india- south africa
-
దక్షిణాఫ్రికాతో ఫైనల్ మ్యాచ్.. టీమిండియా కీలక నిర్ణయం
టీ20 వరల్డ్‌కప్-2024 టైటిల్‌ను ముద్దాడేందుకు టీమిండియా అడుగు దూరంలో నిలిచింది. ఈ మెగా టోర్నీ తుదిపోరులో జూన్ 29 (శనివారం) బార్బోడస్ వేదికగా దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది.ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి తమ 13 ఏళ్ల వరల్డ్‌కప్ నిరీక్షణకు తెరదించాలని భారత్ భావిస్తోంది. ఈ తుది పోరు కోసం రోహిత్ సేన ఇప్పటికే బార్బోడస్‌కు చేరుకుంది. అయితే ఫైనల్ మ్యాచ్‌కు ముందు భారత జట్టు మెనెజ్‌మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫైనల్ మ్యాచ్ ముందు తమ జట్టు ఆటగాళ్లు ఎటువంటి గాయాల బారిన పడకుండా ఉండడానికి శుక్రవారం తమ ప్రాక్టీస్ సెషన్‌ను భారత్ మెనెజ్‌మెంట్ రద్దు చేసింది. సెమీఫైనల్‌కు, ఫైనల్‌కు కేవలం ఒక్క రోజు మాత్రమే గ్యాప్ ఉండడంతో మెనెజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది.కాగా గురువారం జరిగిన జరిగిన సెకెండ్ సెమీస్‌లో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్.. ముచ్చటగా మూడో సారి ఫైనల్లో అడుగుపెట్టింది. మరోవైపు దక్షిణాఫ్రికా మాత్రం ఈ ఫైనల్ మ్యాచ్‌కు ముందు తమ ప్రాక్టీస్ సెషన్లో పాల్గోంది. తొలిసారి ఫైనల్‌కు చేరుకున్న సౌతాఫ్రికా నెట్స్‌లో తీవ్రంగా శ్రమించింది. కాగా ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశముంది. -
T20 WC 2024: ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు.. రద్దైతే విజేత ఎవరంటే..?
టీ20 వరల్డ్‌కప్-2024లో తుది సమరానికి సమయం అసన్నమైంది. శనివారం(జూన్ 29)న బార్బడోస్ వేదికగా జరగనున్న ఫైనల్ పోరులో భారత్-దక్షిణాఫ్రికా జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి.ఈ ఫైనల్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. అయితే ఈ తుది పోరుకు వర్షం వర్షం ముప్పు పొంచి ఉంది. శనివారం మ్యాచ్ జరగనున్న బార్బడోస్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అక్యూ వెదర్ రిపోర్ట్ ప్రకారం.. జూన్ 29న బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్‌లో 78 శాతం వర్షం పడే అవకాశం ఉంది. స్ధానిక కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ ఉదయం 10:30 ప్రారంభం కానుంది. మ్యాచ్ జరిగే రోజు బార్బోడస్‌లో ఉదయం 3 గంటల నుండి వర్షం మొదలు కానున్నట్లు అక్కడ వాతవారణ శాఖసైతం వెల్లడించింది. ఈ క్రమంలో ఇరు జట్లు అభిమానులు తెగ ఆందోళన చెందుతున్నారు. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే ఏంటి పరిస్థితి అని చర్చించుకుంటున్నారు.రిజర్వ్ డే..ఈ ఫైనల్ మ్యాచ్‌కు ఐసీసీ రిజర్వ్ డే కేటాయించింది. శనివారం (జూన్ 29) నాడు వర్షం కారణంగా పూర్తిగా మ్యాచ్ మొదులు కాకపోతే రిజర్వ్ డే అయిన ఆదివారం మ్యాచ్‌ను నిర్వహిస్తారు.ఒకవేళ మ్యాచ్ ప్రారంభమై ఆగిపోతే.. శనివారం ఎక్కడైతే మ్యాచ్ ఆగిందో అక్కడి నుంచే ఆటను కొనసాగిస్తారు. మరోవైపు శనివారం టాస్ పడ్డాక.. వర్షం అటంకం కలిగించి మ్యాచ్ ప్రారంభం కాకపోతే, మళ్లీ తాజాగా రిజర్వ్‌డే ఆదివారం రోజు టాస్ నిర్వహిస్తారు. మ్యాచ్ రద్దు అయితే?కాగా ఈ మ్యాచ్ ఫలితాన్ని ఎలాగైనా తేల్చేందుకు ఐసీసీ అదనంగా 190 నిమిషాలు సమయం కేటాయించింది. ఈ ఎక్స్ట్రా సమయం మ్యాచ్డేతో పాటు రిజర్వ్‌డేకు కూడా వర్తిస్తోంది. అయితే రిజర్వ్‌డే రోజు కూడా ఆటసాధ్య పడకపోతే.. రెండు జట్లను ఉమ్మడి విజేతలుగా ప్రకటిస్తారు. దక్షిణాఫ్రికా, భారత్ రెండు జట్లు ట్రోఫీని సంయుక్తంగా పంచుకుంటున్నాయి. కాగా డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో విజేతను నిర్ణయించాల్సి వస్తే ఇరు జట్లు కనీసం 10 ఓవర్ల చొప్పున అయిన బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. -
‘చెత్త ఫీల్డింగ్‌తోనే ఓడిపోయాం’
కేప్‌టౌన్ : భారత్‌తో జరిగిన చివరి టీ20లో ఓటమికి తమ ఆటగాళ్ల చెత్త ఫీల్డింగే కారణమని దక్షిణాఫ్రికా కోచ్ ఒటిస్ గిబ్సన్ అభిప్రాయపడ్డారు. సులువైన క్యాచ్‌లను జారవిడచడమే కాకుండా.. బంతిని ఆపడంలోను తమ ఆటగాళ్లు తడబడ్డారన్నారు. కేవలం ఈ మ్యాచ్‌లోనే కాదు ఓవరాల్ సిరీస్‌లో ఇవే తప్పులను ఆతిథ్య ఆటగాళ్లు చేశారని దీంతోనే సీరీస్లు కోల్పోయామన్నారు. ఇక భారత్‌లో అనుభవ బౌలర్లైన భువనేశ్వర్, బుమ్రాలు అద్భుతంగా రాణించారని, పవర్‌ప్లేలో పరుగులు రాకుండా కట్టడిచేశారని కితాబిచ్చారు. వారికి ఐపీఎల్ అనుభవం ఎంతగానో సహకరించిందని గిబ్సన్ పేర్కొన్నారు. తమ జట్టులో సైతం ఐపీఎల్ ఆడిన ఆటగాళ్లున్నారని కానీ వారంతగా రాణించలేదన్నారు. ముఖ్యంగా క్రిస్మొర్రిస్ను ఎన్నో సార్లు మ్యాచ్ విన్నర్‌గా చూశామని, కానీ అతని బౌలింగ్‌లో ఇంకా స్థిరత్వం కావాలని గిబ్సన్ చెప్పుకొచ్చారు. ఈ సిరీస్‌లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన డాలా, క్లాసెన్, జాన్కర్లు అద్భుత ప్రదర్శన కనబర్చారని కొనియాడారు. సీనియర్ ఆటగాళ్ల గాయాలు కూడా సిరీస్ ఒటమికి ఓ కారణమని తెలిపారు. అయితే అంతర్జాతీయ క్రికెట్ ప్రమాణాలను అందిపుచ్చుకోవడంలో కుర్రాళ్లు తడుబడుతున్నారని, సఫారీలకు అసలు పరీక్ష ఆస్ట్రేలియాతో ఎదురుకాబోతున్నది తెలిపారు. మార్చి1 నుంచి ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా 4 టెస్టుల సిరీస్ ఆరంభం కానుంది. చివరి టీ20లో సఫారీ స్పిన్నర్ షామ్సీ ధావన్ 9, 34 పరుగుల వద్ద ఇచ్చిన రెండు క్యాచ్‌లను జారవిడిచిన విషయం తెలిసిందే. అనంతరం ధావన్(47) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 7 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. -
ఐసీసీ గదను అందుకున్న కోహ్లి
-
ఐసీసీ గద అందుకున్న కోహ్లి
కేప్‌టౌన్ : మూడో టీ20 విజయంతో దక్షిణాఫ్రికా పర్యటనను విజయవంతంగా ముగించిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ఐసీసీ ప్రతిష్టాత్మ టెస్ట్ చాంపియన్‌షిప్ గదను అందుకున్నాడు. మ్యాచ్ అనంతరం దిగ్గజ ఆటగాళ్లు సునీల్ గావస్కర్, గ్రేమ్ పొలాక్ చేతుల మీదుగా కోహ్లి గదను అందుకున్నాడు. గత నెలలో జొహన్నెస్‌బర్గ్‌లో జరిగిన చివరి టెస్ట్‌లో భారత విజయం సాధించి ఐసీసీ ర్యాకింగ్స్లో అగ్రస్థానాన్ని కాపాడుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది కటాఫ్ తేదీ అయిన ఏప్రిల్ 3 వరకు మరే జట్టు భారత్‌ను ర్యాంకింగ్స్‌లో వెనక్కి నెట్టే అవకాశం లేకపోవడంతో ప్రతిష్టాత్మక గదతో పాటు 10 లక్షల డాలర్ల ప్రైజ్ మనీ వరించింది. 124 పాయింట్లతో దక్షిణాఫ్రికా గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా రెండు టెస్టుల్లో ఓడి 121 పాయింట్లకు చేరినా ర్యాంకింగ్‌లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. 111 పాయింట్లతో ఉన్న దక్షిణాఫ్రికా 115 పాయింట్ల చేరి రెండో ర్యాంకులోనే ఉండటంతో ఐసీసీ టెస్ట్ చాంపియన్ షిప్ గదను టీమిండియా అందుకోవడానికి ఉపకరించింది. 2002 తర్వాత ఐసీసీ టెస్ట్ చాంపియన్ షిప్ గద అందుకున్న పదో కెప్టెన్‌గా కోహ్లీ నిలిచాడు. 2016లో కోహ్లి తొలి సారి ఐసీసీ గదను అందుకున్నాడు. ఇక ఆస్ట్రేలియాతో జరగనున్న నాలుగు టెస్టుల సిరీస్‌లో దక్షిణాఫ్రికా కనీసం ఒక మ్యాచ్‌లోనైనా గెలిస్తేనే రెండో స్థానంలో కొనసాగుతోంది. దీంతో 5 లక్షల డాలర్ల ప్రైజ్ మనీ అందుకునే అవకాశం దక్కుతుంది. మూడో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా చేతిలో ఇప్పటికే 2 లక్షల డాలర్లు ఉన్నాయి. ఒకవేళ ఆస్ట్రేలియా కనుక దక్షిణాఫ్రికాపై 3-0, లేదంటే 4-0తో విజయం సాధిస్తే వీరి ర్యాంకులు తారుమారై ఆసీస్ రెండో స్థానానికి చేరుకుంటుంది. ఇక మార్చిలో ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ గెలిచిన వారికి లక్ష డాలర్ల ప్రైజ్ మనీ లభిస్తుంది. ఒకవేళ సిరీస్ డ్రా అయితే నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్‌కే ఆ ప్రైజ్ మనీ లభిస్తుంది. మూడో టీ20లో ఆతిథ్య జట్టుపై భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించి టీ20 సిరీస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. రైనా, భువీల అద్భుత ప్రదర్శనతో భారత్‌కు విజయం వరించింది. 2-1తో టెస్ట్ సిరీస్ ఓడినా.. కోహ్లి సేన 5-1తో వన్డే, 2-1తో టీ20 సిరీస్‌లను కైవసం చేసుకుని పర్యటనను సగర్వంగా ముగించింది. -
ఆమెలా ఎవరైనా సిక్సు కొట్టగలరా?
సాక్షి, స్పోర్ట్స్ : టీ20లు లేకుండా అంతర్జాతీయ క్రికెట్‌కు మనుగడలేదని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డారు. దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా అద్బుతంగా ఆడి వన్డే సిరీస్ గెలిచిందని, చివరి టీ-20లో సైతం విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కోహ్లిసేనకు ఇదొక మంచి పర్యటన అని చెప్పారు. ‘మనీష్ పాండే, హార్దిక్ పాండ్యాతోపాటు అనేక మంది యువకులకు భారత జట్టులో అవకాశం వచ్చింది. వాళ్లు మంచి ఆటగాళ్లుగా ఎదిగేందుకు తగిన సమయం ఇస్తే.. మరో సేహ్వాగ్, హర్భజన్లవుతారని ఈ మాజీ కెప్టెన్ చెప్పుకొచ్చారు. పరిమిత ఓవర్ల క్రికెట్లో ధోనీ అద్భుతమైన ప్లేయర్ అని కితాబిచ్చాడు. ఫిట్నెస్ విషయంలో అంతర్జాతీయ ప్లేయర్లకు మనోళ్లు దీటుగా ఉంటారని తెలిపారు. మహిళా క్రికెటర్లపై సైతం గంగూలీ ప్రశంసలు జల్లు కురిపించారు. మహిళా క్రికెటర్లు అద్భుతంగా రాణిస్తున్నారని కితాబిచ్చారు. ముఖ్యంగా హర్మన్‌ప్రీత్ కౌర్ సిక్స్ బాదినట్టుగా ఎవరైనా కొట్టగలరా? అని దాదా ప్రశ్నించాడు. -
రోహిత్ శర్మ చెత్తరికార్డు.. ట్విటర్ ఫైర్.!
సాక్షి, స్పోర్ట్స్ : దక్షిణాఫ్రికా పర్యటనలో నిలకడలేమి ప్రదర్శనతో తీవ్ర తడబాటుకు గురవుతున్న టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఓ చెత్త రికార్డును నమోదు చేశాడు. ఆతిథ్య జట్టుతో జరిగిన రెండో టీ20లో గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగి టీ20ల్లో అత్యధిక డకౌట్లైన భారత బ్యాట్స్‌మన్‌గా అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. ఇప్పటికే పర్యటనలో పేలవ ప్రదర్శనతో అభిమానుల ఆగ్రహానికి గురైన ఈ హిట్‌మ్యాన్ తాజా రికార్డుతో మరిన్ని విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇప్పటి వరకు ఈ చెత్తరికార్డు మాజీక్రికెటర్ ఆశిశ్నెహ్రా, యూసఫ్ పఠాన్ల పేరిట సంయుక్తంగా ఉండగా రోహిత్ అధిగమించాడు. రోహిత్ నాలుగు సార్లు డకౌట్ కాగా నెహ్రా, పఠాన్లు మూడు సార్లు అవుటయ్యారు. అంతేకాకుండా గోల్డెన్ డకౌట్ అయిన భారత క్రికెటర్ల జాబితోలోకి సైతం రోహిత్ ప్రవేశించాడు. తాజా గోల్డెన్ డకౌట్‌తో అంతకు ముందు జాబితాలో ఉన్న కేఎల్ రాహుల్, అజింక్యా రహానే, మురళి విజయ్‌ల సరసన చేరాడు. ఈ ముంబై ఇండియన్స్ కెప్టెన్ చెత్తరికార్డుపై ట్విటర్లో విమర్శలు వెల్లువెత్తాయి. ‘రోహిత్ దక్షిణాఫ్రిక పర్యటనలో గోల్డెన్ డక్‌తో గోల్డ్ సాధించావు’..అని ఒకరంటే.. ‘బ్యాట్స్‌మన్ ఆఫ్‌దిడే.. రోహిత్, బౌలర్ ఆఫ్‌దిడే చహల్’ అని మరోకరు ట్రోల్ చేస్తున్నారు. మనీష్‌పాండే, ధోనిల అద్భుత ప్రదర్శనతో సఫారీలకు భారీ లక్ష్యమే విధించినా.. చాహల్ పేలవ బౌలింగ్, క్లాసన్ విజృంభణతో భారత్ రెండో టీ20లో ఓడిన విషయం తెలిసిందే. ఇక సిరీస్ నిర్ణయాత్మక టీ20 శనివారం కేప్‌టౌన్ వేదికగా జరగనుంది. #RohitSharma's "Golden Duck" is the only Gold he got from this series....#INDvSA #SAvIND #INDvsSA — Akshay mane (@akashaymane) 21 February 2018 -
సెంచురియన్లో భారత్ ఓటమి
-
బుమ్రా ఔట్.. ఠాకుర్ ఇన్
సెంచూరియన్ : భారత్‌తో జరుగుతున్న రెండో టీ20లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక తొలి టీ20 గెలిచి ఉత్సాహంగా ఉన్న కోహ్లి సేన ఈ మ్యాచ్‌లో గెలిచి మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. సొంత గడ్డపై వన్డే సిరీస్ కోల్పోయిన ఆతిథ్య జట్టు టీ20 సిరీస్‌నైనా గెలిచి పరువు నిలుపుకోవాలని భావిస్తోంది. ప్రొటీస్ జట్టు ఎలాంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగుతుండగా.. టీమిండియాలో బుమ్రా స్థానంలో యువ బౌలర్ శార్ధుల్ ఠాకుర్ వచ్చాడు. జట్లు భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, ధావన్, రైనా, మనీశ్ పాండే, ధోని, పాండ్యా, భువనేశ్వర్, ఉనాద్కట్, చహల్, శార్ధుల్. దక్షిణాఫ్రికా: డుమిని (కెప్టెన్), హెన్డ్రిక్స్, స్మట్స్, మిల్లర్, బెహర్దీన్, క్లాసెన్, మోరిస్, ఫెలుక్వాయో, జూనియర్ డాలా, డేన్ ప్యాటర్సన్, షమ్సీ. -
వర్షం కారణంగా మహిళల టీ20 రద్దు
సెంచూరియన్ : దక్షిణాఫ్రికా-భారత్ మహిళల మధ్య జరుగుతున్న నాలుగో టీ20 వర్షం కారణంగా రద్దైంది. వర్షం తగ్గినా.. అవుట్ ఫీల్డ్ పచ్చిగా ఉండడం, మరి కొద్ది గంటల్లో పురుషుల మ్యాచ్ ఉండటంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. ఇదే భారత మహిళల టీ20 చరిత్రలో రద్దైన తొలి మ్యాచ్‌కావడం విశేషం. దీంతో హర్మన్ ప్రీత్ సేన నిర్ణయాత్మక ఐదో టీ20 ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉన్న భారత మహిళలు చివరి మ్యాచ్ గెలిస్తే సిరీస్ వశం అవుతోంది. లేకుంటే డ్రాగా ముగుస్తోంది. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టు మ్యాచ్ నిలిచే సమయానికి 15.3 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. ఓపెనర్లు కెప్టెన్ నికెర్క్(55: 47 బంతులు, 6 ఫోర్లు, 2 సిక్సులు), లిజెల్లే లీ(59: 39 బంతులు,2ఫోర్లు, 5 సిక్సర్లు, నౌటౌట్)లు రాణించారు. పురుషుల మ్యాచ్ కోసం మైదాన సిబ్బంది కృషి చేస్తున్నారు. -
దంచికొడుతున్న వాన.. రెండో టీ20 కష్టమే
సెంచూరియన్ : భారత్-దక్షిణాఫ్రికాల మధ్య జరిగాల్సిన రెండో టీ20 జరగడం కష్టంగా కనిపిస్తోంది. సెంచూరియన్ వేదికగా సూపర్ స్పోర్ట్స్ పార్క్ మైదానంలో రాత్రి 9.45 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్ ఆలస్యమమ్యే అవకాశం ఉంది. భారీ వర్షం కురుస్తుండటంతో మైదానమంతా కవర్లు కప్పేశారు. అయితే అక్కడక్కడ అవుట్ ఫీల్డ్‌ను వదిలేశారు. దీంతో మ్యాచ్ జరగడంపై అనుమానాలు నెలకొన్నాయి. వర్షం ఇలానే కొనసాగితే మ్యాచ్ రద్దయ్యే అవకాశం ఉంది. వర్షంతో నిలిచిపోయిన మహిళల టీ20 మ్యాచ్ ఇక ఇదే మైదానంలో భారత్-దక్షిణాఫ్రికా నాలుగో టీ20 జరుగుతున్న విషయం తెలిసిందే. వీరి ఆట మధ్యలోనే వర్షం రావడంతో మ్యాచ్ నిలిచిపోయింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టు మ్యాచ్ నిలిచే సమయానికి 15.3 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. ఓపెనర్లు కెప్టెన్ నికెర్క్(55: 47 బంతులు, 6 ఫోర్లు, 2 సిక్సులు), లిజెల్లే లీ(59: 39 బంతులు,2ఫోర్లు, 5 సిక్సర్లు, నౌటౌట్)లు చెలరేగడంతో ప్రోటీస్ జట్టు భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది. క్రీజులో లిజెల్లే లీ(59), డూప్రీజ్(2)లున్నారు. -
టాస్ గెలిచిన భారత మహిళలు
సెంచూరియన్ : భారత్-దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌లో భాగంగా ఇక్కడ జరుగుతున్న నాలుగో టీ20లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు ఎలాంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగుతున్నాయి. ఇప్పటికే ఈ సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉన్న భారత మహిళలు ఈ మ్యాచ్ గెలిచి సఫారీ గడ్డపై మరో ఘనతను సొంతం చేసుకోవాలని ఉవ్విల్లురుతోన్నారు. ఇక ఆతిథ్య జట్టు పరువు కోసం పాకులాడుతుంది. గత మ్యాచ్ గెలుపు జోరును కొనసాగించి సిరీస్ రేసులో నిలవాలని భావిస్తోంది. ఇప్పటికే సఫారీ గడ్డపై భారత మహిళలు వన్డే సిరీస్‌ను గెలుచుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఇదే మైదానంలో పురుషుల జట్ల పోరాటం ఉంటుంది. యాదృచ్ఛికమే అయినా... గెలిస్తే రెండు భారత జట్లూ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌లను సొంతం చేసుకుంటాయి. -
ఇలాంటి కెప్టెన్‌ను చూసిందిలేదు!
