Cadre
-
పుంగనూరులో టీడీపీ.. వైఎస్ఆర్సీపీ సానుభూతిపరుని
సాక్షి,చిత్తూరు జిల్లా: ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో మొదలైన టీడీపీ నేతల అరాచకాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం కమ్మపల్లిలో వైఎస్ఆర్సీపీ సానుభూతిపరుడు సుబ్రమణ్యరెడ్డి కుటుంబాన్ని టీడీపీ నేతలు గ్రామం నుంచి వెలివేశారు. ఆయన పండించుకున్న టమాటా పంటను అమ్ముకోకుండా అడ్డుకున్నారు. దీంతో టమాటాలన్నీ కుళ్లిపోయి భారీ నష్టం వాటిల్లింది. కనీసం ఆవులకు మేత వేయకుండా అడ్డుకుని అరాచకం సృష్టిస్తున్నారు. పోలీసులకు చెబితే గ్రామం వదిలి వెళ్లిపోవాలంటున్నారని సుబ్రమణ్యరెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. గ్రామంలోకి వస్తే చంపేస్తామని టీడీపీ నేతలు బెదిరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
‘లోక్‌సభ’ ఓటమితో బీఆర్ఎస్ దిష్టి పోయింది: కేసీఆర్
సాక్షి,గజ్వేల్: కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. గెలుపు ఓటములకు అతీతంగా తెలంగాణ సమాజం బీఆర్ఎస్కు ఎల్లవేళలా అండగా ఉందని, భవిష్యత్తులోనూ ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం(జులై3) ఎర్రవెల్లి ఫాంహౌజ్‌లో తనను కలిసిన మేడ్చల్, నల్గొండ జిల్లాల కార్యకర్తలనుద్దేశించి కేసీఆర్ మాట్లాడారు.‘బీఆర్ఎస్ విజయ ప్రస్థానంలో ఇటీవల లోక్‌సభ ఎన్నికల ఓటమితో దిష్టి తీసినట్టయింది. తిరిగి పునరుత్తేజంతో ప్రజాదరణను కూడగట్టాలి. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అలవిగాని హామీలు అమలు చేయడం చేతగాక పలురకాల జిమ్మిక్కులతో ప్రజలను పక్కదారి పట్టిస్తూ పబ్బం గడుపుకుంటోంది.కాంగ్రెస్ పార్టీ నైజం మరోసారి అర్థమైన ప్రజలు ఓటేసి పొరపాటు చేశామని నాలిక కరుసుకుంటున్నరు. బీఆర్ఎస్ను మళ్లీ తెలంగాణసమాజాం కోరుకుంటోంది. కేసీఆర్ మీద ద్వేషంతో ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా నడుస్తున్న కాంగ్రెస్ మీద ప్రజలు తిరగబడే రోజు త్వరలోనే వస్తుంది’అని కేసీఆర్ అన్నారు. -
తెలంగాణ బీజేపీకి కొత్త సమస్య..!
ఎనిమిది మంది ఎంపీలను గెలుచుకుని తెలంగాణ బీజేపీ మాంచి జోష్ మీదుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన నేతలు కూడా ఎంపీలయ్యారు. ఓట్ల శాతం కూడా అసెంబ్లీ ఎన్నికల కంటే పెరిగింది. ఇంత జోష్‌లో ఉన్న బీజేపీ నేతలు, క్యాడర్‌కు ఓ ఇబ్బంది ఎదురవుతోంది. కొత్త ఎంపీలు, కేంద్ర మంత్రుల వల్ల రాష్ట్ర నేతలు పడుతున్న ఇబ్బంది ఏంటి? శ్రేణులకు నాయకులు ఇచ్చిన భరోసా ఏంటి?తెలంగాణలో బీజేపీ ఫేస్‌గా చెప్పుకునే నేతలంతా ఎంపీలుగా గెలిచారు. మోదీ రెండో కేబినెట్లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన కిషన్‌రెడ్డికి ఇప్పుడు కూడా మంత్రి పదవి దక్కింది. కాగా కరీంనగర్ నుంచి రెండోసారి గెలిచిన బండి సంజయ్‌కు కూడా కేంద్ర కేబినెట్లో పదవి దక్కింది.ఇప్పుడు బీజేపీకి రాష్ట్రం నుంచి ఎనిమిది మంది ఎంపీలు, ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ ఉన్నారు. వీళ్ళతో పాటుగా రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ జాతీయ నేతగా ఉన్నప్పటికీ రాష్ట్ర బీజేపీలో కూడా కీలకంగా ఉన్నారు. ప్రజా ప్రతినిధుల సంఖ్యను భారీగా పెంచుకున్న తెలంగాణ బీజేపీకి అసలు సమస్యే ఇక్కడే మొదలైందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. పవర్ సెంటర్స్ పెరగడం వల్లే ఈ సమస్య వచ్చిందంటున్నారు.కేంద్రంలోను, రాష్ట్రంలోను కమలం పార్టీ నుంచి ప్రజా ప్రతినిధుల సంఖ్య పెరగడంతో ఆటోమెటిక్‌గా పార్టీలో పవర్ సెంటర్స్ కూడా పెరిగాయి. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి బీజేపీ రాష్ట్ర సారథిగా కూడా కొనసాగుతున్నారు. త్వరలోనే రాష్ట్ర పార్టీకి కొత్త అధ్యక్షుడు వస్తారు. బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు.గెలిచిన ఎంపీల్లో ఈటల రాజేందర్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్, రఘునందన్ వీళ్లంతా ఎవరికి వారు పార్టీలో పవర్ సెంటర్స్ అనే చెప్పుకోవచ్చు. గెలిచిన ఎంపీలను సన్మానించడానికి వెళ్లిన నేతలు.. ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి భయపడుతున్నారు. కిషన్ రెడ్డి మనిషిగా బండి సంజయ్ మనిషిగా ఈటల రాజేందర్ మనిషిగా ముద్ర పడితే భవిష్యత్‌లో పొలిటికల్ కేరీర్‌కు ఇబ్బందిగా మారే ప్రమాదం ఉందని జంకుతున్నారు. ఫలానా నేత మనిషి అంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు దక్కవేమోననే భయం క్యాడర్‌ను పట్టి పీడిస్తోంది.కాషాయ సేనకు రాష్ట్రంలో ఉన్న కీలక నేతలంతా పైకి బాగానే ఉంటారు. తామంతా ఒక్కటే అన్నట్లుగానే కనిపిస్తారు. కాని ఒకరి కంటే ఒకరు ముందుండాలని, పార్టీలో పట్టు సాధించాలని తపన పడుతుంటారు. గతంలో ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. ఇప్పుడు కీలక నాయకుల సంఖ్య కూడా బాగా పెరిగింది. ముఖ్య నేతల మధ్య విభేదాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒకరి మనిషిగా గుర్తింపు వస్తే..మరో నేతతో ఇబ్బంది వస్తుందనే భయం క్యాడర్‌ను, దిగువ స్థాయి నేతల్ని ఆవహించింది. అందుకే తమకు నమ్మకం ఉన్న, సత్సంబంధాలున్న నాయకులను చాటు మాటుగానే కలుస్తూ స్థానిక నేతలు, క్యాడర్ తమ భక్తి ప్రపత్తులు చాటుకుంటున్నారు. -
పోలింగ్ రోజు తరహాలో మరోసారి విధ్వంసానికి బాబు పథకం
-
‘రంగారెడ్డి’ కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది..?
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా పార్టీ క్యాడర్లో ఇంకా అయోమయం కొనసాగుతోంది. హస్తం శ్రేణుల్లో ఈ ఆందోళనకు కారణమేంటి? పాత, కొత్త నేతల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోందా ? గ్రూపు తగాదాలు పార్టీ క్యాడర్‌కు ఇబ్బందికరంగా మారాయా ? కొత్తవారు పెద్ద ఎత్తున చేరడంతో పాత నేతలు సైలెంట్ అయ్యారా ? ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది ?ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మెజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచినప్పటికీ...గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి జంప్ అవుతారనే ప్రచారంతో పార్టీ క్యాడర్‌కు కునుకుపట్టనివ్వడం లేదు. హైదరాబాద్ నగర శివారులోని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పలుమార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినప్పటికీ వివిధ కారణాలతో కాంగ్రెస్‌లోకి వెళ్లడం లేదని తాత్కాలికంగా ప్రకటించారు. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి... కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను కలిసి వచ్చారు. కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి రెడీగా ఉన్నప్పటికీ... పార్టీ నేతలు మాత్రం ఒప్పుకోవడం లేదట. ఒకవేళ నేతలు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఏ క్షణంలోనైనా మామా అల్లుళ్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్ క్యాడర్ లో కన్య్ఫూజన్ క్రియేట్ చేస్తున్నాయి.ఇక బీఆర్ఎస్ చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి.. అనుకోని పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకుని రెండోసారి ఎంపీగా పోటీ చేశారు. అటు కాంగ్రెస్ క్యాడర్ సహకరించకపోవడం.. ఇటు బీఆర్ఎస్ క్యాడర్ తన వెంట రాకపోవడంతో రంజిత్ రెడ్డి చేవెళ్లలో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు.మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో అక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసిన కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి సైలెంట్ అయిపోయారు. చేవెళ్లలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు అన్ని రకాలుగా సిద్ధమై బీఆర్ఎస్ నుంచి వచ్చిన పట్నం సునీతారెడ్డి... రంజిత్ రెడ్డి కారణంగా మల్కాజిగిరి కాంగ్రెస్ లోక్ సభ స్థానానికి షిఫ్ట్ అయ్యారు. స్థానిక క్యాడర్ సహకారం లేకపోవడంతో పట్నం సునీతా మహేందర్ రెడ్డి చాలా ఇబ్బంది పడ్డారు. తాండూరు కాంగ్రెస్‌లో ప్రస్తుతం విచిత్రమైన పరిస్థితి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజులు ముందు కాంగ్రెస్‌లో చేరి మనోహర్ రెడ్డి... ఎమ్మెల్యేగా గెలిచారు. తొలుత మనోహర్ రెడ్డి సోదరుడు శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు.అంతలోనే సోదరుడు మనోహర్ రెడ్డి రావడంతో పోటీ నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు సోదరుల మధ్య ఆధిపత్య పోరు పతాకస్థాయికి చేరింది. ఎవరికి వారు గ్రూపులుగా విడిపోయారు. ఇంతలోనే పార్లమెంట్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి... తాండూరును వదిలిపెట్టే ప్రసక్తే లేదని.. వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేతల మధ్య కోల్డ్ వార్ ఇప్పుడిప్పుడే ముదురుతోంది. -
