AITA
-
ఏఐటీఏపై బోపన్న విమర్శలు, సానియా మద్దతు
2012 లండన్ ఒలింపిక్స్‌కు ముందు... లియాండర్ పేస్‌తో డబుల్స్ ఆడేది లేదని మహేశ్ భూపతి, రోహన్ బోపన్న పట్టు... బలవంతంగా మిక్స్డ్ డబుల్స్‌లో పేస్ భాగస్వామిగా సానియా మీర్జా... పురుషాధిక్య ప్రపంచంలో తనను బలి పశువును చేశారని సానియా తీవ్ర వ్యాఖ్య! 2016 రియో ఒలింపిక్స్‌కు ముందు... పేస్‌తో కలిసి ఆడనని, డబుల్స్‌లో సాకేత్ మైనేనితోనే బరిలోకి దిగుతానని బోపన్న పట్టు... అలా కుదరదంటూ బలవంతంగా జోడీని ఎంపిక చేసిన ఏఐటీఏ!! 2020 టోక్యో ఒలింపిక్స్‌కు ముందు... ఇంకా వివాదమేమీ లేదు, అంతా బాగుందనే అనిపించిది. కానీ అలా అయితే అది భారత టెన్నిస్ ఎలా అవుతుంది...ఆటలకు ముందు వ్యాఖ్యల దుమారం రేగింది!!! న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌లో తాను పాల్గొనే అవకాశాల విషయంలో అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) అందరినీ తప్పుదోవ పట్టించిందని టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న వ్యాఖ్యానించాడు. సుమిత్ నగాల్‌కు జోడీగా తాను ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశాలు లేవని తెలిసి కూడా అధికారులు ఇలా వ్యవహరించారని అతను విమర్శించాడు. బోపన్న వ్యాఖ్యలకు సానియా మీర్జా మద్దతు పలకగా... ఏఐటీఏ ప్రతిగా స్పందిస్తూ ఇద్దరి విమర్శలను ఖండించింది. నేపథ్యమిదీ... ఒలింపిక్స్ పురుషుల డబుల్స్‌లో పాల్గొనే జోడీగా రోహన్ బోపన్న–దివిజ్ శరణ్‌ల పేర్లను ఏఐటీఏ ప్రకటించింది. అయితే వీరిద్దరి ‘సంయుక్త ర్యాంక్’ 113 కాగా... అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) నిబంధనల ప్రకారం తక్కువ ర్యాంక్ కారణంగా వీరు అర్హత సాధించలేకపోయారు. ఆ తర్వాత పురుషుల సింగిల్స్‌లో పలువురు తప్పుకోవడంతో అనూహ్యంగా సుమిత్ నగాల్ అర్హత సాధించాడు. దాంతో దివిజ్ స్థానంలో నగాల్‌ను చేర్చి కొత్తగా ఈ జోడీని పరిశీలించమంటూ ఐటీఎఫ్‌ను ఏఐటీఏ కోరింది. చివరకు బోపన్న–నగాల్ జోడీకి కూడా అవకాశం దక్కలేదు. ఇదే విషయంపై వ్యాఖ్య చేసిన బోపన్న... అసలు ఏఐటీఏ అలాంటి ప్రయత్నమే చేయలేదని విమర్శించాడు. ‘నగాల్‌తో నా జోడీని ఐటీఎఫ్ అసలు అంగీకరించనే లేదు. గాయం తదితర బలమైన కారణం ఉంటే తప్ప చివరి తేదీ అయిన జూన్ 22 తర్వాత ఎలాంటి మార్పులు అంగీకరించబోమని ఐటీఎఫ్ స్పష్టం చేసింది. అయినా సరే మాకేదో అవకాశం ఉందని, తామేదో చేస్తున్నట్లుగా ఆటగాళ్లు, ప్రభుత్వం, మీడియా... ఇలా అందరినీ ఏఐటీఏ తప్పుదోవ పట్టించింది’ అని బోపన్న ట్వీట్ చేశాడు. దీనిని మద్దతుగా సానియా...‘అవునా...ఇదే నిజమైతే చాలా ఘోరం. సిగ్గు పడాల్సిన విషయం. దీని ప్రకారం చూస్తే మనిద్దరం కలిసి మిక్స్డ్ డబుల్స్‌లో పతకం సాధించే అవకాశం కూడా కోల్పోయాం. నీతో పాటు సుమిత్ పేరు పంపించినట్లు నాకు కూడా చెప్పారు’ అని ట్వీట్ చేసింది. అయితే ఈ విమర్శలన్నింటికీ ఏఐటీఏ కొట్టి పారేసింది. బోపన్న, సానియా వ్యాఖ్యలు పూర్తిగా అర్థరహితం. వారికి అసలేం తెలీదు. అర్హత గురించి రూల్ బుక్ చదివి మాట్లాడితే బాగుండేది. డబుల్స్ జోడీని మార్చమంటూ మేం ఐటీఎఫ్కి విజ్ఞప్తి చేశాం. అయితే ప్రత్యేక పరిస్థితుల్లోనే అది సాధ్యమవుతుందని వారు మాకు చెప్పారు. అయినా సరే డెడ్‌లైన్ ముగియడానికి ఏడు గంటల ముందు వరకు కూడా సమాచారం ఇస్తామని చెప్పి మేమూ వేచి చూసేలా చేశారు. ఇందులో తప్పుదోవ పట్టించడం ఏముంది. దాని వల్ల మాకేంటి లాభం. బోపన్న ఒలింపిక్స్‌లో ఆడాలని అతనికి సహాయం చేసేందుకే ప్రయత్నించాం. అంతగా అనుకుంటే అతను సొంతంగా తన ర్యాంకింగ్‌తో అర్హత సాధించాల్సింది. –అనిల్ ధుపార్, ఏఐటీఏ కార్యదర్శి -
కూతురికి వేధింపులు.. తండ్రి అలుపెరగని పోరాటం
