Amsterdam
-
Joyeeta Gupta: డైనమిక్ ప్రొఫెసర్‌కు డచ్ నోబెల్
ఆర్థికశాస్త్రం చదువుకున్నవారి ఆసక్తి గణాంకాలకే పరిమితమని, న్యాయశాస్త్రం చదువుకున్న వారి ఆసక్తి ఆ శాస్త్రానికి సంబంధించిన అంశాలపైనే ఉంటుందనేది ఒక సాధారణ భావన. ‘విభిన్న విద్యానేపథ్యం ఉన్న మేధావి’గా గుర్తింపు పొందిన జ్యోయితా గుప్తా ఆర్థికశాస్త్రం నుంచి న్యాయశాస్త్రం వరకు ఎన్నో శాస్త్రాలు చదివింది. అయితే ఆమె ప్రయాణంలో ఆ శాస్త్రాలేవీ వేటికవే అన్నట్లుగా ఉండిపోలేదు. వాతావరణ మార్పులపై తాను చేసిన శాస్త్రీయ పరిశోధనకు మరింత విస్తృతిని ఇచ్చాయి. నెదర్లాండ్స్‌లోని యూనివర్శిటీ ఆఫ్ ఆమ్‌స్టార్‌డమ్‌లో ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న జ్యోయితా గుప్తా డచ్ రిసెర్చి కౌన్సిల్ నుంచి ‘డచ్ నోబెల్’గా పేరొందిన ప్రతిష్టాత్మకమైన స్పినోజా ప్రైజ్‌ను ది హేగ్‌లో అందుకుంది... దిల్లీలో పుట్టి పెరిగింది జ్యోయితా గుప్తా. లోరెటో కాన్వెంట్ స్కూల్లో చదువుకుంది. దిల్లీ యూనివర్శిటీలో ఎకనామిక్స్, గుజరాత్ యూనివర్శిటీలో న్యాయశాస్త్రం, హార్వర్డ్ లా స్కూల్లో ఇంటర్నేషనల్ లా చదివింది. ‘అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వాతావరణ మార్పులు’ అనే అంశంపై ఆమ్స్టార్ డామ్‌లోని వ్రిజే యూనివర్శిటీలో డాక్టరేట్ చేసింది. 2013లో ఈ యూనివర్శిటీలో ఫ్యాకల్టీగా చేరింది. వాతావరణ మార్పుల వల్ల సమాజంపై కలుగుతున్న ప్రభావం, ఉత్పన్నమవుతున్న సామాజిక అశాంతి... మొదలైన అంశాలపై లోతైన పరిశోధనలు చేసింది. 2016లో ఐక్యరాజ్య సమితి ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఔట్లుక్ (జీఈవో)కు కో– చైర్‌పర్సన్‌గా నియమితురాలైంది. యూనివర్శిటీ ఆఫ్ ఆమ్‌స్టర్‌డమ్‌లో ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న జ్యోయితా గుప్తా ‘ఆమ్స్టర్డామ్ గ్లోబల్ చేంజ్ ఇన్స్టిట్యూట్’ సభ్యులలో ఒకరు. పరిశోధనలకే పరిమితం కాకుండా పర్యావరణ సంబంధిత అంశాలపై విలువైన పుస్తకాలు రాసింది జ్యోయిత. ‘ది హిస్టరీ ఆఫ్ గ్లోబల్ క్లైమెట్ గవర్నెన్స్’ ‘ది క్లైమెట్ ఛేంజ్ కన్వెన్షన్ అండ్ డెవలపింగ్ కంట్రీస్’ ‘టాక్సిక్ టెర్రరిజమ్: డంపింగ్ హజడస్ వేస్ట్’ ‘అవర్ సిమరింగ్ ప్లానెట్’ ‘ఆన్ బిహాఫ్ ఆఫ్ మై డెలిగేషన్: ఏ సర్వె్యవల్ గైడ్ ఫర్ డెవలపింగ్ కంట్రీ క్లైమెట్ నెగోషియేటర్స్’ ‘మెయిన్ స్ట్రీమింగ్ క్లైమేట్ చేంజ్ ఇన్ డెవలప్మెంట్ కో ఆపరేషన్’... మొదలైన పుస్తకాలు రాసింది. అమెరికా పరిశ్రమల చెత్త ఏ దేశాలకు చేరుతుంది? ఎంత విషతుల్యం అవుతుందో 1990లోనే ‘టాక్సిక్ టెర్రరిజమ్: డంపింగ్ హాజడస్ వేస్ట్’ పుస్తకంలో కళ్లకు కట్టినట్లు వివరించింది. పాశ్చాత్య దేశాల పరిశ్రమలు ఉత్పత్తి చేసే విషపూరిత వ్యర్థాలు మరోవైపు విదేశీ మారకద్రవ్యం కోసం పరితపిస్తూ పర్యావరణాన్ని పట్టించుకోని దేశాల గురించి లోతైన విశ్లేషణ చేసింది జ్యోయిత. సాధారణంగానైతే పర్యావరణ అంశాలకు సంబంధించిన చర్చ, విశ్లేషణ ఒక పరిధిని దాటి బయటికి రాదు. అయితే జ్యోయిత విశ్లేషణ మాత్రం ఎన్నో కోణాలను ఆవిష్కరించింది. వాతావరణంలోని మార్పులు ప్రభుత్వ పాలనపై చూపే ప్రభావం, ధనిక, పేద సమాజాల మధ్య తలెత్తే వైరుధ్యాల గురించి చెప్పడం ఇందుకు ఒక ఉదాహరణ. ‘ప్రపంచవ్యాప్తంగా తగినన్ని ఆర్థిక వనరులు ఉన్నాయి. అందరి జీవితాలను బాగు చేయడానికి ఆ వనరులను ఎలా ఉపయోగించాలనేదే సమస్య. ప్రపంచవ్యాప్తంగా సంపన్నులు, నిరుపేదల మధ్య అసమానతలు ఉన్నాయి. భారత్‌లాంటి దేశాల్లో కూడా ఇదొక పెద్ద సవాలు’ అంటుంది జ్యోయిత. ఆమె విశ్లేషణలో విమర్శ మాత్రమే కనిపించదు. సందర్భాన్ని బట్టి పరిష్కారాలు కూడా కనిపిస్తాయి. ‘విస్తృతమైన, విలువైన పరిశోధన’ అంటూ స్పినోజా ప్రైజ్ జ్యూరీ గుప్తాను కొనియాడింది. కొత్త తరం పరిశోధకులకు ఆమె మార్గదర్శకత్వం విలువైనదిగా ప్రశంసించింది. తనకు లభించిన బహుమతి మొత్తాన్ని (1.5 మిలియన్ యూరోలు) శాస్త్రపరిశోధన కార్యక్రమాలపై ఖర్చు చేయాలని నిర్ణయం తీసుకుంది జ్యోయితా గుప్తా. అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణకు, పర్యావరణ సంరక్షణకు చట్టాలతో కూడిన ప్రపంచ రాజ్యాంగం కోసం జ్యోయితా గుప్తా గట్టి కృషి చేస్తోంది. -
కాలువ శుభ్రం చేస్తుంటే వందలకొద్దీ సైకిళ్లు.. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి?
భారతదేశం అయినా విదేశాల్లో అయినా సరే ప్రతి పౌరుడి బాధ్యత తన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం. విదేశాల్లో రోడ్డుపై చెత్త వేయడం నేరంతో సమానం. ఇందుకు కఠినమైన నిబంధనలు అమలులో ఉన్నాయి. అయినా చాలామంది నిర్లక్ష్య ధోరణితోనే వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో ఇందుకు నిదర్శనంగా నిలిచింది. ఈ వీడియోలో కాలువను శుభ్రం చేస్తున్న దృశ్యం కనిపిస్తుంది. మురుగునీటిలో నుంచి పెద్ద సంఖ్యలో సైకిళ్లు బయటకు వచ్చి, కుప్పగా ఏర్పడిన తీరు వీడియోలో కనిపిస్తుంది. నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌లో ఈ ఉదంతం చోటుచేసుకుంది. కాలువను శుభ్రం చేస్తున్న కార్మికులు నీటి అడుగునుంచి పలు సైకిళ్లను వెలికితీశారు. జేసీబీతో ఈ క్లీనింగ్ పనులను చేపట్టారు. ఈ క్లిప్ @fasc1nate అనే ఖాతాతో ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘ది గార్డియన్’ నివేదిక ప్రకారం ప్రతి సంవత్సరం వేలాది బైక్‌లు, సైకిళ్లను నదులు, చెరువులు, సరస్సులలో విసిరివేస్తున్నారు. ఇదేవిధంగా బైక్‌లు, సైకిళ్లు ప్రమాదవశాత్తు కూడా నీట మునుగుతున్నాయి. ఈ కారణంగా వాటిని శుభ్రపరిచే సమయంలో పెద్ద మొత్తంలో చెత్త బయటకు వస్తున్నది. కేవలం 2 నిమిషాల 9 సెకన్ల వీడియోను చూసిన వారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. ఇది పలువురి నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. పర్యావరణ పరిరక్షణ పరంగా ఇది ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఈ వీడియోకు 14 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కాయి. ఈ వీడియోను చూసిన యూజర్స్ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఒక యూజర్ ఇన్ని సైకిళ్లు ఎక్కడి నుంచి వచ్చాయని రాయగా, మరొకరు ఈ సైకిళ్లను అమ్ముతారా? అని ప్రశ్నించారు. మరొక యూజర్ కాలువలోకి ఇంత పెద్ద సంఖ్యలో సైకిళ్లు ఎక్కడ నుండి వచ్చాయి? అని రాశారు. ఇది కూడా చదవండి: శాంతినికేతన్‌తో చైనాకు లింకు ఏమిటి? తాన్ యున్ జెన్ ఏం సాయం చేశారు? Finding some surprises while cleaning the canals of Amsterdam. pic.twitter.com/QsEJgj5GHM — Fascinating (@fasc1nate) September 18, 2023 -
రెస్టారెంట్ టూ స్టార్టప్ ఫండింగ్: సురేష్ రైనా నెట్‌వర్త్ తెలిస్తే షాకవుతారు
