Cricket World Cup 2023
-
షమీ.. నీ కమిట్మెంట్కు సలాం.. వరల్డ్‌కప్ మొత్తం పెయిన్ కిల్లర్స్‌తోనే..!
టీమిండియా స్వింగ్ సుల్తాన్ మొహమ్మద్ షమీకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2023 వరల్డ్‌కప్‌లో లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచి, టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషించిన షమీ.. మెగా టోర్నీ ఆధ్యాంతం గాయంతో సతమతమయ్యాడని సమాచారం. దీర్ఘకాలిక మడమ సమస్యతో బాధపడుతున్న షమీ నొప్పిని అధిగమించేందుకు ప్రతి మ్యాచ్‌కు ముందు పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్స్ వాడాడని అతని సహచరుడొకరు ప్రముఖ న్యూస్ ఛానెల్‌తో చెప్పాడు. గాయం కారణంగా అప్పటికే కొన్ని మ్యాచ్‌లు ఆడే అవకాశం కోల్పోయిన షమీ.. హార్దిక్ గాయపడ్డాక బెంచ్‌పై కూర్చోకూడదని నిర్ణయించకున్నాడట. అందుకే రిస్క్ చేసి మరీ బరిలోకి దిగాడట. ఆట పట్ల షమీకి ఉన్న అంకితభావం గురించి తెలిసి అభిమానులు అతన్ని పోరాట యోధుడితో పోలుస్తున్నారు. షమీ.. నీ కమిట్మెంట్కు సలాం అని కొనియాడుతున్నారు. కాగా, ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా ఫైనల్ వరకు అద్భతమైన ఆటతీరు కనబర్చి, తుది సమరంలో ఆసీస్ చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీలో షమీ 7 మ్యాచ్‌ల్లో 3 ఐదు వికెట్ల ఘనతల సాయంతో 24 వికెట్లు పడగొట్టాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకునేందుకు వరల్డ్‌కప్ అనంతరం విరామం తీసుకున్న షమీ.. తొలుత సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌కు ఎంపికయ్యాడు. అయితే బీసీసీఐ నుంచి అతనికి ఫిట్నెస్ క్లియెరెన్స్ దక్కకపోవడంతో సిరీస్ మొత్తనికి దూరంగా ఉన్నాడు. షమీ గైర్హాజరీలో టీమిండియా.. తొలి టెస్ట్‌లో సౌతాఫ్రికా చేతిలో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ 32 పరుగుల భారీ తేడాతో పరాజయాన్ని ఎదుర్కొంది. షమీ స్థానంలో రెండో టెస్ట్‌కు ఆవేశ్ ఖాన్‌ను ఎంపిక చేశారు భారత సెలెక్టర్లు. వచ్చే ఏడాది (2024) జనవరి 3 నుంచి కేప్‌టౌన్ వేదికగా రెండో టెస్ట్ ప్రారంభంకానుంది. సౌతాఫ్రికాతో రెండో టెస్ట్ కోసం భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్‌కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్. సిరాజ్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, కేఎస్ భరత్ (వికెట్‌కీపర్), అభిమన్యు ఈశ్వరన్, అవేష్ ఖాన్ -
2023.. భారత క్రికెట్ అభిమానులకు గుండెకోత మిగిల్చిన సంవత్సరం
2023.. భారత క్రికెట్ అభిమానులకు తీవ్ర విషాదం మిగిల్చిన సంవత్సరంగా చిరకాలం గుర్తుండిపోనుంది. భారీ అంచనాల నడుమ స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు చివరి వరకు అద్భుతంగా పోరాడి అనూహ్య రీతిలో తుది మెట్టుపై బోల్తా పడి అభిమానులకు తీవ్ర గుండెకోతను మిగిల్చింది. లక్షలాది మంది సమక్షంలో, కోట్లాది మంది భారతీయుల ఆకాంక్షల నడుమ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఓటమి పాలై 140 కోట్ల మంది భారతీయుల ఆశలను అడియాశలు చేసింది. ఈసారి కప్ మనదే అని ధీమాగా ఉండిన భారతీయులు ఫైనల్లో ఆసీస్ చేతిలో ఎదురైన పరాభవాన్ని జీర్ణించుకోలేక గుండెలు పగిలేలా రోధించారు. టోర్నీ గడిచి దాదాపు నెల రోజులు అవుతున్నా అభిమానులు, ఆటగాళ్లు ఆ బాధ నుంచి తేరుకోలేకపోతున్నారు. ఈ చేదు అనుభూతి మినహాయిస్తే భారత క్రికెట్ అభిమానులకు ఈ ఏడాదంతా తీపి జ్ఞాపకాలే ఉన్నాయి. స్వదేశంలో శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకోవడం ద్వారా భారత్ 2023కు ఘన స్వాగతం పలికింది. అనంతరం అదే శ్రీలంకతో జరిగిన 3 వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. ఆతర్వాత న్యూజిలాండ్‌పై టీ20 సిరీస్ (3-0), వన్డే సిరీస్‌లు (2-1) నెగ్గి, కొత్త ఏడాది తిరుగులేని జట్టుగా ప్రస్తానాన్ని మొదలుపెట్టింది. దీని తర్వాత స్వదేశంలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 2-1 తేడాతో (టెస్ట్‌లు) నెగ్గిన భారత్.. వన్డే సిరీస్‌ను 1-2తో కోల్పోయి 2023లో తొలి సిరీస్ పరాజయాన్ని చవిచూసింది. అనంతరం ఏప్రిల్, మే మసాల్లో టీమిండియా ఆటగాళ్లు సహా ప్రపంచ క్రికెట్ మొత్తం ఐపీఎల్‌తో బిజీగా ఉండింది. జూన్‌లో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్‌తో టీమిండియా తిరిగి అంతర్జాతీయ వేదికపై ప్రత్యక్షమైంది. ఇంగ్లండ్‌లోని ఓవల్‌లో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత జట్టు ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలై వరుసగా రెండోసారి టెస్ట్ ఛాంపియన్షిప్ దక్కించుకునే అవకాశాన్ని చేజార్చుకుంది. దీని తర్వాత వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన భారత జట్టు 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 1-0తో, వన్డే సిరీస్‌ను 2-1తో గెలుపొందింది. ఈ పర్యటనలో భారత్ టీ20 సిరీస్‌ను 2-3 తేడాతో కోల్పోయింది. అనంతరం ఐర్లాండ్ పర్యటనకు వెళ్లిన భారత్.. 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-0తో నెగ్గింది. దీని తర్వాత శ్రీలంక వేదికగా జరిగిన ఆసియా కప్‌లో పాల్గొన్న టీమిండియా.. ఆ టోర్నీ ఫైనల్లో శ్రీలంకను చిత్తు చేసి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. ఆతర్వాత స్వదేశంలో ఆసీస్‌తో 3 వన్డేలు ఆడిన భారత్ 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. ఈ సిరీస్ తర్వాత వన్డే ప్రపంచకప్‌లో పాల్గొన్న టీమిండియా.. ఆ టోర్నీలో వరుసగా 10 మ్యాచ్‌ల్లో గెలిచి ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓటమిపాలైంది. అనంతరం అదే ఆసీస్‌తో స్వదేశంలోనే 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడిన భారత్ 4-1 తేడాతో జగజ్జేతను ఓడించింది. దీని తర్వాత భారత్ 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్, 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్, 2 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు సౌతాఫ్రికాకు వెళ్లింది. ఈ పర్యటనలో టీ20 సిరీస్ 1-1తో డ్రా కాగా.. వన్డే, టెస్ట్ సిరీస్‌లు జరగాల్సి ఉంది. ఓవరాల్‌గా చూస్తే ఈ ఏడాదంతా భారత క్రికెట్ జట్టుకు సానుకూల ఫలితాలే వచ్చాయని చెప్పాలి. -
'ఆ ఓటమిని' జీర్ణించుకోలేకపోతున్నాను.. రోహిత్ శర్మ భావోద్వేగం
2023 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలిసారిగా సోషల్‌మీడియా ముందుకు వచ్చి ఓ వీడియో స్టేట్మెంట్ను రిలీజ్ చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోలో రోహిత్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. వరల్డ్‌కప్ ఫైనల్లో ఓటమిని ఎలా అధిగమించాలో తెలియట్లేదని హిట్‌మ్యాన్ వాపోయాడు. ఆ ఓటమి తనను తీవ్రంగా కలిచి వేసిందని పేర్కొన్నాడు. అభిమానుల ఆశలను అడియాశలు చేయడం ఎంతో బాధించిందని తెలిపాడు. ఆ మనోవేదనను అధిగమించి మైదానంలోకి తిరిగి ఎలా అడుగుపెట్టాలో తెలియట్లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. వరుసగా పది మ్యాచ్‌ల్లో గెలిచి, పైనల్లో ఓడిపోవడాన్ని జీర్ణించుకకోలేకపోతున్నానని తెలిపాడు. View this post on Instagram A post shared by Team Ro (@team45ro) చిన్నతనం నుంచి వన్డే వరల్డ్‌కప్‌లు చూస్తూ పెరిగానని, వరల్డ్‌కప్ గెలవడం అనేది గొప్ప బహుమతిగా భావించేవాడినని గుర్తు చేసుకున్నాడు. వరల్డ్‌కప్ గెలవడం కోసం జట్టు మొత్తం కొన్ని సంవత్సరాల పాటు కఠోరంగా శ్రమించిందని, అంతిమంగా ఫలితం నిరాశపరిచిందని విచారం వ్యక్తం చేశాడు. వరల్డ్‌కప్ గెలవడం కోసం జట్టుగా చేయవలసిందంతా చేశామని, ఫలితం ఊహించిన విధంగా రాకపోవడం జట్టు మొత్తాన్ని తీవ్ర బాధించిందని వాపోయాడు. ఫైనల్లో ఓటమి అనంతరం తన జర్నీ అనుకున్నంత ఈజీగా సాగలేదని, ఆ బాధ నుంచి బయటపడేందుకు తన కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎంతగానో సాయపడ్డారని చెప్పుకొచ్చాడు. అంతిమంగా ఆటలో గెలుపోటములు సహజమని, వాటిని అధిగమించి జీవితంలో ముందుకు సాగాలని తన సందేశాన్ని ముగించాడు. కాగా, హిట్‌మ్యాన్ వరల్డ్‌కప్ ఓటమి అనంతరం ఆసీస్‌తో టీ20 సిరీస్‌కు, ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న పరిమిత ఓవర్ల సిరీస్‌లకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది సౌతాఫ్రికాతో జరిగే టెస్ట్ సిరీస్‌తో రోహిత్ తిరిగి మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. -