చండీగఢ్: ఆడవారి మీద వేధింపులకు ప్రధానమైన కారణం.. బలహీనులు, బయటకు చెప్తే.. సమాజంతోపాటు కుటుంబ సభ్యులు కూడా వారినే శిక్షిస్తారనే ఉద్దేశంతో చాలా మంది మృగాళ్లు ఆడవారి పట్ల దారుణాలకు పాల్పడుతుంటారు. ప్రతిరోజు వెలుగులోకి వచ్చే వార్తలు చూస్తే.. ఇది నిజమేననిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో కొద్దిగా మార్పు వచ్చింది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆడవారికి అన్యాయం జరిగినప్పుడు సమాజం సంగతి పక్కనే పెడితే.. కుటుంబం తోడుగా నిలబడి మద్దతిస్తే చాలు.. మరిన్ని అన్యాయాలు వెలుగులోకి వస్తాయి. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి చండీగఢ్‌లో చోటు చేసుకుంది. కుమార్తెను వేధించిన వారికి శిక్ష పడేలా చేయడం కోసం ఓ తండ్రి అలుపెరగిన పోరాటం చేస్తున్నాడు. ఆ వివరాలు.. చండీగఢ్‌కు చెందిన ఓ యువతి టెన్నిస్ శిక్షణ కోసం రాష్ట్రంలోని ప్రసిద్ధి చెందిన ఓ అకాడమీలో చేరింది. అక్కడ ఆమెతో పాటు శిక్షణ పొందుతున్న ఓ ఐదుగురు యువకులు బాధితురాలిని లైగింక వేధింపులకు గురి చేశారు. వీరిలో ఒక వ్యక్తి జూనియర్ డేవిస్ కప్ ప్లేయర్ కూడా కావడం గమనార్హం. దీని గురించి బాధితురాలు తండ్రితో చెప్పింది. ఆయన ఈ విషయం బయటకు తెలిస్తే.. పరువు పోతుందని ఆలోచించలేదు. తన బిడ్డ పట్ల తప్పుగా ప్రవర్తించిన వారికి శిక్షపడాలని భావించాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు కోర్టుకు చేరింది. ఇక వారికి తప్పక శిక్ష పడుతుంది.. కూతురికి న్యాయం జరుగుతుందని ఆశించిన ఆ తండ్రికి నిరాశే ఎదురయ్యింది. కేసు విచారణ సమయంలో పోలీసులు టెన్నిస్ అకాడమీ వారు ఇచ్చిన బర్త్ సర్టిఫికెట్లు కోర్టుకు అందజేశారు. దాని ప్రకారం నిందితులంతా మైనర్లుగా భావించింది కోర్టు. వారికి బెయిల్ మంజూరు చేసింది. తప్పు చేసిన వాళ్లే దర్జగా బయటకు వెళ్తుంటే ఆ తండ్రి తట్టుకోలేకపోయాడు. నిందితులు కోర్టుకు తప్పుడు బర్త్ సర్టిఫికెట్లు ఇచ్చారని గ్రహించిన ఆ తండ్రి.. వాస్తవాలు వెలుగు తీసేందుకు ప్రయత్నించాడు. (మరో ఇద్దరు యువతుల ప్రమేయం!) నిజమైన బర్త్ సర్టిఫికెట్ల కోసం ఆ తర్వాత కొన్ని నెలల పాటు శ్రమించి ఆ ఐదుగురు నిందితుల స్వగ్రామాలైన హరియాణాలోని రోహ్తక్, పాల్వాల్, హిసార్లలో పర్యటించాడు. నిందితులు ప్రాథమిక స్థాయిలో చదివిన ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి వారి అసలు పుట్టిన తేదీల గురించి ఆరా తీయడం ప్రారంభించాడు. అతడి అనుమానం నిజమయ్యింది. పోలీసులు తప్పుడు బర్త్ సర్టిఫికెట్లు సమర్పించారని తెలిసింది. స్కూల్ రికార్డ్స్ ప్రకారం వారి మైనర్లు కాదని తేలింది. వీటిని కోర్టులో సమర్పించి.. నిందితుల బెయిల్ రద్దు చేయాలని బాధితురాలి తండ్రి కోరాడు. కోర్టు దీని గురించి పోలీసులను ప్రశ్నిస్తే వారు పొంతన లేని సమాధానాలు ఇచ్చారు. ‘కోర్టు ఆదేశాల మేరకు మేం పత్రాలను పరిశీలించి రికార్డు సబ్మిట్ చేశాం. అయితే నిందితులు ఇచ్చిన పత్రాలు నిజమైనవా.. కావా అనే విషయం తేల్చాల్సింది కోర్టు’ అన్నారు. ముఖ్యమంత్రికి ఫిర్యాదు బాధితురాలి తండ్రి ఇంతటితో ఊరుకోలేదు. జరిగిన విషయాల గురించి హరియాణా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశాడు. అనంతరం జరిగిన విచారణలో ఒక నిందితుడు తప్పుడు పత్రాలు సమర్పించాడని రుజువయ్యింది. దాంతో ఆరోగ్య శాఖ అతడి బర్త్ సర్టిఫికెట్‌ను క్యాన్సల్ చేసింది. నిందితుడితో పాటు అతడి తండ్రి, మరో ఇద్దరి మీద కూడా ఫోర్జరీ పత్రాలు సమర్పించారనే కారణంతో కేసు కూడా నమోదు చేసింది. మరో ఇద్దరిపై దర్యాప్తు కొనసాగుతోంది. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా కోర్టు విచారణకు తాత్కలికంగా బ్రేక్ పడింది. కోర్టులు తెరిచిన తర్వాత అయినా వీరందరికి తగిన శిక్ష పడుతుందని భావిస్తున్నాడు బాధితురాలి తండ్రి. ఏఐటీఏ నుంచి ఎలాంటి స్పందన లేదు ఈ సందర్భంగా బాధితురాలి తండ్రి మాట్లాడుతూ.. ‘ఈ విషయం గురించి నేను ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్‌కు లేఖ రాశాను. కానీ వారి నుంచి ఎలాంటి స్పందన లేదు. అంతేకాక చండీగఢ్ లాన్ టెన్నిస్ అసోసియేషన్(సీఎల్‌టీఏ) నిందితులకు చట్టపరమైన మద్దతు ఇవ్వడమే కాక వారి బెయిల్ బాండ్లను కూడా చెల్లించింది’ అని తెలిపాడు. దీని గురించి సీఎల్‌టీఏను ప్రశ్నించగా.. ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తున్నందున తామేమి స్పందించలేమని తెలిపింది. -
