Gokul Chat blast
-
ముంబై నుంచి తీసుకెళ్తేనే.. స్టేట్మెంట్ ఇస్తా
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని గోకుల్‌చాట్–లుంబినీ పార్క్‌ల్లో 2007 ఆగస్టు 25న చోటు చేసుకున్న జంట పేలుళ్ల కేసులో నిందితుడిగా ఉన్న అనీఖ్ షఫీఖ్ సయీద్ ‘మారా’ చేస్తున్నాడు. ప్రస్తుతం ముంబైలోని తలోజ జైల్లో ఉన్న ఇతడిపై అహ్మదాబాద్ కోర్టులో విచారణ సాగుతోంది. అయితే తనను ముంబై నుంచి తీసుకెళ్తేనే వాంగ్మూలం ఇస్తానంటూ తన లాయర్ ద్వారా అహ్మదాబాద్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయించాడు. ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం)కు చెందిన ఈ ఉగ్రవాదికి హైదరాబాద్‌లోని ప్రత్యేక న్యాయస్థానం 2018లో ఉరి శిక్ష విధించింది. అనీఖ్ స్వస్థలం మహారాష్ట్రలోని పుణె. ఇతగాడికి ఖలీద్ అనే మారు పేరు కూడా ఉంది. పుణెలో కంప్యూటర్లు, మొబైల్స్ దుకాణం నిర్వహించేవాడు. ఐఎంలో కీలక ఉగ్రవాది అయిన రియాజ్ భత్కల్ ద్వారా ఉగ్రవాదం వైపు మళ్లాడు. గోకుల్‌చాట్–లుంబినీ పార్క్ పేలుళ్ల కోసం సిటీకి వచ్చినప్పుడు తన పేరును సతీష్‌గా మార్చుకున్నాడు. రియాజ్ ఆదేశాల మేరకు మహ్మద్ అక్బర్ ఇస్మాయిల్ చౌదరితో కలిసి 2007 జూలైలో హైదరాబాద్ వచ్చారు. అదే ఏడాది ఆగస్టు 25న రియాజ్ భత్కల్ గోకుల్ ఛాట్‌లో, అనీఖ్ షఫీఖ్ లుంబినీపార్క్‌లో బాంబులు అమర్చగా... మహమ్మద్ అక్బర్ ఇస్మాయిల్ చౌదరి దిల్‌షుక్‌నగర్‌లో బాంబు పెట్టాడు. మొదటి రెండూ పేలగా, మూడోదానిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మిగిలిన నిందితులతో పాటు అనీఖ్ కూడా అరెస్టయ్యాడు. ఈ కేసుల విచారణ 2018లో పూర్తికావడంతో న్యాయస్థానం అనీఖ్‌కు ఉరి శిక్ష విధించింది. అయితే మహారాష్ట్ర, గుజరాత్‌ల్లో ఐఎం సృష్టించిన వరుస పేలుళ్లలోనూ అనీఖ్ కీలక పాత్ర పోషించాడు. దీంతో మహారాష్ట్ర పోలీసులు తమ కేసుల విచారణ కోసం ముంబైకి తరలించారు. ప్రస్తుతం తలోజ జైల్లో ఉన్న ఇతడిపై అహ్మదాబాద్ కోర్టులోనూ విచారణ జరుగుతోంది. దీంతో లాక్డౌన్ మొదలయ్యే వరకు అనీఖ్‌కు అవసరమైన ప్రతి సందర్భంలోనూ ముంబై నుంచి అహ్మదాబాద్‌కు తీసుకువెళ్లేవారు. కరోనా నేపథ్యంలో అహ్మదాబాద్ కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ ప్రారంభించడంతో అతను అప్పటి నుంచి జైలుకే పరిమితమయ్యాడు. అహ్మదాబాద్ పేలుళ్ల కేసులో ఇతడి నుంచి అక్కడి కోర్టు అదనపు వాంగ్మూలం నమోదు చేయాలని భావించింది. దీంతో ఇటీవల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తలోజ జైలులో ఉన్న అనీఖ్ వాంగ్మూలం రికార్డుకు ఆదేశాలు ఇచ్చింది. అయితే తాను అలా స్టేట్మెంట్ ఇవ్వనంటూ ఈ ఉగ్రవాది స్పష్టం చేశాడు. తనను తలోజ జైలు నుంచి అహ్మదాబాద్‌లోని సబర్మతి జైలుకు తరలిస్తేనే వాంగ్మూలం ఇస్తానంటూ అందులో పేర్కొన్నాడు. తలోజ జైలు అధికారులు తనకు అహ్మదాబాద్ కేసుకు సంబంధించిన రికార్డులు ఇవ్వలేదని తన పిటిషన్లో వివరించాడు. లాక్‌డౌన్‌కు ముందే తనను సబర్మతి జైలుకు తరలించేందుకు కోర్టు వారెంట్ ఇచ్చిందని, దీనిని పట్టించుకోని తలోజ జైలు అధికారులపై చర్యలు తీసుకోవాలని పిటిషన్లో పేర్కొన్నాడు. కేసుల విచారణకు అడ్డంకులు సృష్టించి, జాప్యం చేయడానికే ఇతగాడు ఇలా వ్యవహరిస్తున్నాడని నిఘా వర్గాలు చెబుతున్నాయి. అనీఖ్‌కు ఇప్పటికే హైదరాబాద్ జంట పేలుళ్ల కేసులో ఉరిశిక్ష పడింది. మిగిలిన కేసుల విచారణ పూర్తయిన తర్వాతే దీన్ని అమలు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ కేసుల విచారణకు పొడిగిస్తే శిక్ష అమలు కూడా మరింత ఆలస్యం అవుతుందనే ఉద్దేశంతో అనీఖ్ ఇలా చేస్తున్నాడని పేర్కొంటున్నారు. -
జంట పేలుళ్ల కేసులో అప్పీళ్లు విచారణకు స్వీకరించిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని లుంబినీ పార్క్, గోకుల్ చాట్లలో సంభవించిన జంట పేలుళ్ల కేసులో కింది కోర్టు విధించిన ఉరి శిక్ష తీర్పును సవాల్ చేస్తూ దోషులు అనీక్ షఫీక్ సయీద్, మహ్మద్ అక్బర్ ఇస్మాయిల్ చౌదరిలు హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. వీరిద్దరికీ ఢిల్లీలో ఆశ్రయం కల్పించిన నేరానికి తారీఖ్ అంజూమ్ ఎహసాన్ అనే వ్యక్తికి కింది కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ తారీఖ్ కూడా హైకోర్టులో అప్పీల్ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. వీటిని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్ టి.అమర్‌నాథ్‌గౌడ్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణకు స్వీకరించింది. ఈ కేసు నుంచి నిర్దోషులుగా బయటపడిన నిందితులు షాదిక్ ఇష్రార్ షేక్, ఫరూక్ షర్ఫూద్దీన్ తర్ఖాష్లకు పేలుళ్లతో సంబంధం ఉందని, కింది కోర్టు వీరిని విడిచిపెట్టడం చెల్లదని ప్రత్యేక దర్యాప్తు సంస్థ దాఖలు చేసిన అప్పీల్ వ్యాజ్యాలను కూడా కలిపి విచారిస్తామని ధర్మాసనం ప్రకటించింది. అప్పీల్ తీర్పు వెలువడే వరకూ తమకు బెయిల్ మంజూరు చేయాలన్న వారి అభ్యర్థనలను ధర్మాసనం తోసిపుచ్చింది. ఉరిశిక్ష ఖరారు విషయంలో నిర్ణయం తీసుకునేందుకు వాటికి గతంలోనే హైకోర్టు నంబర్లు కేటాయించి రెఫర్ ట్రయిల్ మొదలు పెట్టింది. అనీక్ షఫీక్ సయీద్, మహ్మద్ అక్బర్ ఇస్మాయిల్ చౌదరిలకు ఉరిశిక్ష విధిస్తూ రెండో అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి టి.శ్రీనివాసరావు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. -
మూడు బాంబుల టైమర్లుగా 'సమయ్' వాచీలు
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని గోకుల్‌చాట్, లుంబినీపార్క్, ఆపై దిల్‌సుఖ్‌నగర్‌లోని ఏ–1 మిర్చి సెంటర్, 107 బస్టాప్‌లతో పాటు దేశ వ్యాప్తంగా 2005 ఫిబ్రవరి నుంచి 11 విధ్వంసాలకు పాల్పడిన ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) సంస్థ వినియోగించిన బాంబుల్లో టైమర్లుగా ‘సమయ్’ వాచీలనే వాడారు. వేర్వేరు సమయాల్లో తయారు చేసిన బాంబుల్లోనూ ఒకే తరహా వాచీలనే ఎందుకు వాడారనే మిస్టరీని 2007 నాటి జంట పేలుళ్ల కేసులను దర్యాప్తు చేసిన ఆక్టోపస్ అధికారులు ఛేదించారు. సదరు కంపెనీ తయారు చేసే వాచీల్లో ఉన్న స్పేస్ (ఖాళీ)తో పాటు ప్రత్యేకమైన అలారం కనెక్షన్ కారణంగానే దీనిని ఎంపిక చేసుకున్నట్లు గుర్తించారు. ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులు నగరంలో చోటు చేసుకున్న జంట పేలుళ్ల నుంచి ఢిల్లీ పేలుళ్ల వరకు ఒకే తరహా బాంబులను వినియోగించారు. ‘వీ’ ఆకారంలో ఉండే ఈ బాంబులను సాంకేతిక పరిభాషలో ‘షేప్డ్ బాంబ్స్’గా పిలుస్తారు. అమ్మోనియం నైట్రేట్ సమ్మిళిత పేలుడు పదార్థమైన ‘నియోజల్–90’ని వీటిలో వాడారు. బాంబు పేలిన వెంటనే అపరిమిత వేగంతో దూసుకుపోయి ఎదుటి వారి శరీరాలను ఛిద్రం చేసేందుకు సైకిల్ చెర్రాలను స్లి్పంటర్స్గా వినియోగించారు. పేలుడు పదార్థాన్ని ఎలక్ట్రిక్ డిటోనేటర్ సాయంతో పేల్చారు. ఈ డిటోనేటర్‌కు ప్రేరణ అందించేందుకు 9 వోల్టుల బ్యాటరీని టైమర్‌తో కలిపి ఉపయోగించారు. బాంబు ఫలానా సమయానికి పేలాలని సెట్ చేసేందుకు టైమర్ అవసరమవుతుంది. ఐఎం సంస్థ దేశ వ్యాప్తంగా జరిపిన అన్ని వరుస పేలుళ్లలోనూ టైమర్‌గా సమయ్ కంపెనీకి చెందిన వాచ్‌లనే ఏర్పాటు చేసింది. ఈ టైమర్ సర్క్యూట్‌ను ఆజామ్గఢ్కు చెందిన ‘సిమి’ ఉగ్రవాది మహ్మద్ ఆరిఫ్ అలియాస్ ఆరిఫ్ బదర్ అలియాస్ లడ్డాన్ తయారు చేశాడు. పాకిస్తాన్లో ఉగ్రవాద శిక్షణ పొందిన ఆరిఫ్ ఆజామ్గఢ్లో ఓ ఎలక్ట్రానిక్ దుకాణం నిర్వహిస్తూ ఆ ముసుగులోనే టైమర్లను తయారు చేశాడు. అంతకు ముందు అజంతా, చైనా వాచీలతో చేసిన ప్రయోగాలు ఫలించలేదు. డిటోనేటర్లకు అవసరమైన ప్రేరణ అందించడానికి 9 వోల్టుల బ్యాటరీ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీనిని ఉంచే ఖాళీ అజంతా, చైనా వాచీల్లో లేదు. ఆ ఖాళీతో పాటు అలారం కనెక్షన్లో కట్ సౌకర్యం ఉన్న కారణంగానే సమయ్ వాచీలను ఎంపిక చేసుకుని టైమర్ సర్యూ్కట్స్ రూపొందించాడు. మరోపక్క బాంబు పేలాల్సిన సమయాన్ని అలారం ద్వారా నిర్ణయిస్తారు. ఆ సమయం వచ్చిన వెంటనే అలారం మోగడానికి అనువుగా బ్యాటరీ నుంచి విద్యుత్ సరఫరా అవుతుంది. ఈ విద్యుత్‌ను 9 వోల్టుల బ్యాటరీకి సరఫరా చేయాల్సి ఉంటుంది. ఇందుకు అనువుగా సమయ్ వాచీల్లో అలారం కనెక్షన్‌కు కట్ ఉంటుంది. అనుకున్న ప్రకారం బాంబు పేలడానికి ఈ కనెక్షన్ ఎంతో కీలకం. ఇన్ని అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే అతను ప్రత్యేకంగా వీటినే ఎంపిక చేసుకున్నాడని ఆక్టోపస్ అధికారులు నిర్ధారించారు. ఈ సర్క్యూట్‌కు పాజిటివ్ కనెక్షన్లు (+)ఇవ్వడానికి ఎరుపు, పసుపు, బూడిద రంగు వైర్లను, నెగెటివ్ కనెక్షన్ (–) ఇచ్చేందుకు తెలుపు, నలుపు వైర్లను వాడారని నిర్ధారించారు. ఈ రెండు కనెక్షన్లనూ బాంబును అసెంబుల్ చేసే వ్యక్తి కచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అందుకే అన్ని ప్రాంతాల్లో ఇవే రంగులను వినియోగించారు. ఐఎం టైమర్ల గుట్టును పసిగట్టడానికి ఆక్టోపస్ అధికారులు అప్పట్లో భారీ అధ్యయనమే చేయాల్సి వచ్చింది. గోకుల్‌చాట్, లుంబినీపార్క్‌లతో పాటు దిల్‌సుఖ్‌నగర్‌లోని ఫుట్ఓవర్ బ్రిడ్జ్ వద్ద పెట్టిన బాంబులను రియాజ్ భత్కల్ తయారు చేశాడు. వీటికి టైమర్లను కనెక్ట్ చేసింది మాత్రం సాదిఖ్ షేక్. అప్పట్లో పుణె క్యాంప్ ఏరియాలో ఉన్న ఇతడి వద్దకు వాచీలను తీసుకువెళ్లిన రియాజ్ కనెక్ట్ చేసే విధానాన్ని తెలుసుకున్నాడు. ఈ విషయంతో పాటు మరికొన్ని అంశాలూ ఆధారాలతో నిరూపితం కాని నేపథ్యంలో సాదిఖ్‌పై అభియోగాలు వీగిపోయాయి. కొంత ఊరట... ప్రభుత్వ వైఫల్యం కారణంగానే గోకుల్‌చాట్ కేసులో మిగతా నిందితులు తప్పించుకున్నారు. ఇన్నేళ్ల తర్వాత కొందరినైనా శిక్షించడం ఊరట కలిగిస్తోంది. నా సోదరి మృతి చెంది 11 ఏళ్లు గడుస్తున్నా తాను పనిచేస్తున్న ఆర్టీసీ నుంచి ఎలాంటి సహాయం, పరిహారం అందలేదు. ఇప్పటికైనా ఆమె కుటుంబాన్ని ఆదుకోవాలి. – మన్నె చంద్రకళ (గోకుల్‌చాట్ మృతురాలు సుశీల సోదరి) -
ఉరి శిక్ష ఖరారు.. అమలు ఎలా?