వసంతకు ఉమా క్యాడర్ వార్నింగ్
-
వచ్చే వంద రోజులు ఎంతో కీలకం: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: బీజేపీ కార్యకర్తలు దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాల రెండోరోజు కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకురావడానికి బీజేపీ పార్టీ కార్యకర్తలు ఎంతో కష్టపడుతున్నారని మోదీ అన్నారు. వచ్చే వంద రోజులు ఎంతో కీలకమని తెలిపారు. 18 ఏళ్లు నిండిన వారంతా 18వ లోక్‌సభ ఎన్నికలకు ఓటు వేయబోతున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలని మోదీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో అత్యధిక సీట్లు బీజేపీ గెలుస్తుందని మోదీ తెలిపారు. సబ్ కా సాత్.. సబ్ కా వికాసే బీజేపీ లక్ష్యమని ఆయన గుర్తుచేశారు. పార్టీ శ్రేణలు ప్రతి ఇంటికి, ప్రతి ఓటరు వద్దకు చేరుకోవాలని సూచించారు. నవ భారత్ నిర్మాణం కోసం అందరం కలిసి పనిచేద్దామని పీఎం మోదీ అన్నారు. గత పదేళ్లలో దేశ రూపరేఖలు మారాయని ప్రధాని మోదీ అన్నారు. బీజేపీ భారీ మేజార్టీతో మళ్లీ అధికారంలోకి రాబోతోందని తెలిపారు. ఈ పదేళ్లలో అవినీతి రహిత పాలన అందించాని.. ఇంకా చాలా నిర్ణయాలు తీసుకోవల్సి ఉందన్నారు. తనకు రాజకీయాలు ముఖ్యం కాదని.. దేశమే ముఖ్యమని మోదీ అన్నారు. విపక్ష నేత కూడా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 400 స్థానాలు వస్తాయని అంటున్నారని తెలిపారు. దేశంలో ప్రభుత్వాలు మారుతుంటాయి.. కానీ వ్యవస్థలు అలాగే ఉంటాయని అన్నారు. అందుకే తమ పాలనలో పలు వ్యవస్థలను ప్రక్షాళన చేశామని తెలిపారు. ప్రతిపక్షాలవి అబద్ధపు వాగ్ధానాలని.. తాము ఎన్నికల కోసం అబద్ధపు హామీలు ఇవ్వమని మోదీ స్పష్టం చేశారు. తాము తప్ప వికాస్ భారత్‌కు ఎవరూ హామీ ఇవ్వరని అన్నారు. అదే విధంగా 2029లో దేశంలో ఒలింపిక్స్ నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇంకా... ‘400సీట్లు గెలిచేందుకు పార్టీ నేతలంతా కష్టపడి పని చేయాలి. మోడీ గ్యారెంటీ వికసిత్ భారత్. ఎన్డీఏ వల్లే భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. మోడీ 3.0లో దేశాన్ని ప్రపంచంలో మూడు ఆర్థిక వ్యవస్థగా పైకి తీసుకొస్తాం. ఈ పదేళ్ల కాలంలో 11వ నెంబర్లో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను ఐదో నెంబర్‌కి తీసుకొచ్చా. 25 కోట్ల ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చాం. పదేళ్లపాటు అవినీతి రహిత పాలన అందించాం. ... లోక్ సభ ఎన్నికల్లో 370 సీట్లు గెలవడమే లక్ష్యం. దేశ భవిష్యత్తుపై కాంగ్రెస్‌కు విజన్ లేదు. దేశ అస్థిరతకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కారణం. అవినీతి, వారసత్వ రాజకీయాలకు జనని కాంగ్రెస్. కులాల ఆధారంగా ప్రజలను విభజించాలని కాంగ్రెస్ పార్టీ కుట్రలు పన్నుతోంది. రానున్న రోజుల్లో ప్రతి లబ్ధిదారుని కలవాలి. నేను పంపే ఉత్తరాన్ని లబ్ధిదారులకు ఇవ్వాలి. పదేళ్ల పాలన, రానున్న ఐదేళ్ల మన విజన్ వారి చేతికి ఇవ్వాలి’ అని ప్రధాని మోదీ తెలిపారు. -
గ్రామాలపై బీజేపీ ఫోకస్.. ప్రచారానికి కొత్త కార్యక్రమం
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకోవాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా ప్రజలతో మమేకం కావాలని బీజేపీ ఓ కొత్త ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యకర్తలు ‘గ్రామాలకు వెల్లండి’(గావో చలో అభియాన్)అని శనివారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 4 నుంచి ఫిబ్రవరి 11 వరకు ఈ ప్రచారం జరగనుంది. ప్రతి బీజేపీ కార్యకర్త గ్రామాలకు వెళ్లి బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయాలు, పేద ప్రజలకు కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకోవాలని జేపీ నడ్డా కార్యకర్తలకు సూచించారు. బూత్ స్థాయిలో మరింత ఎక్కువగా కార్యకర్తలు ప్రచారం చేయాలని అన్నారు. సుమారు 7 లక్షల గ్రామాల్లో బూత్‌స్థాయిలో బీజేపీ కార్యకర్తలు.. కేంద్ర ప్రభుత్వ విధానాల వివరిస్తూ ప్రజలతో మమేకం కావాలని అన్నారు. అర్బన్ పార్టీగా పేరున్న బీజేపీని గ్రామీణ ప్రాంతాల్లో కూడా బలోపేతం చేయటం కోసం పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఇక.. ఈసారి జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో 51 శాతం ఓట్లను సాధించాలనే లక్ష్యంతో బీజేపీ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. పలు స్థానాల్లో భారీ మేజార్టీలో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. చదవండి: కులమతాల చిచ్చు పెడుతున్నారు -
తునిలో తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ
కాకినాడ: టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు మరోసారి బయటపడ్డాయి. కాకినాడ జిల్లాలోని తునిలో తెలుగు తమ్ముళ్లు బాహాబాహీకి దిగారు. సాయి వేదిక ఫంక్షన్ హల్లో యనమల సోదరులు న్యూ ఇయర్ వేడుకలు ఏర్పాటు చేశారు. అయితే ఈ వేడుకల్లో యనమల సోదరుల వర్గాలకు చెందిన టీడీపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. యనమల సోదరుడు కృష్ణుడు వర్గానికి, యనమల అన్న కుమారుడు రాజేష్ వర్గానికి మధ్య పరస్పర దూషణలతో బీభత్సం చేశారు. అయితే ఈ వివాదం ముదరడంతో ఇరువర్గాల టీడీపీ కార్యకర్తలు వేదికపైనే తన్నుకున్నారు. చదవండి: రెచ్చిపోయిన టీడీపీ, జనసేన కార్యకర్తలు.. మంత్రి విడదల రజిని ఆఫీసుపై దాడి -
ఓం ప్రథమం... ఎదురైంది దుశ్శకునం
మనకున్నది బలం కాదు వాపని తేల్చేసిన నాయకులు కాకినాడ సమీక్షలో పవన్ కు షాకిచ్చిన క్యాడర్ టీడీపీతో కలిసి పని చేయలేమని స్పష్టీకరణ మాకు బాగా పట్టున్న జిల్లాలివి.. ఇక్కడ ఎంతటి కొమ్ములు తిరిగిన నాయకుడిని అయినా ఓడిస్తాం.. మేము దిగనంతవరకే.. దిగితే ఆట మారిపోతుందన్న భ్రమల్లో ఉన్న పవన్ కళ్యాణ్ కు ఇప్పుడిప్పుడే వాస్తవ పరిస్థితి అవగతం అవుతోంది. వెక్కిరించేవాళ్ల ముందరే కాలు జారిపడిపోయే పరిస్థితులు గోచరిస్తున్నాయి. గోదావరి జిల్లాల్లో పవన్ ప్రభంజనం.. తుపాను రాబోతోంది.. మొత్తం ఈస్ట్.. వెస్ట్.. పవన్ ఈజ్ బెస్ట్ అన్నట్లుగా ఊదరగొట్టిన జనసైనికులు జనసేన ప్రధాన నాయకులుగా చెప్పుకున్నవాళ్లకు గత రెండు రోజులుగా వాస్తవాలు అర్థం అవుతున్నాయి. జనాన్ని పోగేసి సభలు.. మీటింగులు పెట్టడం వేరు.. జనాన్ని తనవెంట నడిపించి వాళ్లతో ఓట్లు వేయించడం వేరు అన్నది అర్థం అర్థం అవుతోంది. కాకినాడ జిల్లాతో నియోజకవర్గం రివ్యూలు మొదలు పెట్టిన పవన్‌కు మొదట్లోనే గొంతులో అడ్డం పడిపోయింది. క్యాడర్ నుంచి.. ఓ మోస్తరు నాయకులవరకూ చెబుతున్న ఫీడ్ బ్యాక్ చూసి దిమ్మెత్తిపోయింది. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ను చెడ్డీ మీద కొట్టుకుంటూ నడిపిస్తాను అని అప్పట్లో వార్ణింగ్ ఇవ్వడం ఐతే ఇచ్చారు కానీ అక్కడ జనసేనకు అభ్యర్థే లేరు. కాపులు మొత్తం చంద్రశేఖర్ వెంట ఉండడంతో పవన్ తరఫున పోటీ చేసి చేతులు కాల్చుకునేందుకు అభ్యర్థి కరువయ్యారు. రెండు జిల్లాల్లోని మొత్తం 34 స్థానాల్లో జనసేన దాదాపు పాతికపైగా సీట్లు గెలుస్తుంది అని భ్రమల్లో ఉంటూవచ్చిన వారికి ఇప్పుడు పట్టుమని పదిమంది అభ్యర్థులు కనిపించడం లేదు. ఎదురులేదని చెప్పుకున్న ఈస్ట్, వెస్ట్ గోదావరిలోనే ఇలా ఉంటె మిగతా జిల్లాల్లో పరిస్థితి ఏమిటన్నది పార్టీ పెద్దలకు అంతుపట్టడం లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ టికెట్ రాదని తెలుసుకున్న జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కూడా జనసేనలో చేరారు. ఈ క్రమంలోనే పవన్‌తో సమీక్షకు హాజరయ్యారు. అయన కూడా గ్రామ స్థాయిలో పార్టీకి ఏమీ బలం లేదని.. ఉన్నదంతా వాపేనని తేల్చి చెప్పారు. దీంతోబాటు తెలుగుదేశం కోసం సీట్లు త్యాగం చేసే పరిస్థితి లేదని, అలాగని టీడీపీతో పొత్తు పెట్టుకున్నా ఆ పొత్తు కలవదని, నిలవదని ఓట్ల బదలాయింపు జరగదని తేల్చి చెప్పేసారు. రెండు పార్టీల పొత్తు పొసగదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా జిల్లా.. మండల కార్యవర్గాలను ఎందుకు వేయలేదని పవన్ ప్రశ్నించగా.. మీరెళ్ళి చంద్రబాబుకు ఊడిగం చేస్తుంటే మేము పార్టీని ఎలా మోస్తాం.. మేమెలా నిర్ణయాలు తీసుకుంటాం అని ఎదురు ప్రశ్నించడంతో పవన్ నోట మాట రాలేదని తెలిసింది. చిత్తూరులో నాయకుల చిటపట ఇదిలాఉంటే శనివారం కుప్పం పర్యటనకు వెళ్లిన చంద్రబాబు జనసేన జిల్లా సమావేశానికి హయారయ్యారు. చంద్రబాబును సీఎం చేసేందుకు అందరం కష్టపడాలి అని పార్టీ జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ చేసిన ప్రసంగం అక్కడ గలాటా రేపింది. కాసేపు ఉండి సమావేశం నుంచి చంద్రబాబు బయటకు వెళ్ళిపోగానే జనసైనికులు హరిప్రసాద్ మీద ప్రశ్నల దాడి చేశారు. చంద్రబాబుకు మనం ఎందుకు ఊడిగం చేయాలి.. మనం పవన్ కోసం కదా పని చేస్తున్నాం. మీరు అలా మాట్లాడితే ఎలా అంటూ కుప్పం జనసైనికులు ప్రశ్నించేసరికి హరిప్రసాద్ నిరుత్తరుడయ్యారు. అధికారంలో సైతం జనసేనకు వాటా ఇవ్వాల్సిందేనని, ఆలాగైతేనే పొత్తు ఉంటుందని జనసైనికులు తేల్చి చెప్పేసారు. - సిమ్మాదిరప్పన్న -
