contraversial comments
-
‘ఇండియా’ కూటమి సిగ్గు పడాలి
న్యూఢిల్లీ: పిట్రోడా వ్యాఖ్యలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఖండించారు. ‘‘నేను దక్షిణ భారతదేశం నుంచి వచ్చా. నేను భారతీయురాలిగా కనిపిస్తా. నా బృందంలో ఈశాన్య రాష్ట్రాలకు చెందినవారు సైతం సభ్యులుగా ఉన్నారు. వారంతా భారతీయులుగానే కనిపిస్తారు. నా సహచరులైన పశి్చమ ప్రాంతాల ప్రజలు కూడా భారతీయులుగానే కనిపిస్తారు. రాహుల్ గాం«దీకి గురువైన ఓ జాత్యహంకారికి మాత్రం భారతీయులు ఆఫ్రికన్లు, చైనీయులు, అరబ్బులు, శ్వేతజాతీయులుగా కనిపిస్తున్నారు. కాంగ్రెస్ నాయకుల అసలు రంగు బయటపడింది. అందుకు వారికి కృతజ్ఞతలు చెప్పాలి. విపక్ష ‘ఇండియా’ కూటమి సిగ్గు పడాలి’’ అని నిర్మలా సీతారామన్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలపై కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. సోనియా గాంధీ కుటుంబంతో పిట్రోడాకు దశాబ్దాలుగా అనుబంధం ఉందని చెప్పారు. పిట్రోడాను ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ పదవి నుంచి తక్షణమే తొలగించాలని స్పష్టం చేశారు. దక్షిణ భారత ప్రజలను ఆఫ్రికన్లతో పోలుస్తూ పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై నాలుగు దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందించాలని అన్నారు. రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లినప్పుడు భారతదేశ ప్రజాస్వామ్యాన్ని, వ్యవస్థలను హేళన చేస్తూ మాట్లాడుతుంటారని, దీని వెనుక శామ్ పిట్రోడా సలహాలు ఉంటాయని రాజీవ్ చంద్రశేఖర్ ఆరోపించారు. దురదృష్టకరం: జైరామ్ రమేశ్ శామ్ పిట్రోడా వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ స్పందించారు. ఇండియాలోని వైవిధ్యాన్ని వరి్ణస్తూ పిట్రోడా ప్రస్తావించిన పోలికలు దురదృష్టకరమని పేర్కొన్నారు. అవి ఎంతమాత్రం ఆమోదయోగ్యం కావని చెప్పారు. పిట్రోడా అభిప్రాయాలతో తమ పారీ్టకి ఎలాంటి సంబంధం లేదని తేలి్చచెప్పారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టు చేశారు. -
శామ్ పిట్రోడా మరో దుమారం
న్యూఢిల్లీ: అమెరికాలో అమల్లో ఉన్న వారసత్వ పన్ను తనకు బాగా నచి్చందని, అది న్యాయంగా ఉందని వ్యాఖ్యానించి రాజకీయ వివాదానికి తెరతీసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శామ్ పిట్రోడా ఆ గొడవ సద్దుమణగ ముందే మరో దుమారం సృష్టించారు. దక్షిణ భారతదేశ ప్రజలు అఫ్రికన్లలా ఉంటారని ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పిట్రోడాను సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం తప్పుపట్టారు. తాజాగా ఓ పత్రికకు ఇచి్చన ఇంటర్వ్యూలో శామ్ పిట్రోడా మాట్లాడుతూ... భారత్ విభిన్నమైన దేశం అని అభివరి్ణస్తూ కొన్ని పోలికలను ప్రస్తావించారు. అవే ఆయనను ఇప్పుడు ఇరకాటంలోకి నెట్టేశాయి. ‘‘మనది లౌకిక దేశం. బ్రిటిష్ పాలకులపై మన స్వాతంత్య్ర సమరయోధులు సాగించిన పోరాటాల వల్ల భారత్ లౌకిక దేశంగా ఆవిర్భవించింది. ప్రపంచవ్యాప్తంగా మనది ఉత్తమమైన ప్రజాస్వామ్య దేశం. 75 ఏళ్లుగా ప్రజలు సంతోషకరమైన వాతావరణంలో కలిసిమెలిసి జీవిస్తున్నారు. అక్కడక్కడా జరిగిన చిన్నపాటి గొడవలను పక్కనపెడితే ఇక్కడెంతో వైవిధ్యం, భిన్నత్వం కనిపిస్తాయి. భారత్‌లో ఈశాన్య ప్రాంతాల ప్రజలు చైనీయుల్లా, పశి్చమ ప్రాంతాల జనం అరబ్బుల్లాగా, ఉత్తరాది ప్రజలు శ్వేతజాతీయుల్లాగా, దక్షిణాది ప్రజలు ఆఫ్రికన్లలా కనిపిస్తారు. అది పెద్ద విషయం కాదు. ఏది ఎలా ఉన్నప్పటికీ మనమంతా సోదర సోదరీమణులం. దేశంలోని విభిన్నమైన భాషలు, మతాలు, సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లను మనం పరస్పరం గౌరవించుకుంటున్నాం. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం మన మూలాల్లోనే ఉన్నాయి’’ అని శామ్ పిట్రోడా చెప్పారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. మరోవైపు పిట్రోడా వ్యాఖ్యలతో తమ పార్టీకి సంబంధం లేదని కాంగ్రెస్ వివరణ ఇచ్చింది. పిట్రోడా రాజీనామా.. ఆమోదించిన అధిష్టానం తన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీయడంతో శామ్ పిట్రోడా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ పదవికి బుధవారం రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను కాంగ్రెస్ అధిష్టానం వెంటనే ఆమోదించింది. రాజీనామా చేయాలన్నది పిట్రోడా సొంత నిర్ణయమని కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ చెప్పారు. -
రమేశ్ బిధూరీపై సస్పెన్షన్ వేటు వేయాలి
న్యూఢిల్లీ: లోక్‌సభలో బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరీపై కఠిన చర్యలు తీసుకోవాలని వివిధ ప్రతిపక్ష పారీ్టల నేతలు శనివారం డిమాండ్ చేశారు. బిధూరీపై సస్పెన్షన్ వేటు వేయాలని, సభ నుంచి బహిష్కరించాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. కొందరు స్పీకర్‌కు లేఖ రాశారు. కాగా, రమేశ్ బిధూరీ వ్యాఖ్యల్లో నిజానిజాలు నిగ్గుతేల్చడానికి విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని బీజేపీ ఎంపీ నిషికాంత్ పేర్కొన్నారు. -
బర్నింగ్ టాపిక్
-
కొనసాగుతున్న ప్రకంపనలు.. ప్రవక్తపై వ్యాఖ్యలను ఖండించిన ఇరాక్, లిబియా, మలేసియా, తుర్కియే
దుబాయ్/ఐరాస: మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యల ఉదంతం తాలూకు ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వాటిని ఖండించిన ముస్లిం దేశాల జాబితాలో ఇరాక్, లిబియా, మలేసియా, తుర్కియే కూడా చేరాయి. ఇలాంటి వ్యాఖ్యలు ప్రజల మధ్య చిచ్చు రేపి ఊహించని పరిణామాలకు దారి తీస్తాయని ఇరాక్ మంగళవారం ప్రకటన జారీ చేసింది. అవమానకరమైన ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు లిబియా, మలేసియా పేర్కొన్నాయి. ‘భారత్‌లో పాలక బీజేపీ అధికార ప్రతినిధి చేసిన బాధ్యతారహితమైన వ్యాఖ్యలను’ తీవ్రంగా ఖండిస్తున్నామంటూ ఈజిప్టులోని అరబ్ పార్లమెంటు కూడా ప్రకటన జారీ చేసింది. ప్రవక్తపై ఇలాంటి వ్యాఖ్యలు ముస్లింలందరినీ అవమానించడమేనని తుర్కియే విమర్శించింది. ఈ నేపథ్యంలో కేంద్రం మరోసారి రంగంలోకి దిగింది. సదరు వ్యాఖ్యలు కొందరు వ్యక్తుల బాధ్యతారాహిత్యమే తప్ప భారత ప్రభుత్వ వైఖరిని ప్రతిబింబించేవి కాదని పునరుద్ఘాటించింది. ఇరాక్‌లోని భారత రాయబార కార్యాలయం ఈ మేరకు ప్రకటన జారీ చేసింది. ఐక్యరాజ్యసమితి రోజువారీ మీడియా బ్రీఫింగ్ సందర్భంగా మంగళవారం ఓ పాక్ జర్నలిస్టు కూడా ఈ అంశాన్ని లేవనెత్తారు. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ బదులిస్తూ, మతాల మధ్య పరస్పర సహనం, గౌరవం ఉండాలన్నదే ఐరాస వైఖరి అన్నారు. ‘‘ఈ ఉదంతంపై కథనాలను చూశాను. అయితే వాళ్లు ఏం వ్యాఖ్యలు చేసిందీ నాకు తెలియదు’’ అని చెప్పారు. ప్రభావముండదు: గోయల్ గల్ప్ దేశాలతో భారత సంబంధాలపై ఈ వివాదం ప్రభావం చూపలేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దీనిపై తీవ్రంగా స్పందించిన ముస్లిం దేశాలతో సత్సంబంధాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. గల్ఫ్ దేశాల్లో భారత ఉత్పత్తుల బహిష్కరణ తన దృష్టికి రాలేదన్నారు. అక్కడి భారతీయుల భద్రతపై ఆందోళన అనవసరమన్నారు. నుపుర్‌కు సమన్లు ఓ చానల్లో చర్చ సందర్భంగా ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో జూన్ 22న హాజరై వాంగ్మూలమివ్వాలని సస్పెండైన బీజేపీ నేత నుపుర్‌శర్మకు మహారాష్ట్ర పోలీసులు సమన్లు జారీ చేశారు. ఈ ఉదంతానికి సంబంధించి థానేలో ఆమెపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదైంది. సదరు వ్యాఖ్యల వీడియో క్లిప్పింగులు సమరి్పంచాల్సిందిగా సంబంధిత చానల్‌ను ఆదేశించినట్టు పోలీసులు చెప్పారు. బెదిరింపుల నేపథ్యంలో నుపుర్‌కు, ఆమె కుటుంబానికి ఢిల్లీ పోలీసులు భద్రత కలి్పంచారు. వారికి దిక్కులేని చావే: కాంగ్రెస్ నేత ప్రవక్తపై బీజేపీ తాజా మాజీ నేతల అనుచిత వ్యాఖ్యలను పిచ్చి కుక్కల మొరుగుడుగా కాంగ్రెస్ సీనియర్ నేత అజీజ్ ఖురేషీ అభివర్ణించారు. ‘‘అవి చంద్రునిపై ఉమ్మి వేయడంతో సమానం. వారు చివరికి దిక్కులేని చావు చస్తారు’’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గల్ఫ్ దేశాల్లో భారత వస్తువుల బహిష్కరణను కూడా తప్పుబట్టారు. అగ్ర నేతల ప్రకటనే శరణ్యం! 10 రోజుల క్రితం ఓ టీవీ చానల్ చర్చలో మహ్మద్ ప్రవక్తపై బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ చేసిన అనుచిత వ్యాఖ్యలపై అంతర్జాతీయంగా నిరసనలు నానాటికీ పెరిగిపోతుండటం అంతర్జాతీయంగా భారత్‌కు ఇబ్బందికరంగా మారింది. వాటిని ఖండించిన ముస్లిం దేశాల సంఖ్య 16ను దాటింది. ఈ జాబితాలో యూఏఈ, సౌదీతో పాటు పలు అతి సన్నిహిత మిత్ర దేశాలూ ఉండటంతో ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. పైగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గల్ఫ్ పర్యటనలో ఉన్న సమయంలోనే వివాదం రాజుకోవడం మరింత సమస్యగా మారింది. ఈ రగడ వల్ల వెంకయ్య దోహలో తన ప్రెస్‌మీట్, విందు సమావేశాలను రద్దు చేసుకోవాల్సి వచి్చంది కూడా. ఉద్రిక్తతలను చల్లార్చి పరిస్థితిని చక్కదిద్దేందుకు విదేశాంగ శాఖ వెంటనే రంగంలోకి దిగింది. ఓవైపు ఆయా దేశాల విమర్శలను ఖండిస్తూనే, సదరు వ్యాఖ్యలు భారత్ వైఖరిని ప్రతిబింబించేవి కాదంటూ విడమరిచే ప్రయత్నం చేసింది. అయినా ఇప్పటికీ ముస్లిం దేశాలల్లో నుపుర్ వ్యాఖ్యల కలకలం ఇంకా సద్దుమణగలేదు. ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాలతో కీలక ఆర్థిక తదితర సంబంధాల దృష్ట్యా వివాదానికి వీలైనంత త్వరగా సంతృప్తికరమైన ముగింపునివ్వడం తప్పనిసరి అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘‘విదేశాంగ శాఖ ఎంతగా వివరణలు ఇస్తున్నా గొడవ సద్దుమణుగుతున్నట్టు కని్పంచనందున ప్రభుత్వం తరఫున అత్యున్నత స్థాయిలో ఉన్న నేతలే ముందుకొచ్చి దీనిపై ఓ స్పష్టమైన ప్రకటన చేయాలి. అప్పుడే ముస్లిం దేశాలు శాంతిస్తాయి’’ అని అభిప్రాయపడుతున్నారు. దేశవ్యాప్తంగా ఆత్మాహుతి దాడులు అల్‌కాయిదా హెచ్చరికలు ప్రవక్తపై వ్యాఖ్యలకు ప్రతీకారంగా దేశవ్యాప్తంగా ఆత్మాహుతి దాడులకు పాల్పడతామని ఉగ్ర సంస్థ అల్‌కాయిదా హెచ్చరించింది. ఢిల్లీ, ముంబై, యూపీ, గుజరాత్‌ల్లో దాడులకు దిగుతామంటూ ఓ లేఖ విడుదల చేసింది. ‘‘ప్రవక్తను అవమానించిన వారిని హతమారుస్తాం. మేం, మా పిల్లలు ఒంటినిండా పేలుడు పదార్థాలు చుట్టుకుని వారిని పేల్చేస్తాం. ఢిల్లీ, ముంబై, యూపీ, గుజరాత్‌ల్లోని కాషాయ ఉగ్రవాదులూ! చనిపోయేందుకు సిద్ధంగా ఉండండి’’ అని హెచ్చరించింది. ఆచితూచి మాట్లాడండి.. నేతలకు బీజేపీ ఆదేశం వివాదం నేపథ్యంలో ఇకపై టీవీ చానళ్ల చర్చల్లో అధిష్టానం ఎంపిక చేసిన అధికార ప్రతినిధులు, ప్యానలిస్టులు మాత్రమే పాల్గొనాలని బీజేపీ ఆదేశించింది. ఎవరెవరు పాల్గొనాలో పార్టీ మీడియా విభాగం ఎప్పటికప్పుడు నిర్ణయిస్తుందని చెప్పినట్టు సమాచారం. ‘‘చర్చల్లో ఏ మతాన్నీ, మత చిహ్నాలను, మతాలకు చెందిన వ్యక్తులను విమర్శించొద్దు. గీత దాటొద్దు. భాష విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రెచి్చపోయి, భావోద్వేగాలకు లోనై మాట్లాడొద్దు. ఎవరెంతగా రెచ్చగొట్టినా పార్టీ సిద్ధాంతాలను ఉల్లంఘించేలా ప్రవర్తించొద్దు’’ అంటూ కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. ‘‘మాట్లాడాల్సిన అంశం ఏమిటో ముందే చెక్ చేసుకోండి. దానిపై పార్టీ వైఖరిని అనుగుణంగా బాగా ప్రిపేరయ్యాకే చర్చకు వెళ్లండి. ఎట్టి పరిస్థితుల్లోనూ అజెండాకు కట్టుబడండి. ఎవరి ఉచ్చులోనూ పడి నోరు జారకండి’’ అంటూ పలు విధి నిషేధాలు విధించినట్టు సమాచారం. -
వాచాలతకు మూల్యం ఎంత?
నోటికి మాట తెగులు... నీటికి పాచి తెగులు అని జన వ్యవహారం. టీవీ చర్చల్లో మాట్లాడమన్నారు కదా అని అదుపు తప్పి మాట్లాడితే, అదే ఎదురు తంతుందని ఇద్దరు బీజేపీ నేతలకు ఆదివారం తెలిసొచ్చింది. జ్ఞానవాపి మసీదు వ్యవహారంలో మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు పార్టీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మపై, పార్టీ ఢిల్లీ శాఖ మీడియా హెడ్ నవీన్ జిందాల్‌పై బీజేపీ పెద్దలు సస్పెన్షన్ వేటు వేశారు. ఖతార్, కువైట్, ఇరాన్ సహా పలు అరబ్ దేశాల నుంచి సదరు అభ్యంతర వ్యాఖ్యలకు నిరసన ఎదురవడంతో, అధికార బీజేపీ సొంతపార్టీ వాళ్ళపైనే కొరడా జుళిపించక తప్పని పరిస్థితి వచ్చింది. సదరు అభ్యంతరకర వ్యాఖ్యలు కాన్పూర్ లాంటి చోట్ల శుక్రవారమే హింసాకాండకు దారి తీస్తే, వ్యాఖ్యలు చేసి పదిరోజులవుతున్నా వాటిని ఖండించని అధికారపక్షపు దిలాసా ఆదివారం విదేశాల నిరసనకు కారణమైంది. మరోపక్క పశ్చిమాసియా దేశాల్లో లక్షలాది భారతీయుల ఉద్యోగాలకూ, సూపర్ మార్కెట్లలో భారతీయ ఉత్పత్తులకూ ఉద్వాసన లాంటి వార్తలు వస్తున్నాయి. విద్వేషపు వాచాలతకు ఇదీ మూల్యం! గల్ఫ్‌లోని భాగస్వామ్య దేశాలతో పెరుగుతున్న భారత సంబంధాలకు ఈ వ్యాఖ్యలు ఇబ్బంది తెచ్చాయి. భారత ఉపరాష్ట్రపతి మూడు రోజుల ఖతార్ పర్యటన వేళ మరింత ఇరుకునపెట్టాయి. గల్ఫ్‌లో 90 లక్షల మంది భారతీయులు పని చేస్తున్న సంగతి మర్చి పోతే ఎలా? మనకు అత్యధిక విదేశీ మారక ద్రవ్యం చేకూర్చే తొలి 7 దేశాల్లో 5 గల్ఫ్ దేశాలేనని విస్మరించగలమా? అందుకే, చివరకు అభ్యంతర వ్యాఖ్యలు చేసినవారు ‘ప్రధాన స్రవంతిలో లేని అనధికారిక అతివాద శక్తులు’ అంటూ ప్రభుత్వం పరువు కాపాడుకొనే ప్రయత్నం చేయాల్సి వచ్చింది. నిజానికి, ప్రధాని సోషల్ మీడియాలో ఫాలో అయ్యే నూపుర్ కానీ, నవీన్ కానీ బీజేపీలో భాగమే తప్ప వేరొకటి కాదని ప్రపంచానికీ తెలుసు. చివరకు, బీజేపీ ఆత్మరక్షణలో పడి, అన్ని మతాలూ తమకు సమానమేననీ, వివాదాస్పద వ్యాఖ్యల్ని సమర్థించబోమనీ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. వారిపై వేటు వేయాల్సి వచ్చింది. అయితే, వ్యాఖ్యలు చేసి పది రోజులయ్యాక, అదీ అరబ్ ప్రపంచంతో ముడిపడిన భారత చమురు, వాణిజ్య, దౌత్య ప్రయోజనాల ఒత్తిడితో బీజేపీ ఈపాటి చర్యకు దిగిందన్నది చేదు నిజం. అధికార ప్రతినిధిపై వేటుతో బీజేపీ పిరికిగా వ్యవహరించిందంటూ కాషాయబృందంలో ఓ వర్గం విమర్శ. నిజానికి, ఎన్నికల్లో ఓ పార్టీకి