‘ఆ జాబితాలో చాట్ జీపీటి టాప్.. ఇండియా నుంచి ఏడు’
సాధారణంగా ఏ విషయానైనా సంపూర్ణంగా తెలసుకునేందుకు అందరూ వికీపీడియా మీదనే ఆధారపడుతూ ఉండటం తెలిసిందే. అయితే.. అందులో అన్ని రంగాలకు సంబంధించిన వార్తలు, సమాచారం అందుబాటులో ఉంటుంది. 2023లో వికీపీడియాలోని సమాచారాన్ని ఎంత మంది చదివారో దాని సంబంధించిన.. నివేదికను తాజాగా వికీపీడియా ఫౌండేషన్ విడుదల చేసింది. 2023 ఏడాదిలో అధికంగా చదివిన పలు ఆంగ్ల ఆర్టికల్స్ గణాంకాలను రిలీజ్ చేసింది. విడుదల చేసిన జాబితాలో గణాంకల ప్రకారం మొత్తం 25 ఆర్టికల్స్‌లు వార్షిక నివేదికలో చోటు సంపాదించుకోగా.. అందులో భారత్‌కు చెందినవి ఏడింటికి చోటు దక్కటం గమనార్హం. వికీపీడియా విడుదల చేసిన వివరాల ప్రకారం.. సుమారు 8.4 బిలియన్ పేజ్ వ్యూస్ సాధించిన అర్టికల్స్‌లో టాప్‌లో ఐదు నిలిచాయి. చాట్ జీపీటీ మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో.. 2023లో చోటుచేసుకున్న మరణాలు, 2023 క్రికెట్ ప్రపంచ కప్(3వ స్థానం), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (4వ స్థానం), హాలీవడ్ సినిమా ఓపెన్ హైమర్ ఐదో స్థానంలో చోటు సంపాధించింది. అదేవిధంగా ఆరో స్థానంలో క్రికెట్ ప్రపంచ కప్, ఏడో స్థానంలో జే.రాబర్ట్ ఓపెన్‌హైమర్, జవాన్ మూవీ (8వ స్థానం), 2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్(9వ స్థానం) పఠాన్( 10వ స్థానం). ది లాస్ట్ ఆఫ్ అస్ (TV సిరీస్)(11వ స్థానం), టేలర్ స్విఫ్ట్(12వ స్థానం), బార్బీ మూవీ(13వ స్థానం), క్రిస్టియానో రొనాల్డో( 14 స్థానం), లియోనెల్ మెస్సీ( 15వ స్థానం), ప్రీమియర్ లీగ్( 16వ స్థానం), మాథ్యూ పెర్రీ(17వ స్థానం), యునైటెడ్ స్టేట్స్( 18వ స్థానం), ఎలోన్ మస్క్(19వ స్థానం), అవతార్: ది వే ఆఫ్ వాటర్( 20వ స్థానం), india( 21 వ స్థానం), లిసా మేరీ ప్రెస్లీ( 22 స్థానం), గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ ( 23వ స్థానం), ఉక్రెయిన్‌పై రష్యా దాడి( 24వ స్థానం), ఆండ్రూ టేట్( 25వ స్థానం)లో చోటు దక్కించుకున్నాయి. ఈ వివరాల నివేదిక జనవరి 1 నుంచి నవంబర్ 28 వరకు మాత్రమేనని వికీపీడియా ఫౌండేషన్ పేర్కొంది. క్రికెట్ వరల్డ్ కప్ 2023, ఇండియన్ ప్రీమియర్ లీగ్ టాప్ 5లో చోటు సంపాదించటం విశేషం. అదే విధంగా షారుక్‌ఖాన్ నటించిన జవాన్, పఠాన్ బాలీవుడ్ సినిమాలు రెండు టాప్ టెన్‌లో నిలిచాయి. -
ప్రేయసిని పెళ్లాడిన సఫారీ పేస్ గన్
సౌతాఫ్రికా యంగ్ పేస్ గన్ గెరాల్డ్ కొయెట్జీ తన చిరకాల ప్రేయసిని పెళ్లాడాడు. వివాహానికి సంబంధించిన పలు ఫోటోలను కొయెట్జీ తన సోషల్‌మీడియా హ్యాండిల్లో పోస్ట్ చేశాడు. కొయెట్జీ భాగస్వామి ఎవరన్న విషయమై పూర్తి సమాచారం లేనప్పటికీ.. గతంలో ఈ ఇద్దరూ చాలా సందర్భాల్లో కలిసి కనిపించారు. కొయెట్జీ పెళ్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. కాగా, భారత్ వేదికగా ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్‌లో గెరాల్డ్ కొయెట్జీ అద్భుతంగా రాణించాడు. 23 ఏళ్ల ఈ పేస్ గన్ అన్రిచ్ నోర్జే గాయపడటంతో జట్టులోకి వచ్చి సంచలన ప్రదర్శనలు నమోదు చేశాడు. మెగా టోర్నీలో 8 మ్యాచ్‌లు ఆడిన కొయెట్జీ.. 19.80 సగటున 20 వికెట్లు పడగొట్టి, టోర్నీ లీడింగ్ వికెట్‌టేకర్ల జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. తన స్వల్ప కెరీర్లో 3 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన కొయెట్జీ.. 43 వికెట్లు పడగొట్టాడు. కొయెట్జీ.. త్వరలో స్వదేశంలో భారత్‌తో జరిగే టీ20, టెస్ట్ సిరీస్‌లకు కూడా ఎంపికయ్యాడు. వరల్డ్‌కప్ సంచలన ప్రదర్శనల నేపథ్యంలో కొయెట్జీకి ఐపీఎల్ 2024 వేలంలో భారీ ధర దక్కే అవకాశం ఉంది. ఇతని కోసం ఫైవ్ టైమ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ పోటీ పడే అవకాశం ఉందని టీమిండియా వెటరన్ స్పిన్నర్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. పేస్ దిగ్గజం డేల్ స్టెయిన్‌ను పోలిన బౌలింగ్ శైలి కొయెట్జీని ప్రత్యేకంగా నిలబెడుతుందని యాశ్ అన్నాడు. ఇదిలా ఉంటే, డిసెంబర్ 10 నుంచి భారత్ దక్షిణాఫ్రికాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో 2 టెస్ట్‌లు, 3 టీ20లు, 3 వన్డేలు జరుగుతాయి. ఈ సిరీస్ కోసం ఇరు జట్లు ఇదివరకే జట్లను కూడా ప్రకటించాయి. సిరీస్‌లో భాగంగా తొలి టీ0 డర్బన్ వేదికగా డిసెంబర్ 10న జరుగనుంది. -
IND VS AUS 3rd T20: మ్యాక్స్‌వెల్ ఊచకోత.. ఫాస్టెస్ట్ సెంచరీ
గౌహతి వేదికగా భారత్‌తో జరిగిన మూడో టీ20లో ఆసీస్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 48 బంతుల్లోనే 8 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో సుడిగాలి శతకం బాదాడు. ఫలితంగా ఆసీస్ 5 వికెట్ల తేడాతో గెలుపొంది, ఐదు మ్యాచ్‌లో సిరీస్‌లో భారత్ ఆధిక్యాన్ని 1-2కు తగ్గించింది. రుతురాజ్ మెరుపు శతకం.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. రుతురాజ్ అజేయమైన మెరుపు శతకంతో (57 బంతుల్లో 123 నాటౌట్; 13 ఫోర్లు, 7 సిక్సర్లు) విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ (6), ఇషాన్ కిషన్ (0) నిరాశపర్చగా.. సూర్యకుమార్ యాదవ్ (29 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), తిలక్ వర్మ (24 బంతుల్లో 31 నాటౌట్; 4 ఫోర్లు) పర్వాలేదనిపించారు. కేన్ రిచర్డ్సన్, బెహ్రెన్‌డార్ఫ్, ఆరోన్ హార్డీ తలో వికెట్ పడగొట్టారు. మ్యాక్సీ ఊచకోత.. 223 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. మ్యాక్స్‌వెల్ సునామీ శతకంతో చెలరేగడంతో అద్భుత విజయం సాధించింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఆరోన్ హార్డీ (16), జోష్ ఇంగ్లిస్ (10), మార్కస్ స్టోయినిస్ (17) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. ట్రవిస్ హెడ్ (35) పర్వాలేదనిపించాడు. ఆఖర్లో మ్యాక్స్‌వెల్.. మాథ్యూ వేడ్ (16 బంతుల్లో 28 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) సహకారంతో ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చాడు. భారత బౌలర్లలో రవి భిష్ణోయ్ 2 వికెట్లు పడగొట్టగా.. ఆవేశ్ ఖాన్, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్ తలో వికెట్ దక్కించుకున్నారు. ప్రసిద్ద్ కృష్ణ (4-0-68-0) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. ఆఖరి బంతికి గెలిచిన ఆసీస్.. ఆసీస్ గెలవాలంటే చివరి రెండు ఓవర్లలో 43 పరుగులు అవసరం కావడంతో భారత గెలుపు లాంఛనమే అని అంతా అనుకున్నారు. అయితే మ్యాక్సీ ఒక్కసారిగా మెరుపుదాడికి దిగి భారత్ చేతుల్లో నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. అక్షర్ వేసిన 19వ ఓవర్లో 22 పరుగులు, ప్రసిద్ద్ కృష్ణ వేసిన ఆఖరి ఓవర్లో 23 పరుగులు పిండుకున్న మ్యాక్సీ.. ఆఖరి బంతికి ఫోర్ బాది ఆసీస్‌ను గెలిపించాడు. ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు సమం చేసిన మ్యాక్సీ.. ప్రస్తుత భారత పర్యటనలో భీకర ఫామ్‌లో ఉన్న మ్యాక్స్‌వెల్ వరల్డ్‌కప్ 2023లో రెండు మెరుపు శతకాలు బాదడంతో పాటు నిన్న (నవంబర్ 28) జరిగిన మూడో టీ20లోనూ సుడిగాలి శతకంతో విరుచుకుపడ్డాడు. నిన్నటి మ్యాచ్‌లో 47 బంతుల్లోనే శతక్కొట్టిన అతను.. ఆస్ట్రేలియా తరఫున పొట్టి క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును సమం చేశాడు. మ్యాక్సీకి ముందు ఆరోన్ ఫించ్, జోష్ ఇంగ్లిస్ కూడా 47 బంతుల్లోనే శతకాలు బాదారు. ఆసీస్ తరఫున టీ20ల్లో టాప్-5 ఫాస్టెస్ట్ శతకాల్లో మ్యాక్స్వెల్వే మూడు ఉండటం విశేషం. దీనికి ముందు మ్యాక్సీ ఓసారి 49 బంతుల్లో, ఓసారి 50 బంతుల్లో టీ20 సెంచరీలు బాదాడు. -
