CLIMATE
-
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం
-
ఏపీకి అల్పపీడనం ముప్పు.. వాతావరణ శాఖ హెచ్చరిక
-
గాలి నిండా మీథేన్!
పర్యావరణానికి ప్రధాన శత్రువు మనిషేనని మరోసారి రుజువైంది. శిలాజ ఇంధనాల వాడకం, పారిశ్రామికీకరణ వంటి మానవ కార్యకలాపాల వల్ల 20 ఏళ్లలోనే ఏకంగా 67 కోట్ల టన్నుల మేరకు ప్రమాదకర మీథేన్ వాయువు వాతావరణంలోకి విడుదలైందట. స్టాన్‌ఫర్డ్ వర్సిటీ సైంటిస్టుల తాజా అధ్యయనంలో తేలిన చేదు నిజమిది. ఈ దెబ్బకు పారిశ్రామికీకరణకు ముందు నాటితో పోలిస్తే గాలిలో మీథేన్ పరిమాణం ఏకంగా 2.6 రెట్లు పెరిగిపోయిందని ఆ నివేదిక పేర్కొంది. పైగా, ‘‘ఇవి 2020 నాటి గణాంకాల ఆధారంగా వేసిన లెక్కలు. ఈ నాలుగేళ్లలో పరిస్థితి మరింత దిగజారింది’’ అంటూ హెచ్చరించింది... 2000 నుంచి కొన్నాళ్ల పాటు వాతావరణంలో మీథేన్ పెరుగుదల కాస్త అదుపులోనే ఉంటూ వచ్చింది. కానీ ఆ తర్వాత పలు దేశాలు శిలాజ ఇంధనాల ఉత్పత్తి, వాడకాలను విచ్చలవిడిగా పెంచేయడంతో ప్రమాదకర స్థాయిలో పెరుగుతూ వస్తోంది. బొగ్గు, చమురు, సహజవాయువు తదితరాల వెలికితీత, వాడకం వల్ల వెలువడుతున్న మీథేన్ పరిమాణం గత 20 ఏళ్లలో ఏకంగా 33 శాతం పెరిగిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అలాగే వ్యర్థాలు తదితరాల నుంచి మీథేన్ విడుదలవుతున్న 20 శాతం, వ్యవసాయం వల్ల మరో 14 శాతం పెరిగిందని అధ్యయనం తేలి్చంది! ‘ప్రపంచం పెద్దగా పట్టించుకోవడం లేదు గానీ, వాతావరణంలో పెరిగిపోతున్న మీథేన్ పరిమాణం పర్యావరణానికి పెద్ద విపత్తుగా పరిణమిస్తోంది’ అని అధ్యయనానికి సారథ్యం వహించిన గ్లోబల్ కార్బన్ ప్రాజెక్ట్ హెడ్, స్టాన్‌ఫర్డ్ వర్సిటీలో పర్యావరణ శాస్త్రవేత్త రాబ్ జాక్సన్ హెచ్చరించారు. ఈ ప్రాజెక్టు గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను ఎప్పటికప్పుడు గమనిస్తుంటుంది. ‘‘2000 సంవత్సరంలో వాతావరణంలోని మొత్తం మీథేన్ పరిమాణంలో మనిషి వాటా 60 శాతంగా ఉండేది. ఇప్పుడది ఎకాయెకి 65 శాతానికి పెరిగింది. భూ వాతావరణంలో మీథేన్ పెరుగుదల కార్బన్ డయాక్సైడ్ (సీఓటూ) కంటే చాలా ఎక్కువగా నమోదవుతోంది. 2015లోనైతే వాతావరణంలో మీథేన్ సాంద్రత గత 80 లక్షల ఏళ్లలో ఎన్నడూ లేనంత భారీగా నమోదైంది! వాతావరణంలో వేలాది ఏళ్లపాటు ఉండిపోయే సీఓటూతో పోలిస్తే మీథేన్ ఉండేది 12 ఏళ్లే అయినా అది కలగజేసే నష్టం మాత్రం ఎక్కువ. ఎందుకంటే పర్యావరణానికి సీఓటూ కంటే మీథేన్ 82 రెట్లు ఎక్కువ నష్టం చేస్తుంది’’ అని జాక్సన్ వివరించారు. ‘‘మీథేన్, సీఓటూ ఉద్గారాలు ఇలాగే కొనసాగితే 2050 నాటికి ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు ఏకంగా 3 డిగ్రీలకు మించి పెరిగిపోతాయి. అది వినాశనానికి దారితీస్తుంది’’ అని ఆందోళన వెలిబుచ్చారు. ఈ అధ్యయన ఫలితాలు ‘ఎని్వరాన్మెంటల్ రీసెర్చ్ లెటర్స్’లో మంగళవారం ప్రచురితమయ్యాయి.కాగితాల్లోనే లక్ష్యం...మీథేన్ ముప్పుపై అంతర్జాతీయ వేదికలపై ఎన్నోసార్లు చర్చోపచర్చలు జరిగాయి. పర్యావరణ శాస్త్రవేత్తల వరుస ఆందోళనల ఫలితంగా 2021లో దేశాలన్నీ దీనిపై లోతుగా చర్చించాయి. వాతావరణంలో మీథేన్ పరిమాణాన్ని తగ్గిస్తామంటూ ప్రతినబూనాయి. ‘గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్’గా పిలిచే ఒప్పందంపై 100కు పైగా దేశాలు సంతకాలు చేశాయి. మీథేన్ ఉద్గారాలను 2030 నాటికి 30 శాతానికి పైగా తగ్గించాలన్నది దీని లక్ష్యం. ఫలితంగా 2050 నాటికి గ్లోబల్ వార్మింగ్‌లో 0.2 డిగ్రీ సెల్సియస్ మేరకు తగ్గుదల నమోదవుతుందని అంచనా. కానీ ఆచరణలో ఏ దేశమూ చేసింది పెద్దగా ఏమీ లేకపోవడంతో ఈ లక్ష్యం కాగితాలకే పరిమితమైంది. – సాక్షి, నేషనల్ డెస్క్ మీథేన్‌తో పెను ప్రమాదమే⇒ ఏటా 5.8 కోట్ల టన్నుల మీథేన్ వాతావరణంలోకి విడుదలవుతోందని అంచనా. ఇందులో మనిషి వాటాయే ఏకంగా 60 శాతం. ⇒ వ్యవసాయం, శిలాజ ఇంధనాల వెలికితీత, వాటి వాడకం తదితరాల వల్ల 60 శాతం మీథేన్ విడుదలవుతోంది. ⇒ అమెరికాలో కేవలం గ్యాస్ డ్రిల్లింగ్ కారణంగా 2005 నుంచి ఇప్పటిదాకా ఏకంగా 1.17 కోట్ల టన్నుల మీథేన్ విడుదలై ఉంటుందని అంచనా! ⇒ గాల్లో మీథేన్ పరిమాణం పెరిగితే వచ్చే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ⇒ గ్లోబల్ వార్మింగ్‌కు ప్రధాన కారణమైన గ్రీన్‌హౌజ్ వాయు ఉద్గారాల్లో మీథేన్దే పెద్ద వాటా. ⇒ పారిశ్రామికీకరణ అనంతరం గత 150 ఏళ్లలో ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు ప్రమాదకరంగా పెరిగిపోతుండటం తెలిసిందే. అందులో మూడో వంతు పెరుగుదల మీథేన్ వల్లే సంభవిస్తోంది! ⇒ వాతావరణంలోని వేడిని మీథేన్ నిర్బంధించి దాన్ని తిరిగి భూమిపైకే పంపుతుంది. మరోలా చెప్పాలంటే భూ ఉపరితలంపై ఓజోన్ పొరలాంటి దాన్ని ఏర్పరుస్తుంది. అలా భూ ఉష్ణోగ్రతలు పైకి వెళ్లకుండా అడ్డుకుంటుంది. తద్వారా పర్యావరణం నానాటికీ వేడెక్కుతోంది. ⇒ వాయు నాణ్యతను కూడా మీథేన్ బాగా దెబ్బ తీస్తుంది. దాంతో మనుషులతో పాటు జంతువుల్లో కూడా శ్వాసకోశ సంబంధిత సమస్యలు పెరుగుతాయి. ⇒ పర్యావరణానికి కార్బన్ డయాక్సైడ్ కంటే మీథేన్ వల్ల జరిగే నష్టం ఏకంగా 82 రెట్లు ఎక్కువ! ⇒ తాజా అధ్యయనం కేవలం 2020 నాటికి అందులో ఉన్న డేటా ఆధారంగా చేసినదే. ఈ నాలుగేళ్లలో మీథేన్ ప్రభావం మరింత వేగంగా పెరుగుతూ వస్తోందన్నది పర్యావరణవేత్తల మాట. తక్షణం దిద్దుబాటు చర్యలు తప్పవని వారంటున్నారు.భూ సగటు ఉష్ణోగ్రతల పెరుగుదలను అంతర్జాతీయంగా అంగీకరించిన 1.5 డిగ్రీ సెల్సియస్ స్థాయికి పరిమితం చేయాలంటే సీఓటూ ఉద్గారాలను సగానికి, మీథేన్ ఉద్గారాలను మూడో వంతుకు తగ్గించాలి. ఈ దిశగా తక్షణ కార్యాచరణ అత్యవసరం – బిల్ హేర్, క్లైమేట్ అనలిటిక్స్ సీఈఓ, పర్యావరణ శాస్త్రవేత్త -
ఒక్కసారిగా మారిన వాతవరణం..