క్రికెటర్, ఐపీఎల్ ఆటగాడు సురేష్ రైనా నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌లో రెస్టారెంట్‌ను ప్రారంభించి అటు ఫ్యాన్స్‌ను, ఇటు వ్యాపార వర్గాలను ఆకర్షించాడు. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత రైనా వ్యాపార వ్యూహంలో భారీ ప్లాన్లే ఉన్నాయి. ఇండియా నుంచి యూరప్‌కు విస్తారమైన ప్రామాణిక వంటకాలను, రుచులను, అందించనున్నాడు. రెస్టారెంట్ మాత్రమే కాదు వ్యాపార సామ్రాజ్యం, పెట్టుబడి డీల్స్ ఇంకా చాలానే ఉన్నాయి. ఆ వివరాలు ఒకసారి చూద్దాం!. సిక్సర్లేనా.. నోరూరించే ఇండియన్ వంటకాలు కూడా తన ప్రతిభతో క్రికెటర్‌గా పాపులర్ అయిన సురేష్ రైనా, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఎంఎస్ ధోని జట్టు చెన్నై సూపర్ కింగ్స్ కోసం ఆడిన సంగతి తెలిసిందే. తాజాగా ‘రైనా క్యులినరీ ట్రెజర్స్ ఆఫ్ ఇండియా’ పేరుతో కోట్ల రూపాయల రెస్టారెంట్‌ను ప్రారంభించినట్లు జూన్ 23న సోషల్ మీడియా ద్వారా రైనా ప్రకటించాడు. ఈ రెస్టారెంట్ ఢిల్లీలోని ప్రసిద్ధ చాందినీ చౌక్ నుండి స్నాక్స్‌తో సహా అనేక రకాల శాఖాహార, మాంసాహార వంటకాలను అందిస్తుందట. ఐపీఎల్ 2022 వేలంలో అమ్ముడుపోని తర్వాత, రైనా క్రికెట్ టోర్నమెంట్‌కు వ్యాఖ్యాతగా, విశ్లేషకుడిగా వ్యవహరించాడు. ఇది భారీ ఆదాయాన్నే సంపాదించి పెట్టింది. దీంతోపాటు బహుళ ఎండార్స్మెంట్ డీల్స్ ద్వారా కోట్ల రూపాయలను ఆర్జిస్తున్నాడు. (సింగిల్ బ్రాండ్‌తో 100 కోట్ల డీల్ కుదుర్చుకున్న తొలి ఇండియన్ క్రికెటర్ ఎవరో తెలుసా? ) ముఖ్యంగా సురేష్ రైనా , భార్యతో కలిసి ‘మాతే’ అనే బేబీకేర్ బ్రాండ్‌ను కూడా స్థాపించాడు. ఇది ఇది పిల్లల సంరక్షణ కోసం రసాయన రహిత, ఆయుర్వేద ఉత్పత్తులను విక్రయిస్తుంది. దీంతోపాటు క్రిప్టోకరెన్సీకి సంబంధించిన వార్తలను ప్రచురించే Sahicoin అనే స్టార్టప్ కంపెనీలో కూడా పెట్టుబడి పెట్టాడు. అలాగే సురేష్ రైనా గతంలో అడిడాస్, టైమెక్స్, మ్యాగీ, ఇంటెక్స్, బూస్ట్ ఎనర్జీ డ్రింక్స్, పెప్సికో, ఆర్కె గ్లోబల్, హెచ్‌పి వంటి అనేక పెద్ద బ్రాండ్లతో ఎండార్స్మెంట్ ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. అంతేనా, భారత్‌పే, బుకింగ్స్ డాట్కాం, ఎలిస్తా లాంటి కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు. వీటన్నింటి విలువు దాదాపు రూ.10 కోట్లకు పైమాటే. దీంతోపాటు విలాసవంతమైన భారీ బంగ్లా కూడా ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని ఈ బంగ్లా విలువ 18 కోట్ల రూపాయలట.స్పోర్ట్స్‌కీడా అంచనా ప్రకారం రైనా నికర విలువ రూ. 200 కోట్లకు పైగా ఉండగా, వార్షిక సంపాదన దాదాపు రూ. 11.5 కోట్లుగా ఉంది.(ఆదిపురుష్ విలన్‌కి కోట్ల విలువైన డైమండ్ వాచ్ గిఫ్ట్: ఎపుడు, ఎవరిచ్చారో తెలుసా?) 1986, నవంబరు 27న యూపీలో పుట్టిన సురేష్ రైనా. ఢిల్లీ యూనివర్శిటీటీ నుంచి బీకాం (డిస్టెన్స్), 2022లో చెన్నైలోని యూనివర్శిటీనుంచి గౌరవ డాక్టరేట్ పొదారు. బీటెక్ చదివిన అతని భార్య ప్రియాంక చౌదరి పలు ఐటీ కంపెనీల్లో పనిచేశారు. ఆ తరువాత 2017లో మాతే నేచురల్ బేబీ కేర్ ఉత్పత్తుల సంస్థను స్థాపించారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. (వైట్‌హౌస్ స్టేట్ డిన్నర్: నీతా అంబానీ చీరల విశేషాలేంటో తెలుసా?) -
యూరప్‌లో చెఫ్ అవతారమెత్తిన రైనా.. నోరూరించే రుచులతో..
Suresh Raina Restaurant: టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ఫుడ్ బిజినెస్ మొదలుపెట్టాడు. నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌లో రెస్టారెంట్ ఆరంభించాడు. యూరప్ నడిబొడ్డున భారత రుచులను కస్టమర్లకు వడ్డించేందుకు సిద్ధమైపోయాడు. రెస్టారెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా చెఫ్ అవతారమెత్తాడు ఈ మిస్టర్ ఐపీఎల్. ‘రైనా’ పేరిట మొదలెట్టిన రెస్టారెంట్ ముందు నిలబడి తమ ఉద్యోగులతో ఫొటోలకు పోజులిచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. సరికొత్త రుచులు ‘‘ఇంతకు ముందెన్నడూ రుచి చూడని వంటకాలతో మేము సిద్ధం. రుచి చూసేందుకు మీరూ సిద్ధంకండి. ఆమ్‌స్టర్‌డామ్‌లో రైనా ఇండియన్ రెస్టారెంట్ మొదలెట్టడం ఎంతో సంతోషంగా ఉంది. ఫుడ్ పట్ల నాకున్న ప్యాషన్ ఇక్కడ మీరు చూడబోతున్నారు’’ అని సురేశ్ రైనా తన పోస్టులో చెప్పుకొచ్చాడు. నోరూరించే వెరైటీలు తమ రెస్టారెంట్లో ఉత్తర భారత వంటల సువాసనలతో పాటు.. దక్షిణ భారత అదిరిపోయే రుచులను కూడా అందిస్తామని రైనా ఈ సందర్భంగా పేర్కొన్నాడు. కాగా రైనా రెస్టారెంట్లో చికెన్ చాట్, మిక్స్ పకోడా, జైతుని పనీర్ టిక్కా, తందూర్ చికెన్ టిక్కా, ఆనియన్ భాజీతో పాటు పలురకాల కెబాబ్స్ స్టార్టర్లుగా వడ్డించనున్నారు. అదే విధంగా ఢిల్లీలోని చాందినీచౌక్‌లో ప్రసిద్ధి పొందిన దహీ భల్లా, పానీ పూరీ, చాట్ పాప్రీ, ఆలూ చాట్, సమోసా కూడా వీరి మెనూలో ఉన్నాయి. చికెన్, మటన్, ఫిష్ సహా వెజ్‌టేరియన్ వెరైటీలతో కస్టమర్లను ఆకర్షించేందుకు రైనా రెస్టారెంట్ సిద్ధమైపోయింది. భార్య బ్యాంకర్‌గా కాగా సురేశ్ రైనా భార్య ప్రియాంక గతంలో నెదర్లాండ్స్‌లోని ఓ బ్యాంక్‌లో పనిచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైనా తరచుగా ఆమ్స్టర్డామ్ వెళ్లేవాడు. ఈ క్రమంలో అక్కడే రెస్టారెంట్ ఆరంభించి తన కలను నిజం చేసుకున్నాడు. ఇక తాను ఫుడీనంటూ గతంలో రైనా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. చిన్న తలా కెరీర్ ఇలా ఇదిలా ఉంటే.. టీమిండియా తరఫున 18 టెస్టులు, 226 వన్డేలు, 78 టీ20లు ఆడిన రైనా.. వరుసగా 768, 5615, 1604 పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్లో సుదీర్ఘకాలం పాటు చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన అతడు.. చిన్న తలాగా పేరొందాడు. మహేంద్ర సింగ్ ధోనికి అత్యంత సన్నిహితుడైన రైనా.. మిస్టర్ కూల్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వెంటనే తానూ గుడ్ చెప్పాడు. 2020 ఆగష్టు 15న రిటైర్మెంట్ ప్రకటించాడు. చదవండి: ధోని నమ్మకం నిలబెట్టిన ప్రపంచకప్ విజేత, 2 సార్లు ఐపీఎల్ ‘విన్నర్’.. ఇప్పుడు పోలీస్ View this post on Instagram A post shared by Suresh Raina (@sureshraina3) -
‘70 ఉద్యోగాలకు అప్లయ్ చేశా.. ఒక్క జాబ్ రాలేదు..ఇండియాకి తిరిగి వచ్చేస్తా’
అమెజాన్, మెటా, గూగుల్, ట్విటర్, యాపిల్ ఇవన్నీ వరల్డ్ క్లాస్ కంపెనీలు. వీటిల్లో ఏ ఒక్క సంస్థల్లో కొలువు దొరికినా లైఫ్ సెటిల్ అని అనుకునేవారు. అయితే అదంతా నిన్న మొన్నటి వరకే. ప్రపంచ దిగ్గజ సంస్థల నుంచి స్టార్టప్‌ల వరకు ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. ఉదయం ఆఫీస్‌కు వెళితే సాయంత్రానికి ఆ జాబ్ ఉంటుందో? ఊడుతుందో తెలియని పరిస్థితి. ఇతర సంస్థల సంగతేమో కానీ.. కష్టపడి విదేశాల్లో ఉద్యోగాలు సంపాదించి.. ఆర్ధిక పరిస్థితులు, ఇతర కారణాలతో ఉద్యోగాలు చేస్తూ హాయిగా గడుపుతున్న భారతీయుల ఉపాధి పోవడం ప్రస్తుత పరిస్థితులకు ప్రత్యక్ష సాక్షంగా నిలుస్తోంది. ప్రపంచ దేశాల్లో .. మరోసారి సంక్షోభం! 2008 తర్వాత.. దాదాపు ఆ స్థాయిలో.. మాంద్యం పరిస్థితులు! వెరసీ ప్రపంచ దేశాల్లో అన్నీ సంస్థల ఆదాయాలు తగ్గిపోతున్నాయి. దీంతో ఖర్చుల్ని తగ్గించుకునేందుకు ఏన్నోఏళ్లుగా తమనే నమ్ముకొని ఉద్యోగాలు చేస్తున్న ఎంప్లాయిస్‌కు ఊహించని షాక్‌లిస్తున్నాయి సంస్థలు . సారీ..! మిమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నాం’ అంటూ మెయిల్స్ పెట్టేయడంతో సదరు ఉద్యోగుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. అలాంటి వారిలో ఒకరైన స్వాతి థాపర్ తనకు ఎదురవుతున్న చేదు అనుభవాల్ని నెటిజన్లతో పంచుకున్నారు. నెదర్లాండ్‌లో ఏడేళ్ల నుంచి నివాసం ఉంటున్న భారతీయురాలు స్వాతి థాపర్ ఉన్నట్లుండి ఉద్యోగం కోల్పోయింది. గతేడాదిలో మే నెలలో ఆర్ధిక మాంద్యంతో ఉద్యోగం పోగొట్టుకుంది. తాను చేస్తున్న కంపెనీ ఫైర్ చేయడంతో నాటి నుంచి సుమారు 70కి పై ఉద్యోగాలకు అప్లయ్ చేసింది. ఒక్క ఉద్యోగం రాలేదు. చివరికి భారత్‌కు వచ్చేయాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం లింక్డిన్ పోస్ట్‌లో ఆమె తన గోడును వెళ్ల బోసుకుంది. బైబై నెదర్లాండ్ నెదర్లాండ్ రాజధాని ఆమ్స్టర్డ్యామ్లో స్వాతీ థాపర్ కాపీ రైటర్‌గా విధులు నిర్వహిస్తుంది. డిపెండెంట్ వీసా మీద మార్కెటింగ్ స్టార్టప్‌లో పనిచేస్తున్న ఆమెను గతేడాది మేలో సంస్థ ఫైర్ చేసింది. అప్పటి నుంచి ఉద్యోగాలు ప్రయత్నాలు చేస్తున్నా సక్సెస్ కాలేకపోతుంది. అందుకే 7ఏళ్లగా ఉంటున్న నెదర్లాండ్ కు గుడ్‌బై చెప్పి భారత్‌కు వచ్చేయాలని అనుకుంటున్నట్లు తన పోస్ట్‌లో పేర్కొంది. రోజులు..