Goodbye
-
డేవిడ్ వార్నర్ గుడ్ బై.. అందమైన కుటుంబాన్ని చూశారా?(ఫొటోలు)
-
Britain: క్రియాశీల రాజకీయాలకు థెరెసా మే గుడ్‌బై
లండన్: బ్రిటన్ మాజీ ప్రధాన మంత్రి థెరెసా మే(67) క్రియాశీల రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని శుక్రవారం ప్రకటించారు. అయితే, ప్రస్తుత ప్రధాని రిషి సునాక్‌కు తన మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు. 2016–2019 కాలంలో బ్రిటన్ ప్రధానిగా ఉన్న థెరెసా మే హౌస్ ఆఫ్ కామన్స్‌లో 27 ఏళ్లపాటు ఎంపీగా కొనసాగారు. అధికార కన్జర్వేటివ్ పార్టీ ఎంపీగా 1997 నుంచి ఏడు పర్యాయాలు ఆమె ఎన్నికయ్యారు. మార్గరెట్ థాచర్ తర్వాత బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రెండో మహిళ థెరెసా మే ‘న్యూ ఐరన్ లేడీ’గా పేరు తెచ్చుకున్నారు. 2016 జూన్‌లో రెఫరెండం నేపథ్యంలో కుదిరిన బ్రెగ్జిట్ ఒప్పందం పార్లమెంట్ తిరస్కరించడంతో ఆమె ప్రధాని పదవి నుంచి వైదొలిగారు. -
‘కమలం’ చెంతకు కమల్‌నాథ్?
న్యూఢిల్లీ/భోపాల్: మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ హస్తం పార్టీకి గుడ్‌బై చెప్పబోతున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి. అయితే అలాంటిదేమీ లేదని కమల్‌నాథ్ ఆ వార్తలను కొట్టిపారేశారు. అయితే శనివారం జరిగిన పరిణామాలు చూస్తుంటే ఆయన బీజేపీ కండువా కప్పుకోవడం ఖాయంగా కనిపిస్తోందని విశ్లేషణలు వినవచ్చాయి. అసలేం జరిగింది? కమల్‌నాథ్‌కు మాజీ మీడియా సలహాదారు, ప్రస్తుత బీజేపీ అధికార ప్రతినిధి అయిన నరేంద్ర సలూజా.. కమల్‌నాథ్, ఆయన కుమారుడు, ఛింద్వారా కాంగ్రెస్ ఎంపీ నకుల్‌నాథ్‌లతో దిగిన భోపాల్‌లో దిగిన ఒక ఫొటోను ‘ఎక్స్’లో పోస్ట్‌చేసి దానికి ‘జై శ్రీరామ్’ అని ట్వీట్‌చేశారు. దీంతో తండ్రీకొడుకులు కమలం గూటికి చేరుకుంటున్నారని వార్తలు మొదలయ్యాయి. వీటికి బలం చేకూరుస్తూ నకుల్‌నాథ్ తన ‘ఎక్స్(పాత ట్విట్టర్)’ ఖాతా వివరాల్లో కాంగ్రెస్ పదాన్ని తొలగించారు. ముందస్తు షెడ్యూల్ లేకుండా హడావుడిగా ఇద్దరూ ఢిల్లీకి వచ్చారు. రాగానే మీడియా కమల్‌ను ప్రశ్నించింది. మీరు పార్టీ మారుతున్నారా? అన్న ప్రశ్నకు ‘‘ అలాంటిదేమైనా ఉంటే ముందు మీకే చెబుతా’ అని అన్నారుగానీ పార్టీని వీడట్లేదనే సమాధానం చెప్పలేదు. దీంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. రాజ్యసభ సీటు ఆశించి భంగపడినందుకే కమల్‌నాథ్ పార్టీని వీడుతున్నారని మరో విశ్లేషణ వినిపించింది. బీజేపీలోకి వస్తామంటే ఇప్పుడే మీకు స్వాగతం పలుకుతామని మధ్యప్రదేశ్ బీజేపీ చీఫ్ వీడీ శర్మ శుక్రవారం వ్యాఖ్యానించడం తెల్సిందే. గత ఏడాది మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పేలవ ప్రదర్శనకు కమల్‌నాథ్ బాధ్యుడని రాహుల్ భావిస్తున్నారని, అందుకే కమల్‌ను తప్పించి జీతూ పట్వారీకి కాంగ్రెస్ మధ్యప్రదేశ్ చీఫ్ పదవి కట్టబెట్టారని వార్తలొచ్చాయి. అన్నీ అసత్యాలు : జీతూ పట్వారీ ఇలాంటి వార్తలను కాంగ్రెస్ మధ్యప్రదేశ్ అధ్యక్షుడు జీతూ పటా్వరీ తోసిపుచ్చారు. ‘‘ కాంగ్రెస్‌తో కమల్‌నాథ్ బంధం ఈనాటిది కాదు. ఇందిరాగాంధీ తనయుడు సంజయ్ గాంధీతో కలిసి డెహ్రాడూన్ డూన్ స్కూల్లో చదివారు. ఒకానొక సమయంలో కమల్ నా మూడో కుమారుడు అంటూ స్వయంగా ఇందిరగాం«దీనే వ్యాఖ్యానించారు. అలాంటి వ్యక్తి కాంగ్రెస్‌ను వీడుతారా?’’ అని మీడియానే పట్వారీ నిలదీశారు. ‘‘రాజ్యసభ సీటు ఇవ్వలేదన్నది అవాస్తం. నిజానికి ఆ స్థానం కోసం నామినేషన్ వేసిన పార్టీ కోశాధికారి అశోక్‌సింగ్ పేరును బలపరిచింది కమల్‌నాథే’’ అని పటా్వరీ వివరణ ఇచ్చారు. దశాబ్దాలుగా కాంగ్రెస్‌తో అనుబంధమున్న కమల్ ఛింద్వారా నుంచి తొమ్మిదిసార్లు ఎంపీగా గెలిచారు. 2019లో ఆ స్థానం నుంచి కమల్ కుమారుడు నకుల్ గెలిచారు. ఈ ఒక్కస్థానం తప్ప రాష్ట్రంలోని మిగతా 28 ఎంపీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. -
ఇలా రాజీనామా, అలా ప్రమాణం!
