debit card
-
అక్టోబర్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకోకపోతే మీకే నష్టం!
సెప్టెంబర్ ముగుస్తోంది.. అక్టోబర్ నెల మొదలవడానికి మరికొన్ని రోజుల మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రతి నెలలో మాదిరిగానీ వచ్చే నెలలో (2024 అక్టోబర్) కూడా ఇన్వెస్ట్మెంట్స్, సేవింగ్స్ వంటివాటికి సంబంధించిన చాలా నిబంధలను మారతాయి. ఈ కథనంలో వచ్చే నెలలో ఏ రూల్స్ మారుతాయనే విషయం తెలుసుకుందాం..స్మాల్ సేవింగ్ స్కీమ్2024 అక్టోబర్ 1 నుంచి స్మాల్ సేవింగ్ రూల్స్ మారనున్నాయి. ప్రావిడెంట్ ఫండ్ (PPF), సుకన్య సమృద్ధి యోజన (SSY) ఖాతాల వంటి పోస్ట్ ఆఫీస్ చిన్న పొదుపు ఖాతాలు కొత్త సర్దుబాట్లకు లోబడి ఉంటాయి. రెగ్యులర్ కానీ నేషనల్ స్మాల్ సేవింగ్ (NSS) ఖాతాలపై కూడా కొంత ప్రభావం ఉంటుంది. కొన్ని అకౌంట్స్ క్రమబద్దీకరించాల్సి ఉంటుంది.ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్ కార్డ్ ఛార్జీలుఐసీఐసీఐ బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం.. 2024 అక్టోబర్ 1 నుంచి మీరు రూ. 10వేలు ఖర్చు చేయడం ద్వారా రెండు కాంప్లిమెంటరీ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ పొందవచ్చు. మునుపటి క్యాలెండర్ త్రైమాసికంలో చేసిన ఖర్చులు.. తరువాత క్యాలెండర్ త్రైమాసికానికి యాక్సెస్‌ను అన్‌లాక్ చేస్తాయి.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మార్పులువచ్చే నెల ప్రారంభం నుంచే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్దులో కొన్ని మార్పులు జరగనున్నాయి. స్మార్ట్‌బై ప్లాట్ఫామ్లో.. యాపిల్ ఉత్పత్తులను కొనుగోలు చేసినట్లయితే.. అందులో వచ్చే రివార్డ్ పాయింట్స్ కేవలం ప్రొడక్ట్‌కు మాత్రమే వర్తిస్తాయి. ఇప్పుడు 1వ తేదీ నుంచి స్మార్ట్‌బై పోర్టల్ ప్రతి క్యాలెండర్ త్రైమాసికానికి 50,000 రివార్డ్ పాయింట్ల చొప్పున తనిష్క్ వోచర్ల కోసం రివార్డ్ పాయింట్ల రిడీమ్‌ను పరిమితం చేస్తుంది. ఈ మార్పులు ఇన్ఫినియా, ఇన్ఫినియా మెటల్ కార్డ్‌లకు మాత్రమే వర్తిస్తాయి.ఇదీ చదవండి : ఇద్దరితో మొదలై.. విశ్వమంతా తానై - టెక్ చరిత్రలో గూగుల్ శకం.. అనన్య సామాన్యంటీడీఎస్ వడ్డీ రేట్లుకేంద్ర బడ్జెట్ సమయంలో సెక్షన్ 194DA - జీవిత బీమా పాలసీకి సంబంధించి చెల్లింపును 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించాలని ప్రతిపాదించారు. ఇది అక్టోబర్ 1, 2024 నుండి అమలులోకి వస్తుంది. సెక్షన్ 194G - లాటరీ టిక్కెట్ల విక్రయంపై కమీషన్ తదితరాలను కూడా 5 నుంచి 2 శాతానికి తగ్గించాలని పేర్కొన్నారు. ఇది కూడా 1వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తుంది. కమిషన్ లేదా బ్రోకరేజీ చెల్లింపులు, హెచ్‌యూఎఫ్‌లు చేసే అద్దె చెల్లింపులు వంటి వాటికి అక్టోబర్ 1 నుంచి టీడీఎస్ రేట్లు తగ్గుతున్నట్లు సమాచారం. -
డెబిట్ కార్డు లేకపోయినా డబ్బు విత్‌డ్రా
డెబిట్ కార్డు పోయిందా..ఏటీఎంకు కార్డు తెసుకెళ్లడం మర్చిపోయారా..డెబిట్ కార్డు లేకుండా దూరప్రాంతాలకు వెళ్లారా.. మరేం పర్వాలేదు. మీరు ఉన్న ప్రాంతంలో ఏటీఎం ఉంటే ఎలాంటి డెబిట్ కార్డు లేకుండానే నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే అందుకోసం మీ స్మార్ట్‌ఫోన్‌లో యూపీఐ యాప్ ఉంటే సరిపోతుంది. కార్డు అవసరం లేకుండా యూపీఐ ద్వారా ఎలా డబ్బు విత్‌డ్రా చేయాలో తెలుసుకుందాం.బ్యాంకింగ్ రంగ సేవల్లో టెక్నాలజీ విస్తరిస్తోంది. అందులో భాగంగా యూపీఐ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ఏ చిన్న లావాదేవీలు చేయాలన్నా స్మార్ట్పోన్లోని యూపీఐని వినియోగిస్తున్నారు. దీన్ని ఉపయోగించి డెబిట్ కార్డు లేకుండానే ఏటీఎంలో డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. అందుకోసం ఇంటర్ ఆపరబుల్ కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రావల్ (ఐసీసీడబ్ల్యూ) విధానం ఉపయోగపడుతుంది. ప్రస్తుతం చాలా బ్యాంకులు ఈ సర్వీసును అందిస్తున్నాయి.విత్‌డ్రా చేసుకోండిలా..ముందుగా మీ వద్ద యూపీఐ యాప్ ఇన్స్టాల్ చేసిన స్మార్ట్‌ఫోన్ ఉండాలి. ప్రస్తుతం చాలామంది గూగుల్‌పే, ఫోన్‌పే..వంటి యూపీఐ ధర్డ్‌పార్టీ యాప్‌లను వాడుతున్నారు.మీ బ్యాంకు ఐసీసీడబ్ల్యూ సేవలందిస్తుందో లేదో తనిఖీ చేసుకోవాలి.ఒకవేళ ఈ సర్వీసు అందుబాటులో ఉంటే ఏటీఎం వద్దకు వెళ్లి స్క్రీన్‌పై ‘యూపీఐ నగదు ఉపసంహరణ’ ఆప్షన్ ఎంచుకోవాలి.ఏటీఎం ప్రొవైడర్‌ను బట్టి ఈ ఎంపిక విభిన్నంగా ఉండవచ్చు. జాగ్రత్తగా గమనిస్తే సులువుగానే దాన్ని గుర్తించవచ్చు.యూపీఐ విత్‌డ్రా సెలక్ట్ చేసుకున్నాక క్యూఆర్ కోడ్ డిస్ప్లే అవుతుంది.మీ ఫోన్లోని యూపీఐ యాప్ ఓపెన్ చేసి ఏటీఎం స్క్రీన్‌పై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి.మీరు ఎంత డబ్బు విత్‌డ్రా చేయాలో ఎంటర్ చేసి, యూపీఐ పిన్ ప్రెస్ చేయాలి. (యూపీఐ ద్వారా ఏటీఎం రోజువారీ విత్‌డ్రా పరిమితి సాధారణంగా రూ.10,000గా ఉంటుంది)కొంత సమయం తర్వాత బ్యాంకు సిస్టమ్ సర్వర్‌తో కనెక్ట్ అయి డబ్బు విత్‌డ్రా అవుతుంది.ఇదీ చదవండి: కొత్త పెన్షన్ విధానంలోని కీలకాంశాలు..ఈ ప్రక్రియ వల్ల ఖాతాదారుల వ్యక్తిగత సమాచారానికి ఎలాంటి ప్రమాదం ఉండదు. క్యూఆర్ కోడ్ మీ సమాచారాన్ని రక్షించడానికి ఎన్క్రిప్షన్ని ఉపయోగిస్తుంది. మీకు మాత్రమే తెలిసిన యూపీఐ పిన్‌తో లావాదేవీని పూర్తి చేసుకోవచ్చు. -
చోరీ డెబిట్ కార్డుతో లాటరీ.. రూ. 41 కోట్లు గెలిచి..
