Experiment
-
యవ్వనం కోసం మిలియనీర్ పాట్లు : వికటించిన ప్రయోగం, కానీ!
టెక్ వ్యవస్థాపకుడు బ్రయాన్ జాన్సన్ వృద్ధాప్యాన్ని తిప్పికొట్టడానికి, యవ్వనంగా ఉండేందుకు కోట్ల కొద్దీ సొమ్మును కుమ్మరిస్తున్నాడు. తన జీవసంబంధమైన వయస్సును తగ్గించుకోవడానికి 30 మంది శాస్త్రవేత్తలు, వైద్యుల బృందం మద్దతుతో, విపరీతమైన మందులు, వ్యాయామం, అనేక చికిత్సల ద్వారా వయసును తగ్గించుగాకలిగాడు. అయితే, అతని తాజా యాంటీ ఏజింగ్ ప్రయోగం ఊహించని మలుపు తిరిగింది. దీనికి సంబంధించిన వివరాలను బ్రయాన్ జాన్సన్ స్వయంగా ఇన్‌స్టాలో వివరించాడు.యవ్వన రూపాన్ని పొందే క్రమంలో ముఖానికి కొవ్వు ఇంజక్షన్ వికటించి, అతని ముఖం ఎర్రగా ఉబ్బిపోయింది. మీకెప్పుడైనా ఇలా జరిగిందా అంటూ తన ఫోటోలను జాన్సన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. డోనర్ ఇచ్చిన కొవ్వును ఇంజెక్ట్ చేసే ప్రయత్నంలో తన ముఖం ఎర్రగా వాచిపోయిందని తెలిపాడు. దీన్నే "ప్రాజెక్ట్ బేబీ ఫేస్" అంటారు. ముఖంలో మంట మొదలైందనీ, ఆ తర్వాత మరింత అధ్వాన్నంగా మారిపోయిందని తెలిపాడు. ఇది తీవ్రమైన అలెర్జీ ప్రతిచర్య అని వివరించాడు. అయితే అతని కఠినమైన 1,950-కేలరీల డైట్‌తో గణనీయమైన బరువు తగ్గిన తర్వాత ఈ పరిణాం చోటు చేసుకోవడం గమనార్హం. ఏడు రోజుల తర్వాత, తన ముఖం సాధారణ స్థితికి వచ్చిందని పేర్కొన్నాడు తదుపరి ప్రయత్నానికి సంబంధించిన ప్రణాళికలపై తమ టీం పని చేస్తోందన్నాడు. View this post on Instagram A post shared by Bryan Johnson (@bryanjohnson_) కాగా బ్రయాన్ జాన్సన్ ఆల్-ఓవర్ స్కిన్ లేజర్ ట్రీట్మెంట్, యాంటీ యాజింగ్ మందులు చికిత్సలతో తన చర్మ వయస్సుతోపాటు, గుండె, లివర్ శరీరంలోని ప్రతీ భాగం వయస్సును తగ్గించుకున్నట్టు ఇంతకు ముందే ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: శోభిత ధూళిపాళ, నాగచైతన్య పెళ్లి సందడి : హాట్ టాపిక్‌గా శోభిత పెళ్లి చీర -
లైవ్‌లో ఎలిఫెంట్ టూత్‌పేస్ట్ ప్రయోగం చేస్తూ..ఓ యూట్యూబర్..
ఇటీవల యూట్యూబ్‌లో రకరకాల వైరైటీ వీడియోలు చేస్తూ మంచి క్రేజ్ తోపాటు పేరు తెచ్చుకుంటున్న యూట్యూబర్లకు కొదువే లేదు. కాకపోతే కొందరూ ఈ పిచ్చిలో కాస్త తమ ప్రాణాలను కూడా పణంగా పెట్టి లైవ్ వీడియోలు చేస్తున్నారు. ఫ్యాన్ ఫాలోయింగ్ ఆన్లైన్ క్రేజీ ఆరాటం ఎంత ఉన్నా కాస్త వ్యక్తిగతం ఏది ఎంత వరకు బెటర్ అన్నది బేరీజు చూసుకుని చేస్తేనే మంచిది. ఇక్కడొక యూట్యూబర్ కూడా అలానే ఎలిఫెంట్ టూత్‌పేస్ట్ ప్రయోగం అంటూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయబోయి అతడే మతితప్పి పడిపోయే సంకట పరిస్థితి ఎదురైంది. కొన్ని లైవ్ వీడియోలు సీరియస్‌గా మారి వారి ప్రాణాలనే ఉక్కిబిక్కరి చేసేంత భయానకంగా ఉన్నాయి. దయచేసి ఇలాంటివి చేయాలనుకునే ఔత్సాహిక యూట్యూబర్లు ముందుగా ట్రయల్స్ వేసిగానీ రిస్క్ వీడియోలు చేసే సాహసం చెయొద్దు. ఇంతకీ ఆ యూట్యూబర్ చేసిన ప్రయోగం ఏంటంటే ఎలిఫెంట్ టూత్‌పేస్ట్ ప్రయోగం. జంబో రేంజ్లో టూత్ పేస్ట్‌లాంటి నురుగు పదార్థాన్ని తయారు చేయడం. ఇది నిపుణుల పర్యవేక్షణలో చేయకపోతే ఆ రసాయనాలు రియాక్షన్ ఇచ్చి వికటిస్తే మొదటికే మోసం వస్తుంది. ఈ యూట్యూబర్ కూడా అలాంటి చేదు అనుభవాన్నే ఎదుర్కొన్నాడు. లైవ్‌లో ఆ వింత ప్రయోగాన్ని చేస్తుండగా నురగలు కక్కుతూ పేస్ట్ వస్తూ ఓ విధమైన పొగ ఆ ప్రదేశం అంతా క్షణాల్లో ఆవిరించింది. సరిగ్గా సమయానికి అగ్నిమాక సిబ్బంది రంగంలోకి దిగి ఆ యూట్యూబర్‌ని కెమరామెన్ని వెంటనే ఆ గది నుంచి బయటకు తీసుకొచ్చి రక్షించే యత్నం చేశారు కాబట్టి సరిపోయింది. ప్రస్తుతం ఇద్దరికి కుత్రిమంగా ఆక్సిజన్ని అందిస్తున్నారు వైద్యులు. ఇంతకీ ఆ ఎలిఫెంట్ టూత్‌పేస్ట్ ప్రయోగం ఏంటంటే.. ఇదొక శాస్త్రీయమైన ప్రక్రియ. ఇది హైడ్రోజన్ పెరాక్సైడ్, డ్రై ఈస్ట్, డిష్ సోప్ కలవగానే ఒక విధమైన నురుగు పదార్థాన్ని సృష్టిస్తారు. చూస్తే ఎక్కువ మొత్తంలో ఊహించని రేంజ్లో ఆ నురుగు వస్తుంది కాబట్టి దీన్ని ఎలిఫెంట్ టూత్‌పేస్ట్ ప్రయోగం అని పిలుస్తున్నారు. ఈ మూడు పదార్థాలు కలిసినపుడు రసాయనాలు ప్రతిస్పందించి ఆక్సిజన్ వాయువును విడుదల చేస్తాయి. అది మనం తట్టుకోలేనంతగా ఒక్కొసారి రావచ్చు దీంతో మన ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే పరిస్థితికి దారితీస్తుంది. అంతేగాదు రాత్రి టైంలో మొక్కలు అధిక ఆక్సిజన్ విడుదల చేస్తాయనే కదా మన పెద్దవాళ్లు చెట్ల కింద పడుకోవద్దనేది. మోతాదుకి మించిన ఆక్సిజన్ని మనిషిని ఉక్కిరిబిక్కిరిచేసి ప్రాణాలను హరించేస్తుంది. ఇలాంటి ప్రయోగాలు చేసేటప్పుడూ తస్మాత్ జాగ్రత్త..! (చదవండి: అపార్ట్మెంట్ విండోలో భారీ కొండచిలువ..చూస్తే హడలిపోతారు!) -
ప్లాంట్ మాన్ ప్రయోగం
‘కాలింగ్ బెల్, రాక్షసి’ వంటి హారర్ చిత్రాలు తెరకెక్కించిన దర్శకుడు పన్నా రాయల్ దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన చిత్రం ప్లాంట్ మాన్’. డీఎం యూనివర్సల్ స్టూడియోస్ స్థాపించి కె. సంతోష్బాబుని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని నిర్మించారు . పన్నా రాయల్. ‘‘సైంటిఫిక్ కామెడీ మూవీగా ఈ చిత్రాన్ని నిర్మించాం. ఒక కొత్త తరహా ప్రయోగంతో పూర్తి వినోద ప్రధానంగా రూ΄పొందించాం’’ అన్నారు పన్నా రాయల్. ఇక ప్రస్తుతం పన్నా రాయల్ దర్శకత్వంలో రూ΄పొందిన ‘ఇంటి నెం.13’ చిత్రం త్వరలో విడుదల కానుంది. ప్లాంట్ మాన్ పొస్టర్ -
'బుద్ధి'.. గడ్డి తినడం కాదు!..గడ్డిప్లేట్లోనే తిందాం!
