Asia games
-
ఆసియా క్రిడల్లో సెంచరీ కొట్టిన భారత్
-
పసిడి పోరుకు సాకేత్–రామ్ జోడీ
ఆసియా క్రీడల టెన్నిస్ ఈవెంట్లో భారత్‌కు రెండు పతకాలు ఖాయమయ్యాయి. పురుషుల డబుల్స్ విభాగంలో సాకేత్ మైనేని–రామ్‌కుమార్ రామనాథన్ జోడీ ఫైనల్‌కు దూసుకెళ్లి స్వర్ణ పతకానికి విజయం దూరంలో నిలిచింది. సెమీఫైనల్లో సాకేత్–రామ్‌కుమార్ ద్వయం 6–1, 6–7 (6/8), 10–0తో ‘సూపర్ టైబ్రేక్’లో సెంగ్‌చన్ హాంగ్–సూన్‌వూ క్వాన్ (దక్షిణ కొరియా)పై గెలిచింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాకేత్ 2014 ఇంచియోన్ ఆసియా క్రీడల్లో పురుషుల డబుల్స్‌లో సనమ్ సింగ్‌తో కలిసి రజత పతకం, మిక్స్డ్ డబుల్స్‌లో సానియా మీర్జాతో కలిసి స్వర్ణ పతకం సాధించాడు. నేడు ఉదయం గం. 7:30 నుంచి జరిగే ఫైనల్లో జేసన్ జంగ్–యు సియో సు (చైనీస్ తైపీ) జంటతో సాకేత్–రామ్ జోడీ తలపడుతుంది. మరోవైపు మిక్స్డ్ డబుల్స్‌లో రోహన్ బోపన్న–రుతుజా భోస్లే (భారత్) ద్వయం సెమీఫైనల్ చేరి కనీసం కాంస్య పతకం ఖాయం చేసుకుంది. క్వార్టర్ ఫైనల్లో బోపన్న–రుతుజా 7–5, 6–3తో జిబెక్ కులామ్‌బయేవా–గ్రిగోరి లొమాకిన్ (కజకిస్తాన్)లపై గెలిచారు. నేడు జరిగ సెమీఫైనల్లో యు సియో సు–చాన్ హావో చింగ్ (చైనీస్ తైపీ)లతో బోపన్న–రుతుజా తలపడతారు. -
మన గురి అదిరె..
ఆసియా క్రీడల్లో ఐదో రోజూ భారత్ పతకాల వేట కొనసాగింది. ఒక స్వర్ణం, ఒక రజతం, ఒక కాంస్యంతో కలిపి గురువారం భారత్ ఖాతాలో మూడు పతకాలు చేరాయి. అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ భారత షూటర్లు నాలుగో స్వర్ణం సాధించగా... వుషులో రోషిబినా దేవి రజతం, ఈక్వెస్ట్రియన్‌లో అనూష్ కాంస్యం గెలిచారు. ఫలితంగా భారత్ పతకాల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. నేటి నుంచి అథ్లెటిక్స్ ఈవెంట్ కూడా మొదలుకానుండటం... టెన్నిస్, షూటింగ్, స్క్వాష్‌లలో కూడా మెడల్ ఈవెంట్స్ ఉండటంతో పతకాల పట్టికలో నేడు భారత్ నాలుగో స్థానానికి చేరుకునే అవకాశముంది. హాంగ్జౌ: భారీ అంచనాలతో ఆసియా క్రీడల్లో అడుగుపెట్టిన భారత షూటర్లు నిలకడైన ప్రదర్శనతో రాణిస్తున్నారు. పోటీల ఐదో రోజు గురువారం పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో భారత్‌కు స్వర్ణ పతకం లభించింది. శివ నర్వాల్, అర్జున్ సింగ్ చీమా, సరబ్జోత్ సింగ్‌లతో కూడిన భారత బృందం క్వాలిఫయింగ్‌లో అగ్రస్థానం సంపాదించి పసిడి పతకం గెల్చుకుంది. క్వాలిఫయింగ్‌లో భారత జట్టు మొత్తం 1734 పాయింట్లు స్కోరు చేసి టాప్ ర్యాంక్‌ను దక్కించుకుంది. సరబ్జోత్ సింగ్ 580 పాయింట్లు, అర్జున్ సింగ్ 578 పాయింట్లు, శివ నర్వాల్ 576 పాయింట్లు స్కోరు చేశారు. సరబ్జోత్ ఐదో స్థానంలో, అర్జున్ సింగ్ ఎనిమిదో స్థానంలో నిలిచి వ్యక్తిగత విభాగం ఫైనల్స్‌కు అర్హత సాధించారు. అయితే వ్యక్తిగత విభాగంలో సరబ్జోత్, అర్జున్ సింగ్‌లకు నిరాశ ఎదురైంది. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో అర్జున్ 113.3 పాయింట్లు స్కోరు చేసి చివరిదైన ఎనిమిదో స్థానంలో నిలువగా... సరబ్జోత్ 199 పాయింట్లు సాధించి నాలుగో స్థానం దక్కించుకొని కాంస్య పతకానికి దూరమయ్యాడు. మరోవైపు స్కీట్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో అనంత్ జీత్ సింగ్, గనీమత్ సెఖోన్‌లతో కూడిన భారత జట్టు ఏడో స్థానంలో నిలిచింది. నేడు షూటింగ్లో నాలుగు మెడల్ ఈవెంట్స్ (పురుషుల 50 మీటర్ల త్రీ పొజిషన్ టీమ్, వ్యక్తిగత విభాగం; మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్, వ్యక్తిగత విభాగం) ఉన్నాయి. ప్రస్తుత ఆసియా క్రీడల్లో భారత షూటర్లు నాలుగు స్వర్ణాలు, నాలుగు రజతాలు, ఐదు కాంస్య పతకాలు గెలిచారు. అనూష్ ఘనత.. ఈక్వె్రస్టియన్ (అశ్వ క్రీడలు)లో భారత్‌కు మరో పతకం దక్కింది. డ్రెసాజ్ వ్యక్తిగత విభాగంలో అనూష్ అగర్వల్లా కాంస్య పతకం సాధించాడు. 14 మంది పోటీపడిన ఫైనల్లో అనూష్, అతని అశ్వం 73.030 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచారు. ఆసియా క్రీడల చరిత్రలో డ్రెసాజ్ వ్యక్తిగత విభాగంలో భారత్‌కు పతకం రావడం ఇదే తొలిసారి. మరోవైపు వుషు క్రీడాంశంలో స్వర్ణ పతకం సాధించాలని ఆశించిన భారత క్రీడాకారిణి రోషిబినా దేవికి నిరాశ ఎదురైంది. వు జియోవె (చైనా)తో జరిగిన 60 కేజీల సాండా ఈవెంట్ ఫైనల్లో రోషిబినా దేవి 0–2తో ఓడిపోయి రజత పతకం కైవసం చేసుకుంది. భారత్ ‘హ్యాట్రిక్’ విజయం భారత పురుషుల హాకీ జట్టు వరుసగా మూడో విజయం నమోదు చేసింది. డిఫెండింగ్ చాంపియన్ జపాన్‌తో గురువారం జరిగిన పూల్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో భారత్ 4–2 గోల్స్ తేడాతో నెగ్గింది. భారత్ తరఫున అభిõÙక్ (13వ, 48వ ని.లో) రెండు గోల్స్ చేయగా... మన్దీప్ (24వ ని.లో), అమిత్ రోహిదాస్ (34వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. క్వార్టర్ ఫైనల్లో సింధు బృందం.. మహిళల బ్యాడ్మింటన్ టీమ్ ఈవెంట్లో భారత జట్టు క్వార్టర్ ఫైనల్ చేరింది. మంగోలియాతో జరిగిన తొలి రౌండ్లో భారత్ 3–0తో గెలిచింది. పీవీ సింధు, అషి్మత, అనుపమ తమ సింగిల్స్ మ్యాచ్‌ల్లో విజయం సాధించారు. స్క్వాష్ జట్లకు పతకాలు ఖాయం వరుసగా నాలుగోసారి ఆసియా క్రీడల్లో భారత పురుషుల, మహిళల స్క్వాష్ జట్లు సెమీఫైనల్లోకి ప్రవేశించి కనీసం కాంస్య పతకాలను ఖాయం చేసుకున్నాయి. చివరి లీగ్ మ్యాచ్‌ల్లో భారత మహిళల జట్టు 0–3తో మలేసియా చేతిలో ఓడిపోగా.. భారత పురుషుల జట్టు 3–0తో నేపాల్‌పై నెగ్గింది. తమ గ్రూపుల్లో రెండో స్థానంలో నిలవడం ద్వారా ∙భారత జట్లు సెమీఫైనల్ బెర్త్‌లు పొందాయి. నిశాంత్ పంచ్ అదుర్స్.. భారత బాక్సర్లు నిశాంత్ దేవ్ (71 కేజీలు), జాస్మిన్ లంబోరియా (60 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లి పతకానికి విజయం దూరంలో నిలువగా... దీపక్ (51 కేజీలు) పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్లో ముగిసింది. నిశాంత్ పంచ్‌లకు అతని ప్రత్యర్థి బుయ్ తుంగ్ (వియత్నాం) తొలి రౌండ్లోనే చిత్తయ్యాడు. జాస్మిన్ పంచ్‌లకు హదీల్ గజ్వాన్ (సౌదీ అరేబియా) తట్టుకోలేకపోవడంతో రిఫరీ రెండో రౌండ్లో బౌట్‌ను ముగించాడు. దీపక్ 1–4తో ప్రపంచ మాజీ చాంపియన్ టొమోయా సుబోయ్ (జపాన్) చేతిలో ఓడిపోయాడు. -
సెయిలింగ్‌లో సూపర్..
