Bhumana karunakara Reddy
-
రామోజీ రూ.2 వేల కోట్లు అడిగారు
సాక్షి, తిరుపతి: ‘రామోజీరావు నాకు చాలా సన్ని హితులు. నేను ఆయనను 15 సార్లకుపైగా కలి శా. ఒకసారి వెళ్లి కలిసినప్పుడు రామోజీరావు.. ‘కరుణాకర్‌రెడ్డి గారు.. రూ.2వేల కోట్లు జగన్ నుంచి ఇప్పిస్తే ఈనాడంతా మీ గురించే రాస్తాం’ అన్నారు. ఇది వాస్తవం.. ఏ ప్రమాణానికైనా నేను సిద్ధం. తన బిడ్డలు, మనవళ్లపై ప్రమాణం చేసి కాదని రామోజీ చెప్పగలరా’ అని టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో గురువారం నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రామోజీ కుమారుడు సుమన్ తనకు బాగా తెలుసన్నారు. ఒకసారి కలిసిన సమయంలో సుమన్ తన తండ్రి అన్నమాటలను తనకు చెప్పుకుని బాధపడ్డారన్నారు. రామోజీÆకి తాను పుట్టలేదన్నారని.. అటువంటి నైజం తన తండ్రిదని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలో తాను దోపిడీ చేసినట్టయితే ఏ విచారణకైనా సిద్ధమని సవాల్ విసిరారు. 1974లో రాడికల్ స్టూడెంట్ నాయకుడిగా ఉన్న సమయంలో నిధుల సేకరణ కోసం తిరుపతిలో ‘చక్రపాణి’ సినిమాను బెనిఫిట్ షోగా వేశామని తెలిపారు. అప్పుడు వర్సిటీలో చంద్రబాబుని తాను శ్రీధర్, హైకోర్టు అడ్వకేట్ సారధి వెళ్లి కలిశామన్నారు. ఆ సమయంలో బాబు కూర్చొని, ఆయన స్నేహితుడు పడుకుని ఉన్నాడన్నారు. సినిమా టికెట్ కొనుగోలు చేయాలని అడిగితే.. నిద్రిస్తున్న తన స్నేహితుడి జేబులో ఉన్న రూ.2లను బాబు దొంగిలించి తన చేతిలో పెట్టారని తెలిపారు. -
అయోధ్యకు లక్ష వెంకన్న లడ్డూలు
తిరుమల: అయోధ్యలో సోమవారం జరుగనున్న బాల రాముని విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమానికి హాజరయ్యే భక్తులకు పంపిణీ చేయడానికి తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి వారి ప్రసాదం అయిన లక్ష లడ్డూలను రామ మందిర ట్రస్టు ప్రతినిధులకు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఆదివారం అందజేశారు. తొలుత రామ మందిరానికి చేరుకున్న కరుణాకరరెడ్డికి రామ మందిర ట్రస్టు ప్రతినిధి సాధ్వి రితంబరి సాదర స్వాగతం పలికారు. అనంతరం ఆయన రామాలయాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. తర్వాత ఆంధ్రప్రదేశ్‌తో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు, విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులతో మాట్లాడారు. కలియుగంలో తిరుమలలో స్వయంభువుగా వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారే త్రేతాయుగంలో శ్రీరామచంద్ర మూర్తి అని చెప్పారు. శ్రీవారి ప్రథమ సేవకుడిగా ఉన్న తనకు రామ మందిర ప్రారంభ మహోత్సవంలో పాల్గొనే అదృష్టం దక్కడం పూర్వజన్మ సుకృతమని ఆనందం వ్యక్తం చేశారు. రసరమ్యంగా అయోధ్యకాండ అఖండ పారాయణం లోకకల్యాణం కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ఆదివారం జరిగిన 6వ విడత అయోధ్యకాండ అఖండ పారాయణం భక్తిసాగరంలో ముంచెత్తింది. ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేసింది. అయోధ్యకాండలోని 18 నుంచి 21వ సర్గ వరకు మొత్తం నాలుగు సర్గల్లో 199 శ్లోకాలు, యోగవాశిష్టం, ధన్వంతరి మహామంత్రంలోని 25 శ్లోకాలు కలిపి మొత్తం 224 శ్లోకాలను పారాయణం చేశారు. ధర్మగిరి వేద పాఠశాల పండితులు కె.రామానుజాచార్యులు, అనంత గోపాలకృష్ణ, మారుతి శ్లోక పారాయణం చేశారు. -
టీటీడీ ఆలయాల సమాచారంతో ఆధునీకరించిన వెబ్సైట్ ప్రారంభం
సాక్షి,తిరుమల: టీటీడీ ఆలయాల సమాచారంతో ఆధునీకరించిన వెబ్సైట్ ttdevasthanams.ap.gov.in ను టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ప్రారంభించారు. టీటీడీలో 60కి పైగా ఉన్న స్థానిక, అనుబంధ ఆలయాలకు సంబంధించిన స్థలపురాణం, ఆర్జితసేవలు, దర్శన వేళలు, రవాణా వివరాలు, ఇతర సౌకర్యాలను పొందుపరిచారు. ఆలయ విశిష్టతపై ఫొటోలు, వీడియోలను అందుబాటులో ఉంచారు. జియో సంస్థ సహకారంతో టీటీడీ ఐటీ విభాగం ఈ వెబ్‌సైట్‌ను ఆధునీకరించింది. మరోసారి తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయానికి సంబంధించిన వివరాలను తెలియజేసే అధికారిక వెబ్ సైట్ పేరు మారినట్లు టీటీడీ ప్రకటించింది. టీటీడీకి సంబంధించిన వెబ్సైట్ పేరుతో ఇతర వెబ్సైట్ వస్తుండటంతో టీటీడి తాజా వెబ్సైట్ పేరు మార్పు చేసింది. శ్రీవారి భక్తులు ఇకపై టీటీడీ సంబంధించిన పూర్తి వివరాలు వెబ్ సైట్ తెలుసుకోవచ్చు. గతంలో tirupatibalaji.ap.gov.in అని ఉన్న టీటీడీ వెబ్సైట్ పేరు ఇప్పుడు ttdevasthanams.ap.gov.in గా మార్పు చేశారు. ఈ విషయాన్ని శ్రీవారి భక్తులు గమనించాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేసింది. తిరుపతి, ఇతర ప్రాంతాలలో ఉన్న టిటిడి అనుబంధ ఆలయాలుతో పాటు హిందూ ధర్మానికి విస్తృత ప్రాచుర్యం కల్పించే దిశగా అన్ని వివరాలతో కొత్త వెబ్ సైట్ ttdevasthanams.ap.gov.inను టిటిడి ఛైర్మన్ భూమన కరుణాకర రెడ్డి ప్రారంభించారు. ఆలయానికి సంబంధించిన అధికారిక వెబ్సైట్ పేరు మార్పుని 'వన్ ఆర్గనైజేషన్, వన్ వెబ్ సైట్, వన్ మొబైల్ యాప్' లో భాగంగా మార్చినట్లు వెల్లడించింది. ఇక నుంచి శ్రీవారి భక్తులు ఆన్లైన్ బుకింగ్‌ను ttdevasthanams.ap.gov.in వెబ్ సైట్ ద్వారా చేసుకోవాల్సిందిగా సూచించారు. స్వామి వారి భక్తులకు అన్ని సౌకర్యాలు ఒకే చోట లభించే విధంగా వెబ్ సైట్ పేరుని మారుస్తూ టీటీడీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఒకే సంస్థ, ఒకే వెబ్ సైట్, ఒకే మొబైల్ యాప్ ఉండాలన్న నిర్ణయంతో