునే అవసరం లేదు. వ్యక్తుల్ని టార్గెట్ చెయ్యడం కాకుండా విధానాలు, సమస్యలు,ఆలోచనల గురించి నా అభిప్రాయాల్ని ఎప్పటిలాగే నిష్కర్షగా చెబుతూనే ఉంటాను. — Kathi Mahesh (@kathimahesh) 20 January 2018 గురువారం ఓ టీవీ చానెల్ చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు క్యాబ్‌లో వెళ్తుండగా కత్తి మహేశ్‌పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కోడిగుడ్లతో దాడిచేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనను సీరియస్‌గా పరిగణించిన కత్తి శుక్రవారం మాదపూర్ పోలీస్ స్టేషన్లో సినీ నటుడు పవన్‌కల్యాణ్ అభిమానులే దాడి చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశాడు. కత్తిపై తామే దాడి చేశామని హైదరాబాద్‌లోని జగద్గీరిగుట్టకు చెందిన సతీష్, నాని అనే ఇద్దరు యువకులు ముందుకు వచ్చారు. అనంతరం ఓ టీవీ చానెల్ డిబెట్లో కత్తికి ఈ యువకుల మధ్య సయోధ్య కుదరడంతో ఆయన కేసును ఉపసంహరించుకున్నారు. -
పవన్ కోసం 10, త్రివిక్రమ్ కోసం 3సార్లు..
సాక్షి, హైదరాబాద్ : త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన అజ్ఞాతవాసి చిత్రం చాలా చాలా బాగుందని జబర్దస్త్ కమేడియన్ హైపర్ ఆది పేర్కొన్నారు. తమ్ముడు, తొలిప్రేమ సమయంలో పవన్ లో ఉన్న కామెడీ టైమింగ్ మళ్లీ ఈ చిత్రంలో చూడొచ్చని తెలిపారు. ఈ సినిమా గురించి పూర్తిగా చెప్పాలంటే పవన్ కోసం పదిసార్లు, త్రివిక్రమ్ కోసం మూడుసార్లు, కీర్తీ సురేష్, అను ఇమ్మాన్యూల్, మురళీ శర్మ, రావు రమేష్‌ల కోసమైతే వీలున్నప్పుడల్లా వెళ్లి చూడొచ్చన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే అజ్ఞాతవాసి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అన్నారు. సీరియస్‌గా చాలా చాలా బాగుందని చెప్పారు. ఈ చిత్రంలో బొమన్ ఇరానీ చెప్పిన 'రాజ్యం మీద ఆశలేనివాడికంటే గొప్ప రాజు ఎవడుంటాడు' అనే డైలాగ్ బాగుందన్నారు. ఇలాంటివి సినిమాలో చాలా డైలాగులుంటాయని తెలిపారు. -
’అజ్ఞాతవాసి’పై హైపర్ ఆది కామెంట్స్
-
మహేశ్ కత్తిపై మళ్లీ హైపర్ ఆది పంచులు!
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సినీ విమర్శకుడు మహేశ్ కత్తి, పవన్ కల్యాణ్ అభిమానుల మధ్య వివాదం ఇప్పుడు ఉద్రిక్తతలు రేపుతోంది. తనపై పవన్ కల్యాణ్ అభిమానులు వ్యక్తిగత దూషణలు, దాడులకు దిగుతుండటంతో మహేశ్ కత్తి తాజాగా బహిరంగ సవాళ్లకు దిగారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. పవన్ కల్యాణ్‌కు సూటిగా ప్రశ్నలు సంధించారు. పూనం కౌర్ విషయంలోనూ పలు ప్రశ్నలు గుప్పించారు. ఈ నేపథ్యంలో పవన్ అభిమానులు అక్కడికి వచ్చి మహేశ్ కత్తిని అడ్డుకునే ప్రయత్నం చేయడం ఉద్రిక్తతలకు దారితీసింది. ఇది ఇలా ఉండగా మహేశ్ కత్తి యథారీతిలో పవన్ ఫ్యాన్స్ తీరుపై తన ప్రతి విమర్శలను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో జబర్దస్త్ కమేడియన్ హైపర్ ఆది తాజాగా ట్విట్టర్లో కత్తి లక్ష్యంగా విమర్శల దాడికి దిగారు. మహేశ్ కత్తి ఓ సైకో అంటూ విమర్శించారు. ఆయనపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. హైపర్ ఆది ఏమన్నారంటే.. ’అనవసరమైన వాళ్లకి అర్హత లేని వాళ్ళకి అనుచితంగా స్టార్ చైర్ వేసి కూర్చోపెట్టకండి. అతను ఒక సైకో. అతనికి కావాల్సింది డబ్బు.. విలువలూ ప్రేమలూ కాదు. ఏ అనుబంధాలు లేని వాడికి ఇవ్వన్నీ అర్థంకావు. అనవసరమైన ఎక్సైట్మెంట్తో, క్యూరియాసిటీతో ఇది వరకే ఒకరిని అందలం ఎక్కించారు. ఇదంతా ఆపేయండి’ అని హైపర్ ఆది ట్వీట్ చేశారు. ’ఫ్యాన్స్ అందరికి ఒక విన్నపం. కత్తి మహేశ్‌ను ప్రతి ఒక్కరూ అన్‌ఫ్రెండ్ చేసి బ్లాక్ చేయండి. అతన్ని ఏకాకిని చేయండి. అతనో మానసిక రోగి. అతనికి ఏ ఫ్యాన్ కూడా స్పందించకూడదని కోరుకుంటున్నా. వాడి ట్వీట్ కింద ఏ ఒక్కరూ దయచేసి రీట్వీట్లు పెట్టకండి’ అని మరో ట్వీట్లో అన్నారు. ‘మరి వేణు అన్న లైవ్ లో చెప్పాడు కదా.. మైండ్ దొబ్బినోళ్ళతో పవన్ ఫ్యాన్స్ మాట్లాడొద్దని.. అదే ఫాలో అవ్వండి. మహేశ్ కత్తికి మైండ్ బ్లాక్ అయిపోయింది అనుకుంటా.. ఓరే క్యూట్ బ్యాయ్ అప్పుడే అయిపోయిందనుకోకు. ఇప్పుడే మొదలైంది. ఇంకా చాలామంది వస్తారు. నేను ట్విట్టర్లోకి వచ్చిన రోజే చెప్పా.. నువ్వు ఇంకా ఫినిష్ అని’ అని ఆది రాసుకొచ్చారు. -
‘జబర్దస్త్’ షోపై మరో ఫిర్యాదు
సాక్షి, కామారెడ్డి: ఓ చానెల్లో ప్రసారమవుతున్న ‘ జబర్దస్త్’ కామెడీ షో చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. తాజాగా ప్రసారమైన ’జబర్దస్’ ఎపిసోడ్లో అనాథలను కించపరిచేలా హైపర్ ఆది డైలాగులు ఉన్నాయంటూ వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు అనాథలు ‘జబర్దస్’కు, హైపర్ ఆదికి వ్యతిరేకంగా రాష్ట్ర మానవహక్కుల సంఘానికి (హెచ్చార్సీ), పోలీసులకు ఫిర్యాదుచేశారు. తాజాగా ‘జబర్దస్త్’ షోలో తమను అవమానించారంటూ కొందరు