మెజారిటీ ఇచ్చినంత మాత్రాన ప్రతి పనికీ, మాటకూ జనం మద్దతు ఉందనుకోవడం పొరపాటు. కేంద్రంలో వరుసగా రెండు ఎన్నికల్లో బీజేపీ గెలిచాక కాషాయ అజెండాతో స్వామి భక్తులు మైనారిటీ వ్యతిరేక వ్యాఖ్యలకూ, చర్యలకూ దిగడం పెరిగింది. తొలి రోజుల్లోనే పరిస్థితిని అదుపులో పెట్టాల్సిన పెద్దలు వ్యూహాత్మక మౌనం పాటించారు. ఇప్పుడు విషయం ప్రపంచ వేదికపైకి ఎక్కేదాకా వచ్చింది. కాలు జారినా తీసుకోవచ్చేమో కానీ, నోరు జారితే తీసుకోలేమని పాలక పక్షీయులకు పదే పదే గుర్తు చేయాల్సి రావడం దురదృష్టకరం. అయితే, ఇదే అదనుగా పాకిస్తాన్, తాలిబన్ల పాలనలోని అఫ్ఘానిస్తాన్ లాంటి దేశాలు భారత్‌కు సూక్తి ముక్తావళిని వినిపించడానికి ప్రయత్నించడం విడ్డూరం. సామాన్యుల స్వేచ్ఛకే గౌరవమివ్వని దేశాలు భారత్‌ను వేలెత్తి చూపుతూ, ఉపన్యాసాలిచ్చే పరిస్థితి తెచ్చుకోవడం మన స్వయంకృతాపరాధం. ఒక వర్గం అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినంత మాత్రాన, రెండో వర్గం హింసాకాండకు పాల్పడడం ఏ మాత్రం సమర్థనీయం కాదు. వివాదాస్పద వ్యాఖ్యలే సాకుగా వీవీఐపీల పర్యటన వేళ గత శుక్రవారం కాన్పూర్‌లో జరిగిన మత ఘర్షణలు దురదృష్టకరం. దీని వెనుక దేశవ్యాప్తంగా నిద్రాణ రహస్య యంత్రాంగం ఉన్న ‘పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా’ (పీఎఫ్ఐ) లాంటి సంస్థలు ఉన్నాయట. ఇది మరింత ఆందోళనకరం. ఇలాంటివి జరగకుండా తక్షణ, కఠిన చర్యలు తీసుకోక పోతే కష్టం. ఆ మాటకొస్తే – ప్రవక్త మీద వ్యాఖ్యలు చేయడం ఎంత తప్పో, శివలింగాల మీద ఎవ రైనా విపరీత వ్యాఖ్యలు చేస్తే, అవీ అంతే తప్పు. తప్పొప్పుల తరాజు ఎటు మొగ్గిందని చూసే కన్నా, ఈ వ్యాఖ్యల వల్ల దేశ సమైక్యతా చట్రానికి ఎదురయ్యే ముప్పును అర్థం చేసుకోవడం ముఖ్యం. కాన్పూర్ హింసాకాండకు ఒక రోజు ముందర జూన్ 2న ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్ మాట్లాడుతూ, ‘ప్రతి మసీదులో శివలింగాల గురించి వెతికి, తవ్వాల్సిన పని లేదు’ అంటూ స్వయం సేవకులకు హితవు చెప్పారు. దేశంలో ముస్లిమ్‌ల పట్ల విద్వేషానికీ, హిందూ అతివాద సైద్ధాంతి కతకూ మూలకందమని భావించే ఆరెస్సెస్ నుంచి ఆ సంస్థ అధినేత నోట ఇలాంటి మాటలు ఆహ్వానించదగ్గవే. కానీ, గతంలో ప్రార్థనా స్థలాలపై హిందూ, ముస్లిమ్ వివాదాల్లో ఆరెస్సెస్ పోషిం చిన పాత్ర చూశాం. కాబట్టి, భాగవత్ తాజా మాటలను నమ్మగలమా అన్నది విమర్శకుల ప్రశ్న. విద్వేషపూరిత వ్యాఖ్యలు దేశానికీ, దేశ ప్రయోజనాలకూ భంగం కలిగిస్తాయి. ఆ విషయం గల్ఫ్ మిత్ర దేశాలు, చిచ్చురేపి చలి కాచుకుందామని చూస్తున్న పొరుగు దేశాలు చెబితే కానీ అర్థం కాని స్థితిలో మనం ఉన్నామా? ప్రపంచంలో ముస్లిమ్ జనాభా అధికంగా ఉన్న రెండో దేశం మనదే. ప్రజల మధ్య ప్రేమ పంచితే ప్రేమ వస్తుంది. ద్వేషాన్ని పెంచితే ద్వేషమే మిగులుతుంది. ఇవాళ దేశంలో నెలకొన్న అతి సున్నిత పరిస్థితులకు తామెంత కారణమో పాలకుల మొదలు ప్రతిపక్షీయుల దాకా అందరూ ఆత్మ విమర్శ చేసుకోవాలి. మతసామరస్యాన్ని చెడగొట్టేవారిపై తక్షణ, కఠినచర్యలు తీసుకోవాలి. ప్రపంచ వేదికపై భారత గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. -
నేను నలుపే.. కానీ నా ఆలోచనలు తెలుపు: సీఎం
న్యూఢిల్లీ: 200 ఏళ్ల తెల్ల వారి పాలనలో మగ్గిన ఫలితమో.. లేక పాశ్చత్య సంస్కృతి మీద మోజో తెలీదు కానీ మన వారికి తెల్లని శరీర ఛాయ అంటే మహా మోజు. నల్లగా ఉన్న వారిని అంటరాని వారిగా చూస్తారు. శాస్త్ర సాంకేతికపరంగా ఎంత ఎదిగినా.. సంస్కారం పరంగా మరింత దిగజారిపోతున్నాం. ఇక నల్లని శరీర ఛాయ ఉన్న వారు ఎదుర్కొనే అవమానాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిలో సామాన్యుల నుంచి సెలబ్రిటీలు కూడా ఉన్నారు. తాజాగా ఈ జాబితాలోకి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేరారు. పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఆమ్ ఆద్మీ పార్టీని ఉద్దేశించి.. నల్ల ఆంగ్లేయులు అని సంబోధించాడు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ప్రస్తుతం ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. (చదవండి: ప్రతి మహిళకు నెలకు రూ.వేయి ఇస్తాం.. సీఎం ప్రకటన) వచ్చే ఏడాది పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బరిలో దిగేందుకు ఆప్ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య రాజకీయ ఆరోపణలు చేసుకుంటున్నాయి. దానిలో భాగంగా పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ బుధవారం ప్రసంగిస్తూ.. ‘‘కేజ్రీవాల్ చర్మం రంగు నలుపు. కానీ ఆయన తన ఆలోచనలు న్యాయపరమైనవని చెప్పడానికి తెగ ప్రయత్నిస్తున్నారు. 2022లో గెలవడానికి నల్ల ఆంగ్లేయులు తెగ ప్రయత్నిస్తున్నారు’’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. (చదవండి: గతంలో నేనూ ఆటో డ్రైవర్‌నే.. పెండింగ్ చలాన్లు రద్దు చేస్తా: సీఎం) చన్నీ వ్యాఖ్యలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ‘‘నేను నలపు కావొచ్చు. కానీ నా ఆలోచనలు మాత్రం తెలుపు.. అంటే స్వచ్ఛంగా ఉంటాయి’’ అని తెలిపారు. తిరంగ యాత్రలో భాగంగా పఠాన్‌కోటలో పర్యటిస్తున్న కేజ్రీవాల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘నేను వారికి (కాంగ్రెస్) ఒక విషయం సూటిగా చెప్పాలనుకుంటున్నాను. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే సాధారణ దుస్తులు ధరించి, నల్లగా ఉన్న వ్యక్తి అన్ని హామీలను నెరవేరుస్తాడని తెలుపుతున్నాను. నేను తప్పుడు ప్రకటనలు, తప్పుడు వాగ్దానాలు చేయను’’ అని తెలిపారు. చదవండి: మీకు నేనున్నా.. హామీ ఇస్తున్నా: కేజ్రీవాల్ -
‘95 శాతం మంది భారతీయులకు పెట్రోల్ అవసరమే లేదు’
ఉత్తరప్రదేశ్: ఓ వైపు ప్రతిపక్షాలు, మేధావులు పెరుగుతున్న పెట్రో ధరల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుండగా.. మరోవైపు అధికార పార్టీ నాయకులు అడ్డగోలు వ్యాఖ్యలు చేసి జనాలను మరంత రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఇంటికో బండి అనే విధంగా మారాయి పరిస్థితులు. చిన్నాచితకా ఉద్యోగాలు చేసే వారు సైతం బండి కొంటున్నారు. గత పదేళ్లలలో దేశంలో టూ వీలర్, 4 వీలర్ వినియోగం బాగా పెరిగింది. దాంతో పెట్రోల్, డీజిల్ వినియోగం కూడా పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ మినిస్టర్ దేశంలో దాదాపు 95 శాతం మంది ప్రజలకు అసలు పెట్రోల్‌తో పనే లేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. ఆవివరాలు.. (చదవండి: గెలిపిస్తే రూ.60కే లీటర్ పెట్రోల్: బీజేపీ) ఉత్తరప్రదేశ్‌కు చెందిన మినిస్టర్ ఉపేంద్ర తివారి.. జలౌన్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెరుగుతున్న ఇంధన ధరల గురించి ప్రశ్నించగా.. ఉపేంద్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రతిపక్షాలుకు వేరే పనేంలేక ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయి. 2014, అంతకు ముందుతో పోలిస్తే.. ఇప్పుడు మోదీ, యోగి హయాంలో జనాల తలసరి ఆదాయం బాగా పెరిగింది’’ అని తెలిపారు. ‘‘మన సమాజంలో 95 శాతం మందికి పెట్రోల్ అవసరమే లేదు. కేవలం కార్లు ఉన్న 5 శాతం మందికి మాత్రమే పెట్రోల్ ధరల గురించి ఆందోళన. దీనిపై ప్రతిపక్షాలు రాద్దంతం చేస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే 100 కోట్ల కోవిడ్ టీకాలు పంపిణీ చేసింది. కరోనా బారిన పడ్డ వారికి ఉచిత వైద్యం అందిస్తుంది. దీని గురించి ఎవరు మాట్లాడరు’’ అన్నారు. (చదవండి: నిరసన గళం: ఎలక్ట్రిక్ స్కూటర్‌పై సచివాలయానికి దీదీ) మినిస్టర్ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది. ‘‘నీ దృష్టిలో కార్లు ఉన్నవారికే మాత్రమే పెట్రోల్ అవసరం ఉంటుందా.. ఇతర వాహనాలు వాడే వారు నీళ్లతో బళ్లు నడుపుతారా ఏంటి’’.. ‘‘వారిని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్నందుకు మాకు తగిన శాస్తి జరుగుతుంది’’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. చదవండి: మోదీకి చురక: పెట్రోల్ ధరలపై బావమరుదుల భగ్గు -
