Baby died
-
వైద్యుల నిర్లక్ష్యం.. పురిటిలోనే శిశువు మృతి.. కుటుంబసభ్యుల ఆందోళన
ఎల్లారెడ్డి: నిండు గర్భిణికి సకాలంలో వైద్యం అందకపోవడంతో పురిటిలోనే శిశువు మృతి చెందిందని ఆరోపిస్తూ బాధిత కుటుంబసభ్యులు ఎల్లారెడ్డి ప్రభుత్వాస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని బాలాజీనగర్ తండాకు చెందిన దేశెట్టి రాజేశ్వరికి శుక్రవారం వేకువజామున పురిటినొప్పులు రావడంతో కుటుంబసభ్యులు 108 అంబులెన్స్‌లో ఎల్లారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఉదయం 10 గంటల వరకు కూడా ఆస్పత్రికి వైద్యులు రాలేదు. ఆ తర్వాత వచ్చిన వైద్యురాలు నిషాత్ బూతుల్ గర్భిణీని పరీక్షించి ఇంకా కొద్దిసేపు వేచి చూద్దామని చెప్పి వెళ్లిపోయింది. మధ్యాహ్నానికి పురిటినొప్పులు ఎక్కువ కావడంతో గర్భిణిని కామారెడ్డికిగానీ, బాన్సువాడకుగానీ తీసుకునివెళ్లాలని సిబ్బంది సూచించారు. చేసేదేమీ లేక కుటుంబసభ్యులు అత్యవసరంగా స్థానికంగానే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆపరేషన్ చేయగా అప్పటికే గర్భంలోనే మగశిశువు మృతి చెందింది. తల్లి పరిస్థితి సైతం ప్రాణాపాయంలో ఉందని వైద్యులు తెలిపారు. మృత శిశువుతో రాజేశ్వరి కుటుంబ సభ్యులు ఎల్లారెడ్డి ప్రభుత్వాస్పత్రి ఎదుట ధర్నాకు దిగారు. పోలీసులు వచ్చి విచారణ జరిపిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. శిశువు మృతి విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవీంద్రమోహన్‌ను వివరణ కోరగా, పురిటిలోనే శిశువు ఉమ్మనీరు మింగడంతో శ్వాస ఆడక మృతి చెందినట్లు చెప్పారు. ఆస్పత్రిలోని గైనకాలజిస్టు నిషాత్ బూతుల్ సెలవులో ఉన్నా గర్భిణి పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో ఆమెను ఆసుపత్రికి పిలిపించామన్నారు. గర్భిణిని కామారెడ్డికి రిఫర్ చేసినప్పటికీ సకాలంలో తరలించకపోవడంతో శిశువు మృతి చెందిందని తెలిపారు. చదవండి: మరో గుడ్‌న్యూస్.. త్వరలోనే జేఎల్ఎం పోస్టుల భర్తీ -
పొద్దెక్కినా పావని నిద్ర లేవలేదు.. శరీరం పచ్చగా మారడంతో
సాక్షి, నల్గొండ: విష పురుగు కుట్టి చిన్నారి మృతిచెందిన ఘటన మిర్యాలగూడ మండలంలోని తక్కెళ్లపాడుతండా సమీపంలో గల జగ్గుతండాలో చోటుచేసుకుంది. తండావాసులు తెలిపిన వివరాల ప్రకారం... జగ్గుతండాకు చెందిన భూక్య హరి, సుజాత దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె పావని(11)సంతానం. పావని తండాలోని పాఠశాలలోనే 4వ తరగతి చదువుతుంది. బుధవారం రాత్రి తల్లి సుజాతతో కలిసి పావని ఇంట్లో నేలపై నిద్రించింది. గురువారం తెల్లవారుజామున సుజాత నిద్ర లేచి రోజుమాదిరిగానే ఇంట్లో పనులు చేసుకుంటుంది. కాగా పొద్దెక్కినా కూడా పావని నిద్ర లేవకపోవడంతో పాటు ఎంత పిలిచినా పలకకపోవడంతో దగ్గరికి వెళ్లి చూసింది. పావనిలో ఎటువంటి చలనం లేకపోవడంతో వెంటనే భర్త హరికి విషయం చెప్పింది. అతడు వచ్చి చూడగా పావని శరీరం చల్లబడటంతో పాటు నాడీ స్పందన లేకపోవడంతో తమ కుమార్తె చనిపోయిందని నిర్ధారించుకున్నారు. కాగా పావని శరీరం పచ్చగా మారడంతో ఏదైనా విష పురుగు కుట్టి ఉండవచ్చని స్థానికులు అంటున్నారు. కుమార్తె మృతిని తట్టుకోలేక సుజాత స్పృహ కోల్పోయి కిందపడిపోయింది. కుటుంబ సభ్యులు, బంధువులు వెంటనే స్థానిక వైద్యుడిని పిలిపించి ఆమెకు సెలైన్ బాటిల్ ఎక్కించారు. -
విషాదం.. అప్పుడే పుట్టిన బిడ్డను కోల్పోయిన సింగర్ దంపతులు
ప్రముఖ సింగర్ బిప్రాక్ ఇంట విషాదం చోటు చేసుకుంది. త్వరలోనే తల్లిదండ్రులం కాబోతున్నామని ఎంతో ఆశగా ఎదురు చూసిన ఈ సింగర్ దంపతులకు తీవ్ర నిరాశ ఎదురైంది. పది నెలల క్రితం బిప్రాక్ భార్య మీరా గర్భవతి అయినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ బిడ్డ పుట్టిన మరుక్షణమే పోత్తిళ్లలోనే కన్నుమూసిన ఘటన ఈ దంపతులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ విషయాన్ని సింగర్ బిప్రాక్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. చదవండి: ఇంటింటికి సబ్బులు అమ్ముకుంటున్న స్టార్ నటి ఐశ్వర్య గురువారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ విషయాన్ని పంచుకుంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘ఈ రోజు మాకు బిడ్డ పుట్టింది. కానీ అంతలోనే ఆ బిడ్డ మమ్మల్ని విడిచి శాశ్వతంగా వెళ్లిపోయింది. పుట్టిన సమయంలోనే మా బిడ్డ చనిపోయింది. ఇది తల్లిదండ్రులుగా మేం భరించలేని ఒక దశ. చివరి వరకు మా బిడ్డను కాపాడేందుకు ప్రయత్నించిన వైద్యులకు కృతజ్ఞతలు. ఈ క్లిష్ట పరిస్థితిలో మాకు సపోర్ట్ చేసిన వారికి, అభిమానులకు ధన్యవాదాలు.. ఈ సమయంలో మా గోప్యతను మాకు అందించమని మీ అందరిని అభ్యర్థిస్తున్నాం’ అంటూ బిప్రాక్ రాసుకొచ్చాడు. చదవండి: కమల్ సర్ నాకు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వలేదు: అనిరుధ్ ఇక అతడి పోస్ట్‌పై పలువురు బాలీవుడ్ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కాగా సింగర్ బిప్రాక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ చిత్రాలకు పాటలు పాడుతూ, స్టేజి షో లలో బిప్రాక్ మంచి సింగర్‌గా గుర్తింపు పొందాయి. అంతేకాదు అతడి పాటలకు దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. తెలుగులో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో సూర్యుడివో చంద్రుడివో అనే పాట పాడి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. కొన్నేళ్ల క్రితం తన ప్రియురాలు మీరాను వివాహమాడిన ఆయన ఇటీవలే తాము తల్లిదండ్రులం కాబోతున్నామని తెలిపాడు. దీంతో అభిమానులు త్వరగా మీరా బిడ్డకు జన్మనివ్వాలని కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలిపారు. View this post on Instagram A post shared by B PRAAK(HIS HIGHNESS) (@bpraak) -
విషాదం: రూ.16 కోట్ల ఇంజక్షన్.. ఆ పాప ఇక లేదు