హాంగ్జౌ: సముద్రంలో తెర చాపను నియంత్రిస్తూ ముందుకు దూసుకుపోవడమే సెయిలింగ్. ఆసియా క్రీడల్లో మంగళవారం ఈ క్రీడాంశంలో భారత్‌కు రెండు పతకాలు లభించాయి. భోపాల్‌కు చెందిన 17 ఏళ్ల నేహా ఠాకూర్ బాలికల డింగీ ఐఎల్సీఏ–4 ఈవెంట్లో రెండో స్థానం సంపాదించి రజత పతకం గెల్చుకుంది. అయోధ్యకు చెందిన 29 ఏళ్ల ఇబాద్ అలీ విండ్‌సర్ఫర్ ఆర్ఎస్:ఎక్స్ ఈవెంట్లో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించాడు. 11 రేసులతో కూడిన డింగీ ఈవెంట్లో నేహా 32 పాయింట్లు స్కోరు చేయగా... 14 రేసులతో కూడిన విండ్‌సర్ఫర్ ఈవెంట్లో ఇబాద్ అలీ 52 పాయింట్లు సాధించాడు. భవాని దేవి ఓటమి.. ఆసియా క్రీడల ఫెన్సింగ్ ఈవెంట్లో భారత స్టార్ ఫెన్సర్ భవాని దేవి పోరాటం ముగిసింది. మహిళల సేబర్ విభాగంలో భవాని దేవి క్వార్టర్ ఫైనల్లో 7–15తో యాకి షావో (చైనా) చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో భవాని గెలిచిఉంటే సెమీఫైనల్ చేరడంద్వారా కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకునేది. చేజారిన కాంస్యం.. ఆసియా క్రీడల షూటింగ్ ఈవెంట్లో భారత్‌కు త్రుటిలో కాంస్యం చేజారింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో రమితా జిందాల్–దివ్యాంశ్‌లతో కూడిన భారత జోడీ కాంస్య పతక మ్యాచ్‌లో ఓడిపోయింది. రమిత–దివ్యాంశ్ ద్వయం 18–20తో పార్క్ హాజున్–లీ ఉన్‌సియో (కొరియా) జంట చేతిలో ఓటమి పాలైంది. క్వార్టర్ ఫైనల్లో సుమిత్ ఆసియా క్రీడల టెన్నిస్ ఈవెంట్ పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్, మహిళల సింగిల్స్‌లో అంకిత రైనా క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో సుమిత్ 7–6 (11/9), 6–4తో బెబిట్ జుకయెవ్ (కజకిస్తాన్)పై, అంకిత 6–1, 6–2తో ఆదిత్య పటాలి (హాంకాంగ్)పై గెలుపొందారు. -
ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణం..
-
చైనాలో.. అదరగొట్టనున్న.. తెలంగాణ బిడ్డ! అరుదైన అవకాశం!!
సాక్షి, మహబూబాబాద్: చైనాలోని హాంగ్జౌ వేదికగా శనివారం నుంచి ఆసియా గేమ్స్ ప్రారంభం కానున్నాయి. బ్యాడ్మింటన్ విభాగంలో మహబూబాబాద్ జిల్లాకు చెందిన క్రీడాకారిణి సిక్కిరెడ్డి ప్రతిభ కనబర్చనున్నారు. పతకం సాధించి తెలంగాణకు పేరు తేవాలని తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, జిల్లాకు చెందిన ప్రముఖులు కోరుతున్నారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం జయపురం గ్రామానికి చెందిన నెలకుర్తి కృష్ణారెడ్డి, మాధవి దంపతుల కుమార్తె సిక్కిరెడ్డి. బాల్యంలో ఇక్కడే ఆటలో ఓనమాలు దిద్దారు. తండ్రి ఉద్యోగరీత్యా ఖమ్మం, హైదరాబాద్‌లో పని చేయడంతో అక్కడ బ్యాడ్మింటన్‌లో పూర్తి మెలకువలు నేర్చుకున్నారు. ఎడమ చేతివాటంతో చిన్నతనం నుంచి ప్రతిభ కనబర్చిన సిక్కిరెడ్డి 2014 మే నెలలో ఢిల్లీ ఉబర్ కప్‌లో కాంస్యం, 2015లో నేషనల్ గేమ్స్‌లో బంగారు పతకం, కామన్వెల్త్లో కాంస్యం.. ఇలా అనేక పతకాలు కైవసం చేసుకున్నారు. అరుదైన అవకాశం.. ఆసియా గేమ్స్‌లో 40 దేశాలకు పైగా.. 41 క్రీడాంశాల్లో 655 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. ఇందులో తెలంగాణ నుంచి 16 మంది పాల్గొంటున్నారు. వీరిలో మహబూబాబాద్ జిల్లాకు చెందిన సిక్కిరెడ్డి ఉండడం గర్వకారణం. -
జ్యోతి సురేఖకు నిరాశ.. బొపన్న, సానియా జంటలకు షాక్!
