rajeev kanakala
-
నా కూతురు ఫంక్షన్‌కి వెళ్తే.. బాధపెట్టారు: ట్రోలర్స్‌పై రాజీవ్ కనకాల ఫైర్
సోషల్ మీడియాలో సినీ ప్రముఖులపై ట్రోలింగ్ రోజు రోజుకు పెరిగిపోతుంది. సినిమాల పరంగానే కాకుండా పర్సనల్ విషయాలపై కూడా అసత్యాలను ప్రచారం చేస్తూ ఇబ్బందికి గురి చేస్తున్నారు. అందుకే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అలా ట్రోల్ చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటుంది. సినీ సెలబ్రిటీలు, వారి ఫ్యామిలీని ట్రోల్ చేస్తున్న చానాళ్లపై స్ట్రైక్స్ వేసి, వాటిని తొలగిస్తున్నారు. అయితే ఇది బెదిరింపు కాదని.. రెక్వెస్ట్ అని అంటున్నాడు నటుడు రాజీవ్ కనకాల. ట్రోల్ చేయడానికి కూడా ఓ హద్దు ఉంటుందని..అది దాటి ప్రవర్తించవద్దని విజ్ఞప్తి చేస్తున్నాడు. తాజాగా ఆయన ఓ య్యూటూబ్ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనపై వచ్చిన ట్రోల్స్ గురించి, వాటి వల్ల ఎదురైన ఇబ్బందుల గురించి వివరించాడు. (చదవండి: చిన్న పిల్లలతో లిప్ కిస్‌లా.. యాంకర్‌పై చిన్మయి ఫైర్!)‘ఓసారి నేను ఓ యూట్యూబ్ చానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో మా నాన్న గురించి మాట్లాడుతూ..ఒకానొక దశలో ఆయన సూసైడ్ చేసుకోవాలని అనుకున్నాడు అని చెప్పాను. వాళ్లు ఆ ఇంటర్వ్యూని చక్కగా ఎడిట్ చేసి పబ్లీష్ చేశారు. కానీ దాని అనుబంధ చానల్ మాత్రం..నా ఇంటర్వ్యూలు ముక్కలు ముక్కలుగా చేసి ఇష్టం వచ్చినట్లు పోస్ట్ చేసింది. ఆ ముక్కల్లో ఓవీడియోకి ‘సూసైడ్ చేసుకొని చనిపోయిన దేవదాస్ కనకాల’అని థంబ్ పెట్టారు. ఆ థంబ్ చూడగానే నాకు చాలా కోపం వచ్చింది. వెంటనే ఆ రిపోర్టర్‌కి ఫోన్ చేస్తే.. అతను సారీ చెప్పి ఆ థంబ్ని మార్చేశారు. అంతేకాకుండా నా భార్య సమతో నేను విడాకులు తీసుకున్నానని తప్పుడు ప్రచారం చేశారు. యూట్యూబ్‌లో వచ్చిన థంబ్ నేయిల్స్ చూసి..నిజంగానే మేము విడాకులు తీసుకున్నామని అందరూ భావించారు. ఓ షోకి మళ్లీ సుమతో కలిసి వెళ్తే.. ‘వీరు విడాకులు తీసుకున్నారు కదా..మళ్లీ కలిసిపోయారా?’ అని కామెంట్స్ వచ్చాయి. అంతలా నమ్మేశారు జనాలు. ఒకనొక సమయంలో నా కూతురుని కూడా ట్రోల్ చేశారు. తను ఓ ఫంక్షన్‌కి వెళ్తే..లేనిపోని వార్తలు రాసి బాధపడేలా చేశారు. దయచేసి ఇలాంటి ఫేక్ న్యూస్ రాయకండి’అని రాజీవ్ విజ్ఞప్తి చేశాడు. -
ట్రోలర్స్ కి దిమ్మతిరిగే వార్నింగ్ ఇచ్చిన మా సభ్యులు
-
ట్రోలర్స్ అందరికీ దండం పెట్టి అడుగుతున్నా....
-
డీజీపీని కలిసిన 'మా' ప్రతినిధులు.. ట్రోలర్స్‌కు చుక్కలే!
సాక్షి, హైదరాబాద్: విమర్శ మంచిదే కానీ అది హద్దు దాటకూడదు. ఈ మధ్య కాలంలో పలువురు నెటిజన్లు, యూట్యూబర్స్.. సెలబ్రిటీలను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. వారు చేసే పని గురించే కాకుండా వ్యక్తిగత విషయాలను సైతం చర్చిస్తూ దారుణంగా కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో మా(మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్) నటీనటుల గురించి అసభ్యంగా మాట్లాడిన ఐదు యూట్యూబ్ ఛానల్స్‌ను తొలగించింది.స్పెషల్ సెల్గురువారం నాడు మా బృందం డీజీపీ జితేందర్‌ను కలిసింది. సెలబ్రిటీలను టార్గెట్ చేసుకుని వీడియోలు వదులుతున్న 200 యూట్యూబ్ ఛానల్స్ లిస్టును డీజీపికి సమర్పిస్తూ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించిన ఆయన.. సైబర్ సెక్యూరిటీ వింగ్‌లోని ఓ స్పెషల్ సెల్ ఇకపై దీనిపైనే ఫోకస్ చేస్తుందని హామీ ఇచ్చారు. ట్రోలర్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.ఫ్యామిలీని కూడా వదలట్లేదుఅనంతరం రాజీవ్ కనకాల మాట్లాడుతూ.. ట్రోల్స్ నవ్వుకునేలా ఉండాలి కానీ ఏడిపించేలా ఉండొద్దు. కుటుంబ సభ్యుల మీద కూడా ట్రోల్ చేయడం దారుణం. ఇకమీదట నటీనటులను ట్రోల్స్ చేస్తే సహించేది లేదు అని వార్నింగ్ ఇచ్చారు. శివ బాలాజీ మాట్లాడుతూ.. దారుణమైన ట్రోల్స్‌కు పాల్పడేవారిని టెర్రరిస్టులుగా పరిగణిస్తాం. సుమారు 200 యూట్యూబ్ ఛానల్స్ లిస్టును డీజీపీకి సమర్పించాం. ఆయన సానుకూలంగా స్పందించారు అని తెలిపారు.మహిళా ఆర్టిస్టులే టార్గెట్నటుడు శివకృష్ణ మాట్లాడుతూ.. మహిళా ఆర్టిస్టుల క్యారెక్టర్‌ను దారుణంగా చిత్రీకరిస్తున్నారు. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ డబ్బు కోసం ఇలా చేస్తున్నాయి. కానీ దీనివల్ల లేడీ ఆర్టిస్టులు ఎక్కువ ఇబ్బందిపడుతున్నారు అని చెప్పుకొచ్చారు.చదవండి: మరో రెండు ఓటీటీల్లోకి తెలుగు యాక్షన్ మూవీ.. ఎక్కడంటే? -
న్యూ ఇయర్ వేడుకల్లో యాంకర్ సుమ ఫ్యామిలీ!
టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేరళకు చెందిన సుమ టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాలను ప్రేమ వివాహం చేసుకున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ జంటకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తమ 25వ వివాహా వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు కూడా. తాజాగా ఈ జంట కేరళలో సందడి చేసింది. మలయాళ నూతన సంవత్సర వేడుకలను సెలబ్రేట్ చేసుకున్నారు. మలయాళ, తమిళ న్యూ ఇయర్‌గా భావించే విషును కుటుంబంతో కలిసి ఆనందంగా జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన అభిమానులు క్యూట్ కపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. యాంకర్ సుమ కేరళలోని పాలక్కాడ్‌లో జన్మించారు. View this post on Instagram A post shared by suma kanakala (@suma_kanakala_f) View this post on Instagram A post shared by suma kanakala (@suma_kanakala_f) -
‘మాట’తో చేస్తున్న సేవకు ఆనందంగా ఉంది: శ్రీనివాస్ గనగోని
మాట (మన అమెరికా తెలుగు అసోసియేషన్ ) ప్రారంభించిన పదినెలల్లోనే 22 బ్రాంచిలు ఏర్పాటు చేసి దాదాపు 5000 మందితో అనేక సేవ కార్యక్రమాలను నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు అసోసియేషన్ వ్యవస్థాపకులు, అధ్యక్షుడు శ్రీనివాస్ గనగోని. మాట అధ్వర్యంలో ఫిబ్రవరి 17 నుంచి వివిధ సేవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మార్చి 10 వరకు ఈ సేవ కార్యక్రమాలు కొనసాగుతాయి. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని కోట్ల విజయభాస్కర రెడ్డి స్టేడియంలో జరగుతున్న కంటి కాటరాక్ట్ ఆపరేషన్ల క్యాంప్ నేటితో(ఫిబ్రవరి 28) ముగియనుంది. ఈ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న మాట అధ్యక్షుడు శ్రీనివాస్ గనగోని మాట్లాడుతూ.. ఇండియాలో ఈ నెల 17న వరంగల్‌లో 500 మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్‌లు మరియు జనరల్ మెడిసిన్ ట్రీట్మెంట్లు చేశాము. 18న ఆశలపల్లిలో మరో 300 మందికి క్యాన్సర్ టెస్ట్‌లతో పాటు జనరల్ టెస్ట్‌లు కూడా చేసి మందులను ఉచితంగా పంచిము. అలాగే 19న కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో శంకర్ నేత్రాలయ వారితో కలిసి కంటి ఆపరేషన్లకు సంబంధించి 2300మంది వరకు టెస్ట్‌లు చేశాము. దాదాపు 200 మందికి ఆపరేషన్లు నిర్వహించి 100 మందికి ఉచిత కళ్లజోళ్లను పంపిణి చేశాము. మరో 250 మందిని చెన్నైకి పంపించి వైద్యం చేయిస్తున్నాం. ఇదంతా చేయటం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అని మాట అధ్యక్షుడు శ్రీనివాస్ గనగోని అన్నారు. ఫెస్టివల్స్ ఫర్ జోయ్ అధ్యక్షురాలు, ప్రముఖ యాంకర్ సుమ కనకాల మాట్లాడుతూ– ‘‘ఇలాంటి గొప్ప కార్యక్రమం చేయాలంటే ఎంతో మానవత్వం ఉండాలి. అలాంటి మానవత్వం ఉన్న ఎంతో మంది కలిసి చేయబట్టే దాదాపు 2000మందికి పైగా ఈ రోజు ఐ స్క్రీనింగ్ టెస్ట్‌లు చేయగలిగారని, దాదాపు 195 ఆపరేషన్లు జరిగినందుకు శంకర్ నేత్రాలయ టీమ్‌ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’’ అన్నారు. రాజీవ్ కనకాల మాట్లాడుతూ–‘‘ గతంలో నన్ను అందరూ సుమ భర్త అని ఎవరన్నా అంటుంటే చిరగ్గా ఉండేదని ఇప్పుడు సుమ ఇలాంటి మంచిపనులు చేస్తున్నందుకు సుమ భర్త అంటుంటే ఎంతో గర్వంగా ఉందని కాలర్ ఎగరేసుకుని మరి సుమ భర్తనే అని చెప్పుకోవాలి అనిపిస్తుంది’’ అన్నారు. కార్యక్రమంలో శంకర్ నేత్రాలయ ప్రతినిధి అరుల్, డాక్టర్ విజయ్ భాస్కర్ బొలగం, ప్రవాసాంధ్రుడు ప్రదీప్ సామల టివి ఫెడరేషన్ సభ్యులు విజయ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆ విషయంలో గొడవపడేవాళ్లం: యాంకర్ సుమ
ఒకరు సినీ సెలబ్రిటీ.. మరొకరు బుల్లితెర సెలబ్రిటీ.. వీరిద్దరి జోడీ ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. ఆ జంట మరెవరో కాదు రాజీవ్ కనకాల- యాంకర్ సుమ. ఈ మధ్యే వీరు 25వ పెళ్లి రోజు జరుపుకున్నారు. పాతికేళ్ల వైవాహిక బంధాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా సుమ తన యూట్యూబ్ ఛానల్లో ఓ కొత్త వీడియో వదిలింది. ఇందులో ఎన్నో ప్రశ్నలకు ఈ దంపతులు సమాధానాలు చెప్పారు. ఎప్పుడో చెక్ చేశా.. మీ పార్ట్నర్కు తెలియకుండా పార్ట్నర్ ఫోన్ చెక్ చేశారా? అని అడగ్గా రాజీవ్ లేదన్నాడు. కానీ సుమ మాత్రం చెక్ చేశానంది. ఏదో పదేళ్ల క్రితం చెక్ చేశాను అంటూ నవ్వేసింది. ఫోన్ చెక్ చేయడమేంటని షాకైన రాజీవ్ తాను కూడా తన జాగ్రత్తలో ఉన్నానని కౌంటరిచ్చాడు. ఏ విషయంలో గొడవపడేవారన్న ప్రశ్నకు.. తాను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు కూడా రాజీవ్ దెయ్యాల సినిమాలకు తీసుకెళ్లేవాడని.. ఆ విషయంలో గొడవపడేవాళ్లమని సుమ సమాధానమిచ్చింది. ఇన్నాళ్లకు సారీ చెప్పిన రాజీవ్ రాజీవ్‌కు ఫోన్ చేసినప్పుడల్లా ఐదు నిమిషాల్లో ఇంటికి వచ్చేస్తానంటాడు.. కానీ ఎప్పుడూ చెప్పిన సమయానికి రాలేదని రాజీవ్‌పై కంప్లైంట్ ఇచ్చింది సుమ. పెళ్లైన ఆరేడేళ్ల వరకు అతడి గురించి ఎదురుచూసేదాన్నని.. తనకోసం ఎదురుచూసి చివరకు ఒక్కదాన్నే తినేసేదాన్నని చెప్పింది. దీంతో రాజీవ్.. అప్పుడు చేసిన పనికి ఇప్పుడు పశ్చాతాప్పపడుతూ సారీ చెప్పాడు. ఈ మాటతో సుమ ఫుల్ ఖుషీ అయింది. కాగా సుమ తన పెళ్లిరోజును గుర్తు చేసుకుంటూ.. '25 ఏళ్ల క్రితం మేము పెళ్లి చేసుకుంటామంటే ఇంట్లో వ్యతిరేకత ఉన్నా తర్వాత అందరూ ఒప్పుకున్నారు. నాలుగో ముడి కూడా.. ఫిబ్రవరి 10న పెళ్లి చేసుకున్నాం. మూడుముళ్లు రాజీవ్ వేశాక నాలుగో ముడి ఆడపడుచు వేయాల్సి ఉంది. కానీ రాజీవ్ ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఎంతో కష్టపడి ప్రేమించా.. ఆ ముడి కూడా నేనే వేస్తా అంటూ నాలుగోది కూడా అతడే వేశాడు. ఆ జ్ఞాపకాన్ని ఎప్పటికీ మర్చిపోలేను' అంటూ ఆనాటి రోజుల్ని గుర్తు చేసుకుంది. అలాగే దగ్గర్లోని వృద్ధాశ్రమానికి వెళ్లి అక్కడే ఈ జంట యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంది. పెద్దల సమక్షంలో కేక్ కట్ చేసుకుని ఇరువురు దండలు మార్చుకున్నారు. వృద్ధులకు అన్నదానం చేశారు. చదవండి: వాలంటైన్స్ డే.. ప్రియుడి తల పగలగొట్టిన హీరోయిన్ -
సుమ వింత ఫోటో షూట్.. భయపడిపోయిన రాజీవ్, ఫన్నీ వీడియో వైరల్