జైపూర్: రాజస్తాన్ బికనీర్‌కు చెందిన ఏడు నెలల చిన్నపాప నూర్ ఫాతిమా స్పైనల్ మస్కులర్ అట్రోపీ(ఎస్ఎమ్ఏ) వంటి అరుదైన వ్యాధితో బాధపడుతూ మంగళవారం ఉదయం మరణించింది. ఆ చిన్నారిని బతికించడానికి రూ. 16 కోట్ల విలువైన ఇంజక్షన్ మాత్రమే ఆధారం.సాధారణంగా ఇలాంటి అరుదైన వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు చికిత్సల్లో భాగంగా రూ.22 కోట్ల విలువ చేసే ‘జొలెస్మా’ ఇంజెక్షన్ వాడాల్సి వస్తుంది.ఇది అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంది. అయితే కేంద్రం రూ.6 కోట్లు దిగుమతి సుంకాన్ని రద్దు చేసింది. అయితే పాప తండ్రి జిసాన్ అహ్మద్ ఆర్థిక స్థోమత అంతంతమాత్రమే కావడంతో తమ బిడ్డపై ఆశలు వదిలేసుకున్నారు. అయితే ఇటీవలే హైదరాబాద్‌కు చెందిన అయాన్ష్ గుప్తా ఇదే వ్యాధితో బాధపడుతున్న వేళ క్రౌడ్ ఫండింగ్ పేరిట ఏడాది పాటు ఇంపాక్ట్ గురు సంస్థ ఆన్లైన్ వేదికగా రూ. 16 కోట్లు విరాళాలు సేకరించి ఆ బాబును బతికించారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న జిసాన్ అహ్మద్‌కు మళ్లీ ఆశలు చిగురించాయి. దీంతో పాప ఇంజెక్షన్‌కు విరాళాలు సేకరించేందుకు తన మిత్రులు, సోషల్ మీడియా గ్రూఫ్లను సంప్రదించాడు. అలా ఇప్పటివరకు క్రౌడ్ ఫండింగ్ పేరిట రూ. 40 లక్షలు పోగయ్యాయి. కానీ దురదృష్టంకొద్ది ఆ చిన్నారి మంగళవారం కన్నుమూయడంతో విరాళం అందించిన వారు పాపను బతికించలేకపోయామని ఆవేదన చెందుతున్నారు. ఇదే విషయమై.. పాప తండ్రి జిసాన్ అహ్మద్ స్పందించాడు. '' ఉదయం నాలుగు గంటల సమయంలో పాప బాగానే ఉంది. ఆకలితో ఏడ్వడంతో పాపకు పాలు పట్టిచ్చి మళ్లీ నిద్రపుచ్చాం. కానీ ఉదయం ఏడు గంటల సమయంలో పాపను లేపడానికి ప్రయత్నించగా.. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులున్నట్లు గమనించాం. దీంతో వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాం. కానీ పాపను పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు దృవీకరించారు. పాప ఇంజెక్షన్ కోసం క్రౌడ్ ఫండింగ్ పేరిట విరాళాలు అందించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. ఇంజెక్షన్‌కు రూ. 16 కోట్లు అవసరం కాగా.. ఇప్పటివరకు రూ. 40లక్షలు సేకరించాం. అయితే పాప చనిపోవడంతో మాకు విరాళం అందించిన వారికి డబ్బు తిరిగిచ్చేస్తాం.'' అంటూ కన్నీటిపర్యంతమయ్యాడు. చదవండి: 62,400 మంది దాతలు.. రూ.16 కోట్లు.. బాలుడికి పునర్జన్మ -
అనుమానాస్పదంగా పసికందు మృతి
రేగోడ్(మెదక్): అభం శుభం తెలియని పసికందు అనుమానాస్పదంగా మృతిచెందిన సంఘటన రేగోడ్ మండల కేంద్రంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు, అల్లాదుర్గం సీఐ జార్జి తెలిపిన వివరాల ప్రకారం.. రేగోడ్ మండల కేంద్రానికి చెందిన లక్ష్మన్ పోచమ్మ దంపతులకు ఇది వరకు ఇద్దరు కుమారులు ఉండగా రెండోబాబు ఏడాది క్రితం చనిపోయాడు. తొమ్మిది రోజుల క్రితం పోచమ్మ మరో బాబుకు జన్మనిచ్చింది. మంగళవారం సాయంత్రం ఇంట్లో పసికందు అనుమానాస్పదంగా మృతిచెందాడు. ఇంట్లో లక్ష్మన్, పోచమ్మలతో పాటు మరో ఐదుగురు ఉంటున్నారు. లక్ష్మన్ పాత సామగ్రి (స్క్రాప్) వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పసికందు మృతిచెందిన ఘటనా స్థలికి క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్ బృందాలు చేరుకుని క్లూస్‌కోసం పరిశీలించారు. పసికందు తల్లి పోచమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు సీఐ పేర్కొన్నారు. ఇందులో పెద్దశంకరంపేట ఎస్ఐ నరేందర్, స్థానిక హెడ్ కానిస్టేబుల్ పూర్యానాయక్, సిబ్బంది పాల్గొన్నారు. చదవండి : (బైక్ కొనివ్వలేదని డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య) (మంచి నిద్రలో ఉండగా..గొలుసు మాయం!) -
బకెట్లో పడి బాలుడు మృతి
సాక్షి, కుభీర్(ఆదిలాబాద్) : మండలంలోని సాంగ్వి గ్రామానికి చెందిన పొట్టేవార్ ఆదిత్య (2) ఆదివారం మధాహ్నం 3 గంటలకు రెండు రూపాయల బిల్ల కోసం బాత్రూంలోని బకెట్లో పడి మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పొట్టేవార్ రజిత యోగేష్ దంపతులకు ఇద్దరు కుమారులు మధ్యాహ్నం కుటుంబసభ్యులు ఇంట్లో ఉండగా చిన్న కుమారుడు ఆదిత్య ఆడుకుంటూ.. బాత్రూంలోకి వెళ్లాడు. ఆడుకుంటుండగా రెండు రూపాయల బిల్ల బకెట్లో పడింది. దానిని తీయడానికి బకెట్లోకి వంగి తీసుకునే ప్రయత్నంలో అందులో పడిపోయాడు. నీటిలో తల మునగడంతో అపస్మారక స్థితికి చేరాడు. గమనించిన కుటుంబసభ్యులు భైంసా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమద్యలో మృతి చెందాడు. గ్రామంలో విషాదం.. మండలంలోని సాంగ్వి గ్రామంలో ఆదివారం రెండు రూపాయల బిల్ల కోసం బకెట్లో పడి పొట్టేవార్ రజిత యోగేశ్ దంపతుల చిన్న కుమారుడు ఆదిత్య (2)మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నా యి. ఈ విషయం గ్రామస్తులకు తెలియడంతో వందలాది మంది తరలివచ్చారు. తల్లిదండ్రులు, కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. -
వేధింపుల పర్వం
జైపూర్: ఆరేళ్ల చిన్నారిని రేప్ చేసి, హత్య చేసిన ఓ ట్రక్కు డ్రైవర్‌ను రాజస్తాన్‌లోని టొంక్ జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేశారు. చాక్లెట్లు ఇస్తానని చెప్పి, స్కూల్ వద్ద నుంచి తీసుకెళ్లిన నిందితుడు మహేంద్ర అలియాస్ ఢోలు చిన్నారిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. నిందితుడు చిన్నారికి తెలిసిన వ్యక్తి కావడంతో.. తల్లిదండ్రులకు చెబుతుందేమోనన్న భయంతో పాపను అక్కడే చంపేశాడని ఎస్పీ ఆదర్శ్ తెలిపారు. ఈ అఘాయిత్యానికి పాల్పడ్డ సమయంలో నిందితుడు మద్యం మత్తులో ఉన్నాడని చెప్పారు. ఈ దారుణానికి పాల్పడ్డ తర్వాత రాజస్తాన్ విడిచి పారిపోవాలని భావించాడని, అయితే అలీగఢ్‌లో పట్టుపడ్డాడని వివరించారు. నిందితుడి వయసు 41 ఏళ్లు ఉంటుందని, ట్రక్కు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని, అతడికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారని ఎస్పీ తెలిపారు. శనివారం పాఠశాలలో జరిగిన ఓ కార్యక్రమం తర్వాత చిన్నారి కన్పించడం లేదని మొత్తం వెతికారు. మరుసటి రోజు ఉదయం స్కూల్ సమీపంలో పాప శవమై కన్పించింది. స్కూల్ బెల్టుతో మెడకు బిగించి ఊపిరాడకుండా చంపేశాడని పోలీసులు తెలిపారు. కన్న తండ్రే కూతురిపై.. జైపూర్: సొంత తండ్రే కన్న కూతురిని గొలుసులతో కట్టేసి, హింసించి, పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డ హేయమైన ఘటన రాజస్తాన్‌లోని జలోర్ జిల్లాలో జరిగింది. తన తండ్రి వేరే మహిళతో చనువుగా ఉన్న సమయంలో తాను చూశాననే కోపంతో గొలుసులతో తన కాళ్లు, చేతులు కట్టేసి పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని పేర్కొంది. ఇంటి నుంచి బాధితురాలు శుక్రవారం తప్పించుకుని తన మేనమామ పొలం దగ్గరికి వచ్చింది. అప్పటికీ తన చేతులు గొలుసులతో కట్టేసి ఉన్నాయి. జరిగిన విషయాన్ని తన మేనమామతో చెబితే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోజూ ఇంట్లో జరిగే హింసను తట్టుకోలేక బాధితురాలి తల్లి ఏడేళ్ల కిందటే నిందితుడిని వదిలేసి వేరే పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. ఒడిశాలో గ్యాంగ్ రేప్.. నిందితుల్లో కానిస్టేబుల్ పూరి: ఒడిశాలోని పూరీలో సోమవారం ఓ మహిళపై గ్యాంగ్‌రేప్ జరిగింది. కాకట్‌పర గ్రామానికి చెందిన బాధితురాలు నిమపరలోని బస్టాండ్ వద్ద బస్ కోసం ఎదురుచూస్తోంది. అదే సమయంలో అక్కడికి కారులో వచ్చిన ఓ వ్యక్తి..కాకట్‌పర తీసుకెళ్తానంటూ ఆమెను కారులో ఎక్కించుకున్నాడు. ఆ సమయంలో కారులో మరో ముగ్గురు వ్యక్తులున్నారు. బాధితురాలిని ఝడేశ్వరి క్లబ్ పక్కనున్న పోలీస్ క్వార్టర్ల వద్దకు తీసుకెళ్లి ఇద్దరు రేప్ చేశారు. అక్కడ తనకు దొరికిన పర్స్‌ను బాధితురాలు పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదుచేసింది. అందులోని ఐడీకార్డుల ద్వారా నిందితుడైన కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసి, అరెస్ట్‌చేశారు. -
పౌడర్ డబ్బాపై పడి చిన్నారి మృతి
సాక్షి, గుంటూరు : ఇంట్లో ఆడుకుంటూ పౌడర్ డబ్బాపై పడడంతో మెడపై తీవ్రంగా గాయమై జీజీహెచ్‌లో చికిత్సపొందుతున్న తొమ్మిది నెలల చిన్నారి మృతిచెందిన సంఘటన ఆ కుటుంబంలో తీరని విషాదం నింపింది. గుంటూరు లాలాపేట ఎస్హెచ్ఓ ఫిరోజ్ తెలిపిన వివరాల ప్రకారం బాలాజీనగర్ 6వ లైనుకు చెందిన తురకా ఏసుబాబు కుమార్తె తొమ్మిది నెలల జస్సి శుక్రవారం ఇంట్లో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు పౌడర్ డబ్బామీద పడడంతో మెడకు తీవ్ర గాయమైంది. ఆలస్యంగా గమనించిన తల్లిదండ్రులు బాలికను చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. చికిత్స అనంతరం గురువారం డిశ్చార్జి చేశారు. ఏసుబాబు కుమార్తెను ఇంటికి తీసుకువచ్చిన అనంతరం తీవ్ర అస్వస్థతకు గురై శుక్రవారం మృతిచెందింది. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
కారు చక్రాల కింద చితికిన చిన్నారి ప్రాణం..
న్యూఢిల్లీ: అన్నెం పున్నెం ఎరుగని చిన్నారి కారు చక్రాల కింద నలిగిపోయింది. ఈ దారుణ ఘటన శుక్రవారం ఢిల్లీలోని నేతాజీ సుభాష్ టెక్నాలజీ విశ్వవిద్యాలయం(ఎన్ఎస్ఐటీ) ఆవరణలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఎన్ఎస్ఐటీ క్యాంపస్ ఆవరణలో ఓ వ్యక్తి నిర్లక్ష్యంగా కారు నడుపుతూ పసిపాపపై కారును పోనిచ్చాడు. దీంతో ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. క్యాంపస్ క్యాంటీన్ ఆవరణలో, ఉదయం 9.30 నిమిషాల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా మృతురాలి తల్లి పేర్కొన్నారు. నిందితుడిని యూనివర్సిటీకి చెందిన ఉద్యోగిగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవటం గమనార్హం. పాపను ఆసుపత్రిలో చేర్పించగా అక్కడి యాజమాన్యం పోలీసులకు సమాచారమివ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు బాధితురాలి తల్లిదండ్రులు, బంధువుల నుంచి వాంగ్మూలాన్ని సేకరించారు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాత దర్యాప్తును వేగవంతం చేయనున్నారు. -
అయ్యో పాపం.. ఆడపిల్ల
నాగరిక ఎంత అభివృద్ధి చెందినా... సాంకేతికంగా ఎంత పురోగమిస్తున్నా ఈ లోకంలో ఆడ జన్మకు కష్టాలు మాత్రం తప్పడం లేదు. నవ మాసాలు కడుపులో మోసి బిడ్డను కనటానికి తల్లి నరక బాధను అనుభవిస్తుంది. తన ప్రాణాలను పణంగా పెట్టి బిడ్డకు జన్మనిచ్చిన ఆ తల్లికి ఏం కష్టమొచ్చిందో.. అప్పుడే ఈ లోకంలోకి అడుగుపెట్టిన శిశువును నడిరోడ్డుపైనే వదిలేసి వెళ్లింది. రోడ్డుపై మాంసం ముద్దలా విగత జీవిగా పడి ఉన్న ఆ శిశువును చూసి స్థానికుల కళ్లు చెమర్చాయి. చందాలు వేసుకుని మరీ ఆ శిశువుకు దహన సంస్కారాలు చేశారు. ఈ హృదయ విదారక ఘటన గురువారం చీరాలలో చోటుచేసుకుంది. సాక్షి, చీరాల రూరల్(ప్రకాశం) : అది చీరాల పట్టణంలోని విఠల్ నగర్ ప్రాంతం. ఊరు పేరు తెలియని నిండు గర్భిణి... ఎవరి చేతిలోనైనా మోసానికి గురైందో లేక ఆ తల్లికి ఏ కష్ట మొచ్చిందో తెలియదు బుధవారం రాత్రి స్థానిక రెడ్డిగారి స్కూలు వద్దకు చేరుకుంది. నా అనేవారు ఎవరూలేని ఆ అభాగ్యురాలు స్కూలు సమీపంలోని రహదారిపై ఏ సమయంలో పురుడు పోసుకుందో ఓ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. శిశువును అక్కడే వదిలేసి వెళ్లిపోయింది. ఉదయాన్నే మృత శిశువును చూసిన స్థానికులు తీవ్ర కలత చెందారు. పేగు కూడా కత్తిరించని స్థితిలో మాతృమూర్తి కడుపులోని అవయవాలు కూడా రోడ్డుపైనే పడివున్నాయి. అప్పటికే ఆ ఆడ శిశువు అచేతనంగా రోడ్డుపై పడి ఉంది. ఈ దృశ్యన్ని చూసిన స్థానికులు తీవ్ర మనో వేదనకు గురయ్యారు. కొందరు మహిళలు కంటతడి పెట్టారు. తలో కొంత డబ్బులు చందాలు రూపంలో వసూలు చేసుకుని గురువారం ఆ శిశువుకు దహన సంస్కారాలు నిర్వహించారు. ఆడపిల్ల పుడితే కుటుంబానికి భారం కాకూడదని ప్రభుత్వాలు అనేక పథకాలను ప్రవేశ పెడుతున్నా మానవత్వాన్ని మరచిన కొందరు కఠిన హృదయులు ఇటువంటి దురాగతాలకు పాల్పడటం శోచనీయం. -
అమ్మతనం ఆవిరైంది.. నాలుగో అంతస్తు పైనుంచి..
లక్నో: అమ్మతనం ఆవిరైంది. అనారోగ్యంతో పుట్టిన పిల్లాన్ని మోయలేక పోయింది. మూడు నెలల చిన్నారి ఉసురు తీసి ‘ఊపిరి’ పీల్చుకుంది. వివరాలు.. మూడు నెలల చిన్నారిని కన్నతల్లే కర్కశంగా హత్య చేసిన అమానవీయ ఘటన లక్నోలో చోటుచేసుకుంది. పుట్టుకతోనే జాండిస్, కాలేయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న కొడుకును అక్కున చేర్చుకోవాల్సింది పోయి ఓ అమ్మ రాక్షసంగా ప్రవర్తించింది. చికిత్స చేయిస్తున్నా పిల్లాడి ఆరోగ్యం కుదటపడక పోవడంతో అతన్ని తుదముట్టించాలనుకుంది. బాలుడికి చికిత్సనందిస్తున్న కింగ్ జార్జ్ మెడికల్ యునివర్శిటీ హస్పిటల్ భవనం నాలుగో అంతస్తు నుంచి కింద పడేసింది. తీవ్ర గాయాలతో చిన్నారి ప్రాణాలు విడిచాడు. తొలుత ఈ ఘటన ప్రమాదవశాత్తూ జరిగిందని అందరూ భావించారు. అయితే, భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన భర్త నిలదీయడంతో చేసిన నేరం ఒప్పుకుంది. అతని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. -
వైద్యం అందక చిన్నారి మృతి
సాక్షి, మంచిర్యాల : వైద్యుడి నిర్లక్ష్యంతో మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నాలుగు నెలల చిన్నారి మృతిచెందింది. దీంతో చిన్నారి బంధువులు ఆందోళనకు దిగారు. మంగళవారం రాత్రి జరిగిన సంఘటన వివరాలు బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఏసీసీ అంబేద్కర్‌కాలనీకి చెందిన ఎల్కపెల్లి మల్లేష్, తరుణి దంపతుల తొలి సంతానం సాయి మనస్విని (నాలుగు నెలలు). పుట్టినప్పటి నుంచి జిల్లాకేంద్రంలోని హర్షిత పిల్లల ఆసుపత్రిలో చూపిస్తున్నారు. మనస్వినికి శ్వాస రాకపోవడంతో మంగళవారం రాత్రి 9గంటల ప్రాంతంలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉందన్న వైద్యులు పాప ముక్కులో రెండుచుక్కలు మందు వేశారు. మరో ఇద్దరు సీనియర్ వైద్యులు కూడా పరిశీలించారు. అప్పటికే ఆలస్యం కావడంతో మనస్విని మృతి చెందింది. అయితే చిన్నారి మృతికి ఆసుపత్రి వైద్యుడు గోలి పూర్ణచందర్ నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబసభ్యులు బంధువులతో కలిసి ఆస్పత్రి ఎందుట ఆందోళన దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. అప్పటికే రాత్రికావడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఏసీపీ గౌస్‌బాబ, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలు, 20మంది సిబ్బంది బందోబస్తు చేపట్టారు. కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ పాప మృతికి కారణమైన వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని పేర్కొంటూ బంధువులు ఆందోళన కొనసాగించారు. సంఘటన స్థలానికి ఐఎంఏ, ఎమ్మార్పీఎస్ నాయకులు చేరుకొని ఇరువర్గాలతో చర్చలు జరిపారు. బంధువులు రూ.10 లక్షలు డిమాండ్ చేయగా.. చివరకు రూ.2.50లక్షలు ఇచ్చేందుకు వైద్యుడు అంగీకరించారు. బాధితులు ఫిర్యాదు చేయకపోవడంతో కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. తప్పు లేకున్నా.. ఆందోళన పాపను ఆసుపత్రికి తీసుకొచ్చే సమయానికే జలుబు, జ్వరంతో బాధపడుతోంది. మంగళవారం రాత్రి శ్వాస ఆడడం లేదని మళ్లీ వచ్చారు. అప్పటికే బేబీ కండిషన్ సీరియస్‌గా ఉందని చెప్పిన. అయినా వైద్యం చేయాలన్నారు. ఏర్పాట్లు చేసేలోపే మృతి చెందింది. పిల్లలకు పాలు పట్టిన తరువాత భుజంపై ఎత్తుకోవాలి. లేకుంటే పాలు లంగ్స్‌లోకి వెళ్లి శ్వాస ఆగిపోయే ప్రమాదముంది. మనస్విని విషయంలో ఇదే జరిగింది. – గోలి పూర్ణ చందర్, హర్షిత్ పిల్లల ఆసుపత్రి వైద్యుడు, మంచిర్యాల -
శ్వాస ఆడక రెండు నెలల పసిపాప మృతి
సాక్షి, విజయనగరం : పట్టణంలోని కేఎల్‌పురంలో ఉన్న శిశుగృహాకు చెందిన ఓ ఆడబిడ్డ మంగళవారం మృతి చెందింది. వివారాల్లోకి వెళ్తే...రెండు నెలలు క్రితం ఓ అవివాహిత ఆడబిడ్డకు జన్మనిచ్చి శిశుగృహాకు అప్పగించింది. ఆ బిడ్డకు శిశుగృహా సిబ్బంది దీపిక అని పేరు పెట్టారు. సోమవారం రాత్రి 2 గంటల సమయంలో శిశుగృహ సిబ్బంది దీపికకు పాలు పట్టడానికి లేచి చూడగా తీవ్ర ఆయాసంతో శ్వాస తీసుకోవడం ఇబ్బందిపడడం గమనించి మేనేజర్‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే కేంద్రాస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజాము 3 గంటల సమయంలో పాప మృతి చెందింది. దీపిక మృతిని ఐసీడీఎస్ ఏపీడీ శాంతకుమారి ధ్రువీకరించారు.కారా (సెంట్రల్ ఆడప్సన్ రిసోర్స్ అధార్టీ) నిబంధనలు ప్రకారం శిశుగృహాకు చెందిన పిల్లలు మృతి చెందితే ఆ పిల్లలకు పోస్టుమార్టం చేయాలి. దీంతో దీపికకు కూడా శిశుగృహ సిబ్బంది కేంద్రాస్పత్రి వైద్యులతో పోస్టుమార్టం చేయించారు. అనంతరం మృతదేహాన్ని ఖననం చేశారు. అయితే శిశుగృహలో 11 మంది పిల్లలు ఉన్నారు. వారిలో మంగళవారం ఒక పాప మృతి చెందింది. ఆకాష్ అనే ఐదు నెలల బాలుడు కూడా రెండు రోజులుగా ఆరోగ్యం బాగోలేకపోవడంతో బాలుడిని విశాఖ కేజీహెచ్‌లో శిశుగృహ సిబ్బంది చేర్పించి చికిత్స అందిస్తున్నారు. వలంటర్ అనే మరో ఐదు నెలల బాలుడికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. -
మగబిడ్డ పుట్టాడని ఆనందం..కానీ అంతలోనే
