Exam centers
-
జేఈఈ మెయిన్స్‌కు సర్వం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ మెయిన్స్–1 పరీక్ష ఈ నెల 24 నుంచి ప్రారంభంకానుంది. ఫిబ్రవరి 1వ తేదీ వరకూ ఈ పరీక్షను ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారు. జేఈఈ కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అన్ని ఏర్పాట్లు చేసినట్టు ప్రకటించింది. మొదటి మూడు రోజులు ఆర్కిటెక్చర్ (పేపర్–1) ఉంటుంది. ఈ పరీక్ష రాసే విద్యార్థులకు అడ్మిట్ కార్డులు ఇప్పటికే ఆన్లైన్లో ఉంచినట్టు ఎన్టీఏ తెలిపింది. జేఈఈ ఇంజనీరింగ్ విభాగానికి ఈ నెల 27 నుంచి పరీక్ష ఉంటుంది. ఈ విద్యార్థుల అడ్మిట్ కార్డులు 25 లోగా ఆన్లైన్లో ఉంచే అవకాశముంది. రెండు విభాగాలకు కలిపి దేశవ్యాప్తంగా ఈ ఏడాది 12 లక్షల మందికిపైగా విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి 2.4 లక్షల మంది పరీక్ష రాస్తారని సమాచారం. జేఈఈ మెయిన్స్‌కు అన్ని ఏర్పాట్లు చేశామని, భద్రత కల్పిస్తామని ఎన్టీఏ స్పష్టం చేసింది. మొదటి షిప్టు ఉదయం 9 నుంచి, రెండో షిప్టు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఉంటుంది. ప్రతీ సెషన్ మూడు గంటల వ్యవధితో ఉంటుంది. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షకు అనుమతించబోమని ఎన్టీఏ ప్రకటించింది. ఈసారి భద్రత వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు. ఫేషి యల్ రికగ్నిషన్ సిస్టమ్‌ను అమలు చేస్తున్నారు. 11 కేంద్రాల్లో మెయిన్స్ తెలంగాణలో 11 కేంద్రాల్లో మెయిన్స్ పరీక్షలు నిర్వ హించనున్నట్టు ఎన్టీఏ తెలిపింది. హైదరాబా ద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబా ద్, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్‌తోపాటు ఏపీలోని 30 కేంద్రాల్లో పరీక్షలు ఉన్నట్టు అధికారులు వివరించారు. పరీక్షలు తెలుగు, ఇంగ్లిష్ సహా మొత్తం 10 భాషల్లో నిర్వహిస్తారు. రెండో దశ పరీక్షలు ఏప్రిల్ లో చేపడతారు. ఈసారి పరీక్ష కోసం సిలబస్ తగ్గించారు. కోవిడ్ సమయంలో కేంద్ర విద్యా సంస్థల్లో టెన్త్ రాసినవారు ప్రస్తుతం జేఈఈ మెయిన్స్ కు హాజరవుతున్నారు. ఆ సమయంలో వీళ్లకు సిలబస్ కుదించారు. ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని 25% సిలబస్‌ను మెయిన్స్ నుంచి తొలగించారు. గణితంలో సుదీర్ఘ ప్రశ్నలను తొలగించారు. ఈ కారణంగా మెయిన్స్ రాసే వారి సంఖ్య పెరగుతోంది. నెగెటివ్ మార్కులతో జాగ్రత్త జేఈఈ మెయిన్స్‌లో నెగెటివ్ మార్కుల పట్ల జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నా రు. సమాధానం కచ్చితంగా రాస్తే 4 మార్కులు ఉంటాయి. తప్పుగా టిక్ పెడితే మైనస్–1 అవుతుంది. కాబట్టి తెలియని ప్రశ్నలకు ఊహించి రాసేకన్నా, వదిలేయడమే మంచిదని గణిత శాస్త్ర నిపుణులు ఎంఎన్ రావు తెలిపారు. కన్ఫ్యూజ్ చేసే ప్రశ్నల కోసం ముందే సమయం వృథా చేయకూడదని, వాటి గురించి ఆఖరులో ఆలోచించాలని ఆయన సూచించారు. అనవసర ప్రశ్నలకు తలబాదుకుంటూ కూర్చుంటే ఆ ప్రభావం తెలిసిన ప్రశ్నలపై పడే అవకాశం ఉంటుందని భౌతిక శాస్త్ర నిపుణుడు విక్రమ్ సింగ్ చెప్పారు. ముందుగానే జేఈఈ అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకుని, అవసరమైన పత్రాలన్నీ (సెల్ఫ్ డిక్లరేషన్, అండర్ టేకింగ్ ఫాం) దగ్గర ఉంచుకోవాలని ఎన్టీఏ సూచించింది. వాటర్ బాటిల్స్, హ్యాండ్ శానిటైజర్లు, మాసు్కలు, బాల్ పాయింట్ పెన్నులను అనుమతిస్తామని తెలిపింది. -
AP: ఎస్ఐ ఫైనల్ ఎగ్జామ్ డేట్ ఖరారు.. ఎప్పుడంటే?
సాక్షి, అమరావతి: ఏపీలో ఎస్ఐ పోస్టులకు ఫైనల్ రాత పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 14, 15 తేదీల్లో ఎస్ఐ ఫైనల్ రాత పరీక్షను నిర్వహించనున్నట్టు అధికారులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇక, ఏపీలో సివిల్, ఏపీఎస్పీ ఎస్ఐ పోస్టుల భర్తీకి రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షల కోసం రాష్ట్రంలోని విశాఖ, ఏలూరు, గుంటూరు, కర్నూల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఇది కూడా చదవండి: తిరుమల: శ్రీవారి సర్వదర్శనానికి ఏడుగంటల సమయం -
వాయిదా వేస్తే ఇప్పట్లో కష్టమే!
