Valmiki Movie
-
కల్యాణ్ బాబాయికి చూపిస్తా: వరుణ్ తేజ్
సాక్షి, విశాఖ : గద్దలకొండ గణేష్ కథ తనకు నచ్చినా.. ఎన్నో సందేహాలు తలెత్తాయని.. పెదనాన్న చిరంజీవి ధైర్యమిస్తూ వెన్ను తట్టడంతోనే ముందడుగు వేయగలిగానని గద్దలకొండ గణేష్ చిత్రం హీరో వరుణ్ తేజ్ అన్నారు. తన పాత్రకు విశేష ప్రేక్షకాదరణ లభిస్తున్నందుకు ఎంతో సంతోషం కలుగుతోందని ‘సాక్షి’తో మాట్లాడుతూ ఆయన చెప్పారు. అందరికీ ఈ పాత్ర నచ్చుతుందని అనుకున్నా కానీ మరీ ఇంత నచ్చుతుందని మాత్రం అనుకోలేదని చెప్పారు. విజయయాత్రలో భాగంగా నగరానికి వచ్చిన ఆయన ఈ చిత్రం ప్రారంభించడానికి ముందు.. విడుదలైన తర్వాత పరిణామాల గురించి మాట్లాడారు. ‘పెదనాన్న చిరంజీవి ఇచ్చిన ధైర్యంతోనే గద్దల కొండ గణేష్ చిత్రంలో నటించేందుకు ధైర్యంగా ముందడుగు వేశాను. గద్దల కొండ గణేష్ సినిమా స్టోరీ విన్నప్పుడు నాకు తెగ నచ్చింది. అయితే కొందరు సన్నిహితులు మాత్రం వద్దన్నారు. దాంతో తటపటాయించాను. అప్పుడు పెదనాన్న గుర్తుకు వచ్చారు. ఎన్నో సినిమాలు చేసిన అనుభవం, సినిమాలను బాగ జడ్జ్ చేయగలగే అవగాహన ఉన్న ఆయనకు విషయం చెబితే బాగుంటుందనిపించింది. నేను, డైరెక్టర్ హరీష్ శంకర్ వెళ్లి స్టోరీ చెప్పాం. ఆయన థ్రిల్లయ్యారు. స్టోరీ చాలా బాగుందని, మంచి పేరు వస్తుందని చెప్పారు. ఆ ధైర్యంతో ఈ సినిమా తీశాం. సినిమా చూసిన తర్వాత పెదనాన్న మాతో మాట్లాడుతూ, అప్పుడు చెప్పిన కథ కంటే సినిమా చాలా బాగుందని ప్రశంసించారు.’ అని వరుణ్‌తేజ్ చెప్పారు. పెదనాన్న సినిమాలు చేయాలనుకోను చిరంజీవి సినిమాలను చూడాలని ఉంటుంది తప్ప అలా నటించాలని ఉండదని వరుణ్‌తేజ్ అన్నారు. ‘ఆయన సినిమా అంటే ఇష్టం. వాటిని మళ్లీ తీసే సాహసం చేయను. సైరా సినిమా కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నా. కల్యాణ్ బాబాయి కూడా ఆ సినిమా ప్రమోషన్లో ఉన్నారు.’ అని చెప్పారు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు అభినందనలు మరిచిపోలేనివని చెప్పారు. ‘ ఆయన ఈ సినిమా చూసి చాలా బాగా తీశారని మెచ్చుకున్నారు. వెల్లువొచ్చి గోదారమ్మా పాటను ఆయనతోనే విడుదల చేయించినపుపడు కూడా ఆయన మాట్లాడుతూ.. ఈ చిత్రం కచ్చితంగా పెద్ద హిట్ అవుతుందన్నారు.’ అని తెలిపారు. ఇంత పేరు మునుపు లేదు.. గతంలో ఎన్ని సినిమాలు హిట్ అయినా తనకు ఇంత పేరు రాలేదని, ఎక్కడికి వెళ్లినా వరుణ్ అనే పిలిచేవారని వరుణ్‌తేజ్ చెప్పారు. ‘ఈ సినిమా తర్వాత నేను ఎక్కడికి వెళ్లినా గద్దలకొండ గణేష్ అని పిలిస్తున్నారు. ఇది వింటే చాలా గర్వంగా ఉంది. ఈ పాత్ర ప్రేక్షకులను ఇంతలా ఆకర్షిస్తుందని అనుకోలేదు. ఇలాంటి పాత్ర చేయాలని అని ఎప్పటి నుంచో అనుకుంటున్నా కానీ అలాంటి కథ రాలేదు. డైరెక్టర్ హరీష్ శంకర్ కథ చెప్పగానే ఎంతో ఉత్సహం కలిగింది.’ అని చెప్పారు. ‘కథను నిర్థారించాక గణేష్ పాత్ర ఎలా ఉండాలి.., ఎలా ప్రవర్తించాలి అనేదానిపై మూడు నెలల పాటు రోజుకు ఎనిమిది గంటలపైగా డైరెక్టర్, నేను చర్చించుకున్నాం. మా కష్టానికి తగ్గ ఫలితం వచ్చింది.’ అని చెప్పారు. వరుణ్‌తో అన్ని భాషల్లో సినిమా చేస్తా.. తెలుగు సినిమా ఇప్పుడు ఇతర భాషల ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తుందని డైరెక్టర్ హరీష్ శంకర్ అన్నారు. ‘వరుణ్ పర్సనాలిటీ అన్ని భాషాల ప్రేక్షకులను అలరించేలా ఉంటుంది. తర్వలోనే వరుణ్‌తో అన్ని భాషల్లో సినిమా తీసేందుకు కథ సిద్ధం చేస్తా’ అని చెప్పారు. ఈ చిత్రం టైటిల్ మార్చడం గురించి మాట్లాడుతూ.. ‘కథలు రాసే హక్కు మాత్రమే మనకు ఉంది కానీ టైటిల్ పెట్టే హక్కు మనకు లేదు’ అనిపిస్తుందన్నారు. సినిమా పేరు మార్చుకుండా ఉండి ఉంటే ప్రేక్షకులను ఇంకా బాగా ఆకర్షించేదన్నది తన అభిప్రాయమని చెప్పారు. వైజాగ్ అంటే చాలా ఇష్టం ‘నేను నటనను సత్యానంద్ మాస్టర్ వద్ద నేర్చుకున్నా. ఆరు నెలల పాటు సీతమ్మధారలో ఉన్నా. వైజాగ్ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా హైదరాబాద్‌లొ బీచ్ లేకపోవడం వల్ల వైజాగ్ బీచ్ మరీ ఆకర్షిస్తుంది.’ అని వరుణ్ తేజ్ చెప్పారు. తొలిప్రేమ సినిమాను చాలామట్టుకు ఇక్కడే షూట్ చేశామని గుర్తు చేసుకున్నారు. సినిమా ట్రైలర్ చూసి కల్యాణ్ బాబాయి చాలా బాగుందన్నారని, అయితే సినిమా ఇంకా చూపించలేదని చెప్పారు. విజయోత్సవ యాత్ర ముగిశాక వెళ్లి కల్యాణ్ బాబాయికి చూపిస్తానన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఒకటే మాట.. సూపర్ హిట్
‘‘ప్రీమియర్ షోస్ పడినప్పటి నుంచి పాజిటివ్ టాక్ మొదలైంది. ఆనందంతో నిద్రపట్టలేదు. చిరంజీవిగారు, అల్లు అరవింద్‌గారు ఫోన్ చేసి అభినందించారు. ఇది నా ఒక్కడి సక్సెస్ కాదు మా టీమ్‌ది’’ అన్నారు వరుణ్ తేజ్. హరీశ్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా పూజా హెగ్డే, మృణాళిని రవి, అథర్వ ముఖ్య పాత్రధారులుగా రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించిన చిత్రం ‘గద్దలకొండ గణేష్’. శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి మొదటి షో నుండే పాజిటివ్ టాక్ వచ్చిందని చిత్రబృందం తెలిపింది. ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో నాగబాబు, 14 రీల్స్ ప్లస్ అధినేతలు రామ్ ఆచంట, గోపి ఆచంట, వరుణ్ తేజ్, హరీశ్ శంకర్ తదితరులు కేక్ కట్ చేసి సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకున్నారు. ‘‘అందరి నోటా ఒకటే మాట.. సూపర్‌హిట్ అని. వరుణ్ వన్ మేన్ షో అంటున్నారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవిగారు ఫోన్ చేయడంతో మాకు ఇంకా ఎనర్జీ వచ్చింది. కొంతమందైతే నీ కెరీర్ బెస్ట్ వర్క్ అన్నారు. వరుణ్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ కావడం ఆనందం’’ అన్నారు హరీశ్ శంకర్. -
‘గద్దలకొండ గణేష్’ సక్సెస్ మీట్
-
‘గద్దలకొండ గణేష్’ మూవీ రివ్యూ
టైటిల్ : గద్దలకొండ గణేష్ (వాల్మీకి) జానర్ : కామెడీ ఎంటర్టైనర్ తారాగణం : వరుణ్ తేజ్, అథర్వా, పూజా హెగ్డే, మృణాళిని రవి, బ్రహ్మాజి, తణికెళ్ల భరణి తదితరులు సంగీతం : మిక్కీ జే మేయర్ నిర్మాతలు : రామ్ ఆచంట, గోపి ఆచంట దర్శకత్వం : హరీష్ శంకర్ మెగా హీరో వరుణ్ తేజ్ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంటూ.. విభిన్న కథా చిత్రాలను ఎంచుకుంటూ వరుస విజయాలను అందుకుంటున్నాడు. ఈ ఏడాది ఎఫ్2 చిత్రంతో భారీ హిట్టు కొట్టిన వరుణ్.. మరో సక్సెస్ సాధించి ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు ఓ తమిళ రీమేక్‌తో వచ్చాడు. రీమేక్ స్పెషలిస్ట్ హరీష్ శంకర్.. తమిళ సినిమా జిగర్తాండను ఇక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు వాల్మీకిగా మలిచాడు. అయితే చివరి నిమిషంలో కోర్టు ఆదేశాల మేరకు సినిమా పేరును ‘గద్దలకొండ గణేష్’గా మార్చారు. మరి ఈ చిత్రం వరుణ్‌కు మరో విజయాన్ని అందించిందా? లేదా అన్నది చూద్దాం. కథ అభి (అథర్వా) దర్శకుడు కావాలని ప్రయత్నిస్తుంటాడు. రియలిస్టిక్‌గా ఉండేలా సినిమాను తెరకెక్కించేందుకు.. ప్రస్తుతం