Gali Janardhana Reddy
-
బళ్లారి, రాయచూరుల్లో విమానాశ్రయాలు కట్టాలి: గాలి
శివాజీనగర: బళ్లారి, రాయచూరులో ప్రభుత్వం విమానాశ్రయాలు నిర్మించాలని కేఆర్పీపీ ఎమ్మెల్యే గాలి జనార్ధనరెడ్డి గురువారం డిమాండ్ చేశారు. విధానసభలో ఆయన మాట్లాడుతూ బళ్లారిలో విమానాశ్రయం నిర్మాణానికి ప్రభుత్వం నిధులు ఇవ్వాల్సిన అవసరం లేదు. అక్కడ డీఎంఎఫ్ నిధి ఉంది. ఈ నిధులో ఉన్న సొమ్మును ఉపయోగించుకొని విమానాశ్రయం నిర్మించవచ్చని తెలిపారు. అలాగే బళ్లారిలో అంతర్జాతీయ క్రికెట్ మైదానం నిర్మించేందుకు 200 ఎకరాల అనువైన స్థలం ఉందని చెప్పారు. రాయచూరు యరమరస్‌లో విమానాశ్రయం నిర్మాణానికి 200 ఎకరాల స్థలం ఉందని, విమానాశ్రయం నిర్మిస్తే కొప్పళతో పాటుగా చుట్టుపక్కల జిల్లాలకు అనుకూలమవుతుందని తెలిపారు. 2010లో బళ్లారిలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసి రూ.83 కోట్ల ఖర్చుతో అన్ని సదుపాయాలతో భవనం నిర్మించామన్నారు. ఈ ఆసుపత్రికి పరికరాలకు రూ.52 కోట్లు అవసరముందని, ప్రభుత్వం ఈ సొమ్మును విడుదల చేసి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనిచేసేలా చూడాలని కోరారు. -
గంగావతి అసెంబ్లీ సీటునుంచి గెలిచిన గాలి జనార్ధన్ రెడ్డి
-
గాలి జనార్థన్‌రెడ్డిపై సోదరుడు సోమశేఖర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
బళ్లారి: కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గాలి జనార్థన్‌రెడ్డిపై సోదరుడు సోమశేఖర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి బళ్లారి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సోమశేఖర్‌రెడ్డి.. తనదే విజయం అని స్పష్టం చేశారు. గాలి జనార్థన్‌రెడ్డి భార్య బరిలోకి దిగుతున్నప్పటికీ విజయం మాత్రం తనదేని నొక్కి చెప్పారు సోమశేఖర్‌రెడ్డి. గాలి జనార్థన్‌రెడ్డి పేరు అక్కడక్కడ వినిపిస్తున్నా, ఆయన పబ్లిక్‌తో ఎటువంటి సంబంధాలు లేవన్నారు. పబ్లిక్‌తో ఉండేది తానేనని సోమశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. అదే తనను గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గతంలో తామంతా గాలి జనార్థన్‌రెడ్డి ఉన్పామని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు సోదరుడు సోమశేఖర్‌రెడ్డి. పక్కా కార్యకర్తలంతా తమతోనే ఉన్నారని, అది తన గెలుపునకు దోహదం చేస్తుందన్నారు. డబ్బులకు ఆశ పడే వాళ్లు మాత్రమే గాలి జనార్థన్‌రెడ్డి వైపుకు వెళ్తున్నారని, నిజమైన కార్యకర్తలు మాత్రం తమ పార్టీ వెంటే ఉన్నారన్నారు. ఇదిలా ఉంచితే, గాలి జనార్థన్‌రెడ్డి స్థాపించిన కళ్యాణ రాజ్య ప్రగతిపక్ష(కేఆర్పీ)పార్టీ తరఫున ఆయన భార్య అరుణ లక్ష్మి పోటీ చేస్తున్నారు. కాగా, కర్నాటక ఎన్నికలకు సంబంధించి కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ అధ్యక్షుడు గాలి జనార్ధన్ రెడ్డి స్పందించారు. కర్నాటక ఎన్నికల్లో మేమే కీలకం కాబోతున్నాం. 25 అసెంబ్లీ స్థానాల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తాం. మా రాజకీయ ప్రత్యర్ధులు బీజేపీ - కాంగ్రెస్. బసవేశ్వర సిద్ధాంతాలే మా అజెండా. కులాలు, మతాలకు అతీతంగా సేవ చేసేందుకే రాజకీయ పార్టీ స్థాపించాను’ అని అన్నారు. -
కొత్త పార్టీ ప్రకటించిన గాలి జనార్దన్ రెడ్డి.. 2023లో అక్కడి నుంచే పోటీ!
బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి సొంత పార్టీని స్థాపించారు. కొద్ది రోజుల క్రితం తుమకూరు నగరంలో ఉన్న సిద్ధగంగా మఠాన్ని సందర్శించిన సందర్భంగా సొంత పార్టీపై సూత్రప్రాయంగా వెల్లడించిన గాలి జనార్దన్ రెడ్డి.. ముందుగా చెప్పినట్లుగానే డిసెంబర్ 25న కొత్త పార్టీ ప్రకటన చేశారు. ‘కల్యాణ రాజ్య ప్రగతి పక్ష’ పేరుతో నూతన రాజకీయ పార్టీని ప్రకటించారు. గనుల అక్రమ తవ్వకాలకు సంబంధించిన కేసులో ఆయన విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు బీజేపీలో కొనసాగిన ఆయన.. నాయకత్వం బుజ్జగించినప్పటికీ కొత్త పార్టీవేపై మొగ్గు చూపారు. బీజేపీతో రెండు దశాబ్దాల బందానికి తెరదించారు. మరోవైపు.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కొప్పల్ జిల్లాలోని గంగావతి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ‘నేను ఆ పార్టీ సభ్యుడిని కానని దానితో ఎలాంటి సంబంధం లేదని బీజేపీ నేతలు చెబుతున్నప్పటికీ ఆ పార్టీకి చెందిన వాడినేనని ప్రజలు విశ్వసించారు. ఆ నమ్మకం అబద్ధమని తేలింది. నా సొంత ఆలోచనతో ఈ రోజు కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీని ప్రకటిస్తున్నాను. మతం, కులం పేరుతో చేసే విభజన రాజకీయాలకు ఈ పార్టీ దూరంగా ఉంటుంది. నా జీవితంలో మొదలు పెట్టిన ఏ విషయంలోనూ విఫలం కాలేదు. నా చిన్నతనంలో గోళీలు ఆడుకునేప్పటి నుంచి ఇప్పటి వరకు పరాజయాన్ని ఆమోదించని వ్యక్తిని. ప్రజల ఆశిస్సులు ఉంటాయనే విశ్వాసం ఉంది. భవిష్యత్తులో కర్ణాటక కల్యాణ రాజ్యంగా(సంక్షేమ రాష్ట్రంగా) అవతరిస్తుంది.’ - గాలి జనార్దన్ రెడ్డి, కర్ణాటక మాజీ మంత్రి గనుల అక్రమ తవ్వకాల కేసులో గాలి జనార్దన్ రెడ్డితో పాటు 9 మందిపై 2009లో సీబీఐ కేసులు నమోదు చేసింది. 2011 సెప్టెంబర్‌లో జనార్దన్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. నాలుగేళ్ల తర్వాత 2015లో కొన్ని షరతులతో కూడిన బెయిల్‌ను సుప్రీం కోర్టు మంజూరు చేసింది. కర్ణాటకలోని బళ్లారి, ఆంధ్రప్రదేశ్‌లోని కడప, అనంతపురంకు వెళ్లరాదని స్పష్టం చేసింది. అయితే, 2020లో మళ్లీ సుప్రీం కోర్టుకు వెళ్లగా ఆయా జిల్లాల ఎస్పీలకు తెలియజేసిన తర్వాత వెళ్లేందుకు వీలు కల్పించింది. ఇదీ చదవండి: పొలిటికల్ పార్టీపై మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి క్లారిటీ.. 'ఆ రోజే అన్ని చెబుతా' -
