declaration
-
వైఎస్ జగన్ డిక్లరేషన్ ఎందుకివ్వాలి: రామకృష్ణ
సాక్షి,హైదరాబాద్: వెంకటేశ్వర స్వామిని ముందుపెట్టి రాజకీయాలు చేయడం తగదని, స్వామి వద్దకు అందరూ వెళ్లొచ్చని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. ఈ విషయమై రామకృష్ణ శుక్రవారం(సెప్టెంబర్27)ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.‘అందరివాడైన వెంకటేశ్వరస్వామికి మత రాజకీయాలు ఆపాదించడం తగదు. తిరుమలకు జగన్ వెళ్తే అపవిత్రం అనే వ్యాఖ్యలు తగదు. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ భార్య క్రిస్టియన్ కాదా? మరి ఆయన తిరుమలకు ఎలా వెళ్తున్నాడు. నాడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉండి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.వైఎస్ జగన్ ఐదేళ్లపాటు సీఎంగా ఉండి స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. పట్టు వస్త్రాలు ఇవ్వడమంటేనే ఒక ప్రాధాన్యతగల అంశం. అప్పుడు ఏమీ మాట్లాడకుండా నేడు సాధారణ భక్తునిలా వైఎస్ జగన్ తిరుమల వెళ్తానంటే డిక్లరేషన్ అడగడమేంటి’అని రామకృష్ణ ప్రశ్నించారు.ఇదీ చదవండి: దొరికిపోయిన చంద్రబాబు..అబద్ధాలు బట్టబయలు -
లాహోర్ ఒప్పందాన్ని ఉల్లంఘించటం పాక్ తప్పే: నవాజ్ షరీఫ్
లాహోర్: పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీష్ భారత్‌తో చేసుకున్న ఒప్పదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. 1999లో తాను,అప్పటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజపేయి సంతకాలు చేసిన ‘లాహోర్ డిక్లరేషన్’ఒప్పందం ఉల్లంఘించామని తెలిపారు. ఆయన మంగళవారం పాకిస్తాన్ ముస్లిం లీగ్(ఎన్) పార్టీ సమావేశంలో మాట్లాడారు.‘మే 28, 1998న పాకిస్తాన్ ఐదు అణుబాంబు పరీక్షలు చేపట్టింది. అనంతరం భారత్ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి లాహోర్‌కు వచ్చారు. ఆయన మాతో లాహోర్ ఒప్పందం చేసుకున్నారు. అయితే ఆ ఒప్పందాన్ని మేం ఉల్లంఘించాము. అది మా తప్పే. అప్పటి అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఉద్దేశపూర్వకంగా అగ్రిమెంట్‌ను అతిక్రమించారు’ అని అన్నారు.మార్చి,1999లో ముషారఫ్ పాక్ ఆర్మీకి ఫోర్ స్టార్ జనరల్‌గా ఉన్నారు. లడ్డాక్‌లోని కార్గీల్‌లో రహస్యంగా చొరబాడటానికి ఆదేశించారు. ఈ విషయంతో అప్రమత్తమైన ఇండియా యుద్ధం చేసి విజయం సాధించింది. ఆ సమయంలోనే తాను ప్రధానిగా ఉన్నానని నవాజ్ షరీఫ్ గుర్తుచేశారు. పాకిస్తాన్ మొదటి అణు బాంబు పరీక్షించి 26 ఏళ్లు అవుతోందని తెలిపారు.‘అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఆనాడు పాక్.. అణుపరీక్ష ఆపేందుకు 5 బిలియన్ డాలర్లను ఇస్తానని ఆఫర్ చేశాడు. కానీ, నేను అమెరికా అఫర్‌ను తిరస్కరించాను. ఆ సమయంలో మాజీ ప్రధానిగా ఇమ్రాన్ ఉండి ఉంటే క్లింటన్ ఆఫర్‌కు అంగీకరించేవాడు’అని ఇమ్రాన్‌పై విమర్శలు గుప్పించారు.లాహోర్ డిక్లరేషన్ ఇరు దేశాల మధ్య ఏర్పాటు చేసుకున్న శాంతి ఒప్పందం. ఈ ఒప్పందంపై ఇరు దేశాల ప్రధానులు 21, ఫిబ్రవరి 1999లో సంతాకాలు చేశారు. అనంతరం పాకిస్తాన్ జమ్ము కశ్మీర్‌లోని కార్గిల్‌లోకి చొరబడటంతో యుద్ధానికి దారి తీసింది. ఈ యుద్ధంలో భారత్ విజయం సాధించింది. ఇక..ద తాజాగా మంగళవారం నవాజ్ షరీష్ మరోసారి పీఎంఎల్-ఎన్ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. -
ఉత్తరాఖండ్‌లో బహుభార్యత్వం రద్దు!
డెహ్రాడూన్: బీజేపీ పాలిత ఉత్తరాఖండ్‌లో బహుభార్యత్వంపై నిషేధంతో పాటు సహజీవనాన్ని ధ్రువీకరిస్తూ డిక్లరేషన్‌నూ తప్పనిసరి చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. రాష్ట్రంలో ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) అమలుకు సంబంధించిన ముసాయిదాను జస్టిస్ రంజన ప్రకాశ్ దేశాయ్ కమిటీ శుక్రవారం సీఎం పుష్కర్ సింగ్ ధామికి సమరి్పంచింది. అందులో కీలక ప్రతిపాదనలు చేసింది. ‘‘రాష్ట్రంలో జరిగే ప్రతి పెళ్లినీ విధిగా రిజిస్ట్రర్ చేయించాల్సిందే. విడాకులు కోరే హక్కులు భార్యభర్తలకు సమానంగా ఉంటాయి. భార్య జీవించి ఉండగా భర్త మరో పెళ్లి చేసుకోవడం చట్టప్రకారం నేరం. బహు భార్యత్వంపై నిషేధం అమలు చేయాలి. అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలకూ వారసత్వ హక్కులుంటాయి. సహజీవనం చేస్తుంటే దానిని అధికారికంగా ధ్రువీకరిస్తూ స్త్రీ, పురుషులిద్దరూ డిక్లరేషన్‌ను సమరి్పంచాలి’’ అని పేర్కొంది. ఈ నిబంధనల నుంచి షెడ్యూల్ తెగలకు మినహాయింపు ఇవ్వనున్నారు. యూసీసీ ముసాయిదా రూపకల్పన కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం 202లో ఈ కమిటీని వేసింది. 2022 అసెంబ్లీ ఎన్నికల హామీ అమలు దిశగా ఇదో కీలక అడుగని ధామీ అభివరి్ణంచారు. ముసాయిదాను క్షుణ్నంగా పరిశీలించాక అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడతామని చెప్పారు. ఫిబ్రవరి 5 నుంచి 8వ తేదీ వరకు జరిగే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో యూసీసీ బిల్లును తెచ్చి ఆమోదించి చట్టం చేస్తామన్నారు. యూసీసీ అమలైతే వివాహం, విడాకులు, ఆస్తి, వారసత్వం వంటి అంశాల్లో పౌరులందరికీ మతంతో సంబంధం లేకుండా సమాన చట్టాలు అమలవుతాయి. మేమూ అదే బాటలో: అసోం సీఎం బహుభార్యత్వం విధానాన్ని రద్దుచేయనున్నట్లు అస్సాం ముఖ్యమంత్రి çహిమంత బిశ్వ శర్మ కూడా ప్రకటించారు. ‘‘అసోంలో యూసీసీ అమలుపై గతేడాదే మాకు నివేదిక అందింది. దానిని న్యాయశాఖ పరిశీలిస్తోంది. కుదిరితే ఫిబ్రవరి ఐదున మొదలయ్యే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లుగా ప్రవేశపెట్టి చట్టంగా తెస్తాం’’ అని హిమంత అన్నారు. -
కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్ బీజేపీ కుట్రే: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: మైనారిటీలను బీసీల్లో చేరుస్తామని కాంగ్రెస్ చేసిన ప్రతిపాదనను బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ విషయమై ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రతిపాదనను కాంగ్రెస్ వెంటనే ఉపసంహరించుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్ బీజేపీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉందని కేటీఆర్ విమర్శించారు. ‘మైనారిటీలు, బీసీల మధ్య కాంగ్రెస్ చిచ్చు పెడుతోంది. కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.మైనారిటీలకు కులగణనతో సంబంధం లేదు. ఇది బీజేపీ కుట్రలాగా కనిపిస్తోంది. మైనారిటీలను బీసీల్లో కలిపితే వారు తమ హక్కులన్నీ కోల్పోతారు. కాంగ్రెస్ వెంటనే మైనారిటీ డిక్లరేషన్‌ను ఉపసంహరించుకోవాలి’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: అవినీతి డబ్బుతో కేసీఆర్ గెలవాలనుకుంటున్నారు! -
లైన్ ‘క్లియర్’ కొందరికే!