‘అర్జున’ బరిలో అంకిత, దివిజ్
న్యూఢిల్లీ: భారత అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారులు అంకితా రైనా, దివిజ్ శరణ్ కేంద్ర ప్రభుత్వ పురస్కారం ‘అర్జున’ అవార్డు బరిలో నిలవనున్నారు. 2018 ఆసియా క్రీడల పతక విజేతలైన వీరిద్దరి పేర్లను అర్జున అవార్డు కోసం అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ–ఐటా) సిఫారసు చేయనుంది. వీరిద్దరితో పాటు భారత డేవిస్ కప్ మాజీ కోచ్ నందన్ బాల్ పేరును ధ్యాన్‌చంద్ అవార్డు కోసం ‘ఐటా’ నామినేట్ చేయనున్నట్లు సమాచారం. -
‘ఐటా’ తీరు ఆశ్చర్యం కలిగించలేదు!
ముంబై: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) తనతో వ్యవహరించిన తీరు తనను తీవ్రంగా బాధించిందని మాజీ ఆటగాడు మహేశ్ భూపతి వ్యాఖ్యానించాడు. అయితే ‘ఐటా’ గత రికార్డును బట్టి చూస్తే ఇది తనకు ఏమాత్రం ఆశ్చర్యం కలిగించలేదని అతను అన్నాడు. పాకిస్తాన్‌తో జరిగే డేవిస్ కప్ మ్యాచ్ కోసం ముందుగా మహేశ్నే నాన్‌ప్లేయింగ్ కెప్టెన్‌గా ‘ఐటా’ ఎంపిక చేసింది. అయితే అతను పాకిస్తాన్ ప్రయాణించేందుకు ఇష్టపడటం లేదంటూ తొలగించింది. దీనిపై భూపతి స్పందించాడు. ‘నేను కెప్టెన్‌గా పనికి రానని వారు భావిస్తే తప్పు లేదు. కానీ ప్రస్తుతం నీకు బదులుగా మరొకరిని ఎంపిక చేస్తున్నామని ఒక్క ఫోన్ కాల్ చేసినా బాగుండేది. కానీ నాకు కనీస సమాచారం కూడా అందించలేదు. నన్ను కెప్టెన్‌గా ఎంపిక చేయాలని భావించిన రోజున హైదరాబాద్‌కు వచ్చి మరీ నాతో కలిసి మాట్లాడారు. కానీ ఇప్పుడు వారి ప్రవర్తన తీవ్ర నిరాశ కలిగించింది. నేను బాధ పడటం కూడా సహజం. అయితే గత ఇరవై ఏళ్లుగా భారత టెన్నిస్ సంఘం పలువురు ఆటగాళ్లతో వ్యవహరించిన తీరును బట్టి చూస్తే ఇది ఆశ్చర్యం కలిగించలేదు’ అని భూపతి వివరించాడు. -
ఐటా సింగిల్స్ చాంప్ వినీత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కుర్రాడు ముత్యాల వినీత్ అదరగొట్టాడు. తొలిసారి తెలుగు రాష్ట్రాల నుంచి బాలుర విభాగంలో అఖిల భారత టెన్నిస్ సంఘం సింగిల్స్ టైటిల్‌ని నెగ్గిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. బాలుర అండర్–14 విభాగంలో వినీత్ విజేతగా నిలిచాడు. శనివారం జరిగిన ఫైనల్లో వినీత్ 6–3, 4–6, 6–3తో సిద్ధార్థ్ మరాఠే (మహారాష్ట్ర)పై విజయం సాధించి టైటిల్‌ను ఖాయం చేసుకున్నాడు. తొలి సెట్ గెలిచిన వినీత్ రెండో సెట్లో వెనుకబడ్డాడు. అయితే నిర్ణాయక మూడో సెట్లో దూకుడుగా ఆడి సెట్‌తో పాటు మ్యాచ్‌నూ గెలిచాడు. -
మరీ ఇంత దారుణమా?: మహేశ్ భూపతి
న్యూఢిల్లీ: తనను భారత డేవిస్‌కప్ నాన్ ప్లేయింగ్ కెప్టెన్సీ పదవి నుంచి తొలగించడంపై మాజీ టెన్నిస్ ఆటగాడు మహేశ్ భూపతి ఆవేదన వ్యక్తం చేశాడు. టెన్నిస్ కెరీర్‌కు ఎప్పుడో దూరమైన భూపతి.. డేవిస్‌కప్ ఆడే భారత జట్టుకు ఇప్పటివరకూ కెప్టెన్‌గా వ్యవహరిస్తూ వచ్చాడు. అయితే ఆలిండియా టెన్నిస్ అసోసియేషన్(ఐటా) అతన్ని కెప్టెన్సీ పదవి నుంచి అర్థాంతరంగా తొలగించడంపై భూపతి మండిపడ్డాడు. మరీ ఇంత దారుణంగా వ్యహరిస్తారా అంటూ ఐటా తీరును తప్పుబట్టాడు. ‘ నన్ను భారత డేవిస్‌కప్ కెప్టెన్సీ నుంచి తప్పించాలంటే ఆ పని ముందే చేయాల్సింది. ఈ ఏడాది ఆరంభంలో ఇటలీతో జరిగిన డేవిస్‌కప్‌లో భారత్ ఓడిపోయినప్పుడే కెప్టెన్సీ నుంచి తప్పించాల్సింది. ఇప్పుడు దాన్ని సాకుగా చూపుతూ ఉన్నపళంగా కెప్టెన్సీ నుంచి తప్పించారు. ఇక్కడ ఐటా వ్యవహరించిన తీరు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఒక్కసారిగా నన్ను తప్పించడం