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–2 పరీక్షల తేదీల మార్పు కష్టంగానే కనిపిస్తోంది. ఈనెల 29, 30వ తేదీల్లో గ్రూప్–2 పరీక్షల నిర్వహణకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్విస్ కమిషన్ ఏర్పాట్లు చేసింది. దాదాపు ఐదు నెలల క్రితమే పరీక్ష తేదీని ప్రకటించింది. అయితే వరుసగా పరీక్షలు ఉన్నాయని, కాబట్టి సన్నద్ధతకు మరింత సమయం కావాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఆందోళన కార్యక్రమాలు సైతం చేపడుతున్నారు. గురువారం టీఎస్పీఎస్సీ కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన తెలిపారు. శుక్రవారం కూడా పలుచోట్ల ధర్నాలు నిర్వహించారు. పలు ప్రతిపక్ష పార్టీలు వీరికి మద్దతు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో సర్విస్ కమిషన్ తర్జనభర్జన పడుతోంది. వాయిదా వేస్తే ఎదురయ్యే పరిణామాలను అధికారులు సమీక్షిస్తున్నారు. ఇప్పుడు వాయిదా వేస్తే మళ్లీ ఎప్పుడు నిర్వహించొచ్చనే కోణంలోనూ పరిశీలన చేస్తున్నట్లు, ఒకవేళ వాయిదా గనుక వేస్తే దీర్ఘకాలం వేచి చూడాల్సి ఉంటుందనే అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. వరుస ఎన్నికల ప్రక్రియతో అధికార యంత్రాంగం బిజీగా ఉండడం, రెండున్నర నెలల వరకు ఆన్లైన్ పరీక్షా కేంద్రాలు అందుబాటులో లేకుండా బుక్ అయిపోవడంతో పరీక్షల వాయిదాపై కమిషన్ ఎటూ తేల్చుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థుల్లో గందరగోళం... గతేడాది డిసెంబర్లో గ్రూప్–2 ఉద్యోగ ప్రకటన వెలువడింది. రాష్ట్రవ్యాప్తంగా దాదా పు 5.5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షల తేదీని దాదాపు ఐదు నెలల క్రితమే టీఎస్పీఎస్సీ ప్రకటించింది. దీంతో అభ్యర్థులంతా సన్నద్ధతలో నిమగ్నమయ్యారు. పరీక్ష తేదీ చాలా ముందుగానే ప్రకటించిన నేపథ్యంలో పరీక్ష కోసం పూర్తిస్థాయిలో సిద్ధమవుతున్నారు. ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు సైతం ఉద్యోగాలకు సెలవులు పెట్టి మరీ పుస్తకాలు చేతబట్టారు. అయితే మరికొన్ని పరీక్షలు సైతం సమీప తేదీల్లోనే ఉండటంతో గ్రూప్–2 వాయిదా వేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. దీంతో కొందరు అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. పరీక్ష నిర్వహిస్తారా? లేదా? అనే సందేహం వారిని వెంటాడుతోంది. అయితే టీఎస్పీఎస్సీ ఎలాంటి స్పందన వ్యక్తం చేయకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. ఏదో ఒక స్పష్టత ఇచ్చి ఈ గందరగోళానికి తెరదింపాలని అభ్యర్థులు కోరుతున్నారు. -
ఏపీ వ్యాప్తంగా ఇవాళ గ్రూప్–1 ప్రిలిమ్స్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రూప్–1 పోస్టుల భర్తీకి నేడు (ఆదివారం) ప్రిలిమినరీ పరీక్ష (స్క్రీనింగ్ టెస్ట్) జరగనుంది. పరీక్ష కోసం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లాల్లోని 297 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం 1,26,449 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు. ఉదయం 10 గంటల నుంచి 12 వరకు పేపర్–1, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు పేపర్–2 నిర్వహిస్తారు. ఒక్కో పేపర్లో 120 చొప్పున ప్రశ్నలుంటాయి. అభ్యర్థులు హాల్ టిక్కెట్లతోపాటు నిర్దేశిత గుర్తింపు కార్డును పరీక్ష కేంద్రాల వద్ద చూపించాలి. ఉదయం 9 గంటల నుంచి 9.30 గంటల వరకు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఆ తర్వాత 15 నిమిషాల గ్రేస్ పీరియడ్ కింద 9.45 గంటల వరకు అనుమతి ఉంటుంది. అలాగే మధ్యాహ్నం 1 గంట నుంచి 1.30 వరకు పరీక్ష హాల్లోకి వెళ్లాలి. 15 నిమిషాల గ్రేస్ పీరియడ్ కింద 1.45 గంటల వరకు అనుమతిస్తారు. ఆ తర్వాత ఎవరినీ అనుమతించరు. అభ్యర్థి దరఖాస్తులో బయోడేటా వివరాలను తప్పుగా పేర్కొని ఉంటే ఇన్విజిలేటర్ వద్ద అందుబాటులో ఉన్న నామినల్ డేటాను అప్డేట్ చేసుకోవాలి. అభ్యర్థికి ఇచ్చే ఓఎమ్మార్ సమాధాన పత్రం ఒరిజినల్, డూప్లికేట్ కాపీలుగా ఉంటుంది. పరీక్ష పూర్తయ్యాక అభ్యర్థి ఒరిజినల్ కాపీని ఇన్విజిలేటర్‌కు ఇచ్చి డూప్లికేట్ కాపీని తన వద్ద ఉంచుకోవాలి. ప్రాథమిక ‘కీ’ ఆదివారం రాత్రి లేదా సోమవారం విడుదల చేస్తారు. పరీక్షలను అత్యంత పారదర్శకంగా నిర్వహించడమే తమ లక్ష్యమని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. -
జేఈఈ పరీక్ష కేంద్రాల కుదింపు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 24 నుంచి జరిగే జేఈఈ మెయిన్స్ పరీక్ష కేంద్రాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) కుదించింది. గతంలో 21 పట్టణాల్లో నిర్వహించే ఈ పరీక్షను ఈసారి 17 పట్టణాలకే పరిమితం చేసినట్టు స్పష్టం చేసింది. కరోనా నేపథ్యంలో గతంలో భౌతికదూరం పాటించాల్సి వచ్చిందని, అభ్యర్థులు గుంపులుగా ఉండకుండా ఉండేందుకు పరీక్ష కేంద్రాలను ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. ఈసారి ఆ తీవ్రత లేకపోవడంతో పరీక్ష కేంద్రాలను తగ్గించినట్టు పేర్కొన్నారు. కోవిడ్ కాలంలో నాలుగు దఫాలుగా నిర్వహించిన పరీక్షను ఈసారి రెండు దఫాలకు తగ్గించిన విషయం తెలిసిందే. పరీక్ష కేంద్రాల విషయంలో విద్యార్థుల వెసులుబాటు, పరీక్ష కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనను ప్రామాణికంగా తీసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. అయితే పరీక్ష కేంద్రాల తగ్గింపు వల్ల పలు జిల్లాల్లో విద్యార్థులు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఆదిలాబాద్‌లో పరీక్ష రాసే విద్యార్థులు నిజామాబాద్‌కుగానీ, హైదరా బాద్‌కుగానీ వెళ్లాల్సి ఉంటుంది. వికారాబాద్ అభ్యర్థులు హైదరాబాద్‌లోగానీ, సంగారెడ్డిలోగా నీ రాయాల్సి ఉంటుంది. గద్వాల విద్యార్థులు మహబూబ్‌నగర్ పరీక్ష కేంద్రంలో పరీక్ష రాసేందుకు 95 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ఆదిలాబాద్, గద్వాల, వికారాబాద్, మంచిర్యాలలో ఉన్న కేంద్రాలను ఈసారి తీసేశారు. పరీక్ష కేంద్రాలు ఇవే. జేఈఈ మెయిన్స్ పరీక్ష కేంద్రాల జాబితాను ఎన్టీఏ ప్రకటించింది. ఇందులో హయత్‌నగర్, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మేడ్చల్, మెదక్, నల్లగొండ, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్ ఉన్నాయి. -