సాక్షి, హైదరాబాద్: కీలకమైన అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల ప్రకటనను కాంగ్రెస్ పార్టీ వాయిదా వేసింది. మొత్తం 55 మందితో తొలి జాబితాను ప్రకటించినా.. కీలక నేతలు ఉన్న చాలా సీట్లను వదిలేసింది. తొలి జాబితాలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితోపాటు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, సీతక్క, పొదెం వీరయ్య, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిలతోపాటు గడ్డం వినోద్, కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు, అంజన్‌కుమార్ యాదవ్, టి.రామ్మోహన్‌రెడ్డి, సంపత్‌కుమార్, దొంతి మాధవరెడ్డి వంటి వారికి చోటు దక్కింది. ఎస్సీలకు రిజర్వ్ అయిన 12, ఎస్టీలకు రిజర్వ్ అయిన 2 స్థానాలు పోగా.. రెడ్డిలకు 17, వెలమలకు 7, బ్రాహ్మణులకు 2, మైనార్టీలకు 3, బీసీలకు 12 స్థానాలు దక్కాయి. అయితే బీసీల్లో ప్రధాన కులాలైన గౌడ, పద్మశాలి కులాల నేతల పేర్లు తొలిజాబితాలో కనిపించలేదు. యాదవ వర్గానికి 4, మున్నూరుకాపులకు 2, ముదిరాజ్, వాల్మికి, మేరు, వంజర, చాకలి, బొందిలి కు లాలకు ఒక్కొక్కటి దక్కాయి. ఎస్సీల్లో మాదిగలకు 9, మాలలకు 3 స్థానాలు కేటాయించగా.. ఎస్టీల్లో 2 ఆదివాసీలకే ఇచ్చారు. లంబాడా నేతలకు తొలి జాబితాలో చోటు లభించలేదు. ఉమ్మడి జిల్లాల వారీగా పరిశీలిస్తే ఆదిలాబాద్ (3), నిజామాబాద్ (3), కరీంనగర్ (7), మెదక్ (5), రంగారెడ్డి (7), హైదరాబాద్ (10), మహబూబ్‌నగర్ (8), నల్లగొండ (6), వరంగల్ (4), ఖమ్మం (2) స్థానాలకు టికెట్లను ప్రకటించారు. ప్రముఖుల పేర్లు లేకుండానే! కాంగ్రెస్ తొలి జాబితాలో ఆ పార్టీ ప్రముఖులు కొందరి పేర్లు కనిపించలేదు. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, మాజీ ఎంపీలు సురేశ్ షె ట్కార్, బలరాం నాయక్, పొన్నం ప్రభాకర్, పీఏసీ కన్వినర్ షబ్బీర్‌అలీ, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి, వరంగల్ జిల్లాకు చెందిన కొండాసురేఖ, ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు వంటివారి పేర్లు తొలి జాబి తాలో లేకపోవడం గమనార్హం. కచ్చితంగా తొలి జాబితాలో ఉంటాయని భావించిన కొందరి పేర్లు లేకపోవడం, అనూహ్యంగా మరికొందరి పేర్లు కనిపించడం చర్చనీయాంశంగా మారింది. పార్టీ అను బంధ సంఘాలకు తొలి జాబితాలో ప్రాధాన్యం దక్కలేదు. టికెట్లు ఆశిస్తున్న యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ, ఫిషర్మెన్, ఎస్సీసెల్, కిసాన్ కాంగ్రెస్, బీసీ సెల్ నేతలు ఆశిస్తున్న టికెట్లు ప్రకటించలేదు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుకు గోషామహల్ స్థానం ఇచ్చారు. ఓయూ విద్యార్థి నేతలకూ తొలి జాబితాలో లభించలేదు. గెలుపు ఆశల్లేని స్థానాలే బీసీలకు? కాంగ్రెస్ తొలి జాబితాపై బీసీ వర్గాలు పెదవి విరుస్తున్నాయి. బీసీలకు మొత్తంగా 34 సీట్లు ఇస్తామని కాంగ్రెస్ ముఖ్యనేతలు చెప్పినా ఆ ప్రాధాన్యత కనిపించడం లేదని అంటున్నాయి. తొలి జాబితాలో 12 మంది బీసీల పేర్లు ఉన్నా.. సగం వరకు పెద్దగా గెలుపు ఆశలు లేనివేననే విమర్శలు వస్తున్నాయి. బీసీలకు ఇచ్చిన 12 సీట్లలో.. మేడ్చల్, గద్వాల, ముషీరాబాద్, ఆలేరు స్థానాలను యాదవ సామాజిక వర్గాలకు, సికింద్రాబాద్, వేములవాడ స్థానాలను మున్నూరుకాపులకు, గోషామహల్‌ను ముదిరాజ్ మహిళకు కేటాయించారు. రామగుండం (బొందిలి), షాద్‌నగర్ (రజక)లను ఎంబీసీ కులాలకు ఇచ్చారు. మిగతా మూడు సీట్లను ఎంఐఎం ప్రాబల్యం ఉండే పాతబస్తీలో కేటాయించారు. అందులో చాంద్రాయణగుట్ట (వాల్మికి), యాకుత్‌పుర (మేరు), బహుదూర్‌పుర (వంజర) ఉన్నాయి. పారాచూట్లకు చాన్స్ కాంగ్రెస్ తొలి జాబితాలో పారాచూట్ నేతలకు గణనీయంగానే సీట్లు దక్కాయి. కూచాడి శ్రీహరిరావు (నిర్మల్), వినయ్‌కుమార్‌రెడ్డి (ఆర్మూరు), సునీల్‌రెడ్డి (బాల్కొండ), మైనంపల్లి రోహిత్‌రావు (మెదక్), ఆగం చంద్రశేఖర్ (జహీరాబాద్), మైనంపల్లి హన్మంతరావు (మల్కాజ్గిరి), కోట నీలిమ (సనత్‌నగర్), సరితా తిరుపతయ్య (గద్వాల), కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి (నాగర్‌కర్నూల్), కసిరెడ్డి నారాయణరెడ్డి (కల్వకుర్తి), జూపల్లి కృష్ణారావు (కొల్లాపూర్), వేముల వీరేశం (నకిరేకల్) ఇటీవల కాంగ్రెస్‌లో చేరినవారే. తొలి జాబితాలో ఆరుగురు మహిళలకు అవకాశం లభించింది. ఇందులో డాక్టర్ కోట నీలిమ, మొగిలి సునీత, సరితా తిరపతయ్య, సింగాపురం ఇందిర, సీతక్క, నలమాద పద్మావతి ఉన్నారు. మైనార్టీలకు నాంపల్లి, కార్వాన్, మలక్‌పేట స్థానాలను కేటాయించారు. గాందీభవన్ వద్ద నిరసన సెగలు తొలి జాబితా విడుదలతోనే కాంగ్రెస్‌లో నిరసనల సెగలు కూడా మొదలయ్యాయి. పలు చోట్ల టికెట్లు ఆశించిన నేతలు, వారి అనుచరులు గాందీభవన్ వద్ద ఆందోళనకు దిగారు. గద్వాల టికెట్‌ను అమ్ముకున్నారంటూ ఆ నియోజకవర్గ నేత కుర్వ విజయ్‌కుమార్ నేతృత్వంలో నిరసన తె లిపారు. మైనార్టీల ప్రాబల్యం ఉండే పాతబస్తీలో ఆ వర్గం నేతలకు కాకుండా ఇతరులకు టికెట్లు ఇచ్చారంటూ కొందరు మైనార్టీ నేతలు ఆందోళనకు దిగారు. ఉప్పల్, మేడ్చల్ వంటి చోట్ల కూడా టికె ట్లు రాని వారి అనుచరులు నిరసన వ్యక్తం చేశారు. కొందరు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఫ్లెక్సీలను, దిష్టిబోమ్మలను దహనం చేశారు. -
సమావేశాలు విజయవంతం.. ఆ క్రెడిట్ మొత్తం భారత్‌దే
వాషింగ్టన్: భారత దేశంలో జరిగిన 18వ జీ20 సమావేశాలు ఆదివారంతో ముగిశాయి. తొలిసారి నిర్వహించినా భారత్ ఈ సమావేశాలను అద్భుతంగా నిర్వహించిందని సభ్య దేశాలు అభినందిస్తున్నాయి. ఈ సందర్బంగా అమెరికా అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మాట్లాడుతూ భారత్ నిర్వహించిన ఈ సమావేశాలు సూపర్ సక్సెస్ అయ్యినట్లు నమ్ముతున్నామన్నారు. సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఓ ఛానల్ ప్రతినిధి జీ20 సమావేశాలు విజయవంతమైనట్టేనా అని అడిగిన ప్రశ్నకు మాథ్యూ మిల్లర్ సమాధానమిస్తూ.. భారత్ జీ20 సమావేశాలను విజయవంతంగా నిర్వహించిందని విశ్వసిస్తున్నానన్నారు. జీ20 అనేది చాలా పెద్ద సంస్థ. రష్యా చైనాలు కూడా ఇందులో భాగస్వాములే. సమావేశాలకు రష్యా గైర్హాజరు కావడంపై ప్రశ్నించగా రష్యా ఉక్రెయిన్ అంశంపై సభ్యులందరివీ భిన్నకోణాలు అయినప్పటికీ భారత్ సిద్ధం చేసిన డిక్లరేషన్‌లో ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వానికి సంబంధించిన సూత్రాలను ఉల్లంఘించరాదని వారు రాసిన ఆ మాట రష్యా ఉక్రెయిన్‌పై చేసిన దాడిని సూటిగా స్ఫురించి సభ్యదేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరడానికి దోహదపడిందన్నారు. #WATCH | On the question of the absence of Russia word from the New Delhi Leaders’ Declaration and whether the G20 Summit was successful, US State Department Spokesperson Matthew Miller says, "We absolutely believe it was a success. The G20 is a big organisation. Russia is a… pic.twitter.com/NgQGhC5iAM — ANI (@ANI) September 11, 2023 అణ్వాయుధాలను చూపించి భయపెట్టడం కానీ వాటిని ప్రయోగించడం కానీ ఆమోదయోగ్యం కాదని యుద్ధాన్ని గురించి వారు ప్రస్తుతించిన విధానం అద్భుతమన్నారు. డ్రాఫ్ట్‌లో ఎక్కడా రష్యా పేరెత్తకుండా ఉక్రెయిన్‌లో సమగ్రమైన, న్యాయమైన, మన్నికైన శాంతిని నెలకొల్పాలని అంతిమంగా అంతర్జాతీయ ఆర్ధిక సహకారం అందించడమే ఈ సమావేశాల యొక్క ముఖ్య ఉద్దేశ్యమని వారు చెప్పిన విధానం బాగుందన్నారు. మొత్తంగా డిక్లరేషన్‌పై సభ్యదేశాల ఏకాభిప్రాయం సాధించడమే భారత్ సాధించిన గొప్ప విజయమన్నారు. బిల్ గేట్స్ కూడా.. జీ20 సమావేశాల్లో స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి భారత్ చూపించిన చొరవ అనిర్వచనీయమన్నారు. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాత్రపై ఏకాభిప్రాయం సాధించి ప్రాపంచిక సంక్షేమానికి పెద్దపీట వేశారు. సదస్సు విజయవంతంగా నిర్వహించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఎక్స్(ట్విటర్)లో రాశారు. The #G20 reached a groundbreaking consensus on the role of digital public infrastructure as a critical accelerator of the Sustainable Development Goals. I'm optimistic about the potential of DPI to support a safer, healthier, and more just world. Kudos to PM @narendramodi.… — Bill Gates (@BillGates) September 11, 2023 ఇది కూడా చదవండి: ఆ విషయంలో భారత్‌ను మెచ్చుకోవాల్సిందే.. చైనా -
ఆ విషయంలో భారత్‌ను మెచ్చుకోవాల్సిందే.. చైనా
బీజింగ్: భారతదేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జీ20 సదస్సు విజయవంతం కావడంపైనా ఢిల్లీ డిక్లరేషన్‌పై సభ్యదేశాల ఆమోదం పొందడంపైనా పొరుగుదేశం చైనా ప్రశంసలు కురిపించింది. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో డిక్లరేషన్ సభ్యదేశాల ఏకాభిప్రాయం సాధించడం గొప్ప విజయమన్నారు. ఢిల్లీ వేదికగా రెండు రోజుల పాటు జరిగిన జీ20 సమావేశాలను అత్యంత సమర్ధవంతంగా నిర్వహించిన భారత్ దేశంపై ప్రపంచ దేశాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి. తాజాగా చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ సమావేశాల నిర్వహణలోనూ డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయం సాధించడం విషయంలోనూ భారత్ పాత్ర అభినందనీయమని తెలిపారు. అన్నిటినీ మించి ఈ సమావేశాల ద్వారా ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణ కోసం సభ్యదేశాలు చూపిన చొరవ కూటమి యొక్క ఐక్యతకు సంబంధించి సానుకూల సంకేతాలను పంపుతుందని తెలిపింది చైనా. మావో నింగ్ మాట్లాడుతూ.. జీ20 సమావేశాల్లో సభ్య దేశాలు ఆమోదం తెలిపిన ఢిల్లీ డిక్లరేషన్‌పై చైనా వైఖరి స్పష్టంగా ప్రతిబింబించేలా ఉందన్నారు. ఈ డిక్లరేషన్ జీ20 సభ్య దేశాల మధ్య దృఢమైన భాగస్వామ్యాన్ని బహిర్గతం చేస్తూ ప్రాపంచికసావాళ్ళను ఎదుర్కొనేందుకు జీ20 బృందం సిద్ధపాటుపై ప్రపంచ దేశాలకు సానుకూల సంకేతాలను పంపుతుందన్నారు. ఈ సమావేశాలకు సిద్దపడే విషయమై చైనా నిర్ణయాత్మక పాత్ర పోషించిందని అభివృద్ధి చెందుతున్న దేశాల సమస్యలకు ప్రాధాన్యతనిచ్చే ఈ సదస్సుకు చైనా మొదటినుంచి మద్దతు తెలుపుతూనే ఉందని అన్నారు. న్యూఢిల్లీ డిక్లరేషన్ ఆమోదం పొందడం జీ20 సభ్యదేశాల ఉమ్మడి అవగాహనకు ప్రతీకగా నిలుస్తుందని అంతర్జాతీయ ఆర్థిక సహకారానికి జీ20 ఒక ప్రధాన వేదిక అని అన్నారు. ఈ వేదిక ద్వారా భౌగోళిక రాజకీయ, భద్రతా సమస్యల పరిష్కారం సాధ్యమవుతుందని ఉక్రెయిన్ సంక్షోభానికి పరిష్కారం చర్చల ద్వారానే సాధ్యమవుతుందని తాము బలంగా విశ్వసిస్తున్నామన్నారు. దీనిపై అంతర్జాతీయ కమ్యూనిటీతో కలిసి పని చేసేందుకు చైనా కట్టుబడి ఉందన్నారు. సమావేశాలకు హాజరైన చైనా ప్రీమియర్ లీ కియాంగ్ ప్రపంచ ఆర్ధిక పురోగతి తోపాటు ప్రపంచ శాంతికి చైనా కట్టుబడి ఉందన్న విషయాన్ని తెలిపారన్నారు. ఇది కూడా చదవండి: 1,968 అడుగుల ఎత్తు నుంచి పడ్డా ఏమీ కాలేదు -
జీ20 సమ్మిట్: ఉక్రెయిన్ యుద్ధంపై ఏమని తీర్మానించారంటే..
