Gujarat Riots 2002
-
‘సబర్మతి రిపోర్ట్’ సినిమాపై ప్రధాని మోదీ కీలక ట్వీట్
న్యూఢిల్లీ:తాను సీఎంగా ఉన్నప్పుడు జరిగిన గుజరాత్ అల్లర్లను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ‘ది సబర్మతి రిపోర్ట్’ సినిమాపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రశంసల వర్షం కురిపించారు. నిజాలు బయటకు వస్తున్నాయన్నారు.కల్పిత కథనాలు పరిమిత కాలమే కొనసాగుతాయని,సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు.ఈ సినిమానుద్దేశించి ఒక నెటిజన్ పెట్టిన పోస్ట్‌పై ప్రధాని ఆదివారం ఎక్స్(ట్విటర్) వేదికగా స్పందించారు.2002లో గుజరాత్లో జరిగిన అల్లర్లు, గోద్రా రైలు దహన కాండ సంచలనం రేపిన విషయం తెలిసిందే.2002 ఫిబ్రవరి 27న పంచమహాల్ జిల్లాలోని గోద్రా నగరంలో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌కు కొందరు దుండగులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో 59 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. దీనిని ఆధారంగా చేసుకుని బాలీవుడ్ దర్శకుడు ధీరజ్ సర్నా ‘ది సబర్మతి రిపోర్ట్’ సినిమా తెరకెక్కించారు. విక్రాంత్ మాస్సే, రాశీఖన్నా ప్రధాన పాత్రల్లో నటించారు. రిధి డోగ్రా కీలక పాత్ర పోషించారు. నవంబర్ 15న సినిమా విడుదలైంది. Well said. It is good that this truth is coming out, and that too in a way common people can see it.A fake narrative can persist only for a limited period of time. Eventually, the facts will always come out! https://t.co/8XXo5hQe2y— Narendra Modi (@narendramodi) November 17, 2024 -
NCERT: బాబ్రీ కాదు.. 3 గోపురాల నిర్మాణం
న్యూఢిల్లీ : హేతుబద్దీకరణ పేరుతో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) పాఠ్య పుస్తకాల్లో పలు మార్పులు, చేర్పులు చేసిన సంగతి తెలిసిందే. అయితే 12వ తరగతి పొలిటికల్ సైన్స్ పుస్తకంలోనూ అనేక మార్పులు చేసింది. ‘బాబ్రీ మసీదు’ సహా అనేక కీలక అంశాలను, చాలా సమాచారాన్ని తొలగించింది. తొలగింపులు అంశాలవారీగా.. ⇒ ‘బాబ్రీ మసీదు’ పదం తొలగింపు: పాఠ్య పుస్తకంలోంచి బాబ్రీ మసీదు అనే పదాన్ని పూర్తిగా తొలగించింది. దాని స్థానంలో ‘మూడు గోపురాల నిర్మాణం’ను చేర్చింది. ⇒ అయోధ్య అధ్యాయం తగ్గింపు: నాలుగు పేజీలున్న అయోధ్య అధ్యాయాన్ని రెండు పేజీలకు తగ్గించింది. రథయాత్ర, కరసేవకుల పాత్ర, బాబ్రీ మసీదు కూలి్చవేత, అనంతరం జరిగిన హింస, ఆ తరువాత బీజేపీ పాలిత ప్రాంతాల్లో విధించిన రాష్ట్రప తి పాలన అంశాలను తొలగించింది. ⇒ చారిత్రక వివరాల సవరణ: బాబ్రీ మసీదుకు సంబంధించిన వివరాల్లో కూడా అనేక మార్పులు చేసింది. బాబ్రీ మసీదును 16వ శతాబ్దంలో మీర్ బాకీ నిర్మించినట్లుగా గత పుస్తకంలో ఉండగా.. 1528లో రాముడి జన్మస్థలంలో నిర్మించబడిన మూడు గోపురాల నిర్మాణంగా ఇప్పుడు పేర్కొన్నది. అంతేకాదు ఈ నిర్మాణంలో అనేక హిందూ చిహ్నాలు ఉన్నాయని, లోపలి, వెలుపలి గోడలపై శిల్పాలు ఉన్నాయని కొత్త పుస్తకం పేర్కొంది. హిందూ చిత్రాలు, విగ్రహాలను కూడా కొత్తగా ప్రస్తావించింది. ⇒ చట్టపరమైన, మతపరమైన కథనాల్లోనూ మార్పులు: ఆలయంలో పూజలు చేసుకునేందుకు బాబ్రీ మసీదు నిర్మాణాన్ని తెరచి ఉంచాలని 1986 ఫిబ్రవరిలో ఫైజాబాద్ జిల్లా కోర్టు ఇచి్చన తీర్పును పాత పుస్తకం వివరించగా, వాటన్నింటిని తొలగించి మూడు గోపురాల నిర్మాణం, తరువాత వచి్చన మతపరమైన వైరుధ్యాలను కొత్త పుస్తకం క్లుప్తంగా ప్రస్తావించింది. వివాదాస్పద భూమి ఆలయానికే చెందుతుందంటూ 2019లో సుప్రీంకోర్టు ఇచి్చన తీర్పును మాత్రం కొత్త ఎడిషన్‌లో చేర్చింది. ⇒ వార్తాపత్రికల కటింగ్స్ తీసివేత: పాత పుస్తకంలో వార్తాపత్రిక కథనాలకు సంబంధించిన అనేక ఛాయాచిత్రాలు ఉన్నాయి. వీటిలో డిసెంబర్ 7, 1992న ’బాబ్రీ మసీదు కూలి్చవేత, కేంద్రం కళ్యాణ్ సింగ్ ప్రభుత్వాన్ని రద్దు చేసింది’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనం కూడా ఉంది. వీటన్నింటినీ తొలగించారు. ⇒ గుజరాత్ అల్లర్ల అధ్యాయం తొలగింపు: ప్రజాస్వామ్య హక్కుల అధ్యాయం నుంచి గుజరాత్ అల్లర్ల ప్రస్తావనను పూర్తిగా తొలగించింది. అల్లర్ల గురించి బోధించాల్సిన అవసరం లేదుఎన్సీఈఆర్టీ డైరెక్టర్ ద్వేషం, హింస బోధనాంశాలు కావని, పాఠశాల పాఠ్యపుస్తకాలు వాటిపై దృష్టి పెట్టకూడదని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) చీఫ్ దినేష్ ప్రసాద్ సక్లానీ అన్నారు. గుజరాత్ అల్లర్లు, బాబ్రీ మసీదు కూలి్చవేత గురించి బోధిస్తే పాఠశాల విద్యార్థులు హింసాత్మకంగా తయారవుతారని, అందుకే వాటిని పాఠ్యాంశాల్లోంచి తొలగించామని వెల్లడించారు. పాఠ్య పుస్తకాల్లో మార్పులు, బాబ్రీ మసీదు కూల్చివేత, తరువాత మతపరమైన హింసకు సంబంధించిన అంశాల తొలగింపులపై శనివారం ఓ వార్తా సంస్థతో ఆయన మాట్లాడారు. సమాజంలో విద్వేషాలను సృష్టించే విధంగా బోధనలు అవసరం లేదని, చిన్నపిల్లలకు అల్లర్ల గురించిన నేరి్పంచాల్సిన అవసరం లేదని, అది ఎందుకు జరిగిందో పెద్దయ్యాక వారే తెలుసుకుంటారని చెప్పారు. పాఠ్య పుస్తకాల్లోని అంశాలను కాషాయీకరణ చేశారనే ఆరోపణలను కొట్టి పారేశారు. రామజన్మభూమికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునిస్తే దాన్ని పాఠ్యపుస్తకాల్లో ఎందుకు చేర్చకూడదని, పార్లమెంటు నూతన భవనాన్ని నిర్మించడం విద్యార్థులకు ఎందుకు తెలియకూడదని ఆయన ప్రశ్నించారు. చరిత్రను యుద్ధభూమిగా మార్చడానికి కాకుండా విద్యార్థులకు వాస్తవాలు తెలిసేలా బోధిస్తామన్నారు. పాఠ్యపుస్తకాల పునరి్వమర్శ ప్రపంచవ్యాప్తంగా జరిగే అభ్యాసమని, ఏది మార్చాలన్నది సబ్జెక్ట్, బోధనా శాస్త్ర నిపుణులే నిర్ణయిస్తారని, తాను ఆ ప్రక్రియలో జోక్యం చేసుకోనని స్పష్టం చేశారు. ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాల్లో 2014 నుంచి ఇప్పటివరకూ నాలుగు పర్యాయాలు మార్పులు చేశారు. -
NCERT Textbooks: ఆ పదాలు తొలగింపు
న్యూఢిల్లీ: పాఠశాల పాఠ్యపుస్తకాల్లో బాబ్రీ మసీదు కూల్చివేత, గుజరాత్ అల్లర్లలో ముస్లింల హత్య, హిందూత్వ తదితర పదాలు, వాక్యాలను తొలగిస్తున్నట్లు జాతీయ విద్యాపరిశోధనా, శిక్షణా మండలి(ఎన్సీఈఆర్టీ) పేర్కొంది. పాఠ్యపుస్తకాల్లో కాలానుగుణంగా చేయాల్సిన మార్పుల్లో భాగంగా ఈ సవరణలు చేపట్టినట్లు ఎన్సీఈఆర్టీ తెలిపింది. ఆరి్టకల్ 370 రద్దుకు సంబంధించిన అంశంలో పాక్ ఆక్రమిత జమ్మూకశ్మీర్(పీఓకే) అనే పదానికి బదులు ఆజాద్ పాకిస్తాన్ అనే పదాన్ని చేర్చారు. పుస్తకాల నుంచి కొన్ని పాఠ్యాంశాల తొలగింపుపై ఎన్సీఈఆర్టీ స్పందించింది. ‘‘ పుస్తకాల ఆధునీకరణలో జరిగే సాధారణ ప్రక్రియ ఇది. నూతన విద్యా ప్రణాళిక కింద చేసే కొత్త పాఠ్యపుస్తకాల తయారీకి దీనితో ఏ సంబంధం లేదని అధికారులు స్పష్టంచేశారు. ఇతర తరగతుల పుస్తకాలతోపాటు 11, 12 తరగతుల రాజనీతి శాస్త్రం, సామాజిక శాస్త్ర పాఠ్యపుస్తకాల్లో ఈ మార్పులు చేశారు. 11వ తరగతిలో లౌకికవాదం అనే 8వ చాప్టర్లో ‘‘ 2002 గుజరాత్ గోధ్రా అల్లర్ల తర్వాత వేయికిపైగా ఊచకోతకు బలయ్యారు. ఇందులో ముస్లింలే ఎక్కువ’’ అనే వాక్యంలో ముస్లింలు అనే పదం తొలగించారు. అల్లర్ల ప్రభావం అన్ని మతాలపై ఉన్న కారణంగా ఒక్క మతాన్నే ప్రస్తావించడం సబబు కాదని ఎన్సీఈఆర్టీ భావించింది. 12వ తరగతి రాజనీతిశాస్త్రం పుస్తకంలోని ‘స్వాతంత్య్రం నుంచి భారత రాజకీయాలు’ చాప్టర్లో కొత్తగా ఆరి్టకల్ 370 రద్దును జతచేశారు. 8వ చాప్టర్లో ‘‘ 1992 డిసెంబర్లో బాబ్రీ మసీదు కూల్చివేతతో ఎన్నో విపరిణామాలు జరిగాయి. ఇది బీజేపీ, హిందూత్వ వ్యాప్తికి దారితీసింది’’అన్న వాక్యాలకు బదులు ‘ శతాబ్దాలనాటి రామజన్మభూమి ఆలయ వివాదం దేశ రాజకీయాలనే మార్చేసింది’’ అని మార్చారు. ఇందులో హిందూత్వ పదాన్ని తొలగించారు. -
బిల్కిస్ బానో కేసు.. రేపు సుప్రీం తీర్పు
