govt offices
-
ఆ మూడ్రోజులు ‘ఢిల్లీ’కి సెలవు..
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ జి–20 శిఖరాగ్ర సదస్సుకు సమాయత్తమవుతోంది. సెపె్టంబర్ 8, 9, 10వ తేదీల్లో జరిగే ఈ సదస్సును అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించింది. సదస్సు దృష్ట్యా వచ్చే నెల 8 నుంచి మూడ్రోజుల పాటు ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవులు ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సదస్సుకు హాజరవుతున్న భాగస్వామ్య దేశాల నేతల భద్రత దృష్ట్యా ఆ మూడు రోజులూ లుటియన్స్ ఢిల్లీలోని అన్ని మాల్స్, మార్కెట్లను మూసి ఉంచాలన్న పోలీసు శాఖ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ సక్సేనా ఆమోదం తెలిపారు. అంతేకాకుండా, రాజధానిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యా సంస్థలు, బ్యాంకులు, దుకాణాలు, వాణిజ్య వ్యాపార సంస్థలను మూసివేయనున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా సుప్రీంకోర్టు, సెంట్రల్ సెక్రటేరియట్ సహా కొన్ని మెట్రో స్టేషన్లు మూసివేయనున్నారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు నిర్దేశిత ప్రాంతాల్లో ప్రభుత్వ బస్సుల రాకపోకలను గణనీయంగా తగ్గించనున్నారు. సదస్సుకు 20 దేశాల అధినేతలు సహా 14 అంతర్జాతీయ సంస్థల అధిపతులు హాజరయ్యే అవకాశం ఉంది. హాజరయ్యే ముఖ్యుల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, యూకే ప్రధాని రిషి సునాక్, జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిదా, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ల తదితరులున్నారు. హోటళ్లకు పెరిగిన గిరాకీ... జీ20 సదస్సు నేపథ్యంలో ఢిల్లీ సహా, గురుగ్రావ్, నోయిడాల్లోని పెద్ద హోటళ్లకు గిరాకీ పెరిగింది. ప్రపంచ నాయకులతో పాటు వారి ప్రతినిధి బృందాలు, భారీ రక్షణ, మీడియా బృందాలు ముందుగానే భారత్ చేరుకుంటుండటంతో టాప్ ఫైవ్ స్టార్ హోటళ్లలో బుకింగ్‌లు పెరిగాయి. సెపె్టంబర్ 6 నుంచి 12 మధ్య అన్ని ఫైవ్ స్టార్ హోటళ్లు పూర్తిగా బుక్ అయ్యాయని తెలుస్తోంది. హోటల్ గదుల ధరలు కూడా భారీగా పెరిగాయి. ఎయిర్‌పోర్ట్‌కి సమీపంలోని ఏరోసిటీలోని హోటల్లో ఉత్తమమైన సూట్ ఒక రాత్రికి రూ.20 లక్షల చొప్పున కోట్ చేశారని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పార్లమెంట్‌కు కూతవేటు దూరంలోని జన్‌పథ్ సమీపంలోని ఒక హోటల్లో ప్రధాన సూట్‌కు ఒక్క రాత్రికి రూ.15 లక్షలకు బుక్ అయిందని అవి వెల్లడించాయి. -
ఈ–వ్యర్థాల సేకరణ కేంద్రాలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పేరుకుపోతున్న ఎలక్ట్రానిక్ వ్యర్థాలను (ఈ–వేస్ట్‌ను) పర్యావరణహితంగా తొలగించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. పాలనలో పారదర్శకత కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని సేవలను ఆన్లైన్ విధానంలో అందిస్తుండడంతో ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ–వేస్ట్ భారీగా పెరిగిపోతుండటాన్ని సర్కారు గుర్తించింది. ఏటా ప్రభుత్వ కార్యాలయాల నుంచి వెయ్యి టన్నుల ఈ–వేస్ట్ ఉత్పత్తి అవుతున్నట్లు ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. కంప్యూటర్లు, ట్యాబులు, మొబైల్ ఫోన్లు, రూటర్లు, స్విచ్‌లు, వైర్లు వంటి వాటి కాలపరిమితి తీరిపోయి పనిచేయనివాటిని సేకరించి రీసైక్లింగ్, డిస్పోజబుల్ చేసేవిధంగా ఒక వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఈ వేస్ట్ సేకరణకు నోడల్ ఏజెన్సీగా ఏపీ టెక్నాలజీస్ సర్వీసెస్ (ఏపీటీఎస్)ని నియమించింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల మేరకు ఈ–వ్యర్థాలను రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఈ–వ్యర్థాలను సేకరించి వాటిని తీసుకెళ్లి రీసైక్లింగ్, రీ–ఫర్‌బిషింగ్, డిస్పోజబుల్ చేసే బాధ్యతల్ని అప్పగించేందుకు ఏపీటీఎస్ టెండర్లు పిలిచింది. ఆసక్తిగల సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, కార్యాలయాలు, సంస్థల నుంచి ఈ–వేస్ట్ సేకరించే విధంగా కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు. ఎలక్ట్రానిక్ వ్యర్థాల్లో 40 శాతం లెడ్ ఉంటుంది. మొత్తం 75 శాతం భార లోహాలను కలిగి ఉండటంతో ఇవి పర్యావరణానికి పెనుముప్పుగా పరిణమించాయి. టెండర్ కమ్ ఆక్షన్ విధానంలో బిడ్డర్‌ను ఎంపిక చేయనున్నామని, అత్యధిక ధర కోట్‌చేసిన సంస్థకు ఈ బాధ్యతను అప్పగిస్తామని ఏపీటీఎస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. -
దీపావళి దందా.. ప్రతి ఏడాది ఇంతే!
సాక్షి, చెన్నై: దీపావళి వేళ అధికారులు, సిబ్బంది మామూళ్ల మత్తులో జోగుతున్నారు. దీంతో 46 ప్రభుత్వ విభాగాలపై విజిలెన్స్ అవినీతి నిరోధక విభాగం దృష్టి సారించింది. వివరాలు.. దీపావళి వస్తోందంటే చాలు కొన్ని శాఖల్లో చందాలు, మామూళ్ల పేరిట జరిగే దందా తారస్థాయిని చేరుతుంది. ప్రధానంగా రిజిస్ట్రేషన్లు, గ్రామీణాభివృద్ధి, రెవెన్యూ, పరిశ్రమలు, రవాణా, రహదారులు, అటవీ, వాణిజ్యం, అగ్నిమాపకం, పర్యావరణం, పౌర సరఫరాలు. ఎక్సైజ్, వ్యవసాయం విభాగాల్లో వసూళ్లు జోరందుకున్నాయి. ఈ సమాచారంతో విజిలెన్స్, అవినీతి నిరోధక శాఖ అధికారుల శుక్ర, శనివారం ఆయా కార్యాలయాల్లో దాడులు చేపట్టారు. రూ. రెండు కోట్ల మేరకు నగదు లభ్యం సోదాల్లో అత్యధికంగా తిరువారూర్ డివిజన్ ఇంజినీరింగ్ గెస్టుహౌస్‌లో రూ. 75 లక్షలు పట్టుబడింది. అలాగే, నామక్కల్ రహదారుల శాఖ కార్యాలయంలో రూ. 8.77 లక్షలు, విరుదానగర్ గ్రామీణాభివృద్ధి అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంలో రూ. 12.53 లక్షలు, కళ్లకురిచ్చి వ్యవసాయ కార్యాలయంలో రూ.4.26 లక్షలు, తిరునల్వేలి రహదారుల విభాగంలో రూ.3.55 లక్షలు, కృష్ణగిరి చెక్ పోస్టులో రూ. 2.20 లక్షల, తిరువణ్ణామలై బీడీఓ కార్యాలయంలో రూ. 1.31 లక్షలు, నాగపట్నం బీడీఓ కార్యాలయంలో రూ.1.19 లక్షలు, తిరుపత్తూరు ఎక్స్‌జ్ కార్యాలయంలో రూ. 1.01 లక్షలు పట్టుబడ్డాయి. మదురై, శివగంగై, కోవై, కరూర్, సేలం, పుదుకోట్టై, ధర్మపురి, చెంగల్పట్టు తదితర జిల్లాలో సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. డెల్టా జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిపిన సోదాలలో రూ. 78 లక్షలు పట్టుబడింది. చదవండి: అన్నదమ్ములతో మహిళ వివాహేతర సంబంధం.. రెండు సార్లు పారిపోయి.. -
‘నేను అవినీతి ఉద్యోగిని కాను’.. అని బోర్డు పెట్టి..