పట్నా/న్యూఢిల్లీ: బిహార్‌లో రాజకీయ సంక్షోభం క్లైమాక్స్‌కు చేరుతోంది. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన మహాఘట్బంధన్ సంకీర్ణ సర్కారుకు జేడీ(యూ) సారథి, సీఎం నితీశ్‌కుమార్ గుడ్‌బై చెప్పడం, మళ్లీ బీజేపీతో దోస్తీ కట్టి ఎన్డీఏ కూటమిలో చేరడం ఖాయమైనట్టు కని్పస్తోంది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు, ఆదివారం ఉదయం నితీశ్ సారథ్యంలో పటా్నలో ఎన్డీఏ శాసనసభా పక్ష భేటీ జరగనుంది. బీజేపీ, జేడీ(యూ), జితిన్‌రాం మాంఝీ సారథ్యంలోని హిందూస్తాన్ అవామీ లీగ్ అందులో పాల్గొంటాయి. ఎమ్మెల్యేలంతా కలిసి శాసనసభాపక్ష నేతగా నితీశ్‌ను ఎన్నుకుంటారు. వెంటనే ఆయన గవర్నర్‌ను కలిసి సీఎం పదవికి రాజీనామా చేస్తారు. ఎన్డీఏ పక్షాల మద్దతు లేఖలు సమరి్పంచి మళ్లీ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కోరతారు. సాయంత్రం సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారు. బీజేపీ నేత సుశీల్‌కుమార్ మోదీ ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారని సమాచారం. మాంఝీ కూడా రెండు మంత్రి పదవులు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆదివారం విధులకు రావాల్సిందిగా సచివాలయ సిబ్బందికి ఆదేశాలు వెళ్లడం వంటివన్నీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సూచికలేనని చెబుతున్నారు. పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా నితీశ్‌ను బలపరిచే అవకాశముందని వార్తలొస్తున్నాయి. కనీసం ఏడెనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల సెల్ ఫోన్లు శనివారమంతా స్విచాఫ్ కావడం వాటిని బలపరుస్తోంది! దాంతో పరిస్థితిని సమీక్షించేందుకు కాంగ్రెస్ అధిష్టానం తరఫున ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేశ్ బఘెల్ హుటాహుటిన పట్నా చేరుకున్నారు. ఇండియా కూటమిలోకి రావాల్సిందిగా మాంఝీతో మంతనాలు జరిపారు. మరోవైపు నితీశ్‌తో చేదు అనుభవాల నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంపై బీజేపీ వ్యూహాత్మకమౌనం పాటిస్తోంది. శనివారం పటా్నలో జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో దీనిపై లోతుగా చర్చ జరిగినా జేడీ(యూ)ను తిరిగి ఎన్డీఏలోకి ఆహా్వనించడంపై ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. ఇక ఘట్బంధన్ సంకీర్ణంలో ప్రధాన భాగస్వామ్య పక్షమైన ఆర్జేడీ ఎలాగైనా సర్కారును కాపాడుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఆర్జేడీ నేతలతో పార్టీ చీఫ్ లాలు మంతనాల్లో మునిగి తేలుతున్నారు. జేడీ(యూ) లేకుండా ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వాలని నేతలు ప్రతిపాదించారు. అయితే బీజేపీ, జేడీ(యూ) కలిస్తే 123 ఎమ్మెల్యేలతో మెజారిటీ మార్కు (122)ను సులువుగా దాటేస్తారంటూ లాలు కుమారుడు, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ వాటిని తిరస్కరించినట్టు చెబుతున్నారు. ఇలా శనివారమంతా పట్నాలో హై వోల్టేజ్ పొలిటికల్ డ్రామా నడిచింది. ఇండియా కూటమి ఖతమే: జేడీ(యూ) బిహార్‌లో ఘట్బంధన్ సంకీర్ణం కుప్పకూలనుందని జేడీ(యూ) రాజకీయ సలహాదారు, అధికార ప్రతినిధి కేసీ త్యాగి స్పష్టం చేశారు. శనివారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు నితీశ్‌ను పదేపదే అవమానించడమే ఇందుకు కారణమని చెప్పారు. కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష ఇండియా కూటమి కూడా కుప్పకూలే దశలో ఉందని ఆయన జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ మాత్రం కూటమికి వచి్చన ముప్పేమీ లేదని ఆశాభావం వెలిబుచ్చారు. అయితే, నితీశ్‌తో మాట్లాడేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పదేపదే ప్రయత్నించినా ఆయన ‘బిజీ’గా ఉండటంతో వీలు కాలేదని వెల్లడించారు! ఇండియా కూటమి నుంచి జేడీ(యూ) వైదొలగుతున్నట్టు ఎలాంటి సమాచారమూ లేదని ఖర్గే చెప్పుకొచ్చారు. -
Bihar Politics: రేపే ఎన్డీఏలోకి నితీశ్?
పట్నా/న్యూఢిల్లీ: బిహార్ రాజకీయం రసకందాయంలో పడింది. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన అధికార మహాఘట్బంధన్ సంకీర్ణానికి జేడీ(యూ) సారథి, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గుడ్‌బై చెప్పి ఎన్డీఏ కూటమిలో చేరడం దాదాపుగా ఖాయమైందని తెలుస్తోంది. పాత నేస్తం బీజేపీతో మళ్లీ జట్టు కట్టి ఆయన కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఆదివారమే నితీశ్ మరోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయవచ్చని జేడీ(యూ) వర్గాలంటున్నాయి. రాష్ట్ర బీజేపీ అగ్ర నేత సుశీల్‌కుమార్ మోదీకి ఉప ముఖ్యమంత్రి పదవి దక్కనుందని సమాచారం. ‘‘(నితీశ్‌కు ఇంతకాలంగా బీజేపీలోకి) మూసుకుపోయిన తలుపులు తెరుచుకోవచ్చు. రాజకీయాంటేనే అవకాశాల ఆటస్థలి. కనుక ఏదైనా సాధ్యమే’’ అంటూ శుక్రవారం సుశీల్ చేసిన నర్మగర్భ వ్యాఖ్యలు కూడా ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. బిహార్ తాజా పరిణామాలపై రాష్ట్ర బీజేపీ చీఫ్ సమర్థ్ చౌదరి, సుశీల్‌కుమార్ ఇప్పటికే ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షా తదితర బీజేపీ అగ్ర నేతలతో చర్చలు జరిపి వచ్చారు. ఈ నేపథ్యంలో జేడీ(యూ)ను ఎన్డీఏలోకి తీసుకోవడంపై శని, ఆదివారాల్లో బిహార్ బీజేపీ రెండు రోజుల రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో చర్చించనున్నారు. ఆదివారమే పొత్తు నిర్ణయం వెలువడవచ్చని తెలుస్తోంది. ఆ రోజు ఉదయమే జేడీ(యూ) ఎమ్మెల్యేలతో నితీశ్ సమావేశం కానుండటం విశేషం! మరోవైపు 10 మంది దాకా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా బీజేపీతో టచ్‌లో ఉన్నట్టు వస్తున్న వార్తలు అధికార సంకీర్ణంలో కలకలం రేపుతున్నాయి. నితీశ్ స్పష్టత ఇవ్వాలి: ఆర్జేడీ సంకీర్ణంలో ప్రధాన భాగస్వామి అయిన ఆర్జేడీతో నితీశ్‌కు విభేదాల నేపథ్యంలో బిహార్‌లో రెండు రోజులుగా రాజకీయ రగడ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆయన ఎన్డీఏలో చేరతారన్న వార్తలు గురువారం కలకలం రేపాయి. జేడీ(యూ) ని్రష్కమిస్తే సంకీర్ణ ప్రభుత్వం మైనారిటీలో పడుతుంది. దాన్ని కాపాడుకునేందుకు అవసరమైన 8 మంది ఎమ్మెల్యేల కోసం ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. నలుగురు ఎమ్మెల్యేలున్న ఎన్డీఏ భాగస్వామి హిందూస్తానీ అవామ్ మోర్చా చీఫ్ జితిన్‌రామ్ మాంఝీతో శుక్రవారం మంతనాలు జరిపారు. మాంఝీ మాత్రం నితీశ్ కూడా త్వరలో ఎన్డీఏలోకి వస్తారని మీడియాతో చెప్పుకొచ్చారు! ఘట్బంధన్ సర్కారు ఒకట్రెండు రోజుల్లోనే కుప్పకూలడం ఖాయమని ఆయన కుమారుడు సంతోష్ జోస్యం చెప్పారు. మొత్తం ఉదంతంపై నితీశ్ తక్షణం స్పష్టమైన ప్రకటన చేసి ఊహాగానాలకు తెర దించాలని ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా కోరడం విశేషం. -
ఈ సంవత్సరం ఏం చేశారు?