అనాథ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్, ఎస్పీలకు వారు సోమవారం ఫిర్యాదు చేశారు. గత గురువారం టీవీలో ప్రసారమైన స్కిట్లో తమపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని అనాథలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు జబర్దస్త్ షోపై సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో అనాథ యువతులు ఫిర్యాదు చేశారు. జబర్దస్త్ కార్యక్రమంపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయాన్ని సినీ విమర్శకుడు కత్తి మహేష్ గతంలో ఫేస్ బుక్ ద్వారా తెలిపాడు. బాలల హక్కులు, మానవ హక్కులను నాశనం చేసేలా జబర్దస్త్ లో స్కిట్లు వేస్తుండటం పట్ల కేసు నమోదైందని, తన మద్దతు అనాథలకే అని తెలిపాడు. ‘అతిగా ఆవేశపడే ఆడదానికి .. అతిగా ఆశపడే మగాడికి కలిగే సంతానంని ఆనాథలు అంటారు’ అనే హైపర్ ఆది చెప్పిన డైలాగ్.. అనాథల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని, ఎలాంటి అండ లేని అభాగ్యులపై ఇంత నీచంగా డైలాగ్‌లు చెప్పడం ఏమిటని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. -
'వాళ్లను' బ్లాక్ చేస్తాను : అనసూయ వార్నింగ్
హైదరాబాద్ : అసభ్యత, హాస్యం లాంటి విషయాల గురించి మాట్లాడితే అనవసరంగా పెడర్థాలు తీస్తున్నారంటూ స్టార్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ మండిపడుతున్నారు. 'అసభ్యత, అశ్లీలత గురించి నేను ఏదైనా విషయం చెప్పినా, మాట్లాడినా.. బట్టలు సరిగా వేసుకోవాలంటారు. పోనీ కామెడీని కామెడీగా తీసుకుంటే మంచిదని చెబితే.. అర్జున్ రెడ్డి అంటారు. ఏందివయ్యా.. దిమాగ్ ల అటుది ఇటు.. ఇటుది అటు ఉందా' అంటూ ట్వీట్ చేశారు అనసూయ. 'పిచ్చి పిచ్చి రాతలు, కామెంట్స్, పోస్టులు చేసేవాళ్లను బ్లాక్ చేయడం ఉత్తమమని ఆమె భావిస్తున్నారు. 'సారీ.. ఏమనుకోవద్దు. వితండ వాదాలు చేసేవాళ్లని, బేసిక్‌గా నెగటివ్ సందేశాలు పంపేవాళ్లని బ్లాక్ చేద్దామని డిసైడ్ అయ్యాను. నా సంతోషం నా చేతిలో అన్నట్లు. మీరు కూడా ఏది నచ్చితే అది చేయండి. నా చుట్టూ నిజాయితీ, నిబద్ధత, సంతోషంగా ఉండేవాళ్లు ఉంటే బాగుంటుందంటూ' మరో పోస్ట్‌లో ఈ స్టార్ యాంకర్ రాసుకొచ్చారు. 'హాస్యం కోసం కొన్ని ప్రయత్నాలు చేస్తుంటాం. స్క్రీన్ మీద ఆర్టిస్టులు చెప్పేది, చేసేది కేవలం కల్పితాలే. హాస్యం కోసం కొన్ని ప్రయోగాలు చేస్తుంటారు. ఎవరినీ ఉద్దేశించి అలాంటివి ఎవరూ చేయరు. భయట కూడా మేం నటిస్తున్నామని భావించవద్దంటూ' అనసూయ తన ట్వీట్ ద్వారా సూచించారు. 