వరల్డ్‌కప్ హీరో రచిన్ రవీంద్రకు షాక్
వన్డే వరల్డ్‌కప్ 2023లో నాలుగో లీడింగ్ రన్ స్కోరర్‌గా (10 మ్యాచ్‌ల్లో 3 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీల సాయంతో 578 పరుగులు) నిలిచిన న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్రకు ఊహించని షాక్ తగిలింది. బంగ్లాదేశ్‌తో ఇవాల్టి నుంచి (నవంబర్ 28) ప్రారంభమైన తొలి టెస్ట్‌లో రచిన్‌కు న్యూజిలాండ్ జట్టులో చోటు దక్కలేదు. రచిన్ భీకర ఫామ్‌లో ఉన్నప్పటికీ న్యూజిలాండ్ మేనేజ్మెంట్ అతన్ని పక్కకు పెట్టడం విశేషం. బ్యాటర్‌గానే కాకుండా బౌలింగ్‌లోనూ (స్పిన్నర్‌గా) రాణించే సత్తా ఉన్న రచిన్‌ను న్యూజిలాండ్ ఎందుకు పక్కన పెట్టిందో తెలియలేదు. న్యూజిలాండ్ తమ ప్లేయింగ్ ఎలెవెన్‌లో ముగ్గురు స్పిన్నర్లకు అవకాశం ఇచ్చింది. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా అజాజ్ పటేల్, ఐష్ సోధి, పార్ట్ టైమ్ స్పిన్నర్‌గా గ్లెన్ ఫిలిప్స్ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. కేన్ విలియమ్సన్ చాలాకాలం తర్వాత టెస్ట్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. టిమ్ సౌథీ నేతృత్వంలో న్యూజిలాండ్ జట్టు బరిలోకి దిగింది. డెవాన్ కాన్వే, టామ్ లాథమ్, విలియమ్సన్, హెన్రీ నికోల్స్, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్ (వికెట్‌కీపర్), గ్లెన్ ఫిలిప్స్, కైల్ జేమీసన్, ఐష్ సోధి, టిమ్ సౌథీ, అజాజ్ పటేల్ సభ్యులుగా ఉన్నారు. బంగ్లాదేశ్ జట్టును నజ్ముల్ హసన్ షాంటో ముందుండి నడిపిస్తున్నాడు. మహ్మదుల్ హసన్ జాయ్, జాకీర్ హసన్, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షాహదత్ హుస్సేన్, నూరుల్ హసన్(వికెట్‌కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, నయీమ్ హసన్, తైజుల్ ఇస్లాం, షోరీఫుల్ ఇస్లాం సభ్యులుగా ఉన్నారు. రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుంది. కాగా, ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. లంచ్ విరామం సమయానికి ఆ జట్టు 2 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. జకీర్ హసన్ (12), షాంటో (37) ఔట్ కాగా.. మహ్మదుల్ హసన్ జాయ్ (42), మోమినుల్ హక్ (3) క్రీజ్‌లో ఉన్నారు. అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్‌కు తలో వికెట్ దక్కింది. -
IPL 2024 Auction: ఆ ఇద్దరి కోసం క్యూ కట్టనున్న ఫ్రాంచైజీలు
ఈ ఏడాది డిసెంబర్ 19న జరిగే ఐపీఎల్ 2024 వేలంలో వరల్డ్‌కప్-2023 హీరోలకు ఫుల్ డిమాండ్ ఉంటున్నది కాదనలేని సత్యం. దుబాయ్ వేదికగా జరిగే ఈ మెగా ఆక్షన్‌లో న్యూజిలాండ్‌కు చెందిన రచిన్ రవీంద్ర, ఆసీస్ స్టార్ బ్యాటర్ ట్రవిస్ హెడ్ల కోసం ఫ్రాంచైజీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొనే అవకాశం ఉంది. భారత్ వేదికగా కొద్ది రోజుల క్రితం జరిగిన వరల్డ్‌కప్‌లో రచిన్ బ్యాట్‌తో చెలరేగిపోయిన విషయం తెలిసిందే. భారత్ మూలాలున్న రచిన్ తన పెద్దల సొంతగడ్డపై పరుగుల వరద పారించాడు. ఈ టోర్నీలో రచిన్ 10 మ్యాచ్‌ల్లో 3 సెంచరీలు, 2 అర్ధసెంచరీల సాయంతో 578 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్ల జాబితాలో విరాట్, రోహిత్, డికాక్ తర్వాతి స్థానంలో నిలిచాడు. ట్రవిస్ హెడ్ విషయానికొస్తే.. ఈ ఆసీస్ బ్యాటర్ ప్రపంచకప్‌లోకి లేట్‌గా ఎంట్రీ ఇచ్చినా టోర్నీని ఘనంగా ముగించాడు. భారత్‌తో జరిగిన ఫైనల్లో చిరస్మరణీయ శతకం (137) సాధించిన హెడ్ తన జట్టును ఆరోసారి జగజ్జేతగా నిలిపాడు. ఈ ఒక్క ప్రదర్శనతో హెడ్ ఐపీఎల్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేరిపోయాడు. రచిన్, హెడ్ ఇద్దరు బ్యాట్‌తో పాటు బంతితోనూ మాయ చేయగల సమర్దులు కావడంతో ఐపీఎల్ ఫ్రాంచైజీలు వీరి కోసం ఎగబడే అవకాశం ఉంది. వీరిద్దరితో పాటు వరల్డ్‌కప్ బౌలింగ్ హీరోలు దిల్షన్ మధుషంక (శ్రీలంక), గెరాల్డ్ కొయెట్జీ (సౌతాఫ్రికా) కోసం కూడా ఫ్రాంచైజీలు పోటీపడవచ్చు. ప్రస్తుతం ఆయా ఫ్రాంచైజీల వద్ద మిగులు బడ్జెట్ ప్రకారం చూస్తే.. రచిన్, మధుషంక కోసం ఆర్సీబీ.. హెడ్ కోసం ఢిల్లీ.. కొయెట్జీ కోసం సీఎస్కే పోటీపడవచ్చని తెలుస్తుంది. ఈ ఫ్రాంచైజీలు వదిలించుకున్న ఆటగాళ్ల జాబితా చూసినా వారికి ఈ రోల్స్‌లో ఆటగాళ్ల అవసరం ఉంది. మిగులు బడ్జెట్ గుజరాత్ వద్ద అధికంగా (38.15 కోట్లు) ఉండగా, ఎక్కువ మంది ఆటగాళ్లను తీసుకునే వెసులుబాటు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు (12 మందిని) ఉంది. పైన పేర్కొన్న ఆటగాళ్ల కోసం పోటీపడే ఫ్రాంచైజీల్లో ఢిల్లీ వద్ద 28.95 కోట్లు, సీఎస్కే వద్ద 31.4 కోట్లు, ఆర్సీబీ వద్ద 23.25 కోట్ల పర్స్ వ్యాల్యూ మిగిలి ఉంది. -
ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడిపై కేసు నమోదు
ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు మిచెల్ మార్ష్‌పై భారత్‌లో కేసు నమోదైంది. ఆస్ట్రేలియా 2023 వన్డే ప్రపంచకప్ గెలిచిన అనంతరం మార్ష్ వరల్డ్‌కప్ ట్రోఫీపై కాళ్లు పెట్టి భారతీయుల మనోభావాలను దెబ్బతీశాడని ఆరోపిస్తూ అలీఘర్కు చెందిన ఆర్టిఐ కార్యకర్త పండిట్ కేశవ్ ఢిల్లీ గేట్ పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వక ఫిర్యాదు చేశాడు. మార్ష్ చర్య ప్రతిష్టాత్మకమైన ట్రోఫీకే కాకుండా 140 కోట్ల మంది భారతీయులకు అవమానం కలిగించిందని ఆరోపించాడు. కేశవ్ తన ఫిర్యాదు కాపీని ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు పంపించాడు. మార్ష్ భారత్‌లో ఏ క్రికెట్ మ్యాచ్ ఆడకుండా జీవితకాల నిషేధం విధించాలని అతను డిమాండ్ చేశాడు. కేశవ్ ఫిర్యాదును స్వీకరించిన ఢిల్లీ గేట్ పోలీసులు మార్ష్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం (నవంబర్ 19) జరిగిన వరల్డ్‌కప్ 2023 ఫైనల్లో భారత్‌పై ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో గెలుపొంది, ఆరో సారి జగజ్జేతగా నిలిచింది. ఆరోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచామన్న గర్వంతో మార్ష్ వరల్డ్‌కప్ ట్రోఫీపై కాళ్లు పెట్టుకుని ఫోటోలకు పోజులిచ్చాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌మీడియాలో తెగ వైరలయ్యాయి. మార్ష్‌పై క్రికెట్ అభిమానులు దుమ్మెత్తిపోశాడు. ఏమా ఖండకావరం అంటూ ధ్వజమెత్తారు. భారత అభిమానులయితే మార్ష్ ఓ రేంజ్లో ఏకి పారేశారు. -
ఆరు సార్లు జగజ్జేతలు.. అయినా ఎలాంటి హడావుడి లేదు.. సాధారణ వ్యక్తుల్లా..!
