EAMCET exam
-
తెలంగాణ ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్ష వాయిదా
-
ఎంసెట్‌కు నాన్‌లోకల్ పోటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ రాసేవారి సంఖ్య ఈసారి భారీగా పెరిగే అవకాశం ఉందని ఉన్నత విద్యామండలి వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ మంది టీఎస్ ఎంసెట్‌కు హాజరయ్యే వీలుందని చెబుతున్నాయి. కరోనా తగ్గుముఖం పట్టడం, హాస్టళ్లు తెరవడంతో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయని వివరించాయి. గత రెండేళ్లుగా ఇతర రాష్ట్రాల నుంచి ఎంసెట్‌కు దరఖాస్తు చేసినా పరీక్ష రాసే వారి సంఖ్య దాదాపు 50 శాతం తగ్గిందని, ఇంజనీరింగ్‌లో చేరే వారి సంఖ్య కూడా 45 శాతం పడిపోయినట్టు ప్రైవేటు కాలే జీలు స్పష్టం చేస్తున్నాయి. ఈసారి ఈ సమస్య లేకపోవడంతో ప్రమాణాలున్న కాలేజీలు, యూనివర్సిటీ క్యాంపస్‌లో సీట్ల కోసం అభ్యర్థులు పోటీ పడే వీలుందని చెబుతున్నారు. ఎంసెట్, జేఈఈ కోసం శిక్షణ పొందే వారు హైదరాబాద్‌నే కేంద్రంగా చేసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారూ ఇక్కడ చదువుతూనే ఎంసెట్, ఇతర పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకుంటున్నారు. ఉద్యోగ రీత్యా స్థిరపడిన వారి పిల్లలు సైతం హైదరాబాద్‌లోని కాలేజీల వైపే మొగ్గు చూపుతున్నారు. కరోనాకు ముం దు మేనేజ్మెంట్ కోటా సీట్లలో ఏపీకి చెందిన విద్యార్థులు ఎక్కువగా చేరేవారు. ఇప్పుడూ ఇదే పరిస్థితి కనిపిస్తోందని ఓ కాలేజీ నిర్వాహకుడు తెలిపారు. 15 శాతం కోటాలో పోటీ...: తెలంగాణవ్యాప్తంగా 1.05 లక్షల ఇంజనీరింగ్ సీట్లు ఉంటే అందులో 70 వేల వరకు కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తారు. ఈ సీట్లలో 15 శాతం నాన్–లోకల్ కోటా ఉంది. ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఈ కోటాలోనే పోటీ పడాల్సి ఉం టుంది. దీంతో ఈసారి పోటీ ఎక్కువ ఉండే వీలుందని ఎంసెట్ వర్గాలు అంటు న్నాయి. కొన్ని కోర్సులకు నాన్‌లోకల్స్ పోటీ వల్ల మేనేజ్మెంట్ కోటా విషయంలో యాజమాన్యాలు భారీగా డిమాండ్ చేసే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. కరోనా వల్ల రెండేళ్ళుగా ఈసీఈ సహా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ సీట్ల కోసం ఇతర రాష్ట్రాల అభ్యర్థులు పోటీ పడలేదు. టాప్ టెన్ కాలేజీల్లోనూ ఈ సీట్లకు పెద్దగా డిమాండ్ కనిపించ లేదు. ఈసారి కూడా కంప్యూటర్ కోర్సులనే ఇతర రాష్ట్రాల వారు కోరుతున్నారు. దీంతో ఏపీ నుంచి మేనేజ్మెంట్ కోటా సీట్లలో కంప్యూటర్ కోర్సులకే ప్రాధాన్యం ఉండే వీలుందని భావిస్తున్నారు. 2021 లో జరిగిన ఎంసెట్‌కు 2,51,604 మంది దరఖాస్తు చేస్తే, పరీక్షకు 2,27,00 మంది హాజరయ్యారు. ఇందులో 1,94, 550 మంది అర్హత సాధించారు. -
మే మొదటి వారంలో ఎంసెట్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాంకేతిక, వృత్తి విద్యా కాలేజీల్లో 2020–21 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) తేదీలను ఖరారు చేసేందుకు ఉన్నత విద్యా మండలి సిద్ధమైంది. ఈనెల 24న మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగే ఉన్నత స్థాయి సమావేశంలో సెట్స్ తేదీలను ఖరారు చేయనున్నారు. 2020 మే మొదటి వారంలో ఎంసెట్ ప్రవేశ పరీక్షలను నిర్వహించేలా షెడ్యూలు ఖరారు చేయనున్నట్లు తెలిసింది. ఎంసెట్, ఈసెట్, ఐసెట్, పీఈసెట్, ఎడ్‌సెట్, లాసెట్ తదితర పరీక్షలను ఈ సారి కూడా ఆన్లైన్లోనే నిర్వహించనున్నారు. -
నేటి నుంచి తెలంగాణ ఎంసెట్ పరీక్షలు
-
‘ఎంసెట్’కు విద్యుత్ ఇబ్బందులు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎంసెట్ ఆన్లైన్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. విద్యుత్ అంతరాయంతో పలు కేంద్రాల్లో అధికారులు, విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. ఖమ్మం జిల్లాలోని పలు కేంద్రాల్లో విద్యుత్ లేకపోవడంతో పరీక్ష 10 నిమిషాలు ఆలస్యమైనట్లు అధికారులు వెల్లడించారు. మంగళవారం నాటి గాలి కారణంగా అధికారులు నిర్వహణ కోసం సరఫరాను నిలిపివేశారు. దీంతో పలు కేంద్రాల్లో అధికారులు, సిబ్బంది ఆందోళన చెందారు. చివరకు ఎంసెట్ కమిటీ అధికారులు విద్యుత్‌శాఖ అధికారులతో మాట్లాడి సరఫరాను పునరుద్ధరించేలా చర్యలు చేపట్టారు. దీంతో 10 నిమిషాలు ఆలస్యంగా పరీక్షను ప్రారంభించాల్సి వచ్చింది. హైదరాబాద్ శివారులోని మరో కేంద్రంలో (నోమా ఫంక్షన్ హాల్) విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో కొంత ఇబ్బంది కలిగింది. అయితే అధికారులు జనరేటర్ల ఏర్పాటుతో పరీక్ష సజావుగా జరిగేలా చర్యలు చేపట్టారు. 44,445 మంది హాజరు.. బుధవారం నిర్వహించిన అగ్రికల్చర్ ఎంసెట్ పరీక్షకు 48,551 మంది విద్యార్థులు హాజరయ్యేలా అధికారులు చర్యలు చేపట్టగా, 44,445 మంది పరీక్షకు హాజరయ్యారు. తెలంగాణలోని 67 కేంద్రాలు, ఆంధ్రప్రదేశ్‌లోని 8 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు జరిగిన మొదటి సెషన్‌కు 23,808 మందికి 21,774 మంది (91.46 శాతం) పరీక్షకు హాజరయ్యారు. మధ్యాహ్నం పరీక్షకు 24,743 మందికి ఏర్పాట్లు చేయగా, 22,671 మంది (91.63 శాతం) హాజరయ్యారు. ఆన్లైన్ పరీక్షలను ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, ఎంసెట్ చైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి, కన్వీనర్ ప్రొఫెసర్ యాదయ్య తదితరులు పర్యవేక్షించారు. సులువైన ప్రశ్నలు.. ఇక ఉదయం, మధ్యాహ్నం జరిగిన పరీక్షల్లో ప్రశ్నలు సులువుగానే వచ్చాయని విద్యార్థులు తెలిపారు. ఆన్లైన్ విధానంలో పరీక్ష రాయడానికి పెద్దగా ఇబ్బంది పడలేదని వెల్లడించారు. మరోవైపు ఈ నెల 3న కూడా అగ్రికల్చర్ ఎంసెట్ పరీక్ష జరుగనుంది. 4, 5, 7 తేదీల్లో ఇంజనీరింగ్‌కు ఎంసెట్ పరీక్ష నిర్వహిస్తారు. వేర్వేరు సెషన్లలో వేర్వేరు ప్రశ్నలు వస్తాయి కనుక చివరకు అన్నింటిని నార్మలైజ్ చేసి మార్కులను కేటాయిస్తారు. వాటికి ఇంటర్మీడియట్ మార్కుల వెయిటేజీ కలిపి తుది ర్యాంకులను ఖరారు చేస్తారు. -
ప్చ్.. ఇక్కడ చేరలేం!!
♦ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలపై టాపర్ల అనాసక్తి ♦ పక్కరాష్ట్రాల్లోని కాలేజీలవైపే 75 శాతం మంది చూపు ♦ టాప్ 1000లో వెరిఫికేషన్‌కు హాజరైంది 253 మందే ♦ మౌలిక వసతులు, ఫ్యాకల్టీ లేమి ప్రధాన కారణం.. సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ పరీక్ష నిర్వహిస్తే దరఖాస్తు చేకునేవారు లక్షల్లో ఉంటున్నారు. పరీక్షకు హాజరయ్యేవారి సంఖ్య కూడా ఏమాత్రం తగ్గడంలేదు. కానీ కాలేజీల్లో చేరే సమయానికి ఈ సంఖ్య గణనీయంగా పడిపోతోంది. ఇక టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులైతే పక్క రాష్ట్రాల్లోని కాలేజీల్లో చేరేందుకే ఆసక్తి చూపుతున్నారు. అందుకు ఇటీవల జరిగిన సర్టిఫికెట్ వెరిఫికేషనే ప్రత్యక్ష సాక్ష్యం. 1000 మంది టాపర్లలో 253 మందే.. తెలంగాణ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం ప్రక్రియను ఇటీవలే మొదలుపెట్టారు. అయితే ప్రవేశ పరీక్ష టీఎస్‌ఎంసెట్‌లో టాప్ ర్యాంకులు సాధించిన 1000 మందిలో కేవలం 253 మంది మాత్రమే సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. అంటే దాదాపు 75 శాతం మంది రాష్ట్రంలోని కాలేజీల్లో చేరేందుకు విముఖత చూపుతున్నారన్నమాట. మిగతా 25 శాతం మంది.. అంటే సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరైన 253 మందిలో చాలామంది జేఈఈ అడ్వా న్స్‌డ్‌లో ర్యాంకులు సంపాదించినవారే ఉండడంతో వీరు కూడా చేరతారనే నమ్మకం లేదు. ఎందుకంటే ఐఐటీలో సీటు కంటే ఇంజనీరింగ్ కాలేజీల్లో బీటెక్ చదివేందుకు అంతగా ఆసక్తి చూపరనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం టాప్ 1000 ర్యాంకులలోపు విద్యార్థులే కాదు 2 వేల ర్యాంకులోపు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరైన విద్యార్థుల్లోనూ ఎక్కువ మంది ఎన్ఐటీ, ఐఐటీల్లోనే చేరే అవకాశం ఉంది. కారణాలేంటి?: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరకపోవడానికి అనేక కారణాలున్నాయని విద్యావేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీ అంటూ ఓ బోర్డు తగిలించి, విద్యార్థులను చేర్చుకోవడం మినహా అందులో సాగుతున్న బోధన అంతంత మాత్రమేనని చెబుతున్నారు. మౌలిక సదుపాయాల విషయానికి వస్తే రాష్ట్రంలోని కేవలం 10 శాతం కాలేజీలు మాత్రమే అర్హత కలిగిన కాలేజీలని, మిగతా కాలేజీల్లో ఇంజనీరింగ్ విద్యకు అవసరమైన కనీస సదుపాయాలు కూడా లేవని చెబుతున్నారు. ఇక ఫ్యాకల్టీ విషయానికి వస్తే.. అర్హత కలిగిన అధ్యాపకులు ఉన్న కాలేజీలు చాలా తక్కువ. బీటెక్ పూర్తిచేసిన వారితో క్లాసులు చెప్పించడం జరుగుతోంది. ఫీజు రీయింబర్స్‌మెంటూ కారణమేనా? ఫీజు రీయింబర్స్మెంట్ మీద ఆశతో ఇంజనీరింగ్ కాలేజీలో చేరుదామన్నా.. అది వస్తుందో? లేదో? కూడా తెలియని పరిస్థితి. ప్రభుత్వం రీయింబర్స్మెంట్ సొమ్ము చెల్లించేదాకా కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఫలితంగా ఎంతోమంది విద్యార్థులు ఉద్యోగ అవకాశాలను కోల్పోతున్నారు. అందుకే ఆ ఫీజేదో మంచి కాలేజీల్లోనే చెల్లించి, మెరుగైన విద్యను నేర్చుకోవాలనే అభిప్రాయంతో ఇతర రాష్ట్రాల్లోని కాలేజీలవైపు చూస్తున్నారు. -
ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఖరారు
-
ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఖరారు
⇒ అన్ని పరీక్షలు ఆన్లైన్లోనే నిర్వహణ ⇒ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఎస్.విజయరాజు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్నత విద్యా కోర్సుల ప్రవేశ పరీక్షలన్నీ ఆన్లైన్లో (కంప్యూటర్ ఆధారితంగా) నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ జి.విజయరాజు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ పి.నరసింహారావు, సెట్ల ప్రత్యేకాధికారి డాక్టర్ కె.రఘునాథ్‌లతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంసెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షల షెడ్యూళ్లను ఖరారు చేశామని, కొన్నిటి నోటిఫికేషన్లు విడుదల య్యాయన్నారు. రోజుకు రెండు సెషన్లలో పరీక్ష ఉంటుందన్నారు. ఎంసెట్ పరీక్ష 5 రోజులు జరగనున్నందున నార్మలైజేషన్ చేసి ప్రశ్నలు ఇవ్వనున్నామన్నారు. విద్యార్థి పరీక్ష సమాధానాలను ఎన్నిసార్లయినా ఆలోచించుకొని మార్పులు చేసుకోవచ్చన్నారు. పరీక్ష సమయం ముగిసిన తర్వాత ఆయా సమాధానాలు ఆటో మేటిగ్గా సబ్మిట్ అవుతాయన్నారు. కరెక్టు కీ సమాధానాలను వారి ఈ మెయిళ్లకు పంపించడంతో పాటు వెబ్‌సైట్‌లోకూడా పెడతామని చెప్పారు. పరీక్షలు పూర్తి పారదర్శకంగా జరిగేందుకు ఆన్లైన్ విధానం దోహదపడుతుందని చెప్పారు. సెట్ల షెడ్యూళ్లను వెబ్సైట్ల వివరాలను చైర్మన్ వెల్లడించారు. -
మెడికల్ కౌన్సెలింగ్ గడువు పెంచండి
సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ సాక్షి, న్యూఢిల్లీ: ఎంసెట్ పరీక్ష నిర్వహణ ఆలస్యమైన నేపథ్యంలో మెడికల్ అడ్మిషన్ల ప్రక్రియకు మరో నెల రోజులు గడువు పెంచాలని కోరుతూ సోమవారం సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. సెప్టెంబర్ 30 నాటికి కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తవ్వాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినందున ప్రభుత్వం మరికొంత గడువు కోరింది. తెలంగాణలో అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యమైతే తమపై ప్రభావం చూపుతుందని, తమకూ కొంత సమయం అవసరమవుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఎన్టీఆర్ హెల్త్ వ ర్సిటీ, ప్రైవేటు కళాశాలలు పిటిషన్లు దాఖలు చేశాయి. బుధవారం పిటిషన్లు విచారణకు వచ్చే అవకాశం ఉంది. -
'ఎంసెట్-2 ను రద్దు చేయవద్దు'
-
'ఎంసెట్-2 ను రద్దు చేయవద్దు'
హైదరాబాద్: ఎంసెట్ - 2 ను రద్దు చేయవద్దంటూ విద్యార్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎంసెట్-2 పరీక్షను మళ్లీ రాయడం చాలా కష్టమని మొరపెట్టుకున్నారు. గురువారం తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డితో ఎంసెట్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భేటీ అయ్యారు. ఎంసెట్ ప్రశ్నాపత్రం లీకేజీ దోషులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ లీకేజీ వ్యవహారంపై సీఐడీ విచారణ ఇంకా కొనసాగుతోందని ఆయన అన్నారు. సమస్యను తెలంగాణ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని విద్యార్థులకు నాయిని హామీ ఇచ్చారు. -
ఒక్కనిమిషం నిబంధనతో విద్యార్ధుల అవస్ధలు
-
నేడు ఎంసెట్..
నల్లగొండ టూ టౌన్ : జిల్లాలోని నల్లగొండ, కొదాడ పట్టణాల్లో ఆదివారం నిర్వహించే ఎంసెట్‌కు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. అన్నీ పరీక్ష కేంద్రాల్లోని సెంటర్లలో విద్యార్థులకు నెంబర్ల ప్రక్రియ కూడా పూర్తి చేశారు. పరీక్ష నిర్వహణ కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఎలాంటి అవంతరాలు చోటు చేసుకోకుండాముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. పరీక్ష సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పటికే సంబంధిత అధికారులకు శిక్షణ కూడా ఇచ్చారు. ఎంసెట్ కోసం జిల్లా కేంద్రంలో 15 సెంటర్లు, కోదాడలో 8 సెంటర్లను ఏర్పాటు చేశారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఒక గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇంజినీరింగ్ పరీక్ష, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు మెడిసిన్ పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం 9 నుంచి 10 గంటల మధ్యలో విద్యార్థులకు బయోమెట్రిక్ హాజరు తీసుకుంటారు. అభ్యర్థులు పరీక్ష పూర్తయ్యే వరకు పరీక్ష హాల్లోనే ఉండాల్సి ఉంటుంది. పరీక్ష కేంద్రాల ఏర్పాట్లను శనివారం ఎంసెట్ రీజినల్ కోఆర్డినేటర్లు రావుల నాగేదంర్‌రెడ్డి, ధర్మానాయక్ పరిశీలించారు. ఆయా సెంటర్లలో ఏర్పాట్లపై ఆరా తీశారు. -
ఆల్ ది బెస్ట్
♦ నేటి ఎంసెట్‌కు ఏర్పాట్లు పూర్తిచేసిన యంత్రాంగం ♦ వికారాబాద్‌లో రెండు పరీక్ష కేంద్రాలు ♦ హైదరాబాద్‌లోనే రాయనున్న శివారు విద్యార్థులు విభాగం పరీక్ష సమయం ♦ ఇంజినీరింగ్ ఉ.10 గం. నుంచి ఒంటిగంట ♦ అగ్రికల్చర్, మెడికల్ మ.2.30గం. నుంచి సా.5.30 సాక్షి, రంగారెడ్డి జిల్లా : ఎంసెట్ పరీక్షలకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. కేంద్రాలపై కొంతకాలంగా నెలకొన్న అస్పష్టతతో పరీక్ష ఇప్పటికే ఒకసారి వాయిదాపడింది. దీంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనలకు గురయ్యారు. తాజాగా సమస్యలను పరిష్కరిస్తూ ప్రభుత్వ, ఎయిడెడ్ విద్యాసంస్థలను పరీక్షా కేంద్రాలుగా ఎంపిక చేస్తూ.. ఈనెల 15న పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా ఆదివారం జరిగే ఎంసెట్ పరీక్షలకు అధికారులు అన్నివిధాలా సన్నద్ధమయ్యారు. జిల్లాలోని పశ్చిమ ప్రాంత విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వికారాబాద్‌లోని శ్రీ అనంత పద్మనాభస్వామి కళాశాల, సెయింట్ జ్యూడ్స్ పాఠశాలలో పరీక్షలు జరగనున్నాయి. ఈ రెండు కేంద్రాల్లో 2,442 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే ఇంజినీరింగ్ విభాగం పరీక్షకు 1,358 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. అదేవిధంగా మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరిగే అగ్రికల్చర్, మెడికల్ విభాగం పరీక్షకు 1,084 మంది హాజరుకానున్నారు. వికారాబాద్ ఎన్టీఆర్ చౌరస్తా నుంచి ఎస్ఏపీ కాలేజీ వరకు ప్రత్యేక బస్సు సదుపాయాన్ని కల్పించారు. హైదరాబాద్ డివిజన్లలో.. ఇదిలావుండగా.. నగర శివారు ప్రాంతాలైన సరూర్‌నగర్, చేవెళ్ల, మల్కాజిగిరి, రాజేంద్రనగర్ డివిజన్లకు సంబంధించిన విద్యార్థులకు నగరంలోనే పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ పరిధితోపాటు జిల్లాలో ని పశ్చిమ ప్రాంతం మినహా ఇతర ప్రాంతాల విద్యార్థులకోసం ప్రత్యేకంగా 8 రీజియన్లుగా విభజించి దరఖాస్తులు స్వీకరించిన అధికారు లు.. ఆ మేరకు పరీక్షా కేంద్రాలను ఎంపిక చేశారు. హైదరాబాద్‌లోని ఎనిమిది రీజియన్ల పరిధిలో 146 పరీక్షా కేంద్రాలను గుర్తించగా.. ఇందులో ఇంజినీరింగ్‌కు సంబంధించి 94, అగ్రికల్చర్, మెడికల్‌కు సంబంధించి 52 సెంటర్లున్నాయి. నగరంలో ఎంసెట్ రాసేం దుకు రెండు విభాగాల నుంచి 93,986 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఇంజినీరింగ్ విభాగంలో 60,731, అగ్రికల్చర్, మెడికల్ విభాగంలో 32,319 దరఖాస్తులు ఉన్నాయి. అదేవిధంగా ఈ రెండు విభాగాల పరీక్షలకు హాజరయ్యేందుకు మరో 468 అందాయి. నిమిషం నిబంధన ఉండడంతో అభ్యర్థులు జాగ్రత్తగా మెలగాలని అధికారులు సూచిస్తున్నారు. ఎంసెట్ పరీక్షా కేంద్రాలకు విద్యార్థులను చేరవేసేందుకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. -
నేడు ఎంసెట్, టెట్ షెడ్యూల్ ఖరారు!
