Contractor
-
వాల్తేరులో వణుకు
సాక్షి, విశాఖపట్నం : ‘ఈయన మంచి డీఆర్ఎం.. మాకు టెండరు కావాలని అడిగితే.. ఎంతిచ్చినా తీసుకొని ఆ పనులు మాకే వచ్చేటట్లు చూసేవాళ్లు. అలాంటి మంచివ్యక్తిని సీబీఐ పట్టుకోవడమేంటి సార్..?’’.. రైల్వే సంబంధిత పనులు చేపట్టే ఓ కాంట్రాక్టర్ చెప్పిన మాటలివీ.. సదరు కాంట్రాక్టర్.. తనకు రావాల్సిన పనులు ఆగిపోతాయేమోనన్న ఆందోళనతో చెప్పినా.. వాల్తేరు డీఆర్ఎం వ్యవహారమేంటనేది ఈ వ్యాఖ్యలే స్పష్టం చేస్తున్నాయి. వాల్తేరు డివిజనల్ రైల్వే మేనేజర్ సౌరభ్‌కుమార్ ప్రసాద్.. ముంబైలో శనివారం ఉదయం లంచం తీసుకుంటూ సీబీఐకి పట్టుబడిన విషయం తెలిసిందే. డీఆర్ఎంపై దర్యాప్తు బృందం దాడితో వాల్తేరు డివిజన్ రైల్వే అధికారులు, ఉద్యోగులు ఉలిక్కి పడుతున్నారు. డీఆర్ఎం వ్యవహారాలు చక్కబెట్టే ఉద్యోగులు తమ పరిస్థితేంటనే ఆందోళనలో ఉన్నారు. రెండేళ్ల నుంచీ సీబీఐ నిఘా...! వాస్తవానికి.. సీబీఐతో డీఆర్ఎం సౌరభ్‌కు కొత్త పరిచయం కాదని తెలుస్తోంది. గతంలో వాల్తేరు డీఆర్ఎంగా రాకమునుపు సెంట్రల్ రైల్వే జోన్లో ప్రిన్సిపల్ చీఫ్ మెకానికల్ ఇంజినీర్ (పీసీఎంఈ)గా విధులు నిర్వర్తించే వారు. ఈయనకు ముందు పీసీఎంఈగా వ్యవహరించిన అధికారి.. రూ.లక్ష లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కారు. అనంతరం నిర్వహించిన సోదాల్లో రూ.23 లక్షలు, రూ.40 లక్షల విలువైన ఆభరణాలు, రూ.13 కోట్ల విలువైన ఆస్తులు, సింగపూర్, యూఎస్ బ్యాంకుల్లో రూ.1.63 కోట్ల డిపాజిట్లు ఉన్నట్లుగా సీబీఐ అధికారులు గుర్తించారు. ఆయన స్థానంలో పీసీఎంఈగా విధుల్లోకి వెళ్లిన సౌరభ్‌పై అప్పటి నుంచి కేంద్ర దర్యాప్తు బృందం నిఘా పెట్టింది. పలుమార్లు చిక్కినట్లే చిక్కి తప్పించుకున్నట్లు సమాచారం. వైజాగ్ నుంచి ఫాలో చేస్తూ.. టెండర్ పాస్ చేసేందుకు లంచం అడుగుతున్నారంటూ ఓ కాంట్రాక్టర్ సీబీఐని ఆశ్రయించారు. దీంతో విశాఖ నుంచి దర్యాప్తు బృందం అధికారులు డీఆర్ఎం కదలికలపై నిఘాపెట్టారు. ముంబై వెళ్తున్నట్లు సమాచారం తెలుసుకొని అక్కడ బృందాల్ని అలెర్ట్ చేసినట్లు తెలుస్తోంది. అక్కడ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకోవడం.. మెర్సిడెస్ కారులో ఇంటికి వెళ్లిన వెంటనే సీబీఐ అధికారులు డీఆర్ఎంను అదుపులోకి తీసుకోవడం చకచకా జరిగిపోయాయి. రెండేళ్ల నుంచి నిఘా కొనసాగించిన సీబీఐ అధికారులకు ఎట్టకేలకు శనివారం చిక్కారని సమాచారం. సీబీఐ అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఎంతిచ్చినా ఓకే.?? లంచం వ్యవహారంలో సౌరభ్ చిక్కడంతో.. ఆయన చేసిన అవినీతి వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కాంట్రాక్టర్లతో నిరంతరం..డీఆర్ఎం కార్యాలయం బిజీ బిజీగా ఉండేదని తెలుస్తోంది. సివిల్, మెకానికల్ విభాగాలకు సంబంధించి టెండర్ల ద్వారా వచ్చిన డబ్బుల వసూళ్లకు డీఆర్ఎం కార్యాలయంలోని ఇద్దరు ఉద్యోగుల్ని ప్రత్యేకంగా నియమించినట్లు సమాచారం. టెండర్లు ఎవరికి రావాలంటే.. పని విలువ బట్టి వసూళ్లు రాబట్టేవారని వాల్తేరు డివిజన్ వర్గాలు చెబుతున్నాయి. రూ.50 వేల నుంచి వసూళ్ల పర్వం మొదలయ్యేదని కొందరు కాంట్రాక్టర్లు వాపోతున్నారు. డబ్బులిచ్చిన వారికే పనులకు సంబంధించిన టెండర్లు దక్కేవనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డీఆర్ఎం అండ్ కో బ్యాచ్‌పై పలుమార్లు ఉన్నతాధికారులకు కాంట్రాక్టర్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలుస్తోంది. విశాఖ రైల్వే పరువు తీసేశారు.! వాల్తేరు డివిజన్ చరిత్రలో సీబీఐ దాడుల్లో ఒక ఉద్యోగి, లేదా అధికారి పట్టుబడటం ఇదే మొదటిసారని ఉద్యోగులు చెబుతున్నారు. గతంలో డీఆర్ఎంలుగా వ్యవహరించిన అనూప్‌కుమార్ సత్పతి, చేతన్‌కుమార్ శ్రీవాత్సవ్.. డివిజన్ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించారని.. అనేక సంస్కరణలు తీసుకొచ్చారని అంటున్నారు. ఎక్కడా అవినీతికి తావులేకుండా.. ప్రతి అంశంలోనూ పారదర్శకంగా వ్యవహరిస్తూ.. తప్పు చేసిన ఉద్యోగులను బదిలీలు, సస్పెన్షన్లు చేసేవారని చెబుతున్నారు. సదరు సౌరభ్ వచి్చన తర్వాత.. ఫిర్యాదులిస్తున్నా పట్టించుకోకుండా వాళ్లతో మిలాఖత్ అయిపోయేవారని కొందరు ఆరోపిస్తున్నారు. మొత్తంగా సీబీఐ వ్యవహారంతో విశాఖ రైల్వే డివిజన్‌పై మచ్చపడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఇద్దరిలో టెన్షన్ డీఆర్ఎంపై సీబీఐ దాడులతో.. డివిజన్లో ఉద్యోగుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. డీఆర్ఎం వ్యవహారాలు చక్కబెట్టిన ఇద్దరు ఉద్యోగులు.. సెలవుపై వెళ్లిపోయేందుకు ప్రయతి్నస్తున్నట్లు సమాచారం. అయితే.. సెలవులో వెళ్తే.. సీబీఐ దృష్టిలో పడతారంటూ సహచరులు చెప్పడంతో ఏం చెయ్యాలో పాలుపోక ఎప్పుడు తమని సీబీఐ విచారణకు పిలుస్తారోనంటూ బిక్కుబిక్కుమంటున్నారు. -
సీబీఐకి చిక్కిన అవినీతి అనకొండ
సాక్షి,విశాఖ: సీబీఐ వలకి అవినీతి అధికారి అడ్డంగా దొరికి పోయారు. ఓ కాంట్రాక్టర్ నుంచి భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.వాల్తేరు డివిజన్ డీఅర్ఎంగా సౌరభ్ కుమార్ పని చేస్తున్నారు. అయితే మెకానికల్ బ్రాంచ్ పనులుకి టెండర్ వ్యవహారంలో ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.25 లక్షల లంచం డిమాండ్ చేశారు. దీంతో సదరు కాంట్రాక్టర్ సౌరబ్‌కు డబ్బులు ముట్ట జెప్పేందుకు సిద్ధమయ్యారు. కానీ ప్లాన్ ప్రకారం.. సదరు కాంట్రాక్టర్ ముడుపుల వ్యవహారంపై సీబీఐ అధికారులు సమాచారం ఇచ్చారు.పక్కా సమాచారంతో కాంట్రాక్టర్ నుంచి రూ.25 లక్షలు లంచం తీసుకుంటుండగా సీబీఐ అధికారులు డీఆర్ఎం సౌరబ్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న సీబీఐ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. -
ఈ మేకప్ ఆర్టిస్ట్ చాలా కాస్టీ..! రోజుకు ఎంత ఛార్జ్ చేస్తాడో తెలుసా..?