దిల్సుఖ్నగర్, లుంబినీ పార్కు బాంబు పేలుళ్ల కేసుల్లో ఉగ్రవాదులకు న్యాయ స్థానం ఉరి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. మరో మూడు దశలు దాటితే..మొత్తం ఏడుగురు ఉగ్రవాదులు ఉరికంబం ఎక్కాల్సిందే. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే...రాష్ట్రంలో ఇప్పుడు ఏ జైలులోనూ గ్యాలోస్ (ఉరికంబం ఉండే ప్రాంతం సాంకేతిక నామం) లేవు. తలారులు(హ్యాంగ్మెన్) లేరు. ఈ నేపథ్యంలో మొత్తం ఏడుగురు ఐఎం ఉగ్రవాదులకు మరణశిక్ష అమలు చేయడం ఖరారైతే... అది ఎక్కడన్నది ఆసక్తికరంగా మారింది. ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి ఆఖరి ఉరి శిక్షను 38 ఏళ్ల క్రితం ముషీరాబాద్‌లోని సెంట్రల్ జైలులో అమలు చేశారు. ముషీరాబాద్ సెంట్రల్ జైలునే కొన్నేళ్ల క్రితం చర్లపల్లికి మార్చారు. అక్కడ జైలు నిర్మిస్తున్నప్పుడు గ్యాలోస్ కోసం ఓ ప్రాంతాన్ని ఎంపిక చేసినప్పటికీ... ఉరికంబం ఏర్పాటు చేయలేదు. దీంతో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉరికంబం ఉన్న జైలు కేవలం రాజమండ్రి సెంట్రల్ జైలు మాత్రమే. ఐఎం ఉగ్రవాదులకు ఉరిశిక్ష ఖరారైతే చర్లపల్లిలో గ్యాలోస్‌ను ఏర్పాటు చేయడమో లేక రాజమండ్రిలో అమలు చేయించడమో మాత్రమే మార్గాలు. కాగా లుంబినీ పార్కులో పేలుడుకు పాల్పడిన అనీఖ్, అక్బర్‌లకు సోమవారం కోర్టు ఉరిశిక్ష విధించగా...దిల్‌సుఖ్‌నగర్‌లో బాంబు పేలుళ్లకు పాల్పడిన ఐదుగురు ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాదులకు 2016 డిసెంబర్ 19న కోర్టు ఉరి శిక్ష విధించింది. ఇవి అమలు కావాల్సి ఉంది. 2007 ఆగస్టు 25న లుంబినీ పార్క్‌లో పేలుడుకు పాల్పడడంతో పాటు దిల్సుఖ్నగర్ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ వద్ద బాంబు పెట్టిన ఇద్దరు ఐఎం ఉగ్రవాదులకు సోమవారం... క్యాపిటల్ పనిష్మెంట్గా పరిగణించే మరణశిక్ష విధిస్తూ న్యాయస్థానాలు తీర్పు చెప్పాయి. మరో మూడు దశలు దాటితే ఈ ముష్కరులకు విధించిన శిక్ష ఖరారైనట్లే! ఇక్కడ తెరపైకి వచ్చే ఆసక్తికర అంశం ఏమిటంటే... ప్రస్తుతం రాష్ట్రంలోని ఏ జైలులోనూ గ్యాలోస్ (ఉరికంబం ఉండే ప్రాంతం సాంకేతిక నామం) లేవు. తలారులుగా పిలిచే హ్యాంగ్మెన్ పోస్టులు అసలే లేవు. ఈ నేపథ్యంలో మొత్తం ఏడుగురు ఐఎం ఉగ్రవాదులకు మరణశిక్ష అమలు చేయడం ఖరారైతే... అది ఎక్కడన్నది ఆసక్తికరంగా మారింది. సాక్షి, సిటీబ్యూరో :సిటీలో పేలుళ్లకు సంబంధించి ఇప్పటి వరకు మొత్తం ఏడుగురు ఉగ్రవాదులకు ట్రయల్ కోర్టు మరణశిక్ష విధించింది. ఈ తీర్పును దోషులు హైకోర్టులో సవాల్ చేసే ఆస్కారం ఉంది. ఇప్పటికే డిఫెన్స్ లాయర్లు ఈ మేరకు ప్రకటించారు. దిల్సుఖ్నగర్ కేసుల్లో ఆ ప్రాసెస్ కూడా మొదలైంది. ఇలా జరగని పక్షంలో శిక్ష విధించిన న్యాయస్థానమే ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకువెళ్తుంది. అప్పుడు ఉన్నత న్యాయస్థానం ‘రిఫర్డ్ ట్రయల్’గా పిలిచే విధానంలో తనంతట తానుగానే విచారణ చేయొచ్చు. హైకోర్టు సైతం ట్రయల్ కోర్టు విధించిన శిక్షలను సమర్థిస్తే... దోషులు పిటిషన్ దాఖలు చేయడం ద్వారా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. సుప్రీంలోనూ వీరికి చుక్కెదురైతే క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతికి విజ్ఞప్తి చేసుకోవచ్చు. దోషులో లేదా వారి తరఫు వారో ఈ పిటిషన్లను దాఖలు చేయడానికి ఆస్కారం ఉంది. రాష్ట్రపతి సైతం క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరిస్తే దోషులకు విధించిన మరణశిక్ష ఖరారైనట్లే. దీంతో శిక్ష విధించిన న్యాయస్థానం పరిధిలోకి వచ్చే రాష్ట్రంలో దీన్ని అమలు చేయడానికి సన్నాహాలు ప్రారంభమవుతాయి. కానీ మరి రాష్ట్రంలో ఒక్క జైలులోనూ ఉరికంబం లేదు. 38 ఏళ్ల క్రితం చివరిసారి... ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి ఆఖరి ఉరి శిక్షను 38 ఏళ్ల క్రితం ముషీరాబాద్‌లోని సెంట్రల్ జైలులో అమలు చేశారు. 1978లో భారత వైమానిక దళంలో పనిచేసిన ఎయిర్‌మెన్ రామవతార్ యాదవ్‌పై హత్య కేసు నిరూపితం కావడం, మరణశిక్ష ఖరారు కావడంతో ఉరి తీశారు. అప్పటి జైల్ సూపరింటెండెంట్ సుబ్బారెడ్డి పర్యవేక్షణలో శిక్ష అమలు చేశారు. రామవతార్ ఓ వివాహితతో సంబంధం కొనసాగించాడు. వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న సందర్భంలో సదరు వివాహిత కుమారుడు చూశాడు. తమ గుట్టురట్టవుతుందనే ఉద్దేశంతో ఇద్దరూ కలిసి ఆ బాలుడిని చంపేశారు. మృతదేహాన్ని హుస్సేన్‌సాగర్‌లో పడేసేందుకు గన్నీ బ్యాగ్‌లో కట్టి సైకిల్‌పై తీసుకొస్తున్న రామవతార్ ఓ కానిస్టేబుల్‌కు ఎదురుపడటంతో మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసును విచారించిన న్యాయస్థానం రామవతార్కు ఉరి, వివాహితకు జీవితఖైదు విధించింది. చంచల్‌గూడ జైల్లో శిక్ష అనుభవించిన ఆ వివాహిత రామవతార్ యాదవ్‌ను ఉరి తీసిన విషయం తెలుసుకొని ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకుంది. జైలు మారడంతో... ముషీరాబాద్ సెంట్రల్ జైలునే కొన్నేళ్ల క్రితం చర్లపల్లికి మార్చారు. అక్కడ జైలు నిర్మిస్తున్నప్పుడు గ్యాలోస్ కోసం ఓ ప్రాంతాన్ని ఎంపిక చేసినప్పటికీ... ఉరికంబం ఏర్పాటు చేయలేదు. దీంతో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉరికంబం ఉన్న జైలు కేవలం రాజమండ్రి సెంట్రల్ జైలు మాత్రమే. మరోపక్క తెలంగాణ జైళ్ల శాఖలో కొన్ని దశాబ్దాలుగా హ్యాంగ్మెన్గా పిలిచే తలారీ పోస్టులు లేవు. ఏళ్లుగా ఉరిశిక్ష అమలు లేకపోవడంతో కొందరు హెడ్–వార్డర్స్కే ఈ అంశంలో ప్రాథమిక శిక్షణ ఇస్తున్నారు. అవసరమైనప్పుడు వీరిలో ముందుకొచ్చిన వారికి ప్రత్యేక అలవెన్స్ ఇవ్వడం ద్వారా దోషుల్ని ఉరితీయించవచ్చని అధికారులు భావిస్తున్నారు. సాధారణంగా ఓ రాష్ట్రంలోని ఓ జైలులో ఉరికంబం లేకపోతే అదే రాష్ట్రంలోని మరో జైలులో దీన్ని అమలు చేసే ఆస్కారం ఉంది. అయితే తెలంగాణలోని ఏ జైలులోనూ గ్యాలోస్ లేని నేపథ్యంలో ఐఎం ఉగ్రవాదులకు ఉరిశిక్ష ఖరారైతే చర్లపల్లిలో గ్యాలోస్‌ను ఏర్పాటు చేయడమో లేక రాజమండ్రిలో అమలు చేయించడమో మాత్రమే మార్గాలు. అయితే రాజమండ్రిలో ఉరిశిక్ష అమలు చేస్తే అది ఆంధ్రప్రదేశ్ సర్కారు అమలు చేసినట్లవుతుందని, ఈ నేపథ్యంలో గ్యాలోస్ ఏర్పాటుకే ప్రాధాన్యం ఉంటుందని పేర్కొంటున్నారు. దీనికి ప్రత్యేకించి ఎలాంటి అనుమతులు లేని నేపథ్యంలో అవసరమైతే రెండుమూడు రోజుల్లోనే ఏర్పాటు చేయవచ్చని స్పష్టం చేస్తున్నారు. రాజమండ్రిలో 40 ఏళ్ల క్రితం.. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఆఖరుసారిగా 1976 ఫిబ్రవరిలో ఉరిశిక్ష అమలు చేశారు. ఓ హత్య కేసులో దోషిగా తేలిన అనంతపురం జిల్లాకు చెందిన నంబి కిష్టప్పను ఉరి తీశారు. ఆ తర్వాత కొందరు ఖైదీలను ఉరిశిక్ష అమలు కోసం ఈ జైలుకు తరలించినా అవి అమలు కాలేదు. 1875 నుంచి గ్యాలోస్ కలిగి ఉండి, ఇప్పటికీ కొనసాగుతున్న కేంద్ర కారాగారం రాజమండ్రి సెంట్రల్ జైల్ మాత్రమే. స్వాతంత్య్రానంతరం దేశవ్యాప్తంగా వివిధ కారాగారాల్లో మొత్తం 94 మందిని ఉరితీశారు. అత్యధికంగా 42 శిక్షల్ని రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే అమలు చేశారు. క్యాపిటల్ పనిష్మెంట్గా పిలిచే ఉరిశిక్షను అమలు చేసే ముందు సదరు ఖైదీని ఆఖరి కోరిక ఏమిటని అడగడం అనవాయితీ. హత్య కేసులో ఉరిశిక్షకు గురైన కిష్టప్ప తన ఆఖరి కోరికగా లడ్డూ తింటానని కోరాడు. దీంతో జైలు అధికారులు ఉరితీయడానికి ముందు అతడికి లడ్డూలు అందించారు. రాజమండ్రి జైలు తలారీ ధర్మరాజు ఇతడిని ఉరితీశారు. ఆ ఇద్దరి శిక్షకు బ్రేక్... 1993 నాటి చిలకలూరిపేట బస్సు దహనం కేసులో నిందితులుగా ఉండి, దోషులుగా తేలిన విష్ణువర్ధన్‌రావు, చలపతిరావులకు న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. ఈ శిక్ష ఖరారు కావడంతో అమలు కోసం ఇద్దరినీ 1997లో రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించారు. 1999లో శిక్ష అమలు చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మరుసటి రోజు ఉదయం 5 గంటలకు ఉరి తీయాల్సి ఉండగా... సుప్రీంకోర్టు స్టే విధించడంతో తెల్లవారుజామున ఒంటిగంటకు రాజమండ్రి జైలు అధికారులకు ఫోన్ ద్వారా, 3గంటలకు అధికారికంగా ఉత్తర్వులు అందడంతో శిక్ష అమలు ఆగిపోయింది. ఆపై వీరికి పడిన శిక్ష జీవితఖైదుగా మారింది. విజయవాడలో జరిగిన శ్రీలక్ష్మి హత్య కేసులో నిందితుడిగా ఉన్న మనోహర్‌కు కింది కోర్టు ఉరిశిక్ష వి«ధించడంతో 2004లో రాజమండ్రికి తరలించారు. హైకోర్టు ఈ శిక్షను జీవితఖైదుగా మార్చడంతో ఇతడిని నెల్లూరు సెంట్రల్ జైలుకు పంపారు. 2011లో ప్రకాశం, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన బి.వెంకటేశ్వరరావు, కె.శ్రీనివాసదోర విషయంలోనూ ఇలానే జరిగింది. భూగర్భంలో ఉరికంబం రాజమండ్రి సెంట్రల్ జైలులోని గ్యాలోస్ 1980 వరకు ప్రధాన ద్వారం పక్కనే బహిరంగ ప్రదేశంలో ఉండేది. ఖైదీని జైలు గది నుంచి బయటకు తీసుకువచ్చి, ఉరిశిక్ష అమలు చేసిన తర్వాత మృతదేహాన్ని ఉరికంబం కింద ఉండే ప్రత్యేక చాంబర్లో దింపుతారు. ఇక్కడి నుంచి నేరుగా ట్రే ద్వారా సంబంధీకులకు అప్పగించాలని, మృతదేహాన్ని జైలు మీదుగా బయటకు తీసుకురాకూడదనే ఉద్దేశంతో ఇలా ఏర్పాటు చేశారు. ఆ తరువాత దీన్ని అడ్మినిస్ట్రేటివ్ భవనం పరిసరాల్లోకి మార్చారు. మూడేళ్ల క్రితం ఈ గ్యాలోస్ ఉన్న ప్రాంతంలోనే రూ.7.5 కోట్లతో కొత్తగా పరిపాలనా భవనాన్ని నిర్మించారు. ఈ నేపథ్యంలోనే గ్యాలోస్‌ను అది ఉన్న ప్రాంతం నుంచి మార్చడం ఇష్టం లేక భవనం కింద భూగర్భంలో ఏర్పాటు చేశారు. ఈ తరహా గ్యాలోస్ కలిగిన కారాగారం దేశంలో మరోటి లేదు. నిర్మాణాలు ఎన్ని మారినా ఇప్పటికీ బ్రిటిష్ కాలం నాటి ఇనుప ఉరికంబాన్నే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. తరచూ దీనికి ఆయిలింగ్ చేస్తూ పనితీరు దెబ్బతినకుండా జైలు అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సంబంధిత వార్తలు.. అతడు ఊహాచిత్రాలు గీయడంలో దిట్ట మూడు బాంబుల టైమర్లుగా 'సమయ్' వాచీలు -
ఇద్దరికి ఉరిశిక్ష..ఒకరికి యావజ్జీవం
-
ఇద్దరికి ఉరి.. ఒకరికి యావజ్జీవం
