Gadikota Srikantha reddy
-
ఫ్రస్ట్రేషన్లో చంద్రబాబు
సాక్షి, అమరావతి: రాజకీయ విలువలను అథఃపాతాళానికి నెట్టేసిన వ్యక్తి నారా చంద్రబాబునాయుడు మాత్రమేనని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గడికోట శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. ఎల్లో మీడియాతో కలిసి ఎన్ని కుట్రలు చేసినా, ఎంతగా ప్రభుత్వంపై బురదజల్లినా ఆయన గ్రాఫ్ అణువంత కూడా పెరగడంలేదన్న ఫ్రస్ట్రేషన్లో చంద్రబాబు ఉన్నారని చెప్పారు. శ్రీకాంత్ రెడ్డి గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారంలో ఉన్నన్నాళ్లూ వ్యక్తిగత, కుల రాజకీయాలు, అవినీతిని పెంచి పోషించారని, వ్యవస్థలను మేనేజ్ చేస్తూ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని ధ్వజమెత్తారు. అందువల్లే 2019 ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారని, ఆ ఓటమిని జీర్ణించుకోలేక ఆయన నిర్మించిన వ్యవస్థలతో ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్ర ప్రజలకు కనీసం భరోసా ఇవ్వకుండా, హైదరాబాద్‌లో రూ. 300 కోట్లతో నిర్మించుకున్న కోటలో నెలల తరబడి దాక్కున్నారని దుయ్యబట్టారు. ఇప్పుడు మహానాడులంటూ తిరుగుతూ వ్యక్తిగత దూషణలకు పాల్పడటం సిగ్గుచేటని అన్నారు. ఆయన సీఎంగా ఉన్న సమయంలో ప్రజలకు ఫలానా మంచి చేశాను అని ఎక్కడా చెప్పలేరని, మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో కూడా చెప్పడం చేతకాదని ఎద్దేవా చేశారు. సొంత జిల్లా చిత్తూరుకు ఏమీ చేయలేని చంద్రబాబు.. సీఎం జగన్‌పైనా, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపైనా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డికి వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేకపోతున్నారని చెప్పారు. బాబు అధికారంలో ఉన్న 14 ఏళ్లలో తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు, పుంగనూరు నియోజకవర్గాల్లో ఏమి అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ మూడేళ్ల పాలనలో విద్యా, వైద్యం, రోడ్లు తదితర అభివృద్ధి కార్యక్రమాలపై తామెంత ఖర్చు పెట్టామో లెక్కలు తీసుకు వస్తే చర్చకు సిద్ధంగా ఉన్నామని, ఇదే చాలెంజ్ అని అన్నారు. సీఎం జగన్‌ని రాజకీయంగా ఎదుర్కోలేక ప్రగల్భాలు తన కొడుకు వయసున్న సీఎం జగన్‌ని రాజకీయంగా ఎదుర్కొలేక, సానుభూతి కోసం 20 నిమిషాలు బోరున ఏడ్చిన చంద్రబాబు, ఇప్పుడు తాను కన్నెర్ర చేస్తే వైఎస్సార్సీపీ వాళ్లు బయటకు రాలేరని అనడం హాస్యాస్పదమన్నారు. సీఎం జగన్ పిల్లలు విదేశాల్లో చదివితే, పేద పిల్లలను సరిగా చూసుకోవడంలేదని అంటున్నారని మండిపడ్డారు. మరి నీ కొడుకు, నీ మనవడు ఎక్కడ చదివారు? నారావారిపల్లెలో చదివించారా? ప్రభుత్వ స్కూల్లో చదివించారా అని ప్రశ్నించారు. ఇలాంటి విమర్శలు చేయడానికి బాబుకు అర్హత ఉందా అని నిలదీశారు. నాడు – నేడు తో సీఎం జగన్ పాఠశాలల్లో విద్యా బోధన, మౌలిక సదుపాయాల్లో సమూల మార్పులు చేస్తున్నారని తెలిపారు. బాబు హయాంలో స్కూళ్లు, ఇప్పుడు స్కూళ్లు ఎలా ఉన్నాయో చూస్తే అర్థం అవుతుందన్నారు. వైఎస్సార్ ఉచిత విద్యుత్‌ను అమలు చేసి, రైతుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. అలాంటి వైఎస్సార్ తనయుడు సీఎం జగన్ రాష్ట్రంలో ఉచిత విద్యుత్‌ను ఎత్తేస్తున్నారంటూ విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాబోయే 30 ఏళ్ల వరకు రైతులకు ఉచిత విద్యుత్ అందించడానికి మంచి ప్రణాళిక అమలు చేస్తే దానిపైనా ప్రజలను రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. రాజకీయాలంటే ఎన్నికలే కాదని, ప్రజా సేవ కూడా అని చంద్రబాబు గుర్తెరగాలన్నారు. నీచ రాజకీయాలు చేసే బాబును తెలుగు ప్రజలెప్పుడూ అధికారంలోకి రానివ్వరని చెప్పారు. -
పేదలకు అండగా నిలిచిన బడ్జెట్ ఇది: మంత్రి వేణుగోపాల కృష్ణ
సాక్షి, అమరావతి: పేదవాడికి అండగా నిలిచిన బడ్జెట్ ఇదని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నారు. విద్య కోసం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన బడ్జెట్ అన్నారు. బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీలకు కూడా మేలు చేసే బడ్జెట్ అని పేర్కొన్నారు. బీసీ వర్గాలకు రూ.29 వేల కోట్లకుపైగా బడ్జెట్ కేటాయింపులు జరిగాయని తెలిపారు. బీసీ వర్గాలకు గొప్ప మేలు చేసే బడ్జెట్ ఇదని చెప్పారు. చదవండి: ఏపీ బడ్జెట్ 2022-23 ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన నవరత్నాలతో పాటు అన్ని రంగాలకు ప్రాధాన్యత: శ్రీకాంత్‌రెడ్డి ఆర్థిక రంగాన్ని చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. చంద్రబాబు సర్కార్ చేసిన అప్పులకు మేం వడ్డీ కడుతున్నామన్నారు. తమ ప్రభుత్వం ప్రారంభించిన పథకాల్లో ఎక్కడా కేటాయింపులు తగ్గలేదన్నారు. నవరత్నాలతో పాటు అన్ని రంగాలకు సమాన ప్రాధాన్యత ఇచ్చామని శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. బడ్జెట్ ప్రసంగాన్ని సైతం అడ్డుకునేందుకు యత్నించిన దుర్మార్గపు ప్రతిపక్షం టీడీపీ అని దుయ్యబట్టారు. ప్రజలకు మంచి బడ్జెట్ ఇచ్చిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌కు శ్రీకాంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు. డ్రోన్ల వినియోగం.. దేశంలోనే వినూత్న ప్రయత్నం: ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవసాయంలో డ్రోన్ల వినియోగాన్ని ప్రవేశపెడుతూ సీఎం జగన్ ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించిందని.. 10 వేల డ్రోన్లు వాడుకలోకి వస్తాయని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. పెస్టిసైడ్లు, ఎరువులు, విత్తనాలు డ్రోన్లతో చల్లడం వల్ల సేద్యం ఖర్చు తగ్గుతుందన్నారు. 20 వేల మంది డ్రోన్ పైలట్లుగా ఉపాధి పొందుతారన్నారు. దేశంలోనే వినూత్న ప్రయత్నం అని విజయసాయిరెడ్డి ట్విట్టర్లో పేర్కొన్నారు. సబ్ప్లాన్లకు భారీగా కేటాయింపులు: సామినేని బడ్జెట్లో వాస్తవ కేటాయింపులు, ఖర్చులు ఉంటాయని.. వివిధ సబ్ ప్లాన్లకు భారీగా కేటాయింపులు చేశారని ఎమ్మెల్యే సామినేని ఉదయభాను అన్నారు. చంద్రబాబు వ్యవసాయ బీమా బకాయిలు కూడా తమ ప్రభుత్వం చెల్లించిదన్నారు. -
24 గంటలూ కుట్రలు, కుతంత్రాలేనా?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పేదల సంక్షేమం కోసం నిరంతరం ఆలోచించే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓ వైపు ఉంటే.. మరోవైపు ప్రతిపక్షనేత చంద్రబాబు కృష్ణానది కరకట్ట పక్కన అక్రమ కట్టడంలో నివాసం ఉంటూ ప్రభుత్వంపై బురదజల్లేందుకు 24 గంటలు కుట్రలు చేస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. ఆ అక్రమ భవనాన్ని కుట్రల కోటగా మార్చారని దుయ్యబట్టారు. మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యపై సీబీఐ విచారణ పూర్తిగాకముందే ప్రభుత్వంపై, వైఎస్సార్సీపీ నేతలపై బురదజల్లేలా ఎల్లో మీడియాకు రోజుకో లీక్ ఇస్తూ.. కథనాలు అచ్చేయించి.. వాటిని పట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ వివేకా హత్యకేసులో పారదర్శకంగా విచారణ జరగాలని కోరుకునే సీఎం వైఎస్ జగన్ సీబీఐ విచారణను స్వాగతించారని గుర్తుచేశారు. సీబీఐ విచారణకు ప్రభుత్వం సహకరిస్తోందన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు సీబీఐ రాష్ట్రంలో అడుగుపెట్టడానికి వీల్లేకుండా ఉత్తర్వులు జారీచేసిన టీడీపీ నేతలే.. ఇప్పుడు ఆ సంస్థను ప్రశంసిస్తున్నారని ఎత్తిచూపారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. కోర్టు ఆదేశాలతోనే రాంసింగ్‌పై కేసు ‘సీబీఐ ఎస్పీ రాంసింగ్‌పై ప్రభుత్వమే పోలీసులతో కేసు నమోదు చేయించిందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడొకరు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదు. జనవరి 27న గజ్జెల ఉదయ్‌కుమార్‌రెడ్డి తనను సీబీఐ అధికారి రాంసింగ్ వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో ఈనెల 15న మళ్లీ ఫిర్యాదు చేశారు. అప్పటికీ పోలీసులు స్పందించకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు రాంసింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేస్తే, ప్రభుత్వంపై బురద చల్లుతున్నారు. ఇది కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడం కాదా? కోర్టును అవమానించినట్లు కాదా? మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో రాష్ట్ర ప్రజలంతా శోకసంద్రంలో ఉంటే.. ఆయన మరణాన్ని రాజకీయం చేయడం టీడీపీ నేతలకు సిగ్గు అనిపించడం లేదా? హత్యలు టీడీపీకి అలవాటే వైఎస్ వివేకా హత్యకేసులో నిందితులుగా ఉన్న వారిని హత్యచేయాలని చూస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించడం సిగ్గుచేటు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అన్నీ క్రిమినల్ ఆలోచనలే చేశారు. నిరాహార దీక్షలో కూర్చున్న వంగవీటి రంగాను, విలేకరి పింగళి దశరథరామ్‌ను హత్యచేసింది, ఒక ప్రజానాయకుడిని బతికుండగానే హింసించి చంపింది టీడీపీ నేతలు కాదా? హత్యలు చేయించే అలవాటున్న టీడీపీ నేతలు అలాంటి అలవాటే ఇతరులకు ఉంటుందనుకోవడం దుర్మార్గం. టీడీపీ నేతలు వైఎస్ అవినాష్‌పై ఎందుకు బురద చల్లుతున్నారు. ఉదయ్‌కుమార్‌రెడ్డి, భరత్‌యాదవ్ చేస్తున్న ఆరోపణల్లో నిజాలను నిగ్గుతేల్చాలి. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. వివేకా హత్యకేసులో సీబీఐ దర్యాప్తును తప్పుదోవ పట్టించాలని టీడీపీ నేతలు కుట్రలు చేస్తున్నారు. వైఎస్ వివేకా గుండెపోటుతో మరణించారని ఆయన బావమరిది శివప్రకాష్‌రెడ్డి ఎం పీ వైఎస్ అవినాష్‌కు తొలుత ఫోన్‌చేసి చెప్పారు. సిట్ దర్యాప్తులోనూ ఇదే వెల్లడైంది. కానీ వివేకా గుండెపోటుతో మృతిచెందారని వైఎస్ అవినాష్ ప్రచారం చేసినట్లు ఎలా దుష్ప్రచారం చేస్తారు? వై ఎస్ వివేకా రాసిన లేఖను ఆ రోజు సాయంత్రం వరకు బయటపెట్టకుండా కేసును తప్పుదోవపట్టిం చాలని చూసింది ఎవరు? దస్తగిరి స్టేట్మెంట్ అధి కారికంగా ఇప్పటిదాకా బయటకు రాలేదు. కానీ దానిపై ఎల్లోమీడియా ఎలా కథనాలు ప్రచురించిం ది. సీబీఐ ఎస్పీ రాం సింగ్‌ను హత్యచేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ టీడీపీ నేతలు.. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే కుట్రతో దుర్మార్గంగా ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబూ.. అధికారం కోసం ఇంతగా దిగజారాలా? సిగ్గనిపించడంలేదా? నిజాలు బయటకు రానివ్వండి వైఎస్ వివేకా హత్యకేసులో వైఎస్ అవినాష్‌రెడ్డి ప్రమేయం ఉందని ఆధారాలున్నాయా? ఆయనపై ఆరోపణలు చేసిన వ్యక్తి డబ్బులకు ఆశపడతారని కూడా చెబుతున్నారు. అలాంటప్పుడు నిజాలు బయటకు రావాలి కదా. విచారణ పూర్తిగాకముందే రోజూ లీకులు ఎందుకిస్తున్నారని సీబీఐ అధికారులను కూడా ప్రశ్నిస్తున్నాం. వైఎస్ వివేకా హత్య జరిగింది టీడీపీ సర్కార్ హయాంలో. ఈ హత్యకేసులో టీడీపీ నాయకుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అప్పట్లో ఏం కుట్ర జరిగిందో తెలియాలి. దర్యాప్తు నిష్పాక్షికంగా జరగాలని, వాస్తవాలు బయటకు రావాలని కోరుకుంటున్నాం.’ -
‘అమరావతి పేరు చెప్పి.. గ్రాఫిక్స్‌తో గడిపారు’
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి పేరుతో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టకుండా చంద్రబాబు గ్రాఫిక్స్‌తో కాలయాపన చేశారని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి దుయ్యబట్టారు. నిజంగా విజన్ ఉంటే ఐదేళ్లలో ఆయన అమరావతిలో చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పగలరా అని ప్రశ్నించారు. ఐటీ బూమ్‌లో ఉన్నప్పుడు చంద్రబాబు కాదు కదా ఆయన బావమరిది బాలకృష్ణ సీఎంగా ఉన్నా హైదరాబాద్ ఐటీ పరంగా అదే జరిగి ఉండేదన్నారు. సీఎం జగన్ సంక్షేమ కార్యక్రమాలపై నారావారిపల్లెలో చర్చించేందుకు చంద్రబాబుకు దమ్ముందా అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తానని ప్రకటించే సత్తా ఆయనకు ఉందా అని నిలదీశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గడికోట మంగళవారం విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు చెబుతున్న అమరావతి అనేది అక్కడ లేదని, అది ఒక పాడుపడిన రియల్ ఎస్టేట్ వెంచర్ అని పేర్కొన్నారు. అందుకే ఆ పార్టీ నేత చింతమనేని ప్రభాకర్ శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో పశువులను తెచ్చి కట్టేశారని చెప్పారు. అమరావతిలో ఐకానిక్ బ్రిడ్జిలు లేవు, ఇడ్లీ పాత్ర లాంటి స్ట్రక్చర్లూ లేవన్నారు. కనీసం డ్రైనేజీ, తాగునీరు కూడా లేదన్నారు. ఐఏఎస్, ఐపీఎస్‌లకు నిర్మిస్తామన్న క్వార్టర్స్‌ను కనీస దశకు కూడా తీసుకు రాలేదన్నారు. అమరావతిలో ఖర్చు చేసిన రూ.10 వేల కోట్లకు చంద్రబాబు లెక్కలు చెప్పాలన్నారు. అక్కడ చంద్రబాబుకు సొంతిల్లు కూడా లేదని, ప్రస్తుతం ఆయన నివాసముంటున్న ఇంటి డ్రైనేజీ నీటిని కూడా కృష్ణా నదిలోకి వదులుతున్నారన్నారు. సీమ, ఉత్తరాంధ్ర వెనుకబాటు కనపడదా? రాష్ట్ర ప్రయోజనాలే అజెండాగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీలో పర్యటించి ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి చర్చించారని గడికోట తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనపై చంద్రబాబు అక్కసు వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు. ఐదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు రాష్ట్రానికి ఏం సంపద సృష్టించారని నిలదీశారు. ఆయనకు విజన్ ఉంటే రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనకబాటుతనం కనిపించదా? అని ప్రశ్నించారు. స్వార్థం, బినామీల కోసం రాష్ట్రాన్ని చంద్రబాబు సర్వనాశనం చేశారని మండిపడ్డారు. హోదాను చంపేసి అర్ధరాత్రి ప్యాకేజీ చంద్రబాబు హయాంలో ఐదేళ్లలో రూ.20 వేల కోట్లు పెట్టుబడులు వస్తే సీఎం జగన్ పాలనలో రెండున్నరేళ్లలో గ్రౌండ్ అయిన ప్రాజెక్టుల విలువ రూ.40 వేల కోట్లు అని గడికోట స్పష్టం చేశారు. టీడీపీ హయాంలో చేసిన అప్పులకు ఇప్పుడు ప్రతి నెలా రూ.3 వేల కోట్లు వడ్డీలు చెల్లిస్తున్నామని తెలిపారు. ప్రత్యేక హోదాను చంపేసి అర్థరాత్రి ప్యాకేజీకి స్వాగతం పలికింది చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు. నేతల విగ్రహాలపై తమ ప్రభుత్వానికి ద్వేషం ఉండదని చెప్పారు. ఓ తాగుబోతు చేసిన పనికి పోలీసులు అతడిని వెంటనే అరెస్టు చేశారని తెలిపారు. కులమతాల పేరుతో రెచ్చగొడుతోంది చంద్రబాబేనని స్పష్టం చేశారు. -
ఏపీ ప్రజలు రాక్షసులా? తెలంగాణ మంత్రిపై రోజా ఆగ్రహం
సాక్షి, అమరావతి: కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చు సరికాదని.. ప్రాంతాలు విడిపోయినా, తెలుగు వారంతా ఒక్కటేనని తెలంగాణ మంత్రి ప్రశాంత్‌రెడ్డి గుర్తించాలని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఏపీఐఐసీ చైర్పర్సన్, ఎమ్మెల్యే రోజా, ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను రాక్షసులంటూ మాట్లాడటం దారుణం అని, దుర్మార్గం అని మండిపడ్డారు. కలిసి మెలిసి ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య గొడవలు రేపేలా మాట్లాడటం ఎంత మాత్రం సరికాదన్నారు. తెలంగాణ మంత్రి వ్యాఖ్యలను తప్పు పడుతూ మంగళవారం వారు మీడియాతో మాట్లాడారు. కేటాయింపులు లేకుండా చుక్క నీటిని కూడా వాడుకోవడం లేదని పేర్కొన్నారు. కృష్ణా ట్రిబ్యునల్ కేటాయింపుల్లో రాష్ట్ర విభజన చట్టం ద్వారా హక్కుగా దక్కిన నీటిని వాడుకోవడానికే రాయలసీమ ఎత్తిపోతల, ఆర్డీఎస్ (రాజోలిబండ డైవర్షన్ స్కీమ్) కుడి కాలువ పనులను ఏపీ ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. ఈ ప్రాజెక్టులను ఆపాలని, అక్రమ ప్రాజెక్టులనీ మాట్లాడటం సరికాదన్నారు. ఈ సందర్భంగా వారు ఏమన్నారంటే.. విభజన చట్టాన్ని గౌరవించాలి..: తెలంగాణ ప్రభుత్వం విభజన చట్టాన్ని గౌరవించడం లేదు. కేటాయింపులే లేకుండా కొత్త ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడంతో పాటు పాత ప్రాజెక్టుల సామర్థ్యం పెంచుతోంది. 8 అక్రమ ప్రాజెక్టుల ద్వారా 178 టీఎంసీల నీటిని అక్రమంగా తరలించుకుపోతోంది. ప్రాంతాలకు, కులాలకు అతీతంగా ప్రజల మనసుల్లో చిరస్థాయిలో నిలిచిపోయిన వైఎస్సార్‌ను తూలనాడటం తెలంగాణ మంత్రులు, నాయకులను తగదు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి మహానేత ప్రాజెక్టులు చేపట్టారు. అందుకే ఆయన్ను అన్ని ప్రాంతాల ప్రజలు గుండెల్లో పెట్టుకొని దేవుడిగా కొలిచారు. ముఖ్యమంత్రి జగన్ పారదర్శకతతో వ్యవహరిస్తున్నారు. రాష్ట్రానికి లేని కేటాయింపులను వాడుకోవాలని భావించడం లేదు. పొరుగు రాష్ట్రాలతో వివాదాలు పెట్టుకొనే యోచన మా రాష్ట్రానికి లేదు. కొత్త ప్రాజెక్టులు కడుతున్నది తెలంగాణే కొత్త ప్రాజెక్టులను అనుమతులు లేకుండా నిర్మిస్తున్నది తెలంగాణ ప్రభుత్వమే. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఫిల్మ్, ఐటీ ఇండస్ట్రీ తదితర పరిశ్రమలతో హైదరాబాద్‌ను ఆర్థిక పరిపుష్టి గల కేంద్రంగా తయారు చేశాం. విభజన వల్ల ఆ ప్రాంతాన్ని కూడా పోగొట్టుకోవాల్సి వచ్చింది. మంచి వాతావరణంలో ఇరువురం కలిసి ఉండి కర్ణాటక, మహరాష్ట్రతో పోరాడి సాగునీటిని తెచ్చుకోవాల్సింది పోయి స్థానికంగా ప్రజలను కించపరిచేలా మాట్లాడటం తగదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా ఎంతో సంయమనంగా వ్యవహరిస్తున్నారు. -
టీడీపీ దుర్బుద్ధితో విష ప్రచారం
-
అజ్ఞాతంలో ఏం కుట్రలు పన్నుతున్నారో!
సాక్షి, తాడేపల్లి : అమరావతి అవినీతిపై విచారణకు చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం తాడేపల్లిలో మీడియా సమావుశంలో మాట్లాడుతూ.. ' రాష్ట్రంలోకి సీబీఐను అనుమతించను అని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు ప్రతి ఘటనకు సీబీఐ విచారణకు ఎందుకని డిమాండ్ చేస్తున్నారు. తప్పు చేయకుంటే విచారణకు రావడానికి భయమెందుకు? సీఎం వైఎస్ జగన్ సుప్రీం కోర్ట్ సీజే కి లేఖ రాసినప్పటి నుంచి ఆయన ఆజ్ఞాతంలోకి వెళ్ళారు. మరీ ఆయన అజ్ఞాతంలో ఉంటూ ఏ కుట్రలకు తెర లేపుతున్నారో అన్న అనుమానం ఉంది. వేల కోట్ల అవినీతి చేసి ఇప్పుడు మా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళు విచారణకు భయపడుతున్నారూ అంటే దొంగలేవరో ఇక్కడే తేలిపోతుంది. ప్రభుత్వంపై ఎలా బురద జల్లాలి అనే దానిపైనే చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. మా ప్రభుత్వం వచ్చాక రిజర్వాయర్లు నిండుకుండలను తలపిస్తున్నాయి.రైతుల కళ్లలో ఆనందాన్ని చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు. (చదవండి :కరకట్ట నుంచి ఖాళీ చేయండి : మంత్రి అనిల్) రాష్ట్రంలో రిజర్వాయిర్ లు నిండటంతో తండ్రీ కొడుకులు ఓర్వలేక పోతున్నారు. వరదలపై చంద్రబాబు నిన్న మాట్లాడారు. ఆయన సీఎం అయ్యి ఉంటే గంట గంటకు టెలీకాన్ఫరెన్స్ చేసే వాడిని అంటూ మళ్లీ పాత పాటే పడుతున్నారు. వర్షాల వల్ల పంట నష్టం జరిగిన మాటమే నిజమే కానీ వారికి ఏ రకంగా సాయం చేయాలనేది ప్రభుత్వం చూసుకుంటుంది. బాబు గారు తన ఇల్లు ముంచేస్తున్నారని అంటున్నారు.కరెంట్ ప్లగ్ లో చెయ్యి పెట్టి షాక్ కొట్టకుండా ఉంటుందా..? ఒక రిజర్వాయిర్ లో అక్రమంగా కట్టిన ఇంట్లో ఉంటూ నువ్వే తప్పులు చేస్తూ నా కొంప ముంచుతున్నారని అనడం హాస్యాస్పదంగా ఉంది. కరకట్టపై అక్రమంగా నివాసం ఉంటూ ఇల్లు మునిగిందంటే ఎలా? ఎవరి ఇల్లు ముంచాలన్న ఆలోచన మా ప్రభుత్వానికి లేదు.9లక్షల క్యూసెక్కుల వరద రావడం వల్లే పలు ప్రాంతాలు నీట మునిగాయి. అమరావతిని ముంచాలనే ప్రయత్నం చేశారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వం శత్రువులకు కూడా అన్యాయం చేయదు. లోకేష్ పొలాల్లోకి దిగి ఫొటోలో దిగారు.. కనీసం వరి నాట్లు ఎలా ఉంటాయో కూడా తెలియని ఆయన ఫోటోల కోసమే ఫోజులు ఇవ్వడం చేశారు. చంద్రబాబు హయాంలో కరువు వస్తే కనీసం ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వలేదు.కానీ అప్పటి బకాయిలను కూడా మా ప్రభుత్వం ఇచ్చింది. ఇక నిన్న విజయవాడలో జరిగిన సాయి తేజస్విని సంఘటనే కాదు.. ఏ సంఘటన జరిగిన ఈ ప్రభుత్వం సహించదు. పక్క రాష్ట్రంలో సంఘటన జరిగితే మన రాష్ట్రంలో దిశ చట్టం తెచ్చిన ఘనత వైఎస్ జగన్ ది. నితీశ్వరీ కేసులో దోషులను కాపాడి పంచాయతీ చేసిన ఘనత చంద్రబాబుదని' శ్రీకాంత్ రెడ్డి దుయ్యబట్టారు. -
సచివాలయ వ్యవస్థతో గడప వద్దకే సేవలు
సాక్షి, తాడేపల్లి: గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రారంభించి రేపటితో ఏడాది పూర్తి కావస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల పని తీరును ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘గ్రామ స్వరాజ్యం.. గాంధీజీ కల... అనే మాటలు 70 ఏళ్ల నుంచి వింటూనే ఉన్నాం.ఆ మాటలను నిజం చేస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసింది. గతంలోలో పింఛను, రేషన్ కార్డ్ కావాలంటే ఎమ్డీఓ ఆఫీస్ వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఏ గ్రామంలో సమస్యలు ఆ గ్రామంలోనే పరిష్కారం అవుతున్నాయి. పింఛన్, రేషన్ కార్డులు కూడా వెంటనే మంజూరు అవుతున్నాయి. గత ప్రభుత్వంలో రేషన్ కార్డు, పింఛన్ కావాలంటే జన్మభూమి కమిటీలు నిర్ణయించాలి. కానీ ఇప్పుడు ఎవరి సిఫార్సులు అక్కర్లేదు. ఇంత మంచి వ్యవస్థను ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రిని అభినందిస్తున్నాను. గ్రామంలో అద్భుతమైన సచివాలయ బిల్డింగులు ఏర్పాటు చేస్తున్నాం. వాటిలో అవసరమైన ఫర్నిచర్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. గతంలో మండలానికి ఇలాంటి బిల్డింగ్ ఒక్కటి కూడా ఉండేది కాదు. గతంలో చంద్రబాబు నాయుడు వాలంటీర్లను అవమాన పరిచే విధంగా మాట్లాడారు’ అంటూ శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. (చదవండి: ‘చర్చకు బాబు రాకుంటే లోకేష్‌ను పంపండి’) కరోనా సమయంలో వాలంటీర్ల పనితీరు అద్భుతమని ప్రశంసించారు శ్రీకాంత్‌రెడ్డి. ‘వాలంటీర్ల వ్యవస్థ ద్వారా కరోనా టైంలో ఆయుష్ మాత్రలు కేవలం రెండు గంటల్లోనే పంపిణీ చేశాం. గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రధానమంత్రి కూడా అభినందించారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తెల్లవారకముందే అవ్వాతాతలకు వాలంటీర్ల ద్వారా పింఛన్ అందిస్తున్నాం. గత ప్రభుత్వంలో 47 లక్షల మంది పింఛన్ లబ్ధిదారులు ఉంటే.. ఇప్పుడు 61, 65,000 లబ్ధిదారులు ఉన్నారు. నెల.. నెల పింఛన్ పొందే లబ్ధిదారుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఇది ఒక అద్భుతం. మా ప్రభుత్వంలో రైతులంతా ఆనందంగా ఉన్నారు. ఇది రైతు ప్రభుత్వం. గతంలో విత్తనాల కోసం రైతులు క్యూలో నిలబడి పోలీసుల చేత దెబ్బలు తినే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ప్రభుత్వ పొలం దాకా విత్తనాలను సప్లై చేస్తోంది. చెత్త ద్వారా సంపద సృష్టిస్తామని గతంలో లోకేష్ చెప్పాడు. సంపద ఎక్కడ ఎలా సృష్టించాడు’ అని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. ‘నీరు-చెట్టు పేరుతో దోచుకున్నారు. చంద్రబాబు ఎప్పుడూ అధికారంలోకి వచ్చిన అప్పులు పెరుగుతాయి... ఆస్తులు తగ్గుతాయి. మా ప్రభుత్వం వైద్యరంగంలో విప్లవం తీసుకు వచ్చింది. రాష్ట్రంలో మొత్తం 16 మెడికల్ కాలేజీలు పెడుతున్నాం. పాడేరు లాంటి ప్రాంతాల్లో కూడా మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నాం. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవు. చంద్రబాబు తనను తానే రక్షించుకో లేకపోయారు. గత ప్రభుత్వంలో నా పైన తప్పుడు కేసులు పెట్టారు. చంద్రబాబు తన పాలనలో జరిగిన అవినీతి పైన తాను విచారణకు సిద్ధం అంటారు. తీరా విచారిస్తే కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. చంద్రబాబు పై ఉన్న కోర్టు స్టే లు ఎత్తేస్తే వాళ్ళ అవినీతి బాగోతం బయట పడుతుంది. ఈ ప్రభుత్వంలో ఎవరు తప్పు చేసినా శిక్ష పడుతుంది’ అని శ్రీకాంత్ రెడ్డి హెచ్చరించారు. -
కరోనా టైంలో వాలంటీర్ల పనితీరు అద్భుతం
-
రామోజీరావు డబుల్ స్టాండ్ ఎందుకు.!
సాక్షి, తాడేపల్లి : పరిపాలనలో పేదలకు సహాయం చేయాలనే ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశాన్ని ఆచరణలో చూపిస్తున్నారని కొనియాడారు. కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. ప్రజల శ్రేయస్సు కోసం ఆరు నెలల్లోనే రూ.28,122 కోట్లు ఖర్చు చేశామని, కులం, మతం, పార్టీ కూడా చూడకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవాలను రామోజీరావు తెలుసుకోవాలని, ధృతరాష్ట్రుడిలా కళ్లు మూసుకోవద్దు హితవు పలికారు. కరోనాపై ఆంధ్రప్రదేశ్‌లో ఒకవిధంగా తెలంగాణలో మరొక విధంగా ఈనాడు పత్రికలో వార్తలు రాస్తున్నారని మండిపడ్డారు. ఇలా డబుల్ స్టాండ్ విధానం ఎందుకని ప్రశ్నించారు. ఈనాడు, ఎల్లో మీడియా ప్రజలను తప్పు తోవ పట్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. (సీఎం జగన్ కృషి.. సుదీర్ఘ స్వప్నం సాకారం) సీఎం జగన్ పాలన చూసి టీడీపీ నేతలు ఈర్ష్య పడుతున్నారని శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. కరోనా క్లిష్ట సమయంలోనూ ప్రభుత్వంపై అసత్యాలు ప్రచారం చేయడం సరికాదని అన్నారు. బుధవారం తాడేపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘బెంజ్ సర్కిల్ దగ్గర సన్నివేశం చూసి ప్రజలు పరవసించిపోయారు. 108 వాహనాలు మళ్ళీ అందుబాటులోకి రావడంతో ప్రజలు సంతోషిస్తున్నారు. ప్రజలకు సీఎం జగన్ మేలు చేస్తుంటే చంద్రబాబుకు ఎందుకు అంత కడుపుమంట.? ఐదేళ్ళు 108 సర్వీస్‌లను గాలికి వదిలేసి.. ఇప్పుడు నీచమైన ఆరోపణలు చేస్తున్నారు. గత ఐదేళ్లు ఆరోగ్యశ్రీ, 108, 104 లను పూర్తిగా నిర్వీర్యం చేశారు. 108 వాహనాల్లో 300 కోట్ల అవినీతి అంటూ సిగ్గులేని ఆరోపణలు చేస్తున్నారు. వాహనాల కొనుగోలు, నిర్వహణ టెండర్లు అంతా పారదర్శకంగా జరిగింది. కరోనా టెస్టుల్లో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉంది. రాష్ట్రంలో పాజిటివ్ శాతం 1 శాతం మాత్రమే. కరోనా నియంత్రణకు ఏపీలో తీసుకుంటున్న జాగ్రత్తలు మరెక్కడా తీసుకోవడంలేదు. దేశంలో ఎక్కడ లేనన్ని కరోనా టెస్టులు ఆంధ్రప్రదేశ్‌లో చేస్తున్నారు. కరోనా సమయంలో చంద్రబాబు ఎన్నిసార్లు హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చారు.. సీఎం జగన్ ప్రజాదరణ ముందు టీడీపీ మట్టికొట్టుకుపోతుంది. ప్రభుత్వాన్ని తిట్టమే పనిగా టీడీపీ నేతలు పెట్టుకున్నారు. వైస్రాయి హోటల్ మాదిరిగా పార్క్ హయత్ లో ప్రభుత్వంపై కుట్రకు ప్లాన్ చేశారు.’ అని వ్యాఖ్యానించారు. -
రైతులకు రూ. 33 కోట్ల చెక్కు అందజేసిన చీఫ్ విప్
సాక్షి, వైఎస్సార్ కడప: నిత్యం రైతుల గురించి ఆలోచించే ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వమని... ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. రాయచోటి మండల అభివృద్ది కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన రైతు భరోసా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన 42500 మంది రైతులకు రూ. 33 కోట్ల మెగా చెక్కును అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన మాట ప్రకారం పెట్టుబడి సాయం అందించిన ముఖ్యమంత్రి వెఎస్ జగన్ అన్నారు. 42500 మంది రైతుల ఖాతాలోకి మొత్తం రూ. 33 కోట్లు జమ అయినట్టు తెలిపారు. గిట్టుబాటు ధర కల్పించి రైతుల మొహంలో సంతోషం కలిగేలా చేసిన వ్యక్తి సీఎం జగన్ అన్నారు. ('కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం') కరోనా వైరస్ వంటి విపత్తు కాలంలో రుపాయి ఆదాయం లేదని చాలా రాష్ట్రాలు సంక్షేమ పథకాలు అమలు చేయకుండా తప్పించుకుంటునాయని ఆయన చెప్పారు. కానీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం సున్న వడ్డీ పథకం, ఫీజు రీయంబర్స్మెంట్, పూర్తి బకాయిల చెల్లింపు, రైతు భరోసా వంటి సంక్షేమ పథకాలు పెంచుకుంటూ పోతున్నారని పేర్కొన్నారు. ఇంతవరకు రాయచోటి నియోజకవర్గమంతా గ్రీన్ జోన్లో ఉండేది. అయితే కోయంబేడు నుంచి వచ్చన వ్యక్తికి కరోనా పాజిటివ్ తెలిడంతో రెడ్‌జోన్‌కి వచ్చిందన్నారు. ఓ పక్క మహమ్మారిని ఎదుర్కొంటునే మరో పక్క పారదర్శకంగా ప్రజా సంక్షేమ పథకాలు అందిస్తూ ఎక్కడా అవినీతి లేకుండా సువర్ణ పాలన అందిస్తున్నారని చీఫ్ విప్ అన్నారు. (విద్వేషాలు రగిల్చే దుష్ట ఆలోచన) కరోనా నివారణ, సహయక చర్యలపై చీఫ్ విప్ వీడియో కాన్ఫరెన్స్... కరోనా నివారణ సహయక చర్యలపై చీఫ్ విప్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడారు. సంబేపల్లి ఘటనతో అధికారులు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. కరోనా నియంత్రణపై అధికారులు బేషుగ్గా పనిచేస్తున్నారని వారిపై ప్రశంసల జల్లు కురిపించారు. అధికారులు మరింత ఉత్సహంతో పనిచేసి కరోనా వ్యాప్తిని కట్టడి చేయాలన్నారు. వలస కార్మికులకు క్లియరెన్స్ వచ్చేంత వరకు నిత్యవసర సరుకులు అందించండని, బయట ప్రాంతాల నుంచి ఎవరూ వచ్చిన నేరుగా క్వారంటైన్‌కు పంపించాలని సూచించారు. -
‘రాయలసీమలో జేసీ పుట్టడం దురదృష్టకరం’
సాక్షి, వైఎస్సార్ కడప: అనేక సంవత్సరాలుగా వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రలో రాజధానులు ఏర్పాటు ద్వారా ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. మూడు రాజధానుల విషయంలో ప్రముఖ సీనియర్ అధికారులు, న్యాయ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసి సమగ్ర నివేదికను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెప్పించుకున్నారని గుర్తు చేశారు. నివేదికలో పేర్కొన్న విధంగా రాష్ట్రంలో మూడు రాజధానుల నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో శివరామకృష్ణ కమిటీ నివేదిక ఏమైందని ఆయన ప్రశ్నించారు. అప్పట్లోనే అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలని కమిటీల నివేదిక స్పష్టం చేశాయని అన్నారు. కానీ, గత టీడీపీ ప్రభుత్వంలో కమిటీల నివేదికను బుట్ట దాఖలు చేశారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల అభివృద్ధి టీడీపీకి ఇష్టం లేదని అంజాద్ బాషా మండిపడ్డారు. ముందుగా టీడీపీ నేతలు వారి వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు గల్లీ నాయకుడి కన్నా హీనంగా తయారయ్యారని ఆయన దుయ్యబట్టారు. అమరావతి విషయంలో చంద్రబాబు తీరు దుర్మార్గమని అన్నారు. కమిటీల నివేదికను గౌరవిస్తూ సీఎం వైఎస్ జగన్ అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతు తెలిపారని గుర్తు చేశారు. అమరావతిపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తుందని ఫైర్ అయ్యారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రజలు సంతోషంగా మద్దతిస్తున్నారని తెలిపారు. పెద్దల సభ అంటే ప్రభుత్వ నిర్ణయాలపై సూచనలు, సలహాలు ఇవ్వాలని అన్నారు. కానీ, మండలిలో బలం ఉందని.. ప్రభుత్వ బిల్లును అడ్డుకోవడం దారుణమన్నారు. రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం టీడీపీ నేతలు మండలిని వాడుకున్నారని ఆయన విమర్శించారు. ప్రజలకు అవసరం అయ్యే బిల్లులను అడ్డుకోవడమే పరమావధిగా టీడీపీ నేతలు తయారయ్యారని అంజాద్ బాషా మండిపడ్డారు. ఎన్పీఆర్, ఎన్ఆర్సీ బిల్లులపై ప్రజల అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉందని అంజాద్ బాషా అన్నారు. ఎన్పీఆర్ అనేది పదేళ్లకు ఒకసారి చేస్తారని చెప్పారు. గతంలో 2010లో చేశారని, మళ్లీ ఇప్పుడు చేస్తున్నారని గుర్తు చేశారు. 2019 ఆగస్టు 16న ఎన్పీఆర్పై గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందన్నారు. ఎన్ఆర్సీపై ప్రధానంగా ముస్లిం ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయని, వాటిని సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. వెంటనే సీఎం వైఎస్ జగన్ ఈ బిల్లులకు పూర్తి వ్యతిరేకమని ఆయన బహిరంగంగా ప్రకటించారని అంజాద్ బాషా తెలిపారు. అభివృద్ధి వికేంద్రీకరణపై రాయలసీమ వాసిగా స్వాగతిస్తున్నానని రాష్ట్ర చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. అమరావతి ప్రాంతాల రైతులే కావాలి, మిగతా జిల్లాల రైతులు అవసరం లేదనే ధోరణిలో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. దీక్షల పేరుతో కోట్ల రూపాయల ప్రజల సొమ్మును దోచుకు తిన్నారని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. రిజర్వాయర్లు, ప్రాజెక్టుల్లో ప్రస్తుతం నీరు నిల్వ చేయలేకపోతున్నామంటే టీడీపీ ప్రభుత్వ నిర్ణయాలే కారణమని అన్నారు. గతంలో హైకోర్టు బెంచ్ కావాలని రాయలసీమ లాయర్లు చంద్రబాబు అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వలేదని ఆయన తప్పుపట్టారు. అభివృద్ధి వికేంద్రీకరణను రాయలసీమ నేతలు అడ్డుకోవడం సిగ్గు చేటని శ్రీకాంత్‌రెడ్డి దుయ్యబట్టారు. రాయలసీమ ప్రాంత ప్రజలు టీడీపీ నేతలను కచ్చితంగా అడ్డుకుంటారని హెచ్చరించారు. ఫ్యాక్షనిస్టులు, కడప రౌడీలు అని చంద్రబాబు అంటే.. ఎందుకు టీడీపీ నేతలు నోరు మెదపటంలేదని శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. 70 ఏళ్ల క్రితం శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. వందల ఏళ్లుగా రాయలసీమ ప్రాంత రైతులు, ప్రజలు అనేక విషయాల్లో త్యాగం చేశారని తెలిపారు. అమరావతి ప్రాంత రైతులకు ప్రజలు మెచ్చిన ప్యాకేజి ఇచ్చిన సీఎం వైఎస్ జగన్ అని గుర్తు చేశారు. భవిష్యత్‌లో రాయలసీమ ప్రాంత ప్రజలను రౌడీలు, గుండాలు అంటే చూస్తూ ఊరుకునేది లేదని శ్రీకాంత్ రెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని కుటుంబ కార్యక్రమం లాగా చేశావని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజలు మెచ్చిన ప్రభుత్వం వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వమని ఆయన ప్రశంసించారు. అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలని 13 జిల్లాల ప్రజలు కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. కల్లు తాగే, పొగరు వ్యక్తి జేసీ దివాకర్‌రెడ్డి రాయలసీమలో పుట్టి ఇక్కడి ప్రజలను అవమానరీతిలో మాట్లాడటం దారుణమని ఆయన దుయ్యబట్టారు. రాయలసీమలో ఇలాంటి వారు పుట్టడం దురదృష్టకరమన్నారు. గత ఐదు ఏళ్ల టీడీపీ హయాంలో రాయలసీమకు ఏం చేసారో చంద్రబాబు స్పష్టం చేయాలని శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
ఈ నెల 24న రాయచోటిలో సీఎం వైఎస్ జగన పర్యటన
-
ఐదేళ్లలో ఇసుకను దోచేశారు
-
ఇది ప్రజా ప్రభుత్వం: గడికోట
సాక్షి, అమరావతి: మహిళల జీవితాల్లో వెలుగులు నింపడమే వైఎస్ జగన్ ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం జరిగిన మెప్మా సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రిజర్వేషన్లలో మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత కల్పించిన ఏకైక ప్రభుత్వం వైస్ జగన్ ప్రభుత్వమేనని తెలిపారు. ప్రతి మహిళా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని.. స్వయం సహాయక సంఘాలు బలోపేతం కావాలన్నారు. గత టీడీపీ ప్రభుత్వం ఎన్నికల్లో ఓట్లు దండుకోనేందుకు పసుపు-కుంకుమ పేరుతో మోసం చేసిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం నాలుగు దశల్లో డ్వాక్రా రుణాలు మాఫీ చేయబోతున్నారని వెల్లడించారు. రాజు బాగుంటే రాజ్యం బాగుంటుందని పెద్దలు ఊరికే చెప్పలేదని.. అందుకు తాజా ఉదాహరణే ప్రస్తుత వర్షాలన్నారు. నాడు మహానేత వైఎస్సార్ హయాంలో.. నేడు ఆయన తనయుడు జగన్ పాలనలో కూడా వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. అక్టోబర్ 15న రైతు భరోసా, ఆటో డ్రైవర్లకు పదివేల రూపాయలు ఆర్థిక సహాయం, జనవరి 15న అమ్మఒడి, పేదలకు ఉగాది నాటికి ఇంటి స్థలాలు, పక్కా ఇల్లు అందుతాయన్నారు. ఇది ప్రజా ప్రభుత్వమని, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా జగన్ పాలన జరుగుతోందన్నారు. -
‘టీడీపీలోనే కోడెలకు అవమానాలు’
సాక్షి, అమరావతి: టీడీపీలో ఎదురైన అనేక అవమానాలతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తీవ్ర మనోవేదనకు గురయ్యారని ప్రభుత్వ చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. గత రెండు నెలలుగా కోడెల అనారోగ్యంతో బాధపడుతున్నా.. చంద్రబాబు కనీసం పరామర్శించలేదని గుర్తుచేశారు. ఛలో ఆత్మకూరుకు కోడెల వస్తానంటే టీడీపీ నేతలు ఆయన్ని ఆడ్డుకున్నారని, వర్గ రామయ్య కూడా ఆయనపై అనేక ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. టీడీపీ నేతల అవమానాలు భరించలేకే కోడెల ఆత్మహత్యకు పాల్పడ్డారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. కోడెల కుటుంబ సభ్యులకు ప్రగాఢసానుభూతి తెలిపారు. చంద్రబాబు నాయుడు ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ.. శవ రాజకీయాలు చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడెల మరణం చాలా బాధాకరమన్న ఆయన.. చంద్రబాబు వేధింపుల కారణంగానే కోడెల మృతి చెందారని ఆరోపించారు. పల్నాడు ప్రాంతంలో టీడీపీ గ్రూపు రాజకీయాలు చేస్తోందని.. ఓ వర్గాన్ని మాత్రమే చంద్రబాబు పోత్రహిస్తూ కోడెలను అవమానానికి గురిచేశారని పేర్కొన్నారు. కోడెలపై ప్రభుత్వం కేసులు పెట్టలేదని, కేవలం బాధితులు మాత్రమే పెట్టారని ఆయన స్పష్టం చేశారు. ‘ఎన్నికల అనంతరం కోడెల అస్వస్థతకు గురయ్యారు. రెండు నెలల్లో కనీసం ఒక్కసారి కూడా చంద్రబాబు ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీయలేదు. బతికున్నప్పుడు మనుషులను వేధించడం చంద్రబాబుకు బాగా తెలుసు. చనిపోయిన తరువాత శవ రాజకీయాలను చేయడం ఆయనకు ఎంతో సులువు. ఎన్టీఆర్, హరికృష్ణ మరణం సమయంలో ఇలాంటివి చూశాం. కోడెల మృతికి పరోక్షంగా చంద్రబాబే కారణం. ఆయన పెట్టిన మానసిక వేధింపుల కారణంగానే కోడెల మరణించారు. ఉరేసుకున్నారని, గుండెపోటు వచ్చిందని అయన మరణంపై టీడీపీ నేతలే అనేక వార్తలను ప్రచారం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఫ్యాక్షన్‌ను ప్రోత్సహించిన తొలి వ్యక్తి చంద్రబాబు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఫ్యాక్షన్ విపరీతంగా పెరిగింది. ఎన్నో హత్యలు చేయించారు. చెరుకుపాటి నారాయణరావును హత్య చేసింది టీడీపీ కాదా?. కోడెల మరణం పట్ల వైఎస్సార్సీపీ తరఫున ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నాం’ అని పేర్కొన్నారు. చదవండి: శివరామే తండ్రిని హత్య చేశాడని ఫిర్యాదు కోడెల మృతితో షాక్‌కు గురయ్యాను... కోడెల మరణం: క్షణక్షణం అనేక వార్తలు! కోడెల మెడపై గాట్లు ఉన్నాయి కాబట్టి: సోమిరెడ్డి కోడెల మృతిపై అనేక సందేహాలు: అంబటి కోడెల మృతిపై కేసు నమోదు కోడెల కొడుకు ఆస్పత్రికి ఎందుకు రాలేదు? కోడెలది ఆత్మహత్యా? సహజ మరణమా? సుదీర్ఘ రాజకీయ జీవితం.. అనూహ్య విషాదం! కోడెల శివప్రసాదరావు కన్నుమూత -
కోడెల మృతి పట్ల గండికోట శ్రీకాంత్ రెడ్డి దిగ్భ్రాంతి
-
కోడెల మృతిని రాజకీయం చేయవద్దు: గడికోట
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణంపై ప్రభుత్వ చీఫ్‌విప్ గండికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి దురదృష్టకరమని, ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోడెల మరణాన్ని రాజకీయ కోణంలో చూడోద్దన్నారు. ప్రతి అంశాన్ని టీడీపీ రాజకీయ చేయడం సరికాదని, వాస్తవాలు తెలుసుకోని మాట్లాడాలని సూచించారు. సీనియర్ నేత చనిపోయారు అనే బాధలేకుండా టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీపై బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతల విమర్శలు వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. పోస్టుమార్టం రిపోర్ట్ అనంతరం వాస్తవాలు తెలుస్తాయని పేర్కొన్నారు. కాగా కోడెల శివప్రసాదరావు ఆకస్మిక మృతి పట్ల బంజారాహిల్స్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆయన మృతిపై కేసు నమోదు చేసుకుని, మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ మేరకు కోడెల కుటుంబసభ్యుల నుంచి స్టేట్మెంట్ పోలీసులు రికార్డు చేసినట్టు తెలుస్తోంది. చదవండి: కోడెల మృతిపై కేసు నమోదు కోడెల కొడుకు ఆస్పత్రికి ఎందుకు రాలేదు? కోడెలది ఆత్మహత్యా? సహజ మరణమా? సుదీర్ఘ రాజకీయ జీవితం.. అనూహ్య విషాదం! కోడెల శివప్రసాదరావు కన్నుమూత -
మొదట వైఎస్ జగన్ ప్రమాణం.. తరువాత చంద్రబాబు
సాక్షి, అమరావతి: తొలి క్యాబినెట్ సమావేశంతోనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాశమంత ఎత్తుకి ఎదిగారని ప్రభుత్వ చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మేనిఫెస్టోను అమలు చేసే విధంగా తొలి క్యాబినెట్ సమావేశంలోనే చర్యలు తీసుకోవడం గర్వకారణన్నారు. మంగళవారం అమరావతిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏపీ అసెంబ్లీ తొలి సమావేశాలు రేపటి నుంచి ప్రారంభవుమతాయని వెల్లడించారు. తొలుత సీఎం వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని, అనంతరం ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చేస్తారని తెలిపారు. గురువారం స్పీకర్ ఎన్నిక ఉంటుందని, 14న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారని చెప్పారు. సభను ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహిస్తామని శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. గత స్పీకర్, ప్రభుత్వంలా కాకుండా హుందాగా నిర్వహిస్తామన్నారు. ప్రతిపక్షాన్ని కూడా గౌరవించి సభలో అవకాశం ఇస్తామన్నారు. గత ప్రభుత్వంలో ప్రతిపక్ష సభ్యులకు ఛాంబర్ కూడా ఇవ్వకుండా హేళన చేశారని, తమ ప్రభుత్వంలో అందరికీ సరైన ప్రాధాన్యం కల్పిస్తామని పేర్కొన్నారు. -
ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్‌గా శ్రీకాంత్ రెడ్డి
సాక్షి, అమరావతి : ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్‌గా రాయచోటి నియోజకవర్గ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి నియమితులయ్యారు. రాష్ట్రంలో ప్రభుత్వ చీఫ్ విప్‌తో పాటు మరో అయిదుగురు విప్‌లను నియమించారు. విప్‌లుగా కొలుసు పార్థసారధి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, దాడిశెట్టి రాజా, బుడి ముత్యాల నాయుడు, కొరుముట్ల శ్రీనివాసులు ఎంపికయ్యారు. కాగా శ్రీకాంత్‌రెడ్డికి కేబినెట్లో స్థానం దక్కుతుందని అందరూ ఆశించినా, సామాజిక వర్గాలకు సముచిత స్థానం కల్పించే ప్రయత్నాల్లో భాగంగా ఆయనకు మంత్రి పదవి దూరమైంది. -
రాయచోటీలో ఎమ్మెల్యే శ్రీకాంత రెడ్డి సతీమణి లలితమ్మ ప్రచారం
-
అడుగడుగునా అన్యాయం.. అబద్ధాలు: వైఎస్ జగన్
-
అడుగడుగునా అన్యాయం.. అబద్ధాలు: వైఎస్ జగన్
సాక్షి, వైఎస్సార్: ఐదేళ్ల చంద్రబాబు నాయుడు పాలనతో విసిగిపోయిన ప్రతి పేదవాడికి అండగా తాను ఉన్నానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. తన 3648 కి.మీటర్ల పాదయాత్రలో ప్రతి పేదవాడి గుండెచప్పుడు విన్నానని, వారి సమస్యలను దగ్గరుండి చూశానని వైఎస్ జగన్ తెలిపారు. బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం అడుగడుగునా అన్యాయం, అబద్ధాలతో ప్రజలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. వైఎస్సార్ జిల్లా రాయచోటి నియోజకవర్గంలో సోమవారం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ మాట్లాడారు. ప్రభుత్వానికి మంచి మనసుంటే ప్రతి ఇంటికీ మంచిచేయాలని కోరుకుంటుందని, టీడీపీ ప్రభుత్వానికి మాత్రం అదిలేదని మండిపడ్డారు. పేదవాడు సంతోషంగా బతకడానికి ఏం కావాలో తన పాదయాత్రలో తెలుసుకున్నానని, తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వాటన్నింటిని అందిస్తానని హామీ ఇచ్చారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్సీపీ రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి గడికోట శ్రీకాంత్‌రెడ్డిని, రాజంపేట ఎంపీ అభ్యర్థి మిథున్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వైఎస్ జగన్ కోరారు. ‘అన్నకు అవకాశం ఇద్దాం.. సీఎం చేద్దాం’ వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థుల ప్రొఫైల్స్ చంద్రబాబు నాయుడు పాలనలో అన్ని వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చే మూడువేలు తీసుకుని మరోసారి మోసపోద్దని వైఎస్ జగన్ పేర్కొన్నారు. బహిరంగ సభలో వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. ‘‘మహిళలు, రైతులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పాదయాత్రలో చూశాను. వాటిని చూసి చలించిపోయాను. చంద్రబాబు పాలనలో మోసపోయిన ప్రతి పేదవాడి సమస్యలను నేను విన్నాను, చూశాను. వారందరికీ మాట ఇస్తున్న మీకు అండగా నేనున్నాను. గత ఎన్నికల సమయంలో రుణమాఫీ చేస్తానని, పొదుపు రుణాలు మాఫీ చేస్తానని, ఉద్యోగాలు ఇస్తామని ఇలా అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారు. మద్యపానం పూర్తిగా నిషేధిస్తామని హామీ ఇచ్చి.. దానిని విస్మరించి.. ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులను తెరిపించారు. మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నాలుగు విడతల్లో మద్యపానం పూర్తిగా నిషేధిస్తాం. చదవుకున్న వారికి ఉద్యోగాలు ఇస్తామని మోసం చేశారు. ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతికూడా ఇవ్వలేదు. ఏపీకి ప్రత్యేక హోదా వస్తే ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డాం. చంద్రబాబు దానిని కూడా తాకట్టుపెట్టారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ నిర్మిస్తే స్థానిక యువతకు ఉద్యోగాలు లభించేవి. టీడీపీ ప్రభుత్వం దానిని కూడా విస్మరించింది. రాబోయే 20 రోజుల్లో జరగబోయేది ఇదే : వైఎస్ జగన్ ఎన్నికల్లో గెలవడానికి చంద్రబాబు నాయుడు ఏమైనా చేస్తాడు. మూటలతో కోట్లు తెస్తాడు. మన పార్టీకి చెందిన వారి ఓట్లను తొలగిస్తాడు. అవసరమయితే దొంగ ఓట్లు చేరుస్తాడు. తెగించి హత్యలు కూడా చేయిస్తాడు. ప్రజల సమాచారం కూడా చోరీచేస్తాడు. న్యాయానికి, అన్యాయానికి మధ్యం మధ్య యుద్ధం జరుగుతోంది. ఒక్కసారి అవకాశం ఇవ్వండి.. వైఎస్సార్ పాలన కంటే గొప్ప పరిపాలనను అందిస్తా. మళ్లీ రాజన్న రాజ్యాన్ని నిర్మిస్తాం. మరో 20 రోజులు ఒపిక పట్టండి. మన ప్రభుత్వం ఏర్పడుతుంది. చదువుకు దూరమైన ప్రతి పిల్లవాడిని చదవిస్తాం. పిల్లల్ని బడికి పంపిన ప్రతి తల్లికి ఏడాదికి 15000 అందిస్తాం. డ్వాక్రా సంఘాలను ఆదుకుంటాం. నవరత్నాలు ప్రతి ఒక్కరికి అందేలా పరిపాలన అందిస్తాం. ఈ ప్రాంతానికి చెందిన మైనార్టీ వ్యక్తికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని గతంలో రాయచోటికి వచ్చిన సందర్భంగా మాట ఇచ్చాను. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇచ్చిన హామీని నెరవేరుస్తాం’’ అని తెలిపారు. -
ఎన్నికల కోసం ఎన్ని తాయిలాలో?
సాక్షి, హైదరాబాద్: నాలుగున్నరేళ్లుగా ఏ ఒక్క మంచి పని చేయని చంద్రబాబు, ఎన్నికల ముందు అనేక తాయితాలు ప్రకటించడం విడ్డూరంగా ఉందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రజలను మరోసారి దగా చేసే ఉద్దేశం ఆయనలో స్పష్టమవుతోందని మండిపడ్డారు. హైదరాబాద్‌లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో రైతులు గిట్టుబాటు ధరల్లేక ఊపిరి ఆగిపోతోందని లబోదిబోమన్నా పట్టించుకోని సర్కార్ ఇప్పుడు నెల రోజుల్లో ఎన్నికలొస్తున్నాయని తాయిలాలు ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటి వరకు ప్రతీ కేబినేట్ మీటింగుల్లో భూములను ఎలా మాఫియాలకు కట్టబెట్టాలని, ఇసుకను ఎలా దోచుకోవాలని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం ఎలా అనే దానిపైనే చర్చించారని, ఏనాడూ రైతు సమస్యలపై చర్చించలేదన్నారు. అధికారంలో ఉన్న వారు ఇప్పటిదాకా ప్రజలకు ఏం చేశామో చెప్పి, మరోసారి అవకాశం ఇస్తే ఎలా మేలు చేస్తామో చెప్పుకుని ఎన్నికలకు వెళ్లడం మంచి పద్ధతి అన్నారు. అందుకు విరుద్ధంగా ఎన్నికల ముందు అన్నీ చేస్తామని చెప్పడం అంటే దగా చేయడమేనన్నారు. వైఎస్ పాలనను ఒక్కసారి గుర్తుచేసుకోమని సూచించారు. ఎన్నికల సమయంలో వైఎస్ ఏనాడూ కొత్త తాయిలాలు ప్రకటించలేదన్నారు. ఐదేళ్ల కాలంలో తాను చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించి ప్రజలను ఓట్లు అడిగారని తెలిపారు. అలాంటి ధైర్యం బాబుకు ఉందా అని ప్రశ్నించారు. కొంతమంది మంత్రులు తమ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి లేఖలు రాయడాన్ని శ్రీకాంత్ రెడ్డి ఆక్షేపించారు. నాలుగేళ్లు కేంద్రంలోని బీజేపీతో అంటకాగి, అధికారాలను అనుభవించారని, అప్పుడు విభజన సమస్యలు కన్పించలేదా అని నిలదీశారు. కేసీఆర్‌కు వంగి దండాలు పెట్టిందెవరు? తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీకొస్తే వంగి వంగి నమస్కారాలు పెట్టారని, కండువాలు కప్పి సత్కరించారని, కేసీఆర్ యాగానికి హాజరై ఆయన కాళ్లకు మోకరిల్లింది చంద్రబాబు అని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఆరోజే కేసీఆర్‌ను ఏపీ హక్కుల కోసం ఎందుకు నిలదీయలేదన్నారు. వైఎస్ జగన్ 9 ఏళ్లుగా ప్రజాక్షేత్రంలోనే పోరాటం చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి గుర్తు చేశారు. వ్యవసాయం దండుగన్న మనిషి, రైతులకు ఉచిత కరెంట్ఇస్తే తీగలపై బట్టలు ఆరేసుకోవాలని ఎద్దేవా చేసిన చంద్రబాబు ఇప్పుడు రైతు రక్ష పథకం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. లోపాయికారి ఒప్పందాలు బీజేపీ వ్యతిరేక కూటమి అంటూనే చంద్రబాబు ఆ పార్టీతోనే లోపాయికారి ఒప్పందాలకు తెరతీశాడని శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. గడ్కరీ రాష్ట్రానికి వస్తే మంత్రులే ప్రశంసలు చేయడం చూస్తుంటే ఎన్నికల తర్వాత బీజేపీ అధికారంలోకి వస్తుందేమోనని ఒకవైపు, కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని మరోవైపు ఆలోచిస్తూ ఇద్దరితో సంబంధాలు కొనసాగిస్తున్నది చంద్రబాబేనన్నారు. చంద్రబాబు గురించి ఆయన మామ ఎన్టీఆర్ ఏమన్నారో, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు ఏమన్నారో ఒకసారి యూట్యూబ్ చూడాలన్నారు. గాలేరు–నగరి, హంద్రీ–నీవా ప్రాజెక్టుల వల్లే సీమకు నీరొస్తోందని, అది వైఎస్ పుణ్యమేనని ఆయన తెలిపారు. -
చంద్రబాబు దర్శకత్వం.. శివాజీ నటనతో
వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై దాడితో ప్రజాస్వామ్యం ఖూనీ చేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రఘురామి రెడ్డి వ్యాఖ్యానించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. మైదుకూరు ఎమ్మెల్యే రఘురామి రెడ్డి మాట్లాడుతూ..ఎమ్మెల్యేలను రూ.30 కోట్లకు కొనుగోలు చేసిన చంద్రబాబు, శ్రీనివాసరావుకు రూ.100 కోట్లు ఆఫర్ చేసినా చేసి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. వైఎస్సార్ కుటుంబం లేకపోతే తనకు తిరుగులేదని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. రాజారెడ్డిని హత్య చేయించింది నువ్వు కాదా..దోషులకు ఆశ్రయం కల్పించింది నువ్వు కాదా? అని సూటిగా చంద్రబాబును ప్రశ్నించారు. వైఎస్సార్ మరణం వెనక కూడా అనేక అనుమానాలు ఉన్నాయని అన్నారు. ఇంత వరకు ఆ కేసు గురించి నిజాలు బయటకు రాలేదని తెలిపారు. చిచ్చరపిడుగులా ఎదుగుతున్న వైఎస్ జగన్‌పై కచ్చితంగా చంద్రబాబు కుట్ర పన్నారని ఆరోపించారు. కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ..చంద్రబాబు నాయుడు తప్ప అన్ని పార్టీలు దాడిని ఖండించాయని తెలిపారు.ఇతర పార్టీలు ఖండించినా జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. తెలుగు దేశం నేతల స్పందన ఎంత జుగుప్సాకరంగా ఉందో ప్రజలంతా చూస్తున్నారని అన్నారు. జగన్ ఎంత హుందాగా వ్యహరించారో గమనించాలని కోరారు. చంద్రబాబు దర్శకత్వంలో..సినీ నటుడు శివాజీ నటనతో గరుడపురాణం నడుస్తున్నదని అన్నారు. శివాజీని అరెస్ట్ చేస్తే ఆపరేషన్ గరుడ సూత్రధారులు ఎవరో బయటకు వస్తారని చెప్పారు. దీనిపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. కడప మేయర్ సురేష్ బాబు మాట్లాడుతూ..మూడు నెలల నుంచి ఈ కుట్ర జరుగుతోందని స్పష్టం అవుతోందని వ్యాక్యానించారు. శివాజీ గరుడ లీక్ దీనికి నాంది అని వివరించారు. దీని వెనక ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఒక మీడియా అధిపతి ఉన్నారని వెల్లడించారు. హత్యా రాజకీయాలను ప్రోత్సహించే వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. శివాజీ ఇప్పుడే అమెరికా వెళ్లడంపై కూడా అనుమానాలకు తావిస్తుందని అన్నారు. ఇది అంతా ఒక పథకంలో భాగంగానే జరుగుతుందని అనుమానం వ్యక్తం చేశారు. రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ..ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వాడుతున్న భాష అభ్యంతరకరంగా ఉందన్నారు. మీలా తాము దిగజారదలచుకోలేదని చెప్పారు. వారి మాటలు వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని వ్యాఖ్యానించారు. మేధావులు, ప్రజలు అర్ధం చేసుకోవాలని కోరారు. అప్పుడు పెరుగువడ అన్నాను కానీ..ఇప్పుడు అసలు కథ అర్ధం అవుతోందని పరోక్షంగా టీడీపీ కుట్రల గురించి ప్రస్తావించారు. ఇలానే వదిలేస్తే చాలా ఘోరాలు జరుగుతాయని పేర్కొన్నారు. తాము అడ్డదారిలో గద్దెనెక్కే వాళ్లం కాదని, భయపడి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయవద్దని కోరారు. టీడీపీ నేతలు తమ భాషను ఒకసారి చెక్ చేసుకోవాలని సూచించారు.