నీట్ యూజీ సెంటర్ల జాబితా విడుదల
సాక్షి, న్యూఢిల్లీ: వైద్య విద్యలో ప్రవేశాలకు సంబంధించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (అండర్ గ్రాడ్యుయేట్) నీట్ యూజీ– 2022 కోసం అభ్యర్థులు ఏ పట్టణాల్లోని పరీక్ష కేంద్రాల్లో ఎగ్జామ్ రాస్తారనే జాబితాను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) విడుదల చేసింది. అయితే ఈసారి జాబితాను అభ్యర్థుల సౌకర్యార్థం చాలా ముందుగానే విడుదల చేయడం విశేషం. లిస్ట్‌ను ఆన్లైన్లో అందుబాటులోకి తెచ్చారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారిక వెబ్సైట్లో సెంటర్ వివరాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఇది అడ్మిట్ కార్డు కాదని, కేవలం అభ్యర్థులకు ముందస్తు సమాచారం అందించే వెసులుబాటు అని ఎన్టీఏ తమ నోటీస్‌లో పేర్కొంది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను తర్వాత డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. జూలై 17న జరిగే ఈ పరీక్షను మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు ఒకే దఫాలో నిర్వహిస్తారు. ఈ పరీక్షను ఇంగ్లీష్, హిందీ, తెలుగుతో పాటు 13 భాషల్లో నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా 546 పట్టణాల్లో నిర్వహించనున్న నీట్ యూజీ–2022 కోసం ఆంధ్రప్రదేశ్‌లో 29, తెలంగాణలో 24 నగరాలను ఎంపిక చేశారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ), సింగపూర్, కువైట్ సహా పలు దేశాల్లోని 14 నగరాల్లోనూ టెస్ట్ నిర్వహించనున్నారు. -
ఎస్ఐ స్కాం: రాత పరీక్ష కుంభకోణంలో పెరుగుతున్న లొంగుబాట్లు
బనశంకరి: ఎస్ఐ రాత పరీక్ష కుంభకోణంలో లొంగుబాట్లు పెరిగాయి. సోమవారం కలబురిగి జ్ఞానజ్యోతి స్కూల్ ప్రధానోపాధ్యాయుడు కాశీనాథ్ పోలీసుల ముందు లొంగిపోయాడు. ఈ పాఠశాల ముఖ్య నిందితురాలు దివ్య హగరగికి చెందినది. గత నెల 10 నుంచి పరారీలో ఉండగా, అరెస్టు తప్పదని తెలిసి కలబురిగిలో సీఐడీ ఆఫీసులో లొంగిపోయాడు. ఈ స్కాం సూత్రధారి రుద్రేగౌడపాటిల్, నీటిపారుదల శాఖ ఇంజనీర్ మంజునాథ మేళకుందతో కాశీనాథ్ కుమ్మక్కయినట్లు సమాచారం. ఆదివారం ఇంజనీర్ మంజునాథ లొంగిపోవడం తెలిసిందే. సమగ్ర దర్యాప్తునకు సమయం కావాలి ఈ బాగోతం రోజురోజుకు మలుపు తిరుగుతుండడంతో సమగ్ర సమాచారం రావాలంటే మరికొన్ని రోజులు పడుతుందని సీఐడీ సీనియర్ అధికారి తెలిపారు. ఎస్ఐ పరీక్ష అక్రమాలు కలబురిగి నుంచి బెంగళూరుతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో జరిగి ఉండవచ్చని, లోతుగా దర్యాప్తు చేయడానికి మరికొన్ని రోజులు సమయం పట్టే అవకాశం ఉందన్నారు. తమకు సాంకేతిక నిపుణులు అవసరమన్నారు. ఎస్ఐ నియామకాల్లో ఎంపికైన 545 మంది అభ్యర్థులను విచారణ కు పిలవగా కొందరు గైర్హాజరైయ్యారు. ఆ పరీక్షలను రాష్ట్రవ్యాప్తంగా 92 కేంద్రాల్లో జరపగా 54,104 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఆ మంత్రి పేరు చెప్పాలంటే భయం: డీకే శివాజీనగర: ఎస్ఐ కుంభకోణం లో మంత్రి హస్తం ఉందని వార్తలు వినిపిస్తున్నాయని, ఓ అభ్యర్థి కోసం మంత్రి రాజకీయ పలుకుబడిని వినియోగించినట్లు తెలిసిందని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ అన్నారు. సోమవారం నగరంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఆ మంత్రి ముఖ్యమంత్రి కానున్నారని, ఆయన పేరును బయటకు చెప్పరాదని మండ్య నుంచి ఓ నేత తో పాటు పలువురు ఒత్తిడి తీసుకువస్తున్నారని, తనకు అతడి పేరు చెప్పాలంటే భయంగా ఉందని అన్నారు. రామనగరలో మీరు మగాడా? అని మాకు ఆ మంత్రి తనకు సవాల్ విసిరాడని, దీంతో భయం వేస్తుందని పరోక్షంగా బెంగళూరుకు చెందిన ఓ మంత్రి గురించి చలోక్తులు విసిరారు. కాగా ఈ ఆరోపణలను విలేకరులు సీఎం బొమ్మై వద్ద ప్రస్తావించగా తరువాత మాట్లాడతానని చెప్పారు. మరో కాంగ్రెస్ నేత ఉగ్రప్ప మాట్లాడుతూ ఎస్ఐల స్కాంలో అరెస్ట్ అయినవారిని విడుదల చేయించేందుకు ఉన్నత విద్యా, రామనగర జిల్లా ఇన్చార్జి మంత్రి సీఎన్ అశ్వత్థనారాయణ ఒత్తడి తీసుకొస్తున్నారని ఆరోపించారు. (చదవండి: ఎంట్రన్స్ టెస్టులో అవకతవకలు.. మరిన్ని ట్విస్టులు) -
పదోతరగతి పరీక్షలు సమీపిస్తున్న... పరిశుభ్రత ప్రశ్నార్థకం
సాక్షి, హైదరాబాద్: మండుతున్న ఎండలకు తోడు కోవిడ్ ఫోర్తు వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో పరిశుభ్రత, శానిటేషన్, తాగునీటి ఏర్పాట్లు ప్రశ్నార్థకంగా మారాయి. ఈ నెల 23 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. వీటి నిర్వహణ కోసం ప్రభుత్వ పాఠశాలలను కూడా పరీక్ష కేంద్రాలుగా గుర్తించడంతో ఏర్పాట్లు సమస్యగా మారాయి. సర్కారు బడుల్లో నాలుగో తరగతి ఉద్యోగుల కొరత వెంటాడుతుంటంతో ఇప్పటి వరకు ప్రైవేటు సిబ్బందితో పనులు కొనసాగిస్తూ వచ్చారు. ప్రభుత్వ పరంగా ఎలాంటి నిధులు రానప్పటికీ టీచర్లందరు కలిసి సిబ్బంది వేతనాలను భరిస్తూ వచ్చారు. ఇక పరీక్షలు కేంద్రాల్లో సదుపాయాలను సమకూర్చేందుకు నిధుల కొరతతోపాటు ప్రైవేట్ సిబ్బంది విధులకు హాజరయ్యే విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వేసవి సెలవుల సందర్భంగా ఇప్పటివరకు పాఠశాలల్లో పనిచేసిన స్వీ పర్లు, స్కావెంజర్లు డ్యూటీకి రాకుంటే పరిస్థితి ఏమిట ని ప్రధానోపాధ్యాయుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 62 మంది సిబ్బందే.. హైదరాబాద్ జిల్లాలోని 16 మండలాల పరిధిలో 690 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలున్నా యి. ఆయా స్కూళ్లలో ప్రస్తుతం 1,06,635 మంది చదువుతుండగా, 6,200 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు నాలుగో తరగతికి చెందిన సుమారు 62 మంది పర్మనెంట్ అటెండర్లు మాత్రమే పనిచేస్తున్నారు. దీంతో ఇతర పాఠశాలల్లో ప్రైవేట్ సిబ్బందిని నియమించుకుని తరగతి గదులు, నీటి ట్యాంకులు, మరుగుదొడ్లను శుభ్రం చేయడంతోపాటు విద్యార్థులకు తాగునీటిని అందిస్తున్నారు. ప్రస్తుతం పరిస్ధితేంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. రెండేళ్ల నుంచి.. కరోనాకు ముందు పాఠశాల నిధులు (స్కూల్ గ్రాంట్) నుంచి కొంత డబ్బులు తీసి ఒక్కొక్కరికి నెలకు రూ.2500 వేతనం కింద ఇచ్చేవారు. సర్వశిక్ష అభియాన్ కింద కేటాయించే నిధులను కోవిడ్ కాలం నుంచి రద్దు కావడంతో హెచ్ఎంలు, ఉపాధ్యాయులపై భారం పడినట్లయింది. తాము పని చేస్తున్న స్కూల్లో మరుగుదొడ్లు, తాగునీటి ట్యాంకులు, తరగతి గదులను శుభ్రం చేయించేందుకు సొంతంగా డబ్బులు సమకూర్చే పరిస్థితి నెలకొంది. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న స్కూల్లో ఒక్కొక్కరు రూ.300 నుంచి 500 ఇస్తుండగా, ఎక్కువ ఉన్న చోట్ల రూ.500–1000 వరకు వేసుకొని వారికి వేతనాలుగా అందిస్తున్నారు. పరీక్షల సమయంలో ఎలా? వాస్తవంగా ప్రతి ఏటా పదో తరగతి పరీక్షలను ఏప్రిల్ రెండో వారంలోగా పూర్తవుతుంటాయి. అప్పుడు అటెండర్లు, స్వీపర్లు, స్కావెంజర్ల సమస్య ఎదురయ్యేది కాదు. ప్రస్తుతం వేసవి సెలవుల సమయంలో మే 23 నుంచి జూన్ 1 వరకు పరీక్షలు జరగనుండడంతో ఏర్పాట్లు సమస్యగా తయారైంది. వేసవి సెలవుల్లో ప్రైవేట్ స్వీపర్లు, స్కావెంజర్లు విధులకు హాజరయ్యే పరిస్థితి కనిపించడం లేదని కొందరు ప్రధానోపాధ్యాయులు పేర్కొంటున్నారు. పరీక్షలు జరుగుతున్నప్పుడు రోజువారీగా తరగతి గదులను శుభ్రం చేయడంతోపాటు తాగునీటిని అందించాల్సిన అవసరం ఉంది, ఎండాకాలం సెలవుల్లో వేతనం ఇచ్చే పరిస్థితి ఉండకపోవడంతో మెజారిటీ సిబ్బంది విధులకు హాజరుపై నిరాసక్తత వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: రంజాన్‌కు భారీ బందోబస్తు) -
Si Exam Scam: ఎంట్రన్స్ టెస్టులో అవకతవకలు.. మరిన్ని ట్విస్టులు
బనశంకరి: ఎస్ఐ పోస్టుల రాత పరీక్ష కుంభకోణంలో రోజురోజుకూ కొత్త ముఖాలు వెలుగు చూస్తున్నాయి. బెంగళూరులోనూ 7 పరీక్ష కేంద్రాల్లో కొందరు అక్రమాలకు పాల్పడి ఉత్తీర్ణులైనట్లు తెలిసింది. దీనికి సంబంధించి హైగ్రౌండ్ పోలీసులు 12 మందిని అరెస్టు చేయగా వారిలో ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉన్నట్లు సమాచారం. ఇతడు పది లోపు ర్యాంకులో ఉత్తీర్ణుడు కావడం గమనార్హం. ఓఎంఆర్ షీట్, కార్బన్ షీటులో వ్యత్యాసం బయటపడింది. మరో 10 మంది అభ్యర్థుల కోసం గాలింపు జరుగుతోంది. ఇంజనీర్ లొంగుబాటు ఈ స్కాంలో 20 రోజులుగా పరారీలో ఉన్న మరో కింగ్‌పిన్ నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ మంజునాథ మేళకుంద ఆదివారం కలబురిగి నగరంలో సీఐడీ ఆఫీసుకు ఆటోలో వచ్చి లొంగిపోయాడు. ఈ బాగోతంలో తన పాత్ర లేదని, ఆరోగ్యం సరిగా లేకపోవడంలో మంగళూరులో ఉన్నట్లు మీడియాతో చెప్పాడు. తన పేరు అనవసరంగా వెలుగులోకి వచ్చిందన్నారు. మంజునాథ తమ్ముడు రవీంద్ర, ప్రధానోపాధ్యాయుడు కాశీనాథ్, అభ్యర్థి శాంతాబాబు ఇంకా పరారీలో ఉండగా, 10 బృందాలతో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గాలిస్తున్నారు. మరికొందరి కుమ్మక్కు మరో ముఖ్య నిందితురాలు దివ్య హాగరగిని సీఐడీ అధికారులు రెండు రోజుల నుంచి ప్రశ్నించి కీలక సమాచారం రాబట్టినట్లు తెలిసింది. కింగ్‌పిన్ రుద్రేగౌడపాటిల్, మంజునాథ మేళకుందతో కలిసి బ్లూటూత్ ఉపకరణాలను ఉపయోగించి సమాధానాలు చెప్పడానికి గాను లక్షలాది రూపాయలు డీల్ కుదుర్చుకున్నట్లు విచారణలో తేలింది. దివ్య హాగరగి సహకారంతో, కలబురిగి జ్ఞానజ్యోతి పాఠశాల హెచ్ఎం కాశీనాథ్‌తో కలిసి ప్లాన్ చేశారు. రుద్రేగౌడ పాటిల్‌తో పాటు కొందరు పోలీస్ అధికారులు, కానిస్టేబుళ్లు కుమ్మక్కైనట్లు అనుమానాలున్నాయి. ఇందులో ఇద్దరు డీఎస్పీలు, ఒక సీఐ, కొందరు కానిస్టేబుల్స్ పేర్లు వినబడుతున్నాయి.ఏయే అభ్యర్థులకు సహాయం చేయాలి అనే దానిపై పోలీస్ అధికారులే రుద్రేగౌడకు సూచనలిచ్చారు. పరీక్ష పూర్తయిన తరువాత కానిస్టేబుల్స్ ద్వారా అభ్యర్థులు డబ్బులు అందజేశారు. ఎవరికి ఎంత ఇవ్వాలి అనేది రుద్రేగౌడ నిర్ణయించాడు. ఇది కూడా చదవండి: చైనాకు గట్టి వార్నింగ్ ఇచ్చిన భారత్ -
పీపీఈ కిట్లతో పరీక్షలకు
యశవంతపుర: కర్ణాటకలో వారం రోజులుగా కరోనా విజృంభిస్తోంది. మూడు రోజులుగా వెయ్యికిపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీనికితోడు పలు కళాశాలలు, హాస్టళ్లపై కరోనా పంజా విసురుతోంది. ఈ క్రమంలో బెంగళూరులోని మల్లేశ్వరం ఈడిగ సముదాయ హాస్టల్లో 15 మంది విద్యార్థులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వీరిలో ముగ్గురు బీకాం, బీబీఎం పరీక్షలు రాయాల్సి ఉంది. దీంతో సదరు విద్యార్థులకు శుక్రవారం పీపీఈ కిట్లు వేయించి అంబులెన్స్‌లో పరీక్షా కేంద్రమైన మహారాణి కళాశాలకు తీసుకెళ్లారు. విద్యార్థులు పీపీఈ కిట్లు ధరించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదిలో పరీక్షలు రాశారు. అనంతరం సదరు విద్యార్థులను ఆస్పత్రికి తరలించి ఐసోలేషన్ వార్డులో ఉంచారు. -
ఆర్ఆర్బి ఎన్టీపీసీ రెండో విడత షెడ్యూల్ విడుదల