సాక్షి, హైదరాబాద్ : లుంబినీపార్క్, గోకుల్‌చాట్‌లో బాంబు పేలుళ్లు జరిపి అమాయకుల ప్రాణాలు బలిగొన్న అనీక్ షఫీక్ సయీద్, మహ్మద్ అక్బర్ ఇస్మాయిల్ చౌదరిలకు న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. ఈ బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితులైన వీరిద్దరినీ గత వారం దోషులుగా నిర్ధారించిన న్యాయస్థానం, సోమవారం హత్య, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడం వంటి నేరాల కింద ఉరిశిక్షను ఖరారు చేసింది. అలాగే ఒక్కొక్కరికీ రూ.10 వేల జరిమానా విధించింది. అంతేకాక హత్యయత్నం కింద జీవిత ఖైదు, రూ.10 వేల జరిమానా, కుట్ర కింద జీవిత ఖైదు, రూ.10 వేల జరిమానా, దేశంపై యుద్ధం ప్రకటించిన నేరం కింద జీవిత ఖైదు, రూ.10 వేల జరిమానా, పేలుడు పదార్థాల నిరోధక చట్టం కింద జీవిత ఖైదు, రూ.10 వేల జరిమానా, ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం చట్టం కింద ఐదేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది. దోషులది ఆవేశపూరిత చర్య ఎంత మాత్రం కాదని, పక్కా ప్రణాళిక ప్రకారం బాంబు పేలుళ్లకు పాల్పడ్డారని న్యాయస్థానం స్పష్టం చేసింది. భారీగా ప్రజల ప్రాణాలు తీసి దేశంలో అలజడి సృష్టించేందుకు కుట్ర పన్నారనేందుకు తగిన ఆధారాలున్నాయని తెలిపింది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలన్న లక్ష్యంతో కుట్రపూరితంగా వ్యవహరించారనేందుకు సైతం ప్రాసిక్యూషన్ తగిన ఆధారాలను చూపగలిగిందని స్పష్టం చేసింది. దోషులు అత్యంత హేయమని చర్యలకు పాల్పడ్డారని, అందువల్ల ఈ కేసును అత్యంత అరుదైన కేసుగా భావిస్తూ దోషులిద్దరికీ ఉరిశిక్ష విధిస్తున్నట్లు తెలిపింది. దర్యాప్తు సంస్థ తమను ఈ కేసులో ఉద్దేశపూర్వకంగా ఇరికించిందన్న దోషుల వాదనకు ఆధారాలు లేవని తేల్చింది. అలాగే ఈ దోషులకు ఢిల్లీలో ఆశ్రయం కల్పించిన తారీఖ్ అంజూమ్ ఎహసాన్‌ను సైతం దోషిగా నిర్ధారిస్తున్నట్లు తెలిపింది. ఇందుకు అతనికి జీవిత ఖైదు విధిస్తున్నట్లు స్పష్టం చేసింది. నిర్ధోషులుగా తేల్చిన షాదిక్ ఇష్రార్ షేక్, ఫరూక్ షర్ఫూద్దీన్ తర్ఖాష్‌కు బాంబు పేలుళ్లతో సంబంధం ఉందని నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని తెలిపింది. ఈ మేరకు రెండో అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి టి.శ్రీనివాసరావు సోమవారం సాయంత్రం సంచలన తీర్పు వెలువరించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న రియాజ్ బత్కల్, ఇక్బాల్ బత్కల్, అమీర్ రజాఖాన్ పరారీలో ఉన్నారు. ఈ ముగ్గురిపై ఉన్న కేసును విడగొట్టి మిగిలిన వారిపై న్యాయస్థానం విచారణ జరిపి ఈ తీర్పు వెలువరించింది. ఘటన జరిగిన 11 ఏళ్ల తరువాత కేసులో తీర్పు వెలువడటం విశేషం. తీర్పు నేపథ్యంలో చర్లపల్లి జైలు పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. అలాగే తీర్పు వెలువరించిన జడ్జి శ్రీనివాసరావు ఇంటి పరిసర ప్రాంతాల్లో కూడా మఫ్టీలో పోలీసులను ఏర్పాటు చేశారు. కాగా కోర్టు తీర్పుపై హైకోర్టుకు అప్పీలుకు వెళ్తామని నిందితుల తరుఫు న్యాయవాది గందం గురుమూర్తి పేర్కొన్నారు. ఉరిశిక్షపై హైకోర్టు నిర్ణయం... అనీక్, ఇస్మాయిల్ చౌదరిలకు విధించిన ఉరిశిక్షను హైకోర్టు ఖరారు చేయాల్సి ఉంటుంది. కింది కోర్టు తీర్పును హైకోర్టు ఖరారు చేసేంత వరకు ఉరిశిక్ష అమలుకు అవకాశమే లేదు. ఉరిశిక్ష తీర్పు వెలువరించిన జడ్జి తానిచ్చిన తీర్పుతో పాటు ఈ కేసుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను హైకోర్టుకు పంపుతారు. ఉరిశిక్ష వ్యవహారాల్లో తన ముందుకు వచ్చిన కేసులపై హైకోర్టు విచారణ జరుపుతుంది. దీనిని రెఫర్ ట్రయిల్ అంటారు. అలాగే కింది కోర్టు తీర్పుపై దోషులు హైకోర్టును ఆశ్రయించవచ్చు. రెఫర్ ట్రయిల్‌తో పాటు దోషులు దాఖలు చేసే అప్పీళ్లపై హైకోర్టు ఏక కాలంలో విచారణ జరుపుతుంది. తెలిసి చేయలేదు.. రోబోల్లా పనిచేశారు... శిక్ష ఖరారుకు ముందు అనీక్, ఇస్మాయిల్ చౌదరిల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. వీరిద్దరూ తెలిసి బాంబు పేలుళ్లకు పాల్పడలేదని, రోబోల్లా తమకు అప్పగించిన పనిని పూర్తి చేశారని వివరించారు. ఉద్దేశపూర్వకంగా వ్యవహరించలేదన్నారు. అయితే ఈ వాదనను జడ్జి తోసిపుచ్చారు. ఈ వాదన ద్వారా దోషులు తమ నేరాన్ని అంగీకరించినట్లయిందన్నారు. దోషులిద్దరూ రోబోలైతే, వారిని ఎవరు నడిపించారో వారి వివరాలిస్తే సరిపోతుందన్నారు. అనంతరం దోషులు కూడా వ్యక్తిగతంగా తమ వాదనను కోర్టు ముందుంచారు. పోలీసులు తప్పుడు కేసులో ఇరికించారని అనీక్ తెలిపాడు. పేలుళ్లతో తనకు ఏ మాత్రం సంబంధం లేదన్నాడు. ఇస్మాయిల్ చౌదరి స్పందిస్తూ.. తనకు భార్య, బిడ్డలు ఉన్నారని, తన తల్లి కేన్సర్‌తో బాధపడుతోందని తెలిపాడు. వారి బాగోగులు చూడాల్సిన బాధ్యత తనపై ఉందని నివేదించాడు. గత పదేళ్లుగా జైలులో ఉన్నానని, ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని తనపై కరుణ చూపాలని కోర్టును అభ్యర్థించాడు. వీరి వల్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయి... అంతకు ముందు ప్రాసిక్యూషన్ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె.సురేంద్ర వాదనలు వినిపిస్తూ, దోషుల వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయని తెలిపారు. 44 కుటుంబాలు విచ్ఛినమయ్యాయన్నారు. బాంబు పేలుళ్ల వల్ల గాయపడిన వారు ఇప్పటికీ కోలుకోలేదని, బాధను అనుభవిస్తూనే ఉన్నారన్నారు. శిక్ష నుంచి తప్పించుకునేందుకు దోషులు కట్టుకథలు చెబుతున్నారని, వాటిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని వివరించారు. ఒకరిని హత్య చేస్తేనే న్యాయస్థానాలు ఉరిశిక్ష విధిస్తున్నాయని, 44 మందిని పొట్టనపెట్టుకున్న దోషులకూ అదే సరైన శిక్షని ఆయన విన్నవించారు. ఇదీ జరిగింది... 2007, డిసెంబర్ 25న లుంబనీ పార్క్, గోకుల్ చాట్లలో వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. పేల్చేందుకు దిల్సుఖ్నగర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి వద్ద పెట్టిన బాంబును పోలీసులు నిర్వీర్యం చేశారు. లుంబినీ పార్క్ పేలుడులో 12 మంది మరణించగా, 21 మంది గాయపడ్డారు. గోకుల్‌చాట్‌లో జరిగిన పేలుళ్లలో 32 మంది మృతి చెందగా, 47 మంది గాయాలపాలయ్యారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసుల్లో కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు 1,195 పేజీల చార్జిషీట్‌ను దాఖలు చేశారు. నిందితులకు సహాయ సహకారాలు అందించిన తారీఖ్ అంజూమ్ ఎహసాన్ పాత్రపై అనుబంధ చార్జిషీట్ దాఖలు చేశారు. లుంబినీపార్క్ కేసులో 98 మందిని, గోకుల్‌చాట్ కేసులో 147 మంది, దిల్సుఖ్నగర్ కేసులో 46 మందిని సాకు‡్ష్యలుగా చూపారు. -
దశాబ్దం తర్వాత శిక్షలు
హైదరాబాద్‌తోపాటు దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతి పరిచిన గోకుల్‌చాట్, లుంబినీ పార్కు జంట పేలుళ్ల కేసులో ఇద్దరు నిందితులు అనిక్ షఫీక్ సయీద్, మహమ్మద్ అక్బర్ ఇస్మాయిల్‌కు ఉరిశిక్ష విధిస్తూ సోమవారం ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. ఇదే కేసులో నిందితులుగా ఉండి తప్పించుకు తిరుగుతున్న రియాజ్ భత్కల్, అతని సోదరుడు ఇక్బాల్ భత్కల్‌లకు ఆశ్రయమిచ్చిన మరో నింది తుడు తారిక్ అంజుమ్‌కు యావజ్జీవ శిక్ష విధించింది. మరో ఇద్దరు నిందితులు నిర్దోషులని న్యాయ స్థానం ప్రకటించింది. 44మంది అమాయకులను పొట్టనబెట్టుకుని, 77మందిని తీవ్రంగా గాయపరి చిన ఈ జంట పేలుళ్ల ఉదంతాలు జరిగి పదకొండేళ్లు దాటింది. ఇండియన్ ముజాహిదీన్(ఐఎం) ఉగ్రవాదులు మహారాష్ట్రలోని పుణేలో ఈ దారుణానికి పథక రచన చేశారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. దిల్‌సుఖ్‌నగర్‌లో సైతం బాంబు పేలుడుకు కుట్ర పన్నినా అదృష్టవశాత్తూ బాంబుకున్న టైమర్ సరిగా పనిచేయకపోవడంతో అక్కడ పెను విషాదం తప్పింది. ఇప్పుడు దోషులిద్దరికీ పడిన ఉరిశిక్షను హైకోర్టు ఖరారు చేయాల్సి ఉంటుంది. అక్కడ వచ్చే ఫలితాన్నిబట్టి రాజ్యాంగం ప్రకారం వారికి ఇతరత్రా మార్గాలు అందుబాటులో ఉంటాయి. చివరికి ఏం జరుగుతుందన్న సంగతి అలా ఉంచి ఈ పేలుళ్ల కేసు దర్యాప్తులో ఎడతెగని జాప్యం చోటు చేసుకున్న తీరు మన పోలీసు యంత్రాం గం సమర్ధతను ప్రశ్నిస్తుంది. ఏమాత్రం సంబంధం లేని అమాయకులను లక్ష్యంగా చేసుకుని కేవలం ఉన్మాదంతో ఇంత దారుణానికి ఒడిగట్టినవారిని వెన్నాడి సత్వరం పట్టుకోగలిగితే, వారిపై పకడ్బందీ సాక్ష్యాధారాలతో కేసులు పెట్టగలిగితే న్యాయస్థానాల పని సులువవుతుంది. అక్కడ కూడా త్వరగా విచారణ ముగిసి శిక్షలు పడతాయి. అది నేరగాళ్ల వెన్నులో వణుకు పుట్టిస్తుంది. అలాంటి నేరం చేయ డానికి మరెవరూ సాహసించరు. ఉగ్రవాద ముఠాల ఆట కడుతుంది. విషాదమేమంటే ఇవన్నీ సక్ర మంగా సాగటం లేదు. ఈ జంట పేలుళ్ల కేసులో దాదాపు వందమంది అనుమానితులను అదుపులోకి తీసుకున్న ప్రత్యేక దర్యాప్తు బృందం ఎన్నో నెలలపాటు కాస్తయినా పురోగతి సాధించలేక పోయింది. ఈలోగా రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్ దేశం సరిహద్దులు దాటి పాకిస్తాన్ పరారయ్యారు. ఈ జంట పేలుళ్ల ఉదంతాలు ఎందరికో గర్భశోకం మిగిల్చాయి. ఆప్తులను పోగొట్టుకున్నవారు, అనాథలైనవారు ఎందరో! సజావుగా బతుకుబండి ఈడుస్తున్నవారూ, జీవితంలో ఒక స్థాయికి ఎది గివచ్చిన పిల్లలు, మరికొన్ని రోజుల్లో ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లదల్చుకున్నవారు... ఇలా ఎందరెందరో ఈ పేలుళ్లకు బలయ్యారు. లుంబినీ పార్క్‌లో లేజర్ షో చూడటానికొచ్చినవారు, గోకుల్‌చాట్‌లో అల్పాహారం తిందామని వచ్చినవారితోపాటు ఆ రోడ్డు పక్కనుంచి నడిచి వెళ్తున్న వారు సైతం పేలుళ్లకు బలయ్యారు. ఈ ఉదంతాల్లో గాయపడిన కుటుంబాలవారిది మరో రకం విషాదం. నిన్నటివరకూ ఎంతో చురుగ్గా, సమర్ధవంతంగా పనిచేస్తూ తలలో నాలుకలా మెలగిన వారు శాశ్వత అంగవైకల్యంతో, కదల్లేని స్థితిలో, అయినవారిని గుర్తుపట్టలేని స్థితిలో పడటం తీరని దుఃఖాన్ని మిగులుస్తుంది. ఈ కుటుంబాలు తమవారిని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావాలన్న ఆశతో లక్షలాది రూపాయలు వెచ్చించాయి. ఎన్నో కుటుంబాలు ఆ క్రమంలో ఉన్న ఆస్తుల్ని కూడా పోగొట్టుకున్నాయి. అప్పులపాలయ్యాయి. కొందరు క్షతగాత్రులు తాము కూడా చనిపోయి ఉంటే బాగుండేదని వివిధ చానెళ్ల ముందు వాపోయారంటే వారు పడిన కష్టాలు ఎటువంటివో అర్ధమ వుతుంది. ఆ కుటుంబాలు చెబుతున్న ప్రకారం వారికి ప్రభుత్వాల నుంచి కూడా తగిన ఆసరా లభిం చటం లేదు. ఇది అత్యంత ఘోరం. ఉగ్రవాదుల ఉద్దేశం ప్రజల్లో భయోత్పాతం సృష్టించి, సమాజాన్ని కల్లోలపరచడం. ప్రభు త్వాలు ఇలాంటి ఉన్మాద ముఠాల కార్యకలాపాల గురించి, వారి పోకడల గురించి ప్రజల్లో అవ గాహన కల్పించటంతోపాటు పటì ష్టమైన నిఘా, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తే ఉగ్రవాదుల ఎత్తుగడలు విఫలమవుతాయి. పేలుళ్ల కోసం ఉగ్రవాదులు సాధారణంగా జనసమ్మర్థంగల ప్రాంతా లను ఎంచుకుంటారు. కనుక అలాంటి ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా అవసరమవుతుంది. హైదరాబాద్ నగరంలో దిల్సుఖ్నగర్ ప్రాంతాన్ని ఉగ్రవాదులు మూడుసార్లు లక్ష్యంగా ఎంచుకుంటే 2002, 2007 సంవత్సరాల్లో ఏదో ఒక కారణం వల్ల వారు విఫలమయ్యారు. కానీ 2013లో అక్కడ రెండు బాంబులు పేలి 17మంది చనిపోయారు. 130 మందికిపైగా గాయపడ్డారు. ఆ ఘటన తర్వాత తాము ముందస్తు హెచ్చరికలు చేశామని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రకటించింది. ప్రభుత్వ యంత్రాం గాల్లో కనబడే ఇటువంటి నిర్లక్ష్యమే నేరగాళ్లకు వరమవుతోంది. ఉగ్రవాదులు ఏదీ చెప్పి చేయరు. కానీ ప్రభుత్వ యంత్రాంగంతోపాటు జనంలో కూడా తగినంత అప్రమత్తత ఉంటే వీరి కుట్రలను వమ్ము చేయటం ఎంతో సులభం. సమాజంలో అరాచకం ప్రబలకుండా, సంక్షోభాలు తలెత్తకుండా, అమాయకుల ప్రాణాలు బలికాకుండా చూడటం రాజ్యం మౌలిక బాధ్యత. తమకు రక్షణ లభిస్తుం దని, తమ జీవనం సజావుగా సాగుతుందని ఆశించే పౌరుల్లో ఉగ్రవాద ఉదంతాలు అపనమ్మకాన్ని, అవిశ్వాసాన్ని కలిగిస్తాయి. ఆ దుస్థితి తలెత్తకుండా ఉండాలంటే రెప్పవాల్చని నిఘా అవసరం. లుంబినీ పార్క్ పేలుళ్ల ఉదంతంలో ఒక ఉగ్రవాది బ్యాగ్‌తో పాటు వచ్చి కూర్చోవటం, దాన్ని అక్కడ వదిలి వెళ్లడం యాదృచ్ఛికంగా ఒక విద్యార్థి గమనించి పేలుళ్ల తర్వాత అతగాడి రూపురేఖలపై సమాచారమిచ్చాడు. మరికొందరు సాక్షులు కూడా నిందితులను గుర్తుపట్టగలిగారు. కనుకనే ఇప్పుడీ శిక్షలు సాధ్యమయ్యాయి. ఈ పేలుళ్ల ఉదంతం నుంచి తగిన గుణపాఠాలు తీసుకుని మరె ప్పుడూ ఇలాంటివి జరగకుండా చూడటమే ప్రాణాలు కోల్పోయినవారికి నిజమైన నివాళి అవు తుంది. క్షతగాత్రులైనవారి కుటుంబాలను కూడా ఆర్థికంగా ఆదుకుని, ఆ కుటుంబాల్లో అర్హులైన వారికి ఉపాధి కల్పించటం తమ బాధ్యతని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. వారికి అన్నివిధాలా ఆసరాగా నిలబడాలి. -
