Groceries
-
2,000 నోట్లను ఇలా వాడేస్తున్నారట!
న్యూఢిల్లీ: కరెన్సీ నోటును చలామణి నుండి ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించిన తర్వాత ప్రజలకు తమ రూ. 2,000 కరెన్సీ నోట్లను మార్చుకోడానికి- ఇంధనం, ఆభరణాలు, రోజువారీ కిరాణా వస్తువుల కొనుగోళ్లు మొదటి మూడు ప్రాధాన్యతలుగా ఉన్నట్లు లొకేషన్ బేస్డ్ సోషల్ నెట్వర్క్ పబ్లిక్ యాప్ నిర్వహించిన ఒక దేశవ్యాప్త సర్వే వెల్లడించింది. (యూట్యూబర్లకు గుడ్ న్యూస్, 500 చాలట!) 55 శాతం మంది ప్రజలు తమ కరెన్సీ నోట్లను బ్యాంకులో డిపాజిట్ చేయడానికి, 23 శాతం మంది వాటిని ఖర్చు చేయడానికి, 22 శాతం మంది మార్చుకోడానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు సర్వే వెల్లడించింది. మే 19వ తేదీన వ్యవస్థలో ఉన్న రూ.2,000 నోట్ల ఉపసంహరణ ప్రకటన అనంతరం ఇప్పటి వరకూ దాదాపు సగం పెద్ద నోట్లు వెనక్కు వచ్చాయని ఆర్బీఐ గవర్నర్ గత వారం పాలసీ సమీక్ష నిర్ణయాల సందర్భంగా తెలిపారు. (అపుడు పాల ప్యాకెట్ కొనలేక పాట్లు, ఇపుడు 800 కోట్ల ఆస్తులు!) ఆయన తెలిపిన సమాచారం ప్రకారం 2023 మార్చి 31వ తేదీ నాటికి రూ.2,000 నోట్లు వ్యవస్థలో రూ.3.62 లక్షల కోట్లు చెలామణీలో ఉన్నాయి. ఇందులో ఇప్పటికి రూ.1.80 లక్షల కోట్లు వెనక్కు వచ్చేశాయి. వీటిలో 85 శాతం డిపాజిట్ల ద్వారానే వెనక్కు వచ్చాయన్నారు. రూ.500 నోట్లు వెనక్కు తీసుకోవాలన్న యోచన లేదని, అలాగే కొత్తగా రూ.1,000 నోట్లు తీసుకుని రాబోమని గవర్నర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఆయా అంశాలపై 22 రాష్ట్రాల్లో లక్షకుపైగా ప్రజల నుంచి తీసుకున్న అభిప్రాయాల ప్రాతిపదికన తాజాగా వెలువడిన సర్వేలో ముఖ్యాంశాలు ఇవీ... ► తమ నోట్లను మార్చుకునేటప్పుడు సమస్యలను ఎదుర్కొంటున్నారా? అని అడిగినప్పుడు 61 శాతం మంది ఈ ప్రక్రియలో తమకు ఎటు వంటి ఇబ్బందులు ఎదురుకాలేదని పేర్కొన్నారు. మా ర్పిడి పక్రియ చాలా తేలిగ్గా ఉందని కేరళలో 75% మంది పేర్కొంటే, ఆంధ్రప్రదేశ్‌లో 53 శాతం, తమిళనాడులో 50% మంది తెలిపారు. ► ప్రజల్లో రూ.2000 నోటు మార్చుకోడానికి మాత్రం ఇబ్బందులు ఎదరవుతున్నట్లు 42 శాతం మంది తెలిపారు. ► సర్వేలో పాల్గొన్న 51 శాతం మంది తమ రూ.2000 నోటును మార్చుకునేందుకు ప్రభుత్వం తమకు మరింత సమయం ఇచ్చి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ► 2,000 నోట్ల మార్పిడి రూ.20,000 కంటే ఎక్కువగా ఉండాలని 44 శాతం మంది పేర్కొన్నారు. ప్రజలు రూ. 2,000 కరెన్సీ నోటును డిపాజిట్ చేయవచ్చు. లేదా తక్కువ విలువ కలిగిన కరెన్సీతో బ్యాంకులో మార్చుకోవచ్చు, అయితే ఒకేసారి రూ. 20,000 వరకు మాత్రమే మార్చుకోవచ్చు. ► ఇక రూ. 2,000 నోట్లను ఉపసంహరణ ప్రకటన తర్వాత దేశీయంగా పసిడి, వెండిపై ఆసక్తి పెరిగింది. రూ. 2,000 నోట్లతో కొనుగోళ్లు జరి పే ఉద్దేశంతో కొనుగోలుదారులు పెద్ద ఎత్తున ఆరాలు తీస్తున్నట్లు ఆభరణాల విక్రయ సంస్థలు వెల్లడిస్తున్నాయి. కానీ రూ. 2,000 నోట్లకు బదులుగా పసిడిని విక్రయించేందుకు కొందరు జ్యుయలర్లు మాత్రం 5–10 శాతం ఎక్కువ వసూలు చేస్తున్నాయనీ వార్తలు వెలువడ్డాయి. ► రూ. 2,000 నోట్ల ఉపసంహరణ నేపథ్యంలో పెట్రోల్ బంకుల్లో నగదు లావాదేవీలు ఒక్కసారిగా ఎగిశాయి. ఇంధనం కొనుగోళ్లకు ఎక్కువగా వినియోగిస్తుండటంతో రోజువారీ నగదు అమ్మకాల్లో వీటి వాటా దాదాపు 90 శాతానికి చేరింది. అంతకుముందు వీటివాటా కేవలం 10 శాతంగా ఉండేది. ఆఖరికి రూ. 100, రూ. 200 కొనుగోళ్లకు కూడా కస్టమర్లు రూ. 2,000 నోట్లను తీసుకొచ్చి, మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ► ఆర్బీఐ నివేదిక ప్రకారం రూ.2,000 నోట్ల అంశాన్ని పరిశీలిస్తే, 2023 మార్చి చివరి నాటికి రూ.3,62,220 కోట్ల విలువ చేసే 4,55,468 లక్షల నోట్లు వ్యవస్థలో ఉన్నాయి. పరిమాణం పరంగా చెలామణిలో ఉన్న రూ. 2,000 నోట్లు 2023 మార్చి చివరినాటికి చెలామణిలో ఉన్న మొత్తం కరెన్సీలో 1.3 శాతానికి తగ్గాయి. 2022 మార్చి నాటికి ఈ నోట్లు 1.6 శాతంగా ఉన్నాయి. విలువ పరంగా కూడా నోట్లు 2022 మార్చిలో మొత్తం నోట్లలో 13.8 శాతం ఉంటే, 2023 మార్చి నాటికి 10.8 శాతానికి పడిపోయింది. ► 2016 నవంబర్‌లో అప్పటి పెద్ద నోట్ల రూ.500, రూ.1,000 నోట్లను రద్దుచేసి కొత్త రూ.500, రూ.2,000 నోట్లను తీసుకువచ్చిన ఆర్బీఐ, ఈ నెల 19వ తేదీన రూ.2000 నోట్లను కూడా సెప్టెంబర్ 30 నాటికి పూర్తిగా వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. నిజానికి 2018–19లోనే ఆర్బీఐ రూ. 2,000 నోట్ల ముద్రణను నిలిపివేసింది. 2018 మార్చి 31వ తేదీ నాటికి రూ.2,000 నోట్ల గరిష్ట చెలామణీ విలువ రూ.6.73 లక్షల కోట్లుగా ఉంది. చెలామణీలో ఉన్న మొత్తం రూ.2000 నోట్లలో ఈ విలువ 37.3 శాతానికి సమానం. 2023 మార్చి 31వ తేదీ నాటికి రూ.2000 నోట్ల చెలామణీ విలువ రూ.3.62 లక్షల కోట్లు. చెలామణీలో ఉన్న మొత్తం నోట్లలో ఈ విలువ 10.8 శాతం మాత్రమే. ఇదీ చదవండి: MRF బెలూన్లు అమ్మి, కటిక నేలపై నిద్రించి: వేల కోట్ల ఎంఆర్ఎఫ్ సక్సెస్ జర్నీ మరిన్ని బిజినెస్ అపడేట్స్, ఇంట్రస్టింగ్ వార్తల కోసం చదవండి: సాక్షిబిజినెస్ -
వైరల్ వీడియో: సరుకులు ఇలా కూడా తీసుకెళ్తారా?