బనశంకరి(కర్ణాటక): రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పే సీఎం అభియాన్ పేరుతో అవినీతి ఆరోపణలు గుప్పించడంతో బొమ్మై ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తోంది. పేసీఎంకు సమాధానంగా ప్రభుత్వ కార్యాలయాల్లో లంచ వ్యతిరేక ప్రచారోత్సవం చేపట్టనుంది. నాకు ఎవరూ లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను అవినీతి ఉద్యోగి/ అధికారిని కాదు అనే నినాదంతో అక్టోబరు 2 నుంచి 20వ తేదీ వరకు అభియానను నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. పై నినాదంతో అన్ని ఆఫీసుల్లో బోర్డులు పెట్టాలని తెలిపారు. కాగా ఇటీవల యూపీఐ పేమెంట్ యాప్ పేటీఎం తరహాలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఫోటోన్ని ముద్రించిన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అస్త్రంగా మార్చుకుంది. ఈ ఫోటోని క్యూఆర్ కోడ్‌తో ‘పేసీఎం’ పోస్టర్ల లా ప్రింట్రింగ్ చేసి బెంగళూరు నగరంలో ఏర్పాటు చేసింది. ఆ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసినట్లయితే.. వినియోగదారులు నేరుగా ‘40 శాతం సర్కార్’ వెబ్‌సైట్‌కు తీసుకెళ్తుంది. ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు ఈ వెబ్‌సైట్‌ను కాంగ్రెస్ ప్రారంభిన సంగతి తెలిసందే. చదవండి: కాంగ్రెస్ 'పేసీఎం' పోస్టర్లో నటుడి ఫోటో.. కోర్టుకెళ్తానని వార్నింగ్ -
టైం వచ్చింది ప్యాక్ చేయండి.. ప్రభుత్వ ఆఫీసులు ఖాళీ చేస్తున్న ఎయిరిండియా
ప్రైవేట్ దిగ్గజం టాటా గ్రూప్‌లో భాగమైన నేపథ్యంలో విమానయాన సంస్థ ఎయిరిండియా.. ప్రభుత్వ అధీనంలోని ప్రాపర్టీల నుంచి ఖాళీ చేయాలని నిర్ణయించుకుంది. విస్తార సహా గ్రూప్‌లోని ఇతర ఎయిర్‌లైన్స్‌తో పాటు వచ్చే ఏడాది మార్చి నుంచి ఒకే దగ్గర నుంచి కార్యకలాపాలు నిర్వహించనుంది. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ ఎయిరిండియాను టాటా గ్రూప్ ఈ ఏడాది జనవరిలో రూ. 18,000 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఎయిరిండియా .. ప్రభుత్వ భవంతుల్లోనే కార్యకలాపాలు సాగిస్తోంది. ఢిల్లీ, ముంబై సహా వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వానికి చెందిన హౌసింగ్ కాలనీల నుంచి ఖాళీ చేయాలంటూ తమ సిబ్బందికి ఎయిరిండియా మే నెలలోనే సూచించింది. తాజాగా ఈ నెల నుంచి ఖాళీ చేసే ప్రక్రియ ప్రారంభం అవుతుందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఢిల్లీ కార్యాలయాల్లోని సిబ్బంది తాత్కాలికంగా గురుగ్రామ్‌లోని కార్యాలయం నుంచి పని చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కొత్తగా నిర్మిస్తున్న వాటికా కాంప్లెక్స్‌కి వచ్చే ఏడాది తొలినాళ్లలో మారతారు. ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లతో పాటు టాటా గ్రూప్‌నకు విస్తార విమానయాన సంస్థలో 51 శాతం (సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో జేవీ), ఎయిర్ఏషియా ఇండియాలో 83.67 శాతం వాటాలు ఉన్నాయి. చదవండి: గూగుల్ మ్యాప్స్‌లో కొత్త ఫీచర్.. ఇకపై ఆ సమస్య ఉండదబ్బా! -
ప్రభుత్వాఫీసుల్లోనూ ఫేస్ రికగ్నిషన్ యాప్
సాక్షి, అమరావతి: త్వరలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ వ్యవస్థను తీసుకురానున్నామని.. అందులో భాగంగా తొలుత విద్యాశాఖలో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. విజయవాడలో గురువారం ఉపాధ్యా య సంఘాలతో ఆయన సమావేశమయ్యారు. పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల అటెండెన్స్ నమోదు కోసం రూపొందించిన యాప్ వినియోగంలో ఉన్న అపోహలు, ఎదురవుతున్న ఇబ్బందులపై ఈ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించారు. సమావేశం అనంతరం బొత్స మీడియాతో మాట్లాడు తూ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి ఆఫీస్ సబార్డినేట్ వరకు అందరూ ఈ ఫేస్ రికగ్నిషన్ యాప్‌నే వినియోగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, అందులో భాగంగా తొలుత విద్యాశాఖ లో దీనిని ప్రవేశపెట్టామన్నారు. అటెండెన్స్ యాప్ విషయంలో ఉపాధ్యాయులు ఎంతమాత్రం ఆందోళ న చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టంచేశా రు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ఉద్యోగుల పక్షపాత ప్రభుత్వమని మంత్రి అన్నారు. విద్యార్థుల బాగోగులు, మంచి ప్రమాణాలతో విద్యను అందించడమే లక్ష్యంగా, పూర్తి సానుకూల దృక్పథంతోనే విధానపరమైన నిర్ణయా లు తీసుకుంటున్నామని, వాటిని అమలుచేయడంలో ఏమైనా సమస్యలు ఎదురైతే వాటిని అధిగమించ డానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని బొత్స తెలిపా రు. విద్యాశాఖలో ఉపాధ్యాయుల అటెండెన్స్‌కు సం బంధించిన యాప్ విషయంలో కొంత సమాచార లోపం వచ్చిందని.. దానిని సరిదిద్దే క్రమంలో ఆయా సంఘాలతో సమావేశం నిర్వహించి వారి సందేహా లను నివృత్తిచేసే చర్యలు చేపట్టామన్నారు. వారి అభ్యంతరాలను పరిగణనలోనికి తీసుకుని కొన్ని మార్పులు చేర్పులు చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. పాఠశాలకు ఆలస్యంగా వస్తే ఆ రోజును సెలవుగా పరిగణిస్తారన్న ప్రచారం పై మంత్రి స్పష్టతనిస్తూ.. ఉద్యోగుల హాజరు విషయంలో ఏళ్ల తరబడి ఉన్న నిబంధనలనే అమలుచేస్తున్నామని, కొత్తగా ఏమీ చేర్చలేదన్నారు. మూడు సార్లకు మించి నాలుగోసారి ఆలస్యంగా వస్తే హాఫ్ డే లీవ్ కింద పరిగణించడం తప్ప కొత్త నిబంధనలేమీ పెట్టలేదని ఆయన స్పష్టంచేశారు. రాష్ట్రంలో 1.83 లక్షల మంది ఉపాధ్యాయులు ఉంటే, ఇంతవరకు దాదాపుగా లక్ష మంది యాప్‌లో రిజిస్టర్ చేసుకున్నారని, మిగిలిన వారందరూ కూడా యా ప్ను డౌన్లోడ్ చేసుకుని దాని వినియోగాన్ని అల వాటు చేసుకునేందుకు 15 రోజులను ట్రైనింగ్ పీరి యడ్గా పరిగణించాలని నిర్ణయించామన్నారు. 5 జూనియర్ కాలేజీలు క్లస్టర్ కళాశాలలుగా మార్పు మరోవైపు.. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురంలోని ఐదు జూనియర్ కాలేజీలను గుర్తించి వాటిని క్లస్టర్ జూనియర్ కాలేజీలుగా అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. వీటిల్లో వర్చువల్ క్లాస్ రూమ్స్, లాంగ్వేజ్ల్యాబ్స్, డిజిటల్ బోర్డ్స్ ఇతర ఆధునిక మౌలిక సదుపాయాల ఏర్పాటుపై చర్చిం చారు. ఇంటర్ విద్యాశాఖ సర్వీస్ అంశాలపై ఇంట ర్మీడియట్ విద్యామండలి కార్యాలయంలో ఆయన అధికారులతో సమావేశమయ్యారు. ప్రిన్సిపాళ్ల పదోన్నతుల సమస్యలపై చర్చించి పరిష్కారం దిశగా పలు ఆదేశాలు జారీచేశారు. కొత్తగా విశాఖపట్నంలో రీజినల్ జాయింట్ డైరెక్టర్ కార్యాలయానికి ఆమోదం తెలిపారు. నాడు–నేడు కింద ఉన్న అన్ని జూనియర్ కళాశాలల్లోని అన్ని తరగతులకు డిజిటిల్ బోర్డుల ఏర్పాటుకు మంత్రి అంగీకరించారు. సమావేశంలో మండలి కార్యదర్శి శేషగిరిబాబు కూడా పాల్గొన్నారు. ఇదీ చదవండి: ‘టీడీపీ కుట్ర బట్టబయలు.. ఫేక్ సర్టిఫికెట్తో దొరికిపోయిన బాబు అండ్ గ్యాంగ్’ -
ప్రభుత్వ ఆఫీసుల్లో ఫొటోలు, వీడియోలపై నిషేధం
శివాజీనగర: ప్రభుత్వ కార్యాలయాల్లో ఇకపై ప్రజలు ఫొటో తీయటానికి, వీడియోలు చిత్రీకరించడానికి ఆస్కారం లేకుండా కర్ణాటక ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ప్రైవేట్ వ్యక్తులు కార్యాలయాల్లోకి వచ్చి ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో ఉంచుతున్నారు. దీనివల్ల మహిళా ఉద్యోగుల గౌరవానికి భంగం వాటిల్లుతోందని, అనధికారికంగా ఫొటోలు, వీడియోలు తీయకుండా చర్యలు తీసుకోవాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ప్రభుత్వానికి విన్నవించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం కూలంకుషంగా పరిశీలించింది. ఇకపై పనివేళల్లో అనధికారికంగా ఫొటోలు, వీడియోలు తీయరాదని ఆదేశిస్తూ సిబ్బంది, పరిపాలనా విభాగం కార్యదర్శి కే.వెంకటేశప్ప ఆదేశాలు జారీచేశారు. గవర్నర్ ఆదేశాల మేరకు ఈ ఉత్తర్వులు శుక్రవారం నుంచే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. కాగా చట్టవిరుద్ధంగా ఫొటోలు, వీడియోలు తీసేవారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే విషయాన్ని ఆ ఉత్తర్వుల్లో పేర్కొనలేదు. -
సీఎం సంచలన నిర్ణయం.. వారంలో ఐదు రోజులే పని దినాలు..