జంట పేలుళ్ల కేసు: దోషులకు ఉరి శిక్ష
-
జంట పేలుళ్ల కేసు: దోషులకు మరణ దండన
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ జంట బాంబు పేలుళ్ల కేసులో దోషులకు ప్రత్యేక న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది. ఇద్దరు దోషులకు మరణశిక్ష, ఒకరికి యావజ్జీవకారాగార శిక్ష విధించింది.ఈ మేరకు చర్లపల్లి కారాగార ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు సోమవారం సాయంత్రం తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ఏ1, ఏ2లుగా ఉన్న అనీఖ్ షఫీఖ్ సయీద్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరిలకు రూ.10వేల జరిమానతో పాటు మరణ దండన విధించింది. ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చిన ఐదో నిందితుడైన మహ్మద్ తారీఖ్ అంజుమ్‌కు జీవిత ఖైదు విధించింది. గత మంగళవారం ఈకేసుపై తీర్పు వెలువరించిన కోర్టు ఇద్దరు నిందితులను దోషులగా.. మరో ఇద్దరిని నిర్ధోషులగా ప్రకటించిన విషయం తెలిసిందే. దోషులకు విధించే శిక్ష, ఐదో నిందితుడిపై తుది తీర్పు నేడు వెల్లడిస్తామని ప్రకటించింది. దీనిలో భాగంగా సోమవారం చర్లపల్లి కేంద్ర కారాగారం ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డెజిగ్నేటెడ్ న్యాయస్థానం నిందితులకు మరణ శిక్ష విధించింది. ఈ కేసులో 11 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత న్యాయస్థానం తీర్పు చెప్పింది. 8 మంది నిందితుల్లో ఇద్దరిని మాత్రమే దోషులుగా తేల్చింది. సూత్రధారులై న రియాజ్‌భత్కల్, ఇక్బాల్ భత్కల్, అమిర్ రజా ఖాన్లు పరారీలో ఉండటంతో వారిపై విచారణ ఇంకా మొదలు కాలేదు ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాద సంస్థ ఈ ఘాతుకానికి పాల్పడింది. ఈ కేసులో మొత్తం 8 మంది ఉగ్రవాదులను నిందితులుగా పేర్కొనగా అమీర్ రజాఖాన్, రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్ పరారీలో ఉన్నారు. మిగిలిన ఐదుగురు నిందితుల (అనీఖ్ షఫీఖ్ సయీద్, సాదిక్ ఇష్రార్ షేక్, ఫారూఖ్ సర్ఫుద్దీన్ తర్ఖా ష్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరి, మహ్మద్ తారీఖ్ అంజుమ్ ఎహసాన్)పై విచారణ జరిగింది. వీరిలో సాదిక్ ఇష్రార్ షేక్, ఫారూఖ్ సర్ఫుద్దీన్ తర్ఖాష్‌లను దోషులుగా తేల్చాడానికి ఆధారాలు లేకపోవడంతో నిర్దోషులుగా ప్రకటిస్తూ వారిపై ఉన్న అభియోగాలను కొట్టేసింది. 2007 ఆగస్టు 25న నగరంలో జరిగిన ఈ జంట పేలుళ్లలో 44 మంది ప్రాణాలు కోల్పోగా.. 77 మంది గాయపడ్డారు. -
జంట పేలుళ్ల కేసు.. మరో నిందితుడు దోషే
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని గోకుల్‌చాట్, లుంబినీ పార్కు జంట బాంబుపేలుళ్ల కేసులో మరో నిందితుడిని సైతం కోర్టు దోషిగా తేల్చింది. గత మంగళవారం ఈకేసుపై తీర్పు వెలువరించిన కోర్టు ఇద్దరు నిందితులను దోషులగా.. మరో ఇద్దరిని నిర్ధోషులగా ప్రకటించిన విషయం తెలిసిందే. దోషులకు విధించే శిక్ష, ఐదో నిందితుడిపై తుది తీర్పు నేడు వెల్లడిస్తామని ప్రకటించింది. దీనిలో భాగంగా సోమవారం చర్లపల్లి కేంద్ర కారాగారం ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డెజిగ్నేటెడ్ న్యాయస్థానంలో జరిగిన విచారణలో ఐదో నిందితుడైన మహ్మద్ తారీఖ్ అంజుమ్ ఎహసాన్‌ను సైతం కోర్టు దోషిగా తేల్చింది. అతను ఢిల్లీలో ఉగ్రవాదులకు ఆశ్రయిమిచ్చాడని విచారణలో రుజువైంది. తారీఖ్ అంజూమ్‌తో పాటు దోషులు ఇస్మాయిల్ చురి, అనీఖ్ షఫీఖ్‌లకు కోర్టు మరికాసేపట్లో శిక్ష ఖరారు చేయనుంది. ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాద సంస్థ ఈ ఘాతుకానికి పాల్పడింది. ఈ కేసులో మొత్తం 8 మంది ఉగ్రవాదులను నిందితులుగా పేర్కొనగా అమీర్ రజాఖాన్, రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్ పరారీలో ఉన్నారు. మిగిలిన ఐదుగురు నిందితుల (అనీఖ్ షఫీఖ్ సయీద్, సాదిక్ ఇష్రార్ షేక్, ఫారూఖ్ సర్ఫుద్దీన్ తర్ఖా ష్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరి, మహ్మద్ తారీఖ్ అంజుమ్ ఎహసాన్)పై విచారణ జరిగింది. వీరిలో సాదిక్ ఇష్రార్ షేక్, ఫారూఖ్ సర్ఫుద్దీన్ తర్ఖాష్‌లను దోషులుగా తేల్చాడానికి ఆధారాలు లేకపోవడంతో నిర్దోషులుగా ప్రకటిస్తూ వారిపై ఉన్న అభియోగాలను కొట్టేసింది. 2007 ఆగస్టు 25న నగరంలో జరిగిన ఈ జంట పేలుళ్లలో 44 మంది ప్రాణాలు కోల్పోగా.. 77 మంది గాయపడ్డారు. చదవండి: ఇద్దరు దోషులు.. ఇద్దరు నిర్దోషులు -
పేలుళ్ల తర్వాతా మరో ఆపరేషన్‌కు కుట్ర!
సాక్షి, హైదరాబాద్: ఇద్దరు అనుచరులతో వచ్చి నగరంలో భారీ పేలుళ్లకు పాల్పడ్డాడు. 45 మందిని పొట్టనపెట్టుకోవడంతోపాటు మరెందరినో క్షతగాత్రులుగా మార్చాడు. ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టిన తర్వాత కొన్నేళ్లపాటు నగరానికే కాదు చుట్టుపక్కల ప్రాంతాలకు రావడానికి, తన అనుచరుల్ని పంపడానికి ఎవరూ సాహసించరు. అయితే, ఇండియన్ ముజాహిదీన్(ఐఎం) మాస్టర్ మైండ్ రియాజ్ భత్కల్ తీరే వేరు. 2007 ఆగస్టు 25న గోకుల్‌చాట్, లుంబినీపార్క్‌ల్లో జంట పేలుళ్లకు పాల్పడిన అతడు మరో ఆపరేషన్ నిమిత్తం 2008 ఫిబ్రవరిలో ఒక అనుచరుడిని సిటీకి పంపాడు. 2009లో అరెస్టులపర్వంతో అది ఆగిపోయింది. జంట పేలుళ్ల కేసులో దోషులుగా తేలిన ఐఎం ఉగ్రవాదులు అనీఖ్ షఫీద్ సయ్యద్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరిలకు కోర్టు నేడు(సోమవారం) శిక్ష ఖరారు చేయనుంది. ఈ కేసులకు సంబంధించి ఫారూఖ్, సాదిఖ్ షేక్‌లపై అభియోగాలు కొట్టేసింది. మరో కీలక నిందితుడు, బీహార్‌లోని నలందా ప్రాంతానికి చెందిన సివిల్ ఇంజనీర్ తారీఖ్పై సోమవారం నిర్ణయం తీసుకోనుంది. ఈ పరిణామాల నేపథ్యంలో పోలీసులు చర్లపల్లి కేంద్ర కారాగారం వద్ద పటిష్ట భద్రత, బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఐఎం నేతృత్వంలో రియాజ్ భత్కల్ సూత్రధారిగా 2013లో దిల్‌సుఖ్‌నగర్‌లోని ఏ–1 మిర్చ్ సెంటర్, 107 బస్టాపుల్లోనూ పేలుళ్లు జరిగాయి. ఈ కేసుల్లో దోషులుగా తేలిన ఉగ్రవాదులకు ఆ ఏడాది డిసెంబర్ 19న న్యాయస్థానం ఉరి శిక్ష విధించింది. ఆ రోజు కూడా సోమవారమే కావడం గమనార్హం. డాక్టర్నే ట్రాప్ చేసిన రియాజ్ మహారాష్ట్ర అహ్మద్‌నగర్‌లోని రోహరీ జిల్లాకు చెందిన అన్వర్ అబ్దుల్లా ఘనీ భగ్వార్ పూనెలోని ససూన్ హాస్పిటల్‌కు చెందిన బీజే మెడికల్ కాలేజీ నుంచి 2006లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఐఎంకు చెందిన ఆసిఫ్ బషీరుద్దీన్ షేక్ ప్రోద్బలంతో ఉగ్రవాదం వైపు ఆకర్షితుడయ్యాడు. రియాజ్ భత్కల్‌కు కీలక అనుచరుడిగా మారాడు. అన్వర్‌ను రియాజ్ భత్కల్ హైదరాబాద్‌కు పంపి మరో ఆపరేషన్ చేపట్టాలని కుట్రపన్నాడు. ఇందులో భాగంగా 2008 ఫిబ్రవరిలో మెడిసిన్‌లో ఎండీ చేయడానికంటూ అన్వర్‌ను పూనె నుంచి హైదరాబాద్ పంపాడు. నదీంకాలనీలో అన్వర్ ప్రాక్టీసు నిర్వహిస్తుండగానే 2008 సెప్టెంబర్‌లో ముంబై పోలీసులు 20 మంది ఐఎం ఉగ్రవాదులను అరెస్టు చేశారు. విచారణలో హైదరాబాద్ పేలుళ్లతోపాటు అన్వర్ విషయం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లోనే ఉన్న అన్వర్‌ను ముంబై పోలీసులు ప్రశ్నించి విడిచిపెట్టారు. ఆ తర్వాత ఆధారాలు లభించడంతో 2009 జనవరిలో అరెస్టు చేశారు. -
ప్రాణం ఖరీదు రూ.888!
సాక్షి, హైదరాబాద్: నగరంలో ‘జంట పేలుళ్ల ’కోసం ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) మాస్టర్‌మైండ్ రియాజ్ భత్కల్ ఖర్చు చేసింది ఎంతో తెలుసా..? అక్షరాల రూ.40 వేలు మాత్రమే. గోకుల్‌చాట్, లుంబినీపార్క్ పేలుళ్లతో పాటు దిల్‌సుఖ్‌నగర్‌లో దొరికిన పేలని బాంబు ఆపరేషన్ వెనుక ఉన్న విషయమిది. 2007 ఆగస్టు 25న చోటు చేసుకున్న ఈ రెండు పేలుళ్లు 45 మందిని పొట్టనపెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ లెక్కన సరాసరిన ఒక్కో హత్యకు వీరు రూ.888 చొప్పున ఖర్చు చేశారు. హైదరాబాద్ పేలుళ్ల తర్వాత వీరందరూ ఈ కుట్ర పురుడుపోసుకున్న పుణేలోని అశోక మీవ్స్ అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నారు. అక్కడ ఉంటూనే ఆ నగరంలో కొన్ని కిడ్నాప్‌లు చేయడం ద్వారా ‘మాల్ ఏ ఘనీమఠ్’ సంపాదించాలని కుట్రపన్నారు. మంగళవారం దోషులుగా తేలిన అనీఖ్ షఫీద్ సయ్యద్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరిల వాంగ్మూలాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అనీఖ్‌కు ఇచ్చింది రూ.20 వేలు... పాతబస్తీలోని మక్కా మసీదు పేలుళ్లకు ప్రతీకారంగా నగరాన్ని టార్గెట్ చేయాలని భావించిన రియాజ్ భత్కల్ తన అనుచరుడు అనీఖ్‌ను హైదరాబాద్ పంపాలని నిర్ణయించుకున్నాడు. తొలుత ఫారూఖ్ బంధువైన నవీద్‌ను కలిసి, కంప్యూటర్ శిక్షణ కోసం వచ్చినట్లు చెప్పాలని సూచించాడు. ఆగస్టు 1న అతడికి రూ.20 వేలు ఇచ్చి పంపాడు. సరూర్‌నగర్‌లోని నవీద్ ఇంట్లో కొన్ని రోజులు ఉన్న అనీఖ్ అక్కడి నుంచి పుణే వెళుతున్నట్లు చెప్పి నాంపల్లిలోని ఓ లాడ్జిలో బస చేశాడు. అయితే దాని అద్దె రోజుకు రూ.250 వరకు ఉండటంతో మరుసటి రోజే అజీజియా లాడ్జికి మకాం మార్చాడు. తన పేరు సతీష్ గౌక్వాడ్‌గా చెప్పుకుని రూ.120 అద్దెతో గది తీసుకున్నాడు. ఇక్కడ ఉంటూనే హబ్సిగూడ బంజారా నిలయంలోని ఫ్లాట్ నం.302లో దిగేందుకు యజమానితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. నెలకు రూ.4 వేల అద్దె చెల్లించేందుకు అంగీకరించి రూ.12 వేలు అడ్వాన్స్‌గా ఇచ్చాడు. అక్బర్ తెచ్చింది మరో రూ.6 వేలు... ఫ్లాట్ అద్దెకు తీసుకున్న అనీఖ్ ఈ విషయాన్ని పబ్లిక్ ఫోన్ ద్వారా రియాజ్‌కు చేరవేయడంతో ఆగస్టు 8న అక్బర్‌ను నగరానికి పంపిన రియాజ్... ఖర్చుల కోసం రూ.6 వేలు ఇచ్చాడు. అనీఖ్, అక్బర్ అమీర్‌పేటలోని ధూమ్ టెక్నాలజీస్‌లో హార్డ్‌వేర్ నెట్ వర్కింగ్ కోర్సులో చేరి రూ.5 వేలు చెల్లించారు. అక్బర్.. వినోద్ పాటిల్ పేరుతో చెలామణి అయ్యాడు. భత్కల్ ఆదేశాల మేరకు అనీఖ్ రూ.4 వేలతో కోఠిలో టీవీ కొనుగోలు చేశాడు. రియాజ్ భత్కల్ బంజారా నిలయానికి వచ్చిన తర్వాత అతడి సూచనల మేరకు సికింద్రాబాద్‌లోని రూ.360 వెచ్చించి మూడు బ్యాగులు కొన్నారు. ఆగస్టు 1 నుంచి 27 మధ్య (పేలుళ్ల తర్వాతా ఫ్లాట్‌లోనే రెండు రోజులు ఉన్నాడు) భత్కల్ రెండుసార్లు వచ్చిపోవడానికి, బాంబుల తయారీ, ఇతర ఖర్చులకు మరో రూ.14 వేలు వెచ్చించినట్లు అనీఖ్, అక్బర్ చెప్పుకొచ్చారు. ఇలా మొత్తమ్మీద జంట పేలుళ్ల ఆపరేషన్ పూర్తి చేయడానికి రియాజ్ వెచ్చించింది రూ.40 వేలు. పేలుళ్ల అనంతరం ఆగస్టు 27న అనీఖ్ పుణేకు తిరిగి వెళ్లిపోయాడు. పుణేలో కిడ్నాప్‌లకు కుట్ర... పేలుళ్ల తర్వాత అనీఖ్, అక్బర్, రియాజ్ వేర్వేరుగా పుణే చేరుకున్నారు. ఆ తర్వాత రెండు రోజులకు పుణేలోని అశోక మీవ్స్ అపార్ట్మెంట్లో సమావేశం కాగా, రియాజ్ తన కుట్రను బయటపెట్టాడు. ఉగ్రవాద కార్యకలాపాలకు అవసరమైన డబ్బు (మాల్ ఏ ఘనీమఠ్) కోసం కిడ్నాప్‌లు చేయాలని చెప్పాడు. పుణేలోని ప్రముఖ నిర్మాణ, రియల్ ఎస్టేట్ సంస్థ లుంకడ్ బిల్డర్స్ యజమానిని తొలి టార్గెట్‌గా చేసుకున్నారు. అక్కడి విమాన్‌నగర్‌లో ఉన్న అతడి కార్యాలయం, క్యాంప్ ఏరియాలోని కౌన్సిల్ హాల్ ఔట్‌పోస్ట్‌ల వద్ద రెక్కీ చేసే బాధ్యతలను రియాజ్.. అనీఖ్, అక్బర్‌కే అప్పగించాడు. ఇతడితో పాటు రంక జ్యూవెలర్స్ యజమాని కుమారుడినీ టార్గెట్‌గా చేసుకుని గణేశ్ పేట్‌లోని అతడి కార్యాలయం, మార్షినగర్‌లోని ఇంటి వద్ద సైతం వీరితో రెక్కీ చేయించాడు. ఒక్కొక్కరి వెనుక పక్షం రోజుల పాటు రెక్కీలు చేయించిన రియాజ్ ఆపై హఠాత్తుగా వదిలేయాలంటూ చెప్పాడు. జంట పేలుళ్లతో పాటు పేలని బాంబు కేసులో అనీఖ్, అక్బర్లను మంగళవారం దోషులుగా నిర్ధారించిన న్యాయస్థానం వచ్చే సోమవారం శిక్ష ఖరారు చేయనుంది. -