కడియం శ్రీహరి నేతృత్వంలో జరిగే సమీక్షలో నిర్ణయం సాక్షి, హైదరాబాద్: ఇటీవల వాయిదా వేసిన ఎంసెట్, ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) తేదీలను విద్యా శాఖ సోమవారం అధికారికంగా ఖరారు చేయనుంది. మధ్యాహ్నం 3:30 గంటలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వద్ద జరిగే సమీక్ష సమావేశంలో ఈ పరీక్షల తేదీలను నిర్ణయించనున్నారు. విద్యా సంస్థల్లో పోలీసు తనిఖీల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రైవేటు విద్యా సంస్థలు చేపట్టిన బంద్ నేపథ ్యంలో మే 1న జరగాల్సిన టెట్, 2న జరగాల్సిన ఎంసెట్ పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 20లోగా ఈ రెండు పరీక్షలను ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇందులో భాగంగా ఆయా శాఖలు పరీక్షల నిర్వహణకు వివిధ తేదీలతో సిద్ధమయ్యాయి. సోమవారం చర్చించి ఆ తేదీలను కడియం శ్రీహరి ప్రకటించనున్నారు. ఎంసెట్‌ను ఈ నెల 15న నిర్వహించే అవకాశం ఉంది. అంతకంటే ముందుగానే నిర్వహించే వీలుంటే 13వ తేదీనే ఖరారు చేసే అవకాశం ఉంది. ఇక టెట్‌ను ఈ నెల 14న లేదా 21-22 తేదీల్లో నిర్వహించేందుకు ఖరారు చేసే అవకాశం ఉంది. -
'భవిష్యత్తులో ఎలాంటి పరీక్ష రాయకుండా వేటు'
కాకినాడ : రేపు (ఏప్రిల్ 29) జరుగనున్న ఏపీ ఎంసెట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంసెట్ కన్వీనర్ సాయిబాబా గురువారం 'సాక్షి'కి వివరించారు. పరీక్ష కేంద్రంలోకి గంట ముందే అనుమతి ఇస్తారని, నిముషం ఆలస్యమైనా అనుమతించేది లేదని ఆయన స్పష్టం చేశారు. మాల్ ప్రాక్టీస్ చేస్తే కఠిన చర్యలు తప్పవని, భవిష్యత్తులో ఎలాంటి పరీక్ష రాయకుండా వేటు వేస్తామని సాయిబాబా హెచ్చరించారు. పరీక్షా కేంద్రాల్లోకి సాంకేతిక పరికలరాలకు అనుమతి లేదన్నారు. ఉదయం 10 గంటలకు ఇంజనీరింగ్, మధ్యాహ్నం 2 గంటలకు మెడికల్ ప్రవేశ పరీక్ష జరుగనుంది. ఏపీలో 494 పరీక్షా కేంద్రాలను, తెలంగాణలో 52 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. 2,92,500 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. కాగా పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తోంది. -
ఎంసెట్ విద్యార్థులకు ఉచిత ప్రయాణ సౌకర్యం
విజయవాడ : రాష్ట్రంలో ఈ నెల 29న జరుగనున్న ఎంసెట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అందించేలా ఏపీఎస్ఆర్టీసీ ఎండీ నండూరి సాంబశివరావు నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్టీసీ తీసుకుంటున్న చర్యలను ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ జయరావు మంగళవారం ఒక ప్రకటనలో వివరించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోను ఆర్టీసీ రెగ్యులర్ బస్సులతోపాటు ప్రత్యేక (స్పెషల్) సర్వీసులను నడుపుతామని ఆయన పేర్కొన్నారు. ఏ ప్రాంతం నుంచి ఏ పరీక్షా కేంద్రానికి వెళుతున్నదీ వివరాలతో బస్సులకు ప్రత్యేక డిస్ప్లే బోర్టులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. విద్యార్థులు తమ నివాస ప్రాంతం నుంచి వారు వెళ్లాల్సిన పరీక్షా కేంద్రం వైపు వెళ్లే బస్సు ఎక్కి ఎంసెట్ హాల్ టికెట్ చూపిస్తే చాలు ఉచితంగా ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తామని వివరించారు. ఈ నెల 29న ఉదయం 10గంటల నుంచి ఒంటిగంట వరకు జరిగే ఇంజినీరింగ్ కోర్సు విద్యార్థుల కోసం ఉదయం ఆరు గంటల నుంచి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. అదే మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు జరిగే అగ్రికల్చర్, మెడికల్ కోర్సుల పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం ఉదయం 11గంటల నుంచి ప్రత్యేక సర్వీసులను నడుపుతామని తెలిపారు. ఆర్టీసీ అందిస్తున్న ప్రయాణ సౌకర్యాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని ఆయన కోరారు. -
ఎంసెట్ రాస్తున్నారా... నిబంధనలు తెలుసుకోండి..!
విద్యార్థులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఎంసెట్ పరీక్ష సమయం తరుముకొస్తోంది. ఈ నెల 29వ తేదీన పరీక్ష జరగనుంది. పరీక్ష బాగా రాసి కలలను నెరవేర్చుకోవాలని భావిస్తున్న సరస్వతీ పుత్రులంతా ముందుగా నిబంధనలను తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. గతంలో కంటే ఈసారి కొన్ని మార్పులు..చేర్పులు చేపట్టినందున వాటి గురించి అవగాహన కలిగి ఉండాలని, ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్షకు అనుమతించని విషయాన్ని గమనించాలని సూచిస్తున్నారు. జీవిత లక్ష్యం.. విలువైన సమయం మళ్లీ రావనే సత్యాన్ని తెలుసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. - ఎచ్చెర్ల * పరీక్ష నిర్వహణకు చకచకా ఏర్పాట్లు * ‘నిమిషం’ నిబంధనపై విద్యార్థులకు అప్రమతం అవసరం * ఇంజినీరింగ్‌కు 11, మెడిసన్‌కు ఐదు కేంద్రాల కేటాయింపు ఎచ్చెర్ల: ఈ నెల 29వ తేదీన నిర్వహించనున్న ఎంసెట్‌కు సంబంధించి 8049 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇంజినీరింగ్‌కు 5,918, మెడిసన్‌కు 2131 మంది ఉన్నారు. * ఇంజినీరింగ్‌కు సంబంధించి 11 కేంద్రాల్లో ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ, మెడిసన్ సంబంధించి మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ఐదు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. * విద్యార్థులను గంట ముందు పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు. * ఈసారి పరీక్ష కేంద్రాల్లో జా మర్లు అమర్చుతున్నందున ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్ఫోన్లు పని చేయవు. * ఈసారి చేతి గడియారాలను సైతం పరీక్ష కేంద్రంలోకి అను తించరు. * పరీక్ష కేంద్రంలో గోడ గడియారాలను విద్యార్థులు సమయం తెలుసుకోవడానికి అందుబాటులో ఉంచుతారు. ఫోన్లు, వాచీలు, క్యాలిక్లేటర్లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు పరీక్ష కేంద్రంలోకి తీసుకెళ్లడాన్ని నిషేధించారు. * విద్యార్థుల హాల్ టిక్కెట్, బ్లాక్, బ్లూల్ బా ల్ పాయింట్ పెన్, కుల ధ్రువీకరణ పత్రం నక లు పరిశీలకులకు అంద జేయాలి. * ఆన్లైన్ దరఖాస్తుపై ఫొటో అంటించి ఎటస్టేషన్ చేయించిన కాపీని విద్యార్థి పట్టుకుని వెళ్లాలి. * నిమిషం ఆలసమైన పరీక్షకు అనుమతించ ని నిబంధన కచ్చి తంగా అమలవుతుంది. ఈ విషయంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి. * విద్యార్థి వేలి ముద్రను సైతం ఈసారి తీసుకుంటారు. కవలలు ఒకరికి బదులు ఒకరు పరీక్ష రాస్తున్న సంఘటనలకు పూర్తిగా చెక్ పెట్టేందుకు వేలి ముద్రలు సేకరించాలని అధికారు లు ఈసారి నిర్ణయించారు. ఈ నిబంధన ఇప్పటికే జేఈఈ వంటి పరీక్షల నిర్వహణలో అమలు చేస్తున్నారు. * దివ్యాంగ విద్యార్థులకు అదనపు సమ యం, సహాయకుల కేటాయింపు ఉంటుంది. ఇన్విజిలేటర్ అంజేసిన ఓఎంఆర్ సీట్లో విద్యార్థులు రిజర్వేషన్ కేటగిరీ, జెండర్, లోకల్ ఏరియా ఆంధ్రా యూనివర్సిటీ, బుక్లెట్ నంబర్, కోడ్, సక్రమంగా నింపాలి. * పర్యవేక్షకుడి సమక్షంలో మాత్రమే సంత కం చేయాలి, వేలిముద్ర వేయాలి. * ప్రశ్నపత్రం అందజేసిన వెంటనే ముందు గా ప్రింటును సరిచూసు కోవాలి. ప్రింట్ సమ స్య ఉంటే ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకెళ్లి మార్చుకోవాలి. ప్రతి పేజీ క్షణ్ణంగా పరిశీలించాలి. సహాయం కోసం సహాయం కోసం ప్రభుత్వం కొన్ని హెల్ప్‌లైన్, టోల్ ఫ్రీ నంబర్లను అందుబాటులో ఉంచుతుంది. సమస్యలు, సందేహాలు ఈ కాల్స్ ద్వా రా నివృత్తి చేస్తారు. 18004256755, 0884-2340535, 0884-2356255, 0884-23405459, జిల్లా ఎంసెట్ కోఆర్డినేటర్ డాక్టర్ బాబూరావు 9440931686 నంబర్లను విద్యార్థులు సంప్రదించవచ్చు. పక్కాగా నిబంధనలు అమలు కన్వీనర్ ప్రకటించిన నిబంధనలు పక్కాగాపాటిస్తాం. విద్యార్థులు కూడా నిబంధనలపై అవగాహనతో ఉం డాలి. ఇంజినీరింగ్‌కు 11, మెడిషన్‌కు ఐదు కేంద్రాలను కేటాయించి.. ఏర్పాట్లు చేస్తున్నాం. అందుబాటులో ఉన్న కేంద్రాలను ఎంచుకున్నాం. ‘నిమిషం’ నిబంధన పట్ల విద్యార్థులు అప్రమతంగా ఉండా లి. కనీసం గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకునేలా జాగ్రత్త పడాలి. - డాక్టర్ బాబూరావు, జిల్లా కో ఆర్డినేటర్, ఎంసెట్-2016 -
వచ్చే ఏడాది నుంచి ఆన్లైన్లో ఎంసెట్: గంటా
సాక్షి, విజయవాడ బ్యూరో: వచ్చే సంవత్సరం నుంచి ఎంసెట్ పరీక్షను ఆన్లైన్లో నిర్వహించనున్నట్లు రాష్ట్ర మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. అన్ని సెట్లు ఆన్లైన్లో నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. సాధ్యాసాధ్యాల పరిశీలనకు కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సోమవారం విజయవాడలోని గేట్‌వే హోటల్లో 13 జిల్లాల ఎంసెట్ సమన్వయకర్తలు, విద్యా శాఖ ఉన్నతాధికారులతో ఎంసెట్ పరీక్షల ఏర్పాట్లపై మంత్రి సమీక్షించారు. -
ఏపీ ఎంసెట్‌కు నగరంలోనూ కేంద్రాలు
వెల్లడించిన సెట్ కన్వీనర్ సాయిబాబు సాక్షి, హైదరాబాద్ /బాలాజీచెరువు(కాకినాడ): ఏపీ ఎంసెట్‌కు ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లోనూ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ సీహెచ్.సాయిబాబు తెలిపారు. హైదరాబాద్‌లోని మెహిదీపట్నం, టోలిచౌకి, గోల్కొండ, లంగర్‌హౌజ్, ఇబ్రహీంబాగ్, గండిపేట, రాయదుర్గం, షేక్‌పేట, గచ్చిబౌలి ప్రాంతాలు జోన్-ఏ పరిధిలో, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, ప్రగతినగర్, నిజాంపేట్, బాచుపల్లి, చందానగర్, బీహెచ్ఈఎల్, పటాన్చెరు, కండ్లకోయ, జీడిమెట్ల, గండిమైసమ్మ, దూలపల్లి, గుండ్లపోచంపల్లి, దుండిగల్ ప్రాంతాలను జోన్-బీ పరిధిలో ఉన్నాయని వివరించారు. అభ్యర్థుల సంఖ్యను బట్టి పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎంసెట్ నిర్వహణకు సకల చర్యలు ఎంసెట్ నిర్వహణలో లోపాలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని కన్వీనర్ సీహెచ్.సాయిబాబు తెలిపారు. కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన నిఘా పెడుతున్నట్లు వివరించారు. ఇంటర్మీడియెట్ హాల్ టికెట్ నంబర్‌ను తప్పుగా నమోదు చేసిన విద్యార్థులు సీనియర్ ఇంటర్మీడియెట్ హాల్‌టికెట్ నంబర్‌ను ఎంసెట్ ఈమెయిల్ (apeamcet2k16@ gmail.com)కు ఈనెల 20వ తేదీలోగా పంపించాలని సూచించారు. ఈ విషయాన్ని అభ్యర్థులందరికీ సంక్షిప్త సమాచారం అందించామన్నారు. హాల్ టికెట్ నంబర్‌ను సరిచేయించుకోకపోతే వారు ఎంసెట్ హాల్ టిక్కెట్‌ను డౌన్లోడ్ చేసుకోలేరని వివరించారు. ఏప్రిల్ 3 నుంచి 9 వరకు సవరణలకు అవకాశం ఆన్లైన్ దరఖాస్తుల్లో సమాచారం పొందుపర్చడంలో జరిగిన పొరపాట్లను సరిచేసుకోవడానికి ఏప్రిల్ 3 నుంచి 9వ తేదీ వరకు అవకాశం కల్పిస్తున్నట్లు కన్వీనర్ చెప్పారు. ఎంసెట్ హాల్ టికెట్లను ఏప్రిల్ 21 నుంచి 27వ తేదీ వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే 0884-2340535, 0884-2356255 నంబర్లలో సంప్రదించవచ్చని సాయిబాబు సూచించారు. -
ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్ ప్రారంభం
గుంటూరు ఎడ్యుకేషన్ : ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌లో భాగంగా కళాశాలల ఎంపికకు ఆదివారం వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ ప్రారంభమైంది. జిల్లాలోని నాలుగు హెల్ప్‌లైన్ కేంద్రాల పరిధిలో తొలిరోజు 240 మంది విద్యార్థులు కళాశాలల్లో సీట్ల కోసం ఆప్షన్లు ఇచ్చుకున్నారు. సర్టిఫికెట్ల పరిశీలనకు 1,264 మంది హాజరయ్యారు. గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో సర్టిఫికెట్ల పరిశీలనకు 322, వెబ్ కౌన్సెలింగ్‌కు 87 మంది హాజరయ్యారు. నల్లపాడులోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సర్టిఫికెట్ల పరిశీలనకు 312, వెబ్ కౌన్సెలింగ్‌కు 20, సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో సర్టిఫికెట్ల పరిశీలనకు 305, వెబ్ కౌన్సెలింగ్‌కు 88, ఏఎన్‌యూలో సర్టిఫికెట్ల పరిశీలనకు 325, వెబ్ కౌన్సెలింగ్‌కు 45 మంది హాజరయ్యారు. నేటి కౌన్సెలింగ్ సోమవారం జరిగే సర్టిఫికెట్ల పరిశీలనకు గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో 45,001 ర్యాంకు నుంచి 48,800 వరకూ, నల్లపాడులోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 48,801 ర్యాంకు నుంచి 52,500 వరకూ, సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 52,501 ర్యాంకు నుంచి 56,300 వరకూ, ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయంలో 56,301 ర్యాంకు నుంచి 60,000 వరకూ హాజరుకావాలి. -
మైనారిటీ వైద్య సీట్ల ఫీజులు భారీగా పెంపు
♦ యాజమాన్య సీట్లకు నెల దాటకుండానే రెండోసారి సవరణ ♦ బీ కేటగిరీ సీట్ల ఫీజు రూ. 9 లక్షల నుంచి రూ. 11 లక్షలు.. సీ కేటగిరీ ఫీజు రూ. 11 లక్షల నుంచి రూ. 13.25 లక్షలకు పెంపు ♦ ఉత్తర్వులు జారీచేసిన తెలంగాణ ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: మైనారిటీ యాజమాన్య వైద్య సీట్ల ఫీజును భారీగా పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. సరిగ్గా గత నెల 20 న ఫీజులు పెంచుతూ నిర్ణయం తీసుకున్న సర్కారు నెల రోజులు గడవకుండానే మళ్లీ పెంచడంపై విమర్శలు వస్తున్నాయి. గత నెల మైనారిటీ వైద్య యాజమాన్య కోటాలోని బీ కేటగిరీ సీట్లకు రూ. 9 లక్షలు ఫీజులు పెంచింది. ఆ ఫీజును ఇప్పుడు రూ. 11 లక్షలకు పెంచింది. అలాగే సీ కేటగిరీ సీట్ల ఫీజును గత నెల రూ. 11 లక్షలకు సవరించి ఇప్పుడు ఏకంగా రూ. 13.25 లక్షలకు పెంచింది. అలాగే, సీట్ల కేటగిరీల్లో తాజాగా మార్పులు చేసింది. మైనారిటీ వైద్య కళాశాలల్లో గతంలో 60 శాతం సీట్లు ఏ కేటగిరీలో ఉండేవి. వాటిని ప్రభుత్వం నిర్వహించే ఎంసెట్ ద్వారానే కన్వీనర్ కోటాలో భర్తీ చేసేవారు. అయితే గత నెల విడుదల చేసిన ఉత్తర్వుల్లో అందులోని 10 శాతం సీట్లను యాజమాన్య కోటాలోకి చేర్చారు. దీంతో కన్వీనర్ కోటా సీట్లు 50 శాతానికి తగ్గాయి. తాజా ఉత్తర్వుల్లో మళ్లీ పాత పద్ధతి ప్రవేశపెట్టారు. ఆ 10 శాతం సీట్లను తిరిగి కన్వీనర్ కోటాలోకి మార్పు చేశారు. దీంతో తిరిగి కన్వీనర్ కోటా సీట్లు 60 శాతానికి చేరినట్లయింది. ఇది పేద విద్యార్థులకు కాస్తంత ఊరటనిచ్చే అంశమే. కానీ, ఈ కళాశాలల్లో సీట్లన్నింటినీ మైనారిటీ విద్యార్థులతోనే భర్తీ చేసుకోవాల్సి ఉంటుంది. వారి ద్వారా భర్తీ కాకుంటే ఇతరులతో భర్తీ చేసుకోవచ్చు. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ ఫీజు అంశాలకు సంబంధించి కొన్ని సవరణలు కోరారని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం. ఇక నుంచి మూడు ప్రత్యేక ప్రవేశ పరీక్షలు... యాజమాన్య కోటా సీట్లకు ఇక నుంచి మూడు ప్రవేశ పరీక్షలు జరుగనున్నాయి. ప్రభుత్వం నిర్వహించే ఎంసెట్ ఒకటి కాగా... నాన్ మైనారిటీ కళాశాలల్లోని యాజమాన్య సీట్లకు మరో పరీక్షకు సర్కారు ఈ ఏడాది అనుమతించింది. ఆ ప్రకారం వాటికి ఈ ఏడాది ప్రత్యేక పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే. ఇక వచ్చే ఏడాది నుంచి మైనారిటీ వైద్య కళాశాలలు కూడా సొంతంగా ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ప్రత్యేక పరీక్ష నిర్వహించుకోవడానికి సర్కారు తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. అయితే మైనారిటీలోని 25 శాతం సీట్లకు మాత్రమే ప్రత్యేక పరీక్ష నిర్వహించుకోవడానికి అవకాశం కల్పించారు. ఈసారి మాత్రం సాధారణ ఎంసెట్ పరీక్ష ద్వారానే సీట్లను భర్తీ చేస్తారు. -
