BIOLOGY
-
జీవశాస్త్ర రంగంలో రాష్ట్రం దూకుడు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జీవశాస్త్ర రంగంలో దూకుడుగా ముందుకెళ్తోందని, ఈ ప్రగతి తమకెంతో గర్వకారణమని మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. సిన్‌జీన్ వంటి అంతర్జాతీయ సంస్థలు తెలంగాణలో తమ కార్యకలాపాలు చేపట్టడం రాష్ట్రంలోని అవకాశాలకు, ప్రభుత్వ సహకారానికి నిదర్శనమన్నారు. గురువారం జినోమ్ వ్యాలీలో సిన్‌జీన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్‌షాతో కలసి ఆ సంస్థ విస్తరణ కార్యకలాపాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. రాష్ట్రంలో జీవశాస్త్ర రంగం పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం అన్నివిధాలుగా ప్రోత్సహిస్తోందని, తగిన మౌలిక సదుపాయాలను కల్పిస్తోందని మంత్రి చెప్పారు. సిన్‌జీన్ సంస్థ 2020లోనే జినోమ్ వ్యాలీలో సుమారు 52వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో క్యాంపస్‌ను ఏర్పాటు చేసింది. తాజాగా సుమారు 788 కోట్ల పెట్టుబడితో దీని విస్తరణ చేపట్టింది. ఇందులోభాగంగా కొత్తగా ఏర్పాటు చేసిన అత్యాధునిక ప్రోటాక్ ల్యాబొ రేటరీని, సెంట్రల్ కాంపౌండ్ మేనేజ్మెంట్ ఫెసిలిటీని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ విస్తరణతో వచ్చే ఐదేళ్లలో వెయ్యికిపైగా ఉద్యోగాలు వస్తాయని కంపెనీ చైర్పర్సన్ కిరణ్ మజుందార్‌షా తెలిపారు. -
Benjamin J W Mills: ఆక్సిజన్ ‘స్థాయి’లో మార్పును బట్టి గ్రహాలపై జీవం గుట్టు పట్టేయొచ్చు
లీడ్స్(యూకే): అనంతమైన విశ్వంలో మనమంతా ఒంటరి జీవులమా? లేక ఇతర గ్రహాలపైనా జీవం ఏదైనా ఉందా? మన సౌర కుటుంబానికి అవతల ఉన్న గ్రహాలపై వాతావరణం ఉనికి ఉండే అవకాశం ఉందా? ఈ ప్రశ్నలు శతాబ్దాలుగా మానవులను వేధిస్తూనే ఉన్నాయి. వీటికి సమాధాలు కనిపెట్టేందుకు జిజ్ఞాసులు అలుపెరుగని కృషి సాగిస్తున్నారు. ఇతర గ్రహాలపై జీవం జాడ తెలుసుకొనేందుకు ఎన్నో పరిశోధనలు, అధ్యయనాలు జరుగుతున్నాయి. రహస్యాన్ని ఛేదించే విషయంలో మనం కొంత పురోగతి సాధించినట్లు పరిశోధకులు చెబుతున్నారు. ఇప్పటిదాకా మనకు తెలిసింతవరకూ కేవలం మన భూగోళంపైనే జీవులు ఉన్నాయి. ఇవన్నీ ఆక్సిజన్‌ను శ్వాసిస్తున్నాయి. జీవుల మనుగడకు ప్రాణవాయువు(ఆక్సిజన్) అవసరమన్న సంగతి తెలిసిందే. భూమిపై ఆక్సిజన్ ఎల్లవేళలా ఒకేలా లేదని యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్‌కు చెందిన బయోకెమికల్ మోడలింగ్ అసోసియేట్ ప్రొఫెసర్ బెంజమిన్ జేడబ్ల్యూ మిల్స్ చెప్పారు. కోట్ల సంవత్సరాల నుంచి భూమిపై ఆక్సిజన్ పరిమాణం మారుతూ వచ్చిందని అన్నారు. ఈ మార్పు ఎప్పుడు, ఎలా జరిగిందో, ఆయా సమయాల్లో ఏయే జీవులు పుట్టాయో కచ్చితంగా తెలుసుకుంటే ఇతర గ్రహాలపై ఉన్న వాయువుల పరిమాణం గురించి, తద్వారా అక్కడి జీవజాలం గురించి ఒక అంచనాకు రావొచ్చని వివరించారు. మన గ్రహంపై ఉన్న ఆక్సిజన్ పరిమాణంపై తమ పరిశోధనలో కీలక విషయాలు బహిర్గతమయ్యాయని పేర్కొన్నారు. భూమిపై ఆక్సిజన్, జీవం భూగోళంపై వాతావరణంలో ప్రస్తుతం 21 శాతం ఆక్సిజన్ ఉంది. అయితే, ఇప్పుడున్నంత ఆక్సిజన్ కోట్ల సంవత్సరాల క్రితం లేదు. గతంలోకి.. అంటే 45 కోట్ల సంవత్సరాలు వెనక్కి వెళ్తే.. అక్కడ జీవించడానికి ఆక్సిజన్ ట్యాంకర్లు కూడా వెంట తీసుకొని పోవాల్సిందే. ఎందకంటే అప్పట్లో స్వల్ప పరిమాణంలో ఆక్సిజన్ ఉండేది. జీవులు కూడా ఇంకా పుట్టలేదు. ప్రధానంగా మూడు దశల్లో ఆక్సిజన్ స్థాయిలు భూమిపై పెరిగాయి. మొదటిది ‘గ్రేట్ ఆక్సిడేషన్ ఈవెంట్’. దాదాపు 240 కోట్ల సంవత్సరాల క్రితం ఇది సంభవించింది. భూమిపై వాతావరణం ఏర్పడింది. ఆక్సిజన్ నిల్వలు ప్రారంభమయ్యాయి. రెండోది నియోప్రొటెరోజోయిక్ ఆక్సిజనేషన్ ఈవెంట్ (ఎన్ఓఈ). 80 కోట్ల సంవత్సరాల క్రితం సంభవించింది. భూమిపై ఆక్సిజన్ పరిమాణం పెరిగింది. దాదాపు ఇప్పుడున్న స్థాయికి ప్రాణవాయువు చేరుకుంది. ఆ తర్వాత 20 కోట్ల సంత్సరాలకు భూమిపై తొలితరం జంతువులు పుట్టాయి. మూడోది ‘పాలెజోయిక్ ఆక్సిజనేషన్ ఈవెంట్’.. 42 కోట్ల సంవత్సరాల కిందట ఏర్పడింది. ఆక్సిజన్ ఇప్పుడున్న స్థాయికి పూర్తిగా చేరింది. 75 కోట్ల ఏళ్ల క్రితం భూమి వాతావరణంలో కేవలం 12 శాతం ఆక్సిజన్ ఉండేది. ఇది ఇప్పుడు 21 శాతానికి ఎగబాకింది. ఆక్సిజన్ పరిమాణాన్ని బట్టి కొత్త జీవులు ఉద్భవించడం, పాతవి అంతరించిపోవడం వంటివి జరిగాయని పరిశోధకులు భావిస్తున్నారు. దాదాపు 45 కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై మొక్కలు పుట్టాయి. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ(ఈఎస్ఏ), కెనడియన్ స్పేస్ ఏజెన్సీ(సీఎస్ఏ) భాగస్వామ్యంతో గత ఏడాది జేమ్స్‌వెబ్ స్పేస్ టెలిస్కోప్(జేడబ్ల్యూఎస్‌టీ)ను ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఇది మన సౌర మండలం ఆవల ఉన్న గ్రహాలపై వాతావరణం, వాయువులపై అధ్యయనం చేస్తోంది. అక్కడి వాయువులు, వాటి పరిమాణం గురించి తెలిస్తే జీవం ఉందా? లేదా? అనేది తేల్చవచ్చని పరిశోధకులు పేర్కొంటున్నారు. -
సముద్రం నుంచి సముద్రానికి
చిన్నప్పుడు వేటకు వెళ్లిన తండ్రి ఒక్కోసారి ఖాళీ చేతులతో తిరిగి వచ్చేవాడు. ఒక్కోసారి ప్రమాదాల బారిన పడేవాడు. పడిన సరుకును సరిగ్గా అమ్ముకోగలిగేవాడు కాదు. ఇవాళ 45 ఏళ్ల వెల్విగి మెరైన్ బయాలజిస్ట్‌గా మారి తమిళనాడు కారైకల్ ప్రాంతంలో మత్స్యకారులకు సురక్షిత చేపల వేటకు సాయం చేస్తోంది. బెస్త స్త్రీల స్వయం సమృద్ధికి మార్గదర్శనం చేస్తోంది. 35 ఏళ్ల క్రితం వెల్విగికి పదేళ్లు. ఇంటికి పెద్ద పిల్ల. తన తర్వాత ముగ్గురు తోబుట్టువులు. తమిళనాడు నాగపట్టణం బెస్తపల్లెలో తండ్రి ఉదయాన్నే నాలుగ్గంటలకు చేపల వేటకు కొయ్య పడవ మీద బయలుదేరుతూ ఉంటే నిద్ర కళ్లతో చూసేది. వేటకు వెళ్లిన తండ్రి రెండు మూడు రోజులు రాడు. ఆ అన్ని రోజులు వెల్విగి దేవుణ్ణి ప్రార్థిస్తూ తండ్రి కోసం ఎదురు చూసేది. తండ్రి తిరిగి వచ్చేంత వరకూ తండ్రికీ ఇంటికీ మధ్య ఏ కమ్యూనికేషనూ ఉండేది కాదు. వాతావరణం మారితే ప్రమాదం. తుఫాను వస్తే ప్రమాదం. లేదా అంతర్జాతీయ జలాల్లోకి పడవ వెళ్లిపోతే ప్రమాదం. ఇన్ని ప్రమాదాలు దాటుకుని తండ్రి ఇల్లు చేరితే అదృష్టం. 35 ఏళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు నాగపట్టణం చుట్టుపక్కలే కాదు తమిళనాడు బెస్తపల్లెలన్నింటిలోనూ వెల్విగి తన సాంకేతిక ఆలోచనలతో బెస్తవాళ్లకు ఒక ధైర్యంగా మారింది. దానికి కారణం ఏ బెస్త కుటుంబమూ ఆందోళనగా బతక్కూడదని. ఏ బెస్త ఇంటి పిల్లలు తండ్రి కోసం భయం భయంగా ఎదురు చూడకూడదు అని. అలా వారి సాయం కోసం తాను మారాలంటే మెరైన్ బయాలజీ చదవాలి. కాని బెస్త ఇళ్లల్లో ఆడపిల్లలకు అంత చదువా? ‘మన దేశంలో దాదాపు 3 వేలకు పైగా బెస్త పల్లెలు ఉన్నాయి. దాదాపు 10 లక్షల మంది బెస్త కుటుంబాలు ఉన్నాయి. 40 లక్షల బెస్తలు సముద్రాన్ని నమ్ముకుని జీవిస్తున్నారు. వీరిలో 90 శాతం మంది సంప్రదాయ మత్స్యవేట చేస్తారు. వీరిలో ఇప్పటికి మూడు వంతుల మంది దారిద్య్రరేఖకు దిగువన ఉంటే ఇక ఆడపిల్లలకు చదువు ఎక్కడ?’ అంటుంది వెల్విగి. బిఎస్సీ జువాలజీ, ఎంఎస్సీ మెరైన్ బయాలజీలను వెల్విగి తన మేనమామ సాయంతో చదువుకుంది. ‘ఆ చదువులో కూడా వివక్ష ఎదుర్కొన్నాను. బెస్త అమ్మాయి ఇలాంటి చదువు చదవడం కొందరి దృష్టిలో వింతగా ఉండేది’ అంటుంది వెల్విగి. ఇక తన కాళ్ల మీద తాను నిలబడక తప్పలేదు. పూంపుహార్‌లోని ఎం.ఎస్.స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ సంస్థ ‘ఫిష్ ఫర్ ఆల్ రీసెర్చ్ అండ్ ట్రయినింగ్ సెంటర్’ పేరుతో ఒక ప్రోగ్రామ్ని తీసుకుంటే అందులో పని చేయడానికి రామేశ్వరం వెళ్లింది వెల్విగి. అది తన ఊరికి 265 కిలోమీటర్ల దూరం. ‘కాని నాకు తప్పలేదు. డబ్బులు కావాలి’ అంది వెల్విగి. పదేళ్లు ఆ సంస్థలో పని చేశాక తిరిగి పిహెచ్డి పనిని స్వీకరించి అన్నామలై యూనివర్సిటీ నుంచి పూర్తి చేసింది. అక్కడి బెస్త సమూహంలో పిహెచ్డి చేసిన తొలి మహిళ వెల్విగి. స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ సంస్థలో ప్రస్తుతం సీనియర్ సైంటిస్ట్‌గా పని చేస్తున్న వెల్విగి బెస్తవారి కోసమే ప్రత్యేకంగా ‘మీనవా నన్బన్’ (బెస్తవారికి మిత్రుడు) యాప్‌ను డెవలప్ చేయడంలో సాయపడింది. ఇప్పుడు తమిళనాడు, పాండిచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌లలో కనీసం 50 వేల మంది ఈ యాప్ వాడుతున్నారు. మత్స్య పడవల నేవిగేషన్లో ఇది సాయపడుతోంది. అంతేకాదు తీరంతో కమ్యూనికేషన్‌ను కూడా సులభం చేస్తుంది. ‘బెస్తవారి సంప్రదాయ చేపల వేట ప్రకృతి సహజమైనది. అయినప్పటికీ వలకు పడాల్సిన చేపలతో పాటు అనవసరపు సముద్ర జీవులు (బైక్యాచ్) కూడా పడుతూ ఉంటాయి. వాటిని కాకుండా కేవలం చేపలు మాత్రమే పడాలంటే ఏం చేయాలో నేను గైడ్ చేస్తూ ఉంటాను. అలాగే వలలో తాబేళ్లు చిక్కకుండా చిక్కిన తాబేళ్లు ప్రాణాలు కోల్పోకుండా ఉండేలా వాటిని తిరిగి సముద్రంలో వదిలేలా బెస్తవారికి ట్రైనింగ్ ఇస్తుంటాను’ అంటుంది వెల్విగి. ఆమె ఊరికే బోర్డు మీద పాఠాలు చెప్పే రకం కాదు. ఇప్పటికి చేపల వేటకు వెళ్లే పడవల్లో కనీసం 150 సార్లు సముద్రం మీదకు వెళ్లింది. వారితోనే ఉంటూ మెళకువలు చెబుతుంది. ఏ సమయంలో ఏ ప్రాంతంలో చేపలు పడతాయో వారికి బోధ పరుస్తుంది. ‘ఇదంతా నా చదువు వల్ల మాత్రమే కాదు. మా నాన్న నుంచి తీసుకున్న అనుభవం కూడా’ అంటుంది వెల్విగి. మత్స్స సంపద నుంచి స్త్రీలు ఆదాయం గడించేలాగా వారికి ఫుడ్‌కోర్టులు నడపడం ఎలాగో, నిల్వ ఆహారం చేయడం ఎలాగో, ఎండు చేపల మార్కెట్... వీటన్నింటి గురించి కూడా ఆమె తర్ఫీదు ఇస్తోంది. దాదాపు 17 వేల మంది మహిళలు ఆమె వల్ల లబ్ది పొందారు. ‘మత్స్యకారుల్లో వయసుకు వచ్చిన అబ్బాయిలు వేటలో పడకుండా, అమ్మాయిలు పెళ్లిలోకి వెళ్లకుండా చదువుకోవాలంటే ప్రభుత్వ పరంగా చాలా చేయాల్సి ఉంటుంది. అప్పుడే వారి జీవితాల్లో వెలుగు’ అంటుంది వెల్విగి. సముద్రంలో మత్స్యకారులతో వెల్విగి బెస్త మహిళలు, మత్స్యకారులతో వెల్విగి -
అన్ని జీవుల జన్యుగుట్టు తేల్చే ప్రాజెక్ట్!
మెల్బోర్న్: ప్రపంచంలోని ప్రతి సంక్లిష్ట జాతి జన్యువుల లోగుట్టును విశదీకరించే భారీ ప్రాజెక్టు పూర్తైతే జీవశాస్త్రంలో సంచలనాలు చూడవచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. పదేళ్లలో దాదాపు 18 లక్షల స్పీసిస్ (ప్రజాతులు) జీనోమ్ సీక్వెన్సింగ్ చేసే ద ఎర్త్ బయోజీనోమ్ ప్రాజెక్ట్ (ఈబీపీ)కు 2018లో శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టు లక్ష్యాలు, పురోగతి తదితర వివరాలను మంగళవారం సైన్స్ జర్నల్స్‌లో ప్రచురించారు. ఈ ప్రాజెక్టు పూరై్తతే ఇంతవరకు జరిగిన బయోలాజికల్ రీసెర్చ్ రూపురేఖలు మారతాయి. విశేషాలు.. ► ఈ ప్రాజెక్టులో 22 దేశాలకు చెందిన 44 సంస్థలు పాలుపంచుకుంటున్నాయి. సుమారు 5వేల మంది శాస్త్రవేత్తలు ఈ ప్రాజెక్టు కోసం పనిచేస్తున్నారు. ► ప్రాజెక్టుకు దాదాపు 470 కోట్ల డాలర్ల వ్యయమవుతుందని అంచనా. ► సంక్లిష్ట జీవులు ఎలా ఉద్భవించాయి? జీవ వైవిధ్యత ఎలా మనుగడ సాగిస్తోంది? తదితర ప్రశ్నలకు సమాధానాలు ఈ ప్రాజెక్టుతో లభిస్తాయని అంచనా. ► హ్యూమన్ జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రాజెక్ట్ ప్రేరణతో 2016లో ఈబీపీని ప్రతిపాదించారు, 2018 నవంబర్‌లో అధికారికంగా ప్రారంభించారు. ► ప్రతి కుటుంబం (టాక్జానమీలో ఫ్యామిలీ) నుంచి కనీస ఒక్క జీనోమ్ సీక్వెన్సింగ్‌ను తొలిదశలో పూర్తి చేయాలని సంకల్పించారు. ► రెండోదశలో సుమారు 1.8లక్షల జాతుల సీక్వెన్సింగ్ చేస్తారు, మూడోదశలో అన్ని జీవుల సీక్వెన్సింగ్ పూర్తవుతుంది. ► ఏకకణ జీవుల నుంచి మానవుల వరకు భూమిపై ఉన్న అన్ని జీవుల జీనోమ్ సీక్వెన్సింగ్ ఈ ప్రాజెక్టులో పూర్తి చేస్తారు. అంటే దాదాపు ప్రతి ప్రాణి జన్యు గుట్టును ఈ ప్రాజెక్టు బహిర్గతం చేస్తుంది. ► దీనివల్ల భవిష్యత్‌లో వైద్య, ఫార్మా రంగాల్లో ఊహించని పురోగతి సాధించవచ్చని పరిశోధకుల అంచనా. -
ఈ రాక్షస చేప నోట్లో వందల పళ్లు!!.. ఇప్పటికీ రహస్యమే..
Pacific Lingcod Fish Mysterious Unknown and Shocking Facts in telugu: అనగనగా ఒక భారీ చేప. దాని నోటిలో వందల సంఖ్యలో రంపపు దంతాలు. అంతేకాదు ఆ పళ్లు వేగంగా పెరుగుతాయి. అంతేవేగంగా ఉడిపోతాయి. ఎందుకు? ఇదేదో జానపద పొడుపు కథలా ఉందే!! అని అనుకుంటున్నారా..? కథ కాదు ఇలలోనే...! ఈ రాక్షస చేప విశేషాలు మీకోసం.. ఆ చేప పేరు పసిఫిక్ లింగ్‌కాడ్. దాని నోటిలో 555 పదునైన దంతాలు ఉంటాయి. రోజుకు 20 పళ్లు చొప్పున ఊడిపోతాయి. మళ్లీ కొత్తవి పెరుగుతూ ఉంటాయి. ఐతే ఈ చేప దంతాలు మనుషుల దంతాలంత సైజులో కాకుండా చాలా చిన్నగా, పదునుగా ఉంటాయి. ఇలాంటి చేపలు సాధారణంగా నార్త్ పసిఫిక్ సముద్రంలో కనిపిస్తాయి. పసిఫిక్ లింగ్‌కాడ్ చేప యుక్తవయస్సులో 50 సెంటీమీటర్లు పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో 1.5 మీటర్ల వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు అధ్యయనాలు వెల్లడించాయి. అంతేకాకుండా ఈ రకమైన చేపలకు పైన, కింద రెండు దవడలు ఉంటాయి. వీటిని ఫారింజియల్ దవడలు అంటారు. మనుషులు దవడపళ్లతో నమిలినట్లే చేపలు కూడా ఆహారాన్ని నమలడానికి ఉపయోగిస్తాయని లైవ్‌సైన్స్ నివేదిక తెల్పింది. చదవండి: Side Effects Of Wearing Jeans: ఆ జీన్స్ ధరించిన 8 గంటల తర్వాత.. ఐసీయూలో మృత్యువుతో.. యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్లో జీవశాస్త్రంలో పీహెచ్డీ చేస్తున్న కార్లీ కోహెన్, ఈ నివేదిక ప్రధాన రచయిత ఎమిలీ కార్ ఈ చేపల దంతాలపై అధ్యయనం చేశారు. పసిఫిక్ లింగ్‌కోడ్ చేపల దంతాలు మైక్రోస్కోపిక్ పరిమాణంలో ఉన్నందువల్ల వీటిని మామూలు పద్ధతుల్లో లెక్కించడం కుదరదు. అందువల్ల ప్రయోగశాలలో 20 పసిఫిక్ లింగ్‌కోడ్ చేపలను ఒక ట్యాంక్‌లో ఉంచి, నీళ్లలో ఎరుపు రంగును కలిపారు. ఫలితంగా చేపల దంతాలు కూడా ఎరుపు రంగులోకి మారాయి. ఆ తర్వాత ఈ చేపల పళ్లపై మరకలు పడేలా పచ్చ రంగుకలిపిన మరో ట్యాంక్‌లోకి తరలించారు. ఎమిలీ కార్ లైవ్ సైన్స్‌తో మాట్లాడుతూ.. ‘ఈ చేపల పళ్లను లెక్కించడానికి ఒక చీకటి గదిలో పని చేయాల్సి వచ్చింది. మైక్రోస్కోప్‌లో పళ్లను లెక్కించాను. ఒక్కోచేపకు దాదాపుగా వెయ్యికి పైగా పళ్లున్నాయ’ని వెల్లడించారు. చేపలకు ఎక్కువ ఆహారం ఇవ్వడం వల్ల వాటి దంతాల రిప్లేస్మెంట్ సైకిల్లో ఏవైనా మార్పులు వస్తాయేమోననే కోణంలో కూడా పరిశోధకులు ప్రయత్నించారు. ఐతే ఎటువంటి మార్పులు సంభవించలేదు. అందువల్ల పసిఫిక్ లింగ్‌కాడ్ చేప పళ్లకు సంబంధించిన వింత ఇప్పటికీ రహస్యంగానే ఉండిపోయింది. చదవండి: Science Facts: చీమల రక్తం అందుకే ఎర్రగా ఉండదట..! -
వై క్రోమోజోమ్... వెరీ స్పెషల్!
సాక్షి, హైదరాబాద్: పురుషులకు మాత్రమే ప్రత్యేకమైన వై క్రోమోజోమ్‌కు సంబంధించి ఒక కొత్త, వినూత్నమైన అంశాన్ని శాస్త్రవేత్తలు వెలికితీశారు. కేవలం లింగ నిర్ధారణకు మాత్రమే ఉపయోగపడుతుందని ఇప్పటివరకూ ఉన్న అంచనా పూర్తిగా నిజం కాకపోవచ్చని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయోలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు చెబుతున్నారు. లింగ నిర్ధారణతోపాటు పురుషుల పునరుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన ఇతర జన్యువుల నియంత్రణలోనూ వై క్రోమోజోమ్ కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలిసిందని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన సీసీఎంబీ శాస్త్రవేత్త ప్రొఫెసర్ రాచెల్ జేసుదాసన్ తెలిపారు. బీఎంసీ బయోలజీ తాజా సంచికలో పరిశోధన వివరాలు ప్రచురితమయ్యాయి. ఎలుకల వై క్రోమోజోమ్‌ను పరిశీలించినప్పుడు అందులో నిర్దిష్ట డీఎన్ఏ భాగం కొంత ఎడంతో పదేపదే కనిపిస్తోందని... ఇవి ఇతర క్రోమోజోమ్‌లలోని జన్యువుల వ్యక్తీకరణపై ప్రభావం చూపుతున్నట్లు తెలిసిందని వివరించారు. వృషణాల్లోని ఈ జన్యువులు కేవలం పునరుత్పత్తికి మాత్రమే చెంది ఉండటం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. పునరావృతమవుతున్న డీఎన్ఏ భాగం కొన్ని జీవజాతుల్లో ఉంటే మరికొన్నింటిలో లేదని, ఇది ప్రత్యేకమైన చిన్నస్థాయి ఆర్ఎన్ఏల ఉత్పత్తికి కారణమవుతోందని జేసుదాసన్ వివరించారు. చిన్నస్థాయి ఆర్ఎన్ఏలపై ఇదే తొలి పరిశోధన వ్యాసమన్నారు. జీవజాతుల పరిణామ క్రమంలో ఈ పునరావృత డీఎన్ఏ భాగాలు పునరుత్పత్తిని నియంత్రించే స్థితిని కోల్పోతాయని చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీ జెనిటిక్స్ డిపార్ట్మెంట్కు సలహాదారు (పరిశోధనలు)గా వ్యవహరిస్తున్న జేసుదాసన్... ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఆఫ్ జినోమిక్స్ అండ్ జీన్ టెక్నాలజీ శాస్త్రవేత్త కూడా. -
వినూత్న ప్రయత్నం.. నెటిజన్లు ఫిదా
స్పానిష్ : బోధన అనేది ఒక గొప్ప కళ. ఒకరికి తెలిసిన జ్ఞానాన్ని ఇంకొకరికి సులభంగా తెలియజేసే ప్రక్రియనే బోధన. అయితే బోధించడం వేరు.. సులభంగా బోధించడం వేరు. టీచింగ్‌లో ప్రత్యేకత ఉంటేనే విద్యార్థులు ఆసక్తికరంగా పాఠాలు వింటారు.. అర్థం చేసుకుంటారు. అలా కాదని ఓ ఉపాధ్యాయుడు తన జ్ఞానాన్ని మొత్తం పిల్లల ముందు ప్రదర్శించినా ఉపయోగం ఉండదు. ఓ ఉపాధ్యాయుడికి ఎంత మేర జ్ఙానం ఉందని ముఖ్యం కాదు.. ఆ జ్ఞానాన్ని ఏ మేరకు విద్యార్థులకు అందిచారనేదే ముఖ్యం. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకున్న ఓ ఉపాధ్యాయురాలు తన విద్యార్థులకు వెరైటీగా పాఠాలు చెప్పేందుకు సిద్దపడింది. దాని కోసం ప్రత్యేకమైన డ్రెస్‌ను వేసుకొని తరగతి గదిలోకి వెళ్తోంది. మరి ఆ టీచరమ్మ ఎవరు.. ఆ డ్రెస్ స్పెషల్ ఏంటీ తెలుసుకుందాం. స్పానిష్‌కి చెందిన వెరోనికా డ్యూక్(43) 15 ఏళ్ల నుంచి టీచర్‌గా పని చేస్తున్నారు. 3వ తరగతి విద్యార్ధులకు సైన్స్, ఇంగ్లీష్, ఆర్ట్, సోషల్ స్టడీస్, స్పానిష్ సబ్జెక్టులను బోదిస్తారు.ఆ టీచర్ అంటే ఆ విద్యార్ధులకు చాలా చాలా ఇష్టం. ముఖ్యంగా వెరోనికా టీచర్ చెప్పే అనాటమీ క్లాస్ (శరీర నిర్మాణ శాస్త్రం) కోసం విద్యార్ధులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే ఆమె చాలా ప్రాక్టికల్. ఆ పాఠం చెప్పేందుకు మానవ అంతర్గత అవయవాలను ప్రింట్ చేసిన సూట్ ధరించి క్లాస్‌కి వెళతారు. ఆమె ఇలా బోధించడం ఫన్నీగా ఉన్నా.. విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. సూట్ ఐడియా ఎలా వచ్చిందంటే.. ఇంటర్నెట్‌ని సెర్చ్ చేస్తుండగా చటుక్కున ఓ యాడ్ చూసి.. దాని ప్రభావంతో ఇలా వెరైటీ బోధన చేస్తున్నానని చెబుతోంది వెరోనికా. పిల్లలకు సులభంగా పాఠాలు అర్థం కావాలంటే ఇలా బాడీ సూట్ ధరించడమే మేలని అంటోంది. పైగా వారికి ఇది తమాషాగా, వింతగా కూడా ఉంటుందని తెలిపింది. మానవ అంతర్గత అవయవాలపై చిన్నారులకు తక్కువ అవగాహను ఉంటుందని, ఇలా చేస్తే వారు సులువుగా అర్థం చేసుకుంటారని ఆమె చెబుతోంది. అనాటమీ సూట్ ధరించి పాఠాలు బోధిస్తున్న వెరోనికా ఫోటోలను ఆమె భర్త మైక్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. తన భార్యకు ఇలాంటి సరికొత్త ఐడియాకు తానెంతో గర్విస్తున్నాని మైక్ అన్నారు. కాగా, వెరోనికా ఫోటోలను చూసిన నెటిజన్లు ఆమె ప్రయత్నాన్ని అభినందిస్తున్నారు. ఈ పోస్ట్‌కు స్పందన భారీగా వస్తోంది. వేల కొద్దీ రీట్వీట్లు, 67వేల లైక్‌లు వచ్చాయి. వెరోనికా ఇలా చేయడం ఇదే మొదటిసారి కాదు.. వ్యాకరణ అంశాల్లో నౌన్స్, అడ్జెక్టివ్స్, వెర్బ్స్ వంటివి దొర్లినప్పుడు సంబంధిత కార్డ్ బోర్డ్ క్రౌన్లను ధరించి పాఠాలు చెప్పేదట. ఈ సమాజంలో పిల్లలకు బోరింగ్‌గా, లేజీగా పాఠాలు చెప్పే టీచర్లు ఉంటారనే అపోహలు తప్పని నిరూపించడానికే ఇలా ఫన్నీగా ప్రయోగాలు చేస్తున్నానని వెరోనికా చెబుతోంది. వృత్తి పట్ల వెరోనికాకు ఉన్న నిబద్ధత, విధేయతకు ఈ ప్రయోగమే నిదర్శనం. -
నడిచేటప్పుడు చేతులు ఎందుకు ఆడిస్తాం?