బుద్ధి గడ్డి తినడం కాదిది. బుద్ధిగా గడ్డి ప్లేట్లో తినడం. పర్యావరణ పరిరక్షణ పట్ల బుద్ధి వచ్చిన తర్వాత చేసే పని. దీనికి పెట్టిన అందమైన పేరే బయో డిగ్రేడబుల్ టేబుల్ వేర్. కేరళకు చెందిన రిషభ్, రోషన్ సోదరుల ప్రయోగం ఇది. సముద్రాన్ని కూడా వదలని కాలుష్యం నుంచి తీసుకున్న నిర్ణయం. వీళ్లు ప్లేట్ల తయారీకి వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగిస్తున్నారు. వేడుకల సందర్భంగా ఇప్పుడు ఉపయోస్తున్న ఫైబర్, పాలిథిన్ పొర ఉన్న పేపర్ ప్లేట్లలో భోజనం చేసి బయట పారేసినప్పుడు చెత్త కుండీల దగ్గర చేరిన కుక్కలు, ఆవులు, ఇతర జంతువులు ఆ ప్లేట్లలో మిగిలిపోయిన ఆహారంతోపాటు ప్లేట్లను కూడా నమిలి మింగేస్తుంటాయి. దాంతో అవి అనారోగ్యాల బారిన పడుతుంటాయి. ఫైబర్ బదులు బయో డీగ్రేడబుల్ ప్లేట్ వాడినట్లయితే... మూగజీవులు మనం పారేసిన మిగులు ఆహారంతోపాటు ప్లేట్‌ని తిన్నప్పటికీ వాటి ఆరోగ్యానికి ఎటువంటి హానీ కలగదు. ఈ ప్లేట్లను నానబెట్టి ఎరువుగా మార్చుకుని పంటకు వాడుకోవచ్చు. ఏమీ చేయకుండా వదిలేసినా కూడా ఈ మెటీరియల్ మట్టిలో కలిసిపోయి ఆ మట్టి జవజీవాలను పెంచుతుంది. గడ్డి కంచం ఇలా పుట్టింది! అసలీ గడ్డి ప్లేట్ ఆలోచన ఎలా వచ్చిందంటే... రిషభ్‌కి సర్ఫింగ్ ఇష్టం. కేరళ, కోవళమ్, అరేబియా సముద్రంలో సర్ఫింగ్ చేసేవాడు. సముద్రపు అలలను తప్పించుకుంటూ బోర్డు మీద పెడలింగ్ చేయడం అత్యంత సాహసంతో కూడిన ఆట. ప్రాక్టీస్‌లో ఉన్నప్పుడు రిషభ్ తలకు, దేహానికి పాలిథిన్ పేపర్, ప్లాస్టిక్ వస్తువులు తగులుతుండేవి. ఒక్కోసారి పాలిథిన్ షీట్ వచ్చి కాళ్లకు చుట్టుకునేది. ఇలాంటిదే మరో సంఘటన ఈ సోదరులిద్దరికీ ఆఫ్రికాలోని ఉగాండా దేశంలో ఎదురైంది. అక్కడి పర్వత శిఖరాల మీదకు ట్రెకింగ్ చేస్తున్నప్పుడు ఎటు చూసినా ప్లాస్టిక్ కాలుష్యమే. ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడం కంటే పాలిథిన్ వ్యర్థాలను తప్పించుకుంటూ అడుగులు వేయడంతోనే ట్రెకింగ్ పూర్తయింది. ఈ సమస్య ఒక్క కేరళనే కాదు, ప్రపంచం అంతటినీ వేధిస్తోందనిపింంది. పర్యావరణం ఎదురుగా భూతంలా నిలిన ఈ సవాల్‌కు జవాబు వెతికే ప్రయత్నంలో వీరికి వచి్చన ఆలోచన ఈ బయో డీగ్రేడబుల్ టేబుల్‌వేర్. క్వాడ్రాట్ పేరుతో మొదలు పెట్టిన ఈ ప్రయోగంలో ప్లేట్ తయారీకి తవుడు, పొట్టు, గడ్డి ఉపయోగించారు. ఇరవై నెలల నిరంతర పరశోధన, ప్రయోగాలతో ఒక రపం వచ్చింది. వేడుకల్లో ఉపయోగించే పేపర్ ప్లేట్, అల్యమినియం ఫాయిల్ అద్దుకున్న ప్లేట్, ఫైబర్ ప్లేట్ల స్థానాన్ని భర్తీ చేయగలుగుతుందా అనే పరీక్షలన్నింటినీ ఈ బయోడీగ్రేడబుల్ ప్లేట్ పాసయింది. ఇలా చేస్తున్నారు! పంట పొలాల నుంచి గడ్డిని, రైస్ మిల్లుల నుంచి తవుడు, పొట్టు సేకరించి శుభ్రం చేసిన తర్వాత హీటర్‌లో వేడి చేసి, మెత్తగా పొడి చేసి ప్లేట్, కప్పు, స్పన్ ఆకారంలో ఉన్న మౌల్డ్ ఆధారంగా రపం తెస్తారు. ఈ ప్లేట్లు భోజనం చేసే లోపు నానిపోతాయేమో అనే సందేహం కలుగుతుంది. పులుపు, రసం, మజ్జిగతో హాయిగా భోజనం చేయవచ్చని, నీటిలో నానబెట్టిన తర్వాత అరగంట సేపటి వరకు వాటి షేప్ మారదని చెప్పారు. అలాగే కప్పులు మరింత దృఢంగా 70 నిమిషాల సేపు ద్రవాలను నిలిపి ఉంచుతాయి. ఒకసారి తయారైన ఈ టేబుల్ వేర్ని ఏడాది పాటు నిల్వ ఉంచుకోవచ్చు. బయో డీగ్రేడబుల్ ప్లేట్లో ఆహారపదార్థాలు విదేశాలకెళ్తున్నాయి! ఢిల్లీ, ముంబయి, బెంగళరు నగరాలతోపాటు అండవన్ నికోబార్ దీవులు, మిజోరాం, నాగాలాండ్ రాష్ట్రాలు ఈ ప్రత్యామ్నాయాన్ని ఆదరిస్తున్నాయి. అంతేకాదు, యూఎస్, యూకే, కెనడా, మెక్సికోలు కూడా ఈ బయోడీ గ్రేడబుల్ టేబుల్ వేర్‌కు స్వాగతం పలికాయి. నెలకు ప్లేట్లు, కప్పులు, స్ట్రాలు, స్పన్లు అన్నీ కలిపి పాతిక వేలు అమ్ముడవుతున్నాయని చెప్పారు రిషభ్, రోహన్‌లు. పొట్ట ఉబ్బిపోతుంది! జంతువులు మనం తినే ఆహారం వైపు చూస్తున్నాయంటే వాటికి వాటి ఆహారం దొరకడం లేదని అర్థం. వీధికుక్కలతోపాటు ఆవులు మరికొన్ని జంతువులు ఓ దశాబ్దకాలంగా జీర్ణవ్యవస్థ సమస్యలతో మరణిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ప్లాస్టిక్ వ్యర్థాలే. ప్లాస్టిక్ వ్యర్థాలను వరుసగా నెలరోజుల పాటు తిన్నాయంటే వాటి పెద్దపొట్టలో పదహారు నుంచి పద్దెనిమిది కిలోల ప్లాస్టిక్ పేరుకుంటుంది. ఐదారు కిలోలు చేరినప్పటి నుంచి వాటికి ఇబ్బందులు మొదలవుతాయి. గ్యాస్‌తో కడుపు ఉబ్బిపోతుంది. అక్యూట్ బ్లోటింగ్‌తో కొద్ది రోజుల్లోనే మరణిస్తాయి. ఎవరి పెంపకంలో లేని జంతువులకు ఈ ప్రమాదం ఎక్కువ. పరిస్థితి ఎంత దయనీయమంటే... ఆవులు నెమరు వేసుకునే ప్రక్రియలో ఆహారాన్ని తిరిగి నోట్లోకి తెచ్చుకున్నప్పుడు ఫైబర్, ప్లాస్టిక్ వ్యర్థాలు ముక్కలు ముక్కలుగా బయటపడుతుంటాయి. బయటపడడం కొంతలో కొంత నయం. పాలిథిన్ కవర్లు లోపల చుట్టచుట్టుకుని పోతే వాటంతట అవి బయటకు రాలేవు. ఆపరేషన్ చేయడమే మార్గం. ఈ జంతువులకు వైద్యం చేసి ప్రాణాలు కాపాడాలన్నా కూడా ప్లాస్టిక్ పెద్ద పొట్టలో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం. అవి విసర్జక వ్యవస్థలోకి వెళ్లాయంటే ఇక ఏమీ చేయలేం. మరణాన్ని ఆపలేం. – డాక్టర్ మల్లేశ్ పాటిల్, అసిస్టెంట్ డైరెక్టర్, యానిమల్ హజ్బెండరీ, ఆంధ్రప్రదేశ్ (చదవండి: ఆ సమోసాల అమ్మే వ్యక్తి..ఓ గొప్ప జీవిత పాఠాన్ని నేర్పాడు!) -
టీచర్ @ ఎకో స్మార్ట్ కుండీ
లక్ష్మీదేవికి పాఠాలూ ప్రయోగాలే ఊపిరి. క్లాసులో పాఠంతోపాటు ప్రయోగమూ చేయిస్తారు. మొక్క కోసం నేలకు హాని తలపెడితే ఎలా? అందుకే నేలకు మేలు చేసే పూల కుండీ చేశారు. ఆ.. ఎకో స్మార్ట్ పూల కుండీ... అంతర్జాతీయ సదస్సులో ప్రదర్శితం కానుంది. ‘టీచర్ ఉద్యోగం ఒక వరం. దేవుడిచ్చిన ఈ అవకాశానికి నూటికి నూరు పాళ్లు న్యాయం చేయాలనేది నా ఆశయం’ అన్నారు కొల్లాటి లక్ష్మీదేవి. ఆమె పుట్టింది, పెరిగింది మచిలీ పట్నంలో. ఎమ్ఎస్సీ, బీఈడీ చేసి 1995లో డీఎస్సీ సెలెక్షన్లో ఉద్యోగం తెచ్చుకున్నారు. తొలి పోస్టింగ్ కృష్ణాజిల్లా, సుల్తానగరంలో. అప్పటి నుంచి మొదలైందామె విజ్ఞాన దానయజ్ఞం. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పాఠ్యాంశాల్లో ఉన్న విషయాలను ప్రయోగాత్మకంగా చేసి చూపించడంతో మొదలైందా యజ్ఞం. పదేళ్ల తర్వాత పెడన మండలం చెన్నూరు ఈస్ట్‌లో మరో స్కూల్‌కి హెడ్మాస్టర్గా బదిలీ. ఆ సంతోషం ఆ స్కూల్‌కి వెళ్లే వరకే. పదిహేనుమంది పిల్లలున్న స్కూల్ అది. అలాగే వదిలేస్తే ఇద్దరు టీచర్ల స్కూల్లో ఒక పోస్ట్ రద్దయ్యే పరిస్థితి. ఇంటింటికీ వెళ్లి ‘మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించండి. మంచి విద్యనందిస్తాం. మా మీద నమ్మకం ఉంచండి’ అని నచ్చచెప్పి ఎన్రోల్మెంట్ 45కి పెంచారు. సైన్స్ ప్రాజెక్టులు చేయించడం ద్వారా విద్యార్థుల్లో ఉత్సాహాన్ని కలిగిస్తూ పాఠశాల పిల్లలను అయస్కాంతంలా ఆకర్షించేటట్లు చేశారు. ఆ తర్వాత చెన్నూరు జిల్లా పరిషత్ స్కూల్‌కి వచ్చినప్పటి నుంచి పెద్ద తరగతులకు పాఠం చెప్పే అవకాశం రావడంతో మరింత విస్తృతంగా ప్రయోగాలు మొదలుపెట్టారు. వందకు పైగా ప్రయోగాలు చేసిన ఆమె ప్రయోగాల్లో ఎకో ఫ్రెండ్లీ పూల కుండీ ప్రయోగం అంతర్జాతీయ స్థాయికి చేరింది. ఈ నెల 13 నుంచి 18 వరకు ఆమె విద్యార్థులు మణికంఠ, వినయ కుమార్‌లు యూఎస్‌లోని టెక్సాస్ రాష్ట్రం, డల్లాస్ నగరంలో జరిగే ఐఎస్ఈఎఫ్ ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఫెయిర్‌లో ‘స్మార్ట్ సొల్యూషన్ ఫర్ ఎకో పొల్యూషన్’ పేరుతో ఈ ప్రయోగాన్ని ప్రదర్శించనున్నారు. తన ప్రయోగాల పరంపరను సాక్షితో పంచుకున్నారు లక్ష్మీదేవి. ఎంత నేర్పిస్తే అంత నేర్చుకుంటారు! పిల్లల మెదడు కొత్త విషయాలను తెలుసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. వాళ్లకు మనం మనసు పెట్టి నేర్పిస్తే వాళ్లు అంతే చురుగ్గా నేర్చుకుంటారు. ప్రయోగాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. పాఠాలను ప్రయోగాత్మకంగా వివరించడానికి స్లయిడ్లు, స్టెమ్, లీఫ్, ప్లవర్ల భాగాలు నిలువుకోత, అడ్డకోతల నుంచి శరీర అవయవాల పనితీరును వివరించడానికి వధశాలల నుంచి మూత్రపిండాలు, గుండె, ఊపిరితిత్తులను సేకరించేదాన్ని. ఒక సైన్స్ ఫేర్‌లో సులువైన పద్ధతిలో పుట్టగొడుగుల పెంపకాన్ని నిరూపించాం. కానీ మా స్కూల్‌కి గణితం విభాగంలో ఒక అవార్డ్ ప్రకటించడంతో అదే స్కూల్‌కి రెండో అవార్డు ఇవ్వకూడదని చెప్పి అప్రిషియేషన్ ఇచ్చారు. నాచుతో సేద్యం ప్రయోగం రాష్ట్ర స్థాయికి ఎంపికైంది. కోవిడ్ సమయంలో ఎక్కువ ఖాళీ సమయం వచ్చింది. మా ఇంటి ఎదురుగా సంతలో అమ్మే మొక్కలు, నర్సరీల