2023కు వీడ్కోలు ఇవన్నీ ప్రశ్నలే.పునరావలోకనం చేసుకోవాలి.కొత్త సంవత్సరం కొత్త ఉత్సాహంతో మొదలెట్టాలి.జీవితం ఒక్కటే. సాధించాల్సినవి లక్ష.స్త్రీగా జన్మించినందుకు రోజులు ఎలా గడిచిపోయాయో అనుకోకూడదు.ఎంత బాగా గడిచాయో అనుకోవాలి.అందుకు తరచి చూసుకుని స్వీయ అంచనా వేసుకోవడమే మార్గం.‘ఏం చేస్తున్నావమ్మా?’ అని పిల్లలు అడిగి ‘అన్నం పెట్టు’ అంటారు. ‘ఏం చేస్తున్నావోయ్’ అని భర్త అడిగి, ‘నా వైట్‌షర్ట్ ఎక్కడా?’ అని ప్రశ్నిస్తాడు. అత్తగారు, మామగారు ‘ఏం చేస్తున్నావమ్మా’ అని కేకేసి ఇంకేదో చెప్తారు. వీళ్లంతా ఏ పనీ చెప్పకపోయినా ఇంట్లో గృహిణిగా ఉన్నందుకు తప్పక చేయాల్సిన పనులు ఉంటాయి.ఈ పనుల్లోనే జీవితం గడిచిపోవాలా? ఈ పనుల మధ్యలో స్త్రీలు తమకంటూ ఒక జీవితాన్ని నిర్మించుకోలేరా? 2023 మరో రెండు మూడు రోజుల్లో వీడ్కోలు తీసుకుంటుంది. కొత్త సంవత్సరం వస్తుంది. గృహిణిగా/ ఉద్యోగం చేస్తూ ఇల్లు చూసుకునే గృహిణిగా ఈ సంవత్సరమంతా ఎలా గడిచిందో బేరీజు వేసుకున్నారా? ఎన్ని పుస్తకాలు చదివారు? స్త్రీకి మెదడు ఉంటుంది... దానికి వ్యాయామం ముఖ్యం అన్నాడు రచయిత చలం. ఆ వ్యాయామం పుస్తకాలు చదివితే వస్తుంది. సాహిత్యానుభవం వల్ల మస్తిష్కం విశాలం అవుతుంది. జీవన అవగాహన పెరుగుతుంది. జీవితాన్ని ఆస్వాదించడమూ తెలుస్తుంది. స్త్రీలు పుస్తకం చదివితే ఇంటికి వెలుగు. ప్రతిఏటా ఎన్నో మంచి పుస్తకాలు వస్తాయి. పుస్తక ప్రదర్శనలు జరుగుతాయి. అమేజాన్ నుంచి తెప్పించుకోవచ్చు. ఆడియో యాప్స్ కూడా ఉన్నాయి. పుస్తకాలు చదవకుండానే 2023ను మీరు వృథా చేసి ఉంటే మీరు మీ బౌద్ధిక వ్యాయామాన్ని వృథా చేసినట్టు. లేదా కొన్ని పుస్తకాలైనా చదివి ఉంటే వాటిని లిస్ట్ చేసి మీ స్నేహితులకు పంపి ఇన్‌స్పయిర్ చేయండి. ఈ సంవత్సరం మరిన్ని చదవాలని లక్ష్యం పెట్టుకోండి. మంచి సినిమాలు చూశారా? సినిమాలంటే కాలక్షేపపు సినిమాలు కాదు. హాలీవుడ్లో, హిందీలో, భారతీయ భాషల్లో అర్థవంతమైన సినిమాలు వస్తున్నాయి. స్త్రీ దృష్టికోణం నుంచి ఎన్నో కథలు చెప్తున్నారు. ఓటిటిలలో కూడా చాలా సినిమాలు వస్తున్నాయి. వీటిలో కొన్నయినా మీరు ఎంచుకుని చూశారా? పోనీ... పాత క్లాసిక్స్... మీరు ఎప్పటినుంచో చూడాలనుకున్నవి... ఎవరూ మధ్యలో డిస్ట్రబ్ చేయని విధంగా చూశారా? సంతోషించారా? ఎంతమంది మిత్రులను పొందారు? ఇవాళ మనిషికి పెద్ద ఓదార్పు స్నేహమే. వైవాహిక జీవితంలో పడ్డాక పాత స్నేహాలు కొనసాగితే అదృష్టమే. స్కూల్, కాలేజీ నాటి స్నేహితులు మాట్లాడుతూ ఉంటే ఆ స్నేహాన్ని ఈ సంవత్సరం ఎంతమేరకు నిలబెట్టుకున్నారు. లేదా ఇంటి ఇరుగు పోరుగున, పని చేసే చోట ఎన్ని మంచి స్నేహాలు చేయగలిగారు. ఇవాళ రేపు మనుషుల పట్ల నెగెటివిటి పెరిగింది. కాని లోపాలు ఎంచటం తక్కువ... స్నేహాన్ని కొనసాగించడం తక్కువ కొనసాగించారా? బాగా చికాకుగా, డల్‌గా ఉన్నప్పుడు మీరు కాల్ చేసి మాట్లాడే స్నేహితుల సంఖ్య ఈ సంవత్సరం పెరిగిందా? తగ్గిందా? ఎన్ని అనుబంధాలను కాపాడుకోగలిగారు? బంధువులను దూరం చేసుకోవడం, బంధువులకు దూరం కావడం ఈ కాలపు గడుసుదనంగా మారింది. బంధువులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనే పోకడ ఇప్పుడు సర్వసామాన్యం అయ్యింది. కాని బంధుత్వాలు లేకనే జీవనం సాగగలదా? ఎన్ని లోపాలు ఉన్నా మంచికీ చెడ్డకీ ఆధారపడాల్సింది బంధువులే కదా? ఈ బాంధవ్యాలను, అనుబంధాలను డ్యామేజీ చేశారా? లేదా బలపరుచుకున్నారా? ఏదైనా నష్టం జరిగి ఉంటే 2024లో ఆ నష్టాన్ని నివారించే ప్రయత్నం ఎందుకు జరగకూడదు? ఎన్ని కొత్తప్రాంతాలు తిరిగారు? సంవత్సరమంతా ఇంటి నాలుగ్గోడలు, ఆఫీసుప్రాంగణంలోనే గడిచిపోయిందా? ఏ కొత్తప్రాంతాన్ని చూడలేదా? కొత్తనేలను తాకి కొత్తగాలిని పీలిస్తేనే సంతోషం. సంవత్సరంలో కనీసం 2 కొత్తప్రాంతాలు చూడగలగాలి. 2023లో చూడకపోతే 2024లో కదలండి కుటుంబ సభ్యుల మధ్య సాన్నిహిత్యం: కుటుంబం జీవన సర్వస్వం. ఒకే కుటుంబమే అయినా కుటుంబ సభ్యుల మధ్య స్పర్థలు, అభ్యంతరాలు, నిర్లక్ష్యం, నిర్బాధ్యత వస్తాయి ఒక్కోసారి. కడుపున పుట్టిన వాళ్ల మధ్య ప్రేమను కల్పించారా? తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లల మధ్య అడ్డుగోడలు లేకుండా ఉన్నారా? మీ మనసులో ఉన్నదంతా వారికి చెప్పగలరా? వారి మనసులో ఉన్నది చెప్పే వీలు ఇచ్చారా? 2024లో ఈ ప్రశ్నలకు జవాబు వెతకండి. ఎంత పోదుపు చేశారు? పిల్లల కోసమే ప్రతి పైసా ఖర్చు పెట్టడం ఇన్నాళ్లు చేశారా? 2023లో కూడా అదే చేశారా? తల్లిగా మీ ఆర్థిక భద్రత ఎంత? మీ పేరున స్థిరచరాస్తులు, రొక్కం ఏ మేరకు ఉంది. మీ కోసం మీరుఎంత పోదుపు చేసుకున్నారు? ఒకరిపై ఆధారపడలేని స్థితిలో ఉండాలనుకోవడం లేదా? కొత్త సంవత్సరం వస్తున్నది మీ స్వయంసమృద్ధికే. ఆరోగ్యం పై ఎంత శ్రద్ధ పెట్టారు? ఆరోగ్యం సంగతి తర్వాత చూసుకుందాం అని ఇంకా ఎన్నేళ్లు అనుకుంటారు. ఈ సంవత్సరం హెల్త్ ఇన్సూరెన్స్‌లు చేయించుకోండి. మంచి ఆహారానికి బడ్జెట్ కేటాయించుకోండి. జిమ్‌లో చేరండి. వాకింగ్ చేయండి. యోగా క్లాసులకెళ్లండి. మీ ఆరోగ్యం కోసం మీరు కొంత ఖర్చు పెట్టుకోవడాన్ని హక్కుగా పొందండి. 2024లో కచ్చితంగా మీరు సంపూర్ణ ఆరోగ్యం కోసం నడుం బిగించండి.కాలం వచ్చేది మన కోసం. మనం ఇతరుల కోసం ఎంత జీవించినా మన కోసం కూడా జీవించాలి. కొత్త సంవత్సరంలో మీ కోసం కూడా మీరు జీవించండి. -
కుస్తీకి సాక్షి స్వస్తి