వెనుక కుట్ర జరిగింది. నేను ఎప్పుడూ ఆటగాళ్ల కోసం వారి రక్షణ కోసం ఆలోచిస్తూ వచ్చాను. దానిలో భాగంగానే డేవిస్‌కప్ మ్యాచ్‌లు ఆడటానికి పాకిస్తాన్ వెళ్లలేమని ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్(ఐటీఎఫ్)కు తేల్చిచెప్పాను దాంతో తటస్థ వేదికపై ఆడటానికి ఐటీఎఫ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అక్టోబర్ 15వ తేదీన జరిగిన ఒక సమావేశానికి నేను కెప్టెన్సీ హోదాలో హాజరయ్యా. ఉన్నట్టుండి నా కెప్టెన్సీకి స్వస్థి పలికారు. నవంబర్ 4వ తేదీన నన్ను కెప్టెన్‌గా తొలగిస్తూ ఐటా సెక్రటరీ జనరల్ హిరోన్మయ్ ఛటర్జీ ఫోన్లో చెప్పారు. కానీ కారణాలు చెప్పలేదు. విభజించు-పాలించు విధానాన్ని ఐటా అవలంభిస్తోంది’ అని మహేశ్ భూపతి విమర్శించాడు. -
సెమీస్‌లో సాయిదేదీప్య
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) సీవీజీ నాయుడు స్మారక ఆలిండియా మహిళల టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి వై. సాయిదేదీప్య నిలకడగా రాణిస్తోంది. బెంగళూరు వేదికగా జరుగుతోన్న ఈ టోరీ్నలో దేదీప్య సెమీఫైనల్‌కు చేరుకుంది. బుధవారం సింగిల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌లో సాయిదేదీప్య 6–1, 6–1తో షరోన్ విలియమ్స్ (కర్ణాటక)పై ఘనవిజయం సాధించింది. అంతకుముందు ప్రిక్వార్టర్స్‌లో 6–2, 6–2తో ఆపేక్ష సోలంకీ (కర్ణాటక)పై గెలుపొందగా... తొలి రౌండ్లో తెలంగాణ ప్లేయర్ మౌలికరామ్ తప్పుకోవడంతో దేదీప్యకు వాకోవర్ లభించింది. ఇదే టోరీ్నలో మరో హైదరాబాద్ అమ్మాయి శ్రీవల్లి రషి్మక క్వార్టర్స్‌కు చేరుకుంది. ప్రిక్వార్టర్స్‌లో రష్మిక 6–0, 6–1తో అదితి నారాయణన్‌పై నెగ్గింది. తొలి రౌండ్లో ఆమె 6–3, 6–0తో ఎస్బీ అపూర్వను ఓడించింది. నేడు జరిగే క్వార్టర్స్ మ్యాచ్‌లో వన్షిత పతానియా (కర్ణాటక)తో దేదీప్య ఆడుతుంది. -
ప్రిక్వార్టర్స్‌లో తీర్థశశాంక్
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) పురుషుల టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ ఎం. తీర్థ శశాంక్ నిలకడగా రాణిస్తున్నాడు. పంజాబ్‌లోని జసోవాల్ వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీలో శశాంక్ ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్నాడు. సోమవారం పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో తీర్థ శశాంక్ (తెలంగాణ) 6–3, 6–4తో ఎనిమిదో సీడ్ అనురాగ్ (ఢిల్లీ)పై విజయం సాధించాడు. -
చాందిని డబుల్
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) ర్యాంకింగ్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి చాందిని శ్రీనివాసన్ సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో విజేతగా నిలిచింది. జలంధర్‌లో జరిగిన ఈ టోర్నీలో అండర్–14 బాలికల సింగిల్స్ ఫైనల్లో చాందిని 6–0, 6–1తో ప్రాణ్య (ఢిల్లీ)పై గెలుపొందింది. సెమీస్‌లో 6–0, 6–2తో సహీరా సింగ్ (హరియాణా)పై, క్వార్టర్స్‌లో 6–1, 6–1తో ఐశ్వర్య (మహారాష్ట్ర)పై గెలిచింది. డబుల్స్‌లో ప్రతిష్ట సైనీ (పంజాబ్)తో జతకట్టిన చాందిని ఫైనల్లో 6–2, 6–3తో ఇనాయత్ రాయ్–ప్రాణ్యలను ఓడించి చాంపియన్లుగా నిలిచారు. సెమీస్‌లో చాందిని–ప్రతిష్ట ద్వయం 6–2, 6–2తో సీరత్ (పంజాబ్)–షగుణ్ (ఉత్తరప్రదేశ్) జోడీపై గెలిచి ఫైనల్‌కు చేరుకుంది. -
రన్నరప్ రాజేశ్వర్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్:అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారుడు పట్లోళ్ల రాజేశ్వర్ రెడ్డి ఆకట్టుకున్నాడు. హరియాణాలోని కర్నాల్‌లో జరిగిన ఈ టోర్నీలో రాజేశ్వర్ రెడ్డి రన్నరప్ ట్రోఫీని అందుకున్నాడు. శుక్రవారం జరిగిన అండర్–16 బాలుర సింగిల్స్ ఫైనల్లో రాజేశ్వర్ రెడ్డి (తెలంగాణ) 5–7, 2–6తో ఆర్యన్ ఠాకూర్ (చండీగఢ్) చేతిలో వరుస సెట్లలో ఓడిపోయాడు. -
తరుణ్, తానియాలకు టైటిళ్లు