ఒకవైపు టీవీ షోలు.. మరోవైపు సినిమా ఈవెంట్స్‌తో దాదాపు రెండు దశాబ్దాలుగా బుల్లితెరపై మకుటం లేని మహారాణిలా కొనసాగుతున్నారు యాంకర్ సుమ. ఎలాంటి షో అయినా.. ప్రొగ్రామ్ అయినా యాంకర్‌గా సుమ ఉండాల్సిందే. కొంతమందికి అయితే ఆమె యాంకరింగ్ సెంటిమెంట్‌గాను మారింది. (చదవండి: సూపర్ విమెన్‌ను పెళ్లి చేసుకున్నా..భర్తగా గర్వంగా ఉంది: అక్షయ్ కుమార్) ఆమె కోసం కొన్ని సినిమాల ప్రీరిలీజ్ ఈవెంట్స్ కూడా వాయిదా వేసుకున్న సందర్భాలు ఉన్నాయి. తనదైన యాంకరింగ్‌తో అంతలా ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ని క్రియేట్ చేసుకుంది సుమ. కేవలం బుల్లితెరపై మాత్రమే కాదు.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది ఈ యాంకరమ్మ. ఫన్నీ వీడియోలతో పాటు వంట వీడియోలు చేస్తూ తన అభిమానులను ఎంటర్టైన్ చేయడంతో పాటు సలహాలు, సూచనలు కూడా ఇస్తుంటుంది. (చదవండి: అరెరె... ఇది తెలీక వేరే కథతో సినిమా తీస్తున్నానే..: మారుతి) ఇక ఇటీవల వింత ఫోటో షూట్స్ చేస్తూ.. వాటిని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది సుమ. తన కొడుకు రోషన్ హీరోగా నటించిన బబుల్ గమ్ సినిమా రిలీజ్ టైమ్‌లో హీరోయిన్ డ్రెస్‌తో సుమ ఓ ఫోటో షూట్ చేసింది. అవి బాగా వైరల్ అయ్యాయి. తాజాగా ఆ ఫోటో షూట్ సమయంలో రాజీవ్ రియాక్షన్ ఎలా ఉందో తెలియజేస్తూ ఓ వీడియోని ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఇందులో సుమ ఫోటో కోసం రకరకాల పోజులు ఇస్తుంటే.. రాజీవ్ ‘వామ్మో.. వాయమ్మో’అంటూ దండం పెట్టేశాడు. ‘నా ఫోటో షూట్ సమయంలో భర్త రియాక్షన్ ఇది’ అంటూ ఆ వీడియోని షేర్ చేసింది సుమ. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో ఫుల్ వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్స్ ఫన్నీగా స్పందిస్తున్నారు. ‘రాజీవ్ గారు మాకు కాళ్ళు చేతులు వణుకుతున్నాయి సార్’, ‘సుమ అక్క రోజు రోజుకి మీ వయసు తగ్గిపోతుంది’అంటూ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) -
ఫుడ్ పాయిజన్.. ఆస్పత్రిలో.. అందుకే లావయ్యా: రాజీవ్ కనకాల
ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల.. టాలీవుడ్లో అనేక సినిమాల్లో నటించాడు. చిన్న చిత్రాల నుంచి భారీ బడ్జెట్ చిత్రాల వరకు అన్నింటినీ కవర్ చేశాడు. సై, స్టూడెంట్ నెం.1, ఎ ఫిలిం బై అరవింద్, విక్రమార్కుడు, రంగస్థలం, నాన్నకు ప్రేమతో, ఆర్ఆర్ఆర్.. ఇలా ఎన్నో వైవిధ్య చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఇండస్ట్రీలో అందరివాడు అనిపించుకున్న రాజీవ్ కనకాల గతకొంతకాలంగా కొద్దిగా లావయ్యాడు. రోజూ రాత్రి పావుకిలో పైనే స్వీట్స్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తను లావవడం వెనక గల కారణాన్ని బయటపెట్టాడు. రాజీవ్ మాట్లాడుతూ.. 'ఆ మధ్య నాకు ఫుడ్ పాయిజన్ అయింది. ఆస్పత్రిలో జాయిన్ అయితే సెలైన్స్ ఎక్కించారు, యాంటిబయాటిక్స్ ఇచ్చారు. అప్పుడు ఆస్పత్రిలో ఫుడ్ ఇచ్చేవారు, అటు ఇంటి నుంచి ఆహారం వచ్చేది. ఏదీ వృథా చేయకూడదన్న ఉద్దేశ్యంతో అంతా తినేసేవాడిని. డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చాక రోజూ రాత్రి స్వీట్స్ తినాలనిపించేది. పావు కిలో నుంచి అరకిలో వరకు రోజూ స్వీట్స్ లాగించాను. అలా తెలియకుండానే బరువు పెరిగాను. కాలు బెణికి నడవలేకపోయా.. ఆ తర్వాత తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా వరంగల్‌లో క్రికెట్ ఆడాను. ఆ సమయంలో కాలు బెణికింది. దీనికి తోడు లావు పెరగడంతో సరిగా నడవలేకపోయాను. నేను తినేటప్పుడు ఎవరైనా చాలు, ఆపేయని చెప్తే మాత్రం చాలా కోపమొస్తుంది. అందుకని నేను తినేటప్పుడు వద్దని దాదాపు ఎవరూ చెప్పరు. ప్రస్తుతం బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నాను' అని తెలిపాడు రాజీవ్ కనకాల. కాగా రాజీవ్- యాంకర్ సుమ తనయుడు రోషన్ కనకాల 'బబుల్గమ్' సినిమాతో ఇటీవలే హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే! చదవండి: ఓటీటీ ట్రెండింగ్‌లో టాప్ లేపుతున్న ఫ్లాప్ సినిమా.. స్ట్రీమింగ్ అందులోనే -
Bubblegum Movie: యాంకర్ సుమ కుమారుడు 'బబుల్గమ్' సినిమా ప్రీ రిలీజ్ (ఫొటోలు)
-
సరికొత్త దళారి
రాజీవ్ కనకాల, ‘షకలక’ శంకర్ ప్రధాన పాత్రల్లో శ్రీతేజ్, అక్సా ఖాన్, రూపిక కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘దళారి’. కాచిడి గోపాల్‌రెడ్డి దర్శకత్వంలో ఎడవెల్లి వెంకట్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నేడు రిలీజవుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో రాజీవ్ కనకాల మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్తగా ఉంటుంది’’ అన్నారు. ‘‘దళారి’ని రెండు భాగాలుగా తీశాం. ఇప్పుడు తొలి భాగం రిలీ జవుతోంది. ఇందులో మంచి కథ, యాక్షన్ ఉన్నాయి. ఈ సినిమా క్లైమాక్స్ బాగా వచ్చింది’’ అన్నారు ‘షకలక’ శంకర్. ‘‘ఒక ఊరిలోని వెంకట్ రెడ్డి అనే వ్యక్తి జీవితాన్ని ప్రేరణగా తీసుకుని ఈ సినిమా కథ చేశాం’’ అన్నారు కాచిడి గోపాల్‌రెడ్డి. ‘‘త్వరలోనే దళారి 2’ చేస్తాం’’ అన్నారు వెంకట్ రెడ్డి. -
రాజీవ్ కనకాల- జూనియర్‌కు మధ్య దూరం నిజమేనా?.. అసలు నిజం చెప్పిన రోషన్!
టాలీవుడ్ యాంకర్ అనగానే ఠక్కున అందరికీ గుర్తొచ్చే పేరు సుమ. ఆమె తర్వాతే ఎవరైనా అన్నవిధంగా సుమ తెలుగు ఇండస్ట్రీలో అంతలా పేరు తెచ్చుకుంది. కేరళకు చెందిన సుమ టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాలను పెళ్లి చేసుకుని తెలుగమ్మాయిగా స్థిరపడిపోయింది. ప్రస్తుతం రాజీవ్ కనకాల వారసుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. రాజీవ్ -యాంకర్ సుమ దంపతుల తనయుడు రోషన్ కనకాల బబుల్ గమ్ చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నారు. రవికాంత్ పేరేపు దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 29న విడుదల కానుంది. ప్రస్తుతం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రోషన్.. రాజీవ్ కనకాల, జూనియర్ ఎన్టీఆర్ ఫ్రెండ్షిప్పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. రోషన్ మాట్లాడుతూ.. 'ఫ్రెండ్షిప్ అనేది ఒక బంధం. వీరిద్దరి రిలేషన్ స్టూడెంట్ నెం-1 మూవీ నుంచి ఉంది. నాకు అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు. అలాంటి స్నేహితున్ని వదులుకోకూడదు. తారక్ అన్నను చూసి డ్యాన్స్ నేర్చుకోమని నాన్న ఎప్పుడు చెప్పేవారు. ఆయన స్థాయికి చేరుకోవాలనేది నా కోరిక. రాజీవ్, జూనియర్‌కు మధ్య దూరం పెరిగిందన్న వార్తలపై రోషన్ స్పందించారు. అలాంటిదేం జరగలేదు. నాకు తెలిసి ఎప్పుడు వాళ్లు ఇప్పటికీ కలిసే ఉన్నారు. ఎప్పుడు ఎవరు అలా ఫీలవ్వలేదు. అసలు జరిగితేనే కదా ఫీలయ్యేది.' అని అన్నారు. సుమ కుమారుడు కాబట్టి చిరంజీవి సపోర్ట్ చేశారనేది నిజమేనా? అని యాంకర్ ప్రశ్నించారు. ఆయన ఎప్పుడలా సపోర్ట్ చేయరు. ఆయనకు టీజర్ నచ్చింది. సాంగ్ కూడా నచ్చిందని చెప్పారు. నువ్వు కూడా పాట పాడావా?అని అడిగారు. నా వాయిస్ చాలా బాగుందన్నారు. దీంతో చిరంజీవి మాటలకు నాకే ఆశ్చర్యమేసింది' అని రోషన్ అన్నారు. ఆ తర్వాత ఈ సినిమాలో లిప్ లాక్ సీన్స్ చేయడం కోసం దాదాపు 150 టేక్స్ తీసుకున్నారా? అంటూ రోషన్‌ను యాంకర్ ప్రశ్నించారు. దీనికి కాస్తా కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోయిన రోషన్.. హీరోయిన్ మానస చౌదరిని తీసుకొచ్చాడు. ఎన్ని టేకులు తీసుకున్నానో చెప్పు అంటూ ఆమెను అడిగారు. అయితే ఇదంతా ఫన్నీ కోసమే చేసినా సీరియస్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు రోషన్. కాగా.. ఈ చిత్రం డిసెంబర్ 29న థియేటర్లలో సందడి చేయనుంది. -
విడాకులు తీసుకుంటున్నారా? అని నాన్నను అడిగా: రోషన్
నటుడు రాజీవ్ కనకాల-యాంకర్ సుమ దంపతుల తనయుడు రోషన్ కనకాల వెండితెరపై పూర్తి స్థాయిలో ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. బబుల్గమ్ సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. రవికాంత్ పేరేపు దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 29న విడుదల కానుంది. ఇప్పటికే తాను పోలీసులకు దొరికిపోయినట్లు ఓ ప్రాంక్ వీడియో చేసి సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టాడీ యంగ్ హీరో. చిన్నప్పటి నుంచే కోరిక.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'చిన్నప్పటి నుంచి తెలియకుండానే యాక్టింగ్‌పై ఆసక్తి ఏర్పడింది. బాల్యంలో ఉన్నప్పుడు అమ్మతో కలిసి ఓ వాణిజ్య ప్రకటనలో నటించినప్పుడు చాలా సంతోషమేసింది. అలా చిన్నప్పుడే నటుడినవ్వాలని నా మనసులో బలంగా అనుకున్నాను. యాక్టింగ్ కోర్సు కూడా నేర్చుకున్నాను. ఒక మనసు సినిమాలో చిన్న పాత్ర చేశాను. నిర్మలా కాన్వెంట్ ఆడిషన్స్‌కు వెళ్లి సెలక్ట్ అయ్యాక అందులో ఓ పాత్ర చేశాను. బబుల్గమ్ సినిమా కూడా ఆడిషన్స్ జరిగాకే హీరోగా సెలక్ట్ చేశారు. విడాకులు తీసుకుంటున్నారా? అని అడిగా అమ్మానాన్న విడాకులు తీసుకుంటున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అవి చదుతున్నప్పుడు అమ్మానాన్న జాలీగా కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తున్నారు. అసలేం జరుగుతుందో అర్థం కాక.. ఏంటి? మీరు విడాకులు తీసుకుంటున్నారా? అని అడిగేశాను. దానికి వాళ్లు.. ఛీఛీ, ఏం మాట్లాడుతున్నావ్‌రా.. అలాంటిదేం లేదని చెప్పారు. రెండుమూడుసార్లు ఈ విడాకుల వార్తలు చూసినప్పుడు అంతా గందరగోళంగా అనిపించేది. తర్వాత ఊరికే పుకార్లు రాస్తున్నారని అర్థమైంది. పేరెంట్స్ మధ్య గొడవలు? నిజంగా అలాంటిదేమైనా ఉంటే ఇంట్లో ఉండే మాకు తెలుస్తుందిగా.. నాకు తెలియకుండా బయటవాళ్లకు ఈ వార్తలు వెళ్లడమేంటి? అనుకున్నాను. ఆ వార్తల్లో ఒక్క శాతం కూడా నిజం లేదు. భార్యాభర్తల మధ్య గొడవలుంటాయి. కానీ అమ్మానాన్న మధ్య అలాంటి పెద్ద గొడవలు ఏం జరగలేదు. పొద్దున త్వరగా నిద్ర లేకపోతే అమ్మ నాన్నపై అరుస్తుంటుంది. అలాంటి చిన్నచిన్న సరదా గొడవలే ఉంటాయి' అని చెప్పుకొచ్చాడు రోషన్ కనకాల. చదవండి: శివాజీ బ్యాచ్‌ని ఉతికారేసిన నాగార్జున.. ఆ విషయమే కారణమా? -
దళారి రాజకీయం
రాజీవ్ కనకాల, ‘షకలక’ శంకర్, అక్షా ఖాన్ ప్రధాన పాత్రల్లో కాచిడి గోపాల్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘దళారి’. వెంకట్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదలవుతోంది. ఈ చిత్రం ట్రైలర్‌ని నిర్మాతలు సి. కల్యాణ్, దామోదర ప్రసాద్ విడుదల చేశారు. సి. కల్యాణ్ మాట్లాడుతూ– ‘‘వెంకట్ రెడ్డిగారిలాంటి కొత్తవారు వస్తేనే ఇండస్ట్రీ బాగుంటుంది. ‘దళారి’ ట్రైలర్ బాగుంది.. సినిమా విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘మా సినిమాని ఆకృతి క్రియేషన్స్ పతాకంపై రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు వెంకట్ రెడ్డి. ‘‘సమాజంలో ఏ పని జరగాలన్నా ఒక దళారి ఉంటాడు. అలాంటి దళారి పాత్ర రాజకీయంలో ఉంటే ఎలా ఉంటుందో తెలిపేదే మా సినిమా’’ అన్నారు గోపాల్ రెడ్డి. -
భర్తకు స్పెషల్‌గా విష్ చేసిన సుమ.. సోషల్ మీడియాలో వైరల్!