వాళ్లు వాడే పాలిథిన్ కవర్ల మీద దృష్టి పడింది. వాటికి ప్రత్యామ్నాయం కోసం ప్రయోగాలు మొదలుపెట్టాను. వేరుశనగపొట్టు, వేపాకు, కొబ్బరి పీచు, మెంతుల మిశ్రమంతో కుండీ తయారీ విజయవంతమైంది. ఎండకు, వానకు తట్టుకుని నిలవడంలో కష్టమవడంతో కలంకారీలో ఉపయోగించే సహజ రంగులను వేయడంతో సమస్య పరిష్కారమైంది. ఇక అవి మట్టిలో కలిసిపోవడం గురించినదే అసలు ప్రశ్న. నెలరోజుల్లో డీ కంపోజ్ అవుతోంది. ఈ కుండీ మట్టిలో కలిసిన తరవాత మట్టికి పోషణనిస్తోందా లేదా అనే విషయాన్ని నిర్ధారించుకోవడమూ అవసరమే. ఎన్పీకే చాలా తక్కువగా ఉన్న మట్టిలో వేసి, కలిసిపోయిన తర్వాత మట్టిని మళ్లీ టెస్ట్‌కి పంపిస్తే ఎన్పీకే గణనీయంగా పెరిగినట్లు రిపోర్ట్ వచ్చింది. అంతే కాదు నీటిని నిలుపుకునే శక్తి పెరిగింది, వేపలోని యాంటీ మైక్రోబియల్ స్వభావం వల్ల తెగుళ్లు నివారణ సాధ్యమైంది. పైటో కెమికల్స్ ఉన్నాయని ల్యాబ్టెస్ట్లో నిర్ధారణ అయింది. నేషనల్ చైల్డ్ సైన్స్ కాంగ్రెస్ పెట్టిన సైన్స్ ఫేర్లలో మండలం, డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయులు దాటి జాతీయ స్థాయిలో కూడా ప్రదర్శించాం. మెరిటోరియస్ అవార్డు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ‘బెస్ట్ గైడ్ టీచర్’ అవార్డు అందుకున్నాను. ఈ ప్రయోగాన్ని అంతర్జాతీయ వేదిక మీద ప్రదర్శించడానికి పెడన నుంచి ఈరోజు బయలుదేరుతున్నాం. ఢిల్లీలో కార్యక్రమాలు పూర్తి చేసుకుని 12వ తేదీన అమెరికా విమానం ఎక్కుతారు మా పిల్లలు’’ అని సంతోషంగా చెప్పారు లక్ష్మీదేవి. ఫ్లోరైడ్ జవాబు దొరికింది! నేను గర్వంగా చెప్పుకోదగిన ప్రయోగాల్లో ఫ్లోరైడ్ నీటిని శుద్ధి చేసే కుండ కూడా ముఖ్యమైనదే. మట్టిలో తులసి, మునగ ఆకులు కలిపి చేశాను. ఫ్లోరైడ్ 3.5 పీపీఎమ్ ఉన్న నీటిలో అడవుల్లో దొరికే చిల్లగింజలను వేసి హార్డ్నెస్ తగ్గించిన తరవాత ఆ నీటిని నేను చేసిన కుండలో పోసి ఆరు గంటల తర్వాత టెస్ట్ చేస్తే పీపీఎమ్ 1.5 వచ్చింది. ఈ కుండలో శుద్ధి అయిన నీటి పీహెచ్ సాధారణ స్థాయుల్లో ఉండడమే కాదు నీటిలో ఉండాల్సిన కంపోజిషన్స్ అన్నీ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ ప్రయోగాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఇన్నోవేటివ్ అండ్ ఎడ్యుకేషన్ నిర్వహించిన స్మార్ట్ ఇండియన్ హాకథాన్‌లో ప్రదర్శించాం. ‘ద ఇనిషి యేటివ్ రీసెర్చ్ ఫర్ ఇన్నోవేషన్ ఇన్‌స్టెమ్ (ఐరిస్)’ నిర్వహించిన పోటీలో ప్రదర్శించినప్పుడు నా స్టూడెంట్ ‘సీహెచ్. తరుణ్‌బాబు’కి ‘యంగ్ ఇన్నోవేటర్ అవార్డు’, 45 వేల క్యాష్ ప్రైజ్ వచ్చింది. ఫిఫ్త్ యాన్యువల్ ఇంటర్నేషనల్ ఇన్నోహెల్త్ ప్రోగ్రామ్ ఢిల్లీ ట్రిపుల్ ఐటీ– ఇన్నో క్యూరియో సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో ఫైనల్స్‌కి వచ్చి ఆరు బెస్ట్ ప్రాజెక్టుల్లో రెండవ స్థానం. – కొల్లాటి లక్ష్మీదేవి, బయలాజికల్ సైన్స్ అసిస్టెంట్, బీజీకే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పెడన, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ ‘స్మార్ట్ సొల్యూషన్ ఫర్ ఎకో పొల్యూషన్’ పేరుతో మేము తయారు చేసిన ఎకో ఫ్రెండ్లీ పూల కుండీని డల్లాస్‌లో జరిగే ఐఎస్ఈఎఫ్ ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫెయిర్‌లో ప్రదర్శిస్తారు. ఆ కార్యక్రమంలో వంద దేశాలు పాల్గొంటాయి, ప్రదర్శనలో 1800 ప్రాజెక్టులు ఉంటాయి. ఈ కార్యక్రమాన్ని బ్రాడ్‌కామ్ అనే మల్టీనేషనల్ కంపెనీ నిర్వహిస్తోంది. – వాకా మంజులారెడ్డి -
అంతరిక్షంలో వరి మొక్కలను పెంచిన చైనా!... వీడియో వైరల్
Taikonauts conducting life science experiment in space: చైనా సొంతంగా అంతరిక్ష కేంద్రాన్నినిర్మించుకుంటున్న సంగతి తెలిసిందే. ఆ స్పేస్ స్టేషన్ నిర్మాణ పనులు పూర్తి అవుతున్న తరుణంలోనే చైనా పలు సైన్స్ ప్రయోగాలు ప్రారంభించింది. అందులో భాగంగా జీరో గ్రావిటీ ల్యాబ్‌లో వరి మొక్కలను విజయవంతంగా పెంచేసింది కూడా. ఈ విషయాన్ని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్స్(సీఏఎస్) తన లైప్ సైన్సు పరిశోధనల్లో వెల్లడించింది. ఈ ఏడాది జులైలో ఈ ప్రయోగాన్నిప్రారంభించినట్లు పేర్కొంది. ఈ మేరకు తాము రెండు రకాలైన విత్తానాలు...థాలేక్రెస్ అనే క్యాబేజ్ జాతికి చెందిన విత్తనం తోపాటు వరికి సంబంధించిన విత్తనాలతో స్పేస్ స్టేషన్‌లోని వెంటియన్ ల్యాబ్‌లో ఈ ప్రయోగాలు చేసినట్లు పేర్కొంది. ఈ మేరకుక చైనా వ్యోమోగాములు అంతరిక్షంలోని కృత్రిమ వాతావరణంలో ఈ విత్తనాల నుంచి మొక్కలను విజయవంతగా పెంచింది. ఐతే థాల్స్క్రేస్ నాలుగు ఆకులు ఉత్పత్తి చేయగా, పొడవాటి కాండంతో వరి మొక్కలు సుమారు 30 సెం. మీటర్ల వరకు పెరిగాయి. రేడియోషన్ స్థాయిలు అధికంగా ఉండే అంతరిక్షంలో మొక్కలు ఏవిధంగా ఉంటాయి అనేది తెలుసుకునేందుకే చైనా టైకోనాట్స్(వ్యోమోగాములు) ఈ ప్రయోగాలు చేస్తున్నట్లు వివరించారు. ఈ మేరకు చైనీస్ సెన్స్ అకాడమీకి చెందిన పరిశోధకుడు జెంగ్ హుక్వింగ్ మాట్లాడుతూ..."ఈ రెండు ప్రయోగాలు అంతరిక్షంలోని ప్రతి మొక్క జీవిత కాలాన్ని అధ్యయనం చేసేందుకు ఉపకరిస్తుందన్నారు. అలాగే మొక్కలను పెంచేందుకే కాకుండా మైక్రోగ్రావిటీలో మొక్కల ఉత్పత్తి సామర్థ్యాన్ని ఎలా పెంచాలో పరిశోధనల్లో తెలుస్తుందని చెప్పారు. అంతేకాదు పంటలను భూమి లాంటి వాతావరణంలోనే కృత్రిమంగా పెంచగలమని అన్నారు. మొక్కలు పుష్పించడం జరిగితే అంతరిక్షంలో మరిన్ని పంటలను పండించేందుకు దోహదపడుతుందని జెంగ్ అన్నారు." అయినా చైనా ఏమీ తొలిసారిగా అంతరిక్షంలో మొక్కలు పెంచలేదు. గతేడాది జూలైలో చాంగ్ 5 అనే మిషన్‌తో ఒక వ్యొమోగామి బృందం వరి మొక్కను పెంచింది. ఈ మేరకు చైనా అంతరిక్షంలో తాము మొక్కలను ఏవిధంగా పెంచామో వివరించేలా ఒక వీడియోని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వీక్షించండి. (చదవండి: రష్యా సుమారు 50 వేల బలగాలతో సైనిక విన్యాసాలు... టెన్షన్లో యూఎస్) -
క్రయోనిక్స్: ఇలా చేస్తే మృత శరీరం వందేళ్లయినా అలానే ఉంటుంది.. ఆపై..
Cryonics Part 6: బ్రతికున్న మనిషి క్షణాల్లో ప్రాణాలు కోల్పోయే అతి శీతలీకరణ వాతావరణంలో మానవ అండాల్ని ఏళ్ళతరబడి నిల్వ చేస్తున్నారు. దీనివల్ల అండంలో ఎలాంటి రసాయన మార్పులు చోటు చేసుకోకపోవడం వల్ల జీవితం స్తంభించిపోతుంది. మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు అండం జీవితం మళ్ళీ మొదలవుతుంది. ఇటువంటి శీతలీకరణ వాతావరణంలో పెద్దవారి గుండె, మెదడు, ఇతర అవయవాలను నిల్వ ఉంచితే అవి స్తంభించిపోతాయి. అలా గంట సేపటి వరకు వాటిలో ఎటువంటి రసాయన మార్పులు జరగకుండా నిరోధించి తర్వాత యధాస్థితికి తీసుకురావచ్చు. అవయవాల మార్పిడి కోసం వీటిని ఒక చోటు నుంచి మరో చోటుకు ఇటువంటి పరిస్థితుల్లో నిల్వ చేసే తీసుకువస్తారు. ప్రస్తుత కాలంలో అండంతో సహా అవయవాల్లో జీవాన్ని స్తంభింపచేసి, తిరిగి యధాస్తితికి తీసుకురావడంలో సక్సెస్ అయిన సైంటిస్టులు భవిష్యత్ లో మనిషి ప్రాణాన్ని కూడా తిరిగి తీసుకువస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. శరీరాలను ఫ్రీజ్ చేయకుండా విట్రిఫికేషన్ చేయడం ద్వారా మానవ శరీర కణజాలం శిధిలం కాకుండా కాపాడుతారు. ఫ్రీజర్ లో ఐస్ ఏర్పడుతుంది. కాని మైనస్ 120 సెంటిగ్రేడ్ కంటే తక్కువలో కూడా ఐస్ ఏర్పడకుండా కేవలం శీతలీకరించడాన్నే విట్రిఫికేషన్ గా పిలుస్తారు. ఇందులో క్రయో ప్రొటెక్టెంట్స్ గా పిలిచే అత్యంత గాఢమైన రసాయనాలను ఉపయోగిస్తారు. దీనివల్ల మృత శరీరం వందేళ్లయినా ఎలా ఉంచింది అలాగే ఉంటుంది. పంచభూతాలతో నిర్మితమైన మృత శరీరాన్ని వందేళ్ళయినా శిధిలం కాకుండా నిల్వ చేయగలిగే పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినపుడు.. ఆ శరీరానికి తిరిగి ప్రాణం పోసే టెక్నాలజీ కూడా కచ్ఛితంగా రూపొందుతుందని ఆశిస్తున్నారు. ఒక జీవిలో సాధారణంగా జరిగే రసాయనమార్పులు క్రమం తప్పితే, ఒక పద్ధతి లేకుండా సాగితే మరణం సంభవిస్తుంది. అటువంటపుడు రసాయన మార్పులను యధాస్థితికి తీసుకురావడం సాధ్యం కాదు. అయితే క్రయోనిక్స్ విధానంలో చనిపోయిన మనిషి శరీరంలో కణజాలం ధ్వంసం కాకుండా రసాయనమార్పులను స్తంభింపచేయడం ద్వారా నిల్వ చేసి భవిష్యత్ లో తిరిగి వారికి జీవం రప్పించడమే క్రయోనిక్స్ లక్ష్యమంటున్నారు. చదవండి: Cryonics Part 5: సర్జరీ చేసేటప్పుడు డాక్టర్లు రోగి శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తారు.. ఎందుకో తెలుసా! -
మరణించిన వారి శరీరం, మెదడు డ్యామేజ్ కాకుండా ఉంచగలిగితే..