ఈ ఏడాది సెప్టెంబర్‌లో చైనాలో జరిగే ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత ఆర్చరీ జట్ల ఎంపిక కోసం నిర్వహిస్తున్న సెలెక్షన్ ట్రయల్స్‌లో ఆంధ్రప్రదేశ్ స్టార్ ప్లేయర్ జ్యోతి సురేఖ విఫలమైంది. సోనిపట్‌లో మంగళవారం జరిగిన మహిళల కాంపౌండ్ విభాగం ట్రయల్స్‌లో సురేఖ రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయి ఎలిమినేషన్ రౌండ్లోనే నిష్క్రమించింది. సురేఖ 2014, 2018 ఆసియా క్రీడల్లో కాంస్యం, రజతం సాధించింది. ఇతర క్రీడాంశాలు బొపన్న జంట ఓటమి కాలిఫోర్నియా: మయామి ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో రోహన్ బోపన్న (భారత్)–షపోవలోవ్ (కెనడా) ద్వయం 2–6, 1–6తో వెస్లీ కూలాఫ్ (నెదర్లాండ్స్)–నీల్ స్కప్‌స్కీ (బ్రిటన్) జోడీ చేతిలో ఓడిపోయింది. క్వార్టర్ ఫైనల్లో ఓడిన బోపన్న జంటకు 61,100 డాలర్ల (రూ. 46 లక్షల 19 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 180 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. సానియా జోడీ పరాజయం కాలిఫోర్నియా: మయామి ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నీ మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సానియా మీర్జా (భారత్)–కిర్‌స్టెన్ ఫ్లిప్కెన్స్ (బెల్జియం) ద్వయం 3–6, 6–7 (3/7)తో జావోజువాన్ యాంగ్ (చైనా)–ఎకతెరీనా (రష్యా) జోడీ చేతిలో ఓడిపోయింది. సెమీఫైనల్లో మనిక బత్రా–అర్చన జంట ప్రపంచ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) దోహా కంటెండర్ టోర్నీ మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో మనిక బత్రా–అర్చన కామత్ (భారత్) ద్వయం 13–11, 8–11, 11–5, 13–11తో సూ వాయ్ యామ్–లీ హో చింగ్ (హాంకాంగ్) జోడీని ఓడించి సెమీఫైనల్‌కు చేరింది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో మనిక 5–11, 2–11, 4–11తో యింగ్ హాన్ (జర్మనీ) చేతిలో... పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సత్యన్ (భారత్) 11–5, 8–11, 7–11, 4–11తో కార్ల్సన్ (స్వీడన్) చేతిలో ఓడిపోయారు. చదవండి: Kane Williamson: వెయ్యిసార్లు చూసినా అదే నిజం.. చెత్త అంపైరింగ్! పాపం కేన్ మామ! -
రజతం స్వర్ణంగా మారింది...
న్యూఢిల్లీ: రెండేళ్ల క్రితం జరిగిన జకార్తా ఆసియా క్రీడల్లో భారత్ స్వర్ణ పతకాల జాబితాలో మరొకటి అదనంగా చేరింది. నాడు లభించిన రజతమే ఇప్పుడు స్వర్ణంగా మారింది. 4గీ400 మిక్స్డ్ రిలే ఈవెంట్లో భారత బృందం రెండో స్థానంలో (3 నిమిషాల 15.71 సెకన్లు) నిలిచింది. బహ్రెయిన్ (3 నిమిషాల 11.89 సెకన్లు) స్వర్ణం సాధించగా, కజకిస్తాన్ టీమ్ (3 నిమిషాల 19.52 సెకన్లు) కాంస్యం సాధించింది. అయితే బహ్రెయిన్ జట్టులో సభ్యుడైన కెమీ అడికోయా డోపింగ్‌లో పట్టుబడ్డాడు. అతనిపై అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ నాలుగేళ్ల నిషేధం విధించింది. ఫలితంగా బహ్రెయిన్‌ను డిస్క్వాలిఫై చేస్తూ భారత్‌కు బంగారు పతకాన్ని ప్రకటించారు. ఈ స్వర్ణం గెలుచుకున్న బృందంలో మొహమ్మద్ అనస్, అరోకియా రాజీవ్, హిమ దాస్, పూవమ్మ సభ్యులుగా ఉన్నారు. మరో కాంస్యం కూడా... మరో భారత అథ్లెట్ అను రాఘవన్ ఖాతాలో కూడా ఇదే తరహాలో కాంస్య పతకం చేరింది. మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో అను 4వ స్థానంలో నిలిచింది. ఈ రేస్ గెలిచిన అడెకోయాపై కూడా నిషేధం పడటంతో అనుకు కాంస్య పతకం లభించింది. -
భారత ఫుట్‌బాల్ దిగ్గజం చునీ గోస్వామి ఇక లేరు
కోల్‌కతా: భారత విఖ్యాత ఫుట్‌బాల్ ఆటగాడు చునీ గోస్వామి కన్నుమూశారు. దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 82 ఏళ్ల మాజీ సారథి కోల్‌కతాలో గురువారం తుదిశ్వాస విడిచారు. ఆయన మేటి ఫుట్‌బాలరే కాదు... క్రికెటర్ కూడా! ఫస్ట్‌క్లాస్ క్రికెట్ టోర్నీల్లో ఆయన బెంగాల్ తరఫున ఆడారు. కాలేజీ రోజుల్లో ఆయన కలకత్తా యూనివర్సిటీకి చెందిన ఫుట్‌బాల్, క్రికెట్ జట్లకు ఆడటం విశేషం. 1962లో జరిగిన ఆసియా క్రీడల్లో భారత్‌ను విజేతగా నిలిపిన ఈ కెప్టెన్ మరో రెండేళ్ల తర్వాత ఆసియా కప్‌లో జట్టును ఫైనల్‌కు చేర్చి రన్నరప్‌గా నిలిపాడు. కొంతకాలంగా ఆయన అధిక మధుమేహం, ప్రొస్టేట్, తీవ్రమైన నరాలకు సంబంధించిన వ్యాధులతో పోరాడుతున్నారు. గురువారం పరిస్థితి విషమించడంతో ఆయన కుటుంబసభ్యులు నగరంలోని ప్రముఖ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే గుండెపోటు రావడంతో సాయంత్రం 5 గంటలకు చునీ తుదిశ్వాస విడిచారని కుటుంబసభ్యులు తెలిపారు. ఫుట్‌బాల్ క్లబ్లో ఆడినంత కాలం మోహన్ బగన్కే ఆడిన ఈ స్టార్ 1957లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. భారత అలనాటి మేటి ఆటగాళ్లలో ఒకరైన చునీ 27 ఏళ్ల వయసులోనే 1964లో ఆటకు గుడ్‌బై చెప్పారు. అయితే ఈ ఆటకు బై చెప్పినా... మరో ఆటలో బిజీ అయ్యారు. క్రికెట్లోనూ మెరిసిన గోస్వామి 1966లో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో సుబ్రోతో గుహతో కలిసి గ్యారీ సోబర్స్ ఉన్న వెస్టిండీస్ జట్టును ఓడించడంలో కీలకపాత్ర పోషించాడు. ఇండోర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో కంబైన్డ్ సెంట్రల్ అండ్ ఈస్ట్ జోన్ జట్టు తరఫున బరిలోకి దిగిన గోస్వామి 8 వికెట్లు తీశాడు. 1971–72 సీజన్లో చునీ బెంగాల్ రంజీ జట్టుకు సారథ్యం వహించగా... జట్టు ఫైనల్లోకి చేరింది. తుదిపోరులో ముంబై చేతిలో ఓడి రన్నరప్‌తో తృప్తిపడింది. -
2018.. భారత్ ఆట.. పతకాల వేట
-
2018.. భారత్ ఆట.. పతకాల వేట