న్యూఢిల్లీ: సాక్షి మలిక్... మహిళల కుస్తీలో పతకం పట్టుబట్టే స్టార్ రెజ్లర్. కామన్వెల్త్ క్రీడల్లో మూడు పతకాలు... ఆసియా చాంపియన్íÙప్లో నాలుగు పతకాలు... రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం... ఇవిచాలు సాక్షి ఏస్థాయి రెజ్లరో చెప్పడానికి! దేశానికి పతకాలెన్నో తెచ్చిపెట్టిన ఆమె... గురువారం జరిగిన డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విధేయుడే అధ్యక్షుడిగా ఎన్నికవడంతో ఇక చేసేదేమీ లేక బయట పోరాటానికి, బౌట్లో పతకం ఆరాటానికి సెలవిచ్చింది. కన్నీటి చెమ్మతో బరువెక్కిన హృదయంతో రిటైర్మెంట్ ప్రకటించింది. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించిన కేసులో నిందితుడైన బ్రిజ్‌భూషణ్ ప్రధాన అనుచరుడు సంజయ్ సింగ్ భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. బ్రిజ్‌భూషణ్ పై ఢిల్లీ రోడ్లెక్కి సాక్షి సహా స్టార్ రెజ్లర్లు బజరంగ్ పూనియా, వినేశ్ ఫొగాట్, సంగీత ఫొగాట్ తదితరులు నిరసన తెలిపారు. పగలనక... రాత్రనక... తిండి నిద్రలేని రాత్రులెన్నో గడిపి బ్రిజ్‌భూషణ్‌ను గద్దె దింపాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన గద్దె దిగినప్పటికీ ఆయన నీడ సంజయ్ సింగ్ అధ్యక్షుడు కావడంతో జీర్ణించుకోలేకపోయిన సాక్షి తన ఆటకు టాటా చెప్పేసింది. స్టార్ రెజ్లర్లు బజరంగ్, వినేశ్ కూడా సంజయ్ ఎన్నికపై తప్పుబట్టారు. అవును... అందుకే గుడ్‌బై ‘బ్రిజ్‌భూషణ్ మహిళా రెజ్లర్ల పట్ల ప్రవర్తించిన తీరుపై గళమెత్తాం. కదంతొక్కాం. కేసు నమోదు చేయించాం. కానీ డబ్ల్యూఎఫ్ఐ తాజా ఎన్నికల్లో చివరకు ఆయన వర్గమే గెలిచింది. పదవులన్నీ చేజిక్కించుకుంది. అందుకే కెరీర్‌కు గుడ్‌బై చెప్పా. మేం మహిళా అధ్యక్షురాలైతే బాగుంటుందని అనుకున్నాం. కానీ అలా జరగలేదు’ అని మీడియా సమావేశంలో సాక్షి వాపోయింది. 15లో 13 పదవులు బ్రిజ్‌భూషణ్ వర్గానివే మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ డబ్ల్యూఎఫ్ఐలో తన పట్టు నిరూపించుకున్నాడు. ఆయన బరిలో లేకపోయినా... 15 పదవుల్లో ఆయన వర్గానికి చెందిన 13 మంది పదవుల్ని చేజిక్కించుకున్నారు. అధ్యక్ష పదవి ఎన్నికలో ఉత్తరప్రదేశ్ రెజ్లింగ్ సంఘం ఉపాధ్యక్షుడైన సంజయ్... 2010 కామన్వెల్త్ క్రీడల స్వర్ణ పతక విజేత అనిత షెరాన్‌పై 40–7 ఓట్ల తేడాతో గెలిచాడు. అనిత వర్గానికి చెందిన ప్రేమ్‌చంద్ లోచబ్ ప్రధాన కార్యదర్శి పదవి పొందడం... సీనియర్ ఉపాధ్యక్షుడిగా దేవేందర్ సింగ్ కడియాన్ ఎన్నికవడం ఒక్కటే ఊరట. మిగతా 4 ఉపాధ్యక్ష పదవులు బ్రిజ్‌భూషణ్ క్యాంప్‌లోని జైప్రకాశ్ (ఢిల్లీ), అశిత్ సాహా (బెంగాల్), కర్తార్ సింగ్ (పంజాబ్), ఫొని (మణిపూర్)లే సొంతం చేసుకున్నారు. ఉపాధ్యక్ష బరిలో దిగిన మధ్యప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి, మాజీ రెజ్లర్ మోహన్ యాదవ్‌కు కేవలం ఐదు ఓట్లు లభించడం గమనార్హం. కోశాధికారిగా సత్యపాల్ (ఉత్తరాఖండ్), ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులందరూ బ్రిజ్‌భూషణ్ వర్గం వారే ఎన్నికయ్యారు. నిరసన దీక్ష చేపట్టిన రెజ్లర్లపై ఎలాంటి వివక్ష చూపం. ప్రతీకారం తీర్చుకోం. రెజ్లర్లందరిని సమానంగా చూస్తాం. వారికి కావాల్సిన సహకారాలు అందిస్తాం. మేం రెజ్లింగ్ ఆటపైనే దృష్టి పెడతాం. రెజ్లర్ల పొరపాట్లపై కాదు. ఎన్నికైన కొత్త కార్యవర్గమే డబ్ల్యూఎఫ్ఐని నడిపిస్తుంది. రోజువారీ వ్యవహారాల్లో నా ప్రమేయం ఉండదు. వారు కోరితేనే సలహాలిస్తా. –మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ -
బీజేపీకి గౌతమి గుడ్‌బై
సాక్షి, చైన్నె : సినీ నటి గౌతమి బీజేపీకి గుడ్ బై చెప్పేశారు. పార్టీ నుంచి వైదొలగుతున్నట్లు ఆమె మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పార్టీలోని నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తనను మోసం చేసిన మోసగాడికి అండగా బీజేపీ నాయకులు ఉన్నారని తెలిసి తీవ్ర మనో వేదనకు గురైనట్టు పేర్కొన్నారు. గౌతమి విడుదల చేసిన ప్రకటనలోని వివరాలు.. ‘బరువెక్కిన హృదయంతో , తీవ్ర అసంతృప్తితో బీజేపీ నుంచి వైదొలగేందుకు నిర్ణయించాను. గత 25 సంవత్సరాలుగా పార్టీకి సేవలు అందిస్తూ వస్తున్నాను , ఈ పయనంలో ఎన్నో సవాళ్లు, ఒడి దొడుగులు ఎదుర్కొన్నాను. అయినా, తన పని తాను సక్రమంగా చేస్తూ ముందుకు సాగినట్టు పేర్కొన్నారు. పార్టీ నుంచి, నాయకుల నుంచి తనకు ఎలాంటి మద్దతు, సహకారం లేక పోవడమే కాకుండా నన్ను మోసం చేసిన అలగప్పన్‌కు అండగా తమ పార్టీ వాళ్లే ఉన్నట్టుగా వచ్చిన సమాచారం తీవ్రంగా కలచి వేసింది. 37 సంవత్సరాలు సినిమా, టీవీ, రేడియో, డిజిటల్ మీడియాలో కష్టపడి సంపాదించిన సొమ్ముతో కుమార్తెతో తన జీవితం ఉజ్వలమయంగా ఉండాల్సిందన్నారు. అయితే అలగప్పన్ తనను ఆర్థికంగా మోసం చేశాడని, నగదు, ఆస్తులను అపహరించాడని ఇటీవలే తన దృష్టి వచ్చిందన్నారు. ఈ విషయంగా పోలీసులను ఆశ్రయించానని గుర్తుచేశారు. అయితే ఆ మోసగాడికి బీజేపీలోని కొందరు నేతలు అండగా ఉండడం తనను కలిచి వేసిందని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, పోలీసులు, న్యాయం వ్యవస్థ మీద నమ్మకంతో తాను చేసిన ఫిర్యాదుపై న్యాయం దక్కుతుందనే ఎదురు చూపులో ఉన్నాను. 2021 ఎన్నికల్లో రాజపాళయం సీటు తనకే అని చెప్పడంతో పార్టీ బలోపేతానికి తీవ్ర కృషి చేశానని, చివరి క్షణంలో సీటు దక్కకుండా చేశారని గుర్తుచేస్తూ, ఎలాంటి మద్దతు , సహకారం, ఆదరణ లేని పార్టీలో కొనసాగలేను. నన్ను మోసం చేసిన వ్యక్తి 40 రోజులుగా బీజేపీ సీనియర్ల సహకారంతో అజ్ఞాతంలో ఉన్నట్టు వచ్చిన సమాచారం తనను మరింతగా కుంగదీసింది. అందుకే పార్టీ నుంచి బయటకు వెళ్తున్నాను’ అని ప్రకటించారు. ఇదిలా ఉండగా, గౌతమి నిర్ణయంపై బీజేపీ మహిళానేత,నటి కుష్భు విచారం వ్యక్తం చేశారు. అదే సమయంలో ఇటీవల బీజేపీ నుంచి బయటకు వచ్చిన నటి గాయత్రి రఘురాం మరో మారు తెర మీదకు వచ్చి, బీజేపీలో మహిళలకు గుర్తింపు లేదని, న్యాయం దక్కదని ఆవేదన వ్యక్తం చేశారు. -
అయ్యయ్యో.. ఆ శకం ముగుస్తోందా? నిజమేనా?