చనిపోయిన మనిషిని బ్రతికించగలమంటున్నాయి కొన్ని పరిశోధనా సంస్థలు. అమెరికా, రష్యా దేశాల దగ్గర మాత్రమే ఈ టెక్నాలజీ ఉందని చెబుతున్నారు. శవాలతో వ్యాపారం చేసే సైంటిఫిక్ సంస్థలకు ఊపిరి పోస్తున్నాయి సైంటిస్టుల మాటలు. జీవి ఏదైనా మరణించిన గంట తర్వాతి నుంచి శిధిలావస్థ మొదలవుతుంది. కాని మంచు ప్రాంతాల్లో చనిపోయిన మనుషులు లేదా జంతువులు కొన్ని సంవత్సరాల తర్వాత కూడా పాడవకుండా కనిపించిన ఉదంతాలు ఉన్నాయి. అదేవిధంగా మైనస్ 196 సెంటీగ్రేడ్ డిగ్రీల టెంపరేచర్ లో వందేళ్ళయినా మృతుడి శరీరం పాడవకుండా భద్రపరచగల ఏర్పాట్లు చేశాయి అమెరికాలోని రెండు సంస్థలు. అవే ఆల్కర్ లైఫ్ ఎక్స్ టెన్షన్ ఫౌండేషన్, క్రయోనిక్ ఇనిస్టిట్యూట్లు. ఆల్కర్ 1972లో ఏర్పడగా...క్రయోనిక్ ను 1976లో స్థాపించారు. చదవండి: Cryonics: చనిపోయిన మనిషిని తిరిగి బ్రతికించగలమా?సైన్స్ ఏం చేప్తోందంటే! క్రయోనిక్స్ టెక్నాలజీ అంటే అత్యంత శీతల వాతావరణం సృష్టించి మనిషి శరీరం పాడవకుండా భద్రపరచడమే. మరణించిన వారి శరీరం, మెదడు డ్యామేజ్ కాకుండా ఉంచగలిగితే...వారు ఏ కారణంతో చనిపోయారో..దానికి తగిన చికిత్స అందుబాటులోకి వస్తే...ఆ చికిత్స లేదా సర్జరీ ద్వారా వారిని తిరిగి బ్రతికించగలగడమే క్రయోనిక్స్ ఉపయోగం అని చెబుతున్నారు. ప్రస్తుతానికి ప్రపంచంలో ఇటువంటి టెక్నాలజీ అందుబాటులో లేదు. భవిష్యత్ లో అత్యంత ఉన్నతస్థాయి చికిత్సలు అందుబాటులోకి వస్తే చనిపోయినవారిని తిరిగి బ్రతికించగలమనే నమ్మకంతో ఈ సంస్థలు కోట్ల రూపాయల ఫీజు తీసుకుని మృత శరీరాలను పాడవకుండా భద్రపరుస్తున్నాయి. ఈ పరిశోధన ఎంత దూరం వచ్చింది? థర్డ్ స్టోరీలో చదవండి.. -
చనిపోయిన మనిషిని తిరిగి బ్రతికించగలమా? సైన్స్ ఏం చేప్తోందంటే!
టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఎక్కడో ఓ చోట కూర్చుని ప్రపంచాన్ని కంట్రోల్ చేయగల శక్తిని సంపాదించాడు మనిషి. సౌర కుటుంబం ఆవల ఏముందో తెలుసుకుంటున్నాడు. తనలాంటి మనుషులు ఏదైనా గ్రహంలో ఉన్నారేమోనని శోధిస్తున్నాడు. అదేవిధంగా తన సుఖ సంతోషాల కోసం చేయని ప్రయత్నం లేదు. ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నా చావును ఎందుకు జయించలేకపోతున్నామని మదనపడుతున్నాడు. మరణాన్ని జయిస్తే ఎలా ఉంటుందనే ప్రయత్నాలు ప్రారంభించాడు. ►చావును జయించే క్రమంలో ఎంతవరకు ప్రయాణించాడు...? ►మృత్యువును జయించగలమా? ►చనిపోయిన మనిషిని తిరిగి బ్రతికించగలమా? ►చావును ఆపగల శక్తి మనిషికి వచ్చేసిందా? ►డబ్బు ప్రపంచంలో మనిషి బలహీనతలను సొమ్ము చేసుకునే మరో వ్యాపారమా? చదవండి: Meteor Lights Up Chile Sky: ఆకాశంలో అద్భుతం.. ఒక్క సెకనులో రాత్రి పగలుగా మారింది.. ఎక్కడంటే? ఇన్స్యూరెన్స్ పాలసీని రెన్యువల్ చేయించుకున్నట్లుగా... జీవిత కాల పరిమితి పూర్తయిన వాహనాలకు గ్రీన్ టాక్స్ కట్టి లైఫ్ పొడిగించుకున్నట్లుగా మనిషి తన జీవితాన్ని రెన్యువల్ చేసుకోగలడా? జీవిత కాలాన్ని తనకు కావాల్సిన విధంగా పెంచుకోగలడా? తిరిగి బ్రతికించగలమనే మూఢ నమ్మకాలతో కన్న బిడ్డలను చంపుకున్న తల్లిదండ్రుల గురించి కొంతకాలం క్రితం విన్నాం. అనేక మంది బాబాలు, స్వాములు చనిపోయినవారిని బ్రతికించారనే ప్రచారాన్ని అప్పుడప్పుడూ వింటుంటాం. జీవరాశుల పుట్టుకకు కారణమైన పంచ భూతాల గుట్టుమట్లను తెలుసుకునే స్థాయికి చేరుకుంటున్నామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అదేకోవలో.. గ్రహాంతర వాసుల కోసం అనేక సంవత్సరాలుగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే..చనిపోయిన మనిషిని బ్రతికించగలమంటున్నారు కొందరు సైంటిస్టులు. అసలు ఈ స్థాయికి మనిషి మేధస్సు పెరిగిందా? నిజంగా శవాన్ని బ్రతికించగల టెక్నాలజీ తయారయిందా? జబ్బులు, చావులు, వృద్ధాప్యం వంటి సమస్యలు లేని ప్రపంచాన్ని చూడగలమా?... చూడగలమనే అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇవన్నీ సరే, చనిపోయిన మనిషిని అసలు మళ్లీ బతికించగలమా? మనుష్యులు చేస్తోన్న పరిశోధన ఎంత దూరం వచ్చింది? సెకండ్ స్టోరీలో చదవండి.. -
తక్కువ ముళ్లు.. ఎక్కువ రుచి! అప్పలు చేప.. లాభాలు గొప్ప!
కష్టాలకు ఎదురీదుతూ చేపలు పడుతూ.. కడుపు నింపుకొంటున్న గంగపుత్రులకు సంద్రమంత లాభాలు తీసుకొచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విభిన్న ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా కొత్త కొత్త వంగడాలు సృష్టిస్తూ.. జలపుష్పాలు పెంచేందుకు నీలివిప్లవం సృష్టించే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఆఫ్రికా, ఆస్ట్రేలియా తీరాల్లో లాభాల పంట పండిస్తున్న అప్పలు చేపను విశాఖ మత్స్యకారులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సముద్ర మత్స్య పరిశోధన కేంద్ర సంస్థ (సీఎంఎఫ్ఆర్ఐ) చేస్తున్న ప్రయోగాలు చివరి దశకు చేరుకున్నాయి. సాక్షి, విశాఖపట్నం : లుట్జానిడే కుటుంబానికి చెందిన జాన్ స్నాపర్ (అప్పలు చేపలు) ఇండో–వెస్ట్ పసిఫిక్‌లో తూర్పు ఆఫ్రికా నుంచి ఫిజీ వరకు, దక్షిణాన ఆస్ట్రేలియా వరకు విస్తరించిన సముద్ర జలాల్లో విరివిగా పెరుగుతుంటాయి. మన దేశంలోనూ ఈ చేపలు పశి్చమ, తూర్పు తీరాల్లోనూ అరుదుగా కనిపిస్తుంటాయి. ఈ చేపలు ఎక్కువగా పగడపు దిబ్బలు, రాళ్లు, లోతైన సముద్రాల్లో పెరుగుతుంటాయి. వేగవంతమైన వృద్ధి, పరిస్థితులకు సులభంగా పెరిగే స్వభావం వీటి సొంతం. అందుకే విశాఖతో పాటు తమిళనాడు, కొచ్చి తీర ప్రాంతంలో ప్రజలకు పెంపకానికి అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు సీఎంఎఫ్ఆర్ఐ శాస్త్రవేత్తలు. నాలుగేళ్లుగా పరిశోధనలు.. విశాఖలోని సీఎంఎఫ్ఆర్ సంస్థ అప్పలు రకం చేపను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. వేటకు వెళ్లే వారికి చాలా అరుదుగా దొరికే ఈ చేపల్లో తక్కువ ముళ్లు, ఎక్కువ రుచితో ఉండే ఆయా చేపలకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంటోంది. కేజీ రూ.450 నుంచి రూ.500వరకు ధర పలుకుతోంది. ఈ కారణంగా వీటిని పెంచేందుకు మత్స్యకారులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో గంగపుత్రులకు అప్పలు అందించేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. నాలుగేళ్ల క్రితం ఏడాది పాటు శ్రమించి 100కిపైగా ఆడ జాన్ స్నాపర్స్, మగ జాన్ స్నాపర్స్ని సముద్రం నుంచి సేకరించారు. ఇందులో 20 మేలుజాతి జతల ద్వారా పరిశోధనలు చేపట్టారు. సీఎంఎఫ్ఆర్ఐ శాస్త్రవేత్తలు డాక్టర్ రితేశ్ రంజన్, డాక్టర్ శుభదీప్ ఘోష్, డాక్టర్ శేఖర్ బృందం కలిసి భారత బయో టెక్నాలజీ విభాగం నుంచి ఒక ప్రాజెక్టుకు అర్హత సాధించారు. సేకరించిన అప్పలు చేపలను కృత్రిమంగా పెంచే విధానంపై పరిశోధనలు ప్రారంభించారు. చివరి దశకు చేరుకున్న పరిశోధనలు ప్రయోగశాలలో ఉంచిన సముద్రపు నీటిలో అప్పలు చేపలు పెరుగుదల ఉండటాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. పెరుగుదలతో పాటు ఉత్పత్తి కూడా అద్భుత ఫలితాల్ని ఇచ్చినట్లు గుర్తించారు. నాలుగేళ్ల కాలంలో అప్పలు చేపలకు వివిధ రకాల ఆహారాల్ని అందించి ఏ ఆహారం సులువుగా జీర్ణమవుతుందోనని పరీక్షలు నిర్వహించి అన్నివిధాలుగా సఫలీకృతులయ్యారు. ఇందుకోసం ఆడ,మగ చేపలు ఒకదానికొకటి ఆకర్షితులయ్యేలా ప్రత్యేక ఇంజక్షన్లు ఇచ్చి ఉత్పత్తిని పెంచేలా చేసిన పరిశోధనలు సత్ఫలితాలిచ్చినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. 42 గంటల్లో ఆడమగ చేపలు ప్రేరిపితమై సంతానోత్పత్తికి సిద్ధమైనట్లు గుర్తించారు. గుడ్లు పెట్టేలా చేయడంలోనూ సీఎంఎఫ్ఆర్ఐ శాస్త్రవేత్తలు విజయం సాధించారు. ఈ గుడ్లను పిల్లలుగా మారేందుకు ప్రయోగశాలల్లో ప్రత్యేకంగా ఉన్న 2 టన్నుల సామర్థ్యం కలిగిన హేచరీల్లో అనుకూల వాతావరణాన్ని అభివృద్ధి చేశారు. 28 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రతలో 14 గంటల లార్వా నుంచి బయటికి వచ్చినట్లు వెల్లడించారు. తర్వాత వేల సంఖ్యలో చేప పిల్లలు బతకడంతో పాటు పెద్దవిగా పెరిగాయి. 42 రోజుల పెంపకం తర్వాత 3.67% మనుగడ రేటు సాధించినట్లు గుర్తించారు. సాధారణంగా ఏడాది వ్యవధిలో కిలోకి పైగా బరువు పెరగడాన్ని గమనించారు. ఒక్కోచేప మూడున్నర కేజీల వరకూ పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలా 125 టన్నుల వరకూ చేపల్ని పెంచి పరిశోధనలు నిర్వహిస్తున్నారు. ఈ పరిశోధనలు చివరి దశకు వచ్చినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. త్వరలోనే మత్స్యకారులకు ఈ అప్పలు చేపలను పెంపకానికి అందిస్తామని వెల్లడించారు. తీరాలలో ఏర్పాటు చేసిన కేజ్ కల్చర్ విధానంలో వీటిని పెంచేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఈ చేపల పెంపకం విజయం సాధిస్తే.. మత్స్యకారులకు అప్పలు చేపలు లాభాల పంట పండించినట్లే. -
పండు ఈగకు ‘వలపు వల!’