-
సంక్రాంతి సరుకుల పేరుతో కేటుగాళ్ల మోసం
-
వాట్సాప్ ద్వారా సరుకులు ఆర్డర్..అందుబాటులో జియో మార్ట్ సేవలు
హైదరాబాద్: వాట్సాప్ ద్వారా కూడా సరుకులు ఆర్డర్ చేసే వెసులుబాటును రిలయన్స్ రిటైల్ జియో మార్ట్ అందుబాటులోకి తెచ్చింది. దీనితో సమయంపరమైన పరిమితులేమీ లేకుండా హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల్లోని కస్టమర్లు తమ వీలును బట్టి ఆర్డర్ చేయొచ్చని సంస్థ తెలిపింది. కనీసం రూ. 250 కొనుగోళ్లపై కచ్చితమైన 30 శాతం తగ్గింపును, గరిష్టంగా రూ. 120 వరకూ అందుకోవచ్చని పేర్కొంది. వాట్సాప్ ద్వారా జియోమార్ట్‌లో కొనుగోళ్లు చేసేందుకు +91 7977079770కి సందేశం పంపించవచ్చని వివరించింది. -
‘పొట్లం’ యువకుడి కథ.. ఏటా రూ.6 కోట్ల టర్నోవర్.. 200 మందికి ఉపాధి
ఆ యువకుడిది.. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఒక సామాన్య రైతు కూలీ కుటుంబం. చిన్నప్పుడే తండ్రి ఇల్లు వదిలి వెళ్లిపోయినా, తల్లి వ్యవసాయ కూలీగా పనిచేస్తూ అతడిని పెంచి పెద్ద చేసింది. పేదరికంతో విద్యాభ్యాసమంతా ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లోనే సాగింది. బీఏ మాత్రమే చదివినా పట్టుదలతో ఐటీ కోర్సులు నేర్చుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు. యాక్సెంచర్, విప్రో వంటి ప్రతిష్టాత్మక కంపెనీల్లో పనిచేశాడు. అంతటితో ఆగని ఆ యువకుడు ‘పొట్లం’ పేరుతో ఆహారం, సరుకులను డోర్ డెలివరీ చేసే యాప్‌కు శ్రీకారం చుట్టాడు. చదువుకునేటప్పుడే ఖర్చుల కోసం కిరాణా కొట్టులో పనిచేస్తూ ‘పొట్లం’ కట్టిన ఆ యువకుడు ఇప్పుడు తన సొంత ఊరు జంగారెడ్డిగూడెం కేంద్రంగా 200 మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగాడు. పొట్లం యాప్ ద్వారా ఐదు పట్టణాల్లో ఆహార పదార్థాలను, నిత్యావసర వస్తువులు, పండ్లు, కూరగాయలను డోర్ డెలివరీ చేస్తున్నాడు. తన వ్యాపారం ద్వారా ఏటా రూ.6 కోట్ల టర్నోవర్ సాధిస్తున్నాడు. కృషితో నాస్తి దుర్భిక్షం... అనే మాటను రుజువు చేస్తున్న ఆ యువకుడే.. శ్రీనివాస్ అలమండ. అతడి స్ఫూర్తిదాయక విజయగాథ ఇది.. సాక్షి, అమరావతి: పేదరికం కారణంగా అలమండ శ్రీనివాస్ ఐదో తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుకునే సమయంలో ఖర్చుల కోసం అనేక పనులు చేశాడు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఏ పూర్తయ్యాక ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్లాడు. అక్కడ నెలకు రూ.1,500 జీతంతో ఉద్యోగం చేశాడు. ఇంగ్లిష్, అమీర్‌పేటలో ఐటీ కోర్సులు నేర్చుకుని యాక్సెంచర్, విప్రో కంపెనీల్లో 17ఏళ్ల పాటు సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేశాడు. ఆ తర్వాత ఇంగ్లండ్, కెనడాల్లోనూ కొన్నాళ్లు ఉద్యోగం చేశాడు. అయితే, సొంత ఊరు జంగారెడ్డిగూడెంపై మమకారంతో తిరిగి వచ్చేశాడు. ఏదైనా మొబైల్ యాప్ తయారు చేయాలనే లక్ష్యంతో తన స్నేహితులు హరికృష్ణ, రఘు, సోదరుడు పవన్‌లతో కలిసి జంగారెడ్డిగూడెం కేంద్రంగా 2020లో పొట్లం రిటైల్ కాన్సెప్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఏర్పాటు చేశాడు. ఇందులో భాగంగా ‘పొట్లం ఫుడ్ అండ్ కిరాణా యాప్’కు శ్రీకారం చుట్టాడు. లక్ష మందికిపైగా వినియోగదారులు అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించిన పొట్లం ఫుడ్ అండ్ కిరాణా యాప్‌కు ప్రస్తుతం లక్ష మందికిపైగా వినియోగదారులు ఉన్నారు. పొట్లం యాప్ ద్వారా జంగారెడ్డిగూడెం, ఏలూరు, తణుకు, నర్సీపట్నం, సత్తుపల్లి పట్టణాల్లో వినియోగదారులకు నిత్యం ఘుమఘుమలాడే ఆహార పదార్థాలు, కిరాణా సరుకులు, కూరగాయలు, పండ్లు, మాంసాన్ని డోర్ డెలివరీ చేస్తున్నారు. పొట్లం యాప్ ద్వారా శ్రీనివాస్ ఏటా రూ.6 కోట్ల టర్నోవర్ సాధిస్తున్నారు. పొట్లంలో 200 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. 2020లోనే పొట్లం మొదటి డార్క్ స్టోర్ పొట్లం యాప్ ద్వారా వినియోగదారుల నుంచి వచ్చే ఆర్డర్‌కు అనుగుణంగా సరుకులు అందించేలా 2020 ఆగస్టులో జంగారెడ్డిగూడెంలో మొదటి డార్క్స్టోర్ను శ్రీనివాస్ ఏర్పాటు చేశాడు. వినియోగదారులు నేరుగా రావాల్సిన అవసరం లేకుండా పొట్లం ఆన్లైన్ యాప్, ఆఫ్‌లైన్ (ఫోన్ ద్వారా)లో ఆర్డర్ ఇస్తే సరుకులు డార్క్‌స్టోర్ నుంచి సిబ్బంది డోర్ డెలివరీ చేస్తున్నారు. రైతుకి వెన్నుదన్ను.. వ్యవసాయ కూలీ కుటుంబ నేపథ్యం కలిగిన శ్రీనివాస్ పొట్లం యాప్ ద్వారా రైతుల ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా అక్కడికక్కడే మంచి ధర దక్కేలా చేస్తున్నాడు. దీనిద్వారా ఓవైపు రైతులకు దళారీల బాధ లేకుండా మంచి ధర దక్కుతుంటే.. వినియోగదారులకు తాజా కూరగాయలు, పండ్లు తక్కువ ధరకే అందుతున్నాయి. మార్కెట్ ధరల కంటే కనీసం 20 నుంచి 50 శాతం వరకు తక్కువ ధరకే కూరగాయలు, పండ్లను డోర్ డెలివరీ చేస్తున్నాడు. బయట మార్కెట్లో దాదాపు రూ.400 విలువ చేసే 17 రకాల కూరగాయలను కేవలం రూ.199కే డోర్ డెలివరీ ఇస్తున్నాడు. నిరక్షరాసులు సైతం.. ఆన్లైన్ కొనుగోళ్లు చేయాలంటే స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్, చదువు తప్పనిసరి. ప్రస్తుతం బహుళజాతి సంస్థల యాప్‌లన్నీ ఈ కోణంలోనే ఉన్నాయి. కానీ పొట్లం యాప్ మాత్రం వీటికి భిన్నంగా ఆఫ్‌లైన్ విధానంలోనూ సేవలు అందిస్తోంది. పొట్లం వినియోగదారుల్లో చాలామంది స్మార్ట్ ఫోన్ లేనివారే అంటే అతిశయోక్తి కాదు. స్మార్ట్ ఫోన్ లేకపోయినా కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి ఆర్డర్ ఇస్తే నేరుగా ఇంటికి సరుకులు పంపే ఏర్పాటు ‘పొట్లం’ ప్రత్యేకత. కరోనా సమయంలోనూ ఉపాధి 2020లో కరోనా సమయంలో పొట్లం యాప్‌ను ప్రారంభించా. ఆ సమయంలో ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల టీచర్లు చాలామంది ఉపాధి కోల్పోయి పొట్లం యాప్‌లో డెలివరీ బాయ్స్‌గా చేరారు. కరోనా కష్టకాలంలో ఏ ఉద్యోగం లేక రోజు గడవడం కష్టమైన చాలామందికి ఉపాధి కల్పించా. ఔత్సాహిక యువతకు మొదటి పది బ్రాంచ్‌లకు పొట్లం ఫ్రాంచైజీ ఉచితంగా ఇస్తా. ఫుల్లీ ఆటోమేటెడ్ అండ్ ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ ద్వారా మొత్తం 14 యాప్‌ల అనుసంధానంతో పొట్లం యాప్ పనిచేస్తోంది. పొట్లం ఫ్రాంచైజీని ఉచితంగా ఎవరైనా తమ ప్రాంతంలో తీసుకోవడానికి యాప్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 2024 నాటికి రాష్ట్రంలో ఐదు వేల కేంద్రాలకు పొట్లం యాప్‌ను విస్తరించే లక్ష్యంతో పనిచేస్తున్నా. అధునాతన మెషీన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), కృత్రిమ మేథ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)లను జోడించి వినియోగదారులకు సేవలందిస్తున్నా. – శ్రీనివాస్ అలమండ, ఎండీ, పొట్లం రిటైల్ కాన్సెప్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. -
‘కల్తీ’ కథలు.. ఒకటేమిటీ అన్నీ అంతే.. తినేదెలా? బతికేదెలా?
