club cricket
-
ఇంగ్లండ్ క్రికెట్లో తీవ్ర విషాదం.. యువ క్రికెటర్ మృతి
ఇంగ్లండ్ క్రికెట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వోర్సెస్టర్షైర్ క్రికెట్ క్లబ్ యువ స్పిన్నర్ జోష్ బేకర్ మృతి చెందాడు. ఈ విషాద వార్తను వోర్సెస్టర్షైర్ క్లబ్ సోషల్ మీడియా వేదికగా ధ్రువీకరించింది. 20 ఏళ్ల బేకర్ మరణ వార్తతో ఇంగ్లీష్ క్రికెట్ ఉలిక్కిపడింది.అయితే బేకర్ మరణానికి గల కారమైతే ఇప్పటివరకు తెలియలేదు. రోడ్డు ప్రమాదంలో అతడు మృతి చెందినట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. కాగా కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్ వన్ 2024లో వోర్సెస్టర్షైర్ జట్టులో బేకర్ భాగంగా ఉన్నాడు. అతడు చివరగా వోర్సెస్టర్షైర్ క్రికెట్ క్లబ్ తరపున గత నెలలో డర్హామ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడాడు. 2021లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అడుగుపెట్టిన బేకర్.. తన కెరీర్లో 47 మ్యాచ్‌లు ఆడి 525 పరుగులతో పాటు 70 వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా అండర్-19 ప్రపంచ కప్- 2022 కోసం ఎంపికైన ఇంగ్లండ్ రిజర్వ్ ఆటగాళ్ల జాబితాలో బేకర్ ఉన్నాడు. ఇక బేకర్ మృతి పట్ల ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సంతాపం వ్యక్తం చేసింది. అతడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఇంగ్లండ్ క్రికెట్ ఎక్స్‌లో ఓ పోస్ట్ చేసింది. -
క్రికెట్ చరిత్రలో పెను సంచలనం.. 6 బంతుల్లో 6 వికెట్లు
క్రికెట్ చరిత్రలో పెను సంచలనం నమోదైంది. ఆస్ట్రేలియాలో ఓ క్లబ్ క్రికెటర్ ఎవ్వరూ ఊహించని విధంగా ఒకే ఓవర్ లో 6 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. గోల్డ్ కోస్ట్ ప్రీమియర్ లీగ్ డివిజన్లో భాగంగా ఆదివారం ముగ్గీరాబా నెరంగ్, సర్ఫర్స్ ప్యారడైజ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ముజీరబా నీరంగ్ జట్టు కెప్టెన్ గారెత్ మోర్గాన్ 6 వికెట్లు పడగొట్టి రికార్డులకెక్కాడు. 40 ఓవర్లలో 179 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సర్ఫర్స్ ప్యారడైజ్ 39 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. చివరి ఓవర్లో ప్యారడైజ్ విజయానికి కేవలం 5 పరుగులు అవసరమయ్యాయి. చేతిలో ఇంకా 6 వికెట్లు ఉండడంతో ప్యారడైజ్ విజయం లాంఛనమే అనుకున్నారంతా. కానీ ఇక్కడే అస్సలు ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ సమయంలో ముగ్గీరాబా కెప్టెన్ మోర్గాన్ స్వయంగా బౌలంగ్ ఎటాక్‌కు వచ్చాడు. తన వేసిన చివరి ఓవర్ లో 6 బంతుల్లో 6 వికెట్లు పడగొట్టి.. తన జట్టుకు మరుపురాని విజయాన్ని అందించాడు. మోర్గన్ తన బౌలింగ్‌లో మొదటి నాలుగు బంతుల్లో నలుగుర్ని క్యాచ్‌ల రూపంలో పెవిలియన్‌కు పంపగా.. చివరి రెండు వికెట్లను బౌల్డ్రూపంలో పొందాడు. అంతర్జాతీయ మీడియా రిపోర్టులు ప్రకారం.. మోర్గాన్ గోల్డ్‌కోస్ట్ కౌన్సిల్ వర్కర్‌గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: World Cup 2023: భారత్- న్యూజిలాండ్ సెమీస్‌కు అంపైర్లు వీరే.. 2019 వరల్డ్‌కప్‌లో కూడా -
మిస్ అయిన చోటే మళ్లీ దొరికితే!
క్యాచెస్ విన్ మ్యాచెస్ అనేది క్రికెట్లో ఒక సూత్రం. పటిష్ట ఫీల్డింగ్ వల్ల చాలా జట్లు అద్భుతమైన విజయాలు అందుకున్న దాఖలాలు చాలానే ఉన్నాయి. క్యాచ్‌లు డ్రాప్ చేస్తే చివాట్లు పెట్టడం.. స్టన్నింగ్ క్యాచ్‌లు అందుకుంటే మెచ్చుకోవడం చూస్తుంటాం. తాజాగా యార్క్‌షైర్ క్రికెట్ సదరన్ ప్రీమియర్ లీగ్‌లో ఇలాంటి ఫన్నీ ఘటనే చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. హ్యాట్‌ఫీల్డ్ వేదికగా హ్యాట్‌ఫీల్డ్ టౌన్ సీసీ ఫస్ట్ ఎలెవెన్, హల్లమ్ సీసీ సెకండ్ ఎలెవెన్ మధ్య మ్యాచ్ జరిగింది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన హల్లమ్ సీసీ ఎలెవెన్ బౌలింగ్‌కు దిగింది. మ్యాచ్ సాధారణంగా సాగుతున్న వేళ ఒక క్యాచ్‌ను ఫీల్డర్ జారవిడిచాడు. దీంతో ఆటగాళ్లంతా నిరాశకు లోనయ్యారు. అయితే మరుసటి బంతికే ఎవరు ఊహించని విధంగా క్యాచ్ జారవిడిచిన ఫీల్డరే మరోసారి మెరిశాడు. బౌలర్ వేసిన బంతిని స్లిప్ దిశగా ఆడాడు. అయితే అక్కడే ఉన్న ఫీల్డర్ ఒకవైపుగా డైవ్ చేస్తూ ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ తీసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హల్లమ్ సీసీ తొలుత బ్యాటింగ్ చేసి 249 పరుగులు చేసింది. విలియమ్ కోట్స్ 46 బంతుల్లో 61 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన హ్యాట్‌ఫీల్డ్ 167 పరుగులకే కుప్పకూలింది. హల్లమ్ కెప్టెన్ నిక్ కూపర్ నాలుగు వికెట్లు తీయడంతో పాటు ఏడు బౌండరీల సాయంతో 36 బంతుల్లో 37 పరుగులు చేశాడు. "He only takes the hard ones" 😂Absolute scenes from @HatfieldTownCC! pic.twitter.com/w4hLzRfR9l— That’s So Village (@ThatsSoVillage) July 2, 2023 చదవండి: ఆ ముగ్గురిపై సస్పెన్షన్ వేటు.. ఆస్ట్రేలియా జట్టుకు క్షమాపణ -
పిచ్ మధ్యలోకి వచ్చి నిద్రపోతున్నావా? నడవడానికి ఇబ్బందిగా ఉంటే ఆడడం ఎందుకు?
యూరోపియన్ క్రికెట్ గేమ్‌లో సీరియస్‌నెస్ చాలా తక్కువగా కనిపిస్తోంది. నిర్లక్ష్యంగా వికెట్లు పారేసుకోవడం ఇక్కడ మాత్రమే చూస్తుంటాం. పరుగులు తీయడానికి ఇబ్బందులు పడుతూ అనవసరంగా రనౌట్ అయిన దాఖలాలు చాలానే ఉన్నాయి. తాజాగా అలాంటి ఫన్నీ ఘటనే మరోసారి చోటుచేసుకుంది. రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకునే చాన్స్ ఉన్నా బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్ అయినట్లు పరిగెత్తడానికే ఇష్టపడని ఒక బ్యాటర్ చేతులు కాల్చుకున్నాడు. విషయంలోకి వెళితే.. బౌలర్ వేసిన బంతిని బ్యాటర్ లెగ్‌సైడ్ దిశగా ఆడి సింగిల్ కంప్లీట్ చేశాడు. ఫీల్డర్ బంతి అందుకొని కీపర్‌కు త్రో వేశాడు. అప్పటికే సింగిల్ పూర్తి చేసిన స్ట్రైకింగ్ బ్యాటర్ రెండో పరుగు వద్దని సిగ్నల్ ఇచ్చాడు. ఇది గమనించని నాన్‌స్ట్రైక్ ఎండ్ బ్యాటర్ ముందుకు వచ్చాడు. కానీ అప్పటికి వెనక్కి వెళ్లే అవకాశం ఉంది. కానీ నడవడానికి కూడా ఇబ్బంది పడినట్లుగా ఏం జరగదులే అన్నట్లుగా మెళ్లిగా వెళ్లాడు. ఇదే చాన్స్‌గా భావించిన కీపర్ నేరుగా నాన్‌స్ట్రైక్ ఎండ్‌వైపు డైరెక్ట్ త్రో వేయడం.. బ్యాటర్ క్రీజులోకి రాకముందే వికెట్లు ఎగిరిపడ్డాయి. ఇంకేముంది సదరు బ్యాటర్గారూ చేసేదేం లేక పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు.. ''ఎక్కడలేని వింతలన్నీ యూరోపియన్ క్రికెట్లోనే జరుగుతుంటాయి''.. ''నడవడానికి ఇబ్బందిగా ఉంటే క్రికెట్ ఆడడం ఎందుకు.. కనీసం ఫిట్నెస్ కూడా లేదు.. ''పిచ్ మధ్యలోకి వచ్చి నిద్రపోతున్నావా'' అంటూ కామెంట్స్‌తో రెచ్చిపోయారు. 😴 😴 #EuropeanCricket #EuropeanCricketSeries #StrongerTogether pic.twitter.com/ZX7kP0OECa — European Cricket (@EuropeanCricket) June 23, 2023 చదవండి: వందకు పైగా టెస్టులు ఆడాడు.. మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? 'ఐదేళ్ల క్రితమే చెప్పాడు'.. వార్న్ బతికుంటే సంతోషించేవాడు -
చివరకు వికెట్ కీపర్ వెర్రిబాగులోడయ్యాడు!
క్రికెట్లో రనౌట్స్ ఒక్కోసారి నవ్వులు పూయిస్తాయి. అది వికెట్ కీపర్ లేదా బ్యాటర్ లేదా ఫీల్డర్ కావొచ్చు.. తాము చేసే చిన్న తప్పు జట్టుకు నష్టం తెచ్చినప్పటికి మనకు మాత్రం ఫన్ కలిగిస్తోంది. తాజాగా ఒక క్లబ్ క్రికెట్ సందర్భంగా వికెట్ కీపర్ తెలివితక్కువ పనితో నవ్వులపాలయ్యాడు. విషయంలోకి వెళితే.. మ్యాచ్‌లో స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్ లాంగాఫ్ దిశగా ఆడి రెండు పరుగులు తీసేందుకు యత్నించాడు. సింగిల్ పూర్తి చేసి రెండో పరుగు కోసం పరిగెత్తాడు. కానీ నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్ నుంచి స్పందన రాకపోవడంతో అప్పటికే స్ట్రైక్ ఎండ్ నుంచి మిడిల్ పిచ్‌లోకి వచ్చేసిన బ్యాటర్ ఆగ్రహానికి లోనయ్యాడు. అప్పటికే బంతిని అందుకున్న వికెట్‌కీపర్‌కు ఈజీగా రనౌట్ చేసే చాన్స్ వచ్చింది. అలా చేయకుండా బ్యాటర్లు గొడవపడుతుండడాన్ని ఎంజాయ్ చేస్తూ అసలు విషయం మరిచిపోయాడు. తాను ఔట్ అయ్యాననుకొని స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్ పెవిలియన్‌కు వెళ్తూ కీపర్ బెయిల్స్ పడగొట్టకపోవడం గమనించాడు. అయితే కీపర్ మాత్రం తాను బెయిల్స్ ఎగురగొట్టాననే భ్రమలో బౌలర్ దగ్గరకి వెళ్లి సెలబ్రేట్ చేసుకున్నాడు. కానీ బ్యాటర్ క్రీజులోకి చేరుకొని ఇంకా బెయిల్స్ పడగొట్టలేదు నేను ఔట్ కాదు అంటూ అంపైర్‌కు బ్యాట్ చూపించాడు. రూల్ ప్రకారం బెయిల్స్ కింద పడేస్తేనే రనౌట్ అయినట్లుగా పరిగణిస్తారు. దీంతో తనను ఔట్ చేయనందుకు సదరు బ్యాటర్ కీపర్‌కు థాంక్యూ చెప్పడం విశేషం. తన చర్యకు నాలుక్కరుచుకున్న కీపర్ ఏం చేయలేక బంతిని బౌలింగ్ ఎండ్‌కు విసిరేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. pic.twitter.com/7mAlyHdHe9 — Out Of Context Cricket (@GemsOfCricket) May 23, 2023 చదవండి: 'కావాలని మాత్రం కాదు.. మనసులో ఏదో గట్టిగా పెట్టుకొనే!' -
కాలికి పట్టిన దరిద్రం.. ఫోర్ ఇలా కూడా పోతుందా?
క్రికెట్లో ఫన్నీ ఘటనలు చాలా చూస్తుంటాం. అందులో కొన్ని చూడగానే నవ్వు తెప్పిస్తాయి. మరింత నవ్వుకునేలా ఉంటే పదేపదే వీడియోనూ రిపీట్‌గా వేసుకొని చూస్తుంటాం. తాజాగా అలాంటిదే ఒక సంఘటన క్లబ్ క్రికెట్లో జరిగింది. ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఫీల్డర్ బౌండరీని ఆపే క్రమంలో జరిగిన చర్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాధారణంగా మన కాళ్లకు పట్టిన దరిద్రం త్వరగా వదలదు అని పెద్దలు అంటుంటారు. అది ఇక్కడ అక్షరాలా నిజమైంది. విషయంలోకి వెళితే.. బౌలర్ వేసిన బంతిని బ్యాటర్ ఏదో ఆడాలని ప్రయత్నిస్తే అది ఇంకో చోట తాకి థర్డ్‌మన్ దిశగా వెళ్లింది. బంతి స్పీడ్‌గా వెళ్లిందనుకుంటే పొరపాటే. అక్కడే ఉన్న ఫీల్డర్ క్యాచ్ కాదు కదా బంతిని ఆపడానికే నానా కష్టాలు పడ్డాడు. తొలిసారి బంతిని అందుకోవడంలో విఫలమయ్యాడు. అయితే పరిగెత్తి బౌండరీ లైన్ వద్ద బంతిని పట్టుకోవడంతో అరె ఫోర్ ఆగింది కదా అని అనుకున్నాం. కానీ ఇంతలోనే ఊహించని పరిణామం జరిగింది. కీపర్ వైపు బంతి విసిరితే అతని కాలి షూకు తగిలి మళ్లీ వెనక్కొచ్చింది, బౌండరీ దాటింది. అంత కష్టపడి పరిగెత్తి చివరాఖరికి బంతిని మాత్రం బౌండరీ వెళ్లకుండా ఆపలేకపోయానని తెగ ఫీలయ్యాడు ఫీల్డర్. ఎంత కష్టపడితే ఏం లాభం ఫోర్ పోయిందిగా.. ఫోర్ ఇలా కూడా పోతుందా అంటూ క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్ చేశారు. I just watched this 25 times 😂 pic.twitter.com/ICRsu6UmMW — Shiv Aroor (@ShivAroor) March 13, 2023 చదవండి: ఇలా అయితే ఎలా.. బౌలింగ్ జాబ్ వదిలేయాలా?' -
వికెట్ల ముందే ఆడాలని రూల్ లేదు.. అందుకే వెనకాల
సాధారణంగా క్రికెట్లో ఏ బ్యాటర్ అయినా సరే క్రీజులోకి వస్తే వికెట్ల ముందు నిలబడి స్ట్రైక్ తీసుకోవడం ఆనవాయితీ. అయితే వికెట్ల ముందు నిలబడే ఆడాలని ఎక్కడా రూల్ లేదు. వికెట్ల వెనకాల వెళ్లి కూడా బ్యాటింగ్ చేయొచ్చు. కానీ అలా చేస్తే బాగోదు గనుక ఎవరు ఆ పని చేయరు. అయితే తాజాగా మాత్రం ఇండియన్ క్లబ్ క్రికెట్లో మ్యాచ్‌లో ఒక బ్యాటర్ స్టంప్స్ వెనకాల నిలబడ్డాడు. బౌలర్ బంతి విడుదల చేయగానే వికెట్ల ముందుకొచ్చి ఎక్స్ట్రా కవర్స్ మీదుగా భారీ సిక్సర్ సందించాడు. అతను కొట్టిన సిక్సర్ హైలైట్ అనుకుంటే.. అతను బ్యాటింగ్ చేసిన తీరు ఇంకా హైలైట్‌గా నిలిచింది. అయితే ఇలా బ్యాటింగ్ చేయడంలో ఎలాంటి రూల్స్ లేవు కానీ.. ఒకవేళ ప్రత్యర్థి జట్టు తమ వికెట్ కీపర్‌ను ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నట్లు అంపైర్‌కు అప్పీల్ చేస్తే మాత్రం సదరు బ్యాటర్‌ను ఔట్‌గా పరిగణించే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ప్రత్యర్థి జట్టు ఎలాంటి అప్పీల్ చేయకపోవడంతో పరుగులు రావడంతో పాటు బ్యాటర్ హైలైట్‌గా మారాడు. pic.twitter.com/GQaM7T1Ogh — Out Of Context Cricket (@GemsOfCricket) November 4, 2022 2005లో అక్తర్ బౌలింగ్‌లో బ్రాడ్ హడిన్ ఇలాగే.. ఇక అంతర్జాతీయ క్రికెట్లో ఇలాంటి ఘటన ఇప్పటివరకు పెద్దగా చోటుచేసుకోలేదు. అయితే 2005-06లో పాకిస్తాన్ ఆస్ట్రేలియాలో పర్యటించింది. ఆస్ట్రేలియా-ఏతో పాక్ అడిలైడ్ వేదికగా ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. ఫ్రీ హిట్‌ను అప్పుడప్పుడే అమల్లోకి తెచ్చారు. ఆ మ్యాచ్‌లో తొలి ఓవర్ పాక్ తరపున రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ వేయగా.. ఆస్ట్రేలియా-ఏ ఇన్నింగ్స్‌ను బ్రాడ్ హడిన్, జేమ్స్ హోప్స్‌లు ప్రారంభించారు. అయితే అక్తర్ నోబాల్ వేయడంతో అంపైర్ ఫ్రీహిట్ ఇచ్చాడు. ఫ్రీహిట్ అంటే కేవలం రనౌట్ తప్ప ఎలా ఔట్ అయినా పరిగణించరు. ఈ రూల్‌ను అడ్వాంటేజ్ తీసుకున్న బ్రాడ్ హడిన్.. అక్తర్ 155 కిమీ వేగంతో వేసిన డెలివరీ ఆడేందుకు వికెట్ల వెనకాలకు వెళ్లి బ్యాటింగ్ చేశాడు. మిడ్ వికెట్ మీదుగా షాట్ ఆడి రెండు పరుగులు సాధించాడు. అయితే అక్తర్ మరోసారి నోబాల్ వేయడంతో ఫ్రీహిట్ అలాగే ఉండిపోయింది. దీంతో తర్వాత బంతిని అక్తర్ స్ట్రెయిట్ స్లో డెలివరీ వేశాడు. ఈసారి కూడా హడిన్ వికెట్ల వెనకాల వెళ్లి బ్యాటింగ్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్‌ను తాకడంలో విఫలం కావడంతో వికెట్లను గిరాటేసింది. అయితే ఫ్రీహిట్ అమల్లో ఉండడంతో హడిన్ ఔట్ కాకపోవడంతో బై రూపంలో మరో రన్ వచ్చింది. అప్పట్లో హడిన్ చర్య సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది. చదవండి: Aus Vs Afg: అఫ్గన్‌తో కీలక మ్యాచ్.. ఆసీస్ స్కోరు ఎంతంటే మహ్మద్ నవాజ్ రనౌటా లేక ఎల్బీనా? -
వైడ్ ఇచ్చినా పట్టించుకోలేదు.. మూల్యం చెల్లించుకున్నాడు
క్రికెట్లో అంపైర్లు చేసే తప్పిదాలు కొన్నిసార్లు నష్టం కలిగిస్తే.. ఒక్కోసారి మేలు చేస్తాయి. అంపైర్లు తాము ఇచ్చే తప్పుడు నిర్ణయాలకు ఆటగాళ్లు బలైనప్పుడు వచ్చే విమర్శలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఒక బౌలర్.. బ్యాట్స్‌మన్ ఎవరైనా సరే అంతిమంగా ఫీల్డ్ అంపైర్ ఇచ్చే సిగ్నల్‌కు కట్టుబడాల్సిందే. తాజాగా విలేజ్ క్రికెట్లో అంపైర్ నిర్ణయం మాత్రం నవ్వులు పూయించింది. అంపైర్ చర్య కంటే బ్యాటర్ చేసిన పని మరింత నవ్వు తెప్పించింది. విషయంలోకి వెళితే.. బౌలర్ లెగ్‌సైడ్ అవతల బంతి వేయడం.. బంతి బ్యాటర్ వద్దకు చేరకముందే అంపైర్ వైడ్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయింది. అయితే క్రీజులో ఉన్న బ్యాటర్ మాత్రం కనీసం అంపైర్ ఇచ్చిన సిగ్నల్‌ను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. గాల్లోకి లేచిన బంతి నేరుగా వికెట్ కీపర్ చేతుల్లో పడింది. దీంతో సదరు బ్యాటర్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. అయితే అంపైర్ ఇచ్చిన వైడ్ సిగ్నల్ చూసి బ్యాటర్ ఆగిపోయి ఉంటే బాగుండేది.. అనవసరంగా గెలికి తగిన మూల్యం చెల్లించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోనూ ఇంగ్లండ్ బార్మీ ఆర్మీ షేర్ చేసింది. కాగా బ్యాటర్ చర్యను ట్రోల్ చేస్తూ క్రికెట్ ఫ్యాన్స్ పెట్టిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Umpire already signalling a wide… OUT caught 🤣🤣🤣 pic.twitter.com/FWLpbTspUG — England’s Barmy Army (@TheBarmyArmy) August 1, 2022 చదవండి: Obed Mccoy: విండీస్ బౌలర్ సంచలనం.. టి20 క్రికెట్లో ఐదో బౌలర్‌గా -
పక్కవాళ్లు చెప్పేవరకు సోయి లేదు.. ఇంత మతిమరుపా?
క్రికెట్ మ్యాచ్‌ల్లో ఫన్నీ ఘటనలు సహజం. క్యాచ్‌లు, రనౌట్లు, ఫీల్డర్ల మధ్య సమన్వయలోప సందర్భాలు, ఆటగాళ్ల గొడవలు.. ఎన్నో ఎంటర్టైన్మెంట్స్ మన కళ్ల ముందుంటాయి. అప్పుడప్పుడు ఆటగాళ్లు కావాలని చేసే చర్యలను నవ్వు తెప్పిస్తుంటాయి. తాజాగా యూకే వేదికగా జరిగిన క్లబ్ క్రికెట్లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. బ్యాట్స్‌మన్ క్రీజులోకి వచ్చేటప్పుడు అతి ముఖ్యమైన ప్యాడ్లను కట్టుకోవడం మర్చిపోయాడు. కనీసం క్రీజులోకి వచ్చాకా కూడా తాను ఏం మరిచిపోయానన్న సంగతి గమనించలేకపోయాడు. ప్రత్యర్థి ఆటగాళ్లు సహా తోటి బ్యాటర్.. ''నీ ప్యాడ్స్ ఎక్కడా?'' అని అడిగితే.. అప్పుడు మన బ్యాటర్‌కు బుర్రలో లైట్ వెలిగింది. వెంటనే ఎంత వేగంగా క్రీజులోకి వచ్చాడో.. అంతే వేగంగా పెవిలియన్‌కు వెళ్లి ప్యాడ్లను కట్టుకొని తిరిగొచ్చాడు. కనీసం పక్కవాళ్లు చెప్పేంతవరకు కూడా సోయి లేని ఆ ఆటగాడి పేరు మార్టిన్ హ్యూగ్స్.. సౌత్ ఎండ్ సివిక్ క్రికెట్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ''పక్కవాళ్లు చెప్పేవరకు కూడా సోయి లేదు.. ఇంత మతిమరుపా'' అంటూ క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్ చేశారు. ఇప్పటివరకు 11వేల మంది వీడియోనూ లైక్ చేయగా.. 1200 మంది రీట్వీట్ చేయడం విశేషం. pic.twitter.com/JEYho6zRaG — That’s so Village (@ThatsSoVillage) July 20, 2022 చదవండి: పాకిస్తాన్ ఓపెనర్ ప్రపంచ రికార్డు.. 93 ఏళ్ల తర్వాత తొలి సారిగా..! -
క్రికెట్ చరిత్రలో ఇలాంటి క్యాచ్ చూసి ఉండరనుకుంటా!
'క్యాచెస్ విన్ మ్యాచెస్' అని అంటారు. కొన్ని క్యాచ్‌లు మ్యాచ్‌లు గెలిపించిన సందర్బాలు ఉన్నాయి. ఒక్కోసారి బెస్ట్ ఫీల్డర్ అని చెప్పుకునే ఆటగాళ్లు కూడా క్యాచ్‌లు జారవిడుస్తుంటారు. ఒక్కోసారి ఈజీ క్యాచ్‌లు అందుకునే క్రమంలో చేసే తప్పిదాలు నవ్వును తెప్పిస్తుంటాయి. తాజాగా వీటిన్నింటిని మించిన క్యాచ్.. చరిత్రలో మనం ఎప్పుడు చూడని క్యాచ్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. విషయంలోకి వెళితే.. విలేజ్ లీగ్ గేమ్‌లో భాగంగా.. ఆల్డ్విక్ క్రికెట్ క్లబ్, లింగ్‌ఫీల్డ్ క్రికెట్ క్లబ్ మధ్య మ్యాచ్ జరిగింది. లింగ్‌ఫీల్డ్ క్రికెట్ క్లబ్ బ్యాటింగ్ సమయంలో 16 ఏళ్ల అలెక్స్ రైడర్ బౌలింగ్‌కు వచ్చాడు. అతను వేసిన బంతిని బ్యాటర్ షాట్ ఆడే ప్రయత్నంలో గాల్లోకి లేపాడు. దీంతో అలెక్స్ రైడర్ కాట్ అండ్ బౌల్డ్‌తో బ్యాట్స్‌మన్‌ను పెవిలియన్ చేరుస్తాడని భావించారు. అయితే క్యాచ్ అందుకున్నట్లే అందుకున్న రైడర్ చేతి నుంచి బంతి జారిపోయింది. ఇక్కడే ఎవరు ఊహించని ట్విస్ట్ జరిగింది. క్యాచ్ అందుకునే క్రమంలో అప్పటికే కింద పడిపోయిన రైడర్ తన కాలును పైకి లేపడం.. అదే సమయంలో బంతి జారి అతని కాలు మీద పడి మళ్లీ గాల్లోకి లేవడం.. ఈసారి రైడర్ ఎలాంటి మిస్టేక్ లేకుండా క్యాచ్ తీసుకోవడం జరిగిపోయాయి. రైడర్ క్యాచ్ అందుకునే చర్యలో బిజీగా ఉన్నప్పుడు తోటి ఆటగాళ్లు సహా ప్రత్యర్థి ఆటగాళ్లు నోరెళ్లబెట్టి చూడడం విశేషం. మొత్తానికి అలెక్స్ రైడర్ క్యాచ్ అందుకోవడం.. బ్యాటర్ పెవిలియన్ చేరడం జరిగిపోయింది. దీనికి సంబంధించిన వీడియోను స్టంప్ కెమెరాలో రికార్డయింది. ఈ వీడియోనూ దట్స్ సో విలేజ్ తన ట్విటర్లో షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు.. 'గ్రేటెస్ట్ క్యాచ్ డ్రాప్ ఎవెర్' అంటూ కామెంట్ చేశారు. View this post on Instagram A post shared by Cricket District (@cricketdistrict) The greatest dropped catch ever!? 😂 Brilliant clip from @AldwickCC's stump cam! pic.twitter.com/Cpmd80QdGP — That’s so Village (@ThatsSoVillage) June 16, 2022 చదవండి: క్రికెట్లో ఇలాంటి అద్భుతాలు అరుదుగా.. 134 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన పృథ్వీ షా -
మిచెల్ సాంట్నర్ సూపర్ సిక్స్.. అద్దాలు పగిలిపోయాయి
Mitchell Santner Smashes Museum Window Hitting Big Six.. న్యూజిలాండ్‌లో క్రికెట్ మైదానాలు ఎంత చిన్నగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బ్యాట్స్‌మన్ భారీ సిక్స్‌లు కొడితే బంతులన్నీ స్డేడియం బయటే ఉంటాయి. ఇక న్యూజిలాండ్ బ్యాటర్ మిచెల్ సాంట్నర్ సూపర్ సిక్స్ దెబ్బకు స్టేడియంలోని మ్యూజియం అద్దాలు పగిలిపోయాయి. సూపర్ స్మాష్ లీగ్‌లో భాగంగా బేసిన్ రిజర్వ్ పార్క్‌లో వెల్లింగ్టన్, నార్త్రన్ నైట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. చదవండి: క్వార్టర్ ఫైనల్స్కే ఇంత రచ్చ.. మరి కప్ గెలిస్తే! మ్యాచ్‌లో సాంట్నర్ 35 బంతుల్లో ఆరు సిక్సర్లు.. నాలుగు ఫోర్లతో 59 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. కాగా సాంట్నర్ కొట్టిన ఒక సిక్స్ స్డేడియంలోని మ్యూజియం అద్దాలను పగలగొట్టింది. అద్దాలు పగలగొట్టి లోపలికి వెళ్లిన బంతిని అంపైర్లు బయటికి తీయలేకపోయారు.. కారణం మ్యూజియానికి తాళం ఉండడమేనట. దీంతో కొత్త బంతి తీసుకొని ఆటను కొనసాంచారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్‌లో నార్త్రన్ నైట్స్ 2 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెల్లింగ్టన్ 19.4 ఓవర్లలో 167 పరుగులకు ఆలౌటైంది. ఫిన్ అలెన్ 64, కెప్టెన్ బ్రేస్‌వెల్ 63 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన నార్త్రన్ నైట్స్ 19.3 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. చదవండి: రాహుల్, పంత్‌కు ప్రమోషన్.. రహానే, పుజారాలకు డిమోషన్! "The ball is stuck in there, next time they go to open it they will find a white Kookaburra in there" 😂 Mitch Santner finds a window in the Museum Stand.#SparkSport #SuperSmashNZ@cricketwgtninc @SuperSmashNZ pic.twitter.com/9e8j5XMdcB — Spark Sport (@sparknzsport) January 24, 2022 -
70 బంతుల్లో 236 పరుగులతో విధ్వంసం; బౌలర్ బూతుపురాణం
మ్యాచ్ సీరియస్‌గా సాగుతున్నప్పుడు ఆటగాళ్ల ఎమోషన్స్ వివిధ రకాలుగా ఉంటాయి. ఒక బ్యాట్స్‌మన్ అదే పనిగా బౌండరీలు.. సిక్సర్లు బాదుతూ విధ్వంసం సృష్టిస్తుంటే.. బౌలర్లకు ఏ కోశానా మింగుడుపడదు.అలాంటిది బాదుడే లక్ష్యంగా పెట్టుకున్న బ్యాటర్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను వదిలేస్తే.. బౌలర్కున్న ఎమోషనల్ లెవెల్స్ తారాస్థాయికి చేరుకుంటుంది. తాజాగా అలాంటి సంఘటనే విక్టోరియన్ ప్రీమియర్ క్రికెట్ లీగ్‌లో చోటుచేసుకుంది. చదవండి: ఫామ్‌లో లేడనుకున్నాం.. దుమ్మురేపుతున్నాడు; టార్గెట్ అదేనా? లీగ్‌లో భాగంగా కాంబర్వెల్ మాగ్పీస్, కింగ్స్టన్ హాత్రోన్ మధ్య 50 ఓవర్ల మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన కాంబర్వెల్ మాగ్పీస్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ క్రిస్టోఫర్ థెవ్లిస్ విధ్వంసమే సృష్టించాడు. 70 బంతుల్లోనే 20 ఫోర్లు, 24 సిక్సర్లతో 236 పరుగులు సాధించి ప్రత్యర్థి బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించాడు. బంతి పడిందే ఆలస్యం అన్నట్లు బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించాడు. అతని దెబ్బకు జట్టు స్కోరు 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 441 పరుగులు చేసింది. మిగతావారిలో మరో ఓపెనర్ హమీష్ బుర్రిల్, థామస్ డొనాల్డ్సన్ అర్థసెంచరీలు చేశారు. అయితే క్రిస్టోఫర్ థెవ్లిస్ 236 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఇచ్చిన క్యాచ్‌ను ఫీల్డర్ వదిలేశాడు. దాంతో చిర్రెత్తిపోయిన బౌలర్.. క్యాచ్ వదిలేసిన ఫీల్డర్‌పై బూతు పురాణం అందుకున్నాడు. ఆ తర్వాత మరో పరుగు మాత్రమే చేసి 237 పరుగుల వద్ద ఔటయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అనంతరం 415 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కింగ్స్టన్ హాత్రోన్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ప్రజయ్ పరమేశ్ 66 పరుగులతో టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. చదవండి: జాతీయ గీతాలాపన సందర్భంగా కోహ్లి అనుచిత ప్రవర్తన.. The sound every club cricketer recognises 😂 via @Frogboxlive pic.twitter.com/xCsEj6dhoz — That’s so Village (@ThatsSoVillage) January 23, 2022 -
చంపేస్తానంటూ హెచ్చరిక.. ఆటగాడిపై జీవితకాల నిషేధం
క్రికెట్లో ఆటగాళ్ల మధ్య గొడవలు సహజం. ఒక్కోసారి అవి కొట్టుకునే స్థాయికి వెళ్తాయి. అయితే ఇలాంటివి జరగకుండా అంపైర్లు జోక్యం చేసుకొని వివాదాన్ని సద్దుమణిగిస్తుంటారు. మరి అలాంటి అంపైర్లకు చంపేస్తామంటూ వార్నింగ్‌లు ఇస్తే ఆటగాళ్లపై సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. సరిగ్గా అలాంటి పనే పావర్టీ బే క్రికెట్ అసోసియేషన్ చేసింది. చదవండి: Virat Kohli: 'కోహ్లి వివాదం ముగించే వ్యక్తి గంగూలీ మాత్రమే' మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే అంపైర్‌పై చేయి చేసుకోవడంతో పాటు చంపేస్తానంటూ తిమోటి వీర్ అనే క్లబ్ క్రికెటర్ గ్రౌండ్‌లోనే వార్నింగ్ ఇచ్చాడు. డిసెంబర్ 4న గిస్బోర్న్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది. దీనిపై విచారణ జరిపిన పావర్టీ బే క్రికెట్ అసోసియేషన్ తిమోటిపై సీరియస్ యాక్షన్ తీసుకుంది. క్రికెట్ నిబంధనల ప్రకారం అంపైర్‌పై దురుసు ప్రవర్తన మాత్రమేగాక చంపేస్తానంటూ హెచ్చరికలు జారీ చేసి కోడ్ ఆఫ్ కండక్ట్ కింద లెవెల్-4 నిబంధనలను తిమోటి అతిక్రమించినట్లు తేలింది. ఈ చర్యలకుగాను ఇకపై క్రికెట్ ఆడకుండా అతనిపై జీవితకాల నిషేధం విధిస్తున్నట్లు పేర్కొంది. అయితే ఇంతకముందు కూడా తిమోటి ఇదే తరహాలో తన దురుసు ప్రవర్తనతో కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనలు ఉల్లఘించాడని.. అందుకే తాజా చర్యను సీరియస్‌గా తీసుకొని జీవితకాలం నిషేధం విధించినట్లు పావర్టీ బే క్రికెట్ అసోసియేషన్ ఛైర్మన్ ఐసాక్ హ్యూగ్స్ వివరణ ఇచ్చారు. చదవండి: Ashes 2021-22: జోస్ బట్లర్ స్టన్నింగ్ క్యాచ్.. సూపర్‌మాన్‌లా డైవ్ చేస్తూ.. వీడియో వైరల్ -
ఒకే ఓవర్లో 8 సిక్సర్లు.. ఆస్ట్రేలియా ఆటగాడు సరికొత్త రికార్డు
Australian Batter Smashes 8 sixes in an Over: ఒకే ఓవర్లో 6 సిక్స్‌లు కొట్టడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. కానీ ఒకే ఒవర్లో 8 సిక్సర్లు బాది సామ్ హారిసన్ అనే ఆటగాడు సరికొత్త రికార్డు సృష్టించాడు. పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా క్లబ్ క్రికెట్లో భాగంగా సోర్రెంటో డంక్రైగ్ సీనియర్ క్లబ్, కింగ్స్లే వుడ్వాలే సీనియర్ క్లబ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. డంక్రైగ్ క్లబ్ ఇన్నింగ్స్ 39 ఓవర్ వేసిన నాథన్ బెన్నెట్ బౌలింగ్‌లో సామ్ హారిసన్ ఏకంగా 8 బంతుల్లో 8 సిక్సర్లతో విద్వంసం సృష్టించాడు. ఈ ఓవర్లో రెండు నో బాల్స్ కూడా ఉన్నాయి. దీంతో ఆ ఓవర్లో ఏకంగా 50 పరుగులు అతడు సాధించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన సోరెంటో డంక్రైగ్ 40 ఓవర్లలో 276 పరుగులు సాధించింది. అనంతరం 277 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కింగ్స్లే వుడ్వాలే నీర్ణీత 40 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 154 పరుగులకే పరిమితమైంది. దీంతో డంక్రైగ్ క్లబ్ 122 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ప్రస్తుతం ఈ మ్యాచ్‌కు సంబంధించిన స్కోర్ కార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చదవండి: T20 WC 2021 IND Vs PAK: ఆ ఇద్దరు టీమిండియా క్రికెటర్ల నుంచే పాక్‌కు ముప్పు.. పాక్ బ్యాటింగ్ కోచ్ Sam Harrison smacks 8 Sixes in an over at Australia Club Cricket.#Cricket #CricketTwitter #Cricketlovers #Cricketaustralia #Sports #CricketStats #YUVI #sixes pic.twitter.com/syWESFxNp2 — Bouncer Avenue (@BouncerAvenue) October 18, 2021 -
ఫీల్డర్లను పరుగులు పెట్టించిన కుక్క.. ఐసీసీ ప్రత్యేక అవార్డు
దుబాయ్: ఐసీసీ తాజాగా ప్రకటించిన ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుల జాబితాలో ఒక బుజ్జి కుక్క చోటు సంపాదించింది. ఐసీసీ డాగ్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలుచుకున్న ఆ బుజ్జి కుక్క ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఈ అవార్డుపై ఐసీసీ ట్విటర్లో స్పందింస్తూ.. ''ఈసారి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుల్లో ఒక కొత్త అతిథి వచ్చి చేరింది. బంతిని నోట కరచుకొని మైదానంలో ఫీల్డర్లను పరుగులు పెట్టించిన కుక్క అది.. అందుకే దాన్ని అథ్లెట్ డాగ్ పరిగణిస్తూ.. ''ఐసీసీ డాగ్ ఆఫ్ ది మంత్'' అవార్డును బహుకరించాం'' అంటూ పోస్ట్ చేసింది. చదవండి: రనౌట్ అవకాశం; ఊహించని ట్విస్ట్.. ఫీల్డర్ల పరుగులు గతవారం ఐర్లాండ్ క్లబ్ క్రికెట్లో భాగంగా మైదానంలో బుజ్జి కుక్క ఫీల్డర్లను పరుగులు పెట్టించిన విషయం తెలిసిందే. బ్రీడీ, సీఎస్ఎన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది. ఇన్నింగ్స్ 9వ ఓవర్లో అబ్బీ లెక్కీ స్కేర్‌లెగ్ దిశగా షాట్ ఆడింది. ఫీల్డర్ బంతిని అందుకొని నాన్‌స్ట్రైక్ ఎండ్‌వైపు విసిరింది. అదే సమయంలో ఒక బుజ్జి కుక్క తన యజమాని నుంచి తప్పించుకొని మైదానంలోకి పరుగులు తీసింది. బంతిని అందుకున్న బౌలర్ వికెట్లను గిరాటేసే ప్రయత్నం చేయగా.. మిస్ అయింది. అలా రనౌట్ అవకాశం కూడా పోయింది. ఇక బంతిని బుజ్జి కుక్క తన నోట కరుచుకొని గ్రౌండ్లో పరుగులు పెట్టింది. అలా ఫీల్డర్లు కూడా ఆ కుక్క వెంబడి పరుగులు తీశారు. ఈ వీడియో ట్రెండింగ్‌గా మారింది. చదవండి: జో రూట్ ఘనత.. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ మంత్‌గా Exceptional athleticism in the field 👌pic.twitter.com/N5U1szC5ZI — ICC (@ICC) September 13, 2021 -
విచిత్రమైన బౌలర్.. వికెట్ తీసి కామెంటరీ కూడా; వీడియో వైరల్
లండన్: క్రికెట్లో ఒక బౌలర్ వికెట్ తీస్తే సెలబ్రేట్ చేసుకోవడం సాధారణం. అందులో కొంతమంది మాత్రం తాము ఏం చేసినా ప్రత్యేకంగా ఉండాలని భావిస్తుంటారు. ఉదాహరణకు స్టెయిన్ వికెట్ తీస్తే చెయిన్ సా రియాక్షన్ ఇవ్వడం.. ఇమ్రాన్ తాహిర్ వికెట్ తీస్తే గ్రౌండ్ మొత్తం పరుగులు తీయడం.. విండీస్ బౌలర్ కాట్రెల్ వికెట్ తీసిన తర్వాత సెల్యూట్ చేయడం అలవాటు. ఎవరి సెలబ్రేషన్ ఎలా ఉన్నా వాటిని చూసే మనకు మాత్రం వినోదం లభించడం గ్యారంటీ. తాజాగా క్లబ్ క్రికెట్లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఈసీఎస్ టీ10 టోర్నీ సందర్బంగా బనేసా, బుకారెస్ట్ గ్లాడియేటర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో బుకారెస్ట్ గ్లాడియేటర్స్ స్పిన్నర్ పావెల్ ఫ్లోరిన్ వికెట్ తీసిన ఆనందంలో తనదైన శైలిలో సెలబ్రేట్ చేసుకున్నాడు. పావెల్ వేసిన లూప్ డెలివరీని అంచనా వేయడంలో పొరబడ్డ బ్యాట్స్‌మన్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో పావెల్ పిచ్‌పై నుంచి పెవిలియన్ వైపు పరిగెత్తాడు. బౌండరీ చివరల్లో ఆగుతాడునుకుంటే ఎవరు ఊహించని విధంగా కామెంటేటరీ సెక్షన్లోకి వెళ్లి.. '' నేను వికెట్ తీశాను.. నా బౌలింగ్ ఎలా ఉంది'' అంటూ గట్టిగా అరిచాడు. ఆ తర్వాత మళ్లీ గ్రౌండ్లోకి వచ్చి బౌలింగ్‌ను కంటిన్యూ చేశాడు. అతని చర్యలకు సహచర ఆటగాళ్లతో పాటు ప్రత్యర్థి ఆటగాళ్లు నవ్వుకున్నారు. ఏది ఏమైనా పావెల్ ఫ్లోరిన్ చేసిన పని నెటిజన్లను మాత్రం విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఒక వికెట్ తీసినంత మాత్రానా ఇంత చేయాల్సిన అవసరం ఉందా అంటూ కొందరు ఘాటుగా పేర్కొన్నారు. Live the moment #cricket pic.twitter.com/k9cbtmKUrE — Pavel Florin (@PavelFlorin13) July 24, 2021 -
విజయానికి 35 పరుగులు.. ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు
డబ్లిన్: టీ20 క్రికెట్ అంటేనే మజాకు పెట్టింది పేరు. క్షణక్షణం ఉత్కంఠభరితంగా సాగుతూ విజయం ఇరు జట్ల మధ్య దోబూచులాడుతుంటుంది. అలాంటిది ఆఖరి ఓవర్లో 35 పరుగులు విజయానికి అవసరం అన్నప్పుడు బ్యాటింగ్ చేస్తున్న జట్టు ఆశలు వదులుకోవడం సహజం. ఎందుకంటే ఆడిన ప్రతీ బంతిని సిక్స్ కొడితే గానీ మ్యాచ్ గెలవడం సాధ్యమవుతుంది.అచ్చంగా అదే పరిస్థితిలో దాదాపు ఓటమి అంచున ఉన్న టీమ్‌కు అద్భుత విజయాన్ని అందించాడు బాలీమెనా బ్యాట్ప్‌మెన్ జాన్ గ్లాస్. క్లబ్ క్రికెట్లో భాగంగా జాన్ గ్లాస్ ఈ అరుదైన ఫీట్‌ను అందుకున్నాడు. అందులోనూ టోర్నీ ఫైనల్ మ్యాచ్.. దాంట్లోను ఆఖరి ఓవర్.. అసలు ఒత్తిడి అనే పదాన్ని దరి చేరనీయకుండా ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు బాది జాన్ గ్లాస్ అద్భుతం చేశాడు. ఐర్లాండ్ ఎల్వీఎస్ టీ20లో క్రెగాగ్, బాలీమెనా మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన క్రెగాగ్ జట్టు నిర్ణీత ఓవర్లకు 147 పరుగులు చేసింది. ఇక ఈ టార్గెట్‌ను చేధించే క్రమంలో బాలీమెనా 19 ఓవర్లకు ఏడు వికెట్లు నష్టపోయి 113 పరుగులు చేసి పీకల్లోతు కష్టాల్లో ఉంది. చివరి ఓవర్‌కు 35 పరుగులు కావాల్సి ఉండగా.. గ్లాస్(87*) అద్భుతం చేశాడు. ఆరు బంతుల్లో 6 సిక్సర్లు కొట్టి తన జట్టును విజేతగా నిలిపాడు. ఇక ఇదే మ్యాచ్‌లో గ్లాస్ సోదరుడు సామ్ హ్యాట్రిక్ సాధించడం విశేషం. ఇక టీ20ల్లో ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు అనగానే మొదట గుర్తుకు వచ్చేది యువరాజ్ సింగ్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో యువీ ఈ ఫీట్‌ను నమోదు చేశాడు. ఆండ్రూ ఫ్లింటాఫ్‌పై కోపంతో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌ను చీల్చి చెండాడుతూ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత హర్షలే గిబ్స్, కీరన్ పొలార్డ్‌లు అంతర్జాతీయ క్రికెట్లో ఇలాంటి ఫీట్లే నమోదు చేశారు. అయితే ఒక మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో ఆఖరి ఓవర్లో ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు బాదడం అనేది ఇదే తొలిసారి. ప్రస్తుతం జాన్ గ్లాస్ పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతుంది. JOHN GLASS TAKE A BOW! He has just hit 36 off the final over and Ballymena are the 2021 Lagan Valley Steels 2021 champions. What an innings from the skipper. #ncut20t pic.twitter.com/afatC6Q7co — Northern Cricket Union (@NCU_News) July 15, 2021 -
వైడ్ బాల్ విషయంలో వివాదం.. బౌలర్ ముఖంపై దాడి
ఆక్లాండ్: స్థానికంగా జరిగిన ఓ కమ్యూనిటీ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ఆటగాళ్ల మధ్య వివాదం గొడవకు దారితీసింది. సబర్బ్స్ న్యులిన్, హౌవిక్ పకురంగా క్లబ్‌ల మధ్య శనివారం జరిగిన మ్యాచ్‌లో సబర్బ్స్ న్యులిన్ బౌలర్ అర్షద్ బషీర్(41)పై ప్రత్యర్ధి జట్టు ఆటగాడు దాడి చేయడంతో అతను కొన్ని నిమిషాల పాటు స్పృహ కోల్పోయాడు. వైడ్ బాల్ విషయంలో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య వివాదం మొదలవ్వడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. వైడ్ బాల్ విషయంలో మోసం చేయొద్దని అనడంతో రెచ్చిపోయిన ప్రత్యర్ధి జట్టు ఆటగాడు.. గొంతు నులమడంతో పాటు తన ముఖంపై దాడి చేసి గాయపరిచాడని, చికిత్స అనంతరం బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనపై దాడికి పాల్పడిన ఆటగాడిని నిషేదించాలని బాధితుడు డిమాండ్ చేశాడు. ఈ గొడవ జరగడం వల్ల తాను 300 డాలర్లు నష్టపోయినట్లు అతను ఫిర్యాదులో పేర్కొన్నాడు. మరోవైపు ఈ గొడవపై స్పందించిన ఆక్లాండ్ క్రికెట్ సంఘం.. దాడికి పాల్పడిన ఆటగాడిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. కాగా, బాధిత క్రికెటర్ పార్ట్ టైమ్ కింద ట్యాక్సీ డ్రైవింగ్ చేస్తూ ఉపాధి పొందుతున్నాడు. -
మలింగ తరహాలో అరుదైన ఫీట్.. అయినా ఓడిపోయారు
కోల్‌కత: అంతర్జాతీయ క్రికెట్లో హ్యాట్రిక్ తీయడం అరుదుగా జరుగుతుంటుంది. అలాంటిది నాలుగు వరుస బంతుల్లో నాలుగు వికెట్లు తీయడం అసాధారణం. ఈ ఫీట్‌ను అందుకున్న తొలి బౌలర్‌గా శ్రీలంక స్టార్ బౌలర్ లసిత్ మలింగ రికార్డు సృష్టించాడు. అతను ఈ ఫీట్‌ను రెండుసార్లు అందుకోవడం మరో విశేషం. తొలిసారి మలింగ 2007 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఫీట్‌ను సాధించగా ఆ మ్యాచ్‌లో లంక ఓడిపోవడం విశేషం.. రెండోసారి 2019లో కివీస్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో మరోసారి అందుకున్నాడు. మలింగతో పాటు ఆప్ఘన్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్ కూడా 2019లో ఐర్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో వరుస నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీశాడు. తాజాగా బెంగాల్ క్లబ్ క్రికెట్లో మరోసారి ఆ ఫీట్ ఆవిష్కృతమైంది. ఎన్సీ చటర్జీ ట్రోపీలో భాగంగా మోహున్‌లాల్ క్లబ్, హౌరా యూనియన్ మధ్య ఆదివారం కోల్‌కతాలో మ్యాచ్ జరిగింది. మోహున్‌లాల్ క్లబ్ బౌలర్ మసూమ్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో వరుస నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీశాడు. వరుస బంతుల్లో అబ్దుల్ హదీ(32 పరుగులు), దీప్తా నారాయన్ అడక్(38 పరుగులు), సాయికత్ సంజా(0), దిపాన్యన్ రాహా(0)లను ఔట్ చేశాడు. దీంతో పాటు ఓపెనర్ ఎండీ షానవాజ్ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఓవరాల్‌గా మొత్తం నాలుగు ఓవర్ల కోటాలో 13 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. అతని దాటికి హౌరా యూనియన్ 7వికెట్ల నష్టానికి 160 పరుగులకు పరిమితమైంది. అయితే మసూమ్ ఇంత మంచి ప్రదర్శన చేసినా మెహురూన్ క్లబ్ 114 పరుగులకే ఆలౌట్ అయి మ్యాచ్ ఓడిపోయింది. తన ప్రదర్శనకు మాత్రం మసూమ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. చదవండి: 12 ఏళ్ల బంధానికి ముంబై ఇండియన్స్ గుడ్‌బై 'అందుకే ఐపీఎల్ నుంచి పక్కకు తప్పుకున్నా' -
ఆఖరి బంతి.. ఆరు పరుగులు.. ఆరు వైడ్లు!
-
ఒక్క బంతికి సిక్స్ అవసరమైతే.. ఆరు వైడ్లు వేశాడు
ముంబై: క్రికెట్ చరిత్రలో ఆఖరి బంతికి ఆరు కొట్టి గెలిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. గతేడాది నిదహాస్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా బ్యాట్స్‌మన్ దినేశ్ కార్తిక్ ఆఖరి బంతికి సిక్స్ కొట్టి జట్టుకు విజయాన్నందించిన సంగతి గుర్తుండే ఉంటుంది. కాగా, రెండు రోజుల క్రితం జరిగిన ఓ క్లబ్ క్రికెట్ మ్యాచ్‌లో ఆఖరి బంతికి సిక్స్ అవసరమైంది. కానీ, సిక్స్ కొట్టకుండానే ఆరు పరుగులు రావడం ఇప్పుడు వార్తల్లో నిలిచింది. వివరాల్లోకి వెళితే.. ఆదర్శ్ క్రికెట్ క్లబ్(మహారాష్ట్ర) నిర్వహించిన క్రికెట్ పోటీల్లో భాగంగా స్థానిక జట్లైన దేశాయ్- జుని డోంబివ్లి జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. 76 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన దేశాయ్ ఒక్క బంతికి 6 పరుగులు కావాల్సివచ్చింది. ఇది ఐదు ఓవర్ల మ్యాచ్ కాగా, దేశాయ్ 4.5 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 70 పరుగులు చేసింది. అయితే, ఒకే బంతికి ఆరు పరుగులు కావాల్సి ఉండటంతో ఇరు జట్ల మధ్య తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే మొదటి బాల్ పడింది.. అది కాస్త వైడ్. ఇంకో బంతి పడింది అది కూడా వైడ్!.. ఇలా ఆరు వైడ్లు పడడంతో ఆఖరు బంతి ఆడకుండానే ఆరు పరుగులు దేశాయ్ జట్టు ఖాతాలో చేరాయి. మరో బంతి మిగిలి ఉండగానే జుని జట్టుపై దేశాయ్ జట్టు అనూహ్యంగా విజయం సాధించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇక్కడ చదవండి: 35/3 నుంచి 35/10 -
ఒక్క పరుగు.. 7 వికెట్లు
లండన్: క్రికెట్లో ఏదైనా సాధ్యమే అనడానికి ఇదొక ఉదాహరణ. కొద్ది రోజుల క్రితమే ఇంగ్లండ్ జట్టు అంతర్జాతీయ వన్డే క్రికెట్లో రికార్డు స్థాయిలో 481 పరుగులు చేస్తే.. తాజాగా ఒక జట్టు విజయానికి అత్యంతగా చేరువగా వచ్చి పరుగు వ్యవధిలో ఏడు వికెట్లను కోల్పోవడంతో పరాజయం పాలైంది. వివరాల్లోకి వెళితే.. ఇంగ్లండ్ ఈసీబీ నేషనల్ క్లబ్ చాంపియన్‌షిప్ పేరిట వన్డే టోర్నీ జరిగింది. టోర్నీలో భాగంగా సోమవారం హైవైకాంబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పీటర్‌బారో జట్టు నిర్ణీత ఓవర్లలో 189 పరుగులు చేసింది. అనంతరం హైవైకాంబ్ జట్టు బ్యాటింగ్ మొదలు పెట్టింది. ఓపెనర్ కల్లిస్ (61) రాణించడంతో ఆ జట్టు విజయం దిశగా ముందుకు సాగింది. ఆ తర్వాత హ్యాక్స్(59 నాటౌట్) కూడా రాణించడంతో 38 ఓవర్లు ముగిసే సమయానికి ఆ జట్టు 186/3తో నిలిచింది. ఇంకేముంది మూడు పరుగులు చేస్తే చాలు విజయం హైవై కాంబ్దే అనుకున్నారంతా. కానీ, ఎవ్వరూ ఊహించని విధంగా మ్యాచ్ మలుపు తిరిగింది. ఆ తర్వాత కేవలం పరుగు మాత్రమే చేసిన హైవైకాంబ్ మిగతా ఏడు వికెట్లును కోల్పోయింది. దాంతో 39.5 ఓవర్లలో 187 పరుగులకే పరిమితమైన హైవై కాంబ్ రెండు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఫలితంగా మ్యాచ్‌తో పాటు టోర్నీ విజేతగా నిలిచే అవకాశాన్ని హైవై కాంబ్ చేజార్చుకుంది. -
రాజూస్ క్రికెట్ క్లబ్ జట్లకు టైటిల్స్
హైదరాబాద్: శ్రీలంకలో జరిగిన జూనియర్ చాలెంజ్ కప్, కొలంబో సెంట్రల్ సీనియర్ కప్ క్రికెట్ టోర్నమెంట్లలో రాజూస్ క్రికెట్ క్లబ్ జట్లు సత్తా చాటాయి. ఈ రెండు విభాగాల్లోనూ విజేతగా నిలిచి టైటిళ్లను కైవసం చేసుకున్నాయి. కదిరిన క్రికెట్ గ్రౌండ్లో జరిగిన జూనియర్ చాలెంజ్ కప్ ఫైనల్లో రాజూస్ జట్టు 110 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. జూనియర్స్ విభాగంలో రుద్విక్ ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’, అజయ్ ‘ఉత్తమ బ్యాట్స్‌మన్’, అక్షయ్ ‘ఉత్తమ బౌలర్’ పురస్కారాలను గెలుచుకున్నారు. సీనియర్స్ కేటగిరీలో కమల్ యాదవ్‌కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది. మే 19 నుంచి 26 వరకు శ్రీలంకలో ఈ టోర్నీ జరిగింది. -
క్లబ్ క్రికెట్ ఆడేందుకు బాన్‌క్రాఫ్ట్‌కు అనుమతి
సిడ్నీ: బాల్ ట్యాంపరింగ్ ఘటనతో 9 నెలల నిషేధానికి గురైన ఓపెనర్ బాన్‌క్రాఫ్ట్‌కు క్లబ్ క్రికెట్ ఆడేందుకు అనుమతి లభించింది. మంగళవారం సమావేశమైన పశ్చిమ ఆస్ట్రేలియా క్రికెట్ క్లబ్... ప్రత్యేక అంశంగా పరిగణిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు దిగ్గజ క్రికెటర్ మార్క్ వా వ్యాఖ్యాతగా స్థిరపడాలనే ఉద్దేశంతో ఆస్ట్రేలియా జాతీయ సెలక్టర్ పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. మార్క్ పదవీ కాలం వచ్చే ఆగస్టు 31తో ముగియనుంది. -
సంచలనం: 40సిక్సర్లతో ట్రిపుల్ సెంచరీ
సాక్షి: ఆస్ట్రేలియాకు చెందిన బిగ్రేడ్ క్రికెట్ ఆటగాడు మైదానంలో ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించాడు. సింగిల్ పరుగు తీసినంత సులువుగా సిక్సర్లు కొట్టేశాడు. ఏకంగా ట్రిపుల్ సెంచరీ చేశాడు. వివరాల్లోకి వెళ్తే జోష్ డన్స్టన్ అనే ఆస్ట్రేలియన్ క్లబ్ క్రికెటర్, శనివారం జరిగిన ఓ క్లబ్ మ్యాచ్‌లో రెచ్చిపోయాడు. బంతులను అలవోకగా గ్రౌండ్ దాటించాడు. 40 సిక్సర్లతో ట్రిపుల్ సెంచరీ(307) పూర్తి చేశాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఐదుగురు ఆటగాళ్లు కలిపితే 47 పరుగులు చేయగా అందులో 18 పరుగులే అత్యధికం. మూడో స్థానంలో వచ్చిన డన్స్టన్ సిక్సర్లతో రెచ్చిపోయాడు. జట్టు మొత్తం పరుగులు 354 కాగా అందులో డన్స్టన్ పరుగులే 307 ఉన్నాయి. అంతేకాదు 203 వద్ద నుంచి 307 పరుగులు చేసే లోపు నాన్‌స్ట్రైకర్ చేసిన పరుగులు 5మాత్రమే. మొత్తం స్కోర్‌లో 86.72 శాతం పరుగులు డన్స్టన్ చేసినవే. ప్రపంచంలో ఇప్పటి వరకూ అన్ని ఫార్మెట్లలో ఈ రికార్డు రిచర్డ్స్ పేరుతో ఉన్న రికార్డును తుడిచేశాడు. వెస్టిండీస్ 1984లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో జట్టు మొత్తం చేసిన పరుగుల్లో(272) రిచర్డ్స్ 69.48 శాతం పరుగులు(189) చేశాడు.