EAGLE Movie
-
ఒక రోజు ముందుగానే ఓటీటీకి రవితేజ ఈగల్..స్ట్రీమింగ్ ఎక్కడంటే!
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఈగల్. అభిమానుల భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 9వ తేదీన థియేటర్లలోకి వచ్చింది. ఈ చిత్రానికి కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ అందుకుంది. అయినప్పటికీ రవితేజ మాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది. కేవలం రూ.35 కోట్లకు పైగా వసూళ్లను మాత్రమే సాధించింది.ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్గా నటించగా.. అనుపమ పరమేశ్వరన్ కీలకపాత్ర పోషించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓటీటీ స్ట్రీమింగ్ అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీ మార్చి 1 నుంచే స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. దీనిపై అఫీషియల్ ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. అయితే ముందుగా ఈ సినిమా మార్చి 2వ తేదీ నుంచి ఓటీటీకి రానున్నట్లు వార్తలొచ్చాయి. ఇప్పటికే ఈ మూవీ హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ లెక్కన అయితే ఈగల్ థియేటర్లో రిలీజైన మూడు వారాల్లోనే ఓటీటీకి వచ్చేస్తోంది. కాగా.. ఈ చిత్రంలో రవితేజకు జోడీగా కావ్య థాపర్ నటించగా.. జర్నలిస్టు పాత్రలో అనుపమ పరమేశ్వరన్ చేశారు. నవ్‌దీప్ కూడా ఓ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రంలో వినయ్ రాయ్, అవసరాల శ్రీనివాస్, మధూ, శ్రీనివాస రెడ్డి, అజయ్ ఘోష్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
ఈగల్‌కు ఓటీటీ డేట్ దొరికినట్లేనా..?
రవితేజ హీరోగా, కావ్యా థాపర్, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఈగల్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల అయింది. సినిమా విడుదల సమయంలో ఈగల్‌కు ఎలాంటి ఇబ్బందులు వచ్చాయో.. ఇప్పుడు ఓటీటీ విడుదల విషయంలో కూడా పలు సమస్యలు ఎదురు అవుతున్నట్లు తెలుస్తోంది. ఓటీటీలు వచ్చాక సినిమాకు కొంత అదనపు బిజినెస్ ఉంటుంది. కానీ పలు కారణాల వల్ల ప్రేక్షకులను మెప్పించిన సినిమాలు కూడా ఓటీటీలోకి అందుబాటులోకి రావు. ఉదాహారణకు 'ది కేరళ స్టోరీ' చిత్రం విషయంలో కూడా ఇదే జరిగింది. సినిమా విడుదలయైన పది నెలలకు ఓటీటీలో విడుదల అయింది. ఇప్పుడు రవితేజ సినిమాకు కూడా అలాంటి కష్ఠాలు ఎదురయ్యాయని వార్తలు వస్తున్నాయి. ఫిబ్రవరి 9న విడుదల అయిన ఈ సినిమా ఇప్పటి వరకు కూడా ఓటీటీ స్ట్రీమింగ్ భాగస్వామితో డీల్ కుదరలేదని తెలుస్తోంది. ప్రస్తుతం థియేటర్లో ఈగల్ సందడి దాదాపు ముగిసిందని చెప్పవచ్చు. సినిమాపై మొదట డివైడ్ టాక్ వచ్చినా.. తర్వాత ఫర్వాలేదు అనే టాక్ రావడంతో మళ్లీ కలెక్షన్స్ పెరిగాయి. దీంతో రవితేజ ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీ అయ్యారు. సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా కూడా ఓటీటీ డీల్ సెట్ కాలేదు అనేది రవితేజ ఫ్యాన్స్‌తో పాటు అందరినీ ఆశ్చర్య పరుస్తుంది. ఈగల్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.60 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఈగల్తో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. డీల్ ప్రకారం ఏప్రిల్ మొదటి వారంలో ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం. అయితే అధికారిక అప్డేట్ రావాల్సి ఉంది. -
15 ఏళ్ల క్రితం సూపర్ హిట్ అయిన రవితేజ సినిమా రీరిలీజ్
మాస్మహారాజా రవితేజ కెరియర్లో కిక్ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. సుమారు 15 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. రవితేజ, బ్రహ్మానందం ట్రాక్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. హల్వారాజ్ పాత్రలో బ్రహ్మానందం పండించిన కామెడీ సూపర్ హిట్ అని చెప్పవచ్చు. ఆ సినిమాలోని కామెడీ సీన్స్ ఇప్పుడు ఎక్కువగా మీమ్స్ రూపంలో కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కిక్ సినిమా రీరిలీజ్ కానుంది. సురేందర్‌రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమా మార్చి 1న రీరిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. ఇందులో రవితేజకు జోడీగా ఇలియానా నటించింది. కోలీవుడ్ నటుడు శామ్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాకు థమన్ సంగీతం అదిరిపోతుంది. కిక్ సినిమాతో థమన్, సురేందర్‌రెడ్డి,రవితేజలకు విపరీతమైన స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా కిక్ 2 కూడా వచ్చింది. కానీ అది కాస్త బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇప్పటికే ఈగల్తో థియేటర్లో సందడి చేస్తున్న రవితేజ.. మార్చి 1న కిక్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నాడు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ రీరిలీజ్ చేయనున్నారు. ఫిబ్రవరిలో రవితేజ అభిమానుల కోసం ఒక ఈవెంట్‌ను కూడా ప్లాన్ చేస్తున్నారు. -
ట్రోలింగ్‌పై హరీశ్ శంకర్ ఫైర్
-
మిస్టర్ బచ్చన్ తో హ్యాట్రిక్ హిట్ కొట్టబోతున్నాం
-
ఈ సినిమా చూసి నాకు ఒకరు మెయిల్ పెట్టారు
-
ట్రోలింగ్ కొత్త కాదు.. అన్నిటికీ తెగించే ఇక్కడికి వచ్చాం: హరీశ్ శంకర్