న్యూఢిల్లీ: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల నియామకానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల కోసం రెండో విడుత షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఆర్ఆర్బి విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఆర్ఆర్బి ఎన్టీపీసీ సెకండ్ పేజ్ సీబీట-1 టెస్ట్ 2021 జనవరి 16 నుండి 2021 జనవరి 30 వరకు జరగనుంది. ఈ పరీక్షలో సుమారు 27 లక్షల మంది అభ్యర్థులు పాల్గొననున్నట్లు ప్రకటించింది. ఈ రోజు(జనవరి 6) నుండి పరీక్షా నగరం & తేదీని తెలుసుకోవడంతో పాటు ఎస్సీ/ఎస్టీ అభ్యర్థుల కోసం ఉచిత ట్రావెలింగ్ సర్టిఫికెట్‌ను అన్ని ఆర్ఆర్బి వెబ్సైట్లలో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.(చదవండి: వైరలవుతోన్న రతన్ టాటా ఫోటో) పరీక్ష తేదీకి 4 రోజుల ముందు ఆర్ఆర్బి ఎన్టీపీసీ అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని అధికారులు తెలిపారు. 2వ దశలో షెడ్యూల్ చేసిన అభ్యర్థులందరికీ వారు ఆన్లైన్ దరఖాస్తులో ఇచ్చిన ఇ-మెయిల్, మొబైల్ నంబర్లకు ఈ సమాచారాన్ని పంపనున్నట్లు పేర్కొన్నారు. మిగిలిన అభ్యర్థులకు సంబందించిన పరీక్షలను తదుపరి దశలో వెల్లడించనున్నట్లు ఆర్ఆర్బి పేర్కొంది. మిగతా సమాచారం కోసం ఆర్ఆర్బి ఎన్టీపీసీ అధికారిక వెబ్సైట్ వీక్షించండి. ఆర్ఆర్బి ఎన్టిపీసీ నోటిఫికేషన్ ద్వారా 35,208 పోస్టులను భర్తీ చేయనున్నారు. -
సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి
సాక్షి, హైదరాబాద్ : రేపు(ఆదివారం) జరగనున్న సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా ఈసారి రాష్ట్రం నుంచి 46,171 మంది సివిల్స్ పరీక్షలు రాయనున్నారు. అందుకు హైదరాబాద్‌లో 99 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. సివిల్స్ పరీక్ష రాయనున్న అభ్యర్థులను గంట ముందుగానే పరీక్షా కేంద్రంలోకి అనుమతించనున్నారు. సివిల్స్ పరీక్ష రెండు సెషన్స్ లో జరగనుంది. కాగా మొదటి సెషన్ ఉదయం 9.30 నుంచి 11.30 వరకు, తిరిగి మధ్యాహ్నం 2.30నుంచి సాయంత్రం 4. 30 వరకు రెండవ సెషన్లో పరీక్ష జరగనుంది. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు గంట ముందే చేరుకోవాలని.. అడ్మిట్ కార్డుతో పాటు ఏదైనా గుర్తింపు కార్డు కూడా తెచ్చుకోవాలని అధికారులు తెలిపారు. అభ్యర్థులంతా కోవిడ్ నిబంధనలు పాటించాలని.. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని స్పష్టం చేశారు. కాగా హైదరాబాద్‌లో జరగనున్న సివిల్స్ పరీక్షా కేంద్రాలకు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. -
రెండో రోజు గ్రామ సచివాలయ పరీక్షలు
-
సచివాలయ పరీక్షలు: నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
-
తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: కరోనా విజృంభణను అరికట్టేందుకు తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు యూజీ, పీజీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు వారు చదివే కాలేజ్‌లోనే పరీక్ష రాసే వెసులుబాటును విద్యాశాఖ కల్పించింది. అయితే ఈ వెసులుబాటు ఈ ఒక్క సంవత్సరం మాత్రమే అమలులో ఉంటుంది. ఈ నెల 15 నుంచి అన్ని యూనివర్శిటీలలో చివరి సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. (జేఈఈ: తెలంగాణ విద్యార్థులే టాప్! ) -
ఇంటికి దగ్గర్లోనే పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో ప్రజా రవాణా వ్యవస్థ పూర్తి స్థాయిలో నడవడం లేదు.. హాస్టళ్లు ఇంకా తెరువలేదు. బయట అద్దె ఇళ్లలో ఉండి పరీక్షలు రాసే అవకాశం లేదు.. విద్యార్థులు వార్షిక పరీక్షలు రాసేందుకు తమ కాలేజీలకు వచ్చే పరిస్థితి లేదు. అందుకే విద్యా ర్థులున్న చోటే పరీక్షలు రాసేలా జేఎన్టీయూ చర్యలు చేపట్టింది. ఫైనల్ ఇయర్ ఫైనల్ సెమిస్టర్ విద్యార్థులు ప్రస్తుతం ఉంటున్న చోటే వారికి పరీక్షలు నిర్వహించాలని జేఎన్టీయూ నిర్ణయించింది. బీటెక్, బీఫార్మసీ తదితర పరీక్షలకు కేంద్రాలను విద్యార్థులు ఉంటున్న దగ్గరే కేటాయించేలా ఏర్పాట్లు చేసింది. సెప్టెంబర్ 16 నుంచి నిర్వహించే పరీక్షలకు ఈ విధానం అమలు చేసేలా చర్యలు చేపట్టింది. ప్రిన్సిపాళ్లకు వివరాలు.. ఫైనల్ సెమిస్టర్ విద్యార్థులు ప్రస్తుతం తాము ఉంటున్న అడ్రస్, సమీపంలో ఉన్న రెండుమూడు కాలేజీల వివరాలను తమ కాలేజీల ప్రిన్సిపాళ్లకు అందజేస్తే వాటిల్లో ఏదో ఒక కాలేజీలో సదరు విద్యార్థులకు పరీక్ష కేంద్రం కేటాయించేలా చర్యలు చేపట్టింది. ఈ విధానంతో దాదాపు 60 వేల మంది విద్యార్థులు తమ దగ్గరలోని కాలేజీల్లోనే ఫైనల్ సెమిస్టర్ పరీక్షలకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేసినట్లు జేఎన్టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూరు హుస్సేన్ వెల్లడించారు. దీనికోసం ఈనెల 31 వరకు గడువు ఇచ్చామని తెలిపారు. విద్యార్థులు తమ సమీపంలోని కాలేజీల వివరాలను, ఇంటి అడ్రస్‌ను.. తమ కాలేజీల ప్రిన్సిపాళ్లకు ఇవ్వాలని, వారు తమకు పంపిస్తే వాటి ఆధారంగా ఆయా విద్యార్థులందరికి దగ్గరలోనే పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. జేఎన్టీయూ అమలు చేస్తున్న ఈ విధానాన్ని ఉస్మానియా, ఇతర యూనివర్సిటీలు కూడా అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నాయి. సెప్టెంబర్ 15 నుంచి నిర్వహించే సంప్రదాయ డిగ్రీ, పీజీ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలను ఈ విధానంలో నిర్వహించాలని విద్యార్థులు కోరుతున్నారు. -
సీబీఎస్ఈ పరీక్షలకు 15 వేల కేంద్రాలు
న్యూఢిల్లీ: పెండింగ్‌లో ఉన్న సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్షలను దేశవ్యాప్తంగా 15 వేల కేంద్రాల్లో నిర్వహించనున్నట్టు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ వెల్లడించారు. కోవిడ్–19 కారణంగా వాయిదా పడిన ఈ పరీక్షలు జూలై 1 నుంచి 15 వరకు జరగనున్నాయి. గతంలో నిర్ణయించినట్టు మూడువేల కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా సామాజిక దూరాన్ని పాటించేందుకూ, విద్యార్థులు ఎక్కువ దూరం ప్రయాణించే అవసరం లేకుండా ఉండేందుకూ, అత్యధిక పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసినట్టు మంత్రి చెప్పారు. హోంశాఖ నిబంధనల ప్రకారం కోవిడ్–19 కంటైన్మెంట్ ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించరు. అలాగే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు రవాణా సదుపాయాలను కల్పించే బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటుంది. 12వ తరగతి పరీక్షలు దేశవ్యాప్తంగాను, ఈశాన్య ఢిల్లీలో వాయిదా పడిన 10వ తరగతి పరీక్షలు ఇప్పుడు జరుగుతాయి. -