ఇంపాల్: మణిపూర్‌లోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి అన్ని కార్యాలయాలు, ఏజెన్సీలు, ప్రభుత్వ రంగ సంస్థలు సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే పని చేయనున్నాయి. అంటే వారంలో ప్రభుత్వ ఉద్యోగుల పని దినాలను ప్రభుత్వం ఐదు రోజులకు కుదించింది. మార్చి 22న సీఎం బీరెన్ సింగ్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మణిపూర్ ప్రభుత్వ డిప్యూటీ సెక్రటరీ సునంద తోక్చోమ్ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం.. ఒక్క వెకేషన్ డిపార్ట్మెంట్ మినహా అన్ని ఆఫీసులకు ఇదే నియవర్తించనుంది. కాగా, ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లో ఆయా కార్యాలయల టైమింగ్స్‌ను కూడా కుదించారు. మార్చి నుంచి అక్టోబర్ వరకు ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పని చేయనున్నాయి. ఇక శీతాకాలమైన నవంబర్-ఫిబ్రవరిలో అరగంట తగ్గించి ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు కార్యాలయాలు తెరిచి ఉంటాయని తెలిపారు. మధ్యాహ్నం 1 నుంచి 1.30 గంటల వరకు భోజన విరామం ఉంటుందని పేర్కొన్నారు. ఇక ప్రభుత్వ పాఠశాలలు కూడా ఐదు రోజుల్లో ఉదయం 8 గంటలకే తెరుచుకోనున్నాయి. అయితే, సెలవు దినాల్లో అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా ఆయా విభాగాలు రోస్టర్ విధానాన్ని రూపొందించనున్నాయి. సీఎం బీరెన్ సింగ్ తన ప్రభుత్వం మొదటి వంద రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాల గురించి ప్రకటించారు. అందులో భాగంగా మొదటగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. -
వారిలో 50% మందికి వర్క్ ఫ్రం హోమ్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ముందుజాగ్రత్తగా ప్రభుత్వ కార్యాలయాల్లోని అండర్ సెక్రటరీ స్థాయికి దిగువన ఉండే సిబ్బందిలో 50% మందికి వర్క్ ఫ్రం హోమ్‌కు అనుమతిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. భారత ప్రభుత్వ అన్ని మంత్రిత్వశాఖలు, విభాగాలకు తక్షణం వర్తించే ఈ ఆదేశాలు జనవరి 31వ తేదీ వరకు అమల్లో ఉంటాయని సోమ వారం తెలిపింది. వాస్తవ సిబ్బంది సంఖ్యలో 50% మంది మాత్రమే ఆఫీసు విధులకు హాజరుకావాలని, మిగతా సగం మందికి వర్క్‌ఫ్రం హోమ్‌ను అమలు చేయాలని వివరించింది. దివ్యాంగులు, గర్భిణులకు ఆఫీసు విధుల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపింది. అదేవిధంగా, కంటెయిన్మెంట్ జోన్లలో నివాసం ఉండే వారికి కూడా ఆయా జోన్లను డీ నోటిఫై చేసే వరకు ఆఫీసు విధుల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపింది. ఉద్యోగులంతా ఒకే సమయం లో కార్యాయాలకు రాకుండా వేర్వేరు పనివేళలను అమలు చేయాలని పేర్కొంది. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ హాజరు విధానాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. సిబ్బంది అంతా హాజరు పట్టికలో సంతకాలు చేసి తమ హాజరును నమోదు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. -
ఇక ఎప్పటిలానే ప్రభుత్వ కార్యాలయాల పనివేళలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఇక రెగ్యులర్‌గా పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. తక్షణమే ఈ విధానం అమల్లోకి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జిల్లా కార్యాలయాలు, ఉప కార్యాలయాలు, జిల్లా నియంత్రణలో ఉండే కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యాలయాలకు ప్రతి ఆదివారంతో పాటు రెండో శనివారం సెలవు ఉంటుందని తెలిపారు. అలాగే రాష్ట్రస్థాయిలో సచివాలయంతో పాటు శాఖాధిపతులు కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, హైదరాబాద్ నుంచి అమరావతికి తరలివచ్చిన ఇన్స్టిట్యూషన్స్ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటలవరకు పనిచేయాలని పేర్కొన్నారు. ఈ కార్యాలయాలకు వారంలో ఐదు రోజులు పనిదినాల్లో భాగంగా 27–06–2021 నుంచి ఏడాది పాటు ప్రతి శని, ఆదివారాలు సెలవు ఉంటుందని స్పష్టం చేశారు. రెగ్యులర్ పనివేళలను తప్పనసరిగా పాటించాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. -
కొత్త సొబగులు.. సకల వసతులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రెండేళ్లుగా వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలతో గ్రామసీమల ముఖచిత్రం సమూలంగా మారిపోతోంది. రాష్ట్రంలో ప్రతి 2 వేల జనాభాకు ఒక గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేసి, గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని ఆవిష్కృతం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. గ్రామాల రూపు రేఖలను సమూలంగా మార్చివేసే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయా గ్రామాల్లోని అన్ని వర్గాల ప్రజలకు అక్కడే సకల మౌలిక వసతులను కల్పించేందుకు భారీ ఎత్తున పలు అభివృద్ధి కార్యక్రమాలకు వేల కోట్ల రూపాయలు వ్యయం చేస్తున్నారు. ప్రధానంగా గ్రామ పంచాయతీ, సచివాలయాలకు పక్కా శాశ్వత భవనాల నిర్మాణానికి ఏకంగా రూ.4,186.83 కోట్లు ఖర్చు చేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 10,929 గ్రామ సచివాలయాలకు కొత్త భవనాల నిర్మాణం ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే 4,418 గ్రామ సచివాలయ భవనాల నిర్మాణం పూర్తయింది. మరో 4,129 పూర్తికానున్న దశలో ఉన్నాయి. ఇంకో 1,822 భవనాలు గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ దశలో ఉన్నాయి. మిగతా భవనాలు బేస్మెంట్, వివిధ స్థాయిల్లో ఉండగా వాటి నిర్మాణాలను వేగవంతం చేయాలని ఇటీవల స్పందన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఆదేశించారు. వచ్చే నెలాఖరు నాటికి మొత్తం గ్రామ సచివాలయ భవనాల నిర్మాణాలను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక సీఎస్ అజయ్ జైన్ తెలిపారు. ఇప్పటికే నిర్మాణాలు పూర్తయిన గ్రామ సచివాలయ భవనాలను ఆయా జిల్లాల్లో మంత్రులు ప్రారంభిస్తున్నారని జైన్ పేర్కొన్నారు. ఈ భవనాల్లో సచివాలయ ఉద్యోగుల కార్యాలయంతో పాటు సమావేశ మందిరం, సందర్శకుల హాలుతో పాటు గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నారు. గ్రామాలకు డిజిటల్ విప్లవం ► ప్రస్తుతం మండలాలకే పరిమితమైన వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యాన్ని గ్రామ సచివాలయాల స్థాయికి తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ప్రతి గ్రామ సచివాలయంలో డిజిటల్ స్క్రీన్లను ఏర్పాటు చేయనున్నారు. వీటిని బహుళ ప్రయోజనాలకు వినియోగిస్తారు. ► ముఖ్యమంత్రితో పాటు అధికారులు నేరుగా గ్రామ సచివాలయాల ఉద్యోగులు, లేదా ఆయా గ్రామాల్లోని లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడానికి ఉపయోగ పడుతుంది. పథకాలతో పాటు లబ్ధిదారుల జాబితాలను ప్రస్తుతం పోస్టర్ల ద్వారా గ్రామ సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నారు. ► పేర్లు, సంఖ్యలో మార్పులు చేయాలంటే మరో పోస్టర్‌ను ప్రదర్శించాల్సి వస్తోంది. అలా కాకుండా వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం అందుబాటులోకి వస్తే డిజిటల్ డిస్ప్లే ద్వారా లబ్ధిదారుల సంఖ్యను, పథకాలను ప్రదర్శిస్తారు. సెంట్రల్ సర్వర్ నుంచి లబ్ధిదారుల పేర్లు, సంఖ్య మార్చేందుకు వీలు కలుగుతుంది. ► ఏ నెలలో నవరత్నాల్లో ఏ పథకం ఎప్పుడు అమలవుతుందనే వివరాలను కూడా డిజిటల్ డిస్ప్లేలో ప్రదర్శిస్తారు. ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం కూడా టీవీల ద్వారా తెలియజేస్తారు. దీని వల్ల పోస్టర్ల వ్యయం తగ్గుతుంది. ప్రతి గ్రామ పంచాయతీలో డిజిటల్ లైబ్రరీ ప్రతి గ్రామ పంచాయతీలో డిజిటల్ లైబ్రరీలను ఏర్పాటు చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ నాటికి సుమారు 4 వేల గ్రామాలకు ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇచ్చేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అన్ని గ్రామ పంచాయతీల్లో రెండేళ్లలో డిజిటల్ లైబ్రరీల ఏర్పాటు పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోంది. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలను సకాలంలో అందించేందుకు గ్రామ సచివాలయాన్నింటినీ కంప్యూటరీకరించారు. ప్రభుత్వ పథకాల మంజూరుకు సాంకేతిక పరిజ్ఞానం కీలకంగా తయారైంది. ఇందుకోసం ప్రత్యేకంగా డిజిటల్ అసిస్టెంట్‌ను నియమించారు. గ్రామ సచివాలయ స్థాయి నుంచి జిల్లా కలెక్టర్, రాష్ట్ర సచివాలయ స్థాయి వరకు ఉత్తర ప్రత్యుత్తరాలతో కూడిన పాలన అంతా ఆన్లైన్లోనే అందుబాటులోకి వచ్చింది. అర్హులైన లబ్ధిదారులకు పథకాల మంజూరు అంతా ఆన్లైన్లోనే కొనసాగుతోంది. ఇందుకోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా 30,008 కంప్యూటర్లు, 15,004 ప్రింటర్లు, 2,67,224 సెల్ఫోన్లను సమకూర్చింది. -
