gates lifted
-
శ్రీశైలంలో 4, సాగర్‌లో 16
నాగార్జునసాగర్, దోమలపెంట: వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరిగింది. దీంతో నాలుగు గేట్లు పైకెత్తి స్పిల్‌వే ద్వారా 1,11,932 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శనివారం రాత్రి 7 గంటల సమయంలో జూరాల నుంచి స్పిల్‌వే ద్వారా 82,940 క్యూసెక్కులు, విద్యుదు త్పత్తి చేస్తూ 35,524, సుంకేసుల నుంచి 72,114, హంద్రీ నుంచి 250 మొత్తం 1,90,828 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. ఎడమగట్టు భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 36,900 క్యూసెక్కులు, ఏపీ జెన్కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో ఉత్పత్తి చేస్తూ 31,139 మొత్తం 68,039 క్యూసెక్కుల నీరు అదనంగా సాగర్‌కు విడుదలవుతున్నాయి. ప్రస్తు తం శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 884.7 అడుగుల వద్ద 213.8824 టీఎంసీల నీటి నిల్వ ఉంది. పోతిరెడ్డిపాడు ద్వారా 8,000 క్యూసెక్కులు, ముచ్చుమర్రి, మల్యాల ఎత్తిపోతల నుంచి హెచ్ఎన్ ఎస్ఎస్కు 1,561, రేగుమాన్గడ్డ నుంచి ఎంజీకేఎల్‌ఐకు 2,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎగువ నుంచి ప్రవాహం పెరగడంతో శనివారం అధికారులు నాగార్జునసాగర్ ప్రాజెక్టు 16 రేడియల్ క్రస్ట్‌గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 16 గేట్లను ఐదడుగులు పైకి ఎత్తి స్పిల్‌వే మీదుగా 1,29,600 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయం 590 అడుగుల గరిష్ట నీటిమట్టంతో ఉంది. ప్రస్తుతం సాగర్ జలాశయానికి 1,74,120 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. సాగర్ ప్రధాన విద్యుదుత్పా దన కేంద్రం ద్వారా 29,435 క్యూసెక్కులు, క్రస్ట్‌గేట్ల నుంచి 1,29,600 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వ లకు, ఏఎమ్మార్పీ, వరద కాల్వలకు 15,085 క్యూసె క్కుల నీరు వదులుతున్నారు. మొత్తం సాగర్ నుంచి 1,74,120 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. -
శ్రీరాంసాగర్ 41 గేట్లు ఎత్తివేత
సాక్షి, హైదరాబాద్/నెట్వర్క్: పరీవాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో కడెం వాగుతోపాటు ఎగువన గోదావరికి వరద పోటెత్తింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా, సోమవారం ఉదయం 10 గంటలకు 1,95,767 క్యూసెక్కుల వరద రాగా, నీటినిల్వ 71.85 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టు నిండుకుండలా మారడం, ఎగువ నుంచి ఉధృతంగా వరద వస్తుండడంతో ఉదయం 10:30 గంటలకు 8 గేట్లు ఎత్తి 25వేల క్యూసెక్కుల నీటిని దిగువన గోదావరిలోకి విడుదల చేశారు. ఎగువ నుంచి వరద పెరుగుతున్న కొద్దీ క్రమంగా మరిన్ని గేట్లు ఎత్తుతూ వెళ్లారు. రాత్రి పదిగంటలకు 3 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వస్తుండగా, ప్రాజెక్టులో 72.9 టీఎంసీలను నిల్వ చేస్తూ మొత్తం 41 గేట్లు ఎత్తి 2.65లక్షల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. ⇒ కడెం ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 7.6 టీఎంసీలు కాగా, 49,763 క్యూసెక్కుల వరద వస్తుండడంతో 5.41 టీఎంసీల నిల్వలు కొనసాగిస్తూ 18 గేట్లు ఎత్తి కిందికి విడుదల చేస్తున్నారు. ⇒ శ్రీరాంసాగర్ నుంచి విడుదలవుతున్న వరదకు కడెం జలాలు తోడుకావడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద ఉధృతి 2,92,815 క్యూసెక్కులు పెరిగింది. ప్రాజెక్టు గరిష్ట నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా, 15.02 టీఎంసీల నిల్వలను కొనసాగిస్తూ 2,64,787 క్యూసెక్కు ల నీటిని గేట్ల ద్వారా కిందికి విడుదల చేస్తున్నారు. దీంతో దిగువన ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు బరాజ్‌లకు వరద ఉధృతి భారీగా పెరిగింది. సుందిళ్ల బరాజ్‌కు 3.68లక్షలు, అన్నారం బరాజ్‌కు 6.61లక్షలు, మేడిగడ్డ బరాజ్‌కు 6.79లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, వచి్చంది వచ్చినట్టు విడుదల చేస్తున్నారు. దిగువన ఉన్న సమ్మక్కసాగర్‌కు 4.45 లక్షలు, సీతమ్మసాగర్కు 3.13లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, వచ్చింది వచి్చనట్టు విడుదల చేస్తున్నారు. ⇒ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరి వరద మొదటి ప్రమాద హెచ్చరిక చేరువకు వెళుతోంది. సోమవారం రాత్రి 12. గంటల సమాయానికి 12.010 మీటర్లకు చేరింది. తెల్లవారే సరికి మరింత వరద పెరగనుంది. కాగా, మొదటి ప్రమాద హెచ్చరిక 12.210 మీటర్లు, డేంజర్ లెవల్ 13.460 మీటర్లు వరకు నమోదు అయితే లోతట్టు గ్రామాలు జలమయమవుతాయి.1986లో కాళేశ్వరం వద్ద 15.75 మీటర్ల ఎత్తు, 2022 జూలై 14న 16.72మీటర్ల ఎత్తులో నీటిమట్టం నమోదైంది. సింగూరు, నిజాంసాగర్‌కు జలకళ గోదావరి ఉపనది మంజీరలోనూ వరద ఉధృతి మరింతగా పెరగడంతో సింగూరు, నిజాంసాగర్ ప్రాజెక్టులు నిండుకుండలా మారుతున్నాయి. సింగూరు ప్రాజెక్టు గరిష్ట నీటినిల్వ సామర్థ్యం 29.917 టీఎంలు కాగా, ప్రస్తుతం 23,942 క్యూసెక్కుల వరద వస్తుండగా, నిల్వలు19.22 టీఎంసీలకు చేరాయి. ⇒ నిజాంసాగర్ నిల్వ సామర్థ్యం 17.8 టీఎంసీలు కాగా 48,800 క్యూసెక్కుల వరద వస్తుండడంతో నిల్వలు 9.16 టీఎంసీలకు చేరాయి. వరద ఇలానే కొనసాగితే మరో ఐదు రోజుల్లో ఈ రెండు ప్రాజెక్టులు పూర్తిగా నిండే అవకాశముంది. మిడ్‌మానేరుకు గ్రావిటీ ద్వారా ఎస్సారెస్పీ జలాలు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో ఎల్లంపల్లి జలాశయం నుంచి నీటిని మిడ్‌మానేరులోకి నంది, గాయత్రి పంప్‌హౌస్‌ల ద్వారా ఎత్తి పోయాల్సిన అవసరం లేకుండా పోయింది. రెండు పంప్‌హౌస్‌లలో పంపింగ్ బంద్ చేసి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా 7000 క్యూసెక్కుల నీటిని గ్రావిటీతో మిడ్‌మానేరు జలాశయా నికి