geetha reddy
-
యాదాద్రి ఆలయ ఈవో గీతారెడ్డి రాజీనామా
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఈవో గీతారెడ్డి గురువారం రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను వెంటనే ఆమోదించిన అధికారులు, ఆలయ నూతన ఈవోగా దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రామకృష్ణారావును నియమించారు. 2014 డిసెంబర్ 2న గీతారెడ్డి యాదాద్రి ఆలయ ఈవోగా బాధ్యతలు తీసుకున్నారు. తొమ్మిదేళ్ల పాటు ఆమె ఈవోగా బాధ్యతల్లో ఉన్నారు. గీతారెడ్డి 2020 ఫిబ్రవరి 28న పదవీ విరమణ చేయాల్సి ఉండగా.. యాదాద్రి ఆలయ అభివృద్ధి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక సంవత్సరం పాటు అంటే 2021 ఫిబ్రవరి 28వ తేదీ వరకు గీతారెడ్డి సర్వీసును పొడిగించింది. అనంతరం ప్రధాన ఆలయ ఉద్ఘాటన నేపథ్యంలో ఆమె పదవీ కాలాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ పొడిగించింది. మరో అధికారిని ఈవోగా నియమించే వరకు గీతారెడ్డినే ఆలయ ఈవోగా కొనసాగుతారని జీవో ఇచి్చంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పదవీ విరమణ పొందిన ప్రభుత్వ అధికారులంతా తమ రాజీనామాలు సమరి్పస్తుండటంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో గీతారెడ్డి రాజీనామా చేశారు. రామకృష్ణారావు బాధ్యతల స్వీకరణ.. యాదాద్రి ఆలయ నూతన ఈవోగా దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రామకృష్ణారావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ఆయన గర్భాలయంలో స్వయంభూ, ప్రతిష్టా అలంకార మూర్తులను దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రామకృష్ణారావుకు ప్రధాన కార్యాలయంలో గీతారెడ్డి బాధ్యతలను అప్పగించారు. -
గెలిచిన ఆరుగురిలో ముగ్గురు అమాత్యులే
జహీరాబాద్: గతంలో నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఆరుగురిలో ముగ్గురికి మాత్రం మంత్రివర్గలో చోటు లభించింది. కాంగ్రెస్ హయాంలోనే ఎం.బాగారెడ్డి, ఎండీ ఫరీదుద్దీన్, జె.గీతారెడ్డిలకు మంత్రి పదవులు దక్కాయి. అప్పుడు కాంగ్రెస్ తరఫున గెలిచిన పి.నర్సింహారెడ్డి, టీడీపీ తరఫున గెలిచిన సి.బాగన్న, బీఆర్ఎస్ తరఫున గెలుపొందిన కె.మాణిక్రావులకు మంత్రి పదవులు దక్కలేదు. అప్పుడు వారి ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయి. 1957 నుంచి 1985 వరకు జరిగిన ఏడు పర్యాయాలు వరుస ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎం.బాగారెడ్డి గెలుపొందారు. పలువురి మంత్రి వర్గంలో బాగారెడ్డికి చోటు లభించింది. చక్కెర పరిశ్రమలు, భారీ పరిశ్రమలు, పంచాయతీరాజ్ తదితర శాఖలను ఆయన నిర్వహించారు. 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎండీ ఫరీదుద్దీన్ మొదటి సారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికల్లో ఆయన తిరిగి గెలుపొందడంతో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి మంత్రి వర్గంలో చోటు లభించింది. వక్ఫ్, మైనార్టీ సంక్షేమం, మత్యశాఖలను నిర్వహించారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అప్పట్లో జహీరాబాద్ అసెంబ్లీ ఎస్సీలకు రిజర్వు కావడంతో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి గీతారెడ్డికి గజ్వేల్ నుంచి జహీరాబాద్‌కు మార్చారు. ఆ ఎన్నికల్లో ఆమె గెలుపొందడంతో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా అవకాశం దక్కింది. 2014 ఎన్నికల్లో తాను ఓటమి పాలవ్వగా బీఆర్ఎస్ అభ్యర్థి కె.మాణిక్‌రావు గెలుపొందారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా ఆయనకు మాత్రం మంత్రివర్గంలో అవకాశంలభించలేదు. పదవులు దక్కలేదు.. 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన పి.నర్సింహారెడ్డి గెలుపొందారు. రాష్ట్రంలో అప్పట్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ఆయనకు మంత్రి యోగం కలుగలేదు. 1994 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన సి.బాగన్న ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పట్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. నాడు ముఖ్యమంత్రిగా ఉన్న నందమూరి తారకరామారావు ఆయనకు మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తామని సీఎం పేషీ నుంచి ఆహ్వానం అందింది. మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి సైతం బాగన్న తన అనుచర గణంతో హాజరయ్యారు. చివరి వరకు వేచి చూసినా ఆయనకు పిలుపు రాలేదు. మంత్రి వర్గంలో చోటు లభించలేదు. దీంతో ఆయన అసంతృప్తితో వెనుదిరగడం అప్పట్లో చర్చనీయాంశమైంది. -
16 నుంచి యాదాద్రిలో ధనుర్మాస ఉత్సవాలు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో 16వ తేదీ నుంచి వచ్చే నెల 15 వరకు ధనుర్మాస ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ గీతారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నెల రోజులపాటు రోజూ ఉదయం 4.30 గంటల నుంచి 5.15 గంటల వరకు ఆలయ ముఖ మండపంపైన ఉత్తర భాగంలోని హాల్లో అమ్మవారిని వేంచేపు చేసి తిరుప్పావై కార్యక్రమం జరిపిస్తామని పేర్కొన్నారు. ఉత్సవాల్లో భాగంగా జనవరి 14న రాత్రి 7 గంటలకు గోదా కల్యాణం, 15న ఉదయం 11.30 గంటలకు ఒడి బియ్యం సమర్పణ నిర్వహించనున్నట్లు వివరించారు. -
యాదగిరిగుట్టలో శిల్ప కళాశాల ప్రారంభం
యాదగిరిగుట్ట: వైటీడీఏ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట పట్టణంలో జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ అనుబంధంగా ఏర్పాటు చేసిన సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్ప కళాశా లను ఆదివారం ఆలయ ఈవో గీతారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా శిల్ప కళాశాలలో ముందుగా గీతారెడ్డి, ఆచార్యులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో శిల్ప కళాకారులను ప్రోత్సహించేలా యాదగిరిగుట్టలో సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్ప కళాశాలను వైటీడీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. పాత హైస్కూల్ మైదానంలో ఏర్పాటు చేసిన ఈ కళాశాలలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు 15 మంది విద్యార్థులకు సంప్రదాయ శిల్ప, ఆలయ వాస్తు కోర్సులో మొత్తం నాలుగు పాఠ్యాంశాలను బోధించనున్నట్లు తెలిపారు. ఈ కోర్సు మూడేళ్లు ఉంటుందన్నారు. కళాశాలలో విద్యార్థులకు జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్ కవిత ప్రత్యేక ప్రోత్సాహంతో పాఠ్య పుస్తకాలు రూపొందించారని వెల్లడించారు. కళాశాల ప్రారంభమైన తర్వాత మధ్యాహ్నం సమయంలో వైటీడీఏ వైస్‌చైర్మన్ కిషన్‌రావు పరిశీలించారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ మోతీలాల్, శిక్షకులు హేమాద్రీ, మొగిలి, అధికారులు భాస్కర్ శర్మ, కృష్ణస్వామి పాల్గొన్నారు. -
సీఎం అయ్యాక ‘ఆరోగ్య’ హామీలు మర్చిపోయారు
సాక్షి, హైదరాబాద్: ఇంకో సంవత్సరం అయితే రాష్ట్రంలో ఎన్నికలు వస్తాయని, ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరోగ్య రక్షణ హామీలు ఏమయ్యాయని సీఎం కేసీఆర్‌ను కాంగ్రెస్ ప్రశ్నించింది. జిల్లాకో మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తా మని, ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ పెడతా మని ఇచ్చిన హామీలను మర్చిపోయారా? అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు జె.గీతారెడ్డి, టి.జగ్గారెడ్డి ప్రశ్నించారు. బుధవారం గాంధీభవన్‌లో వారు విలేకరులతో మాట్లాడారు. ఆర్థిక, ఆరోగ్య శాఖలు రెండూ మంత్రి హరీశ్‌రావు దగ్గరే ఉన్నాయని, ప్రతి మండలానికి 100 పడకల ఆసుపత్రులు ఏమయ్యాయని గీతారెడ్డి ప్రశ్నించా రు. ఢిల్లీలో బస్తీ దవాఖానాలు బాగున్నా యని కేసీఆర్ అంటున్నారంటే తెలంగాణ లో బాగా లేవనేనా అని ఎద్దేవా చేశారు. అయినా, పన్ను నొప్పికి ఢిల్లీ, ఛాతీ నొప్పికి యశోదకు వెళ్లే కేసీఆర్‌కు బస్తీ దవాఖానాల గురించి ఏం తెలుస్తుందన్నారు. ప్రజల ఆరోగ్యం గాలికొదిలి దేశ రాజకీయాలా? తెలంగాణ ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలిన సీఎం కేసీఆర్, దేశ రాజకీయాల్లో బిజీ అయ్యారని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలు.. హామీలుగానే మిగిలిపోయాయని, సీఎం అయ్యాక ఆయన ఆరోగ్య మేనిఫెస్టోను మర్చిపోయారని వ్యాఖ్యానించారు. సమైక్య రాష్ట్రంలో ఉన్న ఆసుపత్రుల్లోనే తెలంగాణ ప్రజలు ఆరోగ్య సేవలు పొందుతున్నారని చెప్పారు. కేసీఆర్ సీఎం అయ్యాక కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కనుమరుగైందని పేర్కొన్నారు. అందుకే సీఎం కేసీఆర్‌కు ప్రజలకిచ్చిన ఆరోగ్య హామీలను మరోమారు గుర్తు చేస్తున్నామని అన్నారు. -
యాదాద్రి ఈఓ మార్పు తప్పదా?