సాక్షి, నరసన్నపేట(శ్రీకాకుళం) : స్థానిక 50 పడకల ప్రభుత్వాసుపత్రిలో ఈ నెల 15వ తేదీన పుట్టిన బిడ్డ (నవజాత శిశువు) వెంటనే మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఆపరేషన్ చేయడంలో జాప్యం వల్ల బిడ్డ పుట్టిన వెంటనే మృతి చెందాడని, వెంటనే ఆపరేషన్ చేసుంటే మా బాబు బతికే వాడని కొత్తూరు మండలం గూనబద్రకు చెందిన రుగడ ఏసుబాబు, లక్ష్మి అన్నారు. పుట్టబోయే బిడ్డ కోసం 9 నెలలు ఎంతో ఆతృతగా ఎదురు చూశామని, మగ బిడ్డ పుట్టాడని ఆనందించామని అయితే తమ ఆనందం కొన్ని క్షణాలు కూడా ఉండలేదని ఏసుబాబు చెప్పారు. వైద్యులు వెంటనే స్పందించి ఉంటే తమకు న్యాయం జరిగేదని, బాబు బతికేవాడని ఏసుబాబు అన్నారు. ఆలస్యంగా అందిన సమాచారం మేరకు సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఏడాదిన్నర కిందట ఏసుబాబుతో పోలాకి మండలం ముప్పిడికి చెందిన లక్ష్మితో వివాహమైంది. భార్య లక్ష్మి గర్భం దాల్చిన తరువాత శ్రీకాకుళంలో ఓ వైద్యురాలి వద్ద నిత్యం తనిఖీలు చేయించామని నెలలు నిండి నొప్పులు రావడంతో 14వ తేదీ రాత్రి 8.30 సమయంలో 108లో ఆసుపత్రికి తీసుకువచ్చామని ఏసుబాబు చెప్పారు. అయితే రాత్రంతా తన భార్య నొప్పులతో ఇబ్బంది పడిందని సాధారణ తనిఖీలు చేసిన సిబ్బంది ఉదయం 10 గంటల వరకూ పట్టించుకోలేదని ఆరోపించారు. ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీసిన గంట కల్లా మృతి చెందాడని అదే ఆపరేషన్ రాత్రి చేసుంటే తమకు న్యాయం జరిగేదని చెప్పారు. ప్రస్తుతం తన భార్య లక్ష్మి ఆస్పత్రిలో చికిత్స పొందుతుందన్నారు. అయితే ఈ సంఘటనపై ఎవరికీ ఫిర్యాదు చేయలేదని చెప్పారు. వైద్యపరమైన కారణాలతోనే మృతి ఈ సంఘటనపై ఆస్పత్రి ప్రధాన వైద్యురాలు ఎన్.పద్మావతి మాట్లాడుతూ వైద్యపరమైన కారణాలతో బిడ్డ మృతి చెందినట్టు చెప్పారు. గుండెజబ్బు ఉన్నట్టు గుర్తించామన్నారు. గర్భిణి ప్రసవానికి వచ్చిన వెంటనే ఆపరేషన్ చేయలేమని సాధారణ ప్రసవానికి ప్రయత్నించి అనుకూలంగా లేకపోతే ఆపరేషన్ చేస్తామని, ఇందులో భాగంగానే సాధారణ ప్రసవానికి ప్రయత్నించి చివరి క్షణంలో ఆపరేషన్ చేశామన్నారు. అయితే గుండెకు సంబంధించిన వ్యాధి ఉండడం వల్ల బిడ్డ పుట్టిన వెంటనే ఊపిరి తీసుకోలేక మృతి చెందినట్టు చెప్పారు. చిన్నపిల్లల వైద్యుడు నవీన్ మాట్లాడుతూ బిడ్డ పుట్టినప్పటికి ఊపిరి ఉందని, కొద్ది క్షణాల్లోనే ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడడంతో తమ ప్రయత్నం చేశామని శ్రీకాకుళం తరలించేందుకు ప్రయత్నించే లోగా మృతి చెందినట్టు తెలిపారు. -
అమ్మ ఒడిలోనే.. ఆఖరి ఊపిరి
సాక్షి, తూర్పు గోదావరి : ఈ చిత్రంలో ఆమెను చూస్తే ఏమనిపిస్తోంది? దూర ప్రయాణంలో భాగంగా బస్టాండులో బస్సు కోసం ఒడిలో చిన్నారితో మండుటెండలో ఎదురుచూస్తున్నట్టుగా ఉంది కదా! కానీ గుండెలు పిండేసే నిజం ఏమిటంటే...ఆ పసిబిడ్డకు అనారోగ్యంగా ఉండడంతో దగ్గర్లోని పీహెచ్‌సీకి తీసుకువెళ్లారు... పరిస్థితి విషమించడంతో రంపచోడవరం ఆసుపత్రిలో చేర్పించగా అక్కడి వైద్యులు రాజమహేంద్రవరం ఆసుపత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. కానీ రాజమహేంద్రవరం పెద్దాసుపత్రికి తీసుకువెళ్లే ప్రయత్నంలోనే ఆ శిశువు తల్లి ఒడిలోనే కన్నుమూసింది. ఎతైన కొండలు... ఆ కొండలతో పోటీ పడుతున్నట్టుగా పొడవాటి చెట్లు ... ఈ రెంటింటి మధ్య గలగలా పారే సెల ఏళ్లు పక్షుల కిలకిలారావాలు, ఎటు చూసినా పచ్చదనమే ... అప్పుడప్పుడు వెళ్లే పర్యాటకులకు కనువిందే..మానసిక ఆనందమే...ఆహ్లాదమే...కానీ.. ఆ గూడెంలో ఉండే గిరిజనుల గుండెల నిండా ఉండే వ్యధ... కన్నతల్లుల కన్నీటి వెత ఎందరికి తెలుసు? వైద్యం అందక కన్నుమూస్తున్న మాతా, శిశు దేహాలను తీసుకువెళ్లేందుకు నానా చావు చావాలి. ఎత్తైన కొండలు, రవాణా సదుపాయాల లేని కుగ్రామాలు, వైద్యం కోసం రోగులను తీసుకుని కాలినడకన ఆస్పత్రులకు వెళ్లడం గిరిజనులకు సర్వసాధారణ అయింది. రెండు నెలల చిన్నారికి అస్వస్థతగా ఉండడంతో తల్లిదండ్రులు పరుగుపరుగున ఆస్పత్రుల చుట్టూ తిరిగినా.. విషమంగా ఉన్న శిశువు ప్రాణాలు దక్కలేదు. పుట్టేడు దుఃఖంతో శిశువు మృతదేహంతో కన్నీరుమున్నీరుగా వారు విలపించారు. అచేతన స్థితిలో ఉన్న వారిద్దరూ.. శిశువు మృతదేహాన్ని గ్రామానికి తీసుకువెళ్లేందుకు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకూ అంబులెన్స్ కోసంస్థానిక ఏరియా ఆస్పత్రిలో విలపిస్తూ కూర్చుండిపోయారు. వారి వేదన అందరినీ కంటతడిని పెట్టించింది. వై.రామవరం మండలం పలకజీడి గ్రామానికి చెందిన సాదల అమ్మాజీ, రాంబాబు రెండు నెలల శిశువు అనారోగ్యంతో రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో శుక్రవారం మృతి చెందాడు. జ్వరం, న్యూమోనియాతో బాధపడుతోన్న శిశువును పలకజీడి నుంచి వై.రామవరం ఆస్పత్రికి తల్లిదండ్రులు తీసుకువచ్చారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి వైద్య సిబ్బంది శిశువును రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి రిఫర్ చేశారు. అతడి పరిస్థితి అలాగే ఉండడంతో రంపచోడవరం ఆస్పత్రి వైద్యులు అత్యవసర వైద్యం రాజమహేంద్రవరం ఆస్పత్రికి రిఫర్ చేశారు. అంతలోనే శిశువు మృతి చెందాడు. అంబులెన్స్ లేక నిరీక్షణ రంపచోడవరం ఏరియా ఆస్పత్రి నుంచి మృతదేహాన్ని సొంత గ్రామానికి తరలించేందుకు అంబులెన్స్ లేక సాయంత్రం ఆరు గంటల వరకు తల్లిదండ్రులు నిరీక్షించారు. ఆస్పత్రి అంబులెన్స్ మోతుగూడెంలో నిర్వహిస్తున్న రక్తదాన శిబిరానికి వెళ్లింది. ఐటీడీఏకు చెందిన రెండు అంబులెన్స్‌లు.. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులతో రాజమహేంద్రవరం వెళ్లాయి. రక్తదాన శిబిరానికి వెళ్లిన వాహనం తిరిగి రావడంతో సాయంత్రం ఆరు గంటలకు శిశువు మృతదేహాన్ని తరలించారు. -
వైద్యులు లేక డెలివరీ చేసిన నర్సులు శిశువు మృతి
-
పురిటిలోనే పసి ప్రాణం బలి
కమ్మర్పల్లి(బాల్కొండ): వైద్యుల నిర్లక్ష్యంతో అప్పుడే పుట్టిన శిశువు మృతి చెందిందని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బందిని నిలదీశారు. కమ్మర్‌పల్లికి చెందిన మల్లగారి రేణుక అనే గర్భిణికి శుక్రవారం పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు మధ్యాహ్నం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. ఆ సమయంలో డ్యూటీ డాక్టర్ అందుబాటులో లేకపోగా, స్టాఫ్ నర్సు, హెల్త్ సూపర్వైజర్ మాత్రమే ఉన్నారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న రేణుకను ప్రసూతి గదిలోకి తీసుకెళ్లారు. పేషెంట్ అవసరమైన(పొలీస్ క్యాథటర్) యూరిన్ పైప్ ఆస్పత్రిలో అందుబాటులో లేకపోవడంతో సిబ్బంది ప్రిస్కిప్షన్‌పై రాసిచ్చారు. కమ్మర్పల్లి మందుల దుకాణాల్లో లేకపోవడంతో మెట్‌పల్లికి వెళ్లి తీసుకువచ్చారు. ఈ కారణంగా రెండు గంటలు ఆలస్యమైంది. దీంతో వైద్య సిబ్బంది కాన్పు చేశారు. సహజ ప్రసవంతో మగ శిశువుకు జన్మించింది. పుట్టిన శిశువులో కదలికలు లేకపోవడంతో పాటు, నీలిరంగుగా మారడంతో శిశువును మరో ఆస్పత్రికి సిఫారసు చేశారు. కుటుంబ సభ్యులు మెట్‌పల్లిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే శిశువు మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు. శిశువు మృతదేహాన్ని ఆస్పత్రి వద్ద ఉంచి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వైద్య సిబ్బంది కారణంగానే శిశువు మరణించిందని ఆరోపిస్తూ సిబ్బందిని నిలదీశారు. కాన్పు చేసిన హెల్త్ సూపర్వైజర్, స్టాఫ్ నర్స్ శిశువు ఉమ్మ నీరు మింగిందని ఒకసారి, మరోసారి తెమడ తట్టుకుందని పొంతన లేని మాటలు చెప్పడంతో బాధిత కుటుంబ సభ్యులు కోపోద్రిక్తులయ్యారు. డ్యూటీ డాక్టర్ ఎక్కడ అని నిలదీశారు. వైద్యాధికారి సెలవులో ఉంటే సంబంధిత రిజిస్టర్‌ను చూపించాలని పట్టుపట్టారు. పోలీసుల సమక్షంలో రిజిస్టర్ చూపించడంతో అందులో అటెండ్ బాక్స్ ఖాళీగా ఉంది. అర్హత కలిగిన వైద్యులు లేకపోవడంతో అనర్హత కలిగిన సిబ్బంది కాన్పు చేయడం కారణంగా శిశువు మరణించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకొని వివరాలు సేకరించారు. బాధిత కుటుంబ సభ్యులను సముదాయించారు. ఘటనపై అనుమానాలుంటే సంబంధిత ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. దీంతో బాధితులు స్థానిక తహసీల్దార్, ఎస్ఐలకు లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. -
వైద్యుల నిర్లక్ష్యంతో పసికందు మృతి
సాక్షి, సిద్దిపేటటౌన్: సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా పురిట్లోనే పాప మృతిచెందిన ఘటన బుధవారం సిద్దిపేటలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం చేర్యాల మండలం వేచరేణి గ్రామానికి చెందిన లక్ష్మి, లింగయ్యల కుమార్తె రజిత అలియాస్ లక్ష్మిప్రియ (23)కి సికింద్రాబాద్ ఈస్ట్‌మారెడ్‌పల్లికి చెందిన మధుతో ఏడాది క్రితం వివాహం జరిగింది. డెలివరీ కోసం తల్లిగారింటికి వచ్చిన లక్ష్మిప్రియకు మంగళవారం మధ్యాహ్నం పురిటి నొప్పులు రావడంతో సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. పరీక్షించిన వైద్యులు నొప్పులు ఎక్కువ రావడం లేదని అబ్జర్వేషన్లో ఉంచారు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం 12గంటల సమయంలో కొద్దికొద్దిగా పురిటి నొప్పులు రావడంతో మరోసారి పరీక్షించి సాయంత్రం వరకు చూడాలని కుటుంబ సభ్యులకు తెలిపారు. ఈలోగా పురిటినొప్పులు తగ్గడంతో అనుమానం వచ్చిన డాక్టర్లు పరీక్షించి శిశువు ఉమ్మ నీరు తాగిందని, కుటుంబ సభ్యులు సంతకాలు చేస్తేనే ఆపరేషన్ చేస్తామని డ్యూటీ డాక్టర్ స్పష్టం చేయడంతో కుటుంబ సభ్యులు సంతకాలు పెట్టారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆపరేషన్ చేసి పాప కడుపులోనే మృతి చెందిందని డాక్టర్ చెప్పినట్లు బంధువులు ఆరోపించారు. పాప మృతికి డాక్టర్ నిర్లక్ష్యమే కారణమని, పాప మృతికి కారణమైన డాక్టర్‌ను సస్పెండ్ చేయాలని పాప తండ్రి మధు డిమాండ్ చేశారు. పాప మృతిచెందిన విషయం డాక్టర్లు చెప్పగానే సిద్దిపేట వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసామని, అయినా పోలీసులు డాక్టర్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మధు ఆరోపించారు. ఈ విషయంపై వన్ టౌన్ ఎస్సై శ్రీనివాస్‌ను వివరణ కోరగా పోస్టుమార్టం రిపోర్టు ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
కూతురు కోసం 36 గంటల పోరాటం
బెంగళూరు: కర్ణాటకలోని ధార్వాడ్‌లో నిర్మాణంలో ఉన్న ఓ భవంతి ఇటీవల కూలిపోయిన ఘటనలో మృతుల సంఖ్య 15కు చేరుకుంది. ఈ ఘటనలో తన కుమార్తెను కాపాడుకునేందుకు 36 గంటల పాటు ఓ తల్లి చేసిన పోరాటం వెలుగులోకి వచ్చింది. విస్టేజ్ మార్కెటింగ్ సంస్థ ఈ భవంతిలో ఆఫీస్ ఏర్పాటుచేసింది. ఈ సంస్థలో ప్రేమా ఉనకల్(36) మార్కెటింగ్ ప్రతినిధిగా చేస్తోంది. స్కూల్‌కు వేసవి సెలవు కావడంతో ప్రేమాతోపాటు ఆమె కూతురు దివ్య(8) సైతం ఆఫీస్‌కు వచ్చింది. మంగళవారం సాయంత్రం భవంతి కుప్పకూలిపోవడంతో తల్లీకుమార్తెలు శిథిలాల కింద చిక్కుకుపోయారు. కొద్దిసేపటి తర్వాత మేలుకున్న ప్రియ, కుమార్తె కోసం వెతుకులాట ప్రారంభించింది. అక్కడే శిథిలాల కింద చిక్కుకున్న దివ్య చేతులు కనిపించాయి. ఆ చీకటిలోనే 45 నిమిషాల పాటు కష్టపడి దివ్యను బయటకు తీసుకొచ్చింది. అంతలోనే అప్పటివరకూ కదలకుండా ఉన్న మరో పిల్లర్ చిన్నారి దివ్యపై పడిపోయింది. దీంతో బాలిక బాధతో విలవిల్లాడింది. ఈ పిల్లర్ కింద చిక్కుకున్న దివ్యను కాపాడేందుకు ప్రియ మరో 24 గంటల పాటు ప్రయత్నించింది. చిన్నారి స్పృహ కోల్పోకుండా ఉండేందుకు తాను అంతసేపు మెలకువగానే ఉంది. 20న దివ్య ఏడుపు ఆపేసింది. అదేరోజు ఉదయం అధికారులు యంత్రాల ద్వారా శిథిలాల తొలగింపు ప్రారంభించారు. ఆ శబ్దం విన్న ప్రియ ‘మేమిక్కడ చిక్కుకున్నాం’ అని గట్టిగా అరిచింది. దీంతో అధికారులు ప్రియను రక్షించి ఆసుపత్రికి తరలించారు. దివ్యను శిథిలాల కిందనుంచి బయటకు తీసినప్పటికీ ఆమె అప్పటికే చనిపోయింది. ఈ విషయాన్ని ప్రియ కుటుంబ సభ్యులు ఆమెకు చెప్పలేదు. ఈ విషయమై ప్రియ పిన్ని మాట్లాడుతూ..‘ఎన్డీఆర్ఎఫ్ అధికారులు రాగానే తనను కాకుండా కుమార్తెను రక్షించాలని ప్రియ కోరింది. కానీ ఆమెను తొలుత వెలికితీసిన అధికారులు ఆసుపత్రికి తరలించారు. దివ్య అప్పటికే చనిపోయింది. ఈ దుర్ఘటనలో ప్రియ చేతులు, కాళ్లకు తీవ్రగాయాలు అయ్యాయి. మెలకువలోకి వచ్చిన ప్రతీసారి కుమార్తె దివ్య గురించి ప్రియ అడుగుతోంది. ఏడుస్తూ అంతలోనే స్పృహ కోల్పోతోంది. కానీ దివ్య ఇక లేదన్న విషయాన్ని మేం చెప్పలేకపోతున్నాం’ అని ఆవేదన వ్యక్తం చేశారు. -
డాక్టర్ల నిర్లక్ష్యం..2నెలల చిన్నారి మృతి
-
వైద్యం అందక చిన్నారి మృతి
మంచిర్యాలక్రైం: ప్రైవేట్ పిల్లల ఆసుపత్రిలో ఓ చిన్నారికి సకాలంలో వైద్యం అందక మృతిచెందిన సంఘటన మంచిర్యాల పట్టణంలో సోమవారం చోటుచేసుకుంది. కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. కాసిపేట మండల కేంద్రానికి చెందిన వైద్యం అందకపోవడంతోదంపతుల కూతురు తనుశ్రీ (2)కి మూడు రోజులుగా జ్వరం వస్తోంది. ఈ క్రమంలో సోమవారం ఉదయం 7 గంటలకు మంచిర్యాలలోని స్థానిక ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన గంటలోపే చిన్నారి మృతి చెందింది. సకాలంలో వైద్యం అందకపోవడంతోనే చిన్నారి మృతిచెందిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న ఎస్సై వెంకటేశ్వర్లు సంఘటనా స్థలానికి చేరుకొని కుటుంబసభ్యులతో మాటాడి ఆందోళన విరమింపజేశారు. బాధితులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్సై తెలిపారు. తనుశ్రీ చనిపోయే గంట ముందే ఆస్పతికి తీసుకువచ్చారని, అప్పటికే చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యుడు తెలిపాడు. వైద్యం అందించలోపే మృతిచెందిందన్నారు. ఎక్కడా నిర్లక్ష్యం చేయలేదన్నారు. కాగా, చిన్నారి మృతితో కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. -
గర్భంలోనే పిండం మృతి
మహబూబాబాద్ రూరల్ : వైద్యురాలి నిర్లక్ష్యం కారణంగా గర్భంలోని పిండం మృతి చెందిందని బాధితురాలి బంధువులు మానుకోట ఏరియా ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు. బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటనపై బాధితురాలి భర్త పల్ల సందీప్ తెలిపిన వివరాల ప్రకారం.. కురవి మండలం సూదనపల్లికి చెందిన పల్ల భార్గవి నెలలు నిండి వారం రోజులు పూర్తయ్యాక పురుటి నొప్పులు రావడంతో మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఏరియా ఆస్పత్రికి వచ్చింది. విధుల్లో ఉన్న గైనకాలజిస్టు ఆశాదేవి భార్గవిని పరీక్షించి ఓ ఇంజక్షన్ తెప్పించి ఇవ్వడంతో కొంత ఉపశమనం లభించింది. డెలివరీ కోసం అక్కడే ఉండిపోయింది. రాత్రి 8 గంటల సమయంలో స్కానింగ్ తీయించిన డాక్టర్ ఆశాదేవి రిపోర్టు చూసి చిన్న నొప్పులే.. నార్మల్ డెలివరీ అవుతుంది.. గర్భంలో శిశువు హార్ట్‌బీట్ బాగానే ఉందని చెప్పింది. కొంచెం నొప్పులు వస్తున్నాయని భార్గవి చెప్పినా పట్టించుకోలేదని సందీప్ తెలిపాడు. బుధవారం ఉదయం 10 గంటల సమయంలో రౌండ్స్‌కు వచ్చిన సూపరిండెంటెంట్, గైనకాలజిస్టు వెంకట్రాములు భార్గవిని పరీక్షించి స్కానింగ్ చేసి కడుపులో శిశువు మృతి చెందిందని చెప్పారు. రాత్రి డాక్టర్ చెప్పిన విషయం ఆయన దృష్టికి తీసుకురాగా మరో వారం రోజుల వరకు కూడా డెలివరీ చేసేందుకు అవకాశం ఉందని చెప్పి వెళ్లారు. మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఎవరు పట్టించుకోలేదు. ఒంటి గంట సమయంలో భార్గవిని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లి అనంతరం మృతి చెందిన ఆడ శిశువును కుటుంబ సభ్యుల చేతిలో పెట్టారు. దీంతో వారు బోరున విలపించారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శిశువు గర్భంలోనే మృతి చెందిందని, ఇందుకు బాధ్యులైన వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. -
కాన్పు చేసిన నర్సులు
కల్వకుర్తి టౌన్ : వైద్యులు లేకుండా నర్సులే ఓ మహిళకు ప్రసవం చేయడంతో చిన్నారికి పేగు చుట్టుకుని మృతి చెందిందింది. ఈ ఘటన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి ప్రభత్వ ఆస్పత్రిలో సోమవారం చోటుచేసుకుంది. కల్వకుర్తి ఎస్ఐ రవి, బాధితురాలి భర్త రమేష్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండ లం ఫిరోజ్ నగర్ గ్రామపంచాయతీకి చెందిన మంగమ్మ కాన్పు కోసం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి సోమవారం ఉదయం వచ్చింది. ఆమెను పరీక్షించిన వైద్యులు సాయంత్రం సాధారణ కాన్పు చేద్దాం.. అంతా సిద్ధం చేయాలని నర్సులకు సూచించి వెళ్లిపోయారు. అయితే, మంగమ్మ నొప్పులు తీవ్రమవుతున్నా వైద్యులు రాకపోవటంతో నర్సులే కాన్పు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు కాన్పు చేస్తుండగా.. బిడ్డకు పేగు చుట్టుకుని ఉండడంతో ఆందోళన చెందిన నర్సులు వైద్యుడు శివరాంకు ఫోన్లో సమాచారం ఇవ్వగా ఆయన బయలుదేరగా.. వచ్చేటప్పటికే బాబు చనిపోయాడు. ఈ విషయమై వైద్యుడు శివరాంను అడగగా.. మంగమ్మ పరిస్థితిని నర్సులు తనకు చెప్పగా.. సాధారణ ప్రసవం వీలు కాకపోతే సిజేరియన్ చేద్దామని ప్రయత్నించినా అప్పటికే బిడ్డ బయటకు రావడంతో చనిపోయాడని తెలిపారు. నర్సులు కాన్పులు చేయొచ్చా అని అడిగితే.. సాధారణ కాన్పులు చేయొచ్చు కానీ క్లిష్ట పరిస్ధితి ఎదురైతే వైద్యులకు సమాచారం ఇస్తారని పేర్కొన్నారు. కానీ ఈ విషయమై మంగమ్మ బంధువులు మాట్లాడుతూ కాన్పు పూర్తిగా నర్సులే చేశారని, పూర్తిగా బిడ్డ బయటకు వచ్చాకే వైద్యుడు చేరుకున్నారని తెలిపారు. ఈ విషయం తెలియగానే కల్వకుర్తి సీఐ సురేందర్‌రెడ్డి, ఎస్సై రవి చేరుకుని బాధితులతో మాట్లాడారు. -
తొగర్‌పల్లిలో విషాదఛాయలు