తరలిస్తున్నారు. అక్కడి నుంచి అనంతగిరి జలాశయానికి, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్‌లకు నీళ్లను ఐదు దశల్లో పంపింగ్ చేస్తున్నారు. ఎగువన శాంతించిన కృష్ణమ్మ... దిగువన ఉగ్రరూపం ⇒ జూరాల 40 గేట్లు, శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లు, సాగర్ 26 గేట్ల ద్వారా నీటి విడుదల పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు తెరిపి ఇవ్వడంతో ఎగువన కృష్ణమ్మ శాంతించింది. మూడు రోజులుగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలు తోడు కావడంతో దిగువన కృష్ణానది ఉగ్రరూపాన్ని కొనసాగిస్తోంది. సోమవారం సాయంత్రం 6 గంటలకు ప్రకాశం బరాజ్‌కు వస్తున్న 11,27,30 క్యూసెక్కుల వరదను వచ్చింది వచ్చినట్టు గేట్ల ద్వారా సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఎగువన మహారాష్ట్రలోని ఆల్మట్టి జలాశయానికి 70 వేలు, నారాయణపూర్ జలాశయానికి 30 వేల క్యూసెక్కులకు వరద తగ్గిపోయింది.దీంతో తెలంగాణలోని జూరాల ప్రాజెక్టుకు సైతం 3.21లక్షల క్యూసెక్కులకు వరద తగ్గిపోగా, 40 గేట్లు ఎత్తి 3.2లక్షల క్యూసెక్కులను కిందకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు 4.89 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా.. 5.52 లక్షల క్యూసెక్కుల నీటిని 10 గేట్లు ఎత్తి కిందకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు 5.40 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, వచ్చింది వచి్చనట్టు 26 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ దిగువన ఉన్న పులిచింతల ప్రాజెక్టుకు 5.48 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, 5.43 లక్షల క్యూసెక్కులను దిగువన ఉన్న ప్రకాశం బరాజ్‌కు విడుదల చేస్తున్నారు. దీంతో మంగళవారం నాటికి ప్రకాశం బరాజ్‌కు వరద ఉధృతి తగ్గే అవకాశముంది. అలుగుపారుతున్న డిండి ప్రాజెక్టు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు దుందుభి వాగు పరవళ్లు తొక్కుతుండడంతో నల్లగొండ జిల్లాలోని డిండి ప్రాజెక్టు నిండి సోమవారం అలుగు పోసింది. వర్షాధారంపైనే ఆధారపడిన ఈ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి 50 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి (36 అడుగులు) చేరుకుంది. హైదరాబాద్ – శ్రీశైలం రహదారి మధ్యలో ఉన్న డిండి ప్రాజెక్టు అలుగుపారుతున్న అందాలను తిలకించేందుకు స్థానికులతోపాటు ఇతర ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలి వస్తున్నారు. మూసీ ప్రాజెక్టు ఏడు గేట్లు ఎత్తివేత మూసీనదికి వరద పోటెత్తడంతో నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని మూసీ ప్రాజెక్టు ఏడు గేట్లు ఎత్తి వరదనీటిని దిగువకు వదులుతున్నారు. 4.46 టీఎంసీ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యంగల మూసీ రిజర్వాయర్‌లో 3.58 టీఎంసీల నీరు నిల్వ ఉంది. -
నాగార్జున సాగర్ గేట్లు ఎత్తివేత
సాక్షి, నల్గొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారటంతో సోమవారం అధికారులు ఆరు గేట్లు ఓపెన్ చేశారు. అంతకుముందు ప్రజలను అప్రమత్తం చేసేందుకు సైరన్ వేశారు. ఆరు గేట్లను ఐదు ఫీట్ల ఎత్తువరకు ఇరిగేషన్ అధికారులు తెరిచి దిగువకు నీటిని విడుదల చేశారు. ఒక్కో గేటు నుంచి 5-10 వేల క్యూసెక్కుల నీటీని విడుదల అవుతోంది.Nagarjuna Sagar Project under the Krishna River, 6 flood Gates opened and Released Water. today in Nalgonda District, Telangana State pic.twitter.com/XhtZnMCrhL— K. N. Hari (@KNHari9) August 5, 2024 శ్రీశైలం నుంచి సారగ్లోకి వరద పోటెత్తుతోంది. నాగార్జునసాగర్ గరిష్ట నీటిమట్టం 590 అడుగులు కాగా ఇప్పటికే 580 అడగుల వరకు చేరుకుంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు నాగార్జునసాగర్‌లోకి 3,22,817 క్యూసెక్కుల నీరు చేరుతుండగా. కుడి, ఎడమ కాలువల ద్వారా విద్యుదుత్పత్తి చేస్తూ 37,873 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో నీటినిల్వ 576.1 అడుగుల్లో 271.9 టీఎంసీలకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తి నీటినిల్వ 312.05 టీఎంసీలు కాగా మరో 41 టీఎంసీలు చేరితే సాగర్ పూర్తిగా నిండిపోతుంది. నాగార్జునసాగర్ కు కొనసాగుతున్న భారీ వరద6 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదలఇన్ ఫ్లో: 323748 క్యూసెక్కులుఅవుట్ ఫ్లో: 83331 క్యూసెక్కులుపూర్తిస్థాయి నీటిమట్టం: 590.00 అడుగులుప్రస్తుత నీటి మట్టం: 582.60 అడుగులుపూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం: 312.5050 టీఎంసీలుప్రస్తుత నీటి నిల్వ: 290.5140 టీఎంసీలుకొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి -
భారీగా వరద ఉధృతి.. రేపు నాగార్జున సాగర్ గేట్లు ఎత్తివేత
సాక్షి, నల్గొండ జిల్లా: నాగార్జున సాగర్‌కు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. రేపు(సోమవారం) ఉదయం 8 గంటలకు క్రస్ట్‌గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ఆదివారం సాయంత్రానికి 576.10 అడుగులకు చేరింది.పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312.5 టీఎంసీలకు గానూ.. 268.8689 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సాగర్ జలాశయానికి 3లక్షల 22 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. 37,873 క్యూసెక్కులు ఔట్ ఫ్లోగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు రావడంతో నీటిమట్టం గంటగంటకూ పెరుగుతోంది. విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.సాగర్ దిగువన ఉన్న కృష్ణానది పరివాహక గ్రామాల ప్రజలు, లోతట్టు ప్రాంతాల వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
నేడు శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్లు ఓపెన్..
సాక్షి, శ్రీశైలం: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. దీంతో, ఈరోజు సాయంత్రం శ్రీశైలం గేట్లు ఎత్తనున్నారు అధికారులు. దిగవకు నాలుగు లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నారు.కాగా, ఈరోజు సాయంత్రం 4 గంటలకు అధికారులు శ్రీశైలం ప్రాజెక్ట్ నాలుగు గేట్లను ఎత్తనున్నారు. ఈ క్రమంలో దిగువకు నీటిని విడుదల చేయనున్నారు. కాగా, జూరాల, తుంగభద్ర నుంచి వరద పోటెత్తడంతో శ్రీశైలంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. అయితే, శ్రీశైలం గేట్లను రేపు ఎత్తాలని అధికారులు భావించినప్పటికీ వదర నీరు భారీగా వచ్చి చేరుతుండంతో ఈరోజే గేట్లను ఎత్తనున్నారు.ఇక, శ్రీశైలంలో ఫుల్‌గా నీరు చేరుతుండటంతో కృష్ణమ్మ సాగర్‌వైపు పరవళ్లు తొక్కుతోంది. మరోవైపు.. అల్మట్టి, నారాయణపూర్ డ్యామ్స్లోకి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో, వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. -
రేపు శ్రీశైలం గేట్లు ఎత్తివేత!
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టులోకి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు 3.79 లక్షల క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 18 వేల క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 1,600 క్యూసెక్కులను తరలిస్తున్నారు. కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు 61,111 క్యూసెక్కులు విడదుల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 873.4 అడుగుల్లో 156.39 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 59 టీఎంసీలు అవసరం. ప్రస్తుతం ఎగువ నుంచి భారీ వరద రావడంతో పాటు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో మంగళవారం ఉదయానికి ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది. దీంతో మంగళవారం ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య ప్రాజెక్టు గేట్లు ఎత్తి వరద ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తామని అధికారవర్గాలు వెల్లడించాయి. నాగార్జునసాగర్‌లోకి 53,774 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 510.2 అడుగుల్లో 132.01 టీఎంసీలకు చేరుకుంది.మహారాష్ట్ర, కర్ణాటకలలో వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో కృష్ణా నది ఎగువన వరద ఉధృతి కొనసాగుతోంది. ఆల్మట్టి డ్యామ్‌లోకి 2.68 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా, దిగువకు 3.25 లక్షల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ డ్యామ్‌లోకి 3.20 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా, 3.27 లక్షల క్యూసెక్కులను వదిలేస్తున్నారు. జూరాల ప్రాజెక్టులోకి 3.04 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 2.98 లక్షల క్యూసెక్కులు దిగువకు వదిలేస్తున్నారు. తగ్గని తుంగభద్ర తుంగభద్ర డ్యామ్‌లోకి వరద ఉధృతి కొనసాగుతోంది. డ్యామ్‌లోకి 1.24 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 1.51 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. దాంతో మంత్రాలయం వద్ద వరద ఉధృతి మరింతగా పెరిగి, ప్రమాదకరస్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో అధికారులు ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. సుంకేశుల బరాజ్‌లోకి 1.49 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. కేసీ కెనాల్‌కు 1,540 క్యూసెక్కులను వదులుతూ, 1.46 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నా రు. అటు జూరాల నుంచి కృష్ణా వరద, ఇటు సుంకేశుల నుంచి తుంగభద్ర వరద వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టులో చేరుతున్న వరద ప్రవాహం గంట గంటకూ పెరుగుతోంది. -
హైదరాబాద్: జంట జలాశాయాలకు భారీగా వరద
-
ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తనున్న అధికారులు.. మూసీతో టెన్షన్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సహా తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాజెక్ట్‌ల్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. అటు లోతట్టు ప్రాంతాలు సైతం జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇదిలా ఉండగా.. నగరంలోని జంట జలాశయాలకు సైతం వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో అధికారులు ఉస్మాన్‌సాగర్ గేట్లు ఎత్తివేసేందుకు సిద్ధమయ్యారు. ఈరోజు(బుధవారం) మధ్యాహ్నం ఒంటి గంటకు ఉస్మాన్ సాగర్ గేట్లను లిఫ్ట్ చేయనున్నారు అధికారులు. ఉస్మాన్‌సాగర్ రెండు గేట్లు ఎత్తి 208 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేయనున్నారు. ఇక, ఇప్పటికే అధికారులు హిమాయత్ సాగర్ నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. దీంతో, మూసీలోకి భారీగా వరద నీరు చేరుతోంది. ఈ క్రమంలో మూసీ ఏడు గేట్లను ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం మూసీ పరిస్థితి.. ఇన్ ఫ్లో: 13140 క్యూసెక్కులు అవుట్ ఫ్లో: 10047 క్యూసెక్కులు పూర్తి స్థాయి నీటిమట్టం 645 అడుగులు ప్రస్తుత మట్టం: 642.40 అడుగులు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం: 4.46 టీఎంసీలు ప్రస్తుత నీటి నిల్వ: 3.79 టీఎంసీలు. ఇది కూడా చదవండి: భారీ వర్షాల ఎఫెక్ట్.. టెన్షన్ పెడుతున్న మున్నేరు, పాలేరు -
నిజామాబాద్: బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేత
సాక్షి, నిజామాబాద్: బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు తెరుచుకున్నాయి. తెలంగాణ, మహారాష్ట్ర ఇరిగేషన్ శాఖ అధికారులు 14 గేట్లను తెరిచారు. ఈ క్రమంలో గోదావరి జలాలు శ్రీరామ్‌సాగర్ వైపు పరుగులు తీశాయి. అయితే, ప్రతీ ఏటా జూల్ 1వ తేదీ నుంచి 28వ తేదీ వరకు అధికారులు గేట్లు ఎత్తుతారు. ఇదిలా ఉండగా.. శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్ట్‌కు వరద నీరు కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్‌కు 553 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. దీంతో, ప్రాజెక్ట్‌లో ప్రస్తుత నీటి మట్టం 1064 అడుగులకు చేరుకుంది. ఇక, ప్రాజెక్ట్ పూర్తి స్తాయి నీటి మట్టం 1090 అడుగులుగా ఉంది. ఇది కూడా చదవండి: స్వచ్ఛ బడి.. సేంద్రియ సిరి -
శ్రీశైలంలో పది, సాగర్‌లో 22 గేట్లు ఎత్తివేత
దోమలపెంట(అచ్చంపేట)/గద్వాల రూరల్/నాగార్జునసాగర్: జోగుళాంబ గద్వాల జిల్లాలో జూరాల ప్రాజెక్టుకు 2,67, 000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 43 గేట్లు ఎత్తి నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం పోటెత్తుతోంది. మొత్తం 3,76, 825 క్యూసెక్కుల నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు వస్తోంది. జలాశయం నీటిమట్టం 884.5 అడుగులు కాగా, 212.9198 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శుక్రవారం ఆనకట్ట వద్ద పదిగేట్లను 15 మీటర్ల మేర ఎత్తి 3,77,160 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. ఎగువ నుంచి మొత్తం 4,42,694 క్యూసెక్కుల నీరు నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. దీంతో సాగర్ ప్రాజెక్టు వద్ద 22 రేడియల్ క్రస్ట్‌గేట్ల ద్వారా 3,55,228 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. విద్యుదుత్పాదనకు, కుడి, ఎడమ కాల్వలు, వరదకాల్వలు, ఎస్ఎల్బీసీకి నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయం నీటిమట్టం ప్రస్తుతం 589.50 అడుగులు ఉంది. -
శ్రీశైలంలో 9 గేట్ల ఎత్తివేత
దోమలపెంట(అచ్చంపేట)/గద్వాల రూరల్: జూరాల, శుంకేసుల నుంచి వరద నీటి ప్రవాహం కొనసాగుతుండటంతో శ్రీశైలం ఆనకట్ట వద్ద తొమ్మిది గేట్లను ఎత్తారు. జూరాల స్పిల్‌వే ద్వారా 1,72,368 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 33,221, సుంకేసుల ద్వారా 1,21,185, హంద్రీ నుంచి 20,820 మొత్తం 3.47 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 885.0 అడుగులుగా ఉంది. 215.8070 టీఎంసీలతో పూర్తిస్థాయిలో నిల్వ ఉంది. తొమ్మిది గేట్లను పది మీటర్ల మేర ఎత్తి స్పిల్‌వే ద్వారా 2.52లక్షలు, తెలంగాణ ఎడమగట్టు, ఏపీ కుడిగట్టు విద్యుత్ కోసం 66,151 క్యూసెక్కుల నీటిని దిగువ ఉన్న నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. మరోవైపు జూరాలకు 1.60 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండటంతో 33 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. -
శ్రీశైలం పదిగేట్లు ఎత్తివేత.. సాగర్‌కు పెరిగిన వరద
నాగార్జునసాగర్/దోమలపెంట (అచ్చంపేట)/గద్వాల రూరల్: శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు ఎగువ నుంచి వరద భారీగా పెరిగింది. సోమవారం జూరాలలో స్పిల్‌వే ద్వారా 68,850, విద్యుదుత్పత్తి ద్వారా 39,092, సుంకేసుల నుంచి 90,222, హంద్రీ నుంచి 4,905 మొత్తం 2,03,069 క్యూసెక్కుల నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతోంది. దీంతో విద్యుదుత్పత్తి ద్వారా 62,112క్యూసెక్కులు, పది గేట్లు 15 మీటర్ల మేర ఎత్తి మొత్తం 4,37,792 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ 22 గేట్ల ద్వారా విడుదలవుతున్న నీరు శ్రీశైలం జలాశయంలో ప్రస్తుతం నీటిమట్టం 884.2 అడుగులు, 210.9946 టీఎంసీల నీటి నిల్వ ఉంది. మరోపక్క శ్రీశైలం నుంచి వస్తున్న వరదతో సాగర్ పోటెత్తుతోంది. దీంతో 22 రేడియల్ క్రస్ట్‌గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాగా, కుడి, ఎడమ కాల్వలతో పాటు వరదకాల్వ, ఏఎమ్మార్పీకి 20,589 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు జూరాలకు 1.16లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా..17 గేట్లు ఎత్తి స్పిల్‌వే ద్వారా 68,850 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 39,092 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. -
శ్రీశైలంలో 7 గేట్ల ఎత్తివేత
దోమలపెంట/గద్వాల రూరల్: శ్రీశైలం జలాశయానికి మరోసారి వరద ప్రవాహం పోటెత్తింది. ఎగువనున్న జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి 3,03,847 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. దీంతో ఆనకట్ట వద్ద 7 గేట్లు ఒక్కొక్కటి 10 అడుగుల మేర పైకెత్తి 1,96,525 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 62,708 క్యూసెక్కుల నీటిని దిగువనున్న నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. కర్ణాటకలోని ప్రాజెక్టుల నుంచి జూరాలకు 1,85,000 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో ప్రాజెక్టులోని 37 గేట్లు ఎత్తి 1,52,292 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 36,111 క్యూసెక్కుల నీటిని శ్రీశైలానికి విడుదల చేశారు. -
శ్రీశైలంలో 8 గేట్ల ఎత్తివేత
దోమలపెంట/గద్వాల రూరల్: ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలోని జూరాల, సుంకేశుల జలాశయాల నుంచి శ్రీశైలానికి వరద నీటి ప్రవాహం కొనసాగుతుండటంతో శుక్రవారం ఆనకట్ట వద్ద ఎనిమిది గేట్లను పైకెత్తారు. స్పిల్‌వే, విద్యుదు త్పత్తి ద్వారా కలిపి 2,86,529 క్యూసె క్కుల నీటిని దిగువన నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేశులతో కలిపి మొత్తం 2,45,590 క్యూసెక్కుల నీటి ప్రవాహం శ్రీశైలానికి వస్తోంది. కర్ణాటకలోని ప్రాజెక్టుల నుంచి జూరాలకు వరద ప్రవాహం స్వల్పంగా తగ్గింది. ఎగు వ నుంచి 2.10 లక్షల క్యూసెక్కుల ప్రవా హం వస్తుండటంతో 40 గేట్లు పైకె త్తి శ్రీశైలానికి నీటిని విడుదల చేశారు. -
అఖండ గోదావరి.. ప్రాజెక్టుల గేట్లు బార్లా!
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: పరివాహక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరి, ఉప నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎన్నడూ లేని రీతిలో ఈ ఏడాది జూలై రెండో వారంలోనే గోదావరికి భారీ వరదలు వచ్చాయి. గోదావరి, ఉప నదుల వరద ఉధృతికి ప్రాజెక్టులన్నీ నిండిపోవడంతో గేట్లు ఎత్తేశారు. సాధారణంగా గోదావరిలో భద్రాచలం నుంచి ధవళేశ్వరం బ్యారేజ్ వరకు ఎప్పుడూ నీళ్లు ఉంటాయి. దాంతో ఈ ప్రాంతాన్నే అఖండ గోదావరిగా పిలుస్తారు. కానీ.. ప్రస్తుతం గోదావరి జన్మించే ప్రాంతమైన మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా త్రయంబకేశ్వర్ నుంచి.. సముద్రంలో కలిసే ప్రాంతమైన డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అంతర్వేది వరకు భారీ వరద ప్రవాహంతో అఖండ గోదావరి మహా సముద్రాన్ని తలపిస్తోంది. గోదావరి బేసిన్లో అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తేయడం చరిత్రలో ఇదే తొలిసారని నీటి పారుదల రంగ నిపుణులు చెబుతున్నారు. 1,465 కిలోమీటర్ల మేర ప్రవహించే గోదావరికి ప్రవర, పూర్ణ, మంజీర, పెన్‌గంగ, వార్ధా, ప్రాణహిత, మానేరు, ఇంద్రావతి, శబరి ప్రధాన ఉప నదులు. ఈ నదీ పరివాహక ప్రాంతం 3,12,812 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించింది. గంగా నది తర్వాత దేశంలో అతి పెద్ద నది గోదావరి. ఆదిలోనే ఉగ్రరూపం ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఈ ఏడాది గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. జైక్వాడ్ నుంచి బాబ్లీలో అంతర్భాగమైన 11 బ్యారేజీ గేట్లను మహారాష్ట్ర సర్కార్ ఎత్తేసి.. దిగువకు వరద నీటిని విడుదల చేస్తోంది. వాటికి సింగూరు, నిజాంసాగర్ నుంచి విడుదల చేస్తున్న మంజీర ప్రవాహం తోడవుతుండటంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద స్థిరంగా కొనసాగుతోంది. అక్కడి నుంచి వదులుతున్న వరదకు కడెం వాగు వరద తోడవడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎత్తిన గేట్లను ఇప్పటిదాకా దించలేదు. దానికి దిగువన కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన సుందిళ్ల, అన్నారం గేట్లు ఎత్తేసి.. దిగువకు వదిలేస్తున్నారు. వాటికి ప్రాణహిత, మిడ్ మానేరు, లోయర్ మానేరు నుంచి వస్తున్న వరద తోడవడంతో మేడిగడ్డ బ్యారేజీ గేట్లు పూర్తిగా ఎత్తేశారు. అక్కడి నుంచి ఇంద్రావతి జలాలు తోడవడంతో తుపాకులగూడెం, సీతమ్మసాగర్ ప్రాజెక్టుల గేట్లను పూర్తి స్థాయిలో ఎత్తేశారు. జూలై 8న పోలవరం ప్రాజెక్టు 48 గేట్లు, ధవళేశ్వరం బ్యారేజ్ 175 గేట్లను ఎత్తేశారు. ఇప్పటిదాకా వాటిని దించలేదంటే గోదావరి వరద ఉధృతి ఇట్టే తెలుస్తోంది. భద్రాచలం వద్ద 55 అడుగులకు చేరే అవకాశం ఎగువ నుంచి 13,92,313 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో గురువారం రాత్రి 7 గంటలకు భద్రాచలం వద్ద నీటి మట్టం 52.4 అడుగులకు చేరుకుంది. దాంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గురువారం రాత్రికి నీటి మట్టం 53 అడుగులు దాటనుంది. అప్పుడు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేస్తామని అధికారులు తెలిపారు. శుక్రవారం ఉదయానికి భద్రాచలం వద్ద నీటి మట్టం 55 అడుగులకు చేరుకుంటుందని అంచనా. పోలవరం వద్ద హై అలర్ట్ భద్రాచలం నుంచి భారీ వరద వస్తుండటం.. వాటికి శబరి ప్రవాహం తోడవుతుండటంతో పోలవరం ప్రాజెక్టు వద్ద అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టులోకి వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తూ.. ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద 34.050 మీటర్లకు నీటి మట్టం చేరుకుంది. ప్రాజెక్టులోకి 11.65 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండటంతో అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 14,13,191 క్యూసెక్కులు చేరుతుండగా.. గోదావరి డెల్టాకు 7,200 క్యూసెక్కులు విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 14,05,991 క్యూసెక్కులను సముద్రంలోకి వదలేస్తున్నారు. ధవళేశ్వరం వద్ద నీటి మట్టం 14.60 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. బిరబిరా కృష్ణమ్మ సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: కృష్ణా పరీవాహక ప్రాంతం(బేసిన్)లో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. కృష్ణా ప్రధాన పాయపై ఆల్మట్టి నుంచి ప్రకాశం బ్యారేజ్ దాకా అన్ని ప్రాజెక్టుల్లో నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరుకోవడం, ఎగువ నుంచి భారీగా ప్రవాహం వస్తుండటంతో గేట్లు ఎత్తేశారు. ప్రధాన ఉపనది తుంగభద్రపై కర్ణాటకలోని భద్ర, సింగటలూరు బ్యారేజ్, తుంగభద్ర డ్యామ్, ఆంధ్రప్రదేశ్‌లోని సుంకేశుల బ్యారేజ్ గేట్లు ఎత్తేశారు. మరో ఉప నది బీమాపై మహారాష్ట్రలోని ఉజ్జయిని ప్రాజెక్టులో నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరుకోవడంతో ఒకటి రెండు రోజుల్లో గేట్లు ఎత్తివేయనున్నారు. ఉప నదులైన ఘటప్రభ, మలప్రభలపై కర్ణాటకలో ఉన్న ప్రాజెక్టులు, వేదవతిపై కర్ణాటకలోని వాణివిలాసాగర్, ఆంధ్రప్రదేశ్‌లోని భైరవానితిప్ప ప్రాజెక్టులు నిండిపోయాయి. మూసీ నదిపై హైదరాబాద్‌లోని జంట జలాశయాలు, మూసీ రిజర్వాయర్ నిండిపోయాయి. పాలేరుపై ఉన్న పాలేరు రిజర్వాయర్ కూడా నిండింది. కృష్ణా బేసిన్లో మొత్తం ప్రాజెక్టులన్నీ నిండిపోవడంతో వాటి గేట్లు ఎత్తివేయడం చరిత్రలో ఇదే తొలిసారని అధికారవర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో అల్పపీడనాల ప్రభావంతో బేసిన్ పరిధిలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా, ఉప నదులు ఉరకలెత్తుతుండటంతో ప్రాజెక్టులన్నీ నిండిపోయాయి. -
చరిత్రలో తొలిసారి!
సాక్షి, హైదరాబాద్/ నాగార్జునసాగర్/ గద్వాల రూరల్/ దోమలపెంట (అచ్చంపేట)/భద్రాచలం: నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనాల ప్రభావంతో పరీవాహక ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు.. కృష్ణా, గోదావరి, వాటి ఉప నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. కృష్ణా నదిపై ఉన్న ఆల్మట్టి నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు అన్ని ప్రాజెక్టుల్లో నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరుకోవడంతో పాటు ఎగువ నుంచి భారీగా ప్రవాహం కొనసాగుతుండటంతో గేట్లు ఎత్తేసి వచ్చిన నీటిని వచ్చినట్టు దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే గోదావరిపై గైక్వాడ్ నుంచి ధవళేశ్వరం బ్యారేజీ వరకూ అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేశారు. ఇలా కృష్ణా, గోదావరి బేసిన్లలో మొత్తం ప్రాజెక్టులన్నీ నిండటం, అలాగే కృష్ణా బేసిన్లో అన్ని రిజర్వాయర్ల గేట్లు ఎత్తేయడం చరిత్రలో ఇదే తొలిసారని అధికారవర్గాలు తెలిపాయి. కడలివైపు కృష్ణమ్మ కృష్ణా నదిపై కర్ణాటకలోని ఆల్మట్టి రిజర్వాయర్‌కు ఎగువన ఉన్న రెండు చిన్న బ్యారేజీలు జూన్ ఆఖరుకే నిండిపోయాయి. ఆల్మట్టి, నారాయణపూర్ జూలై మొదటి వారానికే నిండాయి. అప్పటి నుంచి వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తుండటంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ నిండిపోయాయి. జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు గురువారం 4,30,107 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. దీంతో పది గేట్లు 15 మీటర్ల మేర ఎత్తి, విద్యుదుత్పత్తి ద్వారా మొత్తం 4,53,917 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. ఇక సాగర్ 26 రేడియల్ క్రస్ట్‌గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు మొత్తం 26 గేట్లను మొదటిరోజే ఎత్తడం 2009 తర్వాత ఇదే మొదటిసారి. సాగర్ నుంచి భారీగా వరద వస్తుండడంతో వరద నియంత్రణ చర్యల్లో భాగంగా పులిచింతలలో నీటి నిల్వను 30 టీఎంసీలకు తగ్గిస్తూ 4.41 లక్షల క్యూసెక్కులు దిగువకు వదిలేస్తున్నారు. దాంతో ప్రకాశం బ్యారేజీ వైపు వరద బిరా బిరా పరుగులు పెడుతోంది. గురువారం రాత్రి 7 గంటలకు ప్రకాశం బ్యారేజీలోకి 1,18,909 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టాకు 12,539 క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 1,06,370 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. మహాసముద్రాన్ని తలపిస్తోన్న గోదావరి గోదావరి నది మహాసముద్రాన్ని తలపిస్తోంది. సాధారణంగా ఆగస్టులో గోదావరికి భారీ వరదలు వస్తాయి. కానీ ఈ ఏడాది పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురవడంతో జూలై రెండో వారంలోనే గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు మరోసారి ఉధృతంగా ప్రవహిస్తోంది. గైక్వాడ్ నుంచి బాబ్లీలో అంతర్భాగమైన 11 బ్యారేజీ గేట్లను మహారాష్ట్ర సర్కార్ ఎత్తేసి.. దిగువకు వరదను విడుదల చేస్తోంది. వాటికి సింగూరు, నిజాంసాగర్ నుంచి విడుదల చేస్తున్న మంజీర ప్రవాహం తోడవుతుండటంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద స్థిరంగా కొనసాగుతోంది. శ్రీరాంసాగర్ నుంచి వదులుతున్న వరదకు కడెం వాగు వరద తోడవడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎత్తిన గేట్లను ఇప్పటిదాకా దించలేదు. జూలై 8న పోలవరం ప్రాజెక్టు 48, ధవళేశ్వరం బ్యారేజీ 175 గేట్లను ఎత్తేశారు. ఇప్పటిదాకా వాటిని దించలేదంటే గోదావరి వరద ఏ స్థాయిలో సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. మూడో ప్రమాద హెచ్చరికకు చేరువలో.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గోదావరి ప్రవాహం గురువారం మూడో ప్రమాద హెచ్చరిక జారీకి చేరువయ్యింది. తెల్లవారుజామున 4 గంటలకు 51.30 అడుగులుగా ఉన్న నీటిమట్టం మెల్లగా పెరుగుతూ వచ్చింది. సాయంత్రం 5 గంటలకు 52.30 అడుగుల మేర ఉండగా, 13,86,192 క్యూసెక్కుల నీటి ప్రవాహం నమోదైంది. నీటిమట్టం 53 అడుగులకు చేరుకుంటే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తామని అధికారులు తెలిపారు. ముంపు బెడద గ్రామాలు ఎక్కువగా ఉన్న దుమ్ముగూడెం, చర్ల, బూర్గంపాడు మండలాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందు జాగ్రత్తగా పునరావాస శిబిరాలకు తరలిస్తున్నారు. దుమ్ముగూడెం మండలం యటపాకతో పాటు బూర్గంపాడు – సారపాకల మధ్య గల ఉన్న ప్రధాన రహదారులపైకి వరద నీరు చేరడంతో రాకపోకలు స్తంభించాయి. భద్రాచలం నుంచి భారీ వరద వస్తుండ టం.. వాటికి శబరి ప్రవాహం తోడ వుతుండటంతో పోలవరం ప్రాజెక్టు వద్ద అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. -
వరదల ఎఫెక్ట్: ముంపులో లంక గ్రామాలు.. ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేత
సాక్షి, విజయవాడ : కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదల కారణంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్న భారీ వరదల కారణంగా కృష్ణా, గోదావరి, వంశధారల నదుల్లో వరద ఉద్ధృతి పెరిగింది. దీంతో, లంక గ్రామాలు మరోసారి ముంపునకు గురవుతున్నాయి. ఇక, శ్రీశైలం ప్రాజెక్టులోకి 4.21 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరుతుండటంతో పది గేట్లు 15 అడుగుల మేర ఎత్తారు. శ్రీశైలం నుంచి మొత్తం 4.26 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కాగా, నాగార్జున సాగర్‌లోని నాలుగు లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతుండటంతో 26 గేట్లు ఎత్తి దిగువకు 3.50 లక్ష క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు. మరోవైపు.. పులిచింతల గేట్లు 20 ఎత్తివేత వచ్చిన వరద వచ్చినట్టుగా దిగువకు వదులుతున్నారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి లక్ష క్యూసెక్కులను సముద్రంలోకి చేరుతోంది. కాగా, రాత్రికి వరద ఉద్ధృతి మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్రల నుంచి భారీగా వరద నీరు వస్తోంది. దీంతో, సాగర్ దిగువన నదీ తీర ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కాగా, గోదావరిలో వరద ఉధృతి మరింత పెరిగింది. పోలవరంలోకి 11 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా.. 48 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేశారు. ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 13.76 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతుండగా.. 15 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. దీంతో, రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇక, ధవళేశ్వరం నుంచి 13.76 లక్షల క్యూసెక్కులు సముద్రంలకి వచ్చి చేరుతోంది. గొట్టా బ్యారేజ్ నుంచి 25 వేల క్యూసెక్కుల వంశధార జలాలు సముద్రంలోకి చేరుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో 75 ఫ్రీడమ్ పార్కులు -
శ్రీశైలం, జూరాల గేట్లెత్తారు
గద్వాల రూరల్/దోమలపెంట: ఎగువ నుంచి భారీగా వరద పెరగడంతో శ్రీశైలం, జూరాల ప్రాజెక్టు గేట్లను మరోసారి ఎత్తారు. గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులకు గురువారం రాత్రి 8 గంటల సమయంలో 81,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా పదిగేట్లను ఒక మీటర్ మేర ఎత్తి 81,892 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం జలాశయంలో 8.591 టీఎంసీలు, 317.990 మీటర్ల మేర నీటిని నిల్వ చేశారు. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టుకు జూరాలతోపాటు సుంకేశుల నుంచి భారీగా వరద పోటెత్తింది. సుంకేశుల 1,16,062, హంద్రీ నుంచి 250 క్యూసెక్కులు, జూరాలతో కలిపి మొత్తం 1,98,204 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. దీంతో ప్రాజెక్టు ఒక గేటు పది అడుగుల మేర ఎత్తి స్పిల్‌వే ద్వారా 27,662 క్కూసెక్కులు, ఎడమ గట్టు భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 31,784, ఏపీ జెన్కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో ఉత్పత్తి చేస్తూ 32,237 క్యూసెక్కులు మొత్తం 91,683 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 884.1 అడుగులు, 210.5133 టీఎంసీల నీటి నిల్వ ఉంది. -
శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైలం ప్రాజెక్టుకు నీటి ప్రవాహం కొనసాగుతోంది. దీంతో శనివారం ఉదయం 11.30 ప్రాంతంలో మూడు గేట్లు ఎత్తివేయడం ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు.శ్రీశైలం జలాశయం గరిష్ట స్థాయికి చేరడంతో మూడు గేట్లను ఎత్తివేసి వరద నీటిన దిగువకు విడుదల చేశారు. ఏపీ జలవనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబు మూడు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టులో గరిష్ట నీటి నిల్వ 215.81 టీఎంసీలకు గాను ప్రస్తుతం 202.04 టీఎంసీలు ఉంది.ఇన్‌ఫ్లో 1,27, 980 క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 74,365 క్యూసెక్కులు ఉంది.కుడి, ఎడమ గట్ల విద్యుత్ కేంద్రాల్లో కరెంట్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఎగువ నుంచి వరద కొనసాగుతుండటంతో ప్రాజెక్టులో 882 అడుగుల్లో స్థిరంగా నీటిని నిల్వ చేస్తూ.. మిగులుగా ఉన్న నీటిని స్పిల్ వే గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
అధికారుల హెచ్చరిక.. ఏ క్షణంలోనే మూసీ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తే ఛాన్స్!
సాక్షి, నల్లగొండ: ఉపరితల ద్రోణి కారణంగా నేడు(బుధవారం) తెలంగాణలో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక, ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మూసీ నదికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టానికి చేరుకోవడంతో ఏ క్షణమైనా గేట్లు ఎత్తేసే అవకాశం ఉందని సంబంధిత అధికారులు వెల్లడించారు. అయితే, ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 644 అడుగులకు చేరుకుంది. దీంతో, మూసీ ప్రాజెక్ట్ గేట్లను ఎత్తే అవకాశం ఉంది. ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నట్టు అధికారులు తెలిపారు. గేట్లు ఎత్తివేసే అవకాశం ఉండటంతో నదీ పరివాహక ప్రాంతంలోని దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు.. దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వరకు సగటు సముద్రమట్టం వద్ద ఉన్న ఉపరితల ద్రోణి మంగళవారం బలహీనపడింది. దీంతో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కొన్నిచోట్ల రెండ్రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వివరించింది. ఇది కూడా చదవండి: పెట్రోల్ బంకుల్లో నో స్టాక్.. భారీ క్యూలు! కారణం ఏంటంటే.. -
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద: 10 గేట్లు ఎత్తివేత
సాక్షి, కర్నూలు: ఎగువన కురుస్తోన్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుకుంటోంది. దీంతో 10 గేట్లు ఎత్తి నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 4,90,715 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 4,50,071 క్యూసెక్కులు ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 884 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. పూర్తిస్థాయి నీటినిల్వ 215.807 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 210.032 టీఎంసీలు ఉంది. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు భారీగా వరద శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడంతో నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం పెరుగుతోంది. ఇన్‌ఫ్లో 3,57,667 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 1000 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 544.8 అడుగులు కొనసాగుతోంది. -
పూర్తి స్థాయికి నీటిమట్టం; ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తివేత
-
విధిలేని పరిస్థితుల్లో 6 గేట్లు ఎత్తి నీరు వదిలాం: ఈఈ స్వరూప్
సాక్షి,విజయవాడ: విధి లేని పరిస్థితుల్లోనే తాము ప్రకాశం బ్యారేజీ ఆరు గేట్లు ఎత్తి సముద్రంలోకి నీరు వదిలినట్లు ఈఈ స్వరూప్ వెల్లడించారు. కాగా అధికారులు శుక్రవారం ప్రకాశం బ్యారేజీ గేట్లను ఎత్తి ఆరు గేట్ల ద్వారా 8,500 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. తెలంగాణ విద్యుత్ ఉత్పత్తితో పులిచింతల నుంచి బ్యారేజీకి నీరు భారీగా వచ్చి చేరుతుంది. దీంతో ప్రకాశం బ్యారేజీలో నీటిమట్టం పూర్తిస్థాయికి చేరడంతో అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈఈ స్వరూప్ మాట్లాడుతూ.. ''ఇండెంట్ లేకుండానే తెలంగాణ నీటిని వాడటంతో బ్యారేజీకి నీళ్లు వస్తున్నాయి. బ్యారేజీలో 3.07 టీఎంసీల పూర్తిస్థాయి నీటిమట్టం ఉంది. తెలంగాణ జలవిద్యుత్ కేంద్రం నుంచి వచ్చిన నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నాం. ఖరీఫ్‌కి రైతులు ఇంకా సన్నద్ధం కాలేదు. పంట కాలువలకు నీరు వదిలే అవసరం లేదు'' అని తెలిపారు. -
నిండుకుండలా వున్న శ్రీరాం సాగర్ ప్రాజెక్టు
-
దిగువమానేరు, శ్రీరాం సాగర్ గేట్ల ఎత్తివేత
సాక్షి, కరీంనగర్: అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గత రాత్రి పలు చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. వాగులు వంకలన్ని పొంగిపొర్లుతున్నాయి. చెరువులు కుంటలు అలుగు పారుతుండగా ప్రాజెక్టులన్నీ నిండుకుండను తలపిస్తుండడంతో అధికారులు గేట్లు ఎత్తారు. కరీంనగర్ సమీపంలోని లోయర్ మానేరు డ్యామ్‌కు వరద పోటెత్తింది. మోయతుమ్మెద వాగు ద్వారా 47 వేల క్యూసెక్కుల వరద, మీడ్ మానేర్ నుంచి 19 వేల క్యూసెక్కుల నీరు ఎల్ఎండీకి చేరుతుంది. దీంతో అధికారులు 20 గేట్లు ఎత్తి 57,652 క్యూసెక్కుల నీటిని మానేరు వాగులోకి, మరో రెండు వేల క్యూసెక్కుల వాటర్‌ను కాకతీయ కాలువకు వదులుతున్నారు. మిడ్ మానేర్‌కు ఎస్సారెస్పీ వరద కాలువ ద్వారా 15 వేలు, మూలవాగు ద్వారా మరో 8వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండడంతో ఎంఎంఆర్‌కు చెందిన 6 గేట్లు ఎత్తి 19వేల క్యూసెక్కుల నీటిని దిగువ మానేరు డ్యామ్‌కు వదులుతున్నారు. ఎగువ మానేర్ నర్మాల ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండి అలుగు పారుతుంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎస్ఆర్ఎస్పీ కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో గోదావరి ద్వారా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు లక్షా 52వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండటంతో 15గేట్లు ఎత్తి 1,43,865 క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరిలోకి వదులుతున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా మంథని నియోజకవర్గంలో నిర్మించిన సుందిళ్ల పార్వతి బ్యారేజ్, అన్నారం సరస్వతి బ్యారేజ్, మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్‌లకు భారీగా వరద వస్తుండడంతో ఆయా బ్యారేజీల గేట్లన్ని ఎత్తి దిగువకు లక్షలాది క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టుల గేట్లను ఎత్తడంతో అటు గోదావరి మానేరు వాపులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. తీర ప్రాంత ప్రజలను అధికారులతో పాటు మంత్రి గంగుల కమలాకర్ అప్రమత్తం చేశారు. వర్షం వరదలు అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. గత నెలలో కురిసిన వర్షాలతో నీట మునిగి పంట నష్టపోయిన రైతులు ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా మరోసారి వర్షం వరదలు అపార నష్టాన్ని మిగిల్చాయి. శ్రీరాం సాగర్ ప్రాజెక్టు 40 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల ఇన్ ఫ్లో రెండు లక్షల 21 వేల క్యూసెక్కు లు అవుట్ ఫ్లో రెండు లక్షల 21 వేల క్యూసెక్కు లు వరద గేట్ల ద్వారా రెండు లక్షలు, కాలువల ద్వారా 21 వేల క్యూసెక్కుల నీటి విడుదల పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు, 90 టీఎంసీలు ప్రస్తుత నీటిమట్టం 1091 అడుగులు, 90 టీఎంసీలు లోయర్ మానేరు డ్యామ్ 20 గేట్లు ఎత్తి, 57652 క్యూసెక్కుల నీటిని మానేరు వాగులోకి విడుదల. ఇన్ ఫ్లో 59961 క్యూసెక్కులు. ఔట్ ఫ్లో 59961 క్యూసెక్కులు. పూర్తి స్థాయి నీటి నిలువ సామర్థ్యం 24.034 టీఎంసీలు ప్రస్తుతం నీటి నిలువ 23.645 టీఎంసీలు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు 25 గేట్లు ఎత్తి, 72509 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల. ఇన్ ఫ్లో 72518 క్యూసెక్కులు. ఔట్ ఫ్లో 73157 క్యూసెక్కులు. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు ప్రస్తుతం నీటి నిలువ 19.397 టీఎంసీలు.