birth place
-
ప్రపంచంలో ఎన్ని రకాల బంగాళా దుంపలు ఉన్నాయో తెలుసా..!
పిల్లలు నుంచి పెద్దలు వరకు అంతా ఇష్టంగా తినే కూరగాయ ఏదంటే ఆలునే. ఎందుకంటే దీంతో చాలా రకాల రెసీపీలు, స్నాక్స్లు తయారు చేస్తారు. అందువల్ల ఇదంటే అందరికీ ఇష్టం. అయితే ఈ బంగాళ దుంప మన దేశానికి చెందింది మాత్రం కాదట. మరీ ఇది ఎక్కడ పుట్టింది? ఇందులో ఎన్ని రకాలు ఉంటాయి తదితరాలు గురించి తెలుసుకుందామా..!ఈ దుంప పుట్టింది దక్షిణమెరికాలో. ప్రపంచంలో మొత్తం నాలుగు వేల రకాల బంగాళాదుంపలు ఉన్నాయట. అవన్నీ విభిన్నమైన సైజుల్లో ఉంటాయట. బఠానీ గింజ పరిమాణం నుంచి యాపిల్ కాయంత వరకు చాలా రకాల సైజుల్లో ఉంటాయి. మనం సాధారణంగా పసుపుగా ఉండే దుంపల్నే చూశాం. కానీ ఇవి ఎరుపు, నీలం, నలుపు ఇలా బోలెడు రంగుల్లో ఉంటాయి. క్రీస్తుపూర్వం 3000 కాలంలో దక్షిణమెరికాలోని పెరూ ప్రాంతంలో 'ఇంకా ఇండియన్లు' అనే జాతి ప్రజలే మొదటిసారి వీటిని పండించారని చెబుతారు. ఇప్పుడు ప్రపంచంలో మొక్కజొన్న, గోధుమ, బియ్యం తరవాత ఎక్కువ మంది బంగాళాదుంపనే తింటున్నారు. ఇది 1537లో యూరోప్ దేశాలకు చేరింది. మొదట ఆ దేశాల్లో దీనిని విషంలా చూసేవారు. జర్మనీ రాజు ఫ్రెడెరిక్ విలియం ఈ దుంపలోని సుగుణాల్ని తెలుసుకుని వీటిని పండించాల్సిందిగా ఆదేశించాడు. ఆ తర్వాత నంచే వీటివాడకం పెరిగింది. బంగాళా దుంపలు 1621లో ఉత్తర అమెరికాకు, 1719లో ఇంగ్లాండుకు పరిచయం అయ్యాయి. బంగాళాదుంపలో 80 శాతం నీరే ఉంటుంది. అమెరికాలో ప్రతి ఏడాది బంగాళాదుంపతో చేసిన ఫ్రెంచ్‌ఫ్రైస్ 40 లక్షల టన్నులు అమ్ముడవుతాయట. ఒక అమెరికన్ ఏడాదికి 70 కిలోల దుంపల్ని తింటే, జర్మన్ 100 కిలోలు తింటాడని అంచనా. 1995లో కొలంబియా నౌకలో వీటిని అంతరిక్షంలోకి తీసుకెళ్లారు. ప్రపంచంలో బంగాళాదుంపల్ని ఎక్కువ పండిస్తున్న దేశం చైనా. ఆ తరువాతి రెండు స్థానాల్లో రష్యా, ఇండియాలు ఉన్నాయి.(చదవండి: తుమ్ము ఎంత పనిచేసింది? ఏకంగా ప్రేగులు..) -
అయోధ్య భక్తజన సంద్రం.. బాల రాముడి ప్రాణప్రతిష్ఠ రేపే
అయోధ్య.. ఆ పేరు వింటేనే ఆధ్యాత్మిక పరవశం. అది శ్రీరాముడు జన్మించిన పుణ్యభూమి. ఎన్నో వివాదాలు.. మరెన్నో ఆందోళనలు..అవన్నీ సమసిపోయాయి. రాముడు పుట్టిందక్కడే అని బలంగా నమ్మే కోట్లాది భక్త హృదయాలు ఉప్పొంగేలా, భవ్యమైన దివ్యమైన మందిరంలోకి రామచంద్ర ప్రభువు వేం చేయబోతున్నాడు. ఆ దివ్యమంగళ రూపం కోసం పరితపిస్తున్న భక్తకోటి ఆర్తి తీరేలా బాలరాముడిగా రేపు తొలి దర్శనభాగ్యం కలిగించబోతున్నాడు. అయోధ్యలో దివ్యంగా రూపుదిద్దుకున్న భవ్య మందిరంలో భక్తవత్సలుడు కొలువు దీరబోతున్నాడు. కనులారా బాలరాముడిని వీక్షించే భాగ్యం భక్తులకు దక్కనుంది. అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరం సర్వాంగసుందరంగా సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో బాలరాముడు భక్తజనానికి దర్శనం ఇవ్వనున్నాడు. రేపు సోమవారం బాలరామచంద్రుడి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఇతర రాజకీయ ప్రముఖులు, పీఠాధిపతులు, మఠాధిపతులు, ఆధ్యాత్మిక, ఇతర రంగాల ప్రముఖులు, ప్రపంచం నలు మూలల నుంచి తరలివస్తున్న భక్త జనం సాక్షిగా ఆగమ శాస్త్ర పద్ధతుల్లో ప్రతిష్ఠించనున్నారు. రూ.1300 కోట్లతో మూడో అతిపెద్ద హిందూ దేవాలయంగా రూపుదిద్దుకుంటున్న భారీ ప్రాజెక్టు కావటంతో ఆలయాన్ని మూడు విడతల్లో పూర్తి చేయనున్నారు. ప్రస్తుతం దిగువ అంతస్తు మాత్రమే అందుబాటులోకి రానుంది. ఇప్పటికే సిద్ధం చేసిన బాల రాముడి విగ్రహానికి రేపు ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. బాలరాముడిని ప్రతిష్ఠించే గర్భాలయం; 1947 నుంచి పూజలందుకుంటున్న విగ్రహం; ప్రాణప్రతిష్ఠ జరగనున్న బాలరాముడి విగ్రహం మొదటి అంతస్తులో రామదర్బార్ రావణవధ అనంతరం తిరిగి వచ్చిన సీతారాములకు అయోధ్యలో అంగరంగవైభవంగా పట్టాభిషేకం జరిగింది. ఆ తర్వాత సోదర, ఆంజనేయ సమేతంగా అద్భుత పాలనతో సుభిక్ష రామరాజ్యం విలసిల్లిందన్నది పురాణగాధ. బాలరాముడితో దర్శనం సమాప్తమైతే.. సీతారాములను కనులారా వీక్షించాలని ఉబలాటపడే భక్తుల్లో కొంత అసంతృప్తి ఉంటుందనే ఉద్దేశంతో మొదటి అంతస్తులో ‘రామదర్బార్’ రూపంలో అద్భుత దర్శనభాగ్యం కలిగించే ఏర్పాటు చేస్తున్నారు. శ్రీ సీతారామచంద్రులు లక్ష్మణ, భరత, శత్రఘ్న, ఆంజనేయ విగ్రహాలు సమేతంగా భక్తులకు మొదటి అంతస్తులో దర్శనమివ్వనున్నాయి. రామదర్బార్ విగ్రహాలను రాజస్థాన్ తెల్లరాతితో సిద్ధం చేయనున్నారు. వచ్చే సంవత్సరం ఆ విగ్రహాలు దర్శనమివ్వనున్నాయి. ఆ దివ్య మందిరంపై నిర్మించే రెండో అంతస్తులో ఎలాంటి దర్శన ఏర్పాట్లు చేయాలన్న విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. వచ్చే సంవత్సరం డిసెంబరు నాటికి మొదటి రెండు అంతస్తులను పూర్తి చేసి రామ దర్బార్ దర్శనం కలిగించనున్నారు. బాలరాముడి రూపునకు మూడు విగ్రహాల పరిశీలన బాలరాముడి రూపు కోసం మూడు విగ్రహాలను పరిశీలించారు. రాజస్థాన్ , కర్నాటక ప్రాంతాలకు చెందిన శిల్పులు ఆరు నెలల క్రితమే వీటిని సిద్ధం చేసి పెట్టారు. విగ్రహాల తయారీకి కర్నాటక నుంచి మూడు కృష్ణ శిలలు, ఓంకారేశ్వర్పూజ్య అవధూత నర్మదానంద్జీ మహరాజ్ ప్రత్యేకంగా రాజస్థాన్ నుంచి పంపిన తెల్లరాయిని శిల్పులకు అప్పగించారు. ఇందులో నల్లరాయిని బాలరాముడి విగ్రహానికి కేటాయించారు. తయారైన మూడు బాల రాముడి విగ్రహాల్లో మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజ్ శిల్పి రూపొందించిన విగ్రహాన్ని ఇటీవల ట్రస్టు సభ్యులు ఓటింగ్ పద్ధతిలో ఎంపిక చేశారు. ఈ విగ్రహానికే రేపు ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. మూల విరాట్‌గా కొత్త విగ్రహం... ఉత్సవమూర్తిగా పాత విగ్రహం దిగువ అంతస్తులో బాలరాముడు, మొదటి అంతస్తులో పట్టాభి రాముడు దర్శనం ఇవ్వడం ఒక విశేషమైతే, దిగువ అంతస్తులోనే బాలరాముడితో పాటు పురాతన విగ్రహ దర్శనభాగ్యం కూడా భక్తులకు కల్పించనున్నారు. రామజన్మభూమిలో 1947లో రాముడి విగ్రహం ఒకటి వెలుగు చూసింది. దాన్ని గుర్తించిన వెంటనే సమీపంలోనే ఉంచి పూజలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆలయ ప్రాంగణంలోని తాత్కాలిక మందిరంలో ఆ విగ్రహమే పూజలందుకుంటోంది. కొత్త ఆలయంలో ప్రాణప్రతిష్ఠకు కొత్త విగ్రహాన్ని రూపొందించిన తరుణంలో, పాత విగ్రహాన్ని ఏం చేస్తారన్న ప్రశ్నలు ఉద్భవించాయి. ఇటీవలే ట్రస్టు ఆ సందేహాలను నివృత్తి చేసింది. దిగువ అంతస్తులో బాలరాముడి విగ్రహం ముందే ఆ పాత విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించనున్నారు. 30 అడుగుల దూరం నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. పాత విగ్రహం చిన్నదిగా ఉన్నందున సరిగ్గా కనిపించదు. అందుకోసమే కొత్త విగ్రహాన్ని రూపొందించారు. ఇన్ని దశాబ్దాలుగా పూజలందుకుంటున్న పాత విగ్రహాన్ని కూడా గర్భాలయంలోనే ప్రతిష్ఠించాలని నిర్ణయించారు. కొత్త విగ్రహాన్ని మూల విరాట్గానూ, పాత విగ్రహాన్ని ఉత్సవమూర్తిగా మారుస్తున్నారు. ప్రత్యేక పూజాదికాల కోసం ఉత్సవ విగ్రహం వివిధ ప్రాంతాలకు తరలుతుందని, మూల విరాట్ గర్భాలయంలోనే స్థిరంగా ఉంటుందని ట్రస్టు స్పష్టం చేసింది. అయోధ్యలో సరయూ నదికి హారతి లేజర్ షో జటాయువు కంచు విగ్రహం కూడా... 