సాక్షి, యాదాద్రి: యాదాద్రి దేవస్థానం ముఖ్య కార్యనిర్వహణ అధికారి(ఈఓ) గీతారెడ్డి మార్పు తప్పదన్న చర్చ జోరుగా సాగుతోంది. కూతురు వివాహం కోసం సెలవుపై వెళ్లిన ఈఓ గీతారెడ్డి మంగళవారం తిరిగి విధుల్లో చేరనున్నారు. అయితే తాజాగా యాదాద్రిని చుట్టుముడుతున్న వివాదాలకు తెరదించడానికి ఈఓను తప్పించనున్నారని తెలుస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమక్షంలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో యాదాద్రిలో నెలకొన్న పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. పరిస్థితులు త్వరలోనే సర్దుకుంటాయని మంత్రి ప్రకటించినప్పటికీ అంతర్గతంగా వాస్తవ పరిస్థితులపై సుదీర్ఘంగానే చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈఓ గీతారెడ్డి స్థానంలో ఐఏఎస్ లేదా రిటైర్డు ఐఏఎస్ అధికారికి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. వివాదాస్పదమైన నిర్ణయాలు.. సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యతనిచ్చి ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక క్షేత్రంగా యాదాద్రిని తీర్చిదిద్దిన విషయం తెలిసిందే. అయితే మార్చి 28న ప్రధానాలయ ఉద్ఘాటన జరిగిన తర్వాత దేవస్థానంలో అమలు చేసిన పలు నిర్ణయాలు వివాదాస్పదం అయ్యాయి. భక్తులకు కనీస వసతులైన నీరు, నీడ కల్పించలేకపోవడం, కొండపైన పార్కింగ్ ఫీజు గంటకు రూ.500, ఆ తర్వాత ప్రతి గంటకు అదనంగా రూ.100 చొప్పున చెల్లించాలని నిర్ణయించడంతో దేవస్థానం వ్యాపారమయంగా మారిందని ఇంటాబయటా తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అదనంగా గంటకు రూ.100 పార్కింగ్ ఫీజు వసూలును ఎత్తివేస్తున్నట్లు దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ ప్రకటించడంతో భక్తులకు కొంత ఊరట కలిగింది. మరోపక్క స్థానిక ఆటోలను కొండపైకి నిషేధించడంతో ఆటో డ్రైవర్ల ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ క్రమంలో ఆటో డ్రైవర్లు తమ కుటుంబాలతో కలసి పలుమార్లు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఈఓ తీరుపై ఆటో కార్మికులు గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేశారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు పలువురు నాయకులు గుట్టకు వచ్చినప్పుడు 300 ఆటో డ్రైవర్ల కుటుంబాలకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఈఓకు సూచించారు. దీంతో పాటు మీడియా ప్రతినిధులను కొండపైకి అనుమతించకపోవడం, ప్రశ్నించిన వారిని అరెస్టు చేయించడంతో ఈఓ, మీడియా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. భక్తులకు మౌలిక వసతులు కల్పించడంలో ఉదాసీనంగా వ్యవహరించడం, ఇటీవల కురిసిన కొద్దిపాటి వర్షానికే యాదాద్రిలో జరిగిన నష్టం వంటి పలు అంశాలు దేవస్థానం ప్రతిష్టను దెబ్బతీశాయని ఉన్నతస్థాయి వర్గాలు భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఈఓను మారుస్తారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. -
యాదాద్రి ఇన్చార్జి ఈవోగా రామకృష్ణ
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఇన్చార్జి ఈవోగా దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్, ఇన్చార్జి ఆర్జేసీ రామకృష్ణ రానున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 6న ప్రస్తుత ఈవో గీతారెడ్డి తన కుమార్తె వివాహం దృష్ట్యా సెలవుపై వెళ్లారు. దీంతో రామకృష్ణను ఇన్చార్జిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆయన సోమవారం లేదా మంగళవారం బాధ్యతలు స్వీకరించను న్నట్లు సమాచారం. -
ప్రతీ భక్తుడికి జియో ట్యాగింగ్
యాదగిరిగుట్ట: యాదాద్రీశుడికి ఈనెల 28న ఉదయం 11.55 గంటలకు మహా కుంభసంప్రోక్షణ జరుగుతుందని, ఆ రోజు మధ్యాహ్నం 2గంటల తరువాతే భక్తులకు స్వయంభూ దర్శనాలు కల్పిస్తామని యాదాద్రి ఆలయ ఈవో గీతారెడ్డి చెప్పారు. ‘ఉదయం సమయంలో భక్తులు వచ్చి ఇబ్బందులు పడొద్దు.. పూజా కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో ఎవరినీ ఆలయంలోకి అనుమతించడం కుదరదు. పూజలన్నీ పూర్తయ్యాక మధ్యాహ్నం 2గంటల తర్వాతే స్వయంభూ దర్శనాలు ప్రారంభమవుతాయి’అని ఆమె వెల్లడించారు. శుక్రవారం కొండపైన తన కార్యాలయంలో ఈఓ గీతారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. ‘భక్తులు క్యూకాంప్లెక్స్లోకి వెళ్లే క్రమంలో ఆన్లైన్ టికెటింగ్‌ను ఏర్పాటు చేస్తున్నాం. ఉచిత దర్శనమైనా, వేరే ఏ దర్శనమైనా అక్కడ భక్తులు పేరు నమోదు చేసుకుంటారు. కొండపైకి ఎంత మంది వచ్చారు, క్యూలైన్లో ఎంత మంది ఉన్నారో పరిశీలించేందుకు జియో ట్యాగింగ్ చేస్తున్నాం. ఒక్కసారి ట్యాగింగ్ చేసిన వ్యక్తి కొండ దిగారా లేదా ఎక్కడ ఉన్నారు అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. 28న ఉచిత దర్శనాలే ఉంటాయి కాబట్టి 29వ తేదీ నుంచి ఆన్లైన్ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది’ అని చెప్పారు. కొండపైకి భక్తులు వచ్చేందుకు 75 బస్సులు సిద్ధంగా ఉన్నాయన్నారు. 27 వరకు బాలాలయంలో దర్శనాలు ఈ నెల 21న అంకురార్పణతో బాలాలయంలో ప్రారంభమయ్యే పంచకుండాత్మక కార్యక్రమాలు 28 వరకు జరుగుతాయి. 28న ఉదయం పూర్ణాహుతి పూర్తయిన అనంతరం మహా కుంభ సంప్రోక్షణ ఉంటుంది. పంచకుండాత్మక యాగానికి సంబంధించిన పనులన్నీ శనివారం పూర్తవుతాయి. ‘బాలాలయంలో 27వ తేదీ వరకు స్వామి వారి దర్శనాలు ఉంటాయి. 21 నుంచి వచ్చే భక్తులంతా స్వామి వారిని, యాగాన్ని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. 28న ఉదయం పూర్ణాహుతి, యాగ ఫలం సమర్పించిన అనంతరం బాలాలయంలో ఉన్న సువర్ణ మూర్తులను శోభయాత్రతో ప్రధానాలయానికి తీసుకెళ్తారు. ఆ సమయంలో భక్తులకు దర్శనం ఉండదు’అని ఆమె తెలిపారు. యాగశాల, మహా కుంభసంప్రోక్షణకు అవసరమైన వేద పారాయణీకులు, ఇతర ఆలయాల్లో ఉన్న అర్చక సిబ్బంది డిప్యూటేషన్‌పై యాదాద్రికి వస్తారన్నారు. సౌకర్యాలన్నీ 28న ప్రారంభం ‘మండల దీక్ష భవనం, కల్యాణ కట్ట, లక్ష్మీ పుష్కరిణిని 28న ప్రారంభిస్తాం. శ్రీసత్యనారాయణస్వామి వ్రత మండపం సైతం భక్తులకు అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం. వీలైనంత వరకు అదే రోజు ప్రారంభిస్తాం. కొండపైన క్యూకాంప్లెక్స్ సిద్ధంగా ఉంది. కొండ కింద బస్టాండ్, కొండపైన బస్బే రెడీ అవుతున్నాయి. 21 నుంచి 28 వరకు ఎంత మంది వస్తే అంత మంది భక్తులకు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు అన్న ప్రసాదం అందిస్తాం’అని గీతారెడ్డి చెప్పారు. 28వ తేదీ నుంచి మూడు రోజులపాటు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. తర్వాత ప్రతి శనివారం, ఆదివారం కూడా సాంస్కృతిక కార్యక్రమాలు జరపాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు శ్రీస్వామి వారి కల్యాణ మండపం కింద ప్రత్యేక వేదిక నిర్మించాలని అనుకుంటున్నట్లు చెప్పారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయం చెంతనే గల శ్రీపర్వత వర్ధిని రామలింగేశ్వరస్వామి ప్రధానాలయం ఉద్ఘాటన ఏప్రిల్ 25న ఉంటుందన్నారు. అందరూ ఆహ్వానితులే.. ‘శ్రీస్వామి వారి ప్రధానాలయ ఉద్ఘాటనకు శ్రీత్రిదండి చినజీయర్ స్వామి వచ్చే అంశాన్ని సీఎం కేసీఆర్ చూసుకుంటారు. మేము ఎవరికీ ప్రత్యేకంగా ఆహ్వానం ఇవ్వలేదు. సీఎం కేసీఆర్ మాత్రం 28వ తేదీన ఉదయం జరిగే మహాకుంభ సంప్రోక్షణలో పాల్గొంటారు. దేవుడికి ప్రత్యేకంగా చేస్తున్న కార్యక్రమం కాబట్టి అందరూ ఆహ్వానితులే. యాగం జరిగే సమయంలో ఎవరైనా, ఏ సమయంలోనైనా వచ్చి వెళ్లవచ్చు. వచ్చిన వారికి ఆలయ పరంగా మర్యాదలు చేస్తాం’ అని గీతారెడ్డి చెప్పారు. -