Reynolds 045 Fine Carbure భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన బాల్ పెన్ రేనాల్డ్స్. 90వ దశకంలో రేనాల్డ్స్ పెన్స్ బ్రాండ్ ఒక ట్రెండ్ సృష్టించింది. బ్లూ క్యాప్, వైట్ కలర్ బాడీతో మొదలై పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పవచ్చవు. 90వ దశకంలో ఉపాధ్యాయుల నుండి విద్యార్థులు, ఉద్యోగస్తుల వరకూ అలనాటి పెన్స్ పరిచయం లేనివారెవ్వరూ ఉంటారు. రేనాల్డ్స్ పేరుతో వచ్చిన ఉత్పత్తులలో బాల్ పాయింట్, జెల్, రోలర్‌బాల్ , ఫౌంటెన్ పెన్నులు , మెకానికల్ పెన్సిల్స్ ఉన్నాయి. ఇపుడా రేనాల్డ్స్ పెన్ ఇప్పుడు మార్కెట్లో మాయమైపోతోందట. ఈ మేరకు పలు కథనాలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో నెటిజన్లు కూడా స్పందించారు. రెనాల్డ్స్ పెన్.. అంటే ఒక నోస్టాల్జియా. చిన్ననాటి జ్ఞాపకాలు ఒక్కసారిగా అలా మదిలో మెదులుతాయి. ఇపుడా రెనాల్డ్స్ పెన్నుల కంపెనీ మూసివేస్తున్నారనేవార్త దావానంలా వ్యాపించింది. కేవలం 5 రూపాయలకు లభించే ఈ పెన్ను దేశంలో బాగా పాపులర్ అయింది. ప్రధానంగా రీఫిల్ లీక్‌లకు చెక్ పెడుతూ ప్రత్యర్థి కంపెనీలకు ధీటుగా వినియోగదారులను బాగా ఆకట్టుకుంది. Reynolds 045 Fine Carbure పెన్ ఉత్పత్తిని నిలిపివేసినట్లు పేర్కొంటూ @memorable_90s యూజర్ చేసిన ట్విటర్ పోస్ట్ వైరల్ అయింది. ఈ ప్రత్యేక బ్రాండ్ రేనాల్డ్స్ మిలీనియల్స్‌లో కల్ట్ ఫాలోయింగ్. ఎరుపు, నలుపు, నీలం రంగులలో వచ్చిన క్లాసిక్.ఖరీదైన 'పైలట్' పెన్నులతో పోల్చినప్పుడు సామాన్యులకు ఈజీగా అందుబాటులో వచ్చాయి. దీంతో తమకు ఇష్టమైన కలం ఉత్పత్తి ఆగి పోయిందనే విషాద వార్తపై నెటిజన్లు స్పందించారు. తమ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఇప్పటికీ ఈపెన్ వాడు తున్నామంటూ కొందరు పేర్కొన్నారు. రేనాల్డ్స్ 045 ఫైన్ కార్బ్యూర్ని ది నేషనల్ పెన్ ఆఫ్ ఇండియా అంటూ ఒకరు కమెంట్ చేశారు. పెన్ బెస్ట్ సెల్లర్‌గా ఎలా అమ్ముడయ్యిందో చెబుతూ మరొక యూజర్ ట్వీట్ చేశారు. 'చౌక, గొప్ప, మన్నికైన , ఫాడూ పెన్‌గా అభవర్ణించారు. అయితే ప్రస్తుతం ఉన్న రెనాల్డ్స్ పెన్నుల చివరి బ్యాచ్ అమెజాన్‌లో అందుబాటులో ఉందంటూ మరికొందరు సూచించారు. అయితే ఇది ఫేక్ న్యూస్ అంట ఒక యూజర్ ఒకప్రకటనను షేర్ చేశారు. అసలు నిజం ఏమిటంటే వివిధ మీడియాలో ప్రచురించిన తప్పుడు సమాచారంపై రెనాల్డ్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో వివరణ ఇచ్చింది ఖచ్చితమైన సమాచారం కోసం తమ వెబ్సైట్, సోషల్ మీడియా ఛానెల్స్‌ను పరిశీలించాలని కోరింది. రేనాల్డ్స్కు భారతదేశంలో 45 ఏళ్ల వారసత్వం ఉంది దాన్ని కొనసాగిస్తాం. దేశంలో రైటింగ్ బిజినెస్‌ను వృద్ధి చేయాలనే దృక్పథంతో ఉన్నామని స్పష్టం చేసింది. View this post on Instagram A post shared by Reynolds (@originalreynoldsindia) I still use the same..ordered 15 of these for my office. I think they will be the last ones now. pic.twitter.com/jdy0wrHVZx — A.K (@HaddHaiYaar) August 24, 2023 Reynolds 045 Fine Carbure will no longer be available in market, end of an era..💔 pic.twitter.com/pSU4WoB5gt — 90skid (@memorable_90s) August 24, 2023 what 😭😭😭😭 I use this pen for all of my artworks , bro 😰😢😢😢 pic.twitter.com/LrkABExkWM — Tales, Legends & Stories ♪ (@byindianwriters) August 24, 2023 -
క్రికెట్‌కు మనోజ్ తివారీ వీడ్కోలు
కోల్‌కతా: భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పాడు. ఈ బెంగాలీ క్రికెటర్ 2008 నుంచి 2015 వరకు అంతర్జాతీయ కెరీర్లో 12 వన్డేలు, మూడు టి20లు ఆడాడు. వన్డేల్లో ఒక సెంచరీ, అర్ధసెంచరీ ఉన్నాయి. కానీ మూడు టి20ల్లో ఒకసారి మాత్రమే బ్యాటింగ్ అవకాశం దక్కగా 15 పరుగులే చేశాడు. దేశవాళీ క్రికెట్లో 141 మ్యాచ్‌ల్లో 48.56 సగటుతో 9908 పరుగులు చేశాడు. ఐపీఎల్లో కోల్‌కతా, పంజాబ్, రైజింగ్ పుణేలకు ఆడాడు. 2012లో మనోజ్ తివారీ విన్నింగ్ షాట్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్ విజేతగా నిలిచింది. 37 ఏళ్ల తివారీ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ కేబినెట్లో రాష్ట్ర యువజన, క్రీడా శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నాడు. -
టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు మరో ఎదురుదెబ్బ!
సాక్షి,ముంబై:భారతీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మరో ఎదురు దెబ్బ తగిలింది. కంపెనీలో కీలక ఎగ్జిక్యూటివ్‌ల వరుస రాజీనామాల పరంపర కొనసాగుతోంది. తాజాగా కంపెనీ చీఫ్ ఇన్ఫర్మేషన్ స్ట్రాటజీ ఆఫీసర్(CISO)ఉన్న విశాల్ సాల్వి ఇన్ఫోసిస్‌కు గుడ్ బై చెప్పారు.అంతేకాదు సైబర్ సెక్యూరిటీ సంస్థకు సీఈవోగా బాధ్యతలు చేపట్టారు కూడా. (రూ. 2 వేల నోట్లు: ఆర్బీఐ కీలక ప్రకటన) ఈ రంగంలో 29 ఏళ్ల అనుభవం ఉన్న సాల్వి గత ఏడేళ్లుగా ఇన్ఫోసిస్‌కు CISOగా ఉన్నారు. సైబర్ సెక్యూరిటీ కంపెనీ క్విక్‌హీల్ కి నూతన సీఈవోగా బాధ్యతలు చేపట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. సైబర్ సెక్యూరిటీ పరిశ్రమలో విశ్వసనీయ సంస్థగా ఉన్న క్విక్ హీల్ టీంకు నాయకత్వం వహించడం చాలా సంతోషకరమైన విషయమని విశాల్ ఒక ప్రకటనలో తెలిపారు.సైబర్ భద్రతను అందరికీ ప్రాథమిక హక్కుగా మార్చే భాగస్వామ్య లక్ష్యానికి తాను పూర్తిగా కట్టుబడి ఉన్నాన్నారు. సైబర్ సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అపారమైన అనుభవం ఉన్న సాల్వి ఇన్ఫోసిస్కంటే ముందు PwC, HDFC బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్, డెవలప్మెంట్ క్రెడిట్ బ్యాంక్, క్రాంప్టన్ గ్రీవ్స్ లాంటి సంస్థల్లో కీలక పాత్రల్లో పనిచేశారు. అలాగే క్విక్ హీల్ కైలాష్ కట్కర్ సీఎండీగా ఉంటారు.మరోవైపు కొత్త నాయకత్వ నియామకంపై కైలాష్ కట్కర్ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కస్టమర్ సెంట్రిసిటీ ఇన్నోవేషన్‌తో మా చోదక శక్తిగా, క్విక్ హీల్ వ్యక్తులు, సంస్థలు, దేశాలకు తమ భద్రతా సేవల్ని కొనసాగుతుయన్నారు. విశాల్ సాల్వితో కలిసి, దేశంలోని సైబర్ సెక్యూరిటీ ఎకోసిస్టమ్‌ని మార్చేందుకు గ్లోబల్ మ్యాప్‌లో తమ స్థానాన్ని పటిష్టం చేయడానికి పూర్తిగా కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. (జియో మరో సంచలనం: రూ. 999కే ఫోన్, సరికొత్త ప్లాన్ కూడా) కాగా ఈ మధ్య కాలంలో ఐటీ కంపెనీ నుంచి ఉన్నతాధికారి వైదొలగడం ఇదే తొలిసారి కాదు. జూన్ నెలలో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మన్నేపల్లి నర్సింహారావు కూడా కంపెనీకి (టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టు) రాజీనామా చేశారు. 20 ఏళ్ల క్రితం ఇన్ఫోసిస్‌లో చేరిన మన్నేపల్లి హైదరాబాద్ సెంటర్‌కి హెడ్‌గా ఉన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ప్రెసిడెంట్ మోహిత్ జోషి ఇన్ఫోసిస్‌ను వీడి టెక్ మహీంద్రా సీఈవోగా నియమితులయ్యారు. అంతకుముందు ప్రెసిడెంట్ రవికుమార్ ఎస్ కాగ్నిజెంట్ సీఈవోగా చేరారు. ఇక ఇన్ఫోసిస్‌కు గుడ్‌బై చెప్పిన సుదీప్ సింగ్ ఇన్ఫోటెక్ సీఈవోగా చేరిన సంగతి తెలిసిందే. -
పెళ్లి తరువాత కరియర్‌కు గుడ్‌బై చెప్పిన బ్యూటీస్
-
52 కొత్త ముఖాలకు టిక్కెట్లు.. కర్ణాటక బీజేపీలో భగ్గుమన్న అసమ్మతి
బెంగళూరు: కర్ణాటక బీజేపీలో అసమ్మతి భగ్గుమంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 52 కొత్త ముఖాలకు టిక్కెట్లు ఇస్తూ విడుదల చేసిన తొలి జాబితా పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. టికెట్ రాని అసంతృప్త నాయకులు ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్ బై కొడుతున్నారు. మరికొందరు పార్టీ నుంచి వెళ్లిపోతామంటూ బెదిరింపులకి దిగుతున్నారు. ఆశావహుల మద్దతుదారులు బీజేపీ కార్యాలయం వద్ద నిరసనలకు కూడా దిగారు. సీనియర్ నేత లక్ష్మణ్ సావాది, మాజీ ఎమ్మెల్యే దొడ్డప్పగౌడ పాటిల్ నారిబోల్లు పార్టీకి బుధవారం గుడ్‌బై కొట్టేశారు. సలియా నియోజకవర్గం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గి ప్రస్తుతం మంత్రిగా ఉన్న ఎస్. అంగారా టికెట్ రాకపోవడంతో ఏకంగా రాజకీయ సన్యాసం స్వీకరిస్తున్నట్టుగా ప్రకటించారు. లక్ష్మణ్ సావాది మాజీ సీఎం బీఎస్ యడ్డీయూరప్పకి అత్యంత విధేయుడు, శక్తిమంతమైన లింగాయత్ నాయకుల్లో ఒకరు. 2018 ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటికీ, ఆ తర్వాత ఇతర పార్టీల నుంచి ఫిరాయింపుదారుల్ని ఆకర్షించడంలో పకడ్బందీగా వ్యూహాలు పన్నారు. ఈసారి టికెట్ రాకపోవడంతో సావాది తాను ఎవరినీ బిచ్చమడగనని, తనకి ఆత్మ గౌరవం ఉందని వ్యాఖ్యానించారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆయన కాంగ్రెస్‌లోకి వెళతారంటున్నారు. మాజీ ఎమ్మెల్యే దొడ్డప్ప గౌడ కూడా రాజీనామా చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ షెట్టార్ పేరు తొలిజాబితాలో లేకపోయేసరికి ఆగ్రహావేశాలతో ఢిల్లీకి వెళ్లి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. టికెట్ వస్తుందని ఆశాభావంతో ఉన్నారు. ఇక మంత్రి అంగారా పార్టీ తనను తీవ్రంగా అవమానించిందంటూ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించారు. -
బిగ్‌బీ పుట్టినరోజు స్పెషల్: హ్యాపీ బర్త్‌డే సాంగ్ చూశారా?
యంగ్ హీరోలతో పోటీపడి నటిస్తున్న సీనియర్ స్టార్ అమితాబ్ బచ్చన్. వయసు మీద పడుతున్నా ఏమాత్రం హుషారు తగ్గకుండా రెట్టింపు ఉత్సాహంతో సినిమాలు చేస్తూనే ఉన్నారు. 80వ పడిలో అడుగుపెట్టినా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతున్నారు. నేడు (అక్టోబర్ 11న) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా గుడ్ బై చిత్రయూనిట్ అమితాబ్‌కు స్పెషల్ విషెస్ తెలియజేస్తూ హ్యాపీ బర్త్‌డే సాంగ్ రిలీజ్ చేసింది. సినిమాలో బిగ్‌బీ బర్త్‌డే విజువల్స్ చూపించడంతో పాటు సెట్స్‌లో అతడితో కేక్ కట్ చేయించిన క్లిప్పింగ్‌ను కూడా ఇందులో యాడ్ చేశారు. ఈ వీడియోలో నటీనటులతో పాటు దర్శకుడు వికాస్ కూడా ఉన్నాడు. కాగా గుడ్ బై సినిమాలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటించారు. నీనా గుప్తా, సునీల్ గ్రోవర్, పవైల్ గులాటి ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం అక్టోబర్ 7న విడుదలైంది. చదవండి: ఆస్కార్ ఎంట్రీకి ఆర్ఆర్ఆర్.. నెటిజన్ ట్వీట్‌పై మంచు విష్ణు రియాక్షన్ లైంగిక ఆరోపణలు.. అలాంటి వ్యక్తిని అప్పుడు చూపిస్తారా? -
పుష్ప 2పై అప్డేట్ ఇచ్చిన రష్మిక, ‘అప్పుడే సెట్లో అడుగుపెడతా’
‘‘ఫలానా స్క్రిప్ట్‌ను ఎంచుకుంటే అది జరుగుతుందేమో! ఫలానా స్క్రిప్ట్‌ను ఎంచుకోకపోతే మరొకటి జరుగుతుందేమో అని హైరానా పడను. జరిగేదే జరుగుతుందనుకుని నా గట్ ఫీలింగ్‌తో స్క్రిప్ట్స్ ఎంచుకుంటాను’’ అన్నారు రష్మికా మందన్నా. అమితాబ్ బచ్చన్, రష్మికా మందన్నా ప్రధాన పాత్రల్లో నటింన హిందీ చిత్రం ‘గుడ్ బై’. వికాశ్ బాల్ దర్శకత్వంలో రపొందిన ఈ సినివ అక్టోబరు 7న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. హిందీలో రష్మికా మందన్నాకు ఇదే తొలి చిత్రం. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న రష్మికా మందన్నాను ‘మీరు ఏ విషయానికి గుడ్ బై చెప్పాలనుకుంటున్నారు’ అని ఓ విలేకరి అడగ్గా.. ‘‘నెగిటివిటీకి గుడ్ బై చెప్పాలనుకుంటున్నాను. చదవండి: ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ నాకు మైనస్ అయ్యింది: సంగీత షాకింగ్ కామెంట్స్ నేను చాలా పాజిటివ్ పర్సన్‌ని. మనందరం నెగిటివిటీకి గుడ్ బై చెప్పాలని, ప్రపంచం అంతా పాజిటివ్‌నెస్‌తో నిండిపోవాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకువర్ దర్శకత్వంలో రపొందిన ‘పుష్ప: ది రైజ్’ మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినివ విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమా నెక్ట్స్ పార్ట్ ‘పుష్ప: ది రైజ్’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇంకా రెండో భాగం చిత్రీకరణ ఆరంభం కాలేదు. అయితే ఈ సినిమా షూటింగ్లో మరో రెండు రోజుల్లో జాయిన్ అవుతున్నట్లుగా రష్మిక అప్డేట్ ఇచ్చారు. చదవండి: చై-సామ్ విడాకులపై సమంత తండ్రి ఎమోషనల్ -