ఫామ్‌లో ఉన్న గ్యాంగ్‌స్టర్ కోసం వెతుకుంతుంటాడు. ఆ సమయంలో అతనికి గద్దలకొండ గణేష్ (వరుణ్ తేజ్) గురించి తెలుస్తుంది. అతనిపైనే సినిమా తీయాలని ఫిక్స్ అవుతాడు. అయితే అతనికి ఎదురు తిరిగే వారిని, అతని గురించి ఆరా తీసేవారిని గణేష్ చంపుతూ ఉంటాడు. మరి గణేష్‌కు అభి ఎలా దగ్గరయ్యాడు.. అతనితో కలిసి సినిమాను ఎలా తెరకెక్కించాడు.. అందుకోసం అభి పడిన పాట్లు ఏమిటి? ఆ జర్నీలో గద్దలకొండ గణేష్ మారిపోయాడా? అన్నదే మిగతా కథ. నటీనటులు గద్దలకొండ గణేష్ పాత్రలో వరుణ్ తేజ్ జీవించాడు. ఆహార్యం నుంచి భాషపై పట్టువరకు.. ఆ పాత్రకు సరిపోయేట్టు తనను తాను మలుచుకున్నాడు. సినిమా అంతా తన భుజాలపైనే మోశాడు. వన్ మ్యాన్ షోగా స్క్రీన్‌పై నటించాడు. గద్దలకొండ గణేష్‌గా నవ్వించడమే కాదు.. ఏడ్పించేశాడు. నటుడిగా మరో మెట్టు ఎక్కాడని ఈ చిత్రంతో మరోసారి చెప్పొచ్చు. ఇక ముఖ్యంగా అభి పాత్ర గురించి చెప్పుకోవాలి. తమిళ హీరో ఆ క్యారెక్టర్‌ను పోషించడంతో.. తెలుగు ప్రేక్షకులకు అంతగా అంచనాలు ఉండవు. అయితే అథర్వా అభి పాత్రకు చక్కగా సరిపోయాడు. ఇక మున్ముందు కూడా తెలుగు ప్రేక్షకులను పలకరిస్తాడేమో చూడాలి. పూజా హెగ్డే ఉన్నంతలో ఆకట్టుకుంది. శ్రీదేవీ పాత్రలో అందంతో అందర్నీ కట్టిపడేసింది. ఇక మృణాళినీ కూడా పర్వాలేదనిపించింది. తణికెళ్ల భరణికి ఉన్నవి రెండు మూడు సీన్లే అయినా.. కంటతడి పెట్టించాడు. బ్రహ్మాజీ, సత్య, ఫిష్ వెంకట్, శత్రు ఇలా మిగతా పాత్రధారులు తమ పరిధి మేరకు నటించారు. విశ్లేషణ సినిమాకు కథే ముఖ్యం. ఇదే విషయం వాల్మీకితో మరోసారి రుజువైంది. అయితే ఈ కథ ఇక్కడ పుట్టింది కాదు. తమిళ నాట సూపర్ హిట్‌గా నిలిచిన జిగర్తాండ చిత్రానిది ఈ కథ. టైటిల్ క్రెడిట్స్‌లో కథా రచయిత కార్తీక్ సుబ్బరాజు వేయడంతోనే ఈ కథకు ఉన్న ప్రాముఖ్యత ఏంటో తెలుస్తోంది. అక్కడి ప్రేక్షకులకు ‘జిగర్తాండ’ నచ్చినట్టే.. ఇక్కడి ప్రేక్షకులకు ‘గద్దలకొండ గణేష్’ నచ్చుతుంది. మన తెలుగు ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టు తీయడంలో హరీష్ శంకర్ సక్సెస్ అయ్యాడనే చెప్పవచ్చు. అయితే అక్కడ బాబీ సింహా పోషించిన పాత్రను.. ఇక్కడ వరుణ్‌తేజ్ పోషించడంతో కథలో కొన్ని మార్పులు చేయాల్సి వచ్చింది. తెలుగులో వరుణ్‌కు ఉన్న ఇమేజ్ దృష్ట్యా ఆ మార్పులూ అనివార్యమే. అక్కడ బాబీ సింహా పాత్ర జోకర్లా మార్చేసినట్టు కనిపిస్తోంది. అయితే ఇక్కడ మాత్రం వరుణ్ పాత్రను హైలెట్ చేశారు. గద్దలకొండ గణేష్ హీరోగా తీసిన ‘సీటీమార్’ సినిమాను జనమంతా పగలబడి నవ్వుతున్నారు? కానీ ఎందుకు అని వాల్మీకి చూసిన సగటు ప్రేక్షకుడికి తెలియదు. గద్దలకొండ గణేష్ బయోపిక్‌గా తెరకెక్కిస్తే అది గొడవలతో నిండి ఉండాలి కానీ.. కామెడీ ఎంటర్టైనర్ ఎలా అయిందనే అనుమానాలు రాక మానవు. ఇవే హరీష్ శంకర్ వదిలేసిన సన్నివేశాలు. ఇక్కడే ఇంకాస్త ఆలోచిస్తే.. సినిమాలో ఇంకా వినోదాన్ని పెంచే అవకాశం ఉండేది. అయితే తమిళ సినిమాను చూసిన ప్రేక్షకులకు మాత్రమే అలాంటి ఫీలింగ్ కలిగే అవకాశముంది. అయితే సినిమాను ఆద్యంతం వినోదభరితంగా తెరకెక్కించిన హరీష్.. ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నట్లే కనిపిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి తర్వాత చెప్పుకోవల్సింది మిక్కీ జే మేయర్. పాటలే కాదు.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. గద్దలకొండ గణేష్ పాత్ర అంతగా పండిందంటే.. మిక్కీ అందించిన నేపథ్య సంగీతం కూడా అందుకు ఓ కారణం. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ కథ వరుణ్ తేజ్ సంగీతం మైనస్ పాయింట్స్ కథలో చేసిన మార్పులు నిడివి బండ కళ్యాణ్, సాక్షి వెబ్ డెస్క్. -
గద్దలకొండ గణేశ్
వరుణ్ తేజ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వాల్మీకి’. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై గోపీ ఆచంట, రామ్ ఆచంట నిర్మించారు. పూజా హెగ్డే, అథర్వ మురళి ముఖ్య పాత్రల్లో నటించారు. నేడు ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమా టైటిల్ (వాల్మీకి) మార్చమంటూ బోయ హక్కుల పోరాట సమితి హైకోర్టులో పిటీషన్ వేసింది. దాంతో చిత్రబృందానికి హైకోర్ట్ నోటీసులు పంపింది. నోటీసులకు వివరణ ఇచ్చిన చిత్రబృందం, టైటిల్‌ను మారుస్తామని హైకోర్టుకి తెలియజేసింది. ‘వాల్మీకి’ టైటిల్‌ను ‘గద్దలకొండ గణేశ్’గా మారుస్తున్నట్టు చిత్రబృందం వెల్లడించింది. ఈ సినిమాలో గద్దలకొండ గణేశ్ పాత్రలో వరుణ్ తేజ్ నటించారు. తమిళ ‘జిగర్తండా’ సినిమాకు ఇది రీమేక్. -
వాల్మీకి కాదు... ‘గద్దలకొండ గణేష్’
సాక్షి, అనంతపురం, కర్నూలు : మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన వాల్మీకి సినిమా ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే వాల్మీకి సినిమా మార్చాలంటూ పెద్ద ఎత్తున అభ్యంతరాలు రావడంతో ....శాంతిభద్రతల దృష్ట్యా అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఈ సినిమా విడుదలను ఆపేయాలంటూ కలెక్టర్లు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ‘గద్దలకొండ గణేష్’ గా వస్తున్న వరుణ్ తేజ్ అయితే వాల్మీకి సినిమా టైటిల్ వివాదం ఓ కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తోంది. సినిమా పేరు మార్చాలంటూ... వాల్మీకి, బోయ సామాజక వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ’వాల్మీకి’ చిత్ర బృందం వెనక్కి తగ్గింది. సినిమా టైటిల్‌పై వివాదానికి సంబంధించి చిత్ర యూనిట్ గురువారం హైకోర్టుకు వివరణ ఇచ్చింది. కాగా వాల్మీకి సినిమా పేరును ప్రకటించిన దగ్గర నుంచి టైటిల్ మార్చాలంటూ బోయ కులస్తులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. సినిమా టైటిల్ తమను కించపరిచే విధంగా ఉందని, వాల్మీకి పేరును మార్చాలంటూ బోయ హక్కుల పోరాట సమితి హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటీషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం డీజీపీ, సెన్సార్ బోర్డు, ఫిలిం ఛాంబర్లతో పాటు హీరో వరుణ్ తేజ్‌కు, చిత్రయూనిట్‌కు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన న్యాయస్థానం తదుపరి విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. నోటీసులపై స్పందించిన చిత్ర యూనిట్.. వాల్మీకి టైటిల్ మారుస్తున్నామని గురువారం హైకోర్టు తెలిపింది. అంతేకాకుండా సినిమా టైటిల్‌ను ‘గద్దలకొండ గణేష్’గా మార్చుతున్నట్లు పేర్కొంది. దీంతో శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ‘వాల్మీకి’ చిత్ర వివాదానికి లైన్ క్లియర్ అయినట్లే. కాగా అనంతపురం జిల్లాలో అత్యధిక సంఖ్యలో నివసిస్తున్న వాల్మీకి, బోయ సామాజిక వర్గాలు, సంఘాలు.... ‘వాల్మీకి’ సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న విషయం విదితమే. మరోవైపు కర్నూలు జిల్లా సినిమా విడుదలను నిలిపివేయాలని కలెక్టర్ వీరపాండియన్ ఆదేశాలు జారీ చేశారు. వాల్మీక, బోయ సామాజిక వర్గాల