Ashok Babu
-
నా దీక్ష ఆగదు..
-
అశోక్‌బాబు తల్లి భౌతికకాయానికి సీఎం జగన్ నివాళులు
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. కొండెపి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి వరికూటి అశోక్‌బాబు తల్లి కోటమ్మ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. సోమవారం ప్రకాశం జిల్లా కారుమంచికి వెళ్లిన సీఎం జగన్.. అశోక్‌బాబు తల్లి భౌతిక కాయానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాగా, సీఎం వైఎస్ జగన్ సోమవారం ఉదయం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కారుమంచి గ్రామానికి చేరుకున్నారు. 28న విశాఖ పర్యటన 28వ తేదీ మంగళవారం సాయంత్రం 4 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి సీఎం వైఎస్ జగన్ బయలుదేరి 5.15 గంటలకు విశాఖ చేరుకుంటారు. సాయంత్రం 6 గంటలకు రిషికొండ రాడిసన్ బ్లూ రిసార్ట్స్‌కు చేరుకుని రాత్రి 7–8 గంటల మధ్య జీ–20 ప్రతినిధులతో జరిగే ఇంటరాక్షన్ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అతిథులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘గాలా డిన్నర్’లో పాల్గొని రాత్రి 8.45 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి 10 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు. -
హవ్వ... మోసగాడికి వత్తాసా?
తప్పుడు విద్యార్హతతో ప్రభుత్వాన్ని మోసగించిన టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు ఉదంతంలో చంద్రబాబు తన నైజాన్ని మరోసారి చాటుకున్నారు. అశోక్‌బాబు అరెస్ట్ అయిన తర్వాత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేస్తే దాన్ని కోర్టు ఇచ్చిన క్లీన్ చిట్‌గా చెబుతూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేరం చేసిన వ్యక్తి ఇంటికి వెళ్లి అతడికి మద్దతుగా నిలుస్తున్నట్లు ప్రకటించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఏపీ సబార్డినేట్ రూల్ 23(6) ప్రకారం ప్రభుత్వ శాఖాధి పతులు, డైరెక్టర్ల కార్యాలయాల్లో విధులు నిర్వర్తించాలంటే సదరు ఉద్యోగి తప్పనిసరిగా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారికి మరింత ప్రాధాన్యం ఇవ్వాలి. కాగా ఈ నిబంధనలకు విరుద్ధంగా అశోక్ బాబు వ్యవహరించారు. ఇంటర్మీడియట్ విద్యార్హతతో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరిన ఆయన 1996 నాటికి పదోన్నతి పొంది విజయవాడ వాణిజ్య పన్నుల శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా ఉన్నారు. అదే సంవత్సరం శాఖాధిపతుల కార్యాలయంలో బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. తాను బీకామ్ చదివి నట్టూ, అలాగే ఎన్ఐఐటీ అనే ప్రైవేటు సంస్థ నుంచి డిప్లమో ఇన్ కంప్యూటర్ (డీకామ్) కూడా పొందినట్టూ అఫిడవిట్ ఇస్తూ దరఖాస్తులో పేర్కొన్నారు. అంతేకాదు తన సర్వీస్ రిజిస్టర్లో విద్యార్హతగా ఉన్న డీకామ్ను బీకామ్గా ట్యాంపర్ చేసి ప్రభుత్వాన్ని మోసగించారు. అశోక్‌బాబు మోసంపై వాణిజ్య పన్నుల శాఖలో ఓ ఉద్యోగి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో శాఖాధిపతి కార్యాలయం కోసం దరఖాస్తు చేసిన ఆరుగురు ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్లను తన వద్దకు తీసుకురావాలని వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్ ఆదేశించారు. వారిలో ఐదుగురి సర్వీస్ రిజిస్టర్లు వచ్చాయి. కానీ అశోక్‌బాబు సర్వీస్ రిజిస్టర్ రాలేదు. తరువాత చూస్తే ఆయన సర్వీస్ రిజిస్టర్లో విద్యార్హత కాలమ్ వద్ద చిత్తు చిత్తుగా కొట్టివేసి ఉంది. అంటే ఆ కాలమ్‌లో ఏం రాసి ఉందన్నది ఎవరికీ తెలియకూడదనే అలా చేశారు. ప్రభుత్వ శాఖలో సంబంధిత అధికారి నియంత్రణలో ఉండాల్సిన సర్వీస్ రిజిస్ట ర్ను అనుమతి లేకుండా తీసుకుని అలా కొట్టివేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుందన్నది బహిరంగ రహస్యమే. అశోక్‌బాబు తప్పుడు విద్యార్హతలను పేర్కొంటూ ప్రభు త్వాన్ని మోసగించారనే ఫిర్యాదుపై 2013లోనే వాణిజ్య పన్నుల శాఖ విచారణకు ఆదేశించింది. కాగా 2014లో చంద్రబాబు సీఎం అయిన తర్వాత అశోక్‌బాబుపై దర్యాప్తును 2018వరకు సాగ దీసిన టీడీపీ ప్రభుత్వం అతడికి క్లీన్ చిట్ ఇచ్చేసింది. ఇక టీడీపీకి రాజకీయ లబ్ధి కలిగించేలా 2014లో ప్రభుత్వ ఉద్యోగులను మోసగించిన అశోక్ బాబుకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని చంద్రబాబు 2018 చివర్లో నిర్ణయించారు. దాంతో ఆయన స్వచ్ఛంద ఉద్యోగ విరమణ(వీఆర్ఎస్) కోసం దరఖాస్తు చేశారు. సర్వీసు నిబంధన 42 ప్రకారం 20 ఏళ్లు సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగి వీఆర్ఎస్ కోసం కనీసం మూడు నెలల నోటీసు ఇవ్వాలి. ఆ ప్రకారం అశోక్‌బాబుకు 2019, జనవరి 31న వీఆర్ఎస్ ఇవ్వాలి. కానీ అందుకు విరుద్ధంగా 2019, జనవరి 10నే ఆయనకు వీఆర్ఎస్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఎవరైనా ఉద్యోగిపై ఏదైనా కేసు పెండింగులో ఉంటే వీఆర్ఎస్కు అనుమతించకూడదన్నది ప్రభుత్వ నిబంధన. ఈ విషయంలోనూ అశోక్‌బాబుకు అనుకూలంగా టీడీపీ ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరించింది. తనపై ఎలాంటి కేసులు పెండిం గులో లేవని ఆయన తన వీఆర్ఎస్ దరఖాస్తులో పేర్కొన్నారు. దాన్ని సరిచూసుకోకుండానే ఉన్నతాధికారులు వీఆర్ఎస్కు అను మతించడం వెనుక టీడీపీ ప్రభుత్వ పెద్దల ఒత్తిడి ఉంది. కానీ ఎమ్మెల్సీ నామినేషన్ çసందర్భంలో సమర్పించిన అఫిడివిట్లో అశోక్‌బాబు తనపై నాలుగు కేసులు పెండింగులో ఉన్నాయని వెల్లడించారు. అంటే ఆయన వీఆర్ఎస్ దరఖాస్తులో ఉద్దేశ పూర్వకంగానే తప్పుడు సమాచారమిచ్చారన్నది స్పష్టమైంది. చంద్రబాబు ప్రభుత్వం ఏకపక్షంగా అశోక్‌బాబు అక్రమా లకు వత్తాసు పలకడంతో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగవర్గాల్లో తీవ్ర అసంతృప్తి రగిలింది. దాంతో ఆయన అక్రమాలపై పూర్తి ఆధారాలతోసహా లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. అన్ని అంశా లను సమగ్రంగా పరిశీలించిన లోకాయుక్త అశోక్‌బాబుపై ఆరో పణలకు ప్రాథమిక ఆధారాలున్నాయని భావించింది. అందుకే ఈ కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగించాలని ఆదేశిం చింది. ఎట్టకేలకు వాణిజ్య పన్నుల శాఖ సంయుక్త కమిషనర్ అశోక్ బాబుపై సీఐడీకి ఫిర్యాదు చేశారు. దాంతో సీఐడీ రంగం లోకి దిగి జనవరి 25న కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. అంతవరకు అశోక్‌బాబు తాను బీకామ్ చదివినట్టు సర్వీస్ రిజిస్టర్లో ట్యాంపర్ చేశారనే అంతా భావించారు. కానీ సీఐడీ దర్యాప్తుతో ఆయన అక్రమాలు మరిన్ని వెలుగులోకి వచ్చాయి. ఆయన ఏకంగా ఓ ఫేక్ బీకామ్ సర్టిఫికెట్‌ను సమర్పించినట్టు సీఐడీ దర్యాప్తులో బయటపడింది. అంతేకాదు తాను బీకామ్ చేసినట్టు ఆయన అఫిడవిట్ కూడా సమర్పించారని తెలిసింది. అంటే ఉద్దేశ్యపూర్వకంగానే ప్రభుత్వాన్ని మోసగించారన్నది నిర్ధారణ అయ్యింది. తగిన ఆధారాలు లభించినందునే సీఐడీ ఆయన్ని ఫిబ్రవరి 10 రాత్రి అరెస్టు చేసింది. విజయవాడలోని న్యాయస్థానంలో అశోక్‌బాబును ప్రవేశ పెట్టినప్పుడు ఆయన తరఫు న్యాయవాదులు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. న్యాయస్థానం స్పందిస్తూ ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఇక్కడ న్యాయస్థానం అశోక్‌బాబుకు బెయిల్ మాత్రమే మంజూరు చేసింది. అంతేగానీ ఆయన ఏమీ నిర్దోషి అని తీర్పునివ్వలేదు. ఆయన అక్రమాలపై దర్యాప్తు, విచారణ కొనసాగుతూనే ఉన్నాయి. అశోక్‌బాబు బెయిల్‌పై విడుదల కాగానే ఆయన నివాసానికి వెళ్లి సంఘీభావం ప్రకటించారు చంద్రబాబు. ఇదెంతవరకు సమంజసం అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అయితే ‘ఉద్యోగుల హక్కుల కోసం డిమాండ్ చేసినందుకే అశోక్‌బాబుపై ప్రభుత్వం అన్యాయంగా కేసు పెట్టింది’ అని ఆరోపణలతో అసలు విష యాన్ని పక్కదారి పట్టించేందుకు యత్నించారు చంద్రబాబు. వాస్తవానికి ఉద్యోగుల సమస్యపై ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న అశోక్‌బాబుకు ఏ సంబంధమూ లేదు. ఆయన ప్రస్తుతం ఉద్యోగుల ప్రతినిధి కాదు. ఉద్యోగ సంఘాలు పీఆర్సీ అంశంపై ఆందోళన చేశాయి. ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నేతలతో సామ రస్యంగా పలు దఫాలు చర్చించి ఉభయపక్షాలకు సమ్మతంగా సానుకూల ఫలితాన్ని సాధించింది. 14 ఏళ్లు సీఎంగా చేశాను... రాజకీయాల్లో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు కేవలం తన రాజకీయ ప్రయోజనాల కోసం అశోక్ బాబుకు వత్తాసు పలకడం ద్వారా ఏకంగా ప్రభుత్వ అధికార వ్యవస్థనే నిర్వీర్యం చేసేందుకు ప్రయ త్నిస్తున్నారు. హవ్వ... ఇంతకన్నా దిగజారుడుతనం ఏమైనా ఉందా? – వడ్డాది శ్రీనివాస్, సాక్షి అమరావతి విలేఖరి -
చంద్రబాబు మీరు చేసింది 420 పని అర్థం కావడం లేదా..?: జోగి రమేష్
సాక్షి, తాడేపల్లి: 14 ఏళ్లలో తాను చేయనిది ఒక దమ్మున్న ముఖ్యమంత్రి చేస్తున్నాడని చంద్రబాబుకి నిద్ర పట్టడం లేదని ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. ఈ మేరకు శనివారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు.. 420 అశోక్ బాబు ఇంటికి వెళ్లి మాపై రుబాబు చేస్తున్నారు, బెదిరిస్తున్నారు, ఘీంకరిస్తున్నాడు. అశోక్ బాబు అనే వ్యక్తి ఒక 420 పనిచేశాడు. అది రాష్ట్ర ప్రజలకందరికీ తెలుసు. తప్పుడు సర్టిఫికెట్తో పదోన్నతి పొందారని పిర్యాదు అందింది. ఆ ఫిర్యాదును లోకాయుక్త విచారణ చేసి సీఐడీ విచారణకు ఆదేశించింది. సీఐడీ దానిని విచారించి అది నిజమే అని నిర్దారణ చేశాక అరెస్ట్ చేశారు. దీన్ని నిన్నటి నుంచి చంద్రబాబు అండ్ కో నానా యాగీ చేస్తోంది. దీనికి సీఎం జగన్‌కు ఏమి సంబంధం. అసలు ఆయన చేసిన పనిని ఎవరు సమర్థిస్తారు..?. మీరు చేసింది 420 పని అని చంద్రబాబుకి అర్థం కావడం లేదా. ఎవర్ని బెదిరిస్తావ్.. ఇక్కడ ఎవ్వరూ బెదిరిపోరు. చదవండి: (టీడీపీ నాయకుల బూతుపురాణం.. వాట్సాప్‌లో వైరల్) చంద్రబాబు నిద్రపోవట్లేదు.. నిద్రపోడు కూడా. 14 ఏళ్లలో తాను చేయనిది ఒక దమ్మున్న ముఖ్యమంత్రి చేస్తున్నాడని ఆయనకి నిద్ర పట్టదు. నువ్వు ఎవ్వరి గుండెల్లో నిద్రపోలేవు చంద్రబాబు.. ఇక్కడెవరూ భయపడరు. ఇక్కడ ఉన్నది ఒక ధీశాలి నాయకత్వంలో పనిచేస్తున్న కోదమ సింహాలు. నువ్వు ఎన్ని దొంగ ఏడుపులు ఏడ్చినా 25 సంవత్సరాలు జగన్ సీఎంగా ఉంటారు. అప్పులు అంటున్నాడు.. తెచ్చిన అప్పులు మీలా దోచుకోలేదు. ప్రతి పైసాకి మా దగ్గర లెక్క ఉంది.. ప్రతి ఇంటికి ఆ డబ్బు చేరింది. అభివృద్ది ఒకచోటే కావాలా..? అమరావతిలోనే అభివృద్ది చేయాలా..?. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ అభివృద్ది కావాలని తపించే వ్యక్తి జగన్. సమసమాజ స్థాపన కోసం పాటుపడుతున్నది జగన్. చదవండి: (‘అశోక్‌బాబైనా.. చంద్రబాబైనా చట్టం ముందు సమానమే..’) ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అన్నావ్...మళ్లీ తెరిచిన పుస్తకంగా నిలబెట్టిన వ్యక్తి జగన్. ప్రధాని మోదీ నోటి వెంట విభజన వల్ల ఏపీ నష్టపోయింది అంటూ వచ్చిన మాటలు జగన్ పోరాటం వల్లే. ఈ రోజు సబ్ కమిటీ అజెండాలో చేర్చి చర్చించేలా చేసింది జగన్. ఇది జగన్ విజయం. ప్రత్యేక హోదా అంశం ఎప్పటికీ మరుగున పడదు. తెరిచిన పుస్తకంలా ఉంచిన జగన్‌కి ప్రజలు సెల్యూట్ చేస్తున్నారు. ఇలాంటివి మరుగున పెట్టాలని 420 అశోక్ బాబు వివాదాలను తెస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దమ్మున్న పార్టీ.. మీలా చేవ చచ్చిన పార్టీ కాదు. మీకు దమ్ముంటే ప్రజా సమస్యలపై పోరాడండి. ప్రత్యేక హోదా విషయాన్ని పక్కన పెట్టాలనే ఇలాంటి చిల్లర వేషాలు వేస్తున్నారు. ముగిసిన అధ్యాయాన్ని మళ్లీ మాట్లాడుకుంటున్నాం అంటే అది మేము చేసిన పోరాటమే. తప్పనిసరిగా దీనిపై చర్చ జరుగుతుంది. మనకు మంచి జరిగే రోజు వస్తుంది. అది ఒక్క జగన్మోహన్ రెడ్డి వల్లే సాధ్యం అని ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. -
అవినీతిపరుడి కోసం టీడీపీ తాపత్రయపడుతోంది: మంత్రి కొడాలి నాని
-
ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్ పెట్టి ప్రమోషన్లు సంపాదించాడు: మంత్రి కొడాలి నాని
-
టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అరెస్ట్.. టీడీపీలో మొదలైన హైటెన్షన్
-
‘అశోక్‌బాబు దొరికిపోవడంతో టీడీపీలో ఉలికిపాటు’
సాక్షి, అమరావతి: టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు చదవని డిగ్రీతో పదోన్నతి పొందారని.. ఆయన దొరికిపోవడంతో టీడీపీలో ఉలికిపాటు మొదలైందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అన్నారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ, కోర్టు ఇచ్చిన ఆదేశాలతో సీఐడీ అరెస్ట్ చేసిందన్నారు. ‘‘ఎల్లో మీడియాకు కూడా అశోక్‌బాబు బండారం తెలుసు. గతంలో ఫేక్‌బాబు అంటూ ఎల్లో మీడియా కథనాలు ఇచ్చిందని’’ నాగార్జున యాదవ్ పేర్కొన్నారు. చదవండి: టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు అరెస్ట్ -
టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు అరెస్ట్
-
అడ్డంగా దొరికిన అశోక్‌బాబు
సాక్షి, అమరావతి: తప్పుడు విద్యార్హతతో ప్రభుత్వాన్ని మోసగించిన టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. పదోన్నతి కోసం తన సర్వీస్ రిజిస్టర్‌ను ట్యాంపర్ చేయడమే కాకుండా, ఏకంగా ఉస్మానియా యూనివర్సిటీ పేరుతో ఫేక్ బి.కాం సర్టిఫికెట్ సమర్పించి ప్రభుత్వాన్ని బురిడీ కొట్టించారు. దీనిపై కేసు పెండింగులో ఉన్నాసరే నిబంధనలకు విరుద్ధంగా స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు. తనపై కేసులు పెండింగులో లేవని పేర్కొంటూ ఎమ్మెల్సీగా తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారు. తప్పుడు సర్టిఫికెట్తో పదోన్నతి పొందడమే కాకుండా సహచర ఉద్యోగుల పదోన్నతి అవకాశాలకూ గండి కొట్టారు. లోకాయుక్త ఆదేశాలతో అశోక్‌బాబుపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసిన సీఐడీ విభాగం.. కీలక ఆధారాలు సేకరించి, ఈ కేసులో కీలక పురోగతి సాధించింది. అర్థం కాని విధంగా సర్వీస్ రిజిస్టర్లో మార్పులు ఇంటర్మీడియట్ విద్యార్హతతో వాణిజ్య పన్నుల శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా చేరిన అశోక్‌బాబు.. డి.కాం(డిప్లమో ఇన్ కంప్యూటర్స్) చేసి, సీనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందారు. కాగా వాణిజ్య పన్నుల శాఖ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఉన్నతోద్యోగం పొందాలంటే డిగ్రీ కనీస అర్హత ఉండాలి. దాంతో తన సర్వీస్ రిజిస్టర్‌లోని ‘డి.