15 అడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవుతో జటాయువు కంచు విగ్రహాన్ని కూడా రూపొందిస్తున్నారు. అక్కడి కుబేర్టీలాపై ప్రతిష్ఠించే ఈ విగ్రహం మూలమూర్తి వైపు ధ్యానముద్రలో చూస్తూ వినమ్రంగా ఉండేలా దీనిని ప్రఖ్యాత శిల్పి, పద్మభూషణ్రామ్ సుతార్ సిద్ధం చేస్తున్నారు. దక్షిణ భారతశైలిలో గాలిగోపురం దక్షిణాది దేవాలయాల మాదిరిగా ద్రవిడ శైలిలో ఉండే రాజగోపురాలు ప్రధానాకర్షణగా నిలవనున్నాయి. అయోధ్య రామజన్మభూమి ప్రధాన ఆలయాన్ని ఉత్తర భారతీయ నాగర శైలిలో నిర్మిస్తున్నారు. అయితే నాగరశైలిలో గాలి గోపురాలకు చోటు లేదు. కానీ రామజన్మభూమి ఆలయ ప్రవేశం వద్ద మాత్రం భారీ గాలిగోపురం నిర్మించాలని నిర్ణయించారు. ఈ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. రాముడు పుట్టిన చోటనే గర్భగుడి కట్టాలని అదనంగా స్థల సేకరణ సుప్రీంకోర్టు తీర్పుతో 72 ఎకరాలు రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అధీనంలోకి వచ్చాయి. అయితే రాముడు జన్మించినట్టుగా చెబుతున్న భాగంలోనే గర్భాలయం నిర్మించాలన్నది ప్రణాళిక. కానీ రాముడు పుట్టినట్టుగా పేర్కొంటున్న ఆ భూమి ఆగ్నేయ మూలలో ఉంది. అది గర్భాలయ నిర్మాణానికి అనుకూలంగా లేదు. దీంతో దాని వెనుకవైపు కొంత భూమిని ప్రైవేట్వ్యక్తుల నుంచి ట్రస్టు కొనుగోలు చేసి ఆ ప్రాంగణాన్ని ప్రస్తుతం నిర్మిస్తున్న ఆలయ నమూనాకు వీలుగా సిద్ధం చేసింది. ఏఏఏ ఆలయ పునాదుల్లో నాలుగున్నర లక్షల ఇటుకలు రామ మందిర నిర్మాణంతో తమ చేయూత ఉండాలన్న సంకల్పంతో దేశంలోని పలు గ్రామాల నుంచి ప్రజలు ఇటుకలు పంపారు. అలా నాలుగు లక్షల గ్రామాల నుంచి నాలుగున్నర లక్షల ఇటుకలు అయోధ్యకు చేరాయి. అయితే ఆలయాన్ని పూర్తి రాతి కట్టడంగా నిర్మిస్తున్నందున ఇటుకల వాడకం సాధ్యం కాదు. అలా అని మరోచోట ఈ ఇటుకలను వినియోగిస్తే.. భక్తులు అసంతృప్తికి లోనయ్యే అవకాశముంది. దీంతో వాటికి ప్రత్యేకస్థానం దక్కాల్సిందేని భావించిన ట్రస్టు, వాటిని ఆలయ పునాదుల్లో వినియోగించింది. ఇప్పుడు నాలుగున్నర లక్షల ఇటుకలు పునాది భాగంలో శాశ్వతంగా నిలిచిపోయాయి. దిగువ అంతస్తులో బాలరాముడు ఆలయం మూడు అంతస్తులుగా ఉంటుంది. ప్రతి అంతస్తు 20 అడుగుల ఎత్తుతో ఉంటుంది. భూ ఉపరితలం నుంచి 20 అడుగుల ఎత్తుతో ప్రదక్షిణ పథ (పరిక్రమ్) నిర్మించారు. దాని మీద ప్రధాన ఆలయం దిగువ అంతస్తు ఉంటుంది. ఈ దిగువ అంతస్తులోనే బాల రాముడి విగ్రహం ఉంటుంది. రాముడు పుట్టినట్టుగా భావిస్తున్న చోటనే ఈ ఆలయం నిర్మిస్తున్నందున అక్కడే బాలరాముడు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ట్రస్టు నిర్ణయించింది. ఐదేళ్ల వయసులో ఉన్న రాముడి రూపం 51 అంగుళాల విగ్రహంగా భక్తజనానికి దర్శనమివ్వనుంది. ఎన్నో ప్రత్యేకతలు రాముడి సుగుణాలు అనేకం..ప్రతిఒక్కోటి విలక్షణమే. అలాంటి రాముడు పుట్టిన చోట నిర్మిస్తున్న మందిర నిర్మాణంలోనూ ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. అందుకే ఈ ఆలయాన్ని నభూతో న భవిష్యతిగా వర్ణిస్తున్నారు. ఆధునిక భారతావనిలో రాతితో నిర్మించిన అతి పెద్ద దేవాలయం కూడా ఇదే. సిమెంటు, స్టీలు, ఇతర అనుసంధాన రసాయనాలు లేకుండా పూర్తిగా రాతితోనే దీనిని నిర్మిస్తున్నారు. ఆలయం, పరిసరాలన్నీ కలుపుకొని 90 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇందులో సుప్రీంకోర్టు ఆదేశం మేరకు రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు సంక్రమించినది 72 ఎకరాలు. మిగతా భూమిని ప్రైవేట్సంస్థలు, వ్యక్తుల నుంచి ట్రస్టు కొనుగోలు చేసింది. ఇందులో 2.7 ఎకరాల్లో 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రధాన దేవాలయం రూపుదిద్దుకుంటోంది. 2025 నాటికి మొత్తం ఆలయం సిద్ధం ప్రస్తుతానికి గర్భాలయంగా ఉండే ప్రధాన ఆలయ నిర్మాణమే జరుగుతోంది. మూడంతస్తులుగా ఉండే ఈ ఆలయంతోపాటు ఆ ప్రాంగణంలో పర్కోట (ప్రాకారం) ఆవల మరో ఎనిమిది మందిరాలు కూడా ఉంటాయి. శ్రీరాముడి జీవితంతో అనుబంధం ఉన్న భిన్నవర్గాలకు చెందిన వారి ఆలయాలు నిర్మిస్తారు. వాల్మీకి, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, శబరి, అహల్య, గుహుడు..లాంటి వారితో కూడిన ఎనిమిది గుళ్లుంటాయి. మర్యాద పురుషోత్తముడి సామాజిక దృష్టి కోణానికి నిదర్శనంగా ఇప్పటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఈ ఆలోచన జరిగిందన్నది ట్రస్టు మాట. అయితే ప్రధాన ఆలయ ప్రాంగణాన్ని 2025 డిసెంబరు నాటికి పూర్తి చేయాలని ట్రస్టు లక్ష్యంగా పెట్టుకుంది. ఆరంభమైన వేడుకలు బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు ఈనెల 16 నుంచే మొదలయ్యాయి. హోమాలు, జపాలు, ఇతర ప్రధాన క్రతువులతోపాటు బాలరాముడి విగ్రహానికి శోభాయాత్ర నిర్వహిస్తారు. తెల్లవారుజామునే సరయూ నదిలో విగ్రహానికి స్నానం నిర్వహించి నేత్రపర్వంగా శోభాయాత్ర ద్వారా పట్టణానికి తరలిస్తారు. అక్కడ అతి పురాతన ఆలయాల సందర్శన తర్వాత గర్భాలయంలో ప్రాణప్రతిష్ఠకు తరలిస్తారు. అప్పటి వరకు విగ్రహ నేత్రాలను కప్పి ఉంచుతారు. బాలరాముడు అప్పట్లో అయోధ్యలో స్నానపానాదులు చేస్తూ సంచరించిన తరహాలో ఈ వేడుక నిర్వహించనున్నారు. వాస్తుశిల్పి ‘సోమ్‌పురా’ సారథ్యంలో నిర్మాణ పనులు దేవాలయ ఆర్కిటెక్ట్‌గా ప్రఖ్యాత ‘సోమ్‌పురా’ కుటుంబమే వ్యవహరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆ కుటుంబం వందకుపైగా ఆలయాలను రూపొందించింది. ప్రఖ్యాత సోమ్‌నాథ్ ఆలయానికి కూడా వాస్తుశిల్పిగా పనిచేసిన ఆ కుటుంబం 15 తరాలుగా ఇదే పనిలో ఉంది. అయోధ్య రామాలయం కోసం చంద్రకాంత్ సోమ్‌పురా చీఫ్ ఆర్కిటెక్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈయన విఖ్యాత అక్షర్‌ధామ్‌ను రూపొందించారు. ఆయన ఇద్దరు కుమారులు నిఖిల్ సోమ్‌పురా, ఆశిష్ సోమ్పురాలు ఆర్కిటెక్ట్‌లుగా వ్యవహరిస్తున్నారు. ► ప్రధాన ఆలయం 235 అడుగుల వెడల్పు, 350 అడుగుల పొడవు, 161 అడుగుల ఎత్తులో ఉంటుంది. దీనిని ప్రపంచంలో మూడో అతిపెద్ద హిందూ దేవాలయంగా చెప్పవచ్చు. ► ఆలయ నిర్మాణం ఆగమశాస్త్రం నాగర విధాన గుర్జర చాళుక్య శైలిలో రూపుదిద్దుకుంటోంది. ప్రధాన ఆలయం మూడు అంతస్తుల్లో ఉంటుంది. ప్రతి అంతస్తు 20 అడుగుల ఎత్తుతో ఉంటుంది. ఒక్కో అంతస్తులో నృత్య, రంగ, కుడు, కీర్తన, ప్రార్థన పేర్లతో ఐదు మండపాలుంటాయి. ► ప్రధాన ఆలయంలో 366 స్తంభాలుంటాయి. ఒక్కో దానిపై 30 వరకు శిల్పాలు, ఇతర నగిషీలు ఉంటాయి. ► స్తంభాలపై శివుడు, వినాయకుడు, దశావతారాలు, యోగినులు, సరస్వతి ఇతర దేవతా రూపాలను చిత్రీకరించారు. ► గర్భాలయం అష్టభుజి ఆకృతిలో ఉంటుంది. ► దేవాలయాన్ని లేత గులాబీరంగు ఇసుక రాయితో నిర్మించారు. ఇందుకు రాజస్థాన్ లోని భరత్పూర్ జిల్లా బన్సీపహాడ్‌పూర్ క్వారీ నుంచి 5 లక్షల ఘనపుటడుగుల లేత గులాబీ రంగు రాయి, గర్భాలయం కోసం ఇదే రాష్ట్రంలోని మక్రానా నుంచి లక్ష ఘనపుటడుగుల తెలుపురంగు చలవరాతిని తెప్పించారు. ► రామ జన్మభూమికి సంబంధించి 2019 నవంబరులో సుప్రీం కోర్టు తీర్పు రాగా, 2020 ఫిబ్రవరిలో దేవాలయ కమిటీ ఏర్పాటైంది. ఆలయానికి ప్రధాని మోదీ 2020 ఆగస్టు 5న భూమి పూజ చేశారు. ► ఆలయ పనులు మూడు షిఫ్టుల్లో రేయింబవళ్లు కొనసాగిస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 3500 మంది ఈ పనుల్లో నిమగ్నమయ్యారు. ► ఎల్ అండ్ టీ నిర్మాణ సంస్థ కాగా, పనుల పర్యవేక్షణ బాధ్యత టాటా కన్సల్టింగ్ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ చూస్తోంది. ► శిల్పాలను తీర్చిదిద్దేందుకు ఒడిషా నుంచి ఎక్కువమంది శిల్పులు వచ్చారు. సిమెంట్ లాంటి బైండింగ్ మెటీరియల్ వినియోగిస్తున్నారు. ఇందులో రాళ్లు జోడించటం అనేది క్లిష్టమైన ప్రక్రియ, ఈ ప్రక్రియలో విశేష అనుభవం ఉన్న రాజస్థాన్ నిపుణులకు ఆ బాధ్యత అప్పగించారు. కాపర్ క్లిప్స్ మాత్రమే వాడి రాళ్లను అనుసంధానిస్తున్నారు. ► ఒడిషా, రాజస్థాన్, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ తదితర రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది సిబ్బంది పనుల్లో పాల్గొంటున్నారు. ఈ మందిరం భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయానికి ప్రతీక ‘‘రాముడు జన్మించిన చోటే ఆయన దేవాలయం నిర్మితమవుతుందన్న విశ్వాసం పదేళ్ల క్రితం వరకు లేదు. కానీ అది సాధ్యమై ఇప్పుడు ఆ ఆదర్శ పురుషుడి దివ్య దర్శనానికి నోచుకోబోతున్నాం. అందుకే రామజన్మభూమి మందిరం నిర్మించాలన్న ఆకాంక్ష దైవ సంకల్పమని నేను నమ్ముతాను. అయోధ్యలో నిర్మిస్తున్న భవ్య మందిరం ఓ సాధారణ దేవాలయం కాదు, అది భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయానికి ప్రతీక. అందరూ ఆ అద్భుతాన్ని దర్శించుకోవాలి. దేవుడి ముందు అంతా సమానులే, అందరిపట్లా ఆ రాముడిది సమభావనే. అందుకే ఈ నిర్మాణం సామాజిక సామరస్యాన్ని ప్రతిబింబిస్తుంది. దేశ నలుమూలల ఆలయ నిర్మాణ సంప్రదాయాలను ప్రతిఫలిస్తుంది. దేశంలోని ప్రతి గ్రామ చొరవ అందులో కనిపిస్తుంది. దాదాపు రూ.2 వేల కోట్లతో నిర్మిస్తున్న ఈ ఆలయ ఖర్చులో ప్రభుత్వాలది నయా పైసా లేదు. అంతా భక్తుల విరాళమే. అందుకే మన దేవుడు, మన మందిరం.’’ – నృపేంద్ర మిశ్రా, శ్రీ రామజన్మభూమి దేవాలయ నిర్మాణ కమిటీ చైర్మన్ . ప్రధానమంత్రి కార్యాలయ మాజీ ముఖ్య కార్యదర్శి ఆ తలుపుల తయారీలో తెలుగువారు... ప్రధాన ఆలయానికి తలుపులు అమర్చే అవకాశం హైదరాబాద్‌కు చెందిన అనురాధా టింబర్ డిపోకు దక్కింది. డిపో నిర్వాహకుడు శరత్ బాబు చదలవాడ గతంలో యాదాద్రి మందిరానికి తలుపు చేయించారు. అయోధ్య రామ మందిరానికి తలుపుల నమూనా కావాలంటూ ట్రస్టు సభ్యుల నుంచి పిలుపు రావటంతో ఆయన టేకుతో దాన్ని సిద్ధం చేయించారు. ఆ పనితనానికి సంతృప్తి చెందిన కమిటీ ఆయనతో చర్చించి తలుపులు సిద్ధం చేసే బాధ్యత అప్పగించింది. మహారాష్ట్రలోని బల్లార్షా నుంచి తెప్పించిన మేలిమి రకం టేకు చెక్కతో తలుపులు రూపొందిస్తున్నారు. శరత్ బాబు చదలవాడ అయోధ్యలోని కరసేవక్ పురంలోని కార్యశాలలో ఈ తలుపులను నిపుణులు సిద్ధం చేస్తున్నారు. అక్కడి ఇన్ చార్జ్ ఆర్యన్ మిశ్రా ఆధ్వర్యంలో తమిళనాడుకు చెందిన నిపుణులు వాటిని రూపొందిస్తున్నారు. మొత్తం 44 తలుపులకుగాను ప్రస్తుతానికి 18 సిద్ధమయ్యాయి. వీటిని దిగువ అంతస్తులో వినియోగిస్తారు. బాలరాముడు ఉండే గర్భాలయానికి సంబంధించి రెండు జతలు పూర్తి చేసి ఆలయానికి చేర్చారు. 9 అడుగుల ఎత్తు, 12 అడుగుల వెడల్పుతో ఇవి రూపొందాయి. నెమలి పురి విప్పుకున్నట్టు వీటిపై నగిషీలద్దారు. ఇక అంతస్తులోని ఇతర ప్రాంతాల్లో వాడే తలుపులకు ఏనుగు అర్చిస్తున్నట్టుగా.. పద్మాలు విచ్చుకున్నట్టుగా... ఇలా పలు చెక్కడాలతో అద్భుతంగా రూపొందించారు. వెయ్యేళ్లపాటు వర్థిల్లే దేవాలయానికి తలుపులు సిద్ధం చేసే అవకాశం రావటాన్ని అదృష్టంగా భావిస్తున్నట్టు చదలవాడ శరత్‌బాబు ‘సాక్షి’తో చెప్పారు. అన్నీ ఉచితమే... అందరూ సమానమే! రామ మందిరం దేశంలోనే ప్రముఖ దేవాలయాల జాబితాలో చేరబోతోంది. ఇలాంటి చోట దర్శనం, ప్రసాదాలకు రుసుము ఉండటం సహజం. కానీ, భక్తులు సమర్పించిన రూ.వేల కోట్ల విరాళాలతో రూపుదిద్దుకుంటున్న ఈ భవ్య మందిరంలో భక్తులపై దర్శన వేళ అదనంగా రుసుము భారం మోపొద్దని ట్రస్టు నిర్ణయించింది. ఎంతమంది భక్తులు వచ్చినా ఎలాంటి రుసుమూ లేకుండా దర్శనానికి అవకాశం కల్పించబోతున్నారు. పేద, ధనిక తారతమ్యం లేకుండా అందరికీ ఒకే తరహాలో దర్శన ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామివారి దర్శన అనంతరం ఎంతో భక్తిశ్రద్ధలతో స్వీకరించే ప్రసాదం కూడా ఉచితంగా అందించాలని నిర్ణయించారు. 60 కిలోల బంగారంతో తాపడం ఆలయంలోని తలుపులకు బంగారంతో తాపడం చేయించనున్నారు. అన్ని తలుపులకు కలిపి 60 కిలోల బంగారాన్ని వినియోగిస్తున్నట్టు సమాచారం. దిగువ అంతస్తు బాలరాముడి ఆలయ తలుపులకు తాపడం పనులు ప్రారంభించారు. అనంతరం తాపడం కోసం సిద్ధం చేశారు. తలుపులపై ఉన్న నగిషీల తరహాలోనే బంగారు తాపడంపై కూడా సిద్ధం చేస్తున్నారు. భారీ భూకంపాలను తట్టుకునేలా... రామమందిర ప్రత్యేకతల్లో పునాది కూడా ఒకటి. 161 అడుగుల ఎత్తుతో నిర్మితమవుతున్న దివ్యభవ్య మందిరానికి 50 అడుగుల లోతుతో పునాది నిర్మించారు. అయోధ్య పట్టణ శివారు నుంచి సరయూ నది ప్రవహిస్తోంది. అయితే 400 ఏళ్ల క్రితం సరయూ ప్రస్తుతం ఆలయం నిర్మిస్తున్న ప్రాంతానికి అతి చేరువగా ప్రవహించేది. దీంతో ఆ ప్రాంత భూగర్భం ఇసుక మేటలతో నిండి ఉంది. భారీ నిర్మాణానికి పునాది పడాలంటే ఆ ఇసుకనంతా తొలగించాలి. ఇందుకోసం ఐఐటీ, ఎన్ ఐటీ నిపుణులు, రిమోట్ సెన్సింగ్ సెంటర్ పరిశోధకులు కలిసి దీనికి ప్రత్యేక పునాది నిర్మాణానికి డిజైన్ చేశారు. 50 అడుగుల లోతు నుంచి ఇసుక, మట్టిని తొలగించి వాటికి రీయింజనీర్ ఇసుక, కొన్ని రసాయనాలు, 10 శాతం ఫైన్ సిమెంట్ కలిపి పొరలు పారలుగా వేసి వాటిని కాంపాక్ట్‌గా మార్చి 47 పొరలుగా పైవరకు నిర్మించారు. ఆ ఇసుక, మట్టి భాగం పూర్తిగా గట్టిబడి 50 అడుగుల ఏకశిలగా మారింది. దాని మీద రెండున్నర మీటర్ల మందంతో రాఫ్ట్ నిర్మించారు. ఆ పైన ఒకటిన్నర మీటరు మందంతో గ్రానైట్ రాతిని పరిచి దాని మీద ప్రధాన నిర్మాణం జరిపారు. ఇప్పుడు భూ ఉపరితలం నుంచి ప్రధాన నిర్మాణం 20 అడుగుల ఎత్తులో మొదలవుతుంది. అక్కడకు చేరాలంటే 32 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. పునాది డిజైన్ మార్చింది తెలుగు ఇంజినీరింగ్ నిపుణుడే..! అయోధ్య మందిరానికి ప్రస్తుతం ఏర్పాటు చేసిన పునాదికి డిజైన్ చేసింది తెలంగాణకు చెందిన ఇంజినీరింగ్ నిపుణుడే కావటం విశేషం. తొలుత ఐఐటీ మద్రాస్ నిపుణులు పునాది కోసం సిమెంటు కాంక్రీట్ పైల్స్ డిజైన్ ఇచ్చారు. ఆలయ ట్రస్టు దానికి సమ్మతించి పనులకు శ్రీకారం చుట్టింది. ఒక్కోటి మీటర్ వ్యాసం, 40 మీటర్ల లోతుతో సిమెంట్కాంక్రీట్పైల్స్ను పునాదిలో నిర్మించాలని నిర్ణయించారు. ఇలా 1200 పైల్స్ ఏర్పాటు చేసి దాని మీద ప్రధాన నిర్మాణం చేపట్టాలన్నది వారి ఆలోచన. కానీ, సిమెంటు కాంక్రీట్పైల్స్ వయసు కేవలం వందేళ్లలోపు మాత్రమే ఉంటుందని పేర్కొంటూ, వరంగల్ నిట్ మాజీ ప్రొఫెసర్ పాండురంగారావు ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ రాశారు. దాని బదులు కాకతీయులు అనుసరించిన శాండ్బాక్స్ టెక్నాలజీని వినియోగిస్తే వెయ్యేళ్ల జీవిత కాలం ఉంటుందని రామప్ప, వేయి స్తంభాల దేవాలయాలపై నిర్వహించిన పరిశోధన పత్రాలను జత చేశారు. దీంతో ఆయనకు ట్రస్టు నుంచి పిలుపు వచ్చింది. విశ్వహిందూ పరిషత్ సంయుక్త ప్రధాన కార్యదర్శి కోటేశ్వర శర్మ ఆధ్వర్యంలో పాండురంగారావు తెలంగాణ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ప్రతినిధులతో పునాది నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించి పరిశీలించారు. అనంతరం ఐఐటీ ఢిల్లీ మాజీ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఒక నిపుణుల కమిటీని నియమించారు. నిర్మాణ ప్రాంతం గుండా వందల ఏళ్ల కింద సరయూ నది ప్రవహించటంతో భూమి పొరల్లో ఇసుక మేటలు ఉన్నట్టు గుర్తించారు. దీంతో ఆ కమిటీ కూడా నాటి పునాది డిజైన్ ను తిరస్కరించింది. తర్వాత 50 అడుగుల మేర మట్టిని తొలగించి రీయింజనీర్డ్ ఇసుక, దానికి కొన్ని రసాయనాలు, స్వల్ప మొత్తంలో ఫైన్ సిమెంట్ కలిపి పొరలు పొరలుగా వేసి కంప్రెస్ చేయాలంటూ సిఫారసు చేసింది. అలా చేస్తేనే పునాది కనీసం వెయ్యేళ్లపాటు ఉంటుందని పేర్కొంది. పాండురంగారావు సూచన మేరకే కొత్త పునాది ప్రణాళిక అమలు చేసి, వెయ్యేళ్లపాటు నిలిచే రీతిలో ఆలయ నిర్మాణాన్ని చేపట్టడం విశేషం. మందిర పునాది ప్రాంతాన్ని పరిశీలిస్తున్న నిట్ మాజీ ప్రొఫెసర్ పాండురంగారావు వేయేళ్లు ఉండేలా... అయోధ్య రామాలయం వేయి సంవత్సరాల వరకు పటిష్ఠంగా ఉండేలా నిర్మిస్తున్నారు. ఇది జరగాలంటే పెద్దపెద్ద భూకంపాలను కూడా తట్టుకుని నిలబడే నిర్మాణం అవసరం. ఇందుకోసం రూర్కీలోని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నిపుణులు నిర్మాణ డిజైన్ లో పాలుపంచుకున్నారు. నేపాల్నుంచి అయోధ్య వరకు గతంలో సంభవించిన భూకంపాల తీవ్రతను పరిశీలించి వాటికి 50 రెట్లు పెద్ద భూకంపాలను కూడా తట్టుకునేలా డిజైన్ చేశారు. వరదలను తట్టుకునేలా... అయోధ్య నగరం మీదుగా సరయూ నది ప్రవాహం గతంలో ఉండేది. ఇప్పుడు నగర శివారు గుండా ప్రవహిస్తోంది. ప్రతి వేయి సంవత్సరాల్లో నదీ ప్రవాహ గమనం మారడం సహజం. భవిష్యత్‌లో ఎప్పుడైనా ఇప్పుడు గుడి నిర్మిస్తున్న ప్రాంతం మీదుగా వరద పోటెత్తినా, పెద్దపెద్ద వరదలు సంభవించినా నిర్మాణానికి ఇబ్బంది లేకుండా ఉండేలా దాని పునాది పైన పీఠం ప్లాన్ చేశారు. ఇందుకు సీఎస్ఐఆర్ శాస్త్రవేత్తల సిఫారసులను అనుసరించారు. 25 వేల మంది సామర్థ్యంతో త్వరలో బస ఏర్పాట్లు... ఆలయానికి చేరువలో భక్తులకు వసతి మందిరం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతానికి దీంట్లో 25 వేల మంది వరకూ ఉండొచ్చు. ఈ గదులను ఉచితంగా అందిస్తే ఎలా ఉంటుందన్న అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటారు. లక్షమంది భక్తులకు వసతి ఉండేలా గదులు సిద్ధం చేయాలన్న ఆలోచనలో ట్రస్టు ఉంది. అయితే సొంతంగా ఏర్పాటు చేయాలా, ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలా అన్న దానిపై ఆలోచన చేస్తున్నారు. ప్రతి శ్రీరామనవమీ ప్రత్యేకమే! ► నవమి నాడు బాలరాముడి నుదుటిపై సూర్య కిరణాలు ► ప్రధాని మోదీ కోరికకు తగ్గట్టుగా నిర్మాణం అయోధ్య రామమందిరంలో ప్రతి శ్రీరామనవమి ప్రత్యేకంగా నిలవబోతోంది. ఆ రోజు సూర్యోదయ వేళ ఆలయ దిగువ అంతస్తు గర్భాలయంలోని బాల రాముడి విగ్రహ నుదుటిపై సూర్యకిరణాలు ప్రసరించనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ ఆకాంక్షను ట్రస్టు ముందర ఉంచారు. ఆ మేరకు నిర్మాణం జరుగుతోంది. కిరణాలు దిగువ అంతస్తులోని గర్భాలయంలోకి ప్రసరించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా గర్భాలయం ద్వారం ఎత్తు, విగ్రహ ఎత్తును ఖరారు చేశారు. చాలా విశాలమైన దేవాలయం కావటంతో సహజసిద్ధంగా సూర్యకిరణాలు లోనికి వచ్చే వీలు ఉండదేమోనన్న ఉద్దేశంతో ప్రతిబింబం రూపంలో సూర్యకాంతి లోపలకు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అప్పట్లో రోజుకు 2 వేల మంది.. ఇప్పుడు 50 వేల మంది.. రేపు లక్ష? అయోధ్య రామమందిర నిర్మాణం పూర్తి కాకముందే భక్తుల తాకిడి పెరిగింది. ఇక్కడ ఆలయ నిర్మాణం ప్రారంభం కాకమునుపు రోజుకు సగటున 1500 నుంచి 2000 మంది వరకు వచ్చేవారు. ఆలయ పనులు మొదలయ్యాక ఆ సంఖ్య ఒక్కసారిగా పది వేలకు పెరిగింది. ఇప్పుడు నిత్యం 40 వేల నుంచి 50 వేల మంది భక్తులు అయోధ్యకు వస్తున్నారు. జనవరి 22 ప్రాణ ప్రతిష్ఠ తర్వాత ఆ సంఖ్య లక్షకు చేరువవుతుందని అంచనా వేస్తున్నారు. అయోధ్య రాముడి విరాళాలు రూ.3500 కోట్ల పైమాటే... ఆలయ నిర్మాణానికి అటు కేంద్రం నుంచి ఇటు రాష్ట్రపభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోవటం లేదని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఇప్పటికే ప్రకటించింది. పూర్తిగా భక్తులు సమర్పించిన విరాళాలతోనే పనులు చేస్తున్నట్టు వెల్లడించింది. ఇప్పటి వరకు ఆలయానికి ప్రపంచవ్యాప్తంగా రామభక్తుల నుంచి రూ.3500 కోట్లకు పైగానే విరాళాలు అందినట్టు సమాచారం. వాటి ద్వారా వస్తున్న వడ్డీ మొత్తంతోనే ప్రస్తుతం పనులు జరుగుతున్నాయని చెబుతున్నారు. భక్తులు ఇప్పటికీ విరాళాలు సమర్పిస్తూనే ఉన్నారు. అయోధ్య ఆలయ సమీపంలో ఉన్న కౌంటర్లు, తాత్కాలిక మందిరం వద్ద ఉన్న కౌంటర్లతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఆన్ లైన్ ద్వారా భక్తులు విరాళాలు సమర్పిస్తూనే ఉన్నారు. ప్రతినెలా రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు అవి సమకూరుతున్నట్టు సమాచారం. (అయోధ్య నుంచి ‘సాక్షి’ ప్రతినిధి గౌరీభట్ల నరసింహమూర్తి) ఫొటోలు: నోముల రాజేష్‌రెడ్డి -
బిర్సా ముండా ఎవరు? ప్రధాని మోదీ ఆయన జన్మస్థలికి ఎందుకు వెళుతున్నారు?
నేడు అమర వీరుడు బిర్సా ముండా జయంతి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు (బుధవారం) జార్ఖండ్‌లోని బిర్సా ముండా జన్మస్థలమైన ఉలిహతుకు వెళ్తున్నారు. జార్ఖండ్‌లోని ఖుంటి జిల్లాలో గల ఉలిహతును దేశ ప్రధాని సందర్శించడం ఇదే మొదటిసారి. ఉలిహతులో బిర్సా ముండాకు నివాళులర్పించి, ఆయన కుటుంబ సభ్యులను ప్రధాని మోదీ కలుసుకోనున్నారు. ఈ సందర్భంగా రూ. 24 వేల కోట్ల విలువైన ట్రైబల్ మిషన్‌ను ప్రధాని ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ నేడు ముందుగా రాంచీలోని లార్డ్ బిర్సా ముండా మెమోరియల్ పార్క్, ఫ్రీడమ్ ఫైటర్స్ మ్యూజియాన్ని సందర్శించనున్నారు. అనంతరం బిర్సా ముండా జన్మస్థలమైన ఉలిహతు గ్రామానికి చేరుకుని, అక్కడ బిర్సా ముండా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. బిర్సా ముండా గిరిజనుల పాలిట హీరోగా నిలిచారు. గిరిజనులు అతనిని దేవుడిలా భావిస్తారు. బిర్సా ముండా 1875 నవంబర్ 15న జార్ఖండ్‌లోని ఉలిహతులో జన్మించారు. గిరిజన మత సహస్రాబ్ది ఉద్యమానికి నాయకత్వం వహించారు. అలాగే గిరిజన సమాజంలో ప్రబలంగా ఉన్న మూఢనమ్మకాలను తొలగించే ప్రచారాన్ని చేపట్టారు. భూస్వాముల ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా గిరిజనులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించారు. 1894లో బిర్సా ముండా ఆదాయ మాఫీ కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమాన్ని ముండా తిరుగుబాటు లేదా ఉల్గులన్ అని పిలుస్తారు. 1895లో బ్రిటీష్ వారు బిర్సా ముండాను అరెస్టు చేశారు. జైలు నుండి విడుదలైన తర్వాత బిర్సా ముండా బ్రిటిష్ ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్‌కు వ్యతిరేకంగా గిరిజన సమాజాన్ని ఏకీకృతం చేశారు. 1899, డిసెంబరు 24న బిర్సా ముండా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. ఈ నేపధ్యంలో బ్రిటీష్ వారు 1900, మార్చి 3న అతనిని అరెస్టు చేశారు. బిర్సాముండా 1900, జూన్ 9న రాంచీ జైలులో మరణించారు. ఆ సమయానికి బిర్సా ముండా వయసు కేవలం 25 సంవత్సరాలు. ఇది కూడా చదవండి: ఏడు దాటినా వీడని పొగమంచు.. దిక్కుతోచని ఢిల్లీ జనం! -
మూడు కొండలెక్కితేగానీ చేరుకోని ఆ ఆలయానికి..
హిందూ దేవుళ్లలో హనుమంతుని ఉన్న స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అంతా హనుమంతుడిని భక్తిగా కొలుస్తారు. అలాంటి హనుమంతుని జన్మస్థలంగా భావించే నాసిక్‌లో అంజనేరి కొండల వద్ద ఉన్న ఆ స్వామి గుడిని సందర్శించడాని భక్తులు ఎన్నో ప్రయాసలు పడి వెళ్లాల్సి వస్తోంది. నిటారుగా ఉన్న ఆ రహదారి వెంబడి వెళ్లాలంటే సుమారు రెండు నుంచి మూడు గంటలు పడుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ ఆలయానికి త్వరితగతిన చేరుకునేలా రోప్‌వే నిర్మించాలని నిర్ణయించింది. వచ్చే రెండేళ్లలో బ్రహ్మగిరి ట్రెక్కింగ్ పాయింట్ నుంచి అంజనేరి కొండల వరకు ఈ రోప్ వేని నిర్మించనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏ1) పర్వరత్మల పథకం కింద ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన టెండర్లను ఆహ్వానించింది. ఇక హనుమంతుని జన్మస్థలం అయిన అంజనేరి కొండలు వద్ద ఆ స్వామికి సంబంధించిన గుహ తోపాటు అంజనీమాత ఆలయం కూడా ఉంది. వీటిని యాత్రికులు, ట్రెక్కర్లు సందర్శిస్తారు. సుమారు 4 వేల అడుగులకు పైగా ఎత్తులో ఉన్న ఈ ఆలయానికి చేరుకోవాలంటే మూడు పర్వతాలు ఎక్కాలి. ఇక్కడకు 5.7 కి.మీ పొడవున్న రోప్‌వే మూడు పర్వతాల మీదుగా వస్తే పైకి వెళ్లే ప్రయాణం కొన్ని నిమిషాలకు తగ్గిపోతుంది. కాగా, 2024 నాటికి మొత్తం 18 రోప్‌వే ప్రాజెక్టులను కేంద్ర ప్లాన్ చేస్తునట్లు సమాచారం. (చదవండి: కోడి ముందా.. గుడ్డు ముందా? ఎట్టకేలకు సమాధానం ఇచ్చిన శాస్త్రవేత్తలు) -
శ్రీకృష్ణ జన్మభూమి వివాదంపై కీలక తీర్పు
సాక్షి, న్యూఢిల్లీ: శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా కేసు వివాదంలో శనివారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉత్తర ప్రదేశ్‌లోని మధురు స్థానిక కోర్టు Mathura Court కీలక తీర్పు వెలువరించింది. వివాదాస్పద స్థలంలో సర్వే చేపట్టాలని కోర్టు అమిన్‌కు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జనవరి 20వ(2023) తేదీలోగా సర్వే పూర్తి చేసి.. ఆ నివేదికను తమ ముందు ఉంచాలని ఆదేశించింది. జనవరి 2వ తేదీ తర్వాత నుంచి ఈ సర్వేను చేపట్టాలని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు సూచించింది. షాహీ ఈద్గాలో ఉన్న 13.37 ఎకరాలు తమకు అప్పగించాలని హిందూ సంఘాలు పిటిషన్ దాఖలు చేశాయి. హిందూ సేన దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. కోర్టు ఆదేశాలకు ఇరు పక్షాలు కట్టుబడి ఉండాలని స్పష్టం చేస్తూ.. నోటీసులు జారీ చేసింది. అది కృష్ణ జన్మస్థలమని, మొగలు చక్రవర్తి ఔరంగజేబ్ అక్కడున్న ఆలయాన్ని కూల్చేయించి.. ఈద్గా కట్టించాడని హిందూ సేన అధ్యక్షుడు విష్ణు గుప్తా, ఉపాధ్యక్షుడు సుర్జిత్ సింగ్ యాదవ్‌లు వాదిస్తున్నారు. అంతేకాదు 1968లో శ్రీకృష్ణ జన్మస్థాన సేవా సంఘ్‌కు, షాహీ మసీద్ ఈద్గాకు మధ్య జరిగిన ఒప్పందాన్ని సైతం వీళ్లు న్యాయస్థానంలో సవాల్ చేశారు. ఇదిలా ఉంటే.. జ్క్షానవాపి మసీద్ కేసులోనూ వారణాసి కోర్టు ఇదే తరహాలో వీడియోగ్రాఫిక్ సర్వేకు ఆదేశించిన విషయం తెలిసిందే. -
తిరుమలలో హనుమాన్ జన్మస్థల అభివృద్ధికి భూమిపూజ
-
తిరుమలలో హనుమాన్ జన్మస్థల అభివృద్ధికి భూమిపూజ
తిరుమల: ఆకాశగంగ సమీపంలోని హనుమాన్ జన్మస్థలంలో అభివృద్ధి పనులకు బుధవారం భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతిస్వామి, శ్రీతులసీ పీర్ సేవాన్యాస్, చిత్రకూటం పద్మభూషణ్ శ్రీ రామభద్రాచార్య మహరాజ్, ఆయోధ్య, రామజన్మభూమి తీర్థ ట్రస్ట్ కోశాధికారి స్వామి గోవిందదేవ్‌గిరీజీ మహారాజ్, వీహెచ్‌పీ అంతర్జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి కప్పగంతుల కోటేశ్వరశర్మ పాల్గొన్నారు. అనంతరం విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతిస్వామి మాట్లాడుతూ.. 'తిరుమల వేంకటేశ్వరస్వామి పాదాల చెంత హనుమాన్ జన్మ స్థలానికి భూమిపూజ జరిగింది. వేదాలకు పుట్టినిళ్లు ఆంధ్రప్రదేశ్. తిరుమల శ్రీవారి ఆలయం ఆంధ్రప్రదేశ్ ఆస్థి. వేంకటేశ్వరస్వామి అనుగ్రహం అనుమతి లేనిదే ఏదీ జరగదు. అన్నమయ్య, పురందరదాసు, తరిగొండ వెంగమాంబ వేంకటేశ్వరస్వామిని సాక్షాత్కరించారు. అంజనాద్రే హనుమాన్ జన్మస్థలం అనేది సామాన్యమైన విషయం కాదు. అనేకమంది వేదపండితులు, శాస్త్ర పండితులు పరిశోధించి నిర్థారించారు' అని స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి అన్నారు. చదవండి: (సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి) టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. అంజనాద్రిలో అభివృద్ధి పనులకి భూమిపూజ చెయ్యడం గొప్ప కార్యక్రమం. ఆకాశగంగ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది. కోర్టులో దీనిపై స్టే వచ్చిందని అడిగారు. ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాము. ఆలయంలో ఎలాంటి మార్పులు చెయ్యడం లేదు. భక్తులకి సౌకర్యమైన వసతులు ఏర్పాటు చేస్తాము. వివాదాల జోలికి మేము వెళ్లడం లేదు. సీఎం జగన్ హిందూ ధర్మ ప్రచారం పెద్దఎత్తున చెయ్యాలని ఆదేశించాడు. అందుకే రెండు తెలుగు రాష్ట్రాలలో 502 ఆలయాలు నిర్మిస్తున్నాము. వెనుకబడిన, బలహీన వర్గాలున్న ప్రాంతాలలో ఆలయాలు నిర్మాణం చేస్తున్నాము. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు వేంకటేశ్వరస్వామి ఆలయాలు నిర్మిస్తున్నాము. స్వామి ఆశీస్సులు, ఆజ్ఞతోనే ఈ కార్యక్రమం చేస్తున్నాము' అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. -
కృష్ణ జన్మస్థలి కేసులో కొత్తమలుపు
మథుర: శ్రీకృష్ణ జన్మస్థలిగా భావించే స్థలంలో లభించిన కొన్ని వస్తువులకు సంబంధించిన వీడియో ఆధారాలను కృష్ణ జన్మస్థలి పిటీషనర్లు కోర్టు ముందుంచారు. ఈ వస్తువులు హిందూ మతవిశ్వాసాలకు సంబంధించినవని, వీటిని తర్వాత నిర్మించిన మసీదునుంచి తొలగించడం లేదా కనిపించకుండా చేయడం జరిగిఉంటుందని వివరించారు. ప్రస్తుతం మథురలోని షాహీ మసీదు స్థలంలో కృష్ణ జన్మస్థలి ఉందని చాలా సంవత్సరాలుగా వివాదం నడుస్తోంది. ఇప్పుడున్న కట్రా కేశవ్ దేవ్ గుడి ఆవరణలోని షాహీ ఇద్గా మసీదును తొలగించాలని పిటీషనర్లు కోర్టును ఆశ్రయించారు. తమ వాదనకు ఆధారంగా తాజాగా ఒక వీడియోను కోర్టుకు సమర్పించారు. ఇందులో మసీదులో శేష నాగు చిహ్నం, తామర పువ్వు, శంఖం చూపుతున్నాయి. ఇవన్నీ తర్వాత కాలంలో మసీదు నుంచి తొలగించి ఉంటారని, లేదా కనిపించకుండా రంగులు వేసి ఉంటారని పిటీషనర్లు ఆరోపించారు. తదుపరి విచారణ ఈ నెల 15న ఉందని పిటీషనర్ల తరఫు న్యాయవాది మహేంద్ర ప్రతాప్ సింగ్ చెప్పారు. ఆ రోజు భారత పురాతత్వ సంస్థతో భౌతిక సర్వే కోసం పట్టుపడతామని చెప్పారు. -
అంజనాద్రే ఆంజనేయుని జన్మస్థలం: టీటీడీ
-
‘అబద్ధాలు చెప్పాల్సిన అవసరం టీటీడీకి లేదు’
సాక్షి, తిరుపతి: అంజనాద్రే ఆంజనేయుని జన్మస్థలమని మరోసారి టీటీడీ పునరుద్ఘాటించింది. హనుమాన్ జన్మస్థలంపై టీటీడీ శనివారం మీడియా సమావేశంలో హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రేనని పండితులు తేల్చి చెప్పారు. విమర్శకులపై టీటీడీ పండితులు మండిపడ్డారు. తమకు లభించిన ఆధారాలు, శాసనాల ప్రకారమే ప్రకటన చేశామని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. సంస్కృతం, పురాణాలు తెలియనివాళ్లకు మాట్లాడేహక్కు లేదన్నారు. ఎవరి దగ్గరైనా ఆధారాలుంటే తమతో చర్చకు రావొచ్చని ఈవో తెలిపారు. టీటీడీ ఆధ్వర్యంలో అంజనాద్రిని అద్భుతంగా తీర్చిదిద్దుతామన్నారు. అబద్ధాలను చెప్పాల్సిన అవసరం టీటీడీకి లేదని ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు. -
ఒత్తిడితో నిజం నిగ్గుతేలేనా?