ఒకప్పుడు అంతర్జాతీయ స్థాయిలో భారత క్రీడాకారుల మెరుపులు అడపాదడపా కనిపించేవి. కానీ కొన్నేళ్లుగా ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. వేదిక ఏదైనా.. ప్రత్యర్థులు ఎవరైనా దీటుగా బదులిస్తూ.. వారిని బోల్తా కొట్టిస్తూ.. అద్వితీయ ప్రదర్శనతో అదరగొడుతూ.. మనోళ్లు నిలకడగా పతకాలు కొల్లగొడుతున్నారు. గత ఏడాది కంటే మెరుగ్గా అద్భుత ఫలితాలు నమోదు చేశారు. భారత క్రీడారంగాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లారు. ప్రధానంగా ఏషియన్ గేమ్స్‌లో భారత్ సాధించిన పతకాలే అందుకు నిదర్శనం. ఇండోనేసియా వేదికగా జరిగిన ఏషియన్ గేమ్స్‌లో భారత్ 69(15 స్వర్ణాలు, 24 రజతాలు, 30 కాంస్యాలు) పతకాలు సాధించింది. ఓవరాల్ ఆసియా క్రీడల్లో భారత్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. అలానే మరికొన్ని ప్రముఖ ఈవెంట్లలో సైతం భారత్ సత్తా చాటి పతకాల వేటను కొనసాగించింది. వాటిలో కొన్నింటిని ఓ లుక్కేద్దాం. 1. పీవీ సింధు: వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీ లో భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు విజేతగా నిలిచింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ ప్లేయర్‌గా గుర్తింపు సాధించింది. ఫలితంగా బ్యాడ్మింటన్ టోర్నీని బంగారు పతకంతో ముగించింది. ఈ సీజన్లో ఆమెకు ఇదే తొలి టైటిల్ కాగా, అంతకుముందు వరల్డ్ చాంపియన్‌షిప్స్, ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్ టోర్నీల్లో రజత పతకాలు సాధించింది. ఇక థాయ్‌లాండ్ ఓపెన్, ఇండియా ఓపెన్లలో సైతం సింధు రజత పతకాల్ని సాధించింది. ఆసియా క్రీడల్లో రజతం సాధించిన తొలి భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ఘనతను సింధు సొంతం చేసుకుంది. 2. సైనా నెహ్వాల్: ఈ ఏడాది మరో మహిళా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ సైతం మంచి ఫలితాల్ని సాధించింది. కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణంతో పాటు ఏషియన్ గేమ్స్, ఆసియా చాంపియన్‌షిప్‌లలో కాంస్య పతకాలను ఖాతాలో వేసుకుంది. ఓవరాల్‌గా చూస్తే నాలుగు టోర్నీల్లో(కామన్వెల్త్ గేమ్స్, డెన్మార్క్ ఓపెన్, ఇండోనేసియా ఓపెన్, సయ్యద్ మోదీ) సైనా ఫైనల్‌కు చేరింది. 3. సైనా-కశ్యప్‌ల వివాహం: భారత బ్యాడ్మింటన్ స్టార్స్ సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్‌లు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గత కొన్నేళ్లుగా ప్రేమించుకున్న సైనా-కశ్యప్‌లు కుటుంబ సభ్యుల ఆశీస్సులతో డిసెంబర్14వ తేదీన వివాహం చేసుకున్నారు. రిజిస్టర్ వివాహం చేసుకున్న ఈ జంట.. ఆపై ఘనంగా హెచ్ఐసీసీలో రిసెప్షన్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి పలువురు క్రీడా, సినీ, రాజకీయ రంగ ప్రముఖులు వధూవరులను ఆశీర్వదించారు. 4. సమీర్‌వర్మ: ఈ సీజన్లో భారత షట్లర్ సమీర్ వర్మ సయ్యద్ మోదీ గ్రాండ్ ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టైటిల్‌ను సాధించాడు. లక్నోలో జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌లో చైనాకు చెందిన లు గాంగ్జును ఫైనల్లో ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఇక మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో చైనా క్రీడాకారిణి హన్ యు చేతిలో సైనా ఓటమి పాలైంది. 5. అంగద్ వీర్ సింగ్ బజ్వా: ఆసియా షాట్‌గన్ చాంపియన్‌షిప్ స్కీట్ ఈవెంట్లో భారత షూటర్ అంగద్ వీర్ సింగ్ బజ్వా ప్రపంచ రికార్డు స్వర్ణంతో చరిత్ర సృష్టించాడు. కాంటినెంటల్, ప్రపంచస్థాయి స్కీట్ ఈవెంట్లలో స్వర్ణం సాధించిన తొలి భారత షూటర్‌గా అంగద్ రికార్డులకెక్కాడు. కువైట్ సిటీ వేదికగా జరిగిన ఈ చాంపియన్‌షిప్ ఫైనల్ రౌండల్ అంగద్ 60కి 60 పాయింట్లు సాధించి స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. 10 మీటర్ల రైఫిల్ మిక్స్డ్ ఈవెంట్లో భారత జోడి ఎలవెనిల్ వలరివాన్-హ్రిదయ్ హజరికాలు గోల్డ్ సాధించారు. 6. స్వప్న బర్మన్: ఏషియన్ గేమ్స్‌లో 66 ఏళ్లుగా సాధ్యం కాని ఘనతను అద్భుత ప్రదర్శనతో బెంగాల్‌కు చెందిన 21 ఏళ్ల స్వప్న బర్మన్ సాధించింది. ఇండోనేసియా వేదికగా జరిగిన ఆసియా క్రీడల హెప్టాథ్లాన్‌లో తొలిసారి స్వర్ణం నెగ్గిన భారత అథ్లెట్‌గా రికార్డులకెక్కింది. అరుదైన విజయంతో చరిత్ర సృష్టించింది. హై జంప్, జావెలిన్ త్రోలలో టాపర్‌గా నిలిచిన ఈ బెంగాలీ యువతి... షాట్‌పుట్ , లాంగ్ జంప్ లో రెండో స్థానంలో వచ్చింది. ఇక 100 మీటర్ల పరుగులోనాలుగో స్థానంలో, 200మీ. పరుగులో సెకన్లతో నాలుగో స్థానంతో సరి పెట్టుకుంది. 64 పాయింట్ల ఆధిక్యంతో చివరిదైన 800 మీ. పరుగు బరిలో దిగిన బర్మన్... నాలుగో స్థానంలో నిలిచినా మెరుగైన పాయింట్లతో స్వర్ణం గెల్చుకుంది. 7. అర్పిందర్ సింగ్: ఆసియా క్రీడల్లో భాగంగా ట్రిపుల్ జంప్‌లో భారత జంపర్ అర్పిందర్ 16.77 మీటర్ల దూరం దూకి స్వర్ణంతో మెరిశాడు. కనీసం ఈ పోటీల్లో జాతీయ రికార్డును సవరిస్తే చాలు అనుకున్న అర్పిందర్ ఏకంగా పసిడిని పట్టేయడం విశేషం. దీంతో ఈ విభాగంలో 48 ఏండ్లుగా ఊరిస్తు వస్తున్న స్వర్ణ ఆశలకు తెరదించాడు. 2014 కామన్వెల్త్ గేమ్స్ తర్వాత ఒక్క పతకం కూడా గెలువని అర్పిందర్.. ప్రతిష్టాత్మక ఆసియా గేమ్స్‌లో పసిడిని సాధించి అందరినీ అబ్బురపరిచాడు. 8. తేజిందర్ పాల్ సింగ్: ఆసియా క్రీడల్లో షాట్‌పుట్ ఈవెంట్లో పోటీపడిన తేజిందర్‌పాల్ సింగ్ స్వర్ణాన్ని సాధించాడు. రికార్డు స్థాయిలో గుండుని 20.75 మీటర్లు విసిరి పసిడి పతకాన్ని గెలుపొందాడు. ఇలా అథ్లెటిక్స్‌లో తొలి స్వర్ణం అందజేశాడు. తొలి ప్రయత్నంలో గుండును 19.96 మీటర్లు విసిరిన తజిందర్ రెండో ప్రయత్నంలో 19.15 మీటర్లు విసిరాడు. దీంతో ఒత్తిడికి గురైన తేజిందర్ మూడో ప్రయత్నంలో విఫలమయ్యాడు. నాలుగో ప్రయత్నంలో మాత్రం మళ్లీ 19.96 మీటర్లు విసిరి మునుపటి లయని అందుకున్నాడు. ఐదోసారి కసితో ఆడి ఆసియా క్రీడల్లోనే రికార్డు నెలకొల్పేలా గుండును 20.75 మీటర్లు విసిరాడు. ఆరోసారి 20 మీటర్లకు పరిమితం అయ్యాడు. 