పరిశుభ్రంగా పల్లెలు
సాక్షి, అమరావతి: గ్రామాల్లో ప్రజలందరూ స్వచ్ఛమైన వాతావరణంలో జీవనం సాగించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘జగనన్న స్వచ్ఛ సంకల్పం’ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు అడుగులు వేస్తోంది. పల్లెల్లో సంపూర్ణ పారిశుధ్యమే లక్ష్యంగా భారీ ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగా.. గ్రామీణ ప్రాంతాలలో మురుగు కాల్వలను శుభ్రం చేయడంతో పాటు ప్రభుత్వ స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాలు, సచివాలయాలు వంటి ప్రభుత్వ కార్యాలయాల్లోని మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు యంత్రాలను కొనుగోలు చేయనుంది. అలాగే, పల్లెల్లో రోడ్లపై మురుగునీటి ప్రవాహం ఓ పెద్ద సమస్య. సైడ్ కాల్వలు శుభ్రం చేసేందుకు చాలాచోట్ల కూలీలు ముందుకు రాకపోవడం.. ఒకవేళ వచ్చినా కూలీ రేటు ఎక్కువగా డిమాండ్ చేస్తుండడంతో ఈ పని గ్రామ పంచాయతీలకు పెనుభారంగా మారింది. దీంతో ఈ సమస్యకు కూడా రాష్ట్ర ప్రభుత్వం శాశ్వతంగా చెక్ పెట్టనుంది. ప్రతి మండలంలోని మురుగు కాల్వల్లో పూడిక తీయడంతో పాటు కాల్వల పక్క పెద్దస్థాయిలో పెరిగే పిచ్చి మొక్కలను తొలగించడానికి డివిజన్‌కు ఒకటి చొప్పున బాబ్‌కాట్ మిషన్లను గ్రామాలకు అందుబాటులో ఉంచనుంది. దీనికి తోడు.. గ్రామాల్లో సాధారణ మురుగు తొలగించడానికి మండలానికి ఒకటి చొప్పున మెకనైజ్డ్ డ్రెయిన్ క్లీనింగ్ మిషన్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ట్రాక్టరు నడపడం వచ్చినవారు ఈ మిషన్ ద్వారా రోజుకు 6–8 కి.మీ. పొడవున మురుగు కాల్వలను శుభ్రంచేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వీటిద్వారా మండల పరిధిలోని ప్రతి గ్రామంలో ఏడాదికి కనీసం రెండు మూడు సార్లు మురుగుకాల్వలన్నింటినీ శుభ్రం చేయించనున్నారు. ఇందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 660 మిషన్లను గ్రామీణ ప్రాంతాలలో అందుబాటులో ఉంచనుంది. ప్రతీ పంచాయతీకి టాయిలెట్ క్లీనర్ గ్రామంలో ఉండే కమ్యూనిటీ టాయిలెట్లతో పాటు ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, గ్రామ సచివాలయం సహా ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో మరుగుదొడ్లను కూడా ప్రతిరోజూ శుభ్రం చేసేందుకు ప్రతి గ్రామ పంచాయితీకి ఒక హైపవర్ టాయిలెట్ క్లీనర్ మిషన్‌ను కూడా రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలకు అందజేయనుంది. బ్యాటరీ ద్వారా పనిచేసే ఈ మిషన్‌ను సాధారణ నైపుణ్యం ఉండే ప్రతి ఒక్కరూ ఉపయోగించవచ్చని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 13,371 గ్రామ పంచాయితీలకుగాను ప్రస్తుతం 2,640 చోట్ల ఈ మిషన్లు అందుబాటులో ఉన్నాయి. మిగిలిన పంచాయితీల్లోనూ వీటిని ఏర్పాటుచేయనున్నారు. ఇందుకోసం పంచాయతీరాజ్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్లు ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తున్నాయి. ఫాగింగ్ మిషన్లతో దోమల నివారణ ఇక గ్రామాల్లో దోమల నివారణ కోసం ప్రతి గ్రామ పంచాయతీకి ఒకటి చొప్పున ఫాగింగ్ మెషీన్లను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువస్తోంది. ప్రస్తుతం 2,743 గ్రామాల్లో ఇప్పటికే ఇవి అందుబాటులో ఉండగా, మిగిలిన 10,628 గ్రామాలకు ఒక్కొక్కటి చొప్పున కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. -
అసమర్థ ఉద్యోగులను పంపేయండి
న్యూఢిల్లీ: ముప్పయ్యేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న ఉద్యోగులందరి సర్వీసు రికార్డులను మదింపు చేయాలని, అసమర్థ, అవినీతి అధికారులకు ముందస్తు రిటైర్మెంటు ఇచ్చి ఇంటికి పంపేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. కేంద్ర సివిల్ సర్వీసెస్ (పెన్షన్) రూల్స్, 1972 కింద 56 (జె), 56 (ఐ), 48 (1)(బి) నిబంధనల ప్రకారం... ఉద్యోగి పనితీరును పరిశీలించి ప్రజాప్రయోజనాల దృష్ట్యా అతనికి రిటైర్మెంట్ ఇచ్చి పంపే సంపూర్ణ హక్కు సంబంధిత పై అధికారికి ఉంటుందని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ విడుదల చేసిన ఆదేశాల్లో పేర్కొంది. ముందస్తు రిటైర్మెంట్ ‘శిక్ష’కాదని వివరించింది. ఉద్యోగి 50 లేదా 55 ఏళ్లకు చేరుకున్నాక, 30 ఏళ్ల సర్వీసు పూర్తిచేసుకున్నాక... ప్రజాప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం ఎప్పుడైనా సదరు ఉద్యోగిని ఇంటికి పంపించవచ్చని పేర్కొంది. ఉద్యోగుల సామర్థ్యాన్ని అంచనా వేసి వారిని సర్వీసులో కొనసాగించడంపై ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ అవుతుంటాయని, ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల విషయంలో మరింత స్పష్టత ఇవ్వడానికి, అమలులో ఏకరూపత తేవడానికి తాజా ఆదేశాలు జారీచేశామని సిబ్బంది వ్యవహారాల శాఖ తెలిపింది. రిటైర్ చేయదలచుకున్న ఉద్యోగికి మూడు నెలల నోటీసు ఇవ్వాలని, అలాకాని పక్షంలో మూడునెలల వేతనం ఇచ్చి పంపాలని తెలిపింది. 50 లేదా 55 ఏళ్లకు చేరుకుంటున్న, 30 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకోబోతున్న ఉద్యోగులందరి వివరాలతో కూడిన రిజిస్టర్‌ను ప్రతిశాఖలో నిర్వహించాలని, ఏడాదికి నాలుగుసార్లు ఈ జాబితాను మదింపు చేయాలని ఆదేశించింది. డిజిటల్ లాకర్లోకి పెన్షన్ ఆర్డర్ రిటైరయ్యే ఉద్యోగులకు పెన్షన్‌కు సంబంధించిన పత్రాల కోసం నిరీక్షించే బాధ తప్పనుంది. పెన్షన్ పేమెంట్ ఆర్డర్ (పీపీవో)ను ఎలక్ట్రానిక్ రూపంలో ఇకపై నేరుగా ఉద్యోగుల డిజిటల్ లాకర్‌కు పంపనున్నట్లు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయమంత్రి జితేంద్ర సింగ్ ఆదివారం వెల్లడించారు. పెన్షన్ ప్రక్రియలో ఇక ఆలస్యానికి తావుండదని, అలాగే పెన్షన్ ఆర్డర్ పత్రాలను పోగొట్టుకునే ప్రమాదం ఉండదని మంత్రి తెలిపారు. పౌరులు తమకు సంబంధించిన ముఖ్యమైన పత్రాలన్నింటినీ ఎలక్ట్రానిక్ రూపంలో దాచుకోవడానికి డిజిటల్ లాకర్ ఉపకరిస్తుంది. -
ఒకటీ రెండు కేసులకే మూసేయొద్దు
న్యూఢిల్లీ: కంపెనీలు, సంస్థలు ఒకటీ రెండు కరోనా కేసులు బయటపడిన సందర్భాల్లో తమ కార్యాలయ భవనం లేదా పని ప్రాంతాన్ని మొత్తాన్ని మూసివేయాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. భవనాన్ని శానిటైజ్ చేసి కార్యకలాపాలను ప్రారంభించవచ్చని తెలిపింది. భారీగా కేసులు నిర్ధారణ అయితే ఆ భవనాన్ని 48 గంటలపాటు మూసి ఉంచాలని సూచించింది. భవనాన్ని శానిటైజ్ చేసి, సురక్షితమని ధ్రువీకరించుకున్నాకే ప్రారంభించాలని, సిబ్బంది ‘వర్క్ ఫ్రం హోమ్’విధానంలో పనిచేయాలని పేర్కొంది. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు పని ప్రదేశాల్లో తీసుకోవాల్సిన చర్యలపై సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. కార్యాలయ సిబ్బంది ఎవరైనా ఫ్లూ వంటి లక్షణాలతో బాధపడే వారు ఆఫీసులకు రావద్దని, స్థానిక ఆరోగ్య శాఖ అధికారుల సూచనలు పాటించాలని కోరింది. ఒక గదిలో లేదా ఆఫీసు ప్రాంతంలో ఎవరైనా కోవిడ్–19 సోకిన లక్షణాలతో బాధపడుతుంటే వారిని మరో చోట ఒంటరిగా ఉంచి, వైద్యుని సలహా తీసుకోవాలని సూచించింది. అటువంటి వ్యక్తులు, కోవిడ్–19 అనుమానిత లేక పాజిటివ్ అని తేలితే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపింది. ‘50 శాతం జూనియర్ స్టాఫ్ విధులకు హాజరు కావాలి’ డిప్యూటీ సెక్రెటరీ కంటే తక్కువ స్థాయి పోస్టుల్లో ఉన్న జూనియర్ ఉద్యోగుల్లో 50 శాతం మంది కార్యాలయాల్లో విధులకు హాజరు కావాలని కేంద్ర ప్రభుత్వం సోమవారం స్పష్టం చేసింది. లాక్డౌన్ నేపథ్యంలో ఇప్పటిదాకా 33 శాతం మంది మాత్రమే విధులకు హాజరవుతున్నారు. ఇకపై జూనియర్ ఉద్యోగులు రోజు విడిచి రోజు ఆఫీసులకు వచ్చేలా అన్ని కేంద్ర ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులు రోస్టర్‌ను రూపొందించాలని కేంద్రం ఆదేశించింది. కోవిడ్ కారణంగా తీవ్రమైన హృద్రోగ సమ స్యలు తలెత్తే ప్రమాదం ఉన్నదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. రక్తం గడ్డకట్టడం లాంటి సమస్యలకు కోవిడ్ కారణమౌతోందని, కోవిడ్ మందుల వల్ల హృద్రోగులకు ప్రమాదం జరిగే అవకాశం ఉన్నదని అమెరికాలోని వర్జీనియా వర్సిటీ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. -
ఉద్యోగులేరీ?
