budi mutyala naidu
-
పారిపోయిన సీఎం రమేష్
-
డిప్యూటీ సీఎం పై సీఎం రమేష్ అనుచరుల కుట్ర
-
అనకాపల్లిలో కలకలం.. బూడి ముత్యాలనాయుడు హత్యకు కుట్ర!
సాక్షి, అనకాపల్లి: ఏపీలో ఓటమి తప్పదని భావించిన కూటమి నేతలు హత్యా రాజకీయాలకు తెరలేపారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దాడి జరిగిన ఘటన మరువక ముందే తాజాగా మరో ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. అనకాపల్లిలో డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడి హత్యకు కుట్ర జరిగినట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. బూడి ముత్యాల నాయుడు ప్రస్తుతం అనకాపల్లిలోని ఆయన స్వగ్రామం తారువలో ఉన్నారు. ఈ సందర్భంగా ముత్యాల నాయుడు ఇంటి వద్ద కొందరు వ్యక్తులు రెక్కీ నిర్వహించారు. డ్రోన్ సాయంతో విజువల్స్ తీశారు. దీంతో, అనుమానం వచ్చి స్థానికులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆరా తీశారు. విజువల్స్ తీస్తున్న వారిని పట్టుకుని ప్రశ్నించారు. ఈ క్రమంలో వారు పొంతనలేని సమాధానం ఇచ్చారు.అనంతరం దేవరపల్లి పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో వారు స్థానికులు కాదని పోలీసులకు తెలిపారు. దీంతో, ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారి వద్ద ఉన్న బీజేపీ కండువాలను, జెండాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా, అక్కడ డ్రోన్‌ను ఎందుకు ఎగురవేశారని ప్రశ్నించగా వారు సమాధానం చెప్పకోవడంతో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానికులు మాట్లాడుతూ.. అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో ముత్యాల నాయుడికి లభిస్తున్న ఆదరణను ఓర్వలేకనే బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. -
ఒక రౌడీని గెలిపిస్తే అనకాపల్లి నాశనం అయిపోతుంది
-
అనకాపల్లిలో సామాన్యుడు బలవంతుడికి మధ్య పోటీ- బూడి ముత్యాలనాయుడు
-
అనకాపల్లి ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన YSRCP
సాక్షి, గుంటూరు: అనకాపల్లి లోక్‌సభ స్థానానికి అభ్యర్థి పేరును వైఎస్సార్సీపీ ప్రకటించింది. డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడిని బరిలో నిలుపుతున్నట్లు పేర్కొంది. ఇప్పటికే 175 ఎమ్మెల్యే, 24 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించిన వైఎస్సార్సీపీ.. అనకాపల్లి ఎంపీ సీటు ఒక్కదానినే పెండింగ్‌లో ఉంచిన సంగతి తెలిసిందే. బూడి ముత్యాల నాయుడు కొప్పుల వెలమ సామాజిక వర్గం. ప్రస్తుతం మాడుగుల సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన్ని ఎంపీ అభ్యర్థిగా ప్రమోషన్ ఇచ్చారు సీఎం జగన్. దీంతో.. మాడుగుల స్థానానికి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈర్లి అనురాధను ఎంపిక చేశారు. అనురాధ బూడి ముత్యాలనాయుడు కుమార్తె. గత ఎన్నికల ఫలితాలేంటీ? మాడుగుల స్థానంలో పోటీ చేసిన బూడి ముత్యాలనాయుడు 16392 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఇక అనకాపల్లి పార్లమెంటు స్థానంలో 2019 ఎన్నికల్లో వైఎస్సార్సిపి ఘనవిజయం సాధించింది. పార్టీ అభ్యర్థి బీశెట్టి వెంకట సత్యవతి 89,192 ఓట్ల మెజార్టీతో గెలిచారు. -
బొబ్బిలిలో బడుగుల గర్జన
సాక్షి ప్రతినిధి, విజయనగరం: విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సామాజిక సాధికార విజయ నినాదంతో గర్జించారు. బుధవారం బొబ్బిలిలో జరిగిన వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలకు నియోజకవర్గం నలు దిక్కుల నుంచి ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. వందలాది బైక్‌లతో యువకులు ర్యాలీగా వచ్చారు. ముందుగా మెట్టవలసలో కొత్తగా నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం (ఆర్బీకే), భారత్ నిర్మాణ్ సేవా కేంద్రం–వెల్నెస్ సెంటర్ భవనాలను డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకటచిన్న అప్పలనాయుడు ప్రారంభించారు. అనంతరం నియోజకవర్గంలో అట్టహాసంగా యాత్ర నిర్వహించారు. బొబ్బిలి శ్రీకళాభారతి ఆడిటోరియం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వేలాది మంది పోటెత్తారు. జై జగన్... జై వైఎస్సార్సీపీ నినాదాలతో ప్రజలు హోరెత్తించారు. నాలుగేళ్లలో ఎంతో మేలు: శంబంగి రైతులు ఎక్కువగా ఉన్న బొబ్బిలి నియోజకవర్గంలో ఈ నాలుగేళ్లలో కొత్తగా 11,500 ఎకరాలకు సాగునీరు అందించామని, మరో 4,500 ఎకరాలకు నీరందించడానికి పనులు చేయాల్సి ఉందని ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్నఅప్పలనాయుడు చెప్పారు. ఈ సభలో ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, బొత్స అప్పలనర్సయ్య, బడ్డుకొండ అప్పలనాయుడు, అలజంగి జోగారావు, ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో నిర్వహించిన సామాజిక సాధికార యాత్ర సభకు హాజరైన అశేష జనవాహినిలో ఓ భాగం బలహీనవర్గాలకు పెద్ద పదవులిచ్చిన సీఎం జగన్: ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు పెత్తందారులకు మాత్రమే పెద్దపీట వేసిన టీడీపీ పాలనకు భిన్నంగా బలహీనవర్గాలకు పెద్ద పదవులు కట్టబెట్టిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు చెప్పారు. సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వారికీ సీఎం జగన్ సముచిత స్థానం ఇచ్చారన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యమిచ్చారని తెలిపారు. ధనవంతుల పిల్లల్లాగే పేదల బిడ్డలకు ఇంగ్లిష్ మీడియం విద్యను అందుబాటులోకి తెచ్చారన్నారు. బడుగు, బలహీన వర్గాలు సాధించిన సాధికారత కొనసాగాలంటే సీఎం వైఎస్ జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. సంక్షేమ పాలన జగన్‌తోనే సాధ్యం: పుష్పశ్రీవాణి సంక్షేమ పాలన సీఎం వైఎస్ జగన్‌తోనే సాధ్యమని కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి అన్నారు. వివిధ సంక్షేమ పథకాల కింద దళితులకు రూ.75 వేల కోట్లు, గిరిజనులకు రూ.25 వేల కోట్ల ఆర్థిక ప్రయోజనం అందించారని చెప్పారు. బొబ్బిలి గడ్డపై జనసునామీ: మజ్జి శ్రీనివాసరావు సీఎం వైఎస్ జగన్ పిలుపుతో జరుగుతున్న సామాజిక సాధికార యాత్రకు బొబ్బిలి గడ్డపై జనసునామీ పోటెత్తిందని విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు చెప్పారు. బొబ్బిలి ప్రజల చిరకాల వాంఛ రెవెన్యూ డివిజన్‌ను సీఎం జగన్ సాకారం చేశారని చెప్పారు. చెరకు రైతుల బకాయిలు సుమారు రూ.35 కోట్లు చెల్లించారన్నారు. గతంలో ఇక్కడ గెలిచిన బొబ్బిలి రాజులు పదవుల కోసం పార్టీ మారారని, ఆస్తులు పెంచుకోవడమే తప్ప ప్రజల కష్టాలను పట్టించుకోలేదని విమర్శించారు. -
బడుగు బలహీనర్గాలకే కీలక పదవులు: బూడి మూత్యాల నాయుడు
సాక్షి, అనకాపల్లి: అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలో గురువారం వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బహిరంగ సభ నిర్వహించారు. డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సభకు మంత్రి బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, డిప్యూటీ సీఎం రాజన్న దొర, మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ సత్యవతి, ఎమ్మెల్యేలు ధర్మ శ్రీ, ఉమా శంకర్ గణేష్, గొల్ల బాబూరావు, అడీప్ రాజు, ఎమ్మెల్సీ కళ్యాణి, విశాఖ డెయిరీ చైర్మెన్ అడారి ఆనంద్. తదితరులు హాజరయ్యారు. ఎంపీ సత్యవతి పాయింట్స్ ►పేదరికం నుంచి బయట పడడానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు సీఎం జగన్ ప్రవేశ పెట్టారు. ►సీఎం జగన్ 17 కొత్త మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నారు. ►ఆరోగ్య శ్రీ ద్వారా ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. ►వచ్చే ఎన్నికల్లో 175 కు 175 వైఎస్సార్సీపీ సాధిస్తుంది. బూడి ముత్యాల నాయుడు పాయింట్స్ ►ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా సంక్షేమ కార్యక్రమాలు సీఎం జగన్ అమలు చేస్తున్నారు. ►పార్టీలకు అతీతంగా అర్హులకు సంక్షేమ కార్యక్రమాలు సీఎం జగన్ అందిస్తున్నారు. ►ముడు వంతుల్లో రెండు వంతులు బడుగు బలహీన వర్గాలు స్థానం కల్పించారు. ►కీలకమైన పదవులు బడుగు బలహీనర్గాలకు కట్టబెట్టారు. ►నాడు నేడు ద్వారా విద్యా వైద్య రంగంలో విప్లాత్మకమైన మార్పులు తెచ్చారు. ►కార్పొరేట్ స్కూల్‌కు ధీటుగా ప్రభుత్వ పాటశాలను మార్చారు. ►ఇంగ్లీష్ మీడియంను అలీబాబా 40 దొంగలు హేళన చేశారు. ►చంద్రబాబు, గంటా, అయ్యన్న, బండారు మనవాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదవాలి. ►పేదలు పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదవ కూడదు అంటా. ►ఇంగ్లీష్ మీడియం చదువులు లేక గతంలో ఎంతో మంది పిల్లలు విదేశాల్లో ఉద్యోగాలు కోల్పోయారు. ►దివంగత నేత ఫీజ్ రియంబర్స్ మెంట్ వలన పేదల పిల్లలు విదేశాల్లో ఉద్యోగాలు సాధించారు. ►బడుగు బలహీనర్గాలకు సీఎం జగన్ పాలనలో న్యాయం జరిగింది. మంత్రి ధర్మాన ప్రసాదరావు పాయింట్స్ ►స్వాతంత్ర్యం తరువాత చాలామంది పేదలకు న్యాయం జరగలేదు. ►కొన్ని వర్గాలు మాత్రమే సంతోషంగా ఉన్నారు. ►దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రజలు కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశ పెట్టారు. ►సీఎం జగన్ పథకాలపై విమర్శలు చేసిన వారు నేడు ప్రశంసిస్తున్నారు. ►సీఎం జగన్ పథకాలను చంద్రబాబు కాఫీ కొట్టారు ►ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేశారా? ►రైతు డ్వాక్రా రుణా మాఫీ చేశారా? ►ఇచ్చిన హామీల్లో ఒకదాన్ని కూడా చంద్రబాబు అమలు చేయలేదు. ►అధికారం కోసమే చంద్రబాబు హామీలు ఇచ్చారు. ►పేద వారు తమ అవసరాలు కోసం కోర్టులకు వెళ్ళలేరు. ► పాలకులు ప్రజలు కష్టాలు తెలుసుకొని పాలన చేయాలి. ►దేశానికి ఆదర్శంగా సీఎం జగన్ పాలన చేస్తున్నారు. ►సమాజంలో అంతరాలను తగ్గించడం వంటివి సైకోలు చేస్తారా లోకేష్. ►ఒక రోడ్డు, ఒక బిల్డింగ్ వేస్తే అభివృద్ధి కాదు. ►ప్రతి కుటుంబం జీవన ప్రమాణాలు పెంచడం నిజమైన అభవృద్ధి. ►టీడీపీ జెండా కట్టిన వారికే పథకాలు ఇచ్చారు. ►సీఎం జగన్ పాలన పార్టీలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాల అమలు చేస్తున్నారు. ►సీఎం జగన్ ఒక రూపాయి అవినీతి లేకుండా పాలన చేస్తున్నారు. ►చంద్రబాబు కూడా అవినీతి జరిగిందని చెప్పలేక పోతున్నారు. ►గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు కేంద్రం పెంచితే