ఢిల్లీ: ఉక్రెయిన్‌లో శాశ్వతమైన శాంతి నెలకొనాలనే తీర్మానాన్ని జీ20 సమ్మిట్ ఆమోదించింది. ప్రస్తుత కాలం యుద్ధాల యుగం కాదని రష్యా పేరు ఎత్తకుండానే సభ్య దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఇతర దేశాల భూభాగాల దురాక్రమణ, అణ్వాయుధాల ముప్పు ఉండకూడదని సభ్య దేశాలు కోరాయి. ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి సభ్య దేశాలు ఇండోనేషియా బాలీలో జరిగిన తీర్మానాన్ని పునరుద్ఘాచించాయి. ఐక్యరాజ్య సమితి నియమ నిబంధనలకు అనుగుణంగా ప్రపంచ దేశాలు నడుచుకోవాలని పిలుపునిచ్చాయి. అణ్వాయుధ ప్రయోగాల ముప్పు ఉండకూడదని కోరాయి. #WATCH | G 20 in India | " Strong connectivity and infrastructure base of development of human civilization. India has given highest priority to this topic...we believe connectivity between different countries increases not only business but trust between them...by promoting… pic.twitter.com/hNiqXSL0Me — ANI (@ANI) September 9, 2023 జీ20 ప్రధానంగా అంతర్జాతీయ ఆర్థిక సహకారానికి వేదిక. అయినప్పటికీ ఆర్ధిక వ్యవస్థల్ని దెబ్బతీసే పర్యావరణ, భౌగోళిక, రాజకీయ అంశాలపై కూడా చర్చిస్తారు. వాటిని ఎదుర్కొనడానికి తీర్మానాలను రూపొందించి ఆమోదం తెలుపుతారు. ప్రస్తుతం ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్నే ప్రధానంగా చర్చించారు. ప్రపంచ ఆహార, ఇందన భద్రత, సరఫరా గొలుసులు, ద్రవ్యోల్బణంపై యుద్ధం ప్రభావం చూపుతోందని తీర్మానించారు. కరోనా సృష్టించిన ఆర్థిక విపత్తు నుంచి కోలుకుంటున్న దేశాలను ఉక్రెయిన్ యుద్ధం కష్టకాలంలోకి నెట్టేసిందని అభిప్రాయపడ్డారు. PM Modi announces adoption of G20 Leaders’ Summit Declaration Read @ANI Story | https://t.co/UyjLby7Rvn#PMModi #NarendraModi #G20India2023 #G20SummitDelhi pic.twitter.com/VMxKR5saED — ANI Digital (@ani_digital) September 9, 2023 రష్యా, ఉక్రెయిన్ నుంచి ముడి పదార్థాలను ఎటువంటి అడ్డుంకులు లేకుండా సరఫరా చేయాలని జీ20 సమ్మిట్ పిలుపునిచ్చింది. సంక్షోభాలకు శాంతియుత పరిష్కారాలు, దౌత్యం, చర్చలు చాలా ముఖ్యమైనవని ఈ డిక్లరేషన్ అభిప్రాయపడింది. ఇదీ చదవండి: G20 Summit: ఢిల్లీ డిక్లరేషన్ ఆమోదం.. ప్రధాన ఐదు అంశాలు ఇవే.. -
ఢిల్లీ డిక్లరేషన్ ఆమోదం.. ప్రధాన ఐదు అంశాలు ఇవే..
ఢిల్లీ:జీ20 సదస్సులో ఢిల్లీ డిక్లరేషన్ ఆమోదం పొందింది. సభ్యదేశాల మధ్య ఏకాభిప్రాయాన్ని భారత్ సాధించింది. ప్రధాని మోదీ ఈ అంశాన్ని జీ20 వేదికగా వెల్లడించారు. డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయం కుదిరేలా కృషి చేసిన బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం వెనక కష్టించి పనిచేసిన జీ20షేర్పా సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. G-20 in India| G 20 Sherpa Amitabh Kant tweets, "The New Delhi Leaders Declaration focuses on - Strong, Sustainable, Balanced, and Inclusive Growth, Accelerating Progress on SDGs, Multilateral Institutions for the 21st Century, Reinvigorating Multilateralism https://t.co/4Q3nGh4do1 pic.twitter.com/DJbSe6830a — ANI (@ANI) September 9, 2023 ఢిల్లీ డిక్లరేషన్‌లో ప్రధానంగా ఐదు అంశాలపై ఏకాభిప్రాయాన్ని సాధించారు. అవి.. ► బలమైన, స్థిరమైన, సమతుల్యమైన, సమగ్ర వృద్ధి ► వేగవంతమైన సుస్థిరాభివృద్ధి ► సుస్థిర భవిష్యత్తు కోసం హరిత అభివృద్ధి ఒప్పందం ► 21వ శతాబ్దానికి బహుపాక్షిక సంస్థలు ► బహుపాక్షికతను పునరుద్ధరించడం PM Modi highlights human-centric development at G20 Summit Read @ANI Story | https://t.co/Tq2OriXV0G#PMModi #NarendraModi #G20India2023 #G20SummitDelhi pic.twitter.com/RLZjCIXcus — ANI Digital (@ani_digital) September 9, 2023 జీ20 సదస్సులో అభివృద్ధి, భౌగోళిక-రాజకీయ సమస్యలపై 100 శాతం ఏకాభిప్రాయం కుదిరిందని జీ20 భారత షేర్పా అమితాబ్ కాంత్ అన్నారు. 'జీ20 లీడర్స్ సమ్మిట్‌లో ఢిల్లీ నాయకుల డిక్లరేషన్ ఏకాభిప్రాయంతో ఆమోదం పొందింది. భారత్ నాయకత్వంలో జీ20 సదస్సు నిర్వహించడం ప్రపంచీకరణకు స్వర్ణ యుగంగా గుర్తింపు పొందింది.' అని అమితాబ్ కాంత్ అన్నారు. డిక్లరేషన్‌లో పేర్కొన్నట్లు భౌగోళిక, రాజకీయ అంశాల్లో భూమి, ప్రపంచ శాంతి, ప్రజల శ్రేయస్సుకు పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ఈ దిశగానే భారత్ అడుగులు వేస్తున్నట్లు అమితాబ్ కాంత్ చెప్పారు. ఇదీ చదవండి: జీ20 సమ్మిట్: ప్రధాని మోదీ నేమ్‌ప్లేట్‌పై 'భారత్' పేరు -
G20 summit: ఏకాభిప్రాయం సాధిస్తాం
న్యూఢిల్లీ: జీ20 శిఖరాగ్ర సదస్సుకు సంబంధించిన ఢిల్లీ డిక్లరేషన్ దాదాపు సిద్ధమైందని భారత్ ప్రకటించింది. ‘ ఢిల్లీ డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయం వస్తుందని ఆశిస్తున్నాం. ఈ దిశగా సంప్రదింపులు ముమ్మరంగా జరుగుతున్నాయి’ అని భారత్ ప్రకటించింది. సదస్సుకు సంబంధించిన వివరాలను విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా వెల్లడించారు. అయితే రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, వాతావరణ మార్పులు వంటి అంశాల్లో సమ్మతి సాధ్యమయ్యేనా అన్న ప్రశ్నకు సరైన సమాధానం ఆయన చెప్పలేదు. ‘ ఆఫ్రికా యూనియన్‌కు జీ20 కూటమిలో సభ్యత్వం ఇవ్వాలా వద్దా అనే అంశంపై శనివారం జరిగే సదస్సులో నిర్ణయం తీసుకోవచ్చు’ అని క్వాత్రా తెలిపారు. ‘ప్రధాని మోదీకి గ్లోబల్ సౌత్ దేశాలపై ప్రగాఢ విశ్వాసముంది. అందుకే ఆఫ్రికా యూనియన్ను కలుపుకుందామని జీ20 సభ్యదేశాలకు రాతపూర్వకంగా మోదీ విన్నవించుకున్నారు. ఢిల్లీ డిక్లరేషన్ అనేది గ్లోబల్ సౌత్‌కు, అభివృద్ధి దేశాలకు గొంతుకగా ఉంటుంది. జీ20కి భారత సారథ్యం సమ్మిళితంగా, లక్ష్య సాధకంగా, క్రియాశీలకంగా, నిర్ణయాత్మకంగా ఉంటుందని మోదీ ధీమా వ్యక్తంచేశారు ’ అని జీ20 షెర్పా అయిన అమితాబ్ కాంత్ చెప్పారు. ‘ భారత వైవిధ్య, సమాఖ్య నిర్మాణానికి గుర్తుగా ఇప్పటికే దేశవ్యాప్తంగా 60 నగరాలు, పట్టణాల్లో 220కిపైగా జీ20 సంబంధ సమావేశాలు జరిగాయని అమితాబ్‌కాంత్ పేర్కొన్నారు. అగ్ర నేతలు పాల్గొనే సెషన్స్‌లు మూడు విడిగా జరుగుతాయి. వీటికి ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అని నామకరణం చేశారు. శనివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అగ్రనేతల గౌరవార్ధం విందు ఇవ్వనున్నారు. జీ20 నేతలంతా రాజ్‌ఘాట్‌కు చేరుకుని గాంధీజీకి ఘన నివాళులు అర్పించనున్నారు. ప్రపంచ రాజకీయ భౌగోళిక పరిస్థితులు, ఆర్థిక అనిశ్చితి, సమ్మిళిత వృద్ధి, ఉక్రెయిన్ యుద్ధం, వాతావరణంలో పెను మార్పులు, గ్లోబల్ సౌత్ దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లు తదితర కీలక అంశాలు నేతల మధ్య భేటీలో చర్చకు రానున్నాయి. మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్, జర్మనీ చాన్స్‌లర్ స్కోల్జ్, ఫ్రెంచ్ అధ్యక్షుడు మేక్రాన్ సహా ఇతర దేశాల నేతలు, ఈయూ, ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్, ఓఈసీడీ, ఐరాస వంటి అంతర్జాతీయ సంస్థల చీఫ్‌లు హాజరుకానున్నారు. -
G20 Summit: డిక్లరేషన్‌పై తొలగని ప్రతిష్టంభన
జీ20 శిఖరాగ్ర సదస్సుకు సర్వం సిద్ధమై అగ్రరా జ్యాధినేతలు విచ్చేసి భేటీకి సిద్ధమవుతున్న వేళ ఢిల్లీ డిక్లరేషన్‌పై ఇంకా ప్రతిష్టంభన తొలగలేదు. శిఖరాగ్ర సదస్సులో దేశాధినేతల మధ్య విస్తృత స్థాయి చర్చలు పూర్తయ్యాక చివరి రోజున ఉమ్మడి తీర్మానం(ఢిల్లీ డిక్లరేషన్) విడుదల చేస్తారు. ఆ తీర్మానంలో ఏఏ అంశాలపై ఉమ్మడి నిర్ణయాలు ప్రకటించాలనే దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. డిక్లరేషన్‌లో పొందుపరచాల్సిన అంశాలపై ఇప్పటికే ఆయా దేశాధినేతల తరఫున అధికారిక ప్రతినిధు(షెర్పా) లు పలుమార్లు కలిసికట్టుగా అంతర్గత చర్చలు జరిపారు. ఈ మంతనాల్లో ఇంతవరకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఎలాంటి ఉమ్మడి నిర్ణయాలు తీసుకో లేదు. శిఖరాగ్ర సదస్సులో అధినేతలు ఏమేం అంశాలు చర్చించాలనేది ముందే నిర్ణయం అయిపో తుంది. సదస్సు అత్యంత సాఫీగా సాగేందుకు వీలుగా ఆయా అంశాలపై అధినేతల నుంచి ఉమ్మ డి నిర్ణయాలు వెలువడేందుకుగాను ముందే షెర్పా లు భారీ కసరత్తు చేస్తారు. సభ్య దేశాల అధినేతల అధికారిక ప్రతినిధులైన ఈ షెర్పాలు దౌత్యమార్గంలో అంతర్గతంగా ముందే అందరూ చర్చించుకుంటారు. దీంతో శిఖరాగ్ర సదస్సులో అధినేతలు నేరుగా కలిసి మాట్లాడేటపుడు ఆయా అంశాల లోతుల్లోకి వెళ్లరు. సూత్రప్రాయ అంగీకారం మాత్రమే తెలుపుతారు. మిగిలిన పని అంతా ముందే ఏర్పాటు చేసిపెడతారు కాబట్టి ఆతర్వాతి ప్రక్రియ సులువు అవుతుంది. అయితే, తాజాగా షెర్పాల మధ్య జరిగిన చివరి రౌండ్ చర్చల్లోనూ కొన్ని కీలక అంశాలపై సయోధ్య కుదరనే లేదు. వాటిల్లో పర్యావరణ మార్పు, ఉక్రెయిన్ యుద్ధం వంటి ప్రధాన అంశాలు ఉన్నాయి. ఉక్రెయిన్ యుద్ధాన్ని పేర్కొంటూ ఒక పేరాగ్రాఫ్‌లో భారత్ చేసిన ప్రతిపాదనలపై షెర్పాల చిక్కుముడి పడింది. ఉక్రెయిన్‌లో రష్యా ఆగడాలను అడ్డుకునేలా చర్యలు ఆ పేరాగ్రాఫ్‌లో లేవని అమెరికా, బ్రిటన్, యురోపియన్ యూనియన్లు వేలెత్తిచూపాయి. ఢిల్లీ డిక్లరేషన్‌లో ఉక్రెయిన్ యుద్ధం అంశంపై ఏకాభిప్రాయం తెలపాలంటే తమ డిమాండ్లు నెరవేర్చాలని అటు పశ్చిమ దేశాలు, ఇటు రష్యా–చైనా పక్ష దేశాలు పట్టుబడుతున్నాయి. దీంతో ఈ అంశంపై సమ్మతి సాధ్యపడలేదు. ఇలాంటి పరిస్థితి రాకూడదనే ముందుగానే జకార్తాలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌లు చర్చలు జరిపి డిక్లరేషన్ సంబంధ అంశాలపై చర్చించినా ఫలితం లేకపోయింది. భారత నాయకత్వ ప్రతిష్టకు సవాల్ తొలిసారిగా జీ20 కూటమి సారథ్య బాధ్యతలు తీసుకున్న భారత్ ఈ సదస్సు తర్వాత ఎలాగైనా సరే ఉమ్మడి తీర్మానం ప్రకటించాలని చూస్తోంది. అయితే అటు పశ్చిమ దేశాలు, ఇటు రష్యా–చైనా పక్ష దేశాలు ఎవరి మంకుపట్టు వారు పట్టడంతో ఉ మ్మడి తీర్మానం సాధ్యమయ్యేలా లేదు. అదే జరిగి తే అంతర్జాతీయంగా భారత ప్రతిష్టకు భంగం వా టిల్లే ప్రమాదం ఉంది. సంయుక్త ప్రకటన సాధ్యంకాని పక్షంలో జీ20 అధ్యక్ష హోదాలో మోదీ కేవలం సారాంశ ప్రకటన విడుదల చేస్తారు. వాతావరణ మార్పు: ఇదే అసలైన అవరోధం చర్చల్లో ఏకాభిప్రాయానికి ప్రధాన అవరోధంగా వాతావరణ మార్పు విధానం నిలుస్తోంది. శిలాజ ఇంధనాల వినియోగాన్ని క్రమక్రమంగా తగ్గించుకోవడం, పునరుత్పాదక ఇంథనాల వైపు మళ్లడం, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సామర్థ్యాల పెంపునకు లక్ష్యాలను నిర్దేశించుకోవడం, గ్రీన్‌హౌజ్ వాయువుల ఉద్గారాలను తగ్గించుకోవడం వంటి అంశాల్లో జీ20 సభ్య దేశాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇది షెర్పాల భేటీలో స్పష్టంగా కనిపించింది. 2030 కల్లా పునరుత్పాదక ఇంధన సామర్థ్యాలను క్రమంగా పెంచుకోవాలని, 2035 ఏడాదికల్లా గ్రీన్‌హౌజ్ వాయువుల ఉద్గారాల స్థాయిని తగ్గించుకోవాలని పశ్చిమ దేశాలు చేసిన ప్రతిపాదనలను భారత్, రష్యా, చైనా, సౌదీ అరేబియాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. శిలాజ ఇంధన ఆధారిత ఆర్థికవ్యవస్థ కలిగిన సౌదీ అరేబియా అయితే ఈ ప్రతిపాదలను ఒప్పుకునేది లేదని తెగేసి చెప్పింది. జ్ఞానాధారిత రంగాలు, ఇతర సెక్టార్ల వైపు మళ్లేందుకు తమకు దశాబ్దాల కాలం పడుతుందని వాదిస్తోంది. వెలువడుతున్న కర్భన ఉద్గారాలు, ప్రకృతిలోకి శోషించబడుతున్న కర్భన ఉద్గారాల నిష్పత్తి సమంగా ఉండేలా అంటే కార్బన్ నెట్ జీరో(కర్భన స్థిరత్వం) సాధించేందుకు జీ7 దేశాలు తొందర పెడుతున్నాయి. శిలాజ ఇంధనాల ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, వాటి ద్వారా వచ్చే విద్యుత్ సాయంతోనే ఆర్థిక వ్యవస్థలో సుస్థిరాభివృద్ధి సాధిస్తామని ధీమాగా ఉన్న అభివృద్ధి చెందుతున్న దేశాలు.. ఈ జీ7 దేశాల ప్రతిపా దనలను తప్పుబడుతున్నాయి. ‘దశాబ్దాలుగా శిలా జ ఇంధనాలను విపరీతంగా వాడేసి పారిశ్రా మిక విప్లవంతో పశ్చిమ దేశాలు సంపన్న దేశాలుగా అవ తరించాయి. ఇప్పుడు మాకు ఆ అవకాశం ఇవ్వండి. వాతావరణ మార్పుల మాటున అభివృద్ధిని అడ్డుకో కండి’ అని భారత్‌సహా దేశాలు వాదిస్తు న్నాయి. 2020కల్లా వాతావరణ మార్పులను సమర్థంగా ఎదుర్కొనేందుకు పేద దేశాలకు ఏటా 100 బిలి యన్ డాలర్ల నిధులను ఇస్తామన్న సంపన్న దేశాలు ఆ వాగ్దానాన్ని నెరవేర్చనేలేదు. ఎప్ప టికల్లా సాయం చేస్తాయనేదీ స్పష్టంచేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో క్లైమేట్ పాలసీపై ఉమ్మడి నిర్ణయం ఆశించడం కష్టమే. ఇలాంటి తరుణంలో మొదలవు తున్న జీ20 సదస్సు క్లిష్టమైన కూడలిలో నిల్చుంద నే చెప్పాలి. దేశ ప్రయోజనా లను పక్కనబెట్టి మానవాళి శ్రేయస్సు కోసం అగ్రనేతలు ఏ మేరకు ఉమ్మడి వాగ్దానాలు చేస్తారనేది బిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. జీ20లో ఏకాభిప్రాయం కుదరక పోతే త్వరలో యునైటెడ్ అరబ్ ఎమిరే ట్స్‌లో జరగ బోయే కాప్28 సదస్సులోనూ మేలైన ఫలితాలను ఆశించడం అత్యాశే అవుతుంది. –సాక్షి నేషనల్‌డెస్క్ -
మంత్రి ఈశ్వర్ వ్యాఖ్యలు హాస్యాస్పదం ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌పై రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని, కాంగ్రెస్ పార్టీ దళితులకు ఏం చేసిందని ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే దళితుల సంక్షేమం అమలైందన్న విషయాన్ని ఈశ్వర్ గుర్తుంచుకోవాలని అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంలో దళితులకు ఎన్ని ఇళ్లు ఇచ్చారో, గత మూడేళ్లలో ఎంతమందికి దళిత, బీసీ, మైనార్టీ బంధు పథకాలు అమలు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్లు కట్టిన ప్రాంతాల్లో తాము ఓట్లు అడుగుతామని, బీఆర్ఎస్కు దమ్ముంటే డబుల్బెడ్రూం ఇళ్లు కట్టిన చోట్ల ఓట్లు అడగాలన్నారు. గత నాలుగేళ్లుగా ఏమీ పట్టించుకోకుండా ఎన్నికల ముందు హడావుడి చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం పేదలకు ఒక్క రేషన్‌కార్డు కూడా ఇవ్వలేకపోయిందని విమర్శించారు. దళితుల జనాభా ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేస్తామని కేసీఆర్ మాట తప్పారని, వాటిని తాము అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించడంతో ఆయన ఉలిక్కిపడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీని కాకుండా దళితులకు అన్యాయం చేసిన కేసీఆర్‌ను ఈశ్వర్ ప్రశ్నించాలని జీవన్‌రెడ్డి సూచించారు. -
ఎస్సీలకు 18%.. ఎస్టీలకు 12% రిజర్వేషన్లు
చేవెళ్ల: చేవెళ్ల ప్రజాగర్జన సభ వేదికగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను ప్రకటించింది. మొత్తం 12 అంశాలతో కూడిన ఈ డిక్లరేషన్‌ను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే సమక్షంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ డిక్లరేషన్‌లో పేర్కొన్న అంశాలన్నింటినీ తాము అధికారంలోకి రాగానే అమలు చేస్తామని.. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం కృషి చేస్తామని ఖర్గే ప్రకటించారు. డిక్లరేషన్‌లోని అంశాలివీ.. జనాభా దామాషా ప్రాతిపదికన ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12% మేర రిజర్వేషన్ల పెంపు. వర్గీకరణ చేసి మాదిగలకు న్యాయం చేస్తాం. అంబేడ్కర్ అభయహస్తం కింద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.12 లక్షల చొప్పున ఆర్థిక సాయం. ఐదేళ్ల పాటు ప్రతి బడ్జెట్లో సరిపడా నిధులు కేటాయించి పథకం అమలు. ఎస్సీ, ఎస్టీలకు అన్ని ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 18 శాతం, 12 శాతం చొప్పున రిజర్వేషన్లు అమలు. ప్రైవేటు విద్యాసంస్థలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు పొందే ప్రైవేటు కంపెనీల్లో కూడా వారికి రిజర్వేషన్లు ఇందిరమ్మ పక్కా ఇళ్ల పథకం కింద ఇంటి స్థలాలు లేని ప్రతి దళిత, గిరిజనులకు ఇంటి స్థలంతోపాటు ఇల్లు కట్టుకునేందుకు రూ.6 లక్షల ఆర్థిక సాయం. ఐదేళ్లలో ప్రతి ఎస్సీ, ఎస్టీ కుటుంబానికి ఈ పథకం వర్తింపు. బీఆర్ఎస్ ప్రభుత్వం గుంజుకున్న ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములను అన్ని హక్కులతో తిరిగి అసైనీలకే కేటాయింపు. ప్రజా ప్రయోజనార్థం, భూసేకరణ చట్టం–2013 ప్రకారం భూములను సేకరించినప్పుడు సదరు అసైన్డ్ భూములకు పట్టా భూములతో సమానంగా పరిహారం. ఎస్సీలకు ఇచ్చిన అసైన్ భూములపై యాజమాన్య హక్కుల కల్పన. అమ్ముకునేందుకు, బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకునే హక్కులు. ఎస్టీలకు ఇచ్చిన పోడు భూములపైనా వారికి పూర్తి హక్కులు. అటవీ హక్కుల చట్టం పటిష్టంగా అమలు. సమ్మక్క–సారక్క గిరిజన గ్రామీణ అభివృద్ధి పథకం కింద ప్రతి గూడెం, తండా గ్రామ పంచాయతీలకు రూ.25లక్షల అభివృద్ధి నిధులు. ఎస్సీలకు 3 కార్పొరేషన్లు ఏర్పాటు. మాదిగ, మాల, ఇతర ఉపకులాలకు ఒక్కో కార్పొరేషన్ ద్వారా ఏటా రూ.750 కోట్ల నిధులు. గిరిజనుల కోసం మూడు కార్పొరేషన్లు. తుకారాం ఆదివాసీ కార్పొరేషన్, సంత్ సేవాలాల్ లంబాడా కార్పొరేషన్, ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు. వాటికి ఏటా రూ. 500 కోట్ల కేటాయింపు. రాష్ట్రంలో ఐదు కొత్త ఐటీడీఏలు, తొమ్మిది సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటు. మైదాన ప్రాంత గిరిజనుల కోసం నల్లగొండ, మహబూబాబాద్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లలో ఐటీడీఏల ఏర్పాటు. అన్ని ఐటీడీఏ కేంద్రాల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు.. విద్యాజ్యోతుల పథకం కింద పదో తరగతి పూర్తి చేసిన ప్రతి విద్యార్థికి రూ.10 వేల నగదు, ఇంటర్ పాసైతే రూ.15 వేలు, డిగ్రీ పాసైతే రూ.25వేలు, పీజీకి రూ.లక్ష.. ఎంఫిల్, పీహెచ్డీ పూర్తి చేసిన విద్యార్థులకు రూ.5లక్షల నగదు బహుమతులు. ప్రతి మండలంలో ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద అందరికీ విద్య. గ్రాడ్యుయేట్, పీజీ విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం. విదేశీ యూనివర్సిటీల్లో ప్రవేశం పొందిన ప్రతి ఎస్సీ, ఎస్టీ విద్యార్థికి ఆర్థిక సాయం. -
గాంధీభవన్‌లో కాంగ్రెస్‌పైనే మందకృష్ణ విమర్శలు!
సాక్షి, హైదరాబాద్: గాంధీభవన్‌కు వచ్చి కాంగ్రెస్ పార్టీపైనే విమర్శలు సంధించారు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వర్గీకరణ బిల్లు పెట్టమంటే పెట్టలేదు. ప్రతిపక్ష పాత్రలో లేఖ రాయండని అడిగినా.. రాయలేదు. ఎస్సీ వర్గీకరణకు అండగా ఉంటేనే కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తాం అని తెలిపారాయన. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిక్లరేషన్‌పై అభిప్రాయాలు తీసుకోవడానికి గాంధీభవన్‌కు ఆయన నేతృత్వంలోని బృందం వెళ్లింది. ఏఐసీసీ ఇన్‌ఛార్జి మాణిక్‌రావు థాక్రే సమక్షంలో కాంగ్రెస్ నేతలకు ఎస్సీల్లో ఏ, బీ, సీ, డీ వర్గీకరణ విషయంలో కాంగ్రెస్‌కు ఆయన వినతిప్రతాలు సమర్పించారు. వర్గీకరణ అంశం సామాజిక అంశంగా గుర్తించిందే కాంగ్రెస్. ఎస్సీ వర్గీకరణ చీలీకల సమస్య కాదు. ‘‘మా ఆకాంక్ష వర్గీకరణ అంశంపై పీసీసీ రేవంత్, ఇంచార్జ్ ఠాక్రే ,భట్టికి తెలియజేసాం. ఎస్సీ వర్గీకరణ పోరాటం దళితుల మధ్య చీలిక అంశం కాదు. సామాజికాంశం. అసమానతలను పరిష్కరించడం కోసమే వర్గీకరణ అంశం. అన్ని కులాలను సమానంగా చూడడమే వర్గీకరణ. ► ఎస్సీ రిజర్వేషన్స్ ఫలాలు అన్ని కులాలకు అందడం లేదని అప్పటి ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి 1965లో లోకూర్ కమిటి ని నియమించింది. పంజాబ్ లో 1974 నుండి ఇప్పటి వరకు ఎస్సి వర్గీకరణ అమలు కావడం లేదు. ఎస్సి రిజర్వేషన్స్ వర్గీకరణ ను కాంగ్రెస్ సమర్థించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ వర్గీకరణ కోసం వైఎస్సార్ చంద్రబాబు పై ఒత్తిడి తెచ్చారు. వైఎస్సార్ హయాంలో పార్లమెంట్ లో వర్గీకరణ అంశంపై తీర్మానం చేశారు. కేంద్రం ద్వారా వర్గీకరణ చేసే అంశం రాష్ట్రాలకు ఇస్తామని 2009 లో కాంగ్రెస్ మేనిఫెస్టో లో పెట్టింది. 2018లో రాష్ట్రాలకు ఎస్సీ వర్గీకరణ కట్టబెట్టాలంటూ కేంద్రం పై ఓత్తిడి తెస్తామంటూ మేనిఫెస్టో లో పెట్టారు. ► తమిళనాడులో జనార్దన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ తో dmk వర్గీకరణ అమలు చేస్తుంది. పార్లమెంట్ లో బిల్లు పెడితే మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని లేఖలు రాశారు. 10 ఏళ్లుగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న వర్గీకరణ బిల్లు పెట్టలేదు. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి పెంచాలని 9 ఏళ్లుగా కోరుతున్నా.2018 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కి మద్దతు తెలిపాం. ఇక్కడ ముగ్గురు ఎంపి లు గెలిచిన ఏనాడూ ప్రశ్నించలేదు. పార్లమెంట్ లో రేవంత్ మాట్లాడడానికి అవకాశం వచ్చినప్పుడు ఎస్సీ వర్గీకరణ పై మాట్లాడాల్సి ఉంటే బాగుండేది. ఆరు సంవత్సరాలు అవుతున్న అసెంబ్లీ లో వర్గీకరణ పై సిఏల్పి నేత బట్టి విక్రమార్క మాట్లాడలేదు. ► రాహుల్ గాంధీ హైదరాబాద్‌లో జరిగిన సమావేశం లో ఎస్సి వర్గీకరణ కు కాంగ్రెస్ కట్టుబడి ఉందని తెలిపారు. గద్వాల్ సభలో ఎస్సీ వర్గీకరణ పూర్తి చేస్తామని తెలిపారు.అయితే జనాభా ప్రతిపాదికాన మాదిగలకు టికెట్లు కేటాయించలేదు. వర్గీకరణ మీద అనుకూలమని మీరు చెబితే ప్రధాని కి లేఖ రాయాలి. పార్లమెంట్ లో వర్గీకరణ పై ప్రైవేట్ బిల్లు పెట్టాలి అని కోరాను. రేవంత్, ఠాక్రే మాకు అనుకూలంగా వస్తుంది అన్నారు. వారు మాకు అనుకూలంగా లెటర్ ఇస్తే మా నిర్ణయం చెబుతాం అని చెప్పాం. వర్గీకరణ పై కాంగ్రెస్ స్టాండ్ నిజాయితీగా ఉండాలి. లేదంటే రాజకీయంగా సీరియస్‌గా ఉంటాం అని మందకృష్ణ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించేవారి నుంచి దరఖాస్తులకు ఫీజులు! మరోవైపు టీకాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం కొనసాగుతోంది. టికెట్ ఆశించేవారి నుంచి దరఖాస్తు తీసుకోవాలని, దరఖాస్తుదారుల నుంచి ఫీజులు వసూలు చేయాలని, ఓసీలకు రూ.10వేలు, ఎస్సీ-ఎస్టీలకు అభ్యర్థులకు రూ.2,500 తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: గజ్వేల్‌లో దళిత బంధుకోసం రోడ్డెక్కారు! -
హైదరాబాద్ యువ డిక్లరేషన్‌ను ప్రకటించనున్న ప్రియాంక గాంధీ
-
ప్రియాంక ‘యువ సంఘర్షణ సభ’.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ మళ్లింపులు
సాక్షి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా: రానున్న ఎన్నికల్లో యువతను ఆకట్టుకోవడమే లక్ష్యంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సోమవారం ‘యూత్ మేనిఫెస్టో’ప్రకటించనుంది. గత ఏడాది వరంగల్‌లో నిర్వహించిన సభలో రాహుల్‌గాంధీ ‘రైతు డిక్లరేషన్’ప్రకటించిన విధంగానే.. సోమవారం సాయంత్రం సరూర్‌నగర్ స్టేడియంలో జరిగే ‘యువ సంఘర్షణ సభ’లో ప్రియాంకా గాంధీ ‘హైదరాబాద్ యూత్ డిక్లరేషన్’ను ప్రకటించనున్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని, నిరుద్యోగ యువతకు ప్రతి నెలా రూ.4వేల చొప్పున భృతి ఇస్తామని ప్రకటించనున్నట్టు టీపీసీసీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో 18 నుంచి 40 ఏళ్ల మధ్య నిరుద్యోగులు 60 లక్షల మంది ఉంటారని.. అందులో 25 లక్షల మంది గ్రాడ్యుయేట్లు ఉంటారనే అంచనా మేరకు ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి ప్రకటనలు చేయాలని నిర్ణయించామని వెల్లడించాయి. విద్య–ఉత్పాదకత సృష్టి ద్వారా చదువుకున్న అందరికీ వారి విద్యార్హతల మేరకు ఉపాధి కల్పింస్తామనే హామీ ఇవ్వనున్నట్టు పేర్కొన్నా యి. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ పనితీరును తీర్చిదిద్దుతామని, ఏటా జాబ్ కేలండర్‌ను ప్రకటిస్తామని భరోసా కల్పించనున్నట్టు తెలిపాయి. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు టెలి కమ్యూనికేషన్స్ మాజీ ఇంజనీర్ శ్యామ్ పిట్రోడా నేతృత్వంలో ఏర్పాటు చేసిన ‘నాలెడ్జ్ సొసైటీ’అధ్యయన నివేదిక మేరకు.. విద్య, ఉపాధి రంగాల్లో రాష్ట్ర యువతకు పలు వరాలు ప్రకటిస్తామని టీపీసీసీ వర్గాలు వెల్లడించాయి. విద్యా రంగంలోనూ ‘భరోసా’ ఉపాధి కల్పనతోపాటు విద్యా రంగంలో భరో సా ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీల తరహాలో బీసీ, ఈబీసీలకు పూర్తిస్థాయి లో ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తామని.. ప్రతి ఉమ్మడి జిల్లాలో ఐఐటీ ఏర్పాటుకు కృషి చేస్తామని ప్రకటించనుంది. పీవీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఏపీలో సర్వేల్ గురుకులాన్ని ఏర్పాటు చేసి.. రెసిడెన్షియల్ విద్యకు శ్రీకారం చుట్టినది కాంగ్రెస్ పారీ్టనేనని పీసీసీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పుడు ఆ గురుకుల వ్యవస్థను మెరుగైన సౌకర్యాలతో నడిపిస్తామని హామీ ఇవ్వనున్నట్టు తెలిపాయి. మొత్తమ్మీద యువకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఆకట్టుకునే దిశలో ప్రియాంకా గాంధీ ‘యూత్ మేనిఫెస్టో’ప్రకటించనున్నట్టు వెల్లడించాయి. అమరవీరుల కుటుంబాలకు పింఛన్లు తెలంగాణ కోసం తనువు చాలించిన అమరవీరుల కుటుంబాలకు ప్రియాంకా గాంధీ సభలో భరోసా కలి్పంచనున్నట్టు టీపీసీసీ నేతలు చెప్తు న్నారు. తొలి, మలిదశ అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామని, వారికి నెలవారీ పింఛన్ ఇస్తామని హామీనివ్వనున్నట్టు చెబుతున్నారు. సాయంత్రం 4 గంటలకు రానున్న ప్రియాంక కర్ణాటక నుంచి సోమవారం సాయంత్రం 4కి శంషాబాద్ విమానాశ్రయానికి వస్తారు. అక్కడి నుంచి బయలుదేరి 4:45 గంటలకు సరూర్‌నగర్ స్టేడియానికి చేరుకుంటారు. 5:45 గంటల వరకు సభలో పాల్గొని ప్రసంగిస్తారు. తర్వాత నేరుగా శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లి.. 6.30 సమయంలో ఢిల్లీ బయలుదేరుతారని టీపీసీసీ వర్గాలు వెల్లడించాయి. సభకు ఏర్పాట్లు పూర్తి.. సభ కోసం టీపీసీసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నేతృత్వంలో టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి, యువ నాయకులు మానవతారాయ్, చరణ్ కౌశిక్, మహ్మద్ రియాజ్, చెనగోని దయాకర్, బాలలక్ష్మి, చారగొండ వెంకటేశ్ రెండురోజులు గా సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆదివారం మాణిక్‌రావ్ ఠాక్రే, ఎమ్మెల్యే జగ్గారెడ్డి తదితరు లు సభ ఏర్పాట్లను పరిశీలించారు. మహేశ్వరం నియోజకవర్గం ఇన్చార్జి దేప భాస్కర్‌రెడ్డి సభా వేదిక ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 50మంది కూర్చొనేలా విశాల వేదికను ఏర్పాటు చేశారు. స్టేజీ ముందు భాగంలో వీఐపీలకు, మహిళలకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ‘నిరుద్యోగ ర్యాలీ’.. ట్రాఫిక్ మళ్లింపులు వేలాది మంది విద్యార్థులు, నిరుద్యోగులతో కలిసి సాయంత్రం నాలుగు గంటలకు ఎల్బీనగర్ శ్రీకాంతాచారి విగ్రహం నుంచి సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం వరకు కాంగ్రెస్ ‘నిరుద్యోగ జంగ్ సైరన్’ర్యాలీ నిర్వహించనుంది. కాంగ్రెస్ ముఖ్య నేతలంతా ఈ ర్యాలీలో, సరూర్‌నగర్ సభలో పాల్గొంటున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సరూర్నగ ర్, ఎల్బీనగర్ పరిసరాల్లో మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నా యి. విజయవాడ హైవే, సాగర్‌రోడ్డు నుంచి వచ్చే వాహనాలను ఇటు చంపాపేట వైపు, అటు నాగోల్ వైపు మళ్లించనున్నారు. దిల్సుఖ్నగర్ నుంచి వచ్చే వాహనాలను చైతన్యపురి సిగ్నల్ నుంచి నాగోల్ వైపు మళ్లిస్తారు. -
సరూర్ నగర్ సభలో ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్
-
రేపు మంచిర్యాలలో భారీ బహిరంగ సభకు సన్నాహకాలు
-
World Tourism Day: లోకం చుట్టేద్దాం
నిత్యం ఒత్తిళ్ల నడుమ బిజీ బిజీగా సాగే రొటీన్‌గా బతుకుల్లో అప్పుడప్పుడూ కాస్త కొత్తదనం నింపేవి టూర్లే. కరోనాతో కుదేలైన పర్యాటక రంగం కొన్నాళ్లుగా తిరిగి కళకళలాడుతోంది. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా పలు దేశాలు రీ థింకింగ్ టూరిజం పేరుతో టూరిస్టులను ఆకర్షించే ప్రయత్నాల్లో ఉన్నాయి... కరోనాతో తీవ్రంగా నష్టపోయిన ప్రధాన రంగాల్లో పర్యాటకం ఒకటి. రెండేళ్ల పాటు లాక్డౌన్లు, అంతర్జాతీయ రాకపోకలపై నిషేధాలతోనే సరిపోయింది. దాంతో పర్యాటకమే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న శ్రీలంక వంటి దేశాలు ఆర్థికంగా చితికిపోయాయి. సాధారణ పరిస్థితులు నెలకొంటుండటంతో సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ‘రీ థింకింగ్ టూరిజం’ థీమ్‌తో పలు దేశాలు ముమ్మరంగా ప్రమోట్ చేస్తున్నాయి. టూరిస్టులు ఇష్టపడే ప్రాంతాలను గుర్తించి అభివృద్ధి చేయడం, కాస్త అలా తిరిగి వస్తే నిత్య జీవిత ఒత్తిళ్ల నుంచి బయట పడవచ్చంటూ ప్రచారం చేయడంపై దృష్టి పెట్టాయి. పర్యాటక రంగంలో ప్రపంచ దేశాల్లో ఫ్రాన్స్‌కు తిరుగు లేదని ఎన్నో సర్వేలు తేల్చాయి. 2019లో ఏకంగా 9 కోట్ల మంది అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించింది. దేశ జీడీపీలో 8% వాటా పర్యాటక రంగానిదే. కరోనా వేళ ఫ్రాన్స్‌కు టూరిస్టులు సగానికి సగం తగ్గిపోయారు. మళ్లీ ఈ ఏడాది ఆ దేశానికి టూరిస్టుల తాకిడి పెరిగింది. తర్వాతి స్థానాల్లో స్పెయిన్, అమెరికా, జర్మనీ, స్విట్జర్లాండ్, సింగపూర్ తదితరాలున్నాయి. టాప్ 10 దేశాల్లో యూరప్, ఆసియా ఫసిఫిక్ దేశాలే ఎక్కువగా ఉండటం విశేషం! ఎటు చూసినా ఎకో టూరిజమే ఎకో టూరిజం. సింపుల్‌గా చెప్పాలంటే ప్రకృతి సౌందర్యంలో లీనమైపోవడం. కాంక్రీట్ అడవుల్లో నిత్యం రణగొణధ్వనుల మధ్య బతికేవారు అప్పుడప్పుడూ ప్రకృతి అందాల మధ్య రిలాక్సవడం. ఉద్యానవనాలు, అడవులు, సముద్ర తీర ప్రాంతాల సందర్శన, కొండలు గుట్టలు ట్రెక్కింగ్, ఆయా ప్రాంతాల సంస్కృతిని తెలుసుకోవడంపైç ప్రజలు ఆసక్తి చూపుతుండటంతో అన్ని దేశాలూ ఎకో టూరిజం అభివృద్ధిపై దృష్టి పెట్టాయి. మారుమూలల్లోని ప్రాకృతిక అందాలని టూరిస్ట్ స్పాట్లుగా తీర్చిదిద్దితే ఇటు ఆదాయం రావడంతో పాటు పేదరికంలో మగ్గుతున్న స్థానికుల బతుకులూ బాగుపడతాయి. ఐస్‌ల్యాండ్, కోస్టారికా, పెరు, కెన్యా, అమెజాన్ అడవులతో అలరారే బ్రెజిల్ వంటివి ఎకో టూరిజానికి పెట్టింది పేరు. ప్రపంచ ఎకో టూరిజం మార్కెట్ 2019లో 9 వేల కోట్ల డాలర్లు. 2027 నాటికి 11 వేల కోట్ల డాలర్లకు చేరొచ్చని అంచనా. పర్యాటకానిది పెద్ద పాత్ర ► పర్యాటక రంగానికున్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ప్రపంచ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 10% వాటా దీనిదే! ► ప్రపంచ ఎగుమతుల్లో 7% పర్యాటకుల కోసమే జరుగుతున్నాయి. ► ప్రతి 10 ఉద్యోగాల్లో ఒకటి పర్యాటక రంగమే కల్పిస్తోంది. ► 2019లో అత్యధికంగా ఫ్రాన్స్‌ను 9 కోట్ల మంది సందర్శించారు. 8.3 కోట్లతో స్పెయిన్, 7.9 కోట్ల పర్యాటకులతో అమెరికా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ► పర్యాటక రంగం 2019లో ప్రపంచవ్యాప్తంగా 33.3 కోట్ల ఉద్యోగాలు కల్పించింది. కరోనా దెబ్బకు 2020లో ఇది ఏకంగా 2.7 కోట్లకు తగ్గిపోయింది. ► 2019లో భారత జీడీపీలో పర్యాటక రంగానిది 6.8% వాటా. 2020 నాటికి 4.7 శాతానికి తగ్గింది. ► 2019లో 1.8 కోట్ల మంది భారత్‌ను సందర్శిస్తే 2020లో 60 లక్షలకు పడిపోయింది. ► 2020 నాటికి దేశ పర్యాటక రంగం 8 కోట్ల ఉద్యోగాల కల్పించింది. భారత్.. పర్యాటక హబ్ ► పర్యాటక రంగ పురోగతికి భారత్ పకడ్బందీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ► సుస్థిర, బాధ్యతాయుత పర్యాటకమే లక్ష్యంగా కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రి జి.కిషన్ రెడ్డి ఇటీవల ధర్మశాల డిక్లరేషన్ ఆమోదించారు. ► పర్యాటక రంగ వృద్ధితో విదేశీ మారక నిల్వలు పెరిగి దేశం ఆర్థికంగా సుసంపన్నంగా మారుతుంది. ► 2030 నాటికి పర్యాటక ఆదాయం జీడీపీలో 10 శాతానికి పెంచడం, 2.5 కోట్ల విదేశీ పర్యాటకులను రప్పించడం, 14 కోట్ల ఉద్యోగాలు కల్పించడం లక్ష్యం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ప్రపంచానికి ప్రమాద ఘంటికలు.. ‘నాటో’ విస్తరణకై తీవ్ర ప్రమాదకర నిర్ణయాలు!
స్పెయిన్ రాజధాని మ్యాడ్రిడ్‌లో జూన్ 28 నుండి 30 వరకూ ‘నాటో’ సదస్సు జరిగింది. ఇందులో నాటో మిలిటరీ కూటమి విస్తరణౖకై తీవ్ర ప్రమాదకర నిర్ణయాలు వెలువడ్డాయి. ఐరోపాలో నాటో సైనికుల సంఖ్యను పెంచడంతోపాటు, ఆ కూట మిని మొదటిసారిగా ఆసియా పసిఫిక్ ప్రాంత దేశా లలో విస్తరించే ప్రణాళికలు తయారైనాయి. ప్రస్తుతం యూరప్ లోనున్న 40 వేల సంసిద్ధతా దళాలను ఒకే సారి 3 లక్షల వరకూ పెంచుతామనీ, లెక్కలేనన్ని యుద్ధ ట్యాంకులను, విమానాలను రష్యా సరిహద్దుకు పంపిస్తామనీ; రష్యా, చైనాలతో నూతన వ్యూహాత్మక పోటీకి దిగుతామనీ నాటో ప్రధాన కార్యదర్శి స్టోల్టెన్ బర్గ్ అన్నాడు. లాత్వియా, లిథువేనియా, ఎస్తోనియా దేశాల్లో ఉన్న సైనిక శిబిరాలకు బ్రిగేడ్ హోదా కల్పిస్తా మనీ నాటో అంటోంది. నార్డిక్ తటస్థ దేశాలైన నార్వే, స్వీడన్లను తన పరిధిలోకి నాటో ఆహ్వానించటంతో దశాబ్దాల యూరప్ భద్రత ప్రశ్నార్థకమయింది. ‘‘ఈ దేశాల్లో మిలిటరీ మౌలిక సదుపాయాలతో నాటో స్థావరాలను మోహరిస్తే అందుకు దీటుగా మా ప్రతిస్పందన ఉంటుం’’దని పుతిన్ అన్నాడు. ఉక్రె యిన్‌ను అడ్డం పెట్టుకొని రష్యాతో పరోక్ష యుద్ధం చేస్తూ, శాంతి చర్చలు కాదని యూరప్ కల్లోలానికి కారణమైన నాటో కూటమి యూరప్‌లో భారీగా మిలి టరీ మోహరింపునకు సన్నద్ధం అవుతూనే, ‘‘మా భద్రతకు, మా ఆసక్తులకు, విలువలకు చైనా విసిరే సవాళ్ళను స్వీకరించటానికి ఆసియా పసిఫిక్ దేశాలకు కూడా నాటోను వ్యాప్తి చేస్తాం’’ అని నాటో ప్రధాన కార్యదర్శి అన్నాడు. చదవండి👉లుహాన్స్క్లో జెండా పాతేశాం: పుతిన్ చైనా సరిహద్దుల వరకు వెళ్ళటం తమ విధానాలలో వచ్చిన మార్పు అని చెప్పుకొచ్చాడు. రష్యాపై దాడి చేయటానికి అమెరికా, ఫ్రాన్స్, యూకే వంటి పాశ్చాత్య నాటో దేశాల కాల్బలంతో పాటు... ఆయా దేశాల నౌకలు, యుద్ధ విమానాలతో మూకుమ్మడి దాడిని గంటల వ్యవధిలో చేస్తాయని స్టోల్టెన్‌బర్గ్ యుద్ధోన్మాదాన్ని బయటపెట్టాడు. నాటో కూటమి రష్యాతో యుద్ధంలో పాల్గొనదని అధ్యక్షుడు బైడెన్ చాలాసార్లు చెప్పినా... ఆచరణలో ఉక్రెయిన్ మిలిటరీ ముసుగున అనేకమంది నాటో సైని కులు, సలహాదారులు, శిక్షణలు ఇచ్చే జనరల్స్‌ను ఉక్రెయిన్‌కు నాటో పంపింది. రష్యాకు చెందిన వందల కోట్ల డాలర్లను విదేశీ బ్యాంకుల్లో స్తంభింపచేసి, ఆర్థిక వ్యవస్థను నాశనం చేయటానికి కంకణం కట్టుకొన్న పశ్చిమ దేశాలు, 1918 తర్వాత మొదటిసారిగా రష్యా చెల్లించవల్సిన వాయిదాను తీర్చలేని స్థితికి తీసుకు రాగలిగాయి. అయితే ఉక్రెయిన్ యుద్ధంలో పరోక్షంగా పాల్గొంటున్న నాటో ఇప్పటివరకూ విజయాలను సాధించలేకపోయింది. తూర్పు డోనబాస్ ప్రాంత మంతా రష్యా ఆధీనంలోకి రావటంతోపాటు, నల్ల సముద్ర తీర ప్రాంతాలు 90 శాతం రష్యా సేనలు ఆక్ర మించడం గమనార్హం. రష్యా–ఉక్రెయిన్ వివాదం ద్వారా నాటో యుద్ధ కూటమి ఐక్యంగా బయటకు కనబడటానికి ప్రయత్ని స్తోంది. కానీ అంతరంగాన నాటో సభ్యదేశాల మధ్య లుకలుకలున్నాయి, చర్చల ద్వారా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలని ఒత్తిడి వస్తోంది. ప్రపంచం మొత్తంలో రెండంకెలు దాటిన ద్రవ్యోల్బణంతో పాటు రికార్డు స్థాయిలో నిరుద్యోగం, ధరలు పెరుగు తున్నాయి. అమెరికా, చైనా కూటములకు తటస్థంగా భారత్ ఉండి అలీనోద్యమ పూర్వ వైభవానికి కృషి చేస్తే... ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికాలోని అభివృద్ధి చెందుతున్న దేశాలు అగ్రరాజ్యాల ఆధిపత్య ధోరణుల నుండి కాపాడుకొనే అవకాశాలుంటాయి. ఆంక్షల ఫలితంగా యూరప్ ఇంధన సమస్య తీవ్ర స్థాయికి చేరుకొంది. తొందరలోనే ప్రపంచ ఆర్థిక మాంద్యం సంభవించ వచ్చునని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో నాటో విస్తరణ ఏ పరిస్థితులకు దారి తీస్తుంది? చదవండి👉ట్రంప్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. అదే జరిగితే అధ్యక్ష పోటీ ఆశలు గల్లంతు వ్యాసకర్త: బుడ్డిగ జమిందార్, కె.ఎల్. యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ ‘ మొబైల్: 98494 91969 -
ఆస్తులపై డిక్లరేషన్ ఇవ్వక్కర్లేదు
సాక్షి, హైదరాబాద్: అగ్రకుల పేదలకు శుభ వార్త. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఆర్థికంగా వెనక బడిన తరగతుల (ఈడబ్ల్యూఎస్) రిజర్వేషన్ల కోసం దరఖాస్తు చేసుకొనే వారి నుంచి ఆస్తుల వివరాలు, వాటిపై స్వీయ ధ్రువీకరణ (డిక్లరేషన్) స్వీకరించకుండానే ధ్రువపత్రం జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దరఖాస్తు నమూనా నుంచి ఈ స్వీయ ధ్రువీకరణను తొలగించాలని మీ–సేవను ఆదేశించింది. ఆస్తుల వివరాల విభాగం కింద వ్యవసాయ భూములు, నివాస గృహాలు, నివాస స్థలాలకు సంబంధించిన సమగ్ర వివ రాలను ఇవ్వాల్సి ఉండగా దరఖాస్తు నమూ నా నుంచి ఈ విభాగాన్ని సైతం తొలగిం చాలని సూచించింది. ప్రస్తుత దరఖాస్తు విధా నంలో ఐదెకరాలు, ఆపై పొలం.. 1,000 చద రపు అడుగులు, ఆపై విస్తీర్ణంలో నివాస స్థలం... పురపాలికల్లో 100 చదరపు గజాలు, ఆపై విస్తీర్ణంలో నివాస గృహం... గ్రామాల్లో 200 చదరపు గజాలు, ఆపై విస్తీర్ణంలో నివాస గృహంలో ఏదీ లేదని దరఖాస్తుదారులు స్వీయ ధ్రువీకరణ ఇవ్వాల్సి ఉంది. కానీ ఇక పై కుటుంబ ఆదాయం రూ. 8 లక్షల్లోపు ఉం దని స్వీయ ధ్రువీకరణ ఇస్తే సరిపోనుంది. ఐదెకరాలు, ఆపై పొలం, నివాస గృహం, నివాస స్థలాలేవి లేవని డిక్లరేషన్ ఇచ్చినట్లు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లో ప్రస్తుతం పొందు పరుస్తుండగా ఇకపై దీన్ని కూడా తొలగిం చనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, భూపరిపాలన విభాగం ముఖ్య కమిషనర్ సోమేశ్ కుమార్ గురువారం మీ– సేవ విభాగం కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. గతేడాది జారీ చేసిన జీవో నంబర్ 33 అమలు కోసం ఈ మేరకు మార్పులు చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొ న్నారు. రాష్ట్ర ప్రభుత్వ కొలువులతోపాటు రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో 10 శాతం ఈడ బ్ల్యూఎస్ కోటా కోసం దరఖాస్తు చేసుకొనే వారికి ఈ నిర్ణయంతో లబ్ధి కలగనుంది. కేంద్రంలో కోటాకు డిక్లరేషన్ ఇవ్వాల్సిందే.. కేంద్ర ప్రభుత్వంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు దరఖాస్తు చేసుకొనే వారు మాత్రం ఆస్తుల వివరాలతోపాటు వాటిపై స్వీయ ధ్రువీకరణను యథావిధిగా ఇవ్వాల్సి ఉండనుంది. సీఎస్ సోమేశ్ కుమార్ తాజా ఆదేశాల ప్రకారం ఈడబ్ల్యూఎస్ ఉద్దేశం (పర్పస్ ఆఫ్ ఈడబ్ల్యూఎస్) అనే కొత్త కాలమ్‌ను మీ–సేవా దరఖాస్తులో చేర్చనున్నారు. కేంద్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు దరఖాస్తు చేసుకుంటున్నారా లేక రాష్ట్ర ప్రభుత్వంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు దరఖాస్తు చేసుకుంటున్నారా? అనే రెండు ఐచ్ఛికాలు ఈ కాలమ్‌లో ఉండనున్నాయి. వాటిలో ఒక దాన్ని దరఖాస్తుదారులు ఎంపిక చేసుకోవాల్సి ఉండనుంది. ఒకవేళ కేంద్ర ఈడబ్ల్యూఎస్ కోటా కోసం దరఖాస్తు చేసుకుంటే ప్రస్తుత దరఖాస్తు, సర్టిఫికెట్ నమూనాల్లో ఎలాంటి మార్పులుండవు. రాష్ట్ర ప్రభుత్వంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు దరఖాస్తు చేసుకుంటే మాత్రం దరఖాస్తు, సర్టిఫికెట్ నమూనాలో పైన పేర్కొన్న మార్పులు అమల్లోకి రానున్నాయి. కేంద్రంలో ఈడబ్ల్యూఎస్ కోటాకు జారీ చేసే సర్టిఫికెట్లలో మాత్రం ఈ మేరకు డిక్లరేషన్ ఇచ్చారన్న విషయాన్ని యథాతధంగా పొందుపర్చనున్నారు. -
టీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు
(వరంగల్ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి): ‘‘రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయి. రెండు పార్టీలు కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నాయి. తెలంగాణను నేరుగా పాలించలేమని, ఇక్కడ అధికారంలోకి రాలేమని బీజేపీకి తెలుసు. అందుకే రాష్ట్రంలో టీఆర్ఎస్ రిమోట్ కంట్రోల్ కావాలని కోరుకుంటోంది. కాంగ్రెస్, బీజేపీ కలవవు కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా టీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలని బీజేపీ నేతలు కోరుకుంటున్నారు. ఇక్కడి సీఎం ఎన్ని వేల కోట్ల రూపాయలు దోచుకున్నా ఈడీ, సీబీఐ లాంటి సంస్థల చేత కేంద్రం విచారణ జరిపించకపోవడమే ఇందుకు సాక్ష్యం’’ అని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. శుక్రవారం హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో టీపీసీసీ నిర్వహించిన ‘రైతు సంఘర్షణ సభ’లో రాహుల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్, బీజేపీలపై మాటల తూటాలు పేల్చారు. సభలో రేవంత్‌రెడ్డి ప్రకటించిన ‘వరంగల్ రైతు డిక్లరేషన్’లో ఇచ్చిన హామీలన్నింటికీ కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ ఇస్తుందని, రైతుల పక్షాన నిలబడతామని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్లను మెరిట్ ప్రాతిపదికన ఇస్తామని, ఎంత పెద్ద నాయకులైనా సరే పేదల పక్షాన పోరాటం చేయకపోతే టికెట్ ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. సభలో రాహుల్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ఆ ఒక్క కుటుంబానికే లబ్ధి.. ‘‘తెలంగాణ అంత సులువుగా ఏర్పాటు కాలేదు. యువత ప్రాణ త్యాగాలు చేసింది. తెలంగాణ తల్లి కోసం తనువు చాలించింది. ఈ రాష్ట్రం ఏ ఒక్కరి కోసమో ఏర్పాటైనది కాదు. ఇది తెలంగాణ ప్రజలందరి కల. ప్రజలు తమ రక్తం చిందించారు. పోరాటం చేశారు. వారికి కాంగ్రెస్ పార్టీ తోడుగా నిలబడింది. పోరాటం చేసింది. తెలంగాణ ఏర్పాటు చేసింది. కాంగ్రెస్‌కు నష్టం జరుగుతుందని తెలిసినా తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి రాష్ట్రం ఇచ్చాం. ప్రజల ప్రభుత్వం ఏర్పడుతుందని.. రైతులు, కార్మికులు, పేదల ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశించాం. కానీ ఈ ఎనిమిదేళ్లలో ప్రజల ఆకాంక్షలు ఏమయ్యాయి? ఎవరికి లాభం జరిగింది? ఒక్క కుటుంబం మాత్రమే పెద్ద లబ్ధి పొందింది. ఎవరికైనా ఉద్యోగాలు వచ్చాయా? వేల మంది రైతుల ఆత్మహత్యలకు బాధ్యులెవరు? ఆ రైతుల కుటుంబాల రోదనలకు బాధ్యులెవరు? ఛత్తీస్‌గఢ్ వెళ్లి అడగండి.. ఛత్తీస్‌గఢ్ ఎన్నికల సమయంలో మేం చాలా హామీలు ఇచ్చాం. క్వింటాల్ ధాన్యానికి రూ.2,500 ధర కావాలని, రుణమాఫీ చేయాలని అక్కడి రైతులు మమ్మల్ని అడిగారు. మేం హామీ ఇచ్చి అమలు చేశాం. ఇప్పుడు ఛత్తీస్‌గఢ్ వెళ్లి ధాన్యం ఎంతపెట్టి కొంటున్నామో అడగండి. ఇక్కడి రైతులు కూడా పంటలకు గిట్టుబాటు ధర కావాలని అడుగుతున్నారు. వరంగల్ డిక్లరేషన్‌లో భాగంగా రూ.2 లక్షల రుణమాఫీ, పంటలకు మెరుగైన మద్దతు ధరలను ప్రకటించాం. రైతులెవరూ ఆందోళన పడొద్దు. ఇవి నెరవేరడానికి ఎక్కువ సమయం పట్టదు. ఇవి వట్టి మాటలు కావు. తెలంగాణ ప్రజల కలలు నెరవేరే దిశలో ఇది తొలి అడుగు. ఇది డిక్లరేషన్ కాదు. రైతులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే గ్యారెంటీ. తెలంగాణలోని ప్రతి రైతు ఈ డిక్లరేషన్ చదవాలి. ఇందులోని ప్రతి అంశాన్ని నెరవేరుస్తాం. గిరిజనులకు కూడా భరోసా కల్పిస్తాం. వారికి 10 శాతం రిజర్వేషన్ల విషయంలో మా మద్దతు ఉంటుంది. టీఆర్ఎస్కు, మాకే యుద్ధం తెలంగాణను మోసం చేసిందెవరు? ఇక్కడి ప్రజల కలలను భగ్నం చేసిందెవరు? వేల కోట్ల రూపాయల ప్రజల సొమ్మును దొంగిలించిందెవరు? ఆ వ్యక్తులతో, ఆ పార్టీలతో కాంగ్రెస్‌కు ఎలాంటి అవగాహన ఉండదు. ఈ విషయం గురించి కాంగ్రెస్ పార్టీలోని నేతలు, కార్యకర్తలు ఎవరైనా చర్చిస్తే.. వారిని పార్టీ నుంచి పంపించేస్తాం. అది ఎంత వారైనా సరే. అలాంటి ఆలోచన ఉన్న వాళ్లు ఎవరైనా ఉంటే టీఆర్ఎస్ లేదా బీజేపీలోకి వెళ్లిపోవచ్చు. మేం రాజులతో స్నేహం చేయం. పేదలతో ఉంటాం. టీఆర్ఎస్ను ఓడించి తీరుతాం. భవిష్యత్తు పోరాటం కాంగ్రెస్, టీఆర్ఎస్ల మధ్యే జరుగుతుంది. తెలంగాణ ప్రజల కలలను భగ్నం చేసిన వారిని.. కార్మికులు, రైతులు, ఉద్యోగులకు అన్యాయం చేసిన వారిని కాంగ్రెస్ వదిలిపెట్టదు. ప్రజల పక్షాన పోరాడేవారికే టికెట్లు పార్టీ టికెట్ల కేటాయింపు మెరిట్ పద్ధతిలో జరుగుతుంది. ప్రజల పక్షాన నిలబడి, సమస్యలపై పోరాటం చేసే వారికి మాత్రమే రానున్న ఎన్నికల్లో టికెట్లు ఇస్తాం. అది ఎంత పెద్దవారయినా, ఎవరైనా సరే. రైతులు, పేదల పక్షాన నిలబడకపోతే కాంగ్రెస్ టికెట్ ఇవ్వదు. మీ కోసం వస్తా.. మీకోసం పనిచేస్తా.. సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం వెనుక ఒక లక్ష్యం ఉంది. ప్రజల అభీష్టం మేరకు సోనియా రాష్ట్రాన్ని ఇచ్చారు. ఇక్కడి ప్రజల ఆకాంక్షలు నెరవేరాలనేది ఆమె కోరిక, మనందరి కోరిక. దీన్ని నెరవేర్చేందుకు మీ అందరితో కలిసి పనిచేస్తాం. ఇందుకోసం నా అవసరం ఎక్కడ ఉన్నా, నన్ను మీరు ఎక్కడికి పిలిచినా, నా నుంచి ఎలాంటి మద్దతు కావాలన్నా.. తెలంగాణ ప్రజల పక్షాన వచ్చి నిలబడతా. మీ కోసం పనిచేస్తా. ఇది కాంగ్రెస్ పార్టీ పోరాటం. నా పోరాటం. టీఆర్ఎస్, బీజేపీ మధ్య అవగాహన ఉంది. కేంద్రం నల్ల వ్యవసాయ చట్టాలు తెచ్చినప్పుడు టీఆర్ఎస్ తోడుగా నిలిచింది. తెలంగాణను నేరుగా పాలించలేమని, ఇక్కడ అధికారంలోకి రాలేమని బీజేపీకి తెలుసు. అందువల్ల ఈ రాష్ట్రంలో వారికి ఒక రిమోట్ కంట్రోల్ కావాలని కూడా తెలుసు. కాంగ్రెస్, బీజేపీ కలవవు కాబట్టి.. ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా టీఆర్ఎస్ రావాలని బీజేపీ నేతలు కోరుకుంటున్నారు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి రాష్ట్రం ఏర్పాటయ్యాక టీఆర్ఎస్కు ప్రజలు రెండుసార్లు అవకాశమిచ్చారు. కానీ టీఆర్ఎస్ మోసం చేసింది. కాంగ్రెస్‌కు ఒక్కసారి అవకాశమివ్వండి. రైతులు, పేదల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. మీతో కలిసి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తాం’’ అని రాహుల్ విజ్ఞప్తి చేశారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క అధ్యక్షత వహించిన ఈ సభలో.. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, పొదెం వీరయ్య, సీనియర్ నేతలు జానారెడ్డి, రేణుకాచౌదరి, బలరాం నాయక్, దాసోజు శ్రవణ్, అంజన్‌కుమార్ యాదవ్, దామోదర రాజనర్సింహ, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, వీహెచ్, కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, కొండా సురేఖ, కొండా మురళి, ఇతర నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాహుల్ నేటి షెడ్యూల్ ఇదీ.. వరంగల్ సభకు హాజరైన రాహుల్ రాత్రికి హైదరాబాద్ చేరుకుని హోటల్ తాజ్‌కృష్ణలో బస చేశారు. శనివారం ఉదయం ఆయన హోటల్లోనే పలువురు ప్రముఖులు, మీడియా పెద్దలతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో సంజీవయ్య పార్కులో మాజీ సీఎం దామోదరం సంజీ వయ్య వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత నేరుగా గాంధీభవన్‌కు చేరుకుని పార్టీ శ్రేణులతో సమావేశం కానున్నారు. ముఖ్య నేతలతో చర్చించాక పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కోఆర్డినేటర్లతో మాట్లాడుతారు. సాయంత్రం 5.40 గంటల సమయంలో శంషాబాద్ నుంచి తిరిగి ఢిల్లీకి బయలుదేరుతారు. అయితే.. సమయానుకూలతను బట్టి చర్లపల్లి జైలులో ఉన్న ఎన్ఎస్యూఐ నేతలతో రాహుల్ ములాఖత్ అవుతారని ఏఐసీసీ వర్గాలు పేర్కొన్నాయి. కానీ ఈ ములాఖత్‌కు జైలు అధికారులు అనుమతి నిరాకరించారు. -
మందు, డ్రగ్స్‌కి దూరం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం కొత్తగా తీసుకోవాలని అనుకునే వారికి ఆ పార్టీ నూతన నిబంధనలు ప్రవేశపెట్టింది. మద్యం, మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని, పార్టీ విధానాలను, కార్యక్రమాలను ఎప్పటికీ బహిరంగ వేదికలపై విమర్శించబోమని ఒక సెల్ఫ్ డిక్లరేషన్ (స్వీయ ధ్రువీకరణ పత్రం) ఇవ్వాలని షరతు విధించింది. నవంబర్ 1 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వ నమోదు చేపట్టనుంది. సభ్యత్వం కోసం రూపొందించిన దరఖాస్తు పత్రంలో కొత్తగా సభ్యులుగా చేరాలనుకునే వారు కచ్చితంగా సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చి తీరాలి. ఆదాయానికి మించి ఆస్తులు లేవని, పార్టీని పటిష్టపరిచే కార్యక్రమాల కోసం శారీరక శ్రమకు సిద్ధమేనని అంగీకరించాలి. సామాజిక వివక్ష చూపించమని, వివక్ష, అసమానతల నిర్మూలనకు కృషి చేస్తామని ఇలా మొత్తం 10 పాయింట్లకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేస్తేనే కాంగ్రెస్ పార్టీలో ప్రాథమిక సభ్యత్వం లభిస్తుంది. -
రాజకీయ పక్షాల విమర్శలు బాధాకరం
-
ఎక్కడా లేని అభ్యంతరం.. అక్కడే ఎందుకు?
సాక్షి, తిరుపతి: తిరుమల డిక్లరేషన్‌పై కొన్ని రాజకీయ పక్షాలు చేస్తున్న విమర్శలు బాధాకరమని టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, బీజేపీ నేత ఓవీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘వైకుంఠం ముందు ఒక నోటీసు బోర్డు ఉంది. అందులో డిక్లరేషన్ ఇవ్వాలా? వద్దా అన్నది భక్తుల ఇష్టం’’ అని పేర్కొన్నారు. దీనిపై అనవసర రాజకీయం చేస్తున్నారన్నారు. దేశంలో ఏ ఆలయంలో కూడా డిక్లరేషన్ లేదని ఆయన స్పష్టం చేశారు. అన్ని ఆలయాలకు అన్ని మతాల వారు వెళ్తుతున్నారని, ఎక్కడా లేని అభ్యంతరం తిరుమలకు ఎందుకు అని ప్రశ్నించారు. మంత్రి కొడాలి నాని మీద కొందరు విమర్శలు చేయడం పట్ల ఆయన తప్పుపట్టారు. ఆచార వ్యవహారాలపై పీఠాధిపతులు ఎందుకు మాట్లాడటం లేదని ఓవీ రమణ నిలదీశారు. తిరుమల శ్రీవారికి చెన్నై గొడుగులు: చెన్నై నుంచి ఊరేగింపుగా హిందూ ధర్మర్ధ సమితి సంస్థ ఆధ్వర్యంలో తిరుమలకు గొడుగులు చేరుకున్నాయి. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, అదనపు ఈవో ధర్మా రెడ్డిలకు హిందూ ధర్మార్థ సమితి ట్రస్టీ జి. గోపాల్ గొడుగులను అందజేశారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవ నాడు స్వామివారికి గొడుగులను అలంకరించనున్నారు. మొత్తం 11 గొడుగులను కానుకగా అందించగా, 9 గొడుగులను తిరుమల శ్రీవారి ఆలయానికి, 2 గొడుగులు తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయానికి టీటీడీ వినియోగించనుంది.