వీళ్లంతా నాన్ లోకలే
సాక్షి, హైదరాబాద్: కొన్నేళ్ల క్రితం గోకుల్ చాట్, లుంబినీ పార్కుల్లో జరిగిన బాంబు పేలుడు ఘటనలు నగరాన్ని ఎంతలా కుదిపేశాయో అందరికీ తెలిసిందే. ఈ కేసుల్లో నిందితులుగా ఉన్న ఎనిమిది మంది నిందితుల్లో ఒక్కరూ స్థానికులు లేరు. అయితే వీరిలో నిందితులుగా ఉండి, అభియోగాలు వీగిపోయిన ఇద్దరు ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాదులకూ సిటీ, శివారు జిల్లాలతో లింకులు ఉన్నాయి. మరో కీలక ఉగ్రవాది నగరంలో ఎథికల్ హ్యాకింగ్ శిక్షణ తీసుకున్నాడు. ముంబైలోని అంథేరి ప్రాంతానికి చెందిన సాదిఖ్ ఇష్రార్ షేక్ బంధువులు సిటీలో ఉండగా.. పుణేలోని ఖాండ్వా ప్రాంతంలో ఉంటున్న ఫారూఖ్ సర్ఫుద్దీన్ షేక్ స్వస్థలం మహబూబ్‌నగర్ సమీపంలోని నారాయణ్‌పేట్. రెండు పేలిన బాంబు కేసుల్లో, ఓ పేలని బాంబు కేసుల్లో నిందితులుగా ఉన్న వీరిపై మంగళవారం అభియోగాలు వీగిపోయాయి. మిగిలిన ముగ్గురిలో అనీఖ్ షఫీఖ్ సయ్యద్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరిని కోర్టు దోషులుగా తేల్చింది. మరో నిందితుడు తారిఖ్ అంజుమ్ హసన్‌పై సోమవారం నిర్ణయం తీసుకోనుంది. అలాగే ఐఎం మీడియా సెల్ ఇన్చార్జి పీర్భాయ్.. ‘మక్కా’ పేలుడు సమయంలో నరగంలోనే కంప్యూటర్ శిక్షణ తీసుకుంటున్నాడు. మహ్మద్ సాదిక్ ఇష్రార్ షేక్ అలియాస్ యాసీర్ అలియాస్ ఇమ్రాన్ అంధేరిలోని సీఎంఎస్ కంప్యూటర్స్‌లో డెస్క్‌టాప్ ఇంజినీర్‌గా పనిచేస్తూ ఉగ్రవాద సంస్థ ఐఎంకు కో–ఫౌండర్, ఫెసిలిటేటర్‌గా వ్యవహరించాడు. ఐఎం సంస్థ జంట పేలుళ్లతో సహా 2005 ఫిబ్రవరి నుంచి దేశ వ్యాప్తంగా సృష్టించిన 11 విధ్వంసాల్లోనూ ఇతని పాత్ర ఉన్నట్లు దర్యాప్తు అధికారులు తేల్చారు. సాదిక్ కుటుంబం ఉత్తరప్రదేశ్‌లోని ఆజామ్ఘర్ నుంచి 40 ఏళ్ల క్రితం ముంబైకి వలస వచ్చింది. అక్కడి హబీబ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్లో ఐటీఐ పూర్తిచేసిన సాదిక్ అక్కడి గోద్రేజ్ కంపెనీలో చేరాడు. 2000లో దూరవిద్య ద్వారా బీఏ చదవడం కోసం హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్శిటీలో చేరాడు. ముంబై ఛత్రపతి శివాజీ టెర్మినల్ సమీపంలో ఉన్న అంజుమన్ ఇస్లామ్ హైస్కూల్లోని ఉర్దూ యూనివర్శిటీ సెంటర్‌కు హాజరయ్యేవాడు. 1996లో గోద్రేజ్ కంపెనీలో పనిచేస్తున్న కాలంలోనే స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) భావాలపట్ల ఆకర్షితుడై ఆ సంస్థలో చేరాడు. అప్పట్లో సిమిపై నిషేధం లేదు. చిత్తూరు జిల్లా పీలేరు నుంచి వలస వచ్చి ముంబైలోనే స్థిరపడ్డ అన్సార్‌తో కలిసి 1996–97ల్లో సిమి సమావేశాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. సిమి నిర్వహించే అనేక సమావేశాలకు రియాజ్ భత్కల్, అబ్దుల్ సుభాన్ ఖురేషీ అలియాస్ తౌఖీర్ సైతం హాజరయ్యేవారు. ఈ సంస్థ వ్యవహారాలను నిశితంగా పరిశీలించిన తరవాత సాదిక్ పునరాలోచనలో పడ్డాడు. సిమి సంస్థ కేవలం సమావేశాలు నిర్వహించడం మాత్రమే కాదని, మరెన్నో ‘వ్యవహారాలు’ సాగిస్తోందని తెలిసి ఆ సంస్థ సమావేశాలకు దూరంగా ఉండడం ప్రారంభించాడు. మలుపుతిప్పిన ముజాహిద్ పరిచయం హైదరాబాద్‌కు చెందిన ముజాహిద్ (2004లో మరణించాడు) పరిచయం సాదిక్ జీవితాన్ని పూర్తిగా ఉగ్రవాదం వైపు మళ్లించింది. ముజాహిద్, సాదిక్ షేక్‌ల మధ్య బంధుత్వం ఉంది. 2001 ఏప్రిల్‌లో ముజాహిద్ ముంబై వెళ్లిన సందర్భంలో సాదిక్‌తో పరిచయం ఏర్పడింది. ఇతని స్ఫూర్తితో సాదిక్ ఉగ్రవాదం వైపు మళ్లాడు. అప్పట్లో సాదిక్ షేక్‌ను ముజాహిద్ ముంబైలోని ఓ సైబర్‌కేఫ్‌కు తీసుకువెళ్లి ఓ ఈ–మెయిల్ ఐడీ రూపొందించి ఇచ్చాడు. ఈ మెయిల్‌ను క్రమం తప్పకుండా బ్రౌజ్ చేస్తూ ఉండమని, ఈ–మెయిల్ ద్వారానే ఓ వ్యక్తి పరిచయం అవుతాడని సాదిక్‌కు చెప్పాడు. అతడు చెప్పినట్లుగానే మూడు నెలల పాటు బ్రౌజ్ చేసిన అనంతరం ఓ వ్యక్తి నుంచి సాదిక్‌కు సందేశాలు రావడం మొదలయ్యాయి. కొంతకాలానికి తనను కలవాలంటూ సాదిక్‌కు ఆ వ్యక్తి మెయిల్ పంపాడు. దీనికి స్పందనగా ముంబైలోని చీతా క్యాంప్‌లో ఉన్న మదీనా హోటల్ వద్ద కలుద్దామంటూ సాదిక్ వర్తమానం పంపాడు. అనుకున్నట్లే వచ్చిన ఆ వ్యక్తి తన పేరును జహీర్‌గా చెప్పుకున్నాడు. అతనే ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఏర్పడటానికి కారణమైన కోల్‌కతాకు చెందిన అమీర్ రజా సోదరుడు ఆసిఫ్ రజా అని సాదిక్‌కు ఆ తరవాత తెలిసింది. ఎప్పటికీ వెనుకడుగు వేయనంటూ సాదిక్ నుంచి మాట తీసుకున్న ఆసిఫ్.. అతన్ని పూర్తిగా ఉగ్రవాదం వైపు మళ్లించాడు. అనీఖ్‌కు ‘రిఫరెన్స్’ ఇచ్చిన ఫారూఖ్ రియాజ్ ఆదేశాల మేరకు పేలుళ్లకు దాదాపు నెల రోజుల ముందు అనీఖ్ హైదరాబాద్‌కు బయలుదేరాడు. తన బంధువు రిఫరెన్స్ ఇచ్చిన వ్యక్తి ఫారూఖ్ షర్ఫుద్దీన్ తర్ఖాష్, మహబూబ్‌నగర్ సమీపంలోని నారాయణ్‌పేట్‌కు చెందిన ఫారూఖ్ కుటుంబం పూణేలోని క్యాంపు ఏరియాకు వలస వెళ్లింది. పూణేలో ఇతనితో కలిసి చదువుకున్న మాజిద్ ద్వారా అనీఖ్ షఫీఖ్ సయీద్ పరిచయమయ్యాడు. 2007 జూలైలో హైదరాబాద్‌లో ఓ పని నిమిత్తం వెళ్తున్నానని ఫారూఖ్‌తో చెప్పాడు. అక్కడ కొంత కాలం ఉండడానికి ఆశ్రయం కల్పించమని కోరాడు. దీంతో నారాయణ్‌పేట్ నుంచి వచ్చి సరూర్‌నగర్‌లో ఉంటున్న దూరపు బంధువు నవీద్ దగ్గరకు వెళ్లాల్సిందిగా ఫారూఖ్ సూచించి నవీద్ ఫోన్ నెంబర్ సైతం ఇచ్చి పంపాడు. అలా 2007 ఆగస్టు 1న ఇండియన్ ముజాహిదీన్ మాస్టర్‌మైండ్ రియాజ్ భత్కల్ ఆదేశాల ప్రకారం హైదరాబాద్ వచ్చిన అనీఖ్.. నవీద్ దగ్గర రెండు రోజులు ఆశ్రయం పొందాడు. ఆ తర్వాత హబ్సిగూడలోని స్ట్రీట్ నెం.8లోని బంజారా నిలయంలో ఫ్లాట్ అద్దెకు తీసుకున్నాడు. పీర్భాయ్ ఎథికల్ హ్యాకింగ్ కోర్స్ ఇండియన్ ముజాహిదీన్‌కు మీడియా సెల్ ఇన్చార్జిగా వ్యవహరించడంతో పాటు పేలుళ్లకు ముందు మీడియా సంస్థలకు ఈ–మెయిల్ పంపిన ఉగ్రవాది మన్సూర్ అస్ఘర్ పీర్భాయ్. పుణేకు చెందిన ఇతడు 2007లో కొన్నాళ్లు సిటీలో ఉన్నాడు. కంప్యూటర్ రంగంలో నిపుణుడైన ఇతడు రియాజ్ భత్కల్ ఆదేశాల మేరకు 2007లో సిటీకి వచ్చి ప్రత్యేక శిక్షణ పొందాడు. బంజారాహిల్స్‌లోని ఈ–2 ల్యాబ్స్ సంస్థ.. ఫార్చూన్ కత్రియ హోటల్లో ఆ ఏడాది మే 14 నుంచి 19 వరకు ఎథికల్ హ్యాకింగ్ కోర్సులో శిక్షణనిచ్చింది. దీనికి హాజరైన పీర్భాయ్.. అదే నెల 18న మక్కా మసీదులో పేలుడు జరిగినట్లు తెలుసుకుని అక్కడకు వెళ్లి చూశాడు. ఈ విషయాలను రియాజ్ భత్కల్‌కు వివరించాడు. ఈ నేపథ్యంలోనే భత్కల్ తదితరులు మక్కా పేలుడుకు ప్రతీకారంగా సిటీని టార్గెట్ చేశాడు. -
ఉగ్రవాదుల నేపథ్యం ఇదీ..
సాక్షి, సిటీబ్యూరో: పాతబస్తీలోని మక్కా మసీదు పేలుళ్లకు ప్రతీకారంగా జరిగిన గోకుల్‌చాట్, లుంబినీ పార్కు పేలుళ్లతో పాటు పేలని బాంబు కేసులో మొత్తం ఎనిమిది మందిని నిందితులుగా గుర్తించారు. వారి వ్యవహారాలు ఇవీ.. రియాజ్ భత్కల్ ఇతని స్వస్థలం కర్ణాటకలోని భత్కల్. గోకుల్‌ఛాట్‌లో బాంబు పెట్టిన వ్యక్తి. ఇండియన్ ముజాహిదీన్‌కు రెండో కమాండ్ ఇన్చార్జిగా వ్యవహరించాడు. పాకిస్తాన్‌లోని అమీర్ రజా ఆదేశాల ప్రకారం చేపట్టాల్సిన విధ్వంసాలకు పేలుడు పదార్థాలు, మనుషులు, డబ్బును ఏర్పాటు చేశాడు. దేశ వ్యాప్తంగా అనేక విధ్వంసాలకు సూత్రధారి. 2013 దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసులోనూ వాంటెడ్. ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఇతని సోదరుడైన ఇక్బాల్ భత్కల్ సైతం జంట పేలుళ్ల కేసులో నిందితుడు. మహ్మద్ అక్బర్ ఇస్మాయిల్ చౌదరి మహారాష్ట్రలోని పుణెకు చెందిన కంప్యూటర్ మెకానిక్. విధ్వంసకర్తలకు డ్రైవర్‌గా వ్యవహరించాడు. దిల్‌సుఖ్‌నగర్‌లోని ఫుట్ ఓవర్ బ్రిడ్జి దగ్గర బాంబు పెట్టాడు. మంగుళూరు నుంచి పేలుడు పదార్థాలను రవాణా చేశాడు. సూరత్‌లో దొరికిన బాంబులూ ఇతని పనే. ఇతడిపై నేరం నిరూపితమైంది. అమీర్‌పేటలోని ధూమ్ టెక్నాలజీస్‌లో కంప్యూటర్ కోర్సులో చేరేప్పుడు తన పేరు వినోద్ పాటిల్‌గా పేర్కొన్నాడు. అనీక్ షఫీక్ సయ్యద్ ఇతడి స్వస్థలం కూడా పుణె. లుంబినీ పార్కులో బాంబు పెట్టింది ఇతడే. రియాజ్ భత్కల్ మారిదిగానే ఇండియన్ ముజాహిదీన్‌లో సీనియర్ సభ్యుడు. పుణెలో కంప్యూటర్లు, మెబైల్స్ దుకాణం నిర్వహించేవాడు. ఇతడినీ న్యాయస్థానం దోషిగా ప్రకటించింది. ఫారూఖ్ షర్ఫుద్దీన్ తర్ఖాష్ పూణెలోని క్యాంప్ ఏరియాకు చెందిన వాడు. ‘టి క్యాప్షన్ ఔట్‌డోర్’ యాడ్ ఏజెన్సీ ఉద్యోగి. ఇండియన్ ముజాహిదీన్‌లో కీలక ఉగ్రవాది. జంట పేలుళ్ల కుట్రను అమలు చేయడానికి హైదరాబాద్ వస్తున్న అనీఖ్‌కు తన బంధువు నవీద్ దగ్గర సరూర్‌నగర్‌లో ఆశ్రయం కల్పించి నిందితుడిగా మారాడు. ఇతడిపై అభియోగాలు వీగిపోయాయి. సాదిక్ ఇష్రార్ షేక్ ముంబై అంధేరికి చెందిన ఇండియన్ ముజాహిదీన్ సహ వ్యవస్థాపకుడు. ఫెసిలిటేటర్‌గా వ్యవహరించాడు. విధ్వంసాల వ్యూహకర్తలకు, క్షేత్రస్థాయిలో పాలుపంచుకునే వారికి, ఈ–మెయిల్స్ పంపే వ్యక్తులకు మధ్య సంధానకర్త. జంట పేలుళ్లకు అవసరమైన సహకారం అందించాడు. ఇతడి పైనా అభియోగాలు వీగిపోయాయి. అమీర్ రజా ఖాన్ కోల్‌కతా వాసి. దేశవాళీ ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ ఏర్పాటుకు కీలకపాత్ర పోషించాడు. 2001లో కోల్‌కతాలోని అమెరికన్ కాన్సులేట్‌పై జరిగిన దాడి కేసులో నిందితుడు. ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంటూ ఇక్కడ ఉగ్రవాద చర్యలకు సహాయం చేస్తున్నాడు. జంట పేలుళ్లలోనూ ఇతని పాత్ర ఉంది. మహ్మద్ తారిఖ్ అంజుమ్ హసన్ బీహార్‌లోని నలంద ప్రాంతానికి చెందిన ఇతగాడు కర్ణాటకలోని భత్కల్‌లో సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. అదే వృత్తిలో ఉన్న ఇతడు 1998లో సిమీ సభ్యుడిగా మారాడు. 2001లో రియాజ్ ద్వారా ఐఎంలోకి ప్రవేశించాడు. అమీర్ రజాఖాన్ నేతృత్వంలో జరిగిన కోల్‌కతా ఎటాక్‌లోనూ కీలక పాత్ర పోషించాడు. ఐఎంలోని ‘టాప్ సిక్స్’లో ఒకడిగా, దుబాయ్ నుంచి ఫైనాన్సియర్‌గా వ్యవహరించాడు. కోర్టు ఇతడిపై సోమవారం తీర్పు వెలువరించనుంది. -
కదిలిస్తే కన్నీటి వరదే..