టాలీవుడ్లో యాంకర్ అనగానే అందరికీ ఠక్కున గుర్తొచ్చే పేరు ఆమెనే. ఏ ఈవెంట్ జరిగినా సరే తన మాటలతో మాయ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. వేదికపై గలగల మాట్లాడే యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పుట్టింది కేరళ అయినా.. తెలుగబ్బాయి రాజీవ్ కనకాలను పెళ్లి చేసుకుని తెలుగింటి కోడలిగా మారిపోయింది. రెండున్నర దశాబ్దాలుగా బుల్లితెరపై ప్రేక్షకులను ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నారు. అయితే తాజాగా తన భర్త బర్త్ డే సందర్భంగా ఇన్‌స్టాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. తన భర్తకు పుట్టిన రోజు శుభాకాక్షంలు చెబుతూ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సుమ తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'నా ప్రియమైన భర్తకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు లేకుండా నా వృత్తిని కొనసాగించడం కష్టం. మీరు ఎల్లప్పుడూ నాకు మద్దతుగా ఉంటూ ప్రోత్సహించారు. లవ్ యూ రాజీవ్.' అంటూ లవ్ సింబల్ ఎమోజీలను పంచుకుంది. ఇది చూసిన ఆడియన్స్ సైతం రాజీవ్ కనకాలకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా.. సుమ, రాజీవ్ కనకాల కుమారుడు రోషన్ కనకాల 'బబుల్గమ్' చిత్రంతో హీరోగా రాబోతున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) -
Bubblegum Teaser Launch Event Pics: యాంకర్ సుమ తనయుడు రోషన్ ‘బబుల్గమ్’చిత్రం టీజర్ ఈవెంట్ (ఫొటోలు)
-
బెడ్‌పై కదల్లేని స్థితిలో శ్రీలక్ష్మి, మాట రాక కంటనీరు..: రాజీవ్ కనకాల ఎమోషనల్
కొద్ది నిమిషాల నిడివి ఉన్నా, సినిమా ఆసాంతం ఉన్నా తను పోషించే పాత్రలు ఎంతో పవర్‌ఫుల్‌గా ఉంటాయి. తక్కువ సమయంలోనే ఎక్కువ ఎమోషన్స్ చూపించడం, సీన్‌ను రక్తికట్టించడంలో రాజీవ్ కనకాల దిట్ట. జీవితంలో కష్టనష్టాలు ఎన్నో చూసిన ఆయన సినీ కెరీర్లో సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తున్నాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో తన కుటుంబం గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యాడు. 'అమ్మ, నాన్న, చెల్లి.. అందరినీ కోల్పోయాను. ఆ సమయంలో చాలా ఇబ్బందిపడ్డాను. రెండు,మూడు నెలలపాటు డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. నా చెల్లి పేరు శ్రీలక్ష్మి. తను సీరియల్స్ కూడా చేసింది. తనకు క్యాన్సర్ వచ్చింది, దాన్నుంచి దాదాపు బయటపడింది. పూజలు, హోమాలు చేయించమంటే అవి కూడా చేయించాం. 85 శాతం రికవరీ అయింది. ఇక ఆందోళన చెందాల్సిన పని లేదనుకున్నాం. రెండు రోజుల్లో లాక్డౌన్ అనగా మా బావ నాకు ఫోన్ చేసి రమ్మన్నాడు. వెళ్లి చూశాక తన పరిస్థితి దిగజారుతోందని అర్థమైంది. కీమోథెరపీ చేయిద్దామంటే అప్పుడే పచ్చకామెర్ల వ్యాధి సోకింది. అది తగ్గితేకానీ ఏ చికిత్స చేయరు. రోజురోజుకీ తన పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. అది కరోనా సమయం కావడంతో ఎవరూ ఆస్పత్రిలో జాయిన్ చేసుకునే పరిస్థితిలో లేరు. ఒకవేళ అడ్మిట్ చేసుకున్నా తన ప్రాణ్యాలకు గ్యారెంటీ ఇవ్వలేమన్నారు. అందుకే ఉన్నంత వరకు కుటుంబమంతా ఒకే దగ్గర ఉన్నాం. బెడ్‌పై కదల్లేని స్థితిలో ఉన్న తను ఎప్పుడో ఒకసారి స్పృహలోకి వచ్చి కళ్లు తెరిచి చూసేది. మాట్లాడటానికి కూడా రాకపోయేది. తన కంట నుంచి కన్నీళ్లు కారేవి. రాత్రిపూట తన మూలుగు విని ఇంకా బతికుందని అనుకునేవాడిని. ఎక్కువరోజులు తను బతకదని తెలుసు, అదే జరిగింది. నా మేనకోడళ్లు (చెల్లి పిల్లలు) ఇద్దరూ చాలా స్ట్రాంగ్‌గా ఉండేవారు. తల్లి చనిపోయాక తనకోసం లేఖ రాశారు. ఆ మధ్య అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ సమయంలో సుమ వచ్చి ఇప్పటి నుంచి మనకు నలుగురు పిల్లలు అంది. ఇప్పటికీ వాళ్లకు ఏం కావాలన్నా సుమ దగ్గరుండి చూసుకుంటుంది' అంటూ ఎమోషనలయ్యాడు రాజీవ్ కనకాల. చదవండి: అనాథలా చనిపోయిన తెలుగింటి హీరోయిన్.. -
జూ.ఎన్టీఆర్‌తో గొడవ అక్కడ మొదలైంది: రాజీవ్ కనకాల
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, నటుడు రాజీవ్ కనకాల మంచి స్నేహితులు అన్న విషయం చాలామందికి తెలుసు. అయితే స్నేహాని కంటే ముందు వీరి మధ్య కయ్యం పుట్టిందట. అదే తర్వాత స్నేహంగా మారిందట! తమ మధ్య పరిచయం ఎలా మొదలైంది? అసలు గొడవెందుకు వచ్చింది? అన్న విషయాలను తాజాగా రాజీవ్ కనకాల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. 'నిన్ను చూడాలని సినిమాకు జూ.ఎన్టీఆర్‌కు నన్ను డబ్బింగ్ చెప్పమన్నారు. ఎందుకో తనకు నా గొంతు సరిపోదని చెప్పి వెనక్కు వచ్చేశాను. దీంతో అతడే తన డబ్బింగ్ చెప్పుకున్నాడు. మొదటి రోజే కామెంట్ స్టూడెంట్ నెం.1 సినిమాలో మొదటిసారి కలిశాం. తొలి రోజు మధ్యాహ్నానికే గొడవ. నామీద ఏదో కామెంట్ చేశాడు. నా స్నేహితుడు చంద్రశేఖర్ స్టైలిష్వి కళ్లజోడు పట్టుకొస్తే నా పాత్రకు బాగా సూటవుతుందని అరువు తీసుకున్నాను. ఆ కళ్లజోడు పెట్టుకుని యాక్ట్ చేస్తున్నాను. ఛా.. అవసరమా? అన్నాడు. అవును, అవసరమే అన్నాను. జక్కన్న దగ్గరికెళ్లి చెప్పాను. నామీద కామెంట్ చేశాడు. రేపు పొద్దున నన్ను ఏదో ఒకటి అంటే నేను కూడా తిరిగి కౌంటరిస్తాను. అటు తిరిగి, ఇటు తిరిగి నన్నే అంటారు. నేను సినిమాలో నుంచి వెళ్లిపోతాను అన్నాను. రాజమౌళి మాత్రం.. ఆయనేదో సరదాగా జోక్ చేశాడు, మరీ సెన్సిటివ్‌గా ఆలోచిస్తున్నావ్ అన్నాడు. సరేనని ఊరుకున్నాను. అపరిచితుడిలా నటించాడు తెల్లారి సెట్‌కు వెళ్తే ఎన్టీఆర్.. రాజీవ్‌గారు, నమస్కారం.. రండి సర్ అన్నాడు. ఇంత అపరిచితుడులా ఉన్నాడేంటి అని లైట్ తీసుకున్నాను. మూడో రోజు మళ్లీ ఏదో జోక్ చేశాడు. నాలుగో రోజు ఫ్రెండ్లీగా ఉన్నాడు. ఈ నాలుగురోజుల్లోనే మాకు తెలియకుండా మేమిద్దరం బాగా క్లోజ్ అయ్యాం. ఎంతలా అంటే అప్పటిదాకా రాజీవ్ గారు అని పిలిచే తారక్ రెండో షెడ్యూల్‌కు వచ్చేసరికి ఒరేయ్.. రాజాగా.. రారా అని పిలిచాడు. రాజీవ్‌గారు నుంచి రారానా? అని షాకయ్యాను. మరి ఫ్రెండంటే అనరా? అన్నాడు. అలా క్లోజయ్యాం' అని చెప్పుకొచ్చాడు రాజీవ్ కనకాల. చదవండి: భోళా శంకర్ కోసం ఒక్క రూపాయి ముట్టుకోని చిరంజీవి -
సుమతో విబేధాలు? అందుకే అలా చేస్తున్నా: రాజీవ్ కనకాల
బుల్లితెరపై యాంకర్ సుమ స్టార్.. వెండితెరపై రాజీవ్ కనకాల ఓ చిన్నపాటి స్టార్. వీరిద్దరి జంట చూడముచ్చటగా ఉంటుంది. కానీ ఎందుకో మరి గతంలో వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ ప్రచారం జరిగింది. సంపాదన విషయంలోనూ అభిప్రాయబేధాలు వచ్చాయని పుకార్లు షికార్లు చేశాయి. అదంతా ఏమీ లేదని చెప్పినా వీరి గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజీవ్ కనకాల తన వైవాహిక జీవితం గురించి, ఆర్థిక ఇబ్బందుల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. చనిపోతాను అనగానే బాధ్యత తీసుకున్నా 'మా అమ్మానాన్న ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు. చెన్నైలో సినిమా ఇన్స్టిట్యూట్ పెడుతున్నారనగానే జాబ్ మానేసి అక్కడికి వెళ్లిపోయారు. ఆ తర్వాత కొంతకాలానికే ఇన్స్టిట్యూట్ మూసేశారు. అమ్మ మళ్లీ రాష్ట్ర ఉద్యోగం కొట్టింది. నాన్న నటుడిగా నెమ్మదిగా సినిమాలు చేసుకుంటూ గుర్తింపు పొందాడు. తర్వాత ఆయన దర్శకుడిగా మారి సినిమాలు తీశాడు. 1985లో సొంతంగా ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నాం. అప్పటినుంచి వరుసగా కష్టాలే! ఎప్పుడూ డబ్బులుండేవి కాదు. రూ.100, రూ.500 కోసం కూడా అప్పు చేయాల్సి వచ్చింది. అదే సమయంలో నాన్నకు వారి సోదరులతో కలహాలు వచ్చాయి. వీటన్నింటిని తట్టుకోలేకపోయిన ఆయన ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నా అన్నాడు. నేనున్నా కదా నాన్న అని సర్ది చెప్పి పరిస్థితిని సీరియస్‌గా తీసుకున్నా. వచ్చిన అవకాశాలన్నీ చేసుకుంటూ పోయాను. సుమతో విబేధాలు.. అందుకోసమే అలా చేస్తున్నా కంటి మీద కునుకు లేకుండా వరుస సీరియల్స్ చేసేవాడిని. పెళ్లయిన తర్వాత ఇద్దరం కలిసి అప్పులు అంతా తీర్చేశాం. మధ్యలో ఒకసారి ఓ సీరియల్‌కు డైరెక్షన్ చేశాను. ఏడాదిదాకా ఏ సినిమా ఛాన్సూ రాలేదు. అందుకే నేను నటనకే అంకితమయ్యాను. సుమ, నేను సంతోషంగా ఉన్నాం. మా మధ్య దూరం పెరిగిందని లేనిపోనివి రాస్తున్నారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకే అప్పుడప్పుడూ తన ప్రోగ్రామ్‌లకు హాజరవుతున్నాను. కలిసి రీల్స్ కూడా చేస్తున్నాం. ఈ విడాకుల రూమర్స్ విని నేను బాధపడ్డాను. కానీ సుమ అయితే ఏమాత్రం పట్టించుకోలేదు. తర్వాత నేను కూడా లైట్ తీసుకోవడం మొదలుపెట్టాను' అని చెప్పుకొచ్చాడు రాజీవ్ కనకాల. చదవండి: అందుకే సౌత్‌ను పట్టించుకోను.. అక్కడ హీరో, దర్శకుడు కాంప్రమైజ్ అడిగారు: నటి రెండో భార్యతో కలిసి తిరుమలను దర్శించిన ప్రభుదేవా -
డైరెక్టర్‌గా జబర్దస్త్ కమెడియన్.. 'ప్రతి సీన్ మనసును కదిలిస్తుంది'!