అభ్యర్థన నేపథ్యంలో జిల్లాలో అన్ని సినిమి థియేటర్లలో వాల్మీకి సినిమా నిలిపివేయాలంటూ రాష్ట్ర కార్మిక,ఉపాధి శిక్షణ,మరియు కర్మాగారాలు శాఖ మంత్రి జయరాములు గురువారం జిల్లా కలెక్టర్, ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు. ఈ మేరకు కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. చిత్ర యూనిట్ తాజా నిర్ణయంతో రెండు జిల్లాల్లోనూ సినిమా విడుదల కానుంది. వాల్మీకి టైటిల్ మార్చాలని మంత్రి లేఖ అలాగే వాల్మీకి సినిమా టైటిల్ మార్చాలంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక,ఉపాధి శిక్షణ, కర్మాగారాలు శాఖ మంత్రి గుమ్మనూరు జయరాములు కేంద్ర సమాచారశాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్, సెన్సార్ బోర్డుకు లేఖ రాశారు. ‘వాల్మీకి సినిమా ప్రారంభం నుంచి వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా వాల్మీకి కులస్తులతో పాటు హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా సినిమా పేరు ఉందని నా దృష్టికి వచ్చింది. వెంటనే సినిమా టైటిల్ మార్చాలని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్‌తో పాటు ప్రాంతీయ సెన్సార్ అధికారి రాజశేఖర్‌కు లేఖలు రాశాము’ అని తెలిపారు. -
ఇప్పుడు విలన్‌గా ఎందుకు అన్నారు : వరుణ్
ఓసారి చిరంజీవిగారి బయోపిక్ తీయాలనే ఆలోచన ఉందని హరీశ్‌గారు అన్నారు. అయితే నాతో తీస్తాననలేదు. చరణ్ అన్న చేస్తేనే బాగుంటుంది. చరణ్ అన్న చేయకపోతే నేను ట్రై చేస్తా. హైట్‌ని సీజీలో కవర్ చేస్తా (నవ్వుతూ). అయితే బయోపిక్ గురించి హరీశ్ సీరియస్‌గా అన్నారా? లేదా అనే విషయాన్ని చెప్పలేను. చిరంజీవిగారిని తను లవ్ చేసినంతగా వేరే ఎవరూ చేయలేరని హరీశ్ ఉద్దేశం. ‘‘ఆర్టిస్టుకు హద్దులు ఉండకూడదని నమ్ము తాను. ఏ పాత్రైనా చేయగలగాలి. రేపు నేను ఏదైనా డిఫరెంట్ పాత్ర చేసినప్పుడు వరుణ్ ఏంటీ ఇలా అని ఆడియన్స్ షాక్ అవ్వకూడదు. ఒక బౌండరీలోనే ఉండాలనుకోవడంలేదు’’ అన్నారు వరుణ్ తేజ్. హరీశ్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్, అథర్వ, పూజా హెగ్డే, మృణాళిని ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘వాల్మీకి’. తమిళ చిత్రం ‘జిగర్తాండ’కు ఇది రీమేక్. 14రీల్స్ ప్లస్‌పై గోపీ ఆచంట, రామ్ ఆచంట నిర్మించిన ఈ సినిమా రేపు రిలీజ్ కానున్న సందర్భంగా వరుణ్ చెప్పిన విశేషాలు. ‘ఫిదా’, ‘తొలిప్రేమ’, ‘ఎఫ్ 2’ (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్) చిత్రాల తర్వాత చాలా ప్రేమకథలు విన్నాను. ఆ సమయంలో దర్శకుడు హరీశ్ శంకర్ ‘దాగుడు మూతలు’ కథ చెప్పారు. ‘ప్రస్తుతం నేను ప్రేమ కథ చేయాలనుకోవడం లేదు. మీ సై్టల్ ఆఫ్ మూవీ ఏదైనా ఉందా?’ అని అడిగాను. అప్పుడు తమిళ మూవీ ‘జిగర్తాండ’ చూశావా? అని అడిగారు. చూశానంటే మళ్లీ చూడమన్నారు. అలా ‘వాల్మీకి’ మొదలైంది. హీరో మంచివాడిగానే ఎందుకు ఉండాలి? ఓ బ్యాడ్‌బాయ్‌గా ఎందుకు ఉండకూడదు? అని నేను ఆలోచిస్తున్న సమయంలో హరీశ్ వాల్మీకి కథ చెప్పారు. ఈ సినిమా చేస్తున్నాను అనగానే చాలా మంది ‘ఇప్పుడు విలన్‌గా ఎందుకు?’ అన్నారు. దాంతో ఈ స్క్రిప్ట్‌ను చిరంజీవిగారి దగ్గరకు తీసుకువెళ్లాను. ఆయన హీరోనా? విలనా? అని అడగలేదు. కథ బాగుంది. సినిమా చెయ్యి అన్నారు. హరీశ్‌ని పిలిచి కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు. వాటిని మేం పాటించాం. ఈ సినిమాలో నేను గద్దలకొండ గణేశ్ పాత్ర చేశాను. ‘పునాదిరాళ్లు’ సినిమాలో చిరంజీవిగారిది ఓ స్టిల్ ఉంటుంది. ఆ స్టిల్‌ను రిఫరెన్స్‌గా తీసుకుని గణేశ్ లుక్‌ని రెడీ చేసుకున్నాం. ఆ స్టిల్‌ను చిరంజీవిగారికి కూడా పంపాం. మంచిగా ఉండే గణేశ్ ఎందుకు క్రూరంగా మారాడు? అనే అంశాలను చెప్పడానికి ఓ బ్యాక్‌స్టోరీ యాడ్ చేశాం. ఈ పార్ట్‌లోనే పూజా హెగ్డే వస్తారు. ఈ బ్యాక్‌స్టోరీ ‘జిగర్తాండ’లో లేదు. ఇంకొన్ని మార్పులు కూడా చేశాం. ‘ఎఫ్ 2’లో నేను డీసెంట్ తెలంగాణ యాస పలికాను. కానీ ‘వాల్మీకి’లో నేను చెప్పిన తెలంగాణ యాస డైలాగ్స్ మాసీగా ఉంటాయి. గణేశ్ పాత్రను బాగా ఎంజాయ్ చేశాను. హరీశ్‌గారు మంచి డైలాగ్స్ రాశారు. పూజా హెగ్డేతో నాలుగేళ్ల తర్వాత కలిసి నటించాను. పూజా పాత్ర కాస్త తక్కువగా ఉన్నప్పటికీ తనది ముఖ్యమైన పాత్ర. 14రీల్స్ ప్లస్ బ్యానర్ తొలి సినిమాలో హీరోగా నటించడం హ్యాపీ. ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్. పని విషయంలో హారీశ్ మాత్రమే కాదు.. నేను కూడా చాలా ఫాస్ట్. మాట్లాడటమే కాస్త నెమ్మదిగా మాట్లాడతాను. పనిలో స్పీడ్ ఉంటుంది. డైరెక్టర్‌కు స్పీడ్ ఉన్నప్పుడు మనం కూడా స్పీడ్‌గా వెళ్లాలనిపిస్తుంది. హారీశ్గారిలో మంచి ఎనర్జీ ఉంది. ‘ఎల్లువొచ్చి గోదారమ్మ’ సాంగ్ రీమిక్స్ రెస్పాన్స్ విషయంలో నేను కాస్త టెన్షన్ పడ్డాను. కానీ చేసేప్పుడు పెద్దగా టెన్షన్ పడలేదు. మిక్కీ జె. మేయర్, హరీశ్, మా కాస్ట్యూమ్ టీమ్ జాగ్రత్తలు తీసుకుని నా టెన్షన్‌ను తగ్గించారు. నేను జస్ట్ డ్యాన్స్ చేశాను. పాటను విడుదల చేసిన తర్వాత వస్తోన్న స్పందనకు ఫుల్ హ్యాపీ. ‘జిగర్తాండ’ కల్ట్ మూవీ. ఈ సినిమాలో నటనకుగాను బాబీ సింహాకు జాతీయ అవార్డు వచ్చింది. రీమేక్‌లో తన పాత్రని నేను చేశాను. కానీ నా సై్టల్లో గద్దలకొండ గణేశ్ పాత్ర చేశా. ఆల్రెడీ తమిళ సినిమా ‘జిగర్తాండ’ చూసిన వారికి మా ‘వాల్మీకి’ నచ్చుతుందా? లేదా అని చెప్పలేను. కానీ మంచి ఎంటర్టైనర్. ఒక సినిమాను ఎక్కువమందికి చేరువ కావాలనే రీమేక్ చేస్తాం. అలానే ‘వాల్మీకి’ సినిమా చేశాం. కొన్ని సినిమాలకు బడ్జెట్ కావాలి. బడ్జెట్ పరిమితుల వల్ల ‘అంతరిక్షం’ సినిమా విషయంలో కొన్ని అంశాలకు సంబంధించి రాజీ పడాల్సి వచ్చింది. అనుకున్నది రీచ్ కాలేకపోతున్నామా? అనే సందేహం షూటింగ్ సమయంలోనే వచ్చింది. ఆ సినిమాలో నేను వేసుకున్న స్పేస్ సూట్‌ని నా ఆఫీస్ ఎంట్రన్స్‌లో పెట్టుకున్నా. నా తప్పులను తెలుసుకోవడానికి. నెక్ట్స్ టైమ్ ఎవరైనా కథ చెప్పడానికి వచ్చినప్పుడు ఆ సూట్‌ను చూసుకుని ఓసారి లొపలికి వెళ్తాను (నవ్వుతూ). కానీ ‘అంతరిక్షం’లాంటి ప్రయోగాత్మక సినిమాలను ప్రయత్నించడం ఆపను. ఒక సక్సెస్ వచ్చి నా మార్కెట్ పెరిగిందంటే డబ్బులు గరించి ఆలోచించను. మార్కెట్ పెరిగితే ఏదైనా కొత్తగా ప్రయత్నించే అవకాశం ఉంటుంది కదా అని అనుకుంటాను. కాస్త రిలాక్డ్స్‌గా సినిమాలు చేయడానికి కావాల్సిన సమయం, వయసు నాకు ఉన్నాయి. నా తొలి సినిమా ‘ముకుంద’ అప్పుడుసెట్లో చాలామంది ఉన్నారని సిగ్గుతో కెమెరా ముందుకు రావడానికి ఇబ్బందిపడేవాణ్ణి. కానీ ఇప్పుడు అలా కాదు. చాలా కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను. ‘సైరా’ ట్రైలర్‌ని రిలీజ్‌కి ముందు చూడలేదు. మంగళవారం రాత్రి చరణ్ అన్నను కలిసినప్పుడు చూద్దాం అనుకున్నాను. కానీ మర్చిపోయాను. బుధవారం చూశాను. చిరంజీవిగారు ఏ సినిమా చేసినా చూస్తా. నా సినిమా ఉన్నా.. నేను చిరంజీవిగారి సినిమాకే వెళ్తాను. ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి సినిమాలో బాక్సర్‌గా నటిస్తున్నాను. సాగర్ చంద్ర దర్శకత్వంలో నేను చేయాల్సిన సినిమా ప్రస్తుతం హోల్డ్‌లో ఉంది. చేస్తామా? చేయమా? అని ఇప్పుడే చెప్పలేను. వెంకటేశ్‌గారిని రెగ్యులర్‌గా కలుస్తుంటా. ‘ఎఫ్ 3’ ఉండొచ్చు. -