వన్డే వరల్డ్‌కప్ 2023 గెలిచిన అనంతరం ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు నిన్ననే స్వదేశానికి చేరుకుంది. ఆరోసారి జగజ్జేతలుగా నిలిచిన ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు ఎయిర్‌పోర్ట్‌లో అతి సాధారణమైన స్వాగతం లభించింది. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా ఆస్ట్రేలియా క్రికెటర్లు ఎప్పటిలాగే ఇళ్లకు పయనమయ్యారు. ఎయిర్‌పోర్ట్‌లో ఆసీస్ క్రికెటర్లు సాధారణ ప్యాసింజర్లలా తమ లగేజ్‌ను తామే మోసుకెళ్లారు. తమ జట్టు ఆరోసారి జగజ్జేతగా అవతరించినా ఆస్ట్రేలియన్లు ఎలాంటి హడావుడి చేయలేదు. ఆసీస్ క్రికెటర్లు సైతం తామేదో సాధించామని ఫీలవుతున్నట్లు ఎక్కడా కనపడలేదు. సాధారణంగా ఏ జట్టైనా ప్రపంచ ఛాంపియన్‌గా నిలిస్తే, స్వదేశంలో వారికి అపురూపమైన స్వాగతం లభిస్తుంది. సత్కారాలు, ఆరుపులు, కేకలతో అభిమానులు నానా హంగామా చేస్తారు. No Drama, no jingoism, no political leader present to take the credit, no hero worship, no one to carry his luggage, no one going mad in streets. This is Pat Cummins and Australian people after winning the World Cup 2023. So much to learn from them.pic.twitter.com/u30cB6dBOW — Dr Nimo Yadav (@niiravmodi) November 22, 2023 అయితే ఆసీస్ జట్టు ఆరోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి తొలిసారి స్వదేశంలో అడుగుపెట్టినప్పుడు అలాంటి వాతావరణం ఎక్కడా కనపడలేదు. ఎలాంటి డ్రామాకు ఆస్కారం లేకుండా అతి తక్కువ మంది ఫోటోగ్రాఫర్ల సమక్షంలో ఆసీస్ ఆటగాళ్లు ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లిపోయారు. ఆసీస్ ఆటగాళ్లు సాధించినదానికి క్రెడిట్ తీసుకోవడానికి ఏ రాజకీయ నాయకుడు ముందుకు రాలేదు. అరుపులు, కేకలు అస్సలు లేవు. వ్యక్తి పూజ అంతకంటే లేదు. ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఎయిర్‌పోర్ట్‌లో నుంచి బయటకు వెళ్తున్న వీడియోను ఓ నెటిజన్ సోషల్‌మీడియాలో పోస్ట్ చేసి ఆస్ట్రేలియన్ల సింప్లిసిటీని కొనియాడాడు. వారి నుంచి చాలా నేర్చుకోవాలని కామెంట్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. కాగా, వన్డే వరల్డ్‌కప్ 2023 ఫైనల్లో ఆస్ట్రేలియా.. టీమిండియాపై ఆరు వికెట్ల తేడాతో గెలపొంది ఆరోసారి జగజ్జేతగా నిలిచిన విషయం తెలిసిందే. -
వాళ్లకు వాళ్లు తోపులనుకుంటారు.. పాక్ మాజీలపై నిప్పులు చెరిగిన షమీ
టీమిండియా పేస్ బాద్షా మొహమ్మద్ షమీ పాకిస్తాన్ మాజీ క్రికెటర్లపై నిప్పులు చెరిగాడు. వన్డే వరల్డ్‌కప్ 2023 సందర్భంగా భారత పేసర్లకు ఐసీసీ ప్రత్యేక బంతులు సమకూర్చిందంటూ వారు చేసిన నిరాధారమైన ఆరోపణలపై మండిపడ్డాడు. పాక్ మాజీలు ఇలాంటి విచక్షణారహిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హెచ్చరించాడు. మీకు మీరే తోపులనుకుంటే సరిపోదని చురకలంటించాడు. ఇకనైనా మారండ్రా బాబూ అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. కాగా, 2023 వరల్డ్‌కప్‌లో భారత పేసర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో టీమిండియా పేస్ త్రయం ఏకంగా 58 వికెట్లు పడగొట్టి, ప్రత్యర్ధి బ్యాటర్ల గుండెల్లో రైళ్లు పరిగెట్టించింది. మొహమ్మద్ షమీ 7 మ్యాచ్‌ల్లో 24 వికెట్లు పడగొట్టి వరల్డ్‌కప్ లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలువగా.. జస్ప్రీత్ బుమ్రా 11 మ్యాచ్‌ల్లో 20 వికెట్లు, మొహమ్మద్ సిరాజ్ 11 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు నేలకూల్చారు. Mohammad Shami thrashed Hasan Raza’s theory of different balls provided by ICC to Indians.pic.twitter.com/c6StMTRTCb — Cricketopia (@CricketopiaCom) November 21, 2023 భారత పేసర్లు గతంలో ఎన్నడూ లేనట్లుగా చెలరేగడంతో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లలో అక్కసు కట్టలు తెంచుకుంది. భారత పేసర్లకు ఐసీసీ ప్రత్యేకమైన బంతులు సమకూర్చిందంటూ పాక్ మాజీ ఆటగాడు హసన్ రజా వివాదాస్పద ఆరోపణలు చేశాడు. ప్రత్యేక బంతుల కారణంగానే భారత పేసర్లు చెలరేగిపోయారంటూ మరికొంతమంది పాక్ మాజీలు ఆరోపించారు. ఈ ఆరోపణలపై షమీ తాజాగా స్పందించాడు. ప్యూమా కంపెనీకి సంబంధించిన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో పాక్ మాజీలపై నిప్పులు చెరిగాడు. పాక్ మాజీల నిరాధారమైన ఆరోపణలు బాధించాయని అన్నాడు. ఈ సందర్భంగా షమీ మాట్లాడుతూ.. నాకైతే ఇతరుల సక్సెస్ చూసి ఎప్పుడూ ఈర్ష్య కలుగదు. ఇతరుల సక్సెస్‌ను ఎంజాయ్ చేయగలిగినప్పుడే మంచి ప్లేయర్ అనిపించుకుంటారు. మనకు ఏది చేయాలన్నా దేవుడే చేయాలి. నేను ఇదే నమ్ముతానని అన్నాడు. కుట్ర సిద్ధాంతాల పుట్టుకకు పాకిస్తానీల అర్హతే మూలకారణమని తెలిపాడు. పాక్ మాజీలు కొందరు తమకు తామే అత్యుత్తమమని భావిస్తున్నారని, ఇతరులెవ్వరూ వారు సాధించించి సాధించలేరని ఫీలవుతారని చురకలంటించాడు. -
శ్రీలంక క్రికెట్‌కు మరో షాక్.. ఐసీసీ నిషేధం అమలవుతుండగానే..!
శ్రీలంక క్రికెట్ బోర్డుకు మరో షాక్ తగిలింది. ఆ దేశ క్రికెట్ బోర్డుపై నిషేధం అమలవుతుండగానే ఐసీసీ మరో ఝలక్ ఇచ్చింది. లంక బోర్డుపై నిషేధాన్ని కారణంగా చూపుతూ అక్కడ జరగాల్సిన ఈవెంట్‌ను ఐసీసీ మరో దేశానికి మార్చింది. వచ్చే ఏడాది (2024) జనవరిలో లంకలో జరగాల్సిన అండర్–19 పురుషుల ప్రపంచకప్ టోర్నీని ఐసీసీ దక్షిణాఫ్రికాకు తరలించింది. అహ్మదాబాద్‌లో నిన్న (నవంబర్ 21) జరిగిన బోర్డు సమావేశం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ సభ్యుడు ఒకరు వెల్లడించారు. గతంలో (2020) సౌతాఫ్రికా అండర్–19 వరల్డ్‌కప్‌ను విజయవంతంగా నిర్వహించినందుకు మరోసారి ఆ దేశానికి అవకాశం ఇచ్చినట్లు తెలిపాడు. వేదిక మార్పు అంశాన్ని టోర్నీలో పాల్గొనే జట్లకు ఇదివరకే తెలియజేసినట్లు పేర్కొన్నాడు. కాగా, భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్ 2023లో ఘోర వైఫల్యాలను ఎదుర్కొని, లీగ్ దశలోనే ఇంటిబాట పటిన శ్రీలంక క్రికెట్ జట్టును ఆ దేశ క్రీడా మంత్రి రోషన్ రణసింఘే రద్దు చేసిన విషయం తెలిసిందే. బోర్డు అంతర్గత వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యాన్ని తీవ్రంగా పరిగణించిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ శ్రీలంక క్రికెట్ బోర్డుపై సస్పెన్షన్ వేటు వేసింది. -
CWC 2023 Final: బోల్తా కొట్టించింది పిచ్ వ్యూహమేనా?