సాయికుమార్, ఆదిత్యా ఓం, ఐశ్వర్య, రాజీవ్ కనకాల, శ్రీనివాస్ సాయి, దీపాలి రాజ్‌పుత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘నాతో నేను’. శాంతి కుమార్ తూర్లపాటి (జబర్దస్ట్ ఫేం) దర్శకత్వంలో ప్రశాంత్ టంగుటూరి నిర్మించారు. ఈ నెల 21న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ నటుడు సాయి కుమార్ హాజరయ్యారు. (ఇది చదవండి: స్టార్ డైరెక్టర్ కొత్త వెబ్ సిరీస్.. ఈసారి ఇంకెన్ని వివాదాలో?) సాయికుమార్ మాట్లాడుతూ.. 'నాన్న అమ్మ ఇచ్చిన స్వరం, సంస్కారంతో నేను ఈ స్థాయిలో ఉన్నా. చక్కని కథలతో వైవిధ్యమైన పాత్రలతో నటుడిగా నిలబడ్డా. మనసును కదిలించే కథతో సినిమా రూపొందించారు. ఈ చిత్రంలో ప్రతి సీన్ మనసును కదిలిస్తుంది.' అని అన్నారు. శ్రీనివాస్ సాయి మాట్లాడుతూ..' చక్కని కథాంశంతో ఎమోషన్స్, కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. టీమ్ అంతా కష్టపడ్డాం. చిన్న సినిమానే కావచ్చు కానీ మంచి ప్రయత్నం.' అని అన్నారు. శాంతికుమార్ మాట్లాడుతూ.. 'జబర్దస్త్ కమెడియన్‌గా ప్రేక్షకుల ఆదరణ పొందా. నేను దర్శకత్వం వహించే వరకూ వచ్చానంటే నిర్మాతలే కారణం. కథ అన్ని ఓకే అయ్యాక సీనియర్ ఆర్టిస్ట్ సాయికుమార్ సరే అనగానే నేను సక్సెస్ అయ్యాననిపించింది. అన్ని రకాలుగా సహకరించిన నిర్మాతకు కృతజ్ఞతలు.' అని అన్నారు. కరోనా వల్ల కాస్త ఆలస్యమైనా మంచి సమయంలో విడుదల చేస్తున్నామని ఈ చిత్ర నిర్మాత అన్నారు. ఈ చిత్రంలో సమీర్, సీవీఎల్ నరసింహారావు, గౌతమ్ రాజు, ఎమ్మెస్ చౌదరి, భద్రం, సుమన్ శెట్టి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. (ఇది చదవండి: బిగ్‌బాస్‌లోకి ఇండియన్ స్టార్ క్రికెటర్ .. స్టార్ మా ప్లాన్ ఇదేనా?) -
Anchor Suma: భర్తతో కలిసి లక్ష్మీ పూజలో పాల్గొన్న సుమ (ఫొటోలు)
-
Anchor Suma: భర్తతో కలిసి లక్ష్మీ పూజలో పాల్గొన్న సుమ (ఫొటోలు)
Anchor Suma: భర్తతో కలిసి లక్ష్మీ పూజలో పాల్గొన్న సుమ (ఫొటోలు) -
24 ఏళ్ల బంధం.. ఆన్లైన్లో ఇలా: సుమ కనకాల
తెలుగు బుల్లితెరపై స్టార్ యాంకర్ ఎవరంటే మొదట వినిపించే పేరు సుమ. అంతలా ఫేమ్ సంపాదించుకుంది కేరళ అమ్మాయి. ఇండస్ట్రీలో ఎంతో మంది యాంకర్లు వస్తుంటారు.. పోతుంటారు. కానీ సుమ మాత్రం లోకల్ అన్న విధంగా ఉంటుంది. ఏ ఈవెంట్ అయినా సరే సుమ ఉందంటే ఆ రేంజే వేరు. తెలుగమ్మాయి కాకపోయినా.. తెలుగులో గలగల మాట్లాడడం, సమాయానుకూలంగా పంచ్‌లు వేయడంలో ఆమెకు ఆమె సాటి. నటుడు రాజీవ్ కనకాలను పెళ్లి చేసుకుని హైదరాబాద్‌లోనే స్థిరపడిపోయింది. ఇక టాలీవుడ్లో రాజీవ్ కనకాల గురించి పరిచయం అక్కర్లేదు. ఏ పాత్రలోనైనా మెప్పించడం ఆయనతే సొంతం. ఇక వీరిద్దరి ప్రేమ పెళ్లి సంగతులు అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. పెళ్లయి వీరికి 24 ఏళ్లు పూర్తయింది. వివాహా వార్షికోత్సావాన్ని కాస్త భిన్నంగా సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను సుమ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. అది కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు శుభాకాంక్షలు అంటూ పోస్ట్ పెడుతున్నారు. సుమ షేర్ చేసిన ఆ వీడియో కాల్లో ఇద్దరు పాట పాడుతూ ప్రత్యేక రోజును సెలబ్రేట్ చేసుకున్నారు. నువ్వక్కడ.. నేనిక్కడ.. పాటక్కడ.. పలుకిక్కడ అంటూ సుమ పాట పాడగా.. మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా' అంటూ రాజీవ్ కనకాల పాడుతూ వీడియో కాల్లో కనిపించారు. ఏదేమైనా సుమక్క యాంకరింగే కాదు.. ఇలా వెరైటీగా సెలబ్రేట్ చేసుకుని అందరినీ ఆశ్చర్యానికీ గురి చేసింది. View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) -
యాంకర్ సుమ సంపాదనే ఎక్కువా?: రాజీవ్ కనకాల ఏమన్నాడంటే?
సుమ- రాజీవ్ కనకాల.. ఒకరు బుల్లితెర స్టార్, మరొకరు వెండితెర ప్రముఖ నటుడు. ఏళ్ల తరబడి ఇండస్ట్రీలో రాణిస్తున్న వీరిద్దరూ ఇప్పటికీ చేతినిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే సంపాదన విషయంలో వీరి మధ్య అభిప్రాయబేధాలు వస్తుంటాయని తరచూ కొన్ని పుకార్లు వినిపిస్తూ ఉంటాయి. ఈ రూమర్‌పై స్పందిస్తూ రాజీవ్ కనకాల చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. 'మా మధ్య ఎప్పుడూ అభిప్రాయబేధాలు రాలేవు. సుమ వర్కింగ్ ఉమెన్, సంపాదిస్తుంది. టీవీలో ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఆమెకు ఎక్కువ ఆదాయం వస్తుందని జనాలు అనుకుంటారు. నేను సంపాదించేది నేను సంపాదిస్తాను. సవాలక్ష మంది సవాలక్ష రకాలుగా అనుకుంటారు.. నేను అదేం పట్టించుకోను. ఆమె టీవీలో బిజీ అవకముందు నేను బోలెడన్ని సినిమాలు చేసి సంపాదించిన ప్రాపర్టీలు ఉన్నాయి. అయినా మా మధ్య అలాంటి ప్రస్తావనే రాదు. మీ దృష్టిలో.. నా కంటే సుమ సంపాదన ఎక్కువే' అని చెప్పుకొచ్చాడు రాజీవ్ కనకాల. చదవండి: దమ్ముంటే అడ్డుకో.. తొడకొట్టి సవాల్ విసిరిన శ్రీహాన్ ఓరి దేవుడా దివాలి దావత్ -
ఎన్టీఆర్ డైలాగ్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన: రామ్ అగ్నివేశ్
రామ్ అగ్నివేష్, రేఖ నీరోషా జంటగా వీవీ రుషిక దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇక్షు’. డాక్టర్ గౌతమ్ నాయుడు సమర్పణలో హనుమంతురావు నాయుడు నిర్మించారు. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ మూవీ సక్సెస్ కావడంతో చిత్రబృందం హైదరాబాద్‌లో సెలబ్రేషన్స్ చేసుకుంది. ఇదే బ్యానర్లో మరో సినిమా మొదటి షెడ్యూల్ సందర్భంగా కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. దర్శకురాలు రుషిక మాట్లాడుతూ.. 'ఇక్షు సినిమా తీయడం నా కల. ఈ చిత్రంలో నా కుమారుడు రామ్ అగ్నివేశ్‌ను హీరోగా చూడడం చాలా సంతోషంగా ఉంది. నా మొదటి మూవీ విజయవంతమైనందుకు ఇదే బ్యానర్‌పై మరో సినిమాను ప్రారంభించాం. ఈ చిత్రంలో పాత్రల కోసం అడిషన్స్ ద్వారా కొందరిని ఎంపిక చేశాం.' అని అన్నారు. చిత్ర నిర్మాత హన్మంతరావు నాయుడు మాట్లాడుతూ.. 'ఈ సినిమాకు సపోర్ట్ చేసిన దిల్ రాజు, బసిరెడ్డి, బెక్కెం వేణుగోపాల్, దామోదర్‌కు ధన్యవాదాలు. ఈ సినిమా మేము అనుకున్నంత రీచ్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదే బ్యానర్‌పై మరో చిత్రాన్ని ప్రేక్షకులకు నచ్చేలా తీస్తాం' అని అన్నారు. హీరో రామ్ అగ్నివేశ్ మాట్లాడుతూ.. 'నన్ను గ్లామర్‌గా చూపించమని అమ్మను అడిగితే.. ముందు ఆర్టిస్ట్‌గా నిరూపించుకోవాలన్నారు. ఈ సినిమా నాకు ఎంతో నేర్పించింది. ఇక్షులో నేను చెప్పిన ఎన్టీఆర్ డైలాగ్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఈ క్రెడిట్ రావడానికి కారణం మా అమ్మ, నాన్నలే.' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, కాలకేయ ప్రభాకర్, చిత్రం శ్రీను, చమ్మక్ చంద్ర, రచ్చ రవి, చింటు, రీతు, ఫిదా, కెప్టెన్ చౌదరి ప్రధాన పాత్రల్లో నటించారు. -
యాంకర్ సుమ కొడుకు జోరు, అప్పుడే రెండో సినిమాను కూడా లైన్లో పెట్టేశాడు!
Anchor Suma Son Roshan 2nd Movie With Two Directors: యాంకర్ సుమ, రాజీవ్ కనకాల తనయుడు రోషన్ త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. తమ సొంత నిర్మాణంలో రోషల్ హీరోగా ఓ సినిమా చేయడబోతున్నాడు. ఇప్పటి వరకు అయితే ఈ మూవీ సెట్స్‌పైకి రాకముందే రోషన్ తన రెండో సినిమాను లైన్లో పెట్టినట్టు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. కాగా పై చదువుల కోసం అమెరికా వెళ్లిన రోషన్ ఇటీవల ఇండియా తిరిగి వచ్చాడు. ఇక వచ్చి రాగానే హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు తనని తాను సిద్ధం చేసుకుంటాడు. చదవండి: ఏడో తరగతిలో అలా చేయడం.. అదే తొలిసారి, చివరిసారి: దీపికా పదుకొణె అంతేకాదు కొడుకును ఎప్పుడెప్పుడు సినిమాల్లో తీసుకుద్దామని సుమ, రాజీవ్‌లు కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నారట. ఈ క్రమంలో ఇప్పటికే విజయ్ అనే కొత్త దర్శకుడితో ఓ సినిమా చేస్తున్న రోషన్ ఈ మూవీ ఇంకా స్టార్ట్ కాకుండానే తాజాగా రెండో సినిమాకు చర్చలు జరుపుతున్నట్లు వినికిడి. ఇందుకోసం ఇద్దరు యంగ్ డైరెక్టర్లను తన రెండో సినిమా కోసం లైన్లో పెట్టాడని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు యువ దర్శకుడు విరించి వర్మ దర్శకత్వం వహించగా.. మరో యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథను అందించనున్నాడని సమాచారం. View this post on Instagram A post shared by Suma K (@kanakalasuma) -
'ఆర్ఆర్ఆర్'లో అలరించే కీలక పాత్రధారులు వీరే..