'గుడ్‌బై' మూవీ ట్రైలర్ లాంచ్ వేడుక (ఫొటోలు)
-
అమితాబ్‌తో రష్మిక గొడవ.. ఆసక్తిగా ‘గుడ్‌బై’ ట్రైలర్
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా బాలీవుడ్లో నటించిన లేటెస్ట్ మూవీ గుడ్‌బై. బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ మూవీ అక్టోబర్ 7న ప్రేక్షకుల ముందకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. మనిషి పోతే అంత్యక్రియలను వేడుకగా జరిపించాలనే కథాంశంతో ఈ మూవీని తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. చదవండి: చై-సామ్ విడాకులపై సమంత తండ్రి ఏమోషనల్ పోస్ట్ ఇక ఇందులో అమితాబ్ తండ్రి పాత్రలో కనిపించగా.. రష్మిక కూతురిగా కనిపించింది. తల్లి పాత్రలో నటించిన నటి నీనా గుప్తా చావు, అంత్యక్రయల చూట్టు ఈ మూవీ తిరగనుంది. ఆమె అంత్యక్రయలకు రాకుండ విదేశాల్లో ఉన్న కొడుకులు తప్పించుకోవడం, తల్లి శవాన్ని ఇంట్లో ఉండగానే రష్మిక తండ్రితో గొడవ పడటం ఇలా పలు భావోద్వేగ సన్నివేశాలతో ట్రైలర్‌ను మలిచారు. పూర్తి ఫ్యామిలీ, ఎమోషనల్ డ్రామాగా ఉన్న ఈ ట్రైలర్ సాంతం ఆకట్టుకుంటోంది. కాగా వికాస్ బాహ్ల్ దర్వకత్వం వహించిన ఈ చిత్రాన్ని శోభా కపూర్, ఏక్తాకపూర్‌లు నిర్మించారు. -
‘గుడ్‌బై’ రిలీజ్ ఎప్పుడో చెప్పిన రష్మిక
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంటుంది. కన్నడ నుంచి తెలుగు వచ్చిన రష్మిక ఇటీవల బాలీవుడ్లో అడుగుపెట్టింది. అక్కడ తన తొలి చిత్రం విడుదల కాకముందే వరుసగా రెండు సినిమాలకు సంతకం చేసింది. ఏకంగా బిగ్‌బి అమితాబ్ బచ్చన్‌తో నటించే చాన్స్ కొట్టేసింది. అమితాబ్‌తో గుడ్‌బై, రణ్‌బీర్ కపూర్ సరసన ఎనిమల్ చిత్రాలు చేస్తుంది. తాజా గుడ్‌బై చిత్రం నుంచి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. రష్మిక మందన్నా శనివారం ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ రిలీజ్ డేట్‌ను ప్రకటించింది. అక్టోబర్ 7న ఈ చిత్రం విడుదల చేస్తున్న చెప్పింది. ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ.. ‘మీ కుటుంబాన్ని కలిసేందుకు మా నాన్న-నేను అక్టోబర్ 7న వస్తున్నాం’ అంటూ రాసుకొచ్చింది. ఈ పోస్టర్లో అమితాబ్-రష్మికలు కలిసి పతంగులు ఎగురవేస్తూ కనిపించారు. ఈ సినిమాలో రష్మిక అమితాబ్ కూతురిగా కనిపించనుందని తెలుస్తోంది. కాగా వికాస్ బహల్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఏక్తా కపూర్ నిర్మించింది. నీనా గుప్తా, సాహిల్ మెహతా, శివిన్ నారంగ్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. View this post on Instagram A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) -
ఆ రోజు 'గుడ్ బై' చెప్పనున్న రష్మిక మందన్నా!
కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన్నా (Rashmika Mandanna) వరుస సినిమాలు చేస్తూ తగ్గేదే లే అంటోంది. టాలీవుడ్‌తో స్టార్డమ్ సంపాందించుకున్న ఈ అమ్మడు కోలీవుడ్, బాలీవుడ్లో ఫుల్ బిజీగా ఉంది. 'పుష్ప' మూవీతో తెలుగు, తమిళం, హిందీ ఆడియెన్స్‌ల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ్లో విజయ్ నటిస్తున్న 'వారీసు' (వారసుడు) చిత్రంలో నటిస్తోంది. అలాగే 'పుష్ప 2'తోపాటు మరికొన్ని హిందీ, కోలీవుడ్ ప్రాజెక్టులు చేస్తోంది. ఇక హిందీలో చేసిన 'మిషన్ మజ్ను', 'గుడ్ బై' సినిమాల చిత్రీకరణ పూర్తి అయింది. తాజాగా 'గుడ్ బై' సినిమా విడుదల తేదిని ఖరారు చేసింది మూవీ యూనిట్. కామెడీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, నీనా గుప్తా, ఎల్లీ అవ్రాం, సునీల్ గ్రోవర్, సాహిల్ మెహతా తదితరులు కీలక పాత్రల్లో అలరించనున్నారు. ఈ మూవీ వరల్డ్‌వైడ్‌గా అక్టోబర్ 7న విడుదల కానుంది. ఏక్తా కపూర్ నిర్మించిన ఈ సినిమాకు వికాస్ బహల్ దర్శకత్వం వహించారు. అంత్యక్రియల చుట్టూ 'గుడ్ బై' మూవీ కథ జరుగుతుందని బాలీవుడ్ మీడియా అంటోంది. చదవండి: నూలుపోగు లేకుండా రణ్వీర్ సింగ్.. మానసిక రోగి అంటూ బ్యానర్లు కేటీఆర్ గారూ.. త్వరగా కోలుకోవాలంటే ఈ చిత్రం చూడండి.. I finally get to say this 🥰 My Hindi debut film - GOODBYE!🤍 with @SrBachchan sir 🔥 @Neenagupta001 ma’am 🤍 #VikasBahl and a maaaaaad cool cast @pavailkgulati #SahilMehta#abhishek and so many such amazing actors and technicians .. 🔥❤️ Is releasing on October 7-2022 💃🏻💃🏻 pic.twitter.com/6HnxtA9891 — Rashmika Mandanna (@iamRashmika) July 23, 2022 చదవండి: జాన్వీకి తల్లి శ్రీదేవి చెప్పిన బ్యూటీ సీక్రెట్ ఇదే.. -
‘గుడ్‌బై’ చెప్పడం ఇష్టం లేదు : రష్మిక
నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. తెలుగు, తమిళంలోనే కాకుండా హిందీలోనూ వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. ఇప్పటికే ఆమె సిద్ధార్థ్ మల్హోత్రా తో కలిసిన నటించిన‘మిషన్ మజ్ను’ విడుదలకు సిద్దంగా ఉంది. త్వరలోనే మరో చిత్రం ‘గుడ్‌బై’ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని రష్మిక తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఓ ఫోటోని షేర్ చేసింది. (చదవండి: ద్యేవుడా.. ఆ హీరోయిన్ కింద పడితే సినిమా హిట్!) ‘గుడ్ బై' సినిమాకు గుడ్ బై చెప్పడం నాకిష్టం లేదు. రెండేళ్లుగా కోవిడ్‌తో పాటు ఏదీ కూడా మమ్మల్ని పార్టీ చేసుకోకుండా అడ్డుకోలేకపోయాయి. అమితాబ్ బచ్చన్ సార్‌తో కలిసి పనిచేసే అవకాశం దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రపంచంలో ఆయనే అత్యుత్తమ మనిషి. ఇంత మంచి సినిమాలో నటించే అవకాశం కల్పించిన డైరెక్టర్ వికాస్ బహల్‌కు కృతజ్ఞతలు. నన్ను ఎందుకు ఈ చిత్రంలో తీసుకున్నారో ఆ దేవుడికే తెలియాలి. మీరు గర్వపడేలా ఈ చిత్రంలో నటించానని అనుకుంటున్నాను. నా బేబీ ‘గుడ్‌బై’ని చూసేందుకు అందరు రెడీగా ఉండాలి.. దీని కోసం నేను వేచి ఉండలేకపోతున్నాను’అంటూ రష్మిక తన ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. తండ్రీకూతుళ్ల బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రానికి వికాస్ బాల్ దర్శకుడు. ఈ చిత్రం కూడా ఈ ఏడాదే విడుదల కానుంది View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
టైమ్ చూసి... హ్యాండిస్తున్నారు..!
