cyclist
-
కొండ అంచుపై బెదరకుండా!
రోమ్: గతుకుల రోడ్లపై సైకిల్ సవారీ అంటే చాలా మంది భయపడిపోతారు. పడితే మోకాలి చిప్పలు పగలడం ఖాయమని అందరికీ తెలుసు. అలాంటిది అంతెత్తునుంచి పడితే భూమ్మీద నూకలు చెల్లిపోవడం ఖాయమని తెల్సి కూడా కొండ అంచుపై సైకిల్ తొక్కి ఈ సైక్లిస్ట్ తనకు భయం లేదని, సాహసమే తన ఊపిరి అని చాటాడు. ఇంత ఎత్తులో సైకిల్ తొక్కుతుంటే తొక్కే వారికే చెమటలు పడతాయిగానీ ఈ వీడియో చూసిన వారికి ముచ్చెమటలు పట్టడం ఖాయమని చాలా మంది నెటిజన్లు వ్యాఖ్యానాలు చేశారు. ధైర్యంగా, దిలాసాగా శిఖరాగ్రంపై సైకిల్ మీద దూసుకెళ్తున్న ఈ పర్వతారోహణ సైక్లిస్ట్ పేరు మాక్రో బసాట్. ఇటలీలోని ప్రఖ్యాత డోలమైట్ పర్వతాలపై తాను చేసిన సైకిల్ సవారీని ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్చేశాడు. ‘‘తప్పులకు తావు లేదు. ఆనందంతో నా హృదయం జ్వలిస్తోంది. ఆనంద అడ్రినలిన్ హార్మోన్‌తో మైమరిచిపోయా. ఇలా చేయడం నాకెంతో ఇష్టం’అంటూ వీడియోకు క్యాప్షన్‌ను జతచేశాడు. వీడియో చూస్తున్నంతసేపు ‘‘అరెరే.. పట్టుతప్పి పడిపోతాడేమో’’అని మనసులో అనుకోవడం ఖాయం. View this post on Instagram A post shared by Marco Bassot (@marcobassot) ఈ వీడియోను ఆన్లైన్లో ఏకంగా 16.8 కోట్ల మంది వీక్షించడం విశేషం. ఈయనను పొగుడుతూ చాలా మంది కామెంట్లు పెట్టారు. ‘‘వీడియో చూసిన ఐదు సార్లూ షాక్‌కు గురయ్యా’, ‘చావంటే ఇతనికి భయం లేదనుకుంటా. చావుకు కూడా ఇతనంటే భయమేమో. అందుకే అది ఇతని దరి చేరట్లేదు’, ‘ఇదైతే కృత్రిమ మేథతో సృష్టించిన వీడియో కాదుకదా!’, ‘వీడియో చూస్తున్నంతసేపు నా బీపీ పోటెత్తింది’, ‘51 కోట్ల చదరపు కిలోమీటర్ల భూమిని వదిలేసి తమ్ముడు స్వర్గంలో విహారానికి బయల్దేరాడు’, ‘మాటల్లేవ్’అంటూ ఎవరికి నచి్చనట్లు వాళ్లు కామెంట్లు చేశారు. -
దేశం మారనున్న పారిస్ ఒలింపిక్స్ మూడు పతకాల విజేత
మెల్బోర్న్: విశ్వక్రీడల్లో మూడు పతకాలు సాధించిన ఓ అథ్లెట్... వారం రోజుల వ్యవధిలో దేశం మారాలని నిర్ణయించుకొని అభిమానులకు షాక్ ఇచ్చాడు. పారిస్ ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియా తరఫున బరిలోకి దిగి అద్వితీయ ప్రదర్శనతో మూడు పతకాలు సాధించిన ట్రాక్ సైక్లిస్ట్ మాథ్యూ రిచర్డ్సన్.. అనూహ్య నిర్ణయంతో అభిమానులను విస్మయ పరిచాడు. ఇకపై ఆ్రస్టేలియాకు ప్రాతినిధ్యం వహించబోనని తాను పుట్టి పెరిగిన బ్రిటన్ తరఫున బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నాడు. ‘పారిస్’ క్రీడల్లో రిచర్డ్సన్ రెండు వ్యక్తిగత రజతాలు, ఒక టీమ్ కాంస్యం గెలుచుకున్నాడు. 25 ఏళ్ల రిచర్డ్సన్ తొమ్మిదేళ్ల ప్రాయంలోనే ఆ్రస్టేలియాకు వలస వచ్చాడు. ‘మాథ్యూ నిర్ణయం అనూహ్యం. చాలా వేదనకు గురయ్యాం. అయితే అతడు మాతృదేశానికి ప్రాతినిధ్యం వహించాలని తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం’ అని ఆ్రస్టేలియా సైక్లింగ్ సమాఖ్య మేనేజర్ జెస్ కోర్ఫ్ తెలిపాడు. ఇదేదో ఒక్క రోజులో తీసుకున్న నిర్ణయం కాదని.. బాగా ఆలోచించి తీసుకున్నదని రిచర్డ్సన్ పేర్కొన్నాడు. ‘ఆస్ట్రేలియాపై గౌరవం ఉంది. అయినా ఇది అనాలోచిత నిర్ణయం కాదు. ఇకపై బ్రిటన్ తరఫున పోటీ పడాలనుకుంటున్నా’ అని రిచర్డ్సన్ పేర్కొన్నాడు. మరోవైపు బ్రిటన్ సైక్లింగ్ సమాఖ్య సోషల్ మీడియా వేదికగా రిచర్డ్సన్కు స్వాగతం పలికింది. -
సైక్లింగ్ సుబ్బయ్య.. 57ఏళ్ల వయస్సులో వెయ్యి సెంచరీలు
గుంటూరు వెస్ట్ ( క్రీడలు) : వయసు పెరుగుతున్నా సెంచరీలు కొట్టే వయసు నాది అంటూ సైక్లింగ్‌లో సత్తాచాటుతున్నారు గుంటూరుకు చెందిన వెటరన్ క్రీడాకారుడు బండ్లమూడి సుబ్బయ్య. కఠోర సాధనతో సైక్లింగ్‌లో వెయ్యి సెంచరీలు(వంద కిలోమీటర్లు ఓ సెంచరీ) పూర్తిచేసి అందరినీ ఔరా అనిపించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఘనత సాధించిన ఏకైక వ్యక్తిగా నిలిచారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు ప్రారభమయ్యే ఆయన సైకిల్ ప్రయాణం దాదాపుగా 8.30 గంటలకు పూర్తవుతుంది. సైక్లింగ్‌తోపాటు యోగా, స్విమ్మింగ్ల్లోనూ రాణిస్తున్నారు.సరదాగా ప్రారంభమై..తొలి నాళ్లలో స్విమ్మింగ్ సాధన చేసిన సుబ్బయ్యకు కరోనా సమయంలో సైక్లింగ్‌పై మక్కువ పెరిగింది. స్నేహితులతో ప్రారంభమైన సైకిల్ సవారీ ఇప్పుడు ఆయనను లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ దిశగా తీసుకెళుతుంది. ఈయన నగరంలోని కొందరు వైద్యులతో కలిసి సైక్లింగ్ క్లబ్స్ ప్రారంభించారు. ప్రజలను సైక్లింగ్ చేసేలా ప్రోత్సహిస్తున్నారు.మల్టీ ట్యాలెంట్జాతీయ స్థాయిలో స్ట్రావా అనే యాప్ ఉంది. సైక్లిస్ట్‌లు దాన్లో తమ వివరాలు నమోదు చేసుకుంటే వారు సైక్లింగ్ చేసే స్పీడ్‌తోపాటు ఎన్ని కిలోమీటర్లు ఎంత సమయంలో పూర్తి చేశారనే వివరాలు నమోదు చేస్తుంది. సుబ్బయ్య ఇటీవల 1,000 సెంచరీలతోపాటు సుమారు 1.35 లక్షల కిలోమీటర్లు దూరం పూర్తి చేశారు. రోజూ ఉదయం 100 కి.మీ. నాన్ స్టాప్‌గా సైకిల్ తొక్కుతారు. ఇదొక రికార్డనే చెప్పాలి. జాతీయ స్థాయిలో జరిగే సైక్లింగ్ చాలెంజ్ పోటీల్లో సుబ్బయ్య విజయాలు సాధించారు. సుబ్బయ్య స్విమ్మింగ్‌లో మాస్టర్స్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో 30కుపైగా కాంస్య, రజత, బంగారు పతకాలతోపాటు మరో 3 జాతీయ స్థాయి పతకాలు సాధించారు. కృష్ణా నదిలో 1.5 కి.మీ.లను నాలుగుసార్లు ఈది బహుమతులు సాధించారు. యోగాసనాలతో మంత్రముగ్దుల్ని చేస్తారు. సుబ్బయ్యకు 57 సంవత్సరాలు. ఇటీవల ఆయన కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 3,700 కిలోమీటర్లు సైక్లింగ్‌ను స్నేహితులతో కలిసి పూర్తి చేశారు.ఆరోగ్యం కోసం ఏదైనా చేయండిసంపాదనలో పడి చాలా మంది ఆరోగ్యంపై కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదు. అందుకే కరోనా సమయంలో విపరీతమైన ప్రాణనష్టం జరిగింది. ఆ సమయంలో నా సన్నిహితులనూ కోల్పోయాను. ప్రజలకు అవగాహన కలి్పంచాలంటే ముందుగా నేను ఆచరించాలి. అందుకే సైక్లింగ్, స్విమ్మింగ్, యోగాల్లో ప్రావీణ్యం పొందాను. ఎవరికి నచ్చిన క్రీడలో వారు సాధన చేస్తే మంచిది. రానున్న నవంబర్‌లో గోల్డెన్ క్వార్డిలేటర్ చెన్నై– కోల్‌కతా–ఢిల్లీ–ముంబై ఈ నాలుగు ప్రధాన నగరాలను కలుపుకుంటూ సుమారు 6,000 కి.మీ. మేర సైక్లింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయడమే లక్ష్యంగా సాధన చేస్తున్నాను. – బండ్లమూడి సుబ్బయ్య, సైక్లిస్ట్, గుంటూరు -
16 రోజుల్లో యూరప్ చుట్టేశాడు!..అదికూడా కేవలం..