2023 ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో వరుసగా 10 మ్యాచ్‌ల్లో గెలుపొంది, అజేయ జట్టుగా నిలిచిన భారత్ ఆఖరి మెట్టుపై బోల్తా పడి మూడోసారి టైటిల్ గెలిచే సువర్ణావకాశాన్ని చేజార్చుకుంది. నాకౌట్ మ్యాచ్‌ల్లో చతికిలపడటం టీమిండియాకు కొత్తేమీ కానప్పటికీ, ఈ దఫా మాత్రం అభిమానులను తీవ్రంగా బాధ పెట్టింది. ఆశలు రేకెత్తించి, ఆఖరి మెట్టుపై ఉసూరుమనిపించడంతో ఫ్యాన్స్ బాధ వర్ణణాతీతంగా ఉంది. ఈ ఓటమి 140 కోట్ల మంది భారతీయులకు గుండె కోత మిగిల్చింది. ఫైనల్లో భారత్ ఓటమికి గల కారణాలు విశ్లేషిస్తూ పలువురు నిపుణులు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఒత్తిడి, టాస్ ఓడిపోవడమే టీమిండియా ఓటమికి ప్రధాన కారణాలని మెజారిటీ శాతం అభిప్రాయపడుతున్నారు. కొందరు మాత్రం పిచ్ విషయంలో బీసీసీఐ చేసిన అతే కొంపముంచిందని అంటున్నారు. తమ పేసర్లు భీకరమైన ఫామ్‌లో ఉన్నప్పుడు నిదానమైన ట్రాక్ రూపొందించడమే పెద్ద తప్పని అభిప్రాయపడుతున్నారు. పిచ్ విషయంలో బీసీసీఐ వ్యూహం బెడిసికొట్టిందని, అదే మనపై ప్రత్యర్ధి పైచేయి సాధించేలా చేసిందని అంటున్నారు. పిచ్ ఎప్పటిలాగే ఉన్నా టీమిండియాకు లబ్ది చేకూరేదే అని అభిప్రాయపడుతున్నారు. మన పేసర్లపై నమ్మకం లేక స్లో పిచ్‌ను తయారు చేశారా అని ప్రశ్నిస్తున్నారు. జట్టు అన్ని విభాగాల్లో (బ్యాటింగ్, స్పిన్ బౌలింగ్, పేస్ బౌలింగ్) పటిష్టంగా ఉన్నప్పుడు నిదానమైన పిచ్‌ను తయారు చేయడంలో అర్ధం లేదని మండిపడుతున్నారు. పిచ్ విషయంలో బీసీసీఐ వ్యూహం మిస్ ఫైర్ అయ్యిందని ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కూడా అన్నాడు. పిచ్ స్లోగా ఉండటం, ఆదిలోనే వికెట్లు కోల్పోవడం వల్ల టీమిండియా తీవ్ర ఒత్తిడికి లోనైందని తెలిపాడు. షాట్లు ఆడేందుకు భారత బ్యాటర్లు అష్టకష్టాలు పడ్డారని అభిప్రాయపడ్డాడు. కాగా, అహ్మదాబాద్ పిచ్‌పై గతంలో పరుగుల వరద పారిన విషయం తెలిసిందే. ఇక్కడి రెగ్యులర్ పిచ్‌పై అత్యంత భారీ స్కోర్లు నమోదయ్యాయి. అయితే వరల్డ్‌కప్ ఫైనల్లో రెగ్యులర్ వికెట్ కాకుండా స్లో ట్రాక్‌ను రూపొందించడంతో టీమిండియా పరుగులు చేసేందుకు నానా ఇబ్బందులు పడి స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. అనంతరం ఛేదనలో మంచు ప్రభావం చేత పిచ్ మరింత నిదానంగా మారి, దాదాపు నిర్జీవమైన పిచ్‌గా మారిపోయింది. ఫలితంగా ఆసీస్ బ్యాటర్లు హెడ్, లబూషేన్ క్రీజ్‌లో పాతుకుపోయి తమ జట్టుకు చిరస్మరణీయ విజయాన్నందించారు. -
2023 ప్రపంచకప్‌లో అత్యంత ప్రభావశీల ఫీల్డర్ అతడే.. లిస్ట్‌లో కోహ్లి, జడ్డూ
2023 వన్డే ప్రపంచకప్‌లో అత్యంత ప్రభావశీల ఫీల్డర్‌గా ఆసీస్ మిడిలార్డర్ ఆటగాడు మార్నస్ లబూషేన్‌ను ఐసీసీ ఎంపిక చేసింది. లబూషేన్ 82.66 రేటింగ్ పాయింట్లతో ఫీల్డర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. అతడి తర్వాతి స్థానంలో ఆసీస్‌కే చెందిన డేవిడ్ వార్నర్ ఉన్నాడు. వార్నర్ 82.55 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఈ విభాగం టాప్-10లో ఇద్దరు భారత ఆటగాళ్లకు చోటు లభించింది. 72.72 రేటింగ్ పాయింట్లతో రవీంద్ర జడేజా నాలుగో స్థానంలో.. 56.79 రేటింగ్ పాయింట్లతో విరాట్ కోహ్లి ఆరో స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో డేవిడ్ మిల్లర్ మూడో స్థానంలో, నెదర్లాండ్స్ ఆటగాడు సైబ్రాండ్ ఎంజెల్‌బ్రెచ్ ఐదులో, ఎయిడెన్ మార్క్రమ్, మిచెల్ సాంట్నర్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ వరుసగా 7, 8, 9 స్థానాల్లో నిలిచారు. మైదానంలో కనబర్చిన ప్రతిభ (పరుగుల నియంత్రణ, రనౌట్లు, త్రోలు) ఆధారంగా రేటింగ్ పాయింట్లు కేటాయించబడ్డాయి. ICC named Marnus Labuschagne as the biggest fielding impact in World Cup 2023. - Kohli & Jadeja are the only Indians in Top 10. 🔥🎯 pic.twitter.com/ZtO2kRz7U6 — Johns. (@CricCrazyJohns) November 20, 2023 ఇదిలా ఉంటే, భారత్-ఆస్ట్రేలియా మధ్య నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన వరల్డ్‌కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా జయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆసీస్ 6 వికెట్ల తేడాతో గెలుపొంది, ఆరోసారి జగజ్జేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నామమాత్రపు స్కోర్‌కే (240) పరిమితమైంది. ఛేదనలో ఆసీస్ ఆదిలోనే 3 వికెట్లు కోల్పోయినప్పటికీ అనంతరం అద్భుతంగా పుంజుకుని ఆరోసారి వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచింది. ట్రవిస్ హెడ్ (137).. లబూషేన్ (58 నాటౌట్) సహకారంతో ఆసీస్‌కు చిరస్మరణీయ విజయాన్నందించాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 192 పరుగలు భాగస్వామ్యాన్ని నమోదు చేసి ఆసీస్‌ను గెలిపించారు. భారత బౌలర్లలో బుమ్రా, షమీ, సిరాజ్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ (47), విరాట్ కోహ్లి (54), కేఎల్ రాహుల్ (66) ఓ మోస్తరుగా రాణించారు. ఆసీస్ బౌలర్లు స్టార్క్ (3/55), హాజిల్‌వుడ్ (2/60), కమిన్స్ (2/34), మ్యాక్స్‌వెల్ (1/35), జంపా (1/44) కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి టీమిండియా పతనాన్ని శాశించారు. -
ఆల్ టైమ్ హై రికార్డు సెట్ చేసిన 2023 వరల్డ్‌కప్
2023 వన్డే ప్రపంచకప్ హాజరు విషయంలో ఆల్‌టైమ్ హై రికార్డు సెట్ చేసింది. ఈ ఎడిషన్ ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక హాజరు కలిగిన వరల్డ్‌కప్‌గా రికార్డు నెలకొల్పింది. ఈ ప్రపంచకప్‌కు 1,250,307 మంది హాజరైనట్లు ఐసీసీ ప్రకటించింది. 13 వన్డే వరల్డ్‌కప్ టోర్నీల్లో ఇదే అత్యధిక హాజరు కలిగిన వరల్డ్‌కప్‌గా రికార్డైంది. ఇందులో ఒక్క ఫైనల్ మ్యాచ్‌కే లక్ష మంది వరకు ప్రేక్షకులు హాజరయ్యారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఆ మ్యాచ్‌కు రికార్డు స్థాయిలో 92453 మంది హాజరయ్యారు. ఇదిలా ఉంటే, నవంబర్ 19న జరిగిన వరల్డ్‌కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో టీమిండియాపై విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నామమాత్రపు స్కోర్‌కే (240) పరిమితమైంది. ఛేదనలో ఆసీస్ ఆదిలోనే 3 వికెట్లు కోల్పోయినప్పటికీ అనంతరం అద్భుతంగా పుంజుకుని ఆరోసారి వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచింది. ట్రవిస్ హెడ్ (137).. లబూషేన్ (58 నాటౌట్) సహకారంతో ఆసీస్‌కు చిరస్మరణీయ విజయాన్నందించాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 192 పరుగలు భాగస్వామ్యాన్ని నమోదు చేసి ఆసీస్‌ను గెలిపించారు. భారత బౌలర్లలో బుమ్రా, షమీ, సిరాజ్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ (47), విరాట్ కోహ్లి (54), కేఎల్ రాహుల్ (66) ఓ మోస్తరుగా రాణించారు. ఆసీస్ బౌలర్లు స్టార్క్ (3/55), హాజిల్‌వుడ్ (2/60), కమిన్స్ (2/34), మ్యాక్స్‌వెల్ (1/35), జంపా (1/44) కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి టీమిండియా పతనాన్ని శాశించారు. రికార్డు స్థాయిలో ప్రేక్షకుల బ్రహ్మరథం భారత్ ఆతిథ్యమిచ్చిన వన్డే ప్రపంచకప్‌ను రికార్డుస్థాయిలో ప్రేక్షకులు ప్రత్యక్షంగా వీక్షించారు. పది జట్లు పోటీపడిన ఈ మెగా ఈవెంట్ 48 మ్యాచ్‌లను 12,50,307 మంది ప్రేక్షకులు చూశారని ఐసీసీ ధ్రువీకరించింది. అంటే సగటున ఒక్కో మ్యాచ్‌కు 26000 మంది హాజరైనట్లు తెలిపింది. ఆసీస్, న్యూజిలాండ్ సంయుక్తంగా నిర్వహించిన 2015 వన్డే ప్రపంచకప్‌ను 10,16,420 మంది వీక్షించి రికార్డు సృష్టించగా... దీన్ని తాజా ప్రపంచకప్ బద్దలుకొట్టింది. -
ద్రవిడ్‌ను కొనసాగిస్తారా? సాగనంపితే... టీమిండియా కొత్త కోచ్ ఎవరు..?
టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ రెండేళ్ల పదవీకాలం వరల్డ్‌కప్ 2023 ఫైనల్‌తో ముగిసింది. దీంతో భారత జట్టు కొత్త హెడ్ కోచ్ ఎవరనే అంశంపై చర్చ మొదలైంది. మరో దఫా కొనసాగాలా లేదా అనే దానిపై ఇంకా తేల్చుకోలేదని ద్రవిడ్ వరల్డ్‌కప్ అనంతరం మీడియా సమావేశంలో తెలిపాడు. మరి బీసీసీఐ రవిశాస్త్రిలా ద్రవిడ్‌ను రెండో దఫా కొనసాగిస్తుందో లేదో వేచి చూడాలి. ప్రస్తుతానికి అయితే ఆసీస్‌తో టీ20 సిరీస్‌కు స్టాండ్ ఇన్ కోచ్‌గా ఎన్సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. ఒకవేళ ద్రవిడ్ రెండో దఫా కోచ్‌గా పని చేసేందుకు నిరాకరిస్తే లక్ష్మణ్ భారత జట్టు హెడ్ కోచ్ పదవి రేసులో ముందువరుసలో ఉంటాడు. ఈ పదవి కోసం లక్ష్మణ్‌తో పాటు మరో ఇద్దరు టీమిండియా దిగ్గజాలు పోటీలో ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇటీవలే ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమర్‌గా ప్రకటించబడ్డ వీరేంద్ర సెహ్వాగ్, స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే లక్ష్మణ్‌తో పాటు ప్రధాన పోటీదారులుగా నిలిచే ఛాన్స్ ఉంది. వీరిలో కుంబ్లేకు గతంలో భారత జట్టు హెడ్ కోచ్‌గా పని చేసిన అనుభవం ఉంది. ధోనిని ఒప్పించి అప్పచెబితే.. టీమిండియా హెడ్ కోచ్ పదవి ఖాళీ అయిన నేపథ్యంలో ఈ అంశంపై నెట్టింట జోరుగా చర్చలు సాగుతున్నాయి. కొందరు ద్రవిడ్‌నే కొనసాగించాలని అంటుంటే, మరికొందరు అతడిని సాగనంపాలని వాధిస్తున్నారు. ఒకవేళ హెడ్ కోచ్ పదవిలో కొనసాగేందుకు ద్రవిడ్ ఆసక్తి కనబర్చకపోతే లక్ష్మణ్, అనిల్ కుంబ్లే, సెహ్వాగ్‌లు రేసులో ఉంటారని ప్రచారం జరుగుతుంది. కొత్తగా కొందరు టీమిండియా మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పేరును తెరపైకి తెస్తున్నారు. ధోనికి ఇష్టం లేకపోయినా అతన్ని ఒప్పించి మరీ భారత క్రికెట్ జట్టు కోచింగ్ బాధ్యతలు అప్పజెప్పాలని వారు పట్టుబడుతున్నారు. మరి భారత జట్టుకు కోచింగ్ ఇచ్చేందుకు ధోని ముందుకు వస్తాడో లేదో వేచి చూడాలి. -
భారత్-ఆస్ట్రేలియా టీ20 సిరీస్.. స్టార్ ఆటగాడు ఔట్
నవంబర్ 23 నుంచి భారత్‌తో జరుగబోయే టీ20 సిరీస్ కోసం ముందుగా ప్రకటించిన ఆస్ట్రేలియా జట్టులో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ఆ జట్టు స్టార్ ఆటగాడు, వరల్డ్‌కప్‌లో ఆసీస్ లీడింగ్ రన్ స్కోరర్ (11 మ్యాచ్‌ల్లో 535 పరుగులు) డేవిడ్ వార్నర్ ఈ సిరీస్ మొత్తానికి దూరం కానున్నాడు. విశ్రాంతి కోసం వార్నర్ చేసుకున్న విజ్ఞప్తిని ఆసీస్ క్రికెట్ బోర్డు పరిగణలోకి తీసుకుంది. దీంతో వరల్డ్‌కప్ ముగిసిన అనంతరమే వార్నర్ స్వదేశానికి పయనమయ్యాడు. క్రికెట్ ఆస్ట్రేలియా ఈ సిరీస్ కోసం సీనియర్లెవ్వరినీ ఎంపిక చేయలేదు. ఆసీస్ టీమ్‌కు మాథ్యూ వేడ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. క్రికెట్ ఆస్ట్రేలియా వార్నర్ స్థానంలో ఆరోన్ హార్డీని జట్టులోకి తీసుకుంది. మరోవైపు భారత సెలెక్టర్లు కూడా ఈ సిరీస్‌కు సీనియర్లకు విశ్రాంతి కల్పించారు. వీరి గైర్హాజరీలో సూర్యకుమార్ యాదవ్ టీమిండియా సారధిగా ఎంపికయ్యాడు. 5 మ్యాచ్‌ల ఈ సిరీస్ కోసం భారత సెలెక్టర్లు నిన్ననే టీమిండియాను ప్రకటించారు. కాగా, వన్డే వరల్డ్‌కప్ 2023 విజేతగా ఆస్ట్రేలియా నిలిచిన విషయం తెలిసిందే. ఫైనల్లో ఆ జట్టు టీమిండియాను ఓడించి, ఆరోసారి జగజ్జేతగా నిలిచింది. ఇదిలా ఉంటే, మరో రెండు రోజుల్లో భారత్, ఆసీస్ టీ20 సిరీస్ ప్రారంభంకానుంది. ఈ సిరీస్‌లో గెలిచి ఆసీస్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని భారత ఆటగాళ్లు భావిస్తున్నారు. సిరీస్‌లో తొలి మ్యాచ్ (నవంబర్ 23) వైజాగ్ వేదికగా, రెండో టీ20 నవంబర్ 26న (తిరువనంతపురం), మూడో మ్యాచ్ నవంబర్ 28న (గౌహతి), నాలుగు (నాగ్‌పూర్), ఐదు టీ20లు (హైదరాబాద్) డిసెంబర్ 1, 3 తేదీల్లో జరుగనున్నాయి. ఆస్ట్రేలియా: మాథ్యూ వేడ్ (కెప్టెన్), ఆరోన్ హార్డీ, జేసన్ బెహ్రెన్‌డార్ఫ్, సీన్ అబాట్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్వెల్, తన్వీర్ సంఘా, మాట్ షార్ట్, స్టీవ్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, కేన్ రిచర్డ్సన్, ఆడమ్ జంపా భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్‌కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్, శ్రేయస్ అయ్యర్ (చివరి రెండు మ్యాచ్‌లకు మాత్రమే). -
టీమిండియా ఓటమి - పారిశ్రామిక వేత్తల ట్వీట్స్ వైరల్
ఇండియా మూడవ ప్రపంచ కప్ టైటిల్ సొంతం చేసుకుంటుందని ప్రారంభం నుంచి ఎదురు చూసిన భారతీయుల ఆశలు ఫలించ లేదు. ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించి సంబరాలు చేసుకుంటుంటే.. యావత్ భారతం మిన్నకుండిపోయింది. టైటిల్ సొంతం చేసుకోవడానికి శాయశక్తులా ప్రయత్నించి ఓటమి పాలవ్వడంతో టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మ కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఈ సన్నివేశం చూసిన ప్రజలంతా.. ఓటమిలో అయినా గెలుపులో అయినా మేము మీ తోడుంటాం అంటూ ధైర్యం నింపారు. కొంతమంది పారిశ్రామిక వేత్తలు కూడా తమదైన రీతిలో సానుభూతి తెలిపారు. రోహిత్ శర్మ బాధలో ఉన్న దృశ్యంపై ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ 'రాధికా గుప్తా' స్పందిస్తూ.. గొప్ప నాయకులకు కూడా కొన్ని సందర్భాల్లో ఓటమి తప్పదు. భావోద్వేగాలు బలహీనతకు సంకేతం కాదని ఆమె పోస్ట్ చేస్తూ.. ఎంతోమంది మీకు మద్దతుగా నిలుస్తూ ప్రేమను తెలియజేస్తున్నారని ట్వీట్ చేసింది. Great leaders also have bad days. And shedding a tear doesn’t make you weak. A billion hearts giving you ❤️ captain. pic.twitter.com/uMwxIlIuY5 — Radhika Gupta (@iRadhikaGupta) November 19, 2023 ఆనంద్ మహీంద్రా మండే మోటివేషన్ పేరుతో ట్వీట్ చేస్తూ.. ది మెన్ ఇన్ బ్లూ దేశం నలుమూలల నుంచి చాలా భిన్నమైన నేపథ్యాల నుంచి వచ్చి చివరిదాకా పోరాడి మన హృదయాలను గెలుచుకున్నారు అంటూ వెల్లడించారు. ఇవి ప్రస్తుతం నెట్టింటో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు తమదైన రీతిలో సానుభూతి తెలుపుతున్నారు. This sums up why we didn’t lose. It’s easy for teams to celebrate together;harder to support & share each other’s pain.The Men in Blue came from around the country and from vastly different backgrounds but played as a family and won our hearts. They’re STILL my #MondayMotivation pic.twitter.com/BHatUZ7dKH — anand mahindra (@anandmahindra) November 20, 2023 -
పదేళ్ల నుంచి ఇంతే.. ఆశలు రేకెత్తిస్తారు, ఆఖర్లో ఉసూరుమనిపిస్తారు..!
వన్డే వరల్డ్‌కప్ 2023లో వరుసగా 10 మ్యాచ్‌ల్లో గెలిచి ఫైనల్‌కు చేరిన భారత్.. ఆఖరి మెట్టుపై (ఫైనల్స్) బోల్తా పడి 140 కోట్ల మంది భారతీయులకు గుండెకోత మిగిల్చింది. సెమీస్ లేదా ఫైనల్స్‌లో ఇలా చేతులెత్తేయడం భారత్‌కు ఇది కొత్తేమీ కాదు. గత పదేళ్ల కాలంలో టీమిండియా తొమ్మిది ఐసీసీ టోర్నీల్లో సెమీస్ లేదా ఫైనల్స్‌లో ఓటమిపాలైంది. ఐసీసీ టోర్నీల్లో భారత్ వరుస వైఫల్యాల తీరును పరిశీలిస్తే.. ఆయా టోర్నీల ఆరంభాల్లో చిచ్చరపిడుగుల్లా చెలరేగిపోయే భారత క్రికెటర్లు నాకౌట్ మ్యాచ్ అనగానే ఒత్తిడికి లోనై చతికిలపడతారు. 2013 నుంచి ఐసీసీ టోర్నీల్లో ఇదే తంతు కొనసాగుతుంది. వరల్డ్‌కప్ 2023లోనూ సెమీస్ వరకు ఆకాశమే హద్దుగా చెలరేగిన భారత ఆటగాళ్లు ఫైనల్ మ్యాచ్‌లో చేతులెత్తేశారు. ఎన్నో అంచనాల నడుమ ఫైనల్ మ్యాచ్ బరిలోకి దిగిన భారత ఆటగాళ్లు అన్ని విభాగాల్లో స్థాయికి తగ్గట్టుగా ఆడలేక ఓడారు. ఆశలు రేకెత్తించి, ఆఖర్లో ఊసూరుమనిపించడం టీమిండియా ఆటగాళ్లకు పరిపాటిగా మారింది. ఓటముల నుంచి గుణపాఠం నేర్చుకోని టీమిండియా నెక్స్ట్ టైమ్ బెటర్ లక్ అంటూ సర్ధి చెప్పుకోవడం తప్పించి చేసిందేమీ లేదు. అభిమానులు సైతం ఇదే అనుకుంటూ ఆటగాళ్లకు మద్దతుగా నిలుస్తుండటంతో వారిలో సీరియస్‌నెస్ కొరవడింది. విచ్చలవిడిగా డబ్బు, పబ్లిసిటీ లభిస్తుండటంతో వాటిపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టే భారత క్రికెటర్లు ఇకనైనా అలసత్వం వీడాలి. లేకపోతే నెక్స్ట్ జనరేషన్ కూడా గెలుపును అంత సీరియస్‌గా తీసుకోదు. ఒత్తిడిలో ఎలా ఆడాలో ఆసీస్ ఆటగాళ్ల నుంచి మనవాళ్లు ఎంతైనా నేర్చుకోవాలి. ప్రతిభ గల జట్టును బెంచ్ మార్క్‌గా పెట్టుకోవడంలో తప్పేమీ లేదు. అభిమానులకు ఇది కాస్త ఇబ్బందికరంగానే ఉండవచ్చు కానీ అనక తప్పదు. 2013 నుంచి ఐసీసీ టోర్నీల్లో టీమిండియా ప్రస్తానం.. 2014 టీ20 వరల్డ్‌కప్: ఫైనల్లో ఓటమి 2015 వన్డే వరల్డ్‌కప్: సెమీస్‌లో ఓటమి 2016 టీ20 వరల్డ్‌కప్: సెమీస్‌లో ఓటమి 2017 ఛాంపియన్స్ ట్రోఫీ: ఫైనల్స్‌లో ఓటమి 2019 వన్డే వరల్డ్‌కప్: సెమీస్‌లో ఓటమి 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్: ఫైనల్లో ఓటమి 2022 టీ20 వరల్డ్‌కప్: సెమీఫైనల్లో ఓటమి 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్: ఫైనల్లో ఓటమి 2023 వన్డే వరల్డ్‌కప్: ఫైనల్లో ఓటమి -
ఆ వ్యాఖ్యలు పాంటింగ్ చేసినవేనా???
వన్డే వరల్డ్‌కప్ 2023 ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత ఓటమి నేపథ్యంలో బీసీసీఐపై ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతుంది. పాంటింగ్ ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడుతూ బీసీసీఐని క్రికెట్ మాఫియాతో పోల్చాడన్న వార్త ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. అయితే పాంటింగ్ నిజంగా ఈ వ్యాఖ్యలు చేశాడా లేదా అని ఫ్యాక్ట్ చేయగా.. ఈ ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదని తేలింది. ఈ ప్రచారంపై భారత్‌లోనే ఉన్న పాంటింగ్ స్పందించాల్సి ఉంది. కాగా, ASG అనే ట్విటర్ అకౌంట్ నుంచి పాంటింగ్ ఫాక్స్ క్రికెట్‌తో మాట్లాడుతూ బీసీసీఐపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని నిన్నటి నుంచి సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతుంది. Ricky Ponting on Fox Cricket: "This is a win of justice against cricket mafia. Your money and power is still not winning World Cups for you. How embarrassing." Ponting owned India and BCCI 😂 pic.twitter.com/pc5LnseQi7 — ASG (@ahadfoooty) November 19, 2023 సదరు ట్వీట్లో ఏముందంటే.. ఇది క్రికెట్ మాఫియాపై (బీసీసీఐని ఉద్దేశిస్తూ) న్యాయం సాధించిన విజయం.. డబ్బు, పలుకుబడితో ప్రపంచ కప్ గెలవలేరని పాంటింగ్ అన్నట్లు ప్రచారం జరుగుతుంది. పాంటింగ్ నిజంగానే బీసీసీఐని అలా అన్నాడనుకుని పొరబడ్డ కొందరు భారత క్రికెట్ అభిమానులు పాంటింగ్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. ఐపీఎల్లో పిలిచి పెత్తనం ఇచ్చినందుకు (ఢిల్లీ క్యాపిటల్స్) బీసీసీఐకి సరైన గుణపాఠమే నేర్పాడని కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, నిన్న జరిగిన వరల్డ్‌కప్ 2023 ఫైనల్లో ఆస్ట్రేలియా భారత్‌ను 6 వికెట్ల తేడాతో చిత్తు చేసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. ఆసీస్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో 240 పరుగుల స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్ ఆరంభంలో కాస్త తడబడినప్పటికీ.. ట్రవిస్ హెడ్ (137), లబూషేన్ (58 నాటౌట్) చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ల సహకారంతో విజయతీరాలకు చేరింది. హెడ్-లబూషేన్ జోడీ నాలుగో వికెట్‌కు 192 పరుగలు భాగస్వామ్యాన్ని నమోదు చేసి ఆసీస్‌ను గెలిపించారు. భారత బౌలర్లలో బుమ్రా, షమీ, సిరాజ్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ (47), విరాట్ కోహ్లి (54), కేఎల్ రాహుల్ (66) ఓ మోస్తరుగా రాణించారు. ఆసీస్ బౌలర్లు స్టార్క్ (3/55), హాజిల్‌వుడ్ (2/60), కమిన్స్ (2/34), మ్యాక్స్‌వెల్ (1/35), జంపా (1/44) కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి టీమిండియా పతనాన్ని శాశించారు. -
Pat Cummins: నిశ్శబ్దంలో ఉన్న కిక్కే వేరప్పా..!
వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా టీమిండియాను ఆరె వికెట్ల తేడాతో ఓడించి, ఆరోసారి జగజ్జేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. ఆసీస్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో 240 పరుగుల స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్ ఆరంభంలో కాస్త తడబడినప్పటికీ.. ట్రవిస్ హెడ్ (137), లబూషేన్ (58 నాటౌట్) చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ల సహకారంతో విజయతీరాలకు చేరింది. హెడ్-లబూషేన్ జోడీ నాలుగో వికెట్‌కు 192 పరుగలు భాగస్వామ్యాన్ని నమోదు చేసి ఆసీస్‌ను గెలిపించారు. భారత బౌలర్లలో బుమ్రా, షమీ, సిరాజ్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ (47), విరాట్ కోహ్లి (54), కేఎల్ రాహుల్ (66) ఓ మోస్తరుగా రాణించారు. ఆసీస్ బౌలర్లు స్టార్క్ (3/55), హాజిల్‌వుడ్ (2/60), కమిన్స్ (2/34), మ్యాక్స్‌వెల్ (1/35), జంపా (1/44) కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి టీమిండియా పతనాన్ని శాశించారు. కాగా, ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి. 1.3 లక్షల మంది ప్రేక్షకులను (ఫైనల్‌కు హాజరయ్యే ప్రేక్షకుల సంఖ్య) సైలెంట్‌గా ఉంచడంలో దొరకే సంతృప్తి ఇంకొక దాంట్లో దొరకదని కమిన్స్ వ్యాఖ్యానించాడు. అన్నట్లుగానే కమిన్స్ నిన్న జరిగిన ఫైనల్లో భారత్‌ను ఓడించి నరేంద్ర మోదీ స్టేడియం మొత్తాన్ని సైలెంట్‌గా ఉంచగలిగాడు. కమిన్స్ చేసిన ఈ వ్యాఖ్యలను ప్రస్తుతం కొందరు నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. నిశబ్దంలో ఉన్న కిక్కే వేరప్పా అనే సినిమా డైలాగ్‌తో కామెంట్స్ చేస్తున్నారు. -
Virat Kohli: ఆ విషయంలోనూ తన ఆరాధ్య ఆటగాడి అడుగుజాడల్లోనే..!
వన్డే వరల్డ్‌కప్ 2023 ఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ టోర్నీ ఆధ్యాంతం అద్భుతంగా రాణించిన విరాట్ కోహ్లి ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు గెలుచుకున్నాడు. ఈ ఎడిషన్‌లో 11 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 95.62 సగటున 3 సెంచరీలు, 6 అర్ధసెంచరీల సాయంతో 765 పరుగులు చేశాడు. కోహ్లి వన్డే వరల్డ్‌కప్‌లో ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు గెలుచుకోవడం ఇదే తొలిసారి. అతను టీ20 వరల్డ్‌కప్‌లో మాత్రం రెండుసార్లు ఈ ఘనతను సాధించాడు. 2014, 2016 ఎడిషన్లలో ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డును గెలుచుకున్నాడు. కోహ్లి ఈ ఎడిషన్‌లో ఆటగాడిగా సూపర్ సక్సెస్ అయినప్పటికీ.. టీమిండియాను ఛాంపియన్‌గా నిలబెట్టలేకపోయాడు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్‌కు సైతం గతంలో ఇలాంటి అనుభవమే ఎదురైంది. 2003 ఎడిషన్‌లో సచిన్ కూడా ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు గెలుచుకున్నప్పటికీ టీమిండియాకు టైటిల్‌ను అందించలేకపోయాడు. క్రికెట్‌కు సంబంధించి ప్రతి విషయంలోనూ సచిన్ అడుగుజాడల్లో నడిచే కోహ్లి ఈ విషయంలోనూ తన ఆరాధ్య ఆటగాడినే ఫాలో అయ్యాడు. Sad to experience both these moments in past 20 years. 💔 pic.twitter.com/8txpsrKw1l — Abhishek Ojha (@vicharabhio) November 19, 2023 ఇదిలా ఉంటే, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో టీమిండియా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసి నామమాత్రపు స్కోర్‌కే (240) పరిమితమైంది. ఛేదనలో ఆసీస్ ఆదిలోనే 3 వికెట్లు కోల్పోయినప్పటికీ అనంతరం అద్భుతంగా పుంజుకుని ఆరోసారి వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచింది. ట్రవిస్ హెడ్ (137).. లబూషేన్ (58 నాటౌట్) సహకారంతో ఆసీస్‌కు చిరస్మరణీయ విజయాన్నందించాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 192 పరుగలు భాగస్వామ్యాన్ని నమోదు చేసి ఆసీస్‌ను గెలిపించారు. భారత బౌలర్లలో బుమ్రా, షమీ, సిరాజ్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ (47), విరాట్ కోహ్లి (54), కేఎల్ రాహుల్ (66) ఓ మోస్తరుగా రాణించారు. ఆసీస్ బౌలర్లు స్టార్క్ (3/55), హాజిల్‌వుడ్ (2/60), కమిన్స్ (2/34), మ్యాక్స్‌వెల్ (1/35), జంపా (1/44) కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి టీమిండియా పతనాన్ని శాశించారు. -
CWC 2023 Final: ఇప్పటికంటే 2015లోనే ఎక్కువ..!
