indiramma houses
-
Telangana: 4 పథకాలు నేడే షురూ
సాక్షి, హైదరాబాద్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కారు్డల జారీ పథకాలను లాంఛనంగా ప్రారంభిస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి మండలంలో ఒక్కో గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని.. తొలిరోజున ఆ గ్రామంలో పూర్తి శాచురేషన్ పద్ధతిలో పథకాలను వర్తింపజేయనున్నట్టు వెల్లడించారు. లక్షల్లో వచ్చిన దరఖాస్తులన్నీ పరిశీలించి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పథకాలను ఇవ్వాలని ఆలోచనతో ఉన్నామని.. దీనిపై ఎలాంటి పరిమితి లేదని చెప్పారు. ఈ మొత్తం ప్రక్రియను మార్చి 31 కల్లా పూర్తి చేయనున్నట్టు తెలిపారు. పథకాల అమలుకు సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి శనివారం పలువురు మంత్రులతో కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం సచివాలయంలో సహచర మంత్రులతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి సమావేశం వివరాలను వెల్లడించారు.అర్హత ఉన్న అందరికీ పథకాలు..‘‘లక్షల మంది తమ పేర్లు లేవంటూ గ్రామసభల్లో దరఖాస్తులు పెట్టుకోవడంతో పరిశీలన కోసం మార్చి వరకు సమయం పడుతుంది. ఈ ప్రక్రియలో ఏ ఒక్కరూ మిగిలిపోరు. రైతు భరోసా కింద వ్యవసాయోగ్యమైన ప్రతి ఎకరానికి సాయం చేస్తాం. ఉపాధి హామీ పథకం కింద ఏడాదిలో కనీసం 20 రోజులు పనిచేసిన కూలీలను గుర్తించి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని వర్తింపజేస్తాం. షెడ్యూల్ ప్రకారం గ్రామసభలు నిర్వహిస్తున్నాం. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన లక్షలాది దరఖాస్తులను క్రోడీకరించి అర్హత ఉన్న వారందరికీ ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన పరమ పవిత్రమైన రోజు కావడంతో ఈ ఉదాత్తమైన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం..’’ అని భట్టి తెలిపారు. ఈ ఆనందాన్ని రాష్ట్ర ప్రజలందరితో పంచుకోవాలని ఈ ప్రకటన చేస్తున్నామన్నారు. తనతో సహా సీఎం, మంత్రులు స్వయంగా గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. భూమి లేని కూలీలందరూ ఉపాధి హామీ పనులకు వెళ్తారని ఓ ప్రశ్నకు బదులుగా భట్టి పేర్కొన్నారు.70శాతానికిపైగా జనాభాకు సన్నబియ్యం: ఉత్తమ్ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2.30 గంటల మధ్య నాలుగు పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరుగుతాయని మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. గ్రామంలో అర్హులందరికీ పథకాలను అందిస్తామన్నారు. రేషన్‌కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని తెలిపారు. గతంలో దరఖాస్తులిచ్చినా, సామాజిక ఆర్థిక సర్వే, గ్రామసభ, ప్రజాపాలనలో ఇచ్చినా అర్హత ప్రకారం పరిశీలించి రేషన్‌కార్డులు ఇస్తామని చెప్పారు. స్వతంత్ర భారత దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయిలో ఆహార భద్రత కల్పించడానికి చొరవ తీసుకోలేదన్నారు. గత పదేళ్లలో నిర్లక్ష్యానికి గురైన దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేద కుటుంబాలన్నింటికీ ఆహార భద్రత కల్పించాలని నిర్ణయం తీసుకున్నమని చెప్పారు. కొత్త రేషన్కార్డులిచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి 6 కిలోల చొప్పున నాణ్యమైన సన్న బియ్యాన్ని ఇస్తామని.. రాష్ట్ర జనాభాలో 70–72శాతం మందికి ప్రతి నెలా ఉచితంగా ఇవ్వబోతున్నాని తెలిపారు.రబీకి ముందే రైతు భరోసా..: తుమ్మలతమ సర్కారు ఒకే ఏడాదిలో రైతుల ఖాతాల్లో రూ.40 వేల కోట్లను నేరుగా జమ చేసిందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు చెప్పారు. రబీ సీజన్‌కు ముందే వ్యవసాయం చేసే ప్రతి ఎకరానికి రూ.12 వేల చొప్పున రైతు భరోసా ఇచ్చి పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన వాగ్ధానాన్ని నెరవేర్చబోతున్నామని తెలిపారు.అనర్హులకు ఇళ్లు ఇస్తే రద్దు: పొంగులేటి శ్రీనివాసరెడ్డిఎక్కడైనా అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లను ఇస్తే వాటిని రద్దు చేస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. అనర్హులు లబ్ధిపొంది ఉంటే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా.. ఎక్కడా అవినీతి, పైరవీలకు స్థానం లేకుండా పేదలను గుర్తించి ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని 606 మండలాల్లోని ప్రతి గ్రామంలో ఇళ్లను ఇవ్వబోతున్నామని, ఇది నిరంతర ప్రక్రియగా జరుగుతుందని తెలిపారు. అర్హులైన వారందరికీ జనవరి 26న ఒకేసారి పథకాలను ఇవ్వాలని అనుకున్నామని.. కానీ గ్రామసభల్లో వచ్చిన దరఖాస్తులను క్రోడీకరించాల్సి ఉండటంతో తొలుత ప్రతి మండలంలోని ఒక గ్రామంలో ఇవ్వాలని నిర్ణయించామని వివరించారు. గ్రామసభల్లో కొంత మంది, కొన్ని రాజకీయ పార్టీలు దురుద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని కుట్రలు పన్నాయని ఆరోపించారు. పథకాలను పూర్తిస్థాయిలో ఎప్పుడు, ఎక్కడ అమలు చేస్తారన్న షెడ్యూల్‌ను ఫిబ్రవరి మొదటి వారంలో ప్రకటిస్తామని తెలిపారు. -
బండి సంజయ్‌పై జగ్గారెడ్డి ఫైర్
సాక్షి,హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్లపై చేసిన వ్యాఖ్యలకుగాను కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. ఈ విషయమై జగ్గారెడ్డి శనివారం(జనవరి25) మీడియాతో మాట్లాడారు.‘బండి సంజయ్‌కి రాజకీయ అనుభవం లేకుండానే మినిస్టర్ పోస్ట్ వచ్చింది. బండి సంజయ్‌కి అనుభవం లేదు. అందుకే ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. కేంద్ర మంత్రిగా బండి సంజయ్ ఏది పడితే అది మాట్లాడుతా అంటే కుదరదు. కొందరు నేతలు న్యూస్ బ్రేకింగ్ కోసం మాట్లాడుతున్నారు. బండి సంజయ్ బ్రేకింగ్ లీడర్.. ఆయన మాట్లాడితే తలా తోక ఉండదు. రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి ఉంటే వారి ఫోటోనే ఉంటది. మోదీ ఫోటో పెట్టకపోతే పైసలు ఇయ్యరా.బండి సంజయ్ తెలంగాణ ప్రజలను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. బియ్యానికి పైసలు ఇయ్యమని బండి సంజయ్ ఎలా అంటారు. ఇళ్ళ కు నిధులు ఇవ్వమని బెదిరిస్తారా...ఇంత డైరెక్ట్ గా బెదిరింపులా నిధులు ఏమైనా సీఎం రేవంత్ రెడ్డికి ఇస్తున్నారా..తెలంగాణ ప్రజలకే కదా. మోదీకి గులాం చేస్తేనే నిధులు ఇస్తారా. బండి సంజయ్ వాఖ్యలను కిషన్ రెడ్డి సమర్దిస్తారా’చెప్పాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. -
ఇందిరమ్మ ఇళ్లపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, కరీంనగర్: ఇందిరమ్మ(Indiramma house) పేరు పెడితే ఒక్క ఇల్లు కూడా కేంద్రం ఇవ్వదంటూ కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన’(Pradhan Mantri Awas Yojana) పేరు పెడితేనే నిధులిస్తామంటూ తేల్చి చెప్పారు. కాంగ్రెస్ ఫొటోలు పెడితే రేషన్ కార్డులు ఇవ్వం.. మేమే ముద్రించి ప్రజలకు రేషన్‌కార్డులు ఇస్తామని బండి సంజయ్ చెప్పారు.కరీంనగర్లో మేయర్, కార్పొరేటర్లు బీజేపీలోకి చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఇచ్చిన నిధులు, చేసిన అభివృద్ధి గుర్తించి బీజేపీలో చేరడం సంతోషమన్నారు బీఆర్ఎస్ హయాంలో చాలా ఇబ్బందులు పెట్టారు. రాజకీయ ఒత్తిళ్లతో బీఆర్ఎస్లో ఉన్న సునీల్‌రావు కూడా ఏం చేయలేకపోయారు. నేను హైదరాబాద్‌లో మీటింగ్‌లో గొడవ చేసిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చాక నిధులు విడుదల చేశారు..కరీంనగర్ స్మార్ట్ సిటీ అభివృద్ధి విషయంలో నన్ను పాల్గొనకుండా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పూర్తి అవినీతే తప్ప మంచి లేదు. ఇప్పుడు పెనం మీద నుంచి పొయిలో పడినట్లయింది. కేసీఆర్ బాటలోనే రేవంత్ నడుస్తుండు. డ్రగ్స్ కేసు, ఈ-ఫార్ములా కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు ఇలా అన్ని కేసులు పేర్లతో డైవర్షన్ తప్ప చేసిందేమీ లేదు. ఇప్పుడు దావోస్ ఇష్యూ ముందుకు తెచ్చారు...గ్రీన్కో వంటి సంస్థలపై దాడులు చేస్తే ఇవాళ తెలంగాణాకు వచ్చేందుకు భయపడుతున్నాయి. గ్రీన్కో నుంచి కాంగ్రెస్‌కు పైసలు ముట్టినై. 2014 నుంచి ఇప్పటివరకు దావోస్‌లో జరిగిన ఒప్పందాల్లో ఎన్ని పెట్టుబడులు వచ్చియో శ్వేతపత్రం విడుదల చేయాలి’’ అని బండి సంజయ్ డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: వాటిజ్ దిస్...వేర్ ఈజ్ సీపీ? -
నాలుగు పథకాలపై.. నేడు కీలక భేటీ
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతుభరోసా పథకాలను ఈనెల 26వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు ప్రారంభించాలన్న దానిపై కీలకభేటీ జరగనుంది. దావోస్ పర్యటన ము గించుకొని శుక్రవారం హైదరాబాద్‌కు వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి శనివారం అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశమవుతారు. ఈ నాలుగు పథకాలను జిల్లా స్థాయిలో కార్యక్రమాలు పెట్టి ప్రారంభించాలా లేక రాష్ట్రస్థాయిలో లాంఛనంగా ప్రారంభించాలా అన్న దానిపై నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది.లబ్ధిదారుల ఎంపిక విషయంలో కూడా ఆ సమావేశంలోనే స్పష్టమైన మార్గ దర్శకాలు జారీ చేస్తారని, అదే సమయంలో లబ్ధిదారుల సంఖ్యపై కూడా పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే అవకాశమున్నట్టు తెలిసింది. రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి గ్రామసభల్లో పేర్లు చదవడంపై కొన్ని జిల్లాల్లో లబ్ధిదారులు ఆందోళన చేయడం, అధికారుల తీరుపై అసహనం, ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి విదితమే. మంత్రులతో సమావేశానంతరం పథకాల ప్రారంభానికి సంబంధించిన పూర్తిస్థాయి షెడ్యూల్ విడుదల చేయనున్నట్టు సమాచారం. నాలుగు రోజుల గ్రామసభలు పూర్తి: ఇందిరమ్మ ఇళ్లతోపాటు ఇతర మూడు పథకాలకు సంబంధించి గ్రామస్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన గ్రామసభలు శుక్రవారంతో ముగిశాయి. రాష్ట్రంలో మొత్తం 16,348 గ్రామ/వార్డు సభలు పూర్తయ్యాయని ప్రభుత్వం ప్రకటించింది. జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రం వార్డు సభలు మరికొన్ని రోజులు జరగనున్నాయి. ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు జరిగిన ఈ సభల్లో ఆయా పథకాల కోసం వచ్చిన దరఖాస్తుల వివరాలు, లబ్ధిదారుల జాబితాలను చదివి వినిపించిన అధికారులు పలు పథకాల కోసం మళ్లీ ప్రజల నుంచి కొత్తగా దరఖాస్తులు కూడా తీసుకున్నారు.ప్రధానంగా రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం లక్షల సంఖ్యలో దరఖాస్తులు అందినట్టు సమాచారం. ఈ దరఖాస్తులను వడపోసిన తర్వాతే పూర్తిస్థాయి లబ్ధిదారుల జాబితా సిద్ధమవుతుందని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన గత సంవత్సరంలో నిర్వహించిన ప్రజాపాలన సమావేశాల్లో 83 లక్షల దరఖాస్తులు రాగా, అందులో 30 లక్షల మంది అర్హులుగా తేల్చారని, అందులోనూ తొలి విడతలో భాగంగా అత్యంత పేదలు, వితంతువులు, ఒంటరి మహిళలు, ట్రాన్స్జెండర్ల, గిరిజనులకు ప్రాధాన్యమివ్వాలని, వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనట్టు సర్టిఫికెట్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ⇒ రేషన్‌కార్డులకు సంబంధించి 6.85లక్షల మంది లబ్ధిదారుల జాబితాను గ్రామసభల్లో చదివి వినిపించారు. ఇందులో అభ్యంతరాలు వచ్చిన దరఖాస్తులను, గ్రామసభల్లో కొత్తగా వచ్చిన దరఖాస్తులను పునఃపరిశీలించనున్నారు. ఆ తర్వాతే కొత్త రేషన్‌కార్డుల లబ్ధిదారుల తుది జాబితా తయారు చేయనున్నారు. ⇒ రైతు భరోసా కోసం ఈనెల 16 నుంచి 20వ తేదీవరకు గ్రామస్థాయిలో సాగు యోగ్యం కాని భూముల గుర్తింపు ప్రక్రియ జరిగింది. ఈ ప్రక్రియలో భాగంగా 10–15 లక్షల ఎకరాలు సాగు యోగ్యం కావని తేల్చినట్టు తెలిసింది. ఆత్మీయ భరోసా కింద 10 లక్షల మంది వరకు అర్హులను గుర్తించారని, వీరికి తొలి విడతలో భాగంగా అవసరమయ్యే నిధుల చెక్కును కూడా విడుదల చేస్తారని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది.సీఎం రేవంత్‌కు ఘన స్వాగతంశంషాబాద్: దావోస్‌లో మూడురోజుల పర్యటన ముగించుకొని వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డికి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. విమానాశ్రయ లాంజ్‌లో ఎమ్మెల్యేలు శాలువాలతో సీఎంను సత్కరించారు. -
అర్హుల జాబితాలపై అభ్యంతరాలు
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, రైతు భరోసా లబ్ధిదారుల ఎంపికకు చేపట్టిన గ్రామసభల్లో బుధ వారం రెండోరోజు కూడా పలు చోట్ల గందరగోళం తలెత్తింది. మంత్రులు ఉత్తమ్, పొన్నం ప్రభాకర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు సభల్లో పాల్గొన్నారు. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన సభకు హాజరయ్యారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో పలు గ్రామసభల్లో పాల్గొన్నారు. ముంపు నుంచి తేల్చండి కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్‌లో జరిగిన గ్రామసభలో మంత్రి ఉత్తమ్‌కుమా ర్ రెడ్డి ప్రసంగాన్ని మహిళలు అడ్డుకున్నారు. నారాయణపూర్, మంగపేట, చెర్లపల్లిని నారాయణపూర్ ప్రాజెక్టులో ముంపు గ్రామాలుగా ప్రకటించి, నష్ట పరిహారం చెల్లించాలని కోరారు. మహిళలు పట్టు వీడకపోవటంతో 3 గ్రామాలను ముంపు గ్రామాలుగా ప్రకటిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కొత్తపల్లి మండలం కమాన్‌పూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల జాబితాపై బీజేపీ, బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం తెలుపటంతో గందరగోళం ఏర్పడింది. సుడా మాజీ చైర్మన్‌కు ఇందిరమ్మ ఇల్లు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని 41 డివిజన్లో జరిగిన వార్డు సభలో ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో మాజీ కార్పొరేటర్ విశాలిని రెడ్డి పేరు ఉండటంపై బీజేపీ నేతలు అభ్యంతరం తెలిపారు. విశాలిని రెడ్డి మాజీ కార్పొరేటర్ కాగా, ఆమె భర్త శాతవాహన పట్టణాభివృద్ధి సంస్థ (సుడా) మాజీ చైర్మన్. వారికి ఇందిరమ్మ ఇల్లు ఎలా ఇస్తారని ప్రజలు నిలదీశారు. మోర్తాడ్ మండలం ఓడ్యాడ్ గ్రామంలో అర్హుల జాబితాపై గ్రామస్తులు అభ్యంతరం తెలపటంతో అధికారులు సభను అర్ధాంతరంగా ముగించారు.ఖమ్మంలో రసాభాస ఖమ్మం జిల్లా రఘునాథపాలెం గ్రామసభలో అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడం లేదని ప్రజలు అధికారులను నిలదీశారు. కూసుమంచి గ్రామసభలో అనర్హులను జాబితాలో చేర్చారని ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. తిరుమలాయపాలెం మండలంలో ని జల్లేపల్లి గ్రామంలో అర్హులకు పథకాలు అంద డం లేదని గ్రామస్తులు అధికారులను నిలదీశారు. మరికొన్ని జిల్లాల్లో.. నారాయణపేట జిల్లా మాగనూర్ మండలం ఉజ్జెలి గ్రామంలో ఆత్మీయ భరోసా అర్హుల జాబితాపై గ్రామస్తులు నిరసన తెలిపారు. భూమి లేని కూలీలు 95 మంది ఉంటే, 12 మందినే ఎంపిక చేస్తారా? అని అధికారులను నిలదీశారు. మంచిర్యాల జిల్లా భీమారం, తలమడగు మండలం రుయ్యడిలో అర్హుల పేర్లు జాబితాలో లేవని గ్రామస్తులు గొడవకు దిగారు. తమ గ్రామంలో ఉన్న డంప్‌యార్డును తొలగించాలని సంగారెడ్డి మండలం ఫసల్వాది గ్రామస్తులు గ్రామసభను బహిష్కరించారు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని నర్సాయపల్లి గ్రామసభలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు ఎం మండలంలోని కూరెళ్లలో గ్రామసభలో గందరగోళం ఏర్పడింది. గ్రామంలో 520 మంది ఇళ్లకోసం దర ఖాస్తు చేయగా, 25 మందికే మంజూరు కావడంపై గ్రామస్తులు అభ్యంతరం తెలిపారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం మల్లాపూర్‌లో గ్రామసభ జరుగుతుండగా జాబితాలో పేరు లేదన్న కోపంతో ఓ వ్యక్తి ఆ జాబితా ప్రతులను ఎత్తుకుపోయాడు. విజయవంతంగా గ్రామసభలు: ప్రభుత్వంనాలుగు సంక్షేమ పథకాల లబ్ధిదారులను ఎంపికచేసేందుకు నిర్వహిస్తున్న గ్రామసభలు విజయవంతంగా కొనసాగుతున్నా యని ప్రభుత్వం ప్రకటించింది. 9,844 గ్రామాలు, వార్డులలో సభలు జరిగాయని, 60 శాతం సభలను విజయవంతంగా నిర్వహించినట్లు బుధవారం తెలిపింది. గ్రామసభల్లో నాలుగు పథకాలకు సంబంధించి ఇప్పటివరకు 10,09,131 దరఖాస్తులు అందినట్లు వెల్లడించింది. రెండో రోజు బుధవారం 3,608 గ్రామ సభలు, 1,055 వార్డు సభలు కలపి మొత్తం 4,663 సభలను నిర్వహించినట్లు ప్రభుత్వం తెలిపింది. మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో 12,914 గ్రామ సభలు, పట్టణ ప్రాంతాల్లో 3,484 వార్డు సభలు కలిపి 16,398 సభలు నిర్వహించాల్సి ఉంది. -
సారూ.. మా పేర్లు ఎందుకు లేవు?
సాక్షి నెట్వర్క్: లబ్ధిదారుల జాబితాలో మా పేరు లేదంటూ ఆయా జిల్లాల్లో ప్రజలు అధికారులను ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం రైతుభ రోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, తెల్లరేషన్‌కార్డుల పథకాల అమలుకు ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాలను ప్రకటించింది. వీటిపై అభ్యంతరాల స్వీకరణకు మూడు రోజులపాటు నిర్వహించే గ్రామసభలు మంగళవారం మొదలుకాగా మొదటి రోజు అభ్యంతరాలు వెల్లువెత్తాయి. అర్హులను కాదని అనర్హులను ప్రకటించారంటూ జిల్లాల్లో నిరసన వ్యక్తం చేశారు. రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో తమ పేర్లు లేవంటూ ఆందోళన చేసిన వారే ఎక్కువగా ఉన్నారు. అయితే జాబితాలో పేర్లు లేనివారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని చెప్పడంతో ప్రజలు క్యూ కట్టారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా: హైదరాబాద్‌లో ఉద్యోగాలు చేస్తున్న వారిని ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో చేర్చారని ఖమ్మం జిల్లా వెంకట్యాతండాలో ఎంపీడీఓను నిలదీశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం పాండురంగాపురం తండాలో అనర్హులకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారంటూ ప్రత్యేకాధికారి దేవరాజు తదితరులను స్థానికులు నిర్బంధించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా : అర్హుల జాబితా అంతా తప్పుల తడకగా ఉందని, తమకు గ్రామసభ వద్దని గట్టుప్పల్ మండల కేంద్రంలో ప్రజలు ఆందోళనకు దిగారు. మూడు గంటల పాటు సభను అడ్డుకున్నారు. ఆత్మకూర్ (ఎం) మండలంలోని రహీంఖాన్‌పేటలో నిర్వహించిన గ్రామ సభ రసాభాసగా మారింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా : చాలా చోట్ల తమ పేర్లు లేవని అధికారులను ప్రజలు నిలదీశారు. బెల్లంపల్లి పట్టణం కన్నాలబస్తీ ఒకటో వార్డులో రేషన్‌కార్డులకు అర్హులను ఎంపిక చేయడం లేదంటూ ఆందోళన చేపట్టారు. ఆర్డీవో హరికృష్ణను నిలదీశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా : ధర్మారం మండలం కమ్మరిఖాన్‌పేట గ్రామసభను బహిష్కరించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద గ్రామంలో కేవలం 52మంది లబ్ధిదారులనే ఎంపిక చేశారని, అందులో సగం మందికి వ్యవసాయ భూమలున్నాయని, అసలు గుంట భూమి లేని వారికి మాత్రం జాబితాలో చోటు కల్పించలేదంటూ పలువురు గ్రామసభను బహిష్కరించారు. రూ.2 లక్షల రైతు రుణమాఫీ కాలేదని బోయినపల్లి మండలం రత్నంపేట ప్రజాపాలన గ్రామసభలో పలువురు రైతులు అధికారులను నిలదీశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా: నందిపేట మండలం కుద్వాన్పూర్ గ్రామంలో మహిళలు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డిని నిలదీశారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే తమ గ్రామానికి 10 ఇళ్లు కట్టిస్తానని హామీ ఇచ్చి నెరవేర్చలేదంటూ ఎమ్మెల్యేను అడిగారు. డిచ్పల్లి, ఇందల్వాయి, మోపాల్, ధర్పల్లి, నిజామాబాద్ రూరల్, జక్రాన్‌పల్లి, సిరికొండ తదితర మండలాల్లో రసాభాసగా సభలు జరిగాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా : ఆమనగల్లు మండలం కోనాపూర్ కార్యదర్శి గ్రామసభ నిర్వహిస్తున్న సమయంలో దరఖాస్తులు తీసుకోకుండా, ఓ పార్టీకి చెందిన నాయకులతో దాబాకు వెళ్లి విందు చేసుకున్నారని స్థానికులు ఆరోపించారు. ఆదిబట్ల మున్సిపాలిటీ కొంగరకలాన్‌లో నిర్వహించిన వార్డు సభలు రసాభాసగా మారాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా: నవాబుపేట మండలం కొల్లూరు గ్రామసభలో జాబితాలో అర్హుల పేర్లు రాలేదని అధికారులను నిలదీశారు.మరికల్ మండలం రాకొండలో గ్రామసభ రసాభాసగా మారింది. ఒకే ఇంట్లో ఇద్దరు, ముగ్గురికి ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో పేర్లు రావడంతో గ్రామస్తులు ఆందోళన చేశారు. దీంతో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. పహారా మధ్య గ్రామసభను కొనసాగించాల్సి వచ్చింది. ఉమ్మడి వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మచ్చాపూర్ గ్రామసభ జరుగుతుండగా, అర్షం మనోజ్ వచ్చి... ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీంలో తాను లబ్ధిదారుల జాబితాలో ఉన్నానని, ఆ స్కీం తనకు వద్దంటూ అధికారులకు వినతిపత్రం సమర్పించారు.జనగామ మండలం శామీర్‌పేటలో నిర్వహించిన గ్రామసభకు వచ్చిన కలెక్టర్ రిజ్వాన్ బాషాను పలువురు ప్రశ్నించారు. రేషన్ కార్డులు, ఇతర పథకాలు వచ్చినోళ్లకే వస్తున్నాయి... మా సంగతేంటని ఓ వ్యక్తి కలెక్టర్‌ను నిలదీయగా, మరోసారి దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. -
26 నుంచి రేషన్ కార్డుల జారీ
సాక్షి, సిటీబ్యూరో: ఈ నెల 26 నుంచి హైదరాబాద్‌లో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియæ ప్రారంభించనున్నట్లు జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అదే రోజు నుంచి ఇందిరమ్మ ఇళ్లకు ఎంపికైన లబ్ధిదారుల వివరాలు కూడా వెల్లడిస్తామన్నారు. ఆదివారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయాలకతీతంగా, ఇతర జిల్లాలకు ఆదర్శంగా రాజధాని నగరంలో రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. సొంత స్థలమున్న పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేందుకు ఎంతో ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. గతంలో ఉన్న నిబంధనలకనుగుణంగానే కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలన 50 శాతం పూర్తయిందని, వాటిలో దాదాపు 10 వేల మంది అర్హులున్నట్లు తెలిపారు. ప్రభుత్వం పేదలకు అందజేస్తున్న సంక్షేమ పథకాలకు ‘ప్రజాపాలన’ సందర్భంగా దరఖాస్తులు ఇవ్వలేకపోయిన వారు ఇప్పుడు కూడా సంబంధిత కార్యాలయాల్లో ఇవ్వవచ్చని పొన్నం తెలిపారు. సమావేశంలో ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ప్రకాశ్‌గౌడ్, జాఫర్ హుస్సేన్, మీర్ జుల్ఫికర్ అలీ, మాజిద్ హుస్సేన్, రాజాసింగ్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి, జిల్లా కలెక్టర్ అనుదీప్ తదితరులు పాల్గొన్నారు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించే క్రమంలో దరఖాస్తు చేస్తున్నవారి అర్హత విషయంలో ప్రభుత్వం కొన్ని సాంకేతిక సవరణలు చేయాలని మంత్రికి మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి సూచించారు. ఎల్లో కలర్ ప్లేట్ టాక్సీ డ్రైవర్లను కూడా కారు ఓనర్లుగా గుర్తించడం ద్వారా పేదలకు అన్యాయం జరుగుతోందన్నారు. వికలాంగుల జాబితాలో తలసేమియా బాధితులను, కీమో థెరపీ చేయించుకునే వారిని, డయాలసిస్ పేషెంట్లకు కూడా చేర్చాలని కోరారు. వీరికి ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు మంజూరు చేయాలన్నారు. -
‘గ్రీన్‌చానల్’లో ఇందిరమ్మ ఇళ్లు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఇందిరమ్మ ఇళ్లు కట్టుకొనే వారికి ఆర్థిక సమస్యలు రాకుండా సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో తమ ప్రభుత్వం గ్రీన్‌చానల్ రూపొందించిందని రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఖమ్మంలోని దానవాయిగూడెంలో పొంగులేటి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ విభాగాలు, శాఖల మధ్య సాంకేతిక అడ్డంకులు లేదా ఆర్థికపరమైన చిక్కులు తలెత్తకుండా గ్రీన్ చానల్ విధానం ద్వారా లబ్ధిదారులకు నిధులు చెల్లిస్తామన్నారు.పునాదుల సమయాన రూ. లక్ష, లింటెల్ లెవల్ పూర్తి కాగానే రూ. 1.20 లక్షలు, స్లాబ్ వేశాక రూ. 1.75 లక్షలు, గృహప్రవేశంకన్నా ముందు లేదా ఆ తర్వాత మిగిలిన సొమ్ము చెల్లిస్తామని చెప్పారు. ఇదంతా గ్రీన్‌చానల్ విధానంలో ఆటంకాలు లేకుండా పూర్తవుతుందన్నారు. తొలిదశలో రేషన్ కార్డు లేకపోయినా ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించామని.. త్వరలో రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ మొదలుకానుండగా రెండో విడత నుంచి రేషన్ కార్డు ఉంటేనే ఇందిరమ్మ ఇళ్లు పొందేందుకు అర్హులవుతారని తెలిపారు.వై.ఎస్. హయాంలో తెలంగాణలో 19.56 లక్షల ఇళ్లు..ఇందిరమ్మ ఇళ్లు అంటేనే కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అని పొంగులేటి తెలిపారు. నాటి ఉమ్మడి ఏపీ పరిధిలోకి వచ్చే నేటి తెలంగాణలో 19.56 లక్షల ఇళ్లను దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి కేటాయించారని గుర్తు చేశారు. ఇప్పుడు తహసీల్దార్ లేదా ఎంపీడీఓ గుర్తించాక కలెక్టర్ ద్వారా ఇన్చార్జి మంత్రి ఆమోదిస్తారని తెలిపా రు. మహిళల పేరుతో 400 చదరపు అడుగుల్లో ఇళ్లు నిర్మించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు. రాబోయే 2, 3 రోజుల్లోనే గ్రామసభల ద్వారా అర్హులను గుర్తిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు.ఇళ్ల నిర్మాణంలో సాంకేతికత కోసం యాప్ రూపొందించామని, లబ్ధిదారులను ఇళ్ల వద్దకు తీసుకెళ్లి వివరాలు అప్లోడ్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు పురోగతి తెలుస్తుందన్నారు. భేషజాలకు పోకుండా కేంద్ర ప్రభుత్వ సాయం కూడా తీసుకొనేందుకు ప్రయతి్నస్తున్నట్లు తెలిపారు. మరోవైపు మాజీ సీఎం కేసీఆర్ సొంతూరు చింతమడకతో సహా గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ దశల్లో నిలిచిపోయిన సుమారు 63 వేల డబుల్ బెడ్రూం ఇళ్లను కూడా నిర్మించి పేదలకు ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు పొంగులేటి వివరించారు. -
నాలుగేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం
సాక్షి, హైదరాబాద్: రాబోయే నాలుగేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణమే తమ ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ కలెక్టరేట్లో గోషామహల్ నియోజవర్గానికి చెందిన లబ్ధి దారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. కులాలు, మతా లు, ప్రాంతాలు, పార్టీల వంటి తేడా లేకుండా అర్హులైన పేదవారందరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.ఎలాంటి భేష జాలకు పోకుండా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావల సిన వాటాలు, నిధులు అడిగి తీసుకుంటామన్నా రు. గత ప్రభుత్వం పేదవాడి గురించి ఆలోచన చేయలేదని విమర్శించారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ప్రతిపక్షాలు కాళ్లలో కట్టెలు పెడుతూ అడ్డుకోవాలని ప్రయత్నించినా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఆపేది లేదని స్పష్టం చేశారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయ లేనిది, తమ ప్రభుత్వం 10 నెలల్లో చేసి చూపిస్తుంటే ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక పోతున్నాయని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఓర్వలేకపోతోంది..మూసీ పరీవాహక ప్రాంత వాసులకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో తమ ప్రభుత్వం వారికి ఇండ్లు, ఉద్యోగం, ఉపాధి, కల్పిస్తుంటే బీ ఆర్ఎస్ ఓర్చుకోలేకపోతోందని మంత్రి పొంగులేని విమర్శించారు. ప్రభుత్వం ఏదో తప్పు చేస్తున్నట్లు గా ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. మూసీ పరీవాహక ప్రాంతాల ప్రజలు తమ జీవిత కాల మంతా అదే మురికికుప్పలో బతకాలని బీఆర్ఎస్ కోరుకుంటోందా? అని మంత్రి ప్రశ్నించారు. హైద రాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా ఇబ్బంది పెట్టే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.మూసీ పునరుజ్జీవంపై అనేక అభాండాలు వేస్తున్నా రని, అక్కడున్న పేదవారిని అక్కడే వదిలేస్తారా అని ప్రశ్నించారు. మూసీ రివర్‌ఫ్రంట్ ఏర్పాటు చేసింది మీరు కాదా? అని నిలదీశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రాజా సింగ్, శ్రీ గణేశ్, ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, రహమత్ బేగ్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తదితరులు పాల్గొన్నారు. -
‘ఇందిరమ్మ’లో కదలిక
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఎట్టకేలకు కదలిక వచ్చింది. లబ్ధిదారులను గుర్తించేందుకు వీలుగా ఇందిరమ్మ కమిటీల విధివిధానాలను ఖరారు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే కొన్ని సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టినా, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో మాత్రం ఆచి తూచి వ్యవహరించింది. మూడు నెలల తర్వా త ఈ పథకాన్ని భద్రాచలంలో మంత్రులందరితో కలిసి సీఎం ప్రారంభించారు. కానీ లబ్ధిదారుల ఎంపికలో జాప్యం జరుగుతూ వచ్చింది. ఏడున్నర నెలల తర్వాత ఇప్పుడు ఇందిరమ్మ కమిటీలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఇళ్ల నిర్మాణానికి వీలుగా కసరత్తు మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఒక్కోటి రూ.5 లక్షల వ్యయంతో నియోజకవర్గానికి మూడున్నర వేలు చొప్పున ఇళ్ల నిర్మా ణానికి ప్రభుత్వం సిద్ధమైన విషయం తెలిసిందే. సొంత స్థలం ఉండి, పక్కా ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తారు. ప్రస్తుతానికి సొంత జాగా ఉన్నవారికే.. గ్రామ, పట్టణ స్థాయి (వార్డు/డివిజన్లవారీగా)లో ఏర్పాటయ్యే ఈ కమిటీలే ఇప్పుడు ఇందిరమ్మ పథకంలో కీలకంగా వ్యవహరించనున్నాయి. లబ్ధిదారుల ఎంపిక మొదలు, సోషల్ ఆడిట్ వరకు ప్రధాన పాత్ర పోషించనున్నాయి. గ్రామ స్థాయి కమిటీలను ఎంపీడీవోలు, వార్డు స్థాయిలో మున్సిపల్ కమిషనర్లు నామినేట్ చేస్తారు. ప్రస్తుతానికి సొంత జాగాలు ఉన్నవారినే పరిగణనలోకి తీసుకుంటారు. సొంత జాగా లేని వారికి ఇళ్లను మంజూరు చేయరు. సొంత జాగాలో కచ్చా ఇల్లు ఉన్నవారు, పక్కా ఇల్లు ఉన్నవారెవరన్న విషయంలో జాగ్రత్తగా వివరాలు సేకరించాలని ప్రభుత్వం ఇప్పటికే అధికారులను ఆదేశించింది.కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద రాష్ట్రానికి భారీగా నిధులు రాబట్టే ప్రయత్నంలో రాష్ట్రప్రభుత్వం ఉంది. అనర్హులను లబ్ధిదారులుగా గుర్తిస్తే నిధులు ఇవ్వబోమని కేంద్రం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలోనే లబ్ధిదారుల గుర్తింపులో జాగ్రత్త అవసరమని రాష్ట్రప్రభుత్వం కలెక్టర్లకు స్పష్టం చేసింది. కాగా కమిటీ సభ్యులు లబ్ధిదారుల వివరాలను సేకరించి ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్ల ద్వారా ప్రభుత్వానికి సమర్పిస్తారు. కొత్త దరఖాస్తులు తీసుకుంటారా? ప్రజాపాలన పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పది నెలల క్రితం సంక్షేమ పథకాల లబ్ధి కోసం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. అప్పట్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం 80 లక్షలకు పైగా దరఖాస్తులందాయి. వాటిల్లో ప్రాథమిక స్థాయి వడపోత తర్వాత 50 లక్షల దరఖాస్తులు మిగిలాయి. వీటిల్లో అర్హమైనవి ఎన్ననే విషయం క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సి ఉంది. కాగా పాత దరఖాస్తులే పరిగణనలోకి తీసుకుంటారా? కొత్తవి కూడా స్వీకరిస్తారా? అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఎంపికకు సుదీర్ఘ సమయం! లబ్ధిదారుల ఎంపికకు చాలా సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ప్రజాపాలన దరఖాస్తులనే పరిగణనలోకి తీసుకున్నా.. ఒక్కో దరఖాస్తు ఆధారంగా క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించి అర్హతను తేల్చాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రభుత్వం జాబితాను రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది. ఆ తర్వాతే నిధుల విడుదల ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే హడ్కో నుంచి ఇళ్ల కోసం దాదాపు రూ.3 వేల కోట్ల రుణం పొందింది. కేంద్రం నుంచి మరో రూ.8 వేల కోట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. లబ్ధిదారులకు మొదటి విడత రూ.లక్ష చెల్లించి మిగతా విడతలను వచ్చే ఆర్థిక సంవత్సరంలో చెల్లించనున్నారు. మొదటి విడతలో మంజూరు చేసే ఇళ్లకు రూ.20 వేల కోట్లు అవసరమవుతాయి. గ్రామస్థాయి కమిటీ: సర్పంచ్/ పంచాయితీ ప్రత్యేక అధికారి చైర్మన్‌గా ఉండే కమిటీలో స్వయం సహాయక బృందాలకు చెందిన ఇద్దరు మహిళలు, గ్రామ పురోగతికి పాటుపడే ముగ్గురు స్థానికులు (వీరిలో ఒకరు బీసీ, మరొకరు ఎస్సీ/ఎస్టీ విధిగా ఉండాలి) సభ్యులుగా, పంచాయితీ కార్యదర్శి కన్వీనర్‌గా ఉంటారు. పట్టణ స్థాయి కమిటీ: వార్డు కౌన్సిలర్/కార్పొరేటర్ చైర్మన్‌గా ఉండే ఈ కమిటీలో ఇద్దరు స్వయం సహాయక బృంద సభ్యులు, స్థానికంగా అభివృద్ధి పనులకు సహకరించే ముగ్గురు స్థానికులు (వీరిలో ఒకరు బీసీ, మరొకరు ఎస్సీ/ఎస్టీ విధిగా ఉండాలి) సభ్యులుగా, వార్డు అధికారి కన్వీనర్‌గా ఉంటారు. -
భూమిలేని రైతుకూలీలకు ఏటా రూ.12 వేలు
చింతకాని: ఎన్నికల ముందు ఇచ్చిన హామీ అమల్లో భాగంగా భూమిలేని నిరుపేద రైతు కూలీల కుటుంబాలకు ఈ ఏడాది నుంచి ఖాతాల్లో రూ.12 వేలు జమ చేస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచలో దళితబంధు లబ్ధిదారులు 847 మందికి రెండో విడతగా రూ.15.54 కోట్ల మేర మంజూరు పత్రాలను మంగళవారం ఆయన అందజేశారు. నిరంకుశ రాచరిక పరిపాలన నుంచి తెలంగాణ ప్రజాస్వామ్య పరిపాలనలోకి వచ్చినందున తమ ప్రజాప్రభుత్వం సెపె్టంబర్ 17న ప్రజాపాలన దినోత్సవంగా ప్రకటించిందని తెలిపారు. ఈ ప్రకటనను వ్యతిరేకించిన వారు రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించినట్టేనన్నారు.ఈ విషయంలో భిన్నాభిప్రాయాలున్నా ప్రజాపాలన దినోత్సవాన్ని స్వాగతించాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టబోతున్నామని, ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు రూ.6 లక్షలు, ఇతరులకు రూ.5 లక్షల మేర అందిస్తామని తెలిపారు. సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులపై ప్రజలు ఆసక్తి చూపుతున్నందున రైతులు దృష్టి సారించాలని, సేంద్రియ విధానంలో సాగు చేసే ఉత్పత్తుల అమ్మకానికి ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని భట్టి తెలిపారు.చిన్నాభిన్నమైన ఆర్థికవ్యవస్థను సరిచేస్తూ ఒకటో తేదీనే ఉద్యోగులకు వేతనాలు ఇస్తున్నామని, ఆస్పత్రి మందుల బిల్లులు, కల్యాణలక్ష్మి, మధ్యాహ్న భోజన కారి్మకుల గౌరవ వేతనం, హాస్టల్ మెస్ బిల్లుల బకాయిలను చెల్లించామని వెల్లడించారు. కాగా, దళితబంధు యూనిట్లను లబ్ధిదారుల నుంచి కొనడానికి వీల్లేదని, బెదిరించి తీసుకువెళ్లడం నేరమని భట్టి స్పష్టం చేశారు. అలా ఎవరైనా యూనిట్లను తీసుకెళ్తే తిరిగి అప్పగించాల్సిన బాధ్యత స్పెషల్ ఆఫీసర్లు, జిల్లా యంత్రాంగంపై ఉందన్నారు. సమావేశంలో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
రేషన్.. పరేషాన్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రేషన్‌కార్డుల అంశం ప్రజల్లో పరేషాన్ రేపుతోంది. లక్షలాది మంది కొత్త రేషన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో.. దీనిపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ వెల్లడించిన అంశాలపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నా యి. రేషన్‌కార్డులకు కోత పెడతారా? పెళ్లిళ్లు అయి కొత్తగా ఏర్పడిన కుటుంబాలన్నింటికీ కొత్తకార్డులు జారీ చేస్తారా? పాతవాటిలో మార్పు చేర్పులపై ఏం చేస్తారు? రేషన్‌కార్డులు లేకుంటే ప్రభుత్వ పథకాలు అందడం ఎలా? అర్హతల పునః సమీక్ష అంటే ఎలాంటి నిబంధనలు పెడతారనే ప్రశ్నలు వస్తున్నాయి.వచ్చే నెల ప్రారంభం నుంచే కొత్త రేషన్‌కార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రులు వెల్లడించారు. రేషన్‌కార్డులను విభజించి, స్మార్ట్ రేషన్‌కార్డులు, స్మార్ట్ హెల్త్‌కార్డులు ఇస్తామని.. రేషన్‌కార్డులకు అర్హతలపై పునః సమీక్ష చేస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో గతంలో ప్రభుత్వ పెద్దలు చేసిన ప్రకటనలు, వ్యాఖ్యలు.. ప్రస్తుతం మంత్రులు వెల్లడించిన అంశాలు.. ఇటీవలి పరిణామాలను బేరీజు వేసుకుంటూ.. రేషన్‌కార్డుల అంశంపై తీవ్రస్థాయిలో చర్చలు మొదలయ్యాయి. రేషన్ కార్డుల్లో కోత పడుతుందా? అర్హులైన వారందరికీ కొత్త రేషన్‌కార్డులు జారీ చేస్తామని మంత్రులు ప్రకటించారు. అయితే అర్హు లను ఎలా నిర్ధారిస్తారన్న ప్రశ్నలు వస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 89 లక్షల రేషన్‌కార్డులు ఉన్నాయి. కొత్తగా కార్డుల కోసం ఏడెనిమిది లక్షల మంది ఎదురుచూస్తున్నారు. నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఆరు గ్యారంటీల దరఖాస్తులతోపాటు కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు తీసుకున్నారు. కానీ ఆ దరఖాస్తుల డేటాపై స్పష్టత లేదు. దీంతో మరోసారి ప్రజాపాలన నిర్వహించి రేషన్‌కార్డులకు దరఖాస్తులు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.కొత్త రేషన్‌కార్డుల జారీకి విధి విధానాలేమిటనే విషయంలో స్పష్టమైన వైఖరిని ప్రకటించాల్సి ఉంది. వార్షికాదాయం ప్రాతిపదికన జారీ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. కొత్తగా ఇచ్చే రేషన్‌కార్డులకే పరిమితి అమలు చేస్తారా? పాతకార్డులకూ వర్తింపజేస్తూ.. అధికాదాయం ఉన్నవారికి రద్దు చేస్తారా? అన్నది తేలాల్సి ఉంది. రాష్ట్రంలో అడ్డగోలుగా రేషన్‌కార్డులు జారీ చేశారని, అధికాదాయం ఉన్నవారు, ప్రజాప్రతినిధులు, ఐటీ కడుతున్నవారికి కూడా రేషన్‌కార్డులు ఉన్నాయని సీఎం రేవంత్ గతంలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కార్డులకు కోతపడొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పథకాలు అందేది ఎలా? రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలకు రేషన్‌కార్డులే ప్రామాణికమని సీఎం రేవంత్ గతంలోనే స్పష్టం చేశారు. ఇప్పటికే రేషన్‌కార్డు సమస్యలతో చాలా మంది రైతులకు ‘రుణమాఫీ’ అందలేదు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందనివారూ ఎంతో మంది ఉన్నారు. భవిష్యత్తులో ఇందిరమ్మ ఇళ్లు, ఇతర పథకాలకూ రేషన్‌కార్డుల లింకు ఉండనుంది. దీనివల్ల ఉన్న రేషన్‌కార్డులు రద్దయినా, కొత్త రేషన్‌కార్డులు మంజూరుకాకున్నా.. తమకు పథకాలు అందేది ఎలాగని పేదల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కొన్నేళ్లుగా జీవన వ్యయం విపరీతంగా పెరిగిపోయిందని.. అర్హతకోసం పరిగణించే వార్షికాదాయ పరిమితిని దానికి అనుగుణంగా పెంచాలనే విజ్ఞప్తులు వస్తున్నాయి. ఇక రేషన్‌కార్డులను విభజించి బియ్యం వద్దనుకునే వారికి స్మార్ట్ హెల్త్‌కార్డులు జారీ చేస్తామన్న మంత్రుల ప్రకటనతోనూ సందేహాలు మొదలయ్యాయి. అలా స్మార్ట్ హెల్త్‌కార్డులు ఉన్నవారికి ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయా, లేదా అన్న ప్రశ్న తలెత్తుతోంది. అయితే ఈ నెల 21న మరోసారి కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుంది. అనంతరం రేషన్‌కార్డుల అంశంపై స్పష్టత రావొచ్చని అధికార వర్గాలు చెప్తున్నాయి. -
20 ఏళ్లూ కాంగ్రెస్ పాలనే
సాక్షి, ఆదిలాబాద్: ‘అధికారం అందివచ్చిందని అనుభవించాలని అనుకోలేదు.. ఒక బాధ్యతగా నడుచుకుంటున్నాం. ఆర్థిక ఇబ్బందులున్నా, హామీలు అమలు చేస్తాం. 20 ఏళ్లు కాంగ్రెస్సే పాలిస్తుంది’అని డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం పీప్రీ గ్రామంలో బుధవారం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ‘ఎన్నికలకు ముందు ఏఐసీసీ ఆదేశాల మేరకు ప్రజా సమస్యలు తెలుసుకుంటూ పాదయాత్ర ఇక్కడి నుంచే ప్రారంభించాను. సీఎలీ్పనేతగా నేను ఓ వైపు.. నాటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మరోవైపు ఆదిలాబాద్ జిల్లా నుంచే యాత్రలు ప్రారంభించాం.ఆ పాదయాత్రలో ప్రజల గుండెచప్పుడు విన్నాం. చెప్పిన సమస్యల పరిష్కారానికి కంకణబద్ధులమై ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చాం. ఇప్పటివరకు అనేక హామీలు అమలు చేశాం. మొదటి సంవత్సరంలోనే ప్రతీ నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. రూ.5లక్షలు ఖర్చు చేసి రెండు పడకలతో ఇల్లు నిర్మిస్తాం. ఎస్సీ, ఎస్టీలకు అదనంగా రూ.లక్ష జత చేసి ఇస్తాం. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 30వేల ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చాం. మరో 35వేల ఉద్యోగాల నియామక ప్రక్రియ చివరిదశకు చేరుకుంది. త్వరలోనే వారికి నియామక పత్రాలు అందజేస్తాం’అని భట్టి వివరించారు. గత పదేళ్లలో ఐటీడీఏ నిర్వీర్యం గత పదేళ్లు పాలించినవారు ఐటీడీఏలను నిరీ్వర్యం చేశారని డిప్యూటీ సీఎం భట్టి ఆరోపించారు. ‘పాదయాత్రలో గిరిజనులు నాకు ఈ విషయం చెప్పారు. ఐటీడీఏల కోసం తాజా బడ్జెట్లో రూ.17వేల కోట్లు కేటాయించాం. గిరిజన యువతకు చదువు చెప్పించడం, నైపుణ్యం కల్పించడం, డ్వాక్రా సంఘాల ద్వారా ఆర్థిక అభివృద్ధిని సాధించేందుకు కృషి చేస్తాం. తుమ్మిడిహెట్టి ఆగిపోయింది. ఫలితంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సాగునీరు అందడం లేదు.నాటి సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్ట్ పనులను పున:ప్రారంభించి ఈ జిల్లాకు నీళ్లు ఇస్తాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్లో రూ.400 కోట్లు కేటాయించాం’అని భట్టి చెప్పారు. సభలో ఎమ్మెల్యేలు ప్రేమ్‌సాగర్‌రావు, వెడ్మ బొజ్జు పటేల్, అనిల్‌జాదవ్, ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ గౌస్ ఆలం, ఐటీడీఏ పీఓ ఖుష్బూగుప్తా తదితరులు పాల్గొన్నారు. -
డూప్లెక్స్ ‘ఇందిరమ్మ’!
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్లలో ఈసారి డూప్లెక్స్ తరహా నిర్మాణాలు దర్శనమిస్తాయా? పేద వర్గాల నుంచి వస్తున్న ఒత్తిడి ఆధారంగా ప్ర భుత్వం ఆ దిశగా యోచిస్తున్నట్లు కనిపిస్తోంది. సాధ్యాసాధ్యాలను పరిశీలించి నిర్ణయం తీసుకోనుంది. దిగువ అంతస్తులో కొన్ని గదులు, పై అంతస్తులో కొన్ని గదులు నిర్మించటం దీని ఉద్దేశం. కాదంటే పెద్ద సంఖ్యలో పేదలకు ఇందిరమ్మ ఇల్లు చేజారే పరిస్థితి కనిపిస్తోంది. కనీసం 400 చదరపు అడుగుల్లో... గతంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లు చిన్నవిగా ఉండటంతో ఈసారి విశాలమైనవి సమకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు యూనిట్ కాస్ట్‌ను రూ.5 లక్షలుగా ఖరారు చేసింది. ప్రతి ఇంట్లో కచ్చితంగా వంటగది, టాయిలెట్ నిర్మించాల్సిందేనని తేల్చి చెప్పింది. ఇవికాకుండా మరో రెండు గదులు ఉండాలని పేర్కొంది. దీని ప్రకారం ఇల్లు సమకూరాలంటే కనీసం 400 చదరపు అడుగులకు తగ్గకుండా నిర్మించాల్సి ఉంటుంది. అందుకు 60 గజాల వరకు స్థలం అవసరం. కానీ, చాలామంది నిరుపేదలకు అంతమేర స్థలం లేదు. 30 గజాలలోపు స్థలం ఉన్నవారు ఎందరో. అందులో నిర్మించాలంటే, నిబంధనల ప్రకారం ఖరారు చేసిన విస్తీర్ణంలో ఇంటి నిర్మాణం అసాధ్యం. ఇరుకు ఇంటిని నిర్మించాల్సి ఉంటుంది. అందుకు నిర్ధారిత యూనిట్ కాస్ట్ రూ.5 లక్షల కంటే తక్కువ మొత్తం విడుదల చేయాల్సి ఉంటుంది. ఇది తమ హామీకి విరుద్ధంగా ఉంటుందని భావిస్తున్న ప్రభుత్వం రూ.5 లక్షలు కచ్చితంగా అందించాలంటోంది. అంత మొత్తంతో ఇంటిని నిర్మించాలంటే 60 గజాల స్థలం ఉన్నవారినే లబ్ధిదారులుగా ఎంపిక చేయాల్సి ఉంటుంది. దీంతో తక్కువ స్థలం ఉన్న నిరుపేదల్లో ఆందోళన మొదలైంది. తమకున్న చిన్న స్థలంలో నిబంధనల ప్రకారం ఇంటిని నిర్మించాలంటే కచ్చితంగా డూప్లెక్స్ తరహాలో నిర్మాణం చేపట్టాల్సి ఉంది. పడక గదులను పైన నిర్మించుకుని, వంటిల్లు, హాలు, మరుగుదొడ్డిని దిగువ అంతస్తుల్లో నిర్మించాలి. ఈ నమూనాకు ఆమోదం తెలపాలని కోరుతున్నారు. దీంతో ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. -
ఖమ్మం జిల్లాలో కేసీఆర్ పార్టీకి వచ్చింది ఒకసీటే: రేవంత్
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం మార్కెట్ యార్డు సభా ప్రాంగణంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సీఎంతోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, కొమటి రెడ్డి వెంకట రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మణుగూరు బహిరంగ సభలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. రూ. 22,500 కోట్లతో ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టామని అన్నారు. మహిళల పేరు మీదే ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. పేదల ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇళ్లని అన్నారు. తెలంగాణలో నాలుగున్నర లక్షల ఇళ్లు ఇవ్వబోతున్నామని చెప్పారు. కాంగ్రెస్‌కు ఖమ్మం జిల్లాకు బలమైన బంధం ఉందని అన్నారు రేవంత్. మొదటి నుంచి ఖమ్మం ప్రజలు కేసీఆర్‌ను నమ్మలేదని చెప్పారు. 2014, 2018, 2023లో కూడా ఖమ్మం జిల్లాలో కేసీఆర్ పార్టీకి వచ్చింది ఒకసీటేనని గుర్తు చేశారు. కేసీఆర్ చెప్పిన కథనే మళ్ళీ మళ్ళీ చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేశారని, అందుకే ప్రజలు బీఆర్ఎస్ను బొంద పెట్టారని దుయ్యబట్టారు. పేదవారితో కేసీఆర్ ఆటలాడుతున్నారని మండిపడ్డారు. రూ.400 ఉన్న గ్యాస్ సిలిండర్‌ను కేంద్రం 1200 చేసిందని విమర్శించారు. ఏ ఊర్లో డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చారో అక్కడే బీఆర్ఎస్ ఓట్లు అడగాలని అన్నారు. ఏ ఊరిలో ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామో.. ఆ ఊళ్లోనే మేము ఓట్లు అడుగుతామని..ఈ ఛాలెంజ్‌కు బీఆర్ఎస్ రెడీనా అని సవాల్ విసిరారు. -
దరఖాస్తులు 66.30 లక్షలు.. కట్టేవి 4.16 లక్షలు
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గా మారనుంది. ఈ పథకం కింద ప్రస్తుత సంవత్సరం ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదే జరిగితే రాష్ట్రవ్యాప్తంగా 4.16 లక్షల ఇళ్లను నిర్మిస్తారు. కానీ ఇళ్ల కోసం ప్రజలు సమర్పించిన దరఖాస్తులు పేరుకుపోయి ఉన్నాయి. ఏకంగా 66.30 లక్షల మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. భారీ కోత ఎలా? రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పేదల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా వివిధ సంక్షేమ పథకాల కింద లబ్ధి కోసం కుప్పలుతెప్పలుగా దరఖాస్తులు వచ్చిపడ్డాయి. రకరకాల పథకాలకు దరఖాస్తు చేసిన ప్రజలు ఇందిరమ్మ ఇళ్ల పథకంపై కూడా టిక్ చేశారు. ఈ విధంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన మొత్తం దరఖాస్తులు ఏకంగా 80 లక్షలు దాటాయి. వాటిని ప్రాథమికంగా పరిశీలించిన అధికారులు, గతంలో ఇందిరమ్మ ఇళ్లు పొందిన 14.75 లక్షల మంది కూడా మళ్లీ దరఖాస్తు చేసినట్టు గుర్తించారు. దీంతో మొదటి వడపోతలో భాగంగా ఆ దరఖాస్తులను పక్కన పెట్టేశారు. దీంతో 66.30 లక్షల దరఖాస్తులు మిగిలాయి. వాటి నుంచి లబ్ధిదారుల ఎంపిక ఎలా అన్న ఆందోళన అధికారుల్లో నెలకొంది. మొదటి ఏడాదిలో 4.16 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి సంవత్సరం ఎలాంటి ఆటంకాలు లేకుండా మంజూరు చేస్తూ వెళ్లినా, వచ్చే ఐదేళ్లలో అటుఇటుగా 20 లక్షల ఇళ్లను మాత్రమే ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇవి ఏమూలకూ చాలవు. దీంతో ప్రజల్లో వ్యతిరేకత వచ్చే ప్రమాదముందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో దరఖాస్తులను రకరకాల అంశాల ఆధారంగా వడపోసి వీలైనంత మేర తగ్గించే కసరత్తు ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా సొంత ఇల్లు లేని నిరుపేదలు 30 – 35 లక్షల మంది ఉంటారన్న అంచనా ఉంది. ఒకవేళ దీన్ని పరిగణనలోకి తీసుకుని తగ్గించినా.. దరఖాస్తుల్లో ఆ సంఖ్య మేరకు పోను మిగిలినవారు అంటే సుమారు 30 లక్షల మంది తప్పకుండా అనర్హులే అవుతారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆర్సీసీ కప్పు ఉంటే ఔటే.. ప్రాథమికంగా రూపొందించుకున్న నిబంధనల ప్రకారం.. ఆర్సీసీ పైకప్పు ఉన్న సొంత ఇల్లు ఉంటే ఇందిరమ్మ పథకానికి అర్హత ఉండదు. చుట్టూ కాంక్రీట్ గోడలు ఉండి, కప్పు భాగంలో రేకులు, తడకలు, పెంకులు లాంటివి ఉంటే అర్హత వస్తుంది. దీంతో ఇప్పుడు గుట్టలాగా పేరుకుపోయి ఉన్న దరఖాస్తుల్లో.. అలా ఆర్సీసీ పైకప్పుతో ఉన్న సొంతింటిదారులు ఎవరున్నారని వెతికి పట్టుకునే పనిలో అధికారులున్నారు. తెల్ల రేషన్‌కార్డు ఉంటేనే.. ఇందిరమ్మ ఇల్లు పొందాలంటే కచ్చితంగా నిరుపేదలై ఉండాలి. తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారినే ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుంది. దీంతో ఈ దరఖాస్తుదారుల్లో ఎంతమందికి తెల్ల రేషన్ కార్డు ఉందో, ఎంతమంది తప్పుడు రేషన్‌కార్డు నంబర్లు నమోదు చేశారో అన్న వివరాలను కూడా వాకబు చేస్తున్నారు. ఈ సంవత్సరం సొంత జాగా ఉన్నవారికే! సొంత జాగా ఉన్నవారికే ఈ సంవత్సరం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. సొంత జాగా లేని అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వం స్థలం కేటాయించి మరీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. కాగా మొదటి సంవత్సరం మాత్రం సొంత జాగా లేని వారిని పరిగణనలోకి తీసుకోకూడదని నిర్ణయించినట్లు సమాచారం. -
పేదింటి పద్దు రూ.25 వేల కోట్లు!
సాక్షి, హైదరాబాద్: నిరుపేదలకు గృహ వసతి కల్పించేందుకు ఈ ఆర్థిక సంవత్స రంలో రూ.25 వేల కోట్లు ప్రతిపాదించా లని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఉమ్మడి రాష్ట్రంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మా ణాన్ని మళ్లీ ప్రారంభించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అప్పట్లో తక్కువ విస్తీర్ణంలో ఆ ఇళ్లను నిర్మించగా, ఇప్పుడు రెండు పడగ్గదులతో నిర్మించాలని నిర్ణయించింది. ఇందుకోసం యూనిట్ కాస్ట్ ను రూ.5 లక్షలుగా ఖరారు చేస్తూ ఆరు గ్యారంటీల్లో భాగంగా ప్రకటించిన విష యం తెలిసిందే. మొత్తంగా ఐదేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 4 లక్షల ఇళ్లను నిర్మించాలని అనుకుంటోంది. దీంతోపాటు గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కూడా పూర్తి చేయా లని నిర్ణయించింది. వీటన్నింటికి కలిపి తొలి ఏడాదిలో రూ.25 వేల కోట్లు అవసరమవుతాయని తాజాగా అంచనాకొచ్చింది. అధికారులతో ఉప ము ఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్షించి ప్రాథ మికంగా నిర్ణయించారు. దావోస్ పర్యటన కు వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌కు తిరిగి రాగానే ఆయనతో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లకే రూ.20 వేల కోట్లు.. తొలి ఏడాది ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.20 వేల కోట్లు అవసరమవుతాయని అంచనాకొచ్చారు. నాలుగు లక్షల ఇందిరమ్మ ఇళ్లను చేపడితే ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు చొప్పున ఇంత బడ్జెట్ అవసరమవుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం హడ్కో తదితర సంస్థల నుంచి తీసుకున్న అప్పు రూ.10 వేల కోట్లు చెల్లించాల్సి ఉంది. అందులో తొలి సంవత్సరం రూ.వేయి కోట్ల నుంచి రూ.2 వేల కోట్లను కేటాయించాలని లెక్కలు వేశారు. అసంపూర్తి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం 2వేల కోట్లు గత ప్రభుత్వంలో మొదలై పూర్తి కాకుండా మిగిలిపోయి ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పూర్తి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఇళ్ల నిర్మాణం కోసం రూ.2 వేల కోట్లను కేటాయించాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. కాగా, త్వరలో కేంద్రప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టబోతోన్న నేపథ్యంలో అందులో గృహనిర్మాణ పద్దు కింద ఎంత కేటాయిస్తుంది, ఏయే పథకాల కింద రాష్ట్రానికి ఎన్ని నిధులు వస్తాయి.. అన్న అంశాలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్న భావనను కూడా మంత్రులు వ్యక్తం చేస్తున్నారు. -
అరెరె.. ఆరు కంగారే!
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టిన ఆరు గ్యారంటీ పథకాల దరఖాస్తులు సిటీజనులను కంగారు పెట్టిస్తున్నాయి. ప్రజాపాలనలో అర్జీలు ఇచ్చేందుకు మిగిలింది మూడు రోజుల గడువే ఉండటంతో ఆందోళన కలిగిస్తోంది. ప్రజాపాలన కేంద్రాలతో పాటు మీ సేవ, ఆధార్ కేంద్రాలకు జనాలు క్యూ కడుతున్నారు. ఆరు గ్యారంటీల వర్తింపునకు రేషన్ కార్డుతోపాటు ఆధార్ కీలకం. గతంలో ఎప్పుడో తీసుకున్న ఆధార్ కార్డులు కావడం, ఆ తర్వాత వాటిని అప్డేట్ చేయకపోవడంతో మార్పులు, చేర్పులు అత్యవసరమయ్యాయి. మరోవైపు రేషన్ కార్డు కోసం బీపీఎల్ గుర్తింపునకు వార్షిక ఆదాయ ధ్రువీకరణ పత్రం తప్పనిసరి అయింది. ఫలితంగా మీ సేవ కేంద్రాలకు తాకిడి పెరిగింది. ప్రజాపాలన కేంద్రాల దరఖాస్తు స్వీకరణ కౌంటర్ల వద్ద కంటే ఆధార్, మీ సేవ కేంద్రాలకు జనం రద్దీ పెరిగింది. అన్నింటికీ కీలకం.. ఆరు గ్యారంటీల్లోని మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ప్రతి నెలా రూ. 2500, రూ.500కే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పథకాల వర్తింపునకు దరఖాస్తులో కచి్చతంగా ఆధార్ కార్డు నంబరు కీలకమైంది. నగరంలో అద్దె ఇళ్లలో ఉండే వారితో పాటు వలస వచ్చినవారు ఆధార్‌లో ప్రస్తుత (కొత్త) చిరునామాలు అప్డేట్ చేసుకోలేదు. ఇప్పటికీ చాలామంది ఆధార్ కార్డులపై పాత అడ్రస్‌లు ఉన్నాయి. కొత్త అడ్రస్‌ల మారి్పడి ఆరు గ్యారంటీల పథకాల వర్తింపు అడ్డంకి కాకపోయినా క్షేత్ర స్థాయి పరిశీలనలో కొంత సమస్య ఏర్పడే అవకాశం ఉండటంతో ముందు జాగ్రత్తగా చేర్పులు మార్పులు చేసుకునేందుకు జనం సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరోవైపు పెళ్లి చేసుకుని అత్తవారింటికి వచ్చి ఏళ్లు గడిచినా, అడ్రస్ మార్చుకోకపోవడం ద్వారా ఆరు గ్యారంటీలకు దరఖాస్తు చేసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతోంది. దీంతో ఆధార్‌లో అడ్రస్ మార్చుకొని ఆరు గ్యారంటీలకు దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆధార్ సెంటర్ల వద్ద కొత్త దంపతులే అధికంగా కనిపిస్తున్నారు. ధ్రువీకరణ పత్రాలకు సైతం.. రేషన్ కార్డుకు ఆదాయ ధ్రువీకరణ పత్రం తప్పనిసరి కావడంతో మీ సేవ కేంద్రాలకు రద్దీ పెరిగింది. మరోవైపు ప్రభుత్వం అమలు చేయబోయే కొత్త పథకాలకు ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాల అవసరం ఉంటుందనే భావనతో దరఖాస్తు చేసుకుంటున్నారు. మీ సేవ కేంద్రాలు తెరవక ముందే జనం బారులు తీరుతున్నారు. ఇప్పటికే మహానగర పరిధిలో ప్రజాపాలన కౌంటర్లకు సుమారు మూడు లక్షల వరకు రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు వచి్చనట్లు సమాచారం. ఈ కేవైసీ కోసం.. ఆరు గ్యారంటీల్లోని గ్యాస్ సిలిండర్ పథకం కోసం ఈ కేవైసీ అప్డేట్ తప్పనిసరి అని ప్రచారం కావడంతో గ్యాస్ ఏజెన్సీల వద్ద జనం బారులు తీరుతున్నారు. రూ.500కే సిలిండర్ పథకానికి, ఈ కేవైసీకి సంబంధం లేదని అధికారులు చెబుతున్నా.. ఏజెన్సీల వద్ద క్యూ తగ్గడం లేదు. ఈ కేవైసీ చేయించుకోకపోతే పథకం లబ్ధి చేకూరదేమోననే ఆందోళనతో గ్యాస్ ఏజెన్సీలకు పరుగులు తీస్తున్నారు. గత పదిహేను రోజులుగా రద్దీ కొనసాగుతోంది. మరోవైపు కొందరు గ్యాస్ డెలివరీ బాయ్స్ ఈ కేవైసీ పూర్తి చేసి కొంత నగదు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు లేకపోలేదు. రేషన్ కార్డు కేవైసీ ప్రక్రియ ఈ నెలాఖరు వరకు పొడిగించారు. ఇప్పటికే మహానగర పరిధిలోని 78 శాతం లబి్ధదారులు బయోమెట్రిక్ ద్వారా కేవైసీని పునరుద్ధరించుకున్నారు. అవే కావాలి! సాక్షి, మేడ్చల్ జిల్లా: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన సభలకు దరఖాస్తుదారులు బారులు తీరుతున్నారు. మహాలక్ష్మి, గృహజ్యోతి కోసం గ్రేటర్ శివార్ల నుంచి విరివిగా అర్జీలు వస్తున్నాయి. నగరానికి సంబంధించిన దరఖాస్తుల్లో ఎక్కువగా ఇందిరమ్మ ఇళ్లు, చేయూత కోసం అందుతున్నాయి. అలాగే రేషన్ కార్డులు, రెవెన్యూ సమస్యలపై దరఖాస్తు చేసుకునే అవకాశం కలి్పంచకున్నా.. చాలా మంది ఆశావహులు తరలివస్తున్నారు. దీంతో ప్రజాపాలన సభల్లో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయగా.. చాలా మంది రేషన్ కార్డుల కోసం తెల్ల కాగితంతో పాటు జిరాక్స్ సెంటర్లలో లభించే దరఖాస్తు పత్రాలతో అర్జీలు పెట్టుకుంటున్నారు. నగర శివారు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో బుధవారం నాటికి మొత్తం 5,37,788 దరఖాస్తులు అందినట్లు అధికారులు చెప్పారు. -
తెలంగాణ: సొంత జాగా ఉన్నవారికే ఇందిరమ్మ ఇళ్లు!
సాక్షి, హైదరాబాద్: పేదలకు ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. తొలుత సొంత జాగా ఉన్న వారికి ఇళ్ల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. సొంత స్థలం లేనివారికి పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు వంటివి ఆ తర్వాత చేపట్టాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇంటి స్థలాల పంపిణీ కోసం భూమిని సేకరించేందుకు కాస్త సమయం పట్టే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వాలు పేదల కోసం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేశాయి. ఇప్పు డు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావటంతో.. మళ్లీ ఇందిరమ్మ పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. సొంత జాగా ఉన్న అర్హులైన పేదలకు ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చింది. జాగా లేని పేదలకు స్థలం పట్టాలు ఇచ్చి, ఇంటి నిర్మాణానికి నిధులు ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఈనెల 28వ తేదీ నుంచి ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో తొలుత సొంత జాగా ఉన్న పేదలకు ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు చొప్పున నిధులు విడుదల చేసి, వారు వెంటనే ఇళ్ల నిర్మాణం చేపట్టేలా చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. తర్వాతే ఇంటి స్థలాల పంపిణీ.. రాష్ట్రంలో సొంత జాగా లేని నిరుపేదలు లక్షల్లో ఉన్నారు. అలాంటి వారికి తొలుత ఇంటి స్థలం ఇచ్చి, అందులో వారు ఇల్లు నిర్మించుకునేందుకు నిధులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పేదలకు పంపిణీ కోసం భారీగా భూమిని సేకరించాల్సి ఉంది. ఈ ప్రక్రియ కోసం సమయం పట్టే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఇళ్ల డిజైన్లపై కసరత్తు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మూడు నమూనాలను సిద్ధం చేస్తున్నట్టు ఇటీవల గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. అయితే నిర్ధారిత డిజైన్‌లో ఇళ్లను నిర్మించాలంటే.. కాలనీల తరహాలో ఒకే చోట భూమిని సేకరించాల్సి ఉంటుంది. సొంత జాగా ఉన్నవారు నిర్మించుకునే ఇళ్లు నిర్ధారిత డిజైన్‌లో ఉండాలంటే ఇబ్బంది ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. కొందరు ఉమ్మడి కుటుంబంగా ఒకే ఇంట్లో ఉంటున్నారు. అందులో పెళ్లిళ్లు అయినవారు కొత్తగా ఇళ్లకు దరఖాస్తు చేసుకునే వీలుంది. వారు ఉంటున్న ఇంటికి ఆనుకుని ఉండే ఖాళీస్థలాల్లో ఇళ్లను నిర్మించుకుంటారు. అలాంటి ఖాళీ స్థలం ఆకృతి, అధికారులు సిద్ధం చేసే డిజైన్ ప్రకారం ఇల్లు నిర్మించేందుకు అనుకూలంగా ఉండకపోవచ్చనే సందేహాలు ఉన్నాయి. ఈ అంశంలో త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అమరుల కుటుంబాలకు ముందుగానే ప్లాట్లు తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాలకు 250 చదరపు గజాల చొప్పున ప్లాట్లను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అదే స్థలాల్లో వారికి ఇళ్లను కూడా నిర్మించి ఇవ్వనున్నారు. ఇందిరమ్మ లబ్ధిదారుల్లో సొంత జాగా లేనివారికి పట్టాలు ఇచ్చేందుకు కాస్త సమయం తీసుకున్నా.. అమరుల కుటుంబాలకు మాత్రం వెంటనే ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే జాబితా రూపకల్పన, భూసేకరణ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించింది. ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరించి.. 2004– 2014 మధ్య ఉమ్మడి ఏపీలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించి దాదాపు 19 లక్షల ఇళ్లను నిర్మించారు. మళ్లీ అధికారంలోకి వస్తే అదే తరహాలో ఇళ్లను నిర్మిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. గెలిచి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఇందిరమ్మ ఇళ్ల పథకంపై కసరత్తు ప్రారంభించింది. అయితే గత సర్కారు ఎన్నికల ముందు స్వీకరించిన గృహలక్ష్మి దరఖాస్తులను తిరస్కరించాలని ఇప్పటికే నిర్ణయించింది. దీంతో ఇందిరమ్మ ఇళ్ల కోసం మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల 28 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే ప్రజాపాలన కార్యక్రమంలోనే పేదల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. వాటిని పరిశీలించి అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నారు. -
త్వరలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం
సాక్షి, హైదరాబాద్: గత ప్రభుత్వ హయాంలో రోడ్లు భవనాల శాఖలోకి మారిన గృహ నిర్మాణ శాఖ విభాగాలను పునరుద్ధరించనున్నట్టు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. త్వరలో చేపట్టనున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి గాను ఆ విభాగాన్ని పునరుద్ధరిస్తూ, చాలినంత సిబ్బందిని ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్‌పై సమకూర్చుకోనున్నట్టు వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మూడు, నాలుగు నమూనాలను సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. మంగళవారం రాత్రి గృహనిర్మాణ సంస్థ, రాజీవ్ స్వగృహ, గృహనిర్మాణ మండలి అధికారులతో సమీక్షించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నందున, వాటి నిర్మాణానికి కార్యాచరణ ప్రారంభిస్తామని పొంగులేటి చెప్పారు. త్వరలో సీఎం రేవంత్‌రెడ్డి గృహనిర్మాణ శాఖపై సమీక్షించనున్నారని, ఈ సందర్భంగా విధి విధానాలపై స్పష్టత ఇవ్వనున్నారని తెలిపారు. రాజీవ్ స్వగృహ ఇళ్ల విక్రయాల కోసం మార్కెటింగ్ నిపుణులను నియమించండి కొనుగోళ్లు కాకుండా ఉన్న రాజీవ్ స్వగృహ ఇళ్లను విక్రయించేందుకు వీలుగా మార్కెటింగ్ చేయాల్సి ఉందని, ఇందుకు నిపుణులను నియమించాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న రాజీవ్ స్వగృహ సముదాయాలను ఏ ధరకు విక్రయించాలన్న విషయంలో కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్టు వెల్లడించారు. వాటి ద్వారా సమకూరే మొత్తాన్ని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి వినియోగించనున్నట్టు పేర్కొన్నారు. -
మళ్లీ ఇందిరమ్మ ఇళ్లు
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్లను నిర్మించేందుకు సిద్ధమవుతున్న ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, తిరిగి గృహనిర్మాణ శాఖను పునరుద్ధరించబోతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదల కోసం లక్షల సంఖ్యలో ఇళ్లను నిర్మించారు. ఆ సమయంలో రాష్ట్ర గృహ నిర్మాణశాఖ దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించింది. తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం.. అవినీతి ఆరోపణలు చేస్తూ సీఐడీతో దర్యా ప్తు చేయించింది. చివరకు గృహ నిర్మాణ శాఖే లేకుండా చేసింది. రోడ్లు భవనాల శాఖలో ఓ విభాగంగా మార్చేసింది. అందులోని సిబ్బంది వివిధ శాఖలకు బదిలీ అయ్యారు. కాగా త్వరలో సీఎం రేవంత్‌రెడ్డి గృహ నిర్మాణాలకు సంబంధించి సమీక్ష నిర్వహించనున్నట్టు సమాచారం అందటంతో, ఆగమేఘాల మీద అధికారులు నివేదికలు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ శాఖను పునరుద్ధరించే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయనే చర్చ జరుగుతోంది. వైఎస్ హయాంలో 14 లక్షల ఇళ్లు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తెలంగాణ పరిధిలో ఏకంగా 14 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మితమయ్యాయి. 2004–2009 మధ్యలో ఈ ఇళ్లు రూపొందగా, ఆ తర్వాత 2014 వరకు కేవలం నాలుగున్నర లక్షలు మాత్రమే నిర్మితమయ్యాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత, ఇందిరమ్మ తరహా ఇళ్ల నిర్మాణాన్ని నిలిపేసి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకాన్ని ప్రారంభించింది. అయితే తొమ్మిదేళ్లలో లక్షన్నర ఇళ్లను కూడా పూర్తి చేయలేకపోయింది. తర్వాత గృహలక్ష్మి పేరు తో ఇందిరమ్మ తరహా ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టినా, దరఖాస్తులు స్వీకరించే సమయానికి ఎన్నికలు రావటంతో అది కాస్తా ఆగిపోయింది. ఇప్పు డు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మళ్లీ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభం కానుంది. గృహలక్ష్మి పథకంలో లబ్ధిదారులకు రూ.3 లక్షలు చొప్పు న ఇచ్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాట్లు చేయగా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటి యూనిట్ కాస్ట్‌ను రూ.5 లక్షలుగా ఖరారు చేసింది. అదనంగా సిబ్బంది కావాల్సిందేనా..? గృహనిర్మాణ శాఖలో 1983–87 మధ్య సిబ్బంది నియామకం జరిగింది. ఆ తర్వాత కొన్ని బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ మాత్రమే జరిగింది. కాలక్రమంలో చాలామంది పదవీ విరమణ చేశారు. అయితే రిటైర్మెంట్ వయసు పెంపు కారణంగా మొత్తం మీద 500 మంది వరకు ఉండగా, శాఖను రద్దు చేయటంతో 450 మంది వివిధ శాఖలకు బదిలీ అయ్యారు. దీంతో కేవలం 50 మంది మాత్రమే ఉన్నారు. ఇందిరమ్మ ఇళ్లను కొనసాగించాలంటే పాత సిబ్బంది తిరిగి రావటమే కాకుండా, అదనపు సిబ్బంది కావాల్సి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రిటైర్డ్ అధికారుల సేవలను వినియోగించుకుంటే మంచిదన్న సూచనలు అందుతున్నాయి. ఆ దరఖాస్తులేం చేస్తారు? గత ప్రభుత్వం చివరలో ప్రారంభించిన గృహలక్ష్మి పథకం కోసం 14 లక్షల దరఖాస్తులు అందాయి. వాటిల్లో అర్హమైనవి 11 లక్షల వరకు ఉన్నట్టు గుర్తించారు. ఈలోపు ఎన్నికల నోటిఫికేషన్ రావడం, బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోవడంతో ఇప్పుడా పథకమే లేకుండా పోనుంది. దీంతో ఆ దరఖాస్తులను ఏం చేస్తారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. -
మంత్రి కేటీఆర్‌కు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సవాల్
దౌల్తాబాద్: ఇందిరమ్మ ఇళ్లు లేని గ్రామాల్లో తాము ఓట్లు అడగమని, మరి డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వని గ్రామాల్లో మీరు ఓటు అడగకుండా ఉంటారా అని మంత్రి కేటీఆర్‌కు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. హాథ్‌సేహాథ్ జోడో కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజక వర్గం పరిధిలోని దౌల్తాబాద్‌లో ఆయన మాట్లాడా రు. కాంగ్రెస్ హయాంలో ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించామని, బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని చెప్పి మోసం చేస్తోందని నిందించారు. దేశాన్ని ఏకతాటి పైకి చ్చేందుకే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారని, రాహుల్ సందేశాన్ని ప్రతి ఇంటికి చేర్చేందుకు హాథ్‌సేహాథ్ జోడో కార్యక్రమాన్ని చేపడుతున్నా మని రేవంత్ చెప్పారు. ‘మీరు కష్టపడి నాటిన మొక్క నేడు ఒక వృక్షమై కొడంగల్‌కు గుర్తింపు తీసుకొచ్చింది వాస్తవం కాదా.. 119 నియోజక వర్గాల బీఫాంలపై సంతకం పెట్టే అవకాశం నాకు కల్పించారు’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. గురునాథ్‌రెడ్డిని కలిసిన రేవంత్ కొడంగల్: బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డిని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువా కప్పి సత్కరించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆదేశాల మేరకు గురునాథ్‌రెడ్డిని కలిసినట్లు రేవంత్ తెలిపారు. గురునాథ్‌రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీలో ప్రముఖ నాయకుడని, కొడంగల్ నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారని గుర్తు చేశారు. కొడంగల్‌కు కేటీఆర్ చేసిందేమీలేదు: రేవంత్ కోస్గి/మద్దూరు:మంత్రి కేటీఆర్ కొడంగల్‌ను దత్తత తీసుకొని కొత్తగా చేసిన అభివృద్ధి ఏమీ లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉండి తాను చేసిన అభివృద్ధికి, ప్రస్తుతం అధికారంలో ఉండి మీరు చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా చేపట్టిన సన్నాహక యాత్ర శుక్రవారం రాత్రి నారాయణపేట జిల్లా కోస్గికి చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక శివాజీ చౌరస్తాలో నిర్వహించిన రోడ్‌షోలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. -
లక్ష ఇళ్ల గృహప్రవేశం చేశారా ?
-
అనుకున్న సమయానికే ఇందిరమ్మ ఇళ్లు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బకాయిలు చెల్లిస్తున్నామని గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఉదయం ఆయన శాసనసభలో మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల బకాయిలు చెల్లించడం లేదని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని చెప్పారు. 29,64,435 మంది లబ్ధిదారులకు బకాయిలు చెల్లించామని, 1,19,307 మంది లబ్ధిదారులను అనర్హులుగా గుర్తించామని తెలిపారు. ఇప్పటికే చాలా జిల్లాల్లో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం ప్రారంభమైందని గుర్తు చేశారు. అనుకున్న సమయానికే ఈ ఇండ్ల నిర్మాణం పూర్తి చేస్తామని పేర్కొన్నారు. -
గృహాలను ఖాళీ చేయమనడం అన్యాయం
డీసీసీ అధ్యక్షుడు పనబాక కృష్ణయ్య నెల్లూరు (దర్గామిట్ట) : నగరంలోని వైఎస్సార్ నగర్లో నిర్మించిన ఇందిరమ్మ గృహాల లబ్ధిదారులను టీడీపీ నేతలు ఖాళీ చేయించాలనడం చాలా అన్యామని డీసీసీ అధ్యక్షుడు పనబాక కృష్ణయ్య తెలిపారు. శుక్రవారం నగరలోని ఇందిరాభవన్‌లో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 170 ఎకరాల్లో రూ.70 కోట్ల వ్యయంతో 6,500 మంది లబ్ధిదారులకు న్యాయం చేకూరేలా పక్కాగృహాలను నిర్మించడం జరిగిందన్నారు. గృహాలు నాసిరకంగా ఉన్నాయంటూ 10 రోజుల్లో ఖాళీ చేయమనడం చూస్తే ఆ పార్టీ నేతల అనుచరులకు కట్టబెట్టేందుకే ఈ పన్నాగమన్నారు. చేవూరి దేవకుమార్‌రెడ్డి మాట్లాడతూ పంట కాలువలపై నివసించే వారికి ప్రత్యామ్నాయ మార్గం చూపకుండా ఉన్నపలంగా వెళ్లిపొమ్మంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు. సీవీ శేషారెడ్డి మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీని తీసుకువచ్చి రాజధాని అమరావతి శంకుస్థానపన చేయించిన చంద్రబాబు రాష్ట్రానికి ఏమి సాధించాడని ప్రశ్నించారు. చెంచలబాబు యాదవ్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంటు సౌకర్యం కల్పించిన ఘతన వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కిందన్నారు. -
నూకపల్లి హౌసింగ్‌బోర్డు అక్రమాలపై విచారణ
బాధితుల నుంచి వాంగ్మూలం సేకరణ జగిత్యాల రూరల్: నూకలపల్లి హౌసింగ్ బోర్డు అక్రమాలపై విచారణ పూర్తయింది. కొందరు బ్రోకర్లు కన్నువేసి హౌసింగ్ శాఖ డీఈతో చేతులు కలిపి డబ్బులు తీసుకుని ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన పట్టాలు మార్పిడి జరిగిన విషయం తెలిసిందే. దీనిపై ఫిర్యాదు అందుకున్న సబ్ కలెక్టర్ విచారణకు అదేశించారు. గతంలో పనిచేసిన ఓ హౌసింగ్ డీఈ సుమారు 350 మందికి పట్టాలు ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. మూడురోజులుగా విచారణ నిర్వహించిన అధికారులు అక్రమ పట్టాలు పొందిన వారినుంచి ఎంత డబ్బు వసూలు చేశారనే దానిపై వివరాలు సేకరించారు. దీనిపై నివేదిక సమర్పించి ఉన్నతాధికారులు సమర్పించారు. ఇదివరకు పనిచేసిన హౌసింగ్ శాఖ డీఈతోపాటు మల్యాలకు చెందిన సింగాపూర్ మల్లయ్య, రాజారం గ్రామానికి చెందిన నర్సయ్య, నూకపల్లికి చెందిన మరోవ్యక్తి ద్వారా పట్టాల మార్పిడి, డబ్బులు చేతులు మారినట్లు విచారణలో తేలింది. వారిపై చర్యలు తీసుకునేందుకు రెవెన్యూ అధికారులు పూర్తిస్థాయిలో బాధితుల నుంచి వాంగ్మూలం తీసుకుని సబ్‌కలెక్టర్‌కు సమర్పించారు. -
‘ఇందిరమ్మ’ బిల్లులొస్తున్నాయ్!
సాక్షి, హైదరాబాద్: మూడు లక్షల పేద కుటుంబాలకు శుభవార్త. ప్రభుత్వం నుంచి బిల్లులు అందక అర్ధంతరంగా నిలిచిపోయిన ఇందిరమ్మ ఇళ్లకు మోక్షం లభించనుంది. పెండింగ్ బిల్లులు సహా భవిష్యత్తు బిల్లులు చెల్లించేందుకు సీఎం కేసీఆర్ పచ్చజెండా ఊపారు. దీంతో ఏడాదిన్నరగా మొండిగోడలతో దర్శనమిస్తున్న ఇందిరమ్మ ఇళ్లు పూర్తయ్యేందుకు మార్గం సుగమమైంది. ఇప్పటికే నిర్మాణాలు పూర్తి చేసుకున్న 39,429 ఇళ్లకు సంబంధించి బిల్లులు చెల్లించేందుకు రెండు నెలల క్రితమే అంగీకరించిన ప్రభుత్వం... మిగతా ఇళ్ల విషయాన్ని పెండింగ్‌లో ఉంచింది. ఇప్పుడు వాటికి కూడా బిల్లులు చెల్లించాలని నిర్ణయించటంతో అధికారులు అందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నిర్మాణంలో ఉన్న ఇళ్ల వివరాలను కలెక్టర్లు పరిశీలించి వాటిల్లో అక్రమాలు జరిగినట్టు తేలితే అలాంటి లబ్ధిదారుల పేర్లు తొలగించాలని ప్రభుత్వం జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. దీంతో మండలాలవారీగా అధికారుల బృందాలు తనిఖీ ప్రారంభించాయి. ఈ నెలాఖరుకల్లా ఆ కసరత్తు పూర్తి చేసి ప్రభుత్వానికి జాబితా సమర్పించనున్నారు. ఫిబ్రవరి నుంచి బిల్లులు విడుదల చేసే అవకాశం ఉంది. -
'ఎవరిని అరెస్ట్ చేయాలో కూడా అర్థం కావడం లేదు'
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శలు అర్థరహితమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొట్టిపారేశారు. అభివృద్ధిలో ఒక్క అడుగు ముందుకు పడకుండా ప్రతిపక్షాలు యత్నిస్తున్నాయని ఆయన గురువారమిక్కడ ఆరోపించారు. విపక్షాల ఆరోపణలపై అసెంబ్లీ వేదికగా సమాధానం చెబుతామని తలసాని స్పష్టం చేశారు. అవినీతికి అలవాటు పడిన పార్టీలు ఇప్పుడే అదే దృష్టితో చూస్తున్నాయని, ఇందిరమ్మ ఇళ్లలో అవినీతి చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయని ఆయన ధ్వజమెత్తారు. ఇందిరమ్మ ఇళ్ల అవినీతిలో ఎవరిని అరెస్ట్ చేయాలో కూడా అర్థం కావడం లేదన్నారు. గతంలో ఉస్మానియా ఆస్పత్రి వైపు కన్నెత్తి చూడని పార్టీలు, వ్యక్తులు...ప్రస్తుతం తమ యత్నాలు అడ్డుకోవాలని చూస్తున్నారని తలసాని మండిపడ్డారు. -
'కాంగ్రెస్ కు పేరు వస్తుందనే పెండింగులో పెట్టారు'
హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్లు పూర్తయితే కాంగ్రెస్‌కు పేరొస్తుందనే ఉద్దేశంతోనే తెలంగాణ ప్రభుత్వం పెండింగులో పెట్టిందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అవకతవకలకు పాల్పడ్డ లబ్ధిదారులను వెంటనే శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. తప్పు చేయని లబ్ధిదారుల బిల్లులను నిలిపివేయడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో దాదాపు 4 లక్షల మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు బిల్లులు రాక అప్పులపాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ ధర్నా చేపట్టనుందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. -
‘డబుల్ బెడ్రూం’ స్థలాలు గుర్తించండి
‘ఇందిరమ్మ’ బిల్లుల కోసం విచారణ బృందాలు మిడ్‌మానేరు నిర్వాసితులకు 4723 ఇళ్ల మంజూరు గృహ నిర్మాణంపై ఇన్చార్జి కలెక్టర్ పౌసమీబసు సమీక్ష ముకరంపుర : ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన రెండు పడక గదుల నిర్మాణాల కోసం పట్టణ, గ్రామీణ ప్రాంతాలలోని ప్రభుత్వ ఖాళీస్థలాల వివరాలు శనివారంలోగా సమర్పించాలని ఇన్చార్జి కలెక్టర్ జేసీ పౌసమీబసు సమీక్షించారు. శుక్రవారం కలెక్టరేట్లో గృహనిర్మాణాలపై హౌసింగ్ పీడీ పి.నరసింహారావు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లతో సమీక్షించారు. ప్రగతిలో ఉన్న 2437 ఇళ్లకుగాను 1376 ఇళ్లు పర్యవేక్షించిన నివేదికలు అందాయని, మిగిలిన ఇళ్లను రెండు రోజుల్లోగా పర్యవేక్షించి నివేదిక ఇవ్వాలని కోరారు. ఇళ్ల లబ్ధిదారుల జాబితా ప్రకారం నియోజకవర్గానికి ఆర్డీవో, తహశీల్దార్లతో కూడిన ప్రత్యేక బృందాలు విచారణ చేపట్టాలని, పరిశీలన పూర్తయిన అనంతరం లబ్ధిదారులకు బిల్లులు చెల్లింపులుంటాయని అన్నారు. జిల్లాలో ఇంకా మిగిలిన 44,789 మంది ఇళ్ల లబ్ధిదారుల రేషన్ కార్డుల వివరాలు ఈ నెల 31వతేదీలోగా సేకరించి పూర్తిచేయూలన్నారు. మంజూరైన 21,7827 ఇళ్లకుగాను 17,5927 మంది లబ్ధిదారులకు సంబంధించిన ఆధార్‌కార్డుల వివరాలు ఆన్లైన్లో అనుసంధానం చేసినట్లు చెప్పారు. మిగిలిన 41,900 మందివి ఈనెల 31లోగా పూర్తి చేయాలన్నారు. మిడ్‌మానేరు ప్రాజెక్ట్ నిర్వాసితులకు జీవో నంబర్ 42 ద్వారా 4723 గృహాలు నూతనంగా మంజూరు చేయడం జరిగిందని, ఇందుకు సంబందించిన లబ్ధిదారులు పూర్తి వివరాలు ఆన్లైన్లో నమోదు చేసి వర్షాకాలానికి ముందే పనులు మొదలు పెట్టాలన్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నిర్వాసితులకు రామగుండం మండలానికి సంబంధించి 816, వెల్గటూర్ మండలానికి సంబంధించి 256 గృహాల పనులు ఇప్పటివరకు ప్రారంభించకపోవడానికి గల కారణాలేంటో సంబంధిత ఆర్డీవోలను సంప్రదించి నివేదికలివ్వాలని ఆదేశించారు. -
నిధులొస్తున్నాయి
ఆన్లైన్లో నమోదై వివిధస్థాయిలో ఉన్న 57 వేల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు మోక్షం మొదలుపెట్టని లక్ష ఇళ్ల దరఖాస్తుల ర ద్దు నిర్మాణాల్లో అక్రమాలపై సీబీసీఐడీ దర్యాప్తు పూర్తి ఇళ్ల కోసం 2 లక్షల దరఖాస్తులు పెండింగ్ డబుల్ బెడ్రూం స్కీం కోసం ఎదురుచూపులు ఇళ్ల వివరాలు పునాది లెవల్ 7,900 బేస్మెంట్దశలో 31,100 లెంటల్ లెవల్ 4,400 రూఫ్ లెవల్13,900 నల్లగొండ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇది ఊరట కలిగించే విషయం... గతేడాది సార్వత్రిక ఎన్నికల ముందు బిల్లులు చెల్లించకుండా ఆగిపోయిన ఇళ్లకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఆన్లైన్లో నమోైదె ..నిధుల్లేక వివిధ స్థాయిలో నిర్మాణాలు నిలిచిపోయిన ఇళ్లకు మాత్రమే బిల్లులు చెల్లిస్తారు. ఈ బకాయిల మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమచేస్తారు. జిల్లాలో వివిధ స్థాయిలో నిర్మాణాలు ఆగిపోయిన ఇళ్లు 57,300 ఉన్నాయి. వీటికి ఇప్పుడు నిధులు మంజూరు చేస్తారు. అయితే ఆన్లైన్లో నమోదై ఇళ్ల నిర్మాణం చేపట్టని వాటిని ప్రభుత్వం పూర్తిగా రద్దు చేయనుంది. ఇలాంటివి జిల్లాలో లక్షా 23 వేల ఇళ్లు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో డబుల్ బెడ్రూం స్కీం ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో...నిర్మాణం కానీ ఇళ్లను రద్దు చేయాలని నిర్ణయించింది. ఇందిరమ్మ పథకం 2006-07 సంవత్సరంలో ప్రారంభమైంది. అప్పటి నుంచి చివరిసారిగా నిర్వహించిన రచ్చబండ వరకు జిల్లావ్యాప్తంగా 4,03,000 దరఖాస్తులు వచ్చాయి. అయితే సగం ఇళ్లు అంటే 2,22,300 పూర్త్తయ్యాయి. ఇంకా 1,80,700 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవిగాక గతేడాది రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో నిర్వహించిన మన ఊరు-మన ప్రణాళిక భాగంగా ఇళ్లు కావాలని కోరుతూ కొత్తగా రెండు లక్షల ఐదువేల మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ డబుల్‌బెడ్ రూం ఉన్న ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ప్రజల నుంచి వేలాది దరఖాస్తులు వచ్చాయి. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు త్వరలో ఖరారు కానున్నాయి. మార్చి నాటికి ఈ పథకం అమలులోకి వచ్చేఅవకాశం ఉందని పీడీ పి.రాజ్‌కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. అక్రమాలపై దర్యాప్తు పూర్తి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో జరిగిన అవినీతి అక్రమాలపై సీబీసీఐడీ అధికారుల దర్యాప్తు పూర్తయ్యింది. నాగార్జునసాగర్, దేవరకొండ నియోజకవర్గాల్లోని మూడు మండలాల పరిధిలోని నాలుగు గ్రామాల్లో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గురించి సీబీసీఐడీ అధికారులు డిసెంబర్లో విచారణ చేశారు. అనుముల మండలం చల్మారెడ్డిగూడెంలో 414 ఇళ్లు, కొత్తపల్లిలో 730, డిండి మండలం డి.నెమలిపూర్లో 229, చందంపేట మండలం తిమ్మాపురంలో 313 ఇళ్లను సీబీసీఐడీ బృందం తనిఖీ చేసింది. సమగ్ర దర్యాప్తు జరిపి నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. మొత్తం ఇందిరమ్మ దరఖాస్తులు @ః 4,03,500 పూర్తయిన ఇళ్లు 2,22,300 మన ఊరు -మన ప్రణాళికలో వచ్చిన దరఖాస్తులు 2,05,000 నిర్మాణం కాకుండా రద్దయిన ఇళ్లు @ః 1,23,000 -
ఇందిరమ్మ ఇళ్లకు మోక్షమేదీ?
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మార్చి నెలలో ఎన్నికల కోడ్ కారణంతో బిల్లులను నిలిపివేశారు. ఆ తర్వాత రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావటంతో బిల్లులు మంజూరవుతా యని అందరూ భావించారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం గృహ నిర్మాణశాఖలో లోటుపాట్లు సవరించిన తర్వాతనే మంజూరు చేయాలని నిర్ణయించింది. అప్పు చేసి మరీ ఇందిరమ్మ ఇళ్లను ప్రజలు పూర్తి చేసుకున్నారు. చేసిన పనులకు అధికారులు రికా ర్డుల పూర్వకంగా నమోదు చేసినప్పటికీ బిల్లులు మాత్రం మం జూరు కాలేదు. చేసిన అప్పుకు వడ్డీ పెరుగుతోంది. గత అక్టోబర్ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని పథకాలను పునఃప్రారంభిం చారు. తమకు కూడా మోక్షం కలుగుతుందని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. బిల్లులు మంజూరు కాక పోతే చేసిన అప్పులను వడ్డీతో సహా తీర్చడానికి ఇందిరమ్మ ఇళ్లనే అమ్ముకునే దుస్థితి దాపురించే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ల నిర్మాణ పరిస్థితి ఎలా ఉంది? అర్హులే ఇళ్లు నిర్మించుకున్నారా అన్న విషయంపై పరిశీలన చేయించండి. కానీ, దివంగత సీఎం వైఎస్‌లా త్వరితగతిన బిల్లులు చెల్లించడా నికి కేసీఆర్ చొరవ చూపాలి. మనిమద్దె రామకృష్ణ, మేళ్ల దుప్పలపల్లి, నల్లగొండ -
అప్పుల్లో గూడు!
ఆరు నెలలుగా పైసా చెల్లించని టీడీపీ ప్రభుత్వం ఇంటికి లక్షన్నర దేవుడెరుగు.. కట్టుకొన్న ఇళ్లకు బిల్లులెప్పుడో వడ్డీలకు తెచ్చి ఇళ్లు నిర్మించుకొంటున్న లబ్ధిదారులు మార్చినాటికి బకాయిరూ.16.53 కోట్లు బి.కొత్తకోట: పేదల గూడు అప్పుల్లో కూరుకుపోతోంది. కొత్త ప్రభుత్వంపై పేదలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఎన్నికల్లో ఇంటికి లక్షన్నర ఇస్తామని హామీఇచ్చి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేదల నడ్డి విరుస్తున్నారు. వారిని మరింత అప్పుల్లోకి నెట్టేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకుంటున్న పేదలకు ఆరు నెలలైనా ఒక్కపైసా చెల్లించకపోవడంతో లబోదిబోమంటున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు మార్చి 23తో ఇందిరమ్మ బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. రూ.16.53 కోట్ల చెల్లింపులు ఆగాయి. నమోదు కాని నిర్మాణాలు మార్చి నెలాఖరుతోనే జిల్లాలో ఇందిరమ్మ గృహ నిర్మాణాల నమోదు ఆగిపోయింది. మండల స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు అధికారులు నిర్మాణాలను వదిలేశారు. జిల్లాలోని పేదలకు 4,43,009 గృహాలను మంజూరు చేశారు. వీటిలో 2,95,134 గృహ నిర్మాణాలు పూర్తయ్యాయి. 31,900 పునాదుల స్థాయి, 2,130 గోడల స్థాయి, 13,170 రూఫ్లెవల్లో ఉన్నాయి. 1,00671 మంది లబ్ధిదారులు గృహ నిర్మాణాలు చేపట్టనేలేదని తేల్చారు. మే 24 వరకు జిల్లాలో ఇళ్ల నిర్మాణాలకు రూ.1,236.2కోట్లను ఖర్చు చేశారు. అప్పటి నుంచి రికార్డు పరంగా ఈ లెక్కలో మార్పులేదు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో నిర్మాణాలను నమోదు చేయడం మానేశారు. బకాయిలు రూ.60 కోట్లు జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సుమారు రూ.60కోట్ల బకాయిలు చెల్లించాల్సి వస్తుందని అంచనా. వివిధ దశల్లోని నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. లబ్ధిదారులు వడ్డీ వ్యాపారుల నుంచి అధిక వడ్డీలకు రుణాలు తీసుకొస్తున్నారు. మార్చి నుంచి ప్రభుత్వం బిల్లులు చెల్లించడం ప్రారంభిస్తే రూ.60 కోట్ల వరకు ఇవ్వాల్సి వస్తుందని భావిస్తున్నారు. ఇదిగాక మార్చిలోపున్న బకాయిలు కలుపుకుంటే రూ.75 కోట్లకుపైనే చెల్లించాల్సి వస్తుందని అంటున్నారు. లక్షన్నర ఎప్పుడో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇంటికి రూ.లక్షన్నర ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. దీనిపై ఇప్పటివరకు స్పష్టత లేకపోవడంతో కనీసం కట్టుకుంటున్న ఇళ్లకైనా బిల్లులు ఇవ్వాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఇంటి నిర్మాణానికి ఎస్టీలకు రూ.1.05 లక్షలు, ఎస్సీలకు రూ.లక్ష, బీసీ, ఓసీలకు రూ.70వేలు ఇస్తున్నారు. వడ్డీలకు తెచ్చి కడుతున్నాం నా భార్య నాగరత్నమ్మకు ఇందిరమ్మ గృహం మం జూరైంది. పునాది దశలో రూ.14 వేలు, గోడల దశలో 34 వేల బిల్లులు చెల్లించారు. ఈ ఏడాది మార్చి నెలాఖరులోగా పైకప్పుకు మోల్డింగ్ వేస్తేనే బిల్లులు వస్తాయి లేకుంటే రావని అధికారులు చెప్పడంతో రూ.20 వేలు అప్పుతెచ్చి పైకప్పు నిర్మాణం పూర్తి చేశాం. ఇంతవరకు బిల్లులు చేతికందలేదు. -డీ.వెంకట్రమణ, పెద్దతిప్పసముద్రం అప్పులెలా తీర్చాలి ఇందిరమ్మ పథకంలో ఇల్లిచ్చారు. బిల్లులివ్వకుంటే చేసిన ఎలా కట్టుకోవాలి. గతంలో రెండు దఫాలుగా రూ.39 వేలు ఇచ్చారు. సుమారు లక్ష మేరకు అప్పుచేశాం. మిగిలిన బిల్లు కోసం అధికారులను అడిగితే ఎవరూ సమాధానం ఇవ్వరు. ఇంటి పనులు ఆపేశాం, అప్పులు మిగిలిపోయాయి. -బి.వల్లెమ్మ, పెద్దకొండామర్రి మోల్డింగ్ పనులతో ఆపేశాం.. ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని ఆనందమేసింది. పనులు ప్రారంభించి వెంటనే పూర్తి చేయండి బిల్లులు ఇస్తామని అధికారులు చెప్పారు. పూర్తిచేసినా ఇప్పటివరకూ రూ.16 వేలు ఇచ్చారు. మిగిలిన బిల్లు ఇస్తే పనులు పూర్తి చేస్తామని అధికారులకు తెలిపినా పట్టించుకునేవారు లేరు. -టీ.అలివేలమ్మ, పెద్దకొండమర్రి పట్టించుకునేదెవరు ఇందిరమ్మ ఇంటికి పునాది, గోడల దశ వరకు మాత్రమే బిల్లులిచ్చారు. మూడు నెలల క్రితం ఇంటి పైకప్పు కోసం రూ.30 వేలు అప్పుచేసి నిర్మాణం పూర్తి చేయించాం. ఇంతవరకు బిల్లు మంజూరు చేయలేదు. నిర్మాణం పూర్తిచేస్తే బిల్లులు తొందరగా మంజూరు చేస్తామని చెప్పిన అధికారులు పత్తాలేరు. అప్పులకు వడ్డీలు కడుతున్నాం. -కే. రెడ్డెమ్మ, పెద్దతిప్పసముద్రం -
బిల్లు రాకపాయె..ఇల్లు ఆగిపాయె!
‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల్లో ఆందోళన ఆర్నెళ్లుగా విడుదల కాని బిల్లులు నిర్మాణ రంగంపై ప్రభావం కూలీలకు ఉపాధి కూడా కరువే కొత్త పథకంపైనే ఆశలు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు అర్ధంతరంగా నిలి చిపోయాయి. ఆరు నెలలుగా బిల్లుల చెల్లింపులు లేకపోవడంతో లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణానికి ముందు కు రావడం లేదు. సిమెంట్, ఐరన్, ఇటుక, ఇసుక ధరలు కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ సారి ఖరీఫ్‌లో వర్షాభావం వల్ల సాగు విస్తీర్ణం తగ్గడంతో కూలీలకు చేతినిండా పని లేకపోగా, ఇంటి నిర్మాణాలు సైతం నిలిచిపోవడంతో పనులు దొరక్క కూలీలు వలస వెళ్లాల్సిన పరిస్థిలు నెలకొన్నాయి. ఇందిరమ్మ పథకం కింద ఎంపికైన లబ్ధిదారులు బిల్లులు వస్తాయనే ఆశతో అప్పులు చేసి ఇండ్లు నిర్మించుకుంటున్నారు. అయితే బిల్లుల చెల్లింపులు మాత్రం అందని ద్రాక్షగా మారాయి. జిల్లాలో సుమారు 1.57 లక్షల మంది లబ్ధిదారులకు బిల్లులు అందాల్సి ఉంది. జిల్లాలో మూడు విడతల్లో 2,41,992 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయి. వాటిలో 1,57,824 ఇండ్ల నిర్మాణాలు ప్రారంభం కాగా, అవి ప్రస్తుతం అసంపూర్తిగా ఉన్నాయి. అలాగే 84,168 ఇండ్లు ఇప్పటికీ నిర్మాణానికి నోచుకోలేదు. మరో 6,956 ఇండ్లు ప్రాథమిక దశలో ఉండగా, 15,390 ఇండ్లు బేస్మిట్ లెవల్లో, 1,689 ఇండల్లు లెంట ల్ లెవల్లో , రూఫ్ లెవల్లో 5,398 ఇండ్లు ఉన్నాయి. మరో 29,433 ఇండ్లు నిర్మాణం పూర్తి చేసుకొన్నాయి. జి ల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి 1,28,391 ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఈ లెక్కన జిల్లాలో 53 శాతం ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఈ ఏడాది మా ర్చి వరకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లకు రూ. 55,340 లక్షలు విడుదల చేసింది. అయితే గృహ నిర్మాణ అధికారులు ఇంటి నిర్మాణాన్ని బట్టి లబ్ధి దారులకు బిల్లులు చెల్లిస్తారు. బిల్లుల చెల్లింపు ఇలా.. ఇందిరమ్మ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి నిర్మాణానికి మొత్తం 75 సిమెంట్ బస్తాలు ఇస్తారు. ఇవి గాక బేస్మిట్ లెవల్‌కు రూ.12,380, చార్జీల రూపంలో రూ. 2,100, రూఫ్ లెవల్‌కు రూ. 25,220, చార్జీల రూపంలో రూ. 1100, ప్లాస్టింగ్ లెవల్‌కు రూ.14,400, అదనపు చార్జీల రూపంలో రూ. వెయ్యి కలిపి మొత్తం రూ. 70 వేలు మంజూరు చేసేవారు. పట్టణ ప్రాంతాల్లో 75 సిమెంట్ బస్తాలు, బేసిక్ లెవల్‌కు రూ. 12,380, అదనపు చార్జీలు రూ. 5,100, రూఫ్ లెవల్‌కు రూ. 32,120, అదనపు చార్జీల కింద రూ. 1200, ప్లాస్టరింగ్‌కు రూ. 11,200 ఇరత్రా కలిపి మొత్తం రూ. 80 వేలు చెల్లించేవారు. అదే ఎస్సీ, ఎస్టీల ఇండ్ల నిర్మాణాలకు 75 సిమెంట్ బస్తాలతో పాటు బేసిక్ లెవల్‌కు రూ. 17,380, అదనపు చార్జీలకు రూ. 200, రూఫ్ లెవల్‌కు రూ.34,670 అదనపు చార్జీల రూపంలో రూ.1650, ప్లాస్టరింగ్‌కు రూ. 33,900 అదనపు చార్జీల కింద రు. 1500 మొత్తం కలిపి రూ. 1.05 లక్షలు చెల్లించారు. ఎస్సీ, ఎస్టీలకు ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 1.05 లక్షలు, ఇతరులకు గ్రామీణ ప్రాంతాల్లో రూ. 70 వేలు, పట్టణ ప్రాంతల్లో రూ. 80 వేలు చెల్లించేవారు. గతంలో ఎస్సీ, ఎస్టీలకు రూ. 85 వేలు, ఇతరులకు రూ. 55వేలు మాత్రమే చెల్లించారు. గృ హ నిర్మాణ సామాగ్రి పెరగడంతో ఇళ్ళ నిర్మాణానికి లబ్దిదారులు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో ఆ మొత్తాన్ని పెంచారు. కలగానే సొంతిల్లు సొంత ఇంటి కల నెరవేర్చుకుందామనుకున్న లబ్ధిదారులు నిర్మాణాలను త్వరితంగా పూర్తి చేసినా బిల్లులు మాత్రం చేతికి అందలేదు. జిల్లాలో మార్చి చివరి వారం నుంచి ఇప్పటి వరకు అధికారులు లబ్దిదారులకు బిల్లులు చెల్లించలేదు. నిర్మాణాలు పూర్తి చేసిన ఇండ్లకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో మిగిలిన లబ్ధిదారులు తమ ఇండ్లను మధ్యలోనే నిలిపివేశారు. నిర్మాణాలు పూర్తయితే బిల్లులు వస్తాయి కదా అని అప్పు చేసి ఇంటి నిర్మాణం పూర్తి చేసిన లబ్ధిదారులు బిల్లులు చేతికి అందక పోవడంతో ఆవేదన చెందుతున్నారు. పైగా అధికారులు జిల్లా గృహ నిర్మాణ సంస్థకు సంబంధించి నివేదిక తయారు చేసిసే పనిలో నిమగ్నమయ్యారు. రూ. 3.5 లక్షలపై ఆశలు ఇదిలా ఉండగా, తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇండ్ల నిర్మాణానికి రూ. 3.5 లక్షల చొప్పున బిల్లులు చెల్లిస్తామని ప్రకటించడంతో లబ్ధిదారులు గంపె డాశతో ఉన్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకొన్న వారికే ఈ పథకాన్ని వర్తింపజేస్తారా? లేదా గత మార్చి నెలలో దరఖాస్తు చేసుకొన్న వారికి సైతం వర్తింపజేస్తారా ? అంటూ చర్చించుకొంటున్నారు. ఇప్పటి వరకు ఈ పథకంలోని విధి విధానాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. దీంతో లబ్ధిదారులు అయోమయంలో ఉన్నారు. -
కాంగ్రెస్ నుంచి మరికొందరు టీడీపీలోకి
హైదరాబాద్ : కాంగ్రెస్ నుంచి మరికొంతమంది ఎమ్మెల్సీలు తెలుగు దేశం పార్టీలో చేరటానికి సిద్ధంగా ఉన్నారని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. కాంగ్రెస్‌కు హ్యాండ్ ఇచ్చి ఎనిమిది మంది ఎమ్మెల్సీలు టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. కాగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అవకతవకలు జరిగాయని ఆయన అన్నారు. ఆ విషయాన్ని అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణ అంగీకరించారన్నారు. ఇళ్ల నిర్మాణంలో అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని యనమల హెచ్చరించారు. త్వరలోనే మండలి డిప్యూటీ ఛైర్మన్ పదవికి నోటిఫికేషన్ ఇస్తామని ఆయన తెలిపారు. -
పరిశీలించండి.. పరిష్కరించండి
టన్ను రూ.1500 కిలో రూపాయిన్నర భయపడిపోతున్న పేదలు నిలిచిపోతున్న నిర్మాణ పనులు అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు...కృష్ణానది చెంతనే ఉన్నా జిల్లా ప్రజలకు ఇసుక కరువవుతోంది. జిల్లాలో తట్ట ఇసుక తెచ్చుకోవాలంటే పేదవాడు నానా ఇబ్బందులు పడుతున్నాడు. పక్క జిల్లాలోని గోదావరి పరీవాహక ప్రాంతం నుంచి తెచ్చుకోవాలంటే... కిలో ఇసుక రూపాయిన్నర ధర పలుకుతోంది. నూజివీడు : జిల్లా వ్యాప్తంగా ఉన్న ఇసుకక్వారీలకు ప్రభుత్వం వేలం వేయకపోవడంతో జిల్లా వాసులకు ఇసుక కష్టాలు నిత్యకృత్యమయ్యాయి. పేదవాడు చిన్న పక్కాఇల్లు కట్టుకోవాలన్నా పక్క జిల్లాలో ఉన్న గోదావరికి పరిగెత్తాల్సివస్తోంది. అధిక వ్యయంతో ఇసుకను కొనుగోలు వల్ల నిర్మాణ వ్యయం పెరుగుతుండటంతో మధ్య, దిగువ తరగతి ప్రజలు నిర్మాణాలను మధ్యలోనే నిలిపివేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 74ఇసుక క్వారీలు ఉన్నప్పటికీ ప్రభుత్వం వాటికి పాటలు పెట్టకుండా సంవత్సరాల తరబడి జాప్యం చేస్తుండటంతో పశ్చిమగోదావరి జిల్లా రావులపాలెం రేవు వద్ద నుంచి కొనుగోలు చేయాల్సి వస్తోంది. అక్కడినుంచి ఇక్కడకు వచ్చేసరికి 20టన్నుల లారీకి సుమారు రూ.30వేలు ఖర్చవుతోంది. అంటే కిలో ఇసుక రూపాయిన్నర ధర పలుకుతోంది. దీంతో మధ్య, దిగువతరగతి ప్రజలు గృహనిర్మాణం చేపట్టాలంటే రోజురోజుకు పెరుగుతున్న వ్యయాన్ని భరించలేక భయపడుతున్నారు. మరోవైపు బిల్డర్లు కూడా నిర్మాణాలను తాత్కాలికంగా ఆపేయడమో, లేకపోతే అపార్ట్మెంట్లలోని ప్లాట్ల ధరలను పెంచేయడమో చేస్తున్నారు. ఇసుకకు నూతన విధానమంటూ, ఇసుక క్వారీలకు ప్రభుత్వం పాటలు పెట్టకపోవడం వల్ల ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. రోజుకు 4వేల టన్నుల వినియోగం జిల్లాలో రోజుకు 4వేల టన్నుల ఇసుక వినియోగం ఉంటుందని భవన నిర్మాణ కార్మికుల సంఘం, ఇతర సంఘాల అంచానా. జిల్లాలలో 8మున్సిపాల్టీలు, ఒక కార్పొరేషన్, ప్రజలు నిర్మించుకుంటున్న గృహాలు, ఇందిరమ్మ గృహాలు, అపార్ట్మెంట్లు, ప్రభుత్వ భవనాలు, ఎస్సీ సబ్‌ప్లాన్ కింద నిర్మించే సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కాలువల ఆధునికీకరణ పనులు తదితర ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అంతేగాకుండా జిల్లాలో ఉన్న దాదాపు 4వందల మంది బిల్డర్లు పెద్ద పెద్ద భవనాలను నిర్మిస్తున్నారు. అంతేగాకుండా నివేశన స్థలాల ధరలు భారీగా పెరగడంతో పట్టణాల్లో అపార్ట్మెంట్ల నిర్మాణాలు అధికంగా సాగుతున్నాయి. ఒక్క నూజివీడులోనే ప్రస్తుతం 10వరకు అపార్ట్మెంట్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. కిలో ఇసుక రూపాయిన్నర! ఇసుక స్థానికంగా దొరకక పోవడంతో ఇసుక వ్యాపారులకు వరంగా మారింది.గోదావరి నుంచి ఇసుకను లారీల్లో తెచ్చినందుకు కిరాయిలతో కలుపుకుని టన్ను రూ.15వందలు పడుతోంది. దానిని స్టాక్ చేసి ఒకటి, రెండు ట్రక్కుల ఇసుక కావాల్సిన వారికి ట్రాక్కర్ ట్రక్కు ఇసుకను రూ.5వేల నుంచి రూ.6వేల వరకు విక్రయిస్తున్నారు. ఈ ట్రక్కుల్లో కేవలం మూడున్నర టన్నుల ఇసుక మాత్రమే పడుతుంది. దీంతో కిలో ఇసుకరూపాయిన్నర ధర పలుకుతోంది. ఇంత మొత్తంలో వెచ్చించి ఇసుకను కొనలేక నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోతున్నాయి. -
2 లక్షల ఇందిరమ్మ ఇళ్లు రద్దు!
ఏపీ సర్కారు వ్యూహరచన సాక్షి విజయవాడ బ్యూరో: ఏపీలో సుమారు 2 లక్షల ఇందిరమ్మ ఇళ్లను రద్దు చేయడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం వ్యూహ రచన చేస్తోంది! మూడేళ్లుగా ప్రారంభం కాని ఇళ్లు, మంజూరైన వాటిలో అనర్హులు తదితరాల పేరుతో సర్వే చేయించడానికి మండల స్థాయిలో కమిటీలను రంగంలోకి దించనుంది. బుధవారం గృహ నిర్మాణ మంత్రి కిమిడి మృణాళిని తన శాఖకు చెందిన జిల్లా ప్రాజెక్టు డెరైక్టర్లతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ ఏడాది మార్చి నుంచి పెండింగ్‌లో ఉన్న సుమారు రూ.400 కోట్ల బిల్లుల్లో వీలైనంత కోత పెట్టడం, జిల్లాకు కనీసం 15 వేల ఇళ్లు రద్దు చేసేలా అధికారులకు దిశా నిర్దేశం చేయడమే సమీక్ష లక్ష్యమని సమాచారం. రాష్ట్రంలోని ప్రతి నిరుపేద పక్కా ఇంటి కోసం ఎమ్మెల్యే చుట్టూనో, మంత్రి చుట్టూనో ప్రదక్షిణలు చేయకుండా అడిగిన వెంటనే ఇళ్లు మంజూరు చేసేలా దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఏర్పాట్టు చేయడం తెలిసిందే. ఎన్నికల ఏడాదిలో కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారు ఇందిరమ్మ లబ్ధిదారులకు బిల్లులు చెల్లించే విషయంలో సాగదీత వ్యవహారం నడిపింది. దీంతో ఈ ఏడాది మార్చి నుంచి రూ. 400 కోట్లకు పైగా బకాయిలు పేరుకు పోయాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాగానే బకాయిలు చెల్లిస్తుందని లబ్ధిదారులు ఎదురుచూశారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం పక్కా ఇళ్ల నిర్మాణం, ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ఇళ్లను పూర్తి చేయడంపై శ్రద్ధ చూపేలా కనిపించడం లేదు. పైగా వివిధ కారణాలు చూపుతూ మంజూరైన ఇళ్లను రద్దు చేసి కొత్త వాటిని మంజూరు చేసే దిశగా ఆలోచనలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి మృణాళిని నిర్వహించనున్న సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. -
రంగంలోకి సీబీసీఐడీ
ఖానాపూర్ : ఇందిరమ్మ ఇళ్ల అక్రమాలపై నిగ్గు తేల్చడానికి సీబీసీఐడీ రంగంలోకి దిగింది. జిల్లాలో అత్యధికంగా ఖానాపూర్, ఇంద్రవెల్లి, ఆసిఫాబాద్, రెబ్బెన ప్రాంతాల్లో భారీగా అక్రమాలు జరిగాయన్న నేపథ్యంలో ప్రభుత్వం సీబీసీఐడీ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో ఆయా మండలాల్లో దర్యాప్తుకు శ్రీకారం చుట్టారు. సోమవారం సీబీసీఐడీ డీఎస్పీ రవికుమార్, ఇన్స్పెక్టర్లు వి.చేరాల, బి.రఘుపతి హౌసింగ్ డీఈ కార్యాలయంలో ఈఈ అలీంబిన్‌మాలియా నుంచి ఇళ్ల వివరాలు, చెల్లింపులు, ఇతరత్రా సమాచారం సేకరించారు. కంప్యూటర్ నుంచి వివరాలు డౌన్లోడ్ చేసుకున్నారు. ఇప్పటికే 2009లో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల అక్రమాలపై థర్డ్ పార్టీ సర్వే కమిటీ వివరాలు, తదితర అంశాలను సేకరిస్తున్నారు. రూ.కోటీ 29లక్షలకు పైగా అక్రమాలు జరిగాయన్న థర్డ్ పార్టీ విచారణ నివేదిక ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ విషయమై ఈఈ ఆదేశాల మేరకు వర్క్ఇన్స్పెక్టర్లు, సిబ్బంది నాలుగు రోజులుగా ఇళ్ల నిర్మాణాల రికార్డులు తయారు చేశారు. ఇంటింటికీ తిరుగుతూ లబ్ధిదారుల నుంచి వీడియో స్టేట్మెంటు రికార్డు చేసి విచారణ జరిపిన ఇళ్లకు నంబర్లు వేస్తున్నారు. తహశీల్దార్, ఎంపీడీవో, తదితర శాఖల అధికారుల నుంచి ఇళ్ల నిర్మాణాలపై సీబీసీఐడీ అధికారులు ఆరా తీస్తున్నారు. తాజాగా సీబీసీఐడీ అధికారులు రంగంలోకి దిగడంతో అక్రమార్కుల గుండెల్లో గుబులు మొదలైంది. సీబీసీఐడీ అధికారుల వెంట ఆ శాఖ సిబ్బంది షంషీర్‌ఖాన్, రమణ, పట్టాభి, తిరుపతి, సుధాకర్, ఆన్‌చార్జి ఎస్సై టీవీరావు, వర్క్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ తదతరులు ఉన్నారు. -
ఆరంభించని ఇందిరమ్మ ఇళ్లు.. రద్దు!
సాక్షి, విజయవాడ: నిర్మాణం మొదలైన ఇళ్లు సగంలోనే ఆగిపోయాయి. నిధులకు బ్రేకులు పడ్డాయి. మరోవంక... నిర్మాణం మొదలుకాని ఇళ్లకు మంగ ళం పాడేయటానికి కూడా రెడీ అయిపోయారు. ఇదీ... ఇందిరమ్మ ఇళ్ల దుస్థితి. ఎన్నికలు... ప్రభుత్వం మారటం వంటి కారణాలతో మార్చి నుంచి లబ్ధిదారులకు చెల్లించాల్సిన బిల్లులన్నీ నిలిపేశారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో రూ.363.66 కోట్ల విడుదల ఆగిపోయింది. పులిమీద పుట్రలా 2011కు ముందు మంజూరై ఇప్పటి దాకా ప్రారంభించని ఇళ్లను రద్దు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పిడుగు పాటే. రాష్ట్రంలో 2011 మార్చికి ముందు మంజూరై ఇప్పటి దాకా నిర్మాణం ప్రారంభం కాని పక్కా ఇళ్లు ఎన్ని ఉన్నాయో గుర్తించి నివేదికలు పంపాలని జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డెరైక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. అంతా వివరాలు తెప్పించుకునే పనిలో పడ్డారు. జిల్లాల నుంచి నివేదికలు అందిన వెంటనే ప్రభుత్వం రద్దు నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు సమాచారం. -
‘ఇందిరమ్మ’ అనుబంధాలపై ఆరా !
ప్రొద్దుటూరు టౌన్, న్యూస్‌లైన్: ‘ఇందిరమ్మ గృహాల అక్రమ పునాదులకు అనుబంధాలు తయారు చేసిందెవరంటూ’ జిల్లా స్థాయి రెవెన్యూ అధికారులు ప్రొద్దుటూరు తహశీల్దారు చంద్రమోహన్‌ను ఆరా తీశారు. ‘ఇందిరమ్మ’ లో అక్రమాలకు అనుబంధాలు రెడీ’ అన్న శీర్షికన సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి జిల్లా అధికారులు స్పందించారు. ఈ మేరకు స్థానిక తహశీల్దార్‌కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఈ విషయమై స్థానిక రెవెన్యూ కార్యాలయంలో తహశీల్దారు సిబ్బందితో సమావేశం నిర్వహించారు. పాత తేదీలు వేసి రికార్డుల్లో నెంబర్లు వేసి అక్రమాలకు పాల్పడిన విషయంపై విచారణ చేస్తున్నారు. ఏ స్థాయి అధికారులు ఈ పని చేశారన్న విషయంపై ఆరా తీస్తున్నారు. అక్రమార్కులు ఆడిందే ఆట.. గతంలో కలెక్టర్ ఆదేశాలతో తొలగించిన పునాదులకు తిరిగి అక్రమంగా అనుబంధాలు ఇవ్వడంతో అక్రమార్కులు ఎలాంటి బిల్లులు లేకుండానే గృహాలను పూర్తి చేస్తున్నారు. దీంతో అక్రమార్కులు ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. కాలనీలో వందలాది పునాదులు వెలిసినా, వాటి నిర్మాణాలు పూర్తి చేస్తున్నా రెవెన్యూ అధికారులు స్పందించక పోవడంపై కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ అక్రమాలపై 12 మంది అధికారులు సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. ఇందులో రూ.కోట్లు చేతులు మారాయన్న ఆరోపణలు ఉన్నాయి. అనుబంధాలు తయారు చేసిన రెవెన్యూ అధికారి, ఆయనకు సహకరించిన కింది స్థాయి అధికారులపై కఠిన చర్యలు తీసుకోకపోతే అక్రమాలకు అడ్డుకట్ట పడదని స్థానికులు అంటున్నారు. -
ఆగిన ఇందిరమ్మ ఇళ్లు
లబ్ధిదారులకు సవ్యంగా అందని బిల్లులు రెండు నెలలుగా ముప్పు తిప్పలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నిలిచిపోయింది. అధికారులు బిల్లులు చెల్లించకపోవటంతో... చేతిలో డబ్బులు లేక లబ్ధిదారులు పనులు పక్కన పెట్టేశారు. బిల్లులు ఎప్పుడు అందుతాయో తెలియక గృహనిర్మాణ సంస్థ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసిక మొత్తం విడుదల కాకపోవడమే సమస్యకు కారణంగా తెలుస్తోంది. ఇటీవలి వరకు ఇందిరమ్మ ఇళ్ల బిల్లులను గృహనిర్మాణ సంస్థ ఎండీ ఆధ్వర్యంలో విడుదల చేసేవారు. ప్రభుత్వం ఆ త్రైమాసిక మొత్తాన్ని ఎండీ ఖాతాలో వేసేది. దాన్ని ఆ నెలకు సంబంధించి అధికారులు రూపొందించిన నివేదిక ఆధారంగా లబ్ధిదారులకు చెల్లించేవారు. కానీ గత నవంబర్‌లో ఈ విధానాన్ని మార్చి... నేరుగా ట్రెజరీ ద్వారా చెల్లింపులు జరిపే కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టారు. దీని ప్రకారం నేరుగా సంబంధిత బ్యాంకుల నుంచే లబ్ధిదారుల ఖాతాలోకి బిల్లుకు సంబంధించిన డబ్బులు వెళ్లిపోతాయి. ఈ విధానాన్ని పర్యవేక్షించేందుకు గృహ నిర్మాణ సంస్థలో ప్రత్యేకంగా ఓ చీఫ్ జనరల్ మేనేజర్ స్థాయిలో అధికారిని నియమించారు. పాత విధానం అమలులో ఉన్నప్పుడు చెక్కులు రూపొదించటం, వివరాలు నమోదు చేయటం, ఆ నిధులు ఖాతాలకు మళ్లించటం.... తదితర కసరత్తు వల్ల కొంత ఆలస్యంగా బిల్లులు అందేవి. కానీ కొత్త విధానం వల్ల కేవలం మూడు రోజుల్లోనే బిల్లులు లబ్ధిదారుల ఖాతాలోకి చేరిపోతాయంటూ అధికారులు ప్రచారం చేశారు. తొలి నెలలో అనుకున్నట్టే అమలైంది. కానీ.. జనవరి నుంచి సమస్య మొదలైంది. ఫిబ్రవరి నెలకు సంబంధించి కొద్ది రోజుల క్రితం దాదాపు రూ.100 కోట్లు విడుదల చేశారు. వీటితో ఆ నెల 21 వరకు పెండింగుపడిన బిల్లులు చెల్లించేశారు. మిగతా నిధులు రాకపోయేసరికి దాదాపు రెండున్నర లక్షల ఇళ్లకు చెందిన లబ్ధిదారులు పనులు నిలిపివేసి బిల్లుల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూడాల్సి వస్తోంది. తుదకు జిల్లా స్థాయి అధికారులకు కూడా నిధులెప్పుడొస్తాయో తెలియని గందరగోళం నెలకొంది. రాష్ట్ర విభజన కసరత్తు ముమ్మరం కావటంతో సచివాలయంలోని ఉన్నతాధికారులు ఆ పనిలో నిమగ్నమై దీన్ని గాలికొదిలేశారు. ఫిబ్రవరి 24 వరకే అందాయి ‘‘ఫిబ్రవరి 24 వరకు నిధులు అందాయి. వాటిని లబ్ధిదారులకు చెల్లించాం. ఆ తర్వాత నిధులు రావాల్సి ఉంది. ప్రస్తుతం నేను వ్యక్తిగత పనులపై సెలవులో ఉన్నందున... నిధులు ఎప్పుడొచ్చే విషయంపై సమాచారం లేదు.’’ - గృహనిర్మాణ సంస్థ సీజీఎం జగదీశ్‌బాబు నెలన్నరగా కాళ్లరిగేలా తిరుగుతున్నం ‘‘ఇందిరమ్మ ఇంటి నిర్మాణం మొదలుపెట్టి నెలన్నర క్రితమే బేస్మెంట్ వరకు పూర్తి చేసుకున్నం. మొదటి విడత బిల్లు కోసం అప్పటి నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నా నిధులు లేవని చెప్తున్నరు. వ్యవసాయ కూలీ పనిచేసుకునే మాకు పైసలెక్కడినుంచి వస్తయ్. చేసేదిలేక పని ఆపేసినం.’’ -ఉప్పరి పుణ్యవతి, నాగిరెడ్డి గూడ, రంగారెడ్డి జిల్లా పీడీల ఆవేదన: ‘‘పరిస్థితి దారుణంగా ఉంది. బిల్లులు ఎప్పుడొస్తాయంటూ లబ్ధిదారులు కార్యాలయాలకు పెద్ద సంఖ్యలో వచ్చి నిలదీస్తున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే ఇక మేము కార్యాలయాలకు వెళ్లలేం. లబ్ధిదారుల నిలదీతను తట్టుకోలేం’’ అంటూ పలు జిల్లాల పీడీలు పేర్కొంటున్నారు. -
ఎన్నాళ్లీ ఎదురుచూపులు..?
సాక్షి, ఖమ్మం: ఇందిరమ్మ ఇళ్ల కోసం పేదలకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఏళ్లుగా దరఖాస్తు చేసుకుంటున్నా అవి పెండింగ్‌లోనే ఉంటున్నాయి. లక్షల్లో దరఖాస్తులు వచ్చినా.. అర్హత లేవన్న సాకుతో అధికారులు తిరస్కరిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మూడు లక్షలకు పైగా దరఖాస్తులు రాగా, అందులో లక్షకు పైగా మాత్రమే మంజూరు చేయడం గమనార్హం. అయితే ఎన్నికలు సమీపిస్తుండడంతో ‘మీకు తప్పకుండా ఇల్లు మంజూరు చేయిస్తాం’ అని.. నేతలు హామీలు గుప్పిస్తున్నారు. ఇందిరమ్మ మూడు దశల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టినా.. ఇంకా చాలా మంది అర్హులకు అందలేదు. దీంతో వారు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రచ్చబండ, గృహ నిర్మాణ శాఖ కార్యాలయాలు, మండల, జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తున్న గ్రీవెన్స్డేలలో కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వస్తూనే ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో మూడు లక్షలకు పైగా దరఖాస్తులు రాగా, కేవలం 1, 24, 921 మందినే అర్హులని తేల్చారు. ఇందులో ఇప్పటి వరకు 1,01,579 మందికి మాత్రమే ఇళ్లు మంజూరు చేశారు. ఇంకా అర్హులైన 23,342 మందికి త్వరలో మంజూరు చేస్తామని అధికారులు చెపుతున్నప్పటికీ.. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడితే దీనికి బ్రేక్ పడుతుందని పేదలు ఆందోళన చెందుతున్నారు. అసలు మంజూరు జాబితాలో తమ పేర్లు ఉన్నాయో, లేవోననే అనుమానంతో పలువురు లబ్ధిదారులు మళ్లీ గ్రీవెన్స్‌డేలో కలెక్టర్‌ను కలిసి దరఖాస్తులు అందజేస్తున్నారు. కాగా, ఇప్పటికే మంజూరైన ఇళ్ల లబ్ధిదారులకు కూడా అధికారికంగా ఉత్తర్వులు అందకపోవడంతో వారిలోనూ అయోమయం నెలకొంది. దీనిపై లబ్ధిదారులు మండల కార్యాలయాల్లో సంప్రదించినా వారికి సమాచారం ఇచ్చే వారే కరువయ్యారు. ఉత్తుత్తి హామీలేనా.. అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని రాజకీయ పార్టీల నేతలు చెపుతుండడంతో నిరుపేదలు మళ్లీ దరఖాస్తు చేసుకునేందుకు కారా్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేతలు ‘ఇళ్లు ఇప్పిస్తాం.. మీ దరఖాస్తులు మా పార్టీ గ్రామ నాయకులకు ఇవ్వండి’ అని చెపుతున్నారు. మరికొన్ని రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండడంతో ఇప్పుడు దరఖాస్తు చేసుకున్నా ఇళ్లు మంజూరు కావని తెలిసి కూడా.. ఓట్ల కోసమే ఇలాంటి హామీలు గుప్పిస్తుండడం గమనార్హం. కొన్ని నియోజకవర్గాల్లో ఐదేళ్ల క్రితం నిర్మించిన ఇళ్లకు కూడా ఇప్పుడు ఆయా ప్రజాప్రతినిధులు తమ పలుకుబడితో అధికారులపై ఒత్తిడి తెచ్చి బిల్లులు మంజూరు చేయిస్తున్నట్లు సమాచారం. మధిర నియోజకవర్గంలో ఈ వ్యవహారం జోరుగా సాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. లక్షల సంఖ్యలో ఆన్లైన్ కాని దరఖాస్తులు.. గత ఏడాది ప్రతి మండల పరిధిలో వేల సంఖ్యలో స్వీకరించిన దరఖాస్తులు మండల కార్యాలయాల్లో ఇంకా మూలుగుతూనే ఉన్నాయి. నెలలు గడిచినా వాటిని ఆన్లైన్ చేయడంలో టెక్నికల్ సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. అంతకుముందు ఆన్లైన్ చేసిన వాటిలోనూ కొంతమందికే ఇళ్లు మంజూరయ్యాయి. అలాగే ప్రతి గ్రామంలో కాంగ్రెస్ నేతల వద్ద కూడా మరికొన్ని దరఖాస్తులు ఉన్నాయి. ‘మాకు దరఖాస్తులు ఇస్తే వెంటనే ఇళ్లు మంజూరు చేయిస్తా’మని పేదలను వారు మభ్యపెడుతున్నారు. ఖర్చుల పేరుతో కొంత డబ్బు తీసుకుంటున్న సదరు నాయకులు.. ఆ దరఖాస్తులను మండల కార్యాలయాల్లో అందజేయడం లేదు. ప్రతి మండలం, మున్సిపాలిటీల్లో వేల సంఖ్యలో దరఖాస్తులు ఆన్లైన్ కాకుండా ఉన్నా వాటిని సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఇక ఇళ్ల మంజూరు ప్రక్రియకు మరో ఆర్నెళ్ల పాటు బ్రేక్ పడనుంది. -
ఏసీబీ వలలో మరో చేప
రూ. 8 వేలు లంచం తీసుకుంటూ అధికారులకు పట్టుబడిన హౌసింగ్ ఏఈ ఇందిరమ్మ బిల్లు మంజూరుకు నజరానా లంచావతారాల కోసం వల వేసిన ఏసీబీకి ఇరవై నాలుగు గంటలు గడిచీ గడవక ముందే మరో అవినీతి చేప చిక్కింది. పాయకరావుపేటలో తహశీల్దారును, ఆర్ఐని పట్టుకున్న మర్నాడే అవినీతి నిరోధక అధికారుల దాడిలో హౌసింగ్ ఏఈ పట్టుబడడం సంచలనం రేపింది. కె.కోటపాడు హౌసింగ్ ఏఈ లెక్కల సత్యనారాయణ మంగళవారం లబ్ధిదారుడి నుంచి రూ. 8వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. కె.కోటపాడు, న్యూస్‌లైన్: ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారు నుంచి లంచం పిండిన గృహ నిర్మాణ శాఖ అసిస్టెంట్ ఇంజినీర్ ఏసీబీ ఉచ్చులో చిక్కుకున్నారు. కె.కోటపాడు హౌసింగ్ ఏఈ లెక్కల సత్యనారాయణ లెక్కను ఏసీబీ అధికారులు తేల్చేశారు. ఇందిరమ్మ పథకం లబ్ధిదారు నీలి శ్రీనివాస్ నుంచి రూ. 8 వేలు లంచం తీసుకుంటూ ఆయన తన కార్యాలయంలోనే పట్టుబడ్డారు. కె.కోటపాడు గ్రామానికి చెందిన నీలి శ్రీనివాస్‌కు గత రచ్చబండ-2 కార్యక్రమంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. ఈ లబ్ధిదారుడికి మొదటి విడత హౌసింగ్ బిల్లుగా రూ. 15 వేలు మంజూరైన సందర్భంలో హౌసింగ్ ఏఈ సత్యనారాయణ రూ. 6 వేలు లంచం అడిగారు. రెండో విడతలో ఇస్తానని శ్రీనివాస్ చెప్పారు. దాంతోరెండో దఫా బిల్లు ఈ నెల 27న మంజూరు చేస్తానని, బ్యాంకు నుంచి నగదు తీసుకున్న తర్వాత రూ. 10 వేలు లంచంగా ఇవ్వాలని సత్యనారాయణ మరోసారి కోరారు. రూ.8 వేలు ఇస్తానని శ్రీనివాస్ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సంగతి గురించి శ్రీనివాస్ ఏసీబీ అధికారులకు తెలిపారు. బిల్లు మంజూరైందని మంగళవారం ఉదయం శ్రీనివాస్‌కు హౌసింగ్ ఏఈ సత్యనారాయణ తెలిపారు. సాయంత్రం ఎస్బీఐ ఎటీఎం నుంచి డబ్బు డ్రా చేసి కె.కోటపాడులో గల హౌసింగ్ కార్యాలయానికి వెళ్లి ఏఈకి అందజేశారు. అక్కడే మాటువేసిన ఏసీబీ అధికారులు సత్యనారాయణను అదుపులోకి తీసుకున్నారు. రూ. 8 వేలు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఏఈపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నామని ఏసీబీ డీఎస్పీ ఎం.నర్సింహారావు తెలిపారు. ఈ సంఘటనలో ఏసీబీ ఎస్ఐలు గణేష్, రామకృష్ణ పాల్గొన్నారు. లంచగొండి అధికారుల నుంచి ఇబ్బందులు పడుతున్నవారెవరైనా 94404 46170 నంబర్‌కు ఫోన్ చేయవచ్చని, ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని డీఎస్పీ తెలిపారు. -
ఇటుకలపై 5 శాతం పన్ను
సాక్షి, హైదరాబాద్: పేదల కోసం నిర్మించ తలపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఇకపై మరింత భారం కానుంది. ఈ ఇళ్ల నిర్మాణానికి ఉపయోగిస్తున్న ఇటుకలపై పన్ను వసూలు చేసేందుకు రాష్ట్ర సర్కారు సిద్ధమైంది. ఇందులో భాగంగా గడచిన నాలుగేళ్లుగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ళ లెక్కలను ఇవ్వాలని గృహ నిర్మాణ శాఖను వాణిజ్య పన్నుల శాఖ కోరుతోంది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీలు, మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు అనుమతులు మంజూరు చేసిన ఇళ్లు, ఫ్లాట్ల నిర్మాణాలపైనా ఆరా తీస్తోంది. వీటి ఆధారంగా ఎంత ఇటుక వాడారు? వాటి ఖరీదు ఎంత? వాటికి ఎంత పన్ను చెల్లించాలనే లెక్కలు వేయాలని అంచనా వేస్తోంది. ఫిబ్రవరిలోగా ఇందుకు సంబంధించిన అన్ని వివరాలూ పంపాలని జిల్లా అధికారులను వాణిజ్య పన్నుల శాఖ విభాగం ఆదేశించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. గడచిన నాలుగేళ్ల కాలంలో రాష్ట్రంలో సుమారు 30 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించినట్టు అంచనా. వీటికి తోడు మున్సిపాల్టీలు, నగర పాలక సంస్థలు అనుమతి ఇచ్చిన ఫ్లాట్లు, ఇళ్ల నిర్మాణాలు 47 లక్షల వరకూ ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. మేజర్ గ్రామ పంచాయతీల్లోని నిర్మాణాలను కూడా కలుపుకుంటే ఈ సంఖ్య రెట్టింపు ఉంటుందని లెక్కగడుతున్నారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ లెక్కల ప్రకారం ఒక్కో ఇందిరమ్మ ఇంటికీ 10 వేల వరకూ ఇటుక వాడుతున్నారు. అపార్టమెంట్ నిర్మాణాలకు 50 నుంచి 80 వేల ఇటుకల అవసరం ఉంటుంది. వీటికి ఎక్కడి నుంచి ఇటుకలు తెస్తున్నారనే వివరాలు అధికారుల వద్ద లేవు. అయితే ఇటుకలపై 5 శాతం అమ్మకం పన్ను వసూలు చేయాలనే నిబంధన మాత్రం ఉంది. మూడేళ్ల క్రితం వరకూ ఒక్కో ఇటుక రూ. 3.50 ఉండేది. మట్టి తవ్వకాలపై ఆంక్షలు విధించడంతో రూ. 5కి పైగా పెరిగింది. ఈ లెక్కన ఇందిరమ్మ ఇళ్లకే కోట్ల రూపాయల విలువైన ఇటుకను వాడారు. అపార్ట్మెంట్లు, పట్టణాలు, పంచాయతీల్లో నిర్మాణాలను కలుపుకుంటే, ఈ నాలుగేళ్లలో సుమారు రూ. 500 కోట్ల అమ్మకం పన్ను రాబట్టవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే నాలుగేళ్ల పన్ను వసూలు విషయమై ప్రభుత్వం నుంచి ఆమోదముద్ర పడాల్సి ఉంది. -
ఇందిరమ్మ ఇల్లు ఓ కల
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో వేగంగా సాగిన ఇళ్ల నిర్మాణం ప్రస్తుతం రెండడుగులు ముందుకు మూడు అడుగులు వెనక్కి అన్న చందంగా తయారైంది. ఇప్పటి వరకు జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ. 468 కోట్లు ఖర్చుచేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఇంకా సొంత ఇళ్లు లేని నిరుపేదలు ఎందరో ఉన్నారు. ఇటీవల జరిగిన మూడో విడత రచ్చబండలో ఇంది రమ్మ ఇళ్ల కోసం 48 వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. జిల్లాకు మం జూరైన ఇళ్లలో 25,589 ఇళ్లు అసంపూర్తి దశలో ఉన్నాయి. వీటిలో 4,417 ఇళ్లు పునాది దశలో, బేస్మెంట్ లెవల్లో 13,688 ఇళ్లు, లెంటల్ లెవల్లో 1,783 ఇళ్లు, రూఫ్లెవల్లో 5,701 ఇళ్లు ఉన్నాయి. ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లకు రుణపరిమితిని పెంచింది. గతంలో రూ.35 వేల నుంచి 45 వేల వరకు అందించేవారు. ఇప్పుడు ఎస్సీలకు రూ.లక్ష, బీసీలు, ఇతరులకు రూ.75 వేలు, ఎస్టీలకు రూ.1.5 లక్షలు రుణంగా ఇస్తున్నారు. సిమెంటు, స్టీలు ధరలు విపరీతంగా పెరి గిపోవడంతో సర్కారు ఇచ్చే డబ్బులు ఇళ్ల నిర్మాణానికి సరిపోవడం లేదని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో చాలామంది ఇళ్ల నిర్మాణానికి వెనుకంజ వేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కావడంతోనే ఉన్న ఇళ్లను కూల్చేసి ఆశ్రయం కోల్పోయిన కుంటుబాలు ఎన్నో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు నెలవారీగా 9,986 ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్దేశించగా జిల్లాలో 5,288 మాత్రమే పూర్తిచేశా రు. ఇళ్ల మంజూరు మొదలుకొని సిమెంటు బస్తాల పంపిణీ, బిల్లు విడుద ల కోసం దళారుల ప్రమేయంతో ముడుపులు ముట్టజెప్పనిదే పనికావడం లేదని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. రూ. 4 వేల నుంచి రూ. 5 వేల వర కు లంచాల రూపంలో చెల్లించాల్సి వస్తోందంటున్నారు. ఇళ్లు నిర్మించుకోకుండానే.. పాత ఇంటిని చూపించి బిల్లులను స్వాహా చేస్తున్న వారూ ఉన్నారు. అధికార పార్టీ నేతల అండతో ఈ స్వాహా పర్వం నడుస్తోంది. 53 వేల ఇళ్ల రద్దుకు యోచన జిల్లాలో ఇప్పటి వరకు ఇళ్ల నిర్మాణం చేపట్టని లబ్ధిదారుల దరఖాస్తులను రద్దు చేసేందుకు గృహ నిర్మాణ శాఖ కసరత్తు చేస్తోంది. రుణాలు మంజూరైనా నిర్మాణం మొదలు పెట్టని ఇళ్లు 31,867 ఉన్నాయి. ఇంకా గృహ నిర్మాణ శాఖలో రిజిష్టర్ కాని దరఖాస్తులు 21,149 వరకు ఉన్నా యి. ఈ దరఖాస్తులను నమోదు చేయటానికి సమయం ఇచ్చినప్పటికీ లబ్ధిదారులు సరైన అర్హత పత్రాలను అందజేయడం లేదని అధికారులు తెలిపారు. రద్దు చేసే యోచనలో అధికారులు ఉన్నారు. మూడవ విడత రచ్చబండలో వచ్చిన 48 వేల దరఖాస్తులను పరిశీలించి ఇందులో అర్హులైన వారికి ఇళ్లు మంజూరు చేయాలని అధికారులు భావిస్తున్నారు. -
అసంపూర్తి ఇందిరమ్మ ఇళ్లు రద్దు
కెరమెరి, న్యూస్‌లైన్ : అసంపూర్తిగా ఉన్న ఇందిరమ్మ ఇళ్లు రద్దు చేసి కొత్తగా మంజూరు చేస్తామని, స్వయంగా నిర్మించుకోవాలని ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్ అన్నారు. గురువారం ఆయన మండలంలోని పిట్టగూడ(కే) గ్రామాన్ని సందర్శించారు. గ్రామ సమస్యలపై పటేల్ మెంగును అడిగి తెలుసుకున్నారు. 2007లో 18 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా వాటి ఆనవాళ్లు లేకపోవడం, లబ్ధిదారులకు తెలియకుండానే రూ.26,200 డ్రా చేసినట్లు రికార్డుల్లో ఉండడంపై పీవో గ్రామస్తులను ప్రశ్నించారు. అర్ధంతరంగా నిలిచిన నిర్మాణాలపై గృహ నిర్మాణ శాఖ వర్క్ఇన్స్పెక్టర్ అధికారి నిరల్ను అడిగారు. సంతృప్తికరమైన సమాధానం రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. పీటీజీ కోటా కింద ఇళ్లు మంజూరు చేస్తామని, కాంట్రాక్టర్లకు ఇవ్వకుండా లబ్ధిదారులే కట్టుకోవాలని సూచించారు. రోడ్డు సౌకర్యం లేదని, చెలిమెల నీరు తాగుతున్నామని గిరిజనులు చెప్పగా.. నీటి వసతి కల్పించాలని ఆర్డబ్ల్యూఎస్ ఏఈ మతిన్‌ను ఆదేశించారు. ఎంతమంది చదువుకున్నారు, రేషన్‌కార్డులు ఎందరికి ఉన్నాయి, గ్రూపుల్లో ఎన్ని డబ్బులు పొదుపు చేశారు, బ్యాంకు రుణాలు, ఉపాధి హామీ పనులపై ఆరా తీశారు. మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.10వేల చొప్పున మంజూరు చేస్తామని చెప్పారు. ఎడ్లజతలు మంజూరు చేయాలని, పింఛన్ రావడం లేదని వికలాంగులు పీవో దృష్టికి తీసుకెళ్లారు. మంగళవారం ఉట్నూర్‌కు వస్తే ఆదిలాబాద్‌లోని సదరం క్యాంపునకు తీసుకెళ్లి ధ్రువీకరణ పత్రాలు ఇప్పిస్తామని పేర్కొన్నారు. ఉపాధ్యాయుడిపై ఆగ్రహం ఉపాధ్యాయుడు పాఠశాల సక్రమంగా హాజరు కాకపోవడంపై పీవో జనార్దన్ నివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారానికోసారి ఉపాధ్యాయుడు వస్తారని గ్రామస్తులు తెలిపారు. విద్యావాలంటీరు జైతు పాఠాలు బోధిస్తారని పేర్కొన్నారు. దీంతో ఎంఈవో మల్లయ్యను వివరాలు అడిగారు. ఇంట్లోనే ఉండమని చెప్పండి అంటూ మండిపడ్డారు. పాఠశాల భవనం మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆయన వెంట సర్పంచ్ భీము, తహశీల్దార్ రవిచంద్రారెడ్డి, ఏంపీడీవో సాజిద్ అలీ, ఎంఈవో మల్లయ్య, హౌసింగ్ ఏఈ సత్యనారాయణ, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ మతిన్‌అహ్మద్, అధికారులు ఆత్మారాం, ప్రేంసింగ్ పాల్గొన్నారు. -
పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లకు... ఒక్క రోజులోనే బిల్లుల చెల్లింపు
కొత్తగూడెం రూరల్, న్యూస్‌లైన్: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు ఒక్క రోజులోనే బిల్లులు చెల్లిస్తున్నట్టు జిల్లా గృహ నిర్మాణ శాఖ పీడీ వైద్యం భాస్కర్ తెలిపారు. ఆయన శనివారం కొత్తగూడెంలోని గృహ నిర్మాణ శాఖ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. గతంలో బిల్లులు రావడానికి 25 రోజులు పట్టిందన్నారు. ఈ జాప్యాన్ని ప్రస్తుతం పూర్తిగా తొలగించామన్నారు. ఇందిరమ్మ లబ్ధిదారులు బిల్లు కోసం దరఖాస్తు చేసుకునేప్పుడు తమ పేరు, బ్యాంక్ అకౌంట్ నంబర్, ఐఎఫ్‌సీ కోడ్ నంబర్ సరిగా ఉన్నాయా లేదో సరిచూసుకోవాలన్నారు. ఇవి సక్రమంగా ఉన్నట్టయితే.. గృహ నిర్మాణ శాఖ డీఈలు బిల్లులు జనరేట్ చేసిన 24 గంటల్లో బ్యాంక్ అకౌంట్లో నేరుగా చేరతాయని అన్నారు. జిల్లాలో నాలుగు నిర్మిత కేంద్రాల ద్వారా ఇళ్ల నిర్మాణాల వేగవంతానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 4.23 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయన్నారు. వీటిలో 2.10 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, వీటికిగాను 881 కోట్ల రూపాయలు చెల్లించామని అన్నారు. ఇప్పటివరకూ నిర్మాణం చేపట్టని ఇళ్లు లక్ష వరకు ఉన్నాయని, మిగతావి నిర్మాణ దశలో ఉన్నాయని వివరించారు. ఈ ఏడాది మార్చి బడ్జెట్ లోపు ఇళ్ల నిర్మాణం పూర్తిచేసుకోవాలని లబ్ధిదారులను కోరారు. జిల్లాలోని గృహ నిర్మాణ శాఖ కింద 21,758 మరుగుదొడ్లు మంజూరైనట్టు, వీటిని మండలానికి 500 చొప్పున కేటాయించినట్టు చెప్పారు. గ్రామ పంచాయతీ తీర్మానిస్తే ఇందిరమ్మ లబ్ధిదారులకు మరుగుదొడ్లు మంజూరవుతాయన్నారు. కొత్తగూడెం, పాల్వంచ తదితర ప్రాంతాలలో లబ్ధిదారుల సంరక్షణ కేంద్రం (బెనిఫీషియర్స్ కేర్ సెంటర్) ద్వారా వారి (లబ్ధిదారుల) సమస్యలకు పరిష్కారం చూపుతున్నామని అన్నారు. ఇళ్లు మంజూరైన లబ్ధిదారులకు ఇసుక కూపన్లను స్టేజీవారిగా ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. అవకతవకలకు పాల్పడిన అధికారులు, వర్క్ ఇన్స్పెక్టర్లపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
11 నుంచి మూడో విడుత రచ్చబండ
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ప్రభుత్వం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తోంది. నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, కొత్త రేషన్‌కార్డుల జారీ, పింఛన్ల పంపిణీకి మూడో విడత రచ్చబండలో పంపిణీకి రంగం సిద్ధం చేస్తోంది. ముందుచూపుతో దరఖాస్తుదారుల నుంచి వ్యతిరేకత రావద్దనే ఉద్దేశంతో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈనెల 11 నుంచి 26వ తేదీ వరకు నిర్వహించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అధికారులు జాబితా తయారీలో నిమగ్నమయ్యారు. మహానేత వైఎస్సార్ మరణానంతరం కొత్త రేషన్‌కార్డుల జారీని ప్రభుత్వం నిలిపివేసింది. ఈ నాలుగేళ్ల నుంచి నూతన కార్డుల జారీ లేకపోవడంతో జిల్లా వ్యాప్తంగా సుమారు 70 వేల వరకు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే రెండు విడుతల రచ్చబండ కార్యక్రమం ద్వారా సుమారు 90 వేల అర్జీలు వచ్చాయి. క్షుణ్ణంగా పరిశీలించి 22 వేల మంది లబ్ధిదారులకు మాత్రమే ప్రభుత్వం కార్డులు జారీ చేసింది. మిగతా వారికి మంజూరు చేయలేదు. కాగా, మూడో విడత రచ్చబండలో 45,294 కొత్త రేషన్‌కార్డులు. 11,210 పింఛన్ల పంపిణీ, 11,210 మందికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు, 28,603 మంది విద్యుత్ వినియోగదారుల బకాయిల మినహాయింపు చేయాలని ప్రభుత్వం చూస్తోంది. ఎస్సీ, ఎస్టీలనూ ఆకట్టుకునే యత్నం జిల్లాలో కొంతకాలంగా నెలకొన్న పరిస్థితులు అధికార పార్టీకి కలిసి రావడం లేదు. సాధారణ ఎన్నికలకు ముందు ఎస్సీ, ఎస్టీలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే జిల్లాలో 50 యూనిట్ల కన్నా తక్కువగా విద్యుత్ వినియోగిస్తున్న ఎస్సీ, ఎస్టీల బకాయిలు ప్రభుత్వమే చెల్లించేందుకు సిద్ధమైంది. ఇందుకు రూ.15.97 కోట్ల జారీకి ఉత్తర్వులు వెలువర్చినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 28,603 మంది ఎస్సీ, ఎస్టీ విద్యుత్ వినియోగదారులకు ఈ మినహాయింపు వర్తించనుంది. మూడేళ్ల క్రితం వికలాంగత్వం తక్కువగా ఉందని పింఛన్లను ప్రభుత్వం ఏరివేసింది. ఫలితంగా సదరమ్ క్యాంపు సర్టిఫికెట్లో 40 శాతం వికలాంగత్వం ఉంటేనే పింఛన్‌కు అర్హులని మెలిక పెట్టింది. దీంతో అర్హులైన వికలాంగులు పింఛన్‌ను కోల్పోయారు. రెండు విడతలుగా నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో సుమారు 61 వేల దరఖాస్తులు వచ్చాయి. ఈ రచ్బబండ ద్వారా 11,210 మందికి పింఛన్ల పంపిణీ చేయనున్నారు. రచ్చబండ షెడ్యూల్ ఇదే.. రచ్చబండ నిర్వహణకు మండలాల వారీగా షెడ్యూల్ ఖరారైంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు లేదా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కార్యక్రమం నిర్వహిం చాలి. కళాశాల ఆవరణలు, మార్కెట్‌యార్డులు, ప్రభు త్వ అతిథిగృహాలు, మున్సిపల్, ఎంపీడీవో కార్యాలయాలు, పాఠశాల ఆవరణల్లో రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ నెల 11న వాంకిడి, బోథ్, 12న జైనూర్, తలమడుగు, కుంటాల, 13న మంచిర్యాల, భైంసా (అర్బన్), భైంసా, సిర్పూర్(టి), 14న జైనథ్, 15న బెల్లంపల్లి, ఇచ్చోడ, మంచిర్యాల (అర్బన్), కుంటాల, 16న ఆదిలాబాద్, రెబ్బెన, తాండూర్, కుభీర్, బెజ్జూర్, 18న బేల, ఆసిఫాబాద్, కాసిపేట, బజార్హత్నూర్, ఉట్నూర్, దహెగాం, 19న నెన్నెల, తాంసి, చెన్నూర్, లోహేస్రా, కాగజ్‌నగర్, 20న తిర్యాణి, వేమనపల్లి, నేరడిగొండ, మందమర్రి, మందమర్రి(అర్బన్), ఇంద్రవెల్లి, దండేపల్లి, తానూర్, దిలావర్పూర్, కాగజ్‌నగర్ (అర్బన్), 21న నార్నూర్, భీమిని, గుడిహత్నూర్, కోటపల్లి, ఖానాపూర్, లక్సెట్టిపేట, ముధోల్, మామడ, 22న బెల్లంపల్లి (అర్బన్), జైపూర్, కడెం, లక్ష్మణచాంద, 23న ఆదిలాబాద్ (అర్బన్), కెరమెరి, జన్నారం, నిర్మల్ (అర్బన్), 25న సిర్పూర్(యు), సారంగపూర్ మండలాల్లో రచ్చబండ కార్యక్రమం జరుగనుంది. -
రెండు లక్షల మందికి ‘రచ్చబండ’ ఫలాలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ఈ నెల 11 నుంచి జరగ నున్న మూడో విడత రచ్చబండ కార్యక్రమంలో దాదాపు 2 లక్షల మందికి ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, రేషన్‌కార్డులను జారీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ బి.శ్రీధర్ తెలిపారు. అర్హులను ఇదివరకే గుర్తించామని, తాజాగా రచ్చబండ కార్యక్రమంలో వీటిని పంపిణీ చేస్తామని చెప్పారు. గురువారం జిల్లా పరిషత్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈసారి మండలాన్ని యూనిట్‌గా పరిగణలోకి తీసుకొని రచ్చబండ నిర్వహిస్తున్నామని, దీంతో కేవలం మండల కేంద్రాల్లోనే కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఎంపికైన లబ్ధిదారులను మాత్రమే కార్యక్రమానికి ఆహ్వానించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. రచ్చబండ మొదటి, రెండో విడతల్లో వచ్చిన అర్జీలను పరిశీలించి.. అర్హులుగా తేలినవారికి తాజాగా ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, రేషన్‌కార్డులను అందజేయనున్నట్లు తెలిపారు. స్థానిక ప్రజా ప్రతినిధులతో చర్చించి వారి షెడ్యూల్‌కు అనుగుణంగా మండల కేంద్రాల్లో రచ్చబండ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈసారి రచ్చబండ కేవలం గతంలో గుర్తించిన లబ్ధిదారులకు పథకాల వితరణకు మాత్రమే ప్రభుత్వం నిర్దేశించిందని కలెక్టర్ పేర్కొన్నారు. దీంతో కేవలం లబ్ధిదారుల వరకే రచ్చబండను పరిమితం చేసినట్లు స్పష్టంచేశారు. కొత్త రేషన్‌కార్డుదారులు డిసెంబర్ నెల నుంచి సరుకులు పొందవచ్చని, వీరికి తొలుత కూపన్లను జారీ చేస్తామని, ఏడు నెలల తర్వాత కార్డులను పంపిణీ చేస్తామని తెలిపారు. పింఛన్లను వచ్చే నెల నుంచి అమలు చేస్తామని, అక్టోబర్, నవంబ ర్ నెలకు సంబంధించిన పింఛన్ కూడా జమ చేస్తామని కలెక్టర్ శ్రీధర్ వెల్లడించారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల యూనిట్ విలువను ప్రభుత్వం పెంచిందని, ఎస్సీలకు రూ. లక్ష, ఎస్టీలకు రూ.1.05 లక్షలను విడుదల చేయనున్నట్లు చెప్పారు. 20 నుంచి 29 శాతం వికలత్వం ఉన్నవారికీ నెలకు రూ.200 పింఛన్ వర్తింపజే స్తామన్నారు. ప్రత్యేక సదరమ్ శిబిరాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందిరమ్మ కలలు పథకం కింద జిల్లావ్యాప్తంగా కొత్తగా మంజూరైన ఆరు బాలికల హాస్టళ్లు, 20 కమ్యూనిటీ హాళ్లు, ఒక ఇంటెగ్రేటెడ్ హాస్టల్‌కు శంకుస్థాపనలు చేయనున్నట్లు శ్రీధర్ తెలిపారు. అలాగే 50 యూనిట్లు ఉచిత విద్యుత్ పథకం కింద ఎస్సీలకు రూ.6.40 కోట్లు, ఎస్టీ కుటుంబాలకు రూ.3.89 కోట్ల బకాయిలను ప్రభుత్వం విడుదల చేసినట్లు ఆయన వివరించారు. నియోజకవర్గాలవారీగాసమావేశాలు నిర్వహించాలి మూడోవిడత రచ్చబండ కార్యక్రమంపై నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించాల్సిందిగా కలెక్టర్ బి.శ్రీధర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేయాలని సూచించారు. రచ్చబండ కార్యక్రమ ఏర్పాట్లపై గురువారం జిల్లాపరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యేలతో కలిసి ప్రత్యేకాధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో సమీక్షించారు. నియోజకవర్గ స్థాయి సమావేశాల్లో రేషన్ కూపన్లు, పింఛన్లు, ఇళ్ల స్థలాలకు సంబంధించి మంజూరు పత్రాలు అందజేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక కింద మంజూరైన వసతిగృహలు, కమ్యూనిటీ గదులు, హాస్టల్ భవనాల శంకుస్థాపనతో పాటు, రాయితీ పథకాల కింద లబ్ధిదారులకు ఫలాలు అందజేయనున్నట్లు చెప్పారు. కాగా రేషన్ కార్డుల్లో పేర్లు తప్పుగా ప్రచురితం కావడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని పరిగి ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి ప్రస్తావించగా కలెక్టర్ స్పందిస్తూ సవరణ నిమిత్తం ప్రత్యేక కమిటీని ప్రభుత్వం నియమించిందన్నారు. గత రచ్చబండలో చాలా దరఖాస్తులకే మోక్షం లేదంటూ తాండూరు ఎమ్మెల్యే మహేందర్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేయగా, మూడోవిడత రచ్చబండ కార్యక్రమంలో వారికి మంజూరు ఇస్తామని కలెక్టర్ వివరించారు. సమావేశంలో ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కూన శ్రీశైలం, రాజిరెడ్డి, ప్రకాష్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించకపోతే.. అనుమతి రద్దు
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనప్పటికీ ఇప్పటివరకు నిర్మాణం ప్రారంభించని లబ్ధిదారులను గుర్తించి, వారికి ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని అధికారులను కలెక్టర్ శ్రీని వాస శ్రీనరేష్ ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంపై ఆయన మంగళవారం కలెక్టరేట్లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ... ఇళ్ల నిర్మాణం చేపట్టని లబ్ధిదారులను గుర్తించి, వారికి ఇచ్చిన అనుమతిని రద్దు చేసేందుకు చర్యలు చేపట్టాలని, వారి స్థానంలో ఇతరులకు అవకాశమివ్వాలని ఆదేశించారు. నిర్మా ణం పూర్తిచేసిన లబ్ధిదారులకు వెంటనే బిల్లు లు చెల్లించాలన్నారు. ఆన్లైన్ నమోదులో తప్పులు దొర్లడంతో అనేకమంది లబ్ధిదారులు ప్రభుత్వ ఆర్ధిక సహాయం పొందలేకపోతున్నారని చెప్పారు. పినపాక, దమ్మపేట, పెనుబల్లి మండలాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉందన్నారు. దీనిని పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లు.. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ లక్ష్యాలను సకాలంలో పూర్తిచేసి, జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమంగా నిలిపేందుకు హౌజింగ్, డ్వామా, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సమన్వయంతో పని చేయాలని కోరారు. జిల్లాలో చాలామంది పేదలు ఇంటి నిర్మాణ మంజూరు ఉత్తర్వులు రాకుండానే నిర్మాణలు చేపట్టారని, వీటికి బిల్లులు చెల్లించాలని ‘గ్రీవెన్స్ డే’లో అర్జీలు ఇస్తున్నారని చెప్పారు. ఈ అర్జీలను పరిశీ లించి, పేపర్ వర్క్ పూర్తి చేసి సిద్ధంగా ఉంచాలని చెప్పారు. వీరికి ప్రభుత్వం అనుమతిస్తే వెంటనే వీరికి ఆర్ధిక సహాయం అందించవచ్చని అన్నారు. ఇక నుంచి నూతన గృహాలను మంజూరు చేసే సమయంలో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునేలా చూడాలన్నారు. మరుగుదొడ్ల నిర్మాణానికి హౌజింగ్ అధికారులదే బాధ్యతని అన్నారు. నిర్మల్ భారత్ అభియాన్ కింద ఇప్పటివరకు 20వేల వ్యక్తిగత మరుగుదొడ్లు పూర్తయ్యాయని చెప్పారు. మి గతా వాటిని సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఇళ్లు, మరుగుదొడ్ల ని ర్మాణానికి అవసరమైన ఇసుకను తరలిం చేందుకు పోలీసులు అభ్యంతరం చెబుతున్నారని, జరిమానా విధిస్తున్నారని ఈజీఎస్, ఆర్డబ్ల్యూఎస్, హౌజింగ్ అధికారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఈ విషయాన్ని డీఈలు, ఏఈలు, ఆర్డీవోలు, తహశీల్దారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కలెక్టర్ సూచిం చారు. ఈ సమావేశంలో హౌజింగ్ పీడీ వైద్యం భాస్కర్, డ్వామా పీడీ శ్రీనివాసులు, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ మల్లేశం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఇసుక పోటు
జెడ్పీసెంటర్, న్యూస్‌లైన్: రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ఏఈ కార్యాలయాలకు ఇసుకదెబ్బ తగిలింది. ఇసుక కొరత కారణంగా జిల్లాలో ఏఈ కార్యాలయాల నిర్మాణ పనులు ముందుకుసాగడం లేదు. జులై నాటికి నిర్మాణాలు పూర్తిచేయాలని భావించినా ఇసుక దొరక్కపోవడంతో పనుల్లో జాప్యం నెలకొంది. దీనికితోడు సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 12వ తేదీ వరకు ఈ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మాసోత్సవాలు కూడా పనులకు అడ్డంకిగా మారాయి. దీంతో ఆ నెలరోజుల పాటు నిర్మాణపనులు నిలిచి పోయినట్లు తెలుస్తోంది. ఇదే కాకుండా కొన్ని మండలాల్లో కార్యాలయాల నిర్మాణానికి స్థలభావం కూడా ఓ సమస్యగా మారింది. జిల్లాలో ప్రతి మండలానికి ఒక ఏఈ కార్యాలయాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం శ్రీకారంచుట్టింది. జిల్లాలో 64 మండలాలకు ఒక్కో ఏఈ కార్యాలయ నిర్మాణం చేపట్టింది. ముందుగా 55 మండలాల్లో ఈ కార్యాలయాలను నిర్మిం చేందుకు జిల్లా అధికారులు పనులు చేపట్టి..ఇప్పటివరకు 36 కార్యాలయాల నిర్మాణపనులు పూర్తిచేశారు. ఇంకా 19 కార్యాలయ భవనాలు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. ఇంకా కొన్ని స్థలాలు లేక నిర్మాణ పనులు ప్రారంభంకాలేదు. హన్వాడ మండలంలో స్థలం లేక నిర్మాణం చేపట్టలేదని తెలుస్తోంది. చాలాచోట్ల బేస్ లెవల్, లెంటల్ లెవెల్ వరకు వచ్చి ఇసుక కొరతతో మధ్యలోనే ఆగిపోయాయి. ప్రజలకు మరింత చేరువలో.. సేవలు ప్రజలకు మరింత చేరువచేసేందుకు ప్రతి మండలానికి ఒక ఏఈ కార్యాలయాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ముఖ్యంగా మండలాల్లో ప్రత్యేకించి ఈ శాఖకు కార్యాలయం లేకపోవడంతో గ్రామీణప్రాంత లబ్ధిదారులు ఇబ్బందులు పడేశారు. బిల్లుల కోసం ఎక్కడికి వెళ్లాలో తెలిసేదికాదు. వారి ఇబ్బందులను తొలగించేందుకు ప్రతి మండలంలో ఏఈ కార్యాల యాన్ని నిర్మించతలపెట్టారు. ఇందుకో సం జిల్లాకు రూ.1.30కోట్లు మంజూరయ్యాయి. ఇందిరా ఆవాస్ పథకం ద్వారా వీటిని నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. 70 గజాలు, 20/20 వ్యాసార్థం గల స్థలంలో రెండు రూమ్‌లతో కూ డిన కార్యాలయాన్ని నిర్మించనున్నారు. ఇందిరమ్మ ఇల్లు ఎలా ఉండాలో ప్రజల కు తెలియజెప్పేందుకు మాడల్ ఈ కార్యాలయాలకు శ్రీకారం చుట్టారు. ఒక్కో కార్యాలయాన్ని రూ.2.20 లక్షలతో నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిం చారు. దీంతో పాటు ఫర్నీచర్ ఏర్పాటుకోసం రూ.20 లక్షలు మంజురు చేయనున్నారు. ప్రతి కార్యాలయానికి రూ.30వేల చొప్పన కేటాయించనున్నారు. గృహ నిర్మాణశాఖ ద్వారా లబ్ధిదారులు ఇళ్లను ఎలా నిర్మించుకోవాలో తెలియజేసేం దుకు ఈ ఇళ్లకు మాడల్‌గా నిర్మించాలని అధికారులు భావిస్తున్నారు. 70 గజాల స్థలంలో ఎలా నిర్మించుకోవాలో ప్రజల కు తెలియజేస్తున్నారు.