దడ పుట్టిస్తున్న ధరణి పోర్టల్
మేడ్చల్: ధరణి పోర్టల్ వల్ల లాభాల కంటే ఇబ్బందులే అధికమని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ జె.గీతారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ పంచాయతీరాజ్ సంఘటన్ అధ్యక్షురాలు మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్ చేపట్టిన భూదాన్ పాదయాత్ర గురువారం మేడ్చల్‌కు చేరింది. అత్వెల్లి వద్ద పాదయాత్ర బృందాన్ని కలిసిన ఆమె విలేకరులతో మాట్లాడుతూ ధరణి పోర్టల్ వల్ల ఎంతోమంది భూములు కోల్పోతున్నారన్నారు. జహీరాబాద్ నియోజకవర్గం సత్వార్ గ్రామంలో 200 ఏళ్లుగా రైతుల అధీనంలో ఉన్న 800 ఎకరాల భూమి వక్ఫ్ భూమిగా మారిందన్నారు. కేవలం ధరణి వల్ల రైతుల భూమి వారికి కాకుండా చేశారని ఆరోపించారు. అభయహస్తాన్ని పూర్తిగా ప్రభుత్వం మరిచిపోయిందన్నారు. ఇప్పుడేదో హడావుడి చేస్తున్నా మహిళలకు ఎంతో నష్టం జరిగిందన్నారు. ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని విమర్శించారు. ఇందిరాగాంధీ హయాంలో ఉన్న ఇళ్లు తప్ప.. రాష్ట్రంలో ఎక్కడా ప్రభుత్వం కట్టించిన ఇళ్లు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. సికింద్రాబాద్, గజ్వేల్, సిద్దిపేటలో డబుల్ బెడ్రూం ఇళ్లు కడితే సరిపోదని.. రాష్ట్రంలో పేదలకు ఇళ్లు నిర్మించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. మేడ్చల్‌కు చేరిన యాత్ర భూదాన్ పోచంపల్లి నుంచి ప్రారంభమైన పాదయాత్ర మేడ్చల్ మీదుగా మెదక్ జిల్లాకు చేరింది. మండలంలోని పూడూర్, కిష్టాపూర్, మేడ్చల్, అత్వెల్లి మీదుగా యాత్ర సాగింది. పాదయాత్రలో ములుగు ఎమ్మెల్యే సీతక్క పాల్గొని సమస్యలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో పీసీసీ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ కాంగ్రెస్‌లో మరో తుపాన్..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్‌లో మరో తుపాన్ మొదలైంది. నేతల అసమ్మతి మరోమారు బయటపడింది. టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి వ్యవహారశైలిపై చర్చించేందుకు పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు సోమవారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి నివాసంలో కాంగ్రెస్ విధేయుల ఫోరం పేరుతో జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, మాజీ ఎంపీ వి. హనుమంతరావు, మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డిలతోపాటు సీనియర్ కాంగ్రెస్ నాయకులు కోదండరెడ్డి, గోపిశెట్టి నిరంజన్, కమలాకర్‌రావు, శ్యాంమోహన్ తదితరులు హాజరయ్యారు. దాదాపు 3 గంటలకుపైగా జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర పార్టీలో జరుగుతున్న పరిణామాలు, రేవంత్‌రెడ్డి వ్యవహారశైలి, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు గురించి వారు చర్చించినట్టు తెలిసింది. ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌రెడ్డి పనితీరు పార్టీ ఐక్యతను దెబ్బతీసేలా ఉందని నేతలు అభిప్రాయపడినట్టు సమాచారం. రేవంత్ ఏకపక్ష నిర్ణయాలు, ప్రకటనలతో పార్టీలోని సీనియర్లతోపాటు ముఖ్యనేతలందరినీ అవమానపరిచే తరహాలో వ్యవహరిస్తున్నారని పలువురు నేతలు ఈ సమావేశంలో పేర్కొన్నట్టు తెలిసింది. ఈ క్రమంలోనే రేవంత్ వన్‌మ్యాన్ షోను కట్టడి చేయాలని కోరుతూ ‘కాంగ్రెస్ పార్టీని కాపాడుకుందాం’ పేరిట.. త్వరలోనే నేతలందరూ ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించినట్టు సమాచారం. రేవంత్‌ను కట్టడి చేయాలని అధిష్టానం పెద్దలను కోరాలని భావిస్తున్నట్టు తెలిసింది. పార్టీ బలోపేతం కోసమే..: శ్రీధర్‌బాబు మర్రి శశిధర్‌రెడ్డి నివాసం నుంచి నేతలు బయటికి వచ్చిన సమయంలో ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఒకసారి తన నివాసానికి వచ్చి వెళ్లాలని సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి ఆహ్వానించారని చెప్పారు. తమ భేటీలో ప్రత్యేకత ఏమీ లేదని, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై చర్చించామని చెప్పారు. అయితే తమ సమావేశంలో పార్టీ బలోపేతం కోసం చర్చ జరిగిందని శ్రీధర్‌బాబు పేర్కొనడం గమనార్హం. కాగా పార్టీలో పరిణామాలు, సీనియర్ల విషయంలో జరుగుతున్న అవమానాలపై చర్చించామని మాజీ ఎంపీ వీహెచ్ తెలిపారు. అన్ని విషయాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామన్నారు. పార్టీకి పూర్వవైభవం రావాలి: మర్రి శశిధర్‌రెడ్డి కాంగ్రెస్‌లో సంస్థాగత మార్పులు జరగాలని పార్టీ వర్కింగ్ కమిటీ సోనియా గాంధీని కోరిందని.. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీ ఏవిధంగా ప్రజల విశ్వాసం పొందుతుందనే దానిపై నిర్ణయాలు ఉండాలని సూచించిందని మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రంలోనూ పార్టీకి పూర్వ వైభవం రావాలన్నారు. పార్టీ వ్యవహారాలు చూస్తున్నవారు పార్టీకి అనుబంధంగా ఉన్నారా లేదా అనేది చూడాలని.. దీనిపై తాము చర్చించామని వెల్లడించారు. అన్నీ మీడియాకు చెప్పలేం: జగ్గారెడ్డి ఆదివారం ఢిల్లీలో సోనియా గాంధీ సమావేశం ఏర్పాటు చేసిన అంశంపై చర్చించామని.. బయట జరుగుతున్న ఊహాగానాలు సరికాదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పారు. పార్టీతో కొన్ని సంవత్సరాలుగా అనుబంధం కొనసాగుతున్న నేతలం కలిసి మాట్లాడుకున్నామని.. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నాయకత్వం ఉండాలని కోరుకున్నామని తెలిపారు. వీహెచ్ చెప్పిన అంశాలు చర్చకు వచ్చాయని, కానీ అవన్నీ మీడియాకు చెప్పలేనని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు రెట్టింపు బలం కోసం ఏ విధంగా పనిచేయాలనే దానిపై చర్చించామన్నారు. రేవంత్ ‘పాదయాత్ర’ ప్రకటనతో మళ్లీ దుమారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆదివారం కొల్లాపూర్‌లో జరిగిన సభలో.. తాను రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలు, 33 జిల్లాల్లో తిరుగుతానని, పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను తెలుసుకుంటానని ప్రకటించడం రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో దుమారం రేపుతోంది. రాష్ట్రంలోని పార్టీ ముఖ్య నాయకులతో చర్చించకుండా, అటు టీపీసీసీ కార్యవర్గంలోగానీ, రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలోగానీ మాట్లాడకుండా, అధిష్టానానికి చెప్పి అనుమతి తీసుకోకుండా రేవంత్ ఈ ప్రకటన చేశారని.. ఇది ఇతర నేతలను అవమానించడమేనని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సోమవారం కాంగ్రెస్ సీనియర్ నేతల భేటీకి కూడా ఈ ప్రకటనే కారణమని అంటున్నారు. భట్టి కూడా చేస్తున్నా.. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పేరుతో మధిర నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. ఆయన కూడా పార్టీలో ఎలాంటి చర్చ లేకుండా పాదయాత్ర చేపట్టారని.. అయితే ఎమ్మెల్యే హోదాలో తన నియోజకవర్గానికి మాత్రమే పరిమితమై యాత్రలు చేయడంలో ఎలాంటి తప్పు లేదని కొందరు నేతలు పేర్కొంటున్నారు. మరోవైపు భట్టి పాదయాత్ర చేస్తుంటే లేనిది రేవంత్ చేస్తే తప్పేంటని మరికొందరు వాదిస్తున్నారు. ‘పాదయాత్ర’లకు పోటీ వాస్తవానికి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీలో ఎప్పట్నుంచో ఉంది. అదే సమయంలో యాత్రకు నాయకత్వం వహించేందుకు పోటీ పడుతున్న నేతల జాబితా కూడా చాంతాడంత ఉంది. ఈ నేపథ్యంలోనే పార్టీ అధిష్టానంతో చర్చించి పాదయాత్ర చేసే నేతల పేర్లను ప్రకటించాకే రాష్ట్రవ్యాప్త యాత్ర చేపట్టాలనే అభిప్రాయం పార్టీవర్గాల్లో ఉంది. అందులో భాగంగానే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందు జరిగిన సీఎల్పీ సమావేశంలో పాదయాత్ర అంశంపై చర్చించారు. పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గాల ఇన్చార్జుల అభిప్రాయం సేకరించాలని భావించినా.. సమయాభావం వల్ల సాధ్యం కాలేదని తెలిసింది. ఇలాంటి సమయంలోనే రాష్ట్రంలో కాంగ్రెస్ ‘సర్వోదయ పాదయాత్ర’ప్రారంభం కావడం, తెలంగాణలో 26 రోజుల పాటు జరిగే ఈ యాత్రలో ఏదో ఒక రోజు రాహుల్‌గాంధీ పాల్గొంటారన్న అంశం కీలకంగా మారింది. ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంతో రాహుల్ సమావేశమై.. పాదయాత్ర చేసేవారిని ఫైనల్ చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఇవేమీ జరగకుండానే రేవంత్‌రెడ్డి కొల్లాపూర్ సభలో పాదయాత్ర ప్రకటన చేయడం కాంగ్రెస్ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారం ఎంత దూరం వెళ్తుందో తెలియడం లేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. -
మార్చి 28నే మహా కుంభ సంప్రోక్షణ
యాదగిరిగుట్ట: యాదాద్రిలో మార్చి 28న నిర్వహించాలనుకున్న మహా కుంభ సంప్రోక్షణ యథా విధిగా ఉంటుందని దేవస్థానం ఈఓ గీతారెడ్డి స్పష్టంచేశారు. ప్రధానాలయంలో స్వయంభు దర్శనం సందర్భంగా మహా కుంభ సంప్రోక్షణతోపాటు శ్రీసుదర్శన నారసింహ మహా యాగాన్ని నిర్వహించాలని తొలుత అనుకున్నామని.. అయితే, యాగశాలలో పనులు పెండింగ్‌లో ఉండడంతో యాగం వాయిదా వేశామని చెప్పారు. సోమవారం ఆమె తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మార్చి 28 వరకు శ్రీస్వామి వారి బాలాలయం ఉం టుందని, ఆ రోజున మహా కుంభ సంప్రోక్షణ జరిపిన తరువాత బాలాలయం ఉండదన్నారు. భక్తులకు ప్రధానాలయంలోనే శ్రీస్వామి వారి దర్శనం ఉంటుందని స్పష్టంచేశారు. ‘మార్చి 28 నుంచే భక్తులకు దర్శనం కల్పించాలా.. లేక వారం రోజుల తరువాత కల్పించాలా అనే అంశంపై కలెక్టర్, పోలీసులతో చర్చలు జరుగుతున్నాయి. ప్రధానాలయం గోపురాలపై అమర్చే కలశాలకు పూజలు జరిపించాం, త్వరలోనే వాటిని ఏర్పాటుచేస్తాం. ప్రస్తుతం గోపురాలకు పరంజా బిగించే పనులు జరుగుతున్నాయి. గోపురాలన్నింటిపై 126 బం గారు కలశాలు రానున్నాయి. మార్చి 28న మహా కుంభ సంప్రోక్షణతోపాటు కలశాల సంప్రోక్షణ జరిపిస్తాం’అని ఆమె చెప్పారు. భక్తులకు క్యూలైన్ల ద్వారా స్వామి వారి దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కొండపైన బస్బే, ఆర్చ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని, ఆలయం ప్రారంభం నాటికి పూర్తి అవుతాయన్నారు. 4 నుంచి బ్రహ్మోత్సవాలు యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాలు వచ్చే నెల 4 నుంచి 14 వరకు బాలాలయంలోనే జరిపిస్తామని ఈఓ గీతారెడ్డి తెలిపారు. 10న ఎదుర్కోలు మహోత్సవం, 11న తిరు కల్యాణం, 12న దివ్య విమాన రథోత్సవం ఉంటాయన్నారు. బాలాలయం ఏర్పడిన నాటి నుంచి కొండపైన తిరు కల్యాణం, కొండ కింద వైభవోత్సవ కల్యాణం నిర్వహిస్తున్నామని, ఈసారి కొండ కింద వైభవోత్సవ కల్యాణం లేదన్నారు. బాలాలయంలో ఆంతరంగికంగానే నిర్వహిస్తామని చెప్పారు. -
విజయ ‘గీత’: కసితో చదివారు.. ఆమె పేరు చివర ఆరు డిగ్రీలు
అవార్డులు ఊరికే రావు. ఆ అవార్డు వెనుక... అవార్డు అందుకున్న చేతులు చక్కబెట్టిన బాధ్యతలుంటాయి. ఆ చేతులు తీర్చిదిద్దిన జీవితాలుంటాయి. ఆ చేతులు చేతల్లో చూపించిన విజయాలుంటాయి. ‘బెస్ట్ ఉమన్ ఎంటర్ప్రెన్యూర్ ఫర్ మెంటారింగ్ స్టార్ట్ అప్స్’ అవార్డు అందుకున్న డాక్టర్ గీత ప్రస్థానమూ అలాంటిదే. జీవితంలో ఊహించని అవరోధం ఎదురు కానంత వరకు ఎవరూ జీవితాన్ని తరచి చూసుకోరు. అక్కడి నుంచి మొదలయ్యేదే అసలైన జీవితం... అంటారు యష్మిసొల్యూషన్స్ సీఈవో డాక్టర్ బి. గీతారెడ్డి. యువ పరిశ్రమ యువత పట్టాలు పుచ్చుకుని ఉద్యోగం కోసం ఎదురు చూడడమే మనకు తెలిసిన పురోగతి. ఉద్యోగం కోసం ఎదురు చూడడం కాదు, ఉద్యోగం ఇచ్చేలా ఎదగడం యువత లక్ష్యం అయి ఉండాలి. అందుకోసం ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నాను. ఏపీ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్‌తో మా ‘సిఐఎమ్ఎస్ఎమ్ఈ’ ఒప్పందం కుదుర్చుకుంది. సైన్స్, ఆర్ట్స్, కామర్స్, మేనేజ్మెంట్ స్టూడెంట్స్ అందరికీ ఎంటర్ ప్రెన్యూర్షిప్ అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించడం ఇందులో ఉద్దేశం. పరిశ్రమల రంగం యువకులతో, మహిళలతో నిండిపోవాలనేది నా కల. – డాక్టర్ బి. గీతారెడ్డి, చైర్పర్సన్, సిఐఎమ్ఎస్ఎమ్ఈ (ఏపీ స్టేట్). క్లస్టర్ డైరెక్టర్ (ఏపీ, ఒడిషా), కోవె ఎగ్జిక్యూటివ్ మెంబర్ యష్మి సొల్యూషన్స్ స్థాపించి సర్వీస్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారడానికి ముందు ఆమె తనకు ఎదురైన ఎన్నో సవాళ్లను మనోధైర్యంతో అధిగమించారు. ప్రభుత్వ భూముల కబ్జా వంటి అన్యాయాన్ని, అక్రమాన్ని ఎదిరించడంలో మొండిధైర్యంతో సాగిపోయారు. కసితో చదవడం మొదలు పెట్టారు. ఇప్పుడామె పేరు చివర ఆరు డిగ్రీలు కనిపిస్తాయి. అందరమ్మాయిల్లాగానే నేనూ వైజాగ్‌లో పుట్టి పెరిగిన గీత ఎంసీఎ పూర్తయిన తర్వాత పెళ్లయింది. ‘‘పెళ్లి తర్వాత కూడా చదవడమే పనిగా చదివాను. ‘ఒక సమస్య మీద గట్టిగా వాదిస్తావు. పెద్ద పోరాటమే చేస్తావు, నీకు లీగల్ నాలెడ్జ్ ఉంటే పది మందికి ఉపయోగపడతావని చెప్పాడు మా పెద్ద తమ్ముడు. ఆ మాటతో ఎల్ఎల్బీ చేశాను. ఎంబీఏ, ఆస్ట్రాలజీ, మెడికల్ ఆస్ట్రాలజీలో పీహెచ్డీ, ఉమెన్ ఇన్ ప్రొఫెషనల్ స్టడీస్‌లో పీహెచ్డీ చేశాను. ఇదే సమయంలో నాకంటూ ఒక మంచి యాక్టివిటీని అభివృద్ధి చేసుకున్నాను. అప్పుడప్పుడే డిజిటల్ మీడియా ఊపందుకుంటున్న రోజులవి. మా చిన్న తమ్ముడితో కలిసి డిజిటల్ మీడియా సెక్టార్లో సర్వీస్ మొదలు పెట్టాను. తర్వాత 2015లో సొంతంగా సర్వీస్ ఇండస్ట్రీ స్థాపించుకున్నాను. యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లకు పని చేశాను. ఇప్పుడు నా సర్వీస్ బిజినెస్ చూసుకుంటూనే సమాజానికి నా వంతుగా సేవ చేస్తున్నాను. బాధితులు మహిళలే కుటుంబ సమస్యగా కనిపించే అనేక సమస్యలకు నేరుగా బాధితులయ్యేది మహిళలే. ఆ సమస్యను పరిష్కరించగలిగితే పూర్తి కుటుంబం సంతోషంగా సాగిపోతుందని నా గట్టి నమ్మకం. అందుకే మహిళల సమస్యల మీదనే దృష్టి పెట్టాను. లీగల్ కౌన్సెలింగ్, ఫ్యామిలీ కౌన్సెలింగ్ ఇవ్వడంతోపాటు మహిళల స్వయంసమృద్ధి కోసం స్టార్టప్ మెంటార్‌గా కూడా మారాను. ఆర్థిక స్వేచ్ఛ కొరవడడం పరోక్షంగా మానసిక అభద్రతకు కారణమవుతుంటుంది. అక్కడి నుంచి కుటుంబ సమస్యలు తలెత్తుతాయి, అవి న్యాయపరమైన చిక్కులకు దారి తీస్తాయి. కౌన్సెలింగ్ సమయంలో వందలాది మంది మహిళల మనసులను చదివాను. ఆ అనుభవంతో చెప్తున్న మాట ఇది. ‘జాతకాలు చూసి మరీ పెళ్లి చేశారు మా వాళ్లు. అయినా నా జీవితం ఇలా ఉంది’ అని చాలా మంది మహిళలు బాధపడేవాళ్లు. జ్యోతిషం నిజమే అయితే ఫలితాలు ఇలా ఎందుకుంటాయనే సందేహం నాకూ కలిగింది. అప్పుడు జ్యోతిషం చదివాను. ఏ సబ్జెక్టు మీదకు దృష్టి మళ్లితే ఆ కోర్సు చేయడమే ఇప్పటి వరకు నా ప్రస్థానంగా మారింది. ఇప్పుడు బెంగళూరు ఐఐఎమ్ నుంచి మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలనేది కోరిక’’ అన్నారు డాక్టర్ గీతారెడ్డి. – వాకా మంజులారెడ్డి ‘వనిత’ల కోసం మన మహిళల ఉత్పత్తులకు ఒక బ్రాండింగ్ డిజైన్ చేస్తే విదేశాల్లో మంచి గుర్తింపు వస్తుంది. హస్తకళాకృతులను, ఇతర ఉత్పత్తులతో ఉపాధి పొందే మహిళలను ఒక త్రాటి మీదకు తీసుకురావడానికి ‘కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్’ ద్వారా ప్రయత్నిస్తున్నాం. గాజులు, మగ్గం వర్క్, పోటరీ, జీడిపప్పు గ్రేడింగ్ అండ్ ప్యాకింగ్ వంటి ఉత్పత్తుల మార్కెట్ కోసం ‘వనిత’ పేరుతో వెబ్సైట్ రూపకల్పన జరుగుతోంది. గార్మెంట్ మేకింగ్‌లో ఉన్న మహిళలకు హిందూస్థాన్ షిప్‌యార్డ్ ఉద్యోగులకు అవసరమైన బాయిలర్ సూట్స్ ఆర్డర్ ఇప్పించడం, తిరుపతిలోని మహిళా యూనివర్సిటీలో శిక్షణ కార్యక్రమాల సమన్వయం జరుగుతోంది. -
జోష్ ఇంకా పెరగాలి
సాక్షి, హైదరాబాద్: ‘పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నియామకం తర్వాత గత రెండు నెలల కాలంగా పార్టీ కేడర్‌లో ఉత్సాహంతో కూడిన కదలిక కనిపిస్తోంది. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. ఆ పార్టీ నేతల అవినీతిపై క్షేత్రస్థాయిలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ గ్రాఫ్ నానాటికీ పడిపోతోంది. ఇంకోవైపు బీజేపీలో వర్గపోరు తీవ్రమైంది. పాదయాత్రల కోసం ఆ పార్టీ నేతలు పోటీలు పడుతున్నారు. ఈ విధంగా ప్రస్తుత రాజకీయ పరిణామాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్న పరిస్థితు ల్లో ఈ ఊపు, ఉత్సాహం మరింత పెరగాలి’అని టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం అభి ప్రాయపడింది. గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూ ర్, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ మాజీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నాల లక్ష్మ య్య, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, ఎన్నికల నిర్వహణ, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్లు దామోదర రాజనర్సింహ, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్లు జెట్టి కుసుమకుమార్, పొన్నం ప్రభాకర్లతో పాటు ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్లు హాజరయ్యారు. 17లోపు హుజూరాబాద్ అభ్యర్థి ప్రకటన మాణిక్యం ఠాగూర్ మాట్లాడుతూ సమావేశానికి హాజరైన కీలక నేతలందరూ హుజూరాబాద్ అభ్య ర్థిగా ఒక్క పేరునే సూచిస్తే ఆ పేరును అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి ఓకే చేయిస్తానని చెప్పారు. పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న నేతల నుంచి వచ్చే నెల 9వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించాలని, పరిశీలించిన దరఖాస్తులను అధిష్టానానికి పంపి వచ్చేనెల 17లోపు అభ్యర్థిని ప్రకటించాలని తీర్మానించారు. మరో రెండుచోట్ల దండోరా సభలు దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలకు మం చి స్పందన వచ్చిందని, క్షేత్రస్థాయి కార్యక్రమాల వల్ల దళితులు, గిరిజనుల్లో అవగాహన పెంచగలిగామని కమిటీ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో వచ్చే నెల 17లోగా మరో రెండుచోట్ల సభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 8 లేదా 9వ తేదీల్లో గజ్వేల్ లేదా మెదక్ పార్లమెంటు స్థానం పరిధిలోనికి వచ్చే మరోచోట సభ నిర్వహించాలని తీర్మానించారు. 17న నిర్వహించే ముగింపుసభకు రాహుల్ రాకపోతే ఏఐసీసీ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గేను ఆహ్వానించాలని నిర్ణయించారు. దళితబంధుతో వ్యతిరేకత దళితబంధు వల్ల దళితుల్లోనూ, ఇతర సామాజికవర్గాల్లోనూ టీఆర్ఎస్పై వ్యతిరేకత వస్తోందని సీనియర్ నేతలు చెప్పారు. ఈ నేపథ్యం లో దళిత బంధును రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న అన్ని వర్గాలకు దాన్ని వర్తింప చేయాలంటూ ప్రభు త్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ నేతలే తమ పని అయిపోయినట్టేనని వ్యాఖ్యానిస్తున్నారని చెప్పినట్టు సమాచారం. పార్లమెంటు స్థానాల వారీ సమీక్షా సమావేశాలు డిసెంబర్ 31 కల్లా పూర్తి చేస్తానని మాణిక్యం ఠాగూర్ చెప్పారు. అప్పటికి మండల స్థాయి, బూత్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేయించి సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేస్తానని హామీ ఇచ్చారు. సీనియర్ల సూచనలను పరిగణనలోకి తీసుకుని ముందుకెళతానని రేవంత్ అన్నారు. ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నేత కె.జానారెడ్డి గైర్హాజరయ్యారు. కాగా టీపీసీసీ అధ్యక్షులుగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా జెట్టి కుసుమకుమార్‌లు పార్టీకి చేసిన సేవలను అభినందిస్తూ సమావేశం తీర్మానించింది. ‘ఆ లోటు కనిపించింది’ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశంలో సీనియర్ నాయకులు కొందరు లేని లోటు కనిపించిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. జీవన్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, కోదండరెడ్డి, వీహెచ్ లాంటి సీనియర్లు లేని లోటు స్పష్టంగా ఉందని మీడియాతో ఇష్టాగోష్టి మాట్లాడుతూ అన్నా రు. గతంలో వైఎస్సార్ సీఎం హోదాలో ఉన్న ప్పుడు కూడా కాకా, వీహెచ్‌లాంటి నేతలను కలుపుకొని వెళ్లే ప్రయత్నం చేశారని, సభలు సక్సెస్ చేయడం ఎంత ముఖ్యమో సీనియర్ నేతలను గాంధీభవన్‌కు రప్పించుకోవడం కూడా అంతే ముఖ్యమన్న విషయాన్ని పీసీసీ గ్రహించాలని జగ్గారెడ్డి అన్నారు. -
సేవలు చేయించుకుని రోడ్డుపై పడేస్తారా?
సాక్షి, హైదరాబాద్: కరోనా కష్టకాలంలో ఏడాది పాటు సేవలు చేయించుకుని ఇప్పుడు 1,640 మంది ఔట్సోర్సింగ్ స్టాఫ్‌నర్సులను నడిరోడ్డుపై పడేశారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి జె. గీతారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యులు దేవుళ్లతో సమానం అన్న కేసీఆర్‌కు నర్సులు దేవతల్లా కనిపించడం లేదా అని ప్రశ్నించారు. వెంటనే స్టాఫ్‌నర్సులను పునఃనియమించాలని, లేదంటే వారి పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పారు. తమను విధుల్లోకి తీసుకోవాలని స్టాఫ్‌నర్సులు శుక్రవారం గాంధీభవన్‌లో చేపట్టిన దీక్షను గీతారెడ్డి విరమింపజేశారు. ఈ సందర్భంగా గీతా రెడ్డి మాట్లాడారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి, మానవత్వం ఉంటే ఈ ఆడబిడ్డలకు న్యాయం చేయాలని కోరారు. స్టాఫ్‌నర్సులను ప్రభుత్వం 10 రోజుల్లోగా విధుల్లోకి తీసుకోకుంటే ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని, అధికార పార్టీ నేతలను అడ్డుకుంటామని యూత్‌కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి హెచ్చరించారు. కాగా, దీక్ష విరమణ సందర్భంగా గీతారెడ్డితో మాట్లాడుతూ స్టాఫ్‌నర్సులు కంటతడి పెట్టుకున్నారు. -
మంత్రి ఎర్రబెల్లి పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి : గీతారెడ్డి
-
హోం మంత్రి వ్యాఖ్యలు హాస్యాస్పదం: గీతారెడ్డి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో మహిళకు రక్షణ లేకుండా పోయిందని కాంగ్రెస్ నేత గీతారెడ్డి వ్యాఖ్యానించారు. తాజాగా నగరంలో చోటుచేసుకున్న ప్రియాంకరెడ్డి హత్యపై స్పందించిన గీతా రెడ్డి శనివారం ప్రియాంక తల్లిదండ్రులను కలిసి పరామర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రియాంక హత్య అందరిని కలచివేస్తుందన్నారు. ప్రియాంక ఘటన మరవక ముందే మరో మహిళ అనుమానాస్పదంగా మృతి చెందడం బాధాకరమన్నారు. 50 శాతం ఉన్న మహిళలకు ఎలాంటి భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక 2017లో మహిళలపై 14 శాతం హత్యలు పెరిగాయన్నారు. అంతేగాక మహిళ అక్రమ రవాణా కూడా పెద్ద ఎత్తున జరుగుతుందన్నారు. తమ కూతురు కనిపించడం లేదని ప్రియాంక తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోలేదని, వారితో కూడా సరిగా మాట్లాడలేదని గీతారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రమాద సమయంలో ప్రియాంక తన చెల్లెలికి కాకుండా పోలీసులకు కాల్ చేయాలి’ అని హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడిన మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చదవండి : ప్రియాంక చిన్న పొరపాటు వల్లే: మహమూద్ అలీ -
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న టీఆర్ఎస్
జహీరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను, నేతలను మభ్యపెట్టి పార్టీలో చేర్చుకుంటోందని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క విమర్శించారు. గురువారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు వచ్చిన ఆయన.. మాజీ మంత్రి గీతారెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి పార్టీలో చేర్చుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని టీఆర్ఎస్పై మండిపడ్డారు. దీన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. టీఆర్ఎస్లోకి వెళ్లే వారు ప్రజల కోసం కాకుండా తమ స్వలాభం కోసమే వెళ్తున్నారని విమర్శించారు. 16 సీట్లు ఇస్తే కేంద్రంలో అధికారంలోకి వస్తామని సీఎం కేసీఆర్ చెబుతున్నారని, అదెలా సాధ్యమో చెప్పాలని నిలదీశారు. పేద ప్రజలకు ఒక్క కాంగ్రెస్‌తోనే మేలు జరుగుతుందని ఉద్ఘాటించారు. సరైన పాలనను అందించడంలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కుల, మతాల మధ్య అంతరాలు పెంచి దశ ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. జహీరాబాద్ అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందంటే దానికి గీతారెడ్డి చేసిన కృషి మాత్రమే అని అన్నారు. ఆమె హయాంలోనే మహీంద్ర ట్రాక్టర్ యూనిట్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిమ్జ్ వచ్చాయని గుర్తు చేశారు. నిమ్జ్ పూర్తయితే 3 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు వై.నరోత్తం, కండెం నర్సింహులు, జి.భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల చూపు కాంగ్రెస్ వైపు: గీతారెడ్డి ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని మాజీ మంత్రి గీతారెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఆరోపించారు. ఏప్రిల్ 1న జరగనున్న జహీరాబాద్ సభకు రాహుల్ గాంధీ వస్తారని వెల్లడించారు. ఈ సభలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున తరలిరావాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలను కోరారు. -
పాఠ్యాంశంగా ఈశ్వరీబాయి చరిత్ర
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గడ్డపై జన్మించిన ధీరవనిత ఈశ్వరీబాయి జీవితచరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చి, మరింతగా సమాజానికి చెప్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం ఇక్కడ భాషా సాంస్కృతిక శాఖ, ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ఆమె వర్ధంతిసభను ఘనంగా నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ 94 ఏళ్ల తర్వాత కూడా ఈశ్వరీబాయి గురించి మనం మాట్లాడుకొంటున్నామంటే ఆమె ఆ రోజుల్లో సమాజం కోసం ఎంతగా పనిచేసి ఉంటారో ఇట్టే అర్థం చేసు కోవచ్చని అన్నారు. పేద కుటుంబం, దళితవర్గంలో జన్మించిన మహిళ అయి కూడా సమాజం బాగుకు ధైర్యంగా ముందుకు సాగడం గొప్ప విషయమని కొనియాడారు. అధికార పార్టీకి చెందిన మంత్రిని ఓడించి అసెంబ్లీలో అడుగు పెట్టిన ధీరవనిత అని అన్నారు. మంత్రి పదవి ఇస్తామన్నా తృణప్రాయంగా తిరస్కరించిందని తెలిపారు. అంబేద్కర్ భావజాలం పుణికిపుచ్చుకుందని, కుల, మత విశ్వాసాలు బలంగా ఉన్న ఆ రోజుల్లోనే మనుషులంతా ఒక్కటే అని చాటి చెప్పిందన్నారు. 1969 జరిగిన తెలంగాణ ఉద్యమంలోనూ ఈశ్వరీబాయి కీలకపాత్ర పోషించిందని తెలిపారు. 90 ఏళ్ల క్రితమే ఎదిగి, ఎన్నికల్లో కొట్లాడి, ఎన్నో సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొని సాంఘిక సంస్కరణలకు కారణభూతురాలు అయిందని తెలిపారు. ఉమ్మడి పాలకులు తొక్కిపెట్టారు తెలంగాణగడ్డపై పుట్టిన ఎంతోమంది మహనీయులచరిత్రను ఉమ్మడి పాలకులు తొక్కిపెట్టారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. కేసీఆర్ తెలంగాణ సాధించి సీఎం పదవి చేపట్టిన తర్వాత అధికారికంగానే ఈశ్వరీబాయి జయంతి, వర్ధంతిని జరుపుకొం టున్నామన్నారు. ఇప్పుడు తపాలా శాఖ కూడా ఈశ్వరీబాయి పేరుతో ప్రత్యేక పోస్టల్ కవర్ తీసుకురావటం అభినందనీయమన్నారు. ఈశ్వరీబాయి చరిత్రను అందరూ చదువుకుని ఆమె స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. ఆమె ఆదర్శప్రాయమైన జీవితం అందరికీ ఆదర్శవంతం కావాలన్నారు. సభకు అధ్యక్షత వహించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి మాట్లాడుతూ సామాన్య కుటుంబంలో పుట్టిన వీరనారి ఈశ్వరీబాయి అని కొనియాడారు. ఆమె తెలంగాణ పోరాటయోధురాలు, ధీర వనితన్నారు. వంద ఏళ్ల తర్వాత కూడా జనం హృదయాల్లో నిలిచిన వనిత అని చెప్పా రు. మాజీమంత్రి గీతారెడ్డి మాట్లాడుతూ 28 ఏళ్ల క్రితం భౌతికంగా వదిలి వెళ్లినా ఇప్పటికీ అందరి హృదయాల్లో ఈశ్వరీ బాయి ఉండి పోయారన్నారు. బాగా చదువుకొని డాక్టర్ కావాలని, రాజకీయాల్లోకి మాత్రం రావద్దని చెప్పేవారన్నారు. పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడుతూ స్వశక్తితో పైకి వచ్చిన ఓ గొప్ప మహిళ ఈశ్వరీబాయి అని అన్నారు. అనంతరం ఈశ్వరీబాయిపై రూపొందిన లఘుచిత్రాన్ని ప్రదర్శించారు. కార్యక్రమంలో భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, డాక్టర్ నందన్, డాక్టర్ రామచంద్రారెడ్డిలు పాల్గొన్నారు. -
ఓడిన కాంగ్రెస్ హేమాహేమీలు..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ హేమాహేమీలంతా ఓటమిపాలయ్యారు. మంగళవారం వెల్లడైన ఫలితాల్లో కారు హవా ముందు కాంగ్రెస్ సీనియర్లు నిల వలేకపోయారు. కుందూరు జానారెడ్డితోపాటు ఆ పార్టీకి చెందిన సీనియర్లు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, డి.కె.అరుణ, టి.జీవన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, గీతారెడ్డి, షబ్బీర్ అలీ, కొండా సురేఖ, పొన్నాల లక్ష్మయ్య, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, సర్వే సత్యనారాయణ, చిన్నారెడ్డి, బలరాంనాయక్, సుదర్శన్‌రెడ్డిలకు ప్రత్యర్థుల చేతిలో భంగపాటు ఎదురైంది. జానారెడ్డిపై రెండోసారి పోటీ పడిన నోముల నర్సింహయ్య (టీఆర్ఎస్) విజయం సాధిం చగలిగారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై కూడా తన ప్రత్యర్థి భూపాల్‌రెడ్డి రెండోసారి పోటీలోనే గెలుపొందారు. దీంతో ఈసారి శాసనసభలో ఉత్తమ్ కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, వనమా వెంకటేశ్వర రావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సబితా ఇంద్రారెడ్డిలతో పాటు సీతక్క, వీరయ్య, జగ్గారెడ్డి లాంటి మాజీ ఎమ్మెల్యేలతోనే ఆ పార్టీ సరిపెట్టు కోవాల్సి వచ్చింది. వీరితోపాటు కాంగ్రెస్ పక్షాన ఆరుగురు తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. జాజుల సురేందర్ (ఎల్లారెడ్డి), కందాల ఉపేందర్‌రెడ్డి (పాలేరు), హర్షవర్దన్‌రెడ్డి (కొల్లాపూర్), హరి ప్రియానాయక్ (ఇల్లెందు), పైలట్ రోహిత్‌రెడ్డి (తాండూరు) తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ అయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (మునుగోడు) కూడా తొలిసారి ఎమ్మెల్యేగా శాసనసభలోకి ప్రవేశించనున్నారు. పదవులున్న వాళ్లంతా...! టీపీసీసీ అధ్యక్షుడు, ఆ పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ మినహా కాంగ్రెస్‌లో కీలక పదవుల్లో నేతలంతా ఓటమి పాలయ్యారు. ఏఐసీసీ కార్యదర్శులుగా ఉన్న వంశీచంద్‌రెడ్డి, చిన్నారెడ్డి, సంపత్‌కుమార్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఉన్న రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, కో చైర్మన్లు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీనియర్ నేత డి.కె.అరుణ తదితరులు ఓటమి పాలైన జాబితాలో ఉన్నారు. కేంద్రమంత్రులుగా పనిచేసి ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన సర్వే సత్యనారాయణ, బలరాం నాయక్‌లకు కూడా ఓటమి తప్పలేదు. -
కేసీఆర్ లాగు తొడగక ముందే..
సాక్షి, సంగారెడ్డి : కేసీఆర్ లాగు తొడగక ముందే గీతారెడ్డి తల్లి ఈశ్వరీ బాయి తెలంగాణ కోసం కంకణం కట్టుకుని పోరాటం చేశారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. గీతారెడ్డికి మద్దతుగా శనివారం జహీరాబాద్‌లో జరిగిన బైక్‌ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ అడ్డా అని అన్నారు. ఈ గడ్డపై కాంగ్రెస్ జెండా మరోసారి ఎగరాలని.. గీతారెడ్డి గెలిస్తే రాష్ట్రంలో కీలక పదవిలో ఉంటారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణకు కాపల కుక్కల ఉంటూ.. దళితున్ని సీఎం చేస్తానన్న దరిద్రుడు ముఖ్యమంత్రి అయ్యాడని మండిపడ్డారు. త్యాగమంటే ఎంటో సోనియా గాంధీని చూసి నేర్చుకోవాలని హితవుపలికారు. అక్కడ మోదీ, ఇక్కడ కేడీలు ప్రజలను దోచుకుంటున్నారని రేవంత్ విమర్శించారు. మోదీ మెడలు వంచి జోనల్ వ్యవస్థను తీసుకువచ్చానని చెప్పున కేసీఆర్.. రిజర్వేషన్లు ఎందుకు తీసుకురాలేకపోయ్యారని ప్రశ్నించారు. -
‘కారు’ జోరు
ప్రత్యేక తెలంగాణ ప్రకటన అనంతరం జరిగిన తొలి ఎన్నికల్లో ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లాలో సత్తా చాటింది. ఆ పార్టీ అభ్యర్థులు పదింటికి ఎనిమిది స్థానాల్లో విజయబావుటా ఎగురవేశారు. కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు స్థానాలకే పరిమితమైంది. గజ్వేల్ నుంచి బరిలో నిలిచి గెలిచిన కేసీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. సిద్దిపేట ఎమ్మెల్యేగా ఎన్నికైన హరీశ్‌రావు కీలకమైన నీటి పారుదల శాఖ మంత్రి పదవి చేపట్టారు. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి డిప్యూటీ స్పీకర్ పదవి దక్కింది. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : పదమూడో శాసనసభ (2009–14)లో జిల్లాలో తిరుగులేని విజయం నమోదు చేసిన కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడటంతో తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంది. మలి విడత తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు అనంతరం 2014 ఏప్రిల్‌లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించారు. అయితే రాష్ట్ర ఆవిర్భావ దినంగా 2014 జూలై రెండో తేదీని ప్రకటించడంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రాతిపదికనే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాలకు గాను నారాయణఖేడ్, జహీరాబాద్ మినహా మిగతా ఎనిమిది సెగ్మెంట్లలోనూ ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులే విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో పరాజయం మూటగట్టుకున్న పద్మా దేవేందర్‌రెడ్డి (మెదక్), సోలిపేట రామలింగారెడ్డి (దుబ్బాక) అసెంబ్లీకి మరోమారు ఎన్నికయ్యారు. టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన చింతా ప్రభాకర్ (సంగారెడ్డి), చిలుముల మదన్‌రెడ్డి (నర్సాపూర్), బాబూమోహన్ (అందోలు) తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు పి.కిష్టారెడ్డి (æఖేడ్), జె.గీతారెడ్డి (జహీరాబాద్) అసెంబ్లీకి మరోమారు ఎన్నికయ్యారు. అసెంబ్లీకి మళ్లీ కేసీఆర్.. 1985 నుంచి 2004 వరకు సిద్దిపేట అసెంబ్లీ స్థానానికి ప్రాతినిథ్యం వహించిన కేసీఆర్ 2004 అక్టోబర్‌లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. కరీంనగర్, మహబూబ్‌నగర్ పార్లమెంటు స్థానాల నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సుమారు దశాబ్దకాలం తర్వాత శాసన సభ ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ మెజారిటీ స్థానాలు సాధించడంతో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ శాసనసభ్యుడు పి.కిష్టారెడ్డి 2015 ఆగస్టు 25న గుండె పోటుతో మరణించారు. దీంతో 2016 ఫిబ్రవరిలో నారాయణఖేడ్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. కిష్టారెడ్డి తనయుడు డాక్టర్ పి.సంజీవరెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన మహరెడ్డి భూపాల్‌రెడ్డి మరోమారు పార్టీ తరపున పోటీ చేశారు. హోరాహోరిగా సాగిన ఉప ఎన్నికల పోరులో టీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్‌రెడ్డి సుమారు 50వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించి అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. మంత్రివర్గంలో హరీశ్.. తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా సిద్దిపేట నుంచి వరుసగా ఐదో పర్యాయం విజయం సాధించిన తన్నీరు హరీష్‌రావుకు కేసీఆర్ మంత్రివర్గంలో ప్రధానమైన శాఖలు దక్కాయి. నీటి పారుదల, శాసనసభ వ్యవహారాలు, మార్కెటింగ్, గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మెదక్ నుంచి విజయం సాధించిన పద్మా దేవేందర్ రెడ్డి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు పి.కిష్టారెడ్డి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. సైడ్ లైట్స్.. 2004లో రామాయంపేట నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన పద్మా దేవేందర్‌రెడ్డి, 2014లో మెదక్ నుంచి బరిలోకి దిగారు. మాజీ లోక్‌సభ సభ్యురాలు, సినీనటి విజయశాంతి మెదక్ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున బరిలో దిగి ఓటమి పాలయ్యారు. మెదక్ ఎమ్మెల్యేగా గెలుపొందిన పద్మా దేవేందర్‌రెడ్డి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. దుబ్బాక నుంచి సోలిపేట రామలింగారెడ్డి టీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా ఎన్నిక కాగా, అసెంబ్లీ అంచనాల కమిటీ చైర్మన్‌గా పదవి స్వీకరించారు. సిద్దిపేట నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా టి.హరీష్‌రావు వరుసగా ఐదో పర్యాయం బరిలో నిలిచి, కాంగ్రెస్ అభ్యర్థిపై 93వేల పైచిలుకు ఓట్ల మెజారిటీని సాధించి రికార్డు సృష్టించారు. నర్సాపూర్ నుంచి వరుసగా మూడో పర్యాయం విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డి పరాజయం పాలయ్యారు. ∙2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసిన చింత ప్రభాకర్ రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2014 ఎన్నికల నాటికి టీఆర్ఎస్లో చేరిన చింత ప్రభాకర్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి జయప్రకాశ్‌రెడ్డిపై గెచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. అందోలు నుంచి గతంలో టీడీపీ నుంచి రెండు సార్లు విజయం సాధించి, మంత్రిగా పనిచేసిన బాబూమోహన్ 2014 ఎన్నికల సమయంలో టీఆర్ఎస్లో చివరి నిమిషంలో చేరి, ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహపై విజయం సాధించారు. ఖేడ్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పి.కిష్టారెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రజా వ్యతిరేకతను తట్టుకుని మరీ విజయం సాధించారు. అయితే 2015 ఆగస్టులో గుండెపోటుతో కిష్టారెడ్డి మరణించారు. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గా భూపాల్‌రెడ్డి విజయం సాధించారు. గతంలో గజ్వేల్ నుంచి ప్రాతినిధ్యం వహించిన గీతారెడ్డి నియోజకర్గాల పునర్విభజన అనంతరం 2009, 14 ఎన్నికల్లో జహీరాబాద్ నుంచి వరస విజయాలు సాధించారు. -
మేనిఫెస్టో అంశాలపై ఏఐపీసీ కసరత్తు: గీతారెడ్డి
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఎన్నికల మేనిఫెస్టో అంశాలపై తాము కూడా కసరత్తు చేస్తున్నామని ఆలిండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ (ఏఐపీసీ) దక్షిణ భారత కోఆర్డినేటర్, మాజీ మంత్రి జె.గీతారెడ్డి చెప్పారు. ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కూడా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ ప్రతిపాదించిన 5 అంశాలను అక్కడి కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేర్చారని వెల్లడించారు. సోమవారం గాంధీభవన్‌లో గీతారెడ్డి ప్రొఫెషనల్ కాంగ్రెస్ నేతలు దాసోజు శ్రవణ్, రోహిత్, కల్యాణ్ నార్ల తదితరులతో కలసి విలేకరులతో మాట్లాడారు. కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ నేతృత్వంలోని ప్రొఫెషనల్ కాంగ్రెస్‌లో దేశవ్యాప్తంగా 5 వేల మంది సభ్యులుగా ఉన్నారని, తెలంగాణలో కూడా 450 మంది సభ్యత్వం తీసుకున్నారని ఆమె వివరించారు. ఏఐపీసీ నిర్వహిస్తోన్న మంతన్ సంవాద్ అనే కార్యక్రమంలో భాగంగా మంగళవారం హైదరాబాద్‌లో జరిగే ‘ప్రమాదంలో ప్రజాస్వామ్యం’అనే సెమినార్లో పాల్గొనేందుకు శశిథరూర్ వస్తున్నట్టు ఆమె వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. -
ప్రజల ఆరోగ్యంతో రాజకీయం వద్దు : గీతారెడ్డి
సంగారెడ్డి టౌన్ : ప్రజల ఆరోగ్యంతో రాజకీయం చేయవద్దని సంగారెడ్డి పట్టణ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలి అనేది ప్రజల ఆకాంక్ష అని, మెడికల్ కాలేజీ ఏర్పాటుకై దీక్ష చేస్తున్న జగ్గారెడ్డికి సంఘీభావం తెలుపుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, జహీరాబాద్ ఎమ్మెల్యే గీతారెడ్డి అన్నారు. సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన మూడు రోజుల నిరవధిక రిలే నిరహర దీక్ష రెండో రోజు కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ప్రకాశ్‌రావు, జిల్లా సెక్రెటరీ సయ్యద్ జలాలుద్దీన్, నాయకులు ఎం.ఏ.రహమాన్, నరేందర్‌రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే గీతారెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంజిరెడ్డిగోదావరి, సంగారెడ్డి పట్టణ మెడికల్ షాపు అసోసియేషన్, రేషన్ డీలర్స్ అసోసియేషన్, కిరాణ అండ్ గ్రెన్ జనరల్ మర్చంట్ అసోసియేషన్, అబ్ధుల్ ఖుయ్యూమ్ హాఫెజ్, సంగారెడ్డి నియోజకవర్గ యునైటెడ్ ఫాస్టర్స్ ఫెలోషిఫ్ ఫాస్టర్లు దీక్ష వేదిక వద్దకు వచ్చి జగ్గారెడ్డితో పాటు దీక్ష చేస్తున్న కాంగ్రెస్ నాయకులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా యునైటెడ్ ఫాస్టర్స్ ఫెలోషిఫ్ పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆశిస్సులు అందజేశారు. జహీరాబాద్ ఎమ్మెల్యే గీతారెడ్డి మాట్లాడుతూ సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయకపోవడం అన్యాయమన్నారు. ఉమ్మడి జిల్లాకు కేంద్ర బిందువు అయిన సంగారెడ్డి కాకుండా కొత్త జిల్లా సిద్దిపేటలో కళాశాల ఏర్పాటు చేయడం ఎంత వరకు సమంజసమన్నారు. ఇప్పటికే సిద్దిపేటలో ఓ ప్రైవేట్ కళాశాల ఉండగా ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అనుమతి ఇచ్చారని, ములుగులో మరో ప్రైవేట్ మెడికల్ కాలేజి నడుస్తుందని, దానిలో ఇద్దరు మంత్రులు సైతం దానిలో కలిసి ఉన్నారన్నారు. ఉమ్మడి జిల్లాలో పుట్టిన ముఖ్యమంత్రి సంగారెడ్డి జిల్లా ప్రజలకు న్యాయం చేస్తారన్న నమ్మకం ఉందన్నారు. స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ముఖ్యమంత్రిపై ఒత్తిడి తీసుకురావడంలో విఫలమయ్యారన్నారు. జగ్గారెడ్డి పోరాటంలో కాంగ్రెస్ పార్టీ వెంట ఉందని ఏలాంటి కార్యక్రమాలు చేపట్టిన సంఘీభావం తెలుపుతూ ముందుకు వెళ్తామన్నారు. ఈ ధర్నాలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి తోపాజి అనంతకిషన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతోష్‌కుమార్, శ్రీకాంత్, శంకర్‌రెడ్డి, రఘుగౌడ్, మహేశ్, షేక్ సాబేర్, సంజీవ్, సు«ధాకర్‌తో పాటు సంగారెడ్డి పట్టణం, వివిధ గ్రామాల నాయకులుపాల్గొన్నారు. -
ఆర్థిక క్రమశిక్షణ లేదు.. అడిగినా వివరణ ఇవ్వలేదు
సాక్షి, హైదరాబాద్: వివిధ సంస్థల నుంచి తీసుకున్న అప్పులను రాష్ట్ర ప్రభుత్వం ఆదాయంగా చూపించిందని పీఏసీకి కాగ్ నివేదించింది. సర్కారు ఆర్థిక క్రమశిక్షణ పాటించలేదని, దీనిపై అధికారులకు లేఖ రాసినా వివరణ ఇవ్వలేదని పేర్కొంది. సోమవారం శాసనసభ కమిటీహాలులో పీఏసీ సమావేశమైంది. పీఏసీ చైర్పర్సన్ గీతారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే లక్ష్మణ్, సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు భానుప్రసాదరావు, రాములునాయక్ హాజరయ్యారు. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పీఏసీకి కాగ్ అధికారులు వివరణ ఇస్తూ.. ప్రభుత్వ, ప్రభుత్వరంగ ఆర్థిక సంస్థల నుంచి అప్పులు తీసుకుని, నిధులు మళ్లించి ప్రభుత్వం ఆదాయంగా చూపించిందన్నారు. హడ్కో ద్వారా తీసుకున్న అప్పును ఆర్థిక శాఖ ఆదాయంగా చూపించిందని వివరించారు. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ తీసుకున్న రుణాన్ని ఆదాయంగా చూపించారన్నారు. విద్య, వైద్య రంగాలకు నిధుల కేటాయింపులు, ఖర్చులు ఏటేటా తగ్గించార, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు కేటాయించినా ఖర్చు చేయలేదన్నారు. దీంతో సమావేశానికి ఆర్థిక శాఖ అధికారులను పిలిచి సమాచారం తీసుకోవాలని పీఏసీ నిర్ణయించింది. -
చదువుతోనే సాధికారత
సమాజంలో మహిళ పురుషుడితో పాటు సమానంగా ఎదగడానికి చదువు ఒక్కటే మార్గం. చదువుతోనే మహిళా సాధికారత సాధ్యమవుతుంది. మహిళలు భరించేతత్వం వీడి ప్రశ్నించేతత్వం పెంచుకున్నప్పుడే అన్ని రంగాల్లో రాణించగలరు’ అని యాదాద్రి దేవస్థానం కార్యనిర్వహణాధికారి జి. గీతారెడ్డి తెలిపారు. మహిళా సాధికారత– సమాన అవకాశాలు అనే అంశంపై ‘సాక్షి’కి పలు విషయాలు వెల్లడించారు. వివరాలు ఆమె మాటల్లోనే.. సాక్షి, యాదాద్రి : ఇంటర్ చదువుతుండగానే నాకు వివాహమైంది. కుటుంబ సభ్యులు అందించిన ప్రోత్సాహంతోనే ఉన్నత చదువులు చదివినా. 1990లో మొదటిసారిగా ప్రభుత్వ ఉద్యోగంలో చేరా. 1995లో గ్రూప్–2 అధికారిగా ఎంపికై డిప్యూటీ తహసీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2014 వరకు మహబూబ్‌నగర్‌లో మెప్మా పీడీగా పని చేశా. 2014లో యాదగిరిగుట్ట దేవస్థానం ఈఓగా వచ్చాను. మహిళలు అన్నిరంగాల్లో రాణించలేరని నాతో చాలా మంది అన్నారు. ఆ మాటలను నేటి మహిళలు కొట్టిపడేస్తున్నారు. రిజర్వేషన్లు 50శాతానికి పెంచాలి సమాజంలో సగభాగం ఉన్న మహిళలకు అన్నింటిల్లో సమాన అవకాశాలు కల్పించాలి. ప్రధానంగా 33శాతంగా ఉన్న రిజర్వేషన్లను 50శాతానికి పెంచాలి. ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. అయితే మహిళలు చదువును మధ్యలో ఆపివేయకుండా ఉన్నత చదువులు చదివి తన కాళ్లపై తాను నిలబడగలిగే స్థితికి ఎదగాలి. ఉద్యోగాలు సంపాదించి ఆర్థిక స్వాలంబన సాధించాలి. ప్రస్తుతం ప్రభుత్వాలు మహిళలకు అనేక చట్టాలను ప్రవేశపెట్టింది. అయితే కుటుంబంలో, సమాజంలో మహిళలపై ఇంకా వివక్ష ఉంది. కొన్నిచోట్ల రెండో తరగతి పౌరులుగా చూస్తున్నారు. మనస్సుల్లో మార్పు రావాలి. కుటుంబంలో మగపిల్ల వాడితో సమానంగా ఆడపిల్లను చూడాలి. అక్కడ నుంచే వివక్ష తొలగిపోతోంది. మార్పు ప్రారంభమవుతుంది. విద్య, వైద్యం వంటి విషయాలపై శ్రద్ధ పెట్టాలి. గృహహింసను ఎదుర్కోవాలి ఇంకా కొన్నిచోట్ల గృహహింస చోటు చేసుకుంటుంది. గృహ హింసను సహించి ఊరుకునే పరిస్థితి నుంచి ఎదుర్కోవడానికి ప్రశ్నించేతత్వాన్ని అలవర్చుకోవాలి. చదువుకోవాలి. ఆర్థికంగా ఎదగాలి. మరింతగా ముందుకుసాగాలి. నలుగురున్న సమాజంలో ఉన్నామన్న భావన పెంపొందించుకోవాలి. పురుషుల్లో తోటి మనిషిని వేధించే మనస్తత్వం మారాలి. సతాయించాలనే విధానం తొలగిపోవాలి. గృహహింసను పట్టించుకోకుండా నాకేమిటి అనే బాధ్యతారాహిత్యాన్ని సమాజం వీడనాడాలి. చట్టాలు మరింత వేగంగా పనిచేయాలి. లింగనిర్ధారణ పరీక్షలు మానుకోవాలి సమాజంలో మహిళలు ఎక్కువగా చదువును మధ్యలోనే ఆపివేస్తున్నారు. చదువు ఆపివేయడానికి పలు కారణాలు ఉన్నాయి. ఆడపిల్లలకు చదువు ఎందుకులే అనే భావన నుంచి చదివించాలని అనే ఆలోచనలోకి తల్లిదండ్రులు వచ్చారు. ఇది శుభసూచకం. అయితే ప్రాథమిక స్థాయిలోనే విద్యను ఆపివేయకుండా ఉన్నత చదువులు చదవాలి. బ్రూణహత్యలను నివారణకు ఉన్న చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి. లింగనిర్ధారణ చేసే డాక్టర్లను, స్కానింగ్ సెంటర్లను గుర్తించి కఠినంగా శిక్షించి, ఆవిషయాన్ని సమాజానికి తెలపాలి. లింగనిర్ధారణ పరీక్షలు ఆపితే ఆడపిల్లల నిష్పత్తి పెరుగుతోంది.