తెలుసుకుందాం.. పిల్లలూ.. నడిచేవాళ్లను గమనించారా? నడిచే సమయంలో కాళ్లు కదిలితే సరిపోతుంది కదా.. మరి చేతులు కూడా ఎందుకు కదులుతారుు. కొంతమంది కావాలనే వేగంగా చేతులు ఊపుతూ నడుస్తారు ఎందుకు? జీవశాస్త్రం ప్రకారం మానవుడు రూపాంతరం చెందడానికి జీవపరిణామ సిద్ధాంతం ఉందన్న విషయం మీకు తెలిసిందే! గొరిల్లా, చింపాంజీ వంటి జీవులను గమనిస్తే అవి అప్పుడప్పుడూ వెనుక కాళ్లమీద నిలబడి కాసేపు నడవగలవు. పరిణామ క్రమంలో మానవుడు పూర్తిగా కాళ్లమీదే నడవడం, నిలబడగలగడం నేర్చుకున్నాడు. ఇప్పుడు చేతులు ఎందుకు ఊపుతామో తెలుసుకుందాం. మీరు కూడా కాసేపు కోతిలాగా కాళ్లమీద నడుస్తూ.. కాళ్లూ చేతులు కదిలే పద్ధతిని మార్చకుండా, క్రమంగా నిలబడి నడవండి చూద్దాం.. ఏమి గమనించారు. నాలుగు కాళ్ల జంతువులు నడిచేటప్పుడు.. దాని ముందరి కాళ్లు ఎలా కదులుతాయో, అదే విధంగా మనం నిటారుగా నిలబడినప్పుడు చేతులు కూడా అలాగే కదులుతాయని గమనించారా? అదీ సంగతి. లక్షల సంవత్సరాల క్రితం పురాతన మానవ జాతి కూడా నాలుగు కాళ్లపై నడుస్తూ.. ఆ తర్వాత రెండు కాళ్లపై నడవడం నేర్చుకున్నాడన్నమాట. అందుకే చేతులు కూడా కదులుతూ నడకకు పట్టును ఇస్తారుు. -
పర్యావరణ పరిరక్షణకు ముచ్చటైన మూడు సూత్రాలు
పదో తరగతి జీవశాస్త్రం భూమి సహజ వనరులకు ఆలవాలమైన గ్రహం.నీరు, నేల, అడవులు, వృక్షాలు, జంతువులు మానవ మనుగడకు ఎంతగానో దోహదం చేస్తున్నాయి.వీటిని సరైన రీతిలో వినియోగించుకోకపోతే అనేక అనర్థాలు కలుగుతాయి. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. జీవవైవిధ్యాన్ని కాపాడాలి. భవిష్యత్ తరాలు సురక్షితంగా జీవించడానికి కావాల్సిన పరిస్థితులను కల్పించడం అందరి బాధ్యత. సహజ వనరులు వనరులను సంరక్షించకపోతే కలిగే నష్టాలు, వాటిని సుస్థిరపరచుకునే విధానాల గురించి ‘సహజ వనరులు’ పాఠ్యభాగంలో వివరించారు. దీంట్లో భాగంగా రెండు గ్రామాల్లో నిర్వహించిన అధ్యయనాలను పేర్కొన్నారు. వనపర్తి గ్రామంలో నీరు పుష్కలంగా లభిస్తుంది. ఈ గ్రామంలో బావుల ద్వారా నీటి పారుదల నిర్వహించే 25 కుటుంబాల సామాజిక, ఆర్థిక అంశాలను సేకరించారు. వడ్డిచెర్ల గ్రామంలో తీవ్ర నీటికొరత ఉంటుంది. ఈ రెండు గ్రామాల్లో బావుల సంఖ్య, నీటి పారుదల ఉన్న భూ వైశాల్య శాతం, అందులో తగ్గుదల, ఫలితంగా పంటల్లో వచ్చిన మార్పులను పరిశీలించారు. చిన్న, పెద్ద రైతులు బావుల ద్వారా నీటిపారుదలపై చేస్తున్న వార్షిక ఖర్చు, పంటల ద్వారా పొందిన ఆదాయాన్ని సరి చూశారు. ఈ గ్రామాల్లో ఎండిపోతున్న బావుల్లో నీరు చేరుకునేలా భూగర్భ జలాల సుస్థిరత్వం కోసం కేంద్రం దృష్టి సారించింది. మైక్రో ఇరిగేషన్ పద్ధతులు ప్రవేశ పెట్టడం, ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయడం లాంటి సంరక్షణ చర్యలను ప్రోత్సహించింది. ఫలితంగా నీటి వనరుల రక్షణలో పెద్ద ముందడుగు పడింది. అందరికీ నీరు అనే అంశంలో భూమిపై ఉన్న మొత్తం నీటి గణాంకాలను తెలియజేస్తూ, మంచినీరు చాలా తక్కువగా ఉందని, నీటిని విచక్షణతో వాడుకోవాలని వివరించారు. వాటర్‌షెడ్, సామాజిక చెరువు, కాంటూర్ సేద్యం లాంటి సముదాయ ఆధారిత విధానాలను అవలంబించాలని తెలిపారు. కొత్తపల్లి గ్రామంలో నీటి యాజమాన్యం దిశగా జరిగిన ప్రయత్నం, సముదాయ ఆధారిత విధానాలు, వీటికి సహాయపడిన ఇక్రిసాట్ సంస్థ గురించి తెలుసుకోవాలి. తక్కువ ఎత్తు పెరిగే పంటలను సాగు చేయడం, కాంటూర్ సేద్యం మొదలైన యాజమాన్య పద్ధతులను పాటిస్తూ.. నేల, నీరు, పోషకాలు దుర్వినియోగం కాకుండా కాపాడుకునే రైతు ఆధారిత విధానాలను ప్రోత్సహించడం చాలా అవసరం. బీడు భూముల అభివృద్ధి, వాటిలో మొక్కల పెంపకం, రాష్ట్రంలో అందుబాటులో ఉన్న నీరు, నీటి వనరులు మొదలైన అంశాల గురించి తెలిపారు. గోదావరీ నదీజలాలు శ్రీరాంసాగర్ ప్రాజెక్టును నింపడానికే సరిపోవడం లేదు. అందువల్ల నీటిపారుదల సౌకర్యాల వినియోగం కోసం మెరుగైన పథకాలను రూపొందించుకోవాల్సి ఉంది. మన చుట్టూ ఉన్న పునరుద్ధరింపదగిన, పునరుద్ధరింపలేని వనరుల గురించి అవగాహన పెంచుకోవాలి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహారం, ఇళ్లు, వస్తువుల ఉత్పత్తి - రవాణా, ఇంధన వినియోగం గురించి తెలుసుకోవాలి. అడవి ఒక ప్రధాన పునరుద్ధరింపదగిన వనరు. భూమిపై అధికంగా మానవుడి తాకిడికి గురవుతున్న వనరు కూడా ఇదే. దీనివల్ల హరిత గృహ వాయువులు విడుదలై, గ్లోబల్ వార్మింగ్‌కు దారి తీస్తున్నాయి. భవిష్యత్ తరాలకు అటవీ వనరులను అందించడానికి సుస్థిర అటవీ విధానాలను అనుసరించాలి. అభివృద్ధి పేరుతో అడవులను నరికివేయడం వల్ల వాతావరణ సమతౌల్యం దెబ్బతింటుంది. రాజస్థాన్‌లో బైష్ణోయి తెగకు చెందిన అమృతాదేవి, ఆమె కుమార్తెలు, గ్రామస్థులంతా అడవులను నరికివేయకుండా కాపాడటానికి ప్రాణాలు అర్పించడానికి సైతం సిద్ధపడ్డారు. సుస్థిర అటవీ పద్ధతులు, పునఃచక్రీయ విధానాలను అవలంబించడం ద్వారా అడవులను కాపాడుకోవాలి. ఆహారోత్పత్తికి నేల అత్యంత అవసరం. ఒకే రకం పంటను పలుమార్లు పండించడం లాంటి లోపభూయిష్టమైన పద్ధతుల వల్ల నేలలోని పోషకాలు నశిస్తాయి. కాంటూర్ పట్టీ పంటలు, ఎంపిక పంట పద్ధతులతో నేలను రక్షించుకోవచ్చు. జీవవైవిధ్యం మరో ప్రధాన అంశం. భూమిపై తరిగిపోతున్న జీవులు, వాటిని కాపాడుకోవటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అధ్యయనం చేయాలి. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల్లో ప్రధానమైంది శిలాజ ఇంధనాలు. మనదేశంలో ఉపయోగిస్తున్న వివిధ వనరుల గురించి తెలుసుకోవాలి. ఇంధన పొదుపు, దీని కోసం పాటించాల్సిన చర్యలు, ప్రత్యామ్నాయ ఇంధన వనరులు (బయోడీజిల్), సైకిల్ వాడకం లాంటివాటి గురించి తెలుసుకోవాలి. భూమిలో లభించే వివిధ ఖనిజ లవణాల గురించి పరిశీలించాలి. గనుల తవ్వకం ద్వారా కోల్పోతున్న ఖనిజ నిక్షేపాలు, వెలువడుతున్న గాలి, ధూళి లాంటి కాలుష్య కారకాల గురించి తెలుసుకోవాలి. ఇందిరాగాంధీ చెప్పినట్లుగా.. పర్యావరణ పరిరక్షణ కోసం అవసరమైన మూడు ఖ (ఖ్ఛఛీఠఛ్ఛి, ఖ్ఛఠట్ఛ, ఖ్ఛఛిడఛ్ఛి)లను ఆచరించాలి. ఐ్ఖఇూ లాంటి అంతర్జాతీయ సంస్థలు పర్యావరణ సంరక్షణ కోసం చేస్తున్న కృషిని తెలుసుకోవాలి. మన చుట్టూ ఉన్న పరిసరాలను జాగ్రత్తగా కాపాడుకోవడానికి ప్రతిఒక్కరూ కృషిచేయాలి. అభివృద్ధిపేరుతో వనరుల విధ్వంసం పరిశ్రమల ఏర్పాటు, ఇళ్ల నిర్మాణం, రహదారుల ఏర్పాటు కోసం వనరులను ఎక్కువగా వినియోగిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం వల్ల అనేక ప్రాంతాల్లో పంటపొలాలు ప్లాట్లుగా మారి బీడుపడి పోతున్నాయి. బహుళజాతి సంస్థల వల్ల అనేక ప్రాంతాల్లో భూగర్భ జలాలు హరించుకుపోతున్నాయి. మినరల్ వాటర్ ప్లాంట్ల పేరుతో నీరు వ్యాపారమైంది. బెంగాల్‌లోని సింగూరు భూములు, తమిళనాడు కుడంకుళం లాంటివాటిని వనరుల అతి వినియోగానికి ఉదాహరణగా పేర్కొనవచ్చు. వీటికి సంబంధించి ప్రజావ్యతిరేకత అధికంగా ఉంది. పర్యావరణ సంరక్షణ సూత్రాలు తగ్గించడం, తిరిగి వాడటం, పునఃచక్రీయం అనే 3 అంశాల ద్వారా పర్యావరణ రక్షణను నిర్వహించాలి. 1. తగ్గించడం (ఖ్ఛఛీఠఛ్ఛి): వనరులను వృథా చేయకుండా తక్కువగా వినియోగించాలి. అవసరంలేని సమయాల్లో విద్యుద్దీపాలు, ఫ్యాన్లను ఆర్పి ఉంచాలి. 2. తిరిగి వాడటం (ఖ్ఛఠట్ఛ): పారేయకుండా తిరిగి ఉపయోగించుకోవాలి. కాగితాన్ని తిరిగి వాడటం వల్ల మొక్కలను అధిక మొత్తంలో కాపాడగలుగుతాం. 3. పునఃచక్రీయం (ఖ్ఛఛిడఛ్ఛి): ఒకసారి ఉపయోగించి వృథాగా ఉన్న పదార్థాలను తిరిగి వేరే రూపంలో వినియోగించుకోవాలి. దీన్నే పునఃచక్రీయం అంటారు. వీటితో పాటు ఇటీవల ఖ్ఛ్టజిజీజు (తిరిగి ఆలోచించడం) అనే అంశం ఎక్కువగా వినిపిస్తోంది. ఇది కూడా ఆచరణీయమే. కీలకభావనలు ఇంకుడు చెరువు: నీటి ప్రవాహాలకు అడ్డంగా రాళ్లు, మట్టితో అడ్డుకట్టలు కట్టి ఏర్పరిచే నీటి నిల్వలే ఇంకుడు చెరువులు. సూక్ష్మ నీటిపారుదల: బిందు సేద్యం, తుంపరల విధానం ద్వారా జరిగే నీటిపారుదల. బోరు బావులు: భూగర్భ జలాలను పైకి తేవడానికి తవ్వే గొట్టపు బావులు. సుస్థిర అభివృద్ధి: ఒక రంగంలో జరిగే అభివృద్ధి వల్ల మరో రంగానికి నష్టం కలుగకుండా సమగ్ర అభివృద్ధి సాధించడం. జీవ ఇంధనాలు: మొక్కలు, జంతు సంబంధ వ్యర్థాలను ఉపయోగించి తయారు చేసే ఇంధనాలు. కాంటూర్ పట్టీ పంటల విధానం: నేల క్రమక్షయానికి గురవకుండా నేలవాలుకు అడ్డంగా కట్టలను ఏర్పరచడం ద్వారా జరిపే వ్యవసాయ విధానం. గట్లు: వర్షపు నీరు పొలాల్లోకి పారి వ్యర్థం కాకుండా అడ్డుగా నిర్మించే నిర్మాణాలు. కట్టల నిర్వహణ: వాన నీటిని వ్యర్థం కాకుండా అడ్డుకట్టల్లో నిల్వచేసి, ఆ నీటిని తిరిగి ఎండిన బావులు, బోరు బావుల్లో నింపి భూగర్భ జలమట్టాన్ని పెంచడానికి అనుసరించే విధానం. ఇంకుడు గుంతలు: వర్షపు నీరు భూమిలో ఇంకడం కోసం తవ్వే గుంతలు. ఇక్రిసాట్ (ఐఇఖఐఅఖీ): ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమి ఎరిడ్ ట్రాపిక్స్. ఇది అంతర్జాతీయ సంస్థ. ఇది అర్ధ శుష్క మండలాల్లో పెరిగే మొక్కలకు సంబంధించి పరిశోధనలు చేస్తుంది. డైక్: ప్రాజెక్టు నుంచి వెళ్లే కాలువలకు కట్టే అడ్డుకట్టలను డైక్‌లు అంటారు. నీటి వినియోగదారుల సంఘం: చెరువులు, కాలువలు, ప్రాజెక్టుల లాంటి నీటి వినియోగ నిర్మాణాలకు ప్రజల భాగస్వామ్యంతో ఏర్పడిన ప్రజాసంఘాలు. రైతు ఆధారిత విధానాలు: పొలాల్లో వ్యక్తిగతంగా నేల, నీటి సంరక్షణ కోసం రైతులు అమలు చేసే కార్యక్రమాలను రైతు ఆధారిత విధానాలు అంటారు. గ్లైరిసిడియా: పొడి నేలలో పెరిగే లెగ్యుమినేసి కుటుంబ మొక్కలు. ఇవి నేలలో నైట్రోజన్ నిల్వలు పెరగడానికి, గట్లు బలంగా ఉండటానికి సహాయపడతాయి. బిందు సేద్యం: ఇది సూక్ష్మ నీటిపారుదల విధానం. మొక్కలకు సన్నని పైపుల ద్వారా వేర్ల వద్ద నీరు అందేలా చేస్తారు. ూఖఈ్క: యునెటైడ్ నేషన్స డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇది ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ. ఇది ప్రపంచ దేశాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తుంది. హరిత గృహ వాయువులు: కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డై ఆక్సైడ్, మీథేన్, ూై2, క్లోరోఫ్లోరో కార్బన్లను గ్రీన్హౌస్ వాయువులు అంటారు. ఇవి ఓజోన్ పొరకు హాని కలుగజేస్తాయి. సుస్థిర అటవీ విధానాలు: భవిష్యత్ తరాలకు అటవీ వనరులను అందజేయడానికి అవలంబించాల్సిన విధానాలను సుస్థిర అటవీ విధానాలు అంటారు. ఎంపిక పంట పద్ధతి: పంట కోసేటప్పుడు ఒక్కో మొక్క లేదా చిన్న గుంపును తీసివేయడం. దీనివల్ల నేల క్రమక్షయాన్ని తగ్గించవచ్చు. జట్రోఫా కర్కాస్: బయో డీజిల్ తయారీకి ఉపయోగపడే మొక్క. 1. మంజు ఇంటికి పాలిథిన్ కవర్లను తేవడం తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? ఎ) ఆమె మార్కెట్టుకు వెళ్లకూడదు బి) అమె పాలిథిన్ను వాడాలి సి) మార్కెట్టుకు గుడ్డసంచీ తీసుకెళ్లాలి డి) కూరగాయల బదులు వేరేవి తినాలి 2. రమ్య తన పాత పుస్తకాలను పారేయకుండా తన చెల్లెలికి ఇచ్చి చదువుకోమన్నది. ఈ చర్య దేనికి ఉదాహరణ? ఎ) తగ్గించడం బి) పునఃచక్రీయం సి) సహాయం డి) పునర్వినియోగం 3. కింది వాక్యాల్లో ఏది సత్యం? 1) నేలలో నైట్రోజన్ నిల్వలు పెంచడానికి ఎక్కువ ఎరువులు వేయాలి 2) గట్లపై గ్లైరిసిడియా మొక్కలను పెంచడం ద్వారా నత్రజని నిల్వలను పెంచాలి. ఎ) 1, 2 సత్యం బి) 1 సత్యం, 2 అసత్యం సి) 2 సత్యం, 1 అసత్యం డి) 1, 2 రెండూ అసత్యం 4. కిందివాటిలో రైతు ఆధారిత విధానం ఏది? ఎ) కాలువలు తీయడం బి) చెరువుల కింద సాగు సి) కాంటూర్ పట్టీ సేద్యం డి) ఎక్కువ నీటిని వినియోగించడం సమాధానాలు 1) సి 2) డి 3) సి 4) సి 1. అంతర్జాతీయ సంస్థ ఇక్రిసాట్ ృృృృ లో ఉంది. 2. నీటి ప్రవాహాలకు అడ్డంగా రాళ్లు, మట్టితో ఆనకట్టలు కట్టి ఏర్పరచిన నిర్మాణాలు ృృృృృ 3. }రాంసాగర్ ప్రాజెక్టును ృృృృృ నదిపై నిర్మించారు. జవాబులు 1) హైదరాబాద్ (రాజేంద్రనగర్) 2) ఇంకుడు చెరువులు 3) గోదావరి -
శ్వాసక్రియ.. రకాలు.. ప్రభావితం చేసే అంశాలు..
జీవశాస్త్రం సాధారణంగా జీవుల్లో శ్వాసక్రియ అంటే గాలిని తీసుకోవటం లేదా వదిలి వేయటం వంటి విషయాలు గుర్తుకు వస్తాయి. పోటీ పరీక్షల్లో జంతువులు, మొక్కలు, కణాల్లో జరిగే శ్వాసక్రియ మొదలైన అంశాల గురించి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆయా అంశాలకు సంబంధించి లోతైన ప్రశ్నలు కూడా అడగొచ్చు. మరికొన్ని సందర్భాల్లో వివిధ జంతువుల్లో ఉండే శ్వాస వ్యవస్థల మధ్య తారతమ్యాలు, సారూప్యత, అవయవ నిర్మాణాలు వాటి ప్రత్యేక లక్షణాలు గురించి కూడా ప్రశ్నలు వస్తుంటాయి. శ్వాసక్రియ జరిగే సమయంలో కలిగే మార్పులు, ప్రయోజనాలు, ఏర్పడే పదార్థాలు, శక్తి తదితర అంశాలను వీటికి సంబంధించినవిగా చెప్పుకోవచ్చు. జంతువుల్లో శ్వాస వ్యవస్థ నిర్మాణాల్లో భిన్నత్వం కనిపిస్తుంది. ఇటువంటి వ్యవస్థలపై కూడా ప్రశ్నలు అడుగుతుంటారు. ఉచ్ఛ్వాస, నిచ్ఛ్వాస: మానవునిలో శ్వాసక్రియ జరిగే సమయంలో ఉచ్ఛ్వాస, నిచ్ఛ్వాసలు చోటు చేసుకుంటాయి. ఈ ఉచ్ఛ్వాస, నిచ్ఛ్వాసలను కలిపి శ్వాసక్రియ అంటారు. సాధారణంగా మానవునిలో జరిగే శ్వాసక్రియ రేటు.. అప్పుడే పుట్టిన శిశువు 32సార్లు/నిమిషానికి 5 సం॥పిల్లలు 26 సార్లు / నిమిషానికి 25 సం॥ 15 సార్లు / నిమిషానికి 50 సం॥ 18 సార్లు / నిమిషానికి గాలి పీల్చే (ఉచ్ఛ్వాస) సమయంలో వాయువుల పరిమాణం, గాలి వదిలివేసేటప్పుడు (నిచ్ఛ్వాస) వాయువుల పరిమాణం గురించి కూడా పరీక్షల్లో ప్రశ్నిస్తుంటారు. ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాస ై2 ృ21 శాతం 16.4 శాతం ఇౌ2 ృ 0.04 శాతం 4.0 శాతం ూ2 ృ 79 శాతం 79.6 శాతం సాధారణంగా ఉచ్ఛ్వాస, నిచ్ఛ్వాస ప్రక్రియకు పురుషుల్లో ఉదర వితానం (ఈజ్ఛీఞజిట్చజఝ) స్త్రీలలో పక్కటెముకలు (ఖజీఛట) తోడ్పడుతాయి. వీటితోపాటు శ్వాస మార్గం, శ్వాస అవయవాలైన గాలిగొట్టం, శ్వాస నాళాలు, శ్వాస నాళికలు, ఊపిరితిత్తులు తదితర అంశాలకు సంబంధించి కూడా ప్రశ్నలు అడుగుతుంటారు. శ్వాస మార్గం: నాశికా రంధ్రాలు ్ధ నాశికా కుహరాలు ్ధ అంతర నాశికా రంధ్రాలు ్ధ గ్రసని (్కజ్చిటడ్ఠ) ్ధ స్వరపేటిక (ఔ్చటడ్ఠ) ్ధ వాయునాళం ్ధ శ్వాస నాళాలు ్ధ శ్వాస నాళికలు ్ధ ఊపిరితిత్తులు.వీటిలో గ్రసని అనేది ఆహార, శ్వాస మార్గాలకు కూడలి వంటిది. ఈ భాగంలో ఉన్న ఉపజిహ్విక (ఉఞజీజౌ్ట్టజీట) ఆహారం స్వరపేటికలోకి పోకుండా రక్షిస్తుంది. ఊపిరితిత్తులు: ఊపిరితిత్తుల అధ్యయనాన్ని పల్మనాలజి అంటారు. ఊపిరితిత్తుల చుట్టూ ఉండే పొరను ప్లూరా అంటారు. వీటిలో కుడి ఊపిరితిత్తి పెద్దది. ఇందులో మూడు తమ్మెలు, ఎడమ ఊపిరితిత్తిలో రెండు తమ్మెలు ఉంటాయి. ఊపిరితిత్తుల్లోనే రక్తం శుభ్రమవుతుంది. ఇందులో నిల్వ ఉంచగల గాలి పరిమాణం 6000 ఝ ఊపిరితిత్తులు పూర్తిగా గాలిని వదిలి వేసిన కూడా అందులో 500 ఝ గాలి ఉంటుంది.గాలి పీల్చినప్పుడు 3500 ఝ, వదిలి వేసినప్పుడు 1000 ఝ గాలి ఊపిరితిత్తుల్లో ఉంటుంది. ఊపిరితిత్తుల్లో అతి సూక్ష్మమైన భాగాలు అల్వియోలి. ఈ ప్రమాణాల నుంచి గాలి రక్తంలోకి ప్రవేశిస్తుంది. రక్తం నుంచి కణాల్లోకి ై2 చేరిన తర్వాత కణంలో శ్వాసక్రియ యాంత్రికం జరుగుతుంది. ఒకే విధంగా: సాధారణంగా కణంలో జరిగే శ్వాసక్రియ జంతువుల్లో, మొక్కల్లో దాదాపు ఒకే విధంగా ఉంటుంది. శ్వాసక్రియ రెండు రకాలు. అవి.. 1)వాయు సహిత (ఏరోబిక్) శ్వాసక్రియ సమీకరణం: 6126 + 62 62 + 62 + 38 అఖ్కీ 2)అవాయు (ఎన్ఏరోబిక్) శ్వాసక్రియ సమీకరణం: 6126 225 + 22 + 2 అఖ్కీ ఈ సమీకరణాలాధారంగా అవాయు శ్వాసక్రియలో ై2 అవసరం ఉంటుంది. తక్కువ శక్తి ఉత్పనమవుతుందనే విషయం స్పష్టమవుతుంది.వాయుసహిత శ్వాసక్రియ నిజ కణాల్లో, అవాయు శ్వాసక్రియ కేంద్రక పూర్వ కణాల్లో జరుగుతుంది. ఇటువంటి అంశాల్లో నాలుగు సమీకరణాలు ఇచ్చి సరైన దాన్ని గుర్తించండి? వంటి ప్రశ్నలు ఉపయోగపడే పదార్థాలు, వెలువడే పదార్థాలు, శక్తి మొదలైన అంశాలపై ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. రెండు దశలు: అవాయు శ్వాసక్రియలో గ్లైకాలసిస్, కిణ్వణం అనే రెండు దశలు ఉంటాయి. కిణ్వణం ద్వారా ఆల్కహాల్, లాక్టిక్ ఆమ్లం, పైరూవిక్ ఆమ్లం వంటి పదార్థాలు ఏర్పడతాయి. కిణ్వన ప్రక్రియకు ఈస్ట్ తోడ్పడుతుంది. ఈస్ట్‌లో ఇన్వర్టేజ్, జైమేజ్ అనే ఎంజైమ్‌లు ఉంటాయి. మొదట కనుగొన్న ఎంజైమ్ జైమేజ్. జంతు కణాల్లో అవాయు శ్వాసక్రియ జరిగినప్పుడు ఏర్పడే పదార్థం లాక్టిక్ ఆమ్లం. కణ శ్వాసక్రియ: కణంలోని శ్వాసక్రియ మైటోకాండ్రియాలో జరుగుతుంది. ఈ శ్వాసక్రియలోని దశలు మూడు. అవి.. 1) గ్లైకాలసిస్ 2) క్రెబ్స్ వలయం 3) ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థ. గ్లైకాలసిస్: ఇది మైటోకాండ్రియాలోని భాగంలో కాకుండా కణ ద్రవ్యంలో చోటు చేసుకుంటుంది. దీనిలో గ్లూకోజ్ రెండు అణువుల ఫైరూవిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. 2,2 ప్రమేయం ఉండదు. 2అఖ్కీలు ఏర్పడతాయి. ఇది వాయు, అవాయు శ్వాసక్రియల్లో జరుగుతుంది. క్రెబ్స్ వలయం: ఈ దశ మైటోకాండ్రియాలోని మాత్రికలో జరుగుతుంది. దీనిలోని పైరూవిక్ ఆమ్లం వివిధ పదార్థాలుగా మార్పు చెందుతుంది. ఈ క్రమంలో మొదట ఏర్పడే పదార్థం సిట్రిక్ ఆమ్లం. కాబట్టి దీన్ని సిట్రిక్ ఆమ్ల వలయం అని కూడా పిలు స్తారు. దీనిలో ఇౌ2 వెలువడుతుంది, ూఅఈఏ2,ఊఅఈఏ2లు ఏర్పడతాయి. దీనిలో ై2 ప్రమేయం ఉండదు. ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థ (ఉఖీ): ఇది మైటోకాండ్రియా క్రిస్టె పైన ఉండే ఆక్సీసోముల్లో జరుగుతుంది. ఈ దశలో ై2 వినియోగం కారణంగా నీటి అణువు ఏర్పడుతుంది. అదే మాదిరిగా ూఅఈఏ2, ఊఅఈఏ2లు ఆక్సీకరణం చెంది శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఇది అఖ్కీ రూపంలో వెలువడుతుంది.ఒక గ్లూకోజ్ అణువు శ్వాసక్రియలో పాల్గొన్నప్పుడు ఏర్పడే మొత్తం అఖ్కీలు 38. ఒక అఖ్కీ = 7.2 7200 ఒక గ్రామ్ గ్లూకోజ్ అణువులో 4.5 ఒక గ్రాము కొవ్వులో 9.45 ఓ.ఇ్చ, ఒక గ్రాము ప్రోటీన్‌లో 67శక్తి ఉంటుంది.ప్రతీరోజూ సగటు పనిచేసే మానవునికి 2600 శక్తి అవసరం. బరువు పని చేసేవారు 3900 ఓ.ఇ్చ శక్తిని వినియోగించుకుంటారు. వివిధ అంశాలపై: శ్వాసక్రియలో ఏర్పడే శక్తి 40 శాతం జీవశక్తిగా, 60 శాతం ఉష్ణశక్తిగా మార్పు చెందుతుంది. ప్రతీ 100ఇ ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ 2 శాతం శ్వాసక్రియ రేటు పెరుగుతుంది. శ్వాసక్రియ శరీర ఉష్ణోగ్రత, పీడనం మొదలైన అంశాలపై ఆధారపడి ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రత 450ఇ ఆపై శ్వాసక్రియ తగ్గుతుంది. చుంచు ఎలుకలో శ్వాసక్రియ వేగంగా, ఏనుగులో నెమ్మదిగానూ జరుగుతుంది. గతంలోని ప్రశ్నలు - సమాధానాలు 1. పాలు పెరుగుగా మారినప్పుడు పుల్లటి రుచి రావడానికి కారణం? (ఎస్ఐ - 2011) 1) ఎసిటిక్ ఆమ్లం 2) సిట్రిక్ ఆమ్లం 3) లాక్టిక్ ఆమ్లము 4) ఆక్సాలిక్ ఆమ్లం 5) టార్టారిక్ ఆమ్లం సమాధానం: 3 2. చెరకు చక్కెరలో ఉన్న రసాయనం? (ఎస్ఐ - 2011) 1) లాక్టోస్ 2) గ్లూకోజ్ 3) సుక్రోజ్ 4) ఫ్రక్టోజ్ 5) ఏదీకాదు సమాధానం: 3 3. వాతావరణంలో ఇౌ2 ఎంతవరకు కేంద్రీకృతమై ఉంటుంది? (ఎస్ఐ-2011) 1) 0.03 శాతం 2) 0.09 శాతం 3) 0.12 శాతం 4) 0.06 శాతం 5) 0.33 శాతం సమాధానం: 1 4. ట్యూబర్కులోసిస్ దేనివల్ల వస్తుంది? (కానిస్టేబుల్ - 2012) 1) వైరస్ 2) ప్రోటోజోవా 3) పోషకాహార లోపం 4) బ్యాక్టీరియా సమాధానం: 4 5. సగటు మానవుడు ప్రతీరోజూ ఎన్ని కిలో కేలరీల శక్తిని వినియోగించుకుంటాడు? 1) 2300 2) 2400 3) 1900 4) 3900 సమాధానం: 2 6. పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియా? 1) బాసిల్లస్ ధురెంజి యన్సిస్ 2) క్లాస్ట్రిడియం 3) రైజోబియం 4) లాక్టోబాసిల్లస్ సమాధానం: 4 7. ఊపిరితిత్తులకు సంబంధించని వ్యాధి ? 1) బ్రాంఖైటిస్ 2) క్షయ 3) స్వైన్‌ఫ్లూ 4) చికెన్ గున్యా సమాధానం: 4 8. కణశక్తి భాండాగారం అని దేన్ని పిలుస్తారు? 1) రిక్తిక 2) క్రోమోజోమ్ 3) మైటోకాండ్రియా 4) హరిత రేణువులు సమాధానం: 3 9. కొండ నాలుక విధి? 1) ఆహార నాళంలోకి గాలిని పోనివ్వదు 2) గాలి గొట్టంలోకి ఆహారాన్ని పోనివ్వదు 3) శబ్దాన్ని చేసేందుకు తోడ్పడుతుంది 4) ఏదీకాదు సమాధానం: 2 10. ‘ఎనర్జీ కరెన్సీ’ అని దేన్ని పిలుస్తారు? 1) అఖ్కీ 2) ూఅఈ్క 3) ఊఅఈ్క 4) ఈూఅ సమాధానం: 1 -
ఫిజిక్స్.... ప్రతి అంశమూ ప్రధానమే
