kites
-
తెగిన గాలిపటం జీవిత భాగస్వామిని చేరుతుందట!
నేడు ఫిబ్రవరి 14.. ఒకవైపు వసంత పంచమి. మరోవైపు ప్రేమికుల రోజు. ఉత్తరప్రదేశ్‌లో వాలెంట్సైన్స్ డే సందర్భంగా గాలిపటాలు ఎగురవేస్తుంటారు. పతంగులను ఎగురవేయడం ద్వారా తమ ప్రేమను చాటుతున్నామని యూపీలోని మీరఠ్‌కు చెందిన యువత చెబుతోంది. యువతీ యువకులు తాము గాలిపటం ఎగురవేసినప్పుడు దాని దారం తెగితే.. అది నేరుగా వారి జీవిత భాగస్వాముల దగ్గరికి చేరుతుందని అంటుంటారు. మీరఠ్‌లో వాలెంటైన్స్‌డే సందర్భంగా ఆకాశమంతా గాలిపటాలతో నిండిపోయింది. ఈసారి ప్రత్యేకమైన గాలిపటాలు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా గుండె ఆకారంలోని గాలిపటాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. కొన్ని గాలిపటాలలో అబ్బాయి, అమ్మాయిల రూపురేఖలు చిత్రీకరించారు. వాటి మధ్యలో హృదయాకారాన్ని తీర్చిదిద్దారు. -
HYD: వరుస విషాదాలు.. గాలిపటాలు ఎగురవేస్తూ 9 మంది మృతి
హైదరాబాద్: పండుగ వేళ నగరంలో వరుస విషాదాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు గాలిపటాలు ఎగురవేస్తూ 7 మంది మృతి చెందారు. తాజాగా మంగళవారం మరో ఇద్దరు మృతి చెందారు. రహ్మత్ నగర్లో స్నేహితులతో కలిసి గాలిపటాలు ఎగరవేయడానికి వెళ్లిన కపిల్ దేవ్ (23) అనే యువకుడు ఐదంతస్తుల భవనంపై నుంచి ప్రమాదశాత్తూ కింద పడడంతో మృతి చెందాడు. మృతిపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆరుగురు స్నేహితుల ప్రమేయంపై అనుమానంతో కుటుంబ సభ్యులు మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు యాప్రాల్ గాలిపటానికి మరొక బాలుడు మృతి హైదరాబాద్ యాప్రాల్‌లో పతంగి ఎగరవేస్తూ భువన్ సాయి అనే బాలుడు భవనంపై నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. కాగా మంగళవారం ఒక్క రోజే ఇద్దరు మృతి చెందారు. TS: ప్రాణాలు తీస్తున్న పతంగులు! -
TS: ప్రాణాలు తీస్తున్న పతంగులు!
హైదరాబాద్, సాక్షి: పతంగి దారాలు పండుగ పూట ఉత్త పుణ్యానికి మనుషుల కుత్తుకలు కోస్తున్నాయి. తెలంగాణలో రెండు రోజుల్లో ఆరుగురు మృత్యువాత పడగా.. తాజాగా సోమవారం మరో ప్రాణం పోయింది. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. గాలిపటాలు ఎగరేసేప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూనే.. నిషేధిత చైనా మాంజా దారం అమ్మినా, వినియోగించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. సంక్రాంతి వేళ గాలి పటం సరదా ప్రాణాలు తీస్తోంది. బిల్డింగ్‌పై నుంచి పడి ఇద్దరు, విద్యుత్ షాక్‌తో ముగ్గురు మృత్యువాత పడ్డారు. మాంజా దారం తగిలి ఆర్మీ జవాన్ మృతి చెందిన సంగతీ తెలిసిందే. అలా గడిచిన రెండు రోజుల్లో ఆరుగురు మృత్యువాత పడ్డారు. సోమవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో మరో మరణం సంభవించింది. విద్యుత్ తీగలకు తగిలిన పతంగి తీసే క్రమంలో 22 ఏళ్ల యువకుడికి షాక్ తగిలింది. ఆస్పత్రికి తరలించే క్రమంలో ఆ యువకుడు కన్నుమూశాడు. ఝరాసంగం మండలం పొట్పల్లిలో ఇది జరిగింది. వరుస ఘటన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. తల్లిదండ్రుల పర్యవేక్షణలోనే పిల్లలు గాలి పటం ఎగరేసేలా చూడాలని కోరుతున్నారు. బిల్డింగ్‌లపై కాకుండా మైదానాల్లో పతంగులు ఎగరేయాలని సూచిస్తున్నారు. అదే సమయంలో.. మాంజాదారం అమ్మినా, వినియోగించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పలు చోట్లా ప్రత్యేక బృందాలు తనిఖీలు చేసి దుకాణాల్ని సీజ్ చేస్తున్నాయి. సరదా పేరిట పతంగులు ఎగరేస్తూ పబ్లిక్ న్యూసెన్స్‌కు పాల్పడ్డా కూడా చర్యలు తప్పవని హెచ్చరించారు. -
ప్రాణం తీసిన చైనా మాంజా!
సాక్షి, హైదరాబాద్/లంగర్‌హౌస్: హైదరాబాద్‌కు అక్రమంగా దిగుమతి అయిన చైనా మాంజా ఓ ఆర్మీ అధికారి ప్రాణం తీసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లా పెదవాల్తేరుకు చెందిన కాగితాల కోటేశ్వర్‌రెడ్డి ఆర్మీలో నాయక్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం లంగర్‌హౌస్‌లో ఉన్న మిలటరీ ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్నారు. భార్య ప్రత్యూష, రెండేళ్ల కుమార్తెతో కలిసి బాపునగర్‌లో నివసిస్తున్నారు. విధులకు హాజరయ్యేందుకు శనివారం ద్విచక్ర వాహనంపై బాపునగర్ నుంచి లంగర్‌హౌస్ వైపు వస్తున్నారు. సాయంత్రం 6.30 గంటల సమయంలో లంగర్‌హౌస్ ఫ్లైఓవర్‌పై ప్రయాణిస్తున్న ఆయన మెడకు ఎగురుకుంటూ వచ్చి న పతంగికు కట్టిఉన్న చైనా మాంజా చుట్టుకుంది. ఆయన అప్రమత్తమయ్యేలోపే మాంజా గొంతుకు బిగుసుకుని కోసుకుపోయింది. దీంతో గొంతుపై తీవ్రగాయమై కోటేశ్వర్‌రెడ్డి వాహనంపైనుంచి కింద పడిపోయారు. రక్తం మడుగులో పడి ఉన్న ఆయన్ను గుర్తించిన స్థానికులు చికిత్స కోసం ఆయన పనిచేసే మిలటరీ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు రెండు గంటలపాటు శ్రమించినా ఫలితం దక్కలేదు. కోటేశ్వర్‌రెడ్డి చికిత్స పొందుతూ శనివారం రాత్రి 9.30 సమయంలో కన్నుమూశారు. కేసు నమోదు చేసుకున్న లంగర్‌హౌస్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబీకులకు అప్పగించారు. కట్టడి చేసినా.. విచ్చలవిడిగా... మనుషులతో పాటు పక్షులు, ఇతర ప్రాణులకు ముప్పు కలిగించే చైనా మాంజాను కట్టడి చేయా లని నగర పోలీసులు గత నెల నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. మాంజా రవాణా, నిల్వ, విక్రయంపై నిఘా ఉంచి అనేక కేసులు నమోదు చేశా రు. అయినప్పటికీ ధనార్జనే ధ్యేయంగా అనేక మంది వ్యాపారులు చైనా మాంజాను అక్రమంగా తీసుకువచ్చి విక్రయించారు. శని, ఆదివారాల్లో ఈ మాంజా ప్రభావం నగరవ్యాప్తంగా కనిపించింది. అనేక మంది వాహనచోదకులు దీని బారినపడి గాయప డ్డారు. రాజధానిలోని అనేక ప్రాంతాల్లో పక్షులు ఈ మాంజా కారణంగా తీవ్రంగా గాయపడటం, చనిపోవడం కనిపించింది. నగరంలోని దాదాపు అన్ని ఫ్లైఓవర్లు ‘డేంజర్ జోన్లు’గా మారాయి. మాంజా కారణంగా వాహనాలు సడన్‌గా వేగాన్ని తగ్గించడం.. వెనుక వచ్చే వాహనాలు ఢీకొట్టడంతో పలుచోట్ల ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. -
HYD: ఇద్దరి ప్రాణం తీసిన గాలిపటాలు
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండగ పూట గాలిపటాల సరదా రాజధాని నగరంలో ఇద్దరి ప్రాణాలు తీసింది. రోడ్డుపై వెళుతూ చైనా మాంజా దారం తగిలి ఆర్మీ లో డ్రైవర్‌గా పని చేసే కోటేశ్వేర్ రెడ్డి మృతి చెందాడు. మరో ఘటనలో గాలిపటం ఎగురవేస్తూ అల్వాల్ పీఎస్‌లో పనిచేసే ఏఎస్సై కుమారుడు ఆకాష్ ఇంటిపై నుంచి కిందపడి మరణించాడు. దీంతో రెండు కుటుంబాల్లోనూ విషాదం నెలకొంది. శనివారం సాయంత్రం ఇంటి నుంచి డ్యూటీకి వెళ్తున్న సమయంలో లంగర్‌హౌజ్‌స్ ఫ్లైఓవర్‌పై అడ్డుగా ఉన్న చైనా మాంజా మెడకు తగలడంతో తీవ్రంగా గాయపడ్డ కోటేశ్వర్‌రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కోటేశ్వర్‌రెడ్డి స్వస్థలం విశాఖపట్నం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వేరే ఘటనలో గాలిపటం ఎగురవేస్తూ, ప్రమాదవశాత్తు భవనం పైనుండి పడి ఆకాష్(20) అనే యువకుడు మృతి చెందాడు. పేట్ బహీరాబాద్‌లో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పండుగ రోజు కుమారుడు మృతి చెందడంతో ఆకాష్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. సహచర ఉద్యోగి కుమారుడు మృతి చెందడంతో అల్వాల్ పోలీసుస్టేషన్‌లోలోనూ విషాద చాయలు అలుముకున్నాయి. ఇదీచదవండి.. తెలంగాణలో హత్యా రాజకీయాలు చెల్లవు: కేటీఆర్ -
25 అడుగుల జాయింట్ కైట్ ఎగురుతుందిలా..