ముప్పైఏడేళ్లు వెనక్కి వెళ్లాను
‘‘ఉండ్రాజవరంలోని నా స్నేహితుని ఇంట్లో మడత మంచం మీద పడుకొని పాట ఎలా తీయాలి అని సీరియస్‌గా ఆలోచిస్తున్నాను. సెకనుకోసారి ఠంగ్, ఠంగ్ అని మోత వినిపించడంతో అతన్ని ‘ఏంటి’ అని అడిగాను. ఈ ఊళ్లో బిందెలు తయారు చేస్తారు అని చెప్పాడు. అంతే... పాట ఎలా తీయాలో ఐడియా తట్టింది’’ అని దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు అన్నారు. వరుణ్ తేజ్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘వాల్మీకి’. 14రీల్స్ ప్లస్ పతాకంపై హరీశ్ శంకర్ దర్శకత్వంలో గోపీ అచంట, రామ్ ఆచంట నిర్మించారు. ఈ శుక్రవారం సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా కోసం రీమిక్స్ చేసిన ‘దేవత’ చిత్రంలోని శోభన్‌బాబు, శ్రీదేవిల ‘ఎల్లువొచ్చి గోదారమ్మ..’ పాటను మంగళవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న ‘దేవత’ సినిమా దర్శకుడు కె. రాఘవేంద్ర రావు మాట్లాడుతూ– ‘‘ఈ పాటకు ఇంత కీర్తి ప్రతిష్టలు రావటానికి కారణం అయిన ముగ్గురికి కృతజ్ఞతలు చెప్పాలి. వారు ముఖ్యంగా చిత్రనిర్మాత డి. రామానాయుడు, స్వరకర్త చక్రవర్తి, పాట రాసిన వేటూరి గారు. ఇప్పుడు ఈ పాటను చూపించిన టీమ్ అందరూ నన్ను 37 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారు. ఆ రోజు నాకు బాగా గుర్తు. ‘మీరు చేసిన బిందెల మధ్యలో శోభన్‌బాబు, శ్రీదేవి ఉంటారు... చాలా బిందెలు అవసరం అవుతాయి. అవి వాడుకొని మళ్లీ ఇచ్చేస్తాం’ అని చెప్పాను. బిందెలు తయారు చేసే ఆయన 1000 బిందెలను చేసి ఇచ్చారు. మనం ఈ రోజుకీ ఈ పాటను చెప్పుకుంటున్నాం అంటే ఎందరో చేసిన కృషి ఫలితమే ఇది. నేను నిర్మాత బావుండాలని కోరుకునే దర్శకుడిని. ఇన్ని బిందెల్లో పూజా హెగ్డే నడుము మీద పెట్టుకున్న బిందె నాకు ఇస్తే తీసుకెళ్తాను (నవ్వుతూ). నేను పూజను చూసిన మొదటిరోజే చెప్పాను. ఈ అమ్మాయి నంబర్‌వన్ హీరోయిన్ అవుతుందని. వరుణ్ గురించి చెప్పేదేముంది. ఆల్రెడీ పెద్ద హీరో అయ్యాడు. ఇప్పుడు నేను హీరోయిన్ పూజని ఏ పండుతో కొడతాను అంటే చెర్రీ పండుతో ఆమె నడుము మీద కొడతాను’’ అని చమత్కరించారు. హరీశ్ శంకర్ మాట్లాడుతూ– ‘‘నా ఏడెనిమిదేళ్ల కల ఇది. 2019లో బిందెలతో పాట చేస్తే ఎలా ఉంటుంది? అనుకున్నాను. యానంలో ఈ పాట షూట్ స్టార్ట్ చెయ్యగానే నాకు కళ్ల వెంట నీళ్లు వచ్చాయి. శ్రీదేవిగారు చేసిన ఈ పాటలో పూజాని తప్ప ఎవరినీ ఊహించలేను. వరుణ్ చాలా బాగా డాన్స్ చేశాడు. నేను నిర్మాతలను 500 బిందెలడిగితే వాళ్లు నాకు 1500 బిందెలను ఇచ్చారు. ఇది వేటూరిగారు రాసిన పాట. ఈ పాట తీయటం రాఘవేంద్ర రావు లాంటి గురువుగారికి శిష్యుడు ఇస్తున్న పువ్వు ఇది. వేటూరిగారి లిరిక్స్‌ని వాడుకున్నందుకు ఆయన కుమారుడు వేటూరి రవిగారికి రెమ్యునరేషన్ ఇవ్వటం నా అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు. వరుణ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘నేను స్వతహాగా పాటలు, డాన్సులకు అంత కంఫర్ట్ కాదు. కానీ ఈ చిత్రంలో రీమిక్స్ సాంగ్ అనగానే చిరంజీవి గారిదో, పవన్ గారి పాటో ఉంటుంది అనుకున్నాను. కానీ, శోభన్‌బాబు గారి పాట అనగానే చాలా ఎగై్జట్ అయ్యాను. ఇంత బాగా రీక్రియేట్ చేస్తారనుకోలేదు. నేను బాలుగారి పాటలకు వీరాభిమానిని’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు గోపి అచంట, రామ్ ఆచంట, పూజా హెగ్డే, మిక్కీ. జె. మేయర్, అవినాష్, శేఖర్ మాస్టర్, గౌరినాయుడు తదితరులు పాల్గొన్నారు. -
నా దృష్టిలో అన్నీ రీమేక్ సినిమాలే
‘‘దాగుడుమూతలు’ అనే సినిమా తీయాలని కొన్ని నెలలు ప్రయత్నించాను. కుదర్లేదు. అప్పుడు రజనీకాంత్‌గారితో కార్తీక్ సుబ్బరాజ్ చేస్తున్న ‘పేటా’ ఫస్ట్ లుక్ వచ్చింది. అంతకుముందు కార్తీక్ తీసిన ‘జిగర్తండా’ను చూశాను. ‘పేటా’ లుక్ వచ్చాక మళ్లీ చూశాను. ఈ సినిమా రీమేక్ చేస్తే బావుంటుంది అనిపించింది. అలా ‘వాల్మీకి’ సినిమా స్టార్ట్ అయింది’’ అన్నారు దర్శకుడు హరీశ్ శంకర్. వరుణ్ తేజ్, పూజా హెగ్డే, అథర్వ మురళి, మృణాళిని రవి ముఖ్య పాత్రల్లో హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వాల్మీకి’. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై గోపీ ఆచంట, రామ్ ఆచంట నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం రిలీజ్ కానున్న సందర్భంగా హరీశ్ శంకర్ చెప్పిన విశేషాలు. ► ‘దాగుడుమూతలు’ సినిమాలో ఒక పాత్ర కోసం వరుణ్ తేజ్‌ని కలిశాను. ‘నాతో ఎందుకు చేయాలనుకుంటున్నారు?’ అని అడిగాడు. ‘ఫిదా, తొలి ప్రేమ’ వంటి సినిమాలు చేస్తున్నావు కదా. ఈ పాత్రకు బావుంటావనిపించింది’ అన్నాను. ‘నేను మీ స్టయిల్ సినిమా చేయాలనుకుంటున్నాను. అలాంటి సినిమా చేద్దాం’ అన్నాడు వరుణ్. ఆ తర్వాత ‘జిగర్తండా’ రీమేక్ ఉంది, నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అనగానే వరుణ్ ఆసక్తి చూపించాడు. ఈ సినిమాను చాలా డెడికేషన్‌తో చేశాడు వరుణ్. సెట్లో సీన్ పేపర్ పట్టుకొని చిన్నపిల్లాడు నేర్చుకున్నట్టు నేర్చుకుంటూ ఉండేవాడు. ► ఎనిమిదేళ్ల తర్వాత ఓ రీమేక్ సినిమా చేశాను. నా దృష్టిలో ఏ సినిమా అయినా రీమేక్ కిందే లెక్క. ఒక సినిమా చేయడానికి ఒక పుస్తకమో, ఓ వ్యక్తో ఏదైనా సంఘటనో ప్రేరణ అయినప్పుడు మరో సినిమా ఎందుకు కాకూడదు? నాకు రీమేక్ అయినా సొంత కథతో సినిమా అయినా ఒకటే. ► హిందీ ‘దబాంగ్’ని తెలుగు (‘గబ్బర్ సింగ్)లో రీమేక్ చేసేటప్పుడు చాలా మార్పులు చేశాను. ఆ ధైర్యంతోనే టైటిల్ కార్డ్‌లో ‘మాటలు–మార్పులు–దర్శకత్వం’ అని వేసుకున్నాను. కానీ ‘వాల్మీకి’ సినిమాలో ఎక్కువ మార్పులు చేయలేదు. కొన్ని షాట్స్ అలానే తీశాం. అందుకని ‘మార్పులు’ అని ప్రత్యేకంగా వేసుకోలేదు. ఈ సినిమాలో సుకుమార్‌గారు, నితిన్, బ్రహ్మానందంగారు అతిథి పాత్రల్లో కనిపిస్తారు. ► ఒక మనిషిలోని అత్యున్నతమైన మార్పుకు నిదర్శనం వాల్మీకి. ఆ టైటిల్ అయితే సినిమాకు బావుంటుందని పెట్టాం. టైటిల్ మీద చిన్న ఇష్యూ నడుస్తోంది. కేసు కోర్టులో ఉంది కాబట్టి దాని గురించి ఎక్కువ మాట్లాడకూడదు. ► పూజా హెగ్డే పాత్ర సినిమాలో సెకండ్ హాఫ్‌లో వస్తుంది. తన పాత్ర సర్ప్రైజ్. వరుణ్–పూజా మీద ‘దేవత’ సినిమాలో ‘వెల్లువచ్చి గోదారమ్మ..’ పాట రీమిక్స్ చేశాం. పాత పాటలానే షూట్ చేశాం. ► అథర్వ మురళి పాత్రకు ముందు చాలా మందినే అనుకున్నాం. దర్శకుడవ్వాలనే కసితో ఉండే కుర్రాడి పాత్ర చేయాలంటే ఏ ఇమేజ్ లేని నటుడైతే బెస్ట్ అని అతణ్ణి తీసుకున్నాను. నిర్మాతలు రామ్ ఆచంట, గోపీ ఆచంటగారు నాకు ఎప్పటి నుంచో తెలుసు. వాళ్ల 14 రీల్స్ ప్లస్ బ్యానర్లో తొలి సినిమా నేనే చేయడం ఆనందంగా ఉంది. ► ప్రస్తుతం ఆర్థికంగా బాగానే ఉన్నాను. కేవలం డబ్బు కోసం కాకుండా మంచి సినిమాలు తీయాలనుకుంటున్నాను. ప్రస్తుతం కంటెంట్ ఉన్న సినిమాలకు ఆదరణ బాగా లభిస్తోంది. నా మిత్రులు కృష్ణ, మహేశ్ కోనేరులతో కలసి సినిమాలు నిర్మించాలనుకుంటున్నాను. ► చలంగారి ‘మైదానం’, యండమూరిగారి ‘ప్రేమ’ నవలలను సినిమాగా తీయాలనుంటుంది. కుదరదు. ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో గమనించి, అందులో మన శైలికి ఏది మ్యాచ్ అవుతుందో అలాంటి సినిమాలు తీయలి. ఓ సినిమాను ఎక్కువ మంది చూస్తే అది కమర్షియల్ సినిమా కిందే లెక్క. మనం ఈ సినిమా తీయాలి అనుకుని సినిమా తీయలేం. సినిమానే దర్శకుడిని ఎంచుకుంటుంది కానీ దర్శకుడు సినిమాని ఎంచుకోలేడు అని నేను నమ్ముతాను. నాకు త్వరత్వరగా సినిమాలు తీయాలని ఉన్నా అనుకోకుండా గ్యాప్ వస్తుంది. ► ప్రస్తుతం రెండు మూడు కథలు సిద్ధంగా ఉన్నాయి. ఏది ముందు మొదలవుతుందో తెలియదు. అందరూ బలంగా కోరుకుంటే పవన్ కల్యాణ్‌గారితో సినిమా ఉండొచ్చు. ఎన్టీఆర్‌గారితో చేసిన ‘రామయ్య వస్తావయ్యా’ అనుకున్న స్థాయి విజయాన్ని సాధించలేదు. ఆయనతో ఓ సినిమా తీసి రుణం తీర్చుకోవాలి. ► నాకు, ‘దిల్’ రాజుగారికి చిన్న చిన్న క్రియేటివ్ డిఫరెన్సెన్స్ ఉన్నాయి. అది ఏ నిర్మాత – దర్శకుడికైనా ఉండేవే. ‘దాగుడుమూతలు’ సినిమాలో క్యారెక్టర్స్ మాత్రమే కావాలని నేను, స్టార్స్‌తో తీద్దాం అని ఆయన. క్రియేటివ్‌గా చిన్న చిన్న డిఫరెన్స్ తప్పితే ఆయనకు, నాకు మంచి అనుబంధం ఉంది. ► వరుణ్ హీరో అవ్వకముందు గడ్డం పెంచుకొని ఫొటోషూట్ చేయించుకున్నాడు. ఆ స్టిల్స్‌ను నాగబాబుగారు నాకు చూపించారు. ఆ లుక్ నా మనసులో ఉండిపోయింది. వరుణ్ మేకోవర్కి కారణం నాగబాబుగారే. ఈ సినిమా కోసం ఆ లుక్ కావాలంటే వరుణ్ మౌల్డ్ అయ్యాడు. ఇందులో తన నటవిజృంభణ చూస్తారు. వరుణ్, నేను గర్వంగా ఫీల్ అయ్యే సినిమా ఇది. -
‘వాల్మీకిని రిలీజ్ కానివ్వం’
సాక్షి, హైదరాబాద్: వాల్మీకి సినిమా టైటిల్ మార్చాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌తో కలిసి బోయ సామాజిక వర్గం నేతలు సోమవారం సెంట్రల్ బోర్డ్ ఫిల్మ్ సర్టిఫికెట్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. రామాయణం రాసిన వాల్మీకిని గ్యాంగ్ స్టర్‌తో పోల్చడం వల్ల ఆ సామాజిక వర్గం మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. దాంతో వారు తనను సంప్రదించారని తెలిపారు. గ్యాంగ్‌స్టర్ మూవీకి వాల్మీకి పేరు పెట్టడాన్ని వారు వ్యతిరేకిస్తున్నారన్నారు. తక్షణమే ఈ సినిమా టైటిల్ మార్చాలని డిమాండ్ చేస్తున్నారన్నారు. లేకపోతే బోయ కమ్మూనిటీ అంతా ఒక్కటి అవుతుందని.. అందుకు నిర్మాతలు, డైరెక్టర్, నటులు అందరూ బాధ్యత వహించాల్సి వస్తుందని లక్ష్మణ్ హెచ్చరించారు. టైటిల్ మార్చకుంటే రిలీజ్ కానివ్వం: గోపి బోయ మా జాతికి గురువు అయిన వాల్మీకిని ఈ సినిమా ద్వారా రాబోయే తరాలకు గ్యాంగ్‌స్టర్‌గా చూపించే ప్రయత్నం చేస్తున్నారని బోయ వాల్మీకి సంఘం అధ్యక్షుడు గోపి బోయ ఆరోపించారు. సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందే. డైరెక్టర్ హరీష్ శంకర్, నిర్మాతలు రాం అచంట, గోపి అచంటలను కలిసి టైటిల్ మార్చమని కోరామన్నారు. అంతేకాక హీరో వరుణ్ని కూడా కలిసామని కానీ వారు స్పందించలేదని తెలిపారు. టైటిల్ మార్చకుంటే సినిమా రిలీజ్ కానివ్వమని హెచ్చరించారు. తమిళ సినిమా జిగర్తాండకు రీమేక్‌గా తెరకెక్కిన వాల్మీకి సినిమా ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ ప్రతినాయక ఛాయలున్న పాత్రలో నటిస్తుండగా తమిళ నటుడు అధర్వ హీరోగా నటిస్తున్నాడు. (చదవండి: నాతోటి పందాలు వేస్తే సస్తరు) -
గద్దలకొండ గణేశ్... రచ్చ రచ్చే
‘‘మా కోబ్రా (కో–బ్రదర్. ‘ఎఫ్ 2’ లో వరుణ్ పాత్రను ఉద్దేశించి) లుక్ మొత్తం మార్చేశాడు.. ‘ఎఫ్ 2’ నుంచి ‘వాల్మీకి’ చిత్రానికి గెటప్ మార్చేశాడు. ఈ ట్రైలర్ చూడగానే టెరిఫిక్‌గా అనిపించింది. ‘గద్దలకొండ గణేశ్... రచ్చ రచ్చే’’ అని హీరో వెంకటేశ్ అన్నారు. వరుణ్‌తేజ్, పూజాహెగ్డే, అధర్వ, మృణాళిని రవి ముఖ్య పాత్రల్లో హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వాల్మీకి’. 14రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించిన ఈ సినిమా ఈనెల 20న విడుదలవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘ఆ వాల్మీకి దొంగ.. మంచిగా మారి రామాయణం రాశారు. మరి.. ఈ వాల్మీకి ఏం రాశాడో థియేటర్స్‌కు వెళ్లి చూడాలి. నాకు నమ్మకం ఉంది.. మా వరుణ్ రెచ్చిపోయి ఒక సూపర్ బ్లాక్‌బస్టర్ ఇస్తాడు. నా స్నేహితుడు పవన్ కల్యాణ్‌కు హరీశ్ శంకర్ ‘గబ్బర్ సింగ్’ అనే బ్లాక్‌బస్టర్ సినిమా ఇచ్చాడు. మా వరుణ్‌కి కూడా సూపర్ హిట్ ఇస్తాడని నమ్మకంగా ఉన్నాను. నిర్మాతలు రామ్, గోపి కలిసి నాతో ‘నమో.. వెంకటేశ’ చేశారు. చాలా ప్యాషన్‌తో సినిమా చేస్తారు.. కానీ, సింపుల్‌గా ఉంటారు. ‘వాల్మీకి’ పెద్ద హిట్ అవ్వాలి, మంచి కలెక్షన్స్ రావాలి’’ అన్నారు. వరుణ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘ఈ గద్దలకొండ గణేశ్‌ని ఆశీర్వదించడానికి వచ్చిన మా సింగిల్ హ్యాండ్ గణేశ్ వెంకటేశ్ సర్కి థ్యాంక్స్. నేను ఫోన్ చేసి రావాలనగానే వెంటనే ఓకే అన్నారు.. అంత మంచి మనసు ఆయనది. ‘వాల్మీకి’ నా 9వ సినిమా. ఇప్పటి వరకూ ప్రయోగాలు, క్లాస్, లవ్‌స్టోరీలంటూ సినిమాలు చేశాను. ఫస్ట్ టైమ్ ఓ మాస్ సినిమా చేస్తే ఆ కిక్కే వేరప్పా.. మామూలుగా లేదమ్మా. చిరంజీవిగారు ఎప్పుడూ చెబుతుండేవారు.. ‘అరేయ్ మేము మాస్ సినిమాలు ఎందుకు చేస్తామో నీకు అర్థం కావట్లేదు అని’.. ఇప్పుడు ఫైనల్‌గా ఆ రుచిని కొంచెం చూశా.. థ్యాంక్యూ డాడీ. మా దాహం తీరే సినిమా ఎవరిస్తారు అనుకున్నాం.. హరీష్‌గారి ‘గబ్బర్‌సింగ్’ చూసినప్పుడు ఇదీ సినిమా అనిపించింది. మా బాబాయికి అంతపెద్ద సినిమా ఇచ్చిన ఆయన నాతో చేయడం నా అదృష్టం. రామ్, గోపీగార్లతో నా ప్రయాణం ఇకముందు కూడా సాగుతుందని కోరుకుంటున్నా. ‘ముకుంద’ సినిమా తర్వాత పూజాహెగ్డేతో చేద్దామనుకున్నా. ఆ సినిమా చేస్తున్నప్పుడు ‘అరే ఇంత అందమైన అమ్మాయిని పెట్టి మా మధ్య మాటలు ఇవ్వలేదు ఏంట్రా?’ అనిపించింది.. కానీ ‘వాల్మీకి’లో హరీష్‌గారు మా ఇద్దరి మధ్య మంచి సీక్వెన్స్ ఇచ్చారు. శోభన్‌బాబుగారి ‘వెల్లువొచ్చే గోదారమ్మ..’ రీమిక్స్ పాట చాలా బాగా వచ్చింది. మీ అందర్నీ(అభిమానులు) చూస్తే మా కుటుంబం ఇక్కడే ఉన్నట్టు ఉంటుంది.. థ్యాంక్యూ. నిన్ననే చిరంజీవిగారిని, చరణ్ అన్నని కలిశా. ‘సైరా’ పనుల్లో చాలా బిజీగా ఉన్నారు. కానీ, వాళ్ల ఆశీర్వాదాలు, ప్రేమ ఎప్పుడూ నాతోనే ఉంటాయి. ‘వాల్మీకి’ ట్రైలర్ చూసి బాబాయ్(పవన్ కల్యాణ్) నాతో, హరీష్గారితో మాట్లాడారు.. చాలా బాగుంది.. తెలంగాణ యాసలో చాలా బాగా మాట్లాడావు అన్నారు. మా ఫ్యామిలీని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ(అభిమానులు) మళ్లీ మళ్లీ థ్యాంక్స్. కచ్చితంగా మీ అందరికీ ‘వాల్మీకి’ నచ్చుతుంది. అక్టోబర్ 2న మన ‘సైరా నరసింహారెడ్డి’ కూడా వస్తోంది. ‘వాల్మీకి’ని ఎంత హిట్ చేస్తారో అంతకు రెండు రెట్లు ‘సైరా’ ని కచ్చితంగా హిట్ చేస్తారని కోరుకుంటున్నా’’ అన్నారు. నటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ– ‘‘వాల్మీకి’ టైటిల్ పెట్టడానికి కొంచెం గుండె ధైర్యం కావాలి.. సాహిత్యంపై పట్టుండి, ఎక్కువ చదువుకున్నాడు కాబట్టి హరీష్‌లాంటి ఒక అద్భుతమైన డైరెక్టర్ ఈ టైటిల్ ఎంపిక చేసుకున్నాడేమో అనిపించింది. వరుణ్‌తేజ్ మామూలోడు కాదని గత సినిమాలు చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు ‘వాల్మీకి’ చూస్తే అసాధారణ నటుడు అనిపిస్తుంది. మా గురువు చిరంజీవిగారు, ఆయన తమ్ముడు పవన్ కల్యాణ్.. వారి మధ్యలో ఉన్నాడు అర్జునుడు నాగబాబు.. అతను సంధించి వదిలిన బాణం మన వరుణ్. మా బాస్ వెంకటేశ్ ఉన్నాడు ఎదురుగా.. ‘సుందరకాండ’ దగ్గరి నుంచి చాలా సినిమాల్లో మా కాంబినేషన్లో చేశాం. ఆయన కొన్ని సినిమాలనే ఎంచుకుని అతిథిగా వస్తుంటారు. ‘వాల్మీకి’ సినిమాకి ముఖ్య అతిథిగా రావడం చాలా గొప్ప విషయం. రామ్ ఆచంట, గోపీ ఆచంట మంచి క్రమశిక్షణ, మనసున్నవారు. ‘వాల్మీకి’అద్భుతమైన విజయం సాధించాలని కోరుకుంటున్నా’’అన్నారు. నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ–‘‘పవన్‌కల్యాణ్‌గారితో ‘గబ్బర్‌సింగ్, సాయిధరమ్ తేజ్‌తో ‘సుబ్రమణ్యం ఫర్ సేల్, బన్నీతో ‘డీజే’... ఇలా మెగా ఫ్యామిలీతో హిట్స్ కొట్టాడు హరీష్.. ఇప్పుడు వరుణ్‌తో కూడా ‘వాల్మీకి’తో హిట్ కొడుతున్నాడు. మా ‘ఎఫ్ 2’ వెంకటేశ్‌గారు ఈ సినిమాని ఆశీర్వదించడానికి వచ్చారు.. ‘ఎఫ్ 2’ లాగా ‘వాల్మీకి’ చిత్రానికీ తిరుగులేదు. ప్యాషన్ ఉన్న నిర్మాతలు గోపీ, రామ్. ‘వాల్మీకి’ పెద్ద హిట్ కావాలి.. ఆల్ ది బెస్ట్ టీమ్’’ అన్నారు. హరీష్ శంకర్ మాట్లాడుతూ– ‘‘భాస్కరభట్లగారు ‘జర జర..’ పాట రాస్తున్నప్పుడు వాళ్ల అమ్మగారు చనిపోయారు.. అయినా రాసి ఇచ్చారు. చంద్రబోస్ అన్నయ్యగారితో నా సినిమాలో ఓ పాటైనా రాయించుకోకపోతే వెలితిగా ఉంటుంది. వనమాలిగారు చక్కనిపాట రాశారు. ఇతర భాషలతో పోలిస్తే రచయితలు, పాటల రచయితలకు మనం ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వలేదేమో అనిపిస్తోంది. మనకు నచ్చిన పాటలు, లిరిక్స్‌ని తోటివారితో షేర్ చేసుకోండి. తద్వారా మన భాషను మనం కాపాడుకున్నవాళ్లం అవుతాం. కెమెరామెన్ బోస్, మిక్కీ జి. మేయర్ ఈ సినిమాకి రెండు స్తంభాల్లాంటివారు. నాకోసం ఈ సినిమాలో ప్రత్యేక పాట చేసినందుకు డింపుల్‌కి థ్యాంక్స్. ‘డీజే’ లో పూజాహెగ్డే గ్లామర్ నచ్చితే, ‘వాల్మీకి’లో తన నటన నచ్చుతుంది. ‘ఎఫ్ 2’ టైమ్‌లో వెంకటేశ్‌గారిని కలిశా. ఆయన్ని కలిసే వరకూ తెలియదు అంత సరదాగా ఉంటారని. 85రోజులు షూటింగ్ చేశాం.. ఇన్ని రోజులూ నవ్వుతూ పనిచేసిన నా మొదటి హీరో వరుణ్. ఈ కాలం జనరేషన్లో ఓ హీరో ఫోన్ పక్కన పెట్టి పనిపైనే శ్రద్ధ పెట్టేవాడు వరుణ్ ఒక్కడే. నెలరోజులు తెలంగాణ యాసలో డబ్బింగ్ చెప్పాడు. డబ్బులు పెట్టేవారు చాలామంది ఉంటారు.. కానీ ప్యాషన్ ఉన్న నిర్మాతలు గోపీ ఆచంట, రామ్ ఆచంట, ‘దిల్’ రాజుగారు. వారం కిందట పవన్ కల్యాణ్‌గారిని కలిశా. ఆయనకి ‘వాల్మీకి’ ట్రైలర్ బాగా నచ్చింది. సినిమా గురించి తప్ప మిగతా అన్ని విషయాలు మాట్లాడుకున్నాం. ‘గబ్బర్‌సింగ్’ అప్పుడు ఎలా కోరుకున్నారో ఇప్పుడూ అదే సంకల్పంతో కోరుకోండి (పవన్ కల్యాణ్ అభిమానులను ఉద్దేశించి) అప్పుడే సినిమా కుదురుతుంది’’ అన్నారు. నిర్మాత గోపీ ఆచంట మాట్లాడుతూ– ‘‘ఇక్కడి విచ్చేసిన మెగాస్టార్, పవర్‌స్టార్ ఫ్యాన్స్‌కి, మా తొలి సినిమా హీరో వెంకటేశ్‌బాబుకి థ్యాంక్స్. ఎప్పటి నుంచో వరుణ్‌తో సినిమా చేద్దామని రెండు మూడు కథలు అనుకున్నా, కుదరలేదు. ఇప్పుడు ‘వాల్మీకి’లాంటి మంచి కథతో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. పవర్‌స్టార్‌తో ‘గబ్బర్‌సింగ్’ తీసి ఎలా అలరించారో వరుణ్‌తో ‘వాల్మీకి’ తోనూ అలా అలరిస్తారు హరీష్’’ అన్నారు. ‘‘నాకు శ్రీదేవిలాంటి మంచి పాత్ర ఇచ్చినందుకు హరీష్ సర్కి చాలా థ్యాంక్స్’’ అన్నారు పూజాహెగ్డే. నిర్మాత అనీల్ సుంకర, సంగీత దర్శకుడు మిక్కీ జె.మేయర్, నటుడు బ్రహ్మాజీ, పాటల రచయితలు భాస్కరభట్ల, చంద్రబోస్, వనమాలి, నటి డింపుల్ పాల్గొన్నారు. -
వరుణ్ తేజ్‌తో పాటు ‘వాల్మీకి’ టీంకు నోటీసులు
మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన వాల్మీకి సినిమాను సమస్యలు వెంటాడుతున్నాయి. ఈసినిమా టైటిల్ ప్రకటించిన దగ్గర నుంచి టైటిల్ మార్చాలంటూ బోయ కులస్తులు ఆందోళనలు చేస్తున్నారు. సినిమా టైటిల్ తమను కించపరిచే విధంగా ఉందంటూ వారు ఆరోపిస్తున్నారు. ఇటీవల వాల్మీకి సినిమా టైటిల్ మార్చాలంటూ బోయ హక్కుల పోరాట సమితి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటీషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం డీజీపీ, సెన్సార్ బోర్డు, ఫిలిం ఛాంబర్లతో పాటు హీరో వరుణ్ తేజ్‌కు, చిత్రయూనిట్‌కు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన న్యాయస్థానం తదుపరి విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. తమిళ సినిమా జిగర్తాండకు రీమేక్‌గా తెరకెక్కిన వాల్మీకి సినిమా ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను ప్రతినాయక ఛాయలున్న పాత్రలో వరుణ్ తేజ్ నటిస్తుండగా తమిళ నటుడు అధర్వ హీరోగా నటిస్తున్నాడు. -
నాతోటి పందాలు వేస్తే సస్తరు
‘నాపైన పందాలు ఏస్తే గెలుస్తరు.. నాతోటి పందాలు వేస్తే సస్తరు, మనం బతుకుతున్నామని పదిమందికి తెల్వకపోతే ఇక బతుకుడెందుకురా, గవాస్కర్ సిక్సు కొట్టుడు.. బప్పిలహరి పాట కొట్టుడు.. నేను బొక్కలు ఇరగ్గొట్టుడు సేం టు సేం, గద్దలకొండ గణేశ్ అంటే గజ గజ వణకాలి’ అంటూ ‘వాల్మీకి’ ట్రైలర్లో వరుణ్ తేజ్ చెప్పిన డైలాగ్‌లు సినిమాపై ఆసక్తి పెంచుతున్నాయి. వరుణ్‌తేజ్, పూజా హెగ్డే, అధర్వ, మృణాళిని రవి ముఖ్య పాత్రల్లో హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వాల్మీకి’. తమిళ చిత్రం ‘జిగర్తాండ’కి ఇది తెలుగు రీమేక్. 14రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ‘వాల్మీకి’ ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. హరీష్ శంకర్ మాట్లాడుతూ– ‘‘జిగర్తాండ’ సినిమాని నేను ఏ దృష్టితో చూశానో వరుణ్ కూడా అదే కోణంలో చూసి నటించేందుకు ఒప్పుకున్నాడు. ‘ఫిదా, తొలిప్రేమ’ వంటి సాఫ్ట్ పాత్రలు చేసిన వరుణ్ ‘వాల్మీకి’ లో పక్కా మాస్ పాత్ర చేశారు. ఇలాంటి పాత్ర చేయాలంటే ధైర్యం ఉండాలి. హిందీ ‘దబాంగ్’ సినిమాని ‘గబ్బర్‌సింగ్’గా రీమేక్ చేసినప్పుడు చాలా మార్పులు చేశాను.. ‘వాల్మీకి’లో మాత్రం మన నేటివిటీకి తగ్గట్టు కొన్ని మాత్రమే మార్పులు చేశాం. మిక్కీ జె. మేయర్ మంచి సంగీతం, నేపథ్య సంగీతం అందించారు. ‘వాల్మీకి’ టైటిల్‌పై వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా చూసి బోయ సంఘంవారు, వాల్మీకి అభిమానులు గర్వపడతారు’’ అన్నారు. వరుణ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో గద్దలకొండ గణేశ్ పాత్ర చేశా. ఇందులో నెగటివ్ షేడ్స్ ఉంటాయి. ఈ టైమ్‌లో ఇలాంటి పాత్ర అవసరమా? అని చాలామంది అన్నారు. కానీ హరీష్‌గారు నాకు నమ్మకం ఇచ్చారు. కొన్ని సినిమాలు రీమేక్ చేయాలనే స్ఫూర్తినిస్తాయి.. ‘జిగర్తాండ’ అలాంటి చిత్రమే. చిరంజీవి, రజనీకాంత్, కమల్‌హాసన్... వంటి వారు గతంలో చేసిన సినిమాలు చూస్తే రాముడు మంచి బాలుడు అనేలా హీరోలా పాత్రలు ఉండేవి. ఈ మధ్య హీరోలు నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటిస్తున్నారు. నేను కూడా హీరోలాంటి పాత్రలు చేశా. కానీ, వైవిధ్యంగా ఉండేలా ప్రయోగాత్మకంగా ఏదైనా ఓ పాత్ర చేయాలనుకున్నా. అలాంటి పాత్రే ఇది. ఈ పాత్ర నాకే కొత్తగా అనిపించింది. సినిమాలో మంచోడి కంటే చెడ్డోడి పాత్ర బాగుంటుంది (నవ్వుతూ)’’ అన్నారు. ‘‘టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. ట్రైలర్ అందరికీ నచ్చుతుందనుకుంటున్నా. సినిమా విజయంపై నమ్మకంగా ఉన్నాం’’ అన్నారు గోపీ ఆచంట. ‘‘ఇంత మంచి సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన హరీష్ శంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంటగార్లకు థ్యాంక్స్. ఈ సినిమాలో ‘జర జర...’ పాటకి చాలా మంచి స్పందన వస్తోంది’’ అని సంగీత దర్శకుడు మిక్కీ జె.మేయర్ అన్నారు. నిర్మాత రామ్ ఆచంట పాల్గొన్నారు. -
వాల్మీకి ట్రైలర్ విడుదల
-
వాల్మీకి ట్రైలర్ : గత్తర్‌లేపినవ్.. చింపేశినవ్ పో!
ఓ రీమేక్ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు ఏవిధంగా అందించాలో హరీష్‌శంకర్‌కు తెలిసనట్టు మరే దర్శకుడికి తెలీదేమో. అందుకే హిందీలో దబాంగ్ అంటే తెలుగులో గబ్బర్‌సింగ్ అంటూ రికార్డులన్నీ బ్రేక్ చేసేశాడు. మరోసారి అలాంటి ఓ రీమేక్‌తో మన ముందుకు వస్తున్నాడు ఆ దర్శకుడు. తమిళ్ హిట్ మూవీ జిగర్తాండను తెలుగులో వాల్మీకిగా తెరకెక్కిస్తున్నాడు. వరుణ్ తేజ్ డిఫరెంట్ పాత్రలో నటిస్తున్న ఈ మూవీ టీజర్, పోస్టర్స్, సాంగ్స్‌తో మంచి బజ్‌ను నెలకొల్పాయి. వరుణ్ తేజ్ తన లుక్‌తో ఆశ్చర్యపరుస్తున్న ఈ మూవీ ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ ట్రైలర్లో వరుణ్ తేజ్ చెప్పిన డైలాగ్స్ హైలెట్‌గా మారనున్నట్లు తెలుస్తోంది. గద్దలకొండ గణేష్ పాత్రలో వరుణ్ జీవించినట్లు కనిపిస్తోంది. ‘నాపైన పందాలు ఏస్తే గెలుస్తరు.. నాతోటి పందాలు వేస్తే సస్తరు..’, ‘గవాస్కర్ సిక్సు కొట్టుడు.. బప్పిలహరి పాట కొట్టుడూ.. నేను బొక్కలు ఇరగొట్టడం సేం టు సేం...’,అనే డైలాగ్‌లు అదిరిపోయాయి. ఈ చిత్రంలో అథర్వా, పూజా హెగ్డేలు ప్రత్యేకపాత్రలో నటిస్తుండగా.. మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీ సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘వాల్మీకి’ టైటిల్ మార్చాలని ధర్నా
బన్సీలాల్‌పేట్: వాల్మీకి సినిమా టైటిల్‌ను మార్చాలని కోరుతూ గురువారం సీజీఓ టవర్స్‌లోని సెన్సార్ బోర్డు కార్యాలయం ఎదుట విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ టైటిల్ మార్చాలని బోయ కులస్తులు తీవ్ర ఆందోళన చేస్తున్నారన్నారు. వాల్మీకి బోయలతో పాటు హిందువుల ఆరాధ్య దైవమని పేర్కొన్నారు. అలాంటి మహనీయుడి పేరు మీద సినిమా తీయడం సరైంది కాదన్నారు. వెంటనే సినిమా పేరును మార్చాలని భజరంగ్‌దళ్ రాష్ట్ర కన్వీనర్ ఎం.సుభాశ్‌చందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సెన్సార్ బోర్డు చైర్మన్‌కు రాసిన లేఖను విడుదల చేశారు. -
‘వాల్మీకి’లో మరో గెస్ట్!
మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా కమర్షియల్ చిత్రాల దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా వాల్మీకి. తమిళ సూపర్ హిట్ జిగర్తాండకు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కోలీవుడ్ నటుడు అధర్వ మురళీ మరో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పలువురు సినీ ప్రముఖులు అతిథి పాత్రల్లో కనిపించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే దర్శకుడు సుకుమార్ ఈ సినిమాలో గెస్ట్ అపియరెన్స్ ఇస్తున్నట్టుగా ప్రకటించారు. తాజాగా యంగ్ హీరో నితిన్ కూడా ఈ సినిమాలో కనిపించనున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే నితిన్ కనిపించే సన్నివేశాల చిత్రీకరణ కూడా పూర్తయ్యిందట. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ స్పందించాల్సి ఉంది. వరుణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో మృణాలినీ రవి మరో హీరోయిన్గా నటిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతమందిస్తున్నారు. -
‘వాల్మీకి’లో సుకుమార్!
ఈ ఏడాది ఎఫ్2తో బ్లాక్ బస్టర్హిట్ కొట్టిన వరుణ్ తేజ్.. త్వరలోనే ఓ రీమేక్ మూవీతో పలకరించనున్నాడు. తమిళ హిట్ మూవీ జిగర్తాండను తెలుగులో వాల్మీకిగా తెరకెక్కిస్తున్నారు. రీమేక్ స్పెషలిస్ట్ హరీష్ శంకర్.. ఈ మూవీని రీమేక్ చేస్తుండటంతో అంచనాలు పెరిగాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, పోస్టర్స్, సాంగ్.. సినిమాపై హైప్‌ను క్రియేట్ చేశాయి. తాజాగా ఈ మూవీలో సుకుమార్ స్పెషల్ రోల్లో నటించనున్నట్లు తెలుస్తోంది. కథానుగుణంగా.. ఈ మూవీలో వరుణ్ తేజ్‌పై ఓ సినిమాను తెరకెక్కించే పనిలో అథర్వా ఉంటాడు. సినీ ఇండస్ట్రీకి సంబంధించి తెరకెక్కించే సన్నివేశాల్లో సుకుమార్ ప్రత్యేక పాత్రలో నటించనున్నట్లు ఓ క్లూను వదిలాడు దర్శకుడు హరీష్ శంకర్. ఈ మేరకు సుకుమార్‌తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. వాల్మీకిలో సుకుమార్ నుంచి చిన్న సర్ప్రైజ్ అంటూ ట్వీట్ చేశారు. పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ సినిమాను సెప్టెంబర్ 20న విడుదల చేయనున్నారు. A Small surprise from @aryasukku in #Valmiki.... thank you so much darling Sukku..for your sweet gesture !!!!! #ValmikiOnSep20th !!!! pic.twitter.com/frzHdhSuW6 — Harish Shankar .S (@harish2you) September 3, 2019 -
గోదారిలో పాట
గ్యాంగ్‌స్టర్ గోదావరికి వెళ్లి పాటలు పాడుతున్నాడు. వరుణ్‌తేజ్, అథర్వ హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘వాల్మీకి’. పూజా హెగ్డే, మృణాళిని కథానాయికలుగా నటిస్తున్నారు. గోపీ ఆచంట, రామ్ ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమాకు హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో గ్యాంగ్‌స్టర్ పాత్రలో వరుణ్ తేజ్ కనిపిస్తారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ గోదావరి పరిసర ప్రాంతాల్లో జరుగుతోందని తెలిసింది. ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ వహిస్తున్నారు. ‘‘గోదావరి జిల్లాలో కాదు.. అచ్చంగా.. గోదారిలో షూటింగ్ నా ఎన్నో ఏళ్ల కల..’’ అని హరీశ్ శంకర్ పేర్కొన్నారు. తమిళ హిట్ చిత్రం ‘జిగర్తాండ’కు ‘వాల్మీకి’ తెలుగు రీమేక్. ఈ చిత్రాన్ని సెప్టెంబరు 20న విడుదల చేయాలనుకుంటున్నారు. -
నానీని.. మెగా అభిమానులు అంగీకరిస్తారా?