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) టోర్నమెంట్లో తానియా సరాయ్, టి. తరుణ్ సత్తా చాటారు. సానియా మీర్జా టెన్నిస్ అకాడమీలో జరిగిన ఈ టోర్నీలో అండర్–14 బాలబాలికల విభాగాల్లో వీరిద్దరూ టైటిళ్లను కైవసం చేసుకున్నారు. బాలుర ఫైనల్లో తరుణ్ 6–4, 6–4తో శ్రీశరణ్పై గెలుపొందగా... బాలికల కేటగిరీలో తానియా 6–2, 6–3తో లక్ష్మీశ్రీని ఓడించింది. అండర్–12 కేటగిరీలో వన్షిక మరియా, తిరుమురుగన్ విజేతలుగా నిలిచారు. బాలుర తుదిపోరులో తిరుమురుగన్ 6–2, 6–2తో అనీష్ జైన్‌పై, బాలికల ఫైనల్లో వన్షిక 5–7, 6–4, 6–2తో రిషితపై విజయం సాధించారు. మరోవైపు బాలుర డబుల్స్ విభాగంలో మురళీ కౌశల్–భవ్యానంద్ రెడ్డి జంట... బాలికల విభాగంలో రిషిత–తోరిత చక్రవర్తి జంటలు చాంపియన్లుగా నిలిచాయి. ఆకాంక్ష–స్నిగ్ధ జోడీ, ఆరవ్–శ్రీవంత్ రెడ్డి జోడీ రన్నరప్‌తో సరిపెట్టుకున్నాయి. అండర్–14 బాలుర డబుల్స్ ఫైనల్లో ప్రణీత్ సింగ్–మిహిర్ పర్చా జోడీపై తరుణ్ కోర్వర్–శ్రీశరణ్ జంట... బాలికల విభాగంలో లక్ష్మీసిరి–పద్మ వేద జోడీపై తానియా సరాయ్–నైనిక రెడ్డి ద్వయం గెలుపొంది విజేతలుగా నిలిచాయి. -
సింగిల్స్ విజేత లక్ష్మీసాహితిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ), చండీగఢ్ లాన్ టెన్నిస్ సంఘం (సీఎల్‌టీఏ) ఆధ్వర్యంలో జరిగిన జాతీయ సీనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వుటుకూరు లక్ష్మీసాహితిరెడ్డి చాంపియన్‌గా అవతరించింది. చండీగఢ్‌లో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో లక్ష్మీసాహితి 7–5, 6–4తో సాల్సా అహిర్ (మహారాష్ట్ర)పై వరుస సెట్లలో విజయం సాధించింది. కడప జిల్లా పులివెందుల ప్రాంతానికి చెందిన లక్ష్మీసాహితి క్వాలిఫయర్ హోదాలో మెయిన్ ‘డ్రా’లో అడుగుపెట్టింది. టైటిల్ గెలిచే క్రమంలో ఆమె ప్రత్యర్థులకు ఒక్కసెట్ కూడా కోల్పోకపోవడం విశేషం. తొలి రౌండ్లో లక్ష్మీసాహితి 6–2, 6–2తో ఆర్తి మునియన్ (తమిళనాడు)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లో 7–6 (8/6), 6–1తో టాప్ సీడ్ యుబ్రాని బెనర్జీ (పశ్చిమ బెంగాల్)కి షాకిచ్చింది. క్వార్టర్ ఫైనల్లో 6–2, 6–4తో ఆరో సీడ్ ప్రేరణ బాంబ్రీ (ఢిల్లీ)పై, సెమీఫైనల్లో 6–4, 6–3తో నాలుగో సీడ్ శ్రావ్య శివాని (తెలంగాణ)పై విజయం సాధించింది. -
సాయికార్తీక్ రెడ్డికి సింగిల్స్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: గురుకుల్ ‘ఐటా’ ఆలిండియా పురుషుల టెన్నిస్ టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారుడు జి. సాయికార్తీక్ రెడ్డి అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు. భువనేశ్వర్‌లో జరిగిన ఈ టోర్నమెంట్లో క్వాలిఫయర్‌గా బరిలోకి దిగిన సాయికార్తీక్ విజేతగా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ టైటిల్‌పోరులో అన్‌సీడెడ్ సాయికార్తీక్ 6–3, 6–3తో టాప్ సీడ్ అన్షు కుమార్ భూయాన్ (ఒడిశా)ను కంగుతినిపించాడు. ఈ టోర్నమెంట్ ఆసాంతం నిలకడగా ఆడిన సాయికార్తీక్... జనవరిలో జరిగిన ఖేలో ఇండియా చాంపియన్‌షిప్‌లో అండర్–21 పురుషుల సింగిల్స్, డబుల్స్ కేటగిరీల్లో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించాడు. -
టైటిల్ పోరుకు సాయికార్తీక్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: గురుకుల్ ‘ఐటా’ ఆలిండియా పురుషుల టెన్నిస్ ర్యాంకింగ్ టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారుడు జి. సాయికార్తీక్ రెడ్డి నిలకడైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. భువనేశ్వర్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో క్వాలిఫయర్‌గా బరిలోకి దిగిన సాయికార్తీక్ రెడ్డి తనకన్నా మెరుగైన క్రీడాకారులను ఓడించి టైటిల్‌పోరుకు అర్హత సాధించాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో సాయికార్తీక్ రెడ్డి 6–2, 6–4తో రెండోసీడ్ విలాసిర్ (హరియాణా)పై విజయం సాధించాడు. అంతకుముందు జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌లో సాయికార్తీక్ 4–6, 6–3, 6–2తో కైవల్య కలాంసే (మహారాష్ట్ర)పై పోరాడి గెలిచాడు. రెండో రౌండ్లో 3–6, 6–0, 6–2తో వి. హేవంత్ (తెలంగాణ)పై, తొలి రెండ్లో ఏకే రోహిత్‌పై గెలుపొందాడు. -
రన్నరప్ సాయిదేదీప్య జంట
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) మహిళల టోర్నమెంట్లో హైదరాబాద్ క్రీడాకారులు సాయిదేదీప్య, మౌలిక రామ్ రాణించారు. బెంగళూరులో జరిగిన ఈ టోర్నీలో వీరిద్దరూ జతగా రన్నరప్‌గా నిలిచారు. గురువారం జరిగిన టైటిల్‌పోరులో సాయిదేదీప్య–మౌలిక రామ్ ద్వయం 6–0, 4–6, 10–8తో సాల్సా అహెర్ (మహారాష్ట్ర)–లిఖిత (తెలంగాణ) జంట చేతిలో ఓడిపోయింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో సాయిదేదీప్య–మౌలిక జంట 6–4, 6–2తో ఆర్తి ముణియన్ (తమిళనాడు)–విదుల (కర్ణాటక) జోడీపై గెలుపొందింది. -
సెమీస్‌లో సాయిదేదీప్య జోడీ
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) మహిళల టోర్నమెంట్లో హైదరాబాద్ క్రీడాకారులు సాయిదేదీప్య, మౌలిక రామ్ నిలకడగా రాణిస్తున్నారు. బెంగళూరులో జరుగుతోన్న ఈ టోర్నీలో జంటగా బరిలోకి దిగిన వీరిద్దరూ డబుల్స్ విభాగంలో సెమీఫైనల్ చేరుకున్నారు. బుధవారం జరిగిన మహిళల క్వార్టర్ ఫైనల్లో సాయిదేదీప్య–మౌలిక రామ్ ద్వయం 6–2, 7–6 (9/7)తో రాధిక యాదవ్ (హరియాణా)–స్నిగ్ధ (కర్ణాటక) జోడీపై విజయం సాధించి ముందంజ వేసింది. -
సంజన డబుల్ ధమాకా
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) అండర్–16, అండర్–18 టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి సంజన సిరిమల్ల సత్తా చాటింది. హరియాణాలోని కర్నల్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో ఆమె పాల్గొన్న రెండు వయో విభాగాల్లోనూ విజేతగా నిలిచి రెండు టైటిళ్లను హస్తగతం చేసుకుంది. అండర్–16 బాలికల సింగిల్స్ విభాగంలో విజేతగా నిలిచిన సంజన... అండర్–18 కేటగిరీలో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. కానీ అండర్–18 డబుల్స్ కేటగిరీలో తన భాగస్వామి ఆర్నిరెడ్డితో కలిసి చాంపియన్‌గా నిలిచింది. శనివారం జరిగిన అండర్–16 బాలికల టైటిల్‌పోరులో సంజన 6–4, 7–5తో రాధిక రాజేశ్ (మహారాష్ట్ర)పై గెలుపొందింది. అంతకుముందు జరిగిన సెమీస్‌లో సంజన 6–2, 6–1తో నియతి (ఉత్తరాఖండ్)పై, క్వార్టర్స్‌లో 6–2, 6–0తో క్రిస్టీ బోరో (అస్సాం)పై, ప్రిక్వార్టర్స్‌లో 6–0, 6–0తో వన్య అరోరా (మహారాష్ట్ర)పై, తొలి రౌండ్లో 6–1, 6–3తో అనా వర్షిణి (ఉత్తర్‌ప్రదేశ్)పై విజయం సాధించింది. సింగిల్స్ ఓడినా.. డబుల్స్ దక్కింది అండర్–16 విభాగంలో ఆధిపత్యం ప్రదర్శించిన సంజన... అండర్–18 కేటగిరీ సింగిల్స్‌లో చివరి మెట్టుపై తడబడింది. ఫైనల్లో సంజన 4–6, 3–6తో గార్గి (మహారాష్ట్ర) చేతిలో ఓడిపోయింది. అంతకుముందు జరిగిన సెమీస్ మ్యాచ్‌లో సంజన 6–4, 1–6, 6–1తో కశిష్ భాటియా (ఢిల్లీ)పై, క్వార్టర్స్‌లో 6–1, 5–7, 6–4తో హర్లీన్ కౌర్ (పంజాబ్)పై, ప్రిక్వార్టర్స్‌లో 6–1, 6–2తో క్రితిక (హరియాణా)పై, తొలి రౌండ్లో 6–1, 6–1తో ఐరా సూద్ (తెలంగాణ)పై గెలుపొంది ంది. మరోవైపు డబుల్స్ విభాగంలో భాగస్వామి ఆర్నిరెడ్డితో కలిసి సంజన టైటిల్‌ను సాధించింది. అండర్–18 బాలికల డబుల్స్ తుదిపోరులో సంజన–ఆర్నిరెడ్డి ద్వయం 7–6, 6–4తో పవిత్రా రెడ్డి జోడీపై విజయం సాధించింది. -
ఫైనల్లో అపురూప్ రెడ్డి జోడీ