సాక్షి, సూర్యాపేట: జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల కొరత వేధిస్తోంది. కలెక్టరేట్‌తో పాటు జిల్లా కేంద్రంలో ఉన్న 64 ప్రధాన శాఖల్లో సుమారు 2వేల మంది ఉద్యోగులు ఉండాల్సి ఉండగా కేవలం 625 మందితో కాలం వెల్లదీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో సకాలంలో ఏ పనీ జరగడం లేదు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలుకు నోచుకోకపోగా, విధులు నిర్వహిస్తున్న సిబ్బందిపై పని భారం తప్పడంలేదు. జిల్లా ఆహార తనిఖీ కార్యాలయంలో కనీసం ఆరుగురు ఉద్యోగులు ఉండాలి. కానీ కేవలం ఒక అధికారి, అటెండర్ మాత్రమే ఉన్నా వీరిని యాదాద్రి భువ నగిరి జిల్లాకు ఇన్చార్జ్గా ని యమించారు. దీంతో ఏడాది కాలంగా కార్యాలయ తాళం తీ యడం లేదు. జిల్లాస్థాయి ప్ర భుత్వ కార్యాలయాల్లో సిబ్బం ది కొరతకు ఇది నిదర్శనం. సర్కారు పథకాలు సకాలంలో ప్రజలకు అందించాలంటే ప్రభుత్వ కార్యాలయాల్లో సరిపడా ఉద్యోగులు ఉండాలి. చిన్న జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు ప్రభుత్వ పథకాలను చేరువ చేయవచ్చని భావించిన రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల విభజన చేసింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఉన్న ఉద్యోగులను మూడు జిల్లాలకు పంచడమే కాకుండా ఇతర జిల్లాల నుంచి కొంత మంది ఎంప్లాయీస్‌ను సూర్యాపేట జిల్లాకు ఆర్డర్టు సర్వ్ పేరుతో పంపింది. అయితే తగినంతమందిని కేటాయించకపోవడంతో జిల్లా స్థాయిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఉద్యోగుల కొరత పట్టిపీడిస్తోంది. ఒకటి రెండు శాఖల్లో ఉద్యోగుల కొరత ఉంటేనే పరిస్థితి దారుణంగా ఉంటుంది. అలాంటిది అన్ని శాఖల్లో అలాంటి పరిస్థితే ఉండడంతో సకాలంలో పనులు జరగడంలేదు. జిల్లా ఏర్పడి మూడేళ్లు కావొస్తున్నా ఉద్యోగుల సమస్య మాత్రం తీరడం లేదు. శాఖల్లో పరిస్థితి.. జిల్లా సమీకృత కలెక్టరేట్‌తో పాటు జిల్లా కేంద్రలో ఉన్న 64 ప్రధాన శాఖల్లో సుమారు 2 వేల మంది ఉద్యోగులు ఉండాలి. కానీ కేవలం 625 మందితో నెట్టుకురావాల్సిన దుస్థితి నెలకొంది. సమీకృత కలెక్టరేట్లో ఉన్న జిల్లా కార్యాలయాల్లో ఉద్యోగుల కొరత స్పష్టంగా కనబడుతోంది. అన్ని శాఖల్లో ప్రధాన్యత కలిగిన జిల్లా రెవెన్యూ కార్యాలయంలో వివిధ సెక్షన్లలో కలిపి 54 మంది ఉద్యోగులు అవసరం ఉండగా 30 మంది మాత్రమే ఉన్నారు. జిల్లా పరిశ్రమల శాఖ కార్యాలయలంలో 15 మంది ఉద్యోగులు ఉండాల్సి ఉండగా 8 మంది ఉద్యోగుల మాత్రమే ఉన్నారు. జిల్లా ఆహార తనిఖీ కార్యాలయంలో కనీసం ఆరుగురు ఉద్యోగులు ఉండాల్సి ఉండగా కేవలం ఒక అధికారి, అటెండర్ మాత్రమే ఉన్నా వీరు కూడా ఇతర మరో జిల్లాలకు ఇన్చార్జ్గా నియమించడంతో గత సంవత్సరం నుంచి కార్యాలయ తాళం తీయడం లేదు. ఇక జిల్లా కార్మిక శాఖలో 12 మంది ఉద్యోగులు ఉండాల్సి ఉండగా కేవలం ఒక జిల్లా అధికారి, ఒక డివిజన్ అధికారి, ఒక జూనియర్ అసిస్టెంట్, ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి కలిపి మొత్తం నలుగురు మాత్రమే ఉన్నారు. అదే విదం గా గ్రామ పంచాయతీ కార్యాలయం, ముఖ్య ప్రణాళిక అధికారి కార్యాలయం, సివిల్ సప్లయ్, పౌరసంబంధాలశాఖ, వ్యవసాయశాఖ, ఉద్యానవనశాఖ, సహకారశాఖ, భూ కొలతలు, పంచాయతీరాజ్ ఇలా అన్ని శాఖల్లో ఉద్యోగుల కొరత వేధిస్తోంది. సక్రమంగా అమలు కాని ప్రభుత్వ పథకాలు ఉద్యోగుల కొరత వల్ల ప్రభుత్వ పథకాలు స క్రమంగా అమలు కావడం లేదు. చిన్న జిల్లాలు ఏర్పడినా ప్రజలు తమ పనుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగక తప్పడం లేదు. ఇదిలా ఉంటే ఉద్యోగులకు పని ఒత్తిడి పెరిగింది. ముఖ్యంగా అధికారులతో పాటు సీనియర్ అసిస్టెంట్లపై అధికభారం పడుతోందని ఆయా ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు నేరుగా బయటకు చెప్పకున్నా తమలో తమే బాధపడుతున్న సందర్భాలూ ఉన్నాయి. -
కశ్మీర్లో పాఠాలు షురూ
శ్రీనగర్/న్యూఢిల్లీ/ఇస్లామాబాద్/వాషింగ్టన్: కశ్మీర్లో సోమవారం పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే చాలా పాఠశాలల్లో విద్యార్థులు తక్కువ సంఖ్యలో హాజరయ్యారు. శ్రీనగర్‌లో 190 ప్రాథమిక పాఠశాలలు తెరుచుకున్నప్పటికీ శాంతిభద్రతల భయంతో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూళ్లకు పంపలేదు. అయితే బెమినాలోని పోలీస్ పబ్లిక్ స్కూల్, ఇతర కేంద్రీయ విద్యాలయాల్లో మాత్రం చెప్పుకోదగ్గ సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. కశ్మీర్లో ఆంక్షలు సడలించినప్పటికీ బలగాల మోహరింపు మాత్రం తగ్గలేదు. ఈ సందర్భంగా బారాముల్లా జిల్లాకు చెందిన ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ..‘పట్టన్, పల్హలాన్, సింఘ్‌పొరా, బారాముల్లా, సోపోర్ పట్టణాల్లో ఆంక్షలు యథాతథంగా కొనసాగుతున్నాయి. జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో మాత్రం పాఠశాలలు తెరుచుకున్నాయి’ అని చెప్పారు. శ్రీనగర్‌లో గత 3 రోజులుగా హింసాత్మక ఘటనలు జరుగుతున్నందున పాఠశాలలు తెరుచుకోలేదని వ్యాఖ్యానించారు. అయితే నగరంలో ప్రశాంతంగా ఉన్న ప్రాంతాల్లో బారికేడ్లను తొలగించి ప్రజలు స్వేచ్ఛగా రాకపోకలు సాగించేలా అధికారులు చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని ఈ నెల 5న రద్దుచేసిన కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లదాఖ్ అని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎలాంటి అల్లర్లు చెలరేగకుండా జమ్మూకశ్మీర్‌లో భారీగా బలగాలను మోహరించారు. భారత రాయబారికి పాక్ సమన్లు భారత డిప్యూటీ హైకమిషనర్‌గా గౌరవ్ అహ్లూవాలియాకు పాక్ ప్రభుత్వం సోమవారం సమన్లు జారీచేసింది. అహ్లూవాలియాను ఇస్లామాబాద్‌లోని తన కార్యాలయానికి పిలిపించుకున్న సార్క్ డైరెక్టర్ జనరల్ మొహమ్మద్ ఫైజల్.. భారత్ మరోసారి కాల్పుల విమరణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపించారు. భారత బలగాల తీరుపై తీవ్ర నిరసన తెలియజేశారు. ఆదివారం ఛిక్రీకోట్, హాట్‌స్ప్రింగ్ సెక్టార్లపై భారత ఆర్మీ జరిపిన కాల్పుల్లో ఇద్దరు అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ఆగ్రహం వ్యక్తంచేశారు. 2017 నుంచి ఇప్పటివరకూ భారత్ 1,970 సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచిందని విమర్శించారు. ట్రంప్ పాక్‌వైపు మొగ్గు చూపొద్దు భారత్–పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా పొరపాటున కూడా పాక్‌వైపు మొగ్గుచూపరాదని అగ్రరాజ్యానికి చెందిన కౌన్సిల్ ఫర్ ఫారిన్ రిలేషన్స్(సీఎఫ్ఆర్) సంస్థ అధ్యక్షుడు రిచర్డ్ ఎన్ హాస్ సూచించారు. ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాక్‌వైపు ఏమాత్రం మొగ్గుచూపినా భారత్ దూరమైపోతుందని హెచ్చరించారు. ఈ విషయమై రిచర్డ్ స్పందిస్తూ..‘భారత్‌ను ఎదుర్కోవడానికి కాబూల్(అఫ్గానిస్తాన్)లో తన మిత్రులు అధికారంలో ఉండాలని పాక్ కోరుకుంటోంది. కాబట్టి పాక్‌ను శాసించే సైనిక, నిఘా వ్యవస్థలు తాలిబన్లను నియంత్రిస్తాయనీ, ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలిస్తాయని నమ్మేందుకు చాలాతక్కువ అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో భారత్‌కు అమెరికా దూరం జరగడం అంత తెలివైన నిర్ణయంకాదు. ప్రజాస్వామ్య భారత్ జనాభా త్వరలోనే చైనాను దాటేస్తుంది. అంతేకాకుండా భారత్ ఐదో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరించబోతోంది. కాబట్టి అమెరికా దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటే ఇండియావైపు మొగ్గడమే శ్రేయస్కరం. ఆసియాలో చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు భారత్ అమెరికాకు సహకరిస్తుంది’ అని తెలిపారు. మరోవైపు కశ్మీర్ సమస్య కారణంగా తాలిబన్–అమెరికాల మధ్య శాంతిచర్చలకు విఘాతం కలుగుతుందన్న పాక్ వ్యాఖ్యలపై అఫ్గానిస్తాన్ ప్రభుత్వం మండిపడింది. జమ్మూకశ్మీర్ భారత్–పాక్‌ల ద్వైపాక్షిక సమస్యనీ, దాన్ని అఫ్గాన్‌తో ముడిపెట్టడం పూర్తిగా బాధ్యతారాహిత్యమేనని స్పష్టం చేసింది. అమిత్ షాతో దోవల్ భేటీ జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ సోమవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ లోయలో దాదాపు 10 రోజులపాటు పర్యటించిన దోవల్.. అక్కడి పరిస్థితిని షాకు వివరించారు. ఈ సందర్భం గా జమ్మూకశ్మీర్‌లో శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, ప్రస్తుతం కొనసాగుతున్న ఆంక్షలపై చర్చించారు. హోంశాఖ కార్యదర్శి రాజీవ్‌గౌబాతో పాటు ఇతర ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. -
యంత్రాలు ఉన్నా ఉపయోగం సున్నా..
