car race
-
ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో నేడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరు కానున్న కేటీఆర్
-
పక్కవాడితో నీకెందుకు.. ముందు నువ్వు బాగుండాలి కదా?: అజిత్ కుమార్
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ముఖ్యంగా అభిమానులను ఉద్దేశించిన ఆయన చేసిన కామెంట్స్ తెగ వైరలవుతున్నాయి. ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడటం వల్ల ఏ మాత్రం ఉపయోగం ఉండదని ఫ్యాన్స్‌కు సూచించారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో జరిగే ఫ్యాన్స్ వార్‌పై ఆయన మాట్లాడారు.అజిత్ మాట్లాడుతూ.. 'ఇతరుల విషయాల్లో ఎవరూ జోక్యం చేసుకోవద్దు. మీరు చేయాల్సిన పనిపై ముందు దృష్టి పెట్టండి. ఇతరుల గురించి ఆలోచిస్తూ మీరు టైన్షన్ తెచ్చుకోకండి. అలాంటి వాటితో మీకేలాంటి ఉపయోగం ఉండదు. ముందు మీ లైఫ్ గురించి ఆలోచించండి. నేను నా అభిమానులకు కూడా ఇదే చెబుతా. సినిమాలు చూడటం వరకు ఓకే.. కానీ జై అజిత్.. జై విజయ్ అంటుంటే జై కొడుతూ ఉంటే నువ్వెప్పుడు బాగుపడతావ్. మీ చూపిస్తున్న ప్రేమకు నాకు ఆనందంగానే ఉంటుంది. కానీ మీ జీవితం బాగున్న తర్వాతే కదా ఏదైనా. నా ఫ్యాన్స్ ఆనందంగా ఉన్నారని తెలిసినప్పుడే నాకు సంతోషంగా అనిపిస్తుంది' అని అన్నారు.కాగా.. ఇటీవల దుబాయ్ కారు రేసింగ్‌లో అజిత్ టీమ్ మూడో స్థానంలో నిలిచింది. అజిత్ కారు రేసింగ్ గెలవడంపై సినీ ప్రముఖులు ఆయనపై ప్రశంసలు కురిపించారు. రేస్ గెలిచిన తర్వాత జాతీయ జెండా పట్టుకుని అజిత్ సంతోషం వ్యక్తం చేశారు. విదాముయార్చి వాయిదా..కోలీవుడ్ స్టార్ ప్రస్తుతం అజిత్ కుమార్(ajith Kumar) విదాముయార్చి మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఊహించని కారణాలతో ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్ కాలేదు. ఈ సినిమాకు మగిళ్ తిరుమేని దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించారు. అర్జన్ సర్జా కీలక పాత్ర పోషించిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్డెట్లో నిర్మించారు.మైత్రి మూవీ మేకర్స్‌తో సినిమా..అజిత్ కుమార్ టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌తో జతకట్టారు. ఆయన హీరోగా తెరకెక్కిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఇందులోనూ త్రిషనే హీరోయిన్గా నటిస్తోంది . ‘మార్క్ ఆంటోని’ ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీని వేసవిలో ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. -
'మీరు అనుకున్నది సాధిస్తే'.. ప్రమాదం తర్వాత అజిత్ వీడియో రిలీజ్!
కోలీవుడ్ స్టార్ ప్రస్తుతం అజిత్ కుమార్(ajith Kumar) విదాముయార్చి మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పొంగల్ బరిలో నిలిచింది. కానీ ఊహించని కారణాలతో ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్ కాలేదు. ఈ సినిమాకు మగిళ్ తిరుమేని దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించారు. అర్జన్ సర్జా కీలక పాత్ర పోషించిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్డెట్లో నిర్మించారు.అయితే ఇటీవల తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్‌కు(Ajith Kumar) పెను ప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే. దుబాయ్‌లో జరుగుతున్న రేసింగ్‌లో ఆయన నడుపుతున్న కారు పక్కనే ఉన్న ట్రాక్‌ను ఢీకొట్టారు. ఈ ఘటనలో అజిత్‌కు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారు రేసింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేసింది. అజిత్ ప్రమాదం నుంచి బయటపడడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.ఈ ప్రమాదం జరిగిన తర్వాత తొలిసారిగా అజిత్ ఓ వీడియో సందేశం రిలీజ్ చేశారు. మోటార్‌స్పోర్ట్స్ పట్ల తనకున్న ఇష్టాన్ని వెల్లడించారు. అలాగే కుటుంబం, హార్ట్ వర్క్, సక్సెస్, ఫెయిల్యూర్‌ను జీవితంలో సమానంగా చూడాలని అభిమానులకు సూచించారు. ప్రస్తుతం దుబాయ్‌లో జరగనున్న 24హెచ్ కారు రేసింగ్‌లో అజిత్ పాల్గొంటున్నారు.ఈ వీడియోలో అజిత్ మాట్లాడుతూ.. 'నేను చాలా సంతోషంగా ఉన్నా. మోటార్ స్పోర్ట్స్ నా జీవితాంతం ఇష్టమైంది. చాలా మంది అభిమానులు ఇక్కడకు వచ్చారు. మీరందరూ సంతోషం, ఆరోగ్యంతో పాటు ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని నేను కోరుకుంటున్నా. ముందు మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి. సమయాన్ని వృథా చేయకండి. బాగా చదవండి. కష్టపడి పనిచేయండి. జీవితంలో మీకు నచ్చినది చేసినప్పుడు విజయం సాధిస్తే దాని ఫలితం అద్భుతంగా ఉంటుంది. అంతే కానీ, విజయం సాధించకలేకపోయామని అక్కడే ఆగిపోవద్దు. ఈ ప్రపంచంలో పోటీ చాలా ముఖ్యం. ఎప్పటికైనా మీ సంకల్పం, అంకితభావాన్ని వదులుకోవద్దు. మీ అందరినీ ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా' అంటూ రిలీజ్ చేశారు.కార్ రేసింగ్ గురించి మాట్లాడుతూ.. ' రేసింగ్ అనేది ఇతర క్రీడల మాదిరిగా వ్యక్తిగత క్రీడ కాదు. మీరు స్ప్రింట్ రేసర్లను చూసి ఉండవచ్చు. కానీ ఇందులో నలుగురు, ఐదుగురు డ్రైవర్లు ఒకే కారు నడుపుతారు. కాబట్టి మనమందరం అందరి పనితీరుకు బాధ్యత వహించాలి. మన కారును జాగ్రత్తగా చూసుకోవాలి. అదే సమయంలో మనం ల్యాప్ టైమింగ్‌లను సాధించాలి. ఇందులో సిబ్బంది, మెకానిక్స్, లాజిస్టికల్ సపోర్ట్‌తో పాటు డ్రైవర్ల సమష్టి కృషి ఉంటుంది. ఇది సినిమా పరిశ్రమ లాంటిది. ప్రతి ఒక్కరూ తమ పాత్రపై దృష్టి పెడితే ఫలితాలు వస్తాయి' అని అన్నారు.కాగా.. అజిత్ దాదాపు 15 సంవత్సరాల విరామం తర్వాత తిరిగి రేసింగ్‌కు వచ్చాడు. అతని జట్టు ఈ కారు రేసింగ్‌లో పోటీపడుతోంది. రేసింగ్ జట్టు యజమానిగా తాను రేసింగ్‌లో పాల్గొంటానని అజిత్ తెలిపారు.మైత్రి మూవీ మేకర్స్‌తో సినిమా..అజిత్ కుమార్ టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌తో జతకట్టారు. ఆయన హీరోగా తెరకెక్కిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఇందులోనూ త్రిషనే హీరోయిన్గా నటిస్తోంది . ‘మార్క్ ఆంటోని’ ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీని వేసవిలో ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. Ak. My fans Their commitments. pic.twitter.com/5fW17Gghgu— Suresh Chandra (@SureshChandraa) January 11, 2025 -
ఫార్ములా కారు రేసు కేసులో బిగ్ ట్విస్ట్
-
31 వరకు కేటీఆర్ అరెస్టు వద్దు
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా–ఈ కార్ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను ఈ నెల 31 వరకు అరెస్టు చేయవద్దని ఏసీబీని హైకోర్టు ఆదేశించింది. కేటీఆర్‌ను అరెస్టు చేయవద్దంటూ గతంలో జారీ చేసిన ఉత్తర్వులను ఎత్తివేయాలన్న ఏసీబీ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. వాదనలు వినకుండా ఉత్తర్వులను మార్చలేమని స్పష్టం చేసింది. గత విచారణ సందర్భంగా 30వ తేదీ వరకు అరెస్టు వద్దని మధ్యంతర ఉత్తర్వులిచ్చిన కోర్టు.. శుక్రవారం దానిని 31వ తేదీ వరకు పొడిగించింది. ఆలోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. విచారణను ఈ నెల 31వ తేదీకి వాయిదా వేసింది.ఫార్ములా–ఈ కార్ రేసు వ్యవహారంపై రాష్ట్ర అవినీతి నిరోధక విభాగం (ఏ సీబీ) ఈ నెల 19న కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. మాజీ మంత్రి కేటీఆర్, ఇద్దరు అధికారులను నిందితులుగా చేర్చింది. ఆ ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలంటూ కేటీఆర్ ఈ నెల 20న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి కె.లక్ష్మణ్ శుక్రవారం విచారణ చేశారు. కేటీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు, ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్‌రెడ్డి, ఏఏజీ తేరా రజనీకాంత్‌రెడ్డి కోర్టులో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది. కేటీఆర్‌ను అరెస్టు చేయవద్దంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలను ఎత్తివేయాలంటూ అఫిడవిట్ దాఖలు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా నగదు బదిలీ.. కోర్టులో ఏసీబీ తరఫున కేసు విచారణాధికారి, డీఎస్పీ మాజీద్ అలీఖాన్ కౌంటర్ దాఖలు చేశారు. ‘‘కేటీఆర్ మంత్రిగా ఉండి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. తన పరిధిలోని ప్రజాధనాన్ని నిబంధనలకు విరుద్ధంగా బదిలీ చేయడానికి సహకరించి విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారు. దీనిపై ఈ నెల 18న మున్సిపల్ అడ్మినిస్టేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు అందిన తర్వాత దర్యాప్తు ప్రారంభించడం కోసం ప్రభుత్వంలోని అ«దీకృత అధికారులకు ఏసీబీ డీజీ లేఖ రాశారు.వారి ఆమోదంతో ఈ నెల 19న ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. ప్రాథమిక దశలోనే దర్యాప్తును తప్పుబడుతూ పిటిషనర్ (కేటీఆర్) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రారంభ దశలోనే దర్యాప్తులో జోక్యం చేసుకుని నిందితులకు ఊరట కలిగేలా ఉత్తర్వులు జారీచేసే అధికారం కోర్టులకు కూడా స్పల్పమే. ప్రాథమిక దశలోనే విచారణను అడ్డుకునేలా ఎలాంటి ఆదేశాలు ఇవ్వకూడదని సుప్రీంకోర్టు గతంలో తీర్పునిచ్చింది. దర్యాప్తును అడ్డుకునేందుకు, ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలంటూ పిటిషనర్ దాఖలు చేసిన పిటిషన్ విచారణార్హం కాదు. దాన్ని కొట్టివేయాలి. అలాగే ఈ నెల 20న ఇచ్చిన ‘అరెస్టు వద్దు’అనే ఆదేశాలను ఎత్తివేయాలి’’అని ఏసీబీ కౌంటర్లో పేర్కొన్నారు.రాజకీయ పగతోనే కేసు పెట్టారు...ఏసీబీ కౌంటర్‌పై న్యాయవాది ద్వారా కేటీఆర్ కోర్టుకు సమాధానమిచ్చారు. ‘‘ఏసీబీ కౌంటర్లోని అన్ని అంశాలను పరిశీలించాను. ఆ ఆరోపణలు అవాస్తవాలు. నాపై ఎఫ్ఐఆర్కు ప్రాథమిక ఆధారమేమిటో పేర్కొనలేదు. ఎలాంటి అవినీతి జరగకున్నా ప్రభుత్వం రాజకీయ పగతోనే నేర పరిశోధన సంస్థలను రంగంలోకి దించింది. ఎఫ్ఐఆర్లో పెట్టిన సెక్షన్లు ఏవీ దీనికి వర్తించవు. కేసు నమోదులో తీవ్ర జాప్యానికి కారణాలు పేర్కొనలేదు. కేసును కొట్టివేసే అధికారం కోర్టుకు ఉంది. ఆర్థికపరమైన చిక్కులేమిటో చెప్పకుండా ప్రైవేట్ స్పాన్సర్ పాత్రను ప్రభుత్వంపై మోపారనే ఆరోపణ సరికాదు.రెగ్యులేటరీ అధికారుల నుంచి అవసరమైన అనుమతులు పొందకుండానే విదేశాలకు నగదు బది లీ చేశారని ఆరోపిస్తున్నారు. ఎవరి ఆమోదమో స్పష్టంగా చెప్పలేదు. బ్యాంక్ అ«దీకృత డీలర్లు, ఏదైనా ముందస్తు అనుమతి అవసరమైతే సంబంధిత అధికారులు పరిశీలించాల్సి ఉంటుంది. ఎంఏయూడీ మంత్రిగా విధులు నిర్వహించిన నాపై నిందలు మోపారు. ఆ నిర్ణయంలో లోపాలుంటే ప్రభుత్వమే తన నిర్ణయాన్ని రద్దు చేసుకోవాలి.ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మంత్రిగా నన్ను బాధ్యుడ్ని చేయడం చట్ట వ్యతిరేకం. అవినీతి నిరోధక చట్టం–1988లోని సెక్షన్ 13(1) (ఎ), సెక్షన్ 13(2) ఈ కేసులో వర్తించవు. ఐపీసీలోని 120–బీ, 409 సెక్షన్ల కింద కేసు నమోదు వెనుక కుట్ర ఉంది. ఇలాంటి తీవ్ర నేరాభియోగాలతో కేసు నమోదు చేస్తే.. నోటీసులిచ్చి విచారణ చేయాల్సిన అవసరం లేకుండా ఉంటుందనే కుట్ర దాగి ఉంది. వ్యక్తిగతంగా నన్ను సర్కార్ టార్గెట్ చేసింది’’అని కేటీఆర్ పేర్కొన్నారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి విచారణను ఈ నెల 31కి వాయిదా వేశారు. -
Formula E Car Race: తెలంగాణ హైకోర్టులో కేటీఆర్‌కు ఊరట
-
సీఎం రేవంత్ రెడ్డి కావాలనే కేసు పెట్టించారు: KTR
-
దమ్ముంటే ‘ఫార్ములా–ఈ రేస్’ పై చర్చించండి
సాక్షి, హైదరాబాద్: ‘ఫార్ములా–ఈ రేస్’అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ మీడియా ద్వారా అవాస్తవాలు ప్రచారం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తద్వారా ఫార్ములా–ఈ రేస్ నిర్వహణలో ఏదో జరిగిందనే అపోహలు సృష్టించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు. దమ్ముంటే ఫార్ములా–ఈ రేస్ అంశంపై శాసనసభలో చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కేటీఆర్ బుధవారం లేఖ రాశారు. ‘ఫార్ములా–ఈ రేస్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నెలలుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంతోపాటు నా మీద అనేక నిరాధార ఆరోపణలు చేస్తున్నది. అసెంబ్లీ ఆవరణలో సీఎం ఆధ్వర్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై గంటన్నర పాటు చర్చించినట్టు వార్తా కథనాలు వచ్చాయి. ఈ అంశం మీద నాలు గు గోడల నడుమ చర్చించడానికి బదులు గా శాసనసభ వేదికగా నాలుగు కోట్ల మంది ప్రజల ముందు సవివర చర్చ జరిగితే అందులో నిజానిజాలు ఏమిటో అందరికీ తెలు స్తాయి’అని కేటీఆర్ తన లేఖలో పేర్కొన్నా రు. ‘తెలంగాణ, హైదరాబాద్ నగరానికి మంచి జరగాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ‘ఫార్ములా–ఈ రేస్’ నిర్వాహ కులతో ఒప్పందం చేసుకుంది. తద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సుమారు రూ.700 కోట్ల లబ్ధి చేకూరిందని నీల్సన్ నివేదిక స్పష్టం చేసింది. 2024లో మరోదఫా రేస్ జరగాల్సి ఉండగా, కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్షంగా రద్దు చేసింది. ఒప్పందం పారదర్శకంగా జరిగినా ప్రభుత్వం మాత్రం దుష్ప్రచారం మానడం లేదు. నిజానిజాలేమిటో తెలుసుకునే హక్కు రాష్ట్ర ప్రజలకు ఉన్నందున శాసనసభలో ‘ఫార్ములా–ఈ రేస్’అంశంపై చర్చ పెట్టాలి’అని కేటీఆర్ సీఎం రేవంత్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలి: స్పీకర్‌కు బీఆర్ఎస్ వినతిఫార్ములా– ఈ రేస్ అంశంలో కేటీఆ ర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న నిరాధార ఆరోపణలపై చర్చించాలని బీఆర్ఎస్ శాసనసభాపక్షం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మాజీ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం బుధవారం స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు వినతిపత్రం అందజేసింది. సీఎం రేవంత్‌కు కేటీఆర్ రాసిన లేఖలోని అంశాలను ఉటంకిస్తూ ప్రస్తుత సమావేశాల్లో సభకు అనుకూలమైన రోజు ఈ అంశంపై చర్చించాలని స్పీకర్‌ను కోరారు. స్పీకర్‌ను కలిసిన వారిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్, కేపీ.వివేకానంద, కల్వకుంట్ల సంజయ్, విజయుడు, మాణిక్‌రావు, చామకూర మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, చింత ప్రభాకర్ ఉన్నారు. -
ఈ -కార్ రేస్ కేసు: ఏసీబీకీ టీజీ సీఎస్ లేఖ
హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్వహించిన ఈ కార్ రేస్ కేసు అంశం ఇప్పుడు ఏసీబీ వద్దకు చేరింది. ఈ మేరకు తెలంగాణ సీఎస్ శాంతికుమారి..ఏసీబీకి లేఖ రాశారు. ఈ వ్యవహారంలో విచారణ కోరుతూ సీఎస్ లేఖ రాశారు. నిధుల దుర్వినియోగంపై విచారణ జరపాలని లేఖలో సీఎస్ పేర్కొన్నారు. దీనిలో భాగంగా గవర్నర్ అనుమతి ఇచ్చిన లేఖను సీఎస్ జత చేశారు.గవర్నర్ అనుమతితో ముందుకు.. సోమవారం సాయంత్రం అసెంబ్లీ కమిటీ హాల్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ‘ఫార్ములా–ఈ’ కార్ రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్‌పై విచారణ చేపట్టేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై రాష్ట్ర మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించింది.చదవండి: కేటీఆర్‌పై ‘ఫార్ములా’ అస్త్రం! -
ఈ-కార్ రేసు స్కామ్‌పై చర్చకు రెడీ:కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని సమస్యలపై సభలో చర్చిద్దామని.. దమ్ముంటే రెండువారాలపాటు అసెంబ్లీ నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు సవాల్ విసిరారు. మంగళవారం కొడంగల్ బీఆర్ఎస్ ముఖ్యనేతల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ..‘‘కేబినెట్లో మాట్లాడటం కాదు. సభలో చర్చ చేద్దాం. అన్ని సమస్యలపై సభలో చర్చిద్దాం. ఈ-కార్ రేసు కుంభకోణంపై కూడా చర్చకు నేను రెడీ. దమ్ముంటే 15 రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి’’ అని సీఎం రేవంత్‌కు సవాల్ విసిరారు.పేరు మర్చిపోయినందుకు యాక్టర్‌ను జైలులో పెట్టించారు. సీఎం పేరు మర్చిపోతే జైల్లో పెడతారా?అంటూ రేవంత్‌పై కేటీఆర్ ఫైర్ అయ్యారు. -
‘కేటీఆర్ చేసింది పెద్ద తప్పు.. జైలుకు వెళ్లక తప్పదు’
హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నగరంలో నిర్వహించిన ఈ కార్ రేస్ వ్యవహారంలో కేటీఆర్ జైలుకు వెళ్లక తప్పదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నారు. కేటీఆర్ చేసింది పెద్ద తప్పు అని, దానికి శిక్ష అనుభవించక తప్పదని స్పష్టం చేశారు. ఆ కేసులో ఏడేళ్ల వరకూ జైల్లో ఉండాల్సి వస్తుందంటూ కోమటిరెడ్డి హెచ్చరించారు. కేటీఆర్ చేసిన తప్పిదానికి బెయిల్ కూడా రాదని, ఆయనకు బెయిల్ రావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొక్కుతున్నారని ఎద్దేవా చేశారు.అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్ల దుస్తులు ధరించి రావడం పట్ల మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ కేటీఆర్‌కు బెయిల్ రావాలని మొక్కుతున్నారు.ఎమ్మెల్యేలు శబరిమల వెళ్లడానికి నల్లదుస్తులు ధరించారు. కేటీఆర్ అరెస్టు అయితే శబరిమల వెళ్లి బెయిల్ రావాలని మొక్కుతారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం కేటీఆర్‌కు బెయిల్ వచ్చే చాన్స్ కూడా లేదు.’ అని కోమటిరెట్టి పేర్కొన్నారు. ఇవీ చదవండి: ‘ఈ కార్ రేసు’ కేసు.. స్పందించిన కేటీఆర్కేటీఆర్ ‘ఈ-కార్ రేస్’ కేసు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు -
తమిళనాడు చరిత్రలో మరో మైలురాయి.. ఫార్ములా రేస్
సాక్షి, చెన్నై: తమిళనాడు చరిత్రలో ఫార్ములా కార్ రేసు –4 మరోమైలు రాయి అని క్రీడల మంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఫార్ములా కార్ రేసు పోటీలు చెన్నైలో విజయవంతంగా జరిగాయి. బహుమతుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. వివరాలు.. తమిళనాడు క్రీడలశాఖ, తమిళనాడు స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ సహకారంతో ప్రొమోటర్ ఆఫ్ ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ (ఆర్పీపీఎల్) నేతృత్వంలో చెన్నై వేదికగా భారతదేశంలోనే ప్రపథమంగా నైట్ స్ట్రీట్ సర్క్యూట్ పందేంగా శని, ఆదివారాలలో ఫార్ములా కార్ రేస్ – 4 పోటీలు జరిగాయి. చెన్నై ఐల్యాండ్ గ్రౌండ్ మైదానం చుట్టూ ఉన్న 3.5 కి.మీ దూరంలోని అన్నాసాలై, శివానందసాలై, నేప్పియర్ వంతెన మీదుగా పోటీలు హోరెత్తాయి. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, గోవా తదితర నగరాలకు చెందిన జట్టులకు చెందిన 24 మంది క్రీడాకారులు కార్ రేసింగ్‌లో దూసుకెళ్లారు. ఇందులో ఆరుగురు మహిళా డ్రైవర్లు సైతం ఉన్నారు. ఆదివారం అర్ధరాత్రి వరకు పోటీలు ఉత్కంఠ భరితంగా జరిగాయి. వినోదం, సాహసంతో కూడిన కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నగర వాసులు ఈ పోటీలను తిలకించేందుకు వీలుగా అనేక చోట్ల ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. తుది పోటీలు ఇండియన్ చాంపియన్ షిప్, ఇండియన్ రేసింగ్ లీగ్ కేటగిరీలలో పోటాపోటీగా జరిగాయి. జేకే టైర్ జూనియర్ జాతీయ పోటీలు, సాహస కార్యక్రమాలు నిర్వహించారు. విజయవంతంగా.. ఫార్ములా రేస్ విజయవంతమైంది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో విజేతలకు క్రీడల మంత్రి ఉదయనిధి స్టాలిన్‌తో పాటు, నిర్వాహకులు, సినీ సెలబ్రటీలు బహుమతులను ప్రదానం చేశారు. ఫారుమలా – 4 ఛాంపియన్ షిప్లో ఆ్రస్టేలియాకు చెందిన కొచ్చి టీం క్రీడాకారుడు హగ్ బర్టర్, బెంగాళ్ జట్టుకు చెందిన భారత క్రీడాకారుడు రుహాన్ అల్వ, బెంగళూరు జట్టుకు చెందిన భారత క్రీడాకారుడు అభయ్ మోహన్ తొలి మూడు స్థానాలను కైవసం చేసుకున్నారు. రేస్ –2లో విజేతలుగా హైదరాబాద్ జట్టుకు చెందిన దక్షిణాఫ్రికా క్రీడాకారుడు అకిల్ అలీబాయ్, అహ్మదా బాద్ జట్టుకు చెందిన భారత డ్రైవర్ దివ్య నందన్, బెంగళూరు జట్టుకు చెందిన భారత డ్రైవర్ జడిన్ పరియట్ తొలి మూడుస్థానాలను దక్కించుకున్నారు. ఇండియన్ రేసింగ్ లీగ్, జేకే టైర్ జూనియర్ పోటీలలోనూ విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ పోటీల విజయవంతం గురించి క్రీడల మంత్రి ఉదయనిధి స్టాలిన్ సోమవారం ఉదయం సామాజిక మాధ్యమం వేదికగా స్పందించారు. చెన్నైలో ఈ పోటీలు విజయవంతంగా జరగడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. నిర్వాహకులు, అధికారులు, మద్దతు ఇచ్చిన చెన్నై నగర ప్రజలు, క్రీడాభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ పోటీలు తమిళనాడు చరిత్రలో మరో మైలురాయిగా నిలిచి పోతాయని అభిప్రాయపడ్డారు. ఈ పోటీలను ఇక్కడ నిర్వహించేందుకు తోడ్పాటు అందించిన సీఎం స్టాలిన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే ఈ పోటీలలో విజేతలు, కార్యక్రమం విజయవంతం చేసిన వారందరికీ సీఎం స్టాలిన్ సైతం అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.The best video to come out of #Formula4Chennai with 🐐BGM! Top class…👌💥P.C : dinesh _dharmendra_17 (IG) 🙌 pic.twitter.com/DJLQlfU8ci— Chennai Updates (@UpdatesChennai) September 2, 2024 -
చెన్నైలో 'రేస్' అదరహో.. సెలబ్రిటీల సందడి
సాక్షి, చెన్నై: ఫార్ములా కార్ రేస్ ఆదివారం అదరహో అనిపించే విధంగా జరిగింది. వినోదంతో కూడిన సాహసాలు హోరెత్తాయి. సినీ సెలబ్రిటీలు సందడి చేశారు. చెన్నై ఐలాండ్ గ్రౌండ్ వేదికగా ఫార్ములా కార్ రేస్ –4 శనివారం మొదలైన విషయం తెలిసిందే. తొలిరోజు అర్హత పోటీలు ఉత్కంఠ భరితంగా సాగాయి. రెండవ రోజు ఆదివారం ఉదయం నుంచి ట్రయల్ రన్ పేరిట పోటీలు హోరెత్తాయి. అలాగే, నగర వాసులు, ప్రేక్షకులను ఆకర్షించే దిశగా వినోద కార్యక్రమాలు, సాహసాలతో కూడిన కార్ రేసులు సాగాయి. జేకే టైర్ కార్ రేస్ ప్రత్యేక ఆకర్షణగా దూసుకెళ్లింది. ఆదివారం రాత్రి నుంచి అర్ధరాత్రి వరకు తుది పోటీలు ఇండియన్ చాంపియన్‌షిప్, ఇండియన్ రేసింగ్ లీగ్ కేటగిరిలలో జరిగాయి. అత్యంత పోటాపోటీగా ఉత్కంఠ భరితంగా గాల్లో 200 కి.మీకి పైగా వేగంతో కార్లు దూసుకెళ్లాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు పోటీలలో విజయాన్ని కైవశం చేసుకునే దిశగా రేసులో దూసుకెళ్లారు.చివరి రోజు పోటీలను వీక్షించేందుక ప్రత్యేక ఆకర్షణగా త్రిష వంటి సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు. అలాగే, భారత మాజీ క్రికెటర్ గంగూలి, బాలీవుడ్ స్టార్ అర్జున్ కపూర్, జాన్అబ్రహం, నిర్మాత బోనికపూర్‌తో పాటు పలువురు నటీ నటులు హాజరయ్యారు. కోలీవుడ్‌కు చెందిన అనేక మంది స్టార్లు తరలి వచ్చారు.సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అలాగే, టాలీవుడ్ స్టార్ నాగచైతన్య ఈ ఫార్ములాకు మరింత ప్రత్యేక ఆకర్షణ అయ్యారు. అర్ధరాత్రి జరిగిన విజయోత్సవంలో మరెందరో సినీ, క్రీడా సెలబ్రిటీలు సందడి చేశారు. శునకాల కోసం వేట కార్ రేస్‌కు శునకాలు పెద్ద సమస్యగా మారాయి. ఈ రేస్ జరిగే పరిసరాలలో కూవం నదీ తీరంలోని కొన్ని మురికి వాడలు ఉన్నాయి. ఇక్కడ శునకాలు ఎక్కవ. శనివారం రేస్ సమయంలో ఓ శునకం ట్రాక్‌లోకి దూసుకు రావడంతో రైడర్లు అలర్ట్ అయ్యారు. ఆ శునకం ట్రాక్‌ను రేస్ కారు వేగంతో దాటేయడంతో పెనుప్రమాదం తప్పినట్టైంది. దీంతో ఆదివారం రేసుకు శునకాల రూపంలో ఆటంకాలు ఎదురుకాకుండా జాగ్రత్తలు పడ్డారు. ఆదివారం ఉదయం నుంచి ఆ పరిసరాలలో శునకాల కోసం కార్పొరేషన్ సిబ్బంది తీవ్ర వేట సాగించారు. పదికి పైగా శునకాలను పట్టేశారు. రాత్రి జరిగిన ఫైనల్స్‌లోకి శునకాలు ట్రాక్ వైపుగా దూసుకు రాకుండా డేగ కళ్లతో కార్పొరేషన్ సిబ్బంది నిఘా వేయాల్సి వచ్చింది. Lovely! Normal Traffic on the left lane! Races on the right lane..👌🏎️#Formula4Chennai pic.twitter.com/2fqMd5KDSY— Chennai Updates (@UpdatesChennai) September 1, 2024 -
అనంతగిరి అడవుల్లో రేసింగ్‌పై స్పందించిన పోలీసులు
సాక్షి, వికారాబాద్: అనంతగిరి అడవుల్లో రేసింగ్‌పై పోలీసులు స్పందించారు. రేసింగ్ నిర్వహించిన వారిలో కొందరిని గుర్తించామని వికారాబాద్ ఎస్పీ కోటి రెడ్డి తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మిగిలిన వారిపైనా చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసులు స్వాతంత్ర్య దినోత్సవం బందోబస్తులో ఉండటంతో రేసింగ్‌కు పాల్పడ్డారని, ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా నిఘా ఏర్పాటు చేస్తామని ఎస్పీ అన్నారు. అనంతగిరి అడవుల్లో జరిగిన కార్, బైక్ రేసింగ్ విన్యాసాలకు సంబంధించిన ప్రాంతానికి వెళ్లి అటవీ శాఖ విజిలెన్స్, ఫారెస్ట్ అధికారులు వివరాలు సేకరించారు ఒక కారు నంబర్ ను గుర్తించిన అధికారులు.. హైదరాబాద్ నుంచి ఇద్దరు ఆర్గనైజర్లు, 40 మందితో 16 కార్లు, రేసింగ్ బైకులు తీసుకొచ్చి విన్యాసాలు చేసినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అనంతగిరి అడవుల్లోకి వీరిని ఎవరు తీసుకొచ్చారు. ఎవరు సహకరించారనే విషయాలపై విచారణ చేపట్టారు. రేసింగ్‌లో పాల్గొన్న వాహనాల నంబర్ల ఆధారంగా గుర్తించే పనిలో పడ్డారు. చదవండి: 9 నంబర్లు వస్తే.. లిఫ్ట్ చేయొద్దు -
తీవ్ర విషాదం.. కార్ రేసింగ్ పోటీల్లో ప్రముఖ రేసర్ దుర్మరణం
చెన్నై: ఎంఆర్ఎఫ్–ఎఫ్ఎమ్ఎస్ సీఐ జాతీయ కార్ రేసింగ్ చాంపియన్‌షిప్‌లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఆదివారం మద్రాస్ ఇంటర్నేషనల్ సర్క్యూట్లో జరిగిన రెండో రౌండ్ రేసింగ్‌లో సీనియర్ రేసర్ కె.ఇ.కుమార్ కారు ప్రమాదానికి గురైంది. ఇందులో పోటీపడిన 59 ఏళ్ల సీనియర్ రేసర్ కుమార్ తీవ్ర గాయాలపాలయ్యాడు. అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. ఈ దుర్ఘటనపై భారత మోటార్ స్పోర్ట్స్ సమాఖ్య (ఎఫ్ఎమ్ఎస్సీఐ) దర్యాప్తు చేయాలని ఆదేశించింది. -
హమ్మయ్య.. హైదరాబాద్ వాహనదారులకు ఊరట
సాక్షి, హైదరాబాద్: నగరంలోని హుస్సేన్ సాగర్ తీరంలో శని, ఆదివారాల్లో ఇండియన్ రేసింగ్ లీగ్(ఐఆర్ఎల్) నిర్వహించారు. దీంతో ఇటువైపుగా వచ్చే వాహనాలను దారి మళ్లించారు. కార్ రేసింగ్ ముగియడంతో సోమవారం వాహనాలను కొత్తగా నిర్మిస్తున్న రాష్ట్ర కొత్త సచివాలయం ముందు నుంచి అనుమతించారు. రెండురోజుల పాటు ఇబ్బందులకు గురైన వాహన చోదకులు హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, కార్ రేసింగ్ కోసం ఈ మార్గంలో ప్రత్యేకంగా ట్రాక్‌ను నిర్మించారు. దేశంలోనే తొలి స్ట్రీట్ సర్క్యూట్ ఇండియన్ రేసింగ్ లీగ్‌ను హుస్సేన్ సాగర్ తీరంలో శని, ఆదివారాల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే చెన్నై జట్టుకు చెందిన కారు ప్రమాదానికి గురికావడంతో రేసింగ్‌ను నిర్వాహకులు నిలిపివేశారు. దీంతో అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. డిసెంబర్ 10, 11 తేదీల్లో మళ్లీ ఇక్కడ కార్ రేసింగ్ నిర్వహిస్తారు. (క్లిక్ చేయండి: రేస్ లేకుండానే ముగిసిన లీగ్...) -
నిలిచిపోయిన ఇండియన్ రేసింగ్ లీగ్
-
కార్ రేసింగ్ లో వరుస ప్రమాదాలు
-
కార్ రేసింగ్ షో
-
హుస్సేన్ సాగర్ తీరాన తొలిరోజు ముగిసిన కార్ రేసింగ్..
-
హుస్సేన్ సాగర్ తీరాన ప్రధాన కారు రేస్ ..
-
Sri Sathya Sai: రేసులో దూసుకెళ్దాం.. చకాచకా ఎస్–3 ట్రాక్ పనులు..
రయ్యిమంటూ ట్రాక్‌పై దూసుకెళ్తూ క్షణాల్లో మాయమయ్యే కార్లు... ఒకదానితో ఒకటి పోటీ పడుతూ సాగే రేస్‌లో డ్రైవర్ల విన్యాసాలు.. అనుకోని మలుపులు.. ఆపై విజేతల గెలుపు సంబరాలు. టీవీల్లో తప్ప ప్రత్యక్షంగా చూసే భాగ్యం మనకు లేదను కుంటున్నారా..?, వైఎస్ జగన్ సర్కార్ ఆ అవకాశం మనకూ కల్పిస్తోంది. చంద్రబాబు హయాంలో అటకెక్కిన ఫార్ములా–3 కార్ రేస్ ట్రాక్ ప్రాజెక్టుకు ఊపిరి పోసింది. ఫలితంగా తనకల్లు మండలం కోటపల్లి వద్ద పనులు చకచకా సాగుతున్నాయి. సాక్షి, కదిరి: తనకల్లు మండలం కోటపల్లి వద్ద ఫార్ములా–3 కారు రేస్ ట్రాక్ ఏర్పాటుకు బెంగళూరుకు చెందిన ‘నిధి మార్క్ వన్ మోటార్స్’ ముందుకు వచ్చింది. అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆ కంపెనీతో 2017లో ఒప్పందం కుదుర్చుకుంది. 90 నెలల్లో పనులు పూర్తి చేయాలని అగ్రిమెంట్ రాసుకుంది. అయితే భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించడంలో బాబు సర్కారు పూర్తిగా విఫలమైంది. దీంతో కారు రేస్ ట్రాక్ పనులు అటకెక్కాయి. వైఎస్ జగన్ సర్కారు అధికారంలోకి రాగానే ఈ కారు రేస్ ట్రాక్ ఏర్పాటుపై దృష్టి సారించింది. 3.4 కి.మీ ఫార్ములా–3 కారు రేస్ ట్రాక్ ఏర్పాటుకు అవసరమైన 219 ఎకరాల భూమిని సేకరించి ‘నిధి మార్క్ వన్ మోటార్స్’కు అప్పగించడంతో పాటు నిర్వాసిత రైతులకు పరిహారం కూడా చెల్లించింది. దేశంలో మూడోది.. ఏపీలో మొదటిది.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గ్రేటర్ నోయిడా వద్ద ‘బుద్ద ఇంటర్ నేషనల్ సర్క్యూట్’ ఫార్ములా–1 కారు రేస్ ట్రాక్ ఉంది. అలాగే తమిళనాడు రాష్ట్రం చెన్నై సమీపంలోని ఇడుంగట్టు కొట్టయ్ వద్ద ఫార్ములా–2 కారు రేస్ ట్రాక్ ఏర్పాటు చేశారు. తాజాగా కదిరి సమీపంలోని కోటపల్లి వద్ద నిర్మిస్తోంది ఫార్ములా–3 కారు రేస్ ట్రాక్. రేస్ ట్రాక్‌లలో ఇది దేశంలో మూడోది. మన ఏపీలో మొదటిది. దీనికి ‘ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ (ఎఫ్ఐఏ), ఫెడరేషన్ ఇంటర్నేషనల్ మోటో సైక్లిజం(ఎఫ్ఐఎం) గుర్తింపు పొందింది. కారు రేసింగ్‌తో పాటు కొత్త కార్ల వేగాన్ని పరీక్షించేందుకు కూడా ఈ ట్రాక్ ఉపయోగ పడుతుంది. కార్ రేస్ వివిధ ఫార్మాట్లు ఇలా... ►ఫార్ములా–1 (ఎఫ్–1): ఈ రేసులో పాల్గొనే కారుకు 1,000 హెచ్‌పీ(హార్స్పవర్) ఇంజిన్ ఉంటుంది. ప్రపంచ చాంపియన్లను దృష్టిలో ఉంచుకొని ట్రాక్‌లను తయారు చేస్తారు. ఈ రేస్‌లో పాల్గొనే కార్లు వివిధ రకాల డిజైన్లలో ఉంటాయి. వారాంతంలో ఒక రోజు చొప్పున మూడు వారాల పాటు పోటీలు నిర్వహిస్తారు. గంటకు 1,000 కి.మీ వేగ పరిమితి ఉంటుంది. ►ఫార్ములా–2 (ఎఫ్–2): ఈ రేసులో పాల్గొనే కార్లకు 500 హెచ్‌పీ ఇంజిన్ ఉంటుంది. కార్లు అన్నీ ఒకే డిజైన్‌లో ఉంటాయి. రేస్ కూడా ఒకే రోజు మూడు గ్రూపులుగా విభజించి నిర్వహిస్తారు. గంటకు 500 కి.మీ వరకూ వేగ అనుమతి ఉంటుంది. ►ఫార్ములా–3(ఎఫ్–3): ఈ కార్లకు 250 హెచ్‌పీ సామర్థ్యం ఉంటుంది. ఇది బేసిక్ రేస్. ఇందులో పాల్గొనే కార్లన్నీ ఒకే డిజైన్‌లో ఉంటాయి. ఒకే రోజు మూడు గ్రూపులుగా విభజించి... పోటీలు నిర్వహిస్తారు. ఇందులో కార్ల వేగం గంటకు 250 కి.మీ పరిమితి ఉంటుంది. ఎంతోమందికి ఉపాధి.. ఫార్ములా–3 కారు రేస్ ట్రాక్ ఏర్పాటుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 500 మందికి ఉపాధి దొరుకుతుంది. తొలి దశలో ట్రాక్‌తో పాటు ఆస్పత్రి, అతిథి గృహం ఏర్పాటు చేయనున్నారు. రెండు, మూడవ దశల్లో 40 గదులో పెద్ద రిసార్ట్, అమ్యూజ్మెంట్ పార్కు(వినోద భరిత ఉద్యానవనం), గోల్ఫ్ కోర్సు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు ఏర్పాటు చేస్తారు. అలాగే జిల్లాలో తయారవుతున్న ‘కియా’ కార్లను పరీక్షించేందుకు కూడా ఈ ట్రాక్ ద్వారా అవకాశం కల్పిస్తారు. పర్యాటక హబ్ ఏర్పాటుకు ప్రణాళిక.. కోటపల్లి పార్ములా–3 కారు రేస్ ట్రాక్ బెంగళూరు విమానాశ్రయానికి కేవలం 110 కి.మీ దూరంలో ఉంది. కార్ రేసింగ్‌లో పాల్గొనేందుకు దేశ, విదేశాల చెందిన వారు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో రాయలసీమలోని పలు పర్యాటక ప్రాంతాలను కలుపుతూ ఒక హబ్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర పర్యాటక శాఖ యోచిస్తోంది. శ్రీసత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి, లేపాక్షి, కదిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, యోగి వేమన సమాధి, తిమ్మమ్మ మర్రిమాను, పెనుకొండ కోట, అనంతపురం జిల్లాలోని తాడిపత్రి, గుత్తి కోట, కర్నూలు, వైఎస్సార్ జిల్లాలలోని పలు పర్యాటక ప్రాంతాలను కలుపుతూ ‘రాయలసీమ హెరిటేజ్ సర్క్యూట్’ ఏర్పాటుకు అనుమతివ్వాలని ఇప్పటికే రాష్ట్ర పర్యాటక శాఖ కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరింది. చకాచకా పనులు.. ప్రస్తుతం కోటపల్లి వద్ద ఫార్ములా–3 కారు రేస్ ట్రాక్ పనులు చకాచకా జరుగుతున్నాయి. ఇప్పటికే చుట్టూ ఫెన్సింగ్ పూర్తయ్యింది. రేస్‌లో ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే చికిత్స చేసేందుకు అవసరమైన ఆస్పత్రి భవనం దాదాపుగా పూర్తి కావచ్చింది. వెయిటింగ్ హాలు, విశ్రాంతి గదుల నిర్మాణాలు ఊపందుకున్నాయి. ఇక రేస్ ట్రాక్ కోసం భూమి చదును చేసే పనులు ప్రారంభమయ్యాయి. రెండేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి చేసి కార్ రేస్‌లు ఏర్పాటు చేసేలా ‘నిధి మార్క్ వన్ మోటార్స్’ కృషి చేస్తోంది. రెండేళ్లలో పూర్తి చేస్తాం ఏపీలో జగన్ ప్రభుత్వం వచ్చాక మాకు కోటపల్లి వద్ద భూములు అప్పగించారు. కోవిడ్ కారణంగా పనులు కాస్త ఆలస్యమయ్యాయి. ఇప్పుడు మళ్లీ పనులు వేగంగా జరుగనున్నాయి. రెండేళ్లలో మొత్తం పనులు పూర్తి చేస్తాం. ఇది బెంగుళూరు విమానాశ్రయానికి దగ్గరగా ఉంది. రేసర్లు, ఔత్సాహికులతో పాటు పర్యాటకులను కూడా బాగా ఆకర్షించనుంది. –గోవింద రాజన్ చక్రవర్తి, నిధి మార్క్ వన్ మోటార్స్, డైరెక్టర్, బెంగళూరు -
స్నేహితురాలి పుట్టినరోజు.. యువతుల కార్ల రేస్.. చివరికి ఏం జరిగిందంటే?
మండ్య(కర్ణాటక): యువతులు రెండు కార్లలో పోటాపోటీగా ప్రయాణిస్తుండగా ఒక కారు ప్రమాదానికి గురైంది. మండ్య జిల్లా నాగమంగళ తాలూకాలోని కోణనూరు గేట్ వద్ద ఆదివారం ఉదయం కారు ప్రమాదంలో ఒక యువతి మరణించింది. మృతురాలు బెంగళూరు బాగలకుంటెకు చెందిన హెచ్‌టి. మంజుళాదేవి, పద్మరాజు దంపతుల కుమార్తె తనుశ్రీ (21)గా గుర్తించారు. ఈమె మైసూరులో బీబీఎ చివరి ఏడాది చదువుతోంది. చదవండి: సోడా తాగి వస్తా.. ఇంట్లో నుంచి వెళ్లిన వివాహిత అదృశ్యం ప్రస్తుతం బెంగళూరులోనే ఉంటోంది. స్నేహితురాలి పుట్టినరోజు ఉండడంతో ఆదివారం ఉదయం 7.30 సమయంలో సొంత కారును డ్రైవింగ్ చేసుకుంటూ మైసూరుకు బయల్దేరింది. మధ్యలో ఇద్దరు స్నేహితురాళ్లు వారి కారులో వచ్చారు. ఇద్దరూ పోటీలు పడుతూ కార్లను వేగంగా నడుపుతూ వెళ్లారు. ఈ సమయంలో తనుశ్రీ కారు అదుపుతప్పి కోణనూరు దగ్గర వంతెన గోడను ఢీకొని సుమారు 50 అడుగుల దూరం పల్టీలు కొట్టింది. తనుశ్రీ తీవ్ర గాయాలతో అక్కడే కన్నుమూసింది. నాగమంగళ పోలీసులు కేసు నమోదు చేశారు. -
'ఫ్లైయింగ్ ఫిన్' ఇక లేరు
పారిస్: ర్యాలీ రేసింగ్‌లో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించిన హన్నూ మికోలా కన్నుమూశాడు. ఫ్లైయింగ్ ఫిన్గా ప్రసిద్ధి పొందిన మికోలా(78) కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతూ శనివారం మరణించాడు. ఈ సందర్భంగా మికోలా మరణవార్తను అతని కుమారులు ట్విటర్ ద్వారా దృవీకరించారు. ' మీరు విన్నది నిజమే.. ఫ్లైయింగ్ ఫిన్ ఇక మనకు లేరు. ఈ చేదు వార్తను మీతో పంచుకోవడం బాధాకరం.' అంటూ ట్వీట్ చేశారు. మికోలా తన కెరీర్‌ను వోల్వో కారుతో ప్రారంభించినా ఎక్కువభాగం ఫోర్డ్, ఆడీ కార్లతో రేసింగ్‌లో పాల్గొన్నాడు. టాప్ 10 ర్యాలీ డ్రైవర్స్‌లో ఒకడిగా పేరు పొందిన మికోలా 1979లో ప్రపంచ ర్యాలీ చాంపియన్‌షిప్‌లో రన్నరఫ్‌గా నిలవగా.. 1983లో ప్రపంచ ర్యాలీ రేస్ చాంపియన్‌షిప్ సాధించాడు. అతని మరణం పట్ల మాజీ ర్యాలీ చాంపియన్స్ కార్లోస్ సైంజ్, సెబాస్టియన్ ఓగిర్, పీటర్ సోల్డ్ బర్గ్‌లు తమ సానభూతి వ్యక్తం చేశారు. -
గో-కార్ట్ రేస్.. ఊహించని ప్రమాదం
సాక్షి, ఛండీగఢ్ : సరదాగా బయట గడిపేందుకు వెళ్లిన ఈ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. గో-కార్ట్ రేసులో ఊహించని రీతిలో ప్రమాదం జరగటంతో 28 ఏళ్ల ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. భయానక ప్రమాదంతో అమ్యూజ్మెంట్ పార్క్‌లో హాహాకారాలతో దద్దరిల్లిపోయింది. వివరాల్లోకి వెళ్లితే... పంజాబ్‌కు చెందిన రామ్‌పుర ఫూల్‌లోని బత్తిండకు చెందిన పునీత్, తన భర్త అమర్దీప్ సింగ్, రెండేళ్ల కొడుకు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం సాయంత్రం పింజోరేలోని యాదవీంద్ర గార్డెన్స్‌కు వెళ్లింది. అక్కడ కుటుంబ సభ్యులతో సరదాగా గడిపాక అంతా గో-కార్ట్ రేసుకు సిద్ధమయ్యారు. భర్త ఆమె ఓ కారులో కూర్చోని ముందుకు వెళ్లారు. మొదటి లాప్ పూర్తయ్యాక ఒక్కసారిగా పునీత్ జుట్టు కారు చక్రంలో ఇరుక్కుపోయింది. వేగం ఎక్కువగా ఉండటంతో భర్త వాహనాన్ని నియంత్రించలేకపోవటంతో ఒక్కసారిగా ఆమె జుట్టుతోపాటు తల పైభాగం కాస్త ఊడిపోయి చట్రంలోకి వెళ్లిపోయింది. ఆ దృశ్యాలు చూసిన ప్రేక్షకులు ఒక్కసారిగా హహకారాలు చేస్తూ పరుగులు తీశారు. వెంటనే నిర్వాహకులు కొందరు వాహనాన్ని అదుపు చేసి.. స్పృహ కోల్పోయిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే తీవ్ర రక్తస్రావంతో అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఊహించని ఈ దుర్ఘటనతో పునీత్ కుటుంబంలో విషాదం నెలకొంది.