యూకేలో ఓ వింత ఉదంతం వెలుగు చూసింది. ఈ దేశానికి చెందిన ఇద్దరు దొంగలు లాటరీలో నాలుగు మిలియన్ పౌండ్లు గెలుచుకున్నాడు. భారత కరెన్సీతో పోల్చిచూస్తే ఈ మొత్తం రూ.41 కోట్ల 66 లక్షలు. ఇంత భారీ ప్రైజ్ మనీ గెలుచుకున్నాక కూడా వారు చిక్కుల్లో పడ్డాడు. బోల్టన్‌కు చెందిన జాన్ రాస్ వాట్సన్, మార్క్ గుడ్‌రామ్‌లు తాము చోరీ చేసిన డెబిట్ కార్డుతో లాటరీ టిక్కెట్ కొనుగోలు చేశారు. ఆ లాటరీ ఫలితాలు రాగానే వారు ఆనందంతో గెంతేశారు. తాము నాలుగు మిలియన్ పౌండ్లు అందుకోబోతున్నామంటూ ఉబ్బితబ్బిబయ్యారు. అయితే వారి ఆనందం కొద్దిసేపటికే ఆవిరయ్యింది. లాటరీలో వచ్చిన మొత్తాన్ని అందుకునేందుకు వారు లాటరీ నిర్వాహకులను సంప్రదించారు. వారు బ్యాంకు ఖాతా గురించి అడగగా, గుడ్‌రామ్ తనకు బ్యాంకు ఖాతా లేదని తెలిపాడు. దీంతోవారు అనుమానంతో అతనిని పలు విధాలుగా విచారించారు. ఈ నేపధ్యంలో గుడ్‌రామ్ ఆ కార్డు తన స్నేహితుడు జాన్‌దని తెలిపాడు. దీంతో వారు జాన్‌ను కూడా విచారించారు. అది అతనిది కూడా కాదని తేలింది. లాటరీ నిర్వాహకుల విచారణలో ఆ డెబిట్ కార్డు జోషువా అనే వ్యక్తికి చెందినదని తేలింది. దీంతో జాన్ రాస్ వాట్సన్, మార్క్ గుడ్‌రామ్‌లు ఆ కార్డును దొంగిలించారని వారు గుర్తించారు. విషయం పోలీసుల వరకూ చేరింది. కోర్టు విచారణలో జాన్ రాస్ వాట్సన్, మార్క్ గుడ్‌రామ్‌లకు 18 నెలల చొప్పున జైలు శిక్ష పడింది. డెబిట్ కార్డు యజమాని జోషువా ఆ లాటరీ మొత్తాన్ని అందుకునేందుకు అర్హుడయ్యాడు. ఈ విషయం తెలిసినవారంతా అదృష్టమంటే ఇదేనేమో అని అంటున్నారు. -
లైఫ్‌టైమ్ జీరో బ్యాలెన్స్ అకౌంట్! డెబిట్, క్రెడిట్ కార్డులు కూడా...
BoB LITE Savings Account: బ్యాంక్ అకౌంట్ లేని వారికి, జీరో బ్యాలెన్స్ అకౌంట్ కావాల్సిన వారి కోసం ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) సరికొత్త అకౌంట్‌ను అందిస్తోంది. బీఓబీ ప్రత్యేక పండుగ క్యాంపెయిన్‌లో భాగంగా ‘బీఓబీ లైట్ సేవింగ్స్ అకౌంట్’ పేరిట లైఫ్‌టైమ్ జీరో బ్యాలెన్స్ అకౌంట్‌ను ప్రకటించింది. ఈ అకౌంట్‌తో మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేకుండానే బ్యాంకింగ్ సేవలు పొందవచ్చని బ్యాంక్ ఆఫ్ బరోడా ఓ ప్రకటనలో పేర్కొంది. ఉచితంగా డెబిట్, క్రెడిట్ కార్డులు బీఓబీ లైట్ సేవింగ్స్ అకౌంట్‌తో పాటు కస్టమర్లు ఉచితంగా డెబిట్, క్రెడిట్ కార్డులు కూడా పొందవచ్చు. అయితే లైఫ్‌టైమ్ ఫ్రీ రూపే ప్లాటినమ్ డెబిట్ కార్డు కోసం సగటు త్రైమాసిక బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయాల్సి ఉంటుంది. అలాగే అర్హతను బట్టీ లైఫ్‌టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డు కూడా పొందవచ్చు. వీటితో పాటు మరిన్ని ఆఫర్లను కస్టమర్లకు బ్యాంక్ అందిస్తోంది. ఇప్పటికే వివిధ కన్జ్యూమర్ బ్రాండ్లతో ఒప్పందం చేసుకున్న బ్యాంక్ ఆఫ్ బరోడా.. డిసెంబర్ 31 వరకు వివిధ బ్రాండ్లపై ఆకర్షణీయమైన ఆఫర్లు అందిస్తోంది. రిలయన్స్ డిజిటల్, క్రోమా, మేక్ మై ట్రిప్, అమెజాన్, బుక్ మై షో, మింత్రా, స్విగ్గీ, జొమాటోలో కొనుగోళ్లపై స్పెషల్ ఆఫర్లు లభిస్తాయని బ్యాంక్ ఆఫ్ బరోడా ఓ ప్రకటనలో తెలిపింది. బీఓబీ లైట్ సేవింగ్స్ అకౌంట్ ప్రయోజనాలు ఇది లైఫ్‌టైమ్ జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్. 10 ఏళ్లు పైబడిన భారతీయ పౌరులెవరైనా ఈ కౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఉచితంగా రూపే ప్లాటినమ్ డెబిట్ కార్డు. ఇందు కోసం మెట్రో/అర్బన్‌లో రూ.3000, సెమీ అర్బన్‌లో రూ.2000, గ్రామీణ శాఖల్లో రూ.1000 త్రైమాసిక సగటు బ్యాలెన్స్ నిర్వహించాల్సి ఉంటుంది. అర్హత ఆధారంగా లైఫ్‌టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డు ఒక ఆర్థిక సవత్సరంలో ఉచితంగా 30 చెక్ లీవ్స్ -
Jio financial services: ఇకపై రిలయన్స్ జియో డెబిట్ కార్డులు!
రిలయన్స్ జియో టారిఫ్ పరంగా టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఆ దెబ్బతో అదే రంగంలోని కొన్ని కంపెనీలు కుదేలయ్యాయి. ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రత్యేకంగా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి పూర్తిస్థాయి ఆర్థిక సేవలు అందించేలా సన్నద్ధమవుతుంది. రిలయన్స్ ఫైనాన్షియల్ మార్కెట్లోనూ తన సత్తా చాటాలనుకుంటోంది. పేమెంట్ విభాగం సేవింగ్స్ అకౌంట్లను, బిల్ పేమెంట్ సర్వీసులను సంస్థ రీలాంచ్ చేసింది. త్వరలో డెబిట్ కార్డులు కూడా తీసుకురావాలని భావిస్తున్నట్లు కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ త్వరలో ఆటో, హోమ్లోన్లను కూడా జారీ చేయనుంది. ఇటీవల సంస్థ తొలి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు కొన్ని అంశాలను వెల్లడించారు. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ దేశవ్యాప్తంగా ఉన్న 300 స్టోర్లలో గృహ వినియోగ వస్తువులపై రుణాలను మంజూరు చేస్తోంది. ఇప్పటికే ముంబయిలోని వేతన జీవులకు, స్వయం ఉపాధి పొందుతున్న వారికి వ్యక్తిగత రుణాలు అందిస్తుంది. త్వరలో వ్యాపారులకు సైతం రుణాలు జారీ చేస్తామని కంపెనీ తెలిపింది. ఇప్పటికే 24 బీమా సంస్థలతో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ జతకట్టింది. తన ఉత్పత్తులను వినియోగదారులకు చేరువ చేసేందుకు ఓ యాప్‌ను సైతం జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ సిద్ధం చేస్తోంది. -
వాట్సాప్ పేమెంట్స్ సేవల విస్తరణ
ముంబై: మెసేజింగ్ యాప్ వాట్సాప్ తాజాగా భారత మార్కెట్లో తమ చెల్లింపుల సేవలను మరింతగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగా వ్యాపార సంస్థలకు కొనుగోలుదారులు చేసే పేమెంట్స్ ప్రక్రియను సులభతరం చేసింది. ‘వాట్సాప్ బిజినెస్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించే భారతీయ వ్యాపార సంస్థలన్నింటికీ మా పేమెంట్స్ సర్వీసును విస్తరిస్తున్నాం. కొనుగోలుదారులు తమకు కావాల్సిన ఉత్పత్తులను వాట్సాప్‌లోనే కార్ట్‌కి జోడించుకోవడంతో పాటు తమకు నచ్చిన పేమెంట్ విధానం ద్వారా .. అంటే వాట్సాప్ లేదా యూపీఐ యాప్‌లు, డెబిట్ .. క్రెడిట్ కార్డులతో కూడా చెల్లించవచ్చు. ఇందుకోసం ఇతర వెబ్‌సైట్‌కి గానీ, మరో యాప్‌కి గానీ వెళ్లనక్కర్లేదు. వ్యక్తిగతంగా వెళ్లి చెల్లించనక్కర్లేదు‘ అని సంస్థ తెలిపింది. ఈ ఫీచర్ ఇప్పటికే సింగపూర్, బ్రెజిల్లో చిన్న వ్యాపార సంస్థల కోసం కంపెనీ అమలు చేస్తోంది. వ్యాపార సంస్థలు, కొనుగోలుదారులు మెసేజింగ్ ఫీచర్‌ను సమర్ధంగా వినియోగించుకునే విషయంలో ప్రపంచానికి భారత్ సారథ్యం వహిస్తోందని బిజినెస్ మెసేజింగ్ సదస్సు ’కన్వర్సేషన్స్’ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్న వాట్సాప్ మాతృసంస్థ మెటా వ్యవస్థాపకుడు, సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు. వాట్సాప్ ఫ్లోస్, వెరిఫైడ్ బ్యాడ్జ్ .. మెసేజింగ్ ఫార్మాట్లు, గ్రూప్ చాట్స్, బ్రాడ్కాస్ట్ చానల్స్ విషయంలో మెటా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను ఆవిష్కరిస్తోందని జుకర్‌బర్గ్ చెప్పారు. ఇందులో భాగంగా వ్యాపార సంస్థల కోసం వాట్సాప్ ఫ్లోస్, మెటా వెరిఫైడ్ బ్యాడ్జ్‌లను విస్తృతంగా అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. రిజర్వేషన్ బుకింగ్, ఉత్పత్తులను ఆర్డర్ చేయడం, ఫ్లయిట్స్‌లో చెకిన్ చేయడం వంటి అంశాల్లో కస్టమర్లకు వెసులు బాటు కల్పించేలా వాట్సాప్ ఫ్లోస్‌ను వ్యాపార సంస్థలు ఉపయోగించుకోవచ్చు. మరోవైపు, మెటా వెరిఫైడ్ బ్యాడ్జ్‌లను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్‌లకు విస్తరిస్తున్నట్లు ఆయన తెలిపారు. -
యూపీఐ ట్రాన్సాక్షన్ల జోరు.. డెబిట్ కార్డులు బేజారు!
