bite
-
ప్రత్యర్థిని కొరికేశాడు
ప్రిస్టన్ (ఇంగ్లండ్): హోరాహోరీగా సాగుతున్న ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఒక ఆటగాడు తన ప్రత్యర్థి మెడ దగ్గర గట్టిగా కొరికేశాడు. అంతే ఇంగ్లండ్ ఫుట్‌బాల్ సంఘం (ఈఎఫ్ఏ) ఆగ్రహానికి గురయ్యాడు. నిషేధం, జరిమానా రెండు పడ్డాయి. ఇక వివరాల్లోకెళితే... ఇంగ్లండ్‌లో సెకండ్ డివిజన్ ఫుట్‌బాల్ పోటీలు జరుగుతున్నాయి. ప్రిస్టన్, బ్లాక్బర్న్ల మధ్య పోటాపోటీగా మ్యాచ్ జరుగుతోంది. ప్రిస్టన్ ఆటగాడు మిలుటిన్ ఉస్మాజిక్ ఉన్నపళంగా తనను నిలువరిస్తున్న బ్లాక్బర్న్ డిఫెండర్ ఒవెన్ బెక్ మెడ వెనుక కొరికేశాడు. ఇంత జరిగినా... రిఫరీకి చెప్పినా ఉస్మాజిక్కు మాత్రం రెడ్‌కార్డ్ చూపలేదు. బయటికి పంపలేదు. గత నెల 22న ఈ మ్యాచ్ జరుగగా... అప్పీల్ తదుపరి విచారణ అనంతరం తాజాగా ఈఎఫ్ఏ ఉస్మాజిక్పై ఎనిమిది మ్యాచ్‌ల నిషేధం విధించడంతో పాటు 15 వేల పౌండ్లు (రూ.16.80 లక్షలు) జరిమానాగా విధించింది. ఇలా కొరకడంలో ఉరుగ్వే స్ట్రయికర్ లూయిస్ స్వారెజ్ ఫుట్‌బాల్ అభిమానులకు చిరపరిచితుడు. 2013లో జరిగిన ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్‌లో బార్సిలోనా స్ట్రయికర్ స్వారెజ్... చెల్సియా డిఫెండర్ బ్రానిస్లావ్ ఇవానోవిచ్‌ను కొరకడంతో ఏకంగా 10 మ్యాచ్‌ల నిషేధం విధించారు. అయినా అతని బుద్ధి మారలేదు. ఆ మరుసటి ఏడాది బ్రెజిల్లో జరిగిన ఫుట్‌బాల్ ప్రపంచకప్ (2014)లో స్వారెజ్ ఇటలీ డిఫెండర్ జియోర్జియో చిలినిని కొరికాడు. దీంతో మళ్లీ నాలుగు మ్యాచ్‌ల నిషేధం ఎదుర్కొన్నాడు. -
వికాస్‌ను ఎనిమిదో‘సారీ’ కాటేసిన పాము!
ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాకు చెందిన వికాస్ ద్వివేదికి సంబంధించిన ‘పాము కాటు’ ఉదంతం ఆసక్తికరంగా మారింది. తనకు బద్దశత్రువుగా మారిన సర్పం పీడను వదిలించుకోవడానికి 11 రోజులుగా వికాస్ రాజస్థాన్‌లోని మెహందీపూర్ బాలాజీ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్నాడు. అయినా కూడా వికాస్ ఎనిమిదోసారి పాము కాటుకు గురైనట్లు సమాచారం. అయితే..దేవుని దయతో వికాస్‌కు ఏమీకాలేదని అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పాము కాటు వేసిన తర్వాత కూడా వికాస్ పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడు. అయితే పాము వికాస్ దగ్గరకు రావడాన్ని, వెళ్లడాన్ని తాము చూడలేదని అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఏడుసార్లు పాము కాటుకు గురైన వికాస్ వికాస్ జూలై 13న మెహందీపూర్ బాలాజీ ఆశ్రమానికి వచ్చాడు. ఆయన జూలై 14న మీడియాతో మాట్లాడుతూ.. తనకు కలలో పాము కనిపించిందని, జూలై 20న పాము తనను ఎనిమిదవసారి కాటేస్తుందని చెప్పాడు. అయితే అలాంటి ఘటనేమీ జరగలేదు. కానీ, 22న సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో పాము మరోసారి వికాస్‌ను కాటేసిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.వికాస్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ పాము తనను కాటు వేయడానికి వచ్చినప్పుడల్లా, తన ఎడమ కన్ను కొట్టుకుంటుందని తెలిపాడు. సోమవారం కూడా అలానే జరిగిందని చెప్పాడు. మరోవైపు ఇటీవల తనకు కూడా పాము కల వచ్చిందని వికాస్ తండ్రి సురేంద్ర ద్వివేది తెలిపారు. తన కుమారుడిని పాము కాటువేయగా, అతను చనిపోవడాన్ని తాను కలలో చూశానని పేర్కొన్నాడు. కాగా బాలాజీ టెంపుల్ ట్రస్టు వికాస్‌కు ఆశ్రయం కల్పిస్తూ సాయం అందిస్తోంది. -
అక్కడ చేపలు జస్ట్ తినడానికి ట్రై చేసినా చాలు..క్యాన్సర్ ఖాయం!
చేపలు తినడం ఆరోగ్యానికి మంచిదంటారు. పైగా చేపనూనె లేదా చేపతో చేసిన రెసిపీలు కనీసం వారానికి ఒక్కసారి తీసుకుంటే చాలా మంచిదని పదేపదే ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు కూడా. కానీ ఆ దేశంలోని చేపలు గురించి వైద్యులు చెబుతున్న షాకింగ్ విషయాలు వింటే వెంటనే మీ నిర్ణయం మార్చుకుంటారు. ఎందుకంటే చేపలను జస్ట్ తినాలని ట్రై చేసినా చాలు మందులతో కూడా నయం చేయలేని భయానక క్యాన్సర్ రావడం పక్కా అంటున్నారు. విచిత్రం ఏంటంటే.. అక్కడ చేపలతో చేసిన వంటకాలనే అక్కడ ప్రజలు చచ్చేంత ఇష్టంగా తింటారట. ఆ చేప కథకమామీషు ఏంటో చూద్దాం!. థాయ్ వంటకాలకు అత్యంత రుచికర, ఆరోగ్యకరమైన వంటకాలుగా మంచి ప్రసిద్ధి. కానీ అక్కడ ఓ చేప వంటకం మాత్రం చాలా డేంజర్ అని దాదాపు 20 వేల మంది మరణాలకు కారణమైందని వైద్యులు షాకింగ్ విషయాలు చెబుతున్నారు. థాయ్‌లోని కోయి ప్లా అనే మంచి నీటి చేప చాలా ప్రమాదకరమైందని ఒక్కసారి తిన్నా చాలు ఆ క్యాన్సర్ బారిన పడటం ఖాయం అంటున్నారు వైద్యులు. కానీ అక్కడ ఈ చేపకు సంబంధించి వివిధ రకాల వంటకాలకు చాలా ప్రసిద్ధి. పైగా ప్రజలు కూడా ఆ చేప వంటకాలను తెగ ఇష్టంగా తింటుంటారు. థాయ్‌లోని ఖోన్‌సాన్, ఇసాన్ వంటి ప్రాంతాల్లో ఈ చేప వంటకాలను ఎక్కువగా తింటారట. ఈ వంటకానికి సంబంధించి కొంచెం తిన్నా చాలు ఆ భయనక క్యాన్సర్ కచ్చితంగా వస్తుందని నొక్కి చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది తిన్న వారికి కొద్ది రోజులు లేదా నెలల్లోనే కాలేయ సంబంధ క్యాన్సర్ వ్యాధి బారిన పడతారని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఆ చేపలో లివర్ ఫ్లూక్ అనే ఫ్లాట్ వార్న్ పరాన్నజీవి ఉందని ఇది కాలేయం పిత్తాశయం, చిన్నపేగులను కలిపి ఉండే ప్రాంతంలో దాడి చేసి పిత్తాశయం లేదా కాలేయ క్యాన్సర్‌కి దారితీస్తుందని అంటున్నారు. ఈ చేపలను తినే ఆయా ప్రాంతాల్లో సర్వే చేయగా..దాదాపు 80 శాంత మంది శరీరంలో ఆ పరాన్నజీవి ఉందని వారంతా కూడా పిత్తాశయం లేదా కాలేయం క్యాన్సర్ బారిన పడినట్లు తేలిందని వెల్లడైంది. ఆయా బాధితులకు చికిత్స అందించడం కూడా ఓ సవాలుగా ఉందన్నారు. అంతేగాదు బాధితుల్లో ఈ ప్రాణాంతక క్యాన్సర్ ఏ స్టేజ్‌లో ఉందన్న నిర్థారణ ఆధారంగానే ఆ వ్యక్తలు నెలలు లేదా సంవత్సరాలు బతకగలరని అంచనా వేసి చెప్పగలం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ క్యాన్సర్ లక్షణాలు.. పిత్తాశయం లేదా కాలేయ క్యాన్సర్ వచ్చే వ్యక్తుల్లో కళ్లు చర్మం పసుపు రంగులోకి మారిపోవడం జరుగుతుంది, చర్మం చాలా దురదగా ఇరిటేషన్‌గా ఉంటుంది. ఆకలిని కోల్పోవడం. ఏ ప్రయత్నం చేయకుండానే బరువు తగ్గిపోవడం సడెన్‌గా అధిక ఉష్ణోగ్రత లేదా వణుకుపోతున్న ఫీలింగ్ ఈ చేపల్లోని ఫ్లాట్ వార్మ్ పిత్తవాహికలో ఏళ్ల తరబడి నివశిస్తాయని చెబుతున్నారు వైద్యులు. వైద్య పరీక్షలు చేసినప్పుడు కూడా కాలేయ వాపుగానే కనిపిస్తుందని వాటిని గుర్తించలేం అని తెలిపారు ఆరోగ్య నిపుణులు. మనిషి బలహీనపడినప్పుడూ ఒకేసారి ఆ పరాన్నజీవి విజృంభించడం మొదలు పెట్టి క్యాన్సర్ బారిన పడేల చేస్తుందని చెబుతున్నారు. (చదవండి: ఓ మహిళకి క్యాన్సర్ థర్డ్ స్టేజ్!ఎలాంటి సర్జరీ లేకుండానే..) -
బైడెన్ శునకాన్ని వైట్‌హౌజ్ నుంచి వెళ్లగొట్టిన అధికారులు
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు బైడెన్ శునకం 'కమాండర్' వైట్ హౌజ్‌లో సిబ్బందిని తరచూ కరుస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల కూడా ఓ అధికారిని కరిచి వార్తల్లోకెక్కింది. అయితే.. ఈ శునకాన్ని వైట్‌హౌజ్ నుంచి బయటకు పంపించినట్లు తెలుస్తోంది. గుర్తుతెలియని ప్రదేశానికి ఆ శునకాన్ని పంపించినట్లు వైట్‌హౌజ్ అధికారులు తెలిపారు. 2021లో కమాండర్‌ను బైడెన్ వైట్‌హౌజ్‌కు తీసుకువచ్చారు. అప్పటి నుంచి కనీసం 11 సార్లు అది సిబ్బందిని కరిచినట్లు వార్తలు వచ్చాయి. బైడెన్ వద్ద అంతకుముందు ఉన్న మేజర్ అనే శునకంపై కూడా ఇదే తరహా కేసులు నమోదు కావడంతో దాన్ని కూడా వైట్ హౌజ్ నుంచి బయటకు పంపించారు. అయితే.. ప్రస్తుతం కమాండర్‌ను ఎక్కడికి పంపించారో వివరాలు మాత్రం బయటికి వెళ్లడించలేదు. కమాండర్ రక్షణలో ఎంతో శ్రద్ధ కనబరిచిన సీక్రెట్ సర్వీస్ సిబ్బందిని జిల్ బైడెన్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ ఎలిజబెత్ అలెగ్జాండర్ ప్రశంసించారు. ఇదీ చదవండి: పార్లమెంట్ సాక్షిగా ట్రూడో చిల్లర చేష్టలు -
పాములు కాటేసే ముందు హెచ్చరిస్తాయా..?
పాములు కాటేసే ముందు ముందుగానే హెచ్చరిస్తాయట. ఆ ఒక్క పాము మినహా మిగిలిన అన్ని పాములు ముందుగానే వివిధ శబ్ధాలతో మన్నల్ని హెచ్చరిస్తాయి. నిజానికి అవి నేరుగా కాటేయవని ముందుగా సిగ్నల్ ఇస్తాయని నిపుణుల అంటున్నారు. దాన్ని నిశితంగా గమనిస్తే పాము కాటు నుంచి తప్పించుకోవచ్చట. నిజానికి పాములను చూసి మనం భయపడతాం గానీ వాటికి మనం అంటేనే భయం. అందువల్లే అవి ప్రాణ భయంతో కాటేసే యత్నం లేదా సంకేతం ఇస్తాయట. ఒక్క కట్లపాము మినహా మిగిలిన పాములన్నీ కాటు వేసే ముందు హెచ్చరిస్తాయని నిపుణులు చెప్తున్నారు. కట్లపాము ఒక్కటే ఎప్పుడు కాటువేస్తుందో చెప్పలేం. మిగిలిన పాములు మాత్రం కాటు వేసే ముందు గట్టిగా శ్వాస పీల్చుకుంటూ "బుస్స్" "బుస్స్".. అని శబ్ధం చేస్తాయి. శరీరాన్ని నేలపై బలంగా కదిలిస్తూ శబ్ధం చేసే ప్రయత్నం చేస్తాయి. పాముల ప్రవర్తనను నిశితంగా గమనించగలిగితే పాము కాటు నుంచి తప్పించుకోవచ్చు అని స్నేక్ క్యాచర్ ధర్మేంద్ర త్రివేది అన్నారు. కట్లపాము విషయానికి వస్తే, రాత్రి వేళల్లో చురుగ్గా ఉంటుంది. రాత్రి నుంచి ఉదయం వరకు ఆహారం కోసం వేటాడుతుంది. అందుకే రాత్రి సమయంలో ఎక్కువగా ఈ పాము కాటు ప్రమాదాలు చోటచేసుకుంటాయి. మిగిలిన పాములు పంట పొలాలు, నిర్మాణ ప్రదేశాలలో కనిపిస్తాయి. అవి బూడిద, నలుపు, గోధుమ రంగుల్లో ఉంటాయి కాబట్టి, ఈ ప్రదేశాల్లో సులభంగా దాక్కొని ఆహారం కోసం వేటాడతాయని చెబుతున్నారు. పాము కాటు వేసిన వెంటనే ఏం జరుగతుందంటే.. పాము కాటుకు గురైన 15-20 నిముషాల నుంచి విషం ప్రభావం శరీరంలో కనిపించడం మొదలవుతుంది. 30 నుంచి 45 నిముషాల సమయంలో విషం శరీరమంతా వ్యాపిస్తుంది. విషపూరిత లక్షణాలు కనిపించడానికి సుమారు రెండు నుంచి రెండున్నర గంటల సమయం పడుతుంది. దాదాపు 4 నుంచి 6 గంటల్లో తీవ్రత గరిష్టస్థాయికి చేరుకుంటుంది. పాము కాటు వేసిన భాగంలో మాత్రమే నొప్పి తీవ్రంగా ఉంటుంది. అయితే, పాము కాటు వేస్తే, లక్షణాలు వెంటనే కనిపించవు” అని అన్నారు. పాము కాటు వేస్తే ఏం చేయాలి పాము కాటుకు గురైన వ్యక్తికి ముందు మానసిక ధైర్యాన్ని ఇవ్వాలి. ఆందోళన పడకోడదు. సాధ్యమైనంత త్వరగా దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి లేదా వైద్యుడి దగ్గరకు వెళ్లాలి. ఏం చేయకూడదు..? పాము కాటుకు గురైన వ్యక్తిని కదల్చకూడదు. దీని వలన విషం వేగంగా శరీరమంతా వ్యాపించే అవకాశం ఉంది. గాయానికి కట్టు కట్టడం లాంటివి చేయకుండా ఉంటేనే మంచిది. పాము కాటుని నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతి క్షణమూ విలువైనదే అని గుర్తుంచుకోవాలి. వేసకి కాలంలో బయట సంచరిస్తాయట. శీతకాలంలో నిద్రాణ స్థితిలో ఉంటాయట. వర్షాకాలంలో గుడ్లు పెడతాయట. శీతకాలం వచ్చేలోపు ఈ సమయంలో కావల్సిన ఆహరం కోసం వేట మొదలుపెడతాయట. అందువల్ల ఈ కాలంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. (చదవండి: నత్తల విసర్జకాలు, తేనెటీగల విషంతో బ్యూటీ ప్రొడక్ట్స్! కొరియన్ల బ్యూటీ రహస్యం ఇదేనా!) -
భార్యతో గొడవ.. కోపంతో ఆమె చేతి వేళ్లను కొరికి తినేసిన భర్త
బెంగళూరు: దంపతుల మధ్య గొడవలు సహజం. ఇలాంటివి వచ్చినప్పుడు తప్పు ఎక్కడ జరిగిందని సమీక్షించుకుని సమస్యను పరిష్కరించుకోవాలి తప్పు .. గొడవలను పెద్దవి చేసుకోకూడదని పెద్దలు అంటుంటారు. అయితే ఇటీవల కొందరు భార్యాభర్తలు హత్యలకు కూడా కారణం అవుతున్నాయి. క్షణికావేశం కొంపల్ని వాళ్ల జీవితాలని నాశనం చేస్తున్నాయి. తాజాగా భార్యతో గొడవపడిన భర్త.. ఆమె వేలిని కొరికి ఉమ్మేశాడు. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విజయ్ కుమార్ స్వస్థలం కర్ణాటకలోని బెంగళూరు. అతని భార్య పేరు పుష్ప. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. పెళ్లయి 23 ఏళ్లు కావస్తున్న వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో వారిద్దరూ అభిప్రాయ బేధాల కారణంగా విడిపోయి విడివిడిగా జీవిస్తున్నారు. విజయ్ కుమార్ తన కుమారుడితో కలిసి ఉంటున్నాడు. కొన్నేళ్ల నుంచి విజయ్‌కుమార్ భార్యను వేధిస్తుండటంతో ఆమె వేరుగా ఉంటోంది. గత నెల 28న విజయ్‌కుమార్ ఆమె వద్దకు వెళ్లి ఘర్షణకు దిగాడు. కోపం పట్టలేక ఆమెపై దాడి చేసి ఎడమ చేతి వేళ్లు కొరికి తినేశాడు. తన వద్దకు రాకపోతే ఆమెను చంపి ఇదే విధంగా తినేస్తానని బెదిరించడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు విజయ్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కేసును దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: నిందితులను పట్టుకున్నారు.. చివరికి కక్కుర్తి పడి పోలీసులే అరెస్టయ్యారు! -
అందుకే కుక్కలు రెచ్చిపోతున్నాయి: హార్వర్డ్ స్టడీలో వెల్లడి
దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో కుక్కకాటు సంఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఇదే విషయానికి సంబంధించిన పరిశోధనలలో ఒక ఆందోళన కలిగించే రిపోర్టు బయటకువచ్చింది. దాని ప్రకారం శునకాల ప్రవర్తన వాతావరణ మార్పులకు అనుగుణంగా మారుతుందని పేర్కొన్నారు. హార్వర్డ్ మెడికల్ స్కూల్ సాగించిన ఈ పరిశోధనలో వాతావరణంలో వేడి, అల్ట్రావైలెట్(యూవీ) స్థాయి పెరిగినప్పుడు శునకాలు మనుషులకు శత్రువులుగా మారుతాయని తెలిపారు. ఈ మార్పు ప్రపంచ వ్యాప్తంగా కనిపిస్తుందని పేర్కొన్నారు. హార్వర్డ్ మెడికల్ స్కూల్ 70 వేలకు పైగా డాగ్ బైట్స్‌కు సంబంధించిన ఘటనలపై అధ్యయనం చేసిన అనంతరం ఒక ఆందోళనకర ట్రెండ్‌ను గుర్తించింది. వేడివాతావరణంలోను, పొల్యూషన్ కలిగిన వాతావరణంలోనూ శునకాలు మనుషులపై దాడులకు దిగుతాయని వారి పరిశోధనలో తేలింది. మానవుల తప్పిదాల కారణంగా గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతోంది. దీని ప్రభావం శునకాలపైన కూడా పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. నేచర్ జర్నల్ ఈ సైంటిఫిక్ రిపోర్ట్స్‌ను జూన్ 15న ప్రచురించింది. అమెరికాలోని 8 ప్రముఖ నగరాల్లో ఈ పరిశోధన 10 ఏళ్లపాటు కొనసాగింది. వాతావరణం వేడిగా ఉన్న రోజుల్లోను, కాలుష్యం అధికంగా ఉన్న రోజుల్లోనూ శునకాలు హింసాత్మకంగా మారడం కనిపించింది. Dog bites may occur more frequently on days with hotter, sunnier weather, and when air pollution levels are higher, suggests a paper in @SciReports. However, the authors caution that more data and further research is needed to confirm these findings. https://t.co/njHvX3z5BG— Springer Nature (@SpringerNature) June 16, 2023 ఈ పరిశోధనలో ప్యాట్రన్‌ను గమనిస్తే యూవీ లెవెల్ పెరుగుతున్న కొద్దీ కుక్క కాట్లు 11 శాతం పెరుగుతూ వచ్చింది. ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్న రోజుల్లో ఇది 4 శాతం మేరకు పెరిగింది. ఓజోన్ లెవెల్ అధికంగా ఉన్న రోజుల్లో కుక్క కాట్లు 3 శాతం మేరకు పెరిగాయి. అలాగే భారీ వర్షాలు కురిసే సమయంలోనూ ఈ ముప్పు ఒకశాతం మేరకు పెరిగే అవకాశం ఉందని పరిశోధనల్లో తేలింది. ఇది కూడా చదవండి: భారత్‌లో అధికంగా విక్రయమయ్యే కండోమ్ బ్రాండ్స్.. -
శునకాన్ని చిన్నపాటి కొమ్మతో అదిలించాడు..అంతే అది రెచ్చిపోయి...
సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు అత్యంత వేగంగా వైరల్‌గా మారుతాయి. తాజాగా ఒక కుర్రాడిపై శునకం చూపిన ప్రతాపానికి సంబంధించిన ఒక వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఉన్న కంటెంట్ ప్రకారం ఒక వ్యక్తి తాడుతో కట్టివున్న కుక్కను పట్టుకుని కనిపిస్తున్నాడు. అక్కడే ఉన్న మరో కుర్రాడు ఒక చెట్టు కొమ్మతో ఆ శునకాన్ని అదిలించడం కనిపిస్తుంది. అంతే ఆ శునకానికి చిర్రెత్తుకొచ్చి ఆ కుర్రాడిపైన పడి,అతనిని కరిచే ప్రయత్నం చేస్తుంటుంది. వెంటనే తేరుకున్న ఆ కుర్రాడు ఆ శునకం బారి నుంచి తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంటాడు. అయితే ఆ శునకం ఏమాత్రం వెనక్కి తగ్గక, ఆ కుర్రాడిని పరిగెత్తించి, మరీ కరుస్తుంటుంది. దీనిని గమనించిన శునకం యజమాని దానిని పక్కకు తప్పించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోవడం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వీడియో ట్విట్టర్లో @cctvidiots పేరుతో పోస్ట్ అయ్యింది. ఈ వీడియోను ఇప్పటి వరకూ 60 లక్షల మంది వీక్షించారు. అయితే వీరిలో చాలామంది ఆ శునకానికి మద్దతుగా కామెంట్లు చేయడం విశేషం. జంతువులను అకారణంగా కవ్వించినా, అదిలించినా ఇలాంటి ఫలితమే ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు. Well done 😂😂 pic.twitter.com/nkFH2W1OB9 — CCTV IDIOTS (@cctvidiots) May 23, 2023 -
ఆస్తి తన పేరుమీద రాయలేదని భర్త చెవికొరికిన భార్య
ముంబై: భర్త పేరు మీద ఉన్న భూమిని తనపేరిట రాయలేదన్న కోపంతో భర్త చెంప కొరికింది ఓ భార్య. కోన్‌గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. తాలూకాలోని ఠాక్రాచపాడ గ్రామంలోని ఆటస్థలం ప్రక్కనున్న శంకరుని మందిర పరిసర ప్రాంతానికి చెందిన ప్రకాశ్ మారుతీ ఠాకూర్ (67) తన పూర్వీకుల స్థలాన్ని భార్య సునంద పేరు మీద రాయాల్సిందిగా పట్టుబట్టింది. అయితే ఆ స్థలం తన తల్లి, సోదరుడి పేరుతో ఉందని, పెద్దల సమక్షంలో నిర్ణయం తీసుకోవాలని భర్త చెప్పడంతో కోపంతో రగిలిపోయిన సునంద తన భర్తను వేధింపులకు గురిచేసింది. ఈ క్రమంలో కుమారుడు స్వప్నిల్, సునంద కలసి భర్త చెంప, వేళ్లను గట్టిగా కొరికేయడంతో ప్రకాశ్ ఠాకూర్ తీవ్రంగా గాయపడ్డాడు. సునంద, స్వప్నిల్‌పై స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా..ఐపీసీ 324, 506, 504,34 కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. చదవండి: విషాదం.. 75 మంది విద్యార్థులతో వెళ్తున్న బస్సు బోల్తా.. -
భయానక దృశ్యం.. చావు అంచుల దాకా వెళ్లొచ్చాడు!
నీటిలో దిగినప్పుడు చిన్న పురుగు కనిపించినా భయంతో ఒడ్డుకు చేరతాం. అలాంటిది భారీ ఆకారంతో మొసలి దాడి చేస్తే.. ఒక్క క్షణం గుండె ఆగినంత పనవుతుంది. అలాంటి అనుభవమే ఓ వ్యక్తికి ఎదురైంది. చెరువులో ఈత కొడుతుండగా ఒక్కసారిగా ఓ భారీ మొసలి(ఎలిగేటర్) అతడిపై దాడి చేసింది. చేతిని పట్టి లాగింది. అయితే, దాని నుంచి తప్పించుకుని ఒడ్డుకు చేరాడు ఆ వ్యక్తి. స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోను ‘ద సన్’ అనే యూట్యూబ్ ఛానల్లో 2021లో పోస్ట్ చేయగా.. 52 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. మళ్లీ ఇప్పుడు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. ఈ సంఘటన బ్రెజిల్లో జరిగింది. చెరువులో ఈత కొడుతున్న వ్యక్తి వైపు వేగంగా దూసుకొచ్చిన మొసలి అతని చేతిని పట్టి లాగేందుకు యత్నించింది. ఒడ్డుకు వేగంగా ఈదేందుకు బాధితుడు ప్రయత్నించగా చేతిని కరిచింది. దాని నుంచి తప్పించుకుని ఒడ్డుకు చేరుకుని ఊపిరి పీల్చుకున్నాడు. ఒడ్డుకు చేరుకున్నాక తన చేతిని పరిశీలించి చూడగా.. రక్తం కారుతూ కనిపించింది. ఇదీ చదవండి: మెట్లపై నుంచి పడిపోయిన రష్యా అధ్యక్షుడు పుతిన్ -
వైరల్ వీడియో : కుక్కపిల్లలను కాటేసిన కసాయి నాగు
-
షాకింగ్ ఘటన: కాటేసిన నాగును కొరికి చంపాడు
ఒక బాలుడు పాము కాటేసిందని కోపంతో కసిగా కొరికి చంపేశాడు. ఈ ఘటన చత్తీస్‌గఢ్‌లో రాయ్‌పూర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..చత్తీస్‌గఢ్‌లో రాయ్‌పూర్‌లో జష్పూర్ జిల్లాలోని పండర్పాండ్ గ్రామంలో దీపక్ అనే బాలుడు ఇంటి పెరటిలో ఆడుకుంటున్నాడు. ఇంతలో ఒక పాము అతని చేతిని చుట్టుకుని కాటేసింది. దీంతో ఆ బాలుడు నొప్పితో విలవిల లాడాడు. కానీ పాము బాలుడి చేతిని చుట్టుకుని వదలకపోవడంతో దులుపుకని వదిలించుకునేందుకు యత్నించాడు. కానీ ఆ పాము బాలుడి చేతిని వదలలేదు. దీంతో కోపంతో ఆ పాముని కసితీరా రెండుసార్లు గట్టిగా కొరికి చంపేశాడు. ఈ సంఘటన జరిగిన వెంటనే బాలుడు కుటుంబసభ్యులు హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. వెంటనే డాక్టర్లు యాంటీ స్నేక్ విషాన్ని అందించి ఒక రోజు అంతా అబ్జర్వేషన్లో ఉంచారు. తదనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి వెళ్లిపోయాడు. ఈ మేరకు పాములకు సంబంధించిన నిపుణుడు ఖైజర్ హుస్సేన్ మాట్లాడుతూ.. దీపక్ త్వరగా కోలుకున్నాడని చెప్పారు. ఇది పొడి కాటు అని అందువల్ల విషపూరితమైన పాము కాటు వేసినప్పటకి విషం విడుదల కాదని చెప్పారు. ఇటువంటి పాము కాట్లు చాలా నొప్పిగా అనిపిస్తాయని, అలాగే కాటు వేసిన చోట సాధారణ కాటు వేసిన లక్షణాలే కనిపిస్తాయని అన్నారు. ఐతే ఇలాంటి సంఘటన మాత్రం ఎప్పుడూ చూడలేదని అన్నారు. అంతేగాదు ఆ ప్రాంతాన్ని గిరిజనుల నాగ్లోక్ గ్రామం అని అంటారు. దీన్ని పాముల నివాసంగా చెబుతారు గ్రామస్తులు. (చదవండి: సెకను వ్యవధిలో జింకను మింగేసిన కొండచిలువ : వీడియో వైరల్) -
వైరల్ వీడియో: విమానంలో ప్రయాణికుడి వీరంగం...సిబ్బంది వేలు కొరికి...
-
విమానంలో ప్రయాణికుడి వీరంగం...సిబ్బంది వేలు కొరికి....
విమానంలోని ఒక ప్రయాణికుడు మద్యం మత్తులో బీభత్సం సృష్టించాడు. పైగా విమాన సిబ్బందితో వాగ్వాదానికి దిగి వేలు కొరికేశాడు. ఈ ఘటన ఇండోనేషియా రాజధాని జకర్తాకు బయలుదేరిన టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానంలో చోటు చేసుకుంది. విమానంలో ప్రయాణికులు అందరూ చూస్తుండగా సిబ్బందిపై పంచ్‌లు విసురుతూ చాలా దురుసుగా ప్రవర్తించాడు. దీంతో విమాన సిబ్బంది అతనిని కట్టడి చేసే క్రమంలో సిబ్బందిలో ఒకరు ప్రయాణికుడుని తన్నడం వంటివి చేశారు. ఐతే ప్రయాణికుడు తనకు మరింత కోపం తెప్పించందంటూ..హెచ్చరిస్తూనే ఆ ఫ్టైట్ అటెండెంట్ వేలుని కొరికేశాడు. దీంతో ఇస్తాంబుల్ నుంచి జకర్తా వెళ్తున్న ఆ టర్కీష్ విమానాన్ని అత్యవసరంగా మలేషియాలో కౌలాంలంపూర్కి మళ్లించారు. ఈ మేరకు మెడాన్‌లోని కౌలానాము అంతర్జాతీయ విమానశ్రంయంలో అత్యవసర ల్యాండింగ్ చేసి...ఈ వాగ్వాదానికి కారకుడైన సదరు ప్రయాణికుడిని దించేసి, గాయపడ్డ సిబ్బందికి చికిత్స అందించారు. సదరు ప్రయాణికుడు ఇండోనేషియా పౌరుడు, పైగా అతను సరుకు రవాణ చేసే క్యారియర్ ఫైలెట్‌గా గుర్తించి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు పోలీసులు. ఈ ఘటనపై మెడాన్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చ్ చేస్తోంది. (చదవండి: ఇక ఆపండి ప్లీజ్! దయచేసి ఇలాంటి వంటకం ట్రై చేయొద్దు.. ఇప్పటికైనా డిలీట్ చేయడం మంచిది) -
కొండచిలువతో పోట్లాడుతున్న కంగారు: వీడియో వైరల్
ప్రకృతి నియమం ప్రకారం ప్రతి జీవి ఏదో ఒకదానికి ఆహారమవుతుంది. ఆ తరుణంలో కొన్ని జంతువులు క్రూరంగా వేటాడటాన్ని చూస్తే చాలం భయానకంగా ఉంటుంది. ఆ క్రూర జంతువులు నుంచి ఈ జంతువు తప్పించుకుంటే బావుండును అనిపిస్తుంది కూడా. అచ్చం అలాంటి జుగుప్సకరమైన సంఘటన ఈ వైరల్ వీడియోలో చోటు చేసుకుంది. ఆ వీడియోలో ఒక కంగారును కొండచిలువ గట్టిగా చుట్టి చంపేందుకు ప్రయత్నిస్తుంటుంది. ఇంతలో మరో కంగారు జంప్ చేసుకుని వచ్చి మరీ తన స్నేహితుడిని విడిపించేందకు శతవిధాల యత్నిస్తుంటుంది. కానీ మరోవైపు కొండ చిలువ ఏదో విధంగా చంపి తినేందుకు చూస్తుంటుంది. కానీ కంగారు మాత్రం తనకు చేతనైనంత మేర ఆ కొండచిలువను రకరకాలుగా కొరుకుతూ తన స్నేహితుడుని విడిపించేందుకు ప్రయత్నించడం చూస్తేంటే ఒక విధమైన భావన కలుగుతుంది. కొండచిలువకు చిక్కిన ఆ కంగారు బతికితే బావుండును అనిపిస్తుంది. View this post on Instagram A post shared by Wildlifeanimall (@wildlifeanimall) -
ఆమె పార్లమెంట్లో అలా ఎందుకు చేసిదంటే.....
న్యూఢిల్లీ: పార్లమెంట్లో ధరల పెరుగుదల పై చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ విషయమై తృణమూల్ ఎంపీ కకోలి ఘోష్ దస్తీదార్ పార్లమెంట్లో లేచి నిలబడి మాట్లాడుతూ... చర్చకు అనుమతిచ్చినందుకు ధన్యావాదాలని చెబుతూ... పెద్ద ఎత్తున ధరల పెరుగుదల గురించి విమర్శలు చేశారు. ఇక తాము పచ్చి కూరగాయాలే తినాలని కోరుకుంటుందా ప్రభుత్వం అంటూ నిలదీశారు. వంటగ్యాస్ ధర గత కొన్ని నెలల్లోనే నాలుగు సార్లు పెరిగిందని ఇక ఏం వండుకుని ప్రజలు తింటారంటూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు. వంటగ్యాస్ ధర ఇలాపెరుగుతూ ఉంటే పచ్చి కూరగాయాలే తినాలంటూ... పార్లమెంట్‌లోనే అందరి ముందు పచ్చి వంకాయ తిని చూపిస్తూ... ప్రభుత్వ తీరు పై మండిపడ్డారు. అంతేకాదు ఈ వంటగ్యాస్ ధర రూ. 600 నుంచి రూ. 1100కి ఎలా పెరిగిందో వివరించి చెప్పడమే కాకుండా సిలిండర్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. పైగా ఉజ్వల పథకం కింద కనెక్షన్లు పొందిన పేద లబ్దిదారులకే ప్రభుత్వం సబ్సిడీని పరిమితం చేయడంతో సామాన్య కుటుంబాలు వంట గ్యాస్ కొనుగోలుకు సబ్సిడీ లేని రేట్లు చెల్లిస్తున్నారని కూడా ఈ సందర్భంగా కకోలి ఘోష్ చెప్పుకొచ్చారు. ఐతే కాంగ్రెస్ ఎంపీలు సస్పెండ్ అవ్వడంతో ఈ చర్చలు రెండుసార్లు వాయిదాపడ్డా తదనంతరం లోక్‌సభలో ఈ ధరల పెరుగుదల గురించి చర్చలు ఘాటుగా జరిగాయి. (చదవండి: పాత్రా చావల్ స్కామ్: వీడిన సస్పెన్స్.. ఈడీ కస్టడీకి సంజయ్ రౌత్.. ముంబై PMLA కోర్టు ఆదేశం) -
ఇద్దరు డాక్టర్ల సస్పెన్షన్ కు కారణమైన ఎలుకలు
-
కరోనా సోకిన ఎలుక కరవడంతో సైంటిస్టుకు పాజిటివ్
దాదాపు రెండేళ్ల నుంచి కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను పట్టిపీడిస్తోంది. కోట్లాది మంది కోవిడ్ భారిన పడగా.. లక్షలాది మంది ఈ మహమ్మారి బలితీసుకుంది. కరోనా తగ్గుముఖం పడతుందనుకున్న ప్రతీసారి మరో కొత్త రూపం దాల్చి మళ్లీ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. కరోనా వేరియంట్లలో ఆల్ఫా, బీటాలు పెద్దగా ప్రభావం చూపకపోయినా ఆ తరువాత వచ్చిన డెల్లా వేరియంట్ మాత్రం ప్రజలను ముప్పు తిప్పలు పెట్టింది. ఇక ఇప్పుడు దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ ప్రస్తుతం ప్రపంచ దేశాలకూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటి వరకు 57 దేశాలకు పాకింది. కరోనా మహమ్మారి ఇప్పటి వరకూ ఒక మనిషి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని తెలుసు. అలాగే కరోనా సోకిన వ్యక్తి తుమ్మినా, దగ్గినా, అతని వాడిన వస్తువులు వేరే వారు తాకిన కోవిడ్ వ్యాపిస్తుందని తెలుసు. అయితే తాజాగా ఎలుక కరిచినా కరోనా సోకుతున్నట్లు తేలింది. తైవాన్‌లోని అత్యంత కట్టుదిట్టమైన బయో-సేఫ్టీ ల్యాబరేటరీలోని ఓ సైంటిస్ట్‌కు ఎలుక కరవడంతో కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తైవాన్‌లోని టాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అకాడెమియా సినికా అనే జన్యుక్రమ విశ్లేషణ సంస్థలో పనిచేస్తున్న 20 ఏళ్ల మహిళకు వైరస్ సోకినట్లు తేలిందని అక్కడి ఆరోగ్య మంత్రి చెన్ షిహ్-చుంగ్ బ్రీఫింగ్ తెలిపారు. చదవండి:: కేరళలో మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం..బాతులు, కోళ్లను చంపేయండి! కాగా ఆమె ఈ మధ్యకాలంలో ఎక్కడికీ ప్రయాణం చేయలేదని, మోడర్నా ఎంఆర్ఎన్ఏ రెండు డోసుల వ్యాక్సిన్ ను కూడా సైంటిస్ట్ తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఇక గత నెల రోజులుగా ద్వీప దేశంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. చివరి సారిగా నవంబర్ 5న పాజిటివ్ నమోదైంది. తాజాగా ఎలుక కరవడంతో తొలి కేసు నమోదైంది. సైంటిస్ట్‌కు పాటివ్‌గా తేలడంతో ఆమెతో సన్నిహితంగా మెలిగిన 100 మందిని క్వారంటైన్లో ఉంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఎలుక కరవడం వల్లే కరోనా సోకింది అనేది ప్రాథమిక అంచనా మాత్రమేనని, ఎలుక కారణంగానే వైరస్ వ్యాపించిందో లేదో తెలుసుకోవడానికి మరింత పరిశోధన జరుగుతంద ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. మహిళకు డెల్టా వేరియంట్ సోకిందని అధికారులు భావిస్తున్నారు. కాగా, అకాడమికా సినికాలో జంతువుల్లోని వివిధ వ్యాధి కారక క్రిములను బయటకు తీసి పరిశోధనలను చేస్తుంటారు. టీకా పనితీరు, వాటి ప్రభావం వంటి వాటిని తెలుసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే సైంటిస్ట్‌కు ఎలుక కరిచిందని అధికారులు చెబుతున్నారు. చదవండి: ఒమిక్రాన్ అలజడి: భారత్‌లో మరో మూడు కేసులు.. -
చేయి కొరకడంపై శివబాలాజీ భార్య సీరియస్
MAA Elections 2021 : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్‌పై మంచు విష్ణు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే నిన్న జరిగిన ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్ద శివ బాలాజీ చేయిని సినీ నటి హేమ కొరకడం చర్చకు దారి తీసింది. పోలింగ్ కేంద్రం వద్ద తాను వెళ్తున్న సమయంలో శివబాలాజీ చేయి అడ్డుగా పెట్టాడని, తప్పుకోమంటే తప్పుకోలేదని, అందుకే చేయి కొరకాల్సి వచ్చిందని హేమ క్లారిటీ ఇచ్చింది. తాజాగా ఈ ఘటనపై శివబాలాజీ భార్య మధుమిత స్పందించింది. చదవండి: టీటీ ఇంజెక్షన్ వేయించుకున్న శివబాలాజీ ఆమె మాట్లాడుతూ.. ఇలాంటి పనులు మనుషులు మాత్రం చేయరు. ఇంతకన్నా ఇంకేమీ చెప్పలేను అని ఘాటుగా బదుల్చిచ్చింది. ఇక తన భర్త శివబాలాజీ గెలవడంపై హర్షం వ్యక్తం చేసింది. నిస్వార్థంగా సేవ చేసినప్పుడు దానికి ప్రతిఫలం దక్కుతుందని తాను నమ్ముతానని బదులిచ్చింది. చదవండి: MAA Elections 2021 Results: 'మంచు'కే మా అధ్యక్ష పదవి -
ఓవరాక్షన్లో మెడల్‌ను గట్టిగా కొరికేశాడు, ఆపై..
సాధారణంగా ఒలింపిక్స్ మెడల్స్ సాధించి.. ఫొటోగ్రాఫర్ల ఫోజుల కోసం పంటిగాట్లు పెట్టినట్లు అథ్లెట్లు నటించడం చూస్తున్నదే. కానీ, ఓ మేయర్ అతి వల్ల జపాన్‌లో రాజకీయ దుమారం చెలరేగింది. అథ్లెట్ నుంచి మెడల్ అందుకుని.. కసితీరా పంటితో గాట్లు పెట్టాడు ఆయన. ఈ చర్యకతో ఆయనకి వ్యతిరేకంగా ఏడు వేల ఫిర్యాదులు రావడం విశేషం. సాఫ్ట్ బాల్ ప్లేయర్ మియూ గోటో టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం కైవసం చేసుకుంది. సంబురాల్లో భాగంగా సొంత వూరు జపాన్ సెంట్రల్ సిటీ నయోగాలో జరిగిన ఓ ఈవెంట్‌కి ఆమె హాజరైంది. అక్కడే ఆ నగర మేయర్ టకాషి కవామురా అత్యుత్సహం ప్రదర్శించాడు. ఆమె నుంచి గోల్డ్ మెడల్‌ను అందుకుని మెడలో వేసుకున్న కవామురా.. తన ముఖానికి ఉన్న మాస్క్ కిందకి లాగేసి మరీ ఆ గోల్డ్ మెడల్‌ను గట్టిగా కొరికేశాడు. మెడల్‌పై పంటిగాట్లు బలంగా పడ్డాయి. ఈవెంట్ తర్వాత ఆ డ్యామేజ్ చూసి ఆందోళన చెందిన మియూ వెంటనే టోక్యో ఒలింపిక్స్ నిర్వాహకుల్ని సంప్రదించింది. చదవండి: గ్రేటెస్ట్ జాబితాలో బల్లెం వీరుడి ప్రదర్శన ఇక టోక్యో నిర్వాహకుల విజ్ఞప్తి మేరకు ఆ మెడల్‌ను మార్చేందుకు ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ మార్చడానికి సుముఖత వ్యక్తం చేసింది. అంతేకాదు ఆ మెడల్ మార్పిడికి అయ్యే ఖర్చును ఐవోసీనే భరించబోతోంది. మరోవైపు కరోనా టైంలో మాస్క్ తీసేసి నిర్లక్క్ష్యంగా వ్యవహరించడం, పైగా ఆమె విజయాన్ని అగౌరవపర్చడం తీవ్ర నేరాలంటూ మేయర్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెతున్నాయి. ఈ తరుణంలో తన స్థాయిని మరిచి ప్రవర్తించిన తీరుకు టకాషి కవామురా క్షమాపణలు తెలియజేశాడు. ఆమెకు కృతజ్ఞతలు ఒక టోక్యో ఒలింపిక్స్ వేదికగా మరో ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. జమైకా హర్డ్లింగ్ అథ్లెట్ హన్స్లే పర్చమెంట్ 110 మీటర్ల రేసులో స్వర్ణం సాధించాడు. అయితే రేసుకి ముందు పొరపాటున వేరే వేదిక దగ్గరికి వెళ్లిపోయాడు. అక్కడే ఉన్న వలంటీర్ ఒకామె.. జరిగిన పొరపాటును గుర్తించి సరైన వేదిక దగ్గరికి వెళ్లడం కోసం హన్స్లేకి డబ్బులిచ్చి మరీ సాయం చేసింది. View this post on Instagram A post shared by Hansle Parchment, OLY (@parchment_hansle) దీంతో డిస్క్వాలిఫైయింగ్ను తప్పించుకుని అతను అర్హత సాధించడం, ఆపై ఫైనల్ రేసులో గోల్డ్ సాధించాడు. ఇక తన విజయానికి మూల కారణమైన ఆ వలంటీర్‌ను వెతుక్కుంటూ వెళ్లి మరీ కృతజ్ఞతలు తెలియజేశాడు ఈ జమైకన్ అథ్లెట్. -
రెండు పాములను పట్టుకొని షోచేశారు.. కాసేపటికి..
కుమ్రంభీంజిల్లా(ఆదిలాబాద్): పాములను పట్టుకోవడంలో రాజులమని భావించారు. పట్టుకున్న పాములతో చాలాసేపు ఆడుకున్నారు.. ఈ క్రమంలో అదే పాముకాటు వేయటంతో ఒక యువకుడు చావుబతుకుల మధ్య ఆసుపత్రిపాలయ్యాడు. ఈ విషాద ఘటన కుమ్రంభీం జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జైనూర్ మండల కేంద్రంలోని హనుమాన్ దేవాలయం పక్కన రెండు పాములు కన్పించాయి. ఈ క్రమంలో స్థానికులు, సోనుపటేల్ గూడకు చెందిన కనక రాంజీ, కనక రాందాస్‌లకు సమాచారం అందించారు. దీంతో, అన్నదమ్ములిద్దరు అక్కడికి చేరుకున్నారు. అక్కడ ఆడుకుంటున్న జంట పాములను చేతితో ఓడిసి పట్టుకున్నారు. అంతటితో ఆగకుండా.. తాము పాములను పట్టుకున్నామని రోడ్డుపై వెళ్తున్న జనాలకు చూపెట్టారు. కాసేపు వాటితో ఆడుకున్నారు. ఒక పాము బుసలు కొడుతూ.. తీవ్రమైన కోపంతో కనక రాంజీ అనే యువకుడి ఏడమ చేయి బోటన వేలుపై కాటు వేసింది. దీంతో వారిద్దరు భయపడిపోయారు. అప్పటి వరకు ఉన్న వారి వినోదం కాస్త.. విషాదంగా మారిపోయింది. రాంజీని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. కాగా, పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్సకోసం ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. -
రెండు పాములను పట్టుకొని షోచేశారు.. కాసేపటికి..
-
దాచుకున్న డబ్బును కొరికేసిన ఎలుకలు : మహబూబాబాద్
-
పాడు ఎలుకలు.. ఆపరేషన్ కోసం దాచుకున్న డబ్బును..
మహబూబాబాద్ రూరల్: అసలే నిరుపేద... ఆపై అనారోగ్యం.. ఆపరేషన్ నిమిత్తం రూ.రెండు లక్షలు అప్పు చేశాడు.. ఆ డబ్బుకు సంబంధించిన నోట్లను తన పూరి గుడిసెలో దాచుకోగా ఎలుకలు ముక్కలు ముక్కలుగా కొరికేశాయి. బాధితుడు లబోదిబోమంటూ బ్యాంకులను ఆశ్రయించగా అవి చెల్లవని చెప్పారు. దీంతో ఎవరైనా ఆర్థికసాయం చేసి ఆదుకోవాలని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో శనివారం వెలుగుచూసింది. వివరాలు... మహబూబాబాద్ మండలం ఇందిరానగర్ కాలనీకి చెందిన భూక్యా రెడ్యా తోపుడుబండిపై కూరగాయలు అమ్ముకుని జీవిస్తున్నాడు. తన కడుపులో ఏర్పడిన కణితిని ఆపరేషన్ చేసి తొలగించేందుకు రూ.2 లక్షలు ఖర్చు అవుతాయని వైద్యులు చెప్పడంతో తెలిసినవారి వద్ద అప్పు చేశాడు. వాటితోపాటు కూరగాయలు అమ్మగా వచ్చిన రూ.50 వేల నగదును ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఇంట్లోని చెక్క బీరువాలో దాచాడు. రెండు, మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో డబ్బును పరిశీలించేందుకు బీరువా తెరిచి చూడగా రూ.2 లక్షలకు సంబంధించిన నోట్లను ఎలుకలు పనికిరాకుండా కొరికేశాయి. ప్రభుత్వం స్పందించి తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాడు. -
ఈ దృశ్యాన్ని చూసి జడుసుకోవాల్సిందే!
సాక్షి, న్యూఢిల్లీ : ఎవరు ఈ దృశ్యాన్ని చూసినా జడుసుకోవాల్సిందే. ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్త ఆడమ్ థార్న్ ముఖానికి అద్దాల ఫేస్‌మాస్క్ ధరించి ఆరడుగుల కొండ చిలువతో చిన్న ఫైట్‌కు దిగారు. కుడి చేతిని మోచేతి వరకు గట్టిగా మడిచి దమ్ముంటే తనపై దాడి చేయమని సవాల్ చేసినట్లున్నారు. ఆ కొండ చిలువ హఠాత్తుగా పైకి లేచి బార్లా తెరిచిన నోటితో థార్న్ మోచేతిని గట్టిగా పట్టి పీకింది. ఆ మంటను పంటి భిగువున థార్న్ భరించాల్సి వచ్చింది. పాములను పట్టడంలో అపార అనుభవం కలిగిన మిత్రుడు రాబ్ అల్లేవా సమక్షంలో ఈ ఫీటు నడిచింది. గట్టిగా థార్న్ చేతిని పట్టుకున్న కొండ చిలువను రాబ్ అల్లేవా లాగేశాడు. ఈ క్రమంలో కొండ చిలువ ఆయన్ని కూడా కాటేసింది. అనంతరం కొండ చిలువ పట్టి పీకిన చోట థార్న్ కుట్లు వేయించుకోవాల్సి వచ్చింది. వీరిద్దరు ‘హిస్టరీ ఛానెల్’లో ప్రసారం చేయడం కోసం ‘కింగ్స్ ఆఫ్ పెయిన్’ పేరిట ఓ సిరీస్‌ను రూపొందిస్తున్నారు. అందులో భాగంగా థార్న్ ఈ ఫీట్‌ను నిర్వహించారు. ఈ సిరీస్ డాక్యుమెంటరీలో భాగంగా వీరిద్దరు కొన్ని వందల సార్లు వివిధ రకాల పాములు, జంతువులతో ఇలా కరిపించుకున్నారు. థార్న్ వన్యప్రాణి బయోలజిస్ట్. తన మిత్రుడు రాబ్‌తో కలిసి ప్రపంచంలోని పలు దట్టమైన అడవుల్లోకి వెళ్లి వివిధ రకాల పాములు, జంతువులతోపాటు పలు రకాల కీటకాలతో కరిపించుకొని ఏది కరిస్తే ఎంత బాధ, ఎంత సేపుంటుందో ప్రజలకు తెలియజేసేందుకు ఓ 30 పాయింట్ల స్కేలును తయారు చేసి దానిపై నమోదు చేస్తూ వస్తున్నారు. 1980వ దశకంలో క్రిమికీటకాలు కరిస్తే ఎంత బాధ ఉంటుందో తెలియజేయడానికి ఎ ‘సూచిక’ను రూపొందించిన డాక్టర్ జస్టిన్ ష్మిడ్‌ను ఆదర్శంగా తీసుకొని వారు ఈ సిరీస్‌కు శ్రీకారం చుట్టారు. వారు ఇప్పటి వరకు భారీ బల్లులు, లైన్ ఫిష్‌గా వ్యవహరించే ప్రమాదకరమైన చేపలు, కొన్ని విష సర్పాలతో ఇలాంటి ఫీట్లు చేశారు. కొండ చిలువల కోరలకు విషయం ఉండక పోయిన ఓ మనిషిని చంపి తినేంతటి శక్తి ఉంటుందన్న విషయం తెల్సిందే. -
సైడ్ ఇవ్వమన్నందుకు వేలు కొరికేశాడు
మల్కాజిగిరి: దారి ఇవ్వాలని అడిగినందుకు కారులో వెళుతున్న ఓ వ్యక్తి ద్విచక్ర వాహనదారుడి వేలు కొరికిన సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ అశోక్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.మౌలాలి హనుమాన్‌నగర్‌కు చెందిన మహ్మద్ జాఫర్ పెయింటర్‌గా పనిచేసేవాడు. ఈ నెల 24న అతను బైక్‌పై లాలాపేట్ వెళుతుండగా మౌలాలి కమాన్ వద్ద ఎదురుగా ఇండికా కారు రావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కారు కొద్దిగా పక్కకు తీస్తే తాను వెళ్లిపోతానని జాఫర్ కోరడంతో ఆగ్రహానికి లోనైన కారు డ్రైవర్ మహ్మద్ ఆలి అతడిని దూషించడమే కాకుండా అతడిపై దాడి చేసి కుడిచేతి ఉంగరం వేలు కొరికివేయడంతో వేలే తెగి పడింది. తెగిపడ్డ వేలుతో వెంటనే ఆస్పత్రికి వెళ్లిన జాఫర్ చికిత్స అనంతరం సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు సోమవారం నిందితుడు మహ్మద్ ఆలిని సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మహ్మద్ ఆలి మౌలాలి షాదుల్లానగర్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. -
పిచ్చికుక్కల స్వైర విహారం..15 మందికి గాయాలు
కర్నూలు జిల్లా : నగర శివారులోని గోకులపాడులో శుక్రవారం పిచ్చికుక్కలు స్వైరవిహారం చేశాయి. కనపడిన ప్రతీ వ్యక్తిని కండలూడేలా కరిచాయి. ఈ ఘటనలో 15 మందికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిలో చిన్నారులు, వృద్దులే అధికంగా ఉన్నారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పిచ్చికుక్కుల గురించి అధికారులకు తెలియజేసినా వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, గ్రామంలో తిరగాలంటేనే హడలిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
షార్క్ తోక పట్టుకులాగాడు.. అంతే!
దారి తప్పి బీచ్ తీరానికి వచ్చిన చిన్న టైగర్ షార్క్ చేపను పట్టుకోవడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తి అందుకు మూల్యం చెల్లించుకున్నాడు. తోక పట్టుకునేందుకు ప్రయత్నించిన అతని చేతిని షార్క్ కొరికేసింది. దీంతో తీవ్ర రక్తస్రావమైంది. ఈ సంఘటన నార్త్ కరోలినాలోని వ్రైట్స్విల్లే బీచ్‌లో చోటు చేసుకుంది. ఇద్దరు స్నేహితులు టైగర్ షార్క్‌ను పట్టుకోవడానికి చేసిన ప్రయత్నాలకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో వైరల్ అయింది. వివరాల్లోకి వెళితే.. దారి తప్పి లోతు తక్కువగా ఉన్న ప్రాంతంలోకి వచ్చిందో టైగర్ షార్క్ చేప పిల్ల. తిరిగి లోతు ప్రాంతానికి వెళ్లడానికి యత్నిస్తున్న దాన్ని చూసిన ఇద్దరు స్నేహితులు పట్టుకునేందుకు ప్రయత్నించారు. నడుము లోతు ఉన్న నీటిలోకి దిగి షార్క్ తోక పట్టుకున్నాడు ఇద్దరి స్నేహితుల్లో ఒక వ్యక్తి. అంతే ఒక్కసారిగా వెనక్కు మళ్లిన షార్క్ అతని చేతిని కొరికేసింది. దీంతో అతని చేతికి తీవ్రగాయమై రక్తం స్రావం కావడం మొదలైంది. ఉబికి వస్తున్న రక్తాన్ని మరో చేత్తో అదిమి పట్టుకున్న వ్యక్తి ఒడ్డుకు పరుగెత్తాడు. ఆ తర్వాత ఎలాగో షార్క్‌ను పట్టుకుని తిరిగి సముద్రంలోకి వదిలేశారని తెలిసింది. గాయాలైన వ్యక్తి పరిస్ధితి ఎలా ఉందనే విషయంపై సమాచారం లేదు. -
తండ్రి, కొడుకులను కాటేసిన పాము
- తండ్రి మృతి - కుమారుడి పరిస్థితి విషమం కౌతాళం: మండల పరిధిలోని కామవరం గ్రామంలో తండ్రి, కుమారుడిని పాము కాటేయగా తండ్రి మృతి చెందాడు. కుమారుడు పరిస్థితి విషమంగా ఉంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన కొలిమి ఖాజహుసేన్ (65), అతని కుమారుడు మహబూబ్ (30) బుధవారం రాత్రి ఇంటి బయట నిద్రించారు. అర్ధరాత్రి సమయంలో ఇద్దరిని పాము కాటు వేయడంతో స్థానికంగా నాటు వైద్యం వేయించారు. గురువారం సాయంత్రం వరకు వీరు బాగానే ఉన్న రాత్రి ఉన్నట్టుండి అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు చికిత్స కోసం ఆదోని ఆసుపత్రికి తరలిస్తుండగా ఖాజహుసేన్ కోలుకోలేక మార్గమధ్యంలోనే చనిపోయాడు. కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. శుక్రవారం ఉదయం తండ్రి అంతిమ సంస్కారాలకు కొడుకును ఆసుపత్రి నుంచి గ్రామానికి తీసుకొచ్చారు. ప్రస్తుతం అతని పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది. -
కుక్కల దాడిలో మూగజీవాల మృత్యువాత
డిండి : కుక్కులదాడిలో ఏడు మూగజీవాలు మృతిచెందాయి. ఈ ఘటన మండల పరిధిలోని యర్రగుంట్లపల్లిలో గురువారం చోటు చేసుకుంది. వివరాలు.. మండల పరిధిలోని యర్రగుంట్లపల్లి గ్రామానికి చెందిన ముచ్చర్ల రాములుకు చెందిన ఆరు గొర్రెలు, మేక దొడ్డిలో ఉండగా ఒక్కసారిగా కుక్కలు దాడి చేయడంతో గాయపడి మృతిచెందాయి. వాటి విలువ సుమారు రూ. 50 వేలు ఉంటుందని బాధితుడు తెలిపాడు. ప్రభుత్వం ఆర్థికసాయం చేసి బాధితుడిని ఆదుకోవాలని టీఆర్ఎస్ మండల నాయకులు మల్రెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి కోరారు. -
కుక్కదాడిలో ఇద్దరికి గాయాలు
ఆత్మకూర్ (ఎస్) : కుక్క దాడిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మండల కేంద్రంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని మల్లన్నమర్రి వీధికి చెందిన మండాది మల్లమ్మతో పాటు రెండో తరగతి చదవుతున్న బుడిగె శిరీషను గాయపర్చింది. అంతకు ముందు రోజు అదే వీధికి చెందిన లింగయ్యను గాయపర్చి తప్పించుకుని పక్కనే గల పత్తి చేనులో నక్కింది. మళ్లీ రాత్రి సమయంలో వీధిలోకి వచ్చి ఇంట్లోనే నిద్రిస్తున్న మండాది మల్లమ్మపై దాడిచేసింది. అధికారులు స్పందించి వెంటనే కుక్కల బెడదను నివారించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
స్తంభంపల్లిలో పిచ్చికుక్క స్వైరవిహారం
ఇద్దరు చిన్నారులు, ఓ మహిళకు గాయాలు బోయినపల్లి : మండలంలోని స్థంబంపల్లి గ్రామంలో ఓ పిచ్చికుక్క ఆదివారం స్వైరవిహారం చేసింది. ఓ మహిళతోపాటు ఇద్దరు చిన్నారులను కరిచింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. బస్టాండ్ ప్రాంతంలో రేచిపల్లి గంగవ్వ (45)పై పిచ్చికుక్క దాడిచేసి కాలు, చేతిపై కరిచింది. తర్వాత ఎడమకన్ను కింది బాగంలో గాయపర్చింది. అనంతరం బీసీ కాలనీలో చేపూరి మిన్ను(5), పొన్నం శివ(4)పై దాడి చేసి వారి చేతులు, కాళ్లను కరిచింది. తర్వాత గ్రామస్తులు ఆ కుక్కను చంపేశారు. రెండు నెలల క్రితం కూడా ఓ పిచ్చికుక్క దాడి చేయగా నర్సయ్య, సుధాకర్ తదితరులు గాయపడ్డారు. పిచ్చికుక్కల బెడద నివారించేందుకు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కస్తూరి బాపురెడ్డి, అల్లూరి రవీందర్‌రెడ్డి అధికారులను కోరారు. -
పాము కాటుతో విద్యార్థి మృతి
తిరుమలగిరి: మండలంలోని ఈటూరు గ్రామానికి చెందిన జి.గౌతమ్ (6) అనే విద్యార్థి పాము కాటుకు గురై శుక్రవారం మృతి చెందాడు. గౌతమ్ గురువారం రాత్రి ఇంట్లో పడుకొని ఉండగా పాము కాటు వేసింది. గమనించిన తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించగా అక్కడే మృతి చెందారు. మృతుడు స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఒకటవ తరగతి చదువుతున్నాడు. మృతుడి సంతాప సూచకంగా విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులు సంతాపం తెలిపారు. -
పాము కాటుతో విద్యార్థిని మృతి
నారాయణపురం (కల్లూరు) : మండలంలోని నారాయణపురం గ్రామంలో సోమవారం అర్ధరాత్రి పాము కాటు వేయడంతో విద్యార్థిని మృతి చెందింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. బీసీ కాలనీకి చెందిన బిల్లకంటి సావిత్రి కుమార్తె పూజిత (15) కల్లూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. సోమవారం రాత్రి చాప వేసుకుని కింద పడుకుంది. అర్ధరాత్రి సమయంలో పాము కాటు వేయడంతో కుటుంబ సభ్యులు పూజితను కల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న పాఠశాల హెచ్ఎం మాధవరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మృత దేహాన్ని సందర్శించారు. -
పాముకాటుతో విద్యార్థి మృతి
పెద్దఅడిశర్లపల్లి : పాముకాటుతో విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన పీఏపల్లి గ్రామపంచాయతీ పరిధి బాలాజీనగర్‌లో గురువారం చోటు చేసుకుంది. వివరాలు... బాలాజీనగర్‌కు చెందిన మెగావత్ భాస్కర్ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. భాస్కర్‌కు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. వీరిలో పెద్ద కుమారుడైన మెగావత్ పవన్‌నాయక్ (13) కొండమల్లేపల్లి పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 2వతరగతి చదువుతున్నాడు.ఉదయం ఇంటి వద్దే ఉన్న పవన్ బహిర్భూమికి వెళ్లిన సమయంలో పాము కాటు వేసింది. దీంతో ఇంటికి వచ్చి కళ్లు తిరుగుతున్నాయని ఒంట్లో నలతగా ఉందని తన తండ్రి భాస్కర్‌కు చెప్పాడు. కుమారుడిని గమనించిన తండ్రి భాస్కర్ ఒంటిపై పాము కాటు వేసిన గుర్తులు చూసి హుటాహుటీనా చికిత్స నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. -
పిచ్చికుక్క స్వైర విహారం
– నలుగురికి తీవ్ర గాయాలు వలిగొండ : మండలంలోని ప్రొద్దటూరులో ఆదివారం ఉదయం పిచ్చికుక్క స్వైర విహారం చేసి నలుగురి తీవ్రంగా గాయపరి చింది. గాయపడిన వారిలో దుబ్బ నర్సింహ, స్వామి, రాజయ్య, సాయి ఉన్నారు. వీరిలో నర్సింహ, స్వామిని 108లో, రాజయ్య, సాయిని ప్రైవేట్ వాహనంలో భువనగిరి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లి అక్కడి నుంచి హైదరాబాద్‌లోని కోరంటి వైద్యశాలకు తరలించారు. కుక్క మనుషులతో పాటు పది గేదెలు, ఒక మేకను కరిచింది. దీంతో గ్రామస్తులు కుక్కను వెంటాడి చంపేశారు. కాగా, బాధితులను జెడ్పీటీసీ మొగుళ్ల శ్రీనివాస్, మాద శంకర్, తుమ్మల వెంకట్‌రెడ్డి, వంగాల భిక్షపతి పరమార్శించారు. -
బీచ్‌లో స్నానం చేద్దామని మహిళ వెళ్లగానే..
ఫ్లోరిడా: ఫ్లోరిడాలో అనూహ్య సంఘటన జరిగింది. బోకా రాటోన్ సముద్ర తీరంలోని బీచ్‌లో సరదాగా స్నానం చేసేందుకు వెళ్లిన ఓ యువతిని ఓ రెండడుగుల షార్క్ చేప అమాంతం కరిచేసింది. దాని పళ్లను పూర్తిగా ఆమె కుడి చేతి మోచేయి, మణికట్టు మధ్య భాగంలో దించి అలాగే కరిచిపట్టుకొని ఉండిపోయింది. దాంతో ఆమె భయంతో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. పైగా చుట్టుపక్కల వారు ఆమెను సమీపించి ఆ షార్క్‌ను ఎంత విడిపించాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో అక్కడి అత్యవసరం విభాగం 911కు ఫోన్ కాల్ చేయడంతో అగ్నిమాపక సిబ్బంది ఆ బీచ్‌కు చేరుకున్నారు. ఆమె చేతిని అలాగే కరిచిపట్టుకొని ఉన్న ఆ షార్క్ చేపను కొట్టి చంపారు. అయినప్పటికీ అప్పటికే దాని పళ్లు పూర్తిగా ఆమె చేతిలోకి దిగిపోయి ఉండటంతో ఆ షార్క్‌తో సహా ఆస్పత్రికి తీసుకెళ్లారు. 23 ఏళ్ల మహిళకు ఈ చేదు అనుభవం ఎదురైంది. ఈ ఘటనతో అక్కడ బీచ్‌లో సరదాగా గడిపే వారంతా బిత్తరపోయారు. -
రెడ్ బ్యాక్... యమ డేంజర్!
విష జంతువులు, పురుగులతో జర జాగ్రత్తగానే ఉండాలన్న విషయం మరోసారి రుజువైంది. చూసేందుకు సూక్ష్మంగా కనిపించినా వాటిలో విషం మహ పవర్ ఫుల్ గా ఉండే అవకాశాలు ఉంటాయన్నది మళ్ళీ తెలిసింది. చిన్న సాలీడు కుట్టినా ప్రాణం పోతుందన్నది ఇప్పుడు ఆస్ట్రేలియా తూర్పు ప్రాంతంలో జరిగిన ఘటనతో వెలుగులోకి వచ్చింది. 'రెడ్ బ్యాక్' స్పైడర్ కుట్టి ఓ యువకుడు చనిపోవడం అక్కడి జనాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. ఆస్ట్రేలియాలో సిడ్నీకు చెందిన జాయ్ డెన్ బర్లైగ్ అనే 22 ఏళ్ళ యువకుడు న్యూ సౌత్ వేల్స్ ప్రాంతంలోని నార్త్ కోస్ట్ ప్రాంతంలో వాకింగ్ చేస్తుండగా 'రెడ్ బ్యాక్' సాలీడు కుట్టి చనిపోవడం అక్కడి జనాన్ని భయకంపితుల్ని చేసింది. గతవారం జాయ్ డెన్ ఎడమ మోచేతిని సాలీడు కుట్టడంతో విషం అతని గ్రంధులకు చేరిపోయింది. నాలుగు రోజులపాటు యాంటీబయోటిక్స్ తో వైద్యం అందించిన డాక్టర్లు గురువారం ఆస్పత్రినుంచి డిశ్చార్జి చేశారు. ఒకరోజు బాగానే ఉన్న అతడు ఆదివారం చనిపోయాడు. అయితే జాయ్ కు నంబోర్ ఆస్పత్రి వైద్యులు విషానికి విరుగుడుగా మందు అందించారో లేదో అన్న అనుమానం అతడి తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు. యాంటీ వీనమ్ అభివృద్ధి పరిచిన అనంతరం 1955 తర్వాత రెడ్ బ్యాక్ కుట్టడంతో మనుషులు చనిపోయినట్లు రికార్డుల్లో మాత్రం ఎక్కడా లేనట్లు తెలుస్తోంది. జాయ్ మరణం తమకు తీరని విషాదంగా మారిందని, తమ కొడుకు ప్రాణాన్ని సాలీడు రూపంలో మింగేస్తుందని ఊహించలేదని జాయ్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఏడాది క్రితం చిన్నకొడుకు లచ్లాన్ కారు ప్రమాదంలో చనిపోయాడు. తీవ్ర గాయాలతో బయటపడ్డ జాయ్ ఇప్పుడిప్పుడే కోలుకోగా... వారం క్రితం సాలీడు కుట్టడంతో వచ్చిన ఇన్ఫెక్షన్ తో నాలుగు రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొంది, తీరా ఇంటికి వచ్చిన రెండు రోజులకు ప్రాణం పోవడం ఆ తల్లిదండ్రులు నమ్మలేకపోతున్నారు. తమ కుమారుడికి వైద్యులు సరైన విషం విరుగుడు మందు ఇచ్చారో లేదో అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జాయ్ డెన్ ప్రకృతి ప్రేమికుడని, పర్వతాలు ఎక్కడం, సముద్రాల్లో డైవింగ్, అడవుల అన్వేషణ వంటి సాహసోపేతమైన ప్రయత్నాలు చేసేవాడని మరెవ్వరికీ ఇటువంటి నష్టం జరగకుండా విష పురుగులతో ప్రమాదాలను నివారించే ప్రయత్నాలు మరింత జరగాలని కోరుతున్నారు. వైవిధ్యభరితమైన సాలె పురుగులకు ఆస్ట్రేలియా ప్రసిద్ధి. అయితే వాటిలో చాలా జాతులు మనుషులకు కొద్దిపాటి ముప్పు తెచ్చిపెట్టేవే అయినా ప్రాణాంతకం మాత్రం కావు. అయితే బ్లాక్ విడో జాతికి చెందిన రెడ్ బ్యాక్ మాత్రం దేశంలోని పెద్ద నగరాలతో సహా అన్ని ప్రాంతాల్లోనూ కనిపిస్తూనే ఉంటుంది. ఆస్ట్రేలియాలోని రెండు డేంజరస్ సాలె పురుగుల్లో ఇది ఒకటిగా చెప్పొచ్చు. ఆ ఖండంలోనే కాక ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన సాలెపురుగు మాత్రం ఫన్నల్-వెబ్. ఈ ఫన్నల్ వెబ్ కుట్టడం కారణంగా 1980 తర్వాత ఎవరూ చనిపోయినట్లుగా రికార్డులు లేవని ఆస్ట్రేలియా మ్యూజియం ఆధారాలను బట్టి తెలుస్తోంది. అయితే సంవత్సరానికి కనీసం 2 వేల మంది దాకా రెడ్ బ్యాక్ కాటుకు గురౌతూనే ఉంటారని, ఈ సాలె పురుగు కుట్టినప్పుడు తీవ్రమైన మంట, నొప్పి, నరాల బలహీనత, వాంతులు వంటి బాధలు కలుగుతాయని చెప్తున్నారు. కాగా ముఖ్యంగా ఆడ పురుగులు కుట్టినప్పుడు అవి వాటి చొంగను వదులుతాయని దాంతో కొంత ప్రమాదమేనని చెప్తున్నారు. -
తండ్రి, కుమార్తెను కాటేసిన పాము
అనంతపురం: ఇంట్లో నిద్రిస్తుండగా కట్లపాము ప్రవేశించి తండ్రి, కుమార్తెలను కాటు వేసింది. ఈ సంఘటన శనివారం తెల్లవారుజామున అనంతపురం జిల్లా ఉవరకొండ మండలం రేణుమాకులపల్లి గ్రామంలో జరిగింది. అనుమంతప్ప, అతని కుమార్తె అక్షయలు ఇంట్లో నిద్రిస్తున్నారు. ఇంతలో ఇంటి పక్కనే ఉన్న పొదల్లోంచి వచ్చిన కట్లపాము ఇంట్లోకి ప్రవేశించి కాటు వేసింది. దీంతో వెంటనే వీరిద్దరిని అనంతపురం ఆస్పత్రికి తరలించగా, వైద్యులు పాము కరిచిందని నిర్ధారించారు. కాగా, ప్రస్తుతానికి తండ్రి ఆరోగ్యం నిలకడగానే ఉండగా, కుమార్తె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. -
'చీమ కుట్టినట్లైనా లేదే!'
వేంపల్లె: రైతులు వరుస కరువులతో కొట్టుమిట్టాడుతుంటే సీఎం చంద్రబాబు నాయుడుకు చీమ కుట్టినట్లైనా లేదని కాంగ్రెస్ నేత ఎన్.తులసిరెడ్డి ధ్వజమెత్తారు. గోదావరి పుష్కరాల్లో నిండా మునిగి తేలుతూ ప్రచార ఆర్భాటానికే ఆసక్తి చూపుతున్న సీఎం చంద్రబాబు.. రైతుల కష్టాల గురించి పట్టించుకోకపోవడం తగదన్నారు. వైఎస్ఆర్ జిల్లా వేంపల్లెలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పుష్కరాల కోసం రూ.1600 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం.. రాష్ట్రంలోని రైతులకు 2013-14, 2014-15 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన పంటల బీమా రూ.2,560 కోట్లు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడం దురదృష్టకరమన్నారు. 2012-13 రబీ సీజన్లో వైఎస్ఆర్ జిల్లాలో 70 వేల మంది శనగ, పొద్దుతిరుగుడు రైతులు బీమా ప్రీమియం చెల్లించారని.. రెండేళ్లుగా నష్టపరిహారం కోసం ఎదురు చూస్తున్నారన్నారు. సీఎం జపాన్, చైనా, సింగఫూర్ దేశాల్లో తిరుగుతూ రైతుల సమస్యలను గాలికొదిలేశారని ఆయన విమర్శించారు. కష్టాల్లో ఉన్న రైతులను ఓదార్చి, వారి సమస్యలపై రాష్ట్ర ప్రభుత్తాన్ని నిలదీసేందుకు ఈనెల 24న రాహుల్ గాంధీ అనంతపురం జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారన్నారు. అప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యం వీడకపోతే ప్రత్యక్ష ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. పది రోజులుగా మున్సిపల్ కార్మికులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం అన్నారు. ప్రధాని నరేంద్రమోడి స్వచ్ఛ భారత్.. అంటుంటే, చంద్రబాబు చెత్తాంధ్రప్రదేశ్‌గా మారుస్తున్నారని ఎద్దేవా చేశారు. -
హైదరాబాద్‌లో కుక్కల స్వైరవిహారం
-
వసతి గృహంలోని బాలికకు పాముకాటు
నెల్లూరు: నెల్లూరు జిల్లాలోని కోవూరు మండలంలోని బాలికల వసతి గృహంలో పదోతరగతి చదువుతున్న సుమతి(15) అనే విద్యార్థి పాము కాటుకు గురైంది. వివరాలు.. ఈ రోజు(ఆదివారం) తెల్లవారుజామున బాలిక కాలుకు పురుగు కుట్టిందేమో అని భావించి, పట్టించుకోలేదు. కానీ ఉదయం నుంచి ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆమెను వసతిగృహం సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. బాలికను పరిశీలించిన ఆస్పత్రి వర్గాలు బాలికను పాము కరించిందని నిర్ధారించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
పదహారుమందిని కరిచేశాయి
పొదిలి : ప్రకాశం జిల్లా పొదిలిలో పిచ్చి కుక్కల దాడిలో 16 మందికి గాయాలయ్యాయి. సోమవారం అర్ధరాత్రి నుంచి పొదిలి మేజర్ పంచాయతీ పరిధిలోని పొదిలి పట్టణంతోపాటు రాజుపాలెంలో మూడు పిచ్చి కుక్కలు స్వైర విహారం చేశాయి. కనిపించిన వారిపై దాడి చేశాయి. వీటి దాడిలో 16 మంది గాయపడ్డారు. వారిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన వారిని ఒంగోలులోని రిమ్స్‌కు, మిగిలిన వారిని పొదిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా మూడు పిచ్చి కుక్కల్లో ఒక దానిని స్థానికులు కొట్టి చంపగా మిగతా రెండూ తప్పించుకుపోయాయి. -
తొమ్మిదిమందిని కరిచేశాయి
కృష్ణా: మరోసారి కుక్కలు స్వైర విహారం చేశాయి. స్థానికులను హడలెత్తించాయి. చందర్లపాడు మండలం విపరింతలపాడు గ్రామంలో కుక్కలు ఇష్టమొచ్చినట్లుగా రెచ్చిపోయాయి. కనిపించివారందరిపై దాడి చేశాయి. మొత్తం తొమ్మిదిమంది వీటివల్ల గాయాల పాలయ్యారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వీరందరినీ ఆస్పత్రికి తరలించి వైద్య సాయం అందిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం, గ్రామ నిర్వహణ కార్యకలాపాల్లో నిర్లక్ష్యం మూలంగా ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. వెంటనే వాటి బారినుంచి బయటపడే రక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
పాము 'తలే' ప్రాణం తీసింది!
చైనా:పాము తలను మొండెం నుంచి వేరు చేశాడు. ఆ మాంసాన్ని వంటకు సిద్ధం చేశాడు. అయితే ఆ వేరు చేసిన తల ప్రాణంతోనే ఉన్నదన్న సంగతి మరిచాడు. అలా చేయడమే అతని ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ తాజా నమ్మశక్యం కాని ఘటన చైనాలోని ఫోషన్ నగరంలోని కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. ఒక చెఫ్ త్రాచు పామును మాంసాహారంగా చేయడం కోసం ఒక కత్తితో ఆ పాము తలను, మొండాన్ని వేరు చేశాడు. ఇక వంటకు సిద్ధం అయ్యే క్రమంలో ప్రక్కనే ఉన్న పాము తలను చెత్తబుట్టలో పాడేయడానికి వెళ్లాడు. అయితే ఆ పాము తల మాత్రం అప్పటికీ ఊపిరితోనే ఉంది. అది ఆ చెఫ్ ను కాటువేయడంతో అతను కొద్దిపాటి సమయంలోనే ప్రాణాలు కోల్పోయాడు.ఇటువంటి ఘటనలు అరుదుగా జరిగినా.. పాము తలను వేరుచేసిన గంట తరువాత కూడా బ్రతికే ఉంటాయనేది ఇక్కడ గమనించాల్సిన విషయం. -
కుక్క కాటు
-
చెప్పుకోలేని చోట కొరికేసింది
ఆమెకు కోపం వచ్చింది. అలిగి కూచుంది. ఆయనకు పట్టుదల పెరిగింది. నువ్వు వండకపోతే నేనే వండుకుంటాను అంటూ వంటింట్లోకి వెళ్లాడు. నా వంటింట్లోకి నువ్వు వెళ్లొద్దంటూ ఆమె అడ్డం పడింది. అంతే ఇద్దరూ బాహాబాహీ ముష్టా ముష్టీ కొట్టుకున్నారు. ఆ పోరాటంలో ఆయన కట్టుకున్న టవల్ జారిపోయింది. ఆయన 'దివ్యమంగళరూపాన్ని' చూసిన ఆమెకు నషాళానికి అంటింది. అంతే కసక్కున కొరకరాని చోట కొరికేసింది. ఇదంతా మే 4 న మధ్యప్రదేశ్ లోని సత్నా జిల్లాలోని పాగ్రా గ్రామంలో జరిగింది. ఆయన పేరు జితేన్ పటేల్, ఆమె పేరు ఉమా పటేల్. వాళ్లిద్దరూ రెండేళ్లు ప్రేమించుకుని పెళ్లాడారు. పెళ్లి తరువాత ప్రేమ వికటించి ప్రేమ గాట్ల నుంచి కోపపు కాట్ల దాకా ఎదిగింది. అయితే బయట చెప్పుకుంటే పరువునష్టమని జితేన్ నెల రోజుల పాటు తనలోనే దాచుకున్నాడు. ఇప్పుడు ఆయనకు మొత్తం చీము పట్టేసింది. దాంతో తప్పనిసరై ఆస్పత్రికి వెళ్లడంతో అంతా బట్టబయలైంది. ఇప్పుడు జితేన్ సర్జరీ చేయించుకుంటున్నారు. ఉమ కేసులను ఎదుర్కొంటోంది.