ఈ విభాగంలో 6-10 తరగతుల సామాన్య శాస్త్రం నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇందులో జీవ శాస్త్రం, వృక్ష శాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయనశాస్త్రం.. ఇలా నాలుగు భాగాల నుంచి ప్రశ్నలు అడగొచ్చు. పైన సూచించిన అంశాల నుంచి నిత్య జీవిత వినియోగానికి అన్వయించే ఆధారంగా ప్రశ్నలు అడగొచ్చు. 1. ఇంట్లో ఉపయోగించే సాధారణ ఉప్పు రసాయన నామం? 1) సోడియం కార్బోనేట్ 2) సోడియం బైకార్బోనేట్ 3) సోడియం క్లోరైడ్ 4) సోడియం హైడ్రాక్సైడ్ సమాధానం: 3 2. ఇళ్లలోని విద్యుత్ పరికరాలను ఏ సంధానంలో కలుపుతారు? 1) శ్రేణి సంధానం 2) సమాంతరం సంధానం 3) లూప్ 4) విడివిడిగా సమాధానం: 1 3. రోడ్డుపై ఎండమావి కనిపించటంలో దాగి ఉన్న దృగ్విషయం? 1) వక్రీభవనం 2) పరావర్తనం 3) సంపూర్ణాంతర పరావర్తనం 4) సందిగ్ధ కోణం సమాధానం: 3 4. చింతపండు రసం, మిథైల్ ఆరెంజ్ సూచికలో ఏర్పడే రంగు? 1) పసుపు 2) పింక్ 3) ఎరుపు 4) రంగు మారదు సమాధానం: 3 5. గాలిలో ధ్వని తరంగాలు ----- తరంగాలు? 1) అనుధైర్ఘ్య 2) తిర్యక్ 3) స్థిర 4) తిరోగామి సమాధానం: 1 ఏ మేరకు చదవాలంటే.. సిలబస్‌లోని అంశాలను మొత్తంగా కాకుండా వాటి ప్రాధాన్యత మేరకు ప్రిపరేషన్ సాగించడం ప్రయోజనకరం. తద్వారా ఈ విభాగంలో మెరుగైన స్కోర్ సాధించవచ్చు. ఈ క్రమంలో అంశాల వారీగా దృష్టి సారించాల్సిన ముఖ్యాంశాలు.. ధ్వని: ధ్వని ఉత్పాదన, ధ్వని ప్రసరణ, అనుదైర్ఘ్య తరంగాలు, తిర్యక్ తరంగాలు, గాలిలో ధ్వని వేగం, సోనార్, ధ్వని లక్షణాలు (పిచ్, తరచు దనం, కీచు దనం), ధ్వని పరావర్తనం. కాంతి: కాంతి స్వభావాన్ని వివరించే సిద్ధాంతాలు (న్యూటన్ సిద్ధాంతం, హైగెన్ సిద్ధాంతం), కాంతి పరావర్తనం, పరావర్తన నియమాలు, దర్పణాల్లో పరావర్తనం, దర్పణంలో ప్రతిబింబం ఏర్పడే విధానం (సమతల గోళాకార దర్పణాలు), వక్రీభవనం, కటకాలు, కటకాలలో ప్రతిబింబం ఏర్పడే విధానం, దృష్ట్టి దోషాలు- వాటి సవరణ, కాంతి విక్షేపణం, కాంతి పరిక్షేపణం, లేజర్- ప్రత్యేక లక్షణాలు, లేజర్ ఉత్పత్తిలోని దశలు, లేజర్ ఉపయోగాలు. విద్యుత్: విద్యుత్ వలయం, ఓమ్ నియమం, నిరోధ నియమాలు, నిరోధాల శ్రేణి, సమాంతర సంధానాలు, సాధారణ విద్యుత్ వలయాలు, విద్యుత్ సామర్థ్యం, ఇళ్లలో విద్యుత్‌ను కొలవడం. విద్యుదయస్కాంతత్వం, ఫారడే నియమాలు, విద్యుత్ మోటారు, జనరేటర్. అయస్కాంతత్వం: అయస్కాంతాల్లోని రకాలు, అయస్కాంత బలరేఖలు, అయస్కాంత క్షేత్రం, డయా, పారా, ఫెర్రో అయస్కాంతత్వం. రేడియో ధార్మికత: రేడియో ధార్మిక వికిరణం, ఆల్ఫా, బీటా, గామా వికిరణాల లక్షణాలు, కృత్రిమ రేడియో ధార్మికత, కృత్రిమ రేడియో ధార్మిక మూలకాలు ఉపయోగాలు. ఎలక్ట్రానిక్స్: విద్యుత్ అర్ధ వాహకాలు, స్వభావజ, అస్వభావజ అర్థ వాహకాలు, ఞృ జంక్షన్, జంక్షన్ డయోడ్ ధర్మాలు, ఉపయోగాలు, ట్రాన్సిస్టర్ - ధర్మాలు- ఉపయోగాలు కంప్యూటర్: కంప్యూటర్ చరిత్ర, ఇన్పుట్, అవుట్‌పుట్, ఉన్నత స్థాయి భాషలు, కంప్యూటర్ పనితీరు - ఉపయోగాలు. పరమాణు నిర్మాణం: రూదర్ ఫర్డ నమూనా, బోర్ నమూనా, ఆధునిక క్వాంటమ్ సిద్ధాంతం ఆధారంగా పరమాణు నిర్మాణం, ఆర్బిట్, ఆర్బిటాల్, క్వాంటమ్ సంఖ్యలు, ఎలక్ట్రాన్ విన్యాసం. మూలకాల వర్గీకరణ: త్రిక సిద్ధాంతం, అష్టక సిద్ధాంతం, మెండలీఫ్ వర్గీకరణ, ఆధునిక ఆవర్తన పట్టిక, పీరియడ్, గ్రూపులలో పరమాణు ధర్మాల ఆవర్తనం. రసాయన బంధం: అయానిక బంధం, సమయోజనీయ బంధం, వివిధ అణువుల ఆకృతులు, సంకరీకరణం. ఆమ్లాలు - క్షారాలు: ఆమ్లాలు, క్షారాల పరీక్షలు, లోహాలు, అలోహాలతో చర్యలు, తటస్థీకరణం, ్కఏ విలువలు ద్రావణాలు: ద్రావణాల్లో రకాలు, గాఢత, మొలారిటీ. కర్బన రసాయన శాస్త్రం: కార్బన్ ప్రత్యేక ధర్మాలు, హైడ్రోకార్బన్ల వర్గీకరణ - ధర్మాలు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, నూనెలు, సబ్బు. కొన్ని మూలకాల ఖనిజాలు - ఉపయోగాలు ముఖ్యమైన మూలకాలు, వాటి ఖనిజాలు, లోహ సంగ్రహణ లోని ముఖ్యమైన దశలు - విశ్లేషణ సన్నద్ధమిలా ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని ప్రిపరేషన్ కొనసాగించాలంటే ముందుగా 6-10 తరగతుల సామాన్యశాస్త్ర పుస్తకాలు (పాతవి, కొత్తవి) సేకరించాలి. పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి గత ప్రశ్నా పత్రాల్లోని బిట్ పేపర్లను ప్రాక్టీస్ చేయాలి. ముందుగానే బిట్‌బ్యాంక్స్ పై ఆధారపడకుండా పాఠ్యపుస్తకాలను చదవి సొంతంగా నోట్స్ రాసుకుంటే ఉపయుక్తంగా ఉంటుంది. ఎక్కువ తికమకగా ఉండే అంశాలను కొన్ని విలక్షణ పట్టికల ద్వారా గుర్తుంచుకోవాలి. భౌతిక, రసాయన శాస్త్రంలో ముఖ్యమైన టాపిక్స్ -
వివరంగా, విశ్లేషణాత్మకంగా.. జీవశాస్త్రం
జీవశాస్త్రం జీవశాస్త్రం నుంచి అడిగే ప్రశ్నలు సాధారణంగా రెండూ అంశాల చుట్టూ ఉంటున్నాయి. అవి.. మన చుట్టూ ఉన్న జీవ, నిర్జీవ అంశాలు. అంతేకాకుండా జనరల్ సైన్స్ విభాగం మొత్తంలో ఈ అంశాల నుంచే ఎక్కువ ప్రశ్నలు వచ్చే ఆస్కారం ఉంటుంది. ఈ క్రమంలో మన చుట్టు ఉండే మొక్కలు, జంతువులు, వాటి స్వరూపం, రకాలు, వర్గీకరణ, విస్తరణ, ప్రత్యేక లక్షణాలు, పోలికలు మొదలైన అంశాలపై ప్రధానంగా దృష్టి సారించాలి. ప్రశ్నల సరళి: ప్రశ్నల సరళిని పరిశీలిస్తే.. ఇంటర్మీడియెట్ స్థాయి వరకు ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి ప్రిపరేషన్‌ను ఇంటర్మీడియెట్ స్థాయి వరకు సాగించాలి. అంటే పదో తరగతి వరకు ఉండి ఇంటర్మీడియెట్‌లో పునరావృతమయ్యే అంశాలకు మాత్రమే ప్రిపరేషన్‌ను పరిమితం చేయాలి. కొన్ని సందర్భాలలో ప్రశ్నలు నేరుగా ఒక అంశానికి మాత్రమే పరిమితమై ఉంటాయి. ఉదాహరణకు- స్కర్వీ ఏ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది? మరికొన్ని సందర్భాలలో రెండు, మూడు సబ్జెక్ట్‌ల అనుసంధానంతో ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకు- మయోపియా (హ్రస్వదృష్టి) సంభవించినప్పుడు ఉపయోగించే కటకాలు ఏవి? సునిశితంగా పరిశీలిస్తే.. ఇందులో జీవ, భౌతిక శాస్త్ర అంశాలు ఇమిడి ఉన్నాయి. దీనికి సమాధానం గుర్తించాలంటే కంటి వ్యాధులు, వాటి నివారణకు ఉపయోగించే కటకాలపై కూడా పూర్తి అవగాహన కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే సమాధానం గుర్తించగలం. విశ్లేషణాత్మకంగా: మొక్కలు, జంతువులపై అడిగే ప్రశ్నలు కొంత మేరకు గందరగోళానికి గురి చేస్తాయి. ప్రత్యేకించి మొక్కలు, జంతువులు వాటి మధ్య పోలికలు, వర్గం గుర్తించమనే సందర్భంలో ఇటువంటి సందేహాలు ఎక్కవగా వస్తాయి. ఉదాహరణకు తొండ, బల్లి, ఉడుం, ఉడత-వీటిలో భిన్నమైంది? (ఈ ప్రశ్నకు సమాధానం-ఉడత. ఎందుకంటే మొదటి మూడు సరీసృపాలు, చివరిది క్షీరదం. అంటే క్షీరదాల శరీరంపై వెంట్రుకలు ఉంటాయి అనే లక్షణం తెలిస్తే సమాధానాన్ని సులువుగా గుర్తించవ చ్చు)మొక్కలు, జంతువులకు సంబంధించి సాధారణ విషయాలు మనకు తెలుసు. అంతేకాకుండా రోజూ చూస్తూనే ఉంటాం. అయినప్పటికీ వాటి మధ్య భేదం అంత తొందరగా స్ఫూరణకు రాదు. కారణం వాటిపై శాస్త్రీయ అవగాహన లేకపోవడమే. కాబట్టి వర్గీకరణ, సాధారణ లక్షణాలు, అవయవ నిర్మాణం, ఆహారపు అలవాట్లు వంటి అంశాలను విశ్లేషణాత్మకంగా చదవాలి. అప్పుడే ఇటువంటి ప్రశ్నలకు సమాధానాన్ని సులభంగా ఇవ్వొచ్చు. జంతువుల విస్తరణ: మరో కీలక అంశం.. జంతువుల విస్తరణ. ఈ అంశానికి సంబంధించి అడిగే ప్రశ్నలు సాధారణ స్థాయిలోనే ఉంటాయి. జంతువుల ఆవాసాలు, అవి నివసించే ప్రదేశాలపై ఎక్కువగా ఈ తరహా ప్రశ్నలు ఇస్తుంటారు. ఎందుకంటే కొన్ని జంతువులు, కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉంటాయి. కాబట్టి ఆయా అంశాలపై ప్రధానంగా దృష్టి సారించాలి. ముఖ్యంగా కంగారు, ఎకిడ్నా, ప్లాటిపస్, ఎలుగుబంటి వంటి జంతువులకు సంబంధించిన ప్రశ్నలను అడుగుతుంటారు. ఇందుకోసం వాటి అవాస ప్రాంతాలు, దేశాలను గుర్తుంచుకోవాలి. ఉదాహరణ- కంగారు అనేది ఆస్ట్రేలియాలో కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఆయా అంశాల మధ్య ఉన్న సంబంధంపై విస్తృత అవగాహనను పరీక్షించే విధంగా కూడా ప్రశ్నలు అడుగుతుంటారు. ఉదాహరణకు పిట్యుటరీ : మెదడు :: థైమస్ : --? (సమాధానం: అవటు గ్రంధి) ఈ ప్రశ్న నియంత్రణ- సమన్వయం అనే అంశానికి సంబంధించింది. ఈ అంశాన్ని విస్తృత స్థాయిలో చదివినప్పుడే పై ప్రశ్నకు సమాధానం గుర్తించడం సాధ్యమవుతుంది. కాబట్టి మెదడు నిర్మాణం, దానిలోని భాగాలు, వాటి విధులు వంటి విషయాలపై కూడా ప్రధానంగా దృష్టి సారించాలి. అంతే విస్తృత స్థాయి ప్రిపరేషన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. కిరణజన్య సంయోగ క్రియకు సంబంధించి నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్త ఎవరు? (సమాధానం: మెల్విన్ కాల్విన్) ఈ ప్రశ్న చూస్తే కిరణజన్య సంయోగ క్రియకు సంబంధించింది. కాబట్టి ఈ అంశాన్ని చదువుతున్నప్పుడు ఇందులో కేవలం కిరణజన్యసంయోగ క్రియ, దానికి కావల్సిన పరిస్థితులు, ఫలితాలు వంటి వాటికే పరిమితం కాకుండా.. సంబంధిత అంశాలపై పరిశోధనలు నిర్వహించిన శాస్త్రవేత్తలు, అందుకుగాను వారికి లభించిన పురస్కారాలను కూడా గుర్తుపెట్టుకున్నప్పుడు మాత్రమే సమధానాన్ని గుర్తించగలం. గవద బిళ్లలు ఏ సూక్ష్మజీవి ద్వారా సంభవిస్తాయి? (సమాధానం-వైరస్) ఈ ప్రశ్న వ్యాధులకు సంబంధించి. వ్యాధులు, లక్షణాలు, సంక్రమణ, వ్యాప్తి, నిర్మూలన, ప్రభావిత భాగాలు మొదలైన అంశాలపై అవగాహన ఉండాలి. వ్యాధులు ముఖ్యంగా బ్యాక్టీరియా, వైరస్, ప్రోటోజోవా, నిమటోడ్స్, ఫంగస్ వంటి సూక్ష్మజీవులతోపాటు దోమలు, ఈగలు వంటి కీటకాల ద్వారా కూడా వ్యాప్తి చెందుతాయి. ఇవి వ్యాధులకు సంబంధించిన ప్రాథమిక భావనలు. దీనిపై పట్టు ఉంటేనే సమాధానం గుర్తించగలం. తప్పకుండా: మరో ప్రధాన విభాగం.. మానవ శరీర ధర్మ శాస్త్రం. ఎందుకంటే ప్రతి పోటీ పరీక్షలో ఈ అంశం నుంచి తప్పకుండా ప్రశ్నలు ఉంటున్నాయి. కాబట్టి మానవ శరీర నిర్మాణంపై పూర్తి అవగాహన పెంచుకోవాలి. ఇందులో భాగంగా అస్థి పంజరం, జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, నాడీ వ్యవస్థ, విసర్జక వ్యవస్థ మొదలైన అంశాలపై ప్రధానంగా దృష్టి సారించాలి. గతంలో రక్త కణాలు, ఎంజైములు, హార్మోన్స్, విటమిన్స్, మూలకాలు, పౌష్టిక ఆహారం మొదలైన అంశాలపై ప్రశ్నలు అడిగారు. కాబట్టి మన ఆహారం, ప్రాముఖ్యత, లభ్యత మొదలైన అంశాలపై కూడా ప్రధానంగా దృష్టి సారించాలి. గత ప్రశ్నపత్రాన్ని పరిశీలిస్తే శరీర రక్షణ ఆహారం ఏమిటి? అనే ప్రశ్న ఇచ్చారు. దీనికి సమాధానం-విటమిన్స్. ఇక్కడ గమనించాల్సిన అంశం.. ఏ పోటీ పరీక్షలోనైనా విటమిన్స్ గురించి తప్పనిసరిగా ఒకటి లేదా రెండు ప్రశ్నలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విటమిన్సను క్షుణ్నంగా చదవాలి. కీలకం: జీవశాస్త్రంలో కీలకమైన అంశం..పరిశోధనలు. ఈ అంశానికి సంబంధించి ప్రశ్నలు వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టి జీవశాస్త్ర పరిశోధనలు, చేపట్టిన శాస్త్రవేత్తల గురించి క్షుణ్నంగా చదువుకోవాలి. బహుమతులు పొందిన అంశాలను కూడా గుర్తుంచుకోవాలి. కొన్ని సందర్భాల్లో సంవత్సరాలను కూడా అడుగుతుంటారు. కాబట్టి సంవత్సరాన్ని కూడా విస్మరించవద్దు. దేశాన్ని గుర్తుంచుకోవడం కూడా ప్రయోజనకరమే. ముఖ్యంగా జీవశాస్త్రంలో నోబెల్ గ్రహీతలు గురించి ప్రశ్నలు అడిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి రోనాల్డ్ రాస్, హారగోవింద్ ఖురానా, వాట్సన్, క్రిక్, స్టాన్లీవంటి శాస్త్రవేత్తలపై ప్రధానంగా దృష్టిసారించాలి. మూలకాలు ముఖ్యమే: మూలకాల గురించి కూడా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. ఉదాహరణ- గతంలో ఇచ్చిన ప్రశ్నను పరిశీలిస్తే.. హిమోగ్లోబిన్ : ఐరన్ :: క్లోరోఫిల్ : --దీనికి సమాధానం గుర్తించాలంటే అణువుల నిర్మాణంపై అవగాహన ఉండాలి. ఇక్కడ ఈ ప్రశ్నలోని రెండు అణువుల నిర్మాణం ఒకే విధంగా ఉంటుంది. కాని దాని మధ్యలో ఉండే ముఖ్యమైన మూలకంలో తేడా ఉంటుంది. సమాధానం మెగ్నీషియం. కాబట్టి ఇటువంటి అంశాలకు సంబంధించి మొక్కలలో, జంతువులలో ఉండే మూలకాలు, వాటి ఆవశ్యకత మొదలైన అంశాల గురించి క్షుణ్నంగా తెలుసుకోవాలి. ఈ అంశానికి సంబంధించి మరో ప్రశ్న కూడా గతంలో అడిగారు. ఎముకల నిర్మాణానికి సంబంధించి కాల్షియంను నియంత్రించే హార్మోన్? దీనికి సమాధానం పారాథైరాక్సిన్. (ఈ ప్రశ్నలో హార్మోన్‌కు బదులుగా విటమిన్ ఉంటే.. దానికి సమాధానం విటమిన్-డి). చదవాల్సినవి: ఆయా అంశాలను అనుసరించి 6 నుంచి ఇంటర్మీడియెట్ వరకు ఉన్న జీవశాస్త్ర పాఠ్య పుస్తకాలు. -
ఇమ్యునాలజీ పితామహుడు ఎవరు?
రోగ నిరోధక వ్యవస్థ శరీరంలోకి ప్రవేశించిన వ్యాధి కారకాన్ని గుర్తించి నిర్మూలించే వ్యవస్థను అసంక్రామ్యత వ్యవస్థ లేదా రోగ నిరోధక వ్యవస్థ అంటారు. ఈ వ్యవస్థ ద్వారా ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. శరీరానికి రోగ నిరోధక శక్తి (ఇమ్యూనిటీ) పెరుగుతుంది. అసంక్రామ్యత వ్యవస్థ అధ్యయనం ద్వారా టీకాలను అభివృద్ధి చేశారు. ఇమ్యూనిటీ - రకాలు మానవుడిలో ఇమ్యూనిటీ రెండు రకాలు. అవి.. స్వాభావిక, స్వీకృత ఇమ్యూనిటీలు. పుట్టుకతోనే లభించేది స్వాభావిక ఇమ్యూనిటీ. శరీరంలోకి ఏ వ్యాధి కారకం ప్రవేశించక ముందే ఈ ఇమ్యూనిటీ ఉంటుంది. చర్మం, శ్లేష్మస్తరాలు బాహ్య అవరోధాలుగా వ్యవహరిస్తూ స్వాభావిక ఇమ్యూనిటీని అందిస్తాయి. వీటికి అదనంగా బ్యాక్టీరియా నాశినిగా పనిచేసే కంటిలోని లైసోజైం అనే ఎంజైమ్, జఠర రసంలోని హైడ్రో క్లోరిక్ ఆమ్లం కూడా స్వాభావిక ఇమ్యూనిటీని అందిస్తాయి. అందరిలో స్వాభావిక ఇమ్యూనిటీ దాదాపు ఒకే విధంగా ఉంటుంది. ఒక వ్యక్తి తన జీవితకాలంలో ఆర్జించే ఇమ్యూనిటీ.. స్వీకృత లేదా ఆర్జిత ఇమ్యూనిటీ. ఒక వ్యక్తి నివసించే ప్రాంతం, తాగే నీరు, పీల్చే గాలి, ఆహారపు అలవాట్లపై ఇది ఆధారపడుతుంది. కాబట్టి ఇది అందరిలోనూ ఒకే విధంగా ఉండదు. మానవుడిలో ఇమ్యూనిటీ వ్యవస్థ మానవుడి ఇమ్యూనిటీ వ్యవస్థలో తెల్ల రక్త కణాలు, లింఫాయిడ్ అవయవాలు ఉంటాయి. తెల్ల రక్త కణాలు శరీర రక్షక భటుల లాంటివి. వీటిలో ఇసినోఫిల్స్ అలర్జీ చర్యల్లో పాల్గొనగా, న్యూట్రోఫిల్స్, మోనోసైట్స్ భక్షక కణాలుగా వ్యవహరిస్తాయి. లింఫోసైట్స్ అనే తెల్ల రక్త కణాలు చాలా కీలకమైనవి. ఇవి రెండు రకాలు ఖీ - లింఫోసైట్స్, ఆ - లింఫోసైట్స్. ఖీ- లింఫోసైట్స్ మళ్లీ రెండు రకాలు - ఇఈ4/ఖీ4, ఇఈ8 కణాలు. ఇమ్యూనిటీ వ్యవస్థలోని అవయవాలు రెండు రకాలు. ఎముక మజ్జ, థైమస్ అనేవి ప్రాథమిక అవయవాలు. ఎముక మజ్జలో లింఫోసైట్స్ ఏర్పడతాయి. ఆ లింఫోసైట్స్ మాత్రం ఎముక మజ్జలో పరిపక్వత చెందగా, ఫోసైట్స్ థైమస్ నుంచి విడుదలయ్యే థైమోసిన్ హార్మోన్ ప్రేరణతో పరిపక్వత చెందుతాయి. స్పెసిఫిక్ ఇమ్యూనిటీ ఖీ, ఆ లింఫోసైట్స్ ద్వారా లభించే నిరోధక శక్తిని స్పెసిఫిక్ ఇమ్యూనిటీ అంటారు. వ్యాధి కారకం ఉపరితలంపై ఉన్న ప్రతిజనకం ఆధారంగా దీన్ని గుర్తించి ఖీ ృ లింఫోసైట్స్ అందించే ఇమ్యూనిటీని సెల్యూలార్ లేదా సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అంటారు. వ్యాధి కారకాన్ని గుర్తించి ఖీ ృ లింఫోసైట్స్ భక్షక కారకాలను ప్రేరేపిస్తాయి. ఫలితంగా భక్షక కణాలు వ్యాధి కారకాన్ని భక్షిస్తాయి. కొన్ని సందర్భాల్లో వ్యాధి కారకాన్ని నేరుగా ఖీ ృ లింఫోసైట్స్ నాశనం చేస్తాయి. ముఖ్యంగా ఇఈ8 కణాలు ఈ విధంగా వ్యవహరిస్తాయి. కొన్ని ఖీ4 లింఫోసైట్స్ వ్యాధి కారకాన్ని గుర్తించిన వెంటనే ఆ లింఫోసైట్స్‌ను ప్రేరేపిస్తాయి. ఈ విధంగా ప్రేరణకు గురైన ఆ ృ లింఫోసైట్స్ వ్యాధి కారకానికి విరుద్ధంగా ప్రత్యేకంగా ప్రతిదేహకాలు లేదా ప్రతిరక్షకాల (అ్టజీఛౌఛీజ్ఛీట)ను విడుదల చేస్తాయి. ఇవి వ్యాధి కారకం ఉపరితలంపై ప్రతి జనకం ఆధారంగా దాన్ని గుర్తించి నాశనం చేస్తుంది. అంతేగాకుండా కొన్ని ఆ ృ కణాలు వ్యాధి కారకాన్ని గుర్తుపెట్టుకునే ఇమ్యునలాజికల్ మెమొరీ అనే గుణాన్ని ప్రదర్శిస్తాయి. అదే వ్యాధి కారకం మళ్లీ శరీరంలోకి ప్రవేశిస్తే ఈ సారి అధిక మోతాదులో వేగంగా ప్రతిదేహకాలు విడుదలై దాన్ని పూర్తిగా నిరోధిస్తాయి. ఈ రకంగా ప్రతిదేహకాల ద్వారా ఆ ృ లింఫోై సెట్స్ అందించే ఇమ్యూనిటీయే హ్యుమొరల్ ఇమ్యూనిటీ. వ్యాక్సిన్ టీకా లేదా వ్యాక్సిన్ అనేది ఒక నివారణ ఔషధం. వ్యాధి కారకం శరీరంలోకి చేరకముందే దీన్ని ఇస్తారు. దాంతో భవిష్యత్తులో సంక్రమించడానికి అవకాశమున్న వ్యాధి కారకాన్ని నిరోధించడానికి వీలవుతుంది. కేవలం చిన్న పిల్లలకే కాకుండా పెద్దలు కూడా వేయించుకునే టీకాలు ఉంటాయి. సాధారణంగా టీకాలు రెండు రకాలు. సంప్రదాయ, ఆధునిక టీకాలు. సంప్రదాయ టీకాల్లో క్షీణింపజేసిన లేదా మృత వ్యాధి కారకాలు ఉంటాయి. ఇలాంటి వాటిని అందించడం ద్వారా వ్యాధి అభివృద్ధి చెందదు. అయితే వ్యాధికారక ఉపరితలంపై ఉన్న ప్రతిజనకానికి విరుద్ధంగా శరీరంలో ప్రతిదేహకాలు విడుదలై మెమొరీ అభివృద్ధి చెందుతుంది. ఇలాంటి టీకాను రెండు లేదా మూడుసార్లు వేయించినట్లయితే శరీరంలో ఆ వ్యాధికి విరుద్ధంగా పూర్తిస్థాయి నిరోధకత లభిస్తుంది. ఉదా: ఓరల్ పోలియో వ్యాక్సిన్ , డీపీటీ వ్యాక్సిన్. సంప్రదాయ టీకాల్లో కొన్ని లోపాలను అధిగమించడానికి ఆధునిక టీకాలు అందుబాటులోకి వచ్చాయి. ఆధునిక టీకాల్లో శుద్ధమైన ప్రతిజనకం లేదా వ్యాధి కారకానికి చెందిన ఉపరితల భాగం ఉంటాయి. ఇవి సంప్రదాయ టీకాల కంటే సురక్షితమైనవి. ఉదా: హెపటైటిస్ అ, ఆ టీకాలు. స్థిరమైన ప్రతిజనకం లేని కారణంగా హెచ్ఐవీ లాంటి వాటికి విరుద్ధంగా టీకాలేవీ అందుబాటులోకి రాలేదు. భారత టీకా కార్యక్రమం 1975లో ప్రపంచవ్యాప్తంగా మశూచిని పారదోలిన తర్వాత భారత ప్రభుత్వం 1978లో ఎక్స్పాండెడ్ ప్రోగ్రామ్ ఆన్ ఇమ్యూనైజేషన్ (ఉ్కఐ) అనే టీకా కార్యక్రమాన్ని ప్రారంభించింది. 1974లో ప్రపంచ ఆరోగ్య సంస్థ రూపొందించిన నమూనా ఆధారంగా భారత్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. 1990 నాటికి దేశంలోని చిన్నారులందరికీ టీకాలు అందించాలనేది దీని లక్ష్యం. 1985లో యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్ ను ప్రభుత్వం ప్రారంభించి, 1990 నాటికల్లా 85 శాతం చిన్నారులకు టీకాలను అందించాలని నిర్ణయించింది. 1990 నాటికి టీకాల ఉత్పాదనలో స్వయం సమృద్ధిని సాధించాలనేది కూడా దీని లక్ష్యం. ఆ తర్వాత కొన్ని ఇతర కార్యక్రమాల్లో భాగంగా అమలు చేశారు. ప్రస్తుతం జాతీయ ఆరోగ్య మిషన్‌లో టీకా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. భారత ప్రభుత్వం ప్రస్తుతం ఉచితంగా అందిస్తున్న టీకాలు కనీసమైనవి, కచ్చితమైనవి. గర్భిణులకు రెండు డోసుల ఖీ.ఖీ (టెటనస్ టాక్సాయిడ్) టీకాను ఇస్తున్నారు. నవజాత శిశువులకు కింది ప్రాణాంతక వ్యాధులకు నివారణగా టీకాలను అందిస్తున్నారు. క్షయ - బాసిల్లస్ కాల్మేట్ గ్వెరిన్ పోలియో-ఓరల్ పోలియో వ్యాక్సిన్ డిఫ్తీరియా - డీపీటీ పర్టుసిస్ - డీపీటీ టెటనస్ - డీపీటీ మీజిల్స్ - మీజిల్స్ హెపటైటిస్ఆ - హెప్ఆ వీటికి అదనంగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో జపనీస్ ఎన్సిఫలైటీస్ టీకాను అందుబాటులోకి తీసుకువచ్చారు. త్వరలో నీమోకోకల్ కాంజు గేట్, హ్యూమన్ పాపిల్లోమ, రోటా, హెచ్ఐబీ (హీమోఫిలస్ ఇన్‌ఫ్లూయెంజా టైప్ బి) టీకాలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం అందిస్తున్న టీకాలకు అదనంగా కూడా కొన్ని కచ్చిత టీకాలను పిల్లలకు ఇవ్వాలని ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియా ట్రిక్స్(ఐఏపీ) సూచిస్తోంది. మంప్స్ - ఎంఎంఆర్ టీకా మీజిల్స్ - ఎంఎంఆర్ టీకా రుబెల్లా - ఎంఎంఆర్ టీకా పోలియో - ఇనాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్ టైఫాయిడ్ - టైఫాయిడ్ కాంజుగేట్ వ్యాక్సిన్ హీమోఫిలస్ ఇన్‌ఫ్లూయెంజా టైప్ బి (హెచ్ఐబీ) సర్వైకల్ క్యాన్సర్ - హ్యూమన్ పాపిల్లోమ వీటికి అదనంగా కూడా కొన్ని ఐచ్ఛిక టీకా లను ఐఏపీ సూచిస్తోంది. హెపటైటిస్ ఎ - హెప్ ఎ అమ్మవారు - వారి సెల్ల ప్రతిజనకం: వ్యాధి కారకం ఉపరితలంపై ఉంటూ శరీర నిరోధక శక్తిని ప్రేరేపించే అన్య పదార్థాన్ని ప్రతిజనకం అంటారు. రసాయనికంగా ఇది ఏదైనా కావచ్చు. దీనికి విరుద్ధంగా శరీరంలోని ఆ ృ లింఫోసైట్స్ అనే తెల్ల రక్త కణాలు ప్రతిదేహకాలు అనే జీవ క్షిపణులను విడుదల చేస్తాయి. కాంబినేషన్ వ్యాక్సిన్: నాలుగు, అంతకంటే ఎక్కువ వ్యాధి కారకాలకు నిరోధక ఔషధాలు ఉంటే కాంబినేషన్ టీకా అంటారు. భారత్‌లో ప్రస్తుతం ఇలాంటి రెండు టీకాలు ఎక్కువగా వినియోగంలో ఉన్నాయి. అవి.. టెట్రావలెంట్ టీకా(నాలుగు వ్యాధులకు), పెంటావలెంట్ టీకా(ఐదు వ్యాధులకు). తొలిసారిగా ఇలాంటి టీకాలను ప్రభుత్వం కేరళ, తమిళనాడులో పెలైట్ ప్రాజెక్టుగా ప్రారంభించి, క్రమంగా ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తోంది. -
మధుమేహ రోగులు అధికంగా ఉన్న దేశం?
