Awe
-
మళ్లీ అశ్చర్యపరుస్తారట
ఆశ్చర్య కదా.. ‘అశ్చర్య’ అని ఉందేంటి అనుకుంటున్నారా? అయితే చదవండి. గత ఏడాది ‘అ!’తో అందర్నీ ఆశ్చర్యపరిచారు ప్రశాంత్ వర్మ. ఇప్పుడు ఇంకోసారి అశ్చర్యపరచడానికి ప్రశాంత్ వర్మ సిద్ధమయ్యారని తెలిసింది. నాని నిర్మాణంలో కాజల్ అగర్వాల్, నిత్యామీనన్, రెజీనా, అవసరాల శ్రీనివాస్ ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘అ!’. ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేశారు ప్రశాంత్ వర్మ. స్క్రిప్ట్ పనులు కూడా పూర్తయ్యాయని తెలిసింది. ఇందులో కాజల్, తమిళ నటుడు విజయ్ సేతుపతి నటిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇంకా నటీనటుల గురించి ఏమీ అనుకోలేదని యూనిట్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. -
‘అ!’ సీక్వెల్లో టాప్ స్టార్స్!
యంగ్ హీరో నాని నిర్మాతగా మారి తెరకెక్కించిన సినిమా అ!. ఈ సినిమాతో ప్రశాంత్ వర్మ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా కమర్షియల్‌గా విజయం సాధించకపోయినా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దీంతో ప్రశాంత్ వర్మకు ఆఫర్లు కూడా బాగానే వచ్చాయి. ఇటీవల కల్కి సినిమాతో మరోసారి ఆకట్టుకున్న ప్రశాంత్, త్వరలో అ! సినిమాకు సీక్వెల్‌ను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడట. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్‌తో పాటు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా కూడా కమర్షియల్ ఫార్మాట్లో కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్‌తోనే రూపొందుతున్నట్టుగా తెలుస్తోంది. -
‘మహానటి’.. కీర్తి సురేష్
66వ జాతీయ చలన చిత్ర అవార్డులను శుక్రవారం కేంద్రం ప్రకటించింది. తెలుగు సినిమాను భారీ పురస్కారాలు వరించాయి. సావిత్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’లో ప్రధానపాత్ర పోషించిన కీర్తి సురేష్ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. ఉత్తమ తెలుగు సినిమాగా ‘మహానటి’ ఎంపికైంది. ఉత్తమ నటుడు అవార్డునుఆయుష్మాన్ ఖురానా(అంధాధూన్), విక్కీ కౌశల్(ఉడి)కు ప్రకటించారు. ఉత్తమ దర్శకుడిగా ఆధిర్ ధర్ (ఉడి) ఎంపికయ్యారు. ఇక బెస్ట్ మేకప్, స్పెషల్ ఎఫెక్ట్స్, ఒరిజినల్ స్క్రీన్‌ప్లే , ఉత్తమ ఆడియోగ్రఫీతో పాటు కాస్ట్యూమ్స్ డిజైనింగ్, సౌండ్ మిక్సింగ్ విభాగాల్లో ‘తెలుగు వెలిగింది’. తెలుగు సినిమా కొత్త దారిలో వెళ్తోంది. ఈ దారిలో మరింత విస్తృతంగా నడవడానికి కావాల్సింది అవార్డులు, రివార్డులు. తెలుగులో వస్తున్న కొత్తతరం సినిమాలకు ప్రేక్షకులు అభినందనలతో ప్రేమను అందిస్తుంటే, జాతీయ అవార్డులు ప్రోత్సాహం అందిస్తున్నాయి. ఉత్తమ ప్రాంతీయ చిత్రం, ఉత్తమ నటి, మేకప్, స్పెషల్ ఎఫెక్ట్, కాస్ట్యూమ్ డిజైనింగ్, సౌండ్ మిక్సింగ్, ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగాల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. ఈసారి జాతీయ అవార్డుల్లో మన తెలుగు వెలిగింది. చిన్నూ.. అవార్డ్ వచ్చిందని అరిచాను – రాహుల్ రవీంద్రన్ (‘చిలసౌ’ దర్శకుడు) పదేళ్ల క్రితం మా ఫ్రెండ్స్ లైఫ్‌లో జరిగిన సంఘటనల ఆధారంగా ‘చిలసౌ’ కథ తయారు చేసుకున్నాను. కెరీర్లో ఇలాంటి అవార్డ్ వస్తుందని ఊహించలేదు. ఇవాళ చాలా స్పెషల్ రోజు. నా మొదటి సినిమాకు నేషనల్ అవార్డ్ రావడం, రెండో సినిమా రిలీజ్ కావడం, డెబ్యూ డైరెక్టర్‌గా ‘సాక్షి’ నాకు అవార్డ్ ప్రకటించడం అన్నీ ఒకే రోజు జరిగాయి. తెలుగు ప్రేక్షకులు ఒక్కసారి మనల్ని మెచ్చుకున్నా, మన పని నచ్చినా సరే ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. వాళ్ల ఆశీర్వాదం నాకు లభించడం చాలా ఆనందంగా ఉంది. ‘మీకు నేషనల్ అవార్డ్ వచ్చింది’ అని చాలా ఫోన్లు వచ్చాయి. నాకు అర్థం కాలేదు. వెంటనే చిన్ను (రాహుల్ భార్య చిన్మయి)కి ఫోన్ చేసి గట్టిగా ‘చిన్నూ...నాకు నేషనల్ అవార్డ్ వచ్చింది..’ అని అరిచాను. తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అవార్డ్ కోసం ‘చిలసౌ’ ఎప్పుడో పంపించి మర్చిపోయాం. ప్రస్తుతం ఎంత సంతోషంగా ఉన్నానో చెప్పలేను. కథను నమ్మిన హీరో, నిర్మాతలకు, నాగార్జున సార్‌కి అందరికీ థ్యాంక్స్. క్రెడిట్ ముగ్గురికి దక్కుతుంది – ప్రశాంత్ వర్మ, (’అ!’ దర్శకుడు) చాéలా హ్యాపీగా ఉంది. మరీ ముఖ్యంగా మేకప్, విజువల్ ఎఫెక్ట్స్ ఈ రెండు కేటగిరీల్లో అవార్డులు వస్తాయని అస్సలు ఊహించలేదు. దర్శకుడిగా ఫస్ట్ సినిమాకే అవార్డ్స్ రావడం ప్రోత్సాహంలా ఉంటుంది. విభిన్నమైన సినిమాలు తీయాలనే ఆసక్తి ఇంకా పెరుగుతుంది. కమర్షియల్ సినిమాలా? డిఫరెంట్ సినిమాలా? అనే కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఈ అవార్డ్స్ ఇంట్రెస్ట్ పెంచుతాయి. నేషనల్ అవార్డ్స్‌కు స్పెషల్ రెస్పెక్ట్ ఉంటుంది. మరో విశేషం ఏంటంటే ‘అ!’ రిలీజ్ అయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా చూడలేదు. ఈరోజు ఎందుకో ఇంట్లో హోమ్ థియేటర్ సెట్ చేసుకొని చూస్తూ ఉన్నా. అర్ధగంట అవగానే నేషనల్ అవార్డ్ వచ్చిందంటూ కాల్ చేశారు. ఈ ప్రాజెక్ట్‌కు సపోర్ట్‌గా నిలబడినందుకు నానీగారికి స్పెషల్ థ్యాంక్స్. మేకప్ చీఫ్ రంజిత్‌తో పాటు కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ శాంతి, అదితీ కూడా చాలా కష్టపడ్డారు. వాళ్ల ముగ్గురికీ ఈ క్రెడిట్ వెళ్లాలనుకుంటున్నాను. అస్సలు ఊహించలేదు – రాజాకృష్ణన్ (‘రంగస్థలం’ ఆడియోగ్రాఫర్) బెస్ట్ సౌండ్ మిక్సింగ్ విభాగంలో తొలిసారి జాతీయ అవార్డు సాధించినందుకు సంతోషంగా ఉంది. అది కూడా నేను చేసిన తెలుగు సినిమాకు రావడం హ్యాపీ. జాతీయ అవార్డు వస్తుందని ఊహించలేదు. ‘రంగస్థలం’ చిత్రంలో హీరో రామ్‌చరణ్ సగం చెవుడు ఉన్న చిట్టిబాబు పాత్రలో బాగా నటించారు. హీరోకు వినికిడి సమస్య ఉండటంతో సౌండింగ్ ఎలిమెంట్స్‌ను ఎలివేట్ చేయడానికి మంచి అవకాశం దొరికినట్లయింది. సౌండింగ్‌కు మంచి స్కోప్ దొరికింది. చాలా కాన్ఫిడెంట్‌గా ఈ సినిమా చేశాను. సుకుమార్‌గారు బ్రిలియంట్ డైరెక్టర్. ఆయనకు ఈ అవార్డును అంకితం ఇస్తున్నా. డైరెక్టర్, హీరో, నిర్మాతలకు థ్యాంక్స్. 66వ జాతీయ చలనచిత్ర పురస్కారాలకు ఎంపికైన తెలుగు చలన చిత్రాల నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. తెలుగు సినిమా మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. అలాగే అవార్డులకు ఎంపికైన అందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మా బాధ్యత పెరిగింది – నాని మేకప్, వీఎఫ్ఎక్స్ విభాగాల్లో ఉత్తమ చిత్రంగా ‘అ’ సినిమా జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. కాజల్ అగర్వాల్, నిత్యామీనన్, రెజీనా, ఈషా రెబ్బా, ప్రియదర్శి, అవసరాల శ్రీనివాస్, మురళీ శర్మ ప్రధాన తారాగణంగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కింది. నాని, ప్రశాంతి తిపిరనేని నిర్మించిన ఈ సినిమా గత ఏడాది ఫిబ్రవరిలో విడుదలైంది. ఈ సినిమాకి రెండు జాతీయ అవార్డులు రావడం పట్ల హీరో, నిర్మాత నాని మాట్లాడుతూ– ‘‘మా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్లో నిర్మించిన తొలి చిత్రం ‘అ’ మంచి విజయాన్ని సాధించి, ప్రశంసలు అందుకుంది. జాతీయ అవార్డులు రావడం మాకెంతో ఉత్సాహాన్నిచ్చింది.. నిర్మాతగా మా బాధ్యతను మరింత పెంచింది. మా యూనిట్ తరపున జ్యూరీకి థ్యాంక్స్’’ అన్నారు. 66వ జాతీయ చలనచిత్ర పురస్కారాలకు ఎంపికైన తెలుగు చలన చిత్రాల నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. తెలుగు సినిమా మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. అలాగే అవార్డులకు ఎంపికైన అందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిష్టాత్మకమైన 66వ జాతీయ చలనచిత్ర అవార్డుల ఎంపికలో తెలుగు చిత్రాలు సత్తా చాటాయి. ‘మహానటి, రంగస్థలం, అ!, చిలసౌ’ చిత్రాలకు అవార్డులు దక్కాయి. అవార్డులు గెలుచుకున్నవారికి నటుడు చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఇతర భాషల్లో అవార్డులు గెలుచుకున్నవారికి కూడా ఆయన అభినందనలు తెలిపారు. ‘మహానటి’, ‘రంగస్థలం’ చిత్రాలకు జాతీయ అవార్డులు వస్తాయని ఈ సినిమాల రిలీజ్‌కు ముందే చిరంజీవి ఊహించి చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. ‘మహానటి’ సినిమా విడుదల తరవాత కూడా ఓ సందర్భంలో యూనిట్ సభ్యులను చిరంజీవి అభినందించిన సంగతి విదితమే. మరాఠీలో మెరిసిన తెలుగు తేజం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మరాఠీ చిత్రం ‘సైరాట్’కు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన సుధాకర్ రెడ్డి యక్కంటి ప్రతిష్టాత్మక జాతీయ అవార్డును కైవసం చేసుకున్నారు. మరాఠీ చిత్రం ‘నాల్’ (బొడ్డుతాడు) చిత్రానికి సుధాకర్ రెడ్డి ‘ఇందిరాగాంధీ జాతీయ ఉత్తమ నూతన దర్శకుడు అవార్డు’కు ఎంపికయ్యారు. గుంటూరుకు చెందిన సుధాకర్ రెడ్డి జేఎన్టీయూలో డిగ్రీ పూర్తి చేసి, పుణేలోని ప్రఖ్యాత ఎఫ్టీఐఐలో పీజీ పట్టా పుచ్చుకున్నారు. ‘మధుమాసం’, ‘పౌరుడు’, ‘దళం’ వంటి టాలీవుడ్ చిత్రాలకు పనిచేశాక ముంబైలో స్థిరపడ్డారు. హిందీ, మరాఠీ చిత్రాల్లో బిజీగా ఉంటూనే ‘నాల్’ చిత్రాన్ని తెరకెక్కించారు. బాల్యంతో పెనవేసుకున్న అనుభవాలను, తల్లితో కొడుకుకు ఉండే అనుబంధాన్ని ఈ చిత్రంలో సుధాకర్ ఉద్వేగభరితంగా చూపారు. అదే విధంగా ‘నాల్’ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించిన బాలనటుడు శ్రీనివాస్ పోకలేకు మరాఠీ విభాగంలో ఉత్తమ బాలనటుడు అవార్డును ప్రకటించడం విశేషం. కేజీఎఫ్‌కు డబుల్ ధమాకా యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కన్నడ చిత్రం ‘కేజీఎఫ్’. కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మించారు. గత ఏడాది డిసెంబర్ 21న విడుదలై ఘన విజయం అందుకున్న ఈ సినిమా రెండు జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్, బెస్ట్ ఫైట్స్ విభాగాల్లో అవార్డులు దక్కడంతో చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా జ్యూరీ సభ్యులకు యష్, ప్రశాంత్ నీల్, విజయ్ కిరంగదూర్ ధన్యవాదాలు తెలిపారు. ‘‘కేజీఎఫ్ చాప్టర్2’ను త్వరలోనే విడుదల చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. పాటకు తొలి అవార్డు ‘పద్మావత్’ సినిమాకు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ కొరియోగ్రఫీ, బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ విభాగాల్లో మూడు జాతీయ అవార్డులు వచ్చాయి. ఈ సినిమాకు సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వం వహించారు. ఆయనే సంగీత దర్శకుడు కూడా. భన్సాలీ మాట్లాడుతూ– ‘‘క్రియేటివ్ ఫిల్డ్‌లో ఆర్టిస్టులు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనక తప్పదు. కానీ ‘పద్మావత్’ సినిమా విషయంలో అవసరమైన దానికంటే ఎక్కువగానే సమస్యలను ఫేస్ చేశాను. నేను చేసిన సినిమాల్లో కల్లా ‘పద్మావత్’ చాలా కష్టతరమైనది. చిత్రీకరణ సమయంలో మాపై దాడులు జరిగాయి. ఈ సినిమాకు వ్యతిరేకంగా ధర్నాలు, మార్చ్‌లు చేశారు. బ్యాన్ చేయమన్నారు. ఇలా ఈ సినిమాకి ప్రతి విషయంలోనూ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నాం. ఈ కారణాల చేత నేను ఫీలైన ప్రతిసారీ ఓ పాట తీసేవాడిని. కొంచెం రిలీఫ్‌గా అనిపించేది. అన్ని సమస్యల మధ్య కూడా నేను ఈ సినిమా గురించి పాజిటివ్‌గానే ఆలోచించా. ఈ సినిమా విజయం సాధించడానికి అదొక కారణం అనిపించింది. ఇప్పుడు మా సినిమాకు అవార్డులు రావడం హ్యాపీగా ఉంది. ఇదొక ఎమోషనల్ మూమెంట్ మాకు. నా ప్రతి సినిమాలో సంగీతం చాలా కీలకంగా ఉంటుంది. సంగీతమే నా ప్రపంచం’’ అని అన్నారు. అయితే.. ఉత్తమ సంగీత దర్శకుడిగా సంజయ్‌కు అవార్డు రావడం ఇదే తొలిసారి. ఇంతకుముందు వివిధ విభాగాల్లో జాతీయ అవార్డులు వచ్చాయి. బుల్బుల్ పాడగలదు! అస్సామీ సినిమాకు ‘జాతీయ ఉత్తమ చిత్రం’ అవార్డు అందని ద్రాక్ష. అది 2018 వరకే. రీమా దాస్ తన మొదటి సినిమా ‘విలేజ్ రాక్‌స్టార్స్’తో ఆ డ్రీమ్‌ను డెబ్యూ (తొలి) సినిమాతోనే తీర్చేశారు. అస్సామీ రాక్‌స్టార్‌గా నిలిచారు. తొలి సినిమాయే అవార్డు అందుకునే స్థాయిలో ఉన్నప్పుడు తదుపరి సినిమా మీద అంచనాలు మామూలే. ఆ అంచనాలను రెండో సినిమాతోనూ సునాయాసంగా అందుకొని అందర్నీ మరొక్కసారి రీమా దాస్ ఆశ్చర్యపరిచారు. రీమా రెండో చిత్రం ‘బుల్బుల్ కెన్ సింగ్’ ఉత్తమ అస్సామీ చిత్రం అవార్డు గెలుచుకుంది. బుల్బుల్, బోణీ, సుము అనే ముగ్గురు స్నేహితుల కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. తమ సమాజం కోరుకున్నట్టు ఉండలేక, తాను అనుకున్నట్టు ఉండాలనే పోరాటం చేస్తూ తన గొంతుని వినిపించాలనుకుంటుంది బుల్బుల్. తన గొంతుని వినిపిస్తుంది. ఇది విన్న జ్యూరీ కూడా అవార్డు ఇవ్వకుండా ఉండగలదా? ‘బుల్ బుల్..’ లో ఓ దృశ్యం 66వ జాతీయఅవార్డుల ఎంపికలో ‘ఉరి: ది సర్జికల్‌స్ట్రైక్స్’ చిత్రానికి నాలుగు విభాగాల్లో (ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, బెస్ట్ సౌండ్ డిజైన్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్) అవార్డులు వచ్చాయి. కానీ 2019, జనవరి 11న విడుదలైన ఈ చిత్రం 2018 జాతీయ అవార్డులకు ఎలా అర్హత సాధించిందనే ప్రశ్నలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. అయితే ఇక్కడే ఓ లాజిక్ ఉంది. ఒక ఏడాదిలో జనవరి 1 నుంచి డిసెంబర్ 31వరకు సెంట్రల్‌బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సిబీఎఫ్సీ ) చేయించుకున్న సినిమాలను జాతీయ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలా 31, 2018న ‘ఉరి’ సిబీఎఫ్సీ వద్ద సర్టిఫికేట్ పొందింది. ఆ విధంగా ‘ఉరి’ చిత్రం జాతీయ అవార్డుల రేస్‌లో నిలిచి అవార్డులను సొంతం చేసుకుంది. – ముసిమి శివాంజనేయులు, డేరంగుల జగన్ -
సూపర్ స్టార్ సోదరి కొత్త ఇన్నింగ్స్
ఘట్టమనేని వారసురాలిగా వెండితెర మీద సత్తా చాటుతున్న నటి, నిర్మాత, దర్శకురాలు మంజుల. అభిమానుల ఆంక్షల మధ్య వెండితెరకు పరిచయం అయిన మంజుల తొలి సినిమా షోతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. తరువాత అడపాదడపా నటిగా కొనసాగుతూనే నిర్మాతగానూ ఇందిరా ప్రొడక్షన్ బ్యానర్‌పై పలు చిత్రాలను ప్రొడ్యూస్ చేశారు. ఇటీవల సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన మనసుకు నచ్చింది సినిమాతో దర్శకురాలిగా మారిన మంజుల త్వరలో మరో రంగంలోకి అడుగుపెట్టనున్నారు. ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్న డిజిటల్ ట్రెండ్‌కు అనుగుణంగా ఓ వెబ్ సిరీస్‌ను నిర్మించనున్నారు. ఈ వెబ్ సిరీస్‌కు అ! ఫేం ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలో అధికారక ప్రకటన వెలుడవనుంది. -
‘అ!’ అనిపించేలా ‘కల్కి’
నాని నిర్మాతగా మారి తెరకెక్కించిన ప్రయోగాత్మక చిత్రం అ!. లఘు చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమకు విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం దట్ ఈజ్ మహాలక్ష్మీ పనుల్లో బిజీగా ఉన్న దర్శకుడు ప్రశాంత్ వర్మ త్వరలో సీనియర్ నటుడు రాజశేఖర్ హీరోగా ఓ సినిమాను తెరకెక్కించనున్నారు. 1983 నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైటిల్ లోగోను రాఖీ పండుగ సందర్భంగా ఆదివారం రిలీజ్ చేశారు. శ్రీ మహా విష్ణువు దశావతారాలకు సంబంధించిన వివిధ వస్తువులతో ఈ టైటిల్ టీజర్‌ను ఆసక్తికరంగా రూపొందించారు. నిర్మాత సీ కల్యాణ్‌తో కలిసి రాజశేఖర్ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం కానుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. -
ప్రీ లుక్‌తో మెగాస్టార్‌కి బర్త్‌డే విషెస్
యాంగ్రీ హీరో రాజశేఖర్.. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా తన కొత్త సినిమా ప్రీ లుక్‌ను రిలీజ్ చేశారు. అ! ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబందించిన ప్రీ లుక్ ఆసక్తికరంగా రూపొందించారు. 1983 బ్యాక్‌డ్రాప్‌లో సాగే పీరియడ్ ఫిలిం ఇది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కథాంశంతో సినిమా తెరకెక్కనుంది. రాజశేఖర్ సినిమా ప్రీ లుక్‌లో 1983లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ పోస్టర్‌తో చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అదే ఏడాది ఇండియా క్రికెట్లో వరల్డ్‌కప్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ వరల్డ్ కప్‌ను కూడా ఈ పోస్టర్లో చూపించారు. అ! లాంటి డిఫరెంట్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ సినిమా చేస్తుండటంతో సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ఆగస్ట్ 26న రాఖీ పౌర్ణమి సందర్భంగా ఈ సినిమా టైటిల్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడించనున్నారు. Wishing u all a very Happy Bakrid. Here I’m releasing the pre-look of my next with the ‘awe’some @prasanthvarma. Launching the title logo on August 26th with all the other details. Chiranjeevi Garu,Many Many Happy Returns Of The Day!😊#HBDMegastarChiranjeevi From My Team & Me. pic.twitter.com/xLUTrEpuEn — Dr.Rajasekhar (@ActorRajasekhar) 22 August 2018 -
48 ఏళ్లు వెనక్కి!
రాజశేఖర్ టైమ్ మెషీన్‌ని వెనక్కి తిప్పనున్నారు. అది కూడా ఏ పదేళ్లో.. పాతికేళ్లో కాదు.. ఏకంగా 48ఏళ్లు.. ఎందుకిలా వెనక్కి వెళుతున్నారంటే ఆయన నటించనున్న తాజా చిత్రం కోసమట. ‘గరుడవేగ’తో మంచి హిట్ అందుకున్న రాజశేఖర్ తన తర్వాతి చిత్రంపై క్లారిటీ ఇవ్వలేదు కానీ ఆ మధ్య ఓ హింట్ ఇచ్చారు. ‘‘నా తర్వాతి సినిమా గురించి నేను ఒక్కటే చెప్పగలను. అది అద్భుతంగా ఉంటుంది’’ అని పేర్కొన్నారు. ఈ సినిమా గురించి తాజా అప్డేట్ ఏంటంటే.. ‘అ’ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుందని సమాచారం. ఈ సినిమా 1970 బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందట. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ చిత్రంలో రాజశేఖర్ పవర్ఫుల్ పోలీసాఫీసర్‌గా కనిపిస్తారట. ఆగస్టులో ఈ మూవీ స్టార్ట్ కానుంది. -
రాజశేఖర్ ‘అ’సమ్!
సీనియర్ హీరో రాజశేఖర్ చాలా కాలం తరువాత గరుడవేగ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా తరువాత తదుపరి చిత్రాన్ని చేసేందుకు చాలా సమయం తీసుకుంటున్నారు. ఆ సక్సెస్ ట్రాక్‌ను కంటిన్యూ చేసేందుకు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. చాలా రోజులుగా రాజశేఖర్ చేయబోయే సినిమాలపై రకరకాల వార్తలు వినిపిస్తున్నా.. అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాలేదు. తాజాగా తాను చేయబోయే సినిమాపై ఈ యాంగ్రీ హీరో ఓ హింట్ ఇచ్చారు. ‘నా నెక్ట్స్ ప్రాజెక్టు గురించి నేను చెప్పగలిగింది ఒక్కటే. ఆ సినిమా ఆసమ్ (AWEsome) గా ఉండబోతోంది’. అంటూ తన ట్విటర్ పేజ్‌లో కామెంట్ చేశారు. దీంతో రాజశేఖర్ తదుపరి చిత్రం అ! (Awe) చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలోనే అన్న క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం వర్మ ప్రస్తుతం తమన్నా లీడ్ రోల్ తెరకెక్కుతున్న క్వీన్ రీమేక్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా పూర్తయిన వెంటనే రాజశేఖర్ సినిమా పనులు ప్రారంభించనున్నారు. Well.. all I can say about my next project is that, it’s going to be AWEsome! — Dr.Rajasekhar (@ActorRajasekhar) 28 June 2018 -
క్వీన్ కోసం ‘అ’ దర్శకుడు
బాలీవుడ్ సూపర్ హిట్ క్వీన్ సినిమాను దక్షిణాది భాషల్లో ఒకేసారి రీమేక్ చేస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ రీమేక్ పనులు జరుగుతున్నాయి. అయితే తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న తెలుగు వర్షన్‌కు ముందుగా షో ఫేం నీలకంఠను దర్శకుడిగా తీసుకున్నారు. కానీ నీలకంఠ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇతర భాషల్లో రీమేక్ పనులు జరుగుతున్నా తెలుగు వర్షన్‌ను మాత్రం పక్కన పెట్టేశారు. తాజా మరో దర్శకుడితో క్వీన్ తెలుగు రీమేక్‌ను కొనసాగించే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. నాని నిర్మాతగా మారి రూపొందించిన ‘అ!’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన ప్రశాంత్ వర్మ, క్వీన్ తెలుగు రీమేక్‌కు దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. అ సినిమా కమర్షియల్‌గా విజయం సాధించకపోయినా ప్రశాంత్ వర్మ టేకింగ్ కు మంచి స్పందన వచ్చింది. తెలుగులో తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తుండగా, తమిళ వర్షన్లో కాజల్, మలయాళ వర్షన్లో మంజిమా మోహన్, కన్నడ వర్షన్లో పరుల్ యాదవ్‌లు లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. -
అ! దర్శకుడితో రాజశేఖర్
చాలా కాలం తరువాత సీనియర్ హీరో రాజశేఖర్ ‘పీఎస్వీ గరుడవేగ 126.18 ఎం’ సినిమాతో ఘనవిజయం సాధించారు. ఈ సక్సెస్ తరువాత సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్న యాంగ్రీ హీరో త్వరలోనే తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించనున్నారట. కొత్త సినిమా కూడా డిఫరెంట్ కాన్సెప్ట్‌తోనే ఉండనుందన్న టాక్ వినిపిస్తోంది. ఇటీవల ప్రయోగాత్మకంగా తెరకెక్కిన అ! సినిమాతో పరిచయం అయిన దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఈ యువ దర్శకుడు రాజశేఖర్ తదుపరి చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌కు కల్కి అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. జూన్ లేదా జూలై మాసాల్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెల్లనుంది. ఈ సినిమాతో పాటు కోలీవుడ్ మహిళా దర్శకురాలు ఐశ్వర్య ధనుష్ దర్శకత్వంలో ఒక సినిమా, మరో మల్టీ స్టారర్ సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నాయి. ఈ వరుస సినిమాలతో రాజశేఖర్ తిరిగి ఘన వైభవాన్ని అందుకుంటాడేమో చూడాలి. -
మళ్ళీరావా బ్యానర్లో మరో సినిమా
మళ్ళీరావా లాంటి రొమాంటిక్ ఎంటర్టైనర్ ను అందించిన నిర్మాణ సంస్థ స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్. తొలి సినిమాతోనే కథాబలం ఉన్న చిత్రాన్ని ఎంచుకుని తన ప్రత్యేకతను చాటుకున్న నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా. ఈ ప్రతిష్టాత్మక సంస్థ నుంచి రెండో ప్రయత్నంగా మరో సినిమాకు శ్రీకారం చుట్టారు రాహుల్. ‘మళ్ళీరావా తర్వాత ఎన్నో కథలు విన్నాను,నూతన దర్శకుడు స్వరూప్ ఆర్ఎస్ జే చెప్పిన కథ నచ్చి ఈ సినిమా చేస్తున్నాం. యూట్యూబ్ లో సంచలనం సృష్టించిన ఆల్ ఇండియా బక్చోద్ కార్యక్రమంతో గుర్తింపు తెచ్చుకున్న నవీన్ పొలిశెట్టిని హీరోగా పరిచయం చేస్తున్నాం. మెంటల్ మదిలో చిత్ర దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ చిత్రానికి మాటలు రాస్తుండటం విశేషం.‘అ!’ సినిమాతో విమర్శకుల ప్రసంశలు అందుకున్న మార్క్ కె రాబిన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఇతర నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలు తెలియచేస్తాం’ అని నిర్మాత రాహుల్ యాదవ్ తెలిపారు. -
ఆ పని మాత్రం చేయను!
తమిళసినిమా: నటి నిత్యామీనన్ రూటే వేరని చెప్పవచ్చు. చాలా వరకూ లవ్లీ పాత్రలు చేసిన ఈ మాలీవుడ్ భామ ఆ తరువాత నటనకు అవకాశం ఉన్న పాత్రలకు ప్రాధాన్యత నిస్తోందనే చెప్పవచ్చు. ఆ మధ్య కాంచన 2 చిత్రంలో దివ్యాంగురాలిగా నటించి మెప్పించిన నిత్యామీనన్, మణిరత్నం దర్శకత్వం చిత్రం కాదల్ కణ్మణి చిత్రంలో హీరోతో పెళ్లి చేసుకోకుండానే సహజీవనం చేసే పాత్రలో నటించి అలరించింది. అదే విధంగా మెర్శల్ చిత్రంలో విజయ్‌కు జంటగా పల్లెటూరి అమ్మాయిగా నటించడానికి బరువు కూడా పెరిగింది. ఇక ఇటీవల తెలుగు చిత్రం ‘అ’లో లెస్బియన్ పాత్రలో నటించి అందరినీ ఆశ్చర్య పరిచింది. ఈ పాత్రలో నటించిన నిత్యామీనన్‌ను విమర్శించిన వారూ లేకపోలేదు. అలాంటి విమర్శలను డోంట్‌కేర్ అంటున్న నిత్యామీనన్ మాట్లాడుతూ అవకాశాలు చాలానే వస్తున్నాయని, అయితే వాటిలో ఒకటి రెండు చిత్రాలే తన వల్ల నటించడం అవుతుందని అంది. కారణం సాధారణ హీరోయిన్ పాత్రలను తాను కోరుకోవడంలేదని చెప్పింది. ఇక షూటింగ్ స్పాట్లో తన పాత్రను డెవలప్ చేసుకునే విషయంలోనూ, సంభాషణల గురించి దర్శకుడితో చర్చిస్తానని చెప్పింది. ఎందుకంటే తనకు దర్శకత్వం వహించాలన్న ఆసక్తి ఉందని చెప్పింది. అందుకే సినిమాకు సంబంధించిన అన్ని విషయాల గురించి తెలుసుకోవడంపై శ్రద్ధ చూపిస్తున్నానని అంది. భవిష్యత్‌లో కచ్చితంగా మెగాఫోన్ పడతానని, అయితే సొంతంగా చిత్రం నిర్మాణం చేపట్టే పొరపాటును మాత్రం చేయనని అంటోంది. మరి ఈమె దర్శకత్వం వహించే చిత్రాన్ని నిర్మాతగా ఎవరు ముందుకొస్తారో చూడాలి. -
అ!.. చిరు, బాలయ్యల మల్టీ స్టారర్..?
నాని తొలిసారిగా నిర్మాతగా మారి తెరకెక్కించిన సినిమా అ!. ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాకు విశ్లేషకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా ఓవర్ సీస్లో అ! మంచి వసూళ్లు రాబడుతుండటంతో అందరి దృష్టి దర్శకుడు ప్రశాంత్ వర్మపై పడింది. లఘు చిత్రాలతో దర్శకుడిగా సత్తా చాటిన ప్రశాంత్, వెండితెర మీద కూడా తొలి సినిమాతోనూ తనదైన ముద్ర వేశాడు. అ! సక్సెస్ సాధించిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఈ యువ దర్శకుడు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. తనకు ఓ భారీ మల్టీ స్టారర్ చేయాలన్న కోరిక ఉందంటున్నాడు ప్రశాంత్. మెగాస్టార్ చిరంజీవి, నటసింహాం బాలకృష్ణలతో ఓ మల్టీ స్టారర్ సినిమా చేయాలని ఉందని వెల్లడించాడు. గతంలోనూ ఈ కాంబినేషన్లో సినిమా చేసేందుకు ప్రయత్నాలు జరిగినా ఫలించలేదు. మరి ప్రశాంత్ అయినా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను సెట్స్ మీదకు తీసుకొస్తాడేమో చూడాలి. -
స్పీడ్ పెంచిన హీరోలు
రెండు మూడేళ్ల క్రితంతో పోల్చితే ఇప్పుడు హీరోలు స్పీడ్ పెంచారు. ఒకేసారి రెండు సినిమాలు లేదా ఒకే సినిమాని త్వరగా పూర్తి చేయడం చేస్తున్నారు. దానివల్ల థియేటర్ల కొరత ఏర్పడుతోంది. ఇదే విషయాన్ని ఇటీవల ‘దిల్’ రాజు ప్రస్తావించారు. ఎన్ని ఎక్కువ సినిమాలు వస్తే అంత మంచిదే కానీ, రిలీజ్ విషయంలో అండర్‌స్టాండింగ్‌తో వెళ్లాలి. నిర్మాతలందరూ దాదాపు అలానే వెళుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫిబ్రవరి 9 గురించి మాట్లాడుకోవాలి. ఒకటి కాదు.. రెండు కాదు. ఏకంగా ఐదు సినిమాలు ఫిబ్రవరి 9న బాక్సాఫీస్ వార్‌కు రెడీ అయ్యాయి. మోహన్‌బాబు ‘గాయత్రి’, వరుణ్‌తేజ్ ‘తొలిప్రేమ’, సాయిధరమ్ తేజ్ ‘ఇంటిలిజెంట్’, నిఖిల్ ‘కిర్రిక్ పార్టీ’, నాగశౌర్య ‘కణం’ అదే రోజున రిలీజ్ కావాల్సింది. కానీ.. గాయత్రి, ఇంటిలిజెంట్ మాత్రమే ఫిబ్రవరి 9న థియేటర్లోకి వచ్చాయి. ‘తొలిప్రేమ’ నిర్మాత బీవీయస్‌యన్ ప్రసాద్, ఆ మూవీ డిస్ట్రిబ్యూటర్ ‘దిల్’ రాజు తమ ‘తొలిప్రేమ’ సినిమాను ఒక్క రోజు వాయిదా వేశారు. అంటే.. ఫిబ్రవరి 10న వరుణ్ తేజ్ ‘తొలిప్రేమ’ రిలీజైంది. ‘ఇంటిలిజెంట్’ నిర్మాత సి. కల్యాణ్, ‘తొలిప్రేమ’ నిర్మాత బీవీయస్‌యన్, డిస్ట్రిబ్యూటర్ రాజు.. ముగ్గురూ చర్చించుకుని ఈ నిర్ణయానికి వచ్చారు. అంతేకాదు.. ఇప్పుడు ఒకేరోజు సినిమాలు రిలీజ్ అవుతుంటే.. ఒక సినిమా హీరో, ఇంకో సినిమా హీరోకు సోషల్ మీడియాలో ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. అఖిల్ హీరోగా నాగార్జున నిర్మాణంలో వచ్చిన ‘హలో’, ‘దిల్’ రాజు నిర్మాతగా నాని హీరోగా వచ్చిన ‘ఎమ్సీఏ’ విషయం అప్పుడు ఇలానే పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఇటీవల ‘మనసుకు నచ్చింది’ రిలీజ్ అప్పుడు చిత్రకథానాయకుడు సందీప్ కిషన్.. నాని నిర్మించిన ‘అ!’కి శుభాకాంక్షలు చెబితే.. నాని టీమ్ వీళ్లకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. సాయిధరమ్ తేజ్, లావణ్యా త్రిపాఠి -
వసూళ్లు ‘అ!’దుర్స్
సాక్షి, హైదరాబాద్: యంగ్ హీరో నాని తొలిసారిగా నిర్మించిన ‘అ!’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. ఫిబ్రవరి 16న విడుదలైన ఈ చిత్రం ఓపెనింగ్ వీకెండ్లోనే రూ. 9 కోట్ల పైచిలుకు కలెక్షన్లు రాబట్టినట్టు ట్రేడ్ వర్గాల అంచనా. ఓవర్సీస్లోనూ అంచనాలకు మించి వసూళ్లు వస్తున్నాయి. అమెరికాలో ఐదు రోజుల్లో రూ.4.13 కోట్లు సాధించినట్టు సినీ విమర్శకుడు, బిజినెస్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లు మరింత పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. డిఫరెంట్ కాన్పెప్ట్ తో ఇంట్రస్టింగ్ టేకింగ్‌తో తెరకెక్కించిన అ! సినిమాతో ప్రశాంత్ వర్మ దర్శకుడిగా పరిచయమయ్యాడు. కాజల్ అగర్వాల్, నిత్యామీనన్, రెజీనా, ఈషా రెబ్బా, ప్రియదర్శి, శ్రీని అవసరాల, మురళీ శర్మ, ప్రగతి ముఖ్యపాత్రలు పోషించారు. థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమాకు మార్క్ కె రాబిన్ సంగీతం అందించాడు. -
విప్లవం రావాలి
‘‘తెలుగు ప్రేక్షకులు అన్ని రకాల సినిమాలు ఆదరిస్తున్నారు. వారి కోసం కొత్త తరహా సినిమాలు చేయాలి. తెలుగు సినిమాల్లో విప్లవం రావాలి. ‘అ!’ సినిమా ఇలాంటి కొత్తదనానికి దారి చూపించింది’’ అన్నారు నిత్యామీనన్. నానీ సమర్పణలో వాల్‌పోస్టర్ పతాకం పై కాజల్ అగర్వాల్, రెజీనా, నిత్యామీనన్, ఈషా రెబ్బా, శ్రీనివాస్ అవసరాల, మురళీ శర్మ, ప్రియదర్శి ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘అ!’. ప్రశాంత్ వర్మ దర్శకుడు. ప్రశాంతి త్రిపిరనేని నిర్మాత. గత శుక్రవారం ఈ చిత్రం విడుదలైన విషయం తెలిసిందే. సోమవారం పాత్రికేయులతో నిత్యామీనన్ పలు విశేషాలు పంచుకున్నారు. ∙ప్రశాంత్ ఈ కథ చెప్పగానే చాలా ఎగై్జట్ అయ్యాను. అన్ని క్యారెక్టర్స్‌ను చాలా డిఫరెంట్‌గా డిజైన్ చేశాడు. ఒక నటిగా అన్ని రకాల పాత్రలు చేయాలనుకుంటాను. ఇలాంటి రోల్స్ చేస్తే కెరీర్ ఏమైపోతుందో అని ఆలోచించను. యాక్చువల్లీ ఇలాంటి డిఫరెంట్ రోల్స్ చేయడమే ఇష్టం. లేకపోతే బోర్ కొట్టేస్తుంది. ∙ఈ సినిమాను నానీయే ప్రొడ్యూస్ చేస్తున్నాడు అని తెలిసి హ్యాపీగా ఫీల్ అయ్యాను. ‘అ’ చేసినవాళ్లందరం దర్శకుడు చెప్పిన కథ నచ్చే చేశాం. ముందు నన్ను కృష్ణవేణి కానీ రాధా (ఈషా) కానీ ఏదో పాత్ర చేయమని అడిగారు. కృష్ణవేణి పాత్ర కొత్తగా అనిపించడంతో అది చేశాను. ∙ఏదైనా సినిమా ఒప్పుకునే ముందు ఎలాంటి సినిమా చేస్తున్నాను? వాళ్ల ఇన్టెన్షన్ ఏంటి? ఎలా చేయాలి? అని అలోచిస్తాను తప్పితే నా పాత్రకు స్క్రీన్ టైమ్ ఎంత? అని ఆలోచించను. అది సొసైటీపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అని కూడా ఆలోచించి ఒప్పుకుంటాను. ∙‘కాంచన’ సినిమాలో గంగ పాత్ర చేసేటప్పుడు చాలెంజింగ్‌గా అనిపించింది. ఈ సినిమాలో చేసిన కృష్ణవేణి పాత్ర విషయానికి వస్తే అంత చాలెంజింగ్‌గా ఏమీ అనిపించలేదు. ‘మహానటి’ సినిమాలో సావిత్రి పాత్ర మొదట నా దగ్గరకే వచ్చింది. కానీ అది వర్కవుట్ కాలేదు. ∙‘ప్రాణ ’ అనే సినిమా నాలుగు (తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ) భాషల్లో చేశాం. నాకు నాలుగు భాషలు వచ్చు కాబట్టి రైటింగ్ సైడ్ కూడా సహాయం చేశాను. ఈ సినిమా కేవలం ఒక్క పాత్రతోనే నడుస్తుంది. సింక్ సౌండ్‌లో, 23రోజుల్లో కంప్లీట్ చేశాం. ∙సినిమా సినిమాకు గ్యాప్ తీసుకుంటాను అంటారు. సినిమాకంటే ముఖ్యమైనవి జీవితంలో చాలా ఉన్నాయి. సినిమా అనేది ఒక పార్ట్ మాత్రమే. నాకు సంతోషం కలిగించే పనే నేను చేస్తుంటాను. -
అందరికీ థ్యాంక్స్ : హీరో నాని
సాక్షి, హైదరాబాద్ : టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో నాని తొలిసారిగా నిర్మాతగా మారి తెరకెక్కించిన సినిమా అ!. ఈ సినిమా ఫిబ్రవరి 16న(శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిషో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అటు సినీ అభిమానులు సైతం సినిమా బాగుందంటూ కితాబిచ్చారు. దీంతో నిర్మాత నాని సినిమా విజయవంతం చేసినందుకు సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. దీనిపై నిర్మాత నానీ కూడ స్పందించారు. ఈ సందర్భంగా సినీ విశ్లేషకులతో పాటు సినీ అభిమానులకు నాని ధన్యవాదాలు తెలిపారు. పలు వెబ్సైట్లు అ! సినిమాకు ఇచ్చిన రేటింగ్ పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందరికీ థ్యాంక్స్ అంటూ తన వాల్‌పై రాసుకొచ్చాడు. ఈ సినిమాతో ప్రశాంత్ వర్మ దర్శకుడిగా పరిచయం అయ్యారు. కొత్త తరహ కథ కావడంతో 'అ!' సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. -
‘అ!’ మూవీ రివ్యూ
టైటిల్ : అ! జానర్ : థ్రిల్లర్ తారాగణం : కాజల్ అగర్వాల్, నిత్యామీనన్, రెజీనా, ఈషా రెబ్బా, ప్రియదర్శి, శ్రీని అవసరాల, మురళీ శర్మ, ప్రగతి సంగీతం : మార్క్ కె రాబిన్ దర్శకత్వం : ప్రశాంత్ వర్మ నిర్మాత : నాని, ప్రశాంతి వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో నాని తొలిసారిగా నిర్మాతగా మారి తెరకెక్కించిన సినిమా అ!. అయితే నాని తొలి ప్రయత్నంగా ఎంచుకున్న సినిమా కథాంశం ఇండస్ట్రీ వర్గాలకు కూడా షాక్ ఇచ్చింది. డిఫరెంట్ కాన్పెప్ట్ తో ఇంట్రస్టింగ్ టేకింగ్‌తో తెరకెక్కించిన అ! సినిమాతో ప్రశాంత్ వర్మను దర్శకుడిగా పరిచయం చేశాడు నాని. కేవలం కథ, దర్శకుడిని నమ్మి నాని చేసిన ప్రయత్నం ఫలించిందా..? దర్శకుడు నాని నమ్మకాన్ని నిలబెట్టాడా..? కథ : కళి (కాజల్).. జీవితంలో ఎన్నో చేదు అనుభావాలతో విసిగిపోయి తన పుట్టిన రోజున ఓ తీవ్ర నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించుకుంటుంది. చివరి సారిగా చిత్ర (ప్రగతి) నిర్వహిస్తున్న ఫుడ్ కోర్ట్‌లో కూర్చోని తన గతాన్ని గుర్తు చేసుకుంటుంది. అదే సమయంలో రాధమ్మ(ఈషా రెబ్బా)తను ప్రేమించిన క్రిష్ (నిత్యామీనన్)ను తన తల్లిదండ్రులకు పరిచయం చేయడానికి అదే ఫుడ్ కోర్ట్‌కు వస్తుంది. ఈజీ మనీకోసం తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి ఓ దొంగతనం ప్లాన్ చేసిన మీరా(రెజీనా) అదే ఫుడ్ కోర్ట్‌లో పనిచేస్తుంటుంది. తనకు తాను గ్రేటెస్ట్ మెజీషియన్ అనుకునే యోగి (మురళీశర్మ) రెస్టారెంట్ లో ఉన్న చిన్నపాప మ్యాజిక్ చేస్తుంటే ఆమెతో గొడవ పడతాడు. అక్కడే డోర్ బాయ్‌గా పనిచేస్తున్న శివ తన చిన్నప్పుడే దూరమైన అమ్మనాన్నలు చూడాలన్న కోరికతో టైం మెషీన్ తయారు చేసే పనిలో ఉంటాడు. ఎక్కడా ఉద్యోగం దొరక్క చెఫ్ అని అబద్ధం చెప్పి నలభీమ (ప్రియదర్శి) అదే ఫుడ్కోర్ట్ లో ఉద్యోగంలో చేరతాడు. ఇలా ఒకే చోట చేరిన ఈ వ్యక్తలకు ఒకరితో ఒకరికి ఉన్న సంబంధం ఏంటి..? కళి తీసుకున్న నిర్ణయం ఏంటి..? అన్నదే మిగతా కథ. నటీనటులు : నిడివి తక్కువే అయినా సినిమాలో కీలక పాత్ర కాజల్‌దే. అందుకు తగ్గ హవా భావాలతో కళి పాత్రకు ప్రాణం పోసింది కాజల్. కళి తరువాత ఆకట్టుకున్న మరో పాత్ర రెజీనా. మీరాగా కనిపించేందుకు చాలా కష్టపడ్డ రెజీనా పర్ఫామెన్స్తోనూ మెప్పించింది. డ్రగ్స్‌కు అలవాటు పడిన అమ్మాయిగా అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. టామ్ బాయ్ తరహా పాత్రలో నిత్యామీనన్, ఆమె లవర్‌గా ఈషా రెబ్బాలు ఆడియన్స్ కు షాక్ ఇచ్చారు. ఈ ఇద్దరు లుక్స్ పరంగానూ మెప్పించారు. ఇక వంట రాని చెఫ్ పాత్రలో ప్రియదర్శి మంచి నటనతో పాటు కామెడీ కూడా పండించాడు. ముఖ్యంగా చేప, చెట్టు, ప్రియదర్శి కాంబినేషన్లో వచ్చే సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. మెజీషియన్‌గా మురళీశర్మ కూడా అద్భుతంగా నటించాడు. టైం మెషీన్ తయారు చేయాలని భావించిన సైంటిస్ట్ పాత్రలో అవసరాల శ్రీనివాస్ కొత్తగా కనిపించాడు. ఇతర పాత్రలో ప్రగతి, రోహిణి, దేవదర్శిలు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ : మనిషి జీవితంలోని అనుభవాలు వాటి తాలుకా ప్రతిస్పందనల నేపథ్యంలో కథను తయారు చేసుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ ఒక్కో ఎమోషన్‌ను ఒకో పాత్రలో చూపించే ప్రయత్నం చేశాడు. కోపం, బాధ, ప్రేమ, పగ, ఆవేశం లాంటి భావాలకు ప్రతీరూపాలుగా క్యారెక్టర్స్ వెండితెర మీద ఆవిష్కరించాడు. తొలి అర్థభాగం మొత్తం సినిమాలోని పాత్రల పరిచయానికే కేటాయించిన దర్శకుడు సెకండ్ హాఫ్ లోనే అసలు కథ మొదలు పెట్టడం ఆడియన్స్ లో అసహనం కలిగిస్తుంది. అయితే ఆడియన్స్ బోర్ ఫీల్ అయిన ప్రతీసారి అ! అనిపించే ట్వీస్ట్ తో షాక్ ఇచ్చాడు డైరెక్టర్. సినిమా టైటిల్‌కు తగ్గట్టుగా అవాక్కయ్యేలా చేసే ట్విస్ట్‌లు సినిమాలో చాలానే ఉన్నాయి. కానీ అవి రెగ్యులర్ సినిమా ఆడియన్స్ కు ఏ మేరకు రీచ్ అవుతాయన్నదే చూడాలి. చేపకు నాని, చెట్టుకు రవితేజ చెప్పిన వాయిస్ ఓవర్ సినిమాలకు మరింత గ్లామర్ తీసుకువచ్చింది. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫి కూడా చాలా బాగుంది. ఓ డిఫరెంట్ జానర్ తెరకెక్కిన సినిమాను అదే స్థాయి కెమెరా టెక్నిక్స్‌తో మరింత కొత్తగా మార్చాడు. మార్క్ కె రాబిన్ సంగీతం కూడా సినిమా స్థాయిని పెంచింది. టైటిల్ లో వచ్చే పాటతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తోనూ అ! అనిపించాడు రాబిన్. ఆర్ట్, ఎడిటింగ్ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. నిర్మాతగా నాని ఖర్చుకు వెనకాడకుండా సినిమాను నిర్మించాడు. ప్రతీ ఫ్రేమ్‌ను కొత్తగా చూపించేందుకు యూనిట్ పడిన తపన తెర మీద కనిపిస్తుంది. అయితే రొటీన్ ఫార్ములా సినిమాలు ఇష్టపడే వారిని ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోకపోవచ్చు. ప్లస్ పాయింట్స్ : లీడ్ క్యారెక్టర్స్ నటన స్క్రీన్ ప్లే సంగీతం మైనస్ పాయింట్స్ : అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు లేకపోవటం - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
అందుకే నిర్మాతగా మారా!
‘‘తెలుగులో కొత్త సినిమాలు, కొత్త కథలు రావడం లేదని అందరూ అంటున్నారు. నేనూ అలా అనుకోవడం ఎందుకు? మార్పు నా నుంచే మొదలవ్వాలి. నేనే ముందుగా చేస్తే బాగుంటుంది కదా? అనుకొని ‘అ’ చిత్రం తీశా’’ అని హీరో నాని అన్నారు. కాజల్ అగర్వాల్, నిత్యా మీనన్, రెజీనా, ఈషా, అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘అ’. ప్రశాంత్ వర్మను దర్శకునిగా పరిచయం చేస్తూ వాల్ పోస్టర్ సినిమా పతాకంపై హీరో నాని సమర్పణలో టి. ప్రశాంతి నిర్మించిన ఈ సినిమా ఈరోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నాని పంచుకున్న విశేషాలు.. ► ప్రశాంత్ వర్మ చెప్పిన కథ చాలా వైవిధ్యంగా ఉంది. తనకు నిర్మాతలు లేరని నేనే ఇద్దరు ముగ్గురు నిర్మాతలకు కథ వినమని చెప్పా. కానీ కమర్షియల్ సినిమాలు తీస్తున్న వారు ఇలాంటి కథ తీసేందుకు ముందుకు రారు. అటువంటప్పుడు ప్రశాంత్‌ని ఎందుకు నిరుత్సాహపరచడం. పైగా కథ వైవిధ్యంగా ఉంది కాబట్టి నేనే నిర్మిస్తానని చెప్పా. తనకు అవసరమైన నటీనటులు, టెక్నీషియన్స్‌ని ఇచ్చా. ► హీరోగా కూల్‌గా ఉంటాను. నిర్మాతగానూ టెన్షన్ లేదు. నిర్మాతగా ‘అ’ సినిమా చూసినప్పుడు నటుడిగా నా తొలి సినిమా ‘అష్టా చమ్మా’ చూసిన ఫీలింగ్ కలిగింది. చాలా హ్యాపీ. అయితే ‘నానీకి ప్రొడక్షన్ అవసరమా?’ అంటారేమో అని చిన్న భయం. టాలీవుడ్‌కి ‘అ’ లాంటి సినిమాల అవసరం ఉంది. పైగా తెలుగు ప్రేక్షకులు ఇలాంటి కొత్త సినిమాలు కోరుకుంటున్నారు. అందుకే నాకు ప్రొడక్షన్ అవసరం. ► ఓవైపు హీరోగా ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాతో బిజీగా ఉన్నా. మరోవైపు ‘అ’ సినిమా పనుల్లో ఉండటంతో ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపా. సినిమా అంటే నాకు పిచ్చి. ఓ ఎగై్జట్‌మెంట్. అందువల్లే నాకు నటన, ప్రొడక్షన్ కష్టం అనిపించలేదు. ‘అ’ చిత్రంతో నిర్మాతల కష్టాలేంటో పూర్తి స్థాయిలో తెలిసాయి. ► ‘అ’ కమర్షియల్ సినిమా కాదు. నాపై నమ్మకంతో సినిమా కొనే డిస్ట్రిబ్యూటర్లను ఎందుకు రిస్క్‌లో పడేయడం? సినిమాపై నాకు నమ్మకం ఉంది. ఆ రిస్క్ ఏదో నేనే పడదామనుకుని సొంతంగా రిలీజ్ చేస్తున్నా. తమిళ, మలయాళం భాషల్లో డబ్ చేసి విడుదల చేస్తున్నాం. ► మా 18 మంది కజిన్స్లో యూజ్లెస్ ఫెలో నేనే. అటువంటి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది సినిమా. నా వద్ద ఉన్న ప్రతి రూపాయి సినిమా ఇచ్చిందే. ఆ డబ్బుని తిరిగి సినిమాపై పెట్టేందుకు నేను వెనకాడను. ► ‘అ’ సినిమా కమర్షియల్‌గా హిట్ సాధించకున్నా పర్లేదు. కానీ.. ఓ ఇరవై ఏళ్ల తర్వాత.. తెలుగులో వైవిధ్యమైన సినిమాలకు ‘అ’ సినిమాతోనే మార్పు ప్రారంభమైంది అంటే చాలు. మా లక్ష్యం నెరవేరినట్లే. వాల్‌పోస్టర్ సినిమా బ్యానర్లో కొత్త తరహా చిత్రాలే వస్తాయి. అందుకు రెండు మూడేళ్లు అయినా పట్టొచ్చు. ► నేనిప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే నా దర్శక–నిర్మాతలే కారణం. సొంత బ్యానర్ పెట్టాను కదా. నా సినిమాలు నేనే చేసుకుంటానంటానేమో? అనుకుంటారు. నేనెప్పుడూ నటుణ్ణే. నా బ్యానర్లో నేనెప్పుడూ నటించను. ‘అ’ విషయంలో నేను నిర్మాతనే. కాజల్, నిత్య, రెజీనా, అవసరాల నటులే. మేమంతా ఫ్రెండ్స్ కదా అని రెమ్యునరేషన్ తగ్గించలేదు. డేట్స్‌ని బట్టి తీసుకున్నారు. ► ఏడాదికి మూడు సినిమాలతో బిజీ. నేను హీరోగా చేయడంతో పాటు నా పాత జాబ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నా. నా డైరెక్టర్లకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉంటున్నా. యాక్టర్‌గా నా పేరు వేయకున్నా పర్లేదు.. డెరెక్షన్ డిపార్ట్మెంట్లో నా పేరు వేయమని చెబుతుంటా (నవ్వుతూ). ► శేఖర్ కమ్ముల, వెంకీ కుడుముల దర్శకత్వంలో నేను సినిమాలు చేస్తున్నానన్నది అవాస్తవం. మేర్లపాక గాంధీతో ‘కృష్ణార్జున యుద్ధం చేస్తున్నా’. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జునగారు, నేను చేయబోయే సినిమా పూజ ఈ నెల 24న ఉంటుంది. మార్చిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. తర్వాత కిశోర్ తిరుమల, విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో సినిమాలు చేస్తా. -
'మనసుకు నచ్చింది' రిలీజ్ ట్రైలర్
-
చెట్టు, చేప, ప్రకృతి.. ఇంట్రస్టింగ్ ఫ్రైడే
ఈ శుక్రవారం టాలీవుడ్ లో ఆసక్తికరమైన సినిమాలు బరిలో దిగుతున్నాయి. కొత్త తరహా కథా కథనాలతో రూపొందిన అ! సినిమాతో తొలిసారిగా నాని నిర్మాతగా మారుతుంటే.. మనసుకు నచ్చింది సినిమాతో సూపర్ స్టార్ కృష్ణ కూతురు మంజుల దర్శకురాలిగా మారుతున్నారు. ఇప్పటికే ఈ రెండు సినిమాల మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా నిర్మాణ సంస్థలు ప్రచార కార్యక్రమాల్లోనూ కొత్తదనం చూపిస్తున్నారు. ఈ రెండు సినిమాలకు మరో ప్రత్యేక కథ కూడా ఉంది. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాల్లో ముగ్గురు టాప్ హీరోలు కేవలం వినిపించేందుకు రెడీ అవుతున్నారు. అది కూడా చెట్టు, చేప, ప్రకృతి లాంటి వాటికి టాప్ స్టార్లు గాత్రదానం చేయటం విశేషం. అ! సినిమాలో చేప పాత్రకు నాని, చెట్టు పాత్రకు రవితేజ డబ్బింగ్ చెబుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మనసుకు నచ్చింది సినిమా కొత్త టీజర్ రిలీజ్ చేసిన చిత్రయూనిట్ సూపర్ స్టార్ అభిమానులకు షాక్ ఇచ్చారు. ఈ సినిమాలో మహేష్ బాబు ప్రకృతికి వాయిస్ అందించారు. ఇలా ఒకే రోజు రిలీజ్ అవుతున్న రెండు సినిమాల్లో ముగ్గురు టాప్ హీరోలు చెట్టు, చేప, ప్రకృతి లాంటి వాటికి డబ్బింగ్ చెప్పటం ఆసక్తికరంగా మారింది. -
నాని గట్స్‌కు హ్యాట్సాఫ్
సాక్షి, సినిమా : హీరోగా వరుస సక్సెస్‌లు అందుకుంటున్న నేచురల్ స్టార్ నాని.. అ! చిత్రంతో నిర్మాతగానూ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైపోయాడు. టీజర్, ట్రైలర్, ప్రోమోలు, ప్రమోషన్లతో బాగానే హైప్ తీసుకొచ్చిన నాని.. ఇప్పుడు మౌత్ టాక్‌పై కూడా దృష్టిసారించాడు. అందుకే సినిమా విడుదలకు ముందే సెలబ్రిటీలకు ఇక్కడ ప్రత్యేక షో వేయించి వారితో అభిప్రాయాలను చెప్పిస్తున్నాడు. వెన్నెల కిషోర్, అనుపమ పరమేశ్వరన్, అడివి శేష్, దర్శకనిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి, నటుడు శశాంక్, డిజైనర్ నీరజ్ కోన, రాహుల్ రవీంద్రన్ ఇలా పలువురు సెలబ్రిటీలు ఈ చిత్రాన్ని వీక్షించి తమ ట్విటర్లో ట్వీట్లు చేశారు. ‘అ చిత్రం కొత్త తరహా కాన్సెప్ట్‌తో కూడిన చిత్రమని, అన్ని వర్గాల వారిని విశేషంగా ఆకట్టుకుంటుందని, దర్శకుడు ప్రశాంత్ టేకింగ్ కొత్తగా.. ఆకట్టుకునేలా ఉందని, ముగింపు ఓ కవిత్వంలా ఆహ్లాదంగా అనిపించిందని చెబుతున్నారు. ముఖ్యంగా నిర్మాతగా ఇలాంటి చిత్రం నిర్మించాలంటే చాలా గట్స్ ఉండాలంటూ ప్రతీ ఒక్కరూ నానిని ప్రశంసిస్తున్నారు. కాజల్, నిత్యామీనన్, రెజీనా, అవసరాల, ఇషా రెబ్బా, మురళీ శర్మ, ప్రియదర్శి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేశాడు. మరి ఈ చిత్రం నానికి నిర్మాతగా సక్సెస్ అందిస్తుందో లేదో తెలియాలంటే కొద్ది గంటలు ఆగితే చాలూ. #Awe creates a new genre of film making. It is a seamless blending of all genres..a film that encompasses the best aspects of each genre without being limited. No wonder @NameisNani bhayya backed this one😌🙏🏼 and @prasanthvarma gariki 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 pic.twitter.com/x4M2tPtBbV — vennela kishore (@vennelakishore) 14 February 2018 Thanks & kudos to @NameisNani & @PrashantiTipirn for backing #Awe A true blue concept film with a poetic finish! — Adivi Sesh (@AdiviSesh) 14 February 2018 Watched a superb & out of the box movie #awe. @NameisNani proved to be an intelligent as a producer also. Needs lot of guts to produce this kind of intelligent THIKKA cinema 😃👏👏👏. Kudos to the director @prasanthvarma and his team for the brilliant technical work! Cheers guys! — Madhura Sreedhar Reddy (@madhurasreedhar) 14 February 2018 Awe : a feeling of reverential respect mixed with fear or wonder.😲🤯 Last night I experienced the same when I was watching #AWE .. truly inspiring... a new approach to cinema with good values.. @NameisNani @PrashantiTipirn @prasanthvarma good work 👌🏻👌🏻 — Anupama Parameswaran (@anupamahere) 15 February 2018 #AWEstruck What a crazy film 🤘🏻 Kudos to @NameisNani n @PrashantiTipirn for backing @prasanthvarma n his unique story #AWE Good luck guys..Wishing Huge Success 👍🏻👍🏻 Great job by entire cast n crew 👌🏻👌🏻 This is real Hatke — Shashank (@ActorShashank) 14 February 2018 #Awe pushes boundaries .. in every possible direction! One has to appreciate the amazing passion this team had to believe in something like this and make it come to life. @NameisNani Wishing u and ur team an amazing run starting Feb 16th ❤️👍🏻😊 — Neerajaa Kona (@NeerajaKona) 14 February 2018 -
అ! ట్రెండ్‌సెట్టర్ అవుతుంది – రాజమౌళి
‘‘అ’ ట్రైలర్ చూశా. చాలా బాగుంది ప్రశాంత్. ట్రైలర్ చూడగానే సినిమా చూడాలనిపించింది’’ అని దర్శకుడు రాజమౌళి అన్నారు. కాజల్ అగర్వాల్, నిత్యామీనన్, రెజీనా, ఈషా, అవసరాల ముఖ్య తారలుగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హీరో నాని సమర్పణలో టి. ప్రశాంతి నిర్మించిన చిత్రం ‘అ!’. ఫిబ్రవరి 16న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రీ–రిలీజ్ వేడుకలో రాజమౌళి మాట్లాడుతూ– ‘‘రిలీజ్‌కు ఓ రోజు ముందుగానే షో వేయించుకుని చూడాలనిపిస్తోంది. ట్రైలర్ చూశాక ఈ సినిమా సూపర్‌హిట్ అనే ఫీలింగ్ వచ్చింది. నాని హిట్స్ మీద హిట్స్ సాధిస్తున్నాడు. ఓ భారీ హిట్ తర్వాత తనకి ‘వరుసగా హిట్స్ అందుకుంటున్నావ్.. దాన్ని దాటి నువ్వింకా ఓ మెట్టు పైకి ఎదగాలి’ అని మెసేజ్ పెట్టా. ట్రై చేస్తా సార్ అన్నాడు. సడెన్‌గా చేపకి వాయిస్ ఓవర్ ఇస్తూ కనిపించాడు. నాని సినిమా చేస్తున్నాడంటే అది హిట్టే అని అందరికీ గ్యారెంటీ వచ్చేసింది. ఈ చిత్రంలో నేను చూసిన ఫస్ట్ లుక్ రెజీనాది. మెండ్ బ్లోయింగ్. ఇంతమంది నటులు ఈ సినిమా చేస్తున్నారంటే కథలో ఏదో ఉందనే ఫీలింగ్ కలిగింది. ఈ సినిమా ట్రెంyŠ సెట్టర్ అవుతుంది’’ అన్నారు. నాని మాట్లాడుతూ– ‘‘మనందరి లోనూ ఓ తిక్క ఉంటుంది. ఆ తిక్కను సంతృప్తిపరిచే సినిమా ఇది. హీరోగా బాగా సంపాదిస్తున్నాడు? ఎందుకు ప్రొడక్షన్ చేస్తున్నాడని చాలామంది అనుకున్నారు. డబ్బుల కోసం నిర్మాతగా మారలేదు. ఈ సినిమా తీశాక నిర్మాతలపై గౌరవం పెరిగింది. చేప వాయిస్ ఓవర్ కోసం వచ్చిన ప్రశాంత్ కథ చెప్పాడు. కానీ తనకు ప్రొడ్యూసర్స్ లేరు. నేను నిర్మాతలను సెట్ చేస్తానన్నాను. కానీ, ఎవరికీ చెప్పలేకపోయా. ఫైనల్లీ నేనే నిర్మిస్తానని చెప్పా. ఇప్పటివరకూ నేను సంపాదించినదంతా సినిమాలతోనే. కాబట్టి సినిమాపై ఇన్వెస్ట్ చే యడానికి ఆలోచించను. ఈ చిత్రకథ విన్న రవితేజ అన్న వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. అయితే మనమిద్దరం ప్రొడ్యూస్ చేద్దామా? అన్నారు. కథపై అంత కాన్ఫిడెన్స్ ఆయనకి. ‘అ!’ సినిమా చూశాక గర్వంగా అనిపించింది. ట్రేడ్ విశ్లేషకులు ఒకరు.. ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటే రిలీజ్ చేయండి. లేవు.. రిస్క్ అనుకుంటే అమ్మేయండన్నారు. వాణిజ్య అంశాలు లేవు. రిస్క్ అనిపించింది. అందుకే నేనే రిలీజ్ చేస్తున్నా’’ అన్నారు. ‘‘కొత్తవాళ్లతో చిన్న సినిమాగా నేనే తీద్దామను కున్నా. బట్ నానీగారు వచ్చాక ఈ సినిమా పెద్దది అయింది. రోహిణీగారికి కథ చెబితే తెలుగులో ఇలాంటి సినిమా తీస్తున్నారా? అన్నారు. కాజల్గారు హిందీలో తీద్దామన్నారు. నానీతో సినిమా అంటే ఆయన ఇన్వాల్వ్ అవుతారని, మార్పులు చేర్పులు చేస్తారని కొందరు భయపెట్టారు. ఆయన ఎటువంటి మార్పులు అడగలేదు’’ అన్నారు ప్రశాంత్ వర్మ. ‘‘అ!’ సినిమా ఫస్ట్ లుక్ నుంచి మంచి ఇంట్రెస్ట్ ఉంది. కచ్చితంగా ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తాను’’ అన్నారు అనుష్క. ‘‘ఇప్పటివరకూ ఇలాంటి పాత్ర చేయలేదు’’ అన్నారు కాజల్ అగర్వాల్. ‘‘తెలుగులో ఇలాంటి మూవీ వస్తుందనుకోలేదు’’ అన్నారు నిత్యామీనన్. ‘‘ప్రశాంత్ కథ చెప్పినప్పుడే నా పాత్ర బాగా నచ్చింది’’ అన్నారు రెజీనా. సంగీత దర్శకుడు కీరవాణి, చిత్రసంగీతదర్శకుడు మార్క్ కె.రాబిన్ తదితరులు పాల్గొన్నారు. -
కారు ప్రమాదంపై నాని క్లారిటీ ఇస్తాడా..!
ఇటీవల యంగ్ హీరో నాని కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ముందుగా ఈ ప్రమాదంలో డ్రైవర్ మాత్రమే గాయపడ్డట్టుగా వార్తలు వినిపించినా.. తరువాత తనకు కూడా స్వల్ప గాయాలైనట్టుగా నాని స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలిపారు. అయితే ఈ ప్రమాదంపై స్పందించేందుకు నాని చాలా సమయం తీసుకోవటంతో ఈ లోగా మీడియాలో రకరకాల వార్తలు వినిపించాయి. ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చేందుకు నాని రెడీ అవుతున్నాడట. నాని తొలిసారిగా నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న సినిమా ‘అ!’. ఫిబ్రవరి 16న రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఈ రోజు(బుధవారం) హైదరాబాద్‌లో గ్రాండ్ గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమా వేడుకలో కారు ప్రమాదంపై నాని స్పందించనున్నాడట. ఇదే వేడుకలో అ! థియేట్రికల్ ట్రైలర్‌ను కూడా లాంచ్ చేయనున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, నిత్యా మీనన్, రెజినా, ఈషా రెబ్బా, అవసరాల శ్రీనివాస్, ప్రియదర్శిలు కీలక పాత్రల్లో నటిస్తుండగా నాని, రవితేజలు చేప, చెట్టు పాత్రలకు వాయిస్ అందిస్తున్నారు. -
మరో ఆసక్తికర పాత్రలో నిత్య
కెరీర్ స్టార్టింగ్ నుంచి విలక్షణ పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మలయాళీ ముద్దుగుమ్మ నిత్యమీనన్. ఇటీవల ఆచితూచి సినిమాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ తిరిగి ఫాంలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే నాని నిర్మాతగా మారి రూపొందిస్తున్న అ! సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది ఈ బ్యూటి. ఈ సినిమా తరువాత బహు భాషా చిత్రంగా తెరకెక్కనున్న ఓ ఆసక్తికర చిత్రంలో నటించేందుకు అంగీకరించింది. సినిమాటోగ్రాఫర్ నిజార్ షఫీ దర్శకుడిగా మారి రూపొందిస్తున్న సినిమాలో నిత్యమీనన్ కీలక పాత్ర పోషించనుందట. ముందుగా ఈ పాత్రకు అంజలిని తీసుకున్నారన్న ప్రచారం జరిగినా.. చిత్రయూనిట్ నిత్య మీనన్ రను తీసకునేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కథ విన్న నిత్య, ఈ సినిమాలో నటించేందుకు సుముఖంగానే ఉందన్న టాక్ వినిపిస్తోంది. నలుగురు హీరోయిన్లు నటించనున్న ఈ సినిమాలో ఇతర పాత్రల్లో అనీషా ఆంబ్రోస్, అదితి ఆర్య, నందిత శ్వేతలు నటించనున్నారు.