కులం పేరిట బాబు విష రాజకీయం
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ.. చిత్ర విచిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దాంట్లో భాగంగా అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై కొన్ని శక్తులు వ్యూహాత్మకంగా విష ప్రచారం చేస్తున్నాయి. నిజం గుమ్మం దాటి బయటకు వచ్చేలోగా అబద్దం ఊరంతా తిరిగివచ్చిందన్న సామెత గుర్తు చేస్తున్నాయి. కులం.. ఓ అస్త్రం ఆంధ్రప్రదేశ్‌లో మొదటి నుంచి ప్రజలను కులాల పేరిట విడగొట్టడంలో తెలుగుదేశం పార్టీ మొదట్లో సక్సెస్ అయింది. కొన్ని కులాలను దెబ్బతీయడానికి తెలుగుదేశం పార్టీ ఎంతకైనా దిగజారిందన్న ఆరోపణలున్నాయి. అందులో భాగంగా చంద్రబాబునాయుడు మూడు దశాబ్దాల నుంచి ఓ పకడ్బందీ వ్యూహరచనను అమలు చేస్తున్నాడన్న విమర్శలున్నాయి. ఏపీలో.. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో పెద్ద సంఖ్యలో ఉన్న కాపులను రాజకీయంగా ఎదగకుండా అడ్డుకోవడంలో చంద్రబాబు కొంత సఫలీకృతుడయ్యాడని చెబుతారు. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఇప్పుడు మరో అసత్య ప్రచారానికి చంద్రబాబు తెరలేపుతున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి. గోదావరి జిల్లాల్లో కాపులు ఏ రకంగానయితే పెద్ధ సంఖ్యలో ఉన్నారో.. అలాగే కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో పెద్ద సంఖ్యలో బలిజలున్నారు. పవన్‌తో పొత్తు.. దేనికి సంకేతం పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. సినిమాల్లో హీరోగా నటించిన పవన్ కళ్యాణ్‌కు రాజకీయాలతో సంబంధం లేకుండా కొంత యువతలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చిరంజీవి ప్రజారాజ్యం పెట్టడం, ఆ సమయంలో పవన్ పార్టీ కోసం పని చేయడం.. ఆ తర్వాత కాలంలో అది కాస్తా కాంగ్రెస్‌లో కలిసిపోవడం.. ఇదంతా సగటు తెలుగు ప్రేక్షకులకు తెలిసిన విషయం. ఈ ఎపిసోడ్‌ను జాగ్రత్తగా ఫాలో అయిన చంద్రబాబు.. ఈ మొత్తం అధ్యాయం నుంచి పవన్ కళ్యాణ్ అనే చాప్టర్‌ను బయటకు తీశాడు. తనకు అనుకూలమైన రాజకీయ పరిస్థితులను సృష్టించడానికి పవన్‌కళ్యాణ్‌ను ఓ పావుగా వాడుకోవడం మొదలుపెట్టాడు. 2014లో అసలు పోటీ చేయకుండానే.. పొత్తులోకి రావడం, 2019లో చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రతిపక్షంలో ఓటు చీల్చేందుకు జనసేన విడిగా పోటీచేసేలా చూడడం, ఆ తర్వాత మళ్లీ పవన్‌తో జైల్లో పొత్తు పెట్టుకోవడం.. ఇవన్నీ హఠాత్తుగా జరిగిన రాజకీయ పరిణామాలు కాదు. అతి జాగ్రత్తగా చంద్రబాబు తెరవెనక రచించిన మంత్రాంగానికి ఇవి విజువల్ రూపం మాత్రమే. పవన్ వెనక ఉన్న వారెవరు? పవన్ కళ్యాణ్‌ను కాపుల ప్రతినిధిగా ఎవరైనా చెప్పుకుంటే అంతకు మించిన తప్పు ఇంకొకటి ఉండదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గత ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం అత్యధిక సంఖ్యలో ఉండే భీమవరం నియోజకవర్గాన్ని ఎంచుకుని మరీ పోటీ చేస్తే.. 8వేలకు పైగా తేడాతో ఓడిపోయారు పవన్‌కళ్యాణ్. నిజంగా పవన్ కాపుల ప్రతినిధే అని జనం నమ్మితే ఓడించబోరు కదా. ఇక చంద్రబాబు చేతిలో ఉన్న ఎల్లో మీడియా ఓ అడుగు ముందుకేసి కాపులతో పాటు, బలిజ కూడా జనసేన, తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నాయన్న ఓ అబద్ద ప్రచారాన్ని సోషల్ మీడియాలో నడుపుతున్నారు. ఏపీలో బలమైన సామాజిక వర్గంగా తెలగ/కాపులు, బలిజలు ఉన్నారు. బలిజలు రాష్ట్రవ్యాప్తంగా చాలా జిల్లాలో విస్తరించి ఉన్నారు. మరి బలిజలకు చంద్రబాబు చేసిందేంటీ? సీఎం జగన్ చేసిందేంటీ? చంద్రబాబు ఏం చేయకపోగా.. బలిజలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకున్నాడు. మా నమ్మకం నువ్వే జగన్ : బలిజలు రాయలసీమ జిల్లా బలిజల్లో ఎందరికో మంచి పదవులను ఇచ్చారు ముఖ్యమంత్రి జగన్. అవకాశం వచ్చిన ప్రతీ సారి బలిజలకు ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు సీఎం జగన్. YSR జిల్లానే చూసుకుంటే.. కడపకు చెందిన సి.రామచంద్రయ్యను ఎమ్మెల్సీగా నియమించారు. గురుమోహన్ ను అన్నమయ్య జిల్లా అర్బన్ డెవెలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా నియమించారు. మర్రి రవికుమార్ ను రాజంపేట మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఎంచుకున్నారు. పోరుమామిళ్లకు చెందిన డా. కళ్యాణ్ చక్రవర్తిని ఆప్కోస్ డైరెక్టర్ గా నియమించారు. బలిజలపై తనకున్న ప్రేమను ఎప్పటికప్పుడు చాటుకుంటున్నారు. నాలుగున్నరేళ్ల పాలనలో 10 మంది కాపు నేతలకు మంత్రి పదవులివ్వడమే కాకుండా కీలక శాఖలు ఇచ్చారు సీఎం జగన్. ఇక అనంతపురం జిల్లాలో హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా మహాలక్ష్మి శ్రీనివాస్‌ను, అగ్రోస్ ఛైర్మన్‌గా నవీన్ నిశ్చల్‌ను, నియమించారు. అలాగే చిత్తూరు జిల్లాలో చిత్తూరు ఎమ్మెల్యేగా జంగాలపల్లె శ్రీనివాసులు (అరణి శ్రీనివాసులు)ను 2019లో గెలిపించుకున్నారు. నగరికి చెందిన కేజీ శాంతికుమారిని ఈడిగ కార్పోరేషన్ ఛైర్మన్‌గా ఎంపిక చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యులుగా పోకల అశోక్‌కుమార్‌ను ఎంపిక చేశారు. ఫారెస్ట్ బోర్డు మెంబర్‌గా నయనార్ శ్రీనివాసులును నియమించారు. పదవులకు తోడు.. యావత్తు బలిజలకు అండగా ఉండేలా ఇప్పుడు మరో అడుగు ముందుకేసేందుకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారు. బలిజ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు. మంత్రివర్గం మొదటిసారి ఏర్పాటు చేసినప్పుడు అయిదుగురికి, రెండో సారి పునర్వ్యవస్థీకరించినప్పుడు అయిదుగురికి కాపు/బలిజలనుంచి తీసుకున్నారు సీఎం జగన్. బలిజలంతా వైఎస్ఆర్సీపీ వైపే : రత్నాకర్ వరుసగా నాలుగో సారి ఉత్తర అమెరికా ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన రత్నాకర్ పండుగాయల తాజా రాజకీయ పరిస్థితులను విశ్లేషించారు. "మాటల్లో కాదు, చేతల్లో సామాజిక న్యాయం చేసి చూపించిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్. మధ్యతరగతి కుటుంబానికి చెందిన తన లాంటి ఓ సామాన్యుడిని కేబినెట్ పదవిలో కూర్చోబెట్టగలిగిన చిత్తశుద్ధి, సత్తా ఒక్క వైయస్ఆర్ సీపీకే ఉంది. కాపు, బలిజ సామాజికవర్గానికి మరింత రాజకీయ ప్రాధాన్యత ఇచ్చేందుకు సీఎం జగన్ కృతనిశ్చయంతో ఉన్నారు. త్వరలోనే బలిజలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు కాబోతోంది, ఆర్ధికంగా వెనుకబడిన బలిజల అభ్యున్నతికి ఈ కార్పొరేషన్ ద్వారా చేయూతనివ్వాలన్నది సీఎం జగన్ ఆలోచన." అని అన్నారు. పవన్‌తో చంద్రబాబు పొత్తు పేరిట కాపు, బలిజల ఓటు బ్యాంకును కొట్టేయాలన్న చంద్రబాబు ప్రయత్నం కచ్చితంగా విఫలమవుతుందని, బలిజల ముసుగులో టీడీపీ చేస్తున్న దిగజారుడు రాజకీయాలను బలిజలు ఈసడించుకుంటున్నారంటున్నారు. బలిజలకు టీడీపీలో పదవులే కాదు, కనీస గౌరవం కూడా లేదంటున్నారు. -
జనసేన కేడర్‌కు, పవన్‌కు వార్