ప్రపంచాన్ని కల్లోలపరచిన కోవిడ్–19 వైరస్ సార్స్–కోవి 2 పుట్టుకపై లోతైన పరిశోధనకు డిమాండ్ పెరుగుతోంది. వాస్తవాల పారదర్శక వెల్లడికి అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి అధికమౌతోంది. అమెరికా తర్వాత ఇప్పుడు బ్రిటన్, ఐరోపా సంఘం గొంతు పెంచాయి. జీ–7 సదస్సు ముంగిట తెరపైకి వస్తున్న ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. సదస్సు కూడా ఇదే డిమాండ్ చేస్తుందని ముందే బయటపడ్డ ముసాయిదా అంశాల్లో వెల్లడైంది. మరో దఫా లోతైన పరిశోధన జరిపి, నిజాల్ని ప్రపంచానికి తెలపాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌వో)ను సదస్సు కోరే అవకాశం ఉంది. డబ్లుహెచ్‌వో లోగడ జరిపిన పరిశోధన డొల్ల అని, కారణమేమైనా ఈ అంతర్జాతీయ సంస్థ ఎందుకో చైనా పట్ల అనుచిత సానుకూలత చూపిందనే విమర్శలొచ్చాయి. అందుకు భిన్నంగా, తమ పరిశోధకులకు చైనా సహకరించలేదని, ఇంకా లోతైన పరిశోధన అవసరమని డబ్లుహెచ్‌వో నాడే ప్రకటించింది. సమగ్ర పరిశోధన జరగాల్సిందేనని ఇప్పుడు భారత్ కూడా స్వరం కలుపుతోంది. పలు దేశాలు ఇదే బాటలో వరుస కట్టనున్నాయి. సార్స్ వైరస్ సహజంగానే పుట్టిందా? చైనాలోని వూహాన్ వైరాలజీ సంస్థ (డబ్లుఐవి) పరిశోధనశాల నుంచి లీకైందా? అన్నది మౌలిక ప్రశ్న! లీకవడమే నిజమైతే... ప్రమాదపు ఘటనా? ఉద్దేశ్యపూర్వక కుట్రా? అన్నదీ తేలాలి. సహజంగానే తన సమాచారం చుట్టూ ఇనుప గోడలు కట్టే అతిపెద్దగోడగల దేశం, చైనా ఒకింత ఇరుకున పడింది. కొంత శోధించిన అమెరికా నిఘా విభాగాన్ని మరింత లోతు పరిశోధన జరపాలని ఆ దేశాధ్యక్షుడు బైడన్ ఆదేశించిన నుంచి.. ఒకటొకటిగా చోటుచేసుకుంటున్న పరిణామాలు వేడిపుట్టిస్తున్నాయి. చైనా–అమెరికా దేశాల మధ్య తాజా పరిణామం మరింత ఎడం పెంచవచ్చేమో కానీ, వారి ద్వైపాక్షిక అంశం కాదని విశ్వ సమాజం భావిస్తోంది. ఇది ప్రపంచ సమస్య! ప్రపంచాన్ని అతలాకుతలం చేసి, ఇంకా వణికిస్తున్న కరోనా మహమ్మారి పుట్టుక, దాని మూలాలు సమగ్రంగా తెలిస్తే, తగు ఉపకరణాలతో ప్రస్తుత ఉపద్రవాన్ని అరికట్టడంతో పాటు భవి ష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్త పడవచ్చు. ఏడాదిన్నర కాలంలో, అధికారికం గానే 37 లక్షల మంది ప్రాణాలు తీసి, 18 కోట్ల మందికి సోకిన వైరస్ గూర్చి మానవాళికి తెలియాలి. చైనాను కుట్రకోణంలో అనుమానించడానికి బలమైన సాపేక్ష సాక్ష్యాధారాలున్నాయి. సార్స్– కోవి2 వైరస్ సహజమా? మానవనిర్మితమా? అన్న ప్రశ్నను రేకెత్తిస్తున్న అంశాలెన్నో! వూహాన్ వైరా లజీ సంస్థలో ఏళ్లుగా జీవాయుధ తయారీ పరిశోధనలు, రక్షణ విభాగ నిఘాలో జరుగుతున్నాయని లోగడ వెల్లడైంది. వైరస్‌లను లోతుగా అర్థం చేసుకునేందుకు, ‘పనితీరు నుంచి లబ్ది’ (గెయిన్ ఆఫ్ ఫంక్షన్) పరిశోధనలు అంతటా జరుగుతాయి. దీనికి రెండు పార్శా్వలుంటాయి. ఒకటి లోక కల్యాణం కోసం జరిగేది. అంటే, వైరస్ స్వభావాన్ని లోతుగా గ్రహించి, భవిష్యత్తులో అది రూపు మార్చుకునే ‘వైవిధ్యాల’ అవకాశం– ప్రభావాలు, వాటికి విరుగుడు టీకామందుల తయారీపై అధ్య యనం.. లాంటివి! వైరస్ రూపుని, స్వభావాన్నీ కృత్రిమంగా మార్చడం ద్వారా మరింత ప్రమాద కారిగా తయారు చేసేందుకు గల అవకాశాల అధ్యయనం రెండోది. ఇది అత్యంత ప్రమాదకారి! ఇతర జీవుల, ముఖ్యంగా మానవుల విధ్వంసకారిగా వైరస్ వైవిధ్యాన్ని మానవప్రమేయంతో రూపొందించి, జీవాయుధంగా మలచడం, శత్రుదేశాలపై ప్రయోగించడం ఈ కుట్ర వెనుక లక్ష్యం. వూహాన్లో ఇదేమైనా జరిగిందా? అన్నది అనుమానం. ఇదే క్రమంలో... బాహ్యప్రపంచంలోకి వైరస్ రాక ఉద్దేశ్యపూర్వక చర్య కావచ్చు, లేదా పొరపాటు పరిణామమైనా(లీక్) అయుండొచ్చు! ఏదన్నదే ఇపుడు అందరినీ తొలుస్తున్న ప్రశ్న. చైనాను అనుమానించడానికి ఇంకో కారణముంది. దక్షిణ చైనాలోని యుమ్మన్ ప్రావిన్స్‌లో 2013 లో బయటపడిన ఆర్‌ఏటీజీ–13 వైరస్‌ను ప్రస్తుత సార్స్–కొవి 2 వైరస్ సరిగ్గా పోలి ఉండటమే! తాజా వైరస్‌లోని కొవ్వు కొమ్ముల్లో... సహజం కాని, మానవ ప్రమేయమని అనుమానించదగ్గ 4 జన్యుజోక్యాలను ఢిల్లీ ఐఐటీ పరిశోధకులు గత జన వరిలో గుర్తించారు. ఈ వైరస్ మనిషి ఊపిరితిత్తుల్ని ఎలా ధ్వంసం చేస్తుందో, నమగ్ర అణుస్థాయి నమూనాగా అమెరికా ఇంధన విభాగం ఒక ‘ఎన్వలప్’రూపొందించింది. ‘నేచర్ కమ్యూ నికేషన్’ జర్నల్‌లో ఇది ప్రచురితమైంది. ఈ వైరస్ సహజమా? కృత్రిమమా? అనే అంశంపై అట్లాంటాలోని జార్జియా యూనివర్సిటీ వాళ్లొక అధ్యయనం చేస్తున్నారు. చైనా ప్రమాదకర జీవాయుధ క్రమమే ఇదని అమెరికా ఆరోపిస్తే, సహజ సార్స్ వైరస్‌ను యుఎస్ జన్యుమార్పిడికి గురిచేస్తోందని చైనా 2003లోనే ఆరోపించింది. ఎవరి విమర్శలు, ఆరోపణలు ఎలా ఉన్నా తగిన శాస్త్రాధారాలు లేకుండా ఎవరినీ శంకించలేం. లోతైన పరిశోధనతో సందేహాలకతీతంగా అది ధృవపడాల్సిందే! శాస్త్రవిజ్ఞాన బలాన్ని మంచికి కాకుండా మనిషి చెడువైపు మళ్లించిన సందర్భాలు మనకేం కొత్త కాదు! అణ్వాయుధాలు–వాటి దురుపయోగం ఇందుకో ఉదాహరణ! బాంబు తయారు చేసిన నోబెల్, ఆధునిక మారణాయుధం ఏకే–47 తయారుచేసిన కలైష్నకోవ్లు, సత్సంకల్పంతో తామొ కటి తలిస్తే వినియోగం మరొకటై శాంతికి భంగం కలిగిందని తీవ్రంగా బాధపడ్డవారే! సార్స్–కొవి 2 వైరస్ జన్మరహస్యాన్ని చేధించి, కుట్రకోణం ఉంటే... అందుకు కారణమైన వారిపై తగు చర్యలు తీసుకోవాల్సిందే! ఇలాంటి దుశ్చర్యలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత పాలకులు, శాస్త్రవేత్తలపై ఉంది. -
హనుమంతుని జన్మస్థలం కిష్కింధే
తిరుపతి అన్నమయ్య సర్కిల్: హనుమంతుని జన్మస్థలం ముమ్మాటికీ కర్ణాటక పంపాక్షేత్రంలోని కిష్కింధేనని హనుమద్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు వ్యవస్థాపకులు గోవిందానంద సరస్వతి స్వామి పునరుధ్ఘాటించారు. టీటీడీ కమిటీ ఇచ్చిన నివేదికలోని ప్రతి అంశాన్నీ ఆయన ప్రస్తావిస్తూ అందులో లోపాలున్నాయని ఆరోపించారు. దేశంలో ఎంతో మంది పండితులు, పీఠాధిపతులు, స్వామీజీలు, దిగ్గజ సిద్ధాంతులు ఉన్నారని వారిని సంప్రదించకుండా సబ్జెక్ట్‌పై పట్టులేని నలుగురితో కమిటీ వేసి అంజనాద్రే హనుమంతుని జన్మస్థలం అని ఎవరికి వారు తేల్చడం తగదని తీవ్రస్థాయిలో విమర్శించారు. శుక్రవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ హనుమ జన్మస్థలంపై టీటీడీ నియమించిన కమిటీ వ్యర్థమని, 4 నెలల్లో ప్రాజెక్ట్ వర్క్‌లా ఇతర పుస్తకాల్లోని పేపర్లను జిరాక్స్ చేసి నివేదిక సమరి్పంచిందని విమర్శించారు. అందులో పొందుపరచిన శ్లోకాలు పూర్తిగా కల్పితాలేనని, నివేదిక పూర్తిగా తప్పుల తడకగా ఉందన్నారు. -
ఆంజనేయుడి జన్మస్థలంపై కొనసాగుతోన్న సందిగ్థత
-
హనుమ జన్మస్థలం: ఆధారాలు తప్పని నిరూపించలేకపోయారు
-
హనుమ జన్మస్థలం: ఆధారాలు తప్పని నిరూపించలేకపోయారు
సాక్షి, తిరుపతి: హనుమంతుడి జన్మస్థలంపై సందిగ్థత నెలకొన్న సంగతి తెలిసిందే. దీని మీద గురువారం టీటీడీ-హనుమద్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ మధ్య చర్చలు జరిగినప్పటికి ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో మురళీధర శర్మ మాట్లాడుతూ.. ‘‘తిరుమలలోని జాపాలి తీర్థమే హనుమ జన్మస్థలం.ఇతిహాసాలు, చారిత్రక, శాసన ప్రమాణాల ఆధారంగా ఈ విషయాన్ని ప్రకటించాం. దీనిపై గోవిందానంద సరస్వతి అభ్యంతరం వ్యక్తం చేశారు. సన్యాసిగా ఉండి.. మాట్లాడకూడని పదాలతో లేఖ రాశారు’’ అని తెలిపారు. ‘‘టీటీడీ ఇచ్చిన ఆధారాలలో ఏ ఒక్కటి తప్పని నిరూపించలేకపోయారు. గోవిందానంద సరస్వతి ఆధారాలు లేకుండా ఇష్టానుసారం మాట్లాడారు.కుప్ప విశ్వనాథశర్మ మధ్యవర్తిగా శాస్త్ర చర్చ జరిగింది... గోవిందానంద స్వామి వితండవాదం చేస్తున్నారు’’ అన్నారు మురళీధర శర్మ. -
హనుమాన్ జన్మస్థలంపై ముగిసిన చర్చలు
సాక్షి, తిరుమల: హనమంతుడి జన్మస్థలంపై సందిగ్ధత తలెత్తిన నేపథ్యంలో గురువారం సంస్కృత విద్యాపీఠంలో ప్రారంభమైన చర్చలు ముగిసాయి. టీటీడీ-హనుమద్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ మధ్య చర్చలు నడిచాయి. కిష్కింధ ట్రస్టు తరపున గోవిందానంద సరస్వతి, టీటీడీ తరపున పండిత పరిషత్ కమిటీ చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ అందించిన ఆధారాలపై గోవిందానంద సరస్వతి అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ వాదనతో టీటీడీ ఏకీభవించడం లేదని ఆరోపించారు. టీటీడీ ఆధారాలు ప్రామాణికంగా లేవన్నారు గోవిందానంద సరస్వతి. ఇక తిరుమలలోని జపాలి తీర్థమే హనుమాన్ జన్మస్థలం అని టీటీడీ చెప్తుండగా, కాదు కిష్కింధే హనుమంతుడి జన్మస్థలం అని తీర్థ క్షేత్ర ట్రస్టు చెప్తొన్న సంగతి తెలిసిందే. -
ఆంజనేయుడి జన్మస్థలంపై కొనసాగుతోన్న సందిగ్థత
-
పంపా క్షేత్రమే హనుమంతుని జన్మస్థలం
తిరుమల: కర్ణాటకలోని పంపా క్షేత్రంలోని కిష్కింధలోని అంజనాద్రి పర్వతమే హనుమంతుని జన్మస్థలంగా తమ వాదన నిరూపితమవుతుందని శ్రీ హనుమద్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు వ్యవస్థాపకులు గోవిందానంద సరస్వతి స్వామీజీ అన్నారు. బుధవారం సాయంత్రం ఆయన తిరుమలలోని గోశాలను సందర్శించి మీడియాతో మాట్లాడారు. తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో గురువారం ఉదయం 10 గంటలకు టీటీడీ పండితులతో హనుమంతుని జన్మస్థలం నిర్ధారణపై చర్చించనున్నామని తెలిపారు. ఇప్పటికే టీటీడీ హనుమంతుని జన్మస్థలం శేషాచలం వెంకటాద్రిలోని అంజనాద్రి పర్వతమేనని నిర్ధారించిన విషయం విదితమే. కాగా, వాదన ముగిసిన అనంతరం టీటీడీ పాలకమండలి సభ్యులను, టీటీడీ ఉన్నతాధికారులను పంపా క్షేత్రంలోని హనుమంతుని జన్మస్థానమైన అంజనాద్రి పర్వతం వద్దకు తీసుకెళతామని స్వామీజీ చెప్పారు. చదవండి: అమ్మానాన్నా లేకున్నా నేనున్నా... కరోనా 'చింత' లేని గిరిజనగూడెం -
హనుమంతుని జన్మస్థలంపై చర్చ రేపే
సాక్షి, చిత్తూరు: హనుమంతుడి జన్మస్థలంపై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. తిరుమలలోని జపాలి తీర్థమే హనుమాన్ జన్మస్థలం అని టీటీడీ చెప్తుండగా, కాదు కిష్కింధే హనుమంతుడి జన్మస్థలం అని తీర్థ క్షేత్ర ట్రస్టు చెప్తోంది. ఈ నేఫథ్యంలో టీటీడీతో హనుమద్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు చర్చకు సిద్ధమైంది. రేపు తిరుపతిలో హనుమాన్ జన్మస్థలంపై సంస్కృత విద్యాపీఠంలో చర్చ జరగనుంది. కిష్కింధ ట్రస్టు తరపున గోవిందానంద సరస్వతి, టీటీడీ తరపున కమిటీ కన్వీనర్, సభ్యులు చర్చలో పాల్గొంటున్నారు. రేపు ఆహ్లాదకరమైన వాతావరణంలో పండితుల మధ్య చర్చలు జరగనున్నాయి. ఇరుపక్షాలు చర్చించి శాస్త్రోక్తంగా నిర్ధారణకు రావడమే ఉపాయమని గోవిందానంద సరస్వతి తెలిపారు. చదవండి: శ్రీవారి కోసం 365 రకాల దేశీ వరి! -
ఆంజనేయుడి జన్మస్థలం అంజనాద్రే
సాక్షి, తిరుపతి, తిరుమల: కలియుగ దైవం శ్రీనివాసుడు కొలువుదీరిన ఏడుకొండలే రామభక్తుడైన ఆంజనేయుడి జన్మస్థలం అని టీటీడీ ఆధారాలతో సహా నిరూపించింది. తిరుమలలో శ్రీవారి ఆలయానికి సమీపంలోని జాపాలి తీర్థమే హనుమంతుడి జన్మస్థలమని.. అదే అంజనాద్రి అని తెలిపింది. ఈ మహత్తర, పురాణ, చారిత్రక ఆవిష్కరణను బుధవారం శ్రీరామనవమి రోజు టీటీడీ ప్రకటించటం విశేషం. 15వ శతాబ్దంలో విజయ రాఘవరాయలు జాపాలిలో నిర్మించిన శ్రీఆంజనేయుని ఆలయమే హనుమ జన్మస్థలం అని ఆధారాలతో టీటీడీ వెలుగులోకి తెచ్చింది. జాపాలి మహర్షి జపం ఆచరించి శ్రీనివాసుడిని ప్రసన్నం చేసుకోవడంతో ఈ తీర్థానికి జాపాలి అనే పేరు వచ్చింది. శాస్త్రబద్ధంగా నిరూపణ: తమిళనాడు గవర్నర్ పురోహిత్ భక్త హనుమ జన్మస్థలాన్ని నిర్ధారిస్తూ పండితుల కమిటీ రూపొందించిన నివేదికను నవమి రోజు తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ హాజరయ్యారు. హనుమ జన్మస్థలాన్ని టీటీడీ శాస్త్రబద్ధంగా నిరూపించడం తనకెంతో సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. క్షుణ్నంగా పరిశీలించి ఆధారాలు సేకరించడం ఎంత కష్టమో తమిళనాడులోని 20 విశ్వవిద్యాలయాల చాన్సలర్‌గా తనకు బాగా తెలుసన్నారు. నాలుగు నెలలపాటు అవిశ్రాంతంగా శ్రమించిన పండితుల కమిటీని ఆయన అభినందించారు. త్వరలో పుస్తక రూపంలో నివేదిక: ఈవో జవహర్‌రెడ్డి భగవత్ సంకల్పంతోనే శ్రీరామనవమి నాడు హనుమంతుడి జన్మస్థానాన్ని తిరుమలగా నిరూపించామని టీటీడీ ఈవో డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి చెప్పారు. పండితులతో కూడిన కమిటీ పౌరాణిక, వాజ్ఞయ, శాసన, భౌగోళిక ఆధారాలను సేకరించి ఈ విషయాన్ని నిర్ధారించిందన్నారు. ఆధారాలతో కూడిన నివేదికను టీటీడీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని, త్వరలో పుస్తక రూపంలోకి తెస్తామని ప్రకటించారు. కర్ణాటకలోని హంపి క్షేత్రాన్ని కూడా హనుమంతుడి జన్మస్థలంగా చెబుతున్నారని, దీన్ని శాస్త్రీయంగా పరిశీలించామని, అక్కడ కిష్కింద అనే రాజ్యం ఉండవచ్చని, హనుమంతుడు అంజనాద్రి నుంచి అక్కడికి వెళ్లి సుగ్రీవుడికి సాయం చేసినట్లుగా భావించవచ్చన్నారు. గుజరాత్, మహారాష్ట్ర, హరియాణాలో హనుమంతుడు జన్మించినట్లుగా ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. కమిటీ సభ్యులకు అభినందనలు.. కమిటీ సభ్యులైన ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సన్నిధానం సుదర్శనశర్మ, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య మురళీధరశర్మ, ఆచార్య రాణి సదాశివమూర్తి, ఆచార్య జానమద్ది రామకృష్ణ, ఆచార్య శంకరనారాయణ, ఇస్రో శాస్త్రవేత్త రేమెళ్ల మూర్తి, రాష్ట్ర పురావస్తుశాఖ మాజీ డిప్యూటీ డైరెక్టర్ విజయ్‌కుమార్, టీటీడీ ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డాక్టర్ ఆకెళ్ల విభీషణశర్మలను ఈవో అభినందించారు. పండితుల కమిటీ నాలుగు నెలల పాటు విస్తృతంగా పరిశోధించి బలమైన ఆధారాలు సేకరించిందని టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. ఇవీ ఆధారాలు.. శ్రీమద్రామాయణంలోని సుందరకాండ, అనేక పురాణాలు, వేంకటాచల మహాత్యం, ఎన్నో కావ్యాల్లో హనుమంతుని జన్మవృత్తాంతం గురించి వర్ణించి ఉందని ఆచార్య మురళీధరశర్మ చెప్పారు. కంబ రామాయణం, వేదాంత దేశికులు, తాళ్లపాక అన్నమాచార్యులు తమ రచనల్లో వేంకటాద్రిగా, అంజనాద్రిగా అభివర్ణించారని తెలిపారు. బ్రిటీష్ అధికారి స్టాటన్ క్రీ.శ.1800లో తిరుమల ఆలయం గురించి సంకలనం చేసిన అంశాలతో సవాల్–ఏ–జవాబ్ పుస్తకాన్ని రాశారని, అందులో అంజనాద్రి అనే పదాన్ని వివరిస్తూ అంజనాదేవికి ఆంజనేయుడు పుట్టినచోటు కావడం వల్లే అంజనాద్రి అనే పేరు వచ్చిందని ప్రస్తావించారని తెలిపారు. బాలాంజనేయుడు సూర్యదేవుడిని పట్టుకోవడానికి వేంకటాద్రి నుంచి లంఘించడం, శ్రీరాముని దర్శనానంతరం సీతాన్వేషణలో తిరిగి వేంకటగిరికి రావడం, అక్కడ అంజనాదేవిని మళ్లీ చూడడం, వానరవీరులు వైకుంఠగుహలో ప్రవేశించడం.. లాంటి అనేక విషయాలు వేంకటాచల మహాత్యం ద్వారా తెలుస్తున్నాయన్నారు. ఈ గ్రంథం ప్రమాణమే అని చెప్పడానికి రెండు శిలాశాసనాలు తిరుమల గుడిలో ఉన్నాయన్నారు. మొదటి శాసనం 1491 జూన్ 27వ తేదీ నాటిది కాగా రెండో శాసనం 1545 మార్చి 6వ తేదీకి చెందినదని వివరించారు. శ్రీరంగంలో ఉన్న ఒక శిలాశాసనం కూడా దీన్ని తెలియజేస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సీవీఎస్వో గోపీనాథ్‌జెట్టి, ఎస్వీబీసీ సీఈవో సురేష్‌కుమార్, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు ఆచార్య దక్షిణామూర్తి, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డాక్టర్ ఆకెళ్ల విభీషణశర్మ తదితరులు పాల్గొన్నారు. -
రాముడి జన్మస్థలంపై మళ్లీ పేట్రేగిన నేపాల్ ప్రధాని
ఖట్మండు : నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి మరో వివాదానికి తెరలేపారు. శ్రీరాముడి జన్మస్థలం దక్షిణ నేపాల్‌లోని అయోధ్యాపురి అని, యూపీలోని అయోధ్య కాదని ఆయన పేర్కొన్నారు. నెలరోజుల వ్యవధిలో అయోధ్యపై ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇది రెండోసారి. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతులమీదుగా ఇటీవల అత్యంత వైభవంగా భూమిపూజ జరిగిన నేపథ్యంలో ఓలి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మాడి మేయర్ ఠాకూర్ ప్రసాద్ ధకాల్ నేతృత్వంలో తనను కలిసిన ప్రతినిధి బృందంతో రాముడి జన్మస్థలాన్ని అభివృద్ధి చేసేందుకు తన ప్రణాళికలను పంచుకున్నారు.అయోధ్యపురిని శ్రీరాముడు జన్మించిన ప్రాంతంగా ప్రచారం చేయాలని, అక్కడ రాముడి విగ్రహం ప్రతిష్టించాలని కోరారు. మాడి మున్సిపాలిటీ పేరును అయోధ్యపురిగా మార్చాలని సూచించారు. చదవండి : ఐక్యరాజ్యసమితికి నేపాల్ కొత్త మ్యాప్ కాగా, నేపాల్ ప్రధాని ఓలి గత నెలలోనూ ఇవే వ్యాఖ్యలు చేయగా పాలక నేపాల్ కమ్యూనిస్టు పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమైంది. నేపాల్ ప్రధాని భారత వ్యతిరేక వ్యాఖ్యలను ఆయన పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు రాముడి జన్మస్థలంపై ఓలి ప్రచారాన్ని జానకి ఆలయ పూజారులు సహా నేపాల్‌కు చెందిన మత నేతలు ఖండిస్తున్నారు. అయోధ్య భూమిపూజలో పాల్గొన్న నేపాల్ మత బోధకుడు ఆచార్య దుర్గా ప్రసాద్ గౌతమ్ ప్రధాని ఓలి వ్యాఖ్యలను తోసిపుచ్చారు. మరోవైపు నేపాల్ కమ్యూనిస్టు పార్టీలో ఓలికి వ్యతిరేకంగా అంతర్గత పోరు తీవ్రతరమైంది. పార్టీ అగ్రనేత పుష్ప కమల్ దహల్‌తో పాటు మాజీ ప్రధానులు మాధవ్ నేపాల్, జల్నాథ్ ఖనల్‌లు ఓలి తక్షణమే పదవి నుంచి వైదొలగాలని డిమాండ్ చేస్తున్నారు. -
