Cyberabad police commissionerate
-
సైబరాబాద్ శివారు ఫాంహౌస్లపై ఎస్వోటీ పోలీసుల దాడులు
-
హైదరాబాద్ శివార్లలోని 32 ఫామ్‌హౌస్‌లపై పోలీసుల దాడి
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పలు ఫామ్‌హౌస్‌లపై ఎస్ఓటీ పోలీసులు సోమవారం దాడులు చేపట్టారు. మొయినాబాద్‌లోని బిగ్ బాస్ ఫామ్‌హౌస్, జహంగీర్ డ్రీమ్ వ్యాలి, శంషాబాద్ పరిధిలోని రిప్లెజ్ ఫామ్‌హౌస్, మేడ్చల్‌లోని గోవర్ధన్ రెడ్డి ఫామ్‌హౌస్‌లలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఫామ్‌హౌస్‌ల నుంచి మద్యం సీసాలు, హుక్కా సామాగ్రి, ప్లేయింగ్ కార్డ్స్, లక్ష రూపాయల నగదు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 32 ఫామౌస్‌లలో తనిఖీలు చేపట్టగా.. 26 మంది అరెస్ట్ చేశారు. చదవండి: కేసీఆర్ నోట పదేపదే ఈటల మాట.. దీని వెనక మతలబు ఏంటీ? -
Cyberabad Police Commissionerate: సైబరాబాద్‌లో 5 జోన్లు!
సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సరం నుంచి సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ స్వరూపం మారనుంది. హైదరాబాద్ తరహాలో సైబరాబాద్ కూడా ఐదు జోన్లతో కార్యకలాపాలు సాగించనుంది. ఇప్పటికే శాంతి భద్రతల విభాగంలో మాదాపూర్, శంషాబాద్, బాలానగర్ మూడు జోన్లు ఉండగా.. కొత్తగా రాజేంద్రనగర్, మేడ్చల్ జోన్లు అవతరించనున్నాయి. ట్రాఫిక్ విభాగాన్నీ రెండు జోన్లుగా విభజించి, జాయింట్ సీపీ అధికారిని నియమించనున్నారు. ఈ మేరకు ఆయా ఏర్పాట్లపై సైబరాబాద్ పోలీసు ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించారు. 3,644 చ.కి.మీ. మేర విస్తరించి ఉన్న సైబరాబాద్‌లో సుమారు ఏడు లక్షల జనాభా ఉంది. పట్టణీకరణ, కొత్త ప్రాంతాల ఏర్పాటుతో సైబరాబాద్ విస్తరిస్తుంది. దీంతో కొత్త జోన్ల ఏర్పాటు అనివార్యమైంది. ఈ మేరకు ప్రస్తుతం బాలానగర్ జోన్లో భాగంగా ఉన్న మేడ్చల్‌ను వేరే చేసి కొత్తగా మేడ్చల్ జోన్‌ను, అలాగే ప్రస్తుతం శంషాబాద్ జోన్లో ఉన్న రాజేంద్రనగర్‌ను విడదీసి రాజేంద్రనగర్ జోన్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇటీవలే సైబరాబాద్‌కు 750 కొత్త పోస్టులు మంజూరయ్యాయి. వీటిలో ఒక జాయింట్ సీపీ, నాలుగు డీసీపీ, ఏడు అదనపు డీసీపీ, ఎనిమిది ఏసీపీ ర్యాంకు పోస్టులు కాగా.. మిగిలినవి ఇన్స్పెక్టర్, ఆ కింది స్థాయి ర్యాంకు పోస్టులున్నాయి. కొత్త జోన్ల స్వరూపం ఇదే: మేడ్చల్ జోన్: ఈ జోన్లో మేడ్చల్, పేట్‌బషీరాబాద్ డివిజన్లుంటాయి. మేడ్చల్ డివిజన్లో కొత్తగా ఏర్పాటయ్యే సూరారం, జీనోమ్‌వ్యాలీతో పాటు ఇప్పటికే ఉన్న మేడ్చల్, దుండిగల్ ఠాణాలుంటాయి. రాజేంద్రనగర్ జోన్: ఈ జోన్లో రాజేంద్రనగర్, చేవెళ్ల డివిజన్లుంటాయి. రాజేంద్రనగర్ డివిజన్లో రాజేంద్రనగర్, మైలార్‌దేవ్‌పల్లి, నార్సింగితో పాటు కొత్తగా ఏర్పాటుకానున్న అత్తాపూర్ ఠాణా కూడా ఉంటుంది. పేట్‌బషీరాబాద్ డివిజన్లో అల్వాల్, శామీర్‌పేట, పేట్‌బషీరాబాద్ పీఎస్‌లు, చేవెళ్ల డివిజన్లో మొయినాబాద్, శంకర్పల్లి, షాబాద్, చేవెళ్ల పీఎస్‌లుంటాయి. కొత్త ఠాణాలు ఇక్కడే.. తాజా పునర్ వ్యవస్థీకరణతో సైబరాబాద్‌లో ప్రతి జోన్‌లోనూ రెండేసి డివిజన్లు ఉంటాయి. ప్రస్తుతం మాదాపూర్ జోన్లో ఉన్న కూకట్పల్లి డివిజన్‌ను విడదీసి బాలానగర్ జోన్లో కలిపేయనున్నారు. దీంతో మాదాపూర్ జోన్లో మాదాపూర్, మియాపూర్ డివిజన్లు, బాలానగర్ జోన్లో బాలానగర్, కూకట్పల్లి, శంషాబాద్ జోన్లో శంషాబాద్, షాద్‌నగర్ డివిజన్లుంటాయి. అలాగే ప్రస్తుతం సైబరాబాద్‌లో 37 శాంతి భద్రతల పోలీసు స్టేషన్లు ఉండగా.. కొత్తగా గండిపేట, మెకిలా, కొల్లూరు, జన్వాడ, సూరారం, జీనోమ్‌వ్యాలీ, అత్తాపూర్ ఠాణాలను ఏర్పాటు చేయనున్నారు. ట్రాఫిక్‌కు జాయింట్ సీపీ.. ప్రస్తుతం సైబరాబాద్ మొత్తానికీ ఒకటే ట్రాఫిక్ జోన్ ఉంది. దీన్ని రెండుగా విభజించి రాజేంద్రనగర్, మేడ్చల్ జోన్లుగా ఏర్పాటు చేయనున్నారు. ప్రతి జోన్ ఒక డీసీపీ, అదనపు డీసీపీ పర్యవేక్షణలో ఉంటాయి. కొత్తగా ట్రాఫిక్ విభాగానికి జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీసు (జాయింట్ సీపీ)ను నియమించనున్నారు. ప్రస్తుతం సైబరాబాద్‌లో మాదాపూర్, శంషాబాద్, బాలానగర్ ట్రాఫిక్ డివిజన్లలో 14 పీఎస్‌లున్నాయి. -
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో కొత్తగా ఒక జోన్.. ఏడు ఠాణాలు
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పునర్ వ్యవస్థీకరణకు మార్గం సుగమమైంది ఈ మరకు శుక్రవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త జోన్, పోలీసు స్టేషన్ల ఏర్పాటుకు నాలుగేళ్ల క్రితం సీఎంకు ప్రతిపాదనలు పంపగా.. తాజాగా ఆయన ఆమోదముద్ర వేశారు. దీంతో ప్రస్తుతం సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మాదాపూర్, శంషాబాద్, బాలానగర్ మూడు జోన్లు ఉండగా.. కొత్తగా రాజేంద్రనగర్ జోన్ ఏర్పాటు కానుంది. ఇప్పటివరకు శంషాబాద్ జోన్ పరిధిలో శంషాబాద్, షాద్‌నగర్, రాజేంద్రనగర్, చేవెళ్ల డివిజన్లు ఉన్నాయి. వీటిలో రాజేంద్రనగర్, చేవెళ్ల డివిజన్లు కలిపి రాజేంద్రనగర్ జోన్‌గా.. అలాగే శంషాబాద్, షాద్‌నగర్ డివిజన్లు కలిపి శంషాబాద్ జోన్‌గా ఏర్పాటు చేసేందుకు సీఎం సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇప్పటివరకు మాదాపూర్ జోన్ పరిధిలో ఉన్న నార్సింగి పోలీస్ స్టేషన్‌ను తొలగించి... కొత్తగా ఏర్పాటు కానున్న రాజేంద్రనగర్ జోన్లో కలపనున్నారు. డివిజన్ స్థాయిలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసు (ఏసీపీ), జోన్ స్థాయిలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు (డీసీపీ) స్థాయి అధికారి కార్యకలాపాలు నిర్వహిస్తుంటారు. సైబరాబాద్ పునర్ వ్యవస్థీకరణపై ‘సైబరాబాద్ సరికొత్తగా..’ శీర్షికన ఈనెల 10న ‘సాక్షి’ ఎక్స్‌క్లూజివ్ కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. కొత్త ఠాణాల ఏర్పాటు కూడా.. 3,644 చ.కి.మీ. మేర విస్తరించి ఉన్న సైబరాబాద్‌లో 37 శాంతి భద్రతలు, 14 ట్రాఫిక్ ఠాణాలు, 7 వేల మంది పోలీసులున్నారు. శరవేగంగా విస్తరిస్తున్న సైబరాబాద్‌లో ఏడు కొత్త ఠాణాల ఏర్పాటుపై కూడా సీఎం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ప్రస్తుతం ఆర్సీపురం ఠాణా పరిధిలో ఉన్న కొల్లూరు, నార్సింగి పీఎస్ పరిధిలోని జన్వాడ, శంకర్పల్లి స్టేషన్ పరిధిలోని మోకిల ప్రాంతాలను విభజించి.. కొత్తగా కొల్లూరు, జన్వాడ, మోకిల ఠాణాలను ఏర్పాటుకు రూటు క్లియరైంది. ఇటీవలే కొత్తగా మేడ్చల్ ట్రాఫిక్ పీఎస్‌ను ప్రారంభమైన సంగతి తెలిసిందే. కొత్త జోన్ ఏర్పాటు, ఠాణాల పెంపుతో పరిపాలన సులువవటంతో పాటు నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని సైబరాబాద్ కమిషనరేట్ పోలీసు ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. -
మూడేళ్లుగా ఒకేచోట.. సైబరాబాద్‌లో ఎస్హెచ్ఓల బదిలీలు?
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మూడేళ్లకు పైగా ఒకటే పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న స్టేషన్ హౌస్ ఆఫీసర్లు (ఎస్హెచ్ఓ)లు బదిలీ కానున్నారు. మాదాపూర్, బాలానగర్ జోన్లలో దీర్ఘకాలికంగా ఒకే చోట విధులు నిర్వహిస్తున్న పలువురు ఇన్స్పెక్టర్లను బదిలీ చేసేందుకు రంగం సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం. ఆయా అధికారుల పనితీరు సక్రమంగా లేకపోవటమే సస్పెన్షన్‌కు కారణాలని తెలిసింది. రెండు మూడు వారాల్లో ఆయా బదిలీలు జరుగుతాయని సమాచారం. శాసనమండలి (ఎమ్మెల్సీ) ఎన్నికల కోడ్ ఎత్తివేసిన నేపథ్యంలో ఈ బదిలీలు చేయాలని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర నిర్ణయించినట్లు తెలిసింది. సైబరాబాద్ సీపీగా స్టీఫెన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత.. పలు భూ వివాదాల్లో తలదూర్చినందుకు నార్సింగి పీఎస్ ఇన్స్పెక్టర్ మధనం గంగాధర్, ఎస్ఐ కే లక్ష్మణ్‌లను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. 66 మంది ఎస్ఐలకు పోస్టింగ్‌లు.. సైబరాబాద్‌లో మాదాపూర్, బాలానగర్, శంషాబాద్ మూడు జోన్లలో కలిపి 36 లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లున్నాయి. ఇన్చార్జి ఇన్స్పెక్టర్లతో నెట్టుకొస్తున్న పలు పోలీస్ స్టేషన్లకు శాశ్వత అధికారులను నియమించనున్నట్లు తెలిసింది. ఇటీవలే 66 మంది సబ్ ఇన్స్పెక్టర్లు (ఎస్ఐ) సైబరాబాద్ కమిషనరేట్‌కు రిపోర్ట్ అయ్యారు. ప్రస్తుతం వీళ్లంతా జోన్లకు అటాచ్‌లో ఉన్నారు. త్వరలోనే వీళ్లందరికీ కొత్త పోస్టింగ్స్ ఇవ్వనున్నట్లు తెలిసింది. చేవెళ్ల వంటి సున్నితమైన ప్రాంతాలలోని పీఎస్‌లలో ఎస్ఐల విద్యార్హతలు, నిబద్ధత, క్రమశిక్షణలను బట్టి పోస్టింగ్ ఇవ్వనున్నట్లు తెలిసింది. పీఎస్‌లను సందర్శిస్తూ.. సీపీగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచే శాంతి భద్రతలపై సీపీ స్టీఫెన్ రవీంద్ర ప్రత్యేక దృష్టి సారించారు. క్రమం తప్పకుండా పోలీస్ స్టేషన్లను సందర్శిస్తూ, పోలీసుల పనితీరును సీపీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. స్టేషన్, రికార్డ్ల నిర్వహణలను లోతుగా పరిశీలించారు. రిసెప్షన్, జేడీ ఎంట్రీ ప్రతి రికార్డ్లను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. లా అండ్ ఆర్డర్, నేరాల నివారణ వ్యూహాలపై ఎప్పటికప్పుడు పోలీసులకు సూచనలు చేస్తున్నారు. ఇప్పటికే కూకట్పల్లి, రాజేంద్రనగర్, మైలార్‌దేవ్‌పల్లి పీఎస్‌లలో సందర్శించారు. చదవండి: హృదయ విదారకం: రోగికి ఊపిరి పోస్తుండగా.. ఆగిన డాక్టర్ గుండె -
Hyderabad: క్రికెట్ బెట్టింగ్ రాకెట్ బ్లాస్ట్: రూ.2.21 కోట్ల సొత్తు స్వాధీనం
సాక్షి, హైదరాబాద్: అంతర్రాష్ట్ర క్రికెట్ బెట్టింగ్ రాకెట్‌ను సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తొలిసారిగా అతిపెద్ద బెట్టింగ్ ముఠాను పట్టుకున్నారు. మాదాపూర్ జోన్ పరిధిలోని ఏడు ప్రాంతాల్లో క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నట్లు పక్కా సమాచారంతో పోలీసులు మియాపూర్, బాచుపల్లి, గచి్చ»ౌలి, మైలార్‌దేవ్‌పల్లిలోని ఏడుచోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించి 23 మంది బూకీలను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.93 లక్షల నగదు, 14 బెట్టింగ్ బోర్డ్‌లు, 8 ల్యాప్టాప్స్, 247 సెల్ఫోన్లు, 28 స్మార్ట్ఫోన్లు, 4 ట్యాబ్స్, 4 టీవీలు, 2 రూటర్స్, ప్రింటర్, 5 కార్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ రూ.2.21 కోట్లు. పరారీలో ఉన్న మెయిన్ బూకీ విజయవాడకు చెందిన మహా అలియాస్ సురేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రస్తుతం ఇతను బెంగళూరులో ఉన్నట్లు సమాచారం. వివరాలను మాదాపూర్ డీసీపీ ఎం.వెంకటేశ్వర్లు, స్పెషల్ ఆపరేషన్ టీం(ఎస్ఓటీ) డీసీపీ సందీప్‌లతో కలిసి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర బుధవారం మీడియాకు వివరించారు. విజయవాడకు చెందిన మెయిన్ బూకీ మహా నుంచి లీడ్స్ తీసుకొని పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడుకు చెందిన చింత వేణు(35), కర్నాటకలోని రాయచూర్‌కు చెందిన గోదవర్తి వెంకటేష్ (32) ఇద్దరు బూకీలుగా అవతారమెత్తి ఏడేళ్లుగా హైదరాబాద్‌లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్–2021లో మంగళవారం నాటి ముంబై–పంజాబ్ మ్యాచ్‌లో బెట్టింగ్ నిర్వహిస్తున్నారు ఫ్యాన్సీ లైఫ్, లైవ్ లైన్ గురు, క్రికెట్ మజా, లోటస్, బెట్ 365, బెట్ ఫెయిర్ వంటి యాప్స్ ద్వారా క్రికెట్ బెట్టింగ్, లావాదేవీలను నిర్వహిస్తున్నారు. రెండు నెలలుగా నిఘా పెట్టిన పోలీసులు బెట్టింగ్ నిర్వాహకులను మంగళవారం పట్టుకున్నారు. పశ్చిమ గోదావరి ఆకువీడుకు చెందిన జెళ్ల సురేష్ (33), తిరుమణి మణికంఠ(23), కొల్లాటి మణికంఠ(21), పీ.శ్రీనివాస్(35), దుర్గాప్రసాద్ కొల్లాటి(22), జమ్ము నాగరాజు(36), ఈదర రవి(36), భీమవరం వడువు అజయ్ కుమార్ (27), అట్లూరి రంజిత్ కుమార్(35), జగన్నాథపురంకు చెందిన జయశ్రీనివాస్(29), నల్లజర్లకు చెందిన తూరెళ్ల సాయి(24), గుంటూరు జిల్లా మంత్రిపాలెం రేపల్లె నాగళ్ల రాకేష్(37), తూర్పు గోదావరి మొగిలి కూడురుకు చెందిన సుందర రామరాజు(34), విజయవాడకు చెందిన కునప్పరెడ్డి దుర్గా పవన్ కుమార్(32), కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన కోట సాయి నవీన్(25), భద్రాచలం గౌరిదేవిపేట్కు చెందిన రవితేజ(37), బాచుపల్లికి చెందిన కామగాని సతీష్(39), మైలార్‌దేవ్‌పల్లికి చెందిన మల్లిఖార్జున చారీ(38), కర్నాటకలోని రాయచూర్‌కు చెందిన బొప్ప వెంకటేష్ (30), గన్ని కల్యాణ్ కుమార్ (30), పత్తిపాటి రాము (32)లను అరెస్ట్ చేశారు. వీరిపై వివిధ పోలీస్ స్టేషన్లలో 7 కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మెయిన్ బూకీ మహాతో పాటు చెన్ను భాస్కర్‌రెడ్డి, గుంటూరుకు చెందిన సురేష్, కేపీహెచ్‌బీకి చెందిన పవన్ అలియాస్ ప్రవీణ్, రాయచూర్‌కు చెందిన కే.సుమన్, రామాంజనేయ, ముంబైకి చెందిన నందలాల్ గోరీ పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ముఠా కార్యకలాపాలు ముంబై, గోవా, బెంగళూరు, దుబాయ్‌లో కూడా ఉన్నాయని దర్యాప్తులో తేలిందని చెప్పారు. త్వరలోనే వారిని పట్టుకుంటామని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పునర్విభజన?
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ రంగారెడ్డి జిల్లాలో.. రాచకొండ కమిషనరేట్ మేడ్చల్ జిల్లాలో ఉండటంతో.. వీటి పరిధిలోకి వచ్చే ప్రాంతాలకు సంబంధించి గందరగోళం నెలకొంది. రంగారెడ్డి జిల్లాకు చెందిన కొన్ని ఏరియాలు రాచకొండకు, మేడ్చల్‌కు చెందినవి సైబరాబాద్ పరిధిలోకి వస్తాయి. దీన్ని గమనించిన ఉన్నతాధికారులు ఈ రెండు కమిషనరేట్లను పునర్విభజన చేయాలని యోచిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రాథమిక కసరత్తు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓ రూపు వచ్చిన తర్వాత ప్రభుత్వానికి నివేదించడం ద్వారా అనుమతి పొంది అమలులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. చదవండి: ‘రామప్ప’ పరిసరాలు కాంక్రీట్ జంగిల్‌గా మారొద్దు : హైకోర్టు అప్పట్లో ఒకే కమిషనరేట్.. ► రాజధానిలో ఒకప్పుడు కేవలం హైదరాబాద్ కమిషనరేట్ మాత్రమే ఉండేది. మిగిలిన ప్రాంతాలన్నీ రంగారెడ్డితో పాటు ఇతర జిల్లాల పరిధిలోకి వచ్చేవి. 2002లో సైబరాబాద్ కమిషనరేట్‌కు రూపమిచ్చారు. ► రాష్ట్ర విభజన తర్వాత పెరుగుతున్న జనాభా, మారుతున్న అవసరాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం 2016లో సైబరాబాద్ చుట్టూ ఉన్న ఇతర జిల్లాల్లోని ముఖ్యమైన అభివృద్ధికి ఆస్కారం ఉన్న ప్రాంతాలను కలుపుతూ రెండుగా విభజించారు. ► తొలినాళ్లల్లో సైబరాబాద్ ఈస్ట్, వెస్ట్గా వ్యవహరించిన వీటిని ఆపై సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లుగా మార్చారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు ఈ రెండు కమిషనరేట్ల పరిధిలో విస్తరించి ఉండటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రిక్రూట్‌మెంట్స్‌లోనూ సమస్యలే.. ► పోలీసు విభాగంలో ఎంపికలు యూనిట్ ఆధారంగా జరుగుతుంటాయి. పోలీసు విభాగంలో రాష్ట్ర ప్రభుత్వం పోలీసు రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా కేవలం మూడు స్థాయిల్లోనే ఎంపికలు చేస్తుంది. కానిస్టేబుల్, ఆపై సబ్–ఇన్స్పెక్టర్తో (ఎస్సై) పాటు గ్రూప్–1లో భాగమైన డీఎస్పీ పోస్టుల్ని ప్రభుత్వం భర్తీ చేసుకుంటుంది. ► ఈ మూడింటిలోనూ కానిస్టేబుల్‌కు రెవెన్యూ జిల్లా, ఎస్సైకి జోన్, డీఎస్పీకి రాష్ట్రం యూనిట్‌గా ఉంటుంది. ఆయా యూనిట్స్‌కు చెందిన దరఖాస్తుదారుల్ని స్థానికులుగా ఇతరుల్ని స్థానికేతరులుగా పరిగణిస్తారు. వీటి ప్రామాణికంగానే పోలీసు ఎంపికలు జరగడం అనివార్యం. ► రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్ ప్రాంతాలు రాచకొండ కమిషనరేట్లోకి, మిగిలినవి సైబరాబాద్ కమిషనరేట్లోకి వచ్చాయి. ► మేడ్చల్ జిల్లాలోకి బాలానగర్, పేట్ బషీరాబాద్ తదితరాలు సైబరాబాద్ పరిధిలోకి, మిగిలినవి రాచకొండలోనూ ఉన్నాయి. ఇలా ఒకే జిల్లా రెండు కమిషనరేట్లలో విస్తరించి ఉండటం కానిస్టేబుల్ స్థాయి అధికారుల ఎంపికలో సాంకేతిక ఇబ్బందులకు కారణమవుతోంది. జోన్ల మార్పులతో సమస్యలకు చెక్ ► ఈ సమస్యలతో పాటు ఇతర ఇబ్బందులను పరిగణలోకి తీసుకున్న పోలీసు విభాగం సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లను పునర్విభజన చేయాలని యోచిస్తోంది. ఒక కమిషనరేట్‌లో ఒకటి కంటే ఎక్కువ రెవెన్యూ జిల్లాలు ఉన్నప్పటికీ.. ఒక రెవెన్యూ జిల్లా మొత్తం ఆ కమిషనరేట్‌లోనే ఉండేలా కసరత్తు చేస్తోంది. ►ప్రాథమిక పరిశీలన నేపథ్యంలో రెవెన్యూ పరంగా రంగారెడ్డి జిల్లాలో ఉండి.. పోలీసు విషయానికి వచ్చేసరికి రాచకొండ పరిధిలోకి వచ్చే ఎల్బీనగర్ జోన్‌ను సైబరాబాద్‌లో కలపాలని భావిస్తున్నారు. మేడ్చల్ జిల్లాకు చెందిన, సైబరాబాద్ కమిషనరేట్‌లో ఉన్న బాలానగర్ జోన్‌ను రాచకొండ కమిషనరేట్‌కు మార్చాలని భావిస్తున్నారు. ► ఈ మార్పుచేర్పులకు సంబంధించి ఉన్నతాధికారులు ప్రాథమిక కసరత్తులు చేస్తున్నారని సమాచారం. ఒకే రెవెన్యూ జిల్లా రెండు కమిషనరేట్లలో లేకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిసింది. -
కోవిడ్‌కు వ్యాక్సిన్ ఉంది.. రోడ్డు ప్రమాదాలకు లేదు..
-
రోడ్డు ప్రమాదంలో ఇద్దరిని కోల్పోయా: ఎన్టీఆర్
సాక్షి, హైదరాబాద్ : అత్యంత ప్రమాదకర కరోనాకు వ్యాక్సిన్ ఉంది.. కానీ, రోడ్డు ప్రమాదాలకు ఎలాంటి టీకా లేదని సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు. ఇంట్లోంచి బయటకు వెళ్లే ముందు ఒకసారి మీ కోసం ఎదురుచూసే భార్య, తల్లిదండ్రులు, పిల్లలను గుర్తుంచుకోవాలని ఎన్టీఆర్ సూచించారు. గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్‌లో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్–2021 వార్షిక సదస్సును బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్–బీజాపూర్ నేషనల్ హైవేపై పెట్రోలింగ్ వాహనాలను జెండా ఊపి జూనియర్ ఎన్టీఆర్, అదనపు డీజీపీ సందీప్ శాండిల్య, సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ ప్రారంభించారు. అనంతరం జూనియర్ ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. దేవుడు అన్ని చోట్లా ఉండడని, అందుకే తల్లిదండ్రులు ఉన్నారని అన్నారు. అలాగే విద్యనేర్పిన గురువులను, దేశ సరిహద్దుల్లో పహారాకాసే సైనికులను, దేశం లోపల పహారా కాస్తున్న పోలీసుల సేవలను గుర్తించాలన్నారు. పోలీసుల చేతిలో లాఠీ ఉండేది దండించడానికి కాదని, ప్రజల్ని సన్మార్గంలో పెట్టడానికేనని తెలిపారు. తాను ఈ కార్యక్రమానికి అతిథిగా, నటుడిగా కాకుండా ఇంట్లో ఇద్దరి(జానకిరామ్, హరికృష్ణ)ని కోల్పోయిన కుటుంబీకునిగా వచ్చానన్నారు. వాహనం నడిపే సమయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతను గుర్తెరగాలని రాష్ట్ర అదనపు డీజీ(రైల్వేస్, రోడ్‌సేఫ్టీ) సందీప్ శాండిల్యా అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సైబరాబాద్ పోలీసులు చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. దేశంలో ఎక్కడాలేని విధంగా సైబరాబాద్ పరిధిలో రోడ్డు సేఫ్టీ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని సైబరాబాద్ సీపీ వి.సి.సజ్జనార్ తెలిపారు. ఏడు చోట్ల ఈ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి.. 10 వేల మందికి హెల్మెట్లు ఇప్పించామని వివరించారు. డీసీపీ విజయకుమార్ నాయకత్వంలోని సైబరాబాద్ ట్రాఫిక్ విభాగం పనితీరు ఎంతో బాగుందని ఆయన కితాబిచ్చారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ పుస్తకాన్ని, బుక్లెట్, లోగోను సందీప్‌శాండిల్యా, సజ్జనార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీఎస్సీ ప్రధాన కార్యదర్శి కృష్ణ ఎదుల, సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయకుమార్, విమెన్ వింగ్, మాదాపూర్, శంషాబాద్, బాలానగర్ డీసీపీలు తదితరులు పాల్గొన్నారు. కాగా, జబర్దస్త్ కళాకారులు చేసిన స్కిట్ విశేషంగా ఆకట్టుకుంది. విజేతలకు పురస్కారాలు.. సైబరాబాద్ ట్రాఫిక్ విభాగం ఇటీవల విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాçసం, చిత్రలేఖనం తదితర పో టీలు నిర్వహించగా విజేతలుగా నిలిచిన విద్యార్థులకు సర్టిఫికెట్లు, నగదు పురస్కారాలను జూనియర్ ఎన్టీఆర్, సజ్జనార్, సందీప్‌శాండిల్య అందజేశారు. జీవన్‌దాన్ కింద అవయవదానం చేసిన వారి కుటుంబçసభ్యులను ఘనంగా సత్కరించి వారు అందరికీ స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. చదవండి: బర్త్‌డే: మొక్క నాటిన సీఎం కేసీఆర్ ఏమ్మా.. ఎలా చదువుతున్నారు! -
మహిళల భద్రతకు డ్రోన్లు వాడాలి
సాక్షి, హైదరాబాద్ : మహిళల భద్రత విషయంలో అత్యాధునిక సాంకేతికతతో కూడిన డ్రోన్లు వాడటం వల్ల నేరాలు తగ్గే అవకాశముందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు అభిప్రాయపడ్డారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో నిర్మించిన పబ్లిక్ సేఫ్టీ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్ సెంటర్ అండ్ డేటా సెంటర్‌ను హోంమంత్రి మహమూద్ అలీ, విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డితో కలసి ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ‘డయల్ 100కు కాల్ చేయడం వల్ల ఐదు నిమిషాల్లో ఘటనకు చేరుతారు, అదే ఎస్‌వోఎస్ బటన్ నొక్కి డ్రోన్లు వినియోగించడం వల్ల ఒక నిమిషం వ్యవధిలో అక్కడికి చేరుతారు. అదే సమయంలో పోలీసు సైరన్ మోగిస్తే నిందితుడు పారిపోతాడు. దీనివల్ల బాధిత మహిళ నేరం బారినపడకుండా ఉంటుంది. పోలీసులు బాధితురాలికి భరోసా ఇచ్చి నిందితులను పట్టుకోవచ్చు’అని అన్నారు. వీటి వినియోగం కోసం డీజీసీఏ అనుమతులు తీసుకునే అంశాల్నీ పోలీసులు పరిశీలించాలని సూచించారు. నేరం చేయాలంటే దొంగలు భయపడుతున్నారు.. ‘దేశంలో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో 60 శాతం హైదరాబాద్‌లోనే ఉన్నాయి. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ‘నేను సైతం’ప్రాజెక్టులో భాగంగా సీసీ కెమెరాలు బిగించుకుంటు న్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఐదు లక్షల సీసీ కెమెరాలున్నాయి. వీటిని పది లక్షలు చేసే దిశగా ముందుకెళుతున్నాం. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లలోని ఈ సీసీటీవీలు సైబరాబాద్‌లోని పబ్లిక్ సేఫ్టీ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్ సెంటర్ అండ్ డేటా సెంటర్ అనుసంధానం చేయడం వల్ల నేరాలు పూర్తిస్థాయిలో తగ్గే అవకాశముంది. ఇప్పటికే హైదరాబాద్‌లో దొంగత నాలు చేయాలంటే అంతర్రాష్ట ముఠాలు భయపడుతున్నాయి. ఒకవేళ చేసినా 24 గంటలు గడవక ముందే సీసీటీవీల సహాయంతో పట్టేస్తున్నారు. అయితే ఈ డేటా సెంటర్ ద్వారా అన్ని ప్రభుత్వ విభాగాలను ఒకేతాటిపైకి తీసుకురావాలి, ఆయా పనులను కలిసికట్టుగా చేయడం వల్ల ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఉంటుంది’ అని కేటీఆర్ పేర్కొన్నారు. ఎఫెక్టివ్ పోలీసింగ్ వల్లే రాష్ట్రానికి, ముఖ్యంగా హైదరాబాద్‌కు పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి చెప్పారు. మారుతున్న సమాజానికి అనుగుణంగా పెరుగుతున్న సైబర్ నేరాలు నిలువరించేలా ఎప్పటికప్పుడూ సిబ్బంది సైబర్ వారియర్లుగా మారి ఆధునిక టెక్నాలజీని అర్థం చేసుకుంటూ ముందుకెళ్లాలని ఆయన సూచించారు. అంబులెన్స్ వాహనాలను అనుసంధానించాలి... ‘ఈ సెంటర్ ద్వారా పోలీసు పెట్రోలింగ్ వాహనాలు ఏ ఏ సమయంలో ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకునే వీలుంది. నేరం జరిగిన ప్రాంతానికి ఏ వాహనం దగ్గరగా ఉంటే వారికి సమాచారమిచ్చి సులువైన మార్గంలో వెళ్లేలా సెంటర్ సిబ్బంది మార్గదర్శనం చేస్తారు. ఇదే మాదిరిగా అత్యవసర వైద్యసహాయం కోసం రోగులను తీసుకొచ్చే అంబులెన్స్‌లకు కూడా పెట్రోలింగ్ వాహనాలకు మాదిరిగానే ఈ సెంటర్‌తో అనుసంధానం చేయాలి. ప్రమాదసమయాల్లో ప్రాధమ్యంగా భావించే గోల్డెన్ అవర్‌లో రోగి సమీప ఆసుపత్రికి వెళ్లే దారి చూపేలా వైద్యారోగ్య శాఖతో మాట్లాడి అనుసంధానం చేయాల’ని సంబంధిత అధికారులకు కేటీఆర్ సూచించారు. బంజారాహిల్స్‌లో నిర్మిస్తున్న పోలీసు ట్విన్ టవర్స్ రెండు నెలల్లో అందుబాటులోకి వస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రపంచంలోని ఎక్కడి పోలీసులకైనా ఇది ఐకానిక్‌గా నిలుస్తుందని అన్నారు. ప్రతి వెయ్యిమందికి 30 సీసీటీవీలు: మహమూద్ అంతకుముందు హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ హైదరాబాద్‌లో ప్రతి వెయ్యి మందికి 30 సీసీటీవీ కెమెరాలున్నాయని, ఇది ఎంతో భద్రతపరమైన నగరమని అన్నారు. ‘ఈ సెంటర్ వల్ల కిందిస్థాయి సిబ్బందికి మెరుగైన ఫలితాలు ఉంటాయి. నేరం జరిగే ప్రాంతానికి వెళ్లేలోపు సమగ్ర సమాచారం చేతికి అందేలా ఈ సెంటర్ చూస్తుంద’ని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. సైబర్ సెక్యూరిటీలో పోలీసులకు శిక్షణ కోసం తెలంగాణ పోలీసు శాఖ, ఐటీఈఎస్ ఎంవోయూ కుదుర్చుకున్నాయి. కార్యక్రమంలో హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీసు కమిషనర్లు అంజనీకుమార్, మహేష్ భగవత్, వీసీ సజ్జనార్, ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ,ఎమ్మెల్సీ నవీన్‌కుమార్, ఇతర పోలీసు సిబ్బంది, ఎల్ అండ్ టీ స్మార్ట్ ప్రతినిథి జేవీఎస్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
వివాహితపై అత్యాచారం.. స్పృహ కోల్పోయి:!
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. రామచంద్రపురం పోలీస్ స్టేషన్లో సమీపంలో కొల్లూరు తండాకు చెందిన వివాహిత ప్రేమలత అనే మహిళపై ముగ్గురు యువకులు అత్యాచారానికి ఒడిగట్టారు. దీంతో స్పృహ కోల్పోయిన మహిళను అనంతరం హత్య చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహిళను రెండు రోజుల క్రితమే హత్య చేయగా మియాపూర్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. అదే రోజు మధ్యాహ్నం కొల్లూరు సమీపంలో మహిళ మృతదేహం లభ్యం కావడంతో రామచంద్రపురం పోలీసులు కేసు నమోదు చేసి నిందితులు మధు, చందూలాల్, కుటుంబరావులను అదుపులోకి తీసుకున్నారు. చదవండి: సూసైడ్ నోట్: నా చావుకు వారే కారణం..! కాగా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని లంబాడి ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఆర్సీ పీఎస్ ముందు ఆందోళన చేపట్టారు. నిందితులపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నామని మియాపూర్ ఇన్వెస్టిగేషన్ అధికారి కృష్ణ ప్రసాద్ తెలిపారు. ఇదిలా ఉండగా మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పన్నెండేళ్ల క్రితం భర్తను కూడా హత్య చేశారని కుటుంబ సభ్యులు తెలిపారు. కూతురు హత్యకు భూ వివాదమే కారణమని బాధితురాలి తల్లి, బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
అరచేతిలో 'షీ సేఫ్'!
సాక్షి, సిటీబ్యూరో: ‘మీరు గృహ హింసకు గురవుతున్నారా.. ఆన్లైన్ వేదికగా ఆకతాయిలు వేధిస్తున్నారా.. సైబర్ నేరాల బారిన పడ్డారా.. జీవితంపై విరక్తి చెంది తీవ్ర ఒత్తిడిలో ఉన్నారా..’కారణాలేమైతేనేం మీ మొబైల్లో ‘షీ సేఫ్’యాప్ నిక్షిప్తం చేసుకుంటే చాలు. నేరాలు, ఒత్తిడి తదితరాల బారి నుంచి ఎలా బయటపడాలో మార్గదర్శక్‌లు దగ్గరుండి మరీ మీకు మార్గదర్శనం చేసి అవసరమైన సహాయాన్ని అందిస్తారు. అది పోలీసుపరంగా, న్యాయపరంగా, షీ టీమ్‌ల పరంగా.. ఇలా ఎవరి వల్ల ఆ సమస్య పరిష్కారమవుతుందో అటువైపుగా మార్గదర్శనం చేసి ఆ బాధల నుంచి విముక్తి కల్పిస్తారు. ఇలా మహిళల భద్రతకు సంబంధించి సైబరాబాద్ పోలీసులు, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) సరికొత్తగా రూపొందించిన ‘షీ సేఫ్’యాప్ అతివలకు ఎంతో ఉపయుక్తకరం కానుంది. ప్రస్తుతం ట్రయల్ రన్ నిర్వహిస్తున్న ఈ యాప్‌ను వచ్చే మహిళా దినోత్సవం పురస్కరించుకొని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో అధికారికంగా అందుబాటులోకి తెచ్చేలా చూస్తున్నారు. ఆ తర్వాత రాచకొండ, హైదరాబాద్ పోలీసు కమిషనరేట్లతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆయా ప్రాంత ముఖ్య వివరాలను జోడించి ఈ యాప్‌ను సరికొత్తగా అతివల భద్రత కోసం తీసుకొచ్చే అవకాశాలున్నాయి. మార్గదర్శనం చేస్తారు ఈ యాప్‌ను నిక్షిప్తం చేసుకున్న మహిళలు ఎవరైనా గృహహింస, ఆన్లైన్ వేధింపులు, సైబర్ నేరాల విషయాల్లో మార్గదర్శక్‌ల సహాయం కోరవచ్చు. మీరు ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఉంటే ఈ యాప్‌లోని ఎస్‌వోఎస్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మార్గదర్శక్‌లు, షీ బృందాలు, మహిళా పోలీసు స్టేషన్లు, భరోసా కేంద్రాలు, పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు చేరుతుంది. హాక్ ఐను కూడా దీంతో అనుసంధానం చేశారు. అలాగే మహిళల భద్రత గురించి ఎస్సీఎస్సీ నిర్వహించే భద్రత కార్యక్రమాలు, అవగాహన సదస్సు వివరాలను తెలుసుకోవచ్చు. ‘సేఫ్ స్టే’చేయవచ్చు.. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో 2 లక్షల మందికి పైగా సాఫ్ట్వేర్ మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరి భద్రతను దృష్టిలో ఉంచుకొని ఏ హాస్టల్స్ ఉండేందుకు సురక్షితమనే వివరాలను కూడా ‘ప్రాజెక్టు సేఫ్ స్టే’ఫీచర్లో పొందుపరిచారు. ఇప్పటికే ఏఏ హాస్టళ్లలో సీసీటీవీ కెమెరాలున్నాయి, భద్రత ఎలా ఉంది, సందర్శకుల రిజిస్టర్ నమోదు చేస్తున్నారా తదితర అంశాలపై అధ్యయనం చేసిన ఎస్సీఎస్సీ, సైబరాబాద్ పోలీసులు వందకుపైగా హాస్టళ్ల పేర్లను చేర్చారు. ఇలా ఐటీ కారిడార్‌లో ఏఏ హాస్టళ్లలో ఉండటం మంచిదనే విషయాన్ని తెలుసుకునే అవకాశాన్ని కల్పించారు. ఫొటో తీసి అప్లోడ్ చేయండి.. మీరు సంచరించే ప్రాంతాల్లో ఎక్కడైనా వీధి దీపాలు వెలగకుండా చీకటిగా ఉంటే ఆ దృశ్యాన్ని సెల్‌ఫోన్ ద్వారా చిత్రీకరించి ఈ యాప్‌లో అప్లోడ్ చేసే ఫీచర్‌ను అందుబాటులో ఉంచారు. ఇలా మీరు ఆ చిత్రాన్ని, ప్రాంతాన్ని నమోదు చేస్తే ఎస్సీఎస్సీ సభ్యులు సంబంధిత విభాగాల ద్వారా ఆయా ప్రాంతాల్లో లైట్లు వెలిగేలా చూస్తారు. అలాగే ప్రయాణం చేస్తున్న సమయంలోనే ఈ–లెర్నింగ్స్, భద్రత అవగాహన మాడ్యూల్స్‌ను యాక్సెస్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు. అలాగే ఐటీ కారిడార్‌లో సాఫ్ట్వేర్ మహిళా ఉద్యోగుల కోసం నడుపుతున్న షీ షటిల్ బస్సుల ప్రయాణ వివరాలు అందుబాటులో ఉంచారు. అలాగే హాక్ ఐ యాప్ కూడా ఈ అప్లికేషన్ ద్వారా యాక్సెస్ చేసుకునేలా రూపకల్పన చేశారు. సైబరాబాద్ పోలీసు కమాండ్ కంట్రోల్‌కి కూడా యాక్సెస్ చేశారు. హాక్ ఐ అత్యవసర పరిస్థితుల్లో.. హాక్ ఐ అనేది అత్యవసర పరిస్థితుల్లో పోలీసులను సంప్రదించడానికి మరియు ఏదైనా సంఘటనలను నివేదించడానికి సంబంధించిన యాప్. అయితే షీ సేఫ్ యాప్ ముఖ్యంగా మహిళలు బాధలో ఉన్నప్పుడు మార్గదర్శక్‌లను సంప్రదించవచ్చు. తద్వారా సాయం పొందొచ్చు. మహిళలను అప్రమత్తంగా ఉంచటానికి ఇందులో రోజువారీ నోటిఫికేషన్లు వస్తుంటాయి. నిరంతరం మహిళల భద్రత గురించి వివరాలుంటాయి. ఈ యాప్ మహిళల భద్రతకు ఎంతగానో ఉపయోగకరంగా ఉండనుంది. డౌన్లోడ్ చేసుకోండిలా... గూగుల్ ప్లే స్టోర్‌కు వెళ్లి ‘షీ సేఫ్’అని టైప్ చేయగానే యాప్ వస్తుంది. దీన్ని స్మార్ట్‌ఫోన్‌లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాపిల్ స్టోర్ ద్వారా కూడా నిక్షిప్తం చేసుకునేలా ఫీచర్లు రూపొందించారు. -
డ్రంక్ అండ్ డ్రైవ్: 3148 మందిపై కేసులు
సాక్షి, హైదరాబాద్: డిసెంబర్ 31 సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 239 డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించామని పోలీసులు తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలకు సంబంధించి హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 951 కేసులు నమోదు చేశామని తెలిపారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 873, రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో 281 కేసులు నమోదైనట్టు వివరించారు. తెలంగాణవ్యాప్తంగా 3148 కేసులు నమోదయ్యాయని, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో పట్టుబడిన వారిలో ఒక మహిళ, 3,147 మంది పురుషులు ఉన్నారని వివరించారు. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో అత్యధికంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. -
ఐటీ జోన్ లో మేటి ఠాణా
సాక్షి, హైదరాబాద్: రండి.. రండి.. ఏదైనా ఫిర్యాదు చేయడానికి వచ్చారా?. ఇదిగోండి కాగితం.. పెన్ను.. అంటూ ఫిర్యాదు స్వీకరిస్తారు. అంతేనా.. అధికారులు, సందర్శకులు, మీడియా వేర్వేరుగా పార్కింగ్... విభాగాల వారీగా ప్రత్యేక గదులు... మహిళా సిబ్బంది కోసం రెస్ట్ రూమ్... అటాచ్డ్ బాత్రూమ్స్.. సిబ్బంది విశ్రాంతి తీసుకోవడానికి పడకలు.. భోజనం చేయడానికి వసతులు.. ఇలా ఎన్నో.. ఇదీ రాయదుర్గం పోలీసుస్టేషన్ ప్రత్యేకత. ఠాణాల ఆకస్మిక తనిఖీలో భాగంగా డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి శుక్రవారం సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లోని ఈ స్టేషన్ ను సందర్శించారు. అక్కడి హంగులు, పోలీసులు నిర్వర్తిస్తున్న విధులు చూసి మంత్రముగ్ధులెన ఆయన ఠాణాకు రూ.లక్ష రివార్డు ప్రకటించారు. రాజధానిలో ఉన్న మూడు కమిషనరేట్ల అధికారులకు ఆ పోలీసుస్టేషన్ ఓ రోల్‌మోడల్‌గా ప్రకటించారు. అంతా అక్కడ వచ్చి, చూసి, నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయంటూ కితాబిచ్చారు. ఏంటీ ప్రత్యేకత... నానక్‌రామ్‌గూడ చౌరస్తాకు సమీపంలో జీ+వన్ గా నిర్మితమైన ఠాణాలో అడుగుపెడుతూనే ఆహ్లాదకర వాతావరణం. ఇన్ స్పెక్టర్, సబ్–ఇన్ స్పెక్టర్ల చాంబర్స్‌తో సహా పోలీసుస్టేషన్ పరిపాలన విభాగం మొత్తం కింది అంతస్తులో ఉంటుంది. మొదటి అంతస్తులో టెక్ టీమ్, కోర్టు విధులు నిర్వర్తించే సిబ్బంది, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, వారంట్ స్టాఫ్, సమ¯Œ స్టాఫ్, క్రైమ్ రైటర్, కేస్ ప్రాపర్టీలకు ప్రత్యేకించి రూమ్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడే మహిళా సిబ్బంది కోసం ప్రత్యేకంగా రెస్ట్ రూమ్ ఉంటుంది. అటాచ్డ్ బాత్రూమ్స్, సిబ్బంది విశ్రాంతి తీసుకోవడానికి పడకలు, భోజనం చేయడానికి వసతులు ఈ ఠాణా ప్రత్యేకతలు. అక్కడ, ఇస్పెక్టర్ చాంబర్‌కు సమీపంలో ప్రతి ఒక్క అధికారికీ ప్రత్యేకంగా కూర్చునే స్థలం, పరిపాలన పరమైన ఫైళ్ల కోసం భద్రమైన ఏర్పాట్లు ఉన్నాయి. సిబ్బంది కోసం మినీ వర్క్ స్టేషన్, మహిళల కోసం వేరుగా వెయిటింగ్ రూమ్, ఇంటర్వ్యూ రూమ్, సబ్–ఇన్స్పెక్టర్లకు విశ్రాంతి గదులు ఈ పోలీసుస్టేషన్ లో అందుబాటులో ఉన్నాయి. రాయదుర్గం పోలీసుస్టేషన్ టెర్రస్ పైన అధికారులు, సిబ్బంది కోసం ఉద్దేశించిన జిమ్, యోగా ఏరియాలను ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. వీటితో పాటు రిలాక్స్ ఏరియా కూడా ఇక్కడే ఉంటుంది. ఈ స్టేషన్ కు ప్రత్యేక గుర్తింపు వెనుక సమిష్టి కృషి ఉంది. ప్రజా మిత్ర పోలీసింగ్ విధానాలు అమలు చేయడంలో భాగంగానే ఈ చర్యలు తీసుకుంటున్నాం. ప్రజల మన్ననలు పొందేలా, వాళ్లు చట్టాలను తప్పనిసరిగా పాటించేలా చేయడంలో సఫలీకృతం కావాలి. ఇది జరగాలంటే ఠాణాలోని అన్ని స్థాయి పోలీసులు తమ విధులు సక్రమంగా నిర్వహించాలి. – ఎస్.రవీందర్, ఇన్‌న్‌స్పెక్టర్ రండి.. రండి.. సాయం కోరుతూ వచ్చిన వారిని అక్కడి సిబ్బంది సాదరంగా ఆహ్వానిస్తారు. ఇక్కడ ‘హావ్ ఏ పేపర్’విధానం అమలు చేస్తున్నారు. దీని ప్రకారం ప్రతి బాధితుడికీ వారే అడిగి మరీ కాగితం, పెన్ను అందించడంతో పాటు ఫిర్యాదు రాయడంలోనూ అవసరమైన పూర్తి సహకారం అందిస్తారు. అలాగే ఠాణా మొదటి అంతస్తులో సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన బ్యారెక్స్, డైనింగ్ ఏరియా ప్రత్యేక ఆకర్షణ. ఇక్కడే ఈ ఠాణాకు సంబంధించిన క్లోజ్డ్ ఫైల్స్ రూమ్ ఏర్పాటు చేశారు. కోర్టులు కోరినప్పుడు, ఉన్నతాధికారులు అడిగినప్పుడు వీటిని పక్కాగా తీసుకువెళ్లి సమర్పించాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి ఏ కేసుకు సంబంధించిన ఫైల్ అయినా కేవలం 30 సెకండ్లలోనే బయటకు తీసేందుకు ఆస్కారం ఏర్పడింది. వీటికితోడు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పోలీసుస్టేషన్ లో ఫస్ట్ ఎయిడ్ కిట్‌ను సైతం అందుబాటులో ఉంచారు. -
‘కమాండ్ కంట్రోల్’తో భద్రత భేష్
సాక్షి, హైదరాబాద్: నేర పరిశోధనకు అత్యంత కీలకంగా మారిన సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణలో అధునాతన కమాండ్ కంట్రోల్ సెంటర్ త్వరలో అందుబాటులోకి రాబోతుందని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో చేపట్టిన అధునాతన కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులను పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్‌తో కలసి శుక్రవారం పర్యవేక్షించారు. త్వరితగతిన పనులు పూర్తిచేయాలని ఎల్ అండ్ టీ సిబ్బందిని కోరారు. ప్రస్తుత కమాండ్ కంట్రోల్ సెంటర్ల ద్వారా హైదరాబాద్‌లో వెయ్యి, సైబరాబాద్‌లో 500 కెమెరాల్ని మాత్రమే పర్యవేక్షించే సదుపాయముందని, అయితే కొత్త కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా రెండు వేల కెమెరాల్ని ఏకకాలంలో వీక్షించవచ్చన్నారు. దేశంలోనే ప్రతిష్టాత్మకంగా బంజారాహిల్స్‌లో నిర్మితమవుతున్న జంట పోలీస్‌టవర్లలో ఏర్పాటు కాబోయే కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు సమాంతరంగా దీన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వీటితోపాటు కమ్యూనిటీ పోలీసింగ్, ‘నేను సైతం’ప్రాజెక్టుల కింద కాలనీల్లో ఏర్పాటు చేస్తున్న లక్షలాది కెమెరాల్నీ ఈ కేంద్రంలో పర్యవేక్షించే వీలు కలుగుతుందన్నారు. 3 కమిషనరేట్లలో ఎల్ అండ్ టీ సంస్థ 10,000 అధునాతన కెమెరాల్ని ఏర్పాటు చేస్తోందని తెలిపారు. వేగంగా వెళ్లే వాహనాల నంబర్ ప్లేట్లను గుర్తించే ఆటోమేటిక్ కెమెరాల్ని ఇక్కడ అందుబాటులోకి తెస్తున్నారు. కాలనీల్లో ఏర్పాటు చేస్తున్న కెమెరాల్ని ఇక్కడి నుంచే పర్యవేక్షిస్తారు. ట్రాఫిక్ రద్దీ నియంత్రణ కోసం ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రాజెక్టులో భాగంగా మూడు కమిషనరేట్లలో కెమెరాల్ని అమర్చనున్నారు. ఈ కేంద్రంలో దాదాపు 10 లక్షల కెమెరాలకు సంబంధించిన దృశ్యాల్ని నెలపాటు నిక్షిప్తం చేసే భారీ సర్వర్లను ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఏదైనా ఘటన జరిగినప్పుడు ఉన్నతాధికారులు అత్యవసరంగా సమావేశమై సీసీ కెమెరాల దృశ్యాలను వీక్షించేందుకు వీలుగా ఆధునిక హంగులతో వార్‌రూంను ఏర్పాటు చేశారు. -
స్టేషన్లోనే సెటిల్ చేద్దామనుకుని!
సాక్షి, హైదరాబాద్: ఎక్స్‌ప్రెస్ టీవీ చైర్మన్, కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్ చిగురుపాటి జయరామ్ హత్యకు ముందు ఓ అధికారి, తర్వాత మరో అధికారితో రాకేష్‌రెడ్డి సంభాషించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఇన్స్పెక్టర్ హోదాల్లో ఉన్న ఈ ఇద్దరితోపాటు మరో ఏసీపీని పిలిచి విచారించాలని నిర్ణయించారు. బుధ, గురువారాల్లో ఈ విచారణ జరనగనుందని సమాచారం. మొదట జయరామ్ కేసును పరిచయమున్న పోలీసు అధికారుల సాయంతో స్టేషన్లోనే సెటిల్ చేద్దామనుకున్నప్పటికీ.. అది కుదరకపోవడంతో జూబ్లీహిల్స్‌లో తన ఇంట్లోనే రాకేష్ హత్యచేశాడని తెలిసింది. మరోవైపు, కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న బంజారాహిల్స్ ఏసీపీ కె.శ్రీనివాసరావు మంగళవారం నిందితులతో క్రైమ్ రీ–కన్స్ట్రక్షన్ నిర్వహించారు. ఇందులో భాగంగా నిందితులను జూబ్లీహిల్స్ రోడ్ నెం.10 లోని రాకేష్ ఇంటి నుంచి నందిగామ వరకు తీసుకువెళ్లి వచ్చారు. జయరామ్‌ను వీణా పేరుతో ‘హనీట్రాప్’ చేసిన రాకేష్.. ఆయన్ను బంధించడానికి సహకరించాల్సిందిగా సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో పనిచేస్తున్న అధికారిని సంప్రదించాడు. జయరామ్‌ను తీసుకొచ్చి పోలీసుస్టేషన్లోనే ఉంచాలని, ఆపై డబ్బు వసూలుతోపాటు పత్రాలపై సంతకాలు తీసుకుందామని అన్నాడు. అయితే అలా చేయడం తనకు ఇబ్బందికరంగా మారుతుందని ఆ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి చెప్పాడు. దీంతో తానే రంగంలోకి దిగిన రాకేష్ గత నెల 30న జయరామ్‌ను జూబ్లీహిల్స్ క్లబ్ వరకు రప్పించి తన ఇంటికి వచ్చేలా ప్లాన్ వేశాడు. రెండ్రోజులపాటు బంధించి! ఆహారం, మద్యం అందిస్తూ రెండు రోజుల పాటు ఇంట్లోనే ఉంచాడు. తొలుత కొన్ని ఖాళీ రూ.100 స్టాంప్ పేపర్లపై బలవంతంగా జయరామ్‌తో సంతకాలు చేయించుకున్న రాకేష్.. ఆపై బలవంతపు వసూలుకు ప్రయత్నించాడు. జయరామ్‌తో అనేక మందికి ఫోన్లు చేయించి రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకు వీలున్నంత పంపాల్సిందిగా చెప్పించాడు. చివరకు ఒకరు రూ.6 లక్షలు పంపడంతో తన అనుచరుడిని దస్పల్లా హోటల్‌కు పంపి ఆ మొత్తం రిసీవ్ చేసుకున్నాడు. ఈ డబ్బును తన ఇంట్లో తానే జయరామ్‌కు ఇస్తున్నట్లు నటిస్తూ విశాల్‌తో వీడియో రికార్డింగ్ చేయించాడు. జయరామ్ తన దగ్గర అప్పు తీసుకున్నాడని చెప్పేందుకు ఆధారంగా ఉంటుందనే ఈ వీడియా ప్లాన్ వేశాడు. ఆ సమయంలోనూ సైబరాబాద్ ఇన్స్పెక్టర్కు కాల్ చేసిన రాకేష్.. ఆ ఫోన్ జయరామ్‌కు ఇచ్చి మాట్లా డించాడు. అప్పుడు మాట్లాడిన సదరు పోలీసు అధికారి.. రాకేష్ ఇవ్వాల్సిన, అతడు కోరిన మొత్తం ఇవ్వాలంటూ జయరామ్‌ను హెచ్చరించాడు. హైదరాబాద్ టు నందిగామ హత్య చేశాక జయరాం శవాన్ని ఆయన కారులోనే పెట్టుకుని నల్ల కుంట పోలీసుస్టేషన్‌కు రాకేష్ వెళ్లాడు. తనకు పరిచయస్తుడైన ఇన్స్పెక్టర్ శ్రీనివాసులుకు ఫోన్ చేశాడు. తాను ఆంధ్రమహిళా సభ ఆస్పత్రి వద్ద ఉన్నానంటూ చెప్పడంతో అక్కడకు వెళ్లిన రాకేష్ కారు దూరంగా ఆపి ఇన్స్పెక్టర్ను కలిశాడు. హత్య విషయం ఆయనకు చెప్పగా.. దాన్ని అతిగా మద్యం సేవించడంతో జరిగిన రోడ్డు ప్రమాదంగా మార్చాలని సూచించాడు. హైదరాబాద్ లేదా చుట్టుపక్కల అలా చేస్తే సీసీటీవీలు ఇతర ఆధారాలతో పోలీసులు పట్టుకుంటారని, ఏపీకి తీసుకువెళ్లి సీన్ క్రియేట్ చేయమని సలహా ఇచ్చాడు. దీంతో రాకేష్ విజయవాడ వైపు బయలుదేరాడు. మధ్యలో రాకేష్‌కు ఏసీపీ మల్లారెడ్డి ఫోన్ చేశాడు. ఆదిభట్లలో ఉన్న ఓ ల్యాండ్ వివాదం నేపథ్యంలో వీరికి పరిచయం ఉంది. ఆపై నందిగామ వరకు వెళ్లి ఓ బార్లో బీరు బాటిళ్లు కొని ఐతవరంలో రోడ్డు కిందకు కారు వదిలేసి వెనక్కు వచ్చేశాడు. గతంలో రాకేష్ ఇంట్లో క్రైమ్ సీన్ రీ–కన్స్ట్రక్షన్ నిర్వహించిన పోలీసులు మంగళవారం అక్కడినుంచి నల్లకుంటకు, నందిగామ, ఐతవరం వరకు వెళ్లి ఈ ప్రక్రియ చేసి వచ్చారు. వీరి వెంట నిందితులు సైతం ఉన్నారు. విచారణలో నింది తులు చెప్పిన వివరాలు, రీ–కన్స్ట్రక్షన్లో గుర్తించినవి ఒకేలా ఉన్నాయ ని దర్యాప్తు అధికారులు తెలిపారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసుల్ని మరో 2రోజుల్లో పిలిచి విచారించాలని నిర్ణయించారు. -
సొంతూరులో దొర.. హైదరాబాద్‌లో దొంగ
సాక్షి, హైదరాబాద్: ‘తెల్లటి ఖద్దర్ చొక్కా...చేతికి రెండు ఉంగరాలు...ఆపై బుల్లెట్ బైక్‌పై జర్నీ.. ఇదీ ఓ చోరశిఖామణి ఆహార్యం. రైతు సంఘానికి అధ్యక్షుడిగా, సొంతూరులో పెద్దమనిషిగా చలామణి అవుతూ, హైదరాబాద్‌లో తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలు చేస్తున్న గుల్బర్గా జిల్లా బెలూర్గికి చెందిన కాశీనాథ్ గైక్వాడ్ ని తొలిసారిగా సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి 54 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో క్రైమ్స్ డీసీపీ జానకి షర్మిలా, మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావుతో కలిసి పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ గురువారం మీడియాకు వెల్లడించారు. పెద్దమనిషి హోదా తగ్గకుండా.. కాశీనాథ్ గైక్వాడ్ అఫ్జల్పూర్ తాలూకా రైతు సంఘానికి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. తనకున్న మూడెకరాల భూమిలో వ్యవసాయం చేస్తూ గ్రామంలో రాజకీయంగా చురుగ్గా ఉంటున్నాడు. అదే సమయంలో పైరవీలు చేస్తూ అందరి దృష్టిలో పెద్దమనిషిగా చలామణి అవుతున్నాడు. ఈ రాజకీయాల్లో తిరుగుతుండగానే లగ్జరీ లైఫ్ స్టైల్‌కు అలవాటు పడటంతోపాటు పేకాటకు వ్యసనపరుడయ్యాడు. దీంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో ఊర్లో తన హోదా తగ్గకుండా ఉండేందుకు చోరీలను ఎంచుకున్నాడు. ఇందుకు హైదరాబాద్‌ను ఎంచుకొని గతేడాది అక్టోబర్ ఏడు నుంచి ఈ ఏడాది జనవరి 22 వరకు సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో 16 ఇళ్లలో చోరీలు చేసి పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేశాడు. తాళం వేసిఉన్న ఇళ్లే లక్ష్యం.. కాశీనాథ్ దొంగతనం చేయాలనుకున్నప్పుడు వెంట సెల్‌ఫోన్ తెచ్చుకునేవాడు కాదు. గుల్బర్గా నుంచి బస్సులో హైదరాబాద్‌కు చేరుకొని ఆటోల్లో కాలనీల్లో ప్రయాణిస్తూ తాళం వేసిఉన్న ఇళ్లను గమనించేవాడు. కొన్ని సందర్భాల్లో నడుస్తూనే ఎవరూ లేని ఇళ్లపై కన్నేసేవాడు. వెంటనే అక్కడికి సమీపంలోని నిర్మాణంలో ఉన్న భవనాల వద్ద ఉండే ఇనుప పరికరాలతో తాళాలను పగులగొట్టేవాడు. ఆయా ఇళ్లలో లభించిన బంగారు, వెండి ఆభరణాలను గుల్బర్గాకు తీసుకెళ్లి అఫ్జల్‌పూర్‌లోని కళాసింగ్‌కు ఇచ్చి డబ్బులు తీసుకునేవాడు. ఇలా సైబరాబాద్, రాచకొండలో 16 దొంగతనాలు చేసి పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేయడంతో సీపీ సజ్జనార్ మార్గదర్శనంలో క్రైమ్స్ డీసీపీ జానకి షర్మిలా పర్యవేక్షణలో బాలానగర్, మాదాపూర్ సీసీఎస్ ఇన్స్పెక్టర్ టి.శ్రీనివాస్, చంద్రబాబు నేతృత్వంలో బృందాన్ని రంగంలోకి దింపారు. సీసీటీవీకి దొరికినా.. మియాపూర్, రాజేంద్రనగర్, నార్సింగి, ఉప్పల్, బాచుపల్లి ఠాణా పరిధిలో దొంగతనాలు జరిగిన సమయంలో సీసీటీవీ ఫుటేజీలను ఈ ప్రత్యేక బృందం సేకరించింది. అన్నింటిని జాగ్రత్తగా గమనించగా కాశీనాథ్ అన్ని ప్రాంతాల్లో ఉన్నట్టుగా గుర్తించారు. అయితే గతంలో ఎటువంటి ప్రాపర్టీ నేరాల్లో గైక్వాడ్ అరెస్టు కాకపోవడంతో అతన్ని పట్టుకోవడం పోలీసులకు కష్టతరంగా మారింది. గతంలో అఫ్జల్పూర్ ఠాణా పరిధిలో ఓ పెట్టీ కేసులో మాత్రమే గుల్బర్గా జైలుకు వెళ్లి వచ్చాడు. దీంతో గైక్వాడ్‌ను పట్టుకునేందుకు కర్ణాటక, మహారాష్ట్రలకు ప్రత్యేక బృందం వెళ్లింది. చివరకు గుల్బర్గా పోలీసులను సంప్రదించడంతో గైక్వాడ్‌ను బుధవారం పట్టుకొని ట్రాన్సిట్ వారంట్‌పై గురువారం సిటీకి తీసుకొచ్చారు. కోర్టులో హజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. -
‘ప్రో హెల్తీవే’ పేరిట.. 30 కోట్లకు టోకరా
సాక్షి, హైదరాబాద్: ‘మీరు అధిక కొవ్వుతో బాధపడుతున్నారా? అయితే మీ బరువును తగ్గిస్తాం.. బక్క పలుచగా ఉంటే మీ బరువును పెంచుతాం.. శరీరంలో రోగనిరోధక స్థాయిని పెంచుతాం...కీళ్ల నొప్పులను హెర్బల్ మందులతో తగ్గుముఖం పట్టిస్తాం‘అంటూ 2 తెలుగు రాష్ట్రాల్లో 40వేల మందిని పంపిణీదారులుగా చేర్చుకొని దాదాపు రూ.30 కోట్లు మోసం చేసిన 9మంది సభ్యుల ముఠాను సైబరాబాద్ ఆర్థికనేరాల విభాగం(ఈవోడబ్ల్యూ) పోలీసులు శనివారం అరెస్టు చేశారు. హైదరాబాద్ లోని మలక్‌పేట గంజ్‌లో ‘ప్రో హెల్తీవే ఇంటర్నేషనల్ ఎల్ఎల్పీ’ కంపెనీ పేరుతో కార్యక లాపాలు చేస్తున్న ముగ్గురు డైరెక్టర్లతోపాటు మరో ఆరుగురిని పట్టుకున్నారు. వీరి నుంచి 3 ఖరీదైన కార్లతోపాటు బ్యాంక్ ఖాతాల్లోని 40 లక్షలను ఫ్రీజ్ చేశారు. కేసు వివరాలను గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో ఈవోడబ్ల్యూ ఇన్చార్జ్ విజయ్‌కుమార్‌తో కలసి పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ శనివారం మీడియాకు తెలిపారు. ముఠా కట్టిన వారంతా తెలుగువారే... ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదువును మధ్యలోనే ఆ పేసిన చార్మినార్ దబీర్‌పురాకు చెందిన మహమ్మద్ రిజ్వాన్ యూనస్, కుత్బుల్లాపూర్‌లో నివాసముంటున్న కర్నూలు వాసులు భట్టు సాయికొండ హర్షవర్ధన్ రాజు, అలూరు నరేశ్, విశాఖకు చెందిన పప్పల సాయిచరణ్, వరం గల్ వాసులు వంకుడోతు వేణు నాయక్‌లు మల్టీలెవల్ మార్కెటింగ్ వైపు అడుగులు వేశా రు. వివిధ మార్కెటింగ్ కంపెనీల్లో పనిచేసిన అనుభవంతో సులభంగా డబ్బు సంపాదించాలని ఆరోగ్యకర ఉత్పత్తుల పేరిట మల్టీ లెవల్ మార్కెటింగ్ కంపెనీ ప్రారంభించారు. ఇలా రిజ్వాన్ యూనస్ తండ్రి మహమ్మద్ ఇషాక్ సహకారంతో మలక్‌పేటలో ‘ప్రో హెల్తీవే ఇంటర్నేషనల్ ఎల్ఎల్పీ కంపెనీ’ రెండేళ్ల క్రితం ఏర్పాటైంది. ఈ ఆరుగురికి తోడు, విశాఖపట్నానికి చెందిన ఎర్రగంటి సత్య మణికంఠ, వరంగల్ వాసిభుక్యా అనిల్‌కుమార్, కర్నూలుకు చెంది న కొండా శ్రీనివాసులు కలిశారు. ఈ కంపెనీకి సీఈవోగా రిజ్వాన్ యూనస్, డైరెక్టర్లుగా హర్ష వర్ధన్‌రాజు, మహమ్మద్ ఇషాక్‌లు ఉండగా, మిగతావారు డిస్ట్రిబ్యూటర్లుగా పనిచేశారు. కమీషన్ల వల.. టైటిళ్లతో ఆకర్షణ: ఈ గొలుసు కట్టు పథకంలో 4వేలు చెల్లించి సభ్యు డిగా చేరినవారికి వారి కంపెనీ పేరిట ఆరోగ్యకర ఉత్పత్తులు ఇచ్చేవారు. ఒకరు మరో ఇద్దరిని చేర్పిస్తే 25శాతం కమీషన్, వారు మరో ఇద్దరిని చేర్పిస్తే 25శాతం కమీషన్ ఇచ్చేవారు. ఇలా దశలవారీగా వెళ్లేది. 6 వేల నుంచి రూ.10 కోట్ల వరకు వ్యాపారం చేసిన వారికి క్లబ్, రూబీ , స్టార్ రూబీ మెంబర్...ఇలా క్రౌన్ బ్లాక్ డైమండ్ టైటిల్ ఇచ్చి ప్రోత్సహించారు. పథకంలో భాగంగా గోవా విహారయాత్రనూ ఆఫర్ చేశారు. అలావారు ఉత్పత్తులు కొనేలా చేశారు. నెలకు రూ.90వేలు వంతున ఏడాది పాటు అమ్మకాలు జరిపిస్తే ఎఫ్టీబీ కింద రూ. కోటీ 18లక్షల95వేలు గెలుచుకోవచ్చంటూ ఆశ చూపించారు. ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, వైజాగ్, కర్నూలు జిల్లాల్లో సమావేశాలు పెట్టి నిరుద్యోగులు, వృద్ధులను మోస గించారు. నెలకు 1,500 మందిని చేర్పిస్తూ ముందుకెళుతున్న ఈ ముఠా కార్యకలాపాలపై శామీర్‌పేట పోలీసుస్టేషన్‌కు ఫిర్యాదు అంద డంతో ఈవోడబ్ల్యూ అధికారులు నిఘా వేసి మలక్‌పేటలోని కంపెనీ కార్యాలయంలో నిందితులను పట్టుకున్నారు. ఒక్కరు మినహా మిగిలిన వారంతా 23 నుంచి 27 ఏళ్లలోపు వారు కావడం గమనార్హం. రూ.300 వస్తువులు.. రూ.4వేలు రాజస్తాన్ బిల్వారాలోని హెచ్ఏఎస్ హెర్బల్ కంపెనీ, హైదరాబాద్‌లోని మహబూబ్ హెర్బల్స్, పంజాబ్ లూథియానా లోని కేవా ఇండస్ట్రీస్‌లో తక్కువ ధరకు వేద్ గెయిన్, వేద్ ఫిట్, గిలాయ్ జ్యూస్, ఆర్థో ఆయిల్, హార్ట్ కేర్, 42 హెర్బ్స్ ఆయిల్, హెర్బల్ టూత్ పేస్ట్, వేద్ లైఫ్ హెర్బల్ పౌడర్, జస్ట్ వేద్ మాయిశ్చరైజర్, టాన్ జెల్, అక్నీ లోషన్, షాంపూ, యాంటీ రాడియంట్ చిప్స్ పేరుతో ఉత్పత్తులు కొనుగోలు చేసేవారు. రూ.300 నుంచి రూ.500 లకు కొనుగోలు చేసిన ఈ ఉత్పత్తులను రూ.4వేలకు ఇచ్చేవారు. గడియారాలు, బె ల్ట్లు బహుమతిగా ఇచ్చి 40వేల మంది స భ్యులను ఆకర్షించారు. రూ.30కోట్ల వ్యా పారం చేశారు. ఈ ఆరోగ్య ఉత్పత్తులు అను మతి లేనివని, నాసిరకమైనవిగా పోలీసులు గుర్తించారు.లైసెన్స్‌లు తీసుకోకుండా వ్యా పారం చేస్తున్న సంస్థలపై చర్యలు తీసుకోవల్సిందిగా లేఖ రాస్తామని సీపీ తెలిపారు. -
పోలీసులు ఉన్నా.. హత్యను ఆపలేకపోయారు
సాక్షి, సిటీబ్యూరో: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అత్తాపూర్‌లో బుధవారం పట్టపగలు జరిగిన రమేష్ దారుణ హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. పోలీసులే కాదు.. సామాన్యులనూ ఉలిక్కిపడేలా చేసింది. రమేష్‌ను ఇద్దరు వ్యక్తులు వెంటాడి మరీ నరుకుతుంటే పోలీసులు సమీపంలో ఉండి కూడా స్పందించిన తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఏ కష్టమొచ్చినా, ముప్పు ఎదురైనా ప్రజలకు ముందుగా గుర్తుకొచ్చేది పోలీసులే. అలాంటి ఖాకీలే చేష్టలుడిగి చూస్తుంటే తమకు ఇక రక్షణ ఎక్కడన్నది ఇప్పుడు ప్రతి వ్యక్తి మదినీ తొలుస్తున్న ప్రశ్న. ‘ఆధునికత’ అంటూ దూసుకుపోతున్న పోలీసింగ్‌లో ఈ పరిస్థితి తలెత్తడానికి అనేక కారణాలు ఉన్నాయని పోలీస్ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. వచ్చినా ఉపయోగమేంటి? అత్తాపూర్‌లో జరిగిన ఉదంతాన్నే తీసుకుంటే దాదాపు 10 నుంచి 15 నిమిషాల పాటు నడిరోడ్డుపై ఛేజింగ్ జరిగింది. ఓ వ్యక్తిని ఇద్దరు దుండగులు వెంటాడుతూ చంపడానికి ప్రయత్నించారు. ‘డయల్–100’కు ఫోన్ చేసినా.. ఐదు నిమిషాల్లో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుంటారు. ఇక్కడి వరకు బాగానే ఉది.. అయితే అలా వచ్చిన పోలీసుల స్పందన ఏంటన్నది ఇక్కడ ప్రధాన ప్రశ్న. రమేష్‌ను హత్య చేస్తున్న సమయంలో అక్కడకు చేరుకున్న పోలీసు వాహనంతో ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. అందులోంచి దిగిన ఇద్దరు క్రైమ్ కానిస్టేబుళ్లు ప్లాస్టిక్ లాఠీలతో హతుడు, హంతకుల సమీపం నుంచి తిరిగారే తప్ప అడ్డుకోవడానిగాని, హంతకులను బంధించడాని గాని ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. ఈ నేపథ్యంలో ఫోన్ వచ్చాక ఎంత తక్కువ సమయంలో స్పందించినా ఉపయోగమేంటనే ప్రశ్న తలెత్తుతోంది. ఆయుధం ఉంటే తప్పేంటి? రమేష్ హత్య ఉదంతంలో ట్రాఫిక్ కానిస్టేబుల్, క్రైమ్ కానిస్టేబుళ్లు సరిగ్గా స్పందించక పోవడానికి ప్రధాన కారణం వారు నిరాయుధులై ఉండడం. ఆయుధం అవసరం లేని ట్రాఫిక్ పోలీసులు.. అవసరమైన క్రైమ్ పోలీసులు సైతం ‘ఒట్టి చేతుల తో’ ఉండాల్సి వచ్చింది. ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’ విధానాలు అమల్లోకి వచ్చాక ఆయుధాలు అటకెక్కాయి. ఒకప్పుడు ఎస్సై, ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు రివాల్వర్స్ లేదా పిస్టల్స్, ఆ కింద స్థాయి సిబ్బంది వద్ద 303 లేదా ఎస్ఎల్ఆర్లు ఉండేవి. ఆయుధం పోలీసులకు యూనిఫాంలో భాగమే కాదు.. శరీరంలో భాగం లాంటిదని వారికి శిక్షణ నుంచే చెబుతుంటారు. అలాంటిది ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో ఈ ఆయుధాలను పక్కన పెట్టేశారు. చంపైనా ప్రాణాలు కాపాడుకునే అవకాశం.. సమాజంలో ప్రతి వ్యక్తికీ ప్రాణాలు కాపాడుకునే హక్కు ఉంటుంది. దాడి చేస్తూ ప్రాణహాని తలపెట్టేందుకు ప్రయత్నించిన వ్యక్తిని చంపైనా తనను తాను కాపాడుకునే అవకాశాన్ని చట్టం సామాన్య ప్రజలకే కల్పించింది. పోలీసులకు కూడా కళ్ల ముందు దారుణం జరుగుతుంటే దుండగులను కాల్చడమో, గాల్లోకి కాల్పులు జరిపి నిలువరించి పట్టుకోవడమో చేసే అధికారం ఉంటుంది. అత్తాపూర్ ఉదంతంలో ఆ కానిస్టేబుళ్ల వద్ద తుపాకీ ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని నిపుణులు చెబుతున్నారు. రాజధానిలోనూ ఇదే పరిస్థితా? ‘సాఫ్ట్ టార్గెట్’గా పేరున్న హైదరాబాద్ అనునిత్యం ఉగ్రవాదుల హిట్ లిస్ట్‌లో ఉంటుంది. స్థానిక ఉగ్రవాదుల నుంచి జాతీయ, అంతర్జాతీయ ఉగ్ర సంస్థల వరకు అదను చూసి గురిపెడుతుంటాయి. నిత్యం కుట్రలు జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి రాజధాని నగరంలో నిరాయుధులతో పోలీసింగ్ సురక్షితం కాదని పోలీస్ శాఖకు చెందిన నిపుణులు చెబుతున్నారు. బృందాలుగా రంగంలోకి దిగడం, బాంబు పేలుళ్ల వంటివి కాకుండా తుపాకులతో జనసమర్థ ప్రాంతాల్లో రెచ్చిపోతున్నారు. సామాన్యులపై విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడుతున్నారు. ఇలాంటి ఉదంతమే పోలీసులకు ఎదురైతే పోలీస్ స్టేషన్ నుంచి ఆయుధాలు తెచ్చుకోవడమో, ‘ఇంటర్సెప్షన్’ వాహనాన్ని పిలవడమో చేయాలి. (ఈ వాహనాల్లోనే ఆయుధాలతో పోలీసులు ఉంటారు. ఇలాంటివి 17 వెహికల్స్ సిటీలో మాత్రమే ఉన్నాయి) ఈ లోపు జరగాల్సిన నష్టం జరుగుతుంది. బ్యాంకుల వద్ద కాపలా కాసే సెక్యూరిటీ గార్డుల వద్దే తుపాకీ ఉండగా పోలీసుల వద్ద ఉండకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మూడు కమిషనరేట్లలో పరిస్థితి ఇదీ.. రాజధానిలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండల్లో కలిపి 140 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాటిని మినహాయించినా మిగిలిన వాటిలో ప్రతి ఠాణాకు కనిష్టంగా ఒకటి, గరిష్టంగా 3 చొప్పున పెట్రోలింగ్ కోసం ఇన్నోవా వాహనాలు ఉన్నాయి. ఒక్కో వాహనంలో డ్రైవర్ సహా నలుగురు నుంచి ఐదుగురు సిబ్బంది ఉంటారు. వీరికి హెడ్–కానిస్టేబుల్ లేదా ఏఎస్సై నేతృత్వం వహిస్తారు. ఆ వాహనంలో ప్రాథమిక చికిత్స చేసే కిట్లు, రెయిన్కోట్లు, కోన్స్లతో పాటు ప్లాస్టిక్ లాఠీలే ఉంటున్నాయి. అతి తక్కువ వాహనాల్లో మాత్రమే ‘స్టోన్ గార్డ్’ (రాళ్లు తగలకుండా ధరించే కోట్లు) వంటివి ఉంటున్నాయి. ప్రతి ఠాణాకు 2 నుంచి 4 వరకు పెట్రోలింగ్ బైక్‌లు (బ్లూకోల్ట్స్) ఉన్నాయి. దీనిపై ప్రతి షిఫ్ట్‌లో ఇద్దరు కానిస్టేబుళ్ల చొప్పున తమ పరిధుల్లో గస్తీ నిర్వహిస్తుంటారు. వీరి వద్ద వాకీటాకీ, ట్యాబ్, సెల్‌ఫోన్ మినహా కనీసం లాఠీ కూడా ఉండదు. అవసరమైనప్పుడే లాఠీలు పట్టుకెళతారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని డివిజన్‌కు ఒకటి చొప్పున మొత్తం 17 ‘ఇంటర్సెప్టార్’ వాహనాలు ఉన్నాయి. ఒక్కో డివిజన్లో 3 నుంచి 5 ఠాణాలు ఉండగా.. ఈ వాహనాల్లోని సిబ్బంది వద్ద మాత్రమే తుపాకులు ఉంటున్నాయి. అదుపు తప్పిన సందర్భాల్లేవ్.. చేతిలో తుపాకీ ఉన్నంత మాత్రాన ఫ్రెండ్లీ పోలీసింగ్ అటకెక్కుతుందని భావించడం సమంజసం కాదన్నది నిపుణుల మాట. నాలుగేళ్ల కిందటి వరకు అన్ని స్థాయిల అధికారుల వద్దా ఆయుధాలు ఉండేవి. దోపిడీ, బందిపోటు ముఠాల కదలికల నేపథ్యంలో ఉమ్మడి సైబరాబాద్‌లో కానిస్టేబుళ్లు ఎస్ఎల్ఆర్లతో పెట్రోలింగ్ చేసేవారు. ఇప్పటి వరకు పోలీసులు అదుపు తప్పిన, విచక్షణ కోల్పోయి ప్రవర్తించిన సందర్భాలు లేనేలేవు. గడిచిన 15 ఏళ్లలో చూసినా మక్కా మసీదులో పేలుడు జరిగిన 2007 మే 18న మాత్రమే పోలీసు తూటా పేలింది. అది కూడా అల్లరిమూకలు పెట్రోల్ బంక్‌కు నిప్పు పెట్టేందుకు చేసిన ప్రయత్నాన్ని తిప్పికొట్టడానికే కాల్పులు జరిపారు. అంతకు ముందు, ఆ తర్వాత కూడా ఎలాంటి కాల్పులు జరగలేదు. ఈ నేపథ్యంలో ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసుల వెంట తుపాకులు ఉంటే తప్పేంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. -
డేటింగ్.. చీటింగ్
సాక్షి, హైదరాబాద్: డేటింగ్ పేరిట మహిళా ఎస్కార్ట్ సేవలు అందిస్తామంటూ వేలాదిమందిని మోసగించిన కేసులో పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఇద్దరు నిందితులను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. కాల్ సెంటర్ల మేనేజర్లు సందీప్ మిత్రా, నీతా శంకర్లను సిలిగురిలో పట్టుకొని ట్రాన్సిట్ వారంట్‌పై మంగళవారం నగరానికి తీసుకొచ్చారు. అయితే, ప్రధాన నిందితులు దేబాశిష్ ముఖర్జీ, ఫజుల్హక్ పరారీలో ఉన్నారు. కేసు వివరాలను గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో క్రైమ్స్ డీసీపీ జానకీ షర్మిల, ఏసీపీ శ్రీనివాస్‌లతో కలసి పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ మంగళవారం మీడియాకు తెలిపారు. పెస్టిసైడ్ దుకాణం ముసుగులో కాల్‌సెంటర్... పశ్చిమ బెంగాల్ హౌరాకు చెందిన దేబాశిష్ ముఖర్జీ పెస్టిసైడ్ దుకాణాన్ని నిర్వహించగా ఆశించినస్థాయిలో లాభాలు రాలేదు. దీంతో కోల్‌కతాకు చెందిన ఫజుల్ హక్‌తో జతకట్టి తక్కువ కాలంలో డబ్బులు సంపాదించేందుకు ప్లాన్ వేశాడు. యువకులకు ‘ఎస్కార్ట్ సర్వీసుల’పై ఉన్న మోజును క్యాష్ చేసుకోవాలనుకుని రెండున్నరేళ్ల క్రితం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.వరల్డ్‌డేటింగ్.కామ్‌ను ప్రారంభించారు. వీరికి దేబాశిష్ స్నేహితురాలు అనితా డే కూడా సహకరించడంతో సిలిగురి కేంద్రంగా పెస్టిసైడ్ దుకాణం ముసుగులో ఓ కాల్‌సెంటర్ ప్రారంభించారు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.గెట్యువర్ లేడీ.కామ్, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.మైలవ్ 18.ఇన్ పేరుతో కొత్త వెబ్సైట్లను సృష్టించడమే కాకుండా సిలిగురిలో 12 బ్రాంచ్‌లు, కోల్‌కతాలో 8 బ్రాంచ్‌లు ప్రారంభించారు. 400 మంది ఉద్యోగులతో కాల్స్ చేస్తూ డబ్బులు దండుకుంటున్నారు. ఫిమేల్ ఎస్కార్ట్ పేరిట లోకంటో.కామ్‌లోనూ కాల్‌సెంటర్ ఫోన్ నంబర్లను పోస్ట్ చేశారు. ఈ నంబర్లలో సంప్రదించినవారితో దశలవారీగా డబ్బులు కంపెనీ బ్యాంక్ ఖాతాల్లో జమ చేయించేవారు. రోజుకు ఒక్కో సెంటర్ నుంచి 200 ఫోన్‌కాల్స్ చేస్తూ నెలకు ఆరు కోట్లు బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యేవిధంగా వృద్ధి సాధించారు. ఎనిమిది దశల్లో లక్షల వసూళ్లు... ఆయా డేటింగ్ వెబ్సైట్లలో యువకులను ఆకర్షించే విధంగా గూగుల్లోనే డౌన్లోడ్ చేసిన అందమైన ఆకర్షించే అమ్మాయిల ఫొటోలను అప్లోడ్ చేశారు. తొలుత మెంబర్షిప్ కోసం 1,080 ఫీజు కట్టమంటారు. తర్వాత క్లబ్లైసెన్స్, రిజిస్ట్రేషన్, సర్వీస్, జీఎస్టీ, అకౌంట్ వెరిఫికేషన్, బ్యాంక్ గ్రౌండ్ వెరిఫికేషన్, ఫైనల్ పేమెంట్ ఫీజుల రూపంలో ఎనిమిది దశల్లో బాధితుల నుంచి డబ్బులు గుంజేవారు. అందమైన అమ్మాయిలను కేటగిరీగా విభజించి సిల్వర్, గోల్డ్, ప్లాటినమ్ ఫీజులను వసూలు చేశారు. ఈ విధంగానే సైబరాబాద్‌కు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి నుంచి వివిధ ఫీజుల రూపంలో రూ.15,19,614 చెల్లించారు. ఇందులో రూ.87,634ల జీఎస్టీ కూడా చెల్లించడం విశేషం. చివరకు ఇతని ఫోన్ నంబర్ నుంచి ఫోన్‌కాల్స్ చేస్తే స్వీకరించడంతో మోసపోయానని తెలుసుకొని సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాస్, ఎస్ఐ కె.విజయ్ వర్ధన్ నేతృత్వంలోని బృందం సిలిగురిలోని రెండు బ్రాంచ్‌లపై దాడి చేసి మేనేజర్లు సందీప్ మిత్రా, నీతా శంకర్లను పట్టుకుంది. అయితే, చాలామంది రూ.10 వేలు, రూ.20వేల వరకు కట్టినవారు తమ పరువు ఎక్కడ పోతుందోనన్న భయంతో ముందుకు రాలేదని సీపీ సజ్జనార్ తెలిపారు. ఈ డేటింగ్ మోసం అంశం కుటుంబాల్లో చిచ్చుపెట్టే అవకాశం ఉండటంతో ఎక్కువగా పోలీసు స్టేషన్లకు ఫిర్యాదులు రాలేదని చెప్పారు. అయితే, ఈ బ్రాంచ్‌ల్లో పనిచేస్తున్న 35 మందికి నోటీసులు జారీ చేశామని, వారందరూ సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో త్వరలోనే విచారణకు హజరవుతారని తెలిపారు. -
వేలకు వేలొస్తాయన్నారు.. కోట్లు కొట్టేశారు!
సాక్షి, హైదరాబాద్: ‘మీరు రూ.7,500 చెల్లిస్తే చాలు... రూ.2,500 ఫీజును మినహాయించి రూ.5 వేలకు డ్రెస్సులు లేదంటే ఆరోగ్యకర ఉత్పత్తులిస్తాం. మీరు మరో ఇద్దరు సభ్యులను చేర్పిస్తే రూ.500 బోనస్‌తో పాటు రెండేళ్ల పాటు నెలకు రూ.2,500 అంటే రూ.60,000 సంపాదించుకోవచ్చు’అంటూ దేశవ్యాప్తంగా లక్షల మందికి ఆశచూపి దాదాపు రూ.1,200 కోట్లకు టోకరా వేశాడు హరియాణాకు చెందిన రాధేశ్యామ్. 34 ఏళ్ల ఇతడు ఏడో తరగతి వరకే చదవడం గమనార్హం. రాధేశ్యామ్, అతడికి సహకరించిన సురేందర్ సింగ్‌ను సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగ పోలీసులు గుర్గావ్లో పట్టుకొని శనివారం నగరానికి తీసుకొచ్చారు. ఫ్యూచర్ మేకర్ లైఫ్ కేర్ గ్లోబల్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ఆరు బ్యాంక్ ఖాతాల్లోని రూ.200 కోట్లను పోలీసులు ఫ్రీజ్ చేశారు. ఈ కేసు వివరాలను గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో ఆర్థిక నేరాల విభాగం పర్యవేక్షిస్తున్న డీసీపీ విజయ్‌కుమార్, మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావుతో కలసి కమిషనర్ వీసీ సజ్జనార్ మీడియాకు తెలిపారు. హరియాణా రాష్ట్రం హిస్సార్‌కు చెందిన రాధేశ్యామ్, ఫతేబాద్ తహసీల్‌కు చెందిన సురేందర్ సింగ్, బన్సీలాల్‌కు గుడ్‌వే, రైట్ కనెక్ట్ మార్కెటింగ్ సంస్థల్లో పనిచేసినప్పుడు పరిచయం ఏర్పడింది. అక్కడ నేర్చుకున్న మల్టీ లెవల్ మార్కెటింగ్ అనుభవంతో స్వతహాగా ముగ్గురూ కలసి 2015లో ఫ్యూచర్ మేకర్ లైఫ్ కేర్ గ్లోబల్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కంపెనీని ప్రారంభించారు. హరియాణాలోని హిస్సార్ కేంద్రంగా కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించారు. ఉత్తర భారతీయులే లక్ష్యంగా... నెలకు రూ.20 వేల నుంచి రూ.పది లక్షల వరకు సంపాదించవచ్చు.. కేవలం రూ.7,500తో ‘ఫ్యూచర్ మేకర్’గా మారవచ్చని అన్ని పత్రికల్లో క్లాసిఫైడ్స్ ఇచ్చారు. 2015–2017 నవంబర్ వరకు కేవలం వేల సంఖ్యలో ఉన్న కస్టమర్ల సంఖ్య.. గత పది నెలల్లోనే ఏకంగా 20 లక్షల వరకు దాటింది. సెప్టెంబర్ 2న కంపెనీ చీఫ్ రాధేశ్యామ్ జన్మదినం సందర్భంగా ‘మాన్సూన్ బొనాంజా’అంటూ ప్రకటనలు బాగా ఇచ్చి కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. వీరిని అరెస్టు చేసిన శుక్రవారం ఒక్కరోజే.. కంపెనీ పేరు మీదున్న బ్యాంక్ ఖాతాలకు రూ.75 కోట్లు వచ్చి చేరాయి. ట్రస్టు పేరుతోనూ సేవా కార్యక్రమాలు చేసిన వీరు ముఖ్యంగా ఉత్తర భారతీయులపై గురిపెట్టారు. హరియాణా, ఢిల్లీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశాతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులు, గృహిణులు, రిటైర్డ్ ఉద్యోగులకు పార్ట్‌టైమ్ ఆదాయం పేరిట కుచ్చుటోపీ పెట్టారు. గత 6 నెలల నుంచి రాష్ట్రంలో ఊపందుకున్న ఈ వ్యాపారంలో దాదాపు రూ.29 కోట్లు మోసపోయారని సైబరాబాద్ పోలీసుల దృష్టికి వచ్చింది. దీన్ని ఆర్థిక నేరాల విభాగం తీవ్రంగా పరిగణించింది. ప్రత్యేక బృందం గుర్గావ్ వెళ్లి రాధేశ్యామ్, సురేందర్ సింగ్‌ను పట్టుకుంది. మరో నిందితుడు బన్సీలాల్ పరారయ్యాడు. వీరిని న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. తదుపరి విచారణ కోసం పోలీసు కస్టడీకి పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఎంత మందిని చేరిస్తే అన్ని డబ్బులు... దుస్తులు, ఆరోగ్యకర ఉత్పత్తులను విక్రయించేందుకు ఈ గొలుసు వ్యాపారం సాగుతున్నట్లుగా కనిపించినా సభ్యుల చేరికపైనే సంస్థ నిర్వాహకులు ప్రధాన దృష్టి సారించారు. ఒక్కొక్కరూ ఇద్దరిని చేర్పిస్తే, ఆ ఇద్దరు మరో నలుగురు, ఆ నలుగురు మరో ఎనిమిది మందిని... ఇలా గొలుసుకట్టుగా సభ్యులను చేర్పించే ప్రక్రియ మొదలుపెట్టారు. ఎక్కువ సభ్యులను చేర్పించేలా ప్రోత్సహించేందుకు టైటిల్ కూడా ప్రదానం చేసేవారు. 10 మందిని చేర్పిస్తే స్టార్ టైటిల్ ఇవ్వడంతో పాటు రూ.5వేలు ఇచ్చేవారు. ఇలా సిల్వర్ స్టార్ (30 మంది), పెరల్ స్టార్ (80 మంది), గోల్డ్ స్టార్ (180 మం ది), ఎమరాల్డ్ స్టార్ (430 మంది), ప్లాటినమ్ స్టార్ (1,43 0 మంది), డైమండ్ స్టార్ (4,430 మంది), రాయల్ డైమండ్ స్టార్ (11,930 మంది), క్రోన్ డైమండ్ స్టార్ (26,930 మంది), క్రోన్ అంబాసిడర్ స్టార్ (61,930 మంది) టైటిల్ దక్కించుకున్నవాళ్లకు రూ.8 వేల నుంచి రూ.కోటి వరకు ఇస్తామంటూ భారీ మొత్తంలో సభ్యులను చేర్పించేలా స్కెచ్ వేశారు. ఇలా దాదాపు రూ.1,200 కోట్ల మోసపూరిత వ్యాపార లావాదేవీలు చేశారు. వీరిచ్చే ఆరోగ్యకర ఉత్పత్తులను ల్యాబ్‌కు పంపడంతో అవి నకిలీవని తేలింది. ఈ కేసు ఛేదనలో కీలకపాత్ర పోషించిన సైబర్ క్రైమ్స్ ఏసీపీ శ్రీనివాస్, ఆర్థిక నేరాల విభాగ బృంద సభ్యులు సుధీర్, ఆనంద్‌రెడ్డి, గోపీనాథ్, శ్రీనివాస్, చంద్రశేఖర్‌రెడ్డి, శ్యామ్, కూకట్పల్లి సీఐ ప్రసన్నకుమార్‌ను సీపీ ప్రశంసించారు. చేరినా.. చేర్పించినా నేరమే ‘సులభ పద్ధతిలో ఆదాయం వస్తుందని మల్టీ లెవల్ మార్కెటింగ్(ఎంఎల్ఎం)లో పెట్టుబడులు పెట్టినా, పెట్టుబడులు పెట్టించినా అది నేరమవుతుంది. 1978, ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్ బ్యానింగ్ యాక్ట్ ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇంట్లో కూర్చొనే డబ్బులు సంపాదించుకోవడం అంటూ పత్రికల్లో వచ్చే క్లాసిఫైడ్స్‌ను నమ్మకండి. మీడియా కూడా ఇటువంటి ప్రకటనల విషయాల్లో ఆయా సంస్థలను అది ఎలా సాధ్యమనే వివరాలు తెలుసుకోవాలి. పోయింది చిన్న మొత్తం కాబట్టి పోలీసు స్టేషన్‌కు పోవాలా అని ఆలోచన చేస్తున్నారు. ఈ చిన్నచిన్నవి మోసగాళ్లకు కోట్లు తెచ్చిపెడుతున్నాయి. సులభంగా డబ్బులు సంపాదించొచ్చని ప్రకటన మీ దృష్టికి వస్తే వెంటనే పోలీసులకు సమాచారమివ్వండి’అని సీపీ సజ్జనార్ అన్నారు. -
నేడు సైబరాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లోస్వాతంత్య్ర వేడుకలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా : గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో బుధవారం జిల్లా యంత్రాంగం పంద్రాగస్టు వేడుకలను నిర్వహించనుంది. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ హాజరుకానున్నారు. ఉదయం 10 గంటలకు ఆయన జాతీయ జెండా ఎగురవేయనున్నారు. అనంతరం వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు అవార్డులు అందజేస్తారు. మంత్రి మహేందర్‌రెడ్డి శుభాకాంక్షలు.. జిల్లా ప్రజలకు మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి సాంతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ముందడుగు వేయాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలను పేదల దరికి చేర్చాలని పిలుపునిచ్చారు. -
1800 హోంగార్డు పోస్టులకు నోటిఫికేషన్
హైదరాబాద్: సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 1,800 హోంగార్డుల పోస్టుల భర్తీకి శుక్రవారం నోటిఫికేషన్ వెలువడనుంది. ఒక్కో కమిషనరేట్‌లో 900 చొప్పున ఉన్న పోస్టులకు ఆయా కమిషనరేట్ల పరిధిలో నివసించే వారు అర్హులు. ఈ నెల 5 నుంచి 25 వరకు దరఖాస్తులను విక్రయించనున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని వారు గచ్చిబౌలిలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్‌లో, రాచకొండ పరిధిలోని వారు అంబర్‌పేటలోని పోలీస్‌హెడ్ క్వార్టర్స్‌లో దరఖాస్తులు పొందవచ్చు. ఇక్కడే అభ్యర్థుల వివరాలను నమోదు చేసుకుంటామని కమిషనర్లు సందీప్ శాండిల్య, మహేష్ భగవత్ వివరించారు. -
రెండు పోలీస్ కమిషనరేట్లుగా సైబరాబాద్
హైదరాబాద్ : పాలన సౌలభ్యం కోసం ఇప్పటికే జిల్లాల విభజనపై కసరత్తు ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం...మరోవైపు శాంతి భద్రతలను మరింత పటిష్ట పరిచేందుకు పోలీస్ కమిషరేట్ల విభజనపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా సైబరాబాద్ కమిషనరేట్ రెండుగా విభజించింది. సైబరాబాద్ ఈస్ట్, సైబరాబాద్ వెస్ట్గా విభజిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సైబరాబాద్ ఈస్ట్ కమిషనరేట్‌లో భువనగిరి, మల్కాజ్గిరి, ఎల్బీనగర్, సరూర్‌నగర్, చౌటుప్పల్, వనస్థలిపురం, ఇబ్రహీంపట్నం ఉండనుండగా.....సైబరాబాద్ వెస్ట్ జోన్ కమిషనరేట్‌లో బాలానగర్, మాదాపూర్, కూకట్పల్లి, శంషాబాద్, మియాపూర్, రాజేంద్రనగర్, షాద్‌నగర్‌లు ఉండనున్నాయి. రంగారెడ్డి, సైబరాబాద్, నల్గొండ, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లోని పలు ప్రాంతాలను సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి తెచ్చింది. అలాగే డీజీపీ అనురాగ్ శర్మ విజ్ఞప్తి మేరకు సైబరాబాద్ కమిషనరేట్ కు రాష్ట్ర సర్కారు అదనపు సిబ్బందిని మంజూరు చేసింది. 346 పోలీస్, 135 మినిస్ట్రీరియల్ స్టాఫ్, 2000 హోంగార్డ్స్, 41 ఔట్ సోర్సింగ్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సైబరాబాద్ కమిషనరేట్ ఈస్ట్ లోని జోన్స్: బోనగిరి, మల్కాజ్ గిరి, ఎల్బీనగర్. డివిజన్స్: బోనగిరి, చౌటుప్పల్, మల్కాజ్గిరి, కుషాయి గూడ, వనస్థలిపురం, ఎస్బీ నగర్, ఇబ్రహీం పట్నం. సీసీఎస్‌లు: బోనగిరి, మల్కాజ్గిరి, ఎల్బీనగర్. మహిళా పోలీస్ స్టేషన్: సరూర్ నగర్ సైబరాబాద్ కమిషనరేట్ వెస్ట్ లోని జోన్స్: బాలానగర్, మాదాపూర్, శంశాబాద్. డివిజన్స్: బాలానగర్, పహాడీషరీఫ్, మాదాపూర్, కూకట్పల్లి, మియాపూర్, శంషాబాద్, రాజేంద్రనగర్, షాద్ నగర్. సీసీఎస్‌లు: బాలానగర్, మాదాపూర్, శంషాబాద్. మహిళా పోలీస్ స్టేషన్: ఐటీ కారిడార్. -
నేడో రేపో ‘రెండు’!
సైబరాబాద్ కమిషనరేట్ విభజన ప్రక్రియ కొలిక్కి సిబ్బందితో పాటు సామగ్రి కూడా విభజన సీఎం వద్ద దస్త్రం, త్వరలో ఉత్తర్వులు సిటీబ్యూరో: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌ను ఈస్ట్, వెస్ట్ కమిషనరేట్లుగా విభజింజే అంశంపై త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఈ మేరకు రీ ఆర్గనైజింగ్ వింగ్ పంపిన ప్రతిపాదనలపై ఈ నెలాఖరు లోపే ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. విభజన నేపథ్యంలో సిబ్బందితో పాటు కుర్చీల దగ్గరి నుంచి చివరకు పోలీసు జాగిలాల దాకా...ఇలా ప్రతిదీ నిర్ణీత నిష్ఫత్తిలో పంపిణీ చేశారు. అన్ని ఠాణాలతో కూడిన జోన్లతో పాటు నేరగాళ్లను పట్టుకునేందుకు రంగంలోకి దిగే స్నిఫర్ డాగ్స్‌ను కూడా విభజించారు. సైబరాబాద్ పోలీసుల చేతుల్లో ఉన్న 12 డాగ్స్‌ను ఒక్కో కమిషనరేట్‌కు ఆరు చొప్పున కేటాయించారు. దాదాపు 1,300కు పైగా వాహనాలను రెండు కమిషనరేట్లకు సగం చొప్పున పంపిణీ చేయాలని లెక్కలతో సహా చూపినట్టు తెలుస్తోంది. అదేవిధంగా ఆయుధాలతో పాటు కమ్యూనికేషన్ ఉపకరణాలు, ఎలక్ట్రికల్ ఐటమ్స్, ఫర్నీచర్, కేబుల్, ఇతర మెటీరియల్ ఇలా ప్రతిదీ రెండిటికీ పరిధిని బట్టి కేటాయించారు. సిబ్బంది విభజించిన లెక్కలివీ... ప్రస్తుతం సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో మినిస్టీరియల్ సిబ్బంది 40 మంది వరకు ఉన్నారు. సీసీఆర్బీలో 20 మంది, కంట్రోల్ రూమ్‌లో 50 మంది, అకౌంట్ సెక్షన్ 10 మంది వరకు ఉన్నారు. వీరందరినీ రెండు కమిషనరేట్లకు చెరి సగం చొప్పున కేటాయించారు. ఆర్మ్డ్ రిజర్వులో 1200, స్పెషల్ బ్రాంచ్‌లో 60, సైబర్‌క్రైమ్, సీఎస్ఎల్, సీటీసీలో ఉన్న 100 మందిని కూడా విభజించిన పోలీసు ఉన్నతాధికారులు వారికిష్టమున్న కమిషనరేట్‌ను ఎంచుకునే అప్షన్‌ను ఇప్పటికే కల్పించారు. నేరాల దర్యాప్తునకు ఎటువంటి ఆటంకం కలిగించొద్దనే ఉద్దేశంతో శాంతిభద్రతల విభాగంలో పనిచేస్తున్న 3,500 మందిని యథాతథా స్థానంలో కొనసాగిస్తే బాగుం టుందని ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలో రీ ఆర్గనైజింగ్ వింగ్ పేర్కొంది. అలాగే ట్రాఫిక్‌లోని 500 మంది, హోంగార్డులు 2,000 మంది ఎక్కడున్నవారు అక్కడి స్థానాల్లో కొనసాగేలా ఏర్పాట్లు చేశారు. ఎల్బీనగర్, మల్కాజిగిరి, భువనగిరి జోన్లతో ఈస్ట్ కమిషనరేట్, శంషాబాద్, మాదాపూర్, బాలానగర్ జోన్లతో వెస్ట్ కమిషనరేట్లుగా విభజిస్తూ రీ ఆర్గనైజింగ్ వింగ్ పంపిన ప్రతిపాదన సీఎం వద్ద పెండింగ్‌లో ఉంది. అయితే ఈ నెల 27 వరకు గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలోని మూడు, నాలుగు అంతస్తులను పూర్తిచేయాలని ఇప్పటికే డీజీపీ అనురాగ్‌శర్మ పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ అధికారులకు ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు దాదాపు పనులు పూర్తి కావొచ్చాయి. ఆలోపు సైబరాబాద్ విభజనపై ప్రభుత్వ నిర్ణయం అధికారికంగా ప్రకటించే అవకాశముందని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. కమిషనరేట్ల స్వరూపమిదే... ప్రస్తుతమున్న సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఐదు జోన్లు ఉన్నాయి. అయితే విభజన అంశం తెరపైకి వచ్చిన నేపథ్యంలో రెండు కమిషనరేట్లలో మూడు జోన్లు ఉండాలనే ఉద్దేశంతో ఈస్ట్ కమిషనరేట్ పరిధిలో మల్కాజిగిరి, ఎల్బీనగర్ జోన్లతో కొత్తగా భువనగిరి జోన్ ఏర్పాటుచేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. శంషాబాద్, మాదాపూర్, బాలానగర్ జోన్లతో వెస్ట్ కమిషనరేట్ ఏర్పాటుచేయాలన్న రీ ఆర్గనైజింగ్ వింగ్ అధికారులు శంషాబాద్ జోన్లో షాద్‌నగర్ డివిజన్‌ను, మాదాపూర్ జోన్లో మియాపూర్ డివిజన్లను కొత్తగా చేర్చారు. ప్రస్తుత సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో 12 ట్రాఫిక్ పోలీసుస్టేషన్లు ఉండగా...విభజన నేపథ్యంలో కొత్తగా మరో నాలుగు ట్రాఫిక్ ఠాణాలు ఏర్పాటుచేయనున్నారు. ఈస్ట్ కమిషనరేట్‌లో భువనగిరి, చౌటుప్పల్, వెస్ట్ కమిషనరేట్‌లో షాద్‌నగర్, చేవేళ్ల ట్రాఫిక్ పోలీసు స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. విభజన ప్రభావంతో రెండు కమిషనరేట్లలో వం దల సంఖ్యలో సిబ్బంది అవసరం కానుంది. ఈ మేరకు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.