సాక్షి, స్పోర్ట్స్ : ఓవర్సీస్లో అటు కెప్టెన్‌గా ఇటు బ్యాటింగ్‌తో రాణిస్తున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై మాజీ కెప్టెన్ సౌరవ్గంగూలీ ప్రశంసల జల్లు కురిపించారు. ఓ జాతీయా చానెల్‌తో మాట్లాడుతూ.. ‘కోహ్లి పూర్తి స్థాయిలో నాయకత్వ బాధ్యతలు చేపట్టిన తర్వాత వెస్టిండీస్, దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్ విజయాలు నమోదు చేసింది. త్వరలో పర్యటించే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లలో కెప్టెన్‌గా తనేంటో తెలియజేస్తాడు. నేను కెప్టెన్‌గా ధోని, రాహుల్ ద్రవిడ్‌లను చూశా. కానీ ఇలా స్థిరంగా పరుగులు చేసే కెప్టెన్‌ను ఇప్పటి వరకు చూడలేదు. కోహ్లి భారత క్రికెట్ జెండా వంటి వాడు. నేను క్రికెటర్లు అత్యద్భుత ఫామ్ కలిగిన సందర్భాలు ఎన్నో చూశా. వ్యక్తిగతంగా నాది, సచిన్, ద్రవిడ్లది కావొచ్చు. కానీ ఇది అలాంటిది కాదనుకుంటున్నా. ఇది ఓ జీనియస్ గొప్పతనమని భావిస్తున్నా.’ అని గంగూలీ వ్యాఖ్యానించారు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పర్యటనకు భారత్ చాలా ముందుగానే వెళ్లాలని దాదా కోహ్లిసేనకు సూచించాడు. ఈ సిరీస్‌లకు ముందే కొన్ని ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడటం ద్వారా అక్కడి పరిస్థితులు తెలుస్తాయని గంగూలీ చెప్పుకొచ్చాడు. కెప్టెన్‌గా కోహ్లి ఓవర్సీస్లో భారత్‌కు టెస్ట్ సిరీస్ విజయాలను త్వరలోనే అందిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక కోహ్లి ఓవర్సీస్లో చేలరేగుతూ రికార్డు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఆరు వన్డేల్లో ఏకంగా 558 పరుగులు చేసి భారత్‌కు చారిత్రాత్మక విజయం అందించాడు. -
‘ఆ ఇద్దరి వల్లే భారత్‌కు విజయాలు’
సాక్షి, స్పోర్ట్స్ : భారత మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహలే భారత విజయాలకు కారణమని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ పాల్ ఆడమ్స్ అభిప్రాయపడ్డారు. ఈ ఇద్దరితోనే కోహ్లిసేన బలంగా ఉందని తెలిపారు. బ్యాటింగ్‌కే ఎకువ ప్రాధాన్యత ఇచ్చే ప్రస్తుత తరుణంలో ఇద్దరు స్పిన్నర్లను తుది జట్టులోకి తీసుకోవడం గొప్ప విషయమన్నారు. వారు మణికట్టు బౌలర్లే అయినప్పటికి వారు వేసే బంతుల్లో చాలా వైవిధ్యం ఉందని కొనియాడారు. బ్యాట్స్‌మన్‌కు అందకుండా బంతులు వేస్తూ సమర్ధవంతమైన ప్రదర్శనను కనబరుస్తున్నారని ఈ మాజీ క్రికెటర్ తెలిపారు. బ్యాటింగ్‌కు అనుకూలించే జోహన్నెస్‌బర్గ్ మైదానంలో ఆతిథ్య జట్టు ఒక్క స్పిన్నర్‌ను కూడా బరిలోకి దింపలేదన్నారు. కానీ భారత్ మాత్రం ఈ ఇద్దరిని ఆడించి ప్రత్యేకంగా నిలిచిందన్నారు. దక్షిణాఫ్రికాలో తొలి సారి పర్యటిస్తున్నా ఆ యువస్పిన్నర్లలో ఏ మాత్రం భయం కనిపించలేదన్నారు. వారు ఒక మ్యాచ్‌లోనే ఒత్తిడికి లోనయ్యారని, తర్వాతీ మ్యాచుల్లో బ్యాటింగ్‌పిచ్‌లపై సైతం రాణించారని ఆడమ్స్ ప్రశంసించారు. చాహల్ స్థిరంగా రాణిస్తూ బంతిని చాలా బాగా తిప్పేస్తున్నాడని, యాదవ్ గూగ్లీలు బ్యాట్స్‌మన్‌కు ఏమాత్రం అర్థం కావడంలేదన్నారు. ఇక ఐపీఎల్‌తో వారు మరింత రాటుదేలుతారని చెప్పుకొచ్చారు. సఫారీ పర్యటనలో భారత్ 5-1తో వన్డే సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించడంలో ఈ యువ స్పిన్నర్లు కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరు ఆరు వన్డేల్లో ఏకంగా 33 వికెట్లు పడగొట్టారు. -
ధోని ప్రపంచ రికార్డు
జోహాన్నెస్‌బర్గ్ : టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోని మరో అరుదైన ఘనతను సాధించాడు. దక్షిణాఫ్రికాతోజరిగిన తొలి టీ20లో అత్యధిక క్యాచ్లందుకన్న వికెట్ కీపర్‌గా రికార్డు నమోదు చేశాడు. భువనేశ్వర్ బౌలింగ్‌లో హెన్‌డ్రీక్స్ క్యాచ్‌తో ఈ ఘనతను సొంతం చేసుకున్నా డు. ఓవరాల్‌గా 275 టీ20ల్లో ధోని 134 క్యాచ్లందుకున్నాడు. దీంతో ఇప్పటి వరకు అగ్రస్థానంలో కొనసాగిన శ్రీలంక మాజీ వికెట్ కీపర్ సంగక్కర(133) ను అధిగమించాడు. గతంలో సంగక్కర 254 మ్యాచ్‌ల్లో 133 క్యాచ్‌లు పట్టి ఈ రికార్డును నెలకొల్పాడు. ఇక మూడో స్థానంలో భారత ఆటగాడు దినేశ్ కార్తిక్(227 టీ20 మ్యాచ్‌ల్లో 123 క్యాచ్‌లు), పాకిస్థాన్ క్రికెటర్ కమ్రాన్ అక్మల్( 211 టీ20ల్లో 115 క్యాచ్‌లు), వెస్టిండీస్ కీపర్ దినేశ్ రామ్‌దిన్( 168 మ్యాచ్‌ల్లో 108 క్యాచ్‌లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక క్యాచ్‌లు పట్టిన వికెట్ కీపర్ల జాబితాల్లో ధోనీది మూడోస్థానం. ధోనీ ఇప్పటి వరకు 601 క్యాచ్‌లు, 174 స్టంపింగ్‌లు చేశాడు. మార్క్ బౌచర్ (952), ఆడమ్ గిల్‌క్రిస్ట్( 813) క్యాచ్‌లతో తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఇక అంతర్జాతీయ టీ20ల్లో ధోని 77 వికెట్ల భాగస్వామ్యంతో వికెట్ కీపర్‌గా ఇప్పటికే అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇందులో 48 క్యాచ్ అవుట్లు, 29 స్టంపౌట్లున్నాయి. -
భువనేశ్వర్ కుమార్ అరుదైన ఘనత
-
కుల్దీప్ ఏం సైగ చేస్తున్నావ్..?
జొహన్నెస్ బర్గ్ : టీమిండియా చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌కు దూరమైన విషయం తెలిసిందే. గాయం కారణంగా కుల్దీప్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. అయినా కుల్దీప్ వార్తల్లో నిలిచాడు. మైదానం బయట కూర్చొని కుల్దీప్ చేసిన కొన్ని సైగలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. భారత్ విజయం ఖాయమన్న సందర్బంలో కెమెరామెన్ డగౌట్లో ఉన్న కుల్దీప్ను పదే పదే చూపించాడు. దీన్ని గమనించిన కుల్దీప్ ఫన్నీగా చేతులతో సైగలు చేశాడు. అదే సయమంలో దక్షిణాఫ్రికా డగౌట్లో షమ్సీ ఉన్నాడు. దీంతో ఈ సైగలపై సోషల్ మీడియాలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆసైగలు ఓడిపోతున్న దక్షిణాఫ్రికాను చూపించడండి అని కుల్దీప్ చెబుతున్నాడని ఒకరంటే.. ప్రొటీస్ మరో వికెట్ కోల్పోతుంది.. మరో బ్యాట్స్‌మన్ బ్యాటింగ్ వెళ్తాడు చూడండీ అని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు. దీనికి సంబందించిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయింది. ఇక ఈ మ్యాచ్‌లో భారత్ 28 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో వైరలైన కుల్దీప్ సైగలు -
సోషల్ మీడియాలో వైరలైన కుల్దీప్ సైగలు
-
‘వైవిధ్యం కనబర్చకపోతే వికెట్లు తీయడం కష్టం’
జోహన్నెస్‌బర్గ్ : టీమిండియా పేస్ బౌలర్, డెత్ ఓవర్స్ స్పెషలిస్టు భువనేశ్వర్ కుమార్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో ఐదు వికెట్లతో ప్రొటీస్ పతనాన్ని శాసించిన విషయం తెలిసిందే. ఈ ప్రదర్శన(5/24)తో టీ20ల్లోఐదు వికెట్లు పడగొట్టిన తొలి భారత్ పేస్ బౌలర్‌గా రికార్డు నమోదు చేశాడు. అంతేకాకుండా అన్ని ఫార్మాట్లలో ఐదు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు. ఇక భారత బౌలర్లలో యుజువేంద్ర చహల్ ఒక్కడే ఐదు వికెట్లు సాధించగా భువీ రెండో బౌలర్‌గా రికార్డుకెక్కాడు. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్(72) బ్యాటింగ్ దాటికి, కోహ్లి(26), పాండే(29)లు తోడవడంతో ఆతిథ్య జట్టుపై భారత్ 204 పరుగుల రికార్డు లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఈ భారీ లక్ష్య చేధనకు దిగిన ప్రొటీస్ బ్యాట్స్‌మన్‌ను భువేశ్వర్ పెవిలియన్ చేర్చాడు. ముఖ్యంగా దాటిగా ఆడుతున్న ఓపెనర్ హెన్‌డ్రీక్స్(72) వికెట్ తీసి భారత విజయాన్నిసులవు చేశాడు. మధ్య మధ్యలో నకుల్ బాల్స్ వేస్తూ సఫారీ బ్యాట్స్మన్లను అయోమయానికి గురి చేశాడు. వైవిధ్యం కనబర్చకపోతే కష్టం.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన భువీ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘ టీ20ల్లో ఐదు వికెట్లు తీయడం అద్బుతంగా ఉంది. నేను లైన్ లెంగ్త్‌తో బౌలింగ్ చేశాను. ఇది సమిష్టి ప్రదర్శన.. మ్యాచ్‌కు ముందే బౌలింగ్‌పై ప్రణాళికలు రచించాం. కఠిన పరిస్థితుల్లో బౌలింగ్ చేయడం ఎప్పుడు ఆస్వాదిస్తా. నకుల్ బాల్ వేయడంపై గత ఏడాది కాలంగా సాధన చేశా. ఈ రోజుల్లో బౌలింగ్‌లో వైవిధ్యం కనబర్చకపోతే వికెట్లు తీయడం చాలా కష్టం’ అని భువీ అభిప్రాయపడ్డాడు. -
ఆమె నాకు ప్రేరణగా నిలుస్తోంది
-
దీనికంతా అనుష్కానే కారణం!
సాక్షి, స్పోర్ట్స్ : దక్షిణాఫ్రికా పర్యటనలో అద్బుత ఫామ్‌తో రాణించడానికి తన భార్య అనుష్క శర్మే కారణమని విరాట్ కోహ్లి అభిప్రాయపడ్డాడు. ఈ సిరీస్‌లో కోహ్లి మూడు సెంచరీలు, ఒక ఆఫ్సెంచరీతో 558 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అందుకున్న విషయం తెలిసిందే. చివరి వన్డే విజయానంతరం కోహ్లి మాట్లాడుతూ.. ‘మైదానం బయట నుంచి నాకు మద్దతుగా నిలిచినవారు కూడా నా ఫామ్‌కు కారణమే.. ముఖ్యంగా నా భార్యకు ఈ విషయంలో అధిక క్రెడిట్ దక్కుతుంది. ఈ పర్యటనలో తను నాకు ఎంతో మద్దతుగా నిలిచింది. . గతంలో ఆమెపై చాలా మంది విమర్శలు గుప్పించారు. నిరంతరం నాకు ప్రేరణగా నిలుస్తూ ముందుకెళ్లేలా చేస్తోంది. వ్యక్తిగత ప్రదర్శనతో కెప్టెన్‌గా విజయాలందుకోవడం గొప్ప అనుభూతి. ఇంకా నాకు ఎనిమిది నుంచి తొమ్మిదేళ్ల కెరీర్ ఉంది. అందుకే ప్రతీ రోజునూ ఆస్వాదించాలనుకుంటున్నాను. ఆరోగ్యంగా ఉండి జట్టును నడిపిస్తుండడం నా అదృష్టంగా భావిస్తున్నాను, జట్టు విజయాల కోసం నా వంతు 120 శాతం కృషి చేస్తాను’ అని కోహ్లీ తెలిపాడు. స్పిన్నర్లు అద్భుతం సిరీస్ విజయంలో కీలక పాత్ర పొషించిన ఇద్దరు యువ స్పిన్నర్లును కోహ్లి కొనియాడాడు. ‘వారిద్దరు అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా జోహన్నెస్‌బర్గ్ టెస్టు అనంతరం వారు జట్టులోకి వచ్చారు. అప్పటి నుంచి మా విజయ యాత్ర కొనసాగించాం. తొలి రెండు టెస్టుల ఓటమితో నిరాశ చెందాం. చివరి టెస్టు విజయానంతరం ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. టెస్టు సిరీస్ కోల్పోయినప్పుడు ఇక్కడే మీతోనే మాట్లాడా.. ఇప్పుడు వన్డే సిరీస్ గెలిచి మళ్లీ మీతోనే మాట్లాడుతున్నా. ఇది అత్యద్భుతమని ’కోహ్లి వ్యాఖ్యానించాడు. ఇంకా సిరీస్ అయిపోలేదని, టీ20 సిరీస్‌ను సైతం వదులుకోమని స్పష్టం చేశాడు. ఇక మూడు టీ20ల సిరీస్ ఆదివారం జోహన్నెస్ బర్గ్ వేదికగా ప్రారంభం కానుంది. -
వైఫ్‌కు రోహిత్ వాలెంటైన్స్‌డే స్పెషల్ గిఫ్ట్!
సాక్షి, స్పోర్ట్స్ : టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రత్యేక కానుకతో ఆయన సతీమణి రితికా సజ్దేకు ప్రేమికుల రోజు శుభాకాంక్షలు తెలిపాడు. తన భార్య అంటే ఎంత ఇష్టమో పలు సందర్భాల్లో బహిరంగంగానే వ్యక్త పరిచిన రోహిత్ తాజాగా మరో స్పెషల్ గిఫ్ట్ ఇచ్చి వార్తల్లో నిలిచాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదో వన్డేలో సెంచరీతో చెలరేగి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన రోహిత్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ను రోహిత్ తన సతీమణికి బహుమతిగా ఇచ్చాడు. ఇదే విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ప్రేమికుల రోజు శుభాకాంక్షలు రితికా’ అనే క్యాఫ్షన్‌తో పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఈ పోస్ట్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. తన వద్ద మేనేజర్‌గా పనిచేసే సమయంలో రితికాతో ప్రేమ వ్యవహారం నడిపిన రోహిత్ పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. గతంలో పెళ్లిరోజున తన ఆటను కళ్లారా చూసేందుకు వచ్చిన భార్యకు రోహిత్ డబుల్ సెంచరీ బాది అపురూపమైన కానుక ఇచ్చాడు. సెంచరీ అనంతరం భార్యవైపు చూస్తూ ఫ్లైయింగ్ కిస్ ఇచ్చి పెళ్లిరోజును మరపురాని జ్ఞాపకంగా మలుచుకున్న ఈ జంటపై అప్పట్లో సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తాయి. ‘నాకు ప్రత్యేకమైన రోజున నా భార్య పక్కన ఉండటం సంతోషకరమైన విషయం. ఆమెకు నేనిచ్చిన ఈ బహుమతి బాగా నచ్చిందనుకుంటున్నా. ఆమె నాబలం. ఆమె ఎప్పుడు నాతోనే ఉంటుంది’ అని ప్రపంచ రికార్డు అనతరం తన సతీమణిపై ఉన్న ప్రేమను రోహిత్ చాటుకున్న విషయం తెలిసిందే. పెళ్లి రోజు డబుల్ సెంచరీ అనంతరం రితికాకు రోహిత్ ఫ్లైయింగ్ కిస్ ఇక కెరీర్లో 17వ సెంచరీ సాధించిన రోహిత్.. గత నాలుగు వన్డేల్లో దారుణంగా విఫలమై అన్ని వర్గాల నుంచి విమర్శలను ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలో సెంచరీ సాధించి అందుకున్న మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్‌ను బహుమతిగా ఇవ్వడంపై రితికా ఎంత సంతోషపడిందో అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. -
‘గెలిచాం కదా అని ఆ ఒక్కటి వదలం’
పోర్ట్ ఎలిజబెత్ : సిరీస్ గెలిచాం కదా అని సంబరపడిపోకుండా చివరి వన్డేను సైతం గెలుస్తామని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ధీమా వ్యక్తం చేశాడు. మంగళవారం దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలో భారత్ 73 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో ఒక వన్డే మిగిలుండానే 4-1తో సిరీస్ కైవసం చేసుకొని చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఇక మ్యాచ్ అనంతరం కోహ్లి మాట్లాడుతూ.. ‘ఇది మాకు మరో సమిష్టి ప్రదర్శనతో దక్కిన విజయం. మాపై ఒత్తిడి లేకపోవడంతోనే సిరీస్ గెలిచామనే విషయం అర్థమైంది. ఇది ఓ చరిత్ర. ఆటగాళ్లు చాల కష్టపడ్డారు. జోహన్నెస్‌బర్గ్ టెస్టు విజయం మాలో ఉత్తేజాన్ని కలిగించింది. ఈ విజయానంతరం మేము మా ఆటతీరును సమీక్షించుకున్నాం. అది అలానే కొనసాగిస్తూ 4-1తో సిరీస్ గెలిచి కొత్త చరిత్రను సృష్టించాం. ముఖ్యంగా జట్టులోని ముగ్గురు ఆటగాళ్లు స్థిరంగా రాణించారు. వారు ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. గెలిచాం కదా అని చివరి వన్డేను తేలికగా తీసుకోం. మాకు 5-1తో సిరీస్ గెలవడమే కావాలి. ఇప్పటి వరకు అవకాశం రాని ఆటగాళ్లకు చివరి వన్డేలో రావచ్చు. ఏది ఏమైన గెలవడమే మా ప్రాధాన్యత. దాని కోసం ఏమైనా చేస్తాం’ అని కోహ్లి వ్యాఖ్యానించాడు. సెంచరీతో ఫామ్‌లోకి వచ్చిన టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ మాట్లాడుతూ.. ‘దక్షిణాఫ్రికాలో ఆడటాన్ని పూర్తిగా ఆస్వాదించా. క్రికెట్ ఆడటానికి ఇది మంచి ప్రదేశం. నేను నా ఆట శైలి మార్చకున్నా పరుగులు చేయవచ్చని గ్రహించా. నిజంగా ఇది నా రోజు. సెంచరీ సాధించడం ఆనందంగా ఉంది. 17 మంది జట్టు సభ్యుల్లో కేవలం 12 మంది ఆటగాళ్లే ఆడారు. మిగిలిన వారికి చివరి మ్యాచ్‌లో అవకాశం రావోచ్చు. మేం సిరీస్ 5-1తో గెలువాలని కోహ్లి చెప్పాడు. ఇదే ఊపును కొనసాగిస్తూ చివరి వన్డేను సైతం గెలుస్తామని’ రోహిత్ తెలిపాడు. -
పాండ్యా సూపర్ ఫీల్డింగ్.. టర్నింగ్ పాయింట్ ఇదే!
సాక్షి, స్పోర్ట్స్ : దక్షిణాఫ్రికా పర్యటనలో తొలి టెస్టులో బ్యాట్‌తో మెరిసిన టీమిండియా ఆల్‌రౌండర్ పాండ్యా ఆ తరువాత చెప్పుకోదగిన ఇన్నింగ్స్ ఆడలేదు. గత నాలుగు వన్డేల్లో అటు బౌలింగ్.. ఇటు బ్యాటింగ్‌లో విఫలమయ్యాడు. అయితే మంగళవారం జరిగిన ఐదో వన్డేలో బ్యాటింగ్‌లో నిరాశ పరిచిన పాండ్యా.. తన మార్క్ ఫీల్డింగ్‌తో మెరిసాడు. బౌలింగ్లోను రెండు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక దక్షిణాఫ్రికా ఓపెనర్ హషీమ్ ఆమ్లాను పాండ్యా చేసిన రనౌట్ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. హాఫ్ సెంచరీ సాధించి క్రీజులో పాతుకుపోయిన ఆమ్లా(71)ను పాండ్యా అద్భుత ఫీల్డింగ్‌తో పెవిలియన్ చేర్చాడు. దీంతో భారత్ విజయం సులువైంది. భువనేశ్వర్ వేసిన 35 ఓవర్ రెండో బంతికి ఆమ్లా మిడాఫ్ దిశగా ఆడి సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు. ఆ పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్న పాండ్యా రెప్పపాటులో బంతిని అందుకొని నాన్‌స్ట్రైకింగ్ వికెట్ల వైపు విసరడంతో బంతి నేరుగా వికెట్లను తాకింది. ఫీల్డ్ అంపైర్ ధర్డ్ అంపైర్‌కు నివేదించాడు. అందరూ ఆమ్లా క్రీజులో బ్యాట్ పెట్టారని భావించారు. థర్డ్ అంపైర్‌కు సైతం నిర్ణయం ప్రకటించడం సవాలుగా మారింది. అన్ని కోణాల్లో పరిశీలించిన అంపైర్ ఆమ్లా బ్యాట్ క్రీజుకు మిల్లీమీటర్ దూరంలో ఉండటాన్ని గుర్తించి అవుట్‌గా ప్రకటించాడు. దీంతో ఆమ్లా పెవిలియన్ చేరాడు. భారత ఆటగాళ్లు ఆనందంలో మునిగిపోయారు. అప్పటికి ఆతిథ్య జట్టు 166 పరుగుల చేసి 4 వికెట్లు కోల్పోయింది. ఆమ్లా అవుట్ కాకుంటే భారత్ విజయానికి చాలా కష్టమయ్యేదని, పాండ్యా సూపర్ ఫీల్డింగే మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్ అని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
పాండ్యా సూపర్ ఫీల్డింగ్.. టర్నింగ్ పాయింట్ ఇదే!
-
రోహిత్‌పై విరుచుకుపడ్డ నెటిజన్లు
సాక్షి, స్పోర్ట్స్ : టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మపై సోషల్‌మీడియా వేదికగా నెటిజన్లు విరుచుకుపడ్డారు. మంగళవారం దక్షిణాఫ్రికాతో జరిగిన కీలక ఐదో వన్డేలో సెంచరీ సాధించినప్పటికి రోహిత్ నెటిజన్ల ఆగ్రహానికి గురికాక తప్పలేదు. సమన్వయ లోపంతో కెప్టెన్ విరాట్ కోహ్లి, అజింక్యా రహానేలను రనౌట్ చేయడంతో అభిమానులు ఆగ్రహానికి లోనయ్యారు. దీంతో తమ ఆవేశాన్ని సోషల్ మీడియాలో వెల్లగక్కారు. మోర్కెల్ బౌలింగ్‌లో డిఫెన్స్ ఆడిన రోహిత్ సింగిల్ కోసం ముందుకు వచ్చే ప్రయత్నం చేసి ఆగిపోయాడు. అయితే మరోవైపు నుంచి కోహ్లి సగం పిచ్ దాటి దూసుకొచ్చేశాడు. వెనక్కి వెళ్లే ప్రయత్నం చేసినా అప్పటికే డుమిని డైరెక్ట్ త్రో నాన్ స్ట్రైకింగ్ వికెట్లకు తాకింది. మరి కొద్ది సేపటికే రహానే (8) కూడా దాదాపు ఇదే తరహాలో అవుటయ్యాడు. ఈ రనౌట్లకు రోహితే కారణమని అభిమానులు విమర్శలు గుప్తిస్తున్నారు. ‘‘రెండు రనౌట్లకు కారణమైన నువ్వు యోయో టెస్ట్ ఎలా పాసయ్యావో తెలియడం లేదని’ ఒకరంటే.. ‘ఇంకా ఎన్ని రనౌట్లు కారణమైతావయ్యా’ అని మరొకరు.. ‘రోహిత్ స్వార్థపరమైన ఆట ఆడాడని’ ఇంకొకరు ట్రోల్ చేస్తున్నారు. గత నాలుగు వన్డేల్లో దారుణంగా విఫలమైన రోహిత్ ఈ మ్యాచ్‌లో శతకం సాధించి ఫామ్‌లోకి వచ్చాడు. ఈ నేపథ్యంలో అభినందనలు తెలుపాల్సిన అభిమానులు రోహిత్ ఫిట్‌నెస్‌పై విమర్శలు గుప్పించడం సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశమైంది. కీలక ఆటగాళ్లు రనౌట్లు కావడంతోనే భారత్ భారీ స్కోర్ సాధించలేకపోయిందని, ఇదే అభిమానులకు ఆగ్రహం తెప్పించిందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. I wonder How Rohit Sharma Clears #Yo-Yo test for fitness.. 2 Run-outs.. — Ashish Akhade (@ARAashish) 13 February 2018 So selfish man @ImRo45 it was easy single @ajinkyarahane88 was 3 quarterly there — yashtrikha (@yashtrikha) 13 February 2018 -
రనౌట్లలో కోహ్లి, రోహిత్‌ల రికార్డు!
సాక్షి, స్పోర్ట్స్ : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలు రనౌట్ల రికార్డు నమోదు చేశారు. మంగళవారం దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదో వన్డేలో కోహ్లి రనౌట్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీళ్లిద్దరి మధ్య సమన్వయ లోపం మరోసారి చర్చనీయాంశమైంది. వన్డేల్లో వీళ్లిద్దరూ కలిసి ఆడుతున్నపుడు ఎవరో ఒకరు రనౌట్ కావడమిది ఏడోసారి కావడం గమనార్హం. ఏడు రనౌట్లలో కోహ్లీవే ఐదు కాగా.. రెండుసార్లు రోహిత్ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇలా కోహ్లిని రనౌట్ చేసిన ప్రతిసారి హిట్ మ్యాన్ రోహిత్ భారీ స్కోర్లు సాధించాడు. ఇందులో ఏకంగా రెండు డబుల్ సెంచరీలు (209, 264) నమోదు చేయడం విశేషం. ఐదో వన్డేలో సైతం రోహిత్(115) సెంచరీతో కదం తొక్కాడు. ఇప్పటి వరకు వన్డేల్లో అత్యధికంగా రనౌట్లున్న భారత జోడీ సచిన్-గంగూలీలదే. వాళ్లిద్దరి మధ్య 176 భాగస్వామ్యాలు నమోదవగా.. తొమ్మిదిసార్లు ఎవరో ఒకరు రనౌటయ్యారు. ద్రవిడ్-గంగూలీ 87 భాగస్వామ్యాల్లో ఏడు రనౌట్లతో రెండో స్థానంలో ఉండగా.. కోహ్లి-రోహిత్ వారిని సమం చేసి చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. వీళ్లిద్దరి మధ్య 62 భాగస్వామ్యాల్లోనే ఏడు రనౌట్లుండటం విశేషం. గత పదేళ్లలో అత్యధిక రనౌట్లున్న జోడీల్లో వీరిది రెండో స్థానం కాగా డివిలియర్స్-డుప్లెసిస్(8), సంగక్కర- దిల్షాన్(8)లు తొలి స్థానంలో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో భారత్ 73 పరుగుల తేడాతో చారిత్రాత్మక విజయం అందుకున్న విషయం తెలిసిందే. -
చాహల్ చేసింది నేరమే!
సాక్షి, స్పోర్ట్స్ : వర్షం అడ్డంకుల మధ్య అదృష్టం కూడా కలిసొచ్చి విజయం దక్కినందున దక్షిణాఫ్రికా ఇక ప్రతి వన్డేను గులాబీ దుస్తుల్లోనే ఆడాలని భావిస్తుండవచ్చు. ‘పింక్ డే’ మ్యాచ్‌లో వారెప్పుడూ ఓడిపోని రికార్డును కొంత వర్షంతో పాటు ఓ చేజారిన క్యాచ్, ఓ నోబాల్ పదిలంగా ఉంచాయి. మంచి షాట్లతో భారత్‌ను విజయానికి దూరం చేసిన డేవిడ్ మిల్లరే ఈ రెండుసార్లూ లబ్ధి పొందాడు. కెరీర్లో రెండో వన్డే ఆడుతున్న హెన్రిక్ క్లాసెన్ అవకాశాన్ని అందిపుచ్చుకుని స్పిన్నర్ల బౌలింగ్‌లో హిట్టింగ్‌కు దిగి విజయవంతమయ్యాడు. డక్‌వర్త్ లూయీస్ పద్ధతి ఎక్కువగా లక్ష్యాన్ని ఛేదించే జట్టుకే ప్రయోజనకారి అని నిరూపితమైంది. అందుకని మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉన్నదని తెలిసీ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేయాలన్న భారత్ నిర్ణయాన్ని ప్రశ్నించకుండా ఉండలేం. జట్టు స్కోరు 300 దాటకపోవడం, ఓటమి కారణంగా ధావన్, కోహ్లి అద్భుత భాగస్వామ్యం మరుగున పడింది. ఏది సురక్షిత స్కోరు అనేది తెలియకపోవడమే కొన్నిసార్లు మొదట బ్యాటింగ్ చేయడంలో ఉన్న సమస్య. స్కోరింగ్ రేట్ పెంచే క్రమంలో అవుటై కోహ్లి మరో శతకం చేజార్చుకున్నాడు. ధావన్ ఈసారి సెంచరీ కొట్టినా... వర్షం అంతరాయం అతడి ఏకాగ్రతను దెబ్బ తీసింది. మన బౌలింగ్ తీరు చూశాక మరో గెలుపు దారిలో ఉన్నట్లే అనిపించింది. కానీ డివిలియర్స్ తమ జట్టుకు ఊపు తెచ్చాడు. చహల్ నోబాల్ కూడా వారికి కలిసొచ్చింది. ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ ఇలా లైఫ్ పొంది మ్యాచ్‌ను మలుపు తిప్పే ఇన్నింగ్స్ ఆడటం ఇది ఇటీవలి కాలంలో రెండోసారి. ఆధునిక సాంకేతికత అందుబాటులో ఉన్న ఈ రోజుల్లోనూ పరిమిత ఓవర్ల క్రికెట్లో నోబాల్ వేయడం అన్నది నేరంతో పాటు ప్రాథమిక అంశాలకు కట్టుబడకపోవడంలో నిర్లక్ష్యం, బద్ధకానికి నిదర్శనం. నోబాల్ అదనపు పరుగు మాత్రమే ఇవ్వదు. తదుపరి బంతికి బ్యాట్స్‌మన్‌కు ఫ్రీ హిట్ లభించి అతడికి ఆత్మవిశ్వాసాన్నిస్తుంది. వాతావరణం కారణంగా చేజారిన నాలుగో మ్యాచ్ గురించి టీమిండియా ఎక్కువగా ఆలోచించాల్సిన పనిలేదు. మంచి జట్లు తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటాయి. పోర్ట్ ఎలిజబెత్‌లో మనం దానిని చూస్తామనే నమ్మకం ఉంది. -
వాట్ ఏ క్యాచ్ మార్క్రమ్.!
జొహన్నెస్‌బర్గ్ : వాండరర్స్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన నాలుగో వన్డేలో ప్రొటీస్ కెప్టెన్ మార్క్రమ్ అద్భుత ఫీల్డింగ్‌తో వావ్ అనిపించాడు. రబడా వేసిన 46 ఓవర్ చివరి బంతిని భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా భారీ షాట్ కొట్టాడు. అదే దిశలో ఆఫ్‌సైడ్ సర్కిల్ ఎండ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న మార్క్రమ్ అంతే వేగంతో గాల్లోకి ఎగిరి బంతిని ఒడిసి పట్టుకున్నాడు. దీంతో పాండ్యా పెవిలియన్ చేరాడు. అయితే ఈ అద్భుత క్యాచ్‌కు సఫారీ ఆటగాళ్లతో పాటు మైదానంలోని ప్రేక్షకులంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఏ మాత్రం సాధ్యం కాని క్యాచ్‌ను మార్క్రమ్ అద్భుత ఫీల్డింగ్‌తో అందుకోవడం మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. -
ఆ సిక్స్‌కు ఫ్యాన్స్ థ్రిల్.!
జొహన్నెస్‌బర్గ్ : దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో వన్డేలో టీమిండియా ఓడినా ఓ విషయం మాత్రం భారత అభిమానులను థ్రిల్ చేస్తోంది. అద్భుత ఫామ్‌తో చెలరేగుతున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఈ మ్యాచ్‌లో మరో హాఫ్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. అయితే సాధారణంగా కోహ్లి బంతిని గాల్లోకి లేపాడానికి ఇష్టపడడు. అవకాశం చిక్కినప్పుడే సిక్స్ కొడుతాడు. అలాగే నిన్నటి మ్యాచ్‌లో కోహ్లి ఓ సిక్స్ కొట్టాడు. లుంగి ఎంగిడి వేసిన 17 ఓవర్ రెండో బంతిని కోహ్లి ఒక అడుగు ముందుకేసి స్ట్రయిట్‌గా సిక్సు కొట్టాడు. ఈ స్ట్రేట్ డ్రైవ్ షాట్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ‘షాట్ ఆఫ్ ది సిరీస్’ అంటూ తమ ఆనందాన్ని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. 75 పరుగులు చేసిన అనంతరం కోహ్లి క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. శిఖర్ ధావన్(105) అజేయ సెంచరీతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. వర్షం కారణంగా దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని 28 ఓవర్లలో 202 పరుగులుగా నిర్ణయించగా... ఆ జట్టు 25.3 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసి గెలిచింది. WHAT A SHOT 🙌 VIRAT INCREDIBLE KOHLI 👑@imVkohli #SAvIND 🇮🇳 pic.twitter.com/OnbmclPqCT — Vιяαт Kσнℓι (@imPriyaVK) 10 February 2018 -
కోహ్లిసేనదే బ్యాటింగ్
-
జాదవ్ ఔట్.. అయ్యర్ ఇన్
జొహన్నెస్‌బర్గ్ : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నాలుగో వన్డేలో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. సిరీస్ విజయానికి అడుగు దూరంలో ఉన్న కోహ్లి సేన ఎలాగైన ఈ మ్యాచ్ గెలిచి రికార్డు సృష్టించాలని ఉవ్విల్లూరుతోంది. ఇరు జట్లలో స్వల్ప మార్పు చోటు చేసుకున్నాయి. భారత జట్టులో గాయంతో కేదార్ జాదవ్ దూరం కాగా అతని స్థానంలో యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ జట్టులోకి వచ్చాడు. ఇక ఆతిథ్య జట్టులోకి ఏబీ డివిలియర్స్, మోర్కెల్ రాగా జోండో, ఇమ్రాన్ తాహీర్‌లకు ఉద్వాసన పలికారు. ఇక ఏబీ రాకతో ప్రొటీస్ జట్టులో ఆత్మవిశ్వాసం నెలకొంది. ఈ మ్యాచ్‌లో నెగ్గి సిరీస్ కాపాడుకోవాలని సఫారీ జట్టు భావిస్తోంది. తుది జట్ల వివరాలు భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, ధావన్, రహానే, పాండ్యా, శ్రేయస్ అయ్యర్, ధోని, భువనేశ్వర్, కుల్దీప్, బుమ్రా, చహల్. దక్షిణాఫ్రికా: మార్క్రమ్ (కెప్టెన్), ఆమ్లా, డుమిని, డివిలియర్స్, బెహర్దీన్, మిల్లర్, మోరిస్, ఫెలుక్వాయో, రబడ, మోర్కెల్, లుంగి ఎంగిడి -
స్మృతి మంధన డకౌట్
పోట్చెస్ట్రూమ్ : ఐసీసీ మహిళల చాంపియన్‌షిప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరి వన్డేలో భారత ఓపెనర్ స్మృతి మంధన డకౌట్‌గా వెనుదిరిగారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన మిథాలీ సేన తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి వన్డేలో 88, రెండో వన్డేలో సెంచరీతో రాణించి భారత విజయంలో కీలక పాత్ర పోషించిన డాషింగ్ ఓపెనర్ మంధన ఈ మ్యాచ్‌లో అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచారు. దీంతో భారత మహిళలు పరుగుల ఖాతా తెరవకుండానే వికెట్ కోల్పోయారు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ మిథాలీ రాజ్ (4) సైతం త్వరగా ఔటై పెవిలియన్ చేరారు. దీంతో భారత్ 10 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మరో ఓపెనర్ దీప్తీ శర్మతో వైస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. జట్టు స్కోరు 57 పరుగుల వద్ద హర్మన్(25) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగారు. దీంతో భారత్ 55 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. క్రీజులో దీప్తీ శర్మ(33), వేద కృష్ణమూర్తి(25)లు పోరాడుతున్నారు. 25 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు 88/3 -
నా తొలి వికెట్ క్యాచ్ మిథాలీ పట్టింది!
కింబర్లే: తాను తీసిన 200 వికెట్లలో ప్రతి వికెటూ ప్రత్యేకమైనదేనని భారత మహిళా క్రికెటర్ జులన్ గోస్వామి అభిప్రాయపడ్డారు. గత బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో ఆ జట్టు ఓపెనర్ లూరే వికెట్ తీయడంతో వన్డే క్రికెట్లో 200 వికెట్లు పడగొట్టిన తొలి మహిళా క్రికెటర్‌గా జులన్ గోస్వామి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జులన్ మాట్లాడుతూ..‘ఇప్పటి వరకు నేను తీసిన ప్రతి వికెట్ నాకు గుర్తుంది. నా తొలి వికెట్ 2002లో ఇంగ్లండ్‌పై సాధించా. చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో కారోలిన్ అట్కిన్స్ గాల్లోకి లేపిన బంతిని మిథాలీరాజ్ క్యాచ్ పట్టింది. ఇప్పటి వరకు నేను సాధించిన ప్రతి వికెట్ నాకు ప్రత్యేకం. నిజానికి ఈ ఘనత సాధించడానికి నాకెక్కువ సమయం పట్టలేదు. అంతకు ముందు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు నమోదు చేయడానికి మూడు వికెట్ల దూరంలో నిలిచి చాలా సమయం తీసుకున్నా.’ అని జులన్ తెలిపారు. రెండో వన్డే విజయంపై.. ఆతిథ్య జట్టుపై వరుసగా రెండో వన్డేలో గెలవడంపై స్పందిస్తూ.. ‘ ఈ విజయం పట్ల గర్వంగా ఉంది. నా సహచర ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. ముఖ్యంగా బ్యాటింగ్‌లో మంధన, హర్మన్, వేద అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారు. నేను 200 వికెట్ల మైలు రాయిని అందుకున్న మ్యాచ్‌లో విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా నా కుటుంబసభ్యులకు, సహచర ఆటగాళ్లకు, కోచ్‌కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మధ్యమధ్యలో గాయాల బారిన పడతాం. ఆటలో ఇవన్నీ మామూలే. సిరీస్‌ల మధ్య రెండు మూడు నెలల విరామం ఉండటంతో గాయాల నుంచి కోలుకుని తిరిగి ఫామ్‌ను అందుకోవడం సులువుగా ఉంటుంది’ అని జులన్ వ్యాఖ్యానించింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య చివరి వన్డే శనివారం జరగనుంది. ఇప్పటికే 2-0తో భారత్ సిరీస్‌ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. -
కోహ్లి విజృంభణ.. దక్షిణాఫ్రికాకు భారీ లక్ష్యం
కేప్‌టౌన్ : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేల్లో కెప్టెన్ విరాట్ కోహ్లి (160), ఓపెనర్ ధావన్(73)లు విజృంభించడంతో భారత్, ఆతిథ్య జట్టుకు 304 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన భారత్‌కు రోహిత్ డకౌటవ్వడంతో ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లి, ధావన్‌తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. ఈ తరుణంలో వేగంగా ఆడిన ధావన్ 42 బంతుల్లో 9 ఫోర్లతో కెరీర్లో 25వ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హాఫ్ సెంచరీ అనంతరం వేగం పెంచిన ధావన్ సఫారీ కెప్టెన్ మార్క్రమ్ అద్భుత క్యాచ్‌కు వెనుదిరిగాడు. దీంతో రెండో వికెట్‌కు నమోదైన 140 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన రహానే(11) విఫలమయ్యాడు. తొలి వన్డేలో అర్ధ సెంచరీతో ఆకట్టుకున్న రహానే ఈ మ్యాచ్‌లో తీవ్రంగా నిరాశపరిచాడు. మిడిలార్డర్ విఫలం తొలి రెండు వన్డేల్లో అంతగా బ్యాటింగ్ అవకాశం రాని మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ ఈ మ్యాచ్‌లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. పాండ్యా(14), ధోని(10), జాదవ్(1)లు దారుణంగా విఫలమయ్యారు. భువీ అండతో ఒకవైపు వికెట్లు పడుతుండటంతో భారత్ సాధారణ లక్ష్యానికే పరిమితం అనుకున్న సందర్భంలో కోహ్లి, భువనేశ్వర్ అండతో భారీ స్కోర్ దిశగా ప్రయత్నించాడు. వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలిస్తూ స్కోరు బోర్డు వేగాన్ని పెంచాడు. భువనేశ్వర్(16) సైతం కోహ్లికి మద్దతివ్వడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 303 పరుగులు చేసింది. కోహ్లి 160(159 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సులు) నాటౌట్‌గా నిలిచి వన్డేల్లో మూడోసారి 150 పైగా పరుగులు చేశాడు. ఇక ప్రొటీస్ బౌలర్లలో డుమినీకి రెండు వికెట్లు దక్కగా.. మోరిస్, రబడ, తాహీర్, ఆండీల్ పెహ్లుక్వాయో, తాహిర్‌లకు తలో వికెట్ దక్కింది. -
కోహ్లి సెంచరీ.. మరో అరుదైన రికార్డు
కేప్‌టౌన్ : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరో శతకం సాధించాడు. దీంతో మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే తొలి వన్డేలో సెంచరీ సాధించిన కోహ్లి, రెండో వన్డేలో 46 నాటౌట్‌గా నిలిచి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. అదే ఫామ్‌ను కొనసాగిస్తూ మూడో వన్డేలో సైతం 119 బంతుల్లో 7 ఫోర్లతో కెరీర్లో 34వ సెంచరీ నమోదు చేశాడు. ఈ సెంచరీతో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక సెంచరీలు సాధించిన క్రికెటర్ల జాబితాలో 5వ స్థానంలో నిలిచాడు. 54 సెంచరీలతో ఇప్పటి వరకు ఈ స్థానంలో హాషిమ్ ఆమ్లా( దక్షిణాఫ్రికా), మహేళా జయవర్ధనే(శ్రీలంక)లతో నిలిచిన కోహ్లి తాజా సెంచరీతో వారిని వెనక్కి నెట్టాడు. వన్డేల్లో 34, టెస్టుల్లో 21 సెంచరీలతో కలపి కోహ్లి మొత్తం 55 సెంచరీలు చేశాడు. ఇక తొలి స్థానంలో సచిన్(100) ఉండగా.. పాంటింగ్(ఆస్ట్రేలియా) 71, సంగక్కర(శ్రీలంక) 63, జాక్వస్ కల్లీస్(దక్షిణాఫ్రికా) 62లు కోహ్లికన్నా ముందు వరుసలో ఉన్నారు. కోహ్లి భవిష్యత్తులో ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే సచిన్‌ను అధిగమించడం అతిశయోక్తికాదు. -
కోహ్లి, ధావన్@50
కేప్‌టౌన్ : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా బ్యాట్స్‌మెన్ ఓపెనర్ శిఖర్ ధావన్(73), కెప్టెన్ విరాట్ కోహ్లి(50)లు అర్థ సెంచరీలు సాధించారు. దీంతో భారత బ్యాటింగ్ నిలకడగా సాగుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోహ్లిసేనకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. రోహిత్ శర్మ డకౌటవ్వడంతో భారత్ పరుగుల ఖాతా తెరవకుండానే వికెట్ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లి, మరో ఓపెనర్ ధావన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఈ తరుణంలో తొలుత ధావన్ 42 బంతుల్లో 9 ఫోర్లతో కెరీర్లో 25వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరికాసేపటికే 64 బంతుల్లో 5 ఫోర్లతో కోహ్లి కెరీర్లో 46వ అర్ధ సెంచరీ సాధించాడు. ఈ దశలో జట్టు స్కోరు 140 పరుగుల వద్ద డుమినీ బౌలింగ్‌లో ధావన్ 76(63 బంతులు, 12 ఫోర్లు) మార్క్రమ్ అద్భుత క్యాచ్‌కు పెవిలియన్ చేరాడు. దీంతో తొలి వికెట్‌కు నమోదైన 140 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. -
రోహిత్ డకౌట్.. భారత్ 0/1
కేప్‌టౌన్ : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ డకౌట్ అయి మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. దీంతో భారత్ పరుగుల ఖాతా తెరవకుండానే వికెట్ కోల్పోయింది. తొలి ఓవర్ వేసిన రబడా బౌలింగ్‌లో 6 బంతులు ఎదుర్కొన్న రోహిత్ చివరి బంతికి కీపర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. గత రెండు వన్డేల్లో తీవ్రంగా నిరాశపర్చిన రోహిత్ ఈ మ్యాచ్‌లోనైనా చేలరేగుతాడని భావించిన అభిమానులకు నిరాశే మిగిలింది. అనంతరం క్రీజులోకి కోహ్లి వచ్చాడు. -
భారత్‌దే బ్యాటింగ్
కేప్‌టౌన్: భారత్‌తో న్యూలాండ్స్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత జట్టులో ఎలాంటి మార్పులు చోటు చేసుకోకపోగా ఆతిథ్య జట్టులో స్వల్ప మార్పులు జరిగాయి. గాయంతో దూరమైన సఫారీ కీపర్ డికాక్ స్థానంలో హెన్రీచ్ క్లాసెన్, బౌలర్ మోర్కెల్ స్థానంలో లుంగి ఎంగిడిలను తీసుకున్నారు. ఈ ఇద్దరు ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ వన్డేల్లోకి అరంగేట్రం చేస్తున్నారు. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు గెలిచి మంచి ఊపు మీదున్న కోహ్లి సేన మరో విజయం సొంతం చేసుకుని చరిత్ర సృష్టించాలని ఉవ్విల్లూరుతోంది. ఇక ఆతిథ్య జట్టుకు గాయాల బెడద వెంటాడుతుండగా ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ మ్యాచ్ గెలిచి సిరీస్‌పై అవకాశాలు వదులుకోవద్దని సఫారీ జట్టు భావిస్తోంది. జట్లు భారత్: కోహ్లి (కెప్టెన్), ధావన్, రోహిత్, రహానే, జాదవ్, ధోనీ, పాండ్యా, భువనేశ్వర్, కుల్దీప్, చహల్, బుమ్రా. దక్షిణాఫ్రికా: మార్క్రమ్ (కెప్టెన్), ఆమ్లా, డుమిని, మిల్లర్, జొండొ, హెన్రీచ్ క్లాసెన్, మోరిస్, రబడ, తాహీర్, ఆండీల్ పెహ్లుక్వాయో, లుంగి ఎంగిడి -
వాళ్లాయన టీమిండియాకైతే.. ఈమె సతీమణుల కెప్టెన్!
కేప్‌టౌన్ : బాలీవుడ్ నటి, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి సతీమణి అనుష్క శర్మ దక్షిణాఫ్రికా పర్యటనను ఆస్వాదిస్తోంది. పెళ్లి అనంతరం కోహ్లితో అనుష్కశర్మ దక్షిణాఫ్రికా బయలుదేరిన విషయం తెలిసిందే. కోహ్లితో పాటు, కొత్తగా పెళ్లైన భువనేశ్వర్ సైతం తన భార్య నుపూర్ కౌర్‌ను తీసుకొచ్చాడు. శిఖర్ ధావన్, రోహిత్ శర్మలు కూడా తమ సతీమణులను దక్షిణాఫ్రికా తీసుకొచ్చారు. కాస్త విరామం దొరికిన వీరంతా కేప్‌టౌన్ వీధుల్లో చక్కర్లు కొడుతూ.. ఫొటోలకు ఫోజులిస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఫొటోలు నెట్టింట్లో హల్చల్ చేశాయి. అయితే జనవరి 5 నుంచి తొలి టెస్టు ప్రారంభమవడంతో సతీమణులంతా స్టాండ్స్‌కే పరిమితమయ్యారు. తమ పార్టనర్స్‌కు మద్దతు తెలపుతూ లక్కీఛార్స్మ్గా హడావుడీ చేస్తున్నారు. ఈ ఫోటోలకు నెటిజన్లు మైదానంలో ఆటగాళ్లను కోహ్లి లీడ్ చేస్తుండగా స్టాండ్స్‌లో ఆటగాళ్ల సతీమణులను అనుష్క లీడ్ చేస్తోందని కామెంట్ చేస్తున్నారు. షూటింగ్లో పాల్గొనేందుకు అనుష్కా భారత్ రానున్న నేపథ్యంలో ధావన్ భార్య అయేషా ‘మా ట్రైనింగ్ పార్టనర్‌ను చాలా మిస్సవుతున్నామనే’ క్యాఫ్షన్‌తో ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేసింది. ఈ పిక్ సైతం వైరల్ అయింది. -
సోషల్ మీడియాలో రోహిత్‌పై పేలిన జోక్స్
సాక్షి, హైదరాబాద్ : దక్షిణాఫ్రికా పర్యటనలో భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విఫలమవ్వడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే కోహ్లిపై సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేసిన నెటిజన్లు తాజాగా రోహిత్‌ను రోస్ట్ చేశారు. కుళ్లు జోకులతో, ఫొటో, వీడియో మార్ఫింగ్‌లతో హిట్ మాన్ బ్యాటింగ్ వైఫల్యాన్ని ఎండగడుతున్నారు. ఇక రోహిత్ 59 బంతులు ఎదుర్కొని 11 పరుగులు చేయడం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. హిట్ మాన్‌గా ముద్ర వేసుకున్న రోహిత్ తన శైలికి భిన్నంగా బంతిని బ్యాట్‌కు తగిలించడంలో తెగ ఇబ్బంది పడ్డాడు. స్టెయిన్, రబడా, మోర్కెల్ బౌలింగ్‌ను ఎదుర్కొనలేక చేతులేత్తేశాడు. రబడా బౌలింగ్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. శ్రీలంక సిరీస్‌లో సూపర్ ఫామ్ కనబర్చడంతో కెప్టెన్ కోహ్లి వైస్ కెప్టెన్ రహానేను కాదని తుది జట్టులోకి తీసుకున్నాడు. కానీ హిట్ మ్యాన్ కోహ్లి పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేశాడు. ఇప్పటికే రహానేను ఎందుకు తీసుకోలేదని అభిమానులు, మాజీ క్రికెటర్లు కోహ్లిని ఎత్తిపొడుస్తుండగా.. రోహిత్ వైఫల్యం కోహ్లికి మరిన్ని చికాకులు తెప్పించనుంది. రోహిత్‌పై పేలిన జోకులు.. ‘డేల్ స్టెయిన్ బౌలింగ్ ఎదుర్కుంటే రోహిత్ డబుల్ సెంచరీ చేసినట్టే’ పేస్ బౌలింగ్‌ను ఎదుర్కొనడంలో గంటసేపు తడబడ్డ రోహిత్ నాకు తెలిసి గత మూడు దశాబ్దాలుగా భారత క్రికెట్ చరిత్రలోనే బెస్ట్ వాచ్‌మన్. భారత్‌లోనే రోహిత్ వంద, రెండొందలు బాదగలడు..కానీ విదేశాల్లో రాణించలేడు. సీమర్స్ను ఎదుర్కోవాలంటే రోహిత్ ఒళ్లంతా ప్యాడ్స్ పెట్టుకోవాలి Exclusive pic of Rohit Sharma offering pads against express fast bowlers 😂😂 #SAvIND #INDvSA #FreedomSeries pic.twitter.com/9qkcJPg912 — Rahul (@clickator7) 6 January 2018 తొలి ఇన్నింగ్స్‌లో 92 కే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న భారత్‌ని ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అపద్భాందవుడిలా ఆదుకున్నాడు. తృటిలో సెంచరీ చేజార్చుకున్న పాండ్యా(93) భారత్ గౌరవ ప్రదమైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. భారత్ 209 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా రెండు వికెట్లు కోల్పోయి 65 పరుగులు చేసింది. ఈ రెండు వికెట్లు సైతం పాండ్యా తీయడం విశేషం. ఇక భారత రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్ రాణించకపోతే రెండో టెస్టు తుది జట్టులో చోటు దక్కడం కష్టమవుతోంది. -
కోహ్లిపై సెటైర్లతో నెటిజన్ల ఫైర్
కేప్‌టౌన్ : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై సోషల్ మీడియా వేదికగా జోకులు పేలుతున్నాయి. దక్షిణాఫ్రికాతో శుక్రవారం ప్రారంభమైన తొలి టెస్టులో కోహ్లి(5) దారుణంగా విఫలమవ్వడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ ఆగ్రహాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లగక్కారు. కొందరైతే వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ఫొటో మార్ఫింగ్‌లతో ట్రోల్ చేస్తున్నారు. తుది జట్టులో రహానేను తీసుకోకపోవడంపై కూడా విమర్శల వర్షం కురిపించారు. ఓవర్సీస్లో రాణించే రహానేను ఎందుకు పక్కన పెట్టారని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. భారత బౌలర్లు అద్భుతంగా రాణించడంతో దక్షిణాఫ్రికా 286 ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్.. ఓపెనర్లు మురళి విజయ్(1), శిఖర్ ధావన్(16)ల వికెట్లను స్వల్ప వ్యవధిలోనే కోల్పోయింది. బాధ్యతాయుతంగా ఆడాల్సిన కోహ్లి(5) సైతం నిరాశపరచడంతో అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు. దీంతో తమ ఆవేశాన్ని సోషల్‌మీడియాలో వెల్లగక్కారు. ఇప్పుడు ఈ పోస్టులు తెగవైరల్ అవుతున్నాయి. కోహ్లిపై అభిమానుల సెటైరిక్ ట్వీట్స్.. అంచనాలు : కోహ్లి ఏ పరిస్థితుల్లోనైనా ఆడగలడు. నిజం: బ్యాటింగ్ పిచ్‌లో 200 పైగా పరుగులు చేయగలడు. కానీ బౌలింగ్ పిచ్‌లో 20 పరుగులు చేయలేడు. కోచ్: కోహ్లి దక్షిణాఫ్రికాలో ఎందుకు ఇబ్బందిపడుతున్నావు..? కోహ్లి: జాతిపిత మహాత్మగాంధే ఇక్కడ ఇబ్బందులు ఎదుర్కున్నారు నేనేంత ‘హనీమూన్ డేస్ ఉద్యోగానికి రమ్మంటే ఇలానే ఉంటుంది.. మీ అసౌకర్యానికి చింతిస్తున్నాను.. నాకు ఇప్పుడిప్పుడే పెళ్లైంది’. ‘కోహ్లి కన్నా స్మిత్ బెస్ట్. అన్నిపరిస్థితుల్లో స్మిత్ ఆడగలడు. కోహ్లి కేవలం ఉపఖండ పిచ్‌లపైనే రాణించగలడు’. ‘హనీమూన్ హ్యాంగోవర్ నుంచి బయటపడి తన సహజమైన ఆట ఆడటానికి కోహ్లి ఇంకా 10 నుంచి 15 ఇన్నింగ్స్‌లు తీసుకుంటాడు’. ‘మోదీగారు.. ఓవర్సీస్లో ఎలా రాణించాలో కోహ్లికి సలహాలివ్వండి’. Coach : why are you struggling in South Africa? Virat Kohli : even the great Mahatma Gandhi struggled here, mai kya cheez hun. #INDvSA — Pakchikpak Raja Babu (@HaramiParindey) 5 January 2018 ఈపర్యటన నేపథ్యంలో ఇప్పటికే టీమిండియాపై ఒత్తిడి నెలకొనగా తొలి మ్యాచ్‌లో ఓడితే మరింత ఒత్తిడి పెరగనుంది. దక్షిణాఫ్రికాలో ఆరుసార్లు పర్యటించిన భారత్ ఒక్కటంటే ఒక్క టెస్ట్ సిరీస్ గెలవలేదు. సఫారీలతో భారత్ కేవలం రెండు టెస్టులు మాత్రమే నెగ్గగా 8 ఓడి, 7 మ్యాచ్‌లు డ్రా చేసుకుంది. ఇక క్రీజులో రోహిత్, పుజారాలున్నారు. ఈ రోజు బ్యాటింగ్‌తో భారత విజయవకాశం తేలనుంది. -
భారత్‌తో అంత ఈజీ కాదు!
న్యూఢిల్లీ : దాదాపు ఏడాదికి పైగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన దక్షిణాఫ్రికా స్పీడ్ స్టార్ డేల్ స్టెయిన్‌కు భారత్‌పై రాణించడం అంత సులువైన విషయం కాదని భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. గతేడాది ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ సందర్భంగా స్టెయిన్ భుజానికి గాయమైంది. దీంతో ఏడాదిగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమయ్యాడు. ‘పదేళ్లు తన బౌలింగ్‌తో అద్బుతంగా రాణించిన స్టెయిన్‌కు పునరాగమనం అంత ఈజీ కాదు. జింబాంబ్వేతో జరుగుతున్న నాలుగురోజుల ప్రయోగాత్మక టెస్టు.. భారత్‌తో జరిగే టెస్టు సిరీస్‌ను ప్రతిబింబించలేదు.’ అని బజ్జీ దక్షిణాఫ్రికాలో భారత్ పర్యటనపై తన అభిప్రాయం తెలిపాడు. ‘భారత బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా ఉంది. చాలా నాణ్యమైన బ్యాట్స్‌మెన్ భారత జట్టులో ఉన్నారు. మురళి విజయ్, చతేశ్వర పుజారా, విరాట్ కోహ్లి, అజింక్యా రహానే, రోహిత్ శర్మలతో కూడిన పటిష్ట బ్యాటింగ్ లైనప్‌ను ఎదుర్కోవడం స్టెయిన్, మోర్కెల్లకు పెద్ద సవాలే.’ అని హర్బజన్ చెప్పుకొచ్చాడు. ఇక ఆరో స్థానంలో ఆడుతున్న పాండ్యాకు బదులు రోహిత్‌ను చూడాలనుందన్న బజ్జీ .. పాండ్యా బెస్ట్ ఆల్‌రౌండరే కానీ రోహిత్ పూర్తిస్థాయి బ్యాట్స్‌మన్ అన్నాడు. ఇక జట్టులో ఆఫ్ స్పిన్నర్ అశ్విన్‌కు చోటు దక్కకపోవచ్చని, భారత్ ముగ్గురు పేసర్లను బరిలోకి దించే అవకాశం ఉండటమే దీనికి కారణమని పేర్కొన్నాడు. -
సౌతాఫ్రికాకు శుభారంభం
రాజ్ కోట్: గాంధీ- మండేలా సిరీస్ లో భాగంగా రాజ్ కోట్ లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరుగుతున్న మూడో వన్ డేలో దక్షిణాఫ్రికా నిలకడగా ఆడుతోంది. 10 ఓవర్లు ముగిసేసరికి వికెట్లేమీ కోల్పోకుండా 59 పరుగులు సాధించింది. ఓపెనర్లు డికాక్ (31), మిల్లార్ (26 పరుగులు చేసి భారీ స్కోరుకు పునాదులు వేసే ప్రయత్నం చేస్తున్నారు. భారత జట్టు కూర్పులో ఒక మార్పు చోటుచేసుకుంది. అమిత్ మిశ్రా బరిలోకి దిగాడు.