Jahnavi
-
జాహ్నవిపై అనుచిత వ్యాఖ్యలు..ఆ పోలీసు తొలగింపు
న్యూయార్క్/సియాటెల్: అమెరికాలోని సియాటెల్‌లో గతేడాది తెలుగు విద్యార్థిని కందుల జాహ్నవి(23) పోలీసు వాహనం ఢీకొట్టడంతో ప్రాణాలు కోల్పోవడం తెల్సిందే. ఆమెకు పెద్దగా విలువేమీ లేదనేలా డేనియల్ ఆడెరర్ అనే పోలీసు అధికారి చేసిన అనుచిత వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అవి జాహ్నవి కుటుంబానికి ఎంతో వేదన కలిగించి ఉంటాయని దీనిపై విచారణ చేపట్టిన అధికారి స్యూ రాహ్ర్ అన్నారు. అడెరర్ అమానవీయ వైఖరి పోలీసు వృత్తికే కళంకం తెచ్చిపెట్టిందన్నారు. ‘‘ఇలాంటి అధికారిని ఇంకా కొనసాగనీయడం మొత్తం పోలీసు విభాగానికే అవమానకరమవుతుంది. అందుకే ప్రజల్లో విశ్వాసం పాదుకొల్పేందుకు అతడిని విధుల నుంచి తొలగిస్తున్నాం’ అని ప్రకటించారు. కారును వేగంగా నడిపిన మరో అధికారి కెవిన్ డేవ్‌పై నేరారోపణలను నమోదు చేయలేమంటూ కింగ్ కౌంటీ అధికారులు ఈ ఏడాది జనవరిలో స్పష్టం చేశారు. అయితే, ఈ నేరం కింద డేవ్‌కు 5 వేల డాలర్ల జరిమానా విధిస్తూ సియాటెల్ సిటీ అటార్నీ తీర్పు వెలువరించారు. -
కొత్తింట్లోకి అడుగుపెట్టిన 'మహాతల్లి'.. ఎమోషనల్ పోస్ట్
'మహాతల్లి' జాహ్నవి నూతన ఇంట్లోకి గృహప్రవేశం చేసింది. తన భర్తతో కలిసి కొత్తింట్లో కుడికాలు పెట్టింది. డ్రీమ్ హౌస్‌లో పాలు పొంగించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ భావోద్వేగానికి లోనైంది. 'నాలుగు సంవత్సరాల క్రితం సుశాంత్, నేను కొత్తింటి కోసం వెతకడం ప్రారంభించాము. కొంతకాలానికే మాకు పర్ఫెక్ట్గా సరిపోతుందనుకునే ఇల్లు దొరికేసింది.నా వల్ల అవుతుందా?నా కుక్కపిల్లలు ఆడుకోవడానికి, అటూఇటూ పరిగెత్తడానికి అవసరమయ్యేంత పెద్ద స్థలం ఉంది. మేము ఇల్లు కొనాలని అనుకున్నప్పటి నుంచి ఎన్నోసార్లు ఇది మావల్ల అయ్యే పని కాదేమోనని మథనపడ్డాం. ఆ సమయంలో నా బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ నాకు అండగా నిలబడ్డారు. ఇప్పుడు కొత్తిల్లు సొంతమవుతుంటే అంతా ఏదో కలలా అనిపిస్తోంది' అని క్యాప్షన్‌లో రాసుకొచ్చింది. ఏప్రిల్ 19న గృహప్రవేశం చేసినట్లు పేర్కొంది. ఎవరీ జాహ్నవి?కర్నూలుకు చెందిన తెలుగమ్మాయి జాహ్నవి. నిఫ్ట్‌లో ఫ్యాషన్ టెక్నాలజీ చదివిన ఆమె మొదట్లో షార్ట్ ఫిలిం డైరెక్టర్ హరీశ్ నాగరాజుతో కలిసి కొన్ని లఘుచిత్రాలకు పని చేసింది. అలా మహాతల్లి- మహానుభావుడు అనే వెబ్‌సిరీస్‌లో నటించింది. ఇది ఎంతలా క్లిక్ అయిందంటే జాహ్నవి మహాతల్లి పేరిట సొంతంగా ఓ ఛానలే ప్రారంభించింది. వెబ్ సిరీస్‌లు చేస్తూ సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ బాగా పాపులర్ అయింది.అన్ని రకాల విషయాలపై తనదైన రీతిలో వీడియోలు చేస్తూ ఉంటుంది. లై, మెంటల్ మదిలో వంటి చిత్రాల్లోనూ నటించింది. కొన్నేళ్ల క్రితం సుశాంత్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అందరిలాగే ఈ జంట కూడా సొంతిల్లు ఉండాలని కల గనేవారు. తాజాగా ఆ కలను వీరు సాకారం చేసుకోవడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. View this post on Instagram A post shared by Jahnavi Dasetty (@mahathalli) చదవండి: వార్ 2 కోసం జూనియర్ ఎన్టీఆర్ కసరత్తులు.. అది లీక్ చేయొద్దనే.. -
Jahnavi Falki: 'సామాన్య శాస్త్రానికి' తను ఒక మారుపేరు!
సైన్స్‌ను సామాన్యుల దగ్గరికి తీసుకుపోవడానికి ‘బెంగళూరు సైన్స్ గ్యాలరీ’ ద్వారా ప్రయత్నిస్తోంది జాహ్నవి ఫాల్‌కి. ‘సైంటిఫిక్ స్టోరీ టెల్లర్’గా దేశవిదేశాల్లో పేరు తెచ్చుకున్న జాహ్నవి సైన్స్‌కు సంబంధించిన డాక్యుమెంటరీలు తీసింది. పుస్తకాలు రాసింది. ‘అడగడం’ ‘తెలుసుకోవడం’ అనే ప్రక్రియ జాహ్నవికి ఎంతో ఇష్టమైనది. ఆమెకు బాగా నచ్చే మాట.. రైట్ క్వశ్చన్. రిసెర్చ్ వర్క్ నుంచి కెరీర్‌కు సంబంధించి డైరెక్షన్‌ను మార్చుకోవడం వరకు ‘రైట్ క్వశ్చన్’ అనేది ఆమెకు ఎంతో ఉపయోగపడింది. అమెరికాలోని జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరకు తీసుకెళ్లింది. అక్కడ భారతదేశ శాస్త్ర సాంకేతిక చరిత్రను అధ్యయనం చేసింది. ఆ చరిత్రపై బాగా ఇష్టాన్ని పెంచుకుంది. తాను తెలుసుకున్న విషయాలను, తన అభిప్రాయాలను నలుగురితో పంచుకోవడానికి వివిధ మాధ్యమాలను ఎంచుకుంది. 'బాంబే యూనివర్శిటీ’లో సివిక్స్ అండ్ పాలిటిక్స్ చదువుకున్న జాహ్నవి ‘జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’లో సైన్స్ అండ్ టెక్నాలజీ హిస్టరీలో డాక్టరేట్ చేసింది. సామాజిక శాస్త్రాల అధ్యయనం ద్వారా సామాజిక కోణంలో సైన్స్‌ను అర్థం చేసుకుంది. ఆమె మాటల్లోనే చెప్పాలంటే ‘సైన్స్ అనేది ఒంటరి కాదు’ సైన్స్‌ను ప్రభావితం చేసే అంశాలు సమాజంలో ఎన్నో ఉంటాయి. ఆ అంశాలకు సైన్స్‌కు మధ్య ఉండే అంతః సంబంధాన్ని లోతుగా అధ్యయనం చేసింది. ‘ఆటోమిక్ స్టేట్ బిగ్ సైన్స్ ఇన్ ట్వంటీయత్ సెంచరీ ఇండియా సైన్స్’ పుస్తకం జాహ్నవికి ఎంతో పేరు తెచ్చింది. ‘కీ కాన్సెప్ట్స్ ఇన్ మోడ్రన్ ఇండియన్ స్టడీస్’కు కో–ఎడిటర్‌గా వ్యవహరించింది. ‘సైక్లోట్రాన్’ పేరుతో సైన్స్ డాక్యుమెంటరీ తీసింది. సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా కథలు చెప్పడం తనకు ఇష్టమైన పని. ‘మెనూ గురించి తెలుసుకోవాలంటే మనం మొదట ఉండాల్సింది టేబుల్ దగ్గర’ అంటున్న జాహ్నవి ‘సైన్స్’ అనే మెనూ గురించి తెలుసుకోవడానికి ‘సైన్స్ గ్యాలరీ’ అనే టేబుల్ దగ్గరికి ప్రజలను తీసుకువస్తుంది. లండన్‌లోని కింగ్స్ కాలేజీ ఫ్యాకల్టీగా పనిచేసిన జాహ్నవి 2018లో ‘బెంగళూరు సైన్స్ గ్యాలరీ’ ఫౌండింగ్ మెంబర్‌గా నియమితురాలైంది. ఉరుకుల పరుగుల పోటీ ప్రపంచానికి కాస్త దూరంగా.. సృజనాత్మకంగా ఆలోచించేలా, సైన్స్‌కు దగ్గరయ్యేలా యువతను ఆకట్టుకోవడానికి ‘బెంగళూరు సైన్స్ గ్యాలరీ’ ద్వారా ప్రయత్నిస్తోంది జాహ్నవి. ‘మ్యూజియం’ వాతావరణం ఆమెకు కొత్త కాదు. ‘సైన్స్ మ్యూజియం లండన్’ ఎక్స్టర్నల్ క్యురేటర్‌గా పనిచేసి ఎన్నో అనుభవాలను సొంతం చేసుకుంది. ‘మా టార్గెట్ ఆడియెన్స్ పదిహేనేళ్ల పైబడిన వారు అయినప్పటికీ అండర్ గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లపై కూడా దృష్టి సారిస్తాం. అంతరిక్షానికి సంబంధించి సమకాలీన, భవిష్యత్ విషయాలపై దృష్టి పెట్టేలా గ్యాలరీ తోడ్పడుతుంది’ అంటుంది జాహ్నవి. శాస్త్రీయ విషయాలతో యువత మమేకం కావడానికి డిజిటల్ ఎగ్జిబిషన్ ద్వారా ప్రయత్నిస్తోంది జాహ్నవి. ‘బ్రేకింగ్ ది వాల్స్ బిట్విన్ సైన్స్ అండ్ కల్చర్’ శీర్షికతో నిర్వహించిన ఆన్లైన్ సైన్స్ గ్యాలరీకి కూడా మంచి స్పందన వచ్చింది. ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ జాహ్నవిని హ్యుమానిటీస్ విభాగంలో ‘ఇన్ఫోసిస్ ప్రైజ్’తో సత్కరించింది. సైన్స్‌ను జాహ్నవి అర్థం చేసుకున్న కోణాన్ని, చేపడుతున్న కార్యక్రమాలను ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ ప్రశంసించింది. ఇవి చదవండి: Ruchira Gupta: చీకటి కూపం నుంచి వెన్నెల దారుల్లోకి.. -
జాహ్నవి కేసు.. భారత్ కీలక ప్రకటన