9. రోహన్ బోపన్న–దివిజ్ శరణ్ జోడికి స్వర్ణం: ఆసియా క్రీడల టెన్నిస్‌లో రోహన్ బోపన్న–దివిజ్ శరణ్ (భారత్) జంట స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. అలెగ్జాండర్ బుబ్లిక్–డెనిస్ యెవ్సెయెవ్ (కజకిస్తాన్) ద్వయంపై గెలుపొందిన బోపన్న–శరణ్ జోడి పసిడి సాధించింది. ఫలితంగా తమ కెరీర్లో ఏషియాడ్ డబుల్స్ స్వర్ణాన్ని తొలిసారి సొంతం చేసుకుంది. 10. వుషూలోనూ మెరిశారు: ఈ ఏడాది జరిగిన ఆసియా క్రీడల వుషూ ఈవెంట్లో భారత్ నాలుగు కాంస్య పతకాల్ని సాధించింది. ఇది ఏషియన్ గేమ్స్ వుషూ చరిత్రలో భారత్‌కు ఇది అత్యుత్తమ ప్రదర్శన. అంతకుముందు 2014లో రెండు క్యాంస పతకాల్ని మాత్రమే సాధించగా.. ఈసారి దాన్ని మరింత మెరుగుపరుచుకుంది. వుషూలో పతకాలు సాధించిన వారిలో రోషిబినా దేవీ(60 కేజీల కేటగిరీ), సంతోస్ కుమార్(56 కేజీల కేటగిరీ), సూర్య భాను ప్రతాప్ సింగ్(60 కేజీల కేటగిరీ), నరేందర్ గ్రావెల్(65 కేజీల కేటగిరీ)లు ఉన్నారు. 11. సెపక్తక్రా: ఆసియాగేమ్స్ సెపక్‌తక్రాలో ఈవెంట్లో భారత జట్టు కాంస్య పతకాన్ని సాధించి కొత్త చరిత్రను లిఖించింది. ఆసియాగేమ్స్‌లో భాగంగా భారత పురుషుల జట్టు సెమీఫైనల్లో థాయ్‌లాండ్ చేతిలో ఓటమి పాలై కాంస్యంతో సరిపెట్టుకుంది. ఈ గేమ్స్ చరిత్రలో సెపక్తక్రా క్రీడాంశంలో భారత్ కనీసం కాంస్య పతకాన్ని సాధించడం ఇదే తొలిసారి. 12. వినేశ్ ఫొగాట్: ఆసియా క్రీడల మహిళల రెజ్లింగ్ చరిత్రలో వినేశ్ ఫొగాట్ రూపంలో తొలిసారి భారత వనిత పసిడి పట్టు పట్టింది. అదీ కూడా ప్రపంచ మహిళల రెజ్లింగ్‌లో తిరుగులేని శక్తిగా పేరున్న జపాన్ క్రీడాకారిణిని చిత్తు చేసి ఈ ఘనత సాధించింది. మహిళల ఫ్రీస్టయిల్ 50 కేజీల విభాగంలో వినేశ్ ఫొగాట్ విజేతగా నిలిచింది. ఫలితంగా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా రెజ్లర్‌గా గుర్తింపు పొందింది. 13. బజరంగ్ పూనియా: ఆసియా క్రీడల్లో రెజ్లర్ బజరంగ్ పూనియా గోల్డ్ సాధించాడు. 65 కేజీల పురుషుల విభాగంలో జపాన్ రెజ్లర్ తకాతాని దైచిని ఓడించిన పూనియా పసిడిని ఒడిసి పట్టుకున్నాడు. 14. గోల్డెన్ జాన్సన్: ఆసియా క్రీడల్లో జిన్సన్ జాన్సన్ స్వర్ణం ఒడిసిపట్టాడు.1500 మీ. పరుగులో జాన్సన్ పసిడితో మెరిశాడు. 3 నిమిషాల 44.72 సెకన్లలో రేసు పూర్తి చేసి బంగారు పతకం అందుకున్నాడు. 800 మీటర్ల పరుగులో రజతంతో సంతృప్తిపడిన జాన్సన్...1500 మీ. పరుగులో మాత్రం అందరి కంటే ముందు లక్ష్యాన్ని చేరి బంగారు పతకాన్ని సాధించాడు. 15.జెరెమీ లాల్రిన్గుంగా: అర్జెంటీనా వేదికగా జరిగిన యూత్ ఒలింపిక్స్‌లో భారత్ టీనేజ్ వెయిట్‌లిఫ్టింగ్ సంచలనం జెరెమీ లాల్రిన్గుంగా స్వర్ణ పతకాన్ని సాధించి కొత్త చరిత్ర సృష్టించాడు. వెయిట్‌లిఫ్టింగ్ పోరులో 15 ఏళ్ల లాల్రిన్గుంగా ఫైనల్ అటెంప్ట్‌లో 150 కేజీల బరువు ఎత్తడంతో పసిడిని ఒడిసి పట్టుకున్నాడు. గ్రూప్-ఎలో భాగంగా 62 కేజీల విభాగంలో పోటీపడ్డ ఈ యువ వెయిట్‌లిఫ్టర్.. మొత్తంగా 274 కేజీల బరువు ఎత్తి స్వర్ణాన్ని సాధించాడు. తొలుత స్నాచ్ విభాగంలో అత్యధికంగా 124 కేజీల బరువును సునాయాసంగా ఎత్తిన జెరెమీ.. క్లీన్ అండ్ జర్క్‌లో అత్యధికంగా 150కేజీలను ఎత్తాడు. 16. తబాబి దేవి: యూత్ ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలిసారి జూడోలో పతకం లభించింది. 44 కిలోల కేటగిరిలో తంగ్జమ్ తబాబి దేవి రజత పతకాన్ని సొంతం చేసుకుంది. సీనియర్ లేదా యూత్ స్థాయిలో పరంగా చూసిన జూడోలో భారత్‌కు ఇదే తొలి పతకం కావడం విశేషం. 17. దీపా కర్మాకర్: టర్కీలో జరిగిన జిమ్నాస్టిక్స్ వరల్డ్ చాలెంజ్కప్లో భారత జిమ్నాస్ట్ దీపాకర్మాకర్ స్వర్ణాన్ని సాధించి కొత్త చరిత్రను లిఖించింది. ఈ గేమ్స్‌లో భారత్ తరపున పసిడి సాధించిన తొలి భారత జిమ్నాస్ట్‌గా గుర్తింపు పొందింది. 18. సునీల్ ఛెత్రి: జూన్ నెలలో జరిగిన ఇంటర్ కాంటినెంటల్ కప్‌లో భారత ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రి అత్యధిక అంతర్జాతీయ గోల్స్ సాధించిన ఆటగాడిగా రెండోస్థానం పొందాడు. అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్‌తో లియోనల్ మెస్సీతో కలిసి సంయుక్తంగా రెండోస్థానంలో నిలిచాడు. 19.నవజ్యోత్ కౌర్: భారత మహిళా రెజ్లర్ నవజ్యోత్ కౌర్ కొత్త చరిత్ర లిఖించింది. కిర్గిస్తాన్‌లో జరిగిన ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం నెగ్గి.. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా రెజ్లర్‌గా గుర్తింపు పొందింది. 20. సానియా మీర్జాకు పుత్రోత్సాహం: అక్టోబర్ నెలలో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పుత్రుడికి జన్మనిచ్చింది. సానియా, షోయబ్‌లకు 2010 ఏప్రిల్ 12న హైదరాబాద్‌లో వివాహం జరగ్గా.. ఈ ఏడాది ఆ దంపతులకు కొడుకు పుట్టాడు. ఆరు గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్స్ గెలుచుకున్న 32 ఏళ్ల సానియా సుదీర్ఘ కాలం పాటు డబుల్స్‌లో వరల్డ్ నంబర్‌వన్‌గా కొనసాగింది. 21. సాక్షి మాలిక్: ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో సాక్షి మాలిక్(57 కేజీలు) స్వర్ణ పతకం నెగ్గింది. తుదిపోరులో నికోలినా కాసిక్ (క్రొయేషియా)పై సాక్షి విజయం సాధించింది. 22. మేరీకోమ్: ముప్పై ఐదేళ్ల వయసు.. ముగ్గురు పిల్లల తల్లి అయినా తనలో ఏ మాత్రం సత్తా తగ్గలేదని మహిళా బాక్సర్ మేరీకోమ్ తన ప్రదర్శనతో నిరూపించింది. నవంబర్‌లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో మేరికోమ్ పసిడి సొంతం చేసుకుంది. తద్వార ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఆరు స్వర్ణాలు నెగ్గిన తొలి మహిళా బాక్సర్‌గా చరిత్ర సృష్టించింది. ఈ స్వర్ణంతో ఈ మణిపురి మణిపూస క్యూబా పురుషుల బాక్సింగ్ దిగ్గజం ఫెలిక్స్ సవాన్ సరసన చేరింది. ఏప్రిల్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో పసిడి సొంతం చేసుకున్న మేరీ.. ఫిబ్రవరిలో జరిగిన స్ట్రాండ్జా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో రజతం సరిపెట్టుకుంది. సెప్టెంబర్‌లో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ మేరికోమ్‌ను గిరిజనుల ప్రచారకర్తగా నియమించింది. ఇదే నెలలో పొలాండ్‌లో జరిగిన బాక్సింగ్ చాంపియన్‌షిప్ కోసం నాలుగు గంటల్లో రెండు కిలోలు తగ్గి ఔరా అనిపించింది. -