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో పోలింగ్ తేదీకి గడువు దగ్గరకొస్తున్న కొద్దీ, కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు పార్టీని మరింత బలహీన పరిచేలా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ మినహా మిగతా హస్తిన నేతలు ఎవరూ పట్టనట్లుగా వ్యవహరిస్తుండడంతో పార్టీ నేతలు ఒక్కొక్కరుగా గుడ్‌బై చెప్పేస్తున్నారు. పార్టీని వీడుతున్న నేతలను బుజ్జగించే చర్యలు ఏవీలేకపోవడం, పార్టీలో ప్రాధాన్యంపై ఎలాంటి హామీలు ఇవ్వకపోవడం, పార్టీ గెలిచే అవకాశాలపై నమ్మకంలేకపోవడంతో పార్టీ విధేయులే ఇతర పార్టీల్లోకి జారుకుంటున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, యూపీ ఇంఛార్జ్‌గా ప్రియాంకా గాంధీ బాధ్యతలు చేపట్టిన తర్వాత, పార్టీ పరిస్థితిలో మెరుగుదల కనిపిస్తుందని భావించినా, ఇప్పటికే 20 మందికి పైగా కీలక నేతలు పార్టీని వీడడం తలనొప్పి వ్యవహారంలా మారింది. కేంద్ర మాజీ మంత్రి, పార్టీ అధిష్టానానికి సన్నిహితుడైన బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన జితిన్ ప్రసాదతో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఎన్నికల షెడ్యూల్‌కు ముందే పార్టీని వీడగా, షెడ్యూల్ విడుదలయ్యాక పశ్చిమ యూపీలో కీలక ముస్లిం నేత, గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన ఇమ్రాన్ మసూద్ ఎస్పీలో చేరారు. తాజాగా స్టార్ క్యాంపెయినర్ జాబితా ప్రకటించిన మరుసటిరోజే మాజీ కేంద్రమంత్రి ఆర్పీఎన్ సింగ్ కాషాయ కండువా కప్పుకున్నారు. ఎన్నికల సమయంలో పేరున్న నేతలే కాకుండా, క్షేత్రస్థాయిలోనూ పార్టీని వదిలివెళ్లేవారిని ఆపలేకపోవడం పార్టీ అవకాశాలను దెబ్బతీస్తోంది. కాంగ్రెస్‌ను వీడిన కొందరు కీలక నేతలు వీరు.. -
అంతర్జాతీయ క్రికెట్‌కు డ్వయాన్ బ్రావో గుడ్‌బై
-
షూటింగ్స్ బంద్
ఇప్పటికే కరోనా కోరల్లో చిక్కుకుని పలువురు హిందీ స్టార్స్ క్వారంటైన్ లో టైమ్ గడుపుతున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ఇటీవలే థియేటర్స్‌లో సినిమాల ప్రదర్శన నిలిచిపోయింది. దీంతో రిలీజ్‌కు దగ్గరైన సినిమాలు వాయిదా పడ్డాయి. తాజాగా సినిమా, టీవీ షూటింగ్స్‌ను కూడా నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ‘బ్రేక్ ది చైన్ ’ పేరుతో ఏప్రిల్ 14 సాయంత్రం నుంచి మే 1 ఉదయం వరకు లాక్డౌన్ విధించించి, కొత్త మార్గదర్శకాలను కూడా ప్రభుత్వం వెల్లడించింది. దీంతో కోవిడ్ జాగ్రత్తల నడుమ జరుగుతున్న కొద్ది సినిమాల షూటింగ్స్ కూడా నిలిచిపోనున్నాయి. షారుక్ ఖాన్ ‘పఠాన్ ’, సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’, అమితాబ్‌బచ్చన్ – రష్మికల ‘గుడ్ బై’ , కార్తీక్ ఆర్యన్ ‘భూల్ భులయ్యా 2’ చిత్రాలతో పాటు ముంబయ్‌లో జరుగుతున్న ఇతర సినిమాల షూటింగ్స్‌కి కూడా బ్రేక్ పడింది. ‘‘మేం అన్ని రూల్స్ పాటిస్తున్నాం. అయినా షూటింగ్స్ కారణంగా కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుందని అనుకోవడం లేదు. త్వరలో ప్రభుత్వాన్ని కలిసి షూటింగ్స్‌కు అనుమతి ఇవ్వాల్సిందిగా విన్నవించుకుంటాం’’ అని ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ అధ్యక్షుడు బీఎన్ తివారీ పేర్కొన్నారు. -
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు
క్రైస్ట్‌చర్చ్: ఒకవైపు తరచూ గాయాల బారిన పడుతుండటం... మరోవైపు కాబోయే భార్యతో అమెరికాలో స్థిరపడే అవకాశం రావడం... వెరసి న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ కోరె అండర్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని... క్లబ్ క్రికెట్లో కొనసాగాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ మేరకు అమెరికాలోని మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ)తో అండర్సన్ మూడేళ్లపాటు ఒప్పందం చేసుకున్నాడు. న్యూజిలాండ్ తరఫున 13 టెస్టులు, 49 వన్డేలు, 31 టి20 మ్యాచ్‌ల్లో పాల్గొన్న అండర్సన్ మొత్తం 2,277 పరుగులు చేశాడు. 90 వికెట్లు తీశాడు. ‘ఈ నిర్ణయాన్ని సులువుగా తీసుకోలేదు. రాబోయే కాలంలో ఏం చేయాలనుకుంటున్నానో ఇప్పుడే నిర్ణయించుకున్నాను. నా కాబోయే భార్య మేరీ మార్గరెట్ అమెరికాలో పుట్టి పెరిగింది. నా కోసం ఆమె ఎన్నో త్యాగాలు చేసింది. మేజర్ లీగ్ క్రికెట్ రూపంలో అమెరికాలో ఉండేందుకు, వీలైతే అక్కడే స్థిరపడేందుకు నాకు అవకాశం లభించింది. దాంతో భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని 29 ఏళ్ల అండర్సన్ తెలిపాడు. 2014 జనవరి 1న విండీస్‌పై అండర్సన్ 36 బంతుల్లో సెంచరీ సాధించి వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. 2015లో వెస్టిండీస్‌పైనే డివిలియర్స్ 31 బంతుల్లోనే శతకం బాది ఈ రికార్డును బద్దలు కొట్టాడు. -
సుశాంత్ సోదరి శ్వేత ఆకస్మిక నిర్ణయం
సాక్షి, ముంబై: దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సోదరి శ్వేతా సింగ్ కీర్తి సంచలన నిర్ణయం తీసుకున్నారు. సోదరుడు సుశాంత్ మరణం తరువాత సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ వస్తున్న ఆమె సడన్ గా సోషల్ మీడియా నుంచి నిష్క్రమించారు. ట్విటర్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను బుధవారం తొలగించారు. జస్టిస్ ఫర్ సుశాంత్ అంటూ పోరాడుతున్న శ్వేతా తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం వెనుక కారణాలు ఇంకా వెలుగులోకి రాలేదు. సుశాంత్ తమను వీడి నేటితో (అక్టోబర్14) నాలుగు నెలల అయిన సందర్భంగా "నిజమైన ప్రేరణ" అంటూ ఒక వీడియోను కూడా ఆమె షేర్ చేశారు. ఇంతలోనే ఆమె తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. అయితే ఫేస్ బుక్ అకౌంట్ మాత్రం యాక్టివ్ గానే ఉంది. మరోవైపు సుశాంత్ అనుమానాస్పద మరణం కేసులో రాబ్తా డైరెక్టర్ దినేష్ విజన్ కార్యాలయం, ఇంటిపైనా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం దాడులు చేసింది. మనీలాండరింగ్ కోణంపై దర్యాప్తులో భాగంగా దినేష్ విజన్‌తో సంబంధం ఉన్న నాలుగు చోట్ల ఈడీ సోదాలు నిర్వహించింది. 2016 లో రాబ్తా మూవీకిగాను సుశాంత్‌కు చేసిన చెల్లింపులపై దర్యాప్తు చేస్తోంది.