దళితులపై అనుచిత వ్యాఖ్యలు.. నటి అరెస్ట్
చెన్నై: తమిళ నటి, బిగ్ బాస్ ఫేం మీరా తన విచిత్రమైన వ్యవహర శైలితో తరచూ వార్తల్లో నిలిచే సంగతి తెలిసిందే. ఇతర నటీనటులు, ప్రముఖ రాజకీయ నాయకులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ హాట్‌టాపిక్‌గా మారుతుంటారు. సెలబ్రిటీల గురించి అంటే పర్లేదు కానీ ఈ సారి ఏకంగా ఓ సామాజిక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. తాజాగా దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మీరా మిథున్ని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. దళిత-కేంద్రీకృత పార్టీ అయిన విదుతలై సిరుతైగల్ కట్చి నాయకుడు వన్నీ అరసు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నటిని అరెస్ట్ చేశారు. కొన్ని మీడియా సంస్థల్లో వచ్చిన వార్తల ప్రకారం మీరా మిథున్ దళితుల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడియోను శనివారం సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది కాస్త వైరల్ కావడంతో మీరా మిథున్‌ను అరెస్ట్ చేయాల్సిందిగా నెటిజనులు డిమాండ్ చేశారు. మీరా మిథున్ షేర్ చేసిన వీడియోలో.. ఆమె ఓ డైరెక్టర్ అనుమతి లేకుండా తన ఫోటోని అతడి మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్ కోసం వాడుకున్నాడని ఆరోపించారు. అంతటితో ఊరుకోక.. ‘‘తక్కువ జాతి అనగా దళిత సామాజిక వర్గానికి చెందిన వారి ఆలోచనలు ఇలానే ఉంటాయి. చాలా చీప్‌గా ప్రవర్తిస్తారు’’ అంటూ నోటికొచ్చినట్లు విమర్శించారు. దళితులు నేరాలకు, అంసాఘిక కార్యకలపాలకు పాల్పడటం వల్లనే వారిని సమాజంలో నీచంగా చూస్తున్నారని వ్యాఖ్యానించారు. అంతేకాక తమిళ ఇండస్ట్రీలో ఉన్న దళిత దర్శకులను, నటీనటులను బయటకు గెంటేయాలని సూచించారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజనులు మీరా మిథున్‌సై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమెను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చెన్నై పోలీసులు మీరా మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి.. అరెస్ట్ చేశారు. ఇక మీరా తమిళ్ బిగ్‌బాస్ సీజన్3లో పాల్గొన్నారు. కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించారు. Actress Meera Mithun has used very derogatory term against SC/ST people in her video. This shows her caste conceit mindset. She must be arrested soon. @mkstalin #CrushTheCaste pic.twitter.com/LghONRsKPv — Mission Ambedkar (@MissionAmbedkar) August 7, 2021 -
ఆడాళ్లు డ్రమ్ముల్లా మారుతున్నారు: డీఎంకే నేత
సాక్షి, చెన్నై: మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు కొంతమంది ప్రబుద్ధులు. సామాన్యుల సంగతి పక్కన పెడితే.. ప్రజాప్రతినిధులు సైతం ఇందుకు అతీతులు కారు. సభల్లో, పార్లమెంట్, అసెంబ్లీ వేదికగా స్త్రీల వస్త్రధారణ గురించి ఇష్టారీతిన మాట్లాడి వివాదానికి కారణమైన వారు చాలా మందే ఉన్నారు. తాజాగా వీరి జాబితాలోకి డీఎంకే నాయకుడు ఒకరు చేరారు. విదేశీ ఆవు పాలు తాగుతూ మన ఆడవాళ్లు డ్రమ్ముల్లా మారుతున్నారంటూ మహిళల శరీరాకృతి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలపై ఇతర పార్టీల నాయకులు, మహిళా సంఘాల నేతలు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఆ వివరాలు.. డీఎంకే పార్టీ నాయకుడు దిండిగుల్ లియోని అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం లియోని, కార్తికేయ శివసేనాపతి అనే అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తూ.. మహిళల శరీరాకృతి గురించి అసభ్యకరంగా మాట్లాడారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇందులో.. ‘‘ప్రస్తుతం చాలా రకాలు ఆవులున్నాయి. ఫామ్‌లలో మీరు విదేశీ ఆవులను చూసే ఉంటారు. వీటి పాలను పితకడానికి మెషిన్లను వాడతారు. ఒక్కసారి స్విచ్ వేస్తే.. మెషిన్ గంటలో 40 లీటర్ల పాలు పితుకుంది. ఈ రోజుల్లో మహిళలు ఎక్కువగా ఈ విదేశీ ఆవుల పాలు తాగుతున్నారు. అందుకే వారి శరీరాకృతి మారి.. డ్రమ్ముల్లా తయారవుతున్నారు. గతంలో మహిళలు ‘8’ ఆకారంలో ఉండేవారు. పిల్లల్ని అలవోకగా ఎత్తుకునే వారు. కానీ ఇప్పుడు ఎవరూ అలా కనిపించడం లేదు. లావుగా అయ్యి పిల్లలను ఎత్తుకోలేకపోతున్నారు. దానికి కారణం విదేశీ ఆవు పాలు తాగడమే’’ అంటూ ఇష్టారీతిన ప్రసంగిస్తూ పోయాడు. What a shame.. what milk does he drink? Does he know what happens to women’s body post pregnancy or during hormonal changes? @KanimozhiDMK what do you like to say to this kind of male chauvinist? Is this the respect your party people have on women. https://t.co/7yMf5esqX0 — Gayathri Raguramm (@BJP_Gayathri_R) March 24, 2021 లియోని పక్కనే ఉన్నవారు అతడిని ఆపేందుకు ప్రయత్నించారు. విషయాన్ని పక్కదోవ పట్టించడం కోసం రేషన్ సరఫరాపై మాట్లాడాల్సిందిగా లియోనికి సూచించారు. అతడు కాసేపు దాని మీద ప్రసంగించి మళ్లీ టాపిక్‌ను ఆడవారి వద్దకే తెచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్ల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు సైతం తీవ్రంగా విరుచుకుపడుతున్నాయి. కాగా గతంలోనూ లియోని అనేక సార్లు మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
వివాదాల్లో మేయర్ గద్వాల్.. సోషల్ మీడియాలో విమర్శలు
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ మేయర్‌గా పదవీబాధ్యతలు స్వీకరించి ఇంకా నెలరోజులు కాలేదు...అప్పుడే గద్వాల్ విజయలక్ష్మి వార్తల్లో వ్యక్తిగా మారారు. ఆమె మాటలు, చేతలు ఎందుకనోగానీ వివాదాస్పదంగా మారుతున్నాయి. ముఖ్యంగా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మేయర్ హోదాలో ఒక టీవీ చానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వరదలపై చేసిన వ్యాఖ్యలు, అందుకు ఆమె ప్రతిస్పందన జనం ఇంకా మరచిపోక ముందే జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఎన్నికల కరపత్రాల పంపిణీ వివాదానికి తావిచ్చింది. తాజాగా క్యాంప్ ఆఫీస్‌కు (ఇంటికి) 25 కేవీ జనరేటర్ కావాలంటూ కమిషనర్‌కు నోట్ పెట్టడం దుమారం రేపుతోంది. ఓవైపు ప్రభుత్వం 24 గంటలపాటు కోతల్లేని నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెబుతుంటే, తరచూ విద్యుత్ కోతల వల్ల పనులకు అంతరాయం కలుగుతూ, రోజువారీ పనుల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ‘నోట్’లో పేర్కొన్నారు. ఈ నెల 2వ తేదీన ఆమె రాసిన ఈ నోట్ కాపీ వాట్సప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతోంది. దీంతో, శుక్రవారం సాయంత్రం వివరణనిస్తూ మేయర్ విజయలక్ష్మి పత్రికా ప్రకటన జారీ చేశారు. తన నివాసం వద్ద విద్యుత్లైన్ల నిర్మాణానికి తవ్వకాలు జరుగుతున్నందున విద్యుత్ అంతరాయం కలుగుతోందని, అందువల్లే తాత్కాలికంగా విద్యుత్ జనరేటర్ ఏర్పాటు చేయాల్సిందిగా కమిషనర్‌ను కోరినట్లు పేర్కొన్నారు. అంతేతప్ప నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉందని తాను పేర్కొన్నట్లుగా కొన్ని ప్రసారమాధ్యమాల్లో వస్తున్న కథనాలు అవాస్తవమని, ప్రజలను తప్పుదారి పట్టించేవిధంగా ఉన్న వీటిపై తానూ తీవ్ర వ్యధ చెందుతున్నానని వివరించారు. బయటకు పొక్కడంపై ఆరా.. ఇదిలా ఉండగా, కమిషనర్‌కు మేయర్ పంపిన నోట్ ప్రతి బయటకు ఎలా వెళ్లిందని జీహెచ్ఎంసీ అధికారులు ఆరా తీస్తున్నారు. సదరు సదుపాయం సమకూర్చేందుకుగాను నోట్ కాపీ ఎవరెవరి దగ్గరకు వెళ్లింది..ఎక్కడ లీకై ఉంటుందా అని ఆరా తీస్తున్నారు. మేయర్ గౌరవ వేతనం రూ.50 వేలు, కార్పొరేటర్లకు రూ.6 వేలు పాలకమండలి సభ్యుల జీతభత్యాలూ చర్చనీయాంశంగా మారాయి. కార్పొరేటర్లకు నెలకు రూ.6 వేల గౌరవ వేతనం ఉండగా, మేయర్‌కు రూ.50 వేలు, డిప్యూటీ మేయర్‌కు రూ.25 వేలుగా ఉంది. రూ.4 వేల ఫోన్‌బిల్లుతోపాటు కార్పొరేటర్ కుటుంబానికి రూ.5 లక్షల వరకు మెడికల్ ఇన్సూరెన్స్ సదుపాయం ఉంటుంది. మేయర్, డిప్యూటీ మేయర్లకు వాహనాల సదుపాయంతోపాటు కార్యాలయ ఖర్చులు కూడా చెల్లిస్తున్నారు. తమ గౌరవ వేతనాలు పెంచాల్సిందిగా గత పాలకమండలి నుంచే కార్పొరేటర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గౌరవ వేతనమనేది జీతం కాదని, ప్రజాసేవ చేస్తామని వచ్చేవారు ఎక్కువగా ఆశించవద్దని అభిప్రాయపడుతున్న వారూ ఉన్నారు. పన్నులు వసూలు చేయొద్దు: బీజేపీ కార్పొరేటర్లు గత సంవత్సరం నుంచి కరోనా వల్ల ప్రజల ఆర్థిక పరిస్థితులు దిగజారినందున ఆస్తిపన్ను వసూళ్లు, ట్రేడ్‌లైసెన్సుల ఫీజులు వసూలు చేయరాదని బీజేపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. ఈమేరకు వారు శుక్రవారం జీహెచ్ఎంసీ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. చదవండి: మేయర్ అసంతృప్తి.. అస్సలు బాలేదంటూ కామెంట్ -
ఆసీస్ క్రికెటర్‌పై షేన్ వార్న్ అసభ్యకర వ్యాఖ్యలు
సిడ్నీ: ఆస్ట్రేలియా మాజీ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ క్రికెటర్‌గా ఎంత పేరు సంపాదించాడో.. వివాదాల్లోనూ అంతే పేరు మూటగట్టుకున్నాడు. తాజాగా సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో రెండో రోజు మొదటి సెషన్లో వార్న్ మరో మాజీ ఆటగాడు ఆండ్రూ సైమండ్స్‌తో కలిసి కామెంటరీ చేశాడు. ఈ సందర్భంగా ఆసీస్ బ్యాట్స్‌మన్ మార్నస్ లబుషేన్‌పై వార్న్ అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. లబుషేన్ క్రీజులో చూపిస్తున్న మేనరిజమ్స్పై సైమండ్స్ ఏదో చెప్పగా..వార్న్ దానికి అడ్డుపడుతూ..'జీసస్..చూడడానికి చాలా ఇబ్బందిగా ఉంది..మొదట బ్యాట్‌ను సరిగా పట్టుకోమను' అంటూ దూషించాడు. లబుషేన్‌పై వార్న్ చేసిన వ్యాఖ్యలను సైమండ్స్ సమర్థిస్తూ ఒక బూతు పదాన్ని ఉపయోగించాడు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణను లెన్నీ పిలిఫ్స్ తన ట్విటర్లో షేర్ చేశాడు. వార్న్‌కు ఎవరైనా ఒక్కటే.. తనకు నచ్చకపోతే ప్రత్యర్థి ఆటగాళ్లను ఎంతలా ద్వేషిస్తాడో.. సహచర క్రికెటర్లను కూడా అదే తీరుతో చూస్తాడంటూ కామెంట్లు పెడుతున్నారు.(చదవండి: 'తొందరపడ్డావు.. కొంచెం ఆగుంటే బాగుండేది') Ahh Kayo, thank you for this pic.twitter.com/Jy6PfTpvYK — Lenny Phillips (@lenphil29) January 8, 2021 లెజెండరీ స్పిన్నర్‌గా పిలవబడే వార్న్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో చాలా ముందుంటాడు. తాను క్రికెట్ ఆడే సమయంలో స్టీవ్ వా, పాంటింగ్ కెప్టెన్సీలో ప్రత్యర్థి ఆటగాళ్లపై బాహంటగానే స్లెడ్జింగ్‌కు దిగేవాడు. ప్రొఫెషనల్‌గా మాత్రమే గాక వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నోసార్లు వివాదాలకు కేంద్ర బిందువుగా మారాడు. ఈ మధ్యనే టీమిండియా, ఆసీస్‌ల మధ్య తొలి టెస్టు సమయంలో చతేశ్వర్ పుజారాను టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. పుజారా పేరు పలకడం తనకు ఇబ్బందిగా ఉంటుందని.. అందుకే అతన్ని స్టీవ్ అని పిలుస్తానని చెప్పాడు. దీనిపై సోషల్ మీడియాలో షేన్ వార్న్‌ను నెటిజన్లు ఒక రేంజ్లో ఆడుకున్నారు. దీంతో షేన్ వార్న్ దెబ్బకు దిగివచ్చి తాను చేసిన పనికి క్షమాపణ చెప్పుకోవాల్సి వచ్చింది.(చదవండి: రిషభ్ పంత్‌పై ట్రోలింగ్.. సైనీ తొలి వికెట్) -
అసమర్థుడు.. పనికిరాని వాడు!
జైపూర్ : తిరుగుబాటు నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్‌పై రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ సోమవారం తీవ్ర స్థాయిలో మాటల దాడి చేశారు. ‘అసమర్ధుడు, పనికిరాని వాడు’ అంటూ నోరు చేసుకున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉండగా పైలట్ పార్టీ కోసం ఏమీ చేయలేదని హిందీలో ‘నాకారా, నికమ్మా’ అంటూ దూషణలకు దిగారు. అయినా, పార్టీ పరువును దృష్టిలో పెట్టుకుని ఎవరూ ఏమీ మాట్లాడలేదని, పీసీసీ చీఫ్‌ను మార్చాలని కోరలేదని వివరించారు. పైలట్ పేరును ప్రస్తావించకుండా, మాజీ యువ సహచరుడు అంటూ సంబోధించారు. ‘నేనేమైనా కూరగాయాలు అమ్మడానికి వచ్చానా? ముఖ్యమంత్రి కావడానికే వచ్చాను అనేవాడు’ అంటూ పైలట్‌పై విమర్శలు గుప్పించారు. ‘ఒక పీసీసీ అధ్యక్షుడు పార్టీకి వెన్నుపోటు పొడవడం బాధాకరం. నా ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి బీజేపీ చేస్తున్న కుట్ర ఫలించదు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీనే అది దెబ్బతీస్తుంది’ అని గహ్లోత్ మండిపడ్డారు. సాధారణంగా బీజేపీ, బీజేపీ ప్రభుత్వాల తరఫున న్యాయస్థానాల్లో వాదించే ముకుల్ రోహత్గీ, హరీశ్ సాల్వేలు పైలట్ తరఫున హైకోర్టులో వాదించడాన్ని గహ్లోత్ ప్రస్తావించారు. వారి ఫీజు కోట్లలో ఉంటుందని, ఆ మొత్తాన్ని పైలట్ స్వయంగా చెల్లిస్తున్నారా? అని ప్రశ్నించారు. 30 కోట్లా.. 35 కోట్లా? బీజేపీలో చేరాలని కోరుతూ తనకు పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చేందుకు పైలట్ ప్రయత్నించారని కాంగ్రెస్ ఎమ్మెల్యే గిరిరాజ్ సింగ్ మలింగ ఆరోపించారు. ‘పైలట్‌జీ నాతో మాట్లాడారు. బీజేపీలో చేరాలని అడిగారు. పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తామన్నారు. బీజేపీలో చేరడం నాకు ఇష్టం లేదని చెప్పాను’ అని వివరించారు. ఈ విషయాన్ని వెంటనే సీఎం గహ్లోత్ దృష్టికి తీసుకువెళ్లానన్నారు. ఎంత మొత్తం ఇస్తామన్నారు? రూ. 