Dalit man
-
దళిత యువకుడిని చంపి.. తల్లిని వివస్త్రను చేసి..
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో ఓ కేసు విషయమై చెలరేగిన వివాదంలో దళిత యువకుడైన నితిన్ అహిర్వార్(18)ని కొట్టి చంపారు దుండగులు. మొదట అతడి ఇంటిని ధ్వంసం చేసిన ఆ ముఠా తర్వాత అతడిని కొట్టి చంపి అడ్డుకోబోయిన అతడి తల్లిని వివస్త్రను చేశారు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. మృతుడి సోదరి చెప్పిన కథనం ప్రకారం.. విక్రమ్ సింగ్ ఠాకూర్ అనే యువకుడు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ 2019లో కేసు దాఖలు చేసింది. ఈ కేసు ఉపసంహరించుకోవాలని నిందితుడు కొంతమందితో కలిసి తన ఇంటికి వచ్చి మరీ బెదిరించాడని అందుకు ఆమెతోపాటు ఆమె తల్లి కూడా నిరాకరించిందని, దాంతో ఆ ముఠా తమ ఇంటిని నాశనం చేశారని తెలిపింది. వారంతా అక్కడి నుండి బస్‌స్టాండ్‌కు వెళ్లి అక్కడున్న తన సోదరుడు నితిన్ అహిర్వార్ను తీవ్రంగా గాయపరుస్తుండగా వారిని అడ్డుకోబోయిన ఆమె తల్లిని కూడా కొట్టి వివస్త్రను చేశారంది. వదిలేయమని ఎంతగా ప్రాధేయపడినా వినలేదని తనపై కూడా అత్యాచారం చేయడానికి ప్రయత్నించగా తాను తప్పించుకున్నానని తెలిపింది. ఈ ఘటనకు సంబంధించి హత్య కేసును నమోదు చేసి ప్రధాన నిందితుడితో సహా ఎనిమిది మందిని అరెస్టు చేశామని గ్రామపెద్ద భర్తతో సహా కొంతమంది నిందితులు పరారీలో ఉన్నారని వారికోసం ప్రత్యేక బృందాలతో సెర్చ్ ఆపరేషన్లను నిర్వహిస్తున్నామని తెలిపారు అడిషనల్ ఎస్పీ సంజీవ్ ఉయికే. MP News : 'मामा' का राज, लाडलियों पर अत्याचार... @ChouhanShivraj || @BJP4MP || @MPDial100 || @OfficeOfKNath || @INCMP || @Zeepramod #MadhyaPradesh #LadliBehna #ShivrajSinghChouhan #CrimeNews #TopNews #ZeeMPCG For More Updates : https://t.co/uXPUZQobFo pic.twitter.com/sfDdDqnoQL — Zee MP-Chhattisgarh (@ZeeMPCG) August 27, 2023 ఇది కూడా చదవండి: కూలీలకు దొరికిన 240 బంగారు నాణేలు.. కానీ అంతలోనే.. -
అమానవీయం: చికెన్ ఇవ్వలేదని.. చెప్పులతో దళితునిపై దాడి..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అమానవీయ ఘటన జరిగింది. చికెన్ ఉచితంగా ఇవ్వలేదని ఓ దళిత వ్యక్తిపై దాడి చేశారు కొందరు యువకులు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుజన్ అహిర్వార్ అనే వ్యక్తి బైక్‌పై చికెన్‌ను విక్రయిస్తుంటాడు. ఒక ఊరి నుంచి మరో ఊరిలోకి వెళ్లే క్రమంలో మార్గమధ్యలో అతన్ని అడ్డగించారు నిందితులు. తమకు చికెన్ అవ్వాలని అడిగారు. డబ్బులు ఇవ్వాలని అభ్యర్థించిన బాధితున్ని.. యువకులు చెప్పులతో చితకబాదారు. ఈ ఘటనను ఓ వ్యక్తి ఫోన్లో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు. ఇది కాస్త వైరల్‌గా మారింది. వీడియో ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇదీ చదవండి: సినిమాలో పెట్టుబడి.. కుటుంబం మొత్తం మర్డర్ కేసులో -
'యూరిన్ పోసి.. ఎమ్మెల్యే కాళ్లు నాకించారు..' దళితునిపై దారుణం..
జైపూర్: రాజస్థాన్‌లో దారుణం జరిగింది. రక్షించాల్సిన పోలీసే ఓ దళిత వ్యక్తిపై అమానవీయంగా ప్రవర్తించాడు. బాధితునిపై యూరిన్ పోశాడు. అంతేకాకుండా స్థానిక ఎమ్మెల్యే కాళ్లు నాకించాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై క్రై బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే గోపాల్ మీనా, పోలీసు అధికారి శివకుమార్ భరద్వాజపై కేసు నమోదు చేశారు. తాను పొలంలో పనిచేస్తుండగా.. పోలీసులు వచ్చి ఓ గదిలోకి తీసుకెళ్లారని బాధితుడు(51) ఫిర్యాదులో తెలిపారు. అక్కడ డీఎస్పీ శివ కుమార్ భరద్వాజ తనపై యూరిన్ పోసి అవమానించాడని పేర్కొన్నాడు. అంతేకాకుండా స్థానిక ఎమ్మెల్యే గోపాల్ మీనా ఆ ప్రాంతానికి రాజని.. అతని మాటకు ఎదురులేదని చెప్తూ ఎమ్మెల్యే బూట్లు నాకించారని పోలీసులకు తెలిపాడు. తన ఫోన్‌ను లాక్కున్నారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించినట్లు పోలీసులకు తెలిపాడు. మొదట పోలీసులు ఫిర్యాదు కూడా తీసుకోలేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. తాను నేరుగా కోర్టునే ఆశ్రయించినట్లు తెలిపాడు. ఫిర్యాదు చేసిననాటి నుంచి బెదిరింపులు వస్తున్నాయని నిందితులకు భయపడే జూన్ 30న ఈ ఘటన జరగగా.. జులై 27న ఫిర్యాదు చేసినట్లు బాధితుడు వెల్లడించాడు. తన కుటుంబ సభ్యులను కూడా వేదిస్తున్నారని తెలిపాడు. అయితే.. దళిత వ్యక్తిపై నిందితులు ఈ ఘటనకు పాల్పడటానికి కారణాలు మాత్రం ఇంకా తెలియలేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదీ చదవండి: నవాబ్ మాలిక్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు.. -
గ్రీజ్ అంటిన చేతితో తాకాడని.. దళితుడి ఒంటికి మలం రాశాడు!