-
స్వచ్ఛ గాలి కేరాఫ్ ఏపీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 13 పట్టణాల్లో వాతావరణ కాలుష్యం తగ్గించడంపై నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం (ఎన్సీఏపీ) కింద చేపట్టిన కార్యక్రమం సత్ఫలితాలను అందిస్తోంది. దేశవ్యాప్తంగా 131 పట్టణాలు, 10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో వాయుకాలుష్యం తగ్గించే విధంగా 2019లో ఈ కార్యక్రమాన్ని కేంద్రం ప్రారంభించింది. 2025–26 నాటికి వాతావరణ కాలుష్యాన్ని ఆయా ప్రాంతాల్లో తగ్గించడం ద్వారా ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అందించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. 2023–24లో నమోదైన వాతావరణ కాలుష్యం డేటా ప్రకారం..దేశవ్యాప్తంగా 131 పట్ణణాల్లో అత్యధిక కాలుష్యం నమోదవుతుండగా... అందులో ఏపీ నుంచి 13 ప్రాంతాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా చూస్తే అత్యధికంగా ఢిల్లీ 208 పీఎం10తో తొలి స్థానంలో నిలిచింది. దేశస్థాయిలో విశాఖ 30వ స్థానంలో, కడప 128వ స్థానంలో నిలిచాయి. కాలుష్యం పెరుగుదలలో పీఎం10 (వాతావరణంలో పీల్చుకునే స్థాయిలో ఉండే 10 మైక్రోమీటర్ల వ్యాసం కలిగిన ముతక కణాలు) స్థాయి 120 పాయింట్లతో ఏపీలో విశాఖ తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో రాజమహేంద్రవరం, విజయనగరం, ఏలూరు నిలిచాయి. 42 పీఎం10 స్థాయితో ఏపీలో కడప చివరి స్థానంలో నిలిచింది. విజయవాడలో తగ్గుముఖంఈ పథకం అమలు తర్వాత రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లో కాలుష్యం తగ్గుముఖం పట్టినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఎన్సీఏపీ చర్యలతో విజయవాడ, కడప, కర్నూలు, నెల్లూరు వంటి పట్టణాల్లో కాలుష్యం తగ్గుముఖం పట్టింది. 2022–23లో విజయవాడలో పీఎం10 స్థాయి 90 పాయింట్లుగా ఉంటే అది 2023–24కు 61 పాయింట్లకు చేరింది. ఇదే సమయంలో కడపలో 57 నుంచి 42కు, నెల్లూరులో 56 నుంచి 52కు, కర్నూలులో 64 నుంచి 56కు తగ్గినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే విశాఖలో వాతావరణ కాలుష్యం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇక్కడ 2022–23లో పీఎం10 స్థాయి 116 పాయింట్లుగా ఉండగా అది 2023–24 నాటికి 120 పాయింట్లకు పెరిగింది. రాజమహేంద్రవరంలో 68 నుంచి 76, గుంటూరులో 60 నుంచి 61 పాయింట్లకు పెరిగింది. జనాభా పెరుగుదల, పారిశ్రామిక పురోగతి ఎక్కువ అవడం, స్థానికంగా వాతావరణ మార్పులు చోటుచేసుకోవడం తదితర కారణాల వల్ల ఈ ప్రాంతాల్లో కాలుష్యం పెరుగుతున్నట్లు తెలిపింది. ఏపీలో ఇప్పటివరకు రూ.109.78 కోట్ల వినియోగంవాతావరణంలో పీఎం10, పీఎం 2.5 స్థాయిలను ప్రస్తుతమున్న స్థాయి నుంచి 2025–26కి కనీసం 40% తగ్గించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం 131 పట్టణాలకు రూ.19,614 కోట్లను కేటాయించింది. 10 లక్షల కంటే అధిక జనాభా కలిగిన నగరాల్లో ఈ మొత్తాన్ని 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు విడుదల చేస్తుండగా.. మిగిలిన పట్టణాలకు స్థానిక సంస్థల ద్వారా విడుదల చేస్తోంది. ఈ మొత్తంలో ఇప్పటివరకు రూ.11,211.13 కోట్లను ఖర్చు చేసింది. ఎన్సీఏపీ కింద ఏపీ నుంచి ఎంపికైన 13 పట్టణాలకు ఇప్పటివరకు రూ.361.09 కోట్లు విడుదల చేయగా అందులో రూ.109.78 కోట్లను ఖర్చు పెట్టారు. వాతావారణ కాలుష్యానికి కారణమైన రహదారులపై దుమ్ము, వ్యర్థాలను తగలపెట్టడం, వాహన, పారిశ్రామిక కాలుష్యం, నిర్మాణ రంగ వ్యర్థాలు వంటి వాటిని గుర్తించి వాటిని నియంత్రించడంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాయి. -
ప్రతికూల వాతావరణం.. 80 శాతం రైతులు కుదేలు
ఊహకందని రీతిలో మారుతున్న వాతావరణ పరిస్థితులు రైతులను నిరాశలోకి నెట్టేస్తున్నాయి. భారీ వర్షాలు, వరదలు లాంటి ప్రకృతి విపత్తులతో రైతులు భారీ స్థాయిలో పంట నష్టాలను ఎదుర్కొంటున్నారు.గత ఐదేళ్లలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా భారతదేశంలో 80 శాతం మంది రైతులు తమ పంటలను నష్టపోయారు. పలు రాష్ట్రాల్లో వివిధ కారణాలతో నాట్లు వేయడం, విత్తనాలు విత్తడంలో జాప్యం జరుగుతున్నదని, ఇది పంటల దిగుబడిపై ప్రభావం చూపుతున్నదని నిపుణులు అంటున్నారు. ఫోరమ్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్ ఫర్ ఈక్విటబుల్ డెవలప్మెంట్ (ఫీడ్) తాజాగా విడుదల చేసిన నివేదికలో దేశంలోని రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు వెలుగులోకి వచ్చాయి.దేశంలోని 21 రాష్ట్రాల్లోని 6,615 మంది రైతుల నుంచి ఫీడ్ పలు వివరాలు సేకరించింది. దేశంలో సంభవించిన పంట నష్టాల్లో 41 శాతం కరువు కారణంగా, 32 శాతం సక్రమంగా వర్షాలు కురియక, 24 శాతం రుతుపవనాల ముందస్తుగా లేదా ఆలస్యంగా వచ్చిన కారణంగా సంభవించినట్లు ఫీడ్ సర్వేలో తేలింది.సర్వేలో పాల్గొన్న రైతులలో 43 శాతం మంది తమ పంటలో కనీసం సగం పంట నష్టపోయామని తెలిపారు. ముఖ్యంగా వరి, కూరగాయలు, పప్పుధాన్యాలు అధిక వర్షపాతం కారణంగా దెబ్బతిన్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో వరి పొలాల్లో కొత్తగా నాటిన మొక్కలకు నష్టం వాటిల్లింది. అదేవిధంగా తక్కువ వర్షపాతం మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, బీహార్, ఉత్తరప్రదేశ్‌లను ప్రభావితం చేసింది. బెంగాల్ తదితర రాష్ట్రాల్లో వరి, మొక్కజొన్న, పత్తి, సోయాబీన్, వేరుశనగ తదితర పంటల విత్తనాలు నాటడంలో ఆలస్యం జరిగింది. ఇది పంట దిగుబడులపై ప్రభావం చూపనున్నదని నిపుణులు అంటున్నారు. -
నిరాశపరచనున్న నైరుతి రుతు పవనాలు.. సాధారణ వర్షపాతం
-
హైదరాబాద్ లో పలు చోట్ల కుండపోత వాన
-
దక్షిణాదిన వానలు.. ఉత్తరాదిన ఎండలు
దేశంలో విభిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉత్తరాదిన ఎండలు మండిపోతుంటే.. దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వరుణుడు పలకరించడంతో తెలుగు రాష్ట్రాల్లో వెదర్ కాస్త చల్లబడింది. మొన్నటి వరకూ దేశవ్యాప్తంగా ఎండలు దంచికొట్టాయి. ఉత్తరం, దక్షిణం అనే తేడా లేకుండా ఉష్ణోగ్రతలు ఠారెత్తించాయి. అయితే రుతుపవనాలు పలకరించాక, వాతావరణం మారింది. ఉత్తరాదిన భానుడి భగభగలు కొనసాగుతుంటే.. దక్షిణాదిన మాత్రం వర్షాలు పడుతున్నాయి. వేడి, ఉక్కపోత నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది.మరో మూడు రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం హెచ్చరించింది. రేపు, ఎల్లుండి కోస్తాంధ్రలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇటు తెలంగాణలోనూ నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్టు ఐఎండీ వెల్లడించింది. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రుతుపవనాల ప్రభావంతో కేరళలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్, 2 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది ఐఎండీ.వర్షాలతో దక్షిణాది చల్లబడినా.. ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లో వేడి వాతావరణం కొనసాగుతోంది. భానుడి భగభగలు సెగలు పుట్టిస్తున్నాయి. వేడి గాలులు వీస్తున్నాయి. ఢిల్లీ, హరియాణా, ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్‌గఢ్‌లోని పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాజధాని ఢిల్లీలో సోమవారం ఉష్ణోగ్రత 46 డిగ్రీల సెల్సియస్ దాటింది. రానున్న రోజుల్లో ఇది 47 డిగ్రీలకు చేరుకుంటుందని భారత వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఎల్లో అలర్ట్ ఇష్యూ చేసింది.హీట్‌వేవ్, నీటి సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న దేశ రాజధానిపై మరో పిడుగు పడింది. మంగళవారం మధ్యాహ్నం నుంచి భారీగా విద్యుత్ కోతలను ఎదుర్కొంటోంది. ఉత్తర్‌ప్రదేశ్ మండోలాలోని పవర్ గ్రిడ్‌లో అగ్నిప్రమాదం జరగడంతో ఢిల్లీ వాసులకు కరెంట్ కష్టాలు మొదలయ్యాయి. నగరానికి ఈ గ్రిడ్ నుంచి 1500 మెగావాట్ల ఎలక్ట్రిసిటీ సరఫరా అవుతుంది. మొత్తంగా ఉత్తరాది ప్రజలు ఇటు ఉష్ణోగ్రతలు, అటు ఉక్కపోతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. -
వాతావరణ యాంగ్జైటీ అంటే ఏంటి..? ఎదుర్కోవడం ఎలా..?
పచ్చని చెట్లు కొట్టేస్తూంటే మీకు గుబులుగా ఉంటోందా? ఊరి చెరువు నెర్రలుబారితే అయ్యో ఇలా అయ్యిందేమిటి? అన్న ఆందోళన మొదలవుతుందా? ఉష్ణోగ్రత ఒక్క డిగ్రీ పెరిగినా..‘‘అంతా అయిపోయింది’’ అన్న ఫీలింగ్ మీకు కలుగుతోందా? అయితే సందేహం లేదు.. మీరు కూడా ఎకో యాంగ్జైటీ బారిన పడ్డట్టే అంటున్నారు మానసిక వైద్య నిపుణులు. ఏంటీ ఎకో యాంగ్జైటీ? మానసిక రోగమా? చికిత్స ఉందా? లేదా? ఎలా ఎదుర్కోవాలి? ఈ రోజు జూన్ ఐదవ తేదీ. ప్రపంచం మొత్తమ్మీద పర్యావరణ దినంగా ఉత్సవాలు జరుగుతాయి. మారిపోతున్న పర్యావరణం తీసుకొచ్చే ముప్పుల గురించి చర్చలు, అవగాహన శిబిరాలూ నిర్వహిస్తారు. అయితే ఇటీవలి కాలంలో పర్యావరణ మార్పుల చర్చల్లో ఎకో యాంగ్జైటీ కూడా ఒక టాపిక్‌గా మారిపోయింది. వాతావరణంలో వస్తున్న మార్పుల మీలో ఆందోళన, ఒత్తిడి కలిగిస్తూంటే దాన్ని ఎకో యాంగ్జైటీ అని పిలుస్తున్నారు. కొన్నిసార్లు మనం దాన్ని గుర్తించలేకపోవచ్చు. గానీ ఆ ప్రభావం మనం మీద ఎక్కువగానే ఉంటుంది. దీని కారణంగా మన మూడ్స్ మారిపోవడం జరిగి ఒక దానిపై ఏకాగ్రత పెట్టలేని స్థితికి చేరుకుంటాం. ముఖ్యంగా వరదలు, అడవి మంటలు, భూకంపాలు, అపూర్వమైన వేసవి, చలికాలం, హిమనీనదాలు కరగడం, గ్లోబల్ వార్మంగ్ తదితరాలన్నీ మానవులను ఆందోళనకు గురి చేసేవేననిశారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసేవేనని నిపుణులు చెబుతున్నారు. పెనుముప్పు... మారుతున్న వాతావరణం కలిగించే ఆందోళన ప్రపంచానికి పెనుముప్పు అని అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ స్వయంగా చెబుతోందంటే పరిస్థితి ఏమిటన్నది అర్థం చేసుకోవచ్చు. చాలాసార్లు దీన్ని వైద్య పరీక్షల ద్వారా గుర్తించలేమని అంచనా. అయితే తట్టుకునేందుకు, సమస్య నుంచి బయటపడేందుకు చాలా మార్గాలు ఉన్నాయని వీరు చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని రక్షించుకునేలా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. అందుకోసం శాస్త్రీయంగా చేయాల్సిన పనులపై దృష్టిసారించడం, తీసుకోవాల్సిన చర్యలు, పరిష్కారాలను అమలు చేయడం వంటివి చేయాలి. కార్బన్ ఉద్గారాలను తగ్గించేలా పర్యావరణ అనుకూలమైన జీవనశైలి మార్పులను చేసుకోవడం వాతావరణ పరిక్షణకు అనుకూలంగా ఉన్న విధానాలకు మద్దతు ఇవ్వడం లేదా స్థానిక పర్యావరణ కార్యక్రమాల్లో పాల్గొనడం. మైండ్‌ఫుల్‌నెస్, రిలాక్సేషన్‌ను ప్రాక్టీస్ చేయడం. మనసు ప్రశాంతంగా ఉంచేలా ధ్యానం, శ్వాస లేదా ప్రకృతిలో గడపడం వంటి వాటితో ఈ పర్యావరణ ఆందోళనను తగ్గించుకోవచ్చు ఈ వాతావరణ మార్పులను తట్టుకునేలా ఇతరులతో కనెక్ట్ అవ్వడం. ఆన్లైన్ కమ్యూనిటీలు లేదా స్థానిక సంస్థల్లో చేరడం వంటివి చేయండి. వాతావరణ సంక్షోభంపై అవగాహన కలిగి ఉండటం తోపాటు సవాళ్లును ఎదుర్కొనేలా సిద్ధం కావాలి. అలాగే పురోగతిని, వాతావరణ మార్పులు పరిష్కరించడానికి సమిష్టి ప్రయత్నాలు చేయాలి. (చదవండి: పర్యావరణహితం యువతరం సంతకం) -
ఫ్లాష్ ఫ్లాష్ తెలంగాణ ఎలో అలెర్
-
నైరుతి వచ్చేసింది.. వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి..
-
తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు..
-
ప్రపంచ వ్యాపార సామ్రాజ్య పతనం! భయపడుతున్న సీఈఓలు..
'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (AI) టెక్నాలజీ.. మారుతున్న భౌగోళిక పరిస్థితులు దాదాపు ప్రపంచంలోని సగం వ్యాపార సామ్రాజ్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని దిగ్గజ కంపెనీల సీఈఓలు ఆందోళన చెందుతున్నారు. ప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్ (PwC) సర్వ్ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 4,702 కంపెనీల నాయకుల పోల్‌లో 45 శాతం మంది తమ వ్యాపారాలు అనుకూలించకపోతే 10 సంవత్సరాలలో విఫలమవుతారని తెలిపింది. 2023లో కొన్ని కంపెనీల పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్న సంఘటనలు ఇప్పటికే కళ్ళముందు కనిపించాయని స్పష్టం చేసింది. దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో పీడబ్ల్యుసీ గ్లోబల్ చైర్మన్ 'బాబ్ మోరిట్జ్' (Bob Moritz) మాట్లాడుతూ.. ఆదాయ అవకాశాలు గత ఏడాది కంటే ఈ ఏడాది తక్కువగా ఉండే సూచనలు కనిపిస్తున్నట్లు వెల్లడించారు. ఆర్ధిక పరిస్థితుల కారణంగా ఉద్యోగులను తొలగించి ఏఐ వినియోగాన్ని పెంచుకోవడానికి కూడా సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు తెలిపారు. టెక్నాలజీ మాత్రమే కాకుండా మారుతున్న భౌగోళిక పరిస్థితులు కూడా కంపెనీల వృద్ధికి అడ్డుకట్ట వేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఉక్రెయిన్ యుద్ధం, ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై యెమెన్ హౌతీ తిరుగుబాటుదారుల దాడుల వంటివి ప్రపంచ వాణిజ్యానికి అంతరాయాలుగా ఉన్నాయి. -
రానున్నది ఉష్ణ ప్రకోపమే!
వాతావరణం, శీతోష్ణస్థితి గురించి లెక్కలు తీసి రికార్డుగా దాచి ఉంచడం మొదలుపెట్టి 170 సంవత్సరాలకు పైనే అయింది. ఈ మొత్తం కాలంలోనూ 2023వ సంవత్సరం అన్నిటికన్నా వేడి అయినదిగా నమోదవుతుంది అని పరి శోధకులు అప్పుడే చెప్పేస్తున్నారు. ఇటీ వలి కాలం ఇంత వేడిగా ఉండడా నికి మనుషుల కారణంగా మారుతున్న శీతోష్ణస్థితి మాత్రమే అని ఎటువంటి అనుమానం లేకుండా తేల్చేస్తున్నారు. యూరోపియన్ యూనియన్ స్పేస్ ప్రోగ్రావ్‌ు వారి ‘కోపర్ని కస్ క్లైమేట్ ఛేంజ్ సర్వీస్’ వారి లెక్కల ప్రకారం, ఇంతకు ముందు ఎప్పుడూ వేసంగి ఇంత వేడిగా ఉన్నది లేదు. గతంలో కంటే ఈసారి ఉష్ణోగ్రత 0.32 డిగ్రీ సెల్సియస్ సగటున ఎక్కువగా ఉన్నట్టు లెక్క తేలింది. ప్రపంచం మొత్తం మీద మునుపెన్నడూ లేని మూడు వేడి దినాలు నమోదైనట్లు కూడా తెలిసింది. ఇప్పటికే ఈ ఏడాది వేసవికాలం మునుపెన్నడూ లేనంత వేడిగా ఉందని లెక్కతేల్చి పెట్టారు. 2023వ సంవత్సరంలో నెలల ప్రకారం లెక్కలు చూచినా... ప్రపంచమంతటా ఆరు మాసాలు అంతకు ముందు ఎన్నడూ లేని వేడి కనబరిచినట్టు ఇప్పటికే లెక్కలు వచ్చాయి. అంటార్కిటికాలో మంచు కూడా అంతకు ముందు ఎన్నడూ లేనంతగా కరిగిపోయినట్టు కూడా గమనించారు. ప్రపంచంలో పారిశ్రామికీకరణ కన్నా ముందు కూడా వాతా వరణంలోని వేడి గురించిన రికార్డులు ఉన్నాయి. ఈ సంవత్సరం ఇప్పటి వరకు సగటున ప్రపంచం మొత్తం మీద 1.46 డిగ్రీల సెల్సియస్ వేడి పారిశ్రామికీకరణకు ముందున్న వేడి కన్నా ఎక్కువగా ఉంది. పరిశ్రమల వల్ల వాతావరణం వేడెక్కుతున్న దన్న భావన చాలాకాలంగా ప్రపంచంలో ఉండటం తెలిసిందే. 2016లో వేడిమి ఎక్కువగా ఉన్నట్టు ఇప్పటి వరకు ఉన్న రికార్డులు తెలుపుతున్నాయి. అయితే ఈ సంవత్సరం వేడి 2016లో కన్నా ఎక్కువగా ఉన్నట్టు నమోదయింది. ఈ ప్రకారంగా ఇప్పటి వరకు రికార్డులో ఉన్న సంవత్సరాల అన్నింటిలోకీ 2023 అత్యంత వేడిగా ఉన్నట్టు లెక్క తేలింది. ఈ విషయాన్ని ఈ మధ్యనే ‘సీ త్రీ ఎస్’ సంస్థ పరిశోధకురాలు సమంతా బుర్జెస్ ఒక ప్రకటనలో బయటపెట్టారు. శరత్ కాలం కూడా వేడిగా ఉండడానికి ‘ఎల్ నినో’ కారణం అని ఇప్పటికే మనకంతా తెలుసు. ఎల్ నినో వల్ల భూమధ్య రేఖ వద్ద సముద్రాలలో ఉపరితలం నీరు వేడెక్కుతుంది. దాని వల్ల ప్రపంచంలోని గాలులు వేడవుతాయి. 2023 జూన్‌లోనే ఈ ప్రక్రియ మొదలైంది. వచ్చే ఏడాది కూడా ఈ వేడి కొనసాగుతుందని అంటున్నారు. గడచిన మూడు సంవత్సరాల పాటుఎల్ నినోకు వ్యతిరేకంగా ఉండే ‘లా నినా’ అనే పరిస్థితి కారణంగా వేడిమి కొంతవరకు అదుపులో ఉంది. ఈ ‘లా నినా’ప్రస్తుతం లేదు. కనుక వేడిమి హద్దు లేకుండా పెరుగుతున్నది. మరికొంతమంది నిపుణులు టోంగాలో సముద్రం లోపల 2022లో పేలిన అగ్నిపర్వతం కారణంగా వేడి నీటి ఆవిరులు వాతావరణంలో పెరిగాయనీ, ఈ సంవత్సరం వేడి పెరుగుదలకు అది కూడా కొంతవరకు కారణం కావచ్చుననీ అంటున్నారు. అయితే పరి శోధకులు మాత్రం ఈ విషయం గురించి అను మానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచమంతటా వాతావరణం వేడిగా మారడానికి ‘గ్లోబల్ వార్మింగ్’ అన్న ప్రక్రియ కారణం అని అందరికీ తెలుసు. గ్రీన్ హౌస్ వాయువుల కారణంగా ఈ పరిస్థితి ఎదురవుతున్నదని కూడా తెలుసు. ఈ ప్రక్రియ వల్ల ప్రపంచ వాతావరణంలో 25 బిలి యన్ల అణుబాంబుల శక్తికి సమానంగా ఉష్ణశక్తి చేరిందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఇదంతా గడిచిన 50 సంవ త్సరాల పాటు జరిగిన మార్పు. ఈ మార్పు ఒక పక్కన గాలిని వేడెక్కిస్తుండగా, మరొక పక్కన ఊహకు అందకుండా ఎల్ నినో వచ్చే పరిస్థితులకు దారితీస్తున్నది. రానురానూ పరిస్థితి మరింత దారుణంగా మారుతున్నది. డిసెంబర్ 4న ‘కాప్’ 28 అనే యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ ఛేంజ్ కాన్ఫరెన్స్ జరిగింది. వాతావరణంలోకి కార్బన్ డై ఆక్సైడ్నుపంపించడం ఈ సంవత్సరం అంతకు ముందు ఎన్నడూ లేని స్థాయికి చేరిందని అక్కడ ప్రకటించారు. పరిస్థితి ఇలాగుంటే, వాతావరణం నియంత్రణలో ఉంటుందని అనుకోవడానికి వీలే లేదు అన్నారు అక్కడ.గ్లోబల్ వార్మింగ్ ప్రభావాలు ప్రస్ఫుటంగా బయట పడు తున్నాయి. ప్రపంచమంతటా తీర ప్రాంతాల్లో ఉన్న నగరాలు ముంపునకు గురవుతున్నాయి. ప్రపంచంలోని పెద్ద పెద్ద సరస్సులు, జలాశయాలు సగం కుదించుకుపోయాయి. సముద్ర అంతర్భాగంలో ఉండే గల్ఫ్ ప్రవాహం కూడా ప్రభావం కనపరు స్తున్నది. సముద్ర మట్టాలు ఎక్కడికక్కడ పెరుగుతున్నాయి. అయితే పరిశోధకులు, పరిస్థితిని చక్కదిద్దుకోవడానికి అవ కాశాలు ఇంకా ఉన్నాయి అని ఆశాభావం కనబరుస్తున్నారు. వాతావరణంలో మార్పులను మనకు అనుకూలంగా మార్చే మార్గాలు లేకపోలేదు అంటున్నారు పెన్సిల్వేనియా విశ్వ విద్యా లయం పరిశోధకులు. కానీ ఆ అవకాశం కూడా రానురానూ తగ్గి పోతున్నది అన్నది వారి అభిప్రాయం. కె. బి. గోపాలం వ్యాసకర్త సైన్స్ రచయిత -
Fog In Tirumala Photos: తిరుమలను చుట్టేసిన పొగమంచు (ఫోటోలు)
-
మిల్లెట్ సాగుకు అనుకూల వాతావరణం
సాక్షి, హైదరాబాద్: దేశంలో మిల్లెట్ సాగుకు అనుకూలమైన వాతావర ణం ఉందని నాబార్డ్ చైర్మన్ షాజీ కేవీ అన్నారు. శుక్రవారం హైదరా బాద్‌లో ‘మిల్లెట్ కాంక్లేవ్– 2023’ని జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా షాజీ మాట్లాడు తూ మిల్లెట్ వాల్యూ చైన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అద్భుత మైన ఫలితాలు అందించిందని చెప్పారు. గ్రామీణ–పట్టణ ఆదాయ అసమానతలు తగ్గించడం, సహకార ఉద్యమాన్ని బలోపేతం చేయడం తమ కర్తవ్యమన్నారు. ఐక్యరాజ్యసమి తి 2023ని మిల్లెట్ సంవత్సరంగా ప్రకటించడానికి మన దేశమే కారణమని, మిల్లెట్లను మరింత ముందుకు తీసుకెళ్ల డానికి ఇది భారతదేశానికి ఒక సువర్ణావకాశాన్ని అందిస్తుందని చెప్పారు. భారత్‌ను మిల్లెట్ గ్లోబల్ హబ్‌గా మార్చ డానికి హైదరాబాద్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ అత్యుత్తమ కేంద్రంగా ఉందన్నారు. ఈ సందర్భంగా మిల్లెట్‌పై వ్యవసాయ, వివిధ రంగాల ప్రముఖు లు చర్చించారు. అపెడా చైర్మన్ అభిషేక్ దేవ్ వర్చువల్ పద్ధతిలో మాట్లాడారు. నాబార్డు సీజీఎంలు మోనోమోయ్ ముఖర్జీ, ఉదయ్ భాస్కర్ తదితరులు మాట్లాడారు. -
స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌లో గుంటూరుకు మూడో ర్యాంకు
నెహ్రూనగర్(గుంటూరుఈస్ట్): కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం (ఎన్.క్యాప్) జాతీయ స్థాయిలో చేపట్టిన స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌లో గుంటూరు నగరానికి మూడో ర్యాంక్ దక్కింది. దక్షిణ భారతదేశం నుంచి గుంటూరు నగరానికి మాత్రమే ర్యాంకు దక్కిందని మేయర్ కావటి శివనాగ మనోహర్‌నాయుడు, కమిషనర్ కీర్తి చేకూరి గురువారం సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 131 నగరాలు పోటీ పడగా, అందులో 10 లక్షల లోపు జనాభా కేటగిరిలో గుంటూరు నగరానికి 3వ ర్యాంక్ దక్కిందన్నారు. జాతీయ కాలుష్య నియంత్రణ మండలి 131 నగరాల్లో స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌లోని అంశాలను పరిశీలించి 2023–24 ఆర్థిక సంవత్సరానికి ఉత్తమ నగరాలను సిఫార్సు చేసిందన్నారు. ఈ అవార్డును సెపె్టంబర్ 7న మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి చేతుల మీదుగా అందుకోనున్నట్లు చెప్పారు. -
గ్రీన్ ఫైనాన్స్ వ్యవస్థ పటిష్టం కావాలి..
ముంబై: గ్రీన్ ఫైనాన్స్ (వాతావరణ పరిరక్షణకు దోహదపడే పరిశ్రమలకు ప్రోత్సాహకంగా రుణాలు) వ్యవస్థ మరింత పటిష్టం కావాల్సిన అవసరం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్ ఎం రాజేశ్వరరావు స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి పర్యవేక్షణ, కార్యాచరణ ప్రణాళికల రూపకల్పన, ప్రమాణాల అభివృద్ధికి ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంక్‌ల మధ్య సమన్వయం అవసరమని అన్నారు. ఆయా అంశాలకు సంబంధించి కొన్ని అవరోధాలు ఎదురైనా, వాటిని ఎదుర్కొనడానికి సిద్ధపడాలని పిలుపునిచ్చారు. వాతావరణ పరిరక్షణ అంశాల్లో ఆర్బీఐ పాత్ర గురించి ఇక్కడ జరిగిన ఒక చర్చా గోష్ఠిలో ఆయన ప్రసంగించారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్), సెంటర్ ఫర్ సోషల్ అండ్ ఎకనమిక్ ఫోరమ్ ఈ చర్చాగోష్ఠిని నిర్వహించాయి. న్యూఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమం వివరాలను ఆర్బీఐ విడుదల చేసింది. రాజేశ్వర రావు ప్రసంగంలో ముఖ్యాంశాలు... కొత్త గ్రీన్ వెంచర్లకు ఆర్థిక సహాయం చేయడం మాత్రమే సరిపోదు. ఇప్పటికే ఉన్న ఉద్గార సంస్థలు ఉత్పత్తి లేదా వృద్ధి అంశాలపై రాజీ పడకుండా విశ్వసనీయమైన వాతావరణ అనుకూల పరివర్తన ప్రణాళికలను రూపొందించుకొని, అనుసరించాల్సిన అవసరం ఉంది. ఇందుకు ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకుల సహాయ సహాయసహకారాలు, కార్యాచరణ ప్రణాళికలు అవసరం. ఇది గ్రీన్ ఫైనాన్స్ మార్కెట్లో పారదర్శకత, ప్రామాణీకరణ, సమగ్రతను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. సంవత్సరాలుగా గ్రీన్ ఫైనాన్స్ కార్యక్రమాలను ప్రోత్సహించడానికి, వాటికి మద్దతు ఇవ్వడానికి రిజర్వ్ బ్యాంక్ వివిధ విధాన చర్యలు తీసుకుంటోంది. ఉదాహరణకు బ్యాంకుల ప్రాధాన్యతా రంగ రుణాల (పీఎస్ఎల్) పోర్ట్‌ఫోలియోలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు ఫైనాన్స్‌ను చేర్చడం జరిగింది. ఈ సంవత్సరం ప్రారంభంలో సావరిన్ గ్రీన్ బాండ్లను (ఎస్‌జీఆర్‌బీ) విజయవంతంగా జారీ చేయడంలో భారత ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ మద్దతు ఇచి్చంది. ఈ బాండ్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆర్థిక వ్యవస్థలో కార్బన్ తీవ్రతను తగ్గించడంలో సహాయపడే ప్రభుత్వ రంగ ప్రాజెక్టుల అమలుకు వినియోగించే విషయం తెలిసిందే. సావరిన్ గ్రీన్ బాండ్ల జారీ... ఇందుకు సంబంధించి ఇతర ఆర్థిక సాధనాల విషయంలో ధరను నిర్దారించేందుకు కూడా సహాయపడుతుంది. అలాగే దేశంలో గ్రీన్ ఫైనాన్సింగ్ పర్యావరణ వ్యవస్థకు ఉద్దేశించిన మార్కెట్ అభివృద్ధికి పురికొల్పుతుంది. ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థపై వాతావరణ మార్పు ప్రభావాల గురించి ప్రపంచ దేశాల్లో అవగాహన పెరుగుతోంది. తదనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు, పర్యవేక్షకుల సానుకూల ప్రతిస్పందనలూ పెరుగుతున్నాయి. వాతావరణ సమస్యలు, సంబంధిత ఆర్థిక నష్టాలను అర్థం చేసుకోవడానికి, అంచనా వేయడానికి, ప్రణాళికలు రూపొందించడానికి సెంట్రల్ బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థలు, రియల్ ఎకానమీ భాగస్వామ్యులను సన్నద్ధం చేయడానికి పెద్ద ఎత్తున సామర్థ్య నిర్మాణ ప్రయత్నాన్ని చేపట్టాల్సిన అవసరం ఉంది. తద్వారానే నూతన ఆవిష్కరణలు, వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మూలధనాన్ని సమీకరించగలరు. స్థిరత్వ లక్ష్యాలను సాధించడానికి సమర్థవంతమైన పరివర్తన ప్రణాళికలను రూపొందించగలరు. వాతావరణ అనుకూల పారిశ్రామికీకరణ విషయంలో సూక్ష్మ, లఘు, మధ్య, చిన్న (ఎంఎస్ఎంఈ) తరహా పరిశ్రమలపై పాత్ర ఎంతో కీలకం. వాస్తవానికి అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించి వాతావరణ పరిరక్షణకు చర్యలు, ఆర్థిక కట్టుబాట్లు, అమలు సంతృప్తికరంగా లేదు. ఏమి చేస్తున్నారు– చేయవలసినది ఏమిటి అన్న అంశాల మధ్య అంతరం పెరుగుతోంది. ఈ విషయంలో 100 బిలియన్ డాలర్ల హామీకి భిన్నంగా 2020లో అభివృద్ధి చెందిన దేశాలు మొత్తం 83.3 బిలియన్ డాలర్లు వెచ్చించాయి. 2019తో పోల్చితే ఇది కేవలం 4 శాతం మాత్రమే పెరిగాయి. ఇలాంటి ధోరణి మారాలి. -
ఏపీ ప్రజలకు అలర్డ్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
-
ఆకాశం నుంచి పెద్ద శబ్థం.. భయాందోళనలో జనం.. అక్కడ ఏం జరిగింది!
వేలూరు(చెన్నై): జిల్లాలోని గుడియాత్తం సమీపంలో ఆదివారం రాత్రి ఆకాశం నుంచి ఒక వస్తువు పెద్ద శబ్దంతో కింద పడటంతో స్థానికులు భయాందోళన చెందారు. గుడియాత్తం తాలూకా నెల్లూరుపేట పంచాయతీ పరిధిలోని లింగుండ్రం గ్రామంలో ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో ఆకాశం నుంచి ఒక విచిత్రమైన వస్తువు పడింది. గమనించిన స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చి చూశారు. అక్కడ పారాచూట్ లాంటి వస్తువు, సమీపంలో సిగ్నిల్ ఉన్న చిన్న పెట్టెను కనుగొన్నారు. గుడియాత్తం పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ జరిపారు. ఆ సమయంలో సిగ్నల్స్ ఉన్న చిన్న పెట్టెలో కేంద్ర ప్రబుత్వ జాతీయ వాతావరణ కేంద్రం, మీనంబాక్కం, చెన్నై అనే చిరునామా, ఫోన్ నంబరు ఉండడంతో చెన్నైలోని వాతావారణ కార్యాలయానికి ఫోన్ చేసి విచారించారు. దీంతో చెన్నై వాతావరణ కేంద్రం నుంచి వివిధ ప్రాంతాల్లో వాతావరణ మార్పులపై అధ్యయనం చేసేందుకు సిగ్నల్స్ ఉన్న పెట్టె సహకారంతో పంపినట్లు అధికారులు తెలిపారు. పోలీసులు వాటిని సేకరించి పోలీస్ స్టేషన్లో భద్రపరిచారు. చదవండి: ఆరో తరగతిలోనే పెళ్లి.. నేనున్నానని తోడు నిలిచిన భార్య.. డాక్టర్ కొలువుకు ‘నీట్’గా -
World Environment Day: ‘వాతావరణ న్యాయం’ కోరుతున్నాం
న్యూఢిల్లీ: అభివృద్ధి చెందిన కొన్ని దేశాలు అనుసరిస్తున్న తప్పుడు విధానాలకు అభివృద్ది చెందుతున్న, పేద దేశాలు మూల్యం చెల్లించాల్సి వస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ‘వాతావరణ న్యాయం’ కోసం అభివృద్ధి చెందిన దేశాలను డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ సోమవారం ఒక సందేశం విడుదల చేశారు. పర్యావరణ పరిరక్షణకు ప్రపంచ దేశాలన్నీ నడుం బిగించాలని, కలిసికట్టుగా పనిచేయాలి, ఈ విషయంలో సొంత ప్రయోజనాలు పక్కనపెట్టాలని సూచించారు. వాతావరణాన్ని చక్కగా కాపాడుకోవాలని, ప్రపంచదేశాలు దీనిపై తక్షణమే దృష్టి పెట్టాలని హితవు పలికారు. మొదట దేశాన్ని అభివృద్ధి చేసుకుందాం, ఆ తర్వాత పర్యావరణం గురించి ఆలోచిద్దామన్న ధోరణి ప్రపంచమంతటా పెరిగిపోతోందని, ఇది చాలా ప్రమాదకరమని హెచ్చరించారు. ఇలాంటి అభివృద్ధి మోడల్‌తో విధ్వంసమే తప్ప ఆశించిన ప్రయోజనం ఉండదన్నారు. ఒకవేళ అభివృద్ధి లక్ష్యాలు సాధించినప్పటికీ దాని మూల్యం ఇతర దేశాలు చెల్లించాల్సి వస్తుందని తెలిపారు. అభివృద్ధి చెందిన దేశాలు అమలు చేస్తున్న తప్పుడు విధానాలను ఇప్పటిదాకా ఎవరూ పెద్దగా ప్రశ్నించలేదని గుర్తుచేశారు. ‘వాతావరణ న్యాయం’ కోసం అభివృద్ధి చెందిన దేశాల ఎదుట భారత్ బిగ్గరగా గొంతెత్తున్నందుకు తనకు సంతోషంగా ఉందని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. బడా దేశాల స్వార్థానికి చిన్న దేశాలు ఎందుకు నష్టపోవాలని ప్రశ్నించారు. పర్యావరణ పరిరక్షణ అనేది భారతీయ సంస్కృతిలో వేలాది సంవత్సరాలుగా ఒక భాగంగా కొనసాగుతూ వస్తోందన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ది కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నామని, అదే సమయంలో పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని వివరంచారు. 4జీ, 5జీ కన్టెక్టివిటీ మాత్రమే కాదు, మరోవైపు అడవుల పెంపకం చేపడుతున్నామని తెలియజేశారు. సింగిల్–యూజ్ ప్లాస్టిక్ నిషేధం కోసం ప్రజలంతా సహకరించాలని కోరారు. గత ఐదేళ్లుగా ఈ దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. వాతావరణ మార్పుల నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ కోసం స్పష్టమైన రోడ్డుమ్యాప్‌తో ముందుకెళ్తున్నామని ప్రధానమంత్రి పేర్కొన్నారు. -