డబ్బు కడితేనే క్రీడాగ్రామంలోకి
న్యూఢిల్లీ: ఆసియా పారా గేమ్స్‌లో పాల్గొనేందుకు జకార్తా వెళ్లిన భారత బృందాన్ని నిర్వాహకులు అడ్డుకున్నారు. బస, ఇతరత్రా ఏర్పాట్ల కోసం రుసుము చెల్లిస్తేనే లోనికి అనుమతిస్తామని చెప్పారు. గేమ్స్ విలేజ్‌లో ప్రవేశించడానికి ముందు బస ఏర్పాట్ల కోసం ఫీజు చెల్లించడం ఆనవాయితీ. భారత బృందం రూ. 1 కోటి 80 లక్షలు (2,50,0000 డాలర్లు) చెల్లించకపోవడంతో నిర్వాహకులు భారత పారా అథ్లెట్లను చాలాసేపు నిలువరించారు. చివరకు ఈ నెల 4వ తేదీకల్లా చెల్లిస్తామని, లేదంటే గేమ్స్ విలేజ్ నుంచి నిష్క్రమిస్తామని రాతపూర్వక హామీ ఇవ్వడంతో ఎట్టకేలకు నిర్వాహకులు అంగీకరించారు. ఆసియా పారా అథ్లెటిక్స్ ఈ నెల 6 నుంచి 13 వరకు జరుగనున్నాయి. ఇందులో 193 మంది భారత అథ్లెట్లు పాల్గొంటున్నారు. కేంద్ర క్రీడాశాఖ నుంచి నిధులు విడుదల కాకపోవడం వల్లే ఇలాంటి అనుభవం ఎదురైందని భారత పారాలింపిక్ కమిటీ ఉపాధ్యక్షుడు గుర్శరణ్ సింగ్ తెలిపారు. -
వరుసగా ఎనిమిదో స్వర్ణం సాధిస్తాం: రాహుల్ చౌదరీ
సనత్‌నగర్: వరుసగా ఏడుసార్లు విజేత... ఆసియా క్రీడల్లో భారత కబడ్డీ జట్టు ఘనత. ఇదే ఆనవాయితీని కొనసాగించేందుకు అజయ్ ఠాకూర్ సేన సిద్ధమైంది. ఆగస్టులో ఇండోనేసియా వేదికగా జరుగనున్న ఈ క్రీడల్లో ఎనిమిదో స్వర్ణాన్ని సాధించడమే తమ లక్ష్యమంటున్నాడు భారత స్టార్ రైడర్ రాహుల్ చౌదరి. మషాల్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ‘రైడ్ ఫర్ గోల్డ్’ పేరిట జరుగుతోన్న ప్రచార కార్యక్రమంలో రాహుల్ చౌదరి పాల్గొన్నాడు. బేగంపేట్‌లోని గీతాంజలి స్కూల్ ప్రాంగణంలో పాఠశాల విద్యార్థులతో కలిసి సందడి చేశాడు. చిన్నారులతో కబడ్డీ ఆడుతూ వారిని ప్రోత్సహించాడు. ఈ సందర్భంగా వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. ఈ కార్యక్రమంలో గీతాంజలి స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ జయకరణ్, ప్రిన్సిపల్ మాయ సుకుమారన్, ఫిజికల్ ట్రైనర్ శశాంక్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులతో రాహుల్ చౌదరీ విద్యార్థుల ప్రశ్న: 1990లో తొలి స్వర్ణం సాధించి నప్పటికీ, ఇప్పటికీ జట్టులో తేడా ఏమైనా ఉందా? రాహుల్: మొదటిసారి పోటీలకు వెళ్లినప్పుడు ప్రత్యర్థి ఆటగాళ్లు ఎలా ఉంటారో? వారి బలాలు, బలహీనతలు ఏంటి? అనే అంశాలపై అవగాహన లేదు. ఇప్పుడు ఆ పరిస్థితిని అంచనా వేయగలుగుతున్నాం. కానీ అప్పుడు ఇప్పుడూ ఆటగాళ్లు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. రోజూ ప్రాక్టీస్‌కు ఎంత సమయం కేటాయిస్తారు? ఉదయం 45 నిమిషాల వ్యాయామం, వాకింగ్‌తో సరిపెడితే కుదరదు. కోచ్ పర్యవేక్షణలో 6 గంటలు, స్వతహాగా టీమ్ సభ్యులందరం కలిసి మరో 6 గంటలు... మొత్తం 12 గంటలు ప్రాక్టీస్‌కే అంకితమవుతాం. ఫిట్నెస్ కోసం ఎలాంటి ఆహారం తీసుకుంటారు? పిజ్జాలు, బర్గర్లకు చాలా దూరంగా ఉంటాం. సహజమైన పోషకాలు లభించే ఆహారానికే ప్రాధాన్యత ఇస్తాం. డ్రైప్రూట్స్, నట్స్ ఎక్కువగా తీసుకుంటాం. వరుసగా ఎనిమిదోసారి బంగారు పతకం సాధిస్తామని గట్టిగా ఎలా చెబుతున్నారు? ఏడేళ్లుగా వివిధ దేశాల జట్ల ఆటతీరును నిశితంగా పరిశీలించాం. వారి బలాలు, బలహీనతలు స్పష్టంగా అవగతమయ్యాయి. వీటితో పాటు యావత్ భారత జాతి కూడా మాకు మద్దతుగా ఉంది. కచ్చితంగా స్వర్ణం సాధిస్తామనే విశ్వాసం బలంగా ఉంది. -
ప్రాంజలకు చోటు
న్యూఢిల్లీ: తెలుగు అమ్మాయి యడ్లపల్లి ప్రాంజలకు అరుదైన అవకాశం దక్కింది. ఆసియా క్రీడల కోసం ఎంపిక చేసిన ఆరుగురు సభ్యుల భారత మహి ళల టెన్నిస్ జట్టులోకి ప్రాంజల ఎంపికైంది. సానియా మీర్జా తర్వాత ఒక హైదరాబాదీ అమ్మాయికి టెన్నిస్‌లో ఆసియా క్రీడల్లో ఆడే అవకాశం లభించడం ఇదే మొదటిసారి. 19 ఏళ్ల ప్రాంజల ఐటీఎఫ్ సర్క్యూట్లో వరుస విజయాలతో సత్తా చాటింది. భారత జట్టులో ప్రాంజలతో పాటు అంకితా రైనా, కర్మన్‌కౌర్ థండి, రుతుజా భోస్లే, రియా, ప్రార్థన కూడా ఉన్నారు. మహిళల టీమ్‌కు అంకితా బాంబ్రీ నాన్ ప్లేయింగ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తోంది. -
మళ్లీ జకార్తాలో కలుద్దాం
పక్షం రోజులపాటు జరిగిన ఆసియా క్రీడలు ముగిశాయి. దక్షిణ కొరియాలోని ఇంచియాన్‌లో శనివారం ముగింపు కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఆసియాలో మరోసారి తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ చైనా 342 పతకాలతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. భారత్ 11 స్వర్ణాలు, 10 రజతాలు, 36 కాంస్యాలతో కలిపి మొత్తం 57 పతకాలతో ఎనిమిదో స్థానంలో నిలిచింది. కబడ్డీలో తమకు తిరుగులేదని నిరూపిస్తూ భారత్ పురుషుల, మహిళల విభాగాల్లో మళ్లీ స్వర్ణ పతకాలు సాధించింది. ఓవరాల్‌గా ఈ ఆసియా క్రీడల్లో 14 ప్రపంచ రికార్డులు, 27 ఆసియా రికార్డులు బద్దలయ్యాయి. ఆరు డోపింగ్ కేసులు నమోదు కాగా... ఇందులో ఇద్దరు స్వర్ణ పతక విజేతలు కూడా ఉండటం గమనార్హం. ఈ ఆసియా క్రీడల ‘అత్యంత విలువైన ఆటగాడు’ పురస్కారం జపాన్ స్విమ్మర్ కొసుకె హగినోకు లభించింది. 2018 ఆసియా క్రీడలు ఇండోనేసియా రాజధాని జకార్తాలో జరుగుతాయి. -
ఆసియా క్రీడలు : ఖేల్ ఖతమ్!!