RRR Movie Main Key Characters: ప్రస్తుతం యావత్ భారతదేశం వేయి కళ్లతో ఎదురుచూసిన తరుణం సమీపించింది. ఓటమెరుగని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన భారీ మల్టీస్టారర్ చిత్రం 'రౌద్రం.. రణం.. రుధిరం'. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పవర్ఫుల్ నటనను వీక్షించేందుకు ఇంకా ఒక్క రోజే మిగిలింది. ఎన్నో వాయిదాల అనంతరం ఎట్టకేలకు ఈ శుక్రవారం అంటే మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది ఆర్ఆర్ఆర్. ఈ మూవీలో అల్లూరి సీతారామరాజుగా చెర్రీ, కొమురం భీమ్‌గా తారక్, సీతగా బాలీవుడ్ క్యూట్ బ్యూటీ అలియా భట్ అలరించనున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్లో ఈ ఇద్దరే కాకుండా ఇతర కీలక పాత్రలు కూడా సందడి చేయనున్నాయి. ఆ పాత్రలేంటో చూద్దామా ! 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రంతోనే ఆయన తెలుగు ప్రేక్షకులకు చేరువకానున్నాడు. ఇందులో ఆయనది పవర్ఫుల్ రోల్ అని తెలుస్తోంది. 'యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతటవే వస్తాయ్..', 'నేనంటేనే ఓ పోరాటం' అంటూ తన చుట్టూ ఉన్న ప్రజల కోసం భార్యాబిడ్డల్ని వదిలి యుద్ధభూమిలోకి అడుగు పెట్టిన పోరాటయోధుడిగా అజయ్ దేవగన్ కనిపించనున్నారు. ఈ రోల్‌కు అజయ్ ఎలాంటి రెమ్మ్యునరేషన్ తీసుకోలేదని సమాచారం. అజయ్ దేవగన్‌కు సతీమణిగా సరోజిని పాత్రలో అలరించనుందని స్టార్ హీరోయిన్ శ్రియ సరన్. 'ఛత్రపతి' తర్వాత రాజమౌళి సినిమాలో మళ్లీ కనిపిస్తోంది శ్రియ. భర్త అడుగుజాడల్లో పోరాటంలోకి అడుగుపెట్టిన స్త్రీగా ఆమె పండించిన హావాభావాలు ప్రేక్షకులు భావోద్వేగానికి లోనయ్యేలా ఉన్నాయి. పాన్ ఇండియాగా తెరకెక్కిన ఈ సినిమాలో కోలీవుడ్ నటుడు, డైరెక్టర్ సముద్రఖని నటించారు. ఇందులో ఆయన పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో రామ్‌చరణ్‌కు సన్నిహితుడిగా కనిపించనున్నట్లు ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. బ్రిటీష్ వారికి ఎదురుతిరిగేందుకు చెర్రీ సిద్ధమవుతుండగా 'చాలా ప్రమాదం.. ప్రాణాలు పోతాయిరా..' అని ఆయన ఎమోషనల్‌గా చెప్పిన డైలాగ్ మెప్పించింది. ఇంకా ఈ మూవీలో రాజీవ్ కనకాల నటిస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళికి ఆయనకు మధ్య ఎంతో మంచి స్నేహబంధం ఉంది. జక్కన్న తెరకెక్కించిన ఎన్నో చిత్రాల్లో కీలకపాత్రల్లో నటించారు. ఇప్పుడు చాలా కాలం తర్వాత ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేయనున్నట్లు తెలుస్తోంది. వీళ్లే కాకుండా ఎన్టీఆర్‌కు లవర్‌గా విదేశీ భామ ఒలివీయా మోరీస్ కొన్ని సన్నివేశాల్లో తళుక్కున మెరిసి ఆకట్టుకోనుంది. విలనిజంతో కూడకున్న పాత్రలో ఐరిష్ నటి అలిసన్ డూడీ నటించారు. లేడీ స్కాట్‌గా ఆమె తన విలనిజాన్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు. కమెడియన్, నటుడు రాహుల్ రామకృష్ణ ఈ సినిమాలో ఎన్టీఆర్ వెంట ఉండే వ్యక్తిగా కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. -
సస్పెన్స్ థ్రిల్లర్‌గా 'దళారి' సినిమా
Shakalaka Shankar Dalri Movie First Look Released: ‘షకలక’ శంకర్, రాజీవ్ కనకాల, శ్రీ తేజ్ ప్రధాన పాత్రల్లో గోపాల్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘దళారి’. ఎస్.కె. పిక్చర్స్, ఆకృతి క్రియేషన్స్‌పై సురేష్ కొండేటి, ఎడవెల్లి వెంకట్ రెడ్డి నిర్మిస్తున్నారు. టాకీ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ‘దళారి’ టైటిల్ అనౌన్స్ చేసి, ఫస్ట్ లుక్ విడుదల చేశారు. గోపాల్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘సస్పెన్స్ థ్రిల్లర్, ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన చిత్రమిది’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో మాస్ ఎలిమెంట్స్, సస్పెన్స్, యాక్షన్ అంశాలు ఎక్కువగా ఉంటాయి’’ అని సురేష్ కొండేటి అన్నారు. ‘‘కథ, క్వాలిటీ విషయంలో రాజీపడకుండా ఈ సినిమా చేశాం’’ అన్నారు ఎడవెల్లి వెంకట్ రెడ్డి. ఈ చిత్రానికి కెమెరా: మెంటెం సతీష్, సంగీతం: గౌరహరి. -
రాజీవ్ కనకాలతో షూటింగ్లో పాల్గొన్న సురేష్ కొండేటి
Suresh Kondeti Shares Picture With Rajeev Kanakala In Shooting: తెలుగు సినీ పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు సురేష్ కొండేటి. 1996లో రాంబంటు సినిమాలో తొలిసారి నటుడిగా కనిపించిన ఆయన తనను నటుడిగా పరిచయం చేసిన డైరెక్టర్ బాపు జయంతి రోజున ఓ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు.నటుడు రాజీవ్ కనకాలతో కలిసి షూట్లో పాల్గొన్నారు.ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. ఇక రాంబంటు సినిమా తర్వాత పలు సినిమాల్లో నటించిన ఆయన ఇటీవలె దేవినేని సినిమాలో చేసిన పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది. దాసరి గారు తనకు స్ఫూర్తి అని చెప్పే సురేష్ కొండేటి.. దాసరిలా నటుడు, నిర్మాత, దర్శకుడు, రచయిత, డిస్ట్రిబ్యూటర్ ఇలా అన్ని రంగాల్లో ముద్రవేయాలనేది తన కోరిక అని చెబుతూ ఉంటారు. -
ChaySam Divorce: బాధ కలిగించింది.. చైతు చాలా కూల్: రాజీవ్ కనకాల
Rajeev Kanakala About Chaysam Divorce: టాలీవుడ్లో ప్రస్తుతం ఎక్కడ చూసిన నాగ చైతన్య-సమంతల విడాకుల గురించే టాక్ నడుస్తోంది. నాలుగేళ్ల క్రితం(2017) పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్న చై-సామ్.. టాలీవుడ్లో క్యూట్ కపుల్‌గా గుర్తింపు పొందారు. ఎలాంటి వివాదాలు లేకుండా నాలుగేళ్లుగా కలిసి ఉన్న ఈ ప్రేమ.. ఒక్కసారిగా విడాకులు తీసుకోబోతున్నామని ప్రకటించడంతో చై-సామ్‌ల అభిమానులు షాక్‌కు గురయ్యారు. వాళ్లు ఎందుకు విడిపోయారు? విడాకులకు కారణం ఎవరు? అంటూ మీడియా, సోషల్ మీడియాలో పలు కథనాలు వస్తున్నాయి. ఇక సినీ ప్రముఖులు కూడా చై-సామ్ విడాకులపై స్పందిస్తున్నారు. కొంతమంది సమంతకు మద్దతుగా మాట్లాడితే.. మరికొంతమంది చైతూకి అండగా నిలుస్తున్నారు. ఇక తాజాగా నాగ చైతన్య- సమంత విడాకులపై నటుడు రాజీవ్ కనకాల కూడా స్పందించారు. (చదవండి: అందుకే సమంత దూరం జరిగింది : మాధవీలత) నాగ చైతన్య, సాయి పల్లవి హీరో, హీరోయిన్లుగా రూపొందిన 'లవ్ స్టోరీ' మూవీలో రాజీవ్ నెగెటివ్ పాత్రలో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లవ్ స్టోరీ సక్సెస్, ఆ సినిమా షూటింగ్ తాలూకు విశేషాలను ఓ యూట్యూబ్ చానల్‌కు పంచుకున్న రాజీవ్ కనకాల.. చై-సామ్ విడాకులపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. నాగ చైతన్య- సమంత విడాకుల ఇష్యూ అనేది పూర్తిగా వాళ్ల వ్యక్తిగతం అని, దాని గురించి ఏం మాట్లాడలేం అని చెప్పాడు. అయితే వారిద్దరు విడిపోవడం తనను బాధ కలిగించిందని చెప్పాడు. వాళ్లిద్దరి మధ్య ఏం జరిగిందో మనకు తెలియదు కాబట్టి దాని గురించి మనం మాట్లాడడం సరికాదన్నాడు. రియల్ లైఫ్‌లో మాత్రం నాగ చైతన్య చాలా కూల్ పర్సన్ అని, ఆయన ఎక్కడా విసుగు చెందే మనస్తత్వం కాదని తెలిపాడు. సెట్లో అందరితో సరదాగా ఉంటూ తన పని తాను చెసుకొని వెళ్లేవాడని చెప్పుకొచ్చాడు. -
‘లవ్‌స్టోరీ’ చిత్రం చూసి భర్తపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన యాంకర్ సుమ
Anchor Suma Comments Husband Rajeev Kanakala Over Love Story Movie: ప్రముఖ యాంకర్ సుమ కనకాల ‘లవ్‌స్టోరీ’ మూవీ చూసి ఎమోషనల్ అయ్యింది. ఈ మూవీ చూసిన అనంతరం ఆమె ట్వీట్ చేస్తూ తన భర్త రాజీవ్ కనకాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అంతేగాక ‘లవ్‌స్టోరీ’ మూవీ టీంపై ప్రశంసల వర్షం కురిపించింది. ఈ మేరకు సుమ ట్వీట్ చేస్తూ.. ‘కొందరూ నటులు పాత్రలో లీనమై నటిస్తారు. అసలు ఆ పాత్ర తన కోసమే పుట్టిందా! అన్నట్లు నటిస్తారు. అలాంటి వాళ్లు చాలా అరుదుగా ఉంటారు. నా భర్త రాజీవ్ కూడా అలాంటి అద్భుతమైన నటులలో ఒకరు. అలాంటి ఒక అద్భుతమైన పాత్రలో నటించిన రాజీవ్‌కు శుభాకాంక్షలు. ఈ రోల్ చేయడానికి నువ్వు ఎంత ఇబ్బంది పడ్డావో నాకు తెలుసు. కానీ ఈ పాత్ర ద్వారా నువ్వు ఎంతో మంది జీవితాలను ఇంపాక్ట్ చేశావు’ అంటూ రాసుకొచ్చింది. చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలోకి వచ్చే సినిమాలివే అలాగే ‘లవ్‌స్టోరీ చిత్రంలో ఇలాంటి సెన్సిబుల్ లైన్ తీసుకుని సెన్సీటీవ్గా చూపించిన శేఖర్ కమ్ముల గారికి ధన్యవాదాలు. అలాగే నాగ చైతన్య, సాయి పల్లవిలు చాలా అద్భుతంగా నటించారు. ఈ సినిమాలో సాయి పల్లవి డ్యాన్స్ చూస్తూ నా కళ్లు తిప్పుకోలేక పోయాను, రెప్పలు కొట్టకుండా అలానే చూస్తుండిపోయాను. దీంతో నా కళ్లు అలసిపోయాయి’ అంటూ తనదైన శైలిలో చమత్కరించింది. అలాగే మూవీ టీం మొత్తానికి సుమ శుభాకాంక్షలు తెలిపింది. చదవండి: ‘గాడ్ ఫాదర్’లో తన రోల్ చెప్పెసిన గంగవ్వ, ఏకంగా చిరుకు.. కాగా ఈ చిత్రంలో రాజీవ్ కనకాల తన సొంత అన్న కూతురిని చిన్నప్పుడు లైంగికంగా వేధించిన పాత్రలో నటించాడు. సాధారణంగా ఇలాంటి పాత్ర చేయడానికి ఎవరూ ముందుకు రారు. కానీ డైరెక్టర్ శేఖర్ కమ్ములను నమ్మి ఆయన ఈ పాత్ర చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే లవ్‌స్టోరీ సక్సెస్ మీట్లో రాజీవ్ క్యారెక్టర్‌పై శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. ‘ఇలాంటి పాత్ర చేయడానికి రాజీవ్ ఒప్పుకున్నాడంటే ముందు ఆయన భార్య సుమ కనకాలకు హ్యాట్సాఫ్ చెప్పాలి. మా మూవీకి ఇంతటి ఆదరణ లభించిందంటే దానికి ముఖ్య కారణం రాజీవ్’ అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. There are a very few actors who can make us so deeply involved with their performance and my dearest hubby Rajeev Kanakala @RajeevCo is one among them. Congratulations to you for such a wonderful role, I know you felt bad doing the character but you have impacted many lives (1/3) pic.twitter.com/ucL5mI3t90 — Suma Kanakala (@ItsSumaKanakala) September 30, 2021 -
సుమతో విడిగా ఉన్న మాట నిజమే : రాజీవ్ కనకాల
Rajeev Kanakala About Clashes with Suma: టాలీవుడ్ బెస్ట్ కపుల్స్‌లో సుమ-రాజీవ్ కనకాల కూడా ఒకరు. ఓవైపు యాంకరింగ్‌లో మకుటం లేని మహారాణిలా సుమ చెలామణి అవుతుంటే, నటుడిగా రాజీవ్ కనకాల తమ కెరియర్లో దూసుకుపోతున్నారు. అయితే పాతికేళ్ల వీరి వివాహబంధంలో పొరపాచ్చాలు వచ్చాయని, విడాకులు కూడా తీసుకోబోతున్నారంటూ గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోనే ఉంటూ ఇద్దరూ వేరువేరు ఇళ్లల్లో ఉండటం ఈ రూమర్స్‌కు మరింత బలం చేకూర్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రాజీవ్ కనకాల.. ఈ విషయాలపై క్లారిటీ ఇచ్చారు. 'నిజంగానే కొన్నిరోజులు సుమతో విడిగా ఉండాల్సి వచ్చింది. అమ్మ చనిపోయిన తర్వాత నాన్న దేవదాస్ కనకాల ఒక్కరే మణికొండలోని సొంతింట్లో ఉండేవారు. నాన్నను మా ఫ్లాట్‌కు తీసుకువద్దాం అనుకుంటే ఆయన బుక్ లైబ్రరీ చాలా పెద్దగా ఉండేది. దీంతో అది మా ఫ్లాట్‌లోకి షిఫ్ట్ చేయడం కష్టమయ్యింది. దీంతో నాన్నతో పాటు నేను మణికొండలో ఉండిపోయాను. అంతే తప్పా సుమతో విడిపోయి కాదు. మేమిద్దరం వేరేవేరు ఇళ్లలో ఉండటంతో సుమ-రాజీవ్ కనకాల విడిపోయారు. త్వరలోనే విడాకులు తీసుకుంటారు అంటూ ఏవేవో వార్తలు రాశారు. అందులో ఏమాత్రం నిజం లేదు. మా మధ్య ఎలాంటి సమస్యలు లేవు' అంటూ రాజీవ్ పేర్కొన్నాడు. ఇటీవలె నారప్ప సినిమాలో రాజీవ్ కీలక పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. -
ఎయిర్‌పోర్టులో అభిమానితో సెల్పీ, ఫొటో షేర్ చేసిన రాజీవ్ కనకాల