న్యూఢిల్లీ: 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం, ఆమె కుటుంబంలోని ఏడుగురి దారుణహత్య ఘటనల్లో దోషులకు శిక్ష తగ్గింపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై తీర్పును సుప్రీంకోర్టు సోమవారం వెలువరించనుంది. జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌ల ధర్మాసనం పిటిషన్లపై 11 రోజులపాటు వాదనలను వింది. తీర్పును రిజర్వులో ఉంచుతున్నట్లు గత ఏడాది అక్టోబర్ 12న ప్రకటించింది. అక్టోబర్ 16వ తేదీ కల్లా శిక్ష తగ్గింపు నిర్ణయానికి సంబంధించిన ఫైళ్లను తమ ముందు ఉంచాలని కేంద్రం, గుజరాత్ ప్రభుత్వాలను ఆదేశించింది. బిల్కిస్ బానో కేసులో మొత్తం 11 మంది దోషులకు శిక్షను తగ్గించి, 2022 ఆగస్ట్ 15న గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. -
నరోదా పాటియా ఊచకోత కేసులో సంచలన తీర్పు
గాంధీనగర్: గుజరాత్ నరోదా పాటియా ఊచకోత కేసులో అహ్మదాబాద్ ప్రత్యేక కోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది. బీజేపీ నేత మాయా కొద్నానితో సహా 69 మందిని నిర్దోషులుగా ప్రకటించింది కోర్టు. ఇందులో బజరంగ్ దళ్ సభ్యుడు బాబూ బజరంగీతో పాటు వీహెచ్‌పీ నేత జయదీప్ పటేల్ కూడా ఉన్నారు. గురువారం సాయంత్రం స్పెషల్ జడ్జి సుభదా బాక్సి తీర్పు వెలువరించగా.. బయట నిందితుల మద్ధతుదారులు, బంధువుల ‘జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై..’ నినాదాలు చేశారు. 2002 ఫిబ్రవరి 28వ తేదీన నరోదా పాటియాలో చెలరేగిన అల్లర్లలో మొత్తం 97 మంది మరణించారు. అయితే.. నరోదా గామ్ కుంభర్ వ్యాస్ ఏరియాలో ‘ముస్లిం మహోల్లా’గా పేరున్న నివాస సముదాయంలో నరమేధం జరిగింది. మొత్తం 11 మంది మరణించారు. నరోదా పీఎస్‌లో ఇందుకు సంబంధించిన కేసు నమోదు అయ్యింది. ఈ కేసులోనే గుజరాత్ మాజీ మంత్రి మాయా కొద్నాని, వీహెచ్‌పీ, ఆరెస్సెస్ నేతలు, ఇతరులను నిందితులుగా చేర్చారు. 👉 గుజరాత్ అల్లర్ల కేసుల విచారణ కోసం ఏర్పాటైన అహ్మదాబాద్ ప్రత్యేక కోర్టు.. ఈ కేసులో ఏప్రిల్ 5వ తేదీతోనే వాదనలు పూర్తి చేసుకుంది. తీర్పును ఇవాళ్టికి(ఏప్రిల్ 20కి)రిజర్వ్ చేసింది. చివరికి.. నరమేధం జరిగిన 21 ఏళ్ల తర్వాత తీర్పు వెలువడింది. 👉 ఈ కేసు దర్యాప్తు ప్రారంభంలో మొత్తం 86 మంది పేర్లను నిందితుల జాబితాలో చేర్చగా.. 17 మందిని ట్రయల్ దశలోనే నిర్దోషులుగా వదిలేశారు. మిగతా 69 మందిని నిందితులుగా కొనసాగించారు. అంతా ప్రస్తుతం బెయిల్ మీద బయట ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి దాదాపు 182 మందిని ప్రాసిక్యూషన్ సాక్షులుగా పేర్కొన్నారు. 👉 నరోదా గామ్ ఊచకోత కేసు.. గోద్రా సబర్మతి రైలు దహనం ఘటన జరిగిన మరుసటిరోజు నుంచి గుజరాత్లో తొమ్మిది ప్రాంతాల్లో చెలరేగిన అల్లర్లలో ఒకటి. పైగా గుజరాత్ అల్లర్లలో ‘‘భారీ నరమేధం’’గా నరోదా పాటియా కేసును అభివర్ణిస్తుంటారు. 👉 ఈ కేసులో మాయా కొద్నాని ప్రధాన సూత్రధారి అంటూ అభియోగాలు నమోదు అయ్యాయి. ఆ సమయంలో ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) గుజరాత్ ప్రభుత్వానికి ఓ నివేదిక సైతం సమర్పించింది. అయినప్పటికీ.. 2008లో సుప్రీం కోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం నివేదిక 70 మంది నిందితులకు వ్యతిరేకంగా నివేదిక సమర్పించింది. 61 మందిపై అభియోగాలు మోపింది. 31 మందిని సూత్రధారులుగా తేల్చింది. 👉 నివేదికల ఆధారంగా 2012లో.. గుజరాత్ మాజీ మంత్రి మాయా కొద్నానికి 28 ఏళ్ల శిక్ష విధించింది అహ్మదాబాద్ ట్రయల్ కోర్టు. తీర్పు సందర్భంగా స్పెషల్ జడ్జి జ్యోత్స్న యాగ్నిక్, కొద్నానిని ఈ మత ఘర్షణకు ప్రధాన సూత్రధారిగా పేర్కొన్నారు కూడా. కొద్నానీకి 28 ఏళ్ల జైలు శిక్ష. బజిరంగీకి జీవిత ఖైదు. ఎనిమిది మందికి 31 ఏళ్ల శిక్ష. 22 మందికి 24 ఏళ్ల చొప్పున శిక్ష విధించారు ట్రయల్ కోర్టు జడ్జి జ్యోత్స్న యాగ్నిక్. 👉 అయితే.. మాయా కొద్నాని సహా 10 మంది ప్రధాన నిందితులకు విధించిన జీవిత ఖైదును మరణశిక్షగా మార్చాలంటూ గుజరాత్ ప్రభుత్వం 2013 ఏప్రిల్‌లో అప్పీల్‌కు వెళ్లింది. సిట్ ఇచ్చిన నివేదిక ఆధారంగానే అప్పటి మోదీ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. చివరికి మే 14వ తేదీన ఆ పిటిషన్‌ను వెనక్కి తీసుకుంది. 👉 సాధారణంగా కింది కోర్టు(ఈ కేసులో ట్రయల్ కోర్టు) తీర్పును పైకోర్టులో మూడు నెలల్లోనే సవాల్ చేయాలి. కానీ, అప్పుడు ఏడు నెలల గ్యాప్ తర్వాత సవాల్ చేసేందుకు గుజరాత్ ప్రభుత్వం ప్రయత్నించడం గమనార్హం. 👉 2013లో టీబీ కారణంగా మూడు నెలలపాటు బెయిల్ మీద బయటకు వచ్చిన ఆమె.. 2014లో అనారోగ్యం కారణంగా ఏకంగా ఆమె జైలు శిక్షను సస్పెండ్ చేస్తూ గుజరాత్ హైకోర్టు బెయిల్ మంజూరు అయ్యింది. 👉 ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. కొద్నాని స్వయంగా అల్లరి మూకకు కత్తులు అందించారు. ముస్లింలపై దాడులకు ఉసిగొల్పారు. ఒకానొక టైంలో తుపాకీతోనూ ఆమె కాల్పులు జరిపారు. అయితే.. ఆరోజు ఉదయం తాను అప్పటి చట్టసభ్యుడు అమిత్ షాతో అసెంబ్లీలో ఉన్నానని, ఆపై ఆయనతో కలిసి గోద్రా మారణకాండ బాధితుల్ని పరామర్శించేందుకు ఆస్పత్రికి సైతం వెళ్లినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ కేసు విచారణ సందర్భంగా 2017లో కొద్నాని తరపున సాక్షిగా ఇప్పటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు కూడా. 👉 ఆపై గుజరాత్ హైకోర్టుకు అప్పీల్‌కు వెళ్లగా.. 2018లో కొద్నానితో పాటు 17 మందిని నిర్దోషులుగా తేలుస్తూ తీర్పు ఇచ్చింది. అయితే.. బజరంగితోపాటు 16 మందిని మాత్రం దోషులుగా తేల్చింది. 👉 ఇప్పుడు(ఏప్రిల్ 20, 2023).. గుజరాత్ అల్లర్ల కేసుల్ని విచారణ జరుపుతున్న అహ్మదాబాద్ ప్రత్యేక కోర్టు నరోదా పాటియా ఊచకోత కేసులో కొద్నానితో పాటు నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. 👉 ఇక గుజరాత్ అల్లర్లపై జస్టిస్ నానావతి కమిషన్ సమర్పించిన నివేదికలో సాక్షుల స్టేట్మెంట్ ఆధారంగా ‘‘ఆ సమయంలో ముస్లింలకు సాయం చేసేందుకు పోలీసులు ఎవరూ రాలేదు. నిస్సహాయంగా వాళ్లు ఆర్తనాదాలు చేశారు. సాయంత్రానికే పోలీసులు అక్కడికి చేరుకున్నారు అని పేర్కొంది. అయితే.. కమిషన్ ఎదుట హాజరైన పోలీసులు మాత్రం అంతకన్నా తీవ్ర పరిస్థితులు ఉన్న ప్రాంతంలో తాము మోహరించామని, నరోదా గామ్‌కు చేరుకునే పరిస్థితులు కూడా లేవని స్టేట్మెంట్ ఇచ్చారు. మాయా కొద్నాని నేపథ్యం.. పూర్తి పేరు మాయా సురేంద్రకుమార్ కొద్నాని.. గుజరాత్ మాజీ మంత్రి. నరోదా నుంచి బీజేపీ తరపున ఆమె గతంలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. సింధి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సభ్యుడి కూతురు ఈమె. 👉 తండ్రిబాటలో పయనించి.. రాష్ట్రీయ సేవీకా సమితిలో(ఆరెస్సెస్ మహిళావ విభాగం) చేరారామె. ఎంబీబీఎస్ చేసి గైనకాలిస్టుగా స్పెషలైజేషన్ చేసిన కొద్నాని.. నరోదాలోనే ఓ ఆస్పత్రిలో పని చేశారు. ఆమె భర్త సురేంద్రకుమార్ కొద్నాని ఫిజీషియన్‌గా పని చేశారు. 👉 1995 అహ్మదాబాద్ మున్సిపల్ ఎన్నికల నుంచి ఆమె రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత మూడుసార్లు ఆమె నరోదా ఎమ్మెల్యేగా ఎన్నియ్యారు. గుజరాత్ అల్లర్లు జరిగిన అదే ఏడాది డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లోనూ ఆమె ఘన విజయం సాధించారు. 👉 2007 ఎన్నికల్లోనూ నెగ్గిన తర్వాత ఆమె మహిళా శిశుసంక్షేమ అభివృద్ధి శాఖా మంత్రిగా మోదీ కేబినెట్లో పని చేశారు. అయితే.. 2009లో నరోదా పాటియా నరమేధానికి సంబంధించిన అభియోగాలతో ఆమె అరెస్ట్ కావడంతో.. తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ కేసును తనకు వ్యతిరేకంగా జరిగిన రాజకీయ కుట్రగా అభివర్ణిస్తుంటారామె. :::సాక్షి వెబ్ ప్రత్యేకం -
Bilkis Bano Case: కేంద్రం, గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు
2002 గుజరాత్ అల్లర్ల సమయంలో సామూహిక అత్యాచారానికి గురైన బిల్కిస్ బానో కేసులో దోషులైన 11 మందిని విడుదల చేయడంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దోషుల విడుదలను సవాల్ చేస్తూ బాధితురాలు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన ప్రత్యేక ధర్మాసనం సోమవారం విచారించింది. ఈ కేసు అనేక సమస్యలతో ముడిపడి ఉందని.. ఈ అంశంపై పూర్తిస్థాయి విచారణ జరగాల్సిన అవసరముందని ధర్మాసనం పేర్కొంది. ‘బిల్కిస్ బానో కేసులోని 11 మంది దోషులను ఇతర కేసుల్లోని రెమిషన్ ప్రమాణాల ప్రకారమే విడుదల చేశారా? రెమిషన్ కోసం నిందితులు ఏళ్లుగా జైళ్లలోనే మగ్గుతుగున్న అనేక హత్య కేసులు మన ముందు ఉన్నాయి. ఈ కేసుల్లోనూ అవే నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదా?’ అని ద్విసభ్య ధర్మాసనంలోని జస్టిస్ జోసెఫ్ ప్రశ్నించారు. తదుపరి విచారణ తేదీ నాటికి రెమిషన్ మంజూరుకి సంబంధించిన అన్ని పత్రాలను సిద్ధం చేసుకోవాలని.. కేంద్ర ప్రభుత్వంతోపాటు గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో భావోద్వేగాలకు తావు లేదని, చట్ట ప్రకారం విచారిస్తామని వెల్లడించింది. ఏప్రిల్ 18న కేసును మరోసారి విచారిస్తామని తెలిపింది. కాగా 2002 గోద్రా అల్లర్ల సమయంలోబిల్కిన్ బానోపై లైంగిక దాడి జరిగింది. ఆ సమయంలో ఆమె వయసు 21 ఏళ్ల కాగా.. అప్పటికే ఐదు నెలల గర్భవతి. అంతేగాక ఆమె కుటుంబ సభ్యులు ఏడుగురిని హత్య చేశారు. ఇందులో మూడేళ్ల కూతురు సైతం ఉంది. దీనిపై సీబీఐ దర్యాప్తు చేపట్టగా.. విచారణను మహారాష్ట్ర కోర్టుకు సుప్రీంకోర్టు విచారణను బదిలీ చేసింది. 2008 జనవరి 21న సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ కేసులో 11 మందిని దోషులుగా నిర్ధారిస్తూ.. నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ తీర్పును ఆ తర్వాత బాంబే హైకోర్టు, సుప్రీంకోర్టు ధ్రువీకరించాయి. అయితే 15 ఏళ్ల జైలు శిక్ష తర్వాత తమను విడుదల చేయాలంటూ దోషుల్లో ఒకరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దోషి విడుదల అభ్యర్థనను పరిశీలించాలంటూ గుజరాత్ ప్రభుత్వాన్ని మే 2022న కోర్టు ఆదేశించింది. దీనిపై కమిటీని ఏర్పాటు చేసిన గుజరాత్ ప్రభుత్వం దోషులకు రెమిషన్ మంజూరు చేయాలని సిఫార్సు చేసింది. వాటిని కోర్టుకు సమర్పించగా.. 1992 నాటి రెమిషన్ విధానాన్ని అమలు చేసేందుకు గుజరాత్ సర్కారుకు అనుమతినిచ్చింది. ఫలితంగా జైలులో సత్ప్రవర్తన పేరుతో గోద్రా సబ్ జైలు నుంచి గత ఏడాది ఆగష్టు 15న నిందితులు విడుదలయ్యారు. నిందితుల్లో కొందరు 15 సంవత్సరాలు, మరికొందరు 18 ఏళ్లు జైలు శిక్ష అనుభవించారు. ఈ క్రమంలో నిందితుల ముందస్తు విడుదలపై సుప్రీంకోర్టులో బిల్కిస్ బానో రెండు పిటిషన్లు దాఖలు చేశారు. దోషుల విడుదలపై పిటిషన్‌తో పాటు మే 13 2022న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇందులో ఒకటి సుప్రీంకోర్టు కొట్టివేసింది. దోషుల విడుదల పిటిషన్‌పై మార్చి 22న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పందిస్తూ.. కొత్త బెంచ్ ఏర్పాటుకు అనుమతినిచ్చింది. ఈ అంశాన్ని అత్యవసరంగా జాబితా చేయాలని, నిందితుల విడుదలపై విచారణ అవసరమన్నారు. -
Bilkis Bano: ప్రత్యేక ధర్మాసనానికి ఓకే
ఢిల్లీ: గుజరాత్ అల్లర్ల అత్యాచార బాధితురాలు బిల్కిస్ బానో అభ్యర్థనకు దేశ సర్వోన్నత న్యాయస్థానం ఎట్టకేలకు సానుకూలంగా స్పందించింది. ఆమె పిటిషన్‌ను విచారించేందుకు ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేసేందుకు బుధవారం అంగీకరించింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఈ మేరకు స్వయంగా బాధితురాలి తరపు న్యాయవాదికి ఈ విషయమై స్పష్టత ఇచ్చారు. బానో తరపున లాయర్ శోభా గుప్తా విజ్ఞప్తి మేరకు న్యాయస్థానం ఇందుకు అంగీకరించింది. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో పాటు జస్టిస్ పీఎస్ నరసింహా, జేబీ పార్దివాలాలతో కూడిన బెంచ్.. ఈ మేరకు బెంచ్ ఏర్పాటునకు అంగీకరించారు. ఈ కేసులో దోషులను రెమిషన్ మీద విడుదల చేయడం సరికాదు. ఈ(బానో) పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని, దానికి ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయల్సి ఉందని లాయర్ గుప్తా.. త్రిసభ్య ధర్మాసనాన్ని కోరారు. దీనికి ‘‘ నేను బెంచ్ ఏర్పాటు చేస్తా. సాయంత్రమే దాన్ని పరిశీలిస్తా’’ అని స్వయంగా సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, గుప్తాకు తెలిపారు. ఈ పిటిషన్‌తో పాటు నిందితుల విడుదలను సవాల్ చేస్తూ బానో ప్రత్యేకంగా మరో పిటిషన్‌ను సైతం సుప్రీంలో దాఖలు చేశారు. 2002 గుజరాత్ అలర్ల సమయంలో.. బిల్కిస్ బానో దారుణంగా సామూహిక అత్యాచారానికి గురైంది. అదే అల్లర్లలో ఆమె కుటుంబ సభ్యులు సైతం హత్యకు గురయ్యారు. ఇక ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న పదకొండు మందిని.. గుజరాత్ ప్రభుత్వం కిందటి ఏడాది ఆగష్టు 15వ తేదీన రెమిషన్ కింద విడుదల చేసింది. దీనిని సవాల్ చేస్తూ గత డిసెంబర్లో బిల్కిస్ బానో సుప్రీంను ఆశ్రయించగా.. ఆ అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఇక.. ఈ ఏడాది జనవరి 24వ తేదీన సైతం ఆమె మరో పిటిషన్ దాఖలు చేయగా.. ఆ సమయానికి ఐదుగురు జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం మరో పిటిషన్‌తో బిజీగా ఉండడం వల్ల ముందుకు కదల్లేదు. -
కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. ఏకే ఆంటోని కుమారుడు అనిల్ రాజీనామా
కాంగ్రెస్‌కు బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ ఈ రాజీనామాకు కారణంగా మారింది. 2002 గుజరాత్ అల్లర్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మోదీపై బీబీసీ ప్రసారం చేసిన డాక్యుమెంటరీపై అనిల్ అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ డాక్యుమెంటరీని వ్యతిరేకిస్తూ అనిల్ ఆంటోనీ పోస్టు చేయగా.. తన ట్వీట్‌ను వెనక్కి తీసుకోవాలంటూ అతనికి కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్ర ఒత్తడి ఎదురైంది. ఈ క్రమంలోనే పార్టీ నుంచి వైదొలుగుతున్నట్లు బుధవారం ప్రకటించారు. మోదీపై డాక్యుమెంటరీపై విమర్శించిన మరుసటి రోజే అనిల్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ‘కాంగ్రెస్ పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నాను. నా ట్వీట్‌ను వెనక్కి తీసుకోవాలని విపరీతమైన ఒత్తిడి చేశారు. అది కూడా వాక్ స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న వారి నుంచి వచ్చింది. కానీ దానికి నేను నిరాకరించాను. ప్రేమను ప్రచారం చేసే వారే ఫేస్బుక్లో నాపై ద్వేషాన్ని వెల్లగక్కుతున్నారు. దీనినే హిపోక్రసీ అంటారు. జీవితం సాగుతూనే ఉంటుంది’ అంటూ ట్విటర్లో రాజీనామా లేఖను కూడా పోస్టు చేశారు. ‘నిన్నటి నుంచి సంఘటనలను పరిశీలిస్తే కాంగ్రెస్‌లోని నా అన్ని పదవులను వదిలేయడానికి సరైన సమయమని నమ్ముతున్నాను. కేపీసీసీ డిజిటల్ మీడియా కన్వీనర్, ఏఐసీసీ సోషల్ మీడియా- డిజిటల్ కమ్యూనికేషన్ సెల్ జాతీయ కో ఆర్డినేటర్ పదవులకు రాజీనామా చేస్తున్నాను. నా రాజీనామా లేఖను పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నాను. నేను ఇక్కడ ఉన్న కొద్ది కాలంలో నాకు సహరించిన కేరళ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వానికి, నేతలకు, పార్టీ కార్యకర్తలకు ముఖ్యంగా ఎంపీ శంశిథరూర్‌కు ధన్యవాదాలు.’ అని తెలిపారు. ఇక ఇప్పటికే మోదీపై ‘ఇండియా ద మోదీ క్వశ్చన్’ పేరుతో బీబీసీ ప్రసారం చేసిన డాక్యుమెంటరీ లింక్‌లను బ్లాక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం యూట్యూబ్, ట్విట్టర్ సంస్థలను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏకే ఆంటోనీ తనయుడు అనిల్ ఆంటోనీ నుంచి మోదీకి అనూహ్య మద్దతు లభించింది. భారతీయ సంస్థలపై బ్రాడ్‌కాస్టర్ అభిప్రాయాలను వెల్లడించడం దేశ సార్వభౌమత్వాన్ని అణగదొక్కడం కిందకే వస్తుందంటూ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. 2002 గుజరాత్ అల్లర్లపై రూపొందించిన బీబీసీ డాక్యుమెంటరీని కేరళలో ప్రదర్శిస్తామని రాష్ట్ర కాంగ్రెస్ లోని వివిధ విభాగాలు ప్రకటించిన తరుణంలో ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు. చదవండి: కొలీజియం తీర్మానం తీవ్ర ఆందోళనకరం I have resigned from my roles in @incindia @INCKerala.Intolerant calls to retract a tweet,by those fighting for free speech.I refused. @facebook wall of hate/abuses by ones supporting a trek to promote love! Hypocrisy thy name is! Life goes on. Redacted resignation letter below. pic.twitter.com/0i8QpNIoXW — Anil K Antony (@anilkantony) January 25, 2023 -
నేరస్థులను సన్మానించడం ముమ్మాటికీ తప్పే..
ముంబై: బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం కేసులో 11 మంది దోషులు ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యారు. వారికి కొందరు పూలమాలలు వేసి సన్మానాలు చేశారు. దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయంపై తాజాగా మహారాష్ట్ర హోంమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే దోషులు విడుదలయ్యారని, వారంతా దాదాపు 20 ఏళ్లు జైలు శిక్ష అనుభవించారని పేర్కొన్నారు. అయితే నేరస్థులకు పూలమాలలు వేసి సన్మానాలు చేయడం మాత్రం ముమ్మాటికీ తప్పే అని ఫడ్నవీస్ స్పష్టం చేశారు. ఇలా చేయటం సరికాదన్నారు. మహారాష్ట్ర భండారాలో 35ఏళ్ల మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనపై శాసన మండలిలో చర్చ సందర్భంగా ఫడ్నవీస్ ఈ వ్యాఖ్యలు చేశారు. బిల్కిస్ బానో ఘటనను సభలో ప్రస్తావించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. 2002 గుజరాత్ అలర్ల సమయంలో బాల్కిస్ బానో సామూహిక అత్యాచార ఘటన జరిగింది. బాధితురాలి కుటుంబంలోని ఏడుగురిని దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో మొత్తం 11 మందిని 2008లో దోషులుగా తేల్చింది ముంబయిలోని సీబీఐ న్యాయస్థానం. అందరికీ యవజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఆ తర్వాత బాంబే హైకోర్టు కూడా ఈ తీర్పును సమర్థించింది. అయితే 14 ఏళ్ల శిక్షకాలం పూర్తి చేసుకున్నందున తమను జైలు నుంచి విడుదల చేయాలని దోషుల్లో ఒకరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ విషయాన్ని పరిశీలించాలని గుజారత్ ప్రభుత్వాన్ని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 15న 11 మందిని విడుదల చేసింది గుజరాత్ ప్రభుత్వం. వీరంతా జైలు నుంచి బయటకు రాగానే కొందరు పూలమాలలు వేసి మిఠాయిలు తినిపించారు. దోషులందరినీ జైలు నుంచి విడుదల చేయడం, సన్మానించడంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. చదవండి: ‘రాజీ’ ఎరుగని బీజేపీ ఎమ్మెల్యే.. ఏడికైతే ఆడికైతది.. తగ్గేదెలే! -
నాడు మోదీ సర్కార్‌ను కూల్చే కుట్ర
అహ్మదాబాద్/న్యూఢిల్లీ: 2002లో గుజరాత్లో మత కలహాల తర్వాత రాష్ట్రంలో అప్పటి బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు పెద్ద కుట్ర జరిగిందని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) తేల్చింది. సర్కారును కూల్చడానికి కాంగ్రెస్ దివంగత నేత అహ్మద్ పటేల్ ఆదేశాలతో సాగించిన కుట్రలో సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ సైతం భాగస్వామిగా మారారని వెల్లడించింది. సెతల్వాద్ బెయిల్ దరఖాస్తును వ్యతిరేకిస్తూ తాజాగా అహ్మదాబాద్ సెషన్స్ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. గుజరాత్ అల్లర్ల కేసులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆమె సమర్పించిన దరఖాస్తును ‘సిట్’ తిరస్కరించింది. సెతల్వాద్‌కు బెయిల్ ఇవ్వొద్దని కోర్టుకు విజ్ఞప్తి చేసింది. బెయిల్ దరఖాస్తుపై తదుపరి విచారణను అదనపు సెషన్స్ జడ్జి డి.డి.ఠక్కర్ సోమవారానికి వాయిదా వేశారు. గుజరాత్ మత కలహాల కేసులో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీతోపాటు అమాయకులను ఇరికించేలా తప్పుడు సాక్ష్యాధారాలను సృష్టించారన్న ఆరోపణలతో తీస్తా సెతల్వాద్‌తోపాటు గుజరాత్ మాజీ డీజీపీ ఆర్.బి.శ్రీకుమార్, మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్‌ను గుజరాత్ పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. రాజకీయ కారణాలతోనే.. ‘‘ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలదోయడానికి లేదా అస్థిరపర్చడానికి తీస్తా సెతల్వాద్ ప్రయత్నించారు. రాజకీయ కారణాలతో కుట్ర సాగించారు. అల్లర్ల కేసులో అమాయకులను ఇరికించాలని చూశారు. ఇందుకోసం తప్పుడు సాక్ష్యాలు సృష్టించారు. ప్రతిఫలంగా ప్రతిపక్షం (కాంగ్రెస్) నుంచి చట్టవిరుద్ధంగా ఆర్థిక సాయం, ఇతర ప్రయోజనాలు, బహుమతులు పొందారు’’ అని సిట్ తన అఫిడవిట్లో ఆరోపించింది. సాక్షుల స్టేట్మెంట్లను ఉటంకించింది. అహ్మద్ పటేల్ ఆజ్ఞతోనే కుట్ర జరిగిందని, గోద్రా అల్లర్ల తర్వాత ఆయన నుంచి సెతల్వాద్, ఆర్.బి.శ్రీకుమార్, సంజీవ్ భట్ రూ.30 లక్షలు స్వీకరించారని తెలిపింది. గుజరాత్ అల్లర్ల కేసులో బీజేపీ సీనియర్ నాయకుల పేర్లను చేర్చాలంటూ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ(కాంగ్రెస్) నాయకులను సెతల్వాద్ తరచూ కలుస్తూ ఉండేవారని గుర్తుచేసింది. మరో సాక్షి చెప్పిన విషయాలను సిట్ ప్రస్తావించింది. కేవలం షబానా అజ్మీ, జావెద్ అక్తర్‌ను ఎందుకు రాజ్యసభకు పంపిస్తున్నారు? తనకెందుకు అవకాశం ఇవ్వడం లేదంటూ 2006లో ఓ కాంగ్రెస్ నాయకుడిని సెతల్వాద్ నిలదీశారని పేర్కొంది. మోదీకి క్లీన్చిట్.. సమర్థించిన సుప్రీంకోర్టు గుజరాత్ అల్లర్ల కేసులో నరేంద్ర మోదీతో సహా 62 మందికి ‘సిట్’ క్లీన్చిట్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు గత నెలలో సమర్థించింది. ‘సిట్’ ఇచ్చిన క్లీన్‌చిట్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. మరుసటి రోజే సెతల్వాద్‌ను గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు. ఆమెతోపాటు శ్రీకుమార్, సంజీవ్ భట్‌పై ఐపీసీ సెక్షన్ 468(ఫోర్జరీ), సెక్షన్194 (దురుద్దేశంతో తప్పుడు సాక్ష్యాలు సృష్టించడం)తోపాటు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గుజరాత్ అల్లర్ల వ్యవహారానికి సంబంధించి కల్పిత సాక్ష్యాలు, తప్పుడు సమాచారం సృష్టించారన్న ఆరోపణలపై రాష్ట్ర పోలీసు శాఖకు చెందిన ‘సిట్’ దర్యాప్తు కొనసాగిస్తోంది. సెతల్వాద్, శ్రీకుమార్‌ను 14 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ అహ్మదాబాద్‌లోని మెట్రోపాలిటన్ కోర్టు జూలై 2న ఆదేశాలిచ్చింది. అహ్మద్ పటేల్ కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీకి రాజకీయ సలహాదారుగా సేవలందించిన సంగతి తెలిసిందే. 2002 ఫిబ్రవరి 27న గుజరాత్‌లోని గోద్రా రైల్వే స్టేషన్లో సబర్మతీ ఎక్స్‌ప్రెస్‌కు దుండగులు నిప్పుపెట్టారు. అయోధ్య నుంచి రైలులో వస్తున్న 58 మంది భక్తులు ఆహూతయ్యారు. -
మోదీ సర్కార్‌ను కూల్చేందుకే.. గుజరాత్ అల్లర్ల వెనుక కాంగ్రెస్ హ్యాండ్!
గుజరాత్ అల్లర్లపై సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. 2002 నాటి అల్లర్ల కేసులో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీని ఇరికేంచేందుకు దివంగత కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ కుట్ర పన్నారనే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మేరకు సిట్ వెల్లడించింది. ఈ కుట్రలో సామాజిక కార్యకర్త తీస్వా సెతల్వాద్‌కు హ్యాండ్ ఉందని సిట్ పేర్కొంది. ఈ మేరకు సెషన్స్ కోర్టులో అఫిడవిట్‌ను దాఖలు చేసింది. అయితే, 2002 గుజరాత్ అల్లర్ల కేసుకు సంబంధించి కల్పిత సాక్ష్యాలు, తప్పుడు సమాచారం ఆరోపణలపై పోలీసు శాఖకు చెందిన సిట్ దర్యాప్తు జరుపుతోంది. విచారణలో భాగంగా.. సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్, మాజీ డీజీపీ ఆర్బీ శ్రీకుమార్, ఐపీఎస్ ఆఫీసర్ సంజీవ్ భట్‌లకు అహ్మద్ పటేల్ 30 లక్షలు ఇచ్చారని సిట్ తెలిపింది. అలాగే, అల్లర్ల కేసులో మోదీని ఇరికించాలానే ఉద్దేశంతో పటేల్ ఆ డబ్బులు ఇచ్చినట్లు సిట్ తన రిపోర్ట్‌లో పేర్కొన్నది. సెతల్వాద్, శ్రీకుమార్‌లు నేర కుట్రకు, ఫోర్జరీకి పాల్పడినట్లు సిట్ వెల్లడించింది. ఇదిలా ఉండగా.. జూలై రెండవ తేదీన సెతల్వాద్, శ్రీకుమార్‌లను 14 రోజుల పాటుకు రిమాండ్‌కు తరలిస్తూ అహ్మదాబాద్ మెట్రోపాలిటన్ కోర్టు పోలీసులను ఆదేశించింది. గుజరాత్ అల్లర్ల కేసుతో లింకు ఉన్న డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసిన కేసులో మాజీ ఐపీఎస్ సంజీవ్ భట్‌ను అహ్మదాబాద్ క్రైం బ్రాంచీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. Shri @Jairam_Ramesh issues statement on the false allegations against Late Sri Ahmed Patel pic.twitter.com/Txder7qojx— Congress Sevadal (@CongressSevadal) July 16, 2022 మరోవైపు.. సిట్ నివేదికను, దివంగత అహ్మాద్ పటేల్‌పై ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం మరణించిన వారిని కూడా వదలడం లేదని విరుచుకుపడింది. రాజకీయ పెద్దలు ఆడించినట్లుగా సిట్ ఆడుతోందని, వారు ఏది చెబితే అది చేస్తోందని విమర్శించింది. ఈ క్రమంలోనే ఆరోపణలపై అహ్మాద్ పటేల్ కుమార్తె స్పందించారు. సిట్ ఆరోపణలను కొట్టిపారేశారు. ఈ కుట్రలో నిజంగా తన తండ్రికి పాత్ర ఉంటే కేంద్రం ఇప్పటి వరకు ఎందుకు విచారించలేదని ఆమె ప్రశ్నించారు. కాగా అహ్మాద్ పటేల్ 2020లో మరణించిన విషయం తెలిసిందే. Full Reporthttps://t.co/CxYcsB4pRy— Organiser Weekly (@eOrganiser) July 16, 2022 -
తీస్తా, శ్రీకుమార్లకూ రిమాండ్
అహ్మదాబాద్: 2002 గుజరాత్ అల్లర్ల కేసులో తప్పుడు సాక్ష్యాలను సమర్పించారనే ఆరోపణలపై అరెస్టయిన తీస్తా సీతల్వాద్, మాజీ డీజీపీ ఆర్బీ శ్రీకుమార్‌లకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. శనివారం వీరిద్దరి పోలీస్ కస్టడీ ముగియడంతో అహ్మదాబాద్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎస్పీ పటేల్ ఎదుట హాజరుపరిచారు. అహ్మదాబాద్ క్రైం బ్రాంచ్ పోలీసులు రిమాండ్ పొడిగించాలని కోరకపోవడంతో 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపుతూ ఆదేశాలు జారీ చేశారు. లాకప్‌డెత్ కేసులో బనస్కాంత్ జిల్లా పలన్‌పూర్ జైలులో జీవిత కాల జైలు శిక్ష అనుభవిస్తున్న శ్రీకుమార్‌ను అహ్మదాబాద్‌కు తీసుకువస్తామని పోలీసులు తెలిపారు. -
గరళకంఠునిలా మోదీ: అమిత్ షా
న్యూఢిల్లీ: 2002 గుజరాత్ అల్లర్లలో ప్రధాని నరేంద్ర మోదీ తదితరులకు సిట్ ఇచ్చిన క్లీన్‌చిట్‌ను సుప్రీంకోర్టు సమర్థించడాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వాగతించారు. ‘‘గరళాన్ని కంఠంలో దాచుకున్న శివునిలా మోదీ కూడా ఆ తప్పుడు ఆరోపణల తాలూకు బాధను 19 ఏళ్లపాటు మౌనంగా దిగమింగారు. పుటం పెట్టిన బంగారంలా ఎట్టకేలకు నిజం నిగ్గుదేలింది. అందుకెంతో ఆనందంగా ఉంది’’ అన్నారు. రాజకీయ కారణాలతో మోదీపై తప్పుడు ఆరోపణలు చేసిన వాళ్లంతా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. శనివారం ఏఎన్ఐ వార్తా సంస్థకు అమిత్ షా ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘‘నేను కావాలనుకుంటే ఈ ఇంటర్వ్యూను 2003లో గుజరాత్ హోం మంత్రిగా ఉన్నప్పుడే, లేదంటే ఆ తర్వాత బీజేపీ అధ్యక్షునిగా ఉన్నప్పుడే ఇచ్చి ఉండేవాణ్ని. కానీ మోదీ మాత్రం తానే తప్పూ చేయకపోయినా ఆ ఉదంతంపై సాగుతున్న న్యాయ ప్రక్రియను ప్రభావితం చేయొద్దని భావించారు. ఆ కారణంతోనే దానిపై ఇన్నేళ్లుగా ఒక్క మాటా మాట్లాడలేదు. తప్పుడు ఆరోపణలన్నింటినీ మౌనంగా భరించారు. ఎంతో గుండె దిటవుంటే గానీ ఇది సాధ్యం కాదు. ఆ క్రమంలో ఆయన బాధను అనుభవించిన తీరును నేను దగ్గరినుంచి చూశా’’ అని చెప్పారు. ప్రజాస్వామ్య దేశంలో రాజకీయాల్లో ఉన్నవాళ్లు రాజ్యాంగాన్ని ఎలా గౌరవించాలో సిట్ విచారణ సందర్భంగా మోదీ స్వయంగా ఆచరించి చూపించారన్నారు. విచారణను వ్యతిరేకిస్తూ ఆయన ఎలాంటి ప్రదర్శనలకూ దిగలేదని గుర్తు చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఈడీ విచారించిన సందర్భంగా ఆయన నేతృత్వంలో పార్టీ రోజుల తరబడి దేశవ్యాప్తంగా ఆందోళనలు చేయడం తెలిసిందే. వాటిని ఉద్దేశించి షా ఈ వ్యాఖ్యలు చేశారు. కోర్టు తీర్పు స్పష్టంగా ఉంది ‘‘ఈ అంశంపై మేం చర్చ చేపట్టవచ్చు. కానీ, ఆపని చేయలేదు. ఎందుకంటే ఇందులో దాచేందుకు ఏమీలేదు. ఇప్పుడు దీనిపై కోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఒక పోలీసు అధికారి, ఒక ఎన్జీవో, కొన్ని రాజకీయ శక్తుల పేర్లు కూడా ఈ తీర్పులో ప్రస్తావనకు వచ్చాయి. తీర్పులో తీస్తా సెతల్వాద్ పేరు స్పష్టంగా ఉంది. ఎన్జీవోను ఆమె నడుపుతున్నారు. ఈ త్రయమే సంచలనాలు సృష్టించేందుకు అసత్యాలు ప్రచారం చేసి, తప్పుడు సాక్ష్యాలు చూపించినట్లు తేలింది. సిట్‌కు తప్పుడు వాంగ్మూలాలు ఇచ్చినట్లు కోర్టు స్పష్టం చేసింది. అల్లర్లను ఆపేందుకు అప్పటి ప్రభుత్వం శతథా ప్రయత్నించినట్లు తెలిపింది. సీఎంగా ఉన్న మోదీ శాంతి నెలకొనాలని పదేపదే ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రైలు దహనం ఘటన అనంతరం అల్లర్లు ప్రణాళిక ప్రకారం జరిగినవి కాదని న్యాయస్థానం స్పష్టం చేసింది’’ అని అమిత్ షా చెప్పారు. అల్లర్లను ఆపేందుకు అప్పటి గుజరాత్ సీఎంగా మోదీ ఏం చేశారన్న ప్రశ్నకు అమిత్ షా..‘‘హింసను నివారించడంలో గుజరాత్ ప్రభుత్వం ఎటువంటి జాప్యం చేయలేదు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు కాల్పులు కూడా జరిపారు’’ అని తెలిపారు. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో హోం, న్యాయ, ఎక్సైజ్ తదితర శాఖలకు మంత్రిగా అమిత్ షా వ్యవహరించారు. మోదీ విజయమిది ‘‘అల్లర్లకు సంబంధించి మోదీపై కేసులు ఎందుకు పెట్టారో కూడా సుప్రీంకోర్టు తన తీర్పుతో బట్టబయలు చేసింది. మా నేతపై మోపినవన్నీ తప్పుడు ఆరోపణలంటూ కొట్టిపారేసింది. బీజేపీ కార్యకర్తలందరికీ ఈ తీర్పు గర్వకారణమైంది. చాలా ప్రాధాన్యమున్న తీర్పిది’’అని షా అన్నారు. ‘‘ప్రభుత్వం పరిస్థితిని వెంటనే అదుపు చేయడంతో తక్కువ నష్టం జరిగింది. సాక్షుల భద్రతకు సరైన చర్యలు తీసుకుంది. శాంతిని స్థాపించేందుకు మోదీ పలు సమావేశాలు జరిపారని కోర్టు తెలిపింది’’ అని అమిత్ షా అన్నారు. ‘‘నేడు సత్యం గెలిచింది. మోదీ విజయం సాధించారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘సిట్ కోసం కోర్టు ఆదేశాలివ్వలేదు. ఒక ఎన్జీవో సిట్ వేయాలని డిమాండ్ చేయగా కోర్టు ప్రభుత్వం అభిప్రాయం కోరింది. ప్రభుత్వం అభ్యంతరం లేదనడంతో సిట్ ఏర్పాటైంది. రికార్డుల్లో ఇదే విషయం ఉంది. కోర్టు చెప్పింది కూడా ఇదే. సిట్‌లోని అధికారులు కూడా ఇతర రాష్ట్రాల వారే. ఆ సమయంలో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉంది’’ అని ఆయన అన్నారు. #WATCH LIVE | HM Amit Shah breaks his silence on what happened during the 2002 Gujarat riots. An interview with ANI Editor Smita Prakash. https://t.co/qkX9eAYeG6 — ANI (@ANI) June 25, 2022 చదవండి: గుజరాత్ అల్లర్ల కేసు.. మోదీకి ఊరట -
గుజరాత్ అల్లర్లు: మోదీ వ్యతిరేక పిటిషన్ కొట్టివేత
సాక్షి, న్యూఢిల్లీ: గుజరాత్ అల్లర్లకు సంబంధించి.. ప్రధాని నరేంద్ర మోదీకి సుప్రీం కోర్టు సైతం క్లీన్ చిట్ ఇచ్చినట్లయ్యింది. 2002 గుజరాత్ అల్లర్లలో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోదీతో పాటు 63 మందికి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) క్లీన్ చిట్ ఇచ్చింది. ఆ క్లీన్ చిట్‌ను సవాలు చేస్తూ.. కాంగ్రెస్ మాజీ ఎంపీ ఎహ్సాన్ జాఫ్రీ భార్య జకియా జాఫ్రీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. అల్లర్ల సమయంలో అహ్మదాబాద్‌లోని గుల్బర్గా సొసైటీలో హత్యకు గురైన 69 మందిలో.. పిటిషనర్ జాకియా జాఫ్రీ భర్త, కాంగ్రెస్ మాజీ పార్లమెంటు సభ్యుడు ఎహ్సాన్ జాఫ్రీ కూడా ఉన్నారు. అయితే దీని వెనుక భారీ కుట్ర ఉందని ఆరోపిస్తూ జాకియా, ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ తీస్తా సేతల్వాద్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 2012లో SIT దాఖలు చేసిన నివేదికకు వ్యతిరేకంగా జాఫ్రీ దాఖలు చేసిన పిటిషన్‌ను గుజరాత్ స్పెషల్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ తిరస్కరించారు. అయితే ఆ ఉత్తర్వును సుప్రీం కోర్టు జస్టిస్ AM ఖాన్విల్కర్ నేతృత్వంలోని బెంచ్ అయితే శుక్రవారం.. సమర్థించింది. అంతేకాదు.. జాఫ్రీ యొక్క అభ్యర్థన ఎటువంటి అర్హత లేనిదని పేర్కొంది. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదిస్తూ.. మాజీ పోలీసు అధికారి సంజీవ్ భట్ స్టేట్మెంట్ ఆధారంగా మోదీపై ఆరోపణలు వచ్చాయని పేర్కొన్నారు. అయితే భట్ ఆ సమావేశంలో లేరని, అందువల్ల ఆరోపణలను ధృవీకరించడానికి వేరే మార్గం లేదని సిట్ తేల్చింది. మరోవైపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ.. ఈ ఆరోపణ న్యాయాన్ని అపహాస్యం చేయడమేనని అన్నారు. అల్లర్ల కేసుల దర్యాప్తును పర్యవేక్షించిన సుప్రీంకోర్టు.. ఆరోపణలను పరిశీలించాల్సిందిగా 2011లో సిట్‌ను ఆదేశించింది. ఫిబ్రవరి 2012లో, సిట్ నివేదిక(క్లోజ్డ్) దాఖలు చేసింది. అయితే.. ఈ నివేదికపై ట్రయల్ కోర్టు, గుజరాత్ హైకోర్టులో సవాల్ చేయడంలో పిటిషనర్లు విఫలం అయ్యారు. తిరిగి.. 2018లో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న సుప్రీం కోర్టు.. కిందటి ఏడాది డిసెంబర్లోనే తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. -
గోద్రా అల్లర్లు: మోదీ పేరు తొలగింపు
సాక్షి, హైదరాబాద్ : 2002 నాటి గోద్రా అల్లర్ల కేసులో నరేంద్ర మోదీ నుంచి తమకు నష్టపరిహారం కల్పించాలంటూ గుజరాత్‌లోని సబర్కంతా దిగువ న్యాయస్థానంలో దాఖలైన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. గోద్రా అల్లర్లలో నాటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేయం ఉందని నిరూపించడానికి ఎలాంటి సాక్ష్యాధారాలు లేనందుకు వ్యాజ్యం నుంచి ఆయన పేరును తొలగిస్తున్నట్లు స్పష్టం చేసింది. నాటి అల్లర్ల సమయంలో ప్రత్యర్థి దాడిలో హత్య గురైన మరణించిన ముగ్గురు ముస్లిం వ్యక్తుల తరఫున బ్రిటన్‌కు చెందిన ఓ కుటుంబం స్థానిక కోర్టులో 2004లో వ్యాజ్యం దాఖలు చేసింది. తమ కుటుంబ సభ్యుల మృతికి నాటి సీఎం నరేంద్ర మోదీనే కారణమని, ఆయన నుంచి 24 కోట్ల రూపాయలు నష్ట పరిహారం కల్పించాలని పిటిషన్లో డిమాండ్ చేశారు. దీనిపై సుదీర్ఘ విచారణ చేపట్టిన దిగువ కోర్టు.. నాటి అల్లర్లకు మోదీనే కారణమని చెప్పలేనమి పిటిషన్ నుంచి ఆయన పేరును తొలగిస్తున్నట్లు ఆదివారం తీర్పును వెలువరించింది. మోదీకి క్లీన్ చిట్ కాగా 2002 నాటి గోద్రా అల్లర్ల కేసులో కేంద్ర ప్రభుత్వ నియమించిన నానావతి కమిషన్ మోదీకి క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ 2014 ఎన్నికల వరకు గుజరాత్ సీఎంగా పని చేశారు. ఆయన హయాంలో జరిగిన గోద్రా అల్లర్ల ఘటన తర్వాత.. చెలరేగిన హింసాత్మక ఘటనల్లో వెయ్యి మందికిపైగా చనిపోయారు. వీరిలో ఎక్కువ మంది మైనార్టీలే. ఇందులో మోదీ ప్రమేయం ఉందడానికి ఎలాంటి ఆధారాలు లేవని.. అల్లరి మూకలను నియంత్రించడంలో పోలీసుల వైఫల్యమే కారణమని నానావతి కమిషన్ నివేదికలో తెలిపింది. (నాటి మోదీ ప్రభుత్వానికి క్లీన్చిట్) సబర్మతి ఎక్స్‌ప్రెస్ బోగీల దహనం పక్కా ప్రణాళికతో చేసిందేనని.. తర్వాత జరిగిన అల్లర్లు మాత్రం ప్రణాళికా బద్ధంగా జరిగినవి కావని నానావతి కమిషన్ తెలిపింది. ఈ అల్లర్ల వెనుక రాష్ట్రానికి చెందిన ఏ ఒక్క మంత్రి ప్రమేయం ఉందనడానికి లేదా.. వారి ప్రోద్బలంతోనే దాడులు జరిగాయనడానికి ఆధారాలు లేవని కమిషన్ తన నివేదికలో వెల్లడించింది. 1500 పేజీలతో తొమ్మిది సంచికలుగా ఈ నివేదికను రూపొందించింది. విచారణ ఇలా.. ఈ అల్లర్ల కేసు విచారణకు గుజరాత్ హైకోర్ట్ రిటైర్డ్ జడ్జి కేజీ షాతో 2002 మార్చి 6న నాటి సీఎం మోదీ కమిషన్ ఏర్పాటు చేశారు. కానీ ఆయనతో మోదీకి ఉన్న సాన్నిహిత్యం కారణంగా మానవ హక్కుల సంఘాలు నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. దీంతో సుప్రీం రిటైర్డ్ జస్టిస్ జీటీ నానావతి పేరును కూడా కమిషన్‌లో చేర్చారు. మధ్యంతర నివేదిక సమర్పించడానికి ముందే షా చనిపోవడంతో.. గుజరాత్ హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ అక్షయ్ మెహతాను ఈ కమిషన్‌లో సభ్యుడిగా చేర్చారు. 2008 సెప్టెంబర్‌లో నివేదిక తొలి భాగాన్ని ప్రభుత్వానికి సమర్పించిన కమిషన్.. 2014 నవంబర్ 18నన నాటి గుజరాత్ సీఎం ఆనందీబెన్ పటేల్‌కు మరో నివేదికను సమర్పించింది. -
నాటి మోదీ ప్రభుత్వానికి క్లీన్చిట్
గాంధీనగర్: 2002 నాటి గుజరాత్ అల్లర్ల విషయంలో అప్పటి ఆరాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ప్రభుత్వం తప్పేమీ లేదని జస్టిస్ నానావతి కమిషన్ స్పష్టం చేసింది. గుజరాత్ హోం శాఖ మంత్రి ప్రదీప్ సిన్హ్ జడేజా బుధవారం నానావతి కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. కమిషన్ ఈ నివేదికను ఐదేళ్ల క్రితమే ప్రభుత్వానికి సమర్పించింది . 2002 అల్లర్ల సమయంలో కొన్ని చోట్ల తగినంత సిబ్బంది లేక పోలీసులు మూకలను నియంత్రించడంలో విఫలమయ్యారని, సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ నానావతి, గుజరాత్ హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ అక్షయ్ మెహతాల కమిషన్ తన నివేదికలో స్పష్టం చేసింది. రాష్ట్ర మంత్రుల స్ఫూర్తితోగానీ, రెచ్చగొట్టడం వల్లకానీ, ప్రోత్సహించడం వల్లగానీ 2002లో ఒక వర్గంపై దాడులు జరిగాయనేందుకు ఆధారాలు లేవని పేర్కొంది. అందుబాటులో ఉన్న సమాచారం మొత్తాన్ని పరిశీలించాక... గోద్రా సంఘటన తరువాత చెలరేగిన మతఘర్షణలు ఆ ఘటన తాలూకూ ప్రతిస్పందనగా మాత్రమే జరిగాయని భావిస్తున్నట్లు కమిషన్ తెలిపింది. విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్‌లకు చెందిన స్థానిక సభ్యులు వారి నివాసప్రాంతాల్లో జరిగిన గొడవల్లో పాల్గొన్నారని వివరించింది. అహ్మదాబాద్ నగరంలో జరిగిన మత ఘర్షణలను ప్రస్తావిస్తూ.. ఆ సమయంలో అత్యవసరమైన చొరవ, సామర్థ్యాన్ని పోలీసులు చూపలేదని అభిప్రాయపడింది. తప్పు చేసిన పోలీసు అధికారులపై విచారణ, చర్యలపై విధించిన స్టేను కమిషన్ ఎత్తివేయడం గమనార్హం. 2002లో మత ఘర్షణల తరువాత ఏర్పాటైన నానావతి కమిషన్ తన తొలి నివేదికను 2009 సెప్టెంబరులో సమర్పించగా తుది నివేదిక 2014 నవంబరు 18న ప్రభుత్వానికి అందించింది. -
...అందుకే మోదీని తప్పించలేదు
భోపాల్: 2002లో గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో అప్పటి ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి సీఎం మోదీని రాజీనామా కోరాలని నిర్ణయించుకున్నారని బీజేపీ మాజీ నేత యశ్వంత్ సిన్హా తెలిపారు. ఒకవేళ మోదీ రాజీనామా చేయకుంటే ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలనుకున్నట్లు వెల్లడించారు. అయితే అప్పటి హోంమంత్రి అడ్వాణీ బెదిరింపులకు దిగడంతో వాజ్‌పేయి వెనక్కి తగ్గారని పేర్కొన్నారు. ‘గోవాలో 2002లో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ కమిటీ సమావేశంలో మోదీ రాజీనామా కోరాలని వాజ్‌పేయి నిర్ణయించుకున్నారు. అయితే మోదీని తప్పిస్తే తాను హోంమంత్రి పదవికి రాజీనామా చేస్తానని అడ్వాణీ హెచ్చరించారు. దీంతో వెనక్కి తగ్గిన వాజ్‌పేయి మోదీని గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగించారు’ అని చెప్పారు. ‘ఐఎన్ఎస్ విరాట్’ నౌకలో రాజీవ్ కుటుంబం విహరించడంపై అప్పటి నేవీ అధికారులు స్పష్టత ఇచ్చినందున దీనిపై మాట్లాడటం అనవసరమని అభిప్రాయపడ్డారు. మోదీ తన ఎన్నికల ప్రచారంలో మాటిమాటికీ పాకిస్తాన్‌ను ప్రస్తావిస్తున్నారనీ, పాక్‌తో మనకు పోటీయా? అని ప్రశ్నించారు. -
బిల్కిస్ ధీర
పదిహేడేళ్ల కాలం అనేది ఎవరి జీవితంలోనైనా సుదీర్ఘమైనది. కానీ తనకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దమని, అందుకు కారకులైనవారిని శిక్షించమని కోరిన ఒక మహిళకు మన న్యాయస్థానాల్లో ఊరట లభించడానికి అంత సుదీర్ఘ కాలం పట్టింది. దేశ చరిత్రలో అత్యంత అమానుషమైన అధ్యాయంగా చెప్పదగిన 2002నాటి గుజరాత్ మారణకాండకు సంబంధించిన ఒక కేసులో బాధితురాలైన బిల్కిస్ బానోకు రూ. 50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని, ఉద్యోగం ఇవ్వడంతోపాటు వసతి కూడా కల్పించాలని మంగళవారం సుప్రీంకోర్టు ధర్మాసనం గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అడుగడుగునా అవరోధాలెదురైనా ఇంత సుదీర్ఘకాలంపాటు పట్టు వీడకుండా ఎలా పోరాడగలిగారని బిల్కిస్ బానోను ఒక పాత్రికేయుడు అడిగితే ఆమె ఇచ్చిన సమాధానం గమనించదగ్గది. ‘మీ కుటుంబం మొత్తం మీ కళ్లముందే తుడిచిపెట్టుకుపోయిన ప్పుడూ... మీ జీవితం సర్వనాశనమైనప్పుడూ న్యాయం కోసం పోరాడకుండా ఎలా ఉండగలరు?’ అన్నది ఆమె జవాబు. నిజమే...బిల్కిస్ బానోకు ఎదురైన అనుభవాలు సాధారణమైనవి కాదు. అవి పగవారికి కూడా రావొద్దని ఎవరైనా అనుకుంటారు. 19 ఏళ్ల వయసులో అయిదునెలల గర్భిణిగా ఉన్నప్పుడు దుండగులు ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఆమె మూడున్నరేళ్ల కుమార్తెను బండకేసి బాది చంపారు. కుటుంబంలోని మరో నలుగురు మహిళలపై కూడా సామూహిక అత్యాచారాలకు పాల్పడి హత్య చేశారు. ఆడా మగా కలిపి మొత్తం 14మంది ప్రాణాలు తీశారు. బిల్కిస్ బానో చనిపోయినట్టు నటించడంతో ఆమెను పొదల్లోకి విసిరి వెళ్లిపోయారు. ఇద్దరు పసివాళ్లతో, ఒంటిపై బట్టలు కూడా సరిగాలేని స్థితిలో ఆమె ఆ కాళరాత్రి గడిపి ఒక ఆదివాసీ మహిళ ఇచ్చిన ఆసరాతో ప్రాణాలు కాపాడుకుంది. ఇలాంటి ఉదంతాల గురించి విన్నప్పుడు మనం నాగరిక సమాజంలోనే జీవిస్తున్నామా అన్న సందేహం కలుగుతుంది. ఇంతటి దుర్మార్గం జరిగింది సరే... కనీసం ఆ తర్వాతనైనా కారకులైన ఆ మానవమృగాలను దండించడానికి, ఆ మహిళకు న్యాయం చేయడానికి ఇన్నేళ్ల సమయం పట్టడంలో ఏమైనా అర్ధముందా? దుర్మార్గం జరిగిన మర్నాడు సమీపంలోని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లింది మొదలుకొని అడుగడుగునా ఆమెకు అవరోధాలే ఎదురయ్యాయి. ఫిర్యాదును తారుమారు చేయడం, పోస్టుమార్టం నివేదికలను మార్చేయడం, అడుగడుగునా బెదిరింపులకు దిగడం, కొన్నిసార్లు ఆమెను హతమార్చేందుకు ప్రయత్నించడం షరా మామూలుగా సాగాయి. ఒక దశలో ఖననం చేసిన శవాల తలలు మాయమయ్యాయి. బిల్కిస్బానోకు నిలకడ లేదని, ఆమె క్షణానికో మాట మాట్లాడుతున్నదని చిత్రించారు. చివరకు తగిన సాక్ష్యాధారాలు లేవని మేజిస్ట్రేట్ కోర్టులో కేసు కొట్టేశారు. వెంటాడుతున్న దుండగులను తప్పించుకుంటూ, జాతీయ మానవ హక్కుల సంఘం, సుప్రీంకోర్టు వరకూ అన్నిచోట్లకూ వెళ్లి తన గోడు వినిపిస్తూ, అందుకోసం ఆ కాళరాత్రినాటి చేదు జ్ఞాపకాలను చెదిరిపోకుండా చూసుకుంటూ ఆమె జరిపిన పోరాటం అసాధారణమైనది. ఎట్టకేలకు అహ్మదాబాద్ కోర్టులో విచారణ ప్రారంభమయ్యాక సాక్షులకు ఇక్కడ రక్షణ లేదని ఆమె విన్నవించుకోవడంతో సుప్రీంకోర్టు ఈ కేసును 2004 ఆగస్టులో ముంబైకి బదిలీ చేసింది. ఆ తర్వాత ఆ కేసు తేలడానికి మరో నాలుగేళ్లు పట్టింది. ఆరుగురు పోలీసు అధికారులు, ఇద్దరు ప్రభుత్వ వైద్యులు సహా 19మందిపై అభియోగాలు నమోదు కాగా అందులో 11మందికి యావజ్జీవ శిక్ష పడింది. రెండేళ్లక్రితం ఈ శిక్షలను బొంబాయి హైకోర్టు ధ్రువీకరించింది. అంతేకాదు...కిందికోర్టు నిర్దోషులుగా తేల్చిన మరో 8మందిని సైతం శిక్షించాల్సిందేనని బిల్కిస్ బానో చేసిన అప్పీల్‌ను అంగీకరించి వారికి కూడా శిక్ష ఖరారు చేసింది. వీరిలో ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ భగోరా, మరో నలుగురు అధికారులు, ఇద్దరు వైద్యులు దాఖలు చేసిన అప్పీళ్లను సుప్రీం కోర్టు తాజాగా తోసిపుచ్చింది. తనకు ప్రకటించిన రూ. 5 లక్షల పరిహారాన్నీ పదిరెట్లు పెంచాలన్న ఆమె వినతిని అంగీకరించింది. భగోరా ఆలిండియా సర్వీస్ అధికారి గనుక అతనిపై చర్య తీసుకోవడానికి అనుమతించమని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని, నాలుగు వారాల్లో చర్య తీసుకుని తమకు వర్తమానం అందించాలని గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసు క్రమాన్ని పరిశీలిస్తే బాధితులకు న్యాయం లభించడానికి మన దేశంలో ఎన్ని అవాంతరాలు ఎదురవుతాయో అర్ధమవుతుంది. ఎప్పటికప్పుడు ఏదో ఒక కారణం చూపిస్తూ, కేసు విచారణ ముందుకు పోకుండా చేయడం ప్రభుత్వాలకు రివాజుగా మారింది. చాలా సందర్భాల్లో న్యాయస్థానాలు సైతం నిస్సహాయ స్థితిలో పడుతున్నాయి. ఏళ్లకు ఏళ్లు కేసులు పెండింగ్‌లో పడుతూ న్యాయస్థానాల సమయం వృధా అవుతోంది. గుజరాత్ మారణకాండకు సంబంధించి మరెన్నో కేసులు ఇంకా విచారణ దశలో ఉన్నాయి. ఈ కేసులు మాత్రమే కాదు...ఇందిరాగాంధీ హత్యానంతరం ఢిల్లీలోనూ, ఆ చుట్టుపట్లా జరిగిన సిక్కుల ఊచకోత కేసుల గతీ ఇలాగే ఉంది. కేసుల్లో ఇలా అసాధారణ జాప్యం చోటు చేసుకుంటే, నిందితుల నుంచి అడుగడుగునా బెదిరిం పులు ఎదురవుతుంటే అందరూ బిల్కిస్ బానో తరహాలో పోరాడలేరు. ఆమె పేదింటి మహిళ అయినా, ఉండటానికి గూడంటూ లేక భర్తతో కలిసి దాదాపు సంచారజీవనం సాగిస్తున్నా పది హేడేళ్లపాటు దృఢంగా నిలబడింది. గుజరాత్‌లోని వడోదర, అహ్మదాబాద్‌లతోపాటు ఢిల్లీ, లక్నో, ముంబై వంటి సుదూర నగరాలకు సైతం ఆ కుటుంబం వలసపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఎన్నో ఇబ్బందులు పడింది. బిల్కిస్ బానో కేసు వంటివి అంతర్జాతీయంగా దేశ పరువు ప్రతిష్టల్ని దిగజారుస్తాయి. బాధితులకు న్యాయం దక్కడం అక్కడ అసాధ్యమన్న అభిప్రాయాన్ని కలిగిస్తాయి. సకాలంలో దక్కని న్యాయం అన్యాయంతో సమానమంటారు. కనీసం ఊచకోతల కేసుల విష యంలోనైనా ఇలాంటి అన్యాయాలకు తావీయరాదన్న స్పృహ మన పాలకులకు కలగాలి. -
ఆమెకు రూ. 50 లక్షలు చెల్లించండి : సుప్రీం
న్యూఢిల్లీ : సామూహిక అత్యాచార బాధితురాలు బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. 2002లో చెలరేగిన అల్లర్లలో భాగంగా సర్వం కోల్పోయిన ఆమెకు పరిహారంగా రూ. 50 లక్షలు చెల్లించాల్సిందిగా గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదే విధంగా ఆమె జీవనోపాధి కోసం ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఆశ్రయం కూడా కల్పించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కాగా గోద్రా అల్లర్ల అనంతరం గుజరాత్లో 2002లో తీవ్రస్థాయిలో అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా దాహోద్ సమీపంలోని రాధిక్‌పూర్ గ్రామానికి చెందిన ముస్లిం కుటుంబంపై మూకదాడి జరిగింది. కుటుంబ యజమాని బిల్కిస్ యాకూబ్ రసూల్, అతడి భార్య బానో మినహా మిగిలిన 13 మందిని దుండగులు అత్యంత పాశవికంగా హత్య చేశారు. ఆ సమయంలో గర్భవతిగా ఉన్న బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె మూడేళ్ల కూతురు సలేహ తలను బండకు బాది హత్య చేసిన అనంతరం.. బానో కూడా చనిపోయిందని నిర్ధారించుకుని అక్కడి నుంచి పారిపోయారు. అయితే ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బానో స్థానికుల సహాయంతో ప్రాణాలు దక్కించుకుంది. ఇక 2008లో బిల్కిస్ బానో అత్యాచార కేసులో 11 మందిని బాంబే హైకోర్టు దోషులుగా తేల్చింది. అయితే తన విషయంలో కొంతమంది పోలీసు అధికారులు నిందితులకు అనుకూలంగా వ్యవహరించి.. కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారంటూ బానో కోర్టును ఆశ్రయించింది. అదే విధంగా తనకు నష్టపరిహారం చెల్లించాల్సిందిగా కోరింది. ఈ నేపథ్యంలో పోలీసు అధికారులపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సుప్రీంకోర్టు గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఆ కేసును విచారించిన ఐదుగురు అధికారుల్లో నలుగురు రిటైర్డు కావడంతో వారికి పెన్షన్ అందకుండా మాత్రమే చేయగలిగామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. వీరితో పాటు ఈ కేసును విచారించిన మరో అధికారి ప్రస్తుతం డీసీపీగా విధులు నిర్వర్తిస్తుండగా అతడిని డిమోట్ చేసినట్లు పేర్కొంది. చదవండి : బిల్కిస్ బానో... గుజరాత్ గాయం.. కోర్టు తీర్పులు బిల్కిస్ బానో... 2002 గుజరాత్ మారణహోమం ఉదంతాలను అనుసరించినవారికి తప్పనిసరిగా గుర్తుండే పేరు. మే 4 న ముంబై హైకోర్టు ఆమెపై పాశవికదాడి చేసిన 11 మందికి ట్రయల్ కోర్టు వేసిన శిక్షను ఖరారు పరిచింది. అంతేకాదు, సాక్ష్యాలు తారుమారు చేయడానికి ప్రయత్నించిన ఏడు మంది పోలీసులను, డాక్టర్లను కూడా దోషులుగా తేల్చింది. బిల్కిస్‌బానుకు సంబంధించి మాత్రమే కాదు గుజరాత్ మారణకాండకు సంబంధించి కూడా ఇది ముఖ్యమైన తీర్పు. గర్భిణిపై అత్యాచారం చేసి పసిబిడ్డను చంపి... 2002లో గోధ్రా రైలు దుర్ఘటన తర్వాత గుజరాత్లో అల్లర్లు చెలరేగాయి. అహ్మదాబాదుకు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాధిక్‌పూర్ గ్రామంలో భర్తతో పాటు నివసిస్తున్న బిల్కిస్‌బానుకు అప్పుడు వయసు 18. గుజరాత్ అల్లర్లు ఆ ఊరికి కూడా పాకడంతో అప్పటికే చుట్టుపక్కల ఉన్న 60 ముస్లిం కుటుంబాల ఇళ్లను తగులబెట్టారు. బాధితులతో పాటు బిల్కిస్ కూడా తన కుటుంబంతో పొలాలలో పరిగెత్తి ప్రాణాలు కాపాడుకుంది. అప్పటికి ఆమె గర్భవతి. మూడేళ్ల కుమార్తె కూడా ఉంది. రెండు మూడు రోజులు వారు ఊరికి దూరంగా ఉన్న గుట్టల్లో పొదల్లో ప్రాణాలు కాపాడుకుని ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతానికి పారిపోదామనుకున్నారు. మార్చి 3, 2002న ఒక మట్టి మార్గం గుండా వాళ్లు పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా రెండు ట్రక్కుల్లో ముష్కరులు ‘చంపండి... నరకండి’ అని నినాదాలు ఇస్తూ వాళ్లను చుట్టుముట్టారు. బిల్కిస్‌పై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ‘వాళ్లంతా మా ఊరి వాళ్లే. చిన్నప్పటి నుంచి నేను చూసినవాళ్లే. వాళ్లే నా పట్ల అత్యంత అమానుషంగా ప్రవర్తించారు’ అని మీడియాతో మాట్లాడుతూ ఆనాడు బిల్కిస్ ఉద్వేగభరితమైంది. ‘వాళ్లు మొత్తం 11 మంది. ఒకడు ఆమె చేతిలోని మూడేళ్ల కుమార్తెను నేలకు కొట్టి అప్పటికప్పుడు చంపేశాడు. మిగిలినవారంతా ఆమెను వివస్త్రను చేసి అత్యాచారానికి పూనుకున్నారు. ‘నేను గర్భవతిని వదిలేయండి అంటున్నా వాళ్లు వినలేదు’ అంది బిల్కిస్. ఆమెపై అత్యాచారం చేయడమే కాదు ఆమె కుటుంబానికి చెందిన మొత్తం 13 మందిని దారుణంగా చంపేశారు. అపస్మారకంలో పడి ఉన్న బిల్కిస్ ఆ తర్వాత మూడు రోజులకు కోలుకుని శరణార్థుల శిబిరంలో పోలీసులకు ఫిర్యాదు చేయగలిగింది. పట్టించుకోని పోలీసులు... అయితే స్థానిక పోలీసులు ఆమె ఫిర్యాదును పట్టించుకోలేదు. దోషులను అరెస్టు చేయండి అంటే వినలేదు. దిగువ కోర్టులో కేసు కూడా ‘తగిన సాక్ష్యాధారాలు లేనందున’ నిలువలేదు. అయితే బిల్కిస్ తన పోరాటాన్ని మానలేదు. మానవ హక్కుల సంఘం ద్వారా సుప్రీం కోర్టును ఆశ్రయించి తన కేసును సిబిఐ విచారించేలా ఆదేశాలు పొందగలిగింది. స్థానిక పోలీసులు, సిఐడిలు తనను వేధిస్తున్నందున సిబిఐ విచారణ కోరుతున్నానని ఆమె చేసిన విన్నపాన్ని అత్యున్నత న్యాయస్థానం స్వీకరించింది. సిబిఐ రంగంలో దిగిన వెంటనే బిల్కిస్ కేసులోని తీగలన్నీ కదిలాయి. బిల్కిస్ కోల్పోయిన 13 మంది కుటుంబ సభ్యులను పోస్ట్‌మార్టం చేసిన డాక్టర్లు వారిని గుర్తు పట్టకుండా తలలు వేరు చేశారని, గోరీలలోని శవాలు త్వరగా పాడయ్యేలా చేశారని, సామూహిక ఖననం చేసి కేసు ఆనవాలు పట్టకుండా ఉండేలా జాగ్రత్తలు పడ్డారని విచారణలో తేలింది. గుజరాత్లో పారదర్శకమైన న్యాయవిచారణకు అవకాశం లేనందున సుప్రీంకోర్టు విచారణను గుజరాత్ నుంచి మహారాష్ట్రకు బదిలీ చేసింది. అక్కడ బిల్కిస్ కేసును ప్రత్యేక కోర్టు విచారణ చేసి 2008లో 11 మంది నిందితులకు యావజ్జీవకారాగార శిక్ష తీర్పు వెలువరించగా నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. మే 4, 2017 బిల్కిస్ కేసును విచారించిన ముంబై హైకోర్టు తీర్పు వెలువరించింది. ప్రత్యేకకోర్టు విధించిన శిక్షనే అది బలపరిచింది. 11 మంది నిందితులు (ఒకరు మరణించారు) యావజ్జీవకారాగార శిక్ష పొందారు. వీరిలో ముగ్గురిని ఉరి తీయాలని సిబిఐ వాదించగా కోర్టు వారి వాదనను తోసిపుచ్చింది. ‘ఉరిశిక్ష కోరి నేను ప్రాణానికి ప్రాణం బదులు తీర్చుకోవాలనుకోవడం లేదు. నాకు కావలసింది న్యాయం. అది దక్కింది’ అని బిల్కిస్ పేర్కొంది. ఇన్నాళ్లు ఈ కేసు కోసం బిల్కిస్, ఆమె భర్త యాకుబ్ రసూల్ రహస్యంగా జీవిస్తూ వచ్చారు. నిందితుల వల్ల ప్రాణహాని ఉండటమే దీనికి కారణం. ఆనాడు నిందితులకు శిక్ష ఖరారు కావడంతో పాటుగా.. నేడు బిల్కిస్‌కు పరిహారంగా 50 లక్షలు చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించడంతో ఆలస్యంగానైనా ఆమెకు పోరాటానికి గుర్తింపు దక్కిందని బిల్కిస్ మద్దతు దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
అనుమానాలే శిక్షకు ప్రాతిపదికలా?
గుజరాత్ అల్లర్ల సమయంలో వందమందిని చంపేసిన సంఘటనలో బాబు బజ్రంగి ముఖ్యుడు. ఈ కేసులో 2012లో తనకు జీవితఖైదు విధించారు. 2019 మార్చిలో అతడికి సుప్రీం కోర్టు వైద్యకారణాలతో బెయిల్ మంజూరు చేసింది. కానీ ఉపా (చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం) చట్టం కింద శిక్ష అనుభవిస్తున్న, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ప్రొ‘‘ సాయిబాబాకు నాగ్‌పూర్ హైకోర్టు మార్చి 25న బెయిల్ తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఉపా చట్టంలోని లొసుగులను సీరియస్‌గా డిబేట్ చేయాల్సిన అవసరముంది. ఉపా చట్టంలోని సెక్షన్ 19, 20 ప్రకారం ఏదైనా టెర్రరిస్ట్ సంస్థలో సభ్యుడైనా, లేదా అలాంటి వాళ్ళకు ఆశ్రయమిచ్చినా, తోడ్పడినా శిక్షార్హుడు అవుతాడు. 2017లో 90 శాతం అంగవికలుడైన ప్రొ. సాయిబాబాను ఈ చట్టం కింద శిక్షార్హుడిగా ప్రకటించారు. సాయిబాబా ‘రెవల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్’ అనే ఒక సంస్థకు జాయింట్ సెక్రటరీ. ఆ సంస్థ ఢిల్లీలో ఎన్నో బహిరంగ సమావేశాలు కూడా నిర్వహించింది. ఆ సంస్థ చట్టబద్ధమైనా (రెండు రాష్ట్రాల్లో తప్ప) సరే, అది ప్రచారం చేసే ‘థియరీ’తో భాగం కావడం వలన సాయిబాబను దోషిగా ఆరోపించారు. 1919లో రౌలత్ చట్టం వచ్చింది. దాని ప్రకారం విప్లవచర్యలు చేపడుతున్నాడన్న అనుమానం మీదే ఎవరినైనా, ఎన్నిరోజులైనా అరెస్ట్ చేసే అధికారం బ్రిటిష్ ప్రభుత్వానికి ఉంటుంది. ఇప్పుడు మనిషి చుట్టూ నక్సలైటు వాసన వస్తోం దని నిర్దయగా సాయిబాబాకు జైలుశిక్ష వేశారు. మరి రౌలత్ చట్టానికి, ఉపా చట్టానికి తేడా ఏమిటి? కోర్టులు పోలీసుస్టేషన్లుగా పనిచేయాలనుకుంటే, అందుకోసం విచారణలు, లాయర్లు దేనికి? సాయిబాబాతోపాటు ఇంకా ఐదుగురు శిక్షకు గురయ్యారు. అందులో ముగ్గురు ఆదివాసీ రైతులు, ఒక స్టూడెంట్, ఒక జర్నలిస్టు ఉన్నారు. ఆ తీర్పుచూస్తే కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడతాయి. మచ్చుకు ఒకపేరా చూద్దాం. ‘90వ పేజీలో ఎగ్జిబిట్ 267 నుంచి తెలిసేదేమంటే చేతిలో దినపత్రిక లేదా అరటిపండు పట్టుకోవడం సూచి కగా మావోయిస్టులు వాడతారు. అది స్పష్టమే కాబట్టి ప్రాసిక్యూషన్ వాదించిందే (అంటే చేతిలో న్యూస్ పేపర్ పట్టుకున్న ఒక ముద్దాయి మావోయిస్టు అని) ఎక్కువ సంభావ్యత ఉన్నట్టుగా తోస్తుంది‘ (ఆ తోచడం కూడా కచ్చితంగా కాదు !) ఇలా కేవలం నమ్మకాలు, విశ్వాసాలమీద కూడా అందరికీ శిక్ష ఖాయం చేస్తున్నారు. సాయిబాబా కేసులో Doctrine of pleasure ఫాలో అవుతూ తీర్పు ఇచ్చినట్లు కనబడుతోంది. ఉరిశిక్షలాంటి విషయాల్లో మనం దీన్ని చూస్తాం. ఇందులో హేతువు ఎంత స్థాయిలో ఉండాలి అన్నది నిర్ణయం తీసుకునే వ్యక్తిని బట్టి ఉంటుంది. మనిషి ప్రాణానికి విలువనివ్వని న్యాయవ్యవస్థ తీరును మనం సీరియస్‌గా ప్రశ్నించాల్సిన అవసరం సాయిబాబా కేసు ముందుకు తీసుకొస్తోంది. అసలు సాయిబాబా చుట్టూ అల్లుకున్న కేసును చూస్తే ఇవే ప్రాథమిక సందేహాలు అగుపిస్తాయి: 1. సాయిబాబా ముక్కుమొహం తెలీని ఏదో మహారాష్ట్ర మారుమూలల్లో బతుకుతున్న ముగ్గురు ఆదివాసీలతో కలిసి ‘యుద్ధంచేయాలని’ కుట్రపన్నుతున్నాడని ఆరోపణ. సాయిబాబా తన వీల్‌చెయిర్‌లో వెళ్ళిన వాళ్లతో కలిసి ఈ పన్నాగం పన్నారా? 2. సాయిబాబా ఇంటిమీద పోలీసులదాడికి కారణం– అతను మహారాష్ట్రలో ‘ఆహిరె’ అనేచోట ఒక ఇంట్లో దొంగతనం చేశాడని! అదెలా సాధ్యం? 3. ఈ కేసులో సాక్ష్యం సీలు వేసి లేదు. సీలువేయని సాక్ష్యం ఎవరన్నా మార్చేయొచ్చుకదా? ఇదెలా కోర్టు అంగీకరించింది? ఇలాంటి కేసుల్లో ‘ఇంప్రెషన్ మేనేజ్మెంట్’ మాత్రమే ప్రధాన భూమిక వహిస్తున్నట్టుగా అగుపిస్తుంది. మనదేశంలో చట్ట, న్యాయవ్యవస్థ ఇంత బలహీనమైనదా అనే గుబులు పుట్టించే కేసు సాయిబాబాది. పైగా ముద్దాయి రాజకీయఖైదీ. సత్యం రామలింగరాజులా రూ. 5,000 కోట్లు వెనకేసుకున్న క్రైం కాదిది. మాల్యాలా గొప్ప లాయర్ల టీమ్‌ని పెట్టుకునే స్థాయి కూడా సాయిబాబా భార్యకు లేదు. 90 శాతం అంగవైకల్యంతో కిడ్నీ, ఛాతీ, క్లోమంకు సంబంధించి తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రొఫెసర్‌కి తగిన మెడికల్ కేర్ ఇవ్వకుండా అల్పశరీరాన్ని కృశింపజేసే విధా నం మనకు లోపభూయిష్టంగా అనిపించకపోతే మన పబ్లిక్ కన్సైన్స్లో దారుణమైన లోపం ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. అనుమానాలతో శిక్షకు అర్హత ప్రకటించే చట్టాలు ఇంకా మనదేశంలో ఉండడం సమంజసం కాదు. ఇది నిజానికి ప్రజాస్వామ్యం పైన వేలాడుతున్న కరవాలం లాంటిది. ఎవరినైనా, ఎప్పుడైనా తెగ్గోయవచ్చు ! పి. విక్టర్ విజయకుమార్ వ్యాసకర్త ఫ్రీలాన్స్ రచయిత మొబైల్ : 96188 88955 -
మోదీకి క్లీన్‌చిట్‌పై పిటిషన్ : విచారణ జనవరికి వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ : 2002 గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాని నరేంద్ర మోదీకీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) క్లీన్చిట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ జకియా జాఫ్రి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు సోమవారం వాయిదా వేసింది. ఈ అల్లర్ల వెనుక కుట్ర కోణానికి అవసరమైన ఆధారాలను సమర్పించేందుకు పిటిషనర్లు సమయం కోరడంతో పిటిషన్‌పై విచారణను కోర్టు జనవరి మూడో వారానికి వాయిదా వేసింది. గుజరాత్ అల్లర్ల కేసులో మోదీని సిట్ అధికారులు 9 గంటల పాటు ప్రశ్నించిన మీదట ఈ ఘర్షణల్లో ఆయన పాత్ర లేదని సిట్ క్లీన్చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. గోద్రా అనంతర ఘర్షణల్లో పెద్దసంఖ్యలో చోటుచేసుకున్న మృతుల్లో ఒకరైన మాజీ ఎంపీ ఇషాన్ జాఫ్రి భార్య జకియా సిట్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ చేసుకున్న అప్పీల్‌ను గుజరాత్ హైకోర్టు గత ఏడాది అక్టోబర్ 5న తిరస్కరించింది. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ పిటిషనర్లు సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు. జకియా జాఫ్రి పిటిషన్ విచారణను జస్టిస్ ఏఎం కన్విల్కార్, జస్టిస్ హేమంత్ గుప్తాతో కూడిన సుప్రీం బెంచ్ జనవరి మూడో వారానికి వాయిదా వేసింది. సిట్ మోదీకి క్లీన్ చిట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ పిటిషనర్ ప్రత్యేక న్యాయస్ధానం ఎదుట నిరసన వ్యక్తం చేసినా దాన్ని పరిగణనలోకి తీసుకోకుండా కేసు మూసివేత నివేదికను సిద్ధం చేశారని జాఫ్రి న్యాయవాది సర్వోన్నత న్యాయస్ధానానికి నివేదించారు. -
2002 గుజరాత్ అల్లర్ల కేసు: సుప్రీం కోర్టు విచారణ
-
మోదీకి సిట్ క్లీన్చిట్ : సుప్రీం ముందుకు పిటిషన్
సాక్షి, న్యూఢిల్లీ : 2002 గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాని నరేంద్ర మోదీ, ఇతరులకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) క్లీన్చిట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ మాజీ కాంగ్రెస్ ఎంపీ ఇషాన్ జఫ్రీ భార్య జకియా జఫ్రీ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. ఈనెల 19న ఈ కేసును విచారణకు చేపడతామని సర్వోన్నత న్యాయస్ధానం స్పష్టం చేసింది. గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాని సహా పలువురికి సిట్ క్లీన్చిట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఆమె దాఖలు చేసిన పిటిసన్‌ను గత ఏడాది గుజరాత్ హైకోర్టు కొట్టివేస్తూ తదుపరి విచారణ కోసం ఎగువ కోర్టులను ఆశ్రయించాలని సూచించింది. 2002, ఫిబ్రవరి 28న అహ్మదాబాద్‌లోని గుల్బర్గ్ సొసైటీలో అల్లరి మూకలు జరిపిన దాడిలో కాంగ్రెస ఎంపీ ఇషాన్ జఫ్రీ సహా 68 మరణించారు. మార్చి 2008న సుప్రీం కోర్టు నియమించిన సిట్ జఫ్రీ ఆరోపణలపై విచారణ చేపట్టింది. 2010లో అప్పటి గుజరాత్ సీఎంగా ఉన్న ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీని సిట్ దాదాపు తొమ్మిది గంటలు పైగా ప్రశ్నించింది. అనంతరం ఈ కేసులోని అన్ని ఆరోపణల నుంచి ప్రధాని మోదీని సిట్ తప్పించింది. ప్రధానికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని కేసును మూసివేస్తూ సిట్ తన నివేదికలో స్పష్టం చేసింది. ప్రధాని మోదీకి సిట్ క్లీన్చిట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్‌తో కలిసి 2012 ఫిబ్రవరి 9న జఫ్రీ మెట్రపాలిటన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే కోర్టు సిట్ ఉత్తర్వులను సమర్ధించడంతో జఫ్రీ, తీస్తా సెతల్వాద్ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. గుజరాత్ హైకోర్టులోనూ చుక్కెదురవడంతో సిట్ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు. -
గుజరాత్ అల్లర్ల కేసులో మాజీ మంత్రికి ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్ అల్లర్ల కేసులో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) మాజీ మంత్రి మాయా కొద్నానీ నిర్దోషిగా విడుదల అయ్యారు. 2002 గుజరాత్లో జరిగిన అల్లర్ల సమయంలో అహ్మదాబాద్‌లోని నరోదా పటియాలో నరమేథం జరిగింది. ఈ నరమేథం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాయా కొద్నానీని శుక్రవారం గుజరాత్ హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. సంశయ లాభం కింద కొద్నానీని నిర్దోషిగా ప్రకటిస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది. 2002లో నరోదా నరమేథంలో 100 మంది ముస్లింలు హత్యకు గురయ్యారు. వృత్తి రీత్యా వైద్యురాలైన కొద్నానీ అల్లర్లకు పురిగొల్పారని ఆరోపణలను ఎదుర్కొన్నారు. ఘటన మరుసటి రోజున ఏర్పాటు చేసిన ప్రత్యేక విచారణ బృందం అల్లర్లకు కొద్నానీయే రెచ్చగొట్టారని తేల్చింది. దీంతో ఆమెను అరెస్టు చేశారు. అప్పటినుంచి 10 ఏళ్ల పాటు సాగిన విచారణ అనంతరం ప్రత్యేక కోర్టు కొద్నానీకి జీవిత ఖైదును విధించింది. 2014లో కొద్నానీ బెయిల్‌పై విడుదలయ్యారు. కాగా, ఈ కేసులో నిందితుడిగా ఉన్న భజరంగ్ దళ్ నేత బాబు భజరంగీని దోషిగా తేల్చిన న్యాయస్థానం క్రింది కోర్టు ఇచ్చిన శిక్షను ఖరారు చేసింది. భజరంగీకి 2012లో ప్రత్యేక కోర్టు 28 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. ఇరువురితో పాటు ఆరోపణలను ఎదుర్కొంటున్న మరో 29 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది. -
ముంబైలో కలకలం; గుజరాతీల షాపులపై దాడి
సాక్షి, ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాకరే ఇచ్చిన మోదీ ముక్త్ భారత్ నినాదం సెగలు రేపుతోంది. ముంబయి శివాజీ పార్క్‌లో కార్యకర్తలను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముంబయి శివార్లలోని వసాయ్‌లో ఎంఎన్ఎస్ కార్యకర్తలు గుజరాతీల దుకాణాలను టార్గెట్ చేసి సైన్బోర్డులను ధ్వంసం చేశారు. ముంబయి-అహ్మదాబాద్ హైవేపై పలు గుజరాతీ దాబాలపై కూడా ఎంఎన్ఎస్ కార్యకర్తలు దాడులు చేశారు. మహారాష్ట్రలో గుజరాతీల ఆస్తులను లక్ష్యంగా చేసుకుని ఎంఎన్ఎస్ చెలరేగడం ఇదే తొలిసారి కాదు. గత ఏడాది జులైలోనూ దాదర్‌లోని ఓ జ్యూవెలరీ షాపుపై, ముంబయిలోని మహీంలో ఓ హోటల్పైనా హింసాత్మక దాడులకు తెగబడ్డారు. గుజరాతీలో ఉన్న సైన్బోర్డులను లాగిపడవేశారు. అప్పట్లో దాదార్‌లోని పీఎన్ గాడ్గిల్ జ్యూవెలర్స్ ఎదుట ఆందోళనకు దిగిన ఎంఎన్ఎస్ కార్యకర్తలు మేనేజ్మెంట్ దిగివచ్చి సైన్‌బోర్డును తొలగించడంతో శాంతించారు. నగరంలోని మహీం వద్ద గుజరాతీలో ఉన్న హోటల్ శోభ సైన్‌బోర్డును కూడా ఎంఎన్ఎస్ కార్యకర్తలు బలవంతంగా తొలగింపచేశారు.