దర్శకుడు హరీశ్ శంకర్ స్టేజ్ ఎక్కితే ఎలా మాట్లాడుతాడో టాలీవుడ్ ప్రేక్షకులకు తెలిసిందే. ఫుల్ పంచులు, కౌంటర్లతో అదరగొట్టేస్తాడు. మీడియాపై సైతం సెటైర్లు వేస్తుంటాడు. సందర్భం ఏదైనా.. తాను చెప్పాలనుకున్నది చెప్పేస్తాడు. తాజాగా ఈగల్ మూవీ సక్సెస్ మీట్లో తనపై వస్తున్న ట్రోల్స్ గురించి ఘాటుగా స్పందించాడు. ‘నాకు గ్యాప్ వచ్చిందని.. తెల్లవార్లు తాగాడని..ఏదేదో రాస్తున్నారు. ఇప్పుడు ఒకేసారి ఉస్తాద్ భగత్ సింగ్, మిస్టర్ బచ్చన్ సినిమాలు చేస్తున్నాను. త్వరలోనే పెద్ద హీరోలతో మరో రెండు సినిమాలు ప్లాన్ చేశాను. ఇవన్నీ మీకు(మీడియా) చెప్పి చేయాలా? ఇదేమన్నా ప్రొగ్రెస్ రిపోర్టా? మా నాన్నలాగా ఫీజ్ కట్టావా..? నేను ఏం చేస్తున్నానో నీకు చూపించడానికి?. నాలుగు కాకపోతే ఐదేళ్లు కుదరదు. నీకు ప్రాబ్లమ్ ఏంటి? నీ ఇంటికి వచ్చి ఏమైనా అడుగుతున్నానా? నా రెంట్ కట్టండని. ట్రోలింగ్ మాకేం కొత్తకాదు. మేము సినిమా రంగంలోకి అడుగుపెట్టేటప్పుడే.. మా అమ్మనాన్నలే నాపై మొదట ట్రోల్ చేశారు. ‘హరీశ్ శంకర్ డైరెక్టర్ అవుతాడట.. వీడో పెద్ద మణిరత్నం మరి’ అని స్నేహితులు, బంధువులు ఎగతాళి చేశాయి. అవన్ని తట్టుకొనే ఇక్కడి వరకు వచ్చాం’ అని హరీశ్ అన్నారు. సినిమాలకు ఇచ్చే రివ్యూలు..రేటింగ్‌లపై తన అభిప్రాయాన్ని తెలియస్తూ... ‘మేము ఏ సినిమా చేస్తున్నా.. హౌస్‌ఫుల్ కావాలని కోరుకుంటాం. మాకు ఎటువంటి అజెండాలు ఉండవు. అన్ని సినిమాలు అందరికీ నచ్చాలనే రూల్ లేదు. విమర్శించే వాళ్లు విమర్శిస్తారు. పొగిడేవాళ్లు పొగుడుతారు.రివ్యూల్లో విమర్శ కనిపిస్తే ఓకేగానీ అది ఎగతాళి స్థాయికి వెళ్తోంది.ఎవరో సోషల్ మీడియాలో ట్రోల్ చేశారంటే అర్థం ఉంది. మన రివ్యూస్ కూడా ట్రోల్ చేసే విధంగా ఉన్నందుకు బాధేస్తుంది. సినీ జర్నలిస్టులు కూడా ఇండస్ట్రీలో ఒక భాగమే. మనం ఒకరిపై ఒకరం రాళ్లు వేసుకోవడమేంటి?నేను ఓ విలేకరికి కౌంటర్ ఇచ్చినందుకు నాకు వందల కాల్స్ వచ్చాయి. కౌంటర్‌కు ప్రశంసలేంటి? అని ఆలోచించా. నేను గొప్పగా ఏం మాట్లాడలేదు. సదరు జర్నలిస్టు పలు సందర్భాల్లో తప్పుగా మాట్లాడారు. అతనిపై ఉన్న కసిని కొందరు నాకు ప్రశంస అన్నట్లుగా మార్చారు. అది నాకు బాధ కలిగించింది’అని హరీశ్ అన్నారు. -
కాళికాదేవి ఎపిసోడ్లో నన్ను నేను నమ్మలేకపోయాను: రవితేజ
రవితేజ హీరోగా నటించిన చిత్రం ‘ఈగల్’. ఇందులో కావ్యా థాపర్, అనుపమా పరమేశ్వరన్స్ హీరోయిన్లు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న విడుదలైంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా సక్సెస్‌మీట్‌లో రవితేజ మాట్లాడుతూ– ‘‘ఈగల్’కు ప్రేక్షకుల నుంచి వస్తోన్న స్పందన సంతోషాన్నిస్తోంది. కార్తీక్ ‘ఈగల్’ కథ చెప్పినప్పుడే సహదేవ వర్మ పాత్రకు ఎగ్జైట్ అయ్యాను. నా పాత్ర మేకోవర్‌కు మంచి ప్రశంసలు వస్తున్నాయి. సినిమాలోని కాళికాదేవి ఎపిసోడ్లో నన్ను నేను నమ్మలేకపోయాను. పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి అభినందనలు. హరీష్ శంకర్‌తో చేస్తున్న ‘మిస్టర్ బచ్చన్స్ ’ సినిమాతో ఈ బ్యానర్లో హాట్రిక్ కొడుతున్నాం. కార్తీక్, కావ్యా థాపర్లకు మంచి భవిష్యత్ ఉంది’’ అన్నారు. ‘‘యాక్షన్స్ సినిమా తీయాలనే నా ఆశ రవితేజగారి ‘ఈగల్’తో నెరవేరింది’’ అన్నారు కార్తీక్. ‘‘రవితేజగారితో ‘ధమాకా’లాంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చి, ఇప్పుడు ‘ఈగల్’తో ఈ బ్లాక్‌బస్టర్‌ను కొన సాగించాం’’ అన్నారు టీజీ విశ్వప్రసాద్. దర్శకుడు హరీష్‌శంకర్, ‘ఈగల్’ యూనిట్ సభ్యులు ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. -
బాక్సాఫీస్ వద్ద ఈగల్ దూకుడు.. రెండు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం 'ఈగల్'. ఈ సినిమాను కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. అనుపమ పరమేశ్వరన్,కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం అభిమానుల భారీ అంచనాల మధ్య ఈనెల 9న థియేటర్లలోకి వచ్చింది. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు తర్వాత నటించిన సినిమా కావడంతో ఫ్యాన్స్‌లోనూ ఆసక్తి నెలకొంది. మూవీ రిలీజైన మొదటి రోజే మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా రూ.11.90 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. అయితే రెండో రోజు సైతం బాక్సాఫీస్ వద్ద ఈగల్ అదే జోరు కొనసాగించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.9 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. దీంతో రెండు రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద రూ.20.90 గ్రాస్ వసూళ్లు రాబట్టింది. అయితే మొదటి రోజు ఇండియా వ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి రూ.6.2 కోట్ల నెట్ వసూళ్లు సాధించిన ఈగల్.. రెండో రోజు అదే జోరులో రూ. 5 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. దీంతో రెండు రోజుల్లోనే రూ.11.2 కోట్లు వచ్చాయి. ఇక మూడో రోజు ఆదివారం కావడంతో ఈగల్ బ్రేక్ ఈవెన్ మార్క్ చేరుకునేలా కనిపిస్తోంది. రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలో 32.84 శాతం ఆక్యుపెన్సీతో నడిచాయి. కాగా.. ఈగల్ చిత్రానికి దేవ్ జాంద్ సంగీతమందించారు. ఈ మూవీలో అక్రమ ఆయుధాల వ్యాపారాన్ని అడ్డుకునే పాత్రలో మాస్ మహారాజా నటించారు. కాగా.. ఈ చిత్రాన్ని హిందీలో సహదేవ్ పేరుతో విడుదల చేసిన సంగతి తెలిసిందే. -
ఈగల్ రివ్యూ: రవితేజ పరిస్థితి ఏంటి..?
-
Eagle Review: ‘ఈగల్’ రివ్యూ
టైటిల్: ఈగల్నటీనటులు: రవితేజ, అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్, నవదీప్, విజయ్ రాయ్, మధుబాల, అవసరాల శ్రీనివాస్, అజయ్ ఘోష్ తదితరులునిర్మాణ సంస్థ: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్దర్శకత్వం: కార్తీక్ ఘట్టమనేనిసంగీతం: డేవ్ జాంద్విడుదల తేది: ఫిబ్రవరి 9, 2024ఢిల్లీలో జర్నలిస్టుగా పని చేస్తున్న నళిని(అనుపమ పరమేశ్వరన్)కి ఓ రోజు మార్కెట్లో స్పెషల్ కాటన్ క్లాత్ కనిపిస్తుంది. అది ఎక్కడ తయారు చేశారని ఆరా తీయగా.. ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. ఆ క్లాత్కి వాడిన పత్తిని ఆంధ్రప్రదేశ్‌లోని తలకోన ప్రాంతంలోని పండించారని, దానికి ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చిన సహదేవ్ వర్మ(రవితేజ)అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో కనిపించకుండా పోయాడని తెలుసుకుంటుంది. అలాంటి గొప్ప వ్యక్తి ఆచూకీ తెలిస్తే సమాజానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశ్యంతో ఆ విషయాన్ని పేపర్లో ప్రచురిస్తుంది. చివరి పేజీలో చిన్న ఆర్టికల్‌గా వచ్చిన ఆ న్యూస్‌ని చూసి.. సీబీఐ రంగంలోకి దిగుతుంది. ఆ పత్రికా సంస్థపై దాడి చేసి.. ఆ సమాచారం ఎలా లీకైందని విచారణ చేపడుతుంది.ఒక్క చిన్న వార్తకు అంతలా రియాక్ట్ అయ్యారంటే.. దీని వెనుకాల ఏదో సీక్రెట్ ఉందని, అది ఏంటో తెలుసుకోవాలని నళిని తలకోన గ్రామానికి వెళ్తుంది. అక్కడ సహదేవ్ వర్మ గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. అసలు సహదేవ్ వర్మ ఎవరు? అతన్ని మట్టుబెట్టడానికి కేంద్ర ప్రభుత్వ బలగాలు.. పాకిస్తాన్‌కి చెందిన టెర్రరిస్టులతో పాటు నక్సల్స్ ఎందుకు ప్రయత్నిస్తున్నారు. యూరప్‌లో కాంట్రాక్ట్ కిల్లర్ అయిన ఈగల్(రవితేజ)కి ఇతనికి ఉన్న సంబంధం ఏంటి? సహాదేవ్ ఎలా మిస్ అయ్యాడు? సహదేవ్, రచన(కావ్య థాపర్)ల ప్రేమ కథ ఏంటి? సహదేవ్ అనుచరుడైన జై(నవదీప్) ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడు? తలకోన కొండను దక్కించుకునేందుకు ప్రముఖ వ్యాపారవేత్త(నితిన్ మెహతా), లోకల్ ఎమ్మెల్యే చిల్లర సోమేశ్వరరెడ్డి(అజయ్ ఘోష్) ఎందుకు ప్రయత్నించారు? వారిని ఈగల్ ఎలా అడ్డుకున్నాడు? అసలు సహదేవ్ బతికే ఉన్నాడా? ఈ కథలో మధుబాల, శ్రీనివాస్ అవసరాల,విజయ్ రాయ్ పోషించిన పాత్రలు ఏంటి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ‘కేజీయఫ్’ తర్వాత యాక్షన్ సినిమాల ప్రజంటేషన్లో మార్పు వచ్చింది. కథ కంటే యాక్షన్, ఎలివేషన్స్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు మేకర్స్. ప్రేక్షకులు కూడా అలాంటి చిత్రాలను ఆదరిస్తున్నారు. ‘ఈగల్’ కూడా ఆ తరహా చిత్రమే. కేజీయఫ్, విక్రమ్, జైలర్ తరహాలోనే ఇందులో కూడా భారీ యాక్షన్ సీన్స్‌తో పాటు హీరోకి కావాల్సినంత ఎలివేషన్ ఇచ్చారు. కానీ కథను ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చేయడంలో దర్శకుడు విఫలం అయ్యాడు.యాక్షన్, ఎలివేషన్లనే నమ్ముకొని కథనాన్ని నడిపించాడు. సినిమా ప్రారంభం నుంచే హీరోకి భారీ ఎలివేషన్స్ ఇచ్చారు. ప్రతి సీన్ క్లైమాక్స్ అన్నట్లుగానే తీర్చిదిద్దారు. మణిబాబు రాసిన సంభాషణలు హీరోని ఓ రేంజ్లో కూర్చోబెట్టేలా ఉన్నాయి. అయితే కొన్ని చోట్ల వచ్చే డైలాగులకు.. అక్కడ జరిగే సన్నివేశానికి ఎలాంటి సంబంధం ఉండకపోవడమే కాకుండా అతిగా అనిపిస్తుంది. ఇక హీరోకి ఇచ్చే ఎలివేషన్స్ కొన్ని చోట్ల చిరాకు పుట్టిస్తుంది. యాక్షన్స్ సన్నివేశాలు మాత్రం ఆకట్టుకుంటాయి. ఈ సినిమా కథ ఢిల్లీలో ప్రారంభమై.. ఏపీలోని తలకోన ప్రాంతం చుట్టూ తిరుగుతుంది. జర్నలిస్టు నళిని వార్త ప్రచురించడం.. సీబీఐ రంగంలోకి దిగి పత్రికా సంస్థపై దాడి చేయడంతో కథపై ఆసక్తి కలుగుతుంది. హీరో ఎంట్రీకి ఇచ్చే ఎలివేషన్ సీన్ ఆకట్టుకుంటుంది. ఫస్టాఫ్ అంతా ఎలివేషన్లతోనే ముగుస్తుంది. హీరో క్యారెక్టర్ గురించి తెలియజేయకుండా ఎలివేషన్స్ ఇవ్వడంతో కొన్ని చోట్ల అంత బిల్డప్ అవసరమా అనిపిస్తుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తి పెంచుతుంది. ఇక సెకండాఫ్‌లో హీరో ఫ్లాష్‌బ్యాక్ తెలుస్తుంది. సహదేవ్, రచనల లవ్ స్టోరీ అంతగా ఆకట్టుకోదు. కానీ కథకు అది ముఖ్యమైనదే! ఫస్టాఫ్‌తో ఎలివేషన్ల కారణంగా యాక్షన్ సీన్స్ అంతగా ఆకట్టుకోలేవు కానీ.. ద్వితీయార్థంలో వచ్చే పోరాట ఘట్టాలు ఆకట్టుకుంటాయి. పబ్లీ నేపథ్యంలో వచ్చే ఫైట్ సీన్ అదిరిపోతుంది. అలాగేప్రీ క్లైమాక్స్ యాక్షన్ సీన్ కూడా బాగుంటుంది. సినిమాలో మంచి సందేశం ఉన్నా.. దాన్ని ఓ చిన్న సన్నివేశంతో ముగించారు. ఎవరెలా చేశారంటే.. రవితేజకు యాక్షన్ కొత్త కాదు..ఎలివేషన్లు అంతకంటే కొత్తకాదు. ఈ రెండు ఉన్న ‘ఈగల్’లో రెచ్చిపోయి నటించాడు. సహదేవ్, ఈగల్ ఇలా రెండు విభిన్నమైన పాత్రల్లో చక్కగా నటించాడు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా అనుపమ తనదైన నటనతో ఆకట్టుకుంది. సహదేవ్ అనుచరుడు జైగా నవదీప్ తన పాత్ర పరిధిమేర నటించాడు. వినయ్ రాయ్ పాత్ర చిన్నదైనా ఉన్నంతలో ఆకట్టుకున్నాడు. అవసరాల శ్రీనివాస్, మధుబాల, మిర్చి కిరణ్, అజయ్ ఘోష్, శ్రీనివాస్ రెడ్డి, అమృతం అప్పాజీతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. దేవ్ జాండ్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు పర్వాలేదు. మణి బాబు రాసిన డైలాగ్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. అయితే కొన్ని చోట్ల సన్నివేశాలను డామినేట్ చేశాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ విలువలు బాగున్నాయి. హై రిచ్ కంటెంట్ డెలీవరి చేయడంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మరోసారి సత్తా చాటింది. -
ఆ విషయంలో ఈగల్ మేకర్స్ డేరింగ్.. అందుకేనా!
-
Eagle Twitter Review: ‘ఈగల్’ ట్విటర్ రివ్యూ
మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ స్టయిలీష్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ఈగల్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. భారీ అంచనాల మధ్య నేడు (ఫిబ్రవరి 9) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఈగల్ మూవీ ఎలా ఉంది? రవితేజ ఖాతాలో హిట్ పడిందా లేదా? తదితర విషయాలు ఎక్స్(ట్విటర్) వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. ఇది కేవలం ప్రేక్షకుల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. ఈగల్‌కు ట్విటర్లో మిశ్రమ స్పందన వస్తోంది. సినిమా బాగుందని కొంతమంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. యాక్షన్ సీన్స్ మాస్ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటున్నాయని చెబుతున్నారు. ఇక మరికొంత మంది అయితే ఈగల్ యావరేజ్ ఫిల్మ్ అంటున్నారు. సినిమాలో హీరో ఎలివేషన్ సీన్సే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. బీజీఎం అంతగా ఆకట్టుకోలేదని చెబుతున్నారు. Waiting #Eagle - Part 2 💥💥🙏 Positives @RaviTeja_offl Getup & Performance Dialogues Fights Chusi Shock loki vellipotham Elevations Climax; Good lead for 2nd Part Negatives No proper emotional connect Few lags Overall- Very Good Attempt 💥🏆🏆#EagleMovie pic.twitter.com/BCtDOxU9sU — 𝐀𝐥𝐥𝐚𝐫𝐢 𝐑𝐚𝐦𝐮𝐝𝐮 𝐍𝐓𝐑 (@AllariRamuduNTR) February 8, 2024 #Eagle is an Action-Drama with full of style but not enough substance! Too much time spent on elevations which needed a better pay-off. sadly emotions didn’t work well too. Ravi Teja’s best makeover & Top Notch visuals made it watchable.“Adhunika Veta-Kani adhupu thappina katha!” pic.twitter.com/Z0HEJe8xPV — Kittu (@Kalyanchowdaryy) February 9, 2024 It's #Eagle Day⚡🔥 Hittu Bomma Dincharu @peoplemediafcy Getting positive reviews in every where 🔥🔥🔥🔥🔥⚡⚡⚡@RaviTeja_offl ❤,#KarthikGattamaneni @anupamahere @pnavdeep26 #EAGLEonFEB9th pic.twitter.com/lhRk25y02h — MSREDDY (@Mallesw63170522) February 9, 2024 #Eagle below avg first half and avg second half 🙌🏻 Raviteja gave his best, too many elevations with flat bgm 😷 Everything setup for Part- 2. My Rating: 2.25-2.5/5 ⭐️⭐️ #EagleReview pic.twitter.com/Qvi9j6KPhi — Daniel Sekhar (@rk_mahanti) February 8, 2024 #Eagle An Ordinary Action Thriller with a below average 1st half but a better 2nd half which saves the film to an extent! The action sequences in the 2nd half are the biggest USP for the film and have a come out well. Production Values and Cinematography stand out. Director… — Venky Reviews (@venkyreviews) February 9, 2024 After a bumpy start , 20 mins before interval, the movie gets interesting. Cinematography is 🔥 🔥 Raviteja is refreshing. Need an excellent 2nd half!! Liked the fight before interval ,designed well.#Eagle@RaviTeja_offl — Raghu (@436game) February 9, 2024 #Eagle 1st half : @RaviTeja_offl got 3 introductions it will go along with his fans but no story at all. A lot need to be answered https://t.co/z8GneiaqoX — #AllHailTheTiger (@EV9999_Tarakian) February 9, 2024 #EAGLE one Man show @RaviTeja_offl ఊచకోత Elevations 🔥🔥🔥 Cinematography 🔥 Bgm 🔥🔥🔥 Overall excellent movie with elevations emotion and story #EAGLEonFEB9th#EaglePremier#RaviTeja#peoplesmediafactory 🔥 మార్గశిరం మధ్య రాత్రి రవి అన్న హిట్టు బొమ్మ Overall:3.5/5 pic.twitter.com/eSRxXadrMC — Praveen Kasindala (@Pravee4523) February 8, 2024 #EagleReview - GORGEOUS ⭐⭐⭐⭐#RaviTeja Has Done Amazing Job. The Best Part OF The Film Is The Second Half. In The First Half The Film Seems To Be Dull While Trying To Build The Story. Career Best Action Sequences OF #RaviTeja #Eagle #EagleMovie #EagleMovieReview pic.twitter.com/CqSNL17Keo — Mr Jaat Reviews (@Mrjaat0007) February 9, 2024 #Eagle 🦅 2 yuddhakaanda 🥵💥 Mass Maha Raja @RaviTeja_offl Annayya 🦁🔥#BlockBusterEagle 🦅🥁🥳💥💥#EAGLEFromToday 🦅🥁🥳🤩💥 pic.twitter.com/xr2jYOkFqs — Surya (@Surya333547) February 9, 2024 #EagleReview #RaviTeja Decent First Half with Extraordinary Second Half The Fight Sequences in the Second Half are Paisa Vasool and The Screenplay is the Heart of the Movie Ravi Teja's Comeback Film after Krack and Dhamaka #Eagle Ratings 3.5/5 💥💥💥 pic.twitter.com/ylhJUJnXdy — Chaitanya Varma (@spychaitanya) February 9, 2024 Awesome Review Of #Eagle 🔥🔥🔥 Everyone is Appreciate the Performance Of #RaviTeja Anna and loudly praise him. Blockbuster loading 🔥🔥🔥#EagleReview #EagleMovie #Eagle #RaviTeja pic.twitter.com/CG7804pcKF — AMIR ANSARI (@amirans934) February 9, 2024 #EagleReview - GORGEOUS ⭐⭐⭐⭐#RaviTeja Has Done Amazing Job. The Best Part OF The Film Is The Second Half. In The First Half The Film Seems To Be Dull While Trying To Build The Story. Career Best Action Sequences OF #RaviTeja #Eagle #EagleMovie #EagleMovieReview pic.twitter.com/CqSNL17Keo — Mr Jaat Reviews (@Mrjaat0007) February 9, 2024 Perfect Review Of #Eagle 🔥🔥🔥#EagleReview #RaviTeja pic.twitter.com/thLqOz5oKM — AMIR ANSARI (@amirans934) February 9, 2024 -
ఈగల్ కథ వినగానే చేసేద్దాం అన్నారు
‘‘ఈగల్’ కాన్సెప్ట్‌లోనే విధ్వంసం ఉంది. అయితే హీరో చేసే విధ్వంసం సమాజం కోసమే. అది ఏంటి? అనేది ప్రేక్షకులకు ఇవాళ తెలిసిపోతుంది. ఈ సినిమాలో పత్తి రైతు పాత్ర చేశారు రవితేజగారు. అయితే ఆయన పోరాడే సమస్య అంతర్జాతీయ స్థాయిలో ఉంటుంది. మనకి కూడా దగ్గరగా ఉంటుంది. ‘రాంబో, టెర్మినేటర్’ లాంటి హాలీవుడ్ సినిమాలని చాలా ఎంజాయ్ చేస్తాం. అలాంటి సినిమాలు తీసుకు రావాలనే ప్రయత్నమే ‘ఈగల్’. అద్భుతమైన యాక్షన్, డ్రామా, ఎంటర్టైన్మెంట్ ఉన్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు’’ అని డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని అన్నారు. రవితేజ హీరోగా, కావ్యా థాపర్, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరించిన ‘ఈగల్’ నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని విలేకరులతో పంచుకున్న విశేషాలు. ► దర్శకునిగా నా తొలి సినిమా నిఖిల్‌తో ‘సూర్య వర్సెస్ సూర్య’ చేశాను. ఆ తర్వాత మళ్లీ కెమెరామేన్‌గా బిజీ అయిపోవడంతో దర్శకునిగా వెంట వెంటనే సినిమాలు చేయలేకపోయాను. రవితేజగారి ‘ధమాకా’ సినిమాకి కెమెరామేన్‌గా చేశాను. ఆ సమయంలో ‘ఈగల్’ కథ ఆయనకి చెప్పాను. వినగానే.. ‘ఇది మంచి కమర్షియల్ సినిమా.. చేసేద్దాం’ అన్నారు రవితేజగారు. దర్శకునిగా ‘ఈగల్’ నా రెండో సినిమా. ముందు నుంచీ యాక్షన్ సినిమాలు చేయడం నాకు ఇష్టం. అయితే కెరీర్ బిగినింగ్‌లో కొన్ని పరిమితులుంటాయి. ఇప్పుడు ‘ఈగల్’తో పూర్తి స్థాయి యాక్షన్ సినిమా చేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది. ► రవితేజగారు అద్భుతమైన నటుడని అందరికీ తెలుసు. కానీ, కొన్నిసార్లు వాణిజ్య అంశాల కారణంగా ఒకే సినిమాలో కామెడీ, డ్యాన్స్, యాక్షన్.. ఇలా చాలా రకాలు చేయాల్సి వస్తుంది. ‘ఈగల్’లో మాత్రం ఆయన ఒక పాత్రగానే కనిపిస్తారు. ఆ తేడా సినిమా చూసే ప్రేక్షకులకు అర్థం అవుతుంది. ఇంటెన్స్‌గా ఉంటూ కూల్‌గా ఉండటం ఆయనలో డిఫరెంట్ క్వాలిటీ. ‘ఈగల్’లో నన్ను నేను చూసుకునే పాత్ర చేశాను’ అని రవితేజగారు అనడం సంతోషం. చాలా క్రమశిక్షణ కలిగిన నటుడు. ఆయన ఆహారపు అలవాట్లు, నిద్రపోయే వేళలు పర్ఫెక్ట్గా ఉంటాయి.. సెల్ఫ్ కంట్రోల్ ఎక్కువ. చాలా ఆనందమైన జీవితం గడుపుతారు. ► పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నాకు హోమ్ బ్యానర్‌లా అయిపోయింది. సినిమాకి కావాల్సిన ప్రతిదీ ఒక్క ఫోన్ కాల్‌తో సమకూర్చుతారు. విశ్వప్రసాద్, వివేక్గార్లకు కృతజ్ఞతలు. ఈ మూవీలో అనుపమ జర్నలిస్ట్ పాత్ర చేశారు. కావ్యా థాపర్, నవదీప్ పాత్రలకి చాలా ప్రాధాన్యత ఉంది. మరో చిన్న పాప పాత్ర కూడా కీలకంగా ఉంటుంది. ఇక హిందీలో ‘ఈగల్’ పేరుతో ఓ సినిమా ఉంది. దీంతో ‘సహదేవ్ వర్మ’ టైటిల్‌తో అక్కడ రిలీజ్ చేస్తున్నాం. ప్రస్తుతం తేజ సజ్జా హీరోగా ఓ సినిమా చేస్తున్నాను. -
లోకేష్ కనగరాజ్ స్టైల్లో 'ఈగిల్' క్లైమాక్స్ ఉంటుంది: నిర్మాత
హీరో రవితేజ లేటెస్ట్ మూవీ 'ఈగల్'. ఫిబ్రవరి 9న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్‌లో జరుగుతున్నాయి. విడుదల దగ్గర పడటంతో సినిమా ఎలా ఉండబోతుందా అని సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలో చిత్ర నిర్మాత విశ్వ ప్రసాద్.. 'ఈగల్' గురించి, మరీ ముఖ్యంగా క్లైమాక్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రవితేజ హీరోగా నటించిన 'ఈగల్' సినిమా.. ఈ సంక్రాంతికే థియేటర్లలోకి వచ్చేలా ప్లాన్ చేశారు. కానీ మహేశ్, వెంకటేశ్, నాగార్జున చిత్రాలు విడుదలకు సిద్ధం కావడంతో 'ఈగల్' పోటీ నుంచి తప్పుకొంది. తెలుగు నిర్మాతల మండలి సోలో డేట్ హామీ ఇవ్వడంతో ఫిబ్రవరి 9కి రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే సినిమా క్లైమాక్స్ వేరే లెవల్ ఉండబోతుందని నిర్మాత విశ్వప్రసాద్ చెప్పుకొచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాన్ని బయటపెట్టారు. (ఇదీ చదవండి: టీవీ షోలో కుమారి ఆంటీ.. 'బిగ్‌బాస్ 7' బ్యాచ్‌తో కలిసి స్కిట్!) 'ఈగల్' సినిమాలోని చివరి 40 నిమిషాలు ఎక్స్‌ప్లోజివ్‌గా ఉంటుందని, లోకేష్ కనగరాజ్ స్టైల్ ఆఫ్ క్లైమాక్స్ ఉంటుందని.. తెలుగులో ఇప్పటివరకు ఇలాంటి క్లైమాక్స్ చూసి ఉండరని నిర్మాత విశ్వప్రసాద్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఈయన చెప్పినట్లు క్లైమాక్స్ ఉంటుందా లేదా అనేది మరో రెండు రోజుల్లో తెలిసిపోతుంది. అప్పటివరకు వెయిట్ అండ్ సీ. 'ఈగల్' సినిమాలో రవితేజ సరసన అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ నటించారు. నవదీప్ కీలకపాత్ర పోషించాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. (ఇదీ చదవండి: 'పుష్ప' సినిమాకు మూడో పార్ట్? వర్కౌట్ అయ్యే పనేనా?) -
‘ఈగల్’లో రొమాన్స్ డిఫరెంట్‌గా కొత్తగా ఉంటుంది: కావ్య థాపర్
‘ఈగల్ లో యాక్షన్ రోమాన్స్ చాలా యూనిక్ గా ఉంటాయి. రోమాన్స్ అయితే చాలా డిఫరెంట్ గా, కొత్తగా ఉంటుంది. ఖచ్చితంగా ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు’అన్నారు యంగ్ హీరోయిన్ కావ్య థాపర్.మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ స్టయిలీష్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ఈగల్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఫిబ్రవరి 9న ఈగల్ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరోయిన్ కావ్య థాపర్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ►ఓ బాలీవుడ్ సినిమా షూటింగ్ కోసం ముంబైలో వున్న సమయంలో దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఈగల్ కథ చెప్పారు. చాలా కొత్తగా, అద్భుతంగా అనిపించింది. తప్పకుండ సినిమా చేయాలని అనుకున్నాను. అన్నిటికంటే రవితేజ గారి సినిమాలో చేయడం గొప్ప అవకాశం. లుక్ టెస్ట్ చేసిన తర్వాత ఎంపిక చేశారు. ►ఇందులో నా పాత్ర పేరు రచన. జీవితంలో చాలా యునిక్ గోల్స్ వున్న అమ్మాయిగా కనిపిస్తాను. ఇందులో చాలా అద్భుతమైన ప్రేమకథ ఉంది. దాని గురించి అప్పుడే ఎక్కువ రివిల్ చేయకూడదు(నవ్వుతూ). రవితేజ గ, నా పాత్రల మధ్య కెమిస్ట్రీ చాలా యూనిక్ గా ఉంటుంది. సినిమా చాలా బాగా వచ్చింది. ఈగల్ పై రవితేజ , డైరెక్టర్ కార్తిక్, మా టీం అంతా చాలా హ్యాపీగా, కాన్ఫిడెంట్ గా వున్నాం. ఈగల్ తప్పకుండా ప్రేక్షకులని చాలా గొప్పగా అలరిస్తుంది. ►రవితేజ గారితో సినిమా చేయడం నా అదృష్టం. రవితేజ గారి వ్యక్తిత్వానికి నేను పెద్ద అభిమానిని. ఆయన చాలా పాజిటివ్ ఎనర్జీతో ఉంటారు. సెట్స్ లో చాలా సరదాగా, సపోర్టివ్ గా ఉంటారు. ఆయనతో వర్క్ చేయడం మర్చిపోలేని అనుభూతి. పోలాండ్, లండన్ ఇలా అద్భుతమైన ఫారిన్ లోకేషన్స్ లో ఇంటర్ నేషనల్ లెవల్ లో షూట్ చేశారు. నిజంగా ఒక వెకేషన్ లానే అనిపించింది. చాలా ఎంజాయ్ చేశాను. ►భవిష్యత్తులో ఫుల్ మాస్ యాక్షన్ సినిమా చేయాలని ఉంది(నవ్వుతూ). అలాగే సూపర్ నేచురల్ సినిమాలు చేయాలని ఉంది. -
ఈగల్ మేకర్స్ డేరింగ్ స్టెప్.. ఆ విషయంలో షాకింగ్ డెసిషన్!
సంక్రాంతి రావాల్సిన మాస్ మహారాజా ఫిబ్రవరికి రెడీ అయిపోయారు. రవితేజ, అనుమప పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరో, హీరోయిన్లుగా నటించిన ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ ఈగల్ మరో మూడు రోజుల్లో థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే చిత్రబృందం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఇటీవలే ప్రీ రిలీజ్ ఈవెంట్ సైతం గ్రాండ్‌గా నిర్వహించారు. గతేడాది రావణాసుర, టైగర్ నాగేశ్వరరావుతో అలరించిన మాస్ హీరో మరోసారి ఫుల్ యాక్షన్ ట్రీట్ ఇవ్వనున్నారు. అయితే ఈ సినిమాకు రిలీజ్‌కు చిత్రబృందం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. అదేంటో తెలుసుకుందాం. పెద్ద సినిమాలు అంటే టికెట్ల రేట్స్ కూడా అదే రేంజ్లో ఉంటాయి. మొదటి రోజు బుకింగ్స్ దొరకడం కూడా కష్టమే. సినిమా బడ్జెట్ ఆధారంగా మేకర్స్ టికెట్ రేట్లు పెంచేస్తుంటారు. పెద్ద హీరోల సినిమాలకు ప్రభుత్వాలు సైతం ధర పెంచుకునేందుకు సడలింపులు ఇస్తాయి. కానీ ఈగల్ మేకర్స్ మాత్రం ఊహించని నిర్ణయం తీసుకున్నారు. ఈగల్ సినిమా టికెట్లను మామూలు రోజుల్లో ఉండే ధరలకే అందుబాటులో ఉంచారు. హైదరాబాద్‌లోని మల్టీప్లెక్స్‌ల్లో ఉండే టికెట్ ధర రూ.200, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.150కే పరిమితం చేశారు. అత్యధికంగా మల్లీప్లెక్స్‌లలో టికెట్ ధర రూ.295 వరకు పెంచుకునే అవకాశం ఉంది. కానీ ఈగల్ సినిమాను ఎక్కువమంది చూడాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభం కాగా.. మల్టీప్లెక్స్‌ల్లో టికెట్ రూ.200 మాత్రమే చూపిస్తోంది. ఫిబ్రవరి, మార్చిలో పరీక్షల సమయం కావడంతో స్టూడెంట్స్ చాలా వరకు సినిమాలకు దూరంగా ఉంటారు. ఇది కూడా ఒక కారణం అయినప్పటికీ.. కంటెంట్‌పై ఉన్న నమ్మకంతోనే మేకర్స్ డేరింగ్ డెసిషన్ తీసుకున్నట్లు అనిపిస్తోంది. ర్యాప్ వీడియో వైరల్ అయితే ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఈగల్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అందులో ఓ యువకుడు రవితేజ సినిమాలను డైలాగ్స్‌తో అదిరిపోయేలా పాట పాడారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సైతం ఆ వీడియోను ట్విటర్లో షేర్ చేసింది. The video is so good that even the pause button has given up. Can someone send us help or more popcorn? 🍿,🫠 Cinema Cinema Cinema ♥️#RaviTeja #EAGLEonFEB9th #Eagle pic.twitter.com/oMqjByZqUF — People Media Factory (@peoplemediafcy) February 6, 2024 -
స్టేజీపైనే డైరెక్టర్‌కు రాఖీ కట్టిన అనుపమ.. కారణం ఇదే
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన చిత్రం 'ఈగల్'. సూర్య వర్సెస్ సూర్య సినిమాతో డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తీక్ ఘట్టమనేని ఈ మూవీని తెరకెక్కించాడు. ఇందులో అనుపమ పరమేశ్వరన్, కావ్యా థాపర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నవదీప్, అవసరాల శ్రీనివాస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 9న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో చిత్ర దర్శకుడు కార్తీక్ ఘట్టమనేనికి హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ రాఖీ కట్టింది. ఈ వేడుకలో స్టేజీపైకి వచ్చిన అనుపమ డైరెక్టర్‌ను అన్నయ్య అని పిలిచింది. వెంటనే రవితేజ.. 'నువ్వు అతన్ని అన్నయ్య అని పిలిచావా.. అందమైన అమ్మాయిలు అన్నయ్య అనే పదం వాడకూడదు.. నేను ఎందుకు చెప్పానో, ఎందుకు చెప్తున్నానో అర్ధం చేసుకో' అని చెప్తాడు. ఆ వెంటనే అనుమప కూడా సారీ రవిగారు.. 'దర్శకుడు కార్తీక్‌తో నేను నాలుగు సినిమాలు చేశాను. ఆయనతో మంచి అనుబంధం ఏర్పడింది. మొదటి నుంచి ఆయన్ను అన్నయ్య అనే నేను పిలుస్తున్నాను అలాగే అలవాటు అయిపోయింది. ఇప్పుడు మార్చుకోలేను.' అని చెప్పింది. ఇంకేముంది ఈ లోపు యాంకర్ సుమ ఓ రాఖీ తీసుకొచ్చి అన్నయ్యకు కట్టేయమని చెప్పింది. దీంతో స్టేజిపైనే డైరెక్టర్ కార్తీక్‌కి అనుమప రాఖీ కడుతుంది. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. గతంలో డైరెక్టర్ కార్తీక్ చాలా సినిమాలకు ఛాయాగ్రాహకుడిగా పనిచేశాడు. ప్రేమమ్,కృష్ణార్జున యుద్ధం,చిత్రలహరి,నిన్ను కోరి,కార్తీకేయ,ఎక్స్‌ప్రెస్ రాజా వంటి చిత్రాలకు ఆయన కెమెరామెన్‌గా వర్క్ చేశాడు. దీంతో అనుపమతో ఆయనకు మంచి అనుబంధం ఉంది. -
ఈగల్‌కు ఎక్కువ థియేటర్స్ ఉండేలా చూస్తాం: దిల్ రాజు
సంక్రాంతి సినిమాల విడుదలపై ఇప్పటికి కూడా కొనసాగుతున్న కొన్ని అంశాల గురించి అదేవిధంగా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, గిల్డ్ నుంచి కొంతమంది ప్రొడ్యూసర్స్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఇండస్ట్రీ గురించి చర్చించిన విషయాలు గురించి తాజాగా మాట్లాడటం జరిగింది. ఈ సమావేశంలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ దిల్ రాజు , తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్, ప్రసన్నకుమార్, వై వి ఎస్ చౌదరి, సునీల్ నారంగ్ , పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ దిల్ రాజు మాట్లాడుతూ : సంక్రాంతి సినిమాల బరిలో నుంచి ఫిలిం ఛాంబర్ కోరగానే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి టీ. జీ. విశ్వప్రసాద్, వివేక్‌తో పాటు హీరో రవితేజ గారు ముందుకొచ్చి తమ సినిమా రిలీజ్ డేట్‌ను ఫిబ్రవరి 9కి మార్చుకోవడం జరిగింది. ఇప్పుడు అదే ఫిబ్రవరి 9కి భైరవకోన తమ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. ముందు ఈ విషయం ఛాంబర్ నోటీస్‌కు రాలేదు వచ్చిన వెంటనే ఆ చిత్రం నిర్మాత అనిల్ సుంకరతో మాట్లాడటం జరిగింది. వారు కూడా ఛాంబర్ వినతిని మన్నించి తమ చిత్రాన్ని ఒక వారం రోజులు అంటే ఫిబ్రవరి 16కు మార్చుకోవడం జరిగింది. సంక్రాంతి అప్పుడు చాంబర్ వినతిని మన్నించి తమ డేట్‌ని మార్చుకున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారికి ఇప్పుడు కూడా తమ డేట్ ని మార్చుకొని ఛాంబర్ వినితిని మన్నిస్తున్న ఏ కె ఎంటర్టైన్మెంట్స్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఫిబ్రవరి 9కి రిలీజ్ అవుతున్న ఈగల్ చిత్రానికి ఎక్కువ శాతం థియేటర్స్ వచ్చేలాగా చూడడం జరుగుతుంది. అదే తేదీలో యాత్ర 2 వాళ్లు కూడా రిలీజ్ పెట్టుకున్నారు. ఆ చిత్రం విడుదల తేదీని చాలా రోజుల క్రిమతమే ఫిక్స్ చేసుకోవడం వల్ల వాళ్లు డేట్ చేంజ్ చేసుకోవడానికి ఒప్పుకోలేదు. అదేవిధంగా ఒక తమిళ్ సినిమా రజనీకాంత్ లాల్ సలాం కూడా ఫిబ్రవరి 9న రిలీజ్ అవుతుంది. ఇదే విషయాన్ని ఈగల్ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్లతో చర్చించినప్పుడు పర్లేదండి మా సినిమాతో రెండు సినిమాలు రావడం పెద్ద ఇబ్బంది కాదు అని చెప్పి వాళ్లు అనడం చాలా ఆనందం అనిపించింది. ఫిబ్రవరి 9కి ఈగల్ మేజర్ థియేటర్స్‌లో రిలీజ్ అవుతుంది.' అని దిల్ రాజు అన్నారు. ఇండస్ట్రీ, మీడియా కలిసి ఒకటిగా పని చేయాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగిందని తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ టి. ప్రసన్నకుమార్ తెలిపారు. ఇండస్ట్రీ, మీడియా ఒకటిగానే ఉంది. భవిష్యత్తులో కూడా ఒకటిగానే ఉంటుంది. పరిశ్రమ గురించి ఏమైనా మీడియాకి సందేహాలు ఉంటే ఫిలిం ఛాంబర్లో తామందరం అందుబాటులో ఉంటాం. ఇక్కడకు వచ్చి అసలు నిజాన్ని తెలుసుకుని ప్రజలకి పబ్లిష్ చేయవలసిందిగా కోరుతున్నట్లు ఆయన చెప్పారు. -
మీ వల్లే హీరోయిన్లతో ఇబ్బందులు రవితేజపై సజ్జా కామెంట్స్
-
ఇచ్చిన మాట నిలబెట్టుకోండి.. రవితేజ 'ఈగల్' టీమ్ లేఖ
రవితేజ హీరోగా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన చిత్రం 'ఈగల్'. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. జవనరి 13న సంక్రాంతి కానుకగా రావాల్సిన ఈ సినిమా థియెటర్ల కొరత ఉండటంతో అప్పుడు వాయిదా పడింది. సంక్రాంతి సినిమాల విడుదలపై.. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ సమావేశం అయి ఈ నిర్ణయం తీసుకున్నారు. రోజుల వ్యవధిలోనే ఐదు సినిమాలు విడుదలైతే పలు ఇబ్బందులు వస్తాయిని దానిపై ఈగల్ నిర్మాతలతో సుదీర్ఘ చర్చలు అప్పట్లో జరిగాయి. వారందరి కోరిక మేరకు ‘ఈగల్’ నిర్మాత తమ సినిమాని పోస్ట్‌పోన్ చేసేందుకు అంగీకరించారు. అందుకు గాను ఈగల్ సినిమాకు సింగిల్ రిలీజ్ డేట్‌గా ఫిబ్రవరి 9 ఫైనల్ చేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఈగల్ సినిమాకు అలాంటి పరిస్థితే వస్తుంది. ఫిబ్రవరి 8న యాత్ర-2, ఊరు పేరు భైరవకోన చిత్రాలతో పాటు ఫిబ్రవరి 9న లాల్ సలామ్ విడుదల కానుంది. అంటే ఈగల్ సినిమాతో కలిపి మొత్తంగా నాలుగు సినిమాలు ఉన్నాయి. దీంతో తాజాగా ఈగల్ సినిమాకు సంబంధించిన పీపుల్స్ మీడియా వారు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు లేఖ రాశారు. సంక్రాంతికి రావాల్సిన ఈగల్ సినిమా ఛాంబర్ పెద్దల నిర్ణయం మేరకు, సినీ పరిశ్రమ మంచి కోసం తాము వాయిదా వేసుకున్నామని ఆ లేఖలో తెలిపారు. ఈ క్రమంలో తమ ఈగల్ సినిమాకు సోలో రిలీజ్ డేట్ ఇస్తామని మాట ఇచ్చారు. కానీ తమ సినిమా రిలీజ్ రోజే మరి కొన్ని సినిమాలు విడుదల కానున్నాయని తెలిపారు. ఈగల్ సినిమాకి సోలో డేట్ ఇస్తామన్న మాటను నిలబెట్టుకోవాలని పీపుల్స్ మీడియా విజ్ఞప్తి చేసింది. ఈగల్ సినిమా సోలోగా విడుదలయ్యేలా సహకరించాలని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ను కోరింది. ఈ లేఖకు ఎలాంటి సమాధానం ఇంకా వెలువడలేదు. Ravi Teja’s #Eagle Solo Release issue. pic.twitter.com/BOauCOiKMm — Christopher Kanagaraj (@Chrissuccess) January 19, 2024 -
రవితేజ సినిమాతో క్లాష్.. వెనక్కి తగ్గలేమని చెప్పిన సందీప్ కిషన్
సందీప్‌కిషన్ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఊరు పేరు భైరవకోన'. ఒక్క క్షణం, ఎక్కడికి పోతావు చిన్నవాడా, డిస్కో రాజా వంటి చిత్రాలకు వీఐ ఆనంద్ దర్శకత్వం వహించాడు.తాజాగా విడుదలైన ఊరు పేరు భైరవకోన చిత్రం ట్రైలర్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఫాంటసీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 9న విడుదల కానుంది. గరుడ పురాణంలో కనిపించకుండా పోయిన ఆ నాలుగు పేజీలే ఈ భైరవకోన అనే డైలాగుతో ట్రైలర్ మెప్పించింది. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న 'ఈగల్' చిత్రం కూడా ఫిబ్రవరి 9న విడుదల అవుతుంది. దీంతో రవితేజ చిత్రంతో వస్తున్న క్లాష్ గురించి సందీప్‌కిషన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చాడు. 'ఊరు పేరు భైరవకోన' చిత్రాన్ని వాస్తవంగా సంక్రాంతికే విడుదల చేయాలని అనుకున్నాం. ఆ తేదీలలో చాలా సినిమాలు ఉండటం చూసి వెనక్కు తగ్గాం. దీంతో ఫిబ్రవరి 9న వెళ్దాం అనుకున్నాం. అప్పటికే ఫిబ్రవరి 9న 'టిల్లు స్క్వేర్' రేసులో ఉంది. ఆ సమయంలో ఆ చిత్ర యూనిట్‌తో మాట్లాడుకుని మేము రిలీజ్ డేట్ ఫిక్స్ చేశాం. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ రిలీజ్ డేట్ మార్చుకునే అవకాశం కూడా లేదు. ఈ సినిమా వివషయంలో ఇప్పటికే చాలా సమయం తీసుకున్నాం. రవితేజతో డైరెక్టర్ వి.ఐ.ఆనంద్ కూడా పని చేశారు. అయన్ను ఎవరైనా అభిమానిస్తారు. 'ఈగల్' నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో మా చిత్ర నిర్మాతకు మంచి స్నేహమే ఉంది. 'ఈగల్' రిలీజ్ విషయంలో మాకు ఎలాంటి కాల్స్ రాలేదు. వాళ్లు మాతో టచ్‌లోకి రాలేదు. వారి నుంచి ఫోన్ వచ్చింటే స్పందించేవాళ్లమే.. ఎన్ని జరిగినా ఫిబ్రవరి 9వ తేదీనే రావాలని ఫిక్స్ అయ్యాం. మరోసారి విడుదల తేదీ మారిస్తే మాకు ఎన్నో సమస్యలున్నాయి. సంక్రాంతి రేసులో ఎక్కువ చిత్రాలు ఉండటంతో ఈగల్ తప్పుకోవాలని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒక సమావేశం పెట్టి కోరింది. అందుకుగాను ఈగల్ చిత్రానికి సింగిల్ రిలీజ్ డేట్ ఇస్తామని చెప్పింది. అప్పటకే ఫిబ్రవరి 9న విడుదలకు రెడీగా ఉన్న 'టిల్లు స్క్వేర్' వాయిదా వేసుకుంది. కానీ ఆ సమయంలో 'ఊరు పేరు భైరవకోన' చిత్రం టీమ్‌తో చర్చలు జరిగినట్లు లేదని తెలుస్తోంది. దీంతో ఊరు పేరు భైరవకోన,ఈగల్ రెండు చిత్రాలు ఒకే రోజు విడుదల కానున్నాయి. వీఐ ఆనంద్ డైరెక్షన్లో ఇప్పటికే టైగర్ చిత్రంలో సందీప్‌కిషన్ నటించాడు. సందీప్ సరసన కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ కనిపించనున్నారు. రాజేశ్ దండా నిర్మాత. అనిల్ సుంకర సమర్పకులు. -
ఈగల్ కి ఊహించని షాక్..!
-
పాన్ ఇండియా హీరోలతో పోటీ పడుతున్నా దీపికా
-
ఎట్టకేలకు వాయిదా పడ్డ ఈగల్.. కొత్త డేట్ ఇదే!
మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన చిత్రం ఈగల్. కావ్య థాపర్ హీరోయిన్గా యాక్ట్ చేసిన ఈ మూవీకి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించాడు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేస్తామని ఎప్పుడో ప్రకటించారు. కానీ సంక్రాంతికి ఇప్పటికే నాలుగైదు సినిమాలో రంగంలోకి దిగాయి. వాటిమధ్యే తీవ్ర పోటీ ఉంది. ఈ తరుణంలో ఈగల్‌ను రిలీజ్ చేస్తే సినిమా కలెక్షన్లపై ఎఫెక్ట్ పడటం ఖాయం! అందుకని చిత్రయూనిట్ వెనకడుగు వేసింది. జనవరి 13న రిలీజ్ కావాల్సిన ఈ మూవీని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఫిబ్రవరి 9న విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమ సంక్షేమం కోసం ఓ అడుగు వెనక్కు వేస్తున్నాం.. అంటూ రవితేజ ఎక్స్(ట్విటర్)లో కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశాడు. ఇది చూసిన రవితేజ అభిమానులు.. మీరు గ్రేట్ అన్నా.. మీ మనసు బంగారం అని కామెంట్లు చేస్తుండగా మరికొందరు మాత్రం ప్రతిసారి మీరే పెద్ద మనసు చేసుకుని తప్పుకుంటున్నారు.. ఈగల్ కోసం చాలా వెయిట్ చేస్తున్నాం.. అంటూ విచారం వ్యక్తం చేస్తున్నారు. Taking a step back for the welfare of our Telugu Cinema🤗 A little change in the arrival not in the shot & target 💥#EAGLE from February 9th,2024 :)))) Wishing the very best to all the films releasing this Sankranthi 😊 pic.twitter.com/LU2e7nSmy0 — Ravi Teja (@RaviTeja_offl) January 5, 2024 చదవండి: నాగార్జున స్పెషల్ గిఫ్ట్.. ఆనందంలో తేలియాడుతున్న శోభ