కాం’ ను కాస్త ‘బి.కాం’గా మార్చివేసి ట్యాంపరింగ్‌కు పాల్పడ్డారు. తర్వాత పదోన్నతి పొంది వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కార్యాలయంలో విధుల్లో చేరారు. కాగా, ఆయన విద్యార్హతపై ఫిర్యాదులు రావడంతో సర్వీస్ రిజిస్టర్లో విద్యార్హత కాలమ్‌లో పేర్కొన్న సమాచారాన్ని అడ్డదిడ్డంగా కొట్టివేశారు. అందులో పేర్కొంది ఏమిటన్నది తెలియకుండా చేశారు. పొరపాటు అయితే ఫేక్ సర్టిఫికెట్ ఎందుకు? పదోన్నతి కోసం తన విద్యార్హత బి.కాంగా పేర్కొన్న అశోక్‌బాబు అంతటితో ఆగలేదు. ఏకంగా ఉస్మానియా యూనివర్సిటీ పేరుతో ఓ ఫేక్ బి.కాం సర్టిఫికెట్‌ను సృష్టించి సమర్పించినట్టు తెలుస్తోంది. తాను బి.కాం చేసినట్టుగా అఫిడవిట్ కూడా సమర్పించారు. సీఐడీ దర్యాప్తులో ఈ అంశం తాజాగా వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. దాంతో ఈ కేసులో సీఐడీ అధికారులు కీలక ఆధారం సేకరించినట్టే. తనపై సీఐడీ కేసు నమోదు చేయగానే తాను ఇంటర్మీడియట్ మాత్రమే చదివానని, తన సర్వీస్ రిజిస్టర్లో టైపింగ్ పొరపాటుతో బి.కాం అని పడినట్టు అశోక్‌బాబు వాదిస్తూ వచ్చారు. మరి టైపింగ్ పొరపాటే అయి ఉంటే.. ఉస్మానియా యూనివర్సిటీ పేరుతో ఫేక్ సర్టిఫికెట్ ఎందుకు సమర్పించాల్సి వచ్చిందన్న ప్రశ్న తలెత్తుతోంది. అంటే అశోక్‌బాబు ఉద్దేశ పూర్వకంగానే ఫేక్ సర్టిఫికెట్తో ప్రభుత్వాన్ని మోసం చేశారన్నది స్పష్టమవుతోంది. ఎమ్మెల్సీ నామినేషన్లోనూ తప్పుడు సమాచారం టీడీపీ ప్రభుత్వ హయాంలో అశోక్‌బాబుపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోలేదు. పైగా ఆయన్ను టీడీపీ తరఫున ఎమ్మెల్సీ చేశారు. అందుకోసం హడావుడిగా ఆయనకు స్వచ్ఛంద పదవీ విరమణకు అనుమతి ఇచ్చారు. పెండింగు కేసులు ఉండగా, స్వచ్ఛంద పదవీ విరమణకు అవకాశం ఇవ్వకూడదన్న నిబంధనను టీడీపీ ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే విస్మరించింది. ఇక ఎమ్మెల్సీగా నామినేషన్ వేసే సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్లోనూ తప్పుడు సమాచారమే ఇచ్చారు. తనపై ఎలాంటి కేసులు పెండింగులో లేవని పేర్కొన్నారు. అయితే లోకాయుక్త ఆదేశాలతో అశోక్‌బాబుపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టిన సీఐడీ కీలక ఆధారాలు సేకరించింది. సర్వీస్ రిజిస్టర్లో ట్యాంపరింగ్, ఉస్మానియా విశ్వవిద్యాలయం పేరుతో నకిలీ సర్టిఫికెట్, నిబంధనలకు విరుద్ధంగా స్వచ్ఛంద పదవీ విరమణ, ఎమ్మెల్సీగా నామినేషన్ కోసం సమర్పించిన అఫిడవిట్లో తప్పుడు సమాచారం.. ఇలా వీటన్నింటికీ సంబంధించిన పూర్తి ఆధారాలు సేకరించింది. వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో రికార్డులను పరిశీలించి అశోక్‌బాబు సమర్పించిన ఫేక్ సర్టిఫికెట్‌కు సంబంధించిన కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. ఆయన సర్వీస్ రిజిస్టర్లో ట్యాంపరింగ్ చేసినట్టు కూడా ఆధారాలు లభించాయి. అనంతరమే అశోక్‌బాబును అరెస్టు చేసి గుంటూరులోని ప్రాంతీయ సీఐడీ కార్యాలయానికి తరలించింది. ఈ కేసుపై ఆయన్ను సీఐడీ అధికారులు శుక్రవారం వివిధ కోణాల్లో విచారించినట్టు తెలుస్తోంది. తప్పుడు నివేదిక ఇచ్చిన వారినీ కేసులో చేర్చాలి టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబును అరెస్టు చేయడం హర్షనీయమని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ఎన్జీవోల సంఘం–1 అధ్యక్షుడు బి.మెహర్ కుమార్ అన్నారు. ఆయన నేరాన్ని పూర్తి సాక్ష్యాధారాలతో రుజువు చేసి తగిన శిక్ష పడేలా చూడాలని శుక్రవారం ఆయన ఓ ప్రకటనలో కోరారు. ప్రభుత్వాన్ని మోసం చేసిన అశోక్‌బాబును సమర్థించిన ముగ్గురు ఉన్నతాధికారులపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన టీడీపీ ఎమ్మెల్సీగా నామినేషన్ వేసేందుకు వీలుగా హడావిడిగా తప్పుడు నివేదిక ఇచ్చిన వారిని కూడా కేసులో చేర్చాలన్నారు. అశోక్‌బాబుతో కుమ్మక్కై ప్రభుత్వాన్ని మోసం చేసిన అప్పటి విచారణ అధికారి పుల్లయ్య, సంయుక్త కమిషనర్ కిరణ్‌కుమార్‌లపై కూడా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సిండికేట్ రింగ్ మాస్టర్ అశోక్ బాబు టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు రాష్ట్రంలో పలువురు అవినీతి ఉన్నతాధికారుల అక్రమాలకు వత్తాసు పలికే సిండికేట్‌ను నిర్వహించారని విజయవాడలోని సనత్ నగర్‌కు చెందిన షేక్ నజియా బేగం విమర్శించారు. ప్రధానంగా ఏసీబీ దాడుల్లో దొరికిన ఉన్నతాధికారుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ద్వారా ఆ కేసులను నీరుగార్చారని చెప్పారు. 2016లో ఆదాయానికి మించి ఆస్తులు కలిగిన వాణిజ్య పన్నుల శాఖ సంయుక్త కమిషనర్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా అశోక్‌బాబే రక్షించారన్నారు. ఏసీబీ కేసు విచారణ కూడా ముందుకు సాగకుండా చేయడంతోపాటు కనీసం శాఖా పరమైన విచారణ జరగకుండా అడ్డుకున్నారని చెప్పారు. దీనిపై తాము పూర్తి ఆధారాలతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. అశోక్‌బాబు, సంయుక్త కమిషనర్ అవినీతికి వత్తాసు సహకరించిన ఓ ఐఏఎస్ అధికారికి విజయవాడలో కోట్లాది రూపాయల విలువైన ఇంటిని బహూకరించారని ఆమె చెప్పారు. అశోక్‌బాబు సిండికేట్‌లోని అవినీతి అధికారులపై కూడా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేయాలని ఆమె కోరారు. గుంటూరులో టీడీపీ హైడ్రామా పాత గుంటూరు/విజయవాడ లీగల్ : సీఐడీ అధికారులు అరెస్టు చేసిన ఎమ్మెల్సీ అశోక్‌బాబును కలిసేందుకు వచ్చిన టీడీపీ నాయకులను లోపలికి అనుమతించక పోవడంతో ధర్నాకు దిగి హైడ్రామాకు తెరలేపారు. సీఐడీ అధికారులు కావాలనే ఎమ్మెల్సీ అశోక్ బాబుపై అక్రమ కేసులు పెట్టారని శుక్రవారం హంగామా సృష్టించారు. ఈ సందర్భంగా టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ.. అశోక్ బాబును అర్ధరాత్రి అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆరోపించారు. ఎంపీ రఘరామ కృష్ణంరాజును కొట్టినట్లు అశోక్ బాబుని సైతం కొట్టాలని చూస్తున్నారన్నారు. తప్పు చేయలేదు కనుక ముందస్తు బెయిల్ తీసుకోలేదని చెప్పారు. ఏపీలో రాక్షస పాలన సాగుతోందని, ప్రజల కోసం పోరాడుతున్న తమపై ఎన్ని దాడులు చేసినా భయపడమని అన్నారు. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ ప్రభుత్వం కనుసన్నల్లో సీఐడీ అధికారులు పని చేస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో దేవినేని ఉమతో పాటు టీడీపీ నేతలు రావిపాటి సాయికృష్ణ, మన్నవ మోహనకృష్ణ, అబ్బూరు మల్లి తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్, తెనాలి శ్రావణ్‌కుమార్‌లు కొద్దిసేపు హడావుడి చేసి వెళ్లిపోయారు. కాగా, నిషేధాజ్ఞలు ఉల్లంఘించి ధర్నా చేసిన 60 మందిపై సెక్షన్ 151 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం గుంటూరు జీజీహెచ్‌లో అశోక్‌బాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత విజయవాడ కోర్టుకు తరలించారు. బెయిల్ మంజూరు ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు తప్పుడు పత్రాలు సృష్టించి పదోన్నతి పొందినట్లుగా నిర్ధారణ కావడంతో సీఐడీ పోలీసులు 10వ తేదీ రాత్రి ఆయన్ను అరెస్టు చేశారు. శుక్రవారం సాయంత్రం విజయవాడ మూడవ అదనపు చీప్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఇన్చార్జ్ జడ్జి ఎదుట హాజరు పరిచారు. రాత్రి వరకు ఇరు పక్షాల వాదనల అనంతరం న్యాయమూర్తి.. అశోక్‌బాబుకు బెయిల్ మంజూరు చేశారు. ఇదిలా ఉండగా అంతకు ముందు తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ శుక్రవారం లంచ్ మోషన్ రూపంలో అశోక్‌బాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన జస్టిస్ దొనడి రమేశ్ ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశించారు. ఈ వ్యాజ్యంలో లోకాయుక్త వాదన కూడా వినేందుకు ప్రతివాదిగా చేర్చాలని అశోక్‌బాబు తరఫు న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లును ఆదేశిస్తూ ఈ నెల 14వ తేదీకి విచారణ వాయిదా వేశారు. -
