independence day
-
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధ ఖైదీల మార్పిడి
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది.ఇటీవల ఉక్రెయిన్ సైన్యం రష్యాపై దాడిని పెంచింది. ఉక్రెయిన్ మిలటరీ.. రష్యా భూభాగంలోకి చొచ్చుకుపోతోంది. యుద్దం మొదలైన తర్వాత జరుపుకోనున్న ఉక్రెయిన్ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ఇరు దేశాలు సుమారు 100 మంది యుద్ధ ఖైదీలను మార్పిడి చేసుకున్నారు. రష్యా దాడులు ప్రారంభించిని మొదటి నెలలోనే 115 మంది ఉక్రెయిన్ సైనికులను క్రెమ్లిన్ నిర్బంధించిందని ఉక్రెయిన్ అధికారులు పేర్కొన్నారు. వారిలో దాదాపు 50 మంది సైనికులను మారియుపోల్‌లోని అజోవ్‌స్టాల్ స్టీల్‌వర్క్స్ నుంచి రష్యన్ దళాలు తమ అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. రెండువారాల క్రితం ఊహించని రీతిలో ఉక్రెయిన్ సైన్యం తమ సరిహద్దుల్లోని భూభాగాల్లోకి చొచ్చుకువచ్చిందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆ దాడుల్లో కూర్స్క్ ప్రాంతంలో 115 మంది రష్యా సైనికులు ఉక్రెయిన్‌కు పట్టుపడ్డారని తెలిపారు. వారంతా ప్రస్తుతం బెలారస్లో ఉన్నారని అయితే తాజాగా యుద్ధ ఖైదీలలో మార్పిడిలో భాగంగా వారికి వైద్య చికిత్స, పునరావాసం అందించటంల కోసం రష్యాకు తీసుకువెళ్లనున్నట్ల పేర్కొంది. 22 ఫిబ్రవరి 2022లో యుద్దం మొదలైనప్పటి నుంచి ఇది 55వసారి యుద్ధఖైదీల మార్పిడి అని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ అన్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్యవర్తిత్వంతో సైనికుల మార్పిడి జరిగిందని ఎక్స్‌లో పేర్కొన్నారు. ‘‘మాకు ప్రతిఒక్కరూ గుర్తున్నారు. అందరీని స్వదేశానికి రప్పించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం’’ అని అన్నారు. -
న్యూజెర్సీ సాయిదత్త పీఠంలో అట్టహాసంగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
-
మెల్బోర్న్లో మైండ్ బ్లోయింగ్ క్రేజ్.. వరల్డ్ కప్ తో రామ్ చరణ్ (ఫొటోలు) (ఫొటోలు)
-
డాలస్‌లో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
డాలస్, టెక్సస్: డాలస్‌లో నెలకొనియున్న అమెరికా దేశంలోనే అతిపెద్దదైన మహాత్మాగాంధీ స్మారకస్థలి వద్ద వందలాది మంది ప్రవాస భారతీయులు భారతదేశ 78వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల్లో అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సస్ కార్యదర్శి రావు కల్వాల అందరికీ స్వాగతం పలుకుతూ వారాంతం కాకపోయినప్పటికీ అత్యధిక సంఖ్యలో ప్రజలు హాజరుకావడం ఆనందదాయకమని, మహాత్మాగాంధీ మెమోరియల్ స్థాపించి 10 సంవత్సరాలు పూర్తయిందని, ఈ స్మారకస్థలి అన్ని విశేష కార్యక్రమాలకు ప్రధాన వేదిక అయిందని, దీన్ని సాకారం చెయ్యడానికి విశేష కృషిచేసి, నాయకత్వం వహించిన ప్రవాసభారతీయ నాయకులు డా. ప్రసాద్ తోటకూరకు, సహకరించిన అధికారులకు, ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ ప్రపంచంలోనే అతి పురాతనమైన ప్రజాస్వామ్యదేశం అమెరికాలో, ప్రపంచంలోనే అతి పెద్దదైన ప్రజాస్వామ్యదేశం భారతదేశ 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం సంతోషమని, స్వాతంత్ర్య సముపార్జనలో ముఖ్యపాత్ర పోషించిన మహాత్మాగాంధీ స్మారకస్థలి వద్ద ఈ వేడుకలు జరుపుకోవడం ఇంకా విశేషమని, దేశస్వాతంత్ర్యం కోసం సర్వం త్యాగంచేసిన సమరయోధులు అయినా గాంధీ, నెహ్రు, సర్దార్ వల్లభభాయి పటేల్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు లాంటి నాయకులు చేసిన సేవలు చిరస్మరణీయం అంటూ ఘన నివాళులర్పించారు.ఎన్నో దశాబ్దాలగా ఇక్కడ నివాసముంటున్న ప్రవాస భారతీయులు అమెరికాదేశ విధి విధానాలను గౌరవిస్తూ, ఎన్నికలలో పాల్గొంటూ, ఇక్కడి జనజీవన స్రవంతిలో మమేకం అవ్వవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు... మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ బోర్డు సభ్యులు, ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ బోర్డ్ సభ్యులు సుష్మా మల్హోత్రా, బి.ఎన్ రావు, జస్టిన్ వర్ఘీస్, జగజిత్లు అందరికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అందజేశారు. వివిధ సంఘాల ప్రతినిధులు - సత్యన్ కల్యాణ్ దుర్గ్, శాంటే చారి, లెనిన్ బాబు వేముల, నాగలక్ష్మి, గాయని భారతి, కమల్ ఫులాని మొదలైన వారు పాల్గొన్నారు. దేవులపల్లి కృష్ణ శాస్త్రి రచించిన “జనయిత్రీ దివ్యధాత్రి” గీతం లెనిన్ వేముల శ్రావ్యంగా గానంచేసి అందరినీ పరవశుల్ని చేశారు. -
ఖైరతాబాద్ నియోజకవర్గంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు (ఫొటోలు)
-
చిన్నబాబు కోసం.. పంద్రాగస్టు శకటాల ప్రదర్శనలో విద్యా శకటానికి ఫస్ట్ ప్రైజ్
-
పంద్రాగస్టు వేడుకల్లో వైఎస్సార్సీపీ
-
దేశానికి లౌకిక పౌరస్మృతి తక్షణావసరం.. : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఇంకా ఇతర అప్డేట్స్
-
పేదరికాన్ని పీ4తో తరిమేస్తాం
సాక్షి, అమరావతి: ‘పేదరికం లేని సమాజం మా ప్రభుత్వ విధానం. గతంలో పీ–3 (పబ్లిక్, ప్రైవేటు, పార్ట్నర్షిప్ విధానంతో సంపద సృష్టించాం. ఇప్పుడు పీ–4 (పీపుల్, పబ్లిక్, ప్రైవేట్, పార్టనర్ షిప్)తో పేదరికాన్ని నిర్మూలిస్తాం’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గురువారం విజయవాడలోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన 78వ స్వాతంత్య్ర దినోత్సవాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించి.. సాయుధ దళాల వందనాన్ని స్వీకరించారు. ఆయన ఏమన్నారంటే.. సూపర్ సిక్స్ హామీలకు కట్టుబడి ఉన్నాం.. సూపర్ సిక్స్ హామీలకు కట్టుబడి ఉన్నాం. తొలిరోజే 5 కీలక అంశాలపై సంతకాలు చేసి మాట నిలబెట్టుకున్నాం. 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ఫైలుపై తొలి సంతకం చేసి నియామక ప్రక్రియ మొదలెట్టాం. సామాజిక పింఛన్లను పెంచి ప్రతి నెలా 1వ తేదీనే వలంటీర్లతో పని లేకుండా ఇంటి వద్దే పంపిణీ చేస్తున్నాం. అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు రూ.20 వేలు ఆర్థ్ధిక సాయం అందిస్తాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ప్రజల ఆస్తులకు భద్రత కల్పించాం. ఆదాయాన్ని కాదని ఉచిత ఇసుక.. ప్రభుత్వానికి ఆదాయాన్ని వదులుకుని ఉచిత ఇసుక విధానం మొదలు పెట్టాం. మరింత పకడ్బందీగా దీన్ని అమలు చేస్తాం. 3.54 కోట్ల మందికి నైపుణ్య గణన చేపట్టి మెరుగైన ఉపాధి కల్పించేలా కార్యాచరణ అమలు చేస్తాం. అన్న క్యాంటీన్లకు విరాళాలు పేదవాడికి పట్టెడన్నం పెట్టాలన్న సంకల్పంతో నేటి నుంచి 100 అన్న క్యాంటీన్లను పునరుద్ధరిస్తున్నాం. వీటి సంఖ్యను 203కు పెంచుతాం. పుట్టిన రోజు, పెళ్లి రోజు, శుభకార్యాల సందర్భంగా విరాళాలు ఇచ్చేవారి పేరిట ఆ రోజు అన్న క్యాంటీన్లలో భోజనం పెడతాం. పోర్టులు–రహదారుల అనుసంధానం పోర్టులు, ఎయిర్ పోర్టులు, జాతీయ రహదారులను అనుసంధానం చేసి సంపద సృష్టిస్తాం. విజయవాడ, విశాఖపట్నంలో మెట్రో రైల్ ప్రాజెక్టును మళ్లీ పట్టాలు ఎక్కిస్తాం. వంశధార – నాగావళి – గోదావరి – కృష్ణా –పెన్నా నదులను అనుసంధానిస్తాం. కళాశాలల ఖాతాల్లో నేరుగా ఫీజు రీయింబర్స్మెంట్ సొమ్ములు జమ చేసేలా పాత విధానాన్ని పునరుద్ధరిస్తాం. గత ప్రభుత్వం బకాయి పెట్టిన ఆరోగ్యశ్రీ బిల్లులను దశలవారీగా చెల్లిస్తున్నాం. ఎన్టీఆర్ బేబీ కిట్స్’ను తిరిగి ప్రవేశ పెడతాం. మా ప్రభుత్వంలో రాజకీయ కక్ష సాధింపులకు తావులేదు. ఎస్సీల వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. రూ.9.74 లక్షల కోట్లకు రాష్ట్ర అప్పులు రాష్ట్ర అప్పులు రూ.9.74 లక్షల కోట్లకు చేరుకున్నాయి. తలసరి అప్పు రూ.74,790 నుంచి రూ.1,44,336కి పెరిగింది. తలసరి ఆదాయం 13.2 శాతం నుంచి 9.5 శాతానికి తగ్గింది. ద్రవ్యోల్బణం పెరిగింది. పేదవారికి ఉపయోగపడే కార్యక్రమాలేవీ గత ప్రభుత్వం అమలు చేయలేదు. 100 రోజుల ప్రణాళిక వచ్చే వంద రోజుల్లో పారిశ్రామికరంగంతో పాటు ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్, ఎల్రక్టానిక్, ఐటీ అండ్ క్లౌడ్, టెక్స్టైల్, టూరిజం పాలసీలు తెస్తున్నాం. సులభతర వాణిజ్యంలో మళ్లీ రాష్ట్రాన్ని అగ్రగామిగా చేస్తాం. మెడ్‌టెక్ జోన్ స్ఫూర్తిగా మరో 100 పారిశ్రామిక పార్కులు ఏర్పాట్లు చేస్తాం. -
సత్వర న్యాయం కోసం సంస్కరణలు
సాక్షి, అమరావతి: సామాన్యులకు సత్వర న్యాయాన్ని అందించడంలో జాప్యాన్ని, అవరోధాలను అధిగమించేందుకు న్యాయ వ్యవస్థలో పలు సంస్కరణలను అమలు చేస్తున్నామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ చెప్పారు. గురువారం హైకోర్టులో నిర్వహించిన 78వ స్వాతంత్య్ర దినోత్సవాల్లో జస్టిస్ ఠాకూర్ జాతీయ జెండా ఎగురవేశారు. అంతకు ముందు ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ దేశాల స్వాతంత్య్రోద్యమాల్లో భారతదేశ స్వాతంత్రోద్యమం ఎంతో ప్రత్యేకమైనదన్నారు. పేదరికం, నిరక్షరాస్యత, సైబర్ నేరాలు, ఉగ్రవాదం, ప్రకృతి విపత్తులు, పర్యావరణ మార్పులు వంటి సవాళ్లను విజయవంతంగా అధిగమిస్తూ మన దేశం పురోగతి వైపు పరుగులు పెడుతోందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ ఎన్.ద్వారకనాథరెడ్డి, అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కిలిగినీడి చిదంబరం, అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) ఇవన సాంబశివ ప్రతాప్, రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ, హైకోర్టు న్యాయవాదుల సంఘం ఉపాధ్యక్షుడు ఎన్.రంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి నన్నపనేని శ్రీహరి పాల్గొన్నారు. లోకాయుక్తలో.. కర్నూలు (సెంట్రల్, అగ్రికల్చర్): దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని లోకాయుక్త చైర్మన్ జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డి అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం కర్నూలులోని లోకాయుక్త కార్యాలయ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఉప లోకాయుక్త జస్టిస్ పి.రజినీ, రిజి్రస్టార్ టి.వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు. ఏపీఈఆర్సీలో..కర్నూలులోని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఏపీ ఈఆర్సీ) భవనంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కమిషన్ చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి గురువారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఏపీఈఆర్సీ సభ్యులు ఠాకూర్ రాంసింగ్, వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు. -
జోరు వానలో ఎట్ హోమ్
సాక్షి, హైదరాబాద్: దేశ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గురువారం సాయంత్రం రాజ్‌భవన్ ప్రాంగణంలో ఎట్ హోమ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ సీనియర్ నేతలు కె.కేశవరావు, చిన్నారెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు, ఎంపీలు మల్లు రవి, ఈటల రాజేందర్, ఎమ్మెల్సీ ఎల్. రమణ, సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమం ప్రారంభమైన కొద్దిసేపటికే భారీ వర్షం మొదలైంది. అయితే వాటర్‌ప్రూఫ్ టెంట్లు వేసి ఉండటంతో జోరు వానలోనూ కార్యక్రమం యథావిధిగా కొనసాగింది. ఈ కార్యక్రమానికి హాజరైన స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలు, పద్మ పురస్కార గ్రహీతల వద్దకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్‌రెడ్డి వెళ్లి పలకరించారు. చివర్లో గవర్నర్ అతిథుల టేబుల్స్ వద్దకు వెళ్లి అందరినీ పలకరించారు. కాగా, వర్షపు నీటి ప్రవాహం టేబుల్స్ కిందకి చేరడంతో చివర్లో కొంత అసౌకర్యం కలిగింది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నేతలు ఎవరూ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు.భిన్నత్వంలో ఏకత్వమే మన బలంమాతృభూమికి స్వాతంత్య్రం కోసం పోరాడిన అసంఖ్యాక దేశభక్తుల నిస్వార్థ త్యాగాలు చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచాయని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం ఆయన రాజ్‌భవన్ దర్బార్ హాల్ ఎదుట జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. గడిచిన ఏడు దశాబ్దాల్లో దేశం అద్భుత ప్రగతిని సాధించిందన్నారు. భిన్నత్వంలో ఏకత్వమే మన అతిపెద్ద బలమని స్పష్టం చేశారు. దేశం, రాష్ట్ర అభివృద్ధికి అకుంఠిత దీక్షతో పనిచేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాజ్‌భవన్ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ప్రతి ఒక్కరూ చాంపియనే
న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత అథ్లెట్ల బృందాన్ని గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఎర్రకోట వద్ద స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల అనంతరం న్యూఢిల్లీలోని తన నివాసంలో అథ్లెట్ల బృందంతో ప్రధాని భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పారిస్ క్రీడల్లో రెండు పతకాలు సాధించి కొత్త చరిత్ర లిఖించిన షూటర్ మనూ భాకర్.. ఒలింపిక్స్‌లో వినియోగించిన పిస్టల్ ను ప్రధానికి చూపించింది. ఇక వరుసగా రెండో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన భారత పురుషుల హాకీ జట్టును ప్రధాని ప్రత్యేకంగా అభినందించారు. ఇటీవల కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేశ్, కెపె్టన్ హర్మన్‌ప్రీత్ సింగ్‌తో మోదీ ముచ్చటించారు. ఈ సందర్భంగా జట్టు ఆటగాళ్లంతా సంతకాలు చేసిన జెర్సీతో పాటు ఓ హాకీ స్టిక్‌ను ప్రధానికి అందించారు. పారిస్ క్రీడల్లో కాంస్య పతకం అందుకున్న రెజ్లర్ అమన్ సెహ్రావత్ కూడా భారత జెర్సీని ప్రధానికి బహుమతిగా ఇచ్చారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మనూ భాకర్‌తో కలిసి కాంస్య పతకం గెలిచిన సరబ్‌జ్యోత్ సింగ్, 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్లో కాంస్యం నెగ్గిన స్వప్నిల్ కుసాలేను కూడా ప్రధాని అభినందించారు. అనంతరం క్రీడాకారుల మధ్య కలియదిరిగిన ప్రధాని వారితో సంభాíÙంచారు. ఒలింపిక్స్‌లో వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవీయా, భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష పాల్గొన్నారు. ‘పారిస్ ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్లతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. విశ్వక్రీడల్లో వారి అనుభవాలు వినడం.. వారి విజయాలను ప్రశంసించడం తృప్తినిచ్చింది. పారిస్‌కు వెళ్లిన ప్రతీ భారత క్రీడాకారుడు చాంపియనే. ప్రభుత్వం క్రీడలకు మద్దతునిస్తుంది. మౌలిక సదుపాయాల కల్పనలో ఎల్లప్పుడూ ముందుంటుంది’ అని ప్రధాని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఒలింపిక్స్‌లో రజతం నెగ్గిన స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. పారిస్ క్రీడలు ముగిసిన వెంటనే చికిత్స కోసం జర్మనీకి వెళ్లడంతో అతడు ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. త్రుటిలో పతకానికి దూరమైన షట్లర్ లక్ష్యసేన్, వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను, బాక్సర్ లవ్లీనా బొర్గోహైన్తో పాటు ఇతర అథ్లెట్లతోనూ ప్రధాని సంభాషించారు. పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ నుంచి 117 మంది అథ్లెట్లు బరిలోకి దిగారు. ఓవరాల్‌గా ఈ క్రీడల్లో దేశానికి ఆరు (ఒక రజతం, 5 కాంస్యాలు) పతకాలు వచ్చాయి. అంతకుముందు ఎర్రకోట వద్ద జరిగిన 78వ స్వాతంత్య్ర వేడుకల్లో ఒలింపిక్ అథ్లెట్ల బృందం పాల్గొంది. ఈ సందర్భంగా ప్రధాని ‘పారిస్’ క్రీడల్లో పాల్గొన్న అథ్లెట్లకు ధైర్యం చెబుతూనే.. పారాలింపిక్స్‌కు వేళ్లనున్న క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఒలింపిక్స్‌కు ఆతిథ్యమివ్వడం భారత్ కల అని.. 2036లో విశ్వక్రీడలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నామని ప్రధాని పునరుద్ఘాటించారు. ఫీల్డ్ గోల్స్‌తోనే అది సాధ్యం: శ్రీజేశ్ న్యూఢిల్లీ: విశ్వక్రీడల్లో నిలకడగా పతకాలు సాధించాలంటే.. ఫీల్డ్ గోల్స్‌పై దృష్టి పెట్టాల్సిన అవసరముందని అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికిన భారత గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేశ్ అన్నాడు. ఒలింపిక్స్ వంటి మెగా టోర్నీల్లో సత్తా చాటాలంటే.. పెనాల్టీ కార్నర్లను వినియోగించుకోవడంతో పాటు.. ఫీల్డ్‌గోల్స్ ఎక్కువ చేయాలని శ్రీజేశ్ పేర్కొన్నాడు. పారిస్ క్రీడల్లో కాంస్య పతకం సాధించిన భారత జట్టు మెగా టోరీ్నలో మొత్తం 15 గోల్స్ చేసింది. అందులో 9 పెనాల్టీ కార్నర్లు, మూడు పెనాల్టీ స్ట్రోక్స్ ఉన్నాయి. అంటే కేవలం మూడే ఫీల్డ్ గోల్స్ చేయగలిగింది. అదే సమయంలో స్వర్ణం గెలిచిన నెదర్లాండ్స్ 14 ఫీల్డ్ గోల్స్, రజతం నెగ్గిన జర్మనీ 15 ఫీల్డ్ గోల్స్ చేశాయి. కాంస్య పతక పోరులో భారత్ చేతిలో ఓడి నాలుగో స్థానంలో నిలిచిన స్పెయిన్ కూడా 10 ఫీల్డ్ గోల్స్‌తో ఆకట్టుకుంది. ‘పెనాల్టీ కార్నర్ల విషయంలో మన ప్లేయర్ల ఆలోచనల్లో మార్పు రావాల్సిన అవసరముంది. వరుస విజయాలు సాధించాలంటే మనం ఎందులో మెరుగ్గా ఉన్నామో దానిపైనే కాకుండా.. ఇతర వాటిపై కూడా దృష్టి పెట్టాలి. ఫీల్డ్ గోల్స్‌లో సత్తా చాటితే హాకీలో పూర్వవైభవం సాధ్యమే’ అని శ్రీజేశ్ అన్నాడు. -
గోల్కొండ కోటపై ఘనంగా పంద్రాగష్టు పండుగ (ఫొటోలు)
-
పంద్రాగస్టు స్పీచ్‌తో సరికొత్త రికార్డు
-
తెలంగాణ పార్టీ ఆఫీసుల్లో స్వాతంత్ర్య వేడుకలు
-
తెలంగాణ అసెంబ్లీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
-
పవన్ కళ్యాణ్ ఇండిపెండెన్స్ డే స్పీచ్
-
జవాన్ ల స్వాతంత్య్ర దినోత్సవ విన్యాసాలు
-
ఎందరో మహనీయుల త్యాగ ఫలితమే స్వాతంత్య్రం
-
2047 నాటికి వికసిత భారత్ మన లక్ష్యం
-
న్యూఢిల్లీ : ఎర్రకోటపై జెండాను ఎగురవేసిన ప్రధాని మోదీ (ఫొటోలు)
-
వాఘా బార్డర్ లో జవాన్ ల స్వాతంత్య్ర వేడుకలు
-
విజయవాడ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
-
గోల్కొండ కోటలో జాతీయ జెండా ఎగురవేసిన సీఎం రేవంత్ రెడ్డి
-
రాష్ట్ర ప్రజలకు వైఎస్ జగన్ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు