Hair cut
-
Students Hair Cuts: కాలేజీకి ఆలస్యంగా వచ్చారని విద్యార్థినుల జుట్టు కత్తిరింపు..
-
ఖమ్మం: లేడీ టీచర్ వికృత చేష్టలు.. విద్యార్థుల జుట్టు కత్తిరించి...
సాక్షి, ఖమ్మం జిల్లా: జుట్టు పెంచుకొని స్కూల్‌కి వస్తున్నారంటూ ఓ టీచర్ కత్తెర పట్టుకుని స్వయంగా తానే విద్యార్థులకు పేనుకొరుకుడు మాదిరిగా కటింగ్ చేసి వికృత చేష్టలకు పాల్పడింది. ఇళ్లకు వెళ్లిన విద్యార్థుల హెయిర్ స్టైల్ చూసి అవాక్కైన తల్లిదండ్రులు స్కూలు వద్దకు వచ్చి ఆందోళన చేపట్టారు.ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శిరీష అనే ఉపాధ్యాయురాలు విద్యార్థుల జుట్టు కత్తిరించి పైశాచిక ఆనందం పొందారు. కొందరు విద్యార్థులు జుట్టు పెంచి రోజు తరగతులకు హాజరవుతున్నారని, ఎన్నిసార్లు కటింగ్ చేయించుకుని స్కూల్‌కి రావాలని హెచ్చరించిన మాట వినడం లేదని స్వయంగా ఉపాధ్యాయురాలు శిరీషనే బార్బర్ అవతారమెత్తింది.ఓ కత్తెర తీసుకొని తనకి వచ్చిన విధంగా 8 మంది విద్యార్థులకు జుట్టు కత్తిరించింది. తలపై అక్కడక్కడ జుట్టు కత్తిరించడంతో ఎలుకలు కొరికినట్టుగా మారింది. అయితే విద్యార్థులు ఇంటికి వెళ్లి విషయం తెలపగా పాఠశాల వద్దకు విద్యార్థుల తల్లిదండ్రులు చేరుకొని ఆందోళన చేపట్టారు. పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులు ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం ఏంటని,అవమానభారంతో తమ పిల్లలు ఏదైనా అఘాయిత్యానికి పాల్పడితే బాధ్యులు ఎవరంటూ ప్రశ్నించారు. అయితే టీచర్ చేసిన పనికి తమ పిల్లలకు పూర్తిగా గుండు కొట్టించాల్సి వచ్చిందని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. -
రోడ్డు పక్క సెలూన్లో రాహుల్ షేవింగ్.. ఫొటో వైరల్!
ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల వేళ సోషల్ మీడియాలో పలువురు నేతల ప్రకటనలు, ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇదే కోవలో తాజాగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో హల్హచల్ చేస్తున్నాయి. ఆ ఫొటోలలో రాహుల్ రోడ్డు పక్కనున్న ఒక సాధారణ సెలూన్లో హెయిర్ కటింగ్‌తో పాటు షేవింగ్ చేయించుకోవడం కనిపిస్తుంది.కాంగ్రెస్ తన అధికారిక హ్యాండిల్లో రాహుల్ గాంధీకి సంబంధించిన కొన్ని ఫొటోలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో షేర్ చేసింది. దానితోపాటు క్యాప్షన్‌లో 'ఎన్నికల సన్నాహాలు పూర్తయ్యాయి. అయితే జుట్టు కత్తిరించుకోవడం కూడా అవసరం. నైపుణ్యం కలిగిన యువత హక్కుల కోసం మేము పోరాడుతున్నాం. దేశ అభివృద్ధిలో వారి భాగస్వామ్యం కావాలని డిమాండ్ చేస్తున్నాం’ అని రాసివుంది.ప్రస్తుతం దేశవ్యాప్తంగా 18వ లోక్‌సభకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు నాలుగు దశల ఎన్నికలు పూర్తికాగా, ఇక మూడు దశల ఎన్నికలు మిగిలివున్నాయి. ఐదో దశ ఎన్నికలు మే 20న, ఆరో దశ ఎన్నికలు మే 25న, చివరి దశ అంటే ఏడో దశ ఎన్నికలు జూన్ ఒకటిన జరగనున్నాయి. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. चुनाव की तैयारी पूरी है, लेकिन हेयर कटिंग भी जरूरी है।हम ऐसे ही हुनरमंद नौजवानों के हक के लिए लड़ रहे हैं, देश के विकास में इनकी हिस्सेदारी मांग रहे हैं। 📍 रायबरेली, उत्तर प्रदेश pic.twitter.com/iTfEzkDGsh— Congress (@INCIndia) May 13, 2024 -
రూ. 10కే హెయిర్ కటింగ్.. 4 గంటలు వేచి ఉంటున్న జనం!
హెయిర్ కంటింగ్ అనేది అటు పురుషులకు, ఇటు అందంగా కనిపించాలనుకునే మగువలకు తప్పనిసరి. కొందరు ఫ్యాషన్‌తో కూడిన హెయిర్ కటింగ్ కోసం పలు సెలూన్లను ఆశ్రయిస్తుంటారు. ఇలాంటి హెయిర్ కంటింగ్ ఎక్కడైనా రూ. 10కే చేస్తున్నారని తెలిస్తే జనం క్యూ కట్టకుండా ఉండలేరు. జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో ది హెయిర్ స్టోరీ పేరుతో ఓ నూతన సెలూన్ ప్రారంభమయ్యింది. ఇక్కడ మే నెల అంతటా పురుషులు, మహిళలు అనే బేధం లేకుండా అందరికీ అడ్వాన్స్ హెయిర్ కటింగ్ కేవలం రూ. 10కే చేస్తున్నారు.ఈ సందర్భంగా ది హెయిర్ స్టోరీ డైరెక్టర్ సన్నీ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ ఇది కొత్త సెలూన్ అయినందున ప్రత్యేక ఆఫర్ ఇస్తున్నామని, ప్రకటనలు, మార్కెటింగ్ కోసం లక్షలు ఖర్చు చేయడం కంటే ఆఫర్లను అందించడం ఉత్తమమని ఆయన తెలిపారు.పురుషులకు రూ. 200, స్త్రీలకు 350 విలువైన హెయిర్ కంటింగ్ సర్వీస్‌ను రూ. 10కే అందిస్తున్నామని తెలిపారు. తాము అందిస్తున్న ఆఫర్ చూసి, ప్రతీరోజూ వందమందికిపైగా జనం వస్తున్నారని, మా సెలూన్లో హెయిర్ డ్రెస్సర్లుగా నలుగురు యువకులు, ఆరుగురు యువతులు పనిచేస్తున్నారని సన్నీ తెలిపారు. ఇక్కడికి వచ్చే జనం తమ హెయిర్ కటింగ్ కోసం నాలుగు గంటలకుపైగా సమయం వెచ్చించాల్సి వస్తున్నదన్నారు. -
హిమాచల్‌లో దారుణం.. కోడలి జుట్టు కత్తిరించి, ముఖానికి నల్లరంగు పూసి
హిమాచల్ ప్రదేశ్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. 21 ఏళ్ల మహిళ జుట్టు కత్తిరించిన అత్తమామలు ఆమెను తీవ్రంగా వేధించారు. కోడలు ముఖానికి నల్లరంగు పూసి గ్రామంలో ఊరేగించారు. హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖ సొంత జిల్లా హమీర్‌పూర్‌లోని భోరంజ్ సబ్‌డివిజన్‌లోని ఓ గ్రామంలో ఆగస్టు 31 జరిగిన ఉదంతం ఆలస్యంగా వెలుగుచూసుంది. అత్తమామల దాష్టీకానికి సంబంధించిన మూడు నిముషాల వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి అత్తమామలతో సహా అయిదుగురిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల మేరకు.. మహిళకు కొన్నాళ్ల క్రితం వివాహామైంది. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆమె తన ఇంటికి వెళ్లింది. అయితే ఆమె తిరిగి రాగానే అత్తమామలు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టారు. కోడలికి వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో అత్తమామలు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అత్తమామలపై కేసు ఫైల్ చేసి చర్యలు తీసుకుంటున్నామని హమీర్పూర్ ఎస్పీ ఆకృతి శర్మ తెలిపారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేశామని, తదుపరి విచారణ జరుగుతోందని ఆమె తెలిపారు. ఈ ఘటన దురదృష్టకరమని హిమాచల్ ప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ప్రబోధ్ సక్సేనా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిందని, కేసును విచారిస్తున్న అధికారులు పూర్తి నివేదికను సమర్పించాలని తెలిపారు. ఈ కేసులో బాధిత మహిళ వాంగ్మూలాన్ని తీసుకున్నామని, ఆమెకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వ స్థాయిలో చర్యలు తీసుకుంటామని చెప్పారు. సీఎం సొంత జిల్లాలోనే ఈ ఘటన జరగడంతో ఈ అంశం రాజకీయ విమర్శలకు దారితీసింది. శాంతిభద్రతలు పూర్తిగా స్తంభించాయని హిమాచల్ బీజేపీ కార్యదర్శి నరేంద్ర అత్రి అన్నారు. ఎలాంటి భయం లేకుండా సంఘ వ్యతిరేకులు నేరాలకు పాల్పడుతున్నారని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. मुख्यमंत्री सुखविंदर सुक्खू जी के गृह जिला में मानवता शर्मसार।#जनता_विरोधी_कांग्रेस_सरकार #कांग्रेस_का_कुप्रशासन#Congress #bhoranj#Hamirpur #cmsukkhu #himachal #himachalpradesh pic.twitter.com/g1jQvi0cYk — BJP Himachal Pradesh (@BJP4Himachal) September 15, 2023 -
'వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే మంచిది'
యాషెస్ సిరీస్‌లో మ్యాచ్‌లు ఎంత రసవత్తరంగా సాగుతున్నాయో.. మ్యాచ్ బయట జరిగే విషయాలు కూడా అంతే ఆసక్తిగా ఉంటున్నాయి. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో జానీ బెయిర్ స్టో వివాదాస్పద ఔట్ తర్వాత ఇంగ్లీష్ మీడియా, అభిమానులు వీలు చిక్కినప్పుడల్లా ఆసీస్ ఆటగాళ్లను టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆసీస్ కీపర్ అలెక్స్ కేరీని విలన్‌గా ముద్రించారు. అతను కనిపించిన ప్రతీసారి ఏదో ఒకరీతిలో అతన్ని టార్గెట్ చేస్తూనే వస్తున్నారు. లీడ్స్ వేదికగా మొదలైన మూడో టెస్టులో బ్యాటింగ్, కీపింగ్‌కు వచ్చిన సందర్భంలో మైదానంలోని ఇంగ్లండ్ అభిమానుల నుంచి అతనికి చీత్కారాలే ఎక్కువగా వచ్చాయి. దీనికి తోడు ఇంగ్లీష్ పత్రిక ది సన్ అలెక్స్ కేరీ కటింగ్షాపు ఓవర్‌కు డబ్బులు ఎగ్గొట్టాడంటూ ఒక కథనాన్నే ప్రచురించింది. ''లీడ్స్‌లోని ఒక కటింగ్షాపుకు వెళ్లిన కేరీ హెయిర్ కట్ అనంతరం ఓనర్‌కు డబ్బులు ఎగ్గొట్టాడు. దాంతో సదరు వ్యక్తి కేరీకి డెడ్‌లైన్ విధించాడంటూ'' రాసుకొచ్చింది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై ఆసీస్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ తన థ్రెడ్స్ ఖాతాలో వివరణ ఇస్తూ సదరు పత్రికపై విమర్శలు గుప్పించాడు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే మంచిదంటూ హితభోద చేశాడు. ''అలెక్స్ కేరీ లండన్ వచ్చినప్పటి నుంచి హెయిర్ కటింగ్ చేయించుకోలేదు. దానిని నేను కచ్చితంగా చెప్పగలను. ముందు నిజాలను తెలుసుకుంటే బాగుంటుంది'' అని స్మిత్ పోస్టు చేశాడు. ఇక యాషెస్ సిరీస్ మూడో టెస్టు రసవత్తర ముగింపునకు సిద్ధమైంది. 251 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన ఇంగ్లండ్ మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది. డకెట్ (18 నాటౌట్), క్రాలీ (9 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నారు. ఆ జట్టు మరో 224 పరుగులు చేయాల్సి ఉంది. చదవండి: #PrithviShaw: ''పుజారా సార్' నాలా బ్యాటింగ్ చేయలేడు.. నేను అంతే!' విలన్‌గా మారిన ఆసీస్ కీపర్.. కటింగ్షాపులో డబ్బులు ఎగ్గొట్టి -
వాట్ యాన్ ఐడియా! ఆ తల్లి చేసిన పనికి ఫిదా అవ్వాల్సిందే!
చిన్న పిల్లలకు హెయిర్ కట్ చేయడం అంత ఈజీ కాదు. ఎవరో ఒకళ్లు వాళ్లని కదలకుండా గట్టిగా పట్టుకుని కూర్చోవాల్సిందే. ఓ పక్క వాళ్ల ఏడుపులు, పెడబొబ్బలు..మరోవైపు ఎంతలా పట్టకున్నా కదలిపోతూనే ఉంటారు. దీంతో గాయాలు వారికి, హైరానా పడటం మన వంతు అవుతుంది. హెయిర్ కట్టింగ్ షాపులోనూ లేదా మన ఇంటి దగ్గరైన అంతే పరిస్థితి. అలాంటి సమయంలో ఈ అమ్మ తన చిన్నారికి హెయిర్ కట్టింగ్ చేసిన ట్రిక్ని ఫాలో అయ్యితే చాలు. ఆ తల్లి మాత్రం భలే మంచి టెక్నిక్ కనుక్కుంది. చూస్తే కచ్చితంగా వాట్ యాన్ ఐడియా! అని నోరెళ్లెబెట్టకుండా ఉండరు. వివరాల్లోకెళ్తే..ఆమె తన చిన్నారికి హెయిర్ కట్టింగ్ చేసేందుకు ఓ అట్ట ప్యాకింగ్ బాక్స్‌ని తీసుకుంది. ముందు ఆ బాక్స్‌లో తన చిన్నారి కదలకుండా కూర్చొనేలా వాటికి రెండు హోల్స్ పెట్టుకుంది. ఆ తర్వాత ఆ చిన్నారిని ప్యాకింగ్ బాక్స్‌లో ఆ రెండు హోల్స్‌లోకి రెండు కాళ్లు వచ్చేలా ఉంచి కూర్చొబెట్టింది. ఆ తర్వాత తల మాత్రం బయటకు ఉండేలా..చిన్నారి బాడీ, చేతులు కదలకుండా బాక్స్‌ని టేప్‌తో ప్లాస్టర్ వేసేసింది. ఆ తర్వాత ట్రిమ్మింగ్ మిషన్‌తో చక్కగా పిల్లాడికి హెయిర్ కట్ చేసేసింది. ఆ తల్లి ఆలోచనకు హ్యాట్సాప్ చెప్పాల్సిందే కదా!. కాగా, అందుకు సంబంధించిన వీడియోని ఐపీఎస్ ఆఫీసర్ రూపిన్ శర్మ ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. #HairCut ♥️🩷 🤣🤣🤣🤣🤣 pic.twitter.com/dMgfFIORRm — Rupin Sharma IPS (@rupin1992) June 29, 2023 (చదవండి: టమాటా ధర పెరిగిందని టెన్షన్ వద్దు..ఆ లోటుని ఇలా భర్తీ చేయండి!) -
హెయిర్ కటింగ్‌కు రూ.230..చెల్లించింది.. రూ.1.15 లక్షలు.. ఏమైందంటే..?
టెక్నాలజీ పెరిగేకొద్దీ మోసాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. రోజురోజుకు చాలా విచిత్రమైన మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా అమాయకులే ప్రధాన అజెండాగా దుండగులు మోసాలకు పాల్పడుతున్నారు. చైనాలో ఓ వ్యక్తి మోసపోయిన తీరు చూస్తే ఆశ్చర్యపోకుండా ఉండలేరు. అంతా.. నాటకీయంగా అనిపించినప్పటికీ ఓ వ్యక్తి హెయిర్ కటింగ్‌కు రూ.230 చెల్లించడానికి రూ.1.15 లక్షలు చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇంతకూ అతడెలా మోసపోయాడో చదివేయండి.. బీజింగ్‌కు చెందిన ఈ వ్యక్తి పేరు లీ. ఇతనికి ఓ హెయిర్ సెలూన్ నుంచి రూ.230 గిఫ్ట్ కార్డ్ వచ్చింది. దానిని వాడుకోవడానికి సెలూన్‌కు వెళ్లాడు. కార్డు చూపించగానే హెడ్ మసాజ్ చేశారు సెలూన్ నిర్వహకులు. అనంతరం లీ ముఖానికి లోషన్‌ను పూశారు. లోషన్ బాటిల్ ఖరీదు రూ.4,582గా బిల్లును చూపించారు. రూ.57,571 ఖరీదైన మరో కూపన్‌ను కొనుగోలు చేసేలా లీని సలూన్ మేనేజర్ ప్రోత్సహించారు. హెయిర్ కట్ చేసే ముందు లీకి బిల్‌ను చూపించారు. కానీ కళ్లద్దాలు పెట్టుకోనందున లీ దాన్ని చూడలేకపోయారు. ఎయిర్ కట్ అనంతరం లీకి అసలు విషయం అర్ధమైంది. రూ.1.15లక్షల బిల్ చెల్లించాల్సిందిగా సెలూన్ యాజమాన్యం అతనిపై ఒత్తిడి చేసింది. డబ్బులు లేవన లీ చెప్పగా.. సెల్‌ఫోన్ ద్వారా లోన్‌కు అప్లై చేసేలా ఒత్తిడి చేశారు. చేసేదేమీ లేక లీ లోన్ ద్వారా ఆ మొత్తాన్ని చెల్లించాల్సి వచ్చింది. మోసపోయానని తెలుసుకున్న లీ.. ఈ విషయాన్ని స్థానిక మీడియా ద్వారా తెలియజేశారు. తన డబ్బులు తిరిగి ఇప్పించాలని పోలీసులను ఆశ్రయించారు. అయితే.. ఈ ఘటన అనంతరం ఆ సెలూన్ మూసి ఉందని పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి: వామ్మో..! తాళ్లు లేకుండా 123 ఫ్లోర్ల బిల్డింగ్‌పైకి సగం ఎక్కేశాడు..కానీ.. -
ఎంత పనిచేశాడు.. హెయిర్ స్టయిల్ నచ్చలేదని బాత్రూమ్లోకి వెళ్లి..
ముంబై: ఇటీవల టీనేజర్లు చిన్న విషయాలకు కలత చెందడం, గొడవలకు దిగడం, అంతెందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలను కూడా మనం చూస్తూనే ఉన్నాం. క్షణికావేశంలో నిండు నూరేళ్లు జీవితాన్ని అర్థంతరంగా ముగించుకుంటున్నారు. ఇంట్లో తమ తల్లిదండ్రుల ఆశలపై నీళ్లు చల్లుతున్నారు. తాజాగా ఓ టీనేజర్ హెయిర్‌కట్ నచ్చలేదని బిల్డింగ్‌పై నుంచి దూకేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మహరాష్ట్రలోని భయాందర్ నగరానికి చెందిన 13 ఏళ్ల బాలుడికి కుటుంబ సభ్యులు హెయిర్ కట్ చేయించారు. అయితే షాపు అతను చేసిన హెయిర్ కటింగ్ ఆ బాలుడికి అసలు నచ్చలేదు. ఇంటికి వెళ్లాక అద్దంలో పదే పదే ఆ హెయిర్ స్టైల్‌ను చూసుకుంటూ తనకు నచ్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఓ దశలో కోపోద్రిక్తుడైన ఆ బాలుడు అపార్ట్మెంట్ భవనం 16వ అంతస్తులోని బాత్రూంలోకి వెళ్లి అక్కడ ఉన్న కిటికీ నుంచి కిందకు దూకేశాడు. ఈ ఘటనలో బాలుడు తీవ్రంగా గాయపడడంతో అక్కడికక్కడే చనిపోయాడు. సమాచారం అందుకున్న నవ్ఘర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. -
పెళ్లి మండపంలో వధువు అనూహ్య నిర్ణయం.. కుటుంబం కంటతడి..
పెళ్లి అంటే ఓ పండగ. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో జరుపుకునే వేడుక. రెండు జీవితాలను ఒక్కటి చేసే వేదిక. చాలా మంది తమ పెళ్లిని ఎంతో ప్రత్యేకంగా జరుపుకోవాలని కోరుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో పలు జంటలు తమ వివాహాన్ని మంచి పనులకు వేదికగా మలుచుకుంటున్నారు. సమాజం కోసం, భవిష్యత్తు కోసం ఉపయోగపడే పనులకు శ్రీకారం చుడుతున్నారు. తాజాగా ఓ వధువు కూడా ఇలాగే ఆలోచించింది. పెళ్లి రోజు జీవితాంతం గుర్తుండేలా అందమైన, పొడవాటి తన జుట్టును కత్తిరించేందుకు సిద్ధపడింది. వధువు అనూహ్య నిర్ణయంతో మండపంలోని అతిథులందరూ ఆశ్యర్యానికి గురయ్యారు. అనంతరం ఆమె క్యాన్సర్ బాధితులకు జుట్టు డొనెట్ చేసిందుకు ఇలా చేసిందని తెలుసుకొని హర్షం వ్యక్తం చేశారు. పెళ్లిలో వధువు తన జుట్టు కత్తిరించుకుంటున్న ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని ఓ ఇన్స్టాగ్రామ్ పేజ్‌లో షేర్ చేశారు. విందులో పెళ్లి దుస్తుల్లో ఉన్న వధువు.. వివాహ వేడుక అనంతరం తన పొడవాటి జుట్టును కత్తిరించుకోవడం కనిపిస్తోంది. క్యాన్సర్ రోగులకు సాయం చేసేందుకు ఇలా చేస్తున్నట్లు ఆమె తెలిపింది. వధువు జుట్టు కత్తిరించుకుంటుంటే ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులతో సహా అక్కడున్న వారంతా కంటతడి పెట్టుకున్నారు. ఇక ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. లక్షల్లో వ్యూస్ వచ్చి చేరుతున్నాయి. వధువు తీసుకున్న నిర్ణయాన్ని నెటిజన్లు సైతం ప్రశంసిస్తున్నారు. View this post on Instagram A post shared by Michigan Wedding Photographer & Videographer | Brianna Eslinger (@theunfilteredcollective) -
ఇక చాలూ.. ఆమె చర్యతో పార్లమెంట్లో మౌనం
స్ట్రాస్‌బర్గ్(ఫ్రాన్స్): యూరోపియన్ పార్లమెంట్లో మంగళవారం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. స్వీడన్ సభ్యురాలైన అల్ సహ్లానీ ఎవరూ ఊహించని చేష్టలకు దిగారు. ఇరాన్ మహిళలకు సంఘీభావంగా పార్లమెంట్‌లోనే ఆమె జుట్టు కత్తిరించుకోవడంతో.. తోటి సభ్యులంతా షాక్ తిన్నారు. మహ్సా అమినీ అనే యువతి మృతి నేపథ్యంతో మొదలైన హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు ఉధృత స్థాయిలో కొనసాగుతున్నాయి అక్కడ. ఈ పోరాటంలో పాల్గొంటున్న ఇరాన్ మహిళలకు సంఘీభావం తెలిపే క్రమంలో తన జుట్టు కత్తిరించుకున్నారు అల్ సహ్లానీ. ఈయూ పార్లమెంట్లో ఇరాన్ ఆందోళనలపై ఆమె ప్రసంగించారు. ‘‘మౌనంగా ఉంది ఇక చాలూ. ఈయూ పౌరులమైన మనం.. ఇరాన్లో సాధారణ పౌరులపై జరుగుతున్న హింసాకాండను ఆపేయాలని అక్కడి ప్రభుత్వాన్ని డిమాండ్ చేద్దాం. వాళ్లు(ఇరాన్ పౌరులను ఉద్దేశించి) తమ జీవితాలను పణంగా పెట్టి అక్కడ స్వేచ్ఛ కోసం పోరాడుతున్నారు. ఇరాన్‌కు స్వేచ్చ లభించేంత వరకు.. అణచివేతదారుల కంటే మన ఆవేశం ఎక్కువగానే ఉంటుంది. ఇరాన్ మహిళలు.. మీకు స్వేచ్ఛ లభించేంత వరకు మేం మీకు అండగా ఉంటాం. జిన్ జియాన్ ఆజాదీ(వుమెన్, లైఫ్, ఫ్రీడమ్) అంటూ ఆమె వెంట తెచ్చుకున్న కత్తెరతో తన పోనీ టేల్‌ను కత్తిరించుకున్నారామె. Traditionen att klippa av sig håret i protest är tusenårig. Den visar att ilskan är starkare än förtryckarens makt. Irans kvinnor har fått nog. EU borde visa samma mod och ge dem fullt stöd. pic.twitter.com/0FdMB9XoXu — AbirAlsahlani (@AbirAlsahlani) October 4, 2022 ఇరాన్లో పుట్టిన అబిర్ అల్-సహ్లానీ.. స్టాక్‌హోమ్(స్వీడన్) హగెర్స్టన్లో స్థిరపడ్డారు. 2009 జులై నుంచి ఆమె స్వీడన్ సభ్యురాలిగా యూరోపియన్ పార్లమెంట్లో కొనసాగుతున్నారు. ఇక ఇరాన్ హిజాబ్ వ్యతిరేక ఆందోళనలను కట్టడి చేసేందుకు భద్రతా దళాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో వంద మందికి పైగా సాధారణ పౌరులు మరణించారు. మరోవైపు ఇరాన్ మహిళలు, స్కూల్ చిన్నారులతో పాటు ప్రపంచవ్యాప్తంగా వీళ్ల ఆందోళనకు మద్దతుగా ప్రముఖులు సైతం జుట్టు కత్తిరించుకుని సంఘీభావం తెలుపుతున్నారు. -
స్జేజీపైనే జుట్టు కత్తిరించుకున్న సింగర్.. వీడియో వైరల్
ఇస్తాన్‌బుల్: హిజాబ్ వ్యతిరేక నిరసనలతో ఇరాన్ అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఆ దేశ మహిళలకు టర్కీ ప్రముఖ సింగర్ మెలెక మొసో మద్దతు తెలిపారు. స్టేజీపైనే జుట్టు కత్తిరించుకుని ఇరాన్ మహిళల పోరాటానికి అండగా నిలిచారు. దీంతో సింగర్ జుట్టు కత్తిరించుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Turkish singer @MelekMosso cuts off her hair on stage in solidarity with the Iranian women. Thank you Melek!#MahsaAmini #مهسا_امینی #IranProtests2022 pic.twitter.com/ZjISxjGkAL — Omid Memarian (@Omid_M) September 27, 2022 హిజాబ్ ధరించనందుకు ఇరాన్లో 22 ఏళ్ల యువతి మహస అమీనిని పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆమె మరణించింది. పోలీసులు హింసించడంతోనే ఆమె చనిపోయిందని ఇరాన్లో హిజాబ్ వ్యతిరేక నిరసనలు వెల్లువెత్తాయి. ప్రభుత్వం వీరిపై ఉక్కుపాదం మోపింది. దీంతో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య పలు చోట్ల ఘర్షణలు తలెత్తాయి. ఇప్పటివరకు 75 మంది నిరసనకారులు చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇరాన్‌కు ఇతర దేశాల్లోని ప్రజలు మద్దతు తెలుపుతున్నారు. షరియా, ఇస్లామిక్ చట్టం ప్రకారం ఏడేళ్లు పైబడిన ముస్లిం అమ్మాయిలు జుట్టు కన్పించకుండా తప్పనిసరిగా హిజాబ్ ధరించాలి. బుర్ఖా లాంటి పొడవైన వస్త్రాలు ధరించాలి. కొన్ని ముస్లిం దేశాలు దీన్ని పాటించకపోయినప్పటికీ ఇరాన్ ఈ నిబంధనను తప్పనిసరి చేసింది. జులై 5న అధికారిక ఆదేశాలు జారీ చేసింది. దీంతో అక్కడి మహిళలతో పాటు వారి కుటుంబసభ్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. చదవండి: హిజాబ్ ఆందోళనల్లో సోదరుడు మృతి.. జుట్టుకత్తిరించుకున్న యువతి -
నిమిషంలోపే హెయిర్ కట్.. గిన్నిస్ రికార్డు సృష్టించిన హెయిర్ డ్రస్సర్
అర్జెంట్‌గా హెయిర్ కట్ చేయించుకోవాలా? అస్సలు టైమ్ లేదా? అయితే మీకు ఈ గ్రీక్ హెయిర్ డ్రెస్సర్ కావాల్సిందే. సాధారణ హెయిర్‌కట్ కోసం గ్రీక్ హెయిర్ డ్రస్సరెందుకు? అనేగా సందేహం. ఒక్కసారి మైండ్‌లో ఫిక్సయిపోతే.. బ్లైండ్‌గా ఫాలో అయ్యే ప్రొఫెషనల్ హెయిర్ డ్రస్సర్ ఈయన. గ్రీస్‌లోని ఏథెన్స్కు చెందిన కాన్సాంటినోస్ కౌటోపీస్... నిమిషంలోపే హెయిర్ కట్ చేసేస్తాడు. 47 సెకన్లలోనే అందమైన హెయిర్‌స్టైల్ చేసి.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా సాధించాడు. ఓపికతో, ఎంత ఎక్కువ సమయం తీసుకుని కట్ చేస్తే.. అంతమంచి హెయిర్ స్టైల్ వస్తుందనే భావనకు చెక్ పెట్టేశాడు. ట్రిమ్మర్, కోంబ్ సహాయంతో చకచకా కట్ చేశాడు. గిన్నిస్ అధికారులు విడుదల చేసిన ఈ వీడియోను లక్షల మంది చూసేశారు. కొందరు సూపరని పొగుడుతుండగా, మరికొందరు బాలేదంటూ పెదవివిరిచారు. Need a quick trim? How about a 45 second trim? 💇♂️ pic.twitter.com/DqeokLazg2 — Guinness World Records (@GWR) September 4, 2022 చదవండి: మా గడ్డ మీలాగా కాదు.. పాక్‌కు తాలిబన్ల కౌంటర్ -
పట్టింపులకు ..‘కత్తెర’
సాక్షి, సిద్దిపేట: ఒకప్పుడు మహిళలు అంటే ఇంటికే అంకితమనేవారు. తర్వాత కాలం మారినా.. కొన్ని రకాల ఉద్యోగాలు, కొన్ని రంగాలకే పరిమితమయ్యారు. కొన్ని రకాల కుల వృత్తులు అయితే పూర్తిగా పురుషులే ఉండే పరిస్థితి. ఇలాంటి ఆలోచనల్లో మార్పు తెస్తోంది సిద్దిపేటకు చెందిన కొత్వాల్ లావణ్య. పట్టింపులన్నీ పక్కన పెట్టి.. విజయవంతంగా క్షౌరవృత్తిని నిర్వహిస్తోంది. అటు భర్తకు చేదోడుగా ఉండటంతోపాటు కుటుంబానికి ఆసరానూ ఇస్తోంది. ఆర్థిక ఇబ్బందులతో.. సిద్దిపేట జిల్లా కేంద్రానికి చెందిన కొత్వాల్ లావణ్య, నంగనూరు మండలం దేవుని నర్మెట గ్రామానికి చెందిన శ్రీనివాస్‌లకు 13 ఏళ్ల కింద వివాహమైంది. మొదట్లో వారు వ్యవసాయం చేసేవారు. అది గిట్టుబాటు కాకపోవడంతో పనికోసం 8 ఏళ్ల కింద సిద్దిపేటకు వచ్చారు. పట్టణంలో పలు సెలూన్లలో శ్రీనివాస్ రోజువారీ పనికివెళితే.. లావణ్య కూలీపనులకు వెళ్లేది. ఇన్నాళ్లూ ఎలాగోలా గడిచినా.. కరోనా సమయంలో సెలూన్లు మూతపడటం, గిరాకీ తగ్గడంతో శ్రీనివాస్‌కు పనిలేకుండా పోయింది. ఇద్దరూ కూలిపనులకు వెళ్లినా వచ్చే అరకొర సంపాదన సరిపోక అప్పుల పాలయ్యారు. ఈ క్రమంలోనే భర్తతో కలిసి తానూ కత్తెర పట్టాలనుకుంది. ఆ ఆలోచనకు శ్రీనివాస్ అండగా నిలిచాడు. 4 నెలల పాటు వివిధ స్టయిళ్లలో కటింగ్ చేయడం నేర్చుకుంది లావణ్య. ఇద్దరూ కలిసి గతేడాది నవంబర్ 25న స్థానిక కేసీఆర్ నగర్ (డబుల్ బెడ్రూమ్ కాలనీ)లో హరీశన్న హెయిర్ కటింగ్ పేరుతో సెలూన్ ప్రారంభించారు. లావణ్య రోజూ ఇంటిపనులు చూసుకోవడంతోపాటు.. పొద్దంతా షాప్‌లో కటింగ్ చేస్తోంది. ముఖ్యంగా కటింగ్‌కు వచ్చే పిల్లలు ఏడుస్తుంటారు. లావణ్య వారిని బుజ్జగిస్తూ, కబుర్లు చెప్తూ కటింగ్ చేస్తుండటం అందరినీ ఆకట్టుకుంది. చాలా మంది తమ చిన్నారులను హెయిర్ కటింగ్ కోసం లావణ్య వద్దకు తీసుకురావడం మొదలుపెట్టారు. మా ఆయన దగ్గరే ట్రైనింగ్ తీసుకున్నా మా కులంలో మగవాళ్లు చాలావరకు కులవృత్తిలోనే కొనసాగుతున్నారు. మా కుటుంబంలో ఆడవాళ్లు ఎవరూ కటింగ్ షాప్‌లో అడుగు పెట్టలేదు. కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల మా ఆయనకు సపోర్ట్‌గా నిలవాలనుకున్నా. కటింగ్ చేస్తానంటే మా ఆయన సపోర్ట్ చేశారు. ఆయన దగ్గరే ట్రైనింగ్ తీసుకున్నా. ఎవరేమైనా అనుకోనీ అని క్షౌరవృత్తి మొదలుపెట్టిన. పిల్లలు, పెద్దలు ఎవరికైనా కటింగ్, షేవింగ్ చేస్తున్నా. మా ఆర్థిక ఇబ్బందులకు కొంత పరిష్కారం దొరికింది. – లావణ్య -
థూ.. థూ ఉమ్ముతో హెయిర్ కటింగ్.. వైరల్ వీడియో
లక్నో: ఇండియాలోని అత్యంత ప్రసిద్ధిగాంచిన హెయిర్ స్టైలిస్ట్‌లలో ఒకరైన జావేద్ హబీబ్ తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. జావెద్ హబీబ్ హెయిర్ కట్ చేస్తూ ఓ మహిళ నెత్తి మీద ఉమ్మివేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హెయిర్ స్టైలిస్ట్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలేం జరిగిందంటే.. జావెద్ హబీబ్ కొంతమందితో కలిసి ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫనగర్లో ట్రైనింగ్ సెమినార్ నిర్వహించారు. ఇందులో ఓ మహిళను హెయిర్ కట్ కోసం సెలూన్ కూర్చీ వద్దకు పిలిచాడు. దువ్వెనతో జుట్టును సరిచేస్తూ.. సెమినార్‌కు హాజరైన వారికి హెయిర్ కేర్ టిప్స్ చెప్తున్నాడు ఇంతలోనే ‘ఒకవేళ నీటి కొరత ఉంటే ఉమ్మితోనే గడిపేయాలి..' అంటూ అందరి ముందే ఆయన మహిళ నెత్తి మీద ఉమ్మివేశాడు. దీంతో అక్కడున్న జనమంతా చప్పట్లు కొడుతూ నవ్వుకున్నారు. అయితే మహిళ జుట్టు చాలా పొడిగా ఉందని చెబుతూ, ఉమ్మిలో ఓ పవర్ కూడా ఉందంటూ తను చేసిన తప్పు పనిని కప్పిపుచ్చుకున్నాడు. ఈ వీడియో ఎప్పుడో జరిగిందో క్లారిటీ లేదు. కానీ దీనికి సంబంధించిన క్లిప్ వైరల్‌గా మారడంతో నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. అనేక మంది జావేద్ చేసిన అనుచిత పని పట్ల అసహనం వ్యక్తం చేస్తూ తిట్టిపోస్తున్నారు. జావేద్ చర్య సెలూన్ పరిశ్రమకు అగౌరవమని పలువురు మండిపడుతున్నారు. కాగా ఈ వీడియోలో తనకు ఎదురైన అవమానకరమైన అనుభవాన్ని షేర్ చేసేందుకు సదరు మహిళ ట్విటర్లో వీడియోను పోస్టు చేసింది. చదవండి: నోట్లో సిగరెట్, చేతిలో గన్.. జాంజాం అని బుల్లెట్ రైడింగ్.. విషయం బయటపడటంతో.. This is Javed Habeeb... Spitting instead of using water... absolutely horrible 🤮🤬 pic.twitter.com/8s7xaE8qfO — Kungfu Pande 🇮🇳2.0 (@pb3060) January 5, 2022 ‘నా పేరు పూజాగుప్తా. నేను ఓ బ్యూటీ సెలూన్‌ను నిర్వహిస్తాను. ఇటీవల జావేద్ హబీబ్ సార్ ఏర్పాటు చేసిన సెమినార్‌కు వెళ్లాను. అతను నన్ను హెయిర్ కట్ కోసం స్టేజ్ మీదకు పిలిచి అసభ్యంగా ప్రవర్తించాడు. మీ దగ్గర నీళ్లు లేనప్పుడు హెయిర్ కట్కు ఉమ్మి ఉపయోగించవచ్చని చెప్పాడు. కానీ నేను హెయిర్ కట్ చేయించుకోలేదు. ఒకవేళ నేను మా పక్కింటి మంగళి వ్యక్తి దగ్గర హెయిర్ కట్ చేయించుకుంటాను. కానీ జావేద్ హబీబ్ దగ్గరకు వెళ్లను' అని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా తాజా వివాదంపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని మహిళా చైర్ పర్సన్ రేఖా శర్మ ఉత్తర ప్రదేశ్ పోలీసులను కోరారు. చదవండి: అరెరే ఎంతపనాయే.. బెడిసికొట్టిన వెడ్డింగ్ ఫోటోషూట్.. ఫోటోలు వైరల్ Ms. Pooja's response pic.twitter.com/QKvyoMlCHU — Kungfu Pande 🇮🇳2.0 (@pb3060) January 6, 2022 -
వెంట్రుకలను ఎందుకలా కత్తిరిస్తున్నారని అడిగా..
సాక్షి, కర్నూలు(హాస్పిటల్): తలపై జుట్టు ప్రతి ఒక్కరికీ ఎంతో అపురూపం. ఒక్క వెంట్రుక రాలిపోతున్నా ఎంతో మనోవేదనకు గురవుతారు. అలాంటిది క్యాన్సర్ బాధితులకు ఇచ్చే చికిత్సలో తల వెంట్రుకలు మొత్తం పోతే వారి బాధ వర్ణణాతీతం. అలాంటి వారి కోసం మేమున్నామంటూ.. పిల్లల నుంచి పెద్దల వరకు ముందుకు వస్తున్నారు. వారి కోసం కేశాలు దానం చేసి విగ్గుల తయారీకి సహకరిస్తున్నారు. ఇటీవల కర్నూలులో నిర్వహించిన కేశదాన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. క్యాన్సర్ బారిన పడిన వారికి కీమోథెరపి ఇవ్వడం కారణంగా వారి తలవెంట్రుకలు పూర్తిగా ఊడిపోయి గుండు ఏర్పడుతుంది. ఇలాంటి వారికి తలవెంట్రుకలు తిరిగి రావడమనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఒక వైపు క్యాన్సర్ మహమ్మారి నుంచి వేదన మరోవైపు ఎంతో అపురూపంగా చూసుకున్న తలవెంట్రుకలు పోయి అందవిహీనంగా మారామనే మనోవేదన వారిని తీవ్రంగా కలిచివేస్తుంది. ఇలాంటి వారికి ఉచితంగా విగ్గులు తయారు చేసి ఇచ్చేందుకు ముంబయిలోని నోవా హాస్పిటల్ వారు ఇతోధికంగా సేవలు అందిస్తున్నారు. దాతల ద్వారా వారికి అందిన వెంట్రుకలను విగ్గులుగా మార్చి కీమోథెరపి ద్వారా వెంట్రుకలు కోల్పోయిన వారికి అందజేస్తున్నారు. కేశదానానికి విశేష స్పందన యువభారత్ సేవా సమితి ఆధ్వర్యంలో రాయలసీమలో మొదటిసారి గత నెల 29వ తేదీన నిర్వహించిన కేశదానం, రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. కేశదానానికి ముందుగా 25 మంది వస్తారని నిర్వాహకులు అంచనా వేశారు. కానీ అనూహ్యంగా 49 మంది మహిళలు, యువతులు, పిల్లలతో పాటు నలుగురు యువకులు కేశదానానికి ముందుకు వచ్చారు. స్థానిక దేవిఫంక్షన్ హాలులో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. నలుగురు యువకులు క్యాన్సర్ బాధితుల కోసమే వెంట్రుకలను 15 సెం.మీ. కంటే ఎక్కువగా పెంచి మరీ కేశదానం చేశారు. నంద్యాల మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన వెంకటహరీష్ అనే యువకుడు ఇప్పటికే రెండుసార్లు కేశదానం చేశారు. ఈ కార్యక్రమంపై యువభారత్ సేవా సమితి వారు నెలరోజుల ముందు నుంచే విస్తృతంగా ప్రచారం చేశారు. ఇందులో అధికంగా మహిళలు భాగస్వామ్యమయ్యేలా చేశారు. ఎంతో తృప్తినిస్తోంది క్యాన్సర్ బాధితుల కోసం చేసే కేశదాన కార్యక్రమాన్ని నిర్వహించాలని మొదట భావించినప్పుడు అందరూ ప్రశ్నార్థకంగా చూశారు. క్రమంగా కార్యక్రమం ఉద్దేశాన్ని అందరికీ చెప్పి ఒప్పించాం. అనూహ్యంగా 53 మంది తరలివచ్చి కేశ దానం చేయడం మాలో మరింత ఉత్సాహాన్ని నింపింది. నేను కూడా కేశదానం చేశాను. ఇప్పటికే 22 సార్లు రక్తదానం కూడా చేశాను. ఎవ్వరైనా కేశదానం చేయాలనుకుంటే హైదరాబాద్‌లోని కోట సంపత్‌కుమార్ (9992345678, 93463445)కు ఫోన్ చేసి సమాచారం ఇస్తే చాలు ఏర్పాట్లు చేస్తారు. –సి. రేణుక, యువభారత్ సేవా సమితి సహాయ కార్యదర్శి, కర్నూలు నేనూ దానం చేశా క్యాన్సర్ బాధితుల కోసమని కేశదానం చేస్తున్నారని తెలిసి అక్క వారితో కలిసి నేనూ వెళ్లాను. అక్కడ ఆంటీలు, అక్కలు వారి వెంట్రుకలను కత్తిరిస్తూ ఉంటే ఎందుకలా కత్తిరిస్తున్నారని అడిగా. క్యాన్సర్ బాధితుల కోసం విగ్గులు తయారు చేసి ఉచితంగా ఇస్తారని చెప్పడంతో నేను కూడా నా వెంట్రుకలను కత్తిరించి వారికి ఇచ్చాను. నాతో పాటు నా స్నేహితులు సైతం ఇచ్చారు. – సి. శ్రీమహి, కర్నూలు -
వైరల్: కిమ్ జోంగ్ హెయిర్ కట్ కావాలి.. చివరికి ఏమైందంటే!
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ వాప్తంగా జనాలకు ఇతని పేరు సుపరిచితమే. ఇతను వార్తల్లో నిలిచేది కొన్నిసార్లే అయినా తన ప్రత్యేకతను చూపిస్తుంటాడు. ఇప్పుడు కిమ్ జోంగ్ పేరు మరోసారి వైరలవుతోంది. అయితే ఇందుకు ఓ వ్యక్తి చేసుకున్న హెయిర్ కట్ కారణం. వివరాలు.. ఓ వ్యక్తి సెలూన్‌లోకి వెళ్లాడు. అక్కడ తనకు ఏ స్టైలిష్ హెయిర్‌కట్ అవసరం లేదని, కానీ ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ లాంటి హెయిర్ స్టైల్ కావాలని కోరాడు. అయితే ఇది బార్బర్‌కు సవాల్ లాంటిదే అయినప్పటికీ.. కిమ్ లాంటి హెయిర్ కట్ చేసేందుకు ప్రయత్నించాడు. ఆఖరికి అతను ఆ వ్యక్తి జుట్టును అచ్చం కిమ్ జోంగ్ లాగానే మార్చాడు. చదవండి: వైరల్: భల్లుకాల బంతాట.. భలే ఆట అంటున్న నెటిజన్స్ కిమ్ జోంగ్ మాదిరి హెయిర్ కట్ అంతా అయిపోయిన తరువాత దీనికి సంబంధించిన వీడియోను టిక్‌టాక్‌లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఒక వ్యక్తి సెలూన్లో కుర్చీపై కూర్చొని కనిపిస్తాడు. నియంత కిమ్ జోంగ్ ఉన్ లాగా అతను తన జుట్టు కత్తిరింపుతో నవ్వుతూ వీడియో రికార్డ్ చేస్తున్నాడు. బార్బర్‌ని కూడా వీడియో క్లిప్‌లో కనిపిస్తాడు. ఈ సమయంలో ఇద్దరూ నవ్వుతుంటారు. ‘కిమ్ జోంగ్ ఉన్ స్టైల్ హెయిర్‌కట్’క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. చదవండి: అమ్మా దొంగా ఇక్కడున్నావా? ఇది చూస్తే మీ స్ట్రెస్ హుష్‌కాకి కొందరు అచ్చు కిమ్‌లా ఉన్నావని అంటే మరొకరు కిమ్ భారత దేశం ఎప్పుడు వచ్చాడు అంటూ కామెంట్స్ జోడిస్తున్నారు. ఈ వ్యక్తి కిమ్ జాంగ్ ఉన్ వేషం ధరించి ఉత్తర కొరియాకు వెళ్లాలని, అక్కడ సరిహద్దు గార్డ్స్‌ను గందరగోళానికి గురిచేయాలని మరొక యూజర్ అన్నారు. బార్బర్ తలుచుకుంటే మామూలు వ్యక్తిని సెలబ్రిటీ చేయగలడంటూ నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు. -
గ్రామపెద్ద సరేనంటేనే క్షవరం
సాక్షి, యశవంతపుర: దళితులకు క్షవరం చేయబోమనడంతో గొడవ ఏర్పడింది. కర్ణాటకలోని దావణగెరె జిల్లా హరిహర తాలూకా ధళెహళె గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామంలో ఇప్పటికీ అంటరానితనం దురాచారం అమలవుతోంది. ఓ క్షౌరశాలలో క్షవరం కోసం కొందరు దళితులు రాగా, క్షురకుడు అన్నప్ప గ్రామ పెద్ద సరేనంటే మీకు క్షవరం చేస్తానని చెప్పాడు. మాకు ఎందుకు క్షవరం చేయవు అని దళిత యువకులు ప్రశ్నించటంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. శుక్రవారం ఉదయం జరిగిన ఈ ఘటన వీడియోలు సోషల్ మీడియాలో రావడంతో శనివారం చర్చనీయాంశమైంది. సంఘటనపై జిల్లాస్థాయి అధికారులు గ్రామంలో పర్యటించి విచారణ చేపట్టారు. ఈ గ్రామంలో దళితులను ఆలయాల్లోకి అనుమతించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. -
బెంగళూరు డ్రగ్స్ కేసు: ఆ గుట్టంతా జుట్టులోనే..!
సాక్షి, హైదరాబాద్: బెంగళూరు డ్రగ్స్ కేసు ఇప్పుడు పలువురు ప్రజాప్రతినిధుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఈ కేసులో భాగంగా కర్ణాటక పోలీసులు హైదరాబాద్‌కు చెందిన పలువురు వ్యాపారులకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా జుట్టు కత్తిరించుకునే పనిలో ఉన్నారని తెలిసింది. ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే.. వారి రక్తం, మూత్రం శాంపిళ్లతోపాటు తలవెంట్రుకలను పరీక్షించడం ద్వారా తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి. డ్రగ్స్ తీసుకున్న వారి వెంట్రుకల్లో దాదాపు 90 రోజుల (3 నెలల) పాటు వాటి అవశేషాలు ఉంటాయి. రక్తం, మూత్రంలలో కొన్నివారాలపాటు మాత్రమే డ్రగ్స్ ఆనవాళ్లు ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. దీంతో ఆరోపణలు ఎదుర్కొన్న వారు జుట్టు కత్తిరించుకునే పనిలో పడ్డారని అంటున్నారు. సాంకేతిక ఆధారాలపై దృష్టి.. బెంగళూరు డ్రగ్స్ కేసులో పోలీసులు కొందరు ప్రముఖులను విచారించాల్సి ఉంది. ఇందుకోసం వారి సెల్‌ఫోన్ లొకేషన్ డేటా తెప్పించుకుంటున్నారని సమాచారం. డ్రగ్స్ పెడ్లర్లకు, వారికి మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్, డ్రగ్స్ కోసం జరిగిన యూపీఐ, ఆన్లైన్ మనీ ట్రాన్సాక్షన్స్, బెంగళూరు ఫామ్ హౌజ్ పార్టీలకు ఎవరెవరు వెళ్లారన్నది నిర్ధారించేందుకు గూగుల్ టైంలైన్ డేటాను విశ్లేషిస్తున్నారని తెలిసింది. డ్రగ్స్ సరఫరాను నిర్ధారించుకున్న అనంతరం.. ఎవరు వినియోగించారన్న విషయంపై పోలీసులు దృష్టి సారించనున్నారు. సినీతారల కేసులన్నీ అటకపైకే! మనదేశంలో డ్రగ్స్ కేసులో అనేక మంది సినీతారలు జైలుపాలయ్యారు. ముఖ్యంగా బాలీవుడ్, శాండల్‌వుడ్ నటులు పలువురు జైలుకు వెళ్లారు. అయితే హైదరాబాద్‌లో ఓ సినీనటుడి కాల్పుల కేసు, ఆ తర్వాత పలుమార్లు వెలుగుచూసిన సినీతారల డ్రగ్స్ కేసులు మాత్రం ముందుకు సాగలేదు. టాలీవుడ్ డ్రగ్స్ కేసు దేశాన్ని కుదుపు కుదిపిన విషయం తెలిసిందే. చాలా మంది సినీ ప్రముఖులను విచారించడం ఒక దశలో జాతీయమీడియా దృష్టిని ఆకర్షించింది. కానీ ఆ తర్వాత అడుగుకూడా ముందుకు పడలేదు. -
సిరులు కురిపించిన కురులు
వేములవాడ: ఎములాడ రాజన్నకు భక్తులు సమర్పించుకునే కురులతో సిరులు కురిశాయి. కరోనా వైరస్ నేపథ్యంలో గత మార్చి 22 నుంచి మూసివేసి ఉంచిన కల్యాణకట్ట కోవిడ్–19 నిబంధనల మేరకు ప్రభుత్వం అన్‌లాక్ ప్రకటించిన నేపథ్యంలో నవంబర్ 25న ప్రారంభించారు. దీంతో 36 రోజుల్లో కల్యాణ కట్టలో సేకరించిన తలనీలాలకు కాంట్రాక్టర్ల మధ్య పెరిగిన పోటీతో భారీగా ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 20న స్వామి వారి ఓపెన్‌స్లాబ్‌లో జరిగిన బహిరంగ వేలంపాటలో కాంట్రాక్టర్లు పోటాపోటీగా కిలో ఒక్కంటికి రూ.16,050 వరకు వేలం పాడారు. దీంతో రాజన్నకు సిరులు కురిశాయి. పెరిగిన పోటీ.. రాజన్న ఆలయ కల్యాణకట్ట నుంచి పోగుచేసిన తలనీలాలకు నిర్వహించిన బహిరంగ వేలం కమ్ సీల్డ్ టెండర్లలో కాంట్రాక్టర్లు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో కాంట్రాక్టర్ల మధ్య తీవ్రపోటీ పెరిగింది. 14 మంది కాంట్రాక్టర్లు బహిరంగ వేలంపాటలో హాజరు కాగా, ఇద్దరు బాక్స్ టెండర్, ఒకరు ఆన్లైన్ టెండర్ వేశారు. దీంతో బహిరంగ వేలంపాటలో హెచ్చుపాటదారుడైన హిందూపురానికి చెందిన సుమిత్ ఎంటర్ ప్రైజెస్ కిలో ఒక్కంటికి రూ.16,050కు సొంతం చేసుకున్నారు. తమిళనాడుకు చెందిన దురై ఎంటర్ ప్రైజెస్, హిందూపురానికి చెందిన సుమిత్ ఎంటర్ ప్రైజెస్ మధ్య వేలంపాట జోరుగా సాగిందని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. మొత్తంగా రాజన్నకు మాత్రం 36 రోజుల్లో సేకరించిన తలనీలాలకు భారీగా ఆదాయం వచ్చి చేరిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆదాయం ఎక్కువే కల్యాణకట్టలో నవంబర్ 25 నుంచి డిసెంబర్ 31 వరకు మేము సేకరించిన తలనీలాలకు నిర్వహించిన టెండర్ ద్వారా ఆదాయం ఎక్కువగానే వచ్చింది. చాలామంది కాంట్రాక్టర్లు తరలివచ్చారు. అంతేకాకుండా ఆన్లైన్, బాక్స్ టెండర్లు కూడా దాఖలయ్యాయి. దీంతో బహిరంగ వేలంపాటలో హెచ్చుపాటదారుడైన సుమిత్ ఎంటర్ ప్రైజెస్‌కు కిలో ఒక్కంటికి రూ.16,050 చొప్పున తూకం వేసి అప్పగిస్తాం. మొత్తంగా రూ.అరకోటికి పైగా ఆదాయం రావచ్చని భావిస్తున్నాం. – కృష్ణప్రసాద్, ఆలయ ఈవో -
నీ క్రియేటివిటీకి హ్యాట్సాఫ్
మనం హెయిర్‌కట్ చేయించుకోవాలంటే కచ్చితంగా బార్బర్ షాపుకు వెళ్లాల్సిందే. మనం చెప్పిన విధంగా హెయిర్‌కట్ చేసే బార్బర్లను చూసే ఉంటాం. అందులో కొందరు మాత్రం ట్రెండ్‌కు అనుగుణంగా ఫాలో అవుతూ డిఫరెంట్ హెయిర్‌స్టైల్స్ ప్రయత్నిస్తుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి ఆ కోవకు చెందినవాడే. తన షాపుకు వచ్చిన ఒక కస్టమర్‌కు వినూత్న రీతిలో హెయిర్‌కట్ చేశాడు.ఇది ఎలా ఉందా అని చూడ్డానికి బార్బర్ ఎన్ని కోణాల్లో చూశాడో లెక్కేలేదు. చివరకు దుకాణం నుంచి బయటకు వెళ్లి కూడా చూశాడు. అచ్చం టోపీ పెట్టుకుంటే ఎలా ఉంటుందో కస్టమర్ జట్టును అలానే తయారు చేశాడు. (చదవండి : అద్భుతం.. బ్లాక్ పాంథర్‌ను దించేశాడు) ఈ హెయిర్‌స్టైల్ చేయించుకుంటే దూరం నుంచి చూస్తున్నవారికి టోపీ పెట్టుకున్నాడా అనే సందేహం కూడా కలుగుతుంది. దాదాపు 44 సెకండ్ల నిడివి ఈ వీడియో చూస్తున్నంతసేపు చాలా ఫన్నీగా అనిపించినా.. బార్బర్ పని తనానికి మెచ్చకోకుండా ఉండలేం. ఇది ఎక్కడ జరిగిందన్నది తెలియదుగాని సోషల్ మీడియాలో షేర్ చేసిన కాసేపటికే వైరల్‌గా మారింది. 'నీ క్రియేటివిటీకి హ్యాట్సాఫ్.. భలే ఉంది టోపీ హెయిర్‌స్టైల్.. మీ టాలెంట్‌కు ఇవే మా జోహార్లు ' అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. We need more barbers like this guy😂 pic.twitter.com/he4dhLMwlu — 🇧🇧 (@rahm3sh) September 2, 2020 -