-
Maharashtra: శివాజీ విగ్రహ కాంట్రాక్టర్‌పై లుక్అవుట్ నోటీసులు
ముంబై: సింధుదుర్గ్ జిల్లాలోని రాజ్‌కోట్ కోటలో మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిపోయిన ఘటన మహారాష్ట్ర రాజకీయాల్లో దుమారాన్ని రేపింది. ఇప్పటికే విగ్రహం కూలిన ఘటనపై ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. మరోవైపు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవినీతి కారణంగా ఈ తప్పిదం జరిగిందని, ఇది క్షమించరానిదని ప్రతిపక్షాలు పడిపడుతున్నాయి.తాజాగా ఈ ఘటనకు సంబంధించి శివాజీ విగ్రహ కాంట్రాక్టర్ జైదీప్ ఆప్టేపై సింధుదుర్గ్ పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. ఆయన దేశం విడిచి పారిపోకుండా ఆపడానికి అన్ని విమానాశ్రయాలకు లుక్అవుట్ నోటీసులు పంపినట్లు పోలిసులు తెలిపారు. ఠాణెకు చెందిన జైదీప్ ఆప్టే ఆధ్వర్యంలోనే ఈ విగ్రహ నిర్మాణం జరిగింది. ఇక.. శివాజీ విగ్రహం కూలిపోయిన ఘటన తర్వాత ఆయన పరారీలో ఉన్నారు. రాజ్‌కోట్ కోటలో ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహం ఆగస్టు 26న కూలిన విషయం తెలిసిందే. గతేడాది నేవీ డే సందర్భంగా డిసెంబర్ 4న సింధుదుర్గ్‌లో 35 అడుగుల ఎత్తైన శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు.. శివాజీ విగ్రహం కూలిన ఘటనలో కేవలం శిల్పిని మాత్రమే కాకుండా ఇతరులను కూడా బాధ్యుల్ని చేయాలని ప్రతిపక్ష కాంగ్రెస్ సీఎం ఏక్నాథ్ షిండే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. -
బొజ్జ గణపయ్యా...పొట్ట నింపవయ్యా!
కడప కల్చరల్: మరో మూడు వారాల్లో శ్రావణ మాసం ముగిసి భాద్రపదం వస్తుంది. సందుగొందుల్లో సైతం గణపయ్య విగ్రహాలు వెలుస్తాయి. ఏటా నెలరోజుల ముందే ఊరిబయట విగ్రహాల తయారీ మొదలవుతుంది. రాజస్థాన్, గుజరాత్ తదితర ప్రాంతాల నుంచి విగ్రహాల తయారీదారులు వచ్చి అక్కడి నుంచి తెచ్చుకున్న సామగ్రితోపాటు స్థానికంగా లభించే సామగ్రితో విగ్రహాలు తయారు చేస్తారు. ఊరి బయట పెద్ద టెంట్లు వేసుకుని కుటుంబాలతో గడుపుతారు. ఒకటి, రెండు నెలలపాటు తయారు చేసిన విగ్రహాలను అమ్ముకుని సంతృప్తిగా తిరిగి తమ ప్రాంతానికి వెళతారు. కానీ ఈ సంవత్సరం పరిస్థితి కొద్దిగా మారింది. స్థానికంగా ఉండే పెట్టుబడిదారులు ముందే ముడి విగ్రహాలను తెచ్చిపెట్టుకుని రాజస్తానీ కళాకారులకు కాంట్రాక్టుపై రంగులు పూసే పని అప్పగించారు. సదరు పెట్టుబడి పెట్టిన స్థానికులే విగ్రహాలకు అడ్వాన్సులు తీసుకుని ప్రజలు కోరిన తేదికి విగ్రహాలను సిద్ధం చేయాలని కళాకారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఆలస్యమైతే కూలీ తగ్గుతుందన్న భయంతో కళాకారులు రేయింబవళ్లు కష్టపడుతున్నారు. కడప నగరంతోపాటు ఇతర పట్టణాలు, మండల కేంద్రాల శివార్లలో పెద్ద టెంట్లు వేసుకుని గణపయ్య విగ్రహాలను తయారు చేస్తున్నారు. నిజానికి విగ్రహాల వ్యాపారం నిన్న, మొన్నటివరకు కళాకారుల ద్వారానే జరిగేది. ప్రస్తుతం పెట్టుబడి దారులు రంగప్రవేశం చేశాక కళాకా రులంతా కూలీలుగా మారారు. తయారీదారుల ప్రమేయం లేకుండా కాంట్రాక్టర్లే విగ్రహాలకు ధరలు నిర్ణయించి అమ్ముతున్నారు. ఐదు అడుగుల విగ్రహం రూ. 8–10 వేలకు విక్రయిస్తున్నారు. 13 అడుగుల భారీ విగ్రహం రూ. 50–60 వేలకు ఇస్తున్నారు. తాము మాత్రం ఇష్టమొచ్చిన ధరకు అమ్ముకుంటూ కళాకారులకు కూలీ మాత్ర మే ఇస్తున్నారు. సీజన్ పోతే ఈ ఆదాయం కూడా ఉండదంటూ కళాకారులు వచ్చిన కాడికే తీసుకుంటున్నారు. -
నా గురించి తెలుసుకదా..! అలా చేయలేదంటే మిమ్మల్నీ?
కరీంనగర్: ‘బిల్లులో ఏముందనేది సంబంధం లేదు.. నేను చెప్పిందానికి సంతకం పెట్టలేదంటే అంతే. మీ ఎంబడి పడుడైతది చెబుతున్నా.. నా గురించి తెలుసు కదా.. నన్ను ఏ కొడుకు.. ఏం చేయలేడు’.. ఇది నగరపాలకసంస్థలో ఓ డీఈ దౌర్జన్యకాండ. నగరపాలక సంస్థలో పనులు పూర్తికాకున్నా బిల్లులపై సంతకాల కోసం ఇంజినీరింగ్ అధికారులపై వివాదాస్పద డీఈ వేధింపులు మళ్లీ మొదలయ్యాయి. నిత్యం వివాదాల్లో ఉండే సదరు డీఈ కాంట్రాక్టర్ల తరఫున రంగంలోకి దిగాడు. ఏఈలు, డీఈలను సంతకాలకోసం బెదిరిస్తుండగా, వారు సెలవుపై వెళ్లేందుకు కూడా సిద్ధమవుతున్నారు. పూర్తి కాని, నాణ్యత పాటించని పనులకు.. ఓ వైపు స్మార్ట్ సిటీ, సీఎంఏ తదితర నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనుల్లో వందల కోట్ల రూపాయల అవినీతి అక్రమాలు జరిగాయని అధికార, విపక్షాలనే తేడా లేకుండా ఫిర్యాదులు చేస్తుంటే.. మరో వైపు ఎలాంటి భయం లేకుండా పూర్తి కాని, నాణ్యత పాటించని పనులకు రికార్డులు తయారుచేసి బిల్లులు ఎత్తే పనిని సదరు డీఈ విజయవంతంగా పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యాడు. దీనికోసం ఏఈలు, సహచర డీఈలపై బెదిరింపులకు దిగుతున్నాడు. సంతకాలు పెట్టకపోతే మీ సంగతి చెబుతానంటూ బూతులందుకుంటున్నాడు. మళ్లీ వేధింపులు షురూ! బల్దియాలో వివాదాస్పద అధికారిగా పేరొందిన సదరు డీఈ బెదిరింపులు మళ్లీ మొదలయ్యాయి. గతంలో ఉన్నతాధికారులను సైతం అసభ్యపదజాలంతో దూషించిన వ్యవహారం అప్పట్లో కలకలం సృష్టించింది. కొద్దికాలంగా స్థబ్దుగా ఉన్న ఆయన నాలుగైదు రోజుల నుంచి కిందిస్థాయి, సహచర, ఉన్నత అనే తేడా లేకుండా ఇంజినీరింగ్ అధికారులపై దూషణలకు దిగుతున్నాడు. వారి పరిధిలోని పనులకు సంబంధించిన బిల్లుల తయారీలో సంతకాలు పెట్టాలంటూ ఒత్తిడి తెస్తున్నాడు. సెలవులో వెళ్లేందుకు ప్రయత్నం సదరు డీఈ ఆగడాలు ఎక్కువవుతున్న క్రమంలో సెలవులో వెళ్లేందుకు అధికారులు సిద్ధపడుతున్నారు. నగరపాలకసంస్థలో ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న ఆరోపణలు, ఫిర్యాదుల నేపథ్యంలో అధికారులు ముఖ్యంగా ఇంజినీరింగ్ అధికారులు ఒత్తిడిలో ఉన్నారు. ఈ క్రమంలో డీఈ సంతకాల కోసం దౌర్జన్యానికి దిగుతుండడంతో తాము సంతకాలు చేసి ఉద్యోగాలను ఫణంగా పెట్టలేమని అధికారులు పేర్కొంటున్నారు. దీనికన్నా సెలవులో వెళ్లడం మేలని, అవసరమైతే బదిలీకి కూడా సిద్ధపడుతున్నారు. కాగా నగరంలో అభివృద్ధి పనుల్లో జరుగుతున్న అక్రమాలు, సదరు డీఈ వ్యవహారంపై లోతుగా విచారణ జరిపించి ఆయన ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉన్నతాధికారులపై ఉంది. ఇవి చదవండి: నేరడిగొండ జెడ్పీఎస్‌ఎస్‌లో ఓ ఉపాధ్యాయుడు.. -
ఎవరికీ పట్టని ప్రాణాలు
జానెడు పొట్ట కోసం ఉన్న ఊరునూ, అయినవారినీ వదిలి దూరతీరాలకు పోయి కాయకష్టం చేసే వారు బతుకుపోరాటంలో ఎప్పుడూ ఓడిపోతూనే వుంటారు. మహానగరాల్లో రాళ్లెత్తే కూలీలుగా, క్వారీల్లో గనుల్లో చెమటోడ్చే కార్మికులుగా, భారీ భవంతులకు కాపలాదార్లుగా, స్థానికులు చేయసాహసించని అనేక ప్రమాదకరమైన పనులను తప్పనిసరిగా తలకెత్తుకుని ప్రాణాలు పణంగా పెట్టే బడుగుజీవులుగా వీరు అందరికీ సుపరిచితులే. కానీ భద్రత, ఆరోగ్యం వంటివి వీరికెప్పుడూ ఆమడదూరమే. రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుంటున్నా అర్ధాకలితో కాలం గడిపే అలాంటి అభాగ్యులపై ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) విడుదల చేసిన నివేదిక దిగ్భ్రాంతికరమైన నిజాలు వెల్లడించింది. పనికి సంబంధించిన ప్రమాదాల్లో చిక్కుకుని, వ్యాధుల బారినపడి ప్రపంచవ్యాప్తంగా సగటున ఏటా 30 లక్షలమంది కన్నుమూస్తున్నారని ఆ నివేదిక అంచనా. కార్మికుల ఉసురుతీస్తున్న పది రకాల కారణాలను ఆ నివేదిక గుర్తించింది. సుదీర్ఘమైన పనిగంటలు (వారానికి 55 గంటలు లేదా అంతకన్నా ఎక్కువ) కార్మికుల మరణాలకు ప్రధాన కారణమవుతున్నాయని, ఆ కేటగిరీలో ఏటా మరణిస్తున్నవారు 7,44,924 మంది అని తేల్చింది. ఆ తర్వాత స్థానం సూక్ష్మ ధూళి కణాలు, పొగలు, వాయువులది. వాటి బారినపడి మర ణించేవారు ఏటా 4,50,381 మంది అని లెక్కేసింది. ఇవిగాక నికెల్, ఆర్సెనిక్, డీజిల్ కాలుష్యం, సిలికా, ఆస్బెస్టాస్ తదితరాల వల్ల మరో 15 లక్షల మరణాలు సంభవిస్తున్నాయని తెలిపింది. వీటిల్లో 63 శాతం ఆసియా–పసిఫిక్ ప్రాంత దేశాల్లోనే వుంటున్నాయని వివరించింది. వ్యవసాయం, రవాణా, మైనింగ్, నిర్మాణరంగం వగైరాల్లో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి నివారణకు అనుసరించాల్సిన విధానాల రూపకల్పనకు సోమవారం ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ప్రారంభ మైన నాలుగురోజుల సదస్సు సందర్భంగా ఐఎల్ఓ ఈ నివేదిక వెలువరించింది. మనవరకూ తీసుకుంటే జనాభాలో మూడోవంతు మంది వలసబాట పడుతున్నారు. వీరంతా పల్లెటూళ్లను వదిలి పట్టణాలకూ, నగరాలకూ వలసపోయేవారే. ఇలాంటివారు ఎలాంటి గుర్తింపూ లేకుండా బతుకులీడుస్తున్నారు. వారికి ఓటు హక్కుండదు. రేషన్ కార్డు వుండదు గనుక చవగ్గా సరుకులు లభించవు. స్థానికతకు అవకాశం లేదు గనుక వారి హక్కుల కోసం, పని పరిస్థితుల మెరుగు కోసం పోరాడే సంస్థలుండవు. అసంఘటిత రంగ కార్మికులుగా కనీసం చట్టప్రకారం దక్కాల్సినవి వారికి ఎప్పుడూ దూరమే. జ్వరమో, మరే వ్యాధో ముంచుకొచ్చినా చూసే దిక్కుండదు. ఇలాంటి అభాగ్యులకు కుటుంబాలుంటే ఈ కష్టాలన్నీ మరిన్ని రెట్లు ఎక్కువ. ఈ కార్మికుల కాంట్రాక్టర్లు సర్వసాధారణంగా ఏదో ఒక పార్టీ ఛత్రఛాయలో వుంటారు గనుక అధికారులు వారి జోలికి పోవటానికి, కార్మికుల ప్రయోజనాలు కాపాడటానికి సాహసించరు. మెరుగైన సాంకేతికత లున్న యంత్ర సామగ్రి లభ్యమవుతున్నా వాటిపై పెట్టుబడులు పెట్టడం దండగన్న భావనతో ఈ కార్మికులతోనే అన్నీ చేయిస్తుంటారు. ఈ క్రమంలో ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోవటం లేదా అంగవికలురు కావటం రివాజు. ప్రపంచవ్యాప్తంగా గాయాలపాలై ఏటా 3,63,283 మంది కార్మికులు మరణిస్తున్నారని ఐఎల్ఓ నివేదిక చెబుతోంది. మన దేశంలో 2017–2020 మధ్య సగటున రోజూ ముగ్గురు కార్మికులు ప్రమాదాల బారినపడి చనిపోతున్నారని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ డేటా తెలిపింది. ఇవన్నీ రిజిస్టరయిన ఫ్యాక్టరీలకు సంబంధించినవి. అసంఘటిత రంగంలో సంభవించే మరణాలకు అరకొర డేటాయే వుంటుంది. సాధారణంగా ఆ రంగంలో సంభ వించే చాలా మరణాలు సహజ మరణాల ఖాతాలోకి పోతుంటాయి. వైద్యులు కూడా వారికి సహకరిస్తుంటారు. అసంఘటిత రంగ కార్మికులు చేసే వెట్టిచాకిరీ అపారమైన సంపద సృష్టిస్తోంది. కానీ ఆ సంపద సృష్టికర్తలు అనామకులుగా మిగిలిపోతున్నారు. ముగిసిపోతున్నారు. అంతర్జాతీయంగా నిబంధనలు లేవని కాదు. పని పరిస్థితుల్లో భద్రత, ఆరోగ్యం వంటి అంశా లపై ఐఎల్ఓ రూపొందించిన అంతర్జాతీయ ఒడంబడికను 187 సభ్య దేశాల్లో కేవలం 79 దేశాలు ఆమోదించాయి. కనీసం అందుకు సంబంధించిన నియమ నిబంధనలకైనా సభ్య దేశాలన్నీ ఆమోదం తెలపలేదు. అందుకు కేవలం 62 దేశాలు మాత్రమే సమ్మతించాయి. ఈ రెండు ఒడంబడి కలకూ మన దేశం ఆమడ దూరంలో వుంది. వృత్తిపరంగా ఎదురయ్యే ఇబ్బందులేమిటో, అందులో పొంచివుండే ప్రమాదాలేమిటో బయటివారికన్నా కార్మికులకే ఎక్కువ తెలుస్తుంది. కనీసం అవి బయటివారు తెలుసుకోవటానికైనా కార్మికులకు సంఘాలుండాలి. వారి తరఫున గట్టిగా ప్రశ్నించే నేతలుండాలి. కానీ మన దేశం వరకూ చూస్తే కార్మిక సంస్కరణల పేరిట తీసుకొచ్చిన కొత్త చట్టాలు అలాంటి అవకాశాలను మరింత నీరుగార్చాయి. ఫలితంగా బాల కార్మిక వ్యవస్థ, వెట్టిచాకిరీ, వివక్ష, అధిక పనిగంటలు వంటివన్నీ అసంఘటిత రంగ కార్మికులకు శాపాలవుతున్నాయి. రిజిస్టరైన ఫ్యాక్టరీల్లోనే తప్పుడు లెక్కలు చూపించి కార్మికుల భద్రతకు సంబంధించిన కమిటీల ఏర్పాటు,లైంగిక వివక్ష నిర్మూలన తదితరాలను ఎగ్గొడుతున్నారు. ఇక ఎవరికీ పట్టని అసంఘటితరంగ కార్మికుల గురించి చెప్పేదేముంది? సిడ్నీలో సాగుతున్న సదస్సులో 127 దేశాలకు చెందిన మూడు వేల మందికి పైగా ప్రతినిధులు పాల్గొంటున్నారు. 30 గోష్ఠులు, ఆరు సాంకేతిక సదస్సులు కూడా వుంటాయంటున్నారు. కనీసం ఈ సదస్సు తర్వాతనైనా కార్మికుల భద్రతకు ముప్పుగా పరిణమించిన సమస్యలను నివారించటానికి పకడ్బందీ విధానాలు రూపొందించటం తమ బాధ్యతగా ప్రభు త్వాలు గుర్తించాలి. -
పోలవరం కాంట్రాక్టర్‌ని మార్చొద్దన్నా మార్చేశారు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్‌ను మార్చొద్దని ఎంతచెప్పినా వినకుండా సీఎం జగన్ మార్చేశారని ప్రతిపక్ష నేత చంద్రబాబు చెప్పారు. తమ హయాంలో పెట్టిన కాంట్రాక్టర్ సమర్థంగా పనిచేస్తున్నారని పీపీఏ చెప్పినా వినలేదన్నారు. రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్టును రివర్స్ చేశారని, జీవనాడి అయిన ప్రాజెక్టును నాశనం చేశారని విమర్శించారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు, రివర్స్ పోకడల వల్లే పోలవరం ప్రాజెక్టు సర్వనాశనమైందన్నారు. డయాఫ్రం వాల్ కొట్టుకుపోవడానికి సీఎం మూర్ఖపు నిర్ణయాలే కారణమని చెప్పారు. తమ హయాంలో పోలవరం ప్రాజెక్టుపై రూ.11,537 కోట్లు ఖర్చుచేస్తే, వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.4,611 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని తెలిపారు. ప్రతిపక్ష నేతగా పోలవరం ముంపు బాధితులకు పరిహారంపై ప్రగల్భాలు పలికిన జగన్, ఇప్పుడు వారిని ముంచేశారని విమర్శించారు. వైఎస్ చేసిన పనుల వల్ల ప్రాజెక్టు పదేళ్లు ఆలస్యమైందన్నారు. 2009 వరకు ఎలాంటి పురోగతి లేదని, మొత్తం ప్రాజెక్టుని వైఎస్ సమస్యల సుడిలోకి నెట్టేశారని విమర్శించారు. వాటన్నింటినీ సరిదిద్ది తాను ప్రాజెక్టు పనులు ప్రారంభించానని చెప్పారు. తమ హయాంలో 72శాతం పనులు పూర్తిచేస్తే, వైఎస్సార్సీపీ వచ్చాక కేవలం నాలుగుశాతం మాత్రమే చేశారని పేర్కొన్నారు. పోలవరం నిర్వాసితులకు సకల వసతులతో కాలనీలు నిరి్మస్తానని చెప్పి నాలుగేళ్లలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదన్నారు. ఈ ప్రాజెక్టులను దారిలో పెట్టడానికి నిర్దిష్ట కాలపరిమితితో పనిచేస్తానని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల వద్దకు వెళ్లి వాళ్ల బాగోతాన్ని బట్టబయలు చేస్తానని ఆయన పేర్కొన్నారు. -
పూడూరులో పిల్లర్ స్థాయి దాటని ‘డబుల్’ ఇళ్ల నిర్మాణం..
పూడూరు: మండల కేంద్రంలో పేదల సొంతింటి కల ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా మారింది డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం. ప్రభుత్వం నిధులు కేటాయించినా కాంట్రాక్టర్ నిర్వాకం వల్ల పనులు ముందకు సాగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పనులు పునాదుల స్థాయిలోనే ఆగిపోయాయి. పూడూరు మండలానికి 50 డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరయ్యాయి. పూడూరు, మన్నేగుడ, మీర్జాపూర్ గ్రామాల్లో స్థలాలను గుర్తించారు. పూడూరులోని శ్మశానవాటిక పక్కన ఉన్న ప్రభుత్వ స్థలం ఇళ్ల నిర్మాణం కోసం కేటాయించారు. రెండేళ్ల క్రితం పనులు ప్రారంభించారు. అప్పటి నుంచి నేటి వరకు పిల్లర్లకే పనులు పరిమితమయ్యాయి. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి 3,873 డబుల్ ఇళ్లు మంజూరయ్యాయి. సగానికిపైగా రోడ్లు భవనాల శాఖకు అప్పగించగా, మరి కొన్ని ఇరిగేషన్ శాఖ, మున్సిపాలిటీలకు నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. ఇందులో భాగంగా పూడూరులో 50 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. పునాదుల పనులు పూర్తయి పిల్లర్ల స్థాయిలో ఆగిపోయాయి. పరిగి నియోజకవర్గానికి 680 ఇళ్లు మంజూరు కాగా పరిగి, దోమ, కులకచర్ల, గండ్వీడ్, మహమ్మదాబాద్ మండలాల్లో డబుల్ ఇళ్ల నిర్మాణాలు చివరి దశకు చేరాయి. నిధులు లేని కారణంగానే కాంట్రాక్టర్ పనులు ఆపేసినట్లు తెలిసింది. పనులు వేగవంతం చేస్తాం పూడూరులో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. సకాలంలో పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించాం. బిల్లులు రావడం లేదని కాంట్రాక్టర్ పనులు ఆపేశాడు. ప్రస్తుతం బిల్లులు వచ్చాయి. పనుల వేగం పెంచి త్వరలో పూర్తయ్యేలా చూస్తాం. – మహేశ్, ఆర్అండ్బీ ఏఈ -
కార్పెట్‌పై తారు రోడ్డు.. చేత్తో ఎత్తిన గ్రామస్తులు..
-
Video: కార్పెట్‌పై తారు రోడ్డు.. చేత్తో ఎత్తిన గ్రామస్తులు
మహారాష్ట్రలో వింత ఘటన చోటుచేసుకుంది. తారు రోడ్డును కొంతమంది వ్యక్తులు ఒట్టి చేతులతో అమాంతం ఎత్తేశారు. కొత్తగా వేసిన రోడ్డు అట్టముక్కలా పైకి రావడం విచిత్రంగా మారింది. ఈ విషయాన్ని గ్రామస్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో వైరల్ అయ్యింది. జల్నా జిల్లాలోని అంబాద్ తాలూకాలోని కర్జాత్-హస్త్ పోఖారీలో ఈ సంఘటన జరిగింది. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన (పీఎం రూరల్ రోడ్ స్కీమ్) కింద ఈ రహదారిని నిర్మించారు. అయితే రోడ్డు మీద కార్పెట్‌ను బేస్‌లాగా పరిచి దానిపై తారు రోడ్డు వేశారు. స్థానిక కాంట్రాక్టర్ ఈ రహదారిని నిర్మించారు. దీనిని గుర్తించిన గ్రామస్థులు నాణ్యత ప్రమాణాలు పాటించకుండా బోగస్ రోడ్డు నిర్మించిన కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్షానికి ఈ పనులు సాక్ష్యంగా నిలిచాయని మండిపడ్డారు. రోడ్డు వేసి నాలుగు రోజులు అవుతుందని.. ఈ విధంగా లేచిపోయే రోడ్లను గతంలో ఎప్పుడూ చూడలేదంటున్నారు.రాత్రికి రాత్రి ఇలాంటి రోడ్లు వేసి.. చేతులు దులుపుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. దీనిని ఆమోదించిన ఇంజనీర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే కాంట్రాక్టర్ మాటలు మాత్రం ఇందుకు వ్యతిరేకంగా ఉన్నాయి. రోడ్డు నిర్మాణం కోసం జర్మన్ టెక్నాలజీని ఉపయోగించినట్లు అతడు పేర్కొన్నాడు. రోడ్డుపై కార్పెట్ వేసి.. దానిపై తారు రోడ్డు నిర్మాణం చేసినట్లు చెబుతున్నాడు. మొత్తానికి ఫేక్ రోడ్డుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. కాగా 63.32 లక్షల కిలోమీటర్ల రోడ్డు నెట్‌వర్క్‌తో భారత్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద రోడ్ నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. అయినా ఇప్పటికీ పలు గ్రామాల్లో సరైన రోడ్లు లేకపోవడం గమనార్హం. చదవండి: పసిప్రాయంలో రాసిన ఉత్తరం 15 ఏళ్లుగా వెంటాడుతూ... -
ఇదేనా రోడ్డు? దీనిపై కారు నడిపి చూపించండి.. కాంట్రాక్టర్‌పై ఎమ్మెల్యే ఫైర్!
ప్రభుత్వ పనుల్లో కాంట్రాక్టర్ల పని తీరు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రాజెక్ట్ కోట్లలో ఉంటుంది గానీ నాణ్యత పరంగా మాత్రం తేలిపోతుంది. ఈ తరహా ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఓ నియోజకవర్గంలో చోటు చేసుకుంది. కనీసం ఆరు నెలలు కూడా కాకుండానే వేసిన రోడ్డు నాశనం అయ్యింది.ఆ రోడ్డు నాణ్యతను చెక్ చేసిన ఆ నియోజకవర్గపు ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల జఖానియన్ ప్రాంతంలోని జంగీపూర్-బహరియాబాద్-యూసుఫ్పూర్లను కలుపుతూ 4.5 కిలోమీటర్ల విస్తీర్ణంలో రోడ్డు నిర్మాణం జరిగింది. అయితే నిర్మాణం విషయంలో రోడ్డు నాణ్యత కాంట్రాక్టర్ గాలికి వదిలిశాడు. భారతీయ సమాజ్ పార్టీకి చెందిన సుహెల్దేవ్ శాసనసభ్యుడు బెదిరామ్ ఆ రోడ్డుకు సంబంధించి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ఎమ్మెల్యే ఆ రోడ్డు పరిశీలినకు వెళ్లి.. దాని నాణ్యతను చూసి షాకయ్యాడు. సాధారణంగా తారు రోడ్డు అంటే టన్నుల బరువున్న వాహనాలు ప్రయాణించిన తట్టుకుని నిలబడాలి. అయితే ఆ రోడ్డు మాత్రం అందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. కాలు పెట్టినా కదిలిపోతోంది. దీంతో ఎమ్మెల్యే కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం దీనిపై స్పందిస్తూ.. "నేను రోడ్డు నాణ్యత పరిశీలనకు వెళ్లిన సమయలో అక్కడ పిడబ్ల్యుడి (పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్) అధికారి ఎవరూ లేరు. నేను కాంట్రాక్టర్‌తో ఈ సమస్యను లేవనెత్తాను. పిడబ్ల్యుడి ఉన్నతాధికారులతో కూడా మాట్లాడాను, రహదారిని ప్రమాణాల ప్రకారం నిర్మించలేదని వాళ్లతో చెప్పాను. ఈ రోడ్డు మరి దారుణంగా ఉంది, దీని నిర్మించి కనీసం ఆరు నెలలు కూడా మించలేదని ఫైర్ అయ్యారు. అయితే ఆ రాష్ట్రంలో నాసిరకం రోడ్లు వెలుగులోకి రావడం ఇదేం మొదటిసారి కాదు. @ACOUPPolice Corruption in road construction Jakhiniya Ghazipur UP pic.twitter.com/d9bT5rP4BX — Sanjay Singh (@SANJAYK98610543) March 30, 2023 -
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మరికొన్నేళ్లు సాగొచ్చు