రాష్ట్ర ప్రభుత్వం పై టిడిపి నేతలు విమర్శలు చేస్తున్నారు. ►కంటి ఆపరేషన్ కోసం బెయిల్ ఇస్తే న్యాయం గెలిసింది అని టిడిపి నేతలు సంబరాలు జరుపుకున్నారు. ►271 కోట్లు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబును అరెస్ట్ చేశారు. ►అన్ని ఆధారాలు తోనే చంద్రబాబును అరెస్ట్ చేశారు. ►చంద్రబాబు నిజాయితీ పరుడు అయితే కోర్టులో నిరూపించుకోవాలి. ►టీడీపీ పాలనలో నాయకుల అకౌంట్లోకి డబ్బులు వెళ్తాయి. ►సీఎం జగన్ పాలనలో పేదల ఖాతాల్లోకి డబ్బులు వెళ్తున్నాయి. ►ఎన్నికలు ముందు మయ మాటలతో చంద్రబాబు ప్రజలు ముందుకు వస్తారు రాజన్న దొర డిప్యూటీ సీఎం ►మనకు మంచి ఎవరు చేస్తున్నారో గుర్తు పెట్టుకోవాలి. ►పేదలు కోసం సీఎం జగన్ పని చేస్తున్నారు. ►టీడీపీ నాయకుల మయ మాటల ఎవరు నమ్మొద్దు. ►బలహీన వర్గాలకు సీఎం పెద్ద పీట వేశారు. ►సమాజాన్ని సమ సమాజంగా సీఎం జగన్ మార్చారు. ►గిరిజనులు కోసం 20 వేల కోట్ల కర్చు చేశారు. ►పేదలు పక్ష పాతి సీఎం జగన్ ►బురద మా మీద జల్లలని చూస్తే పందుల్లా మీదే బురద పడుతుంది. మంత్రి గుడివాడ అమర్నాథ్ పాయింట్స్ ►సామాజిక న్యాయానికి ముత్యాల నాయుడే ఒక ఉదాహరణ. ►రాజకీయాలలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా సీఎం జగన్, ముత్యాల నాయుడిని పక్కన పెట్టుకున్నారు. ►సీఎం జగన్ చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ►దేశంలో ఎక్కడ లేనివిధంగా సంక్షేమ కార్యక్రమాలు సీఎం జగన్ అమలు చేస్తున్నారు. ►2 లక్షల 40 వేల కోట్లు ప్రజల ఖాతాల్లో ఏ నాయకుడు వేయలేదు. ►కంటి ఆపరేషన్ కోసం చంద్రబాబుకు బెయిల్ ఇచ్చారు. ►మళ్ళీ 28 రోజుల తరువాత జైలుకు వెళ్లాల్సిందే. ►ఎన్ని పార్టీలు కలిసి వచ్చిన సీఎం జగన్ సింగిల్‌గానే పోటీ చేస్తారు. ►చంద్రబాబుకు 1000 కోట్ల చేతి కర్ర పవన్ రూపంలో దొరికింది. -
కార్పొరేట్ స్కూల్స్‌కు ధీటుగా ఇవాళ ఏపీలో ప్రభుత్వ స్కూల్స్ ఉన్నాయి: డిప్యూటీ సీఎం
-
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సీఎం జగన్ అన్ని రంగాల్లో పెద్దపీట వేశారు: డీప్యూటీ సీఎం
-
బడుగు, బలహీన వర్గాలకు ఆర్థిక స్వావలంబన కలిగించాం: బూడి
-
చిత్తశుద్ధితో కొత్త అర్థం చెప్పిన సీఎం జగన్
-
‘బాబు బాధలో ఉంటే బాలకృష్ణ మూవీ రిలీజ్ చేస్తారా?^
సాక్షి, మాడుగుల: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోనే అత్యంత అవినీతిపరుడు చంద్రబాబు అంటూ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ అయినా ఆ బాధ వారి కుటుంబ సభ్యుల్లో కనిపించడంలేదని అన్నారు. కాగా, బూడి ముత్యాల నాయుడు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. స్కిల్ స్కాం కేసులో అన్ని ఆధారాలతో చంద్రబాబు దొరికిపోయారు. చంద్రబాబు అతిపెద్ద అవినీతికి పాల్పడ్డారు. చంద్రబాబు జైలులో బాధలో ఉంటే బాలకృష్ణ సినిమా ఎలా రిలీజ్ చేస్తారు. చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారు కాబట్టే జైలు నుంచి రాజకీయాలు చేస్తున్నారు. బాబు అనారోగ్యంగా ఉంటే కేజీ బరువు ఎలా పెరుగుతారు. నారా ఫ్యామిలీ, నందమూరి కుటుంబం కలిసి ఎన్ని యాత్రలు చేసినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఏమీ చేయలేరు. చంద్రబాబు ఏ తప్పు చేయలేదనే నమ్మకం ఉంటే సీబీఐ విచారణ కోరవచ్చు కదా?. రూ.371 కోట్ల అవినీతిలో చంద్రబాబు అడ్డంగా దొరికొపోయారు కాబట్టే జైలు జీవితం గడుపుతున్నారు. స్కిల్ స్కాంలో బయటపడింది కేవలం గోరంత మాత్రమే. చంద్రబాబు అవినీతి పూర్తి స్థాయిలో వెలికి తీస్తే కొండంత అవినీతి బయటపడుతుంది. ఇది కూడా చదవండి: చంద్రబాబుకి బ్లాక్ ఫ్రైడే.. కోర్టుల్లో వరుస ఎదురుదెబ్బలు -
ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం
-
జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం
-
డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ఏం చేసాడో చూడండి
-
63.14 లక్షల మందికి రూ.1,739.75 కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా 63,14,192 మంది అవ్వాతాతలు, వితంతు, దివ్యాంగులు, వివిధ చేతివృత్తిదారులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు గురువారం నుంచి 1739.75 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం పింఛన్ల రూపంలో పంపిణీ చేయనుంది. లబ్ధిదారుల సంఖ్య ఆధారంగా ఈ డబ్బులను బుధవారమే ఆయా గ్రామ/వార్డు సచివాలయాల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేయగా..స్థానిక సిబ్బంది నిధులను డ్రా చేసి, వలంటీర్ల వారీగా పంపిణీ కూడా చేశారు. గురువారం తెల్లవారుజాము నుంచి తమ పరిధిలోని లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లి పింఛన్ సొమ్ము అందజేస్తారని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు తెలిపారు. వలంటీర్ల ఆధ్వర్యంలో 5వ తేదీ వరకు లబ్ధిదారుల ఇంటి వద్దనే ఈ పంపిణీ కొనసాగుతుందని.. ఎలాంటి ఫిర్యాదులు లేకుండా పంపిణీ ప్రక్రియ కొనసాగేందుకు 26 జిల్లాల్లో డీఆర్డీఏ కార్యాలయాల్లో ప్రత్యేక కాల్ సెంటర్లనూ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. -
పథకాలను సీఎం ప్రతినిధులుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి..
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమాభివృద్ధి పథకాలను ఆయన ప్రతినిధులుగా గ్రామీణ ప్రజలకు వివరించి.. వారిని చైతన్యపర్చాల్సిన బాధ్యత మీదేనని వైఎస్సార్సీపీ సర్పంచులకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దిశానిర్దేశం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం 175 నియోజకవర్గాల నుంచి తరలివచ్చిన సర్పంచులతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడుతో కలిసి ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమ ప్రాంతాల్లోని సమస్యలను, ఇతర అంశాలను సజ్జల రామకృష్ణారెడ్డి, బూడి ముత్యాలనాయుడుల దృష్టికి సర్పంచులు తీసుకొచ్చారు. వాటిని సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని సర్పంచులకు వారు హామీ ఇచ్చారు. అనంతరం సర్పంచులను ఉద్దేశించి సజ్జల మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూర్చేలా సీఎం వైఎస్ జగన్ పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర విభజన, కోవిడ్, ఆర్థిక సమస్యలు.. ఇలా ఎన్ని సమస్యలు ఎదురైనా లెక్క చేయకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలలో పేదరికాన్ని పోగొట్టడం, విద్య, వైద్యం వంటి విషయాల్లో ప్రయోజనం కలిగేలా సీఎం వైఎస్ జగన్ దార్శనికతతో సంక్షేమాభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. సంపన్నులతో సమానంగా పేదలకు అవకాశాలు కల్పించడం, వారి కాళ్లపై వారు నిలబడేలా పేదలను అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నారన్నారు. పథకాల ఫలాలు ప్రజలకు చేరడం వల్లే మునిసిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో 90 శాతం స్థానాల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించిందన్నారు. ప్రస్తుతం ఆ పథకాల ఫలితాలు మరింతగా ప్రతి కుటుంబానికి చేరడంతో ప్రజల్లో వైఎస్సార్సీపీకి ఆదరణ మరింతగా పెరిగిందని చెప్పారు. ప్రజా స్వామ్యంలో ప్రజాప్రతినిధులంటే ప్రజాసేవకులమేగానీ దొరలం కాదన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీలతో సర్పంచుల అధికారాలను హరించారని గుర్తు చేశారు. ‘సీఎం వైఎస్ జగన్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఆయన ప్రతినిధులుగా ప్రజలే మిమ్మల్ని గుర్తిస్తారు. పథకాలు అందుతున్న తీరు తెన్నులను మీరే పరిశీలించాలి. తద్వారా వైఎస్సార్సీపీకి ఆదరణ పెరుగుతుందంటే.. మీకు, మనందరికి ఆదరణ పెరిగినట్లే’ అని సజ్జల చెప్పారు. ప్రతిపక్షాలకు సర్పంచులు కనీస సంఖ్య లేకున్నా.. పాత సంఘాల పేరుతో ప్రభుత్వంపై చేస్తున్న దుష్ప్రచారాన్ని పెద్ద సంఖ్యలో ఉన్న వైఎస్సార్సీపీ సర్పంచులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సర్పంచ్‌లతో రాష్ట్రస్థాయి కార్యవర్గం: మంత్రి బూడి ముత్యాలనాయుడు మంత్రి బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ వైఎస్సార్సీపీకి సంబంధించిన సర్పంచులతో రాష్ట్ర స్థాయిలో కార్యవర్గాన్ని ఏర్పాటుచేస్తామన్నారు. దాని ద్వారా వారి సమస్యలను గుర్తించి పరిష్కరిస్తామని తెలిపారు. సర్పంచులకు నిధులివ్వడం లేదంటూ ప్రతిపక్షాల విమర్శలు అర్థంలేనివన్నారు. ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, నవరత్నాల అమలు ప్రోగ్రాం వైస్ చైర్మన్ నారాయణమూర్తి పాల్గొన్నారు. -
ఐదేళ్ళలో టీడీపీ చేసిన దోపిడీకి ప్రజలు ఓట్లతో బుద్ది చెప్పారు: బూడి ముత్యాలనాయుడు
-
అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు సరికావు: బూడి ముత్యాలనాయుడు
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్‌పై డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు సీరియస్ అయ్యారు. చంద్రబాబు, లోకేశ్ కంటే పెద్ద సైకోలు ఎవరూ లేరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, బూడి ముత్యాలనాయుడు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘చంద్రబాబుకు ప్రజాసంక్షేమం అవసరం లేదు. గత ప్రభుత్వానికి, ఇప్పటి ప్రభుత్వానికి తేడా చూడండి. జన్మభూమి కమిటీల పేరుతో గత ప్రభుత్వం దోచుకుంది. అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు సరికావు. మూడున్నర ఏళ్ల కాలంలో ప్రజల కోసం ఎప్పుడైనా మాట్లాడారా?. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ పాలన చూసి ఓర్వలేకపోతున్నారు. ఐదేళ్లలో టీడీపీ చేసిన దోపిడీకి ప్రజలు ఓట్లతో బుద్ధి చెప్పారు. ప్రజలకు ఇచ్చిన మాట తప్పకుండా సీఎం వైఎస్ జగన్ సుపరిపాలన అందిస్తున్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 98 శాతం అమలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ అందిస్తున్న పథకాఉ గతంలో ఎవ్వరూ ఇవ్వలేదు. అయ్యన్న పోలీసులపై ఇష్టానుసారం మాట్లాడతారా?. టీడీపీ నేతల మాటలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు. టీడీపీ నేతల తీరుతోనే గుంటూరులో అమాయకులు బలయ్యారు. నోరు అదుపులో పెట్టుకొని మాటలు మాట్లాడాలి. 650 హామీలు ఇచ్చి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది చంద్రబాబు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
సీఎం జగన్ న్యూ ఇయర్ కానుక.. ఏపీలో పెంచిన పింఛన్ల పంపిణీ