'ప్రతిదాన్ని భూతద్ధంలో చూస్తూ రియాక్ట్ అవుతున్నారు. మొన్న వాళ్లు (జబర్ధస్త్‌లో) చేసిన స్కిట్ అలాంటిది. వాళ్లంతా అనాథశ్రమానికి వెళతారు. అక్కడున్న వారిని ఉద్ధేశించి లీడ్ కోసం కొన్ని పదాలు అలా తీసుకున్నారు. వాటిని చూసి నవ్వుకోండి అంతే. మా ఉద్దేశ్యం నవ్వించడమే. లైఫ్‌లో వచ్చే అన్ని అంశాలను జబర్ధస్త్ కళ్లకి కట్టినట్లు చూపిస్తుందని' ఫేస్బుక్ వీడియోలో హైపర్ ఆది స్కిట్‌పై స్టార్ యాంకర్ అనసూయ స్పందించిన విషయం తెలిసిందే. ఎంటర్టైన్మెంట్ వరల్డ్‌లో జబర్ధస్త్ హిస్టరీ చరిత్ర సృష్టించిందన్న అనసూయ.. కొందరు వ్యక్తులు పనిగట్టుకుని రాద్ధాంతం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. Sorry..emanukovoddu..vitanda vaadalu chesevaallani..oorke gelukudam anevaallani..basic ga negativity to approach ayye vaallani block cheseddamani decide ayya..na happiness na hands lo annattu..meeru kuda meeku edi nacchite ade cheyandi..i want genuine, honest,happy ppl around🙏🏻 — Anasuya Bharadwaj (@anusuyakhasba) 26 November 2017 Arey🤦🏻♀️ Nenu abuse gurinchi maatladite battalu sariga veskomantaru..nenu fun ni fun la teeskondante #ArjunReddy antaru.. endivaya..dimag la atudi itu itudi atu unda🤔 — Anasuya Bharadwaj (@anusuyakhasba) 26 November 2017 😄 I am laughing at your lack of approach. What we do or say as artists on screen is fictional. We dont mean what we do or say. We do/say for fun. To generate fun. Not target anyone. We disclaim that. But outside, it is entirely different. There we are not “acting”.Consider that. https://t.co/svBXlNkYgs — Anasuya Bharadwaj (@anusuyakhasba) 26 November 2017 -
ఆది స్కిట్ పై అనసూయ కామెంట్
హైదరాబాద్ : సినిమా షూటింగ్లో గ్యాప్ దొరకడంతో యాంకర్, నటి అనసూయ తన అభిమానులతో ముచ్చటించారు. ‘సచ్చిందిరా గొర్రె’ చిత్ర షూటింగ్ నిమిత్తం నైట్ షూటింగ్లో ఉండటం వల్లే, చాలా రోజులుగా ఫేస్ బుక్ లైవ్ లోకి రాలేకపోయానని తెలిపారు. ఈ సందర్భంగా అనాథపిల్లలపై జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది చేసిన స్కిట్‌పై అనసూయ స్పందించారు. ‘అతిగా ఆవేశపడే ఆడదానికి .. అతిగా ఆశపడే మగాడికి కలిగే సంతానంని ఆనాథలు అంటారు’ అనే డైలాగ్‌తో అనాథల మనోభావాలను దెబ్బతీసాడని.. ఎలాంటి అండ లేని అభాగ్యులపై ఇంత నీచంగా డైలాగ్‌లు చెప్పడం ఏమిటని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఆంటీ ఏంటండీ.. ఓ అభిమాని హాయ్ అనూ ఆంటీ అంటూ కామెంట్ పెట్టాడు. దీనికి అనసూయ అతడికి ఘాటుగా బుదులిచ్చారు. ఆంటీ అంటే అదో బూతులా చేసేశారు. నేను చాలా మందిని ఆంటీ అంటూ సంబోధిస్తుంటాను. వాళ్లందరూ బూతులా ఫీల్ అవ్వాలా. ఇంకోసారి దీనిపై స్పందించను. కాస్త చదువుకున్నవారిలా ప్రవర్తించండి. నా పిల్లల స్నేహితులు ఆంటీ అంటే పలుకుతా కానీ, మీసాలు గడ్డాలు పెట్టుకొని మీరు నాకు అంకుల్లా ఉండి ఆంటీ ఎంటండి అంటూ మండిపడ్డారు. నేను చాలా మంచి మూడ్‌లో ఉన్నా కాస్త సరదగా సంభాషిద్దాం అంటూ ఫేస్ బుక్ లైవ్‌ను ప్రారంభించారు. అభిమాని కామెంట్ : ఆది చేసిన స్కిట్‌పై మీ అభిప్రాయం ఏంటి ? క్రియేటివిటీని తొక్కేయొద్దు.. 