ప్రస్తుతం లాక్డౌన్లో ఇంటికే పరిమితమైన సెలబ్రెటీలు తమకు సంబంధించిన పాత జ్ఞాపకాలను, చిన్ననాటి ఫొటోలను అభిమానులతో పంచుకుంటున్నారు. అయితే తాజాగా నటుడు రాజీవ్ కనకాలను షేర్ చేసిన ఓ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అది చూసిన నెటిజన్లు ఓ అభిమాని పట్ల ఆయన చూపించిన ఔదార్యానికి ఫిదా అవుతున్నారు. ఓ అభిమానితో సెల్ఫీ తీసుకున్న ఫొటోను తన ట్విటర్లో శుక్రవారం షేర్ చేస్తూ 2018లో ఎయిర్‌పోర్టులో తనకు ఎదురైన అనుభవం గురించి రాజీవ్ వివరించాడు. ‘ఈ వ్యక్తి ఎవరో నాకు తెలియదు. ఇది 2018 నాటి ఫొటో. చెన్నై ఎయిర్ పోర్టులో ఒకసారి నేను నడుచుకుంటూ వెళుతున్నాను. అక్కడే క్లీనింగ్ డిపార్టుమెంటులో పనిచేసే ఓ వ్యక్తి నన్ను చూసి పరుగెత్తుకుంటు వచ్చాడు. అప్పుడు అతని మొహంలో ఉత్సహాన్ని చూశాను. ఆనందంతో అతడి మొహం వెలిగిపోతుంది. ఇక నా దగ్గరికి వచ్చి తన గురించి చెప్పి పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత తన దగ్గర స్మార్ట్ ఫోన్ లేదని నా ఫోన్లోనే సెల్ఫీ తీయమని కోరాడు. నేను తీశాను. ఆ తర్వాత దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేద్దామనుకున్నా కానీ, మరిచిపోయాను. అయితే ఇప్పుడు పోస్టు చేస్తున్నాను. ఆ వ్యక్తికి ఈ పోస్టు చేరి, ఈ ఫొటోను సేవ్ చేసుకుంటాడని ఆశిస్తున్నా’ అంటు రాసుకొచ్చాడు. అయితే సాధారణంగా తమ అభిమాన నటీనటులను చూడగానే అభిమానులు ఉప్పోంగిపోతారు. మరు క్షణం ఆలోచించకుండా వారి దగ్గరకి పరుగులు తీసి సెల్ఫీలు తీసుకుంటారు. అయితే కొన్ని సార్లు సెలబ్రిటీ మూడ్ సరిగా లేకపోతే.. అభిమానులకు చీవాట్లు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అభిమానులకు సెల్పీ ఇచ్చామా వెళ్లిపోయామా అన్నట్టు ఉండే సెలబ్రెట్రీలతో పోల్చితే రాజీవ్ భిన్నమని నిరుపించుకున్నాడు. ‘ఇంతకాలం వరకు కూడా ఓ అభిమాని సెల్పీని మీ ఫోన్లో ఉంచుకున్నారంటే మీరు గ్రేట్ సార్’, ‘మీ ఔదార్యానికి హాట్సాఫ్’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. Iam not aware of this person but, this was in 2018 when I was walking to catch my flight in Chennai Airport. He belongs to the airport staff cleaning department. With lots of excitement on his face, he rushed towards me, introduced himself, pic.twitter.com/rI2ZlveHiI — Rajeev kanakala (@RajeevCo) June 3, 2021 -
భర్త డైలాగ్ చెప్పి ధైర్యం నూరిపోసిన సుమ.. వీడియో వైరల్
యాంకర్ సుమ.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని బుల్లితెర ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తికాదు. టీవీ ఉన్న ప్రతి ఇంటివారికి ఆమె చుట్టమే. దాదాపు రెండు దశాబ్దాలుగా బుల్లితెరపై మకుటం లేని మహారాణిలా ఏలుతోంది. ఎలాంటి షో అయినా, ప్రోగ్రామ్ అయినా సుమ ఉండే చాలు హిట్టయినట్లే. అంతలా ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ని క్రియేట్ చేసుకుంది సుమ. ఇక బుల్లితెరపైనే కాదు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది ఈ యాంకరమ్మ. ఫన్నీ వీడియోలతో పాటు వంట వీడియోలు చేస్తూ తన అభిమానులను ఎంటర్టైన్ చేయడంతో పాటు సలహాలు, సూచనలు కూడా ఇస్తుంటుంది. ఇక కరోనా లాక్డౌన్ వల్ల మరింత ఫ్రీ దొరకడంతో సోషల్ మీడియాలో దూకుడు పెంచేసింది. కరోనా భయంలో అల్లాడుతున్న ప్రజలకు తన వీడియోల ద్వారా ధైర్యాన్ని అందిస్తోంది. ఇప్పటికే పలు వీడియో ద్వారా కరోనా జాగ్రత్తలు చెప్పిన సుమ.. తాజాగా తన భర్త రాజీవ్ కనకాల డైలాగ్ చెప్పి ప్రజలకు ధైర్యాన్ని నూరిపోసింది. నితిన్ హీరోగా నటించిన ‘సై’సినిమాలో కోచ్‌గా రగ్బీ కోచ్‌గా రాజీవ్ కనకాల నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా క్లైమాక్స్‌లో నితిన్ టీమ్ ఓడిపోతుంటే.. రాజీవ్ ఓ భారీ డైలాగ్ చెప్పి వారికి ధైర్యాన్ని అందిస్తాడు. తాజాగా ఆ డైలాగ్‌ని సుమ అచ్చు గుద్దినట్లు చెప్పింది. అందరు ధైర్యంగా ఉండాలి.. ఎప్పుడైతే భయపడతామో మనలోని ఇమ్యూనిటీ శక్తి తగ్గిపోతుంది. భయపడకుండా ఉండాలంటే.. మంచి విషయాలు వినండి, భయపెట్టే వాటిని చూడకండని’ అంటూ ఫ్యాన్స్‌కి సలహా ఇచ్చింది సుమ. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. View this post on Instagram A post shared by Suma K (@kanakalasuma) -
నువ్వే నా బలం.. నా హ్యపీనెస్: సుమ
సుమ కనకాల... ఇండస్ట్రీలో పరిచయం అక్కరలేని పేరు.. బుల్లితెరపై తన వాక్చాతుర్యంతో కొన్ని లక్షల మంది హృదయాలను దోచుకున్నారు. తెలుగులో అనర్గళంగా మాట్లాడుతూ, ఎదుటి వారిపై పంచ్‌లు వేస్తూ కడుపుబ్బా నవ్విస్తుంటారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్కు కేరాఫ్ అడ్రస్ సుమ.. సీరియల్స్, యాంకరింగ్, ఆడియో ఫంక్షన్స్, సినిమాలు.. ఇలా అన్నింటిలోనూ అందె వేసిన చేయి ఆమెది. యాంకరింగ్‌లో కొత్తదనాన్ని తీసుకొచ్చి నేడు స్టార్ యాంకర్‌గా నిలదొక్కుకున్నారు. నేటి తరం యాంకర్లకు ఆదర్శంగా నిలిస్తూ, బుల్లితెరపై రారాణిగా నిలిచారు. సుమ వచ్చిన ఏ షో అయినా సందడిగా మారాల్సిందే.. దర్శకుడు దేవదాస్ కనకాల కుమారుడు అయిన రాజీవ్ కనకాలను సుమ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. నేడు(శుక్రవారం) రాజీవ్ కనకాల పుట్టినరోజు. ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమ, అభిమానుల నుంచి రాజీవ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తన భర్త రాజీవ్‌కు సుమ ప్రత్యేక బర్త్‌డే విషెస్ తెలిపారు. సుమ తన భర్తను ప్రేమగా రాజా అని పిలుచుకుంటారు. ఈ క్రమంలో ‘నా ప్రియమైన రాజాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. నువ్వు నా బలం.. నా హ్యపీనెస్. నీతో జీవితాన్ని పంచుకున్నందుకు సంతోషంగా ఉంది. నీతో ఉండే ప్రతి రోజు కొత్తగా ఉండాలని ఎదురు చూస్తున్నాను. లవ్ యూ.’ అంటూ ట్వీట్ చేశారు. ఇక కేరళ కుట్టి అయిన సుమ రాజీవ్ కనకాలను 1999లో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కొడుకు రోషన్, కుతూరు మనస్వీని ఉన్నారు. My dearest raja a very very very happy birthday to you . You are my strength and happiness, I am blessed to be with you , I look forward to everyday as a new day to be with you . Love uuuuuu , I am in oneness with you my dear #Rajeevkanakala pic.twitter.com/hqoWYfVjBq — Suma Kanakala (@ItsSumaKanakala) November 13, 2020 -
రాజీవ్‌పై సుమ ఎమోషనల్ ట్వీట్.. వైరల్
తెలుగు టెలివిజన్ రంగంలో పెద్దగా పరిచయం అక్కరలేని పేరు యాంకర్ సుమ. తన యాంకరింగ్ టాలెంట్‌తో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. దశాబ్ద కాలంగా తెరపై ఎన్నో సినీ కార్యక్రమాలను, ఈవెంట్స్ చేస్తూ ప్రేక్షకులను అలరించడంలో ఎప్పుడూ ముందుంటారు. తన భర్త రాజీవ్ కనకాల టాలీవుడ్లో పెద్ద నటుడే అయినప్పటికీ తన కంటే ఎక్కువ క్రేజ్ సుమ సొంతం చేసుకుందని చెప్పక తప్పదు. అంతేకాదు ఇండస్ట్రీలో మంచి జోడీగా కూడా వీరిద్దరికి గుర్తింపుఉంది. (షూటింగ్‌లు స్టార్ట్.. యాంకర్స్ సందడి) అయితే ఈ మధ్య కాలంలో సుమ-రాజీవ్ వైవాహిక జీవింత గురించి పెద్ద ఎత్తున రూమర్స్ వినిపించాయి. వారి వివాహ బంధంలో విభేదాలు వచ్చాయని, ఇద్దరూ వేరువేరుగా ఉంటున్నారని పుకార్లు షికారు చేశాయి. అంతేకాదు రాజీవ్ నుంచి సుమ విడాకులు కూడా కోరిందని సోషల్ మీడియా కోడైకూసింది. ఈ వార్తలు టీ టౌన్లో కూడా చర్చనీయాంశంగా మారాయి. అయినా కూడా ఈ జోడీ కనీసం స్పందించకపోవడంతో అంతా నిజమేఅని అనుకున్నారు. ఈ క్రమంలోనే సుమ చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియా రాయుళ్ల ఊహాగానాలను పటాపంచల్ చేసింది. తమపై వస్తున్న వార్తలకు చెక్‌పెడుతూ.. సుమ తన ట్విటర్ ఖాతా ద్వారా రాజీవ్‌పై ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూ ఓ సందేశం ఇచ్చింది. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది. రాజీవ్ కనకాలను ఆప్యాయంగా హత్తుకుని ఎమోషనల్‌గా భావాన్ని చూపించింది. ’నా ప్రియమైన రాజా.. మై లవ్.. ఎప్పటికైనా నువ్వే నా జీవితం, నువ్వే నా ఆనందం’ అంటూ తమ వైవాహిక జీవితం ఎంత బలంగా ఉందో చాటిచెప్పింది. అందమైన జంట అని కొందరు కామెంట్ పెడుతుండగా.. ఇంత అన్యోన్యమైన కపుల్ మధ్య అనవసరమైన రూపర్స్ ఆపండి అంటూ మరికొంతమంది రిప్లే ఇస్తున్నారు. భార్యాభర్తలు అన్నాక వారి మధ్య ఎన్నో సమస్యలు ఉంటాయి. వాటన్నింటినీ సోషల్ మీడియాలో పెద్దవి చేసి చూపించడం సరైనది కాదంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. My dearest raja , my ❤️ , oneness and happiness forever #Rajeevkanakala pic.twitter.com/rxSqffqulm — Suma Kanakala (@ItsSumaKanakala) September 14, 2020 -
సినీనటుడు దేవదాస్ కనకాల మృతి
-
సీనియర్ నటుడు దేవదాస్ కనకాల మృతి
సీనియర్ నటుడు, రాజీవ్ కనకాల తండ్రి దేవదాస్ కనకాల(74) మృతి చెందారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దేవదాస్ కనకాల.. శుక్రవారం మధ్యాహ్నం కన్ను మూశారు. గతేడాది ఫిబ్రవరిలో దేవదాస్ కనకాల భార్య లక్ష్మీ దేవి కనకాల మృతి చెందిన సంగతి తెలిసిందే. పూణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందిన తొలితరం నటుల్లో దేవదాస్ కనకాల ఒకరు. దేవదాస్ కనకాల హైదరాబాద్‌లో యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ను నెలకొల్పి ఈ తరం వారకి నటనలో శిక్షణ ఇస్తున్నారు.చిరంజీవి, రాజేంద్రప్రసాద్, రజనీకాంత్‌తో సహా పలువురు ప్రముఖ నటుల చేత ఒకప్పుడు దేవదాస్ కనకాల నటనలో ఓనమాలు దిద్దించారు. దేవదాస్ కనకాల 1945లో జూలై 30న యానాంలో జన్మించారు. దేవదాస్ స్వగ్రామం యానాం శివారులోని కనకాల పేట. తండ్రి కనకాల తాతయ్య నాయుడు యానాం ఫ్రెంచి పరిపాలనలో ఉన్నప్పుడు యానాం ఎమ్మెల్యేగా పనిచేశారు. తల్లి మహాలక్ష్మమ్మ. దేవదాస్ కనకాలకు ఒక కుమారుడు రాజీవ్ కనకాల, కుమార్తె శ్రీలక్ష్మీ కనకాల ఉన్నారు. రాజీవ్ వివాహం ప్రముఖ టీవీ యాంకర్ సుమతో, శ్రీలక్ష్మీ వివాహం నాటకరంగ ప్రముఖులు డా. పెద్ది రామారావుతో జరిగింది. చలి చీమలు, నాగమల్లి వంటి చిత్రాలకు దేవదాస్ కనకాల దర్శకత్వం వహించారు. ఓ సీత కథ, భలే దంపతులు, మనసంతా నువ్వే, శ్రీరామ్, పెదబాబు, అమ్మో ఒకటో తారీఖు, సిరిసిరి మువ్వ, గోరింటాకు, మంచుపల్లకి, గ్యాంగ్‌లీడర్ వంటి అనేక చిత్రాల్లో దేవదాస్ కనకాల నటించారు. భరత్ అనే నేను ఆయన నటించిన చివరి చిత్రం. రేపు అంత్యక్రియలు దేవదాస్ కనకాల పార్థీవ దేహాన్ని రేపు ఉదయం 8గంటలకు మణికొండలోని ఇంటికి తెసుకెళ్లనున్నారు. ఉదయం 11:30గంటల వరకు అభిమానుల సందర్శనార్థం కనకాల భౌతికకాయాన్ని ఇంటి దగ్గరే ఉంచి, అనంతరం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. -
ఆ రోజున ఆలస్యంగా షూటింగ్‌కు వెళ్తాం
సాక్షి, బంజారాహిల్స్: ప్రజాస్వామ్యం మనకు ఒక గౌరవం, హక్కును కల్పించింది. అలాంటప్పుడు ఆలోచించి ఓటు వేయాలి. ఓటు వేయడం అవసరమా అనే భావన చాలా మందిలో ఉంటుంది. ఆ భావనను విడనాడాలి. ఓటు వేయకుంటే మనల్ని మనం మోసం చేసుకోవడంతో పాటు ఇతరులకు నష్టం చేసిన వారిగా మిగులుతాం. ఓటు అనేది హక్కు, ఆ హక్కును సరైన దారిలో వినియోగించుకోవాలి. గాలి, తిండి ఎలాగో మన భవిష్యత్తును నిర్ణయించే ఓటు కూడా అలాంటిదేనని అనుకోవాలి. నేను, నా భర్త రాజీవ్ తప్పనిసరిగా ప్రతి ఎన్నికల్లోనూ ఓటు హక్కును వినియోగించుకుంటాం. ఆ రోజు షూటింగ్‌లు ఉన్నా రెండు గంటలు ఆలస్యంగా వెళతాం. ఎన్ని పనులున్నా ఓటు వేయనిదే షూటింగ్‌లకు హాజరయ్యే ప్రసక్తే లేదు. 20 ఏళ్ళ క్రితం రాజీవ్ కనకాల ఓటు వేయలేకపోయారు. ఓటు విలువ అప్పుడు అంతగా తెలియకపోవడంతో ఓటు వేయలేకపోయానని ఆ విలువ తెలిసిన తర్వాత తప్పనిసరిగా ఎన్నికల్లో పాల్గొంటున్నానని వెల్లడించారు. మేము జూబ్లీహిల్స్ నియోజక వర్గం పరిధిలో రాజీవ్‌నగర్‌లో ఉంటున్నాం. – సుమ, రాజీవ్ కనకాల జస్ట్ ఫర్ యు ♦ పోలింగ్‌కు 48 గంటల ముందు బహిరంగ సమావేశాలు, పోలింగ్ స్టేషన్లకు వంద మీటర్లలోపు ప్రచారం నిషేధం. ♦ ప్రజల ఇళ్లముందు పికెటింగ్‌లు, ప్రదర్శనల వంటి వాటితో వారి ప్రశాంతతకు భంగం కలిగించరాదు. ♦ భవన యజమానుల అనుమతి లేనిదే పార్టీ జెండాలు, బ్యానర్లు గోడలపై రాతలు వంటివి చేయరాదు. ♦ పార్టీ సమావేశాలకు సంబంధించి సమయం, వేదిక తదితర వివరాలను తగినంత ముందుగా స్థానిక పోలీసులకు తెలియజేయాలి. తద్వారా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా తదితర చర్యలు తీసుకుంటారు. ర్యాలీలు నిర్వహించేప్పుడు బయలు దేరే స్థలం.. ముగిసే స్థలం.. సమయం తెలియజేయాలి. ♦ సభలకు లౌడ్స్పీకర్లు, ఇతరత్రా సదుపాయాలు వినియోగించుకునేందుకు ముందస్తు అనుమతి పొందాలి. -