అశోక్‌బాబుపై కేసు నమోదు
అమరావతి: టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబుపై సీఐడీ కేసు నమోదు చేసింది. గతంలో ఏసీటీవోగా పని చేసిన సమయంలో అశోక్‌బాబు తప్పుడు సమాచారం ఇచ్చారనే అభియోగాలపై కేసు నమోదు చేసింది సీఐడీ. తన సర్వీసు రికార్డు లేకుండానే తప్పుడు సమాచారం ఇచ్చారని కేసు నమోదైంది. బీకాం చదవకుండానే నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చారనే అభియోగంపై కేసు నమోదు చేశారు. తప్పుడు సమాచారం ఇచ్చి రికార్డులను ట్యాంపరింగ్ చేయడమే కాకుండా, ఎన్నికల అఫిడవిట్లో కూడా డిగ్రీ చదివినట్లు పేర్కొన్నారనే అభియోగాల కింద కేసులు నమోదు చేశారు. అశోక్ బాబు పైన సెక్షన్ 477A, 465,420 కింద కేసు నమోదు చేశారు. 2021లో అశోక్‌బాబుపై లోకాయుక్తాలో కేసు నమోదు కాగా, ఆ కేసును సీఐడీకి అప్పగించాలని లోకాయుక్తా ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. -
రిజర్వ్ ఇన్స్పెక్టర్పై లోకేశ్ హత్యాయత్నం
సాక్షి, అమరావతి/మంగళగిరి: టీడీపీ ఎమ్మెల్సీలు లోకేశ్, అశోక్‌బాబు, మాజీ ఎమ్మెల్యేలు ఆలపాటి రాజేంద్రప్రసాద్, తెనాలి శ్రావణ్‌కుమార్ విధి నిర్వహణలో ఉన్న రిజర్వ్ ఇన్స్పెక్టర్ సక్రూనాయక్పై హత్యాయత్నం చేశారు. దీనిపై కేసు నమోదైంది. ఏకంగా టీడీపీ రాష్ట్ర కార్యాలయంలోని ఓ గదిలో ఆ పోలీసు అధికారిని బంధించి కులం పేరుతో దూషిస్తూ దాడికి తెగబడటం విస్మయం కలిగిస్తోంది. చివరికి మంగళగిరి సీఐ వచ్చి ఆ అధికారిని విడిపించి ఆస్పత్రికి తీసుకెళ్లారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. బాధిత రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు లోకేశ్ ఏ1, అశోక్‌బాబు ఏ2, ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఏ3, తెనాలి శ్రావణ్‌కుమార్ ఏ4గా, మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. హత్యాయత్నం, కులం పేరుతో దూషించడం, విధి నిర్వహణకు ఆటంకం కలిగించడం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న ప్రకారం వివరాలివీ.. టీడీపీ ఆఫీసు వద్ద దాడిచేసి, బంధించి.. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయం వద్ద ఘర్షణలు జరుగుతున్నట్లు సమాచారం రావడంతో మంగళవారం సాయంత్రం మంగళగిరి బెటాలియన్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ సక్రూనాయక్ వెంటనే అక్కడకు చేరుకున్నారు. విధి నిర్వహణ కోసం టీడీపీ ప్రధాన కార్యాలయం గేటు వద్దకు చేరుకున్న ఆయనపై టీడీపీ నేతలు, కార్యకర్తలు దాడి చేశారు. తాను పోలీసు అధికారినని చెబుతున్నా వినిపించుకోకుండా ఆయన్ని బలవంతంగా టీడీపీ కార్యాలయం లోపలికి తీసుకెళ్లి ఒక గదిలో బంధించారు. తరువాత టీడీపీ ఎమ్మెల్సీలు లోకేశ్, అశోక్‌బాబు, మాజీ ఎమ్మెల్యేలు ఆలపాటి రాజా, శ్రావణ్ తదితరులు పెద్దసంఖ్యలో పార్టీ కార్యకర్తలతో ఆ గదిలోకి వచ్చారు. తాను పోలీసు అధికారినని చెబుతున్నా, తన గుర్తింపు కార్డు చూపించినా వారు పట్టించుకోలేదు. అందరూ కలసి రిజర్వ్ ఇన్స్పెక్టర్ సక్రూనాయక్పై తీవ్రంగా దాడిచేశారు. లంబాడి తెగకు చెందిన ఆయన్ని కులం పేరుతో దుర్భాషలాడారు. హత్యాయత్నం చేశారు. అశోక్‌బాబు ఆయన గుర్తింపు కార్డును లాక్కున్నారు. సెల్‌ఫోన్‌ను నేలకేసి కొట్టారు. మళ్లీ అందరూ కలసి మూకుమ్మడిగా ఆయనపై దాడిచేశారు. అతి కష్టం మీద అక్కడ నుంచి తప్పించుకుని బయటకు వచ్చేందుకు ప్రయత్నించిన సక్రూనాయక్‌ను అశోక్‌బాబుతోపాటు పలువురు మళ్లీ పట్టుకుని బంధించారు. బలవంతంగా ప్రెస్మీట్లో కూర్చోబెట్టి ఆయనపై అసత్య ఆరోపణలు చేశారు. అంత జరుగుతున్నా సరే ప్రాణభయంతో సక్రూనాయక్ మౌనంగా ఉండిపోయారు. ప్రెస్‌మీట్ అనంతరం ఆయన్ని మళ్లీ గదిలో బంధించారు. సమాచారం తెలుసుకున్న మంగళగిరి రూరల్ సీఐ భూషణం మంగళవారం రాత్రి 10.30 గంటలకు టీడీపీ ప్రధాన కార్యాలయానికి చేరుకుని ఆయన్ని విడిపించి ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం సక్రూనాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. లోకేశ్, అశోక్‌బాబు, ఆలపాటి రాజా, శ్రావణ్‌కుమార్, పోతినేని శ్రీనివాసరావులతోపాటు మరికొందరిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. టీడీపీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు టీడీపీ రాష్ట్ర కార్యాలయం వద్ద పోలీసులు బుధవారం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యాలయానికి ఇరువైపులా అర కిలోమీటరు దూరంలో బారికేడ్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను మళ్లించారు. టీడీపీ నాయకులను మాత్రమే అనుమతించారు. టీడీపీ కార్యాలయానికి చేరుకున్న ఎమ్మెల్సీ లోకేశ్ పోలీసులను బెదిరించడం ఉద్రిక్తతలకు దారితీసింది. మంగళవారం దాడిలో గాయపడ్డారని చెబుతున్న కార్యకర్తలు కార్యాలయానికి వస్తుండగా వాహనాన్ని బెటాలియన్ వద్ద బందోబస్తులో ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. లోకేశ్ కార్యకర్తలతో తరలివచ్చి గాయపడినవారి అంబులెన్స్‌ను ఎందుకు వదలరని ప్రశ్నించడంతోపాటు అక్కడ విధుల్లో ఉన్న పోలీసులకు వేలు చూపిస్తూ బెదిరించారు. దీంతో విధుల్లో ఉన్న పోలీసులు విస్తుపోయారు. వాహనాల రాకపోకలు అడ్డుకోవడంపై కేసు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గంజి చిరంజీవిపై మంగళగిరి రూరల్ పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యాలయం వద్ద మంగళవారం జరిగిన వివాదంలో గంజి చిరంజీవితో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు జాతీయ రహదారిపై బైఠాయించి వాహనదారులను అడ్డుకుని ఇబ్బందులు కలిగించారు. జాతీయ రహదారులశాఖ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గంజి చిరంజీవితో పాటు మరికొంతమందిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 70 మందిపై కేసు నమోదు మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయం వద్ద మంగళవారం జరిగిన ఘర్షణలకు సంబంధించి గుర్తుతెలియని 70 మందిపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. తమ పార్టీ కార్యాలయంపై దాడిచేశారని టీడీపీ నేతలు ఫిర్యాదు చేయగా.. టీడీపీ కార్యకర్తలు తమపై దాడికి పాల్పడ్డారని మరికొందరు కూడా ఫిర్యాదు చేశారు. ఈ వివాదంలో తమకు పలు ఫిర్యాదులు అందాయని, అన్నింటిపై సమగ్రంగా దర్యాప్తు జరిపి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని మంగళగిరి రూరల్ సీఐ భూషణం చెప్పారు. -
అశోక్‌బాబుపై ఏపీఎన్జీవో ఫైర్..