-
నిరాశపరిచిన భారత రెజ్లర్లు
ఇంచియాన్:ఫ్రీ స్టయిల్ విభాగంలో దుమ్ము భారత రెజ్లర్లు గ్రీకో రోమన్లో మాత్రం నిరాశ పరిచారు. కృష్ణకాంత్ యాదవ్ కాంస్య పతక పోరులో 0-3తో ఇరాన్ రెజ్లర్ సయూద్ చేతిలో ఓడాడు. ఇక రవీందర్ సింగ్, హర్‌ప్రీత్ సింగ్ క్వార్టర్ ఫైనల్ బౌట్లో ఓడి ఇంటిదారి పట్టారు. ఇదిలా ఉండగా టేబుల్ టెన్నిస్ పురుషుల డబుల్స్‌లో భారత జోడీలు శరత్ కమల్- ఆంథోని అమల్‌రాజ్, హర్మీత్ దేశాయ్-సౌమ్యజిత్ ఘోష్ తమ ప్రత్యర్థులపై గెలిచి మూడో రౌండ్లోకి ప్రవేశించారు. మిక్స్డ్ డబుల్స్ ప్రి క్వార్టర్స్‌లో అమల్‌రాజ్-మాధురిక ద్వయుం, జపాన్ జంటపై నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. షూటింగ్ లో మైరాజ్ అహ్మద్ ఖాన్ స్కీట్ వ్యక్తిగత విభాగంలో కొద్దిలో కాంస్య పతకాన్ని చేజార్చుకున్నాడు. సెమీఫైనల్లో తను ఐదో స్థానంలో నిలిచాడు. -
స్వర్ణానికి ఒక అడుగుదూరంలో..
ఇంచియాన్:భారత పురుషుల హాకీ జట్టు సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. హాకీ పూర్వ వైభవాన్ని తిరిగి నిలబెట్టేందుకు భారత్ ఒక అడుగుదూరంలో నిలిచింది. 17 వ ఆసియా గేమ్స్ లో భాగంగా ఇక్కడ దక్షిణకొరియాతో జరిగిన పురుషుల హాకీ సెమీ షైనల్ మ్యాచ్ లో భారత జట్టు ఫైనల్ కు చేరింది. మంగళవారం జరిగిన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు 1-0 తేడాతో జయకేతనం ఎగురవేసింది. ఆసియా గేమ్స్ లో ఆద్యంత ఆకట్టుకున్నభారత్ జట్టు పటిష్టమైన దక్షిణకొరియాను బోల్తా కొట్టించింది. ఆట 44 వ నిమిషంలో ఆకాశ్ దీప్ సింగ్ గోల్ చేసి జట్టును ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. అనంతరం దక్షిణకొరియాను గోల్ చేయకుండా నిలువరించిన భారత్ జట్టు విజయాన్ని కైవసం చేసుకుని 12 ఏళ్ల తరువాత ఫైనల్ ఆశలను నెరవేర్చుకుంది. గతంలో 2002లో ఫైనల్ కు చేరిన భారత్.. ఆ తరువాత సెమీస్ అడ్డంకిని దాటలేకపోయింది. ఇదిలా ఉండగా భారత్ పురుషలు హాకీలో స్వర్ణం సాధించి 16 ఏళ్ల దాటింది. 1998 లో ధనరాజ్ పిళ్లె కెప్టెన్సీలో స్వర్ణం సాధించిన భారత్ ఆ తరువాత ఆ పతకాన్ని దక్కించుకోలేదు. పాకిస్తాన్-మలేషియాల మధ్య జరిగే మరో సెమీ ఫైనల్ మ్యాచ్ లో విజేతతో భారత్ తుదిపోరులో తలపడనుంది. ఒకవేళ భారత్ ఫైనల్ కు చేరి అక్కడ కూడా విజయం సాధిస్తే.. 2016 రియో ఒలింపిక్స్ కు నేరుగా అర్హత సాధిస్త్తోంది.ఒకవేళ ఆ మ్యాచ్ లో ఓడినా భారత్ కు రజత పతకం దక్కుతుంది. -
రజతంతో సరిపెట్టుకున్న సాకేత్ జోడీ
ఇంచియాన్: ఆసియా గేమ్స్ లో డబుల్స్ విభాగంలో ఫైనల్ కు చేరిన భారత టెన్నిస్ జోడీ సాకేత్ మైనేని- సనామ్ సింగ్ లు రజతంతో సరిపెట్టుకున్నారు. ఆదివారం జరిగిన మ్యాచ్ లో ధాయ్ లాండ్ ఆటగాళ్లపై విజయం సాధించిన ఈ జోడీ.. ఫైనల్ రౌండ్ లో మాత్రం చతికిలబడ్డారు. సోమవారం జరిగిన ఫైనల్ రౌండ్ లో సాకేత్ జోడీ 5-7,6-7 తేడాతో దక్షిణా కొరియా ఆటగాళ్లు యంగ్ క్యూ లిమ్ మరియ హెన్ చుంగ్ చేతిలో ఓటమి పాలైయ్యారు. కేవలం గంటా 29 నిమిషాలు మాత్రమే జరిగిన ఈ పోరులోభారత్ ఆటగాళ్లు ఏ దశలోనూ దక్షిణ కొరియా పై పైచేయి సాధించలేదు. ఆదివారం జరిగిన సెమీ ఫైనల్లో సాకేత్ మైనేని -సనామ్ సింగ్ జోడీ ఫైనల్ కు చేరిన సంగతి తెలిసిందే. ఈ జోడీ అద్భుత ప్రదర్శన కనబరిచి థాయ్ లాండ్ జంటను మట్టికరిపించింది. -
రేపు దక్షిణ కొరియాతో పోరుకు భారత్ సిద్ధం
ఇంచియాన్: ఇప్పటి వరకూ ఆసియా గేమ్స్ లో దుమ్ము లేపుకుంటూ సెమీస్ కు చేరిన భారత పురుషులు.. రేపటి మ్యాచ్ లో విజయం సాధించి సుదీర్ఘ నిరీక్షణను అధిగమించేందుకు సన్నద్దమవుతున్నారు. భారత్ పురుషలు హాకీలో స్వర్ణం సాధించి 16 ఏళ్ల దాటింది. ఈ తరుణంలో భారత్ ఎలాగైనా తుదిమెట్టుకు చేరాలని భావిస్తోంది. మంగళవారం దక్షిణకొరియాతో జరిగే సెమీఫైనల్ మ్యాచ్ కు భారత్ జట్టు సిద్ధమైంది. ఈ మ్యాచ్ ను అధిగమించి ఫైనల్ కు చేరాలని భారత యువ ఆటగాళ్లు పట్టుదలతో ఉన్నారు. 1998 లో ధనరాజ్ పిళ్లె కెప్టెన్సీలో స్వర్ణం సాధించిన అనంతరం భారత్ కు ఇప్పటివరకూ ఆ పతకాన్ని దక్కించుకోలేదు. దీంతో రేపటి పోరులో దక్షిణ కొరియాను బోల్తా కొట్టించి స్వర్ణం వేటకు సన్నద్ధం కావాలని భారత్ భావిస్తోంది. ఒకవేళ భారత్ ఫైనల్ కు చేరి అక్కడ కూడా విజయం సాధిస్తే.. 2016 రియో ఒలింపిక్స్ కు కూడా అర్హత సాధిస్త్తోంది. ఈ రెండు అవకాశాలు భారత్ అదృష్టానికి పరీక్షగా నిలిచాయి. తొలుత రేపటి మ్యాచ్ లో పటిష్టమైన దక్షిణ కొరియాను ఢీకొనడంపైనే భారత్ ప్రధానంగా దృష్టి పెట్టింది. శనివారం జరిగిన చివరి పూల్ మ్యాచ్‌లో భారత్ 2-0 తేడాతో చైనాపై విజయం సాధించి సెమీ ఫైనల్ కు ప్రవేశించిన సంగతి తెలిసిందే. మరో సెమీస్‌లో పాకిస్థాన్-మలేసియా తలపడనున్నాయి. -
ఫైనల్ కు చేరిన సాకేత్ జోడీ
ఇంచియాన్: ఆసియా గేమ్స్ లో భాగంగా ఇక్కడ జరిగిన టెన్నిస్ డబుల్స్ మ్యాచ్ లో సాకేత్ మైనేని -సనామ్ సింగ్ జోడీ ఫైనల్ కు చేరింది. ఈ జోడీ అద్భుత ప్రదర్శన కనబరిచి థాయ్ జంటను మట్టికరిపించింది. భారత్ జోడీ 4-6, 6-3, 10-6 తేడాతో థాయ్ జోడీ సంచాయ్, సంచోత్ రతి వతనాలను కంగుతినిపించింది. కేవలం ఒక గంటా మూడు నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్ లో సాకేత్ జోడీ తొలి సెట్ ను కోల్పోయింది. అయితే అనంతరం అనూహ్యంగా పుంజుకున్న ఈ జోడీ వరుస రెండు సెట్ లను గెలుచుకుని భారత్ కు మరో రజత పతకాన్ని ఖాయం చేశారు. మరో సెమీఫైనల్లో దక్షిణాకొరియా విజయం సాధించి భారత్ పో్రుకు సిద్ధమైంది.ఈ మ్యాచ్ లో గెలిచి టెన్నిస్ లో స్వర్ణ పతకాన్ని అందించడానికి సాకేత్ జోడీ ఉవ్విళ్లూరుతోంది. -
పురుషుల హాకీ సెమీస్‌లో భారత్
ఇంచియాన్: ఆసియా క్రీడల పురుషుల హాకీలో భారత జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన చివరి పూల్ మ్యాచ్‌లో భారత్ 2-0 తేడాతో చైనాపై విజయం సాధించింది. తప్పక సత్తా చాటాల్సిన పోరులో ఇరు జట్లు తొలి రెండు క్వార్టర్లలో గోల్సేమీ సాధించలేకపోయాయి. అయితే మూడో క్వార్టర్లో భారత్ దూకుడు పెంచింది. 40వ నిమిషంలో రఘునాథ్, 45వ నిమిషంలో వీరేంద్ర లక్రా గోల్స్ సాధించి జట్టుకు 2-0 ఆధిక్యాన్ని అందించారు. ఆ తర్వాత మరో గోల్ నమోదు కాకపోవడంతో చైనాకు ఓటమి తప్పలేదు. ఇక ఈ గెలుపుతో పూల్ ‘బి’లో భారత్ రెండో స్థానంలో నిలిచి కొరియాతో సెమీస్ పోరుకు సిద్ధమైంది. మరో సెమీస్‌లో పాకిస్థాన్-మలేసియా తలపడనున్నాయి. మహిళల హాకీలో భారత మహిళల జట్టు అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుని సెమీస్ కు చేరిన సంగతి తెలిసిందే. శుక్రవారం జరిగిన పూల్ ‘ఎ' చివరి వ్యూచ్‌లో భారత్ 6-1 గోల్స్ తేడాతో మలేసియాను చిత్తు చేసి సెమీఫైనల్ బెర్తును ఖాయం చేసుకుంది. -
స్వ్కాష్ లో భారత్ సరికొత్త చరిత్ర
ఇంచియాన్:స్వ్కాష్ లో భారత పురుషల జట్టు చరిత్ర సృష్టించింది. ఆసియా గేమ్స్ లో భాగంగా ఇక్కడ మలేషియాతో తలపడిన భారత టీం 2-0 తేడాతో పరిపూర్ణ విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. అంతకుముందు మహిళల ఈవెంట్ లో తొలిసారి రజతాన్ని చేజిక్కించుకున్న భారత్.. పురుషుల ఈవెంట్ లో కూడా మెరిసి పసిడిని కూడా తన ఖాతాలో వేసుకుంది. పురుషుల టీం ఈవెంట్ లో సౌరవ్ ఘోశల్, హరివిందర్ పాల్ సింగ్ ,కుశ్ కౌర్, మహేష్ మనోన్కర్ లు భారత్ కు స్వర్ణాన్ని సాధించిపెట్టారు. ఈ స్వర్ణపతకంతో భారతజట్టు పతకాల పట్టికలో కొం పైకి ఎగబాకే అవకాశం వచ్చింది. దీంతో కలిపి 17వ ఆసియా క్రీడల్లో ఇప్పటివరకు భారత్ కు మూడు స్వర్ణాలు లభించాయి. -
కాంస్యంతో సరిపెట్టుకున్న సనతోయి దేవి
ఇంచియాన్: ఆసియా గేమ్స్‌లో వుషు క్రీడాంశంలో సనోతోయిదేవి కాంస్యంతో సరిపెట్టకుంది. మంగళవారం జరిగిన సెమీఫైనల్లో ఈ మణిపూర్ క్రీడాకారిణి జాంగ్ లుయాన్ (చైనా) చేతిలో పరాజయం పాలైంది. సోమవారం మహిళల సాండా 52 కేజీల క్వార్టర్ ఫైనల్లో సనతోయి దేవి అద్భుత ప్రదర్శన చేసి సెమీ ఫైనల్ కు చేరిన సంగతి తెలిసిందే. మంగోలియాకు చెందిన అమ్‌గలన్ జర్గల్‌ను 2-0తో విన్ బై రౌండ్ పద్దతిన నెగ్గి సెమీస్‌కు చేరినా.. ఇక్కడ సనతోయిదేవికి నిరాశే ఎదురైంది. కాగా, ఏషియన్ గేమ్స్‌లో షూటింగ్ విభాగంలో భారత్ మరో కాంస్య పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. 100మీటర్ల పురుషుల రైఫిల్ షూటింగ్లో అభినవ్ బింద్రా, రవికుమార్, సంజీవ్ రాజ్పుట్ జట్టు పతకాన్ని సాధించింది. ఇదిలా ఉండగా స్వ్కాష్ లో ఘోషల్ రజతంతో సరిపెట్టుకున్నాడు. -
ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు మరో కాంస్యం
ఇంచియాన్ : ఏషియన్ గేమ్స్‌లో షూటింగ్ విభాగంలో భారత్ మరో కాంస్య పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. 100మీటర్ల పురుషుల రైఫిల్ షూటింగ్లో అభినవ్ బింద్రా, రవికుమార్, సంజీవ్ రాజ్పుట్ జట్టు పతకాన్ని సాధించింది. కాగా అభినవ్ బింద్రా ట్విట్టర్ ద్వారా చేసిన వ్యాఖ్యలతో అయోమయం నెలకొల్పాడు. ప్రొఫెషనల్ షూటర్‌గా ఇదే తన చివరి రోజు అని ఈ మాజీ ఒలింపిక్ చాంపియన్ ట్వీట్ చేయడం కలకలం రేపింది.