ఉప్పల్: లుంబిని పార్కు, గోకుల్ చాట్ దుర్ఘటన జరిగి 11 ఏళ్లు గడిచినా వారి కుటుంబ సభ్యులు నేటికీ ఆ పేరు గుర్తు చేస్తే ఉల్లిక్కి పడుతున్నారు. ఎవరిని కదలించినా కన్నీటి పర్యంతమవుతున్నారు. ఉప్పల్ శాంతినగర్‌కు చెందిన గాదే అంజయ్య, వెంకటలక్ష్మిల కూతురు స్రవంతి(14), చిన్నమ్మ సుశీల(30), అంజయ్య అన్న కూతురు శ్రీలేఖ(19)తో కలసి రాఖీ పౌర్ణమి సందర్భంగా రాఖీలు కొనేందుకు వెళ్లి షాపింగ్ అనంతరం గోకుల్ చాట్‌కు వెళ్లారు. వారు లోపల ఉండగానే బాబు పేలింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన సుశీల(30), శ్రీలేఖ(19), స్రవంతి(14) ప్రాణాలు కోల్పోయారు. ఆ రోజు నుంచి రాఖీ పౌర్ణమి వచ్చిందంటే వారు భయపడుతున్నారు. ఆలస్యమైనా కఠినశిక్ష పడాల్సిందే.. ‘ఆలస్యమైనా తప్పుచేసిన నిందితులకు మాత్రం కఠిన శిక్షపడితేనే మరణించిన వారి అత్మలకు శాంతి కలుగుతుంది. గత 11 సంవత్సరాలుగా నిందితులకు రాజభోగాలు అందించడం చూసి బాధేసింది. వారికోసం రూ. కోట్లు ఖర్చు చేసారు. మాకు మాత్రం పరిహారం ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మృతుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తానన్న మాటను ప్రభుత్వం దాటవేసింది. నింధితులను కోర్టుకు తీసుకు వచ్చినప్పుడల్లా రాజులా సెక్యూరిటీ మధ్యలో తీసుకువస్తుంటే బాధ పడ్డాం. బాధితులకు సత్వర న్యాయం జరగాలి. అయినా పర్వాలేదు.. బాద్యులందరినీ ఉరికంభం ఎక్కించాల్సిందే’ అని మృతురాలు స్రవంతి తండ్రి అంజయ్య డిమాండ్ చేశారు. ఆగస్టు అంటే భయమేస్తుంది.. ‘రాఖీ పండగ అంటే మా కుటుంబంలో భయంతో కూడిన విషాదం కనబడుతుంది. నేరాలు చేసినవారు రాజాలా బతుకుతున్నారు. మృతిచెందిన వారి కుటుంబాలే వారి జ్ఞాపకాలతో రోదిస్తున్నాయి. నిందితులకు అప్పటికప్పుడే శిక్ష వేయ్యాలే తప్పా 11 ఏళ్లుగా కేసులను నానబెట్టారు. ఏం సాదించింది.. కేవలం ఇద్దరికే శిక్ష ఖరా>రు చేసింది. విచారణ పేరుతో బాధితులను మభ్యపెడుతున్నారు. చాలా బాధగా ఉంది’ అని గోకుల్ చాట్ ఘటనలో మృతిచెందిన సుశీల సోదరి చంద్రకళ ఆవేదన చెందింది. ఇప్పటికీ సుశీల కుమారుడు సాయికుమార్ నిద్రలో భయంతో కలవరిస్తాడని కన్నీటి పర్యంతమైంది. -
ప్రతీకారేచ్ఛతోనే పేలుళ్లు
సాక్షి, హైదరాబాద్ : రాజధానిలో జంట బాంబు పేలుళ్లవెనుక ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాదుల ప్రతీకారేచ్ఛే కారణమని దర్యాప్తు అధికారులు తేల్చారు. హైదరాబాద్ పాతబస్తీ లోని మక్కా మసీదులో 2007 మే 18న జరిగిన బాంబు పేలుడుకు ఓ వర్గం వారే బాధ్యులని భావించిన ఐఎం ఉగ్రవాదులు అందుకు ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే 2007 ఆగస్టు 25న గోకుల్‌చాట్, లుంబినీ పార్కులో పేలుళ్లకు పాల్పడినట్లు నిర్ధారించారు. అదే రోజు దిల్‌సుఖ్‌నగర్‌లోని వెంకటాద్రి థియేటర్ సమీపంలో ఉన్న ఫుట్ఓవర్ బ్రిడ్జి సమీపంలో మరో బాంబును అమర్చినా అది పేలకపోవ డంతో పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలోని పుణేలో ఉన్న అశోక్ మీవ్స్ అపార్ట్మెంట్లో ఈ పేలుళ్లకు కుట్ర జరిగిందని నిందితులు బయటపెట్టారు. భారీ ప్రాణ నష్టమే లక్ష్యం... హుస్సేన్‌సాగర్ బోట్లో అనీఖ్, గోకుల్‌చాట్‌లో రియాజ్, దిల్‌సుఖ్‌నగర్‌లో అక్బర్ బాంబులు పేట్టాలన్నది పథకం. వాస్తవానికి సికింద్రాబాద్, అమీర్‌పేట్, చార్మినార్ సహా మరికొన్ని చోట్ల రెక్కీ చేసినా చివరకు రియాజ్ ఆదేశాలతో ఈ మూడింటినే టార్గెట్‌గా చేసుకున్నారు. భారీ ప్రాణ నష్టాన్ని సృష్టించాలని భావించిన రియాజ్ భత్కల్... నగరంలో మూడు బాంబులూ రద్దీ సమయమైన రాత్రి 7 గంటలకు కచ్చితంగా పేలేలా అనీఖ్, అక్బర్‌ల వాచీలను రీ–సెట్ చేయించాడు. టైమర్‌తో కూడిన షేప్డ్ బాంబుల్లో సరిగ్గా 6.45 గంటలకు బ్యాటరీలను పెట్టి, తమ టార్గెట్స్‌లో జన సమ్మర్థం ఉన్న చోట వదలాలని స్పష్టం చేశాడు. తమ దగ్గర ఉన్న సెల్ఫోన్లను ఫ్లాట్ నుంచి బయటకు వెళ్లే ముందు ఆపేయాలని, విధ్వంసం జరిగి ఫ్లాట్‌కు చేరుకున్నాకే వాటిని ఆన్‌చేయాలని చెప్పాడు. ఒకవేళ ముగ్గురిలో ఎవరైనా పట్టుబడితే పోలీసుల సమక్షంలోనే మిగిలిన ఇద్దరికీ ఫోన్ చేసి ‘బిగ్ బజార్‌కు రండి’అని చెప్పాలంటూ రియాజ్ కోడ్ ఏర్పాటు చేశాడు. ఇలా ఫోన్ వస్తే మిగిలిన వారు పారిపోవాలని స్పష్టం చేశాడు. తారుమారైన పరిస్థితులు... గోకుల్‌చాట్ వద్ద పేలుడుకు రియాజ్ భత్కల్ పథకం ప్రకారమే అక్కడి ఐస్‌క్రీమ్ డబ్బాపై బాంబు పెట్టి జారుకున్నా మిగిలిన ఇద్దరు మాత్రం పేలుళ్ల అమల్లో కంగారుపడ్డారు. హబ్సిగూడ నుంచి ఆర్టీసీ బస్సులో సికింద్రా బాద్‌కు వెళ్లిన అనీఖ్ అక్కడి నుంచి ఆటోలో లుంబినీ పార్కుకు చేరుకొని ఆటోడ్రైవర్‌కు రూ. 500 నోటు ఇవ్వగా అతడు చిల్లర లేదన్నాడు. దీంతో అక్కడే ఉన్న లేజర్ షో బుకింగ్ కౌంటర్లో టికెట్ కొని చిల్లర తెచ్చిచ్చాడు. కానీ ఆటో దిగే ముందే టైమర్‌ను ఆన్ చేయడంతో బాంబు యాక్టివేట్ అయి పోయింది. అయితే అప్పుడే షికారు బోటు హుస్సేన్‌సాగర్‌లోకి వెళ్లిపోవడం, మరొకటి బయలుదేరే వరకు తాను వేచి ఉండాల్సిన పరిస్థితి ఉండటం, ఈలోగా బాంబు పేలే ప్రమాదం నెలకొనడంతో తాను కొన్న టికెట్‌తో లేజర్ షో వద్దకు వెళ్లి బాంబు అమర్చి పరారయ్యాడు. మరోవైపు దిల్సుఖ్నగర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి సమీపంలో బాంబు పెట్టడానికి హబ్సిగూడలోని ఫ్లాట్ నుంచి సరిగ్గా సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరిన అక్బర్ ఇస్మాయిల్ చౌదరి బస్సు కోసం నిరీక్షించి అది రాకపోవడంతో ఆటోలో 6.20 గంటలకు అక్కడకు చేరుకున్నాడు. ఆ ప్రాంతమంతా జన సమ్మర్థంగా ఉన్నప్పటికీ బాంబు ఉన్న బ్యాగ్‌ను ఎక్కడ పెట్టాలో అతనికి అర్థంకాలేదు. ఆ ఆందోళనలోనే బాంబులో బ్యాటరీని హడావుడిగా పెట్టడంతో టైమర్ వాచ్ పని చేయకపోవడాన్ని గమనించినా... ఏమీ చేయలేక బ్యాగ్‌ను ఓ ద్విచక్ర వాహనానికి తగిలించి చివరకు ఫ్లాట్‌కు చేరుకున్నాడు. పేలుడు జరిగిన మర్నాడూ ముగ్గురు ఉగ్రవాదులు ఫ్లాట్‌లోనే గడిపారు. ఆగస్టు 27న మధ్యాహ్నం 3.30 గంటలకు అక్బర్ సికింద్రాబాద్ నుంచి బస్సు ద్వారా పుణే పరారవగా ఆపై రెండు రోజుల వ్యవధిలో మిగిలిన వాళ్లూ పరారయ్యారు. ఈ విధ్వంసాలకు అవసరమైన సహాయ సహకారాలను ఇతర నిందితులు అందించారు. రియాజ్ భత్కల్ స్కెచ్... ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు రియాజ్ భత్కల్ తన సోదరుడు ఇక్బాల్ భత్కల్, పాకిస్తాన్లో ఉన్న అమీర్ రజా ఖాన్‌తో కలసి హైదరాబాద్‌లో పేలుళ్లకు స్కెచ్ వేశాడు. రియాజ్ ఆదేశాలతో 2007 ఆగస్టు మొదటి వారంలో అనీఖ్ షఫీఖ్ సయ్యద్ నగరానికి చేరుకోగా సురక్షిత ప్రాం తంలో ఇల్లు అద్దెకు తీసుకోవడంతోపాటు కం ప్యూటర్ కోర్సులో చేరాలంటూ అతన్ని రియా జ్ ఆదేశించాడు. దీంతో అనీఖ్ తొలుత సరూర్ నగర్లో ఉంటున్న ఫారూఖ్ బంధు వైన నవీద్ వద్ద ఆశ్రయం పొందాడు. ఆపై నాంపల్లిలోని అజీజియా లాడ్జిలో కొన్ని రోజులు బస చేశాడు. ఆ తర్వా త హబ్సిగూడలోని బంజారా నిల యం అపార్ట్మెంట్ ఫ్లాట్ నంబర్ 302ను అద్దెకు తీసుకున్నాడు. అనీఖ్ ఎవరికీ అనుమానం రాకుండా నగరంలో ఆశ్రయం పొందడంతో పుణేకు చెందిన అక్బర్ ఇస్మాయిల్ చౌదరిని రియాజ్ హైద రాబాద్ పంపాడు. వారిద్దరూ అమీ ర్‌పేటలోని ధూమ్ కంప్యూటర్స్ లో హార్డ్‌వేర్ శిక్షణలో చేరారు. పే లుళ్లకు కొన్ని రోజుల ముందు సిటీ వచ్చిన రియాజ్... ఇక్కడి ఏర్పాట్ల పై సంతృప్తి చెందాడు. కొన్ని రోజు ల తర్వాత మంగుళూరు నుంచి ఆర్టీసీ బస్సు లో పేలుడు పదార్థాలను పంపగా... అనీఖ్, అక్బర్ ఎంజీబీఎస్‌లో వాటిని అందుకున్నారు. పేలుళ్లకు రెండ్రోజుల ముందు అనీఖ్, అక్బర్లను నగరంలో కలిసిన రియాజ్ కుట్ర అమలుకు సిద్ధం కావాలని ఆదేశించాడు. దీంతో వారిద్దరూ సికింద్రాబాద్‌లో బ్యాగ్‌లు, కోఠిలో బ్యాటరీలు కొని అనుకున్నట్లుగానే 2007 ఆగస్టు 25న మూడు బ్యాగుల్లో బాంబులు పెట్టుకొని బయలుదేరారు. -
ఇద్దరు దోషులు.. ఇద్దరు నిర్దోషులు
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ జంట బాంబు పేలుళ్ల కేసులో 11 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. గోకుల్‌చాట్, లుంబినీ పార్కులో టైమర్ బాంబులు పేల్చి 44 మంది అమాయ కుల మరణాలకు దారితీసిన ఇండియన్ ము జాహిదీన్ ఉగ్ర ఘాతుకంపై ఎట్టకేలకు తీర్పు వెలు వడింది. పోలీసులు అరెస్టు చేసిన ఐదు గురు నిందితుల్లో అనీక్ షఫీక్ సయీద్, మ హ్మద్ అక్బర్ ఇస్మాయిల్ చౌదరిలను న్యాయ స్థానం మంగళవారం దోషులుగా నిర్ధారించిం ది. వారిద్దరూ నేరానికి పాల్పడినట్లు రుజువైందని కోర్టు స్పష్టం చేసింది. దేశంపై తిరుగుబాటు, హత్య, కుట్ర, పేలుడు పదారా ్థల నిరోధక చట్టం, చట్ట వ్యతిరేక కార్యకలా పాల నిరోధక చట్టం తదితర వాటి కింద సయీద్, చౌదరిలను దోషులుగా పేర్కొంది. అయితే మరో ఇద్దరు నిందితులైన సాదిక్ ఇష్రార్ షేక్, ఫరూఖ్ షర్ఫుద్దీన్ తర్ఖాష్లు పేలుళ్లకు పాల్పడినట్లు నిరూపించే సరైన సాక్ష్యాధారాలు లేవంటూ వారిని నిర్ధోషులు గా ప్రకటించింది. ఈ మేరకు రెండో అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి టి. శ్రీనివాసరా వు మంగళవారం తీర్పు నిచ్చారు. దోషులకు ఈ నెల 10న శిక్షలు ఖరారు చేస్తామని, నిందితులకు సహకరించిన తారీఖ్ అంజూమ్ ఎహసాస్ విషయంలోనూ ఆ రోజునే నిర్ణయం వెలువరిస్తామని కోర్టు స్పష్టం చేసింది. భద్రతా కారణాలరీత్యా నిందితుల ను ఉంచిన చర్లపల్లి కేంద్ర కారాగారంలో ప్రత్యేక కోర్టు గదిని ఏర్పాటు చేసి విచారణ చేపట్టగా తీర్పును కూడా అక్కడి నుంచే జడ్జి వెలువరిం చారు. మీడియా ప్రతినిధులకు కోర్టులోకి అనుమతి లేకపోవడంతో తీర్పు పూర్తి పాఠం రెండు, మూడు రోజుల్లో అందుబాటులోకి రానుంది. కేసు విచారణలో సుమారు 170 మంది సాక్షుల వాంగ్మూలాల ను న్యాయస్థానం నమోదు చేసింది. ఈ కేసులో మరో ముగ్గురు నిందితులైన ఇండియ న్ ముజాహిదీన్ వ్యవ స్థాపకుడు రియాజ్ భత్కల్, అతని సోదరుడు ఇక్బాల్ భత్కల్, అమీర్ రజాఖాన్‌లు పేలుడు జరిగినప్పటి నుంచీ ఇంకా పరారీలోనే ఉన్నారు. ప్రస్తుతం వారు పాకిస్తాన్లో ఆశ్ర యం పొందుతున్నారు. దోషులకు మరణశిక్ష విధించాల్సిందిగా కోరాలని ప్రాసి క్యూషన్ నిర్ణయించింది. ఈ కేసులో న్యాయ స్థానం ఇద్దరు నిందితులను నిర్దోషు లుగా ప్రకటించడంపై బాధితులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది ఎంతమాత్రం సరికాదని, ట్రయల్ కోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేయాలని డిమాండ్ చేశారు. కోర్టు తీర్పుతో కేసు మూతబడ లేదని, బాధిత కుటుంబాలకూ న్యాయం జరగలేదని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ట్విట్టర్లో విమర్శించారు. నాటి నుంచి నేటి వరకు... జంట పేలుళ్ల కేసులో 11 ఏళ్ల 11 రోజుల తర్వాత తీర్పు రాజధానిలోని గోకుల్‌చాట్, లుంబినీ పార్కులో జంట పేలుళ్లు జరిగి మంగళవారానికి 11 ఏళ్ల 11 రోజులైంది. ఈ కేసులో కోర్టు తీర్పు మంగళవారం వెలువడిన నేపథ్యంలో ఉగ్ర ఘాతుకం చోటుచేసుకున్నప్పటి నుంచి తీర్పు వెలువడే వరకు చోటుచేసుకున్న పరిణామాలు ఇలా... 