నేపాల్ తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలి
సాక్షి, విశాఖపట్నం : శ్రీరాముని జన్మభూమిపై నేపాల్ ప్రధాని ఓలీ చేసిన వ్యాఖ్యలను విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర తీవ్రంగా ఖండించారు. రాముడు భారతదేశంలో జన్మించాడనేందుకు ఎన్నో చారిత్రక సాక్ష్యాలున్నాయని వాటిని వక్రీకరించడం సరికాదని పేర్కొన్నారు. చైనా ప్రధాని కుట్రలకు అనుగుణంగా నేపాల్ ప్రధాని నడుచుకోవడం దారుణమని, ఇకనైనా నేపాల్ తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని హితవు పలికారు. శ్రీరాముని జన్మస్థలం గురించి తెలిసీ తెలియని మాటలు సరికాదని పేర్కొన్నారు.భారత్‌లో జన్మించిన రాముడు ఎంతోమందికి ఆరాధ్య దైవమన్న స్వరూపానందేంద్ర.. ధర్మబద్ధమైన జీవితాన్ని సమాజానికి అందించిన దివ్యమూర్తి శ్రీరాముడని కొనియాడారు. రాముడి జన్మస్థలం అయోధ్య నేపాల్‌లోనే ఉందని, శ్రీరాముడు నేపాల్ దేశస్తుడంటూ నేపాల్ ప్రధాని సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. గతంలోనూ భారత భూభాగంలోని లిపులెఖ్, కాలాపానీ ప్రాంతాలు తమవేనంటూ నేపాల్ ప్రధాని ఓలీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. . -
సమసిన షిర్డీ వివాదం
సాక్షి, ముంబై: పాథ్రీ గ్రామాన్ని సాయిబాబా జన్మస్థలంగా కాక, ఒక పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే చేసిన ప్రకటనతో బాబా జన్మస్థలంపై తలెత్తిన వివాదం సమసినట్లయింది. సాయిబాబా జన్మస్థలమైన పాథ్రీ గ్రామాన్ని రూ.100 కోట్లతో అభివృద్ధి చేస్తామని ఇటీవల ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే చేసిన ప్రకటనతో షిర్డీ వాసులు నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. షిర్డీలోని దుకాణాలను మూసివేయడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. పరిస్థితి తీవ్రతను గమనించిన సీఎం ఉద్ధవ్ సోమవారం షిర్డీ, పాథ్రీ గ్రామాల ప్రముఖులు, షిర్డీ ఆలయ ప్రతినిధులతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సీఎం ఉద్ధవ్ పాథ్రీ గ్రామాన్ని సాయిబాబా జన్మస్థలంగా కాకుండా ఒక పుణ్య క్షేత్రంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. అంతేకాకుండా, పాథ్రీ సాయిబాబా జన్మస్ధలమంటూ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. ఇందుకు పాథ్రీ, షిర్డీ వాసులు సమ్మతించారు. ‘బాబా జన్మస్థలం పాథ్రీ అవునో కాదో నాకు తెలియదు. నేనేమీ పరిశోధకుణ్ని కాదు. అందరూ అన్నట్టుగానే నేనూ అన్నా’అని తెలిపారు. -
ముగిసిన షిర్డీ బంద్
సాక్షి, ముంబై/షిర్డీ: షిర్డీ సాయిబాబా జన్మస్థలంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలకు నిరసనగా షిర్డీ్డలో జరుగుతున్న బంద్ ముగిసింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి బంద్‌ను నిలిపివేస్తున్నట్లు శివసేనకు చెందిన స్థానిక ఎంపీ సదాశివ లోఖండే ప్రకటించారు. ఈ అంశంపై సంబంధిత వర్గాలతో సోమవారం సీఎం ఠాక్రే సమావేశం నిర్వహిస్తున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఆదివారం సాయంత్రం ఆయన షిర్డీ్డలోని స్థానికులతో చర్చించారు. అంతకుముందు, బంద్‌కు ఎంపీ సదాశివ లోఖండే మద్దతు ప్రకటించారు. ఠాక్రే వ్యాఖ్యలపై నిరసనగా ఆదివారం షిర్డీ్డలో బంద్ పాటించారు. శనివారం అర్ధరాత్రి నుంచి షిర్డీతో పాటు చుట్టుపక్కల ఉన్న 25 గ్రామాల్లోనూ బంద్ జరిగింది. అయితే, షిర్డీ సాయి ఆలయం తెరిచే ఉంది. భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండానే సాయినాథుని దర్శించుకున్నారు. షిర్డీ్డలోని షాపులు, రెస్టారెంట్లు, ప్రైవేటు వాహనాల వారు బంద్ పాటించారు. ముందే బుక్ చేసుకున్నవారికి మాత్రం హోటళ్లలో వసతి కల్పించారు. సాయిబాబా దర్శనం కోసం వచ్చిన భక్తులకు స్థానికులు ఆహారం, తాగునీరు తదితర సౌకర్యాలు కల్పించారు. భక్తులకు ఉపాహారం అందించే ప్రసాదాలయ, లడ్డూ కౌంటర్ల వద్ద భారీ క్యూలు కనిపించాయి. స్థానికులు, భక్తులు ఆదివారం ఉదయం ద్వారకామాయి ఆలయం నుంచి ప్రారంభించి సాయి ఆలయం చుట్టూరా భారీ ర్యాలీ నిర్వహించారు. పర్భని జిల్లాలోని పాథ్రీలో ఉన్న ‘సాయి జన్మస్థాన్’ అభివృద్ధి కోసం రూ. 100 కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించడంతో వివాదం ప్రారంభమైంది. పత్రిని అభివృద్ధి చేయడం పట్ల తమకు అభ్యంతరం లేదని శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్(ఎస్ఎస్ఎస్టీ) మాజీ సభ్యుడు సచిన్ థాంబె తెలిపారు. సాయిబాబా జన్మస్థలంగా పత్రిని పేర్కొనడంపైనే తమ అభ్యంతరమని స్పష్టం చేశారు. ‘పత్రి తన జన్మస్థలమని సాయిబాబా ఎన్నడూ చెప్పలేదు’ అని వివరించారు. బంద్ కారణంగా షిర్డీకి వచ్చే భక్తుల సంఖ్య భారీగా తగ్గిందని రాష్ట్ర మంత్రి చగన్ భుజ్‌బల్ పేర్కొన్నారు. సాధారణం కన్నా 10 వేల మంది తగ్గారన్నారు. ఇరు గ్రామాల వారితో భేటీ ఈ అంశంపై నేడు(సోమవారం) సీఎం ఉద్ధవ్ ఠాక్రే అధ్యక్షతన కీలక భేటీ జరగనుంది. ఈ సమావేశానికి షిర్డీ, çపత్రి గ్రామాల వాస్తవ్యులు, షిర్డీ ఎమ్మెల్యే విఖే పాటిల్, ఎంపీ లోఖండే హజరవుతారని ఎస్ఎస్ఎస్టీ సీఈఓ దీపక్ ముగ్లీకర్ తెలిపారు. పత్రిలో సాయిబాబా జన్మించాడని 2017లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పేర్కొనడంతో.. సాయిబాబా జన్మస్థలానికి సంబంధించిన వివాదం ప్రారంభమైంది. ‘2017లో రాష్ట్రపతి షిర్డీకి వచ్చినప్పుడు షిర్డీ సాయిబాబా కర్మభూమి.. పత్రి ఆయన జన్మభూమి అని వ్యాఖ్యానించారు. ఈ విషయమై రాష్ట్రపతిని నేను ఆ తరువాత కలిసి వివరణ ఇచ్చాను. అధికారులు చెప్పిన విషయాన్నే తాను ప్రస్తావించానని అప్పుడు రాష్ట్రపతి అన్నారు’ అని లోఖండే వివరించారు. పత్రినే సాయి జన్మభూమి అని ఆ గ్రామస్తులు వాదిస్తున్నారు. సాయి జీవిత చరిత్ర ‘శ్రీ సాయిసశ్చరిత’లో కూడా çపత్రినే సాయి జన్మస్థలంగా పేర్కొన్నారని గుర్తు చేస్తున్నారు. ‘పాథ్రీనే సాయిబాబా జన్మస్థలమని ఆయన శిష్యుడు దాసు గణు మహారాజ్ తన జీవిత చరిత్రలో పేర్కొన్నారు. షిర్డీ సంస్థాన్ కూడా çపత్రినే సాయిబాబా జన్మస్థలమని నిర్ధారిస్తూ కొన్ని పత్రాలు ప్రచురించింది’ అని పత్రిలోని ‘శ్రీ సాయి జన్మస్థాన్ టెంపుల్ ట్రస్ట్’ సభ్యుడు సంజయ్ భూసారి వెల్లడించారు. -
నేటి నుంచి షిర్డీ బంద్
అహ్మద్‌నగర్/షిర్డీ: శ్రీ సాయి జన్మస్థలంపై తలెత్తిన వివాదం ముదిరింది. పత్రి గ్రామ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ ఆదివారం పట్టణ బంద్ పాటించాలని షిర్డీ వాసులు పిలుపునిచ్చారు. అయితే, ఆదివారం ఆలయం తెరిచే ఉంటుందని, పూజా కార్యక్రమాలు కొనసాగుతాయని శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ పేర్కొంది. సంస్థాన్‌కు చెందిన ఆస్పత్రులు, ప్రసాద విక్రయ కేంద్రాలు, భక్తి నివాసాలు తదితరాలన్నింటిలో కార్యకలాపాలు కొనసాగుతాయని ప్రకటించింది. ఇలా ఉండగా, ఈ వివాదం పరిష్కారానికి సంబంధిత వర్గాలతో సెక్రటేరియట్లో ఆదివారం సీఎం ఉద్ధవ్ ఠాక్రే సమావేశం నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. షిర్డీ వాసుల్లో ఆగ్రహం బాబా జన్మస్థలంగా భక్తులు భావించే పత్రి అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం ప్రకటించడం వివాదమైంది. ఈ అంశంపై వివిధ రాజకీయ పార్టీల నేతలు, షిర్డీ వాసులు శనివారం సమావేశమయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ప్రకటనకు నిరసనగా ఆదివారం నుంచి బంద్‌కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. బంద్‌లో దాదాపు 20 గ్రామాల ప్రజలు పాల్గొంటారన్నారు. గతంలోనూ ఇలా బాబా జన్మస్థలంపై వివాదాలు సృష్టించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. దేశవ్యాప్తంగా ఉన్న బాబా ఆలయాల్లో పత్రిలోనిది ఒకటనీ, బాబా జన్మస్థానం పత్రి అంటూ ముఖ్యమంత్రి చేసిన ప్రకటనతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిపారు. హోటళ్లలో బుకింగ్ చేసుకున్న భక్తులకు, విమానాల్లో వచ్చే భక్తులకు బంద్‌తో ఎలాంటి అసౌకర్యం ఉండదని, దుకాణాలు మాత్రమే మూతబడి ఉంటాయన్నారు. ఆధారాలున్నాయి: ఎన్సీపీ నేత దుర్రానీ పత్రిలోనే బాబా జన్మించారనేందుకు చారిత్రక ఆధారాలున్నాయని ఎన్సీపీ నేత దుర్రానీ అబ్దుల్లా చెప్పారు. పత్రి జన్మభూమి కాగా, షిర్డీ సాయి కర్మభూమి అని, రెండు ప్రాంతాలూ భక్తులకు ముఖ్యమైనవేనన్నారు. పత్రి ప్రాధాన్యం పెరిగితే షిర్డీకి భక్తుల రాక తగ్గిపోతుందేమోనని షిర్డీ ప్రజల్లో ఆందోళన ఉందన్నారు. సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రి అశోక్ చవాన్ మాట్లాడుతూ..బాబా జన్మస్థలంపై వివాదం కారణంగా పత్రిలో భక్తులకు సౌకర్యాల కల్పనను అడ్డుకోవడం సరికాదన్నారు.