‘లవర్’ మూవీ రివ్యూ
టైటిల్ : లవర్ జానర్ : రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ తారాగణం : రాజ్ తరుణ్, రిద్ధి కుమార్, రాజీవ్ కనకాల, శరత్ కేడ్కర్, అజయ్ సంగీతం : సాయి కార్తీక్, అంకిత్ తివారి, అర్కో ప్రావో ముఖర్జీ, రిషీ రిచ్, అజయ్ వాస్, తనిష్క్ బాగ్చీ దర్శకత్వం : అనీష్ కృష్ణ నిర్మాత : దిల్ రాజు కెరీర్ స్టార్టింగ్‌లో మంచి ఫాంలో కనిపించిన యంగ్ హీరో రాజ్ తరుణ్ తరువాత గాడి తప్పాడు. వరుస ఫ్లాప్ లతో కెరీర్‌ను కష్టాల్లో పడేసుకున్నాడు. రొటీన్ సినిమాలతో బోర్ కొట్టించిన రాజ్ తరుణ్ తాజాగా లవర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సక్సెస్ ఫుల్ నిర్మాత దిల్ రాజు బ్యానర్లో తెరకెక్కిన ఈ సినిమా అనీష్ కృష్ణ దర్శకుడు. ట్రైలర్ తో రాజ్ తరుణ్‌ను యాక్షన్ హీరోగా పరిచయం చేసే ప్రయత్నం చేసిన మేకర్స్... లవర్‌తో రాజ్ తరుణ్ కమర్షియల్ హీరోగా నిలబెట్టారా...? వరుస పరాజయాలతో కష్టాల్లో ఉన్న ఈ యంగ్ హీరో సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చాడా..? కథ; రాజు (రాజ్ తరుణ్) అనాథ. అనంతపురంలో కస్టమైజ్డ్ మోటర్ బైక్ బిల్డర్‌గా పనిచేస్తుంటాడు. జగ్గు (రాజీవ్ కనకాల)ను తన సొంత అన్న గా భావించి వారి కుటుంబానికి చేదుడు వాదోడుగా ఉంటుంటాడు. ఫ్రెండ్స్ తో కలిసి హ్యాపిగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్న రాజుకు ఓ గొడవ కారణంగా గవర్నమెంట్ హాస్పిటల్లో నర్సుగా పనిచేసే చరిత (రిద్ధి కుమార్) పరిచయం అవుతుంది. ఇద్దరు ప్రేమించుకుంటారు. (సాక్షి రివ్యూస్) హాస్పిటల్ లో ఏ చిన్న తప్పు జరిగిన ఎదిరించి మాట్లాడే చరిత, లక్ష్మీ అనే అమ్మాయిని కాపాడే ప్రయత్నంలో తన ప్రాణం మీదకు తెచ్చుకుంటుంది. చరిత కాపాడాలనుకున్న లక్ష్మీ ఎవరు..? ప్రభుత్వాన్నే గడగడలాండిచే వరదరాజులు (శరత్ కేడ్కర్)కు లక్ష్మీకి సంబంధం ఏంటి..? లక్ష్మీ, చరితలను రాజు ఎలా కాపాడాడు..? అన్నదే మిగతా కథ. నటీనటులు ; ఇన్నాళ్లు లవర్ బాయ్ ఇమేజ్ తో ఆకట్టుకున్న రాజ్ తరుణ్.. లవర్ సినిమాతో మాస్ కమర్షియల్ హీరోగా కనిపించే ప్రయత్నం చేశాడు. యాక్షన్ హీరోగా ప్రూవ్ చేసుకునేందుకు కష్టపడ్డాడు. హీరోయిన్ రిద్ధి కుమార్‌కు తొలి సినిమాలోనే నటనకు ఆస్కారం ఉన్న పాత్ర దక్కింది. తెర మీద అందంగా కనిపించారు. అన్యాయాన్ని ఎదిరించే పాత్రలో చరిత పాత్రలో రిద్ధి కుమార్ మంచి నటన కనబరిచారు. రాజీవ్ కనకాల నటన సినిమాకు ప్లస్ అయ్యింది.(సాక్షి రివ్యూస్) చాలా రోజుల తరువాత ఫుల్ లెంగ్త్ రోల్లో కనిపించిన రాజీవ్ తనదైన ఎమోషనల్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. విలన్స్ గా అజయ్, సుబ్బరాజులు రొటీన్ పాత్రల్లో కనిపించారు. మెయిన్ విలన్‌గా నటించిన శరత్ కేడ్కర్‌ది అతిధి పాత్రే. ఆయన తెర మీద కనిపించేది కేవలం రెండు మూడు సీన్స్‌లోనే. హీరో ఫ్రెండ్స్‌గా సత్యం రాజేష్, ప్రవీణ్, సత్య , రాజాలు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ ; నాలుగేళ్ల విరామం తరువాత దర్శకుడిగా సినమా చేసిన అనీష్ కృష్ణ రొటీన్ కథ కథనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అక్కడక్కడా కాస్త కొత్తదనం కనిపించినా ఎక్కువ భాగం రొటీన్ ప్రేమకథలాగే సాగింది. ఫస్ట్ హాప్ ను కామెడీ, లవ్ స్టోరితో నడిపించిన దర్శకుడు అసలు కథ మొదలు పెట్టడానికి చాలా టైం తీసుకున్నాడు. కామెడీ కూడా ఆశించిన స్థాయిలో లేకపోవటం కాస్త నిరాశపరుస్తుంది. క్లైమాక్స్ కూడా ఆసక్తికరంగా లేదు. ప్రీ క్లైమాక్స్ వరుకు బాగానే ఉన్నా.. క్లైమాక్స్‌ను హడావిడిగా ముగించేసిన ఫీలింగ్ కలుగుతుంది. కార్‌ను హ్యాక్ చేయటం లాంటి అంశాలు ప్రేక్షకులకు అర్థం కావటం కాస్త కష్టమే. (సాక్షి రివ్యూస్)సంగీతం బాగుంది. ఒక్కో పాటకు ఒక్కో సంగీత దర్శకుడు పనిచేయటం కొత్త ప్రయోగమనే చెప్పాలి. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫి మరో ప్లస్ పాయింట్. ఇంటర్వెల్ కు మందు వచ్చే యాక్షన్ సీన్‌తో పాటు కేరళలో జరిగే సీన్స్ లో కెమెరా వర్క్ ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ ; హీరో హీరోయిన్ల నటన సినిమాటోగ్రఫి సాంగ్స్ మైనస్ పాయింట్స్ ; రొటీన్ కథా కథనాలు ఫస్ట్ హాఫ్ సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
ఆదితో జతకట్టనున్న సురభి!
శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఆది సాయికుమార్ హీరోగా శ్రీనివాస నాయుడు నడికట్ల దర్శకత్వంలో ఇటీవల ఓ సినిమా ప్రారంభమైన విషయం తెలిసిందే. చింతలపూడి శ్రీనివాస్ , చావలి రామాంజనేయులు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జులై నుండి ప్రారంభం కానుంది. రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈసినిమాలో ఆది లవర్ బాయ్ గా కనిపించనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాలో ఆది జోడిగా సక్సెస్ఫుల్ హీరోయిన్ సురభి నటించనున్నారు. అరుణ్ చిలువేరు సంగీతమందిస్తున్న ఈ మూవీలో రావు రమేష్, ప్రియా, రాజీవ్ కనకాల ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. -
యాంకర్ సుమకు ‘రైతు బంధు’ చెక్కు
బాలానగర్ (జడ్చర్ల): మండలంలోని హేమాజీపూర్ గ్రామ పాఠశాలను సినీ నటుడు రాజీవ్ కనకాల, యాంకర్ సుమ దంపతులు బుధవారం సందర్శించారు. హేమాజీపూర్ శివార్లలో వారికి వ్యవసాయం పొలం ఉండగా వచ్చారు. ఈ సందర్భంగా వారు గతంలో పాఠశాలలకు ప్రొజెక్టర్, లాప్‌ట్యాప్‌లు బహూకరించగా వాటిని వారు పరిశీలించారు. అనంతరం రాజీవ్–సుమ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కంప్యూటర్ విద్య అందాలనే భావనతో రూ.లక్ష వ్యయంతో వీటిని అందజేశామన్నారు. తెలంగాణలోని గురుకుల పాఠశాలల్లో ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం రూ.లక్షలు వెచ్చిస్తున్నందున ప్రైవేటు పాఠశాలల్లో చేరి ఆర్థికంగా నష్టపోవద్దని సూచించారు. ఈ మేరకు సుమ, రాజీవ్‌తో పలువురు గ్రామస్తులు ఫొటోలు దిగారు. ‘రైతు బంధు’ చెక్కు వెనక్కి.. హేమాజీపూర్ గ్రామ శివారులో తమకు ఉన్న భూమికి సంబంధించి సినీ నటుడు రాజీవ్‌కు ప్రభుత్వం నుంచి తాజాగా రూ.29 వేల విలువైన పెట్టుబడి సాయం చెక్కు అందింది. అయితే, తాను ఆర్థికంగా కొంత మేర స్థిరపడినందున రైతుల సంక్షేమానికి ఉపయోగించేలా చూడాలని కోరుతూ ఆ చెక్కును రాజీవ్ బుధవారం తహసీల్దార్ రాంబాయికి అందజేశారు. కార్యక్రమాల్లో సర్పంచ్ మురళీదర్ రెడ్డి, ఉప సర్పంచ్ రమేష్, కరుణాకర్‌తో పాటుబాలానగర్ రైతు సమన్వయ కన్వీనర్ గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో... జడ్చర్ల టౌన్: జడ్చర్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి బుధవారం రాజీవ్ కనకాల, సుమ దంపతులు వచ్చారు. భూమికి సంబంధించిన లావాదేవీల విషయంలో వారు కార్యాలయానికి చేరుకుని అధికారులతో మాట్లాడారు. -
జడ్చర్లలో రాజీవ్ కనకాల సందడి
జడ్చర్ల : జడ్చర్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సినీనటుడు రాజీవ్ కనకాల బుధవారం కొద్దిసేపు సందడి చేశారు. ఆయన బాలానగర్ మండలంలోని హేమాజీపూర్ గ్రామ శివారులో గల తన సొంత భూమికి సంబందించి బ్యాంకు లోన్ నిమిత్తం తనఖా పెట్టేందుకు కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్బంగా ఆయన స్థానిక సబ్‌రిజిస్ట్రార్ అశోక్‌తో మాట్లాడి నిబందనల మేరకు సంతకాలు చేసి వెళ్లారు. విషయం తెలుసుకున్న కొందరు ఆయనను చూసేందుకు వచ్చారు. మరికొందరు అభిమానులు ఆయనతో సెల్ఫీలు దిగారు. -
ఆమె మృతి తీరని లోటు: చిరంజీవి
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల తల్లి లక్ష్మీదేవి కనకాల(78) మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతాపం ప్రకటించారు. కనకాల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. తాను హైదరాబాద్‌లో లేని కారణంగా లక్ష్మీదేవి కుమారుడు రాజీవ్ కనకాలకు చిరంజీవి ఫోన్ చేసి పరామర్శించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. తెలుగు సినిమాతో ముడిపడి ఉన్న ప్రతి మనసుకి ఇవి బరువైన క్షణాలని చిరంజీవి అన్నారు. ‘పేరు లక్ష్మీదేవి అయినా ఆమె నా పాలిట సరస్వతీ దేవి. ఆమె పాఠాలే నా పాఠవాలకి మూలం. నటనలో ఆమె నేర్పిన మెళకువలే నాలోని నటుడికి మెళకువలు. లక్షలాది కుటుంబాలకి అభిమాన కథానాయకుడిగా ఎంత గర్వపడతానో.. లక్ష్మీదేవిగారి శిష్యుడని చెప్పుకునేందుకు అంత గర్వపడుతున్నాను. ఆమె దూరమవ్వడం తీరని లోటు. నాకే కాదు తెలుగు సినిమాతో ముడిపడి ఉన్న అందరికీ ఇవి బరువైన క్షణాలు. అలా బరువెక్కిన మనసుతో నా చదువులమ్మకి కన్నీటి వీడ్కోలు పలుకుతున్నానని’ రాజీవ్ కనకాల తల్లి లక్ష్మీదేవి గురించి చిరంజీవి షేర్ చేసుకున్నారు. ఈ విషయాలను పీఆర్వో బీఏ రాజు తన ట్వీటర్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. తల్లి లక్ష్మీదేవితో నటుడు రాజీవ్ కనకాల (ఫైల్ ఫోటో) గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న లక్ష్మీదేవి శనివారం ఉదయం స్వగృహంలో తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. లక్ష్మీదేవి భర్త దేవదాస్ కనకాల కూడా నటుడుగా రాణించారు. కనకాల కుటుంబానికి మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ప్రగాఢ సంతాపం తెలియజేసింది. కెరీర్ ప్రారంభంలో మద్రాస్ ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో ఎంతో మంది నటీనటులకు ఆమె శిక్షణ ఇచ్చారు. -
రాజీవ్ కనకాల కుటుంబంలో విషాదం
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన తల్లి లక్ష్మీదేవి(78) కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శనివారం ఉదయం స్వగృహంలో తుది శ్వాస విడిచారు. లక్ష్మీదేవి భర్త దేవదాస్ కనకాల కూడా నటుడు అన్న విషయం తెలిసిందే. కనకాల కుటుంబానికి మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ప్రగాఢ సంతాపం తెలియజేసింది. ఈ మేరకు మా అధ్యక్షుడు శివాజీరాజా, కార్యదర్శి నరేష్‌లు ఓ ప్రకటన విడుదల చేశారు. లక్ష్మీదేవి గురించి... 11 ఏళ్ల వయసులోనే నాటక రంగంలోకి ప్రవేశించిన ఆమె.. నాట్యకారిణిగా, నటిగా కళామతల్లికి సేవలు అందించారు. ప్రారంభంలో మద్రాస్ ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో కళాకారులకు ఉపాధ్యాయురాలిగా ఆమె శిక్షణ ఇచ్చారు. శుభలేఖ సుధాకర్, సుహానిసి పలువురు ఆమె వద్ద శిక్షణ తీసుకున్న వారే. పలు చిత్రాల్లో కూడా ఆమె నటించారు. ప్రేమ బంధంలో జయప్రదకు తల్లిగా ఆమె నటించారు. ఆపై ఒకఊరికథ సినిమాలో అసోసియేట్ గా పనిచేస్తూనే ఒక చిన్నపాత్రలో నటించారు. పోలీస్ లాకప్ సినిమాలో విజయశాంతి అత్త పాత్రలో, కొబ్బరిబోండాం సినిమాలో రాజేంద్రప్రసాద్ తల్లి పాత్రలో నటించారు. 1971లో నటుడు దేవదాస్ కనకాలను ఆమె వివాహం చేసుకున్నారు. ఆమెకు ఓ కొడుకు (రాజీవ్ కనకాల), కుమార్తె(శ్రీలక్ష్మి) ఉన్నారు. కోడలు కనకాల సుమ యాంకర్‌గా పాపులర్. అల్లుడు పెద్ది రామారావు కూడా నాటక రంగ ప్రముఖులు. ఆమె మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. -
శివబాలాజీ ఇంటికి బిగ్‌బాస్!