25-08-07 రాత్రి 7–7.30 గంటల మధ్య గోకుల్‌చాట్, లుంబినీ పార్కులో పేలిన బాంబులు. దిల్సుఖ్నగర్ ఫుట్ఓవర్ బ్రిడ్జి కింద పేలని బాంబు స్వాధీనం. ఈ పేలుళ్లపై అదే రోజు సైఫాబాద్, సుల్తాన్ బజార్, మలక్‌పేట పోలీసు స్టేషన్లలో కేసుల నమోదు. 27-08-07 ఉగ్రవాద పేలుళ్ల కేసులు కావడంతో సీసీఎస్ ఆధ్వర్యంలోని సిట్‌కు బదిలీ. నాడు లుంబినీ పార్కులో ఉన్న నాసిక్‌కు చెందిన అమృతవాహిని ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు చెప్పిన వివరాల ఆధారంగా నిందితుడి ఊహాచిత్రం విడుదల. 15-09-08 2007 సెప్టెంబర్ 13న ఢిల్లీలో వరుస పేలుళ్లకు బాధ్యత ప్రకటించుకున్న ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) బాధ్యత ప్రకటించుకుంది. ఈ కేసులో నిందితుల షెల్టర్ గుర్తించిన ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు. జామియానగర్‌లోని బాట్లాహౌస్ ఎల్–18 ఫ్లాట్‌లో జరిగిన ఎన్కౌంటర్లో ఆతిఖ్ అలియాస్ బషర్ సహా మరో ఇద్దరు ఉగ్రవాదుల మృతి, ముగ్గురు అరెస్ట్. ఈ ఉదంతంతో కదిలిన ఐఎం డొంక. 06-10-08 ఢిల్లీ ఎన్కౌంటర్లో దొరికిన ఆధారాలతో దర్యాప్తు ముమ్మరం. మొత్తం ఐఎం గుట్టు విప్పిన ముంబై క్రైమ్ బ్రాంచ్. 2005 ఫిబ్రవరి నుంచి దేశవ్యాప్తంగా 11 విధ్వంసాలకు పాల్పడిన ఐఎం ఉగ్రవాదుల్లో దాదాపు 20 మంది అరెస్ట్. వారిలోనే హైదరాబాద్ జంట పేలుళ్ల కేసు నిందితులు ఉండటంతో సిట్ పోలీసుల దర్యాప్తు కొలిక్కి. పీటీ వారెంట్‌పై నిందితుల తరలింపు, విచారణకు సిట్ ప్రయత్నాలు ప్రారంభం. 30-11-08 ఉగ్రవాదంపై పోరుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్గనైజేషన్ ఫర్ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ (ఆక్టోపస్) రూపుదిద్దుకున్న ఏడాది తర్వాత అధికారిక దర్యాప్తు ప్రారంభం. జంట పేలుళ్ల ఉదంతంతోపాటు పేలని బాంబుపై సిట్‌లో నమోదైన మూడు కేసులు ఈ విభాగానికి బదిలీ. 01-02-09 జంట పేలుళ్ల కేసులో నిందితులైన ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదుల్లో అనీఖ్ షఫీఖ్ సయ్యద్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరి పీటీ వారెంట్‌పై ముంబై నుంచి హైదరాబాద్‌కు... 09-02-09 కేసు దర్యాప్తులో కీలకమైన టెస్ట్ ఐడెంటిఫికేషన్ పరేడ్ చర్లపల్లి కేంద్ర కారాగారంలో నిర్వహణ. లుంబినీ పార్కులో బాంబు పెట్టిన అనీఖ్, హబ్సిగూడలోని బంజారా నిలయంలో బస చేసిన అక్బర్ ఇస్మాయిల్ చౌదరిలను గుర్తించిన సాక్షులు. 25-03-09 కేసులోని ఇతర నిందితులైన ఐఎం సహ వ్యవస్థాపకుడు సాదిక్ ఇష్రార్ షేక్, ఫారూఖ్ సర్ఫుద్దీన్ తర్ఖాష్ పీటీ వారంట్‌పై హైదరాబాద్ తీసుకొచ్చిన ఆక్టోపస్. 15/28-05-09, 20-06-09 కేసులో ఆక్టోపస్ అధికారుల కీలక ఆధారాల సేకరణ. లుంబినీ పార్కులో పేలుడుకు సంబంధించి 2009 మే 15న, పేలని బాంబుపై అదే నెల 28న, గోకుల్‌చాట్ పేలుడు ఉదంతానికి సంబంధించి అదే ఏడాది జూన్ 20న నాంపల్లి కోర్టులో చార్జిషీట్ల దాఖలు. 03-02-2012 జంట పేలుళ్లకు నిధులు అందించిన తారీఖ్ అంజుమ్ హసన్‌ను దుబా య్ నుంచి డిపోర్టేషన్‌పై తీసుకొచ్చిన ఢిల్లీ పోలీసులు. పీటీ వారంట్‌పై సిటీకి తరలించిన సీఐ సెల్ అధికారులు. అనుబంధ చార్జ్‌షీట్ దాఖలు. 07-08-2018 చర్లపల్లి కేంద్ర కారాగారంలోని ప్రత్యేక కోర్టులో (నాంపల్లి కోర్టు అనుమతితో) కేసుల విచారణ పూర్తి. 04-09-2018 మూడు కేసుల్లో అరెస్టయిన ఐదుగురు నిందితుల్లో అనీఖ్, అక్బర్‌లపై నేరం నిరూపణ. సాదిఖ్, ఫారూఖ్లపై వీగిపోయిన అభియోగాలు. నాలుగో చార్జ్‌షీట్‌లో నిందితుడైన తారీఖ్ దోషా కాదా అనే విషయంతో పాటు అనీఖ్, అక్బర్‌లకు సోమవారం ఖరారు కానున్న శిక్షలు. -
లుంబీనీ పేలుళ్ల కేసు,ఏ1గా అక్బర్ ఇస్మాయిల్
-
లుంబీనీ పేలుళ్ల కేసు.. అనూహ్య తీర్పు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని గోకుల్‌చాట్, లుంబినీ పార్కులో 2007లో జరిగిన జంట బాంబు పేలుళ్ల కేసులో కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. ఇద్దరు దోషులుగా తేల్చిన న్యాయస్థానం మరో ఇద్దరని నిర్దోషులుగా ప్రకటించింది. దోషుల్లో అక్బర్ ఇస్మాయిల్ చౌదరి, అనీఖ్ షఫిక్ సయ్యద్‌లకు శిక్ష ఖరారైంది. దోషులపై సెక్షన్ 302 కింద అభియోగాలు నమోదయ్యాయి. సాదిక్ ఇష్రార్ షేక్, ఫారూఖ్ సర్ఫుద్దీన్ తర్ఖాష్‌లను దోషులుగా తేల్చాడానికి ఆధారాలు లేకపోవడంతో నిర్దోషులుగా ప్రకటిస్తూ వారిపై ఉన్న అభియోగాలను కొట్టేసింది. రెండో కేసులో తుది తీర్పును సోమవారం వెలువరించనుంది. ఇక దోషులకు విధించే శిక్ష ఆ రోజే తెలియనుంది. చర్లపల్లి కేంద్ర కారాగారం ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డెజిగ్నేటెడ్ న్యాయస్థానంలో ఈ విచారణ సాగింది. ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాద సంస్థ ఈ ఘాతుకానికి పాల్పడింది. ఈ కేసులో మొత్తం 8 మంది ఉగ్రవాదులను నిందితులుగా పేర్కొనగా అమీర్ రజాఖాన్, రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్ పరారీలో ఉన్నారు. మిగిలిన ఐదుగురు నిందితుల (అనీఖ్ షఫీఖ్ సయీద్, సాదిక్ ఇష్రార్ షేక్, ఫారూఖ్ సర్ఫుద్దీన్ తర్ఖా ష్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరి, మహ్మద్ తారీఖ్ అంజుమ్ ఎహసాన్)పై విచారణ జరిగింది. -
బ్రేకింగ్: జంట పేలుళ్ల కేసులో తీర్పు వాయిదా
సాక్షి, హైదరాబాద్: నగరంలోని గోకుల్‌చాట్, లుంబినీ పార్కులో 2007లో జరిగిన జంట బాంబు పేలుళ్ల కేసులో తీర్పు వచ్చే నెల నాలుగో తేదీకి వాయిదా పడింది. ఈ కేసులో నేడు (సోమవారం) తీర్పు వెలువడుతుందని భావించినప్పటికీ.. పలు కారణాల వల్ల నాంపల్లిలోని ఎన్ఐఏ కోర్టు తీర్పును వచ్చేనెలకు వాయిదా వేసింది. భద్రతా కారణాల రీత్యా చర్లపల్లి సెంట్రల్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్ఐఏ న్యాయమూర్తి శ్రీనివాసరావు ఎదుట ఐదుగురు నిందితులను హాజరుపర్చారు. భద్రత కారణాల వల్ల నిందితులను కోర్టుకు తీసుకెళ్లడం లేదని, జైలు నుంచే వారిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జడ్జి ఎదుట ప్రవేశపెడతామని జైలు అధికారులు తెలిపారు. గోకుల్‌చాట్, లుంబినీ పార్కులో పేలుళ్లతోపాటు దిల్‌సుఖ్‌నగర్‌లో దొరికిన పేలని బాంబులకు సంబంధించి మొత్తం 3 కేసుల విచారణ ఈ నెల 7తో పూర్తయిన సంగతి తెలిసిందే. చర్లపల్లి కేంద్ర కారాగారం ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డెజిగ్నేటెడ్ న్యాయస్థానంలో ఈ విచారణ సాగింది. ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాద సంస్థ ఈ ఘాతుకానికి పాల్పడింది. ఈ కేసులో మొత్తం 8 మంది ఉగ్రవాదులను నిందితులుగా పేర్కొనగా అమీర్ రజాఖాన్, రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్ పరారీలో ఉన్నారు. మిగిలిన ఐదు గురు నిందితుల (అనీఖ్ షఫీఖ్ సయీద్, సాదిక్ ఇష్రార్ షేక్, ఫారూఖ్ సర్ఫుద్దీన్ తర్ఖా ష్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరి, మహ్మద్ తారీఖ్ అంజుమ్ ఎహసాన్)పై విచారణ జరిగింది. సోమవారం తీర్పు వెలువడనుండటంతో పోలీసు విభాగం జైలు వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేసింది. ఆక్టోపస్ కమాండోలను మోహరించింది. ఈ పేలుళ్లు జరిగి శనివారంతో 11 ఏళ్లు పూర్తయ్యాయి. జంట పేలుళ్ల కేసులను తొలుత నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధీనంలోని ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) బదిలీ చేశారు. పేలుళ్ల ఘటన తర్వాత నాటి ప్రభుత్వం ఉగ్రవాదంపై పోరుకు ఆర్గనైజేషన్ ఫర్ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ (ఆక్టోపస్) విభాగాన్ని ఏర్పాటు చేసి నిఘా, ఆపరేషన్స్, దర్యాప్తు బాధ్యతలు కల్పిస్తూ పోలీసుస్టేషన్ హోదా ఇచ్చింది. దీంతో సిట్ నుంచి ఈ 3 కేసులూ ఆక్టోపస్‌కు వెళ్లాయి. దీనిపై ఆక్టోపస్ అధికారులు 2009లో 3 అభియోగపత్రాలు దాఖలు చేశారు. ఇది జరిగిన ఏడాదికే ఆక్టోపస్‌ను కమాండో ఫోర్స్‌గా మార్చిన ప్రభుత్వం పోలీ సు స్టేషన్ హోదాను ఉగ్రవాద వ్యతిరేక విభాగమైన కౌంటర్ ఇంటెలిజెన్స్ (సీఐ) సెల్‌కు కట్టబెట్టింది. దీంతో ఈ కేసులు సీఐ సెల్‌కు బదిలీ అయ్యాయి. సీఐ సెల్‌కు భవిష్యత్తులో మరే ఇతర కేసు దర్యాప్తును అప్పగించకూడ దని నాడే నిర్ణయించారు. దీంతో ఆక్టోపస్, సీఐ సెల్ వింగ్స్ పర్యవేక్షించిన తొలి, ఆఖరి కేసులుగా ఈ మూడే రికార్డులకు ఎక్కాయి. -
గోకుల్‌చాట్ కేసు: పాకిస్థాన్‌లోనే ఉగ్రవాది
సాక్షి, సిటీబ్యూరో: రియాజ్ భత్కల్... 2007 నాటి గోకుల్‌చాట్, లుంబినీపార్క్ పేలుళ్లకు సూత్రధారిగా ఉన్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది. 2013లో జరిగిన దిల్సుఖ్నగర్ పేలుళ్ల కేసులోనూ నిందితుడు... వీటి సూత్రధారి యాసీన్ భత్కల్‌కు సోదరుడు. తెలంగాణ సహా తొమ్మిది రాష్ట్రాల్లో నమోదైన విధ్వంసాల కేసుల్లో రియాజ్ పేరు ప్రముఖంగా ఉంది. ఉగ్రవాదం ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారం సైతం నిర్వహించాడు. ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) గుట్టు వెనుకా ఇతని ‘పాత్ర’ ఉంది. 2007 ఆగస్టు 25 నాటి ఆ జంట పేలుళ్లకు 11 ఏళ్లు పూర్తికాగా... చర్లపల్లి జైలులోని ప్రత్యేక న్యాయస్థానం సోమవారం తీర్పు వెలువరించనుంది. ఇప్పటికీ పరారీలోనే ఉన్న ముగ్గురు ఉగ్రవాదుల్లో కీలక నిందితుడైన రియాజ్ భత్కల్ పూర్వపరాలివీవి... ముంబై నుంచి ‘ప్రస్థానం’... రియాజ్ భత్కల్ అసలు పేరు రియాజ్ అహ్మద్ షహబంద్రి. కర్ణాటకలోని భత్కల్ గ్రామంలో 1976 మే 19న పుట్టాడు. ఈ ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలు, స్మగ్లింగ్ ప్రభావంతో నేరబాట పట్టాడు. వీరి కుటుంబం కొన్నాళ్ల పాటు ముంబైలో నివసించింది. డబ్బుపై ఆశతో ముంబై గ్యాంగ్‌స్టర్ ఫజల్–ఉర్–రెహ్మాన్ ముఠాలో చేరిన అతను బెదిరింపులు, కిడ్నాప్‌లు తదితర వ్యవహారాల ద్వారా డబ్బు సంపాదించడం ప్రారంభించాడు. ఈ మేరకు ఇతనిపై కోల్‌కతా, ముంబై, కర్నాటకలో పలు కేసులు నమోదైనా... ఒక్కసారి కూడా అరెస్టు కాలేదు. గ్యాంగ్ నుంచి బయటకు వచ్చిన అనంతరం కుర్లా ప్రాంతంలో ‘ఆర్ఎన్’ పేరుతో కొత్తముఠా ఏర్పాటు చేసి కొంతకాలం వ్యవహారాలు సాగించాడు. స్థానిక ప్రార్థన స్థలానికి తరచూ వెళ్లే బత్కల్ ఆ ప్రభావంతో (సిమి)లో కొంతకాలం పని చేశాడు. అప్పడికే అతడి సోదరుడు ఇక్బాల్ భత్కల్ లష్కరే తోయిబాతో సంబంధాలు పెట్టుకోవడంతో అతని ద్వారా ఉగ్రవాదం వైపు మళ్లాడు. ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఏర్పాటులో కీలక పాత్ర పోషించి, రెండో కమాండ్ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించాడు. ఆసిఫ్ రజా కమెండో ఫోర్స్ పేరుతో ఉగ్రవాద సంస్థను ప్రారంభించిన కోల్‌కతా వాసి అమీర్ రజా ఖాన్ సూచనల మేరకు విధ్వంసాలకు పేలుడు పదార్థాలు, మనుషులు, డబ్బులు సమకూర్చేవాడు. రియల్టర్ అవతారం... ఉగ్రవాదం పేరుతో వసూలు చేసిన నిధులను దారి మళ్లించి రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహించాడు. మరిన్ని నిధుల కోసం పూణేకు చెందిన వ్యాపారులను కిడ్నాప్ చేయాలని కుట్రపన్నాడు. విధ్వంసాలకు శిక్షణ, పేలుడు పదార్థాల కొనుగోలు, ఆయుధాల సేకరణ పేరుతో విదేశీ సంస్థల నుంచి హవాలా ద్వారా భారీగా నిధులు సమీకరించాడు. అయితే వాటిని తన సొంత ‘ఖాతా’ల్లోకి మార్చుకుంటూ మంగళూరు సమీపంలోని థోయ్యత్తు, ఉల్లాల్ పరిసరాల్లో భారీగా రియల్ ఎస్టేట్ వెంచర్లు నిర్వహించాడు. భత్కల్ ఇండియన్ ముజాహిదీన్‌లో సెకండ్ కమాండ్ ఇన్ఛార్జ్ హోదాలో ఉండటంతో జమాఖర్చులు అడిగే సాహసం మాడ్యుల్లోని ఎవరూ చేయలేకపోయారు. జంట పేలుళ్లలో ఇదీ పాత్ర.... పూణేకు చెందిన మహ్మద్ అక్బర్ ఇస్మాయిల్‌చౌదరిæ, అనీఖ్ షఫీఖ్ సయ్యద్ రియాజ్ భత్కల్ ఆదేశాల మేరకు 2007 జూలై లో హైదరాబాద్ వచ్చారు. అదే ఏడాది జూలై, ఆగస్టు నెలల్లో రియాజ్ భత్కల్ అనేక సార్లు నగరానికి వచ్చి వెళ్లాడు. అక్బర్, అనీఖ్ తమ టార్గెట్‌గా ఎంపిక చేసుకున్న అనంతరం రియాజ్ భత్కల్‌కు సమాచారం ఇచ్చారు. పేలుళ్లకు కొన్ని రోజుల ముందు ముంబైలో జరిగిన సమావేశంలో రియాజ్ భత్కల్, సాదిక్ షేక్‌లతోపాటు అన్సార్ అహ్మద్ బాద్షా షేక్ కూడా పాల్గొన్నాడు. ప్రణాళిక సిద్ధమైన తరవాత ఆగస్టు 23న భత్కల్ నగరానికి వచ్చి అప్పటికే పార్సిల్లో పంపిన బాంబులను అసెంబుల్ చేశాడు. చివరకు ఆగస్టు 25న రియాజ్ భత్కల్ గోకుల్‌ఛాట్‌లో, అనీఖ్ షఫీఖ్ సయ్యద్ లుంబినీపార్క్‌లో బాంబులు అమర్చగా... మహమ్మద్ అక్బర్ ఇస్మాయిల్ చౌదరి దిల్శుక్నగర్లో బాంబు పెట్టాడు. మొదటి రెండూ పేలగా... మూడోది పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుల్లో కొందరు నిందితులు చిక్కడం, వారిపై విచారణ పూర్తయి తీర్పు వెలువడనున్నప్పటికీ రియాజ్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. పాక్‌లో తలదాచుకున్న ఇతగాడు అక్కడి నుంచే తన సోదరుడైన యాసీన్ ద్వారా 2013 నాటి దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల (ఏ–1 మిర్చి సెంటర్, 107 బస్టాప్) కథ నడిపించాడు. ఈ కేసులో యాసీన్ సహా మరికొందరిని గత ఏడాది దోషులుగా తేల్చిన కోర్టు ఉరిశిక్ష విధించిన విషయం విదితమే. ‘ఐఎం’ గుట్టు బయటపడింది ఇతడి వల్లే... ఐఎంలో కీలకంగా ఉన్న రియాజ్ భత్కల్ అనేక పేలుళ్ల సందర్భంలో కొన్ని ఈ–మెయిల్స్ రూపొందించి మీడియా సంస్థలకు పంపాడు. దీనిని మరో ఉగ్రవాది సాదిక్ షేక్ పూర్తిగా వ్యతిరేకించాడు. తద్వారా తమ ఉనికి బయటపడుతుందని, దర్యాప్తు సంస్థలకు పట్టుబడే అవకాశం ఉందని వాదించాడు. తమ లక్ష్యం నెరవేరాలంటే సాధ్యమైనంత ఎక్కువ కాలం తెరవెనుకే ఉండటం మంచిదని రియాజ్‌తో చెప్పాడు. అయితే ఈ మాటలను రియాజ్ పెడచెవిన పెట్టాడు. ప్రతి విధ్వంసానికి అత్యంత పగడ్భందీగా వ్యూహరచన చేసి కథ నడిపేది తామైతే... పేరు మాత్రం సీమాంతర ఉగ్రవాద సంస్థలకు రావడం రుచించని రియాజ్ తమ సంస్థ పేరు బయటకు వచ్చి ప్రచారం జరిగితే నిధులు సైతం భారీగా వస్తాయంటూ సాదిక్‌తో వాదనకు దిగాడు. చివరకు తన పంతం నెగ్గించుకుని ప్రతి విధ్వంసానికీ ముందు ఈ–మెయిల్ పంపేవాడు. ఐపీ అడ్రస్ ఆధారంగా దర్యాప్తు చేసిన అధికారులు ఐఎంకు సంబంధించిన కొన్ని వివరాలు సేకరించారు. ఈ నేపథ్యంలో 2008లో ఐఎం గుట్టురటైంది. దీంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన రియాజ్... ప్రస్తుతం పాకిస్థాన్‌లో తలదాచుకుంటున్నాడు. -
హైదరాబాద్ గోకుల్ చాట్ పేలుళ్లకు 11 ఏళ్లు
-
హైదరాబాద్ జంట పేలుళ్లకు 11 ఏళ్లు
సాక్షి, హైదరాబాద్ : 41 మందిని బలితీసుకున్న హైదరాబాద్ జంట పేలుళ్ల ఘటనకు నేటితో పదకొండేళ్లు పూర్తయ్యాయి. 2007, ఆగస్టు 25న లుంబిని పార్కు, గోకుల్ చాట్‌లో సంభవించిన జంట పేలుళ్లు ఎన్నో కుటుంబాలను వీధిన పడేశాయి. నగరాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఈ ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోగా, వంద మందికి పైగా గాయపడ్డారు. ఈ పేలుళ్ల కేసుకు సంబంధించిన తుది తీర్పును ఎన్ఐఏ స్పెషల్ కోర్టు సోమవారం(ఆగస్టు 27) వెలువరించనుంది. ప్రభుత్వమే ఆదుకోవాలి.. ఈ ఉగ్రదాడి జరిగి పదకొండేళ్లయినా బాధిత కుటుంబాలను మాత్రం వాటి ఛాయలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో కోఠి గోకుల్ చాట్ వద్ద నివాళులర్పించిన బాధిత కుటుంబాలు.. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నాయి. చికిత్స కోసం లక్షల్లో ఖర్చు చేస్తున్నామని... దీంతో ఆర్ధికంగా చితికిపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
‘మక్కా’ నుంచే మారాడు..
సాక్షి, సిటీబ్యూరో: వికారుద్దీన్ అహ్మద్... తెహరీక్–గల్బా–ఏ–ఇస్లాం (టీజీఐ) లోకల్ ఉగ్రవాద సంస్థను ఏర్పాటు చేసి... మరో నలుగురితో కలిసి మాడ్యుల్ తయారు చేసి... 2009–10 మధ్య ఏడాదిన్నర కాలంలో మూడుసార్లు పోలీసులపై తుపాకీ ఎక్కుపెట్టిన ఉగ్రవాది ఇతడు. హైదరాబాద్‌తో పాటు గుజరాత్‌లోనూ అనేక నేరాలు చేసిన వికార్... ఉగ్రవాద బాటపట్టడానికి ‘మక్కా కాల్పులే’ కారణం. 2006 మే 18న మక్కా మసీదులో జరిగిన పేలుడులో మృతుల సంఖ్య తొమ్మిది అయినప్పటికీ... ఘటనాస్థలిలో చనిపోయింది ఐదుగురు. ఈ సందర్భంగా చెలరేగిన ఘర్షణలను అదుపు చేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో దర్స్గా జిహాద్ ఏ షెహదత్ (డీజేఎస్) అనే సంస్థలో పని చేస్తున్న వికారుద్దీన్ ఈ ఘటనతో పోలీసులపై కక్ష పెంచుకున్నాడు. ఓల్డ్ మలక్‌పేట ప్రాంతానికి చెందిన ఇతడు కొన్నాళ్ల పాటు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. సులేమాన్ తదితరులతో కలిసి ముఠా కట్టి హఠాత్తుగా 2008 డిసెంబరు 3న సంతోష్‌నగర్‌లో ప్రత్యక్షమై నిఘా విభాగం అధికారులపై కాల్పులు జరిపాడు. ఆపై టీజీఐ పేరులో ఏకంగా సంస్థనే ఏర్పాటు చేసి 2009 మే 18న ఫలక్‌నుమాలో, మరికొన్ని రోజులకు శాలిబండలో హోంగార్డు బాలస్వామి, కానిస్టేబుల్ రమేష్‌లను పొట్టనపెట్టుకున్నాడు. ‘మక్కా కాల్పులకు’ ప్రతీకారంగా అంటూ పోలీసులను టార్గెట్‌గా చేసుకున్నాడు. ఈ గ్యాంగ్‌ను 2010 జూలైలో అరెస్టు చేసిన పోలీసులు వరంగల్ కారాగారానికి తరలించారు. 2015 ఏప్రిల్‌లో విచారణ నిమిత్తం నగరానికి తీసుకువస్తుండగా పోలీసులపై దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నించగా... పోలీసులు జరిపిన కాల్పుల్లో వికారుద్దీన్ సహా ఐదుగురు హతమయ్యారు. ‘మక్కా’ కారణంగానే ఐఎం విధ్వంసం.. దేశవాళీ ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) హైదరాబాద్‌ను రెండుసార్లు టార్గెట్‌గా చేసుకుంది. 2007 ఆగస్టు 25న గోకుల్‌చాట్, లుంబినీ పార్క్‌ల్లో, 2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌లోని 107 బస్టాప్, ఏ–1 మిర్చ్ సెంటర్ల వద్ద విధ్వంసాలు సృష్టించింది. 2002 నుంచి ఐఎం దేశ వ్యాప్తంగా విధ్వంసాలకు పాల్పడింది. ఈ సంస్థలో మీడియా సెల్ ఇన్చార్జ్గా వ్యవహరించిన పుణే వాసి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ మన్సూర్ అస్ఫర్ పీర్భాయ్ బంజారాహిల్స్‌లోని ఓ సంస్థలో ఎథికల్ హ్యాకింగ్‌లో శిక్షణ తీసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే మక్కా పేలుడు జరిగినప్పుడు హైదరాబాద్‌లోనే ఉన్న అతను మసీదు వద్దకు వెళ్ళి చూసి వచ్చాడు. ఆ తర్వాత ఐఎంకు చెందిన కీలక ఉగ్రవాదులు రియాజ్ భత్కల్, యాసీన్ భత్కల్ తదితరుతో పుణేలో సమావేశమై ‘భవిష్యత్తు కార్యాచరణ’పై చర్చించారు. ఇందులో పాల్గొన్న పీర్భాయ్ ‘మక్కా’ ఉదంతాన్ని వివరించడంతో రియాజ్ అందుకు ప్రతీకారంగా హైదరాబాద్‌ను టార్గెట్‌గా చేసుకుందామని నిర్ణయించాడు. 2007 ఆగస్టులో సిటీకి వచ్చిన రియాజ్, అనీఖ్, అ క్బర్ అదే నెల 25న జంట పేలుళ్లకు పాల్పడి పారిపోయారు. ప్రస్తు తం ఈ కేసు విచారణ సైతం తుది దశకు చేరుకుంది. ఈ కేసునూ మక్కా పేలుడు కేసును దర్యాప్తు చేసిన జాతీయ దర్యాప్తు సంస్థే ఇన్వెస్టిగేట్ చేయడం కొసమెరుపు. ఈ కేసు కూడా అనేక చేతులు మారిన తర్వాతే ఎన్ఐఏకే చేరింది. -
చలాకీగా ఉండేవాడు.. జీవచ్ఛవంలా మిగిలాడు..
సుల్తాన్‌బజార్ : ఎనిమిదేళ్ల నాటి దుర్ఘటన వారిని ఇంకా వెంటాడుతునే ఉంది. ఎంటెక్ చదివి ఇంజినీరుగా పనిచేస్తున్న ఆ యువకుడు స్నేహితులతో కలిసి చాట్ తిందామని 2007లో ఆగస్టు 25న గోకుల్ చాట్‌కు వచ్చిన అతడు ఉగ్రవాదులు పెట్టిన బాంబు పేలుడులో తీవ్రంగా గాయపడిన సరూర్‌నగర్ వాసి సదాశివ రెడ్డి(35) ఇప్పుడు వికలాంగుడిగా మిగిలాడు. కదలలేని స్థితిలో ఉన్న అతడిని చూస్తూ కన్నవారు తట్టుకోలేక పోతున్నారు. నాటి దుర్ఘటనలో ప్రాణాలు పోగొట్టుకున్న వారికి నివాళులు అర్పించేందుకు మంగళవారం సదాశివరెడ్డి తల్లిదండ్రులు మోహన్‌రెడ్డి, వసంత సహాయంతో కోఠి గోకుల్ చాట్‌కు వచ్చాడు. నాటి బాంబు పేలుళ్లలో అన్ని అవయవాలు చచ్చుబడిపోయాయని తల్లి రోదించడం అందరినీ కలిచివేసింది. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి తక్షణ సహాయం కింద రూ. 20 వేల చెక్కు ఇచ్చారని, వైద్య ఖర్చులు భరిస్తామని, ప్రభుత్వ ఉద్యోగం, రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని వైఎస్ హామీ ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. వైఎస్సార్ చొరవతో తన రెండో కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందన్నారు. వైస్సార్ అకాల మరణంతో వైద్య ఖర్చులు చెల్లించకపోవడంతో నాంపల్లి కేర్ ఆసుపత్రి నుంచి ఇంటికి పంపేశారని, తమకు ఇస్తామన్న ఎక్స్‌గ్రేషియా, వైద్య సదుపాయాలు లే వని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి తమకు న్యాయం చేయాలని ఆమె కోరారు. మరో బాధితుడు సయ్యద్ రెహమాన్ గోకుల్ చాట్ వద్ద నివాళులు అర్పించారు. నాటి పేలుడులో తనకు కన్ను పోయిందని, ప్రభుత్వం వికలాంగ ఫించన్, ఇల్లు, జిరాక్స్ మిషన్ ఇచ్చి ఆదుకోవాలని అక్కడ బ్యానర్ ప్రదర్శించాడు.