వన్డే వరల్డ్‌కప్ 2023 ఫైనల్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన విషయం తెలిసిందే. నిన్న (నవంబర్ 19) జరిగిన ఈ మ్యాచ్‌కు అశేష జనవాహిని హాజరై టీమిండియాను ప్రోత్సహించారు. దురదృష్టవశాత్తు ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలై అభిమానులను నిరాశపర్చింది. అధికారక లెక్కల ప్రకారం ఈ మ్యాచ్‌కు 92453 మంది హాజరైనట్లు సమాచారం. 2015 వరల్డ్‌కప్‌తో పోల్చుకుంటే ఈ సంఖ్య తక్కువ. మెల్బోర్న్ వేదికగా జరిగిన నాటి ఫైనల్‌కు 93013 మంది హాజరయ్యారు. న్యూజిలాండ్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో గెలుపొంది, ఐదో సారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. తాజాగా జరిగిన 2023 ఎడిషన్ ఫైనల్లో అదే ఆసీస్ టీమిండియాను 6 వికెట్ల తేడాతో ఓడించి, ఆరోసారి జగజ్జేతగా నిలిచింది. According to official attendance numbers, the 2015 World Cup in MCG had higher attendance than the 2023 World Cup final in Ahmedabad👀🤯 pic.twitter.com/j2kapHeAfB — CricTracker (@Cricketracker) November 20, 2023 నిన్నటి మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నామమాత్రపు స్కోర్‌కే (240) పరిమితమైనప్పటికీ.. బౌలింగ్‌లో రాణించి చివరి వరకు పోరాడింది. ట్రవిస్ హెడ్ (137) చిరస్మరణీయ శతకంతో ఆసీస్ గెలుపు అంచుల వరకు తీసుకెళ్లాడు. లబూషేన్ (58 నాటౌట్) సహకారంతో భారత్‌కు గెలుపును దూరం చేశాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 192 పరుగలు భాగస్వామ్యాన్ని నమోదు చేసి ఆసీస్‌ను గెలిపించారు. భారత బౌలర్లలో బుమ్రా, షమీ, సిరాజ్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ (47), విరాట్ కోహ్లి (54), కేఎల్ రాహుల్ (66) ఓ మోస్తరుగా రాణించారు. ఆసీస్ బౌలర్లు స్టార్క్ (3/55), హాజిల్‌వుడ్ (2/60), కమిన్స్ (2/34), మ్యాక్స్‌వెల్ (1/35), జంపా (1/44) కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి టీమిండియా పతనాన్ని శాశించారు. -
ఆసీస్‌పై ప్రతీకారం తీర్చుకునే అవకాశం
వన్డే వరల్డ్‌కప్ 2023 ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం టీమిండియాకు అతి త్వరలో రానుంది. స్వదేశంలోనే మరో 3 రోజుల్లో భారత్, ఆసీస్ టీ20 సిరీస్ ప్రారంభంకానుంది. 5 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో గెలిచి ఆసీస్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని భారత ఆటగాళ్లు భావిస్తున్నారు. ఈ సిరీస్ నవంబర్ 23 నుంచి ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్ వైజాగ్ వేదికగా, రెండో టీ20 నవంబర్ 26న (తిరువనంతపురం), మూడో మ్యాచ్ నవంబర్ 28న (గౌహతి), నాలుగు (నాగ్‌పూర్), ఐదు టీ20లు (హైదరాబాద్) డిసెంబర్ 1, 3 తేదీల్లో జరుగనున్నాయి. కాగా, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో టీమిండియా పోరాడి ఓడింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నామమాత్రపు స్కోర్‌కే (240) పరిమితమైనప్పటికీ.. బౌలింగ్‌లో రాణించి చివరి వరకు పోరాడింది. ట్రవిస్ హెడ్ (137) చిరస్మరణీయ శతకంతో ఆసీస్ గెలుపు అంచుల వరకు తీసుకెళ్లాడు. లబూషేన్ (58 నాటౌట్) సహకారంతో భారత్‌కు గెలుపును దూరం చేశాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 192 పరుగలు భాగస్వామ్యాన్ని నమోదు చేసి ఆసీస్‌ను గెలిపించారు. భారత బౌలర్లలో బుమ్రా, షమీ, సిరాజ్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ (47), విరాట్ కోహ్లి (54), కేఎల్ రాహుల్ (66) ఓ మోస్తరుగా రాణించారు. ఆసీస్ బౌలర్లు స్టార్క్ (3/55), హాజిల్‌వుడ్ (2/60), కమిన్స్ (2/34), మ్యాక్స్‌వెల్ (1/35), జంపా (1/44) కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి టీమిండియా పతనాన్ని శాశించారు. -
క్రికెట్ జోష్ ముగిసింది.. బరిలో 8 సినిమాలు.. పోటీ పడుతున్న సలార్
కొద్దిరోజుల్లో 2023కు గుడ్‌బై చెప్పే సమయం ఆసన్నమైంది. దసర పండుగ వరకు వరుస సినిమాలతో సందడి చేసిన చిత్ర పరిశ్రమ క్రికెట్ వరల్డ్ కప్ కారణంగా పలు సినిమాలు వాయిదా పడుతూ వచ్చాయి. ఎందుకంటే..? క్రికెట్, సినిమా రెండూ ప్రేక్షకులను అలరిస్తాయి. క్రికెట్ కారణంగా కొన్ని సినిమాలు విడుదల వాయిదా వేసుకుంటే మరికొన్ని అనుకోని కారణాలతో జాప్యం జరుగుతూ వచ్చింది. నిన్నటితో క్రికెట్ ప్రపంచం నుంచి ప్రేక్షకులు మెళ్లిగా సినిమా ప్రపంచం వైపు మళ్లుతున్నారు. త్వరలో క్రిస్టమస్ పండగ రానుంది... అంతేకాకుండా 2023 సంవత్సరానికి గుడ్‌బై చెప్పే సమయం వచ్చేస్తుంది. ఇలాంటి సమయంలో రానున్న 40 రోజుల్లో విడుదలయ్యే సినిమాలు ఏవి..? ఏడాది చివర్లో భారీ సిక్సర్ కొట్టే సినిమా ఏది..? ఇదే క్రమంలో క్లీన్ బౌల్డ్ అయ్యే మూవీ ఏది..? అనే అప్పుడే లెక్కలు వేస్తున్నారు సినీ అభిమానులు. నవంబర్ 24 నుంచి డిసెంబర్ 22 వరకు వరసగా విడుదలయ్యే చిత్రాలు ఎన్ని ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఆదికేశవతో వస్తున్న వైష్ణవ్ తేజ్ వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా శ్రీకాంత్ ఎన్.రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం 'ఆదికేశవ'. ఎస్. నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో అపర్ణా దాస్, జోజు జార్జ్, రాధిక తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో వైష్ణవ్, శ్రీలీల రొమాంటిక్ లుక్‌తో చూడముచ్చటగా కనిపించారు. మాస్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై వైష్ణవ్ భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఇందులో రుద్ర అనే పాత్రలో వైష్ణవ్ కనిపిస్తే... వజ్ర కాళేశ్వరి దేవిగా అపర్ణా దాస్ కనిపించనుంది. ఈ సినిమాకి సంగీతం జి.వి.ప్రకాష్ కుమార్ అందిస్తున్నారు. 'కోట బొమ్మాళి పీఎస్'లో శివాని రాజశేఖర్ లింగి లింగి లింగిడి... పాట వల్ల 'కోట బొమ్మాళి పీఎస్' సినిమా గురించి విడుదలకి ముందే హైప్ క్రియేట్ అయింది. తల్లిదండ్రులు జీవిత, రాజశేఖర్ల నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న శివాని ఇందులో ప్రధాన పాత్రలో కనిపించనుంది. శ్రీకాంత్, రాహుల్ విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2 పతాకంపై బన్నీ వాస్, విద్య కొప్పినీడి నిర్మించారు. నవంబర్ 24న ఈ చిత్రం విడుదల కానుంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన 'నాయట్టు' చిత్రానికి రీమేక్‌గా దీనిని తెరకెక్కించారు. క్రూరమైన యానిమల్గా రణ్‌బీర్ రణ్‌బీర్ కపూర్ - రష్మిక జంటగా నటించిన చిత్రం 'యానిమల్'. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కిన ఈ చిత్రానికి తెలుగు డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. విభిన్నమైన కథతో యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా రన్‌టైమ్ దాదాపు 3.20 గంటలు ఉండనుందని టాక్ వస్తుంది. కానీ అధికారికంగా ప్రకటన రాలేదు. హ్యట్రిక్‌పై కన్నేసిన షారుక్ ఖాన్ సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న సినిమా పేర్లలో 'డంకీ' చిత్రం టాప్‌లో ఉంది. రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వంలో షారుక్ ఖాన్ ఇందులో నటిస్తున్నాడు. ఈ ఏడాదిలో ఇప్పటికే వరుసగా రెండు సూపర్ హిట్ సినిమాలతో ఫుల్‌జోష్‌లో ఉన్న షారుక్ ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పఠాన్, జవాన్ రెండు చిత్రాలు రూ.1000 కోట్ల క్లబ్లో చేరిపోయాయి. డంకీ చిత్రం ద్వారా సూపర్ హిట్ కొట్టి ఈ ఏడాదిలో హ్యాట్రిక్ కొట్టాలని షారుక్ ఉన్నారు. డిసెంబర్ 22న ఈ చిత్రం సలార్‌తో పోటీకి దిగనుంది. చివర్లో దిగుతున్న డైనోసార్ (సలార్) భారతీయ చలన చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలతో విడుదలకు రెడీగా ఉన్న చిత్రం సలార్.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ తెరకెక్కింది. ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఇప్పటికే ఒకసారి వాయిదా పడి క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 22న విడుదల కానుంది. ఈ ఏడాది చివర్లో భారీ బడ్జెట్ చిత్రంగా సలార్ ఉంది. లైన్లో ఉన్న నాని, నితిన్, విష్వక్సేన్ ఈ చిత్రాలతో పాటు మరికొన్ని ఆసక్తకరమైన చిత్రాలు డిసెంబర్ నెలలో విడుదల కానున్నాయి. డిసెంబర్ 7న నాని చిత్రం 'హాయ్ నాన్న' ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబర్ 8న ఏకంగా మూడు చిత్రాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. వరుణ్‌తేజ్- 'ఆపరేషన్ వాలంటైన్', విష్వక్సేన్- 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి', నితిన్- 'ఎక్స్ట్రా ఆర్డినరీమేన్' ఉన్నాయి. ఈ మూడు సినిమాలూ ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది.