fish Prasadam
-
ముగిసిన చేప ప్రసాదం పంపిణీ, మిస్ అయిన వాళ్ల కోసం..
సాక్షి, హైదరాబాద్: మృగశిర కార్తె సందర్భంగా ప్రారంభమైన చేప ప్రసాదం పంపిణీ ముగిసింది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిన్న ఉదయం 10 గంటకు ప్రారంభమైన ఈ పంపిణీ కార్యక్రమం ఈ రోజు ఉదయం 11 గంటల వరకు కొనసాగింది. మొత్తం 1,60,000 చేప పిల్లలు సిద్ధం చేయగా, నిన్న 60 వేలకు పైగా భక్తులు చేప ప్రసాదం స్వీకరించారు. అయితే ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం తీసుకోని వారికి మరో అవకాశం కల్పించారు బత్తిని సోదరులు. కవాడి గూడ, దూద్ బౌలి లోని తమ నివాసల్లో చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. ఇక 24 గంటలపాటు సాగిన చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం.. ప్రత్యేక ఏర్పాట్ల మధ్య కొనసాగింది. అయితే.. 30 కౌంటర్లకు పైగా ఏర్పాటు చేసినా క్యూ లైన్లల్లో మహిళలకు, వృద్దులకు, దివ్యంగులకు ప్రత్యేక లైన్స్ లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు.టోకెన్ తీసుకున్న వారికే చేప మందు ప్రసాదం పంపిణీ చేయడం.. ఉదయం నుంచే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వద్దకు ఉబ్బసం వ్యాధిగ్రస్తులు క్యూ కట్టడంతో ఆ ప్రాంతమంతా కోలాహలం నెలకొంది. -
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో కొనసాగుతున్న చేప మందు పంపిణీ
-
ఉబ్బసం రోగులకోసం చేప ప్రసాదం
అబిడ్స్ / గన్‌పౌండ్రీ/ సిరికొండ: ఉబ్బసం రోగుల కోసం చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం నగరంలో ని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో శనివారం ఉదయం ప్రారంభమైంది. రెండురోజుల పాటు బత్తిని కుటుంబం ఆ ధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమాన్ని శాసనసభ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్షి్మ, మత్స్యశాఖ చైర్మన్ మెట్టు సాయికుమార్, టీపీసీసీ కార్యనిర్వహణ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మీడియాతో మా ట్లాడుతూ, 150 సంవత్సరాలుగా మృగశిరకార్తెను పురస్కరించుకుని బత్తిన కుటుంబీకులు ఉచితంగా, సేవాభావంతో లక్షలాది మందికి చేపప్రసాదం పంపిణీ చేస్తున్నారన్నారు. తెలంగాణతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల నుంచి వచ్చిన వేలాది మంది అస్తమా రోగుల సౌకర్యార్థం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని పేర్కొన్నారు. 32 కౌంటర్ల ద్వారా చేపప్రసాదం... జీహెచ్ఎంసీ, ఆర్అండ్బీ, వాటర్ బోర్డు, విద్యుత్, రెవెన్యూ, మత్స్యశాఖ, పోలీస్‌శాఖ, ట్రాఫిక్ శాఖ లతో పాటు పలు శాఖల అధికారులు చేపప్రసాద పంపిణీకోసం భారీ ఏర్పాట్లు చేశారని పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా లన్ని శాఖల అధికారులు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారని, 32 కౌంటర్ల ద్వారా చేపప్రసాదం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. వాటర్‌బోర్డు ఆధ్వర్యంలో మంచినీరు సరఫరా చేయగా, పలు స్వచ్ఛంద సేవా సంస్థలు రోగులకు అల్పాహారం అందించాయి.వాటర్‌బోర్డు ఆధ్వర్యంలో దాదాపు 6 లక్షల మంచినీటి ప్యాకెట్లు ఉచితంగా అందించారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ పరిసరాల్లో పెద్దఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాన్స్ యాదవ్ ఆధ్వర్యంలో అబిడ్స్ ఏసీపీ చంద్రశేఖర్, బేగంబజార్ ఇన్స్పెక్టర్ విజయ్‌కుమార్‌లు భారీ బందోబస్తు ఏర్పాటు చేశా రు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో దాదాపు 60వేల చేపపిల్లలను శనివారం రాత్రి వరకు విక్రయించినట్లు మత్స్యశాఖ అధికారులు వెల్లడించారు. ఆదివారం వరకు చేపప్రసాదం పంపిణీ జరుగనుందని వెల్లడించారు.క్యూలైన్లో సొమ్మసిల్లి మృతి.. చేపమందు కోసం హైదరాబాద్ వచ్చిన నిజా మాబాద్ జిల్లా సిరికొండ మండలం తాళ్లరామడుగు గ్రామానికి చెందిన మామిడి గొల్ల రాజన్న (65) తొక్కిస లాటలో మృతి చెందాడు. శనివారం ఉదయం క్యూలైన్లో వేచి ఉన్నప్పుడు, ఒకేసారి జనాన్ని పంపించడంతో తోపులాట జరిగి రాజన్న కిందపడిపోయాడు. అంబులెన్స్‌లో అతన్ని ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. -
Fish Prasadam 2024 : చేప ప్రసాదం కోసం పోటెత్తిన జనాలు (ఫొటోలు)
-
చేప మందు పంపిణీకి ఏర్పాట్లు పూర్తి
-
నాంపల్లి : చేప ప్రసాదం పంపిణీ.. భారీగా తరలి వచ్చిన జనం (ఫొటోలు)
-
రేపటి నుంచి చేప ప్రసాదం పంపిణీ
-
చేప ప్రసాదంగా కొల్లేరు కొర్రమీను
కైకలూరు: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని కొల్లేరు కొర్రమీను పిల్లలు (సీడ్) ఆస్తమా నివారణలో ఔషధంగా మారాయి. మృగశిరకార్తె రోజున హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో బత్తిన సోదరులు అందించే చేప ప్రసాదానికి కొల్లేరు ప్రాంత కొర్రమీను పిల్లలను సరఫరా కానున్నాయి. తెలంగాణ స్టేట్ ఫిషరీస్ కో–ఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ (టీఎస్ ఎఫ్సీఓఎఫ్) ఆధ్వర్యంలో చేప మందు ప్రసాదం నిమిత్తం టెండర్లను ఆహా్వనించింది. దాదాపు 5 లక్షల నుంచి 7 లక్షల వరకు కొర్రమీను పిల్ల అవసరమని గుర్తించారు. తెలంగాణ మత్స్యశాఖ అధికారులు కొర్రమీను సీడ్ అందించే సీడ్ ఫామ్‌లను పరిశీలించి నివేదికను అక్కడి ప్రభుత్వానికి అందించారు. తెలంగాణలో లభ్యత లేకపోవడంతో.. చేప ప్రసాదానికి తెలంగాణలో సరిపడినన్ని చేప పిల్లల లభ్యత లేకపోవడంతో ఏపీ నుంచి కొర్రమీను పిల్లలకు మే 21న టెండర్లు ఆహా్వనించింది. ఏపీ నుంచి కొల్లేరు ప్రాంతాలైన ఏలూరు జిల్లాలోని ముదినేపల్లి మండలం దేవపూడి ఫణిరామ్ ఫిష్ సీడ్ ఫామ్, ఏలూరుకు చెందిన దుర్గమల్లేశ్వర ఫిష్ హేచరీస్, కలిదిండి మండలం పోతుమర్రు, పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు నుంచి దుర్గ ఫిష్ సీడ్ ఫామ్‌తో పాటు తెలంగాణలోని నల్గొండ, హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు కలిపి మొత్తం ఏడుగురు టెండర్లను దాఖలు చేశారు. తెలంగాణకు చెందిన వనపర్తి, ఖమ్మం, హన్మకొండ, సంగారెడ్డిలకు చెందిన జిల్లా మత్స్యశాఖ అధికారులకు పర్యవేక్షణ బాధ్యతను అక్కడి ప్రభుత్వం అప్పగించింది. ఖమ్మం మత్స్యశాఖ అధికారి డి.ఆంజనేయస్వామి నేతృత్వంలో అధికారులు టెండర్లు వేసిన ఏపీలో సీడ్ ఫామ్‌లను పరిశీలించి ఈ నెల 25 తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక అందించారు. పోషకాల గని కొర్రమీను కొర్రమీను పిల్ల చాలా హుషారుగా ఉంటుంది. ఇది మీటరు వరకు పెరుగుతుంది. మంచినీటి సరస్సులు, పొలాల బోదెలు, బురద నేలల్లో ఇవి పెరుగుతాయి. వీటిలో 18–20 శాతం మాంసకృత్తులు ఉంటాయి. ఆకు కూరల్లో లభించే విటమిన్ ‘ఏ’ కంటే కొర్రమీనులో ఉండే విటమిన్ ‘ఏ’ తేలిగ్గా జీర్ణమవుతుంది. వీటిలో గంధకం కలిగిన లైసిన్, మిథియానిక్, సిస్టిన్ అమినో యాసిడ్లు లభిస్తాయి.చేప మందుతో కొర్రమీనుకు గుర్తింపు ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు వంటి శ్వాస సంబంధ వ్యాధుల నివారణకు చేప ప్రసాదాన్ని హైదరాబాద్‌లో బత్తిన సోదరులు ఉచితంగా అందిస్తారు. కరోనా కారణంగా మూడేళ్లు ఆగిన ప్రసాదం పంపిణీ ఈ ఏడాది జూన్ 8న మృగశిరకార్తె ప్రారంభమయ్యే ఉదయం 11 నుంచి 9వ తేదీ ఉదయం 11 గంటల వరకు పంపిణీ చేయనున్నారు. వీరు తయారు చేసిన ప్రత్యేక మందును కొర్రమీను పిల్ల సహా నోటిలో వేస్తారు. తెలంగాణకు సరఫరా చేసే కొర్రమీను పిల్ల సైజు 2 అంగుళాల నుంచి 3 అంగుళాలు ఉండాలి. నల్ల రంగులో హుషారుగా ఉండాలి. ప్రస్తుత మార్కెట్లో ఒక్కో కొర్రమీను పిల్ల రూ.30 ధర పలుకుతోంది. పిల్ల సేకరణ ఓ సవాల్ కొర్రమీను పిల్లను సేకరించడం పెద్ద సవాల్‌గా మారుతోంది. కొల్లేరు సరస్సు, పొలాల గుంతల్లో కొర్రమీను తల్లి చేపను గుర్తిస్తారు. తల్లి వద్ద తిరిగే వేలల్లో పిల్లలను సేకరించి సిమెంటుతో చేసిన కుండీలలో ప్రత్యేకంగా పెంచుతారు. రోజుకు మూడుపూటలా నీరు మారుస్తారు. నాలుగు పూటలా మేత వేస్తారు. తెలంగాణ వరకు వ్యాన్లలో అత్యంత జాగ్రత్తగా వీటిని రవాణా చేస్తారు. కొల్లేరు ప్రాంతాల నుంచి వెళ్లే వ్యాన్లలో పిల్లలకు మూడు ప్రాంతాల్లో నీటిని మార్పు చేస్తారు. చేప మందు ప్రసాదం నిమిత్తం జూన్ 6వ తేదీన ఉదయం హైదారాబాద్‌కు కొల్లేరు కొర్రమీను పిల్లల్ని తరలించనున్నారు.కొల్లేరు ప్రాంతం అనుకూలం చిత్తడి నేలల ప్రాంతమైన కొల్లేరు సరస్సులో సహజసిద్ధంగా కొర్రమీను పెరుగుతుంది. నల్లజాతి చేపల్లో కొర్రమీనుకు ప్రత్యేక స్థానం ఉంది. కొల్లేరు పరీవాహక ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాలకు వీటిని సరఫరా చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో కొర్రమీను సాగు సైతం చేస్తున్నారు. కొర్రమీనులో పోషకాహారాలు అధికంగా ఉంటాయి. – షేక్ చాన్‌బాషా, ఫిషరీస్ ఏడీ, కైకలూరు -
జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ
హైదరాబాద్: ఆస్తమా, ఉబ్బసం సంబంధించిన వ్యాధిగ్రస్తులకు ఇస్తున్న చేప ప్రసాదం ఈ సంవత్సరం జూన్ 8వ తేదీన శనివారం ఉదయం 11 గంటల నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో పంపిణీ చేయనున్నట్లు బత్తిని గౌడ్స్ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బత్తిని అమర్నా«థ్‌గౌడ్, శివ శంకర్ గౌడ్, గౌరీశంకర్ గౌడ్లు మాట్లాడుతూ 8వ తేదీ ఉదయం 11 నుంచి 9వ తేదీ ఉదయం 11 వరకు 24 గంటల పాటు నిరంతరాయంగా చేప ప్రసాదం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. తరువాత 3 రోజులపాటు దూద్»ౌలిలోని తమ నివాసం వద్ద పంపిణీ చేస్తామని తెలిపారు. ఇప్పటికే 3 లక్షల చేప పిల్లలు సిద్ధంగా ఉంచినట్లు, జీహెచ్ఎంసీ, ఆర్టీసీ, వాటర్‌వర్క్స్, మున్సిపాలిటీ, పోలీస్ ఎప్పటిలాగే సహాయ సహకారాలు అందించాలని లేఖలు రాసినట్లు తెలిపారు. సోషల్ మీడియాలో జూన్ 7వ తేదీ ప్రసాదం పంపిణీ అని వార్తలు వస్తున్నాయని, అది తప్పుడు వార్త అని..8నే ప్రసాదం పంపిణీ ఉంటుందని చెప్పారు. -
8న హైదరాబాద్‌లో చేప ప్రసాదం పంపిణీ
చార్మినార్/దూద్‌బౌలి (హైదరాబాద్): మృగశిర కార్తె సందర్భంగా ప్రతీ ఏడాది మాదిరిగానే ఈసారి కూడా హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఆస్తమా రోగులకు చేప ప్రసాదాన్ని పంపిణీ చేయడానికి బత్తిని కుటుంబ సభ్యులు అంతా సిద్ధం చేస్తున్నారు. మృగశిర కార్తె ప్రవేశం రోజైన జూన్ 8వ తేదీన చేప ప్రసాదం పంపిణీ జరుగుతుందని శుక్రవారం బత్తిన అనురీత్‌గౌడ్, గౌరీ శంకర్‌గౌడ్‌లు మీడియాకు తెలిపారు.చేప ప్రసాదం తయారీలో భాగంగా జూన్ 7వ తేదీన ఉదయం 11 గంటలకు దూద్‌బౌలీలోని స్వగృహంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం, బావి పూజ కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. అనంతరం 8వ తేదీన ఉదయం ఇంట్లోనే తమ కుటుంబ సభ్యులందరూ చేప ప్రసాదాన్ని స్వీకరించిన అనంతరం ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు తరలించి ప్రసాదం పంపిణీ చేస్తామని వివరించారు. -
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. రేపు ఉదయం 8 వరకు కొనసాగనుంది. చేప ప్రసాదం కోసం రెండు లక్షల మంది వరకు వచ్చే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ, రెవెన్యూ, ఆర్అండ్బీ, వాటర్ బోర్డు, పోలీస్, మత్స్య, విద్యుత్ తదితర శాఖల ఆధ్వర్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మూడేళ్ల విరామానంతరం ప్రారంభం కానున్న చేప ప్రసాదానికి ఒక రోజు ముందుగానే తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది గురువారమే తరలిరావడంతో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కిక్కిరిసింది. వీరికి పలు స్వచ్ఛంద సంస్థలు భోజన వసతులు కల్పించాయి. వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేప ప్రసాదం పంపిణీ నేటి ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఇందుకోసం 32 కౌంటర్లను ఏర్పాటు చేశారు. బత్తిని కుటుంబాలకు చెందిన దాదాపు 250 మందితో పాటు పలు స్వచ్ఛంద సంస్థల వారు కౌంటర్ల ద్వారా చేప ప్రసాదాన్ని అందజేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర మత్స్యశాఖ 6 లక్షల చేప పిల్లలను అందుబాటులో ఉంచింది. దాదాపు వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూం ఏర్పాటు.. ప్రజల సౌకర్యార్థం పోలీసులు ఒక కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. వేలాది మంది జనం రావడంతో వారికి ఇబ్బంది కలగకుండా కంట్రోల్ రూంలు పోలీస్ శాఖ అంత సమాచారాన్ని ఇవ్వనున్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు అశ్విన్ మార్గం ఆధ్వర్యంలో చేప ప్రసాదానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు, పలు స్వచ్ఛంద సంస్థలు సహకారాన్ని అందిస్తున్నాయి. చదవండి: మృగశిర ఎఫెక్ట్.. కొర్రమీను@ 650 ట్రాఫిక్ మళ్లింపు.. పాత బస్తీ నుంచి ఎంజే మార్కెట్ మీదుగా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు వచ్చే వాహనాలను ఇతర ప్రాంతాల మీదుగా శుక్రవారం దారిమళ్లించినట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ట్రాఫిక్ డీసీపీ అశోక్ కుమార్, ఏసీపీ కోటేశ్వర్రావు, ఇన్స్పెక్టర్ గురునాథ్‌లు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ట్రాఫిక్ దారిమళ్లింపుపై గురువారం పర్యవేక్షణ జరిపి పరిస్థితులను సమీక్షించారు. ఆర్టీసీ పలు ప్రాంతాల నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు. స్వచ్ఛంద సంస్థల చేయూత నగరంలోని పలు స్వచ్ఛంద సంస్థలు చేయూత అందించనున్నాయి. చేప ప్రసాదానికి వచ్చే ప్రజలకు అల్పాహారాలు, భోజనాలు, తాగునీరు, మజ్జిగను పంపిణీ చేస్తున్నాయి. ఆరోగ్యశాఖ అధికారులు హెల్త్ క్యాంపును ఏర్పాటు చేశారు. ప్రజలకు ఎలాంటి హెల్త్ సమస్యలు ఉన్నా 4 అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచారు. -
రేపే చేప ప్రసాదం పంపిణీ.. ఏర్పాట్లు పూర్తి (ఫోటోలు)
-
చేప ప్రసాదం పంపిణీకి భారీ సన్నాహాలు (ఫొటోలు)
-
జూన్ 9న చేప ప్రసాదం పంపిణీ
పంజగుట్ట (హైదరాబాద్): కరోనా కారణంగా మూడేళ్ల నుంచి వాయిదాపడిన చేప ప్రసాదం జూన్ 9న నగరంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఇవ్వనున్నట్లు బత్తిని సోదరులు ప్రకటించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బత్తిని అమర్నాథ్ గౌడ్, బత్తిని గౌరీశంకర్ గౌడ్ మాట్లాడుతూ..జూన్ 9న ఉదయం 8 గంటల నుంచి 10వ తేదీ ఉదయం 8 గంటల వరకు 24 గంటల పాటు చేప ప్రసాదం పంపిణీ చేస్తామన్నారు. ఆస్తమా, దగ్గు, ఉబ్బసం లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు కొన్ని లక్షల మంది తమ చేప ప్రసాదం తీసుకుని వారి సమస్యలను శాశ్వతంగా తగ్గించుకున్నారన్నారు. ప్రభుత్వం తరఫున కొర్రమీను లైవ్ చేపలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని ఈ మేరకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో సంప్రదింపులు జరుగుతున్నాయని తెలిపారు. ప్రసాదం తీసుకునే నాలుగు గంటల ముందు, తీసుకున్న రెండు గంటలు ఏమీ తినకూడదని, 45 రోజులు పత్యం ఉండాలని చెప్పారు. ఉచితంగా చేప ప్రసాదం పంపిణీ చేస్తామని తెలిపారు. -
Hyderabad: ఈ ఏడాది చేప ప్రసాదం పంపిణీ లేదు
దూద్‌బౌలి (హైదరాబాద్): కరోనా మహమ్మారి కారణంగా ఈ సంవత్సరం ఆస్తమా రోగులకు చేప ప్రసాదాన్ని పంపిణీ చేయడం లేదని శనివారం బత్తిని హరినాథ్‌గౌడ్ తెలిపారు. 175 ఏళ్లుగా వంశపారపర్యంగా తమ కుటుంబం అందిస్తున్న చేప ప్రసాదాన్ని గతేడాది కూడా కరోనా కారణంగా పంపిణీ చేయలేదన్నారు. మృగశిరకార్తె ప్రవేశం రోజున ప్రతి ఏటా మాదిరిగానే జూన్ 7వ తేదీన దూద్‌బౌలిలోని తమ నివాసంలో సత్యనారాయణ వ్రతంతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి 8వ తేదీన చేప ప్రసాదాన్ని తయారు చేసి ఉదయం 10 గంటలకు తమ కుటుంబ సభ్యులందరం తీసుకుంటామని.. అలాగే తమ దగ్గరి బంధువులకు పంపిణీ చేస్తామని తెలిపారు. కరోనా మహమ్మారి, లాక్డౌన్ కారణంగా చేప ప్రసాదం పంపిణీని విరమించుకోవాల్సిందిగా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సూచించారని హరినాథ్‌గౌడ్ వెల్లడించారు. ఏటా దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది ఆస్తమా రోగులు చేప ప్రసాదాన్ని సేవించేందుకు ఇక్కడికి వచ్చేవారని.. రెండేళ్లుగా చేప ప్రసాదం అందకపోవడంతో వారు ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెలంగాణతో పాటు పలు ఇతర రాష్ట్రాల్లో కూడా లాక్డౌన్ ఉండటంతో చేప ప్రసాదం కోసం రోగులు వచ్చేందుకు అనేక ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని ప్రభుత్వం చెప్పిందని, ఆ మేరకు ప్రసాదాన్ని ఇవ్వడం లేదని చెప్పారు. చదవండి: లాక్డౌన్ వేళ.. ఇంటింటా హింస.. ఇంతింతా కాదు! -
చేప ప్రసాదం.. హుష్!
సాక్షి, హైదరాబాద్: ఆ రోజు కోసమే ఆస్తమా రోగులంతా వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. మృగశిర కార్తె అరుదెంచే అరుదైన సందర్భాన చేప ప్రసాదం స్వీకరించేందుకు వేలాది మంది తరలివస్తుంటారు. కానీ.. ఈసారి వీరి ఆశలపై కోవిడ్ –19 నీళ్లు చల్లింది. ఆస్తమా రోగులు ఆపన్నహస్తంగా భావించే చేప ప్రసాదానికి తొలిసారిగా బ్రేక్ పడింది. 175 ఏళ్లపాటు నిర్విరామంగా కొనసాగిన ఈ కార్యక్రమాన్ని కరోనా కారణంగా రద్దు చేశారు. సోమ, మంగళవారాల్లో (ఈ నెల 8 ఉదయం 8.30 గంటల నుంచి 9వ తేదీ ఉదయం 8 గంటల వరకు) చేపట్టనున్న చేప ప్రసాదం పంపిణీని నిలిపివేస్తున్నట్లు నిర్వాహకులు బత్తిని హరినాథ్ గౌడ్ స్పష్టం చేశారు. కొద్దిరోజుల క్రితమే ఈ విషయాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు ఆయన వివరించారు. వైరస్ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో వేలాదిగా తరలివచ్చే ప్రజలు భౌతిక దూరం పాటించే పరిస్థితి ఉండదని, అంతేకాకుండా రాత్రిపూట కర్ఫ్యూ తదితర కారణాల తో చేప ప్రసాదం అందించడం దుస్సాహసమనే భావనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు హరినాథ్ గౌడ్ పేర్కొన్నారు. ఇలా పంపిణీ చేసేవారు.. ప్రతి ఏడాది చేప ప్రసాదం తయారీలో భాగంగా పంపిణీకి ఒకరోజు ముందు దూద్‌బౌలిలోని బత్తిని కుటుంబ సభ్యుల స్వగృహంలో సత్యనారాయణ స్వామి వ్రతం, బావి పూజ చేసేవారు. అనంతరం చేప ప్రసాదాన్ని తయారీకి ఉపక్రమించేవారు. తొలుత వీరి కుటుంబ సభ్యులంతా చేప ప్రసాదాన్ని తీసుకునేవారు. ఈ తర్వాత ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీకి శ్రీకారం చుట్టేవారు. ఈసారి ఇవేవీ చేపట్టడంలేదు. మొదట్లో 50 కిలోలే.. మొదట్లో 50 కిలోల వరకు తయారైన చేప ప్రసాదం ఆ తర్వాత 3.5 క్వింటాళ్లకు చేరుకుంది. కొన్నాళ్ల వరకు చేపమందుగా ప్రాచుర్యం పొందగా.. అనంతర కాలంలో చేప ప్రసాదంగా మారింది. భారత తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ సైతం చేప ప్రసాదం కోసం ఇక్కడికి వచ్చారని బత్తిని కుటుంబ సభ్యులు చెబుతుంటారు. అప్పట్లో మారిన వేదికలు.. ♦ బత్తిని హరినాథ్ గౌడ్ పూర్వీకుల నుంచి 1996 వరకు పాతబస్తీ దూద్‌బౌలిలోనే చేప ప్రసాదాన్ని పంపిణీ చేసేవారు ♦ 1997లో పాతబస్తీలో జరిగిన మత కలహాల కారణంగా ఈ వేదిక నిజాం కాలేజీ గ్రౌండ్‌కు మార్చారు. ♦ 1998లో అప్పటి ప్రభుత్వం చేపప్రసాదం పంపిణీకి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌ను కేటాయించింది ♦ అనంతరం 2012లో బత్తిని మృగశిర ట్రస్ట్‌కు కేటాయించిన కాటేదాన్‌లోని ఖాళీ స్థలంలో పంపిణీ జరిగింది. పంపిణీ సందర్బంగా తొక్కిసలాటలో ఒకరు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 2013లో తిరిగి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీకి అనుమతించింది. ♦ నాటి నుంచి పోయిన ఏడాది వరకు చేప ప్రసాదం ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లోనే కొనసాగింది. ♦ కరోనా వైరస్ కారణంగా ఈసారి పంపిణీకి బ్రేక్ పడింది దయచేసి ఎవరూ రావొద్దు.. ప్రస్తుతం ప్రపంచాన్ని కోవిడ్ వణికిస్తోంది. ఈ మహమ్మారి నుంచి తమను తాము కాపాడుకోవడం కోసం ప్రజలంతా అప్రమత్తంగా ఉంటున్న రోజులివి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో చేప ప్రసాదం పంపిణీ సరైంది కాదని భావించాం. పంపిణీ చేపడితే ఎన్నో సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. చేప ప్రసాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో పంపిణీ చేయం. దీని కోసం ఎవరూ రావద్దని స్పష్టం చేస్తున్నాం. – బత్తిని హరినాథ్ గౌడ్ -
మహా ప్రసాదం
-
చేపప్రసాదం.. భారీగా జనం
సాక్షి, హైదరాబాద్: ఆస్తమా బాధితులకోసం బత్తిన సోదరులు పంపిణీ చేసే చేపప్రసాదం పంపిణీ శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైంది. ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు కొనసాగే చేపప్రసాదంకోసం జనం భారీగా తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన ఆస్తమా వ్యాధిగ్రస్తులతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కిటకిటలాడింది. శుక్రవారం రాత్రి నుంచే ఆస్తమా బాధితులు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ చేరుకున్నారు. ఈసారి మృగశిరకార్తె సాయంత్రం ప్రవేశించిన దృష్ట్యా చేపప్రసాదం పంపిణీ కూడా సాయంత్రం ప్రారంభించారు. పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బత్తిన హరనాథ్గౌడ్, ఆయన కుటుంబీకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాయంత్రం 6 గంటలకు మంత్రి తలసాని ఆస్తమా వ్యాధి బాధితులకు చేపప్రసాదం అందజేసి పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత 173 ఏళ్లుగా, మూడు తరాలుగా బత్తిన సోదరులు చేపప్రసాదం పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ప్రపంచంలోనే చేప ప్రసాదం అనేది తెలంగాణలో పంపిణీ చేయడం గొప్ప విషయమన్నారు. చేపప్రసాదం కోసం వచ్చే ప్రజలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేపట్టిందన్నారు. ఆదివారం కూడా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేపప్రసాదం పంపిణీ కొనసాగనున్న దృష్ట్యా ప్రజలు ఓపిగ్గా వేచి ఉండాలన్నారు. ఆస్తమా బాధితులు ప్రతి ఒక్కరికీ చేపప్రసాదం లభించే విధంగా మందు తయారు చేసినట్లు బత్తిన హరనాథ్గౌడ్ తెలిపారు. అందరూ చేప ప్రసాదం తీసుకొనే వెళ్లాలన్నారు. ఆదివారం తరువాత మరో రెండు రోజులపాటు తమ ఇంటి వద్ద ప్రసాదం అందజేయనున్నట్లు తెలిపారు. తాము సూచించిన నియమాలకు అనుగుణంగా చేపప్రసాదం సేవిస్తే ఆస్తమా నయమవుతుందన్నారు. గత సంవత్సరం సుమారు 70 వేల మందికి పంపిణీ చేయగా ఈ ఏడాది ఆ సంఖ్య లక్షకు చేరుకోవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉత్తరాది నుంచే ఎక్కువ సంఖ్యలో.... జనవిజ్ఞాన వేదిక వంటి సంస్థలు, హేతువాదులు, వైద్యనిపుణులు చేపప్రసాదం అశాస్త్రీయమని ప్రచారం చేస్తున్నప్పటికీ జనంలో ఆదరణ మాత్రం తగ్గడం లేదు. చేపప్రసాదం రూపంలో అందజేసే మందు కోసం వచ్చే బాధితుల సంఖ్య ఏటా పెరుగుతోంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల కంటే ఉత్తరాది రాష్ట్రాల నుంచే జనం ఎక్కువ సంఖ్యలో తరలి వస్తున్నారు. ఢిల్లీ, మహారాష్ట్ర, రాజస్తాన్, పంజాబ్, జమ్మూ కశ్మీర్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, తదితర రాష్ట్రాల నుంచి బాధితులు వచ్చారు. తప్పని పడిగాపులు...: ఇలా ఉండగా ఆస్తమా సమస్య తీవ్రంగా ఉన్నవాళ్లు మాత్రం క్యూలైన్లలో ఎక్కువ సేపు నిలబడేందుకు ఇబ్బంది పడ్డారు. మధ్యాహ్నం 3 గంటల నుంచే కూపన్ల కోసం క్యూలైన్లలో బారులు తీరారు. సాయంత్రం 6 గంటలకు పంపిణీ ప్రారంభమైంది. దీంతో గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వచ్చి ంది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పత్యం పాటించాలి: బత్తిన సోదరులు చేప ప్రసాదం తీసుకున్న ఆస్తమా రోగులకు బత్తిన సోదరులు కొన్ని సూచనలు చేశారు. వారు పత్యం పాటించాలన్నారు. మందు స్వీకరించిన తర్వాత గంటన్నరపాటు ఏమీ తినరాదన్నారు. మందును ఆరు మాత్రలుగా చేసి నీడలో 7 రోజులపాటు ఎండబెట్టాలన్నారు. వీటిని మూడు సార్లు 23 జూన్, జూలై 8, జూలై 23వ తేదీల్లో ఉదయం పరగడుపున ఒక మాత్ర, నిద్రబోయే ముందు ఒకటి గోరు వెచ్చటి నీటితో వేసుకోవాలి.45 రోజుల పాటు కింద పేర్కొన్న వస్తువులనే వాడాలి. పాత బియ్యం, గోధుమలు, చక్కెర, మేక మాంసం, చామకూర, పాలకూర, పులిచింత కూర, పొట్లకాయ, చామగడ్డ, మామిడి వగరు, కోయికూర, అల్లము, ఎల్లిగడ్డ, పసుపు, కందిపప్పు, కరడి ఆయిల్, మిరియాలు, మినప్పప్పు, మిరపపొడి, ఉప్పు, ఆవు నెయ్యి, మోసంబీలు (బత్తాయిపండ్లు), ఆన్జీర్ పండ్లు, ఆవుపాలతో చేసిన టీ, తెల్ల జొన్నలు, ఇడ్లీ (చట్నీ లేకుండా), బ్రెడ్ మాత్రమే తీసుకోవాలి. స్నేహితుల సహకారంతో తెలుసుకున్నాను స్థానిక ఆస్పత్రులు, పలు రకాల మూలికలు తీసుకున్నప్పటికి ఆస్తమా తగ్గలేదు. ఆస్తమా రోగులకు హైదరాబాద్ నగరంలో ప్రతి యేటా ఉచితంగా చేప ప్రసాదం అందిస్తారనే విషయాన్ని స్నేహితుడి ద్వారా తెలుసుకొని ఇక్కడకు వచ్చాను. – దిలీప్, ఉత్తరప్రదేశ్ మొదటి సారిగా వచ్చాను గత రెండు సంవత్సరాలుగా ఉబ్బసం వ్యాధితో బాధపడుతూ స్థానికంగా ఎన్నో ఆస్పత్రులు తిరిగాను. ఉబ్బసం తగ్గేందుకు హైదరాబాద్‌లో చేప ప్రసాదం పంపిణీ చేస్తారన్న విషయం తెలుసుకొని రెండు రోజుల ముందే ఇక్కడికి వచ్చాను. స్థానిక స్వచ్ఛంద సంస్థలు, అధికారుల ఏర్పాట్లు బాగున్నాయి. – భవానీ శంకర్, రాజస్థాన్ -
చేప ప్రసాదం @ 171 ఏళ్లు
చార్మినార్: మృగశిర కార్తె సందర్భంగా ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆస్తమా రోగులకు చేప ప్రసాదాన్ని పంపిణీ చేసేందుకు బత్తిని కుటుంబ సభ్యులు అంతా సిద్ధం చేశారు. ఈ నెల 8న సాయంత్రం 6 గంటల నుంచి 9వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతుందని బత్తిని హరినాథ్ గౌడ్ తెలిపారు. చేప ప్రసాదం తయారీలో భాగంగా ఈ నెల 7న ఉదయం 11 గంటలకు దూద్‌బౌలిలోని ఆయన స్వగృహంలో సత్యనారాయణ స్వామి వ్రతం, బావి పూజా కార్యక్రమాలు ఉంటాయన్నారు. అనంతరం 8వ తేదీ సాయంత్రం దూద్‌బౌలిలోని స్వగృహంలో కుటుంబ సభ్యులంతా చేప ప్రసాదాన్ని తీసుకున్న అనంతరం ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పంపిణీ ప్రారంభమవుతుంది. కాగా.. చేప ప్రసాదానికి 171 ఏళ్ల చరిత్ర ఉందని బత్తిని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రతి ఏడాది పాతబస్తీ దూద్‌బౌలిలోని తమ స్వగహంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం చేప ప్రసాదాన్ని తయారు చేస్తారు. ఇంటి బావిలోని నీటితోనే ఈ చేప ప్రసాదాన్ని తయారు చేయడం ఆనవాయితీగా వస్తోంది. పూర్వీకుల నుంచి ఈ బావిలోని నీటినే వాడుతున్నారు. ఇప్పటికీ ఈ బావిలో నీరు సమృద్ధిగా ఉంది. మొదట్లో 50 కిలోల వరకు.. మొదట్లో 50 కిలోల వరకు తయారు చేసిన చేప ప్రసాదం ప్రస్తుతం 3.5 క్వింటాళ్లకు చేరిందని బత్తిని కుటుంబ సభ్యులు తెలిపారు. మొన్నటి వరకు చేప మందుగా ప్రాచుర్యం పొందగా.. ప్రస్తుతం చేప ప్రసాదంగా మారింది. భారత తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ సైతం చేప ప్రసాదం కోసం ఇక్కడికి వచ్చారని బత్తిని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మూడు రకాలు.. చేప మందును మూడు రకాలుగా తయారు చేస్తారు. చేపతో ఇచ్చే మందు, బెల్లంతో ఇచ్చే మందు, కార్తె మందు. 2 నుంచి 3 అంగుళాల కొరమీను చేపతో ఇచ్చే ప్రసాదాలు 10 గ్రాములుంటుంది. 30 గ్రాములు కలిగిన కార్తె మందును మూడు డోసులుగా 45 రోజుల పాటు వాడాలి. 15, 30,45 రోజుల్లో కార్తె మందును వాడాలి. చేపతో మింగడం ఇష్టం లేని వారికి బెల్లం ప్రసాదాన్ని అందజేస్తారు. నిజానికి చేపతో తీసుకునే ప్రసాదమే సత్ఫలితాలిస్తుందని చెబుతున్నారు. రెండు గంటలకు ముందుగా.. చేప ప్రసాదం స్వీకరించే ముందు రెండు గంటల వరకు ఎలాంటి ఆహార పదార్థాలతో పాటు నీటిని కూడా స్వీకరించరాదని బత్తిని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. చేప ప్రసాదం స్వీకరించిన అనంతరం గంటన్నర వరకు కూడా ఆహారం, నీరు తీసుకోవద్దు. బత్తిని స్వగృహంలోని బావి , పూజ అనంతరం చేప ప్రసాదం స్వీకరిస్తున్న బత్తిని హరినాథ్ గౌడ్ (ఫైల్) బత్తిని వీరన్న గౌడ్‌తో ప్రారంభం... బత్తిని వంశ పూర్వీకులైన వీరన్న గౌడ్, శివరాంగౌడ్‌ల నుంచి చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. వీరి మూడో తరమైన శంకరయ్య గౌడ్ హయాంలో చేప ప్రసాదం పంపిణీ ఎక్కువ ప్రాచుర్యం పొందింది. అనంతరం మూడు తరాలుగా చేప ప్రసాదం కొనసాగుతూనే ఉంది. ఇలా ఫలితం .. ఔషధ గుణాలు కలిగిన ప్రసాదాన్ని చేప నోటిలో పెట్టి మింగడంతో అది కదులుతూ గొంతు ద్వారా జీర్ణాశయంలోకి వెల్లి జీర్ణకోశాన్ని శుభ్రం చేస్తుందంటున్నారు. అంతేకాకుండా నేరుగా జీర్ణాశయంలో జీర్ణం అవుతుండడంతో చేప ప్రసాదం త్వరగా రక్త ప్రసరణలో కలిసి శ్వాసకోశ సంబంధ వ్యాధులను తగ్గిస్తుందంటున్నారు బత్తిని సోదరులు. అప్పట్లో అక్కడ.. ఇప్పుడు ఇక్కడ.. పూర్వీకుల నుంచి 1996 వరకు పాతబస్తీ దూద్‌బౌలిలో పంపిణీ అయిన చేప ప్రసాదం.. 1997లో పాతబస్తీలో జరిగిన మతకలహాల కారణంగా నిజాం కాలేజీ గ్రౌండ్‌కు మారింది. 1998లో అప్పటి ప్రభుత్వం పంపిణీ కోసం ఎగ్జిబిషన్ గ్రౌండ్‌ను కేటాయించింది. అనంతరం చేప ప్రసాదం పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం 2012లో బత్తిని మృగశిర ట్రస్ట్‌కు కేటాయించిన కాటేదాన్‌లోని ఖాళీ స్థలంలో కాకుండా పక్కనే ఉన్న మరో ఖాళీ స్థలంలో పంపిణీ జరిగింది. పంపిణీ సందర్భంగా జరిగిన తొక్కిసలా టలో ఒకరు మృతి చెందడంతో పాటు పలువురు తీవ్ర గాయాలకు గురయ్యారు. దీంతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 2013లో తిరిగి పంపిణీ కోసం ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీకి అనుమతించింది. దీంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చేప ప్రసాదం ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లోనే కొనసాగుతూ వస్తోంది. ఈసారి కూడా ఇక్కడే చేప ప్రసాదం పంపిణీ జరగనుంది. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు. -
8,9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ
గన్‌ఫౌండ్రీ: మృగశిర కార్తె సందర్భంగా ఈ నెల 8,9 తేదీల్లో నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో బత్తిన సోదరుల ఆధ్వర్యంలో ఆస్తమా రోగులకు ఉచిత చేప ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం ఆయన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేప ప్రసాదం పంపిణీ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. పలు రాష్ట్రాల నుంచి చేప ప్రసాదం కోసం ఆస్తమా బాధితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చేందుకు అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. గత 173 ఏళ్లుగా బత్తిన కుటుంబం రోగులకు ఉచితంగా చేప ప్రసాదాన్ని పంపిణీ చేఐస్తుండటంతో అభినందనీయమన్నారు. జూన్ 8న సాయంత్రం నుంచి చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం కానున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రసాదం కోసం వచ్చే ప్రజల సౌకర్యార్థం రూ.5 భోజనం కౌంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వేసవి తీవ్ర దృష్ట్యా అగ్నిమాపక శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వయోవృద్ధులు, దివ్యాంగులకు వీలుగా వీల్ చైర్లు అందుబాటులో ఉంచాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ మాట్లాడుతూ...చేపప్రసాదం పంపిణీ కార్యక్రమానికి జీహెచ్ఎంసీ తరపున అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 100 మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేయడమే కాకుండా పారిశుద్ధ్య నిర్వాహణకు 3 షిప్ట్లుగా 100 మంది చొప్పున సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. మెట్రో వాటర్‌బోర్డు తరపున మంచినీటి ప్యాకెట్లను సరఫరా చేస్తామన్నారు. నగర అడిషనల్ కమిషనర్ డిఎస్.చౌహాన్ మాట్లాడుతూ... మే ఐ హెల్ప్ కేంద్రాలతో పాటు పూర్తిస్థాయిలో సిబ్బందిని నియమించనున్నట్లు తెలిపారు. చేప ప్రసాద పంపిణికి అవసరమైన సుమారు 1.60 లక్షల చేపపిల్లలను సిద్ధం చేసినట్లు మత్స్యశాఖ కమిషనర్ సువర్ణ పేర్కొన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, హైదరాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ రవి, బత్తిన హరినాథ్‌గౌడ్, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఉబ్బసానికి చేప విరుగుడు!
ఏడాదికి ఒకసారి ఉబ్బసం రోగులకు హైదరాబాద్‌లో ఇచ్చే చేపమందుపై ఎన్నో వివాదాలు ఉన్న విషయం మనకు తెలిసిందే. వీటి మాటెలా ఉన్నా ఉబ్బసంతో బాధపడుతున్న వారు మరీ ముఖ్యంగా చిన్న పిల్లలకు చేపలు ఎంతో మేలు చేస్తాయని అంటున్నారు లా ట్రోబ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఈ అధ్యయనంలో భాగంగా కొవ్వులు ఎక్కువగా ఉన్న చేప రకాలను ఆహారంగా తీసుకున్న ఉబ్బసం రోగుల ఊపిరితిత్తుల పనితీరు ఆరునెలల్లో మెరుగైనట్లు గుర్తించారు. చిన్నతనంలో వచ్చే ఉబ్బసానికి చేపలతోపాటు ఆరోగ్యకరమైన ఆహారం మెరుగైన చికిత్స అనేందుకు ఇదో తార్కాణమని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త మారియా పాపామైకేల్ అంటున్నారు. ఉప్పు, చక్కెర, సాధారణ కొవ్వులు ఎక్కువగా ఉన్న ఆహారంతో ఉబ్బసం లక్షణాలు తీవ్రమవుతాయని ఇప్పటికే గుర్తించగా చేపల్లో ఉండే ఒమేగా –2 ఫ్యాటీ యాసిడ్లు దీనికి మినహాయింపు అని తమ అధ్యయనం చెబుతోందని అన్నారు వారానికి కేవలం రెండు సార్లు మాత్రమే చేపలు ఆహారంగా తీసుకున్నా ఊపిరితిత్తుల్లోని మంట/వాపు తగ్గే అవకాశముందని చెప్పారు. గ్రీస్, ఆస్ట్రేలియాల్లోని 5 – 12 మధ్య వయసు పిల్లలపై తాము ఈ అధ్యయనం చేసినట్లు చెప్పారు. కొంతమందికి సాధారణ ఆహారం, ఇంకొంతమందికి దాదాపు 150 గ్రాముల కొవ్వులున్న చేపలు ఆహారంగా ఇచ్చామని, ఆరు నెలల తరువాత పరిశీలించగా ఊపిరితిత్తుల మంట/వాపు 14 యూనిట్ల వరకూ తగ్గిందని వివరించారు. -
ముగిసిన చేప ప్రసాదం పంపిణీ
సాక్షి, హైదరాబాద్: ఏటా మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా బాధితులకు అందజేసే చేప ప్రసాదానికి ఈ సారి అనూహ్యమైన స్పందన కనిపించింది. కిందటే డాది కంటే భారీ ఎత్తున జనం తరలి వచ్చారు. శుక్రవారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ప్రారంభించిన చేపప్రసాదం పంపిణీ కార్యక్రమం శనివారంతో ముగిసింది. శనివారం ఉదయం 10 గంటల వరకు 75, 631 మందికి చేపప్రసాదం పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. మధ్యహ్నానికి ఈ సంఖ్య 80 వేలు దాటింది. 75 వేల మందికి పైగా చేప పిల్లల మందు పంపిణీ చేయగా, మరో 5 వేల మందికి బెల్లంలో కలిపి మందు ఇచ్చారు. చేప ప్రసాదం కోసం 1.32 లక్షల చేప పిల్లలను ప్రభుత్వం సిద్ధంగా ఉంచింది. 34 కౌంటర్ల ద్వారా కూపన్లు అందజేశారు. అన్ని ప్రభుత్వ శాఖలు, అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేశారని, ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెబుతున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. చేప ప్రసాదం కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారికి సేవలందించిన స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులను ఆయన అభినందించారు. ఉత్తరాది నుంచి భారీగా జనం చేప ప్రసాదంకోసం ఉత్తరాది రాష్ట్రాల నుంచి జనం భారీగా తరలి వచ్చారు. రాజస్తాన్, పంజాబ్, హరియాణా, జమ్మూ కశ్మీర్, ఉత్తరప్రదేశ్, ఢిలీ తదితర రాష్ట్రాల నుంచి ఎక్కువ సంఖ్యలో వచ్చారు. చేప ప్రసాదంపై హిందీ దిన పత్రికలు, చానళ్లలో వెలువడిన ప్రకటనలతో జనంలో బాగా స్పందన కనిపించింది. ఈ రెండు రోజుల్లో చేప ప్రసాదం తీసుకోలేకపోయినవారు దూద్‌బౌలీలోని బత్తిన హరినాథ్ గౌడ్ నివాసంలో కూడా పొందవచ్చు. -
ప్రసాదం కోసం జన ప్రవాహం
సాక్షి, హైదరాబాద్: చేప ప్రసాదం కోసం ఆస్తమా బాధితులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బత్తిన కుటుంబసభ్యులు, బత్తిన హరినాథ్‌గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీ చేశారు. ఉదయం 8.50 గంటలకు శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్‌కు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ చేప ప్రసాదం అందజేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తర్వాత నిర్వాహకులు 34 కౌంటర్ల ద్వారా కూపన్ల పంపిణీ చేపట్టారు. డిమాండ్‌కు తగినట్లుగా లక్షకుపైగా చేపపిల్లలను అందుబాటులో ఉంచారు. చేప ప్రసాదం కోసం వచ్చిన ఆస్తమా బాధితుల సంఖ్య 75 వేలు దాటిపోయింది. శనివారం మధ్యాహ్నం వరకు ఈ సంఖ్య లక్ష దాటే అవకాశమున్నట్లు నిర్వాహకులు అంచనా వేశారు. జనవిజ్ఞాన వేదిక, హేతువాదులు, వైద్యనిపుణులు కొంతకాలంగా చేపట్టిన ప్రచారం వల్ల మందు కోసం వచ్చే బాధితుల సంఖ్య గత రెండు మూడేళ్లుగా 50 వేల నుంచి లక్ష లోపే ఉన్నట్లు అంచనా. కానీ, ఈసారి అనూహ్యం గా ఆదరణ పెరిగింది. ఈ సారి తెలుగు రాష్ట్రాల కంటే ఉత్తరాది రాష్ట్రాల నుంచే జనం భారీఎత్తున తరలివచ్చారు. శుక్రవారం రాత్రి వరకు ప్రసాదం తీసుకున్న 75 వేల మందిలో కనీసం 45 వేల మంది ఉత్తరాది వారేనని అధికారుల అంచనా. గతేడాది వయోధికులు, మహిళలు ఎక్కువ సంఖ్యలో కనిపించగా, ఈసారి పిల్లల సంఖ్య ఎక్కువగా కనిపించింది. రాజస్తాన్‌కు చెందిన అస్తమా బాధితులు ఎక్కువ సంఖ్యలో కనిపించారు. దివ్యాంగులకు, వృద్ధులకు అదనపు కౌంటర్లు లేకపోవడంతోఇబ్బందులకు గురయ్యారు. బాధితులకు జీహెచ్ఎంసీ ఐదు రూపాయల భోజన కౌంటర్లను ఏర్పాటు చేసింది. స్వచ్ఛంద సంçస్థలు భోజనాన్ని అందజేశాయి. జలమండలి సుమారు 3 లక్షల నీటి ప్యాకెట్లను అందజేశారు. భారీగా స్తంభించిన ట్రాఫిక్.... చేపమందు కోసం జనం పెద్ద ఎత్తున తరలి రావడంతో వాహనాలు గంటల తరబడి ట్రాఫిక్‌లో స్తంభించాయి. మొజంజాహీ మార్కెట్ నుంచి గాం«ధీభవన్ వరకు వాహనాల రాకపోకలకు తీవ్ర అసౌకర్యం కలిగింది, సరైన పార్కింగ్ సదుపాయం కల్పించకపోవడం వల్ల ఎగ్జిబిషన్గ్రౌండ్స్కు వచ్చిన వాహనాలన్నీ రోడ్లపైనే నిలిచిపోయాయి. -
50 వేల మందికి చేప ప్రసాదం
♦ శుక్రవారం ఉదయం 9 గంటల వరకు పంపిణీ ♦ వివిధ రాష్ట్రాల నుంచి తరలి వచ్చిన ఆస్తమా బాధితులు ♦ ఏర్పాట్లు పరిశీలించిన నాయిని, తలసాని, స్వామిగౌడ్ సాక్షి, హైదరాబాద్: చేపప్రసాదం పంపిణీ కార్యక్రమం గురువారం ప్రశాంతంగా సాగింది. ఏటా మృగశిర కార్తె ప్రారంభం రోజు అందజేసే చేపప్రసాదం పంపిణీ కార్యక్రమం గురువారం ఉదయం లాంఛనంగా ప్రారంభమైంది. బత్తిని హరినాథ్‌గౌడ్, విశ్వనాథ్‌గౌడ్, శివరాంగౌడ్, సోమలింగంగౌడ్, ఉమామహేశ్వర్‌గౌడ్‌లు, వారి కుటుంబసభ్యులు చేపప్రసాదం పంపిణీ చేశారు. ఉదయం భారీ వర్షం కారణంగా కొద్దిగా ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ మధ్యాహ్నం 12 గంటల వరకు ఆస్తమా బాధితుల సంఖ్య క్రమంగా పెరిగింది. హైదరా బాద్‌తో పాటు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు తరలివచ్చారు. రాత్రి 10.30 గంటల వరకు సుమారు 50 వేల మందికి చేప ప్రసాదం పంపి ణీ అయినట్లు అధికారులు వెల్లడిం చారు. అయితే, గత సంవత్సరంతో పోల్చు కుంటే ఈ సంఖ్య తక్కువే. గతేడాది ఉదయం నుంచి సాయంత్రం వరకు 64 వేల మందికి పైగా చేపప్రసాదం పంపిణీ చేశారు. చేపప్రసాదం కోసం వచ్చిన వారిలోనూ తెలుగు రాష్ట్రాల వారి కంటే ఉత్తరాది రాష్ట్రాల ప్రజలే ఎక్కువ సంఖ్యలో కనిపించారు. సేవలందించిన స్వచ్ఛంద సంస్థలు చేప ప్రసాదం పంపిణీ కోసం మొత్తం 32 కౌంటర్లను, టోకెన్లు అందజేసేందుకు మరో 40 కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంత్‌నిరంకారీ గ్రూపు, ఉత్తరభారత్ నాగరిక్ సంఘ్, పంజాబీ సేవాదళ్, హైదరాబాద్ దేశ్పాల్ సమితి, బద్రీ విశాల్ పన్నాలాల్ ట్రస్ట్, అగర్వాల్ సేవాదళ్, గౌడ విద్యార్థి సంఘాలకు చెందిన వందలాది మంది కార్యకర్తలు సేవలంద జేశారు. క్యూలైన్ల వద్ద ప్రతి ఒక్కరికీ చేపపిల్లలు, ప్రసాదం లభించే విధంగా జాగ్రత్తలు చేపట్టారు. ఆస్తమా బాధితులకు, వారి బంధు మిత్రులకు ఉచితంగా ఆహారం, మంచినీరు అందజేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉదయం ప్రారంభోత్సవ సమయంలోనూ సాయంత్రం 4 గంటలకు రెండుసార్లు వచ్చి ఏర్పాట్లను పర్య వేక్షించారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ తదితరులు చేప ప్రసాద పంపిణీ ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. 4 కేంద్రాల్లో మరో రెండు రోజులు చేప ప్రసాదం మృగశిర కార్తె ప్రారంభం రోజున ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేప ప్రసాదం స్వీక రించని వారికి బత్తిని సోదరులు నగరంలోని నాలుగు కేంద్రాల్లో చేప ప్రసాదాన్ని అందజేస్తారు. మరో రెండు రోజులపాటు ఈ కేంద్రాలు పనిచేస్తాయి. నగరంలోని కూకట్ పల్లి, కవాడిగూడ, వనస్థలిపురం, పాత బస్తీలో ప్రసాదాన్ని పంపిణీ చేస్తామని బత్తిని హరినాథ్ గౌడ్ పేర్కొన్నారు. నాలుగు తరాలుగా తమ వంశం చేప మందును అందజేస్తోందని చెప్పారు. ఈ ప్రసాదాన్ని మూడు రకాలుగా తయారు చేసి ఇస్తున్నా మని పేర్కొన్నారు. మాంసాహారులకు చేప ప్రసాదం, శాకాహారులకు బెల్లం ప్రసాదం, ఈ రెండూ తీసుకోనివారికి కార్తీక ప్రసాదం ఇస్తామని తెలిపారు. -
8, 9 తేదీల్లో చేప ప్రసాదం
♦ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పంపిణీ ♦ పూర్తికావస్తున్న ఏర్పాట్లు ♦ అన్ని ప్రభుత్వ శాఖలు పనుల్లో నిమగ్నం ♦ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి తలసాని హైదరాబాద్: ఈ నెల 8, 9 తేదీల్లో బత్తిని సోదరులు చేప ప్రసాదం పంపిణీ చేసేందుకు హైదరాబాద్ నగరంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర మత్స్య శాఖ, ఆర్ అండ్ బీ, రెవెన్యూ, జీహెచ్ఎంసీ, హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డ్, పోలీస్ తదితర శాఖల అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఆస్తమా రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభం ఈ నెల 8వ తేదీ (గురువారం) ఉదయం 9 గంటలకు చేపప్రసాదం పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మృగశిర కార్తె ప్రారంభమయ్యే సమయంలో బత్తిని కుటుంబీకులు చేప ప్రసాద పంపిణీని చేపడతారు. 32 కౌంటర్ల ద్వారా చేపప్రసాదం ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. దీంతో పాటు వీఐపీ కౌంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. శుక్రవారం ఉదయం 9 గంటల వరకు రెండు రోజుల పాటు ఈ పంపిణీ కొనసాగుతుంది. రెండు రోజుల ముందే నగరానికి రాక... రెండు రోజుల ముందే పలు రాష్ట్రాల నుంచి ఆస్తమా రోగులు ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు తరలి వస్తున్నారు. వారికి భోజన వసతులను పలు స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్నాయి. భారీ పోలీస్ బందోబస్తు దాదాపు 1,000 మంది పోలీసులతో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సెంట్రల్ జోన్ డీసీపీ జోయెల్ డేవిస్ స్వయంగా అక్కడే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 2 లక్షల చేపపిల్లలు సిద్ధం: మంత్రి తలసాని హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈ నెల 8వ తేదీన చేప ప్రసాద పంపిణీ పెద్ద ఎత్తున చేపడతామని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. చేప ప్రసాద ఏర్పాట్లను మంగళవారం ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. చేప ప్రసాదం కోసం 2 లక్షల చేప పిల్లలను అందుబాటులో ఉంచుతున్నట్లు తలసాని వివరించారు. ఆర్టీసీ అధికారులతో మాట్లాడి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలిపారు. రైల్వేస్టేషన్లు, ఇతర ప్రధాన కేంద్రాల నుంచి అదనపు బస్సులను నడపాలని ఆదేశించినట్లు చెప్పారు. గురువారం ఉదయం పాతబస్తీలోని బత్తిని సోదరుల ఇంటి నుంచి పోలీస్ ఎస్కార్ట్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి.. ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు చేప ప్రసాదం సరైన సమయానికి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. క్యూలైన్లలో నిలబడే వారికి వాటర్ ప్యాకెట్లు క్యూలైన్లలో నిలబడే ఆస్తమా రోగులకు కూడా మంచినీటి ప్యాకెట్లను ఉచితంగా సరఫరా చేయాలని వాటర్ బోర్డ్ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. 1845 నుంచి చేప ప్రసాదం పంపిణీ చేప ప్రసాదం పంపిణీ మా పూర్వీకుల నుంచి ప్రారంభమైంది. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఆస్తమా రోగులకు నయం చేసేందుకు 1845 నుంచి ఈ ప్రసాదాన్ని అందిస్తున్నాం. ఈ ఏడాది కూడా దాదాపు 2 లక్షలకు పైగా ఆస్తమా రోగులకు చేప ప్రసాదం పంపిణీ చేసేందుకు ప్రసాదాన్ని తయారు చేస్తున్నాం. – బత్తిని హరినాథ్‌గౌడ్