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లోని ఎంవీఎం గ్రౌండ్లో ‘సంక్రాంతి మహోత్సవ్-2024’కు సర్వం సిద్ధమైంది. నేటి ఉదయం (జనవరి 14) రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు సూర్యునికి అర్ఘ్యం సమర్పించి ఉత్సవాన్ని ప్రారంభించనున్నారు. ఉత్సవంలో భాగంగా మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి ఒకరికొకరు పసుపు, కుంకుమ పూసుకుంటారు. తరువాత పతంగుల పోటీ జరగనుంది. ఈ సందర్భంగా గుజరాత్‌కు చెందిన పతంగుల కళాకారులు ప్రత్యేకంగా తయారుచేసిన జాయింట్ గాలిపటాన్ని ఎగురవేయనున్నారు. దాని పరిమాణం 25 అడుగుల వరకు ఉంటుంది. ఈ జాయింట్ పతంగులలో కార్టూన్లు, సింహాలు, వివిధ బొమ్మలు ఉంటాయి. ‘సంక్రాంతి మహోత్సవ్-2024’లో మహిళల ఆధ్వర్యంలో ఫుడ్ స్టాల్స్ ఏర్పాటయ్యాయి. అలాగే జిల్లా స్థాయి పతంగుల ఎగురవేత పోటీ ఏర్పాటు చేశారు. సాయంత్రం లోహ్రీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భోగి మంటలు వేయడంతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గాలిపటాలు ఎగురవేయాలనే ఉత్సాహం కలిగినవారికి నిపుణులు శిక్షణ అందిస్తారు. ‘సంక్రాంతి మహోత్సవ్-2024’ జనవరి 15న ముగుస్తుంది. ఇది కూడా చదవండి: తొలి గాలిపటాన్ని ఎవరు తయారు చేశారు? ఎందుకు ఉపయోగించారు? -
సంక్రాంతికి పతంగులు ఎందుకు ఎగురవేస్తారో తెలుసా?
సంక్రాంతి సంబరం అంటే చుట్టాలు పక్కాలు, అరిసెలు, స్వీట్లు, భోగి పళ్లు, గంగిరెద్దులు, గొబ్బెమ్మల ముచ్చటే కాదు. వీటన్నింటికి మించి మరో పండుగ కూడా ఉంది. అసలు సంక్రాంతి అంటేనే చాలా ప్రదేశాల్లో పతంగుల పండుగ. , రెండు నెలల ముందు నుంచి పిల్లలు, పెద్దలు గాలి పటాలను ఎగుర వేస్తారు. ఎవరికి నచ్చిన సైజులు, ఆకారాల్లో రకరకాల గాలి పటాలను ఎగురవేస్తూ ఆనందంలో మునిగి తేలతారు. ఆకాశంలో ఎటు చూసినా పట్ట పగలే నక్షత్రాలొచ్చాయా అన్నట్టు గాలిపటాలు దర్శనిమిస్తాయి. తెలంగాణా, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పతంగులు గురవేయడాన్ని పండగలా నిర్వహిస్తారు సంక్రాంతికి గాలి పటాలు ఎందుకు ఎగురవేస్తారు..? చరిత్ర ఏమిటి..? ఎక్కడి నుంచి మొదలైంది? తొలి రోజుల్లో వీటిని ఆత్మరక్షణకు, సమాచారాన్ని పంపించడం కోసం ఉపయోగించేవారట. దాదాపు 2 వేల సంవత్సరాల కిందట చైనాలో వీటిని తయారు చేశారట. సిగ్నలింగ్, మిలటరీ ఆపరేషన్స్‌లోనూ వీటిని వినియోగించారు. చైనాలో హేన్ వంశపు రాజుల చరిత్ర ప్రారంభం కావటానికి గాలిపటమే దోహదం చేసిందని పరిశోధకులు చెబుతారు. మకర సంక్రాంతికి శీతాకాలం ముగిసి వసంత రుతువు ప్రారంభానికి సూచికగా చూస్తారు గాలిపటాలను పగటిపూట ఎగరవేయడంలో ఒక ఆరోగ్యపరమైన కారణం కూడా ఉంది. పతంగులు ఎగురవేయడం అనేది దేవుళ్లకు కృతజ్ఞతలు చెప్పడానికి ఒక మార్గం అని కొందరు విశ్వసిస్తారు. గాలిపటాలు ఎగరేసేటపుడు ఎక్కువ సమయం మన బాడీ సన్లెటై్కి ఎక్స్పోజ్ అవుతుంది. అంతేకాదు లేలేత సూర్యకిరణాల్లో విటమిన్ డి లభిస్తుంది. సూర్యుడి లేతకిరణాలు చర్మంపై పడితే చర్మ సమస్యలు, ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని నమ్మకం. అలాగే చలిగాలుల వల్ల కలిగే అనేక అంటువ్యాధులు, అనారోగ్యాలతో పోరాడేందుకు ఎంతో సహాయ పడుతుంది.ఆకాశంలో ఎగిరే గాలిపటాలను చూడటం కంటిచూపును మెరుగు పరుస్తుందని చైనీయుల విశ్వాసం. తల పైకి ఎత్తి చూసేటపుడు నోరు కొద్దిగా తెరచు కుంటుందని, అది శరీరానికి శక్తిని ఇస్తుందని కూడా వారు నమ్ముతారు. మొదట్లో వీటిని ఆత్మరక్షణకు, సమాచారాన్ని పంపించడం కోసం ఉపయోగించేవారట. ఆ తర్వాత సిగ్నలింగ్, మిలటరీ ఆపరేషన్స్‌లోనూ వీటిని వినియోగించారు. ఒకప్పటి గాలిపటాలు మందంగా, దీర్ఘచతురస్రాకారంలో ఉండేవి. క్రీస్తుపూర్వం 206లో చైనాలో హేన్ వంశపు రాజుల చరిత్ర ప్రారంభం కావటానికి గాలిపటమే దోహదం చేసిందని పరిశోధకులు చెబుతారు. దుర్మార్గుడైన రాజును ఓడించేందుకు వచ్చిన ఆలోచనే తొలి గాలిపటం. ఇందులో భాగంగా కోటలోకి సొరంగాన్ని తవ్వాలనేది హేన్ చక్రవర్తి ప్లాన్. అలా ఒక పతంగ్‌ను తయారు చేసి దానికి దారం కట్టి ఎగరవేశాడు. ఆ దారం ఆధారంగానే, సొరంగం తవ్వి సైనికులను పంపి కోటను వశం చేసుకున్నాడని చెబుతారు. ఈ నియమాలు తెలుసా? పతంగులు ఎగురవేసేటపుడు కొన్ని నిబంధనలు కూడా పాటించాలి. ఇది ఆయా దేశాలని బట్టి ఉంటాయి. థాయ్‌లాండ్‌లో పతంగులు ఎగురవేయాలంటే 78 రకాల నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. బెర్లిన్ గోడపై నుంచి అవతలికి వెళ్ళే అవకాశం ఉండడంతో భారీ గాలిపటాలను ఎగురవేయడంపై తూర్పు జర్మనీలో నిషేధం విధించారు. జపాన్‌లో కొన్ని గాలిపటాల బరువు కొన్ని కిలోల వరకు ఉంటుందట. -
వయ్యారి గాలిపటం.. పైపైకి ఎగిరే.. (ఫొటోలు)
-
గాలిపటం వెంట పరుగెత్తి... దారితప్పిన బాలుడు .. ఆ తర్వాత!