-
శివబాలాజీ ఇంటికి బిగ్‌బాస్!
సాక్షి, హైదరాబాద్: తెలుగు బుల్లితెరపై సరికొత్త రియాల్టీ షో బిగ్‌బాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యహరించిన ఈషో 70 రోజుల పాటు ప్రేక్షకులను అలరించింది. మొత్తం 14 మందితో మొదలైన తొలిసీజన్ విజేతగా హీరో శివబాలాజీ నిలిచాడు. భారీ మొత్తంలో ప్రైజ్ మనీ గెలుచుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజగా శివబాలాజీ ఇంటికి బిగ్‌బాస్ వచ్చాడు. అంతే కాకుండా టాస్క్ కూడా ఇచ్చి సర్ప్రైజ్ చేశాడు. వివరాల్లోకి వెళ్తే శివబాలాజీ, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రల్లో స్నేహమేరా జీవితం అనే చిత్రం తెరకెక్కింది. ఈచిత్రం ప్రమోషన్లలో భాగంగా బిగ్‌బాస్ వాయిస్‌ను ఉపయోగించుకున్నారు. ఇందులో భాగంగా ఒక ప్రమోషన్ వీడియోని విడుదల చేశారు. అందులో శివబాలాజీ ఇంట్లో కూర్చుని ఉండగా బిగ్‌బాస్ వాయిస్ వినిపిస్తుంది. షో విజేతగా నిలిచినందుకు, స్నేహమేరా జీవితం సినిమా ట్రైలర్ 1మిలియన్ వ్యూస్ దాటినందుకు బిగ్‌బాస్ శుభాకాంక్షలు తెలిపారు. అంతేకుండా ప్రీజ్, రిలీజ్ టాస్క్‌ను కూడా చేయించారు. ప్రేక్షకులకు కూడా ప్రత్యేక టాస్క్ ఇచ్చారు. సినిమా సారాంశాన్ని ఒక్క నిమిషం నిడివి ఉన్న వీడియో తీసి పంపాలి. ఆ వీడియో సినిమా కథకు దగ్గరగా ఉంటే వారికి శివబాలాజీ, రాజీవ్ కనకాలను కలిసే అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించాడు. బిగ్‌బాస్ తన ఇంటికి వచ్చినట్లుగా తీసిన ఈ వీడియోను శివబాలాజీ ఫేస్బుక్లో పోస్టు చేశారు. ఇంక ఎందుకు ఆలస్యం మీరూ ఒక వీడియో తీసి ఓసారి ప్రయత్నించండి. -
రాజీవ్‌తో సరదాగా కాసేపు
-
రాజీవ్ కనకాలకు కళాదర్బార్ ఉగాది పురస్కారం
కొత్తపేట (గుంటూరు): కళాదర్భార్ ఉగాది పురస్కారాలకు నటుడు రాజీవ్ కనకాల, జొన్నవిత్తుల, ఎమ్మేల్యే ఆలపాటి రాజా, నటి ఉషాగాయత్రి, బుల్లితెర నటి అస్మిత, హస్య నటి గీతాసింగ్య ఎంపికయ్యారు. ఈ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు పొత్తూరి రంగారావు బుధవారం ఉగాది పురస్కారాలు వివరాలు విలేకరులకు తెలియజేశారు. విద్యరంగం నుంచి ఎన్ఆర్ఐ విద్యసంస్ధల అధినేత, తెనాలి ఎమ్మేల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్, సాహిత్య రంగం నుంచి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, సినీ రంగం నుంచి నటుడు రాజీవ్ కనకాల, నటి గీతసింగ్, బుల్లి తెర నటి ఆస్మిత, నృత్య రంగం నుంచి మద్ధాళి ఉషా గాయత్రి, వైద్య రంగం నుంచి శంకర కంటి ఆసుపత్రి యాజమాన్యం పెదకాకాని, వ్యవసాయ రంగం నుంచి మంతెన అచ్యుత్ రామరాజు, సామాజిక రంగం నుంచి యర్రం సాంబిరెడ్డి (బాల భారతి )లు ఉగాది పురస్కారాలకు ఎంపిక చేసినట్లు ఆయన వివరించారు. ఈ నెల 22న పురస్కారాలు అందజేస్తామని ఆయన తెలిపారు. -
రిలేషణం : ఆమె నీరు లాంటిది!
ఒక మాటల ప్రవాహాన్ని అక్షరాల్లో బంధించవచ్చా? పరిగెత్తే పాదరసాన్ని పిడికిట్లో పట్టుకోవచ్చా? ఉరకలేసే జలపాతాన్ని అరచేత్తో అడ్డుకోవచ్చా? ఏమో కష్టమే... సుమ కూడా అంతే! ఆమె ఒక ప్రవాహం, ఒక ఉత్సాహం, ఒక విస్మయం. రెండు దశాబ్దాల ఆ సుమ సమ్మోహనంలో పడిపోని, పరవశులవని తెలుగువారు లేరు. బుల్లితెర అవధులు దాటి ఇంటింటా గుబాళించిన ఆ సుమ సౌగంధికా పరిమళాల పయాణంలో కొన్ని జ్ఞాపకాల్ని ఆమె ఆడపడుచు శ్రీలక్ష్మి గుర్తుచేసుకునే ప్రయత్నమే ఈ వారం రిలేషణం. తన గురించి ఎలా మొదలుపెట్టాలి, ఎక్కడ మొదలుపెట్టాలి. మా పరిచయం ఒక సీరియల్ షూటింగ్లో మొదలైంది. కొంతకాలమయ్యాక, అన్నయ్య, సుమ మధ్య స్నేహం మొదలైంది. అలా మా స్నేహం కూడా బలపడింది. అందుకే తనను వదినలా కాకుండా ఫ్రెండ్‌లాగే చూస్తాను. పెళ్లయిన కొత్తలో అన్నయ్య బాగా బిజీగా ఉండేవాడు. దాంతో మేమిద్దరమే షాపింగ్‌కు వెళ్లేవాళ్లం. తనను నా కోసమే పెళ్లి చేసుకున్నావని అన్నయ్యను ఆటపట్టించేదాన్ని. యాంకర్‌గా సుమ గురించి నాకంటే ప్రేక్షకులకే ఎక్కువ తెలుసు. తను అన్ని రకాల క్యారెక్టర్స్ ఎలా చేయగలుగుతుందోనని ఆశ్చర్యపోతాను. ఒక టీవీ ప్రోగ్రామ్‌లో పంచావతారం చేసినప్పుడు అందులో క్రిటిక్రావు పాత్రను చూసి థ్రిల్లయ్యాను. ఎంతో అబ్జర్వేషన్ ఉంటే తప్ప, అలాంటి టిపికల్ పాత్ర చేయడం సాధ్యం కాదు. సాధారణంగా ఫ్యామిలీ ఫ్రెండ్ గెట్ టూ గెదర్ జరిగినప్పుడు, తను అందరినీ అబ్జర్వ్ చేస్తుంది. తను అబ్జర్వేషన్‌లోకి వచ్చిన కొత్త క్యారెక్టర్స్‌ను ఇమిటేట్ చేసి తెగ నవ్విస్తుంది. ఒకసారి మా పాప బర్త్‌డే జరుగుతోంది. అప్పుడు నేను బిజీగా ఉండటంతో, ఏమీ అరేంజ్మెంట్స్ లేకుండా పార్టీ అరేంజ్ చేశాను. పిల్లలు ఒకటే గొడవ చేస్తున్నారు. అప్పుడు తను అందరినీ కూర్చోపెట్టి వరుసగా పది రకాల ఆటలు ఆడించింది. తను ఏదైనా చాలా స్పాంటేనియస్‌గా చేస్తుంది. నా కెరీర్ విషయంలో తను చాలా సపోర్ట్‌గా నిలిచింది. ఒక సినిమా చేస్తుండగా, నాకు కొంచెం దెబ్బలు తగిలాయి. యూనిట్ అంతగా స్పందించలేదు. ఆ సందర్భంలో కొంచెం బాధగా అనిపించి, యాక్టింగ్ కెరీర్ వదిలేద్దామనుకున్నాను. అప్పుడు తనే నాకు మోరల్ సపోర్ట్ ఇచ్చింది. మా కుటుంబానికే కాదు, ఎవరు అవసరంలో ఉన్నా తను ముందుంటుంది. మూడేళ్ల క్రితం ఒకసారి ట్రైన్ ట్రావెల్ చేస్తున్నాం. మేము లోపల కూర్చున్నాం. అంతలో సుమ ఒక భారీ లగేజ్ మోసుకుని వస్తోంది. ఆ లగేజ్ ఎవరిదని అడిగితే, ఒక్క నిమిషం అంటూ ముందుకు వెళ్లి వేరే దగ్గర పెట్టి వచ్చి అప్పుడు చెప్పింది. ఎవరో పెద్దావిడ మోయలేక ఇబ్బంది పడుతుంటే కొంచెం సాయం చేశానని. మేము మా కెరీర్స్‌లో ఎంత బిజీగా ఉన్నా, చాలా సంతోషమేసినప్పుడు, బాధేసినప్పుడు వెంటనే మాట్లాడుకుంటాం. ఇంకా పిల్లల బర్త్‌డే పార్టీలకు కలుస్తుంటాం. ప్రతి చిన్న అకేషన్‌కు కలవడానికి ప్రయత్నిస్తాం. మగాళ్లు బిజీగా ఉంటే అపార్ట్మెంట్లో ఉన్న పిల్లలందరినీ వ్యాన్‌లో వేసుకుని, బయటకు తీసుకెళతాం. ఇంకా తన గురించి నా అబ్జర్వేషన్స్ చెప్పాలంటే, సుమ యాంకరింగ్ మాత్రమే కాకుండా ఇంకా మేనేజ్మెంట్, ఆర్గనైజింగ్ వంటివి బాగా హ్యాండిల్ చేయగలదు. సీఈవో లాంటి పదవిని తను చాలా సులువుగా మేనేజ్ చేయగలదు. ఇంకోమాట, తను క్లాసికల్ సాంగ్స్ కూడా పాడుతుంది. వీణ కూడా నేర్చుకుంది. సింగర్ అయ్యుంటే కూడా తను చాలా బాగా రాణించేది. ఫిజికల్‌గా, మెంటల్‌గా తనను తను యాక్టివ్‌గా ఉంచుకోవడానికి యోగ, ప్రాణాయామం చేస్తుంది. తను నీరు లాంటిది. ఎందులోనైనా, ఎవరితోనైనా చాలా సులువుగా కలిసిపోతుంది. - కె.క్రాంతికుమార్‌రెడ్డి