చత్తర్‌పూర్: అనుకోకుండా గ్రీజ్ పూసిన చేతితో తాకినందుకు ఓబీసీ కులానికి చెందిన ఓ వ్యక్తి తనకు మలం పూశాడంటూ మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ దళితుడు ఆరోపించడం కలకలం రేపుతోంది. ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. దశరథ్ అహిర్వార్ అనే వ్యక్తి బికౌరా గ్రామంలో పంచాయతీ మురుగుకాల్వ నిర్మాణ పనులు చేస్తున్నాడు. సమీపంలోని చేతి పంపు వద్ద రామ్‌కృపాల్ పటేల్ స్నానం చేస్తున్నాడు. గ్రీజ్ అంటిన చేతితో తాకడంతో ఆగ్రహించిన పటేల్ చేతిలోని మగ్గుతో మలాన్ని తీసుకువచ్చి అహిర్వార్ ముఖం, తల సహా ఒంటిపై రాశాడు. కులం పేరుతో దూషించాడు. పంచాయతీ పెద్దలు అహిర్వార్కు రూ.600 జరిమానా కూడా విధించారు. బాధితుడు కేసు పెట్టడంతో పటేల్‌పై కేసు నమోదయ్యాయి. వారు సరదాగా వస్తువులు విసిరేసుకున్నారు. అది కాస్తా ఇలా వికటించినట్టు విచారణలో తేలిందని పోలీసులు చెప్పారు. కాగా, మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో గిరిజన యువకుడిపై ఒక వ్యక్తి మూత్రవిసర్జన చేసిన ఘటనపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైన విషయం తెలిసిందే. -
అమానవీయ ఘటన.. దళితునితో చెప్పులు నాకించి..
లక్నో: మధ్యప్రదేశ్‌లో గిరిజన వ్యక్తిపై యూరినేషన్ సంఘటన మరవకముందే ఉత్తరప్రదేశ్‌లో మరో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి దళిత యువకునితో చెప్పులు నాకించాడు. అనంతరం బాధితున్ని కుంజీలు తీయించాడు. అతనిపై పరుష పదజాలంతో బూతులు తిడుతూ దాడి చేశాడు. ఈ ఘటన సోనభద్ర జిల్లాలో వెలుగులోకి రాగా.. పోలీసులు అప్రమత్తమయ్యారు. నిందితున్ని అరెస్టు చేశారు. Video: Dalit Man Slapped, Forced To Lick Slipper In Uttar Pradesh https://t.co/AR6lx8dCSH pic.twitter.com/1wMGWNS06C — NDTV News feed (@ndtvfeed) July 8, 2023 దళిత వ్యక్తి తన మామయ్య ఇంట్లో ఎలక్ట్రిసిటీ సమస్య కారణంగా లైన్మెన్ తేజ్‌బలి సింగ్‌ని ఇంటికి పిలిచారు. ఈ అంశంలో వివాదం రాగా.. తేజ్‌బలి సింగ్ రెచ్చిపోయాడు. దళిత వ్యక్తితో చెప్పులు నాకించాడు. కుంజీలు తీయించాడు. ఆ తర్వాత అతనిపై దాడి చేశాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా.. నెటిజన్లు ఫైరవుతున్నారు. ఈ ఘటనపై పోలీసుల అప్రమత్తమయ్యారు. కేసు నమోదు చేసి నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. ఇదీ చదవండి: మధ్యప్రదేశ్‌లో మరో వికృత చేష్ట.. వీడియో వైరల్ -
బంతిని పట్టుకున్నాడని.. దళిత వ్యక్తి వేలు కోసేశారు..
గుజరాత్:గుజరాత్లో అమానవీయ ఘటన జరిగింది. పిల్లాడు బంతిని పట్టుకున్నాడని.. ఓ దళిత వ్యక్తి వేలు కోసేశారు. పటాన్ జిల్లాలోని కాకోశీ గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామంలో కొందరు క్రికెట్ ఆడుతున్నారు. మైదానం చివర కూర్చుని ఓ పిల్లాడు ఆటను చూస్తున్నాడు. ఈ క్రమంలో బంతి అతని వైపు దూసుకొచ్చింది. ఆ బంతిని పట్టుకున్నాడని కొంతమంది అతన్ని హీనంగా దూషించారు. కులపరమైన దూషణలు చేస్తూ అవమానపరిచారు. పిల్లాడి మేనమామ ధీరజ్ పర్మర్ వారిని వారించడంతో సమస్య అప్పటికి సద్దుమణిగింది. కానీ సాయంత్రం నిందితులు కత్తులతో వచ్చి ధీరజ్, అతని సోదరుడు కిర్టీపై వాగ్వాదానికి దిగారు. అనంతరం కిర్టీ వేలును కత్తిరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇదీ చదవండి:మంచు పెళ్లలు విరిగిపడి మహిళ మృతి -
హేయనీయం: ‘పైసలొద్దు.. నన్ను వదిలేయండయ్యా!’
క్రైమ్: పని చేసి.. దానికి ప్రతిఫలం అడిగిన ఓ వ్యక్తిని కులం పేరుతో దూషించడమే కాదు.. అతనిపై దాష్టికానికి పాల్పడ్డారు కొందరు. వద్దని వేడుకుంటున్నా వినిపించుకోకుండా ఆ వ్యవహారమంతా వీడియో తీసి.. సోషల్ మీడియా ద్వారా వైరల్ చేశారు. ఓ దళితుడిని కులం పేరిట దూషించడమే కాదు.. అతనిపై దాడికి దిగారు. అక్కడితో ఆగకుండా అతనితో బలవంతంగా వాళ్ల మూత్రం తాగించి, మెడలో చెప్పుల దండ వేశారు. నవంబర్ 23వ తేదీన రాజస్థాన్ సిరోహిలో హేయనీయమైన ఈ ఘటన చోటు చేసుకుంది. భరత్ కుమార్ అనే వ్యక్తి స్థానికంగా నగరంలో ఎలక్ట్రిషియన్‌గా పని చేస్తున్నాడు. ఓ దాబాలో కరెంట్ వైరింగ్ పని చేసి.. రూ. 21వేలు బిల్లుగా వేశాడు. కానీ, ఆ దాబా ఓనర్ ఐదు వేలు మాత్రమే చెల్లించి.. మిగతా పేమెంట్ కోసం భరత్‌ను చాలాసార్లు తిప్పించుకున్నాడు. సహనం కోల్పోయిన భరత్ ఓ రాత్రి.. దాబా వద్దకు వెళ్లి మిగతా డబ్బు ఇవ్వాలని గట్టిగా నిలదీశాడు. దీంతో.. కోపంతో ఆ దాబా ఓనర్, అతని మరో ఇద్దరు స్నేహితులు కలిసి భరత్‌పై దాడి చేశారు. వద్దని వేడుకున్నా.. అతనిపై వికృత చేష్టలకు పాల్పడి వీడియోలు తీశారు. తనకు డబ్బులు వద్దని, వదిలేయాలంటూ బతిమాలుకున్నాడు. కులం పేరుతో అతన్ని దూషిస్తూ తమ మూత్రం తాగించారు ఆ ముగ్గురు. ఆపై తమ చెప్పులను దండగా చేసి అతని మెడలో వేశారు. ఐదు గంటలపాటు సాగింది వాళ్ల దాడి. ఆ సమయంలో అటుగా వెళ్తున్న వాళ్లు.. భరత్ కేకలు విని కూడా పట్టనట్లు వెళ్లిపోయారు. ఆపై నిందితులు ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అది చూసి అవమానం భరించలేక పోలీసులను ఆశ్రయించాడు భరత్. దీంతో అట్రాసిటీ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టారు. Video Credits: First India News -
అయ్యా.. మీ కాళ్లు మొక్కుతా.. దొంగతనం చెయ్యలే!
క్రైమ్: తోటలోంచి జాంకాయను దొంగిలించాడనే అనుమానంతో ఓ యువకున్ని ఘోరంగా హింసించి చంపారు. ఈ ఘటనలో బాధితుడు దళితుడు కాగా, స్థానికుల ఆందోళనతో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అనుమాష ఘటన యూపీలోని అలీగఢ్ జిల్లాలో శనివారం జరిగింది. 20 ఏళ్ల ఓం ప్రకాశ్ అడవి నుంచి తిరిగొస్తూ.. జాంపళ్ల తోట వద్ద కింద పడున్న ఓ పండును తీసుకుని తినబోయాడు. అయితే అది గమనించిన తోట యజమానులు భీంసేన్, భన్వారీలు దొంగతనం చేశాడేమో అనే అనుమానంతో అతన్ని దారుణంగా హింసించారు. తాను దొంగతనం చేయలేదని, కిందపడితే తీసుకున్నానని బాధితుడు కాళ్ల మీద పడ్డా కూడా ఆ మూర్ఖులు వినిపించుకోలేదు. ఈ క్రమంలో అతని కేకలు విని.. జనం గుమిగూడారు. కొందరు పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఈ మధ్యలోనే అంతా చూస్తుండగానే.. దుడ్డుకర్రలు.. చేతికి దొరికిన వస్తువులతో స్పృహ తప్పేదాకా ఓం ప్రకాశ్‌ను చితకబాదారు. గాయాలతో పడి ఉన్న అతన్ని.. స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశాడు. ఘటనపై బాధిత కుటుంబం నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. ఇద్దరు నిందితులిద్దరినీ అరెస్టు చేసినట్టు వెల్లడించారు. ఇదీ చదవండి: నేరాలు.. ఘోరాలు.. చూసి ఇంట్లోవాళ్లనే! -
ముస్లిం యువతిని ప్రేమించడమే ఆ యువకుడికి శాపమైందా?
బెంగళూరు: వేరే మతానికి చెందిన అమ్మాయిని ప్రేమించడమే ఆ యువకుడి పాపమైంది. ప్రేమించిన అమ్మాయితో జీవితాంతం సంతోషంగా ఉండాలనుకున్న అతని ఆశాలు అడియాశాలయ్యాయి. ఎంతో అందంగా ఊహించుకున్న భవిష్యత్తును మధ్యలోనే సమాధి చేశారు. ఎదిగి వచ్చిన కొడుకును దూరం చేసి కన్నతల్లికి కడుపుకోత మిగిల్చారు. ముస్లిం యువతితో సన్నిహితంగా ఉంటున్నాడని దళిత యువకుడిని హత్య చేశారు. ఈ అమానుష ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. కాలబురాగి(గుల్బర్గా) వాడిటౌన్‌లోని భీమా నగర్లో లేఅవుట్లో నివిస్తున్న 25 ఏళ్ల విజయ్ కాంబ్లే, ముస్లిం యువతిని ప్రాణంగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఈ ప్రేమ విషయం యువతి కుటుంబ సభ్యులకు నచ్చలేదు. తన సోదరితో దూరంగా ఉండాలని యువతి సోదరులు విజయ్ను పలుమార్లు హెచ్చరించారు. అయినా యువకుడి ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో ఎలాగైనా విజయ్ను అంతమొందించాలని ముస్లిం యువతి కుటుంబ సభ్యులు పథకం పన్నారు. ఈ క్రమంలో శుక్రవారం విజయ్ను అడ్డగించి కత్తితో పొడిచి చంపి అక్కడి నుంచి పరారయ్యారు. చదవండి: Hyderabad: ప్రియురాలిపై మాజీ ప్రియుడి ఘాతుకం.. నడిరోడ్డుపై తన కుమారుడిని ముస్లిం యువతి సోదరులే హత్య చేశారని మృతుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులు షాహుద్దీన్, నవాజ్ అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరితోపాటు ఇరు కుటుంబ సభ్యులను కూడా విచారిస్తున్నారు. అయితే యువతి సోదరులు తమ కొడుకును పలుమార్లు బెదిరించారని మృతుడి తల్లి పేర్కొంది. తన చెల్లెలితో రిలేషన్‌షిప్‌ను వదులుకోవాలని లేకుంటే చంపేస్తామని బెదిరించినట్లు తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ‘విజయ్‌కు ఫోన్ కాల్ రావడంతో ఇంటినుంచి బయటకు వెళ్లిపోయాడు. తను ఎవరితో మాట్లాడాడో కూడా నాకు తెలీదు. తరువాత విజయ్ను ఎవరో కొట్టారని మాకు కాల్ వచ్చింది. వెంటనే తన వద్దకు పరిగెత్తాము. అప్పటికే మా అబ్బాయి మెడపై కత్తితో పొడిచి చంపారు. ఈ సంఘటనకు ముందు ఎలాంటి గొడవలు జరగలేదు. యువతి సోదరుడు మాత్రం ఒకసారి ఇంటికొచ్చి.. ‘నీ కొడుక్కి మంచి బుద్ధులు నేర్పించు. లేకపోతే తన తల నరికి నీకు అప్పగిస్తాం’ అని బెదిరించి వెళ్లాడు’ అని విజయ్ తల్లి చెబుతూ కన్నీటి పర్యంతమైంది. చదవండి: లైంగిక ఆరోపణలు.. మనస్తాపంతో మాజీ మంత్రి ఆత్మహత్య -