మానవ శరీర ధర్మశాస్త్రం శరీరంలోని వివిధ భాగాల మధ్య అర్థవంతమైన సమన్వయం చాలా అవసరం. మానవునిలో దీనికోసం నాడీ వ్యవస్థ, అంతస్రావిక వ్యవస్థలు ఉన్నాయి. నాడీ వ్యవస్థలో నాడీ ప్రచోదనం అనే నాడీ సమాచార ప్రసారం ద్వారా వేగవంతమైన సమన్వయం సాధ్యమవుతుంది. అంతస్రావిక వ్యవస్థలోని అంతస్రావిక గ్రంథుల నుంచి విడుదలయ్యే హార్మోన్లు కూడా కీలకమైన సమన్వయాన్ని నిర్వహిస్తాయి. నాడీకణం నాడీ వ్యవస్థలోని ప్రతి భాగం నాడీకణాలతో నిర్మితమై ఉంటుంది. నాడీ కణాలకు కణవిభజన శక్తి ఉండదు. నాడీ కణాల సంఖ్య స్థిరంగా ఉంటుంది. మిగతా శరీర కణాల కంటే నాడీ కణాలు పొడవుగా ఉంటాయి. నాడీ కణం లో రెండు ప్రధాన భాగాలు ఉంటాయి. అవి: వెడల్పాటి కణదేహం, పొడవైన ఏక్సాన్. కణదేహం (Cyton)లో కేంద్రకం ఉంటుంది. కేంద్రకం చుట్టూ నిస్సల్స్ కణికలు ఉంటాయి. కణదేహం అంతా డెండ్రైట్స్ అనే విభజనలు ఉంటాయి. ఏక్సాన్ తంతువు చివరన టెలిడెండ్రైట్స్ ఉంటాయి. ఏక్సాన్ చుట్టూ మైలిన్పొర విద్యుత్ బంధకంగా వ్యవహరిస్తుంది. దీని చుట్టూ న్యూరిలెమ్మా ఉంటుంది. న్యూరిలెమ్మా, మైలిన్ పొరల మధ్య ప్రత్యేకంగా ష్క్వాన్ కణాలు ఉంటాయి. నాడీ ప్రచోదనం నాడీ వ్యవస్థలోని ప్రతి భాగం నాడీ కణాలతో నిర్మితమై ఉంటుంది. మెదడు, వెన్నుపాము నాడులన్నీ నాడీ కణాలతోనే నిర్మితమై ఉంటాయి. అనేక నాడీకణాలు ఒక దాని వెనుక మరొకటి చేరి ఒక సమూహంగా ఏర్పడితే, దాన్ని ‘నాడు’ అంటారు. ఒక నాడులోని నాడీకణాల ద్వారా సాగే నాడీ సమాచారం ప్రసారమే నాడీ ప్రచోదనం. ఇది విద్యుత్ రూపంలో ప్రసారమవుతుంది. నాడీ ప్రచోదనం రెండు నాడీ కణాల మధ్య రసాయన మాధ్యమంతో ముందుకు సాగుతుంది. నాడీ ప్రచోదనంలో ఉపయోగపడే ఈ రసాయనాలను న్యూరోట్రాన్సమీటర్లు అంటారు. నాడీ వ్యవస్థ భాగాలు నాడీ వ్యవస్థను మూడు భాగాలుగా విభజించవచ్చు. అవి: కేంద్ర, పరధీయ, స్వయంచోదిత నాడీ మండలాలు. మెదడు, వెన్నుపాములను కలిపి కేంద్ర నాడీ మండలం అంటారు. ఈ రెండూ అతి సున్నితమైన భాగాలు. వీటి చుట్టూ మూడు రక్షణ పొరలు, మెనింజిస్ ఉంటాయి. కపాలం అనే అస్థిపంజర నిర్మాణంలో మెదడు, వెన్నెముకలోని వెన్నుపాము సురక్షితంగా ఉంటాయి. మెదడులో అతిపెద్ద భాగం మస్తిష్కం. ఇది రెండు మస్తిష్క గోళార్ధాల రూపంలో ఉంటుంది. మస్తిష్కం తెలివి తేటలు, ఆలోచన, జ్ఞాపకశక్తి, విచక్షణా శక్తి, సమస్యా పరిష్కారం లాంటి గుణాలను, అనేక భావాలను నియంత్రిస్తుంది. మస్తిష్కం తర్వాత మెదడులోని పెద్ద భాగం అనుమస్తిష్కం. ఇది శరీర చలనాన్ని, సమన్వయాన్ని, కండర సంకోచాలను నియంత్రిస్తుంది. బ్రెయిన్స్టెంలో పాన్‌స అనే భాగం మెదడు వెన్నుపాముల మధ్య సమాచార మార్పిడికి ఒక రిలే కేంద్రంగా వ్యవహరిస్తుంది. పాన్‌స కింద మజ్జాముఖం ఉంటుంది. ఇది ప్రధానంగా శ్వాసను నియంత్రిస్తుంది. మస్తిష్కం కింద ఉండే అథాపర్యంకం (Hypothalamus) శరీర ఉష్ణోగ్రత, ఆకలి, దప్పిక, నిద్ర, లైంగిక వాంఛలను నియంత్రిస్తుంది. మెదడు, కింది భాగం వెన్నుపాముగా కొనసాగుతుంది. వెన్నుపాము ఒక సెంటీ మీటర్ మందంలో ఉంటుంది. ఇది అసంకల్పిత ప్రతీకార చర్యలను నియంత్రిస్తుంది. మెదడు, వెన్నుపాముల నుంచి సాగే నాడులన్నీ కలిిసి పరధీయ నాడీ మండలం ఏర్పడుతుంది. మెదడు నుంచి సాగే నాడులను ‘మస్తిష్క/ కపాల నాడులు’ అంటారు. ఇవి 12 జతలు. వెన్నుపాము నుంచి సాగే నాడులను ‘వెన్నునాడులు’ అంటారు. ఇవి 31 జతలు. కేంద్ర నాడీ మండలానికి సంబంధం లేకుండా వ్యవహరించే నాడీ కేంద్రాల వల లాంటి నిర్మాణం, స్వయంచోదిత నాడీ మండలం సహానుభూత, పరసహానుభూత వ్యవస్థలు అనే రెండు రకాలుగా స్వయంచోదిత నాడీ వ్యవస్థ విభజన చెంది ఉంటుంది. అంతస్రావిక వ్యవస్థ అంతస్రావిక వ్యవస్థలో అంతస్రావిక గ్రంథులు, వాటి నుంచి హార్మోన్లు అనే రసాయన విభాగాలు ఉంటాయి. అంతస్రావిక గ్రంథులు వాటి స్రావితాలను, ఏ నాళం సాయం లేకుండా నేరుగా రక్తంలోకి విడుదల చేస్తాయి. వీటిని వినాళ గ్రంథులు అంటారు. ఇవి శరీరంలోని వివిధ భాగాల్లో ఉంటాయి. ఒక అంతస్రావిక గ్రంథి ద్వారా రక్తంలోకి విడుదలై, రక్తం ద్వారా ఇతర భాగాలకు చేరి, క్రియాశీల చర్యలను నియంత్రించే రసాయనాలను హార్మోన్లు అంటారు. మెదడు కింది భాగంలో పీయూష గ్రంథి ఉంటుంది. దీనిలో పూర్వ, మధ్యస్థ, పర లంబికలు ఉంటాయి. పూర్వలంబిక నుంచి ట్రాపిన్స అనే హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి కొన్ని ఇతర అంతస్రావిక గ్రంథులను ప్రేరేపిస్తాయి. పూర్వలంబిక నుంచి విడుదలయ్యే పెరుగుదల హార్మోన్ శారీరక పెరుగుదలను ప్రేరేపిస్తుంది. దీని అల్పస్రావం ద్వారా పిల్లల్లో మరుగుజ్జుత నం వస్తుంది. అధికస్రావం వల్ల జెగాంటిజం (అతిదీర్ఘకాయం)వస్తుంది. మధ్యస్థలంబిక నుంచి మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ (MSH) విడుదలవుతుంది. పరలంబిక నుంచి విడుదలయ్యే ఆక్సిటోసిన్ శిశు జననానికి తోడ్పడుతుంది. వాసోప్రెసిన్ అతిమూత్రాన్ని నిరోధిస్తుంది. మెడలో వాయునాళానికి ముందుగా స్వరపేటిక దిగువన అవటు గ్రంథి ఉంటుంది. దీని నుంచి థైరాక్సిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది జీవక్రియారేటును నియంత్రిస్తుం ది. థైరాక్సిన్ లోపం వల్ల క్రెటినిజం అనే మానసిక, శారీరక మాంద్యంతో శిశువు పుట్టే ప్రమాదముంది. పెద్దల్లో థైరాక్సిన్ అల్పస్రావం ద్వారా మిక్సోడియ/ గల్స్ వ్యాధి అధిక స్రావం ద్వారా గ్రేవ్స వ్యాధి/ ఎక్సాఫ్తాల్మిక్ గాయిటర్ వస్తాయి. అవటుకు దగ్గరగా నాలుగు చిన్న పార్శ్వ అవటు గ్రంథులుంటాయి. వీటి నుంచి పారాథార్మోన్ విడుదలవుతుంది. అవటు నుంచి విడుదలయ్యే కాల్సిటోనిన్ అనే హార్మోన్‌తో కలిసి పారాథార్మోన్ రక్తంలో కాల్షియం శాతాన్ని నియంత్రిస్తుంది. క్లోమం క్లోమం జీర్ణాశయం కింది భాగాన, చిన్న పేగులోకి తెరుచుకొని ఉంటుంది. ఇది ఒక మిశ్రమ గ్రంథి. దీనిలోని అంతస్రావిక భాగం లాంగర్హన్స పుటికలు. క్లోమంలోని ఆల్ఫా కణాలు గ్లూకగాన్ హార్మోన్‌ను, బీటా కణాలు ఇన్సులిన్‌ను విడుదల చేస్తాయి. ఈ రెండు హార్మోన్లు కలిసి రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రిస్తాయి. గ్లూకగాన్ రక్తంలో చక్కెర శాతాన్ని పెంచుతుంది. ఇన్సులిన్ తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర శాతం పెరిగి, శరీర అవయవాల పనితీరు దెబ్బతినే రుగ్మతను ‘మధుమేహం’ (Diabetes mellitus) అంటారు. ఇది రెండు రకాలు. పూర్తిగా ఇన్సులిన్ ఏర్పడక పోవడం ద్వారా సంభవించేది టైప్-1 మధుమేహం. ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గడం లేదా సరిగా పనిచేయకపోవడం ద్వారా సంభవించేది రెండో రకం మధుమేహం. రక్తంలో చక్కెర శాతం పెరిగే కొద్దీ రక్త సరఫరాకు అవరోధం ఏర్పడి, వివిధ అవయవాల పనితీరు దెబ్బతింటుంది. గాయాలు తొందరగా మానవు. పాదాల్లో అల్సర్లు ఏర్పడతాయి. మూత్రపిండాల పనితీరు దెబ్బతింటుంది. పురుషుల్లో లైంగిక సామర్థ్యం తగ్గుతుంది. కంటి చూపు మందగిస్తుంది (డయాబెటిక్ రెటినోపతి). చివరకు గుండె పనితీరు దెబ్బతిని, వ్యక్తి కోమా స్థితిలోకి చేరి మరణిస్తాడు. అధివృక్క గంథ్రి అధివృక్క గ్రంథులు మూత్రపిండాలపై టోపిలా కనిపిస్తాయి. వీటి నిర్మాణంలో రెండు భాగాలుంటాయి. వెలుపలి వల్కలం (Cortex), లోపలి దవ్వ (Medulla) వల్కలం నుంచి విడుదలయ్యే కార్టికాయిడ్‌స మూడు రకాలు. గ్లూకో, ఖనిజ, లైంగిక కార్డికాయిడ్స దవ్వ నుంచి ఎపినెఫ్రిన్ (అడ్రినలిన్) నార్ ఎపినెఫ్రిన్ (నార్ అడ్రినలిన్) అనే హార్మోన్లు విడుదలవుతాయి. ఈ రెండూ ఎమర్జెన్సీ లేదా పోరాట పలాయన హార్మోన్లు. బీజకోశాలు పురుష బీజ కోశాలైన ముష్కాలు, స్త్రీ బీజ కోశాలైన అండాశయాలు లైంగిక హార్మోన్లను విడుదల చేస్తాయి. పురుష లైంగిక హార్మోన్లు ఆండ్రోజెన్స. వీటిలో ప్రధానమైంది టెస్టోస్టిరాన్. స్ట్రీ లైంగిక హార్మోన్లు ఈస్ట్రోజెన్స. వీటిలో ప్రధానమైంది బీటా-ఈస్ట్రడయోల్. ఈ లైంగిక హార్మోన్లు స్త్రీ, పురుషుల్లో ద్వితీయ లైంగిక లక్షణాల అభివృద్ధిని ప్రేరేపిస్తాయి. అదనంగా జీర్ణకోశం నుంచి కొన్ని హార్మోన్లు, మెదడులో ఉండే పీనియల్ గ్రంథి నుంచి మెలటోనిన్ అనే హార్మోన్, యుక్తవయసు వరకు మాత్రమే ఉండే బాలగ్రంథి (థైమస్) నుంచి థైమోసిన్ అనే హార్మోన్లు విడుదలవుతాయి. మాదిరి ప్రశ్నలు 1. మెదడులో థర్మోస్టాట్‌గా పనిచేసే భాగం? 1) మస్తిష్కం 2) అనుమస్తిష్కం 3) అథాపర్యంకం 4) మజ్జాముఖం 2. {పపంచ అల్జీమర్స దినం? 1) ఏప్రిల్ 2 2) మే 14 3) జూన్ 23 4) సెప్టెంబరు 21 3. జపనీస్ ఎన్సిఫలైటిస్ కారక వైరస్ ఏది? 1) ఫ్లేమి వైరస్ 2) టోగా 3) ఆల్ఫా 4) పాక్స్ 4. ఏ న్యూరో ట్రాన్‌సమీటర్ లోపం ద్వారా పార్కిన్‌సన్‌స వ్యాధి వస్తుంది? 1) అసిటైల్ కొలిన్ 2) డోపమైన్ 3) సెరటోనిన్ 4) గ్లైసిన్ 5. మనిషి మెదడు సగటు బరువు ఎంత? 1) 1350 గ్రాములు 2) 1800 గ్రాములు 3) 2000 గ్రాములు 4) 1000 గ్రాములు 6. మెదడులోని ఏ భాగానికి గాయమైతే, శ్వాస ఆగిపోయి వ్యక్తి మరణించే ప్రమాదం ఉంటుంది? 1) మస్తిష్కం 2) అనుమస్తిష్కం 3) మజ్జాముఖం 4) అథాపర్యంకం 7. మెదడులో ఏర్పడే అసాధారణ పరిస్థితులను తెలుసుకోవడానికి వినియోగించే నిర్ధారణ పరీక్ష ఏది? 1) ఎక్స్‌రే 2) అల్ట్రాసౌండ్ స్కానింగ్ 3) మ్యాగ్నెటిక్ రెసొనెన్స ఈమేజింగ్ 4) ఎండోస్కోపి 8. హార్మోన్ అనే పదాన్ని ప్రతిపాదించింది? 1) బ్యాంటింగ్, బెస్ట్ 2) యంగ్వల్, పర్లమన్ 3) అలెక్ జెఫ్రీస్ 4) బేలిస్, స్టార్లింగ్ 9. మధుమేహ రోగులు అధికంగా ఉన్న దేశం ఏది? 1) భారత్ 2) చైనా 3) అమెరికా 4) బ్రెజిల్ 10. పుట్టుకతోనే శరీరంలోని ఏ భాగంలోనూ మెలనిన్ ఏర్పడని జన్యు వ్యాధి? 1) విటిలిగో 2) ల్యూకోడెర్మ 3) పైబాల్డ్ 4) ఆల్బినిజం 11. థైరాక్సిన్ ఏర్పడటానికి అవసరమయ్యే ఖనిజం ఏది? 1) అయోడిన్ 2) ఇనుము 3) కాల్షియం 4) మాంగనీస్ 12. ఆహారంలో తగినంత అయోడిన్ లోపిస్తే, అవటు గ్రంథి? 1) క్షీణిస్తుంది 2) బంతిలా వాచిపోతుంది 3) పూర్తిగా అదృశ్యం అవుతుంది 4) ఏ మార్పూ ఉండదు సమాధానాలు 1) 3; 2) 4; 3) 1; 4) 2; 5) 1; 6) 3; 7) 3; 8) 4; 9) 2; 10) 4; 11) 1; 12) 2 కాంపిటీటివ్ కౌన్సెలింగ్ సివిల్స్ ప్రిలిమ్స్‌లో చరిత్రలో ఎక్కువ మార్కులు రావాలంటే ఏం చేయాలి? ఏయే అంశాలపై దృష్టి సారించాలి? - ఎస్.ప్రకాశ్ రెడ్డి, హైదరాబాద్. చరిత్రలో ‘ప్రాచీన భారతదేశ చరిత్ర’ నుంచి 3 నుంచి 5 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ప్రాచీన ప్రాంతాలు, పురావస్తు తవ్వకాల్లో బయల్పడిన కట్టడాలు, పరికరాలు, సింధూనాగరికత, ఆర్యులు, మత ఉద్యమాలు, మౌర్యుల పరిపాలనాంశాలు, గుప్తుల సాంస్కృతిక సేవ లాంటి అంశాలపై దృష్టి సారించాలి. ‘మధ్య యుగ భారతదేశ చరిత్ర’కు సంబంధించి సూఫీ, భక్తి ఉద్యమకారుల ప్రభావం, ఢిల్లీ, మొగల్ చక్రవర్తుల సాహిత్య, సాంస్కృతిక సేవ, విజయనగర - బహమనీ రాజ్యాల ప్రభావం, దక్షిణ భారతంలో చోళ, పాండ్య రాజ్యాల ఆర్థిక, శిల్పకళా రంగాలు, దక్షిణ భారతదేశం సందర్శించిన యాత్రికులు, వారి రచనల్లోని అంశాలపై ప్రశ్నలు వచ్చే అవకాశముంది. అదేవిధంగా బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణ, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో ప్రభావం, సామాజిక సంస్కరణోద్యమాలు, స్వాతంత్రోద్యమంలోని దశలు, స్వాతంత్య్రం అనంతరం పరిస్థితులపై పట్టు సాధించాలి. గత మూడు, నాలుగేళ్ల ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయో అర్థమవుతుంది. 2008 సివిల్స్‌లో కింది ప్రశ్నను అడిగారు. ప్రశ్న: జతపర్చండి. -1 (సూఫీమతం) ఎ) చిస్తీ సిల్సిలా బి) నక్షబంది సిల్సిలా సి) ఖాద్రీ సిల్సిలా డి) సౌహాద్రి సిల్సిలా 2 (నాయకులు) 1) షేక్ అహ్మద్ షేర్‌హింద్ 2) షేక్ బహ్రూద్దీన్ జకారియా 3) షేక్ హమీదుద్దీన్ 4) సయ్యద్ ముక్దుమ్ మహ్మద్ గిలాని 1) ఎ-3, బి-4, సి-1, డి-2 2) ఎ-1, బి-4, సి-3, డి-2 3) ఎ-3, బి-1, సి-4, డి-2 4) ఎ-1, బి-3, సి-4, డి-2 సమాధానం: 3 1857 సిపాయిల తిరుగుబాటును ‘నాగరికత- అనాగరికతల’ తిరుగుబాటుగా పేర్కొన్నవారు ఎవరు? 1869లో కార్ల్‌మార్క్స్ ఈ తిరుగుబాటును ఏమని వ్యాఖ్యానించాడు? లాంటి ప్రశ్నలు అడిగే అవకాశముంది. ‘గాంధీయుగం’ నుంచి గాంధీ వ్యక్తిత్వం, పోరాట పద్ధతులు, సత్యాగ్రహం + అహింస ప్రాధా న్యం, 1942 క్విట్ ఇండియాలో ‘డూ ఆర్ డై’ అని ఎందుకు పిలుపునిచ్చారు? దక్షిణాఫ్రికాలో గాంధీజీ ఆసియన్ల హక్కుల కోసం పోరాడటానికి కారణాలు, గాంధీజీ చేపట్టిన ఉప్పు సత్యాగ్రహం మొదలైన అంశాలను అధ్యయనం చేయాలి. ఈ సమాచారమంతా ప్రామాణిక పాఠ్యపుస్తకాల్లో లభిస్తుంది. చదువుతున్నప్పుడే అర్థం చేసుకున్న అంశాలను నోట్స్ రూపంలో రాసుకోవాలి. అప్పుడే సబ్జెక్టుపై ప్రాథమిక అవగాహన వస్తుంది. సివిల్ సర్వీసెస్, కాలేజ్ సర్వీస్ కమిషన్స్ నిర్వహించిన నెట్/ స్లెట్ ప్రశ్న పత్రాల్లోంచి 50 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. పాత విషయాలే కాకుండా, నూతన, సమకాలీన, సాంస్కృతిక పరమైన అంశాలకూ ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రిలిమినరీ పరీక్ష జ్ఞానానికి సంబంధించిందే తప్ప, సబ్జెక్టుకు సంబంధించింది కాదు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇది కేవలం వడపోత (ఎలిమినేట్) చేయడానికి నిర్వహించేది మాత్రమే. డాక్టర్ పి.మురళి, సీనియర్ ఫ్యాకల్టీ, నిజాం కాలేజ్, హైదరాబాద్. -
బట్టమేక పక్షి శాస్త్రీయ నామం?
జీవశాస్త్ర పరిచయం భూమిపై ఎన్నో వైవిధ్యభరితమైన జీవులుంటాయి. జీవుల శాస్త్రీయ అధ్యయనమే బయాలజీ. సుమారు 4.5-5 బిలియన్ ఏళ్ల క్రితం భూమి ఏర్పడింది. భూమి ఏర్పడిన 1 నుంచి 1.5 బిలియన్ ఏళ్ల తర్వాత జీవం ఆవిర్భవించింది. ఆ తర్వాత జరిగిన జీవ పరిణామం ద్వారా ఎన్నో రకాలు జీవులు ఆవిర్భవించాయి. * భూమిపై జీవ ఆవిర్భావాన్ని వివరించే సిద్ధాంతాల్లో ప్రధానమైంది పాన్‌స్పెర్మియ, జీవావిర్భావ సిద్ధాంతాలు. పాన్‌స్పెర్మియ సిద్ధాంతం ప్రకారం భూమిపై జీవులు ఆవిర్భవించనే లేదు. భూమి వెలుపల నుంచి గ్రహ శకలాల ద్వారా లేదా గ్రహాంతర వాసుల ద్వారా భూమిపైకి చేరి ఆ తర్వాత పరిణామం చెందాయని ఈ సిద్ధాంతం వి వరిస్తోంది. స్వాంటె అర్హీనియస్ దీన్ని వివరించాడు. ప్రస్తుతం అధిక ఆమోదంలో ఉన్న సిద్ధాంతం ఖీజిౌ్ఛటడ ౌజ ౌటజజీ ౌజ జీజ్ఛ(జీవావిర్భావ సిద్ధాంతం). దీన్ని అ.ఐ. ఒపారిన్ అనే రష్యాకు చెందిన జియోకెమిస్ట్, జేబీఎస్ హాల్టేన్ అనే బ్రిటన్ జన్యుశాస్త్రవేత్తలు స్వతంత్రంగా ప్రతిపాదించారు. వీరు ప్రతిపాదించిన వివరాల ప్రకారం భూమిపై జీవావిర్భావానికి ముందు జీవ రసాయనాలు ఆవిర్భవించాయి. * పూర్వభూమి వాతావరణం కార్బన్, హై డ్రోజన్, నత్రజని వాయువుల మిశ్రమంగా ఉండేది. నీరు, నీటి ఆవిరి ఉన్నప్పటికీ స్వేచ్ఛా ఆక్సిజన్ ఉండేది కాదు. ఇలాంటి వాతావరణాన్ని క్షయకరణ (ఖ్ఛఛీఠఛిజీజ) వాతావరణం అంటారు. అప్పటి అధిక ఉష్ణోగ్రతల ప్రభావానికి కార్బన్, హైడ్రోజన్, నత్రజని మధ్య రసాయన చర్యలు జరిగి మీథేన్, హైడ్రోజన్ సయనైడ్, అమోనియా లాంటివి ఏర్పడ్డాయి. వీటితో నీటి ఆవిరి చర్యపొందడం ద్వారా ప్రస్తుతం కేవ లం జీవుల్లో మాత్రమే కనిపించే అమైనో ఆమ్లాలు, చక్కెరలు, కొవ్వు ఆమ్లాలు, నత్రజని క్షారాలు లాంటి సరళ జీవ రసాయనాలు ఏర్పడ్డాయి. ఈ సరళమైన అణువుల మధ్య చర్యల ద్వారా ప్రోటీన్లు, కొవ్వులు, కేంద్రకామ్లాలు, పిండి పదార్థాలు తయారయ్యాయి. సముద్ర నీటిలో ఈ రసాయనాలు కలిసిపోయి జరిగిన కొన్ని చర్యల ద్వారా పూర్వపర జీవకణం ఏర్పడింది. * భూమిపై ఏర్పడిన మొదటి జీవులన్నీ అవాయుజీవులు (అ్చ్ఛటౌఛ్ఛట). వీటి చర్యల ద్వారా నీటి అణువు విచ్ఛిన్నమై క్రమంగా స్వేచ్ఛా ఆక్సిజన్ విడుదలైంది. ఆ తర్వాత మొక్కలు ఆవిర్భవించి వాటిలోని కిరణజన్య సంయోగక్రియ ద్వారా మరింత ఆక్సిజన్ వాతావరణంలోకి విడుదలైంది. ప్రస్తుతం భూమిపై ఉన్న 21 శాతం ఆక్సిజన్‌కు ప్రధాన మూలం మొక్కల్లోని కిరణజన్య సంయోగక్రియ. భూమిపై జీవం ఆవిర్భవించిన తర్వాత, జీవ పరిణా మం జరిగింది. సరళస్థాయి నుంచి సంక్లిష్ట స్థాయి జీవులు ఎలా పరిణామం చెందాయన్నది మూడు ప్రధాన సిద్ధాంతాలు వివరిస్తాయి. వీటిలో మొదటిది ‘ఫ్రాన్సకు చెందిన జంతుశాస్త్రవేత్త జె.బీ.లామార్‌క ప్రతిపాదించిన ఆర్జిత లక్షణాల అనువంశిక సిద్ధాంతం (ఖీజిౌ్ఛటడ ౌజ ఐజ్ఛిటజ్ట్చీఛ్ఛి ౌజ అ్ఞఠజీట్ఛఛీ ఛిజ్చిట్చఛ్ట్ఛిటట). పర్యావరణ ప్రభావం ద్వారా జీవుల్లో కొత్త లక్షణా లు ఏర్పడి అవి తర్వాతి తరాలకు అవిచ్ఛిన్నంగా సంక్రమించడం ద్వారా కొత్త జాతు లు ఆవిర్భవిస్తాయని ఈ సిద్ధాంతం వివరిస్తుంది. ఇంగ్లండ్‌కు చెందిన ఛార్లెస్ డార్విన్ ప్రతిపాదించిన సిద్ధాంతం ప్రకృతివరణ సిద్ధాంతం.దీని ప్రకారం ప్రకృతిలోని పోటీ ఫలితంగా ఆ పోటీ తట్టుకొని నిలిచే జీవజాతులను ప్రకృతి వరిస్తుంది. హ్యూగోడివ్రీస్ అనే డచ్ వృక్ష శాస్త్రవేత్త ఉత్పరివర్తన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. * భూమిపై ఉన్న జీవులను వర్గీకరించడం ద్వారా వాటిపై సమగ్ర అవగాహన సాధ్యమవుతుంది. అన్ని జీవులు పెరుగుదల, జీవక్రియ, ప్రత్యుత్పత్తి లాంటి సమాన లక్షణాలను ప్రదర్శించినప్పటికీ వాటిలోని కొన్ని ప్రత్యేకతల కారణంగా వాటిని విభజించాల్సిన అవసరముంటుంది. భూ మిపై ఉన్న జీవులన్నింటినీ మొక్కలు, జంతువులు అనే రెండు రకాలుగా అరిస్టాటిల్ వర్గీకరించాడు. అనంతరం అనేక సూక్ష్మజీవులను గుర్తించిన తర్వాత వాటిని కూడా కలుపుకొని అర్థవంతంగా వర్గీకరించాల్సిన అవసరం ఏర్పడింది. రాబర్ట విట్టేకర్ అనే జీవశాస్త్రవేత్త జీవులన్నింటినీ ఐదు ప్రధాన రాజ్యాలుగా వర్గీకరించాడు. ప్రస్తుతం ఈ వర్గీకరణే ప్రపంచవ్యాప్తంగా వినియోగంలో ఉంది. కణ సంక్లిష్టత, శరీర సంక్లిష్టత, పోషణ ఆధారంగా జీవులను ఐదు రాజ్యాలుగా వర్గీకరించాడు. * మొనీరా రాజ్యం: కేంద్రక పూర్వ జీవులన్నింటినీ ఈ రాజ్యంలో వర్గీకరించారు. ఇవన్నీ ఏక కణజీవులు. ఇవి కేంద్రక పూర్వ కణాలతో నిర్మితమై ఉంటాయి. ఉదా: బ్యాక్టీరియా, సయనో బ్యాక్టీరియా (పూర్వనామం: నీలి ఆకుపచ్చ శైవలాలు) * పొటిస్టా రాజ్యం: నిజ కేంద్రక జీవుల్లో ఏక కణజీవులను ఈ రాజ్యంలో చేర్చారు. జంతువుల్లో ప్రోటోజోవా అనే ఏక కణ జీవులను, మొక్కల్లోని ఏకకణ శైవలాలను ఈ రాజ్యంలో చేర్చారు. * శిలీంధ్ర రాజ్యం: మొక్కలు, జంతువులు కానీ శిలీంధ్రాలు (ఊఠజజీ) ఈ వర్గంలో చేర్చారు. శిలీంధ్రాలు పరపోషకాలు. అత్యధిక శిలీంధ్రాలు విచ్ఛిన్నకారులు. జంతు, వృక్ష కళేబరాలపై ఆధారపడతాయి. శిలీంధ్రాల ద్వారా మానవుల్లో, పంట మొక్కల్లో అనేక వ్యాధులు కలుగుతాయి. ఉదా: కాండిడా, పెన్సీలియం. * వృక్ష రాజ్యం: అన్ని బహుకణ మొక్కలను ఈ వర్గంలో చేర్చారు. కిరణ జన్య సంయోగక్రియ ద్వారా వాటి ఆహారాన్ని అవే తయారు చేసుకుంటాయి. ఇవన్నీ స్వయం పోషకాలు. ఉదా: బహుకణ శైవలాలు, బ్రయోఫైట్స్, టెరిడోఫైట్స్, వివృత బీజాలు, ఆవృత బీజాలు. * జంతురాజ్యం : అన్ని బహుకణ జంతువులను ఈ రాజ్యంలో వర్గీకరించారు. ఇవన్నీ పరపోషకాలు. అత్యధికంగా స్వేచ్ఛా జీవులు. కొన్ని పరాన్న జీవులు కూడా ఉంటాయి. ఉదా: రక్తాన్ని పీల్చే ఆడదోమలు, పేగులోని బద్దెపురుగులు. అత్యధిక జంతువులు శాకాహారులు. కొన్ని మాంసాహారులు, మరికొన్ని సర్వభక్షకాలు కూడా ఉంటాయి. -
కాంపిటీటివ్ కౌన్సెలింగ్
సివిల్స్ ప్రిలిమ్స్‌లో జనరల్ సైన్స్ నుంచి ఏయే అంశాలపై ప్రశ్నలు వస్తాయి? ఎలా సిద్ధం కావాలి? - శ్రావణి, గాంధీనగర్ సివిల్స్ ప్రిలిమ్స్‌లో మొదటి పేపర్లో దాదాపు 26 నుంచి 30 ప్రశ్నల వరకు జనరల్ సైన్స్, పర్యావరణం విభాగాల నుంచి వస్తున్నాయి. జనరల్ సైన్స్ విభాగంలోని జీవ శాస్త్రంపై పట్టు ఉంటేనే.. ఆవరణ శాస్త్రంలోని అంశాలపై సమగ్ర అవగాహన పొందడం సాధ్యమవుతుంది. ప్రిలిమ్స్‌లో నెగెటివ్ మార్కులు ఉండటంతో అభ్యర్థులు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ప్రిపరేషన్‌కు ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు విసృ్తతంగా చదవాల్సి ఉంటుంది. జనరల్ సైన్స్‌లో జీవ శాస్త్రం, భౌతిక, రసాయన శాస్త్రాలు ఉంటాయి. వీటితోపాటు టెక్నాలజీకి సంబంధించిన ప్రశ్నలు కూడా ఇస్తారు. అయితే వీటిని సమకాలీన దృక్పథంతో అడుగుతారని గుర్తించాలి. జీవావరణ శాస్త్రంలో స్థూలంగా ఆవరణ శాస్త్ర భావనలు, పర్యావరణ కాలుష్యం, శీతోష్ణస్థితి మార్పు, గ్లోబల్ వార్మింగ్, జీవవైవిధ్యం తదితర అంశాలు ఉంటాయి. జీవ శాస్త్రంలో అభ్యర్థులు వృక్ష, జంతు వర్గీకరణ, వాటి లక్షణాలు, ప్రత్యేకతలపై దష్టి సారించాలి. అదేవిధంగా మానవ శరీర ధర్మ శాస్త్రం, వ్యాధులు వంటి అంశాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. శరీర అవయవాల పనితీరు, వాటికి సంక్రమించే వ్యాధులపై ప్రశ్నలు అడుగుతారు. ముఖ్యంగా ఇటీవల ప్రబలుతున్న ఫ్లూ, మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్, అధికమవుతున్న కాలేయ, జీర్ణకోశ సమస్యలు, క్యాన్సర్లు, వాటి చికిత్స, వాడాల్సిన ఔషధాలు, టీకాలు, నోబెల్ పురస్కార గ్రహీతలు - వారి పరిశోధనలు వంటివి చాలా ముఖ్యమైనవి. భౌతిక శాస్త్రంలో వివిధ సూత్రాల ఆధారంగా పనిచేస్తున్న యంత్రాలపై ప్రశ్నలు వస్తాయి. మైక్రోవేవ్, రిఫ్రిజిరేటర్, ఎయిర్ కండీషనింగ్, విద్యుత్ ఉత్పాదన ప్రమాణాలు మొదలైన అంశాలను క్షుణ్నంగా చదువుకోవాలి. దైనందిన జీవితంలో మానవుడు ఉపయోగించే వివిధ రసాయనాలు (కాస్మొటిక్స్, టాయ్‌లెట్రీస్, ఫార్మాస్యూటికల్స్), అదేవిధంగా ప్లాస్టిక్స్, పాలిమర్స్‌కు సంబంధించిన అంశాలను కూడా అధ్యయనం చేయాలి. జీవ వైవిధ్యం, శీతోష్ణస్థితి మార్పు, పర్యావరణ కాలుష్యం, జీవజాతులు వంటి అంశాలపై కూడా క్రమం తప్పకుండా ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి జీవ వైవిధ్యానికి కారణాలు, ఏర్పడుతున్న ప్రమాదాలు, జీవవైవిధ్య హాట్‌స్పాట్స్, వివిధ దేశాల మధ్య పర్యావరణ ఒప్పందాలు మొదలైనవాటిని బాగా చదవాలి. చదవాల్సిన పుస్తకాలు: ఎన్సీఈఆర్టీ బుక్స్ - సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్; రిఫరెన్స్ కోసం: సైన్స్ రిపోర్టర్; ఎన్విరాన్మెంటల్ సర్వే; హిందూ సైంటిఫిక్ ఫ్యాక్ట్స్; దినపత్రికల సైన్స్ కాలమ్స్ ఇన్పుట్స్: సి.హరికృష్ణ, సీనియర్ ఫ్యాకల్టీ, సివిల్స్ నేను ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్‌ని. బ్యాంక్ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాను. నాకు బ్యాంకింగ్ అవేర్నెస్ సబ్జెక్టు పూర్తిగా పరిచయం లేదు. ఈ విభాగం నుంచి ఎలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది? ఏయే అంశాలపై దృష్టి సారించి ప్రిపేరవ్వాలో తెలియజేయండి? - ఎం.సందీప్, రాంనగర్ బ్యాంకు పరీక్షలు రాసే చాలామంది అభ్యర్థులకు బ్యాంకింగ్ అవేర్నెస్ టాపిక్ కొత్తదే. ఈ విభాగాన్ని ఏవిధంగా ప్రిపేరవ్వాలి? ఎక్కడ మొదలు పెట్టాలి? ఏయే అంశాలను చదవాలి? అనే విషయాలకు సంబంధించి చాలామందికి స్పష్టత ఉండదు. రోజూ బ్యాంకుల్లో జరిగే లావాదేవీలకు సంబంధించిన ప్రాథమిక పరిజ్ఞానంపై పట్టు సాధిస్తే ఈ విభాగం నుంచి చాలా ప్రశ్నలకు జవాబులు గుర్తించవచ్చు. అంటే ఒక బ్యాంకులో ఒక రోజు జరిగే పనులపై అవగాహన ఉండాలన్నమాట. ఏదైనా బ్యాంకులో అకౌంట్ కలిగి ఉన్న ఒక సాధారణ వ్యక్తి గరిష్ట ప్రశ్నలకు సమాధానాలు చెప్పే రీతిలో ఈ విభాగం నుంచి ప్రశ్నల కూర్పు ఉంటుంది. బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఏం చేయాలి? డబ్బు డిపాజిట్ చేయడానికి ఉపయోగించే స్లిప్‌ను ఏమంటారు? అకౌంట్లో మినిమమ్ బ్యాలెన్స్ ఎంత ఉండాలి? అకౌంట్ ఓపెన్ చేయడానికి కనీస వయసు ఎంత ఉండాలి?ఎన్ని రకాల అకౌంట్లు ఉంటాయి? లాంటి ప్రశ్నలకు సమాధానం తెలిసి ఉండాలి. వీటితో పాటు బ్యాంకులతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉండే వివిధ సంస్థల (రెగ్యులేటరీ బాడీస్) గురించి తెలుసుకోవాలి. ఆయా సంస్థలకు సంబంధించిన వెబ్సైట్లను పరిశీలించడం, బ్యాంకింగ్ సర్వీస్ క్రానికల్ లాంటి మేగజైన్లను క్రమం తప్పకుండా చదవడం ద్వారా కావాల్సిన వివరాలను సేకరించవచ్చు. ఆర్బీఐ, సెబీ, ఐఆర్డీఏ సంస్థలు, వాటి నిబంధనల గురించి చదవాలి. బీఎస్ఈ, ఎన్ఎస్ఈ, సూక్ష్మ రుణ సంస్థలు లాంటి అనుబంధ అంశాలపై కూడా పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. నమూనా ప్రశ్నలను సాధించడం, ఠీఠీఠీ.ట్చజుటజిజ్ఛీఛీఠఛ్చ్టిజీౌ.ఛిౌఝ లాంటి వెబ్సైట్లలో ఆన్లైన్ టెస్టులను సాధన చేయడం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకోవచ్చు. ఇన్పుట్స్: కె.వి.జ్ఞానకుమార్, డెరైక్టర్, డీబీఎస్, దిల్సుఖ్నగర్ -
సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ కోర్సు వివరాలు
ఎంటెక్ బయోటెక్నాలజీ కోర్సును అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లేవి? -స్టీవెన్, నల్గొండ. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్ సబ్జెక్ట్లతో ముడిపడి ఉన్న విభాగం బయోటెక్నాలజీ. దీని అనువర్తనాలను పలు విభాగాల్లో వినియోగించుకుంటారు. ఇంజనీరింగ్ సూత్రాలను అనుసరించి జీవకణాల లక్షణాలను విశ్లేషించడమే బయోటెక్నాలజీ. అగ్రికల్చర్, ఫుడ్‌ప్రాసెసింగ్, డ్రగ్ డెవలప్మెంట్, వేస్ట్ మేనేజ్మెంట్, హార్టికల్చర్, హెల్త్ కేర్, పర్యావరణం వాటిల్లో కొన్ని. హార్టికల్చర్, అగ్రికల్చర్, కెమికల్, బయో ప్రొడక్ట్స్, టెక్స్టైల్స్, హెల్త్‌కేర్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వ-ప్రైవేట్ రంగంలోని పరిశోధన సంస్థలు, విద్యా సంస్థలు బయోటెక్నాలజీ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు కెరీర్ అవెన్యూస్‌గా నిలుస్తున్నాయి. అందిస్తున్న ఇన్స్టిట్యూట్లు: ఐఐటీ-ఖరగ్‌పూర్; వెబ్సైట్: www.iitkgp.ac.in ఐఐటీ-గౌహతి; వెబ్సైట్: www.iitg.ac.in ఐఐఐటీ-హైదరాబాద్;వెబ్సైట్: http://biotech.iith.ac.in చెఫ్‌గా కెరీర్ ప్రారంభించాలనుకుంటున్నాను. సంబంధిత వివరాలను తెలపండి? -కరణ్, నిజామాబాద్.వివిధ హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార పదార్థాలను నాణత్యను పాటిస్తూ.. వృథా లేకుండా రుచిగా తయారు చేయడమే చెఫ్ ప్రధాన బాధ్యత. హోటల్ మేనేజ్మెంట్ లేదా కలినరీ టెక్నాలజీ సంబంధిత కోర్సులను ఎంచుకోవడం ద్వారా చెఫ్‌గా కెరీర్ ప్రారంభించవచ్చు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్ మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లయిడ్ న్యూట్రిషన్ -హైదరాబాద్ (వెబ్సైట్: www. ihmhyd.org), కలినరీ అకాడమీ-హైదరాబాద్ (వెబ్సైట్: www.iactchefacademy.com) వంటి ఇన్స్టిట్యూట్లు డిప్లొమా నుంచి పీజీ వరకు వివిధ స్థాయిల్లో సంబంధిత కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఈ కోర్సును పూర్తి చేసిన తర్వాత హోటల్స్, రెస్టారెంట్లు, ఎయిర్‌లైన్స్, క్రూయిజర్స్ వంటి డైనింగ్ ఎస్టా బ్లిష్మెంట్స్లో చెఫ్‌గా అవకాశాలు ఉంటాయి.రెన్యూవబుల్ ఎనర్జీ కోర్సులను అందిస్తున్న ఇన్స్టిట్యూట్లను తెలపండి? -సిద్ధూ, రామన్నపేట. పెరుగుతున్న ఇంధన అవసరాలు ఒక వైపు, మరో వైపు తరుగుతున్న వనరుల ఫలితంగా ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి సారించాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. దాంతో జాబ్ మార్కెట్లో ప్రత్యామ్నాయ ఇంధన వనరుల (రెన్యూవబుల్ ఎనర్జీ) పట్ల అవగాహన ఉన్న నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రెన్యూవబుల్ ఎనర్జీకి అకడమిక్ సబ్జెక్ట్‌లలో స్థానం కల్పించారు. కొన్ని యూనివర్సిటీలు ఎనర్జీ స్టడీస్-ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్‌లో భాగంగా ఈ సబ్జెక్ట్‌ను బోధిస్తున్నాయి. మరికొన్ని యూనివర్సిటీలు పీజీలో స్పెషలైజేషన్‌గా అందిస్తున్నాయి. ఇందులో సోలార్ ఎనర్జీ, బయోమాస్, విండ్ ఎనర్జీ, టైడ్ అండ్ వేవ్ ఎనర్జీ, ఫ్యూయల్ సెల్స్, హైడ్రోజన్ ఎనర్జీ, ఎనర్జీ మేనేజ్మెంట్, న్యూక్లియర్ ఎనర్జీ, ఎనర్జీ జనరేషన్, ఎనర్జీ పాలసీస్ వంటి అంశాలను బోధిస్తారు. సంబంధిత కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు సోలార్-విండ్-న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, బయోమాస్ కంపెనీలు, ఆర్కిటెక్చర్ ఫిర్మ్స్, ఎన్జీవో, ఇంధనానికి సంబంధించిన ప్రభుత్వ శాఖల్లో అవకాశాలు ఉంటాయి. రెన్యూవబుల్ ఎనర్జీ కోర్సులను అందిస్తున్న ఇన్స్టిట్యూట్లు: యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం ఎన ర్జీ అండ్ స్టడీస్- డెహ్రాడూన్ కోర్సు: ఎంటెక్ (పవర్ సిస్టమ్స్) వెబ్సైట్: www.upes.ac.in అమిటీ యూనివర్సిటీ-నోయిడా కోర్సు: ఎంటెక్ (సోలార్ అండ్ ఆల్టర్నేటివ్ ఎనర్జీ) వెబ్సైట్: www.amity.edu మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-భోపాల్ కోర్సు: ఎంటెక్ (రెన్యూవబుల్ ఎనర్జీ) వెబ్సైట్: www.manit.ac.in టెరీ యూనివర్సిటీ-ఢిల్లీ కోర్సు: ఎంటెక్ (రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ మేనేజ్మెంట్) వెబ్సైట్: www.teriuniversity.ac.in సాక్షి భవిత ఎడ్యుకేషన్ ఫెయిర్ జూన్ 14, 15 తేదీల్లో వేదిక: విశ్వేశ్వరయ్య భవన్, ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స, ఖైరతాబాద్ సర్కిల్, హైదరాబాద్.ఇంజనీరింగ్‌తోపాటు ఇతర కోర్సుల్లో చేరాలనుకుంటున్న విద్యార్థులకు ‘సాక్షి’ మార్గనిర్దేశనం చేయనుంది. ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్, ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్సలో జూన్ 14, 15న ‘సాక్షి భవిత ఎడ్యుకేషన్ ఫెయిర్-2014’ను నిర్వహించనుంది. ఇంజనీరింగ్‌లో ఏ కళాశాలలో చేరాలి? ఏ బ్రాంచ్‌ను ఎంచుకోవాలనే సందిగ్ధంలో ఉన్న విద్యార్థులకు ఈ ఫెయిర్ పరిష్కారం చూపనుంది. కళాశాలల వివరాలతోపాటు ఆయా బ్రాంచ్‌ల ప్రత్యేకత, భవిష్యత్‌లో ఉద్యోగ, ఉన్నత విద్యావకాశాల గురించి విద్యార్థులకు నిపుణులు అవగాహన కల్పిస్తారు. విద్యార్థులు ఫెయిర్‌లో ఏర్పాటు చేసిన కళాశాలల ప్రతినిధులతో నేరుగా సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చు. కార్యక్రమానికి వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఈవెంట్ స్పాన్సర్‌గా, భారత్ ఇన్‌స్టిట్యూషన్‌స అసోసియేట్ స్పాన్సర్సగా, వైఈఎస్(యూత్ ఎంప్లాయిబిలిటీ సర్వీసెస్) నాలెడ్‌జ పార్టనర్‌గా, 92.7 బిగ్ ఎఫ్.ఎం. రేడియో పార్టనర్‌గా వ్యవహరిస్తున్నా యి. ఎడ్యుకేషన్ ఫెయిర్‌కు సంబంధించిన మరిన్ని వివరాలకు ఎంపీ రావు (9912220375), రోహన్ (9951603007), వేణు (9951602991)ను సంప్రదించొచ్చు. సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ కోర్సు గురించి వివరాలు తెలపండి? ఈ కోర్సు చేస్తే ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి? -రాజా, అలంపూర్.ఫైనాన్షియల్ ప్లానర్ సర్టిఫికెట్‌కు అంతర్జాతీయంగా ఫైనాన్షియల్ రంగంలో గుర్తింపు ఉంది. అనేక సంస్థలు ఈ సర్టిఫికెట్‌ను ప్రత్యేక అర్హతగా గుర్తిస్తున్నాయి. అందుకే ఈ సర్టిఫికెట్ పొందే ప్రక్రియ కూడా ఎంతో కఠినంగా ఉంటుంది. శిక్షణ, పని అనుభవం, మూల్యాంకనం ఇలా అన్ని అంశాల్లో నైపుణ్యాన్ని పరిశీలిస్తారు. వాటన్నిటినీ సంతృప్తికరంగా పూర్తి చేస్తేనే సర్టిఫికెట్ లభిస్తుంది. ఈ సర్టిఫికెట్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆర్థిక సేవల పరిశ్రమల్లో అవకాశాలకు మార్గాలు చూపుతుంది. మన దేశంలో ఫైనాన్షియల్ ప్లానింగ్ సర్వీస్ బోర్డు ఆఫ్ ఇండియా (ఎఫ్‌పీఎస్‌బీ) సీఎఫ్‌పీ సర్టిఫికెట్‌ను అందజేస్తుంది. సర్టిఫికెట్ పొందే ప్రక్రియ: ఎఫ్పీఎస్బీఐ అధీకృత భాగస్వామ్య శిక్షణ సంస్థల్లో శిక్షణ పొందాలి. ఇది ఐదు మాడ్యూల్స్‌లో ఉంటుంది. ఎన్ఎస్ఈ నిర్వహించే 1-4 పరీక్షల్లో ఉత్తీర్ణులవ్వాలి. తర్వాత ఉద్యోగం పొందడానికి అవసరమైన పని అనుభవం గడించాలి. ఆ సమయంలో ఎఫ్‌పీఎస్‌బీ కోడ్ ఆఫ్ ఎథిక్స్‌కు, బిహేవియరల్ స్కిల్స్, ప్రాక్టీస్ ప్రమాణాలు, క్రమశిక్షణకు సంబంధించిన నియమ, నిబంధనలు, పద్ధతులపై తర్ఫీదు పొందుతారు. సర్టిఫికెట్ తీసుకున్న తర్వాత కూడా ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ స్ట్రాటజీస్, ఉత్పత్తులు, క్లయింట్స్‌పై మార్పుల ప్రభావం వంటి అంశాలను అప్డేట్ చేసుకోవాలి. కెరీర్: సర్టిఫికెట్ పొందిన తర్వాత అభ్యర్థులకు బ్యాంకులు, ఇన్వెస్ట్మెంట్ ఏజెన్సీలు. వెల్త్ ప్లానింగ్ కంపెనీలు, స్టాక్ బ్రోకింగ్ కంపెనీలు, విద్యా సంస్థలు, ఎంటర్ప్రెన్యూర్ రంగంలో అవకాశాలు లభిస్తాయి. ఇగ్నో ప్రవేశాలు ప్రపంచంలోనే అతి పెద్ద సార్వత్రిక విశ్వవిద్యాలయాల్లో ఒకటైన.. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(ఇగ్నో)..ప్రతి సంవత్సరం జనవ రి, జూన్లలో రెండు విడతలుగా అడ్మిషన్ల ప్రక్రియను నిర్వహిస్తుంది. ప్రస్తుతం జూన్ సెషన్‌కు సంబంధించి ఇగ్నో నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ స్పెషలైజేషన్స్‌తో మాస్టర్స్, బ్యాచిలర్ డిగ్రీ కోర్సులను అందిస్తుంది. వివరాలు.. మాస్టర్స్ డిగ్రీ: మాస్టర్ డిగ్రీని ఎంచుకున్న అభ్యర్థులు సంబంధిత కోర్సును రెండు నుంచి ఐదేళ్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ విభాగం కింద అందిస్తున్న కోర్సుల కోసం ఏదైనా సబ్జెక్ట్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మాస్టర్ ఆఫ్ సైన్స్ విభాగంలో ఉండే కోర్సులకు మాత్రం సంబంధిత/ అనుబంధ సబ్జెక్ట్‌లో డిగ్రీ చేసిన విద్యార్థులు మాత్రమే అర్హులు. టెక్నికల్ అంశాలతో ముడిపడి ఉన్న కోర్సులకు ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి. స్పెషలైజేషన్స్: ఎంసీఏ (కంప్యూటర్ అప్లికేషన్స్), ఎంఎస్సీ (డైటిక్స్ అండ్ ఫుడ్ సర్వీస్ మేనేజ్మెంట్, కౌన్సెలింగ్ అండ్ ఫ్యామిలీ థెరపీ), ఎంఏ (రూరల్ డెవలప్మెంట్, టూరిజం మేనేజ్మెంట్, ఇంగ్లిష్, హిందీ, సోషల్ వర్క్, ఫిలాసఫీ, గాంధీ అండ్ పీస్ స్టడీస్, ఎడ్యుకేషన్, పార్టిసిపేటరీ డెవలప్మెంట్, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, సైకాలజీ, ఎక్స్టెన్షన్ అండ్ డెవలప్మెంట్ స్టడీస్, జెండర్ డెవలప్మెంట్ స్టడీస్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, ఆంత్రోపాలజీ, అడల్ట్ ఎడ్యుకేషన్, ఉమెన్ అండ్ జెండర్ స్టడీస్), ఎంకామ్, ఎంఎస్‌డబ్ల్యూ కౌన్సెలింగ్.బ్యాచిలర్ డిగ్రీ: బ్యాచిలర్ డిగ్రీ కోర్సులను ఎంచుకున్న అభ్యర్థులు సంబంధిత కోర్సును మూడు నుంచి ఆరేళ్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. అర్హత: 10+2 ఉత్తీర్ణత (బీఎస్సీ కోర్సులకు సైన్స్ స్ట్రీమ్ చదివి ఉండాలి). స్పెషలైజేషన్స్: బీసీఏ కంప్యూటర్ అప్లికేషన్స్, బీఏ టూరిజం స్టడీస్, బీఏ, బీఎస్సీ, బీకామ్, బీఏ (సోషల్ వర్క్, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్, ప్రిపరేటరీ ప్రోగ్రామ్). మాస్టర్స్, బ్యాచిలర్తోపాటు డిప్లొమా విభాగంలో 53 కోర్సులు, సర్టిఫికెట్ విభాగంలో 58 కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. డిప్లొమా కోర్సులకు/సర్టిఫికెట్ కోర్సులకు అర్హత: 10+2, పీజీ డిప్లొమా కోర్సులకు/ పీజీ సర్టిఫికెట్ కోర్సులకు-బ్యాచిలర్ డిగ్రీ. దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత ఫీజును కూడా ఆన్లైన్ ద్వారా చెల్లించవచ్చు. ఆఫ్‌లైన్ విధానంలో ఫీజును డీడీ రూపంలో స్వీకరిస్తారు. ఆన్లైన్ దరఖాస్తు తర్వాత ప్రింట్ అవుట్, సంబంధిత సర్టిఫికెట్లను జతచేసి దగ్గర్లోని ఇగ్నో కేంద్రానికి పంపాలి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: జూన్ 20, 2014. రూ. 300 లేట్ ఫీజుతో దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: జూన్ 31, 2014. వివరాలకు: http://ignou.ac.in ది ఫుల్బ్రైట్ నెహ్రూ ఫెలోషిప్ అమెరికాలోని ఎంపిక చేసిన విశ్యవిద్యాలయాల్లో మాస్టర్స్ డిగ్రీ చేసే అవకాశం కల్పిస్తోంది.. ది ఫుల్బ్రైట్ నెహ్రూ ఫెలోషిప్. యునెటైడ్ స్టేట్స్-ఇండియా ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ (యూఎస్ఐఈఎఫ్) ఈ ఫెలోషిప్‌ను అందజేస్తోంది.అందిస్తున్న సబ్జెక్ట్‌లు: ఆర్ట్స్ అండ్ కల్చర్ మేనేజ్మెంట్తోసహా హేరిటేజ్ కన్జర్వేషన్ అండ్ మ్యూజియమ్ స్టడీస్, ఎన్విరాన్మెంట్ సైన్స్/స్టడీస్, హయ్యర్ ఎడ్యుకేషన్ అడ్మినిస్ట్రేషన్, పబ్లిక్ హెల్త్, ఆర్బన్ అండ్ రీజనల్ ప్లానింగ్, ఉమెన్స్ స్టడీస్/జెండర్ స్టడీస్. అర్హతలు: గుర్తింపు ఉన్న యూనివర్సిటీ నుంచి కనీసం 55 శాతం మార్కులతో యూఎస్ బ్యాచిలర్ డిగ్రీతో సమానమైన డిగ్రీ. ఈ క్రమంలో బ్యాచిలర్/మాస్టర్ డిగ్రీ ఏదైనా కావచ్చు. బ్యాచిలర్ డిగ్రీ అయిన పక్షంలో దాని కాల వ్యవధి నాలుగేళ్లు ఉండాలి. అదే సమయంలో యూఎస్‌లోని ఏ యూనివర్సిటీ నుంచైనా మరొక డిగ్రీ కానీ కోర్సులో కానీ చేరి ఉండకూడదు. కనీసం మూడేళ్ల ప్రొఫెషనల్ అనుభవం. స్వదేశానికి తిరిగి వచ్చి సేవా చేస్తామనే దృక్పథం, చక్కని నాయకత్వ లక్షణాలు ఉండాలి.ఎంపిక: వచ్చిన దరఖాస్తుల్లోంచి షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు న్యూఢిల్లీలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. వీరిల్లోంచి అర్హులను ఎంపిక చేస్తారు. వీరు నిర్దేశించి టోఫెల్/జీఆర్ఈ పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ అభ్యర్థుల దరఖాస్తులను ఫుల్బ్రైట్ ఫారెన్ స్కాలర్షిప్ బోర్డుకు తుది ఎంపిక కోసం పంపిస్తారు. వీరు నేరుగా ఇన్స్టిట్యూట్లకు దరఖాస్తు చేసుకోవాలి. ప్రయోజనాలు: జే-1 వీసా స్వస్థలం నుంచి ఇన్స్టిట్యూట్ ఉన్న పట్టణం వరకు ఎకానమీ క్లాస్‌తో విమాన ప్రయాణానికి ఏర్పాట్లు ట్యూషన్ ఫీజుతోపాటు వసతి, సంబంధిత ఖర్చులకు ఫండింగ్ దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 1, 2014. వివరాలకు: www.usief.org.in జాబ్ రిమైండర్సబోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్ పోస్టులు దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 7, 2014 వివరాలకు: http://bsf.nic.in ........................................................ ఇండియన్ ఆర్మీ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:జూన్ 30, 2014 వివరాలకు: http://joinindianarmy.nic.in ........................................................ ఎస్ఎస్సీ స్టెనోగ్రాఫర్స్ పోస్టులు: 534 దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 27, 2014 వివరాలకు: http://ssc.nic.in ........................................................ ఇండియన్ నేవీ ఆర్టిపైసర్ అప్రెంటీస్ సెయిలర్ బ్యాచ్-2015 ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ:జూన్ 20, 201410+2 క్యాడేట్ ఎంట్రీ స్కీమ్ డిసెంబర్-14 ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ:జూన్ 23, 2014 వివరాలకు: ://nausenabharti.nic.in ........................................................ -
కన్నుల ద్వారా శాఖీయోత్పత్తి జరిపే మొక్క?
1. జిరాప్ ధాల్మియం వ్యాధి ఏ అవయవానికి సంబంధించింది? 1) నాలుక 2) కండరం 3) కంటిరెప్ప 4) కన్ను 2. కిందివాటిలో ట్రేస్ మూలకం కానిది? 1) మాంగనీస్ 2) సిలీనియం 3) కాల్షియం 4) ఫ్లోరిన్ 3. ఒక గ్రాము కొవ్వు ఎన్ని కిలో క్యాలరీల శక్తినిస్తుంది? 1) 9.54 2) 9.45 3) 9.35 4) 9.53 4. కిందివాటిలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు, కొవ్వుల జీవక్రియకు ఆవశ్యకమైంది ఏది? 1) రైబోఫ్లోవిన్ 2) నియాిసిన్ 3) పెరిడాక్సిన్ 4) థయాలిన్ 5. జంతువుల్లో పిండి పదార్థం? 1) లాక్టోస్ 2) సుక్రోజ్ 3) సెల్యులోజ్ 4) గ్లైకోజెన్ 6. థైరాక్సిన్ హార్మోన్ గురించి సరికానిది? 1) జీవక్రియ రేటును పెంచుతుంది 2) ఎక్కువ ఉష్ణోగ్రత ఉత్పత్తి అయ్యేట్లు చేస్తుంది 3) కణజాలాలు పెరగడంలో, {పత్యేకత పొందడంలో తోడ్పడుతుంది 4) రక్తం, ఎముకల్లో ఉండే C2,ఫాస్పేట్ల స్థాయిని నియంత్రిస్తుంది 7. ద్విధావిచ్ఛిత్తి జరుపుకునే జంతువు? 1) బ్యాక్టీరియా 2) యూగ్లీనా 3) 1, 2 4) ఏదీకాదు 8. మస్తిష్క వల్కలంలో ఉండే నాడీకణాల సంఖ్య(బిలియన్లలో)? 1) 2.6 2) 3.6 3) 4.6 4) 5.6 9. ఎల్లోజ్వరాన్ని కలిగించే వాహకాలు ఏవి? 1) ఎలుకలు 2) కీటకాలు 3) కోతులు 4) పాములు 10. పెరుగుదలకు కావాల్సిన ఏదో ఒక పదార్థం పాలలో ఉందని 1912లో కనుగొన్నవారు? 1) సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ 2) హెచ్.జి. హాప్కిన్స 3) సర్‌క్రిక్ 4) సర్ వాట్సన్ 11. వానపాములో స్త్రీ బీజ కోశాలుండే ఖండితాల సంఖ్య? 1) 11 2) 12 3) 13 4) 14 12. ఫోరోఫిరిన్ అణువుల్లో ఉండేవి? 1) హిమోగ్లోబిన్‌లోని గ్లోబిన్ ప్రోటీన్ 2) ఐరన్ 3) కర్బన అణువులు 4) అన్నీ 13. నాడీ మండలంలో క్రియాత్మక పరిమాణాలు? 1) గ్లియల్ కణాలు 2) సహాయ కణాలు 3) నాడీకణాలు 4) నిస్సెల్ కణాలు 14. శరీరంలోకి ప్రవేశించిన ప్రతిజనకాలను గుర్తించి, ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేస్తూ వ్యాధులను నివారించే W.B.C.? 1) మోనో సైట్లు 2) లింఫోసెట్లు 3) ఇస్నోఫిల్స్ 4) బేసోఫిల్స్ 15. జాతీయ గీతం వినగానే భక్తి శ్రద్ధలతో లేచి నిలబడటం ఏ చర్య? 1) నిబంధన రహిత 2) నిబంధన సహిత 3) సంకల్పిత 4) అసంకల్పిత 16. కప్పలో సంతానోత్పత్తి కాలం? 1) జూన్ - ఆగస్టు 2) జూన్ - సెప్టెంబరు 3) జూన్ - అక్టోబరు 4) ఆగస్టు- నవంబరు 17. ఉభయ జీవుల్లో సిరాసరిణి తెరుచుకునే హృదయపు గది? 1) ఎడమ జఠరిక 2) కుడి కర్ణిక 3) కుడి జఠరిక 4) ఎడమ కర్ణిక 18. బాల్య వివాహాల అదుపు చట్టాన్ని భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో చేసింది? 1) 1972 2) 1974 3) 1976 4) 1978 19. అధిక సంఖ్యలో అండాలు ఒక సమూహాంగా విడుదలవుతాయి. దీన్ని ఏమంటారు? 1) స్పాన్ 2) మిల్ట్ 3) స్కలన నాళం 4) పుటికలు 20. ఏ వ్యాధి చికిత్సలో డై ఇథైల్ కార్బ మొజైన్ను ఔషధంగా వాడతారు? 1) బోదరోగం 2) కోరింత దగ్గు 3) గవద బిళ్లల వ్యాధి 4) తట్టువ్యాధి 21. శరీరం మొత్తం బరువులో ఎంతశాతం కంటే ఎక్కువ కొవ్వులు ఉన్నవారిని స్థూల కాయులు అంటారు? 1) 10 2) 15 3) 12 4) 20 22. పరిపూర్ణ ప్రోటీన్లు అని వేటినంటారు? 1) మాంసం 2) పాలు 3) గుడ్లు 4) అన్నీ 23. పారామిషియంలో సమవిభజన ద్వారా ఏర్పడిన ‘8’ కేంద్రకాల్లో అదృశ్యం అయ్యేవి ఎన్ని? 1) 2 2) 3 3) 4 4) 5 24. ఆడకప్పలో ఉండనివి? 1) స్వరకోశాలు 2) ఏంప్లక్సరి 3) 1, 2 4) ఏదీకాదు 25. అతిముఖ్యమైన వేగస్ కపాలనాడీ ఎన్నోది? 1) ఒకటి 2) ఐదు 3) పది 4) పదకొండు 26. హార్మోన్లు చర్య జరిపే కణజాలం? 1) నిర్వాహక 2) మృదు 3) లింప్ 4) స్థంభాకార 27. గర్బధారణ తర్వాత ఎన్ని వారాలకు ముఖ్య అవయవాలన్నీ ఏర్పడతాయి? 1) 11 2) 10 3) 9 4) 12 28. చేపల్లో అంతర జలశ్వాస రంధ్రాలు తెరచుకునే భాగం? 1) నోరు 2) ఆస్యకుహరం 3) గ్రసని 4) స్వరకోశాలు 29. అండాశయంలో ఉబ్బిన భాగం నుంచి అండాలు పెరిగే భాగాన్ని ఏమంటారు? 1) అండాతర కణజాలం 2) కలాజా 3) అండన్యాస స్థానం 4) అండద్వారం 30. రక్త వర్గాలను కనిపెట్టినవారు? 1) అరిస్టాటిల్ 2) విలియం హార్వే 3) కార్లలాండ్ స్టీనర్ 4) ల్యూవెన్ హుక్ 31. సాలమండర్లో శ్వాసక్రియ? 1) పుపుస శ్వాసక్రియ 2) జల శ్వాసక్రియ 3) చర్మ శ్వాసక్రియ 4) విసరణ 32. ఎర్రరక్తకణంలో కేంద్రకం ఉన్న సక శేరుకాలకు ఉదాహరణ? 1) కప్ప 2) ఒంటె 3) కప్ప, మానవుడు, ఒంటె 4) కప్ప, ఒంటె 33. చేమంతిలో పిలకమొక్కలు దేని నుంచి ఏర్పడతాయి? 1) వేరు 2) కాండం 3) పత్రం 4) వేరు బుడిపెలు 34. ఎయిడ్స వ్యాధిలో బలహీనపడే తెల్ల రక్త కణాలు? 1) బేసోఫిల్స్ 2) న్యూట్రోఫిల్స్ 3) మోనోసైట్స్ 4) లింఫోసైట్స్ 35. కణజాల వర్ధనంలో ఏకస్థితిక మొక్కల ఉత్పత్తికి వాడేవి? 1) పత్రాలు 2) కాండ కణాలు 3) పరాగ రేణువులు 4) వేరు చివరి కణాలు 36. ఎర్ర రక్తకణాల స్మశాన వాటిక? 1) కాలేయం 2) క్లోమం 3) ఎముక మజ్జ 4) ప్లీహం 37. ఫలదీకరణ సమయంలో పూర్తిగా ఏర్పడిన పిండకోశంలోని కణాలు ఎన్ని గుంపులుగా చేరతాయి? 1) 7 2) 2 3) 4 4) 3 38. ఎలర్జీ సమయంలో పెరిగే తెల్ల రక్తకణాలు? 1) ఇసినోఫిల్స్ 2) న్యూట్రోఫిల్స్ 3) లింఫోసైట్స్ 4) మోనోసైట్స్ 39. కన్నుల ద్వారా శాఖీయోత్పత్తి జరిపే మొక్క? 1) క్యారట్ 2) రణపాల 3) బంగాళదుంప 4) చేమంతి 40. కీటకాలను ఆకర్షించి పరాగ సంపర్కానికి తోడ్పడే పుష్ప భాగం? 1) కేసరావళి 2) అండకోశం 3) ఆకర్షక పత్రావళి 4) రక్షక పత్రావళి 41. జీవక్రియల ఫలితంగా ఏర్పడిన వ్యర్థ పదార్థాలను తిరిగి ఉపయోగించుకునే శక్తి ఉన్నవి? 1) మొక్కలు 2) జంతువులు 3) మానవుడు 4) జీవులు 42. ఏ తెల్ల రక్తకణాల కేంద్రకం మూత్రపిండం ఆకారంలో ఉంటుంది? 1) మోనోసైట్స్ 2) లింఫోసైట్స్ 3) త్రాంబోసైట్స్ 4) ఎరిత్రోసైట్స్ 43. అంకురచ్చర రహిత విత్తనాలకు ఉదాహరణ? 1) వరి 2) బఠాణి 3) మొక్కజొన్న 4) ఆముదం 44. కణజాల వర్ధనంలో టోటిపొటెన్సీ దేనికి సంబంధించింది? 1) పత్రాలు 2) కాలస్ 3) ఎక్స్‌ప్లాంట్ 4) ఏదీకాదు 45. పిండకోశంలోని ప్రతిపాదక కణాల సంఖ్య? 1) 2 2) 3 3) 4 4) 5 46. క్యారట్ మొక్కల్లో చేసే ఛేదనాలు? 1) కాండం 2) వేరు 3) పత్రం 4) అన్నీ 47. దానిమ్మ, నిమ్మ, నారింజల్లో గూటి పద్ధతి ఒక? 1) నేల అంటు తొక్కడం 2) కొమ్మ అంట్లు 3) వేరు ఛేదనం 4) కాండ ఛేదనం 48. వేరు మొగ్గల నుంచి కొత్త మొక్కలను ఉత్పత్తి చేసేవి? 1) క్యారట్, వేప 2) క్యారట్, కరివేపాకు 3) వేప, కరివేపాకు 4) అన్నీ 49. కొంచెం గట్టిదారు ఛేదనాలకు ఉదాహరణ? 1) మందార, స్వర్ణగన్నేరు 2) డాలియా, పిసినిక 3) గులాబీ, జిరేనియం 4) డాలియా, జిరేనియం 50. కంటిలోని శంకులలో ఉండే వర్ణకం? 1) ఐడాఫ్సిన్ 2) ట్రిిపిన్స 3) పెప్సినోసిన్ 4) రాఢాఫ్సిన్ 51. శోషరసం ఏ వ్యవసకు చెందుతుంది? 1) జీర్ణ 2) విసర్జన 3) నాడీ మండలం 4) రవాణా 52. మనదేశంలో ఖజి+ శాతం? 1) 63 2) 7 3) 93 4) 50 53. పదార్థాల రవాణా, శరీర రక్షణ చర్యల్లో రక్తం ద్రవాభిసరణ పీడనాన్ని కాపాడే ప్రోటీన్లు? 1) గ్లోబ్యులిన్లు 2) ఆల్బుమిన్‌లు 3) పొత్రాంబిన్ 4) పైబ్రినోజన్ 54. బ్యాక్టీరియా ద్విదావిచ్ఛిత్తి, శిలీంద్ర సిద్ధబీ జాశయంలో కేంద్రకాలు జరిపే విభజనలు వరుసగా? 1) క్షయ, సమ 2) క్షయ, క్షయ 3) సమ, సమ 4) సమ, క్షయ 55. అంకురచ్ఛద కేంద్రకం ఏ స్థితిలో ఉంటుంది? 1) త్రయ స్థితికం 2) ఏక స్థితికం 3) ద్వయ స్థితికం 4) చతుర స్థితికం 56. బొద్దింకలో ఎన్ని గదుల హృదయం ఉంటుంది? 1) 3 2) 11 3) 5 4) 13 57. ప్లాస్మాలో అ, ఆ ప్రతిరక్షకాలు లేని రక్త వర్గం? 1) B 2) A 3) O 4) AB 58. ఒక వ్యక్తి రక్తాన్ని మరో వ్యక్తికి దేని ద్వారా ఎక్కిస్తారు? 1) ధమని 2) సిర 3) కండరాలు 4) వాయునాళం 59. పత్ర కోరకాల ద్వారా శాఖీయోత్పత్తి జరుపుకునే మొక్క? 1) చేమంతి 2) ఆలుగడ్డ 3) కరివేపాకు 4) రణపాల 60. ద్వివలయ ప్రసరణ హృదయం ఉన్న జీవి? 1) వానపాము 2) బొద్దింక 3) చేప 4) కోతి 61. బ్లడ్ బ్యాంకులో నిర్జీవ స్థితిలో రక్తం గడ్డకట్ట కుండా ఉండటానికి ఉపయోగించే పదార్థం? 1) కాపర్ 2) సోడియం సిట్రైట్ 3) సోడియం నైట్రేట్ 4) హెపారిన్ 62. కిరణజన్య సంయోగక్రియలో కాంతి చర్య ఎక్కడ జరుగుతుంది? 1) ఆవర్ణిక 2) స్ట్రోమా 3) త్వచం 4) గ్రానా 63. కిరణజన్య సంయోగక్రియ ఎక్కువగా ఏ కాంతిలో జరుగుతుంది? 1) ఎరుపు, నీలి 2) ఆకుపచ్చ, నీలి 3) అరుణ, నీలి 4) అరుణ, ఎరుపు 64. గ్లూకోజ్ ఫైరూవిక్ ఆమ్లంగా ఏర్పడే టప్పుడు పొందే నికర లాభం? 1) 38 అఖ్కీ అణువులు 2) 4 అఖ్కీ అణువులు 3) 36 అఖ్కీ అణువులు 4) 2 అఖ్కీ అణువులు 65. మైటోకాండ్రియాలో లోపలి ముడుతలను ఏమంటారు? 1) క్రిస్టే 2) మాతృక 3) ప్రాథమిక రేణువులు 4) స్ట్రోమా 66. మానవునిలో వాయునాళానికి ఆధారాన్ని ఇచ్చే మృధులాస్థి ఉంగరాల ఆకారం? 1) U 2) O 3) S 4) C 67. పురుషుల్లో శ్వాస వ్యవస్థ కదలికల్లో ప్రముఖ పాత్ర వహించేది? 1) ఉదర వితానం 2) అంగిలి 3) ఉపజిహ్వక 4) ఏదీ కాదు 68. అమీబాలో శ్వాసక్రియ విధానం? 1) ఉచ్ఛ్వాసం 2) బాష్పీభవనం 3) విసరణం 4) ఆష్మాసిస్ 69. ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్లో ఏర్పడేది? 1) వాయు సహిత శ్వాసక్రియలో అఈ్క 2) వాయు సహిత శ్వాసక్రియలో ఏర్పడే ATP 3) సూర్యరశ్మిలో ఏర్పడే అఖ్కీ 4) అన్నీ 70. ఎడమ ఊపిరితిత్తిలోని తమ్మెల సంఖ్య? 1) 3 2) 2 3) 1 4) 4 71. సిరాసరణి లేని జంతువు? 1) కప్ప 2) చేప 3) సాలమండర్ 4) మానవుడు 72. గ్లూకోజ్ ఆక్సీకరణలో మొదటిదశ? 1) క్రెబ్స్ వలయం 2) సిట్రిక్ వలయం 3) గ్లెకాలసిస్ 4) కిణ్వనం సమాధానాలు 1) 4; 2) 3; 3) 2; 4) 2; 5) 4; 6) 4; 7) 3; 8) 1; 9) 3; 10)2; 11) 3; 12) 4; 13) 3; 14) 2; 15) 2; 16) 2; 17) 2; 18) 4; 19) 1; 20)1; 21) 4; 22) 4; 23) 2; 24) 3; 25) 3; 26) 1; 27) 4; 28) 3; 29) 3; 30) 3; 31) 3; 32) 4; 33) 2; 34) 4; 35) 3; 36) 4; 37) 4; 38) 1; 39) 3; 40) 3; 41) 1; 42) 1; 43) 2; 44) 3; 45) 2; 46) 2; 47) 2; 48) 3; 49) 4; 50) 1; 51) 4; 52) 3; 53) 1; 54) 3; 55) 1; 56) 4; 57) 4; 58) 2; 59) 4; 60) 4; 61) 2; 62) 2; 63) 3; 64) 4; 65) 1; 66) 4; 67) 1; 68) 3; 69) 2; 70) 2; 71) 4; 72) 3. -
నేత్రపటలంలో రంగులను గుర్తించే కణాలు?
DEECET - 2014 బయాలజీ 1. ధాన్యాలు, చిరుధాన్యాలు ఏ మొక్కల వంశానికి చెందుతాయి? 1) లిలియేసి 2) ఆస్టరేసి 3) గడ్డిజాతి 4) అన్నీ 2. ఫలాల నుంచి నారనిచ్చే మొక్క? 1) పత్తి 2) గోగు 3) కొబ్బరి 4)జనుము 3. అతి పురాతనమైన నార ఏ మొక్కకు చెందింది? 1) కోకస్ 2) హైబిస్కస్ 3) క్రొటలేరియా 4) గాసిపియం 4. జియామేజ్ దేని శాస్త్రీయ నామం? 1) వరి 2) గోధుమ 3) మొక్కజొన్న 4) సజ్జ 5. కాలికో ముద్రణలో దేని పిండిని వినియో గిస్తారు? 1) సజ్జ 2) రాగి 3) గోధుమ 4) వరి 6. పంటను అభివృద్ధి చేయడానికి ఉపయో గించే సామాన్య పద్ధతి? 1) నేలదున్నడం 2) కలుపు తీయడం 3) సంకరణ పద్ధతి 4) నీరు పెట్టడం 7. ‘లైవ్‌స్టాక్’ కింద ఏ జంతువులు వస్తాయి? 1) ఆవులు 2) గేదెలు 3) పశువులు 4) అన్నీ 8. రోడ్ ఐలాండ్ అనే జాతి దేనికి సంబంధిం చింది? 1) మేకలు 2) గొర్రెలు 3) కోళ్లు 4) గుర్రాలు 9. ఏ జాతి గొర్రె తోలుకి ప్రసిద్ధం? 1) అంగోరా 2) మెరినో 3) కొరిడేల్ 4) కారాకుల్ 10. మగ గాడిద, ఆడ గుర్రానికి పుట్టిన జీవిని ఏమంటారు? 1) ల్యాంబ్ 2) మ్యూల్ 3) బక్ 4) హిన్నీ 11. ప్లీస్ అని ఏ రోమాలను పిలుస్తారు? 1) ప్రాథమిక 2) ద్వితీయ 3) తృతీయ 4) బిరుసు 12. పామ్ మొక్క శాస్త్రీయ నామం? 1) సిసామమ్ ఇండికమ్ 2) ఎల్యుసిన్ కొరకానా 3) ఇలుసిస్ గెనైసిస్ 4) బ్రాసికా 13. ఇండియన్ రోజ్‌వుడ్ అని దేన్ని పిలుస్తారు? 1) సాలు 2) టేకు 3) వేప 4) డాల్బర్జియా 14. చెవిపోటు, చర్మవ్యాధుల నివారణలో వాడే కేంఫర్ అనే ఔషధం ఏ మొక్క నుంచి లభిస్తుంది? 1) యూకలిప్టస్ 2) డిజిటాలిస్ 3) ఆసిమమ్ 4) నక్స్‌వామికా 15. మలేరియా వ్యాధి నివారణలో వాడే ఔషధం? 1) అట్రోవిన్ 2) బ్రూసిన్ 3) క్వినైన్ 4) డిజిటాలిన్ 16. థార్న ఆపిల్‌గా ఏ మొక్కను పిలుస్తారు? 1) దతూరా 2) సింకోనా 3) నల్లమందు 4) ఆట్రోపా బెలడోనా 17. టస్సార్ పట్టు దేని నుంచి లభిస్తుంది? 1) బాంబిక్స్ మోరి 2) థియోపిలా 3) అట్టాకస్ సింధియా 4) ఆంధీరియా పాంపియా 18. పట్టులోని ప్రోటీన్? 1) కెరాటిన్ 2) ఆల్బుమిన్ 3) ఫైబ్రోయిన్ 4) సిలికాన్ 19. తేనె పట్టులో రాణి ఈగల సంఖ్య? 1) 200 - 300 2) 20,000-60,000 3) 1 4) 2 20. లక్క ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న దేశం? 1) శ్రీలంక 2) పాకిస్తాన్ 3) ఇండియా 4) నేపాల్ 21. డీడీటీ ఒక? 1) శిలీంద్ర నాశకం 2) కలుపు మొక్కల నాశకం 3) క్రిమిసంహారకం 4) ఎరువు 22. ఫిరమోనులు ఏ క్రియలో ఉపయోగ పడతాయి? 1) శ్వాసక్రియ 2) విసర్జన 3) ప్రత్యుత్పత్తి 4) జీర్ణక్రియ 23. సర్పాల పార్కు ఉన్న ప్రదేశం? 1) హైదరాబాద్ 2) గిండి 3) ఢిల్లీ 4) విజయవాడ 24. ముత్యం ఏ పదార్థంతో తయారవుతుంది? 1) సోడియం కార్బోనేట్ 2) కాల్షియం కార్బోనేట్ 3) కాల్షియం సిలికేట్ 4) మెగ్నీషియం కార్బోనేట్ 25. యూజీ ఈగలు ఏ పరిశ్రమను ప్రభావితం చేస్తాయి? 1) తేనె 2) లక్క 3) పట్టు 4) చేపలు 26. పట్టుపురుగు జీవిత చరిత్రలో ఉండే నిర్మోచ నాల సంఖ్య? 1) 3 2) 4 3) 2 4) లేవు 27. మూన్ జెల్లి ఏ వర్గానికి చెందుతుంది? 1) నిమటోడ 2) పొరిఫెరా 3) టినోఫోరా 4) కార్డేటా 28. జంతురాజ్యంలో అతిపెద్ద వర్గం? 1) మొలస్కా 2) అనెలిడ 3) ఆర్థ్రోపొడ 4) ఇఖైనోడెర్మట 29. ఏ రాజ్యాన్ని మెటాఫైటా అంటారు? 1) ఫంజి 2) ప్లాంటే 3) ప్రొటిస్టా 4) ఎనిమేలియా 30. ఏ రాజ్యానికి చెందిన జీవులను ‘భూమిని శుభ్రపరిచే తోటీలు’ అంటారు? 1) మొనీరా 2) ప్రొటిస్టా 3) ఫంజి 4) ఎనిమేలియా 31. అతిపురాతన జీవులు ఏ రాజ్యానికి చెందు తాయి? 1) మొనీరా 2) ప్రొటిస్టా 3) ఫంజి 4) ఎనిమేలియా 32. ‘సముద్రంలో తేలియాడే పచ్చికబయళ్లు’ అని వేటికి పేరు? 1) బ్యాక్టీరియా 2) డయాటమ్స్ 3) స్మట్లు 4) మౌల్డ్‌లు 33. ‘జాతి’ పదాన్ని మొదటిసారిగా ఉపయో గించింది? 1) లిన్నయస్ 2) చరకుడు 3) జాన్రే 4) అరిస్టాటిల్ 34. జీర్ణక్రియ, శ్వాసక్రియకు సంబంధించిన జీవశాస్త్ర శాఖ? 1) పిండోత్పత్తి శాస్త్రం 2) శరీర ధర్మ శాస్త్రం 3) సూక్ష్మజీవ శాస్త్రం 4) పరిణామ శాస్త్రం 35. సముద్ర జంతువులపై శాస్త్రీయ అన్వేషణ జరిపే సంస్థ ఎక్కడుంది? 1) నాగ్‌పూర్ 2) గోవా 3) ఢిల్లీ 4) పుణే 36. లక్నోలో ఏ శాస్త్రీయ సంస్థలు ఉన్నాయి? 1) ఎన్బీఆర్ఐ, ఐఏఆర్ఐ 2) ఐఏఆర్ఐ, ఐఐఎస్ఆర్ 3) ఎన్బీఆర్ఐ, ఐఐఎస్ఆర్ 4) సీఐసీఆర్, సీఆర్ఆర్ఐ 37. ఆంథ్రాక్స్ వ్యాధికి టీకాను కనుగొన్నవారు? 1) లూయిపాశ్చర్ 2) రాబర్టహుక్ 3) సలీం అలీ 4) సి.వి.రామన్ 38. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఫైకాలజీ? 1) అయ్యంగార్ 2) వెంకట్రామన్ 3) బీర్బల్ సహానీ 4) పంచానన్ మహేశ్వరి 39. పిండోత్పత్తి శాస్త్రానికి నాంది పలికింది ఎవరు? 1) వాట్సన్, క్రిక్ 2) రొనాల్డ్ రాస్ 3) అరిస్టాటిల్ 4) విలియం హార్వే 40. ఖండాల కదలిక సిద్ధాంతాన్ని ప్రతి పాదించింది? 1) పంచానన్ మహేశ్వరి 2) బీర్బల్ సహానీ 3) ఎం.ఎస్. స్వామినాథన్ 4) లీవెన్‌హుక్ 41. వర్గీకరణలో ప్రాథమిక ప్రమాణం? 1) ప్రజాతి 2) జాతి 3) కుటుంబం 4) తరగతి 42. {పతిరక్షకాలు దేన్ని సంహరిస్తాయి? 1) బ్యాక్టీరియా 2) మాస్ 3) జంతువులు 4) వృక్షాలు 43. రొనాల్డ్రాస్కు నోబెల్ బహుమతి లభించిన సంవత్సరం? 1) 1962 2) 1902 3) 1898 4) 1885 44. కిందివాటిలో రసాయన గ్రాహకాలు? 1) ఘ్రాణ, చర్మ 2) ఘ్రాణ, కాంతి 3) శ్రవణ, కాంతి 4) ఘ్రాణ, రుచి 45. ‘ఎల్లోస్పాట్’ని ఏమని పిలుస్తారు? 1) నేత్రచుక్క 2) అంధచుక్క 3) ఫోవియా 4) రాడ్యులా 46. నేత్రపటంలోని దండాలు, కోనుల నిష్పత్తి? 1) 1 : 1 2) 15 : 2 3) 15 : 1 4) 1 : 15 47. డెర్మటాలజీ ఏ జ్ఞానేంద్రియ అధ్యయనం? 1) కన్ను 2) చెవి 3) ముక్కు 4) చర్మం 48. మధ్య చెవిని, గ్రసనితో కలిపే నిర్మాణం? 1) అర్ధవర్తులకుల్య 2) యుస్టాచియన్ నాళం 3) కర్ణావర్తనం 4) కర్ణాంతరాస్థి 49. ఇచ్‌మైట్ శరీరంలో ఏర్పర్చే బొరియల ఆకారం? 1) a 2) 3) b 4) c 50. చర్మంలోని నాసిసెప్టారులు దేనికి సంబం ధించినవి? 1) పీడనం 2) స్పర్శ 3) నొప్పి 4) ఉష్ణోగ్రత 51. కెరాటిన్ దేనిలో ఉంటుంది? 1) గోళ్లు 2) రోమాలు 3) గిట్టలు 4) అన్నీ 52. ఏ జ్ఞానేంద్రియం ఉష్ణోగ్రతను క్రమ పరుస్తుంది? 1) ముక్కు 2) నాలుక 3) చర్మం 4) చెవి 53. నాలుకపై చేదు గ్రాహకాలు ఏ భాగంలో అమరి ఉంటాయి? 1) ముందరి 2) వెనుక 3) పార్శ్వ 4) మధ్య 54. మానవుని చెవిలోని అర్ధ్దవర్తుల కుల్యల సంఖ్య? 1) 2 2) 3 3) 5 4) 6 55. శిశు పక్షవాతాన్ని కలిగించే సూక్ష్మజీవి? 1) వైరస్ 2) ప్రోటోజోవన్ 3) బ్యాక్టీరియా 4) కీటకం 56. సజలీకరణ ద్రావణాన్ని ఏ బ్యాక్టీరియల్ వ్యాధి నివారణలో వాడతారు? 1) టైఫాయిడ్ 2) కలరా 3) క్షయ 4) కోరింత దగ్గు 57. బీసీజీ టీకాను ఏ వ్యాధి నివారణలో ఉపయోగిస్తారు? 1) గవద బిళ్లలు 2) పోలియో 3) కుష్ఠు 4) క్షయ 58. ‘రూబియోలా’ అని పిలిచే వైరల్ వ్యాధి? 1) గవద బిళ్లలు 2) ఆటలమ్మ 3) పొంగు 4) పోలియో 59. ‘ఆపరేషన్ ఫ్లడ్’ వేటి ఉత్పత్తికి సంబం ధించింది? 1) పాలు 2) మాంసం 3) కోడి గుడ్లు 4) కోళ్లు 60. చేపకుంటను ఏ రుతువులో నిర్మించాలి? 1) వేసవి కాలం 2) వర్షాకాలం 3) శీతాకాలం 4) నిర్దిష్ట సమయం లేదు 61. కొబ్బరిలో వేరువిల్డ్ వ్యాధిని కలిగించేది? 1) బ్యాక్టీరియా 2) వైరస్ 3) శిలీంద్రం 4) కీటకం 62. మొక్కల్లో వ్యాధుల అధ్యయనాన్ని ఏమంటారు? 1) పైటో జాగ్రఫీ 2) పైటో పాథాలజీ 3) పైటోనిక్స్ 4) క్రయోజనిక్స్ 63. వైటిస్ వినిఫెరా ఏ మొక్క శాస్త్రీయ నామం? 1) నిమ్మ 2) ద్రాక్ష 3) బత్తాయి 4) నారింజ 64. చినీ, నిమ్మతోటల్లో వ్యాపించే వైరల్ వ్యాధి కానిది? 1) ట్రిస్టిజె 2) సిట్రస్ కాంకర్ 3) మొజాయిక్ 4) ఎల్లోకార్కీ వీన్ 65. హెర్బిసైడ్స వేటిని సంహరిస్తుంది? 1) ఎలుకలు 2) దోమలు 3) కలుపు మొక్కలు 4) సర్పాలు 66. వ్యాక్సినేషన్‌ను కనుగొన్న సంవత్సరం? 1) 1786 2) 1756 3) 1776 4) 1886 67. నీలి ఆకుపచ్చ శైవలాలు వేటిని పోలి ఉంటాయి? 1) వైరస్ 2) బ్యాక్టీరియా 3) శిలీంద్రాలు 4) జంతువులు 68. ఏ వ్యాధి తీవ్రతలో వరిపంట కాలిన మాదిరిగా కన్పిస్తుంది? 1) ఎండు తెగులు 2) అగ్గితెగులు 3) తెగులు బ్లాస్ట్ 4) కుంకుమ తెగులు 69. పెన్సిలిన్‌ను ఏ జీవుల నుంచి తయారు చేస్తారు? 1) శైవలాలు 2) శిలీంద్రాలు 3) కీటకాలు 4) వైరస్లు 70. గొంతుకు సంబంధించిన తీవ్రమైన బ్యాక్టీరి యల్ వ్యాధి? 1) కోరింత దగ్గు 2) క్షయ 3) డిప్తీరియా 4) హెపటైటిస్ 71. కిందివాటిలో ఎలుకల సంహారిణి? 1) డీడీటీ 2) జింక్ ఫాైస్ఫైడ్ 3) మలాథియాన్ 4) ఇథిలిన్ డైబ్రోమైడ్ 72. నేత్రపటలంలో రంగులను గుర్తించే కణాలు? 1) రాడ్స 2) కోన్స 3) 1, 2 4) అంధ చుక్క 73. అన్ని రకాల వాతావరణంలో నివసించే సూక్ష్మజీవులు? 1) ప్రోటోజోవా 2) శిలీంద్రాలు 3) బ్యాక్టీరియా 4) వైరస్ 74. బాహ్యచెవికి సంబంధించింది? 1) చెవిదొప్ప 2) కర్ణభేరి 3) బాహ్యశ్రవణ కుహరం 4) కర్ణాంతరాస్థి సమాధానాలు 1) 3; 2) 3; 3) 4; 4) 3; 5) 4; 6) 3; 7) 4; 8) 3; 9) 4; 10) 2; 11) 2; 12) 3; 13) 4; 14) 3; 15) 3; 16)1; 17) 4; 18) 3; 19) 3; 20) 3; 21) 3; 22) 3; 23) 2; 24) 2; 25) 3; 26) 2; 27) 3; 28) 3; 29) 2; 30) 3; 31) 1; 32)2; 33) 3; 34) 2; 35) 2; 36) 3; 37) 1; 38) 1; 39) 3; 40) 2; 41) 2; 42) 1; 43) 2; 44) 4; 45) 3; 46) 3; 47) 4; 48) 2; 49) 2; 50) 3; 51) 4; 52) 3; 53) 2; 54) 2; 55) 1; 56) 2; 57) 4; 58) 3; 59) 1; 60) 1; 61) 2; 62) 2; 63) 2; 64) 2; 65) 3; 66) 3; 67) 2; 68) 1; 69) 2; 70) 3; 71) 2; 72) 2; 73) 3; 74) 4; ఉద్యోగాలు డీఆర్డీవోలో సైంటిస్ట్‌లు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీవో), ఢిల్లీ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులు: ఏ సైంటిస్ట్ ‘ఎఫ్’ ఏ సైంటిస్ట్ ‘ఈ’ ఏ సైంటిస్ట్ ‘డి’ ఏ సైంటిస్ట్ ‘సి’ ఏ సెంటిస్ట్ ‘బి’ అర్హతలు: మొదటి శ్రేణిలో ఇంజనీరింగ్/టెక్నాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులు. లేదా సంబంధిత సబ్జెక్టుతో మాస్టర్స్ డిగ్రీ ఇన్ సైన్స్. సైంటిస్ట్ ‘ఎఫ్’ 15 ఏళ్లు, సైంటిస్ట్ ‘ఈ’కు 10, సైంటిస్ట్ ‘డి’కు 7, సైంటిస్ట్ ‘సి’కు మూడేళ్ల అనుభవం ఉండాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: జూలై 20 వెబ్సైట్: www.rac.gov.in మరిన్ని నోటిఫికేషన్ల కోసం www.sakshieducation.com చూడవచ్చు. -
మానవునిలోని లాలాజల గ్రంథుల సంఖ్య?...
1. శాకాహార జంతువుల్లో లోపించిన దంతాలు? a) కుంతకాలు b) రదనికలు c) చర్వణకాలు d) అగ్రచర్వణకాలు 2. మలకబళనాన్ని ప్రదర్శించే జంతువు? a) గుర్రం b) కుందేలు c) గేదె d) మానవుడు 3. ఎంజైమ్‌లు లేని జీర్ణరసం? a) పైత్యరసం b) క్లోమరసం c) జఠర రసం d) పైవన్నీ 4. ఆహారాన్ని మింగడం ఏ చర్య? a) నియంత్రిత b) అనియంత్రిత c) అసంకల్పిత d) ఏదీకాదు 5. మానవుని దంత సూత్రం? a) b) c) d) 6. మానవునిలోని లాలాజల గ్రంథుల సంఖ్య? a) 3 b) 3 జతలు c) 4 d) 4 జతలు 7. ప్లనేరియా విసర్జక అవయవం? a) వృక్కం b) జ్వాలాకణం c) సంకోచ రిక్తిక d) మూత్రపిండం 8. కిందివాటిలో యూరియోటెలిక్ జీవి? a) కీటకం b) పీత c) పాము d) కప్ప 9. విసర్జక పదార్థాలను తనలోనే నిల్వ చేసుకునే జీవి? a) కప్ప b) బొద్దింక c) లెపిస్మా d) నత్త 10. మూత్రంలో ఉండే నీటి శాతం? a) 4 b) 1 c) 96 d) 94 11. సముద్రాలు దేనికి సింకులుగా పని చేస్తాయి? a) CO b) SO2 c) CO2 d) O2 12. నీటిలోని బ్యాక్టీరియాలను సంహరించడానికి వాడే వాయువు? a) O2 b) CO2 c) Cl d) F 13. సహజవాయువు ఏ పదార్థాల మిశ్రమం? a) మీథేన్, ఆక్సిజన్ b) మీథేన్, ఈథేన్ c) మీథేన్, ఈథేన్, ప్రొపేన్ d) అమ్మోనియా, CO2, O2 14. చైనా గడ్డి అనేది? a) శైవలం b) శిలీంద్రం c) చిన్న మొక్క d) ఒక విధమైన గడ్డి 15. సముద్రపు కలుపుమొక్కలు ఏ ఖనిజ లవణాన్ని నిక్షిప్తం చేసుకుంటాయి? a) క్లోరిన్ b) అయోడిన్ c) కాల్షియం d) ఐరన్ 16. సువాసన తైలాల మొక్కలకు ఉదాహరణ? a) నిమ్మగడ్డి b) తులసి c) యూకలిప్టస్ d) పైవన్నీ 17. {పాథమిక జీవక్రియోత్పన్నాలకు ఉదాహరణ? a) పిండి పదార్థాలు b) ప్రోటీన్స c) కొవ్వులు d) పైవన్నీ 18. వేప ఆకులో ఉన్న ఆల్కలాయిడ్ ఏది? a) మార్ఫిన్ b) క్వినైన్ c) రిసర్పిన్ d) నింబిన్ 19. పాలను పెరుగుగా మార్చే ఎంజైమ్? a) పెప్సిన్ b) ట్రిప్సిన్ c) రెన్నిన్ d) లైపేజ్ 20. కండరాలకు వచ్చే కేన్సర్‌ను ఏమంటారు? a) కార్సినోమా b) ల్యుకేమియా c) లింఫోమా d) సార్కోమా 21. క్షయకరణ విభజన అనంతరం ఏర్పడే పిల్ల కణాల సంఖ్య? a) 2 b) 4 c) 8 d) 16 22. కణాలు వాటి ముందున్న కణాల నుంచి ఏర్పడతాయని పేర్కొన్నవారు? a) రాబర్ట బ్రౌన్ b) రాబర్ట హుక్ c) ష్వాన్ d) విర్షో 23. సూక్ష్మనాళికలు దేనిలో భాగం? a) రైబోజోమ్‌లు b) లైసోజోమ్‌లు c) కణ అస్థిపంజరం d) గాల్జీ సంక్లిష్టం 24. {సావక కణాంగం అని దేన్నంటారు? a) మైటోకాండ్రియా b) కేంద్రకం c) గాల్జీ సంక్లిష్టం d) హరితరేణువు 25. వృక్ష కణంలో లేనిది? a) రిక్తిక b) కణకవచం c) ప్లాస్టిడ్స d) సెంట్రియోల్ 26. విదరింగ్ దేనికి సంబంధించింది? a) గాలి b) నీరు c) మృత్తిక d) లోహాలు 27. {Xన్హౌస్ ఎఫెక్ట్‌కు కారణమైన వాయువు? a) CO2 b) O2 c) SO2 d) SO 28. బంగారు పసుపు వర్ణం లేబిల్ కలిగిన విత్తనాలు? a) పునాది b) బ్రీడర్ c) ఫౌండేషన్ d) ధ్రువీకరణ 29. తొలిసారిగా పుట్టిన ప్రాణులుగా గుర్తింపు పొందినవి? a) శిలీంద్రాలు b) సైనోబ్యాక్టీరియా c) ప్రోటోజోవా d) చిన్న మొక్కలు 30. భూమి పుట్టినప్పుడు వాతావరణంలో లేని వాయువు? a) మీథేన్ b) హైడ్రోజన్ c) ఆక్సిజన్ d) అమ్మోనియా 31. హీవియా బ్రెజిలెన్సిస్ నుంచి లభించేది? a) రబ్బరు b) ఆల్కలాయిడ్ c) నూనె d) రంజకం 32. కిందివాటిలో కార్సినోజెన్ కానిది? a) డీడీటీ b) అప్లోటాక్సిన్ c) సాకరిన్ d) గ్లూకోజ్ 33. టోనోప్లాస్ట్ దేనికి సంబంధించింది? a) మైటోకాండ్రియా b) హరితరేణువు c) రిక్తిక d) రైబోజోమ్‌లు 34. కేంద్రకత్వచం నుంచి కణత్వచం వరకు వ్యాపించే కణాంగం? a) గాల్జీ సంక్లిష్టం b) మైటోకాండ్రియా c) అంతర్జీవ ద్రవ్యజాలకం d) హరితరేణువు 35. త్వచరహిత కణాంగం? a) కేంద్రకం b) లైసోజోమ్‌లు c) రైబోజోమ్‌లు d) b, c 36. జీవ సంబంధ కేన్సర్ కారకాలకు ఉదాహరణ? a) వైరస్ b) గీకిరణాలు c) పొగ, మసి d) UV కిరణాలు 37. ఆహారాన్ని నిల్వ చేసే ప్లాస్టిడ్స? a) క్రోమోప్లాస్ట్లు b) ల్యూకోప్లాస్ట్లు c) క్లోరోప్లాస్ట్‌లు d) సయనోప్లాస్ట్లు 38. ప్లాస్మా పొర వేటితో నిర్మితమై ఉంటుంది? a) ప్రోటీన్లు b) లిపిడ్లు c) సెల్యులోజ్ d) a, b 39. మొలస్కా జీవుల్లో మూత్రపిండం (వృక్కాల గుంపు) దేనిలోకి తెరుచుకుంటుంది? a) పేగు b) హృదయావరణ కుహరం c) బయటకు d) శరీర కుహరం 40. పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని ఏమంటారు? a) బోలస్ b) కైము c) ఖైల్ d) ఎంబోలస్ 41. ఏ జీవిలో ‘రాడ్యులా’ ఉంటుంది? a) వానపాము b) నత్త c) జలగ d) దోమ 42. ఏకరక భక్షక జీవికి ఉదాహరణ? a) మానవుడు b) ఆవు c) పట్టుపురుగు d) తేనెటీగ 43. ఏ అణువుల కలయిక వల్ల సెల్యులోజ్ ఏర్పడుతుంది? a) గ్లూకోజ్ b) సుక్రోజ్ c) రైబోజ్ d) పెంటోజ్ 44. నెమరువేసే జీవుల్లో అసలైన జీర్ణకోశంగా పిలిచే గది? a) మొదటి గది b) మూడో గది c) నాలుగో గది d) రెండో గది 45. మానవునిలో విసురు దంతాల సంఖ్య? a) 4 b) 8 c) 12 d) 14 46. ఆవరణ వ్యవస్థలో పోషక స్థాయి అంటే? a) నీటి స్థాయి b) ఆక్సిజన్ స్థాయి c) శక్తి స్థాయి d) లవణాల స్థాయి 47. ఆవరణ వ్యవస్థలో మొక్కలు? a) ప్రాథమిక ఉత్పత్తిదారులు b) ప్రాథమిక వినియోగదారులు c) విచ్ఛిన్నకారులు d) ఏదీకాదు 48. స్పైరోమీటర్‌ను దేన్ని కొలవడానికి ఉపయోగిస్తారు? a) రక్తపోటు b) ఆధార జీవక్రియా రేటు c) నాడీ చర్యలు d) పెరుగుదల 49. న్యూక్లియర్ ఫ్యూయెల్ కాంప్లెక్స్ ఎక్కడుంది? a) ముంబై b) హైదరాబాద్ c) కాకినాడ d) విజయవాడ 50. ‘వన్యప్రాణి సంరక్షణ చట్టం’ ఏర్పడిన సంవత్సరం? a) 1952 b) 1972 c) 1962 d) 1900 51. మొక్కల్లో విసర్జక అవయవాలు? a) వేర్లు b) కాండం c) పత్రాలు d) ఏదీకాదు 52. పైనస్ మొక్క నుంచి లభించే పదార్థం? a) ఆల్కలాయిడ్లు b) టానిన్లు c) లేటెక్స్ d) రెజిన్లు 53. చిన్నపిల్లల్లో మూత్ర విసర్జన ఏ చర్య? a) అనియంత్రిత b) సంకల్పిత c) ప్రతీకార d) నియంత్రిత 54. వ్యాపన ప్రక్రియలో విసర్జనను జరిపే జీవి? a) వానపాము b) సాలీడు c) బొద్దింక d) అమీబా 55. కోల్గ్యాస్లోని వాయువులు? a) H2, CH4, CO b) H2, O2 c) NH3, H2O d) CO, CO2, NH3 Answers 1) b 2) b 3) a 4) a 5) b 6) b 7) b 8) d 9) c 10) c 11) c 12) c 13) c 14) a 15) b 16) d 17) d 18) d 19) c 20) d 21) b 22) d 23) c 24) c 25) d 26) c 27) a 28) b 29) b 30) c 31) a 32) d 33) c 34) c 35) c 36) a 37) b 38) d 39) b 40) b 41) b 42) c 43) a 44) c 45) c 46) c 47) a 48) b 49) b 50) b 51) d 52) d 53) a 54) d 55) a -
‘పట్టు’ సాధించేందుకు ప్రయోగం
సైన్స్‌పై విద్యార్థులకు ప్రత్యేక తర్ఫీదు శ్రీకారం చుట్టిన జిల్లా విద్యాశాఖ బాల శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు దోహదం 90 మందికి ఉచిత భోజనం, వసతి, శిక్షణ విద్యార్థులకు సైన్స్‌పై ఆసక్తి పెంపొందించడానికి జిల్లా విద్యాధికారి పూనుకున్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 9వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులను బాల శాస్త్రవేత్తలుగా తయారు చేసేందుకు.. కనీసం వారికి సైన్స్‌లో ఓనమాలు నేర్పించేందుకు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో హన్మకొండలోని న్యూత్రివి హైస్కూల్లో బాల శాస్త్రవేత్తల ఆవాస వేసవి శిక్షణా శిబిరం ఏర్పాటు చేశారు. ఈనెల 2 నుంచి ప్రారంభమైన శిబిరంలో పదో తరగతిలోని ఫిజికల్ సైన్స్, బయాలజీ, కెమిస్ట్రీ సబ్జెక్టులపై ప్రభుత్వ, జెడ్పీ హైస్కూళ్లలో స్కూల్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న సుమారు 15 మంది ఉపాధ్యాయులు విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. మూడు నెలల క్రితం జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన చెకుముఖి టాలెంట్ టెస్టులో ప్రతిభ చూపిన వారినే బాల శాస్త్రవేత్తల ఆవాస శిక్షణా శిబిరానికి ఎంపిక చేశారు. వివిధ మండలాల నుంచి సుమారు 90 మంది విద్యార్థులకు ఉచిత వసతితోపాటు భోజన సౌకర్యం కల్పిస్తూ శిక్షణ ఇస్తున్నారు. ఉదయం 6 నుంచి 7 గంటల వరకు యోగాలో సునీత శిక్షణ ఇస్తున్నారు. అనంతరం విద్యాబోధన, రిసోర్స్ పర్సన్లు సైన్స్‌లోని పలు అంశాలపై అవగాహన కల్పిస్తూ ప్రయోగాత్మకంగా అర్థమయ్యే రీతిలో బోధిస్తున్నారు. సాయంత్రం ప్రముఖులతో విద్యార్థులకు ఉపయోగపడేలా, వారికి కెరీర్ గెడైన్స్ పెంపొందించేలా అవగాహన కల్పిస్తున్నారు. గెస్ట్ లెక్చర్లు రమాదేవి, సుహాసిని, శంకర్‌నారాయణ పలు అంశాలపై వివరించారు. రాత్రివేళ కొంతసేపు మానసికోల్లాసానికి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. సైన్స్ పరికరాల కొనుగోలు, స్నాక్స్ కోసం ఓరుగల్లు సేవా సమితి నుంచి కలెక్టర్ రూ.36వేలు ఇచ్చారు. భోజన వసతి కోసం ప్రైవేటు కళాశాలల యాజమన్యాలు సహకరిస్తున్నాయి. స్కూల్ అసిస్టెంట్ శ్యాంసుందర్‌రెడ్డి ప్రోగ్రాం ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నారు. రిసోర్స్ పర్సన్లుగా స్కూల్ అసిస్టెంట్లు విజయపాల్‌రెడ్డి, ఏ.జ్ఞానేశ్వర్, ఎస్.రామనాథం, వి.సురేశ్, రాము, శ్రీనివాస్‌స్వామి, శంకర్, శశికళాధర్, దయాకర్, సదానందం, అనితాలత విద్యాబోధన చేస్తున్నారు. ఎంతో ఉపయోగపడుతుంది.. లింగాలఘణపురం మండలం వనపర్తి జెడ్పీఎస్‌ఎస్‌లో 9వ తరగతి పూర్తిచేసి టెన్త్‌లోకి ప్రవేశించాను. ఇక్కడ మాకు ఉచిత వసతితోపాటు సైన్స్‌పై అనేక అంశాలను బేసిక్స్ నుంచి ఉపాధ్యాయులు చెబుతున్నారు. దీంతో టెన్త్ క్లాస్‌లోని అంశాలను ఇప్పుడే నేర్చుకుంటున్నాం. ఈ శిక్షణతో బట్టీపట్టాల్సిన అవసరం లేకుండా సైన్స్ సబ్జెక్టులోని అనేక అంశాలు ప్రయోగపూర్వకంగా చెబుతున్నారు. వాగ్దేవి, జెడ్పీఎస్ఎస్ వనపర్తి ప్రయోగాత్మకంగా చెబుతున్నారు.. రాయపర్తి మండలం కొండూరు జెడ్పీఎస్‌ఎస్‌లో 9వ తరగతి పూర్తి చేశాను. సైన్స్‌లో ప్రోత్సహించే విధంగా ఫిజిక్స్, బయాలజీ సబ్జెక్టులపై బేసిక్స్‌తో సహా టీచర్లు చెప్పడమే కాకుండా ప్రయోగాల ద్వారా చూపడంతో స్పష్టంగా అర్థమవుతోంది. శిక్షణా శిబిరంలో చదువుతోపాటు క్రమశిక్షణ నేర్పుతున్నారు. యోగా చేయిస్తున్నారు. ఇది నైపుణ్యాలను పెంపొందించేందుకు కూడా దోహదం చేస్తుంది. - జి.శ్రీకాంత్, జెడ్పీఎస్ఎస్ కొండూరు ఆసక్తి కనబరిచేలా విద్యాబోధన నరేందర్ నగర్‌లోని ప్రభుత్వ హైస్కూల్లో 9వ తరగతి పూర్తి చేశాను. బాల శాస్త్రవేత్తల ఆవాస వేసవి శిక్షణా శిబిరంలో మాకు టెన్త్లోని ఫిజికల్ సైన్స్, బయాలజీ, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లోని అనేక అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. పలు అంశాలను ప్రయోగాత్మకంగా చూపిస్తున్నారు. ఉపాధ్యాయులు చెబుతున్న సైన్స్ అంశాలు, గెస్ట్ లెక్చర్లు, యోగా, సాంస్కృతిక కార్యక్రమాలు ఆలోచింపజేస్తున్నాయి. - ఈ.రాణి, నరేందర్ నగర్, వరంగల్ ఇదొక ప్రయోగం ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థుల్లో ఎంతో ప్రతిభ ఉంటుంది. వారికి విద్యార్థి దశలోనే సైన్స్ పట్ల ఆసక్తి కలిగిస్తే వారు భవిష్యత్‌లో బాల శాస్త్రవేత్తలుగా ఎదిగే అవకాశం ఉంది. వేసవిలో విద్యార్థులు ఇంటివద్ద ఉంటే వేరే వ్యాపకాల్లో ఉంటారు. అందువల్ల వారికి రెసిడెన్షియల్‌గా ఉదయం టిఫిన్, భోజన వసతితోపాటు మధ్యలో స్నాక్స్ కూడా ఇస్తున్నాం. మానసికోల్లాసానికి యోగా, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం. వివిధ అంశాల్లో గెస్ట్ లెక్చరర్లతో గ్రూప్ డిస్కషన్ చేయిస్తున్నాం. ఫిజికల్ సైన్స్, బయాలజీలోని పలు అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. శిబిరం నిర్వహణకు కలెక్టర్ కిషన్, ప్రైవేటు యాజమాన్యాలు సహకరిస్తున్నాయి. శిక్షణను ఈనెల 11వ తేదీ వరకు కొనసాగిస్తాం. - డాక్టర్ ఎస్.విజయ్‌కుమార్, డీఈఓ సంతృప్తిగా ఉంది వేసవి సెలవులు వస్తే కుటుంబాలతో ఎక్కడికైనా విహార యాత్రకు వెళ్తుంటారు కొందరు ఉపాధ్యాయులు. అయితే విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులకు టెన్త్లోని సైన్స్‌పై నైపుణ్యాలను, మహనీయుల స్ఫూర్తి కలిగించే అంశాలను బోధించడం సంతృప్తిగా ఉంది. సెలవులు పోయినా విద్యార్థులకు ఎంతో కొంత ఉపయోగపడుతున్నామనే భావన ఉంది. - విజయపాల్‌రెడ్డి, స్కూల్ అసిస్టెంట్ -