'కొన్ని విషయాలలో కొందరు ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారేమో అనిపిస్తుంది. నాకు కానీ, చేస్తున్న వారికి కానీ, చూస్తున్న వారందరూ కూడా ఎంటర్టైన్మెంట్ వరల్డ్‌లో జబర్ధస్త్ హిస్టరీ క్రియేట్ చేసిందని ఒప్పుకోవాల్సిందే. ఒక షో ఇంతగా ఆదరణ దక్కించుకోవడం అనేది ఇంతకు ముందు ఎన్నడూ జరగలేదు. మన తెలుగు టెలివిజన్‌ని టాప్ లెవల్లో నిలబెట్టిన ఘనత జబర్ధస్త్‌ది. బాహుబలి ఎలానో జబర్దస్త్ కూడా అంతే. అలాంటి విజన్‌ని ఇందులో చూస్తున్నాం. మేం చాలా కష్టపడుతున్నాం. నా కంటే రోజా, నాగబాబు, టీమ్ మెంబర్స్ ఎంతో కష్టపడుతున్నారు. ఇలాంటి షో ని నిర్భందించాలని చూడకూడదు. క్రియేటీవిటీని తొక్కేయవద్దు నవ్వుకోండి అంతే... ప్రతిదాన్ని భూతద్ధంలో చూస్తూ రియాక్ట్ అవుతున్నారు. మొన్న వాళ్లు చేసిన స్కిట్ అలాంటిది. వాళ్లంతా అనాథశ్రమంకి వెళతారు. అక్కడున్న వారిని ఉద్ధేశించి లీడ్ కోసం అలా తీసుకున్నారు. నవ్వుకోండి అంతే. మా ఉద్దేశ్యం నవ్వించడమే. లైఫ్‌లో వచ్చే అన్ని అంశాలను జబర్ధస్త్ కళ్లకి కట్టినట్లు చూపిస్తుంది. అలా చేస్తే క్రియేటివిటీ రాదు మిమ్మల్ని నవ్వించే వాళ్లందరిని ఇలా ఏడిపించడం ఏమైనా బాగుందా? మీరిలా చేస్తే వాళ్లు భయపడిపోతారు. అది చేస్తే ఏం ప్రాబ్లమో, ఇది చేస్తే ఏం ప్రాబ్లమో..అనే ఆలోచనలో పడిపోతారు. క్రియేటివిటీ రాదు. మిగతా షో ల విషయంలో ఎలా ఉన్నా.. ఈ షో ని మాత్రం వదిలేయండి. దీని ఉద్దేశ్యం వేరు. దీనికి ఎటువంటి లాజిక్స్ లేవు. ఎంతో ఆలసిపోయి వస్తారు. చూసి ఎంజాయ్ చేయండి. హాయిగా నవ్వుకోండి. మేము ఎవరినీ టార్గెట్ చేసి అనడం లేదు కదా. చర్చించుకోవడానికి మన రాష్ట్రంలో ఎన్నో విషయాలు ఉన్నాయి. రోడ్లు, కరెంట్, విద్య, బాలికలపై అత్యాచారం.. ఇలాంటి విషయాలెన్నో ఉన్నాయి. మీకు వినోదాన్ని ఇచ్చే ఈ అంశమే ఎందుకు హైలైట్ చేస్తున్నారు. అభిమాని కామెంట్ : నన్ను రెండో పెళ్లి చేసుకుంటావా..? తనని రెండో పెళ్లి చేసుకుంటావా అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు... ఎన్ని జన్మలెత్తినా మా ఆయన్నే పెళ్లి చేసుకుంటానంటూ బదులిచ్చారు. అభిమాని కామెంట్ : సచ్చిందిరా గొర్రెలో రోల్ ఏంటీ ? సినిమాలో నేనొక్క దాన్నే అమ్మాయిని. శ్రీనివాస్ రెడ్డి, వేణు, రాకేష్, ఆనంద్‌తో ఒక్కదాన్ని మాత్రమే మెయిన్ రోల్లో నటిస్తున్నాని చెప్పారు. -
హైపర్ ఆదిపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు..
సాక్షి, హైదరాబాద్: జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదిపై మానవ హక్కుల సంఘానికి (హెచ్ఆర్సీ) ఫిర్యాదు అందింది. తమ మనోభావాలను దెబ్బతీసేలా స్కిట్ చేశారని ఆరోపిస్తూ పలువురు అనాథ ఆశ్రమ పిల్లలు, సినీ విమర్శకుడు కత్తి మహేష్‌లు హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. గత గురువారం టీవీలో ప్రసారమైన స్కిట్లో తమపై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు జబర్దస్త్ పై సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో అనాథ యువతులు కూడా ఫిర్యాదు చేశారు. జబర్దస్త్ కార్యక్రమంపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయాన్ని కత్తి మహేష్ ఫేస్ బుక్ ద్వారా తెలిపాడు. బాలల హక్కులు, మానవ హక్కులను నాశనం చేసేలా జబర్దస్త్ లో స్కిట్లు వేస్తుండటం పట్ల కేసు నమోదైందని, తన మద్దతు అనాథలకే అని పోస్ట్ చేశాడు. అయితే గురువారం ప్రసారమై ఆది స్కిట్లో ‘అతిగా ఆవేశపడే ఆడదానికి .. అతిగా ఆశపడే మగాడికి కలిగే సంతానంని ఆనాథలు అంటారు’ అనే డైలాగ్‌తో అనాథల మనోభావాలను దెబ్బతీసాడని.. ఎలాంటి అండ లేని అభాగ్యులపై ఇంత నీచంగా డైలాగ్‌లు చెప్పడం ఏమిటని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. -
వెధవలు అయ్యేది మీరే.. పీకే ఫ్యాన్స్‌కు కత్తి కౌంటర్
ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ అభిమానులకు, సినీ విమర్శకుడు మహేశ్ కత్తికి మధ్య రగడ కొనసాగుతూనే ఉంది. ఆ మధ్య పవన్ కల్యాణ్‌పై మహేశ్ కత్తి విమర్శనాత్మక వ్యాఖ్యలు చేయడం.. దీంతో పీకే ఫ్యాన్స్ ఆయనపై నిప్పులు చెరుగుతూ దూషణలకు దిగడం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహేశ్ కత్తి మరోసారి పవన్ అభిమానులకు చురకలంటించారు. మేం మేం బాగానే ఉంటాం.. మధ్యలో ఫ్యాన్సే వెధవలు అవుతారంటూ.. హైపర్ ఆదితో ఫొటో దిగి కామెంట్ పెట్టారు. జబర్దస్త్‌లో భాగంగా ‘పెళ్లి అనేది మనం సినిమా తీసినంత కష్టం కానీ ప్రేమ అనేది ముందు పొట్ట, వెనక బట్ట వేసుకొని రివ్యూలు రాసినంత ఈజీ’ అంటూ పరోక్షంగా ఇటీవల హైపర్ ఆది మహేశ్ కత్తిపై పంచులు విసిరిన సంగతి తెలిసిందే. ఈ పంచ్ డైలాగులు తనను విమర్శించేలా ఉన్నాయని కత్తి మహేష్ మండిపడ్డారు. ’అవును నాకు పొట్ట ఉంది. బట్ట ఉంది. మనుషులంతా ఒక్కటేలా ఉంటారా.? ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు... నేను ఎలా ఉన్నానో అలానే ఉన్నాను. నేను లావుగా ఉన్నానని ఫీల్ అయ్యేంత చీప్ మెంటాలిటీ నాది కాదు’ అంటూ మహేశ్ కత్తి ఘాటుగా రిప్లే ఇచ్చారు. ఈ నేపథ్యంలో హైపర్ ఆదితో సరదాగా దిగిన ఫొటోను పోస్టుచేసిన మహేశ్ కత్తి.. తమ మధ్య ఉన్నవి సిద్ధాంతపరమైన విభేదాలే కాని, వ్యక్తిగత వైరాలు కాదని, పవన్ కల్యాణ్‌తో కూడా తాను నవ్వుతూ ఫొటో దిగినా దిగవచ్చునని, ఈ విషయంలో ఫ్యాన్స్ మేలుకోవాలని మహేశ్ కత్తి సూచించారు. ’కలిస్తే మేమూ మేమూ బాగానే ఉంటాం. విభేదాలు విషయాలకు సంబంధించి, పరిస్థితులకు లేదా సిద్ధాంతాలకు సంబంధించి ఉంటాయేగాని, వ్యక్తిగత వైరాలు ఉండవు. ఆ విషయం తెలియక, అర్థం కాక ఫ్యాన్స్ అనే పిచోళ్ళు నానా రభసా చేసి, వాళ్ళ జీవితాలు సంకనాకించుకుంటారు. మేలుకొండ్రా నాయనా! రేపోమాపో పవన్ కళ్యాణ్ ని కలిసినా ఇలా నవ్వుతూ ఫోటో దిగగలను. తరువాత వెధవలు అయ్యేది మీరే!’ అని ఆయన తాజాగా ఫేస్బుక్లో పోస్టు చేశారు. ఈ కామెంట్‌పై పీకే ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో చూడాలి. -
‘జబర్దస్త్’ ఆదిపై కత్తి ఫైర్..
సినీ విమర్శకుడు మహేశ్ కత్తి జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది ఇటీవల వేసిన సెటైర్లపై మండిపడ్డారు. ఈ గురువారం జబర్దస్త్‌లో హైపర్ ఆది స్కిట్లో బాగంగా ‘పెళ్లి అనేది మనం సినిమా తీసినంత కష్టం కానీ ప్రేమ ముందు పోట్ట వేసుకొని, వెనక బట్ట వేసుకొని రివ్యూలు రాసినంత ఈజీ’ అనే పంచ్‌లు తనను విమర్శించేలా ఉన్నాయని కత్తి మహేష్ మండిపడ్డారు. అవును నాకు పొట్ట ఉంది. బట్ట ఉంది. మనుషులంతా ఒక్కటేలా ఉంటారా.? ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు. ఆ ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉండడమే ఈ ప్రపంచం. కాస్త భిన్నంగా ఉన్నంత మాత్రనా జోకర్స్ అయిపోతామా.? ఒకరు పొడుగ్గా ఉండొచ్చు.. ఇంకొకరు పొట్టిగా ఉండొచ్చు.. ఒకరు నల్లగా ఉండొచ్చు.. ఇంకొకరు తెల్లగా ఉండొచ్చు.. ఇంకొకరికి నత్తి ఉండి మాట్లాడలేకపోవచ్చు. నాలాగా బట్టతల ఉండొచ్చు. దట్ ఈజ్ మై స్టయిల్. నేను ఎలా ఉన్నానో అలానే ఉన్నాను. నేను లావుగా ఉన్నానని ఫీల్ అయ్యేంత చీప్ మెంటాలిటీ నాది కాదు. అంటూ తన ఫేస్బుక్ లైవ్ ద్వారా హైపర్ ఆదిని ఒక రకంగా పొగుడుతూనే విమర్శించారు. జబర్దస్త్ షో నేను చూడను, కానీ ఫ్రెండ్స్ పంపే లింక్స్ చూస్తే నాకు ఈ విషయాలు తెలిశాయని చెప్పాడు. అది ఒక గొప్ప షో అని కానీ, గొప్ప కామిడీ ఉంటుందని కానీ నేను అనుకోను. మనుషుల మీద వారు వేసుకునే బట్టల మీద కామెడీ చేస్తూ అపహస్యం చేస్తున్న దానిని హాస్యం అనుకొని ఎంజాయ్ చేస్తున్నారని అన్నారు. మనందరి దిగజారుడు తనానికి నిదర్శనం అని షో సాగుతున్న తీరునే విమర్శించాడు. -
ఆ వదంతులు నమ్మవద్దు: జబర్దస్త్ నటుడు
హైదరాబాద్ (బంజారాహిల్స్): తాను పెళ్లి చేసుకున్నట్లు వస్తున్న వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని ప్రముఖ హాస్యనటుడు హైపర్ ఆది పేర్కొన్నారు. ఇటీవల తాను రహస్యంగా బుల్లితెర నటిని వివాహం చేసుకున్నట్లు సోషల్ మీడియాలో ఓ ఫొటో చక్కర్లు కొడుతోందని, ఇది పూర్తిగా అవాస్తవమని 'జబర్దస్త్' కామెడీ షో నటుడు చెప్పారు. పెళ్లి వదంతులపై బుల్లితెర నటుడు హైపర్ ఆది ‘సాక్షి’తో మాట్లాడారు. తానింకా ప్రేమపై దృష్టిసారించలేదని, పెళ్లి చేసుకుంటే అందరికీ చెప్పి చేసుకుంటానన్నారు. ఆట కదరా శివ అనే సినిమాలో తాను ఓ పాత్ర పోషిస్తున్నానని తెలిపారు. దీప్తి అనే నటితో పెళ్లి సీన్ ఇటీవల చిత్రీకరించారని ఆ సీన్‌ను ఎవరో లీక్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారన్నారు. దానిని చూసి తన పెళ్లి జరిగిందంటూ ప్రచారం జరిగిందని ఆది వివరించారు. ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నానని ఆయన వెల్లడించారు. పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటానని అయితే రెండేళ్లు ఆగాల్సిందేనని ఆది స్పష్టంచేశారు.