కట్టుదిట్టంగా పరీక్షలు జరుగుతున్నాయి : పెద్దిరెడ్డి
-
‘సచివాలయ’ రాత పరీక్షలకు 4,478 కేంద్రాలు
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో మొత్తం 4,478 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1,26,728 ప్రభుత్వ ఉద్యోగాలకు 21.69 లక్షల మంది దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. ఒక్కొక్క రకమైన పరీక్షకు ఒక్కో రోజు చొప్పున సెప్టెంబరు 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు రెండు పూటలా రాత పరీక్షలు నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 1వ తేదీన జరిగే వివిధ ఉద్యోగాల రాత పరీక్షకు అన్ని జిల్లాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా.. 3వ తేదీ నుంచి 8వ తేదీ వరకూ జరిగే మిగిలిన ఉద్యోగాల రాతపరీక్షకు మాత్రం ఏడు జిల్లాల్లోనే పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. తొలి రోజు 13 జిల్లాల్లో 4,478 కేంద్రాల్లో రాతపరీక్ష నిర్వహించనున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 306, విజయనగరంలో 198, విశాఖ జిల్లాలో 406, తూర్పు గోదావరిలో 481, పశ్చిమ గోదావరిలో 311, కృష్ణాలో 374, గుంటూరులో 365, ప్రకాశంలో 231, నెల్లూరులో 323, చిత్తూరులో 380, వైఎస్సార్ జిల్లాలో 270, అనంతపురంలో 389, కర్నూలు జిల్లాలో 444 పరీక్షా కేంద్రాల్లో 15,50,002 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. సెప్టెంబర్ 3, 4, 6, 7, 8 తేదీల్లో జరిగే రాత పరీక్షకు 7 జిల్లాల్లో 536 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో 40, విశాఖలో 56, పశ్చిమ గోదావరిలో 38, కృష్ణాలో 90, నెల్లూరులో 85, చిత్తూరులో 120, అనంతపురం జిల్లాలో 107 పరీక్షా కేంద్రాల్లో 6,19,812 మంది పరీక్ష రాయనున్నారు. రాత పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు సచివాలయ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే రాతపరీక్షలు ప్రశాంతంగా, సక్రమంగా జరిగేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఎల్వీ సుబ్రహ్మణ్యం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. పరీక్షల నిర్వాహణపై డీజీపీ గౌతమ్ సవాంగ్‌తో కలిపి ఆయన బుధవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ప్రశ్నాపత్రాలను స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరిచి, ప్రత్యేక ఎస్కార్టుతో ఆయా పరీక్షా కేంద్రాలకు తరలించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ పరీక్షల తరహాలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షలను సైతం పకడ్బందీగా నిర్వహించాలని ఎల్వీ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఎస్పీలను డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశించారు. -
రేపే నీట్.. సర్వం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా మే 5న నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)కు తెలంగాణలో పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు. రాష్ట్రంలో హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, రంగారెడ్డి కేంద్రాల్లో పరీక్షను నిర్వహించనున్నారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి 5 గంటల వరకు పరీక్ష జరగనుంది. రెండు గంటల ముందే పరీక్షా కేంద్రంలోకి చేరుకోవాలని.. 1.30 తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమయినా అనుమతి నిరాకరిస్తామని అధికారులు తెలిపారు. ఈ మేరకు భారతీయ విద్యా మండలి ప్రకటన జారీ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా ఈఏడాది 80వేలమంది నీట్ పరీక్షకు హాజరవుతున్నారని నిర్వహకులు తెలిపారు. ఎప్పటిలాగే ఈసారి కూడా కఠిన నిబంధనలు అమలు చేస్తున్నామని, బూట్లు, ఎత్తుమడిమల చెప్పులు, వాటర్ బాటిల్స్, ఫోన్స్, ఎలక్ట్రికల్ పరికరాలు, విద్యార్థినులు గాజులు, గొలుసులు, ఆభరాణాలు హ్యాండ్ బ్యాగ్స్ తీసుకురావద్దని తెలిపారు. పరీక్షకు హాల్ టికెట్ తప్పనిసరి. అప్లికేషన్లో పొందుపరిచిన ఫోటో కాపీని తీసుకుని వెళ్లాలని, దానితో పాటు ఏదైనా గుర్తింపు కార్డు కూడా తప్పనిసరని విద్యా మండలి అధికారులు సూచించారు. -
జేఈఈ మెయిన్ పరీక్ష కేంద్రాలు పెంపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జేఈఈ మెయిన్ నిర్వహించే పరీక్ష కేంద్రాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పెంచింది. జనవరిలో జరిగిన మొదటి దఫా జేఈఈ మెయిన్ పరీక్షను 7 పట్టణాల్లోని పరీక్ష కేంద్రాల్లో నిర్వహించగా, ఏప్రిల్‌లో నిర్వహిం చనున్న రెండో దఫా జేఈఈ మెయిన్ పరీక్షను 9 పట్టణాల్లో నిర్వహించేలా చర్యలు చేపట్టింది. జనవరిలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి, వరంగల్ పట్టణాల్లో పరీక్షలను నిర్వహించిన ఎన్టీఏ ఏప్రిల్‌లో వాటితోపాటు అదనంగా కోదాడ, నిజామాబాద్‌లోనూ పరీక్షలను నిర్వహించేలా చర్యలు చేపట్టింది. ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే విద్యా సంస్థల్లో (జీఎఫ్‌టీఐ) ప్రవేశాలకు ఎన్టీఏ 2 దఫాలుగా జేఈఈ మెయిన్ పరీక్షలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మొదటి దఫా పరీక్షల ఫలితాలను ఇటీవల వెల్లడించింది. ఇక ఏప్రిల్ 7 నుంచి 20 మధ్య నిర్వహించే రెండో దఫా జేఈఈ మెయిన్ దరఖాస్తులను శుక్రవారం ప్రారంభించింది. వచ్చే నెల 7 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల సబ్మిషన్కు, 8 వరకు ఆన్లైన్లో ఫీజు చెల్లింపునకు చర్యలు చేపట్టింది. ఇక ఈ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 30న విడుదల చేయనుంది. జనవరిలో జరిగిన పరీక్షతోపాటు, ఏప్రిల్‌లో జరిగే పరీక్షకు హాజరైన అభ్యర్థులకు ఎందు లో ఎక్కువ స్కోర్ లభిస్తే దానిని పరిగణనలోకి తీసుకొని ఆ తర్వాత తుది ర్యాంకులను ప్రకటించనుంది. ఆ ర్యాంకుల ఆధారంగా ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, జీఎఫ్‌టీఐల్లో ప్రవేశా లు చేపట్టనుంది. ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వ హించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హులుగా జేఈ ఈ మెయిన్‌లో టాప్ పర్సంటైల్ (స్కోర్) సాధించిన 2.24 లక్షల మంది అభ్యర్థులను పరిగణనలోకి తీసుకోనుంది. జేఈఈ మెయి న్ ఫలితాలు వెల్లడైన మరుసటిరోజు నుంచే జేఈఈ అడ్వాన్స్డ్ దరఖాస్తుల ప్రక్రి యను ఐఐటీ రూర్కీ చేపట్టనుంది. ఆ పరీక్షను మే 19న నిర్వహించనుంది. ఏప్రిల్‌లోనూ నాలుగు రోజులే! జనవరిలో జేఈఈ మెయిన్‌ను 4 రోజుల పాటు ప్రతి రోజు 2 షిఫ్ట్‌లలో నిర్వహించిన ఎన్టీఏ ఏప్రిల్‌లోనూ 4 రోజుల పాటు ప్రతి రోజు 2 షిఫ్ట్‌లలో జేఈఈ మెయిన్‌ను నిర్వహించనుంది. మొదటి దఫా పరీక్షలకు హాజ రుకాని 60 వేల మంది విద్యార్థులు రెండో దఫా పరీక్షకు హాజరుకానున్నారు. వారితోపాటు మొదటి దఫా పరీక్షలకు హాజరైన వారిలోనూ 99% మంది తమ స్కోర్‌ను పెంచుకునేందుకు రెండో దఫా పరీక్షకు హాజరుకానున్నారు. కొంతమంది కొత్త విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌లో జరిగే పరీక్షకు 10 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉంది. ఇదీ పరీక్ష షెడ్యూల్.. ఆన్లైన్లో పరీక్షలను ప్రతి రోజు 2 షిఫ్ట్‌లుగా నిర్వహించనున్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మొదటి షిఫ్ట్ పరీక్ష నిర్వహించనుండగా, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు రెండో షిఫ్ట్ పరీక్షను నిర్వహించనున్నారు. విద్యార్థులు గంట ముందుగా పరీక్ష కేంద్రాల్లోకి వెళ్లాల్సి ఉంది. ఉదయం పరీక్షకు 8:30లోపు, మధ్యాహ్నం పరీక్షకు 1:30లోపు పరీక్ష కేంద్రంలోకి అనుమతించనుంది. పరీక్ష హాల్లోకి ఉదయం పరీక్షకు 8:45 గంటల నుంచి 9 వరకు, మధ్యాహ్నం పరీక్షకు 1:45 నుంచి 2 వరకు అనుమతిస్తారు. -
మాస్ కాపీయింగ్‌కు తెరపడేనా?
సాక్షి, ముదినేపల్లి రూరల్: పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ నిరోధించేందుకు విద్యాశాఖ ప్రభుత్వ స్కూళ్లల్లో మాత్రమే పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వచ్చే మార్చిలో జరగబోయే పరీక్షలకు ఇప్పటి నుంచే సన్నాహాలు చేపట్టారు. కేవలం పరీక్షా కేంద్రాల మార్పు వల్లే మాస్ కాపీయింగ్ నిరోధించడం ఏమేరకు సాధ్యపడుతుందనేది నియోజకవర్గంలోని ఉపాధ్యాయుల్లో చర్చనీయాంశంగా మారింది. ఉత్తమ ఫలితాల కోసం అడ్డదారులు ఇప్పటివరకు ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో పరీక్షా కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ప్రైవేట్ స్కూళ్ల విద్యార్థులు ప్రభుత్వస్కూళ్లలోనూ, ప్రభుత్వ స్కూళ్లలోని విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లలోని కేంద్రాల్లో పరీక్షలు రాస్తున్నారు. ఇన్విజిలేటర్లు, డీవోలు, సీఎస్‌లుగా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులే విధులు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ ఫలితాల కోసం ప్రైవేటు విద్యాసంస్థల నిర్వాహకులు ప్రభుత్వ స్కూళ్ల ఉపాధ్యాయులతో కుమ్మక్కై మాస్‌కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పేరుకే చట్టం పరీక్షల్లో కాపీయింగ్ నిరోధించేందుకు విద్యాశాఖ యాక్ట్ 25 అమలులోకి తెచ్చింది. దీని ప్రకారం విద్యార్థి మాస్‌కాపీయింగ్ చేస్తు పట్టుబడితే విద్యార్థితో పాటు ఇన్విజిలేటర్, చీఫ్ సూపరెంటెండెంట్ బాధ్యత వహించాల్సి ఉంది. వీరిని విధుల నుంచి తప్పించడంతో పాటు జరిమానా, సస్పెన్షన్, జైలు శిక్ష విధించాలి. అయితే ఈ చట్టం పేరుకే తప్ప ఆచరణలో ఎక్కడా అమలు కావడం లేదు. దీని ప్రకారం ఇప్పటి వరకు ఏ ఒక్క ఉపాధ్యాయుడిని బాధ్యుడిని చేయలేదంటే మాస్‌కాపీయింగ్ లేనట్లా? లేక చట్టాన్ని సక్రమంగా అమలుచేయడం లేదో అర్థంకాని పరిస్థితి. దీన్ని అమలు చేయాల్సిన స్క్వాడ్ అధికారులే మాస్ కాపీయింగ్ ప్రోత్సహిస్తూ యాక్ట్ 25ను అపహాçస్యం చేస్తున్నట్లు విమర్శలొస్తున్నాయి. అధికారుల ఒత్తిడి విద్యార్థుల సామర్థ్యాలతో పనిలేకుండా పది పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా అధికారులు ఉపాధ్యాయులపై ఒత్తిడి తేవడం ఆనవాయితీగా మారింది. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఫలితాల సాధన కోసం మాస్‌కాపీయింగ్‌ను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడుతున్నట్లు ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలనే ఒత్తిడి ఉన్నంత కాలం పరీక్షా కేంద్రాలు ఏవిధంగా మార్పు చేసినా మాస్‌కాపీయింగ్‌కు తెరపడదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. -
నేడు డిపార్ట్మెంటల్ టెస్టుల నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: వివిధ శాఖల్లో ఉద్యోగుల పదోన్నతుల్లో పరిగణనలోకి తీసుకునే డిపార్ట్మెంటల్ టెస్టుల నిర్వహణకు టీఎస్పీఎస్సీ బుధవారం నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. అభ్యర్థులు నవంబర్ 5 నుంచి 30 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు చర్యలు చేపట్టింది. పరీక్షలను డిసెంబర్ 27 నుంచి 2019 జనవరి 6 వరకు నిర్వహించేలా షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ పరీక్షలను ఈసారి పూర్తిగా ఆన్లైన్ విధానంలో (కంప్యూటర్ ఆధారిత) నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని 9 జిల్లా కేంద్రాలు, హైదరాబాద్, రంగారెడ్డి కలుపుకొని హెచ్ఎండీఏ పరిధిలో పరీక్ష కేంద్రాలు ఉంటాయని వివరించింది. అభ్యర్థులు తాము పనిచేస్తున్న జిల్లా మాత్రమే కాకుండా అదనంగా పరీక్ష కేంద్రాలను ప్రాధాన్యతా క్రమంలో ఆప్షన్లు ఇచ్చుకోవాలని తెలిపింది. ప్రాధాన్యతల ఆధారంగా జిల్లా కేంద్రాలు, హెచ్ఎండీఏ పరిధిలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలను తమ వెబ్సైట్లో పొందవచ్చని వెల్లడించింది. -
టైమ్‌కి వెళ్లినా.. ఎగ్జామ్‌కు నో ఎంట్రీ!