పేరుని మార్చినట్లు ప్రకటించింది. ఇక పై భక్తులు శ్రీవారి దర్శనం కోసం లేదా ఆలయ వివరాల కోసం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలనుకుంటే.. ఇక నుంచి కొత్త వెబ్‌సైట్‌ని ఉపయోగించాలని వెల్లడించింది. గతంలో టీటీడీ వెబ్ సైట్ పేరు టీటీడీ సేవా ఆన్ లైన్ అనే పేరుతో ఉండేది. అనంతరం టీటీడీ వెబ్‌సైట్‌ను tirupatibalaji.ap.gov.inగా మార్చారు. ఇప్పుడు ఆ పేరుని కూడా మార్చి.. ttdevasthanams.ap.gov.inగా కొత్త పేరుని పెట్టారు. ఈ కొత్త వెబ్ సైట్ లో తిరుపతిలో టీటీడీ పరిధిలో ఉన్న ఆలయాలతో పాటు.. అనుబంధ ఆలయాలకు సంబంధించిన వివరాలు, చరిత్రతో సహా శ్రీవారి దర్శన వేళలు, ఆర్జిత సేవలు, రవాణ వివరాలు, బస సహా ఇతర వివరాలను భక్తులు తెలుసుకోవచ్చు. అంతేకాదు, ఈ వెబ్ సైట్ ద్వారా శ్రీవారి ఆలయ విశిష్టతపై ఫొటోలు, వీడియోలను భక్తులకు అందుబాటులో ఉంచారు. -
శాస్త్రోక్తం కైశికద్వాదశి ఆస్థానం
తిరుమల: కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో శుక్రవారం కైశిక ద్వాదశి ఆస్థానం శాస్త్రోక్తం నిర్వహించారు. ఉదయం 4.45 నుంచి 5.45 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తి ఆలయ మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. వేంకటతురైవార్, స్నపనబేరంగా పిలిచే ఉగ్రశ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా ఒక్క కైశిక ద్వాదశి రోజు మాత్రమే సూర్యోదయానికి ముందు మాడవీధులలో ఊరేగిస్తారు. అనంతరం ఉదయం 6 నుంచి ఉదయం 7.30 గంటల వరకు స్వామి, అమ్మవార్లను బంగారు వాకిలి చెంత వేంచేపు చేసి అర్చకులు పురాణ పఠనంతో కైశిక ద్వాదశి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుమల పెద్ద జీయర్‌స్వామి, తిరుమల చిన్నజీయర్‌స్వామి, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు పలువురు పాల్గొన్నారు.తిరుమల వసంత మండపంలో శ్రీతులసి దామోదర పూజ ఘనంగా నిర్వహించారు. అలాగే తిరుమలలో చక్రతీర్థ ముక్కోటి శాస్త్రోక్తం జరిపారు. 26న కార్తీక పర్వదీపోత్సవం..27న పౌర్ణమి గరుడసేవ శ్రీవారి ఆలయంలో ఆదివారం సాలకట్ల కార్తీక పర్వదీపోత్సవం జరగనుంది. శ్రీవారికి సాయంకాల కైంకర్యాలు, నివేదనలు పూర్తయిన తర్వాత ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో సహస్రదీపాలంకరణ సేవను టీటీడీ రద్దు చేసింది. కాగా, పౌర్ణమి సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఈ నెల 27న గరుడసేవ జరగనుంది. రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. -
టీటీడీ నిధులతో నిర్మాణాలకు పెద్దపీట
తిరుమల: టీటీడీ నిధులతో వివిధ నిర్మాణాలు చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి వెల్లడించారు. మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. సమావేశంలో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి, దేవదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, జేఈవోలు సదాభార్గవి, వీరబ్రహ్మం, బోర్డు సభ్యులు హాజరయ్యారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి మీడియాకు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. తిరుపతి సమీపంలోని పుదిపట్ల జంక్షన్ నుంచి వకుళమాత ఆలయం వద్ద జాతీయ రహదారి వరకు నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణానికి రూ.21.10 కోట్లతో టెండర్ ఆమోదం. ఇది పూర్తయితే తిరుపతికి పూర్తిగా ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పడుతుంది. ► ఎస్వీ ఆయుర్వేద ఆస్పత్రిలో రోగులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు రూ.1.65 కోట్లతో గ్రౌండ్ ఫ్లోర్ అభివృద్ధి పనులకు టెండర్ ఆమోదం. ► తిరుపతిలో శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి రుయా ఆస్పత్రిలో నూతన టీబీ వార్డు నిర్మాణానికి రూ.1.79 కోట్లతో టెండర్ ఆమోదం. ► స్విమ్స్ ఆస్పత్రిలో మరింత మంది రోగుల సౌకర్యం కోసం రూ.3.35 కోట్లతో ప్రస్తుతం ఉన్న భవనంపై మరో రెండు అంతస్తుల నిర్మాణానికి టెండరు ఆమోదం. ► స్విమ్స్‌లో నూతన కార్డియో న్యూరో బ్లాక్ నిర్మాణానికి రూ.74.24 కోట్లతో టెండర్ ఖరారు. ► స్విమ్స్ ఆస్పత్రి భవనాల ఆధునికీకరణకు, పునర్నిర్మాణానికి రూ.197 కోట్లతో చేపట్టే పనులకు పరిపాలనా అనుమతికి ఆమోదం. మూడేళ్లలో దశలవారీగా చేపట్టేందుకు నిర్ణయం. ► నడక దారుల్లో భక్తుల భద్రత కోసం డిజిటల్ కెమెరా ట్రాప్‌లు, వైల్డ్ లైఫ్ మానిటరింగ్ సెల్, కంట్రోల్ రూమ్‌కు అవసరమైన పరికరాల కొనుగోలుకు రూ.3.5 కోట్ల మంజూరుకు ఆమోదం. ► కరీంనగర్లో శ్రీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి రూ.15.54 కోట్ల పనులకు టెండర్ ఆమోదం. 23న విశేష హోమం ► శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ఈ నెల 23న అలిపిరి వద్దగల సప్తగోప్రదక్షిణ మందిరంలో ప్రారంభం. ఇందుకోసం టికెట్ ధర రూ.1000గా నిర్ణయం. ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌లో టికెట్లు కేటాయిస్తారు. ప్రత్యక్షంగా, వర్చువల్‌గా పాల్గొనవచ్చు. ఈనెల 16న టీటీడీ ఆన్లైన్లో టికెట్లు విడుదల చేస్తారు. ► టీటీడీలో కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ను రాష్ట్ర ప్రభుత్వ జీవో 114 విధివిధానాలకు లోబడి టీటీడీలో అమలుకు నిర్ణయం. ► తిరుపతిలోని ఎస్వీ శిల్ప కళాశాలలో సంప్రదాయ కలంకారీ, శిల్పకళలో ప్రాథమిక శిక్షణ సాయంకాలం కోర్సులు ప్రవేశపెట్టాలని నిర్ణయం. -
అయ్యో.. ఆరేళ్లకే నూరేళ్లు!