సాక్షి, పొన్నలూరు (ప్రకాశం): ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు సంబంధించిన పనులను సకాలంలో చేసి వారికి మైరుగైన సేవలు అందించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చారు. అలాగే మీ–సేవలో నమోదు చేసే పత్రాలను వెంటనే తనిఖీ చేసి అప్లోడ్ చేయడానికి కంప్యూటర్లు, అధికారులు నిర్వహించే వీక్షణ సమావేశాలకు ఎల్ఈడీ ప్రొజెక్టర్‌ను ఏర్పాటు చేశారు. అదే విధంగా విద్యుత్ సరఫరా నిలిచిపోతే ఉద్యోగుల విధులకు ఆటంకం కలగకుండా నిత్యం కొనసాగించేందుకు జనరేటర్లు కూడా సమకూర్చారు. అయితే అధికారుల బాధ్యాతారాహిత్యంతో పాటు పర్యవేక్షణ లేకపోవడంతో కార్యాలయాల్లో అమర్చిన జనరేటర్లు, ఎల్ఈడీ ప్రొజెక్టర్లు నిరుపయోగంగా మారాయి. దీంతో ప్రభుత్వ లక్ష్యంతో పాటు రూ.లక్షల ప్రజల సొమ్ము వృథా అవుతోంది. పనిచేయని ఎల్ఈడీ ప్రొజెక్టర్ మండల అభివృద్ధి అధికారులతో పాటు కిందిస్థాయి ఉద్యోగులతో ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించేందుకు మండల పరిషత్ కార్యాలయంలో ఎల్ఈడీ ప్రొజెక్టర్ ఏర్పాటు చేశారు. కొన్ని రోజులు వరకు వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులతో దీని ద్వారా వీడియో కాన్ఫరెన్సులు, ఇతర సమావేశాలు నిర్వహించారు. ఆ తరువాత సెట్‌బాక్స్ మరమ్మతులకు గురికావడంతో కొన్ని నెలలుగా పనిచేయడం లేదు. దీంతో ఎల్ఈడీ ప్రొజెక్టర్ పనిచేయకపోవడంతో సమావేశాలు నిర్వహించడం లేదు. ప్రొజెక్టర్ పనిచేయని విషయాన్ని సంబంధిత ప్రతినిధులకు తెలిపామని, మరమ్మతులు తలెత్తినప్పడు బాగుచేయాల్సిన సంస్థ దృష్టికి తీసుకపోయినా స్పందించడం లేదని కార్యాలయం అధికారులు తెలిపారు. పనిచేయని జనరేటర్లు.. తహశీల్దార్ కార్యాలయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగినప్పడు అన్లైన్ సేవలతో పాటు ఉద్యోగుల విధులు ఆగిపోకూడదని రూ.1.50 లక్షలతో జనరేటర్‌ను ఏర్పాటు చేశారు. కానీ జనరేటర్ అమర్చిన తరువాత ఒకటి, రెండు సార్లు వినియోగించారు. ఆ తరువాత సుమారుగా ఐదేళ్లు దాటినా ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఉపయోగించిన దాఖలాలు లేవు. డీజిల్ పోస్తే పనిచేస్తుంది కానీ అందుకు అయ్యే ఖర్చులు ఎవరు భరించాలో తెలియక కార్యాలయం సిబ్బంది పట్టించుకోవడం లేదు. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కూడా సుమారుగా రూ.60 వేలతో ఏర్పాటు చేసిన మినీ జనరేటర్ నిరుపయోగంగా ఉంది. ఇలా రెండు కార్యాలయాల్లో నిరుపయోగంగా ఉన్న జనరేటర్లను ఒక్కరు కూడా కన్నెత్తిచూసిన పాపాన పోలేదని, యంత్రాలు అందుబాటులో ఉన్నా ఉపయోగమేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోని నిరుపయోగంగా ఉన్న యంత్రాలు, పరికరాలను వాడుకలోకి తీసుకవచ్చి విధులకు ఆటంకం కలగకుండా చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు. -
హైదరాబాద్‌లో ఏపీకి కొత్తగా భవనాలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర విభజన జరిగి ఐదేళ్లు పూర్తయినా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా మిగిలిపోయిన వివాదాలను ఇచ్చిపుచ్చుకునే పద్ధతిలో పరిష్కరించుకునే దిశగా చకచకా అడుగులు పడుతున్నాయి. గత నెల 30న వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి పరస్పరం సహకరించుకుందామని, ఏపీ ప్రగతికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని కేసీఆర్ ప్రకటించిన విదితమే. రాజ్‌భవన్‌లో శనివారం జరిగిన ఇఫ్తార్ విందు సందర్భంగా కూడా అధికారుల స్థాయిలో చర్చలు నిర్వహించి ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించుకోవాలని ఇద్దరు సీఎంలు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన భవనాలు నిరుపయోగంగా ఉన్న నేపథ్యంలో వాటిని తమకు అప్పగించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌ను కోరింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన పోలీసు విభాగానికి కొత్తగా ఒక భవనం, ఇతర కార్యాలయాలు నిర్వహించుకోవడానికి మరొక భవనం కేటాయించాలని అభ్యర్థించింది. దీనిపై తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం చేసిన తీర్మాన పత్రాన్ని సీఎం కేసీఆర్ ఆదివారం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలసి అందజేశారు. దీంతో గవర్నర్ తక్షణమే స్పందించి భవనాలను తెలంగాణకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఏపీ పోలీసు విభాగానికి ఒక భవనం, ఇతర కార్యాలయాలకు మరొక భవనం కేటాయించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 8 కింద తనకు సంక్రమించిన అధికారులను ఉపయోగించుకొని గవర్నర్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ ప్రభుత్వ అధీనంలో ఉన్న భవనాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం బకాయిపడిన ఆస్తి పన్నులు, ఇతర చార్జీలను తెలంగాణ ప్రభుత్వం మాఫీ చేయాలని గవర్నర్ సూచించారు. అయితే ఈ భవనాల విలువను పరిహారంగా చెల్లించాలని ఏపీ ప్రభుత్వం కోరనుందని ఆ రాష్ట్ర అధికార వర్గాల ద్వారా తెలిసింది. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి నిర్వహణ లేక శిథిలావస్థకు చేరుకొని... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు హైదరాబాద్ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని రాష్ట్ర విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం పేర్కొనడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు హైదరాబాద్‌లో తమ కార్యాలయాలు నిర్వహించుకునేలా విభజన సమయంలో ఇరు రాష్ట్రాలకు హైదరాబాద్‌లోని ప్రభుత్వ భవనాలను చెరి సగం కేటాయించారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా అమరావతి నుంచి పని చేస్తుండటంతో హైదరాబాద్‌లో ఆ రాష్ట్రానికి కేటాయించిన భవనాలన్నీ ఖాళీగా ఉన్నాయి. వాటిని వాడుకోనప్పటికీ ఏపీ ప్రభుత్వం కరెంటు బిల్లులు, ఇతర పన్నులు చెల్లించాల్సి వస్తోంది. దాదాపు నాలుగేళ్లుగా ఖాళీగా ఉండటం, సరైన నిర్వహణ లేకపోవడంతో ఈ భవనాలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. వాటికి సంబంధించి రూ. 10 కోట్లకుపైగా విద్యుత్ చార్జీలు, ఆస్తి పన్నులను ఏపీ ప్రభుత్వం తెలంగాణకు చెల్లించాల్సి ఉంది. నిరుపయోగంగా ఉన్న ఈ భవనాలకు రక్షణగా వందల మంది ఏపీ ప్రభుత్వ భద్రత సిబ్బందితోపాటు నిర్వహణ కోసం మరికొందరు ఉద్యోగులు గత నాలుగేళ్లుగా పనిచేస్తున్నారు. సీఎం కేసీఆర్ హర్షం... హైదరాబాద్‌లోని ఏపీ ప్రభుత్వ భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించడంపట్ల సీఎం కేసీఆర్హర్షం వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రజాప్రయోజనాలే పరమావధిగా, స్నేహభావంతో ముందడుగు వేయడం శుభపరిణామమని పేర్కొన్నారు. ప్రతి విషయంలోనూ వాస్తవిక దృష్టితో ఆలోచించి ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ప్రభుత్వాలు పని చేస్తాయని సీఎం ఆకాంక్షించారు. ఇరు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని, రెండు రాష్ట్రాల ప్రజలు క్షేమంగా ఉండాలని, అపరిష్కృత సమస్యలన్నీ సామరస్యపూర్వకంగా పరిష్కారం కావాలన్నదే తమ అభిమతమని సీఎం పేర్కొన్నారు. వివాదాలపై రెండు రాష్ట్రాల సీఎస్ల కమిటీ... తెలంగాణ, ఏపీల మధ్య అపరిష్కృత సమస్యల పరిష్కారానికి ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు లేదా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాగల ఇతర సీనియర్ ఐఏఎస్‌ల నేతృత్వంలో ఉమ్మడి కమిటీ ఏర్పాటు చేయనున్నారు. గవర్నర్ నరసింహన్ సమక్షంలో శనివారం రాజ్‌భవన్‌లో సమావేశమైన తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వై.ఎస్. జగన్ ఈ మేరకు నిర్ణయానికి వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. త్వరలో ఈ కమిటీ ఏర్పాటు విషయంలో ఇరు రాష్ట్రాల సీఎస్‌లు ఉమ్మడిగా ఉత్తర్వులు జారీ చేయనున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా మిగిలిపోయిన వివాదాల పరిష్కారానికి గత ఐదేళ్లలో తీసుకున్న చర్యలేమిటి? రాష్ట్ర విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లో పేర్కొన్న ప్రభుత్వరంగ సంస్థల విభజన అంశంపై షీలా బిడే కమిటీ చేసిన సిఫారసులను యథాతథంగా అమలు చేయవచ్చా? లేక ఏమైనా మార్పులు చేయాల్సి ఉంటుందా? అనే అంశాలపై సీఎస్ల కమిటీ సమావేశమై చర్చలు జరపనుంది. షెడ్యూల్ 9, 10లోని సంస్థల ఆస్తులు, అప్పుల విభజన, విద్యుత్ ఉద్యోగుల పంపకాలు, రూ. వేల కోట్లలో ఉన్న విద్యుత్ బిల్లుల వివాదాలు తదితర అంశాలపై అధ్యయనం జరపనుంది. కనీసం వారానికోసారి కమిటీ సమావేశమై అంశాలవారీగా చర్చలు జరపనుంది. చర్చలు కొలిక్కి వచ్చాక కమిటీలోని ఇరు రాష్ట్రాల అధికారులు వేర్వేరుగా నివేదికలను సమర్పించనున్నారు. ఈ నివేదికల ఆధారంగా ఇరు రాష్ట్రాల సీఎంలు మళ్లీ గవర్నర్ సమక్షంలో సమావేశమై చర్చల ద్వారా వివాదాల పరిష్కారానికి కృషి చేయనున్నారు. సమస్యలపై ఏకభిప్రాయం కుదిరే వరకు సీఎంలు సైతం ఒకటికి రెండుసార్లు సమావేశమయ్యే అవకాశాలున్నాయి. -
హైదరాబాద్‌లోని ఏపీ కార్యాలయాలు తెలంగాణకు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాలు నిర్వహించడానికి హైదరాబాద్‌లో కేటాయించిన భవనాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తూ గవర్నర్ నరసింహన్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు తమ కార్యాలయాలు నిర్వహించుకోవడం కోసం హైదరాబాద్‌లోని ప్రభుత్వ భవనాలను చెరిసగం కేటాయించారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా అమరావతి నుంచి నడుస్తున్నందున హైదరాబాద్‌లో ఏపీకి కేటాయించిన భవనాలన్నీ ఖాళీగా ఉన్నాయి. ఆ భవనాలను వాడుకోనప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరెంటు బిల్లులు, ఇతర పన్నులు చెల్లించాల్సి వస్తోంది. ఉపయోగంలో లేకపోవడం వల్ల భవనాలు పాడవుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధీనంలో ఉన్న భవనాలను తమ ప్రభుత్వానికి అప్పగించాలని తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ఆదివారం గవర్నర్‌ను కోరింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన పోలీస్ విభాగానికి ఒక భవనం, ఇతర కార్యాలయాలు నిర్వహించుకోవడానికి మరొక భవనం కేటాయించాలని కూడా తెలంగాణ రాష్ట్ర కేబినెట్ అభ్యర్థించింది. గవర్నర్ తనకున్న అధికారాలను ఉపయోగించుకుని హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాలు నిర్వహించుకోవడానికి కేటాయించిన భవనాలను తమకు ఇవ్వాలని కోరింది. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ విజ్ఞప్తిపై గవర్నర్ నరసింహన్ సానుకూలంగా స్పందించారు. హైదరాబాద్‌లోని ఏపీ ప్రభుత్వ కార్యాలయాలన్నిటినీ తెలంగాణ ప్రభుత్వానికి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగానికి ఒక భవనం, ఇతర కార్యాలయాలకు మరొక భవనం ప్రత్యేకంగా కేటాయించనున్నట్టు ఉత్తర్వులో పేర్కొన్నారు. కేసీఆర్ హర్షం గవర్నర్ నిర్ణయంపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రజా ప్రయోజనాలే పరమావదిగా, స్నేహ భావంతో ముందడుగు వేయడం శుభపరిణామని పేర్కొన్నారు. ప్రతి విషయంలోనూ వాస్తవిక దృష్టితో ఆలోచించి, ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో రెండు ప్రభుత్వాలు పని చేయాలని ఆకాంక్షించారు. రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని, రెండు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. అపరిష్కృత సమస్యలన్నీ సామరస్యపూర్వకంగా పరిష్కారం కావాలన్నదే తమ అభిమతని కేసీఆర్ అన్నారు. -
శిథిల గదులు – సిబ్బంది వ్యథలు
సాక్షి, సీతంపేట (శ్రీకాకుళం): నియోజకవర్గంలో పలు ప్రభుత్వ కార్యాలయాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకోకపోవడంతో విలువైన ఫైల్లు, ఇతర సామగ్రికి భద్రత లేకుండా పోయింది. వీటిని పట్టించుకునే నాథుడు లేకపోవడంతో ఉద్యోగులు బిక్కుబిక్కు మంటూ విధులు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నియోజకవర్గంలో మొత్తం 57 ప్రభుత్వ కార్యాలయాలకు గాను వీటిలో 13 వరకు శిథిలభవనాల్లో నడుస్తున్నాయి. అన్ని మండలాల్లో వ్యవసాయశాఖ కార్యాలయాలు పూర్తిగా పాడయ్యాయి. సీతంపేట మండలంలో మండల పరిషత్ కార్యాలయం శిథిలమైంది. అయితే ఈ భవన సముదాయానికి సంబంధించి నూతన భవనాలు నిర్మాణానికి ఎన్నికల ముందు శంకుస్థాపనలు చేశారు. పనులు మాత్రం ప్రారంభం కాలేదు. అలాగే గిరిజన సహకార సంస్థ భవనాలు, మండల రెవెన్యూ కార్యాలయం, ఎంఆర్సీ కార్యాలయం పూర్తిగా పాడయ్యాయి. చిన్నపాటి వర్షం పడినా వరదతో నిండిపోతున్నాయి. స్లాబ్ పెచ్చులు ఊడిపడుతున్నాయి. భామిని మండలంలో భామిని, బత్తిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు రెండు మరమ్మతులకు గురయ్యాయి. పాలకొండలో మండల విద్యావనరుల కేంద్రం, అగ్నిమాపక కేంద్రం, ఇరిగేషన్ కార్యాలయం, ట్రెజరీ కార్యాలయం, వ్యవసాయ కార్యాలయం శిథిలమయ్యాయి. వీరఘట్టం మండలంలో వ్యవసాయ కార్యాలయం, ఐసీడీఎస్ కార్యాలయలాది ఆదేదారి. వీటి స్థానంలో కొత్తవి ఎప్పుడు నిర్మిస్తారనేది ప్రశ్నగా మారింది. మరికొన్ని కార్యాలయాలు పరాయి పంచన నడుస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు, ప్రజలు వేడుకుంటున్నారు.ఽ నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యాలయాలు.. మండలం ప్రభుత్వ కార్యాలయాలు శిథిలమైనవి సీతంపేట 18 4 పాలకొండ 15 5 వీరఘట్టం 14 2 భామిని 10 2 మొత్తం 57 13 ఎప్పటి నుంచో సమస్య ఉంది శిథిల భవనాల స్థానంలో నూతన భవనాలు మంజూరు చేయాలని గతంలో పలు మా ర్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాం. చాలా ఏళ్లుగా ఈ సమస్య ఉన్నా.. పట్టించుకున్న దాఖలాలు లేవు. రికార్డులకు భద్రత లేకుండా పోతోంది. చిన్నపాటి వర్షం కురిసినా సిబ్బంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. – విశ్వాసరాయి కళావతి, ఎమ్మెల్యే, పాలకొండ కార్యాలయాలన్నీ అలాగే ఉన్నాయి రెవెన్యూ, వ్యవసాయశాఖ ఇలా మండలంలో ఏ కార్యాలయాలు చూసినా శిథిల భవనాలే దర్శనమిస్తున్నాయి. ఎంపీడీవో కార్యాయలం పూర్తిగా పాడైంది. అయితే తప్పదన్నట్లు అక్కడే సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని నూతన భవనాల ఏర్పాటుకు కృషి చేయాలి. – ఎస్.భాస్కరరావు, కారెంకొత్తగూడ -
బ్యాంకుల్లోనే ఆధార్ కేంద్రాలు: ఆర్బీఐ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా బ్యాంకులు, పోస్టాఫీసులు, ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రారంభించిన 13,000 ఆధార్ కేంద్రాలు యథాతథంగా కొనసాగుతాయని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ సీఈవో అజయ్ భూషణ్ తెలిపారు. ఈ కేంద్రాలపై సుప్రీంకోర్టు తన తీర్పులో ఎలాంటి ప్రతికూల వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఆన్లైన్లో ధ్రువీకరణ చేయాల్సిన అవసరం లేకుండా ఆఫ్‌లైన్ ద్వారా సర్వీస్ ప్రొవైడర్లు ఆధార్‌ను గుర్తింపు పత్రంగా వాడుకోవచ్చని చెప్పారు. ఎవరైనా బ్యాంకు ఖాతా తెరిచేందుకు స్వచ్ఛందంగా ఆధార్‌ను సమర్పిస్తే అధికారులు అంగీకరిస్తారని వెల్లడించారు. -
ఇక ప్రీపెయిడ్ మీటర్లు
నిర్మల్అర్బన్: విద్యుత్ దుర్వినియోగాన్ని నివారించేందుకు, బకాయిలు లేకుండా చూసేందుకు విద్యుత్ శాఖ ప్రీపెయిడ్ రీచార్జి కరెంట్ మీటర్లను వినియోగంలోకి తీసుకువస్తోంది. ఇప్పటికే జిల్లాలో ఈ మీటర్లను పలు ప్రభుత్వ కార్యాలయాలకు బిగించారు. ఆ తర్వాత ప్రైవేట్ సంస్థలు, దుకా ణాలు, గృహాలకూ అమర్చుతారు. సెల్ఫోన్లకు ప్రీపెయిడ్ రీచార్జి చేసినట్లే కరెంట్ సరఫరాకు రీచార్జి చేయాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతానికి సాధారణ మీటర్ల మాదిరిగానే వినియోగించుకునేలా ఈ మీటర్లను బిగిస్తున్నారు. రీచార్జి ద్వారా వినియోగించుకుంటే విద్యుత్ యూనిట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ పద్ధతిలో రీచార్జి అయిపోతే విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. కరెంట్‌కు రీచార్జి.. మొబైల్ మాదిరిగానే ఇకపై కరెంట్‌లో కూడా ప్రీపెయిడ్ రీచార్జి విధానం వచ్చింది. ఆధునిక పరిజ్ఞానం వినియోగిస్తూ సంబంధిత శాఖ పెండింగ్ బిల్లులు లేకుండా చర్యలు చేపడుతోంది. విద్యుత్‌ను వాడుకుని కొందరు బిల్లులు చెల్లించకపోవడంతో ఇన్నాళ్లు బకాయిలు పేరుకుపోయేవి. వీటి వసూలుకు ప్రత్యేకంగా సిబ్బంది తిరగాల్సివచ్చేది. మొండి బకాయిదారులుంటే అలాంటి వారి కనెక్షన్ తొలగించేవారు. పెండింగ్ బిల్లుల వసూలు కోసం విద్యుత్ శాఖ స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించేది. ఇక విద్యుత్ రీచార్జి మీటర్లు అందుబాటులోకి రావడంతో ఆ ఇబ్బంది తొలగనుంది. ముందుగానే ఎన్ని యూనిట్ల విద్యుత్ అవసరమో వినియోగదారులు గుర్తించి ఆ మేరకు ముందుగానే రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో 5,400 మీటర్లు.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు మొత్తం 5,400 ప్రీపెయిడ్ రీచార్జి కరెంట్ మీటర్లు వచ్చాయి. ఇందులో సింగిల్ ఫేజ్‌వి 4,000, త్రీఫేజ్‌వి 1,400 ఉన్నాయి. ఇప్పటికే ఆయా సబ్స్టేషన్లకు మీటర్లు చేరాయి. ముందుగా ప్రభుత్వ కార్యాలయాలకు బిగించాలన్న ఆదేశాలు రావడంతో, ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ మీటర్లను బిగిస్తున్నారు. వాటి పనితీరును పరిశీలించిన తరువాత ప్రైవేట్, వ్యాపార, గృహ వినియోగదారులకు అమర్చనున్నారు. మొదటి విడతలో భాగంగా ఏజెన్సీ ద్వారా నిర్మల్ జిల్లాలో 50 సింగిల్ ఫేజ్, 30 త్రీఫేజ్ ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లను ప్రభుత్వ కార్యాలయాలకు ఇప్పటివరకు బిగించారు. రెండు విధాలా వినియోగం.. సింగిల్ ఫేజ్ ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్‌కు రూ.8,500, అలాగే త్రీఫేజ్ మీటర్‌కు రూ.10,800 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మీటర్లు బిగించుకున్న వారు రెండు విధాలుగా దానిని వినియోగించవచ్చు. ప్రస్తుతం కొనసాగుతున్న విధానంతో పాటు కొత్తగా వస్తున్న ప్రీపెయిడ్ విధానాన్ని ఆన్, ఆఫ్‌ల బటన్ల ద్వారా సెలక్ట్ చేసుకునే వీలుంది. అయితే ప్రీపెయిడ్ విధానం సెలక్ట్ చేసుకున్న వారికి రీచార్జి పూర్తయిన తర్వాత కూడా అత్యవసరం కోసం (ఎమర్జెన్సీ యూజెస్) అదనంగా 5యూనిట్ల వరకు రీచార్జి ఉంటుంది. రీచార్జి ముగియగానే విద్యుత్ సరఫరా నిలిచిపోయి ఇబ్బందులు కలగకుండా అత్యవసర పరిస్థితుల్లో ఈ యూనిట్లను అప్పుగా వాడుకోవచ్చు. అది కూడా పూర్తయితే ఖచ్చితంగా రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది. రాబోయే రోజుల్లో ఈ ప్రీపెయిడ్ మీటరు బిగింపునకు వినియోగదారులు ఆసక్తి కనబరుస్తారో.. లేదో అన్న పరిశీలన కూడా జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆన్లైన్లో బిల్లులు చెల్లించే అవకాశం ఉండడంతో సక్రమంగా బిల్లులు చెల్లించేవారు ప్రీపెయిడ్ మీటర్లను అంగీకరిస్తారా? లేదా? అన్న సందేహం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో బిగిస్తున్నాం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లను తొలుత ప్రభుత్వ కార్యాలయాలకు బిగిస్తున్నాం. ఈ మీటర్లలో ఆన్, ఆఫ్ బటన్ల ద్వారా సాధారణ విద్యుత్ సరఫరాకు, ప్రీపెయిడ్ సరఫరాకు రెండు విధాలుగా వినియోగించుకోవచ్చు. – ఉత్తమ్, ఎస్ఈ, నిర్మల్ -
కల్లాల కష్టాలు!