నల్లగొండలో జైభీమ్ తరహా ఘటన.. వీడియో వైరల్
సాక్షి, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో జై భీమ్ సినిమా తరహా సన్నివేశం చోటు చేసుకుంది. కేసు నిమిత్తం ఓ దళిత యువకుడిని స్టేషన్‌కు పిలిచి.. అతడిని చితకబాదారు ఎస్సై, కానిస్టేబుల్. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ సంఘటనపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఆ వివరాలు.. (చదవండి: మీ అబ్బాయి బాలికతో.. కేసు మాఫీ చేయాలంటే రూ.లక్ష ఇవ్వు) నల్లగొండ టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. భూ వివాదానికి సంబంధించన కేసులో ఓ దళిత యువకుడిని స్టేషన్‌కు పిలిపించాడు ఎస్సై నర్సింహులు. అనంతరం అతడిని చితకొట్టారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. విషయం కాస్త పెద్దది కావడంతో ఈ ఘటనకు బాధ్యులైన ఎస్సై నర్సింహులు, కానిస్టేబుల్ నాగుల్ మీరాను సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. చదవండి: సఖ్యతకు అడ్డొస్తున్నాడని.. ప్రియుడితో కలిసి భర్త హత్య.. ఏమీ ఎరగనట్టు.. -
పాత కక్షలతో తండ్రీకొడుకులపై దాడి.. మూత్రం తాగాలంటూ..
జైపూర్: రాజస్థాన్‌లోని బార్మెర్లో దారుణం చోటు చేసుకుంది. 15 మంది వ్యక్తులు కలిసి దళిత వ్యక్తిని, అతడి కొడుకుపై దాడి చేసి బలవంతంగా మూత్రం తాగించారు. పోలీసుల వివరాల ప్రకారం.. బార్మెర్లోని బిజ్రాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోహద్ కా తాలా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు. కిరాణా దుకాణంలో రాయ్‌చంద్ మేఘవాల్, అతని కుమారుడు రమేష్ వస్తువులను కొనుగోలు చేస్తున్న సమయంలో దాడి జరిగినట్లు పోలీసలు పేర్కొన్నారు. ఓ 15 మంది వ్యక్తులు అకస్మాత్తుగా తండ్రీకొడుకుల పై దాడి చేసి మూత్రం తాగమని బలవంతం చేసినట్లు వెల్లడించారు. కులం పేరుతో దూషించి అవమానించినట్లు తెలిపారు. అంతే కాకుండా రాయ్‌చంద్‌పై దాడి చేయడంతో అతడి పంటిని కోల్పోగా.. రమేష్‌కు కాలు విరగడంతో పాటు చేతికి గాయాలయ్యాయి. కాగా, ప్రాధమిక చికిత్స కోసం బాధితులను చౌహతాన్‌కు తరలించి, తదుపరి చికిత్స కోసం బార్మెర్లోని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఖేత్ సింగ్ సహా 15 మందిపై కేసు నమోదు చేశారు. ఇది పాత శత్రుత్వానికి సంబంధించిన కేసుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు ప్రారంభించామని, నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. -
అప్పు తీర్చలేదని సర్పంచ్ భర్త సజీవ దహనం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. అప్పు తీర్చలేదనే నేపంతో కొందరు వ్యక్తులు దళితుడిని సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి మరణించాడు. మృతుడి భార్య గ్రామ్ ప్రధాన్(సర్పంచ్) కావడం గమనార్హం. ఈ ఘటన శుక్రవారం అమేథీలోని మున్షిగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బందోయియా గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన అర్జున్ కోరి(40)కి.. మరి కొందరికి మధ్య డబ్బుకు సంబంధించి వివాదం తలెత్తింది. ఈ క్రమంలో గురువారం 5-6గురు వ్యక్తులు కలిసి అర్జున్ కోరిని చంపేందుకు ప్రయత్నించారు. బతికి ఉండగానే అతడిని సజీవ దహనం చేయాలని భావించి నిప్పు పెట్టారు. ఈ నేపథ్యంలో రాత్రి 10:30 గంటల ప్రాంతంలో బాధితుడి ఇంటి సరిహద్దు ప్రాంతంలో కాలిపోయిన స్థితిలో ఉన్న అర్జున్‌ని కుటుంబ సభ్యులు గుర్తించారు. తక్షణమే అతడిని చికిత్స కోసం నౌగిర్వాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు అతడిని సుల్తాన్పూర్ జిల్లా ఆస్పత్రికి అక్కడి నుంచి లక్నో ట్రామా సెంటర్‌కు తరలించారు. కానీ దురదృష్టవషాత్తు ఆస్పత్రికి చేరేలోపే అతడు మరణించాడు. (బర్త్‌డే పార్టీలో ఓవరాక్షన్ : సింగర్‌పై కాల్పులు) ఈ సందర్భంగా గ్రామ పెద్ద(సర్పంచ్), బాధితుడి భార్య ప్రత్యర్థులే ఈ హత్య చేశారని తెలిపింది. ఐదురుగిరి మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. గ్రామ పంచాయతీ సభ్యులు మాత్రం డబ్బుల కోసమే అర్జున్ కోరిని హత్య చేశారని తెలిపారు. ఇక ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంగటనలు చోటు చేసుకోకుండా చూసేందుకు గ్రామంలో భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. ఈ సందర్భంగా పోలీసు అధికారి మాట్లాడుతూ.. ‘విషయం తెలిసిన వెంటనే మేం సంఘటన స్థలానికి చేరుకుని గ్రామ్ ప్రధాన్ భర్తను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించాము. ఈ రోజు ఉదయం లక్నో ట్రామా సెంటర్‌కు తీసుకెళ్తుండగా.. అతడు మరణించాడు’ అని తెలిపారు. బాధితుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఐదుగురిలో ముగ్గురిని అరెస్ట్ చేశారు. -
లారీ నన్ను ఢీకొట్టలేదు: విజయ్‌బాబు
-
శిరోముండనం కేసు; కొత్త కోణం
సాక్షి, సీతానగరం (రాజానగరం): తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో జరిగిన శిరోముండనం కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రధాన బాధితుడు విజయ్‌బాబు ఇసుక లారీయే తనను ఢీకొట్టలేదని చెప్పాడు. ప్రసాద్, ఇంకొందరితో కలసి మద్యం తాగిన తాను తరువాత ఇంటికి వెళ్తూ బైక్ పై నుండి అదుపు తప్పి పడిపోయాయని స్పష్టం చేశాడు. అసలు తనకు ప్రమాదం జరిగిన సమయంలో ప్రసాద్ అనే వ్యక్తి లేడని, వారి వ్యక్తిగత గొడవలు కప్పిపుచ్చుకునేందుకు తన ప్రమాదాన్ని వాడుకున్నారని ఆరోపించాడు. దళిత నాయకుడినని చెప్పుకునే హర్షకుమార్ కులం పేరుతో రాజకీయాలు చేయడం సరికాదని అన్నాడు. విజయ్‌బాబు ఏమన్నాడంటే... ‘ఈ నెల 18న రాత్రి ఏడున్నర వరకు ప్రసాద్‌తో కలిసి మద్యం తాగిన మాట వాస్తవమే. తర్వాత నేను ఒక్కడినే అక్కడి నుంచి బైక్‌పై ఇంటికి బయలుదేరాను. నన్ను లారీ ఢీకొట్టలేదు. బైక్‌పై నుంచి పడిపోవడం వల్లే గాయపడ్డాను. ప్రసాద్.. ఇసుక లారీలను ఆపి మద్యానికి డబ్బులు అడగటం లాంటివి చేస్తుంటాడు. అతడిపై చాలా కేసులు ఉన్నాయి. నన్ను లారీ ఢీకొట్టిందని నాటకమాడి డబ్బులు గుంజడానికి ప్రయత్నించాడు. హర్షకుమార్ కులాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడం కరెక్ట్ కాదు. గాయపడిన నన్ను పరామర్శించడానికి ఏ నాయకుడు కూడా రాలేదు. నా బాధలు నేను పడుతున్నా. నన్ను ఏ లారీ ఢీ కొట్టలేదు, గొడవకు నాకు ఎటువంటి సంబంధం లేదు. నాకు జరిగిన ప్రమాదంతో ప్రసాద్‌కు సంబంధం లేదు’ అని విజయ్‌బాబు అన్నాడు. ఈ కేసులో కొత్త విషయాలు వెలుగు రావడంతో పోలీసులు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి. (శిరోముండనం కేసులో ఎస్ఐ అరెస్టు) హర్షకుమార్ క్షమాపణలు చెప్పాలి: అమ్మాజీ దళితుల తల్లులపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన మాజీ ఎంపీ హర్షకుమార్‌పై మండిపడ్డారు మాల కార్పొరేషన్ ఛైర్ పర్సన్ పెదపాటి అమ్మాజీ. హర్షకుమార్ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రెండు సార్లు వైఎస్సార్ దయతో ఎంపీగా పనిచేసిన హర్షకుమార్ ఇంత దారుణంగా మాట్లాడడాన్ని ఖండించారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్‌ను చదివేవాడు దళిత నాయకుడు ఎలా అవుతాడని ప్రశ్నించారు. (‘హర్షకుమార్.. నాలుక అదుపులో పెట్టుకో’) -
బైక్ తాకినందుకు రోడ్డుపైకి ఈడ్చి దాడి
బెంగళూరు: ద్విచక్ర వాహనాన్ని తాకాడన్న కారణంతో దళితుడిపై దాడి చేసిన అనాగరిక ఘటన శనివారం కర్ణాటకలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. విజయపుర జిల్లా మినాజీ గ్రామానికి చెందిన ఓ దళితుడు అనుకోకుండా ఉన్నత కులానికి చెందిన ఓ వ్యక్తి బైక్‌ను ముట్టుకున్నాడు. దీంతో ఆగ్రహం చెందిన అగ్ర కులస్థులు అతనిపై మూకదాడి చేశారు. అతని బట్టలూడదీసి గొడ్డును బాదినట్టు బాదడమే కాక అతని కుటుంబాన్ని కూడా రోడ్డుపైకి ఈడ్చి వారిపైనా దాడి చేశారు. దీంతో బాధితుడు తనకు జరిగిన దారుణాన్ని వివరిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో దాడికి పాల్పడ్డ 13 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపడుతున్నారు. మరోవైపు ఈ మూకదాడికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఇందులో కొందరు దళితుడిని గట్టిగా అదిమి పట్టుకోగా మరికొందరు అతన్ని ఇష్టారీతిన కొట్టారు. అతని కుటుంబ సభ్యులపైనా విచక్షణారహితంగా దాడి చేశారు. (నిక్కరు సైజులో తేడా, పోలీసులకు ఫిర్యాదు!) -
దళితుడి ముఖంపై ఉమ్మి, రాడ్లతో కొట్టి
ముంబై : ఉన్నత వర్గానికి చెందిన యువతిని ప్రేమించినందుకు ముఖంపై ఉమ్మి, రాడ్లతో కొట్టి ఓ దళిత వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వివరాలు.. పుణెకు చెందిన విరాజ్ విలాస్ జాగ్తాప్(20) ఉన్నత కులానికి చెందిన యువతిని ప్రేమించాడు. ఈ విషయం కాస్తా యువతి కుటుంబానికి తెలియడంతో యువకుడితో పలుమార్లు గొవడకు దిగారు. ఈ వాగ్వాదం పెరిగి పెద్దదవడంతో అమ్మాయి తరపు కుటుంబ సభ్యులు యువకుడికి ఫోన్ చేసి మాట్లాడాలని పిలిపించారు. ఈ క్రమంలో అమ్మాయి ఇంటికి వెళ్లిన యువకుడిని కులం పేరుతో దూషించి, అసభ్యకరమైన పదజాలంతో యువతి తల్లిదండ్రులు అతన్ని అవమానించారు. (బురుండీ అధ్యక్షుడి హఠాన్మరణం ) అనంతరం అక్కడ నుంచి బయటకు వచ్చి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న విరాజ్‌ను యువతి బంధువులు ఆరుగురు యువకుడిని అడ్డుకొని టెంపోతో దాడి చేశారు. దీంతో విరాజ్ బైక్‌పై నుంచి కింద పడగా కనీస కనికరం లేకుండా నిందితులు అతనిపై రాళ్లు, రాడ్లతో తీవ్రంగా దాడి చేశారు. యువతి తండ్రి విరాజ్ ముఖంపై ఉమ్మి వేశాడు. అనంతరం అక్కడి నుంచి వారు పరారయ్యారు. రక్తపు మడుగుల మధ్య ఉన్న బాధితుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించి, కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దురదృష్టవశాత్తు యువకుడు మరణించాడు. (భార్య మాట వినటం లేదని భర్త హల్చల్) ఈ ఘటనపై విరాజన్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకొని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వీరిలో ఇద్దరు మైనర్లు ఉండగా వారిని రిమాండ్ హోమ్‌కు తరలించారు. కాగా తన కొడుకును చంపిన వారిని ఉరి తీయాలని, అప్పుడే మరోసారి ఇలాంటి దారుణ సంఘటనలు జరగకుండా ఉంటాయని మృతుడి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. -
సోదరి ప్రేమికుడిపై విచక్షణారహితంగా దాడి
తిరువనంతపురం: తన సోదరిని ప్రేమిస్తున్నాడన్న కారణంతో దళిత యువకుడిని ఓ వ్యక్తి కత్తితో పొడిచాడు. ఈ దారుణ ఘటన కేరళలో ఆదివారం చోటు చేసుకుంది. ఎర్నాకులంలోని మువట్టుపుఝకు చెందిన 20 ఏళ్ల యువకుడు, 18 ఏళ్ల యువతి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం యువతి సోదరుడికి తెలిసింది. ప్రేమ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన అతడు దళితుడిని మర్చిపోవాలంటూ సోదరిని మందలించాడు. అయినప్పటికీ వాళ్లిద్దరూ ప్రేమను వదులుకోడానికి ఇష్టపడలేదు. ఇదిలా వుండగా ఆదివారం సాయంత్రం యువతిని ప్రేమించిన వ్యక్తి ఫేస్ మాస్కు కొనేందుకు ఓ దుకాణానికి వెళ్లాడు. (నటి చందన ఆత్మహత్య కేసు.. ప్రియుడు అరెస్ట్) అక్కడికి చేరుకున్న యువతి సోదరుడు అతడిని బయటకు రమ్మని పిలిచాడు. దీంతో అతను దుకాణంలో నుంచి బయటకు రాగానే కత్తి తీసుకుని విచక్షణారహితంగా దాడి చేశాడు. చేతులు, తల, మెడపై తీవ్ర గాయాలైన అతడిని కొట్టాయంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన అతడి స్నేహితుడికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. నిందితుడికి సహకరించిన పదిహేడేళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. (నవవధువు అనుమానాస్పద మృతి) -
యువకుడి తల నరికి.. కుడి చేతి వేళ్లను..
లక్నో : పొలానికి వెళ్లిన దళిత యువకుడి తలను శరీరంనుంచి వేరుచేసి, చేతి వేళ్లను నరికి అతి క్రూరంగా చంపేశారు గుర్తు తెలియని కొందరు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫతేహ్‌పుర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఫతేహ్‌పుర్‌కు చెందిన ప్రమోద్ కుమార్ అనే 22 ఏళ్ల దళిత యువకుడు ఆదివారం 12 గంటల ప్రాంతంలో పొలానికి వెళ్లాడు. 2:30 గంటల ప్రాంతంలో తల వేరు చేయబడ్డ అతడి శవాన్ని అటుగా వెళుతున్న కొందరు గుర్తించారు. ఆ వెంటనే కుటుంబసభ్యులు, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడి కుడి చేతి వేళ్లను మూడింటిని తొలగించి ఉండటం గమనించారు. అంతేకాకుండా అతడి తలను ఇటుకపై పెట్టి, వేరుచేసినట్లుగా వారికి ఆనవాళ్లు లభించాయి. దీనికి తోడు ప్రమోద్ సెల్‌ఫోన్ సైతం కనిపించకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. తమ కుమారుడికి ఎవరితోనూ శత్రుత్వం లేదని మృతుడి తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దాదాపు 10మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ముగ్గురి కంటే ఎక్కువమంది ఈ హత్యలో పాల్గొని ఉంటారని వారు భావిస్తున్నారు. ( భారీ అగ్ని ప్రమాదం: ఏడుగురు సజీవ దహనం ) -
మొబైల్ చోరీ చేశాడంటూ చావబాదారు..
జైపూర్ : మొబైల్ ఫోన్ చోరీ చేశాడనే అనుమానంతో దళిత వ్యక్తిని దారుణంగా కొట్టడంతో బాధితుడు మరణించిన ఘటన రాజస్ధాన్‌లోని సికార్ జిల్లాలో వెలుగుచూసింది. 12 రోజుల కిందట జరిగిన ఈ ఘటనలో మదన్ లాల్ మీనా (75) సవాయ్ మాన్ సింగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకూ ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వృద్ధుడిపై దాడి కేసులో నిందితులు జితేంద్ర యాదవ్, భరత్‌భూషణ్, దిలీప్ సింగ్, సందీప్ మీనా, సందీప్ యాదవ్‌లను అరెస్ట్ చేశామని అదనపు ఎస్పీ దినేష్ అగర్వాల్ వెల్లడించారు. ఓ హోటల్ వద్ద తమ మొబైల్ ఫోన్‌ను మదన్ లాల్ మీనా దొంగిలించాడనే అనుమానంతో ఐదుగురు నిందితులు అతడిని తీవ్రంగా కొట్టారు. మార్చి 4న ఈ ఘటన జరగ్గా, వృద్ధుడిని నిందితులు కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాధితుడి కుమారుడు ఫిర్యాదు మేరకు పోలీసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి : మహిళా కండక్టర్‌పై దాడి.. కానిస్టేబుళ్లపై వేటు! -
నీళ్లు అడిగితే మూత్రం ఇచ్చారు!
చండీగఢ్ : దేశంలో రోజుకో ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రవేశపెట్టాలని యోచిస్తున్న ఆధునిక కాలం ఇది. ఎక్కడి ఎవరికి చిన్నకష్టమొచ్చినా ప్రపంచమంతా తల్లడిల్లుతున్న సున్నితమై కాలం ఇది. కానీ కొందరిలో అనాగరికత్వం, అమానుషత్వం రోజురోజుకూ నరనరానా జీర్ణించుకుపోతున్న చరిత్రకు కూడా ఈ కాలం ప్రత్యక్ష సాక్షి. వివరాల్లోకేళ్తే.. ఓ దళిత వ్యక్తిని ఇంటి నుంచి కిడ్నాప్ చేసి విచక్షణారహితంగా దాడి చేసి, అతనితో బలవంతంగా మూత్రం తాగించిన సంఘటన పంజాబ్‌లోని సంగ్రూర్ జిల్లాలో సంచలనం రేపింది. పాతకక్షల నేపథ్యంలో కొందరు దుండగులు దళితుడిని ఎత్తికెళ్లి చితకబాదారు. అంతటితో ఆగకుండా తాగడానికి నీళ్లు అడిగితే మూత్రం ఇచ్చి ఆ వ్యక్తికి నరకం చూపించారు. సంగ్పూర్ జిల్లాకు 55 కి. మీ దూరంలో ఉన్న చంగలివాలా గ్రామానికి చెందిన జగ్మిల్ సింగ్(37) అనే వ్యక్తి ఇంటికి ఇద్దరు వ్యక్తులు వచ్చి బలవంతంగా అతడిని ఎత్తుకెళ్లి ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ స్తంబానికి కట్టేసి అసభ్యంగా ప్రవర్తించి, రాడ్లతో హింసించారు. అయితే వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తాజాగా వెలుగు చూసింది. కాగా గ్రామానికి చెందిన రింకూ అనే వ్యక్తితో సెప్టెంబర్21న చిన్న వివాదం ఏర్పడినట్లు, అప్పుడే రాజీకి రావడంతో ఆ గొడవ సర్ధుమనిగిపోయిందని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. తనను ఎత్తుకువెళ్లి స్తంబానికి కట్టేసి కర్రలు, రాడ్లతో కొట్టారని, తాగడానికి నీళ్లు అడిగితే మూత్రం ఇచ్చారని పోలీసుల ఎదుట వాపోయాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని బుధవారం నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు రింకూ, అమర్జిత్ సింగ్,లక్కీ అలీయాస్ గోలి, బీతా అలీయాస్ బిందర్‌గా గుర్తించారు. వీరంతా చంగలివాలా గ్రామానికే చెందిన వారని పోలీసులు తెలిపారు. బాధితుడి అభియోగంపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితులను విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. -
కుమారుడి హత్య.. తండ్రి ఆత్మహత్య
జైపూర్: కుమారుడిని చంపేశారు.. న్యాయం చేయమని పోలీసులను ఆశ్రయించడంతో మిగతా కుటుంబ సభ్యులను కూడా చంపేస్తామని బెదిరించారు. నిందితుల బెదిరింపులకు భయపడి కళ్లు లేని ఆ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణం రాజస్తాన్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. రత్తిరన్ జాతవ్ అనే వ్యక్తి అంధుడు. అతడికి ఇద్దరు కుమారులున్నారు. వీరిలో పెద్ద కుమారుడు హరీశ్ జాతవ్ గత నెలలో ఓ యాక్సిడెంట్ చేశాడు. ఈ ఘటనలో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. దాంతో సదరు మహిళ బంధువులు హరీశ్ మీద దాడి చేసి చంపేశారు. దీని గురించి అతడి తండ్రి రత్తిరన్ పోలీసుకుల ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో హరీశ్‌పై దాడి చేసి, అతని చావుకు కారణమయిన వ్యక్తులు కేసు వాపసు తీసుకోవాలని.. లేదంటే రత్తిరన్ కుటంబ సభ్యుల్లో ఎవ్వరిని వదలమని బెదిరించారు. ఈ బెదిరింపులకు భయపడిన రత్తిరన్ విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం గురించి హరీశ్ సోదరుడు మాట్లాడుతూ.. ‘న్యాయం చేయాలంటూ మా నాన్న పోలీసులను ఎంతో వేడుకున్నాడు. కానీ వారు కనికరించలేదు. మమ్మల్ని చంపుతామంటూ బెదిరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశాం. కానీ వారు మా మాటల్ని పెద్దగా పట్టించుకోలేదు. ఒకవేళ వారు ముందుగానే స్పందించి ఉంటే.. ఈ రోజు మా నాన్న మరణించేవారు కాదు. మాకు న్యాయం జరగదనే భయంతోనే మా నాన్న విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు’ అని వాపోయారు. -
దారుణం : గర్భంతో ఉన్న భార్య కోసం వెళితే..
గుజరాత్లో అమానవీయ సంఘటన ఒకటి చోటు చేసుకుంది. గర్భవతిగా ఉన్న తన భార్యను తిరిగి ఇంటికి తీసుకురావడానికి వెళ్లిన దళిత యువకుడిని కొట్టి చంపిన ఘటన కలకలం రేపింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ జిల్లాలో సోమవారం రాత్రి ఈ దారుణం జరిగింది. డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్సీ / ఎస్టీ సెల్)మన్వర్ అందించిన వివరాల ప్రకారం దళిత యువకుడు హరేష్ సోలంకి (25) వర్మోర్ గ్రామానికి చెందిన ఊర్మిలా బెన్ను కులాంతర వివాహం చేసుకున్నారు. కానీ తమ కూతురు ఊర్మిలాబెన్ దళిత యువకుడిని పెళ్లి చేసుకోవడం తల్లిదండ్రులకు ఏమాత్రం ఇష్టం లేదు. దీంతో కచ్ జిల్లాలోని గాంధీధామ్‌లో తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్నాడు సోలంకి. అయితే ఊర్మిలా గర్భం దాల్చడంతో మాయమాటలు చెప్పి ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. కొన్ని వారాల తరువాత ఆమెను తిరిగి పంపిస్తామని చెప్పారు. అయితే రెండు నెలలైనా భార్యను తన వద్దకు పంపించక పోవడంతో, తిరిగి పంపమని అత్తమామలను ఒప్పించటానికి గ్రామానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు మహిళల హెల్ప్‌లైన ‘అభయం 181’ సహాయం కూడా తీసుకున్నాడు. ఆ అధికారుల సహాయంతో హెల్స్‌లైన్ వాహనంలో అత్తమామల ఇంటికి వెళ్లాడు. హెల్ప్‌లైన్ సిబ్బంది ఊర్మిలాబెన్ను పంపించేందుకు ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంతలో వాహనంలో సోలంకి ఉన్నాడని తెలుసుకున్న బంధువులు ఒక్కసారిగా అతనిపై విరుచుకుపడ్డారు. పదునైన దారుణంగా కొట్టడంతో అతను అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడని పోలీసు అధికారి తెలిపారు. ఈ దాడిలో హెల్ప్‌లైన్ వాహనం కూడా దెబ్బతిందన్నారు. ఈ సంఘటన తర్వాత నిందితులు తమ ఇంటి నుంచి పారిపోయారని, వారిని పట్టుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. అత్తమామలు సహా ఎనిమిది మందిపై హత్య, ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు, ప్రభుత్వ అధికారికపై దాడి తదితర సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశామని డిప్యూటీ ఎస్పీ ప్రకటించారు. -
అగ్రవర్ణాల దాడిలో గాయపడ్డ దళితుడి మృతి
నైనిటాల్ : ఉత్తరాఖండ్‌లో గతనెల 26న ఓ వివాహ రిసెప్షన్లో తమ ఎదురుగా భోజనం చేసినందుకు అగ్ర వర్ణాల చేతిలో భౌతిక దాడికి గురైన దళిత యువకుడు మరణించాడు. దాడికి పాల్పడిన ఏడుగురు వ్యక్తుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు నిందితులపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. తక్కువ కులానికి చెందినప్పటికీ తమ సరసన భోజనం చేశాడనే ఆగ్రహంతో జితేంద్ర అనే దళితుడిని తెహ్రి జిల్లా ష్రికోట్ గ్రామంలో అగ్రకులాల వ్యక్తులు చితకబాదారని పోలీసులు తెలిపారు. కాగా, బాధితుడు తొమ్మది రోజుల పాటు డెహ్రడూన్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడని పోలీసులు తెలిపారు. జితేంద్ర సోదరి ఫిర్యాదుతో ఏడుగురు నిందితులు గజేంద్ర సింగ్, శోభన్ సింగ్, కుషాల్ సింగ్, గబ్బర్ సింగ్, గంభీర్ సింగ్, హర్బీర్ సింగ్, హుకుం సింగ్‌లపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు. -
షాకింగ్.. పొరపాటున బీజేపీకి ఓటేసి.. !
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ బులంద్‌షహర్ లోక్‌సభ నియోజకవర్గంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బీఎస్పీకి బదులు పొరపాటున ఈవీఎంలో బీజేపీ గుర్తుకు ఓటు వేయడంతో ఓ దళితుడు తన వేలిని నరికేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌తోపాటు దేశవ్యాప్తంగా ఉన్న పలు లోక్‌సభ స్థానాలకు రెండోదఫా పోలింగ్ గురువారం జరిగిన సంగతి తెలిసిందే. శిఖర్‌పుర ప్రాంతంలోని అబ్దుల్లాపూర్ హులాసన్ గ్రామానికి చెందిన పవన్ కుమార్ (25) ఈ ఘటనకు పాల్పడ్డాడు. పొరపాటున బీజేపీ గుర్తుకు ఓటేయడంతో కోడవలిని ఉపయోగించి తన చేతి వేలిని పవన్ నరికేసుకున్నాడు. వేలిని నరికేసుకున్న తర్వాత పొరపాటున బీజేపీకి ఓటేశానంటూ అతను విచారం వ్యక్తం చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎస్పీ-బీఎస్పీ-ఆరెల్డీ అభ్యర్థి యోగేశ్ వర్మకు ఓటేయాలని పోలింగ్ కేంద్రానికి వెళ్లిన పవన్.. పొరపాటున బీజేపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ భోలా సింగ్‌కు ఓటేశాడని, జరిగిన పొరపాటున తెలుసుకొని తనపై తానే ఆవేశానికి లోనై.. వేలిని నరికేసుకున్నాడని స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. -
పెళ్లిలో నృత్యం చేశాడని దళితుడి హత్య
ముజఫర్‌పూర్: బిహార్‌లో వివాహ వేడుకలో నృత్యం చేశాడంటూ ఓ మహాదళితుడిని కాల్చిచంపారు. అభీఛాప్రాలో బుధవారం రాత్రి ఓబీసీ వర్గానికి చెందిన ఓ కుటుంబం పెళ్లి ఊరేగింపుæ జరిగింది. ఇందులో స్థానిక మహాదళితుడు (ముసాహర్) నవీన్ మాంజీ(22) అనుమతి లేకుండా వచ్చి డాన్స్ చేశాడు. పెళ్లి బృందంలోని వారు అభ్యంతరం చెప్పినా వినలేదు. దీంతో ఆ బృందంలోని ఓ వ్యక్తి మాంజీని కాల్చి చంపాడు. దీంతో ఆగ్రహించిన ముసాహర్లు పెళ్లి కొడుకు ఇంట్లో లూటీ చేశారు. దీనిపై ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాయి. పెళ్లి కొడుకు సోదరుడు (వరుసకు) పాత కక్షలతోనే తన కుమారుడిని పొట్టన పెట్టుకున్నారని బాధితుడి తండ్రి పేర్కొన్నారు. ఇంట్లో దోపిడీకి పాల్పడ్డారని వాహనాలకు నిప్పుపెట్టారని పెళ్లివారు ఫిర్యాదు చేశారు.