సీటెల్: రోడ్డు ప్రమాదంలో భారతీయ విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన అధికారికి అక్కడి కోర్టు ఊరట ఇచ్చిన సంగతి తెలిసిందే. సరైన ఆధారాలు లేనందున ఆ అధికారిపై క్రిమినల్ అభియోగాలు మోపడం లేదని వాషింగ్టన్ స్టేట్‌లోని కింగ్ కౌంటీ ప్రాసిక్యూటర్ కార్యాలయం ప్రకటించింది. అయితే జాహ్నవి కందుల కేసులో భారత్ కీలక ప్రకటన చేసింది. తీర్పును సమీక్షించాలని కోర్టును ఆశ్రయించింది. ఈ విషయాన్ని సీటెల్‌లోని భారత దౌత్య కార్యాలయం ధృవీకరించింది. ‘‘దురదృష్టకర రీతిలో రోడ్డు ప్రమాదంలో మరణించిన జాహ్నవి కందుల కేసులో.. ఇటీవలె కింగ్ కౌంటీ అటార్నీ ప్రాసిక్యూషన్ దర్యాప్తు నివేదికను విడుదల చేసింది. అయితే ఈ విషయంలో బాధిత కుటుంబంతో టచ్‌లో ఉన్నాం. న్యాయం జరిగేంతవరకు అన్ని రకాలుగా సహకారం అందిస్తూనే ఉంటాం అని దౌత్య కార్యాలయం తెలిపింది. అంతేకాదు.. ఈ కేసులో తగిన పరిష్కారం కోసం సీటెల్ పోలీసులతో సహా స్థానిక అధికారులతో తాము సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. తీర్పుపై సమీక్ష కోసం ఇప్పటికే సీటెల్ సిటీ అటార్నీ కార్యాలయానికి సిఫార్సు చేశామని పేర్కొంది. సీటెల్ పోలీస్ విచారణ ముగింపు కోసం ఎదురు చూస్తున్నామని, అప్పటిదాకా కేసు పురోగతిని పరిశీలిస్తామని భారత దౌత్య కార్యాలయం వెల్లడించింది. On the recently released investigation report of the King County Prosecution Attorney on the unfortunate death of Jaahnavi Kandula, Consulate has been in regular touch with the designated family representatives and will continue to extend all possible support in ensuring justice… — India In Seattle (@IndiainSeattle) February 23, 2024 ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన కందుల జాహ్నవి(23) గ్రాడ్యుయేషన్ కోసం అమెరికా వెళ్లింది. కిందటి ఏడాది జనవరి 23వ తేదీ రాత్రి ఎనిమిది గంటల టైంలో ఇంటికి వెళ్లబోతూ రోడ్డు దాటుతున్న ఆమెను.. ఓ పోలీసు పెట్రోలింగ్ వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఆ వేగానికి వంద అడుగుల ఎత్తులో ఎగిరిపడి తీవ్రంగా గాయపడి జాహ్నవి మృతి చెందింది. ఆ టైంలో వాహనం నడుపుతున్న కెవిన్ డేవ్ అనే అధికారి నిర్లక్ష్యం వల్లే ఆమె ప్రాణం పోయిందని ఆ తర్వాతే తేలింది. ఇంకోవైపు.. ఇదీ చదవండి: జాహ్నవికి అన్యాయం.. కేటీఆర్ ఆవేదన సియాటెల్ పోలీస్ ఆఫీసర్స్ గిల్డ్ వైస్ ప్రెసిడెంట్ డేనియల్ ఆర్డరర్ జాహ్నవి మృతిపై చులకనగా మాట్లాడాడు. ప్రమాదం గురించి పైఅధికారికి సమాచారం చేరవేస్తూ.. ఆర్డరర్ నవ్వులు చిందించాడు. అంతేకాదు.. ఆమె(జాహ్నవి) జీవితానికి పరిమితమైన విలువ ఉందని.. పరిహారంగా కేవలం చెక్ ఇస్తే సరిపోతుందని.. చిన్న వయసులో ఆమె చనిపోయింది కాబట్టి 11 వేల డాలర్లు ఇస్తే సరిపోతుందని వెటకారంగా మాట్లాడాడు. ఈ వ్యవహారం వీడియోతో సహా బయటకు రావడంతో దుమారం రేగింది. అయితే తాను అవమానించేందుకు అలా మాట్లాడలేదంటూ తర్వాత వివరణ ఇచ్చుకున్నాడు ఆర్డరర్. అంతేకాదు.. జాహ్నవి మృతికి కారణమైన కెవిన్‌కు అనుకూలంగా.. తప్పంతా జాహ్నవిదే అన్నట్లు అధికారులకు నివేదిక ఇచ్చాడు కూడా. ఇక కెవిన్‌పై ఇప్పటికిప్పుడు క్రిమినల్ చర్యలు లేకపోయినా.. డిపార్ట్మెంట్ తరఫున చర్యలు ఉంటాయని అధికారులంటున్నారు. మార్చి 4వ తేదీన క్రమశిక్షణా కమిటీ ముందు కెవిన్ హాజరు కావాల్సి ఉంటుంది. అక్కడ అతని వివరణతో కమిటీ సంతృప్తి చెందకపోతే మాత్రం చర్యలు తప్పవు. -
జాహ్నవి మృతిపై అమెరికా కోర్టు తీర్పు.. స్పందించిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల మృతి మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ క్రమంలో అమెరికా కోర్టు ఇచ్చిన తీర్పు కామెంట్స్‌ను కేటీఆర్ ప్రస్తావిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో భారత్ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని సూచించారు. కాగా, మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..‘అమెరికాలో తెలుగు విద్యార్థిని జాహ్నవి కందులను తన వాహనంతో ఢీకొట్టి చంపిన అమెరికన్ పోలీస్‌పైన సరైన ఆధారాలు లేవంటూ అమెరికా కోర్టు వ్యాఖ్యలు చేసింది. అతడిపై ఎలాంటి చర్యలు ఉండబోవని తెలిపింది. ఈ అంశంలో అమెరికా రాయబార కార్యాలయం వెంటనే జోక్యం చేసుకొని అమెరికా ప్రభుత్వ వర్గాలతో మాట్లాడి జాహ్నవి కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలి. భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ వెంటనే ఈ అంశంలో జోక్యం చేసుకొని, అమెరికా ప్రభుత్వంతో మాట్లాడి స్వతంత్రంగా ఎలాంటి పక్షపాతం లేకుండా విచారణ జరిగేలా ఒత్తిడి తీసుకురావాలి. అనేక ఉన్నత లక్ష్యాలతో అమెరికా వెళ్లి ఈ ప్రమాదంలో చనిపోవడం అత్యంత విషాదకరం. అయితే ఆమెకి జరగాల్సిన న్యాయం జరగకుండా కేసు తేలిపోవడం అంతకన్నా బాధాకరం అని కామెంట్స్ చేశారు. Disgraceful & absolutely unacceptable ! I demand the @USAmbIndia to take up the matter with US Government authorities and deliver justice to the family of young Jaahnavi Kandula I request EA Minister @DrSJaishankar Ji to take up the matter with his counterpart & demand a… https://t.co/90pw59LtCo — KTR (@KTRBRS) February 22, 2024 ఇక, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన కందుల జాహ్నవి(23) గ్రాడ్యుయేషన్ కోసం అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. గతేడాది అమెరికా సియాటెల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో జాహ్నవి మృతి చెందింది. రోడ్డు దాటుతున్న ఆమెను.. పోలీస్ పెట్రోలింగ్ వాహనం వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మరణించింది. ఆ తర్వాత ఆమె మృతిపై అక్కడి పోలీసు అధికారి కెవిన్ డేవ్ చులకనగా మాట్లాడడం తీవ్ర విమర్శలకు దారితీసింది. దీనిపై తీవ్రంగా స్పందించిన భారత్.. ఆ అధికారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అమెరికాను కోరింది. స్థానిక మీడియా వెల్లడించిన కథనాల ప్రకారం.. ప్రమాదానికి అతివేగమే కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. ఆ రోజు ప్రమాదం జరిగిన సమయంలో కెవిన్ విధి నిర్వహణలోనే ఉన్నారు. ఆ రూటులో స్పీడ్ లిమిట్ 40 మైళ్లు మాత్రమే. కానీ, కెవిన్ తన కారును 100 మైళ్లకు పైగా వేగంతో నడిపారు. ఎమర్జెన్సీ హారన్ ఇవ్వలేదుగానీ.. లైట్లను వెలిగించుకుంటూ వెళ్లారు. అదే సమయంలో రోడ్డు దాటుతున్న జాహ్నవి.. అత్యంత వేగంతో కారు దూసుకురావడాన్ని అంచనా వేయలేకపోయారు. కారు నడుపుతున్న కెవిన్ డేవ్ కూడా జాహ్నవిని ఢీకొట్టడానికి ఒక్క సెకను ముందు మాత్రమే బ్రేకులు వేశాడు. కారు బలంగా ఢీకొట్టడంతో జాహ్నవి ఎగిరి 100 మీటర్లకు పైగా దూరంలో పడిపోయారని సీటెల్ పోలీసులు తమ నివేదికలో రిపోర్టులో పేర్కొన్నారు. -
కందుల జాహ్నవి కేసు.. ఇదెక్కడి న్యాయం?
కిందటేడాది తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల(23) అమెరికా సియాటెల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. రోడ్డు దాటుతున్న ఆమెను.. పోలీస్ పెట్రోలింగ్ వాహనం వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మరణించింది. ఆ తర్వాత ఆమె మృతిపై అక్కడి పోలీసు అధికారి ఒకరు చులకనగా మాట్లాడడం తీవ్ర విమర్శలకు దారితీసింది. దీనిపై తీవ్రంగా స్పందించిన భారత్.. ఆ అధికారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అమెరికాను కోరింది కూడా. అయితే తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమె మృతికి కారణమైన సదరు పోలీస్ అధికారిపై ఎలాంటి కేసు ఉండబోదని అక్కడి అధికార యంత్రాంగం ప్రకటించింది. బుధవారం వాషింగ్టన్ స్టేట్‌లోని కింగ్ కౌంటీ ప్రాసిక్యూటర్ కార్యాలయం ఈ మేరకు ప్రకటన చేసింది. కందుల జాహ్నవి మృతి ప్రపంచవ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురి చేసేదే అయినా.. ఆమె యాక్సిడెంట్ కేసులో సియాటెల్ పోలీస్ అధికారి కెవిన్ డేవ్‌కు వ్యతిరేకంగా సరిపడా ఆధారాలు లేవని, కాబట్టి.. ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి క్రిమినల్ చర్యలు ఉండబోవు’’ అని ఉన్నతాధికారులు అంటున్నారు. మరోవైపు.. ఈ ప్రకటనపై జాహ్నవి బంధువులు, పలువురు భారతీయ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదెక్కడి న్యాయమని ప్రశ్నిస్తున్నారు. ఆఫీసర్ కెవిన్ డేవ్ అతివేగంగా కారు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని తేలినప్పుడు చర్యలు ఎందుకు తీసుకోరని ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో ఆమె మృతిపై అవమానించేలా మాట్లాడిన అధికారి విషయంలోనూ చర్యలు ఏవని ప్రశ్నిస్తున్నారు. స్థానిక మీడియా వెల్లడించిన కథనాల ప్రకారం.. ప్రమాదానికి అతివేగమే కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. ఆ రోజు ప్రమాదం జరిగిన సమయంలో కెవిన్ విధి నిర్వహణలోనే ఉన్నారు. ఆ రూటులో స్పీడ్ లిమిట్ 40 మైళ్లు మాత్రమే. కానీ, కెవిన్ తన కారును 100 మైళ్లకు పైగా వేగంతో నడిపారు. ఎమర్జెన్సీ హారన్ ఇవ్వలేదుగానీ.. లైట్లను వెలిగించుకుంటూ వెళ్లారు. అదే సమయంలో రోడ్డు దాటుతున్న జాహ్నవి.. అత్యంత వేగంతో కారు దూసుకురావడాన్ని అంచనా వేయలేకపోయారు. కారు నడుపుతున్న కెవిన్ డేవ్ కూడా జాహ్నవిని ఢీకొట్టడానికి ఒక్క సెకను ముందు మాత్రమే బ్రేకులు వేశాడు. కారు బలంగా ఢీకొట్టడంతో జాహ్నవి ఎగిరి 100 మీటర్లకు పైగా దూరంలో పడిపోయారని సీటెల్ పోలీసులు తమ నివేదికలో రిపోర్ట్ లో పేర్కొన్నారు. అయితే కెవిన్‌పై క్రిమినల్ చర్యలు లేకపోయినా.. డిపార్ట్మెంట్ తరఫున చర్యలు ఉంటాయని అధికారులంటున్నారు. మార్చి 4వ తేదీన క్రమశిక్షణా కమిటీ ముందు కెవిన్ హాజరు కావాల్సి ఉంటుంది. అక్కడ అతని వివరణతో కమిటీ సంతృప్తి చెందకపోతే మాత్రం చర్యలు ఉంటాయని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన కందుల జాహ్నవి(23) గ్రాడ్యుయేషన్ కోసం అమెరికా వెళ్లింది. కిందటి ఏడాది జనవరి 23వ తేదీ రాత్రి ఎనిమిది గంటల టైంలో రోడ్డు దాటుతున్న ఆమెను.. ఓ పోలీసు వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టి మృతి చెందింది. కెవిన్ డేవ్ అనే అధికారి నిర్లక్ష్యం వల్లే ఆమె ప్రాణం పోయిందని ఆ తర్వాతే తేలింది. అయితే.. ఈ ఘటన గురించి సమాచారం అందించిన తరుణంలో ఓ అధికారి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. Recent reports including in media of the handling of Ms Jaahnavi Kandula’s death in a road accident in Seattle in January are deeply troubling. We have taken up the matter strongly with local authorities in Seattle & Washington State as well as senior officials in Washington DC — India in SF (@CGISFO) September 13, 2023 సియాటెల్ పోలీస్ ఆఫీసర్స్ గిల్డ్ వైస్ ప్రెసిడెంట్ డేనియల్ ఆర్డరర్ ఆమె మృతిపై చులకనగా మాట్లాడాడు. గిల్డ్ ప్రెసిడెంట్ మైక్ సోలన్‌కు ప్రమాదం గురించి సమాచారం అందిస్తూ.. ఆర్డరర్ నవ్వులు చిందించినట్టు రికార్డయింది. అంతేకాదు.. ఆమె జీవితానికి పరిమితమైన విలువ ఉందని.. కేవలం చెక్ ఇస్తే సరిపోతుందని.. చిన్న వయసులో ఆమె చనిపోయింది కాబట్టి 11 వేల డాలర్లు ఇస్తే సరిపోతుందని వెటకారంగా మాట్లాడాడు. అంతేకాదు ఆ తర్వాత దర్యాప్తులోనూ కెవిన్‌కు అనుకూలంగా.. తప్పంతా జాహ్నవిదే అన్నట్లు అధికారులకు నివేదిక ఇచ్చాడు. డేనియల్ ఆర్డరర్ వ్యాఖ్యల వీడియోపై అధికారులు ఇప్పటికే విచారణ జరుపుతున్నారు. అయితే తాను అవి ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యలు కాదని.. ప్రభుత్వ లాయర్లను ఉద్దేశించి చేశానని.. ఇలాంటి కేసులో బాధితులకు అందాల్సిన పరిహారం ఎలా కుదించేలా ప్రయత్నిస్తారో చెప్పే క్రమంలో అలా మాట్లాడాల్సి వచ్చిందని డేనియల్ ఆర్డరర్ గతంలో వివరణ ఇచ్చాడు. -
‘జాహ్నవి’ మృతిపై అనుచిత వ్యాఖ్యలు..విధుల నుంచి అధికారి తొలగింపు
సియాటెల్: అమెరికాలో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన తెలుగు విద్యార్థిని కందుల జాహ్నవి(23)పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలున్న పోలీసు అధికారిపై వేటు పడింది. పోలీస్ అధికారి డేనియల్ ఆడెరర్‌ను గస్తీ విధుల నుంచి తొలగించినట్లు సియాటెల్ పోలీస్ విభాగం గురువారం ధ్రువీకరించింది. అతడికి ఎలాంటి బాధ్యతలను అప్పగించలేదని కూడా తెలిపింది. అయితే, అడెరర్పై చర్యలు ఎప్పుడు తీసుకున్నదీ వెల్లడించలేదు. జనవరి 23వ తేదీన సియాటెల్‌లో కెవిన్ డేవ్ పోలీసు అధికారి నడుపుతున్న వాహనం ఢీకొని రోడ్డు దాటుతున్న కందుల జాహ్నవి ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న మరో అధికారి డేనియల్ అడెరర్ చులకన చేస్తూ మాట్లాడటంపై తీవ్ర దుమారం చెలరేగింది. అడెరర్ బారీ కెమెరా రికార్డింగ్ ఆధారంగా ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు సియాటెల్ పోలీస్ విభాగం పేర్కొంది. -
కాలిఫోర్నియా, మిల్పిటాస్ లో జాహ్నవి కందుల జ్ఞాపకార్థం క్యాండిల్ ర్యాలీ
-
జాహ్నవి మృతికి సంతాపంగా అమెరికాలో క్యాండిల్ ర్యాలీ
అమెరికా సియాటెల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నూలుకు చెందిన జాహ్నవి కందుల మృతి చెందిన సంగతి తెలిసిందే.అమెరికాలో పోలీసుల నిర్లక్ష్యంతో జరిగిన కారు ప్రమాదానికి బలైపోవడమే గాక మరణానంతరం కూడా వాళ్ల చేతుల్లో జాత్యహంకార హేళనకు గురైన తెలుగు యువతి జాహ్నవి కందుల ఉదంతం కలకలం రేపిన సంగతి తెలిసిందే. జాహ్నవి మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్(AIA), తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(TANA), బే ఏరియా తెలుగు అసోసియేషన్ సంస్థ(BATA) ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీని నిర్వహించారు.జాహ్నవి జ్ఞాపకార్థం కాలిఫోర్నియాలోని మిల్పిటాస్లో నిర్వహించిన ఈ క్యాండిల్ ర్యాలీలో ప్రవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జాహ్నవి చిత్రపటానికి నివాళులు అర్పించి.. ఒక నిముషం పాటు మౌనం పాటించారు. సియాటెల్ పోలీసు అధికారి కారు ఢీకొని ప్రమాదంలో మరణించిన జాహ్నవికి న్యాయం జరగాలని ఈ సందర్భంగా నినదించారు. ఆమె మృతికి కారణమైన పోలీసు అధికారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆమె అకాల మరణంపట్ల ఇండియన్ కమ్యూనిటీకి చెందిన పలువురు ప్రముఖులు, నాయకులు సంతాపం తెలిపారు.జాహ్నవి కుటుంబానికి మద్దతుగా ఉంటామని వారు పేర్కొన్నారు. ఏపీ కర్నూలుకు చెందిన జాహ్నవి కందుల (23) ఈ ఏడాది జనవరి 23న రోడ్డు దాటుతుండగా పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొని మృతి చెందింది. దీనిపై పోలీస్ ఆఫీసర్స్ గిల్డ్ ప్రెసిడెంట్ మైక్ సోలన్‌కు ప్రమాదం గురించి సమాచారం అందిస్తూ గిల్డ్ వైస్ ప్రెసిడెంట్ డేనియల్ అడెరెర్.. చులకనగా మాట్లాడుతూ పగలబడి నవ్విన వీడియో ఒకటి ఇటీవల వైరల్ అయ్యింది. -
ఆ పోలీసును తొలగించాలి
వాషింగ్టన్: అమెరికాలో గత జనవరిలో పోలీసు వాహనపు అతి వేగానికి బలైన తెలుగమ్మాయి జాహ్నవి కందుల విషయంలో జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన సియాటిల్ పోలీసు అధికారి డేనియల్ ఆడరర్పై ఆగ్రహ జ్వాలలు నానాటికీ పెరుగుతున్నాయి. ‘ఇదేమంత పెద్ద విషయం? ఏ 11 వేల డాలర్లకో చెక్కు రాస్తే సరి. ఆమెకు 26 ఏళ్లు. అలా చూస్తే ఆమె జీవితం అంత విలువైనదేమీ కాదు‘ అంటూ ఈ ఉదంతంపై అతను చేసిన వ్యాఖ్యలు గత సోమవారం బాడీకామ్ ద్వారా వెలుగులోకి వచ్చాయి. అప్పటినుంచీ వాటిపై తీవ్ర దుమారం రేగుతోంది. రాజా కృష్ణమూర్తి వంటి భారత అమెరికన్ చట్ట సభ్యులతో పాటు అమెరికా చట్ట సభ్యులు కూడా వాటిని తీవ్రంగా తప్పుబడుతున్నారు. డేనియల్ ప్రవర్తన మీద స్వతంత్ర విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అతన్ని ఉద్యోగం నుంచి తొలగించాలంటూ శుక్రవారం (అమెరికా కాలమానం ప్రకారం) ఆన్లైన్ పిటిషన్ దాఖలైంది. నిషిత రహేజా గోయల్ అనే భారత్ అమెరికన్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై ఇప్పటికే వేలాది మంది సంతకాలు చేశారు. శుక్రవారం రాత్రికే సంతకాల సంఖ్య 6,700 దాటిపోయింది. ‘డేనియల్ ప్రవర్తనతో సియాటిల్ పోలీసు శాఖపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లింది. అందుకే అతన్ని తక్షణం ఉద్యోగం నుంచి తొలగించడంతో పాటు ఇకపై కొత్తగా పోలీసు శాఖలో చేరే ప్రతి ఒక్కరికీ సున్నితత్వం తదితరాల విషయంలో విధిగా శిక్షణ ఇవ్వాలి. అప్పుడే జాహ్నవి, అలాంటి ఇతర బాధిత కుటుంబాలకు కాస్తయినా సాంత్వన చేకూరుతుంది‘ అని పిటిషన్ పేర్కొంది. మరోవైపు, డేనియల్ను సియాటిల్ పోలీసు అధికారుల గిల్డ్ సమర్థించింది! అతను ప్రైవేట్‌గా చేసిన వ్యాఖ్యలను అసంబద్ధంగా విడుదల చేసి అపార్థాలకు తావిచ్చారని ఆరోపించింది. ఈ మేరకు సుదీర్ఘ వివరణ విడుదల చేసింది. తన వ్యాఖ్యలను దురర్థం వచ్చేలా వక్రీకరించారని డేనియల్ కూడా ప్రకటన విడుదల చేశాడు. -
‘జాహ్నవిని ఉద్దేశించి నవ్వలేదు’
సియాటెల్‌లో రోడ్డు ప్రమాదంలో భారతీయ విద్యార్థిని జాహ్నవి (Jaahnavi Kandula) మృతి చెందడంపై అక్కడి పోలీసు అధికారి ఒకరు చులకనగా మాట్లాడడం.. తెలిసిందే. ఆ అధికారి తీరుపై ఎన్నారైలు నిరసనలు వ్యక్తం చేస్తుండగా.. కఠిన చర్యలు తీసుకోవాలని భారత్ సైతం అమెరికాను డిమాండ్ చేస్తోంది. అయితే, తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ వ్యాఖ్యలు జాహ్నవిని కించపరిచే ఉద్దేశంతో చేసినవి కావంటూ అధికారి డేనియల్ ఆర్డరర్ పేరిట ఓ లేఖ బయటకు వచ్చింది. ఏపీ కర్నూలుకు చెందిన జాహ్నవి కందుల (23) ఈ ఏడాది జనవరి 23వ తేదీన రాత్రి 8గం. ప్రాంతంలో రోడ్డు దాటుతుండగా.. పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొని మృతి చెందింది. అయితే.. సియాటెల్ పోలీస్ ఆఫీసర్స్ గిల్డ్ ప్రెసిడెంట్ మైక్ సోలన్‌కు ప్రమాదం గురించి సమాచారం అందిస్తూ గిల్డ్ వైస్ ప్రెసిడెంట్ డేనియల్ అడెరెర్.. చులకనగా మాట్లాడుతూ పగలబడి నవ్విన వీడియో ఒకటి ఇటీవల వైరల్ అయ్యింది. ‘ఆమె ఓ సాధారణ వ్యక్తి Just a regular person.. ఆమె జీవితానికి పరిమితమైన విలువ ఉంది. కేవలం ఓ చెక్ ఇస్తే సరిపోతుందని.. 26 ఏళ్ల వయసులో ఆమె చనిపోయింది కాబట్టి 11 వేల డాలర్లు ఇస్తే సరిపోతుంది’ అని నవ్వుతూ మాట్లాడాడు. ఈ క్లిప్ బయటకు రావడంతో తీవ్ర దుమారం చెలరేగింది. ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. అటు భారత్ కూడా దీనిపై అసహనం వ్యక్తం చేసింది.ఈ నేపథ్యంలోనే పోలీసు అధికారి డేనియల్‌పై ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ ఘటనపై ఉన్నతాధికారులకు డేనియల్ అడెరెర్ రాసిన లేఖను సియాటెల్ పోలీసు అధికారుల గిల్డ్ విడుదల చేసింది. న్యాయవాదులను ఉద్దేశిస్తూనే ఆ వ్యాఖ్యలు చేశాను. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు న్యాయస్థానంలో వాదనలు ఎంత హాస్యాస్పదంగా ఉంటాయో గుర్తొచ్చి నవ్వాను అంతే.. అని డేనియల్ లేఖలో ప్రధానంగా పేర్కొన్నారు. ‘‘జనవరి 23న పెట్రోలింగ్ వాహనం వల్ల ప్రమాదం జరిగిందని తెలిసి సాయం చేసేందుకు నేను వెళ్లాను. తిరిగి ఇంటికి వస్తుండగా తోటి అధికారికి ఫోన్ చేసి ఘటన గురించి చెప్పాను. అప్పటికి నా విధులు పూర్తయ్యాయి. అయితే బాడీక్యామ్ కెమెరా ఆన్‌లో ఉన్న విషయం నాకు తెలియదు. నేను జరిపిన వ్యక్తిగత సంభాషణ అందులో రికార్డ్ అయ్యింది. అయితే, ఇలాంటి కేసుల్లో కేవలం న్యాయవాదులు జరిపే వాదనల గురించే నేను మాట్లాడాను. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మనిషి ప్రాణం విలువ గురించి ఇరు పక్షాల లాయర్లు ఎలా వాదిస్తారో, బేరసారాలు ఎలా సాగిస్తారో గతంలో చాలా సార్లు చూశాను. అవి ఎంత హాస్యాస్పదంగా ఉంటాయో గుర్తొచ్చి నవ్వుకున్నాను’’ అని డేనియల్ తన లేఖలో వివరించారు. అంతేగానీ.. బాధితురాలిని అవమానించేలా తాను ఉద్దేశపూర్వకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. పూర్తి వివరాలు తెలియకపోతే.. ఇలాంటి భయానక ఊహాగానాలే వైరల్ అవుతాయని అన్నారు. దీనిపై పారదర్శకంగా దర్యాప్తు జరగాలని, ఉన్నతాధికారులు ఏ శిక్ష విధించినా ఎదుర్కొనేందుకు తాను సిద్ధమేనని తెలిపారు. ఈ వివాదంపై సియాటెల్ పోలీసు అధికారుల గిల్డ్, డేనియల్ అడెరెర్‌కు మద్దతుగా ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘వైరల్ అయిన దృశ్యాలు బాడీక్యామ్ వీడియో రికార్డ్ చేసినవి. అయితే, ఆ సంభాషణల్లో ఒకవైపు మాత్రమే బయటికొచ్చింది. అందులో ఇంకా చాలా వివరాలున్నాయి. అవి ప్రజలకు తెలియవు. పూర్తి వివరాలు తెలియకపోవడంతో అక్కడ అసలేం జరిగిందో చెప్పడంలో మీడియా విఫలమైంది’’ అంటూ డేనియల్‌కు మద్దతుగా గిల్డ్ వ్యాఖ్యానించింది. మరోవైపు డేనియల్ అడెరెర్‌ను ఉద్యోగం నుంచి తొలగించాలని అమెరికాలో ఆన్లైన్ పిటిషన్లు మొదలయ్యాయి. -
జాహ్నవికి న్యాయం జరగాల్సిందే
వాషింగ్టన్: అమెరికాలో పోలీసుల నిర్లక్ష్యంతో జరిగిన కారు ప్రమాదానికి బలైపోవడమే గాక మరణానంతరం కూడా వాళ్ల చేతుల్లో జాత్యహంకార హేళనకు గురైన తెలుగు యువతి జాహ్నవి కందుల ఉదంతాన్ని అక్కడి భారతీయ చట్ట సభ్యులు సీరియస్‌గా తీసుకున్నారు. వాషింగ్టన్‌లోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ స్టూడెంట్ అయిన 23 ఏళ్ల జాహ్నవి గత జనవరిలో సియాటిల్‌లో రోడ్డు దాటుతుండగా పోలీసు వాహనం ఢీ కొని మరణించడం తెలిసిందే. 25 మైళ్ల స్పీడ్ లిమిట్ ఉన్న చోట సదరు వాహనం ఏకంగా 74 మైళ్ల వేగంతో దూసుకురావడమే ప్రమాదానికి కారణమని తేలింది. కానీ డేనియల్ ఆడరర్ అనే సియాటెల్ పోలీసు అధికారి ఈ ఉదంతంపై చేసిన అత్యంత అనుచిత వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ‘అయితే ఏమయిందిప్పుడు?! ఆమెకు ఆల్రెడీ 26 ఏళ్లు. అంత విలువైనదేమీ కాదు. ఏ 11 వేల డాలర్లకో ఓ చెక్కు రాసి పారేయండి‘ అంటూ అతనన్న మాటలు బాడీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. అతనిపై ఇప్పటికీ ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంపై అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి, సియాటిల్ సిటీ కౌన్సిల్ సభ్యురాలు క్షమా సావంత్ తదితరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అమెరికా పోలీసుల్లో జాత్యహంకారం ఎంతగా జీరి్ణంచుకుపోయిందో చెప్పేందుకు ఈ ఉదంతం మరో నిదర్శనమని వారన్నారు. డేనియల్‌పై ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలని గురువారం డిమాండ్ చేశారు. ‘జాహ్నవి దుర్మరణానికి కారకులైన పోలీసులే ఆమె జీవితం విలువే లేనిదంటూ అంత నీచంగా మాట్లాడటం వింటే చెప్పరానంత జుగుప్స కలుగుతోంది. జాతి విద్వేషం, జాత్యహంకారం అమెరికాలో ఆమోదనీయత పొందుతున్నాయనేందుకు ఇది సంకేతం. ఈ చెడు ధోరణికి తక్షణం అడ్డుకట్ట పడాలి‘ అని కృష్ణమూర్తి అన్నారు. ఈ ఉదంతం మీద పూర్తి అధికారాలతో కూడిన పౌర సంఘ సభ్యుల కమిటీ వేసి స్వతంత్రంగా విచారణ జరిపించాలని సావంత్ కోరారు. డేనియల్ మీద 2014 నుంచి కనీసం 18 విచారణలు జరిగితే అతన్ని ఒక్క దాంట్లోనూ శిక్షించకపోవడం దారుణమన్నారు. పోలీసులే ఇంతటి నోటి దురుసుతో జాత్యహంకార వ్యాఖ్యలకు పాల్పడ్డ ఇలాంటి హై ప్రొఫైల్ కేసులో కూడా విచారణను ఆర్నెల్లు సాగదీయడం, రివ్యూ పేరిట ఏడాది దాకా లాగడం క్షమించరానిదని సౌత్ సియాటిల్ సిటీ కౌన్సిల్ సభ్యుడు టామీ జె.మోరల్స్ ఆవేదన వెలిబుచ్చారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అమెరికన్ అసోసియేషన్స్ కూడా ఒక ప్రకటనలో కోరింది. వందలాది మంది గురువారం సియాటిల్‌లో నిరసన ప్రదర్శన కూడా చేశారు. దోషులైన పోలీసులకు శిక్ష పడి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు. జాహ్నవికి మరణానంతరం డిగ్రీ అమెరికాలో పోలీసు వాహనం ఢీకొట్టడంతో మృతి చెందిన తెలుగు విద్యార్థిని కందుల జాహ్నవికి మరణానంతరం డిగ్రీ ప్రదానం చేయనున్నట్లు నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీ ప్రకటించింది. మాస్టర్స్ డిగ్రీ పట్టాను జాహ్నవి కుటుంబ సభ్యులకు అందజేస్తామని వెల్లడించింది. జాహ్నవి మృతి పట్ల నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీ చాన్సలర్ సంతాపం తెలియజేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. -
Jaahnavi Kandula: జాహ్నవికి మరణానంతర డిగ్రీ
వాషింగ్టన్: అమెరికాలో రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన భారతీయ విద్యార్థిని జాహ్నవి కందుల(23)కు మరణానంతర డిగ్రీ అందనుంది. ఈ విషయాన్ని నార్త్ఈస్ట్రన్ యూనివర్సిటీ అధికారికంగా ప్రకటించింది. జాహ్నవి తరపున ఆమె కుటుంబ సభ్యులకు ఎంఎస్ పట్టా అందజేస్తామని నార్త్ఈస్ట్రన్ యూనివర్సిటీ వీసీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కర్నూలువాసి అయిన జాహ్నవి.. స్టూడెంట్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమం కింద 2021లో అమెరికా వెళ్లింది. సౌత్ లేక్ యూనియన్‌లోని నార్త్ఈస్ట్రన్ యూనివర్సిటీ క్యాంపస్‌లో చేరిందామె. కెరీర్లో త్వరగా సెటిల్ అయ్యి.. కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవాలని ఆమె కల. ఈ ఏడాది డిసెంబర్లో జాహ్నవి డిగ్రీ పూర్తి కావాల్సి ఉంది. పాపం ఈలోపే ఆమెను మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కబళించింది. ఈ ఏడాది జనవరి 23వ తేదీన రాత్రి ఆమె రోడ్డు ప్రమాదంలో కన్నుమూసింది. అతివేగంతో దూసుకొచ్చిన ఓ పోలీసు పెట్రోలింగ్ వాహనం ఆమెను బలిగొంది. ఈ ఘటనకు సంబంధించి..ప్రమాద సమయంలో సమాచారం అందుకున్న ఓ అధికారి.. ఆమె ప్రాణాలకు విలువే లేదన్నట్లు చులకనగా మాట్లాడిన మాటల్ని తాజాగా అక్కడి పోలీస్ శాఖనే బయటపెట్టింది. దీంతో భారతీయులు భగ్గుమన్నారు. దీనిపై తీవ్రంగా స్పందించిన భారత్.. ఆ అధికారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అమెరికాను కోరింది. ఇప్పుడు.. ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన నార్త్ఈస్ట్రన్ (Northeastern University) ఛాన్సలర్ ‘‘ఈ విషాద ఘటన, దాని అనంతరం జరిగిన పరిణామాలతో మా క్యాంపస్‌లోని భారత విద్యార్థులు తీవ్రంగా ప్రభావితులయ్యారు. ఈ సమయంలో వారికి మేం అండగా ఉంటాం. అలాగే ఈ ఘటనలో బాధ్యులకు తప్పకుండా శిక్ష పడుతుందని మేం ఆశిస్తున్నాం. ఇక జాహ్నవికి మరణానంతరం డిగ్రీ ప్రదానం చేయాలని మేం నిర్ణయించాం. ఆమె కుటుంబంసభ్యులకు దాన్ని అందజేస్తాం’’ అని తెలిపారు. -
అమెరికాలో తెలుగు యువతి మృతి.. ఎవరీ జాహ్నవి కందుల?
సియాటెల్: గత జనవరిలో అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువతి మృతి చెందిన విషయం తెలిసిందే. జాహ్నవి కందుల అనే యువతి రోడ్డు దాటుతుండగా కెవిన్ డేవ్ అనే అధికారి 911 పోలీస్ వాహనాన్ని అతివేగంతో నడిపి ఆమెను ఢీకొట్టాడు. దీంతో ఆమె 100 అడుగులు ఎగిరి దూరంపడింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే తీవ్ర గాయాలతో మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఎవరీ జాహ్నవి కందుల? ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన యువతి జాహ్నవి (23) అమెరికాలో సియాటెల్‌లోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చదువుతోంది. 2021లో స్టూడెంట్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రాం మీద బెంగుళూరు నుంచి యూఎస్ వెళ్లింది. ఈ డిసెంబర్లో ఆమె మాస్టర్స్ పూర్తి కానుంది. ఇంతలోనే జాహ్నవి మరణ వార్త తెలియడంతో కందుల కుటుంబం తీవ్ర మనోవేదనకు గురవుతోంది. తన మనవరాలును దూరం చేసుకున్న భాధ నుంచి కోలుకోక ముందే పోలీసు ప్రవర్తన గురించి తెలియడం మరింత దిగ్బ్రాంతికి గురిచేస్తందని ఆమె తాత ఆవేదన వ్యక్తం చేశారు. విషాదకరమైన ప్రమాదం తర్వాత ఎవరైనా అలా ఎలా మాట్లాడగలరని వాపోయారు. చదవండి: జాహ్నవి మృతి: కేంద్ర మంత్రి జైశంకర్‌కు సీఎం జగన్ లేఖ పోలీస్ వెకిలి నవ్వులు అయితే జాహ్నవి మృతి పట్ల అక్కడి పోలీస్ అధికారి చులకనగా మాట్లాడిన వీడియో తాజాగా బయటికి రావడంతో తీవ్ర దుమారానికి దారీతీసింది. జాహ్నవి మరణం విషయం తెలిసి దర్యాప్తు చేయడానికి వచ్చిన పోలీసు అధికారి డానియెల్ అడరర్.. పైఅధికారికి వివరాలు చెప్తూ జాహ్నవి పట్ల వెకిలిగా మాట్లాడారు. గట్టిగా నవ్వుతూ ‘ఆమె చచ్చిపోయింది. ఆ ఓ మామూలు వ్యక్తేలే. ‘ఏముంది. ఓ పదకొండు వేల డాలర్లకు చెక్కు రాస్తే చాలు.. ఆమెకు 26 ఏళ్లు ఉంటాయేమో..విలువ తక్కువే..’ అని పగలబడి నవ్వుతూ మాట్లాడారు. ఇదంతా అతడి బాడీ కెమెరాలో రికార్డవ్వగా వీటిని సోమవారం సియాటెల్ పోలీసులు బయటకు విడుదల చేశారు. దీనిపై సియాటెల్ కమ్యూనిటీ పోలీస్ కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఇలాంటి వ్యాఖ్యలు దారుణమని పేర్కొంది. సదరు పోలీసు అధికారి నవ్వుతూ, జోకులు వేస్తున్న వీడియో బయటికి రావడంతో.. అక్కడి ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. అదే విధంగా కారు బాడీకామ్ వీడియోపై శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ ఆందోళన వ్యక్తం చేసింది. జాహ్నవి మృతి పట్ల సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేసింది. అతివేగమే ప్రమాదానికి కారణం ప్రమాదం జరిగినప్పుడు కెవిన్ డేవ్ గంటకు 119 కి.మీ వేగంతో ప్రయాణిస్తున్నట్లు సీటెల్ పోలీస్ డిపార్ట్మెంట్ నివేదికలో తెలిపింది. వాహనం ఢీకొనడానికి అతివేగమే ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. డేవ్ జాహ్నవిని ఢీకొట్టే నికి ఒక సెకను ముందు బ్రేకులు వేయడంతో ఆ వేగం ధాటికి ఆమె 100 అడుగుల ముందుకు ఎగిరిపడింది. వాస్తవానికి ప్రమాదం జరిగిన వీధిలో వేగ పరిమితి గంటకు 25 మైళ్లు లేదా గంటకు 40 కి.మీ మాత్రమే. అయితే జాహ్నవిని ఢీకొని ఆమె మరణానికి కారణమైన తోటి పోలీసు అధికారి కెవిన్‌ను కాపాడేందుకు డానియెల్ ప్రయత్నించిన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ప్రమాద సమయంలో కెవిన్ కారును గంటకు 50 మైళ్ల వేగంతోనే నడుపుతున్నాడని, కారు అదుపు తప్పలేదని డానియల్ దర్యాప్తు నివేదికలో పేర్కొన్నాడు. తప్పు జాహ్నవిదే అన్నట్టుగా చూపడానికి ప్రయత్నించాడు. -
RIP Jahnavi : కేంద్ర మంత్రి జైశంకర్‌కు సీఎం జగన్ లేఖ
సాక్షి, అమరావతి: అమెరికాలో ఏపీకి చెందిన విద్యార్ధిని కందుల జాహ్నవి మృతిపై కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ రాశారు. లేఖలో..‘ఏపీకి చెందిన విద్యార్ధిని కందుల జాహ్నవి అమెరికాలో జనవరి 23, 2023న రోడ్డు దాటుతుండగా వేగంగా వస్తున్న పోలీస్ వాహనం ఢీకొట్టి ప్రాణాపాయానికి గురైంది. ఆమె అమెరికాలోని నార్త్ఈస్ట్రన్ యూనివర్శిటీ సీటెల్ క్యాంపస్‌లో ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చదువుతుంది. ప్రమాద సమాచారం తెలుసుకున్న ఏపీ ప్రభుత్వం వెంటనే ఆమె కుటుంబాన్ని, తెలుగు అసోసియేషన్‌ను సంప్రదించి ఆమె మృతదేహాన్ని కర్నూలు జిల్లాలోని ఆమె స్వగ్రామానికి తరలించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఆమె స్వగ్రామానికి అంబులెన్స్ కూడా ఏర్పాటు చేసింది. తాజాగా కందుల జాహ్నవి మరణంపై దర్యాప్తు చేస్తున్న ఒక పోలీస్ అధికారి (సీటెల్ పోలీస్ అధికారి) ఆమె మరణాన్ని అపహాస్యం చేస్తున్నట్లు వచ్చిన వీడియోను కూడా అందరూ గమనించే ఉంటారు. ఆ వీడియోలో ఒక అమాయక విద్యార్ధి జీవితాన్ని తక్కువ చేసి మాట్లాడారు. నాన్ అమెరికన్ల పట్ల అలాంటి అధికారుల అమానవీయ ప్రవర్తనను అందరూ ఖండించాలి. తప్పు చేసిన పోలీసులపై కఠిన చర్యలకు సిఫార్సు చేయాలి. అమెరికాలోని నార్త్ఈస్ట్రన్ యూనివర్శిటీ సీటెల్‌లో ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌లో మాస్టర్స్ చేస్తూ ప్రమాదానికి గురైన జాహ్నవి. జాహ్నవి మరణంపై అపహాస్యం చేసిన సీటెల్ దర్యాప్తు అధికారి అమానవీయ ప్రవర్తనను ఖండించాలని, తప్పు చేసిన పోలీసులపై కఠిన చర్యలకు సిఫార్సు చేయాలని కోరారు.2/2— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) September 14, 2023 భారతీయులలో విశ్వాసం, భరోసా కలిగించేలా చర్యలు ఉండాలని కోరుకుంటున్నాను. ఈ విషయంలో వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలని మిమ్మల్ని అభ్యర్ధిస్తున్నాను. ఈ దురదృష్టకర పరిస్ధితిపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరుకుంటున్నాను. యూఎస్‌లోని సంబంధిత అధికారులతో తక్షణమే చర్చించి, వాస్తవాలు వెలికితీసి మృతురాలి కుటుంబానికి న్యాయం జరగాలి. భారతదేశంలోని అమెరికా రాయబారితో కూడా చర్చించి తగిన సూచనలివ్వాలని కోరుకుంటున్నాను. మీరు ఈ విషయాన్ని అత్యవసరంగా పరిగణించి కందుల జాహ్నవి కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను.’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. చదవండి: ఇదంతా చంద్రబాబుకి తెలిస్తే ఫీల్ అవ్వరా? మరోవైపు అమెరికాలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రత్నాకర్ పండుగాయల కూడా విదేశాంగ మంత్రి జైశంకర్‌ను ఈ విషయంలో జోక్యం చేసుకుని జాహ్నవికి న్యాయం చేయాల్సిందిగా కోరారు. ఈ విషయంలో కేంద్రానికి లేఖ రాసినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రవాసాంధ్రుల తరపున ధన్యవాదాలు తెలియజేశారు. జాహ్నవి విషయంలో పోలీసు అధికారి వ్యవహరించిన తీరు, ఈ తరహ ఘటనల వల్ల అమెరికాలో వివక్ష పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. Request indian foreign minister @DrSJaishankar to take action on below incident .@PMOIndia #JusticeForjaahnavi pic.twitter.com/eK9k41acwz — Kadapa Rathnakar (@KadapaRathnakar) September 14, 2023 -
అమెరికాలో తెలుగు యువతి మృతి.. భారత్ డిమాండ్ ఇదే..
సియాటెల్: అమెరికాలో రోడ్డు ప్రమాదంలో తెలుగు యువతి మృతి చెందడంపై అక్కడి పోలీసు అధికారి చులకనగా మాట్లాడిన అంశం కలకలం రేపుతోంది. సదరు పోలీసు అధికారి నవ్వుతూ, జోకులు వేస్తున్న వీడియో బయటికి రావడంతో.. అక్కడి ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. అసలేం జరిగింది? అమెరికాలో సియాటెల్‌లోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో చదువుతున్న కర్నూలు జిల్లా ఆదోని యువతి జాహ్నవి (23) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అదీ పోలీసు పెట్రోలింగ్ వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టడంతో అక్కడిక్కడే మరణించారు. ఆ ఘటన విషయం తెలిసి దర్యాప్తు చేయడానికి వచి్చన పోలీసు అధికారి డానియెల్ అడరర్.. పైఅధికారికి వివరాలు చెప్తూ జాహ్నవి పట్ల చులకనగా మాట్లాడారు. గట్టిగా నవ్వుతూ ‘ఆమె చచ్చిపోయింది. ఆ ఓ మామూలు వ్యక్తేలే..’ అని వ్యాఖ్యానించారు. పోలీసు వాహనమే ఢీకొట్టిన నేపథ్యంలో.. ‘ఏముంది. ఓ పదకొండు వేల డాలర్లకు చెక్కు రాస్తే చాలు.. ఆమెకు 26 ఏళ్లు ఉంటాయేమో.. విలువ తక్కువే..’ అని పగలబడి నవ్వుతూ వ్యాఖ్యానించారు. ఇదంతా అతడి బాడీ కెమెరాలో రికార్డైంది. తాజాగా ఈ దృశ్యాలు వెలుగులోకి రావడంతో.. సియాటెల్ కమ్యూనిటీ పోలీస్ కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఇలాంటి వ్యాఖ్యలు దారుణమని పేర్కొంది. డానియెల్ అడరర్‌పై విచారణకు ఆదేశించింది. తప్పుడు వివరాలతోనూ.. జాహ్నవిని ఢీకొని ఆమె మరణానికి కారణమైన తోటి పోలీసు అధికారి కెవిన్‌ను కాపాడేందుకు డానియెల్ ప్రయత్నించిన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ప్రమాద సమయంలో కెవిన్ కారును గంటకు 50 మైళ్ల వేగంతోనే నడుపుతున్నాడని, కారు అదుపు తప్పలేదని డానియల్ దర్యాప్తు నివేదికలో పేర్కొన్నాడు. తప్పు జాహ్నవిదే అన్నట్టుగా చూపడానికి ప్రయత్నించాడు. అయితే కెవిన్ కారును పరిమితికి మించి 74 మైళ్ల వేగంతో నడిపాడని, కారు అదుపు తప్పిందని తర్వాత ఫోరెన్సిక్, ఇతర దర్యాప్తు నివేదికల్లో తేలడం గమనార్హం. ‘జాహ్నవి కందుల మృతి కేసు విచారణలో భాగంగా తాజాగా వెలుగులోకి వచ్చిన కథనాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి. సియాటిల్ అలాగే వాషింగ్టన్‌లోని ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాం. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశాం. అలాగే సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నాం’ అని దౌత్యకార్యాలయం వెల్లడించింది. శాన్ఫ్రాన్సిస్కోలోని భారత దౌత్యకార్యాలయం ట్వీట్ చేసింది. .. for a thorough investigation & action against those involved in this tragic case. The Consulate & Embassy will continue to closely follow up on this matter with all concerned authorities.@IndianEmbassyUS @MEAIndia — India in SF (@CGISFO) September 13, 2023 -
జాహ్నవి మృతిపై అధికారి వెకిలి కామెంట్లు వైరల్
సియాటెల్: అమెరికాలో భారతీయ విద్యార్థి మృతి చెందిన ఘటనపై వెటకారం, వెకిలి వ్యాఖ్యలు చేసిన పోలీస్ అధికారి తీరుపై పలువురు మండిపడుతున్నారు. ఘటనపై పైఅధికారి సమాచారం కోరితే.. ఆమె ప్రాణాలకు విలువే లేదన్నట్లు నవ్వుతూ మాట్లాడాడు సదరు అధికారి. ఆ క్లిప్‌ను సియాటెల్ పోలీసులే విడుదల చేయగా.. అది వైరల్ కావడంతో అధికారి చర్యలు తీసుకోవాలని అక్కడి భారతీయులు డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన కందుల జాహ్నవి(23) గ్రాడ్యుయేషన్ కోసం అమెరికా వెళ్లింది. ఈ ఏడాది జనవరి 23వ తేదీ రాత్రి ఎనిమిది గంటల టైంలో రోడ్డు దాటుతున్న ఆమెను.. ఓ పోలీసు వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టి మృతి చెందింది. కెవిన్ డేవ్ అనే అధికారి నిర్లక్ష్యం వల్లే ఆమె ప్రాణం పోయిందని ఆ తర్వాతే తేలింది. అయితే.. ఈ ఘటన గురించి సమాచారం అందించిన తరుణంలో ఓ అధికారి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతూ.. భారతీయులకు ఆగ్రహావేశాలు తెప్పిస్తున్నాయి. జాహ్నవి యాక్సిడెంట్‌పై సమాచారం అందుకున్న.. సియాటెల్ పోలీస్ ఆఫీసర్స్ గిల్డ్ వైస్ ప్రెసిడెంట్ డేనియల్ ఆర్డరర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. గిల్డ్ ప్రెసిడెంట్ మైక్ సోలన్‌కు ప్రమాదం గురించి సమాచారం అందిస్తూ.. ఆర్డరర్ నవ్వులు చిందించాడు. అంతేకాదు.. ఆమె జీవితానికి పరిమితమైన విలువ ఉందని.. కేవలం చెక్ ఇస్తే సరిపోతుందని.. 26 ఏళ్ల వయసులో ఆమె చనిపోయింది కాబట్టి 11 వేల డాలర్లు ఇస్తే సరిపోతుందని వెటకారంగా మాట్లాడాడు. అయితే.. సోలన్ ఆ కాల్‌కు ఎలాంటి సమాధానం ఇచ్చారన్నది మాత్రం తెలియరాలేదు. సోమవారం అధికారులు ఈ వీడియో రిలీజ్ చేసి.. విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. వీళ్ల మాటలు వింటుంటే గుండె పగిలిపోతోందంటూ పోస్ట్ చేసింది. సియాటెల్ ప్రజలకు మరింత భద్రత కల్పించాల్సి ఉందని, ఇలాంటి వాటిని సహించేదే లేదని తేల్చి చెప్పింది. కేవలం తాము కచ్చితంగా విచారణ చేపడుతున్నామని ప్రజలకు తెలియజేసేందుకే ఈ వీడియో విడుదల చేసినట్టు స్పష్టం చేసింది. ప్రస్తుతానికి విచారణ కొనసాగుతోందని, అప్పటి వరకూ దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని తెలిపింది. అయితే తాను అవి ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యలు కాదని.. ప్రభుత్వ లాయర్లను ఉద్దేశించి చేశానని.. ఇలాంటి కేసులోలో బాధితులకు అందాల్సిన పరిహారం ఎలా కుదించేలా ప్రయత్నిస్తారో చెప్పే క్రమంలో అలా మాట్లాడాల్సి వచ్చిందని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ వీడియోపై జాహ్నావి దగ్గరి బంధువు అశోక్(హౌస్టన్) స్పందించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసేవాళ్ల కూతుళ్లు, మనవరాళ్ల జీవితాలకు మాత్రమే విలువ ఉంటుందా? ప్రాణం ఏదైనా ప్రాణమే కదా అని అసహనం వ్యక్తం చేశారాయన. జాహ్నవి ఈ డిసెంబర్లో ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌లో డిగ్రీ తీసుకోవాల్సి ఉంది. ఇంతలోనే ఇలా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకుంది. ఇదిలా ఉంటే జాహ్నవి ఘటనపై కింగ్ కౌంటీ అటార్నీ కార్యాలయం దర్యాప్తు జరుపుతోంది. -
పోలీసు నిర్లక్ష్యంతోనే జాహ్నవి మృతి?.. ఆలస్యంగా ఆధారాలు వెలుగులోకి..
అమెరికాలోని సీటెల్‌లో 2023 జనవరిలో పోలీస్ వాహనం ఢీకొని తెలుగు యువతి కందుల జాహ్నవి దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఇది అప్పట్లో కలకలం సృష్టించింది. ఆ యువతి కుటుంబంలో విషాదం నింపింది. తాజాగా ఆ ప్రమాదానికి సంబంధించిన వీడియో కీలకంగా మారింది. నార్త్ ఈస్ట్ యూనివర్సిటీలోని కాలేజ్ ఆఫ్ ఇంజనీరిగ్‌లో మాస్టర్ ఆఫ్ సైన్స్ చదువుతున్న జాహ్నవి గత జనవరి 23న రోడ్డు దాటుతుండగా ఆమెను ఒక పోలీస్ వాహనం ఢీకొంది. ఆ సమయంలో పోలీసుల వాహనంలో సీటెల్ పోలీస్ విభాగానికి చెందిన కెవిన్ డేవ్ ఉన్నారు. కెవిన్ డేవ్ బాడీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలను గమనిస్తే.. నాటి కారు స్పీడో మీటర్ గంటకు 74 మైళ్ల వేగాన్ని చూపుతోంది. అదే స్పీడ్‌లో వాహనం జాహ్నవిని థామస్ స్ట్రీట్ కూడలి వద్ద ఢీకొంది. ప్రమాదంలో గాయాలపాలైన ఆమెను వెంటనే స్థానికులు, పోలీసు అధికారులు హార్బర్ వ్యూ మెడికల్ సెంటర్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయింది. కాగా ఈ ఘటన జరిగిన సమయంలో కెవిన్ ఓ ఎమర్జెన్సీ కాల్ మాట్లాడుతున్నట్లు సమాచారం. అందుకే అతను వాహనం సైరన్‌ను తగ్గించాడని తెలుస్తోంది. అయితే ఈ అత్యవసర పరిస్థితి గురించి ఆమెకు హెచ్చరించడంలో కెవిన్ విఫలమయ్యాడని ప్రాసిక్యూటర్లు ఆరోపిస్తున్నారు. ఈ ఉదంతంపై కెవిన్ మాట్లాడుతూ ఆ సమయంలో తాను సైరన్ మోగించానని, అప్పుడు జాహ్నవి క్రాస్ వాక్‌లో ఉందన్నారు. తమ కారును చూసి కూడా ఆమె క్రాస్ వాక్ గుండా వేగంగా పరిగెత్తిందని కెవిన్ తెలిపారు. కాగా ప్రమాదం జరిగిన ఆరు నెలల తర్వాత బాడీ క్యామ్‌లో రికార్డ్ అయిన నాటి ఘటన దృశ్యాలు వెలుగుచూశాయి. కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవి కందుల 2021లో ఉన్నత విద్య అభ్యసించేందుకు అమెరికాకు వెళ్లి సీటెల్ లోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో చేరారు. గత జనవరి 23న ఆమె కళాశాలకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇది కూడా చదవండి: ఇన్ని చిరుకప్పలు ఎక్కడి నుంచి Body cam footage shows Kevin Dave hitting and killing Jaahnavi Kandula in a crosswalk at 8 p.m. on Jan. 23. Dave had chirped his siren, but did not have it running consistently, as he plowed into Kandula, a 23 Y/O master’s student at Northeastern University’s Seattle campus pic.twitter.com/IeTVuUA7cK — That Guy Shane (@ProfanityNewz) July 24, 2023 -
మణిపూర్‌లో కడప విద్యార్థిని జాహ్నవి ఆవేదన
కడప అర్బన్ : కడపకు చెందిన జాహ్నవి అనే విద్యార్థిని మణిపూర్ రాష్ట్రంలో తీవ్ర భయాందోళనకు గురవుతోంది. అక్కడ జరుగుతున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో.. ఆమె ఉంటున్న హాస్టల్లోని విద్యార్థినులు బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. దీంతో జాహ్నవి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కడప మృత్యుంజయకుంటకు చెందిన వెంకటరమణ, సుస్మితకు ఇద్దలు కుమార్తెలు. పెద్దకుమార్తె జాహ్నవి కడపలో ఇంటర్ పూర్తి చేసి నీట్ రాసింది. గతేడాది మణిపూర్‌లో ఎంబీబీఎస్‌లో సీటు వచ్చింది. ఇల్పాల్ నగరం నీట్ క్యాంపస్‌లో చదువుతోంది. ఆమెతోపాటు మిగిలిన విద్యార్థినులు కూడా హాస్టల్‌కే పరిమితం కావడంతో సరైన సౌకర్యాలు లేక మరింత ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై జాహ్నవి చెల్లెలు వైష్ణవి విలేకర్లకు సమాచారం అందించారు. తన సోదిరి ఉన్న హాస్టల్ సమీపంలో అర కిలోమీటర్ దూరంలో పేలుడు జరిగినట్లు చెప్పుకొచ్చిందని, ప్రస్తుతం సురక్షితంగా ఉన్నట్లు ఫోన్లో తెలియజేసిందన్నారు. అక్కడి సంఘటనలు చూస్తే తమకు చాలా భయంగా ఉందని, ఇక్కడికి రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. -
థాంక్యూ సీఎం సార్.. మీ సాయంతో అంతరిక్షం అందుకుంటున్నా
రామచంద్రపురం: సైంటిస్ట్ ఆస్ట్రోనాట్‌గా ఎదగాలని కలలుగన్న ఓ యువతి ఆకాంక్షలకు ప్రభుత్వ సాయం తోడైంది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన దంగేటి జాహ్నవి ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతోంది. ఈమెకు అంతరిక్ష రంగంపై విపరీతమైన మక్కువ. అమెరికా నాసా శిక్షణకు ఎంపికైన ఈమెకు ఆర్థిక ఇబ్బంది తలెత్తింది. బీసీ సంక్షేమ మంత్రి చెన్నుబోయిన వేణుగోపాలకృష్ణ ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో వెంటనే సీఎం ఈ శిక్షణ కోసం ఆమెకు రూ.50 లక్షలు మంజూరు చేశారు. దీంతో అమెరికాలోని నాసా అంతరిక్ష కేంద్రంలో నెల పాటు శిక్షణ పొందింది. ఇటీవల జాహ్నవి స్వస్థలం చేరుకుంది. మరికొన్నాళ్లు ఆమె శిక్షణ పొందాల్సి ఉంది. జాహ్నవి తన తల్లిదండ్రులతో కలిసి శుక్రవారం బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో మంత్రి వేణును కలిసింది. చిరకాల స్వప్నమైన సైంటిస్ట్ ఆ స్ట్రోనాట్ కావడానికి సహకారాన్ని అందజేసిన సీఎం జగన్‌కు, మంత్రి వేణుకు కృతజ్ఞతలు తెలిపింది. -
ఇదీ చంద్రబాబు గంజాయి నీతి..
సాక్షి, అమరావతి: రాష్ట్ర రాజకీయాల్లో టీడీపీ ఓ గంజాయి మొక్కని.. ద్వంద్వ నీతికి తాను నిలువెత్తు నిదర్శనమని చంద్రబాబు మరోసారి నిరూపించారు. గంజాయి స్మగ్లర్లకు టీడీపీ అండగా ఉంటుందని కూడా చేతల్లో చూపించారు. ఇందుకు సంబంధించిన ఓ కేసులో కీలక నిందితురాలిగా ఉన్న.. పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన నరసరావుపేటకు చెందిన మానుకొండ జాహ్నవికి పార్టీలోకి తిరిగి ఎర్రతివాచి పరిచారు. తద్వారా గంజాయి స్మగ్లర్లకు టీడీపీ అడ్డా అని నిరూపించారు. చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో నర్సీపట్నం కేంద్రంగా అప్పటి మంత్రి అయ్యన్నపాత్రుడు అనుచర వర్గమే రాష్ట్రంలో గంజాయి స్మగ్లింగ్‌ను యథేచ్ఛగా నిర్వహించింది. అధికారం కోల్పోగానే వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఈ విషయంలో దుష్ప్రచారం చేసేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. మరోవైపు.. చంద్రబాబు తీరు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ఎందుకంటే.. 2013లో గంజాయి స్మగ్లింగ్ ముఠాపై అప్పటి హైదరాబాద్ పోలీసులు దాడిచేసి కేసు నమోదు చేశారు. ఆ కేసులో నిందితురాలిగా ఉన్న జాహ్నవిని తెలంగాణ పోలీసులు 2022 మేలో అరెస్టుచేశారు. దాంతో టీడీపీ బండారం బట్టబయలైంది. ఈ విషయాన్ని కప్పిపుచ్చేందుకు చంద్రబాబు ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు అప్పట్లో ప్రకటించారు. తుదితీర్పు వచ్చేవరకు ఈ సస్పెన్షన్ అమలులో ఉంటుందని కూడా చెప్పారు. కానీ, జాహ్నవి మాత్రం టీడీపీలో క్రియాశీలంగానే కొనసాగుతోంది. అలాగే, ఆమెపై ఉన్న సస్పెన్షన్‌ను తొలగించాలని చంద్రబాబు తాజాగా నిర్ణయించారు. దీంతో జాహ్నవిపై ఉన్న సస్పెన్షన్‌ను తొలగిస్తున్నట్లు టీడీపీ ఏపీ శాఖ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. కానీ, ఆమెపై ఉన్న స్మగ్లింగ్ కేసు ఇంకా కొనసాగుతూనే ఉంది. అయినప్పటికీ పార్టీలో ఆమెపై సస్పెన్షన్‌ను తొలగించి టీడీపీలోకి ఆమెను తిరిగి ఆహ్వానించడం ద్వారా చంద్రబాబు తన నైజాన్ని మరోసారి చాటుకున్నారు. -
ఇచ్చిన మాటకు కట్టుబడి.. జాహ్నవికి రూ.50లక్షల సాయం
సాక్షి, పశ్చిమగోదావరి: ఇచ్చిన మాట ప్రకారం తనకు సీఎం వైఎస్ జగన్ రూ.50 లక్షల సాయం అందజేయడంపై పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన అనలాగ్ ఆస్ట్రోనాట్ దంగేటి జాహ్నవి ఆనందం వ్యక్తం చేసింది. జగనన్న మేలు మర్చిపోలేనిదని పేర్కొంది. గురువారం ఆమె మాట్లాడుతూ.. ఇటీవల వరదల సమయంలో సీఎం రాజమండ్రి వచ్చినప్పుడు కలిశానని, ‘‘నీ విద్యకు ఆర్థిక ఇబ్బందులు రాకూడదు.. నీకు ఏ అవసరం ఉన్నా నేను సహకరిస్తా’’ అంటూ అప్పుడు ఆయన హామీ ఇచ్చారని పేర్కొంది. సీఎం భరోసాతో ఆస్ట్రోనాట్‌గా అవ్వాలన్న తన ఆశలు మరింత పెరిగాయంది. బుధవారం అమరావతిలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ చేతులమీదుగా ప్రభుత్వం అందించిన రూ. 50 లక్షల చెక్కును జాహ్నవి అందుకుంది. చదవండి: (Janasena: జనసేన జేపీ నకిలీ చేష్టలు) -
సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన పాలకొల్లుకు చెందిన జాహ్నవి
-
సంగీతమే నా ప్రయారిటీ.. లెజెండరీ ఎస్పీ బాలు అడుగుజాడల్లో
యువ గాయని జాహ్నవి... టీవీ చూస్తూ పాట నేర్చుకుంది. టీవీలో పాడుతూ పెరిగి పెద్దదైంది. టీవీ తెర మీద మురిపించిన పాట... ఇప్పుడు సినిమా తెర వెనుక వినిపిస్తోంది. ఎస్పీ బాలు నేర్పించిన మెళకువలే పాదముద్రలు. ఇంట్లో టీవీ ఉంటే పిల్లలు మాటలు త్వరగా నేర్చుకుంటారు. ఆ ఇంటి వాతావరణంలో నేర్పని మాటలు కూడా పిల్లల నాలుక మీద అవలీలగా దొర్లిపోతుంటాయి. ఈ అమ్మాయి టీవీ చూస్తూ మాటలతోపాటు పాటలు కూడా నేర్చుకుంది. ఆటల్లో ఆటగా సీరియల్ టైటిల్ సాంగ్స్ పాడేది. సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం కాదు. కానీ సంగీతం దేవుడిచ్చిన వరంలా ఒంటపట్టింది. పాటల పట్ల పాపాయికి ఉన్న ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు ఆమెను సంగీతం టీచర్ దగ్గరకు తీసుకెళ్లారు. ఎవరూ పెద్దగా ప్రయాస పడింది లేదు. త్వరగానే గ్రహిస్తోందని సంగీతం టీచరు కామాక్షిగారు నోటిమాటతోనే ప్రశంసాపూర్వకమైన సర్టిఫికేట్ ఇచ్చేశారు. ఆ తర్వాత స్వరసుధ అనే మ్యూజిక్ అకాడమీలో చేరి సంగీత సాధన చేసింది. ఇదంతా జాహ్నవి వరంగల్‌లోనే. టెన్త్‌క్లాస్ తర్వాత ఇంటర్ కి జాహ్నవి హైదరాబాద్‌కు మారింది. ఆమె సంగీత ప్రపంచం మరింత విస్తృతమైంది. శ్రీనిధి, రామాచారి వంటి ప్రముఖ గురువుల దగ్గర సంగీతం నేర్చుకునే అవకాశం వచ్చింది. టీవీ రియాలిటీ షోల తో మొదలైన ఆమె సరిగమల ప్రయాణం ప్రముఖ నేపథ్య గాయకులు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంతో కలిసి పాడే అవకాశాన్నిచ్చింది. ఎస్పీబీ దగ్గర పాడడానికి ముందు జాహ్నవి పాటకు, ఆ తర్వాత జాహ్నవి పాటకు మధ్య స్పష్టమైన తేడా వచ్చిందని చెబుతోందీ యువగాయని. నేర్చుకున్న వారికి నేర్చుకున్నంత.. ‘‘రియాలిటీ షోలో నేను పద్యాన్ని పాడుతున్నాను. ఫైనల్ రౌండ్‌కు వెళ్లాలంటే ఆ రౌండ్ దాటాలి. అప్పుడు పద్యం పాడడంలో అనుసరించాల్సిన మెళకువ చెప్పారాయన’’ అంటూ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం తనకు తొలిసారిగా నేర్పించిన సంగీతపాఠాన్ని గుర్తు చేసుకున్నది జాహ్నవి. ‘‘బాలు సర్‌తో 30కి పైగా ఎపిసోడ్లు చేశాను. పాట పాడేటప్పుడు ఆయన ఎంత కచ్చితంగా ఉంటారో ఆయన నొటేషన్ రాసుకోవడం చూసి తెలుసుకున్నాను. వేలాది పాటలు పాడిన అనుభవం ఉన్నప్పటికీ ప్రతి పాటనూ అదే ప్రారంభం అన్నంత శ్రద్ధగా ప్రిపేరవుతారు. ఒక అక్షరం పైన ‘నవ్వు’ అని రాసుకున్నారు. అలా రాసుకోవడం చూసిన తర్వాత ఆయన ఆ పాట పాడడాన్ని కూడా నిశితంగా గమనించాను. కచ్చితంగా ఆ అక్షరం రాగానే గొంతులో నవ్వును పలికించారు. ఆయన టీమ్‌లో కోరస్ పాడడం అనేది చిన్న అవకాశం కాదు. నేర్చుకునే వాళ్లకు నేర్చుకున్నంత జ్ఞానం అబ్బుతుంది. స్వరాలను పలకడంలో పాటించాల్సిన నిబంధనలను, పాట అవసరాన్ని బట్టి గొంతులో పలకాల్సిన రసాలను చెప్పేవారు. మొదట కుతూహలం కొద్దీ ఆయనను గమనించడం మొదలుపెట్టాను. అలా ఆయన చెప్పినవి కొన్ని, చూసి నేర్చుకున్నవి కొన్ని. ఒక్కొక్కటి నేర్చుకుంటున్న కొద్దీ... ఆశ్చర్యంగా నా పాటలో మార్పు నాకే స్పష్టంగా తెలియసాగింది. గాయనిగా గుర్తింపు తెచ్చుకోవాలనే లక్ష్యానికి స్ఫూర్తి ఎస్పీబీ సారే. పాటల పాఠాలు బీటెక్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. కానీ సంగీతమే నా తొలి ప్రయారిటీ. గాయనిగా అన్ని రకాల పాటలూ పాడగలననే గుర్తింపు తెచ్చుకోవాలి. మ్యూజిక్‌లో సర్టిఫికేట్ కోర్సు చేశాను. ఇప్పుడు డిప్లమో కోర్సు చేస్తున్నాను. క్లాసికల్, మెలోడీ, జానపదం, ఫాస్ట్‌బీట్... అన్నింటినీ పాడగలిగినప్పుడే సమగ్రత వస్తుంది. ఇక గాయనిగా నాకు సంతోషాన్నిచ్చిన సందర్భాలంటే... పాడుతా తీయగా సీజన్ 16లో రన్నర్ అప్‌గా నిలవడం. అదే ప్రోగ్రామ్‌లో విన్నర్ మా చెల్లి అక్షయసాయి. అలాగే ఎస్వీబీసీలో అన్నమాచార్య కీర్తనలు పాడే అవకాశం వచ్చింది. అది కూడా అత్యంత సంతోషం కలిగించింది. ఎన్టీఆర్ బయోపిక్, అఖండ, బీమ్లానాయక్, రాధేశ్యామ్ సినిమాల్లో గొప్ప సంగీత దర్శకుల ఆధ్వర్యంలో పాడాను. స్టేజ్ ప్రోగ్రామ్‌లలో పాడాలనే ఆసక్తి ఉన్నప్పటికీ ఎక్కువ కార్యక్రమాలు చేయలేకపోతున్నాను. బాలు గారి జయంతి సందర్భంగా నాలుగవ తేదీ ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు రవీంద్రభారతిలో సంస్మరణ కార్యక్రమం జరుగుతోంది. సినీ మ్యూజిక్ యూనియన్ నిర్వహించే ఈ కార్యక్రమంలో వందమంది గాయనీగాయకులు, సంగీతకారులు పాల్గొంటున్నారు. అందులో పాట పాడడం నాకు మరువలేని జ్ఞాపకం అవుతుంది. ఆయన పాదముద్రల్లో నడిచి వచ్చిన గాయనిని. అది ఆ మహోన్నత గురువుకి నేను అందించే స్వర నివాళి’’ అని చెబుతున్నప్పుడు జాహ్నవి గొంతులో బాలుగారి పట్ల గౌరవపూర్వకమైన అభిమానం తొణికిసలాడింది. – వాకా మంజులారెడ్డి -
IPL 2022 Auction: అప్పుడు ఆర్యన్‌తో కలిసి.. ఇప్పుడు ఇలా: జూహీ చావ్లా భావోద్వేగం
ఐపీఎల్ ఫ్రాంఛైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్ సహ యజమాని, బాలీవుడ్ నటి జూహీ చావ్లా పుత్రికోత్సాహంతో పొంగిపోతున్నారు. తన కుమార్తె జాహ్నవి మెహతా తమ ఫ్రాంఛైజీ వ్యవహారాల్లో మమేకం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ఐపీఎల్ మెగా వేలం-2022 జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో పలు ఫ్రాంఛైజీలకు చెందిన కొత్త తరం నాయకులు పాల్గొన్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున సీఈఓ కావ్య మారన్ సహా కేకేఆర్ యువ రక్తం జాహ్నవి, బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ వారసులు ఆర్యన్ ఖాన్, సుహానా ఖాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముఖ్యంగా జాహ్నవి వ్యవహరించిన తీరు నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో ఆమె ఫొటోలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో జూహీ చావ్లా కూతురును ఉద్దేశించి భావోద్వేగ పోస్టు చేశారు. ఆమె చిన్ననాటి జ్ఞాపకాలతో కూడిన వీడియోను ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు. ‘‘చిన్నపిల్లగా ఉన్నప్పటి నుంచే ఐపీఎల్‌తో పాటు ఇతర క్రికెట్ ఈవెంట్లు చూడటం కూడా అలవాటుగా మార్చుకుంది. కామెంటేటర్ల వ్యాఖ్యలు శ్రద్ధగా వినేది. తనకు 12 ఏళ్ల వయసు ఉన్నపుడు అనుకుంటా.. మేం సెలవుల కోసం బాలి వెళ్లినపుడు కాఫీ టేబుల్ మీద ఉన్న టెలిఫోన్ డైరెక్టరి సైజులో ఓ పుస్తకం... అందులో క్రికెటర్ల జీవిత చరిత్రలు, రికార్డులు, వారు సాధించిన విజయాలు.. ఇలా అన్నీ ఉన్నాయి. ఆ బుక్ చదవడం పూర్తి చేయాలనే పిచ్చి పట్టింది తనకు. స్విమ్మింగ్ విరామ సమయంలో పూల్ ఒడ్డున కూర్చుని ఒక్క పేజీ కూడా వదలకుండా ఆ బుఖ్ చదివింది. ఇది చాలా అసహజమైన విషయం కదా! 12 ఏళ్ల పిల్ల ఇంతలా ఒక విషయం గురించి ఆలోచించడం! వయసు పెరిగే కొద్దీ తనలో క్రికెట్ పట్ల ఆసక్తి కూడా పెరుగుతూ వచ్చింది. క్రికెట్ గురించి మాట్లాడితే తన ముఖం మతాబులా వెలిగిపోతుంది. మూడేళ్ల క్రితం.. ఐపీఎల్ వేలంలో పాల్గొన్న అత్యంత పిన్న వయస్కురాలిగా జాహ్నవి 17 ఏళ్ల వయసులో రికార్డు సాధించింది. ఆర్యన్‌తో కలిసి జాహ్నవి వేలంలో పాల్గొంది. ఈసారి సుహానా కూడా వాళ్లతో చేరింది. దీనంతటికీ కారణమైన మా సీఈఓ వెంకీ మైసూర్‌కు ధన్యవాదాలు. జాహ్నవి అభిప్రాయాలకు విలువనిస్తూ... తనను ప్రోత్సహించారు. ఆమె అతడిని ఆప్యాయంగా ‘కోచ్’ అని పిలుస్తుంది. తన మనసంతా ఆట మీదే. ఒక తల్లిగా నా చిట్టితల్లిని చూసి గర్వపడుతున్నా. దేవుడి ఆశీర్వాదాలతో తన భవిష్యత్తు మరింత ప్రకాశవంతంగా ఉండాలి’’ అని అంటూ ఉద్వేగభరిత నోట్ రాశారు. చదవండి: IPL 2022- SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ షాక్...సైమన్ కటిచ్ రాజీనామా!? ఐపీఎల్ 2022: గతేడాది మిస్ అయ్యింది, ఈసారి తగ్గేదేలే.. కేకేఆర్ పూర్తి జట్టు ఇదే.. View this post on Instagram A post shared by Juhi Chawla (@iamjuhichawla)