బయాలజీ
గత వీఆర్వో/వీఆర్ఏ ప్రశ్నపత్రాన్ని పరిశీలిస్తే కంటి, చర్మ సంబంధ వ్యాధులు; ఖరీఫ్, రబీ పంటలు; వివిధ రకాల ఎరువుల గురించి ప్రధానంగా ప్రశ్నలు అడిగినట్లు గమనించొచ్చు. కాబట్టి అభ్యర్థులకు సంబంధిత అంశాలపై ప్రాథమిక అవగాహన ఉండాలి. మొక్కలు - జంతువుల ఆర్థిక ప్రాముఖ్యత 1. వేసవికాలంలో కోతకు వచ్చే పంటలను ఏమంటారు? రబీ పంటలు 2. రబీ పంటలకు ఉదాహరణలు? గోధుమ, బార్లీ, నువ్వులు 3. ఖరీఫ్ పంటలకు ఉదాహరణలు? వరి, చెరకు, మొక్కజొన్న 4. స్వల్పకాలిక పంటల పంట కాలం ఎంత? 100 రోజులు లేదా అంతకంటే తక్కువ 5. దీర్ఘకాలిక పంటల పంట కాలం? 180 రోజులు లేదా అంతకంటే ఎక్కువ 6. కాలికో ముద్రణలో ఏ పిండిని ఉపయోగిస్తారు? వరి(బియ్యం) 7. గ్లూకోజ్, రేయాన్, కాగితం పరిశ్రమల్లో వాడే మొక్క? మొక్కజొన్న 8. {పపంచంలో అతి పురాతన నార? పత్తినార 9. ఫలాల నుంచి నారనిచ్చే మొక్క? కొబ్బరి 10. కాంఫర్ అనే ఔషధం ఏ మొక్క నుంచి లభిస్తుంది? ఆసిమమ్/తులసి 11. జీర్ణాశయ, నరాల సంబంధ వ్యాధుల నివారణలో వాడే ఔషధం? {బూసిన్ 12. వేర్వేరు కాలాల్లో వేర్వేరు పంటలను పండించడాన్ని ఏమంటారు? పంట మార్పిడి 13. ఒకటి కంటే ఎక్కువ రకాల పంటలను పండించడాన్ని ఏమంటారు? మిశ్రమ పంటలు 14. ‘పచ్చిరొట్ట ఎరువులు’గా వాడేవి? వెంపలి, ఉలవ, పిల్లిపెసర, అలసంద, పెసర 15. పంచగవ్యలోని పదార్థాలు ఏవి? ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు పేడ, ఆవు మూత్రం 16. వర్మి కంపోస్ట్ తయారీలో ఉపయో గపడేవి? వానపాములు 17. శ్రీవరి సాగులో ఖఐ అంటే? system of rice intensification 18. మొలగొలుకులు, పొట్టిబాసంగి, బంగారు తీగ ఏ ధాన్యపు రకాలు? వరి 19. ఆకర్షక పంటలకు ఉదాహరణ? మిర్చిపొలాల్లో బంతిమొక్కల పెంపకం, పత్తి చేలల్లో జనుము పెంపకం 20. మెరినో జాతి గొర్రె ఏ దేశానికి చెందింది? స్పెయిన్ 21. ‘మ్యూల్’ ఎలా జన్మిస్తుంది? మగ గాడిద గీ ఆడ గుర్రం సంకరణం వల్ల 22. కృత్రిమ గర్భధారణలో వాడే హార్మోన్ ఏమిటి?(సూపర్ ఓవ్యులేషన్ కోసం) సీరమ్ గొనాడో ట్రాపిన్ 23. శుక్ర కణాలను క్రయోప్రిజర్వేషన్‌లో ఏ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేస్తారు? 196నిఇ వద్ద 24. అసిల్, చిట్టగాంగ్, గాగూస్ అనేవి ఏ రకాలు? దేశీయ కోడి రకాలు 25. జెర్సీ, హాలీస్టీన్ జాతుల ఆవులు ఏ దేశాలకు చెందినవి? ఇంగ్లండ్, డెన్మార్క 26. పట్టు పరిశ్రమ మొదట ఏ దేశంలో ప్రారంభమైంది? చైనా 27. తేనెపట్టులో ఉండే రాణి ఈగల సంఖ్య? ఒకటి 28. సువాసన నూనెలనిచ్చే మొక్కలకు ఉదాహరణ? ల్యావెండర్, నిమ్మ, కర్పూరతైలం 29. ఎలుకల నివారణలో వాడే రసాయన పదార్థాలు ఏవి? జింక్ఫాస్ఫైడ్, వార్పరిన్ 30. మొక్క వేర్లు నేలలోకి చొచ్చుకుపోవడానికి అవసరమయ్యే స్థూల పోషకం? భాస్వరం(ఫాస్ఫరస్) జ్ఞానేంద్రియాలు 1. దేహంలో అతిపెద్ద అవయవం ఏది? చర్మం 2. చర్మం గురించి చేసే అధ్యయనాన్ని ఏమంటారు? డెర్మటాలజీ 3. చర్మాన్ని అతినీలలోహిత కిరణాల నుంచి రక్షించే వర్ణకం పేరు? మెలనిన్ 4. గోర్లు, కొమ్ములు, రోమాల్లో ఉండే ప్రోటీన్? కెరాటిన్ 5. శరీరంపై రుచి గ్రాహకాలను కలిగి ఉండే జీవులు? చేపలు, అకశేరుకాలు 6. ఏ జ్ఞానేంద్రియాలు రసాయన జ్ఞానాలను గుర్తిస్తాయి? ముక్కు, నాలుక 7. జ్ఞానేంద్రియాలన్నింటిలో కెల్లా ముఖ్యమైంది? కన్ను 8. దేహ ఉష్ణోగ్రతను క్రమపరిచే జ్ఞానేంద్రియం? చర్మం 9. ఎక్కువ ధ్వని తీవ్రతకు గురైన చెవిలో మోగుతున్నట్లు ఉండే స్థితిని ఏమంటారు? టిన్నిటస్ 10. ఇంద్రియ జ్ఞానం అనేది ఒక సంక్లిష్టమైన విధానం. దీనిలో పాల్గొనేవి? జ్ఞానేంద్రియాలు, నాడీ ప్రేరణలు, మెదడు 11. కంటిలోని దండాలు, కోనుల నిష్పత్తి? 15:1 12. కంటి ఫోవియా లేదా ఎల్లో స్పాట్లో ఉండే కణాలు? కోనులు/శంకు కణాలు 13. దండాలు, కోనుల్లో ఉండే పదార్థాలు? రొడాప్సిన్, ఐడాప్సిన్ 14. క్షీరదాల్లో ఉన్న దృష్టి రకం? బైనాక్యులర్ విజన్ 15. మధ్య చెవికి, గ్రసనితో సంబంధాన్ని ఏర్పరిచే నిర్మాణం? {శోతఃపథనాళం/యుస్టాచియన్ నాళం 16. దేహంలోని అతిచిన్న ఎముక పేరు? స్టేపిస్/కర్ణాంతరాస్థి/అంకవన్నె 17. శరీర సమతాస్థితికి సహాయపడే జ్ఞానేం ద్రియం? చెవి 18. మధ్య చెవిలోని ఎముకల సంఖ్య? మూడు 19. మానవుని అంతర చెవిలోని అర్ధవర్తుల కుల్యల సంఖ్య? మూడు 20. విసర్జన క్రియలో ఏ జ్ఞానేంద్రియం పాల్గొంటుంది? చర్మం 21. మన కంటిలోని కటకం ఏ ఆకారంలో ఉంటుంది? ద్వికుంభాకారం 22. బేసిలార్ త్వచం ఏ జ్ఞానేంద్రియానికి సంబంధించింది? చెవి 23. జంతువుల కళ్లు చీకటిలో మెరవడానికి కారణం? వాటి నేత్రపటలానికి ముందు టపేటమ్ లూసిడమ్ పొర ఉండటం. 24. కంటిగుడ్డును కదపడానికి ఎన్ని కండరాలు పనిచేస్తాయి? ఆరు 25. కట్లపాము, తాచుపాముల విషాలు మానవుని ఏ వ్యవస్థపై ప్రభావం చూపిస్తాయి? నాడీ -
బయాలజీ
సూక్ష్మజీవులు - వ్యాధులు లివెన్హుక్ 1674లో మొదటిసారి బ్యాక్టీరియాలను కనుక్కొన్నాడు. బ్యాక్టీరియాల గురించి చదివే శాస్త్రాన్ని బ్యాక్టీరియాలజీ అంటారు. లూయీపాశ్చర్ బ్యాక్టీరియాల ప్రాముఖ్యతను తెలిపాడు. మానవుల్లో కలిగే బ్యాక్టీరియల్ వ్యాధులు కలరా: బ్యాక్టీరియా పేరు: విబ్రియోకలరా వ్యాధి లక్షణాలు: దేహ నిర్జలీకరణం, కళ్లు గుంటలు పడటం, కండరాల నొప్పులు సంక్రమణ: కలుషిత ఆహారం, నీరు టైఫాయిడ్: బ్యాక్టీరియా పేరు: సాల్మోనెల్లాటైఫీ వ్యాధి లక్షణాలు: జ్వరం, తలభారం, పొట్టభాగం పచ్చిగా ఉండటం సంక్రమణ: కలుషిత నీరు, పాలు, ఆహారం డిప్తీరియా: బ్యాక్టీరియా పేరు: కార్నిబ్యాక్టీరియం డిప్తీరియా వ్యాధి లక్షణాలు: తీవ్ర గొంతునొప్పి సంక్రమణ: ప్రత్యక్ష తాకిడివల్ల కోరింతదగ్గు/పెర్టుసిస్: బ్యాక్టీరియా పేరు: బోర్థిటెల్లా పెర్టుసిస్ వ్యాధి లక్షణాలు: ‘వూఫ్’ అనే శబ్దంతో దగ్గు, శ్లేష్మం సంక్రమణ: తుంపరల ద్వారా టెటానస్/ధనుర్వాతం: బ్యాక్టీరియా పేరు: క్లాస్ట్రీడియం టెటానై వ్యాధి లక్షణాలు: మెడ, దవడ కండరాలు బిగుసుకుపోవడం సంక్రమణ: తుప్పుపట్టిన సూదులు గుచ్చుకున్నప్పుడు క్షయ/టీబీ: బ్యాక్టీరియా పేరు: మైకోబ్యాక్టీరియం ట్యుబర్కులోసిస్ వ్యాధి లక్షణాలు: శ్వాసకోశాలు ప్రభావితం కావడం, జ్వరం, శ్లేష్మంతో కూడిన దగ్గు సంక్రమణ: ప్రత్యక్ష తాకిడి, తక్కువ వెలుతురు గదుల్లో నివసించడం వల్ల కుష్ఠు: బ్యాక్టీరియా పేరు: మైకోబ్యాక్టీరియం లెప్రె వ్యాధి లక్షణాలు: వ్యాధిసోకిన భాగాలు స్పర్శను కోల్పోవడం(వేళ్ల చివరి భాగాలు) సంక్రమణ: అంటువ్యాధి కాదు, (దీర్ఘకాల సన్నిహిత సంబంధం వల్ల వ్యాప్తి చెందుతుంది) బొటులిజం(ఫుడ్ పాయిజన్): బ్యాక్టీరియా పేరు: క్లాస్ట్రీడియం బొటులినం వ్యాధి లక్షణాలు: వాంతులు, విరేచనాలు సంక్రమణ: పంకిలమైన ఆహారం వల్ల న్యుమోనియా: బ్యాక్టీరియా పేరు: డిప్లోకోకస్ న్యుమోనియా వ్యాధి లక్షణాలు: ఛాతిలో నొప్పి, ఆయసం సంక్రమణ: గాలి ద్వారా ప్లేగు: బ్యాక్టీరియా పేరు: అర్సినియాపెస్టిస్ వ్యాధి లక్షణాలు: జ్వరం, చర్మంమీద నల్లటి మచ్చలు సంక్రమణ: ఎలుకల ద్వారా మానవునికి సిఫిలిస్: బ్యాక్టీరియా పేరు: ట్రెపోనిమా పాలిడమ్ వ్యాధి లక్షణాలు: జననాంగాలపై పుండ్లు సంక్రమణ: అసురక్షిత లైంగిక సంపర్కం వల్ల -
బయాలజీ
హెచ్ఐవీ-ఎయిడ్స్ 1. హెచ్ఐవీ సోకిన పిల్లలను పాఠశాలల్లో చేర్చుకునే విధానం? ఇతర సాధారణ పిల్లల్లానే 2. సరైన నిర్ణయాన్ని తీసుకునే నైపుణ్యానికి ఏది అవసరం? చక్కని ఆలోచన 3. వ్యక్తి స్వేచ్ఛగా మాట్లాడటానికి కావాల్సిన నైపుణ్యం? సంభాషణా నైపుణ్యం 4. హెచ్ఐవీ తన రూపాన్ని మార్చుకోవడానికి సహాయపడే ఎంజైమ్? రివర్స ట్రాన్సస్క్రిప్టేస్ పోషణ 5. ఒక గ్రాము గ్లూకోజ్ విడుదల చేసే శక్తి? 4 కిలో కేలరీలు 6. ఒక గ్రాము కొవ్వు విడుదల చేసే శక్తి ఎంత? 9.45 కిలో కేలరీలు 7. రోజూ సుమారుగా ఎంత కాల్షియం అవసరం? 400-500 మి.గ్రా. 8. ఐరన్ లోపం వల్ల కలిగే వ్యాధి? ఎనీమియా 9. అయోడిన్ లోపం వల్ల కలిగే వ్యాధి? సామాన్య గాయిటర్ 10. సెల్యులోజ్ ఒక? కార్బొహైడ్రేట్ 11. ఏ ఖనిజ లవణం ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకల్లో లోపాలు కలుగుతాయి? ఫ్లోరిన్ 12. ఫ్లోరిన్ శాతం ఎక్కువగా ఉన్న తాగునీటి ద్వారా వచ్చే వ్యాధి? ఫ్లోరోసిస్ 13. పాలలోని చక్కెరను ఏమంటారు? లాక్టోజ్ 14. చెరకులోని చక్కెరను ఏమంటారు? సుక్రోజ్ 15. జంతువుల్లోని స్టార్చని ఏమంటారు? గ్లైకోజన్ 16. కణంలో కొత్త అణువులు రూపొందడానికి ఎలాంటి శక్తి అవసరం? ఏటీపీ 17. పెద్దవారికి కాకుండా పిల్లలకు మాత్రమే అవసరమైన ఆవశ్యక ఎమైనో ఆమ్లం? హిస్టిడీన్ 18. ఎమైనో ఆమ్లాలు దేనిలో ఉంటాయి? {పోటీన్లు 19. ఎముకలు, దంతాలు ఏర్పడటానికి, రక్తం గడ్డకట్టడానికి అవసరమైన ఖనిజ లవణం? కాల్షియం 20. హిమోగ్లోబిన్లో ముఖ్యమైన మూలకం? ఐరన్ 21. దంతాల్లో పగుళ్లు ఏర్పడకుండా కాపాడే ఖనిజ లవణం? ఫ్లోరిన్ 22. శరీరంలో అధికంగా ఉండే కొవ్వు ఏ కణాల్లో నిలువ చెందుతుంది? అడిపోస్ కణజాలం 23. శరీరం బరువులో 20 శాతం కంటే ఎక్కువ కొవ్వు ఉంటే, ఆ వ్యక్తికి వచ్చే వ్యాధిని ఏమంటారు? స్థూలకాయత్వం 24. ఇటీవల స్థూలకాయత్వం గురించి చేసిన పరిశోధనల్లో తేలిన విషయం ? వంశ పారంపర్యం కావచ్చు 25. క్యాషియోర్కర్ వ్యాధి ఏ పోషకాహార లోపం వల్ల కలుగుతుంది? {పోటీన్లు 26. అతిగా తినడం, శక్తిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏ వ్యాధి కలుగుతుంది? స్థూలకాయత్వం 27. కేలరీల పోషకాహార లోపాన్ని ఏమంటారు? శక్తి పోషకాహార లోపం 28. సర్.హెచ్.జి. హాప్కిన్స పెరుగుదలకు సంబంధించిన ఒక పదార్థ్థం దేనిలో ఉందని కనుగొన్నారు? పాలు 29. విటమిన్ల పుట్టుపుర్వోత్తరాలు ఏ శతాబ్దానికి చెందినవి? 18వ 30. థయమిన్ (విటమిన్ బి1) లోపం వల్ల కలిగే వ్యాధి? బెరిబెరి 31. రైబోఫ్లెవిన్ (విటమిన్ బి2) లోపం వల్ల కలిగే వ్యాధి? గ్లాసైటిస్ 32. విటమిన్ బి3 లోపం వల్ల కలిగే వ్యాధి? పెల్లాగ్రా 33. పాంటోథినిక్ ఆమ్ల లోపం వల్ల మంటలు మండే భాగం? కాళ్లు 34. విటమిన్ ‘సి’ లోపం వల్ల కలిగే వ్యాధి? స్కర్వీ 35. రక్తం గడ్డకట్టడానికి అవసరమయ్యే విటమిన్ ఏది? విటమిన్ ‘కె’ 36. వేడిచేసినప్పుడు అతి త్వరగా నశించిపోయే విటమిన్ ఏది? విటమిన్ ‘సి’ 37. గాయాలు మానటంలో, విరిగిన ఎముకలు అతుక్కోవడంలో తోడ్పడే విటమిన్? విటమిన్ ‘సి’ 38. జీరఫ్థాల్మియా వ్యాధి ఏ అవయవానికి సంబంధించింది? కన్ను 39. జామకాయల్లో లభించే విటమిన్? విటమిన్ ‘సి’ 40. బొప్పాయి పండులో అధికంగా ఉండే విటమిన్? విటమిన్ ‘ఎ’ 41. ‘విటమిన్’ పేరును మొదట ప్రవేశ పెట్టినవారు? ఫంక్ 42. శరీరంలోని కొలెస్టిరాల్‌ను సూర్యరశ్మి ఏ విధంగా మారుస్తుంది? విటమిన్ ‘డి’ 43. పురుషుల్లో వ్యంధ్యత్వం రాకుండా చేసే విటమిన్? విటమిన్ ‘ఇ’ 44. ఏ విటమిన్ లోపం వల్ల రేచీకటి కలుగుతుంది? విటమిన్ ‘ఎ’ 45. విటమిన్ ‘ఎ’ రసాయనిక నామం ఏది? రెటినాల్ 46. విటమిన్ ‘సి’ రసాయనిక నామం? ఆస్కారిబిక్ ఆమ్లం 47. విటమిన్ ‘డి’ రసాయనిక నామం? కాల్సిఫెరాల్ 48. విటమిన్ ‘ఇ’ రసాయనిక నామం? టోకోఫెరాల్ 49. నిమ్మ, ఉసిరి కాయల్లో లభించే విటమిన్? విటమిన్ ‘సి’ 50. విటమిన్ ‘ఎ’ శరీరంలో ఎంతకాలం నిల్వ ఉంటుంది? 6 నుంచి 9 నెలలు 51. విటమిన్ ‘డి’ లోపం వల్ల పిల్లల్లో కలిగే వ్యాధి? రికెట్స్ 52. కొల్లాజన్ ఏర్పడటానికి అవసరమయ్యే విటమిన్ ? విటమిన్ ‘సి’ 53. హానికర రక్త హీనత ఏ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది? సయానో కోబాలమిన్ 54. క్షయ, గవద బిళ్లలు, కోరింత దగ్గు వ్యాధుల సంక్రమణ జరిగే పద్ధతి? లాలాజల తుంపర్ల ద్వారా 55. {బిటన్లో రోగ కారక క్రిములతో కలుషితమైన మేతను పశువులు తినడం వల్ల వచ్చిన వ్యాధి? మేడ్ -కౌ 56. అతి నిద్రాజాడ్యం (ఆఫ్రికన్ స్లీపింగ్ సిక్నెస్)లో పొదిగే కాలం? 20 నుంచి 30 ఏళ్లు 57. రోగ కారక జీవులను వ్యాప్తి చెందించే జంతువులను ఏమంటారు? వాహకాలు 58. ప్లేగు వ్యాధిని కలిగించే బ్యాక్టీరియాకు వాహకాలు? ఎలుకలు 59. ఎల్లో జ్వరం కలిగించే వాటికి వాహకాలు? కోతులు 60. హెపటైటిస్ లాంటి వైరస్ జ్వరానికి వాహకాలు ఏవి? మానవులు 61. మలేరియా జ్వరానికి వాహకాలు? ఆడ ఎనాఫిలస్ దోమ 62. శోషరస నాళాలు, శోషరస గ్రంథుల వాపు వల్ల వచ్చే వ్యాధి? బోధవ్యాధి 63. ఏ వైరస్ ద్వారా గవద బిళ్లల వ్యాధి కలుగుతుంది? మిక్సోవైరస్ పరొటైడిస్ 64. తట్టు లేదా అమ్మవారుకి మరో పేరు? రూబెల్ల 65. తట్టు లేదా అమ్మవారు (మీజిల్స్) ఏ వైరస్ ద్వారా కలుగుతుంది? పారామిక్సో వైరస్ 66. ఏ వైరస్ ద్వారా మెదడు వాపు వ్యాధి కలుగుతుంది? ఆర్బోవైరస్ 67. మెదడు వాపు వ్యాధి వైరస్‌లకు ప్రధాన అతిథేయి ఏది? పందులు -
బయాలజీ
నియంత్రణ సమన్వయం 1. శరీరంలో టెలిఫోన్ వైర్లలా పనిచేసే నిర్మాణాలు ఏవి? నాడులు 2. జ్ఞానాంగాల నుంచి మెదడు లేదా వెన్ను పాముకు వార్తలను తీసుకెళ్లే నాడులు? అభివాహి నాడులు 3. నాడీకణం ఉద్దీపనాలకు గురైనప్పుడు ఉత్పత్తి అయ్యే విద్యుత్ శక్తి? 55 మిల్లీ వోల్టులు 4. మెదడుకి రక్షణ ఇచ్చే పెట్టె లాంటి నిర్మాణం? కపాలం 5. మెదడును కప్పి ఉండే బయటి పొర? వరాశిక 6. మెదడును కప్పి ఉండే మధ్యపొర? లౌతికళ 7. మెదడును కప్పి ఉండే లోపలి పొర? మృద్వి 8. మస్తిష్కం ఉపరితల వైశాల్యాన్ని వృద్ధి చేసేవి? గైరీ 9. మెదడులో శరీరం, వివిధ చర్యలను నియంత్రించే ఉన్నత కేంద్రం ఏది? మస్తిష్కం 10. మానవునిలో వెన్నునాడుల జతల సంఖ్య? 31 11. మానవునిలో కపాలనాడుల జతల సంఖ్య? 12 12. మానవునిలో పరిధీయ నాడుల జతల సంఖ్య? 43 13. హృదయ స్పందనలు ఏ కపాలనాడీ ఆధీనంలో ఉంటాయి? వేగస్‌నాడీ 14. అసంకల్పిత ప్రతీకార చర్యలు నాడీ మండలంలో దేని ఆధీనంలో ఉంటాయి? వెన్నుపాము 15. శరీరం మొత్తం బరువులో మెదడు బరువు సుమారు ఎంత? 2 శాతం 16. కవిత్వం మొదలైన వాటిని ఆనందించే లక్షణం ఉన్న శరీర భాగం ఏది? మెదడు 17. 1990 నుంచి 2000 శతాబ్దాన్ని దేని యుగంగా పరిగణిస్తారు? మెదడు యుగం 18. నిబంధన సహిత ప్రతిచర్యలపై ప్రయోగాలు చేసినవారు? ఇవాన్ పావ్లోవ్ 19. జాతీయ గీతాన్ని వినగానే మనం శ్రద్ధతో లేచి నిలబడడం ఏ చర్య? నిబంధన సహిత ప్రతిచర్య 20. సమస్యలను విశ్లేషించడంలో తోడ్పడే మెదడు భాగం? మస్తిష్కం ప్రత్యుత్పత్తి 21. చేమంతి మొక్క సాధారణంగా దేని ద్వారా వ్యాప్తి చెందుతుంది? పిలకమొక్కలు 22. ఈస్ట్‌లో సాధారణంగా జరిగే అలైంగికోత్పత్తి విధానం? కోరకీభవనం 23. అలంకరణ, ఉద్యానవన మొక్కల అభివృద్ధికి ఉపయోగించే ప్రత్యుత్పత్తి విధానం? శాఖీయోత్పత్తి 24. కరివేప, వేప మొక్కల్లో శాఖీయోత్పత్తికి తోడ్పడేవి? వేరుమొగ్గలు 25. ఒక మొక్క కణం పూర్తి మొక్కను ఇచ్చే శక్తిని ఏమంటారు? టోటిపొటెన్సీ 26. రణపాలాకు మీద ఉండే మొగ్గలను ఏమంటారు? పత్రోపరిస్థిత కోరకాలు 27. వర్థన యానంలో వేటిని ఉపయోగించి ఏకస్థితిక మొక్కలు తయారు చేస్తారు? పరాగ రేణువులు 28. ఫలదళాలు దేనిలో ఉంటాయి? అండకోశం 29. లైంగిక ప్రత్యుత్పత్తికి ముఖ్యంగా అవసరమయ్యే పుష్పభాగాలు ఏవి? అండకోశం, కేసరావళి 30. పురుష సంయోగబీజం దేనితో సంయోగం చెందితే అంకురచ్ఛద కేంద్రకం ఏర్పడుతుంది? ద్వితీయ కేంద్రకం 31. ఫలదీకరణం తర్వాత కూడా ఉపయోగపడే పుష్పభాగాలు ఏవి? అండాలు 32. బాగా ఏర్పడిన పిండంలో వేరుభాగాన్ని సూచించేది? {పథమమూలం 33. పేరమీషియం ఏ పద్ధతి ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తి జరుపుతుంది? సంయోగం 34. బాహ్య ఫలదీకరణం జరిపే జీవులు? కప్ప, చేప 35. అంతర ఫలదీకరణం జరిపే జీవులు? సరీసృపాలు, క్షీరదాలు 36. ఒకే జీవిలో పురుష, స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు ఉండే స్థితిని ఏమంటారు? ఉభయ లైంగికత 37. వానపాములో ముష్కాలు ఉండే ఖండితాలు ఏవి? 10, 11 38. వానపాములో ఫలదీకరణం ఎక్కడ జరుగుతుంది? గుడ్లకోశం 39. కప్ప మిల్ట్లో ఉండేవి? శుక్రకణాలు 40. కప్ప స్పాన్‌లో ఉండేవి? అండకణాలు 41. అండకణంలోకి చొచ్చుకు పోయేందుకు ఉపయోగపడే శుక్రకణ నిర్మాణం ? ఏక్రోజోమ్ 42. పేరమీషియంలో సూక్ష్మ కేంద్రకం ఆధీనంలో ఉండే చర్య? {పత్యుత్పత్తి 43. లైంగిక ద్విరూపకత చూపే జీవి? వానపాము 44. ఈగలో ఫలదీకరణం చెందిన అండాల విడుదలలో సహాయపడే నిర్మాణం? అండశబిక 45. కప్పలోని ఏంప్లక్సరీ మెత్తలు దేనికి తోడ్పడతాయి? సంపర్కం 46. ఏ నిర్మాణంలో గ్రాఫియన్ పుటికలు ఉంటాయి? {స్తీ బీజ కోశం 47. స్త్రీలలో ఒక్కోసారి విడుదలయ్యే అండాల సంఖ్య? ఒకటి 48. తల్లి గర్భాశయ కుడ్యానికి, భ్రూణాన్ని కలిపే నిర్మాణం ఏది? జరాయువు 49. ముష్కాలు ఉత్పత్తి చేసే హార్మోన్? టెస్టోస్టిరాన్ 50. గర్భదారణ తర్వాత మూడో నెల నుంచి పిండాన్ని ఏమంటారు? {భూణం 51. పగిలిన పుటికను ఏమంటారు? కార్పస్ లూటియం 52. భారత ప్రభుత్వం బాల్య వివాహాల నిరోధ చట్టాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టింది? 1978 53. శుక్రకణాలు చలించడానికి కావాల్సిన శక్తిని ఉత్పత్తి చేసేది? మైటోకాండ్రియా 54. గర్భదారణ తర్వాత జరాయువు ఎప్పుడు ఏర్పడుతుంది? 12వ వారానికి 55. గర్భదారణ తర్వాత పిండం లైంగికత్వాన్ని ఎప్పుడు నిర్ధారించొచ్చు? 6వ వారానికి హెచ్ఐవీ - ఎయిడ్స 56. హెచ్ఐవీ పరిమాణమెంత? 120 నానోమీటర్లు 57. ఎయిడ్సను కలిగించే జీవి? వైరస్ 58. హెచ్ఐవీ ఉనికిని తెలిపే పరీక్ష? రక్త పరీక్ష 59. 2003 వరకు ఎయిడ్స వ్యాధి వల్ల చని పోయిన వ్యక్తుల సంఖ్య? 3 మిలియన్లు 60. హెచ్ఐవీ ఉత్పత్తి చేసే ఎంజైమ్‌లు ఏవి? రివర్స ట్రాన్స స్క్రిప్టేస్, ఇంటిగ్రేస్, ప్రోటియేజ్ 61. భారతదేశంలో ఏ నగరంలో మొదటిసారి ఎయిడ్స్ వ్యాధిని గుర్తించారు? చెన్నై 62. ఎయిడ్స వ్యాధి వల్ల తగ్గే శరీర బరువు శాతం ఎంత? 10 శాతం 63. హెచ్ఐవీ అధిక గాఢత ఏ ద్రవంలో ఉంటుంది? రక్తం 64. హెచ్ఐవీని నిర్ధారించడానికి చేసే పరీక్షలు? ఎలీసా, వెస్ట్రన్ బ్లాట్ టెస్ట్, పీసీఆర్ పరీక్ష 65. భారతదేశంలో తొలిసారి ఎయిడ్స్ కేసును ఎప్పుడు గుర్తించారు? 1986