సాక్షి, అమరావతి: ఏపీవ్యాప్తంగా తెల్లవారుజామున నుంచే పింఛన్ల పంపిణీ కొనసాగుతుంది. పెంచిన పెన్షన్ మొత్తం 2,750 రూపాయలు వాలంటీర్లు అందజేస్తున్నారు. మధ్యాహ్నం 12.00 గంటల వరకు 57.88 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేశారు. 37.07 లక్షల మందికి రూ.1021.02 కోట్లు అందజేసినట్లు డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు తెలిపారు. కొత్త సంవత్సరంతో పాటే రాష్ట్రంలో లక్షలాది మంది అవ్వాతాతలు, వితంతు, ఒంటరి మహిళ, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల ఇళ్లలో కొత్త వెలుగులు వచ్చేశాయి. ఇప్పటి దాకా.. ప్రతి నెలా వీరు రూ.2,500 చొప్పున అందుకుంటున్న పింఛను డబ్బులు ఈ రోజు నుంచి ప్రతి నెలా రూ.2,750 చొప్పున అందుకుంటున్నారు. మరోవైపు ఈ నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 2,31,989 మందికి ప్రభుత్వం కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జనవరి 1 నుంచి జరిగే పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి పండుగ వాతావరణంలో వారోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించింది. 7వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మండల, మున్సిపాలిటీల స్థాయిలో ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుంది. జనవరి 3వ తేదీన సీఎం వైఎస్ జగన్ రాజమండ్రిలో పింఛను పెంపు వారోత్సవ కార్యక్రమంలో స్వయంగా పాల్గొననున్నారు. 64.06 లక్షలకు చేరిన పింఛన్ల సంఖ్య ప్రభుత్వం తాజాగా మంజూరు చేసిన 2,31,989 పింఛన్లతో కలిపి జనవరి నెలలో రాష్ట్రంలో సామాజిక పింఛన్ల లబ్ధిదారుల సంఖ్య 64,06,240కి చేరుకుంది. జనవరి ఒకటి ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ.. తెల్లవారుజాము నుంచే వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకి వెళ్లి పెరిగిన పింఛను డబ్బులు పంపిణీ చేస్తున్నారు ఇందుకోసం ప్రభుత్వం శనివారమే అన్ని గ్రామ, వార్డు సచివాలయ శాఖల బ్యాంకు ఖాతాల్లో రూ.1,765 కోట్ల నిధులను జమ చేసింది. మండల, మున్సిపాలిటీల వారీగా సమావేశాలు ► 1వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో స్థానిక ఇన్చార్జి మంత్రుల ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ వారోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమాలు మొదలవుతాయి. 7వ తేదీ వరకు స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో విడతల వారీగా అన్ని మండల కేంద్రాలతో పాటు మున్సిపల్, నగర కార్పొరేషన్ల వారీగా ఫించను లబ్ధిదారుల సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు స్థానిక ప్రజా ప్రతిని«ధులందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. ► ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 3వ తేదీ రాజమండ్రిలో పాల్గొనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైతు భరోసా కేంద్రాలు.. గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రత్యక్ష ప్రసారానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ► 1వ తేదీ నుంచి పింఛన్ల పెంపు వారోత్సవ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహణకు ప్రభుత్వం మండల కేంద్రానికి రూ.10 వేలు, మున్సిపాలిటీకి రూ.15 వేలు, కార్పొరేషన్‌కు రూ.50 వేలు, విజయవాడ, తిరుపతి వంటి పెద్ద కార్పొరేషన్లకు రూ.లక్ష.. విశాఖపట్నం కార్పొరేషన్‌కు రూ.1.50 లక్షలు విడుదల చేసింది. జిల్లా కేంద్రాల్లో స్థానిక మంత్రుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాల నిర్వహణకు రూ.20 వేల చొప్పున ప్రత్యేకంగా నిధులు విడుదల చేసింది. కొత్తగా బియ్యం.. ఆరోగ్యశ్రీ కార్డులు, ఇళ్ల పట్టాలు ► పింఛన్లు రూ.2,750కి పెంపుతో పాటు కొత్తగా పెన్షన్, బియ్యం కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, ఇళ్ల పట్టాలను (జూలై 2022 నుంచి నవంబర్ 2022 వరకు) అర్హులైన వారికి మంజూరు కార్డులను వారోత్సవాల్లో ఎమ్మెల్యేలు పంపిణీ చేస్తారు. ► 44,543 మంది కుటుంబాలకు ప్రభుత్వం కొత్తగా బియ్యం కార్డులు, 14,401 కుటుంబాలకు కొత్తగా ఆరోగ్యశ్రీ, మరో 14,531 కుటుంబాలకు కొత్తగా ఇళ్ల పట్టాలను ప్రభుత్వం తాజాగా మంజూరు చేసింది. ► వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పింఛన్ల కోసం రూ.62,500 కోట్లు ఖర్చు పెట్టారు. లబ్ధిదారుల సంఖ్య తాజాగా 64.06 లక్షలకు పెరిగింది. పెరిగిన పింఛన్లపై ఏటా రూ. 21,180 కోట్లు ప్రభుత్వం వ్యయం చేయనుంది. అప్పటికీ ఇప్పటికీ తేడా.. ► చంద్రబాబు ప్రభుత్వంలో రూ.1,000 ఉన్న పింఛన్‌ను జగన్మోహన్రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టగానే రూ.2,250కు పెంచడంతో పాటు.. 2022 జనవరిలో రూ.2,500కు, ఈ జనవరి నుంచి రూ.2,750కి పెంచుకుంటూ వచ్చారు. ► గత చంద్రబాబు ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు నెల వారీగా పింఛన్ల పంపిణీకి అరకొరగా రూ.400 కోట్ల చొప్పున పంపిణీ చేయగా, 2019లో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి నెలలోనే పింఛన్ల వ్యయం ఏకంగా మూడున్నర రెట్లు పెంచి రూ.1,350 కోట్లు ఖర్చు చేసింది. ► గత చంద్రబాబు ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు 39 లక్షల మందికి మాత్రమే పింఛన్లు పంపిణీ చేస్తే.. వైఎస్ జగన్ సీఎం అయ్యాక సంతృప్త స్థాయిలో అర్హులందరికీ వంద శాతం పింఛన్ల మంజూరు చేసే విధానం తీసుకొచ్చారు. తద్వారా 2019లో 52.17 లక్షలకు, 2022లో 62.31 లక్షలకు, 2023లో 64.06 లక్షలకు ఆ సంఖ్య చేరుకుంది. లంచం, వివక్ష లేకుండా పింఛన్ల మంజూరు కులం, మతం, వర్గం, ప్రాంతం, పార్టీ అనే తారతమ్యాలు లేకుండా.. లంచాలు, వివక్షకు అవకాశం ఇవ్వకుండా అర్హులైతే చాలు ప్రతి ఒక్కరికీ నూటికి నూరు శాతం సంతప్త స్థాయిలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో కొత్త పింఛన్లు మంజూరు అవుతున్నాయి. అదే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో కొత్త పింఛన్లకు అర్హులను గుర్తించే పద్దతే ఉండేది కాదు. లంచాలు.. లేదంటే వివక్షే కనిపించేది. టీడీపీ నేతలతో కూడిన జన్మభూమి కమిటీలే అర్హులను గుర్తించేవి. వాళ్లు లంచాలు ఇస్తేనో లేక తమ వర్గం, తమ పార్టీ వాళ్లో అయితేనే పింఛన్లు మంజూరు చేసేవారు. ఒక్కొక్క గ్రామానికి ఇన్ని పింఛన్లే అని కోటా పెట్టుకొని, ఆ కోటాకు మించి ఎంత మంది అర్హులున్నా వారెవ్వరికీ పింఛన్లు ఇచ్చే వారు కాదు. మాకు పింఛను అర్హత ఉంది కదా అని ఎవరైనా అడిగితే.. మీ ఊరిలో ఎవరైనా పెన్షనర్ చనిపోతే వారి స్థానంలో ఇస్తామని నిస్గిగ్గుగా చెప్పేవారు. పింఛన్లు తీసుకోవడం కోసం వృద్దులు, దివ్యాంగులు ప్రతి నెలా చాంతాడంత క్యూలో గంటల తరబడి నిలబడాల్సి వచ్చేది. ఈ ప్రభుత్వం వచ్చాక అవ్వాతాతలతో పాటు దివ్యాంగులకు ఏ చిన్న కష్టం లేకుండా ప్రతి నెలా 1వ తేదీనే వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్ల డబ్బులు అందజేస్తున్నారు. కొత్త పింఛన్ల మంజూరు కూడా పూర్తి పాదర్శకంగా చేస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితాలను ప్రదర్శించి, సామాజిక తనిఖీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. పేదలకు పెద్దన్న సీఎం జగన్ కొత్త సంవత్సరం రోజున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పింఛను పెంపు ద్వారా పేదల కళ్లల్లో ఆనందం, ముఖంలో చిరునవ్వు, ఆత్మ గౌరవం తీసుకొచ్చారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా, పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా నవరత్నాల కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ఏకంగా 64.06 లక్షల మందికి పింఛన్లు ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. సీఎం జగన్.. తన సంక్షేమాభివృద్ధి పాలన ద్వారా రాష్ట్రంలో పేదలకు పెద్దన్నగా మారారు. ఈ ప్రభుత్వంలో భాగస్వామినైనందుకు గర్వ పడుతున్నాను. – బూడి ముత్యాలనాయుడు, ఉప ముఖ్యమంత్రి -
టీడీపీ నేతలపై కందుకూరు ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి ఆగ్రహం
సాక్షి, నెల్లూరు: తెలుగుదేశం పార్టీ నేతలపై కందుకూరు ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక టీడీపీ నేతల నిర్వాకం వల్లే 8 మంది అమాయకులు బలి అయ్యారని మండిపడ్డారు. ప్రచార ఆర్భాటంతో రోడ్డుపై ఫ్లెక్సీలు కట్టారు. టీడీపీ నేతలు పోటాపోటీగా ఫ్లెక్సీలు కట్టి ప్రమాదానికి కారణమయ్యారు. చేసింది తప్పని తెలుసుకోకుండా పిచ్చిప్రేలాపణలు చేస్తే జనం బుద్ధి చెబుతారని మహీధర్‌రెడ్డి హెచ్చరించారు. చంద్రబాబు బాధ్యత వహించాలి: డిప్యూటీ సీఎం చంద్రబాబు ప్రచార పిచ్చితోనే 8 మంది చనిపోయారని డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు అన్నారు. తక్కువ జనాన్ని ఎక్కువగా చూపించే ప్రయత్నం చేశారు. కందుకూరు ఘటనకు చంద్రబాబే బాధ్యత వహించాలి' అని మంత్రి బూడి ముత్యాలనాయుడు పేర్కొన్నారు. కందుకూరు ఘటన బాధాకరం: బాలినేని చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి పరాకాష్టకు చేరిందని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు. ఇరుకు సందులో సభ పెట్టి ప్రజల ప్రాణాలు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కందుకూరు ఘటనలో 8 మంది చనిపోవడం బాధాకరమైన విషయం అన్నారు. -
వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్షపై సీఎం జగన్ సమీక్ష
-
జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంపై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూ రక్ష (భూముల సమగ్ర రీసర్వే)పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సమగ్ర భూ సర్వే కోసం ఉపయోగిస్తున్న డ్రోన్లు, సర్వే రాళ్లను సీఎం పరిశీలించారు. డ్రోన్ల పనితీరును అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షకు ఉప ముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాలనాయడు, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లాం, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ జి సాయి ప్రసాద్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్ధిక శాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, సర్వే సెటిల్మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ సిద్దార్థ జైన్, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కోన శశిధర్, సీసీఎల్ఏ కార్యదర్శి ఏ ఎండి ఇంతియాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, మైనింగ్ శాఖ డైరెక్టర్ వీ జీ వెంకటరెడ్డి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. చదవండి: (వంగవీటి రంగా హత్య కేసులో ముద్దాయిలు ఆ ఇద్దరే: కొడాలి నాని) -
అయ్యన్న నేరాలకు బీసీలకు సంబంధమేంటి?
సాక్షి, అమరావతి/నెట్వర్క్: అయ్యన్నపాత్రుడిని అరెస్టుచేస్తే బీసీ నేతను అరెస్టుచేశారని టీడీపీ బీసీ నేతలు మాట్లాడడం సిగ్గుచేటని పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు మండిపడ్డారు. అయ్యన్న తప్పుచేస్తే బీసీలకు ఏం సంబంధమని వారు సూటిగా ప్రశ్నించారు. ఆరోపణలు వచ్చినప్పుడు నిరూపించుకోకుండా బీసీలపై దాడి అంటూ రాజకీయ లబ్ధిపొందేందుకు యత్నించడం చాలా హేయమని వారు వ్యాఖ్యానించారు. ఫోర్జరీ ఆరోపణలతో అయ్యన్నను సీఐడీ అరెస్టుచేసిన నేపథ్యంలో చంద్రబాబు సహా టీడీపీ నేతలు స్పందిస్తున్న తీరుపై మంత్రులు బూడి ముత్యాలనాయుడు, జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీమంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు. వారు ఏమన్నారో వారి మాటల్లోనే.. అడ్డంగా దొరికిపోయిన దొంగ అయ్యన్న ‘అయ్యన్నపాత్రుడు నేరాలకు బీసీలకు ఏం సంబంధం ఉంది? దొంగ పనులు చేసి అడ్డంగా దొరికిపోయిన దొంగ అయ్యన్నను పోలీసులు అరెస్టుచేస్తే బీసీలకు అన్యాయం చేస్తున్నట్లు టీడీపీ నేతలు వక్రీకరించడం అన్యాయం. అయ్యన్న చేసిన తప్పులకు అయ్యన్నే బాధ్యుడు. వాటితో బీసీలకు ఏం సంబంధం? చట్టం ఎవరికీ చుట్టంకాదు. పంట కాలువను ఆక్రమించి ఇంటి గోడను నిర్మించిన ఆయనపై సీఐడీ చట్టప్రకారమే కేసు నమోదు చేసింది. ఆక్రమించిన ఇరిగేషన్ భూమిలో ప్రహరీ నిర్మాణానికి తాను ఎన్వోసీ ఇవ్వలేదని, అయ్యన్న హైకోర్టుకు నకిలీపత్రాలు సమర్పించారని జలవనరుల శాఖ ఈఈ సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీనిపై సీఐడీ జరిపిన దర్యాప్తులో అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారణ అయ్యాకే అరెస్టుచేశారు. ఇందులో కక్ష సాధింపు ఎక్కడ ఉందో చంద్రబాబు, టీడీపీ నేతలు చెప్పాలి..’ అని అన్నారు. చట్టం ముందు ఎవరైనా ఒక్కటే తప్పుచేసిన వారు ఎవరైనా శిక్షార్హులే. అయ్యన్నపాత్రునికి ఒక న్యాయం చంద్రబాబుకు ఒక న్యాయం ఉండదు. బీసీలపై దాడి, అర్ధరాత్రి అరెస్టు అంటూ చంద్రబాబు వెకిలివాగుడు వాగుతున్నాడు. ప్రజా ప్రతినిధులు, పలుకుబడిగల నేతలను పోలీసులు రాత్రివేళల్లోనే అదుపులోకి తీసుకుంటారు. ఇది ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. ఇక పవన్ కళ్యాణ్‌ని చంపేందుకు రెక్కీ నిర్వహిస్తున్నారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అనడం హాస్యాస్పదం. కుట్రచేస్తే అది చంద్రబాబే చెయ్యాలి. – కొడాలి నాని, గుడివాడ ఎమ్మెల్యే తప్పుడు పనులకు టీడీపీ లైసెన్స్ ఇచ్చిందా? అయ్యన్నకు ఇలాంటి తప్పుడు పనులు చేయడానికి ఆ పార్టీ ఏమైనా లైసెన్స్ ఇచ్చిందా? అరెస్టుచేసిన సమయంలో వీడియోలను పరిశీలిస్తే అయ్యన్న పోలీసులను తీవ్రస్థాయిలో బెదిరించారన్నది స్పష్టమవుతోంది. అయ్యన్న అరెస్టును బీసీలకు ముడిపెట్టి.. రాజకీయంగా లబ్ధిపొందాలని ప్రయత్నిస్తే బీసీలు వాటిని తిప్పికొడతారు. ఇక విశాఖ భూములపై తాము ప్రశ్నిస్తున్నందుకే తప్పుడు కేసులు పెడుతున్నారంటున్న టీడీపీ నేతల వ్యాఖ్యలు హాస్యాస్పదం. ఫోర్జరీలు చేసేవాడు సామాజిక కార్యకర్త అవుతాడా? టీడీపీ నేతలు ధూళిపాళ్ల నరేంద్ర, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, యరపతినేని శ్రీనివాసరావు, యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమ.. వీళ్లంతా ఏమైనా సంఘ సేవకులా? వీళ్లంతా రాష్ట్రాన్ని దోచుకున్న దోపిడీదారులు. ఈ ముఠాకు నాయకుడు చంద్రబాబు. నారా లోకేశ్ సోషల్ మీడియాను అడ్డంపెట్టుకుని సీఎం జగన్‌ను, ఆయన కుటుంబ సభ్యులతోపాటు వైఎస్సార్సీపీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిపై సీఐడీ పోలీసులు దృష్టిసారించి చర్యలు తీసుకోవాలి. – తాడేపల్లిలో మీడియాతో