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం పురుషుల టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారుడు పి. అపురూప్ రెడ్డి నిలకడగా రాణిస్తున్నాడు. తన భాగస్వామి బీఆర్ నిక్షేప్‌తో కలిసి అపురూప్ రెడ్డి డబుల్స్ విభాగంలో టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీస్ మ్యాచ్‌లో పి.అపురూప్ రెడ్డి–నిక్షేప్ ద్వయం 6–1, 6–3తో ఆకాశ్ నంద్వాల్–ఉదిత్ యాదవ్ జంటపై గెలుపొందింది. అంతకుముందు క్వార్టర్స్‌లో అపురూప్–నిక్షేప్ జంట 6–0, 6–1తో సందీప్ యాదవ్–హ్రితేశ్ పటేల్ జోడీని ఓడించింది. నేడు జరిగే ఫైనల్లో తాహా కపాడియా–పరీక్షిత్ సోమని జంటతో అపురూప్ జోడీ తలపడుతుంది. అరబిందో ఫార్మా ఫౌండేషన్ గత మూడేళ్లుగా అపురూప్ రెడ్డికి స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. -
నిధి చిలుములకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) పురుషుల, మహిళల టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి నిధి చిలుముల విజేతగా నిలిచింది. పుణేలో జరిగిన ఈ టోర్నీలో మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకొని ఈ సీజన్లో తొలి టైటిల్‌ను అందుకుంది. ఆదివారం గంటన్నరపాటు జరిగిన తుదిపోరులో ఏడో సీడ్ నిధి చిలుముల 6–4, 6–0తో నాలుగో సీడ్ సోహా సాధిక్ (కర్ణాటక)పై విజయం సాధించింది. విజేతగా నిలిచిన నిధి రూ. 15,600 ప్రైజ్‌మనీగా అందుకుంది. పురుషుల సింగిల్స్‌లో స్థానిక ఆటగాడు అన్విత్ బింద్రే చాంపియన్‌గా నిలిచాడు. డబుల్స్ విభాగంలో తెలంగాణ అమ్మాయి శ్రావ్య చిలకలపూడి జంట టైటిల్‌ను హస్తగతం చేసుకుంది. మహిళల డబుల్స్ ఫైనల్లో శ్రావ్య (తెలంగాణ)–వైదేహి చౌదరి (గుజరాత్) ద్వయం 4–6, 6–1, 10–5తో షేక్ హుమేరా–సారా యాదవ్ (తెలంగాణ) జంటపై పోరాడి గెలుపొందింది. -
టైటిల్ పోరుకు నిధి, సోహా
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) పురుషుల, మహిళల ఓపెన్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారులు నిధి చిలుముల, షేక్ హుమేరా, సారా యాదవ్ నిలకడగా రాణిస్తున్నారు. పుణేలో జరుగుతోన్న ఈ టోర్నీలో నిధి సింగిల్స్ విభాగంలో... షేక్ హుమేరా–సారా యాదవ్ ద్వయం డబుల్స్ కేటగిరీలలో ఫైనల్‌కు చేరుకున్నారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్‌లో ఏడో సీడ్ నిధి చిలుముల (తెలంగాణ) 7–6 (9/7), 6–4తో టాప్ సీడ్ వైదేహి చౌదరీ (గుజరాత్)కి షాకిచ్చింది. మరో మ్యాచ్‌లో నాలుగో సీడ్ సోహా సాధిక్ (ఆంధ్రప్రదేశ్) 6–3, 6–2తో రెండో సీడ్ నిత్యరాజ్ బాబురాజ్ (తమిళనాడు)ను కంగుతినిపించింది. మరోవైపు మహిళల డబుల్స్ సెమీస్ మ్యాచ్‌లో షేక్ హుమేరా–సారా యాదవ్ ద్వయం 6–3, 6–4తో సాయి–ఆర్తి జంటపై గెలుపొందగా... అనూష కొండవీటి–సాయిదేదీప్య జంట 1–6, 1–6తో శ్రావ్య చిలకలపూడి–వైదేహి చౌదరీ జంట చేతిలో ఓటమి పాలైంది. -
ఫైనల్లో సాయిదేదీప్య జంట
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) మహిళల టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి వై. సాయిదేదీప్య నిలకడగా రాణి స్తోంది. బెంగళూరులో జరుగుతోన్న ఈ టోర్నీలో తన భాగస్వామి అనూష కొండవీటి (ఏపీ)తో కలిసి డబుల్స్ ఫైనల్‌కు చేరుకుంది. బుధవారం జరిగిన బాలికల డబుల్స్ సెమీఫైనల్లో సాయిదేదీప్య (తెలంగాణ)–అనూష (ఏపీ) ద్వయం 7–6 (7/5), 6–1తో ఆర్తి మునియన్ (తమిళనాడు)–దీక్ష మంజు ప్రసాద్ (కర్ణాటక) జంటపై విజయం సాధించింది. -
మలిష్క డబుల్ ధమాకా
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) చాంపియన్‌షిప్ సిరీస్ అండర్–14 టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి కె. మలిష్క సత్తా చాటింది. కాకినాడలోని కాస్మోపాలిటన్ క్లబ్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో మలిష్క సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో విజేతగా నిలిచి రెండు టైటిళ్లను కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన బాలికల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ మలిష్క (తెలంగాణ) 6–0, 6–3తో రెండోసీడ్ హర్షిణి విశ్వనాథ్ (ఏపీ)పై విజయం సాధించింది. అంతకుముందు జరిగిన సెమీస్‌లో మలిష్క 6–1, 6–2తో రాహీన్ తరనమ్ (తెలంగాణ)పై, క్వార్టర్స్‌లో 6–2, 6–1తో జ్యోత్స్న (ఏపీ)పై నెగ్గింది. మరోవైపు బాలికల డబుల్స్ టైటిల్‌పోరులో మలిష్క–రాహీన్ (తెలంగాణ) ద్వయం 7–5, 6–2తో హర్షిణి–జ్యోత్స్న (ఏపీ) జోడీపై నెగ్గి చాంపియన్‌గా నిలిచింది. సెమీస్‌లో మలిష్క జంట 6–1, 6–2తో శవినిత–చరిష్మా జోడీపై గెలిచింది. బాలుర విభాగంలో మహారాష్ట్రకు చెందిన అర్నవ్ విజేతగా నిలవగా... ఏపీ ప్లేయర్ సుహృధ్ రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. ఫైనల్లో అర్నవ్ 7–6 (1), 6–1తో సుహృధ్‌ను ఓడించాడు. డబుల్స్ ఫైనల్లో మురళీ సాత్విక్–సుహృధ్ (ఏపీ) జంట 6–3, 6–1తో సిద్ధాంత్ కృష్ణ (హరియాణా)–యజ్ఞేశ్ (తెలంగాణ) జోడీపై విజయం సాధించి టైటిల్‌ను అందుకుంది., , , -
అబ్దుల్ గఫర్, ప్రతిమ శుభారంభం
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) వీల్ చెయిర్ టెన్నిస్ టోర్నమెంట్లో కర్ణాటక క్రీడాకారులు అబ్దుల్ గఫర్, ప్రతిమా రావు శుభారంభం చేశారు. హైదరాబాద్ తొలిసారి ఆతిథ్యమిస్తోన్న ఈ టోర్నీలో వీరిద్దరూ తొలిరౌండ్లో విజయం సాధించారు. ఎల్బీ స్టేడియంలో నాలుగు రోజుల పాటు జరుగనున్న ఈ టోర్నీని అగ్రశ్రేణి కథానాయిక అక్కినేని సమంత ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. బుధవారం జరిగిన పురుషుల తొలిరౌండ్ మ్యాచ్‌లో అబ్దుల్ గఫర్ 9–2తో దేవేంద్ర (కర్ణాటక)పై గెలుపొందగా... మహిళల విభాగంలో ప్రతిమా రావు 9–0తో సుధ (కర్ణాటక)ను ఓడించింది. ఇతర మ్యాచ్‌ల్లో శిల్ప 9–6తో నళిని కుమారిపై, వీరాస్వామి శేఖర్ (కర్ణాటక) 9–0తో కుందరాగి బసవరాజు (కర్ణాటక)పై గెలుపొందారు. ఇతర పురుషుల తొలిరౌండ్ మ్యాచ్‌ల్లో అంజినప్ప (కర్ణాటక) 9–5తో కేదార్ మండల్ (ఢిల్లీ)పై, శరవణన్ (కర్ణాటక) 9–3తో ఇందుధర బీఎస్ (కర్ణాటక)పై, దేవ గౌడ (కర్ణాటక) 7–5తో కేశవన్ (కర్ణాటక)పై, మౌలాలి (కర్ణాటక) 9–4తో హనుమంతప్ప (కర్ణాటక)పై నెగ్గారు. పోటీలకు ముందు జరిగిన టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శాట్స్ ఎండీ ఎ. దినకర్‌బాబు, తెలంగాణ రాష్ట్ర టెన్నిస్ సంఘం కార్యదర్శి అశోక్ కుమార్, ఇండియన్ వీల్‌చెయిర్ టెన్నిస్ టూర్ (ఐడబ్ల్యూటీటీ) చైర్మన్ సునీల్ జైన్, భారత టెన్నిస్ ప్లేయర్ విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు. -
రన్నరప్ సాయిదేదీప్య జోడీ
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) మహిళల టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి సాయిదేదీప్య రాణించింది. కోయంబత్తూర్‌లో జరిగిన ఈ టోర్నీలో తన భాగస్వామి సారా యాదవ్‌తో కలిసి డబుల్స్ రన్నరప్‌గా నిలిచింది. శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో సాయిదేదీప్య–సారా యాదవ్ (మధ్య ప్రదేశ్) జంట 2–6, 4–6తో నిధి చిలుముల (తెలంగాణ)–శ్వేతా రాణా (ఢిల్లీ) జోడీ చేతిలో పరాజయం పాలైంది. -
అదితి డబుల్ ధమాకా
సాక్షి, హైదరాబాద్: ఐటా చాంపియన్‌షిప్ సిరీస్‌లో తెలంగాణ అమ్మాయి అదితి ఆరే రెండు టైటిళ్లను కైవసం చేసుకుంది. కొంపల్లిలో జరిగిన ఈ టోర్నీలో ఆమె అండర్–16, 18 బాలికల సింగిల్స్ విభాగాల్లో విజేతగా నిలిచింది. శుక్రవారం జరిగిన అండర్–18 బాలికల సింగిల్స్ ఫైనల్లో అదితి 6–4, 6–2తో ఆర్ని రెడ్డి (తెలంగాణ)పై గెలుపొందింది. బాలుర విభాగంలో ఇక్బాల్ ఖాన్ (తెలంగాణ) 7–5, 6–4తో సుహిత్ రెడ్డి (తెలంగాణ)ను ఓడించాడు. అండర్–16 ఫైనల్లో అదితి 6–3, 6–4తో అభయ వేమూరి (తెలంగాణ)పై గెలుపొందింది. బాలుర డబుల్స్‌లో మోహిత్ జోడీ విజేతగా నిలిచింది. అండర్–18 బాలికల డబుల్స్ ఫైనల్లో అభయ– అపూర్వ (తెలంగాణ) ద్వయం 6–3, 6–0తో వేద వశిష్ట– వేదరాజు ప్రపూర్ణ (తెలంగాణ) జోడీపై నెగ్గగా... బాలుర విభాగంలో సుహిత్ రెడ్డి (తెలంగాణ)–అద్వైత్ అగర్వాల్ (మహారాష్ట్ర) జంట 7–5, 6–3తో రిషికేశ్ సుంకర–కార్తీక్ నీల్ వడ్డేపల్లి (తెలంగాణ) జోడీని ఓడించి విజేతలుగా నిలిచాయి.