Indian Railway Services
-
Chenab Railway Bridge: చుక్చుక్బండి.. మేఘాలలో ప్రయాణమండి..
ఇది విదేశాల్లోని చిత్రం కానే కాదు.. మనదే. మన దేశంలోనిదే. కశ్మీర్లో ఈ మధ్యే నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చీనాబ్ వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో నిర్మితమైన రైల్వే బ్రిడ్జిగా పేరొందింది. ఇది రియాసి జిల్లాలోని బక్కర్, కౌరి మధ్య ఉంది. చీనాబ్ వంతెనకు సంబంధించిన కొన్ని ఫోటోలను రైల్వే శాఖ ట్విట్టర్లో షేర్ చేసింది. బ్రిడ్జి నిర్మాణం పూర్తయినా.. రైళ్ల రాకపోకలకు ఇంకా అనుమతించలేదు. డిసెంబర్లో ప్రారంభమయ్యే అవకాశముంది. -
ప్రాణాలకు తెగించి కాపాడాడు.. కొంచెం ఆలస్యమైనా ఎంత ఘోరం జరిగేదో..
తెలిసిన వారు, బంధువులు ఆపదలో ఉంటేనే ఎవరూ సాయం చేయడానికి ముందుకు రాని రోజులివి. అడక్కముందే మాటలు ఎన్నో చెప్తారు కానీ చేతల్లోకి వచ్చే సరికి సైలెంట్‌గా సైడ్ అయిపోతుంటారు. కానీ తనకు ఏం కాని వ్యక్తి కోసం తన జీవితాన్ని పణంగా పెట్టాడు. చనిపోదామనుకున్న వ్యక్తిని ప్రాణాలను తెగించి కాపాడాడు. అతనికి కొత్త లైఫ్ అందించాడు. ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య నిర్ణయించుకున్నాడు. దూరం నుంచి రైలు కూడ వస్తోంది. అయితే అదే సమయంలో స్టేషన్లో విధుల్లో ఉన్న రైల్వే సిబ్బంది అతని గమనించాడు. వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పరుగెత్తాడు. అటు నుంచి రైలు వేగంగా దగ్గరకు వస్తున్న భయపడకుండా ప్రాణాలకు తెగించి రైల్వే ట్రాక్‌పైకి దూకి అతన్ని ఎత్తుకొని పక్క ట్రాక్ మీదకు తీసుకెళ్లాడు. అతను కాపాడిన సెకన్ల వ్యవధిలోనే రైలు పట్టాలపై వేగంగా వెళ్లింది. కాగా ఇది ఎక్కడ, ఎప్పుడు జరిగిందో తెలియరాలేదు.. కాపాడిన వ్యక్తి పేరు మాత్రం సతీష్ కుమార్ అని తెలిసింది. చదవండి: గున్న ఏనుగు చుట్టూ బాడీగార్డులు.. ఓ లుక్కేయండి దీనికి సంబంధించిన వీడియోను ఇండియన్ రైల్వేస్ తమ అధికారిక ట్విటర్లో పోస్టు చేసింది. ‘రైల్వే సిబ్బంది సాహసోపేతమైన ధైర్యం ఒక విలువైన ప్రాణాన్ని కాపాడింది. సతీష్ లాంటి ధైర్యవంతులు భారతీయ రైల్వేలో ఉన్నందుకు గర్వంగా ఉంది’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రాణాలకు తెగించి వ్యక్తిని కాపాడిన రైల్వే సిబ్బందిని అక్కడున్నవారు, అధికారులు ప్రశంసించారు. నెటిజన్లు సైతం సిబ్బంది ధైర్య సాహసాలను మెచ్చుకుంటున్నారు. అతడిని దేవుడు చల్లగా చూడాలి, హ్యాట్సాఫ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. सेवा, सुरक्षा और सहयोग A precious life was saved by the courageous act of help by on-duty staff, who jumped on tracks himself to save a person from getting gravely injured. Indian Railways is proud to have daring & diligent staff like H. Satish Kumar and commends his bravery. pic.twitter.com/gcnHCrtXg4 — Ministry of Railways (@RailMinIndia) June 23, 2022 -
అలర్ట్ ఫీచర్.. ‘రైలులో ప్రశాంతంగా నిద్రపోవచ్చు’
Indian Railways Destination Alert Service: రైలు ప్రయాణికులు తాము దిగాల్సిన స్టేషన్ కోసం ఆన్లైన్లో నిత్యం పరిశీలించాల్సి వస్తుంది. అదే రాత్రి వేళల్లో అయితే బోగీలో లైట్లన్నీ ఆర్పి ఉండటం, సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కావడంతో వేగంగా వెళ్లడంతో రైలులో నుంచి రైల్వేస్టేషన్లను గుర్తు పట్టే పరిస్థితి ఉండదు. అర్ధరాత్రి దిగాల్సిన స్టేషన్ కోసం నిద్రపోకుండా ఎదురుచూస్తూ ఉండాలి. కానీ ఇక నుంచి రిజర్వేషన్లో ప్రయాణించే ప్రయాణికులు తమ బెర్త్‌లో ప్రశాంతంగా నిద్రపోయేందుకు భారత రైల్వే అలర్ట్ ఫీచర్ ఆప్షన్ తీసుకువచ్చింది. రైలులో నిద్రపోతున్న ప్రయాణికుడు ఇందులో భాగంగా 139కు కాల్ చేసి, మీ రిజర్వేషన్ టికెట్‌పై ఉన్న పీఎన్ఆర్ నంబర్ చెప్పి, దిగాల్సిన రైల్వేస్టేషన్ పేరు ధ్రువీకరించుకోవాలి. ఈ విధానంతో ప్రయాణికులు దిగాల్సిన స్టేషన్‌కు 20 నిమిషాల ముందు మీ సెల్‌ఫోన్‌కు కాల్ వస్తుంది. ఈ సదుపాయం కేవలం రాత్రి 11 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు మాత్రమే ఉంది. ఏదేమైనా రాత్రి వేళల్లో ప్రయాణికులకు ఇది సౌకర్యంగా ఉంటుంది. చదవండి: వచ్చే నెలలో అమెరికాకు వెళ్లాల్సి ఉంది.. మనవడిని చూడకుండానే.. -
రైలు ప్రయాణం.. యూటీఎస్ యాప్‌లో జనరల్ టికెట్ల బుకింగ్ ఇలా!
సాక్షి, ఖమ్మం : రైలు ప్రయాణమంటే హడావుడి అంతాఇంత కాదు. ఇంటి నుంచి స్టేషన్‌కు పిల్లలు, లగేజీతో చేరుకోవడం.. తీరా టికెట్ కౌంటర్ల వద్ద చాంతాడంత క్యూలో నిల్చొని టికెట్ తీసుకోవడం.. ఇంతలోనే ఎక్కాల్సిన రైలు ఒక్కోసారి వెళ్లిపోవడం.. టికెట్ లేకుండా రైలు ఎక్కితే జరిమానా కట్టాల్సి రావడం.. ఇలాంటి ఇబ్బందులన్నింటికీ చెక్ పెట్టేలా రైల్వే శాఖ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అందరి చేతుల్లో ఇంటర్నెట్ సౌకర్యంతో కూడిన స్మార్ట్ పోన్లు ఉంటున్న నేపథ్యంలో ఎంచక్కా ఇంటి నుంచే జనరల్ టికెట్ బుక్ చేసుకుని సమయానికి రైల్వే స్టేషన్‌కు వెళ్లే అవకాశం కల్పించారు. యూటీఎస్(అన్ రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టం) మొబైల్ యాప్ ద్వారా ఈ సౌకర్యం అందుబాటులోకి రాగా, జిల్లాలోని అన్ని రైల్వేస్టేషన్లలో యాప్ ఉపయోగించుకునేలా ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇవీ నిబంధనలు.. ప్రధాన రైల్వేస్టేషనల్లో పండుగ సెలవులు, వారాంతాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో ఇబ్బంది పడకుండా యాప్ ఉపయోగించుకోవాలని రైల్వే అధికారులు ప్రచారం చేస్తున్నారు. కాగా, ప్రయాణికులు రైలు ప్రయాణం చేసే రోజునే ఈ యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. టికెట్ బుక్ అయిన గంటలోపే రైలు ఎక్కాల్సి ఉండగా, ఎక్కాల్సిన రైల్వేస్టేషన్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో రైలు ఉన్నప్పుడే యూటీఎస్ ద్వారా టికెట్ బుక్ అవుతుంది. అలాకాకుండా రైలు ఎక్కాక టికెట్ బుక్ కాదు. అలాగే, స్మార్ట్ ఫోన్లో జీపీఆర్ఎస్ యాక్టివేషన్లో ఉండాలి. చదవండి: చెల్లిని వదిలేసిన భర్త.. న్యాయం కోసం ఎడ్లబండిపై సుప్రీంకోర్టుకు.. యాప్‌లో నమోదు, బుకింగ్ ఇలా.. జీపీఆర్ఎస్ యాక్టివేషన్ ఉన్న స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నవారు గూగుల్ ప్లే స్టోర్ ద్వారా యూటీఎస్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. లేదంటే www.utsonmobile.indianrail.gov.in వెబ్సైట్లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. యాప్ ఓపెన్ చేశాక ఫోన్ నంబర్, పేరు, పాస్వర్డ్, పుట్టిన తేదీ తదితర వివరాలు నమోదు చేసుకుని వచ్చే ఓటీపీ ఆధారంగా ఖాతా రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ఆతర్వాత యాప్ తెరిచి ఫోన్ నంబరు, పాస్‌వర్డ్‌తో ఖాతాలోకి లాగిన్ అయితే సాధారణ బుకింగ్, క్విక్ బుకింగ్, ఫ్లాట్‌ఫాం టికెట్, సీజన్ టికెట్, క్యూఆర్ బుకింగ్, కేన్సల్ టికెట్ తదితర ఆప్షన్లు కనిపిస్తాయి. ఇందులో ఎక్కాల్సిన స్టేషన్, గమ్యస్థానం తదితర వివరాలు నమోదు చేసి టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఇక నగదు చెల్లింపునకు ఆర్–వ్యాలెట్, క్రెడిట్, డెబిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, డిజిటల్ పేమెంట్ ఉపయోగించుకోవచ్చు. కాగిత రహిత టికెట్ ఆప్షన్ ఎంచుకుంటే టికెట్ కలెక్టర్లకు స్మార్ట్‌ఫోన్‌లో డౌన్లోడ్ చేసుకున్న టికెట్ చూపిస్తే సరిపోతుంది. లేదా ముద్రించిన టికెట్ ఆప్షన్ ఎంచుకుంటే రైల్వేస్టేషన్‌లోని ఏటీవీఎం, కో–టీవీఎం, ఓసీఆర్ యంత్రాలు, ఓటీఎస్ బుకింగ్ కౌంటర్ ద్వారా టికెట్ తీసుకోవచ్చు. ఖమ్మం స్టేషన్లో అవగాహన.. ఖమ్మం మామిళ్లగూడెం: యూటీఎస్(అన్ రిజర్వుడ్ టికెట్ సిస్టమ్)పై రైల్వే అధికారులు ప్రయాణికులకు అవగాహన కల్పించారు. ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లకు జనరల్ టికెట్లతో పాటు సీజన్ టికెట్లు, పాస్ తీసుకునే అవకాశముందని వెల్లడించారు. ఇందుకోసం ఖమ్మం రైల్వేస్టేషన్లో మంగళవారం అవగాహన కల్పించిన అధికారులు సాధారణ బుకింగ్ కౌంటర్ వద్ద ప్రత్యేక కౌంటర్ ఏర్పాటుచేయడమే కాక స్టేషన్ పరిసరాల్లో కూ ఆర్ కోడ్ స్కానర్లు అమర్చారు. చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ ప్రసన్నకుమార్, చీఫ్ బుకింగ్ సూపర్వైజర్ జె.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్
Summer Special Trains.. రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. ప్రయాణికుల కోసం స్పెషల్ ట్రైన్స్‌ను నడుపుతున్నట్టు భారతీయ రైల్వే పేర్కొంది. వేసవి సందర్భంగా వివిధ ప్రాంతాలకు 968 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు ఏప్రిల్ 30 నుంచి వారాంతాల్లో నడుస్తాయని రైల్వే శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కొత్త రైళ్లలో ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్, మన్మాడ్ మధ్య 126 రైళ్లు ఉన్నాయి. మాల్దా టౌన్, రేవా మధ్య దాదాపు ఆరు వేసవి స్పెషల్స్ ప్రయాణించనున్నాయి. దాదర్, మడ్గావ్ మధ్య మరో ఆరు వేసవి స్పెషల్స్ నడుస్తాయి. ఇక, తిరుపతి-హైదరాబాద్, తిరుపతి-ఔరంగాబాద్ మధ్య 20 ప్రత్యేక రైళ్లు కూడా ఉన్నాయని దక్షిణమధ్య రైల్వే వెల్లడించింది. హైదరాబాద్-తిరుపతి (07509) రైలు శనివారం సాయంత్రం 4.35కు హైదరాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఈ రైలు ఏప్రిల్ 30, మే 7, 14, 21, 28 తేదీల్లో అందుబాటులో ఉంటుంది.అదేవిధంగా తిరుపతి-హైదరాబాద్ రైలు (07510) మంగళవారం 11.50 గంటలకు తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు హైదరాబాద్ చేరకుంటుంది. ఈ సర్వీసు మే 3, 10, 17, 24, 31 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. మరోవైపు.. తిరుపతి-ఔరంగాబాద్ (07511) స్పెషల్ ట్రెయిన్ ఆదివారం ఉదయం 07.05 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరుతుందని, మరుసటి రోజు 7 గంటలకు ఔరంగాబాద్ చేరుకుంటుందని వెల్లడించారు. ఇది మే 1, 8, 15, 22, 29 తేదీల్లో నడుస్తుంది. 20 Summer Weekly Special Trains between various destinations @drmhyb @drmgtl @drmned @drmsecunderabad #SummerSpecialTrains pic.twitter.com/m20zpM1rqj — South Central Railway (@SCRailwayIndia) April 27, 2022 ఇది కూడా చదవండి: ఫోర్త్ వేవ్‌లో అనవసర ఆంక్షలు ఉండవు -
వావ్!! దేశంలో మరో సూపర్ ఫాస్ట్ రైలు, ఎక్కడంటే!
దేశంలో ప్రజారవాణా వ్యవస్థను మరింత బలోపేతం దిశగా కేంద్రం వడివడిగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే దేశంలో 8 కారిడార్లలలో బుల్లెట్ ట్రైన్లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఢిల్లీ - హిస్సార్ ప్రాంతాల మధ్య సూపర్ ఫాస్ట్ ట్రైన్ సేవల్ని ప్రారంభించనుంది. ఢిల్లీ - హిస్సార్ మధ్య కొత్త సూపర్ ఫాస్ట్ రైళ్ల రైలు మార్గాన్ని నిర్మించడంపై ప్రభుత్వం చర్చిస్తున్నట్లు హర్యానా మంత్రి డాక్టర్ కమల్ గుప్తా తెలిపారు. కాగా ప్రస్తుతం ఢిల్లీ-హిస్సార్ మధ్య 180 కి.మీ దూరాన్ని సాధారణ రైలులో నాలుగు గంటల్లో పూర్తి చేస్తుండగా..కొత్త రైలు మార్గం నిర్మాణం పూర్తయితే ఈ దూరాన్ని కేవలం రెండున్నర గంటల్లో అధిగమించవచ్చు. ప్రధాన కారణం ఢిల్లీ-హిస్సార్ కొత్త రైలు మార్గాన్ని నిర్మించడానికి ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ట్రాఫిక్ ఎక్కువే ప్రధాన కారణం. అక్కడ విమాన ట్రాఫిక్ ఉంటే, కొంత విమాన ట్రాఫిక్‌ను హిసార్ విమానాశ్రయానికి మళ్లించవచ్చు. దీని తరువాత, హిసార్ విమానాశ్రయాన్ని ఏవియేషన్ హబ్‌గా అభివృద్ధి చేయొచ్చని కేంద్రం భావిస్తోంది.ఇందులో భాగంగా సీఎం మనోహర్ లాల్‌తో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చర్చించారు. ఈ సందర్భంగా రోహ్తక్లోని ఎలివేటెడ్ రైల్వే లైన్ కింద పది కొత్త రైల్వే స్టేషన్లతో పాటు రోడ్డు మార్గాల్ని నిర్మిస్తామని మంత్రి పేర్కొన్నారు. చదవండి: బెంగళూరు - హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్... రైల్వే శాఖ కీలక నిర్ణయం -
స్పెషల్ లేదు ఏం లేదు.. సున్నాతో సున్నం! ఇదేం బాదుడు బాబోయ్..
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ కాలంలో అన్ని రైళ్లూ రద్దయ్యాయి. ప్రయాణికులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. అలా సొంత ఊళ్లకు చేరుకోకుండా ఎక్కడో ఒకచోట ఉండిపోయిన వాళ్లను గమ్యస్థానాలకు చేర్చేందుకు దక్షిణమధ్య రైల్వే గతేడాది ‘ప్రత్యేక’ రైళ్లకు శ్రీకారం చుట్టింది. అప్పటి వరకు నడిచిన రెగ్యులర్ రైళ్ల నంబర్లకు ‘సున్నా’ను జత చేసింది. దీంతో అవి అకస్మాత్తుగా ‘ప్రత్యేక’ రైళ్ల అవతారమెత్తాయి. అలా ‘ఏమార్చి’న రైళ్లలో చార్జీలను పెంచారు. కోవిడ్ కాలం తొలగిపోయి సాధారణ పరిస్థితులు నెలకొన్నా ఆ ‘సున్నా’ మాత్రం అలాగే ఉండిపోయింది. బాదుడు రైళ్లు యథావిధిగా పట్టాలపై పరుగులు తీస్తున్నాయి. పెంచిన చార్జీలను ఉపసంహరించుకోవడానికి బదులు ప్యాసింజర్లను ‘ఎక్స్‌ప్రెస్’లుగా, ఎక్స్‌ప్రెస్‌లను ‘సూపర్‌ఫాస్టు’లుగా నడుపుతున్నట్లు అధికారులు ప్రకటించారు. కాని ఆయా రైళ్లలో ఎలాంటి మార్పులు, చేర్పులు లేవనీ, చార్జీలు మాత్రం దారుణంగా పెరిగాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవే రైళ్లు.. అదే వేగం... ► రైళ్ల స్థాయిని పెంచినప్పటికీ వేగంలో మాత్రం ఎలాంటి మార్పు లేకపోవడం గమనార్హం. ప్యాసింజర్ రైళ్లు, ఎక్స్‌ప్రెస్‌లు, సూపర్‌ఫాస్టు రైళ్లు గంటకు 60 నుంచి 80 కిలోమీటర్లలోపే నడుస్తున్నాయి. కొన్ని రూట్లలో ఆ మాత్రం వేగం కూడా కష్టమే. ► మరోవైపు ఒక్కో రూట్లో రెండు, మూడు స్టేషన్లలో హాల్టింగ్ సదుపాయం తొలగించడంతో కలిసొచి్చన సమయాన్ని వేగం పెంచినట్లుగా చూపుతున్నారని ప్రయాణికుల సంక్షేమ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బాదుడు రైళ్లివే.. ► కోవిడ్ కంటే ముందు నడిచిన రైళ్లకు ‘ప్రత్యేకం’గా నంబర్లకు సున్నాను జత చేసి నడిపిస్తున్నారు. ఎక్స్‌ప్రెస్ రైళ్లను సూపర్ఫాస్టులుగా, ప్యాసింజర్ రైళ్లను ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చి బాదేస్తున్నారు. ► భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ (17234/17233) కోవిడ్ తర్వాత (017234/017233)గా మారింది. అప్పటి వరకు ఉన్న ఎక్స్‌ప్రెస్ చార్జీలను సూపర్‌ఫాస్ట్ చార్జీలుగా మార్చారు. కరోనా కంటే ముందు సికింద్రాబాద్ నుంచి పెద్దపల్లి వరకు రూ.75 ఉన్న చార్జీని కోవిడ్ తర్వాత రూ.90కి పెంచారు. రిజర్వేషన్ సీట్ కావాలంటే అదనంగా మరో రూ.15 చెల్లించాలి. ఐఆర్సీటీసీ వెబ్సైట్ నుంచి బుక్ చేసుకొంటే మరో రూ.17 సర్‌చార్జీ చెల్లించాలి. మొత్తంగా భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ నంబర్‌కు ‘0’ చేర్చడం వల్ల ఒక సీట్‌పై రూ.45 అదనపు భారం పడింది. ► సికింద్రాబాద్ నుంచి మణుగూర్ వరకు నడిచే డైలీ ఎక్స్‌ప్రెస్ (17026/17025) ట్రైన్‌ను కోవిడ్ నేపథ్యంలో కేవలం నంబర్‌కు ముందు సున్నా చేర్చి చార్జీ రూ.15 పెంచారు. ► సికింద్రాబాద్ నుంచి గద్వాల్ జంక్షన్ వరకు నడిచిన తుంగభద్ర ఎక్స్‌ప్రెస్ చార్జీ కోవిడ్‌కు ముందు రూ.80 ఉంటే ఇప్పుడు రూ.95 కు పెంచారు. కేవలం నంబర్‌కు ముందు సున్నాను చేర్చడం వల్ల పెరిగిన చార్జీ ఇది. రైళ్ల వేగం ఏ మాత్రం పెరగడం లేదని,పైగా కొన్ని స్టాపుల్లో వాటిని నిలపకుండా నడపడంతో తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సివస్తోందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ► తాండూరు నుంచి సికింద్రాబాద్ వరకు నడిచిన మెము పుష్ఫుల్ రైల్లో గతంలో తాండూరు నుంచి సికింద్రాబాద్ వరకు కేవలం రూ.35 చార్జీ ఉండేది. ఇప్పుడు ఆ రైలు నంబర్‌కు ‘సున్నా’ను జత చేయడంతో చార్జీ ఏకంగా రూ.70కి పెరిగింది. ► కాచిగూడ నుంచి నిజామాబాద్ వరకు నడిచిన పుష్ఫుల్ ట్రైన్ చార్జీ రూ.45 నుంచి రూ.70 కి పెరిగింది. నంబర్‌కు ముందు ‘సున్నా’చేర్చి ‘ఎక్స్‌ప్రెస్’గా మార్చి చార్జీలను పెంచేశారు. ► సికింద్రాబాద్ నుంచి కాగజ్‌నగర్‌కు రూ.95 ఉన్న చార్జీ ఇప్పుడు రూ.110 కి పెరిగింది. ► నాగర్సోల్ నుంచి నర్సాపూర్ వరకు నడిచే ఎక్స్‌ప్రెస్ ట్రైన్లో సికింద్రాబాద్ నుంచి కాజీపేట్ వరకు గతంలో రూ.60 మాత్రమే ఉండగా, ఇప్పుడు రూ.75 కు పెంచారు. దోచేస్తున్నారు.. ఏ రైలుకు ఎప్పుడు ‘సున్నా’ వచ్చి చేరుతుందో తెలియదు, కోవిడ్ నెపంతో ‘ప్రత్యేక’ రైళ్లను నడిపి చార్జీలు పెంచారు. ప్రస్తుత సాధారణ పరిస్థితుల్లో పెంచిన చార్జీలను ఉపసంహరించుకోవాలి. కానీ అందుకు భిన్నంగా రెగ్యులర్ రైళ్లనే ‘ఎక్స్‌ప్రెస్’లుగా, ‘సూపర్‌ఫాస్ట్’లుగా నడుపుతున్నట్లు చెప్పి దోచుకుంటున్నారు. ఇది చాలా అన్యాయం. – ఫణిరాజ్ శర్మన్ స్టేషన్లు వెలవెల.. గతంలో హాల్టింగ్ ఉన్న కొన్ని రైల్వేస్టేషన్లలో ఇప్పుడు హాల్టింగ్ తొలగించి వేగం పెంచినట్లుగా చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. ఒకప్పుడు ప్రయాణికులతో సందడిగా ఉన్న ఆ స్టేషన్లు ఇప్పుడు వెలవెలపోతున్నాయి. ఇది ఏ విధమైన మార్పో అర్థం కావడం లేదు. – కామని శ్రీనివాస్ -
మరింత విలాసవంతంగా రైలు ప్రయాణాలు..!
న్యూ ఢిల్లీ: రానున్న రోజుల్లో రైలు ప్రయాణాలు మరింత సౌకర్యవంతంగా ఉండనున్నాయి. త్వరలోనే సరికొత్త ‘ఎసీ ఎకానమీ' కోచ్‌లను ఇండియన్ రైల్వేస్ ప్రారంభించనుంది. కోవిడ్ రాకతో ఈ కోచ్‌ల తయారీకి ఆటంకం ఏర్పడింది. ఈ కోచ్‌లను కపుర్తాలా, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తయారు చేసింది. ప్రస్తుతం ఉన్న ఎసీ 3-టైర్ కంటే తక్కువగా, నాస్ ఎసీ స్లీపర్ కంటే ఎక్కువగా ఎసీ ఎకానమీ కోచ్ ధరలు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ కోచ్‌ల రాకతో ప్రయాణికులకు తక్కువ ధరలో ఎసీ ప్రయాణాలను ఇండియన్ రైల్వేస్ అందించనుంది. కాగా ఎసీ ఎకానమీ కోచ్‌ల అధికారిక పేరును, లాంచ్ డేట్లను ఇండియన్ రైల్వేస్ ఇంకా నిర్ణయించలేదు. కపుర్తాలా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తయారుచేసిన కోచ్‌లను దేశవ్యాప్తంగా డిస్ట్రిబ్యూట్ చేసినట్లు తెలుస్తోంది. ఎసీ ఎకానమీ కోచ్‌ల ఫీచర్లు ప్రతి కోచ్‌లో కనిపించే 72 బెర్తులకు బదులుగా 83 బెర్తులను కలిగి ఉంటుంది. ఇది ప్రయాణీకుల సామర్థ్యాన్ని పెంచుతుంది. ప్రతి బెర్త్‌లో వ్యక్తిగత రీడింగ్ లైట్లు, మొబైల్ ఛార్జింగ్ పాయింట్లతో పాటు బెర్త్‌లకు స్వంత ఎసీ వెంట్ల ఏర్పాటు ఉంది. ప్రతి కంపార్ట్మెంట్లో ఫోల్డబుల్ స్నాక్ టేబుల్, వాటర్ బాటిళ్ల హోల్డర్లు, మ్యాగజైన్స్, మొబైల్ ఫోన్ల హోల్డర్లను అమర్చారు. ఈ ఎసీ ఎకానమీ కోచ్‌లు దివ్యాంగులకు అనువుగా ఉంటాయి. కంపార్ట్మెంట్లకు వీల్ చైర్ యాక్సెస్‌ను ఏర్పాటు చేశారు. Despite Covid-19 restrictions affecting production in workshops, Rail Coach Factory, Kapurthala rolls out 15 coaches of 3 Tier AC Economy class with updated design, divyangjan friendly doors & toilets, with a plan to produce 248 such coaches this fiscal. pic.twitter.com/CFijKEVWdl — Ministry of Railways (@RailMinIndia) June 2, 2021 -
ఐఆర్సీటీసీలో నెలకు రూ.30 - 80 వేలు సంపాదించండిలా !