మంత్రి బూడి ముత్యాలనాయుడు తప్పులు కప్పి పుచ్చుకునేందుకే రాద్ధాంతం అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే టీడీపీ నేతలు లేనిపోని ఆరోపణలతో రాద్ధాంతం చేస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే అయ్యన్నపాత్రుడిపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. పోలీసులు చట్టప్రకారం ఆయన్ను అరెస్టుచేస్తే బీసీలపై దాడిగా టీడీపీ నేతలు ఆరోపణలు చేయటం సిగ్గుచేటు. ఆరోపణలు వచ్చినప్పుడు నిరూపించుకోకుండా బీసీలపై దాడి అంటూ రాజకీయ లబ్ధిపొందేందుకు యత్నించడం హేయం. అయ్యన్న తప్పులను కాపాడేందుకు టీడీపీ నాయకులు చేస్తున్న గగ్గోలును కట్టిపెట్టాలి. – మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అయ్యన్న అతిపెద్ద భూకబ్జాదారుడు రాష్ట్రంలో అత్యధికంగా భూకబ్జాలు చేసిన వ్యక్తి, గంజాయి దొంగ అయ్యన్నపాత్రుడే. న్యాయస్థానాలకు తప్పుడు పత్రాలు సమర్పించి రెవెన్యూ రికార్డుల్లో టాంపరింగ్ చేశారు. అధికారులు చెబుతున్నా పట్టించుకోకుండా ఇష్టానుసారం అక్రమ నిర్మాణం చేపడితే చర్యలు తీసుకోకూడదా? ఆక్రమించిన భూమి ఎవరి నుంచి వచ్చిందో చెప్పాలి. ఆయన కొడుకు రాజేష్ ఐటీడీపీ ద్వారా సీఎంను, మహిళా మంత్రులపై సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లు పోస్టులు పెడుతున్నాడు. – ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫోర్జరీ చేయడం నేరం కాదా? ఒకవైపు అయ్యన్న తప్పు చేశాడంటూనే చంద్రబాబు మరోవైపు మమ్మల్ని తప్పుపట్టడం, దూషించటం ఏమిటి? ఫోర్జరీ డాక్యుమెంట్‌తో ఇరిగేషన్ స్థలాన్ని ఆక్రమించుకుంటే తప్పుకాదా? అయ్యన్నపాత్రుడిని అరెస్టుచేస్తే బీసీ నేతను అరెస్టుచేశారని మాట్లాడుతున్నారు.. బీసీ నాయకులు తప్పుచేస్తే అరెస్టు చేయరా? అయినా అయ్యన్న తప్పుచేస్తే బీసీలకు ఏం సంబంధం? ఆ ఘటనకు కులాన్ని ఎందుకు ఆపాదిస్తున్నారు. కులాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధిపొందే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారు. రెండు సెంట్ల భూమి ఆక్రమించుకుంటే, కేసు పెడతారా? అరెస్టు చేస్తారా? అని చంద్రబాబు అంటున్నారు. అంటే అయ్యన్న చేసింది తప్పే అని ఒకవైపు అంటూనే, మరోవైపు అరెస్టు చేయడాన్ని తప్పుపడుతున్నారు. ఫోర్జరీ డాక్యుమెంటు సృష్టించి దాన్ని హైకోర్టులో సమర్పించడం చంద్రబాబుకు తప్పుకాదు. ఇన్సైడ్ ట్రేడింగ్ చేయొచ్చు.. కానీ కేసు పెడితే మాత్రం ఓర్చుకోలేరు. ఇక పవన్ కళ్యాణ్ గురించి ఆలోచించే టైమ్ కూడా మాకులేదు. అలాంటప్పుడు ఆయనపై రెక్కీ చేయాల్సిన అవసరం అంతకన్నాలేదు. ఈ విషయంలో మాపై నిందలు వేస్తే చంద్రబాబుకే నష్టం. – మంత్రి జోగి రమేష్ అయ్యన్న పెద్ద కబ్జా కోరు టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు పెద్ద కబ్జా కోరు, గంజాయి మాఫియా నడిపే 420. ఫోర్జరీ పత్రాలతో జలవనరుల శాఖకు చెందిన భూమిని ఆక్రమించుకుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా. అవినీతికి పరాకాష్ట అయిన అయ్యన్నపాత్రుడిని అరెస్ట్ చేస్తే.. చంద్రబాబు, లోకేశ్ వెనకేసుకురావడం, గందరగోళం సృష్టించడం సిగ్గుచేటు. ప్రభుత్వం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుంటే బీసీలను ఇబ్బంది పెడుతోందని మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. ఎస్సీ, బీసీలను హేళన చేసినందుకు గత ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలు టీడీపీ తాట తీశారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాష్ట్రంలో బీసీలకు తగిన న్యాయం చేసిన ఏకైక సీఎం వైఎస్ జగన్ మాత్రమే. – మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు