holly
-
Britain: భార్యను 224 ముక్కలుగా నరికేశాడు
లండన్: భార్యను భర్త హత్యచేసి ఏకంగా 224 ముక్కలుగా నరికి మృతదేహాన్ని మాయంచేసిన దారుణ ఘటన బ్రిటన్‌లో చోటుచేసుకుంది. నికొలస్ మెట్సన్ (28), హోలీ బ్రామ్లీ (26) లింకన్ సిటీలోని బస్సింగ్హామ్లో ఉంటున్నారు. గత నెల 17 నుంచి బ్రామ్లీ కనిపించట్లేదని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆమె తనను చితకబాది వెళ్లిపోయిందని పోలీసులకు నికొలస్ చెప్పాడు. ఫ్లాట్‌ను తనిఖీ చేయగా పెద్ద మొత్తంలో రక్తపు మరకలు, అతిగా శుభ్రం చేసినట్లు అమ్మోనియా, బ్లీచింగ్ ఆనవాళ్లు కనిపించాయి. దాంతో అతన్ని అరెస్ట్‌చేసి విచారణ మొదలెట్టారు. తనకేం తెలీదని మెట్సన్ తొలుత వాదించాడు. ఈలోపు సమీపంలోని విథమ్ నదిలో నరికిన చేయి సహా చిన్నిచిన్న శరీరభాగాలున్న ప్లాస్టిక్ బ్యాగులు కొట్టుకుపోవడం చూసి స్థానికుడు పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసు గజ ఈతగాళ్లు వాటిని సేకరించి ల్యాబ్‌కు పంపించారు. అసలేమాత్రం గుర్తుపట్టలేనంతగా హోలీ బ్రామ్లీ శరీరాన్ని పలుమార్లు పొడిచి 224 ముక్కలుగా నరికి భర్త నదిలో పడేశాడు. శరీరభాగాలను పడేయటంతో సాయపడినట్లు భర్త స్నేహితుడు జాషువా హ్యాన్‌కాక్ తన నేరాన్ని అంగీకరించాడు. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో ఎట్టకేలకు భర్త తన నేరాన్ని ఒప్పుకున్నాడు. ఆమె చంపడానికి ముందు పెంపుడు కుక్క పిల్ల, పెంపుడు ఎలుకలనూ చంపేశాడు. తన మాజీ జీవితభాగస్వాములనూ మెట్సన్ హింసించినట్లు 2013, 2016, 2017 పోలీసు రికార్డుల్లో ఉంది. జంతువుల పట్ల అతను అమానుషంగా ప్రవర్తించేవాడని పోలీసు విచారణలో వెల్లడైంది. హత్యచేసి దాదాపు వారంపాటు శరీరం ముక్కలున్న బ్యాగులను దాచి తర్వాత వాటిని పడేశాడు. హత్య తర్వాత భార్య బ్యాంక్ ఖాతా నుంచి 50 పౌండ్లు విత్‌డ్రా చేసి వాడుకున్నాడు. ‘భార్యను హత్య చేస్తే భర్తకు కలిగే లాభాలేంటి?. ఆ తర్వాత నన్ను ఎవరైనా వెంబడిస్తారా?. కూపీ లాగుతారా?’ అంటూ హత్యకు ముందు కొన్ని అంశాలపై ఆన్లైన్లో సెర్చ్చేశాడు. ఈ ఆన్లైన్ సెర్చ్ హిస్టరీని సైతం పోలీసులు వెలికితీశారు. -
ప్రేమికుడు
కూనిరాగం తీసుకుంటూ సతురా ఇంటి దారి పట్టాడు. సూర్యుడు అస్తమించనున్నాడు. అతను అనంతపూర్ వెళ్లి వస్తూ, తను ఉంటున్న ఊరికి మరీ దూరంగా లేడు. కేవలం ఆరు మైళ్లే ఇంకా నడవాల్సి ఉంది. ఝండ సాహి చేరుకుంటాడు. ఆహార పదార్థాలు గాని, ఇతర వస్తువులు గాని ఆ ఊరి వారికి దూరంగా ఉన్న బంధుగణానికి తీసుకెళ్లి అందజేస్తూ ఉంటాడు. ఆ సేవలకుగాను వారు ఇతడికి తృణమో పణమో ముట్టజెబుతూ ఉంటారు. అదే మహద్భాగ్యంగా భావిస్తుంటాడు. గత పదిహేనేళ్లుగా సతురా ఈ పనినే వృత్తిగా చేసుకున్నాడు. నిజానికి ఈ వృత్తి వల్ల ఆ ఊరి జనం అందరికీ ఇతను ప్రీతపాత్రుడయ్యాడు. చిల్లరపనుల విషయంలో కేంద్రబిందువు అయ్యాడు. సతురా ఆ ఊరి వారికీ వారి బంధువులకూ మధ్య వారధిలాంటి వాడు. అమాయకుడు, మృదుభాషి. ఏ చిన్న పనికైనా ముందుంటాడు. నమ్మకస్తుడు, బోళాశంకరుడు. ఎవరు ముందు పిలిస్తే వారి పనిని ముందు చేసి పెడతాడు.దుర్గాపూజ, హోలీ వంటి పండుగ సందర్భాల్లో అతడికి మంచి గిరాకీ ఉంటుంది. అందరూ తమ పిండివంటలూ, పళ్లూ బంధుమిత్రులకు అందించమని పురమాయిస్తుంటారు. వారి అభ్యర్థనలతో అతడు ఉక్కిరిబిక్కిరై మహదానందపడిపోతూ ఉంటాడు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ ఊరి వారందరికీ తలలో నాలుకలా ఉంటాడు. సతురా ఆ ఊరి వారి బంధువులకు చిరపరిచయస్తుడు. అతడు వారిని మెచ్చుకునే విధానం కూడా అభూత కల్పనలా ఉంటుంది. ‘‘అయ్యా! ఫలానా మీ బంధువు చాలా గొప్ప మంచిమనసు గలవాడయ్యా! నాకు పిండివంటలతోనూ పదిరకాల కూరలతోనూ భోజనం పెట్టాడు. నిజంగా వారి ఇంటికి వెళ్లటం నా పూర్వజన్మ సుకృతం..’’ ఇలా సాగుతుంది అతడి వర్ణన.సతురాకు నలభయ్యేళ్లుంటాయి. పొట్టిగా త్వరగా కదులుతూ ఉంటాడు. అతడి కంఠస్వరం కొంచెం బొంగురుగా ఉంటుంది. జనం అతడిని మందమతిగా పరిగణిస్తుంటారు. మెతకతనం వల్ల చాలాసార్లు ఇబ్బందుల్లో ఇరుక్కుంటుంటాడు. కాని మంచితనంతో చాకచక్యంగా బయటపడుతూ ఉంటాడు. ఎంత దూరం, ఏ ప్రాంతం వెళ్లినా తనను పంపించిన వారిని కూడా గొప్ప అతిశయోక్తులతో స్తోత్రం చెయ్యడం మరచిపోడు. గత పదిహేనేళ్లుగా ఆ ఊరి ప్రజలందరికీ ఎంతో చేరువగా ఉన్నాడు. కాని వారెవరికీ అతడి గత జీవితం గురించి ఏమీ తెలియదు. అతడి స్వభావం కూడా లోపల్లోపల అతత్యంత గంభీరమైనది. ఎవరికీ అంతు చిక్కనిది, చొరశక్యం కానిది. ఎవరూ అతడి వ్యక్తిగత వివరాల జోలికెళ్లరు. ఒకవేళ అతడి కుటుంబ గురించి ఎవరైనా ప్రశ్నించినా వెంటనే జవాబు చెప్పలేక తడబడిపోతుంటాడు. అతనిలో ఒక శూన్యం ఆవరించినట్లవుతుంది. కళ్లలో నీరు ఉప్పొంగి చెక్కిళ్ల మీదుగా ప్రవహిస్తుంది. ఎదుటివారికి దిగ్భ్రాంతి కలుగుతుంది. ఆ స్థితిలో ప్రశ్నించిన వారే సతురా పట్ల సానుభూతి చూపిస్తారు. అంతలోనే అతడు అక్కడి నుంచి ఖిన్నవదనంతో, విషాదమైన చూపులతో నిష్క్రమిస్తాడు.సతురా స్వగ్రామం సునాపూర్. పదిహేనేళ్ల కిందట సొంత ఊరినీ ఇంటినీ బంధువులనీ విడిచి వచ్చేశాడు. సునాపూర్‌లో అతడిది ప్రధాన్ కుటుంబం. మంచి స్థితిపరులూ మర్యాదస్తులూ కావడం వల్ల ఆ ఊర్లో అందరూ వారిని గౌరవంగా చూస్తారు. అతడి తండ్రికి ఇద్దరు కుమారులు. పెద్దవాడు సాంతియా, చిన్నవాడు సతురా. ఒక కుమార్తె కూడా ఉంది. ఆమె పెళ్లయి అత్తవారింటికి వెళ్లింది. కుమార్తెకూ సాంతియాకూ పెళ్లి చెయ్యడానికి ముసలాయన బాగా అప్పులు చేశాడు. కాని తన మరణానికి ముందే అప్పులన్నీ తీర్చేశాడు. కొడుకులిద్దరికీ కలిపి ఒక ఎనిమిదెకరాల మాగాణి భూమి మిగిల్చిపోయాడు. తండ్రి చనిపోయాక అన్ననూ వదినెనూ సతురా భయభక్తులతో చూసుకునేవాడు. తల్లిదండ్రులుగానే భావించేవాడు. వారి మాటను ఏనాడూ జవదాటి ఎరుగడు. వదినెకు కూడా పిల్లలు కలగలేదు. కాబట్టి ఆమె మరిదిని గారాబంగా చూసుకునేది. తండ్రి చనిపోయిన ఏడాది తర్వాత సతురాకు పెళ్లయింది. ఆమె అద్భుత సౌందర్యరాశి. కాబట్టి కొద్ది కాలంలోనే అందరి మన్ననలూ పొందింది. అందరి మనసులనూ గెలుచుకుంది. కాని ఆశ్చర్యకరంగా పెళ్లయిన నెలరోజులకే ఆమె కన్నవారింటికి చేరుకుంది. ఆమె తన వారందరితోనూ భర్త తన పట్ల సుముఖంగా లేడని చెప్పడం ప్రారంభించింది. అతడికి అన్నా వదినెలే ప్రాణమని, భార్యను పట్టించుకునే పోకడే లేదని ప్రచారం చేసింది. సూటిగా చెప్పాలంటే సతురాతో కాపురం చెయ్యడానికి ఆమె తిరస్కరించింది. అతడితో ఉండటం కన్నా చావే నయమని తేల్చి చెప్పింది. అప్పటి నుంచి సతురా ప్రపంచం తల్లకిందులైంది. హాయిగా సాగే అతడి జీవనస్రవంతి కల్లోల సముద్రంగా మారిపోయింది. ఆరునెలల తర్వాత సతురా మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. వధువు తులసి, అనుకూలంగానే ఉండేది. ఒక నూతనోత్తేజంతో జీవితంలో ఒక అధ్యాయాన్ని ప్రారంభించాడు. బతుకు గులాబీల బాటగా మారింది.కాని పెళ్లయిన నాలుగు నెలల తర్వాత సంసార జీవితంలో మరో విస్ఫోటం జరిగింది.ఒకరోజు మొక్కజొన్న తోటలో బాగా శ్రమించిన సతురా ఇంటికి చేరాడు. అప్పటికే అతడు అలసి హారతి కర్పూరమైపోయాడు. మిట్టమధ్యాహ్నం. పశువులశాలలో గెడ్డపారను విడిచిపెట్టాడు. ఇంట్లోకి ప్రవేశించాడు. మధ్య ద్వారాన్ని దాటి వెళ్లబోతున్నాడు. తన అన్న గది తలుపులు వేసి ఉండటాన్ని గమనించాడు. అప్పటికే వదినె తన కన్నవారింటికి వెళ్లి ఉంది.లోపలి నుంచి గుసగుసలు వినపడుతున్నాయి. ఒక గొంతు అన్నది, రెండో గొంతు తన భార్య తులసిది. ఒక్కసారిగా అవాక్కయి ఆగిపోయాడు. హతాశుడైపోయాడు. తల తిరగడం మొదలుపెట్టింది.‘‘నీకేమీ భయం లేదు. ఈ సంపదంతా నాదే. ఈ ఇల్లూ ఈ ఆస్తీ అన్నీ నావే. ఆ ఆడంగి వెధవ ఊరు వదిలి పోయేట్టు చేస్తాను’’ తన అన్న తన భార్య తులసితో అంటున్నాడు. ‘‘మనిద్దరి ఈ సంబంధం అతడికి తెలిస్తే?’’ తులసి అనుమానం వ్యక్తం చేస్తోంది. ‘‘తెలీదు. ఆ శుద్ధ బుద్ధావతారానికి ఎలా తెలుస్తుంది? ఒకవేళ తెలిసినా నోరు మూసుకోక తప్పదు. లేకపోతే వాణ్ణి తంతాను.. లేక..’’‘‘లేక?’’ ఆమె అడుగుతోంది.‘‘నిద్రలో ఉండగా వాడి తల నరికేస్తాను. ఈ ఊర్లో నన్ను అడిగేవాడెవ్వడు?’’ తన అన్న స్పష్టంగా చెప్పాడు.సతురాకు ఆ కుట్రలోని తీవ్రత, ప్రమాదస్థాయి అర్థమయ్యాయి. అతడి వెన్నెముకలో భరించలేని భయోత్పాతం ఉప్పెనలా వచ్చింది. తన అన్న అన్నంత పనీ చేయగలడు. అన్న పట్ల సతురాకున్న గౌరవ భావం పటాపంచలైంది. కళ్లవెంబడి నీరు ప్రవహించింది.ఇంకొక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా కట్టుబట్టలతో ఇల్లు విడిచి బయల్దేరాడు. మైళ్ల కొద్దీ ప్రయాణం చేశాడు. చివరికి ఈ ఝండసాహి గ్రామాన్ని చేరుకున్నాడు. ఈ ఊరు అతడి స్వగ్రామం సునాపూర్ నుంచి ముప్పయి మైళ్ల దూరంలో ఉంటుంది. మధ్యలో కొండలూ వాగులూ ఉంటాయి. గత పదిహేనేళ్లుగా ఈ ఊళ్లోనే స్థిరపడిపోయాడు.గడుస్తున్న కాలం అతడి జుత్తు నెరిసిపోయేట్టు చేసింది. ఇల్లు వదిలిన నాటి నుంచి అన్నగాని, దగ్గరి బంధు మిత్రులుగాని సతురా గురించి విచారించలేదు.ఎక్కడున్నాడని వాకబు చెయ్యలేదు. అసలు పట్టించుకోనేలేదు. ఇదీ అతడి గతం.ఇప్పుడు సాయంకాలమైంది. సతురా ఊరి చివర ఉన్న తన నిరాడంబరమైన పూరిగుడిసెకు చేరుకున్నాడు.బరువులు భుజాన మోసే వెదురు కావడి బద్ద ఒక పక్కన చేరవేశాడు. లోపలి వైపు చూస్తూ ఇలా పిలిచాడు: ‘‘ఓయ్ ప్రియతమా! తలుపు తెరు. నేను పూర్తిగా అలసిపోయాను. ఎంత పని చేశానో తెలుసా? ఎన్ని ఊళ్లు తిరిగానో తెలుసా? వింటున్నావా?’’లోనుంచి జవాబు రాలేదు.కొంచెం ఆగి అతడే అన్నాడు: ‘‘ఎందుకు మాట్లాడవు? నీకేమైనా జ్వరంగా ఉందా? అయ్యో! నడిచి నడిచి నొప్పెడుతున్న నా మోకాళ్లను మర్దన చేస్తావనుకున్నానే? పోనీలే నీకు ఒంట్లో బాగాలేదు కనుక మరి నేను అరవను.’’తలుపు తాళం తీసి లోనికి ప్రవేశించాడు. దీపాన్ని ముట్టించాడు. తన సంచిలోంచి నాలుగు మట్టి గాజులు తీశాడు. సంతోషంతో ఉప్పొంగిపోతూ ఇలా అన్నాడు: ‘‘చూడు! ఈ గాజులెంత నాజూకుగా ఉన్నాయో! నీకు నచ్చాయా లేదా? చెప్పు మరి. నిజం చెప్పకపోతే నా మీద ఒట్టే. అరె! ఎందుకు మాట్లాడవు? ఓహో! జ్వరంగా ఉండి మాట్లాడలేకపోతున్నావా? సరేలే! మరి నిన్ను ఇబ్బంది పెట్టను. నీరు తేవాలి. పొయ్యి ముట్టించాలి. ఆ తర్వాత నీ సంగతి చూస్తాను. ముందు ఈ గాజులు నీ చేతికి తొడుక్కో...’’సరిగా అదే సమయంలో నారీ మాస్టరు ఇంటి నుంచి అదేపనిగా పిలవసాగాడు: ‘సతురా! సతురా! ఓయ్ సతురా!’’చేతిలో ఒక మట్టి కుండతో సతురా గుడిసె బయటకు వచ్చాడు. ‘‘ఓయ్! సతురా! నీ రహస్యం ఈరోజే తెలిసింది. ఈ విషయం నాతో మాట మాత్రంగానైనా ఎప్పుడూ అనలేదు. పోనీలే. పెళ్లి చేసుకుని మంచి పనే చేశావు. ఇప్పుడు నువ్వు ఒంటరివాడివి కావు. నాకొక్క విషయం అర్థం కావడంలేదు. అసలు పెళ్లి ఎప్పుడు జరిగిందో చెప్పనేలేదు.’’ నారీ మాస్టరు అంటున్నాడు.సతురా అతని మాటలు జాగ్రత్తగా విన్నాడు. మౌనంగా తల దించుకున్నాడు. పూర్తి నిస్సహాయుడిగా నిలుచుండిపోయాడు.నారీ మాస్టరు ఊరుకోలేదు. మళ్లీ గుచ్చి గుచ్చి అడిగాడు:‘‘నా ప్రశ్నకు జవాబు చెప్పవేం? సతురా! పెళ్లెప్పుడు చేసుకున్నావు? చెప్పడానికి సిగ్గుపడుతున్నావా?’’ రెట్టిస్తున్నాడు.పొరుగునే ఉన్న బిసియా జెనా అనే ఆయన నారీ మాస్టరు వద్దకు వచ్చాడు. ‘‘ఏంటి విషయం?’’ అని అడిగాడు.‘‘ఏంలేదు బిసియా! సతురా పెళ్లి సంగతి.. అతడెప్పుడు పెళ్లి చేసుకున్నాడో తెలుసుకోవాలనుకుంటున్నాను. అంతే. మరేమీ లేదు..’’‘‘మాస్టారూ! సతురా పెళ్లి చేసుకున్నాడని మీకెందుకనిపించింది?’’ బిసియా అడిగాడు.‘‘నేను ఇంటి బయటి నుంచి భార్యతో అతడి సంభాషణ విన్నాను. గాజులు తొడుక్కొమ్మంటున్నాడు. సుస్తీగా ఉన్నది కనుక వచ్చి సేవ చేస్తానని ఊరడిస్తున్నాడు. నిజంగా సంతోషకరమైన జంట.’’ నారీ మాస్టరు మెచ్చుకున్నాడు.సతురా బయట నిర్జీవంగా నిలుచున్నాడు. బిసియా ఇంటి లోపలికి ఆమెను చూడటానికి మాస్టర్ని తీసుకెళ్లాడు. అనారోగ్యంతో ఉన్నామోను మాస్టరు ఆసక్తి చూపలేదు. కాని బిసియా ఒత్తిడి చేశాడు. మాస్టరు అయిష్టంగానే అంగీకరించి వెళ్లాడు. సతురా బయటనే ఉండిపోయాడు.నారీ మాస్టరు అసుర సంధ్య, అర్ధకాంతిలో మంచం మీద దుప్పటి కప్పుకుని ఉన్న ఒక ఆకృతిని చూశాడు. బిసియా దుప్పటి తొలగించాడు. ఆ దృశ్యాన్ని చూసి మాస్టరు అచేతనుడయ్యాడు. తన కళ్లను తనే నమ్మలేకపోయాడు. ఆ ఆకృతి స్త్రీ కానేకాదు. పల్లె రైతులు వ్యవసాయ సమయంలో వినియోగించే తాటాకు గొడుగు. మనిషి ఆకారంలో ఉన్నది. దుప్పటి కప్పడంతో మనిషి నిద్రపోతున్నట్టుంది. బయట సతురా వెక్కివెక్కి ఏడవడం మాస్టరుకు వినిపించింది. ఒక ఉద్వేగంతో మాస్టరు అతడిని నెమ్మదిగా పిలిచాడు. కాని సతురాని ఓదార్చడం సాధ్యం కాలేదు. పదిహేనేళ్ల కిందట అతని నిజ జీవితం కకావికలమైంది. ఇప్పుడు అతడు పదిలంగా కాపాడుకుంటున్న కల్పనాలోకం కూడా ఇతరులకు తేటతెల్లమై ఛిన్నాభిన్నమైంది. నారీ మాస్టరు సునాపూర్‌లో గర్భవతిగా ఉన్న తన కుమార్తెకు పిండివంటలు అందచెయ్యవలసిందిగా సతురాని కోరాడు. సతురా ఇల్లు వదిలిన తర్వాత ఆ ఊరివైపు చూడలేదు. అతనికి భార్య తులసి తలపులు దెయ్యంలాగ వెంటాడుతున్నాయి. ఆమె తన అన్నతో అన్న మాటలు గుండె మీద సుత్తితో కొడుతున్నట్టే ఉన్నాయి. అయిష్టంగానే సునాపూర్ వెళ్లడానికి అంగీకరించాడు. ఊరు చేరే సరికి సాయంకాలమైంది. గ్రామం అతడిని సాదరంగా ఆహ్వానించలేదు. తను పుట్టి పెరిగిన ప్రదేశంలో ఈరోజు అతడికి గుర్తింపు లేదు. సగం మనస్సుతో ఏదో అంతర్మథనంతోనే ఆ ఊళ్లో అడుగుపెట్టాడు. ఆకస్మికమైన సతురా రాక ఆ గ్రామస్తులకు చర్చనీయాంశమైంది. ఎన్నో ప్రశ్నలు వేశారు.అతని అన్నకూ భార్యకూ గల వ్యవహారం అందరికీ తెలుసుననీ, అందుకే చంపించి ఉంటాడని అనుకున్నామనీ చెప్పారు. ఇంకా చాలా చెప్పారు. సతురా అందరి మాటలనూ ఓపికగా వింటూనే నారీ మాస్టరు కుమార్తె ఇంటికి నేరుగా చేరుకున్నాడు. ఆ ఇంటి ముసలామె కబుర్లు వినడంలో మునిగిపోయాడు. ఆమె చాలా అంశాలను స్పృశించింది.సాంతియా తులసిని ఏవిధంగా ఉంపుడుగత్తెగా చేసుకున్నదీ, సతురాను అన్న చంపించినట్లు ఊళ్లో పుకార్లను గురించి చెప్పింది. సాంతియా ఇద్దరు భార్యలతో తొమ్మండుగురు సంతానాన్ని కనడాన్ని గ్రామస్తులు చీదరించుకున్నారని వివరించింది. మూడు సంవత్సరాల కిందటే చివరి బిడ్డను ప్రసవించలేక తులసి చనిపోయిందని సమాచారమిచ్చింది. ముసలామె ఇంకా చెప్పసాగింది: సతురా ఇల్లు వదిలిన తర్వాత పరిస్థితులు దిగజారిపోయాయి. సాంతియా వాతరోగంతో మంచం పట్టాడు. ఇద్దరు భార్యలూ ఎప్పుడూ పోట్లాడుకునేవాళ్లు. వరదలూ కరువుల వల్ల నష్టం వాటిల్లింది. గంపెడు కుటుంబాన్ని పోషించడానికి సాంతియా అప్పుల్లో కూరుకుపోయాడు. కొంత భూమినీ అమ్మివేశాడు. ఒకప్పటి ప్రధాన్ కుటుంబం ఇప్పుడు సర్వనాశనమైంది.సతురా ఈ విషయాలన్నీ రెప్పవెయ్యకుండా విన్నాడు. నిజానికి అతడికి ఇక్కడి ఈ అంశాలపైన ఏమాత్రం ఆసక్తి లేదు. కాని అన్న ఆరోగ్యస్థితి తెలిసిన తర్వాత అతడి కోపమంతా చల్లారిపోయింది. అతడిని కలుసుకోవడానికి పరుగెత్తాడు.సాంతియా ఏడుస్తూ సతురాను ఆలింగనం చేసుకున్నాడు. ‘‘తమ్ముడా! నేను మహాపాపిని. నిన్ను నేనే చంపించానని జనం ఆడిపోసుకున్నారు. ఇంతకాలం ఎక్కడున్నావు? ఎలా ఉన్నావు? చెప్పు.’’సతురా మాట లేకుండా నిలుచున్నాడు.వదినె కూడా ఎంతో ఆర్ద్రతతో స్వాగతించింది. గద్గద స్వరంతో పిల్లల దయనీయ స్థితిని వివరించింది. సతురా ఒక్క క్షణం గతాన్ని మరచిపోయి విలపించాడు. ఆ స్థితిలో సతురా వెంటనే ఝండాసాహికి తిరుగుముఖం పట్టలేకపోయాడు. అక్కడే ఉండిపోయాడు. అన్నకు మంచి వైద్యం ఏర్పాడు చేశాడు. మిగిలి ఉన్న భూమి వ్యవసాయ పనులు తనే చేపట్టాడు. కాని ఒక్కోసారి చెప్పుకోలేని వేదనని అనుభవించేవాడు. తనకంటూ ఏమీలేని ఒక శూన్యం అతడిని బాధించేది. తులసి పిల్లల పట్ల ప్రేమకన్నా ద్వేషమే ఎక్కువ కలుగుతున్నది గ్రహించాడు. ఒక్కోరోజు రాత్రి ఒంటరితనపు యాతనతో అతడు తల్లడిల్లిపోయేవాడు. గుండెలో చెలరేగిన అలజడి వల్ల అతడికి నిద్ర పట్టేదికాదు. పరుపు మీద ప్రాణమున్న దుంగలా దొర్లేవాడు. ఈ విధమైన అశాంతితో కొద్దిరోజులు గడిపాడు. సాంతియాకు అంచెలంచెలుగా నయమైంది. ఇప్పుడు తన పనులు తను చేసుకోగలుగుతున్నాడు.సతురా నిద్రలేని కళ్లను చూసి ఒకరోజు వదినె అడిగింది. ‘‘మరిదీ! నువ్వు బాధపడుతున్నట్టుగానూ నిద్రలేమితో ఇబ్బందిపడుతున్నట్టుగానూ ఉంది. ఎందుకలా ఉన్నావు? ఝండసాహిలో నీ భార్య వదిలి వచ్చినందువల్లనేనా? చెప్పవయ్యా!’’సతురా పెదాలపై ఒక నిర్జీవమైన నవ్వు కదలాడింది. ఆ మరుసటి రోజు అతడు వరిపొలంలో తన పనులన్నీ ముగించుకున్నాడు. తన వెదురు కావడి బద్దను అందుకుని భుజాన వేసుకున్నాడు. బయల్దేరబోతుంటే సాంతియా అడిగాడు: ‘‘సతురా! ఎక్కడికెళుతున్నావు?’’‘‘ఝండాసాహి’’‘‘ఎందుకు?’’సతురా సమాధానం చెప్పలేదు. నిజానికి అతని వద్ద సమాధానం లేదు. చలనం లేకుండా నిలుచున్నాడు. సాంతియా, అతడి భార్య విచారించారు. వారించారు. పిల్లలు కూడా వారి పినతండ్రి చేతులు పట్టుకున్నారు.సతురా వారికి భరోసా ఇచ్చాడు. ‘‘విచారించవద్దు. నేను తిరిగి వస్తాను. నేనిప్పుడు నారీ మాస్టరును కలవాలి. ఆయన పని మీదనే నేనిక్కడికి వచ్చాను. తిరిగి సరైన సమయంలో వెళ్లకపోతే అతడు ఆందోళన చెందుతాడు. ఇప్పుడు మాత్రం వెళ్లక తప్పదు. ఆమె కూడా జ్వరంతో బాధపడుతోంది.’’ ‘‘ఎవరామె? జ్వరంతో బాధపడుతున్నదెవరు?’’ వదినే అడిగింది.సతురా జవాబు చెప్పలేదు.‘‘అయ్యో! ఆమె బాధపడుతోంది. నన్ను వెళ్లనివ్వండి’’ అని మాత్రమే అనగలిగాడు.అన్నా వదినా మారు మాట్లాడలేకపోయారు.‘‘నేను వెళుతున్నాను. మరి సెలవు’’ సతురా వదిన పాదాల వద్ద వంగాడు.లేచి తటాలున బయటకు వచ్చాడు. త్వర త్వరగా అడుగులు వేశాడు. ఒడియా మూలం : రజనీకాంత మొహంతి అనువాదం: టి.షణ్ముఖరావు -
పసిమొగ్గలపై పైశాచికత్వం
పరుగుపెట్టించి కొట్టిన హోలీ ఏంజెల్స్ డైరెక్టర్ ఐటీడీఏ పీవోకు ఫిర్యాదు చేసిన గిరిజన బాలికలు డైరెక్టర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి డిమాండ్ కంబాలచెరువు (రాజమహేంద్రవరం)/ రంపచోడవరం : పైశాచికత్వం పెల్లుబికింది... పసిమొగ్గలని కూడా చూడలేదు వారిని..చేతులపై బొబ్బలు వచ్చేలా.. కాళ్లు వాచేలా చితకబాదాడు...రోజూ అతడు స్కూలుకు వస్తున్నాడంటేనే వణికిపోతున్న విద్యార్థులకు ఒక రోజంతా తన విశ్వరూపం చూపించాడు. రాజమహేంద్రవరంలోని హోలీ ఏంజెల్స్ పాఠశాలలో చదువుతున్న గిరిజన విద్యార్థినులు పాఠశాల డైరెక్టర్ పైశాచికత్వానికి బలయ్యారు. ఈ సంఘటన రాజమహేంద్రవరంలో మంగళవారం వెలుగుచూసింది. దీనికి సంబంధించి విద్యార్థులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. బెల్ట్ దెబ్బలు తట్టుకోలేక రోడ్డుపైకి పరుగులు ఐటీడీఏ ప్రతిభ పాఠశాల పేరుతో గిరిజన విద్యార్థులను రాజమహేంద్రవరంలోని ప్రైవేట్ పాఠశాల అయిన హోలీ ఏంజెల్స్‌లో చేర్పిస్తున్నారు. వీరికి ఐటీడీఏ ఫీజులు చెల్లిస్తోంది. సోమవారం ఉదయం పాఠశాల క్యాంపస్‌కు డైరెక్టర్ మధుసూధనరావు వచ్చారు. ఆయన గిరిజన విద్యార్థుల వద్దకు వెళ్లారు. ఏం చేస్తున్నారురా అంటూ తిట్ల పురాణం మొదలుపెట్టాడు. అక్కడితో చాలక వారిని ఇష్టారాజ్యంగా చితకబాదాడు. విషయాన్ని తమ వారికి తెలపాలంటూ ఏదోలా వారంతా బయటపడ్డారు. మంగళవారం రంపచోడవరం ఐటీడీఏ పీవో ఏఎస్ దినేష్‌కుమార్, స్థానిక ఏఎస్పీ నయీం ఆస్మీకి ఫిర్యాదు చేశారు. పదో తరగతి చదువుతున్న ఎం. జ్యోత్స్నకుమారి అనే విద్యార్థిని మాట్లాడుతూ తమను అకారణంగా కొడుతున్న డైరక్టర్ సార్‌ని కొట్ట వద్దంటూ కాళ్లు పట్టుకున్నామని, అయినా బెల్ట్‌తో కొట్టారంటూ వాచి పోయిన తన చేతులను చూపింది. పి సోనియా అనే మరో బాలిక మాట్లాడుతూ డైరెక్టర్ ఎప్పుడు వచ్చినా ఎవర్ని కొడతారోననే భయంతో వణుకుతూ దాకుంటున్నామని తెలిపింది. సోమవారం ఉదయం ఐదు గంటలకు వచ్చిన డైరెక్టర్ గిరిజన విద్యార్థినులను తిడుతూ ‘ఐటీడీఏ ఇచ్చే డబ్బులు మీకు భోజనానికి కూడా సరిపోవడం లేదు మీకు చెట్లు కింద చదువే మీకు సరిపోతుంది’ అంటూ కర్ర విరిగిపోయేలా కొట్టారని వాపోయింది. దెబ్బలు తట్టుకోలేని కొంత మంది రోడ్డుపైకి పరుగులు తీశారని తెలిపింది. జరిగిన సంఘటన పోలీసులకు తెలియడంతో పాఠశాలకు పోలీసులు వచ్చారని, బాగా దెబ్బలు తగిలిన జ్యోత్స్న కుమారిని గదిలో దాచిపెట్టారంది. నరకం అంటే ఎలా ఉంటే మీకు రోజూ చూపిస్తానని బెదిరించి, జరిగిన సంఘటన ఎవరికి చెప్పిన మీ సంగతి తేల్చుతానని హెచ్చరించారని తెలిపింది. ఆ పాఠశాలలో ఇక చదువును కొనసాగించలేమని విద్యార్థులు వాపోయారు. అందరి దుస్తులూ ఉతకండి.. డైరెక్టర్ వచ్చే సయమానికి ఉతికిన దుస్తులు ఆరబెట్టుకుంటే .. పాఠశాలలో అందరి దుస్తులూ మీరే ఉతకండని తిట్టారని దుర్గవిజయలక్ష్మి అనే బాలిక తెలిపింది. సుమారు 200 మంది గిరిజన విద్యార్థినులు హోలి ఏంజెల్స్‌లో చదువుతున్నారని డైరెక్టర్ వస్తే బాత్రూమ్లో ఉన్న బయటకు పిలిచి మరీ కొడుతున్నారని వివరించింది. కనీసం జ్వరం వచ్చినా పట్టించుకోరని, ఇంటి నుంచి ఫోన్ వచ్చినా ఆ విషయం చెప్పరని వివరించింది. క్రిమినల్ కేసులు నమోదు చేయాలి గిరిజన విద్యార్థినులపై అమానుషంగా ప్రవర్తించిన హోలి ఏంజెల్స్ పాఠశాల డైరెక్టర్ మ«ధుసూధనరావుపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి డిమాండ్ చేశారు. విద్యార్థి పట్ల జరిగిన సంఘటనపై కలెక్టర్, ఐటీడీఏ పీవోలతో చర్చించి విద్యార్థినులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఆ పాఠశాలలో విద్యార్థినులు చదివే పరిస్థితి లేదు కాబట్టి మరో పాఠశాలలో చదివేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థినుల తల్లిదండ్రులు, ఆదివాసీ సంక్షేమ సాంస్కృతిక సంఘం నాయకుడు కడబాల రాంబాబులు డిమాండ్ చేశారు. ఐటీడీఏ రూ.లక్షలు కార్పొరేట్ పాఠశాలకు ఇస్తుంటే అక్కడ కనీసం సరైన భోజనం కూడా పెట్టకుండా కొట్టడం దారుణమన్నారు. గిరిజన సంక్షేమ సహాయ అధికారి ఆకుల వెంకటేశ్వరరావు హోలి ఏంజెల్స్ పాఠశాలకు వెళ్లి బాలికల తల్లిదండ్రులు రాకుండానే సర్దుబాటు చేయాలని చూడడం వెనుక కారణాలు ఏమిటని జగ్గంపాలెం సర్పంచ్ రంగబాబు ఆరోపించారు. -
పసిమొగ్గలపై పైశాచికత్వం
పరుగుపెట్టించి కొట్టిన హోలీ ఏంజెల్స్ డైరెక్టర్ ఐటీడీఏ పీవోకు ఫిర్యాదు చేసిన గిరిజన బాలికలు డైరెక్టర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి డిమాండ్ కంబాలచెరువు (రాజమహేంద్రవరం)/ రంపచోడవరం : పైశాచికత్వం పెల్లుబికింది... పసిమొగ్గలని కూడా చూడలేదు వారిని..చేతులపై బొబ్బలు వచ్చేలా.. కాళ్లు వాచేలా చితకబాదాడు...రోజూ అతడు స్కూలుకు వస్తున్నాడంటేనే వణికిపోతున్న విద్యార్థులకు ఒక రోజంతా తన విశ్వరూపం చూపించాడు. రాజమహేంద్రవరంలోని హోలీ ఏంజెల్స్ పాఠశాలలో చదువుతున్న గిరిజన విద్యార్థినులు పాఠశాల డైరెక్టర్ పైశాచికత్వానికి బలయ్యారు. ఈ సంఘటన రాజమహేంద్రవరంలో మంగళవారం వెలుగుచూసింది. దీనికి సంబంధించి విద్యార్థులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. బెల్ట్ దెబ్బలు తట్టుకోలేక రోడ్డుపైకి పరుగులు ఐటీడీఏ ప్రతిభ పాఠశాల పేరుతో గిరిజన విద్యార్థులను రాజమహేంద్రవరంలోని ప్రైవేట్ పాఠశాల అయిన హోలీ ఏంజెల్స్‌లో చేర్పిస్తున్నారు. వీరికి ఐటీడీఏ ఫీజులు చెల్లిస్తోంది. సోమవారం ఉదయం పాఠశాల క్యాంపస్‌కు డైరెక్టర్ మధుసూధనరావు వచ్చారు. ఆయన గిరిజన విద్యార్థుల వద్దకు వెళ్లారు. ఏం చేస్తున్నారురా అంటూ తిట్ల పురాణం మొదలుపెట్టాడు. అక్కడితో చాలక వారిని ఇష్టారాజ్యంగా చితకబాదాడు. విషయాన్ని తమ వారికి తెలపాలంటూ ఏదోలా వారంతా బయటపడ్డారు. మంగళవారం రంపచోడవరం ఐటీడీఏ పీవో ఏఎస్ దినేష్‌కుమార్, స్థానిక ఏఎస్పీ నయీం ఆస్మీకి ఫిర్యాదు చేశారు. పదో తరగతి చదువుతున్న ఎం. జ్యోత్స్నకుమారి అనే విద్యార్థిని మాట్లాడుతూ తమను అకారణంగా కొడుతున్న డైరక్టర్ సార్‌ని కొట్ట వద్దంటూ కాళ్లు పట్టుకున్నామని, అయినా బెల్ట్‌తో కొట్టారంటూ వాచి పోయిన తన చేతులను చూపింది. పి సోనియా అనే మరో బాలిక మాట్లాడుతూ డైరెక్టర్ ఎప్పుడు వచ్చినా ఎవర్ని కొడతారోననే భయంతో వణుకుతూ దాకుంటున్నామని తెలిపింది. సోమవారం ఉదయం ఐదు గంటలకు వచ్చిన డైరెక్టర్ గిరిజన విద్యార్థినులను తిడుతూ ‘ఐటీడీఏ ఇచ్చే డబ్బులు మీకు భోజనానికి కూడా సరిపోవడం లేదు మీకు చెట్లు కింద చదువే మీకు సరిపోతుంది’ అంటూ కర్ర విరిగిపోయేలా కొట్టారని వాపోయింది. దెబ్బలు తట్టుకోలేని కొంత మంది రోడ్డుపైకి పరుగులు తీశారని తెలిపింది. జరిగిన సంఘటన పోలీసులకు తెలియడంతో పాఠశాలకు పోలీసులు వచ్చారని, బాగా దెబ్బలు తగిలిన జ్యోత్స్న కుమారిని గదిలో దాచిపెట్టారంది. నరకం అంటే ఎలా ఉంటే మీకు రోజూ చూపిస్తానని బెదిరించి, జరిగిన సంఘటన ఎవరికి చెప్పిన మీ సంగతి తేల్చుతానని హెచ్చరించారని తెలిపింది. ఆ పాఠశాలలో ఇక చదువును కొనసాగించలేమని విద్యార్థులు వాపోయారు. అందరి దుస్తులూ ఉతకండి.. డైరెక్టర్ వచ్చే సయమానికి ఉతికిన దుస్తులు ఆరబెట్టుకుంటే .. పాఠశాలలో అందరి దుస్తులూ మీరే ఉతకండని తిట్టారని దుర్గవిజయలక్ష్మి అనే బాలిక తెలిపింది. సుమారు 200 మంది గిరిజన విద్యార్థినులు హోలి ఏంజెల్స్‌లో చదువుతున్నారని డైరెక్టర్ వస్తే బాత్రూమ్లో ఉన్న బయటకు పిలిచి మరీ కొడుతున్నారని వివరించింది. కనీసం జ్వరం వచ్చినా పట్టించుకోరని, ఇంటి నుంచి ఫోన్ వచ్చినా ఆ విషయం చెప్పరని వివరించింది. క్రిమినల్ కేసులు నమోదు చేయాలి గిరిజన విద్యార్థినులపై అమానుషంగా ప్రవర్తించిన హోలి ఏంజెల్స్ పాఠశాల డైరెక్టర్ మ«ధుసూధనరావుపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి డిమాండ్ చేశారు. విద్యార్థి పట్ల జరిగిన సంఘటనపై కలెక్టర్, ఐటీడీఏ పీవోలతో చర్చించి విద్యార్థినులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఆ పాఠశాలలో విద్యార్థినులు చదివే పరిస్థితి లేదు కాబట్టి మరో పాఠశాలలో చదివేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థినుల తల్లిదండ్రులు, ఆదివాసీ సంక్షేమ సాంస్కృతిక సంఘం నాయకుడు కడబాల రాంబాబులు డిమాండ్ చేశారు. ఐటీడీఏ రూ.లక్షలు కార్పొరేట్ పాఠశాలకు ఇస్తుంటే అక్కడ కనీసం సరైన భోజనం కూడా పెట్టకుండా కొట్టడం దారుణమన్నారు. గిరిజన సంక్షేమ సహాయ అధికారి ఆకుల వెంకటేశ్వరరావు హోలి ఏంజెల్స్ పాఠశాలకు వెళ్లి బాలికల తల్లిదండ్రులు రాకుండానే సర్దుబాటు చేయాలని చూడడం వెనుక కారణాలు ఏమిటని జగ్గంపాలెం సర్పంచ్ రంగబాబు ఆరోపించారు. -
రంగు పడుద్ది...
నెయిల్ ఆర్ట్ ఇది స్ల్పాటర్ నెయిల్ ఆర్ట్. దీన్ని వేసుకోవడానికి గ్రీన్, పింక్, ఆరెంజ్, రెడ్, వైట్, బ్లూ నెయిల్ పాలిష్‌లను సిద్ధం చేసుకోవాలి. అలాగే వీటితో పాటు ట్రాన్స్పరెంట్ పాలిష్, నెయిల్ రిమూవర్, కూల్‌డ్రింక్ స్ట్రాలు ఉంటే చాలు. ఎంతో అందంగా ఉండే స్ల్పాటర్ నెయిల్ ఆర్ట్‌ను మీ గోళ్లపైనా వేసుకోవచ్చు. ఈ డిజైన్‌ను చూస్తే... హోలీ రోజు రంగులతో నిండిన మన దుస్తులే గుర్తొస్తాయి. మరి ఆ రంగుల అందం మీకూ కావాలంటే.. ఈ డిజైన్‌ను ట్రై చేయండి. 1. ముందుగా స్ట్రాలను కత్తెరతో ముక్కలు చేసుకోవాలి. 2. ఇప్పుడు అందంగా కత్తిరించుకున్న గోళ్లపై ట్రాన్స్పరెంట్ పాలిష్‌తో బేస్‌కోట్ వేసుకోవాలి. 3. తర్వాత గోళ్లన్నిటికీ తెలుపు రంగు నెయిల్ పాలిష్ పూయాలి. 4. ఆపైన మొదటగా బ్లూ కలర్ పాలిష్‌లో ఓ స్ట్రా ముక్కను ముంచాలి. 5. ఆ స్ట్రాలో ఉన్న పాలిష్‌ను ఇప్పుడు గోళ్లపై చల్లాలి. 6. అలాగే పింక్, రెడ్ పాలిష్లలో స్ట్రాలను ముంచి చల్లుకోవాలి. 7. ఇప్పుడు గ్రీన్, ఆరెంజ్ రంగుల పాలిష్‌లను చల్లాలి. ఇవే కాకుండా, మీకు నచ్చిన రంగులు ఎన్నింటినైనా వాడొచ్చు. 8. తర్వాత గోళ్ల చుట్టూ అంటుకున్న పాలిష్‌ను నెయిల్ పాలిష్ రిమూవర్‌తో క్లీన్ చేసుకోవాలి. నెయిల్ పాలిష్ పూర్తిగా ఆరిన తర్వాత, ట్రాన్స్పరెంట్ పాలిష్‌ను అప్లై చేసుకోవాలి. -
దేశమంతా రంగేలీ!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గురువారం హోలీ సంబరాలు రంగులపండువగా సాగాయి. పార్టీల అధినేతలు, నాయకులు కార్యకర్తలతో కలసి సంబరాల్లో మునిగితేలారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా పార్టీ నేతలు, కార్యకర్తలతో కలసి హోలీని జరుపుకున్నారు. ఢిల్లీలోని అక్బర్ రోడ్ నివాసంలో కార్యకర్తలు అమిత్‌షాకు రంగులు పులిమి తమ సంతోషాన్ని తెలిపారు. కాంగ్రెస్ కార్యాలయంలో సోనియాగాంధీ, రాహుల్‌లు వేడుకల్లో పాల్గొన్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన నివాసంలో హోలీ సంబరాల్లో మునిగితేలారు. పట్నాలోని అధికారిక నివాసంలో జేడీయూ కార్యకర్తలతో కలసి సీఎం నితీశ్ కుమార్ హోలీ జరుపుకున్నారు. కాగా మెగాస్టార్ అమితాబ్ కుటుంబసభ్యుల హోలీ సంబరాల ఫొటోల్ని ట్విటర్లో పోస్ట్‌చేశారు. కెనడాలో ‘క్వాంటికో’ షూటింగ్లో ఉన్న ప్రియాంకాచోప్రా అక్కడే హోలీ జరుపుకున్నారు. ట్విటర్ పేజీలన్నీ బాలీవుడ్ తారల హోలీ ట్వీట్స్‌తో నిండిపోయాయి. గోవా, రాజస్థాన్‌లోని విదేశీ టూరిస్టులు హోలీ రంగుల్లో మునిగితేలారు. -
రంగుల్లో మునిగారు
-
హోలీ డే
సంబరం రంగులద్దుకుంది..వీధులు కేరింతలు కొట్టాయి. పట్టణం, పల్లె హోలీ రంగుల్లో తడిసిముద్దయ్యాయి. హోలీ డేను బుధవారం ప్రతి ఒక్కరూ జాలీగా గడిపారు. పిన్నలు, పెద్దలు కుంకుమ..రంగులతో ఫుల్‌జోష్ చేశారు. బైక్‌లపై చక్కర్లు.. కేకలు.. అరుపులతో అందరిలోనూ ఆనందం పుంతలు తొక్కింది. - ఖమ్మం కల్చరల్ -
విస్తార... హోలీ ప్రత్యేక ఆఫర్
న్యూఢిల్లీ: దేశీయంగా విమాన సర్వీసులు నిర్వహించే విస్తార విమానయాన సంస్థ హోలీ సందర్భంగా ప్రత్యేక డిస్కౌంట్ చార్జీలను అందిస్తోంది. ఈ హోలీ ప్రత్యేక చార్జీలు రూ.999 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొంది. అయితే, దీనికి పన్నులు, ఇతర చార్జీలు అదనమని సంస్థ వెల్లడించింది. ఈ ఆఫర్లో భాగంగా ఒక వైపు విమాన చార్జీలు ఎకానమీ క్లాస్‌కు రూ.999 నుంచి, ప్రీమియమ్ ఎకానమీ క్లాస్‌కు రూ.2,299 నుంచి మొదలవుతాయని వివరించింది. ఈ ప్రత్యేక చార్జీలకు బుకింగ్స్ మంగళవారం నుంచే ప్రారంభమయ్యాయని, ఈ నెల 28 అర్థరాత్రి వరకూ ఉంటుందని, సీట్లు పరిమితమని తెలిపింది. తామందించే అన్ని దేశీయ రూట్లకు ఈ చార్జీలు వర్తిస్తాయని, కొత్త రూట్లు-జమ్ము, శ్రీనగర్, కోచిలకు కూడా ఈ చార్జీలు వర్తిస్తాయని విస్తార పేర్కొంది. -
వర్ణాలెన్నో సంబరాలన్ని
విభిన్న సంప్రదాయాలకు నిలయమైన భాగ్యనగరిలో హోలీ పండుగను ఆనందించడంలో గల్లీకొక వైవిధ్యం కనిపిస్తుంది. ఒకరికొకరు రంగులు పూసుకోవడమే కాదు.. అచ్చమైన పండుగ సందడితో పాటు దానికి తోడయ్యే ఆధునిక సొబగులూ నగరంలో జరిగే హోలీ సంబరాల ప్రత్యేకం. మార్వాడీ శ్వేతవర్ణం.. బెంగాలీ డోల్యాత్ర.. మణిపూర్ గులాల్ రంగులు.. పేజ్‌త్రీ కలర్‌ఫుల్ ఆటలు.. ఎన్నో వర్ణాలు.. ఇంకెన్నో సంబరాలు.. భాగ్యనగరి సొంతం. - సాక్షి, సిటీబ్యూరో విలేజీ క్రేజీ.. హోలీ సంబరాల్లో మగవాళ్లు తలకి బంధిని పగిడి చుట్టుకొని, రంగుల ధోవతి కట్టుకుంటే.. ఆడవాళ్లు మిరిమిట్లు గొలిపే అద్దాల లంగా జాకెట్ వేసుకొని విలేజీ గెటప్‌లో అందంగా తయారవుతారు. పనికిరాని వస్తువులు, చెక్క ముక్కలను ఇంటి ముందు కుప్పగా వేసి నిప్పంటించి దాని చుట్టూ పాటలు పాడుతూ డ్యాన్సులు చేస్తారు. ఆ నిప్పు ఆరిపోయే వరకూ ఆడుతూ.. పాడుతూ.. ఆరిపోయే సమయంలో కల్లు తాగి గుంపులు గుంపులుగా వీధుల్లో సంచరిస్తారు. తెలిసిన వాళ్ల ఇళ్లల్లోకి వెళ్లి హోలీ పాటలు పాడుతూ, వారి వంశాన్ని పొగుడుతూ.. వాళ్లిచ్చే కానుకలు స్వీకరిస్తారు. బెంగాలీ రూటే సెపరేట్... హోలీ సంబరాల్లో బెంగాలీల రూటే వేరు. వీరు హోలీ సందర్భంగా ‘డోల్ యాత్ర’ నిర్వహిస్తారు. పండుగ రోజు సంప్రదాయంగా రాధాకృష్ణుడి ప్రతిమలను ఊయలలో కూర్చోబెట్టి ఊపుతూ, భక్తి పాటలు పాడుతూ నాట్యం చేస్తారు. ఒడిశా వాసులైతే రాధాకృష్ణుల బొమ్మలు ఉండే ప్లేస్‌లో జగన్నాథస్వామి బొమ్మని పెడతారు. ఇక హర్యానావాసులు హోలీ జరుపుకునే తీరులో ఎన్నో సరదాలు. హోలీ సంప్రదాయం ప్రకారం హర్యానా మహిళ తన బావ లేదా బావమరుదులతో సరదాగా ఆట ఆడుతుంది. తన చీర కొంగును ఒక తాడులా తిప్పి దానితో వారిని కొట్టడం, అనంతరం వారిని బుజ్జగించడానికి స్వీట్స్‌ని బహుమతిగా ఇస్తారు. ప్రతి వీధిలోనూ మజ్జిగతో నిండిన కుండను ఉట్టిగా కట్టి కృష్ణుడి కోసమని ఎదురు చూస్తారు. మణిపూర్ ఆట మస్త్.. మణిపూర్ తదితర సమీప ప్రాంతాల వారు హోలీ చాలా ఇంట్రెస్టింగ్గా జరుపుకుంటారు. సాయంత్రం వేళల్లో ఫోక్ డ్యాన్సులు చేస్తూ మ్యూజిక్‌ని ఎంజాయ్ చేస్తారు. ఎండుగడ్డి, పులలు, కొమ్మలను మొదటి రోజు వెన్నెల్లో ఒక కుప్పగా వేసి కాల్చడం, ఆ తర్వాత రోజు అబ్బాయిలు అందరూ కలిసి అమ్మాయిలపై గులాల్ రంగులు చల్లుతూ పండుగ జరుపుకుంటారు. దానికి బదులుగా అమ్మాయిలు, అబ్బాయిల దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం ఆనవాయితీ. అంతేకాదు అక్కడ ప్రతి ఒక్కరూ తెల్లటి దుస్తులు, పగిడీలు కట్టుకొని శ్రీకృష్ణుడి గుడి ముందు ఆటపాటలతో, నృత్యాలతో సందడి చేస్తారు. నేడు సెలవు హోలీ పర్వదినం సందర్భంగా ప్రభుత్వం బుధవారం సెలవు ప్రకటించింది. అయితే నగరంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈ నెల 24న హోలీ వేడుకలకు సన్నద్ధమవుతున్నారు. ముఖ్యంగా మార్వాడీలు, గుజరాతీలు, ఉత్తరాది ప్రజలు హోలీ వేడుకలు గురువారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మొత్తానికి నగరంలో హోలీ వేడుకలు రెండు రోజుల పాటు జరిగే అవకాశం ఉంది. రంగుల జడి.. మార్వాడీ నగరంలో నివసించే నార్త్ ఇండియన్లు హోలీ పండుగ మరింత ట్రెడిషనల్‌గా జరుపుకుంటారు. ఈ పండగ కోసమని స్పెషల్‌గా వైట్ అండ్ వైట్ డ్రెస్‌ని కొనుక్కుంటారు. స్నేహితులు, బంధువులు, ఇరుగు పొరుగు వాళ్లను పిలుచుకొని వారి వీధిలోనే ఓపెన్ ప్లేస్‌లో గెట్ టు గెదర్ అరేంజ్ చేస్తారు. అతిథులకు భాంగ్ లస్సీ ని అందిస్తూ ఆహ్వానిస్తారు. ఒకరికొకరు స్వీట్ తినిపించుకుంటూ శుభాకాంక్షలు చెప్పుకుంటారు. అంత్యాక్షరి, డ్యాన్స్, తంబోలా.. తదితర ఆటలు ఆడతారు. ఆ తర్వాత డ్రమ్స్లో, పిచ్కారీలలో రంగు నీళ్లు నింపుకొని దాగుడుమూతలు ఆడతారు. హ్యూమన్ పిరమిడ్‌లా ఒకరి మీద ఒకరెక్కి శ్రీకృష్ణుడికి ఇష్టమైన మజ్జిగ, వెన్నతో కూడిన ఒక టైట కుండను, రంగు నీళ్లలో అప్పటికే పూర్తిగా తడిసి ఉన్న అబ్బాయిలు పగలకొడతారు. పేజ్‌త్రీ పీపుల్.. కలర్‌ఫుల్ ఆధునిక హోలీ సంబరాలకు అద్దం పడతారు వీరు. జంటలుగా, స్నేహితులతో సరదాగా గడపడానికి స్టార్ హోటళ్లు,రిసార్టులలో ప్యాకేజీ బుక్ చేసుకొని మరీ సంబరాలకు రెడీ అవుతారు. వెల్కమ్ డ్రింక్స్, స్టార్టర్స్, హాట్ డ్రింక్స్, డీజే మ్యూజిక్, పబ్‌ని తలపించే రొమాంటిక్ గేమ్స్.. ఇలా మొదలైన సెలబ్రేషన్స్ కాస్తా రంగురంగుల రెయిన్ డ్యాన్సులు, సల్సాలు, రంగులు కలిపిన స్విమ్మింగ్ పూల్ వాటర్‌లో నృత్యాలు, సెల్ఫీలతో ఒక పూర్తి స్థాయి కలర్‌ఫుల్ ఈవెంట్‌గా మారింది. -
సంప్రదాయ హేల
వసంత ఋతువులో వాతావరణం ఒక్కసారిగా మార్పు చెందడం వలన క్రిమికీటకాదులు విజృంభిస్తాయి. అందువల్ల జ్వరాలు, జలుబు వంటివి చాలామందిని బాధిస్తాయి. ఈ వ్యాధుల నివారణ కోసం సంప్రదాయ రంగులను ఒకరిపై ఒకరు జల్లుకుంటూ పండుగ చేసుకోవడం హోలీ ప్రధాన ఉద్దేశం. సహజ రంగులలోని ఔషధ గుణాలు వ్యాధుల బారి నుంచి కాపాడతాయి. వేప, కుంకుమపువ్వు, పసుపు, బిల్వ దళాలు... వంటి ఔషధ గుణాలు కలిగిన వాటి నుంచే కాకుండా, ఆయుర్వేద వైద్యులు సూచించిన కొన్ని ఇతర కాయగూరల నుంచి కూడా సహజ రంగులను తయారుచేస్తారు. చాలా రంగులను ప్రధాన వర్ణాలను కలపడం ద్వారా తయారుచేస్తారు. సాధారణంగా ఈ రంగులను రైతులు స్వయంగా తయారుచేసి అమ్ముతుంటారు. సహజంగా దొరికే వస్తువులను పొడి చేసి, వాటి నుంచి రంగులు తయారుచేయడం వీరికి బాగా తెలుసు. ఈ ప్రక్రియ హోలీ పండుగకు కనీసం రెండు మూడు నెలల ముందు ప్రారంభిస్తారు. అటువంటి కొన్ని రంగులు... నారింజ రంగు లేదా ఎరుపు పలాస పుష్పాలు ఎరుపు వర్ణంలో ఉంటాయి. వీటిని అగ్నిపూలు అని కూడా అంటారు. అంతేకాదు ఈ పూలు అరణ్యంలో ఎర్రగా కనిపిస్తూ, దావాగ్నిలా భాసిస్తాయి. ఈ పూల నుంచి ఎరుపు రంగును సహజంగా తయారుచేసుకోవచ్చు. ఇంకా ఎర్రచందనం పొడి, ఎండబెట్టిన మందార పూలు, మద్ది చెట్టు కాండం, ఎర్రముల్లంగి, దానిమ్మ... వీటి నుంచి కూడా ఎరుపు రంగు త యారుచేసుకోవచ్చు. పసుపులో నిమ్మరసం కలపడం వల్ల కూడా ఎరుపు లేదా నారింజరంగు తయారవుతుంది. ఇంకా నీళ్లలో కుంకుమపువ్వు వేసి నీటిని మరిగిస్తే కూడా ఎరుపు రంగు తయారవుతుంది. ఆకుపచ్చ రంగు... గోరింటాకు, గుల్మొహర్... చెట్ల ఆకులను ఎండబెట్టి ఈ రంగు తయారుచేసుకోవచ్చు. కొన్ని ప్రాంతాలలో వసంత ఋతువులో పచ్చగా వచ్చే చిగుళ్లను, మూలికలను కలిపి ఈ రంగు తయారుచేసే సంప్రదాయం ఉంది. పసుపు పచ్చ... మనం ఉపయోగించే పసుపు స్వయంగా పచ్చ వర్ణం కలిగి ఉంటుంది. పసుపు కొమ్ముల నుంచి తయారయ్యే సహజ రంగు ఇది. కొన్నిసార్లు పసుపుకి మంచి ఛాయ రావడానికి పసుపులో సెనగపిండి కలుపుతారు. ఇంకా...మారేడుకాయ, చేమంతి జాతులకు చెందిన పూలను సైతం పసుపుపచ్చ రంగు తయారుచేయడానికి వినియోగించుకోవచ్చు. ఇండిగో లేదా ఊదారంగు... నల్ల ద్రాక్ష, నీలిరంగు జాతికి చెందిన ఇతర పుష్సాలు, ఫలాలు... వీటితో సహజంగా నీలిరంగును తయారుచేస్తారు. మజంటా లేదా పర్పుల్ (కుసుంభ లేదా ఊదా) కుసుంభ లేదా ఊదారంగు తయారీకి బీట్రూట్ను ఉపయోగిస్తారు. బీట్రూట్ను నీటిలో వేసి ఉడికించి ఈ రంగును సహజంగా తయారుచేసుకోవచ్చు. గోధుమరంగు ఎండిన తేయాకు నుంచి ఈ రంగును తయారు చేసుకోవచ్చు. టీ డికాక్షన్ తయారుచేయడం తెలిసిందే. అలా ఈ రంగును తయారుచేసుకోవచ్చు. ఇంకా నల్ల ద్రాక్ష, ఉసిరి, బొగ్గు... వీటిని ఉపయోగించి కూడా ఈ రంగును తయారుచేస్తారు. - డా. పురాణపండ వైజయంతి హోలీ ప్రత్యేకంగా వ్రజ్ ప్రాంతానికి చెందినది. ఈ పండుగ... శ్రీకృష్ణుడు, మధుర, బృందావనం, నంద గ్రామం ... పదాలతో ముడిపడి ఉంటుంది. వ్రజ్, మధుర ప్రాంతాలలో హోలీ పండుగను వారం రోజుల పాటు సంబరంగా జరుపుకుంటారు. హోలీ సందర్భంగా సూర్యాస్తమయం అయిన తర్వాత నాలుగు రోడ్ల కూడలిలో... పిడకలు, కర్రలను మంట పెట్టడానికి అనువుగా నిలబెట్టి, పై భాగంలో ప్రతిమను ఉంచి, ఆ ప్రతిమను హోలికగా భావించి, దహనం చేస్తారు. మంట మండుతున్నంతసేపు... పాటలు పాడుతూ, నాట్యం చేస్తూ మంట చుట్టూ తిరుగుతారు. హోలిక మరణించిందన్న సంతోషంతో ఈ విధంగా చేస్తారు. హెర్బల్ హోలీ -
స్టైల్‌గా హోలీ!
బ్యూటిప్స్ ఏడురంగులు.. ఏ రంగు ఎటువైపుగా మన మేనిని తడుముతుందో తెలియదు. కానీ, తెలుపు రంగు దుస్తులను ధరిస్తే ఊహించనన్ని రంగులు డిజైన్లు డిజైన్లుగా ఆనందపు కెరటాల్లా అంటుకుపోతాయి. అందుకని తెల్లని సల్వార్, రంగుల బాందినీ ప్రింటెడ్ చున్నీ ధరిస్తే చాలు పండగ సంబరం రెట్టింపు అవ్వాల్సిందే! కాలే జీ యువతులైతే షార్ట్స్, వదులుగా ఉండే టీ షర్ట్ లేదా కుర్తా ఈ పండగకు నిరభ్యంతరంగా ధరించవచ్చు. అయితే, తప్పనిసరిగా లైట్ వెయిట్ కాటన్ మెటీరియల్ దుస్తులను ఇందుకోసం ఎంచుకోవాలి. కొద్దిగా ఆలివ్ ఆయిల్: హోలీ ఆడటానికి ముందు కొబ్బరి లేదా ఆలివ్ ఆయిల్‌ను మేనికి రాసుకోండి. ఇలా చేయడం వల్ల రంగుల వల్ల కలిగే మంట, దురద సమస్యలు ఉండవు. నూనె వల్ల కాసేపు చర్మం జిడ్డుగా అనిపిస్తుంది కానీ శుభ్రపరుచుకోవడం చాలా సులువు. చర్మకాంతి కూడా తగ్గదు. హోలీ రంగునీళ్ల నుంచి, ఎండవేడి నుంచి చర్మ సంరక్షణకు వాటర్‌ప్రూఫ్ సన్‌స్క్రీన్ మార్కెట్లో లభిస్తుంది. దీనిని ఉపయోగించవచ్చు. హెయిర్ స్టైల్: జుట్టును లూజ్‌గా వదిలేస్తే రంగులు అంటుకుపోయి, వెంట్రుకల ఆరోగ్యం దెబ్బతింటుంది. హోలీ ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించలేరు. అందుకని ఫ్రెంచ్ పోనీటెయిల్ వేసుకుంటే స్టైల్‌గా కనిపిస్తారు. జుట్టు గురించిన ఆందోళనా తగ్గుతుంది. పండగ కళ రావాలంటే పోనీటెయిల్కు పూసలు, కుందన్స్ ఉన్న క్లిప్ లేదా బ్యాండ్‌ను వాడచ్చు. హోలీ ఆడటానికి ముందు జుట్టుకు కండిషనర్ వాడితే ఆ తర్వాత పాడవుతుందనే బెంగ ఉండదు. లేదంటే ముందుగా వెచ్చని కొబ్బరి నూనెను తలకంతా బాగా పట్టించాలి. దీనివల్ల వెంట్రుకలు మాయిశ్చరైజర్‌ను కోల్పోవు. -
దురాచారం తెల్లబోయింది
మగ మహారాజుల రాజ్యంలో ఏమైనా చెల్లుతుంది. దురాచారం కూడా ఆచారం అయిపోతుంది. బుజ్జి బంగారు తల్లులతో వృద్ధులక రెండోపెళ్లి జరుగుతుంది. అతడు కాలం చేస్తే ఈ బంగారు తల్లి భవిష్యత్తుకు కాలం చెల్లుతుంది. భార్య చనిపోయిన వృద్ధుడికి పునర్వివాహం చెల్లుతుంది. కానీ ముసలి మొగుడు చనిపోయినా... ముక్కుపచ్చలారని చిన్నారికి తెలుపే మిగులుతుంది. ఎదురొస్తే అపశకునం! వేడుకలకు అశుభం!! అలాంటి ‘మగ’వంచితులకు రంగుల పండుగ వచ్చింది. సాక్షాత్తూ ఆ దేవుడి సమక్షంలో బృందావనానికి...వసంతం వచ్చింది! హోలీ రంగ హోలీ... రంగుల రంగేళి! తెలుపుతో సప్తవర్ణాలూ సమ్మేళనం కావాలని తపనపడుతున్నాయి. గులాల్ తొలి అడుగేసింది. ఉత్సాహంతో శ్వేతవర్ణాన్ని ఆలింగనం చేసుకుంది. తనలో కలిపేసుకుంది. ఈ ఉత్సవానికి హోలీ సందర్భం అయితే వారణాసిలోని గోపీనాథ్ ఆలయం వేదిక అయింది. దాదాపు నాలుగువందల ఏళ్లుగా ఏలుబడిలో ఉన్న ఓ అనాచారం... ‘వితంతువులు పంచవన్నెలకు దూరంగా ఉండాలి’ అన్న ఆచారం... దహనమైపోయింది. అన్ని రంగులనూ ఆస్వాదించాలన్న వితంతువుల ఆశలకు ఆ గుడి గంటలు శుభం పలికాయి! సాక్షాత్తు ఆ గోపీనాథుడే ఈ సంబరానికి సాక్షి అయ్యాడు. వారి సంతోషాల్లో భాగమయ్యాడు. వింతంతువులతో కలిసి ఆ స్వామివారు కూడా హాలీ ఆడాడా అన్నంతగా అక్కడ అనందం వెల్లివిరిసింది. వారణాసి. సిటీ ఆఫ్ విడోస్! వితంతువుల నగరం. ఆధ్యాత్మిక కీర్తితోపాటు.. ఇది ఆ ఊరు తెచ్చుకున్న అపకీర్తి కూడా. వందల యేళ్ల కిందటి నుంచి దేశంలో ఏ మూలనో ఉన్న వితంతువులను తన దరికి తెచ్చుకుంటోంది వారణాసి. ప్రస్తుతం దాదాపు 38 వేల మంది వితంతువులు ఇక్కడి వృందావన్లోని పలు ఆశ్రమాల్లో ఆశ్రయం పొందుతున్నారు. శతాబ్దం కిందట వితంతువుల విషయంలో ఎలాంటి వైఖరి ఉండేదో ఇప్పటికీ అలాంటి అనాగరిక వైఖరినే అవలంబిస్తున్నారు. తెల్లచీర.. శిరోముండనం, ఒంటిపూట భోజనంతో ప్రకృతిలోని రంగులకు దూరంగా సహజకర్మలను త్యజించి అసహజమైన జీవనశైలిని పాటిస్తున్నారు. పొద్దున్నే సూర్యోదయం కాకముందే ఎవరికంటా పడకుండా.. ఏ ఇంటికీ ఎదురురాకుండా బిక్కుబిక్కుమంటూ గంగాస్నానం చేసి ఆశ్రమం చేరాలి. అంతే. ఇక భోజనం.. భజన.. మాటా, మంతి.. కష్టం, సుఖం అన్నీ ఆ ఆవరణలోనే.. తోటి వితంతువులతోనే! పదిహేనేళ్ల పసిపిల్లల నుంచి కాటికి కాళ్లు చాపిన వృద్ధుల దాకా.. అందరూ కలిసే ఉంటారు. అందరిదీ ఒకటే రకమైన జీవన విధానం... జీవితం! ఒకరిని చూస్తే ఒకరికి ఎక్కడలేని నిస్పృహ.. నిర్లిప్తత. శాంతికి చిహ్నం తెలుపు అంటారు కానీ ఇక్కడ ప్రశాంతతను భగ్నంచేసే పాత్ర ఆ రంగుది. చుట్టూ ఉన్న చెట్లూ పచ్చని బతుకును కాంక్షిస్తున్నట్టుండవ్. శ్వేతమనే శూన్యాన్ని తలపోస్తున్నట్టుంటాయ్. ఇది ఏళ్లనాటి పాత చిత్రం కాదు.. ఇప్పుడు ఈ క్షణం వెళ్లి చూసినా కనిపించే సజీవదృశ్యం! దేశంలో ఎక్కడైనా అంతే! భర్త పోతే పసుపు కుంకుమలతో బతికే హక్కులేదని పురాణాలు పెట్టిన పిచ్చిభ్రమల్లో వారణాసి వితంతువులే కాదు, మన దగ్గరి బంధువులూ కొట్టుమిట్టాడుతున్నారు. కన్నకొడుకు పెళ్లిలో అక్షింతలు వేసి దీవించాలని తపిస్తున్న వితంతు తల్లి ఆశనూ చంపేస్తున్నారు. గాజుల చేతుల హారతులే శుభం అంటూ పదిమంది కూడి చేసుకునే పండగల్లో భాగం లేకుండా చేస్తున్నారు. నలుగురిలో కలిస్తే నష్టమని వితంతువు మొహం మీద నవ్వును మాయం చేస్తున్నారు. పదిమంది ఉన్న ఇంట్లో అయితే వంటిల్లునే ఆమె స్థానంగా ఖరారు చేస్తున్నారు. వండిపెట్టడం తప్ప ఇంకో ధ్యాస లేని బానిసగా మారుస్తున్నారు. వాళ్ల జీవితాల్లో వసంతం లేకుండా చేస్తున్నారు. మూడేళ్ల క్రితం.. ఇలాంటి సంస్కృతిని మూడేళ్ల కిందట బ్రేక్ చేసింది ‘సులభ్ ఇంటర్నేషనల్’ అనే స్వచ్చంద సంస్థ! దానికి వారణాసినే కేంద్రంగా మలచుకుంది. వేలసంఖ్యలో ఉన్న వితంతువులకు అందరిలా హాయిగా.. ప్రకృతిలోని అన్ని వర్ణాలనూ ఆస్వాదిస్తూ బతికే హక్కు ఉందని తెలియజెప్పాలనుకుంది. మూడేళ్ల కిందట.. హోలీనాడు.. ముందుగా వాళ్లమీద రంగుచల్లింది. శూన్యంలో రంగుల వెలుగును చూశారు అక్కడి స్త్రీ మూర్తులు. ఆ ఇంద్రధనుస్సు కొత్త జీవితం మీద ఆశను పెంచింది. ఉక్కిరిబిక్కిరయ్యారు. వృందావన్లోని గోపీనాథుడితోనే రంగులాడాలని ఆరాటపడ్డారు. ఈ ఏడాది కూడా వసంతం ఆ కేళీని మోసుకొచ్చింది. కర్తగా సులభ్ ఇంటర్నేషనల్ సంస్థను నిలబెట్టింది. నాలుగువందల యేళ్ల సంకెళ్లను బద్దలు కొట్టించి మరీ గోపీనాథుడి ఆలయంలోకి ఆ వితంతువులను తీసుకెళ్లింది. తడిసి ముద్దయ్యారు గులాల్.. హరా... పసుపు.. ఎరుపు.. వంగరంగు.. కెంజాయం... నీలం.. పిచ్కారీలో తడిసిముద్దయిపోయారు... ఆ వసంత కేళీలో కృష్ణుడితో ఆడి అలసిపోయారు. వృందావనం కొత్త శోభను సంతరించుకుంది. ఎవరి సంతోషాలను ఎవరూ హరించరు.. ఎవరూ ఎవరికి అశుభం కారు.. అపశకునం ఊసే లేదు. ప్రకృతిలో పుట్టిన ప్రతి జీవి ప్రకృతి ఒడిలో పరవశించాల్సిందే! తాను అందరి జీవితాల్లో నిండాల్సిందే.. అన్న సత్యాన్ని బోధించడానికే వచ్చింది ఈ వసంతం.... అందుకు వృందావనే సాక్ష్యం! వితంతువుల నుదుట చంద్రుడిని నిలిపి... ఒంటిని అంటిపెట్టుకున్న తెలుపుని రంగులమయం చేసింది.. వృందావనంలో స్త్రీలు... స్వావలంబన, సాధికారత దిశగా అడుగులు వేసేందుకు సిద్ధమయ్యారు.. వారికి చేయూతనందించే పనిలో ఉంది సులభ్ ఇంటర్నేషనల్! తెలుపుతో సప్తవర్ణాలూ సమ్మేళనం కావాలని తపనపడుతున్నాయి. గులాల్ తొలి అడుగేసింది. ఉత్సాహంతో శ్వేతవర్ణాన్ని ఆలింగనం చేసుకుంది. తనలో కలిపేసుకుంది. ఈ ఉత్సవానికి హోలీ సందర్భం అయితే వారణాసిలోని గోపీనాథ్ ఆలయం వేదిక అయింది. దాదాపు నాలుగువందల ఏళ్లుగా ఏలుబడిలో ఉన్న ఓ అనాచారం... ‘వితంతువులు పంచవన్నెలకు దూరంగా ఉండాలి’ అన్న ఆచారం... దహనమైపోయింది. అన్ని రంగులనూ ఆస్వాదించాలన్న వితంతువుల ఆశలకు ఆ గుడి గంటలు శుభం పలికాయి! సాక్షాత్తు ఆ గోపీనాథుడే ఈ సంబరానికి సాక్షి అయ్యాడు. వారి సంతోషాల్లో భాగమయ్యాడు. వింతంతువులతో కలిసి ఆ స్వామివారు కూడా హాలీ ఆడాడా అన్నంతగా అక్కడ అనందం వెల్లివిరిసింది. వారణాసి. సిటీ ఆఫ్ విడోస్! వితంతువుల నగరం. ఆధ్యాత్మిక కీర్తితోపాటు.. ఇది ఆ ఊరు తెచ్చుకున్న అపకీర్తి కూడా. వందల యేళ్ల కిందటి నుంచి దేశంలో ఏ మూలనో ఉన్న వితంతువులను తన దరికి తెచ్చుకుంటోంది వారణాసి. ప్రస్తుతం దాదాపు 38 వేల మంది వితంతువులు ఇక్కడి వృందావన్లోని పలు ఆశ్రమాల్లో ఆశ్రయం పొందుతున్నారు. శతాబ్దం కిందట వితంతువుల విషయంలో ఎలాంటి వైఖరి ఉండేదో ఇప్పటికీ అలాంటి అనాగరిక వైఖరినే అవలంబిస్తున్నారు. తెల్లచీర.. శిరోముండనం, ఒంటిపూట భోజనంతో ప్రకృతిలోని రంగులకు దూరంగా సహజకర్మలను త్యజించి అసహజమైన జీవనశైలిని పాటిస్తున్నారు. పొద్దున్నే సూర్యోదయం కాకముందే ఎవరికంటా పడకుండా.. ఏ ఇంటికీ ఎదురురాకుండా బిక్కుబిక్కుమంటూ గంగాస్నానం చేసి ఆశ్రమం చేరాలి. అంతే. ఇక భోజనం.. భజన.. మాటా, మంతి.. కష్టం, సుఖం అన్నీ ఆ ఆవరణలోనే.. తోటి వితంతువులతోనే! పదిహేనేళ్ల పసిపిల్లల నుంచి కాటికి కాళ్లు చాపిన వృద్ధుల దాకా.. అందరూ కలిసే ఉంటారు. అందరిదీ ఒకటే రకమైన జీవన విధానం... జీవితం! ఒకరిని చూస్తే ఒకరికి ఎక్కడలేని నిస్పృహ.. నిర్లిప్తత. శాంతికి చిహ్నం తెలుపు అంటారు కానీ ఇక్కడ ప్రశాంతతను భగ్నంచేసే పాత్ర ఆ రంగుది. చుట్టూ ఉన్న చెట్లూ పచ్చని బతుకును కాంక్షిస్తున్నట్టుండవ్. శ్వేతమనే శూన్యాన్ని తలపోస్తున్నట్టుంటాయ్. ఇది ఏళ్లనాటి పాత చిత్రం కాదు.. ఇప్పుడు ఈ క్షణం వెళ్లి చూసినా కనిపించే సజీవదృశ్యం! దేశంలో ఎక్కడైనా అంతే! భర్త పోతే పసుపు కుంకుమలతో బతికే హక్కులేదని పురాణాలు పెట్టిన పిచ్చిభ్రమల్లో వారణాసి వితంతువులే కాదు, మన దగ్గరి బంధువులూ కొట్టుమిట్టాడుతున్నారు. కన్నకొడుకు పెళ్లిలో అక్షింతలు వేసి దీవించాలని తపిస్తున్న వితంతు తల్లి ఆశనూ చంపేస్తున్నారు. గాజుల చేతుల హారతులే శుభం అంటూ పదిమంది కూడి చేసుకునే పండగల్లో భాగం లేకుండా చేస్తున్నారు. నలుగురిలో కలిస్తే నష్టమని వితంతువు మొహం మీద నవ్వును మాయం చేస్తున్నారు. పదిమంది ఉన్న ఇంట్లో అయితే వంటిల్లునే ఆమె స్థానంగా ఖరారు చేస్తున్నారు. వండిపెట్టడం తప్ప ఇంకో ధ్యాస లేని బానిసగా మారుస్తున్నారు. వాళ్ల జీవితాల్లో వసంతం లేకుండా చేస్తున్నారు. మూడేళ్ల క్రితం.. ఇలాంటి సంస్కృతిని మూడేళ్ల కిందట బ్రేక్ చేసింది ‘సులభ్ ఇంటర్నేషనల్’ అనే స్వచ్చంద సంస్థ! దానికి వారణాసినే కేంద్రంగా మలచుకుంది. వేలసంఖ్యలో ఉన్న వితంతువులకు అందరిలా హాయిగా.. ప్రకృతిలోని అన్ని వర్ణాలనూ ఆస్వాదిస్తూ బతికే హక్కు ఉందని తెలియజెప్పాలనుకుంది. మూడేళ్ల కిందట.. హోలీనాడు.. ముందుగా వాళ్లమీద రంగుచల్లింది. శూన్యంలో రంగుల వెలుగును చూశారు అక్కడి స్త్రీ మూర్తులు. ఆ ఇంద్రధనుస్సు కొత్త జీవితం మీద ఆశను పెంచింది. ఉక్కిరిబిక్కిరయ్యారు. వృందావన్లోని గోపీనాథుడితోనే రంగులాడాలని ఆరాటపడ్డారు. ఈ ఏడాది కూడా వసంతం ఆ కేళీని మోసుకొచ్చింది. కర్తగా సులభ్ ఇంటర్నేషనల్ సంస్థను నిలబెట్టింది. నాలుగువందల యేళ్ల సంకెళ్లను బద్దలు కొట్టించి మరీ గోపీనాథుడి ఆలయంలోకి ఆ వితంతువులను తీసుకెళ్లింది. తడిసి ముద్దయ్యారు గులాల్.. హరా... పసుపు.. ఎరుపు.. వంగరంగు.. కెంజాయం... నీలం.. పిచ్కారీలో తడిసిముద్దయిపోయారు... ఆ వసంత కేళీలో కృష్ణుడితో ఆడి అలసిపోయారు. వృందావనం కొత్త శోభను సంతరించుకుంది. ఎవరి సంతోషాలను ఎవరూ హరించరు.. ఎవరూ ఎవరికి అశుభం కారు.. అపశకునం ఊసే లేదు. ప్రకృతిలో పుట్టిన ప్రతి జీవి ప్రకృతి ఒడిలో పరవశించాల్సిందే! తాను అందరి జీవితాల్లో నిండాల్సిందే.. అన్న సత్యాన్ని బోధించడానికే వచ్చింది ఈ వసంతం.... అందుకు వృందావనే సాక్ష్యం! వితంతువుల నుదుట చంద్రుడిని నిలిపి... ఒంటిని అంటిపెట్టుకున్న తెలుపుని రంగులమయం చేసింది.. వృందావనంలో స్త్రీలు... స్వావలంబన, సాధికారత దిశగా అడుగులు వేసేందుకు సిద్ధమయ్యారు.. వారికి చేయూతనందించే పనిలో ఉంది సులభ్ ఇంటర్నేషనల్! -
హోలీ మందిరాలు
దిక్కులకు అందని ఆనందం... ఎల్లలు దాటిన సంబరం ... కల్లలెరగని కమనీయం... ఆలయ ముంగిళ్ళలో రంగులతో తడిసి మురిసే రాధాకృష్ణుల కేళీ విన్యాసాలు ఎంత నయనానందకరం చేస్తాయో చూద్దాం.. తెలుసుకుని తరిద్దాం... 1. ‘మథుర’మైన ఉత్సవం... ఉత్తరాన యమునా నదిపై వీచే చల్లని గాలులు వేణుగానమై వీనులకు విందుచేస్తుండగా ద్వారకాధీశుడి జన్మస్థలమైన మధురలో రంగుల కేళీ విన్యాసాలు మన్నూ మిన్నూ ఏకం చేస్తుంటాయి. ఎన్నో ప్రత్యేకతలు గల దేవాలయాలు ఉన్న పట్టణం మథుర. ఇక్కడ ప్రతి గృహం, భవనం నుంచి చిన్నా పెద్ద దేవాలయాలు, ఘాట్లు, షాప్‌లు.. అంతా రంగులతో వర్ణశోభితమై నల్లనయ్యను తమ హృదయలోలుడిగా కీర్తిస్తూ భజనలు చేస్తూ భక్త బృందాలు పులకించిపోతుంటాయి. ఉత్తరప్రదేశ్‌లోని కృష్ణుడి జన్మస్థలమైన మథురలో ఆరు రోజుల పాటు ప్రత్యేక ఉత్సవాలు జరుపుతారు. కృష్ణుడి బాల్యం గడిచిన ‘బృందావనం’లో హోలీ రోజున ప్రత్యేక పూజలు చేస్తారు. హోలీ రోజుల్లో సందడంతా కృష్ణాలయాల్లోనే కనిపిస్తుంది. ఇక్కడ గల ద్వారకాధీశ మందిరంలో కృష్ణాష్టమి, దీపావళి, హోలీ వేడుకులు అత్యంత వైభవోపేతంగా జరుగుతాయి. బృందావనంలో కొలువుదీరిన రాధారమణ దేవాలయం అత్యంత ప్రాముఖ్యత గలది. ప్రధాన మూర్తులు గోస్వామి, రాధాదేవి. జుగల్ కిశోర్ దేవాలయం అతి ప్రాచీనమైనదిగానే కాదు ఇక్కడి మురళీధరుడు అత్యంత ప్రాశస్థ్యం గల దైవంగా పూజలు అందుకుంటున్నాడు. దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన శ్రీ రంగనాథ దేవాలయం నమూనాలో ఉంటుంది రంగ్జీ దేవాలయం. ఇక్కడ భారీ రథయాత్ర, బ్రహ్మోత్సవాలు ప్రతి యేటా మార్చి-ఏప్రిల్‌లో జరుగుతుంటాయి. మథుర పట్టణానికి 42 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ‘బర్సానా’ గ్రామం. రాధ పుట్టిన ప్రాంతంగా ఈ ఊరుకి పేరు. ఇక్కడికి స్వయంగా కృష్ణుడే వచ్చి హోలీ ఆడుతాడని అంతా భావిస్తారు. పురుషులు కృష్ణుడిగా, అమ్మాయిలు రాధగా భావించుకుంటారు. హోలి రోజున స్త్రీలు పురుషులను కర్రలతో వెంబడిస్తారు. పురుషులు తమ వద్ద ఉన్న డాలుతో కర్రలను అడ్డుకుంటారు. పురుషులు రెచ్చగొట్టే పాటలు పాడుతూ స్త్రీలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తారు. ఇక్కడ హోలీ సరదా సరదాగా సందడి సందడిగా ఉంటుంది. సమీప కృష్ణమందిరాలలో ప్రత్యేక పూజలు, భజనలు జరుగుతాయి. 2. గుజరాత్లో ద్వారకాధీశుడు గుజరాత్‌లోని గోమతి నదీ తీరాన ద్వారక ఆలయం ఉంది. ఇక్కడ శ్రీకృష్ణ ఆలయం పక్కనే అష్టభార్యల మందిరాలూ ఉన్నాయి. రాధాకృష్ణుల మందిరం, మిగతా దేవేరుల మందిరాలూ ఒకే చోట ఉన్నాయి. ఇక్కడ గోమతి సంగమ్ ఘాట్ విశిష్టమైనది. ఈ ఘాట్ నుంచి 56 మెట్లు ఎక్కి పైకి వెళ్ళితే ద్వారాకాధీశుని ఆలయ స్వర్గ ద్వారం వస్తుంది. ఇక్కడ హోలీ రోజున ప్రత్యేక ఉత్సవాలు జరుపుతారు. 3. తూర్పు-పడమరలను కలిపిన దైవం బెంగాల్లో ‘బసంత్ ఉత్సవ్’ పేరిట వసంతకాలాన్ని ఆహ్వానిస్తూ అమ్మాయిలు అబ్బాయిలు సంతోషంగా ఈ వేడుకను జరపుకుంటారు. అయితే వీరు రంగులు చల్లుకోరు. పాటలు, నృత్యాలు, శ్లోక పఠనం.. అంతా శాంతినికేతన్ పద్ధతుల్లో వేడుక సాగుతుంది. పౌర్ణమి రోజు ఉదయాన్నే విద్యార్థులు కుంకుమపువ్వు రంగు దుస్తులను, సువాసనలు వెదజల్లే పువ్వుల దండలను ధరిస్తారు. సంగీత వాద్యాలను మీటుతూ, పాటలు పాడుతారు. వీళ్లు హోలీని ‘డోలా జాత్రా, డోలా పూర్ణిమ’గా ఊయలోత్సవంగా జరుపుకుంటారు. ముఖ్యమైన వీధులలో రాధాకృష్ణుల ప్రతిమలను అలంకరించి పల్లకిలో ఊరేగిస్తారు. ఆడవాళ్లు నాట్యం చేస్తున్నప్పుడు భక్తులు వాళ్ల చుట్టూ తిరుగుతూ భక్తి పాటలు పాడతారు. పురుషులు రంగు నీటిని, రంగు పొడిని జల్లుకుంటారు. కుటుంబపెద్దలు కృష్ణుడిని, అగ్నిదేవుడిని ప్రార్థిస్తారు. కృష్ణుడి ప్రతిమలకు గులాల్ రంగు పూసి, ఖీర్ (పాయసం), సందేశ్, కుంకుమపువ్వు, పాలు వంటి మధుర పదార్థాలను నివేదిస్తారు. ఒడిశాలో హోలీ సందర్భంగా జగన్నాథుడి ఆలయాల్లోను, కృష్ణాలయాల్లోను ప్రత్యేక పూజలు చేస్తారు. పంజాబ్‌లో సిక్కులు హోలీని ‘హోలా మోహల్లా’ అంటారు. భారతదేశంలో ఆనంద్‌పూర్ సాహిబ్‌లో జరిగే ఉత్సవం చాలా పేరు గడించింది. విదేశాల నుంచి కూడా ప్రజలు పంజాబ్‌కు వచ్చి సంప్రదాయ పద్ధతిలో హోలీ పండుగను జరుపుకొంటారు. వ్యవసాయంలో రబీ పంటలకు ఇది సూచనప్రాయంగా ఉంటుంది. వీధులలో మంటలు వేసి చుట్టూ చేరి పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు. అహ్మదాబాద్‌లో ఒక కుండలో మజ్జిగ నింపి వీధిలో వేలాడదీస్తారు. యువకులు ఆ కుండను పగులకొట్టడానికి పోటీపడుతుంటే అమ్మాయిలు వారిపై నీళ్లు విసురుతారు. చివరకు కుండను పగులకొట్టిన యువకుడిని ‘హోలీ రాజు’గా సత్కరిస్తారు. మహారాష్ట్రలో హోలీ పౌర్ణమికి సాయంత్రం మంటలు వెలిగించి, తినుబండారాలను, భోజనాన్ని అగ్నికి అర్పిస్తారు. ఈ సమయంలో ‘హోలీరే హోలీ పురాణచిపోలీ’ అని పాడతారు. దీంతో తమ బాధలన్నీ తొలగిపోతాయని భావిస్తారు. పంచమి రోజున రంగులతో ఆడుకుంటారు. 4. వెన్నెల రాత్రులలో మణిపూర్‌లో ఆరు రోజులు హోలి పండగను జరుపుకొంటారు. ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజు రాత్రి జానపద నృత్యాలతో, పాటలతో డోలు వాయిస్తారు. వెన్నెల రాత్రుల్లో ప్రజలు విందులలో పాల్గొంటారు. భోగిమంటలకు ఎండుగడ్డిని, రెమ్మలను ఉపయోగిస్తారు. తెలుపు, పసుపు తలపాగాలను ధరించి గులాల్ ఆడుతూ నృత్యం చేస్తారు. చివరి రోజు కృష్ణ ఆలయం ఆవరణలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. దక్షిణ కొచిలోనూ, కాశ్మీర్‌లోనూ ఎండాకాలానికి ప్రారంభంగా, పంటలు కోయడానికి సూచనగా హోలీ పండగను జరుపుకుంటారు. రంగుపొడిని, రంగునీళ్లను విసురుకుంటూ పాటలు పాడుకుంటూ, నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా గడుపుతారు. 5. గిరిజనుల కోలాహలం రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో ఉన్న గిరిపుత్రుల హోలీ పండగ ప్రత్యేకంగానూ, ఆసక్తికరంగానూ ఉంటుంది. మామిడిపూత, గింజధాన్యాల రాకతో కొత్త జీవితానికి గుర్తులుగా భావిస్తారు వీరు. అగ్ని చుట్టూ చేరి, బిగ్గరగా ఏడుస్తారు. ఆ విధంగా చెడు తమ నుంచి దూరం అవుతుందని భావిస్తారు. హోలీ పండగ తమ జీవితంలో గొప్ప ఆనందాన్ని నింపుంతుందని భావిస్తారు. మన దేశంలోనే కాదు పురాణేతిహాసాలలో ప్రఖ్యాతిగాంచిన హోలికా దహనం, రాధాకృష్ణుల వసంతకేళీ కథనాలు ప్రపంచమంతటా వ్యాప్తి చెందాయి. గడప గడపకూ చేరి మన సంస్కృతిలో భాగమయ్యాయి. ఈ వేడుకలోని ఆంతర్యాన్ని తెలుసుకోవడానికి మన దేశానికి విదేశీయులూ వరస కడుతున్నారు. ఎక్కడైనా చెడుపై మంచి సాధించిన విజయానికి సూచికగా జరుపుకునే ఈ పండగ భారతీయ ఆత్మకు అచ్చమైన ప్రతీక. - నిర్మలారెడ్డి దక్షిణాన రంగుల దీవెన: హోలీ నాడు దేశమంతటా రాధాకృష్ణుల దేవాలయాలను సుందరంగా తీర్చిదిద్ది, చిన్న చిన్న సమూహాలుగా చేరి పాటలు పాడి ఆనందిస్తారు. అయితే ఉత్తరభారతదేశంతో పోలిస్తే దక్షిణ భారతదేశంలో అంత వేడుకగా ఈ పండగను జరుపుకోరు. తెలుగు రాష్ట్రాలో హైదరాబాద్ మినహా మిగతా ప్రాంతాలలో చిన్న స్థాయిలోనే హోలీని జరుపుకుంటారు. కొన్ని చోట్ల పెద్దల పాదాలమీద గులాల్ చల్లి, వారి దీవెనలు తీసుకుంటారు. గిరిజనులు మాత్రం పున్నమి రాత్రి కామదహనం పేరుతో పెద్ద పెద్ద మంటలు వేసి, మరుసటి రోజు తమ తెగ నృత్యాలతో హోలీని సంబరంగా జరుపుకుంటారు. -
హోలీ వేడుకల్లో ఒకరి హత్య
వివాహేతర సంబంధమే కారణం ఇద్దరిపై కేసు నమోదు భీమారం : హోలీ వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. తన రక్తసంబంధీకురాలితో వివాహేతర సంబంధం సాగిస్తున్నాడనే నెపంతో హోలీ ఆడుతున్న ఓ వ్యక్తిని హత్య చేసిన సం ఘటన నగంరలోని భీమారంలో గురువారం రాత్రి జరిగింది. వివరాలిలా ఉన్నాయి. కరీం నగర్ జిల్లా కేశవపూర్‌కు చెందిన ఎ. రవికుమార్(43)కు భార్య, కుమారుడు, కుమార్తెలు ఉన్నారు. ప్రస్తుతం రవికుమార్ డీసీఎం డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడు 20 ఏళ్ల క్రితం హసన్‌పర్తిలో స్థిరపడ్డాడు. కొంతకాలంగా స్థా నిక మహిళతో రవి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయమై మహిళ కుటుంబ సభ్యులతో పలుమార్లు గొడవలు కూడా జరిగాయి. దీంతో రవికుమార్ ఆరు నెలల క్రితం తన మకాన్ని భీమారానికి మా ర్చాడు.ఈ క్రమంలో గురువారం సాయంత్రం ఆరు గంటలకు భీమారంలో అతడు హోలీ సంబరాల్లో ఉండగా అక్కడికి హసన్పర్తికి చెం దిన ప్రసాద్ వెళ్లాడు. అతడితోపాటు భీమారానికి చెందిన జితేందర్ జతయ్యాడు. ఈ సందర్భంగా రవికుమార్ తన రక్తసంబధీకురాలితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడనే కోపంతో ప్రసాద్ అతడితో గొడవకు దిగాడు. ఈ క్రమంలో అతడి దాడిలో రవికుమార్ కుప్పకూలాడు. దీంతో భయపడిన ప్రసాద్ తన స్నేహితుడు అనిల్ సహకారంతో ద్విచక్ర వాహనంపై రవికుమార్‌ను వెంటనే నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికీ తీసుకెళ్లాడు. అక్కడ అడ్మిట్ చేసుకోవడానికి వైద్యు లు నిరాకరించారు.దీంతోఎంజీఎంఆస్పత్రికితీసుకెళ్లారు అప్పటికే భయంతో ప్రసాద్ ఆస్పత్రి బయటే ఉండగా, రవి కుమార్‌ను అనిల్ స్ట్రెచర్‌పై క్యాజువాలిటీలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత నెమ్మదిగా జారుకునే ప్రయత్నం చేయగా వైద్యులు అతడిని గమనించి వివరాలు అడిగారు. జరిగిన సంఘటనను అనిల్ వైద్యులకు చెప్పాడు. వారు రవికుమార్‌ను పరిశీలించగా అప్పటికే ప్రాణాలు వదిలాడు. పోలీసులకు అప్పగింత కాగా అనిల్‌ను ఔట్‌పోస్ట్ పోలీసులు అదుపులోకి తీసుకుని కేయూసీ పోలీసులకు సమాచారంఇచ్చారు.విషయం తెలుసుకున్న కేయూ సీఐ దేవేందర్‌రెడ్డి మార్చురీకి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు. వివాహేతర సంబంధం కారణంతోనే హత్య జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో పాల్గొన్న ప్రసాద్, జితేం దర్‌పై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అనిల్ కు ఈ ఘటనతో ఎలాంటి సంబంధం లేదని, రవికుమార్‌ను ఆస్పత్రికి తరలించడానికి మాత్ర మే సహకరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రధాన నిందితుడిగా పేర్కొంటున్నప్రసాద్ హ న్మకొండ మార్కెట్లో కూరగాయాల వ్యాపారం చేస్తుండగా, మరో నిందితుడు జితేందర్ సైతం భీమారంలో కూరగాయలు అమ్ముతున్నాడు. -
పండగపూట విషాదం
రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి పలువురికి గాయాలు పెద్దవూర, దేవరకొండ, చివ్వెంల మండలాల్లో ఘటనలు పెద్దవూర: రంగుల పండగ హోలీ అందరి ఇళ్లలో ఆనందాన్ని నింపితే కొందరి ఇళ్లలో మాత్రం పెను విషాదాన్నే నింపింది.. జిల్లాలో శుక్రవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృత్యువాత పడగా, మరికొందరు తీవ్ర గాయాలై చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.పెద్దవూర, చివ్వెంల, దేవరకొండ మండలాల పరిధిలో శుక్రవారం చోటు చేసుకున్న ప్రమాదాల వివరాలు.. పెద్దవూర మం డలం పర్వేదుల గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్త జయరాంతండాకు చెందిన వడ్త్య బాలు- నాను దంపతుల చిన్న కుమారుడు వడ్త్య హరిలాల్(19)శుక్రవారం ఉదయం వ్యవసాయ పొలానికి వెళ్లొస్తానని బైక్‌పై వెళ్లాడు. అదే తండాకు చెందిన తన సమీప బంధువు స్నేహితుడైన నున్సావత్ సర్ధార్‌ను వెంట తీసుకుని ఇద్దరూ కలిసి సౌండ్ బాక్స్‌లను కొనుగోలు చేసి తీసుకువద్దామని బైక్‌పై హాలియాకు బయల్దేరారు. వీరు ప్రయాణిస్తున్న బైక్‌ను మండలంలోని చింతపల్లి స్టేజీ వద్ద ఏఎమ్మార్పీ లోలెవల్ వరద కాలువపైకి రాగానే కోదాడ నుంచి కర్నూలుకు వెళ్తున్న కోదాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఎదురుగా ఢీకొట్టింది. దీంతో బైక్‌ను నడుపుతున్న హరిలాల్, వెనుక కూర్చున్న సర్ధార్‌లు అంతెత్తు పైకి ఎగిరి 20 అడుగుల దూరంలో పడ్డారు. హరిలాల్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందగా, సర్ధార్ పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం 108 వాహనంలో నాగార్జునసాగర్ కమలా నెహ్రూ ఆసుపత్రికి తరలించారు. బస్సు వేగంగా ఢీ కొట్టడంతో మృతుడు హరిలాల్ తల ఛిద్రమై అతడు పెట్టుకున్న టోపీలో మెదడు ముద్దలా పడింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాగార్జునసాగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన సర్ధార్ పరిస్థితి విషమించటంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ కామినేని ఆస్పత్రికి తీసుకెళ్లారు. మరో 15 రోజుల్లో పెళ్లి.. పది రోజుల క్రితం అనుముల మండలం నేతాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని గట్టుమీదితండాకు చెందిన యువతితో మృతుడు హరిలాల్ నిశ్చితార్థం జరిగింది. పెళ్లి పత్రికలు పంపిణీ చేయటానికి గాను కట్నం కింద కాబోయే వధువు తల్లిదండ్రులు బైక్‌ను ఇప్పించారు. పెళ్లి కూడా ఉగాది పండగ తర్వాత జరపటానికి నిశ్చయించుకున్నారు. అదే బైక్‌పై హాలియాకు వెళ్తూ మృత్యువాత పడ్డాడు. మిన్నంటిన రోదనలు ప్రమాద విషయాన్ని మృతుడు సెల్‌ఫోన్ ఆధారంగా పోలీ సులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో సం ఘటన స్థలానికి చేరుకున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యు లు మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా రోదించారు. పెళ్లిబాజాలు మోగించాల్సిన ఇంట చావుబాజా మోగిస్తావా దేవుడా అంటూ వారు రోదించిన తీరు అందరినీ కంట తడి పెట్టించాయి. ఇంట్లో నుంచి వెళ్లిన అరగంటలోనే శవమై కనిపించటంతో తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. ప్రమాదానికి గురై చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న సర్ధార్కు 10 నెలల క్రితమే వివాహమైంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బి.ప్రసాదరావు తెలిపారు. -
హోలీ రంగుల వాన
నగరాన ....రంగుల వాన.. హోలీ సంబరం అంబరమంటింది. యువత ఉరిమే ఉత్సాహంతో చిందేసింది.. ఆనందం హరివిల్లు గా విరిసింది. మరోవైపు సాయం వేళ నింగి నుంచి జాలువారిన చిటపట చినుకులు పలుకరించాయి. మరింత ఆహ్లాదాన్ని పంచాయి. కొస మెరుపుగా ప్రపంచ క్రికెట్ సమరంలో టీమ్ఇండియా గెలుపు సంబరాలను చక్కటి మలుపు తిప్పింది. కుర్రకారు జోరుకు అడ్డులేదు. చిన్నారుల సరదాకు చినుకులు సై అన్నాయి. నగరంలో శుక్రవారం రంగుల వాన కురిసింది. ఆనందాల పండుగ హోలీని ఉత్సాహంగా జరుపుకొన్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా రంగులు చల్లుకున్నారు. రెయిన్ డ్యాన్స్‌లతో హంగామా చేశారు. ఐటీ ఉద్యోగులు వేడుకల్లో పాల్గొని నృత్యాలు చేశారు. - సాక్షి, సిటీబ్యూరో -
రంగుల కళ
నగరం మోదుగుపూవయింది... హోలీకి సిద్ధమైంది. రంగుల పండుగను రంగేళీగాజరుపుకొనేందుకు సిటీజనులు రెడీ అయ్యారు. కాముని దహనం, రంగులు, స్వీట్ల కొనుగోళ్లతో గురువారం నగరమంతటా హోలీ వాతావరణం కన్పించింది. శుక్రవారం హోలీతోపాటు వరల్డ్ కప్‌లో ఇండియా- వెస్టిండీస్ క్రికెట్ మ్యాచ్‌కూడా ఉండడంతో యూత్‌లో ఫుల్ జోష్ నింపనుంది. -
పోలీసుల నేత్రాల్లో ఢిల్లీ ర హదారులు
హోలీ సందర్భంగా పటిష్ట భద్రత కూడళ్లలో ప్రత్యేక తనిఖీలు వీడియో కెమెరాలతో పర్యవేక్షణ ట్రాఫిక్ నిబంధన పాటించని వారిపై కఠిన చర్యలు కమిషనర్ ముక్తేశ్ చంద ర్ వెల్లడి న్యూఢిల్లీ: హోలీ పండుగ సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన కూడళ్లలో ప్రత్యేక తనిఖీల కోసం 200 బృందాలను సిద్ధం చేశారు. 20 ఇంటర్‌స్పెక్టర్ వాహనాలతో గస్తీ ముమ్మరం చేయనున్నారు. మద్యం తాగి వాహనం నడపడం, బైక్ విన్యాసాలు, విచక్ష ణా రహితంగా వాహనాలు నడపడంతోపాటు ఇతర ట్రాఫిక్ నియమాలు పాటించని వారిని గుర్తించేందుకు వీడియో కెమేరాలు ఉపయోగిస్తున్నారు. రద్దీ కారణంగా నిందుతులను అప్పటికప్పుడే విచారిచడం లేదు. చలానాలను వారి ఇంటికి పంపిస్తారు. గత సంవత్సరం ఇదే తరహాలో 4000 మంది నిందుతులకు చలానాలు వారి ఇంటికే పంపిచారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తే కేవలం జరిమానాతో సరిపెట్టడం లేదు, వారి వాహనం స్వాధీనం చేసుకోవడంతోపాటు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడితే డ్రైవర్‌ను అరెస్ట్ చేయడంతోపాటు వాహనాన్ని స్వాధీనం చేసుకుంటామని ట్రాఫిక్ కమిషనర్ ముక్తేశ్ చందర్ చెప్పారు. జరిమానా విధించడం మాత్రమే కాక జైలు శిక్షతోపాటు వారి డ్రైవింగ్ లెసైన్స్ రద్దు చేస్తామని తెలిపారు. పండుగ సందర్భాల్లో హెల్మెట్ ధరించకుండా వాహనం నడపడం, బైక్‌తో వివిధ విన్యాసాలు చేయడం సర్వసాధారణం. అయితే ఏలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. వాహన యజమాని కాకుండా ఇతరులు, మైనర్లు వాహనం నడిపితే యజమానిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. లై సెన్స్ కాలం పూర్తయి ఉన్నా, విచక్షణా రహితంగా వాహనం నడిపినా, హెల్మెట్ వాడకపోయినా నిబంధనల మేరకు చ ర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పోలీసుల లెక్కల ప్రకారం గత సంవత్సరం చట్టరీత్యా 13,015 మందిపై వివిధ నేరాల కింద చర్యలు తీసుకున్నారు. వీరిలో హెల్మెట్ వాడని కారణంగా 5,633 మందిపై, సిగ్నల్ జంప్ చేసిన నేరంపై 1,544 మందిపై చర్యలు తీసుకున్నారు. అదే విధంగా ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న 1,464కి, ప్రమాదకరంగా వాహనం నడిపిన 139 మందికి జరిమానాలు విధించారు. మద్యం తాగి వాహనం నడిపిన 2,090 మందికి చట్టరీత్యా శిక్ష విధించారు. అంతేకాక 881 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. -
హోలీ టూర్
- నిర్మలారెడ్డి యాంత్రికంగా సాగిపోయే జీవితాల్లో పండగ ఒక ఆనందసౌరభాన్ని నింపుతుంది. అందుకే పండగను బంధుమిత్రుల మధ్య ఆకాశమే హద్దుగా అనిపించే ఆనందాన్ని సొంతం చేసుకునేలా జరుపుకుంటారు. దాంట్లో భాగంగా మన దగ్గర పండగల సంఖ్య ఎక్కువే ఉంది. వాటన్నింటిలో ప్రత్యేకమైనది హోలీ. కొత్త అందాలు నింపుకున్న ప్రకృతి సిరులలో తడిసి ముద్దవడానికి ప్రతి ఒక్కరూ తహతహలాడతారు. అందులో భాగంగానే రంగులను చల్లుకొని, ఉత్సాహాన్ని ఎద నిండా నింపుకుంటారు. వయసు తేడా లేకుండా జరుపుకునే ఈ ఆనందకేళీ విలాసానికి మూలం మన భారతదేశమే! ఆ సౌరభాలను తమ జీవితంలోనూ నింపుకోవడానికి విదేశీయులు సైతం ఆసక్తి చూపుతుంటారు. ఉత్తర భారతదేశంలో ఇంపుగా సాగి, దక్షిణభారత దేశాన్ని అందంగా పలకరించి, విదేశాలలోనూ కాలు మోపిన రంగుల పండగను వీక్షించడానికి మన దగ్గరా కొంతమంది బయల్దేరుతారు. వారిలో పరిశోధకులు, ఫొటోగ్రాఫర్లు, కళాకారులు, చిత్రకారులూ.. ఉంటారు. వారం రోజుల ముందుగానే... ఉత్తరప్రదేశ్‌లో మథురకు దగ్గరగా ఉండే బర్సానా, నంద్గావ్లలో విభిన్నంగా హోలీని జరపుకుంటారు. హోలీకి వారం రోజుల ముందు నుంచే ఉత్సవాలను జరపుతారు. ఆ విధంగా ఫిబ్రవరి 27 నుంచే ఉత్సవాలు జరుపుతారు. ఇందులో ముందుగా నంద్‌గావ్ గ్రామం నుంచి మొదలైన ఉత్సవం మార్చి 1 నాటికి బృందావనంలోని బాంకే బిహారీ మందిరం వద్ద అత్యంత వైభవంగా జరుపుతారు. హోలీ రోజున లడ్డూలను పంచుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేసుకుంటారు. రాధాకృష్ణులకు సంబంధించిన ఆధ్యాత్మిక బృందగీతాలను మధురంగా ఆలపిస్తారు. నలభై రోజుల ముందుగానే.. మథుర, బృందావనాల్లో నలభై రోజుల ముందుగానే వసంత పంచమి రోజున హోలీని వేడుకగా నిర్వహిస్తారు. ఢిల్లీ నుంచి మథుర, బృందావనం చేరుకోవడానికి దాదాపు నాలుగు గంటల సమయం పడుతుంది. కృష్ణుడు జన్మించిన స్థలం మధుర. పెరిగింది బృందావనంలో. అందుకే ఇక్కడ వేడుక అత్యంత వైభవంగా ఉంటుంది. పశ్చిమబెంగాల్లోని శాంతినికేతన్లో వసంతం అత్యంత వేడుకగా జరుపుతారు. బెంగాల్ చరిత్రలో, సంస్కృతిలో హోలీకే అత్యంత ప్రాధాన్యం. హోలీ నాటికి ఇక్కడకు అధికసంఖ్యలో విదేశీ యాత్రికులు వస్తారు. భారతదేశంలో అత్యంత ప్రాచీనకాలం నుంచే ఇక్కడ హోలీ ఉత్సవాలు జరుపుతున్నట్టు చారిత్రక ఆధారాలున్నాయి. పశ్చిమబెంగాల్లోని పురులియా జిల్లాలో హోలీ వేడుక కనులారా చూడాల్సిందే, ఆ రంగుల్లో మునిగితేలాల్సిందే అని యాత్రికులు చాలా ఉత్సాహపడతారు. ఇక్కడ జానపద కళలు ఈ సమయంలో ఊపందుకుంటాయి. ముఖ్యంగా చావ్ నృత్యం, దర్బారి ఝుమర్, నటువా డ్యాన్స్‌తో పాటు జానపద పాటలను ఉత్సాహభరితంగా ఆలపిస్తారు. కలకత్తా నుంచి ఈ ప్రాంతాన్ని చేరుకోవడానికి 5-6 గంటల సమయం పడుతుంది. కలకత్తా నుంచి ప్రైవేటు రవాణా సదుపాయాలు కూడా ఉన్నాయి. వసతి సదుపాయాల కోసం ఇక్కడ టెంట్లు అద్దెకు ఇస్తారు. పంజాబ్ రాష్ట్రంలోని ఆనందపూర్‌లో సిక్కులు అత్యంత వైభవంగా హోలీని జరుపుతారు. పంజాబ్ పర్యాటక శాఖ చంఢీగఢ్ నుంచి నాలుగు రోజుల పాటు ‘హోలా మొహల్లా టూర్’ను ఆఫర్ చేస్తోంది. రాచరికపు హంగుల హోలీ... ఉదయపూర్‌లో రాచరికపు హంగుల మధ్య హోలీని వేడుకగా జరుపుతారు. హోలీ ముందురోజు అంటే పౌర్ణమి రాత్రిలో దుష్టశక్తులను దూరం చేయడానికి జరిపే ఈ వేడుకలో మేవాడ్ రాజరిక కుటుంబం పాల్గొంటుంది. పట్టణంలోని మేనక్ చౌక్ ప్యాలెస్ పరిసరప్రాంతాలలో రాత్రిపూట గుర్రపు డెక్కల చప్పుడు, బ్యాండ్ వాయిద్యాల హోరు హృదయాన్ని లయ తప్పిస్తాయి. రాచరికపు హంగుల మధ్య సంప్రదాయ పద్ధతిలో హోలికా దహనాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఈ ప్రాంత సందర్శనకు టూరిజమ్ వారిని సంప్రదించాలంటే ఫోన్: +919910900630 మురికివాడల సహజత్వం హోలీ... ముంబయ్‌లో హోలీ వేడుకను చూడాలంటే ధారావి ప్రాంతానికి వెళ్లాల్సిందే! ధారావి ముంబయ్‌లోని అతి పెద్ద మురికివాడ. ఇక్కడ ఉండే సహజత్వం నడుమ... మురికివాడల బాలల ఉత్సాహాన్ని చూడాలనుకునే యాత్రికులు ఇక్కడకు లెక్కకు మించి వస్తారు. అంతేకాదు ఇక్కడ అన్ని చోట్ల కన్నా అత్యంత సురక్షితంగా స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. పూర్తిగా రంగులు, సంగీతపు హోరును ఆస్వాదించవచ్చు. అలాగే ఆధ్యాత్మికులలో 80 శాతం మంది ఈ ప్రాంతానికి విచ్చేసి మురికివాడల జనాలకు సహాయాలు చేస్తుంటారు. ఏనుగమ్మ ఏనుగు... జైపూర్‌లో హోలీ పండగ రోజునే ఏనుగుల పండగ జరుపుతారు. ఆ విధంగా హోలీ అంటే జైపూర్‌లోనే చూడాలనుకునే యాత్రికులు ఎంతోమంది. ఏనుగుల విన్యాసాలు, జానపద నృత్యాలు... కన్నుల పండువగా జరుగుతాయి. స్థానికులతో పాటూ విదేశీయాత్రికులూ ఈ వేడుకలో పాలుపంచుకుంటారు. దీంతో ఇక్కడ హోలీ సంబరం రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తుంది. దేశ రాజధాని ఢిల్లీ హోలీ వేడుక అత్యంత ఆధునికంగా ఉంటుంది. దగ్గరలోని పహడ్గంజ్లో రంగులు అమ్మే దుకాణదారులు, కొనుగోలు దారులు, పిల్లలతో అత్యంత సందడిగా ఉంటుంది. ఇక్కడ రంగుల కేళీ, సంగీతపు హోరు పట్టణానికి కొంత దూరంలో ఏర్పాటు చేస్తారు. ఇక్కడ పర్యావరణ హితంగా వేడుకను జరపుకోవడం విశేషం. సహజమైన రంగులతో పాటు వీధుల్లో అమ్మే ఆహారపదార్థాలు సైతం కల్తీ లేకుండా ఉండటం ప్రత్యేకత. ఉత్తరాదితో పోల్చితే దక్షిణభారతదేశంలో హోలీ హంగామా కొంత తక్కువనే చెప్పాలి. కర్నాటకలోని హంపిలో ఉదయం వేళలో మాత్రమే హోలీ జరుపుకుంటారు. విదేశీ యాత్రికులు ఆ సమయానికి ఇక్కడకు చేరుకుంటారు. ఇక్కడ డప్పు వాద్యాలు, నృత్యాలు, పరుగుల మధ్య రంగులు జల్లుకోవడం.. నాటి విజయనగర సామ్రాజ్య వైభవాన్ని కళ్లకు కడతాయి. రంగులు చల్లుకోవడం పూర్తయ్యాక అందరూ నదీ స్నానం చేసి ఇళ్లకు చేరుకుంటారు. విదేశాలలోనూ కనులకు విందుగా... ముస్లిం దేశాలైన బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లోనూ హోలీ వేడుకలను అక్కడక్కడా తిలకించవచ్చు. బంగ్లాదేశ్‌లో హిందూ, బౌద్ధం కూడా ప్రధానంగా కనిపిస్తుంటాయి. హిందువులతో పాటూ ఇక్కడ ముస్లింలూ హోలీ పండగలో పాల్గొని మత సామరస్యతను చాటుతుంటారు. హిందూ దేవాలయాలు, కూడలిలో ఈ వేడుకను ఘనంగా జరుపుకుంటారు. ఈ దేశాలతో పాటు మారిషస్, నేపాల్, దక్షిణాఫ్రికా, ట్రినిడాడ్, అమెరికాలోనూ రంగుల పండగను అత్యంత వేడుకగా జరుపుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణం ఆయా దేశాలలో భారతీయులు స్థిరపడటమే! బృందాలుగా ప్రయాణం... సాంస్కృతిక పరంగా ప్రత్యేక పండగలను స్పెషలైజ్డ్ టూర్లు అంటాం. ప్రత్యేకమైన హోలీ ఉత్సవాన్ని తిలకించడానే కాదు, పండగలో తామూ భాగవం కావడానికి ఎక్కువగా యురోపియన్, అమెరికా యాత్రికులు మనదేశానికి అధిక సంఖ్యలో వస్తుంటారు. మన దగ్గర నుంచి కొంతమంది బృందాలుగా ఏర్పడి హోలీ పండగ బాగా జరపుకునే ప్రాంతాలను ఎంచుకొని వెళుతుంటారు. ఒక్కో బృందంలో 30 నుంచి 40 మంది వరకు ఉంటారు. రంగుల నడుమ వచ్చే ఉత్సాహాన్ని ఒక్కొక్కొరు ఒక్కోవిధంగా వెంట తెచ్చుకుంటారు. - ఎస్.శంకర్ రెడ్డి, అసిస్టెంట్ డెరైక్టర్, ఇండియాటూరిజమ్ మరిన్ని వివరాలకు... ఇండియాటూరిజమ్, పర్యాటకభవన్, బేగంపేట్, హైదరాబాద్ ఫోన్: 040-23409199 -
ఏడు రంగుల వేడుకలో ఎన్ని కోణాలో..!
కుల మత బేధాలు లేకుండా సోదర భావంతో ప్రజలంతా కలిసి ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే పర్వదినం హోలీ. ఈ పండుగనాడు ఎద ఎదలో హోలీ కేరింతలు అంబరాన్ని అంటుతుంటే ఏడురంగులను ఎదపై చల్లుకొని తడిసి ముద్దయి పుడమితల్లి పులకించిపోతుంది. ఫాల్గుణ శుక్ల పౌర్ణమికే హోలీ పౌర్ణమి అని పేరు. ఇంచుమించు భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో ఈ పండుగను జరుపుకుంటారు. గతంలో ఈ పండుగకు ఉత్తరభారతదేశంలో ఉన్నంత ప్రాముఖ్యత దక్షిణభారతదేశంలో లేదు. అయితే, మారుతున్న జీవనవిధానం, ప్రాంతాల మధ్య పరస్పర అవగాహన తదితర కారణాల వల్ల హోలీ పండుగను నేడు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణలలో కూడా ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్నారు. - డి. కృష్ణ కార్తీక ఈ పండుగను కామదేవోత్సవమని, హోలికోత్సవమని, డోలికోత్సవమని, వసంతోత్సవమని మనదేశంలో నాలుగువిధాలుగా జరుపుకుంటారు. ఈ హోలీ పండుగను వసంతోత్సవం పేరుతో విదేశాలైన అమెరికా, జర్మనీ, పర్షియా ఈజిప్టు, గ్రీసు మొదలైన దేశాల్లో కూడా జరుపుకుంటారు. ఈ కాలం నాటిది కాదీ పండుగ: హోలీ పండుగ కృతయుగంలోనే పుట్టింది. పూర్వం రఘునాథుడనే రాజు జనరంజకంగా ప్రజలను పాలించేవాడు. కొంతకాలానికి అతని రాజ్యంలోని పసిపిల్లలను ‘హోలిక’ అనే రాక్షసి హింసిస్తోందని, దాని బారి నుంచి తమను రక్షించవలసిందిగా ప్రజలు రాజుకు మొరపెట్టుకున్నారు. అప్పుడు సభలో ఉన్న నారద మహాముని ప్రతి సంవత్సరం ఫాల్గుణ పౌర్ణమినాడు హోలికను పూజిస్తే పసిపిల్లలకు ఏ బాధలూ ఉండవని చెప్పాడు. దాంతో రాజు పై విధంగా పూజలు జరపమని ఆజ్ఞాపించడంతో ఆనాటి నుంచి ఈ ఉత్సవం జరుపుకుంటున్నారని ప్రతీతి. ఆ కాలంలో ఈ పండుగ రోజు రాత్రి సమయంలో పసిపిల్లలను ఇంట్లో దాచి ఉంచేవారని తెలుస్తుంది. హోలిక గురించి మరో కథ కూడా ఉంది. హోలిక హిరణ్యకశిపుని సోదరి. అగ్ని ఆమెను దహించదని వరం. ఆ వరాన్ని ఉపయోగించి, ప్రహ్లాదుని సంహరించ దలచాడు హిరణ్యకశిపుడు. అన్నగారి ఆజ్ఞమేరకు హోలిక ఆ పసివాణ్ణి ఒడిలో కూర్చోబెట్టుకుని అగ్నిలో ప్రవేశించింది. అయితే ఆ మంటల్లో హోలికయే అగ్నికి ఆహుతి కాగా, ప్రహ్లాదుదు మాత్రం చిరునవ్వుతో వెలుపలికి వచ్చాడు. అప్పుడు ప్రజలందరూ ఆనందోత్సాహాలతో కేరింతలు కొడుతూ ఒకరిపై ఒకరు రంగు నీళ్లు జల్లుకున్నారని కథనం. కామదేవోత్సవం: దక్షయజ్ఞం సమయంలో అవమానానికి గురైన సతీదేవి ప్రాణత్యాగం చేయడంతో శివుడు విరాగియై హిమవత్ పర్వతాన తపస్సు చేయసాగాడు. లోక కల్యాణం కోసం పార్వతియై పుట్టిన సతీదేవిపై శంకరునికి ప్రేమ కలిగించేందుకు ఇంద్రాది దేవతలు ఆలోచించి మన్మథుని పిలిచి విషయం వివరించారు. వెంటనే మన్మధుడు తన భార్య రతీదేవి, మిత్రుడు వసంతునితో కలిసి హిమవత్పర్వతాన్ని చేరాడు. పార్వతీదేవి ఈశ్వరునికి సపర్యలు చేస్తున్న సమయంలో శివునిపై మన్మథుడు తన పుష్పబాణాలు ఉపయోగించి ఆయన మనస్సును వికలం చేశాడు. దాంతో శివుడు కోపించి, మూడోకన్ను తెరిచి అతన్ని మసి చేశాడు. ఈ విధంగా మన్మథుణ్ణి శివుడు దహించి వేయడాన్ని ‘కాముని దహనం’ గా కాముని పున్నంగా ఫాల్గుణ శుద్ధ పూర్ణమి రోజు ప్రజలు పండుగ చేసుకుంటున్నారు. డోలికోత్సవం: వివిధ ప్రాంతాల్లో వివిధ రీతుల్లో ఈ పండుగను జరుపుకుంటారు. కొన్నిప్రాంతాల్లో ప్రజలందరూ వీధుల్లోకి వచ్చి ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొంటారు. దీనినే ‘దులండి’ అని కూడా అంటారు. మరికొన్ని ప్రాంతాల్లో ఈ రోజున పొరుగిళ్లలో దూరి పాలు, పెరుగు, వంటపదార్థాలను దొంగిలించే ఆచారాన్ని పాటిస్తారు. రాత్రి పూట కాముని విగ్రహాన్ని కట్టెల ద్వారా కాల్చివేస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ పండుగను ‘కాముని పున్నమని’ ‘కామ దహనమని’ వ్యవహరిస్తారు. వసంతకాలానికి మన్మథుని విజృంభణ సమయమని పేరు. మన్మథ తాపానికి గురికాకుండా ఉండేందుకు హోలీకి ముందు గ్రామాల్లో ప్రజలు ఇల్లిల్లు తిరిగి పాటలు పాడుకుంటూ ధాన్యాన్ని సేకరించి ఆనందోత్సాహాల మధ్య కామదహనం జరుపుకుంటారు. యువతీ యువకులు వసంతోత్సవం జరుపుకుంటారు. శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాల్లో కూడా కామదహనాన్ని, వసంతోత్సవాన్ని వేడుకగా నిర్వహిస్తారు. -
కచ్చీ దబేలీ
హోలీ స్పెషల్ కావలసినవి: ఎండు మిర్చి - 1; జీలకర్ర - అర టీ స్పూను; ధనియాలు - టీ స్పూను; దాల్చిన చెక్క - చిన్న ముక్క; లవంగాలు - 3 వెల్లుల్లి చట్నీ కోసం... ఎండు మిర్చి - 2 (వేడినీళ్లల్లో సుమారు అరగంటసేపు నానబెట్టాలి); వెల్లుల్లి రేకలు - కప్పు (సన్నగా తరగాలి); నిమ్మ రసం - అర టేబుల్ స్పూను; ఉప్పు - తగినంత... ఫిల్లింగ్ కోసం... జీలకర్ర - టీ స్పూను ; ఉల్లి తరుగు - పావు కప్పు; ఇంగువ - చిటికెడు; చింతపండు + ఖర్జూరం చట్నీ - 2 టేబుల్ స్పూన్లు; బంగాళ దుంపలు - 3 (ఉడికించి తొక్క తీసి ముద్ద చేయాలి); దబేలీ మసాలా - 2 టేబుల్ స్పూన్లు; ఉప్పు - తగినంత; కొబ్బరి తురుము - పావు కప్పు; కొత్తిమీర తరుగు - పావు కప్పు; దానిమ్మ గింజలు - పావు కప్పు; దబేలీ కోసం... పావ్ - 5 (మధ్యకు చేసి పెనం మీద బటర్‌తో కాల్చాలి); వేయించిన పల్లీలు - అర కప్పు; కొత్తిమీర తరుగు - అర కప్పు; సేవ్ - అర కప్పు; దానిమ్మ గింజలు - అర కప్పు; వెల్లుల్లి చట్నీ - తగినంత; చింతపండు + ఖర్జూరం చట్నీ - తగినంత.... తయారీ: బాణలిలో నూనె లేకుండా ఎండు మిర్చి, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, ధనియాలు వేయించి, చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసి పక్కన ఉంచాలి నానబెట్టిన ఎండు మిర్చి, వెల్లుల్లి, నిమ్మ రసం, ఉప్పు గ్రైండర్లో వేసి మెత్తగా ముద్ద చేసి పక్కన ఉంచాలి. (అవసరమైతే కొద్దిగా నీళ్లు కలపాలి) బాణలిలో నూనె వేసి కాగాక జీలకర్ర వేసి వేయించిన తర్వాత, ఉల్లి తరుగు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ఇంగువ జత చేసి వేయించాక, చింతపండు + ఖర్జూరం చట్నీ వేసి బాగా కలపాలి ముద్దగా చేసి ఉంచుకున్న బంగాళదుంప ముద్ద వేసి మరోమారు కలిపి దబేలీ మసాలా పొడి, ఉప్పు వేసి కలియబె ట్టి, సుమారు మూడు నిమిషాలు ఉడికించాలి. (ఒకవేళ బాగా పొడిపొడిగా అనిపిస్తే రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు జత చేయాలి) ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని, దాని మీద కొబ్బరి తురుము, ఆ పైన కొత్తిమీర తరుగు, ఆ పైన దానిమ్మ గింజలు వేసి పక్కన ఉంచాలి. (ద్రాక్ష పండ్లు కూడా వాడుకోవచ్చు) పావ్ మీద ఒక వైపు స్వీట్ చట్నీ, మరో వైపు రెడ్ గార్లిక్ చట్నీ పూయాలి పై భాగంలో బంగాళదుంప మిశ్రమం ఉంచి, ఆ పైన ఉల్లి తరుగు, కొత్తిమీర తరుగు వేయాలి. ఆ పైన పల్లీలు, దానిమ్మ గింజలు వేసి, దబేలీ మసాలా కొద్దిగా చల్లాక, పైన సేవ్ వేయాలి రెండవ పావ్ ఆ పైన ఉంచాలి అన్నిటినీ ఈ విధంగా తయారుచేసుకుని అందించాలి. -
హోలీమార్
రోజూ ఎవర్నెంత పరుగులు పెట్టించేవారైనా... హోలీ రోజున మాత్రం తాము కూడా పరుగులు పెట్టాల్సిందే! ఈ ఆటలో తన మన పర భేదాలుండవు. పొడిగానో, తడిగానో, జడిగానో.. ప్రతి ఒక్కరు తడవాల్సిందే! అయితే.. ఆ తడిసేదేదో కొంచెం స్టెయిల్‌గా, కొంచెం కంఫర్ట్‌గా ఉండేలా జాగ్రత్త పడడం మన ఛాయిసే! హ్యాపీగా హోలీ ఆడండి. ఆట అయ్యాక మళ్లీ ఒకసారి ఆ అనుభూతుల్లో తడవండి... ఏడురంగులు! ఏ రంగు ఎటు వైపు నుంచి మనల్ని ముంచేస్తుందో తెలియదు. అందుకే తెలుపు రంగు దుస్తులను ధరించండి. అన్ని రంగుల్నీ సమానంగా ఆహ్వానించి ఆ ఆనందపు కెరటాలను ఆస్వాదించండి. తెల్లని సల్వార్, రంగుల బాందినీ ప్రింటెడ్ చున్నీ ధరిస్తే చాలు పండగ సంబరం రెట్టింపు అయినట్లే. కాలే జీ యువతులైతే షార్ట్స్, వదులుగా ఉండే టీ షర్ట్ లేదా కుర్తాను ఈ పండగకు నిరభ్యంతరంగా ధరించవచ్చు. అయితే, తప్పనిసరిగా లైట్ వెయిట్ కాటన్ మెటీరియల్ దుస్తులను ఇందుకోసం ఎంచుకోవాలి. పోనీటెయిల్ మేలు జుట్టును లూజ్‌గా వదిలేస్తే రంగులు అంటుకుపోయి, వెంట్రుకల ఆరోగ్యం దెబ్బతింటుంది. అప్పుడు హోలీ ఆనందాన్ని పూర్తిగా ఎంజాయ్ చెయ్యలేరు. అందుకని ఫ్రెంచ్ పోనీటెయిల్ వేసుకుంటే స్టైల్‌గా కనిపిస్తారు, ప్లస్ జుట్టు గురించిన ఆందోళనా తగ్గుతుంది. పండగ కళ రావాలంటే పోనీటెయిల్కు పూసలు, కుందన్స్ ఉన్న క్లిప్ లేదా బ్యాండ్‌ను పెట్టుకోవచ్చు. హోలీ ఆడటానికి ముందు జుట్టుకు కండిషనర్ వాడితే రంగుల వల్ల పాడవుతుందనే బెంగ ఉండదు. లేదంటే ముందుగా వెచ్చని కొబ్బరి నూనెను తలకంతా బాగా పట్టించాలి. దీని వల్ల ఎంత గాఢమైన రంగులు మీద పడ్డా వెంట్రుకలు మాయిశ్చరైజర్‌ను కోల్పోవు. చర్మానికీ కవచాలున్నాయ్! కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్‌ను హోలీ ఆడటానికి ముందు శరీరానికి, ముఖానికి పట్టించాలి. ఇలా చేయడం వల్ల రంగుల వల్ల కలిగే మంట, దురద సమస్యలు ఉండవు. నూనె వల్ల కాసేపు చర్మం జిడ్డుగా అనిపిస్తుంది కానీ శుభ్రపరుచుకోవడం చాలా సులువు. చర్మకాంతి కూడా తగ్గదు. హోలీ రంగునీళ్ల నుంచి, ఎండవేడి నుంచి చర్మ సంరక్షణకు వాటర్‌ప్రూఫ్ సన్‌స్క్రీన్ మార్కెట్లో లభిస్తుంది. దీనిని ఉపయోగించవచ్చు. సహజత్వమే సురక్షితం మీ మీద రంగు పడితే మరి మీరు ఊరికే ఉంటారా? మీరూ చల్లుతారు. అయితే హోలీ ఆడటానికి సహజ సిద్ధమైన పువ్వులు, ఆకులతో తయారుచేసిన రంగులను ఉపయోగించండి. దీని వల్ల చర్మానికి హాని కలగదు సరికదా కాంతి పెరుగుతుంది! అయితే, అన్ని చోట్లా ఈ సహజసిద్ధమైన రంగులు లభ్యం కావు కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి. ఆడి అలసిపోయాక... హోలీ త ర్వాత షవర్‌బాత్ లేదా టబ్ బాత్ తప్పనిసరి. తర్వాత శరీరానికంతటికీ మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం రంగుల వల్ల పొడిబారకుండా ఉంటుంది. రంగుల్లోని సింథటిక్ కెమికల్స్‌లో చర్మసౌందర్యాన్ని దెబ్బతీసే గుణాలు ఎక్కువ. అందుకని తాజా పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు తాగితే చర్మం కాంతి తగ్గదు. మృదువుగా... మర్దనా... రంగులలో ఉండే రసాయనాలు చర్మంపై అధిక ప్రభావం చూపకుండా ఉండాలంటే అవకాడో(మార్కెట్లో లభిస్తుంది) స్క్రబ్‌ని మేనికి రాసి, మృదువుగా రుద్దాలి. సబ్బుకు బదులుగా దీనిని ఉపయోగించడం వల్ల చర్మానికి అంటుకున్న రంగులు త్వరగా వదలడమే కాకుండా తగినంత మర్దనా లభించి, మృతకణాలు తొలగిపోతాయి. ఆ విధంగా రెండు రకాల ఉపయోగాలనూ పొందవచ్చు. హోలీ పండగ సంబరాన్ని కొన్నాళ్ల వరకు మదిలో నిలుపుకోవాలంటే ఆ ఆనంద క్షణాలను ఫొటోల రూపంలో భద్రపరుచుకోవడమే కాదు, మేనికి రక్షిత చర్యలూ తీసుకోవాలి. పిల్లల విషయంలోనూ ఈ జాగ్రత్తలు తప్పనిసరి. ఎంజాయ్ హోలీ. యాడ్ కలర్స్ టు యువర్ లైఫ్. గోళ్లను కత్తిరించాలి చెవులు, గోళ్లలో రంగు ఇరుక్కుపోకుండా ఉండటానికి. ఈ ప్రాంతాలలో పెట్రోలియమ్ జెల్లీ రాసుకుంటే సమస్య నుంచి నివారణ పొందవచ్చు. హోలీ ఆడిన తర్వాత ఎంత శుభ్రపరిచినా రంగు గోళ్లలో ఉండిపోతుంది. అలాగే ఆహారపదార్థాలు తినేస్తుంటారు. దీంతో రంగు గోళ్ల నుంచి పదార్థాల ద్వారా పొట్టలోకి చేరుతుంది. అందుకని తప్పనిసరిగా గోళ్లను కత్తిరించుకోవాలి. రోజుకన్నా ఎక్కువ నీళ్లు సేవించడం వల్ల చర్మంలోని మలినాలు కూడా శుద్ధి అవుతాయి. చర్మం దురద, చిన్న చిన్న దద్దుర్లు రాకుండా ఉండాలంటే కాలమైన్ లోషన్ రాసుకోవడం మేలు. కాలమైన్ లోషన్‌ను హోలీకి ముందు, తర్వాత రాసుకుంటే చర్మ సమస్యలు దరిచేరవు. హోలీ ఆడిన తర్వాత కొన్ని రోజుల వరకు మేకప్‌కు దూరంగా ఉండటం మేలు. చర్మానికి తగినంత గాలి, కాంతి అందాలి. ఇందుకు రిఫ్రెషింగ్ ఫేస్ ప్యాక్‌లు చర్మాన్ని యథాస్థితికి తీసుకురావడానికి ఉపయోగపడతాయి. - డా.షాను, చర్మవైద్య నిపుణులు -
హోలీ... రంగెలా వదిలేది?
హోలీ... అందరికీ ఎంతో ఇష్టమైన, సరదా అయిన పండుగ. రంగులు వెదజల్లుకునే ఆ పండుగ నాడు... జీవితానికే ఓ కొత్త రంగును వచ్చినట్టుగా అనిపిస్తుంది. ప్రపంచమంతా కలర్ఫుల్గా మారిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే పండుగ వరకూ ఓకే గానీ... ఆ తర్వాతే వస్తుంది అసలు తంటా. ఒంటికి, బట్టలకి అయ్యే రంగుల్ని వదిలించేసరికి తల ప్రాణం తోకకొస్తుంది. అలా అని రంగులు చల్లుకోకుండా ఉండలేం కదా. అందుకే హ్యాపీగా పండుగ చేసుకోండి. ఆ తర్వాత రంగుల్ని వదిలించుకోవడానికి ఈ చిట్కాలు ఫాలో అయిపోండి! ఒంటి రంగులకి: శెనగపిండిలో పాలు, పెరుగు, బాదం నూనె, రోజ్‌వాటర్ కలిపి పేస్ట్‌లా చేసి, ఒళ్లంతా పట్టించి, కాసేపుంచి కడిగేసుకుంటే రంగు వదిలిపోతుంది. కొబ్బరినూనెని కొద్దిగా వెచ్చబెట్టి, దానితో ఒళ్లంతా మర్దనా చేసుకోవాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే ఫలితముంటుంది. కలబంద గుజ్జులో నిమ్మరసం కలిపి ఒళ్లంతా రుద్దుకుని, ఆపైన స్నానం చేస్తే రంగులు పోతాయి. కొన్నిసార్లు ఒళ్లంతా వదిలిపోయినా, ముఖానికి అంటిన రంగు మాత్రం త్వరగా వదలదు. అలాంటప్పుడు ముల్తానీ మట్టితో ప్యాక్ వేసుకుంటే మంచిది. రంగులు చర్మానికి అంటుకుపోయి దురదగా అనిపిస్తే... గ్లిజరిన్, రోజ్ వాటర్ కలిపి రాసుకుని, గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే దురద పోతుంది.తలకు అంటిన రంగుల్ని వదిలించడానికి... పెరుగులో గుడ్డు తెల్లసొనను కలిపి తలకు పట్టించాలి. గంట తర్వాత షాంపూతో తలంటుకుంటే సరిపోతుంది. బట్టల రంగులకి బట్టలపై రంగుల మరకలు ఉండిపోతే... నిమ్మరసంతో రుద్ది, వేడి నీళ్లతో ఉతికితే పోతాయి.అరకప్పు వైట్ వెనిగర్‌లో చెంచాడు లిక్విడ్ డిటర్జెంట్‌ను వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని చల్లని నీటిలో వేసి కలిపి, అందులో బట్టల్ని నానబెట్టాలి. కాసేపటి తర్వాత తీసి ఉతికితే రంగులు తేలికగా పోతాయి. వేడి నీటిలో బ్లీచింగ్ పౌడర్ వేసి నానబెట్టి ఉతికితే ఫలితముంటుంది. అయితే క్లోరిన్ లేని బ్లీచ్నే వాడాలి.మార్కెట్లో కలర్ రిమూవర్స్ కూడా దొరుకుతాయి. వాటిని ఉపయోగిస్తే అసలు సమస్యే ఉండదు. వాషింగ్ మెషీన్లో ఉతకాలనుకుంటే... విప్పిన బట్టల్ని ముందు నీటిలో జాడించి అప్పుడు మెషీన్లో వేయండి. అలాగే డిటర్జెంట్ పౌడర్‌తో పాటు కాస్త వైట్ వెనిగర్‌ను వేస్తే, రంగులు మెషీన్‌కు అంటుకోకుండా ఉంటాయి! -
రసాయనం వద్దు... సహజం ముద్దు
హోలీ కేళీలో ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం రంగుల ఎంపికలో జాగ్రత్తలు తప్పనిసరి రసాయన రంగులకు దూరంగా ఉండాలి బెంగళూరు: కొద్ది రోజుల్లో హోలీ పండుగ రానుంది. సగటు మెట్రో నివాసి జీవితానిని ఉత్సాహంగా సప్తవర్ణాల శోభను అద్దేందుకు రంగుల కేళీ హోలీ వచ్చేసింది. సప్తవర్ణ శోభితమైన హోలీకి స్వాగతం చెప్పడానికి నగర వాసులు కూడా హుషారుగా సన్నద్ధమయ్యారు. అయితే హోలీ రోజున కాసిన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదని చర్మ నిపుణులు సూచిస్తున్నారు. రసాయన రంగులను కాకుండా సహజసిద్ధమైన రంగులతో హోలీ ఆడడం ద్వారా చర్మానికి హాని జరక్కుండా చూసుకోవాలని చెబుతున్నారు. ఇక హోలీ కారణంగా నీటిని వృథా చేసే పద్ధతికి కూడా స్వస్తి పలకాలని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు. ఈ నెల 5న హోలీ జరుపుకోనున్న నేపథ్యంలో నిపుణుల సూచనలతో కూడిన ప్రత్యేక కథనం. సహజ రంగులతో హోలీ సాధారణంగా హోలీ ఆడిన తర్వాత చాలా మందిని ఇబ్బంది పెట్టేది చర్మ సమస్యలు. ఇందుకు కారణం రంగుల్లో ఎక్కువ మోతాదులో రసాయన పదార్థాలు కలిసి ఉండడమే. ఈ తరహా రంగులు శరీరంపై ఎక్కువ సేపు ఉంటే చర్మ సంబంధ సమస్యలు తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు. ఇక ఈ తరహా రంగులు పొరపాటున పడితే కళ్లకు చాలా ప్రమాదం కూడా. అందుకే హోలీ ఆడే సమయంలో మనం ఎంచుకునే రంగుల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. వీలైనంత వరకు రసాయనాలు కలిపిన రంగులకు దూరంగా ఉండాలని వైద్యుల ఉవాచ. వీటికి బదులు సహజసిద్ధంగా తయారైన రంగులను హోలీ కోసం ఎంచుకోవాలని స్కిన్ స్పెషలిస్ట్ సుహానా తెలిపారు. ‘రసాయన రంగులకు బదులు హెన్నా(గోరింటాకు పొడి), పసుపు, కుంకుమ, చందనం, టమాట గింజలతో తయారైన పొడి ఇలా సహజసిద్ధ రంగులను హోలీలో ఆడడం వల్ల చర్మానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంతేకాదు చర్మ సంబంధ వ్యాధుల నుంచి కూడా ఇవి రక్షణ కల్పిస్తాయి. ఒక వేళ రసాయన రంగులతోనే హోలీ ఆడాల్సిన పరిస్థితి ఉంటే కళ్లలో పడకుండా జాగ్రత్త వహించాలి. నీటి విషయంలో జాగ్రత్త ఇక హోలీ వేళ నగరంలోని వివిధ షాపింగ్ మాల్స్, కూడళ్లతోపాటు అపార్ట్మెంట్లు తదితర ప్రాంతాల్లో ఎక్కువగా రంగులను నీటిలో కలిపి చల్లుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి ప్రదేశాల్లో రంగులను కలపడానికి ఎంచుకునే నీరు పరిశుభ్రంగా ఉండేందుకు అవకాశాలు చాలా తక్కువ. ఇక షాపింగ్‌మాల్స్ వంటి ప్రాంతాల్లో అయితే ఏదో దొరికిన నీటిలోనే రంగులను కలపడంతోపాటు ఒకసారి చల్లుకున్న రంగునీటిని మళ్లీ సేకరించి తిరిగి అదే నీటిని పైపుల ద్వారా పంపుతుంటారు. ఇలాంటి సందర్భాల్లో అపరిశుభ్రమైన నీటిలో రంగులను కలిపి హోలీ ఆడడం వల్ల అనేక చర్మ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనేది వైద్యుల హెచ్చరిక. ఇక నగరంలో వేసవి ఛాయలు ప్రారంభమైన తరుణంలో హోలీ పేరిట నీటిని వృథా చేయవద్దని పర్యావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఇందుకు బదులుగా ‘డ్రై హోలీ’ని జరుపుకోవాల్సిందిగా కోరుతున్నారు. ఈ సూచనలు పాటిస్తే మేలు రసాయనాలు కలిసిన రంగులతో హోలీ ఆడితే, వాటిని శరీరంపై ఎక్కువ సమయం ఉండనీయకండి. వెంటనే చల్లని నీటితో శరీరాన్ని శుభ్రం చేసుకోండి. ఎక్కువగా ఎరుపు, పింక్ రంగులనే హోలీ కోసం వాడండి. ఇవి తక్కువ గాఢత కలిగి ఉండడంతో శరీరంపై నుంచి సులభంగా తొలగిపోతాయి. గ్రీన్, ఎల్లో, ఆరంజ్ రంగులు ఎక్కువ రసాయనాలను కలిగి ఉన్న కారణంగా సులభంగా శరీరంపై నుంచి తొలగిపోవు. హోలీ ఆడడానికి ముందు మీ ముఖానికి మాయిశ్చరైజర్‌ని, తలకు నూనెను రాసుకోండి. దీని వల్ల రంగులు శరీరంలోకి ఇంకవు. రంగులను శుభ్రం చేయడం కూడా సులభమవుతుంది. ముఖంపై పడిన రంగులను శుభ్రం చేసుకోవడానికి సబ్బు కన్నా క్లెన్సింగ్ మిల్క్ ఉత్తమం. చాలా మంది రంగుల్లో వివిధ ఆయిల్స్ కలిపి రాస్తూ ఉంటారు. ఈ కారణంగా రంగులను శుభ్రం చేయడానికి ఎక్కువ నీరు అవసరమవుతుంది. అందుకే రంగుల్లో ఎటువంటి ఆయిల్స్ లేదా నీటిని కలపకుండా హోలీ ఆడితే నీటి వృథాను అడ్డుకోవచ్చు.