case failed
-
ఎంపీ తేజస్వీ సూర్యపై కేసు
బెంగళూరు: బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యపై కేసు నమోదైంది. రైతు ఆత్మహత్యకు వక్ఫ్ భూముల సమస్యతో సంబంధం ఉందంటూ తప్పుడు సమాచారాన్ని పంచుకున్నందుకు ఎంపీతోపాటు కన్నడ న్యూస్ పోర్టల్స్ ఎడిటర్లు ఇద్దరిపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తన భూమిని వక్ఫ్ బోర్డు స్వాధీనం చేసుకోవడంతో కర్ణాటకలోని హవేరి జిల్లాకు చెందిన రుద్రప్ప చెన్నప్ప బాలికై అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడని సూర్య తన పోస్టులో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య, మంత్రి బిజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్లు రాష్ట్రంలోని రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని సూర్య ఆరోపించారు. అయితే.. రుణ భారం, పంట నష్టంతో 2022 జనవరిలో రైతు ఆత్మహత్య చేసుకున్నారని హవేరి పోలీసు సూపరింటెండెంట్ స్పష్టం చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదైంది. అసహజ మరణాల దర్యాప్తు ప్రక్రియ కింద తుది నివేదిక సమరి్పంచిన తర్వాత కేసును ఇప్పటికే మూసేసినట్లు పోలీసులు తెలిపారు. రైతు భూమిని వక్ఫ్ భూమిగా రికార్డుల్లో నమోదు చేయడం వల్లనే అతను ఆత్మహత్య చేసుకున్నాడనే శీర్షికతో వార్తను ప్రచురించినందుకు గాను.. కన్నడ దునియా ఈ–పేపర్, కన్నడ న్యూస్ ఈ–పేపర్ ఎడిటర్లపైనా ఎఫ్ఐఆర్ నమోదైంది. హవేరిలో రైతులు వక్ఫ్ నోటీసులకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారని, ఇది రుద్రప్పను మానసిక క్షోభకు గురిచేసిందని ఆ వార్తా కథనం పేర్కొంది. -
టపాసులతో కేజ్రీవాల్‌కు స్వాగతం.. పోలీసుల కేసు నమోదు
న్యూఢిల్లీ: లిక్కర్ పాలసీ స్కామ్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ లభించడంతో శుక్రవారం జైలు నుంచి విడుదల అయిన విషయం తెలిసిందే. ఆప్ ముఖ్య నేతలు, కార్యకర్తలు జైలు వద్దకు చేరుకొని సీఎంకు ఘన స్వాగతం పలికారు.కాగా సీఎం విడుదలపై ఆప్ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. నార్త్ ఢిల్లీలోని సివిల్స్ లైన్స్‌లో సీఎం ఇంటి వద్ద పెద్ద ఎత్తున టపాలు కాల్చి కేజ్రీవాల్‌కు స్వాగతం పలికారు. ఈ క్రమంలో సీఎం నివాసం వెలుపల బాణాసంచా పేల్చడంపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.బాణసంచా వినియోగంపై ఢిల్లీలో నిషేధం ఉండటమే ఇందుకు కారణంగా పేర్కొన్నారు. సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్లో గుర్తు తెలియని వ్యక్తులపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 223 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు అధికారి తెలిపారు.ఉత్తర ఢిల్లీలోని సివిల్ లైన్స్‌లోని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి విడుదలయ్యాక స్వాగతం పలికేందుకు ఆయన నివాసం వెలుపల పటాకులు పేల్చడంపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు శనివారం తెలిపారు.చదవండి: దంచికొట్టిన వానలు.. మెరుగుపడిన ఢిల్లీ గాలి నాణ్యతకాగా లిక్కర్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఆరునెలల పాటు జైలుజీవితం గడిపిన ఆయన జైలు నుంచి విడుదలయ్యారు.. రూ.10లక్షల బాండ్ సమర్పించాలని, కేసు విషయంలో ఎక్కడా మాట్లాడొద్దని.. కేసు విచారణ కోసం ట్రయల్ కోర్టు ఎదుట హాజరుకావాలంటూ సర్వోన్నత న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. -
సిన్వర్‌పై అమెరికాలో కేసు
వాషింగ్టన్: ఇజ్రాయెల్‌లో అక్టోబర్ 7న జరిగిన నరమేధానికి సంబంధించి హమాస్ చీఫ్ యాహ్యా సిన్వర్‌తో పాటు ఆ ఉగ్రవాద సంస్థకు చెందిన మరో ఐదుగురు అగ్ర నేతలపై అమెరికాలో కేసు నమోదైంది. దాడికి ప్రణాళిక, మద్దతు, నిర్వహణ వెనక ఉన్నది వీరేరంటూ మంగళవారం క్రిమినల్ అభియోగాలు నమోదయ్యాయి. ఈ జాబితాలో హమాస్ పొలిటికల్ చీఫ్ ఇస్మాయిల్ హనయా, మిలటరీ వింగ్ చీఫ్ మహ్మద్ దెయిఫ్, డిప్యూటీ మిలిటరీ కమాండర్ మార్వాన్ ఇస్సా, ఖలీద్ మెషాల్, అలీ బరాకా ఉన్నారు. వీరిలో హనయా, దెయిఫ్, ఇస్సా ఇప్పటికే ఇజ్రాయెల్ హతమార్చింది. ఖలీద్ మెషాల్ దోహాలో ఉంటూ గ్రూప్ డయాస్పోరాకు నాయకత్వం వహిస్తుండగా అలీ బరాకా లెబనాన్‌కు చెందిన సీనియర్ హమాస్ అధికారి. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఇజ్రాయెల్ బాంబు దాడిలో హనయా, గాజాపై జరిపిన వైమానిక దాడుల్లో మహ్మద్ దెయిఫ్, మరో దాడిలో ఇస్సా మరణించారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన పాశవిక మెరుపుదాడిలో 1,200 మందికి పైగా ప్రాణాలు పోగొట్టుకోవడం తెలిసిందే. వారిలో 40 మందికి పైగా అమెరికన్లున్నారు. ‘‘ఇజ్రాయెల్‌ను నాశనం చేయడానికి, ఆ లక్ష్యసాధన కోసం ఆ దేశ పౌరులను చంపడానికి హమాస్ చేస్తున్న ప్రయత్నాలకు నిందితులంతా నాయకత్వం వహించారు. ఇరాన్ నుంచి అందుతున్న ఆర్థిక, సాయుధ, రాజకీయ దన్నుతో, హిజ్బొల్లా మద్దతుతో ఇందుకు తెగించారు’’అని అటార్నీ జనరల్ మెరిక్ గార్లాండ్ ఒక ప్రకటనలో తెలిపారు.చర్చలకు విఘాతం! అమెరికా తాజా చర్య గాజాలో కాల్పుల విరమణ యత్నాలకు విఘాతంగా మారుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యుద్ధానికి ముగింపు పలికేందుకు, ఖైదీల విడుదలకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్టు అమెరికా కొద్ది రోజులుగా ప్రకటనలు చేస్తుండటం తెలిసిందే. ఇలాంటి సమయంలో హమాస్ అగ్ర నేతలపై అమెరికా కేసులు పెట్టడం కాల్పుల విరమణ చర్చలపై తీవ్ర ప్రభావం చూపుతుందని పరిశీలకులు అంటున్నారు. ‘‘గాజాలో ఇజ్రాయెల్ దాడులకు అమెరికా పూర్తి మద్దతిస్తోంది. తాజా అభియోగాల ద్వారా హమాస్‌నే వేలెత్తి చూపుతోంది. కానీ వేలమందిని పొట్టన పెట్టుకుంటున్న ఇజ్రాయెల్‌ను మాత్రం కనీసం తప్పుపబట్టడం లేదు. అమెరికావి ద్వంద్వ ప్రమాణాలని మరోసారి రుజువైంది’’ అని బీరుట్‌లోని అమెరికన్ యూనివర్సిటీ ఫెలో రామి ఖౌరీ అన్నారు. -
దాడులు చేస్తే చేతులు కట్టుకుని కూర్చోం: మంత్రి అంబటి వార్నింగ్
సాక్షి, తాడేపల్లి: టీడీపీ నేతల ఓవరాక్షన్‌కు మంత్రి అంబటి రాంబాబు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. ఖమ్మంలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి వెళ్తే కొందరు టీడీపీ వారు దాడికి యత్నించారు. దీంతో, ఖమ్మంలో నాకు నిరసన సెగ అంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి అంబటి సీరియస్ అయ్యారు. కాగా, మంత్రి అంబటి శుక్రవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు ఒక నిశ్చితార్థానికి వెళ్తే దాడి చేసే ప్రయత్నం చేశారు. ఖమ్మంలో హఠాత్తుగా పది మంది వచ్చి వేసేస్తాం అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు వచ్చి దాడికి యత్నించారు. ఇలాంటి కులోన్మాదులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక మంత్రిగా సెక్యూరిటీ ఉన్న నాపైనే దాడి చేయాలని ప్రయత్నించారు. రెండు దాడులపై విచారణ జరగాలి.. డబ్బు మదంతో కొందరు ఉన్మాదులు పేట్రేగిపోతున్నారు. వీరికి తోడుగా కొన్ని ఛానల్లు అంబటికి నిరసన సెగ అంటూ అసత్య ప్రచారం చేస్తున్నాయి. దాడులు చేస్తే చేతులు కట్టుకుని కూర్చోం. ఉన్మాదులపై చట్టబద్దమైన చర్యలు తీసుకుంటాం. నిన్న నా కారుపై గోధుమల బస్తాలు పడటం, ఇవ్వాళ దాడికి యత్నించటంపై విచారణ జరగాలి. నన్ను చంపితే రూ.50 లక్షలు.. గతంలో కార్తీక వనభోజనాల సమయంలో నన్ను చంపేసిన వారికి రూ.50 లక్షలు ఇస్తామని ప్రకటించారు. ఈరోజు దాడికి ప్రయత్నించిన వారిలో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు పరారీలో ఉన్నారని పోలీసులు చెప్పారు. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు వెళ్లినవారిపై కూడా దాడి చేస్తారా?. ఇలాంటి కులోన్మాదంతోనే వంగవీటి రంగాని హతమార్చారు. ముద్రగడ పద్మనాభం మీద కూడా దాడి చేశారు. ఇది ఎంత మాత్రం సహించరానిది. చంద్రబాబు మీద ప్రేమ ఉంటే అది వేరేలా వ్యక్తం చేసుకోండి. అంతేకానీ దాడులు చేస్తామంటే మేము చేతులు కట్టుకుని కూర్చోము. టీడీపీ నేతలకు దమ్ముంటే అలా చేయండి.. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్ని పిటిషన్లు వేసినా న్యాయస్థానాల నిబంధనల మేరకు నడుచుకుంటాం. ఆయన కదలికలను పసిగట్టాల్సిన అవసరం ఎవరికీ లేదు. అజ్ఞాత వ్యక్తి లేఖ రాశాడని చంద్రబాబు చెప్తున్నారు. ఆ లేఖ ఏంటో? రాసినదెవరో పోలీసుల విచారణలో తేలుతుంది. పెండ్యాల శ్రీనివాస్‌ని చంద్రబాబు దేశం దాటించారు. ఆయన్ని పిలిపించి సీఐడీకి అప్పగిస్తే చంద్రబాబుకు బెయిల్ వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో టీడీపీ పోటీ చేసే పరిస్థితే లేదు. ఇక తెలంగాణ టీడీపీ అడ్డా అని ఎలా అంటారు?. చంద్రబాబు తప్పు చేసి జైలుకు వెళ్లాడు. మీకు దమ్ముంటే రాజమండ్రి జైలు గోడలు పగులకొట్టండి. దాడికి యత్నించిన ఎనిమిది మంది ఒకే కులం వారు. వారికే కాదు నాకూ కులం ఉందని గుర్తు పెట్టుకోండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక, అంతకుముందు ఖమ్మంలో టీడీపీ నాయకులు ఓవరాక్షన్ చేశారు. ఓ ప్రైవేటు కార్యక్రమానికి మంత్రి అంబటి రాంబాబు హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి అంబటిని అడ్డుకునేందుకు టీడీపీ నేతలు అక్కడికి కర్రలతో వెళ్లారు. అక్కడ అంబటి రాంబాబుతో టీడీపీ కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించారు. ఈ క్రమంలో టీడీపీ నేత కేతినేని హరీష్‌తో పాటు పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
అమిత్ మాలవీయాపై కర్ణాటకలో కేసు నమోదు
బెంగళూరు/న్యూఢిల్లీ: బీజేపీ ఐటీ విభాగం అధ్యక్షుడు అమిత్ మాలవీయాపై కర్ణాటక పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కర్ణాటక కాంగ్రెస్ నేత రమేశ్ బాబు ఫిర్యాదు మేరకు మాలవీయాపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు బుధవారం వెల్లడించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాం«దీని అభ్యంతరకరంగా చిత్రీకరిస్తూ సోషల్ మీడియాలో మాలవీయా ఓ వీడియోను పోస్టు చేశారని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ రమేశ్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టడం, విద్వేషాలు రగిలించడమే మాలవీయా ఉద్దేశమని ఆరోపించారు. ఇదిలా ఉండగా, తనపై కర్ణాటకలో కేసు నమోదు కావడంపై మాలవీయా ట్విట్టర్లో ప్రతిస్పందించారు. విదేశీ శక్తుల చేతుల్లో రాహుల్ గాంధీ ఓ పావు అని విమర్శించారు. మాలవీయాపై కేసు పెట్టడాన్ని కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత స్మృతి ఇరానీ తప్పుపట్టారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దురి్వనియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. -
చైనాలో తొలి ‘చాట్‌జీపీటీ’ అరెస్టు
బీజింగ్: రైలు ప్రమాదానికి గురైందని, తొమ్మిది మంది చనిపోయారని తప్పుడు వార్తను చాట్‌జీపీటీలో సృష్టించి, ప్రచారంలోకి తీసుకొచ్చిన వ్యక్తిని చైనా పోలీసులు అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేశారు. చైనాలో చాట్‌జీపీటీ దుర్వినియోగం కారణంగా జరిగిన తొలి అరెస్టు ఇదేనని పోలీసులు చెబుతున్నారు. వాయవ్య గాన్సు ప్రావిన్స్‌లో ఈ సంఘటన జరిగింది. నిందితుడు హాంగ్ అనే మారుపేరుతో చెలామణి అవుతున్నట్లు గుర్తించారు. అతడు సృష్టించిన తప్పుడు వార్త నిజమని భ్రమించి, కొన్ని పత్రికలు ప్రచురించడం గమనార్హం. -
రాజస్తాన్‌లో ఘోరం.. మహిళపై రేప్.. ఆపై సజీవదహనం
జైపూర్: రాజస్తాన్‌లో ఘోరం జరిగింది. ఓ దుర్మార్గుడు దళిత మహిళపై అత్యాచారానికి పాల్పడి, అనంతరం ఆమెకు నిప్పంటించాడు. తీవ్ర గాయాలపాలైన బాధితురాలు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచింది. బార్మెర్ జిల్లాకు చెందిన దళిత మహిళ(30) ఈ నెల 6న రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అదే గ్రామానికి చెందిన షకూర్‌ఖాన్ అనే వ్యక్తి బలవంతంగా లోపలికి ప్రవేశించాడు. ఆమెపై లైంగికదాడికి పాల్పడిన అనంతరం యాసిడ్ వంటి ద్రావకాన్ని ఒంటిపై పోసి, నిప్పంటించి పరారయ్యాడు. 50 శాతం గాయాలపాలైన బాధితురాలు జోథ్‌పూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి చనిపోయారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు నిందితుడు ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. -
ఎట్టకేలకు బెజవాడ రాజశేఖర్ డెడ్‌బాడీ లభ్యం.. చంపింది అతనే!
సాక్షి, నల్లగొండ: జిల్లాలో దారుణం జరిగింది. కట్టంగూరు మండలం రసూల్‌గూడెంలో రాజశేఖర్(27) నాలుగు రోజలు క్రితం కిడ్నాప్‌కు గురయ్యాడు. అనంతరం రామచంద్రగూడెం శివారులో హత్యకు గురయ్యాడు. ఈ క్రమంలో రాజశేఖర్‌ను తానే హత్య చేశానని వెంకన్న అనే వ్యక్తి శుక్రవారం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఇదిలా ఉండగా.. హత్య అనంతరం రాజశేఖర్ మృతదేహాన్ని వెంకన్న ఓ కాలువలో పాతి పెట్టాడు. దీంతో గ్రామ ప్రజలు(400 మంది వరకు) రాజశేఖర్ మృతదేహం కోసం రసూల్ గూడెం- రామచంద్రాపురం మధ్యలో గాలించారు. ఎట్టకేలకు శనివారం మధ్యాహ్నం రాజశేఖర్ మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు. మరోవైపు.. హత్య చేయబడ్డ రాజశేఖర్, హత్య చేసిన వెంకన్న ఇద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహితులు కావడం గమనార్హం. రాజశేఖర్ హత్య నేపథ్యంలో వెంకన్నకు కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఇక, రాజశేఖర్ హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇది కూడా చదవండి: పబ్‌కు వచ్చిన బాలికపై సామూహిక అత్యాచారం.. అసలేం జరిగింది? -
గుడిలో దళితుడికి ఘోర అవమానం
జైపూర్: రాజస్తాన్ రాష్ట్రం అల్వార్ జిల్లాలోని బెహ్రార్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. హిందూ దేవుళ్లను విమర్శించాడని గుడిలో ఓ దళితుడితో ముక్కు నేలకు రాయించారని పోలీసులు చెప్పారు. ఈ సంఘటనకు బాధ్యులైన 11 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, వీరిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని పేర్కొన్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఇటీవల విడుదలైన ‘ద కశ్మీర్ ఫైల్స్’ సినిమాను విమర్శిస్తూ రాజేశ్ కుమార్ మేఘవాల్ అనే దళిత వ్యక్తి మూడు రోజుల క్రితం ఫేస్బుక్లో పోస్టు పెట్టాడు. దీనిపై కొందరు కామెంట్లు చేయగా, ప్రతిస్పందనగా హిందూ దేవుళ్లను(రాముడు, కృష్ణుడు) కించపరుస్తూ మళ్లీ పోస్టులు పెట్టాడు. ఈ పోస్టులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొందరు వ్యక్తులు మంగళవారం రాజేశ్ కుమార్‌ను గుడికి రప్పించారు. క్షమాపణలు చెప్పించారు. తప్పు ఒప్పుకోవాలంటూ బలవంతంగా ముక్కు నేలకు రాయించారు. ఈ వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో సంచలనాత్మకంగా మారాయి. బాధితుడు రాజేశ్ కుమార్ మేఘవాల్ ఓ ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తున్నాడు. -
హరిద్వార్ ధర్మసంసద్ ప్రసంగాలపై కేసు నమోదు
డెహ్రాడూన్: మైనారిటీలకు వ్యతిరేకంగా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన వసీం రజ్వీ అలియాస్ జితేంద్ర నారాయణ్ త్యాగి, తదితరులపై కేసు నమోదైంది. వారిపై ఐపీసీ 153 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు హరిద్వార్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ రకీందర్‌సింగ్ తెలిపారు. అదేవిధంగా, గత వారం హరిద్వార్‌లో ధర్మసంసద్ నిర్వహించి న, ప్రసంగించిన వారిపై చర్యలు తీసుకోవా లని టీఎంసీ ప్రతినిది సాకేత్ గోఖలే జ్వాలాపూర్లో ఫిర్యాదు చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు గర్హనీయం హిందుత్వవాదం పేరుతో కొందరు చేస్తున్న ద్వేషపూరిత వ్యాఖ్యల ద్వారా హింస జరుగుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. దానికి అన్ని మతాలు మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఆయన శుక్రవారం ట్వీట్ చేశారు. హింసను ప్రేరేపిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. మాజీ ప్రధానిని హత్య చేయాలని పిలుపునివ్వడం, వివిధ మతాల మధ్య చిచ్చు పెట్టే కుట్ర చేయడం హీనమైన చర్యన్నారు. రాజ్యాంగాన్ని ధిక్కరించేలా ఆ వ్యాఖ్యలున్నాయని ఆమె ట్వీట్ చేశారు. -
అరెస్ట్ చేయడానికి వస్తే ఇంటి దగ్గర నా మూడ్ ఇలా.. కంగనా సంచలన పోస్ట్
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ అంటే వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకొవచ్చు. తన తీరు, వివాదస్పద వ్యాఖ్యలతో తరచు ఆమె వార్తల్లో నిలుస్తుంది. తాజాగా సిక్కులపై అనుచిత వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లోకి ఎక్కింది కంగనా. అంతేకాదు ఆమె పోలీసు కేసు కూడా నమోదైంది. ఇటీవల సాగు చట్టాలను రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో రైతులు ఆనందంలో మునితేలుతుంటే కంగనా వారిపై చేసిన కామెంట్స్ వివాదానికి దారి తీశాయి. చదవండి: పార్టీలో డ్యాన్స్‌తో హీరోయిన్ అక్క రచ్చ, ఛీఛీ.. కొంచం పద్దతిగా ఉండండి.. రైతులను ఉద్దేశిస్తూ ఆమె ‘దీన్ని ఖలిస్థానీ ఉద్యమం’ అంటారంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. దీంతో సబ్ అర్బన్ ఖార్ పోలీస్ స్టేషన్లో ఢిల్లీ సిక్ గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ కంగనాపై ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు సోమవారం ఆమెసౌ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రైతు ఉద్యమాన్ని ఉద్దేశపూర్వకంగానే ‘ఖలిస్తాన్’ఉద్యమం అని, సిక్కులను ఖలిస్తానీ టెర్రరిస్టులంటూ వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో కమిటీ సభ్యులు పేర్కొన్నారు. దీనిపై కంగనా స్పందిస్తూ సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ షేర్ చేసింది. చదవండి: షాకింగ్ లుక్‌లో సహజనటి జయసుధ.. ఇంతగా మారిపోయారేంటి? చేతిలో వైన్ గ్లాస్ పట్టుకుని గతంలోని ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోను ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేస్తూ.. ‘మరొక రోజు మరో ఎఫ్ఐఆర్. ఒకవేళ వాళ్లు నన్ను అరెస్ట్ చేసేందుకు వస్తే..ఇంటి దగ్గర నా మూడ్’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. కాగా సున్నితమైన రైతుల అంశంలో కంగనా చేసిన కామెంట్లపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్న వ్యక్తులకు తనదైన శైలిలో వ్యంగ్యంగా సమాధానమిచ్చింది కంగనా. మరి దీనిపై ఎవరూ ఎలా స్పందిస్తారో చూడాలి. అయితే కంగనా షేర్ చేసిన ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక కంగనా తీరుపై ఎప్పటిలాగే నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. తన తీరుపై మండిపడుతున్నారు. చదవండి: ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ ఆరోగ్యం విషమం -
సిక్కులపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు.. నటి కంగనాపై కేసు నమోదు
ముంబై: సిక్కులపై సామాజిక మాధ్యమంలో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై పోలీసు కేసు నమోదైంది. సబ్ అర్బన్ ఖార్ పోలీస్ స్టేషన్లో ఢిల్లీ సిక్ గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సోమవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రైతు ఉద్యమాన్ని ఉద్దేశపూర్వకంగానే ‘ఖలిస్తాన్’ఉద్యమం అని, సిక్కులను ఖలిస్తానీ టెర్రరిస్టులంటూ వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో కమిటీ సభ్యులు పేర్కొన్నారు. 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లు, అప్పటి ప్రధాని ఇందిరా గాంధీపై తన పోస్టులో అనుచిత వ్యాఖ్యలు చేశారని తెలిపారు. చదవండి: నాన్నగారు కోలుకుంటున్నారు, వదంతులు నమ్మవద్దు: కైకాల సత్యనారాయణ కుమార్తె -
డ్రీమ్-11కు షాకిచ్చిన క్యాబ్ డ్రైవర్...!
కొద్ది రోజుల క్రితం టీమిండియా జెర్సీ స్పాన్సర్ మొబైల్ ప్రీమియర్ లీగ్ (ఎమ్‌పీఎల్) కంపెనీకు కర్ణాటక ప్రభుత్వం షాకిచ్చిన విషయం తెలిసిందే. కర్ణాటకలో ఎమ్‌పీఎల్‌ను నిషేధిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిలిచిపోయిన డ్రీమ్-11 సేవలు..! గత కొద్ది రోజల నుంచి కర్ణాటక ప్రభుత్వం ఆన్లైన్ గేమింగ్, గ్యాబ్లింగ్, బెట్టింగ్ యాప్స్‌పై కర్ణాటక ప్రభుత్వం తీవ్ర స్థాయిలో విరుచుకపడింది. ప్రముఖ ఆన్లైన్ ఫాంటసీ గేమింగ్ యాప్ ఎమ్‌పీఎల్ సేవలను అక్టోబరు 5న కర్ణాటక ప్రభుత్వం నిషేధించింది. అయితే ఈ సమయంలో మరో దిగ్గజ ఫాంటసీ గేమింగ్ యాప్ డ్రీమ్-11పై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాగా తాజాగా బెంగుళూరులో 42 ఏళ్ల క్యాబ్ డ్రైవర్ డ్రీమ్-11పై పోలీసులో స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన చట్టాల ప్రకారం డ్రీమ్-11 నియమాలను ఉల్లంఘిస్తోందని సంస్థ యాజమాన్యంపై ఫిర్యాదు ఇచ్చాడు. దీంతో కర్ణాటకలో డ్రీమ్-11 సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తూ కంపెనీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. చదవండి: ఒక్కసారి ఛార్జ్‌తో 1360 కిలోమీటర్ల ప్రయాణం..! స్పందించిన డ్రీమ్-11 బెంగుళూరులో డ్రీమ్-11పై కేసు నమోదుకావడంతో యాజమాన్యం చట్టపరమైన నివారణ చర్యలను చేపట్టనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర చట్టాలకు కట్టుబడే డ్రీమ్-11 సేవలను అందిస్తున్నామని కంపెనీ వెల్లడించింది. గతంలో కూడా డ్రీమ్-11 అనేక చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొంది. గత ఏడాది భారత్‌లో యూనికార్న్ క్లబ్లో చేరిన గేమింగ్ స్టార్టప్‌గా డ్రీమ్-11 అవతరించింది. చదవండి: ఆకాశమే హద్దుగా డీమార్ట్ దూకుడు...! -
ఫేస్బుక్ డేటా చోరీపై సీబీఐ కేసు
న్యూఢిల్లీ: దాదాపు 18 నెలల ప్రాథమిక విచారణ అనంతరం సుమారు 5.62 లక్షల మంది భారతీయ ఫేస్బుక్ వినియోగదారుల సమాచారాన్ని అక్రమంగా వాడుకోవడంపై కేంబ్రిడ్జ్ అనలిటికా(సీఏ), గ్లోబల్ సైన్స్ రీసెర్చ్(జీఎస్ఆర్) సంస్థలపై సీబీఐ శుక్రవారం కేసు నమోదు చేసింది. ఐపీసీ, ఐటీ చట్టాల్లోని సంబంధిత సెక్షన్ల కింద బ్రిటన్‌కు చెందిన ఆ రెండు సంస్థలపై కేసు నమోదు చేశామని సీబీఐ వెల్లడించింది. ఫేస్బుక్ వినియోగదారుల డేటాను ఆయా సంస్థలు అక్రమంగా వినియోగించాయన్న వార్తలపై 2018 జులైలో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సీబీఐకి ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదుపై ప్రాథమిక విచారణ జరపి, సీబీఐ కేసు నమోదు చేసింది. పరిశోధన అవసరాల కోసం కొన్ని వర్గాల వినియోగదారుల సమాచారం ఇవ్వాలని కోరుతూ గ్లోబల్ సైన్స్ రీసెర్చ్ సంస్థ తరఫున అలెక్జాండర్ కోగన్ ఫేస్‌బుక్‌ను అభ్యర్థించారు. ఆ ఆనుమతితో ‘దిస్ ఈజ్ యువర్ డిజిటల్ లైఫ్’ పేరుతో ఒక యాప్‌ను రూపొందించి, ఫేస్బుక్ అనుమతించిన 335 మంది వినియోగదారులతో పాటు అక్రమంగా, వారి స్నేహితుల జాబితాలోని వ్యక్తుల సమాచారం కూడా సేకరించారు. ఆ సమాచారాన్ని ‘కేంబ్రిడ్స్ అనలిటికా’కు అమ్మేశారు. భారత్‌లో జరగనున్న ఎన్నికలపై ప్రభావం చూపేలా ఆ సమాచారాన్ని కేంబ్రిడ్జ్ అనలిటికా ప్రొఫైలింగ్ చేసిందని ఎఫ్ఐఆర్లో సీబీఐ పేర్కొంది. అమెరికాలోని వినియోగదారుల సమాచారం మాత్రమే జీఎస్ఆర్ నుంచి తీసుకున్నామని కేంద్ర ప్రభుత్వానికి కేంబ్రిడ్జ్ ఎనలిటికా తెలిపింది. -
‘తాండవ్’ రూపకర్తలపై క్రిమినల్ కేసు
ముంబై: వెబ్‌సిరీస్ ‘తాండవ్’ రూపకర్తలు, అమెజాన్ ఇండియా ఉన్నతాధికారిపై ఉత్తరప్రదేశ్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ వెబ్‌సిరీస్‌లో హిందూ దేవుళ్లను కించపర్చారని, ప్రజల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో అమెజాన్ ఇండియా హెడ్ ఆఫ్ ఒరిజినల్ కంటెంట్ అపర్ణ పురోహిత్, వెబ్‌సిరీస్ దర్శకుడు అలీ అబ్బాస్, నిర్మాత హిమాన్షు కృష్ణ మెహ్రా, రచయిత గౌరవ్ సోలంకీ, మరో వ్యక్తిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ వెబ్‌సిరీస్‌లో సైఫ్ అలీ ఖాన్, డింపుల్ కపాడియా తదితరులు నటించారు. శుక్రవారం అమెజాన్ ప్రైమ్‌లో ప్రీమియర్ విడుదలైంది. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరపడానికి నలుగురు సభ్యుల పోలీసు బృందం ముంబైకి వెళ్లనుంది. వెబ్సిరీస్లోని అభ్యంతరకరమైన సన్నివేశాలను తొలగించాలని మాజీ సీఎం మాయావతి సూచించారు. బేషరతుగా క్షమాపణ చెబుతున్నాం.. మత విశ్వాసాలను, ప్రజల మనోభావాలను దెబ్బతీయాలన్నది తమ ఉద్దేశం కాదని ‘తాండవ్’ వెబ్‌సిరీస్ రూపకర్తలు స్పష్టం చేశారు. ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెబుతున్నామని ప్రకటనలో పేర్కొన్నారు. తాండవ్‌ను కల్పిత కథ ఆధారంగా చిత్రీకరించినట్లు తెలిపారు. వ్యక్తులు, సంఘటనలకు దీంతో సంబంధం లేదని అన్నారు. ఒకవేళ సంబంధం ఉన్నట్లు అనిపిస్తే అది యాదృచ్ఛికమేనని ఉద్ఘాటించారు. -
జేసీ దివాకర్ రెడ్డిపై కేసు నమోదు
సాక్షి, అనంతపురం : మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులను దూషించిన ఆయనపై 153ఏ, 506 సెక్షన్ల కింద తాడిపత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే అధికారుల అంతు చూస్తానంటూ జేసీ దివాకర్ రెడ్డి నిన్న బెదిరింపులకు పాల్పడ్డారు. తాడిపత్రి సీఐ తేజోమూర్తి ఫిర్యాదు మేరకు పోలీసులు నమోదు చేశారు. (దివాకర్ రెడ్డి మైనింగ్ సంస్థలకు నోటీసులు) కాగా ‘మా అనుచరులు రాక్షసులు. పచ్చి రక్తం తాగేవాళ్లు నా చుట్టూ ఉన్నారు. వాళ్లు మీ రక్తాన్ని పులి, సింహాల్లాగా తాగుతారు.’’ అని దివాకర్‌రెడ్డి అధికారులను బెదిరించే ధోరణిలో వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మమ్మల్ని అధికారులు సన్మానిస్తే, మేము అధికారంలోకి వచ్చాక వారిని రెట్టింపు స్థాయిలో సన్మానిస్తాం అంటూ తాడిపత్రిలోని భూగర్భ గనుల శాఖ కార్యాలయం వద్ద ధర్నా చేయడానికి వచ్చిన ఆయన వ్యంగ్యంగా హెచ్చరించారు. -
సొసైటీలో అక్రమాలు.. టీడీపీ నేతపై కేసు
సాక్షి, కాకినాడ : డీసీసీబీ మాజీ ఛైర్మన్, ప్రత్తిపాడు టీడీపీ నేత వరుపుల రాజాపై పోలీసులు కేసు నమోదు చేశారు. గత టీడీపీ పాలనలో తూర్పుగోదావరి జిల్లా లంపకలోవ వ్యవసాయ పరపతి సంఘంలో రైతు రుణాల పేరుతో రూ. 16 కోట్ల 50 లక్షల నిధులు అక్రమాలు జరిగినట్లు ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. లంపకలోవ సోసైటీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయాని గత ఏడాది అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ప్రస్తావించారు. దీంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విచారణకు ఆదేశించారు. అధికారుల విచారణలో దిమ్మతిరిగే అవినీతి వాస్తవాలు వెల్లడయ్యాయి. (దృఢ సంకల్పంతో ముందడుగు: సీఎం జగన్) చనిపోయిన రైతులు పేరు మీద సోసైటీలో రైతులకు తెలియకుండా స్వల్పకాలిక పంట రుణాలను కాజేసినట్లు గుర్తించారు. అధికారం అడ్డుపెట్టుకుని 450 నకిలీ పాస్ పుస్తాకాలను తయారు చేసి వాటితోను రుణాలను కాజేశారు. ఈ అవినీతి అక్రమాలకు కారకులుగా వరుపుల రాజా తో పాటుగా... అప్పటి సొసైటీ ఉద్యోగులపై విచారణా అధికారి రాధాకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అప్పటి అధ్యక్షుడు వరుపుల రాజాతో పాటుగా నలుగురు మాజీ ఉద్యోగులపై ప్రత్తిపాడు పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. -
తబ్లిగీ నేతపై ఈడీ కేసు
న్యూఢిల్లీ: తబ్లిగీ జమాత్ నేత మౌలానా సాద్ కంధాల్వీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మనీ ల్యాండరింగ్ కేసు నమోదు చేసింది. ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ మేరకు కంధాల్వీతోపాటు అతనితో సంబంధమున్న ట్రస్టులు, మరికొందరు వ్యక్తులపైనా ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు (ఈసీఐఆర్) నమోదు చేసినట్లు గురువారం అధికారులు వెల్లడించారు. గత కొంతకాలంగా తబ్లిగీ జమాత్, ఆ సంస్థ ఆఫీస్ బేరర్లు నిర్వహించిన లావాదేవీలు, వారి ఆర్థిక వ్యవహారాలపై బ్యాంకులు, నిఘా విభాగాలు ఇచ్చిన సమాచారాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. త్వరలో కంధాల్వీకి సమన్లు జారీ చేసి, విచారణ చేపట్టనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం సాద్ సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్నారు. -
యూపీలో నర్సులపై వెకిలి వేషాలు
న్యూఢిల్లీ/ఘజియాబాద్: బ్లాక్ లిస్ట్‌లో చేర్చి, టూరిస్ట్ వీసాలను రద్దు చేసిన 960 మంది తబ్లిగీ జమాత్‌కు చెందిన విదేశీ కార్యకర్తల్లో నలుగురు అమెరికన్లు, తొమ్మిది మంది బ్రిటిషర్లు, ఆరుగురు చైనీయులు ఉన్నారని కేంద్ర హోం శాఖ శుక్రవారం వెల్లడించింది. వారితో పాటు, ప్రస్తుతం భారత్‌లోని పలు రాష్ట్రాల్లో ఉన్న తబ్లిగీ విదేశీ కార్యకర్తల్లో 379 మంది ఇండోనేసియన్లు, 110 మంది బంగ్లాదేశీయులు, 63 మంది మయన్మార్ వారు, 33 మంది శ్రీలంక వారు ఉన్నారని పేర్కొంది. కిర్గిస్తాన్(77), మలేసియా(75), థాయిలాండ్(65), ఇరాన్(24), వియత్నాం(12), సౌదీ అరేబియా(9), ఫ్రాన్స్(3)లకు చెందిన విదేశీ తబ్లిగీ కార్యకర్తల వీసాలను కూడా రద్దు చేశామంది. ఆ 960 మందిలో కజకిస్తాన్, కెన్యా, మడగాస్కర్, మాలి, ఫిలిప్పైన్స్, ఖతార్, రష్యా తదితర దేశాల వారు కూడా ఉన్నారని తెలిపింది. టూరిస్ట్ వీసాపై వచ్చిన వీరిని ఇప్పుడు ఆయా దేశాలకు తిరిగి పంపే ఆలోచన లేదని, వారిపై ఫారినర్స్ యాక్ట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్‌ల కింద వీసా నిబంధనలను ఉల్లంఘించిన నేరాల కింద చర్యలు తీసుకోనున్నామని హోంశాఖ జాయింట్ సెక్రటరీ పున్య సలిల శ్రీవాస్తవ స్పష్టం చేశారు. ‘వారిపై చర్యలు ప్రారంభమైన ప్రస్తుత సమయంలో వారిని వెనక్కు పంపే ప్రశ్నే లేదు. ఎప్పుడు పంపిస్తామన్నది నిబంధనలకు లోబడి నిర్ణయిస్తాం’ అన్నారు. తబ్లిగీ జమాత్ కార్యక్రమాల్లో పాల్గొని తమ దేశాలకు వెళ్లిన 360 మంది విదేశీయులను బ్లాక్ లిస్ట్ చేసే కార్యక్రమం ప్రారంభించామని వెల్లడించింది. వైద్యులు, వైద్య సిబ్బందిపై దాడులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను ఆదేశించామని శ్రీవాస్తవ తెలిపారు. కరోనా వైరస్‌కు సంబంధించి కొత్తగా 1930 అనే టోల్‌ఫ్రీ నెంబర్‌ను కూడా ప్రారంభించామన్నారు. కేంద్ర హోంశాఖ వెబ్సైట్లో రాష్ట్రాల హెల్ప్‌లైన్ నెంబర్లు కూడా ఉన్నాయన్నారు. ► కరోనా, లాక్‌డౌన్‌కు సంబంధించి ఢిల్లీ ప్రజలు తమ సమస్యలు తెలిపేందుకు వాట్సాప్ హెల్ప్‌లైన్ నెంబర్ 8800007722ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ► ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు శుక్రవారం రాజస్తాన్‌లోని టోంక్ జిల్లాలో పర్యటించారు. కరోనా వ్యాప్తిపై సర్వే నిర్వహించారు. యూపీలో నర్సులపై వెకిలి వేషాలు ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఒక ఆసుపత్రిలో నర్సులపై తప్పుగా ప్రవర్తించిన ఆరుగురు తబ్లిగీ జమాత్ సభ్యులపై రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఎస్ఏ కింద కేసు నమోదు చేసింది. వారిపై ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కూడా కేసు పెట్టారు. నర్సులపై అభ్యంతర కర వ్యాఖ్యలు చేసినట్లు వారిపై అభియోగాలు నమోదయ్యాయి. ప్యాంటు వేసుకోకుండా ఆసుపత్రుల్లో తిరిగారని, వెకిలి వ్యాఖ్యలు చేస్తూ, బూతు పాటలు పాడుతూ, వెకిలి చర్యలకు పాల్పడ్డారని, భౌతిక దూరం పాటించలేదని, తామిచ్చే ఔషధాలను తీసుకునేందుకు నిరాకరించారని ఆ ఆరుగురిపై నర్సులు ఫిర్యాదు చేశారు. దేశ భద్రతకు, శాంతి భద్రతలకు ప్రమాదమని భావిస్తే ఎన్ఎస్ఏ కింద ఎవరినైనా ఎలాంటి అభియోగాలు లేకుండానే, సంవత్సరం పాటు నిర్బంధంలోకి తీసుకోవచ్చు. కనౌజ్‌లోని జామామసీదులో శుక్రవారం ప్రార్థనలు చేసేందుకు గుమికూడటాన్ని నిరోధించేందుకు ప్రయత్నించిన పోలీసులపై పలువురు దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. ► మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కోవిడ్–19 బాధితుల కుటుంబసభ్యులు, ఇరుగుపొరుగును క్వారంటైన్ చేసేందుకు వెళ్లిన వైద్య సిబ్బందిపై దాడి చేసిన నలుగురిపై జాతీయ భద్రత చట్టం(ఎన్ఎస్ఏ) కింద కేసు నమోదు చేశారు. కోవిడ్‌పై పోరుకు ఆ ఘటనలతో విఘాతం ఆనంద్ విహార్ వద్ద భారీ సంఖ్యలో వలస కార్మికులు గుమికూడటం, నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిగీ జమాత్ యావత్ దేశం కరోనా కట్టడికి చేస్తోన్న ప్రయత్నాలకు విఘాతం కలిగించాయని రాష్ట్రపతి కోవింద్ పేర్కొన్నారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లతో రాష్ట్రపతి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. -
కోవిడ్ కేసులు లక్ష పైనే
బీజింగ్: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ బాధితుల సంఖ్య శనివారం నాటి లెక్కల ప్రకారం లక్ష దాటిపోగా, 3500 మందికిపైగా చనిపోయారు. చైనాలోని వూహాన్ సిటీలో గత డిసెంబరులో తొలిసారి కరోనా వైరస్‌ను గుర్తించగా.. తాజాగా ఇది 97 దేశాలకు విస్తరించడం ప్రపంచ ఆరోగ్య సంస్థను ఆందోళనకు గురి చేస్తోంది. భూటాన్, కామరూన్, సెర్బియా, దక్షిణాఫ్రికాల్లో కొత్తగా కోవిడ్ కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. వేసవి కారణంగా వైరస్ తీవ్రత తగ్గుముఖం పడుతుందన్న అంచనాలకు శాస్త్రీయ ఆధారాలేవీ లేవని, అన్ని దేశాలూ వైరస్ కట్టడికి చేస్తున్న ప్రయత్నాల తీవ్రతను తగ్గించరాదని డబ్ల్యూహెచ్ఓ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైఖేల్ రయన్ స్పష్టం చేశారు. అమెరికాలో కోవిడ్ కారణంగా 14 మంది, ఇటలీలో 233 మంది మరణించారు. చైనాలో కొత్త కేసులూ తగ్గుముఖం చైనాలో కోవిడ్ కారణంగా మరణించిన వారి సంఖ్య 3070కు చేరుకుందని చైనా ఆరోగ్య కమిషన్ అధికారులు శనివారం తెలిపారు. వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయిన వారి సంఖ్య 80,651గా ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఇది 1.02 లక్షలకు చేరుకుందని వివరించారు. చైనా మొత్తమ్మీద శుక్రవారం 28 మంది మరణించగా, కొత్తగా 99 మందికి వైరస్ సోకింది. ఒక రోజులో కొత్తగా వ్యాధి సోకిన వారి సంఖ్య వంద కంటే తక్కువగా ఉండటం ఇదే తొలిసారి. వ్యాధి తీవ్రత తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో హుబే ప్రాంతంలో క్వారంటైన్ (విడిగా ఉంచడం)ను ఎత్తివేయనున్నట్లు చైనా సూచన ప్రాయంగా తెలిపింది. చైనా పొరుగునే ఉన్న దక్షిణ కొరియాలో శనివారం నాటికి వ్యాధి బారిన పడ్డ వారి సంఖ్య ఏడు వేలకు చేరుకుంది. ఇరాన్ లో ఇప్పటివరకు 145 మంది మరణించారు. వ్యాధిసోకిన వారి సంఖ్య 5823కి చేరినట్లు అయింది. ‘కోవిడ్’ భవనం కూలింది కోవిడ్ బాధితులను చికిత్స కోసం ఉంచిన ఓ భవనం కూలింది. చైనాలోని ఫుజియాన్ ప్రావిన్సు క్వాన్ఝౌ నగరంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. 80 గదులున్న ఓ హోటల్‌ను ప్రస్తుతం కోవిడ్ బాధితుల క్వారంటైన్ కోసం ఉపయోగిస్తున్నారు. ఇప్పటి వరకు 30 మందిని రక్షించామని, శిథిలాల కింద మరో 70 మంది చిక్కుకుని ఉంటారని అధికారులు తెలిపారు. -
పోలీసుల అదుపులో కీచక టీచర్
ఏలూరు టౌన్: పాఠశాల విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్న ఉపాధ్యాయుడిని పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరు లోని వన్‌టౌన్ బావిశెట్టివారిపేట నగరపాలక సంస్థ పాఠశాలలో అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు బాలికలు ఐదవ తరగతి చదువుతున్నారు. ఉపా«ధ్యాయుడు కూరపాటి కిశోర్ వారి పట్ల మధ్యాహ్నం సమయంలో వేర్వేరుగా అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. విషయాన్ని ఇద్దరు విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు తెలపటంతో వారు సోమవారం స్థానిక వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికులతో కలసి పాఠశాలకు చేరుకుని ఆందోళనకు దిగారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. టీచర్ కిశోర్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాలికలు, తల్లిదండ్రుల నుంచి వివరాలు సేకరించి రెండు పోక్సో కేసులు నమోదు చేశారు. -
పుట్టినరోజు నాడే గ్యాంగ్‌రేప్
కోయంబత్తూర్: పుట్టిన రోజును జరుపుకోవడానికి మిత్రుడితో కలసి పార్కుకు వెళ్లిన టీనేజర్‌పై దారుణం చోటు చేసుకుంది. రాత్రి 9 గంటలకు తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో ఆరుగురు సామూహిక అత్యాచారం చేసిన ఘటన తమిళనాడులో జరిగింది. కోయంబత్తూర్ జిల్లా సీరనాయకన్పలాయమ్ గ్రామంలో గత నెల 26న ఈ ఘటన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ఇంటర్ తొలిఏడాది చదువుతున్న 17 ఏళ్ల బాలిక తన పుట్టినరోజును మిత్రుడితో కలసి జరుపుకున్న తర్వాత పార్కు నుంచి తిరిగి ఇంటికి వస్తుండగా ఆరుమంది మృగాళ్లు వారిని అడ్డగించారు. బాలిక వెంట వచ్చిన మిత్రుడిని చితకబాదుతూ, బట్టలు విప్పించి పారిపోయేలా చేశారు. అనంతరం బాలికను బట్టలు విప్పాల్సిందిగా బలవంతం చేశారు. బాలిక అందుకు నిరాకరించడంతో కింద పడవేసి బలవంతం చేశారు. అప్పుడు కూడా ఆమె తిరస్కరించడంతో ఇద్దరు కలసి అత్యాచారం చేశారు. మరో నలుగురు ఈ తతంగాన్ని వీడియో తీశారు. తర్వాత బాలిక అక్కడి నుంచి తప్పించుకొని, తన బంధువు ఇంటికి చేరుకొని 28న పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ ఘటనతో సంబంధం ఉన్న రాహుల్, ప్రకాశ్, కార్తికేయన్, నారాయణమూర్తిలను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడితోపాటు మరొకరి కోసం గాలిస్తున్నారు. నిందితులంతా 22 నుంచి 25 ఏళ్ల లోపు వారే. వీరిపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. -
సెలబ్రిటీలపై దేశద్రోహం కేసుపై నిరసనలు
న్యూఢిల్లీ: మూక దాడులపై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాసిన 49 మంది ప్రముఖులపై దేశద్రోహం కేసు పెట్టడాన్ని పలు పార్టీలు, సంఘాలు ఖండించాయి. కేసును వెనక్కు తీసుకోవాలని కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, డీఎంకే, ఆర్జేడీ, కేరళ రాష్ట్ర చలనచిత్ర అకాడెమీ డిమాండ్ చేశాయి. అయితే, ఈ కేసుతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని శనివారం కేంద్రమంత్రి ప్రకాశ్ జవడేకర్ స్పష్టం చేశారు. -
రాజస్తాన్‌లో ముగ్గురు బాలికలపై అత్యాచారాలు
జైపూర్: రాజస్తాన్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు బాలికలు అత్యాచారానికి గురయ్యారు. ఇందులో ఆళ్వార్ జిల్లా కూడా ఉంది. ఇటీవల ఈ జిల్లాలోనే దళిత మహిళపై గ్యాంగ్ రేప్ ఘటన తీవ్ర సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఆళ్వార్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(15) ఈ నెల 14వ తేదీన బంధువుల ఇంట్లో జరిగిన వివాహానికి వెళ్లగా ముగ్గురు బాలురు ఆమెను అపహరించి, గ్యాంగ్‌రేప్‌నకు పాల్పడ్డారు. ఇది తెలిసిన బాధితురాలి బంధువులు నిందితుల్లో ఇద్దరిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. వారిలో ఒకరు మరుసటి రోజు రోడ్డు పక్క శవమై కనిపించాడు. మిగతా ఇద్దరినీ కోర్టు ఆదేశాల మేరకు జువెనైల్ హోంకు తరలించినట్లు ఎస్పీ అనిల్ తెలిపారు. ఈ నెల 17న చురు ప్రాంతంలో ఆరేళ్ల బాలికపై బంధువైన 14 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే, ఈనెల 16న ధోల్పూర్లో బాలిక(8)పై యువకుడు(18) అత్యాచారం చేశాడు. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇలా ఉండగా, ఏప్రిల్ 26వ తేదీన ఆళ్వార్‌లో దళిత మహిళపై గ్యాంగ్ రేప్‌నకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరుగురిపైనా పోలీసులు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న లైంగికదాడులపై బీజేపీ మండిపడింది. -
‘టోటెం’ ప్రమోటర్ల అరెస్టు
న్యూఢిల్లీ/చెన్నై: రూ. 1,394 కోట్ల మేర ఎనిమిది బ్యాంకుల కన్సార్టియంను మోసగించిన కేసులో టోటెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ప్రమోటర్లు తొట్టెంపూడి సలలిత్, తొట్టెంపూడి కవితలను సీబీఐ శుక్రవారం బెంగళూరులో అరెస్టు చేసింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీబీఐ అధికారులు తెలిపారు. టోటెం ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ఇచ్చిన రూ. 313.84 కోట్ల రుణాన్ని ఎగ్గొట్టారని, 2012లో ఆ రుణం నిరర్ధక ఆస్తుల జాబితాలో చేరిందని ఫిర్యాదులో యూబీఐ పేర్కొం ది. ఆ కంపెనీ మొత్తం రూ. 1394.84 కోట్ల మేర బ్యాంకుల కన్సార్టియంకు బకాయి పడిందని, వివిధ ప్రాజెక్టుల కోసం బ్యాంకుల నుం చి రుణాలు తీసుకుని సొంత పనులకు నిధుల్ని దారి మళ్లించిందని సీబీఐ ఆరోపించింది. నిధుల్లో కొంతమేర ప్రమోటర్ల వ్యక్తిగత ఖాతా ల్లోకి చేరాయని తెలిపింది. కాగా 2015లో ఆదాయపు పన్ను శాఖ విడుదల చేసిన అతిపెద్ద పన్ను ఎగవేతదారుల జాబితాలో రూ. 400 కోట్ల ఎగవేతతో ఈ కంపెనీ కూడా ఉంది. డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్‌పై సీబీఐ కేసు యునైటెడ్ ఇండియా ఇన్సూ్యరెన్స్ కంపెనీ లిమిటెడ్(యూఐఐసీ)కి రూ. 30.54 కోట్ల మేర నష్టం కలిగించారన్న ఆరోపణలపై డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్(డీసీహెచ్ఎల్), దాని చైర్మన్ టి.వెంకటరామ్రెడ్డిలపై సీబీఐ కేసు నమోదు చేసింది. ముంబైకి చెందిన కేర్ రేటింగ్ లిమిటెడ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కో లిమిటెడ్, ఇద్దరు యూఐఐసీ మాజీ ఉద్యోగులు ఏ.బాల సుబ్రమణియన్, కె.ఎల్ కుంజిల్వర్ పేర్లను కూడా ఎఫ్ఐఆర్లో చేర్చింది. కంపెనీకి చెందిన ప్రీమియం డబ్బుల్ని ఆ ఇద్దరు ఉద్యోగులు నిబంధనలకు విరుద్ధంగా డీసీహెచ్ఎల్లో డిబెంచర్ల రూపంలో పెట్టబడి పెట్టారని, ఆ సమయంలో కేర్ రేటింగ్ లిమిటెడ్ సాయంతో రుణ అర్హత సామర్థ్యాన్ని డీసీహెచ్ఎల్ ఎక్కువ చేసి చూపించిందని ఫిర్యాదులో యూఐఐసీ పేర్కొంది.