30 కోట్లా లేక రూ. 35 కోట్టా? అని ప్రశ్నించగా.. ప్రస్తుతం నడుస్తున్న రేటే అంటూ సమాధానమిచ్చారు. ఇవి నిరాధారమని, తన ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఈ ఆరోపణలు చేస్తున్నారని సచిన్ పైలట్ చెప్పారు. ముందస్తు అనుమతితోనే సీబీ‘ఐ’ దర్యాప్తుల విషయంలో సీబీఐకి ఇచ్చిన ‘సాధారణ అనుమతి’ని రాజస్తాన్ ప్రభుత్వం తాజాగా ఉపసంహరించుకుంది. ఇకపై దాడులు చేయాలన్నా, ఎటువంటి విచారణ జరపాలన్నా, కేసుల వారీగా సీబీఐ ముందుస్తుగా రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కాగా, గహ్లోత్ ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర పన్నారని పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ తెరపైకి తెచ్చిన ఆడియో టేప్‌లు నకిలీవని కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మరోసారి పేర్కొన్నారు. -
'జిన్నానా? భారతమాతానా? తేల్చుకోండి'
ఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నకొద్దీ అక్కడి రాజకీయ నేతల్లో మరింత దూకుడు పెరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీని పాకిస్తాన్ తో, బీజేపీని ఇండియాతో పోల్చుతూ.. ఫిబ్రవరి 8న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఢీకొనబోతున్నాయంటూ బీజేపీ నేత కమల్ మిశ్రా వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘం ఆయనకు నోటీసులిచ్చిన సంగతి మరువక ముందే ఢిల్లీ బీజేపీ ఇన్ చార్జిగా వ్యవహరిస్తోన్న కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఢిల్లీలోని షాహిన్‌బాగ్‌లో ఏర్పాటు చేపిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ప్రకాశ్ జవదేకర్ మాట్లాడారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా ఢిల్లీలోని షాహీన్ బాగ్‌లో డిసెంబర్ నుంచి నిరవధిక నిరసనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ అంశాన్ని ఎన్నికలకు ముడిపెడుతూ.. ఆ ఉద్యమం వెనుక చీకటి శక్తులు ఉన్నాయని, ఆ చీకటి శక్తులకు ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీలు అండగా నిలిచాయని కేంద్ర మంత్రి జవదేకర్ ఆరోపించారు. షాహీన్ బాగ్ లో నిరసనకారులు.. జిన్నా కోరిన స్వాతంత్ర్యం(జిన్నా వాలీ ఆజాదీ) అంటూ నినాదాలు చేస్తున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ జిన్నా కావాలో? భారతమాతకు జై అంటారో ఢిల్లీ ఓటర్లు నిర్ణయించుకోవాలని జవదేకర్ పేర్కొన్నారు. (ఫిబ్రవరి 8న భారత్-పాక్ పోరు : కపిల్ మిశ్రా) -
‘ఎంతో పుణ్యం చేస్తేనే బ్రాహ్మణుడిగా పుడతాడు’
తిరువనంతపురం: కేరళ హై కోర్టు న్యాయమూర్తి ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొంటున్నారు. అయితే ఇక్కడ ఆయన ఎవరిని కించపర్చలేదు.. కానీ ఓ సామాజిక వర్గం వారిని కీర్తించడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేరళకు చెందిన వి.చింతాబరేష్ హై కోర్టు న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్నారు. రాజ్యాంగబద్దంగా ఒక ఉన్నత పదవిలో ఉన్న ఆయన.. ఏ సామాజిక వర్గానికి అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. కానీ ఆ విషయాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా.. బ్రాహ్మణుల గుణగణాలను కీర్తించడంలో మునిగిపోయాడు చింతాబరేష్. వివరాలు.. కొద్ది రోజుల క్రితం చింతాబరేష్ తమిళ్ బ్రాహ్మణ్స్ గ్లోబల్ మీట్‌కు హాజరయ్యారు. సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ‘పూర్వజన్మ సుకృతం ఉంటేనే బ్రాహ్మణుడిగా పుడతారు. బ్రాహ్మణుడు ద్విజుడు.. అంటే రెండు జన్మలు కలవాడు. శుభ్రమైన అలవాట్లు, ఉన్నతమైన ఆలోచనలు, గొప్ప వ్యక్తిత్వం, శాఖహారి, కర్ణాటక సంగీతాన్ని ఇష్టపడే లక్షణాలన్ని ఒక్క బ్రాహ్మణుడిలో మాత్రమే ఉంటాయి. గత జన్మలో ఎన్నో మంచి పనులు చేస్తేనే ఈ బ్రాహ్మణ జన్మ లభిస్తుంది. ఇంత ఉన్నతులైన బ్రాహ్మణులకు సమాజంలో సముచిత స్థానం దక్కడం లేదు. వారు మేలుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. కుల ఆధారిత రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బ్రాహ్మణులు ఆందోళన చేయాలని’ ఈ సందర్భంగా చింతాబరేష్ పిలుపునిచ్చారు. దేశంలో ఉన్నతమైన పదవి దక్కించుకోవడానికి బ్రాహ్మణులకే ఎక్కువ అర్హతలు ఉన్నాయన్నారు చింతాబరేష్. బ్రాహ్మణ సమాజంలోకి ఇతరులను అనుమతించకూడదన్నారు. బ్రాహ్మణుడు స్వచ్ఛమైన లౌకికవాది.. ప్రజలను ప్రేమిస్తూ.. వారి శ్రేయస్సు కోసం ఉదారంగా విరాళాలు ఇచ్చేవాడు. అలాంటి వాడు అధికారంలో ఉండే జనాలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం న్యాయమూర్తి వ్యాఖ్యల పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
‘మాకు భావ ప్రకటన స్వేచ్ఛ లేదా?’
దిస్పూర్ : సోషల్ మీడియా వేదికగా అస్సాం ముఖ్యమంత్రిపై విమర్శలు చేసిన బీజేపీ కార్యకర్తను గువాహటి పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. మారిగన్ జిల్లాకు చెందిన నీతు బోరా అస్సాం బీజేపీ సోషల్ మీడియా టీంలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో సీఎం సర్బానంద సోనోవాల్ పనితీరును విమర్శిస్తూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు చేశాడు. రాష్ట్రంలో బీజేపీ సర్కారు ముస్లిం వలసదారుల నుంచి స్థానిక ప్రజలను రక్షించడంలో విఫలమైందని ఆరోపించాడు. దీనికి ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ కారణమంటూ నీతు బోరా సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు. అంతేకాక జలుక్ బరి నియోజక వర్గానికి చెందిన హిమంత బిస్వా శర్మను నూతన హోం శాఖ మంత్రిగా నియమించాలని డిమాండ్ చేస్తూ నీతు బోరా ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. ఇవి కాస్తా వైరల్‌గా మారడంతో పోలీసులు నీతు బోరాతో పాటు మరో ముగ్గురు వ్యక్తులను గురువారం అదుపులోకి తీసుకున్నారు. అంతేకాక బుధవారం అర్థరాత్రి బీజేపీ ఐటీ సెల్ మెంబర్‌గా పనిచేస్తున్న హేమంత బరువా అనే వ్యక్తి ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. అయితే సొంత పార్టీ కార్యకర్తల్ని అరెస్ట్ చేయడం పట్ల బీజేపీపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతర్గత ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే బీజేపీ పెద్దలు వాక్ స్వాతంత్ర్య హక్కును ఎందుకు కాలరాస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. పోలీసుల అదుపులో ఉన్నవారు తమ అసంతృప్తిని వెలిబుచ్చారే తప్ప ఎవరినీ కించపరచలేదంటున్నారు. అరెస్ట్ చేసిన కార్యకర్తల్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా కొన్ని రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్ట్‌ను షేర్ చేశారని ఆరోపిస్తూ.. ఢిల్లీకి చెందిన ఓ జర్నలిస్ట్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
గాడ్సే దేశ భక్తుడైతే గాంధీ జాతి వ్యతిరేకా?
అగర్ మాల్వా, ఉజ్జయిని, భోపాల్/న్యూఢిల్లీ: బీజేపీ నేత, ఆ పార్టీ భోపాల్ లోక్‌సభ అభ్యర్థి, మాలెగావ్ పేలుళ్ల కేసులో నిందితురాలు సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సేని దేశభక్తుడిగా అభివర్ణించారు. దీంతో గాడ్సే దేశ భక్తుడైతే మహాత్మా గాంధీ జాతి వ్యతిరేకా అని విపక్ష నేతలు మండిపడ్డారు. ఇటీవల రెండుసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రజ్ఞా సింగ్ గురువారం మధ్యప్రదేశ్‌లోని అగర్ మాల్వాలో రోడ్ షో సందర్భంగా తాజా వివాదానికి తెరతీశారు. ఓ న్యూస్ చానెల్‌తో మాట్లాడుతూ.. గాడ్సే దేశ భక్తుడని, ఆయన ఎప్పటికీ దేశ భక్తుడిగానే ఉంటారని అన్నారు. ఆయన్ను ఉగ్రవాది అంటున్నవారు తమను తాము ఒకసారి పరీక్షించుకోవాలన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు వారికి సరైన గుణపాఠం చెబుతారన్నారు. స్వతంత్ర భారత తొలి ఉగ్రవాది హిందూ అంటూ గాడ్సేని దృష్టిలో ఉంచుకుని రాజకీయ నేతగా మారిన నటుడు కమల్‌హాసన్ చేసిన వ్యాఖ్యలపై అడిగిన ప్రశ్నకు.. ప్రజ్ఞ ఈ విధంగా జవాబిచ్చారు. ప్రజ్ఞ వ్యాఖ్యలపై కాంగ్రెస్, ఎన్సీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ మండిపడ్డాయి. బీజేపీ అసలు రంగు బయటపడిందని ధ్వజమెత్తాయి. ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో బీజేపీ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ప్రజ్ఞ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపింది. క్షమాపణ చెప్పాల్సిందిగా ప్రజ్ఞను ఆదేశించింది. దీంతో క్షమాపణ చెప్పిన ఆమె తాను చేసిన వ్యాఖ్యలను సైతం ఉపసంహరించుకున్నారు. భోపాల్‌లో మే 12న ఎన్నికల ప్రచారం ముగించిన ప్రజ్ఞ.. 19న ఎన్నికలు జరగబోయే మాల్వా ప్రాంతంలో పార్టీ ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీ అసలు రంగు బయటపడింది: ఎన్సీపీ అమిత్ షా నేతృత్వంలోని బీజేపీ అసలు రంగును ప్రజలిప్పుడు చూస్తున్నారని మహారాష్ట్ర ఎన్సీపీ చీఫ్ జయంత్ పాటిల్ ట్విట్టర్లో పేర్కొన్నారు. గాంధీని చంపిన గాడ్సే.. ప్రజ్ఞ పేర్కొన్నట్టుగా దేశ భక్తుడేనా? అన్న సంగతి ప్రధాని మోదీ స్పష్టం చేయాలన్నారు. మాలెగావ్ పేలుళ్ల నిందితురాలు కూడా ఉగ్రవాది గాడ్సే కోవలోకే వస్తారని ఎన్సీపీ ప్రధాన కార్యదర్శి జితేంద్ర అవ్హద్ అన్నారు. గాడ్సే దేశ భక్తుడైతే మహాత్మా గాంధీ జాతి వ్యతిరేకా అని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ట్విట్టర్లో ప్రశ్నించారు. ఆ వ్యాఖ్యలతో పూర్తిగా విభేదిస్తున్నామన్న బీజేపీ ప్రజ్ఞ వ్యాఖ్యలతో తాము పూర్తిగా విభేదిస్తున్నామని బీజేపీ పేర్కొంది. మహాత్మా గాంధీ హంతకుడు దేశభక్తుడు కాలేడని తెలిపింది. ఆమె అలాంటి ప్రకటన ఎలా చేశారో వివరణ కోరతామని ఆ పార్టీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు తెలిపారు. అభ్యంతరకరమైన వ్యాఖ్యలకు గాను క్షమాపణ చెప్పడం సమంజసమని పేర్కొన్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ప్రజ్ఞ క్షమాపణలు చెప్పడం నెలలో రెండోసారి. గతంలో కర్కరేపై చేసిన వ్యాఖ్యలకు కూడా ఆమె క్షమాపణ చెప్పారు. తాజా వ్యాఖ్యలకు సైతం ఆమె క్షమాపణలు చెప్పినట్లు ఆమె ప్రతినిధి, బీజేపీ నేత డాక్టర్ హితేష్ బాజ్‌పాయ్ తెలిపారు. ప్రజ్ఞ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారని కూడా ఆయన చెప్పారు. గతంలోనూ... ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కలకలం సృష్టించారు. ఐపీఎస్ అధికారి, ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కరే తాను పెట్టిన శాపంతోనే ముంబై ఉగ్రదాడుల్లో మరణించారని అన్నారు. ఏటీఎస్ చీఫ్‌గా మాలెగావ్ పేలుళ్ల కేసు విచారించిన కర్కరే తనను హింసించారని ప్రజ్ఞ అప్పట్లో ఆరోపించారు. 1992లో అయోధ్యలో బాబ్రీ మసీదు విధ్వంసంలో పాల్గొన్నందుకు గర్వపడుతున్నానని మరోసారి వ్యాఖ్యానించారు. అది బీజేపీ డీఎన్ఏలోనే ఉంది : కాంగ్రెస్ ప్రజ్ఞ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. మోదీ, అమిత్ షాల అభిమాన బీజేపీ నేత ప్రజ్ఞా సింగ్ మరోసారి జాతి యావత్తును అవమానించారని పేర్కొంది. హింసా సంస్కృతి, అమరులను కించ పరచడమనేది బీజేపీ డీఎన్ఏలోనే ఉందని విమర్శించింది. ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రజ్ఞా సింగ్‌ను దండించాలని కాంగ్రెస్ పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ప్రధానిని కోరారు. బీజేపీ నేతలు గాడ్సే వారసులనేది స్పష్టమయ్యిందని అన్నారు. వారు గాడ్సేని దేశ భక్తుడని, వీర మరణం పొందిన కర్కరేని దేశ ద్రోహి అని అంటారన్నారు. తమ నేతల ద్వారా బీజేపీ.. జాతిపిత సిద్ధాంతాలు, ఆలోచనా విధానంపై ‘హానికారక దాడులు’ చేస్తూనే ఉందని ఆరోపించారు. ‘ఇది గాంధేయ సూత్రాలను కించ పరిచేందుకు జరుగుతున్న కుట్ర. దేశం క్షమించజాలని క్షమాపణార్హం కాని నేరం..’ అని అన్నారు. మోదీకి ఎంత మాత్రం తెలివి ఉన్నా ప్రజ్ఞా సింగ్‌ను దండించి, దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భోపాల్‌లో బీజేపీ ప్రత్యర్థి, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ సింగ్ కూడా ప్రజ్ఞ వ్యాఖ్యలపై మండిపడ్డారు. గాడ్సేని ప్రశంసించడం దేశ భక్తి కాదని, అదొక జాతి వ్యతిరేక చర్య అని అన్నారు. మోదీ, అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
‘నువ్వు రోజుకు వందసార్లు స్నానం చేసినా వేస్టే’
బెంగళూరు : ఇన్నాళ్లు అందానికి సంబంధించిన విమర్శలు కేవలం గ్లామర్ ఫీల్డ్‌లో మాత్రమే కనిపించేవి. కానీ ఈ సారి ఎన్నికల్లో మాత్రం కొందరు నాయకులు ప్రత్యర్థుల ముఖారవిందం గురించి విమర్శలు చేయడం గమనార్హం. కొన్ని రోజుల క్రితం కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి.. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ.. బహిరంగ సభకు హాజరవ్వడానికి ముందు మోదీ మేకప్ చేసుకుంటారని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే రాజూ కాగే ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘కుమారస్వామి.. మోదీ జనాల్లోకి వచ్చే ముందు పది సార్లు పౌడర్ రాసుకుంటారని... రోజుకు పది జతల బట్టల మారుస్తారని ఆరోపిస్తున్నారు. అరే మోదీ అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. ఆయనకు మేకప్ అవసరం లేదు. అదే మీరు రోజుకు 100 సార్లు స్నానం చేసినా వేస్టే.. మీరు బర్రెలానే కనిపిస్తారు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాజు వ్యాఖ్యలు కన్నడ నాట వివాదాన్ని రాజేస్తున్నాయి. గతంలో కుమారస్వామి మోదీని ఉద్దేశిస్తూ.. జనాల్లోకి రావడానికంటే ముందు మోదీ మేకప్, వ్యాక్సింగ్ చేసుకుని వస్తారు. అందుకే ఆయన ముఖం మీద ఆ మెరుపు అలానే ఉంటుంది. అదే మన విషయం తీసుకుంటే.. ఈ రోజు ఉదయం స్నానం చేస్తే.. తిరిగి మరునాటి ఉదయమే స్నానం చేసి మొహం కడుగుతాం. దాంతో మన మొహాలు కెమరాలో సరిగా కనపడవు. అందుకే మీడియా మిత్రుల మన ముఖాలను ప్రసారం చేయడానికి ఆసక్తి చూపరు. కేవలం మోదీని మాత్రమే ప్రసారం చేస్తారు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. -
మోదీపై విజయశాంతి వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార తార విజయశాంతి ప్రధాని నరేంద్ర మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శనివారం శంషాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో విజయశాంతి మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై ఆమె నిప్పులు చెరిగారు. ప్రధాని మోదీ టెర్రరిస్టులా ప్రజలను భయపెడుతున్నారని ఆమె విమర్శించారు. ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి ప్రజలను రక్షించాల్సింది పోయి భయపెడుతున్నారని ఆరోపించారు. రానున్న లోకసభ ఎన్నికలు కాంగ్రెస్-బీజేపీకి మధ్య జరిగే యుద్ధమంటూ విజయశాంతి అభివర్ణించారు. మోదీ చేతిలో కేసీఆర్ రిమోట్ దమ్ముంటే అరెస్టు చేయ్.. మోదీకి సవాల్! ప్రజాస్వామ్యం బతకాలని రాహుల్ గాంధీ పోరాడుతున్నారని, అయితే మోదీ దాన్ని ఖూనీ చేసి, నియంతలా పాలించి, మరోసారి గద్దెనెక్కాలనుకుంటున్నారని అన్నారు. మోదీ చూస్తుంటే ప్రతి ఒక్కరికి భయం వేస్తోందని, మోదీ ఎప్పుడు ఏం బాంబు వేస్తారో అని దేశ ప్రజలు వణికిపోతున్నారన్నారు. పెద్దనోట్ల రద్దు మొదలు.. జీఎస్టీ, పుల్వామా ఉగ్రదాడి వరకూ ఇదే పరిస్థితి అన్నారు. ఇప్పటికైనా ప్రజలు ఆలోచించి మోదీని గద్దె దింపాలని విజయశాంతి పిలుపునిచ్చారు. కాగా ఇదే సభలో తెలంగాణ సీఎం కేసీఆర్‌పై విమర్శల వర్షం కురిపించారు. మోదీ, కేసీఆర్ కుమ్మకైయ్యారని విజయశాంతి ఆరోపించారు. -
ఆమె బుర్రలేని కలెక్టర్ : ఎమ్మెల్యే
తిరువనంతపురం : అక్రమ నిర్మాణాన్ని ఆపడానికి ప్రయత్నించిన ఓ మహిళా ఐఏఎస్ అధికారిని బుర్ర లేదంటూ సీపీఎం నాయకుడు అవమానించారు. గత శుక్రవారం జరిగిన ఈ సంఘటన విజువల్స్ ప్రస్తుతం టీవీల్లో ప్రసారం అవుతుండటంతో సదరు ఎమ్మెల్యే వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. వివరాలు.. మున్నార్ హిల్ స్టేషన్లో ప్రాంతంలో అక్రమంగా నిర్మిస్తున్న ఓ భవన నిర్మాణాన్ని అడ్డుకున్నారు సబ్ కలెక్టర్ రేణు రాజ్. ఆమె చర్యలను వ్యతిరేకించిన సీపీఎం ఎమ్మెల్యే ఎస్ రాజేంద్రన్ ఓ ప్రజా కార్యక్రమంలో సబ్ కలెక్టర్‌ను ఉద్దేశిస్తూ ‘ఆమెకు బ్రెయిన్ లేదు. పంచాయతి నిర్మాణ పనుల్లో ఒక కలెక్టర్ జోక్యం చేసుకోవడానికి వీలు లేదు. ఇంత చిన్న విషయం ఆమెకు తెలియకపోవడం దారుణం. వీళ్లంతా కేవలం కలెక్టరు పోస్టోకు అర్హత సాధించే చదువులను మాత్రమే చదువుతారు. వారి బుర్ర కూడా అలానే ఉంటుంది. ప్రజస్వామ్య దేశంలో ఇలాంటి వారు ఉండటం మన ఖర్మ’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విజువల్స్ టీవీల్లో ప్రసారం కావడంతో రాజేంద్రన్ వ్యాఖ్యల పట్ల వివాదం చేలరేగుతోంది. ఈ విషయం గురించి సబ్ కలెక్టర్ రేణు మాట్లాడుతూ.. ‘అక్రమ నిర్మాణాన్ని ఆపండంటూ ఈ నెల 6న సదరు పంచాయతీ అధికారులకు మెమో కూడా జారీ చేశాం. కానీ వారు ప్రభుత్వ ఆదేశాలను లెక్క చేయకుండా నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారు. అందుకే వారి మీద చర్యలు తీసుకోవాల్సి వచ్చింద’ని తెలిపారు. ఈ వివాదంలో రెవెన్యూ మినిస్టర్ చంద్రశేఖరన్ కూడా రేణుకు మద్దతు తెలిపారు. సబ్ కలెక్టర్ తీసుకున్న చర్యలు చట్టబద్దమైనవే అన్నారు. -
సూర్యను పెళ్లాడాలని ఉంది : నటి
కొందరు హీరోయిన్లు కావాలనే సమస్యలను కొని తెచ్చుకుంటారు. వివాదాస్పద వ్యాఖ్యలతో ఫ్రీ ప్రచారం పొందాలని ప్రయత్నించి ఇరకాటంలో పడుతుంటారు. వర్ధమాన నటి యాషికా పరిస్థితీ ఇదే. ‘ఇరుట్టు అరైయిల్ మురట్టు కుత్తు’ చిత్రంలో అశ్లీల సన్నివేశాల్లో నటించి పాపులర్ అయిన ఈ అమ్మడు ఇటీవల బిగ్‌బాస్–2 గేమ్ షోలో పాల్గొని అక్కడ జుగుప్సాకరమైన దుస్తులు ధరించి విమర్శలకు గురైంది. నటుడు మహత్తో ప్రేమ కలాపాలు అంటూ మరోసారి రచ్చకు దారి తీసింది. మొత్తం మీద అలా పాపులారిటీ సంపాదించుకున్న యాషికా ఇప్పుడు పలు సినీ అవకాశాలను అందుకుంటోంది. ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఈ అమ్మడు రూపాయి నోటుపై ఆటోగ్రాఫ్ చేసి వివాదాల్లో చిక్కుకుంది. అది సద్దుమణగక ముందే తాజాగా నటుడు సూర్య అభిమానుల ఆగ్రహానికి గురవుతోంది. ఈ సంచలన నటి అభిమానుల ప్రశ్నలకు తన ట్విట్టర్ ద్వారా బదులిచ్చింది. అందులో ఒక అభిమాని మీకు నటుడు సూర్య అంటే ఇష్టమా అని అడగ్గా అందుకు సూర్య ఫొటోను పోస్ట్ చేసి, ఆయన్ని పెళ్లాడాలని ఆశపడుతున్నట్లు పేర్కొని మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. యాషికా వ్యాఖ్యలపై సూర్య అభిమానులు మండిపడుతున్నారు. అటు నటి జ్యోతిక అభిమానులు కూడా ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ‘నటుడు సూర్యకు పెళ్లి అయిన విషయం యాషికాకు తెలియదా’, ‘సూర్య, జ్యోతిక దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్న విషయం తెలిసి సూర్యను పెళ్లాడాలని ఎలా అంటుంది’ అంటూ యాషికాపై మాటల దాడి చేస్తున్నారు. ఏదో ఆశిస్తే, ఇంకేదో జరిగిందంటే ఇదేనేమో. -
‘బీకే హరిప్రసాద్‌ను పదవి నుంచి తొలగించాలి’
న్యూఢిల్లీ : బీజేపీ జాతీయాధ్యక్షడు అమిత్ షా అనారోగ్యాన్ని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు బీకే హరిప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హరిప్రసాద్‌ను పార్టీ జనరల్ సెక్రటరీ హోదా నుంచి తొలగించాలంటూ బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ హరిప్రసాద్‌ను తొలగించకపోతే ఈ వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ కూడా మద్దతిస్తున్నట్లు భావించాల్సి వస్తుందని తెలిపారు. ఈ విషయం గురించి బీజేపీ అధికార ప్రతినిధి జీవిఎల్ నర్సింహ్మ రావు మాట్లాడుతూ.. ‘రెండు నాల్కల ధోరణిని ప్రదర్శిండం కాంగ్రెస్ స్వభావం. ఒక వైపు రాహుల్ గాంధీ జైట్లీ అనారోగ్యం గురించి విచారం వ్యక్తం చేస్తూంటే.. మరో వైపు హరి ప్రసాద్ లాంటి వాళ్లు ఇలా విషం కక్కుతారు. వీరి గురించి జనాలకు బాగా తెలుసు. ఒక వేళ వారు(రాహుల్) నిజంగానే హరిప్రసాద్ వ్యాఖ్యల్ని సమర్థించకపోతే.. అతని చేత అమిత్ షాకు బహిరంగ క్షమాపణలు చెప్పించాల’ని డిమాండ్ చేశారు. అమిత్ షా స్వైన్ ఫ్లూతో బాధపడుతూ.. ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు హరిప్రసాద్.. కర్ణాటకలో కాంగ్రెస్ - జేడీఎస్ కూటమిని చీల్చడానికి ప్రయత్నించడం వల్లే అమిత్ షా అనారోగ్యం పాలయ్యారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
వసుంధర రాజేకు ఘోర అవమానం...
జైపూర్ : రాజస్తాన్ మాజీ సీఎం వసుంధర రాజేను దారుణంగా అవమానించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కాంగ్రెస్ లీడర్ రామ్‌లాల్ మీన మాజీ సీఎం వసుంధర రాజే ప్రస్తుతం అభివృద్ధి పనులను పక్కన పెట్టి మద్యం బాటిళ్లు ఒపెన్ చేయడంలో చాలా బిజీగా ఉన్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రతాప్‌గఢ్ జిల్లాలో ఓ కార్యక్రమానికి హాజరైన మీనా మాట్లాడుతూ.. ‘నూతన ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ పనులు ప్రారంభించారు. ముఖ్యమంత్రిగా రాష్ట్రాభివృద్ధికి ఆయన చాలా కృషి చేస్తున్నారు. కానీ మాజీ సీఎం రాజే మాత్రం పని పక్కన పెట్టి లిక్కర్ బాటిళ్లు ఒపెన్ చేయడంలో బిజీగా ఉన్నారం’టూ వ్యాఖ్యనించారు. రామ్‌లాల్ మీనా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమరాన్ని రేపుతున్నాయి. -
‘నేను బీజేపీ ఐటమ్ గర్ల్‌ని’
లక్నో : నోటి దురుసుతో వార్తల్లో నిలిచే సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అజామ్ ఖాన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను బీజీపీ ఐటమ్ గర్ల్‌ను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండేళ్ల క్రితం ఘజియాబాద్‌లో హజ్ హౌస్ ప్రారంభోత్సావానికి హాజరైన అజామ్ ఖాన్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ని ఉద్దేశించి అవమానకర వ్యాఖ్యలు చేశారు. దాంతో అంబేడ్కర్ మహాసభ సభ్యులు అజామ్ ఖాన్ మీద మంగళవారం (నిన్న) హజ్రత్గని పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ విషయంపై ఆయన స్పందిస్తూ ‘బీజేపీ గత ఎన్నికల్లో నా పేరే వాడింది. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో కూడా నా పేరును అడ్డు పెట్టుకుని ప్రచారం చేయాలని భావిస్తోంది. ఎందుకంటే బీజేపీ నన్ను తన ఐటమ్ గర్ల్‌గా భావిస్తోంది. ఇక మీదట కూడా నాకు సమన్లు, వారెంట్లూ వస్తూనే ఉంటాయాం’టూ అజామ్ మండిపడ్డారు. -
#మీటూ : ‘మగాడి జీవితాన్ని నాశనం చేస్తోంది’
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న #మీటూ ఉద్యమం గురించి అధికార బీజేపీ పార్టీ ఎంపీ ఉదిత్ రాజ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ ఉద్యమం వల్ల చాలా మంది పురుషుల జీవితాలు నాశనం అవుతున్నాయంటూ వివాదాస్పదంగా మాట్లాడారు. ఉదిత్ రాజ్ మీటూ ఉద్యమం గురించి స్పందిస్తూ.. ‘అవును లైంగిక వేధింపులు జరిగాయనే విషయాన్ని నేను కూడా ఒప్పుకుంటాను. ఇది మగవాని స్వభావం. మరి మహిళలు సరిగ్గానే ఉన్నారా..? ఈ ఉద్యమాన్ని వారు తప్పుగా వాడుకోవడం లేదా..? దీన్ని అడ్డం పట్టుకుని వారు ఒక్కో పురుషుని దగ్గర నుంచి 2 - 4 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. అలా డబ్బు చేతికి రాగానే మరో మగవాడి మీద పడుతున్నారు. ఈ ఉద్యమం పురుషుల జీవితాన్ని నాశనం చేస్తుంది’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఎంపీ వ్యాఖ్యల పట్ల జనాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కేవలం స్త్రీలకు జరిగిన అన్యాయాల గురించే కాదు.. పురుషులు ఎదుర్కొన్న వేధింపుల గురించి కూడా మాట్లాడుతున్నారు. ఇలాంటి దరిద్రాలు జరగకుండా చూడాల్సిన నాయకులే ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమంటూ కామెంట్ చేస్తున్నారు.