కేసరి దాల్పైనే దాడులు పట్టణంలోని రాజీవ్నగర్కాలనీలోని ఓ ఇంట్లో దాచిన 112 బస్తాల నిషేధిత కేసరిదాల్ను 2017లో సీజ్‌చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయగఢ్ నుంచి సరుకు ఇక్కడికి అక్రమంగా వస్తున్నట్టు అప్పట్లో అధికారుల విచారణలో తేలింది. 2018లో సైతం పుడ్‌సేప్టీ అధికారులు పలమనేరు ప్రాంతంలోని పలు వారపుసంతల్లో కల్తీ సరుకులపై దాడులు చేపట్టి భారీగా జరిమానాలు విధించారు. ఎముకలతో నూనెలు పలమనేరు సమీపంలోని గడ్డూరు వద్ద ఓ ఇంట్లో టన్నులకొద్దీ దాచి ఉంచిన ఎముకలను అధికారులు సీజ్ చేశారు. తమిళనాడులోని కబేళాలనుంచి వీటిని సేకరించి ఇక్కడ ఎండబెట్టి నూనెను తయారు చేస్తున్నారని అధికారులు గుర్తించారు. దీంతో అప్పట్లో జిల్లా వ్యాప్తంగా వంటనూనెలపై తనిఖీలు చేశారు. ఇలాంటి సంఘటనలు జరిగినపుడు అధికారులు హడావుడి చేసి, ఆ తరువాత మళ్లీ పట్టించుకోవడంలేదు. దీంతో అక్రమార్కులు మళ్లీ కల్తీ సరుకును మార్కెట్లో్లకి తెచ్చి అమ్మకాలు మొదలెట్టారు. మధ్య తరగతి ప్రజలే లక్ష్యంగా కల్తీ వ్యాపారం సాగుతోంది. చౌక బేరమే ఈ కల్తీ వ్యాపారానికి ఆధారంగా మారింది. ఈ జిల్లా మూడు రాష్ట్రాల సరిహద్దులో ఉండడం అక్రమార్కులకు కలసి వచ్చింది. తమిళనాడు నుంచి యథేచ్ఛగా కల్తీ సరుకు మార్కెట్లోకి దిగుతోంది. వారపు సంతల్లో అమ్ముడవుతోంది. మరోవైపు దుకాణాలు, హోటళ్లు, టీ స్టాళ్లు వంటి ఆహార పదార్థాలు విక్రయించే కేంద్రాలకు గుట్టు చప్పుడు కాకుండా చేరిపోతోంది. ఇలా కల్తీ సరుకు ప్రజల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఇంత జరుగుతున్నా అధికార యంత్రాంగం కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. పలమనేరు (చిత్తూరు): జిల్లాలో ఆహార పదార్థాల కల్తీ జోరందుకుంది. పప్పు దినుసులు, టీపొడి, నూనెలు తదితరాల్లో ఈ కల్తీలు యథేచ్ఛగా సాగుతున్నాయి. దీంతోపాటు కేసరి దాల్ అమ్మకాలు వారపు సంతల్లో భారీగా సాగుతున్నట్టు తెలుస్తోంది. సరిహద్దుల్లోని కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కల్తీ సరుకులు ఇక్కడికి గుట్టుగా రవాణా అవుతున్నాయి. ఇలాంటి కల్తీ పదార్థాలను తింటే అనారోగ్యం తప్పదని తెలిసినా ఫుడ్‌సేఫ్టీ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. కల్తీ ఇలా వంటనూనెలే అధికం దుకాణాలకు వస్తున్న సరుకుల్లో ఒకటో రకం, రెండో రకం అంటూ స్థానిక వ్యాపారులే ఏది అసలో, ఏది నకిలీనో కనుక్కోలేకపోతున్నారు. బియ్యం మొదలుకొని శెనగపప్పు, కందిపప్పు, చక్కెర, పెసరపప్పు, మైదాపిండి, గసాలు, రవ్వ, జీలకర్ర, మిరియాలు, ఆఖరుకు వంటనూనెలు కల్తీ అవుతున్నాయి. ఈ కల్తీ వ్యాపారం అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. స్థానికంగా దుకాణాల్లో లభించే ప్రముఖ కంపెనీల నూనె ప్యాకెట్లు ఈ ప్రాంతంలోని వారపు సంతల్లో సైతం అదే కంపెనీల పేరుతో నకిలీ ప్యాకెట్లు లభ్యమవుతున్నాయి. ధరలో కూడా భారీ తేడా ఉండడంతో ప్రజలు ఎగబడి వీటినే కొనుగోలు చేస్తున్నారు. అదే అదనుగా లీటరు ప్యాకెట్లలో 900 మిల్లీలీటర్ల నూనె నింపి సులభంగా సొమ్ముచేసుకుంటున్నారు. చోద్యం చూస్తున్న ఫుడ్ సేఫ్టీ విభాగం ఆహార పదార్థాల కల్తీని అరికట్టేందుకు జిల్లా మొత్తానికి ఇద్దరు ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. అయితే వారు దుకాణాల వైపు కన్నెత్తి చూడడం లేదు. సంబందిత మున్సిపల్ కమిషనర్లకు తనిఖీలు చేసే అధికారం లేదు. ప్రభుత్వం ఫుడ్‌సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్‌ను అమలు చేస్తున్నా ఇలాంటి అక్రమాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. దీనిపై ఆహార కల్తీ నిరోధక శాఖ విచారణాధికారిగా వ్యవహరిస్తున్న జాయింట్ కలెక్టర్ అయినా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తమిళనాడునుంచి వచ్చిన కల్తీ టీపొడి టీపొడి భారీ వ్యాపారం కల్తీ టీ పొడి అక్రమార్కుల పంట పండిస్తోంది. సాధారణంగా మార్కెట్లో పావు కిలో బ్రాండెడ్ టీ పొడి కొనాలంటే రూ.150 నుంచి రూ.200 వరకు ఖర్చు పెట్టాలి. అంటే కిలో రూ.600 నుంచి రూ.800 వరకు ఉంది. అది కల్తీ టీ పొడి అయితే కిలో రూ.170కే దొరుకుతోంది. వినియోగించిన టీ పొడిలో చింతగింజల పొడి, రసాయనాలతో కూడిన చాక్లెట్ పొడి కలిపి చౌకగా దొరికే టీ పొడిని విక్రయిస్తున్నారు. ఈ చాక్లెట్ పొడిని కలపడం వల్ల ఎంత ఉడికించినా టీ రంగు మారదు. జిల్లాలోని పలు టీ దుకాణాల్లో ఈ కల్తీ టీపొడినే వాడుతున్నారు. దీని వల్ల వ్యాపారులకు ఆదాయం అధికంగా వస్తోంది. క్వింటాళ్ల కొద్దీ కల్తీ టీ పొడిని జిల్లాలోని మార్కెట్లో విక్రయించేస్తున్నారు. నిల్వ ఉంచిన కేసరిదాల్ను సీజ్ చేసిన అధికారి (ఫైల్) కేసరి దాల్‌పై 1961 నుంచే నిషేధం జిల్లాలో ప్రమాదకర కేసరి దాల్(లంకపప్పు) అమ్మకాలు మళ్లీ ఊపందుకున్నాయి. వీటిని తింటే పలు రకాల ఆరోగ్య సమస్యలు ఖాయం. ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, అశోం రాష్ట్రాల్లో విరివిగా పండే లతిరస్ సటివస్ అనే మొక్క గింజలను పప్పులుగా చేస్తారు. వాటికి రసాయన రంగులను కలిపి కేసరి దాల్ పేరుతో మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఇందులో న్యూరో టాక్సిన్ అనే విష పదార్థం ఉంటుంది. వీటిని తింటే నరాలకు సంబంధించిన వ్యాధులు వస్తాయి. అందుకే ప్రభుత్వం 1961 నుంచి ఈ పంటపై నిషేధం విధించింది. కానీ ఈ పప్పు ధర చౌకగా ఉండడంతో జనం దీన్ని కొనుగోలు చేస్తూ ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. గతంలో పలమనేరు సమీపంలో అధికారులు సీజ్ చేసిన ఎముకల గోడోన్ కబేళాల నుంచి బోన్ ఆయిల్ జిల్లాలోని పలు పట్టణాల్లో తమిళనాడులోని కబేళాలతో లభ్యమయ్యే ఎముకలనుంచి తయారవుతున్న నూనెలను లూజు పామోలిన్, శెనిగనూనెలో కలిపి గట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్నట్లు గతంలోనే అధికారులు గుర్తించారు. ముఖ్యంగా చిత్తూరు, నగిరి, పుత్తూరు, కుప్పం, పలమనేరు, పుంగనూరు తదితర ప్రాంతాల్లో చికెన్ కబాబ్ సెంటర్లు, కొన్ని హోటళ్లలో బిరియానీ, బోండా, బజ్జీలతో పాటు స్వీట్స్టాల్స్లో ఈ కల్తీ నూనెలు వినియోగిస్తున్నారు. తమిళనాడుకు చెందిన వ్యాపారులు ముఠాగా ఏర్పడి ఈ కల్తీ దందాను నడిపిస్తున్నారు. కారుచౌకగా ఈ నూనెను జిల్లాలో విక్రయిస్తున్నట్టు సమాచారం. పొట్టేలు మటన్‌లో లేగదూడల మాంసాన్ని సైతం కలిపి విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. జీర్ణకోశ వ్యాధులు వస్తాయి వంటనూనెల కల్తీతో జీర్ణకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. తొలుత గ్యాస్స్ట్రిక్తో ఈ సమస్య ప్రారంభమై ఆ తర్వాత తీవ్ర స్థాయికి వెళుతుంది. కల్తీ ఆహార పదార్థాలను తిన్న వెంటనే చర్మంపై దురదలు, అలర్జీ వచ్చిందంటే వెంటనే అక్కడ కల్తీ జరిగినట్లు భావించవచ్చు. కల్తీ అయిన నూనెలతో తయారు చేసే ఆహారపదార్థాలు, మధుమేహ వ్యాధి ఉన్నవారికి చాలా ప్రమాదకరం. – డా.హరగోపాల్, వైద్యాధికారి, పలమనేరు ఏరియా ఆస్పత్రి ఆకస్మిక దాడులు చేస్తాం జిల్లాలో కల్తీ ఆహార పదార్థాలు, వంటనూనెలు, హోటళ్లలో మాంసాహార పదార్థాలు, పప్పులు, రెండోరకం వస్తువులు, వారపుసంతలో విడి విక్రయ సరుకులపై త్వరలో ఆకస్మిక దాడులు నిర్వహిస్తాం. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న మన జిల్లాలో కల్తీ సరుకుల విక్రయానికి అవకాశం ఉంటుంది. దీనిపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం. తక్కువ ధరతో లభిస్తోందని ఏ వస్తువులను కొనుగోలు చేయొద్దు. – సతీష్‌కుమార్, ఫుడ్ ఇన్స్పెక్టర్, చిత్తూరు -
బాధితులకు నిత్యావసర సరుకులు అందించిన మంత్రి చెల్లుబోయిన
-
స్విగ్గీ మరో సంచలనం, ఒక్క ఫోన్ కొడితే చాలు!
డెలివరీ రంగంలో సరికొత్త విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ ఫుడ్ డెలివరీ దిగ్గజం స్విగ్గీకి చెందిన ఇన్‌స్టామార్ట్ ఇకపై కస్టమర్లకు కావాల్సిన గ్రాసరీస్‌ను డ్రోన్ల ద్వారా డ్రోన్ పోర్ట్‌కు డెలివరీ చేయనుంది. బెంగళూరు కేంద్రంగా స్విగ్గీకి చెందిన గ్రాసరీ సర్వీస్ ఫ్లాట్ ఫామ్ 'ఇన్ స్టామర్ట్'లో ఇన్ని రోజులు కస్టమర్లకు వారికి కావాల్సిన నిత్యవసర వస్తువుల్ని డెలివరీ బాయ్స్‌తో అందిస్తుండేది. కానీ ఇకపై డెలివరీ బాయ్స్ బదులు..డ్రోన్లు డెలివరీ చేయనున్నాయి. ఇందులో భాగంగా స్విగ్గీ డ్రోన్ సర్వీస్‌లు అందించే నాలుగు సంస్థల భాగస్వామ్యంలో డ్రోన్ డెలివరీ సర్వీస్ ట్రయల్స్‌ను నిర్వహిస్తుంది. డ్రోన్‌తో సరుకుల రవాణా డిల్లీ -ఎన్సీఆర్, బెంగళూరులో పైలెట్ ప్రాజెక్ట్ కింద ఈ డ్రోన్ డెలివరీ ట్రయల్స్‌ను రెండు సార్లు నిర్వహించనున్నట్లు స్విగ్గీ తన బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది. ముందస్తుగా గరుడా ఏరోస్పేస్ సంస్థ బెంగళూరులో, స్కైఎయిర్ మొబిలిటి సంస్థ ఢిల్లీ- ఎన్సీఆర్'లలో డ్రోన్స్ ద్వారా కస్టమర్లకు కావాల్సిన సరుకుల్ని డ్రోన్ పోర్ట్‌కు చేరవేయనుంది. తొలిఫేజ్ ట్రయల్స్‌ను పరిశీలించిన తర్వాత ఏఎన్ఆర్ఏ అండ్, టెక్ ఈగల్, మరుట్ డ్రోన్ టెక్ సంస్థలు సెకండ్ ఫేజ్‌లో ట్రయల్స్ జరపనున్నాయి. డ్రోన్లతో సరుకుల్ని కస్టమర్లకు డోర్ డెలివరీ చేస్తుందా? డార్క్ స్టోర్ అంటే రీటైల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లేదా అవుట్ లెట్లలో ఉన్న సరుకుల్ని డ్రోన్లే..డ్రోన్లు ఉండే ఏరియా(డ్రోన్ పోర్ట్) కు తీసుకొస్తాయి. డ్రోన్ పోర్ట్ నుంచి స్విగ్గీ డెలివరీ పర్సన్ ప్యాకేజీని పికప్ చేసుకొని కస్టమర్‌కు డెలివరీ చేస్తారు. కేంద్ర అనుమతుల్లేవు..కానీ ఈ డ్రోన్ డెలివరీకి కేంద్రం అనుమతులు ఇవ్వులేదు. డ్రోన్ డెలివరీ బి హైండ్ విజువల్ లైన్ ఆఫ్ సైట్స్ (బీవీఎల్ఓఎస్) మీద ఆదారపడి పనిచేస్తుంది. ఈ ఆపరేషన్స్ నిర్వహించేందుకు కేంద్రం ఇప్పటి వరకు అనుమతులు ఇవ్వలేదు. కానీ గతేడాది కేంద్ర మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియన్స్ శాఖ కేవలం 20సంస్థలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందులో స్విగ్గీతో పాటు ఏఎన్ఆర్ఏ అండ్, టెక్ ఈగల్, మరుట్ డ్రోన్ టెక్ సంస్థలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ఏమంటున్నాయ్! మనదేశంలో డ్రోన్ కార్యకలాపాలు నిర్వహించే సంస్థలు రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేశాయి. ముఖ్యంగా కరోనా కారణంగా హెల్త్ కేర్ రంగంలో డ్రోన్ టెక్నాలజీ అవసరం ఏర్పడించింది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ సమయంలో వ్యాక్సిన్లు, కరోనా బాధితులకు కావాల్సిన మెడిసిన్లు డ్రోన్ల సాయంతో డెలివరీ చేసేందుకు ట్రయల్స్ నిర్వహించాయి. ఇప్పటికే మన దేశానికి గుర్గావ్ కేంద్రంగా లాజిస్టిక్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఢిల్లీ వేరి సంస్థ డ్రోన్ డెలివరీ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా డ్రోన్లను తయారు చేసే అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ట్రాన్సిషన్ రోబోటిక్స్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇంటర్నెట్ దిగ్గజం ఆల్ఫాబెట్ డ్రోన్ డెలివరీ యూనిట్ వింగ్ టెక్సాస్, డల్లాస్ వాల్‌గ్రీన్స్ నుండి మెడిసిన్లను డ్రోన్ డెలివరీ చేసింది. చదవండి👉స్విగ్గీ బంపరాఫర్: డెలివరీ బాయ్స్ కష్టాలకు చెక్..కళ్లు చెదిరేలా జీతాలు! -
China: స్మార్ట్‌ఫోన్ బదులు బియ్యం! కూరగాయలకు బదులు..
ప్రపంచానికి కరోనా వైరస్‌ను అంటగట్టిందన్న అపవాదును మోస్తున్న డ్రాగన్ కంట్రీ.. వైరస్ కట్టడికి చేపడుతున్న చర్యలు ఊహాతీతంగా ఉంటున్నాయి. ఓవైపు కేసులు, మరణాల సంఖ్యను దాస్తూనే.. మరోవైపు జీరో కేసులంటూ ప్రకటనలు చేసుకుంటోంది. ఈ క్రమంలో ఒక్క కేసు కూడా బయటపడలేదంటూనే జియాన్ నగరంలో భారీ లాక్డౌన్ అమలు చేస్తోంది. ఈ పరిణామాలతో జనాలు నానా ఇబ్బందులు పడుతున్నారు. డిసెంబర్ 23వ తేదీ నుంచి కోటికి పైగా జనాభా ఉన్న జియాన్ మహానగరంలో లాక్డౌన్ అమలు అవుతోంది. కఠిన ఆంక్షలతో జనాలు అడుగు బయటవేయని పరిస్థితి నెలకొందక్కడ. మీడియా ఎలాగూ ప్రభుత్వ ఆధీనంలో ఉంది. కాబట్టే, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ వేదికగా జనాలు తమ గోడును వెల్లబోసుకుంటున్నారు. ఆకలి కేకలతో సాయం కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. Scenes from Xi’An lockdown: return of the barter economy 🚬 People can no longer leave their flats, even to shop. This resident makes light of the situation via Kuaishou, a TikTok-like social media platform pic.twitter.com/gsE9NnJnWz — Cindy Yu (@CindyXiaodanYu) January 3, 2022 ఓవైపు ప్రభుత్వమేమో.. తాము ఉచితంగా ఆహారాన్ని అందిస్తున్నామని ప్రకటించుకుంటోంది. కానీ, సోషల్ మీడియాలో జనాల ఆవేదన మరోలా ఉంటోంది. అసలు సహాయమే అందట్లేదని వాపోతున్నారు జియాన్ నగర వాసులు. ఈ మేరకు చైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వెయిబోలో ఫొటోలు, వీడియోలు పెడుతున్నారు. క్యాబేజీకి సిగరెట్, యాపిల్స్‌కు బదులుగా పాత్రలుతోమే లిక్విడ్, కూరగాయలకు బదులుగా శానిటరీ ప్యాడ్స్, రొట్టెలకు బదులు నూడుల్స్.. ఇలా వస్తు మార్పిడి ఇది అక్కడ కనిపిస్తోంది అక్కడ. ఎక్కువగా అపార్ట్మెంట్లలో ప్రజలు ఇలా వస్తు మార్పిడితో పొట్ట నింపుకుంటున్నారు. ఎమర్జెన్సీ అవసరాలకు సైతం.. లాక్డౌన్ ద్వారా ఎదుర్కొంటున్న పరిస్థితులపై రేడియో ఛానెల్స్ ఇంటర్వ్యూల ద్వారా పలువురు వాపోతుండడం విశేషం. బియ్యం కోసం ఏకంగా స్మార్ట్ఫోన్లు, ఇతర గ్యాడ్జెట్లను అమ్మేయడం, తాకట్టుపెట్టడం లాంటి పరిస్థితులు జియాన్ నగరంలో కనిపిస్తున్నాయి. కొందరు వయసుపైబడిన వాళ్లు.. పాత రోజుల్ని చూస్తున్నట్లు ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఓవైపు లాక్డౌన్ ఎప్పటిదాకా ఉంటుందో అనే గ్యారెంటీ లేకపోవడంతో.. ఫ్రిడ్జ్‌లను నింపేస్తున్నారు. మరికొందరు మాత్రం జాలి పడి.. ఇతరుకు దానం చేస్తున్న దృశ్యాలు సైతం కనిపిస్తున్నాయి. జియాన్ నగరంలో కరోనా కట్టడి సంగతి ఎలా ఉన్నా.. అధికారులు, ప్రభుత్వ తీరుపై మాత్రం విరుచుకుపడుతున్నారు జనాలు. తిండి కోసం క్వారంటైన్ సెంటర్లకు వెళ్తున్నారన్న కథనాలు పరిస్థితికి అద్దం పడుతున్నాయి. మరో వైపు ఈ-కామర్స్ డెలివరీలకు, ఎమర్జెన్సీ వాహనాలకు సైతం అనుమతి ఇవ్వకపోవడంతో పరిస్థితి మరింత క్షీణిస్తోంది. గుండెపోటు, ఇతరత్ర ఆరోగ్య కారణాలతో ఇప్పటిదాకా ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు వెయిబో అప్డేట్స్ ద్వారా తెలుస్తోంది. xi'an city When apartment building's gates locked and residents can't go out for groceries shopping... People go back to barter! 2022/1/2 pic.twitter.com/0NKBHmY1uI — Songpinganq (@songpinganq) January 2, 2022 కఠిన లాక్‌డౌన్‌తో చైనాలోని ఒక్కో ప్రాంతాన్ని బంధించుకుంటూ పోతోంది చైనా ప్రభుత్వం. కొన్ని ప్రాంతాలకే ఉచితంగా సరుకుల చేరివేత పరిమితంకాగా, కరోనా పరీక్షలకు సైతం సిబ్బంది వెనుకడుగు వేస్తుండడం విశేషం. మరోవైపు పోలీసులు జనాల్ని అడుగు తీసి బయటపెట్టనివ్వడం లేదు. చివరికి ఆస్పత్రులకు, అవసరాలకు సైతం బయట అడుగుపెట్టనివ్వడం లేదు. తాజాగా మూడే కేసులు వచ్చాయంటూ ప్రకటిస్తూ.. 11 లక్షల జనాభా ఉన్న యుజౌవు నగరాన్ని రాత్రికి రాత్రే లాక్డౌన్ పేరిట మూసేశారు. కొత్త సంవత్సర వేడుకలు, ఆ వెంటనే శీతాకాల ఒలింపిక్స్ ఉన్నందున ఈ తరహా చర్యలు చేపడుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. సంబంధిత వార్త: వుహాన్‌ను మించిన లాక్డౌన్.. చైనా తీరుపై సంభ్రమాశ్చర్యాలు -
నిరుపేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన నిర్మాత
చెన్నై: కోవిడ్ దెబ్బకు పేదలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానిక మైలాపూరులో పూలు విక్రయించే మహిళలపై కరోనా ప్రభావం ఎక్కువగానే పడింది. స్థానిక ఎమ్మెల్యే మయిలై టి.వేలు, సినీ నిర్మాత ట్రైడెంట్ ఆర్ట్స్ సంస్థ అధినేత ఆర్.రవీంద్రన్ బుధవారం బియ్యం, పప్పులు, నిత్యావసర సరుకులను అందించారు. అలాగే పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేశారు. -
స్విగ్గీ న్యూ డెసిషన్... ఇవి కూడా డెలివరీ చేస్తుందట
హైదరాబాద్: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ సిగ్గీ మరిన్ని సేవలు అందించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఫుడ్ డెలివరీలో తన మార్క్ చూపించిన ఈ సంస్థ ప్రజలకు మరింతగా చేరువ అయ్యేలా ప్రణాళిక రూపొందిస్తోంది. అందుకు తగ్గట్టే ఇటీవల భారీగా నిధుల సమీకరణ కూడా చేసింది. గ్రోసరీస్ ఫుడ్ డెలివరీ సర్వీసెస్‌కి సంబంధించి స్విగ్గీ మంచి పట్టు సాధించింది. జిల్లా కేంద్రాల నుంచి కాస్మాపాలిటన్ సిటీస్ వరకు డెలివరీ సర్వీసెస్‌లో దూసుకుపోతుంది. అయితే స్విగ్గీ వచ్చే ఆర్డర్లలో ఎక్కువ శాతం లంచ్, డిన్నర్‌కి సంబంధించినవే ఉంటున్నాయి. బ్రేక్‌ఫాస్ట్ టైంలో అంతగా డెలివరీ ట్రాఫిక్ ఉండటం లేదు. దీంతో ఉదయం సమయంలో కూడా సేవలు అందించేలా సరికొత్త వ్యూహంతో ముందుకు వస్తోంది. కిరణా, పాలు, కూరగాయలు తదితర ఉదయాన్నే ఉపయోగించే సరుకులను కూడా డెలివరీ చేసేలా ప్లాన్ వేసింది. త్వరలోనే ఇన్‌స్టామార్ట్ పేరుతో గ్రోసరీస్ సేవలు అందివ్వనున్నట్టు స్విగ్గీ కో ఫౌండర్ శ్రీహర్ష తెలిపారు. దూకుడుగా కంపెనీ కార్యకలాపాలు విస్తరించేందుకు ఇటీవల స్విగ్గీ ఇన్వెస్టర్ల నుంచి 1.25 బిలియన్ డాలర్ల నిధులు సేకరించింది. వీటి సాయంతో మార్కెట్లో దూకుడుగా వ్యవహరించాలని నిర్ణయించింది. మరోవైపు జోమాటో సైతం భారీగా నిధులు సేకరించి తమ సేవలను మరింతగా విస్తరించే పనిలో ఉంది. -
జోమాటో కీలక నిర్ణయం..! ఇకపై
ముంబై: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జోమాటో కీలక నిర్ణయం తీసుకుంది. జోమాటో త్వరలో ఆన్లైన్ కిరాణా డెలివరీ సేవలను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు కంపెనీ గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించింది. గత ఏడాది ఏప్రిల్‌లో జోమాటో ప్రారంభంలో 80 కి పైగా నగరాల్లో తొలిసారిగా కిరాణా డెలివరీ సేవలను ప్రారంభించగా..దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో గ్రాసరీ డెలివరీ సేవలు నిలిచిపోయాయి. ప్రస్తుతం జోమాటో తిరిగి ఆన్లైన్ కిరాణా డెలివరీ సేవలను పునరుద్దరిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. జోమాటో జూలై 14 నుంచి ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపిఓ) ప్రారంభించటానికి ముందే ఆన్లైన్ కిరాణా డెలివరీలో అడుగుపెట్టాలని జోమాటో తాజా ప్రకటన చేసింది. జోమాటో రూ. 9,375 కోట్లను సమీకరించాలని భావిస్తోంది . జోమాటో షేర్ల తాజా ఇష్యూ రూ. 72 నుంచి 76 చొప్పున ఉండనున్నట్లు తెలుస్తోంది జోమాటో స్థానిక కిరాణా రిటైలర్లను భాగస్వామిగా చేసుకునే విషయంపై సందిగ్ధత నెలకొంది. జోమాటో ఈ నెల ప్రారంభంలో ఆన్లైన్ కిరాణా డెలివరీ ప్లాట్‌ఫామ్ గ్రోఫర్స్లో 10 శాతం మైనారిటీ వాటాను సొంతం చేసుకోవాలని ఆశించింది. గ్రోఫర్స్లో 100 మిలియన్ డాలర్లను (సుమారు రూ. 747 కోట్లు) వాటాను జోమాటో ప్రకటించింది. గ్రోఫర్స్లో పెట్టుబడులు పెట్టినప్పటికీ, జోమాటో తన సొంత ప్రణాళికలతో కిరాణా డెలివరీ సేవలను ప్రారంభిస్తోందని జోమాటో సిఎఫ్ఓ అక్షంత్ గోయల్ ఆశాభావం వ్యక్తం చేశారు. కిరాణా డెలివరీలలో జోమాటో తిరిగి రావడం తన సమీప ప్రత్యర్థి స్విగ్గీకి కఠినమైన పోటీని ఇవ్వగలదు, స్విగ్గీ కూడా ఇన్స్టామార్ట్తో డెలివరీ సేవలను అందిస్తోంది. అంతేకాకుంగా బిగ్ బాస్కెట్ వంటి గ్రాసరీ సేవలను అందించే సంస్థలకు జోమాటో పోటీగా నిలవనుంది. కాగా బిగ్‌బాస్కెట్ తన వ్యాపారాన్ని మరింత పెంచుకోవడానికి టాటా డిజిటల్ నుంచి సుమారు రూ. 9,500 కోట్లను సమీకరించింది. కోవిడ్ రాకతో పుంజుకున్న ఆన్లైన్ గ్రాసరీ డెలివరీ... కోవిడ్-19 రాకతో వినియోగదారులు ఎక్కువగా ఆన్లైన్ గ్రాసరీ డెలివరీల వైపు మొగ్గుచూపారు. రెడ్‌సీర్ కన్సల్టింగ్ సంస్థ నివేదిక ప్రకారం.. భారత్‌లో ఆన్లైన్ కిరాణా మార్కెట్ 2025 నాటికి స్థూల వస్తువుల విలువ (జిఎమ్‌వి) 24 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 1,79,400 కోట్లు) ఉంటుందని అంచనా వేసింది.దేశంలో ఫుడ్ అండ్ గ్రాసరీ వాటాలో ఈ-కామర్స్ ఏడుశాతానికి చేరింది. -
డ్యాన్సర్లకు సాయం చేసిన కోలీవుడ్ నటులు
చెన్నై: స్టేజ్ నాట్య కళాకారులకు సినీ నటీనటులు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. కరోనా కారణంగా పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారిని పలువురు పలు రకాలుగా ఆదుకుంటున్నారు. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న స్టేజ్ నాట్య కళాకారులకు సాయం చేయడానికి అంగాడి తెరు సింధు, నటుడు డేనియల్ హృదయరాజ్, వసంతకుమార్‌తో పాటు యువోఎంఎస్ మిత్రబృందం ముందుకు వచ్చారు. వీరు గురువారం చెన్నైలో 80 మంది స్టేజ్ నాట్య కళాకారులకు బియ్యం తదితర తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులను అందజేశారు. -
Tamil Nadu: ఇంటి వద్దకే సరుకులు
సాక్షి, చెన్నై: లాక్డౌన్ పొడిగింపు నేపథ్యంలో ఇళ్ల వద్దకే ప్రజలకు అవసరమైన అన్ని రకాల వస్తువులను అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం అనుమతి పొందిన దుకాణాలు, కిరాణ కొట్లకు అవకాశం కల్పించారు. అయితే ఈ దుకాణాలకు ఫోన్ చేసి ఆర్డర్లను ఇంటి వద్దకే తెప్పించుకోవాల్సి ఉంటుంది. ఇందు కోసం చెన్నైలో 7,500 మొబైల్ వాహనాలు సిద్ధం చేశారు. ఈనెల 24 నుంచి వారం రోజుల లాక్‌డౌన్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ప్రజలకు వారం రోజులకు అవసరమైన సరుకులు సమకూర్చుకున్నారు. అయితే జూన్ 7వ తేదీ వరకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పొడిగించింది. దీంతో అనేక ఇళ్లల్లో పప్పుదాన్యలు, బియ్యం తదితర వస్తువుల కోసం అలమటించాల్సిన పరిస్థితి. దీనిని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం అధికారుల అనుమతితో ఆయా ప్రాంతాల్లోని దుకాణాలు, మొబైల్ దుకాణాల ద్వారా అన్ని రకాల వస్తువులను అందించేందుకు నిర్ణయించారు. అయితే నేరుగా వెళ్లి కొనుగోలు చేయడానికి వీలు లేదు. ఆయా దుకాణాల మొబైల్ నెంబర్లకు ఫోన్‌చేసి కావాల్సిన వస్తువులను బుక్ చేసుకోవాలని లేదా చీటీల్లో రాసి ఇచ్చి రావాలని తెలిపారు. ఆయా వస్తువులను దుకాణదారులే మొబైల్ వాహనాల ద్వారా ఇళ్లకు సరపరా చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. సోమవారం నుంచి ఈ అనుమతి కల్పించారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అనుమతి పొందిన వ్యాపారులు ప్రజలకు నేరుగా వారికి కావాల్సిన వస్తువులను తీసుకెళ్లి విక్రయించే అవకాశం కల్పించారు. ఇందు కోసం చెన్నైలో 7,500 వాహనాలను సిద్ధం చేసినట్టు కార్పొరేషన్ కమిషనర్ గగన్‌దీప్ సింగ్ భేటి తెలిపారు. విక్రయాల నిమిత్తం ఆదివారం కోయంబేడు మార్కెట్ తెరిచి ఉంచారు. దీంతో మార్కెట్ వైపుగా వాహనాలు కిటకిటలాడాయి. టీకా వేసుకుంటే బిర్యాని చెన్నై శివారులోని కోవలంలో కరోనా టీకా వేసుకుంటే బంపర్ ఆఫర్‌తో కూడిన కానుకలను ఓ సంస్థ ప్రకటించింది. టీకా వేసుకునేందుకు వచ్చే వారికి బిర్యాని ప్యాకెట్లు, పండ్లు ఫలాలను అందిస్తున్నారు. అలాగే వారి పేర్లను ఓ చీటిలో రాసి బాక్సులో వేస్తున్నారు. చివరి రోజున లక్కీ డ్రా తీయన్నుట్టు ఎవరి పేరు వస్తుందోవారికి బంగారు నాణెం ఇవ్వనున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. పుదుచ్చేరిలో లాక్డౌన్ పొడిగింపు పుదుచ్చేరిలో మరో వారం రోజులు లాక్‌డౌన్‌ను పొడిగించారు. ఇందుకు తగ్గ ఆదేశాలను ఎల్జీ తమిళి సై సౌందరరాజన్ జారీ చేశారు. ప్రస్తుతం ఉన్న నిబంధనలు, ఆంక్షల సడలింపులే అమల్లో ఉంటాయని ఎల్పీ ప్రకటించారు. అలాగే, గ్రామాల్లో కేసుల తగ్గుముఖం లక్ష్యంగా నివారణ చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. చదవండి: ఊరట: జూన్‌లో 12 కోట్ల టీకా డోసులు -
MLA Seethakka: ఎడ్లబండే ఎమ్మెల్యే కాన్వాయ్
వెంకటాపురం(ఎం): ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలం అడవి రంగాపూర్(నారాయణపూర్) గ్రామంలోని బండ్లపహాడ్ గొత్తికోయగూడెం వాసులకు ఎమ్మెల్యే సీతక్క అండగా నిలిచారు. గ్రామానికి దూరంగా నివసిస్తున్న గొత్తికోయలు కరోనా కారణంగా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలుసుకున్న ఆమె శనివారం వెళ్లి సరుకులు అందజేయాలని నిర్ణయించుకున్నారు. అయితే, గూడెంకు వెళ్లేందుకు సరైన దారి లేకపోవడంతో ఎడ్లబండే ఎమ్మెల్యే కాన్వాయ్ అయింది. అందులోనే సరుకులు వేసుకుని అదే బండిపై ఎమ్మెల్యే పయనమయ్యారు. ఆమె వెంట అనుచరులు, గన్మ్యాన్లు ద్విచక్ర వాహనాలపై వెళ్లారు. ఈ సందర్భంగా బియ్యం, కూరగాయలు, ఇతరత్రా సరుకులు గొత్తికోయలకు అందజేసి సీతక్క వారికి భరోసా కల్పించారు. ప్రతి పేద కుటుంబానికి రూ.6 వేలు ఇవ్వాలి.. కరోనా కష్టకాలంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నందున, ప్రతీ పేద కుటుంబానికి రూ.6 వేలు అందించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. కరోనా కట్టడిలో పూర్తిగా విఫలమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇకనైనా మొద్దునిద్ర వీడాలని ఆమె సూచించారు. Every drop of my blood will contribute to the growth of this nation and to make our people strong & developed.@RahulGandhi @priyankagandhi @manickamtagore @JitendraSAlwar #aimcprayaas #SOSTCongress @MahilaCongress @INCIndia @kumari_selja @sushmitadevinc #COVID #RahulGandhi pic.twitter.com/Ifkbb3GFEJ — Danasari Anasuya (Seethakka) (@seethakkaMLA) May 30, 2021 చదవండి: Telangana: జూన్ 15నుంచి రైతుబంధు -
Comedian Ali : కష్టకాలంలో వారికి అండగా నటుడు అలీ
లాక్డౌన్ కారణంగా షూటింగులు నిలిపివేసిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా సినీ పరిశ్రమకు చెందిన ఎంతో మంది కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ కమెడియన్, నటుడు అలీ వారికి సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. తన భార్య జుబేదాతో కలిసి ఉమెన్ ప్రొడక్షన్ యూనియన్‌కు చెందిన 130 మంది మహిళా కార్మికులకు నిత్యావసర వస్తువులు అందజేశారు. పదికిలోల బియ్యం, నూనె, గోధుమపిండి, చక్కెర సహా 8 రకాలైన సరుకులను వారికి అందజేశారు. ఈ సందర్బంగా అలీ మాట్లాడుతూ..ప్రతి రోజు ఈ మహిళా కార్మికులు మా కంటే ముందే షూటింగ్ స్పాట్‌కు వెళ్లిపోయి విధులు నిర్వర్తిస్తుంటారు. ప్లేట్లు, కాఫీ కప్పులను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుంటారు. ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగులు లేక పని దొరక్క వారు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని తెలుసు. అందుకే నా వంతుగా చిన్న సహాయం చేస్తున్నాను అని పేర్కొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో అలీ సోదరుడు, నటుడు ఖయ్యూం సహా తదితరులు పాల్గొన్నారు. చదవండి : బ్రదర్స్ డే : అరుదైన ఫోటోను షేర్ చేసిన చిరంజీవి వాళ్లు నాకు ఎప్పటికీ ఫోన్ చేయరు: సోనూసూద్ భావోద్వేగం -
విద్యార్థులకు ‘గాటా’ చేయూత..
అట్లాంటా: అమెరికాలోని తెలుగు ప్రజల కోసం గాటా(గ్రేటర్ అట్లాంటా తెలుగు అసోసియేషన్) అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా అట్లాంటాలోని లిండ్బర్గ్ స్టేషన్ సమీపంలోని ఈఓఎన్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కాగా అగ్ని ప్రమాదానికి తీవ్రంగా నష్టపోయిన వంద మందిపైగా భారత సంతతి(తెలుగు) విద్యార్థులకు గాటా నిత్యావసర వస్తువులు, కిరాణా సరుకులను అందించి మానవత్వాన్ని చాటుకుంది. అయితే విద్యార్థులకు టిఫిన్‌కు అవసరమయ్యే వస్తువులు, పండ్లు, కర్రీస్, చపాతీలను సువీదా స్టోర్స్ అందించింది. విద్యార్థులకు సహాయాన్ని అందించిన సువీదా స్టోర్స్‌కు ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు విద్యార్థులకు ప్యాన్లు, కుండలు, రైస్ కుక్కర్లు అందించిన సరస్వతి, రేణుక తదితరులకు గాటా కృతజ్ఞతలు తెలియజేసింది. కాగా 200 మందికి సరస్వతి, వారి మిత్రులు భోజన సదుపాయాన్ని కల్పించారు. విద్యార్థుల ఇబ్బందుల దృష్యా 100 దుప్పట్లు, పది టీవీలను అందించిన ప్యాడీ రావు, రాధా గార్లకు గాటా కృతజ్ఞతలు తెలిపింది. క్లిష్ట పరిస్థితుల్లో విద్యార్థులను ఆదుకునేందుకు గాటా ఎప్పుడు ముందుంటుందని పేర్కొంది. -
పెళ్లికి ముందు ‘గ్రేట్ ట్రైనింగ్’
సాక్షి, హైదరాబాద్: ఆ మ్యాగీ, చిప్స్ గట్రా రెండు వారాలు తినే సరికి నోరు చేవ చచ్చిపోతుంది. ఇంటి తిండి తినాలనే కోరిక పుడుతుంది. సరిగ్గా అప్పుడే చిన్న సమస్య మొదలవుతుంది. అదే ఏది కందిపప్పో, ఏది మినపప్పో తెలియకపోవడం! అంటూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్న తనయుడికి ఓ తల్లికి రాసిన చిన్న సలహాల పట్టిక సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (నితిన్ పెళ్లి ముహూర్తం ఖరారు) ఐపీఎస్ ఆఫీసర్ దీపాన్షు కబ్రా దీన్ని ట్విట్టర్లో పోస్టు చేశారు. రకరకాల పప్పుదినుసులను ఓ పేపర్‌పై స్టిక్కర్లతో అంటించిన తల్లి దాన్ని కొడుక్కి పెళ్లి బహుమతిగా ఇచ్చిందట. దీపాన్షు ట్వీట్‌కు వెయ్యికి పైగా రిప్లైలు వచ్చాయి. ప్రతి ఒక్కరూ ఆవిడ చేసిన పనిపై వారి అభిప్రాయాలు వెల్లడించారు. కొందరు పెళ్లికి ముందు ఇచ్చే ‘గ్రేట్ ట్రైనింగ్’గా పేర్కొంటూ మెచ్చుకున్నారు. ఓ యూజర్ పప్పు దినుసుల్లో ఏది ఏంటో గుర్తుపట్టలేని అమ్మాయిలు కూడా ఉన్నారు సార్ అని ఓ యూజర్ పేర్కొనగా, ఈ పోస్టు వారికీ వర్తింస్తుందని దీపాన్షు రిప్లై ఇచ్చారు. -
కిరాణా రవాణా : చేతులు కలుపుతున్న దిగ్గజాలు
సాక్షి, ముంబై: కరోనా వైరస్, లాక్డౌన్ తో ఇబ్బందులు పడుతున్న వినియోగదారులను ఆదుకునేందుకు పలు సంస్థలు నడుం బిగించాయి. ఇంటికి పరిమితమైపోయిన ప్రజల ఇంటిముందుకే నిత్యాసరాలను చేరవేసేందుకు పరస్పర భాగస్వామ్య ఒప్పందాలను చేసుకున్నాయి. ముఖ్యంగా పలు ఫుడ్ డెలివరీ సంస్థలు, క్యాబ్ సర్వీసుల సంస్థలు ఈ కోవలో ముందున్నాయి. ఉబెర్, డామినోస్ పిజ్జా , ర్యాపిడో, జైప్, స్విగ్గీ, జొమాటో, స్కూట్సీ లాంటి సంస్థలు బిగ్ బజార్, స్పెన్పర్ , బిగ్ బాస్కెట్ గ్రోఫర్స్ లాంటి సంస్థలతో నిత్యావసరాల పంపిణీకి ఈ భాగ స్వామ్యాలను కుదుర్చుకున్నాయి. అంతేకాదు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లాంటి దిగ్గజాలతో ఈ విషయంలో జరుపుతున్న చర్చలు ఒక కొలిక్కి వచ్చినట్టు సమాచారం. ప్రముఖ రిటైల్ సంస్థ స్పెన్సర్స్..క్యాబ్ సేవల సంస్థ ఉబెర్ భాగస్వామ్యంతో వినియోగదారులకు సరుకులను చేరవేసేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తద్వారా స్పెన్సర్స్ నిత్యావసరాలను వినియోగదారుల ఆర్డర్ల మేరకు క్యాబ్‌లలో డోర్ డెలివరీ చేయనుంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని స్పెన్సర్స్ స్టోర్ల నుంచి ఈ సేవలు అందిచనున్నారు. ఇప్పటికే కోల్‌కతా, లక్నో, ఘజియాబాద్ వంటి నగరాల్లో ట్రైల్ రన్ నిర్వహించగా అది విజయవంతమైందని స్పెన్సర్స్ వెల్ల్లడించింది. ద్విచక్ర వాహనాలకంటే అధిక మొత్తంలో సరుకులను వినియోగదారులకు అందచేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో వినియోగదారులకు నిత్యవసర సరుకులకు ఎటువంటి లోటు లేకుండా అందించేందుకు క్యాబ్ అగ్రిగేటర్ ఊబర్‌తో కలిసి పనిచేస్తున్నట్లు స్పెన్సర్స్ రిటైల్, నేచుర్స్ బాస్కెట్ ఎండీ దేవేంద్ర చావ్లా వెల్లడించారు. ఈ భాగస్వామ్యంతో ఆన్లైన్, ఫోన్ల ద్వారా వచ్చే ఆర్డర్లను ఊబర్ క్యాబ్‌లలో సరఫరా చేస్తామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. బైక్‌లకంటే క్యాబ్‌లలోనే అధిక మొత్తంలో నిత్యవసరాలను సుదూర ప్రాంతాల్లోని కస్టమర్ల ఇళ్లకు సైతం చేరవేసే సదుపాయం ఉండడంతో ఈ సర్వీసులపై మొగ్గుచూపుతున్నట్లు ఆయన వివరించారు. (కరోనా : వారికి ఉబెర్ ఉచిత సేవలు) కరోనా లాక్డౌన్ కాలంలో ప్రజలకు నిత్యవసరాల కొరత ఏర్పడకుండా ఉండేందుకు స్పెన్సర్స్ రిటైల్‌తో కలిసి పనిచేస్తున్నట్లు ఉబర్ ఇండియా అండ్ సౌత్ ఏషియా డైరెక్టర్ పరభ్‌జీత్ సింగ్ వెల్లడించారు. అంతేగాకుండా ఈ కష్టకాలంలో తమ ఊబర్ క్యాబ్ డ్రైవర్లకు ఆదాయం సమకూర్చేందుకు ఇది ఉపయోగపడుతున్నందున ఎటువంటి చార్జీలు గానీ కమీషన్లు గాని తమ సంస్థ తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. ఇంకా జొమాటో సంస్థ గ్రోఫర్స్తోనూ, డామినోస్ ఐటీసీతో కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. ఇంకా లక్షలమంది రీటైల్ వర్తకులతో చర్చలు జరుపుతున్నట్టు జొమాటో వెల్లడించింది. అలాగే స్పెన్సర్స్ కు చెందిన నేచుర్స్ బాస్కెట్ సంస్థ బిగ్ బాస్కెట్, గ్రోఫర్స్, బిగ్ బజార్, పండ్లు, కూరగాయల పంపిణీకి నింజాకార్ట్ తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందాల ద్వారా దాదాపు రెండు లక్షల మంది డ్రైవర్లలో 70 శాతం మందికి ఉపాధి లభించడంతోపాటు, వినియోగదారులకు అవసరాలు కూడా తీరతాయని ర్యాపిడో సహ వ్యవస్థాపకుడు అరవింద్ శంక వ్యాఖ్యానించారు. (లైట్లను ఆర్పేస్తే : గ్రిడ్ కుప్పకూలుతుంది) చదవండి : కరోనా : బ్యాంకు ఉద్యోగి చిట్కా వైరల్ -
కిరాణాపై అమెజాన్ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్
సాక్షి,న్యూఢిల్లీ: గత ఏడాది గ్రాసరీస్ (కిరాణా,ఆహారోత్పత్తులుఇతరత్రా) వ్యాపారంలోకి అడుగుపెట్టిన ప్రముఖ ఆన్లైన్ రీటైల్ దిగ్గజం అమెజాన్ ఈ మార్కెట్‌ను కొల్లగొట్టేందుకు మరింత దూకుడును ప్రదర్శిస్తోంది. వినియోగదారులను ఆకట్టుకునేందుకు సూపర్ వాల్యూ డే ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్లో నెలవారీ సరుకుల కొనుగోళ్లపై క్యాష్‌బ్యాక్‌లు, డిస్కౌంట్లను వినియోగదారులకు అందిస్తోంది. శుక్రవారం ప్రారంభమైన ఈ సేల్ మార్చి 7వ తేదీవరకు కొనసాగుతుంది. ఎస్బీఐ లేదా ఐసీఐసీ కార్డులు, అమెజాన్ పే, అమెజాన్ డిజిటల్వాలెట్ ద్వారా జరిపే కొనుగోళ్లపై ఈ ఆఫర్లను అందిస్తుంది. ఎస్బీఐ కార్డుపై దాదాపు 600 రూపాయల దాకా డిస్కౌంట్ లభిస్తుంది. ఎస్బీఐ కస్టమర్లకు ఈ అవకాశం మార్చి 4-7 తేదీల మధ్య అందుబాటులో ఉంది. మార్చి 1-3వ తేదీల మధ్య ఐసీఐసీఐ కార్డు కొనుగోళ్లపై ఆఫర్స్‌ను అందుకోవచ్చు. రూ. 1500 కొనుగోళ్ళపై ఐసీఐసీఐ కస్టమర్లు 15శాతం దాకా క్యాష్‌బ్యాక్ లేదా 600దాకా డిస్కౌంట్‌ను పొందవచ్చు. అలాగే ప్రతీనెల ఒకటవ తేదీనుంచి 7వ తేదీవరకు 40శాతం తగ్గింపు లేదా, 15శాతం క్యాష్ బ్యాక్ అందివ్వనున్నట్టు వెబ్సైట్లో వెల్లడించింది. మరిన్ని వివరాలు అమెజాన్ వెబ్సైట్లో లభ్యం. -
ఇకపై స్విగ్గీలో ఇవి కూడా
సాక్షి, న్యూఢిల్లీ : అన్లైన్ ఫుడ్ డెలివరీసంస్థ స్విగ్గీ కొత్త వ్యూహాలతో వ్యాపార విస్తరణకు పూనుకుంటోంది. ఇకపై తమ స్విగ్గీ ద్వారా పండ్లు, కూరగాయలు, కిరణా సరుకులు, ఇతర అత్యవసరమైన వస్తువులను డెలివరీ చేస్తామని మంగళవారం ప్రకటించింది. ఇందుకు వివిధ సంస్థలతో భాగస్వామ్యాలను కుదుర్చుకున్నట్టు ఒక ప్రకటనలో వెల్లడించింది. టూత్‌పేస్ట్ నుంచి మీ పెంపుడు జంతువుల ఆహారందాకా అన్నీ గంటలోపలే డెలివరీ చేస్తామని పేర్కొంది. 3500 స్టోర్ల ద్వారా ముందుగా గురుగ్రామ్‌లో ఈ సేవలను ప్రారంభిస్తున్నట్టు తెలిపింది. పళ్లు, కూరగాయలు,మాంసం, శిశు సంరక్షణ వస్తువులతోపాటు, ఇతర నిత్యావసర వస్తువులను సరఫరా చేయనున్నామని స్వీగ్గీ సీఈవో శ్రీహర్ష మాజేటి ఒక ప్రకటనలో తెలిపారు. ‘స్విగ్జీ స్టోర్స్ ' పేరుతో ఆవిష్కరించిన కొత్త సేవలు మొబైల్ యాప్ ద్వారా అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఇందుకోసం హెల్త్‌కార్ట్, జాప్ప్రెష్, అపోలో సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. కాగా 2014లో ఆహార-పంపిణీ సేవల సంస్థ స్విగ్గీ ఒక ప్రస్తుతం 80 కంటే ఎక్కువ భారతీయ నగరాల్లో పనిచేస్తోంది. -
గుడ్డు రూ.10.. టమాట రూ.50
(ఉద్దానం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): తిత్లీ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. సాధారణంగా రూ.5 ఉన్న కోడిగుడ్డు రూ.10 పలుకుతోంది. 25 లీటర్ల మంచినీరు క్యాన్ రూ.20 నుంచి రూ.50కి పెరిగింది. కిలో టమాటాలను రూ.40 నుంచి 50 వరకూ అమ్ముతున్నారు. కూరగాయల ధరలూ ఆకాశాన్ని అంటుతున్నాయని.. దీంతో పచ్చడితో సరిపెట్టుకుంటున్నామని బాధితులు చెబుతున్నారు. (పచ్చటి బతుకుల్లో తిత్లీ చిచ్చు) లూజులో పెట్రోలును లీటర్ రూ.150కి అమ్ముతున్నారని.. వంటగ్యాస్‌ను రెట్టింపు ధరకు విక్రయిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ‘ధరలు చూస్తే.. కొట్టోడు బతకాలి.. కొనేవాడు చావాలి’ అనే చందంగా ఉంది’ అని వజ్రపుకొత్తూరు మండలానికి చెందిన బైపల్లి గోపాలరావు, కామమ్మ దంపతులు చెప్పారు. కాగా.. నాలుగో రోజు ఆదివారం కూడా 1300 పైగా గ్రామాలకు విద్యుత్ సరఫరా కాలేదు. దీంతో వేలాడుతున్న కరెంటు తీగలపై గ్రామస్తులు దుస్తులు ఆరేశారు. పచ్చిబొప్పాయి కూర చేసుకుంటున్నాం కూరగాయల ధరలు మండిపోతుండడంతో తోటలో పడిపోయిన చెట్టు నుంచి పచ్చి బొప్పాయి కాయలు తెచ్చి కూర చేసుకుంటున్నాం. అసలే తుపానువల్ల తోటలు పోగొట్టుకుని కష్టాల్లో ఉన్న తాము ఎక్కువ ధర పెట్టి ఎక్కడ కొనగలం? వంట గ్యాస్ అయిపోవడంతో బయటే పొయ్యి మీద చేస్తున్నాం. – బైపల్లి గోపాలరావు, కామమ్మ దంపతులు -
నెల పాటు నిత్యవసర సరుకులపై 50 శాతం తగ్గింపు
దుబాయ్ : మార్చి 20న అంతర్జాతీయ హ్యాపీనెస్ డే సందర్భంగా యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో నిత్యవసర వస్తువులపై 50శాతం డిస్కౌంట్ ఇస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాదాపు 600 దుకాణాల్లో ఈ తగ్గింపులు ఉంటాయని అరబ్ వార్త పత్రిక అల్ బయాన్ ప్రచురించింది. ప్రజల వాడే నాణ్యమైన బ్రాండ్ సరుకుల పై ఈ నెల 20 నుంచి ఏప్రిల్ 20 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని వినియోగదారుల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ హషిమ్ అల్ నూయిమి సోమవారం ప్రకటించారు. సహకార సంస్థలు, లులూ, కార్ఫోర్ అవుట్ లెట్లు ఈ ఆఫర్ అందించే దుకాణాల జాబితలో ఉన్నాయి. -
కిరాణా రంగంలోకి అమెజాన్
న్యూఢిల్లీ: ప్రముఖ అంతర్జాతీయ ఈ కామర్స్ సంస్థ ‘అమెజాన్ డాట్ కామ్’ భారత్‌లో ఆహారం, కిరాణా సరకుల అమ్మకం రంగంలోకి అడుగుపెడుతోంది. కావల్సినంత సరకు నిల్వ చేసుకొని వాటిని విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఈ సంస్థకు అనుమతులు మంజూరు చేసినట్లు తెల్సింది. ఆహారం, కిరాణ సరకుల రంగంలో అమెజాన్ సంస్థ దాదాపు 3,370 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్నట్లు సంస్థ ప్రతినిథి ఒకరు మీడియాకు తెలిపారు. భారత్‌లో తమ వివిధ కార్యకలాపాల కోసం ఇప్పటికే ప్రకటించిన 32,263 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఈ కిరాణా రంగంపై పెడుతున్న పెట్టుబడులు అదనమని కంపెనీ ప్రతినిథి తెలిపారు. ఇప్పటికే కిరాణా రంగంలో బిగ్‌బజార్, స్టార్ బజార్, హైపర్ సిటీ సంస్థలతో అమెజాన్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. తమ ఆప్‌ను డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ ఇస్తే అదే రోజు అవసరమైన కిరాణా సరకులను సరఫరా చేయగలమని కంపెనీ వర్గాలు తెలియజేస్తున్నాయి. అమెరికాలోని సేంద్రీయ ఆహారోత్పత్తులను సరఫరాచేసే ‘హోల్ ఫుడ్స్ మార్కెట్’ నుంచి అమెజాన్ కంపెనీ ఇప్పటికే 883 కోట్ల రూపాయల సరకును కొనుగోలు చేసింది. ఈ కామర్స్‌లో అమెజాన్ డాట్ కామ్‌కు గట్టి పోటీని ఇస్తున్న భారతీయ సంస్థ ‘ఫ్లిప్‌కార్ట్’ కూడా త్వరలో కిరాణరంగంలోకి అడుగుపెడుతోంది. ఈ రంగంలో కూడా ఇరు కంపెనీలకు పోటీ తప్పదు. -
పేదలకు నిత్యావసరాల పంపిణీ
అనంతపురం: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా అనంతపురం పట్టణంలో నిరుపేద ముస్లింలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. అల్ హస్నత్ చారిటబుల్ ట్రాస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ఈ కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని సురానీ మసీదులో నిర్వహించిన సరుకుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి పల్లె రఘునాథరెడ్డి హాజరయ్యారు.