Kiran rijiju
-
వక్ఫ్ జేపీసీకి 1.2 కోట్ల మెయిల్స్
పుణె: వక్ఫ్ (సవరణ) బిల్లు–2024పై ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని పార్లమెంటరీ వ్యవహారాలు, మైనార్టీ శాఖల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ నేతృత్వంలోని జేపీసీకి ఏకంగా 1.2 కోట్ల ఈ మెయిల్స్ వచ్చాయని సోమవారం వెల్లడించారు. 75,000 మంది తమ వాదనలకు మద్దతుగా డాక్యుమెంట్లను కూడా సమరి్పంచారని తెలిపారు. బిల్లు సమర్థకులు, వ్యతిరేకులు ఇందులో ఉన్నారన్నారు. వివాదాస్పద వక్ఫ్ (సవరణ) బిల్లును ఈ ఏడాది ఆగస్టు 8న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. విపక్షాల అభ్యంతరాల నేపథ్యంలో జేపీసీకి పంపిన విషయం తెలిసిందే. బిల్లుపై అసత్య ప్రచారం చేస్తున్నారని, ముస్లింల ఆస్తులను ప్రభుత్వం లాగేసుకుంటుందని దుష్రచారం చేస్తున్నారని రిజిజు మండిపడ్డారు. వక్ఫ్ ఆస్తుల నిర్వహణ సక్రమంగా జరగాలనేదే ఈ బిల్లు ఉద్దేశమన్నారు. -
లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లు
ఢిల్లీ: ముస్లిం మతపరమైన, ధార్మిక ప్రయోజనాల కోసం దానంగా వచ్చిన ఆస్తుల్ని పర్యవేక్షించే వక్ఫ్ బోర్డ్‌ల్లో మరింత పారదర్శకత సాధించే లక్ష్యంతో సంబంధిత చట్టాల్లో కీలక మార్పులు చేసేందుకు కేంద్రం నడుంబిగించింది. ఇందులో భాగంగా వక్ఫ్ సవరణ బిల్లును ఇవాళ (ఆగస్ట్8న) కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. కేంద్ర మైనారిటీ మంత్రి కిరణ్ రిజిజు ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఇది కూరమైన బిల్లు అని, రాజ్యాంగంపై దాడి చేయడమేనని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ అన్నారు. కేంద్రం మత స్వేచ్ఛ ఉల్లంగిస్తోందని తెలిపారు. వక్ఫ్ చట్టసవరణ బిల్లును కాంగ్రెస్, టీఎంసీ, మజ్లిస్, ఎస్పీ, కమ్యూనిస్ట్ పార్టీలు వ్యతిరేకించగా.. టీడీపీ, జేడీయూ, అన్నాడీఎంకే పార్టీలు మద్దతు ఇచ్చాయి. వక్ఫ్ బోర్డులో మహిళలు, ఓబిసి ముస్లింలు, షియా, బోహ్ర తదితర ముస్లింలకు చోటు కల్పిస్తూ చట్ట సవరణ చేసింది. ఈ చట్టానికి దాదాపు 40 సవరణలు ప్రతిపాదిస్తూ కొత్త బిల్లును తీర్చిదిద్దింది.దీంతో పాటు సరైన ఆధారాలు లేకుండానే ఆస్తులు తమ వేనని ప్రకటించే వక్ఫ్ బోర్డు ఏకపక్ష అధికారాలకు స్వస్తి పలకనుంది. కాగా, ఒకవైపు ఈ బిల్లును ఆమోదించేందుకు ఎన్డీయే అన్ని విధాలా ప్రయత్నిస్తుండగా మరోవైపు విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. BIG BREAKING NEWS 🚨 Union Minister Kiren Rijiju will withdraw the Waqf Properties 2014 Bill, tomorrow at 12 pm.The Bill was introduced in Rajya Sabha on 18th February 2014 during UPA-2 Govt.This will allow Modi Govt to pass new Waqf bill that strips the Board of powers to… pic.twitter.com/xOrbdA1bBg— Times Algebra (@TimesAlgebraIND) August 7, 2024 -
కాంగ్రెస్ ఇంతకు దిగజారడం బాధాకరం.. కిరణ్ రిజిజు సెటైర్లు
ఢిల్లీ: లోక్‌సభ సమావేశాల ప్రారంభానికి ముందే బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. ప్రొటెం స్పీకర్ విషయంలో రెండు పార్టీల నేతలు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు సంచలన కామెంట్స్ చేశారు.కొత్తగా ఎన్నికైన సభ్యులతో 18వ లోక్‌సభ ఈనెల 24న తొలిసారి కొలువుదీరనుంది. ఈ నేపథ్యంలో ప్రధాని సలహా మేరకు ప్రస్తుతం ఉన్న సభ్యుల్లో ఒకరిని రాష్ట్రపతి ప్రొటెం స్పీకర్‌గా నియమించాల్సి ఉంది. ఈ క్రమంలో ఆయన ఎన్నికైన సభ్యులు అందరితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అయితే, ప్రస్తుత లోక్‌సభలో కాంగ్రెస్‌కు చెందిన కోడికున్నిల్ సురేష్ అత్యధికంగా ఎనిమిది సార్లు ఎంపీగా గెలుపొందారు. ఆయన కేరళకు చెందిన దళిత నేత. ఆయన్ను ప్రొటెం స్పీకర్‌గా నియమిస్తారని కాంగ్రెస్ పార్టీ నేతలు భావించారు.కాగా, అందుకు భిన్నంగా అధికార ఎన్డీయే కూటమి వ్యవహరించింది. ఎన్నికల్లో ఏడుసార్లు గెలుపొందిన బీజేపీ నేత మెహతాబ్‌ను ప్రొటెం స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టేందుకు సిద్ధమైంది. దీంతో కాంగ్రెస్ నేతలు ఎన్డీయే ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ స్పందిస్తూ.. పార్లమెంట్ నిబంధనలను ఎన్డీయే ప్రభుత్వం పార్లమెంట్ నిబంధనలను తుంగలో తొక్కేస్తోందన్నారు. సీనియర్ నేత సురేష్‌ను ఎందుకు పక్కన పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. #WATCH | On BJP MP Bhartruhari Mahtab appointed pro-tem Speaker of 18th Lok Sabha, Parliamentary Affairs Minister Kiren Rijiju says, "...I have to say it with great regret that I feel ashamed that the Congress party talks like this. First of all, they created an issue about the… pic.twitter.com/iKwodsMRg3— ANI (@ANI) June 21, 2024ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతల విమర్శలపై పార్లమెంటరీ శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలు ఇలా ప్రవర్తించడం బాధాకరం. కాంగ్రెస్ పార్టీని చూస్తే అసహ్యమేస్తోంది. ప్రొటెం స్పీకర్ అంశంలో ఇంతకు దిగజారడం కరెక్ట్ కాదు. ప్రశాంత వాతావరణంలో లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కావాలని ఆశిస్తున్నాము. అప్పుడే ఈ సమావేశాలు సరైన దిశలో సాగుతాయి. ప్రొటెం స్పీకర్‌గా మెహతాజ్ అర్హులు అని చెప్పుకొచ్చారు. ఇక, ప్రొటెం స్పీకర్ మెహతాజ్ 1998-2019 మధ్య ఒడిశాలోని కటక్ లోక్‌సభ స్థానం నుంచి ఆయన వరుస విజయం సాధించారు. గతంలో బిజు జనతాదళలో ఉన్న మెహతాబ్.. 2024 ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. ఈ ఎన్నికల్లోనూ కటక్ నుంచే పోటీ చేసి మరోసారి విజయం సాధించారు. -
52.9 డిగ్రీలు.. నిజమేనా!?
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరాదిలో ఎండల తీవ్రత నానాటికీ పెరుగుతోంది. బుధవారం రాజస్తాన్‌లో పలుచోట్ల ఉష్ణోగ్రత 50 డిగ్రీలు దాటేసింది. పాకిస్తాన్ మీదుగా అక్కడి నుంచి వీస్తున్న తీవ్రమైన వేడి గాలులతో దేశ రాజధాని అల్లాడుతోంది. దాంతో వరుసగా రెండో రోజు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆ క్రమంలో ఢిల్లీ సమీపంలోని ముంగేశ్‌పూర్‌లో దేశ చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదైందంటూ వచి్చన వార్తలు కలకలం రేపాయి. మధ్యాహ్నం 2.30 సమయంలో అక్కడ 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు భారత వాతావరణ శాఖ ప్రాంతీయ డైరెక్టర్ కుల్దీప్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. మన దేశంలో రాజస్తాన్ సహా ఏ రాష్ట్రంలోనూ ఇప్పటిదాకా ఇంతటి ఉష్ణోగ్రతలు నమోదవలేదు. అయితే 52.9 డిగ్రీలన్నది అధికారికంగా నిర్ధారణ కాలేదని కేంద్ర మంత్రి కిరణ్ రిజజు స్పష్టం చేశారు. ‘‘ఢిల్లీలో అంత ఉష్ణోగ్రత నమోదైందంటే నమ్మశక్యంగా లేదు. వాస్తవమేమిటో తెలుసుకోవాలని ఐఎండీ అధికారులకు సూచించాం. దీనిపై త్వరలో స్పష్టత వస్తుంది’’ అంటూ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. దాంతో నిజానిజాలను పరిశీలిస్తున్నట్టు ఐఎండీ డైరెక్టర్ జనరల్ ఎం.మహాపాత్ర తెలిపారు. ‘‘డేటాలో తప్పులు దొర్లి ఉండొచ్చు. అంతటి ఉష్ణోగ్రత నిజమే అయితే స్థానిక పరిస్థితులేవైనా కారణమై ఉండొచ్చు. ముంగేశ్‌పూర్ వాతావరణ కేంద్ర సెన్సర్లను స్పెషలిస్టుల బృందం నిశితంగా అధ్యయనం చేస్తోంది’’ అని వివరించారు. బుధవారం రాజస్తాన్‌లోని ఫలోదీలో 51 డిగ్రీలు, పరిసర ప్రాంతాల్లో 50.8 డిగ్రీలు, హరియాణాలోని సిర్సాలో 50.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఢిల్లీలోని నజఫ్గఢ్లో 49.1 డిగ్రీలు, పుసాలో 49, నరేలాలో 48.4 డిగ్రీలు నమోదైంది. ఢిల్లీలోని సఫ్దర్జంగ్లో ప్రాంతంలో 46.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అక్కడ గత 79 ఏళ్లలో ఇదే అత్యధికం. హరియాణా, పంజాబ్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ కూడా ఎండ దెబ్బకు అల్లాడుతున్నాయి. హీట్ వేవ్ నేపథ్యంలో ఢిల్లీతో పాటు ఉత్తరాది రాష్ట్రాలకు రెడ్ అలెర్ట్ జారీ అయింది. ఎండలకు తోడు తీవ్రస్థాయిలో వడగాలులు వీస్తున్నాయి. దాంతో జనం బయటకు రావాలంటే వణికిపోతున్నారు. నిత్యం లక్షలాది వాహనాలతో రద్దీగా ఉండే ఢిల్లీ రోడ్లు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం దాకా నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. రికార్డు విద్యుత్ డిమాండ్ ఎండల ధాటికి ఢిల్లీలో విద్యుత్ డిమాండ్ చుక్కలనంటుతోంది. బుధవారం మధ్యాహ్నం 3.36 గంటలకు 8,302 మెగావాట్ల పవర్ డిమాండ్ నమోదైంది. ఇది ఢిల్లీ చరిత్రలోనే రికార్డని డిస్కం అధికారులు చెప్పారు.సాయంత్రం భారీ వర్షం ఢిల్లీలో బుధవారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నగరవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన రెండు గంటల తర్వాత వర్షం ప్రారంభమైంది. దీంతో ప్రజలు కొంత ఉపశమనం పొందారు. రెండు, మూడు రోజుల్లో వర్షాలు అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం నేపథ్యంలో వాయువ్యం నుండి తూర్పు దిశగా వీచే గాలుల కారణంగా గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుతాయని ఐఎండీ తెలిపింది. వచ్చే రెండు, మూడు రోజుల్లో ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, ఢిల్లీ, హరియాణా రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించింది. -
వచ్చే ఏడాదే ‘సముద్రయాన్’: కిరణ్ రిజిజు
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక సముద్రయాన్ ప్రాజెక్టును వచ్చే ఏడాది చివరికల్లా చేపడతమని కేంద్ర భూవిజ్ఞాన శాఖ మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. సముద్ర గర్భంలో అన్వేషణ కోసం దేశంలోనే తొలి మానవ సహిత డీప్ ఓషియన్ మిషన్‌కు సముద్రయాన్ అని పేరుపెట్టారు. సముద్ర ఉపరితలం నుంచి 6 కిలోమీటర్ల లోతుకు సైంటిస్టులను పంపించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ ప్రాజెక్టులో భాగంగా ‘మత్స్య6000’ జలాంతర్గామి నిర్మాణం దాదాపు పూర్తయ్యిందని, ఈ ఏడాది ఆఖరుకల్లా పరీక్షించబోతున్నామని కిరణ్ రిజిజు తెలిపారు. సముద్రంలో 6 కిలోమీటర్ల లోతుకు కాంతి కూడా చేరలేదని, మనం జలాంతర్గామిలో సైంటిస్టులను పంపించబోతున్నామని వెల్లడించారు. సముద్రయాన్‌కు 2021లో కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ‘మత్స్య6000’ జలాంతర్గామిలో ముగ్గురు పరిశోధకులు ప్రయాణించవచ్చు. వచ్చే ఏడాది ఆఖర్లో హిందూ మహాసముద్రంలో వారు అన్వేషణ సాగించబోతున్నారు. ప్రపంచంలో ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, జపాన్ మాత్రమే ఇలాంటి ప్రాజెక్టులను విజయవంతంగా చేశాయి. -
భారత్‌కు కొత్త టెన్షన్.. ట్విస్ట్ ఇచ్చిన మహమ్మద్ ముయిజ్జు!
మాలె: మాల్దీవుల నూతన అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు కీలక వ్యాఖ్యలు చేశారు. తమ దేశం మాల్దీవుల్లో ఉన్న సైనికులను భారత్ ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ క్రమంలోనే తమ ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా బలమైన తీర్పునిచ్చారని, దానిని భారత్ గౌరవిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అయితే, మాల్దీవుల కొత్త అధ్యక్షుడిగా ముయిజ్జు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈనేపథ్యంలో శనివారం కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆయనతో మర్యాపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భారత సైనికులను ఉపసంహించుకోవాలని కోరినట్లు అధ్యక్ష కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఎన్నికల సందర్భంగా మాల్దీవుల నుంచి ఇండియన్ మిలిటరీని తిరిగి పంపిస్తామని ముయిజు అక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు. ఆయన గెలుపు నేపథ్యంలో ఆ హామీని అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. #WATCH | Malé | Union Minister Kiren Rijiju called on President Mohamed Muizzu of Maldives today. pic.twitter.com/U1BPO8Rr9W — ANI (@ANI) November 18, 2023 కాగా, హిందూ మహాసముద్రంలో కీలకమైన పొరుగుదేశం కావడంతోపాటు, అక్కడ అనేకమంది భారతీయులు నివసిస్తుండటం గురించి రిజిజు ప్రస్తావించారు. అందువల్ల నిర్మాణాత్మక సంబంధాలను పెంచుకునేందుకు, దేశాల ప్రజల మధ్య సంబంధాల బలోపేతానికి ఎదురుచూస్తున్నామని చెప్పారు. కాగా, హిందూ మహాసముద్రంలో చైనా ఆధిపత్యం పెరుగుతున్న నేపథ్యంలో దానిని అడ్డుకోవడానికి మాల్దీవులు చాలా అవసరం. ఈనేపథ్యంలో 70 మంది సైనికులను భారత్ అక్కడ మోహరించింది. అక్కడి నుంచి రాడార్లు, నిఘా విమానాలను నిర్వహిస్తున్నది. దీంతోపాటు ఎకనమిక్ జోన్‌కు భారత యుద్ధ నౌకలు గస్తీ కాస్తున్నాయి. -It was expected -#Maldives Pres Mohamed Muizzu under pressure from #China formally asks #India to withdraw forces from his country within 24 hrs of taking oath -Maldives forgets how India protected & helped them for decades, while China is taking them deeper into the debt trap pic.twitter.com/7EUQFfXbP9 — Insightful Geopolitics (@InsightGL) November 19, 2023 ఇదిలా ఉండగా.. మాల్దీవులు ఎన్నికల సందర్భంగా తాను అధికారంలోకి వస్తే అక్కడ ఉన్న భారత్ బలగాలను వెనక్కి పంపిస్తానని మయిజ్జు ఎన్నికల సమయంలో హమీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన అధికారం చేపట్టిన తర్వాతి రోజునే చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. మరోవైపు.. చైనా అనుకూలవాదిగా పేరొందిన మాజీ అధ్యక్షుడు యామీన్‌కు మయిజ్జు సన్నిహితుడు కావడం గమనార్హం. 2013లో అధికారంలోకి వచ్చిన యామీన్ గయూమ్ భారత్ వ్యతిరేక ప్రచారాన్ని ప్రారంభించి చైనాకు దగ్గరయ్యాడు. -
దుమ్ముంటే ఆ వివరాలు బయటపెట్టు.. రిజిజుకు కాంగ్రెస్ ఎంపీ సవాల్
న్యూఢిల్లీ: ప్రతి 15 రోజులకోసారి ఈశాన్య రాష్ట్రాలను సందర్శించాలంటూ ప్రధాని మోదీ తమను ఆదేశించారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన లోక్‌సభలో మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి కేబినెట్ సమావేశంలో కేంద్ర మంత్రులతో మోదీ ఒక బృందాన్ని ఏర్పాటు చేశారని, ఇందులో ఐదుగురు కేబినెట్ మంత్రులు, ఏడుగురు సహాయ మంత్రులు ఉన్నారని తెలిపారు. ప్రతి 15 రోజులకోసారి ఈశాన్యంలో పర్యటించాలంటూ ఈ బృందాన్ని ఆదేశించారని పేర్కొన్నారు. ప్రధాని ఆదేశాల ప్రకారం ఈశాన్యంలో పర్యటిస్తున్నట్లు వివరించారు. ఢిల్లీ నుంచి పాలించడం కాదు, నేరుగా ప్రజలకు వద్దకు వెళ్లాలని అధికారులను సైతం మోదీ ఆదేశించారని పేర్కొన్నారు. కిరణ్ రిజిజు వ్యాఖ్యలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మణిపూర్‌లో గత 97 రోజుల్లో కేంద్ర మంత్రులు ఎవరెవరు ఎప్పుడు పర్యటించారో చెప్పాలని, దమ్ముంటే వివరాలు బయటపెట్టాలని రిజిజుకు సవాలు విసిరారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. During the No Confidence Motion in Lok Sabha, Union Minister Kiren Rijiju has boasted about the Prime Minister’s directions to Cabinet Ministers and Ministers of State to visit Northeast every 15 days. Yes, we all know about the frequency of visits of Union Ministers before any… — Jairam Ramesh (@Jairam_Ramesh) August 8, 2023 -
లోక్‌సభలో గరంగరం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ సహా విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం లోక్‌సభలో చర్చ ప్రారంభమైంది. ఈ సందర్భంగా అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. వాడీవేడిగా చర్చ జరిగింది. మణిపూర్ హింసపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనవ్రతాన్ని విచ్ఛిన్నం చేయ డానికే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టామని ప్రతిపక్షాలు వెల్లడించాయి. ప్రజల సంక్షేమం కోసం కష్టపడి పనిచేస్తున్న పేదల బిడ్డ నరేంద్ర మోదీపై విశ్వాసం లేదంటూ సభలో ఓటు వేస్తారా? అని అధికార బీజేపీ సభ్యులు ప్రతిపక్షాలపై మండిపడ్డారు. మణిపూర్ హింసాకాండకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ తక్షణమే రాజీనామా చేయాలని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే సహా పలువురు విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. దేశంలో సమాఖ్య వ్యవస్థను ప్రధాని మోదీ ధ్వంసం చేస్తున్నారని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగతారాయ్ ఆరోపించారు. శివసేన ఎంపీ, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే సభలో కాసేపు హనుమాన్ చాలీసా పఠించారు. అవిశ్వాస తీర్మానంపై సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్, సీపీఎం నేత ఎ.ఎం.అరీఫ్, బీజేపీ సభ్యుడు నారాయణ్ రాణే, కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ తదితరులు మాట్లాడారు. అవిశ్వాస తీర్మానంపై కాంగ్రెస్ తరపున మాట్లాడేవారి జాబితాలో తొలుత రాహుల్ గాంధీ పేరును చేర్చారు. కానీ, చివరి క్షణంలో తొలగించారు. తీర్మానంపై కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, జ్యోతిరాదిత్య సింధియా తదితరులు బుధవారం మాట్లాడనున్నారు. మణిపూర్‌లో శాంతిని పునరుద్ధరించండి మణిపూర్‌లో హింస, సరిహద్దుల్లో చైనా సైనికుల చొరబాట్లపై ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు నోరువిప్పడం లేదని కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ఆ పార్టీ పక్ష ఉపనేత గౌరవ్ గొగోయ్ నిలదీశారు. ప్రధాని మౌనం వీడేలా చేయడానికే కేంద్ర ప్రభుత్వంపై లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టామని చెప్పారు. మంగళవారం సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చను గౌరవ్ గొగోయ్ ప్రారంభించారు. ‘‘ప్రధాని మోదీ మణిపూర్‌ను ఇప్పటిదాకా ఎందుకు సందర్శించలేదు? రాష్ట్రంలో హింసాకాండపై కేవలం 30 సెకండ్లపాటు స్పందించడానికి 80 రోజులదాకా ఎందుకు వేచిచూశారు? మణిపూర్ ముఖ్యమంత్రిని పదవి నుంచి ఎందుకు తొలగించలేదు?’’అంటూ మూడు ప్రశ్నలు సంధించారు. మోదీ తక్షణమే మణిపూర్‌లో పర్యటించాలని, అఖిలపక్ష బృందాన్ని వెంట తీసుకెళ్లాలని, రాష్ట్రంలోని ప్రజా సంఘాలతో చర్చించి, శాంతిని పునరుద్ధరించడానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. గౌరవ్ గొగోయ్ ఇంకా ఏం మాట్లాడారంటే... తప్పులను అంగీకరించడం మోదీకి ఇష్టం లేదు ‘‘మణిపూర్‌లో తెగల మధ్య ఘర్షణను, హింసను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్ర హోంశాఖ, జాతీయ భద్రతా సలహాదారు ఘోరంగా విఫలమయ్యారు. చేసిన పొరపాట్లను అంగీకరించడానికి ప్రధాని మోదీ ఇష్టపడడం లేదు. మణిపూర్ ప్రభుత్వం విఫలమైందని బహిరంగంగా చెప్పలేకపోతున్నారు. తప్పులను అంగీకరించడం కంటే మౌనం ఉండడానికే ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కాదు, కేవలం మణిపూర్‌కు న్యాయం చేకూర్చాలన్న ఆశయంతోనే ఈ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాం. మణిపూర్‌లో విభజన జరిగితే దేశంలో విభజన జరిగినట్లే. అందుకే ఈ అంశంపై ప్రధానమంత్రి పార్లమెంట్లో మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నాం. కానీ, ఆయన మౌనవ్రతం కొనసాగిస్తున్నారు. ప్రధాని మౌనం వీడాలన్నదే అవిశ్వాస తీర్మానం అసలు ఉద్దేశం. మణిపూర్‌లో పర్యటించడానికి అభ్యంతరం ఏమిటో మోదీ చెప్పాలి. మణిపూర్ అంశంపై కేంద్ర మంత్రులు మాట్లాడితే సరిపోదు, ప్రధానమంత్రి మాట్లాడాలి. మంత్రుల అధికారాలు, ప్రధానమంత్రి అధికారాలు సరిసమానం కాదుకదా! మణిపూర్‌లో శాంతి కోసం మోదీ కనీసం పిలుపు కూడా ఇవ్వకపోడం విచారకరం. ప్రజలు సమస్యల్లో ఉన్నప్పుడు మోదీ అధికారం కోసం ఓట్ల వేట సాగించారు. దేశం కంటే అధికారమే ముఖ్యమనుకున్నారు. ఇదేనా జాతీయవాదం? ఒకే దేశం(వన్ ఇండియా) అని చెబుతున్న మోదీ ప్రభుత్వం రెండు మణిపూర్‌లను సృష్టిస్తోంది. 2002లో గుజరాత్లో మత కలహాలు చెలరేగినప్పుడు అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి అక్కడ పర్యటించారు. ఇప్పటి ప్రధాని మోదీ మాత్రం కల్లోల మణిపూర్‌కు దూరంగా ఉంటున్నారు. సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చినప్పుడల్లా మోదీ మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు. మణిపూర్‌లో శాంతి కోసం చొరవ తీసుకోవాల్సిన ప్రధానమంత్రి విపక్ష కూటమిపై విమర్శలు చేయడంలో బిజీగా ఉన్నారు. ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకోవడానికి విద్వేషం ఒక ఆయుధంగా మారడం దురదృష్టకరం. మీ ‘విద్వేష దుకాణం’ముందు మా ‘ప్రేమ దుకాణాన్ని’తెరుస్తాం. దేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందని మీరు పెద్దపెద్ద మాటలు చెబుతున్నారు, అదే మాట ఒక నిరుపేద కూరగాయల విక్రేత ఎదుట చెప్పగలరా?’’అని గౌరవ్ గొగోయ్ ప్రశ్నించారు. రాజధర్మం పాటించడం లేదు ‘‘దివంగత ప్రధాని వాజ్‌పేయి ‘రాజధర్మానికి’మద్దతుగా నిలిచారు. కానీ, ఇప్పుడు మహిళలను నగ్నంగా ఊరేగించినా మనం రాజధర్మం పాటించడం లేదు. మణిపూర్‌లో జరిగిన అకృత్యాలను ప్రపంచమంతా ఖండించింది. దీనిపై యూరోపియన్ యూనియన్ పార్లమెంట్‌లోనూ చర్చ జరిగింది. ప్రధాని మోదీ వైఖరిని బ్రిటిష్ పార్లమెంట్ సైతం తప్పుపట్టింది. చెడును సంహరించాలన్నదే మా లక్ష్యం. అందుకే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తున్నాం’’ – టి.ఆర్.బాలు, డీఎంకే సభ్యుడు అవిశ్వాసానికి ఇది సమయం కాదు ‘‘ప్రభుత్వంపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి ఇది సరైన సమయం కాదు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ నేతగా ఎదిగారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారబోతోంది. అందుకే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఇప్పుడు అవసరం లేదు. ప్రతిపక్షాలు ఇకనైనా ఇలాంటి తీర్మానాలను పక్కనపెట్టి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో పాల్గొనాలి. తప్పుడు సమయంలో అవిశ్వాసం పెట్టినందుకు కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్షాలు చింతించడం తథ్యం. బీజేపీని, మోదీని ఇష్టపడకపోయినా సరే దేశానికి మాత్రం మద్దతు ఇవ్వండి. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి మోదీ ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. ఈశాన్యం గ్రోత్ ఇంజిన్‌గా మారాలని ఆశిస్తోంది. వాస్తవానికి మణిపూర్‌లో ఇప్పటి సమస్యలకు గత కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్వాకాలే కారణం. మణిపూర్‌ను సందర్శించేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాతోపాటు వస్తారా?’’ – కిరణ్ రిజిజు, కేంద్ర మంత్రి విపక్షాలు ఇక ఇంటికే.. ‘‘ఇండియా అని పేరుపెట్టుకున్న విపక్ష కూటమిలో జగడాలు ముదురుతున్నాయి. విపక్ష నేతలు తమలో తాము కలహించుకుంటున్నారు. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ జైలు శిక్షపై సుప్రీంకోర్టు కేవలం స్టే ఇచ్చింది. ఆయనను నిర్దోషిగా తేల్చలేదు. క్షమాపణ చెప్పడానికి సావర్కార్‌ను కాదని రాహుల్ దురుసుగా మాట్లాడారు. నిజానికి ఆయన ఎప్పటికీ సావర్కార్ కాలేరు. ఒకప్పుడు కాంగ్రెస్‌ను తీవ్రంగా వ్యతిరేకించిన పార్టీలే ఇప్పుడు అదే కాంగ్రెస్‌తో నిస్సిగ్గుగా చేతులు కలిపాయి. పేదలకు మంచి చేసిన నాయకుడికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానమిది. వచ్చే లోక్‌సభ ఎన్నికల తర్వాత విపక్షాలు మళ్లీ సభలో అడుగుపెట్టవు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 400కు పైగా సీట్లు లభించడం ఖాయం’’ – నిషికాంత్ దూబే, బీజేపీ ఎంపీ -
యూనిఫామ్ సివిల్ కోడ్: తొలి అడుగు వేసిన కేంద్రం
న్యూఢిల్లీ: ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ఉమ్మడి పౌరస్మృతిని గురించిన ప్రస్తావన చేసి సంచలనానికి తెరతీసిన విషయం తెలిసిందే. ప్రకటన చేసినంతలోనే ఉమ్మడి పౌరస్మృతిని అమలులో సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసేందుకు నలుగురు కేంద్ర మంత్రులతో కూడిన అనధికారిక ప్యానెల్ ను ఏర్పాటు చేసింది కేంద్రం. మత ప్రాతిపదికన అందరికీ ఒకే రీతిలో చట్టాలు ఉండాలన్న ఆలోచనతో ఉమ్మడి పౌరస్మృతిని ఆచరణలోకి తీసుకుని రావాలన్నది కేంద్ర ప్రభుకిత్వం యొక్క ముఖ్య లక్ష్యం. బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా ఇది కీలకాంశం కావడంతో వచ్చే ఎన్నికలలోపే దీన్ని అమలు చేయాలన్న ఉద్దేశ్యంతో వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లును ప్రవేశ పెట్టనుంది కేంద్రం. ఈ ప్రయత్నంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మొదటి అడుగు వేసింది. నలుగురు కేంద్ర మంత్రులతో కూడిన అనధికారిక ప్యానెల్ ను ఏర్పాటు చేసింది. ఈ ప్యానెల్ లో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు గిరిజనుల వ్యవహారాలను పరిశీలించేందుకు, మహిళల హక్కులను పరిశీలించేందుకు కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీని, ఈశాన్య రాష్ట్రాల వ్యవహారాలు సమీక్షించేందుకు పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డిని, చట్టపరమైన అంశాలను పరిశీలించేందుకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ను నియమించింది కేంద్ర ప్రభుత్వం. ఉమ్మడి పౌరస్మృతి అమలుచేసే విషయమై ఎదురయ్యే చట్టపరమైన అంశాలను అధ్యయనం చేసే క్రమంలో ఈ మంత్రుల ప్యానెల్ బుధవారం మొదటిసారి సమావేశమయ్యింది. అత్యంత సున్నితమైన ఈ అంశాన్ని సునిశితంగా అధ్యయనం చేసి జులై మూడో వారం లోపే ఈ ప్యానెల్ ప్రధానమంత్రికి పూర్తి నివేదికను సమర్పించనున్నారు. ఇటీవల మధ్యప్రదేశ్ లో ప్రధానమంత్రి ఉమ్మడి పౌరస్మృతి అంశాన్ని లేవనెత్తగానే ప్రతిపక్షాలు మూకుమ్మడిగా దాడి చేసిన విషయం తెలిసిందే. దేశంలో ప్రజలు ఎదురుంటున్న ప్రధాన సమస్యల నుండి వారి దృష్టిని మళ్లించడానికే ప్రధాని ఈ ప్రస్తావన చేసినట్లు ఆరోపించాయి. ఇది కూడా చదవండి: 22 కేజీల గంజాయి తిన్న ఎలుకలు.. తప్పించుకున్న స్మగ్లర్లు -
కేంద్ర కేబినెట్లో మార్పులు.. కిరణ్ రిజిజుకు షాకిచ్చిన మోదీ సర్కార్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్లో మార్పులు చోటుచేసుకున్నాయి. కేంద్ర న్యాయశాఖ నుంచి కిరణ్ రిజిజును తొలగించారు. కేంద్ర నూతన న్యాయశాఖ మంత్రిగా అర్జున్ రామ్ మేఘ్వాల్ను నియమించారు. కిరన్ రిజిజుకు ఎర్త్ సైన్సెస్ శాఖను అప్పగించారు. కాగా అర్జున్ రామ్ మేఘవాల్ రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన మాజీ ఐఏఎస్ అధికారి. ప్రభుత్వ ఉద్యోగం నుంచి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన ఆయన మూడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం నరేంద్ర మోదీ మంత్రివర్గంలో పార్లమెంటరీ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నారు. దీనికి అదనంగా న్యాయశాఖ బాధ్యతలు అప్పగించారు. చదవండి: Rattan Lal Kataria: బీజేపీ ఎంపీ రతన్‌లాల్ కన్నుమూత -
ఎన్నారైలు విదేశాల్లోనే ఓటు వేయొచ్చు.. వారి కోసం ప్రత్యేక పోస్టల్ బ్యాలెట్
ప్రవాస భారతీయ (ఎన్నారై) ఓటర్ల కోసం ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ (ఈటీబీపీఎస్)ను అమలు చేసే ప్రతిపాదన పరిశీలనలో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజీజు పేర్కొన్నారు. రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజీజు సమాధానమిస్తూ.. 1 జనవరి 2023 నాటికి ప్రజాప్రాతినిధ్య చట్టం 1950లోని సెక్షన్ 20A ప్రకారం విదేశాల్లో నివసిస్తున్న 1,15,696 మంది భారతీయ పౌరులు భారతీయ ఓటర్ల జాబితాలో ఓటర్లుగా నమోదు చేసుకున్నారని పేర్కొన్నారు. ఎన్నారై ఓటర్ల కోసం ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని అమలు చేయడానికి ఎన్నికల ప్రవర్తన నియమాలు 1961ను సవరించే ప్రతిపాదనను భారత ఎన్నికల సంఘం చేపట్టిందని న్యాయ మంత్రి కిరణ్ రిజీజు తెలిపారు. ప్రతిపాదన అమలులో ఉన్న లాజిస్టికల్ సవాళ్లను పరిష్కరించేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో ఈ విషయం చర్చిస్తున్నట్లు చెప్పారు. విదేశీ ఓటర్లు వ్యక్తిగతంగా లేదా ప్రాక్సీ (నామినేటెడ్ ఓటరు) ద్వారా ఓటు వేయడానికి వీలుగా ప్రజాప్రాతినిధ్య (సవరణ) బిల్లు, 2018 పేరుతో భారత ఎన్నికల సంఘం సిఫార్సు చేసిన బిల్లును ఆగస్టు 9, 2018న లోక్‌సభలో ప్రవేశపెట్టి ఆమోదించినట్లు న్యాయ మంత్రి తెలిపారు. అయితే 16వ లోక్‌సభ రద్దు కారణంగా ఈ బిల్లు కూడా రద్దయిందని పేర్కొన్నారు. -
పొరపాటు అటువైపే ఉందనిపిస్తుంది యువరానర్!
పొరపాటు అటువైపే ఉందనిపిస్తుంది యువరానర్! -
‘పెద్దలు’ కుమ్మక్కైతే న్యాయం గతేమిటి?
మన రాజ్యాంగం ఎవరో ఒకరు రచించిన పుస్తకం కాదు. అది అంబేడ్కర్ వంటి మహానుభావులు నిర్మించిన ఒక సంవిధానం. రాజ్యాంగ నియమాలతో పాటు కొన్ని సంప్రదాయాలూ అనేక ఏళ్ల నుంచీ కొనసాగుతున్నాయి. అందులో సుప్రీం కోర్టు కొలీజియం వ్యవస్థ ఒకటి. ఈ వ్యవస్థ ద్వారా న్యాయమూర్తుల నియామకాలనూ, బదిలీలనూ చేపడతారు. అయితే ఈ కొలీజియం వ్యవస్థ పార్లమెంట్ చేసిన చట్టం ద్వారానో లేదా రాజ్యాంగ నిబంధనలను అనుసరించో ఏర్పడింది కాదు. అది సుప్రీంకోర్టు తీర్పుల ద్వారా పరిణామం చెందిన వ్యవస్థ. సుప్రీంకోర్టు కొలీజియానికి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి మార్గదర్శకత్వం వహిస్తారు. నలుగురు సుప్రీం కోర్టు సీనియర్ న్యాయమూర్తులు సభ్యులుగా ఉంటారు. హైకోర్టు కొలీజియానికి ఆ కోర్టు ప్రధాన న్యాయమూర్తి నాయకత్వం వహిస్తారు. ఇద్దరు సీనియర్ హైకోర్టు న్యాయమూర్తులు సభ్యులుగా ఉంటారు. కొలీజియం సిఫార్సు చేసినవారిని ప్రభుత్వం నియమిస్తుంది. అయితే ఇటీవల కేంద్ర న్యాయ శాఖా మంత్రి కిరణ్ రిజిజు కొలీజియంలో ప్రభుత్వ ప్రతినిధి ఉండాలనే ప్రతిపాదన చేస్తూ సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖ వివాదాస్పదమయింది. సుప్రీం కోర్టు ధర్మాసనాలు ఇచ్చిన అనేక తీర్పుల వల్ల... నియమాల కన్నా ఎక్కువగా సంప్రదాయాల ఆధారంగానే స్వతంత్ర న్యాయవ్యవస్థ నిర్మితమవుతూ వస్తోంది. ఈ క్రమంలోనే కొలీజియం వచ్చింది. ఇప్పుడు ఆ వ్యవస్థలో ప్రభుత్వ ప్రతి నిధి ఉండాలనే ప్రతిపాదన న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తినే దెబ్బ తీసేవిధంగా ఉందని పలువురు న్యాయనిపుణులు అంటు న్నారు. కొలీజియంలో ప్రభుత్వ ప్రతినిధికి స్థానం గురించి మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం మాట్లాడుతూ... ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజుల అభిప్రాయాలను ప్రస్తావించారు. ఆ సందర్భంగా రాజ్యాంగ మౌలిక నిర్మాణం లేదా స్వభావాన్ని మార్చే అధికారం పార్లమెంటుకు లేదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే సమాఖ్య, కార్యనిర్వాహకవర్గం, స్వతంత్ర న్యాయవ్యవస్థ రాజ్యాంగ ముఖ్య విభాగాలు అని రాజ్యాంగ ధర్మాసనం నిర్దేశించిన సంగతిని పేర్కొన్నారు. కొలీజియంలో పార్లమెంట్, ప్రభుత్వ పెద్దలకు స్థానం కల్పించడానికి చేసిన 99వ రాజ్యాంగ సవరణ చట్టాన్నీ, జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్‌జేఏసీ) చట్టాన్నీ సుప్రీంకోర్టు కొట్టివేసిన విషయాన్నీ ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇప్పుడు అధికారంలో ఉన్న ‘పెద్దలు’ (ముగ్గురు) పరోక్షంగా సుప్రీం ఇచ్చిన ఈ తీర్పును ఒప్పుకోవడం లేదనీ, ఆ నిర్ణయాన్ని మరో దారిలో అమలుచేయాలని చూస్తున్నారనీ ట్విట్టర్ వేదికగా ఆయన అన్నారు. ‘1967–77 సంవత్సరాల మధ్య దేశ చరిత్రను ధన్ఖర్, బిర్లా, రిజిజులు చదివే ఉంటారని నేను భావిస్తున్నాను. రెండు భిన్న విషయాలను ధన్ఖర్ కలగలిపి వేశారు. రాజ్యాంగంలోని ప్రతీ లేదా ఏదైనా ఒక నిబంధనను పార్లమెంటు సవరించ గలదా; ఆ సవరణ న్యాయ వ్యవస్థ సమీక్ష పరిధిలోకి రాదా అన్నది ఒక అంశం. 99వ రాజ్యాంగ సవరణను, జాతీయ న్యాయ నియామకాల కమిషన్ చట్టాన్ని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు సరైనదేనా అన్నది రెండో అంశం. సుప్రీంకోర్టు కేశవానంద భారతి కేసులో తీసుకున్న నిర్ణయం సరైనదనీ, జాతీయ న్యాయ నియామకాల కమిషన్ చట్టం కేసులో తప్పుడు నిర్ణయం తీసుకున్నదనీ అభిప్రాయపడేందుకు ఆస్కారమున్నది. నిజానికి న్యాయశాస్త్ర పండితులు అనేక మంది ఇదే విధంగా అభిప్రాయపడుతున్నారు’ అని చిదంబరం అన్నారు. అంతేకాదు ‘‘న్యాయవ్యవస్థ నిర్ణయాల కంటే పార్లమెంటు నిర్ణయాలే సర్వోన్నతమైనవనే వాదనను అంగీకరించామను కోండి. జరిగేదేమిటి? నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. జమ్మూ –కశ్మీర్లో వలే ఒక రాష్ట్రాన్ని విభజించి పలు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేయడాన్ని మీరు ఆమోదిస్తారా? వాక్ స్వాతంత్య్రాన్నీ, దేశంలోని ఏ ప్రాంతంలోనైనా నివసించే స్వేచ్ఛనూ, ఏ వృత్తినైనా ఆచరించే, ఏ వ్యాపారాన్ని అయినా చేసే స్వేచ్ఛను రద్దుచేయడాన్ని మీరు ఒప్పుకుంటారా? స్త్రీ పురు షులను సమానంగా పరిగణించని, హిందువులు, ముస్లింల పట్ల రాజ్య వ్యవస్థ భిన్న రీతుల్లో వ్యవహరించడాన్ని అనుమతించి... స్వలింగ సంపర్కులకు హక్కులు నిరాకరించే చట్టాలను మీరు ఆమోదిస్తారా? ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, పార్శీలు, జైనులు, బౌద్ధులు, యూదులు, ఇతర మైనారిటీ వర్గాలకు రాజ్యాంగం హామీ ఇచ్చిన హక్కులను రద్దు చేయడాన్ని మీరు అంగీకరిస్తారా? ఏడవ షెడ్యూలు నుంచి రాష్ట్ర జాబితాను తొలగించి, శాసన నిర్మాణాధికారాలు అన్నిటినీ పార్లమెంటుకు అప్పగించడాన్ని మీరు సమ్మతిస్తారా? ఒక నిర్దిష్ట భాషను యావద్భారతీయులు తప్పనిసరిగా నేర్చుకు తీరాలనే ఆదేశాన్ని మీరు పాటిస్తారా? నేరారోపణకు గురైన ప్రతీ వ్యక్తి అమాయ కుడుగా నిరూపణ కానంతవరకు అతడిని అపరాధిగా భావించాలని నిర్దేశిస్తున్న చట్టాన్ని మీరు అంగీకరిస్తారా? పార్లమెంటు నేడు అటువంటి చట్టాలు చేయదు, చేయలేదు. చేసినా వాటిని సమీక్షించి తిరస్కరించే అధికారం న్యాయ వ్యవస్థకు ఉన్నది. ఇందుకు భిన్నంగా ‘పార్లమెంటరీ పూర్ణాధిపత్యం, న్యాయవ్యవస్థ సంయమనం’ సిద్ధాంతం కింద అటువంటి చట్టాలపై న్యాయ సమీక్ష జరగదు’’ అని చిదంబంరం పేర్కొన్నారు. రాజ్యాంగ సంవిధాన మౌలిక స్వభావాన్ని మార్చడానికి వీలులేదని సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్పినా, దశాబ్దాలుగా స్థాపితమైన సంప్రదాయాలు మార్చడానికి ప్రయత్నాలు జరుగు తున్నాయి. 99వ రాజ్యాంగ సవరణను, జాతీయ న్యాయ నియామకాల కమిషన్ చట్టాన్ని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినా... ప్రధానమంత్రీ, ఇతర ముఖ్యమైన మంత్రులూ, నాయకులూ తమ బాధ్యతను మరచి రాజ్యాంగ మౌలిక స్వరూ పాన్ని దెబ్బతీయడానికి ఏదో విధంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కొలీజియంలోని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులు కాకుండా చీఫ్ జస్టిస్, ప్రధాన మంత్రి, న్యాయమంత్రి కలిసి న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో పాల్గొనే విషయాన్ని ఈ ‘ముగ్గురు’ పెద్దలు నిర్ణయిస్తారట. ఇదే జరిగితే న్యాయం బతుకు తుందా? - మాడభూషి శ్రీధర్ డీన్, స్కూల్ ఆఫ్ లా, మహీంద్రా యూనివర్సిటీ -
దేశంలో 4.90 కోట్ల పెండింగ్ కేసులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో దాదాపుగా 4.90 కోట్ల పెండింగ్ కేసులు ఉన్నాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. పెండింగ్ కేసుల త్వరితగతి విచారణ కోసం ప్రభుత్వం, న్యాయవ్యవస్థ కలసికట్టుగా కృషి చేయాలన్నారు. అప్పుడే కక్షిదారులకు సత్వర న్యాయం జరుగుతుందని కేసుల విచారణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. మంగళవారం విలేకరుల సమావేశంలో రిజిజు మాట్లాడుతూ సుప్రీం కోర్టు ఈ–కమిటీ చీఫ్‌గా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీ.వై. చంద్రచూడ్ చేస్తున్న కృషిని ప్రశంసించారు. ‘‘4.90 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇది చాలా పెద్ద సంఖ్య. అంటే చాలా మంది న్యాయం కోసం ఎదురు చూస్తున్నారన్నమాట. న్యాయం జరగడం ఆలస్యమవుతోందని అంటే న్యాయం చెయ్యడం తిరస్కరించడంగానే భావించాలి. వీలైనంత త్వరగా న్యాయం జరిగేలా చూడాలి’’ అని రిజిజు అన్నారు. కేంద్ర ప్రభుత్వం, న్యాయస్థానాల ఉమ్మడి కృషి కారణంగానే పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించగలమని వివరించారు. -
కొలీజియం తీర్మానం తీవ్ర ఆందోళనకరం
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు కొలీజియంపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ), రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్(రా)కు చెందిన రహస్య పత్రాల్లో కొన్ని భాగాలను బహిర్గతం చేయాలని కొలీజియం తీర్మానించడం తీవ్ర ఆందోళనకర అంశమని అన్నారు. నిఘా విభాగాల సిబ్బంది దేశ హితం కోసం రహస్యంగా కార్యకలాపాలు సాగిస్తుంటారని, వారి రిపోర్టులను బయటపెడితే భవిష్యత్తులో కార్యాచరణపై ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సి వస్తుందని చెప్పారు. తద్వారా కొన్ని చిక్కులు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. మద్రాసు హైకోర్టు, ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి ఐబీ, ‘రా’ ఇచ్చిన నివేదికల్లోని కొన్ని భాగాలను ప్రజా సమూహంలోకి తీసుకురావాలని సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవలే తీర్మానించింది. దీనిపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తొలిసారిగా మంగళవారం మాట్లాడారు. కొలీజియం వ్యవహారంపై సరైన సమయంలో పూర్తిస్థాయిలో స్పందిస్తానని, ఇది తగిన సమయం కాదని అన్నారు. -
ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానంపై కేంద్రం క్లారిటీ
న్యూఢిల్లీ: ఎన్నికల గుర్తింపు కార్డుతో ఆధార్ అనుసంధానంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఓటర్ కార్డుతో ఆధార్ లింక్ చేయకపోయినా ఓటర్ల జాబితాలో వారి పేరు కొనసాగుతుందని కేంద్రం స్పష్టం చేసింది. అనుసంధానం పూర్తిగా ఐచ్ఛికమని పేర్కొంది. శుక్రవారం లోక్‌సభలో ఒక ప్రశ్నకు బదులుగా కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెణ్ రిజిజు ఈ మేరకు బదులిచ్చారు. ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం యోచన లేదు దేశంలో ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం విధించాలన్న ప్రతిపాదన కేంద్రం పరిశీలనలో లేదని మరొక ప్రశ్నకు బదులుగా రిజిజు స్పష్టం చేశారు. ఇదీ చదవండి: జడ్జీల నియామకం ప్రభుత్వ హక్కు -
న్యాయమూర్తుల నియామకంలో ఏమిటీ జాప్యం?
న్యూఢిల్లీ: ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీల నియామకం కోసం కొలీజియం చేసిన సిఫార్సులపై కేంద్ర ప్రభుత్వం సత్వరం నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేస్తుండడం పట్ల సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వం తీరు విసుగు తెప్పించేలా ఉందని ఆక్షేపించింది. జడ్జీల నియామకాల ప్రక్రియకు భంగం కలిగించవద్దని సూచించింది. జడ్జీలను నిర్దేశిత గడువులోగా నియమించాలని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు గత ఏడాది ఏప్రిల్ 20న టైమ్‌లైన్ ప్రకటించింది. ఈ టైమ్‌లైన్‌ను కేంద్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ బెంగళూరు అడ్వొకేట్స్ అసోసియేషన్ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ కౌల్, జస్టిస్ ఓజాల ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. కొలీజియం సిఫార్సు చేసిన పేర్లపై ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఎప్పుటికప్పుడు ప్రకటించడం లేదని అటార్నీ జనరల్ వెంకటరమణికి ధర్మాసనం తెలియజేసింది. వ్యవస్థ పనిచేసేది ఇలాగేనా అని ప్రశ్నించింది. తమ అసహనాన్ని ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని గుర్తుచేసింది. త్రిసభ్య ధర్మాసనం నిర్దేశించిన టైమ్‌లైన్‌కు ప్రభుత్వం కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. కొలీజియం ఒకసారి ఒక పేరును సిఫార్సు చేసిందంటే, అక్కడితో ఆ ఆధ్యాయం ముగిసినట్లే. వాటిపై ప్రభుత్వం మళ్లీ సంప్రదింపులు జరిపే పరిస్థితి ఉండకూడదు’’ అని ఉద్ఘాటించింది. కొన్ని పేర్లు ఏడాదిన్నర నుంచి పెండింగ్‌లో ఉంటున్నాయని తెలిపింది. జడ్జీలుగా పదోన్నతి పొందాల్సిన వారు ప్రభుత్వం చేస్తున్న ఆలస్యం కారణంగా వెనక్కి తగ్గుతున్నారని ధర్మాసనం పేర్కొంది. ‘‘ఈ కేసులో ప్రభుత్వానికి నోటీసు జారీ చేస్తున్నాం. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లండి’’ అని ఏజేకు సూచించింది. తాము చట్టపరంగా నిర్ణయం తీసుకొనే పరిస్థితి తేవొద్దని కేంద్రానికి సూచించింది. నియామకాల సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పిటిషన్‌పై తదుపరి విచారణను డిసెంబర్ 8కి వాయిదా వేసింది. ఉన్నత పదవుల్లో ఉంటూ అనుచిత వ్యాఖ్యలా? కేంద్ర న్యాయ మంత్రి కిరణ్ రిజిజుపై ధర్మాసనం ఆగ్రహం కొలీజియం వ్యవస్థ పట్ల కేంద్ర న్యాయ శాఖ కిరణ్ రిజిజు ఇటీవల చేసిన వ్యా్ఖ్యలపై మీడియాలో వచ్చిన వార్తలను సీనియర్ అడ్వొకేట్ వికాస్ సింగ్ సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. రిజిజు వ్యాఖ్యలపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు అలా మాట్లాడడం సమంజసం కాదని పేర్కొంది. నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ (ఎన్‌జేఏసీ) చట్టం కార్యరూపం దాల్చకపోవడం పట్ల కేంద్రం బహుశా అసహనంగా ఉన్నట్లు కనిపిస్తోందని జస్టిస్ ఎస్కే కౌల్ అన్నారు. కానీ న్యాయమూర్తుల నియామకంలో చట్ట నిబంధనలను పాటించకపోవడానికి అది కారణం కారాదని స్పష్టం చేశారు. ఆ పేర్లపై అభ్యంతరాలున్నాయి: కేంద్రం హైకోర్టు న్యాయమూర్తులుగా కొలీజియం సిఫార్సు చేసిన 20 పేర్లను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. ‘‘ఆ పేర్లపై చాలా గట్టి అభ్యంతరాలున్నాయి. కనుక మీ సిఫార్సులను పునఃపరిశీలించండి’’ అని సూచించింది!! కేంద్రం తిప్పి పంపిన ఈ 20 పేర్లలో 11 కొలీజియం రెండోసారి సిఫార్సు చేసినవి కావడం విశేషం! మిగతా తొమ్మిదేమో కొత్త పేర్లు. తాను స్వలింగ సంపర్కినని బాహాటంగా ప్రకటించిన అడ్వకేట్ సౌరభ్ కృపాల్ పేరు కూడా తిప్పి పంపిన జాబితాలో ఉంది. ఆయన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి బి.ఎన్.కృపాల్ కుమారుడు. ఢిల్లీ హైకోర్టు కొలీజియం ఆయన పేరును 2017లో కొలీజియానికి సిఫార్సు చేసింది. దానిపై కొలీజియం మూడుసార్లు విభేదించింది. జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే సీజేఐగా ఉండగా కృపాల్ గురించి ప్రభుత్వం నుంచి మరింత సమాచారం కోరారు. అనంతరం 2021లో జస్టిస్ రమణ సీజేఐగా కృపాల్ పేరును ఢిల్లీ హైకోర్టు జడ్జిగా సిఫార్సు చేశారు. -
Constitution Day: ప్రాథమిక విధులే ప్రాథమ్యం
న్యూఢిల్లీ: ప్రాథమిక విధుల నిర్వహణే పౌరుల ప్రథమ ప్రాథమ్యంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. అప్పుడే దేశం ఉన్నత శిఖరాలకు చేరుతుందన్నారు. వాటిని పూర్తి అంకితభావంతో, చిత్తశుద్ధితో పాటించాలని పిలుపునిచ్చారు. నాడు గాంధీ మహాత్ముడు కూడా ఈ మేరకు పిలుపునిచ్చారని గుర్తు చేశారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా శనివారం సుప్రీంకోర్టులో జరిగిన వేడుకల్లో ఆయన మాట్లాడారు. అన్ని రంగాల్లోనూ వృద్ధి పథంలో శరవేగంగా దూసుకుపోతున్న భారత్‌వైపే ప్రపంచమంతా చూస్తోందన్నారు. వచ్చే ఏడాది జీ 20 శిఖరాగ్ర సదస్సుకు భారత్ అధ్యక్షత వహించనుండటాన్ని ప్రపంచ శ్రేయస్సులో మన పాత్రను అందరి ముందుంచేందుకు అతి గొప్ప అవకాశంగా అభివర్ణించారు. ‘‘ప్రపంచం దృష్టిలో దేశ ప్రతిష్టను మరింత ఇనుమడింపజేసేందుకు మనమంతా కలసికట్టుగా కృషి చేయాలి. ఇది మనందరి బాధ్యత. కేంద్రం అనుసరిస్తున్న ప్రజానుకూల విధానాలు పేదలను, మహిళలను సాధికారత దిశగా నడుపుతున్నాయి. రాజ్యాంగ స్ఫూర్తిని, ప్రాచీనకాలం నుంచి వస్తున్న విలువలను కొనసాగిస్తూ ప్రజాస్వామ్యానికి మాతృకగా భారత్ అలరారుతోంది. ఈ గుర్తింపును మరింత బలోపేతం చేయాలి’’ అని పిలుపునిచ్చారు. స్వాతంత్య్రానంతరపు కాలంలో జాతి సాంస్కృతిక, నైతిక భావోద్వేగాలన్నింటినీ మన రాజ్యాంగం అద్భుతంగా అందిపుచ్చుకుందని కొనియాడారు. స్వతంత్ర దేశంగా భారత్ ఎలా మనుగడ సాగిస్తుందోనన్న తొలినాటి అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ భిన్నత్వమే అతి గొప్ప సంపదగా అద్భుత ప్రగతి సాధిస్తూ సాగుతోందన్నారు. ‘‘వందేళ్ల స్వతంత్ర ప్రస్థానం దిశగా భారత్ వడివడిగా సాగుతోంది. ఇప్పటిదాకా నడిచింది అమృత కాలమైతే రాబోయే పాతికేళ్లను కర్తవ్య కాలంగా నిర్దేశించుకుందాం. ప్రాథమిక విధులను పరిపూర్ణంగా పాటిద్దాం. రాజ్యాంగంతో పాటు అన్ని వ్యవస్థల భవిష్యత్తూ దేశ యువతపైనే ఆధారపడి ఉంది. రాజ్యాంగంపై వారిలో మరింత అవగాహన పెంచాల్సిన అవసరముంది. అప్పుడే సమానత్వం, సాధికారత వంటి ఉన్నత లక్ష్యాలను వారు మరింతగా అర్థం చేసుకుని ఆచరిస్తారు’’ అని చెప్పారు. రాజ్యాంగ పరిషత్తులో మహిళా సభ్యుల పాత్రకు తగిన గుర్తింపు దక్కలేదని ఆవేదన వెలిబుచ్చారు. ‘‘అందులో 15 మంది మహిళలుండేవారు. వారిలో ఒకరైన దాక్షాయణీ వేలాయుధన్ అణగారిన వర్గాల నుంచి వచ్చిన మహిళామణి’’ అని గుర్తు చేశారు. దళితులు, కార్మికులకు సంబంధించి పలు ముఖ్యమైన అంశాలు రాజ్యాంగంలో చోటుచేసుకునేలా ఆమె కృషి చేశారన్నారు. 26/11 మృతులకు నివాళి 2008 నవంబర్ 26న ముంబైపై ఉగ్ర దాడికి 14 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వాటిలో అసువులు బాసిన వారిని మోదీ గుర్తు చేసుకున్నారు. వారికి ఘనంగా నివాళులర్పించారు. ఇ–కోర్టు ప్రాజెక్టులో భాగంగా తీసుకొచ్చిన వర్చువల్ జస్టిస్ క్లాక్, జస్ట్‌ఈజ్ మొబైల్ యాప్ 2.0, డిజిటల్ కోర్ట్, ఎస్3వాస్ వంటి సైట్లు తదితరాలను ప్రారంభించారు. వీటిద్వారా కక్షిదారులు, లాయర్లు, న్యాయవ్యవస్థతో సంబంధమున్న వారికి టెక్నాలజీ ఆధారిత సేవలందించేందుకు వీలు కలగనుంది. వేడుకల్లో కేంద్ర న్యాయ మంత్రి కిరణ్ రిజిజు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
కొలీజియం పరాయి వ్యవస్థ
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకం కోసం ఉద్దేశించిన కొలీజియం వ్యవస్థపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు మరోసారి విమర్శలు గుప్పించారు. అది మన రాజ్యాంగానికి పరాయి వ్యవస్థ అన్నారు. 1991 కంటే ముందు న్యాయమూర్తులను ప్రభుత్వమే నియమించేదని గుర్తుచేశారు. కొలీజియం వ్యవస్థను తీర్పు ద్వారా సుప్రీంకోర్టే సృష్టించుకుందని శుక్రవారం ఢిల్లీలో ‘టైమ్స్ నౌ’ సదస్సులో ఆయనన్నారు. రాజ్యాంగం దేశంలో అందరికీ, ముఖ్యంగా ప్రభుత్వానికి మత గ్రంథం వంటిదే. కోర్టులు, కొందరు న్యాయమూర్తులు తీసుకున్న నిర్ణయానికి మొత్తం దేశం మద్దతున్నట్టు ఎలా భావిస్తాం? కొలీజియం వ్యవస్థను ఏ నియమం కింద నిర్వచిస్తారో చెప్పాలి. అయితే జడ్జీల నియామకానికి మరో ఉత్తమ వ్యవస్థ అందుబాటులోకి వచ్చేదాకా కొలీజియంను ప్రభుత్వం గౌరవిస్తూనే ఉంటుంది’’ అన్నారు. ఆ ఉత్తమమైన వ్యవస్థ ఏమిటన్న దానిపై తాను చర్చించలేనన్నారు. -
మరో ఆర్మీ హెలికాప్టర్ క్రాష్: ఆందోళన వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి
ఈటానగర్: అరుణాచల్ ప్రదేశ్‌లోని మిగ్గింగ్ సమీపంలో అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ (ఏఎల్‌హెచ్) కూలిపోయింది. శుక్రవారం ఉదయం 10:30 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయని, మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని గౌహతి డిఫెన్స్ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. విషాదాన్ని నింపిన ఇటీవలి ప్రమాదం నేపథ్యంలో మరింత ఆందోళన నెలకొంది. అప్పర్ సియాంగ్ జిల్లాలోని ట్యూటింగ్ ప్రధాన కార్యాలయానికి 25 కిలోమీటర్ల దూరంలోని గానం గ్రామం సమీపంలో మిలిటరీ చిరుత హెలికాప్టర్ కూలి పోయిందని తెలిపారు. కాగా అక్టోబరు 5న అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సమీపంలో ఇండియన్ ఆర్మీ హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒక పైలట్ మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. Received very disturbing news about Indian Army’s Advanced Light Helicopter crash in Upper Siang District in Arunachal Pradesh. My deepest prayers 🙏 pic.twitter.com/MNdxtI7ZRq — Kiren Rijiju (@KirenRijiju) October 21, 2022 -
పార్టీల నగదు విరాళాలపై నియంత్రణ.. కేంద్రానికి ఈసీ లేఖ
న్యూఢిల్లీ: ఎన్నికల సంస్కరణలకు సంబంధించి కీలక ప్రతిపాదనలను కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి తెరపైకి తెచ్చింది. ‘‘పార్టీలకు అందే విరాళాల విషయంలో మరింత పారదర్శకత అవసరం. ప్రస్తుతం రూ.20 వేలున్న అనామక నగదు విరాళాల పరిమితిని రూ.2 వేలకు తగ్గించాలి. మొత్తం విరాళాల్లో అవి 20 శాతానికి/రూ.20 కోట్లకు (ఏది తక్కువైతే దానికి) మించరాదు’’ అని పేర్కొంది. ఇలాంటి పలు సంస్కరణలను ప్రతిపాదిస్తూ కేంద్ర న్యాయ మంత్రి కిరెణ్ రిజిజుకు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) రాజీవ్‌కుమార్ లేఖ రాసినట్టు సమాచారం. వీటికి కేంద్రం ఆమోదం లభిస్తే రూ.2,000కు మించి ప్రతి నగదు విరాళానికీ పార్టీలు లెక్కలు చూపించాల్సి ఉంటుంది. -
కోర్టుల్లో 5 కోట్ల పెండింగ్ కేసులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా న్యాయస్థానాల్లో పెండింగ్ కేసుల సంఖ్య 5 కోట్లకు చేరువలో ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. ఒక న్యాయమూర్తి 50 కేసుల్ని పరిష్కరిస్తే, కొత్తగా మరో 100 కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. వివాదాల పరిష్కారానికి న్యాయస్థానాలను ఆశ్రయించాలన్న అవగాహన ప్రజల్లో బాగా పెరిగిందని అందుకే కొత్త కేసుల సంఖ్య పెరుగుతోందన్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సమక్షంలో ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రబ్యునల్ పనితీరుపై శనివారం జరిగిన సెమినార్‌కు కిరణ్ హాజరయ్యారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోందన్నారు. కింద కోర్టుల్లో 4 కోట్లకు పైగా, సుప్రీం కోర్టులో 72 వేల కేసులకు పైగా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకుంటే భారం తగ్గుతుందన్నారు. కేంద్రం ప్రతిపాదనలో ఉన్న మధ్యవర్తిత్వంపై చట్టాన్ని త్వరగా తీసుకువస్తే కోర్టులకి కొంత ఊరట లభిస్తుందని మంత్రి పేర్కొన్నారు. మరోవైపు సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ మరో కార్యక్రమంలో మాట్లాడుతూ కోర్టులో పెరిగిపోతున్న పెండింగ్ కేసులు మోయలేని భారంగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మధ్యవర్తిత్వ వ్యవస్థే కేసుల భారాన్ని తగ్గిస్తుందని పేర్కొన్నారు. -
ఫ్యామిలీ కోర్టుల్లో 11.4 లక్షల పెండింగ్ కేసులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కుటుంబ న్యాయస్థానాల్లో 11.4 లక్షల కేసులు పెండింగ్‌లో ఉండటంపై లోక్‌సభ సభ్యులు ఆందోళన వెలిబుచ్చారు. ఈ కేసుల విచారణను త్వరితగతిన ముగించాలని పిలుపునిచ్చారు. న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు శుక్రవారం లోక్‌సభలో ఫ్యామిలీ కోర్టుల సవరణ బిల్లు–2022ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో జనతాదళ్ (యు)కు చెందిన కౌశలేంద్ర కుమార్ పాల్గొన్నారు. ఫ్యామిలీ కోర్టుల్లో పెండింగ్ కేసుల భారం ప్రస్తుతం 11.4 లక్షలకు పెరిగిందని, ఈ కేసుల పరిష్కారం వేగవంతం చేయాలన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న 715 కుటుంబ న్యాయస్థానాల్లో పేరుకుపోయిన కేసుల పరిష్కారానికి తీసుకునే చర్యలను ప్రభుత్వం వెల్లడించాలని బిజూ జనతాదళ్‌కు చెందిన మహ్తాబ్ కోరారు. చర్చను ప్రారంభిస్తూ బీజేపీకి చెందిన సునితా దుగ్గల్.. కేసుల విచారణను వేగవంతం చేసేందుకు కుటుంబ న్యాయస్థానాల్లో ఖాళీలను భర్తీ చేయాలన్నారు. కుటుంబం, వివాహ సంబంధ సమస్యల పరిష్కారానికి కేంద్రం 1984లో ఫ్యామిలీ కోర్టుల చట్టం ద్వారా ఈ న్యాయస్థానాలను ఏర్పాటు చేసింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన నోటిఫికేషన్ల ద్వారా 2008లో నాగాలాండ్‌లో రెండు, 2019లో హిమాచల్ ప్రదేశ్‌లో మూడు కుటుంబ న్యాయస్థానాలు ఏర్పాటయ్యాయి. గత ఏడాది హిమాచల్ హైకోర్టు విచారణ సందర్భంగా రాష్ట్రంలోని ఫ్యామిలీ కోర్టులకు అధికార పరిధి లేదనే అంశం తెరపైకి వచ్చింది. ఫ్యామిలీ కోర్టు చట్టాన్ని హిమాచల్‌కు పొడిగిస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేయనందునే ఇలాంటి పరిస్థితి వచ్చిందని హిమాచల్ హైకోర్టులో దాఖలైన ఓ పిటిషన్ పేర్కొంది. నాగాలాండ్‌లోని ఫ్యామిలీ కోర్టులు కూడా 2008 నుంచి ఎలాంటి చట్టపరమైన అధికారం లేకుండా పనిచేస్తున్నాయి. ఈ చట్టంలో తాజాగా చేపట్టిన సవరణల ద్వారా ప్రభుత్వం ఇటువంటి లోపాలను సవరించే ప్రయత్నం చేసింది. కుటుంబ న్యాయస్థానాల ఏర్పాటు, వాటి పరిధిపై సంబంధిత హైకోర్టులతో సంప్రదించి రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయిస్తాయని తెలిపింది. -
ఉమ్మడి పౌర స్మృతిపై కమిటీ వేయలేదు: కేంద్రం
న్యూఢిల్లీ: దేశంలో ఉమ్మడి పౌర స్మృతి(యూసీసీ)అమలుపై ప్రత్యేకంగా కమిటీని వేయాలన్న ప్రతిపాదనేదీ తమ వద్ద లేదని కేంద్రం తెలిపింది. అయితే, ఈ అంశానికి సంబంధించిన వివిధ అంశాలను పరిశీలించి ప్రతిపాదనలు తయారు చేయాలని న్యాయశాఖను కోరినట్లు వెల్లడించింది. న్యాయ మంత్రి కిరణ్ రిజిజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ప్రస్తుతానికి యూసీసీని దేశవ్యాప్తంగా అమలు చేయాలన్న అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఈ అంశం కోర్టు పరిధిలో ఉందని చెప్పారు. దేశంలో ఉమ్మడి పౌరస్మృతి తీసుకువచ్చే అధికారం రాజ్యాంగంలోని ఆర్టికల్–44 ద్వారా కేంద్రానికి ఉందన్నారు. దేశంలో ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేస్తామంటూ 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ హామీ ఇచ్చింది. -
జమిలి ఎన్నికలపై కేంద్రం కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: జమిలి ఎన్నికల నిర్వహణపై కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న అంశం లా కమిషన్ పరిశీలనలో ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు లోక్‌సభలో ఎంపీ భగీరథ చౌదరి అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు సమాధానం ఇచ్చారు. జమిలి ఎన్నికల అంశంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, కేంద్ర ఎన్నికల సంఘం సహా అనేక భాగస్వామ్య పక్షాలతో చర్చించినట్లు తెలిపారు. ‘స్టాండింగ్ కమిటీ నివేదికలో కొన్ని ప్రతిపాదనలు, సిఫార్సులు చేసింది. ఆ నివేదిక ఆధారంగా లా కమిషన్ సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తూ ఒక ప్రణాళిక తయారుచేసే పనిలో నిమగ్నమైంది. తరచుగా వచ్చే ఎన్నికలు నిత్యావసర సేవలు సహా ప్రజా జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయని స్టాండింగ్ కమిటీ తన నివేదికలో పేర్కొంది. పార్లమెంటుకు రాష్ట్ర అసెంబ్లీలకు వేరువేరుగా జరిగే ఎన్నికల కారణంగా భారీగా ప్రజాధనం ఖర్చవుతుందని పేర్కొంది. 2014-22 మధ్యకాలంలో 50 అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎనిమిదేళ్లలో రూ. 7వేల కోట్లకు పైగా ఎన్నికల నిర్వహణపై ఖర్చు పెట్టాల్సి వచ్చింది’ అని కేంద్ర న్యాయశాఖ కిరణ్ రిజిజుపేర్కొన్నారు. చదవండి: సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు విడుదల