ఫొటోలో కనిపిస్తున్న ఈ సైకిల్ వీరుడి పేరు లే టిమిస్. ఇతగాడు సైకిల్ మీదనే యూరోప్ దేశాలన్నింటినీ చుట్టేశాడు. పోర్చుగల్‌లోని కాబో ద రోకా నుంచి టిమిస్ తన సాహసయాత్రను ప్రారంభించి, రష్యాలోని సైబీరియా అంచుల్లో ఉన్న ఉఫా రైల్వేస్టేషన్ వద్ద ముగించాడు. ఈ యాత్రను అతడు 16 రోజుల 10 గంటల 45 నిమిషాల్లోనే ముగించారు. ఈ యాత్రలో అతడు ప్రయాణించిన దూరం 6,366 కిలోమీటర్లు. దీంతో అతడు అత్యంత వేగంగా యూరోప్యాత్ర పూర్తిచేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. మొత్తం పది దేశాల మీదుగా అతడు తన యాత్ర సాగించాడు. పోర్చుగల్ నుంచి యాత్ర మొదలుపెట్టి, స్పెయిన్, ఫ్రాన్స్, బెల్జియం, నెదర్లాండ్స్, జర్మనీ, పోలండ్, లిథువేనియా, లాట్వియాల మీదుగా రష్యాకు చేరుకున్నాడు. రోజుకు సగటున 386 కిలోమీటర్ల చొప్పున, గంటకు సగటున 30 కిలోమీటర్ల వేగంతో ఈ సాహసయాత్రను విజయవంతంగా పూర్తిచేశాడు. సైక్లింగ్‌పై అమిత ఇష్టం గల టిమిస్ ఇదివరకు ఏడేళ్లపాటు వివిధ దేశాలను సైకిల్ మీదే చుట్టేశాడు. ఇటీవల యూరోప్ సైకిల్‌యాత్రను అనితరసాధ్యమైన వేగంతో అతి తక్కువ వ్యవధిలోనే పూర్తిచేయడంతో వార్తల్లోకెక్కాడు. (చదవండి: ఈ ఫోటోలో ఉన్నది కేకు అనుకుంటున్నారా? తెలిస్తే షాకవ్వుతారు!) -
నిహారిక.. సైక్లిస్ట్ శిఖరం
అనంతపురం: రేస్ అంటే బైక్, కారు మాత్రమే కాదు.. సైక్లింగ్ చేయడం కూడా సాహసమే.. కొందరు సైకిల్ తొక్కడం సరదాగా నేర్చుకుంటే.. మరికొందరు సాహసం చేయడానికి వెనుకాడడంలేదు. అందులో గార్లదిన్నె మండలం తిమ్మంపేటకు చెందిన నిహారిక సాహసోపేత సైక్లింగ్ చేస్తూ పర్వతాలపైకి కూడా దూసుకెళ్తోంది. చిన్నతనం నుంచి ఆమెకు సైక్లింగ్‌పై ఆసక్తి ఉంది.. తల్లిదండ్రులు కూడా ఆమెను నిరుత్సాహపరచకుండా ప్రోత్సహించి, శిక్షణ ఇప్పించారు. ఆ స్ఫూర్తితో ముంబాయిలో సరదాగా సైక్లింగ్ నేర్చుకుని, దగ్రేట్ హిమాలయన్ అల్ట్రా రేస్‌ను పూర్తి చేసింది. 2020లో గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించి, కన్నవారితోపాటు తెలుగువారి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో చాటుతోంది. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం తిమ్మంపేటకు చెందిన భాస్కర్‌రెడ్డి, వాణి రెడ్డి దంపతులు 2005లో ముంబాయిలో వ్యాపారం చేయడానికి వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. వీరికి నిహారిక రెడ్డి, లలిత్ సంతానం. కుమార్తె నిహారిక రెడ్డి చిన్నతనం నుంచి సైక్లింగ్‌పై ఆసక్తి పెంచుకోవడంతో తల్లిదండ్రులు కూడా ఆమె ను వెన్నుతట్టి ప్రోత్సహించారు. దీంతో సైక్లింగ్ రేస్ అంటే సాహసోపేతమైనా అందులో తర్ఫీదు పొందింది. నిహారిక రెడ్డి ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ముంబాయిలోనే చదివింది. ప్రస్తుతం అక్కడే ఢిల్లీ వరల్డ్ పబ్లిక్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం (ఎంపీసీ) చదువుతోంది. చిన్నతనంలో ఎలాంటి అనుభవం లేక పోయినా దాదాపు 700 కిలో మీటర్లు సైక్లింగ్ చేసి, అందరినీ ఆశ్చర్యపరిచింది. మొదటగా 2020లో అండర్ – 15 లో ముంబాయి – హైదరాబాద్ 656 కిలో మీటర్లు సైక్లింగ్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించింది. ఆర్ఏఎంకు అర్హత.. నిహారికరెడ్డి 2022లో అండర్– 16 పుణె టు గోవా సైక్లింగ్ రేస్‌లో పాల్గొని, 652 కిలోమీటర్లు విజయవంతంగా పూర్తి చేసింది. కోచ్ కబీర్ డెక్కన్, హిమాలయన్, రేస్‌లు పూర్తి చేసి ఆర్ఏఎంకు అర్హత సాధించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, కోచ్ కబీర్ స్ఫూర్తితో ఆమె రోజూ 50 కిలో మీటర్లు సైక్లింగ్ చేస్తూ ఫిట్నెస్ను కాపాడుకుంటూ వస్తోంది. ఈ ఏడాది ఆగస్టు 26,27 తేదీల్లో ఇన్స్పైర్ ఇండియా నిర్వహించిన భారత్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మక రేస్ దగ్రేట్ హిమాలయన్ అల్ట్రా రేస్‌లో పాల్గొని, లేహ్ నుంచి ద్రాస్ వరకు మళ్లీ ద్రాస్ నుంచి లేహ్ వరకు మధ్యలో కార్గిల్ వరకు 600 కిలో మీటర్లు 36 గంటల్లో రేస్ పూర్తి చేయాలని లక్ష్యంతో పాల్గొంది. సముద్ర మట్టానికి 10,350 మీటర్లు ఎత్తు లో ఈ రేస్‌ను 39 గంటల్లో పూర్తి చేసి, అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆర్ఏఎం చేయడం లక్ష్యం ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మక రేస్ అక్రాస్ అమెరికా (ఆర్ఏఎం) అల్ట్రా రేస్‌కు అర్హత సాధించి, స్వప్నం సాకారం చేసుకోవడమే లక్ష్యం. అందుకోసం రోజూ ఉదయం 5 గంటల నుంచి 7 వరకు దాదాపు 50 కిలో మీటర్లు సైక్లింగ్ చేస్తా. ఆదివారం దాదాపు 100 నుంచి 120 కిలో మీటర్లు సైక్లింగ్ చేస్తా. ఆర్ఏఎం రేసులో అమెరికా వెస్ట్ కోస్ట్ నుంచి ఈస్ట్ కోస్ట్ వరకు సుమారు 4,500 కిలో మీటర్లు దూరం ఉంటుంది. ఈ రేసులో పాల్గొనాలంటే డెక్కన్, హిమాలయన్ రేస్‌లు పూర్తి చేయాలి. – నిహారిక, సైక్లిస్ట్ -
శెభాష్..ఆశా మాలవీయా..!
సాక్షి, హైదరాబాద్ : మహిళా భద్రతపై యువతలో సానుకూల దృక్పథం కల్పించడంతోపాటు డ్రగ్స్‌కు నో చెప్పండి అంటూ యువతలో సందేశాన్ని వ్యాప్తి చేసేందుకు దేశవ్యాప్తంగా సైకిల్‌యాత్ర చేస్తున్న సైక్లిస్ట్ ఆశా మాలవీయాను డీజీపీ అంజనీకుమార్ అభినందించారు. ఈ మేరకు శుక్రవారం తన చాంబర్లో తెలంగాణ పోలీస్ జ్ఞాపికను అందించి అభినందించారు. ‘మహిళల భద్రత, డ్రగ్స్‌పై సందేశం వ్యాప్తి చేసేందుకు సైకిల్‌పై ఆశా మాల్వియా భారతదేశం మొత్తం యాత్ర చేయడం ఎంతో స్ఫూర్తిదాయకం. ఆమెకు మేమంతా సెల్యూట్ చేస్తున్నాం’అని డీజీపీ అంజనీకుమార్ అన్నారు. కార్యక్రమంలో ట్రైనింగ్ ఐజీ తరుణ్‌జోషి పాల్గొన్నారు. -
24 ఏళ్లపాటు కోమాలోనే.. కన్నుమూసిన సైక్లిస్ట్
క్రీడారంగంలో ఊహించని ఓ విషాదం చోటుచేసుకుంది. 24 ఏళ్ల పాటు కోమాలో ఉండిపోయిన స్పెయిన్ సైక్లిస్ట్ రాల్ గార్సియా అల్వరేజ్ శుక్రవారం కన్నుమూశాడు. అల్వరేజ్ టీనేజ్ వయసులోనే ప్రొఫెషనల్ సైక్లిస్ట్‌గా మారాడు. తన 17 ఏళ్ల వయసులో వెంటా మగుల్లో-బి మెలెరో జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ ఒప్పందమే అతని సైక్లింగ్ కెరీర్‌కు చివరిది కానుందని ఊహించలేదు. స్పెయిన్‌లోని మాడ్రిడ్ వద్ద ఎత్తైన కొండమీద సైక్లింగ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. గంటకు 50మీటర్ల వేగంతో తన టీమ్‌తో కలిసి సైక్లింగ్ చేశాడు. ఈ దశలో సైకిల్ పట్టుతప్పడంతో ఐదు మీటర్ల లోతులోకి పడిపోయాడు. తలకు తీవ్రమైన గాయం కావడంతో పాటు చాతికి, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. అల్వరేజ్‌ను ఎయిర్‌లిఫ్ట్ చేసి మాడ్రిడ్‌లోని ఒక ఆసుపత్రికి తరలించారు. దాదాపు నాలుగున్నర గంటలు సర్జరీ నిర్వహించి అతన్ని కాపాడినప్పటికి శాశ్వత కోమాలోకి వెళ్లినట్లు వైద్యులు పేర్కొన్నారు. కొన్నేళ్ల పాటు ఆసుపత్రి బెడ్‌పైనే ఉండిపోయిన గార్సియాలో కదలిక లేకపోవడంతో కుటుంబసభ్యులు ఇంటికి తీసుకువచ్చారు. అయితే అల్వరేజ్పై ఉన్న ప్రేమతో అతన్ని కంటికి రెప్పలా చూసుకున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా అల్వరేజ్ తల్లి అతనికి సేవలందించింది. అలా 24 ఏళ్ల పాటు కోమాలో ఉండిపోయిన అల్వరేజ్ తాజాగా 42 ఏళ్ల వయసులో శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు. చదవండి: Alexander Zverev: టెన్నిస్ స్టార్‌కు వింత అనుభవం.. -
సైకిల్‌ను ఢీకొట్టి కిలోమీటర్ ఈడ్చుకెళ్లిన కారు.. ఎంత అరిచినా..!
లఖ్‌నవూ: దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో అంజలి సింగ్ అనే యువతిని ఓ కారు ఢీకొట్టి 13 కిలోమీటర్లు లాక్కెళ్లిన ఘటన తరహాలోనే ఉత్తర్‌ప్రదేశ్‌లోని హర్దోయ్ ప్రాంతంలో జరిగింది. సైకిల్‌పై వెళ్తున్న ఓ విద్యార్థిని ఢీకొట్టిన కారు సుమారు కిలోమీటర్ ఈడ్చుకెళ్లింది. కారును ఆపాలని స్థానికులు ఎంత అరిచినా అలాగే వేగంగా దూసుకెళ్లాడు డ్రైవర్. ప్రస్తుతం ఈ ఘటన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. కొత్వాలి నగర పరిధికి చెందిన కేతన్ అనే విద్యార్థి కోచింగ్ సెంటర్‌కు వెళ్లేందుకు సైకిల్‌పై బయలుదేరాడు. కొద్ది దూరం వెళ్లిన క్రమంలో కారు వెనకనుంచి ఢీకొట్టింది. దీంతో అతడి కాలు కారు వెనకాల బంపర్‌లో చిక్కుకుపోయింది. అలాగే సుమారు కిలోమీటర్ వరకు ఈడ్చుకెళ్లాడు కారు డ్రైవర్. కేతన్‌ను గమనించిన స్థానికులు కారును ఆపేందుకు పెద్దగా అరస్తూ వెంట పరిగెత్తారు. కిలోమీటర్ వెళ్లాక ఆపడంతో డ్రైవర్‌ను బయటకి లాగి చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికులను చెదరగొట్టి డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. బాధితుడిని స్థానిక వైద్య కళాశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. #Hardoi में सड़क पर साइकिल सवार छात्र को घसीटते हुए ले गई कार @Manchh_Official pic.twitter.com/6jkBTuGkOS — पत्रकार Rishabh Kant (@KantChhabra) January 7, 2023 ఇదీ చదవండి: యువతిని ఈడ్చుకెళ్లిన ఘటనలో మరో ట్విస్ట్.. గొడవ పడ్డ అంజలి, నిధి -
ఛాంపియన్ అవ్వాలని వచ్చింది.. అనుమానాస్పద మృతి
కేరళకు చెందిన పదేళ్ల చిన్నారి ఫాతిమా నైదా షిహాబుద్దీన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. జాతీయ సైక్లింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు వచ్చిన ఆమె ఛాంపియన్‌గా నిలవాలన్న తన కోరిక తీరకుండానే మృతి చెందడం విషాదం నింపింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ వేదికగా జాతీయ సైక్లింగ్ పోలో చాంపియన్‌షిప్ శుక్రవారం నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. ఈ పోటీల్లో పాల్గొనడానికి ఫాతిమా బుధవారం నాగ్‌పూర్‌కు చేరుకుంది. అయితే గత రెండు రోజుల నుంచి విరేచనాలతో ఇబ్బంది పడుతున్న ఫాతిమా గురువారం ఉదయం అస్వస్థతకు గురైంది. దీంతో నిర్వాహకులు ఆమెను దంతోలిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. చిన్నారిని పరీక్షించిన వైద్యులు ఎం-సెట్ అనే ఇంజెక్షన్ చేశారు. ఆ తర్వాత కాసేపటికే ఆమె కుప్పకూలి అక్కడికక్కడే మరణించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫాతిమా చనిపోవడానికి వైద్యులు చేసిన ఇంజెక్షన్ కారణమా లేక వేరే ఏదైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. అయితే జాతీయ సైక్లింగ్ పోటీల్లో పాల్గొని ఛాంపియన్‌గా నిలవాలనుకున్న 10 ఏళ్ల ఫాతిమా ఇలా అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం అందరిని కలిచివేసింది. కూతురి మరణవార్త తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. -
కామన్వెల్త్లో అపశ్రుతి.. తీవ్రంగా గాయపడ్డ భారత సైక్లిస్ట్
బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. పోటీల్లో పాల్గొన్న భారత్ మహిళా సైక్లిస్ట్ మీనాక్షి తీవ్రంగా గాయపడింది. విషయంలోకి వెళితే.. గేమ్స్‌లో భాగంగా సోమవారం సైక్లింగ్‌లో 10కి.మీ స్క్రాచ్ రేసు జరిగింది. ఈ పోటీల్లో భారత్ నుంచి మహిళా సైక్లిస్ట్ మీనాక్షి పాల్గొంది. పోటీ ప్రారంభమైన కాసేపటికే ఈ మీనాక్షి సైకిల్‌పై నుంచి జారిపడి ట్రాక్ అంచుకు చేరుకుంది. అదే సమయంలో న్యూజిలాండ్‌కు చెందిన బ్రయోనీ బోథా సైకిల్ వేగంగా మీనాక్షిపై దూసుకెళ్లింది. దీంతో బ్రయోనీ బోథా కూడా సైకిల్‌పై నుంచి కిందకు పడిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని రైడర్‌లిద్దరినీ పోటీ నుంచి తప్పించారు. మీనాక్షిని వెంటనే అక్కడి నుంచి స్ట్రెచర్‌పై తీసుకెళ్లారు. కాగా ఈ ఈవెంట్లో ఇంగ్లండ్‌కు చెందిన లారా కెన్నీ స్వర్ణ పతకం గెలుచుకుంది. కాగా మీనాక్షి ప్రమాదానికి గురైన దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఇదే లీ వ్యాలీవెలో పార్క్ వద్ద ఇది రెండో ప్రమాదం. ఇంగ్లండ్‌కు చెందిన మాట్ వాల్స్ కూడా ఈవెంట్లో సైకిల్‌పై నుంచి పడిపోయాడు. అతనికి కుట్లు పడ్డాయి. అదే సమయంలో కెనడాకు చెందిన సైక్లిస్టులు మాట్ బోస్టాక్, డెరెక్ జి కూడా ఆసుపత్రి పాలయ్యారు. Horrible accident involving Indian cyclist Meenakshi at the Velodrome. Hope she’s ok! #CommonwealthGames #B2022 pic.twitter.com/o0i4CE7M82 — Sahil Oberoi (@SahilOberoi1) August 1, 2022 చదవండి: CWG 2022: కామన్వెల్త్లో భారత్ జోరు.. ఖాతాలో తొమ్మిదో పతకం -
'గదిలోకి పిలిచి తన భార్యగా ఉండాలన్నాడు'
క్రీడలు ఏవైనా లైంగిక వేధింపులు సహజం. పాశ్చాత్య క్రీడల్లో భాగంగా ఉన్న ఇలాంటి వేధింపులు భారత్‌కు పాకాయి. తాజాగా భారత టాప్ మహిళా సైక్లిస్ట్.. భారత సైక్లింగ్ జాతీయ కోచ్ ఆర్కే శర్మపై సంచలన ఆరోపణలు చేసింది. ఆర్కే శర్మ తనను తన గదికి బలవంతంగా లాక్కెళ్లి.. లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)కి ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. విషయంలోకి వెళితే.. స్లోవేనియాలో జరుగుతున్న సైక్లింగ్ పోటీలకు భారత సైక్లింగ్ టీమ్‌లో ఐదురుగు పురుషులు, ఓ మహిళా సైక్లిస్ట్ వెళ్లారు. వాస్తవానికి స్లోవేనియాలో భారత జట్టుకి మహిళా కోచ్‌లు ఎవ్వరూ అందుబాటులో లేరు. దీంతో ఆర్కే శర్మ సదరు మహిళకు కూడా కోచ్‌గా వ్యవహరించారు. ఈ నేపథ్యంలోనే ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. గదిలోకి లాక్కెళ్లి తనకు బార్యగా ఉండాలని పేర్కొంటూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. కాగా భారత జట్టు సైక్లింగ్ పోటీల్లో పాల్గొని జూన్ 14న స్వదేశానికి తిరిగి రావాల్సి ఉంది. అయితే లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఈ టూర్‌ని మధ్యలోనే రద్దు చేసుకుని, వెనక్కి రావాల్సిందిగా సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛైర్మెన్ ఓంకార్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు ఈ ఘటనపై స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, సీఎఫ్ఐ కలిసి రెండు ప్యానెల్స్‌తో విచారణ నిర్వహిస్తున్నాయి. ‘అథ్లెట్ ఫిర్యాదును స్వీకరించిన వెంటనే ఆమె భద్రత దృష్ట్యా, సైక్లింగ్ బృందాన్ని స్వదేశానికి రప్పించడం జరిగింది. కమిటీ ఈ విషయంపై పూర్తి విచారణ చేయనుంది. అతి త్వరలో నిజాలను నిగ్గు తేల్చి, బాధితురాలికి న్యాయం చేస్తాం.’ అని సాయ్ అధికారులు తెలిపారు. లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్కే శర్మ ఇప్పటిదాకా స్వదేశానికి చేరుకోలేదు. త్వరలోనే అతన్ని స్లోవేనియా నుంచి స్వదేశానికి రప్పించి, నోటీసులు జారీ చేస్తామని అధికారులు వెల్లడించారు. చదవండి: మెస్సీకి వీరాభిమాని.. రెచ్చగొట్టే ఫోటోలతో చేతులు కాల్చుకుంది Tiger Woods: వేల కోట్లు వద్దనుకున్నాడు.. బిలీనియర్ అయ్యే చాన్స్ మిస్ -
సైకిల్ రైడర్లపై ఘోరంగా దాడి చేసిన ఎద్దు!: వైరల్ వీడియో
Cyclist Tossed In The Air By Raging Bull: ఇంతవరకు ఎద్దు దాడికి సంబంధించిన వీడియోలను చూశాం. సాధారణంగా ఎద్దు దాడి చేయదు. తన దారికి అడ్డు వచ్చినప్పుడో లేక మరే ఏ ఇతర కారణాల వల్లనే ఒక్కోసారి చాలా భయంకరంగా దాడి చేస్తుంది. అచ్చం అలానే ఒక సైకిల్ రైడర్ పై ఎద్దు ఘెరంగా దాడి చేసింది. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. అసలు విషయంలోకెళ్తే...అమెరికాలోని కాలిఫోర్నియాలో రేస్‌లో పాల్గొంటున్న సైక్లిల్ రైడర్ల పై ఎద్దు దాడి చేసింది. ముగ్గురు వ్యక్తులు సైకిల్ రేసింగ్ చేస్తుండగా ఒక ఎద్దు అనుహ్యంగా ఒక సైకిల్ రైడర్ పై దారుణంగా దాడి చేసింది. ఆ వ్యక్తిని అమాత్తంగా గాల్లోకి ఎత్తిపడేసింది. అక్కడ ఉన్న మిగతా వాళ్ల పై కూడా దాడి చేసేందుకు కూడా యత్నించింది. అదృష్టవశాత్తు వారికి ఏం కాలేదు ముగ్గురు సురక్షితంగానే ఉన్నారు. అయితే వారు రేసింగ్ మొదలు పెట్టినప్పుడు ఎద్దు యజమాని దానిని గడ్డి ఉన్న బీడుభూమి వైపుకి చాలా దూరం తీసుకువెళ్లాడు. అయినప్పటికీ అది తిరిగి వచ్చి మరీ వాటి పై దాడి చేసింది. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మీరు ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by Sam Ames (@therockcobbler) (చదవండి: హైహీల్స్‌తో జంప్ చేసి గిన్నిస్ రికార్డు సాధించిన మహిళ!.. ఫిదా అవుతున్న నెటిజన్లు!) -
సైకిల్ మీద దేశం చుట్టి వస్తే ఎలా ఉంటుంది?
‘లెర్న్ ఫ్రమ్ ది మాసెస్...’ అనే మావో మాట అంకిత్ విన్నాడో లేదో తెలియదుగానీ ఆచరణ లో అలాగే చేశాడు. ‘నువ్వు చదవాలనుకుంటే ఈ ప్రపంచమే ఒక పుస్తకం. నువ్వు నేర్చుకోవాలనుకుంటే ఈ ప్రపంచమే ఒక మహా విశ్వవిద్యాలయం’ అనే మంచి మాట నచ్చి కొత్త బాట పట్టాడు... ప్రపంచం సంగతి సరే, ముందు దేశాన్ని చుట్టిరావాలని, ప్రజల దగ్గర ఏదో ఒకటి నేర్చుకోవాలనే బలమైన కోరిక జైపూర్ (రాజస్థాన్) కు చెందిన అంకిత్ అరోరాకు కలిగింది. అలా అని విమానం ఎక్కే ఆర్థిక పరిస్థితి తనకు లేదు. ఎదురుగా సైకిల్ కనిపించింది. ‘అవును. సైకిల్ మీద దేశం చుట్టి వస్తే ఎలా ఉంటుంది?’ అనే ఆలోచన వచ్చింది. ‘చాలా కష్టమేమో’ అన్నది తనలోని మరో వెర్షన్. ‘కాలినడకన దేశాలు తిరిగే వాళ్లు ఉన్నారు. సైకిల్‌పై వెళ్లడం అసాధ్యమేమీ కాదు’ అని తనకు తాను చెప్పుకున్నాడు. అతడు బయలుదేరాడు.... నాలుగు సంవత్సరాల పాటు సాగిన తన యాత్రలో ఎన్నో రాష్ట్రాలు, ఎన్నో పట్టణాలు, ఎన్నో పల్లెలు చూశాడు. మహారాష్ట్రలో దారుశిల్పాలు, తంజావూరులో ఆదివాసి కళలు, తమిళనాడులో సంగీతవాద్య పరికరాల తయారీ... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రాష్ట్రాలలో ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. ఇప్పుడంటే సేంద్రియ వ్యవసాయం గురించి ఘనంగా చెప్పుకుంటున్నాంగానీ, దేశంలోని ఎన్నో ప్రాంతాల్లో చా...లా ఏళ్ల క్రితమే ఈ ఆదర్శనీయ వ్యవసాయ విధానం అమలులో ఉంది. వాటిని దగ్గరగా గమనించిన అంకిత్ ఇతర ప్రాంతాలకు ప్రయాణమైనప్పుడు, వ్యవసాయక్షేత్రాలకు వెళ్లి ఆ విషయాలను చెప్పేవాడు. ‘మీరు మాత్రం ఇలా ఎందుకు చేయకూడదు’ అనేవాడు. ఉత్తమ వ్యవసాయ విధానాలు, చెట్లు, నీటిసంరక్షణ... ఇలా తాను తెలుసుకున్న ఎన్నో విషయాలను ప్రచారం చేస్తూ వెళ్లాడు. (చదవండి: సేంద్రియ కర్బనమే పంటకు ప్రాణం!) ‘నువ్వు సర్కార్ తరపున వచ్చావా? నీకు జీతం ఎంత ఇస్తారు?’ ఇలాంటి ప్రశ్నలెన్నో అడిగే వాళ్లు రైతులు. ‘లేదు’ అనే మాట వారిని ఆశ్చర్యానికి గురి చేసేది. కళ్లతోనే అభినందించి, ఆదరించి తిండి పెట్టేవారు. కొందరు ఎంతో కొంత డబ్బు చేతిలో పెట్టేవారు. అయితే కొన్ని ప్రాంతాలలో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. శ్రీనగర్‌లో తనను దొంగగా అనుమానించారు. మరోచోట స్మగ్లర్ అనుకొని వెంబడించారు. అయితే అది కొద్దిసేపు. నిజం తెలుసుకున్నాక అనుమానించినవారే హృదయపూర్వకంగా అభినందించారు. ప్రఖ్యాత కవి విలియమ్ బట్లర్ ఈట్స్ ‘ది లేక్ అయాల్ ఆఫ్ ఇన్నిస్‌ఫ్రీ’ కవితలో కనిపించే ఆదర్శ, ప్రశాంత, కళాత్మక వ్యవసాయక్షేత్రం ఒకటి ప్రారంభించాలనేది తన కల. బెంగళూరుకు చెందిన శ్రీదేవి, అంకిత్ ఊహలకు రెక్కలు ఇచ్చారు. క్రిష్టగిరి దగ్గర శ్రీదేవి కుటుంబ సహాయ సహకారాలతో ‘ఇన్నిస్ ఫ్రీ’ వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు చేశాడు. రసాయనాలు ఉపయోగించకుండా కూరగాయలు ఎలా పండించాలి? ఎకో–టాయిలెట్స్ ఎలా నిర్మించుకోవాలి? పశువులకు బలమైన మేత.. ఇలా ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి ఇదొక బడిగా మారింది. (చదవండి: సొరంగంలోకి వెళ్లిన రైలు అదృశ్యం.. ఇప్పటికీ మిస్టరీనే..) తాను తిరగాల్సిన ప్రదేశాలు ఇంకా మిగిలే ఉన్నాయి. అందులో మొదటిది ఈశాన్య ప్రాంతాలు. అక్కడకు వెళ్లాలని, అక్కడ నేర్చుకున్న మంచి విషయాలను ఇతర చోట్ల ప్రచారం చేయాలనుకుంటున్నాడు అంకిత్. అంకితభావం ఉన్నవారి కలలు నెరవేరడానికి అట్టే సమయం పట్టదు కదా! -
Sabita Mahato and Shruti Rawat: కూతురి కోసం సందేశం..
సైకిల్ తొక్కుతూ దేశమంతా తిరుగుతూ ‘కూతుళ్లను రక్షించండి, వారిని చదివించండి’ అనే సందేశం ఇవ్వడానికి మూడేళ్ల క్రితమే ఈ సోలో సైకిలిస్ట్ దేశమంతా పర్యటించింది. 173 రోజుల్లో 12,500 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణించి 29 రాష్ట్రాలను చుట్టి వచ్చింది. రాబోయే సంవత్సరం ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి, తన సందేశాన్ని శిఖరాగ్రాన ఉంచాలనుకుంది 24 ఏళ్ల సబితా మహతో. బీహార్ వాసి అయిన సబిత మూడేళ్ల క్రితం తన మొదటి యాత్రను జమ్మూ కాశ్మీర్ నుండి ప్రారంభించి, దక్షిణాన కేరళ, తమిళనాడులను చేరుకుని, అటు తర్వాత ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లింది. చివరకు సిక్కిం మీదుగా పాట్నా చేరుకుంది. దారిలో అన్ని ప్రదేశాలలోనూ ఒక రోజు విశ్రాంతి తీసుకుంటూ సైకిల్‌పై 12 వేల 500 కిలోమీటర్లకు పైగా ప్రయాణించింది. గత ఫిబ్రవరిలో మరో సైకిలిస్ట్ శ్రుతి రావత్‌తో కలిసి 85 రోజుల్లో 5,800 కిలోమీటర్లు నేపాల్ మీదుగా హిమాలయన్ సైక్లింగ్ టూర్‌ను ప్రారంభించిన సబిత ఈ పర్యటననూ దిగ్విజయంగా పూర్తిచేసింది. లింగ సమానత్వం, పర్యావరణం గురించి పాఠశాల విద్యార్థులతో చర్చించాలనే ఆశయంతో ఇప్పటికీ తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంది. అడగడుగునా ఆహ్వానాలు.. సబిత తన ప్రయాణ అనుభవాల గురించి వివరిస్తూ ‘అడవి గుండా వెళుతున్నప్పుడు కూడా నా నినాదాన్ని వదిలిపెట్టలేదు. ‘కూతురుని రక్షించండి. చదివించండి.’ అనే సందేశాన్ని ప్రజలకు ఇస్తూ ఉన్నాను. వెళ్లిన ప్రతి చోటా ఆ ప్రాంతవాసుల ఆదరాభిమానాలు పొందాను. సైకిల్ ప్రయాణంలో నేను బీహార్ వాసినని తెలిసి ప్రజలు ఆశ్చర్యపోయారు. శ్రుతి రావత్‌తో కలిసి చేసిన పర్యటనలో ఇవే అనుభవాలను చవిచూశాను. ఎక్కడకెళ్లినా, అక్కడి ప్రజలు నన్ను ఆదరించిన తీరు మాత్రం మర్చిపోలేను.’ అని తన పర్యటన విశేషాలు సంతోషంగా తెలియజేస్తుంది. పేదరికంలో పెరిగినా.. సబిత మత్స్యకారుల కుటుంబంలో పుట్టింది. పేదరికంలోనూ పెద్ద కలలు కనేది. తనకు చిన్నతనంలోనే పెళ్లి చేయబోతే నిరోధించింది, షార్ట్స్ వేసుకొని సైకిల్ తొక్కుతూ తిరిగేది. దీంతో తండ్రి ఆమెను ఎప్పుడూ ‘జనం ఏమనుకుంటారు’ అని అంటూ వెనకడుగు వేసేలా చేసేశాడు. కానీ, అవేమీ పట్టించుకోలేదు సబిత. స్కూల్లో ఉన్న ఇతర అమ్మాయిల బాల్యవివాహాలనూ అడ్డుకుంది. ‘కూతుళ్లను చదివించండి..’ అనే నినాదంతో సబిత మొదలుపెట్టిన సైకిల్ ప్రయాణానికి పాఠశాల యాజమాన్యం కూడా సాయం చేసింది. భూమికి ఏడున్నరవేల మీటర్ల ఎత్తులో ఉండే హిమాలయాల్లోని సంతోపత్ పర్వతంపై సబిత త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసింది. ‘నిరంతరం నా ప్రయాణం అమ్మాయిల్లో అవగాహన పెంచడం కోసమే’ అంటుంది సబిత. శ్రుతి రావత్‌తో కలిసి.. డార్జిలింగ్‌లో ఉండే శ్రుతి రావత్ ఈ యేడాదే డిగ్రీ పూర్తి చేసింది. సైకిల్ రైడింగ్ అంటే తనకు చాలా ఇష్టం. సైకిల్ రైడర్స్ గురించి తెలుసుకున్నప్పుడు సబిత పరిచయమై, ఆమె తన యాత్ర గురించి చెప్పినప్పుడు ఈ పర్యటనలో పాల్గొనాలన్న ఆలోచన తనకూ కలిగింది. ‘‘మొదట్లో నేను ఎక్కువ దూరం సోలోగా ప్రయాణించలేదు. క్రీడాకారిణిని కూడా కాదు. రోజూ ఏడు గంటలు సైకిల్‌పై ప్రయాణం చేయడం అప్పట్లో కష్టంగా అనిపించేది. కానీ, సబిత ఇచ్చిన శిక్షణ నాలో ఉత్సాహాన్ని నింపింది. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభించే సైకిల్ యాత్ర చీకటి పడటంతో ముగుస్తుంది. బీహార్ నుంచి ఇతర రాష్ట్రాల మీదుగా ఉత్తరాఖండ్ అటు నుంచి ట్రాన్స్ హిమాలయాల ప్రయాణం ఎంతో అద్భుతంగా సాగింది. మా ప్రయాణంలో ముందే భోజన, వసతి సదుపాయాల ప్లానింగ్ కూడా ఉండేది. దాంతో ఎటువంటి ఇబ్బందీ ఉండేది కాదు. ఇంట్లో కూర్చుంటే బయటి ప్రపంచం అంతా అమ్మాయిలకు రక్షణ లేనిదిగానే ఉంటుంది. కానీ, బయటకు వచ్చి చూస్తే ఎంతో అద్భుత ప్రపంచం కనిపిస్తుంది’’ అని తమ యాత్రానుభవాలను పంచుకుంది శ్రుతి. -
ఉవ్వెత్తున ఎగసి... ఉసూరుమని కూలి...
అది 1999 సంవత్సరం... ప్రతిష్టాత్మక ‘టూర్ డి ఫ్రాన్స్’ సైక్లింగ్ రేసు పోటీలు జరుగుతున్నాయి. అందరి దృష్టి అమెరికాకు చెందిన లాన్స్ ఆర్మ్‌స్ట్రాంగ్‌పై నిలిచింది. అలా ఆకర్షించేందుకు అతనేమీ స్టార్ కాదు. అప్పటికే కొన్ని చెప్పుకోదగ్గ ఈవెంట్స్ గెలిచినా... దీంతో పోలిస్తే వాటి స్థాయి చిన్నదే. కానీ ఆర్మ్‌స్ట్రాంగ్ మూడేళ్ల క్రితం క్యాన్సర్‌తో ఆటకు దూరమయ్యాడు. ఆ మహమ్మారితో పోరాడి గెలిచిన తర్వాత ఇప్పుడు మళ్లీ బరిలోకి దిగుతున్నాడు. అభిమానమో, సానుభూతో కానీ చాలా మంది అతనికి మద్దతుగా నిలిచారు. అద్భుత ప్రదర్శనతో టైటిల్ గెలుచుకున్న ఆర్మ్‌స్ట్రాంగ్ అదే జోరును మరో ఆరేళ్లు కొనసాగించి చరిత్ర సృష్టించాడు. కానీ ఇదంతా డ్రగ్స్ పవర్ అని తెలిసిన రోజున ప్రపంచం నివ్వెరపోయింది. ఒక హీరో అందరి దృష్టిలో విలన్‌గా మారిపోయాడు. చిన్నప్పుడు స్విమ్మర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆర్మ్‌స్ట్రాంగ్ టీనేజీలో ట్రయాథ్లెట్గా కెరీర్‌పై దృష్టి పెట్టాడు. ఆ తర్వాత ప్రొఫెషనల్ సైక్లిస్ట్‌గా మారిన అతను ఈ క్రమంలో కొన్ని విజయాలు సాధించాడు. ‘థ్రిఫ్ట్ ట్రిపుల్ క్రౌన్ ఆఫ్ సైక్లింగ్’గా చెప్పుకునే పిట్స్బర్గ్, వర్జీనియా, ఫిలడెల్ఫియా కూడా ఉన్నాయి. ‘టూర్ డి ఫ్రాన్స్’లో కూడా కొన్ని రేసులు గెలిచినా... తగినంత గుర్తింపేమీ రాలేదు. క్యాన్సర్‌తో పోరు... సైక్లింగ్‌లో అద్భుతమైన కెరీర్‌ను ఆశిస్తున్న దశలో ఆర్మ్‌స్ట్రాంగ్‌పై పిడుగు పడింది. 25 ఏళ్ల వయసులోనే అతనికి ‘టెస్టిక్యులర్ క్యాన్సర్’ ఉన్నట్లు బయటపడింది. దాంతో జీవితంపై ఆశలు ఒక్కసారిగా కుప్పకూలాయి. అప్పటికే శరీరంలోని ఊపిరితిత్తులు, మెదడు, పొత్తికడుపులోకి అది వ్యాపించిందని డాక్టర్లు తేల్చారు. ఇక ‘స్ట్రాంగ్’గా పోరాడాల్సిన సమయం వచ్చేసింది. కేవలం 20 శాతం మాత్రమే బతికే అవకాశాలు ఉన్నాయని చెప్పిన రోజు నుంచి బతుకును మార్చుకునేందుకు అతను విధితో పోరాడాడు. రెండేళ్లకుపైగా అన్ని రకాల పరీక్షలను, చికిత్సలను ఎదుర్కొన్నాడు. చివరకు క్యాన్సర్‌ను జయించాడు. అయితే అది చావు నుంచి మాత్రమే... ఆట మా త్రం కుదరదు అని కొందరు హెచ్చరించారు. కానీ లాన్స్ వదల్లేదు. మళ్లీ సైకిల్ తీసుకొని ట్రాక్‌పైకి బయల్దేరాడు. అద్భుత పురోగమనం... ఇలాంటి స్థితిలో ఒక వైద్యుడి ద్వారా యూఎస్ పోస్టల్ సర్వీస్ జట్టులో చోటు దక్కింది. అదే అతని కెరీర్‌ను మలుపు తిప్పింది. 1998లో ‘టూర్ డి ఫ్రాన్స్’ బరిలోకి దిగినా ఫలితం దక్కలేదు కానీ తర్వాతి ఏడాది అతని జీవితం మలుపు తిరిగింది. 1999లో తొలిసారి అతను ఈ ప్రతిష్టాత్మక రేసులో గెలిచాడు. అది అక్కడితో ముగిసిపోలేదు. అదే జోరు కొనసాగిస్తూ వరుసగా 2000, 2001, 2002, 2003, 2004, 2005లలో కూడా ఆర్మ్‌స్ట్రాంగ్ విజేతగా నిలిచాడు. ఈ క్రమంలో 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో కూడా టైమ్ ట్రయల్ రేస్‌లో కాంస్యం కూడా దక్కింది. ఆ సమయంలో అతను ప్రపంచవ్యాప్తంగా సైక్లింగ్‌కు పర్యాయపదంగా నిలిచాడు. అశేష అభిమానులు, స్పాన్సర్‌షిప్‌లు... ఇలా ఒక్కటేమిటి ఏడేళ్ల పాటు అతను సైక్లింగ్ ప్రపంచాన్ని శాసించాడు. 2005 విజయం తర్వాత అతను ఆటకు గుడ్‌బై చెప్పాడు. అయితే 2008లో పునరాగమనం చేసి కొన్ని రేస్‌లలో పాల్గొన్నా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. డ్రగ్స్‌తో పతనం... ఆర్మ్‌స్ట్రాంగ్ కెరీర్లో డ్రగ్స్ ఆరోపణలు కొత్త కాదు. క్యాన్సర్‌లాంటి వ్యాధి నుంచి కోలుకొని ఈ తరహా విజయాలు సాధించడం అసాధ్యమంటూ చాలాసార్లు అతనిపై విమర్శలు వచ్చినా అతను ప్రతీసారి వాటిని కొట్టిపారేశాడు. అతని సైక్లింగ్ సహచరుడు ఫ్లాయిడ్ లాండిస్ 2012లో చేసిన డోపింగ్ ఆరోపణలు ఆర్మ్‌స్ట్రాంగ్ పరువు తీశాయి. మేమందరం డ్రగ్స్ తీసుకునేవాళ్లమంటూ అతను చెప్పుకోవడంతో బండారం బయటపడింది. పూర్తి స్థాయిలో విచారణ జరిపిన యునైటెడ్ స్టేట్స్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఇవన్నీ నిజమని నిరూపించింది. తాను అమాయకుడిని అంటూనే దీనిపై అప్పీల్ వెళ్లకుండా ఆర్మ్‌స్ట్రాంగ్ మౌనం పాటించడంతోనే సైక్లింగ్ ప్రపం చం నివ్వెరపోయింది. తాజా పరిణామాలతో అతని నేరాన్ని ఒప్పు కున్నట్లుగా భావించి ఆర్మ్‌స్ట్రాంగ్ సాధించిన విజయాలన్నింటినీ లెక్క లోంచి తీసేశారు. వరల్డ్ యాంటీ డోపింగ్ నిబంధనల ప్రకారం అతను గెలిచిన ఏడు ‘టూర్ డి ఫ్రాన్స్’ టైటిల్స్‌ను రద్దు చేశారు. ఒలింపిక్ పతకాన్ని వెనక్కి తీసుకున్నారు. చివరకు అంగీకారం తనపై నిషేధం విధించాక ఏడాదికి ఆర్మ్‌స్ట్రాంగ్ నోరు విప్పాడు. ఇన్నేళ్లపాటు తాను జాగ్రత్తగా, ఒక పద్ధతి ప్రకారం డ్రగ్స్‌ను తీసుకున్నానని, తన విజయాలకు అదే కారణమని అంగీకరించాడు. అసలు డ్రగ్స్ లేకుండా ఏ రేసులోనూ బరిలోకి దిగలేదని బయటపెట్టాడు. దాంతో ఇన్నాళ్లూ అతనికి అండగా నిలిచిన స్పాన్సర్లు, కార్పొరేట్లు తిరగబడ్డారు. ఒక దిగ్గజ ఆటగాడిగా ప్రపంచం దృష్టిలో నిలిచి ఇప్పుడు ఇలా నైతికంగా పతనం కావడం నిజంగా విషాదం. -
టచ్ ఫీలింగ్ లేకుండా బతకడం వేస్ట్!
సాక్షి, న్యూఢిల్లీ : ‘నేను ఎంతో కోల్పోయాను. తిరిగి వాటిని పొందలేనని తెలుసు. నేను ఈ దశలో కూడా ఆనందంగా ఉన్నానంటూ గత ఆరేళ్లుగా నా భార్యను, మిత్రులను మోసం చేస్తూ వచ్చాను. ఎప్పటికైనా కోలుకుంటానని వాగ్దానం చేశాను. ఇక చేయలేను. ఈ బాధను భరించలేను. చేతులు, కాళ్లు, వొల్లంతా కదలనప్పుడు ఎలా బాగుంటాను. కాళ్లు, చేతులు ఆడకపోయినా టచ్ ఫీలింగ్ (స్పర్శ తెలియక పోవడం) లేక పోవడం అత్యంత బాధాకరమైన విషయం. రానురాను నా లోపల అంతర్గత నొప్పులు మొదలయ్యాయి. కడుపులో, వెన్నులో చెప్పలేనంత బాధ పెరుగుతూ వస్తోంది. ఇంతకాలం అన్నింటికి మందులు వాడుతూ బాధను అణచిపెట్టుకొని, అంతా బాగున్నట్లు మీ అందరి ముందు నటిస్తూ వచ్చాను. ఇక బాధ తట్టుకోలేక అత్మహత్య చేసుకోవాలనుకున్నాను. అందుకోసం ఆత్మహత్యను చట్టపరంగా అనుమతిస్తున్న స్విడ్జర్లాండ్‌కు వెళ్లాలనుకున్నాను. అందుకు నా భార్యను ఒప్పించాల్సి ఉంటుంది. బాధ పెట్టాల్సి ఉంటుంది. అందుకని వైద్యాన్ని నిరాకరించడం ఆత్మహత్య కిందకు రాదని ఎక్కడో చదివాను. అందుకని నాకమర్చిన ‘వెంటిలేటర్’ తీసేసి వెళ్లి పోతున్నాను. నన్ను క్షమించండి!’ అంటూ 60 ఏళ్ల మైఖేల్ బోన్ని మంగళవారం నాడు భార్య, మిత్రులకు ఫేస్బుక్ పోస్టింగ్ పెట్టి లోకం విడిచి వెళ్లి పోయారు. సైకిల్ రేసిస్ట్‌గా మంచి గుర్తింపు పొందిన మైఖేల్ 2013, మార్చి నెలలో సైకిల్‌పై వెళుతుండగా యాక్సిడెంట్ అయింది. అందులో ఆయన వెన్నుముకకు దెబ్బ తగిలి, మెడ నుంచి కాళ్ల వేళ్ల వరకు శరీరం చచ్చుపడిపోయింది. అప్పటి నుంచి ఆయన వీల్ చెయిర్‌కు అతుక్కుపోయి వెంటిలేటర్ మీద బతుకుతున్నారు. ఇంగ్లండ్, కుబ్రియాలోని పెన్రిత్ పట్టణానికి చెందిన మైఖేల్, సైక్లిస్ట్ అయిన లింజ్ను పెళ్లి చేసుకొని జీవితంలో ఆయిగానే బతికారు. ఆయన పోస్టింగ్‌ను చూసి మిత్రులంతా కదిలిపోయారు. ‘రైడ్ ఇన్ పీస్’ అని ఆయనకు చెబుతూ భార్యకు ఘనంగా నివాళులర్పించారు. ‘ధీరోదాత్తుడివైన నీవు మా మధ్యలో లేక పోయినందుకు నిజంగా బాధ పడుతున్నాం. బాధ నుంచి నీవు విముక్తి పొందినందుకు కాస్త సంతప్తి చెందుతున్నాం’ అన్న భావంతో చాలా మంది మిత్రులు స్పందించారు. -
బెల్జియం సైక్లిస్టు మృతి
వార్సా: బెల్జియంకు చెందిన బిజార్జ్ లాంబ్రెచెట్ మృతి చెందాడు. పొలాండ్ టూర్లో భాగంగా రేసును పూర్తి చేసే క్రమంలో సైకిల్ పైనుంచి కిందపడిన 22 ఏళ్ల బిజార్డ్ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. 30 కి.మీ రేసును ఆరంభించిన తర్వాత ఒక్కసారిగా భారీ వర్షం రావడంతో సైకిల్ అదుపు తప్పింది. దాంతో రాళ్లపై పడిన బిజార్జ్కు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటీనా హెలికాప్టర్లో ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. కాగా, సోమవారం బిజార్జ్ మృతి చెందినట్లు ధృవీకరించారు. ‘ ఇది మా సైక్లింగ్ చరిత్రలో అది పెద్ద విషాదం. బిజార్జ్ లేడన్న విషయం జీర్ణించుకోలేనిది. అతని ఆత్మకు శాంతి చేకూరాలి. అతని మరణం ఆ కుటంబానికి తీరని లోటు’ అని బెల్జియం సైక్లిస్టు టీమ్ విభాగం లొట్టో సౌడల్ పేర్కొంది. అయితే ఇది హైస్పీడ్ రేసు కాకపోయినా బీజార్జ్ కిందపడిపోవడంతో తీవ్ర గాయాలు పాలయ్యాడని రేస్ డైరెక్టర్ చెస్లా లాంగ్ పేర్కొన్నారు. అతనికి తగిలిన గాయాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో వైద్యులు చేసిన చికిత్ప ఫలించలేదన్నాడు. చికిత్స చేసే సమయంలో గుండె పని తీరు సరిగా ఉన్నప్పటికీ ఆపరేషన్ చేసిన తర్వాత అది విఫలమైందన్నారు. -
ప్రమాదంలో గాయపడ్డ ఎన్నారై శ్రీరామమూర్తి
కాన్ టౌన్షిప్ (పెన్సిల్వేనియా) : ప్రముఖ సైక్లిస్టు శ్రీరామమూర్తి కయ్యలముడి (48) కారు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యారు. జూన్ 29న జరిగిన ఈ ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలు కావడంతో స్థానిక పోలీసులు వాషింగ్టన్‌లోని పావోలి ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఆయన మెదడుకు, వెన్నముకు, ఊపిరితిత్తులకు తీవ్ర గాయాలయ్యాయని.. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని చికిత్స అందిస్తున్న వైద్యులు డాక్టర్లు తెలిపారు. తెలుగు వాడైన శ్రీరామమూర్తి పలు స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. స్వతహాగా సేవా దృక్పథం కలిగిన వ్యక్తం కావడంతో.. అమెరికాలోని అనేక ప్రాంతాల్లో సామాజిక సేవా కార్యక్రమాల్లో తరచుగా పాల్గొనేవారు. అరోగ్యకరమైన జీవితం కోసం అందరూ జాగింగ్, రన్నింగ్, సైక్లింగ్ చేయాలని అందరినీ ప్రోత్సహిస్తుండేవారని సన్నిహితులు చెబుతున్నారు. శ్రీరామమూర్తి స్వయంగా పాల్గొని ఎన్నో ప్రతిష్టాత్మకమైన మారథాన్లు కూడా విజయవంతంగా పూర్తి చేశారు. అయితే అందరికీ ఆదర్శంగా ఉండే శ్రీరామమూర్తి ఇలా ప్రమాదానికి గురికావడంతో.. ఆయన అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తున్నారు. ఇటువంటి ఉన్నతమైన వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో వైద్య చికిత్స కోసం ఎన్నారై సంస్థలు ఫండ్ రైజింగ్ చేపట్టారు. ఫండ్ రైజింగ్ కోసం.... https://www.gofundme.com/f/help-murthy-to-run-again -
భద్రం బీకేర్ ఫుల్ బ్రదరూ.. డ్రైవింగ్‌లో జాగ్రత్త గురూ..
తూర్పుగోదావరి,మండపేట :అప్రమత్తంగా లేకపోతే అన్నీ అనర్థాలే.. అన్నీ అపాయాలే.. దీనికి నిదర్శనమే ఈ చిత్రాలు..రాజమహేంద్రవరం నుంచి రామచంద్రపురం వైపు వెళుతున్న ఇండికా వాహనం మంగళవారం స్థానిక పెద కాలువ వంతెన వద్దకు వచ్చేసరికి ముందుకు వెళుతున్న టాటా ఏస్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం దెబ్బతినగా కారులోని వారు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం జరిగిన సంఘటన స్థలాన్ని గమనిస్తున్న మోటారు సైక్లిస్ట్ చూసుకోకుండా ముందు మోటారు సైకిల్‌పై వెళుతున్న వారిని ఢీకొట్టడంతో ఇదిగో వారు ఇలా కింద పడిపోయారు. అదృష్టవశాత్తు ఆయా ప్రమాదాల్లో ఎవరికి ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. -
వైరల్ : భూమ్మీద నూకలుండటం అంటే ఇదే..!
అదృష్టం బాగాలేకపోతే అరటి పండు తిన్నా పళ్లు ఊడిపోతాయని సినిమాలో ఓ స్టార్ హీరో డైలాగ్.. మరి అదృష్టం బాగుంటే ఎలా ఉంటుంది. ఇదిగో ఇలా ఉంటుంది అంటున్నారు ఈ వీడియో చూసిన జనాలు. వెంట్రుకవాసిలో మృత్యువుని తప్పించుకున్న ఓ సైక్లిస్ట్‌కు సంబంధించిన ఓ వీడియో తెగ వైరలవుతోంది. రైల్వే లైన్ల వద్ద భద్రత ఎంత దారుణంగా ఉందో కళ్లకు కడుతుంది ఈ సంఘటన. నెదర్లాండ్‌లో జరిగింది ఈ సంఘటన. రైల్వే క్రాసింగ్ వద్ద ఎలాంటి భయంకర పరిస్థితులు ఉన్నాయో తెలుపుతూ ఓ రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్షర్ సంస్థ ఈ వీడియోను యూట్యూబ్‌లో అప్లోడ్ చేసింది. వీడియోలో ఉన్న దాని ప్రకారం ఓ సైకిలిస్టు రైల్వే ట్రాక్ దాటే ప్రయత్నంలో ఓ వైపు నుంచి రైలు వస్తుందని అక్కడే ఆగాడు. అది వెళ్లిపోయాక ట్రాక్ దాటుతున్నాడు. అదే సమయంలో మరో ట్రాక్ పైనుంచి దూసుకొస్తున్న రైలును ఆ సైక్టిస్ట్ చూసుకోలేదు. దీంతో సైకిల్ తొక్కుకుంటూ ముందుకెళ్లాడు. రైలు చాలా సమీపంలోకి వచ్చేంతవరకూ సదరు సైక్లిస్ట్ దాన్ని గమనించలేదు. చూసిన వెంటనే అప్రమత్తం కావడంతో కేవలం అర సెకన్ వ్యవధిలో మృత్యువుని తప్పించుకోగలిగాడు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న కెమెరాలో రికార్డయింది. యూట్యూబ్‌లో అప్లోడ్ చేసిన ఈ వీడియోను ఇప్పటికే దాదాపు 8 లక్షల మంది చూశారు. వీడియో చూసిన వారంతా సదరు వ్యక్తి అదృష్టాన్ని తెగ పొగుడుతున్నారు. -
భాష అర్థంకాక చితక్కొట్టేశారు
సాక్షి, కామారెడ్డి: భాష అర్థం కాకపోవటంతో ఓ విదేశీయుడిపై కొందరు రైతులు దాడి చేసిన ఘటన కామారెడ్డిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రష్యాకు చెందిన వీ వోలెజ్ (44) సైకిల్‌పై ప్రపంచయాత్రకు బయలుదేరాడు. దానిలో భాగంగా నిజామాబాద్ నుంచి షిర్డీకి వెళ్తున్నారు. శుక్రవారం సాయంత్రం బికనూర్‌కు చేరుకోగానే గాలివాన మొదలవడంతో వోలెజ్ తన ప్రయాణానికి విరామమిచ్చి సమీపంలోని పంటపొలాల్లో గుడారం ఏర్పాటు చేసుకున్నారు. ఇంతలో పొలం యాజమాని మహేందర్ రెడ్డి అక్కడికి చేరుకుని.. అప్పటికే అతని పొలంలో టెంట్ వేసుకుని సేద తీరుతున్న వోలెజ్‌ని ప్రశ్నించాడు. అతను తన భాషలో సమాధానం చెప్పటం.. రైతుకు విదేశీయుడి మాటలు అర్థం కాకపోవటంతో.. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చివరకు భాష అర్థంకాని మహేందర్‌రెడ్డి.. వోలెజ్‌ని దొంగ అనుకొని అతనిపై దాడి చేశాడు. ఇంతలో మరికొందరు రైతులు కూడా మహేందర్‌రెడ్డికి తోడు కావటంతో వోలెజ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వోలెజ్‌ను ఆస్పత్రికి తరలించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మహేందర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. మహేందర్ రెడ్డితో వాగ్వాదం జరుగుతున్న సమయంలో వోలెజ్ గూగుల్ ట్రాన్స్‌లేటర్ సాయం తీసుకుందామని ప్రయత్నించాడనీ.. కానీ, అంతలోనే మహేందర్ రెడ్డి అతనిపై దాడి చేశాడని పోలీసులు పేర్కొన్నారు. బాధితుడి తల, దవడ, కుడి చేతికి గాయాలైనట్లు వైద్యులు వెల్లడించారు. -
సైక్లిస్టును ఢీ కొట్టిన కంగారూ..!!
క్వీన్స్లాండ్, ఆస్ట్రేలియా : సహ రైడర్ల కంటే ముందుగా వెళ్తున్న ఓ సైక్లిస్టును కంగారూ ఢీ కొట్టిన ఘటన క్వీన్స్‌లాండ్‌లోని గోల్డ్‌కోస్ట్‌లో జరిగింది. దీంతో సైక్లిస్టు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. కంగారూ బలంగా తాకడంతో ఆమె భుజం ఒక వైపునకు జరిగింది. అయితే, ఈ ప్రమాదంలో కంగారూకు ఎలాంటి గాయాలు కాలేదు. సైక్లిస్టును ఢీ కొట్టిన అనంతరం భారీ జంప్‌లతో ఆ ప్రాంతం నుంచి పరారైంది. వేగంగా వెళ్తుండటం వల్ల కంగారూ నుంచి తప్పుకోలేకపోయినట్లు ప్రమాదంలో గాయపడిన రెబకా చెప్పారు. -
మంచు.. వాహనం ఢీకొని సైక్లిస్టు దుర్మరణం
సాక్షి, చిట్యాల: మంచు కారణంగా రహదారిపై ముందు ఉన్నది ఏదీ కనిపించని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో వాహనం ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని గుండ్రంపల్లిలో జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున జరిగింది. సైకిల్‌పై వెళుతున్న యువకుడిని గుర్తు తెలియని వాహనం ఢీకొనగా అతను అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడిని కంకల వెంకటేశ్(30)గా గుర్తించారు. -
ప్రమాదవశాత్తూ ఎన్నారై టెకీ మృతి
వాషింగ్టన్: అమెరికాలోని సౌత్‌ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కరీంనగర్ వాసి మృతి చెందారు. భరత్‌రెడ్డి నరహరి (37) అనే టెకీ బాప్తిస్ట్ హెల్త్ సౌత్ ఫ్లొరిడాలో విధులు నిర్వహిస్తుండేవారు. సైక్లిస్ట్ అయిన భరత్‌రెడ్డి డాల్ఫిన్స్ క్యాన్సన్ ఛాలెంజ్ ఈవెంట్ కోసం ఏర్పాటు చేయనున్న పోటీలో పాల్గొనేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలో గత శనివారం నైరుతి మియామి డేడ్‌లో జరిగిన ట్రయథ్లాన్ (సైక్లింగ్, రన్నింగ్, స్విమ్మింగ్) పోటీలో పాల్గొన్నారు. 236 స్ట్రీట్ 87 ఎవెన్యూకు మరికాసేపట్లో చేరుకుంటారనగా లోడ్‌తో వెళ్తున్న ట్రక్కు ఆయనను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భరత్‌రెడ్డితో పాటు మరో సైక్లిస్ట్ గాయపడ్డారు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ భరత్‌రెడ్డి మృతిచెందారని బాప్తిస్ట్ ఐటీ విభాగం వెల్లడించింది. ఇప్పటివరకూ ఆయన పలు 5కే రన్, సైక్లింగ్ పోటీల్లో పాల్గొని ఎంతో మందిలో స్ఫూర్తినింపారని టీమ్ హామర్ హెడ్స్ మేనేజ్మెంట్ తెలిపింది. భరత్‌రెడ్డి మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. భరత్‌రెడ్డి మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. టీమ్ హామర్ హెడ్స్‌లో భరత్‌రెడ్డి యాక్టీవ్ సభ్యుడు. మియామి గో రన్ రన్నింగ్ క్లబ్లో ట్రయాథ్లాన్లో శిక్షణ తీసుకున్న ఆయన వచ్చే నెల 10న నిర్వహించనున్న డాల్ఫిన్స్ క్యాన్సర్ ఛాలెంజ్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నారు. 2010లో మొదలుపెట్టిన ఆ ఛారిటీ ఈవెంట్లో ఈ ఏడాదికిగానూ 22.5 మిలియన్ డాలర్ల విరాళాలు సేకరించేందుకు నిర్ణయించారు. ఇందుకోసం నిర్వహించిన ఓ సన్నాహక ఈవెంట్లో పాల్గొని భరత్‌రెడ్డి మృతిచెందడం ఇతర సభ్యులను ఆందోళనకు గురిచేస్తోంది. భరత్‌రెడ్డి పీఆర్టీయూ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మారెడ్డి కుమారుడు. భరత్‌రెడ్డి మరణవార్తతో అతని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. -
సైక్లిస్ట్‌కు ఆర్థిక చేయూత
కల్లూరు: పర్యావరణ పరిరక్షణ కోసం మౌంట్ ఎవరెస్టుకు సైకిల్ యాత్ర చేపట్టిన పాణ్యంకు చెందిన బీటెక్ విద్యార్థి శ్రీకాంత్‌కు ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి ఆర్థిక చేయూతనిచ్చారు. సైక్లిస్ట్ శ్రీకాంత్ శుక్రవారం కర్నూలు నగరంలోని గౌరు దంపతులను వారి స్వగృహంలో కలిశారు. ఈ మేరకు వారు శ్రీకాంత్‌ను అభినందించి రూ 10 వేలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ 21 రోజులపాటు జరిగే సైకిల్ యాత్రను ఈ నెల 31వ తేదీన ప్రారంభించి జూన్ 20వ తేదీన మౌంట్ ఎవరెస్టు బేస్ క్యాంపు వద్ద ముగించనున్నానని తెలిపారు. ప్రతి ఒక్కరు శారీరకంగా మానసికంగా ఫిట్నెస్ ఉండేందుకు యోగా, ఫిట్నెస్ వ్యాయామం చేయాలన్నారు. సైకిల్ వాడకాన్ని పెంచి పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించాలని విజ్ఞప్తి చేశారు.