'సెంచరీ కంటే భార్య చేసే హెయిర్‌కట్ కష్టంగా ఉంది'
ముంబై : మ్యాచ్ ఆడేటప్పుడు సెంచరీకి ఒక పరుగు దూరంలో ఉన్నప్పుడు ఎంత ఒత్తిడికి గురవుతామో భార్యతో హెయిర్ కట్ చేసుకునేటప్పుడు అంతకంటే ఎక్కువ ఒత్తిడి ఉంటుందని టీమిండియా క్రికెటర్ చటేశ్వర్ పుజార అంటున్నాడు. కరోనా నేపథ్యంలో లాక్డౌన్ విధించడంతో సెలూన్ షాపులు బంద్ చేసిన సంగతి తెలిసిందే. అయితే పెరిగిన జట్టును కొంతమంది తామే కట్ చేసుకుంటే మరికొందరు ఆ పనిని వారి జీవిత భాగస్వాములకు అప్పగిస్తున్నారు. తాజాగా పుజార తన భార్య పూజాతో హెయిర్ కట్ చేసుకుంటున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకున్నాడు.(అఫ్రిది వ్యాఖ్యలకు రైనా స్ట్రాంగ్ కౌంటర్) 'సెంచరీకి ఒక్క పరుగు (99*) దూరంలో ఉన్నప్పుడు నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్‌ను ఎంతగా నమ్ముతాము అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ అదే జీవిత భాగస్వామితో హెయిర్ కట్ చేసుకునేటప్పుడు అదే నమ్మకం ఉంటుందని దైర్యంగా చెప్పడం మాత్రం చాలా కష్టం.' అంటూ క్యాప్షన్ పెట్టాడు. దీనికి సౌరాష్ట్ర సహచర ఆటగాడు జయదేవ్ ఉనద్కట్ మంకీతో కూడిన ఒక ఎమోజీని పెట్టి పుజారతో నేను కూడా ఏకీభవిస్తా అంటూ కామెంట్ చేశాడు. టీమిండియా తరపున 77 టెస్టుల్లో ప్రాతినిథ్యం వహించిన చటేశ్వర్ పుజార 48.86 సగటుతో 5840 పరుగులు చేశాడు. ఇందులో 3 డబుల్ సెంచరీలు, 18 సెంచరీలు, 25 అర్థ సెంచరీలున్నాయి. (మాటలతో జవాబివ్వకు అన్నాడు: కోహ్లి) -
తండ్రికి స్టైలీష్ హెయిర్ కట్ చేసిన హీరో
హైదరాబాద్: కరోనా లాక్డౌన్ ఉండటంతో జనం పలు రకాల ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. కటింగ్, షేవింగ్ చేసుకోవడం కూడా పెద్ద తలనొప్పిగా మారింది. ఆ మాటకొస్తే ఇదో ప్రధాన సమస్యగా మారింది. సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు ఈ సమస్య కొనసాగుతూ ఉంది. అయితే స్వయంగా హెయిర్ కట్ చేసుకోవడమే ఈ సమస్యకు పరిష్కారం అని పలువురు సెలబ్రెటీలు పేర్కొంటున్నారు. ఇప్పటికే విరాట్ కోహ్లీకి తన హార్ట్ బీట్ అనుష్క హెయిర్ కట్ చేయగా, సచిన్ టెండూల్కర్ స్వయంగా కటింగ్ చేసుకున్నాడు. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. తాజాగా టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ తన తండ్రికి సోదరితో కలిసి స్వయంగా హెయిర్ కట్ చేశాడు. తన తండ్రిని స్టైలీష్ లుక్‌లోకి మార్చి అది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ లాక్ డౌన్ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి సందీప్ సరదాగా గడుపుతున్నాడు. గత రెండు నెలలుగా పూర్తిగా ఇంటికే పరిమితం అయిన సందీప్ లాక్ డౌన్ సడలించి షూటింగ్స్ కు అనుమతిస్తే తన ఎ1 ఎక్స్‌ప్రెస్ చిత్రాన్ని పూర్తి చేయాలని ఎదురు చూస్తున్నాడు. చదవండి: ‘సమరసింహారెడ్డి’ మళ్లీ రిపీట్ అవుతుందా? అదిరేటి లుక్‌లో మహేశ్.. సినిమా కోసమేనా? -
అవ్రమ్‌కు హెయిర్ కట్ చేసిన విరానిక
లాక్డౌన్ కారణంగా నిత్యావసరాలు మినహా అన్నిషాప్లు మూతపడ్డాయి. దీంతో చాలా పనులు పెండింగ్‌లో పడిపోయాయి. కనీసం బయటకు వెళ్లి హెయిర్‌కట్ చేయించుకోలేని పరిస్థితి. దీంతో కొందరకు ఇళ్లల్లోనే తమకు తోచిన రీతిలో షేవింగ్, హెయిర్‌కట్ చేసుకుంటున్నారు. ఇలా తమలోని కొత్త ట్యాలెంట్‌ను బయటకు తీసుకొస్తున్నారు. ముఖ్యంగా పిల్లల విషయానికి వస్తే.. కొందరు తల్లిదండ్రులే వారికి హెయిర్ కట్ చేసి మురిసిపోతున్నారు. తాజాగా హీరో మంచు విష్ణు సతీమణి విరానిక కూడా ఈ జాబితాలో చేరిపోయారు. లాక్డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన విరానిక.. తన కుమారడు అవ్రమ్‌కు హెయిర్ కట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘అవ్రమ్ హెయిర్ కట్ చేశాను. ఇలా చేయడం ఇదే తొలిసారి’ అని విరానిక పేర్కొన్నారు. అలాగే అందరూ ఇంట్లోనే ఉండాలని, క్షేమంగా ఉండాలని పిలుపునిచ్చారు. అయితే హెయిర్‌కట్ చేసే సమయంలో ఏం జరుగుతుతందో తెలుసుకోవడానికి అవ్రమ్ పదే పదే వెనక్కి తిరిగి చూస్తూ.. చేసిన అల్లరి చాలా ఫన్నీగా ఉంది. ఈ వీడియోపై ప్రముఖ హీరోయిన్ హన్సిక స్పందిస్తూ.. ‘సో క్యూట్ విన్నీ’ అని కామెంట్ చేశారు. మరోవైపు ఇండియాలో ఉన్న విష్ణు విరానికను, పిల్లలను చాలా మిస్ అవుతున్నానని ఇటీవల ఓ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. చదవండి : భార్య, పిల్లలు విదేశాల్లో చిక్కుకుపోయారు: మంచు విష్ణు -
అన్నయ్యా.. వదినకు చాన్స్ ఇస్తున్నవా?
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న వేళ సామాజిక మాధ్యమాల్లో సరదా సంభాషణలు, ఛలోక్తులు చక్కర్లు కొడుతున్నాయి. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి ఆయన సోదరి, మాజీ ఎంపీ కవిత చేసిన వ్యాఖ్యలు తాజాగా సామాజిక మాధ్యమ వేదిక ట్విట్టర్లో నవ్వులు పూయిస్తున్నాయి. ‘కేటీఆర్ సర్.. నాదో వినయపూర్వక ప్రశ్న. 20వ తేదీకి ముందే క్షౌరశాలలు (సెలూన్లు) తెరిపించే ఉద్దేశమేదైనా ఉందా? మా ఆవిడ నా జుత్తు కత్తిరించేందుకు తొందర పడుతోంది. అదే జరిగితే లాక్డౌన్ ఎత్తివేసినా నేను ఇంటికే పరిమితం కావాల్సి ఉంటుంది’అని శరత్ చంద్ర అనే వ్యక్తి ట్వీట్ చేశాడు. దీనికి కేటీఆర్ స్పందిస్తూ ‘జుత్తు కత్తిరించేందుకు విరాట్ కోహ్లి అంతటి వాడే ఆయన భార్యకు అవకాశం ఇచ్చినప్పుడు.. నువ్వు మాత్రం ఎందుకు చేయించుకోకూడదు’అని సమాధానం ఇచ్చారు. దీనికి కేటీఆర్ సోదరి కవిత స్పందిస్తూ ‘అన్నయ్యా.. అయితే నువ్వు కూడా వదినమ్మకు అవకాశం ఇస్తున్నవా?’అంటూ ట్వీట్ చేశారు.