ప్రశాంతంగా ఎంసెట్
నల్లగొండ: జిల్లాలో ఎంసెట్-2015 ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని నల్లగొండ, కోదాడ పట్టణాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు పెద్ద ఎత్తున విద్యార్థులు హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 22 సెంటర్లలో ఏర్పాటు చేసిన ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు 10,330 మంది విద్యార్థులకుగాను 9,506 మంది హాజరయ్యారు. ఇంజనీరింగ్‌లో 90 శాతం హాజరు నమోదయింది. అగ్రికల్చర్, మెడిసిన్ విభాగంలో మొత్తం 15 సెంటర్లలో 7,051 మంది విద్యార్థులకు గాను 6,501 మంది హాజరయ్యారు. ఈ విభాగంలో 92.5 శాతం హాజరు నమోదయింది. జిల్లా కేంద్రంలోని ఎన్జీ కాలేజీ, నీలగిరి డిగ్రీ, పీజీ కాలేజీ సెంటర్లలో ఎంసెట్ నిర్వహణను కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి పరిశీలించారు. ఆయన వెంట ఏజేసీ నిరంజన్, ఎంసెట్ కో - ఆర్డినేటర్ రావుల నాగేందర్‌రెడ్డి తదితరులున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించిన ఇంజనీరింగ్ పరీక్షకు జిల్లా కేంద్రంలో ఒక విద్యార్థి, కోదాడలో ఇద్దరు విద్యార్థులు నిమిషం నిబంధన కారణంగా పరీక్ష రాలేకపోయారు. సమయం ముగిసిన తర్వాత వచ్చిన ఈ ముగ్గురిని అధికారులు అనుమతించలేదు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి 144 సెక్షన్ విధించారు. మొత్తంమీద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ఎంసెట్ సజావుగా ముగిసింది. పట్టణాల వారీగా... జిల్లా కేంద్రమైన నల్లగొండలో ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ కోసం 15 సెంటర్లను ఏరా్పాటు చేశారు. ఆయా సెంటర్లలో మొత్తం 7,195 మంది విద్యార్థులు అలాట్‌కాగా 6,835 మంది హాజరయ్యారు. 356 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. అదే విధంగా కోదాడలో 7 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా 3,135 మంది విద్యార్థులకు గాను 2,671 మంది హాజరుకాగా 464 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వర కు మెడిసిన్ ఎంట్రెన్స్ కోసం నల్లగొండలో 9 పరీక్షా కేం ద్రాలు ఏర్పాటు చేయగా 4,767 మంది విద్యార్థులు అలాట్ అయ్యారు. అందులో 4,494 మంది హాజరుకాగా 273 మం ది గైర్హాజరయ్యారు. కోదాడలో 6 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా 2,284 మంది విద్యార్థులకుగాను 2,087 మంది మంది విద్యార్థులు హాజరయ్యారు. 197 మంది గైర్హాజరయ్యారు. మొత్తం 92.5 శాతం విద్యార్థులు హాజరయ్యారు. ఆ.. ముగ్గురు నల్లగొండ జిల్లా కేంద్రంలో ఓ విద్యార్థి నిమిషం నిబంధన కారణంగా ఇంజనీరింగ్ పరీక్షకు హాజరుకాలేకపోయారు. నిడమనూరు మండలం భోజ్యాతండాకు చెందిన ధనావత్ శ్రీహరి అనే విద్యార్థి ఆలస్యంగా రావడంతో అధికారులు అతడిని పరీక్షా కేంద్రంలోనికి అనుమతించలేదు. తనకు వాహనాలు సకాలంలో అందనందున రాలేకపోయానని విద్యార్థి వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసినా అధికారులు అనుమతించకపోవడంతో అతను నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. ఆ తర్వాత శ్రీహరి మీడియాతో మాట్లాడుతూ తన ఊరి నుంచి మిర్యాలగూడ వచ్చేందుకు ఆటోలు సమయానికి రాలేదని, అందుకే ఆలస్యం అయిందన్నాడు. కోదాడలోని కేఆర్ఆర్ డిగ్రీ కళాశాల సెంటర్లో నిమిషం ఆల స్యంగా రావడంతో నూతనకల్ మండలం చిల్పకుంట్లకు చెందిన కట్టా ఉపేందర్‌రెడ్డిని, మిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో మునగాల మండలం జగన్నాథపురానికి చెందిన రెడ్డిబోయిన ఉమలను అధికారులు పరీక్షకు అనుమతించలేదు. కిటకిటలాడిన రోడ్లు... ఎంసెట్ రాసేందుకు జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, సహాయకులు జిల్లాకేంద్రమైన నల్లగొండతో పాటు కోదాడకు తరలిరావడంతో రెండు పట్టణాలు కళకళలాడాయి. ఉదయం 8 గంటల నుంచే విద్యార్థులు పరీక్షా కేంద్రాల వద్దకు వచ్చి వేచి ఉన్నారు. ఉదయం నుంచే పలు గ్రామాలు, పట్టణాల నుంచి వచ్చే బస్సులు ఎంసెట్‌కు వచ్చే వారితో కిటకిటలాడాయి. పరీక్షా సమయాలకు అనుగుణంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కూడా భోజనాలు చేయాల్సి రావడంతో రెండు పట్టణాల్లోని హోటళ్లలో సందడి నెలకొంది. సరిగ్గా ఎంసెట్ జరిగే రోజుకు ఆర్టీసీకార్మికులు సమ్మె విరమించడంతో పా టు ఎంసెట్ కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. దూరంగా ఉన్న రెండు సెంటర్లతో ఇబ్బంది కోదాడ టౌన్ :కోదాడ పట్టణానికి దాదాపు 13 కిలో మీటర్ల దూరంలో ఉన్న మిట్స్ కళాశాలను, 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనురాగ్ కళాశాలలను సెంటర్‌గా ఏర్పాటు చేయడంతో విద్యార్థులు కొంత ఇబ్బంది పడ్డారు. మిట్స్ కళాశాల చిలుకూరు మండలంలో ఉండడంతో పలువురు కోదాడకు వచ్చి సెంటర్ విషయమై ఆరా తీయడం కనిపించింది. ఈ సెంటర్ చిలుకూరు మండలంలో ఉందని తెలుసుకొని ఉరుకులు,పరుగులు పెట్టారు. -
ఎంసెట్ విద్యార్ధులకు సమ్మె కష్టాలు
-
సమ్మె ప్రశాంతం
ఎంసెట్ పరీక్షతో ర్యాలీ, ధర్నాలకే పరిమితం ఆర్టీసీ కార్మికుల సమ్మెకు వైఎస్సార్సీపీ సంఘీభావం ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్లతో ఆర్టీసీపై అదనపు భారం జిల్లాలో రోడ్డెక్కిన 403 బస్సులు ఇబ్బందులుపడ్డ దూర ప్రాంత ప్రయాణికులు నెల్లూరు (రవాణా): జిల్లాలో శుక్రవారం విద్యార్థులకు ఎంసెట్ పరీక్ష ఉండటంతో ఆర్టీసీ కార్మికులు సమ్మెను ప్రశాంతంగా నిర్వహించారు. కేవలం ర్యాలీలు, ధర్నాలకే పరిమితమయ్యారు. నగర, రూరల్ ప్రాంతాల్లోని 20 సెంటర్లలో 16 వేల మంది విద్యార్థులు పరీక్షకు హజరయ్యారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకూడదన్న ఉద్దేశంతో ఆర్టీసీ యూనియన్లు సమ్మెకు సడ లింపు ఇచ్చారు. దీంతో జిల్లాలోని ఆయా డిపోల నుంచి పోలీసుల సహకారంతో 403 బస్సులు తిరిగాయి. ఆర్టీసీ అధికారులు దూరప్రాంతాలకు బస్సులను పంపకుండా కేవలం జిల్లాలోనే తిప్పారు. మొత్తం 707 బస్సులుకు గాను 294 ఆర్టీసీ, 109 అద్దె బస్సులును తిప్పినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే దూరప్రాంతాలు చెన్నై, విశాఖ, హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డా రు. ట్రావెల్స్, ప్రైవేటువాహనాలు చార్జీలను రెట్టింపు చేశారు. అధికచార్జీలను నియంత్రించడం లో అటు పోలీసు, రవాణా, అర్టీసీ అధికారులు విఫలమయ్యా రు. ఇంకెన్నాళ్లు ఈ అవస్ధలు పడాలో తెలియడం లేదని పలువురు ప్రయాణికలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్సులను ప్రైవేటు డ్రైవర్లు, కం డక్టర్లతో తిప్పడంతో ఆర్టీసీపై అదనపుభారం పడింది. ర్యాలీ, ధర్నాలకే పరిమితం 43శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించాలని సమ్మెబాట పట్టిన ఆర్టీసీ యూనియన్ల నాయకులు, కార్మికులు శుక్రవారం ర్యాలీ, ధర్నాలకే పరిమతమయ్యారు. ఆర్టీసీలోని అన్ని యూనియన్ల ఆధ్వర్యంలో బస్టాండ్ నుంచి వీఆర్సీ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం డిపోల ఎదుట ముందు ధర్నా నిర్వహించారు.ఆర్టీసీ కార్మికుల చేపట్టిన సమ్మెకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధరరెడ్డి వెళ్లి సంఘీభావం ప్రకటించారు. నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్ కూడా సంఘీభావం తెలుపుతున్నట్లు ప్రకటించారు. వీరితో పాటు సీపీఎం, సీపీఐ, సీఐటీయూ నాయకులు మద్దతు తెలిపారు. అర్టీసీపై అదనపు భారం శుక్రవారం మొత్తం 403 బస్సులు తిరిగినట్లు అధికారులు చెబుతున్నారు. అంటే మొత్తం డ్రైవర్లు 294 మంది, కండక్టర్లు 403 మందిని కొత్తగా నియమించారు. డ్రైవర్‌కు రూ. 1000లు, కండక్టర్‌కు రూ. 800లు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లెక్కన డ్రైవర్లుకు రోజుకు రూ. 2.94 లక్షలు, కండక్టర్లకు రూ. 3.22 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే మొత్తం కలిపి రూ. 6.16 లక్షలు చెల్లించాల్సి ఉంది. పీక్ సీజన్ పేరుతో పక్కన బెట్టిన కొంతమంది కాంట్రాక్టు డ్రైవర్లు, కండక్టర్లు విధులకు హాజరైనట్లు తెలిసింది. ఇబ్బందుల పడ్డ ప్రయాణికులు ఎంసెట్ పరీక్ష ఉండటంతో ఎక్కువ బస్సులను విద్యార్థులకు కేటాయించారు. దీంతో ఆయా ప్రాం తాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. సమీప ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఆటోలు, టాటాఏసీలను ఆశ్రయించారు. అయితే దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు మాత్రం వాహనాల కోసం ఎదురుచూశారు. చెన్నై, తిరుపతి, బెంగూళూరు, హైదరాబాద్‌లకు ప్రవేటు బస్సులు ఛార్జీలను రెట్టింపు చేశారు. కొంత మంది కార్లును అద్దెకు తీసుకుని వెళ్లగా మరికొంతమంది రైళ్లును ఆశ్రయించారు. ఎంసెట్‌కు 253 బస్సులు ఎంసెట్ పరీక్షకు మొత్తం 253 బస్సులన తిప్పినట్లు అధికారులు చెబుతున్నారు. 137 బస్సులను ఆర్టీసీ, 116 బస్సులను రవాణాశాఖ అందజేశారు. అయితే ఎక్కువ మంది విద్యార్థులు, తల్లిదండ్రులు అద్దె వాహనాలు తీసుకుని ఎంసెట్ పరీక్షకు హజరైనట్లు తెలిసింది. దూర ప్రాంతాల విద్యార్థులు మాత్రం ముందు రోజే నెల్లూరు నగరానికి చేరుకున్నట్లు సమాచారం. వరుసగా 3రోజులు టెట్, డీఎస్సీ పరీక్షలు ఉన్నాయి. ఈ పరీక్షల సమయంలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సడలింపు ఇస్తారా లేక మరింత ఉధృతం చేస్తారో వేచి చూడాల్సి ఉంది. ఆర్టీసి కార్మికులు మాత్రం శనివారం నుంచి సమ్మెను ఉధృతం చేయునున్నట్లు చెబుతున్నారు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా వాహనాలు- ఎన్.శివరాంప్రసాద్, రవాణా ఉపకమిషనర్ విద్యార్థులకు మూడు రోజులు వరుస పరీక్షలు ఉండటంతో ఇబ్బందులు లేకుండా వాహనాలను తిప్పుతున్నాం. ఎంసెట్‌కు రవాణాశాఖ నుంచి 116 వాహనాలను ఏర్పాటు చేశాం, మిగిలిన పరీక్షలకు కూడా వాహనాలను ఏర్పాటు చేస్తున్నాం. శుక్రవారం 115 మంది డ్రైవర్లును అర్టీసీకి పంపాం. -
ఏపీ ఎంసెట్
-
నిమిషం ఆలస్యమైందని అనుమతించ లేదు
హైదరాబాద్ : ఎంసెట్ పరీక్షకు నిమిషం ఆలస్యమైందని ఓ విద్యార్థినిని పరీక్ష రాసేందుకు అధికారులు శుక్రవారం కూకట్‌పల్లిలోని ఎంఎన్ఆర్ కాలేజీలోకి అనుమతించ లేదు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో కాలేజీకి వచ్చేందుకు ఆలస్యమైందని సదరు విద్యార్థిని తల్లిదండ్రులు కాలేజీ అధికారులకు తెలిపారు. నిమిషం దాటిపోయిందని... కావున విద్యార్థిని పరీక్ష రాసేందుకు అనుమతించమని కాలేజీ అధికారులు వెల్లడించారు. దాంతో ఆగ్రహించిన విద్యార్థిని తల్లిదండ్రులు... అధికారులతో వాగ్వివాదానికి దిగారు. అయినా అధికారులు ససేమిరా అనడంతో కాలేజీ ఎదుట విద్యార్థిని తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఎంసెట్ పరీక్ష కోసం తాను పడిన కష్టం అంతా బుడిదలో పోసిన పన్నీరుగా మారిందని విద్యార్థిని కన్నీరుమున్నీరవుతుంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఎంసెట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు నిమిషం ఆలస్యంగా వచ్చిన పర్వాలేదని ఉన్నతాధికారులు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఆ నిమిషం కూడా పూర్తి కావడంతో అధికారులు విద్యార్థిని అనుమతించలేదు. -
ఏపీ ఎంసెట్ పరీక్ష ప్రారంభం
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్టు(ఎంసెట్) శుక్రవారం ప్రారంభమైంది. రాష్ట్ర విభజన తరువాత తొలిసారిగా కాకినాడ జేఎన్టీయూ ఆధ్వర్యంలో జరుగుతున్న ఎంసెట్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇంజనీరింగ్‌కు ఈరోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మెడిసిన్/అగ్రికల్చర్ పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్ష జరగనుంది. కాగా ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో నిర్దేశించిన సమయంలోగా ఎంసెట్ పరీక్షకు హాజరవ్వడం దూరప్రాంతాల విద్యార్థులకు సమస్యగా మారటంతో ఎంసెట్ పరీక్షలో ఒక్క నిమిషం నిబంధనను సడలించారు. ఈ విషయాన్ని ఏపీ ఎంసెట్ కన్వీనర్ సాయిబాబు తెలిపారు. ఇంజనీరింగ్ పరీక్ష పత్రం కోడ్‌ను మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈరోజు ఉదయం విడుదల చేశారు. ఇక మెడిసిన్ పరీక్ష పత్రాన్ని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ కాకినాడలోని జేఎన్టీయూకేలో ఎంపిక చేస్తారు. -
నిఘా నీడలో తెలంగాణ ఎంసెట్
14న ఎంసెట్‌కు భారీ ఏర్పాట్లు హైటెక్ కాపీయింగ్ నిరోధానికి పక్కా చర్యలు పరీక్ష కేంద్రాల్లోకి వాచ్‌లను కూడా అనుమతించరు పదేపదే ఎంసెట్ రాసేవారిపై ప్రత్యేక దృష్టి ‘సాక్షి’తో ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్వీ రమణరావు సాక్షి, హైదరాబాద్: ఈ నెల 14న నిర్వహించనున్న తెలంగాణ ఎంసెట్-2015కు పెద్ద ఎత్తున నిఘా, భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్వీ రమణరావు తెలిపారు. గతంలో కంటే అత్యధికంగా దరఖాస్తులు రావడంతో పకడ్బందీగా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. హైటెక్ కాపీయింగ్‌ను నిరోధించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వాచీల్లో స్కానర్లు వస్తున్నందున ఈసారి వాటిని కూడా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించ మని స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రాల్లో గోడ గడియారాలను ఏర్పాటు చేస్తామన్నారు. సమస్యాత్మక కేంద్రాల్లో జామర్లను ఏర్పాటు చేస్తామన్నారు. పదే పదే రాసే అనుమానితులపై పోలీసు నిఘా పెట్టామన్నారు. ఎంసెట్ నిర్వహణ ఏర్పాట్లపై కన్వీనర్ రమణరావు ‘సాక్షి’తో మాట్లాడారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.. రికార్డు స్థాయిలో దరఖాస్తులు తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి నిర్వహిస్తున్న ఎంసెట్‌కు రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. గతంలో తెలంగాణ జిల్లాల నుంచి 1.80 లక్షల దరఖాస్తులు మాత్రమే రాగా, ఈసారి 2.31,956 దరఖాస్తులు వచ్చాయి. ఇంజనీరింగ్ కోసం 1,39,605 మంది దరఖాస్తు చేసుకోగా, అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ కోసం 92,351 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు 41 వేల మంది ఉండగా, ఇతర రాష్ట్రాల వారు మరో 9 వేల మంది ఉన్నారు. మెడిసిన్ రాసే వారిపై ప్రత్యేక దృష్టి పదే పదే ఎంసెట్ రాస్తున్న వారిపై, రూ. 5 వేల ఆలస్య రుసుము, రూ. 10 ఆలస్య రుసుముతో ఎంసెట్‌కు దరఖాస్తు చేస్తున్న వారిపై ప్రత్యేకంగా పోలీసుల నిఘా ఉంటుంది. ఆ వివరాలను ఇప్పటికే రెవెన్యూ, ఇంటెలిజెన్స్, పోలీసు ఉన్నతాధికారులకు అందజేశాం. గతంలో ఎంసెట్ రాసి, మంచి ర్యాంకు సాధించినా మళ్లీ ఇపుడు ఎంసెట్ రాసేందుకు దరఖాస్తు చేసిన వారి వివరాలను అందజేశాం. గతంలోనే మంచి ర్యాంకు వచ్చినా ఇపుడు మళ్లీ ఎందుకు రాస్తున్నారన్న కోణంలో పరిశీలన ఉంటుంది. 20 ఏళ్ల కిందట ఇంటర్మీడియట్ పాస్ అయిన వారు ఇపుడు ఎందుకు ఎంసెట్ దరఖాస్తు చేశారు. ఏ ఉద్దేశంతో రాస్తున్నారు? ఎవరి కోసమైనా రాస్తున్నారా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతారు. అంతేకాదు ప్రతి విద్యార్థి చేతి వేళ్ల ముద్రలు పూర్తిగా తీసుకుంటాం. ముఖ్యంగా ఈసారి మెడిసిన్ పరీక్షకు హాజరయ్యే వారిపై ప్రత్యేక దృష్టి సారించాం. -
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ..
నేడు ఏపీ ఎంసెట్ ఉదయం ఇంజనీరింగ్, మధ్యాహ్నం మెడిసిన్ పరీక్ష అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్న అధికారులు హైదరాబాద్ కేంద్రాల్లోనూ ఏర్పాట్లు ఆర్టీసీ సమ్మెతోనే ఇబ్బందులు హైదరాబాద్, కాకినాడ, విశాఖపట్నం: రాష్ట్ర విభజన తరువాత తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్టు(ఎంసెట్) శుక్రవారం జరగనుంది. కాకినాడ జేఎన్టీయూ ఆధ్వర్యంలో జరుగుతున్న ఎంసెట్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో నిర్దేశించిన సమయంలోగా ఎంసెట్ పరీక్షకు హాజరవ్వడం దూరప్రాంతాల విద్యార్థులకు సమస్యగా మారింది. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపడుతున్నట్టు ప్రకటించినా.. అవి అరకొరగానే ఉండడంతో విద్యార్థులకు అవస్థలు తప్పేలా లేవు. ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్నప్పటికీ ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఎంసెట్-2015 సెట్కోడ్ను రాష్ర్ట మంత్రులు ఎంపికచేయనున్నారు. ఇంజనీరింగ్ పరీక్ష పత్రాన్ని మానవవనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, మెడిసిన్ పరీక్ష పత్రాన్ని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ కాకినాడలోని జేఎన్టీయూకేలో ఎంపిక చే స్తారని ఎంసెట్ చైర్మన్ వీఎస్ఎస్ కుమార్, కన్వీనర్ సాయిబాబులు తెలిపారు. ఎంసెట్ వివరాలివీ... ఎంసెట్‌కు మొత్తం 2,55,429 మంది ద రఖాస్తు చేశారు. ఇంజనీరింగ్ విభాగంలో 1,70,685 మంది, అగ్రికల్చర్, మెడిసిన్ విభాగంలో 84,724 మంది, రెండు విభాగాల్లోనూ 1,260 మంది పరీక్షలకు హాజరు కానున్నారు. మొత్తం 25 రీజనల్ కేంద్రాల పరిధిలో ఇంజనీరింగ్ పరీక్ష ఉదయం 10 గంటలనుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. అగ్రికల్చర్, మెడిసిన్ పరీక్ష మధ్యాహ్నం 2.30 గంటలనుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతుంది. ఏపీలో 22 రీజనల్ కేంద్రాలు, హైదరాబాద్‌లో 3 రీజనల్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఏపీలో ఇంజనీరింగ్ విభాగానికి 312 పరీక్ష కేంద్రాలు, అగ్రికల్చర్, మెడిసిన్‌కు 141 పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశారు. తెలంగాణలో ఇంజనీరింగ్ విభాగానికి 16 పరీక్ష కేంద్రాలు, అగ్రికల్చర్, మెడిసిన్‌కు 22 పరీక్ష కేంద్రాలు నెలకొల్పారు. తెలంగాణలో ఏపీ ఎంసెట్‌కు 22,758 మంది అభ్యర్థులు హాజరవుతున్నారు. ఎంసెట్ ప్రిలిమినరీ కీని 10వ తేదీన విడుదల చేయనున్నారు. దీనిపై అభ్యంతరాలను 15 వరకు స్వీకరిస్తారు. ఫైనల్ కీతోపాటు ర్యాంకుల్ని మే 26న ప్రకటిస్తారు. ప్రత్యేక బందోబస్తు :అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్, ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చే పట్టారు. పరీక్ష కేంద్రాల్లో హైటెక్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా జామర్లు ఏర్పాటుచేశారు. ముందుగా చేరుకోండి... ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఎంసెట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. ఆయన గురువారం హైదరాబాద్‌లో, ఆ తరువాత విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడారు. ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల బస్సులను విద్యార్థుల రవాణాకు తీసుకున్నామని తెలిపారు. గ్రామాల నుంచి పరీక్ష కేంద్రాల వరకు ఈ బస్సులను నడుపుతున్నట్టు వివరించారు. అయితే ఈ ఏర్పాట్లు సరిపోకపోవచ్చని, విద్యార్థుల తల్లిదండ్రులే తగిన ఏర్పాట్లు చేసుకుని పిల్లలను సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరేలా చూసుకోవాలని సలహా ఇచ్చారు. ఇదిలా ఉండగా డీఎస్సీ పరీక్ష యధాతథంగా జరుగుతుందని, పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తిచేసినట్టు మంత్రి చెప్పారు. ప్రత్యేక ఏర్పాట్లు: ఆర్టీసీ ఎండీ ఎంసెట్ పరీక్ష జరుగుతున్నందున ప్రతి మండలం నుంచి విద్యార్థులను తీసుకొచ్చేలా అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చినట్లు ఆర్టీసీ ఎండీ సాంబశివరావు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాలైన పాడేరు నుంచి జీపులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆర్టీసీలో అద్దె బస్సులన్నింటినీ ఎంసెట్ పరీక్ష కేంద్రాలకు విద్యార్థులను చేరవేసేందుకే ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ వినతితో కొన్ని ప్రైవేటు కళాశాలలూ బస్సుల్ని ఉచితంగా తిప్పేందుకు ముందుకొస్తున్నాయన్నారు. అవసరమైతే పోలీసు వాహనాలు కూడా వినియోగిస్తారని తెలిపారు. కన్వీనర్ సూచనలివీ.. పరీక్ష రోజున ఇన్విజిలేటర్ సమక్షంలో హాల్‌టికెట్‌పై సంతకం చేయాలి హాల్‌టికెట్‌లో తప్పులు దొర్లితే పరీక్ష రోజున ఇచ్చే నామినల్ రోల్లో ఇన్విజిలేటర్ సమక్షంలో సరిదిద్దుకోవచ్చు. పరీక్షా కేంద్రానికి 2 గంటలముందే చేరుకోవాలి. హాలులోకి గంట ముందు అనుమతిస్తారు. ఒక నిమిషం ఆలస్యమైనా హాలులోకి అనుమతించరు. కేవలం హాల్‌టికెట్, ఆన్లైన్ దరఖాస్తు, సంబంధిత ధ్రువీకరణ పత్రాలు, రెండు పెన్నులను మాత్రమే తీసుకువెళ్లాలి. ఓఎంఆర్ షీట్‌ను నీలం లేదా నలుపు పెన్నుతోనే పూరించాలి. వాటిలో ఏదో ఒక రంగు పెన్నునే మొత్తం పరీక్షకు వాడాలి. ఓఎంఆర్ షీట్‌పై అభ్యర్థి ఫొటో, పేరు, చిరునామా, తల్లిదండ్రుల పేర్లు, టెస్ట్ సెంటర్‌కోడ్, పేరు, లోకల్ ఏరియా, కేటగిరీ, క్వశ్చన్ పేపర్ బుక్లెట్పైనున్న కోడ్‌ను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. ఏదైనా సమస్య ఉంటే ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకువెళ్ళాలి. ఓఎంఆర్ షీట్‌పై ఏ కోడ్ ఉంటే అదే కోడ్ గల క్వశ్చన్పేపర్ వచ్చిందో లేదో చూసుకోవాలి. -
ఎంసెట్కోసం ప్రభుత్వ ప్రత్యామ్నాయం ఏమిటి?
-
'ఎంసెట్ కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి'
హైదరాబాద్: ఇంటర్ విద్యార్థలు ఎంసెట్ పరీక్ష దృష్ట్యా ఆర్టీసీ కార్మికులు సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశించారు. ఎంసెట్ నిర్వహణపై ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎంసెట్ కన్వీనర్‌తో మంత్రి గంటా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆర్టీసీ సమ్మె గురించి మాట్లాడుతూ.. విద్యార్థులు, నిరుద్యోగుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎంసెట్ పరీక్షకు బస్సులు లేకుంటే విద్యార్థులు చాలా ఇబ్బందులు పడతారని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. ఈ సమయంలో డీఎస్సీ అభ్యర్థులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారని గంటా శ్రీనివాసరావు అన్నారు. -
మే 14న తెలంగాణలో ఎంసెట్ పరీక్ష.. 24న ఫలితాలు
హైదరాబాద్: తెలంగాణలో మే 14న ఎంసెట్ పరీక్షను నిర్వహించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ రమణారావు పేర్కొన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 18న ఎంసెట్ కీ, 24న ఎంసెట్ ఫలితాలు విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు. అయితే ఎంసెట్ పరీక్షల నిర్వహణలో భాగంగా ఇంజినీరింగ్ పరీక్షకు 251 సెంటర్లు, మెడికల్ అండ్ అగ్రికల్చరల్ 172 సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. హైదరాబాద్‌ను 8 జోన్లుగా విభజించి విద్యార్థులను సమీప ప్రాంతంలోనే ఎంసెట్ పరీక్ష సెంటర్లు ఏర్పాట్లు చేస్తున్నామని రమణారావు తెలిపారు. -
ఇరు రాష్ట్రాల్లోనూ ఎంసెట్ రాయాలి
విజయవాడ: తెలంగాణ, ఏపీ ఇరు రాష్ట్రాల్లోనూ వేర్వేరుగా ఎంసెట్ నిర్వహించనుండడంతో 15 శాతం అన్‌రిజర్వుడ్ సీట్ల కోసం విద్యార్థులు 2 ప్రవేశ పరీక్షలు రాయాల్సి ఉంటుందని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ టి.రవిరాజు తెలిపారు. గతంలో తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ రీజియన్లలోని మెడికల్ కళాశాలల్లో 85 శాతం సీట్లను ఆయా లోకల్ విద్యార్థులకు, మిగిలిన 15 శాతం సీట్లను మెరిట్ ఆధారంగా ఇతర రీజియన్లకు కేటాయించేవారు. అవిభాజ్య రాష్ట్రంలో ఒకే ఎంసెట్ ఉండేది. ఇప్పుడు రెండు రాష్ట్రాలూ వేర్వేరు ఎంసెట్లు నిర్వహిస్తుండడంతో అన్‌రిజర్వుడ్ మెరిట్ సీట్ల కోసం సొంత రాష్ట్రం నిర్వహించే ఎంసెట్‌తో పాటు తెలంగాణ విద్యార్థులు ఏపీ ఎంసెట్, ఏపీ విద్యార్థులు తెలంగాణ ఎంసెట్ రాయాల్సి ఉంటుందన్నారు. గతంలో మాదిరిగానే లోకల్, అన్‌రిజర్వుడ్ సీట్ల కేటాయింపు జరుగుతుందన్నారు. సాంకేతికంగా పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చని వీసీ అభిప్రాయపడ్డారు. ప్రెసిడెన్షియల్ రూల్ ప్రకారం ఇప్పటికీ సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాల స్టేట్‌వైడ్ కళాశాలగానే ఉన్న దృష్ట్యా 64 శాతం సీట్లు ఏపీకి, 36 శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకు చెందనున్నాయి. మెడికల్ ఎంట్రన్స్‌కు సర్వం సిద్ధం 2015-16 విద్యా సంవత్సరానికి పీజీ వైద్య కోర్సుల్లో అడ్మిషన్లకు మార్చి 1న నిర్వహించే కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లూ చేసినట్టు వీసీ రవిరాజు తెలిపారు. తెలంగాణ, ఏపీలకు సంయుక్తంగా ఒకే ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. సుమారు 14 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్టు తెలిపారు. ఈ నెల 26 నుంచి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.డీఆర్‌ఎన్‌టీఆర్‌యూహెచ్‌ఎస్.ఓఆర్జీ వెబ్సైట్ ద్వారా అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. -
మే 14న ఎంసెట్
-
మే 14న ఎంసెట్
షెడ్యూల్ విడుదలచేసిన కమిటీ ఈసారి ఆన్లైన్లో ఓఎంఆర్ జవాబు పత్రాలు ఓపెన్ కోటాలో ఏపీ విద్యార్థులు పరీక్ష రాయొచ్చు ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి వెల్లడి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ‘ఎంసెట్’ పరీక్షలకు షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 25న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. 28వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది. మే 14వ తేదీన పరీక్షను నిర్వహించి.. అదే నెల 28వ తేదీన తుది ఫలితాలను వెల్లడిస్తారు. అంతేగాకుండా విద్యార్థుల వెసులుబాటు కోసం ఈసారి ఓఎంఆర్ జవాబు పత్రాలను ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ జేఎన్టీయూలో జరిగిన ఎంసెట్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ పరీక్షలను బ్లాక్/బ్లూ బాల్ పాయింట్ పెన్‌తోనే రాయాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సంఖ్యను బట్టి ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో, నల్లగొండ జిల్లా కోదాడ, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో కొత్తగా ఎంసెట్ రీజనల్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. మొత్తంగా తెలంగాణలోని 12 ప్రాంతాల్లో ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 8 జోన్లను ఏర్పాటు చేసి, వాటి పరిధిలో 56 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పాత పద్ధతిలోనే ప్రవేశాలు.. మెడికల్, ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలన్నీ పాత పద్ధతిలోనే జరుగుతాయని ఈ సందర్భంగా ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి వెల్లడించారు. రాజ్యాంగంలోని 371 (డి) ప్రకారం 15 శాతం ఓపెన్ కోటాలో సీట్ల కోసం ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కూడా ఈ పరీక్షలకు హాజరుకావచ్చని... రెండు రాష్ట్రాల విద్యార్థుల మెరిట్ ఆధారంగా ఓపెన్ కోటాలో ప్రవేశాలు ఉంటాయని ఆయన వివరించారు. ఏపీ ప్రభుత్వం కోరితే ఆ రాష్ట్రంలోనూ పరీక్ష కేంద్రాల ఏర్పాటును పరిశీలిస్తామని చెప్పారు. అవసరమైతే నార్మలైజేషన్.. ఎప్పటిలాగే ఈ సారి కూడా ఎంసెట్ తుది ర్యాంకు ఖరారులో విద్యార్థుల ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉంటుందని హైదరాబాద్ జేఎన్టీయూ వైస్ చాన్సలర్ శైలజా రామయ్యార్ వెల్లడించారు. ప్రస్తుతం రెండు వేర్వేరు బోర్డుల ద్వారా విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాస్తున్న నేపథ్యంలో తమ విద్యార్థులకు ఎక్కువ సీట్లు వచ్చేలా ఎక్కువ మార్కులు వేసుకుంటే ఎలాగని విలేకరులు ప్రశ్నించగా... 85 శాతం స్థానిక కోటా ప్రవేశాల్లో ఆ ఇబ్బంది ఉండదని, మిగతా 15 శాతం ఓపెన్‌కోటా సీట్లకు ఆ ఇబ్బంది రావచ్చని శైలజా రామయ్యార్ చెప్పారు. అయితే తుది ర్యాంకుల ఖరారు నాటికి రెండు రాష్ట్రాల బోర్డులు ఇచ్చే ఇంటర్ మార్కుల్లో అసాధారణ తేడాలున్నట్లు తేలితే... జేఈఈలో తరహాలో నార్మలైజేషన్ పద్ధతిలో ర్యాంకుల ఖరారు చేపడతామని పేర్కొన్నారు. 2.5 లక్షల మందికి పైనే.. ఈ సారి ఎంసెట్‌కు 2.5 లక్షల మందికిపైగా విద్యార్థులు హాజరవుతారని ఎంసెట్ వర్గాలు అంచనా వేశాయి. తెలంగాణ నుంచి గత ఏడాది 1,80,825 మంది (1,26,071 ఇంజనీరింగ్‌లో, మెడికల్‌లో 54,754 మంది) విద్యార్థులు ఎంసెట్‌కు హాజరయ్యారు. ఈసారి కూడా రాష్ట్రం నుంచి దాదాపు అదే సంఖ్యలో విద్యార్థులు ఉండనుండగా... ఏపీ నుంచి మరో 70 వేల మంది విద్యార్థులు ఎంసెట్‌కు హాజరయ్యే అవకాశం ఉందని, మొత్తంగా 2.50 లక్షల మంది ఈసారి ఎంసెట్‌కు హాజరవుతారని అధికారుల అంచనా. పరీక్ష సిలబస్‌కు సంబంధించిన వివరాలను జ్ట్టిఞ://ఠీఠీఠీ.్టట్ఛ్చఝఛ్ఛ్టి.జీ వెబ్సైట్లో ఈ నెల 25 తరువాత అందుబాటులో ఉంచనున్నారు. ఫీజు చెల్లింపు విధానం ఈ నెల 28వ తేదీ నుంచి విద్యార్థులు ఫీజు చెల్లించి ఎంసెట్‌కు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. గత ఏడాదిలాగే ఈ సారి కూడా ఒక్కో పరీక్షకు రూ. 250 ఫీజును నిర్ణయించినట్లు తెలిసింది. ఇంజనీరింగ్, మెడికల్ రెండింటికి కలిపి రూ. 500గా నిర్ణయించారు. ఫీజును విద్యార్థులు తెలంగాణ స్టేట్ ఆన్లైన్, ఏపీ ఆన్లైన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈసేవ, మీసేవ కేంద్రాల ద్వారా చెల్లించవచ్చు. అలాగే ఐసీఐసీఐ, యాక్సిస్, కోటక్ మహీంద్రా బ్యాంకులు, బిల్‌డెస్క్ ద్వారా ఆన్‌లైన్‌లోనూ చెల్లించవచ్చు. ఇదీ షెడ్యూల్.. ఫిబ్రవరి 25న ఎంసెట్ నోటిఫికేషన్ 28 నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ .. చివరి తేదీ ఏప్రిల్ 9 అదే నెల 15 నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తుల్లో సవరణకు అవకాశం ఆలస్య రుసుము రూ.500తో ఏప్రిల్ 15 వరకు.. రూ.1,000 రుసుముతో ఏప్రిల్ 22 వరకు దరఖాస్తులకు అవకాశం మే 8-12 వరకు హాల్‌టికెట్ల డౌన్లోడ్ మే 14న పరీక్ష (ఉదయం 10 నుంచి ఒంటిగంట వరకు ఇంజనీరింగ్) మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు అగ్రికల్చర్, మెడిసిన్ పరీక్ష ప్రాథమిక కీ విడుదల 16వ తేదీన.. 23వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ మే 28న తుది ర్యాంకుల ప్రకటన ఎంసెట్ హైలైట్స్.. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత జరిగే తొలి ఎంసెట్ పరీక్ష రాయనున్న మొత్తం విద్యార్థులు.. దాదాపు 2.5 లక్షలు ఇందులో రాష్ట్రానికి చెందినవారు... లక్షా 80 వేలు ఏపీ నుంచి పరీక్ష రాసే విద్యార్థుల అంచనా.. 70 వేలు మొత్తం సీట్లలో తెలంగాణవారికి.. 85 శాతం ఓపెన్ మెరిట్ కోటా కింద ఇరు రాష్ట్రాల వారికి కలిపి.. 15 శాతం ప్రాంతీయ కేంద్రాలు, సమన్వయం చేసే కాలేజీలు.. కేంద్రం క ళాశాల ఆదిలాబాద్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, శాంతినగర్ జనగాం ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, గీతానగర్ కరీంనగర్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కాలేజీ ఫర్ విమెన్స్, మంకమ్మతోట ఖమ్మం యూనివర్సిటీ పీజీ కాలేజీ, కాకతీయ యూనివర్సిటీ మహబూబ్‌నగర్ ప్రభుత్వ పాలిటెక్నిక్, మహబూబ్‌నగర్ మెదక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ ఫర్ విమెన్స్, నర్సుఖేడా రోడ్డు నల్లగొండ నాగార్జున ప్రభుత్వ కాలేజీ నిజామాబాద్ గిరిరాజ్ ప్రభుత్వ కాలేజీ, దుబ్బరోడ్ సిద్దిపేట ప్రభుత్వ పాలిటెక్నిక్ వికారాబాద్ ఎస్ఏపీ కాలేజీ వనపర్తి కేడీఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ వరంగల్ కేయూ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్, టెక్నాలజీ. -
తెలంగాణకు ప్రత్యేక రాజ్యాంగం ఉందా ?
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తనదైన శైలిలో విమర్శించారు. కేసీఆర్ తెలంగాణ సీఎంలా కాకుండా ఉద్యమ నేతగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ భారత్‌లో అంతర్భాగం కాదా...? తెలంగాణకు ప్రత్యేక రాజ్యాంగం ఉందా అంటూ టీఆర్ఎస్ ప్రభుత్వానికి గంటా ప్రశ్నల వర్షం కురిపించారు. ఎంసెట్ అంశంపై సోమవారం కేబినెట్లో చర్చిస్తామన్నారు. అలాగే అవసరమైతే తెలంగాణ విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరితో చర్చిస్తామన్నారు. ఏపీ ఉన్నత విద్యామండలి ఖాతాలను ఫ్రీజ్ చేయడాన్ని ఖండిస్తున్నట్లు గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. ఎస్‌బీహెచ్‌పై పరువు నష్టం దావా వేస్తామని చెప్పారు. -
ఇదేం సెట్ ..!
ఎంసెట్‌పై పంతానికి పోతున్న తెలుగు రాష్ట్రాలు విద్యార్థుల ఆందోళనను పట్టించుకోని ప్రభుత్వాలు సమస్య పరిష్కారం పట్ల కనిపించని చిత్తశుద్ధి ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తున్న విద్యా మంత్రులు గవర్నర్ సూచనలపైనా స్పందన కరువు ఇరు ప్రభుత్వాల తీరును తప్పుబడుతున్న విద్యావేత్తలు సాక్షి, హైదరాబాద్: రెండు రాష్ట్రాల మధ్య ఎంసెట్ వివాదం ముదురుతోంది. సమస్య పరిష్కారానికి కలసి రావాలంటూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యా శాఖ మంత్రులు ప్రకటనలు చేస్తున్నారే తప్ప పక్కా పరిష్కార మార్గాలపై దృష్టి సారించడం లేదు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారమే నడచుకుంటున్నామని ఎవరికి వారు చెబుతున్నారేగానీ విద్యార్థుల ఆందోళనను పట్టించుకోవడం లేదు. ఇరు ప్రభుత్వాల్లోని ఏ స్థాయిలోనూ రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఎంసెట్, ఇతర ఉమ్మడి ప్రవేశ పరీక్షలను నిర్వహించేందుకు చర్యలు చేపట్టడం లేదు. ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా పరీక్షల షెడ్యూళ్లు ప్రకటిస్తుండగా... తెలంగాణ సర్కారు కూడా సొంతంగా పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ జేఎన్టీయూ నేతృత్వంలో ఎంసెట్ నిర్వహణకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పైగా రెండు రాష్ట్రాల్లోనూ తామే నిర్వహిస్తామని పేర్కొంది. చొరవ చూపని ఇరు ప్రభుత్వాలు ఉమ్మడిగా ఎంసెట్ నిర్వహణపై ఇరు రాష్ట్రాల విద్యా శాఖ మంత్రులు తలోమాట మాట్లాడుతున్నారు. ఉమ్మడి ఎంసెట్‌కు తెలంగాణ మంత్రి ఒప్పుకొన్నారని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. మరోవైపు ఎవరు నిర్వహించాలన్నదాన్ని విద్యా శాఖ కార్యదర్శుల స్థాయిలో తేల్చితే.. ఆ తర్వాత సంయుక్త ప్రకటన చేద్దామని ఏపీ మంత్రికి ప్రతిపాదించినట్లు తెలంగాణ మంత్రి జగదీశ్‌రెడ్డి చెబుతున్నారు. ఇక ఇరు రాష్ట్రాల ఉన్నత విద్యా మండళ్లు కూడా అలాగే వ్యవహరిస్తున్నాయి. ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి ఏక పక్షంగా ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను ప్రకటించారు. తామే కాంపిటెంట్ అథారిటీ అని కూడా ప్రకటించేసుకున్నారు. దీంతో తమ ఎంసెట్‌ను తామే నిర్వహించుకుంటామని, జనవరి 5లోగా తెలంగాణ ఎంసెట్‌కు షెడ్యూలు ఇస్తామని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి ప్రకటించారు. నిజానికి ఏపీ మండలే కాంపిటెంట్ అథారిటీ అయితే ముందుగా తమతో చర్చించి ఒప్పందం చేసుకోవాలని అంటున్నారు. ఏకపక్షంగా షెడ్యూల్ ఎలా ప్రకటిస్తారని ప్రశ్నిస్తున్నారు. విభజన చట్టంలోని నిబంధనలపై ఇరు రాష్ట్రాలు న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నాయి. మరోవైపు విద్యార్థుల ఇబ్బందుల పట్ల చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వాల తీరు ఇలా ఉండదని విద్యావేత్తల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో స్పష్టమైన విధానం కోసం మంత్రులు, అధికారులు ఎందుకు చొరవ ప్రదర్శించడం లేద ని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. కాగా, చెరో ఏడాది పరీక్ష నిర్వహించాలన్న గవర్నర్ సూచనపై ఇరు రాష్ట్రాలు ఎంతమేరకు స్పందిస్తాయన్న సందేహాలు నెలకొన్నాయి. అనవసర రచ్చ చేస్తున్నారు: చుక్కా రామయ్య, విద్యావేత్త రెండు రాష్ట్రాలు కలిసి మాట్లాడుకోవాలి. అనవసర రాద్ధాంతం వద్దు. హైదరాబాద్ జేఎన్టీయూకు రెండు రాష్ట్రాలు కలిసి బాధ్యత అప్పగిస్తే సరిపోతుంది. లేదంటే ఐదుగురితో కూడిన నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి రెండు రాష్ట్రాలకు ఎంసెట్ పరీక్షను నిర్వహించాలి. రెండు ప్రభుత్వాలు, గవర్నర్ ఈ దిశగా చర్యలు చేపడితే బాగుంటుంది. రచ్చ చేయడం మంచిది కాదు. ఎంసెట్‌పై వివాదాలు వద్దు: పి.మధుసూదన్‌రెడ్డి, జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు ఎంసెట్‌పై వివాదాలకు ఆస్కారం ఇవ్వద్దు. ప్రస్తుత పరిస్థితులతో రెండు రాష్ట్రాల విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. విభజన చట్టంలోని సెక్షన్ 75 ప్రకారం ఇరు ప్రభుత్వాలు ఓ అంగీకరానికి రావాలి. ఒప్పందం చేసుకోవాలి. కానీ ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. గతంలో ఇంజనీరింగ్ ప్రవేశాల సందర్భంగా రెండు రాష్ట్రాల మధ్య ఏర్పడిన వివాదంతో వేల మంది విద్యార్థులు నష్టపోయారు. ఈ అనుభవాలను దృష్టిలో ఉంచుకొని, రాజ్యాంగంలో 371(డి) అధికరణం మేరకు ఉన్న కోటా, రిజర్వేషన్ల విధానాన్ని విభజన చట్టంలోని సెక్షన్ 95 ప్రకారం పదేళ్లపాటు కొనసాగించాలి. రెండు రాష్ట్రాల మధ్య ఇచ్చుపుచ్చుకునే ధోరణి లేనందున వేర్వేరుగానే ఎంసెట్ నిర్వహించాలి. 15 శాతం ఓపెన్ కోటాలో అందరికీ సీట్లు కేటాయించాలి. విద్యార్థులకు నష్టం లేకుండా సమన్వయంతో వెళ్లాలి వేర్వేరుగా ఎంసెట్ వద్దు: ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు ఎంసెట్‌ను వేర్వేరుగా నిర్వహిస్తే ఇరు రాష్ట్రాల విద్యార్థులకూ నష్టం కలుగుతుంది. ముఖ్యంగా ఏపీ విద్యార్థులకు మరింత నష్టం తప్పదు. ఏపీలో ఉన్నత విద్యావకాశాలు మెరుగుపడే వరకు ఉమ్మడిగానే ఎంసెట్ నిర్వహించాలి. ఎవరు ఎంసెట్‌ను నిర్వహించాలన్న దానిపై ప్రభుత్వాల మధ్య పట్టుదలలు ఉండరాదు. ఉమ్మడి ఎంసెట్ నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు వస్తే ఏపీ ప్రభుత్వం ఎలాంటి భేషజాలకు పోకుండా అంగీకరించడమే మంచిది. చెరొక ఏడాది నిర్విహ ంచాలి. విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణ దిశగా ప్రభుత్వాలు పనిచేయాలి. ఉమ్మడి కమిటీని వేయాలి: ఎమ్మెల్సీ విఠాపు బాలసుబ్రహ్మణ్యం విద్యార్ధుల సంక్షేమం దృష్ట్యా ఉమ్మడి ఎంసెట్ కొన్నేళ్లు కొనసాగాలి. కేంద్ర ప్రభుత్వం, గవర్నర్ ఈ విషయంలో జోక్యంచేసుకోవాలి. విద్యార్థుల భవిష్యత్తుపట్ల ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేకపోవడం వల్లనే ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. చెరొక ఏడాది ఎంసెట్ నిర్వహించాలన్న ప్రతిపాదనా సరికాదు. ఇదేదో పంచాయతీ తీర్పులా ఉంది తప్ప మరోటి కాదు. ఎలాంటి గందరగోళం లేకుండా ఉండాలంటే ప్రవేశ పరీక్షల నిర్వహణకు ఉమ్మడిగా ఒక కమిటీని ఏర్పాటుచేయడం మంచిది. పదేళ్ల పాటు పరీక్షల నిర్వహణ బాధ్యతను ఈ కమిటీకే అప్పగించాలి. ఇరు ప్రాంతాలకు ఆమోదయోగ్యుడైన వ్యక్తిని చైర్మన్‌గా నియమించాలి. అనవసర రచ్చ చేస్తున్నారు : చుక్కా రామయ్య రెండు రాష్ట్రాలు కలసి మాట్లాడుకోవాలి. అనవసర రాద్ధాంతం వద్దు. హైదరాబాద్ జేఎన్టీయూకు రెండు రాష్ట్రాలు కలసి బాధ్యత అప్పగిస్తే సరిపోతుంది. లేదంటే ఐదుగురితో కూడిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి రెండు రాష్ట్రాలకు ఎంసెట్ పరీక్షను నిర్వహించాలి. రెండు ప్రభుత్వాలు, గవర్నర్ ఈ దిశగా చర్యలు చేపడితే బాగుంటుంది. రచ్చచేయడం మంచిది కాదు. -
పార్టీలోకి వస్తామని చాలా మంది అడుగుతున్నారు
విశాఖపట్నం: ఎంసెట్ పరీక్ష ఇరు రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణపై చర్చిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం విశాఖలో స్పష్టం చేశారు. ఈ అంశంపై త్వరలో స్పష్టత వస్తుందని వెల్లడించారు. తెలుగుదేశం పార్టీలోకి వస్తామని చాలా మంది అడుగుతున్నారని తెలిపారు. గచ్చిబౌలి తరహాలో విశాఖపట్నం నగరంలో కూడా క్రీడా ప్రాంగణాన్ని నిర్మిస్తామని చెప్పారు. త్వరలో నూతన క్రీడా విధానాన్ని తమ ప్రభుత్వం ప్రకటిస్తుందని గంటా శ్రీనివాసరావు తెలిపారు. -
ఉమ్మడిగానే ఎంసెట్: నరసింహన్
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ భేటీ ముగిసింది. శుక్రవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు రాష్ట్రాల శాంతిభద్రతలు..అధికారుల విభజన..తదితర అంశాలపై చర్చ జరిగిట్లు తెలిపారు.ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఎలాంటి సమస్యలు లేవని, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బాగా పని చేస్తున్నారన్నారు. రెండు రాష్ట్రాల్లోనూ శాంతిభద్రతలు కట్టుదిట్టంగా ఉన్నట్లు గవర్నర్ చెప్పారు. అధికారుల విభజన త్వరలోనే పూర్తి చేస్తామని ఆయన అన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలు వేర్వేరుగా నిర్వహించుకోవచ్చని అయితే ఎంసెట్ మాత్రం ఉమ్మడిగా ఉంటుందని చెప్పారు. విద్యార్ధుల ఉమ్మడి ప్రయోజనాలను కాపాడతామని నరసింహన్ అన్నారు. రొటీన్లో భాగంగానే మోదీని కలిసినట్లు గవర్నర్ పేర్కొన్నారు. -
‘‘నాన్న.. లే నాన్నా.. వెళ్దాం.. నాన్న’’
...అంటూ గుండెలవిసేలా విలపిస్తున్న ఈ అబ్బాయి పేరు ఉదయ్‌కుమార్. రోడ్డుపై నిర్జీవంగా పడి ఉన్నది ఆయన తండ్రి రాఘవేందర్. గురువారం ఉదయ్‌ని ఎంసెట్ పరీక్షకు తీసుకువెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురై అక్కడికక్కడే మరణించాడు. నల్లగొండకు సమీపంలో ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఒక్క నిమిషం ఆలస్యమైనా కొడుకును పరీక్షకు అనుమతించరన్న ఆదుర్దాతో వెళ్తూ రాఘవేందర్ మృత్యుఒడికి చేరాడు. తండ్రి మరణం గుండెల్ని పిండేస్తున్నా.. ఆయన ఆశయాన్ని నెరవేర్చేందుకు ఉదయ్ పరీక్షకు హాజరయ్యాడు. ‘నిమిషం’ తో నరకం ! సాక్షి, హైదరాబాద్: ప్రశ్నలు లీక్ అవుతాయన్న అనుమానం.. దాన్ని అరికట్టలేని చేతగానితనం.. అధికారుల అత్యుత్సాహం... వెర సి లక్షల మంది విద్యార్థులకు నరక యాతన! నిమిషం ఆలస్యమైనా ఎంసెట్ పరీక్షకు అనుమతించబోమన్న నిబంధన విద్యార్థులను తీవ్ర మాన సిక ఒత్తిడికి గురిచేస్తోంది. కొంద రు విద్యార్థుల జీవితాల్లో చీకట్లు నింపుతోంది. ఏళ్ల తరబడి చదువుకొని, రేయింబవళ్లు నెలల కొద్దీ కష్టపడ్డా ఒక్క ‘నిమిషం’ వారి ఆశలను చిదిమేస్తోంది. ఆలస్యం కారణంగా పరీక్ష రాయలేని విద్యార్థులను కుమిలి కుమిలి ఏడ్చేలా చేస్తోంది. ‘నిమిషం’ భయం పిల్లలకే కాదు.. తల్లిదండ్రులకూ వణుకు పుట్టిస్తోంది. పిల్లలను పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లే క్రమంలో ప్రమాదాల బారిన పడేస్తోంది. నల్లగొండ జిల్లాలో మహాత్మాగాంధీ యూనివర్సిటీ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదం ఈ కోవలోనే జరిగింది. కొడుకును ఎంసెట్ (ఇంజనీరింగ్) పరీక్షకు తీసుకెళ్తున్న తండ్రి మరణించడంతో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. తండ్రి పోయారన్న ఆవేదనతోనే, దుఃఖాన్ని దిగమింగుకొని ఆ విద్యార్థి పరీక్ష రాయాల్సి వచ్చింది. జాతీయ స్థాయి పరీక్షల్లోనూ సడలింపు.. అసలు రాష్ట్రం నిర్వహించే ఎంసెట్, ఐసెట్ తదితర అన్ని ప్రవేశ పరీక్షల్లో ఇలాంటి నిబంధన అవసరమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ)... దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ లాంటి పరీక్షలను కూడా ఆన్లైన్/ఆఫ్‌లైన్‌లో నిర్వహిస్తోంది. అంతేకాదు గేట్ వంటి పరీక్షల్లోనూ ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేయడం లేదు. పరీక్ష ప్రారంభమైన పావుగంట వరకు కూడా అనుమతిస్తున్నారు. పక్కరాష్ట్రం తమిళనాడులో అయితే పరీక్ష ప్రారంభమైన అరగంట వరకు విద్యార్థులను పరీక్ష హాల్లోకి అనుమతిస్తున్నారని విద్యా నిపుణులు చెబుతున్నారు. ఇక సివిల్స్, గ్రూపు-1 వంటి వివిధ కీలక పరీక్షల్లో నిర్ణీత సమయంలో పరీక్ష హాల్లో ఉండాలన్న నిబంధన ఉన్నా కాస్త వెసులుబాటు కల్పిస్తున్నారు. పావుగంట వరకూ కూడా అభ్యర్థులను అనుమతిస్తున్నారు. అలాంటిది ఈ ప్రవేశ పరీక్షలో ఎందుకు? చిన్నారులను తీవ్ర ఒత్తిడికి గురిచేసే ఈ నిబంధనతో అధికారులు సాధించేదేంటి? అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. శాస్త్రీయత లేని నిబంధన.. విద్యార్థులను, తల్లిదండ్రులను మానసిక ఒత్తిడికి గురి చేసి ఇబ్బందుల పాలుచేసే ఈ నిమిషం నిబంధనకు అసలు శాస్త్రీయతే లేదు. కేవలం బయట ఉన్న విద్యార్థులకు లోపల ఉన్న విద్యార్థుల నుంచి సమాచారం వెళ్తుందన్న అనుమానంతో లక్షల మందిని క్షోభకు గురిచేస్తున్నారు. పరీక్షకు ఆలస్యంగా వె ళ్తే నష్టం తనకేనన్న విషయం విద్యార్థికి తెలుసు. సాధ్యమైనంత వరకు ముందుగా రావడానికే ప్రయత్నిస్తారు. కానీ అనుకోని పరిస్థితుల్లో కొద్ది నిమిషాలు పరీక్షకు ఆలస్యంగా వెళ్తే జీవితాన్ని నష్టపోవాలా అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఈ నిబంధనను తొలగిండచడంతోపాటు ఆన్లైన్లో పరీక్ష వంటి ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నా.. అధికారులు అటువైపు చూడడం లేదు. పైగా ఇంటర్మీడియట్, పదో తరగతి వంటి పబ్లిక్ పరీక్షల్లోనూ ఈ అడ్డగోలు నిబంధనను అమలు చేసే ఆలోచనలు చేస్తుండటం దారుణం. నిజానికి ఎంసెట్ వంటి ప్రవేశ పరీక్షకు ఇలాంటి నిబంధనల అవసరమే లేదని ఉన్నత విద్యాశాఖకు చెందిన ఓ అధికారి వ్యాఖ్యానించారు. శుక్రవారం జరగనున్న ఐసెట్‌కు సైతం ఈ నిమిషం నిబంధనను అమలు చేయనున్నారు. ఒక్కో గడియారంలో ఒక్కో సమయం గడియారంలో సమయమే ఒక్కొక్కరికి మధ్య ఐదు నిమిషాల వరకూ తేడా ఉంటుంది. విద్యార్థుల చేతుల్లో గడియారం ఒక సమయం చూపిస్తే.. పరీక్ష హాల్లో ఉండే గడియారంలో సమయానికి తేడా ఉంటుంది. ఇన్విజిలేటర్ చేతికి ఉండే గడియారంలో మరో సమయం చూపిస్తుంది. పర్యవేక్షణ అధికారి చేతి గడియారంలో కూడా ఒకట్రెండు నిమిషాలు తేడా ఉండొచ్చు. గేటు వద్ద ఉండే వాచ్మెన్ గడియారంలో సమయం మరోలా ఉండొచ్చు. అలాంటపుడు నిమిషం నిబంధన కు ప్రామాణికతే లేదు. అందుకే ఇలాంటి నిబంధనను తొలగించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రాణం తీసిన నిబంధన ఒక్క నిమిషం.. ఓ నిండు జీవితాన్ని బలి తీసుకుంది! కొడుకు నుంచి తండ్రిని దూరం చేసింది. ఆ కుటుంబానికి అంతులేని శోకాన్ని మిగిల్చింది. ఒక్క నిమిషం ఆలస్యమైనా ఎంసెట్ పరీక్షకు తన కొడుకును అనుమతించరన్న ఆదుర్దాతో బయల్దేరిన ఓ తండ్రి రోడ్డు ప్రమాదానికి గురై అక్కడికక్కడే మరణించారు. గురువారం నల్లగొండలో ఈ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. భువనగిరిలోని బాహార్‌పేటకు చెందిన రాఘవేందర్(48) తన కొడుకు ఉదయ్‌కుమార్‌ను ఎంసెట్ పరీక్షకు తీసుకువెళ్లేందుకు మోటార్ సైకిల్‌పై బయలుదేరాడు. మరో 10 నిమిషాల్లో నల్లగొండకు చేరుకోబోతుండగా.. మహత్మాగాంధీ యూనివర్సిటీ సమీపంలో వారి వెనుక వేగంగా వస్తున్న లారీ బైక్‌ను ఢీకొంది. ైబె క్‌పై నుంచి తండ్రీకొడుకులు చెరోవైపు పడిపోయారు. రాఘవేందర్‌పై నుంచిలారీ దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మరణించాడు. తండ్రి అచేతనంగా రోడ్డుపై పడిపోవడంతో ఉదయ్‌కుమార్ కన్నీరుమున్నీరుగా విల పించాడు. ‘లే డాడీ...వెళ్దాం..’ అంటూ చేయి పట్టి లాగడం చూసేవారిని కంటతడి పెట్టించింది. ఈలో పు అంబులెన్స్ రావడంతో ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే మరణించాడని వైద్యులు తెలిపారు. తండ్రి మరణం గుండెల్ని పిండేస్తున్నా.. ఉదయ్ పరీక్షకు హాజరయ్యాడు. తెలిసినవారు వెంట రాగా ఎన్జీ కాలేజీ సెంటర్‌కు చేరుకొని పరీక్ష రాశాడు. తనను ఇంజనీర్‌గా చూడాలనుకున్న తండ్రి ఆశయాన్ని నెరవేర్చుతానంటూ ఉదయ్ కన్నీళ్లతో చెప్పాడు. గేట్లు మూసేసే పరిస్థితి ఉండదు జేఈఈ మెయిన్ వంటి జాతీయ స్థాయి పరీక్షల్లో పావుగంట, ఇరవై నిమిషాల వరకు పరీక్షా హాల్లోకి అనుమతిస్తారు. అంతేకాదు సివిల్స్, గ్రూప్స్ వంటి పరీక్షల్లోనూ పరీక్ష సమయానికంటే ముందుగా హాల్లోకి రావాలని మాత్రమే చెబుతారు. పావుగంట వరకు పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించమని గేట్లు మూసేసే పరిస్థితి ఉండదు. రాష్ట్రస్థాయి పోటీ పరీక్షల్లోనే ఈ విపరీత ధోరణి కనిపిస్తోంది. - జేఈఈ శిక్షణా సంస్థ ప్రతినిధి కృష్ణచైతన్య, సివిల్స్ శిక్షణా సంస్థ ప్రతినిధి శ్రీకాంత్ విద్యార్థుల హక్కులను కాలరాయడమే నిమిషం నిబంధన పేరుతో విద్యార్థులను పరీక్ష రాయకుం డా చేయడం వారి హక్కులను కాలరాయడమే. ఆలస్యంగా వెళ్లే వారిలో ఎక్కువ మంది నిరుపేద విద్యార్థులే ఉంటారు. ధనవంతుల పిల్లల్లాగ వారు కార్లలో వెళ్లలేరు. బస్సులు వంటి పబ్లిక్ ట్రాన్స్‌పోర్టుపైనే ఆధారపడతారు. కాబట్టి ఒక్కోసారి ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. - మధుసూదన్‌రెడ్డి, జూనియర్ లెక్చరర్ల సంఘం ప్రధాన కార్యదర్శి దుర్మార్గపు విధానం ట్రాఫిక్ సమస్యలు, ఇంటి నుంచి బయలుదేరడం ఆలస్యం కావడంతో పరీక్షకు కొంత ఆలస్యంగా వచ్చే పరిస్థితి ఉంటుంది. అలాగని వారిని పరీక్షకే అనుమతించకపోవడం దుర్మార్గం. ఎక్కడాలేని విధానం అమలు చేస్తున్నారు. విద్యార్థులను ముందే భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. - లక్ష్మయ్య, ఎస్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి జీవితాలు నాశనం చేయడమే నిమిషం పేరుతో వందల మంది విద్యార్థుల జీవితాలను నాశనం చేయడమే. మండల కేంద్రాల్లో సెంటర్లు లేవు. ట్రావెలింగ్ సమస్యలు ఉన్నాయి. డివిజన్, జిల్లా కేంద్రాలకు వెళ్లడంలో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. - ఆవుల అశోక్, పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
ఎంసెట్ విద్యార్థులకు 'ఒక్క నిమిషం' పరీక్ష
-
అల్ ది బెస్ట్
విజయనగరం రూరల్/అర్బన్, న్యూస్‌లైన్: ఇంజినీరింగ్, మెడిసిన్, అగ్రికల్చరల్ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు గురువారం నిర్వహించనున్న ఎంసెట్-2014కు హాజరయ్యే విద్యార్థులు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని, గంటముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ఎంసెట్ జిల్లా రీజినల్ కోఆర్డినేటర్, జేఎన్టీయూ ప్రిన్సిపాల్ డాక్టర్ జి.యేసురత్నం బుధవా రం తెలిపారు. ఈ ఏడాది జిల్లాలో 5,228 మంది విద్యార్థులు ఎంసెట్ రాయనున్నారని తెలిపారు. ఇంజినీరింగ్ విభాగంలో 3,834 మంది, మెడిసిన్ విభాగంలో 1394 మంది హాజరు కానున్నారని చెప్పారు. విజయనగరం జి ల్లా కేంద్రం పరిసర ప్రాంతాల్లో ఈ పరీక్ష నిర్వహణ కోసం ఇంజినీరింగ్‌కు ఆరు, మెడిసిన్, అగ్రికల్చరల్కు రెండు కేం ద్రాలను కేటాయించారు. ఇంజినీరింగ్ పరీక్ష ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు, మెడిసిన్, అగ్రికల్చరల్ పరీక్షను మధాహ్నం 2.30 నుంచి 5.30 వరకు నిర్వహించనున్నారు. మెడిసిన్ పరీక్ష జరిగే అన్ని కేంద్రాలకు జేఎన్టీయూ ప్రత్యేక పర్యవేక్షకులను పంపించనుంది. వీరితోపాటు స్థానిక పరిశీలకులు కూడా పర్యవేక్షించనున్నారు. పరీక్ష నిర్వహించే కేంద్రాలలో అక్కడి కళాశాలల ప్రిన్సిపాళ్లు చీఫ్ సూపరింటెండెంట్లుగా వ్యవహరించనున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు ఇబ్బంది పడకుం డా ఫర్నిచర్, మంచినీటి సౌకర్యంతోపాటు ప్రథమ చికిత్స నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉచిత బస్సు సౌకర్యం విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఉదయం 8.30 గంటలకు, 8.45 గంటలకు, 9.00 గంటలకు ఉచిత బస్సు సర్వీసులు ఏర్పాటు చేశారు. అయితే పరీక్షా కేంద్రాలకు సమయానికి చేరుకోవలసిన బాధ్యత విద్యార్థులదేనని అధికారులు తెలి పారు. ఎంసెట్ పరీక్షలు జరిగే అన్ని కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్రాల పరిసరాల్లో 144వ సెక్షన్‌ను అమలు చేయనున్నారు. ఇంజినీరింగ్ విభాగం (నాలుగు కేంద్రాలు) 1. జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాల యం-01 (జేఎన్టీయూ, విజయనగరం క్యాంపస్) 2. ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాల -03 (చింతలవలస- డెంకాడ మండలం) 3. సీతం ఇంజినీరింగ్ కళాశాల-01,(గాజులరేగ- విజయనగరం) 4. ప్రావీణ్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాల -01, (మోదవలస, డెంకాడ మండలం, విశాఖ రోడ్) మెడిసిన్, అగ్రికల్చరల్ విభాగం (రెండు కేంద్రాలు) 1. జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాల యం-01 (జేఎన్టీయూ, విజయనగరం క్యాంపస్)2. సీతం ఇంజినీరింగ్ కళాశాల -01 (గాజులరేగ, విజయనగరం) విద్యార్థులు పాటించాల్సినవి... సమాధానాలు గుర్తించడంలో పెన్సిల్‌కు బదులు నీలం, నలుపు బాల్‌పాయింట్ పెన్ను మాత్రమే వినియోగించాలి. ఓఎంఆర్ షీట్‌పై విద్యార్థి వివరాలు సక్రమంగా ఉన్నదీ లేనిదీ సరిచూసుకోవాలి. పరీక్ష కేంద్రంలోనికి విద్యార్థులకు గంట ముందుగా అనుమతిస్తారు. ఇంజినీరింగ్‌కు ఉదయం 8 గంటలకు, మెడిసిన్‌కు మధ్యాహ్నం 1.30 గంటల నుంచి అనుమతిస్తారు. పరీక్షకు 30 నిమిషాల ముందు ఓఎంఆర్ షీట్‌ను అందిస్తారు. విద్యార్థులు ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్ ఫోన్లు తీసుకురాకూడదు. పరీక్ష రాయడానికి ఉపయోగించే అట్టలు కూడా పరీక్ష కేంద్రలోని అనుమతించరు. ఒత్తిడిని జయించండి.... చివరి సమయంలో నూతన అంశాల జోలికి వెళ్లకండి. పరీక్ష బాగా రాయగలననే దృఢమైన నమ్మకంతో పరీక్షకు వెళ్లండి. స్నేహితులతో చర్చించి అనవసర ఆందోళన చెందకండి. ఇతరులతో పోల్చుకుంటూ భయపడకండి. పరీక్షకు సంబంధించిన విషయాలు చర్చించకండి. తగినంత విశ్రాంతి, సమతుల ఆహారం, తాగునీరు అందించాలి. ప్రశాంతంగా ఉండాలి.. పరీక్షకు రోజున ఉదయం నుంచీ మనసును ప్రశాం తంగా ఉంచుకోవాలి. కనీసం రెండు గంటల ముందు నుంచి పరీక్షకు సంబంధించిన మెటీరియల్ చదవకూడదు. ఇతరత్రా ఆలోచనలను మనసులో ఉంచుకోకూడదు. పరీక్ష పూర్తయినంత వరకు ఇతరులతో మాట్లాడకూడదు. తాగునీటిని అందుబాటులో ఉంచుకోవాలి. రాని ప్రశ్నలను చది వి దిగులు పడకుండా వచ్చిన ప్రశ్నలకు జవాబు రాయడానికే తొలి ప్రాధాన్యమివ్వాలి. -డాక్టర్ ఎన్.వి.సూర్యనారాయణ, సైకాలజిస్ట్ -
నేడే ఎంసెట్
గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్: ఇంజినీరింగ్, మెడిసిన్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశానికి గురువారం జరుగనున్న ఉమ్మడి ప్రవేశ పరీక్ష(ఎంసెట్)కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాలో దరఖాస్తు చేసిన 25,250 మంది విద్యార్థుల కోసం 55 పరీక్ష కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. ఇంజినీరింగ్ పరీక్షకు 20,300 మంది, మెడిసిన్, అగ్రికల్చర్ పరీక్షలకు 4,950 మంది హాజరు కానున్నారు. ఉదయం 10.00 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 43 కేంద్రాల్లో ఇంజినీరింగ్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకూ 11 కేంద్రాల్లో మెడిసిన్ పరీక్షలు నిర్వహిస్తారు. విద్యార్థులను గంట ముందు నుంచే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. నిర్థిష్ట సమయానికి అరగంట ముందుగా విద్యార్థులకు ఓఎంఆర్ షీట్ అందజేస్తారు. ఉదయం 10.00, మధ్యాహ్నం 2.30 తర్వాత పరీక్ష కేంద్రాల గేట్లు మూసివేస్తామని , ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించేది లేదని అధికారులు చెప్పారు. ప్రత్యేక బస్సులు విద్యార్థులను పరీక్ష కేంద్రాలకు తరలించేందుకు ఆర్టీసీ రెగ్యులర్ సర్వీసులతోపాటు వివిధ ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన 55 బస్సులను ఏర్పాటు చేశారు. యూనివర్సల్ ఇంజినీరింగ్ కళాశాల(డోకిపర్రు), కిట్స్ కళాశాల(వింజనంపాడు), వీవీఐటీ(నంబూరు), ఆర్వీఆర్ అండ్ జేసీ ఇంజినీరింగ్ కళాశాల, కళ్ళం ఇంజినీరింగ్ కళాశాల (చోడవరం), చలపతి ఇంజినీరింగ్ కళాశాల (లాం), మిట్టపల్లి ఇంజినీరింగ్ కళాశాల (తుమ్మలపాలెం), చేబ్రోలు హనుమయ్య ఫార్మశీ కళాశాల (చోడవరం), చలపతి ఇంజినీరింగ్ కళాశాల (మోతడక)ల బస్సులు నగరంలోని ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్, మార్కెట్ సెంటర్, లాడ్జి సెంటర్ ప్రాంతాల్లో ఉదయం 7.30, 8.00 గంటలకు బయల్దేరనున్నాయి. నిరంతరం నిఘా ఇటీవల పీజీ మెడికల్ ప్రవేశపరీక్షలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకోవడంతో ఎంసెట్‌కు పటిష్టమైన నిఘా అమలు పరుస్తున్నారు. పరీక్ష కేంద్రాల్లో ప్రత్యేక నిఘా బృందాలను నియమించి అనుక్షణం విద్యార్థులను పర్యవేక్షించే ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాలకు సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తెచ్చిన విద్యార్థులపై క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని ఎంసెట్ కన్వీనర్ రమణారావు హెచ్చరించారు. ఎంసెట్ సరళిని పరిశీలించేందుకు హైదరాబాద్-జేఎన్టీయూ నుంచి ఇరువురు ప్రత్యేక పరిశీలకులు జిల్లాకు వచ్చారు. ఏర్పాట్లు పూర్తి.. ఏఎన్‌యూ : ఎంసెట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఆన్లైన్ అప్లికేషన్ ఫారం కాపీని తప్పకుండా వెంటతెచ్చుకోవాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు కుల ధృవీకరణ పత్రాల అటెస్టెడ్ జిరాక్సు కాపీలను వెంట తెచ్చుకోవాలి. పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని ఎంసెట్ రిజినల్ కో-ఆర్డినేటర్ ఆచార్య ఈ. శ్రీనివాసరెడ్డి తెలిపారు. జిల్లా కలెక్టర్ రెవెన్యూ అధికారులతో ఫైయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారని చెప్పారు. -
ముందు రుణమాఫీ చేయి బాబు...
-
ముందు రుణమాఫీ చేయి బాబు...
ఎన్నిలక నేపథ్యంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన వాగ్దానాలకు కట్టుబడి ఉండాలని ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారానికి ముందే రైతుల రుణ మాఫీ ప్రక్రియను పూర్తి చేసి... ఆ తర్వాతే కొత్త రుణాలు రైతులకు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను కొరినట్లు రఘువీరారెడ్డి వెల్లడించారు. రఘువీరారెడ్డి అధ్యక్షతను ఆ ప్రాంత కాంగ్రెస్ నాయకులు బుధవారం రాజభవన్లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను కలిశారు. అనంతరం రఘువీరారెడ్డి విలేకర్లతో మాట్లాడారు. ఎన్నికల అనంతరం తమ రుణాలు మాఫీ అవుతాయనే ఉద్దేశ్యంతో సీమాంధ్ర రైతులు తమ పేర్లను రెన్యువల్ చేసుకోలేదని... దీంతో బ్యాంకులు రైతులకు తాజాగా రుణాలు ఇవ్వడం లేదన్నారు. రుణమాఫీపై చంద్రబాబు స్పష్టత ఇవ్వకపోవడం వల్లే రైతుల్లో ఆందోళన నెలకొందని ఆయన ఆరోపించారు. బ్యాంకర్లతో మాట్లాడి రైతు రుణాల సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరినట్లు చెప్పారు. ఎంసెట్‌లో ప్రైవేట్ సంస్థల జోక్యాన్ని నిరోధించాలని కూడా విజ్ఞప్తి చేసినట్లు రఘువీరారెడ్డి వెల్లడించారు. -
తుది అడుగులు పడాలిలా
రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఇంటర్మీడియెట్ విద్యార్థులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఎంసెట్ పరీక్షకు కౌంట్‌డౌన్ మొదలైంది.. మరో వారంలో (మే 22) ఎంసెట్ పరీక్షను నిర్వహించనున్నారు.. ఈ నేపథ్యంలో చివరి దశ సన్నాహాలు ఏ విధంగా ఉండాలి.. ఏయే అంశాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.. తదితర అంశాలపై సబ్జెక్ట్‌ల వారీగా నిపుణుల సూచనలు.. మ్యాథమెటిక్స్ ఎంసెట్‌లో ప్రశ్నలన్నీ ఇంటర్మీడియెట్ సిలబస్‌లోని ప్రాథమిక భావనల (బేసిక్ కాన్సెప్ట్స్) ఆధారంగా ఉంటాయి.మ్యాథమెటిక్స్ విద్యార్థులు ప్రాక్టీస్, కచ్చితత్వం, సమయపాలనకు ప్రాధాన్యతనివ్వాలి. చివరి వారంలో మ్యాట్రిక్స్, డిటర్మినెంట్స్, మ్యాథమెటిక్ ఇండక్షన్, 3-డీ జ్యామెట్రీ, ఇంటిగ్రల్ కాలిక్యులస్, క్వాడ్రేటిక్ ఈక్వేషన్స్, కాంప్లెక్స్ నంబర్స్, వెక్టర్ ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్, పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్, బైనామిల్ థీరమ్, డిఫరెన్షియల్ కాలిక్యులస్, సర్కిల్స్ అంశాలపై ఎక్కువగా దృష్టి సారించాలి. కాంప్లెక్స్ నంబర్స్ చాప్టర్లో మాడ్యుల్స్, అంప్లిట్యూడ్, క్యూబ్ రూట్ ఆఫ్ యునిటీ, ఫోర్త్ రూట్ ఆఫ్ యూనిటీ సంబంధిత ప్రాబ్లమ్స్ చాలా ముఖ్యమైనవి. గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే.. సులభమైన ప్రశ్నలు 75 శాతం వరకు ఉంటున్నాయి. వీటిల్లో 80 శాతం ప్రశ్నలకు కచ్చితత్వంతో సమాధానాలు ఇస్తే మెరుగైన స్కోర్ సాధించవచ్చు. అన్ని కాన్సెప్ట్స్, ఫార్ములా, డెఫినేషన్స్, కీ టర్మ్స్పై పట్టు సాధించాలి. పరీక్షలో ఎన్ని ప్రశ్నలు సాధిం చాం కంటే.. కచ్చితత్వంతో ఎన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చామన్నదే ముఖ్యం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.ప్రశ్నలను చదువుతూ ప్రిపరేషన్ సాగించడం కంటే ప్రాక్టీస్‌కు ప్రాధాన్యత ఇవ్వడం ప్రయోజనకరం. చివరి వారంలో గత ప్రశ్నపత్రాలను విధిగా ప్రాక్టీస్ చేయాలి. గ్రాండ్ టెస్ట్‌లకు హాజరుకావాలి.ఎంసెట్‌ను చివరి గ్రాండ్‌టెస్ట్ మాదిరిగానే భావించాలి. తద్వారా ఎటువంటి ఒత్తిడి లేకుండా పరీక్షకు హాజరు కావచ్చు. -ఎంఎన్ రావు, చైతన్య విద్యా సంస్థలు ఫిజిక్స్ ప్రతి అంశంలోని ఫార్ములాలు, ముఖ్యమైన పాయింట్లను సాధ్యమైనన్ని సార్లు పునశ్చరణ చేసుకోవాలి. అకడమిక్ పుస్తకాల్లోని మెకానిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయి డ్స్, థర్మోడైనమిక్స్, ఫిజికల్ ఆప్టిక్స్, న్యూక్లి, కమ్యూనికేషన్స్ తదితర అంశాల్లోని థియరీ ప్రశ్నలపై దృష్టి సారించాలి. క్లిష్టంగా భావించే అంశాలను ప్రాథమిక భావనలాధారంగా నేర్చుకోవడానికి ప్రాధాన్యతనివ్వాలి. గత ఐదేళ్ల ఎంసెట్ ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయాలి. గ్రాండ్ టెస్ట్‌లకు హాజరు కావాలి. న్యూమరికల్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ముఖ్యమైన అంశాలను అండర్లైన్ చేసుకోవాలి. థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, అటమ్స్, న్యూక్లి, థర్మోడైనమిక్స్, కైనటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ వంటి అంశాలపై పట్టు సాధించాలి. ఈ అంశాలు కెమిస్ట్రీ ప్రిపరేషన్లో కూడా ఉపయోగపడతాయి. {పతి అంశానికి సంబంధించిన యూనిట్స్, డెమైన్షన్స్పై పూర్తి అవగాహన సాధించాలి. పరీక్షలో ఫిజిక్స్‌కు కనీసం గంట 15 నిమిషాల సమయం కేటాయించడం ప్రయోజనకరం. పరీక్షలో ఇచ్చే 40ప్రశ్నల్లో 25ప్రశ్నలు సులువుగా, 10 ప్రశ్నలు మధ్యస్తంగా, 5 ప్రశ్నలు క్లిష్టంగా ఉంటాయి. కాబట్టి మొదటి 35ప్రశ్నలపై దృష్టి సారించడం మంచిది.-పి.కె.ఎస్.రావు, శ్రీ గాయత్రి విద్యా సంస్థలు కెమిస్ట్రీ ఆర్గానిక్ కెమిస్ట్రీ పునశ్చరణకు కేటాయించాలి. ఇందులో ఆల్ నేమ్డ్ రియాక్షన్స్- మెకానిజమ్ (రిగెంట్స్తో కలిపి), ఇంటర్కన్జర్వేషన్స్, ఆల్కహాల్స్-ఫినోల్స్-కార్బాక్సిలిక్ యాసిడ్స్ ్కఓ్చ విలువలు, ఎమైన్స్ ్కఓఛ విలువలపై దృష్టి సారించాలి.ఫిజికల్ కెమిస్ట్రీలో ప్రాబ్లమెటిక్ పార్ట్‌కు సంబంధించిన అన్ని ఫార్ములాలపై పట్టు సాధించాలి.ఇనార్గానిక్ కెమిస్ట్రీలో గ్రూప్స్ ప్రాక్టీస్‌లో ట్రెండ్స్ ఇన్ ప్రాపర్టీస్ ఆఫ్ హైడ్రైడ్స్, ఆక్సైడ్స్, ఆల్డిహైడ్స్, ఆక్సీహైడ్స్ (ప్రతి గ్రూపులోని)కు ప్రాధాన్యతనివ్వాలి. బయో మాలిక్యూల్స్, పాలిమర్స్‌కు ఒక రోజు, కెమిస్ట్రీ ఎవ్రీ డే ఇన్ లైఫ్ అంశానికి ఒక రోజు కేటాయించాలి. చివరి రెండు రోజుల్లో ప్రతి చాప్టర్‌కు సంబంధించిన ముఖ్య భావనలను పునశ్చరణ చేసుకోవాలి. గత ఎంసెట్ ప్రశ్నపత్రాలను విధిగా ప్రాక్టీస్ చేయాలి. గ్రాండ్ టెస్ట్‌లకు హాజరు కావాలి. నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి అన్ని ప్రశ్నలను ప్రయత్నించడం ఉత్తమం. -జి.పి. రావు, నారాయణ విద్యా సంస్థలు బోటనీ ప్రభావవంతమైన పునశ్చరణ కోసం కొన్ని చాప్టర్లపై దృష్టి కేంద్రీకరించాలి. సిలబస్ పరంగా చూస్తే.. ఎంసెట్‌లో ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సిలబస్‌కు సమప్రాధాన్యతనిస్తారు.పునశ్చరణలో ప్రథమ సంవత్సరం చాప్టర్లపై దృష్టి సారించడం ఉపయుక్తం.ఎందుకంటే ఇందులో అడిగే ప్రశ్నలన్నీ నాలెడ్జ్ బే స్డ్గా ఉంటాయి. అంతేకాకుండా వీటిని గుర్తు పెట్టుకోవడం తేలిక. దాంతో మంచి స్కోర్ చేయవచ్చు. ప్రథమ సంవత్సరంలోని మొదటి చాప్టర్ (Biological classification), ఆరో చాప్టర్ (prokaryotic cell), ద్వితీయ సంవత్సరంలోని ఏడు, ఎనిమిది (Microbiology), 14వ చాప్టర్లను (Microbes in human life) క్లబ్ చేసి చదువుకోవాలి. ఇందులోంచి 8,9 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. తర్వాతి ప్రాధాన్యత ప్రథమ సంవత్సరం నాలుగో చాప్టర్ (Plant kingdom)కు ఇవ్వాలి. దీనికి సమయం ఎక్కువ కేటాయించాల్సి ఉంటుంది. అయినప్పటికీ ఇందులో పట్టు సాధించడం చాలా కీలకం. తర్వాత ప్రథమ సంవత్సరం 12వ చాప్టర్(Histology and Anatomy), ద్వితీయ సంవత్సరం 10వ చాప్టర్ (Molecular biology)ను ప్రిపేర్ కావాలి. వీటిలోంచి 5 నుంచి 6 ప్రశ్నలు రావచ్చు. ప్రథమ సంవత్సరంలోని ఐదు (Morpholog), ఆరు, ఏడు చాప్టర్ల (Reproduction)కు సమయం కేటాయించాలి. ఇవి సులువైనవే కాకుండా ముఖ్యమైనవి కూడా. వీటిలోంచి 5 నుంచి 6 ప్రశ్నలు రావచ్చు. Cytology, Genetics, Biotechnology అంశాలను ఒకే గ్రూప్‌గా చేసి చదువుకోవడం స్వల్ప కాలంలో ఎక్కువ మొత్తంలోనే ప్రిపేర్ కావచ్చు.ద్వితీయ సంవత్సరంలోని మొదటి యూనిట్ (్కజిడటజీౌౌజడ) నుంచి 5 నుంచి 6 ప్రశ్నలు రావచ్చు. ఇందులో Mineral nutrition చాలా ముఖ్యమైన అంశం. చివర్లో ప్రథమ సంవత్సరం 13వ చాప్టర్ (Ecology), ద్వితీయ సంవత్సరంలోని 12వ, 13వ చాప్టర్లను ప్రిపేర్ కావాలి. తద్వారా స్ఫురణకు రాని ముఖ్యమైన అంశాలను జ్ఞప్తికి తెచ్చుకోవచ్చు. -బి. రాజేంద్ర, సీనియర్ ఫ్యాకల్టీ, హైదరాబాద్. జువాలజీ జంతు శాస్త్రం ప్రథమ సంవత్సరంలో యూనిట్ల వారీగా వచ్చే ప్రశ్నలు ఇలా ఉండొచ్చు. యూనిట్-1(2), యూనిట్-2(2 లేదా 3), యూనిట్-3(2), యూనిట్-4(2),యూనిట్ -5(2), యూనిట్-6(2 లేదా 4), యూనిట్ -7(2 లేదా 4), యూనిట్ -8(2 లేదా 4). జంతు వైవిధ్యం-1, 2లలో ప్రతి సముదాయంలోని ముఖ్యమైన పదాలపై దృష్టి సారించాలి. ఉదాహరణ-తరాల ఏకాంతరత, లాసో కణాలు, రాబ్డయిట్లు, బోత్రిడియం, రెనిట్ గ్రంథులు, సిర్రస్, నేథోఖైలేరియం, రాడ్యాలా, స్ఫటిక శంఖువు, అరిస్టాటిల్ లాంతరు, సంపర్క దండాలు, కర్ణ స్థంభిక, సంయుక్త త్రికం, ద్రోణి, హలాస్థి, విష్బోన్ వంటివి. వివిధ సముదాయాలకు చెందిన డింభకాలను నేర్చుకోవాలి. వానపాము, బొద్దింక నిర్మాణ వ్యవస్థలను తులనాత్మకంగా అధ్యయనం చేయాలి. మిధ్యాపాదాలు, కశాభాలు, ద్విదావిచ్ఛితిలో జరిగే దశలు వంటి వాటిపై దృష్టి సారించాలి. జీవావరణ శాస్త్రంలోని కాంతి, ఉష్ణోగ్రత ప్రభావాలు, సరస్సు, జీవావరణ వ్యవస్థ, ఆహార గొలుసులు, జీవావరణ పిరమిడ్లు, శక్తి ప్రసరణ, షోషక వ లయాలు, జనాభా వంటి అంశాలపై దృష్టి సారించాలి. పర్యావరణ అంశాల నుంచి ఒక ప్రశ్న రావచ్చు.ద్వితీయ సంవత్సరంలో మానవ వ్యవస్థలు మొత్తం ఐదు యూనిట్లలో 10 వ్యవస్థలను ప్రస్తావించారు. వీటి నుంచి 10 నుంచి 12 ప్రశ్నలు రావచ్చు. ఇదే క్రమంలో జన్యుశాస్త్రం-3, జీవపరిణామం- 2 లేదా 3, జీవ పరిణామం- 2 లేదా3, అనువర్తిత జీవశాస్త్రం-3 ప్రశ్నలు అడగొచ్చు.మానవుని వ్యవస్థలలో వివిధ డిసార్డర్స్‌ను నేర్చుకోవాలి. వివిధ పాఠ్యాంశాలలోని పటాలను క్షుణ్నంగా పరిశీలించాలి. ఉదాహరణ-ఆక్సీ హీమోగ్లోబిన్ వియోజిత వక్రరేఖ, నాడీ ప్రచోదనం, ఈసీజీ, మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ, పెడిగ్రి చార్ట్ వంటివి. -కె.శ్రీనివాసులు, చైతన్య విద్యా సంస్థలు. జనరల్ టిప్స్ ఎంసెట్‌లో 50 నుంచి 60 శాతం ప్రశ్నలు ఇంటర్మీడియెట్‌లో అకడెమిక్స్‌పై పట్టు ఉన్న విద్యార్థులందరూ సమాధానం ఇచ్చే విధంగానే ఉంటున్నాయి. 20 నుంచి 30 శాతం ప్రశ్నలు ఓ మోస్తరు క్లిష్టతతో, మరో 20 నుంచి 30 శాతం ప్రశ్నలు అత్యంత క్లిష్టంగా ఉంటున్నాయి. ర్యాంకుల నిర్ధారణ అత్యంత క్లిష్టంగా ఉండే 20 నుంచి 30 శాతం ప్రశ్నలే కీలక పాత్ర వహిస్తాయి. కాబట్టి విద్యార్థులు ఈ దిశగా దృష్టి సారించి ప్రిపరేషన్ సాగించాలి. అన్ని సబ్జెక్ట్‌లకు సంబంధించి ముఖ్యమైన ఫార్ములాలు, కాన్సెప్ట్స్ ఆధారిత ప్రశ్నల ప్రాక్టీస్‌కు ప్రాధాన్యమివ్వాలి.ముఖ్యమైన ఫార్ములాలను, కాన్సెప్ట్‌లను నోట్స్ రూపంలో పొందుపర్చుకుంటే రివిజన్ సులభంగా పూర్తి చేసుకోవచ్చు.ప్రతి విభాగానికి సంబంధించి అభ్యర్థులు తమకు అనుకూలమైన రీతిలో షార్ట్‌కట్ మెథడ్స్‌తో సొంత నోట్స్ రూపొందించుకోవాలి.ఏ సబ్జెక్ట్ అయినా.. ప్రస్తుత సమయంలో కొత్త అంశాల జోలికి వెళ్లకూడదు. దీని వల్ల సమయం వృథా అవడంతోపాటు మానసిక ఆందోళనకు గురవుతారు.పరీక్ష తేదీకి వారం రోజుల ముందు నుంచి పూర్తిగా రివిజన్‌కే కేటాయించాలి. -
ఎంసెట్ హాల్‌టికెట్ల డౌన్లోడ్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ హాల్ టికెట్లను అభ్యర్థులు గురువారం(8వ తేదీ) నుంచి ఈ నెల 19వ తేదీ వరకు డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం కల్పించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఎంసెట్ పరీక్షను ఈ నెల 22వ తేదీన నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇదిలా ఉండగా గతేడాది మంచి ర్యాంకు వచ్చి మెడిసిన్‌లో చేరిన అభ్యర్థులు దాదాపు 2వేల మంది ఈ ఏడాది కూడా దరఖాస్తు చేసుకున్న నేప థ్యంలో వారిపై నిఘా ఉంచాలని ఎంసెట్ అధికారులు పోలీసులకు సూచించారు. -
అందని ‘తెలుగు’ మెటీరియల్
22న ఎంసెట్ తెలుగు మీడియం విద్యార్థుల ఆందోళన సాక్షి, హైదరాబాద్: ఈ నెల 22న ఎంసెట్.. అంటే ఓ నెలా రెండు నెలల ముందుగానే స్టడీ మెటీరియల్ మార్కెట్లో ఉండాలి. కానీ తెలుగు మీడియం విద్యార్థులకు ఇప్పటికీ స్టడీ మెటీరియల్ అసలే రాకపోగా, ఇంగ్లిషు మీడియం మెటీరియల్ అరకొరగానే వచ్చింది. ముద్రణకు చర్యలు చేపడుతున్నామని తెలుగు అకాడమీ చెబుతున్నా.. పరీక్ష రోజునాటికి కూడా మార్కెట్లోకి వచ్చే పరిస్థితి లేదు. తెలుగు మీడియంలో అభ్యసిస్తున్న విద్యార్థుల్లో ఎక్కు వ మంది గ్రామీణ ప్రాంతాల వారు, ప్రభుత్వ కాలేజీల్లో చదివే విద్యార్థులే ఉన్నారు. వారు ఎంసెట్‌కు సిద్ధమయ్యేందుకు ఎక్కువగా ఆధారపడేది బిట్ బ్యాంకు వంటి స్టడీ మెటీరియల్‌పైనే. ఈ విషయం అధికారులకు తెలుసు. అయినా సకాలంలో అందుబాటులోకి తేవడంలో విఫలమయ్యారు. దీంతో ఈసారి ఎంసెట్ రాయనున్న దాదాపు 2 లక్షల మంది తెలుగు మీడియం విద్యార్థులు నష్టపోయే పరిస్థితి నెలకొంది. ఎంసెట్‌కు సిద్ధం అయ్యే తెలుగు మీడియం విద్యార్థులు స్టడీ మెటీరియల్ లేక పాఠ్య పుస్తకాలపైనే ఆధార పడాల్సి వస్తోంది. ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయ్యే సరికే స్టడీ మెటీరియల్‌ను అందుబాటులోకి తీసుకురావడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మరో 2 లక్షల మంది ఇంగ్లిషు మీడియం విద్యార్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్ కూడా పూర్తిగా అందుబాటులోకి రాలేదు. ఇప్పటివరకు బోటనీ-1, కెమిస్ట్రీ-1, ఫిజిక్స్-1, మ్యాథ్స్ 1ఎ, మ్యాథ్స్ 1బీ మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. జువాలజీ-1, 2, ఫిజిక్స్-2, కెమిస్ట్రీ-2, బోటనీ-2 స్టడీ మెటీరియల్ పుస్తకాలు మార్కెట్లోకి రాలేదు. ఇక వాటిని అనువదించి తెలుగు మీడియం విద్యార్థుల కోసం ముద్రించేందుకు మరో నెల రోజులు పట్టనుంది.ఈలోగా ఎంసెట్ పరీక్షే పూర్తయిపోయే పరి స్థితి నెలకొనడంతో విద్యార్థులు బెంబేలెత్తుతున్నారు. దీనికితోడు మరే ఇతర ప్రైవేటు పబ్లిషర్లు కూడా మార్కెట్లోకి స్టడీ మెటీరియల్‌ను అందుబాటులోకి తేకపోవడం తెలుగు మీడియం విద్యార్థులకు శాపంగా పరిణమించింది. దీంతో ఈసారి ఎంసెట్‌లో ర్యాంకు సాధించడంపై ఆయా విద్యార్థులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈసారి ఎంసెట్ ఉంటుందా? నీట్ ఉంటుందా? అనే అంశంపై సుప్రీంకోర్టు తీర్పు ఫిబ్రవరిలోనే ఇచ్చిన వెంటనే ఎంసెట్‌కు మెటీరియల్ రాయించే పని చేపట్టామని, ఒకవేళ నీట్ ఉంటే దానికే మెటీరియల్ సిద్ధం చేయాల్సి ఉండటంతో కోర్టు తీర్పు కోసం ఆగాల్సి వచ్చిందని, అందుకే ఈసారి ఆలస్యం అయిందని అధికారులు చెబుతున్నారు. కారణమేదైనా విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందుబాటులో లేకపోవడంతో ఇబ్బంది తప్పడం లేదు. 8 నుంచి హాల్‌టికెట్లు ఈ నెల 22న నిర్వహించే ఎంసెట్ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను సంబంధిత విద్యార్థులు ఈ నెల 8 నుంచి పొందవచ్చని అధికార వర్గాలు పేర్కొన్నాయి. సంబంధిత రోల్ నంబర్, పేరు ఆధారంగా వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని ఎంసెట్ కన్వీనర్ రమణరావు గురువారం స్పష్టం చేశారు. 8 నుంచి 19 వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. -
కాసుల కక్కుర్తిలో నాణ్యతకు పాతర
* ఇంజనీరింగ్ ప్రవేశాల్లో ఇష్టారాజ్య విధానాలు * మొన్న ఎన్ఆర్ ఐ/ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కోటా పెంపు * ఇపుడు ఎంసెట్ లేకుండానే యాజమాన్య కోటాలో ప్రవేశాలు * ఎంసెట్‌నే ప్రశ్నార్థకం చేసే నిర్ణయం * యాజమాన్యాల ఒత్తిడికి తలొగ్గిన అధికారులు సాక్షి, హైదరాబాద్: యాజమాన్యాల ఒత్తిడికి తలొగ్గిన అధికారులు ఎంసెట్ మనుగడనే ప్రశ్నార్థకం చేసే నిర్ణయం తీసుకున్నారు. మొన్న ఎన్ఆర్ఐ/ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కోటాను 15 శాతానికి పెంచాలని నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి సిఫారసు చేసిన అధికారులు.. తాజాగా మేనేజ్మెంట్ కోటా సీట్లను జేఈఈ మెయిన్స్, ఎంసెట్ ర్యాంకులతో సంబంధం లేకుండా కేవలం ఇంటర్ మార్కుల ఆధారంగానే భర్తీ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి, ఉన్నత విద్యాశాఖ, సాంకేతిక విద్య శాఖ అధికారులు అనుకున్నదే తడవుగా ప్రభుత్వానికి సిఫారసు చేయాలని నిర్ణయించడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తతంగం వెనుక భారీ మొత్తంలో ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నాణ్యతకు పూర్తిగా తిలోదకాలు.. ఇప్పటికే రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యలో నాణ్యత లేకుండాపోయింది. టాప్ కాలేజీల్లోనే ఫలితాలు 50 శాతం నుంచి 80 శాతానికి మించడం లేదు. అయినా కొన్ని ప్రముఖ కాలేజీ యాజమాన్యాల ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గిన అధికారులు ఇంజనీరింగ్ విద్యలో నాణ్యతను మరింత పాతాళానికి తొక్కుతున్నారు. ఇంజనీరింగ్ ప్రవేశాల్లో ప్రస్తుతం ఇంటర్మీడియట్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉంది. ఇపుడు మేనేజ్మెంట్ కోటా సీట్లను పూర్తిగా ఇంటర్మీడియెట్ మెరిట్ ఆధారంగానే భర్తీ చేస్తే నాణ్యత మరింత దెబ్బతింటుందని, ఎంసెట్‌కు ప్రాధాన్యమే ఉండదన్న వాదనలు ఉన్నాయి. ప్రస్తుతం అనేక నిబంధనలు ఉన్నప్పుడే మేనేజ్మెంట్ కోటా సీట్లను బేరం పెడుతున్న ప్రముఖ కాలేజీలకు ఇక ఇంటర్మీడియెట్ మెరిట్‌తోనే యాజమాన్య కోటా సీట్ల భర్తీకి అవకాశం ఇస్తే.. సీట్లను మరింత అడ్డగోలుగా అమ్ముకుంటారనే వాదనలు వెల్లువెత్తుతున్నాయి. ఆ ఆలోచనలతోనే ముందుకొచ్చిన కొన్ని ప్రముఖ కాలేజీల యాజమాన్యాల ముడుపుల బాగోతం, ఒత్తిళ్లకు తలొగ్గిన ఉన్నత విద్య, సాంకేతిక విద్య, ఉన్నత విద్యా మండలి అధికారులు ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఉన్నత విద్యాశాఖ వర్గాల నుంచే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీలో పక్కా విధానం అనుసరించాలన్న కోర్టు ఆదేశాల పేరుతో యాజమాన్య అనుకూల విధానాలు తీసుకువస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కోటా పెంపులో మరో కుట్ర ప్రస్తుతం ఐదు శాతం ఉన్న ఎన్ఆర్ఐ/ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కోటాను 15 శాతానికి పెంచడం ద్వారా సీట్లు అమ్ముకునేందుకు యాజమాన్యాలకు మరింత అవకాశం కల్పించింది. రాష్ట్రంలోని 705 ఇంజనీరింగ్ కాలేజీల్లోనే 3,06,925 సీట్లు అందుబాటులో ఉండగా అందులో 70 శాతం సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తోంది. మరో ఐదు శాతం సీట్లను ఎన్ఆర్ఐ కోటాలో భర్తీకి, 25 శాతం మేనేజ్మెంట్ కోటాలో భర్తీ చేసేలా గతేడాది చర్యలు చేపట్టింది. ఈ మేరకు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను యాజమాన్యాలు కోర్టులో సవాలు చేశాయి. దీంతో యాజమాన్యాలతో సమావేశమైన ఉన్నత విద్యామండలి యాజమాన్యాల డిమాండ్‌కు అనుగుణంగా ఎన్ఆర్ఐ/ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కోటాను 15 శాతానికి పెంచాలని నిర్ణయించి ప్రభుత్వానికి సిఫారసు చేసింది. జూన్ 9న ఎంసెట్ ఫలితాలు సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ రాతపరీక్ష ఫలితాలు జూన్ 9న ప్రకటించనున్నారు. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు మే 16వ తేదీన జరగనున్న నేపథ్యంలో మే 17న నిర్వహించాల్సిన ఎంసెట్ రాతపరీక్షను అదే నెల 22వ తేదీకి వాయిదా వేసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఎంసెట్ కమిటీ ప్రిలిమినరీ కీ విడుదల, అభ్యంతరాల స్వీకరణ, ఫలితాల వెల్లడి తేదీలనూ మార్పు చేసిందని ఎంసెట్-2014 కన్వీనర్ రమణారావు శుక్రవారం వెల్లడించారు. తొలుత మే 19న ప్రాథమిక కీ విడుదల చేసి, 26వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించాలని, జూన్ 2న ర్యాంకులను వెల్లడించాలని నిర్ణయించారు. అయితే పరీక్ష తేదీ మారడంతో మే 24న ప్రిలిమినరీ కీని విడుదల చేయనున్నారు. ప్రాథమిక కీపై అభ్యంతరాలను మే 31 వరకు స్వీకరిస్తారు. జూన్ 9నఎంసెట్ ఫలితాలు, ర్యాంకులను వెల్లడిస్తారు. -
ఆన్లైన్లోనే ఎంసెట్ దరఖాస్తుల సవరణ
కన్వీనర్ డాక్టర్ రమణ రావు సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ పరీక్షకు సంబంధించి విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు ఎంసెట్ కమిటీ ఈ సారి పలు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. దరఖాస్తుల్లో తప్పులు దొర్లినా.. ఆన్లైన్లోనే సులభంగా వాటిని సరిదిద్దుకునే అవకాశం కల్పిస్తోంది. ఇప్పటి వరకు విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసిన సమయంలో తప్పులు దొర్లితే వాటిని సవరించుకునేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇందుకోసం ఎంసెట్ కార్యాలయానికి రావాల్సి వస్తోంది. అయితే, ఇకపై ఆ అవసరం లేదని, దరఖాస్తుల్లో తప్పులను ఆన్లైన్లోనే సరిదిద్దుకునే అవకాశం కల్పిస్తున్నామని ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ రమణరావు తెలిపారు. విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. - మే 17న నిర్వహించే ఎంసెట్ కోసం వచ్చే నెల 10 నోటిఫికేషన్ జారీ కానుంది. - 4.20 లక్షల మంది విద్యార్థులు ఈ సారి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని అంచనా. - ఈ నేపథ్యంలో నకిలీ దరఖాస్తులు, నకిలీ హాల్టికెట్లకు చెక్ పెట్టేందుకు బార్కోడ్, వాటర్ మార్క్‌ను ప్రవేశపెట్టనున్నారు. - ఆన్లైన్ దరఖాస్తుల్లో తప్పులు దొర్లితే.. నిర్ణీత తేదీల్లో ఆన్లైన్లోనే సవరించుకునేందుకు అవకాశం కల్పిస్తారు. - పరీక్ష ఏర్పాట్లపై ఫిబ్రవరి 4న జరిగే సమావేశంలో మరిన్ని అంశాలపై చర్చించనున్నారు. - ఇంటర్మీడియెట్ సిలబస్ మారినందున.. మారిన సిలబస్ ప్రకారమే ఎంసెట్ పరీక్ష ఉంటుందని కన్వీనర్ రమణరావు తెలిపారు. నోటిఫికేషన్ సందర్భంగా ప్రకటించే సిలబస్ ప్రకారం విద్యార్థులు సన్నద్ధులు కావాలని సూచించారు. -
మే 17న ఎంసెట్ పరీక్ష
హైదరాబాద్ : ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఎంసెట్-2014) ఎంసెట్ పరీక్ష మే 17న నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి వెల్లడించింది. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వేణుగోపాల్ రెడ్డి గురువారం పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఎంసెట్ జరిగిన వారం రోజుల్లోనే ఫలితాలు ప్రకటిస్తామని వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ఫిబ్రవరి 10న ఎంసెట్ నోటిఫికేషన్ వెలువడనుంది. మే 17న పరీక్ష నిర్వహించి జూన్ 2న ఫలితాలు వెల్లడి కానున్నాయి. వచ్చే ఏడాది ఆన్లైన్ విధానం ద్వారా ఎంసెట్ నిర్వహించే యోచన ఉన్నట్లు తెలిపారు. కాగా ఎన్నికల షెడ్యూల్ విడుదల అయితే పరీక్షల్లో మార్పులు ఉంటాయని పేర్కొన్నారు. ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు ఫిబ్రవరి 10న ఎంసెట్ నోటిఫికేషన్ మే 17న ఎంసెట్, 2న ఎంసెట్ ఫలితాలు మే 5న పీఈ సెట్ మే 10న ఈసెట్ మే 21 పాలిసెట్ మే 25 ఐసెట్ జూన్ 2న ఎడ్ సెట్ జూన్ 8న లాసెట్ జూన్ 25 నుంచి 29 వరకూ పీజీ ఈసెట్ -
విశ్లేషణాత్మక అధ్యయనమే విజయమంత్రం!