కొండాపూర్(సంగారెడ్డి) : తాను లేని చోట తన పిల్లలకు దిక్కెవరూ అనుకుందో ఏమో గానీ తా నూ విషపు గుళికలు తీసుకొని చిన్నారులకు సైతం ఇచ్చింది. ఈ ఘటనలో 17 నెలల వయసు గల చిన్నారి మృతిచెందగా, మూడు సంవత్సరాలు బాబు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. సమయానికి ఆస్పత్రికి చేరుకోవడంతో తల్లి మాత్రం సురక్షితంగా ఉంది. వివరాల్లోకి వెళితే స్థానిక సీఐ రవి కథనం ప్రకారం.. మండల పరిధిలోని తొగర్పల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్‌కు ఐదు సంవత్సరాల క్రితం హత్నూర మండలం బడంపేట గ్రామానికి చెందిన లక్ష్మితో వివా హమయింది. శ్రీనివాస్, లక్ష్మి దంపతులకు ప్రణ తి (14 నెలలు), మనోజ్‌కుమార్(4) సంతానం. శ్రీనివా స్ భార్య లక్ష్మి తరచూ అనారోగ్యానికి గురయ్యేది. ఒక్కోసారి వారం రోజులు మంచంపైనే ఉన్నా ఇంట్లో ఎవరూ పలకరించేవారు కారనీ, కనీసం భర్త కూడా పలుకరించేవాడు కాదనీ ఈ క్రమంలోనే మనస్థాపానికి గురైన లక్ష్మి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకోవాలనీ నిర్ణయించుకొంది. తన మరణానంతరం తన పిల్లల భవిష్యత్ ఆలోచించి, పిల్లలు అనాథలు అవుతారనుకొని ఇంట్లోని యూరియా గుళికలను తీసి వాళ్లకు ఇచ్చి తాను మింగింది. పొలానికి వెళ్లిన భర్త తిరిగొచ్చి ప్రణతిని ఎత్తుకోవడానికి చేతిలోకి తీసుకోగా డీలా పడిపోతుంది. అనుమానం వచ్చిన శ్రీనివాస్ తన భార్యను అడగ్గా విషయం చెప్పినట్లు సీఐ తెలిపారు. వెంటనే చికిత్సకోసం మొదటగా సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ప్రణతి (14 నెలలు) మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. లక్ష్మి, మనోజ్‌కుమార్‌లకు ప్రథమ చికిత్స చేసి న అనంతరం మెరుగైన వైద్యంకోసం హైదరాబా ద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సీఐ వివరించారు. ప్రస్తుతం తల్లి లక్ష్మి ఆరోగ్యం నిలకడగా ఉండగా కుమారుడు మనోజ్‌కుమార్ పరిస్థితి మాత్రం ఇంకా విషమంగానే ఉందనీ, 3రోజుల వరకు ఏ విషయం చెప్పలేమనీ వైద్యులు తెలిపారనీ సీఐ వివరించారు. గ్రామంలో విషాదఛాయలు.. తల్లితో పాటు ఇద్దరు చిన్నారులు ఆత్మహత్యాయత్నం వార్త దావనంలా వ్యాపించడంతో తొగర్పల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 14 నెలల చిన్నారి ప్రణతి మృతి చెందడంతో బంధువుల రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి. చిన్నారి ప్రణతి అంత్యక్రియలను సోమవారం నిర్వహించారు. -
ఆస్పత్రుల ఎదుట ఆందోళన
నార్కట్‌పల్లి(నకిరేకల్) : ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న ముగ్గురు మృతి చెందారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి చెందారంటూ వారి బంధువులు ఆందోళన చేపట్టారు. ఈ సంఘటనలు మంగళవారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నకిరేకల్, నార్కట్‌పల్లి, చౌటుప్పల్‌లో చోటుచేసుకున్నాయి. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. శాలిగౌరారం మండలం ఊట్కూరు గ్రామానికి చెందిన వర్రె లక్ష్మి పార్వతమ్మ రెండో కాన్పు పురిటినొప్పులు వస్తుండడంతో సోమవారం భర్త వర్రె సత్తీష్, బంధువులు స్థానిక కామినేని ఆస్పత్రిలో చేర్పించారు. డాక్టర్ పరీక్షించి ఆపరేషన్ చేయడంతో మగబిడ్డకు జన్మనిచ్చింది. కాసేపటికి తల్లికి బ్లీడింగ్ అవుతుందని, అందుకు ఆపరేషన్ చేయాలని చెప్పి రెండుసార్లు ఆపరేషన్ చేశారు. తల్లి కన్నుమూసింది. వైద్యులు సక్రమంగా చికిత్స అందించకపోవడం మూలంగానే తమ భార్య మృత్యువాతపడిందని భర్త ఆరోపించారు. లక్ష్మిపార్వతిని చూసేందుకు వచ్చిన బంధువులు దాదాపు గంట సేపు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విషయం తెలుసుకుని ఎస్ఐ గోవర్ధన్, సీఐ క్యాస్ట్రోరెడ్డిలు సంఘటన స్ధలానికి చేరుకున్నారు. మృతురాలి బంధువులకు నచ్చచెప్పి ఆందోళన విరమింపచేశారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే తన భార్య మృతి చెందినట్లు మృతురాలి భర్త ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. నకిరేకల్‌లో చిన్నారి.. నకిరేకల్ : ఆస్పత్రిలోని డాక్టర్ల నిర్లక్ష్యంతో వైద్యం వికటించి మూడు నెలల పసిపాప మృతి చెందిందని నకిరేకల్‌లో మంగళవారం ఆ చిన్నారి తల్లిదండ్రులతో పాటు బంధువులు ఆస్పత్రి ఎదు ట ఆందోళన చేపట్టారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకల్‌లోని తాటికల్రోడ్డుకు చెందిన చినేని జానయ్య, శైలజకు చెందిన రమ్య(3నెలలు)కు సోమవారం వాంతులు విరేచనాలతో పాటు జ్వరం రావడంతో నకిరేకల్‌లోని సాయి శ్రీనివాస పిల్లల వైద్యశాలకు తీసుకువచ్చారు. సదరు డాక్టర్ వైద్య పరీక్షలు నిర్వహించి మందులు రాసి పంపించారు. చిన్నారి రమ్య మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో మంగళవారం ఉదయం అదే ఆస్పత్రికి తీసుకురాగా సదరు వైద్యశాల డాక్టర్ పాప పరిస్థితి విషమంగా ఉందని, పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లాలని తెలిపారు. దీంతో కుటుంబీకులు సదరు డాక్టర్‌మీద ఆందోళన వ్యక్తం చేసి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చిన్నారి రమ్య ప్రాణాలు కోల్పోయింది. ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్లు కూడా మృతి చెందినట్లు చెప్పడంతో రమ్య తల్లిదండ్రులు, కుటుంబీకులు సాయి శ్రీనివాస పిల్లల వైద్యశాల ముందు ఆందోళనకు దిగారు. సదరు డాక్టర్ నిర్లక్ష్యం వల్ల మా చిన్నారి మృతి చెందిందని వాపోయారు. ఆగ్రహించిన బంధువులు ఆస్పత్రి కిటికీల అద్దాలు ధ్వంసం చేశారు. సంఘటన స్థలానికి నకిరేకల్ సీఐ సుబ్బిరామిరెడ్డి ఆధ్వర్యంలో పోలీ సులు చేరుకుని చిన్నారి రమ్య తల్లిదండ్రులను, కుటుంబీకులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ విషయంపై సదరు డాక్టర్ నాంపల్లి శ్రీనివాస్‌ను వివరణ కోరగా చిన్నారి మృతికి సంబంధించి వైద్యం విషయంలో తన తప్పేమి లేదన్నారు. మూడు నెలల చిన్నారుల విషయంలో ఒక్కొక్కరికి శ్వాసకు సంబంధించిన ప్రభావాలు రావడంతో చనిపోవడానికి ఆస్కారం ఉంటుందన్నారు.