కీవ్: ఏడాది క్రితం మొదలైన రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మరికొన్నేళ్లు సాగే అవకాశాలున్నాయని ప్రైవేట్ మిలటరీ కాంట్రాక్టర్, వాగ్నర్ గ్రూప్ యజమాని యెవ్గెనీ ప్రిగోజిన్ అంటున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ప్రిగోజిన్‌కు చెందిన ప్రైవేట్ సైన్యం రష్యా మిలటరీతో కలిసి ఉక్రెయిన్‌లో యుద్ధం చేస్తోంది. శుక్రవారం ఓ వీడియో ఇంటర్వ్యూలో ప్రిగోజిన్.. కీలక పారిశ్రామిక ప్రాంతం డోన్బాస్‌పై పూర్తి స్థాయి ఆధిపత్యం సాధించేందుకు రష్యాకు ఏడాదిన్నర నుంచి రెండేళ్ల వరకు పట్టొచ్చని అంచనా వేశారు. నీపర్ నదికి తూర్పు వైపునున్న విస్తార ప్రాంతంపై పట్టు సాధించాలంటే మాత్రం రష్యాకు మూడేళ్ల వరకు సమయం తీసుకుంటుందని అన్నారు. కంచుకోటలాంటి డొనెట్స్క్లోని బఖ్‌ముత్‌లో ఉక్రెయిన్ దళాలతో తమ గ్రూప్ శ్రేణులు భీకర పోరాటం సాగిస్తున్నాయని చెప్పారు. తమ ‘స్పెషల్ మిలటరీ ఆపరేషన్’అనుకున్న లక్ష్యాలను సాధించే వరకు కొనసాగుతుందని రష్యా కూడా చెబుతుండటం గమనార్హం. రష్యా అధ్యక్ష భవనమైన క్రెమ్లిన్ కేటరింగ్ కాంట్రాక్టులు చేసే ప్రిగోజిన్‌కు ‘పుతిన్ వంటమనిషి’గా పేరుంది. శనివారం ఒడెసాలో వ్యూహాత్మక రైల్వే వంతెనను రష్యాకు చెందిన సీ డ్రోన్ దాడితో పేల్చేస్తున్న వీడియో ఒకటి రష్యా మిలటరీ బ్లాగర్లు విడుదల చేశారు. దీనిని ఇరు దేశాలు అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. -
ఇడియట్స్ అని తిడుతూ..సహనం కోల్పోయిన ఎమ్మెల్యే
కొందరూ ఎమ్మెల్యే కింద స్ధాయి ఉద్యోగులపై తమ ఆవేశాన్ని వెళ్లగక్కడం మామూలే. మరికొందరూ ఏకంగా చేయి జేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అచ్చం అలానే ఇక్కడొక ఎమ్మెల్యే రోడ్డునిర్మాణ పనులను ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ కాంట్రక్టర్ని తిడుతూ..భౌతిక దాడికి దిగారు. ఏకంగా ఆ కాంట్రాక్టర్ కళ్ల అద్దలను కూడా పగలు కొట్టేసి..తోసేస్తానంటూ బెదిరింపులకు దిగారు. ఈఘటన కర్ణాటకలోని రాయచూర్ జిల్లా కవితా పట్టణంలో చోటు చేసుకుంది. కర్ణాటకలోని రాయ్‌చూర్‌లో నిర్మాణ పనుల ప్రాజెక్టును తనిఖీ చేసేందుకు వచ్చిన జేడీఎస్ ఎమ్మెల్యే రాజా వెంకటప్ప సహనం కోల్పోయారు. ఈ పనుల్లోజాప్యం ఎందుకు జరుగుతోందంటూ నిర్మాణ పనుల బాధ్యులపై మండిపడ్డారు. అక్కడు ఉన్న కాంట్రాక్టర్‌ని చూస్తూ..ఇడియట్స్ మీరు గుల్బర్గా నంచి ఇక్కడికి ఎందుకు వలస వచ్చారని ప్రశ్నించారు. మన జిల్లా నుంచి ఉద్యోగానికి ఎవరూ లేరా? అంటూ తిట్టిపోశారు. మనవాళ్ల అయినతే ఈపాటికి పని పూర్తి అయిపోయేదంటూ విరుచుకుపడ్డారు. అంతేగాదుఎమ్మెల్యే ఆ కాంట్రాక్టర్ ముఖానికి ఉన్న కళ్లద్దాలను లాక్కొని పగలు కొట్టడమే గాక ఇక్కడ నుంచి తోసేస్తానని బెదరించారు. ఆ తర్వాత జేఈ శ్యామలప్ప అనే మరో వ్యక్తిని కూడా దుర్భాషలాడారు. వాస్తవానికి రోడ్డు నిర్మాన పనులు ప్రారంభించి ఏడాది దాటిని పూర్తవ్వకపోవడంపై కవితా పట్టణం స్థానికులు ఎమ్మెల్యేను ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జేడీఎస్ ఎమ్మెల్యే వెంకటప్ప రోడ్డు నిర్మాణ కాంట్రాక్టర్లపై మండిపడ్డారు. మీరంతా నాప్రతిష్టను దిగజార్చాలనే ప్రయత్నం చేస్తున్నారంటూ వారిపై ఆరోపణలు చేశారు. చెప్పుడు మాటలు వింటూ కావాలనే జాప్యం చేస్తూ..నాసిరకంగా పనులు చేస్తున్నారంటూ శారీరక దాడికి దిగారు. అందుకు సంబంధించిన దృశ్యాలు కొందరూ కెమరాలో బంధించడంతో ఈ ఘటన వెలుగు చూసింది. (చదవండి: మీకు జీవితఖైదు సరైనదే: షాక్ ఇచ్చిన హైకోర్టు) -
కర్నాటకలో కాంట్రాక్టర్ ఆత్మహత్య.. బీజేపీ ప్రభుత్వమే కారణమా?
కర్నాటకకు చెందిన మరో కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వం నుంచి కాంట్రాక్టులకు బిల్లులు క్లియర్ కాకపోయిన కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. కాంట్రాక్టర్ ఆత్మహత్య సందర్భంగా తన మరణానికి ఎవరూ బాధ్యులు కాదంటూ సూసైడ్ నోట్లో ఉండటం గమనార్హం. వివరాల ప్రకారం.. తుమకూరు జిల్లాకు చెందిన కాంట్రాక్టర్ టీఎన్ ప్రసాద్(50) ఆత్మహత్య చేసుకున్నారు. అయితే, ప్రభుత్వం నుంచి బిల్లులు క్లియర్ కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా, బీజేపీ ప్రభుత్వం ఆధ్వర్యంలోని స్మార్ట్‌సిటీ ప్రాజెక్ట్ కింద రూ.16 కోట్ల విలువైన నిర్మాణ పనులను కాంట్రాక్టర్ ప్రసాద్ చేపట్టారు. అయితే బిల్లుల బకాయిలను ప్రభుత్వం క్లియర్ చేయకపోవడంతో అప్పులపాలయ్యాడు. దీంతో, అప్పులు చెల్లించకలేక తీవ్ర మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే తన మరణానికి ఎవరూ బాధ్యులు కాదంటూ సూసైడ్ నోట్లో ఉందని చెప్పారు. మరోవైపు.. ప్రసాద్ మృతిపై కాంట్రాక్టర్ల సంఘం అధ్యక్షుడు బలరాం స్పందించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ కాంట్రాక్ట్‌ను పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్ ప్రసాద్ భారీగా రుణాలు పొందాడని బలరాం చెప్పుకొచ్చారు. ఆ అప్పు తీర్చేందుకు ఐదు నెలల కిందట తన ఇంటిని కూడా అమ్మేశాడని తెలిపారు. బిల్లుల క్లియరెన్స్‌లో ఆలస్యం వల్ల తాను మనోవేదనకు గురవుతున్నట్టు తనతో చర్చించినట్టు వెల్లడించారు. ఈ క్రమంలో కర్నాటకలోని బీజేపీ సర్కార్‌పై విపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు. 40 శాతం కమీషన్ ఇవ్వకపోతే బిల్లులు పాస్ కావంటూ కొందరు కాంట్రాక్టర్లతోపాటు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. అందుకే ఇలా ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. -
కాంట్రాక్టర్ మోసం చేశాడని.. కుటుంబం ఆత్మహత్యాయత్నం
చైతన్యపురి: పనులు పూర్తి చేసినా కాంట్రాక్టర్ ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తుండటంతో మనస్తాపానికిలోనైన ఓ సబ్ కాంట్రాక్టర్ కుటుంబంతో సహా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సీతారాం కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి..ఖమ్మం, ప్రశాంత్‌నగర్‌కు చెందిన చండ్ర శశికుమార్ ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ పనులు చేసేవాడు. హైదరాబాద్ పంజగుట్టకు చెందిన కాంట్రాక్టర్ జీవీ ప్రతాప్‌రెడ్డి కంపెనీ డైరెక్టర్ జీవీ దినేష్‌రెడ్డి ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాలలో నిర్వహిస్తున్న ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ పనులను శశికుమార్ తీసుకున్నాడు. ఇందుకు సంబందించి సుమారు రూ.2 కోట్లు బిల్లులు రావాలని వెంటనే తనకు డబ్బులు ఇవ్వాలని దినేష్‌రెడ్డిని ఫోన్లో అడిగాడు. అయితే అతను స్పందించకపోవటంతో ఆదివారం శశికుమార్ తన భార్య శ్వేత, ఇద్దరు పిల్లలతో హైదరాబాద్‌కు వచ్చి దిల్‌సుఖ్‌నగర్‌లోని గణేష్ లాడ్జిలో దిగారు. బుధవారం ఖమ్మంలో ఉంటున్న తన బావమరిది సురేష్‌కు ఫోన్ చేసి తామంతా సూసైడ్ చేసుకుంటున్నట్లు తెలిపాడు. దీంతో సురేష్ సరూర్‌నగర్ పోలీసులకు సమాచారం అందించాడు. లాడ్జికి వెళ్లిన పోలీసులకు అప్పటికే అపస్మారకస్థితిలో అప్పటికే నిద్రమాత్రలు మింగి శశికుమార్, శ్వేత అపస్మారక పరిస్థితిలో కనిపించారు. ఇద్దరు పిల్లలు వాంతులు చేసుకుని ఉన్నారు. వారిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. పిల్లలకు తక్కువ మోతాదులో ఇవ్వటంతో వారు క్షేమంగా ఉన్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. 8 పేజీల సూసైడ్ నోట్ స్వాధీనం సెల్ఫోన్లో సూసైడ్ చేసుకోవడానికి కారణాలను వివరిస్తూ వీడియో రికార్డు చేసినట్లు గుర్తించారు. అందులో తనకు రావాల్సిన, ఇవ్వాల్సిన డబ్బుల వివరాలు కూడా శశికుమార్ వివరించాడు. కాంట్రాక్టర్ తనపై మధిర పోలీస్ స్టేషన్లో దొంగతనం కేసు పెట్టాడని, ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోగా తమను బెదిరిస్తున్నాడని, తాను అన్ని వివరాలు రాశానని వాటి ఆధారంగా అతడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు. -
విచారణ జరుగుతోంది, తొందరెందుకు? విపక్షాలపై సీఎం ఫైర్
బెంగళూరు: కే.ఎస్ ఈశ్వరప్పను అరెస్ట్ చేసేది, లేనిది విచారణ అధికారుల నిర్ణయమని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై స్పష్టం చేశారు. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నేతలకు ఓపిక లేకపోతే ఎలా అని అసహనం వ్యక్తం చేశారు. ఆయన శనివారం హంపీ సమీపంలోని కన్నడ విశ్వ విద్యాలయంలో నూతన భవనాలను ప్రారంభించి విలేకరులతో మాట్లాడారు. ఈశ్వరప్ప మంత్రి పదవికి రాజీనామా చేశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి జార్జ్‌పై వచ్చిన ఆరోపణలపై అప్పటి సీఎం ఎందుకు ఆయన్ను అరెస్ట్ చేయించలేదని ప్రశ్నించారు. సీఎల్పీ నేత సిద్ధరామయ్య అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఒకలా మాటలు మాట్లాడితే సరిపోదన్నారు. తప్పు చేసిన వారికి చట్టపరంగా చర్యలు ఉంటాయన్నారు. రాజకీయ లబ్ధి కోసం ధర్నాలు, రాస్తారోకోలు చేయడం మంచిది కాదన్నారు. సంతోష్ పాటిల్ గదిలో క్రిమిసంహారక మందు దొరకడంతో విచారణ జరుగుతోందన్నారు. కాగా హొసపేటెలో బీజేపీ కార్యనిర్వాహక సభ భారీఎత్తున నిర్వహించారు. మాజీ సీఎం యడియూరప్ప, మంత్రి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. చదవండి: కర్ణాటక కాంట్రాక్టర్ మృతి.. చనిపోయేముందు ఏం జరిగింది? కాంగ్రెస్ హస్తం ఉందేమో ? సాక్షి,బళ్లారి/హొసపేట: కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్య ఘటనపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న రాజకీయాలు చూస్తుంటే వారి హస్తం ఉందేమో అన్న అనుమానం కలుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నళిని కుమార్ కటిల్ పేర్కొన్నారు. శనివారం ఆయన హొసపేటలో విలేకరులతో మాట్లాడుతూ... సంతోష్ ఆత్మహత్య వెనుక మహానాయకుడు హస్తం ఉందని చర్చసాగుతోందని, ఆ దిశగా దర్యాప్తు కూడా చేయిస్తామన్నారు. ఈశ్వరప్పను అరెస్ట్ చేయాలని రాద్ధాంతం చేస్తున్నారని, ఎవరిని అరెస్ట్ చేయాలో చట్టం చూసుకుంటుందన్నారు. -
కర్ణాటక కాంట్రాక్టర్ మృతి.. చనిపోయేముందు ఏం జరిగింది?
బెంగళూరు: కాంట్రాక్టర్ సంతోష్‌పాటిల్ ఆత్మహత్య చేసుకోవడానికి పంటల తెగుళ్ల నివారణకు వాడే క్రిమిసంహారక మందు మోనోక్రోటోఫాస్ తాగినట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసింది. సంతోష్‌పాటిల్ చిక్కమగళూరు వద్ద కైమర అనే గ్రామంలో 4 రోజుల పాటు ఒక హోంస్టేలో మకాం వేశాడు. ఆ తరువాత ఉడుపిలో లాడ్జి గది తీసుకున్నట్లు తెలిసింది. ఆయనతో పాటు ముగ్గురు ఉన్నట్లు సమాచారం. హోం స్టేలో స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేస్తూ హుషారుగా ఉన్నాడని, వెళ్లేటప్పుడు అక్కడ కుక్కలకు బిస్కెట్లు వేశాడని తెలిసింది. హోం స్టే, లాడ్జి వద్ద సీసీ కెమెరాల చిత్రాలు, రికార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆయన వెంట వచ్చిన ముగ్గురు ఎవరని ఆరా తీశారు. ఈశ్వరప్ప అరెస్ట్‌కు కాంగ్రెస్ ధర్నాలు.. శివాజీనగర: కాంట్రాక్టర్ కేసులో మాజీ మంత్రి ఈశ్వరప్పను అరెస్టు చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు శనివారం నుంచి వారంరోజుల ఆందోళన ప్రారంభించారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల 9 బృందాలుగా ఏర్పడి వివిధ జిల్లా, తాలూకా కేంద్రాల్లో ధర్నాలు చేశారు. పాటిల్ కుటుంబానికి పరిహారం, ఆయన భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, ఈశ్వరప్పను అరెస్టు చేసి న్యాయవిచారణ జరపాలని డిమాండ్ చేశారు. కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ రామనగర జిల్లా వ్యాప్తిలో ధర్నా నిర్వహించారు. మంత్రిమండలి నుంచి తొలగింపు.. కాంట్రాక్టర్ ఆత్మహత్య ఘటనతో మంత్రి పదవికి కే.ఎస్.ఈశ్వరప్ప రాజీనామా చేయడం తెలిసిందే. ఆయన ఆ లేఖను సీఎం బొమ్మైకి ఇవ్వగా, అటు నుంచి గవర్నర్ గెహ్లాట్‌కు పంపారు. ఆ మేరకు ఈశ్వరప్పను మంత్రిమండలి నుంచి తొలగిస్తూ గవర్నర్ ఆదేశాలిచ్చారు. -
కాంట్రాక్టర్ ఆత్మహత్యపై స్పందించిన మంత్రి..‘ రాజీనామా చేసే ప్రసక్తే లేదు’
బెంగళూరు: కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్‌ను తను ఇప్పటి వరకు కలవలేదని కర్ణాటక గ్రామీణాభివృద్ధి మంత్రి కేఎస్ ఈశ్వరప్ప స్పష్టం చేశారు. కాంట్రాక్టర్ మరణానికి తను బాధ్యుడిని కాదని అన్నారు. కాగా బెళగావి జిల్లాకు చెందిన కాంట్రాక్టర్ తన చావుకు మంత్రి ఈశ్వరప్ప కారణమని లేఖ రాసి ఉడిపిలోని ఓ లాడ్జీలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మంత్రి ఈశ్వరప్ప కమీషన్లు అడిగారని కాంట్రాక్టర్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో సంతోష్ పాటిల్ సోదరుడి ఫిర్యాదు మేరకు బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో మంత్రి ఈశ్వరప్పతోపాటు ఆయన మద్దతుదారులు బసవరాజ్, రమేశ్ పేర్లను కూడా చేర్చారు. తాజాగా కాంట్రాక్టర్ చేసిన ఆరోపణలపై మంత్రి ఈశ్వరప్ప స్పందించారు. నేను ఇప్పటి వరకు కాంట్రాక్టర్‌ను చూడలేదు, కలవలేదు. కేంద్రానికి రాసిన ఆ లేఖను మా శాఖకు పంపించారు. దీనిపై ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా సమాధానమిచ్చారు. అయితే పాటిల్‌కు సివిల్ పనులు అప్పగించినట్లు ఎలాంటి రికార్డ్ లేదు. అలాగే పేమెంట్ గురించి కూడా చర్చించలేదు. ఇదే విషయాన్ని కేంద్రానికి కూడా తెలియజేశారు. నాపై వచ్చిన ఆరోపణలపై నిస్పక్షపాతంగా విచారణకు ఆదేశించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి, హోం మంత్రిని కోరాను’ అని ఈశ్వరప్ప తెలిపారు. సంబంధిత వార్త: సూసైడ్ కలకలం: మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు.. రంగంలోకి సీఎం కాగా కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ లాడ్జీలో మంగళవారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని మరణానికి ముందు తన చావుకు ఈశ్వరప్పే కారణమని, అతనికి శిక్ష పడాలని.. స్నేహితులకు వాట్సాప్ ద్వారా మెసెజ్‌లు పంపారు. తన కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని ముఖ్యమంత్రి, ప్రధానమంత్రికి కోరారు. సంతోష్ పాటిల్ ఆత్మహత్యతో ఈశ్వరప్పపై అవినీతి ఆరోపణలు ఊపందుకున్నాయి. దీంతో ఈశ్వరప్ప రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో మంత్రి స్పందించారు. తను రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సంతోష్ పాటిల్ ఆరోపణలపై పరువు నష్టం కేసు కూడా వేసినట్లు తెలిపారు. -
కుమార్ వర్మ మరో దందా!... కాంట్రాక్టర్‌నూ వదల్లేదు!
సాక్షి, సిటీబ్యూరో: ప్రవాస భారతీయుడి నుంచి రూ.7 కోట్లు, మణికొండ వాసి నుంచి రూ.1.08 కోట్లు స్వాహా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సూపర్ సర్ఫేసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్వాహకుడు కుమార్ శ్రీనివాస్ పెనుమత్స వర్మ అలియాస్ కుమార్ వర్మ మరో దందా వెలుగులోకి వచ్చింది. యూసుఫ్‌గూడ ప్రాంతానికి చెందిన ఓ కాంట్రాక్టర్‌ను రూ.కోటి మేర మోసం చేసినట్లు జూబ్లీహిల్స్ ఠాణాలో కేసు నమోదైంది. యూసుఫ్‌గూడ ప్రాంతానికి చెందిన సదరు క్లాస్–1 కాంట్రాక్టర్ 2015 తర్వాత కాంట్రాక్టులకు దూరంగా ఉంటున్నారు. ఆయనకు ఓ స్నేహితుడి ద్వారా కుమార్ వర్మ పరిచయమయ్యాడు. తాను పెయింటింగ్ కాంట్రాక్టులు చేస్తుంటానని, ఆ పని పూర్తి చేయడానికి అవసరమైన మనుషులను సరఫరా చేయాల్సిందిగా కుమార్ వర్మ కోరడంతో బాధితుడు అంగీకరించాడు. తొలి నెల రోజులు చేసే పనులన్నీ ట్రైనింగ్ కిందికి వస్తామని, ఆపై డబ్బు చెల్లిస్తానంటూ కుమార్ వర్మ చెప్పగా ఈయన అంగీకరించారు. ఎలాంటి వర్క్ ఆర్డర్లు ఇవ్వకుండా, ఒప్పందపత్రాలు లేకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లతో పాటు చెన్నైలోనూ పలు పనులు చేయించారు. ప్రతి నెలా దాదాపు రూ.6 లక్షల చొప్పున రూ.20 లక్షల వరకు బాధితుడు మనుషులకు చెల్లించాడు. ఈ కాలంలో కేవలం కొంత మాత్రమే బిల్లుల రూపంలో కుమార్ వర్మ చెల్లించాడు. ఇదిలా ఉండగా... 2020లో లాక్డౌన్ అమలులోకి రావడంతో పనులు ఆగిపోయాయి. మళ్లీ ప్రారంభమైన తర్వాత తాను పూర్తిగా నష్టపోయానంటూ చెప్పిన కుమార్ వర్మ అప్పటి వరకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వలేనన్నాడు. ఆపై చేసే పనులకు మాత్రం ప్రతి నెలా చెల్లిస్తానంటూ బాధితుడితో మరికొన్ని పనులు చేయించాడు. మొత్తం రూ.కోటికి పైగా పనులు చేయించిన తర్వాత కూడా కేవలం రూ.17 లక్షలే చెల్లించాడు. మిగిలింది ప్రవాస భారతీయుడు పెట్టుబడి పెట్టిన తర్వాత ఇస్తానన్నాడు. కొన్నాళ్లకు బాధితుడు ఆరా తీయగా ప్రవాస భారతీయుడి నుంచి రూ.7 కోట్లు స్వాహా చేశాడని, వివిధ పనులకు సంబంధించిన మొత్తం నగదు రూపంలో తీసుకున్నట్లు తెలిసింది. దీంతో తాను మోసపోయానని గుర్తించిన ఆయన జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. సైబరాబాద్ ఈఓడబ్ల్యూ అధికారులు దర్యాప్తు చేస్తున్న ప్రవాస భారతీయుడి కేసులో కుమార్ వర్మ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఇతడిని అధికారులు అరెస్టు చేశారు. ఇదే కేసులో వర్మతో పాటు అనూష రాజ్, నాగేంద్ర మహేష్ జనార్దన, కర్ణ మహేంద్ర రాజ్, అకౌంటెంట్ ప్రసన్న కుమార్ సైతం నిందితులుగా ఉన్నారు. వీరి పాత్రపై ఈఓడబ్ల్యూ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కొన్ని రోజులుగా వీరు అందుబాటులో లేరని పోలీసులు పేర్కొన్నారు. (చదవండి: కొంపముంచిన ప్రకటన! 20 రోజులు.. రూ.11.26 లక్షలు) -
సామాన్య భక్తురాలిగా వచ్చి.. కాంట్రాక్టర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని..
సాక్షి, వేములవాడ: వేములవాడ రాజన్న దర్శనానికి వస్తున్న భక్తులు వాహనాల పార్కింగ్ పేరిట దోపిడీకి గురవుతున్న వైనంపై వచ్చిన ఫిర్యాదులపై ఈవో రమాదేవి స్పందించారు. గురువారం ఉదయం సామాన్య భక్తురాలిగా వచ్చిన ఈవో పార్కింగ్ టెండర్ కాంట్రాక్టర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వేములవాడలో రాజన్న ఆలయ టీటీడీ ధర్మశాలల పార్కింగ్ స్థలంలో వాహనాలు నిలుపుకునేందుకు రూ.30 పార్కింగ్ ఫీజు వసూలు చేయాలి. కానీ కాంట్రాక్టర్ రూ.100 వసూలు చేస్తున్నట్లు ఈవో రమాదేవికి ఫిర్యాదులు అందాయి. దీంతో గురువారం సామన్య భక్తురాలిగా ఓ ప్రైవేట్ వాహనంలో వచ్చిన ఈవో రూ.100 పార్కింగ్ ఫీజు చెల్లించి, కాంట్రాక్టర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం ఈవో రమాదేవి మాట్లాడుతూ.. పబ్బ లచ్చయ్య, పబ్బ శ్రీనాథ్‌లకు చెందిన పార్కింగ్ ఫీజు, టెంకాయ టెండర్లను రద్దు చేసి, క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. మహాశివరాత్రి జాతర మహోత్సవాలు ముగిసే వరకు ఉచిత పార్కింగ్, నాంపల్లి గుట్టపైకి ఉచితంగా వెళ్లేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. చదవండి: హైదరాబాదీలకు ఊరట.. నగరంలో మరో రైల్వే టర్మినల్ రూ.30కి బదులు రూ.100 వసూలు వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చే భక్తుల వాహనాలకు టీటీడీ ధర్మశాలల ఖాళీ ప్రదేశంలో పార్కింగ్ సౌకర్యం కల్పించారు. ఇందుకు టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ రూ.30 చొప్పున వసూలు చేయాల్సి ఉంటుంది. కానీ సదరు కాంట్రాక్టర్ దేవస్థానం అధికారులు ముద్రించిన రూ.30 టికెట్ల స్థానంలో రూ.100 టికెట్లు ముద్రించి అందినంత దండుకుంటున్నారు. టెంకాయ టెండర్ రద్దు భక్తులకు ఉచితంగా టెంకాయకొట్టే నిబంధనలు అమలులో ఉండగా, రాజన్న ఆలయంలో భక్తుల నుంచి బలవంతంగా రూ.10 వసూలు చేస్తున్నట్లు ఈవో గురువారం గుర్తించారు. వెంటనే సంబంధిత టెండర్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. భక్తులెవరూ డబ్బులు ఇవ్వవద్దని కోరారు. చదవండి: కరీంనగర్: గజానికి రూ.37,400.. ఎకరానికి 3.30కోట్లు -
అనంతలో ఘోర ప్రమాదం.. వాగులో దూసుకెళ్లిన కారు
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విడపనల్ మండలం డోనేకల్ వద్ద కారు అదుపుతప్పి వాగులో దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ఉన్న వ్యక్తులు గల్లంతయ్యారు. గుంతకల్లు నుంచి బళ్లారి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. రోడ్డు పనులు చేసే కాంట్రాక్టర్ తీసిన గుంతలో కారు చిక్కుకుంది. కారులో ఐదుగురు ఉన్నట్లు భావిస్తున్నారు. స్థానికుల సమాచారంతో అధికారులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. క్రేన్ సహయంతో కారును బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. చదవండి: వీడొక్కడే సినిమాలో లాగా.. మహిళ కడుపులో.. అధికారులు షాక్.. -
‘శ్రీలక్ష్మి’ నీ మహిమలూ..! తప్పు అధికారులది.. శిక్ష కొనుగోలుదారులకు
సాక్షి,హైదరాబాద్: ఉద్యోగ విరమణ అనంతరం వచ్చిన సొమ్ముతో ఓ వ్యక్తి విల్లా కొనాలనుకున్నాడు. మల్లంపేటలో ఓ ప్రాజెక్ట్‌ను చూశాడు. నిర్మాణ అనుమతులు ఉన్నాయా లేదా పరిశీలించాడు. బ్యాంక్ రుణం వస్తుందా అని ఆరా తీశాడు. తక్కువ ధర, నచ్చిన చోటు కావటంతో కొనుగోలు చేసేశాడు. రిజిస్ట్రేషన్ కూడా పూర్తయింది. బ్యాంక్‌కు రెండు ఈఎంఐలు కూడా చెల్లించేశాడు. ఇక గృహ ప్రవేశం చేయడమే తరువాయి! కానీ అకస్మాత్తుగా మున్సిపల్ అధికారులు వచ్చి తన విల్లాకు ‘ఇది అక్రమ నిర్మాణం’ అని ఫ్లెక్సీ తగిలించిపోయారు. అసలేం జరుగుతుందో బాధితుడికి అర్థం కాలేదు. అనుమతి పత్రాలున్నాయి.. రిజిస్ట్రేషన్ అయిపోయింది.. బ్యాంక్‌లోనూ మంజూరు చేసింది కదా అని నెత్తీ నోరూ బాదుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. పోనీ, సదరు యజమాని దగ్గరికి వెళ్దామంటే.. ఆ బిల్డర్ విదేశాలకు చెక్కేశాడు. ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితి ఓ విల్లా యజమానిది.. ఇలా ఒకరో ఇద్దరో కాదు మల్లంపేటలోని శ్రీ లక్ష్మి శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ విల్లా ప్రాజెక్ట్ బాధితులు వందల సంఖ్యలోనే ఉన్నారు. ఆక్రమించి.. రహదారిగా చేసి.. మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట రెవెన్యూ పరిధిలోని 170/3,170/4,170/5 సర్వే నంబర్లలోని 15 ఎకరాల భూమిని పాతికేళ్ల క్రితం ముగ్గురు స్వాతంత్ర సమరయోధులకు ప్రభుత్వం కేటాయించింది. ఆ తర్వాత భూమి పలువురి చేతులు మారి.. కొన్నేళ్ల క్రితం శ్రీ లక్ష్మి శ్రీనివాస కన్స్ట్రక్షన్ సంస్థకు చేరింది. మూడేళ్ల క్రితం 3.20 ఎకరాల స్థలంలో విల్లాల నిర్మాణం కోసం ఆ సంస్థ.. 6,418 చదరపు గజాలలో 35 విల్లాలు, 5,394 చదరపు గజాలలో మరో 30 విల్లాల నిర్మాణ అనుమతుల కోసం హెచ్ఎండీఏకు దరఖాస్తు చేసుకుంది. ఆశ్చర్యకర విషయమేంటంటే.. సదరు భూమి మాస్టర్ ప్లాన్‌లో రెసిడెన్షియల్ జోన్లోనే లేదు. అయినా సరే హెచ్ఎండీఏ అనుమతులు ఇచ్చేసింది. పైపెచ్చు ఈ వెంచర్‌కు రహదారి కూడా లేదు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి రహదారిగా మలచడం గమనార్హం. నకిలీ అనుమతులు సృష్టించి.. 2018లో మల్లంపేట గ్రామపంచాయతీగా ఉండేది. దీన్నే అవకాశంగా మలుచుకున్న నిర్మాణ సంస్థ.. గ్రామ పంచాయతీ అనుమతి పత్రాలు సృష్టించి అక్రమంగా 260 విల్లాలను నిర్మించింది. హెచ్ఎండీఏ అనుమతి ఇచ్చిన 65 విల్లాలకు పక్కనే మరో 15 ఎకరాల స్థలం ఉంది. దీన్ని ఆనుకొని కొత్త చెరువు ఉంది. ఆ 15 ఎకరాల్లో అప్పటి మల్లంపేట పంచాయతీ కార్యదర్శులు 260 విల్లాలకు నిర్మాణ అనుమతులు ఇచ్చినట్లు పత్రాలను సృష్టించారు. ఇందులో 40 విల్లాలు చెరువు బఫర్‌జోన్‌లో ఉన్నాయి. చెరువు హద్దుల నిర్ధారణకు రెవెన్యూ, నీటిపారుదలశాఖ సంయుక్త సర్వే చేసినప్పటికీ, ఈ నివేదికను స్థానికంగా రెవెన్యూ అధికారులకు ఇరిగేషన్ అధికారులు ఇవ్వకపోవడం గమనార్హం. చెరువులోకి మురుగు చెరువుకు ఆనుకుని ఉన్న 16 గుంటల ఎఫ్టీఎల్, మూడు ఎకరాల బఫర్ జోన్లో విల్లాలతో పాటు నిర్మాణ వ్యర్థాలతో ఏకంగా రోడ్డును ఏర్పాటు చేసింది. చెరువులో ఉన్న నీటిని మోటార్ల ద్వారా తోడి విల్లా నిర్మాణాలకు వినియోగిస్తున్నారు. విల్లాల మధ్య అంతర్గత రోడ్లు 30 అడుగుల వెడల్పు లేవు. పైగా మురుగు నీరంతా కొత్త చెరువులో కలిసే విధంగా డ్రైయినేజీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్ట్‌కు విద్యుత్ శాఖ అధికారులు భూగర్భ కేబుల్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం. ఇంత వ్యవహారం జరుగుతున్నా నాలుగేళ్లుగా ఏ ఒక్క అధికారి నోరుమెదపలేందంటే ఈ వ్యవహారం వెనుక ఉన్న ‘పెద్దలు’ ఏ స్థాయిలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. గుట్టు రట్టయిందిలా.. విల్లాల అక్రమ నిర్మాణాలపై స్థానికుల నుంచి ఫిర్యాదులు రావడంతో జిల్లా కలెక్టర్ హరీష్ సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈ మేరకు డీపీఓ రమణ మూర్తి, డీఎల్పీఓ స్మిత క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి 260 విల్లాలకు అనుమతులు లేవని నిర్ధారించారు. దీంతో ఆయా విల్లాలను దుండిగల్ మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు. బఫర్ జోన్లో ఉన్న విల్లాలను కూల్చివేసేందుకు పురపాలక అధికారులు ఉపక్రమించగా.. నిర్మాణ సంస్థ కోర్టును ఆశ్రయించి ‘స్టే’ తెచ్చుకోవటం కొసమెరుపు. -
బ్లాక్‌మెయిలింగ్‌కు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బ్లాక్ మెయిలింగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మారారని, మంత్రి మల్లారెడ్డి మొదలుకుని అనేక కాంట్రాక్టు సంస్థలవారు ఆయన బ్లాక్‌మెయిలింగ్ దందాను చెప్తారని పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ(పీయూసీ) చైర్మన్ జీవన్‌రెడ్డి విమర్శించారు. ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశంతో కలసి మంగళవారం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి గాడ్‌ఫాదర్ చంద్ర బాబు కూడా తమను ఏమీ చేయలేకపోయారని అన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రం పంజాబ్ డ్రగ్స్‌కు చిరునామాగా మారిందనే విషయాన్ని రేవంత్ గుర్తుంచుకోవాలన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనూ ఎక్సైజ్ ద్వారా ఆదాయం వస్తోందని, అక్కడి ముఖ్య మం త్రులు తాగుబోతులా? అని జీవన్‌రెడ్డి ప్రశ్నిం చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్రకు జనం లేక పొరుగు జిల్లాల నుంచి తీసుకువస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ తరహాలో కులవృత్తులకు ఏ ఇతర ముఖ్యమంత్రీ న్యాయం చేయలేదని ఎగ్గె మల్లేశం అన్నారు. చదవండి: తగ్గేదేలే.. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ -
నీలోఫర్: రికార్డుల్లో అంకెలు దిద్ది.. రూ.1.2 కోట్లు స్వాహా
సాక్షి, హైదరాబాద్: నిలోఫర్ ఆస్పత్రి డైట్ మాజీ కాంట్రాక్టర్ కోడూరి సురేష్ బాబును నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధికారులు సోమవారం అరెస్టు చేశారు. బోగస్ బిల్లులతో రూ.1.2 కోట్లు స్వాహా చేసిన ఆరోపణల నేపథ్యంలో ఇతడిపై కేసు నమోదైనట్లు సంయుక్త పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి పేర్కొన్నారు. మియాపూర్‌నకు చెందిన సురేష్‌బాబు 2017 ఏప్రిల్ 1న నిలోఫర్ ఆస్పత్రి డైట్ సరఫరా కాంట్రాక్టు దక్కించుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇన్పేషేంట్లతో పాటు వైద్యులకు అవసరమైన ఆహారం సరఫరా చేయడం ఈయన బాధ్యత. 2020 జూలైతో ఈయన కాంట్రాక్టు పూర్తి కావడంతో టెండర్లు పిలిచి మరొకరికి ఈ బాధ్యతలు అప్పగించారు. 2017–18 నుంచి 2019–20 మధ్య ఆహార సరఫరాలో సురేష్ బాబు గోల్‌మాల్‌కు పాల్పడినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. వీటి ఆధారంగా ఆస్పత్రి వర్గాలు విచారణ కోసం నలుగురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేశాయి. వీరి పరిశీలన నేపథ్యంలోనే ఆహార సరఫరా రికార్డుల్లో అనేక అవకతవకలు ఉన్నట్లు బహిర్గతమైంది. కొన్ని చోట్ల అంకెల్ని దిద్దినట్లు గుర్తించారు. దీంతో నిలోఫర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకృష్ణ గత నెలలో సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సురేష్ బాబు మొత్తం రూ.1,13,28,320 స్వాహా చేసినట్లు అందులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న ఏసీపీ కట్టంగూర్ శ్రీనివాస్‌రెడ్డి దర్యాప్తు చేపట్టారు. దాదాపు నాలుగేళ్ల పాటు రోగులు, వైద్యులకు సాధారణ ఆహారం సరఫరా చేసిన సురేష్ బాబు హై ప్రొటీన్ డైట్ ఇచ్చినట్లు రికార్డులు సృష్టించాడని తేల్చారు. దీంతో పాటు ఉన్న వైద్యులు, రోగుల కంటే ఎక్కువ మందికి ఆహారం అందించినట్లు రికార్డులు ట్యాంపర్ చేసినట్లు తేల్చారు. ఆస్పత్రి వర్గాలు గుర్తించిన మొత్తానికి మించి రూ.1.2 కోట్లు స్వాహా చేసినట్లు ఆధారాలు సేకరించారు. దీంతో సోమవారం సురేష్ బాబును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.