‘డాక్టర్’ కెరీర్‌ను అందుకొని.. ఆపై సమాజంలో సమున్నత గౌరవం పొందాలన్నది ఎందరో విద్యార్థుల ఆకాంక్ష. ఆ ఆకాంక్ష నెరవేరేందుకు ఇంటర్మీడియెట్ బైపీసీ తొలి మెట్టు. అత్యుత్తమ మార్కులతో దీన్ని విజయవంతంగా పూర్తిచేసి.. ఆపై ఎంసెట్ వంటి పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకు సాధించి వైద్యంతో పాటు మరెన్నో రంగాల్లో సుస్థిర భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇంటర్, ఎంసెట్ వృక్షశాస్త్రంలో అత్యధిక మార్కుల సాధనకు ప్రిపరేషన్ ప్రణాళిక.. బి. రాజేంద్ర, సీనియర్ ఫ్యాకల్టీ, హైదరాబాద్. ఎంసెట్ ఎంసెట్ (మెడిసిన్) రాయాలనుకునే విద్యార్థులు ప్రిపరేషన్‌కు ముందు కొన్ని అంశాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించాల్సి ఉంటుంది. సిలబస్, పరీక్ష విధానం (Exam Pattern), ప్రశ్న రకాలు, మాదిరి ప్రశ్నలు లేదా ప్రీవియస్ పరీక్షల ప్రశ్నలు, పరీక్షకు నిర్దేశించిన సమయం, పరీక్ష తేదీ, ఏ పాఠ్యపుస్తకాలను చదవాలి? ఎంత సమయం కేటాయించాలి? వెయిటేజీ విధానం ఏమైనా ఉందా? తదితరాలపై అవగాహన పెంపొందించుకోవాలి. సిలబస్: ప్రథమ, ద్వితీయ సంవత్సర ఇంటర్మీడియెట్ సిలబస్. పరీక్ష విధానం: బహుళైచ్ఛిక సమాధానాలు. నెగిటివ్ మార్కులుండవు. ప్రశ్నల రకాలు: బహుళైచ్ఛిక (Multiple Choice), బహుళ సమాధాన ప్రశ్నలు (Multiple Answers), జత పర్చడం (Match the Following), నిశ్చిత వ్యాఖ్య (Assertion & Reasoning). మాదిరి ప్రశ్నలు: ఈ ఏడాది వృక్షశాస్త్రం సిలబస్‌లో మార్పులు బాగా జరిగాయి. కాబట్టి ప్రీవియస్ పేపర్లలోని ప్రశ్నలు అంతగా ఉపయోగపడవు. అయితే వాటిద్వారా ప్రశ్నలు అడిగే విధానంపై అవగాహన పెంపొందించుకోవచ్చు. పాఠ్యపుస్తకాలు:తెలుగు అకాడమీ పుస్తకాలను చదవాలి. వెయిటేజీ: ఇంటర్మీడియెట్ మార్కులకు 25 శాతం, ఎంసెట్‌కు 75 శాతం వెయిటేజీ ఉంటుంది. ర్యాంకు నిర్ధరణకు వరుసగా బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలకు ప్రాధాన్యత ఇస్తారు. పరీక్షకు సిద్ధంకావడానికి లెక్చరర్ సహాయం తీసుకోవాలి. సీనియర్ విద్యార్థులు, ర్యాంక్ సాధించిన వారి సలహాలను పాటించాలి. ఎంసెట్ ప్రశ్నపత్రంలో 1 నుంచి 40 వరకు ప్రశ్నలు వృక్షశాస్త్రానికి సంబంధించి ఉంటాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీల కంటే ముందు జీవశాస్త్రానికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు గుర్తించడం ఉత్తమం. సిలబస్ మారిన తర్వాత తొలిసారిగా ఎంసెట్-2014 జరగబోతోంది. వృక్షశాస్త్రానికి సంబంధించి వివిధ యూనిట్ల నుంచి ఈ కింది విధంగా ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. ఇంటర్ ఫస్టియర్: యూనిట్ {పశ్నల సంఖ్య 1. జీవ ప్రపంచంలో వైవిధ్యం 3 లేదా 4 2. మొక్కల నిర్మాణాత్మక సంవిధానం, స్వరూప శాస్త్రం 6 3. మొక్కల్లో ప్రత్యుత్పత్తి 3 4. మొక్కల సిస్టమాటిక్స్ 2 లేదా 3 5. కణం- నిర్మాణం, విధులు 2 6. మొక్కల అంతర్నిర్మాణ సంవిధానం 2 7. వృక్ష ఆవరణ శాస్త్రం 2 పాఠ్యపుస్తకాల్లోని సమాచారాన్ని క్షుణ్నంగా చదివిన తర్వాత మాదిరి ప్రశ్నపత్రానికి సమాధానాలు రాయడం ద్వారా ప్రిపరేషన్ పూర్తవుతుంది. ఇంటర్మీడియెట్ రెగ్యులర్ విద్యార్థులు ఇంటర్ ఫస్టియర్ సిలబస్‌లోని యూనిట్ 1- జీవ ప్రపంచంలో వైవిధ్యం, యూనిట్ 4- మొక్కల సిస్టమాటిక్స్లను కలిపి చదివితే తేలిగ్గా ఉంటుంది. యూనిట్ 1 నుంచి 3 లేదా 4 ప్రశ్నలు వస్తాయి కాబట్టి దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఈ యూనిట్లో కొన్ని విషయాలపై పూర్తిగా వివరణ లేకపోవడం వల్ల అర్థం చేసుకోవడం కంటే గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. ఈ విషయంలో లెక్చరర్ సహాయాన్ని తీసుకుంటే తేలిగ్గా ఉంటుంది. యూనిట్ 4 విషయంలో మొక్కల కుటుంబాల గురించి అవగాహన కంటే వాటికి సంబంధించిన అంశాలను చదివి గుర్తుంచుకునేందుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. యూనిట్ 2- మొక్కల నిర్మాణాత్మక సంవిధానం, స్వరూప శాస్త్రం చాలా సులభంగా ఉండే పాఠ్యాంశం. దీన్ని చదివేందుకు తక్కువ సమయాన్ని కేటాయించి ఎక్కువ మార్కులు సాధించవచ్చు. యూనిట్ 3 (మొక్కల్లో ప్రత్యుత్పత్తి)పై అవగాహన పెంపొందించుకోవడం చాలా అవసరం. అందువల్ల ఇందులోని అంశాలను ఒకటికి రెండుసార్లు బాగా చదవాలి. సెకండియర్: యూనిట్ {పశ్నల సంఖ్య 1.వృక్ష శరీర ధర్మశాస్త్రం 6 లేదా 8 2.సూక్ష్మజీవ శాస్త్రం 2 3.జన్యుశాస్త్రం 2 4.అణుజీవ శాస్త్రం 3 5.జీవ సాంకేతిక శాస్త్రం 2 లేదా 3 6.మానవ సంక్షేమంలో మొక్కలు, సూక్ష్మ జీవులు 3 లేదా 4 ఇంటర్ సెకండియర్ వృక్షశాస్త్రం పాఠ్యాంశాలు చాలా క్లిష్టంగా ఉంటాయి. ఏ విషయంపైనా పూర్తిగా వివరణ లేకపోవడం వల్ల విద్యార్థులకు గందరగోళంగా ఉంటుంది. ఉదాహరణకు ఒక పాఠంలో కిరణజన్య సంయోగక్రియలో గ్లూకోజ్ ఏర్పడుతుంది అని ఉంటుంది. మరో పాఠం శ్వాసక్రియలో ‘కిరణజన్య సంయోగక్రియలో ఏర్పడిన సుక్రోజ్’ అని ఉంటుంది. వాస్తవానికి మొక్కల్లో గ్లూకోజ్ ఏర్పడదు. యూనిట్ 1లో ఆరు పాఠ్యాంశాలుంటాయి. ఒక్కో అంశం నుంచి ఒక్కో ప్రశ్న ఎంసెట్‌లో వచ్చేందుకు అవకాశముంది. అందువల్ల ఈ యూనిట్‌ను వీలైనన్ని ఎక్కువసార్లు చదవాలి. యూనిట్ 4లోని క్లిష్టమైన పాఠ్యాంశాలపై అవగాహన పెంపొందించుకునేందుకు లెక్చరర్ సహాయం తప్పనిసరి. ఈూఅ నిర్మాణానికి సంబంధించి సమస్యలు ఇచ్చే అవకాశముంది. అందువల్ల వీలైనన్ని సమస్యలను ప్రాక్టీస్ చేయాలి. యూనిట్ 2, యూనిట్ 4లను కలిపి చదివితే ప్రయోజనం ఉంటుంది. ఈ యూనిట్ల నుంచి ఐదారు ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. సూక్ష్మజీవుల పేర్లు, మొక్కల వంగడాల పేర్లు గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. ఎంసెట్‌కు రెండు రోజుల ముందు వీటిని రివిజన్ చేస్తే ఫలితం ఉంటుంది. లాంగ్‌టర్మ్ విద్యార్థులకు: గత సిలబస్‌తో పోలిస్తే ప్రస్తుత సిలబస్‌లో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి కాబట్టి లాంగ్‌టర్మ్ విద్యార్థులు కొంత ఎక్కువ కష్టపడక తప్పదు. గత సిలబస్‌తో పోలిస్తే మొదటి సంవత్సరం యూనిట్ 1 పూర్తిగా భిన్నమైంది. అందువల్ల దీనిపై ఎక్కువ శ్రద్ధచూపాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ పాత పుస్తకాలను చదవకూడదు. సెకండియర్ నుంచి వచ్చే ప్రశ్నలకు లాంగ్‌టర్మ్ విద్యార్థులు ఎక్కువగా యూనిట్ 4 (అణుజీవ శాస్త్రం), యూనిట్ 6 (మానవ సంక్షేమంలో మొక్కలు, సూక్ష్మజీవులు)లపై ఎక్కువ శ్రద్ధపెట్టాలి. వృక్షశాస్త్రంలో ఎక్కువగా చేసే తప్పుల్లో తెలియక తప్పుచేసినవి మూడు శాతం ఉంటే, తెలిసి కూడా తప్పుచేసినవి 10 శాతం ఉంటాయి. అందువల్ల ఈ విషయంలో జాగ్రత్త వహిస్తే ఎక్కువ మార్కులు సాధించవచ్చు. లాంగ్‌టర్మ్ విద్యార్థులు మొదటి సంవత్సరం యూనిట్ 1లోని రెండో పాఠం (జీవశాస్త్ర వర్గీకరణ), ద్వితీయ సంవత్సరం యూనిట్ 2 (సూక్ష్మజీవ శాస్త్రం), యూనిట్ 6 (మానవ సంక్షేమంలో మొక్కలు, సూక్ష్మజీవులు)లతో అనుసంధానం చేసుకుంటూ చదవాలి. ఇలా చేస్తే సమయం చాలా ఆదా అవుతుంది. ఇంటర్ పరీక్షలు ఫస్టియర్ బోటనీ: ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల్లో బోటనీలో ఎక్కువ మార్కులు సాధించాలంటే తొలుత సిలబస్‌లోని పాఠ్యాంశాలపై అవగాహన పెంపొందించుకొని తర్వాత విశ్లేషణాత్మకంగా ప్రిపరేషన్‌ను కొనసాగించాలి. తెలుగు అకాడమీ ప్రచురించిన పుస్తకాలను చదవటం చాలా ప్రధానం. ప్రశ్నపత్రానికి అనుగుణంగా పాఠ్యాంశాలపై దృష్టిసారించాలి. ప్రశ్నపత్రంపై అవగాహన: పేపర్ మొత్తం 76 మార్కులకు ఉంటుంది. 60 మార్కులకు సమాధానాలు రాయాలి. ఇందులో మూడు విభాగాలుంటాయి. సెక్షన్-ఏలో 10 అతి స్వల్ప సమాధాన ప్రశ్నలుంటాయి. అన్నింటికీ సమాధానాలు రాయాలి. సెక్షన్-బీలో 8 స్వల్ప సమాధాన ప్రశ్నలుంటాయి. వీటిలో ఆరు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. సెక్షన్ సీలో మూడు దీర్ఘ సమాధాన ప్రశ్నలుంటాయి. వీటిలో రెండింటికి సమాధానం రాయాలి. పాఠ్యాంశాలు- వెయిటేజ్: యూనిట్ 1:జీవ ప్రపంచంలో వైవిధ్యం (14 మార్కులు) యూనిట్ 2: మొక్కల నిర్మాణాత్మక సంవిధానం- స్వరూపశాస్త్రం (12 మార్కులు) యూనిట్ 3:మొక్కల్లో ప్రత్యుత్పత్తి (12 మార్కులు) యూనిట్ 4:ప్లాంట్ సిస్టమాటిక్స్ (6 మార్కులు) యూనిట్ 5:కణ నిర్మాణం, విధులు (14 మార్కులు) యూనిట్ 6:మొక్కల అంతర్నిర్మాణ సంవిధానం (12 మార్కులు) యూనిట్ 7:వృక్ష ఆవరణ శాస్త్రం (6 మార్కులు) 2, 3, 6 యూనిట్ల నుంచి దీర్ఘ సమాధాన ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. అందువల్ల వీటిపై ఎక్కువ దృష్టిపెట్టాలి. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా చిత్రపటాలను వేగంగా గీయటం నేర్చుకోవాలి. ప్రతి పాఠ్యాంశం చివర ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. సమాధానాల్లో ముఖ్యాంశాలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. మొదటి నుంచి చేతిరాతను మెరుగుపరచుకోవాలి. సెకండియర్ బోటనీ: ఇంటర్మీడియెట్ బైపీసీ రెండో సంవత్సరం విద్యార్థులు పబ్లిక్ పరీక్షల ప్రిపరేషన్‌కు సంబంధించి మొదటి సంవత్సర వార్షిక పరీక్షల అనుభవాన్ని విశ్లేషించుకోవాలి. ఆ పరీక్షల్లో ఏవైనా పొరపాట్లు చేస్తే, అలాంటివి తిరిగి చేయకుండా జాగ్రత్త పడాలి. అప్పుడే మంచి మార్కులు సాధించేందుకు అవకాశముంటుంది. మొదటి సంవత్సరంతో పోల్చితే రెండో సంవత్సరం పాఠ్యాంశాలు క్లిష్టంగా ఉంటాయి. తెలుగు అకాడమీ బోటనీ పుస్తకాల్లో కొన్ని అంశాలు సవివరంగా, స్పష్టంగా లేవు. మొక్కల శరీర ధర్మ శాస్త్రం, బయోటెక్నాలజీ పాఠ్యాంశాలు చదివితే ఈ విషయం అర్థమవుతుంది. అందువల్ల విద్యార్థులు పాఠ్యాంశాలను చదివిన తర్వాత ప్రతి పాఠం చివర ఉన్న ప్రశ్నలకు పరీక్షలకు అవసరమయ్యే విధంగా సమాధానాలు రాసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో లెక్చరర్‌ను సంప్రదించి, అతని సలహాలను పాటించడం చాలా ముఖ్యం. వెయిటేజీకి తగ్గట్టు సన్నద్ధం: యూనిట్ 1:మొక్కల శరీర ధర్మ శాస్త్రం (28 మార్కులు) యూనిట్ 2:సూక్ష్మజీవ శాస్త్రం (6 మార్కులు) యూనిట్ 3:జన్యుశాస్త్రం (6 మార్కులు) యూనిట్ 4:అణు జీవశాస్త్రం (8 మార్కులు) యూనిట్ 5:బయోటెక్నాలజీ (16 మార్కులు) యూనిట్ 6:ప్లాంట్స్, మైక్రోబ్స్, హ్యూమన్ వెల్ఫేర్ (12 మార్కులు) 1, 5, 6 యూనిట్ల నుంచి దీర్ఘ సమాధాన ప్రశ్నలు వస్తాయి. 1, 2, 3, 4, 5 యూనిట్ల నుంచి స్వల్ప సమాధాన ప్రశ్నలుంటాయి. మొక్కల శరీరధర్మ శాస్త్రం, బయోటెక్నాలజీ యూనిట్ల పాఠ్యాంశాలు క్లిష్టంగా ఉంటాయి కాబట్టి వాటిని ఒకటికి రెండుసార్లు విశ్లేషణాత్మకంగా చదవాల్సి ఉంటుంది. విద్యార్థులు 60 మార్కులకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ప్రశ్నలకు రాసే సమాధానాల్లో స్పష్టత అధికంగా ఉండాలి. ఫ్లో చార్టులు అవసరమైన చోట వాటినే చిత్రపటాలుగా భావించాలి.