నెలలు.. కాస్తా 3 ఏళ్లు అయ్యాయి రాజస్థాన్‌లో ఉండే థాపర్‌కు 2016లో పెళ్లైంది. ఉన్నత ఉద్యోగం చేస్తున్న భర్తతో కలిసి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. ఎన్నో కలలతో భారత్ నుంచి నెదర్లాండ్‌కు వెళ్లిన ఆమెకు.. తాను కన్న కలలు కన్నీళ్లను మిగుల్చుతాయని ఊహించలేదు. వైవాహిక జీవితం అంతా బాగుంది. కానీ ఉద్యోగం మాత్రం అంత ఈజీగా రాలేదు. చిన్న వయస్సు నుంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదవడం వల్ల ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడుతుంది. రాస్తుంది. కానీ టెక్నాలజీ విభాగంలో అపారమైన అవకాశాలు ఉండే నెదర్లాండ్‌లో ఉద్యోగం సంపాదించడం కత్తిమీద సామైంది. టెక్ రంగంలో కాపీ రైటర్‌గా ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించింది. రోజులు, నెలలు కాస్త 3 సంవత్సరాలయ్యాయి. ఇంటర్వ్యూలో అనేక అవమానాలు, చీత్కరింపులు.. అన్నింటిని పంటి బిగువున దిగమింగుకుంది. లెక్కలేనన్ని తిరస్కరణల తర్వాత చాలా కంపెనీలు బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు చెందిన వారు, ఇంగ్లీష్ మాట్లాడే వారిని మాత్రమే ఉద్యోగంలోకి తీసుకుంటాయని తెలుసుకుంది. ఎట్టకేలకు 3 ఏళ్ల తర్వాత ఫ్రీలాన్స్ రైటింగ్, స్టార్టప్‌లో మార్కెటింగ్ కాపీ రైటర్‌గా ఉద్యోగం సంపాదించింది. జాబ్ పోయింది కానీ కోవిడ్ మహమ్మారి కారణంగా జాబ్ పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. 2020 ప్రారంభం నుంచి థాపర్ జాబ్ చేస్తున్న కంపెనీ పరిస్థితులు బాగలేదు. చాలా మంది ఉద్యోగులు జాబ్‌కు రిజైన్ చేస్తున్నారు. సీఈవో శాలరీలు ఇచ్చేందుకు బ్యాంక్ లోన్ తీసుకుని చెల్లిస్తున్నట్లు తెలుసుకుంది. అప్పుడే గర్భవతిగా ఉన్న ఆమె 2021 అక్టోబర్‌లో మెటర్నీటీ లీవ్ పెట్టింది. తిరిగి జనవరి 2022లో జాబ్‌లో రీజాయిన్ అయ్యింది. 25 మంది ఉద్యోగులు సంఖ్య 2కు చేరింది. చివరికి ఆమెను కూడా అదే ఏడాది మేలో ఉద్యోగం నుంచి తొలగించినట్లు చెప్పింది. 70 ఉద్యోగాలకు అప్లయ్ చేశా ఉద్యోగం పోవడంతో .. కొత్త జాబ్ కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ‘అప్పటి నుంచి ఇప్పటి వరకు 70 ఉద్యోగాలకు అప్లయ్ చేశా. ఇంకా చేస్తూనే ఉన్నా. ఒక్క ఉద్యోగం రాలేదు. లింక్డ్ఇన్లో రిక్రూటర్లతో మాట్లాడాను. అదనపు స్కిల్స్ కోసం కోర్స్‌వర్క్, కెరీర్ కోచింగ్, మెంటరింగ్ కోసం ఖర్చు చేశా. ఫలితం దక్కలేదు. చివరికి డిప్రెషన్‌కు గురయ్యాను. ప్రొఫెషనల్‌గా నాపై నాకున్న నమ్మకం కూడా పోయింది. 2016తో పోలిస్తే ఇప్పుడు నెదర్లాండ్స్‌లో ఉద్యోగాలు ఉన్నాయి. కానీ ఆర్ధిక మాద్యం, అన్నీ రంగాల్లో లేఫ్స్ కారణంగా కొత్త ఉద్యోగం సంపాదించడంలో కష్టపడాల్సి వస్తుంది. కొడుకు భవిష్యత్ కోసం సంవత్సరాల తరబడి ఇక్కడే ఉన్నందు వల్ల పౌరసత్వం విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేదు. భర్త జాబ్ చేస్తున్నారు కాబట్టి ఆర్ధిక సమస్యలా లేవు. కానీ ఖర్చులు పెరిగాయి. ఇల్లు, కారు అన్నీ తీసుకున్నాం. దాచుకున్న డబ్బులు అయిపోయాయి. ఎక్కువ డబ్బులు అవసరమే. అలా అని భర్తమీద ఆధారపడలేను. కొడుకు భవిష్యత్ కోసం ఇక్కడే ఉండాలని నిశ్చయించుకున్నా. ఒక వేళ ఉద్యోగం దొరక్కపోతే ఇండియాకు తిరిగి వచ్చేస్తాను అంటూ నెటిజన్లతో పంచుకుంది. చదవండి👉 వందల మంది ఉద్యోగం ఊడింది..‘2 నెలల జీతం ఇస్తాం..ఆఫీస్‌కు రావొద్దు’ -
సగం కొట్టేసిన బిల్డింగ్‌లా కనిపిస్తోందా.. అలా అనుకుంటే పొరపాటే!
సడన్‌గా చూస్తే.. సగం కొట్టేసిన బిల్డింగ్‌లా కనిపిస్తోంది కదూ.. నిజానికిది పూర్తిగా కట్టేసిన బిల్డింగ్.. దీని డిజైనే అంత.. ఇలాంటి వింత డిజైన్ సృష్టికర్త నెదర్లాండ్స్‌కు చెందిన ఎంవీఆర్‌డీవీ సంస్థ. ఆమ్స్టర్డంలో 75 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ మూడు భవంతుల సముదాయాన్ని వచ్చే ఏడాది ప్రారంభించనున్నారు. దూరం నుంచి అలా కనిపిస్తోంది గానీ.. దగ్గర్నుంచి చూస్తే.. దేనికది బ్లాక్స్లాగ కట్టినట్లు ఉంటుంది. అంతేకాదు.. వీటిపైనే ఎక్కడికక్కడ మొక్కలు, చెట్లను పెంచుతారట. మొత్తం 13 వేల రకాల మొక్కలు, చెట్లకుఇది నిలయంగా మారుతుందని చెబుతున్నారు. ఈ భవంతుల సముదాయంలో వాణిజ్య కార్యాలయాలతోపాటు 200 అపార్టుమెంట్లు, రూఫ్ గార్డెన్, స్కైబార్ ఉంటాయి. -
ఒమిక్రాన్ గురించి తెలుసుకునే లోపే చాపకింద నీరులా..!
జొహన్నెస్‌బర్గ్: ఒమిక్రాన్ (బి.1.1.529) ఇప్పుడీ పేరు ప్రపంచ దేశాల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని అందరూ ఊపిరి పీల్చుకుంటున్న వేళ ఈ కొత్త వేరియెంట్ భయపెడుతోంది. డెల్టా కంటే శరవేగంగా విస్తరించే ఈ వేరియెంట్ ఒకటి వెలుగులోకి వచ్చిందని తెలుసుకునే లోపే ప్రపంచ దేశాలకు చాపకింద నీరులా విస్తరించిందనే అనుమానాలున్నాయి. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ నుంచి నెదర్లాండ్‌లోని ఆమ్స్టర్డామ్కి వచ్చిన రెండు విమానాల్లోని 600 మంది ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించగా వారిలో 61 మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణమైంది. ఇప్పటివరకు భారత్‌లో తొలిసారిగా వెలుగులోకి వచ్చిన డెల్టా వేరియెంట్ అత్యంత ప్రమాదకరమైనదని భావిస్తున్నాం. కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నా డెల్టా కంటే 40శాతం అధికంగా ఒమిక్రాన్ విస్తరిస్తోందని శాస్త్రవేత్తలు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. యూరప్‌లోని బెల్జియంలోకి కొత్త వేరియెంట్ కేసులు నిర్ధారణ కాగా జర్మనీ, చెక్ రిపబ్లిక్, ఆస్ట్రేలియాలోనూ నమోదైనట్టుగా అనుమానాలున్నాయి. ఆరు దేశాల్లో ప్రస్తుతం ఈ కేసులు అధికంగా వస్తున్నాయి.దక్షిణాఫ్రికాలో రోజుకి సగటున 3 వేల కేసులొస్తున్నాయి. వీటిలో ఒమిక్రాన్ కేసులెన్ని అనేది జీనోమ్ సీక్వెన్సింగ్ తర్వాతే తేలుతుంది. అమెరికా, బ్రెజిల్, కెనడా, జపాన్, థాయిలాండ్, యూరోపియన్ యూనియన్, యూకే తదితర దేశాలు దక్షిణాఫ్రికా ఖండానికి చెందిన దేశాల నుంచి విమానప్రయాణాలపై ఆంక్షల విధించాయి. బ్రిటన్‌లో రెండు ఒమిక్రాన్ కేసులు బ్రిటన్‌లో శనివారం ఒమిక్రాన్ వేరియంట్ సోకిన రెండు కేసులు బయటపడినట్లు బ్రిటన్ ఆరోగ్య మంత్రి సాజిద్ జావెద్ చెప్పారు. చేమ్స్‌ఫోర్డ్, నాటింగ్హామ్లలో ఈ వేరియంట్ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. ఆ ఇద్దరు ప్రస్తుతం స్వీయ–గృహ నిర్బంధంలో ఉన్నారు. ప్రయాణ ఆంక్షల సడలింపుపై పునః సమీక్షించండి: మోదీ న్యూఢిల్లీ: భారత్‌లో విమాన సర్వీస్‌ల పూర్తిస్థాయి పునరుద్ధరణపై ప్రధాని మోదీ సూచన చేశారు. డెల్టా వేరియంట్ తరహాలో వ్యాప్తి స్థాయి ఎక్కువగా ఉన్న ఈ వేరియంట్ ఉధృతి నేపథ్యంలో అంతర్జాతీయ విమాన ప్రయాణ ఆంక్షల సడలింపుపై పునఃసమీక్ష తప్పనిసరి అని కేంద్ర ఉన్నతాధికారులతో మోదీ వ్యాఖ్యానించారు. ప్రపంచదేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి, విదేశాల్లో ఆరోగ్య పరిస్థితులను మోదీకి ఉన్నతాధికారులు వివరించారు. శనివారం ఢిల్లీలో ప్రధాని సమీక్షా సమావేశంలో భారత్‌లో కోవిడ్ పరిస్థితులు, కోవిడ్ వ్యాక్సినేషన్ తదితర ఆరోగ్య సంబంధ కార్యక్రమాల పురోగతిపై చర్చించారు. ఒమిక్రాన్ ప్రభావం భారత్‌పై ఎలా ఉండబోయే వీలుందనే అంశాలూ చర్చకొచ్చాయని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. ఒమిక్రాన్ సంక్రమణ ప్రమాదమున్న దేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికుల విషయంలో కోవిడ్ నిబంధనలను పాటించాలని మోదీ అధికారులకు సూచించారు. డిసెంబర్ 15వ తేదీ నుంచి భారత్‌కు, భారత్ నుంచి అంతర్జాతీయ పౌర విమాన సర్వీస్‌లను పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తామని పౌర విమానయాన శాఖ శుక్రవారమే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రధాని సూచన ప్రాధాన్యత సంతరించుకుంది. సమీక్షా సమావేశంలో నీతి ఆయోగ్ సభ్యుడు(ఆరోగ్యం) వీకే పాల్, ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌భూషణ్, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ భార్గవ తదితరులు పాల్గొన్నారు. -
రోబోలు తయారుచేసిన బ్రిడ్జి.. రిబ్బన్ కట్ చేసిన రాణి
ఆమ్స్టర్డమ్: ప్రపంచంలోనే తొలిసారిగా నిర్మాణ పనిలో రోబోలు పాల్గొన్నాయి. కార్మికులు లేకుండా ఈ యంత్రపు మనుషులు పని చేశాయి. రోబోలు తయారుచేసిన బ్రిడ్జిని ఎంచక్కా రాణి వచ్చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ రోబోలు తయారుచేసిన బ్రిడ్జి ఎన్నో ప్రత్యేకతలతో ఉండి అందరినీ ఆకర్షిస్తోంది. ఆ బ్రిడ్జి ప్రపంచంలోనే మొట్టమొదటి త్రీడీ ప్రింటింగ్ వంతెన కావడం విశేషం. ఈ వంతెన నెదర్లాండ్స్‌లోని అమ్‌స్టార్‌డమ్ నగరంలో నిర్మించారు. ఈ బ్రిడ్జి విశేషాలు మీరు తెలుసుకోండి. ఆమ్‌స్టర్‌డమ్‌లోని ఓ పురాతన కాలువపై 4,500 కిలోల ఉక్కు (స్టీల్)తో బ్రిడ్జి తయారు చేశారు. ఈ బ్రిడ్జిని నెదర్లాండ్స్‌కు చెందిన ఎంఎక్స్ 3 డీ సంస్థ రూపొందించింది. 12 మీటర్ల పొడవైన ఈ వంతెనను 4 రోబోలు కలిసి తయారు చేశాయి. ఈ బ్రిడ్జిని ఒకచోట తయారు చేసి తీసుకొచ్చి పెట్టారు. ఆ తయారీలో రోబోలే పాల్గొన్నాయి. సుమారు 6 నెలల పాటు కష్టపడి బ్రిడ్జిని రోబోలు రూపొందించాయి. తయారైన బ్రిడ్జిని పడవ సహాయంతో కాలువ వద్దకు తీసుకొచ్చారు. అనంతరం క్రేన్ సహాయంతో కాలువపై ఉంచారు. ఈ బ్రిడ్జి కాలువను దాటేందుకు ఎంతో ఉపయోగపడనుంది. ఈ బ్రిడ్జికి ఎంఎక్స్ 3డీ అని పేరు పెట్టారు. ఈ బ్రిడ్జిని జూలై 15వ తేదీన డచ్ రాణి మాక్సిమా అట్టహాసంగా ప్రారంభించారు. 18వ తేదీ నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఆ బ్రిడ్జి రోడ్డు దాటడానికి కాకుండా పర్యాటక స్థలంగా మారింది. ఆ బ్రిడ్జి విశేషాలను తెలుసుకునేందుకు.. చూసేందుకు పెద్ద ఎత్తున డచ్ ప్రజలు వస్తున్నారు. అందమైన నగరానికి పర్యాటకంగా మరో అందం తీసుకొచ్చిందని ఆమ్స్టర్డమ్ నగర అధికారులు తెలిపారు. వంతెన ప్రత్యేకతలు 12 మీటర్ల పొడవు 4,500 కిలోల ఉక్కు వినియోగం. డజనుకు పైగా సెన్సార్లు ఉన్నాయి. వంతెనకు ఏమైనా ప్రమాదం.. లేదా దెబ్బతింటే వెంటనే సెన్సార్ల ద్వారా సమాచారం వస్తుంది. ఈ వంతెనకు సంబంధించిన వివరాలన్నీ డేటా కంప్యూటర్లో నిక్షిప్తం. ప్రయోగాత్మకంగా నిర్మించిన ఈ బ్రిడ్జితో భవిష్యత్‌లో 3డీ పరిజ్ఞానంతో పెద్ద భవంతులు నిర్మించేందుకు కంపెనీలకు ఓ ఉదాహరణగా మారింది. ఎంత బలన్నైయినా ఈ వంతెన మోస్తుంది. ఆమ్‌స్టర్‌డమ్‌లోని కాలువపై నిర్మించిన త్రీడీ ప్రింటింగ్ స్టీల్ వంతెన -
బాధితుల గొంతుక.. ప్రాణాలతో పోరాడుతున్న డచ్ క్రైమ్ రిపోర్టర్
హేగ్ (నెదర్లాండ్స్): ప్రముఖ డచ్ క్రైమ్ రిపోర్టర్ పీటర్ ఆర్. డి వ్రీస్పై దుండుగులు కాల్పులకు తెగపడ్డారు. తీవ్రగాయాపాలైన ఆయనను ఆమ్స్టర్డామ్లోని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. ప్రస్తుతం ఆయన ప్రాణాలతో పోరాడుతున్నారు. ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకారం.. డి వ్రీస్ తలపై దుండగులు అయిదు సార్లు కాల్పులు జరిపినట్లు సమాచారం. పీటర్ ఆర్. డి వ్రీస్ జర్నలిస్ట్, టీవీ ప్రెజెంటర్. క్రిమినల్ కేసులపై పరిశోధన చేయడంలో ఆయనకు మంచి పేరు ఉంది. పీటర్ ఆర్. డి వ్రీస్ బాధితుల తరపున నిత్యం తన గొంతుకను వినిపిస్తుంటారు. గతంలో డి వ్రీస్కు అనేక కేసులకు సంబంధించి క్రిమినల్ అండర్ వరల్డ్ నుంచి బెదిరింపులు కూడా వచ్చాయి. ఈ ఘటనపై డచ్ ప్రధాన మంత్రి మార్క్ రుట్టే హేగ్‌లోని విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘ఈ దాడి దిగ్భ్రాంతికరమైనది. ఓ సాహసోపేతమైన జర్నలిస్టుపై దాడి చేయడం.. మన ప్రజాస్వామ్యం, స్వేచ్ఛాయుత పత్రికల పై దాడి చేయడం వంటిది." అని అన్నారు. కాగా, ఈ ఘటనలో షూటర్‌తో.. సహా ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. డౌన్ టౌన్ లీడ్సెప్లిన్ స్క్వేర్ సమీపంలో కాల్పులు జరిపిన ప్రాంతంలో వీడియో ఫుటేజ్, సాక్షి స్టేట్మెంట్స్, ఫోరెన్సిక్ సాక్ష్యాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఇక 2005లో అరుబాలో టీనేజర్ నటాలీ హోల్లోవే అదృశ్యంపై దర్యాప్తు చేసినందుకు 2008లో కరెంట్ ఎఫైర్స్ విభాగంలో డి వ్రీస్ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డును గెలుచుకున్నారు. -
'ప్లీజ్ ఇలాంటివి వద్దు.. మంచినీరు మాత్రమే తాగండి'
అమ్‌స్టర్‌డామ్: పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో 36 ఏళ్ల వయసులోనూ ఫిట్‌నెస్‌కు అత్యంత ప్రాధాన్యమిస్తాడు. డైట్‌ను కచ్చితంగా ఫాలో అయ్యే రొనాల్డో తన ఆహారంలో కేలరీస్ ఎక్కువగా లభించే జంక్‌ఫుడ్ లేకుండా జాగ్రత్త పడతాడు. తాజాగా ఒక మీడియా సమవేశంలో తన ముందున్న కోకకోలా బాటిల్‌ను పక్కన పెట్టేసి ఇలాంటివి ఎంకరేజ్ చేయొద్దంటూ చెప్పడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. యూఈఎఫ్ఏ యూరోకప్ 2020లో భాగంగా రొనాల్డో జట్టు కెప్టెన్ హోదాలో కోచ్ ఫెర్నాండో సాంటోస్‌తో కలిసి మంగళవారం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నాడు. అయితే తాను కుర్చీలో కూర్చునేటప్పుడు టేబుల్‌పై కోకకోలా బాటిల్స్ కనిపించాయి. వెంటనే వాటిని చేతిలోకి తీసుకొని పక్కన పెట్టేసి.. '' ఇలాంటివి వద్దు.. మంచినీరు మాత్రమే తాగండి'' అంటూ వాటర్‌బాటిల్‌ను తన చేతిలో తీసుకొని చెప్పాడు. కోచ్ ఫెర్నాండోస్ రొనాల్డో ఏం చేస్తున్నాడో అర్థం కాలేదు.. కానీ తర్వాత తన మాటలతో అర్థం చేసుకున్న అతను రొనాల్డొను అభినందించాడు. యూరోకప్ 2020లో భాగంగా పోర్చుగల్ గ్రూఫ్ ఎఫ్‌లో ఉంది. పోర్చుగల్‌తో పాటు జర్మనీ, ప్రాన్స్, హంగేరీ కూడా ఉండడంతో అంతా ఈ గ్రూఫ్‌ను ''గ్రూఫ్ ఆఫ్ డెత్''గా అభివర్ణిస్తున్నారు. కాగా 2016లో జరిగిన యూరోకప్‌లో రొనాల్డో ఆధ్వర్యంలోనే పోర్చుగల్ ఫ్రాన్స్‌ను ఫైనల్లో ఓడించి తొలిసారి విజేతగా నిలిచింది. డిపెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగుతున్న పోర్చుగల్ మరోసారి చాంపియన్‌గా నిలవాలని చూస్తుంది. 36 ఏళ్ల రొనాల్డోకిది వరుసగా ఆరో ‘యూరో’ చాంపియన్‌షిప్ కావడం విశేషం. కాగా రొనాల్డో అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో పోర్చుగల్ తరపున ఇప్పటివరకు 104 గోల్స్ చేశాడు. మరో ఏడు గోల్స్ చేస్తే అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో ఒక దేశం తరఫున అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు ఇరాన్ మాజీ ప్లేయర్ అలీ దాయి (109 గోల్స్) పేరిట ఉంది. చదవండి: UEFA EURO 2020: నెదర్లాండ్స్ బోణీ 7 సెకన్లు.. 60 మీటర్ల దూరం.. ఏమా వేగం Cristiano Ronaldo was angry because they put Coca Cola in front of him at the Portugal press conference, instead of water! 😂 He moved them and said "Drink water" 😆pic.twitter.com/U1aJg9PcXq — FutbolBible (@FutbolBible) June 14, 2021 -
వైరల్: డేగ దాహం తీర్చిన ఓ బాటసారి
ఆమ్స్టర్డామ్: ఆకలి రుచిఎరుగదు నిద్ర సుఖమెరుగదు అనేది నానుడి. మరి దాహం వేస్తే. అది అనుభవించే వారికే తెలుస్తుంది. వేసవిలో గింజలు, నీళ్లు దొరక్క అనేక పక్షులు చనిపోతుంటాయి. అయితే తాజాగా నెదర్లాండ్స్‌లో ఓ డేగ నీళ్ల కోసం అల్లాడిపోయింది. రోడ్డు దగ్గరకొచ్చి ఆ దారివెంట పోయే వాళ్లను తదేకంగా గమనిస్తోంది. దాని బాధను అర్థం చేసుకున్నాడు ఓ బాటసారి. డేగకి తన దగ్గర ఉన్న బాటిల్లోని నీళ్లును తాగించి దాన్ని దాహార్తిని తీర్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన 20 సెకన్ల నివిడి గల ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటివరకు ఈ వీడియోను 53,000 వేల మంది నెటిజన్లు వీక్షించగా..వందల మంది కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియోలో ఓ వ్యక్తి సీసాలోని నీటిని డేగ నోటికి అందించడానికి ప్రయత్నిస్తాడు. ఆ పక్కనే ఇద్దరు స్నేహితులు దాన్ని గమనిస్తున్నట్లు ఉండే ఈ వీడియోను ఓ హైవేపై రికార్డ్ చేసినట్టు కనిపిస్తుంది. కాగా డేగకు సహాయం చేసినందుకు ధన్యవాదాలు అంటూ నెటిజన్లు ఆ జంతు ప్రేమికుడిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. Thirsty eagle.. Thank you! 🙏 pic.twitter.com/ljmh7yMlDU — Buitengebieden (@buitengebieden_) May 24, 2021 (చదవండి: వైరల్: వృద్ధుడి స్టెప్పులకు..నెటిజన్ల కళ్లు జిగేల్) -
వైరల్: వృద్ధుడి స్టెప్పులకు..నెటిజన్ల కళ్లు జిగేల్
ఆమ్స్టర్డామ్: మనిషికి అన్నింటికన్నా ముఖ్యమైనది తన ఉనికి. బతికినంత కాలం ఆరోగ్యంతో జీవించడం ప్రధానం. కానీ, ఆరోగ్యాన్ని ఎంతగా కాపాడుకున్నా ముసలితనం మాత్రం రాకమానదు. వయసుతోబాటు శరీరం పటుత్వం కోల్పోతుంది. ఎముకలు పలచబడతాయి. చర్మానికి సాగే గుణం తగ్గుతుంది. సహజంగా కృష్ణా!రామా! అంటూ కాలం వెళ్లదీస్తారు. అయితే తాజాగా నెదర్లాండ్స్‌లోని హేగ్ వీధుల్లో ఓ వృద్ధుడు వేసిన స్టెప్పులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్లో ఈ వీడియోను పోస్ట్ చేయగా.. ఇప్పటి వరకు 2.52 లక్షల నెటిజన్లు వీక్షించారు. 10 వేల మంది నెటిజన్లు లైక్ కొట్టారు. ఈ వీడియోలో నల్లని రంగు గల పొడవాటి కోటు, బూడిద రంగు చొక్కా, టై, ప్యాంటు, టాన్ టోపీ ధరించిన వృద్ధుడు చేతిలో కర్రతో వీధిలోని సంగీతకారుడి ట్యూన్లకు అద్భుతంగా డ్యాన్స్ చేస్తాడు. గిటారిస్ట్ కూడా ఆ వృద్ధుడితో కలిసి స్టెప్పులేస్తాడు. అయితే ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా మంది హృదయాలను గెలుచుకుంటోంది. దీనిపై ఓ నెటిన్ స్పందిస్తూ..‘‘దీన్ని ప్రేమించండి’’ అని కామెంట్ చేశారు. ‘‘ఇలా డ్యాన్స్ చేయడం మరొకరికి సాధ్యం కాదు. ఈ వ్యక్తి నిజంగా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నాడు’’ అంటూ రాసుకొచ్చారు. (చదవండి: Corona: ‘ముందస్తు ప్రణాళిక లేకుంటే.. థర్డ్ వేవ్ ఆపటం కష్టం’) This guy is truly living his best life pic.twitter.com/SQHnWoQMwk — Giles Paley-Phillips (@eliistender10) May 21, 2021 -
వధువు కాళ్లకు నమస్కరించిన భర్త
జైపూర్: హిందూ వివాహ సంప్రదాయంలో కొన్ని తంతులు చాలా విచిత్రంగా ఉంటాయి. మాంగళ్యధారణ కాగానే అమ్మాయి భర్త కాళ్లకు దండం పెడుతుంది.. పెళ్లైన వెంటనే తన ఇంటి పేరును మార్చుకుంటుంది. మరి రివర్స్‌లో జరగదు ఎందుకు. పెళ్లి కుమారుడు అంటే శ్రీ మహా విష్ణువు అంటారు.. మరి భార్య అంటే లక్ష్మీ దేవినే కదా. కాళ్లు కడిగితే తప్పేంటి.. పాదాలకు ఎందుకు నమస్కరించకూడదు. ఆడపిల్లకు తొలుత పుట్టింటి నుంచే ఓ గుర్తింపు వస్తుంది.. మరి అలాంటప్పుడు దాన్ని మార్చుకోవడం ఎందుకు. ఇదిగో ఇలాంటి ప్రశ్నలు అడిగేతే మనకు వేరే పేర్లు పెట్టేస్తారు. మన పితృస్వామ్య సమాజంలో ఇలాంటివి మహా పాపం. వదిలేద్దాం. కానీ కొందరు మాత్రం ఈ అభిప్రాయాలతో ఏకీభవించడమే కాక ఆచరిస్తారు. అలాంటి వ్యక్తికి సంబంధించినదే ఈ కథనం. భారతీయ యువతిని ప్రేమించి.. మన సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుని.. ఏళ్లుగా ఆడ పిల్లలు మాత్రమే పాటిస్తున్న సంప్రదాయాలను తాను పాటించి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఈ ప్రత్యేక కథనాన్ని హ్యూమన్స్ ఆఫ్ బాంబే ప్రచురించింది. (చదవండి: ప్యాంట్ సూట్లో షాకిచ్చిన వధువు!) వివరాలు.. ఉదయ్‌పూర్‌కు చెందిన దీపా ఖోస్లా ఉన్నత చదువుల నిమిత్తం ఆమ్స్టర్డామ్లోని ఓ విశ్వవిద్యాలయంలో చేరింది. అక్కడే ఆమెకు ఒలేగ్ బుల్లర్‌తో పరిచయం ఏర్పడింది. అతడు విద్యార్థి నాయకుడు. మాట్లాడుకున్న సందర్భాలు చాలా తక్కువ. ఇద్దరి మనసులో మాత్రం ఒకరికోసం ఒకరం అనే భావన కలిగింది. అయితే వారి పరిచయం ముందుకు వెళ్లలేదు. ఎందుకంటే ఒలేగ్‌కి అది లాస్ట్ అకడామిక్ ఇయర్. దీపా యూనివర్సిటీలో చేరిన 6 నెలలకే అతడు క్యాంపస్ నుంచి వెళ్లి పోయాడు. ఆ తర్వాత కూడా కేవలం పుట్టిన రోజు నాడు మాత్రమే మెసేజ్‌లు చేసుకునే వారు. ఇలా ఓ పుట్టిన రోజు నాడు ఆమ్‌స్టర్‌డామ్‌లో డిన్నర్‌కి మీట్ అవుదామని అడిగాడు ఒలేగ్. అప్పుడు దీప లండన్‌లో ఉంది. దాంతో ఆరు నెలల తర్వాత డిన్నర్‌కి కలిశారు. ఆ తర్వాత స్కైప్‌లో మాట్లాడుకునే వారు. ఆ తర్వాత కొన్ని రోజులకు దీపకు ఓగ్ నుంచి డిన్నర్‌కు రావాల్సిందిగా ఆహ్వానం వచ్చింది. ఈ కార్యక్రమం ఉదయపూర్‌లోని ఓ ప్యాలెస్‌లో జరిగింది. దీప ఒక్కతే వెళ్లింది. అయితే అక్కడ ఆమెకు అనుకోని సర్ప్రైజ్ ఎదురయ్యింది. అక్కడ ఒలేగ్ ఉన్నాడు. (చదవండి: ఏడడుగులు వేసిన వేళ) పైగా అతడి చేతిలో ఉంగరం. దీప రాగానే మోకాలి మీద నిలబడి పెళ్లి చేసుకోమని కోరాడు ఒలేగ్. ఆనందభాష్పాల మధ్య దీప ఎస్ చెప్పింది. ఆ తర్వాత ఇరు కుటుంబాల ఆమోదంతో వీరి వివాహం నిశ్చయమయ్యింది. ఈ సందర్భంగా దీప మాట్లాడుతూ.. ‘మా వివాహం యూరోపియన్, భారతీయ సంస్కృతుల సంపూర్ణ కలయికగా నిలిచింది. ఇక వివాహ తంతులో నన్ను ఒలేగ్ పాదాలకు నమస్కరించమని చెప్పారు. అప్పుడు ఇద్దరం కేవలం ఆడవారు మాత్రమే ఎందుకు అలా చెయ్యాలి అని ప్రశ్నించాము. వెంటనే ఒలేగ్ నా పాదాలను తాకాడు. అంతేకాదు మేం ఒకరి ఇంటి పేరు ఒకరం మార్చుకున్నాం. నేను దీప బుల్లర్ ఖోస్లా... తను ఒలేగ్ బుల్లర్ ఖోస్లా. చాలా గర్వంగా ఉంది’ అన్నారు దీప. ఫేస్బుక్లో షేర్ చేసిన ఈ స్టోరీ ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఈ కొత్త కాన్సెప్ట్ చాలా మందికి నచ్చింది. ప్రశంసలు కురిపిస్తున్నారు. -
హనీమూన్ అక్కడే!
హీరో రానా దగ్గుబాటి మిహికా బజాజ్‌తో ఏడడుగులు వేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 8న వీరి పెళ్లి హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో దగ్గుబాటి, మిహికా కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య జరిగింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పెళ్లి వేడుక ముగించారు. రానా–మిహిక పెళ్లి వీడియో, ఫొటోలు బాగా వైరల్ అయ్యాయి కూడా. కోవిడ్ కారణంగా ఈ కొత్త జంట హనీమూన్‌ని కొన్నాళ్లు వాయిదా వేసుకుంది. ‘‘మా హనీమూన్ కోసం ఆమ్‌స్టర్‌డ్యామ్‌ని సెలక్ట్ చేసుకున్నాం. నాకు ఆర్ట్ అంటే ఇష్టం. ఆమ్స్టర్డ్యామ్ ఆర్టిస్టిక్‌గా ఉంటుంది. అందుకే ఆ ప్రదేశాన్ని ఎంచుకున్నా. మిహికా కూడా ఆ ప్లేస్‌కి ఓకే చెప్పిది. కరోనా వైరస్ ప్రభావం లేకపోతే ఇప్పుడే వెళ్లేవాళ్లం. సాధారణ పరిస్థితులు ఏర్పడిన వెంటనే మా హనీమూన్ ఉంటుంది’’ అని పేర్కొన్నారు రానా. -
మాస్క్ పెట్టుకోలేదని చితకబాదారు
-
మాస్క్ పెట్టుకోలేదని చితకబాదారు
అమ్‌స్టర్‌డామ్ : మాస్కులు పెట్టుకోలేదంటూ భౌతిక దాడులు జరిగిన సంఘటనలు చాలానే ఉన్నాయి. ఇలాంటి దాడుల్లో కొందరు తీవ్రంగా గాయపడగా.. కొందరు ఏకంగా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా అమ్‌స్టర్‌డామ్ నుంచి ఐబిజా వెళ్తున్న డచ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన కెఎల్ఎం విమానంలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఇద్దరు ప్రయాణికులు మాస్కులు ఇచ్చినా పెట్టుకోకపోవడంతో విమానంలోని తోటి ప్రయాణికులు వారిపై భౌతిక దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన ఆగస్టు 4న చోటుచేసుకున్న దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కరోనా వైరస్ నేపథ్యంలో విమానంలో ఇలాంటి దాడి జరగడం ఇదే మొదటిసారి.(బీరూట్ పేలుళ్ల ఘటనపై ట్రంప్ స్పందన) ఇక వీడియో విషయానికి వస్తే.. బ్రిటన్‌కు చెందిన ఇద్దరు స్నేహితులు ఐబిజా వెళ్తున్న కెఎల్ఎం విమానం ఎక్కారు. అయితే వారిద్దరికి మాస్కులు లేకపోడంతో తోటి ప్రయాణికులు మాస్కులు ధరించాలని కోరారు. వారి వద్ద మాస్కులు లేకపోవడంతో విమానంలో ఏర్పాటు చేసిన మాస్కులను వారికి అందించారు. మాస్కు పెట్టుకోవడానికి వారిద్దరు నిరాకరించడంతో ఆగ్రహం చెందిన ఒక వ్యక్తి.. మాస్కు ఇస్తున్నా ధరించరా అంటూ బౌతిక దాడికి పాల్పడ్డాడు. ఈ దశలో ఇద్దరు ఒకరి మీద ఒకరు పంచ్‌లు విసురుకుంటూ తీవ్రంగా కొట్టుకున్నారు. అయితే ఇది చూసిన ఇతర ప్రయాణికులు మాస్క్ ధరించని వ్యక్తిని కిందపడేసి కాళ్లతో గట్టిగా అణగదొక్కి పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో పోలీసులు వచ్చి వారిద్దరిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇదంతా ఒక వ్యక్తి వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. అయితే వారిద్దరు మద్యం తాగి విమానమెక్కారని.. మాస్కులు ధరించాలని కోరినా వినకపోవడంతోనే దాడికి పాల్పడాల్సివచ్చిందని ప్రయాణికులు పేర్కొన్నారు. కాగా ఈ ఘటనతో కెఎల్ఎం ఎయిర్‌లైన్స్ విమానం ఎక్కేవారు తప్పనిసరిగా మాస్కు ధరించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రయాణికులు బోర్డింగ్ సమయంలోనే మాస్కులు ధరించాలని.. అలా చేయనివారిని బయటికి పంపించాలని నిర్ణయించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. -
మహ్మద్ ప్రవక్తపై కార్టూన్ పోటీలు!
అమ్‌స్టర్‌డామ్ : ఇస్లాం దైవ ప్రవక్త మహమ్మద్‌పై వ్యంగ్య కార్టూన్ చిత్రాల పోటీని నిర్వహిస్తున్నట్టు నెదర్లాండ్ ప్రజా ప్రతినిధి గ్రీట్ విల్డర్స్ శనివారం ట్విటర్లో ప్రకటించారు. ఔత్సాహికులు తమ కార్టూన్ చిత్రాలను పంపాల్సిందిగా ఆయన కోరారు. నెదర్లాండ్‌లో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీకి చెందిన గ్రీట్ విల్డర్స్ ఇస్లాం వ్యతిరేకులుగా పేరుగాంచారు. హింస, ఇస్లామిక్ ఫత్వాల మీద భావ ప్రకటనా స్వేచ్ఛది ఎప్పుడూ పైచేయి కావాలని విల్డర్స్ పేర్కొన్నారు. విల్డర్స్ ఈ పోటీని గతేడాది ఆగస్టులోనే నిర్వహించాలనుకున్నారు. కానీ, ఆయనను హత్య చేయడానికి ప్రయత్నిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయడంతో తన ప్రయత్నాన్ని మానుకున్నారు. అంతేకాక, కార్టూన్ పోటీలను రద్దు చేయాలంటూ పాకిస్తాన్‌లోని ఇస్లామిక్ పార్టీ తెహ్రీక్ ఎ లబ్బైక్ పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించింది. ప్రపంచంలోని ఇస్లామిక్ దేశాలన్నీ కూడా నెదర్లాండ్తో తమ దౌత్య సంబంధాలను తెంచుకోవాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో విల్డర్స్ గతేడాది పోటీలను రద్దు చేసి ఇప్పుడు నిర్వహిస్తున్నారు. మహ్మద్ ప్రవక్త వ్యంగ్య చిత్రాలను చాలా మంది ముస్లింలు అభ్యంతరకరంగా భావిస్తారు. గతంలో చూస్తే 2005లో ఓ పత్రికలో మహ్మద్ ప్రవక్తపై వ్యంగ్య కార్టూన్ చిత్రాన్ని ప్రచురించినందుకు గాను కార్టూనిస్టు లేదా ఆ పత్రిక ఎడిటర్‌ను చంపాలని తీవ్ర ప్రయత్నాలు జరిగాయి. తర్వాత పదేళ్లకు ప్యారిస్‌లో ఇద్దరు ముస్లిం గన్మెన్లు మహ్మద్ ప్రవక్తపై వ్యంగ్య చిత్రాలను ప్రచురించినందుకు చార్లీ హెబ్డో పత్రిక కార్యాలయంలో 12 మందిని కాల్చి చంపారు. -
అద్భుతం సృష్టించిన చిచ్చర పిడుగు!!
ఆమ్స్టర్డాం: తొమ్మిదేళ్ల వయస్సులోనే లారెంట్ సిమ్మన్స్ అనే బాలుడు అద్భుతం సృష్టించాడు. అతిపిన్న వయస్సులోనే డిగ్రీ పూర్తిచేసిన వ్యక్తిగా రికార్డులకెక్కనున్నాడు. తద్వారా ప్రపంచంలోనే అతిపిన్న వయస్సులో డిగ్రీ సాధించిన వ్యక్తిగా పేరొందిన మైఖేల్ కెర్నీ(10 ఏళ్లకు అలబామా యూనివర్సిటీ) రికార్డును అధిగమించనున్నాడు. వివరాలు.. ఆమ్స్టర్డాంకు చెందిన సిమ్మన్స్ ఇందోవన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్నాడు. ఈ క్రమంలో వచ్చే నెలలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో పట్టా పుచ్చుకోనున్నాడు. అనంతరం కేంబ్రిడ్జి యూనివర్సిటీలో పీహెచ్డీ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ విషయం గురించి అతడి తల్లిదండ్రులు లిదియా, అలెగ్జాండర్ సిమ్మన్స్ మాట్లాడుతూ చిన్నతనం నుంచే లారెంట్ అసాధారణ ప్రతిభా పాటవాలు(ఐక్యూ 145) కనబరిచే వాడని చెప్పుకొచ్చారు. ఈ చిచ్చర పిడుగు తమకు చాలా ప్రత్యేకమని పుత్రోత్సాహంతో పొంగిపోతున్నారు. కేవలం తాను చదువుకు మాత్రమే పరిమితమైపోలేదని.. ఆటపాటల్లోనూ ముందుంటాడని పేర్కొన్నారు. సోషల్ మీడియా సైట్లలో కూడా యాక్టివ్‌గా ఉంటాడని.. తనకు ఇన్‌స్టాగ్రాంలో 11 వేల మంది ఫాలోవర్లు ఉన్నారని తెలిపారు. ఇక తొమ్మిదేళ్లకే డిగ్రీ పూర్తి చేయడం తనకు ఆనందంగా ఉందన్న లారెంట్... ఇంజనీరింగ్‌తో పాటు మెడిసిన్ పట్ల కూడా తనకు అభిరుచి ఉందని తెలిపాడు. -
పోలీసుల దాడిలో దిగ్భ్రాంతికర విషయాలు
జాన్ జోన్ డార్‌స్టెన్‌కు సరిగ్గా పాతికేళ్లు ఉంటాయి. ఓ రోజు భయం భయంగా పొలాల గుండా పరిగెత్తుకుంటూ సమీపంలోని బార్ కెళ్లి. ఐదు బీర్లకు ఆర్డర్ ఇచ్చారు. సర్వర్ తీసుకొచ్చిన బీర్లను తీసుకున్నప్పటికీ ఆయన చేతులు వాటిని పట్టుకోలేక వణికిపోతున్నాయి. కౌంటర్ మీదున్న యజమాని ఆ విషయాన్ని గమనించి ఆ యువకుడి చేతిలోని బీర్లను తీసుకొని విషయం ఏమిటని ప్రశ్నించారు. సమీపంలోని ఓ ఫామ్ హౌజ్‌లో తన కుటుంబం బంధించి ఉందని, విడిపించాల్సిందిగా అడ్రస్ చెప్పి బీర్లు తీసుకొని పారిపోయారు. బార్ యజమాని క్రిస్ వెస్టర్బీక్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు వచ్చి ఆ ఫామ్ హౌజ్‌ను తనిఖీ చేశారు. బార్‌కు వెళ్లి ఫిర్యాదు చేసిన పాతికేళ్ల జాన్ జోన్ అందులో ఓ దిగ్భ్రాంతికరమైన విషయం వెలుగు చూసింది. గీత్ వాన్ డార్‌స్టెన్ అనే మధ్య వయస్కుడు, ఆయన ఐదుగురు పిల్లలు ఫామ్‌హౌజ్ సెల్లార్‌లోని ఓ చీకటి గదిలో బంధీలుగా ఉన్నారు. ఒక్క కిటికీ కూడా లేని ఆ చిన్న చీకటి గదిలో వారు గత తొమ్మిదేళ్లుగా బందీలుగా ఉన్న విషయం తెల్సి పోలీసులు అవాక్కయ్యారు. వారిలో 18 ఏళ్ల నుంచి 25 ఏళ్లు మధ్యన ఇద్దరు యువకులు, ముగ్గురు యువతులు ఉన్నారు. వారిలో పెద్దవాడే బార్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డ్యామ్‌కు ఉత్తరాన 60 కిలోమీటర్ల దూరంలోని రూయినర్‌వోల్డ్ చిన్న పట్టణం ఉంది. ఆ పట్టణం పొలాల్లోనే ఈ ఫామ్ హౌజ్ ఉంది. ఆ ఫామ్ హౌజ్‌లో చాలా గదులు ఉన్నప్పటికీ అన్ని గదుల్లోనూ కొత్తగా చేసిన ఫర్నీచర్ ఉంది. చిన్న చీకటి గదిలోనే వారిని బందీలుగా ఉంచారు. కిడ్నాపర్ జోసఫ్, జాన్ జోన్ కుటుంబం పక్కపక్కన అద్దెకున్న ఇల్లు బందీల మాటలు గమ్మత్తుగా ఉన్నాయని, ఏదో దైవ భాష మాట్లాడుతున్నట్లు కలగా పులగంగా మాట్లాడుతున్నారని, వారి ఒక్క మాట కూడా తమకు అర్థం కావడం లేదని, వారిని వైద్య చికిత్సల నిమిత్తం ఆస్పత్రికి పంపించామని కేసును దర్యాప్తును చేస్తున్న పోలీసులు తెలిపారు. బందీలు తామున్న గదిలోనే తిని, ఆ రూములోనే ఇంతకాలం పడుకున్నట్లు తెలుస్తోందని వారు చెప్పారు. ఇంతకాలం బయటి ప్రపంచానికి దూరం అవడం వల్ల వారు అలా మాట్లాడుతున్నారా ? మరేమైనా ఉందా ? అన్న విషయం దర్యాప్తులో తేలాల్సి ఉందన్నారు. వారిని అలా బంధించినన వ్యక్తిని ఆస్ట్రియాకు చెందిన 58 ఏళ్ల జోసఫ్ బ్రన్నర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వృత్తిరీత్యా వడ్రింగి పనులు చేసుకొని బతికే జోసఫ్ ...16 ఏళ్ల క్రితం గీత్‌వాన్ డార్‌స్టెన్ కుటుంబం అద్దెకున్న పక్క అద్దెకు ఉండేవాడు. గీత్‌వాన్ చెక్క బొమ్మలు చేయడంలో మంచి నేర్పరి. ఆయన బొమ్మలు చెక్కితే జోసఫ్ చెక్క పడవులు తయారు చేసేవాడు. ఇద్దరు కలిసి వాటిని వాటిని విక్రయించేవారు. గీత్‌వాన్ నలుగురితో కలుపుగోలుగా ఉంటే జోసఫ్ మాత్రం ఎవరితో మాట్లాడేవాడు కాదు. పలకరించినా మాట్లాడకుండా తనపని తాను చేసుకొని పోయేవాడు. 2008లో అతను అద్దె ఇల్లు ఖాళీచేసి ఎటో వెళ్లి పోయాడు. జాన్ కుటుంబానికి చెందిన ‘నేచురల్ హోమ్స్’ షాపు 2010లో గీత్‌వాన్ కుటుంబం ఇళ్లు ఖాళీ చేసి ఎటో వెళ్లి పోయింది. అప్పుడే గీత్‌వాన్ కుటుంబాన్ని జోసఫ్ కిడ్నాప్ చేసి ఫామ్ హౌజ్‌లో బంధించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అప్పటికీ గీత్‌వాన్ భార్య బతికే ఉందని, ఆ తర్వాత కొంత కాలానికి ఆమె మరణించినట్లు ఆమె పెద్ద కుమారుడి కథనం ద్వారా తెలుస్తోంది. అయితే ఆమెను ఎక్కడ సమాధి చేశారో, కుటుంబ సభ్యులకు ఎవరికి తెలియదట. జోసఫ్ ఫామ్ హౌజ్ గేట్‌కు ఎప్పుడూ తాళం వేసి ఉంచేవాడని, ఎవరిని దరిదాపుల్లోని రానిచ్చేవాడు కాదని, ఇంటికి ఓ కెమేరాను కూడా అమర్చుకున్నాడని, పొరుగు పొలాల వారు తెలిపారు. జాన్ జోన్ వెళ్లిన బారు ఇదే (మీడియాతో మాట్లాడుతున్న బార్ యజమాని క్రిస్) జోసఫ్‌కు ఓ ట్రక్కుందని, ఆ ట్రక్కులో వారానికి సరఫడా ఆహార పదార్థాలు, సరుకులు తెచ్చేవాడని, ఒక్కరికి అన్ని సరుకులు ఎందుకబ్బా! తమకు అనుమానం వచ్చేదని, మాట్లాడని ఆ మూర్ఖుడితో మాటలెందుకు పడాలని ఎప్పుడు ప్రశ్నించలేదని వారన్నారు. ఆ ఇంటిలో కాకుండా ఆరు మైళ్ల దూరంలో జోసఫ్ ఓ వర్క్‌షాప్‌ను ఏర్పాటు చేసుకొని అక్కడే పనిచేసుకునే వాడని, వారానికి రెండు, మూడు సార్లకు మించి ఫామ్ హౌజ్‌లో కనిపించే వాడు కాదని, వచ్చినప్పుడు కూడా ఏవో ఇంటి మరమ్మతులు ఒంటరిగా చేస్తూ కనిపించే వాడని వారు తెలిపారు. ఆ ఇంటిలో ఇంత గూడుపుఠాణీ ఉందని తాము తెలుసుకోలేకపోయామని చెప్పారు. ఇంతకు ఆ ఫామ్‌హౌజ్ జోసఫ్ సొంతం కాదు. కిరాయికి తీసుకున్నది. నెల నెల టంచనుగా అద్దె చెల్లిస్తున్నందున తాము కూడా ఫామ్‌హౌజ్‌ను మధ్యలో తనిఖీ చేసుకోలేదని యజమాని తెలిపారు. పోలీసు అధికార ప్రతినిధి రమోనా ఈ వింత సంఘటన వెనక సమాధానం లేని అనేక శేష ప్రశ్నలు ఉన్నాయని పోలీసులు చెప్పారు. కుటుంబాన్ని బంధించిన గది తలుపుకు ఓ బండరాయి మాత్రమే అడ్డంగా ఉందని, దాన్ని తొలగించి తప్పించుకునే అవకాశం బందీలకు ఉన్నా కూడా వారు అలా చేయలేదని చెప్పారు. కనీసం గది బయటకు వచ్చేందుకు ప్రయత్నించిన దాఖలాలు లేవు. వారు తీవ్ర భయాందోళనలు, మానసిక ఆందోళనకు గురినట్లు మాత్రం కనిపిస్తోందని చెప్పారు. జ్వార్ట్లూయీ నగరంలో గీత్‌వాన్ కుటుంబానికి ‘నేచురల్ హోమ్స్’ పేరిట ఓ షాపు కూడా ఉంది. పోలీసులు ఇప్పుడు ఆ షాప్‌పై దాడిచేయగా, షాపును తాము గత పదేళ్లుగా అద్దెకు తీసుకొని నడుపుతున్నామని, కొత్తలో ఎవరో వచ్చి అద్దె తీసుకెళ్లే వారని, ఇప్పుడు ఎవరూ రావడం లేదని షాపు వారు చెప్పారట. గీత్‌వాన్ పెద్ద కుమారుడు జాన్ జోన్ రెండు, మూడు సార్లు స్థానిక బారు వద్దకు వెళ్లి బీరు తాగాడట. అప్పుడు ఎవరికీ తమ బంధీ గురించి ఫిర్యాదు చేయలేదట. ఎందుకు ? 2010 వరకు సోషల్ మీడియాలో చురుగ్గా ఉన్న జాన్ జోన్ తాము రూయినర్‌వోల్డ్ పట్టణానికి షిప్ట్ అవుతున్నామని కూడా సోషల్ మీడియాలో 2010లో పేర్కొన్నారు. ఆ తర్వాత సోషల్ మీడియాకు ఆయన పూర్తిగా దూరమయ్యారు. చీకటి గది నుంచి విముక్తి పొందిన తర్వాత గత జూలై నెల నుంచి జాన్ జోన్ మళ్లీ సోషల్ మీడియాలో క్రియాశీలకంగా ఉన్నారు. అయనప్పటికీ తమ చీకటి జీవితం గురించి ఒక్క ముక్క కూడా ఆయన వెల్లడించలేదు. ఎందుకు ? కిడ్నాపర్ జోసఫ్ బ్రన్నర్‌ను ఈ రోజు (గురువారం) ఆమ్స్టర్డామ్ కోర్టు ముందు విచారణకు హాజరుపర్చారు. ఆయన కోర్టుకు ఏమి చెప్పిందీ తెలియరాలేదు. కేసు దర్యాప్తులో పోలీసులకు ఏమాత్రం సహకరించని జోసఫ్ కోర్టు ముందు కూడా నోరు విప్పలేదని పోలీసుల అధికార ప్రతినిధి రమోనా తెలిపారు. కొన్ని కేసుల మిస్టరీ ఎప్పటికీ విడిపోదని, ఇది కూడా అలాంటిదే కావచ్చని ఆమె అన్నారు. -
ఒక్క రోజుకి పెళ్లి!