సాక్షి, అమరావతి: తాము ఎప్పుడు టీడీపీకి మద్దతుగా ప్రచారం చేయలేదని.. అశోక్‌బాబు చెప్పేవన్నీ అవాస్తవాలని ఏపీఎన్జీవో అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అశోక్‌బాబు తనను ఏపీఎన్జీవో అధ్యక్షుడిగా కాకుండా అడ్డుకోవాలని చూశారని, చంద్రబాబుకు అనుకూలంగా ఉన్నవారిని ఏపీఎన్జీవో అధ్యక్షుడిగా చేయాలని చూశారని ధ్వజమెత్తారు. ‘‘అశోక్‌బాబు మమ్మల్ని రాజకీయంగా వేధించారు. ఇంకోసారి ఆయన ఏపీఎన్జీవో పేరు ఎత్తితే సహించేదిలేదని’’ చంద్రశేఖర్‌రెడ్డి హెచ్చరించారు. ఏపీఎన్జీవో సంఘానికి అశోక్‌బాబు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. (చంద్రబాబుకు ఏపీ ప్రభుత్వం నోటీసులు) ఉద్యోగుల హక్కులను తాకట్టు పెట్టిన ఘనుడు టీడీపీకి మద్దతు తెలిపామని అశోక్‌బాబు మాట్లాడటం సిగ్గుచేటని ఏపీ అమరావతి జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మండిపడ్డారు. అశోక్‌బాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని చంద్రబాబుకు తాకట్టు పెట్టిన ఘనుడు అశోక్‌బాబు అని, వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే దాడి చేస్తే ఒక మాటైనా మాట్లాడావా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ పదవి కోసం ఉద్యోగుల హక్కులను చంద్రబాబుకు తాకట్టు పెట్టారని అశోక్‌బాబుపై బొప్పరాజు నిప్పులు చెరిగారు. (‘టీడీపీకి మిగిలింది ఆ ఒక్కటే’) ఉద్యోగాన్ని అడ్డంపెట్టుకుని ఎమ్మెల్సీ పదవి.. గత ఎన్నికల్లో టీడీపీకి సహకరించానని స్వయంగా అశోక్‌బాబే ఒప్పుకున్నారని, ఒక ప్రభుత్వ ఉద్యోగిగా రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనకూడదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ అన్నారు. ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్సీ పదవిని అశోక్ బాబు సంపాదించారని, వెంటనే ఆయనను ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అశోక్ బాబు పై రాష్ట్ర కేంద్ర ఎన్నికల కమిషన్, గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. అవసరమైనతే హైకోర్టు ను కూడా ఆశ్రయిస్తామని తెలిపారు. సమైక్యాంధ్ర ఉద్యమం సందర్భంగా అశోక్ బాబు కు వచ్చిన నిధులుపైన కూడా విచారణ జరపాలని సూర్యనారాయణ డిమాండ్ చేశారు. -
అక్కడి కూలీలకు ఆకలి భయం లేదు
కరోనా లాక్ డౌన్ కూలి లేకుండా చేసింది. కూలీల కడుపు ఎండగట్టేసింది. ఆఫీసులు మూసేశారు సరే!!. ఉద్యోగులకైతే జీతాలొస్తాయి. ఇంట్లో నుంచే పని చేస్తారు. మరి కూలీల సంగతో..? వేల కిలోమీటర్లు నడిచి సొంతిళ్లకు వెళ్లిపోవాలా? నడిచేటపుడు వారి ఆకలి దప్పుల సంగతేంటి? ఈ దేశంలో ఏ రాష్ట్రమైనా ఒకటే కదా? వారూ ఈ దేశీయులే కదా..? వాళ్లను ఆదుకునేదెవరు? అందరివీ ప్రశ్నలే. అశోక్‌బాబు మాత్రం తానే జవాబు కావాలనుకున్నాడు. కొంతైనా జవాబుదారీ అవుదామనుకున్నాడు. ఆ ఆలోచనతోనే పుట్టుకొచ్చాయి కమ్యూనిటీ కిచెన్లు. పుణె, పింప్రీ– చించ్వాడ్లో రోజుకు 25 వేల మంది ఆకలి తీర్చటంతో మొదలై... ఇపుడు రోజూ లక్షన్నర మందికి భోజనంతో పాటు ఆశ్రయం కూడా కల్పిస్తున్నాయి. ఐఆర్ఎస్ అధికారిగా తన విధిని నిర్వర్తించటంతో ఆగిపోలేదు అశోక్‌బాబు. తన స్నేహితుల్ని కూడా ఇందులోకి లాగాడు. సివిల్ సర్వెంట్ల నెట్వర్క్ చాలా పెద్దది. శక్తిమంతమైందిlకూడా. అందుకే ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లోని ఎన్జీవోల సహకారంతో వీళ్లు తమ సేవల్ని అందించగలుగుతున్నారు. పుణే, పింప్రి–చించ్వాడ్ గురించి చెప్పుకోవాల్సి వస్తే ఆసియా ఖండంలోనే అతి పెద్ద పారిశ్రామిక వాడగా చెప్పాలి. ఎందుకంటే ఈ పరిసరాల్లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలతో పాటు పలు ఆటోమొబైల్ కంపెనీలన్నాయి. చక్కెర మిల్లుతో పాటు ఇతర మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్లు, సాఫ్ట్వేర్ హబ్‌లు, ఇతర వాణిజ్య, వ్యాపార సంస్థలు ఎక్కువే ఉన్నాయి. వీటిలో పనిచేసే లక్షల మంది కార్మికులు ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారే. లాక్డౌన్ కారణంగా వీళం్లతా ఇబ్బందుల్లో పడ్డారు. కంపెనీలు మూసేయటం, నిర్మాణ కార్యకలాపాలు ఆగిపోవటంతో నిరాశ్రయులయ్యారు. తిండిలేక అలమటిస్తున్న వీరిని ఆదుకోవటానికి పుణె, షోలాపూర్, కొల్హాపూర్, సతారా, సాంగ్లీ జిల్లాలకు పుణె డీఆర్ఓ హోదాలో (రెవిన్యూ డివిజనల్ కమిషనర్) పనిచేస్తున్న దీపక్ మహిష్కర్ ఓ ఆలోచన చేశారు. కమ్యూనిటీ కిచెన్ భావనకు పురుడు పోశారు. ఆచరణ, పర్యవేక్షణ బాధ్యతలు ఐఆర్ఎస్ అధికారి నేలపట్ల అశోక్‌బాబుకు అప్పగించారు. ప్రతి రోజూ స్వయంగా కిచెన్లకు... కో–ఆర్డినేటర్‌గా నియమితులైన నాటినుంచి అశోక్ బాబు తనదైన శైలిలో సేవలు అందించటం మొదలెట్టారు. ముఖ్యంగా ప్రతిరోజూ పుణే డిప్యూటి కలెక్టరు, పుణే, పింప్రి–చించ్వడ్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర ్లతో సమన్వయం చేసుకునే వారు. రోజుకు కనీసం రెండు నుంచి మూడు కమ్యూనిటీ కిచెన్ సెంటర్లతోపాటు షెల్టర్ల వద్దకు నేరుగా వెళుతున్నారు. కూలీల్లో భయాన్ని పారదోలేందుకు ప్రయత్నిస్తూ... ఆహారం సరిగా అందిందో లేదో చూస్తున్నారు. పలువురికి బస కూడా ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల్లో... ఇతర రాష్ట్రాల్లో కూడా తెలుగువారికి అశోక్‌బాబు తన వంతు సాయం అందిస్తున్నారు. తన మిత్రులతో పాటు ఎన్జీఓ సంస్థల సహకారంతో పలు రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన ప్రజలకు భోజనం, వీలైనంత వరకూ వసతి కల్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్, గుంటూరు, రాజమండ్రి, చిత్తూరు, తెలంగాణలోని హైదరాబాదు, మెదక్, సూర్యాపేట, గద్వాల్ ప్రాంతాలతో పాటు కర్ణాటక, పంజాబ్, హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్, ఒడిషా, తమిళనాడు తదితర రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో తమ సేవలు అందుతున్నట్లు చెప్పారాయన. గుంటూరు జిల్లా వినుకొండ నుంచి.. అశోక్బాబుది గుంటూరు జిల్లా. వినుకొండ తాలూకా మొగచిందలపాలెంలో పుట్టారు. వినుకొండలోని సెయింట్ మేరిస్, లయోల స్కూల్లో ప్రాథమిక విద్య అభ్యసించాక గుంటూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో డిప్లొమా చేసి, వరంగల్‌లో బీటెక్ చేశారు. 2010లో హైదరాబాద్‌లో కొన్నాళ్లు పనిచేశాక ముంబై రీజియన్‌లో ఐటీ జాయింట్ కమిషనర్‌గా పనిచేశారు. ప్రస్తుతం పుణే సీనియర్ ఐఆర్ఎస్ అధికారిగా విధులు నిర్వహిస్తూనే ఈ కమ్యూనిటీ కి చెన్ బాధ్యతలను చూస్తున్నారు. – గుండారపు శ్రీనివాస్ / చక్రవర్తి సాక్షి ముంబై/ పింప్రీ 25 వేల భోజనాలతో ప్రారంభం.. పుణే, పింప్రీ–చించ్వాడ్ పరిధిలో ఏప్రిల్ 16న కమ్యూనిటీ కిచెన్ సేవలను ప్రారంభించాం. మొదట సుమారు 25 వేల మందికి భోజనాలు అందించాం. ఈ సంఖ్య పెంచుతూ ఇపుడు 105 కమ్యూనిటీ కిచెన్ల ద్వారా రోజూ 1.50 లక్షల మందికిపైగా భోజనాలు అందిస్తున్నాం. అదేవిధంగా 57 షెల్టర్లలో సుమారు 70 వేల మందికి బస ఏర్పాటు చేశాం. – నేలపట్ల అశోక్‌బాబు ఐఆర్ఎస్, కో ఆర్డినేటర్, కమ్యూనిటీ కిచెన్ సెంటర్స్ -
మా ఉద్యోగుల జోలికి రావొద్దు..