నాని.. గ్యాంగ్ లీడర్ సినిమాను మొదలు పెట్టిన దగ్గర నుంచి ఇబ్బందులు వెంటాడుతున్నాయి. కొద్ది రోజుల షూటింగ్ తరువాత సినిమా ఆగిపోయిందంటూ ప్రచారం జరిగింది. తరువాత గ్యాంగ్‌లీడర్ అనే టైటిల్‌ను ప్రకటించటంతో మెగా అభిమానులు ఫైర్ అయ్యారు. దీనికి తోడు గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ వేరే నిర్మాతలు రిజిస్టర్ చేయించుకోవటంతో తప్పనిసరి పరిస్థితుల్లో సినిమా టైటిల్‌ను ‘నానీస్ గ్యాంగ్ లీడర్’గా మార్చాల్సి వచ్చింది. రిలీజ్ డేట్ విషయంలోనూ గ్యాంగ్ లీడర్‌కు ఇబ్బందులు ఎదురయ్యాయి. ముందుగా ఈ సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేయాలని భావించారు. కానీ అదే రోజు సాహో రిలీజ్ అంటూ ప్రకటన రావటంతో ఆగస్టు 30కి మార్చారు. కానీ సాహో కూడా వాయిదా పడి ఆగస్టు 30కి రావటంతో సినిమాను సెప్టెంబర్ 13కు వాయిదా వేశారు. ఆ రోజు కూడా వరుణ్ తేజ్ వాల్మీకితో పోటి పడాల్సి రావటంతో సినీ పెద్దలు కలగజేసుకొని వాల్మీకిని సెప్టెంబర్ 20కి వాయిదా వేయించారు. తాజాగా ట్రైలర్లో మెగా అభిమానులను కూల్ చేసే ప్రయత్నం చేశాడు నాని. ట్రైలర్లో గ్యాంగ్ లీడర్లో చిరు ఇంట్రడక్షన్ సీన్ తరహాలో వెల్డర్‌గా ఓ షాట్, తరువాత చిరంజీవి ఫేస్ మాస్క్‌తో మరో షాట్లో కనిపించాడు. మరి ఈ రెండు సీన్స్‌తోనే మెగా అభిమానులు శాంతిస్తారా..? గ్యాంగ్ లీడర్‌గా మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌ను చూసుకోవాలనుకుంటున్న ఫ్యాన్స్ ఆ స్థానంలో నానిని అంగీకరిస్తారా..? లేదా..? తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేవరకు వెయిట్ చేయాల్సిందే -
వెనక్కి తగ్గిన ‘వాల్మీకి’!
మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా వాల్మీకి. తమిళ సూపర్ హిట్ జిగర్తాండకు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాను సెప్టెంబర్ 13న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే అదే రోజు నాని, విక్రమ్ కె కుమార్ల గ్యాంగ్ లీడర్ కూడా రిలీజ్ అవుతుండటంతో రెండు చిత్రాల నిర్మాతలు కలిసి ఓ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెలాఖరున రిలీజ్ అవుతున్న సాహో మేనియా సెప్టెంబర్ 13 వరకు కొనసాగే అవకాశం ఉండటంతో ఆ రోజు రెండు సినిమాలు రిలీజ్ చేస్తే థియేటర్ల సమస్య కూడా వస్తుందని భావిస్తున్నారు. అందుకే గ్యాంగ్‌లీడర్‌ను ముందుగా ప్రకటించినట్టుగా సెప్టెంబర్ 13న రిలీజ్ చేసి వాల్మీకిని 20న రిలీజ్ చేసేందుకు నిర్ణయించారు. ఈ మేరకు చిత్ర నిర్మాతలు ఈ రోజు అధికారిక ప్రకటన చేయనున్నారు. -
‘వాల్మీకి’పై హైకోర్టులో పిటిషన్
సాక్షి, హైదరాబాద్ : వాల్మీకి సినిమా టైటిల్ మార్చాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బోయ వాల్మీకిల మనోభావాలను దెబ్బ తీసే విధంగా చిత్రాన్ని రూపొందించారని, సినిమా టైటిల్ మార్చేలా ఆదేశాలు ఇవ్వాలని బోయ హక్కుల సమితి పిటిషన్ దాఖలు చేసింది. తమ కులస్థులను కించపరిచేలా సినిమా తీసిన చిత్ర యూనిట్‌పై చర్యలు తీసుకోవాలని పిటిషన్లో పేర్కొన్నారు. వరుణ్ తేజ్ హీరోగా హరీశ్ శంకర్ రూపొందిస్తున్న చిత్రం ‘వాల్మీకి’.. పూజా హెగ్డే, అథర్వ మురళి, మృణాళినీ రవి కీలక పాత్రలు చేస్తున్నారు. 14రీల్స్ ప్లస్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 13న విడుదల కానుంది. -
శ్రీదేవి సైకిల్ ఎక్కారు
వరుణ్ తేజ్ హీరోగా హరీశ్ శంకర్ రూపొందిస్తున్న చిత్రం ‘వాల్మీకి’. పూజా హెగ్డే, అథర్వ మురళి, మృణాళినీ రవి కీలక పాత్రలు చేస్తున్నారు. 14రీల్స్ ప్లస్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 13న విడుదల కానుంది. ఆదివారం పూజా హెగ్డే లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో శ్రీదేవి పాత్రలో పూజా కనిపించనున్నారు. -
‘గ్లామరస్‌గా కనిపిస్తే తప్పేంటి?’
దేహమే ఆలయం అంటోంది నటి పూజాహెగ్డే. ఎంటీ సడన్‌గా ఈ అమ్మడు ఆధ్యాత్మిక చింతనతో మాట్లాడుతోంది? అని ఆశ్చర్యపోతున్నారా? అసలు విషయం తెలిస్తే ఆధ్యాత్మికం అందులో ఇసుమంత కూడా లేదని మీకే అనిపిస్తుంది. పూజాహెగ్డే గురించి ఇప్పుడు కొత్తగా చెప్పేదేమీ లేదు. మిస్‌వరల్డ్ అందాల పోటీలో పాల్గొని మూడో స్థానానికి పరిమితం అయిన ఈ బ్యూటీ ఆ తరువాత మోడలింగ్ రంగంలోకి ప్రవేశించి, ఆపై సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. మిస్కిన్ దర్శకత్వంలో తెరకెక్కిన ముఖముడి చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయం అయ్యింది పూజ. ఆ చిత్రం నిరాశపరచడంతో పూజాహెగ్డేను తమిళసినిమా మరచిపోయింది. దీంతో ఆ ఒక్క చిత్రంతోనే పూజాహెగ్డే తట్టాబుట్టా సర్దుకుంది. ఆ తరువాత టాలీవుడ్లో ఎంట్రీ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. అల్లుఅర్జున్, మహేశ్‌బాబు వంటి స్టార్లతో జతకట్టి హిట్స్‌ను తన ఖాతా లో వేసుకుంది. రంగస్థలం చిత్రంలో ఐటమ్ సాంగ్‌లో ఆడి దుమ్మురేపింది కూడా. అలాంటిది అక్కడ కూడా మార్కెట్ కాస్త తగ్గింది. ప్రస్తుతం టాలీవుడ్లో రెండు చిత్రాలు చేతిలో ఉన్నాయి. అవీ స్టార్ హీరోలతో నటిస్తున్నవి కావు. ఇక హిందీలో హౌస్‌పుల్ 4లో నటిస్తోంది. దీంతో మరిన్ని అవకాశాల కోసం గాలం వేసేపనిలో పడింది. ముఖ్యంగా కోలీవుడ్‌లో పాగా వేయాలన్న ఆశ మాత్రం పోలేదట. అందులో భాగంగానే అందరి హీరోయిన్ల మాదిరి గానే అందాలు ఆరబోస్తూ ప్రత్యేకంగా ఫొటో సెషన్‌ను ఏర్పాటు చేసుకుని, ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాలకు విడుదల చేసింది. ఆ ఫొటోలపై నెటజిన్లే కాదు, సినీ అభిమానులు కామెట్స్ చేస్తున్నారు. కొందరైతే తీవ్రంగా విమర్శి స్తున్నారు. దీంతో అలాంటి వారికి బదులిచ్చే విధంగా నటి పూజాహెగ్డే దేహమే ఆలయం అని మన పెద్దలు అన్నారని, అదే విధంగా తన దేహాన్ని తాను ఆరాధిస్తానని చెప్పింది. అంతే కాకుండా అందాలను ప్రదర్శిస్తున్నాను.. ఇందులో తప్పేముంది? మీరు అంతగా ఇదైపోవాల్సిందేముంది?అని ఎదురు ప్రశ్న వేసింది. సమర్ధించుకోవడానికి ఎన్నైనా చెప్పుకోవచ్చు. అయితే ఇలాంటి ఫొటోలతో ఈ అమ్మడు సమాజానికి ఏం సందేశం ఇస్తుందే కూడా కాస్త అలోచించాలిగా అని కొందరు విమర్శిస్తున్నారు. -
రెండు కాల్చుకోవాలె... రెండు దాచుకోవాలె
‘నా సినిమాలో విలనే నా హీరో’ అంటూ అథర్వ డైలాగ్‌తో మొదలవుతుంది ‘వాల్మీకి’ టీజర్. ‘అందుకే పెద్దోళ్ళు చెప్పిండ్రు... నాలుగు బుల్లెట్లు సంపాయిస్తే రెండు కాల్చుకోవాలె.. రెండు దాచుకోవాలె’ అని వరుణ్ తేజ్ చెప్పిన మాస్ డైలాగ్‌తో ముగుస్తుంది. వరుణ్ తేజ్, అథర్వ ముఖ్య తారాగణంగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వాల్మీకి’. ఈ చిత్రంలో పూజా హెగ్డే, మృణాళిని రవి కథానాయికలుగా నటిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. తమిళ హిట్ చిత్రం ‘జిగర్తండా’కు ‘వాల్మీకి’ తెలుగు రీమేక్. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను గురువారం విడుదల చేశారు. ‘‘టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాకు హైలైట్‌గా ఉంటాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. ‘వాల్మీకి’ సినిమా సెప్టెంబర్ 13న విడుదల కానుంది.