సాక్షి, హైదరాబాద్/ అమరావతి : తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియెట్ ఫస్టియర్ పబ్లిక్ పరీక్షలు బుధవారం ప్రారంభం కాగా... కానీ కొన్ని పరీక్ష కేంద్రాల్లో రూమ్ వెతుక్కోవడంలో అలస్యమైనందుకు ఎగ్జామ్ రాసేందుకు విద్యార్థులను అనుమతించలేదు. సూర్యాపేట జిల్లా కోదాడలో వాగ్దేవి కాలేజీ ఇంటర్ విద్యార్థినిని ఒక్క నిమిషం ఆలస్యం నిబంధనతో సిబ్బంది బయటకు గెంటేశారు. దీంతో విద్యార్థి సంఘాల ఆందోళన చేపట్టగా పోలీసులు నచ్చజెప్పే యత్నం చేశారు. బాధిత విద్యార్థిని రమాదేవి మాట్లాడుతూ.. నిర్ణీత సమయానికే ఎగ్జామ్ సెంటర్‌కు వెళ్లిన తాను రూమ్ వెతుక్కోవడంలో అలస్యమైనందుకు బయటకు పంపారని చెప్పింది. పరీక్ష రాసేందుకు అనుమతించాలని వేడుకున్నా సిబ్బంది తన మాట వినలేదని వాపోయింది. కాగా, ఏపీలో మొత్తం 1,423 కేంద్రాల్లో, తెలంగాణలో 1,294 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. అయితే నిమిషం నిబంధన కొన్ని పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు చిక్కులు పెట్టి పరీక్ష రాయకుండా అడ్డుకుంది. ఉదయం 8.45 నుంచి పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులకు అనుమతించారు. 15 నిమిషాల గ్రేస్ పీరియడ్‌తో ఉదయం 9 గంటల వరకు పరీక్ష కేంద్రాల్లోకి చేరుకున్న విద్యార్థులను పరీక్ష రాసేందుకు అనుమతించినట్లు సిబ్బంది చెబుతున్నారు. -
అక్కడి వారిక్కడ.. ఇక్కడి వారక్కడ
సాక్షి, వరంగల్ రూరల్: ‘‘మా విద్యార్థులు మీ కళాశాలలో పరీక్ష రాస్తారు.. మీ విద్యార్థులు మా కళాశాలలో పరీక్ష రాస్తారు.. ఇక్కడ వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.. మా వారికీ అక్కడ ఏమీ ఇబ్బంది ఉండవద్దు’ ఇదీ.. ప్రైవేటు ఐటీఐ కళాశాల యాజమా న్యాల ముందస్తు ఒప్పందం. డైరెక్టరేట్ జనరల్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ (డీజీఈటీ), డైరెక్టరేట్ జనరల్ ట్రైనింగ్ (డీజీటీ)ల ఆధ్వ ర్యంలో ఇండస్ట్రియల్ ట్రెనింగ్ ఇన్స్టిట్యూట్ (ఐటీఐ) పరీక్షలు నిర్వ హిస్తున్నారు. ఈ నెల 5న ప్రారంభమైన సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 15 వరకు కొనసాగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఐటీఐలు 65, ప్రైవేట్ ఐటీఐలు 222 ఉన్నాయి. వీటిలో 58,300 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. సెమిస్టర్ పరీక్షల కోసం 125 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో ముందస్తు ఒప్పందం ప్రకారం పరీక్షలు చూచిరాతను తలపిస్తున్నాయి. పరస్పర ఒప్పందంతో.. వరంగల్ అర్బన్ జిల్లాలోని విద్యార్థి ఐటీఐ, విన్సెంట్ ఐటీఐ విద్యార్థులకు శ్రీ రాజీవ్ గాంధీ ప్రైవేట్ ఐటీఐలో పరీక్ష కేంద్రాన్ని కేటాయించారు. శ్రీ రాజీవ్ గాంధీ ఐటీఐకి చెందిన విద్యార్థులకు విన్సెంట్ ప్రైవేట్ ఐటీఐలో పరీక్ష కేంద్రాన్ని కేటాయించారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా మ్యూచువల్ చేంజ్‌గా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ముందుగానే ఉన్నతాధికారులతో ఒప్పందం కుదుర్చుకుని పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయించుకున్నారు. మా విద్యార్థులను ఫ్రీగా వదిలేస్తే ఇక్కడ మీ విద్యార్థులను ఫ్రీగా వదిలేస్తామని ఒప్పందం చేసుకున్నారు. గతంలో ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్‌లలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసేవారు. ఇప్పుడు ఉన్నతాధికారులతో ప్రైవేట్ యాజమాన్యాలు కుమ్మక్కై మ్యూచు వల్ సెంటర్లను ఏర్పాటు చేశారు. కొన్ని ప్రైవేట్ ఐటీఐలకు సెల్ఫ్ సెంటర్లను సైతం ఏర్పాటు చేశారు. మ్యూచువల్ చేంజ్‌తో కేం ద్రాలు ఏర్పాటు కావడంతో జోరుగా మాస్‌కాపీయింగ్ జరు గుతోంది. పరీక్ష కేంద్రంలో కనీస నియమాలు సైతం పాటించడం లేదు. జంబ్లింగ్ కాకుండా ఒకే ట్రేడ్ వారిని పక్కపక్కన కూర్చోబెట్టి పరీక్షలు రాయిస్తు న్నారు. కనీస సౌకర్యాలు లేకు న్నా సైతం కొన్ని కళాశాలల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలం లక్నెపల్లిలోని వీఎన్ఆర్ ఐటీఐలో సాధారణ కుర్చీలు ఏర్పాటు చేసి పరీక్షలు రాయిస్తున్నారు. ఆ ఐటీఐ భవనం ఇంకా నిర్మాణం పూర్తి కాలేదు. పైసా వసూల్ పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు చూసి రాసుకునేందుకు ప్రైవేట్ ఐటీఐల యజమానులు అడ్డదారులు తొక్కుతున్నారు. పైసలు ఇస్తే పాస్ గ్యారంటీ పేరుతో ప్రైవేట్ ఐటీఐలు డబ్బులు వసూల్ చేస్తు న్నాయి. సెంటర్ ఫీజు పేరుతో విద్యార్థుల నుంచి రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు వసూళ్లు చేసినట్లు తెలిసింది. కొన్ని పరీక్ష కేంద్రాలలో ఏకంగా బోర్డుల పైనే జవాబులు రాస్తున్నారు. ఐటీఐ చేసిన వారికి ట్రాన్స్‌కో, జెన్ కో, సింగరేణిలో ఉద్యోగ అవకాశాలున్నాయి. దీంతో విద్యార్థులు కూడా పాస్ అవుతాం కదా అని డబ్బులు ఇచ్చేందుకు వెనుకాడటంలేదని సమాచారం. విద్యార్థుల నుంచి వసూల్ చేసిన డబ్బులను పరీక్ష పర్యవేక్షకుడికి, ఉన్నత అధికారులకు ముట్టచెబుతున్నట్లు తెలుస్తోంది. డబ్బులు ఇవ్వని విద్యార్థులను మరో గదిలో కూర్చోబెట్టి పరీక్షలు రాయిస్తున్నారు.