సాక్షి, అమరావతి బ్యూరో: పులిని బంధించడానికి బోను ఏర్పాటు చేస్తారు. అందులో మాంసాన్ని ఎరగా వేస్తారు. ఆ మాంసాన్ని తినడానికి వచ్చిన పులి బోనులో చిక్కుతుంది. ఇప్పుడు మామిడిని దెబ్బతీస్తున్న పండు ఈగల నియంత్రణకు సరికొత్త ఎరను ప్రయోగిస్తున్నారు. ఈ ఎరతో రైతులు సత్ఫలితాలు పొందుతున్నారు. ఏమిటా ఎర? ఏమా కథ? మామిడికాయ పక్వానికి వచ్చాక లోపలికి పండు ఈగ ప్రవేశిస్తుంది. లోపల తల్లి ఈగ పిల్లలను పెట్టి కాయ పండాక రసాన్ని పీల్చేస్తుంది. ఇలాంటి కాయల కొనుగోలుకు వ్యాపారులు, ఎగుమతిదార్లు ముందుకురాక రైతులు నష్టపోతున్నారు. కోతకొచ్చే దశలో సగటున నాలుగో వంతు మామిడిని ఈ పండు ఈగ దెబ్బతీస్తోంది. ఏళ్ల తరబడి వేధిస్తున్న ఈ సమస్యపై డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయంలోని నూజివీడు మామిడి పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు ‘ఫ్రూట్ ఫ్లై లూర్’ పేరిట ఓ ఎరను అందుబాటులోకి తెచ్చారు. ఆడ ఈగ సంపర్కానికి సన్నద్ధమయ్యే సమయంలో ఒక రకమైన వాసన విడుదల చేస్తుంది. ఆ వాసనకు ఆకర్షించిన మగ ఈగ.. ఆడ ఈగ వెంటపడుతుంది. క్రిమిసంహారకమందు, రసాయనాలతో రూపొందించిన ఈ లూర్ ఆడ ఈగ సంపర్కానికి ముందు విడుదల చేసే వాసనను పోలి ఉంటుంది. ఈ లూర్ (ఎర)ను ఒక ట్రాప్ బాక్సులో ఉంచి మామిడి చెట్టుకు కడతారు. ఆ బాక్సులో ఆడ ఈగలున్నాయని భ్రమించి మగ పండు ఈగలు ట్రాప్ బాక్సులోకి వెళ్లి ఆ క్రిమిసంహారక ద్రవంలో చిక్కుకుని చనిపోతాయి. సహజంగా ఆడ పండు ఈగలకంటే మగ ఈగల సంతతే అధికంగా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని శాస్త్రవేత్తలు సంతాన ఉత్పత్తికి కారణమయ్యే మగ పండు ఈగలను నియంత్రించేందుకు ఈ లూర్‌ను గత మార్చి నెల నుంచి విస్తృతంగా అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా పదివేల లూర్‌లను ఉద్యానశాఖ ద్వారా పంపిణీ చేశారు. ఒకసారి ట్రాప్ బాక్స్‌లో వేసిన లూర్ నెలరోజుల పాటు ప్రభావం చూపుతుంది. ఇక ఆడ పండు ఈగల నియంత్రణకు కూడా ఈ శాస్త్రవేత్తలు మరో ద్రావణాన్ని సూచిస్తున్నారు. పులిసిన కల్లు, బెల్లం, మలాథియాన్‌తో తయారు చేసిన ద్రావణాన్ని మామిడి తోటలో ఉంచితే ఆడ పండు ఈగలు దాన్ని ఆకర్షించి చనిపోతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ధర కూడా స్వల్పమే.. ఇక ఈ లూర్ ధర కూడా రైతుకు అందుబాటులోనే ఉంది. లూర్ రూ.40, ట్రాప్ బాక్స్ రూ.100 చొప్పున రైతులకు అందజేస్తున్నారు. ఒక ఎకరం తోటకు నాలుగైదు ఏర్పాటు చేస్తే సరిపోతుంది. ఇలా ఒక ఎకరం మామిడి తోటకు వీటి ఖర్చు గరిష్టంగా రూ.700కు మించదు. ఎకరం తోటలో సగటున 4 టన్నుల దిగుబడి వస్తుంది. ఇందులో కనీసం ఒక టన్ను పండు ఈగ బారిన పడుతుంది. అంటే రైతుకు ఎకరానికి దాదాపు రూ.10 వేలు నష్టం వాటిల్లుతుంది. లూర్కు రూ.700 వెచ్చిస్తే రైతుకు కనీసం రూ.9 వేలు ఆదా అవుతుంది. రాష్ట్రంలో 3.74 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో మామిడి ఉంది. ఏటా 40 లక్షల టన్నుల దిగుబడి వస్తుంది. ఇందులో కనీసం 10 లక్షల టన్నుల మామిడిని పండు ఈగ దెబ్బతీస్తోందని అంచనా. ఇలా ఏటా రాష్ట్రంలో పండు ఈగ సుమారు రూ.1,000 కోట్ల విలువైన మామిడి పంటను నాశనం చేస్తోంది. పండు ఈగతో ఏటా నష్టపోతున్న రైతు ఈ స్వల్ప ఖర్చుతో నివారణ మార్గం లభించడంతో లూర్‌పై ఆసక్తి పెంచుకుంటున్నారని నూజివీడు ఉద్యానశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు ‘సాక్షి’కి చెప్పారు. రైతులకు అవగాహన కల్పిస్తున్నాం పండు ఈగతో నష్టపోకుండా అందుబాటులోకి తెచ్చిన ఫ్రూట్ ఫ్లై లూర్‌పై మామిడి రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ఈ ఈగ బారిన పడ్డ మామిడిని ఎగుమతిదార్లు తీసుకోక ఆశించినంతగా ఎగుమతులు జరగడం లేదు. ఎగుమతులు పెంచడంతోపాటు రైతులకు పండు ఈగ బెడద తగ్గించే ఉద్దేశంతో ఫ్రూట్ ఫ్లై లూర్‌ను విస్తృతం చేస్తున్నాం. ఈ ఏడాది తొలిసారిగా రాష్ట్రంలో 10 వేలకు పైగా లూర్‌లను అందించాం. – బీకేఎం లక్ష్మి, సీనియర్ సైంటిస్ట్, హెడ్, మామిడి పరిశోధన స్థానం, నూజివీడు లూర్‌తో సత్ఫలితాలు.. ఏళ్ల తరబడి పండు ఈగ బెడదను ఎదుర్కొంటున్నాం. ఏటా నాలుగో వంతు పంటను పండు ఈగ దెబ్బతీస్తోంది. ఇన్నాళ్లు వీటి నివారణకు మంటలు వేయడం, టైర్లు కాల్చడం వంటివి చేసేవాళ్లం. అయినా ఆశించిన ఫలితం ఉండేది కాదు. ఇప్పుడు లూర్‌తో పండు ఈగల నివారణ సాధ్యమవుతోంది. నేను 5 ఎకరాల్లో 30 ఫ్రూట్ ఫ్లై లూర్‌లను ఏర్పాటు చేశాను. సత్ఫలితాలివ్వడంతో పండు ఈగ బెడద తప్పింది. – చెలికాని మురళీకృష్ణారావు, రైతు, కోటపాడు, కృష్ణాజిల్లా చదవండి: ఏపీ: 400 మంది ప్రాణాలను కాపాడిన పోలీసులు ఏలూరు: కార్పొరేషన్ ఎలక్షన్ కౌంటింగ్‌కు హైకోర్టు అనుమతి -
చైనా సంచలనం; సూర్యుడి ప్రతిసృష్టి!
బీజింగ్: కరోనా వైరస్ పుట్టుకకు కారణమైన చైనాపై ప్రపంచ దేశాలు అసహనంతో ఉన్నాయి. తన తీరుతో ఇతర దేశాలకు ఆగ్రహం తెప్పించే డ్రాగన్ దేశం తాజాగా అవే దేశాలు మెచ్చుకునేలా చేసింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనా టెక్నాలజీతో ప్రయోగాలు చేయడంలో ముందుంటుంది. అలా అత్యాధునిక సాంకేతికతను తన సొంతం చేసుకుంటూ అగ్రరాజ్యం అమెరికాను సైతం వణికేలా చేస్తుంది. అయితే సృష్టికి ప్రతిసృష్టి అన్నట్టుగా ఈ డ్రాగన్ దేశం తాజాగా కృత్రిమ సూర్యుడిని తయారు చేసింది. తన సాంకేతికతతో ఆర్టిఫిషియల్ సన్ను తయారు చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. తమ దేశ శాస్త్రవేత్తలు కృత్రిమ సూర్యుడిని విజయవంతంగా తయారు చేసినట్లు మంగళవారం చైనా ప్రభుత్వ మీడియా ప్రకటించింది. ఈ సూర్యుడి పేరు హెచ్ఎల్-2ఎమ్ టోకామాక్ రియాక్టర్. ఇది చైనాలో అతి పెద్ద, అడ్వాన్స్డ్ న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రయోగ పరిశోధనా పరికరమని.. ఇది న్యూక్లియర్ ఎనర్జీని విజయవంతంగా ఇవ్వగలదని సైంటిస్టుల అంచనా. అయితే ప్రపంచ దేశాలు ఎప్పుడు తనవైపే చూడాలన్నది చైనా కోరిక. అందుకే ఏకంగా సూర్యుడినే తయారు చేసి సాంకేతికపరంగా ఇతర దేశాలు తమ వైపు చూసేలా ప్రయోగం చేసి చూపించింది. (చదవండి: యూఎస్ తర్వాత ఆ రికార్డు చైనాదే..) చైనా తయారు చేసిన కృత్రిమ సూర్యుడు అత్యంత శక్తివంతమైన మాగ్నెటిక్ ఫీల్డ్‌ను కలిగి ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇక ఈ న్యూక్లీయర్ గుండా వేడి ప్లాస్మాను విచ్చిన్నం చేసి దాని ద్వారా 15 కోట్ల డిగ్రీల సెల్సియస్(అసలు సూర్యుడి మధ్య భాగంలో ఉండే వేడి కంటే 10 రెట్లు ఎక్కువ) ఎనర్జీని విడుదల చేయగలదని చైనా ‘పీపుల్స్ డైలీ’ వెల్లడించింది. ఇది ఎక్కువ పవర్ రిలీజ్ చేస్తున్నందున దీన్ని ‘ఆర్టిఫిషియల్ సన్’గా పిలుస్తున్నట్లు స్పష్టం చేశారు. అయితే సూర్యుడి పరమాణు కేంద్రంలో విపరీతమైన సూపర్ పవర్ ఉంటుంది. అణువులను విచ్ఛిన్నం చేస్తే దాని నుంచి విపరీతమైన ఎనర్జీ విడుదలవతుంది. అందుకే ఈ రియాక్టర్ ద్వారా చైనా పరిశోధకులు అదే చేశారు. కాగా ఈ రియాక్టర్ వాయువ్య చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో ఉంది. 2019లోనే చైనా దీని నిర్మాణాన్ని పూర్తి చేసింది. దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలంగా ముందుకు తీసుకెళ్లేందుకే చైనా ఈ ప్రయోగం చేసినట్లు తెలుస్తోంది. 2006 నుంచి ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్ తయారీపై చైనా సైంటిస్టులు దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ కూడా ప్రపంచంలోనే అతి పెద్ద న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్ తయారు చేస్తోంది. అది 2025 నాటికి పూర్తికానుందని ప్రాన్స్ సైంటిస్టులు భావిస్తున్నారు. (చదవండి: చైనా సూపర్ సైనికులను సృష్టిస్తోంది: అమెరికా) -
గాల్లోంచి నీరు.. కొత్త రికార్డు!
గాల్లోని తేమను పిండి, నీటిగా మార్చేందుకు ఇటీవలి కాలంలో బోలెడన్ని యంత్రాలు, టెక్నాలజీలూ అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇవేవీ అనుకున్నంత సమర్థంగా పనిచేయవు. గంటల సమయం తీసుకుని అరకొరగా నీళ్లు ఇస్తాయీ యంత్రాలు. ఈ నేపథ్యంలో జాన్ హాప్కిన్స్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్స్ (ఎంఓఎఫ్)పై చేసిన ప్రయోగం అందరి దష్టిని ఆకర్శిస్తోంది. కేవలం ఒక గ్రాము మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్ పదార్థం ఫుట్‌బాల్ మైదానమంత ఉపరితలం కలిగి ఉంటుంది. గతంలోనూ ఈ ఎంఓఎఫ్లతో గాల్లోని తేమను నీటిగా మార్చవచ్చునని రుజువైంది. కిలోగ్రాము ఎంఓఎఫ్తో బెర్క్లీ యూనివర్శిటీ కాలేజీ ఒక రోజులో వంద మిల్లీలీటర్ల నీటిని ఒడిసిపట్టగలిగింది. గత ఏడాది ఈ మోతాదు 1.3 లీటర్లకు చేరింది. జాన్హాప్కిన్స్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు మాత్రం ఏకంగా 8.66 లీటర్ల నీటిని ఒడిసిపట్టడంలో విజయం సాధించారు. తాము ఇప్పటివరకూ దాదాపు పది ఎంఓఎఫ్లపై ప్రయోగాలు చేశామని, వీటిల్లో ఒకటి ప్రతి కిలోగ్రాము పదార్థానికి ఒక రోజులో 8.66 లీటర్ల నీటిని అందిస్తోందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఝియాంగ్ షీ తెలిపారు. వాతావరణ పరిస్థితులను మార్చడం ద్వారా మరింత ఎక్కువ నీటిని రాబట్టేందుకు ఉన్న అవకాశాలను ప్రస్తుతం పరిశీలిస్తున్నామని చెప్పారు. పరిశోధనల వివరాలు సైంటిఫిక్ రిపోర్ట్స్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. -
రేపు పీఎస్ఎల్వీ సీ47 ప్రయోగం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష ప్రయోగకేంద్రం సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి బుధవారం ఉదయం 9.28కి పీఎస్ఎల్వీ సీ47ను నింగిలోకి పంపనున్నారు. సోమవారం బ్రహ్మప్రకాష్ హాలులో జరిగిన మిషన్ సంసిద్ధతా సమావేశం (ఎంఆర్ఆర్)లో ఇస్రో శాస్త్రవేత్తలు అధికారికంగా నిర్ణయించారు. ఎంఆర్ఆర్ కమిటీ చైర్మన్ బీఎన్ సురేష్ ఆధ్వర్యంలో సోమవారం రాకెట్‌కు అన్ని రకాల పరీక్షలు నిర్వహించాక ప్రయోగానికి అంతా సిద్ధం అని ప్రకటించారు. ప్రయోగ పనులను లాంచ్ ఆథరైజే షన్ బోర్డుకు అప్పగించారు. బోర్డు చైర్మన్ ఆర్ముగం రాజరాజన్ ఆధ్వర్యంలో సోమవారం సమావేశం నిర్వహించి ప్రయోగానికి 26 గంటల ముందు అంటే మంగళ వారం ఉదయం 7.28కి కౌంట్‌డౌన్ ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకున్నారు. పీఎస్ఎల్వీ సీ47 ద్వారా 714 కిలోల బరువు కలిగిన కార్టోశాట్–3 సిరీస్‌లో ఎనిమిదో ఉపగ్రహంతో పాటు అమెరికా 12 ఫ్లోక్–4పీ అనే బుల్లి ఉపగ్రహాలు, మెష్‌బెడ్ అనే మరో బుల్లి ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపేందుకు సిద్ధం చేస్తున్నారు. ఇది షార్ నుంచి 74వ ప్రయోగం. -
శబ్దాన్ని చూసేద్దాం పదండి..
మీరెప్పుడైనా శబ్దాన్ని చూశారా..? ప్రశ్న తప్పుగా అడుగుతున్నామని భ్రమపడకండి. ఆ ప్రశ్న నిజమే.. అదేంటి శబ్దాన్ని వింటాం కానీ.. చూడటమేంటి.. ఇదే కదా మీ మనసులో మెదిలే ప్రశ్న? ఈ ఫొటోలో ఉన్నదేంటో తెలుసా.. శబ్ద తరంగాలు. ఎంత అందంగా ఉన్నాయో కదా.. అమెరికాలోని ఫిలడెల్ఫియా పట్టణానికి చెందిన లిండెన్ గ్లెడ్‌హిల్ అనే శాస్త్రవేత్త, ఫొటోగ్రాఫర్, ఫార్మాసూటికల్ బయోకెమిస్ట్కు శబ్దాన్ని చూడటం, వాటితో ఆడుకోవడం అంటే సరదా.. అంతే కాదు శబ్దాన్ని ఫొటో తీసి అందరికీ చూపించడం ఆయనకు అదో తృప్తి. 'అందుకే శబ్ద తరంగాలను వివిధ తరంగ ధైర్ఘ్యాల వద్ద ఫొటోలు తీస్తుంటాడు. శబ్దాలను ఫొటో తీసే పరికరం చాలా సులువుగా ఉంటుందని గ్లెడ్‌హిల్ వివరించాడు. స్పీకర్‌పై పలుచటి పొరపై నీరు ఉంటుందని, ఆ నీటిపై ఎల్ఈడీ కాంతిని ప్రసరిస్తామని చెప్పాడు. ‘నీటి గుండా శబ్దాన్ని పంపడం వల్ల తరంగాలు ఏర్పడతాయి. ఈ తరంగాలను ఎల్ఈడీ కాంతిని వెదజల్లే ఉపరితలంపైకి పంపుతాం. ఈ సమయంలో శబ్దాన్ని కెమెరా ఫొటోలు తీస్తుంది. తరంగాలు మనం నిర్ణయించే పౌనఃపుణ్యాన్ని బట్టి మారుతుంది. దాన్ని బట్టే ఫొటోలు కూడా మారుతాయి’అని వివరించాడు. -
హోటల్ పుష్పక్
ఇండియన్ సినిమా చరిత్రలో ఒక ఒక గొప్ప ప్రయోగం అనిపించుకున్న ఓ సినిమాలోని కొన్ని సన్నివేశాలివి. ఒక్కటంటే ఒక్క డైలాగ్ కూడా లేని ఈ సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం... అతడు చాలాకాలంగా నిరుద్యోగంలోనే బతుకుతున్నాడు. ఆనంద భవన్ అనే పాతబడ్డ అపార్ట్మెంట్లో చిన్న పెంట్‌హౌస్‌లో ఉంటాడతను. తినడానికి కాదు కదా, కనీసం టీ తాగడానికి కూడా అతని దగ్గర డబ్బుల్లేవు. ‘వేకెన్సీ’ అన్న బోర్డున్న ప్రతిచోటకీ కాలినడకనే వెళ్లి వస్తున్నాడు. ఎక్కడా ఉద్యోగం దొరకడం లేదు. ఒకరోజు రాత్రివరకూ రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నాడు. చీకట్లో రోడ్డు పక్కన, మురికి కాలువ దగ్గర ఒక మనిషి బాగా తాగి పడిపోయి కనిపించాడతనికి. ఆ మనిషి ఖరీదైన బట్టలు వేసుకొని ఉన్నాడు. స్పృహ లేదు. అతడు ఆ మనిషిని పూర్తిగా పరిశీలించి, ఆ మనిషి జేబులో ఉన్న ఓ ఫైవ్‌స్టార్ హోటల్లోని గది తాళంచెవిని తీసుకున్నాడు. తాగి పడిపోయిన ఆ వ్యక్తిని ఎత్తుకొని తీసుకెళ్లి ఆనంద భవన్‌లోని తన గదిలో కట్టిపడేశాడు. అతడు ఆ తాళంచెవిని మార్చి మార్చి చూసుకున్నాడు. ఈరోజున్న అతడి ఆర్థిక పరిస్థితికి అలాంటి ఒక హోటల్లోకి అడుగు కూడా పెట్టలేడు. అలాంటిది అదే హోటల్లో లగ్జరీ స్వీట్లో ఉండబోతున్నాడు ఇప్పుడు. పుష్పక్ హోటల్. స్వీట్ నంబర్ 3039. తాగి రోడ్డుమీద పడిపోయిన వ్యక్తి గత కొద్దికాలంగా ఇక్కడే ఉంటున్నాడు. అతడు ఆ తాళంచెవిని తీసుకొని స్వీట్‌లోకి అడుగుపెట్టాడు. ఇక్కడి వాతావరణం అంతా అతడికి కొత్తగా ఉంది. చుట్టూ తిరిగి చూశాడు. చాలారోజులుగా ఖాళీ కడుపుతో ఉన్నవాడు, ఇవ్వాళ మాత్రం కావాల్సింది తెప్పించుకొని తిన్నాడు. బాత్‌టబ్‌లో స్నానం చేశాడు. కొద్దిసేపటికి బాల్కనీకి వచ్చి పరిసరాలను గమనించాడు. బాల్కనీ నుంచి చూస్తే ఆమె కనిపించింది. చాలా రోజుల తర్వాత ఆమెను చూశాడతను. చెయ్యి ఊపాడు. కాసేపు ఇద్దరూ సైగలతోనే మాట్లాడుకున్నారు. అంతకుముందు ఆమెనతను రెండుసార్లు చూశాడుగాని ఇలా ఇద్దరూ ఎప్పుడూ మాట్లాడుకోలేదు. ఆ తర్వాత అతను తిరిగొచ్చి పడగ్గది మొత్తం వెతికితే చాలా డబ్బులు దొరికాయి. అవన్నీ ఒక దగ్గర దాచిపెట్టుకున్నాడు. కొత్త బట్టలు వేస్కొని, చాలాకాలంగా మురికిపట్టి ఒంటిమీదనే ఉన్న బట్టలను మంచం కిందకి విసిరిపారేశాడు. అతని వ్యవహారం మొత్తం మారిపోయింది. స్టయిల్ కళ్లద్దాలు పెట్టుకొని తనని తాను చూసుకొని మురిసిపోయాడు. ఆనంద భవన్‌కు వెళ్లి తాను కిడ్నాప్ చేసిన వ్యక్తిని చూసొస్తున్నాడు. ఈ హోటల్లో సకల వసతులతో సుఖంగా ఉంటున్నాడు. అతడు పరిచయం చేసుకున్న అమ్మాయి ఒక పెద్ద మెజీషియన్ కూతురు. ఆ హోటల్లో ఆయన తన ప్రదర్శనలిస్తున్నాడు. ఆ ఈవెంట్లోనే ఒక విషయంలో ఆమె అతణ్ని తప్పుగా అర్థం చేస్కొని చీ కొట్టింది. కోపంతో అతడి చెంప మీద గట్టిగా కొట్టింది. అతడు ఆ రాత్రంతా ఆమె తనను ఎందుకు కొట్టిందా అని ఆలోచిస్తూ నిద్ర కూడా పోలేదు. ఇదే సమయానికి ఆ హోటల్లో