సాక్షి, అమరావతి: విశ్రాంత ఉద్యోగస్తులకు 100 శాతం పెన్షన్ చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు ఆంధ్రప్రదేశ్ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. కరోనా వైరస్‌పై పోరాటంలో కింది స్థాయి ఉద్యోగుల కష్టాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లామని పేర్కొన్నారు. ఉద్యోగులు ఎవరూ ఆందోళన చెందవద్దని.. కరోనాపై పోరులో ఇంటికి వెళ్లకుండా కష్టపడుతున్న ఉద్యోగుల సేవలను ముఖ్యమంత్రి గుర్తించారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆర్ధిక ఇబ్బందుల కారణంగానే ఉద్యోగులకు 50 శాతం జీతాలు చెల్లించారని... మిగిలిన 50 శాతం గురించి ప్రభుత్వాన్ని కోరతామని తెలిపారు. ఇక ఉద్యోగులను అడ్డుగా చూపించి పదవి సంపాదించిన చరిత్ర గల టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు ఒక్కరోజు నిరాహార దీక్ష చేయడం విడ్డూరంగా ఉందని బొప్పరాజు వెంకటేశ్వర్లు ఎద్దేవా చేశారు. ఉద్యోగుల కోసం ఇప్పుడు దీక్ష చేసేంత అవసరం ఆయనకు ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఆయన నిరాహార దీక్ష రాజకీయ కుట్రలో భాగమేనని మండిపడ్డారు. గతంలో ఉద్యోగుల జీవితాన్ని తాకట్టు పెట్టిన ఆయన తమ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఉద్యోగ సంఘంలో ఉన్నప్పుడు చేయని దీక్షలు అశోక్‌బాబు ఇప్పుడెందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. తమను కదిలిస్తే గత ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచకాలను బయటపెడతామని.. ఉద్యోగుల జోలికి రావొద్దని హెచ్చరించారు. (కరోనాపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష) ‘‘ఉద్యోగ సంఘాల మీద రాజకీయ ముద్ర వేసిన చరిత్ర నీది. మా ఉద్యోగులకు ఏం కావాలో మాకు తెలుసు... మాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. నీ వలన ఉద్యోగస్తులమంతా ఇప్పుడు బాధ పడుతున్నాం . మీ రాజకీయం మీరు చేసుకోండి.. మేం మీ జోలికిరాము. వాళ్ల నాన్న చనిపోతే అశోక్‌బాబు ఉద్యోగం తెచ్చుకున్నారు. ఇంటర్మీడియట్ చదవిన వారికి జూనియర్ అసిస్టెంట్ ఇవ్వమని మేము పోరాడుతుంటే.. డిగ్రీ వాళ్ల కు ఇవ్వమని అడిగిన వ్యక్తి అశోక్ బాబు. 50 శాతం జీతాలు రాకుండా అడ్డుకొవాలని అశోక్ బాబు కుట్ర పన్నుతున్నట్లు అనిపిస్తుంది. ఏపీఎన్జీవో ఉద్యోగ సంఘ నాయకులు పై రాజకీయ ముద్ర పడేలా చేసిన చరిత్ర అశోక్ బాబుది’’ అని అశోక్‌బాబు తీరును బొప్పరాజు వెంకటేశ్వర్లు దుయ్యబట్టారు.(కార్మికుల కాళ్లు కడిగిన ఎమ్మెల్యే ) ఆ ఘనత సీఎం జగన్ సొంతం ‘‘ఉద్యోగులు అడగకుండానే 27% ఐఆర్ ఇచ్చిన ఘనత సీఎం జగన్ సొంతం. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా చేసిన చరిత్ర ఈ ప్రభుత్వానిది. క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య కార్మికులకు మూడు వేల రూపాయల నుంచి 10 వేలు జీతాలు పెంచిన ఘనత సీఎం జగన్‌కు దక్కింది. అయితే కొంతమంది పారిశుద్య, కార్మికులు, ఏఎన్ఎంలతో ధర్నాలు చేయించి రాజకీయం చేయాలని చూస్తున్నారు. పనిచేసే వాడికి ఎస్మా గురించి అవసరమేముంది. పనిచేయని వాడే ఎస్మా గురించి భయపడతారు. ఇంకా కొన్ని రోజులు కష్టపడండి... కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు మరింత కష్టపడి ప్రజలను రక్షిద్దాం’’ అని ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు. ‘‘అశోక్ బాబు రాజకీయాలు మీ చేసుకోండి, మా ఉద్యోగుల సంక్షేమం మేము చూసుకుంటాం’’ అని చురకలు అంటించారు. -
జేఆర్‌పురం ఎస్ఐపై కేసు నమోదు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించారన్న అభి యోగంతో జేఆర్‌పురం పోలీస్‌స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ వి.అశోక్‌బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన ఇంకా అదే స్టేషన్లో ఉంటే విచారణపై ప్ర భావం చూపుతుందన్న అభిప్రాయంతో యుద్ధ ప్రా తిపదికన ఎస్ఐను వీఆర్‌లోకి పంపించారు. ఇప్పుడి ది పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రణస్థలం మండలం పిశిని పంచాయతీకి చెందిన ఓ మహిళ జేఆర్‌పురం ఎస్ఐ అశోక్‌బాబుపై ఫిర్యాదు చేశారు. ఎస్ఐ తనను కారులో ఎక్కించుకుని, మత్తు మందు చల్లి, అత్యాచారానికి పాల్పడ్డారని టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. ఆ ఫోన్ నేరుగా తెలంగాణ పోలీసులకు వెళ్లిపోయింది. దీనిపై స్పందించిన అక్కడి పోలీసులు ఆంధ్రప్రదేశ్ టోల్‌ఫ్రీ నంబర్ ఇచ్చారు. దీంతో ఆమె నేరుగా మళ్లీ ఇక్కడి టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి ఎస్ఐ తనతో అసభ్యకరంగా ప్రవర్తించారని ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా సోమవారం శ్రీకాకుళంలో జరిగిన స్పందనలో ఎస్పీకి కూడా నేరుగా ఫిర్యాదు చేశారు. దీంతోపాటు స్థానిక మహిళా పోలీసు స్టేషన్లో కూడా కంప్లయింట్ ఇచ్చారు. ఒక భూమి విషయంలో ప్రకృతి లేఅవుట్ యజమానికి, తన కుటుంబానికి మధ్య వివాదం నడుస్తోందని, అందులో ఎస్ఐ, గ్రామ పెద్దల సమక్షంలో ఇరువర్గాల మధ్య లావాదేవీల ఒప్పందం జరిగిందని, అందులో కొంత మొత్తం లేఅవుట్ యజమాని ఇవ్వగా మిగతా మొత్తాన్ని చెల్లించే విషయంలో తాత్సారం చేస్తున్నారని, అదే విషయాన్ని ఎస్ఐకి, గ్రామ పెద్దలకు మళ్లీ ఫిర్యాదు చేశానని మహిళ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఒక రోజు ఎస్ఐ దారిలో తనను చూసి కారులో ఎక్కమని పిలిచారని, ఎక్కిన తర్వాత మత్తు మందు చల్లి అత్యాచారానికి యత్నించారని ఆ మహిళ ఫిర్యాదులో పేర్కొన్నారు. మొత్తానికి మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసు ఉన్నతాధికారులు సోమవారం రాత్రి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విచారణపై ప్రభావం చూపొచ్చని అక్కడి నుంచి తప్పించి వీఆర్‌లోకి పంపించారు. ఆయన స్థానంలో లావేరు ఎస్ఐ చిరంజీవి జేఆర్‌పురం ఇన్చార్జ్ ఎస్ఐగా నియమించారు. నేనేంటో అందరికీ తెలుసు జేఆర్‌పురం పోలీస్‌స్టేషన్ ఎస్ఐగా కొంత కాలంగా పనిచేస్తున్నాను. నేనేంటో అందరికీ తెలుసు. రణస్థలం మండలంలో ఎవర్ని అడిగినా చెబుతారు. నేనెలాంటి తప్పు చేయలేదు. నా ఇల్లు రణస్థలం నడిబొడ్డున ఉంది. ఆరోపణల్లో వాస్తవం లేదు. ఇలాంటి ఫిర్యాదును నమ్మలేకపోతున్నాను. మా కుటుంబమంతా ఆందోళన చెందుతోంది. తలెత్తుకోలేని పరిస్థితిలో ఉన్నాం. విచారణలో వాస్తవాలు బయటపడతాయి. కానీ ఈ లోగా నాకు ఎంత చెడ్డ పేరు. దుష్ప్రచారం జరిగిపోతోంది. మా కుటుంబం ఏమైపోవాలి. ఉద్దేశపూర్వకమైన ఫిర్యాదిది.– అశోక్‌బాబు,ఎస్ఐ, జేఆర్‌పురం పోలీసు స్టేషన్. ఫిర్యాదు మేరకు కేసు నమోదు మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. విచారణపై ప్రభావం చూపుతుందని ఎస్ఐను అక్కడి నుంచి తప్పించాం. ప్రస్తుతం వీఆర్‌లోకి పంపించాం. విచారణ తర్వాత వాస్తవాలు బయటపడతాయి. తదనంతరం శాఖా పరమైన చర్యలు ఉంటాయి. – ఎల్.కె.వి.రంగారావు,డిఐజీ, ఆర్.ఎన్.అమ్మిరెడ్డి, జిల్లా ఎస్పీ -
అవినీతి ‘అశోక’వనం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: అధికార పార్టీ ఎమ్మెల్యే బెందాళం అశోక్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఇచ్ఛాపురం నియోజకవర్గంలో అవినీతి, మామూళ్ల వసూళ్లకు అంతు లేకుండా పోయిందని నియోజకవర్గ ప్రజలు ఆగ్రహిస్తున్నారు. నియోజకవర్గంలో అంగన్వాడీ న్యూట్రిషన్ కౌన్సిలర్ పోస్టుల నియామకంలో భారీగా వసూళ్లకు పాల్పడినట్లు ఎమ్మెల్యే అశోక్, ఆయన తండ్రి ప్రకాశ్, టీడీపీ నాయకులపై వచ్చిన ఆరోపణలు సంచలనం కలిగించాయి. 283 మంది కౌన్సిలర్ల నియామకం కోసం ఒక్కో అభ్యర్థి నుంచి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకూ ముక్కుపిండి మరీ వసూలు చేశారని బాధితులే రోడ్డెక్కారు. 2015 నవంబరులో ఈ కౌన్సిలర్ల నియామకం జరిగింది. తీరా ఏడాది తిరగకముందే వారిని పోస్టింగుల నుంచి తొలగించేయడం గమనార్హం. బాధితులంతా నిరసనకు దిగి ఎమ్మెల్యే అశోక్‌ను చుట్టుముట్టి నిలదీసిన సంగతి తెలిసిందే. అలాగే ఇచ్ఛాపురం మండలంలోని తిప్పనపుట్టుగ గ్రామానికి చెందిన దివ్యాంగుడు ఘనశ్యామ్ మజ్జి ఇంటర్మీడియెట్ తర్వాత టీచర్ ట్రైనింగ్ పూర్తి చేశాడు. ఇచ్ఛాపురం మున్సిపాలిటీలో అటెండర్ పోస్టు కోసం దివ్యాంగుల కోటాలో తన పేరు సిఫారసు చేయాలని టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అశోక్‌కు విన్నవించుకుంటే..ఎమ్మెల్యే తండ్రి బెందాళం ప్రకాశ్ అక్షరాలా మూడు లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేశారు. మరోవైపు ప్రభుత్వపరంగా జరిగే నిర్మాణ పనులనూ ఎమ్మెల్యే వదల్లేదు. తన బినామీలకే కట్టబెట్టారు. ఇసుక అక్రమ రవాణాకు అంతేలేదు బాహుదా, మహేంద్రతనయ నదులు ఇచ్ఛాపురం నియోజకవర్గానికి ప్రకృతి సంపద! వాటిలో ఇసుక తవ్వకాలతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందనే ఉద్దేశంతో ర్యాంపులకు ఎక్కడా గనులశాఖ అధికారులు అనుమతి ఇవ్వలేదు. కానీ అక్రమ సంపాదనే పనిగా పెట్టుకున్న కొంతమంది టీడీపీ నాయకులు రంగంలోకి దిగారు. ఆ నదుల్లో ఇసుకను నిలువెత్తు లోతున తవ్విచేసి రెండు చేతులా సంపాదించారు. సామాన్యుల ఇళ్లనూ వదల్లేదు హుద్‌హుద్ తుపాను బాధితుల కోసం సోంపేట, కవిటి మండల కేంద్రాల్లో నిర్మిస్తున్న ఇళ్లను కూడా టీడీపీ నాయకులు వదల్లేదు. తుపానుతో నష్టపోయినవారికి కాకుండా ఇతరుల నుంచి భారీగా ముడుపులు తీసుకుని ఆ ఇళ్లను కట్టబెట్టారనే విమర్శలు వస్తున్నాయి. తిత్లీ పరిహారంలోనూ పరిహాసం ఇటీవల తిత్లీ తుపానుతో నష్టపోయిన వారికి అందాల్సిన పరిహారం విషయంలోనూ ఎమ్మెల్యే అశోక్ అనుచరులు చేతివాటం ప్రదర్శించారు. బాధితుల జాబితాలో బినామీలను జొప్పించి, వారికి జరిగిన నష్టం తక్కువే అయినా అధిక మొత్తంలో చూపించి పరిహారంలో భారీగా పర్సంటేజీలు నొక్కేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు కూలిపోయిన కొబ్బరి చెట్లకు నష్టపరిహారం నమోదుకు సంబంధించిన ఆప్టికేషన్ లాగిన్ రహస్య సంకేతం(కోడ్) తెలుసుకుని ఈ అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. అలాగే కవిటి మండలంలో కొబ్బరి రైతులకు ప్రకటించిన రుణ ఉపశమనం పథకం (గరిష్ట లబ్ధి రూ.50వేలు) కోసం అమరావతిలోని రైతు ప్రాధికార సంస్థలో మేనేజ్ చేస్తామనే సాకుతో ఎమ్మెల్యే అనుచరుడైన ఓ టీడీపీ నాయకుడు పలువురు రైతుల నుంచి దండిగా వసూళ్లకు పాల్పడ్డాడు. ఆఖరికి రాయితీతో వచ్చే బోటు ఇంజిన్లు, వలలు ఇవ్వడానికీ భారీగానే వసూళ్లు చేయడంపై మత్స్యకారులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. క్వారీల్లో కాసుల గలగల కంచిలి మండలంలోని జలంత్రకోట పంచాయతీ పరిధి క్రాంతినగర్, రాధాశాంతినగర్, నువాగడ గ్రామాల ఉనికికే ప్రమాదం పొంచి ఉన్నా అక్కడి కొండపై గ్రానైట్ క్వారీ నిర్వహణకు ఎమ్మెల్యే అశోక్ బంధువులే లీజు పొందడంపై స్థానికులు పెద్ద ఎత్తున నిరసన తెలిపినా ఫలితం లేకపోయింది. కంచిలి మండలంలోని మండపల్లి పంచాయతీ పరిధి బంజిరి నారాయణపురం గ్రామానికి ఆనుకుని ఉన్న కొండపై కంకర తవ్వకాలకు, గ్రానైట్ క్వారీ, క్రషర్ ఏర్పాటుకు అక్రమంగా అనుమతులు ఇచ్చిన వ్యవహారం కూడా వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. -
అశోక్ తంత్రం!
పచ్చచొక్కాలేసుకున్న కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ ప్రచారంలో పాల్గొంటున్నారు. కొందరు అధికారులైతే కొన్ని కీలక నియోజకవర్గాల్లో అధికార పార్టీ అభ్యర్థులను గెలిపించే బాధ్యతలను నెత్తిన వేసుకున్నారు. అయితే వీరిమాయమాటలను నమ్మబోమంటూ ఉద్యోగులు తేల్చి చెబుతున్నారు. సాక్షి, విశాఖపట్నం: సమైక్యాంధ్ర ఉద్యమానికి తూట్లు పొడిచి ముఖ్యమంత్రి చంద్రబాబు అనుచరుడిగా ముద్రపడిన ఏపీ ఎన్జీవో సంఘ రాష్ట్ర నేత పరుచూరి అశోక్‌బాబు తీరుపై ఉద్యోగులు మండిపడుతున్నారు. గత రెండ్రోజులుగా విశాఖ లోనే మకాం వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే తన ముసుగు తీసేసి టీడీపీలో చేరి ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్న అశోక్‌బాబు రాష్ట్రమంత్రి లోకేష్ తోడల్లుడు భరత్, మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్న పాత్రుడులకు అనుకూలంగా ఆయా నియోజకవర్గాల్లో పరోక్షంగా ప్రచారం చేస్తు న్నారు. అశోక్‌బాబు గడిచిన రెండ్రోజులుగా విశాఖలోనే మకాం వేసి ఉద్యోగ సంఘాల నేతలతో భేటీ అవుతున్నారు. అశోక్‌బాబుకు అనుకూలమైన ఉద్యోగ సంఘ జిల్లా నేత వివిధ సంఘాల నేతలను రప్పించి ప్రభుత్వానికి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఓ çహోటల్లో దిగిన అశోక్‌బాబు ఉద్యోగసంఘాల నేతలతో భేటీ అయ్యేందుకు యత్నిస్తున్నప్పటికీ మెజార్టీ ఉద్యోగ సంఘల నేతలు రావడానికి ససేమిరా అంటున్నారు. ఇటీవలే ఏసీబీ కేసులో అడ్డంగా దొరికిపోయిన జిల్లా ఎన్జీవో సంఘ నాయకుడొకరు అశోక్‌బాబు అడుగులకు మడుగులొత్తుతున్నారు. ఈయనపై నమోదైన ఆదాయానికి మించి ఆస్తులు కేసును ఎత్తి వేయిస్తానని ప్రభుత్వ పెద్దల తరఫున అశోక్‌బాబు హామీ ఇచ్చినట్టుగా ఉద్యోగ సంఘ నేతలు చెబుతున్నారు. ఈ కారణంగానే సదరు ఉద్యోగసంఘ నేత తనకు అనుకూలంగా ఉన్న సంఘాల సభ్యులను అశోక్‌బాబు వద్దకు తీసుకొచ్చి ఉద్యోగులంతా టీడీపీకి అనుకూలంగానే ఉన్నారంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అశోక్‌బాబును కలిసేందుకు ఉద్యోగ సంఘ నేతలు కానీ, ఉద్యోగులు కానీ ఏమాత్రం ఇష్టపడడం లేదు. అంతేకాదు భూకుంభకోణంతో పాటు ఆదాయానికి మించి ఆస్తులు వంటి కేసులు నమోదైన అధికారులకు కూడా ఇదే తరహా హామీ అశోక్‌బాబు ఇచ్చి తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా చెబుతున్నారు. మరో వైపు రిటైర్డ్ ఉద్యోగుల సంఘ జాతీయ నేతంటూ మరో నేత శుక్రవారం నగరంలో మకాం వేశారు. నాలుగేళ్లు తప్పించుకుని ఇటీవలే 75 ఏళ్ల వయస్సు కలిగిన వారికి పెన్షన్ 10 శాతం పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రిటైర్డ్ ఉద్యోగుల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వానికి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి 70 ఏళ్లు దాటిన వారికి 15 శాతం, 80 ఏళ్లు దాటిన వారికి 25 శాతం పెంచాలని 90 ఏళ్లు దాటిన వారికి 50 శాతం పెరగాలని, 100 ఏళ్లు దాటితే 100 శాతం పెంచాలని గత పీఆర్సీ కమిషన్ సిఫార్సు చేసింది. వాటిని అమలు చేయని ప్రభుత్వం నాలుగేళ్లు తిప్పించుకుని 70 ఏళ్లు ఉన్న వారికి మాత్రమే పెన్షన్ 10 శాతం పెంచడాన్ని మెజార్టీ రిటైర్డ్ ఉద్యోగులు తీవ్రంగా తప్పుబడతున్నారు. ఈ పరిస్థితిలో వచ్చిన ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు చూస్తున్న టీడీపీ నాయకులు అశోక్‌బాబును ఎరగా వేసి ఉద్యోగుల ఓట్లను కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నా అది సఫలీకృతం కావడం లేదు. -
ఏపీలో కొత్త ఉద్యోగ సంఘాల జేఏసీ
-
ఏపీలో కొత్త ఉద్యోగ సంఘాల జేఏసీ
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో మరో కొత్త ఉద్యోగ సంఘాల జేఏసీ ఏర్పాటైంది. అశోక్‌బాబు, బొప్పరాజు సంఘాల వల్ల ఉద్యోగులు నష్టపోతున్న కారణంగా ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్స్ సమాఖ్య ఏర్పాటు చేసినట్లు నూతన జేఏసీ కన్వీనర్ వెంకట్రామి రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఇప్పుడున్న ఉద్యోగ సంఘాలు ఉద్యోగుల సమస్యల కోసం పోరాడకుండా ప్రభుత్వ భజన చేస్తున్నాయని మండిపడ్డారు. ఐఆర్, ఇళ్ల స్థలాలు ఇచ్చారంటూ సన్మానాలు, పాలాభిషేకాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. ‘ఉద్యోగులకు ఇళ్ల స్థలాల కోసం అమరావతిలో ఎకరానికి కోటికి పైగా రూపాయలు ఇస్తే.. దానికి సంబరాలు చేసుకున్నారు. ప్రైవేటు సంస్థలకు రూ. 30 లక్షలకు, రూ. 50లక్షలకు ఇచ్చిన ప్రభుత్వం....ఉద్యోగుల దగ్గర కోటి రూపాయలు వసూలు చేసి.. స్థలాలు ఇస్తుందా’ అని ప్రశ్నించారు. మీకసలు సిగ్గుందా? కొత్తగా ఏర్పడే ఉద్యోగ సంఘాల సమాఖ్య ఉద్యోగుల సమస్యలపై పోరాడుతుందన్న వెంకట్రామిరెడ్డి... ‘సీపీఎస్ కోసం అనేక పోరాటాలు చేసాము. అయినా ప్రభుత్వం స్పందించలేదు. 54 సంఘాలు ఇప్పటి వరకు మాకు మద్దతు ఇచ్చాయి. అమరావతి జేఏసీలో ఉన్న ఉద్యోగ సంఘాలు కుడా మద్దతు తెలుపుతున్నాయి. మేము ఏర్పాటు చేస్తున్న సమాఖ్యలో వారంతా కలుస్తున్నారు. కొంతమంది రాజకీయ పదవుల కోసం సిగ్గు లేకుండా ప్రభుత్వం భజన చేస్తున్నారు. అసలు మీకు సిగ్గుందా.. ఉద్యోగుల సమస్యలు మీకు పట్టవా’ అని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఏపీ ఎన్జీవో మాజీ అధ్యక్షుడు అశోక్ బాబు ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే. చంద్రబాబు నాయుడు తనకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన... టీడీపీతోనే రాష్ట్రభివృద్ధి సాధ్యమని చెప్పుకొచ్చారు. -