బంజారాహిల్స్: తెగిన గాలిపటం కోసం పరుగులు తీస్తూ ఓ బాలుడు తప్పిపోయిన ఘటన బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకోగా సీసీ కెమెరాల్లో గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. వివరాల్లోకి వెళ్తే.. కాకినాడకు చెందిన సింహాద్రి, అనసూయ దంపతులకు వినోదకుమార్ అనే 9 ఏళ్ల కొడుకు ఉండగా సంక్రాంతి పండుగకు 3 రోజుల క్రితం బంజారాహిల్స్ లోని ఇందిరానగర్ లో వుండే అమ్మమ్మ ఇంటికి వచ్చారు. సోమవారం మధ్యాహ్నం వినోద్ తన తల్లి, అమ్మమ్మ తోకలిసి కేబీఆర్ పార్క్ వైపు వచ్చారు. అంతలోనే ఓ పతంగి తెగి గాలిలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో దాన్ని పట్టుకోవడానికి పరుగులు తీశారు. కొద్దిసేపట్లో తల్లి గమనించి కొడుకు కోసం గాలించింది. అక్కడే ఉన్న పోలీసులకు చెప్పి అంతటా వెతికింది. కేబీఆర్ పార్క్ ఇంటర్‌సెప్టర్ 10 మెయిన్ గేట్ పోలీసు పీసీలు అక్షయకుమార్, మహేష్ కుమార్, హెచ్‌జీలు దినకర్, నరేష్, కృష్ణంరాజు స్పందించి పార్కు చుట్టూ గాలించారు. అనంతరం సీసీ కెమెరాల్లో పరిశీలించారు. అదే సమయంలో బాలుడు ఓ చోట కనిపించాడు. వెంటనే బాలుడిని గుర్తించి పట్టుకొని తల్లిదండ్రులకు అప్పగించారు. ఓవైపు నెమళ్లు ఇంకోవైపు పతంగులు చూసి ఆనందంలో మునిగిపోయి వాటిని పట్టుకోవడానికి పరుగెత్తానని వినోద్ తెలిపారు. -
శత్రు డ్రోన్లను చీల్చి చెండాడే ‘గద్దలు’.. ఆర్మీ నయా అస్త్రం
న్యూఢిల్లీ: సైనికల బలగాల కన్నుగప్పి దేశంలోకి ఆయుధాలు, మాదకద్రవ్యాలను డ్రోన్ల ద్వారా చేరవేస్తున్నాయి శత్రు దేశాలు. డ్రోన్ల ద్వారానే దాడులకు పాల్పడుతున్న సంఘటనలూ ఇటీవల వెలుగు చూశాయి. ఈ క్రమంలో శత్రు డ్రోన్లను నివారించేందుకు కొత్త అస్త్రాన్ని సిద్ధం చేస్తోంది భారత సైన్యం. తొలిసారి శత్రు డ్రోన్లను ధ్వంసం చేసేందుకు గద్దలకు శిక్షణ ఇస్తోంది. ఉత్తరాఖండ్‌లోని ఔలీలో అమెరికా, భారత్‌లు సంయుక్తంగా నిర్వహిస్తున్న యుద్ధ అభ్యాస్ ప్రదర్శనలో ఈ అస్త్రాన్ని భారత సైన్యం ప్రదర్శించింది. ఈ సైనిక ప్రదర్శన సందర్భంగా ‘అర్జున్’ అనే గద్ద శత్రు దేశాల డ్రోన్లను ఏ విధంగా నాశనం చేస్తుందనే విషయాన్ని చూపించారు. శత్రు దేశాలకు చెందిన డ్రోన్లు ఉన్న ప్రాంతాన్ని గుర్తించి, ధ్వంసం చేసేందుకు గద్దతో పాటు ఓ శునకానికి సైతం శిక్షణ ఇచ్చారు. ఈ క్రమంలో డ్రోన్ శబ్దం వినబడగానే సైన్యాన్ని శునకం అప్రమత్తం చేసింది. అలాగే.. డ్రోన్ ఎక్కడి నుంచి వెళ్తుందనే విషయాన్ని గద్ద గుర్తించింది. ఇలాంటి పక్షులను శత్రు డ్రోన్లను గుర్తించి, ధ్వంసం చేసేందుకు ఉపయోగించటం ఇదే తొలిసారి. అయితే, సైనికపరమైన చర్యల కోసం గద్దలు, శునకాలను వినియోగిస్తున్నట్లు భారత సైన్యం తెలిపింది. పంజాబ్, జమ్ముకశ్మీర్‌లోని సరిహద్దుల గుండా దేశంలోకి ప్రవేశించే డ్రోన్లకు అడ్డుకట్ట వేసేందుకు ఈ ప్రక్రియ దోహదబడుతుందని పేర్కొంది. Here comes India's first anti #drone Kite (a bird) which can destroy a quadcopter in air. #IndianArmy #YUDHABHYAS22 pic.twitter.com/OByAwWuJop — Haresh 🇮🇳 (@HARESHRJADAV3) November 29, 2022 ఇదీ చదవండి: ప్రధాని మోదీని రావణుడితో పోల్చిన ఖర్గే.. బీజేపీ ఆగ్రహం -
గాలిపటాలతో విద్యుత్ ఉత్పతి..!
ఆధునిక యుగంలో మనిషి జీవితానికి, విద్యుత్‌కు ఉన్న అనుబంధం విడదీయలేనిది. క్షణం పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయినా.. భరించలేని పరిస్థితి. పదుల సంఖ్యలో విద్యుత్ ఉపకరణాలు లేని ఇల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న విద్యుత్‌కు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కొరత ఏర్పడుతోంది. బొగ్గు సంక్షోభం గతేడాది పలు దేశాలను చీకట్లోకి నెట్టేసింది. జల, సౌర, పవన, అణు, గ్యాస్ తదితర మార్గాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నా కూడా.. మనిషి అవసరాలకు సరిపోవడం లేదు. పెరుగుతున్న జనాభా, వారి అవసరాలకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తిని భారీగా పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ దిశగా ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు, ప్రయోగాలు జరుగుతున్నాయి. – సాక్షి, అమరావతి స్కాట్లాండ్కు చెందిన రాడ్.. గాలిపటాలతో విద్యుత్‌ను పుట్టించే సరికొత్త టెక్నాలజీని కనిపెట్టారు. గాలిమరల ద్వారా విద్యుత్ తయారు చేస్తున్నప్పుడు.. గాలి పటాల ద్వారా ఎందుకు విద్యుత్ తయారు చేయకూడదని ప్రశ్నించుకున్న ఆయన.. ‘ఫ్లయింగ్ టర్బైన్’ టెక్నాలజీని ఆవిష్కరించారు. గాలి పటాలు ఎగురుతున్నప్పుడు విడుదలయ్యే శక్తిని కింద ఉండే గ్రౌండ్ స్టేషన్ విద్యుత్‌గా మారుస్తుంది. ఈ పద్ధతిలో చాలా తక్కువ కర్బన ఉద్గారాలు విడుదలవుతాయి. 10 కిలోమీటర్ల ఎత్తులోనూ గాలి పటాలు విద్యుత్‌ను జనరేట్ చేయగలవు. ఇవి నిరంతరం ఎగురుతూ ఉంటే ఒక ఇంటికి సరిపడే విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. వ్యవసాయం, పరిశ్రమలు, చేపలు పట్టుకునే పడవలు, ఫ్యాక్టరీలు ఇలా అనేక చోట్ల ఈ విధానాన్ని ఉపయోగించుకోవచ్చు. క్లబ్లో కాళ్లు కదిపితే చాలు.. బ్రిటన్‌లోని ఒక నైట్ క్లబ్ సంస్థ.. తమ వద్దకు వచ్చి డ్యాన్స్ చేసే వారి శరీర ఉష్ణోగ్రతల ఆధారంగా విద్యుత్ తయారు చేస్తోంది. ఈ విద్యుత్‌ను అవసరమైనప్పుడు వాడుకునేలా.. భద్రపరుచుకునే ఏర్పాటు కూడా చేసింది. ఈ ఏడాది చివరి నాటికి పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తామని నిర్వాహకులు తెలిపారు. దీని ద్వారా కాలుష్యాన్ని నియంత్రించి, వాతావరణ మార్పులను అరికట్టవచ్చని చెబుతున్నారు. అదేవిధంగా ఏపీలో ఇప్పటికే చెత్త నుంచి కరెంటు తయారు చేసే విధానాలకు శ్రీకారం చుట్టారు. అంతేకాకుండా మన రాష్ట్రంలో ప్రపంచంలోనే అతిపెద్దదైన నీటిలో తేలియాడే ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. బొగ్గు కొరత నుంచి బయటపడటం కోసం బ్లూ హైడ్రోజన్‌ను జపాన్ ప్రత్యామ్నాయంగా భావిస్తోంది. జపాన్‌లోని టోక్యోలో బ్లూ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్‌తో వాహనాలు కూడా ప్రయోగాత్మకంగా నడిపారు. -
సంక్రాంతి వచ్చేస్తోంది.. పతంగులతో పండగే పండగ..
-
ZOOM : ఇకపై... ఏ లాంగ్వేజైనా ఓకే
వర్చువల్ సమావేశాలు మరింత సౌకర్యవంతంగా నిర్వహించుకునేందుకు వీలుగా నూతన టెక్నాలజీని జూమ్ అందుబాటులోకి తేబోతుంది. విభిన్న ప్రాంతాలు, వేర్వేరు భాషలకు చెందిన ప్రజలు ఇబ్బంది లేకుండా మాట్లాడుకునే వెసులుబాటు కల్పిస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లలో జూమ్ బిజీగా ఉంది. మరింత సమర్థంగా మాట్లాడుతుండగానే ఒక భాషను అనువైన భాషలోకి తర్జుమా చేసి చెప్పే టెక్నాలజీతో దూసుకుపోతున్న జర్మనీకి చెందిన కైట్స్ సంస్థను జూమ్ టేకోవర్ చేసింది. కైట్స్‌కి సంబంధించిన సాంకేతికతను ఉపయోగించి వర్చువల్ మీటింగ్స్ మరింత సమర్థంగా ఉండేలా చూస్తామంటూ జూమ్ ప్రకటించింది. అంతేకాదు కైట్స్‌కి చెందిన ఇంజనీర్లు మెషిన్ ట్రాన్స్‌లేషన్‌లో మరిన్ని నూతన ఆవిష్కరణలు చేస్తారని, అవి తమ యూజర్లకు మరింత సౌకర్యాన్ని అందిస్తాయని జూమ్ తెలిపింది. ఇప్పటికే ఉన్నా వర్చువల్ మీటింగ్‌లో విభిన్న భాషలు మాట్లాడేప్పుడు తర్జుమా చేసే ఫీచర్‌ను ఈ ఏడాది ప్రారంభంలో జూమ్ ప్రవేశపెట్టింది. అయితే మీటింగ్ జరిగేప్పుడు ఇతర శబ్ధాలు వినిపించినా, కొన్ని భాషలకు సంబంధించి స్థానిక యాసల్లో మాట్లాడినా, పదాలు పలికేప్పుడు స్పస్టత లోపించినా.... వాటిని అనువదించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీన్ని అధిగమించేందుకు మెషిన్ ట్రాన్స్‌లేషన్‌లో మెరుగైన సంస్థగా ఉన్న కైట్స్‌ని జూమ్ టేకోవర్ చేసింది. చదవండి : Incom Tax : జులై 1 నుంచి కొత్త టీడీఎస్ రూల్స్ -
కరోనా: పతంగులు ఎగరేయొద్దు
కాన్పూర్(ఉత్తరప్రదేశ్): కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గాలిపటాలు ఎగరేయొద్దని ప్రజలకు పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేస్తున్న నేపథ్యంలో ఇళ్లలో గడుపుతున్న జనంలో కొంతమంది కాలక్షేపానికి పతంగులు ఎగరవేస్తున్నారు. దీన్ని గుర్తించిన కాన్పూర్ పోలీసులు పతంగులు ఎగరేయొద్దని బాలీవుడ్ హిట్ పాటలతో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘గాలిపటాలు ఎగరవేయడం మానండి. మాట వినకుంటే జైలుకు వెళ్లడం ఖాయం’ అనే అర్థం వచ్చేలా పాటలతో కాన్పూర్ పోలీసులు ప్రచారం చేస్తున్నారు. పతంగులు ఎగరేయొద్దని పిల్లకు చెప్పాలని తల్లిదండ్రులకు సూచించారు. కేంద్ర వైద్యారోగ్య శాఖ తాజా గణాంకాల ప్రకారం ఉత్తరప్రదేశ్‌లో 1,868 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 29 మంది ప్రాణాలు కోల్పోయారు. కోవిడ్ సోకిన వారిలో 289 మంది కోలుకున్నారు. మరోవైపు దేశంలో కరోనా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య నానాటికీ ఎగబాకుతోంది. దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 27,892కు, మృతుల సంఖ్య 872కు చేరింది. కరోనా కట్టడికి అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను కేంద్రం పొడిగించే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే ప్రజలు మరికొంత కాలం ఇళ్లకు పరిమితమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. చదవండి: కరోనా వైరస్.. మరో దుర్వార్త -
గాలిపటం..చరిత్ర ఘనం!
సాక్షి, సిటీబ్యూరో: పతంగులు అంటే సంక్రాంతి. సంక్రాంతి అంటే పతంగులు అన్నట్టుగా నగర జీవితం ముడిపడి ఉంది. తరతరాలుగా హైదరాబాద్ నగరంలో పతంగుల(గాలిపటాటు) తయారీ...పతంగులు ఎగురవేయడం ఇక్కడ ప్రత్యేకతగా చెప్పొచ్చు. ప్రాచీన సంప్రదాయం... హైదరాబాద్ నగరం ఏర్పడినప్పటి నుంచే(400 ఏళ్ల క్రితం) ఇక్కడ పతంగులు ఎగురవేసే సంస్కృతి ఉన్నట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. కుతుబ్ షాహీల కాలం నుంచి ప్రతి ఏటా హేమంత రుతువులో నగరంలో పతంగుల పండుగ కొనసాగుతుంది. ఇబ్రాహీం కులీకుతుబ్ షా హయాంలో గోల్కొండ కోటలో పతంగుల పండుగ అధికారికంగా జరిగేదట. ఆ రోజుల్లో కాగితాలతో చేసిన పతంగులు, మూలికలతో చేసిన మాంజాతో పోటీలు కూడా జరిగేవని చరిత్రకారులు తమ పుస్తకాల్లో రాశారు. కుతుబ్ షాహీల అనంతరం అసఫ్ జాహీల పాలనా కాలంలో హైదరాబాద్ ( పాతబస్తీలోని) మైదానాల్లో పతంగుల పండుగ ఘనంగా నిర్వహించే వారు. ఇక అరవ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ పాలనా కాలంలో పతంగుల పండుగకు మరింత గుర్తింపు వచ్చింది. మైదానాల్లో పతంగుల పోటీలు నిర్వహించి ఎక్కువ పతంగులను పడగొట్టిన వారికి బహుమతులు కూడా ఇచ్చేవారు. 1985 వరకు పాతబస్తీలో ప్రతి ఏటా పతంగుల పోటీలు నిర్వహించారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో పోటీలు జరుగుతున్నాయి.. తగ్గుతున్న సందడి గత 10 ఏళ్లుగా పతంగుల హడావుడి తగ్గుతోంది. ఆధునిక పోకడలతో పిల్లల్లో పతంగులపై ఆసక్తి తగ్గింది. వీడియో గేమ్స్, కంప్యూటర్ గేమ్స్, నగరంలో మైదానాలు లేకపోవడం, పతంగులు ఎగురవేసే పద్ధతులు నేర్పించే వారు తక్కువవడం తదితర కారణాల చేత పిల్లలు ఆసక్తి చూపడంలేదు. ఎదో పండుగ రోజు కాసేపు పతంగులు ఎగుర వేసి మళ్లీ స్మార్ట్ గేమ్స్‌లో మునిగిపోతున్నారు. దీంతో తరతరాలుగా పతంగులు తయారు చేస్తున్న కుటుంబాలు చితికిపోతున్నాయి. సరైన ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నాయి. పతంగుల తయారీలో ఎక్కువ శాతం మహిళలు ఉండడంతో వారికి కూలీ కూడా పడడంలేదు. గతంలో సంక్రాంతి సీజన్లోనే కాకుండా వేసవి సెలవులు, ఇతర సీజన్లలో పతంగుల విక్రయాలు జోరుగా ఉండేవి. ప్రస్తుతం సంక్రాంతి సీజన్లో కూడా అమ్మకాలు లేక ఇబ్బందులు ఎదర్కొంటున్నామని తయారీదారులు వాపోయారు. నాలుగు తరాలుగా ఇదే వృత్తి నాలుగు తరాలుగా ఇదే వ్యాపారంలో ఉన్నాం. అప్పటి నుంచి మా కుటుంబం పతంగుల తయారీపైనే ఆధారపడి ఉంది. ప్రసుత్తం పతంగుల వ్యాపారానికి ఆదరణ లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. గతంలో వందల సంఖ్యలో ఉన్న కుటుంబాలు నేడు పదుల సంఖ్యకు చేరుకున్నాయి. నెలల కొద్దీ చేసే పని ఇప్పుడు వారాల్లోకి వచ్చింది.– ముహ్మద్ సాబేర్, డబీర్‌పుర, పతంగుల తయారీదారు నాలుగు నెలల ముందు నుంచే తయారీ నిజాం కాలం నుంచి పతంగుల పండుగ ఉంది. సంక్రాంతికి నాలుగు నెలల ముందే పతంగుల తయారీ జరిగేది. యావత్తు తెలంగాణ జిల్లాలకు ఇక్కడి నుంచే సరఫరా అయ్యేవి. సంక్రాంతి సీజన్లో అప్పట్లో లక్షల్లో తయారు అయ్యేవి. ఇప్పుడు రానురాను ఆదరణ తగ్గుతోంది. తయారీ..వ్యాపారం కూడా బాగా పడిపోయింది.– భగవాన్ దాస్ బజాజ్, కాలికమాన్ -
గొంతు కోస్తోంది!
సాక్షి, గుంటూరు: సంప్రదాయ క్రీడలకు ప్రతీక అయిన సంక్రాంతి సమయంలో ఏటా గాలిపటాలు ఎగురవేయడం ఆనవాయితీ. గతంలో గాలిపటాలను ఎగురవేసేందుకు నూలుతో తయారైన దారం (మాంజా) ఉపయోగించేవారు. దీనివల్ల ఎవరికీ.. ఎలాంటి గాయాలయ్యేవి కావు. ఇప్పుడు వీటి స్థానంలో రసాయనాలతో కూడిన చైనా మాంజా వాడకంతో తీవ్ర గాయాల పాలవుతున్న పాదచారులు, వాహన చోదకుల నిండు ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. గాజు పిండి, ప్రమాదకరమైన రసాయనాలతో తయారు చేసే చైనా మాంజాను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిషేధించినా మార్కెట్లో విచ్చలవిడిగా లభ్యమవుతోంది. కౌశిక్ మృతదేహం (ఫైల్) యథేచ్ఛగా విక్రయాలు చైనా మాంజాలపై నిషేధం ఉన్నప్పటికీ మార్కెట్లో విచ్చలవిడిగా లభిస్తోంది. ఇతర గాలిపటాలను చైనా మాంజాతో సులువుగా తెంపవచ్చనే ఉద్దేశంతో ఎక్కువ మంది దీనిపట్ల మొగ్గు చూపుతున్నారు. గాలి పటాలు ఎగిరే సమయంలో ఈ మాంజా విద్యుత్ తీగలు, వృక్షాలకు చిక్కుకుని పక్షులు మృత్యువాత పడుతున్నాయి. వీటి మనుగడకు పెనుముప్పుగా మారిన చైనా మాంజా వినియోగాన్ని పక్షి ప్రేమికులు, పర్యావరణవేత్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గాలిపటాలను నియంత్రించే క్రమంలో ఒక్కోసారి ఎగురవేసే వ్యక్తులు కూడా గాయాల పాలవుతున్నారు. - గుంటూరులో సోమవారం తండ్రితో కలసి బైక్‌పై వెళ్తున్న మూడేళ్ల చిన్నారి కౌశిక్ మెడకు చైనా మాంజా చుట్టుకోవడంతో తీవ్ర రక్తస్రావమై మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. - గత ఏడాది ఆగస్టులో ఢిల్లీలో చైనా మాంజా గొంతుకు చుట్టుకుని మానవ్ శర్మ (28) అనే యువకుడు మృత్యువాత పడ్డాడు. - 2018లో చైనా మాంజా కారణంగా గుజరాత్లో 16 మంది మరణించడంతో కైట్ ఫెస్టివల్‌తో పాటు ఈ మాంజా వాడకాన్ని నిషేధించారు. చట్టం ఏం చెబుతోందంటే.. రసాయనాలు పూసిన చైనా మాంజాతో పక్షులు, మనుషులకు ముప్పు వాటిల్లుతోంది. 2016 మార్చి 4న ఏపీ ప్రభుత్వం, 2016 జనవరిæ 13న తెలంగాణ సర్కారు వీటి విక్రయాలను నిషేధించాయి. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారం చైనా మాంజాను అమ్మటం, కొనుగోలు చేయడం నేరం. దీన్ని ఉల్లంఘించే వారికి ఐదేళ్లు, అంతకుమించి జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తారు. జంతువులు, పక్షులకు హాని కలిగిస్తే వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం మూడు నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తారు. చైనా మాంజా తయారీ ఇలా.. దారానికి గాజు పిండి, సగ్గు బియ్యం, గంధకం, రంగులు అద్ది ఉడికించి చైనా మాంజా తయారు చేస్తారు. తమిళనాడులోని ఆరంబాకం, చెన్నైలోని ప్యారిస్, మౌంట్‌రోడ్డు మొదలైన ప్రాంతాల్లో చైనా మాంజా ఎక్కువగా తయారు చేస్తుంటారు. అక్కడి నుంచి ఏపీలోని పలు జిల్లాలకు సరఫరా అవుతుంది. తమిళనాడు సరిహద్దులో ఉన్న నెల్లూరు జిల్లాలోని తడ, సూళ్లూరుపేట, గుంటూరు నగరంలోని పట్నంబజార్, లాలాపేటలో కూడా చైనా మంజా తయారు చేస్తారు. రాష్ట్రంలోని కర్నూలు చిత్తూరు, కృష్ణా సహా పలు జిల్లాల్లో కుటీర పరిశ్రమగా చైనా మాంజా తయారీ నడుస్తోంది. మనుగడకు ముప్పు చైనా మాంజాతో గాలిపటాలను ఎగురవేయడం వల్ల పక్షులు, జంతువులకే కాకుండా మనుషులకు కూడా ముప్పు వాటిల్లుతోంది. చైనా మాంజా వాడకాన్ని పూర్తిగా నిషేధించాలి. నూలు దారంతో గాలిపటాలు ఎగురవేయడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరగవు –తేజోవంత్, కార్యదర్శి, హెల్ప్ ఫర్ యానిమల్స్ సొసైటీ ప్రజల్లో చైతన్యం రావాలి ప్రాణాలు హరిస్తున్న చైనా మాంజాను ఎవరూ వినియోగించకూడదు. జీవోలకే పరిమితం అయిన నిషే«ధాన్ని ప్రభుత్వాలు అమలు చేసి చూపించాలి. ప్రజల్లో చైతన్యం రావాలి. చైనా మాంజాను స్వచ్ఛందంగా నిరాకరించాలి – గోపాల్ సూరాబత్తుల, వ్యవస్థాపక కార్యదర్శి, యానిమల్ రెస్క్యూ ఆర్గనైజేషన్ ఇక కఠిన చర్యలు చైనా మాంజా మెడకు చుట్టుకుని మూడేళ్ల బాలుడు మృతి చెందడం అందరినీ కలచి వేసింది. చైనా మాంజాను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. ఇకపై ఎవరైనా దీన్ని కొనుగోలు చేసినా, అమ్మినా, వినియోగించినా కఠిన చర్యలు తీసుకుంటాం. పోలీసులను సైతం అప్రమత్తం చేస్తాం. చైనా మాంజా విక్రయించే వ్యాపారులపై కేసులు నమోదు చేస్తాం – ఐ.శామ్యూల్ ఆనంద్‌కుమార్, కలెక్టర్, గుంటూరు -
పటాలను చూస్తే భయపడి పోతున్న ఇజ్రాయిల్
-
గాలిపటాలు వస్తాయి.. కాల్చి పడేస్తాయి
జెరూసలేం : ఇజ్రాయిల్ ప్రజలు గాలి పటాలను చూస్తే భయపడి పోతున్నారు. గాల్లో ఎగిరే గాలి పటాలు ఎక్కడ కనిపించినా వాటికి దూరంగా పరిగెడుతున్నారు. గాలి పటాలు చక్కగా ఎగరేయాలి గానీ భయపడటం దేనికి? అనుకుంటున్నారా. అవి మామూలు గాలి పటాలు కాదు మరి.. అడవులను, ఊర్లను తగలపెట్టే నిప్పు పటాలు. అసలు సంగతేంటంటే.. పాలస్తీనా, ఇజ్రాయెల్ దేశాల మధ్య గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. మామూలుగా ఈ రెండు దేశాలు బాంబులతో, మిసైల్లతో, పెద్ద పెద్ద గన్నులతో దాడులు చేసుకునేవి. కానీ పాలస్తీనాకు ఇప్పుడు వినూత్నంగా గాలి పటాలను రంగంలోకి దింపింది. చిన్న, భారీ సైజులో ఉండే ఈ గాలి పటాల తోకల చివర నిప్పుపెట్టి ఇజ్రాయెల్ దేశంలోకి ఎగరేసింది. అంతే అలా ఆ గాలి పటాలు అడవులను, ఊర్లను తగుల బెట్టుకుంటూ పోయాయి. గాలి పటాల వల్ల అటవీ ప్రాంతాలు, ఊర్లు తగలబడటం వల్ల దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. కేవలం గాలి పటాలనే కాదు బెలూన్లను సైతం ఇజ్రాయెల్ దేశంలోకి వదిలింది పాలస్తీనా. వీటి కారణంగా శనివారం ఒక్క రోజే పది చోట్ల భారీగా మంటలు చెలరేగాయి. దీంతో విసిగిపోయిన ఇజ్రాయెల్ ఈ దాడులకు ప్రతిగా పాలస్తీనా ప్రధాన నాయకుడి కారును పేల్చిసింది. -
తండ్రీ కొడుకులు
తండ్రీ కొడుకులు మేడపైకి ఎక్కి గాలిపటం ఎగరేస్తున్నారు. గాలిపటాన్ని ఎలా ఎగరేయాలో తండ్రి పిల్లవాడికి నేర్పిస్తున్నాడు. గాలిపటం బాగా ఎత్తుకు వెళ్లాక, దారాన్ని కొడుకు చేతికి అందించాడు తండ్రి. కొడుకు ముఖం సంతోషంతో వెలిగిపోయింది. ఆ వెలుగులో తండ్రి మనసు ఉప్పొంగిపోయింది. కొంతసేపు దారాన్ని చేత్తో పట్టుకున్నాక కొడుకు తండ్రిని అడిగాడు. ‘‘నాన్నా.. దారంతో పట్టి ఉంచితేనే గాలిపటం అంత ఎత్తుకి ఎగిరిందే! దారాన్ని తెంపేస్తే ఇంకా ఎత్తుకు ఎగిరిపోతుంది కదా’’ అన్నాడు. తండ్రి నవ్వాడు. ‘‘దారాన్ని తెంపేద్దామా మరి?’’ అని అడిగాడు. ‘‘లె ంపేద్దాం నాన్నా..’’ అన్నాడు కొడుకు ఎంతో ఉత్సాహంగా. ఇద్దరూ కలిసి దారాన్ని తెంపేశారు. ‘టప్’మని దారం తెగిపోగానే గాలిపటం ఇంకా పైకి ఎగిరిపోయింది. అంతలోనే దారి తప్పి అటూ ఇటూ కొట్టుకుంటూ కిందికి పడిపోవడం మొదలుపెట్టింది! చివరికి ఎవరి మేడ మీదనో కూలిపోయింది. ‘‘ఇలా జరిగింది ఏంటి నాన్నా’’ అన్నాడు కొడుకు విచారంగా. దారం తెంపేస్తే గాలిపటం ఇంకా ఇంకా పైకి పోతుందనుకుంటే, కిందికొచ్చి పడిపోవడం ఆ పిల్లాyì కి నిరుత్సాహం కలిగించింది. తండ్రివైపు బిక్కమొహం వేసుకుని చూశాడు. కొడుకును దగ్గరికి తీసుకున్నాడు తండ్రి. ‘‘గాలిపటానికి దారం ఉండేది, దానిని ఎగిరిపోనీయకుండా పట్టి ఉంచేందుకు కాదు. గాలి ఎక్కువైనా, తక్కువైనా గాలిపటం తట్టుకుని నిలబడి, ఇంకా ఇంకా పైపైకి ఎగిరేలా చేసేందుకే’’ అని చెప్పాడు. మరో గాలిపటానికి దారం కట్టి ఎగరేసి కొడుకు చేతికి దారం అందించాడు. జీవితంలో కూడా మనకు కొన్నిసార్లు అనిపిస్తుంటుంది. కుటుంబం అనే బంధం లేకపోయి ఉంటే మనం ఇంకా ఏదో సాధించి ఉండేవాళ్లం అని! నిజానికి కుటుంబం అందించిన ప్రేమ, సేవ, సౌకర్యాల వల్లనే మనం ఈ మాత్రమైనా నిలబడి ఉన్నామని గ్రహించాలి. కుటుంబం మనల్ని పట్టుకుని లేదు. పట్టుకుని ఉందనుకుని వదిలించుకునే ప్రయత్నం చేస్తే మనమే పట్టుతప్పిపోతాం. తెగిపోయిన గాలిపటంలా గింగిరాలు తిరుగుతూ ఎక్కడో పడిపోతాం. -
గండిపేటలో పతంగులపై నిషేధం
హైదరాబాద్: గండిపేట చెరువు పరిసరాల్లో గాలిపటాల ఎగురవేతను పోలీసులు నిషేధించారు. ప్లాస్టిక్, రసాయనిక రంగులు కలిగిన పతంగులు, మాంజా (దారం) కారణంగా గండిపేట ప్రాంతంలోని జీవవైవిధ్యం దెబ్బతింటోందని శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. అంతేకాకుండా, వీటివల్ల గండిపేట చెరువు నీరు కలుషితమవుతోందని కమిషనరేట్ తెలిపింది. గండిపేట ప్రాంతానికి వలస వచ్చే అరుదైన పక్షులను రక్షించుకుందామని పిలుపునిచ్చింది. పతంగులు ఎగురవేసేందుకు వచ్చేవారు అదనంగా తీసుకువచ్చే ప్లాస్టిక్ బ్యాగులలో ఆహార పదార్థాలు, ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు, వాటర్ బ్యాగ్‌లను అక్కడే వదిలివేస్తున్నారని తెలిపింది. వీటితో పాటు మద్యం తాగి ఆ బాటిళ్లను పగులగొట్టడం, అక్కడే వదిలిపెట్టి వెళ్లిపోవడంతో అపరిశుభ్ర వాతావరణం ఏర్పడుతోందని వివరించింది. పర్యావరణం కలుషితమవుతోందని, అందుకే గండిపేట చెరువు (ఉస్మాన్ సాగర్) పరిసర ప్రాంతాలలో గాలిపటాలు ఎగురవేత పూర్తిగా నిషేధించినట్లు కమిషనరేట్ తెలిపింది. -
గాలిపటమా పద పద..ఆకాశమే హద్దుగా
► మొదలైన సంక్రాంతి సందడి ► మార్కెట్లో రకరకాల గాలిపటాలు ►చిన్నారుల్లో అంతులేని ఆనందం ఆదిలాబాద్ కల్చరల్: వానాకాలంలో ఆకాశంలో రంగురంగుల ఇంద్రధనస్సు దర్శనమిచ్చే సందర్భాలను మనం అప్పుడప్పుడు చూస్తుంటాం. అందులోని ఏడు రంగులను చూసి ఎంతో మురిసిపోతాం. అదే సంక్రాంతి పండుగకు మాత్రం వానతో సంబంధం లేకుండానే ఎన్నో రకాల రంగులతో, విభన్న ఆకారంలో ఆకట్టుకునే విధంగా విభిన్న ఆకృతులతో తయారు చేసినపతంగులు ఆకాశంలో దర్శనమిస్తున్నాయి. సంక్రాతి పర్వదినం మూడు రోజుల ముచ్చటైన పండగకు చిన్న పెద్దలు అందరు ఆనందోత్సహాలతో పతంగులను ఎగురవేస్తూ నిత్యజీవితంలో ఆనందాన్ని పోందుతుంటారు. ఈ పతంగులను ఎగురవేస్తూ జాగ్రత్తగా వ్యహరిస్తూ మధుర జ్ఞాపకాలు జీవితంలో ఉంటాయి. పతంగుల కథాకమామీషు.. పతంగుల పండగ నిజాం కాలంలో గోప్ప ఆదరణపొందింది . దీని పుట్టుక ఆసక్తికరమే. సముద్ర తీర ప్రాంతాలు, మైదానాలు , ఎడారుల్లో గాలి తీవ్రతనువాటాన్ని తెలుసుకునేందుకుఆ రజుల్లో తేలికపాటి వస్తువులను గాలిలో ఎగురవేసేవారు. అవే పతంగుల పుట్టకకు కారణమయ్యాయని చెబుతుంటారు. రాజస్థాన్ లోని అల్వర్‌కు చెందిన మౌజీ 1872 లో మొట్టమొదటి సారిగా పిల్లల సరదా కొసం పతంగాన్ని ఎగురవేసనట్లుచెబుతుంటారు. అలా ఉత్తరాదిలో పుట్టిన పతంగి దక్షిణాది సంస్కృతిలోభాగమైపోయిందనే కథనం ఉంది. నిజాం కాలంలోపతంగుల పోటీలను కుల, మతాలకతీతంగా నిర్వమించడం వల్ల అన్ని ప్రాంతాలోల పతంగులను ఎగురవేయడం ప్రారంభం కాగా, ఇప్పటికి ప్రతి ఒక్కరూ పతంగులను ఎగురవేస్తున్నారు. విభిన్నరకాలుగా.. సంక్రాంతి అంటేముగ్గులు, గొబ్బిళ్లు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు ఉండగా, వీటితోపాటు మరో ముఖ్యమైనది పతంగులు. సంక్రాంతి పేరుచెప్పగానే ఠక్కున చిన్నారులకు గుర్తుకోచ్చేది పతంగులే. నింగిలో రంగురంగుల గాలిపటాలు ఆకాశవీధిలో విన్యాసాలు చేస్తుంటే చిన్నారులతో పాటు పెద్దలకు కూడా ఆనందోత్సహంలో ముచ్చెత్తుతుంది. సినీహీరోలు, సీఎం, పీఎం ,పక్షలు, సీతాకోకచిలుకలు. కార్టూన్ బోమ్మలు, చోటాభీమ్ వంటి విభిన్న రకాల గాలిపటాలు అందుబాటులో ఉన్నాయి. కళాకారులు తమకళాత్మకంగా తయారుచేయడంతో ఈ గాలిపటాలు మైదానాలలో హరివిల్లుల అగుపిస్తున్నాయి. మాంజా స్థానంలో తంగూన్ .. పతంగులను ఎగురవెసేందుకు వినియోగించే మాంజా ఇప్పుడు లబించడం లేదు. చైనా నుంచి టన్నుల కొద్ది దిగుమతి అవుత్ను తంగూన్ (సన్నటి వైరు), మాజానుకబలించింది. ఆ రోజుల్లో మాంజా తయారు చేయడం ఒక కళ. ఇందుకోసం గ్రామాల్లో ప్రత్యేకంగా కొంతమంది సంక్రాంతి పండగ సమయంలో దీనిని తయారు చేసేవారు. అన్నం మెత్తగా రుబ్బి, దానికి బెండకాయరసం, గుడ్డు, సీసం, రంగులు కలిపి దారానికి రుద్దేవాళ్లు. పదినిమిషాలు ఆరబెడిత మాం జా తయారయ్యేది. ఇది మెత్తగా పతంగులను ఎగురేసెందుకు అనుకూలంగా ఉండేది. తంగూన్ తో తరుచూ చేతులకు గాయాలవుతున్నట్లు చిన్నారులు చెబుతున్నారు. అందుబాటు ధరల్లో పతంగులు పరిమాణం, నాణ్యత, రంగులను బట్టి ధరలు ఉన్నాయి. ప్రత్యేకగా వస్రా్తలతో తయారుచేసిన పతంగుల ధరలు అత్యధికంగా వందల్లో ధర ఉండగా , ప్లాస్టిక్‌తోచేసిన పతంగులు రూ. 5 నుంచి మొదలుకుని రూ. 100 వరకు లభ్యమవుతున్నాయి. వీటితో పాటు ప్లాస్టిక్ దారం.ప్రత్యేకంగా తయారు చేసిన మాంజాదారం మీటర్ల ధరలతో విక్రయిస్తున్నారు. రూ. 10 నుంచి 300 వరకు మాంజధారాలు లభిస్తున్నాయి. జాగ్రత్త తప్పని సరి.. ► గాలిపటాలను వీలైనంత మైదానాల్లోనే ఎగురవేయాలి ► మేడలపైన, చెట్ల పైన, ఓవర్హెడ్ట్యాంకుల పై నుంచి ఎగురవేయ వద్దు ► పిట్టగోడలు లేని మేడల పైకి పతంగులు ఎగురవేయడం శ్రేయస్కరం కాదు. ► చెట్లపై చిక్కుకున్న పతంగులను తీయాలనే ప్రయత్న చేయవద్దు, కోమ్మలకు వేలాడుతూ పతంగులను తీయకూడదు. ► రైలు పట్టాల సమీపంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పతంగిని ఎగురవేయవద్దు ► బస్సులు, లారీలు వెళ్లే ప్రదాన మార్గాల్లో కూడా గాలిపటాలు ఎగరువేయ వద్దు. ► చైనా మాజాను వినియోగించవద్దు.దాంతో పక్షలకు ప్రాణాలకు ప్రమాదం. ప్రభుత్వం ఆ మాంజాలను నిషేదించింది. ► విద్యుత్ వైర్లకు అతుకున్న పతంగులను తీయడానికి ప్రయత్నం చేయవద్దు ► పిల్లలు పతంగులు ఎగురవేసేప్రాంతాలను తల్లిదండ్రులు జాగ్రత్తగా పరిశీలించాలి. గుంతలు , చెరువుకట్టలు, కాలువ కట్టల వద్దకు వెళ్లనివ్వకుండా చూడాలి. ► దారం తెగిపోయి గాలిలో ఎగిరిపోతున్న పతంపగిని పట్టుకోవాలని వీధుల్లో, రహదారిమీద పరుగులు తీయవద్దు. దీని వల్ల వాహానాలు ఢీకొని ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. -
పతంగులు కొనేవారేరీ?
చార్మినార్: పెద్ద నోట్ల రద్దుతో పాటు చిల్లర సమస్యలు తలెత్తడంతో పాతబస్తీలో పతంగుల వ్యాపారం కుంటుపడింది. ప్రతి ఏటా డిసెంబర్–జనవరి సీజన్ లో పాతబస్తీలో పతంగుల కొనుగోళ్లు జోరుగా సాగుతాయి. కానీ ఈసారి పెద్ద నోట్ల రద్దు, చిల్లర సమస్య కారణంగా కొనుగోళ్లు భారీగా పడిపోయాయి. పాతబస్తీలోని గుల్జార్‌హౌజ్‌లో ఏటా దాదాపు ఐదు వేల దుకాణాల్లో పతంగుల సామాగ్రిని విక్రయిస్తారు. రోజూ లక్షల్లో వ్యాపారం జరుగుతుంటుంది. తెలంగాణలోని అన్ని జిల్లాలతో పాటు విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, కర్నూలు తదితర ప్రాంతాల నుంచి రిటైల్ వ్యాపారులు కూడా ఇక్కడికి వస్తారు. కానీ ఈసారి ఆ సందడే కన్పించడం లేదు. మరోవైపు చైనా మాంజను నిషేధించడం కూడా కొనుగోళ్లపై ప్రభావం చూపుతోంది. -
మాంజాను నిషేధించండి
ఎన్జీటీలో పెటా పిటిషన్ న్యూఢిల్లీ: గాలిపటాలను ఎగురవేసేందుకు గాజుపూత పూసిన మాంజాను వినియోగించడంపై నిషేధం విధించాలని కోరుతూ జీవకారుణ్య సంస్థ-పెటా జాతీయ హరిత ధర్మాసనానికి(ఎన్జీటీ) ఫిర్యాదు చేసింది. ప్రత్యేకించి చైనా నుంచి భారీగా దిగుమతి అవుతున్న గాజుపూత పూసిన మాంజా వల్ల పక్షులతోపాటు మనుషులు కూడా గాయపడడం, ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోతున్నారని పిటిషన్లో పేర్కొంది. కాటన్ దారాలకు బదులుగా నైలాన్ దారాలను వాడుతున్నారని, అవి ఎంతకూ తెగకపోవడం, వాటికి అడ్డొచ్చిన పక్షులు, మనుషులు గాయపడడం వంటి సంఘటనలు ఏటా జరుగుతూనే ఉన్నాయని తెలిపింది. ఇక దేశీయంగా మాంజాను తయారుచేస్తున్న పరిశ్రమల నుంచి వెలువడుతున్న హానికారక రసాయనాలవల్ల పిల్లలకు శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొంది. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఉత్తరప్రదేశ్ అంతటా గతేడాది నుంచి చైనా మాంజాను నిషేధించారని తెలిపిన పెటా... దేశవ్యాప్తంగా నిషేధాన్ని అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్లో అభ్యర్థించింది. -
పక్షులకు ప్రేమతో.. చైనీస్ మాంజాకు చెక్!
హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ సందర్భంగా ఎగరవేసే గాలిపటాల కోసం ఉపయోగించే చైనా మాంజాను, గ్లాజు పూత మాంజాను నిషేధిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. చైనా మాంజా (నైలాన్ దారం), గాజుపూత మాంజాను అమ్మడం, కలిగి ఉండటం, గాలిపటాలు ఎగరవేసేందుకు వినియోగించడం నిషేధిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. సాధారణంగా సంక్రాంతి పడుంగ అనగానే ఆకాశం రంగురంగుల పతంగులతో సరికొత్త హరివిల్లులా దర్శనమిస్తుంది. గాలిపటాల హోరాహోరీ పోట్లాటతో రణరంగాన్ని తలపిస్తుంది. అయితే తమ గాలిపటం తెగిపోకుండా ఎదుటివారి పతంగులకు పేంచి వేసేందుకు ఈ మధ్య చాలామంది చైనా మాంజాను వాడుతున్నారు. దీనివల్ల పావురాలు, పిట్టలు, గద్దలు.. ఇలా పక్షులన్నీ గాయాలపాలవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో మృత్యువాత పడుతున్నాయి. ఈ మాంజా వల్ల మనుష్యులు కూడా గాయాలపాలవుతున్నారు. ఈ నైలాన్ దారం వల్ల మనుషులకు, పక్షులకు హాని జరుగడమే కాకుండా ఇది భూమిలో, నీటిలో తొందరంగా కలిసిపోకపోవడం వల్ల పర్యావరణానికి కూడా తీవ్ర నష్టం వాటిల్లుతోంది. పక్షులపై ప్రేమ, సానుభూతి గల ప్రజలు సైతం గాలిపటాలు ఎగరేసేందుకు చైనీస్ మాంజాను ఎట్టిపరిస్థితుల్లో ఉపయోగించకూడదని, మాములు దారంతోనే గాలిపటాలను ఎగరవేసి మన ఆనందాన్ని పక్షులకు కూడా పంచాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు. -
ఆకట్టుకుంటున్న బాహుబలి
జోగిపేట: సంక్రాంతి అంటే చిన్న పిల్లలకు గుర్తొచ్చేది గాలిపటాలే! చిన్నాపెద్ద, మహిళలనే తేడాలేకుండా అందరూ పండగ వేళ పతంగులు ఎగరవేస్తుంటారు. భవనాలపై నిలబడి కుటుంబ సభ్యులతో, స్నేహితులకు కలిసి సంతోషాన్ని పంచుకుంటారు. ఈ నేపథ్యంలో జోగిపేటలో పెద్ద ఎత్తున గాలిపటాలు, చరఖా, దారం, మాంజాల విక్రయాలు జరుగుతున్నాయి. చుట్టుప్రక్కల ప్రాంతాలైన అల్లాదుర్గం, రేగోడ్, టేక్మాల్, పుల్కల్, కౌడిపల్లి, హత్నూర ప్రాంతాల నుంచి కూడా యువకులు ఇక్కడికి వచ్చి పతంగులు కొనుగోలు చేస్తున్నారు. ఈసారి ధరలు ఎక్కువగా ఉన్నట్టు పలువురు తెలిపారు. ఈ సంవత్సరం హీరో ప్రభాస్ నటించిన బాహుబలి సినిమా బొమ్మలతో గాలిపటాలు ఎక్కువగా వచ్చాయి. వీటితో పాటు డోలక్పూర్, బెన్‌టెన్ గాలిపటాలు ఆకట్టుకుంటున్నాయి. రూ.2 నుంచి రూ.20 వరకు విక్రయిస్తున్నారు. పతంగులు ఎగరవేయడానికి దారంతో పాటు మాంజాలు కూడా ఉపయోగిస్తారు. చరఖా రూ.750 చొప్పున విక్రయిస్తున్నారు. మద్యం బాటిల్ మాదిరి డబ్బాలలో చరఖా పెట్టి విక్రయిస్తున్నారు.