పొలిటికల్ పార్టీపై మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి క్లారిటీ.. 'ఆ రోజే అన్ని చెబుతా'
సాక్షి, బెంగళూరు: డిసెంబరు 25వ తేదీన అన్నీ చెబుతానని మాజీ మంత్రి తెలిపారు. తుమకూరు నగరంలో ఉన్న సిద్దగంగా మఠాన్ని మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి, భార్య లక్ష్మి అరుణ సందర్శించారు. శివకుమార స్వామి సమాధి వద్ద పూజలు చేసి మఠాధ్యక్షుడు సిద్దలింగ స్వామిని కలిసి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా మఠం ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత 14 సంవత్సరాల నుంచి మఠాన్ని సందర్శిస్తున్నట్లు తెలిపారు. బసవణ్ణ ఆదర్శంగా ఎలాంటి ప్రచారం లేకుండా లక్షల మందికి సేవ చేసిన ఘనత దివంగత శివకుమార స్వామిదని అన్నారు. తనకు మానసికంగా, దైహికంగా శక్తిని ఇచ్చేది మఠాలేనని చెప్పారు. మఠంలో ఎలాంటి రాజకీయాలను మాట్లాడనని, ఈ నెల 25వ తేదీన బెంగళూరులో మీడియా సమావేశం నిర్వహించి అన్ని విషయాలనూ అక్కడ వెల్లడిస్తానని చెప్పారు. చదవండి: (ఉజ్వల లబ్ధిదారులకు రూ.500కే సిలిండర్) -
గాలి రాతలైతేనే అచ్చేస్తాం! రామోజీ పచ్చ రాతలు.. నిజాలకు పాతరేస్తూ..
ఏదో ఒకరకంగా బురద జల్లటమే తప్ప వాస్తవాలతో పనిలేని ‘ఈనాడు’... బుధవారం కూడా ఇలానే బోడిగుండూ... మోకాలూ ఒకటేనని చెప్పే ప్రయత్నం చేసింది. గాలి జనార్థన్‌రెడ్డికి ఓబుళాపురం గనులు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయిందని, తమకేమాత్రం అభ్యంతరం లేదంటూ సుప్రీంకోర్టుకే చెప్పిందని అబద్ధాలను పోగేసి వండివార్చింది. ఓబుళాపురం గనులకు సంబంధించి జరగనివన్నిటినీ జరిగినట్లుగా ఊహించుకుంటూ రామోజీ తన మార్కు పాత్రికేయానికి మరోసారి పదునుపెట్టారు.‘గాలి అడిగితే కాదంటామా?’ అనే శీర్షికతో గాలి వార్తను అచ్చేశారు. అక్షరం కూడా వాస్తవం లేని ఈ కథనంలో అసలు నిజాలేంటో ఒకసారి చూద్దాం... ఓబుళాపురం ప్రాంతంలోని మూడు ఇనుప ఖనిజం గనులకు ఉన్న 50 సంవత్సరాల లీజు కాలపరిమితి గత ఏడాదితో ముగిసింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇలాంటి కాలపరిమితి ముగిసిన గనులకు 1957 గనుల చట్టం ప్రకారం ఈ–ఆక్షన్ ద్వారా తిరిగి లీజులు కేటాయించాలి. కాకపోతే ఇప్పటికే ఈ గనులకు సంబంధించిన అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదం కోర్టు విచారణలో ఉంది. గతంలో సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా క్షేత్ర స్థాయిలో సర్వే చేసి నిర్దేశించిన మేరకు ఓబుళాపురం సరిహద్దులను నిర్ధారిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సర్వే రాళ్ళను ఏర్పాటు చేసింది. సరిహద్దుల నిర్ధారణ కూడా పూర్తయిన నేపథ్యంలో... కోర్టులో ఉన్న కేసును పరిష్కరించడం కోసం త్వరగా వాదనలు వినిపించాలని రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ ఆన్ రికార్డ్స్‌ను కోరింది. ఎందుకంటే ఈ వివాదం పరిష్కారమైతే సదరు మూడు గనులకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం మళ్లీ ఈ–ఆక్షన్ నిర్వహించాల్సి ఉంటుంది. అలా కాకుండా సుప్రీంకోర్టు ఏవైనా ఆదేశాలు ఇస్తే వాటి ప్రకారం ముందుకెళ్లాల్సి ఉంటుంది. నిజానికి అక్కడ తవ్వకాలకు అనుమతివ్వాలా? వద్దా? అనేది సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా ఉంటుంది. కాకపోతే దుష్ప్రచారమే ఎజెండాగా చెలరేగిపోతున్న ‘ఈనాడు’కు ఈ వాస్తవాలేవీ కనిపించ లేదు. గాలి జనార్థన్‌రెడ్డి వ్యవహారానికి దీంతో లింకు పెట్టి యథేచ్చగా తప్పుడు కథనాలు రాసిపారేసింది. ఇది ‘గాలి’ వార్త కాదా రామోజీ? వాస్తవానికి ఓబుళాపురంలో ఇనుప ఖనిజం తవ్వకాలు జరిగితే అది ఆ ప్రాంతానికి ఉపయోగకరమే. అక్కడ అభివృద్ధికి ఆస్కారం ఉంటుంది. కడప స్టీల్ ప్లాంట్‌కు ఇనుప ఖనిజం లభ్యమవుతుంది కూడా. అందుకే కోర్టులో ఉన్న గనుల కేసు కొలిక్కి వస్తే రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం భావించింది. మరి ఇది గాలి జనార్థన్‌రెడ్డికి ప్రయోజనం చేకూర్చడం ఎలా అవుతుంది రామోజీరావు గారూ?. సరిహద్దు వివాదం ముగిసిందని, సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా నిర్దేశించినట్లు సరిహద్దులు నిర్ధారించామని మాత్రమే కదా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది!!. దానర్థం గాలి జనార్ధనరెడ్డికి అనుమతి ఇచ్చేయమనా? కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లకు సైతం ఇలా వక్రభాష్యాలు చెప్పటం ఏ స్థాయి జర్నలిజం? ఒకవేళ కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ గనుల వేలానికి అవకాశం ఏర్పడితే... ఎవరైనా దాన్లో పాల్గొనవచ్చు. దక్కించుకున్న వారు ఎవరైనా వాటిని తవ్వుకోవచ్చు. దీనివల్ల రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. ఇదంతా మీకు తెలియదా... లేక తెలిసినా మీ ఉద్దేశం వేరు కాబట్టి తెలియనట్లు నటిస్తున్నారా? రాష్ట్రానికి ఆదాయం రాకూడదన్నదే మీ ఎజెండా కాబట్టి ఈ రాతలకు దిగుతున్నారా? ‘బాబు’ స్కాములపై అసలు పెన్నెత్తలేదేం? చంద్రబాబు హయాంలో ఎన్ని కుంభకోణాలు వెలుగుచూసినా రామోజీరావు వాటి గురించి ఏనాడు పట్టించుకోలేదు. ఉచిత ఇసుక పేరుతో చంద్రబాబు దోచేసినా... చంద్రబాబు తన కరకట్ట ఇంటి వెనక రాత్రింబవళ్లూ ఇసుకను లారీలతో అక్రమంగా తరలించేసుకున్నా రామోజీకి కనపడలేదు. ‘సాక్షి’లో ఫోటోలతో సహా ప్రచురించినా ‘ఈనాడు’ పెన్నెత్తలేదు. ఇప్పుడు అదే ఇసుకపై రాష్ట్ర ప్రభుత్వానికి రూ.750 కోట్ల ఆదాయం వస్తోంది. ఇక రాజధాని ఎక్కడో చెప్పకుండా ముందే అమరావతి ప్రాంతంలో భూములు కొని, లక్షల కోట్ల ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడినా అది రామోజీకి అభివృద్ధిగానే కనపడింది. రాజధానిలో దళితుల భూములను పైసాకు, పరకకు కొనుగోలు చేసి తర్వాత తీరిగ్గా చంద్రబాబు మనుషులకు అనుకూలంగా క్రమబద్ధీకరించుకున్నా అదో నేరంగా కనిపించలేదు. అమరావతి రింగ్‌రోడ్డును తన అనుయాయులకు అనుకూలంగా ఎన్ని వంపులు తిప్పినా ‘ఈనాడు’కు అది చూడచక్కని గొలుసు డిజైన్‌గానే కనిపించింది. దోచుకో.. పంచుకో.. తినుకో (డీపీటీ) స్కీములో ఎవరి వాటా వారికి అందింది కాబట్టే అప్పట్లో స్కాములన్నీ రామోజీకి అభివృద్ధి వీచికలుగా కనిపించాయి. ఇప్పుడు రాష్ట్రాభివృద్ధి కోసం ప్రభుత్వం ఏది తలపెట్టినా... ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మోకాలడ్డుతూనే ఉన్నారు. అందులో భాగమే ఈ... గాలి రాతలు. -
హీరోగా ‘మైనింగ్ కింగ్’ గాలి జనార్థన్ రెడ్డి కుమారుడు, మూవీ టైటిల్ ఖరారు
కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి తనయుడు గాలి కిరిటి సినీరంగ ప్రవేశం చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే గాలి కిరిటి కన్నడ, తెలుగు ఇండస్ట్రీకి హీరోగా పరిచయంగా కాబోతున్నాడు. దీనికి సంబంధించిన స్క్రీప్ట్ వర్క్, నటీనటుల ఎంపిక కూడా పూర్తయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో త్వరలోనే మూవీ సెట్స్‌పైకి రానుందంటూ తాజాగా చిత్ర బృందం అప్డేట్ ఇచ్చింది. యువ దర్శకుడు రాధాకృష్ణ ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ సినిమాకు వారాహి అనే టైటిల్‌ను ఖరారు చేశారు. చదవండి: విజయ్‌తో పెళ్లి వార్తలపై తొలిసారి నోరు విప్పిన రష్మిక, ఏం చెప్పిందంటే.. తెలుగు కన్నడ ద్విభాషా చిత్రంగా ప్రేమ, కుటుంబ కథా అంశాలను కలిపి రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ప్రారంభానికి సన్నాహాలు చేసుకుంటున్నది. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా..కె సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు తీసుకుంటున్నారు. పీటర్ హెయిన్ స్టంట్స్ సమకూర్చుతున్నారు. ఈ మూవీలో మిగతా నటీనటులను కూడా త్వరలోనే ప్రకటించనున్నారు. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలన్న ఆలోచన రాగానే దానిపైనే దృష్టి సారించిన కిరీటి స్వదేశంతో పాటు విదేశాల్లోనూ ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాడట. మొత్తంగా ఓ రేంజిలో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న గాలి కిరీటి ఏ మేర జనాలను మెప్పిస్తారో చూడాలి. -
గాలి జనార్ధన్‌రెడ్డికి చుక్కెదురు
సాక్షి, న్యూఢిల్లీ: బెయిలు షరతులు సడలించాలంటూ కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధనరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ మరో ధర్మాసనానికి బదిలీ అయింది. జనార్ధనరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ వెకేషన్ బెంచ్ జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎం.ఆర్.షాలతో కూడిన ధర్మాసనం ముందుకు సోమవారం వచ్చింది. ఈ పిటిషన్ గతంలో జస్టిస్ అశోక్‌భూషణ్, జస్టిస్ ఆర్.సుభాశ్‌రెడ్డిల ధర్మాసనం విచారించిందని, ప్రస్తుతం వెకేషన్ బెంచ్ ఈ పిటిషన్‌ను విచారించబోదని జస్టిస్ అశోక్ భూషణ్ స్పష్టం చేశారు. బళ్లారి, అనంతపురం, కడపలకు వెళ్లకూడదన్న 20.1.2015 నాటి ఆదేశాల్లోని షరతు సడలించాలని పిటిషన్లో కోరారు. జస్టిస్ ఆర్.సుభాశ్‌రెడ్డితో మాట్లాడామని, గతంలో పిటిషనర్ దాఖలు చేసిన మిస్లీనియస్ అప్లికేషన్‌తోపాటు ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి సూచించిన ధర్మాసనానికి బదిలీ చేయాలంటూ ధర్మాసనం రిజిస్ట్రీని ఆదేశించింది. -
అతడిని చూస్తే కన్నీళ్లొచ్చాయి
సాక్షి, బెంగళూరు : బళ్ళారికి చెందిన ఎమ్మెల్యేలు రెండు వర్గాలుగా మారడంతో పాటు హొసపేటె ఎమ్మెల్యే ఆనంద్‌సింగ్, కంప్లి ఎమ్మెల్యే గణేష్ మధ్య జరిగిన గొడవకు మూల కారణం మాజీ సీఎం సిద్ధరామయ్య, మంత్రి డి.కే.శివకుమారలేనని మాజీ మంత్రి గాలి జనార్దన రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యేల వద్ద ప్రాబల్యం చూపించుకుంటూ వీరిద్దరు ఇలాంటి పరిస్థితులను సృష్టిస్తున్నారని విమర్శించారు. బెంగళూరు అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే ఆనంద్‌సింగ్‌ను గాలి జనార్ధన్ రెడ్డి బుధవారం పరామర్శించారు. అనంతరం ఆస్పత్రి బయట మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌లో మాజీ సీఎం సిద్ధరామయ్య, మంత్రి డి.కే శివకుమార్ మధ్య కోల్డ్‌వార్ మొదలైందని అన్నారు. ఎమ్మెల్యే గణేష్, భీమానాయక్‌లు సిద్ధరామయ్య వర్గంలో ఉన్నారని, మిగతావారు మంత్రి డీకే బృందంలో ఉన్నారని వ్యాఖ్యానించారు. దీంతో బళ్లారి జిల్లా ఎమ్మెల్యేల్లో గుంపు రాజకీయాలు మొదలయ్యాయని విమర్శించారు. ఆనంద్‌సింగ్‌పైన దాడి విషయంలో మంత్రి డి.కే. శివకుమార్ మొత్తం అబద్దాలు చెబుతున్నారని, దాడి జరిగిన రోజు సాయంత్రం డిశ్చార్జి అవుతారని ఆయన అంటే, మరో మంత్రి జమీర్ ఆహ్మద్ ఆనంద్‌సింగ్‌కు బిర్యాని తెప్పించి తినిపిస్తానని అన్నారన్నారు. కానీ అక్కడ ఆస్పత్రిలో ఆనంద్‌సింగ్ పరిస్థితి చుస్తుంటే మరికొన్ని రోజుల వరకు డిశ్చార్జి అయ్యేలా కనిపించడ లేదని పేర్కొన్నారు. ఆస్పత్రిలో బెడ్‌పైన పడుకుని ఉన్న తన ఆత్మీయ స్నేహితుడు ఆనంద్‌సింగ్‌ను ఆ పరిస్థితిలో చూస్తే నా కళ్ళలో నీళ్ళు ఆగలేదని అన్నారు. కన్నుతో పాటు తలకు తీవ్రమైనగాయమైందని అన్నారు. దాడి చేసిన గణేశ్ కూడా ఒక ఎమ్మెల్యేనే అని, ఇలా దాడి చేయడం మంచి పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు. ఆ రోజు నన్ను చూడనివ్వలేదు: ఎమ్మెల్యే రాజుగౌడ రిసార్టులో ఎమ్మెల్యే ఆనంద్‌సింగ్ పైన జరిగిన దాడి చూస్తుంటె ఇది సాధారణ మనుషులు చెసినట్లులేదని, కరుడుకట్టిన రాక్షసులు దాడి చేసినట్లు ఉందని ఎమ్మెల్యే రాజుగౌడ మండిపడ్డారు. బుధవారం మధ్యాహ్నం ఆయన ఆనంద్‌సింగ్‌ను పరామర్శించారు. దాడి జరిగిన రోజునే ఆస్పత్రికి వస్తే, కొంతమంది పని కట్టుకుని ఎవరినీ లోనికి వెళ్ళకుండా చేశారని, అందుకు కారణం ఇప్పుడు ఆనంద్‌సింగ్ ఉన్న పరిస్థితిని చూస్తుంటే అర్థం అవుతోందన్నారు. ఆనంద్‌సింగ్ ముఖం చూడగానే చాలా భయం వేసిందన్నారు. శత్రువులకు కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదన్నారు. అధికార కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేలకు కూడా రక్షణ ఇవ్వలేక పోతున్నారు, ఇక రాష్ట్ర ప్రజలకు ఏమి చేస్తారని ఎద్దేవా చేశారు.ఇంత జరిగినా పొలీసులు ఎమ్మెల్యే గణేష్‌ను పట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. -
గాలి జనార్దన రెడ్డిపై సిట్ చార్జ్‌షీటు
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో అక్రమ గనుల తవ్వకాలకు సంబంధించిన కేసులో మాజీ మంత్రి గాలి జనార్దన రెడ్డిపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) చార్జ్‌షీటు దాఖలు చేసింది. గురువారం బెంగళూరులోని ప్రజాప్రతినిధుల కోర్టులో చార్జ్‌షీట్‌ను సమర్పించింది. షేక్‌సాబ్ అనే వ్యక్తికి సంబంధించిన మైనింగ్ స్థలాన్ని కాంట్రాక్టుకు తీసుకుని అక్రమంగా తవ్వకాలు జరిపినట్లు చార్జ్‌షీట్‌లో సిట్ ఆరోపించింది. ఏ1గా గాలి జనార్దనరెడ్డి, ఏ2గా అలీఖాన్, ఏ3గా శ్రీనివాసరెడ్డిల పేర్లను పేర్కొంది. -
‘కుమారస్వామి పాము లాంటోడు.. అందుకే’
సాక్షి, బెంగళూరు : ‘కుమారస్వామి పాము లాంటోడు. అందుకే నన్ను జైలుకు పంపించి తన పాత పగను తీర్చుకున్నాడు’ అంటూ కర్ణాటక మాజీ మంత్రి, గనుల వ్యాపారి గాలి జనార్ధన్‌రెడ్డి సీఎం కుమారస్వామిపై విమర్శలు గుప్పించారు. ‘యాంబిడంట్’ ముడుపుల కేసులో గత ఆదివారం అరెస్టైన జనార్దనరెడ్డికి బుధవారం బెయిలు మంజూరైన సంగతి తెలిసిందే. దీంతో బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. ఈ సందర్భంగా.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆయన.. మీడియాతో సుమారు 45 నిమిషాల పాటు సంభాషణ సాగించడం విశేషం. మేం కూడా బాధితులమే.. ‘యాంబిడెంట్ కంపెనీ నా సెక్రటరీ అలీఖాన్ కుటుంబాన్ని మోసం చేసింది. ఈ కారణంగా యాంబిడెంట్‌కు చెందిన ఫరీద్‌పై ఫిర్యాదు చేసేందుకు మేం సిద్ధమయ్యాం. దీంతో భయపడిపోయిన ఫరీద్ నా దగ్గరికి పరిగెత్తుకు వచ్చాడు. పోలీసులకు ఈ విషయం గురించి చెప్పొద్దని, పెట్టుబడిదారులందరికీ వారి డబ్బులు తిరిగి ఇస్తానని మాట ఇచ్చాడు. మానవత్వంతో నేను కూడా సరేనన్నాను. ఆ సమయంలో తీసిన ఫొటోను ఆధారంగా చేసుకుని నన్ను ఈ కేసులో ఇరికించారు. జరిగింది ఇదే. నిజం చెప్పాలంటే ఈ కేసులో మేం బాధితులమే గానీ నేరస్తులం కాదు’ అని జనార్ధన రెడ్డి చెప్పుకొచ్చారు. అంతేకాకుండా బంగారు కడ్డీలు కొనడానికి యాంబిడెంట్ ప్రజల సొమ్మును ఉపయోగించిన విషయం తన సెక్రటరీ అలీఖాన్‌కు తెలియదని పేర్కొన్నారు. అతడిది పాము పగ.. సీఎం కుమారస్వామి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్న జనార్ధన రెడ్డి... పాత పగను దృష్టిలో పెట్టుకునే తనను అరెస్టు చేయించారని ఆరోపించారు. 2006లో బీజేపీ మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కుమారస్వామి.. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన అనంతరం గాలి జనార్దన్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కుమారస్వామి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే మైనింగ్ లాబీ నుంచి ఆయన 150 కోట్ల రూపాయల ముడుపులు అందుకున్నారని గాలి జనార్దన్ ఆరోపణలు చేశారు. తాజాగా మీడియాతో ఈ విషయాలను ప్రస్తావించిన జనార్ధన్ రెడ్డి... ఆనాటి విషయాలు మనసులో పెట్టుకునే సీఎం తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆయన పాములాంటోడని.. గతంలో తనను అరెస్టు చేయించలేక పోయినందుల్లే ప్రస్తుతం ఇలా పగ సాధిస్తున్నారని వ్యాఖ్యానించారు. నీకు ఉన్నది 37 ఎమ్మెల్యేలే గుర్తుపెట్టుకో.. అక్రమ మైనింగ్ కేసులో శిక్ష అనుభవించి విడుదలైన నాటి నుంచి లో ప్రొఫైల్ మెయింటేన్ చేస్తున్నానని గాలి జనార్ధన్ అన్నారు. అప్పటి నుంచి ఎటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకుండా తన పని తాను చేసుకుంటున్నానని పేర్కొన్నారు. కానీ కుమారస్వామి తనను అలా ఉండనివ్వదలచుకోవడం లేదన్నట్లుగా అన్పిస్తోందని అందుకే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు. ఇందులో భాగంగానే తనను అంతం చేసేందుకు కుట్ర పన్నారని, అయితే జడ్జి నిష్పక్షపాతంగా వ్యవహరించడం వల్ల తనకు బెయిలు లభించిందని పేర్కొన్నారు. అంతేకాకుండా కుమారస్వామికి ఉంది కేవలం 37 మంది ఎమ్మెల్యేలేనని.. ఆ విషయం గుర్తుపెట్టుకుంటే బాగుంటుందని జనార్ధన్ రెడ్డి హెచ్చరించారు. పనిలో పనిగా తనను దూరంగా పెడుతున్న బీజేపీకి కూడా చురకలు అంటించారు. కాగా 600 కోట్ల రూపాయల విలువైన పోంజీ స్కామ్ నుంచి నిందితులను తప్పించేందుకు 18 కోట్ల రూపాయల విలువైన బంగారు కడ్డీలను స్వీకరించారన్న ఆరోపణలతో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ గత ఆదివారం గాలి జనార్ధన్ రెడ్డిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. -
గాలి జనార్దనరెడ్డికి బెయిలు
సాక్షి బెంగళూరు: యాంబిడంట్ ముడుపుల కేసులో గత ఆదివారం అరెస్టయిన కర్ణాటక మాజీ మంత్రి, గనుల వ్యాపారి గాలి జనార్దనరెడ్డికి బుధవారం బెయిలు మంజూరైంది. దీంతో బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. జనార్దనరెడ్డి తరపు న్యాయవాది చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో సీసీబీ (కేంద్ర నేర విచారణ విభాగం) సక్రమంగా వ్యవహరించలేదనీ, ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గి జనార్దనరెడ్డిని అరెస్టు చేశారని ఆరోపించారు. కాగా, తనకు ప్రాణహాని ఉందనీ, రక్షణ కల్పించాలంటూ హోం మంత్రి పరమేశ్వరను జనార్దనరెడ్డి కోరారు. -
‘గాలి’ అరెస్ట్ వెనక కుమారస్వామి?
సాక్షి, న్యూఢిల్లీ : కొందరు పోంజి స్కీమ్‌గా అభివర్ణించే పాన్సీ స్కీమ్ స్కామ్‌లో బీజేపీ మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అరెస్టై జైలుకు వెళ్లడం వెనక కర్ణాటక ప్రస్తుత ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి ప్రతీకారం ఉందా? 1600 కోట్ల రూపాయల మైనికంగ్ కుంభకోణం కేసులో 2011లో అరెస్టైన గాలి జనార్ధన్ రెడ్డి నాలుగేళ్లు జైలు శిక్ష అనుభవించి బెయిల్‌పై విడుదలైన విషయం తెల్సిందే. 600 కోట్ల రూపాయల పాన్సీ స్కీమ్ నుంచి నిందితులను తప్పించేందుకు 18 కోట్ల రూపాయల విలువైన బంగారు కడ్డీలను స్వీకరించారన్నది గాలి జనార్దన్ రెడ్డిపై తాజా ఆరోపణ. ముఖ్యమంత్రి కుమార స్వామికి, గాలి జనార్దన్ రెడ్డి మధ్య కొనసాగుతున్న గొడవ 2006 నాటిది. ఆ నాడు అసెంబ్లీ శాసన సభ్యుడైన కుమార స్వామి ముఖ్యమంత్రి అవడం కోసం ఇద్దరు బీజేపీ నాయకులు, తన జేడీఎస్ పార్టీకి చెందిన ఓ యువజన నాయకుడి కోటరీతో కుట్ర పన్ని అప్పటి ధరమ్‌సింగ్ నాయకత్వంలోని కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చివేశారు. బీజేపీ మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కుమారస్వామి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటికే బీజేపీకి నిధులు సమకూర్చే నాయకుడిగా ముద్రపడిన గాలి జనార్దన్ రెడ్డిని ఆయన తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. కుమార స్వామి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలు కూడా కాకముందే మైనింగ్ లాబీ నుంచి ఆయన 150 కోట్ల రూపాయల ముడుపులు స్వీకరించారంటూ గాలి జనార్దన్ ఆరోపించారు. ఆ తర్వాత కొంతకాలానికే బీజేపీతో చేసుకున్న అధికార మార్పిడి ఒప్పందం ప్రకారం సీఎం పదవికి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. ‘నేను ముఖ్యమంత్రి పదవిని చేపట్టి పట్టుమని ఐదు నెలలు కూడా కాలేదు. నా సంకీర్ణ భాగస్వామ్య పక్షం నాయకుడే నాపై అవినీతి ఆరోపణలు చేశారు. నేనా విషయాన్ని నా జీవిత కాలంలో ఎన్నడూ మరవను’ అని ఈ ఏడాది కుమారస్వామి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి కొన్ని రోజుల ముందు విలేకరులతో వ్యాఖ్యానించారు. గాలిపైనున్న ప్రతీకార జ్వాలల కారణంగానే కుమార స్వామి బీజేపీతోని కాకుండా కాంగ్రెస్ పార్టీతోని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని రాజకీయ విశ్లేషకులు నేటికీ భావిస్తున్నారు. అంతే కాకుండా గత ఎన్నికల్లో గాలి జనార్దన్ రెడ్డి లాబీకి వ్యతిరేకంగా తీవ్ర ప్రచారం చేశారు. దాంతో బీజేపీ నాయకులు శ్రీరాములు తరఫున గాలి జనార్దన్ రెడ్డి చేసిన ప్రచారానికి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఆమోద ముద్ర వేయలేక పోయారు. పార్టీ కార్యకర్తగా కాకుండా వ్యక్తిగత హోదాలో శ్రీరాములుకి గాలి జనార్దన్ రెడ్డి ప్రచారం చేస్తున్నారని అమిత్ షా చెప్పాల్సి వచ్చింది. ఒకప్పుడు కాంగ్రెస్‌కు బలంగా ఉన్న బళ్లారి ప్రాంతంలో బీజేపీ బలపడడానికి శ్రీరాములుతో కలిసి గాలి జనార్దన్ రెడ్డి తీవ్రంగా కృషి చేశారు. ఒకప్పుడు అంటే 1999లో బీజేపీ తరఫున విస్తృత ప్రచారం సాగించిన సుష్మా స్వరాజ్‌పై సోనియా గాంధీ బళ్లారి నుంచి విజయం సాధించారంటే కాంగ్రెస్ బలాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆ స్థితి నుంచి బళ్లారి నుంచి అన్ని సీట్లు బీజేపీ గెలుచుకునే స్థాయికి బీజేపీ బలపడింది. గత మే నెలలో జరిగిన ఎన్నికల్లో బళ్లారి ప్రాంతంలోని 9 అసెంబ్లీ సీట్లకు గాను ఆరు సీట్లను కాంగ్రెస్ పార్టీ తిరిగి గెలుచుకుంది. మొన్న బళ్లారి లోక్‌సభకు జరిగి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌లోకి కొత్తగా వచ్చిన ఉగ్రప్ప చేతిలో శ్రీరాములు సోదరి శాంత ఓడిపోయారంటే మళ్లీ కాంగ్రెస్ ఎంత పుంజుకుందో అర్థం చేసుకోవచ్చు. గాలిపై దాఖలైన అవినీతి కేసుల్లో ముఖ్యమంత్రి కుమార స్వామి పంతం పట్టి ముందుకు తీసుకెళుతుండడం, ప్రస్తుతం గాలిని దగ్గర తీయడం నష్టమే ఎక్కువని, ఆయన్ని బీజేపీ దూరంగా ఉంచడం వల్ల అవినీతి కేసులో గాలి అరెస్టైయ్యారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
గాలి జనార్దన రెడ్డి అరెస్టు
సాక్షి బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, గనుల వ్యాపారి గాలి జనార్దన రెడ్డి యాంబిడంట్ కంపెనీ ముడుపుల కేసులో అరెస్టయ్యారు. ఈ కేసుకు సంబంధించి విచారణను ఎదుర్కొనేందుకు శనివారం సాయంత్రమే జనార్దన రెడ్డి బెంగళూరులోని సీసీబీ (కేంద్ర నేర విభాగం) పోలీసు కార్యాలయానికి రావడం తెలిసిందే. శనివారం అర్ధరాత్రి 2 గంటల వరకు జనార్దన రెడ్డిని ప్రశ్నించామనీ, ఆదివారం ఉదయం కూడా విచారణను కొనసాగించి 9 గంటల సమయంలో అరెస్టు చేశామని అదనపు పోలీస్ కమిషనర్ అలోక్ కుమార్ చెప్పారు. అనంతరం ఆయనకు వైద్య పరీక్షలు చేయించి, 6వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరచగా 24 వరకు జనార్దన రెడ్డికి జ్యుడీíషియల్ కస్టడీ విధిస్తూ ఆదేశాలిచ్చారు. దీంతో ఆయనను పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు తరలించారు. ఐపీసీ సెక్షన్లు 120, 204, 420లకింద కేసులు నమోదు చేశారు. కాగా జనార్దన రెడ్డికి, యాంబిడంట్ సంస్థకు ఎలాంటి సంబంధమూ లేదని ఆయన తరఫు న్యాయవాది చంద్రశేఖర రెడ్డి తెలిపారు. కాగా, ఇదే కేసులో పోలీసుల అదుపులో ఉన్న జనార్దన రెడ్డి వ్యక్తిగత సహాయకుడు అలీఖాన్‌ను ఆదివారం విడుదల చేశారు. అయితే తన యజమాని అరెస్టయినందున తాను కూడా జైలులోనే ఉంటానని అలీఖాన్ చెప్పడం గమనార్హం. ఏమిటీ యాంబిడంట్ కేసు? 2016లో సయ్యద్ అహ్మద్ ఫరీద్ అనే బడా వ్యాపారి ఆధ్వర్యంలో యాంబిడంట్ పేరుతో గొలుసుకట్టు పెట్టుబడుల వ్యాపారం ప్రారంభమైంది. నాలుగు నెలలకే పెట్టుబడిపై 50 శాతం రాబడి ఉంటుందంటూ రూ. 600 కోట్లను రాబట్టి అనంతరం చేతులెత్తేసింది. ఈడీ, ఐటీ అధికారులు ఫరీద్‌పై కేసులు నమోదు చేశారు. వీటి నుంచి బయటపడేస్తానంటూ జనార్దన రెడ్డి తన పీఏ ద్వారా ఫరీద్‌తో రూ. 25 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నారనేది ఆయనపై ఉన్న ఆరోపణ. ఇందులో భాగంగా రూ.18 కోట్లను చెందిన బంగారం వ్యాపారి రమేష్ కొఠారి ఖాతాకు జమ చేశారని తేలింది. ఆ సొమ్ముతో 57 కిలోల బంగారం కొన్నారు. రమేష్‌ను విచారణ చేయగా అలీఖాన్‌కు బంగారం అందించినట్లు చెప్పాడు. -
బీజేపీకి కొత్త చిక్కులు
సాక్షి, న్యూఢిల్లీ: కర్ణాటక బీజేపీ నేత బల్లారి ఎంపీ శ్రీరాములుకు అసెంబ్లీ ఎన్నికల ముందు కొత్త చిక్కులొచ్చి పడ్డాయి. గాలి జనార్ధన్ రెడ్డికి అనుకూలంగా తీర్పు ఇవ్వాలని సుప్రీంకోర్టు మాజీ సీజే కేజీ బాలకృష్ణన్ మేనల్లుడు శ్రీనిజన్కు లంచం ఇస్తున్నట్లుగా ఉన్న వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. శ్రీరాములు వీడియోలు బయటకు రావడంతో అతన్ని పోటీ నుంచి అనర్హుడిగా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘాన్ని కోరింది. శ్రీరాములు ప్రస్తుతం సిద్దరామయ్య పై బాదామి నుంచి పోటీచేస్తున్న విషయం తెలిసిందే. శ్రీరాములును పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబాల్ తెలిపారు. శ్రీరాములు గాలిజనార్ధన్ రెడ్డికి ప్రధాన అనుచరుడని, ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీరాములుకి సంబంధం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఆంధ్రప్రేదేశ్, కర్ణాటక ప్రాంతాల్లో అక్రమ మైనింగ్‌కు పాల్పడినట్లు గాలి జనార్ధన్‌రెడ్డి పలు కేసులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. వీడియోలో ఉన్నది శ్రీరాములు కాదని, కాంగ్రెస్ దురుద్ధేశంతో ఫేక్ వీడియోలను సృష్టించిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విమర్శించారు. -
బళ్లారిలో అన్నిసీట్ల గెలుపుపై గాలి వర్గం ధీమా
-
గాలికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?
సాక్షి, బెంగళూర్ : మైనింగ్ కింగ్, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి మళ్లీ బీజేపీలో క్రియాశీలకంగా మారాలని ఉవ్విళ్లూరుతున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసేందుకు సిద్ధమని ఆయన ప్రకటించారు. అనేకల్ పట్టణంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన తర్వాత మీడియాతో మాట్లాడారు. ‘‘బీజేపీ నాకు ఒక్క అవకాశం ఇస్తే కాంగ్రెస్‌ను సర్వనాశనం చేస్తా. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపు తథ్యం. రైతుల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశా. మున్ముందు కూడా పార్టీ కోసం పని చేస్తా’’ అని గాలి జనార్దన్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకత పెరిగిపోయిందని.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పాలన అసమర్థ పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని జనార్దన్ చెప్పారు. మైసూర్ చాముండీ ఆలయంలోకి సిద్ధరామయ్య షూ వేసుకుని వెళ్లిన ఘటన ఇంకా ప్రజలకు మరిచిపోలేదని జనార్దన్ తెలిపారు. తనపై 42 తప్పుడు కేసులు పెట్టి యూపీఏ ప్రభుత్వం తనను నాశనం చేయాలని చూసిందని.. కానీ, వారి కుట్రలు ఫలించలేదని ఆయన చెప్పారు. కాగా, గాలి జనార్దన్‌కు బీజేపీతో ఎటువంటి సంబంధం లేదని, ఆయన పార్టీలో లేరని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప ప్రకటించిన విషయం తెలిసిందే. బీజేపీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి గాలికి హైకమాండ్ అనుమతి ఇవ్వాల్సిందేనని పరివర్తన యాత్ర సందర్భంగా యడ్యూరప్ప అన్నారు. అక్రమ గనుల కేసులో జైలుకు వెళ్లిన మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి 2015లో సుప్రీం కోర్టులో బెయిల్ తీసుకుని బయటకు వచ్చారు. అప్పటి నుంచి ఆయన బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. బళ్లారిలో అడుగు పెట్టరాదని సుప్రీం కోర్టు ఆదేశించడంతో గాలి జనార్దన్ రెడ్డి అక్కడి రాజకీయాలకు కూడా దూరంగా ఉంటూ బెంగళూరులో నివాసం ఉన్నారు. ఫిరాయింపుల టెన్షన్... మధ్య కర్ణాటకలోని బళ్లారి జిల్లా ఒకప్పుడు బీజేపీకి కంచుకోట. అయితే 2013 అసెంబ్లీ ఎన్నికల్లో 8 నియోజకవర్గాలకు గానూ 5 స్థానాలను కైవసం చేసుకుని కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. మైనింగ్ కుంభకోణమే బీజేపీని ఇక్కడ దారుణంగా దెబ్బతీసింది.ఇప్పుడు మళ్లీ ఎన్నికల నేపథ్యంలో మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించింది. బీజేపీ ఎమ్మెల్యేలో ఒకరైన బీ నాగేంద్ర(కుద్లిగి నియోజకవర్గం) ఈ నెల 27న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీ మారేందుకు సిద్ధమైపోతున్నాడు. ఆదివాసీ కమ్యూనిటీ నేత అయిన నాగేంద్ర, పార్టీ మారుతుండటం బీజేపీకి భారీ దెబ్బనే. మరోవైపు హోసాపేట్ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ కూడా పార్టీ విధానాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. పది రోజుల క్రితం యాడ్యూరప్ప నిర్వహించిన పరివర్తన యాత్రకు కూడా హాజరుకాకపోవటంతో ఆనంద్ పార్టీని వీడటం దాదాపు ఖరారైనట్లేనని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా బీజేపీకి వలసలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నప్పటికీ.. వారు అంత ప్రభావంతమైన వ్యక్తులు కాకపోవటంతో వారి చేరికకు బీజేపీ విముఖత చూపుతోంది. ఈ నేపథ్యంలో జనాకర్షణ ఉన్న గాలి జనార్దన్‌ను పార్టీలోకి తీసుకోవటమే మంచిదని సీనియర్లు భావిస్తున్నారు. అయితే అవినీతి ఆరోపణలు ఎదుర్కున్న వ్యక్తికి బీజేపీ అధిష్టానం ప్రాధాన్యత ఇస్తుందా ? అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్నగా మారింది. -
గాలి జనార్దన రెడ్డి సన్నిహితుడి అరెస్ట్
బెంగళూరు: పారిశ్రామికవేత్త, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన రెడ్డికి సన్నిహితుడైన ఉన్నతాధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరులో ప్రత్యేక భూ సేకరణ అధికారిగా పనిచేస్తున్న భీమా నాయక్, అతడి వ్యక్తిగత డ్రైవర్ మహ్మద్ లను ఆదివారం గుల్బర్గాలో అదుపులో తీసుకున్నారు. నాయక్ దగ్గర అంతకుముందు డ్రైవర్ గా పనిచేసిన కేసీ రమేశ్ గౌడ ఆత్మహత్య కేసులో వీరిని అరెస్ట్ చేశారు. మాండ్యలోని ఓ లాడ్జీలో రమేశ్ మంగళవారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. గాలి జనార్దన రెడ్డికి చెందిన రూ.100 కోట్ల పాత నోట్లను 20 శాతం కమీషన్ తీసుకుని నాయక్ మర్చారని రమేశ్ తన సూసైడ్ నోట్లో రాశాడు. ఇవన్నీ తనకు తెలియటంతో చంపించేస్తామని బెదిరించారని పేర్కొన్నాడు. భీమ్ నాయక్ అక్రమ సంపాదన, అక్రమాస్తుల వివరాలనూ రమేశ్ తన సూసైడ్ లేఖలో పేర్కొన్నాడు. నాయక్, ఆయన వ్యక్తిగత డ్రైవర్ మొహమ్మద్లే తన ఆత్మహత్యకు కారణమని వెల్లడించాడు. -
గాలిని, టీటీడీ సభ్యుడిని అరెస్ట్ చేయాలి
సీపీఐ నేత నారాయణ డిమాండ్ సాక్షి, హైదరాబాద్: రూ.వంద కోట్ల పాత నోట్ల మార్పిడిలో గాలి జనార్దనరెడ్డిని.. సోదాల్లో పెద్ద ఎత్తున బంగారం, నగదు బయటపడిన కేసులో టీటీడీ సభ్యుడు శేఖర్‌రెడ్డిని అరెస్ట్ చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు కె.నారాయణ డిమాండ్ చేశారు. టీటీడీ ప్రతిష్టకు భంగం కలగకుండా పాలకవర్గంపై సమీక్ష జరపాలని గురువారం ఒక ప్రకటనలో కోరారు. రూ.వంద కోట్ల మార్పిడిపై కారు డ్రైవర్ ఇచ్చిన మరణ వాంగ్మూలం ఆధారంగా గాలి జనార్దనరెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టి వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. టీటీడీ బోర్డు సభ్యుడు శేఖర్‌రెడ్డిపై జరిగిన ఐటీ దాడుల్లో భారీగా బంగారం, నగదు బయటపడటం ధార్మిక వ్యవస్థకే కళంకం తెచ్చిందన్నారు. ఇప్పటికై నా టీటీడీ బోర్డులో ధనార్జనపరులను సభ్యులు, చైర్మన్‌గా నియమించే విషయాన్ని పునరాలోచించాలని సూచించారు. -
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
తిరుపతి: శ్రీ వేంకటేశ్వరస్వామిని శనివారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి, టాలీవుడ్ హీరో కళ్యాణ్ రామ్ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. -
కాలి నడకన తిరుమలకు గాలి జనార్దన్‌రెడ్డి
సాక్షి , తిరుమల: ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్దన్‌రెడ్డి శుక్రవారం రాత్రి కాలినడకన తిరుమలకు వచ్చారు. బెయిల్‌పై జైలు నుంచి ఇటీవల విడుదలైన నేపథ్యంలో ఆయన శ్రీవారి దర్శనార్థం కుటుంబంతో కలసి వచ్చారు. కుటుంబ సభ్యులు నేరుగా తిరుమలకు రాగా ఆయన అలిపిరినుంచి కాలినడకన రాత్రి పది గంటలకు తిరుమలకు చేరుకున్నారు. శనివారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. -
గాలి జనార్దనరెడ్డి విడుదల
ఓఎంసీ కేసులో ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అధినేత గాలి జనార్దనరెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు. చిట్ట చివరి కేసులో కూడా ఆయనకు మంగళవారం సుప్రీంకోర్టులో బెయిల్ మంజూరైంది. అనంతరం కొన్ని అధికారిక లాంఛనాలు ముగించి, పరప్పన అగ్రహార జైలు నుంచి శుక్రవారం సాయంత్రం గాలి జనార్దనరెడ్డిని విడుదల చేశారు. జైలు నుంచి తన కాన్వాయ్ లో జనార్దనరెడ్డి చిరునవ్వుతో చేతులు ఊపుతూ వెళ్లారు. అక్రమ మైనింగ్ ఆరోపణలపై 2011 సెప్టెంబర్ 5న సీబీఐ వర్గాలు ఆయనను బళ్లారిలోని ఆయన ఇంట్లోనే అరెస్టు చేశాయి. శుక్రవారం విడుదల కావడంతో ఆయన మొత్తం 1,237 రోజులు వివిధ జైళ్లలో గడిపినట్లు అయ్యింది. బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా కర్ణాటకలో మంత్రిగా పనిచేసిన ఆయన.. హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైల్లోనే చాలా కాలం ఉన్నారు. మధ్యలో ఆయన బెంగళూరులోని పరప్పణ అగ్రహారంలో గల ప్రధాన జైలుకు కూడా వెళ్లి వచ్చేవారు. ఎట్టకేలకు ఆయనకు అన్ని కేసుల్లోనూ బెయిల్ మంజూరైంది. దాంతో ఆయనను బెంగళూరులోని పరప్పణ అగ్రహారం జైలు నుంచి శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. తన సోదరునికి బెయిల్ లభించడం ఎంతో సంతోషంగా ఉందని కేఎంఎఫ్ మాజీ అధ్యక్షుడు గాలి సోమశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. -
గాలి జనార్దనరెడ్డి విడుదల
-
గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ కొట్టివేత
న్యూఢిల్లీ : ఓఎంసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గాలి జనార్దన్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు అయ్యింది. ఆయన బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. కాగా మూడేళ్లుగా దర్యాప్తు పూర్తి చేయకుండా నిందితులను ఎంత కాలం జైల్లో ఉంచుతారని సుప్రీంకోర్టు సీబీఐ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. శిక్ష ఖరారు కాకుండానే దర్యాప్తు దశలో ఇలా జైల్లో ఉంచడం న్యాయ సమ్మతం కాదని వ్యాఖ్యానించింది. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసులో గాలి జనార్దన్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ మంగళవారం కోర్టు ముందు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి సీబీఐ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గాలి జనార్దన్ రెడ్డి అన్ని కేసులను ఆరు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. -
విచారణ త్వరగా ముగించవలసిన బాధ్యత సిబిఐదే: సుప్రీం కోర్టు
ఢిల్లీ: ఓబులాపురం మైనింగ్ కంపెనీ(ఓఎంసి) కేసు విచారణ ఏ స్థాయిలో ఉందో తెలియజేయాలని సుప్రీం కోర్టు సిబిఐని ఆదేశించింది. ఓఎంసి అధినేత గాలి జనార్థన్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై ఈరోజు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. విచారణ పేరుతో 27 నెలలుగా గాలి జనార్థన్‌రెడ్డిని జైలులో ఉంచడం అన్యాయం అని అతని తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి వాదించారు. ఇప్పటికే 3 చార్జీషీట్లు దాఖలు చేసినందున బెయిల్ మంజూరు చేయాలని ముకుల్ రోహత్గి కోర్టును కోరారు. సిబిఐ తరపు న్యాయవాది విచారణ ఇంకా కొనసాగుతున్నట్లు తెలిపారు. విచారణను త్వరగా ముగించాల్సిన బాధ్యత సీబీఐదేనని సుప్రీంకోర్టు తెలిపింది. విచారణ ఏ స్థాయిలో ఉందో తెలియజేయాలని కోర్టు సీబీఐని ఆదేశించింది. కేసు విచారణను సుప్రీం కోర్టు మార్చి 28కి వాయిదా వేసింది.