తిరుమల/కోవూరు: తిరుమల కొండపై తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అలిపిరి నడకదారిలో శుక్రవారం రాత్రి ఆరేళ్ల చిన్నారి నడుస్తుండగా అకస్మాత్తుగా ఓ వన్యమృగం చేసిన దాడిలో మృత్యువాత పడింది. నరసింహస్వామి ఆలయం సమీపంలోని అటవీ ప్రాంతం వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు మండలం, పోతిరెడ్డిపాళేనికి చెందిన దినేష్ కుమార్, తన భార్య శశికళ, కుమార్తె లక్షిత (6), కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం తిరుపతికి చేరుకున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు వారంతా అలిపిరి నడకమార్గం ద్వారా తిరుమలకు బయల్దేరారు. రాత్రి 7.30 గంటల సమయంలో నరసింహస్వామి ఆలయం సమీపంలో బాలిక అదృశ్యమైంది. తల్లిదండ్రుల కంటే ముందుగానే ఆ చిన్నారి నడుస్తుండడంతో వేరే భక్తుల గుంపులో కలిసి వెళ్లి ఉంటుందని తల్లిదండ్రులు తొలుత భావించి వెతకడం ప్రారంభించారు. ఎంతకూ కనపడకపోవడంతో చివరికి భద్రతా సిబ్బందికి తెలిపారు. రాత్రి 10.30కు తిరుమల టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తిరుమల వన్‌టౌన్ సీఐ జగన్మోహన్రెడ్డి, టూటౌన్ సీఐ చంద్రశేఖర్ అటవీ ప్రాంతంలో గాలింపు చేపట్టారు. రాత్రి నుంచి 70 మంది టీటీడీ, అటవీశాఖ సిబ్బంది, పోలీసులు గాలింపు చేపట్టారు. శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో నరసింహస్వామి ఆలయం సమీపంలోని నడకదారి నుంచి 150 మీటర్ల దూరంలో ఉన్న అటవీ ప్రాంతంలో బాలిక మృతదేహాన్ని గుర్తించారు. పూర్తిగా ముఖాన్ని జంతువు తినడంతోపాటు కాలిని తీవ్రంగా గాయపర్చింది. దీంతో బాలిక అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలుస్తోంది. చిరుత లేదా ఎలుగుబంటి దాడిచేసి ఉండవచ్చని భావిస్తున్నారు. తిరుమల అదనపు ఎస్పీ మునిరామయ్య, వీజీఓ బాలిరెడ్డి, టూ టౌన్ ఎస్ఐ సాయినాథ్ చౌదరి బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రుయా ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా కలిచివేసింది: ఈఓ ధర్మారెడ్డి చిన్నారి మృతి తమను తీవ్రంగా కలిచివేసిందని టీటీడీ ఈఓ ధర్మారెడ్డి తెలిపారు. ఘటనాస్థలాన్ని ఆయన పరిశీలించారు. మృతురాలి కుటుంబానికి టీటీడీ నుంచి రూ.5 లక్షలు, అటవీశాఖ నుంచి రూ.5 లక్షలు అందిస్తామని చెప్పారు. బాలిక ఒంటరిగా వెళ్లడాన్ని సీసీ కెమెరాల్లో గుర్తించామన్నారు. బాలిక నరసింహస్వామి ఆలయానికి సమీపంలో నడకదారి నుంచి పక్కకు అటవీ ప్రాంతంలోకి ఆడుకుంటూ వెళ్లినట్లు అనుమానిస్తున్నామన్నారు. ఎందుకంటే.. బాలిక ఆటవస్తువులు అటవీ ప్రాంతంలోనే దొరికాయని తెలిపారు. ఈ సమయంలో వన్యమృగం దాడిచేసి తీసుకెళ్లినట్లు తెలుస్తోందన్నారు. భద్రత విషయంలో రాజీలేదు: భూమన తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తేలేదని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి స్పష్టంచేశారు. ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులపై ఆయన అధికారులతో ఆయన మాట్లాడారు. అనంతరం బాలిక లక్షిత మృతదేహం లభించిన ప్రాంతాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ ఘటనలో ఎవరి నిర్లక్ష్యంలేదని చెప్పారు. పోతిరెడ్డిపాళెంలో విషాదఛాయలు ఆడుతూ పాడుతూ ఉన్న చిన్నారి వన్యమృగం దాడిలో మృతిచెందిందన్న విషయం తెలుసుకున్న పోతిరెడ్డిపాళెం గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. బాలిక మృతి వార్త కుటుంబ సభ్యులకు తెలియడంతో గ్రామంలో రోదనలు మిన్నంటాయి. దినేష్ ఇంటి వద్దకు గ్రామస్తులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి వెంటనే టీటీడీ బోర్డు చైర్మన్ భూమన, ఈఓ ధర్మారెడ్డికి ఫోన్‌చేసి బాధిత కుటుంబానికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. అధికారులతో అత్యవసర సమావేశం అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో మరింత భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు టీటీడీ, అటవీ పోలీస్ అధికారులతో జరిపిన అత్యవసర సమావేశంలో ఈఓ ధర్మారెడ్డి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ నడకమార్గంలో 500 సీసీ కెమెరాలు ఏర్పాటుచేస్తామని తెలిపారు. నడక మార్గానికి ఇరువైపులా కంచె ఏర్పాటుకు సమగ్ర నివేదిక అందించాలని డీఎఫ్ఓను ఆదేశించామన్నారు. వన్యమృగాన్ని బంధించేందుకు బోను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతీ 100 మంది భక్తుల గుంపునకు సెక్యూరిటీ సిబ్బంది ఏర్పాటుకు అనుమతిస్తామని చెప్పారు. నడకదారుల్లో మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు మాత్రమే భక్తులను అనుమతించే అంశాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. చిన్నపిల్లలతో నడకమార్గాల్లో వచ్చే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని ఈఓ విజ్ఞప్తి చేశారు. సీసీఎఫ్ నాగేశ్వరరావు మాట్లాడుతూ బోన్ల ద్వారా నడక మార్గాల్లో సంచరించే వన్యమృగాలను బంధిస్తామన్నారు. -
శ్రీహరి కరుణ
ఆ కలియుగ వేంకటేశ్వరుడికి సేవచేసే భాగ్యం దక్కడం అత్యంత అరుదు. అదే రెండో పర్యాయం ఆ స్వామికి సేవ చేయడమంటే నిజంగా అదృష్టమే. అది ఆ శ్రీహరి కరుణే! ఈ అరుదైన అవకాశం తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డికి దక్కింది. ఆయనను టీటీడీ చైర్మన్‌గా నియమిస్తూ రాష్ట్ర దేవదాయశాఖ శనివారం ఉత్తర్వులు విడుదల చేసింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో భూమన టీటీడీ చైర్మన్‌గా నియమితులవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. తిరుమల: తిరుమల, తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్‌గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మరోమారు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర దేవదాయశాఖ శనివారం ఉత్తర్వులు విడుదల చేసింది. ప్రస్తుతం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పదవీకాలం మరికొన్ని రోజుల్లో ముగియనుంది. ఆయన స్థానంలో ప్రస్తుత తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్న భూమన చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా భూమన చేతికి టీటీడీ పగ్గాలు రావడం ఇది రెండోసారి. 2006–2008 మధ్య కాలంలో టీటీడీ చైర్మన్‌గా కొనసాగారు. సంస్కరణలకు మారుపేరు భూమన గతంలో భూమన కరుణాకరరెడ్డి అనేక సంస్కరణలు తీసుకొచ్చి టీటీడీ ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేశారు. ఇందులో కొన్ని విశేష ఆదరణ పొంది దేశవిదేశాల్లోనూ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్నాయి. అందులో మచ్చుకు కొన్ని.. ► దళిత గోవిందం కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అసమానతలు, అంటరానితనాన్ని నిర్మూలించడానికి భూమన నడుంబిగించారు. దళితవాడల్లో శ్రీవారి ఆలయాలు నిర్మించి దేవుడి వద్ద అందరూ సమానమనే భావన సమాజానికి చాటిచెప్పారు. ► కల్యాణోత్సవాలు సైతం నిర్వహించారు. అప్పట్లో ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. పేదలైన శ్రీవారి భక్తులు వివాహాన్ని చేయలేని స్థితిలో ఉన్న వారి కోసం కల్యాణమస్తు అనే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ► ప్రత్యేక క్యూ ఏర్పాటు చేసి ఏడాదిలోపు చంటి పిల్లలు, వారి తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా శ్రీవారి దర్శనం కల్పించారు. ► శ్రీవారి వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటేలా 2007లో ఎస్వీబీసీ భక్తి చానల్‌ను స్థాపించారు. ఇది దినదినాభివృద్ధి చెంది ప్రస్తుతం నాలుగు భాషల్లో భక్తులకు శ్రీవారి వైభవాన్ని ప్రసారం చేస్తోంది. ► చైతన్య రథయాత్ర, ఎస్వీబీసీ చానల్ ఏర్పాటు, విద్యాధన పథకం, టీటీడీ స్కూల్ పిల్లలకు ఉచిత పుస్తకాలు, మహిళా క్షురకులు, షెడ్యూల్ కులాలకు చెందిన వారికి అర్చకులుగా ట్రైనింగ్, ఉచిత లడ్డూ, శ్రవణం ప్రాజెక్ట్, పీఠాధిపతులతో ధార్మిక సదస్సులు, రాజంపేట సమీపంలో 108 అడుగుల అన్నమయ్య విగ్రహం ఇలా.. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. అరుదైన అవకాశం ముఖ్యమంత్రులైన తండ్రీకొడుకుల వద్ద టీటీడీ చైర్మన్‌గా కొనసాగే అరుదైన అవకాశం భూమనకు దక్కింది. ఆయన వైఎస్ కుటుంబానికి అత్యంత ఆప్తుడు. ప్రజాప్రస్థానం పేరుతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన పాదయాత్రలో చురుగ్గా పాల్గొన్నారు. 2006 నుంచి రెండేళ్లపాటు టీటీడీ చైర్మన్‌గా కొనసాగారు. వైఎస్సార్ మరణానంతరం ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ పార్టీ అభివృద్ధికి విశేష కృషి చేశారు. ఈనేపథ్యంలో 2012 ఉప ఎన్నికల్లో.. 2019 సాధారణ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున తిరుపతి నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయనపై నమ్మకంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోమారు టీటీడీ చైర్మన్ పదవిని కట్టబెట్టారు.ఆ కలియుగ వేంకటేశ్వరుడికి సేవచేసే భాగ్యం దక్కడం అత్యంత అరుదు. అదే రెండో పర్యాయం ఆ స్వామికి సేవ చేయడమంటే నిజంగా అదృష్టమే. అది ఆ శ్రీహరి కరుణే! ఈ అరుదైన అవకాశం తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డికి దక్కింది. ఆయనను టీటీడీ చైర్మన్‌గా నియమిస్తూ రాష్ట్ర దేవదాయశాఖ శనివారం ఉత్తర్వులు విడుదల చేసింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో భూమన టీటీడీ చైర్మన్‌గా నియమితులవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. -
తిరుపతి పాత పేర్లు తెలుసా? ఆ ఆధ్యాత్మిక నగరం ఆవిర్భవించింది నేడే!
తిరుమలను తలచుకుంటే.. గోవింద నామం మనస్సులో మార్మోగుతుంది. కలియుగ ప్రత్యక్ష దైవం మనో నేత్రం ఎదుట ప్రత్యక్షమవుతారు. ఏడు కొండలవాడు కొలువైన తిరుమల ఆలయంతోపాటు ఆయన పాదాల చెంత ఉన్న తిరుపతి నగరం ఆవిర్భావమూ ఆసక్తికరమే. కలియుగం (కలియుగం మొదలై ఫిబ్రవరి 13వ తేదీ నాటికి 5,125 ఏళ్లు పూర్తయింది)లో శ్రీనివాసుడు ఏడు కొండలపై శిలారూపంలో కొలువుదీరగా.. ఆ స్వామిని కొలిచే భక్తుల ఆవాసాల కోసం ఏడు కొండల దిగువన తిరుపతి వెలసింది. పూర్వం తిరుమల చుట్టూ అడవులు, కొండల నడుమ అలరారే శ్రీవారి ఆలయం మాత్రమే ఉండేది. భక్తులు క్రూర జంతువుల భయంతో గుంపులుగా కాలినడకన తిరుమల యాత్ర చేసేవారు. పూర్వం శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణ, ధ్వజారోహణం మాత్రమే తిరుమల కొండపై నిర్వహించేవారు. వాహన సేవలన్నీ తిరుచానూరులోనే నిర్వహించేవారు. ప్రతిరోజూ తిరుచానూరు నుంచి తిరుమలకు వెళ్లి రావటం ఇబ్బందిగా ఉండటంతో అర్చకులు కపిల తీర్థం వద్ద నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ ప్రాంతం పేరు కొత్తూరు, కోటవూరుగా పిలిచేవారు. – (సాక్షి, ఏపీ నెట్వర్క్) రామానుజాచార్యులచే శంకుస్థాపన శ్రీనివాసుని పూజా కైంకర్యాలను వైఖానస సంప్రదాయంలో కొనసాగించాలని నిర్దేశించిన జగద్గురువు రామానుజాచార్యులు అర్చకుల నివాసాల కోసం తిరుచానూరు–తిరుమల మధ్య నేటి పార్థసారథి ఆలయ ప్రాంతాన్ని ఎంపిక చేశారు. శ్రీరంగం నుంచి శ్రీరంగనాథస్వామి శిలావిగ్రహాన్ని తెప్పించి పార్థసారథి సన్నిధికి పక్కన ప్రతిష్టించేందుకు ఆలయాన్ని నిర్మించారు . ఆ విగ్రహాన్ని తరలించే సమయంలో స్వల్పంగా దెబ్బ తినటంతో దాన్ని పక్కన పెట్టి.. ఆ ఆలయంలో గోవిందరాజస్వామిని తిరుమలేశుని ప్రతిరూపంగా ప్రతిష్టించారు. పక్కనపెట్టిన రంగనాథస్వామి విగ్రహం ప్రస్తుతం మంచినీళ్ల కుంట ఒడ్డున దర్శనమిస్తోంది. ఆ తర్వాత 1130వ సంవత్సరం ఫిబ్రవరి 24వ తేదీన గోవిందరాజస్వామి ఆలయం నాలుగు వైపులా మాడ వీధులు, అందులో అర్చకుల నివాసాలకు రామానుజాచార్యులు శంకుస్థాపన చేశారు. ఆ బ్రాహ్మణ అగ్రహారాన్నే తర్వాత గోవిందపట్నంగా.. రామానుజపురంగా పిలిచేవారు. ఆ తరువాత 1220–40 మధ్యకాలం నుంచి తిరుపతిగా పేరొందింది. అప్పటినుంచి తిరుపతిలో ఆవాసాలు, ఆలయాలు పెరుగుతూ వచ్చి ఆధ్యాత్మిక నగరంగా రూపుదిద్దుకుంది. 120 సంవత్సరాల సుదీర్ఘ జీవితాన్ని గడిపిన రామానుజాచార్యులు మూడుసార్లు తిరుమలకు వచ్చారని ఆధారాలను బట్టి తెలుస్తోంది. ఆయన తన 112వ ఏట గోవిందరాజస్వామి విగ్రహ ప్రతిష్ఠ, మాడ వీధులకు శంకుస్థాపన చేశారు. దీని ప్రకారం తిరుపతి ఆవిర్భవించి ఈ నెల 24వ తేదీకి 893 సంవత్సరాలు అవుతోంది. వెలుగులోకి తెచ్చిన భూమన వెలుగుచూసిన అంశాలపై తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి సమగ్ర అధ్యయనం చేయించి 2022 ఫిబ్రవరి 24న తొలిసారిగా తిరుపతి 892వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఈ ఏడాది టీటీడీ, తిరుపతి నగరపాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో 893వ పుట్టిన రోజు వేడుకను ఘనంగా నిర్వహించనున్నట్టు భూమన ప్రకటించారు. ఆ వేడుకల్లో భాగంగా నగర వాసులందరూ భాగస్వాములయ్యే విధంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు నాలుగు మాడవీధుల్లో మహా ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పరమ పవిత్రం తిరుపతి ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి పరమ పవిత్రమైనది. ముక్కోటి దేవతలు శ్రీగోవిందరాజస్వామిని కొలుస్తారు. ఇక్కడ స్థానికులతో పాటు అనేక మంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడిన వారు ఉన్నారు. తిరుపతి ప్రాముఖ్యత గురించి తెలియజేయాలన్నదే నా తపన. ప్రతి ఒక్కరూ నగర ప్రాభవాన్ని కాపాడుకోవాలి. తిరుపతి వైభవాన్ని చాటిచెబుదాం. శ్రీవారి నిలయమైన తిరుపతి ఆవిర్భావ వేడుకలను కలిసిమెలసి జరుపుకుందాం. – భూమన కరుణాకరరెడ్డి, ఎమ్మెల్యే, తిరుపతి -
మూడు రాజధానులకే మా మద్దతు
తిరుపతి తుడా: మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయానికి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ మద్దతు తెలిపింది. ఈ మేరకు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. మునిసిపల్ కార్యాలయంలో మేయర్ శిరీష అధ్యక్షతన మంగళవారం అత్యవసర సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ప్రత్యేక ఆహ్వానితుడిగా పాల్గొన్న ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మూడు రాజధానుల ఆవశ్యకతను వివరించారు. తీర్మానాన్ని నగర మేయర్ డాక్టర్ ఆర్.శిరీష బలపరచగా.. డిప్యూటీ మేయర్లు ముద్రనారాయణ, భూమన అభినయ్‌రెడ్డి, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు సంపూర్ణ మద్దతు తెలిపారు. సభ్యుల్లో ఒక్కరు కూడా రాజధాని వికేంద్రీకరణను వ్యతిరేకించకపోవడంతో తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందిందని మేయర్ శిరీష ప్రకటించారు. కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వానికి నివేదించనున్నట్టు ఆమె చెప్పారు. ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ.. దశాబ్దాలుగా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు వెనుకబాటుకు గురవుతున్నాయన్నారు. మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు కర్నూలును రాజధాని చేస్తామని చెప్పి నమ్మించారన్నారు. ఆపై తెలంగాణ ప్రాంతాన్ని విలీనం చేస్తూ ఉమ్మడి ఏపీ ఏర్పడినప్పుడు కర్నూలులో ఉన్న రాజధానిని హైదరాబాద్‌కు తన్నుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఏపీ విడిపోతే కర్నూలుకు రావాల్సిన రాజధానిని కుట్రపూరితంగా, దురుద్దేశంతో అమరావతిలో ఏర్పాటు చేశారన్నారు. రాయలసీమకు రావాల్సిన నీటి ప్రాజెక్టులను సైతం అడ్డుకున్న నీచుడు చంద్రబాబని దుయ్యబట్టారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను తుంగలో తొక్కి రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం చంద్రబాబు అమరావతిని రాజధాని చేశారని ధ్వజమెత్తారు. సీఎం వైఎస్ జగన్ రాష్ట్రమంతా అభివృద్ధి చెందాలని ఆశిస్తుంటే.. అందుకు విరుద్ధంగా చంద్రబాబు 29 గ్రామాలకే న్యాయం జరగాలని పట్టుబట్టడం సిగ్గుచేటన్నారు. రాజధాని, పాలన వికేంద్రీకరణతోనే రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి సాధ్యమన్నారు. అన్ని ప్రాంతాలకు సమానంగా విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మూడు రాజధానులతోనే సాధ్యమవుతాయని చెప్పారు. భవిష్యత్తులో వేర్పాటువాదం రాకూడదన్న ముందు చూపుతోనే సీఎం జగన్ గొప్ప నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. అయితే చంద్రబాబు అండ్ కో వికేంద్రీకరణను అడ్డుకుంటున్నారని విమర్శించారు. వికేంద్రీకరణకు సీమవాసులంతా మద్దతు ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు. కాగా ఇటీవల రాయలసీమ ఆత్మగౌరవ మహాప్రదర్శన విజయవంతం చేసిన భూమన కరుణాకరరెడ్డికి మునిసిపల్ కౌన్సిల్ అభినందనలు తెలిపింది. -
Tirupati: రాయలసీమ గర్జన.. తిరుపతి జన సంద్రం (ఫొటోలు)
-
చంద్రబాబు రాయలసీమ ద్రోహి: ఎమ్మెల్యే భూమన
-
'రాయలసీమను రతనాలసీమగా మార్చే సత్తా సీఎం జగన్‌కే'
సాక్షి, తిరుపతి: వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాలకు న్యాయం జరుగుతుందని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని, రాయలసీమ హక్కులు కాపాడాలని కోరుతూ ప్రజలు ఏకమవుతున్నారు. శనివారం తిరుపతి వేదికగా ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మగౌరవ గర్జన, వికేంద్రీకరణకు మద్దతుగా రాయలసీమ ఆత్మగౌరవ మహా ర్యాలీ నిర్వహించారు. ఈ మహా ప్రదర్శనలో విద్యార్థులు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, వ్యాపారులతోపాటు విద్యాసంస్థల యాజమాన్యాలు, ప్రజసంఘాలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా రాయలసీమను రతనాలసీమగా మార్చే సత్తా సీఎం జగన్‌కే ఉందంటూ నినాదాలు చేశారు. మహాప్రదర్శనతో తిరుపతి జనసంద్రంగా మారింది. మహార్యాలీలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు రాయలసీమ ద్రోహి. రాయలసీమకు బాబు చేసిందేమీ లేదు. కర్నూలును న్యాయరాజధాని చేయడం ద్వారా మరింత ప్రగతి సాధించవచ్చు. మూడు రాజధానులను అన్ని ప్రాంతాల ప్రజలు స్వాగతిస్తున్నారు. వికేంద్రీకరణతోనే అని ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే భూమన పేర్కొన్నారు. -
రైతుల యాత్ర పేరుతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ యాత్ర చేయిస్తున్నారు : ఎమ్మెల్యే భూమన
-
కన్యాశుల్కం నాటకంతో సాంఘిక దురాచారాలను రూపుమాపారు: భూమన
-
టీటీడీ ప్రత్యేక ఆహ్వానితునిగా ‘భూమన’కు అనుమతి
సాక్షి, అమరావతి: టీటీడీ ప్రత్యేక ఆహ్వానితునిగా కొనసాగేందుకు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డికి హైకోర్టు అనుమతిచ్చింది. 52 మందిని టీటీడీ ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీఓలను సవాలు చేస్తూ పిల్ దాఖలు కావడం.. ఆ జీఓలపై స్టే విధించడం తెలిసిందే. ఈ వ్యాజ్యాలు మంగళవారం మరోసారి ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చాయి. గతంలో ఇచ్చిన స్టే ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ భూమన దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ కూడా విచారణకు వచ్చింది. భూమన స్థానిక ఎమ్మెల్యే అయినందున ఆయన విషయంలో స్టే ఉత్తర్వులను సడలిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మిగిలిన ఆహ్వానితుల విషయంలో స్టే కొనసాగుతుందని స్పష్టం చేసింది. ప్రత్యేక ఆహ్వానితుల నియామకం నిమిత్తం ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చిన నేపథ్యంలో కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి, పిటిషనర్లకు అనుమతినిచ్చింది. తదుపరి విచారణను మార్చి 11కి వాయిదా వేసింది. -
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే భూమన పర్యటన
-
జాతిని మేల్కొలిపిన యుగకర్త శ్రీశ్రీ
తిరుపతి కల్చరల్ : తన రచనలతో జాతిని మేల్కొలిపిన యుగకర్త శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ) అని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి కొనియాడారు. మానవ వికాస వేదిక, రాజా చంద్ర ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్లో సోమవారం శ్రీశ్రీ స్వీయ దస్తూరితో రాసిన మహాప్రస్థానం గ్రంథావిష్కరణ సభ నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీశ్రీతో తనకున్న అనుభవాలు, జ్ఞాపకాలను పంచుకుంటూ ప్రస్థానం గీతాలను ఆలపించారు. శ్రీశ్రీ రచనలు జన హృదయాలను ప్రభావితం చేసేలా సాగాయన్నారు. చలం చెప్పినట్లు శ్రీశ్రీ కవిత్వం తెలుగు జాతిని ఊగించి, శాసించి, లాలించిందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. తిరుపతితో పాటు వ్యక్తిగతంగా శ్రీశ్రీకి విడదీయరాని అనుబంధం ఉందన్నారు. తన సోదరుడు భూమన కారణంగా శ్రీశ్రీ ప్రభావం తనపై పడిందన్నారు. ఆయనతో ఉన్న తనకున్న అనుభవాలను, మధురస్మతులను పంచుకుననారు. చిన్ననాటి నుంచి ఆయన రచనలు తనపై ఎంతో ప్రభావం చూపాయన్నారు. ‘కవి’యుగ దైవం శ్రీశ్రీ సినీ గేయ రచయిత భువనచంద్ర మాట్లాడుతూ.. కలాన్ని జయించిన వ్యక్తి శ్రీశ్రీ అని కొనియాడారు. శ్రీరంగం కవిత్వం చదవని వారు రచయితలే కాదని నమ్ముతున్నట్లు తెలిపారు. కలియుగ దైవం శ్రీవారు అయితే ‘కవి’యుగ దైవం శ్రీశ్రీ అని కొనియాడారు. శ్రీవారి పాదాల చెంత మొట్టమొదటి డబ్బింగ్ సినిమా రచనకు ఆధ్యుడు శ్రీశ్రీనే అని గుర్తు చేసుకున్నారు. ఆయన అక్షర విలువను ఎంచడం ఎవరి తరం కాదన్నారు. ఎన్ని సిరులు వెళ్లినా శ్రీశ్రీ మాత్రం మననుంచి వదలి వెళ్లలేదని అభిప్రాయపడ్డారు. మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ అద్భుత కవితల ప్రవకర్త శ్రీశ్రీ అని కొనియాడారు. తెలుగు సాహిత్యాన్ని ఆకాశం నుంచి నేల మీదకు దింపారని అన్నారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి కళాపోషకుడిగా తెలుగు వైభవాన్ని చాటిన ఘనుడని కొనియాడారు. తన బిడ్డకు రాజకీయ వారసత్వంతో పాటు సాంస్కతిక వారసత్వాన్ని అందించారన్నారు. కార్పొరేషన్ డెప్యూటీ మేయర్ భూమన అభినయ్‌రెడ్డి మాట్లాడుతూ.. నేటి తరానికి, యువతరానికి శ్రీశ్రీ రచనలు ఓ చైతన్య దీపికలుగా నిలుస్తాయన్నారు. అంతటి మహనీయుడు రచించిన మహాప్రస్థానం గ్రంథావిష్కరణ తన చేతుల మీదుగా జరగడం మహద్భాగ్యమని తెలిపారు. పుస్తక ప్రచురణ కర్తకు రూ.20 వేలు బహుమతిగా అందజేశారు. పుస్తకావిష్కరణ చేసిన అభినయ్ రెడ్డి తిరుపతి నగర డెప్యూటీ మేయర్ భూమన అభినయ్ చేతుల మీదుగా శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని ఆవిష్కరించారు. తొలి ప్రతిని రచయిత నామిని సుబ్రహ్మణ్యంనాయుడికి, రెండో ప్రతిని విశ్రాంత ప్రిన్సిపల్ పెద్ది సత్యనారాయణకు అందజేశారు. కార్యక్రమంలో శ్రీశ్రీ ప్రింటర్స్ అధినేత విశ్వేశ్వరరావు, రాజాచంద్ర ఫౌండేషన్ వ్యవస్థాపకుడు దుర్గాప్రసాద్, కార్పొరేషన్ మేయర్ శిరీషా, మానవ వికాస వేదిక కనీ్వనర్లు సాకం నాగరాజు, శైలకుమార్, పలువురు కవులు, రచయితలు, సాహితీ వేత్తలు పాల్గొన్నారు. -
మహిళలకు బ్రహ్మాస్త్రం దిశా యాప్ : భూమన కరుణాకర్ రెడ్డి
-
ఎమ్మెల్యే భూమనకు మరోసారి కరోనా
సాక్షి, తిరుపతి : తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డికి మరోసారి కరోనా సోకింది. బుధవారం ఆయన కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని రిపోర్టు వచ్చింది. దీంతో గురువారం ఆయనకు రుయా ఆస్పత్రిలో మరోసారి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆయనకు బీపీ, షుగర్ నార్మల్‌గా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. (కరోనా కష్టంతో 9.6% క్షీణత) ఎంపీ కోటగిరి శ్రీధర్‌కు కరోనా పాజిటివ్ ఏలూరు టౌన్: ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆయన హైదరాబాదులో హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఆయనతో పాటు మరో నలుగురు కార్యాలయ సిబ్బందికి పాజిటివ్ అని తేలింది. గత వారం రోజుల్లో తనను కలిసిన వారందరూ కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని ఎంపీ కోటగిరి శ్రీధర్ విజ్ఞప్తి చేశారు. -
ఎమ్మెల్యే భూమనకు సీఎం జగన్ పరామర్శ
సాక్షి, తాడేపల్లి: కరోనా బారినపడి కోలుకుంటున్న తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో పరామర్శించారు. తాను క్షేమంగా ఉన్నానని ఎమ్మెల్యే భూమన ఈ సందర్భంగా సీఎంకు తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని సీఎం వైఎస్ జగన్ ఆకాక్షించారు. కాగా, తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో భూమన కరుణాకర్‌రెడ్డి చికిత్స పొందుతున్నారు. ఇక భూమన కుమారుడు అభినయ రెడ్డి కూడా కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. (చదవండి: ఆ లేఖ నా వ్యక్తిగత నిర్ణయం : భూమన) -
మానవ జీవితమంటే సేవ చేయటమే
-
ప్రాణాలకు తెగించి వైద్యబృందం సేవలు
తిరుపతి తుడా: కనిపించని శత్రువుతో ప్రాణాలకు తెగించి వైద్య బృందం అనితరమైన సేవలు అందిస్తోందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ప్రశంసించారు. రానున్న క్లిష్ట సమయంలో మరింత సేవలు అందించాల్సి ఉందన్నారు. బుధవారం రుయా ఆసుపత్రిలో కోవిడ్–19పై అత్యవసర సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేతో కలిసి జిల్లా కలెక్టర్ నారాయణ భరత్‌గుప్తా, నగరపాలక కమిషనర్ గిరీషా, జేసీ–2 వీరబ్రహ్మం, అసిస్టెంట్ కలెక్టర్ విష్ణుచరణ్, రుయా హెచ్ఓడీలు, డాక్టర్లతో సమీక్షించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, కరోనా విపత్తులో డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, అధికారులు అందిస్తున్న సేవల గురించి ఎంత చెప్పినా తక్కువేనన్నారు. జిల్లా కలెక్టర్ కోరితే అవసరమైన పక్షంలో శ్రీవారి సేవకుల సేవలు కూడా అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రాబోవు రోజుల్లో కేసుల తీవ్రత అధికం : కలెక్టర్ కలెక్టర్ మాట్లాడుతూ, రాబోవు 15 రోజుల్లో కేసుల నమోదు తీవ్రత అధికంగా ఉండబోతోందని, దీనిని దృష్టిలో ఉంచుకుని సేవలు విస్తృతం చేస్తామన్నారు. కోవిడ్ కేర్ సెంటర్లను ఎస్వీ మెడికల్ కళాశాల హెచ్ఓడీలు పర్యవేక్షించాలన్నారు. పేషెంట్ పరిస్థితిని వారి బంధువులకు వివరించడానికి సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. కరోనా మృతులకు అంత్యక్రియలకు గోవిందధామంలో మాత్రమే కాకుండా ప్రత్యామ్నాయ శ్మశానవాటికలు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో పాజిటివ్ అని తేలిన అర్ధగంట లోపు బాధితులు కోవిడ్ చికిత్సకు వెళ్లేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలను గుర్తుచేశారు. డాక్టర్లు అందరూ వైద్య సేవల్లోకి రావాలని, నాన్ మెడికల్ విధుల్లో అవసరమైన డాటా ఎంట్రీ సిబ్బందిని ఏర్పాటు చేస్తామన్నారు. సాధారణ రోగులకు వార్డులు కష్టతరంగా ఉందని, ఆక్సిజన్ ప్లాంట్–12 కేఎల్ ఏర్పాటు చేయాలని వైద్యాధికారులు కోరారు. త్వరలో 200మంది నర్సింగ్ స్టాఫ్ నియామకం అనంతరం రుయా హాస్పిటల్ సూపరింటెండెంట్ చాంబర్లో రుయా వైద్య అధికారులతో ఎమ్మెల్యే, కలెక్టర్, కమిషనర్ సమావేశమయ్యారు. ఆసుపత్రిలో శానిటేషన్ మరింత మెరుగు పరిచేందుకు ప్రత్యేక అధికారిని నియమించాలని ఆదేశించారు. శానిటేషన్ సరిలేని చోట ఫోన్‌నంబర్ ఏర్పాటు చేసి ఆ నంబరుకు మెసేజ్ వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. రుయాకు సంబంధించి ఏ అవసరాలు ఉన్నా జేసీ వీరబ్రహ్మం ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. త్వరలో 200 మంది నర్సింగ్ స్టాఫ్‌ను జిల్లాలో నియమించనున్నట్టు కలెక్టర్ చెప్పారు. రుయా డెవలప్మెంట్ కమిటీ వర్కింగ్ చైర్మన్ బండ్ల చంద్రశేఖర్, ఏపీఎంఐడీసీ ఈఈ ధనుంజయరావు, డ్వామా పీడీ చంద్రశేఖర్, డీఎంహెచ్ఓ పెంచలయ్య, డీసీహెచ్ఎస్ సరళమ్మ, ఎస్వీ మెడికల్ ప్రిన్సిపల్ జయభాస్కర్, డాక్టర్లు సంధ్య, జమున, సరస్వతి, నాగమునీంద్రుడు, సుబ్బారావు, ఫయీమ్ తదితరులు పాల్గొన్నారు. -
తిరుపతికి అరుదైన ఘనత, భూమన ఆనందం
సాక్షి, తిరుపతి: తిరుపతి దేశంలో గార్బేజ్ ఫ్రీ సిటీగా దేశంలో గుర్తింపు పొందటం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. బుధవారం తిరుపతిలో భూమన మాట్లాడుతూ...దేశవ్యాప్తంగా త్రిబుల్ స్టార్స్ లో తిరుపతికి మొదటి ర్యాంకు రావడం మంచి పరిణామన్నారు. ఇందు కోసం మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు, సిబ్బంది ఎంతో కష్టపడ్డారని, పారిశుధ్య కార్మికులు చేసిన కృషి చాలా గొప్పదని భూమన కరుణాకర్ రెడ్డి కొనియాడారు. ఆధ్యాత్మిక నగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చి దిద్దారని భూమన అన్నారు. (త్రీస్టార్.. తిరుపతి వన్) ఇదే విషయం గురించి తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ గిరిష మాట్లాడుతూ... గార్బేజ్ ఫ్రీ సిటీగా దేశవ్యాప్తంగా త్రిబుల్ స్టార్స్‌లో తిరుపతి మొదటిస్థానం రావడం చాలా గర్వంగా ఉందన్నారు. దీని కోసం శ్రమించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. దీనిని సాధించడంలో తిరుపతి ప్రజల సహకారం మరువలేనిదని, ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఈ విషయంలో చాలా సహకరించారని కొనియాడారు. (విజయవాడ చేరుకున్న 156 మంది ప్రవాసాంధ్రులు) -
కరోనా నియంత్రణకు భూమన యాగం
-
చైతన్య రథసారథి
తిరుపతి తుడా:కరోనాపై యుద్ధంలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి నిరంతరం ప్రజలకు అవగాహన కలిగిస్తూ.. ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా తమ ప్రాణాలకు తెగించి నగరంలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ.. వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారు. ఇందులో భాగంగా సోమవారం స్వయంగా చెత్త సేకరణ రిక్షా తొక్కుతూ.. వారిలో స్ఫూర్తి నింపారు. అనంతరం ఆయన ప్రధాన కూడళ్లకు వెళ్లి ప్రజలకు కరోనా తీవ్రతను వివరించారు.