అశోక్ బాబుపై ఉద్యోగుల ఆగ్రహం
సాక్షి, తిరుపతి : ఏపీ ఎన్జీవో మాజీ అధ్యక్షుడు అశోక్ బాబుపై ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడంపై ఉద్యోగ సంఘాల నేతలు భగ్గుమంటున్నారు. అశోక్ బాబు ఉద్యోగుల ప్రయోజనాలు తాకట్టు పెట్టారని, ఓ పార్టీ ముసుగులో ఉండి ఉద్యోగులకు అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. తమ ప్రయోజనాలు తాకట్టు పెట్టి అశోక్ బాబు ఎమ్మెల్సీ పదవి పొందారని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ విమర్శించారు. ఇళ్ల స్థలాల పేరుతో ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేసిందని ఆయన మండిపడ్డారు. కాగా అశోక్ బాబు నిన్న (గురువారం) లుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే. చంద్రబాబు నాయుడు తనకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన... టీడీపీతోనే రాష్ట్రభివృద్ధి సాధ్యమని చెప్పుకొచ్చారు. -
ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడిగా చంద్రశేఖర్‌రెడ్డి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్జీవో సంఘానికి కొత్త నాయకత్వం వచ్చింది. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి, బండి శ్రీనివాస్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పటివరకు ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడిగా కొనసాగిన అశోక్‌బాబు స్వచ్ఛంద పదవీ విరమణ చేయడంతో ఈ పదవికి ఖాళీ ఏర్పడింది. దీన్ని భర్తీ చేసేందుకు ఆదివారం ఉదయం విజయవాడలోని ఎన్జీవో హోమ్‌లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. దీనికి రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన అధ్యక్ష, కార్యదర్శులు, మహిళా విభాగం అధ్యక్షురాలు, కన్వీనర్లు హాజరయ్యారు. రాష్ట్ర సంఘానికి ఇన్చార్జి అధ్యక్షునిగా ఉన్న సీహెచ్ పురుషోత్తంనాయుడు అధ్యక్షతన ఎన్నిక నిర్వహించారు. చంద్రశేఖర్‌రెడ్డి, బండి శ్రీనివాస్‌లను అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చంద్రశేఖర్‌రెడ్డి 1985 నుంచి ఏపీ ఎన్జీవో సంఘంలో వివిధ పదవులు నిర్వహించారు. ఐదున్నరేళ్లుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బండి శ్రీనివాస్ ప్రకాశం జిల్లా ఎన్జీవో సంఘ అధ్యక్షునిగా, ఇరిగేషన్ ఉద్యోగుల సంఘ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారు. ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యం.. ఈ సందర్భంగా విలేకరులతో నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఐదు లక్షలమంది ప్రభుత్వ ఉద్యోగులు, నాలుగు లక్షలమంది పెన్షనర్ల సంక్షేమమే లక్ష్యంగా వారి న్యాయమైన కోర్కెల సాధనకు శక్తివంచన లేకుండా పనిచేస్తామని చెప్పారు. రాష్ట్రప్రభుత్వం నుంచి 35 శాతం మధ్యంతర భృతి మంజూరుకు ప్రయత్నిస్తామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఇళ్ల నిర్మాణాలకు స్థలాలిప్పించే విషయంలో ప్రభుత్వంతో రాజీలేని పోరాటం చేస్తామని తెలిపారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేస్తున్నట్టు చెప్పారు. అనంతరం అశోక్‌బాబు మాట్లాడుతూ పదేళ్లపాటు ఎన్జీవో సంఘ నాయకునిగా క్రియాశీల పాత్ర పోషించానని, తనకు సహకరించిన ఉద్యోగులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ పెద్దలకు భంగపాటు ఇదిలా ఉండగా, రాష్ట్ర ఎన్జీవో సంఘ ఎన్నికల్లో ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకుని భంగపాటుకు గురయ్యారు. పశ్చిమ కృష్ణా ఎన్జీవో సంఘ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎ.విద్యాసాగర్‌ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చేసేందుకు ప్రభుత్వ పెద్దలు అన్నివిధాలా ప్రయత్నించారు. చివరకు పోలీసు శాఖ ద్వారా కొన్ని జిల్లాల సంఘ నాయకులను బెదిరించినట్టు ఉద్యోగులు చెబుతున్నారు. అశోక్‌బాబు ఆధ్యర్వంలో ఎన్జీవో సంఘం ప్రభుత్వానికి సానుకూలంగా వ్యవహరించిందని, రానున్న ఎన్నికల నేపథ్యంలో అటువంటి కార్యవర్గమే ఉంటే అటు ప్రభుత్వానికి, ఇటు ఉద్యోగులకు మంచిదనే అభిప్రాయాన్ని ఉద్యోగ సంఘ నాయకులకు వివరించినట్టు తెలుస్తోంది. విద్యాసాగర్‌ను ప్రధాన కార్యదర్శిగా చేసేందుకు సహకరించాలని అశోక్‌బాబు కూడా పలు జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులకు విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. అయితే 11 జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించడంతో సీఎం చంద్రబాబు వద్ద పంచాయతీ పెట్టేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఆదివారం ఉదయం 9 గంటల్లోపు సీఎంతో అపాయింట్మెంట్ ఇప్పిస్తామని, ఆయనతో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలని కొందరు ముఖ్య నాయకుల్ని అధికారులు కోరారు. అయితే వారంతా ఈ ప్రతిపాదనను వ్యతిరేకించి ఎన్నికను నిర్వహించారు. -
‘రాష్ట్రంలో ఉన్నవి బ్రోకర్, భజన సంఘాలే’
సాక్షి, విజయవాడ: ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షడు అశోక్‌బాబు వీఆర్ఎస్ను ప్రభుత్వం ఆమోదించడంపై ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు సూర్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అశోక్ బాబు సంతకాలు పోర్జరి చేసి తప్పుడు డిగ్రీ సర్టిఫికేట్ సమర్పించాడని ఆరోపించారు. శాఖ పరమైన చర్యల్లో భాగంగా అతనిపై చర్యలు తీసుకోవాలని సహచర ఉద్యోగులు కోరిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ విషయంలో 2018వరకు విచారణ చేయకుండా జాప్యం చేశారని మండిపడ్డారు. డిగ్రీ ఉన్నట్టు సర్వీసు రిజిష్టర్‌లో అశోక్ బాబు దొంగ ఎంట్రీ చేశారని తెలిపారు. అయితే ఈ విషయంలో ప్రభుత్వం అశోక్‌బాబు క్లీన్ చీట్ ఇవ్వడంపై అభ్యంతరం తెలిపారు. ఇదే రకమైన అభియోగాలు ఉద్యోగులందరికీ క్లీన్ చిట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అశోక్‌బాబు ప్రభుత్వం నుంచి ఒత్తిడి తీసుకువచ్చి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారని విమర్శించారు. స్వచ్ఛందంగా పదవి విరమణ చేయాలంటే మూడు నెలల ముందు శాఖకు తెలియజేయాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలు లేవని.. బ్రోకర్, భజన సంఘాలు మాత్రమే ఉన్నాయని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం అపాయింట్మెంట్ కొన్ని ఉద్యోగ సంఘాల నాయకులకు మాత్రమే లభిస్తోందని తెలిపారు. విలువలు లేని అశోక్‌బాబును ఏ పార్టీలో చేర్చుకున్న వారికి ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. అశోక్‌బాబు వీఆర్ఎస్కు ప్రభుత్వం అమోదం.. ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు వీఆర్ఎస్ గురువారం ఏపీ ప్రభుత్వం అమోదించింది. ప్రస్తుతం సహా అధ్యక్షుడిగా కొనసాగుతున్న పురుషోత్తం నాయుడు తాత్కాలిక అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా, త్వరలో జరగబోయే ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో నూతన అధ్యక్షుడి ఎంపిక జరగనుంది. నూతన అధ్యక్షుడిగా ఏపీ ఎన్జీవో ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న చంద్రశేఖర్ రెడ్డిని ఎన్నుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. -
వివాదస్పదంగా మారిన ఏపీ ఎన్జీవో నేత ఆశోక్ బాబు విఆర్ఎస్
-
వివాదాస్పదంగా మారిన అశోక్ బాబు వీఆర్ఎస్
సాక్షి, విజయవాడ : ఏపీ ఎన్జీవో స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్ఎస్) వివాదాస్సందంగా మారింది. నకిలీ డిగ్రీ సర్టిఫికేట్ల వ్యవహారంలో అశోక్ బాబుకు విచారణాధికారి క్లీన్ ఎక్విడిక్ట్ ఇవ్వడంపై ఎన్జీవో నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్లీన్ ఎక్విడిక్ట్ను అడ్డుపెట్టుకొని అశోక్‌బాబు వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నారు. ఆయనకు వీఆర్ఎస్ ఇవ్వడం నిబంధనలకు విరుద్దమని కమర్షియల్ టాక్స్ ఉద్యోగులు పేర్కొన్నారు. ఈ మేరకు కమర్షియల్ టాక్స కమిషనర్‌కు ఎన్జీవో నేతలు ఫిర్యాదు చేశారు. అశోక్ బాబుపై పలు కేసులు పెడింగ్‌లో ఉన్నాయని డీసీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పెన్షన్ రూల్ 44 ప్రకారం అశోక్‌కు వీఆర్ఎస్ ఇవ్వకూడదని డిమాండ్ చేశారు.