ఒక్క రోజు కోసం ఎవరైనా పెళ్లి చేసుకుందామనుకుంటున్నారా? ఆ తర్వాత ఓ అందమైన నగరాన్ని ఆమెతో కలసి చుట్టేయాలనుకుంటున్నారా? మనది కాని ఊరిలో.. ఏ మాత్రం పరిచయం లేని ఓ అందమైన అమ్మాయితో ఒక్కరోజు వివాహం.. సాధ్యమే సుమా! అందంగా అలంకరించిన పెళ్లి మండపంలో వధూవరులిద్దరూ ఉంగరాలు మార్చుకోవడంతో మొదలై సిటీ అంతా ఎంచక్కా ఇద్దరూ కలిసి చక్కర్లు కొట్టేయొచ్చు. అందమైన సరసుల్లో విహారానికెళ్లొచ్చు. మధ్య మధ్యలో సెల్ఫీలకూ వీలుంటుంది. మీ స్తోమతను బట్టి ఈ పెళ్లికి మీ బంధుమిత్రులను కూడా ఆహాæ్వనించొచ్చు. అయితే ఈ పెళ్లి మీరు చేసుకోవాలనుకుంటే వేలం పాటలో పాల్గొనాల్సిందే. ఎంత ఖర్చయినా పర్లేదు ఒక్క రోజు పెళ్లి చాన్స్ కొట్టేయాలనుకుంటే బట్టలు సర్దుకోండి మరి.. కాస్త ఆగండి.. ఈ పెళ్లి తర్వాత ఉండే షరతులు కూడా చెబుతాం.. అప్పుడు ఓకే అనుకుంటే సర్దుకోండి బట్టలు.. ముఖ్యమైనదేంటంటే పెళ్లి చేసుకున్న అమ్మాయిని కనీసం ముద్దు కూడా పెట్టుకోవడానికి వీల్లేదు. అయితే చిన్నపాటి కౌగిలింతకు మాత్రం అవకాశం ఉంటుంది. అసలీ ఒక్క రోజు పెళ్లి ఏంటి..? చక్కర్లు కొట్టడం ఏంటి..? ఆ నిబంధనలేంటి అనుకుంటున్నారా? ఈ తంతు జరిగేది నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డాంలో. యువతను ఆకర్షించి అక్కడి పర్యాటక రంగాన్ని అభివృద్ధిపరిచేందుకు ఇలా ఓ వింత పెళ్లిని జరిపిస్తున్నారు. పర్యాటకులకు సాధారణ గైడ్ మాదిరిగా కాకుండా ఆత్మీయ స్నేహితురాలిగా మెలుగుతూ దగ్గరుండి ప్రాంతాన్ని ఆ వధువు చూపిస్తుందన్న మాట. ఇరువురి మధ్య గౌరవానికి భంగం రాకుండా ప్రవర్తించడం ఒక గొప్ప అనుభవంగా కూడా భావిస్తున్నారు. పర్యాటకులకు, ఆ ప్రాంతవాసులకు మధ్య సుహృద్భావ వాతావరణాన్ని నెలకొల్పేందుకూ ఈ ఆలోచన ఎంతగానో ఉపయోగపడుతోందట. దీని ద్వారా వచ్చే ఆదాయం లో కొంత మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు విని యోగిస్తున్నారు. 2015 నుంచి ఈ వివాహాలను ‘వెడ్ అండ్ వాక్’పేరుతో నిర్వహిస్తున్నారు జోనా రెన్స్. ఆమ్‌స్టర్‌డాంలోని స్థానిక మార్కెటింగ్ సంస్థలు, వ్యాపారులు ‘అన్టూరిస్ట్ గైడ్ టు ఆమ్ స్టర్డాం’పేరుతో వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించారు. -
హాలిడే మోడ్
నిన్నమొన్నటి వరకు ఫుల్ వర్క్ మోడ్‌లో ఉన్న వరుణ్ తేజ్ హాలిడే మూడ్‌కు షిఫ్ట్ అయ్యారు. వెకేషన్ కోసం ఆమ్స్టర్డామ్ వెళ్లారు. ఈ హాలిడే మూడ్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూ అక్కడి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. హారీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘వాల్మీకి’. ఇందులో డబ్స్మాష్ ఫేమ్ మృణాలిని రవి హీరోయిన్గా నటిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా షెడ్యూల్లో కొన్ని నైట్ సీన్లను తెరకెక్కించారు. ఈ షెడ్యూల్ పూర్తి కావడంతో రెస్ట్ తీసుకోవడానికి నెదర్లాండ్స్ రాజధాని ఆమ్స్టర్డామ్కి వెళ్లారు వరుణ్. ఈ హాలీడే ట్రిప్ అయిపోగానే తిరిగి ‘వాల్మీకి’ సెట్లో జాయిన్ అవుతారు. ఈ సినిమా తమిళ హిట్ ‘జిగర్తండా’కు రీమేక్ అని టాక్. ఈ సినిమా కాకుండా కిరణ్ కొర్రపాటి అనే కొత్త దర్శకుడు తెరకెక్కించనున్న సినిమాలో వరుణ్ తేజ్ హీరోగా నటించనున్నారు. -
ఓయో చేతికి నెదర్లాండ్స్ కంపెనీ
న్యూఢిల్లీ: ఆతిథ్య రంగ సంస్థ ఓయో తాజాగా నెదర్లాండ్స్‌కి చెందిన వెకేషన్ రెంటల్ సంస్థ లీజర్ గ్రూప్‌ను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది. యాక్సెల్ స్ప్రింగర్ నుంచి దీన్ని కొనుగోలు చేస్తున్నట్లు తెలిపింది. ఈ డీల్ విలువ సుమారు 415 మిలియన్ డాలర్లుగా (సుమారు రూ. 2,885 కోట్లు) ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ ఆతిథ్య రంగంలో కార్యకలాపాలు మరింతగా విస్తరించేందుకు ఇది ఉపయోగపడగలదని ఓయో వ్యవస్థాపకుడు, గ్రూప్ సీఈవో రితేష్ అగర్వాల్ పేర్కొన్నారు. యూరోపియన్ దేశాల్లో హాలిడే హోమ్స్, హాలిడే పార్క్‌లు, హాలిడే అపార్ట్మెంట్స్ నిర్వహణలో ః లీజర్ గ్రూప్ పేరొందింది. బెల్విల్లా, డాన్‌సెంటర్, డాన్ల్యాండ్ బ్రాండ్స్ కింద ః లీజర్ గ్రూప్.. యూరప్‌లోని 13 దేశాల్లో 30,000 పైగా గదులను అద్దెకిస్తోంది. అలాగే ట్రామ్ ఫెరీన్వోనుంజెన్ బ్రాండ్ పేరిట 50 దేశాల్లో 85,000 పైచిలుకు గృహాల యజమానులకు హోమ్ మేనేజ్మెంట్ సేవలు అందిస్తోంది. ః లీజర్ గ్రూప్ కొనుగోలుతో 24 దేశాల్లోని 800 నగరాల్లో ఓయో కార్యకలాపాలు విస్తరించినట్లవుతుంది. భారత్ సహా అమెరికా, బ్రిటన్, చైనా, సౌదీ అరేబియా, జపాన్ తదితర దేశాల్లో ఓయో కార్యకలాపాలు సాగిస్తోంది. -
హాలిడే ఇంకా అవ్వలేదు
టాలీవుడ్ లవ్లీ కపుల్ నాగచైతన్య, సమంతల న్యూ ఇయర్ హాలిడే ఇంకా ముగిసినట్టుగా లేదు. ఆమ్స్టర్డమ్ అందాలను ఇంకా చూస్తూ గడిపేస్తున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం నాగచైతన్య, మరికొంత మంది స్నేహితులతో కలసి హాలిడేకి వెళ్లారు సమంత. అక్కడ తాము చేస్తున్న అల్లరంతా ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారామె. తాజాగా ఈ ట్రిప్‌లో పలు ఫొటోలను పంచుకున్నారు. సినిమాల విషయానికి వస్తే సమంత, నాగచైతన్య ప్రస్తుతం ‘మజిలీ’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో భార్యాభర్తలుగానే నటిస్తున్నారు. -
స్టోర్‌లోనే పేలిన ఐప్యాడ్ బ్యాటరీ
శాన్ఫ్రాన్సిస్కో : స్మార్ట్ఫోన్లను, ఎలక్ట్రానిక్ వస్తువులను ఎక్కువగా వాడటం, ఎక్కువ సేపు ఛార్జింగ్ పెట్టడంతో బ్యాటరీలు హీట్ ఎక్కి పేలడం చూస్తూ ఉన్నాం. కానీ అత్యంత సురక్షితమైన ఆపిల్ ఐప్యాడ్ బ్యాటరీ కూడా పేలిపోయింది. అది కూడా స్టోర్‌లో ఉన్న సమయంలోనే. ఐప్యాడ్ బ్యాటరీ పేలడంతో, ఆపిల్ తన ఆమ్స్టర్డ్యామ్ స్టోర్‌ను తాత్కాలికంగా మూసివేసింది. బ్యాటరీ పేలడంతో హానికరమైన కెమికల్స్ ఉత్పన్నమయ్యాయని ఆపిల్ పేర్కొంది. ముందు జాగ్రత్త చర్యగా స్టోర్‌ను మూసివేశామని, ఈ పేలుడుతో స్టోర్‌లోని ముగ్గురు ఉద్యోగులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు ఆపిల్ తెలిపింది. ‘హానికరమైన కెమికల్స్ ఎక్కువగా విడుదల కావడంతో, స్టోర్‌ను మూసివేశారు. అగ్నిమాపకదళాలు, ఆ కెమికల్స్‌ను తొలగిస్తున్నారు’ అని 9టూ5మ్యాక్ రిపోర్టు చేసింది. గత కొన్ని నెలల క్రితం కూడా ఇలాంటి సంఘటనలే జరగడంతో, ఐఫోన్ బ్యాటరీల రీప్లేస్మెంట్ ప్రొగ్రామ్‌ను ఆపిల్ చేపట్టింది. ఐఫోన్ బ్యాటరీలతో థెర్మనల్ సంఘటనలు జరగడంతో, స్విట్జర్లాండ్, స్పెయిన్‌లో ఉన్న రెండు స్లోర్లను అంతకముందుకు ఆపిల్ ఖాళీ చేసింది. ఆమ్స్టర్డ్యామ్లో నేడు జరిగిన సంఘటనలో ఉద్యోగులకు అంత పెద్ద గాయాలేమీ కాలేదని, కానీ ఉద్యోగులు స్వల్పంగా గాయ పడినట్టు రిపోర్టు వెల్లడించింది. గత వారం చైనాలో డ్రైవ్ చేస్తున్న కారులో ఐఫోన్ 6 పేలింది. వెహికిల్ లోపల అమర్చిన డ్యాష్ క్యామ్‌లో ఐఫోన్ 6 పేలిన వీడియో రికార్డైంది. ఈ వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. -
ఆమెను వేధించారో.. ఇక అంతే!
సాక్షి : అది ఆమ్స్టర్ డ్యామ్‌లోని ఓ వీధి. స్థానికంగా ఓ యూనివర్సిటీలో విద్యను అభ్యసించే 20 ఏళ్ల నోవా జన్స్మా నడుచుకుంటూ వెళ్తుంది. అంతలో పక్కనే కొందరు ఆకతాయిలు ఆమెను వెంబడిస్తూ మాటలతో వేధించటం మొదలుపెట్టారు. అంతే ఒక్కసారిగా వెనక్కి తిరిగిన ఆ యువతి వారి దగ్గరగా వెళ్లిన తన బ్యాగ్‌లో చెయ్యి పెట్టింది. ఏం తీయబోతుందా? అని ఆత్రుతగా చూస్తుండగా... యువకులు ఒక్కసారిగా నవ్వటం మొదలుపెట్టారు. ఆమె తన ఫోన్‌ను బయటకు తీసి వారితో ఓ సెల్ఫీ దిగింది. తనంతట తానుగా ఆ యువతి ఫోటో కోసం రావటంతో ఆకతాయిలు కూడా సరదాగా సెల్ఫీ దిగారు. అయితే అది ఆమె వారికొచ్చే కాంప్లిమెంట్ అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఆ ఫోటోల్లో ఆమె ముఖ కవలికలు మాత్రం చాలా సీరియస్‌గా ఉన్నాయి. అంటే ఆమె ఏదో చేయబోతుందని అర్థం. కానీ, తర్వాతే అసలు విషయం అందరికీ అర్థమైపోయింది. ఆ యువతి ఆ ఫోటోను డియర్క్యాట్కాలర్స్(వేధించే ఆకతాయిలు) యాష్ ట్యాగ్‌తో క్రియేట్ చేసిన ఆ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తోంది. పైగా వాళ్లు చేసే కామెంట్లను కూడా అందులో పేర్కొంటుంది. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు... నెల రోజుల వ్యవధిలో 24 ఫోటోలను ఆమె షేర్ చేసింది. అంటే అన్నిసార్లు ఆమె వేధింపులకు గురైందన్న మాట. తొలిసారి నోవా రైల్లో వెళ్తున్నప్పుడు కొందరు ఆమెను వేధించారు. అప్పుడే ఆమెకు ఈ ఆలోచన తట్టింది. తనకు ఎదురయ్యే వేధింపుల ద్వారానే అవగాహన కార్యక్రమం చేపట్టింది. తద్వారా వారు పరువు తీయటంతోపాటు.. మహిళలను గౌరవించాలనే సందేశం ఇస్తుందన్న మాట. ఇక ఈ వినూత్న నిరసనకు సోషల్ మీడియాలో మంచి స్పందన వస్తోంది. ఇప్పటిదాకా 45 వేల మంది ఆమెను ఫాలో అయ్యారు. ‘‘చట్టాలున్నా అవి వారిని ఆపలేకపోతున్నాయి. అందుకే ఇలాంటి నిరసన వ్యక్తం చేస్తున్నా. ఇది బాగా పని చేసింది. నాకిప్పుడు వేదింపులు తగ్గాయి’’ అని ఓ ఇంటర్వ్యూలో నోవా తెలిపింది. వేధింపులను ధైర్యంగా ఎదుర్కుంటూ నోవా చేసిన ప్రయత్నానికి మహిళా సంఘాలతోపాటు అభ్యుదయ వాదులు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.