సాక్షి, హైదరాబాద్: డిజిటల్ లావాదేవీలతో మనోళ్లు దుమ్మురేపుతున్నారు. యూపీఐ పేమెంట్స్ అనేది అత్యంత ప్రజాదరణ పొందిన డబ్బు బదిలీ (మనీ ట్రాన్స్ఫర్)గా నేడు అవతరించింది. అందుకే మునుపెన్నడూ లేనంత స్థాయిలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ట్రాన్సాక్షన్ల జోరు కొనసాగుతోంది. మూడు, నాలుగేళ్ల కిందట ప్రధానంగా బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులతో అత్యధికంగా పలు రకాల లావాదేవీలు, ఆర్థిక కార్యకలాపాలు జరిగిన విషయం తెలిసిందే. కోవిడ్ మహమ్మారి కాలం తెచ్చిన మార్పు చేర్పులతో డెబిట్, క్రెడిట్ కార్డుల వినియోగాన్ని తోసిరాజని యూపీఐ లావాదేవీలు ఇప్పుడు అగ్రపీఠాన్ని అధిరోహించాయి. యూపీఐ ద్వారా... చిన్న మొత్తంలో కొనుగోళ్లు, ఇతరత్రా చెల్లింపులకు అవకాశం ఉండడంతో వాటివైపే అత్యధికుల మొగ్గు చూపుతున్నట్టు స్పష్టమైంది. రోజువారీ నిత్యావసర కొనుగోళ్లు మొదలు, మార్కెట్లో వివిధరకాల వస్తువుల కొనుగోలుకు యూపీఐ చెల్లింపు విధానాన్ని మెజారిటీ వినియోగదారులు అనుసరిస్తున్నారు. గత మూడేళ్లలో 428 శాతం యూపీఐ ట్రాన్సాక్షన్లు పెరగ్గా, గత నెలలో (ఆగస్టులో) రూ.పది బిలియన్ల (బిలియన్ = 100 కోట్లు) ట్రాన్సాక్షన్ల నమోదుతో తొలిసారి రికార్డ్ సృష్టించాయి. మూడేళ్లుగా డిజిటల్ లావాదేవీలు కోవిడ్ నుంచి మూడేళ్లుగా క్రమంగా డిజిటల్ లావాదేవీలు పెరిగాయి. ఎంతగా అంటే.. 2023–24 ఆర్థికసంవత్సరంలో (ఏప్రిల్–జూలైల మధ్య) చెల్లింపుల విషయానికొస్తే..క్రెడిట్‌కార్డుల ద్వారా రూ.5.57 ట్రిలియన్లు, డెబిట్‌కార్డులతో రూ.13 ట్రిలి యన్లు, యూపీఐ ద్వారా రూ.59.14 ట్రిలియన్ల (ట్రిలియన్ = లక్ష కోట్లు)లో జరిగినట్టు వెల్లడైంది. ఆర్బీఐ డేటా ఆధారంగా రూపొందించిన నివేదికలు ఈ విషయాన్నే స్పష్టం చేస్తున్నాయి. కరోనా తెచ్చిన మార్పులతో భారతీయులు అనుస రిస్తున్న వ్యయం తీరులో మార్పులు వచ్చి నట్టుఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. చదవండి: పనిచేస్తున్న బ్యాంకులోనే రూ.8.5 కోట్లు స్వాహా చేసిన డిప్యూటీ మేనేజర్ కీలకాంశాలు ► 2020 జూలైలో డెబిట్‌కార్డుల ద్వారా చేసిన చెల్లింపులు రూ.2.81 ట్రిలియన్లు కాగా. 2023 జూలైలో అవి రూ.3.15 ట్రిలియన్లుకు... అంటే 11.96 శాతం వృద్ధిని మాత్రమే నమోదుచేశాయి. ► ఇదే సమయంలో యూపీఐ చెల్లింపులు అనేవి రూ.2.90 ట్రిలియన్ల నుంచి రూ.15.33 ట్రిలియన్లకు.. అంటే 428 శాతం పెరుగుదలను రికార్డ్ చేశాయి ►మరోవైపు క్రెడిట్‌కార్డుల ద్వారా చెల్లింపులు కూడా పెరుగుతున్నాయి ► 2020 జూలైలో రూ.0.45 ట్రిలియన్ల చెల్లింపులతో పోల్చితే 2023 జూలై నాటికి అవి రికార్డ్ స్థాయిలో రూ.1.45 ట్రిలియన్లకు చేరుకున్నాయి ► కస్టమర్లు చెల్లిస్తున్న పద్ధతుల్లో భారీ మార్పుల వస్తున్నా డెబిట్‌కార్డుల వినియోగం పూర్తిగా కనుమరుగయ్యే అవకాశాలు లేవు. మార్కెట్లో వాటి స్థానం పదిలమని నిపుణుల అంచనా. 20 బిలియన్లకు చేరుకున్నా ఆశ్చర్యం లేదు చిన్న చిన్న మొత్తాల్లో చెల్లింపులు పెరగడం, ఫోన్ ద్వారా యూపీఐ లావాదేవీల వెసులుబాటుతో.. సంప్రదాయ చెల్లింపు పద్ధతిగా ఉన్న కస్టమర్ల డెబిట్‌కార్డుల వినియోగం అనేది బాగా తగ్గింది. దీనిని బట్టి వచ్చే 18–24 నెలల కాలంలో యూపీఐ లావాదేవీలు నెలకు రూ.20 బిలియన్లకు చేరుకున్నా ఆశ్చర్యపడక్కర లేదు. –సునీల్ రంగోలా, సీనియర్ వైస్‌ప్రెసిడెంట్, హెడ్ –స్ట్రాటజీ,ఇన్నోవేషన్, అనాలిటిక్స్, వరల్డ్‌లైన్ ఇండియా -
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్! ఏటీఎం కార్డు వాడట్లేదా? అయితే...
ప్రస్తుతం యూపీఐ వినియోగం ఎక్కువైంది. ఎక్కడ డబ్బు చెల్లించాలన్న ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం వంటి యూపీఐ యాప్‌ల ద్వారానే అన్ని చెల్లింపులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఏటీఎం వాడకం బాగా తగ్గిపోయింది. ఇక రెండు మూడు కార్డులున్న వారి సంగతి చెప్పనక్కర్లేదు. అయితే ఎప్పుడోకానీ ఏటీఎం కార్డులు వాడని వారికి ఇబ్బందులు తప్పడం లేదు. సాధారణంగా డెబిట్ కార్డు గడువు ముగిసిన తర్వాత బ్యాంకులు ఆటోమేటిక్‌గా కొత్త ఏటీఎం కార్డును పోస్ట్ ద్వారా కస్టమర్ల చిరునామాకు పంపుతాయి. కానీ ఓ ఎస్బీఐ కస్టమర్‌కు విభిన్న అనుభవం ఎదురైంది. దీనిపై ఆ కస్టమర్ ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. (ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్! ఇకపై మరింత..) ఆ కస్టమర్‌కు ఎస్బీఐలో 10 సంవత్సరాలుగా అకౌంట్ ఉంది. అతని డెబిట్ కార్డ్ గడువు ఇటీవలే ముగిసింది. కొత్త ఏటీఎం కార్డు ఆటో మేటిక్‌గా పోస్టులో ఇంటికి రావాల్సిఉండగా అతనికి బ్యాంక్ కొత్త ఏటీఎం కార్డును పంపలేదు. దీంతో బ్యాంక్ బ్రాంచికి వెళ్లిన అతనికి కొత్త కార్డు కావాలంటే మరోసారి దరఖాస్తు చేసుకోవాలని బ్యాంకులు అధికారులు చెప్పారు. ఇదీ చదవండి: బాస్మతి బియ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు.. దీంతో ఎక్స్ (ట్విటర్)లో ఎస్బీఐ యాజమాన్యాన్ని ట్యాగ్ చేస్తూ ఫిర్యాదు చేయగా ఎస్బీఐ స్పందించింది. కొత్త ఏటీఎం కార్డు ఎందుకు రాలేదో కారణాలను వివరించింది. కార్డు గడువు ముగిసేందుకు మూడు నెలల ముందే అప్రమత్తం కావాలని సూచించింది. కొత్త కార్డు ఆటోమేటిక్‌గా రావాలంటే.. ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ అకౌంట్ అయి ఉండకూడదు. డెబిట్ కార్డును ఏడాదిలో కనీసం ఒక్కసారైనా వాడి ఉండాలి. అకౌంట్‌కు కస్టమర్ పాన్ నంబర్ తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి. -
డేంజర్: ఇది జరిగితే మీ బ్యాంక్ అకౌంట్ ప్రమాదంలో ఉన్నట్టే..
ప్రపంచవ్యాప్తంగా సైబర్ మోసాలు ఎక్కువయ్యాయి. అమాయక ప్రజల డబ్బును దోచుకునేందుకు సైబర్ మోసగాళ్లు రోజుకో ఎత్తు వేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. మీ డెబిట్, క్రెడిట్ కార్డ్ వివరాలు అత్యంత తేలికగా స్కామర్ల చేతికి చేరుతున్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. పలు అక్రమ వైబ్సైట్లు, టెలిగ్రామ్ చానెళ్లు డెబిట్, క్రెడిట్ కార్డ్ నంబర్లు, కార్డ్ హోల్డర్ పేర్లు, సీవీవీతో సహా వివరాలను స్కామర్లకు విక్రయిస్తున్నాయి. అదీ కూడా ఒక్కో కార్డు వివరాలు కేవలం 5 యూఎస్ డాలర్లు. అంటే రూ.410లకు మాత్రమే. పశ్చిమ దేశాలలో చెల్లింపులు ప్రాసెస్ చేయడానికి కార్డు వివరాలు ఉంటే సరిపోతుంది. ఓటీపీ అవసరం ఉండదు. అందుకే ఆయా దేశాల్లో పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. కానీ భారత్‌లో వన్ టైమ్ పాస్వర్డ్ (OTP) ద్వారా రెండు-కారకాల ప్రామాణీకరణ తప్పనిసరి. అయినప్పటికీ దీన్ని కూడా అధిగమించడానికి స్కామర్లు కొత్త మార్గాన్ని కనుగొన్నారు. ఉన్నట్టుండి సిమ్ డీయాక్టివేట్ అయితే.. బాధితుల ఒరిజినల్ సిమ్‌ను డీయాక్టివేట్ చేయడం ద్వారా స్కామర్లు ఓటీపీని ఎలా యాక్సెస్ చేస్తున్నారో భారతీయ పోలీసు అధికారులను టైమ్స్ ఆఫ్ ఇండియా ఉటంకిస్తూ పేర్కొంది. హ్యాకర్లు డెబిట్, క్రెడిట్ కార్డ్ వివరాలను బాధితుడి పేరు, ఫోన్ నంబర్‌తో సహా షాడో వెబ్సైట్లు, టెలిగ్రామ్ చానెళ్ల ద్వారా అమ్మకానికి పెడుతున్నారు. సైబర్ మోసగాళ్లు ఈ వివరాలను కొనుగోలు చేసి టెలికాం సర్వీస్ ప్రొవైడర్లను సంప్రదించి బాధితుల సిమ్ కార్డ్ డీయాక్టివేట్ చేయిస్తున్నారు. తర్వాత డూప్లికేట్ సిమ్ పొంది ఓటీపీలను సునాయాసంగా యాక్సెస్ చేయగలుగుతున్నారు. నష్టం జరిగేంత వరకు బాధితుడి ఈ మోసం గురించి తెలియదు. కాబట్టి మీ సిమ్ కార్డ్ ఉన్నట్టుడి డీయాక్టివేట్ అయినట్లు గుర్తిస్తే వెంటనే అప్రమత్తం కావాలి. కొన్ని నిమిషాల్లోనే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. ఈ వెబ్సైట్లను నిర్వహిస్తున్నదెవరు? నివేదిక ప్రకారం.. అక్రమ వెబ్సైట్లు, టెలిగ్రామ్ చానెళ్లను రష్యా, ఉక్రెయిన్ దేశాలకు చెందిన హ్యాకర్లు నిర్వహిస్తున్నట్లుగా తేలింది. వీళ్లు వెబ్సైట్లు, టెలిగ్రామ్ చానెళ్ల ద్వారా కార్డ్ వివరాలను హ్యాక్ చేసి విక్రయిస్తున్నారు. సంపన్న పాశ్చాత్య దేశాలకు చెందిన వారి కార్డు వివరాలకు ఒక్కో కార్డుకు 10 డాలర్లు (రూ.820) చొప్పున తీసుకుంటుండగా భారత్ సహా ఆసియా దేశాలకు చెందిన బాధితుల కార్డుల వివరాలకు చవగ్గా కేవలం 5 డాలర్లు (రూ.410)కే అమ్మేస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. 2022 జనవరిలో అటువంటి అక్రమ వెబ్సైట్ ఒకదానిని అధికారులు గుర్తించి చర్యలు తీసుకున్నారు. కానీ అలాంటి అక్రమ వెబ్సైట్లు, టెలీగ్రామ్ చానెళ్లు లెక్కకు మించి పుట్టుకొస్తున్నాయి. ఇదీ చదవండి: ఇంటర్నెట్ షట్‌డౌన్: ఆరు నెలల్లో ఇన్ని వేల కోట్ల నష్టమా? -
డెబిట్ కార్డు పోయిందా? సింపుల్‌గా ఇలా బ్లాక్ చేయండి!
State Bank of India: కొన్ని సందర్భాల్లో అనుకోకుండా ఏటీఎమ్ కార్డు లేదా డెబిట్ కార్డు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో చాలా మంది కంగారు పడతారు. కానీ డెబిట్ కార్డు పోగొట్టుకుంటే ఏ మాత్రం గాబరా పడకుండా.. సింపుల్‌గా బ్లాక్ చేయవచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. (ఇదీ చదవండి: హైలక్స్ కొనుగోలుపై బంపర్ ఆఫర్.. మిస్ చేసుకుంటే మళ్ళీ రాదేమో!) మీరు పోగొట్టుకున్నది స్టేట్ బ్యాంక్ ఏటీఎమ్ కార్డు అయితే.. ముందుగా స్టేట్ బ్యాంక్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లాలి. వెబ్సైట్ ఓపెన్ చేసి అక్కడ బ్లాక్ ది కార్డ్‌పై క్లిక్ చేయాలి. డెబిట్ కార్డును ఆన్లైన్ నుంచి బ్లాక్ చేయాలనుకుంటే తప్పకుండా మీ అకౌంట్ నెంబర్‌కి.. మీ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, కంట్రీ, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి.. క్యాప్చా ఫిల్ చేయాలి. ఇవన్నీ పూర్తయిన తరువాత సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తరువాత మీ మొబైల్ నెంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ నెంబర్ ఎంటర్ చేసి తరువాత మీ పేరు మీద ఉన్న బ్యాంక్ అకౌంట్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి. అందులో ఏ కార్డునైతే బ్లాక్ చేయాలనుకుంటారో.. అక్కడ కనిపించే నుంబర్లలో సెలక్ట్ చేసుకుని సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి. ఒక సారి కార్డుని బ్లాక్ చేసిన తరువాత దానిని తిరిగి ఆన్లైన్లో అన్‌బ్లాక్ చేయడం సాధ్యం కాదు. -
వామ్మో! క్రెడిట్ కార్డు రుణాలు.. ఒక్క ఏప్రిల్‌లోనే అన్ని లక్షల కోట్లా!
దేశంలో క్రెడిట్ కార్డ్ వినియోగం అంతకంతకూ పెరిగిపోతోంది. ఏడాదిలో క్రెడిట్‌కార్డ్ రుణాలు ఏకంగా 30 శాతం పెరగడమే దీనికి నిదర్శనం. క్రెడిట్ కార్డు రుణ బకాయిలు అమాంతంగా పెరుగుతున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) తాజా నివేదిక వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం.. ► దేశంలో క్రెడిట్ కార్డ్ రుణ బకాయిలు 2023 ఏప్రిల్‌లో ఏకంగా రూ.2.05 లక్షల కోట్లకు చేరాయి. 2022, ఏప్రిల్‌లో ఉన్న బకాయిల కంటే ఇవి 30 శాతం అధికం కావడం గమనార్హం. 2023, ఏప్రిల్‌లోనే రూ.1.3 లక్షల కోట్ల మేరకు క్రెడిట్ కార్డ్ రుణాలు తీసుకోవడం విస్మయపరుస్తోంది. ► ఇక బ్యాంకులు ఇస్తున్న మొత్తం రుణాల్లో క్రెడిట్ కార్డ్ రుణాలు 1.4 శాతానికి చేరాయి. 2008లో ఆర్థిక మాంద్యం సమయంలో దేశంలో క్రెడిట్ కార్డ్ రుణాలు అత్యధికంగా 1.2 శాతానికి చేరాయి. అనంతరం దశాబ్దం పాటు క్రెడిట్ కార్డ్ రుణాలు ఒక్క శాతం కంటే తక్కువే ఉంటూ వచ్చాయి. కానీ 2023 ఏప్రిల్‌లో క్రెడిట్ కార్డ్ రుణాలు 1.4 శాతానికి చేరుకోవడం గమనార్హం. కాగా విశ్వసనీయమైన ఖాతాదారులకే క్రెడిట్ కార్డ్ రుణాలిస్తున్నామని బ్యాంకులు చెబుతున్నాయని ఆర్బీఐ పేర్కొంది. దేశ జనాభాలో ఇంకా కేవలం 5 శాతం మందే క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగిస్తున్నారని కూడా ఆర్బీఐ తెలిపింది. ► దేశంలో వ్యక్తిగత రుణాల్లో క్రెడిట్ కార్డ్ రుణాలు మూడో స్థానంలో ఉన్నాయి. వ్యక్తిగత రుణాల్లో గృహ రుణాలు మొదటి స్థానంలో ఉన్నాయి. బ్యాంకులు ఇస్తున్న రుణాల్లో గృహ రుణాల వాటా 14.1 వాటా ఉంది. 3.7శాతం వాటాతో వాహన రుణాలు రెండో స్థానంలో ఉన్నాయి. 1.4 శాతంతో క్రెడిట్ కార్డు రుణాలు మూడో స్థానంలో ఉన్నాయి. ► బ్యాంకులు జారీ చేస్తున్న పారిశ్రామిక రుణాల వాటా 2022–23లో తగ్గింది. 2021–22లో పారిశ్రామిక రుణాలు 26.3శాతం ఉండగా.. 2022–23లో 24.3 శాతానికి తగ్గాయి. చదవండి: గుడ్‌న్యూస్: ఈపీఎఫ్‌వో అధిక పింఛన్‌కు దరఖాస్తు గడువు పొడిగింపు -
ఆధార్‌తో యూపీఐ పేమెంట్: గూగుల్‌పేలో కొత్త ఫీచర్
Aadhaar-based UPI: గూగుల్‌పే (Google Pay) యూజర్లకు కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఆధార్‌తో యూపీఐ చెల్లింపుల కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)కు యూజర్లు గూగుల్‌పే యాప్‌లో నమోదు చేసుకోవచ్చు. డెబిట్ కార్డుతో పనిలేదు ఆధార్ ఆధారిత యూపీఐ ఆన్‌బోర్డింగ్ విధానం ద్వారా గూగుల్‌పే యూజర్లు డెబిట్ కార్డ్ లేకుండానే తమ యూపీఐ పిన్ని సెట్ చేసుకోవచ్చు. కోట్లాది మంది యూపీఐ చెల్లింపులను వినియోగిస్తున్న నేపథ్యంలో ఇది చాలా మంది వినియోగదారులకు యూపీఐ ఐడీలను సెటప్ చేసుకునేందుకు, డిజిటల్ చెల్లింపులు చేయడానికి ఈ ఫీచర్ వీలు కల్పిస్తుందని భావిస్తున్నారు. ఇదీ చదవండి: Retrieve Aadhaar card: ఆధార్ కార్డ్ పోయిందా.. నంబర్ కూడా గుర్తులేదా.. ఎలా మరి? ఆధార్‌తో యూపీఐ పేమెంట్ అవకాశం ప్రస్తుతానికి ఎంపిక చేసిన కొన్ని బ్యాంకుల కస్టమర్లకు మాత్రమే ఉండగా త్వరలో మరిన్ని బ్యాంకులు ఈ సదుపాయాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. ఆధార్ ద్వారా యూపీఐ చెల్లింపులను వినియోగించుకోవాలంటే ఆధార్, బ్యాంక్‌లో నమోదు చేసుకున్న ఫోన్ నంబర్ ఒకటే అయి ఉండాలి. అలాగే బ్యాంక్ ఖాతా ఆధార్‌తో లింక్ చేసి ఉండాలి. నమోదు చేసుకోండిలా.. గూగుల్‌పే యాప్‌లో వినియోగదారులు డెబిట్ కార్డ్ లేదా ఆధార్ ఆధారిత యూపీఐ నమోదును ఎంపిక చేసుకోవచ్చు. ఆధార్‌ని ఎంచుకుంటే నమోదు ప్రక్రియను ప్రారంభించడానికి వారి ఆధార్ నంబర్లోని మొదటి ఆరు అంకెలను నమోదు చేయాలి. ప్రామాణీకరణ దశను పూర్తి చేయడానికి ఆధార్ (UIDAI), బ్యాంక్ నుంచి వచ్చిన ఓటీపీలను నమోదు చేయాలి. తర్వాత ప్రక్రియను బ్యాంక్ పూర్తి చేశాక యూపీఐ పిన్ని సెట్ చేసుకోవచ్చు. ఇదీ చదవండి: ఆధార్ కొత్త ఫీచర్: ఓటీపీ మీ మొబైల్ నంబర్‌కే వస్తోందా? కస్టమర్లు లావాదేవీలు చేయడానికి లేదా బ్యాలెన్స్‌ని చెక్ చేయడానికి గూగుల్ యాప్‌ని ఉపయోగించవచ్చు. ఆధార్ నంబర్లోని మొదటి ఆరు అంకెలను నమోదు చేసిన తర్వాత, అది ధ్రువీకరణ కోసం NPCI ద్వారా UIDAIకి వెళ్తుంది. ఈ ప్రక్రియ వినియోగదారుల ఆధార్ నంబర్ భద్రతను నిర్ధారిస్తుంది. ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే గూగుల్‌పే ఆధార్ నంబర్‌ను స్టోర్ చేయదు. ధ్రువీకరణ కోసం NPCIతో ఆధార్ నంబర్‌ను భాగస్వామ్యం చేయడంలో కేవలం ఫెసిలిటేటర్‌గా మాత్రమే పనిచేస్తుంది. -
కొత్త రూల్ : క్రెడిట్‌కార్డుదారులకు అలర్ట్.. అలా వాడితే ట్యాక్స్ కట్టాల్సిందే!
న్యూఢిల్లీ: విదేశాల్లో క్రెడిట్ కార్డులపై చేసే ఖర్చుల మీద 20 శాతం టీసీఎస్ (ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్) విధింపుపై విమర్శలు వెల్లువెత్తడంతో ఆర్థిక శాఖ వివరణ ఇచ్చింది. ఒక ఏడాదిలో రూ. 7 లక్షల వరకు క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా చేసే వ్యయాలపై టీసీఎస్ విధించబోమని పేర్కొంది. ఇదీ చదవండి: రూ. 2000 నోట్ల రద్దు: షాపింగ్ చేసుకోవచ్చా? విదేశాల్లో క్రెడిట్ కార్డుతో చేసే వ్యయాలను కూడా కేంద్రం ఇటీవల రెమిటెన్స్ స్కీమ్–ఎల్ఆర్ఎస్ పరిధిలోకి తెచ్చింది. దీంతో జూలై 1 నుంచి విదేశాల్లో క్రెడిట్ కార్డులపై చేసే వ్యయాలపై 20% పన్ను వర్తించనుంది. అయితే ఇది ట్యాక్స్ టెర్రరిజం అంటూ విమర్శలు వెల్లువెత్తడంతో ఆర్థిక శాఖ తాజా ప్రకటన చేసింది. చదవండి👉 ఫ్లాష్‌బ్యాక్: ఆ నిర్ణయంతో..అతలాకుతలం మరిన్ని ఆసక్తికరమైన కథనాలు, అప్డేట్స్ కోసం చదవండి సాక్షి,బిజినెస్ -
అదిరిపోయే క్రెడిట్ కార్డ్, భారీ డిస్కౌంట్లు.. ఉచితంగా రైల్వే సదుపాయాలు!
హైదరాబాద్: ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎన్పీసీఐ భాగస్వామ్యంతో బిజినెస్ క్యాష్ బ్యాక్ రూపే క్రెడిట్ కార్డ్‌ను విడుదల చేసింది. వ్యాపారస్తుల కోసం దీన్ని ప్రత్యేకంగా తీసుకొచ్చింది. కార్డు ద్వారా కొనుగోళ్లపై 2 శాతం వరకు క్యాష్‌బ్యాక్, 48 రోజుల పాటు వడ్డీ లేని రుణ సదుపాయం, తక్షణ రుణ సదుపాయం ఈ కార్డులో భాగంగా ఉంటాయని ప్రకటించింది. అలాగే అగ్ని ప్రమాదాలు, దోపిడీలు, ఇళ్లు బద్ధలు కొట్టడం తదితర వాటికి కార్డులో భాగంగా బీమా కవరేజీ పొందొచ్చని ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తెలిపింది. ఎన్పీసీఐ సీఈవో దిలీప్ ఆస్బే సమక్షంలో ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎండీ, సీఈవో సంజయ్ అగర్వాల్ ఈ కార్డును ప్రారంభించారు. ఈ కార్డుపై లైఫ్‌స్టయిల్, ట్రావెల్ ప్రయోజనాలు కూడా ఉన్నట్టు బ్యాంక్ ప్రకటించింది. 300కు పైగా రెస్టారెంట్లలో 30% వరకు తగ్గింపు, ఏడాదికి 8 సార్లు రైల్వే లాంజ్‌లను ఉచితంగా వినియోగించుకునే సదుపాయం ఉంటుందని తెలిపింది. చదవండి👉 240 ఏళ్ల చరిత్రలో మ్యాన్ గ్రూప్ సంచలనం.. తొలిసారి మహిళా సీఈవో నియామకం! -
ఆ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డులు వాడుతున్నారా? కొత్త రూల్స్ చూసారా..!
కొత్త ఆర్ధిక సంవత్సరం ప్రారంభమైపోయింది. ఈ తరుణంలో ఎన్నెన్నో కొత్త రూల్స్ కూడా పుట్టుకొచ్చాయి. ఇందులో భాగంగానే కొన్ని బ్యాంకులు తమ క్రెడిట్ కార్డు / డెబిట్ కార్డులలో చాలా మార్పులు తీసుకువచ్చాయి. ఇందులో ఎస్బీఐ, కోటక్ మహీంద్రా, పంజాబ్ నేషనల్ బ్యాంకు ఉన్నాయి. ఈ బ్యాంకులు చేసిన మార్పులను గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ప్యూర్-ప్లే క్రెడిట్ కార్డ్ జారీచేసే ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ (ఎస్బీఐ కార్డ్) తమ AURUM కార్డ్‌లలో కొన్ని మార్పులు తీసుకువచ్చింది. దీని ప్రకారం ఆరమ్ కార్డు కలిగిన వారు RBL Luxeకి బదులుగా టాటా క్లిక్ లగ్జరీ నుంచి రూ. 5000 వోచర్ పొందుతున్నారు. గతంలో రూ.5 లక్షలు క్రెడిట్ కార్డు ద్వారా ఖర్చు చేసిన వారికి ఆర్బీఎల్ లగ్జరీ నుంచి ఈ వోచర్ వచ్చేది. ఈజీ డైనర్ ప్రైమ్, లెన్స్ కార్ట్ గోల్డ్ మెంబర్ షిప్ ప్రయోజనాలను తొలగించింది. అయితే ఈ కార్డు మీద ప్రైమ్ అండ్ లెన్స్‌కార్ట్ గోల్డ్ మెంబర్షిప్ బెనిఫిట్ ఇకపై అందుబాటులో ఉండే అవకాశం ఉండదు. పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB) 2023 మే 1 నుంచి పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB) కూడా కొత్త నిబంధనలను అమలులోకి తీసుకువచ్చింది. దీని ప్రకారం ఏటీఎమ్ నుంచి అమౌంట్ డ్రా చేసుకోవడం వంటి లావాదేవీలపైన రూ. 10 + జీఎస్టీ విధిస్తోంది. అంతే కాకుండా డెబిట్ కార్డు, ప్రీపెయిడ్ కార్డు వంటి వాటికి కూడా కొంత రుసుము అమలు చేసే ప్రక్రియలో బ్యాంకు ఆలోచిస్తున్నట్లు సమాచారం. కోటక్ మహీంద్రా బ్యాంకు కోటక్ మహీంద్రా బ్యాంకు విషయానికి వస్తే, ఇది 2023 మే 23 నుంచి డెబిట్ కార్డు చార్జీలను రూ. 259తో పాటు GST పెంచనున్నట్లు తమ కస్టమర్లకు ఒక మెయిల్ ద్వారా తెలిపింది. గతంలో ఈ చార్జీలు రూ. 199 ప్లస్ జీఎస్టీతో ఉండేది. కావున ఈ బ్యాంకు కూడా త్వరలోనే కొత్త రూల్స్ ద్వారా కస్టమర్ల మీద పెను భారాన్ని మోపే అవకాశం ఉందని భావిస్తున్నాము. -
ఏటీఎం కార్డ్ మెషిన్లో ఇరుక్కుపోయిందా.. జాగ్రత్త!
మీ ఏటీఎం కార్డు ఎప్పుడైనా మెషిన్లో ఇరుక్కుపోయిందా.. ఇలాంటప్పుడు మీరేం చేస్తారు.. తోటివారిని సాయం అడుగుతారు. మెషిన్లో ఏదో సమస్య వచ్చిందిలే అనుకుని బ్యాంకును సంప్రదిస్తారు.ఇలాంటి సందర్భంలోనే మోసగాళ్లు పొంచి ఉంటారు. సాయం చేసే నెపంతో కార్డులు మార్చి డబ్బులు కాజేస్తారు. కాపలా లేని ఏటీఎం సెంటర్ల వద్ద ఇలాంటి మోసగాళ్లు మాటు వేస్తున్నారు. ఏటీఎం మెషిన్లలో సమస్య కారణంగా ఇబ్బంది పడుతున్న కార్డుదారులను ఏమార్చి వారి కార్డులను క్లోనింగ్ చేయడమో మార్చేయడమో చేసి వారి కష్టార్జితాన్ని దోచేస్తున్నారు. ఈ మోసం ఇక్కడితో ఆగిపోదు. మీ కార్డ్‌ని మార్చేసిన కేటుగాళ్లు ఆ కార్డును ఉపయోగించి అకౌంట్లోని డబ్బు మొత్తాన్ని నిమిషాల వ్యవధిలో కొట్టేస్తున్నారు. నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇది నిజం. ఇదీ చదవండి: ఏటీఎం చార్జీలు.. జీఎస్టీ కొత్తరూల్! మే 1 నుంచి అమలయ్యే కీలక మార్పులు ఇవే.. ఇటువంటి అనేక ముఠాలు దేశంలోని అనేక ప్రాంతాలలో సంచరిస్తున్నాయి. డబ్బులు విత్‌డ్రా చేయడానికి ఏటీఎం మెషిన్లో కార్డ్ పెట్టి పిన్ ఎంటర్ చేసిన తర్వాత డబ్బు బయటకు రాగానే ఏటీఎం కార్డ్ మెషిన్లో ఇరుక్కుపోతుంది. ఏటీఎం స్క్రీన్‌పై అకౌంట్ బ్యాలెన్స్, ఫోన్ నంబర్, ఇతర వివరాలు కన్పిస్తాయి. మెషిన్లో ఏదో సమస్య తలెత్తిందని మీరు గ్రహించేలోపే ఇద్దరు ముగ్గురు వ్యక్తులు లోపలికి ప్రవేశిస్తారు. వారిలో ఒకరు మిమ్మల్ని మాటల్లో పెడతారు. మరొకరు మీ కార్డును వేరే కార్డుతో మార్చేసి కాజేసి అక్కడి నుంచి ఉడాయిస్తారు. తర్వాత కొద్ది సమయానికే డబ్బు విత్ డ్రా చేసినట్లు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఎస్సెమ్మెస్‌లు వస్తాయి. భయాందోళనకు గురైన కస్టమర్లు బ్యాంకుకు కాల్ చేసినా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే జరగాల్సిన మోసం అప్పటికే జరిగిపోయి ఉంటుంది. కార్డ్ డియాక్టివేషన్ అనేది చాలా శ్రమతో కూడుకున్న ప్రక్రియ. ఎందుకంటే అటువంటి సమస్యలను పరిష్కరించడానికి బ్యాంకులకు ప్రత్యేక వ్యవస్థ అంటూ ఏమీ ఉండదు. అనేక మంది బాధితులు ఇలాంటి మోసాలకు గురైన కస్టమర్లు చాలా మందే ఉన్నారు. ఢిల్లీలో ఒక సీనియర్ జర్నలిస్ట్ నగదు ఉపసంహరణ కోసం ఏటీఎంకు వెళ్లగా తన కార్డ్ మెషిన్లో ఇరుక్కుపోయింది. సహాయం చేసే నెపంతో దుండగులు తన ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ డెబిట్ కార్డ్‌ను ప్రభుత్వ రంగ బ్యాంకు కార్డుతో మార్చేశారు. ఘటన జరిగిన 10 నిమిషాల్లోనే తన మొబైల్లో విత్‌డ్రా నోటిఫికేషన్లు రావడంతో మోసపోయానని గ్రహించి వెంటనే బ్యాంక్ కస్టమర్ కేర్ సెంటర్‌కు ఫోన్ చేసి కార్డ్ బ్లాక్ చేయాలని కోరాడు. అయినా అకౌంట్ నుంచి డబ్బు పోవడం ఆగలేదు. ఎందుకంటే కార్డ్ డీయాక్టివేట్ చేసేందుకు సమయం పట్టింది. అలాగే తూర్పు ఢిల్లీలో జరిగిన మరో ఘటనలో ఓ గృహిణి ప్రభుత్వ రంగ బ్యాంక్ ఏటీఎంకి వెళ్లింది. ఆమె కార్డ్ కూడా ఇలాగే ఇరుక్కుపోయింది. ఆ కార్డును మోసగాళ్లు మార్చేసి షాపింగ్ చేశారు. ఆమె వెంటనే ఫిర్యాదు చేసినా దాదాపు రూ.1 లక్ష కోల్పోయిన తర్వాత ఆ కార్డ్ డీయాక్టివేట్ అయింది. ఇలాంటి మోసాలు జరగినప్పుడు ఏకకాలంలో బ్యాంక్ బ్రాంచ్ని సంప్రదించి, సైబర్ క్రైమ్ బ్రాంచ్‌కు ఫిర్యాదు చేస్తే మీ డబ్బును తిరిగి పొందడంలో సహాయపడతారని ఆర్బీఐ చెబుతోంది. అయితే బ్యాంకులు మాత్రం ఈ పిన్ నంబర్ మోసగాళ్లకు తెలిసి ఉండవచ్చని ఎప్పుడూ చెప్పే సమాధానమే చెబుతాయి. ఇక సైబర్ క్రైమ్ బ్రాంచ్ వద్ద ఇలాంటి కేసులు వేలల్లో ఉంటాయి. 65,893 మోసాలు ఆర్బీఐ డేటా ప్రకారం.. ఏటీఎం కార్డు, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లకు సంబంధించి 2021-22లో 65,893 మోసాలు జరిగాయి. కస్టమర్లు నష్టపోయిన డబ్బు రూ.258.61 కోట్లు. మోసగాళ్లు రోజుకో కొత్త మార్గాన్ని కనిపెట్టి కస్టమర్లను మోసం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు నివారించడానికి డిజిటల్, తక్కువ నగదు లావాదేవీలను ప్రోత్సహించడానికి ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదీ చదవండి: Aunkita Nandi: రెండు అద్దె కంప్యూటర్లతో రూ.100 కోట్ల వ్యాపారం! ఈ బెంగాలీ అమ్మాయి సంకల్పం మామూలుది కాదు.. -
డీసీబీ ట్రావెల్ స్మార్ట్ కార్డ్
ముంబై: డీసీబీ బ్యాంక్.. డీసీబీ ట్రావెల్ స్మార్ట్ కార్డ్‌ను విడుదల చేసింది. అంతర్జాతీయ పర్యటనలు, వ్యాపార పర్యటనలు, వేకేషన్ల కోసం దీన్ని తీసుకొచ్చినట్టు ప్రకటించింది. భారత్‌లో ఉన్నప్పుడు ఇది డెబిట్ కార్డ్‌గా పనిచేస్తుందని తెలిపింది. ఈ కార్డ్ ఉంటే విదేశీ కరెన్సీలను కొనుగోలు చేయాల్సిన అవరం లేకుండా సులభంగా ఎక్కడైనా ప్రయాణించొచ్చని, బీమా కవరేజీ, అదే సమయంలో డీసీబీ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలోని బ్యాలన్స్‌పై ఆకర్షణీయమైన వడ్డీ రేటును ఆఫర్ చేసే మూడు రకాల ప్రయోజనాలతో డీసీబీ ట్రావెల్ స్మార్ట్ కార్డ్ వస్తుందని బ్యాంక్ తెలిపింది. ఇందులో ఫారీన్ కరెన్సీ మార్కప్ చార్జీలు అతి తక్కువగా 2 శాతమేనని పేర్కొంది. వీసా కార్డ్‌ను ఆమోదించే అన్ని అంతర్జాతీయ వేదికల వద్ద ఈ కార్డ్‌ను వినియోగించుకోవచ్చని వెల్లడించింది. -
వారికోసం యస్ బ్యాంక్ ప్రైవేట్ డెబిట్ కార్డు, బెనిఫిట్స్ ఏంటి?
ముంబై: అత్యంత సంపన్న కస్టమర్ల (హెచ్ఎన్ఐ) కోసం మాస్టర్‌కార్డ్ భాగస్వామ్యంతో యస్ బ్యాంక్ కొత్తగా ప్రైవేట్ డెబిట్ కార్డును ఆవిష్కరించింది. సంపన్న ప్రొఫెషనల్స్, ఎంట్రప్రెన్యూర్ల అవసరాలకు తగినట్లుగా ఇందులో ఫీచర్లు ఉంటాయని యస్ బ్యాంక్ గ్లోబల్ హెడ్ రాజన్ పెంటాల్ తెలిపారు. ట్రావెల్, వెల్నెస్, లైఫ్‌స్టయిల్ వంటి వివిధ విభాగాల్లో ప్రత్యేక ప్రయోజనాలు అందు కోవచ్చని పేర్కొన్నారు. ఓబెరాయ్ హోట ల్స్ నుంచి ఈ-గిఫ్ట్ వోచర్లు, కాంప్లిమెంటరీ గోల్ఫ్ సెషన్లు, ఎయిర్పోర్ట్ లాంజ్‌లకు యాక్సెస్ పొందవచ్చని వివరించారు. ఆసి యా పసిఫిక్ దేశాల్లో ఈ తరహా వర ల్డ్ ఎలైట్ డెబిట్ కార్డును ప్రవేశపెట్టడం ఇదే తొలిసారని మాస్టర్ కార్డ్ ప్రెసిడెంట్ గౌతమ్ అగర్వాల్ తెలిపారు. -
పీవోఎస్, యూపీఐ లావాదేవీలకు ప్రోత్సాహకాలు
న్యూఢిల్లీ: పాయింట్ ఆఫ్ సేల్, ఈ కామర్స్ సంస్థలకు రూపే డెబిట్ కార్ట్‌తో చేసే చెల్లింపులు, వరక్తుల వద్ద భీమ్ యూపీఐ ప్లాట్‌ఫామ్ సాయంతో చేసిన తక్కువ విలువ లావాదేవీలకు ప్రోత్సాహకాలను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ వెబ్సైట్లో ఈ నోటిఫికేషన్ ఉంచారు. రూపే కార్డు, భీమ్ యూపీఐ లావాదేవీ రూ.2,000లోపున్న వాటిపై ఈ ప్రోత్సాహకాలు అందనున్నాయి. పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) మెషిన్లపై, ఈ కామర్స్ సైట్లపై రూపే డెబిట్ కార్డుతో చెల్లింపులు చేసినప్పుడు.. స్వీకరించే బ్యాంకులకు 0.4 శాతం, గరిష్టంగా రూ.100 ప్రోత్సాహకంగా లభిస్తుంది. భీమ్ యూపీఐ ఆధారిత లావాదేవీలపై చెల్లింపులను స్వీకరించే బ్యాంకులకు 0.25 ప్రోత్సాహకం లభిస్తుంది. ఇవి రిటైల్ చెల్లింపులకు సంబంధించినవి. అలా కాకుండా ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్, ప్రభుత్వం, విద్య, రైల్వే తదితర రంగాల్లోని లావాదేవీలపై ప్రోత్సాహకాలు భిన్నంగా ఉన్నాయి. 2022 ఏప్రిల్ 1 నుంచి ఈ ప్రోత్సాహకాలు ఏడాది పాటు అమల్లో ఉంటాయి. గరిష్టంగా రూ.2,600 కోట్లను ఈ ప్రోత్సాహకాల కోసం కేంద్రం కేటాయించింది. -
రూపే కార్డుల ప్రోత్సాహానికి రూ. 2,600 కోట్ల స్కీం!
న్యూఢిల్లీ: రూపే డెబిట్ కార్డులు, తక్కువ విలువ చేసే భీమ్–యూపీఐ లావాదేవీలను ప్రోత్సహించే దిశగా కేంద్ర క్యాబినెట్ బుధవారం రూ. 2,600 కోట్ల స్కీముకు ఆమోదముద్ర వేసింది. దీని కింద ఈ ఆర్థిక సంవత్సరంలో రూపే కార్డులు, యూపీఐని ఉపయోగించి జరిపే పాయింట్ ఆఫ్ సేల్స్, ఈ–కామర్స్ లావాదేవీలను ప్రోత్సహించినందుకు గాను బ్యాంకులకు ప్రోత్సాహకాలు లభిస్తాయి. అనగా కేంద్రం ఈ పథకం కింద బ్యాంకులకు ఆర్థికసాయాన్ని అందివ్వనుంది. ఈ పథకం ద్వారా బలమైన డిజిటల్ చెల్లింపు వ్యవస్థగా వృద్ధి చెందాలని భావిస్తోంది. వినియోగదారులు వ్యాపారులకు తక్కువ విలువ గల పేమెంట్స్‌ను పోత్సహిస్తుంది. యూపీఐ లైట్, యూపీఐ123పే ద్వారా డిజిటల్ చెల్లింపులను ప్రమోట్ చేస్తుంది. ఈ పథకంతో భారత్ డిజిటల్ చెల్లింపుల విషయంలో మరో ముందడుగు వేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. చదవండి: టాలెంట్ కోసం విప్రో కీలక నిర్ణయం: ఉద్యోగులకు బంపర్ ఆఫర్ -
గుడ్ న్యూస్: ఏటీఎం కార్డ్ లేకుండా క్యాష్ విత్‌డ్రా.. ఇలా చేస్తే సరిపోతుంది!
న్యూఢిల్లీ: గతంలో బ్యాంకులోని మన నగదుని తీసుకోవాలంటే.. అయితే బ్యాంకుకు వెళ్లాలి లేదా ఏటీం( ATM) మెషిన్‌కు వెళ్లి డెబిట్ కార్డ్‌తో కావాల్సినంత డబ్బులను డ్రా చేసుకోవాలి. కానీ నేటి డిజిటల్ యుగంలో, మీరు డెబిట్ కార్డ్ లేకుండా కూడా ఏటీఎం మెషీన్ నుంచి డబ్బును తీసుకోవచ్చు. దీని కోసం మీకు మీ మొబైల్ మాత్రమే అవసరం. చాలా రోజుల నుంచి ఈ బ్యాంకింగ్ సర్వీస్ నడుస్తోంది. అసలు ఇలాంటి సర్వీస్ ఒకటి ఉందని చాలా మందికి కూడా తెలియదు. డబ్బులు డ్రా చేసేందుకు.. ఏటీఎం అక్కర్లేదు ఇప్పటికే చాలా బ్యాంకులు తమ కస్టమర్లకు కార్డు లేకుండానే డబ్బు తీసుకునే వెసులుబాటును కల్పిస్తున్నప్పటికీ.. తాజాగా రిజర్వ్ బ్యాంక్ తన పరిధిని మరింత పెంచింది. ఈ సౌకర్యం కోసం యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) ఉపయోగించనుంది. డెబిట్ కార్డ్ లేకుండా ఏటీఎం నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకోవాలంటే, మీరు తప్పనిసరిగా స్మార్ట్‌ఫోన్‌ని కలిగి ఉండాలి. మీ స్మార్ట్‌ఫోన్‌లో భీం(BHIM), పేటీఎం (Paytm), గూగుల్‌పే (GPay), ఫోన్‌పే (PhonePe) మొదలైన యాప్‌లను ఉపయోగించి ద్వారా డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇలా ఫాలో అయితే సరిపోతుంది.. ఏటీఎం సెంటర్లోకి వెళ్లి కార్డ్ లేకుండా డబ్బు విత్‌డ్రా చేసుకునే ఆప్షన్‌ను ఎంచుకోండి. మీరు యూపీఐ ద్వారా గుర్తింపును అందించే ఎంపికను చూస్తారు. ఆ తర్వాత మీ మొబైల్లో యూపీఐ యాప్‌ని ఓపెన్ చేసి, మీ ముందు కనిపిస్తున్న QR కోడ్‌ను స్కాన్ చేయండి. ఇక్కడి నుంచి ప్రక్రియ మునుపటి మాదిరిగానే ఉంటుంది. మీకు కావలసిన డబ్బును ఎంటర్ చేయండి ఆ తర్వాత విత్‌డ్రా చేసుకోండి. కార్డ్ లెస్ క్యాష్.. ప్రయోజనాలు ఇవే కార్డు లేకుండా నగదు విత్‌డ్రా చేసుకునే సదుపాయం కార్డు స్కిమ్మింగ్, కార్డ్ క్లోనింగ్ వంటి మోసాలను నిరోధించడంలో సహాయపడుతుంది. ఇది కాకుండా, మీరు కార్డును మీ వద్ద ఉంచుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. మీ స్మార్ట్‌ఫోన్ ఈ పనులన్నింటినీ చేస్తుంది. చదవండి: కొత్త ఏడాదిలో యూజర్లకు షాక్.. నెట్‌ఫ్లిక్స్ పాస్వర్డ్ షేర్ చేస్తే పైసలు కట్టాలి! -
ఫోన్‌పే వాడుతున్నారా? అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త సేవలు గురించి తెలుసా!
ఫోన్‌పే(Phone Pay) .. డిజిటల్ లావాదేవీలు పెరిగినప్పటి నుంచి ఈ పేరు బాగా పాపలర్ అయిపోయింది. పర్సలో మనీ లేకపోయినా పర్లేదు ఫోన్లో ఫోన్‌పే ఉంటే చాలు అనుకునేంతగా ప్రజాదారణ పొందింది ఈ యాప్. ప్రస్తుతం 350 మిలియన్ల మంది రిజిస్టర్డ్ కస్టమర్లతో పలు సేవలు అందిస్తూ భారత్‌లో దూసుకుపోతుంది ఫోన్‌పే. ఎప్పటికప్పడు కొత్త సేవలో కస్టమర్లను ఆకట్టుకుంటూ వారి సంఖ్యను పెంచుకుంటున్న ఈ యాప్ తాజాగా మరో సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. సరికొత్త సేవల మీ కోసం.. ఇది వరకు ఫోన్‌పే ఉపయోగించాలంటే తప్పనిసరిగా మన డెబిట్ కార్డుతో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే డెబిట్ కార్డు అవసరం లేకుండా సరికొత్త సేవలను ఫోన్‌పే అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో వినియోగదారుడు కేవలం ఆధార్ కార్డు ఉపయోగించి యూపీఐ సేవలు పొందవచ్చని ఫోన్ పే తెలిపింది. ఇకపై ఫోన్ పేలో మీ డెబిట్ కార్డ్ అవసరం లేకుండా కేవలం మీ ఆధార్ కార్డ్ ద్వారా ఫోన్‌పేలో మీ యూపీఐ (UPI)ని సెటప్ చేయాలనుకుంటే, సింపుల్‌గా ఇలా ఫాలో అవ్వండి. ►ముందుగా ప్లేస్టోర్ (PlayStore) లేదా యాప్ స్టోర్( App Store) నుంచి ఫోన్‌పేని డౌన్లోడ్ చేసుకోండి. ►ఆపై ఓపెన్ చేసి మీ మొబైల్ నంబర్ని యాడ్ చేయండి, తర్వాత OTP వస్తుంది దాని ఎంటర్ చేయండి. ►ఇప్పుడు మై మనీ పేజీకి వెళ్లి, ఆపై పేమెంట్స్ మెతడ్స్ (payments method)పై క్లిక్ చేయండి. ►తర్వాత మీ బ్యాంక్‌ని ఎంచుకోని, 'Add New Bank Account'పై క్లిక్ చేయండి. ► మీ బ్యాంక్‌ని సెలక్ట్ చేసుకుని, మీ ఫోన్ నంబర్ని ధృవీకరించాల్సి ఉంటుంది. ►దీంతో ఫోన్‌పే మీ ఖాతా వివరాలను యాక్సెస్ పొందుతుంది, వీటితో పాటు మీ అకౌంట్ యూపీఐకి లింక్ అవుతుంది. ►తర్వాత మీ డెబిట్/ఏటీఎం కార్డ్ వివరాలను నమోదు చేయవచ్చు లేదా ఆధార్ కార్డ్ ఎంపికను ఎంచుకోవచ్చు. ►మీ ఆధార్‌లోని చివరి ఆరు అంకెలను నమోదు చేయండి. మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. ► OTPని ఎంటర్ చేసి ఆపై మీ యూపీఐ పిన్ నెంబర్ సెట్ చేసుకోవడంతో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. చదవండి: వణుకుతున్న ఉద్యోగులు.. డిసెంబర్ నాటికి మాంద్యంలోకి ఆ దేశాలు! -
బాబోయ్.. 90 లక్షల క్రెడిట్ కార్డుల డేటా లీక్!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులతో సహా 90 లక్షల కార్డ్ హోల్డర్ల ఆర్థికపరమైన డేటా భారీ లీకైనట్లు సైబర్-సెక్యూరిటీ పరిశోధకులు బయటపెట్టారు. సింగపూర్ ప్రధాన కార్యాలయంగా కార్యకలాపాలు జరుపుతున్న CloudSEK సంస్థ ఈ విషయాన్ని గుర్తించింది. వారి పరిశోధనలో.. రష్యాకు చెందిన డార్క్ వెబ్ సైబర్ క్రైమ్ ఫోరమ్‌లో 1.2 మిలియన్ కార్డ్‌ల డేటాబేస్‌ను ఉచితంగా అందుబాటులో ఉన్నట్లు తేలింది. వీటితో పాటు 7.9 మిలియన్ కార్డ్ హోల్డర్ డేటా BidenCash వెబ్సైట్లో ఉన్నట్లు కనుగోన్నారు. గతంలో మాదిరి కాకుండా, ఈసారి, హ్యాకర్లు SSN, కార్డ్ వివరాలు, CVV వంటి ముఖ్యమైన వ్యక్తిగత సమాచారాన్ని విడుదల చేశారని బృందం వెల్లడించింది. వీటితో పాటు కార్డ్ వివరాలతో అనుసంధానించిన చాలా వ్యక్తిగత ఇమెయిల్‌లు కూడా బయటపడ్డాయి. BidenCash ద్వారా గతంలో సాఫ్ట్‌బ్యాంక్, ప్రపంచ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ సింగపూర్‌తో అనుబంధించబడిన అధికారిక ఇమెయిల్‌ల రికార్డులు కూడా లీక్ అయ్యాయి. "స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫిసర్వ్ సొల్యూషన్స్ LLC, అమెరికన్ ఎక్స్‌ప్రెస్‌లతో పాటు కొన్ని అగ్రశ్రేణి బ్యాంకింగ్ సంస్థల కస్టమర్ల డేటా కూడా లీక్ అయ్యింది. మాస్టర్‌కార్డ్, వీసా నెట్‌వర్క్‌లకు సంబంధించిన 414,000 రికార్డులతో సుమారు 508,000 డెబిట్ కార్డ్‌ల వివరాలు కూడా బహిర్గతమైంది." అని భద్రతా పరిశోధకులు దేశాయ్ తెలిపారు. ఈ కార్డుల సమాచారం లీక్ వల్ల అక్రమ కొనుగోళ్ళు, కార్డ్ క్లోనింగ్, అనధికారిక లావాదేవీలు జరుగుతాయని దేశాయ్ అన్నారు. BidenCash వెబ్ సైట్ తన సైట్ కు ట్రాఫిక్‌ను పెంచుకోవడం కోసం ఈ తరహా చర్యలకు పాల్పడుతూ ఉంటుందని తెలిపారు. చదవండి: ఎఫ్బీలో జుకర్‌బర్గ్‌కు భారీ షాక్, కష్టాల్లో మెటా -
క్రెడిట్, డెబిట్ కార్డులపై ఆర్బీఐ కొత్త రూల్
-
‘క్రెడిట్ కార్డు యూజర్లకు ఆర్బీఐ అలెర్ట్’
ఆర్బీఐ, స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థలు (సెబీ) క్రెడిట్ కార్డ్, డీమ్యాట్ అకౌంట్లపై పలు మార్పులు చేసిన విషయం తెలిసిందే. అక్టోబర్ 1 నుంచి మార్పులు అమలు కానున్నాయి. వీటితో పాటు టోకనైజేషన్, నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్), అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) పథకాల్లోని మారిన నిబంధనల గురించి తెలుసుకుందాం. క్రెడిట్ కార్డు వినియోగదారుల భద్రతే లక్క్ష్యంగా ఆర్బీఐ ఈ ఏడాది జులై నుంచి డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డులపై ఎప్పుటికప్పుడు మార్పులు చేస్తూ వస్తుంది. తాజాగా ఆర్బీఐ క్రెడిట్ కార్డుల జారీ అంశంలో కొత్త నిబంధనల్ని తెచ్చింది. ఆ నిబంధనల ప్రకారం.. అక్టోబర్ 1 నుంచి క్రెడిట్ కార్డుల జారీ సంస్థలు.. లబ్ధి దారులకు కార్డు జారీ చేసే ముందు వారి నుంచి ఓటీపీ రూపంలో అనుమతి పొందాల్సి ఉంటుంది. ఆ అనుమతి కార్డు జారీ చేసిన 30 రోజుల్లోగా పొందాల్సి ఉంటుంది. లేదంటే 30 రోజుల తర్వాత కార్డు బ్లాక్ అవుతుంది. అలాగే వినియోగదారుడి అనుమతి లేకుండా క్రెడిట్ కార్డు లిమిట్‌ను పెంచవద్దని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. అటల్ పెన్షన్ యోజన పన్ను చెల్లింపు దారులు అక్టోబర్ 1 లోపు అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) పథకంలో చేరే అవకాశం ఉంది. అక్టోబర్ 1 లేదా ఆ తర్వాత నుంచి చేరేందుకు అనర్హులని కేంద్ర ఆర్ధిక శాఖ తెలిపింది. ఒకవేళ అక్టోబర్ 1 న ఏపీవైలో చేరితే ఆ ఖాతాను బ్లాక్ చేసి, డిపాజిట్ చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని వెల్లడించింది. నేషనల్ పెన్షన్ స్కీమ్ నేషనల్ పెన్షన్ స్కీమ్ ఖాతా దారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. పెన్షన్ ఫండ్ రెగ్యూలరేటరీ అండ్ డెవలప్మెంట్ అథారటీ ( పీఎఫ్ఆర్డీఏ) ఆదేశాల ప్రకారం.. అక్టోబర్ 1 నుంచి పెన్షన్ స్కీమ్ ఖాతాదారులు చేసిన ఈ - నామినేషన్‌ను నోడల్ కార్యాలయం అధికారులు 30 రోజుల వ్యవధిలో యాక్సెప్ట్ చేయొచ్చు. లేదంటే రిజక్ట్ చేయొచ్చు. 30 రోజులు పూర్తయిన అధికారులు స్పందించకపోతే సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ( సీఆర్ఏ) సిస్టమ్‌లో ఆటోమేటిక్‌గా ఇ- నామినేషన్ ఆమోదం పొందుతుంది. డీ మ్యాట్ అకౌంట్ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయాలంటే డీమ్యాట్ అకౌంట్ తప్పని సరి. అయితే ఈ డీమ్యాట్ అకౌంట్‌పై స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ (సెబీ) ఈ ఏడాది జూన్ 14న సర్క్యూలర్‌ను పాస్ చేసింది. ఆ సర్క్యూలర్ ప్రకారం.. డీ మ్యాట్ టూ ఫ్యాక్టర్ అథంటికేషన్‌ను సెప్టెంబర్ 30,2022లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు అకౌంట్‌ను ఓపెన్ చేసేందుకు ఐడీ, పాస్‌వర్డ్‌తో పాటు బయో మెట్రిక్ అథంటికేషన్ చేయాలని సెబీ ఆదేశాలు జారీ చేసింది.