విశాఖ ‘గ్రీన్’ప్లాంట్
ఉక్కు నగరం (విశాఖ): విశాఖ స్టీల్‌ప్లాంట్ పరిసరాలు ప్రత్యేక వాతావరణంలో ఆహ్లాదకరంగా ఉంటాయి. ప్లాంట్ స్థలంలోకి ప్రవేశించిన దగ్గర నుంచి రహదారికి ఇరువైపులా ఉండే పరిసరాలను చూస్తే విశాఖ నగరంలో ఉన్నామా లేక మరెక్కడైనా ఉన్నామా అనే సందేహం కలుగుతుంది. ఉక్కు ఉత్పత్తి ప్రక్రియలో వెలువడే వేడిని చల్లార్చేలా వాతావరణ సమతుల్యత కోసం తీసుకుంటున్న చర్యల వల్ల నగరంంలో కంటే స్టీల్‌ప్లాంట్ ప్రాంతంలో 4 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. పర్యావరణ పరిరక్షణలో ప్రత్యేక శ్రద్ధ వహించడంతో దేశంలోనే పర్యావరణ హిత ప్లాంట్‌గా ఖ్యాతి గాంచింది. నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా స్టీల్ ప్లాంట్ గ్రీన్ ప్లాంట్‌గా ఎలా మారిందన్నదానిపై ప్రత్యేక కథనం.. ఆగ్రో ఫారెస్ట్ విభాగం ఆధ్వర్యంలో.. స్టీల్‌ప్లాంట్ ప్రారంభం నుంచి పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇందుకోసం స్టీల్‌ప్లాంట్ ఆగ్రో ఫారెస్ట్ విభాగం ఆధ్వర్యంలో మొదటి దశలో టన్ను స్టీల్ ఉత్పత్తికి ఒకటి చొప్పున మూడు మిలియన్ టన్నుల ఉత్పత్తిని దృష్టిలో పెట్టుకుని మూడు మిలియన్ చెట్లు నాటి ఆదర్శంగా నిలిచింది. ప్లాంట్ మొదటి దశలో హరిత వనాల పెంపునకు రూ.360 కోట్లు వ్యయం చేయగా.. విస్తరణ యూనిట్లలో మొక్కల పెంపునకు రూ.1,150 కోట్లు వ్యయం చేస్తున్నారు. నిబంధనల మేరకు పరిశ్రమలోని 33 శాతం గ్రీన్ బెల్ట్‌కు వినియోగించాల్సి ఉండగా.. స్టీల్‌ప్లాంట్ ఆ రికార్డును అధిగమించి 2,600 హెక్టార్లలో గ్రీన్ బెల్ట్ అభివృద్ధి చేసింది. 7.2 మిలియన్ మొక్కలు నాటే లక్ష్యం ప్రస్తుతం జరుగుతున్న 7.2 మిలియన్ టన్నుల ఉత్పత్తికి అనుగుణంగా 7.2 మిలియన్ మొక్కలు నాటే లక్ష్యంతో ఆగ్రో ఫారెస్ట్ ముందుకు సాగుతోంది. 2023 మే నెల నాటికి 5.51 మిలియన్ మొక్కలు నాటారు. తుపానులు, సునామి వంటి ఉప ద్రవాలను తట్టుకునేలా సుమారు 24 లక్షల కాజురీనా మొక్కలు నాటారు. కాలుష్యాన్ని నివారించేందుకు 18 లక్షలు ఏఏ ఫోర్మిస్, మామిడి, కొబ్బరి, జీడి, జామ, వేప, సుబాబుల్, సపోటా, రావి, మర్రి, టేకు మొక్కలు నాటారు. అదేవిధంగా 2.50 లక్షల యూకలిప్టస్ మొక్కలు నాటారు. బయోడీజిల్‌ను ప్రోత్సహించేందుకు సుమారు 4.50 లక్షలు పాల్మైరా, పొంగామియా, జట్రోపా మొక్కలు నాటారు. పర్యావరణంతో పాటు సంస్థకు ఆదాయం స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. లక్షలాది మొక్కలను నాటడం ద్వారా నగరంలోని పరిశ్రమలకు ఆదర్శంగా నిలుస్తోంది. వివిధ రకాల మొక్కలను పెంచడం ద్వారా సంస్థకు లక్షలాది రూపాయలు ఆదాయం కూడా లభిస్తోంది. సంస్థపై ఎటువంటి ఆర్థిక భారం లేకుండా ఆదాయం సమకూరుస్తున్నాం. – వీఎల్పీ లాల్, డీజీఎం, ఆగ్రో ఫారెస్ట్ విభాగం నగర కాలుష్యాన్నీ తగ్గించేలా.. నగరంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు చేపట్టిన గ్రీన్ విశాఖ ప్రాజెక్ట్‌లో 4.50 లక్షల మొక్కలు నాటేందుకు స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం ముందుకొచ్చింది. 2012–19 మధ్యకాలంలో 4.50 లక్షలు మొక్కలు నాటి నగర పర్యావరణానికి సహకారం అందించారు. కార్పొరేట్ ఎన్విరాన్మెంట్ రెస్పాన్సిబిలిటీ (సీఈఆర్) ప్రాజెక్ట్‌లో భాగంగా 2019–23 వ్యవధిలో వివిధ ఫల జాతులకు చెందిన 55 వేల మొక్కలు నాటారు. 2020లో నగరంలోని ఐఐఎం క్యాంపస్‌లో గ్రీనరీ పెంపునకు రూ.40 లక్షలు అందజేశారు. సీఈఆర్లో భాగంగా స్టీల్‌ప్లాంట్ పరిసర గ్రామాల్లోని రైతులకు సుమారు 75 వేల జామ, మామిడి, సపోటా, కొబ్బరి మొక్కలు అందజేశారు. -
భారత్ ‘గ్రీన్’ పరిశ్రమకు రాయితీ రుణాలు
ఇంచియాన్ (దక్షిణ కొరియా): పర్యావరణ పరిరక్షణకు (గ్రీన్) దోహదపడే భారత్ పరిశ్రమకు రాయితీలతో కూడిన రుణాలను మరింతగా మంజూరు చేయాలని ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ)కి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ విజ్ఞప్తి చేశారు. భారత్ ఆర్థిక పురోగతి ఇటు ప్రాంతీయ, అటు అంతర్జాతీయ ఎకానమీ సానుకూల వాతావరణానికి దారితీస్తుందని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఏడీబీ ప్రెసిడెంట్ మసత్సుగు అసకవాతో ఆమె ప్రతినిధుల స్థాయి ద్వైపాక్షిక సమావేశం జరిపారు. ఏడీబీ సావరిన్ నాన్ సావరిన్ ఆపరేషన్స్‌లో భారత్ కీలక దేశంగా కొనసాగుతుందని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. సభ్య దేశాలకు 100 బిలియన్ డాలర్ల ‘గీన్’ ఆర్థిక సహాయం అందించడానికి సంబంధించి ఏడీబీ నిబద్ధతను ఈ సందర్భంగా ప్రెసిడెంట్ మసత్సుగు అసకవా పునరుద్ఘాటించారు. ఆసియా, పసిఫిక్‌లో గ్రీన్ ఫైనాన్షింగ్‌కు సంబంధించి ఏడీబీ వినూత్న విధానాలకు మద్దతు ఇచ్చినందుకు భారతదేశానికి ధన్యవాదాలు తెలిపారు. రూపాయి డినామినేటెడ్ బాండ్లతో ఏడీబీ నిధుల సమీకరణ.. కాగా, రూపాయి డినామినేటెడ్ బాండ్ల ద్వారా మరిన్ని నిధులను సేకరించాలని చూస్తున్నట్లు ఏడీబీ పెసిడెంట్ ఈ సందర్భంగా తెలిపారు. భారత్ మౌలిక, గ్రీన్ ప్రాజెక్టులకు 2027 నాటికి 25 బిలియన్ డాలర్ల మేర సమకూర్చాలని ఏడీబీ ప్రతిపాదిస్తుండడం గమనార్హం. ఈ ప్రతిపాదనను ఆమోదం నిమిత్తం ఏడీబీ బోర్డు చర్చించనుందని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఇదీ చదవండి: ఆన్లైన్ గేమింగ్‌పై పన్నులు.. ఖరారైతే మరిన్ని పెట్టుబడులు -
వాన దంచికొడితే ఆగమాగమే! మరి 20 లక్షల ఏళ్లపాటు కురిస్తే.. ఏంటి పరిస్థితి?
వాన అంటే అందరికీ ఇష్టమే. అదీ రెండు, మూడు రోజులు పడితే ఓకే.. మరి వారం పాటు దంచికొడితే!? అమ్మో.. అంతా ఆగమాగమే అంటారు కదా! అదే కొన్నేళ్లపాటు వానలు పడితే.. అలా వేలు, లక్షల ఏళ్లపాటు కురుస్తూనే ఉంటే.. వామ్మో అనిపిస్తోందా? కానీ ఇది నిజమేనని, భూమిపై ఏకంగా 20 లక్షల ఏళ్లపాటు వర్షం పడిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మరి అంత వాన ఎక్కడ పడింది? ఎందుకు పడింది? దాని వల్ల ఏం జరిగిందనే సంగతులు తెలుసుకుందామా.. – సాక్షి సెంట్రల్ డెస్క్ భూమి పొరలను పరిశీలిస్తుండగా.. 1970వ దశకంలో కొందరు శాస్త్రవేత్తలు భూఉపరితలానికి సంబంధించి పరిశోధనలు చేస్తుండగా.. పురాతన రాళ్లలో అసాధారణమైన బూడిద రంగు పొరలను గమనించారు. అవి సిలికా (ఇసుక), మట్టితో ఏర్పడ్డాయని.. ప్రపంచవ్యాప్తంగా చాలాచోట్ల ఇలా ఉన్నాయని గుర్తించారు. కార్బన్ డేటింగ్ పరీక్షలు చేసి.. సుమారు 23 కోట్ల ఏళ్ల కింద ఆ పొరలు ఏర్పడినట్టు తేల్చారు. అవి ఇసుక, మట్టి తీవ్రస్థాయిలో పీడనానికి గురై ఏర్పడినట్టు నిర్ధారించారు. ఈ పొరల మందం, అవి మొదలై, ముగిసిన సమయాన్ని అంచనా వేసి.. సుమారు 20 లక్షల ఏళ్ల పాటు నిరంతరం వాన కురవడంతో అలా ఏర్పడినట్టు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంతా ఒకే ఖండంగా ఉన్నప్పుడు.. 23 కోట్ల ఏళ్ల కింద భూమ్మీద ఖండాలన్నీ కలిసి ఒకే అతిపెద్ద ఖండం ‘పాంజియా’గా ఉండేది. అప్పటిదాకా వానలు తక్కువగా ఉండి.. వేడి వాతావరణం కొనసాగింది. ఆ సమయంలో గ్రహ శకలాలు ఢీకొనడం, భూమి పైపొరలోని టెక్టానిక్ ప్లేట్ల కదలికలు తీవ్రమై అతిభారీ స్థాయిలో అగ్ని పర్వతాల విస్ఫోటనాలు జరిగాయి. వాతావరణంలోకి చేరిన పొగ, దుమ్ము, ధూళి వల్ల ఒక్కసారిగా గ్లోబల్ వార్మింగ్ ఏర్పడింది. సముద్రాల్లో నీరు వేడెక్కి ఆవిరై.. గాలిలో ఆవిరి శాతం (హ్యూమిడిటీ) బాగా పెరిగింది. ఆ గాలులు ‘పాంజియా’ వైపు వీయడం, చల్లబడి వానలు కురవడం మొదలైంది. ఇదిలా 20 లక్షల ఏళ్లపాటు కొనసాగింది. ఈ పరిస్థితులు, తర్వాతి పరిణామాలకు ‘కార్నియన్ ప్లూవియల్ ఈవెంట్’గా పేరుపెట్టారు. తొలుత నాశనం.. ఆ తర్వాత సృష్టి.. కార్నియన్ ప్లూవియల్ ఈవెంట్ మొదట్లో జీవరాశుల నాశనానికి దారి తీసింది. ఉష్ణోగ్రతలు, విషవాయువులు పెరగడంతో మొక్కలు, చెట్లు, జంతువులకు సమస్యగా మారింది. అగ్నిపర్వతాల నుంచి వెలువడిన విషవాయువులు, దుమ్ము మేఘాల్లో కలిసి ఆమ్ల వర్షాలు (యాసిడ్ రెయిన్స్) కురిశాయి. అటు సముద్రాల్లో నీరు వేడెక్కడం, ఆమ్లత్వం పెరగడం, ఆక్సిజన్ స్థాయి తగ్గడంతో జలచరాలూ తగ్గిపోయాయి. మొత్తంగా దాదాపు 80శాతానికిపైగా జీవరాశి అంతరించినట్టు అంచనా. అయితే కార్నియన్ ఈవెంట్ చివరిదశకు వచ్చేప్పటికి ఖండాలు విడివడటం మొదలై.. అగ్ని పర్వతాల విస్ఫోటనాలు తగ్గిపోయాయి. భూమ్మీద వేడి తగ్గిపోయింది. వానలు ఒక క్రమానికి పరిమితమై.. జీవానికి అనుకూలమైన, ఆహ్లాదకర వాతావరణం ఏర్పడింది. ఇది మొక్కలు, జంతువులు సహా ఎన్నో కొత్త జీవరాశుల పునరుత్థానానికి దారితీసింది. డైనోసార్ల ఆధిపత్యానికి తోడ్పడి.. కార్నియన్ ఈవెంట్ మొదలయ్యే నాటికే డైనోసార్లు, పలు ఇతర జీవరాశుల ఎదుగుదల మొదలైంది. ఈవెంట్ నాటి పరిస్థితులను బాగా తట్టుకోగలిగిన డైనోసార్లు.. ఈవెంట్ తర్వాత బాగా ప్రయోజనం పొందాయి. వాటిలో ఎన్నో ఉప జాతులు ఉద్భవించి జీవరాశిపై ఆధిపత్యం చలాయించాయి. ఇదే సమయంలో జీవ పరిణామం బాగా వేగం పుంజుకుంది. తాబేళ్లు, మొసళ్లు, బల్లులు వంటివాటితోపాటు పాలిచ్చి పెంచే వివిధ రకాల జీవులు (మమ్మాల్స్) అభివృద్ధి చెందాయి. భూమ్మీద ఇప్పుడున్న జీవంలో చాలా వరకు ‘కార్నియన్ ఫ్లూవియల్ ఈవెంట్’ నాటి పరిస్థితులే తోడ్పడ్డాయని భూతత్త్వ, ఫోరెన్సిక్ శాస్త్రవేత్త అలస్టేర్ రఫెల్, పురాతత్త్వ శాస్త్రవేత్తలు (పేలియోన్విరాన్‌మెంటిస్ట్స్) జకొపో డాల్ కోర్సో, పాల్ విగ్నల్ వెల్లడించారు. ఈ పరిశోధన వివరాలు ఇటీవల న్యూసైంటిస్ట్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. అక్కడ 20 లక్షల ఏళ్లుగా వానలే లేవు.. ఒకప్పుడు 20 లక్షల ఏళ్లు వాన పడితే.. అసలు గత20 లక్షల ఏళ్లుగా చుక్క వాన పడని ప్రాంత మూ ఒకటుంది తెలుసా.అంటార్కిటికాలో మెక్‌మర్డో డ్రైవ్యాలీగా పిలిచేచోట దాదాపు 20 లక్షల ఏళ్లుగా వాన, మంచు వంటివేవీ కురవలేదని శాస్త్రవేత్తలు గత ఏడాదే నిర్ధారించారు. అతి తక్కువ హ్యూమిడిటీ, డ్రైవ్యాలీకి చుట్టూ ఉన్న పెద్ద కొండలు, గాలులు వీచే దిశ వంటివి దీనికి కారణమని తేల్చారు.