పాలకొల్లు సెంట్రల్: ప్రస్తుతం జనసేన కేడర్‌కు, పవన్‌కళ్యాణ్‌కు మధ్య వార్ జరుగుతోందని మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘పవన్ ఓట్లు కావాలంటారు.. జనసేన నాయకులు అధికారం కావాలంటారు. ఏది ముందు ఏది వెనుక అని విశ్లేషిస్తే జేజేలు, చప్పట్లు కాదు కావాల్సింది ఓట్లు అని పవన్‌కళ్యాణ్ అంటున్నారు.. ఓట్లు సరే అధికారం సంగతేంటి అని జనసైనికులు ప్రశ్నిస్తున్నారు. ఓట్లు వేసి జనసేనను గెలిపిస్తే అధికారం అదే వస్తుందని పవన్ అంటుంటే.. అధికారం వస్తుందని నమ్మిస్తే ఓట్లు అవే వస్తాయని జనసేన నేతలు అంటున్నారు. తాను కోరుకుంటున్నది అధికారం కాదని, రాష్ట్ర శ్రేయస్సు, ప్రజాశ్రేయస్సు అని పవన్ అంటుంటే.. అధికారం చేజిక్కకుండా ప్రజాశ్రేయస్సు ఎలా సాధిస్తారని పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు..’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం జనసేన కేడర్, పవన్‌కు మధ్య జరుగుతున్న వార్ ఇదని తెలిపారు. తెలంగాణలో రాజ్యాధికారం చేపట్టడంలో ఆఖరి వరుసలో ఉందని సర్వేలు చెబుతున్నా తన సత్తా చూపించాలనే ఆతృతతో బీజేపీతో కలిసి పవన్ ఎన్నికల రంగంలోకి దిగడం సాహసోపేతమని పేర్కొన్నారు. తెలంగాణలో రాజ్యాధికారం చేపట్టలేదని తెలిసీ ఓటర్లు తమ ఓట్లను జనసేన–బీజేపీ కూటమికి వేసి ఎందుకు చేతులు కాల్చుకుంటారని ప్రశ్నించారు. ఏపీలో పరిస్థితి మాత్రం వేరని తెలిపారు. పవన్ 60 శాసనసభ సీట్లకు తక్కువ కాకుండా పోటీచేయవచ్చని పేర్కొన్నారు. అధికారం దక్కించుకోవడం పవన్ వంతు అయితే.. జనసేన–టీడీపీ కూటమికి ఓట్లు వేసి నెగ్గించుకోవడం తమ వంతు అని జనసేన కేడర్ దృఢ సంకల్పంతో ఉందని తెలిపారు. జనసేన టీడీపీని కలుపుకొని వైఎస్సార్సీపీని ఓడించి రాజ్యాధికారం దక్కించుకోవడానికి, ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి దగ్గరలో ఉందని తెలిపారు. టీడీపీ వెనుక జనసేన అని కాకుండా.. జనసేన వెంట టీడీపీ ఉందని చెప్పి మూడునెలల్లో అధికారంలోకి రావడం తథ్యమని ప్రజలను నమ్మించగలగాలని ఆయన పేర్కొన్నారు. ఇదీ చదవండి: ఎల్లో మీడియా బరితెగింపు.. చెత్త కథనాలతో బ్లాక్మెయిల్? -
ఖరీఫ్ ధాన్యం సేకరణకు సన్నాహాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఖరీఫ్ ధాన్యం సేకరణకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ సీజన్లో దాదాపు 40 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు విస్తృత ఏర్పాట్లుచేస్తోంది. కల్లంలో పంట కొనుగోలు దగ్గర నుంచి మిల్లుకు తరలించే వరకు ఎక్కడా జాప్యం లేకుండా రైతుకు సంపూర్ణ మద్దతు ధర అందించడమే లక్ష్యంగా ప్రత్యేకంగా రోడ్ మ్యాప్‌ను సిద్ధంచేస్తోంది. రైతుభరోసా కేంద్రం (ఆర్బీకే) స్థాయిలో ధాన్యం రవాణాకు దాదాపు 30వేలకు పైగా వాహనాలను అందుబాటులో ఉంచనుంది. ప్రైవేటు కాంట్రాక్టు వాహనాలతో పాటు రైతుల సొంత వాహనాలకు భాగస్వామ్యం కల్పిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ఆర్బీకేల్లో వాహనాల రిజిస్ట్రేషన్లను ప్రారంభించింది. నిజానికి.. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ ఖరీఫ్‌లో పంట ఆలస్యంగా సాగైంది. ఫలితంగా నవంబర్ రెండో వారం తర్వాత కోతలు పూర్తిస్థాయిలో ప్రారంభమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక్కో ఆర్బీకే క్లస్టర్లో పది వాహనాలు.. రాష్ట్రవ్యాప్తంగా 3,500కు పైగా ఆర్బీకే క్లస్టర్లలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తోంది. సీజన్లో ఒక్కో ఆర్బీకే క్లస్టర్లో దాదాపు 10 వాహనాలను కేటాయించనుంది. కాంట్రాక్టర్ల నుంచి ముందస్తుగా కొంత సెక్యూరిటీ డిపాజిట్లు సేకరించిన అనంతరం వారికి ధాన్యం తరలింపు కాంట్రాక్టును ఇస్తోంది. రైతుల నుంచి సేకరించిన ధాన్యం పక్కదారి పట్టకుండా ప్రభుత్వం నిర్దేశించిన మిల్లుకు మాత్రమే అవి చేరేలా ప్రతి వాహనానికి జీపీఎస్ ట్రాకర్ అమర్చి పర్యవేక్షించనుంది. ఆ తర్వాత బఫర్ గోడౌన్లకు తరలిస్తారు. ఆర్బీకేల వారీగా వివరాల సేకరణ.. ధాన్యం సేకరణలో ఎటువంటి టార్గెట్లు లేకుండా రైతుల నుంచి పూర్తిస్థాయిలో పంట కొనుగోలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పౌరసరఫరాల సంస్థ ఆర్బీకేల వారీగా పంట ఎంత ఉంది? రైతులు బహిరంగ మార్కెట్లో అమ్ముకోగా ఎంతమేరకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వస్తుంది? అన్నదానిపై జిల్లాల వారీగా సమగ్ర నివేదికను సిద్ధంచేస్తోంది. దీని ఆధారంగా ముందస్తుగానే గోతాలు, రవాణా, హమాలీలను సమకూర్చనుంది. అలాగే, 10వేల మందికిపైగా టెక్నికల్ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, హెల్పర్లను తాత్కాలిక ప్రాతిపదికపైన నియమిస్తోంది. ఖరీఫ్, రబీ రెండు సీజన్లలో కలిపి సుమారు 4–5 నెలల పాటు యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. ఆయా జిల్లాల వారీగా జేసీల ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియను చేపట్టింది. ఎంపికైన వారికి శిక్షణ ఇవ్వనుంది. ముందస్తు ఏర్పాట్లలో నిమగ్నం ఇక గతంలో పంట దిగుబడి అంచనా ఆధారంగా ఒక ఎకరాకు ఎన్ని ధాన్యం బస్తాలు వస్తాయో లెక్కించేవారు. అనంతరం..ఈ–క్రాప్‌లో రైతు నమోదు చేసిన పంట విస్తీర్ణ వివరాలను, దిగుబడి అంచనాను బేరీజు వేసుకుని పౌరసరఫరాల సంస్థ రైతు నుంచి నిర్దేశించిన సంఖ్యలో ధాన్యం బస్తాలను సేకరించేది. దీంతో కొనుగోలు కేంద్రాల పరిధిలో అవసరౖమెన గోనె సంచులు, రవాణా వాహనాలు, హమాలీలను వంటి మౌలిక సదుపాయాల కల్పనలో జాప్యం జరిగేది. ప్రస్తుతం పంట దిగుబడి అంచనాతో సంబంధంలేకుండా గడిచిన ఐదేళ్లలో ఏ సంవత్సరం ఎక్కువ దిగుబడి వచ్చిందో ఆ సంఖ్యను ప్రస్తుత సీజన్‌కు అన్వయించుకుని కొనుగోళ్లకు ముందస్తుగానే ఏర్పాట్లుచేస్తోంది. ప్రభుత్వం రైతుకు మద్దతు ధర కల్పించడంతో పాటు గోనె సంచులు, రవాణా, హమాలీ ఖర్చులను సైతం అందిస్తోంది. టన్నుకు గోనె సంచుల వినియోగానికి రూ.85, హమాలీల కూలి రూ.220, సగటున 25 కిలోమీటర్ల ధాన్యం రవాణాకు రూ.468 చొప్పున మొత్తం జీఎల్టీ (గన్నీ లేబర్ ట్రాన్స్‌పోర్టు) కింద టన్నుకు రూ.2,523 లబ్ధిచేకూరుస్తోంది. రైతులు మిల్లుకు వెళ్లొద్దు.. రైతులు ఆర్బీకేలో ధాన్యం అప్పగించిన అనంతరం ఎఫ్టీఓ (ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్) అందిస్తాం. అందులో రైతు కొనుగోలు కేంద్రానికి ఇచ్చిన ధాన్యం బరువు, ప్రభుత్వ నుంచి వచ్చే మద్దతు ధర మొత్తం ఉంటుంది. ఒక్కసారి ఎఫ్టీఓ ఇచ్చిన తర్వాత రైతుకు ధాన్యం బాధ్యత ఉండదు. మిల్లుకు ఆర్బీకే సిబ్బందే తరలిస్తారు. ఏదైనా సమస్య వస్తే మిల్లు వద్ద డెప్యూటీ తహసీల్దార్ స్థాయి అధికారిని కస్టోడియన్ ఆఫీసర్‌గా నియమించి పరిష్కరిస్తాం. ఆర్బీకేలో పరీక్షించిన తేమ శాతాన్ని ఫైనల్ చేస్తాం. దీనిపై రైతులకు అవగాహన కల్పించేలా వీడియోలను రూపొందిస్తున్నాం. – హెచ్. అరుణ్‌కుమార్, కమిషనర్, పౌరసరఫరాల శాఖ మిల్లర్లు గోనె సంచులు ఇవ్వాల్సిందే.. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, చౌకదుకాణాలతో పాటు మిల్లర్ల నుంచి పెద్దఎత్తున గోనె సంచులు సేకరిస్తున్నాం. వీటిని ముందస్తుగా ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచుతాం. ధాన్యం కేటాయింపులకు తగినన్ని గోనె సంచులను ముందుగానే ఆర్బీకేలకు సమకూర్చేలా మిల్లర్లకు ఆదేశాలిచ్చాం. ఇప్పటికే జిల్లా జాయింట్ కలెక్టర్లు దీనిపై దృష్టిసారించారు. మిల్లర్లు సహకరించకుంటే వారిని కస్టమ్ మిల్లింగ్ నుంచి తొలగిస్తాం. – వీరపాండియన్, పౌరసరఫరాల సంస్థ ఎండీ -
పార్టీ ధిక్కారానికి పాల్పడితే వేటే..
సాక్షి, హైదరాబాద్: ముందు నుంచీ చెప్తున్నట్టుగానే సిట్టింగ్‌లకే పార్టీ టికెట్లు కేటాయించామని.. పార్టీ ధిక్కార చర్యలకు ఎవరు పాల్పడినా వేటు తప్పదని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ హెచ్చరించారు. ధిక్కారానికి పాల్పడేవారు ఏ స్థాయిలో ఉన్నా క్రమశిక్షణ చర్యలు సాదాసీదాగా ఉండవని, పార్టీ నుంచి పంపించేస్తామని స్పష్టం చేశారు. ఒకట్రెండు చోట్ల అసంతృప్తులుంటే.. పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు అధ్యక్షతన త్రిసభ్య కమిటీని నియమిస్తామని, ఆ కమిటీ సమస్యలను పరిష్కరిస్తుందని తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమకెవరూ పోటీయే కాదని.. 95 నుంచి 105 సీట్లలో బీఆర్ఎస్ అభ్యర్థులే గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. సోమవారం తెలంగాణ భవన్ లో 115 మంది బీఆర్ఎస్ అభ్యర్థులతో జాబితాను కేసీఆర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. పార్టీలో పూర్తి స్థాయి అవగాహన, సర్దు బాట్లతోనే ఒకేసారి 115 మంది అభ్యర్థులను ప్రకటిస్తున్నామన్నారు. పార్టీ నిర్ణయం మేరకు తాను రెండు చోట్ల పోటీ చేస్తున్నట్టు తెలిపారు. శ్రావణమాసం మంచి ముహుర్తం ధనుర్లగ్నంలో అభ్యర్థులను ప్రకటించామని.. వీరిని గెలిపించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేలా ఆశీర్వదించాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. అక్టోబర్ 16న వరంగల్‌లో సింహ గర్జన బహిరంగ సభ నిర్వహిస్తామని, అదే రోజున బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల చేస్తామని ప్రకటించారు. తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని మార్పులు తప్పనిసరి పరిస్థితుల్లో ఏడుగురు సిట్టింగ్‌లను మార్చామని సీఎం కేసీఆర్ చెప్పారు. ఎవరినైనా వదులుకోవాలంటే తమకు కూడా బాధగానే ఉంటుందన్నారు. అవకాశం రానివారు చిన్నబుచ్చుకోవాల్సిన అవసరం లేదని.. ఎమ్మెల్సీ, ఎంపీ, జెడ్పీ చైర్పర్సన్లుగా పార్టీ అవకాశాలు కలి్పస్తుందని హామీ ఇచ్చారు. పార్టీలోనే ఉండి అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు. మిగిలిపోయిన 4 సీట్లలో అభ్యర్థులను రెండు మూడు రోజుల్లో ఖరారు చేస్తామని చెప్పారు. వేములవాడ అభ్యర్థి మంచివాడే అయినా ఆయన పౌరసత్వం సమస్య కోర్టుల్లో ఉందని చెప్పారు. భూపాలపల్లి నుంచి గండ్ర వెంకటరమణారెడ్డికి పోటీచేసే అవకాశం ఇస్తామని హామీ ఇచ్చినందున మధుసూదనాచారి సహకారంతో టికెట్ కేటాయించామన్నారు. తాండూరు నుంచి మహేందర్‌రెడ్డి కూడా యువకుడికి అవకాశం ఇవ్వడానికి పూర్తిగా సహకరించి ఆశీర్వదించారని చెప్పారు. వామపక్షాలతో పొత్తు మాటే రాదు బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను విడుదల చేశాక వామపక్షాలతో పొత్తు మాటే ఉత్పన్నం కాదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 34 సీట్లు బీసీలకు ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించిందని, బీఆర్ఎస్ బీసీలకు తక్కువ సీట్లు కేటాయించిందేమని మీడియా ప్రశ్నించగా.. ‘చూద్దాం.. ఎవరెన్ని సీట్లు కేటాయిస్తారో?’అని బదులిచ్చారు. మహిళలకు తక్కువ సీట్లపై స్పందిస్తూ.. పార్లమెంటు చట్టం చేస్తే ప్రతీపార్టీ కూడా మహిళలకే అవకాశాలు ఇస్తాయని, ప్రస్తుత పరిస్థితుల్లో అన్నీ ఆలోచించి టికెట్లు కేటాయించామని వివరించారు. కర్ణాటకకు, తెలంగాణకు పోలికే లేదు ఇటీవలి కర్ణాటక అసెంబ్లీ ఫలితాలకు, తెలంగాణకు పోలికే లేదని కేసీఆర్ పేర్కొన్నారు. అలవిగాని హామీలిచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేయలేక చేతులెత్తేస్తోందని విమర్శించారు. బెంగళూరుకు విద్యుత్ సరఫరా చేయలేక లోడ్ షెడ్డింగ్ చేస్తున్నారన్నారు. తెలంగాణలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నా.. బీఆర్ఎస్ లక్ష రూపాయలే, అదీ విడతల వారీగా మాఫీ చేస్తామని, ప్రజలు తమనే నమ్మి గెలిపించారని చెప్పారు. జవదేకర్ ఓ పాగల్..! సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి బీజేపీ సీనియర్ నేత ప్రకాశ్ జవదేకర్ చేసిన విమర్శలను ప్రస్తావించగా.. ‘‘జవదేకర్ మాట్లాడేది ఏంది? కాళేశ్వరం గురించి తొండం తెల్వదు.. తోక తెల్వదు. ఎన్నిసార్లు చెప్పిందే చెప్తారు. ఆయనో ఓ పాగల్. బీఆర్ఎస్ను ఒకరికొకరు ఏ టీమ్, బీ టీమ్ అంటున్న కాంగ్రెస్, బీజేపీలు కూడా పాగల్ పార్టీలు..’’అని కేసీఆర్ మండిపడ్డారు. వ్యతిరేకులకు ఇళ్ల స్థలాలివ్వం: కేసీఆర్ ‘‘రాష్ట్రానికి వ్యతిరేకంగా, అభివృద్ధికి విఘాతం కలిగించేలా కథనాలు ప్రచురించే పత్రికల్లోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వం. వాళ్లను పాలు పోసి పోషించాల్సిన అవసరమేముంది? ఎవరికి ఇవ్వా లన్నది ప్రభుత్వ విచక్షణ. కీలుబోమ్మలాంటి వారు జర్నలిస్టులు ఎలా అవుతారు? వాళ్లకు ఐడియా ఉండాలి కదా.. దేశంలో ఎవరూ మాతో పోల్చుకోవడానికి కూడా సాహసం చేయని పరిస్థితులు ఉంటే.. ఇక్కడ వేతనాలు ఇవ్వడానికి డబ్బుల్లేవంటూ కథనాలు రాస్తున్నారు. ఒకే దెబ్బకు రూ.20 వేల కోట్ల రుణమాఫీ చేశాం. ఆ పత్రిక తల ఎక్కడ పెట్టుకుంటుంది? ఆర్బీఐ రాష్ట్రాన్ని బెస్ట్ స్టేట్ అంటోంది. కేంద్రం, కేంద్ర మంత్రులు తెలంగాణ అభివృద్ధిని చెబుతూ అవార్డులిస్తుంటే.. అవేవీ పట్టించుకోకుండా పనికి మాలిన రాతలు రాస్తున్నారు. ఇదేం జర్నలిజం? ఉద్యమ సమయంలోనే చెప్పా.. కొన్ని కుల పత్రికలు, గుల పత్రికలు ఉన్నాయని.. న్యూస్‌పేపర్ కాదు వ్యూస్ పేపర్, చానెల్స్ ఉన్నాయి..’’అని సీఎం ఘాటుగా స్పందించారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు అంశంపై మీడియా ప్రశ్నించగా ఇలా స్పందించారు. -
ఐపీఎస్‌ను పెళ్లాడిన టీనా దాబి సోదరి.. ఐఏఎస్ భార్య కోసం కేడర్ మార్పు..
ఐఏఎస్ అధికారి, యూపీఎస్సీ టాపర్ టీనా దాబి సోదరి ఐఏఎస్ రియా దాబి పెళ్లి చేసుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఐపీఎస్ అధికారి మనీష్ కుమార్‌తో ఏడడుగులు వేశారు. కాగా మనిష్ కుమార్, రియా దాబిలు కుటుంబ సభ్యుల అనుమతితో ఏప్రిల్ నెలలోనే కోర్టు వివాహం చేసుకున్నారు. అంటే వీరి పెళ్లి జరిగి రెండు నెలలు కావొస్తుంది. అయితే మనీష్ కుమార్ కేడర్‌ను మహారాష్ట్ర నుంచి రాజస్థాన్‌కు మారుస్తూ హోం మంత్రిత్వశాఖ నోటీసులు జారీ చేయడంతో ఈ విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఇక రియా దాబి ఆమె భర్త ఐపీఎస్ మనీష్ కుమార్ ఇద్దరూ 2020 యూపీఎస్సీ బ్యాచ్‌కు చెందిన వారే. యూపీఎస్సీ పరీక్షల్లో ఆమె 15వ ర్యాంకర్‌గా నిలిచారు. ప్రస్తుతం ఆమె రాజస్థాన్‌లోని అల్వార్‌కు కలెక్టర్‌గా ఉన్నారు. వీరిద్దరికి ముస్సోరీలోని శిక్షణా అకాడమీలో పరిచయం ఏర్పడగా.. అనంతరం స్నేహం ప్రేమగా మారింది. అయితే రియా రాజస్థాన్ కేడర్ కాగా మనీష్ మహారాష్ట్ర కేడర్‌కు చెందిన ఐపీఎస్. వివాహామనంతరం మనీష్ తన కేడర్ మార్పు కోసం దరఖాస్తు చేసుకొని..మహారాష్ట్ర నుంచి రాజస్థాన్‌కు మార్చుకున్నారు. చదవండి: బిల్లు కట్టకుండా ఫైవ్ స్టార్ హోటల్లో రెండేళ్లు.. తర్వాత ఏమైందంటే! కాగా మనీష్ కుటుంబం ఢిల్లీలో నివసిస్తోంది. బీటెక్ చదివిన తర్వాత సివిల్ సర్వీసెస్‌లో చేరారు. 2020 పరీక్షలో 581 ర్యాంకు సాధించాడు. మహారాష్ట్రలోని ఒసామాబాద్లో విధులు నిర్వహిస్తున్న ఆయన ఇప్పుడు రాజస్థాన్‌కు బదిలీ కానున్నారు. త్వరలోనే వీరు జైపూర్‌లో స్నేహితులు, కుటుంబ సభ్యులతో గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేసుకోనున్నారు. కాగా రియా సోదరి టీనా దాబి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 2015 టాపర్‌గా నిలిచారు. అంతేగాక సివిల్ సర్వీసెస్ పరీక్షలో అగ్రస్థానంలో నిలిచిన మొదటి దళితురాలిగా రికార్డు సృష్టించింది. సెకండ్ ర్యాంకర్ అయిన అథర్ అమీర్ ఖాన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తరువాత రెండేళ్లకే 2021లో వీరు విడాకులు తీసుకున్నారు. గతేడాది ఐఏఎస్ ప్రదీప్ గావండేను రెండో పెళ్లి చేసుకున్నారు.. ప్రస్తుతం జైసల్మేర్ జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. -
అచంచలమైన నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతలు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: జగనన్నే మా భవిష్యత్తు మెగా సర్వేలో 1.45 కోట్ల కుటుంబాలకు వైఎస్సార్సీపీ చేరువైంది. దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ చేయని భారీ మెగా పీపుల్స్ సర్వేగా ‘జగనన్నే మా భవిష్యత్తు’ నిలిచింది. ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా విజయవంతం చేసిన రాష్ట్ర ప్రజలకు, వైఎస్సార్సీపీ క్యాడర్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ‘‘సుపరిపాలన, ప్రభుత్వ విధానాలపై అచంచలమైన నమ్మకాన్ని ఉంచి ఫోన్లు చేసి మద్దతు తెలిపిన 1.16 కోట్ల కుటుంబాలకు, పార్టీ క్యాడర్‌కు ధన్యవాదాలు’’ అంటూ సీఎం ట్వీట్ చేశారు. ‘‘ప్రజలకు మరింత సేవ చేసేందుకు దేవుని దయ, మీ చల్లని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను’’ అని ట్విటర్లో పేర్కొన్నారు. మన పాలన పట్ల మన ప్రభుత్వ విధానాల పట్ల అచంచలమైన నమ్మకాన్ని ఉంచి ఫోన్లు చేసి నాకు మద్దతు తెలిపిన 1.16కోట్ల కుటుంబాలకు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన @YSRCParty క్యాడర్ కు ధన్యవాదాలు. మీకు మరింత సేవ చేసేందుకు, దేవుని దయ మీ చల్లని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనసారా… pic.twitter.com/92DSw9eFFX — YS Jagan Mohan Reddy (@ysjagan) April 29, 2023 కాగా, వైఎస్సార్ సీపీ ప్రతిష్టాత్మక జగనన్నే మా భవిష్యత్తు మెగా పీపుల్స్ సర్వే శనివారం నాటితో రాష్ట్ర వ్యాప్తంగా ముగిసింది. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ రాష్ట్రంలోని 1.45 కోట్ల కుటుంబాలను కలిసి సీఎం జగనన్న పాలనపై వారి అభిప్రాయాలను సేకరించింది. సీఎం జగన్ పాలనకు 1.1 కోట్ల కుటుంబాలు మిస్డ్ కాల్ ద్వారా మద్దతు ప్రకటించారు. చదవండి: ఇంటింటా ‘నమ్మకం’.. జగనన్నే మా భవిష్యత్తు..1.1 కోట్ల మిస్డ్ కాల్స్ -
ఆ పోస్టర్ల వెనుక మాజీ మంత్రి గంటా హస్తం ఉందా?.. ఇంతకీ ఆమె కథేంటి?
పార్టీ ఏదైనా..తమ నేతను గెలిపిస్తాం అని కేడర్ చెబుతుంది. కానీ ఒక చోట టీడీపీ స్థానిక నేతలు, కార్యకర్తలు మాత్రం ఆ అభ్యర్థి అయితే ఓడించడం ఖాయం అంటున్నారట. తమ అభ్యంతరాలు కాదని ఆమెకే సీటిస్తే ఓటమి తథ్యమని ముందే ప్రకటించేశారట. ఇంతకీ ఆ కథేంటో మీరే చదవండి తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఒక్కసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కానీ పాయకరావుపేట నియోజకవర్గంలోని నేతలతో ఆమెకు ఉన్న గొడవలు అన్నీ ఇన్నీ కావు. పార్టీ అధికారంలో ఉన్నపుడు ఎమ్మెల్యే కావడంతో అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డదిడ్డంగా సంపాదించేశారని ఆమెపై తీవ్ర ఆరోపణలున్నాయి. అనిత అవినీతిని వ్యతిరేకించిన నాయకులుపై కక్ష సాధింపు చర్యలకు దిగారని స్థానిక పార్టీ నేతలే చెబుతారు. తనను గెలిపించిన నియోజకవర్గంలో నచ్చని నేతలపై తప్పుడు కేసులు పెట్టించారట. అనిత తప్పుడు కేసులతో విసిగిపోయిన టీడీపీ నేతలు గతంలోనే ఆమెపై తిరుగుబాటు చేశారు. 2019 ఎన్నికలకు ముందు అనిత వద్దు.. టీడీపీ ముద్దు అంటూ నియోజకవర్గం మొత్తం ప్రచారం చేశారు. పాయకరావుపేటలో అనితకు సీటు ఇస్తే ఓడిస్తామని పార్టీ అధినేతకే నేరుగా వార్నింగ్ ఇచ్చారు. పార్టీలోనే తనకున్న వ్యతిరేకతను తట్టుకోలేక అనిత పాయకరావుపేటని వదిలి పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో పోటీ చేశారు. అక్కడ పరాజయం పాలవడంతో మళ్లీ పాయకరావుపేటకు మకాం మార్చారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. పరాయిచోటుకు వెళ్ళి ఓడిపోయి.. తిరిగి సొంత నియోజకవర్గం పాయకరావుపేటకు చేరుకున్న అనిత తన పాత లక్షణాలను ఏమాత్రం వదులుకోలేదు. స్థానిక టీడీపీ నేతలపై వేధింపులు పర్వం కొనసాగిస్తున్నారు. గతంలో తనపై వ్యతిరేక గళం వినిపించిన నాయకులను ఒక్కొక్కరిని పార్టీ నుండి సస్పెండ్ చేయిస్తున్నారు. ఇటీవల పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నియోజకవర్గంలో కొంతమంది నేతలు పోస్టర్స్ వేయించారు. ఆ పోస్టర్స్ లో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫొటోలు మినహా ఎక్కడా అనిత ఫోటోలు లేవు. ఈ పోస్టర్ల వెనక మాజీ మంత్రి గంటా హస్తం ఉందని అనిత అనుమానిస్తున్నారు. తన నియోజకవర్గంలో కొంతమంది కాపు నేతలను గంటా ప్రోత్సహిస్తున్నారని ఆమె భావిస్తున్నారు. దీంతో గంటాతో సన్నిహితంగా మెలిగే కాపు నాయకులను గుర్తించిన ఆమె వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయించారు. గతంలో అనిత వద్దు.. టీడీపీ ముద్దు అని ఎవరైతే తనకి వ్యతిరేకంగా ప్రచారం చేశారో ఇప్పుడు ఈ పోస్టర్ల వెనక వారే ఉన్నారని అనిత భావిస్తున్నారు. ఈ పోస్టర్ల వ్యవహారాన్ని పార్టీ నాయకత్వం దృష్టికి అనిత తీసుకెళ్ళారు. తన వ్యతిరేకులుగా భావించిన ఇద్దరిని పార్టీ నుంచి అనిత సస్పెండ్ చేయించారు. అనిత సస్పెండ్ చేయించిన ఆ ఇద్దరు కాపు సామాజికవర్గానికి చెందినవారు కావడంతో ఇప్పుడు పాయకరావుపేట టీడీపీ రాజకీయం మరింత వేడెక్కింది. పాయకరావుపేట ఎస్సీ రిజర్వుడ్ అయినప్పటికీ అక్కడ చక్రం తిప్పేది కాపు సామాజిక వర్గ నాయకులే. ఇప్పుడు ఇద్దరిని సస్పెండ్ చేయించడంతో అనిత మీద ఆగ్రహంతో ఉన్న కాపు సామాజిక వర్గ టీడీపీ నేతలు వచ్చే ఎన్నికల్లో తమ తడాఖా ఏంటో చూపిస్తామని హెచ్చరిస్తున్నారు. అనితను ఓడించడమే కాకుండా మంచి రిటర్న్ గిఫ్ట్ కూడా ఇస్తామని సెటైర్లు వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ అనితకు ఇస్తే ఊరూరు తిరిగి ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం చేసి ఓడిస్తామంటూ సవాళ్ళు విసురుతున్నారు. స్థానిక పార్టీ నేతల హెచ్చరికల నేపథ్యంలో అనితకు పాయకరావుపేటలో మళ్లీ సీటు ఇస్తారో లేక గతంలో మాదిరిగా మరో చోటకు మార్చుతారో చూడాలి. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి వెబ్ డెస్క్ చదవండి: ఎస్.. వైనాట్ 175.. ఏపీలో వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్ -
తెలంగాణ రాష్ట్ర కేడర్‌కు ఆరుగురు ఐఏఎస్‌లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కేడర్‌కు ఆరుగురు 2021 బ్యాచ్ ఐఏఎస్ అధికారులను కేంద్రం కేటాయించింది. శ్రద్ధ శుక్ల (ఛత్తీస్‌గఢ్), కిరణ్మయి కోపిశెట్టి (తెలంగాణ), నారాయణ్ అమిత్ మాలెపాటి (తెలంగాణ), వికాస్ మహతో (ఝార్ఖండ్), ఉమాశంకర్ ప్రసాద్ (బిహార్), మాయంక్ సింగ్ (మధ్యప్రదేశ్) త్వరలో రాష్ట్ర కేడర్‌లో చేరనున్నారు. కేంద్ర సర్వీసులకు రజత్‌షైనీ రాష్ట్ర రెవెన్యూ శాఖ లో సీసీఎల్ఏ డైరెక్టర్‌గా పనిచేస్తున్న 2007 బ్యాచ్ ఐఏఎస్ అధికారి రజత్ కుమార్ షైనీ కేంద్ర సర్వీసులకు బదిలీ అయ్యారు. ఆయనను కేంద్ర పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండస్ట్రీ ప్రమోషన్, ఇంటర్నల్ ట్రేడ్ విభాగానికి డైరెక్టర్‌గా నియమిస్తూ కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇదీ చదవండి: రైతే జెండా.. ఎజెండా! బీఆర్ఎస్ కార్యచరణపై కేసీఆర్ కసరత్తు -
పొలిటికల్ కారిడార్: దేవినేని ఉమాను మర్చిపోయిన క్యాడర్, ప్రజలు
-
రాహుల్ సభ సక్సెస్.. కాంగ్రెస్‌లో సమరోత్సాహం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ముందస్తు ఎన్నిక లు వస్తాయా అనే వాతావరణం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే జిల్లా రాజకీయాలు హాట్‌హాట్‌గా మారాయి. ఈ క్రమంలో రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్య క్షుడు అయ్యాక జిల్లా నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో తొమ్మి ది నెలలుగా వరుసగా అనేక కార్యక్రమాలు చేపడుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా కాంగ్రె స్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆధ్వర్యంలో వరంగల్‌లో రైతు సంఘర్షణ సభ భారీ విజయంతో జి ల్లా పార్టీ నాయకులతో పాటు, కార్యకర్తల్లో ఉత్సా హం రెట్టింపైంది. నిజామాబాద్ జిల్లా వ్యవసా య పరంగా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో రైతు సంఘర్షణ సభ ఇంత స్థాయిలో విజయవంతం కావడంపై మరింతగా క్షేత్రస్థాయిలో కార్యక్రమాలను రూపొందించుకునేందుకు జిల్లా నాయకులు ప్రణాళికలు సిద్ధం చే సుకుంటున్నారు. వరంగల్ రైతు సంఘర్షణ సభ లో పార్టీ ప్రకటించిన డిక్లరేషన్ జిల్లా రైతాంగానికి తిరుగులేని మేలు చేస్తుందని పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే 1.50 లక్షల సభ్యత్వాలు.. ఇప్పటికే జిల్లాలో డిజిటల్ విధానంలో పకడ్బందీగా కాంగ్రెస్ పార్టీ నాయకులు 1.50 లక్షల సభ్యత్వాలు చేశారు. ఇక క్షేత్రస్థాయిలోకి వెళ్లేందుకు సి ద్ధంగా ఉన్న నేపథ్యంలో తాజాగా రాహుల్ సభ మరింత జోష్ తెచ్చిందని జిల్లా కాంగ్రెస్ నాయ కులు చెబుతున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ మహే ష్‌కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జిల్లాలో ఇప్పటికే జాతీయ నాయకురాలు మీనాక్షి నటరాజన్ పాదయాత్ర సక్సెస్ చేశారు. తాజాగా వరంగల్ డిక్లరేషన్ అంశాలను జిల్లాలోని ప్రతి ఇంటికీ తీసుకెళ్లేందుకు జిల్లా నేతలు ప్రణాళిక రూపొందించుకుంటున్నారు. రెండుమూడు రోజుల్లో షెడ్యూల్ నిర్ణయించుకుని నెలరోజుల పాటు ఇంటింటికీ తిరిగి రైతుల డిక్లరేషన్‌ను వివరించనున్నారు. దీ నికి సంబంధించి హైదరాబాద్‌లో శనివారం రా హుల్ ఆధ్వర్యంలో ఎక్స్టెండెట్ ఎగ్జిక్యూటివ్ స మావేశం జరిగింది. ఇక పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇకపై మ రిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్లు డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. డిక్లరేషన్ కాదు.. గ్యారంటీ ఇందులో ముఖ్యంగా జిల్లాలో అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన 1937లో నిర్మించిన బోధన్‌లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని పేర్కొన్నారు. ఇక జిల్లాలో పసుపు పంట రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లా రైతులు పండిస్తున్నారు. దీంతో జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని, పసుపునకు మద్దతు ధర రూ.12 వేలు ఇస్తామని ప్రకటించారు. జిల్లాలో ఎక్కువగా పండించే ఎర్రజొన్నలకు మద్దతు ధర ఇస్తామని, ఇతర అన్ని పంటలకు మద్దతు ధరలు ఇస్తామని ప్రకటించారు. ఇక రుణమాఫీని ఏకమొత్తంలో రూ.2లక్షల మాఫీ చేస్తామని డిక్లరేషన్‌లో పేర్కొనడంతో పాటు ధరణి రద్దు చేసి మెరుగైన విధానం తెస్తామన్నారు. ఇవి కాకుండా రాష్ట్రవ్యాప్తంగా రైతులకు సంబంధించి ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేయడంతో పాటు ఇంకా అనేక అంశాలు పొందుపర్చారు. ఇది డిక్లరేషన్ కాదు కాంగ్రెస్ ఇచ్చే గ్యారంటీ అని రాహుల్ చెప్పడంతో పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు. -
అభిషేక్‌ను రెండు వారాల్లో తీసుకోండి
సాక్షి, హైదరాబాద్: ఐపీఎస్ అధికారి అభిషేక్ మొహంతిని రెండు వారాల్లో తెలంగాణ రాష్ట్ర కేడర్‌లోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం సోమేశ్‌కుమార్‌ను ముందుగా ఏపీకి కేటాయించగా తామిచ్చిన ఆదేశాలతో తెలంగాణ కేడర్‌లో కొనసాగుతున్నారని గుర్తుచేసింది. అభిషేక్ మొహంతి కేసులో తమ ఆదేశాలను అమలు చేయకపోతే గతంలో తామిచ్చిన ఆదేశాలను పునఃసమీక్షించి సోమేశ్‌ను తిరిగి ఏపీ కేడర్‌కు పంపుతామని హెచ్చరించింది. ఈ మేరకు క్యాట్ సభ్యులు ఆశిష్కాలియా, బీవీ సుధాకర్ ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. తనను ఏపీకి కేటాయించడాన్ని సవాల్ చేస్తూ అభిషేక్ మొహంతి దాఖలు చేసిన పిటిషన్‌ను గతంలో విచారించిన క్యాట్.. తెలంగాణ కేడర్‌లోకి తీసుకోవాలంటూ 8 నెలల క్రితం ఆదేశించింది. ఈ ఆదేశాలను అమలు చేయకపోవడంతో అభిషేక్ కోర్టుధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణలో భాగంగా సీఎస్ సోమేశ్‌కుమార్‌ను వ్యక్తిగతంగా హాజరుకావాలని గత విచారణ సందర్భంగా ధర్మాసనం ఆదేశించింది. కోర్టుధిక్కరణ పిటిషన్ మరోసారి విచారణకు రాగా.. సీఎస్ తరఫున కౌంటర్ దాఖలు చేసేందుకు గడువు కావాలని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ అభ్యర్థించారు. తమ ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదో సీఎస్ స్వయంగా హాజరై వివరణ ఇవ్వాల్సిందేనని, గంట సమయం ఇస్తున్నామని, ఈలోగా హాజరుకాకపోతే సీఎస్‌కు అరెస్ట్ వారెంట్ జారీ చేయాల్సి ఉంటుందని ధర్మాసనం హె చ్చరించింది. దీంతో కొద్దిసేపటి తర్వాత సీఎస్ ఆన్లైన్లో ధర్మాసనం ఎదుట హాజరయ్యారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కేడర్ కేటాయింపులు చేసే అధికారం కేంద్రానికి ఉందని, ఈ నేపథ్యంలో క్యాట్ ఆదేశాలపై నిర్ణయం తీసుకోవాలని కేంద్రా నికి నివేదించామని సోమేశ్‌కుమార్ పేర్కొన్నారు. రెండు వారాల్లోగా అభిషేక్‌ను తెలంగాణ కేడర్‌లోకి తీసుకోవాలని సీఎస్‌ను ఆదేశిస్తూ తదుపరి విచారణను 2 వారాల తర్వాతకు వాయిదా వేసింది. కాగా, సోమేశ్‌తోపాటు ఇతర అధికారులను తెలంగాణకు కేడర్‌కు కేటాయించాలంటూ క్యాట్ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేంద్రం ఇప్పటికే హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. -
పరస్పర బదిలీలకు ఓకే!
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల పరస్పర బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఒక లోకల్ కేడర్ నుంచి మరో సమాన లోకల్ కేడర్‌కు పరస్పర బదిలీకి అనుమతిచ్చింది. ఒకే శాఖలో సమాన హోదా పోస్టులు కలిగిన ఇద్దరు వ్యక్తులు, వేర్వేరు సమాన లోకల్ కేడర్‌లో పనిచేస్తుంటేనే పరస్పర బదిలీకి అర్హులు కానున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ బుధవారం రాత్రి ఉత్తర్వులు (జీవో నం.21) జారీ చేశారు. రాష్ట్రపతి కొత్త ఉత్తర్వులు–2018 ప్రకారం కొత్త లోకల్ కేడర్లకు ఉద్యోగుల కేటాయింపుల ప్రక్రియ పూర్తైన తర్వాత ఉద్యోగవర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పరస్పర బదిలీల కోసం ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్ ద్వారా మార్చి 1 నుంచి 15 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే పరిపాలన అవసరాల దృష్ట్యా ప్రభుత్వం ఏ దరఖాస్తునైనా తిరస్కరించేందుకు చాన్స్ ఉంది. ఇద్దరిలో ఒక్కరు బదిలీ అయి ఉండాలి ► పరస్పర బదిలీ కోరుకునే ఇద్దరు ఉద్యోగుల్లో ఒకరైనా, కొత్త లోకల్ కేడర్లకు ఉద్యోగుల కేటాయింపుల్లో స్థాన చలనం పొంది ఉండాలి. ► ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు సమాన మేనేజ్మెంట్(ప్రభుత్వ/జెడ్పీ), సమాన హోదా, సమాన సబ్జెక్టు, సమాన మాధ్యమానికి లోబడి పరస్పర బదిలీకిఅర్హులు. జిల్లా పరిషత్, మండల పరిషత్, ఇతర స్థానిక సంస్థల పరిధిలో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందిని అలాంటి ఇతర జిల్లా పరిషత్, మండల పరిషత్, ఇతర స్థానిక సంస్థలకు మాత్రమే బదిలీ చేస్తారు. సీనియారిటీ వదులుకోవాల్సిందే.. ► పాత లోకల్ కేడర్లలోని సీనియారిటీ హక్కులను వదులుకోవడంతో పాటు కొత్త లోకల్ కేడర్లలో చివరి ర్యాంకును పొందేందుకు అంగీకారం తెలుపుతూ పరస్పర బదిలీ కోరే ఇద్దరు వ్యక్తులూ నిర్దేశిత నమూనాలో రాతపూర్వక హామీ ఇవ్వాలి. కొత్త లోకల్ కేడర్లలోని చివరి రెగ్యులర్ ఉద్యోగి తర్వాత చివరి ర్యాంక్‌ను పరస్పర బదిలీపై వెళ్లే ఉద్యోగులకు కేటాయించనున్నారు. ► విజ్ఞప్తి మేరకు బదిలీ చేస్తున్న నేపథ్యంలో ఉద్యో గులు ఎలాంటి టీఏ, డీఏలకు అర్హులు కారు. ► కోర్టు ఆదేశాల మేరకు పాత కేడర్లలో కొనసాగుతున్న ఉద్యోగులు, సస్పెన్షన్‌లో ఉన్నవారు, క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొంటున్న వారు, పాత కేడర్లలో అనధికారికంగా గైర్హాజరవుతున్న వారు పరస్పర బదిలీలకు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు. ఒక్కరికే సమ్మతి ఇవ్వాలి ► ఒక ఉద్యోగి ఇతర సమాన లోకల్ కేడర్‌లో పనిచేస్తున్న ఒక ఉద్యోగికి మాత్రమే పరస్పర బదిలీకి సమ్మతి ఇవ్వాల్సి ఉంటుంది. ► ఆన్లైన్ ద్వారా పరస్పర బదిలీకి దరఖాస్తు చేసుకుని హార్డ్ కాపీని సంబంధిత శాఖకు జిల్లా/జోనల్ అధిపతి ద్వారా పంపించాలి. ఒకసారి దరఖాస్తు చేసుకుంటే మరో దరఖాస్తుకు అవకాశం ఉండదు. సరైన సమాచారం ఇచ్చే విషయంలో పూర్తి బాధ్యత ఉద్యోగులదే. ► సంబంధిత విభాగాధిపతి దరఖాస్తులను పరిశీలించి సమగ్ర ప్రతిపాదనలను శాఖ కార్యదర్శికి సమర్పించాలి. సాధారణ పరిపాలన శాఖ అనుమతితో శాఖ కార్యదర్శి పరస్పర బదిలీలకు ఉత్తర్వులు జారీ చేస్తారు. దరఖాస్తు ఎలా చేయొచ్చు.. ఎలా చేయకూడదు ► స్కూల్ అసిస్టెంట్ (గణితం) ఆంగ్ల మాధ్యమం పోస్టులో ఉన్న ఉపాధ్యాయుడు సమాన స్కూల్ అసిస్టెంట్ (గణితం) ఆంగ్ల మాధ్యమం పోస్టులో ఉన్న మరో ఉపాధ్యాయుడి పోస్టు కోసమే దరఖాస్తు చేసుకోవాలి. ► స్కూల్ అసిస్టెంట్ (గణితం) తెలుగు మాధ్యమం పోస్టులోని ఉపాధ్యాయుడు స్కూల్ అసిస్టెంట్ (గణితం) ఆంగ్ల మాధ్యమం పోస్టులోని మరో ఉపాధ్యాయుడి పోస్టుకు దరఖాస్తు చేసుకోరాదు. ► రెవెన్యూ శాఖలో సీనియర్ అసిస్టెంట్ పోస్టులోని ఉద్యోగి అదే శాఖలోని మరో ఉద్యోగికి సంబంధించిన జూనియర్ అసిస్టెంట్ పోస్టు కోసం దరఖాస్తు చేసుకోరాదు. ► వ్యవసాయ శాఖలో సూపరింటెండెంట్ పోస్టులో ఉన్న ఉద్యోగి పంచాయతీరాజ్ శాఖలోని సూపరింటెండెంట్ పోస్టులోని మరో ఉద్యోగి పోస్టు కోసం దరఖాస్తు చేసుకోరాదు. -
ఎచ్చెర్ల టీడీపీ ‘కళా’విహీనం..!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఎచ్చెర్ల టీడీపీ ‘కళా’ విహీనమవుతోంది. ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షు డు కళా వెంకటరావు నాయకత్వాన్ని అక్కడి టీడీ పీ శ్రేణులు బహిరంగంగా వ్యతిరేకిస్తున్నాయి. తన మాట మాత్రమే వినాలనే కళా వైఖరిని ఎండగడుతున్నాయి. తనతో కలిసి పనిచేయకపోతే లోకేష్‌ను తీసుకువచ్చి పోటీ చేయిస్తానని కళా బెదిరిస్తుంటే.. మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయిన నాయకుడు ఇక్కడేం చేయగలరని బాహాటంగానే బదులిస్తున్నాయి. దీంతో కళా వెంకటరావు పరిస్థితి దిక్కుతోచని విధంగా మారింది. ఇప్పటికే ఆయనను కాదని బయటకు వచ్చిన కలిశెట్టి అప్పలనాయుడు స్వతంత్రంగా పనులు చేయడం మొదలుపెట్టారు. ఆ నియోజకవర్గంలో కళాకు ప్రత్యామ్నాయంగా మారుతున్నారు. అసంతృప్త నేతలు, కార్యకర్తలంతా ఇప్పుడు కలిశెట్టితో కలుస్తున్నారు. కలిశెట్టి నాయకత్వ పటిమను పక్కన పెడితే.. కళా కంటే మేలేనని కా ర్యకర్తలు భావిస్తున్నారు. కలిశెట్టిని పార్టీ నుంచి రెండుసార్లు సస్పెండ్ చేయిస్తే డోంట్‌కేర్ అంటూ పార్టీ జెండాతోనే కార్యక్రమాలు చేపడుతున్నారు. బుజ్జగింపు.. బెదిరింపు పరిస్థితులు రోజురోజుకూ దిగజారిపోతుండడంతో కళా అండ్‌కో పార్టీ శ్రేణులను దారికి తెచ్చుకు నే ప్రయత్నం చేస్తోంది. కలిశెట్టి వెనుక తిరుగుతున్న వారిని బుజ్జగించే పనిలో ఉంది. కలిశెట్టికి ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ రాదని తమతోనే పనిచేయాలని కళా కోరుతున్నారు. అయితే ఈ రా య‘బేరాలకు’ ఎచ్చెర్ల నియోజకవర్గ టీడీపీ శ్రేణు లు తలొగ్గడం లేదు. కళా నాయకత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని ఫోన్ లోనే నేరుగా చెప్పేస్తున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి వస్తున్న స్పందనతో అవాక్కవుతు న్న కళా అండ్‌కో చివరికి బెదిరింపులకు దిగుతున్నారు. కళా పోటీలో లేకుంటే ఆయన కుమారు డు పోటీ చేస్తాడని, కాదూ కూడదంటే లోకేష్‌ను తీసుకువచ్చి పోటీ చేయిస్తారని కేడర్‌కు బెదిరింపుల సంకేతాలు పంపిస్తున్నారు. కానీ ఆ బెదిరింపులకు కూడా ఎవరూ లొంగడం లేదు. లోకేష్ ఇ క్కడికొస్తే అవమానం తప్ప ఏమీ ఉండదని, స్థా నికుడే నాయకుడిగా ఉండాలని «ధీటుగా జవాబు ఇచ్చేస్తున్నారు. పరిస్థితి చూస్తుంటే ఎచ్చెర్లలో బయట నుంచి ఏ నాయకుడొచ్చి నాయకత్వం వహించినా టీడీపీ శ్రేణులు తరిమికొట్టేలా ఉన్నాయి. ఇవీ చదవండి: ‘రోడ్డు’ మ్యాప్ రెడీ కోటి రూపాయలను తలదన్నే కథ -
అంతా పార్టీ గుప్పిట్లోనే..!
సాక్షి, హైదరాబాద్: ‘పార్టీని చూసే ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు.. పార్టీలోకి నేతలు వస్తూ పోతూ ఉంటారు.. పార్టీయే సుప్రీమ్’అని రెండు రోజుల క్రితం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించిన దానికి అనుగుణంగా పార్టీ కమిటీలను పటిష్టం చేసే కసరత్తు మొదలైంది. సభ్యత్వ నమోదు ప్రక్రియ కొలిక్కి రావడంతో రాబోయే రోజుల్లో పార్టీ కేంద్రంగానే నేతలు, కార్యకర్తల యంత్రాంగం పనిచేసేలా సంస్థాగత కమిటీలకు జవసత్వాలు కల్పించాలని అధినేత నిర్ణయించారు. గ్రామస్థాయి మొదలుకుని రాష్ట్ర స్థాయి వరకు అన్ని కమిటీల నిర్మాణంలో సామాజిక వర్గాల సమతూకం పాటిస్తూ పాత, కొత్త తేడా లేకుండా చురుకైనవారు, యువతకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. కమిటీల నిర్మాణంలో పాటించాల్సిన మార్గదర్శకాలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు నేతృత్వంలో ఒకటి, రెండు రోజుల్లో జరిగే భేటీలో ఖరారు చేస్తారు. గ్రామ, మండల స్థాయి సంస్థాగత కమిటీలు పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యేల కనుసన్నల్లో ఏర్పాటవుతుండగా, ఈసారి మాత్రం పార్టీ ఇన్చార్జీల పర్యవేక్షణలో గ్రూపులు, వర్గాలకు అతీతంగా కమిటీలను నియమించేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. విజయదశమికి అటూ ఇటూగా పార్టీ జిల్లా కార్యాలయాలు ప్రారంభించిన తర్వాత కొత్తగా ఏర్పాటయ్యే కమిటీలకు శిక్షణ ఇచ్చేలా పార్టీ రాష్ట్ర కార్యాలయం షెడ్యూల్‌ను సిద్ధం చేస్తోంది. సామాజిక మాధ్యమాల్లో పార్టీ, ప్రభుత్వంపై జరుగుతున్న దాడిని తిప్పి కొట్టేందుకు అన్ని స్థాయిల కమిటీల్లో యువతకు చోటు కల్పించాలని నిర్ణయించారు. ఎమ్మెల్యేల తీరుతో పార్టీకి తలనొప్పి.. ఉపఎన్నిక జరగాల్సిన హుజూరాబాద్ నియోజకవర్గాన్ని మినహాయిస్తే ప్రస్తుతం టీఆర్ఎస్కు 103 మంది ఎమ్మెల్యేలు ఉండగా, వీరిలో 68 మంది వరుసగా రెండు లేదా అంతకంటే ఎక్కువ సార్లు ఎన్నికైనవారే ఉన్నారు. పార్టీకి చెందిన సీనియర్లు పి.మహేందర్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్రావు, మధుసూదనాచారి, జలగం వెంకట్రావు వంటి నేతలు మితిమీరిన ఆత్మ విశ్వాసం వల్లే ఓటమి పాలైనట్లు కేసీఆర్ ఇటీవలి రాష్ట్ర కమిటీ సమావేశంలో వ్యాఖ్యానించినట్లు సమాచారం. కాగా ఇటీవల ఓడిపోయిన నియోజకవర్గంలో దివంగతులైన ఎమ్మెల్యే.. ఆయన ఉన్న సమయంలోనే పార్టీని భ్రష్టుపట్టించారని, ఆయన కుటుంబంపై అంత వ్యతిరేకత ఉన్నట్లు తన దృష్టికి రాలేదని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. మరోవైపు దశాబ్దాల తరబడి వేర్వేరు పార్టీల్లో పనిచేసిన వారు రాజకీయ పునరేకీకరణలో భాగంగా టీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. వీరి నడుమ ఉన్న రాజకీయ విభేదాలు కూడా పార్టీకి నష్టం కలిగిస్తాయని అధినేత అంచనా వేస్తున్నారు. ఎమ్మెల్యేలపైనే పూర్తిగా ఆధారపడటం ద్వారా వారి పనితీరు బాగాలేని చోట పార్టీకి నష్టం కలుగుతుందనే విషయాన్ని కేసీఆర్ గుర్తించినట్లు పార్టీనేతలు చెప్తున్నారు. జిల్లాల్లో ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను సమన్వయం చేసే బాధ్యతను సంబంధిత జిల్లా మంత్రులకు, పార్టీ ప్రధానకార్యదర్శులకు అప్పగించినా ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు. దీంతో గతంలో రద్దు చేసిన జిల్లా కమిటీలను పునరుద్ధరించి, జిల్లా అధ్యక్షులను నియమించాలని కేసీఆర్ నిర్ణయించారు. కొత్తగా నియమితులయ్యే జిల్లా అధ్యక్షులు అధినేత లేదా వర్కింగ్ ప్రెసిడెంట్‌తో నేరుగా సంబంధాలు కలిగి క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు నివేదించాల్సి ఉంటుంది. పార్టీకి కొత్త రక్తం.. యువతకు ప్రాధాన్యత పార్టీ యంత్రాంగం నుంచే కొత్త నాయకత్వం పుడుతుందని, భవిష్యత్తు రాజకీయ అవకాశాలు వారికే వస్తాయని ప్రకటించి కేసీఆర్ ఆ దిశగా కమిటీల నిర్మాణం ద్వారా అడుగులు వేయాలని భావిస్తున్నారు. టీఆర్ఎస్తోపాటు ఇతర పార్టీల్లోనూ సీనియర్ నాయకులు క్రమంగా తెరమరుగవుతున్న క్రమంలో అన్నిపార్టీలు కొత్తతరం నాయకత్వంపై దృష్టి పెడుతున్నాయి. మరో 20 ఏళ్లపాటు టీఆర్ఎస్ అధికారంలో ఉంటుందని కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో పార్టీలోనూ కొత్త నాయకత్వాన్ని గుర్తించేందుకు పార్టీ సంస్థాగత కమిటీలు దోహదం చేస్తాయని భావిస్తున్నారు. నాగార్జునసాగర్, హుజూరాబాద్ ఉప ఎన్నికలో యువకులకు పార్టీ అభ్యర్థులుగా అవకాశమివ్వగా, ఎస్సీ కార్పొరేషన్, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి వంటి వాటిలోనూ కొత్తవారికే అవకాశమిచ్చారు. పార్టీ రాష్ట్ర కమిటీలోనూ యువతకు ప్రాధాన్యత ఇస్తూ మార్గదర్శకాలు సిద్ధం చేయాలని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కేసీఆర్ ఆదేశించినట్లు తెలిసింది. అనుబంధ కమిటీల్లోనూ యువతకే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. టీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలుగా ఉన్న గుండు సుధారాణి ప్రస్తుతం వరంగల్ మేయర్‌గా ఎన్నిక కావడంతో ఆమె స్థానంలో యువతకు ప్రాతినిధ్యం కల్పించాలని యోచిస్తున్నట్లు సమాచారం. -
కమలం పార్టీలో లుకలుకలు.. బహిరంగంగానే విమర్శలు
బీజేపీ కేడర్‌లో జోష్ తగ్గింది.. జిల్లా నేతల తీరుపై పలువురు నాయకులు, కార్యకర్తలు బహిరంగంగా విమర్శలు చేయడం శ్రేణుల మధ్య విభేదాలను ఎత్తిచూపుతోంది. పార్టీ కార్యక్రమాలకు నేతలంతా పూర్తిస్థాయిలో హాజరు కాకపోవడం కమలం పార్టీలో లుకలుకలను బహిర్గతం చేస్తోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో పార్టీకి నష్టం తప్పదు. ఇప్పటికైనా జిల్లా బాధ్యులు స్పందించి అందరినీ ఒకేతాటిపైకి తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వికారాబాద్: బీజేపీలో గ్రూపు రాజకీయాలకు తెర లేసింది. జిల్లా నాయకత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ పార్టీ నాయకుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. అధ్యక్షుడిగా సదానందరెడ్డి జిల్లా బాధ్యతలు చేపట్టి ఏడాది కావస్తున్నా.. ఇప్పటికీ కేడర్‌పై పట్టు సాధించలేకపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వికారాబాద్, తాండూరు, కొడంగల్ నియోజకవర్గాల్లో సొంత పార్టీ నేతల మధ్య సమన్వయం కొరవడింది. ఇదిలా ఉండగా తాజాగా పరిగిలో సైతం విభేదాలు బయటపడ్డాయి. పలువురు నాయకులు ఏకంగా విలేకరుల సమావేశంలోనే జిల్లా అధ్యక్షుడి తీరును ప్రశ్నించారు. పార్టీ సమావేశాలకు హాజరు కాకుండా సీల్డ్ కవర్ ద్వారా పదవులు కట్టబెట్టడం ఏమిటని నిలదీశారు. ఇది బీజేపీ సంప్రదాయానికి విరుద్ధమని మండిపడ్డారు. పరిగి నియోజకవర్గ పరిశీలకుడిగా వ్యవహరిస్తున్న పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గనాపూర్ వెంకటయ్య పార్టీ బాధ్యులను నియమించాల్సి ఉండగా.. ఈ స్థానంలో తాండూరుకు చెందిన రమేశ్‌కు బాధ్య తలు అప్పగించడంపై విమర్శలు గుప్పిస్తున్నారు. మొహం చాటేస్తున్న నేతలు... ఇటీవల జరిగిన పలు పార్టీ సమావేశాలకు జిల్లా ముఖ్య నేతలు మొహం చాటేయటం విమర్శలకు తావిస్తోంది. బీజేపీ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జ్ జనార్దన్‌రెడ్డి సైతం కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈయనకు జిల్లాకు చెందిన మరో ముఖ్య నేతతో పొసగకపోవడమే ఇందుకు కారణమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జిల్లా అధ్యక్షుడు సదానందరెడ్డి సైతం పరిగిలో జరిగిన కార్యకర్తల సమావేశాలు, పార్టీ పదవులకు నేతల ఎంపిక కార్యక్రమాలకు దూరంగా ఉండటంపై పలువురు నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సదానందరెడ్డి కేడర్ విషయంలో వివక్ష చూపుతున్నారని, ఈ విషయంలో పార్టీ రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేస్తామని పలువురు నాయకులు పేర్కొనడం గమనార్హం. కనిపించని ఏసీఆర్ మార్క్.. దుబ్బాక ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్పై గెలుపు.. ఆ వెంటనే జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నలభైకి పైగా కార్పొరేటర్ స్థానాలను కైవసం చేసుకుని బీజేపీ మంచి ఊపు మీద కనిపించింది. ఈ సమయంలోనే మాజీ మంత్రి, సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా పనిచేసిన ఏ.చంద్రశేఖర్ ఆ పార్టీలో చేరడంతో శ్రేణుల్లో కొత్త జవసత్వాలను నింపింది. జిల్లాలో ఏసీఆర్ పార్టీకి పెద్దదిక్కుగా మారతారని అందరూ ఊహించారు. ఈ క్రమంలోనే వివిధ పార్టీలకు చెందిన నాయకులు బీజేపీలో చేరుతారని భావించారు. కానీ ఆయన పార్టీలో చేరింది మొదలు జిల్లా కమలం గూటిలో ఎలాంటి ఊపు కనిపించడంలేదు. కనీసం ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్న తర్వాత జిల్లాలో ఏ ఒక్క కార్యక్రమానికి, పార్టీ సమావేశాలకు హాజరు కాకపోవటం విమర్శలకు తావిస్తోంది.