కోస్గి : రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని ఇతర పంటలను ఆరబెట్టుకోవడానికి కల్లాలు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ఏ మాత్రం తేమ ఉన్నా ధాన్యం కొనుగోలు చేయడంలేదు. మార్కెట్లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఆరబెట్టడానికి సరైన సదుపాయం కల్పించడంలేదు. అకాల వర్షాలు కురిసి మార్కెట్లో ధాన్యం తడిసి రైతులు నష్టపోయిన ఘటనలు అనేకం. కొంతమంది రైతులు తమ వ్యవసాయ పొలాల వద్ద, సమీపంలోని రోడ్లపై కవర్లు వేసుకుని ధాన్యం ఆరబెడుతున్నారు. చేతికి వచ్చిన పంటలను కూడా రైతులు కాపాడుకోలేకపోతున్నారు. ఉపాధిహమీలో కల్లాల నిర్మాణం! జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రైతులు ధాన్యం ఆరబెట్టుకునేందుకు కల్లాల నిర్మాణానికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తుంది. కానీ, ప్రభుత్వం కల్లాలు నిర్మించుకునే అవకాశం కల్పించినా ఈజీఎస్ అధికారులు రైతులకు కల్లాల నిర్మాణాలపై అవగాహన కల్పించలేకపోవడంతో కల్లాలు నిర్మాణాలు కలగానే మిగిలిపోతున్నాయి. ఉపాధిహామీ పథకంలో పశువుల పాకలు, గొర్రెల షెడ్ల నిర్మాణంతో పాటు కల్లాల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నా రైతులకు మాత్రం అధికారులు ఈ విషయం చెప్పడంలేదు. రైతులు కల్లాల నిర్మాణం ఆర్థిక సమస్యతో కూడుకోవడంతో సొంతఖర్చులు పెట్టి నిర్మించుకోలేని పరిస్థితి. అధికారులు కల్లాల నిర్మాణంపై రైతులకు అవగాహన కల్పిస్తే వారు కల్లాలు నిర్మించుకోవడానికి ముందుకొవచ్చే అవకాశం ఉంది. ఎవరు చెప్పలేదు అధికారులు కల్లాల నిర్మాణాల గురించి ఇంతవరకు చెప్పకపోవడంతో గ్రామ సమీపంలో ఉన్న పొలంలో ఎండబెట్టుకుంటున్నాను. అధికారులు గ్రామాల్లో అవగాహన కల్పించి ప్రొత్సహిస్తే ఎంతోమంది పేద రైతులకు లబ్ది చేకూరుతుంది. ఇందుకు అధికారులు చర్యలు తీసుకోవాలి. -
ఆధార్ లీకేజీ కలకలం!
న్యూఢిల్లీ: ఆధార్ భద్రతపై వెల్లువెత్తుతున్న అనుమానాలకు మరో రుజువు దొరికింది. ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ విభాగానికి చెందిన ఓ కంప్యూటర్లో ఆధార్ కార్డు ఉన్న వారి వ్యక్తిగత సమాచారం, పేర్లు, 12 అంకెలుండే ఆధార్ నంబర్‌తోపాటు బ్యాంక్ అకౌంట్ల వివరాలు కూడా లభ్యమయ్యాయని బిజినెస్ టెక్నాలజీ న్యూస్ వెబ్సైట్ జెడ్డీ నెట్ తెలిపింది. అయితే, ఏ సంస్థ కంప్యూటర్లలో ఇలా ఆధార్ సమాచారం దొరుకుతోందో జెడ్డీ నెట్ వెల్లడించలేదు. అయితే, ఈ పరిణామం ఆధార్ భద్రతను ప్రశ్నార్ధకం చేస్తోందని నిపుణులు అంటున్నారు. ఆధార్ వివరాలు తెలుసుకునేందుకు ముందుగా యూనిఫాం రిసోర్స్ లొకేటర్‌ను గుర్తించాల్సి ఉంటుంది..దీనిని కేవలం 20 నిమిషాల్లోనే కనిపెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొన్ని ప్రభుత్వ సంస్థల కంప్యూటర్లలో ఇటువంటివి జరుగుతున్నట్లు తెలిసినా వాటిని సరిదిద్దేందుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోలేదన్నారు. అయితే, ఆధార్ సమాచారం లీకవుతోందంటూ వచ్చిన వార్తలను యూఐడీఏఐ ఖండించింది. ఆధార్ వివరాలకు పూర్తి భద్రత, రక్షణ ఉందని తెలిపింది. లీకేజీ వాస్తవమనుకున్నప్పటికీ వెల్లడైన సమాచారం ఆ రాష్ట్ర ప్రభుత్వ విభాగానికి చెందినదై ఉంటుందనీ, దానికి ఆధార్‌తో ఎటువంటి సంబంధం లేదని తెలిపింది. ఆధార్ సంఖ్య తెలిసినా∙పూర్తి వ్యక్తిగత సమాచారం లీకయినట్లు కాదని పేర్కొంది. -
వాడుకున్నంత!
సాక్షి, మెదక్: ఇక నుంచి విద్యుత్ వినియోగదారులు ప్రతినెలా సెల్‌ఫోన్ రీచార్జి తరహాలోనే విద్యుత్ మీటర్‌ను రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది. కార్డులో బ్యాలెన్స్ ఉన్నంత వరకే విద్యుత్ సరఫరా అవుతుంది. బ్యాలెన్స్ అయిపోతే విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. జిల్లాలో త్వరలో ప్రీ పెయిడ్ విద్యుత్ మీటర్లను బిగించేందుకు ట్రాన్స్‌కో అధికారులు సిద్ధమవుతున్నారు. దీంతో విద్యుత్ బకాయిలకు చెల్లుచీటి పడనుంది. అలాగే వినియోగదారులు వినియోగించే తీరులో మార్పుతో పాటు దుబారా తగ్గనుంది. మొదటి విడతగా ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో ఈ మీటర్లను బిగించనున్నారు. ఇందుకు సంబంధించి ట్రాన్స్‌కో అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. ప్రస్తుతం ఉన్న విద్యుత్ బకాయిలను వెంటనే చెల్లించాలని, చెల్లించిన వెంటనే ప్రీ పెయిడ్ విద్యుత్ మీటర్లు బిగించనున్నారని ప్రభుత్వ కార్యాలయాలకు నోటీసులు జారీ చేశారు. మార్చి నాటికి ప్రీ పెయిడ్ విద్యుత్ మీటర్ల బిగింపు ప్రక్రియ పూర్తి చేయాలని సంబంధిత అధికారులు చర్యలు ప్రారంభించారు. ఇప్పటికే సంగారెడ్డిలోని ట్రాన్స్‌కో స్టోర్స్‌కు ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లు చేరుకున్నాయి. దుబారా తగ్గుదలకు.. ఫిబ్రవరి మొదటి వారంలో జిల్లాకు మొదట విడతగా 400 నుంచి 500 వరకు ప్రీపెయిడ్ మీటర్లు వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో ఇది వరకే ఈ మీటర్ల బిగింపు ప్రక్రియ విజయవంతమైనట్లు తెలుస్తోంది. దీంతో జిల్లాల్లో సైతం ఈ విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) నిర్ణయించింది. నిరంతర విద్యుత్ అందుబాటులోకి రావడంతో జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలతోపాటు గృహ విద్యుత్ వినియోగదారులు ఎడాపెడా విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. దీంతో విద్యుత్ దుబారా పెరుగుతుంది. దీనికితోడు వినియోగించిన విద్యుత్‌కు సంబంధించిన డబ్బులను ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు చెల్లించడం లేదు. నెలల తరబడి బిల్లులు చెల్లించకపోవటంతో ట్రాన్స్కోపై విద్యుత్ బకాయిలు భారం పెరుగుతోంది. విద్యుత్ దుబారా, బకాయిలకు చెక్ పెట్టేందుకు వీలుగా ట్రాన్స్‌కో ప్రీపెయిడ్ మీటర్లు బిగించేందుకు సిద్ధం అవుతుంది. రీచార్జి చేసుకుంటేనే.. ప్రస్తుతం అన్ని సర్వీసుల్లో మెకానికల్ విద్యుత్ మీటర్లు ఉన్నాయి. మెకానికల్ విద్యుత్ మీటర్ల రీడింగ్ ఆధారంగా బిల్లులు వసూలు చేస్తోంది. ప్రతినెలా ప్రభుత్వ కార్యాలయాలు, గృహ విద్యుత్ వినియోగదారులకు బిల్లులు ఇచ్చినా వారు చెల్లించడం లేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రీపెయిడ్ మీటర్ల బిగించాలని నిర్ణయం తీసుకుంది. విద్యుత్ వినియోగదారులు ప్రతినెలా సెల్‌ఫోన్ రీచార్జి తరహాలోనే ఇకపై విద్యుత్ మీటర్‌ను రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది. కార్డులో బ్యాలెన్స్ ఉన్నంత వరకే విద్యుత్ సరఫరా అవుతుంది. బ్యాలెన్స్ అయిపోతే విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. రూ.500 నుంచి రూ.5వేల విలువతో ప్రీపెయిడ్ విద్యుత్ కార్డులు అందుబాటులో ఉంటాయి. జిల్లాలో మొదట మీ సేవ కేంద్రాల్లో ప్రీపెయిడ్ విద్యుత్ రీచార్జి కార్డులను అందుబాటులో ఉంచనున్నారు. రూ.కోట్లలో పేరుకు పోయిన బకాయిలు జిల్లాలో విద్యుత్ బకాయిలు కోట్ల రూపాయలలో పేరుకుపోయి ఉన్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలులతో పాటు గృహ వినియోగదారులు, పరిశ్రమల నుంచి పెద్ద మొత్తంలో మొండి బకాయిలున్నాయి. గృహా విద్యుత్ బకాయిలు రూ.19 కోట్లు, పరిశ్రమలు రూ.2 కోట్లు, ప్రభుత్వ కార్యాలయాలు రూ.1.13 కోట్లు, పంచాయతీ బకాయిలు రూ.122 కోట్లు చెల్లించాల్సి ఉంది. దశల వారీగా.. జిల్లాలో దశలవారిగా ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లను బిగించనున్నారు. మొదటి విడతగా ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో ప్రీపెయిడ్ మీటర్లు బిగించనున్నారు. ఇందుకోసం ఇప్పటి వరకు 931 కార్యాలయాలకు ట్రాన్స్‌కో అధికారులు నోటీసులు ఇచ్చారు. మెదక్ డివిజన్ పరిధిలో 627 ప్రభుత్వ కార్యాలయాలు, తూప్రాన్ డివిజన్ పరిధిలో 304 ప్రభుత్వ కార్యాలయాలకు నోటీసులు అందజేశారు. ప్రీపెయిడ్ విద్యుత్‌మీటర్ల అమర్చేందుకు వీలుగా బకాయిలు రూ.1.13 కోట్లు ట్రాన్స్‌కో వసూలు చేయనుంది. డబ్బులు వసూలు అయిన వెంటనే ఈ మీటర్లను అమర్చనున్నారు. త్వరలోనే బిగిస్తాం జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో మొదటగా ఈ ప్రీపెయిడ్ మీటర్లు అమర్చుతాం. సంగారెడ్డిలోని ట్రాన్స్‌కో స్టోర్స్‌కు ఈ మీటర్లు ఇప్పడికే వచ్చాయి. త్వరలోనే జిల్లాకు మీటర్లు తీసుకువచ్చి బిగింపు ప్రక్రియ ప్రారంభిస్తాం. ప్రీ పెయిడ్ మీటర్లతో విద్యుత్ దుబారా తగ్గడంతోపాటు బకాయిల భారం తొలుగుతుంది. –శ్రీనాథ్, ట్రాన్స్‌కో ఎస్ఈ