మీరు ఆన్లైన్లో డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నారా? అయితే మీకో శుభవార్త. ఆన్లైన్ లో నెలకు రూ.80 వేలు సంపాదించే అవకాశాన్ని కల్పిస్తుంది ఇండియన్ రైల్వే. ఇండియన్ రైల్వేకి చెందిన ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరోషన్ (irctc) లో ట్రైన్ టికెట్లు బుక్ చేసి మనీ ఎర్న్ చేయవచ్చు. ప్రతి టికెట్ బుకింగ్ పై కమిషన్ రూపంలో ఐఆర్సీటీసీ మనకు అందిస్తుంది. ఇండియన్ రైల్వే డేటా ప్రకారం 55శాతం రైల్వే ప్రయాణికులు టికెట్లను రిజర్వేషన్ చేయించుకుంటున్నారు. ఇప్పుడు రిజర్వేషన్ చేయించుకునే ప్రయాణికుల సంఖ్యను పెంచేందుకు కృషి చేస్తోంది. ఇందులో భాగంగా నిరుద్యోగ యువత, అదనపు ఆదాయం కోసం ప్రయత్నిస్తున్నవారికి ఈ అవకాశం కల్పించింది. ఐఆర్సీటీసీలో టికెట్లు బుక్ చేస్తే వచ్చే ఆదాయం ఐఆర్సీటీసీ ఏజెంట్‌గా నాన్ ఏసీ ట్రైన్ టికెట్ బుక్ చేసిన ప్రతి సారి రూ.20 కమిషన్ వస్తుంది ఏసీ టికెట్లు బుక్ చేస్తే టికెట్ పై రూ.40 కమిషన్ వస్తుంది అంతేకాదు మనీ రూ.2వేలు ట్రాన్స్‌శాక్షన్ పై 1శాతం కమీషన్ తో పాటు రూ.2వేలు ట్రాన్సాక్షన్ దాటితే గేట్‌వే ఛార్జీలను అదనంగా పొందవచ్చు. నెలలో అపరిమితంగా ట్రైన్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఒక్కో టికెట్ పై పక్కా కమిషన్‌ను పొందవచ్చు. దీన్ని బట్టి నెలకు రూ.80వేలు డబ్బులు సంపాదించుకోవచ్చు. అంతకాకపోయినా నెలకు రూ.40 నుంచి రూ.50వేల వరకు రాబడి ఉంటుంది. ఆర్థరైజ్ ఐఆర్సీటీసీ ఏజెంట్‌గా పనిచేయాలంటే ఏంజెంట్‌గా పనిచేయాలనుకుంటే ఐఆర్సీటీసీకి ఏడాది రూ.3,999 అగ్రిమెంట్ చేయించుకోవాలి రెండు సంవత్సరాలకు రూ.6,999 చెల్లించాలి. 100 టికెట్లు బుక్ చేస్తే ఒక్కో టికెట్‌పై రూ.10 చెల్లించాలి 101 నుంచి 300టికెట్లు బుక్ చేస్తే 8రూపాయిలు చెల్లించాలి 300 టికెట్లు బుక్ చేస్తే ఒక్కో టికెట్ పై రూ.5 రూపాయిలు చెల్లించాల్సి ఉంటుంది ఆర్థరైజ్ ఐఆర్సీటీసీ ఏజెంట్‌గా గుర్తింపు రావాలంటే ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి సంబంధిత శాఖ అధికారుల రిక్వైర్ మెంట్‌ను బట్టి అడ్రస్ ప్రూప్‌లను సబ్మిట్ చేయాల్సి ఉంది. సబ్మిట్ చేసిన వెంటనే మన ఐడీ వెరిఫికేషన్ జరిగి ఓటీపీ వస్తుంది. అనంతరం మీరు ఐఆర్సీటీసీ ఐడీతో ఎంటర్ అవ్వాలి. రిజిస్ట్రేషన్ కింద రూ1100 చెల్లించాలి చెల్లించిన తరువాత మీకు ఆర్ధరైజ్ ఐఆర్సీటీసీ ఏజెంట్‌గా అనుమతి లభిస్తోంది. -
ఈ రైలులో ఒక టికెట్ ధర రూ. 38 లక్షలు..!
న్యూఢిల్లీ: పర్యాటక రంగం దేశ ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తుంది. పర్యాటకులను ఆకర్షించడం కోసం ప్రభుత్వాలు వినూత్న ఆలోచనలు చేస్తాయి. అలా భారతదేశం ప్రారంభించిన కార్యక్రమమే లగ్జరీ రైళ్లు. సాధారణంగా మన దగ్గర విమానం ఎక్కడం చాలా విలాసవంతంగా భావిస్తారు. కానీ ఒక్కసారి ఈ విలాసవంతమైన రైళ్లను చూస్తే.. ఆ ఆలోచన మారిపోతుంది. ఇక వీటి టికెట్ ఖరీదు కూడా అంతే లగ్జరీగా ఉంటుంది. ఒక్క టికెట్ ఏకంగా 38 లక్షల రూపాయలు ఉంటుంది. భారతదేశ రైల్వే సౌజన్యంతో దేశంలో నడుస్తున్న డెక్కన్ ఒడిస్సీ, మహారాజాస్ ఎక్స్‌ప్రెస్, ది గోల్డెన్ చారిట్ వంటి రైళ్లు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు మాత్రమే కాదు, భారతదేశంలో అత్యంత విలాసవంతమైన రైళ్లు కూడా. ఇండియన్ రైల్వే నడుపుతున్న ఈ 5 లగ్జరీ రైళ్లను చూడండి. 1. దక్కన్ ఒడిస్సీ ఈ రైలులోకి ప్రవేశించగానే రాయల్ బ్లూ కలర్ అలంకరణ మిమ్మల్ని కట్టిపడేస్తుంది. అత్యంత ఖరీదైన విదేశీ ఇంటీరియర్స్, డీలక్స్ క్యాబిన్లు, రెస్టారెంట్ సహా సకల హంగులతో ఉన్న ఈ రైలులో ప్రయాణిస్తుంటే.. మీకు మీరే మహారాజా, మహారాణిలా అనిపించడం ఖాయం. ఈ రైలు ముంబై-ఢిల్లీ మధ్య ప్రయాణం చేస్తుంది. దీనిని తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ నిర్వహిస్తుంది. మహారాష్ట్ర టూరిజం శాఖ చొరవతో, డెక్కన్ ఒడిస్సీని 16 వ శతాబ్దంలో మహారాజుల విలాసవంతమైన జీవితాలను ప్రతిబింబించేలా రూపుదిద్దారు. ఛార్జీలు: డీలక్స్ క్యాబిన్: డబుల్ ఆక్యుపెన్సీ - రూ .7,79,362 ప్రెసిడెన్షియల్ సూట్: డబుల్ ఆక్యుపెన్సీ - రూ .11,76,837 2. గోల్డెన్ చారిట్ కర్ణాటక స్టేట్ టూరిజం బోర్డ్ అధ్వర్యంలో నడుస్తోన్న గోల్డెన్ చారిట్ అనేక ప్రపంచ వారసత్వ ప్రదేశాలను మీకు చూపిస్తుంది. కర్ణాటకను పాలించిన రాజవంశాల పేరిట ఉన్న 11 అతిథి క్యాబిన్లలో ప్రతి ఒక్కటి సొగసైన మైసూర్ తరహా ఫర్నిచర్‌తో రూపొందించబడింది. ఈ రైలులో ఆయుర్వేద స్పా సెంటర్ కూడా ఉంది. ఛార్జీలు: గోల్డెన్ చారిట్లో 6 రాత్రులు, 7 రోజులు ఖర్చు రూ .5,88,000, 3 రాత్రులు, నాలుగు రోజుల ఖర్చు రూ .3,36,000. 3.మహారాజాస్ ఎక్స్‌ప్రెస్ దీనిలో ప్రయాణం మీ రోజువారి ఆలోచనల నుంచీ మీకు ఇది విశ్రాంతినిస్తుంది. ప్రపంచ ట్రావెల్ అవార్డుల ద్వారా దీనిని వరుసగా 6 సంవత్సరాల పాటు "వరల్డ్స్ లీడింగ్ లగ్జరీ ట్రైన్" గా గుర్తింపుపొందింది. భారతదేశ వారసత్వాన్ని వ్యాప్తి చేయాలనే ఆలోచనతో ఈ రీగల్ రైలు నిర్మించబడింది. రైలులో ప్రెసిడెంట్ సూట్ ప్రైవేట్ లాంజ్‌లు, బెడ్రూమ్లు, విలాసవంతమైన వాష్‌రూమ్‌లు, ఖరీదైన భోజన ప్రదేశంతో రాజుల ప్యాలెస్‌ను తలపిస్తుంది. ఛార్జీలు: ఈ రైలులో ఆరు రాత్రులు, ఏడు రోజులు ట్విన్ డీలక్స్ క్యాబిన్ టికెట్ రూ .8,94,000, ప్రెసిడెన్షియల్ సూట్ ధర రూ .37,93,000. 4. ప్యాలెస్ ఆన్ వీల్స్ ఒకప్పుడు హైదరాబాద్ నిజాంలు, సార్వభౌమ రాష్ట్రాలైన రాజ్‌పుతానా, గుజరాత్, ఇతరులు రవాణ కోసం ఉపయోగించారు. రాజస్థాన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చేసిన మొదటి హెరిటేజ్ లగ్జరీ రైలు ఇది. భారతీయులకు, విదేశీ సందర్శకులకు రాజ ప్రయాణాన్ని పరిచయం చేసిన తొలి రైలు ఇదే. ఛార్జీలు: ఈ రైలులో ఏడు రాత్రుల డీలక్స్ క్యాబిన్ ధర రూ .5,23,000. అదే సమయంలో, ఏడు రాత్రులు సూపర్ డీలక్స్ క్యాబిన్ 9,42,000 రూపాయలు. 5. బుద్ధ ఎక్స్‌ప్రెస్ బుద్ధ ఎక్స్‌ప్రెస్ సహాయంతో మధ్యప్రదేశ్, బిహార్ లోని అందమైన పర్యాటక ప్రదేశాలను సందర్శించవచ్చు. వీటిలో బోధ్ గయా, రాజ్గీర్, నలంద వంటి ప్రదేశాలు ఉన్నాయి. ఈ రైలులో చిన్న లైబ్రరీ, రెస్టారెంట్,ఇతర సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఛార్జీలు: ఈ రైలులో, ఒక రాత్రికి రూ .12,000, 7 రాత్రుల ఛార్జీలు రూ .86,000. -
రైల్వే ప్రయాణికులకు విజ్ఞప్తి, పున:ప్రారంభం కానున్న రైళ్లు
కరోనా కారణంగా నిలిచిన రైళ్లు తిరిగి పున:ప్రారంభిస్తున్నట్లు ఇండియన్ రైల్వే తెలిపింది. సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దేశ వ్యాప్తంగా నిలిచిపోయిన 24 ప్యాసింజర్ స్పెషల్ రైళ్లు ఇప్పుడు పున:ప్రారంభిస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ రద్దు చేసిన ప్యాసింజర్ ప్రత్యేక రైళ్లు జూన్ 5, 2021 నుండి ప్రారంభం కానున్నాయి. ఇక, జూన్ 5 నుండి ఇండియన్ రైల్వే తిరిగి ప్రారంభించే ప్యాసింజర్ ప్రత్యేక రైళ్ల పూర్తి జాబితా వివరాలు ఇలా ఉన్నాయి. ట్రైన్ నెంబర్ 05591/05592 దర్భంగా - హర్ నగర్ డెము స్పెషల్ ప్యాసింజర్ జూన్ 5, 2021 నుండి తిరిగి ప్రారంభమవుతుంది ట్రైన్ నెంబర్- 05579 దర్భంగ - జాన్ జహర్ పూర్ డెము స్పెషల్ ప్యాసింజర్ జూన్ 5, 2021 నుండి తిరిగి ప్రారంభమవుతుంది ట్రైన్ నెంబర్ 05580 జాన్ జహర్ పూర్ - దర్భాంగా డెము స్పెషల్ ప్యాసింజర్ జూన్ 5, 2021 నుండి తిరిగి ప్రారంభమవుతుంది ట్రైన్ నెంబర్ 05230/05229 సహర్సా - బర్హారా కోతి డెము స్పెషల్ ప్యాసింజర్ జూన్ 5, 2021 నుండి తిరిగి ప్రారంభమవుతుంది ట్రైన్ నెంబర్ 05238/05237 బర్హరా కోతి - బన్మాంకి డెము స్పెషల్ ప్యాసింజర్ జూన్ 5, 2021 నుండి తిరిగి ప్రారంభమవుతుంది ట్రైన్ నెంబర్ 03224/03223 రాజ్గీర్ - ఫతుహా మెము స్పెషల్ ప్యాసింజర్ జూన్ 5, 2021 నుండి తిరిగి ప్రారంభమవుతుంది ట్రైన్ నెంబర్ 03641/03642 దీన్ దయాల్ ఉపాధ్యాయ జంక్షన్ - దిల్దార్‌నగర్ జంక్షన్ స్పెషల్ ప్యాసింజర్ జూన్ 5, 2021 నుండి తిరిగి ప్రారంభమవుతుంది ట్రైన్ నెంబర్ 03647/03648 దిర్దార్నగర్ - తారిఘాట్ స్పెషల్ ప్యాసింజర్ జూన్ 5, 2021 నుండి తిరిగి ప్రారంభమవుతుంది ట్రైన్ నెంబర్ 03356/03355 గయా - కియుల్ మెము స్పెషల్ ప్యాసింజర్ జూన్ 5, 2021 నుండి తిరిగి ప్రారంభమవుతుంది ట్రైన్ నెంబర్ 05519/05520 వైశాలి - సోన్పూర్ డెము స్పెషల్ ప్యాసింజర్ జూన్ 5, 2021 నుండి తిరిగి ప్రారంభమవుతుంది ట్రైన్ నెంబర్ 03368 సోన్పూర్ - కతిహార్ మెము స్పెషల్ ప్యాసింజర్ జూన్ 5, 2021 నుండి తిరిగి ప్రారంభమవుతుంది ట్రైన్ నెంబర్ 03367 కతిహార్ - సోన్ పూర్ మెము స్పెషల్ ప్యాసింజర్ జూన్ 5, 2021 నుండి తిరిగి ప్రారంభమవుతుంది ట్రైన్ నెంబర్ 03315 కతిహార్ - సమస్తిపూర్ మెము స్పెషల్ ప్యాసింజర్ జూన్ 5, 2021 నుండి తిరిగి ప్రారంభమవుతుంది ట్రైన్ నెంబర్ 03316 సమస్తిపూర్ - కతిహార్ మెము స్పెషల్ ప్యాసింజర్ జూన్ 5, 2021 నుండి తిరిగి ప్రారంభమవుతుంది ట్రైన్ నెంబర్ 05247/05248 సోన్ పూర్- చప్రా మెము స్పెషల్ ప్యాసింజర్ జూన్ 5, 2021 నుండి తిరిగి ప్రారంభమవుతుంది చదవండి : Covid-19 : 'అద్దె ఇంట్లో ఉండలేం బాబోయ్..సొంతిల్లే కొనుక్కుంటాం' -
2022 నాటికి పట్టాలపైకి 44 వందే భారత్ రైళ్లు
న్యూఢిల్లీ : రాబోయే మూడేళ్లలో 44 ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్’ రైళ్లను పట్టాలపై పరుగులు పెట్టించనున్నట్లు భారత రైల్వే శాఖ మంగళవారం తెలిపింది. దేశీయ తొలి సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను మూడు యూనిట్లలో తయారు చేసి వాటిని 2022 నాటికి రైలు నెట్‌వర్క్‌లో చేర్చనున్నట్లు వెల్లడించింది. అత్యాధునిక హంగులతో తయారయ్యే ఈ రైళ్లు ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ నుంచి రానున్నాయి. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కపుర్తాలా, మోడరన్ కోచ్ ఫ్యాక్టరీ రాయ్‌బరేలి, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నైలలో ఈ వందే భారత్ రైళ్ల నిర్మాణం ఒకేసారి జరుగుతుందని రైల్వే బోర్డు చైర్మన్ వికె యాదవ్ తెలిపారు. (2023లో మొదటి దశ ప్రైవేట్ రైళ్లు) ఆయన మాట్లాడుతూ.. కొన్ని నెలల క్రితం మూడు కర్మాగారాల్లో ఈ రైళ్లను తయారు చేస్తామని నిర్ణయం తీసుకున్నట్లు దీనిద్వారా రైళ్ల నిర్మాణ సమయాన్ని తగ్గించవచ్చన్నారు. 44 వందే భారత్ రైళ్లు వచ్చే రెండు మూడేళ్లలో పట్టాలపైకి ఎక్కనున్నాయని తెలిపారు. టెండర్ ఖరారు చేయడంతో ఖచ్చితమైన సమయానికి రైళ్లు అందుబాటులోకి వస్తాయన్నారు. మొదటి రెండు వందే భారత్ రైళ్లను తయారు చేసిన ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ(ఐసీఎఫ్) రైల్వే బోర్డుకు వాటి సేవలను వినియోగంలోకి తీసుకు వచ్చేందుకు 28 నెలలతోపాటు అదనంగా ఆరు నెలల సమయం పట్టిందని, దాని అంచనాల ప్రకారం 44 రైళ్ల తయారీని పూర్తి చేయడానికి 78 నెలలు పట్టనున్న్నట్లు పేర్కొన్నారు. (‘ట్రైన్ 18’ నుంచి చైనా ఔట్..!) -
రైల్వే ప్రయాణికుల టికెట్ తనిఖీ కోసం కొత్త యాప్
ముంబై: కరోనా వైరస్ మానవుని జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చిందనడంలో సందేహం లేదు. అలానే సరికొత్త టెక్నాలజీలను కూడా మానవాళికి పరిచయం చేస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి రోజురోజుకూ కోరలు చాస్తున్న నేపథ్యంలో రైల్వేశాఖ ప్రయాణికుల టికెట్ల తనిఖీ కోసం 'చెక్ఇన్ మాస్టర్' పేరుతో ఓ యాప్‌ను తీసుకొచ్చింది. ఈ యాప్‌ను ఉపయోగించి ప్రయాణికుల వద్దనున్న టికెట్‌ను తాకకుండా టికెట్ కండక్టర్లు వారి మొబైల్ ఫోన్లతో బార్ కోడ్, క్యూఆర్ కోడ్లను స్కాన్ చేసి తనిఖీ చేస్తారు. ఈ విధానాన్ని తొలుత ప్రయోగాత్మకంగా ముంబైలోని ఛత్రపతి శివాజి మహారాజ్ టెర్మినల్ స్టేషన్లో ప్రారంభించారు. కాగా.. టికెట్ల తనిఖీ సమయంలో రైల్వే సిబ్బందికి కరోనా సోకకుండా ఉండేందుకే ఈ యాప్‌ను ప్రవేశపెట్టినట్లు ముంబై రైల్వేశాఖ వర్గాలు వెల్లడించాయి. (2023లో మొదటి దశ ప్రైవేట్ రైళ్లు) -
నేటి నుంచే రైల్వే బుకింగ్స్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జూన్ 1వ తేదీ నుంచి దురంతో, సంపర్క్ క్రాంతి, జన శతాబ్ది, పూర్వా ఎక్స్‌ప్రెస్ వంటి ప్రముఖ రైళ్ల రాకపోకలు ప్రారంభం కానున్నాయని రైల్వేశాఖ బుధవారం ప్రకటించింది. గతంలో చెప్పినట్లుగా ఈ రైళ్లలో నాన్–ఎసీ తరగతి మాత్రమే కాకుండా ఏసీ తరగతి కూడా ఉంటుందని పేర్కొంది. ముందస్తు టికెట్ బుకింగ్‌లు ఈ నెల 21వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం అవుతాయని వెల్లడించింది. జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న 200 రైళ్ల జాబితాను రైల్వేశాఖ విడుదల చేసింది. జనరల్ కోచ్ల్లోనూ రిజర్వుడ్ సీట్లు ఉంటాయని తెలిపింది. టికెట్ రుసుములు సాధారణంగానే ఉంటాయని స్పష్టం చేసింది. గరిష్టంగా 30 రోజుల ముందు ప్రయాణానికి అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చని సూచించింది. తెలంగాణ, ఏపీలకు సంబంధించిన రైళ్లివే.. హైదరాబాద్–ముంబై: సీఎస్టీ హుస్సేన్‌సాగర్ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్–హౌరా: ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ హైదరాబాద్– న్యూఢిల్లీ: తెలంగాణ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ – దానాపూర్: దానాపూర్ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్– గుంటూరు: గోల్కొండ ఎక్స్‌ప్రెస్ నిజామాబాద్– తిరుపతి: రాయలసీమ ఎక్స్‌ప్రెస్ హైదరాబాద్– విశాఖపట్నం: గోదావరి ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్– నిజాముద్దీన్: దురంతో ఎక్స్‌ప్రెస్ వేరే ప్రాంతాల్లో మొదలై తెలంగాణ మీదుగా నడిచే రైళ్లు.. విశాఖపట్నం–న్యూఢిల్లీ: ఏపీ ఎక్స్‌ప్రెస్ హౌరా–యశ్వంతపూర్: దురంతో ఎక్స్‌ప్రెస్ ఎర్నాకులం– నిజాముద్దీన్: దురంతో ఎక్స్‌ప్రెస్ దానాపూర్–కేఎస్ఆర్ బెంగుళూరు: సంగమిత్ర ఎక్స్‌ప్రెస్ రైల్వే స్టేషన్లలో ఆహారశాలలకు అనుమతి: రైల్వే స్టేషన్లలో కేటరింగ్ సేవలు ప్రారంభించేందుకు, ఆహారశాలలు తెరిచేందుకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. ఆహారాన్ని పార్సిళ్ల రూపంలో ఇవ్వాలని, ప్రయాణికులు ఆహారశాలల్లోనే కూర్చొని తినేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. -
మొదటి రైలు: నిబంధనల ఉల్లంఘన
న్యూఢిల్లీ : లాక్డౌన్ కారణంగా దేశంలో నిలిచి పోయిన రైల్వే సేవలను మే 12 నుంచి తిరిగి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఐఆర్సీటీసీ ద్వారా టికెట్ల విక్రయాలు జరుగుతాయని.. 15 సర్వీసులను ప్రత్యేక రైళ్లుగా నడపాలని నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో అహ్మాదాబాద్ నుంచి బుధవారం న్యూఢిల్లీ చేరుకున్న మొదటి రైలులో భౌతిక దూరం నిబంధనలను ఉల్లంఘించారు. ఈ రైలు మే 12 న సాయంత్రం 6.30 గంటలకు సబర్మతి రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి బుధవారం ఉదయం 8 గంటలకు ఢిల్లీ చేరుకుంది. (అపుడు లాక్డౌన్ పరిస్థితి వచ్చి వుంటే.. ) కాగా రైలులో ప్రయాణించే వారి కోసం కోచ్‌లోనే చిన్న గదిని ఏర్పాటు చేసి ఆహార ఉత్పత్తులైన బిస్కెట్లు, భుజియా, చాక్లెట్లు అందుబాటులో ఉంచారు. అయితే ప్రయాణికులు కూర్చున్న కోచ్, చిన్నవంటగదికి దూరంగా ఉండటంతో ప్రయాణీకులు ఆహార పదార్థాలను కొనడంలో సమస్యలను ఎదుర్కొన్నారు. ఆకలి తీర్చుకునేందుకు వంటగది వద్ద ప్రయాణికులు ఎగబడ్డారు. దీని ఫలితంగా రైలునంబర్ 02957 బి -1 కోచ్ సమీపంలో ఉన్న చిన్నగది వ్యాన్ వద్ద తీవ్ర రద్దీ ఏర్పడింది. (రైలు దిగగానే.. స్టాంప్ వేసేశారు! ) రాత్రి సమయంలో చిన్న వంట గది వద్ద ప్రయాణికులు గుమిగూమినప్పుడు ప్రజలంతా ఒక్కక్కరుగా వంటగది వద్దకు రావాలని అధికారులు కోరినట్లు రైలులో ప్రయాణించిన నిహార్ కక్కాడ్ అనే విద్యార్థి తెలిపారు. వాటర్ బాటిల్స్ కొనడానికి చాలా మంది క్యూ కట్టడంతో రద్దీని నివారించడానికి కోచ్‌లోనే నీటిని అమ్మడం ప్రారంభించారని పేర్కొన్నాడు. చాలా మంది ప్రయాణీకులు ఆహారాన్ని తీసుకెళ్లలేదని, చిన్నగదిలో లభ్యమైన వాటిని కొనవలసి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. (లాక్డౌన్ : మూడు గంటల్లో రూ.10 కోట్లు) -
కరోనా: అన్ని రైళ్లూ బంద్
సాక్షి, న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్‌ను అడ్డుకునేందుకు లాక్డౌన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రైలు సర్వీసులన్నిటిని దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు నిలిపివేయాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. కరోనా విస్తరణను నిరోధించే క్రమంలో తొలుత మార్చి 31 వరకు ఉన్న రైలు సర్వీసుల నిలిపివేతను తాజాగా ఏప్రిల్ 14 వరకు పొడిగించింది. గూడ్సు రైళ్లు మినహా అన్ని రైళ్లను రద్దు చేసింది. లాక్ డౌన్ నుంచి మినహాయింపు లభించిన నిత్యావసర వస్తువులకు కొరత రాకుండా గూడ్సు రైళ్లను యథాతథంగా నడపనుంది. అలాగే స్థానిక రైలు సర్వీసులు కూడా ఏప్రిల్ 14 వరకు నిలిపివేశారు. లోకల్ రైళ్లను నిలిపి వేయడం చరిత్రలో ఇదే మొదటిసారి. ఈ మేరకు రైల్వే మండళ్లకు రైల్వే మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. (రానున్న మూడు వారాలే అత్యంత కీలకం) ‘కోవిడ్ -19 నేపథ్యంలో తీసుకున్న చర్యల కొనసాగింపుగా, భారతీయ రైల్వేలలోని అన్ని ప్యాసింజర్ రైళ్లను రద్దు చేయాలని నిర్ణయించాం. ప్రీమియం, ప్యాసింజర్ రైళ్లు, సబర్బన్ రైళ్లు , మెట్రో రైల్వే రైళ్లతో సహా మెయిల్ / ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఏప్రిల్ 14 అర్థరాత్రి 12 గంటల వరకు పొడిగించాలని ఆదేశించింది. అయితే సరుకు రవాణా కార్యకలాపాలు కొనసాగుతాయి’ అని పేర్కొంది. (అందరూ త్యాగాలు చేయాల్సిందే!) -
రైళ్లు, మెట్రో, బస్సు సర్వీసులు బంద్
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఆదివారం ఎక్కడి రైళ్లు అక్కడే నిలిచిపోనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపాదించిన జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకు రైళ్లు నిలిచిపోనున్నాయి. హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ రైళ్లు రెండు మూడింటిని అవసరాన్ని బట్టి నడిపించే అవకాశం ఉందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు. ఆదివారం ఉదయం 7 గంటలకు ముందే ప్రయాణం ప్రారంభించిన దూరప్రాంత రైళ్లు మాత్రం యథావిధిగా గమ్యం వైపు వెళ్లనున్నాయి. (కరోనా మరణ మృదంగం: మృతుల సంఖ్య 11వేలు) కానీ ఉదయం 7 నుంచి రాత్రి 9 మధ్య ప్రారంభమయ్యే మిగతా అన్ని రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ప్యాసింజర్ రైళ్లకు సంబంధించి 2,400 సర్వీసులు, దూర ప్రాంతాలకు తిరిగే రైళ్లకు సంబంధించి దాదాపు 1,300 సర్వీసులు నిలిచిపోనున్నాయి. నగరంలో తిరిగే 121 ఎంఎంటీఎస్ రైళ్లలో రెండు, మూడు మినహా మిగతావాటిని నిలిపేస్తున్నారు. అలాగే హైదరాబాద్‌లోనూ రేపు మెట్రో రైలు సర్వీసులు నిలిచిపోన్నాయి. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో మెట్రో సర్వీసులు నిలిపివేస్తున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. ఇక ఆర్టీసీ బస్సుల విషయంలో మాత్రం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతానికి తాము ఏ నిర్ణయం తీసుకోలేదని, ప్రభుత్వం నుంచి ఆదేశం వస్తే శనివారం నిర్ణయిస్తామని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. మరోవైపు ఏపీఎస్ ఆర్టీసీ బస్సులను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ అర్థరాత్రి నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే బస్సు సర్వీసులను నిలిపివేస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. దీంతో ఏపీలో రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆర్టీసీ బస్సులు నిలిచిపోనున్నాయి. (జనతా కర్ఫ్యూ.. మెట్రో సేవలు బంద్) టికెట్ క్యూలో మీటర్ దూరం కరోనా వైరస్ ప్రమాదం పొంచి ఉన్నా, జనజీవనానికి ఇబ్బంది లేకుండా రైళ్లు నడుపుతున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో రిజర్వేషన్ కార్యాలయాలు, సాధారణ బుకింగ్ కేంద్రాలు, ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్ల వద్ద, పార్శిల్ కార్యాలయాల వద్ద ఒకరికి ఒకరికి మధ్య మీటర్ దూరం ఉండేలా ఫ్లోర్‌పై మార్కింగ్ ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్లలో ఉన్న రిటైరింగ్ రూమ్స్, డార్మిటరీలను మూసేయాలని రైల్వే నిర్ణయించింది. శనివారం రాత్రి 12 నుంచి ఏప్రిల్ 15 రాత్రి 12 వరకు వీటిని మూసి ఉంచాలని నిర్ణయించింది. (జనతా కర్ఫ్యూ సరే, ప్రభుత్వ చర్యలేవీ!?) -
ఇకపై అన్ని రైళ్లలోనూ ఆ సేవలు..!
న్యూఢిల్లీ: ప్రయాణికుల ప్రయాణం ఇకపై మరింత సురక్షితంగా, సుఖవంతం చేసే క్రమంలో భారతీయ రైల్వే సేవలను మరింత విస్తృత పరచనుంది. 2022 మార్చి కల్లా ప్రతి రైల్వే స్టేషన్లోనూ, రైలులోని ప్రతి బోగీలోనూ సీసీ కెమెరాలను అమరుస్తామని రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 530 రైల్వే స్టేషన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చదవండి: కెనడాలో ఘోర రైలు ప్రమాదం..13మంది మృతి రైల్వేబోర్డు చైర్మన్ వీకే యాదవ్ మాట్లాడుతూ.. రైల్వే స్టేషన్, రైళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే టెండర్లను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్ల పరిసరాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు రూ.500 కోట్ల నిర్భయ ఫండ్ నిధులు వచ్చాయన్నారు. 6,100 స్టేషన్లు, 58 వేలకు పైగా రైల్వే బోగిల్లో సీసీ టీవీ కెమెరాల ఏర్పాటుకు రైల్వేశాఖ రూ.2,000 కోట్లు కేటాయించిందని తెలిపారు. ఫేసియల్ రికగ్నేషన్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో నిందితులను గుర్తిస్తాం. ప్యాసింజర్ల ప్రైవసీకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కెమెరాలను కామన్ ఏరియాల్లో ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు . రైళ్లను కూడా ఆన్‌టైమ్‌కు నడిచేలా చేయడానికి, ఆటోమేటిక్ చార్ట్ ప్రిపరేషన్ వంటి వాటి కోసం ఇస్రోతో కలిసి పనిచేస్తున్నట్లు వీకే యాదవ్ తెలిపారు. రైల్వే బోర్డు చైర్మన్ పదవీకాలం పెంపు రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ పదవీ కాలం మరో ఏడాది పొడిగించారు. కేబినెట్ నియామకాల కమిటీ ఆయన పదవీకాలం పొడిగింపును ఆమోదించింది. తాజా నిర్ణయంతో 2020 జనవరి 1 నుంచి 2020 డిసెంబర్ 31 వరకూ ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు. 2019 జనవరి 1న వీకే యాదవ్ రైల్వే బోర్డు చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. -
ఏప్రిల్ నాటికి దక్షిణ మధ్య రైల్వే రెండు ముక్కలు
సాక్షి, హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే రెండుగా చీలనుంది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్నట్టుగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు ఇప్పటికే కేంద్రప్రభుత్వం సమ్మతించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి దక్షిణ మధ్య రైల్వే అధికారులు తాజాగా డీపీఆర్ సిద్ధం చేసి కేంద్రప్రభుత్వానికి పంపించారు. వచ్చే ఏప్రిల్ నాటికి కొత్త జోన్ ఏర్పాటు చేసే దిశగా ఢిల్లీలో కసరత్తు జరుగుతోంది. ఈ దక్షిణ కోస్తా రైల్వే పరిధిలోకి విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లుండగా, తెలంగాణ పరిధి నుంచి సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్లు, మహారాష్ట్ర నుంచి నాందేడ్ డివిజన్ ఉన్నాయి. ఇంతకాలం విశాఖ పట్నం, విజయనగరం, శ్రీకాకుళం వాల్తేరు డివిజన్‌గా ఈస్ట్‌కోస్ట్ జోన్ (భువనేశ్వర్)లో భాగంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ వాల్తేరు డివిజన్ కొత్తగా ఏర్పడే దక్షిణ కోస్తా జోన్లో ఉం డనుంది. వచ్చే ఏప్రిల్ నాటికి కొత్త జోన్ ఏర్పాటై విశాఖలో ప్రధాన కార్యాలయం పని ప్రారంభించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సిబ్బందిలో భావోద్వేగాలు.. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే రెండుగా విడిపో నుండటంతో జోన్ పరిధిలోని సిబ్బందిలో భావోద్వేగాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఐదు దశా బ్దాల క్రితం ఏర్పడ్డ జోన్ ఇప్పుడు రెండుగా చీలనుండటంతో ప్రాంతాల వారీగా సిబ్బంది విధుల్లో చేరాల్సి ఉంటుంది. ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు కొత్త జోన్ పరిధిలోకి వెళ్లాల్సి ఉం టుంది. సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్ల ప రిధిలో ప్రస్తుతం విధుల్లో ఉన్న ఆంధ్రా ప్రాంతం వారు కొత్త జోన్ ఉద్యోగులుగా మారతారు. ఇటు విజయవాడ, గుంటూరు, గుంతకల్ పరిధిలో ఉన్న తెలంగాణ ప్రాంతం వారు సికింద్రాబాద్ కేంద్రంగా ఉండే దక్షిణ మధ్య రైల్వే పరిధిలోకి వస్తారు. దీంతో ఈసారి దక్షిణ మధ్య రైల్వే వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవా లని నిర్ణయించారు. గాంధీ జయంతి రోజునే దక్షిణ మధ్య రైల్వే కూడా ఆవిర్భవించినందున బుధవారం దక్షిణ మధ్య రైల్వే వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇదీ నేపథ్యం ఆవిర్భావం: 1966 అక్టోబరు 2, దేశంలో నాటి కి తొమ్మిదో జోన్. నాటి రైల్వే మంత్రి ఎస్కే పాటిల్ ఈ జోన్‌ను ప్రారంభించారు. అంతకు పూర్వం: నిజామ్స్ గ్యారింటీడ్ స్టేట్ రైల్వేగా ఇది ఆవిర్భవించింది. 1874 అక్టోబరు 8న వాడీ దగ్గరలోని చిత్తాపూర్ నుంచి సికింద్రాబాద్ మధ్య గ్రేట్ ఇండియన్ పెనిన్సులా రైల్వేస్ (జీఐపీ), నిజాం స్టేట్ సంయుక్తాధ్వర్యంలో 110 కి.మీ. రైలు మార్గంతో ఇది రూపొందింది. పరిధి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు, 754 స్టేషన్లు, 6,234 కి.మీ. రైల్వే లైన్. దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు తర్వాత 1,083 కి.మీ. కొత్త లైన్ ఏర్పాటు. ప్రస్తుతం తిరుగుతున్న రైళ్లు 750. 16 ఏళ్ల క్రితం ఎంఎంటీఎస్ సరీ్వసు ప్రారంభం. సరుకు రవాణా: జోన్ ఏర్పడ్డ తొలి సంవత్స రం 11 మిలియన్ టన్నులు. 2011–12లో వంద మిలియన్ టన్నుల మైలురాయి, 2018–19లో 122.5 మిలియన్ టన్నుల స్థాయికి చేరిక. ప్రయాణికులు: తొలి సంవత్సరం 11.50 కోట్ల మంది, 2018–19లో 38.30 కోట్ల మంది. ఆదాయం: రూ.68.06 కోట్ల తొలి ఏడాది ఆదాయం నుంచి రూ.15,640 కోట్లకు చేరిక -
భక్తులకు రైల్వే శాఖ శుభవార్త ...
ఢిల్లీ : కశ్మీర్‌లోని వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించే భక్తులకు రైల్వే శాఖ శుభవార్త. ఢిల్లీ నుంచి కాట్రా వరకు ప్రయాణించే రెండవ వందే-భారత్ రైలును ప్రారంభించనుంది. దసరా నవరాత్రి ఉత్సవాల రోజుల్లో ఇది ప్రారంభం కానున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ అధికారికంగా వెల్లడించారు. ఇప్పటికే భారత్ మొదటి సెమీ హై స్పీడ్ రైలు వందే భారత్ ఢిల్లీ-వారణాసీ మధ్య నడుస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ రైలు విజయవంతంగా నడుస్తుండటంతో ఇటీవలే భారత రైల్వే మరో 40 నూతన వందే-భారత్ రైళ్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ క్రమంలో దేవి నవరాత్రుల్లో వైష్ణో దేవి పవిత్ర దేవాలయాన్ని సందర్శించే లక్షలాది యాత్రికులకు అనుకూలంగా ఉండే ఢిల్లీ-కాట్రా వందే భారత్ రైలును నవరాత్రి రోజుల్లో ప్రారంభించనుంది. ఈ విషయాన్ని పీయూష్ గోయల్ తన ట్విటర్ ద్వారా తెలియజేశారు. मुझे यह सूचित करते हुए अत्यंत खुशी हो रही है कि, आधुनिकतम और मेक इन इंडिया के तहत बनी दूसरी वंदे भारत एक्सप्रेस का नई दिल्ली से माँ वैष्णो देवी के पावन स्थल कटरा तक ट्रायल रन पूरा हो चुका है और माता के भक्तों के लिए यह ट्रेन नवरात्रो में शुरू कर दी जाएगी। जय माता दी 🚩 pic.twitter.com/U3RcCxOYUi — Piyush Goyal (@PiyushGoyal) September 18, 2019 భారత రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ కుమార్ మాట్లాడుతూ మేక్ ఇన్ ఇండియా ట్రయల్ రన్ కింద ఢిల్లీ-కాట్రా వందే-భారత్ రైలుకు సంబంధించిన ట్రయల్ రన్ ఇప్పటికే విజయవంతంగా పూర్తి అయిందనీ, ఇది వైష్ణో దేవి యాత్రికులకు శుభవార్త అని పేర్కొన్నారు. ఈ రైలు ఢిల్లీ జంక్షన్ నుంచి ఉదయం 6 గంటలకు ప్రారంభమై అంబాలా, లుధియానా, జమ్మూతావి మీదుగా మధ్యాహ్నం 2 గంటలకు కాట్రాకు చేరుకోనుంది. 130 కిలోమీటర్ల వేగంతో వెళ్లే ఈ రైలు.. కాట్రాకు 8 గంటల్లో చేరుకోనుందన్నమాట. అలాగే రద్దీగా ఉండే పలు రైల్వే మార్గాలను సరళీకృతం చేయడానికి ప్రయత్రిస్తున్నట్లు వినోద్ కుమార్ తెలిపారు. ఢిల్లీ-ముంబై, ఢిల్లీ- హౌరా రైళ్లు 2021 నాటికి సిద్ధమవుతాయన్నారు. ఇక నూతనంగా ప్రారంభించబోతున్న 40 వందే-భారత్ రైళ్ల గురించి మాట్లాడుతూ..వీటి టెండర్ విషయంలో ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తాజాగా పూర్తి పారదర్శకతతో కొత్త టెండరింగ్ చేపడుతున్నట్లు తెలిపారు. ఈ రైళ్లు పూర్తి భారతీయ సాంకేతికతతో తయారు అవుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఢిల్లీ-కాట్రా రైలు ఢిల్లీ జంక్షన్ నుంచి ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యి అంబాలా, లుధియానా, జమ్మూతావి మీదుగా మధ్యాహ్నం 2 గంటలకు కాట్రాకు చేరుకోనుంది. -
రైళ్లలో కొత్త విధానం; రూ. 800 కోట్లు ఆదా
న్యూఢిల్లీ : రైల్వే వ్యవస్థలో మరింత ఆక్యుపెన్సీ పెంచేందుకు రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తద్వారా రైల్వే కష్టాలనుంచి బయటపడేందుకు యోచిస్తోంది. రైళ్లలో అదనపు బెర్తులను నిర్మించడం కోసం దేశంలో నడుస్తున్న 500 రైళ్ల నుంచి జనరేటర్ కార్లను తొలగించాలని భారత రైల్వే నిర్ణయించింది. వీటి స్థానంలో మరో 20 వేల కొత్త బెర్తులను ఏర్పాటు చేయనుంది. దీనివల్ల రైల్వేకు సంవత్సరానికి దాదాపు రూ. 800 కోట్లు ఆదా కానుంది. ప్రస్తుతం 500లకు పైగా రైళ్లలోని జనరేటర్ కార్లను దశల వారీగా తొలగించాలని నిర్ణయించింది. ఇలా తొలగించడం వల్ల ఎక్కువ మంది ప్రయాణీకులు ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుందని రైల్వే శాఖ భావిస్తోంది. భారతీయ రైల్వే తన బ్రాడ్ గేజ్ నెట్‌వర్క్‌లో 100 శాతం విద్యుదీకరణ కోసం ఒక ప్రధాన విద్యుత్ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. దీనివల్ల ఇంతకముందు రైళ్లలో ఉన్న ఎలక్ట్రికల్ పరికరాల (ఫ్యాన్లు, లైట్లు) స్థానాలలో ప్రయాణీకుల కోచ్‌లతో భర్తీ చేయాలనేది ప్రణాళిక. రైళ్లలో పవర్ కోచ్‌లకు బదులుగా రెండు, మూడు అంచెల కోచ్‌లను జోడిస్తే, దాదాపు 144 బెర్తులు నిర్మించడానికి అనుకూలంగా ఉంటుంది. దీనివల్ల వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న మరిన్ని టిక్కెట్లను ప్రయాణీకులకు అందించవచ్చు. కాగా ప్రయాణీకులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి భారతీయ రైల్వే ఇటీవల ప్రధాన స్టేషన్లలో లిఫ్టులు,ఎస్కలేటర్లు, గృహ నిర్వాహక సదుపాయాలు వంటి అనేక చర్యలు తీసుకున్నవిషయం తెలిసిందే -
రైల్వే ఇ-టికెట్లపై ఛార్జీల మోత
సాక్షి, న్యూఢిల్లీ : రైల్వే ప్రయాణీకులకు చేదువార్త. త్వరలోనే ఇ-టికెట్ల చార్జీల మోత మోగనుంది. నోట్ల రద్దు తరువాత డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహానికంటూ రద్దు చేసిన సర్వీసు చార్జీల బాదుడుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు రైల్వే శాఖ బోర్డు తీవ్ర కసరత్తు చేస్తున్నట్టు తాజా సమాచారం. ముఖ్యంగా ఆన్లైన్ రైల్వే టికెట్లు కొనుగోలుపై సర్వీస్ ఛార్జీలను విధించేందుకు రైల్వే బోర్డు అనుమతినిచ్చింది. ఆగస్టు 3న విడుదల చేసిన భారత రైల్వే బోర్డు లేఖలో దీనికి సంబంధించి వివరణ ఇచ్చింది. అయితే ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలనే ఉంచుతుందా లేక పెంచుతుందా అన్న నిర్ణయాన్ని మాత్రం స్పష్టంగా ప్రకటించలేదు. ఇటీవలి కాలంలో తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్న నేపథ్యంలో రైల్వే బోర్డు ఈ నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. దేశంలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం మూడు సంవత్సరాల క్రితం సేవల ఛార్జీలను ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. 2016లో ఐఆర్సీటీసీ(ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) ద్వారా టికెట్లు కొనుగోలు చేసేవారికి సర్వీస్ ఛార్జీలను నిలిపివేసింది. అప్పటి వరకు ఐఆర్సీటీసీ నాన్ ఏసీ టికెట్‌పై రూ. 20, ఏసీ టికెట్‌పై రూ. 40 సర్వీసు ఛార్జీలను వసూలు చేసేది. సేవా ఛార్జీలు విధించడం, పునరుద్దరించడం వంటి నిర్ణయాలను ఐఆర్సీటీసి తీసుకోవచ్చని పేర్కొంది. కాగా సేవా ఛార్జీలు నిలిపివేసిన అనంతరం 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఆన్లైన్ టికెటింగ్ ఆదాయంలో 26 శాతం పడిపోయింది. -
పట్టాలపై 2.5 మిలియన్ లీటర్ల నీరు..!
సాక్షి, చెన్నై : భూగర్భజలాలు అడుగంటిపోవడం, నైరుతి రుతుపననాల మందగనంతో వర్షాలులేక చైన్నైలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. నగరానికి నీరందించే నాలుగు సరస్సులు ఎడారిని తలపిస్తున్నాయి. దీంతో గత నాలుగు నెలలుగా చైన్నై వాసులు నీటి సమస్యతో సతమతమవుతున్నారు. అక్కడ రోజుకు 200 మిలియన్ లీటర్ల నీటి కొరత ఉందంటే పరిస్థితి ఎంత దారణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సమస్యపై తమకు సాయమందించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరడంతో రైల్వేశాఖ ముందుకొచ్చింది. రైళ్లద్వారా కొన్ని ప్రాంతాలకు నీరందించడానికి సుమారు 2.5 మిలియన్ లీటర్ల నీటిని మోసుకొచ్చే రెండు వాటర్ వ్యాగన్ల రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. చెన్నైకి 217 కిలోమీటర్ల దూరంలోని వేలూరులోని జోలార్‌పెట్టాయ్ నుంచి ఈ రైళ్లు బయలుదేరాయి. విల్లివక్కం రైల్వే స్టేషన్‌కు శుక్రవారం చేరుకున్నాయి. మరికొద్దిసేపట్లో వాటిని రాష్ట్ర మంత్రులు ప్రారంభించిన అనంతరం విల్లివక్కం, కిల్పాక్ ప్రాంతాలకు నీటిని పైపుల ద్వారా సప్లయ్ చేయనున్నారు. ఒక్కో రైలు 50 వేల లీటర్ల నీటి సామర్థ్యంగల 50 వ్యాగన్లను కలిగి ఉండటం విశేషం. రెండు రైళ్ల ద్వారా రోజుకు 11 మిలియన్ లీటర్ల నీరు సరఫరా కానుంది. 200 మిలియన్ల కొరతకు కేవలం 11 మిలియన్ల నీరు మాత్రమే రవాణా అవుతుండటం గమనార్హం. -
రైళ్లలో ఇక మసాజ్ సేవలు..!
న్యూఢిల్లీ : భారతీయ రైల్వే చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఓ వినూత్న పథకానికి తెరలేపింది. ఇక నుంచి రైళ్లలో మసాజ్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. తొలుత ఈ సేవలు ఇండోర్ నుంచి వెళ్లే 39 ప్యాసింజర్ రైళ్లలో అందుబాటులోకి రానున్నాయి. వీటిలో డెహ్రాడూన్-ఇండోర్ ఎక్స్‌ప్రెస్ (14317), న్యూఢిల్లీ-ఇండోర్ ఇంటర్‌సిటీఎక్స్‌ప్రెస్ (12416), ఇండోర్-అమృత్సర్ ఎక్స్‌ప్రెస్ (19325) రైళ్లున్నట్లు ఓ రైల్వే అధికారి తెలిపారు. ఈ సేవలు 20 రోజుల్లో ప్రారంభమవుతాయని, ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు వీటిని పొందవచ్చని తెలిపారు. ప్రయాణికులు రూ.100 చెల్లించి తల, పాదాల మసాజ్ చేయించుకోవ చ్చని చెప్పారు. ప్రతి రైలులో ముగ్గురి నుంచి ఐదుగురి వరకు మసాజ్ చేవారుంటారు. రైల్వే శాఖ వారికి గుర్తింపు కార్డులు జారీ చేయనుంది. -
రైలు ప్రయాణీకులకు తీపికబురు
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ రైల్వేలు దేశవ్యాప్తంగా 200 కొత్త రైల్వే లైన్లను ఏర్పాటు చేస్తున్నారు. నూతన రైల్వే లైన్ ఏర్పాటు పనులు ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్నాయి. రైల్వే ప్రాజెక్టుల సత్వర పూర్తికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు చెందిన పలు మంత్రిత్వ శాఖల అనుమతులు అవసరమని రైల్వే శాఖ సహాయ మంత్రి రాజన్ గొహెయిన్ లోక్‌సభలో వెల్లడించారు. రైల్వే బడ్జెట్లో ప్రకటించిన మేర నూతన రైల్వే లైన్ల నిర్మాణం చేపడుతున్నట్టు పేర్కొన్నారు. తెలంగాణలో 9 నూతన లైన్లు, ఏపీలో 18 రైల్వే లైన్లను ఏర్పాటు చేస్తుండగా, ఈశాన్య రాష్ట్రాల్లో 15 లైన్లను, బిహార్‌లో అత్యధికంగా 34 నూతన రైల్వే లైన్లను చేపడుతున్నట్టు చెప్పారు.పశ్చిమ బెంగాల్లో 18 రైల్వే లైన్లను కొత్తగా ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఇక 2017-18లో స్వచ్ఛభారత్ మిషన్ కింద 21 గ్రీన్ కారిడార్లను నెలకొల్పనున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. కోచ్‌లలో బయో టాయిలెట్స్ నిర్మించాలని రైల్వేలు యోచిస్తున్నాయి.