ఒక ప్రొఫెషనల్ కిల్లర్ దిగాడు. కొద్దిరోజులుగా ఇక్కడే ఉంటున్న ఓ వ్యక్తిని హత్య చేయమంటూ ఆ కిల్లర్‌కు సుపారీ అందింది. ప్రొఫెషనల్ కిల్లర్ చంపాల్సిన వ్యక్తి 3039లో ఉంటున్నాడు. ఆమె అదే రోజు, అదే ఈవెంట్లో తన తప్పు తెలుసుకుంది. అతణ్ని తప్పుగా అర్థం చేసుకున్నందుకు తనని తాను తిట్టుకుంది. అతడు ఎదురైతే ‘సారీ’ చెప్పాలని ఎదురుచూస్తోంది.3039లో ఉన్న వ్యక్తి ఎదురైతే అతణ్ని చంపాలని ప్రొఫెషనల్ కిల్లర్ ఎదురుచూస్తున్నాడు. చిన్న టీ స్టాలు నడుపుకుంటూ జీవితాన్ని మొదలుపెట్టి, పుష్పక్ అంతటి ఫైవ్‌స్టార్ హోటల్‌ను నిర్మించిన వ్యక్తి చివరిసారిగా తన హోటల్‌ను ఆసాంతం చూసుకొని కన్నుమూశాడు. ప్రొఫెషనల్ కిల్లర్‌కు అవకాశం దొరికింది, 3039 వ్యక్తిని చంపడానికి. ఆమెకూ ఒక అవకాశం దొరికింది, అతణ్ని కలిసి ‘సారీ’ చెప్పడానికి. ఆమె అతనికి ఎదురుపడి అతని చెయ్యందుకొని కళ్లతోనే సారీ చెప్పేసింది. రోజులు గడుస్తున్నాయి. ఇద్దరికీ మళ్లీ మళ్లీ కలిసే అవకాశాలు తక్కువే అయినా, ఇద్దరూ ఒకరికొకరు బాగా దగ్గరయ్యారు. ప్రేమలో పడిపోయారు. 3039 వ్యక్తిని చంపడానికి ప్రొఫెషనల్ కిల్లర్ అన్ని ప్లాన్స్ గీసుకుంటున్నాడు. రిహార్సల్స్ చేస్తున్నాడు. మంచు కత్తిని కూడా తయారుచేసుకున్నాడు. అతడికి ఆమె మరింత దగ్గరవుతోంది. ఇద్దరూ కలిసి సినిమాలకు వెళుతున్నారు. షికార్లు తిరుగుతున్నారు. అతడామెకు ఖరీదైన బహుమతులు కొనిపెడుతున్నాడు. ఎంత ఖర్చుపెడుతున్నా అతని దగ్గర డబ్బులు మాత్రం అయిపోవడం లేదు. తాను ఆనంద భవన్లో ఉండే, టీ తాగడానికి కూడా డబ్బుల్లేని ఒక నిరుద్యోగ యువకుడినని అతడు మరచిపోయాడు. ప్రొఫెషనల్ కిల్లర్ అతణ్ని చంపడానికి అతని వెనకే చాటుగా వెంబడిస్తున్నాడు. అతడు దీన్ని పసిగట్టాడు. తననెవరో గమనిస్తున్నారని తెలుసుకొని జాగ్రత్తగా ఉంటున్నాడు. ఆ ప్రొఫెషనల్ కిల్లర్ ఎటువైపు వెళుతున్నాడో గమనించి, తనూ వెనకాలే వెళ్లి చూశాడు. అప్పుడు తెలిసింది అతనికి, 3039లో ఉంటున్న వ్యక్తిని చంపడానికి ఒక పెద్ద ప్లాన్ నడుస్తోందని. ఒంటరిగా రోడ్డు మీద నిలబడి చాలాసేపు చుట్టూ ప్రపంచాన్ని చూశాడతను. తాను ఎవరి జీవితాన్నో బతుకుతున్నాడని అర్థమయ్యాక తన మీదే తనకు అసహ్యమేసింది. ఈ డబ్బులో బతకడం అతని వల్ల కాలేదు. హోటల్లో మంచం కిందికి విసిరేసిన తన బట్టలు తీసి వేసుకున్నాడు. దాచిపెట్టుకున్న డబ్బులన్నీ యథాస్థానంలో పెట్టేశాడు. ఆనంద భవన్‌కు వెళ్లి రాత్రివరకూ ఎదురుచూసి తాను కిడ్నాప్ చేసిన మనిషిని ఎత్తుకెళ్లి ఏ రోడ్డు మీదైతే ఆ మనిషి తాగి పడిపోయి కనిపించాడో, అదే రోడ్డు మీద వదిలేశాడు. హోటల్లో తను ప్రేమించిన అమ్మాయి మేజిక్ షోలో బిజీగా ఉంది. ఆమెకు తన గురించి అంతా చెప్తూ ఒక ఉత్తరం రాసి, ఆమెకు కనిపించేలా ఓ టేబుల్ మీద పెట్టి బయటకు వచ్చాడతను. ఆ ఉత్తరం చదివి ఆమె ఎలా స్పందిస్తుందా అని ఎదురుచూస్తూ హోటల్ బయటే నిలబడ్డాడు. షో అయిపోయాక ఆమె వాళ్ల నాన్నతో కలిసి కారులో వెళుతూ అతణ్ని చూసింది. చేతిలో ఒక పువ్వు పట్టుకొని అతనికి ఇవ్వడానికి ఆమె చుట్టూ చూస్తోంది. అతణ్ని గమనించింది. కారు దిగే అవకాశం లేదు. అప్పటికప్పుడు ఓ కాగితమ్మీద తన ఇంటి అడ్రస్ రాసి ఆ పువ్వుతో పాటు కాగితాన్ని రోడ్డు మీద పడేసింది. అతను ఆ పువ్వు తీసుకున్నాడు. కాగితాన్ని అందుకునే లోపే ఆ కాగితం గాల్లో ఎగురుతూ ఎగురుతూ ఒక పెద్ద మురికికాలువలో పడి కొట్టుకుపోయింది. దూరంగా ఆమె కారులో వెళ్లిపోతూంటే అతడు నిస్సహాయంగా చూస్తూ నిలబడ్డాడు. -
జీశాట్–11 ప్రయోగానికి ఇస్రో గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) జీశాట్–11 ప్రయోగానికి అనుమతి ఇచ్చింది. ఫ్రెంచ్‌గయానాలోని కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి మే 26న ప్రయోగించాల్సిన 5,700 కేజీల బరువున్న జీశాట్–11 ప్రయోగాన్ని ఇస్రో ఇంతకుముందు నిలిపివేసింది. ఈఏడాది మార్చిలో ప్రయోగించిన జీశాట్–6ఏ విఫలమైన నేపథ్యంలో మరిన్ని పరీక్షలు చేసేందుకు వీలుగా ఇస్రో ఈ నిర్ణయం తీసుకుంది. పూర్తిస్థాయిలో అన్ని పరీక్షలు నిర్వహించిన అనంతరం ఉపగ్రహం దోషరహితంగా ఉండటంతో ప్రయోగానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఎక్కువ బరువున్న ఉపగ్రహాలను ప్రయోగించే ‘ఏరియన్ స్పేస్’ సంస్థ స్లాట్ దొరకగానే జీశాట్–11ను కక్ష్యలో ప్రవేశపెడతామని ఇస్రో పేర్కొంది. -
భూ మధ్యరేఖ వద్ద అద్భుతం
సాక్షి, వెబ్ డెస్క్ : భూ మధ్యరేఖ వెళ్తున్న కెన్యా దేశంలో చేసిన ఓ ప్రయోగం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. కెన్యా పర్యటనకు వచ్చిన ఓ విదేశీయుడికి స్థానికులు ఈ ప్రయోగాన్ని చేసి చూపించారు. భూ మధ్యరేఖకు ఉత్తరాన తొలుత ఈ ప్రయోగాన్ని నిర్వహించగా నీటిలో వేసిన పువ్వు కుడి వైపు నుంచి తిరగడం(క్లాక్ వైజ్ డైరెక్షన్) ప్రారంభించింది. అదే భూ మధ్యరేఖకు దక్షిణాన ఈ ప్రయోగాన్ని నిర్వహించగా నీటిలో వేసిన పువ్వు ఎడమ వైపు నుంచి(యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్) తిరిగింది. అదే సమయంలో కచ్చితంగా భూ మధ్యరేఖ వద్ద ప్రయోగం చేయగా.. పువ్వు కదలకుండా ఉండిపోయింది. దీన్ని చూసిన విదేశీయులు మీరేమైనా మేజిక్ చేశారా? అంటూ నిర్వహికులను ప్రశ్నించగా అదేం లేదని సమాధానమిచ్చారు. పువ్వు అలా ఎందుకు తిరిగింది? మూడు సందర్భాల్లో పువ్వులో మార్పులు కనిపించడానికి కారణం భూమికి ఉన్న అయస్కాంత శక్తి. భూ మధ్యరేఖ నుంచి దూరం వెళ్లే కొద్దీ(అంటే ధ్రువాల వైపు ప్రయాణించే కొద్దీ) భూమి అయస్కాంతత్వం పెరుగుతుంది. ధ్రువాల వద్ద దీని విలువ అత్యధికంగా ఉంటుంది. అదే సమయంలో భూ మధ్యరేఖ వద్ద దీని విలువ అతి తక్కువ. ఈ సూత్రాలనే పైన ప్రయోగానికి అప్లై చేస్తే భూ మధ్య రేఖకు ఉత్తరానికి వెళ్లినప్పుడు భూ అయస్కాంత రేఖలు ఎటువైపు ప్రయాణిస్తున్నాన్నాయో అటువైపే పువ్వు తిరిగింది. అలానే భూ మధ్యరేఖ దక్షిణ ప్రాంతంలో కూడా. ఇదే సమయంలో కచ్చితంగా భూ మధ్యరేఖపై ప్రయోగం చేయడం వల్ల ఎలాంటి బలాలు పువ్వుపై పని చేయకపోవడంతో అది ఎటూ కదల లేదు. -
ఇది మేజిక్ కాదు.. భూమికి ఉన్న అయస్కాంత శక్తి
-
నేడు జీఎస్ఎల్వీ ఎఫ్08 ప్రయోగం
-
29న జీఎస్ఎల్వీ ఎఫ్–08 ప్రయోగం
శ్రీహరికోట (సూళ్లూరుపేట): శ్రీ పొట్టి శ్రీరా ములు నెల్లూరు జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగవేదిక నుంచి ఈనెల 29న సాయంత్రం 4.29 గంటలకు జీఎస్ఎల్వీ ఎఫ్–08 ప్రయోగా న్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నా రు. దీనికి సంబంధించి మంగళవారం 2,140 కిలోలు బరువు ఉన్న జీశాట్–6ఏ ఉపగ్రహాన్ని రాకెట్ శిఖరభాగాన అమర్చే పనులను పూర్తి చేశారు. 21, 22 తేదీల్లో రాకెట్‌కు గ్లోబల్ చెకింగ్ చేయనున్నారు. అనంతరం ఈ నెల 23 తేదీన ఉదయాన్నే జీఎస్ఎల్వీ ఎఫ్–08 రాకెట్‌ను అనుసందాన భవనం నుంచి ప్రయోగవేదిక వద్దకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నా రు. వారం రోజులపాటు అన్ని తనిఖీలు నిర్వహించి 29న ప్రయోగించడమే లక్ష్యం గా శాస్త్రవేత్తలు పనులు పూర్తి చేస్తున్నారు. -
జాబిల్లిపై చైనా మొక్కల పెంపకం...
ఇంకొన్నేళ్ల తరువాతైనా మనిషి ఇతర గ్రహాలపైకి విస్తరించక తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారా? అంగారకుడిపైకి ఇంకో ఐదేళ్లలో మనుషుల్ని పంపేస్తానని ఇలాన్ మస్క్ లాంటి వారు ప్రతిపాదిస్తున్నారా? తామేం తక్కువ అనుకున్నారో ఏమోగానీ... చైనా ఈ దిశగా ఒక అడుగు ముందుకేసింది. సుదూర గ్రహాలను చేరే ముందుగానే.. జాబిల్లిపై మొక్కలు పెంచాలని నిర్ణయించుకుంది. ఈ ఏడాది మన పొరుగుదేశం ప్రయోగించే ఛాంగీ –4 ప్రయోగం సక్సెస్ అయితే జాబిల్లిపై మనకు కనిపించని వైపున మొక్కలు పెంచడం మొదలవుతుందని అంచనా. జూన్‌లో జాబిల్లికి దాదాపు 60 వేల కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలోకి ఓ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టడం ద్వారా ఈ కార్యక్రమం మొదలు కానుంది. ఆ తరువాత రెండో దశలో జాబిల్లి పైకి ఓ రోవర్, ల్యాండర్లను ప్రయోగిస్తారు. ఇందులోనే కాయగూరల విత్తనాలు, పట్టుపురుగు గుడ్లు ఉంటాయి. పట్టుపురుగు గుడ్లు పొదిగి పురుగులు బయటకొస్తే అవి కాస్తా మొక్కలు పెరిగేందుకు అవసరమైన కార్బన్ డయాక్సైడ్ను ఇస్తాయి. అలాగే విత్తనాలు మొక్కలుగా మారుతూ ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. ఈ రెండు ప్రక్రియల ద్వారా జాబిల్లిపై చిన్న ప్రాంతంలో ప్రత్యేకమైన వాతావరణాన్ని సిద్ధం చేయవచ్చునన్నది చైనీయుల అంచనా. జాబిల్లి రెండో వైపున ఉండే అతిపెద్ద బిలం వద్ద ఈ ప్రయోగం జరిగే అవకాశముంది. -
ఔషధ బాధితుడు మాయం
సాక్షి ప్రతినిధి, వరంగల్: క్లినికల్ ప్రయోగాల కేసు కొత్త మలుపు తీసుకుంది. ఔషధాల ప్రయోగం వికటించి వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతున్న బాధితుడు ఆస్పత్రి నుంచి వెళ్లిపోయాడు. అయితే, బాధితుడు స్వచ్ఛందంగా వెళ్లిపోయాడా.. లేదా ఎవరైనా తప్పించారా... అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఔషధ ప్రయోగ బాధితుడు బోగ సురేశ్ రక్తపు వాంతులు చేసుకోవడంతో అతడిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి ఆదివారం తీసుకువచ్చారు. అయితే, ఈ కేసు విచారణ నిమిత్తం సెంట్రల్ డ్రగ్ కంట్రోల్ అధికారులు ఎంజీఎంలో మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణ చేపట్టాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో 7 గంటలకే సురేశ్ ఎంజీఎం నుంచి వెళ్లిపోయాడు. ఐదుగురు అపరిచితులు విచారణ రోజే బాధితుడు మాయం కావడం అనుమానాలకు తావిస్తోంది. విచారణ నుంచి తమను కాపాడుకునేందుకు ఫార్మా కంపెనీలు ఏమైనా పన్నాగం పన్నాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మంగళ వారం ఉదయం 6 గంటల సమయంలో ఐదుగురు వ్యక్తులు సురేశ్‌తో మాట్లాడేందుకు వార్డుకు వచ్చారు. పదిహేను నిమిషాల పాటు అక్కడే ఉన్నారు. తర్వాత అందరూ కలసి వెళ్లిపోయారు. ఎంతకీ తిరిగి రాకపో వటంతో వైద్య సిబ్బంది అప్రమత్తమై ఉన్నతాధికారులకు సమాచారం అందిం చారు. సురేశ్‌ను కలిసిన ఐదుగురు వ్యక్తులు ఎవరనేది మిస్టరీగా మారింది. -
నిండు ప్రాణం బలి
అంతా రహస్యం ఉక్కులాంటి మనిషి... పిట్టపిడుగున పోయాడు. భార్యాపిల్లలు భోరుమని ఏడుస్తున్నారు. ఊహించని హటాత్పరిణామం వారిని ఒక్కసారిగా కుదిపేసింది. ఆ కుటుంబం ఒక్క క్షణంలో నిరాధారమైపోయింది. పోయింది జీవనాధారం మాత్రమే కాదు, పెద్ద ఆలంబన కూడా. ఎప్పుడూ జ్వరం, తలనొప్పి అని కూడా అనని మనిషికి ఉన్నట్లుండి ఒక చెయ్యి చచ్చుబడిపోయింది, పొట్ట ఉబ్బిపోయింది, కుప్పకూలిపోయాడు. ఇంతకీ ఎలా పోయాడంటారు? చూడడానికి వచ్చిన వాళ్లలో ఎవరో ఆరాగా అడుగుతున్నారు... దానికి సమాధానం లేదు. అవును, ఎవరి దగ్గరా జవాబు లేదు. ఒక్క ప్రాణాలు వదిలిన వ్యక్తి దగ్గర తప్ప. భార్యాపిల్లలకూ మిగిలింది ప్రశ్నలే. ఎలా దర్యాప్తు చేస్తే ఆధారం దొరుకుతుంది? ఇది కూడా బదులు దొరకని ప్రశ్నే. కరీంనగర్‌కు చెందిన వంగర నాగరాజుకు 39 ఏళ్లు. క్యాటరింగ్ పనులకు వెళ్లేవాడు. అలా క్యాటరింగ్ పనుల మీద పొరుగూళ్లకు పోవడం, నాలుగైదు రోజులకు రావడం మామూలే. అయితే బెంగళూరుకు పోయింది ఆహారాన్ని వడ్డించడానికి కాదు, ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టడానికి అని అతడు చనిపోయిన తర్వాత బయటపడింది. పెద్దకొడుకు జగదీశ్‌కి తండ్రి మరణం అనుమానాస్పదంగా అనిపించింది. తల్లికి కూడా చెప్పకుండా ఇంట్లో తండ్రి వస్తువులన్నీ వెతికాడు. పెట్టెలో అట్టడుగున కొన్ని కాగితాలు దొరికాయి. ఆ దొరికిన కాగితాలు బెంగళూరులోని ఒక లాబొరేటరీకి సంబంధించినవి. అక్కడ ఏం జరుగుతుంది? అది మందుల పనితీరును పరిశీలించే ప్రయోగశాల. ఆ ప్రయోగాలు మనుషుల మీదనే జరుగుతున్నాయి. ఒక కొత్త మందు తయారైన తర్వాత దాని పనితీరును నిర్ధారించుకోవడానికి మనుషులను పావులు చేస్తున్నారు. ఆర్థిక కష్టాల్లో ఉన్న వారికి డబ్బు ఎర వేస్తారు. ప్రయోగానికి నా దేహాన్ని ఉపయోగించుకోవచ్చు అని ఆ వ్యక్తి చేత సంతకాలు తీసుకుంటారు. ఇదొక విషవలయం. ఎక్కడో తయారయ్యే మందులను మార్కెట్లో విడుదల చేయడానికి ముందు జరగాల్సిన ప్రయోగాల కోసం మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న బడా కంపెనీల మాయా నాటకమే ఇదంతా. తండ్రికి జరిగిన మోసం అర్థమైంది జగదీశ్‌కి. బెంగళూరులోని ల్యాబొరేటరీని ఫోన్లో సంప్రదించాడు. లాబ్ నిర్వహకులు ‘అతడికి సంబంధించిన డాక్యుమెంట్లను పోస్టులో పంపిస్తాం’ అని క్లుప్తంగా చెప్పి ఫోన్ పెట్టేశారు. ఒక ప్రాణం పోయినందుకు ఆ కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వడం వంటి బాధ్యతాయుతమైన నిర్ణయం తీసుకునే దాఖలాలు కనిపించడం లేదు. ఇలాంటి ప్రయోగాల కోసం ఒక్కొక్కరికి ఐదు నుంచి పాతికవేల రూపాయలు ఇస్తుంటారని సమాచారం. కొంతమంది స్వచ్ఛందంగా ప్రయోగానికి అంగీకరిస్తుంటారు కూడ. నాగరాజుతో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకున్నారనేది తెలియలేదు. ఎర వేస్తారు! ఇందులో మందుల తయారీ కంపెనీల ప్రమేయం నేరుగా ఉండదు. ప్రయోగం, నిర్ధారణ మరొక కంపెనీకి అప్పగిస్తారు. ఆ కంపెనీలు అత్యంత రహస్యంగా పావులు కదుపుతాయి. ఇందుకోసం ఓ నెట్వర్క్ చాపకింద నీరులా పని చేస్తుంటుంది. దాదాపుగా కిడ్నీ రాకెట్‌లాంటిదే. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ... చేస్తున్న పనిలో వచ్చే సంపాదన ఇంటిని పోషించడానికి సరిపోక ఇబ్బందులు పడుతున్న వాళ్లనీ, వాళ్లలో ఆరోగ్యంగా ఉండే వారిని కనిపెడతారు. వారికి డబ్బు ఎర చూపించి వల వేస్తారు. సందిగ్ధంలో ఉన్న వారిని మాటలతో గారడీ చేస్తారు. ఒప్పించిన తర్వాత వాళ్లను బెంగళూరులో ఉన్న తమ ఏజెంటుతో కలుపుతారు. ఏజెంటు మనుషులు రైల్వేస్టేషన్లో వీరితో కలుస్తారు. అక్కడి నుంచి వాహనంలో ఎక్కించుకుని నేరుగా ల్యాబ్ దగ్గర దించుతారు. ఆరోగ్య పరీక్షలు, సంతకాలు పూర్తయ్యాక వారి మీద మందుల ప్రయోగం జరుగుతుంది. వాటి ఫలితాలను నమోదు చేసుకుని కొంత డబ్బిచ్చి పంపేస్తారు. మళ్లీ నెలకో, రెండు నెలలకో వాళ్లు చెప్పిన సమయానికి హాజరు కావాల్సి ఉంటుంది. ఈ విషవలయంలో చిక్కుకున్న వాళ్ల పరిస్థితి దాదాపుగా నాగరాజులాగానే ఉంటుంది. చదవడానికి ఇదేదో సినిమా కథలా ఉందేమో కానీ, రీల్ కాదు... రియల్. అసలు విషయమేమిటంటే.... ఆయా కంపెనీలు ఇలాంటి క్లినికల్ ట్రయల్స్‌ని ప్రభుత్వానికి నివేదించాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం వాళ్లు నివేదిస్తారు. అయితే... అవన్నీ ప్రాణాల మీదకు రాకుండా బయటపడిన వాళ్ల రిపోర్టులే ఉంటాయి. మందులు ప్రాణం పోస్తాయి, ప్రయోగాల దశలో కొన్ని ప్రాణాలను తీస్తాయి కూడ! -
ప్రయోగం.. కొంచెమైతే గోవిందా..!
ప్రపంచంలో చాలా మంది తమ కిక్కు కోసం వింత వింత పనులు, ప్రయోగాలు చేస్తుండటం గమనించే ఉంటాం. కొందరు తమ మనసుకు ఉల్లాసం కలిగించేందుకు ఎలాంటి పర్యవసానాలనూ ఆలోచించకుడా అనిపించిందే తడువుగా ఆ పనిని పూర్తి చేస్తుంటారు. ఇందులో భాగంగా ఏదైనా తప్పు జరిగినట్లయితే ఎందుకు చేశాన్రా అని.. ఏ పొరపాటూ జరగకపోతే హమ్మయ్య అనుకొని ఊపిరి పీల్చుకుంటారు. ఇలాగే ఓ వ్యక్తి కూడా దాదాపు ఓ పిచ్చి ప్రయోగం చేసి రెప్పపాటులో ప్రాణ గండం నుంచి తప్పించుకున్నాడు. దాదాపు గుండె ఆగిపోయేంతటి ప్రమాదాన్ని స్వయంగా ఎదుర్కొన్నాడు. ఇప్పుడా వీడియో యూ ట్యూబ్‌లో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో చూపించిన ప్రకారం.. ఓ వ్యక్తి ఓ రిఫ్రిజిరేటర్‌ను కొంత మంది వ్యక్తుల సహాయంతో తీసుకొచ్చి ఓ మైదానంలో తనకు దూరంగా పెట్టాడు. ఆ రిఫ్రిజిరేటర్ నిండా కొన్ని రకాల పేలుడు పదార్థాలు నింపాడు. అనంతరం రెండు శాఖలుగా విడిపోయిన ఓ పెద్ద చెట్టు చాటుకు వెళ్లి నిలుచున్నాడు. చెట్టుకు ఉన్న రెండు శాఖల మధ్యలో నుంచి తుపాకీని ఎక్కుపెట్టి నేరుగా ఆ రిఫ్రిజిరేటర్కు గురి చూసి షూట్ చేశాడు. దాంట్లో పేలుడు పదార్థాలు ఉన్న కారణంగా... అది భారీ శబ్దంతో పేలిపోయింది. ఈ పేలుడు ధాటికి రిఫ్రిజిరేటర్ డోర్ నేరుగా అతడి మీదకే దూసుకొచ్చింది. అదృష్టం కొద్దీ... అతడు చెట్టు చాటున ఉండటంతో ఆ డోర్ దూసుకొచ్చి చెట్టుకు బలంగా తగిలింది. దీంతో రెప్పపాటులో ప్రాణాలతో అతగాడు బయటపడ్డాడు. లేదంటే ప్రయోగమెలా ఉన్నా... అసలుకే ఎసరు వచ్చేది.